breaking news
viral
-
బిట్టుగాడి శ్రమంతా బూడిదలో పోసిన ప‘నీరు’!
ఎనిమిది నెలల పాటు చెమటోడ్చాడు.. టన్నుల కొద్దీ చెత్తను ఒక్కడే తొలగించాడు.. నదికి కొత్త రూపు తెచ్చాడు! కానీ, అతడి కష్టం మూణ్నాళ్ల ముచ్చటే అయింది. కొద్ది వారాలకే నది మళ్లీ చెత్తకుప్పగా మారింది. తన శ్రమంతా వృథా కావడంతో గుండె పగిలినా.. 20 ఏళ్ల బిట్టూ తబాహీ వెనక్కి తగ్గలేదు. ఈత కూడా రాని ఆ యువకుడు మరోసారి నదిలోకి దిగి చెత్తను ఏరివేయడం మొదలుపెట్టాడు.మధ్యప్రదేశ్‌లోని అజ్నార్ నది వద్ద ఈ హృదయవిదారక దృశ్యం కనిపించింది. సురేంద్ర సింగ్ చౌధరీ అలియాస్ బిట్టూ తబాహీ.. ఎనిమిది నెలల పాటు ఒంటరిగా శ్రమించి నదిలోని టన్నుల కొద్దీ వ్యర్థాలను తొలగించాడు. కానీ, ప్రజలు మళ్లీ చెత్త వేయడంతో కొద్ది వారాల్లోనే నది పాత స్థితికి చేరింది. ఈ పరిస్థితిపై తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో వీడియోను పంచుకున్నాడు. అయినా, నిరుత్సాహంతో ఆగిపోలేదు. ఈత రాకపోయినా నదిలోకి దిగి మరోసారి చెత్తను తొలగించడం ప్రారంభించాడు. తక్కువ సమయంలో ఎక్కువ వ్యర్థాలను తొలగించేందుకు మార్గాలు సూచించాలని తన ఫాలోవర్లను కోరాడు.అలా ఫేమస్ అయ్యి..బిట్టూ తబాహీ.. స్థానికంగా ఓ ఆలయం సమీపంలోని చెరువు చెత్తతో నిండిపోవడం చూసి శుభ్రం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత అజ్నార్ నదిపై దృష్టి పెట్టాడు. 2026 జనవరి 26న మొదలుపెట్టిన ఈ కార్యక్రమంలో తొలుత కొందరు స్నేహితులు తోడైనా.. ఎక్కువ భాగం పనిని ఒక్కడే చేశాడు. తన సొంత డబ్బును ఖర్చు చేస్తూ, ప్రత్యేక పరికరాలు లేకుండానే ప్లాస్టిక్ సంచులు, సీసాలు, బురద, ఇతర వ్యర్థాలను తొలగించాడు. ఈ క్రమంలో చర్మ సమస్యలు, ఇన్ఫెక్షన్లు వంటి ఇబ్బందులనూ ఎదుర్కొన్నాడు.బిట్టూ శ్రమకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సహా పలువురు ప్రముఖులు ప్రశంసించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా అతడి కృషిని అభినందించారు. ఆ తర్వాత బెంగళూరులోని తురహళ్లి అడవిని 100 మందితో కలిసి శుభ్రం చేశాడు. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడాలోనూ శుభ్రతా కార్యక్రమాలు చేపట్టి గురుగ్రామ్‌లో యుమనా నది నుంచి ఏకంగా 2,435 కిలోల వ్యర్థాలను తొలగించాడు.ఒక్కడి బాధ్యతేనా?నదిని శుభ్రం చేయడం ఎంత ముఖ్యమో.. మళ్లీ చెత్త వేయకుండా చూడటం కూడా అంతే అవసరం. బిట్టూ ప్రయత్నాలకు సోషల్ మీడియాలో పలువురు మద్దతు తెలిపారు. నెదర్లాండ్స్‌కు చెందిన పర్యావరణ సంస్థ ‘ది ఓషన్ క్లీనప్’ వ్యవస్థాపకుడు బోయన్ స్లాట్ నుంచి ఉద్యోగ అవకాశం కూడా వచ్చింది. అయినప్పటికీ, ఇక్కడే ఉండి తన స్వచ్ఛ్ భారత్‌ను కొనసాగిస్తున్నాడు.Bittu who single handedly cleaned the river for eight months was shocked to see it polluted again within a month by the locals. https://t.co/XdcHw2qhQ0— 🚨Indian Gems (@IndianGems_) October 13, 2026ఇదీ చదవండి: శివయ్యా.. ఏంటయ్యా ఈ ఘోరం! -
నా ఫొటోలు దారుణంగా మార్ఫింగ్ చేశారు: స్టార్ నటి
