మార్మోగిన శివనామస్మరణ
నార్కట్‌పల్లి : మహాశివరాత్రి సందర్భంగా ఆది వారం నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి క్షేత్రం శివనామస్మరణతో మార్మోగింది. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. మహిళలు ఎల్లమ్మ దేవతకు బోనాలు సమర్పించారు. దేవాదాయశాఖ అధికారులు, పోలీసులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసినట్లు సీఐ నాగరాజు, ఎస్‌ఐ విష్ణుమూర్తి తెలిపారు. అనుమానాస్పదంగా ఆలయంలో సంచరించే వ్యక్తులను పట్టుకునేందుకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. సీసీ కెమెరాల ద్వారా భక్తుల కదలికలను పర్యవేక్షించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బత్తుల ఉషయ్య, సర్పంచులు నేతగాని కృష్ణ, ఉప్పల వెంకట్‌రెడ్డి, యేల్లేందుల లింగస్వామి, నాయకులు వడ్డే భూపాల్‌రెడ్డి, వరాల రమేష్, రేగట్టే నవీన్‌రెడ్డి, గడుసు శశిధర్‌రెడ్డి, రేగట్టె నర్సిరెడ్డి, పశుపతి, ప్రజ్ఞాపురం సత్తి, సంపత్, లింగస్వామి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
మహాశివరాత్రి సందర్భంగా చెర్వుగట్టుకు భారీగా తరలివచ్చిన భక్తులు
కిటకిటలాడి క్యూలైన్లు
భక్తులకు ఇబ్బందులు కల్గకుండా
ఏర్పాట్లు చేసిన పోలీసులు


