మేరీమాత పుణ్యక్షేత్రం దైవ సంకల్పం
మఠంపల్లి: మండల కేంద్రంలోని శుభవార్త చర్చికి మేరీమాత పుణ్యక్షేత్రంగా నామకరణం చేయడం దైవ సంకల్పమని నల్లగొండ మేత్రాసన పీఠాధిపతి (బిషప్) డాక్టర్ ధమన్‌కుమార్ అన్నారు. ఆదివారం శుభవార్త చర్చికి వచ్చిన ఆయనకు మఠంపల్లిలో స్థానిక రెవరెండ్ ఫాదర్ రాజారెడ్డి, క్రైస్తవులు, చర్చికమిటీ పెద్దలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏప్రిల్‌లో జరిగే చర్చి వార్షికోత్సవాల నుంచి మేరీమాత పుణ్యక్షేత్రంగా వాడుకలోకి వస్తుందని బిషప్ ప్రకటించారు. అనంతరం ఆయన చర్చిలో దివ్యబలిపూజ చేసి క్రైస్తవులకు ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. క్రైస్తవులకు సత్‌ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫాదర్లు రాజారెడ్డి, అశోక్, మర్రెడ్డి, బాలరెడ్డి, బాలశౌరిరెడ్డి, అర్లారెడ్డి, మాజీ సర్పంచ్ స్రవంతికిషోర్‌రెడ్డి, లూర్థుమారెడ్డి, బ్రదర్ వినోద్‌రెడ్డి, సిస్టర్ రూబీ, శుభోదయ యువజన సంఘం అధ్యక్షుడు గాదె జయభారత్‌రెడ్డి, చర్చి కమిటీ పెద్దలు ఆంథోనిరెడ్డి, జార్జిరెడ్డి, టీఆర్ బాలశౌరెడ్డి, బాలరెడ్డి, కాకుమాను జోసెఫ్, తుమ్మా జోసెఫ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నల్లగొండ బిషప్ ధమన్‌కుమార్
శుభవార్త చర్చిని మేరీమాత
పుణ్యక్షేత్రంగా ప్రకటన