ఏఐను ఉపయోగించి సినీ హీరోయిన్లను అసభ్యకరంగా చిత్రీకరిస్తున్న తీరుపై స్టార్ హీరోయిన్ శ్రియా శరణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇటీవల జాన్వీ కపూర్ నటించిన దేవర సినిమాలోని చుట్టమల్లే పాటను ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసిన సోషల్ మీడియాలో అత్యంత దారుణంగా ప్రచారం చేసిన సంగతి విధితమే. ఈ దారుణాన్ని జాన్వీ కపూర్‌తో సహా టాలీవుడ్ అగ్రహీరోలు సైతం స్పందించి విరుచుకుపడ్డారు. తాజాగా దీనిపై స్పందించిన శ్రియా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: సినిమా ఆఫర్‌కోసం నన్ను పడుకోమన్నాడు: స్టార్ నటి)‘ఒక్కోసారి వైరల్ అవుతున్న నా ఫోటోలు చూస్తుంటే.. అందులో ఉన్నది నేనా కాదా అనే సందేహం కలుగుతుంది. శారీరక ఆకృతిని పెంచేస్తూ.. వేసుకున్న దుస్తులు మార్చేస్తూ.. చాలా దారుణంగా మార్ఫింగ్ చేస్తుంటారు. ఇది బాధాకరం. ఏఐ అనేది మనుషులకు సహాయం చేయడానికి ఉపయోగపడాలి తప్పా.. ఓ మహిళ గౌరవాన్ని దెబ్బతీయడానికి కాదు’ అని శ్రియా మండిపడ్డారు. కాగా ఆమె ఇటీవల నటించిన చిత్రం దృశ్యం3. ఇటేవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అజయ్ దేవగన్, టబు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం రూ.490 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. -
యువతులపై రోబోట్ పాడు పని.. చివరికి పోలీసుల ఎంట్రీ!
‘ఇనుములో హృదయం మొలిచెనే..’ అంటూ శంకర్ తీసిన రోబో చిత్రం యావత్ దేశాన్ని ఉర్రూతలూగించింది. అయితే ఫీలింగ్స్ సంగతి పక్కనపెడితే మనుషులకు సాయం చేయాల్సిన యంత్రుడు.. లైంగిక వేధింపులకు పాల్పడితే!. ఈ ఉదంతం ఇప్పుడు నెట్టింట వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.జర్మనీ వీధుల్లో ఓ రోబోట్ చేసిన పాడు పని.. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. స్నేహితులతో ఉన్న ఓ 16 ఏళ్ల బాలిక వద్దకు వచ్చిన రోబోట్.. ఆమెను వెనుక నుంచి తాకుతూ అసభ్యంగా ప్రవర్తించింది. అంతేకాదు.. మరో యువతితోనూ అదే అదే రీతిలో వ్యవహరించింది. మొదటి ఘటనపై యువతి పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు రోబోట్‌తో పాటు దానిని హ్యాండిల్ చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని.. వాళ్ల ఫోన్లను స్వాధీనం చేసుకుని.. దర్యాప్తు చేపట్టారు.బ్రిటన్ టాబ్లాయిడ్ డైలీ మెయిల్ కథనం ప్రకారం.. జర్మనీలోని కొలోన్ నగరంలో ఆదివారం రాత్రి సుమారు 11.45 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. నగరం మధ్యలోని హోహెన్జోలెర్న్రింగ్ వీధిలో ఓ ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్ బయట బాలిక తన స్నేహితులతో కలిసి ఉంది. ఆ సమయంలో సుమారు 1.2 మీటర్ల ఎత్తున్న ఎరుపు, బంగారు రంగుల ‘అహ్మద్’ అనే రోబోట్ వెనుక నుంచి ఆమె వద్దకు వచ్చింది. ఆ రోబోట్ బాలికను అసభ్యంగా తాకడమే కాకుండా.. సైగలు, చేష్టలు ప్రదర్శించింది. