ఆ పెంగ్విన్‌ని చూసి కన్నీళ్లొచ్చేశాయ్‌..! | woman shared how her unemployed husband surprised her with a gift | Sakshi
Sakshi News home page

ఆ పెంగ్విన్‌ని చూసి కన్నీళ్లొచ్చేశాయ్‌..! ఆలుమగలకు అసలైన అర్థం..

Feb 12 2026 1:48 PM | Updated on Feb 12 2026 2:04 PM

woman shared how her unemployed husband surprised her with a gift

వివాహం అనేది అత్యంత పవిత్రమైన బంధం. వేరు వేరు నేపథ్యాల మనుషులు పెళ్లి అను బంధంతో ఒక్కటై..ప్రతి విషయంలోనూ తోడు నీడగా ఉంటామని ఒకరికొకరు వాగ్దానం చేసుకునే పవిత్రమైన కార్యం అది. అలాంటి వైవాహిక వ్యవస్థనే అపహాస్యం పాలుచేస్తున్నారు నేడు చాలామంది యువతీయువకులు. అలాంటి వాళ్లకు కనువిప్పు నెట్టింట రెడ్డిట్‌లో వైరల్‌ అవుతున్న పోస్ట్‌.  అది ఆ గొప్పబంధానికి ఉన్న పవిత్రతను హైలెట్‌ చేసింది. అంతేగాదు ఒకరికొకరుగా ఉండటం అంటే అవగతమవుతుంది. ఆలుమగలు బంధం అనే మాటకు అసలైన అర్థం చెబుతూ ఆలోచింపచేస్తున్న పోస్ట్‌ అందర్నీ తెగ ఆకర్షిస్తుంది. పైగా నెటిజన్లు ఆ జంటను 'మేడ్‌ ఫర్‌ఈచ్‌ అదర్‌' అంటూ కితాబిస్తున్నారు. 

అసలేం జరిగిందంటే..ఆ పోస్ట్‌లో ఒక మహిళ ఏ ఉద్యోగం లేని తన భర్త ఇచ్చిన గిఫ్ట్‌ని చూసి కన్నీళ్లు పెట్టుకుందామె. తన భర్తకు కొన్ని నెలలుగా ఉద్యోగం లేదని, తాను కాపీ రైటర్‌గా పనిచేస్తూ ఇంటిని నెట్టుకొస్తున్నట్లు తెలిపింది. అతడు ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నాడని, అతడి ఖర్చలు, పాకెట్‌ మనీ అన్ని తానే చూస్తుంటానని రాసుకొచ్చింది పోస్ట్‌లో. 

అయితే తన భర్త ఆ డబ్బుని పెట్రోల్‌ కోసం, స్నేహితులతో కలిసి భోజనం చేసేందుకు మాత్రమే ఖర్చు చేస్తాడని తెలిపింది. పైగా తన భర్త పెద్దగా ఖర్చులు కూడా చేయడని, ఎప్పుడైనా స్నేహితులు ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తే తన వంతుగా రూ. 200 నుంచి రూ. 300లే ఇస్తాడని తెలిపింది. అలాగే తాను తనకు ఉద్యోగం లేదని అతడి స్నేహితుల ముందు నిర్లక్ష్యంగా ప్రవర్తించలేదని కూడా పేర్కొంది. 

అయితే ఉద్యోగం లేకపోయినా..తన భర్త ఈ వాలెంటైన్స్‌డేకి బహుమతి ఇవ్వడం తనని ఆశ్చర్యంలో ముంచెత్తిందని అంటోంది. తాను ఇచ్చిన పాకెట్‌ మనీలోనే కొంత తనకు గిఫ్ట్‌ ఇచ్చేందుకు కొని సర్ఫైజ్‌ చేసిన విధానం కన్నీళ్లు పెట్టించేసిందని భావోద్వేగంగా రాసుకొచ్చింది పోస్ట్‌లో. అంతేగాదు తన భర్త ఇచ్చిన వాలెంటెన్స్‌డేకి ఇచ్చిన గిఫ్ట్‌లను తెలియజేస్తూ..ఆయన ఇచ్చన పెంగ్విన్‌ ప్లషీ, చాక్లెట్‌ బార్‌ చూసి ఆనందంతో ఉంబ్బితబ్బిబైంది. 

ఈ కష్టసమయంలోనూ తన గురించి ఆలోచించినందుకు కంటనీళ్లు ఆగడం లేదంటూ కన్నీటిపర్యంతమైంది. తాము విదేశీ పర్యటనలకు వెళ్లిన క్షణాలు కూడా ఉన్నాయి. కానీ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఈ కష్టసమయం తమ మధ్య నెలకొన్న బలమైన బంధం కారణంగా ఇట్టే గడిచిపోతుందని ఉద్విగ్నింగా చెబుతూ పోస్ట్‌ని ముగించింది.  నెటిజన్లు కూడా ఆ ఆలుమగల మధ్య ఉన్న బలమైన బంధానికి ఫిదా అవ్వడమే గాక ప్రశంసల వర్షం కురిపిస్తు పోస్టులు పెట్టారు.

(చదవండి: టెన్షన్‌ లేని లైఫ్‌ కావాలి..అందుకే భారత్‌కి వచ్చేశా..!)

 

Advertisement
 
Advertisement
Advertisement