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. మరో ఘటనలోనూ ఇలాగే ఓ యువతితో రోబోట్ పాడు పని చేసింది.Roboter »Ahmed« fasst einer 16-Jährigen auf den Kölner Ringen von hinten ans Gesäß und führt Stoßbewegungen aus. Der 16-jährige Besitzer aus Wegberg und sein 19-jähriger Begleiter haben den Vorfall gefilmt, live gestreamt und moderiert haben. Die Polizei fand das Gerät kurz darauf im Kofferraum eines VW. Roboter und Handys wurden beschlagnahmt. Ermittelt wird wegen des Verdachts der Beleidigung auf sexueller Grundlage. Die Kriminalpolizei prüft, ob und von wem der Roboter zum Tatzeitpunkt gesteuert wurde.— Dara 🇩🇪 (@Raeubertochtah) October 12, 2026ఈ ఘటనలో రోబోట్ 16 ఏళ్ల బాలుడికి చెందినదిగా పోలీసులు అనుమానిస్తున్నారు. జర్మనీలోని వెగ్బెర్గ్కు చెందిన ఆ బాలుడు, అతనితో ఉన్న 19 ఏళ్ల యువకుడు ఘటనను చిత్రీకరించి నెట్టింట అప్లోడ్ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.German police are reportedly investigating an incident in Cologne where a robot allegedly touched a 16-year-old girl inappropriately. The robot and two phones were seized as investigators examine whether its movements were deliberately controlled. #Robotics #Germany #Technology https://t.co/52uVYeUKYw— Cyrus (@Cyrus_In_The_X) October 12, 2026In #Germany, a robot pinched a girl on the butt and ended up in the police — Cologne cops seized the robot after receiving a report about harassment of a 16‑year‑old girl. According to the police, the 1.2‑meter‑tall robot approached the girl from behind and touched her buttocks. Its 16‑year‑old owner and a 19‑year‑old friend allegedly streamed the incident on social media and commented on it. Now investigators are trying to find out who was operating the robot. The iron man himself, along with two phones, was taken as evidence, and the people are being held as suspects. Source: https://t.co/wAHVZZHXZC— PulseWire (@PulseWire_live) October 12, 2026రిమోట్‌తో నియంత్రించారా?రోబోట్ ఆ సమయంలో ఎలా పనిచేసింది? దాని కదలికలను ఎవరైనా రిమోట్ ద్వారా నియంత్రించారా? లేక ముందుగా ప్రోగ్రామ్ చేసిన విధంగా కదిలిందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలికను వేధించే ఉద్దేశంతోనే రోబోట్‌ను కావాలని అలా నడిపించారా? అన్నది కూడా పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై లైంగిక వేధింపుల అనుమానంతో క్రిమినల్ దర్యాప్తు ప్రారంభించినట్లు కొలోన్ పోలీసులు తెలిపారు. రోబోట్ కదలికల వెనుక ఎవరున్నారు? ఈ ఘటనను చిత్రీకరించి సోషల్ మీడియాలో ప్రసారం చేయడంలో ఎవరి పాత్ర ఎంత? అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది.ఇదీ చదవండి: ఉక్రెయిన్ యుద్ధంలో కామారెడ్డి వాసి మృతి -
యామీ గౌతమ్ ధరించిన కుర్తాసెట్.. అన్ని లక్షలా..!
బాలీవుడ్ నటి యామీ గౌతమ్ తన తాజాలుక్తో ఫ్యాషన్‌లో ఓ సరికొత్త ఒరవడిని సృష్టిస్తోందామె. ఈ నటి అద్భుతమైన ఎరుపురంగు దుపట్టాతో తజ చేసిన క్లిష్టమైన ఎంబ్రాయిడరీతో కూడిన కుర్తా సెట్లో పండుగ హుందాతనాన్ని ఒడిసిపట్టుకుంది. ఈ దుస్తులు అత్యంత నిరాడంబంరగా ఉన్నా.. దాని ధర తెలిస్తే మాత్రం కంగుతినాల్సిందే. నటి యామీ ధరించిన ఈ త్రీపీస్ ఎన్సెంబుల్ డిజైనర్ దుస్తులను దేబ్యాని బ్రాండ్ నుంచి ఎంపిక చేసుకున్నారు. చందేరి కాటన్‌తో తయారైన ఈ దుస్తులు పొడవాటి కుర్తా.. దానికి మ్యాచింగ్ ప్యాంటు, క్రష్డ్ దుప్పటాతో మెరిసింది యామీ. బంగారం, ఎరుపు, ఆకుపచ్చ రంగుల పూల నమునాలు, వజ్రాల స్ఫూర్తితో చేసిన క్లిష్టమైన ఎంబ్రాయిడరీతో ఈ కుర్తా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కుర్తా చేతులపైన, అలాగ ప్యాంట్‌పై వివరమైన అంకరణలు ఉన్నాయి. ముదురు ఎరురంగు దుపట్టా ఆ కుర్తాకు లుక్ మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేసింది. ముఖ్యంగా ఆ కుర్తాపై ఉన్న రంగురంగుల ఎంబ్రాయిడరీ పండుగ శోభను తెచ్చింది. హస్తకళా నైపుణ్యాన్నికి ప్రతికగా, క్లాసిక్ లుక్‌ని అందించాయి. వివాహ వేడుకలు, పండగలు వంటి ప్రత్యేక సందర్భానికి అనువైన డిజైనర్ దుస్తులివి. ఈ డ్రెస్‌కి అనుగుణంగా బంగారు రంగు ఝమ్కాలు, బంగారు ఉంగరాలు ధరించింది. ఇదీ చదవండి: చీరలో కూడా స్మార్టే అంటున్న: సుధామూర్తిజుట్టుని మెత్తని అలలా వదిలేసి మధ్యలో చిన్న జడ వేసుకుంది. కళ్లు, బుగ్గలకు తేలికైన మేకప్ టచ్ ఇచ్చి..నేచరుల్‌గా కనిపించింది. ఈ డ్రెస్ ధర వచ్చేసి అక్షరాల రూ. 1.15 లక్షలు. యామీ తన ‘నయ్యి నవెల్లి’ మూవీ ప్రమోషనల్ భాగంగా ఈ లగ్జరీయస్ లుక్‌లో మెరిసింది. ఈ సినిమా ఈ నెల 16న థియెటర్లలోకి రానుంది. View this post on Instagram A post shared by Ahmedabad Shoutout (@ahmedabad.shoutout_) ఇదీ చదవండి: జస్ట్ 30 సెకన్ల బ్రేక్‌ఫాస్ట్ ఐడియాతో..నెలకు రూ. 1 కోటి సంపాదన! -
శరీరాన్ని కాన్వాస్‌గా మార్చి..టాటులతో గిన్నిస్ రికార్డు..!
సరదాగా వేయించుకున్న పట్టుబొట్టు అతడికి తెలియకుండానే ఎంతటి వ్యసనంగా మారిందంటే..మొత్తం బాడీ పచ్చబొట్ల మయం అయిపోయింది. ఆ హాబీ అతనికి గిన్నిస్ రికార్డులకెక్కేలా చేసింది. అతడే కెనడాకు చెందిన ఎఫెమెరల్ రెమీగా పిలిచే జెరెమీ రెమీ స్కోఫీల్డ్. తన శరీరంలో 90% పైగా పచ్చబొట్లతో నింపేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్ దక్కించుకున్నాడు. నిజానికి ఇలా పంచబొట్టు వేయించుకోవడం 2005లో మొదలైంది. ముందుగా తన కొడుకు పేరును ఎడమ ముంజేతిపై సరదాగా పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. ఆ తర్వాత కొద్ది కాలానికే శరీరం మొత్తం పచ్చబొట్లతో నిండిపోయింది. కానీ అక్కడతో ఆగకుండా అల్బెర్టాకు చెందిన ఈ 38 ఏళ్ల వ్యక్తి ఏళ్లు గడిచే కొద్దీ పొరల మీద పొరలు వేస్తూనే ఉన్నాడు. ఈ విధంగా అతని చర్మంపై సుమారు 40 పొరల పచ్చబొట్లు పేరుకుపోయాయి. అతని శరీరంలో కొన్ని ప్రాంతాలు వందకు పైగా పచ్చబొట్టు నింపేశాడు. ఇలా ప్రపంచంలోనే అత్యధిక పొరల పచ్చబొట్లు వేయించుకున్న వ్యక్తిగా అతను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ 2027లో చోటు దక్కించుకున్నాడు. అప్పటికే శరీర మార్పుల పట్ల అభిమానం ఉంది. అతని శరీరంపై వందకు పైగా పియరింగ్స్లు ఉన్నాయి. అయితే తనకు శరీరం మొత్తం పచ్చబొట్లతో నిండిపోవాలని ఎప్పుడు అనుకోలేదని చెప్పుకొచ్చాడు. తనకు ఎప్పుడు విచిత్రమైన హెయిర్‌స్టైల్స్ ఉండేవి, గోతిక్ తరహాలో దుస్తులు ధరించేవాడిని, కానీ ఇలా పచ్చబొట్లు వేయించుకుంటానని ఎప్పుడు ఊహించలేదని వాపోయాడు. తాను ఇల్లు కొనుక్కుని ఆర్థికంగా స్థిరపడ్డాక ఇంతకాలం కోల్పోయిన సమయాన్ని తిరిగి పొందాలనే ఉద్దేశ్యంతో తనకిష్టమైన పచ్చబొట్లు హాబీని మొదలు పెట్టానని. అందులో చిన్ని చిన్న మార్పులు చేయడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చేదని, అలా అదొక వ్యసనంగా మారిపోయి..ఇన్ని పచ్చబొట్లు వేయించుకునేందుకు దారితీసిందని చెప్పుకొచ్చాడు రెమీ. ప్రస్తుతం అతడు టాటు షాపులు, సోషల్ మీడియా కంపెనీలు నిర్వహిస్తున్నాడు. విచిత్రం ఏంటంటే అతడి శరీరంపై ఉండే టాటుల..తన జ్ఞాపకాల మూటలు అని చెబుతున్నాడు. అందులో పేరెంట్స్, కుక్కుల, జ్ఞాపకార్థ పోర్ట్రెయిట్లట. అలాగే 2016లో మరణించిన తన కుమారుడు తల్లి కోసం కూడా టాటు వేయించుకున్నాడట. అయితే ముఖంపై మాత్రం టాటులు వేయించుకోకుండా వదిలేశాడు. ఎందుకంటే తనను తాను సులబంగా గుర్తించేందుకని నవ్వుతూ చెబుతున్నాడు. ఇలా వరల్డ్ రికార్డు సాధించాక కూడా రెమీ టాటులు వేయించుకోవడం ఆపకపోవడం విశేషం. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) ఇదీ చదవండి: హాబీతో కేన్సర్‌ని జయించింది..! వైద్యానికే అందని మిరాకిల్.. -
రాజమౌళికి సిగ్గు ఎక్కువ.. మా ప్రేమ అలా మొదలైంది: రమా రాజమౌళి
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి అంటే గుర్తొచ్చేది అద్భుతమైన సినిమాలు.. బాక్సాఫీస్ రికార్డులు.. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని చాటిన విజయాలు. కానీ, ఆయన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కూడా అభిమానుల్లో ఎప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా భార్య రమా రాజమౌళితో ఆయన ప్రేమకథ ఎలా మొదలైంది? ఒకరినొకరు ఎలా అర్థం చేసుకున్నారు? వారి దాంపత్య జీవితం ఇన్నేళ్లుగా ఇంత అన్యోన్యంగా సాగడానికి కారణమేంటి? గతంలో ఓ ఇంటర్వ్యూలో రమా రాజమౌళి పంచుకున్న విషయాలు ఈరోజు రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా మరోసారి వైరల్ అవుతున్నాయి.కుటుంబ పరిచయం నుంచి ప్రేమ వరకు..రమా రాజమౌళి మాట్లాడుతూ.. తమ బంధం ఎలా మొదలైందో వివరించారు. రాజమౌళి, ఎం.ఎం. కీరవాణి బంధువులని, కీరవాణి భార్య వల్లి ద్వారా ఆయనతో తమ కుటుంబానికి పరిచయం ఏర్పడిందని తెలిపారు. అలా మొదలైన పరిచయం కొన్నేళ్లపాటు కుటుంబ స్నేహంగా కొనసాగిందన్నారు. ఆ సమయంలో తమ మధ్య ప్రత్యేకమైన భావాలు ఏమీ లేవని చెప్పారు. అయితే, కాలక్రమేణా ఒకరినొకరు మరింత దగ్గరగా అర్థం చేసుకున్నామని, జీవితాంతం కలిసి ప్రయాణించగలమనే నమ్మకం కలిగిందని వెల్లడించారు. తమది పెద్ద ప్రేమకథ కాదని, ఒకరిపై మరొకరికి ఏర్పడిన అవగాహనే బంధాన్ని బలపరిచిందని వివరించారు.(ఇదీ చదవండి: జెర్సీలు అమ్మకానికి పెట్టిన పీవీ సింధు.. దీపికకు ఆర్థిక సాయం)‘శాంతినివాసం’ రోజుల్లో మరింత దగ్గరగా..రాజమౌళి, రమా రాజమౌళి మధ్య పరిచయం మరింత బలపడటంలో ‘శాంతినివాసం’ రోజులూ కీలకంగా మారాయి. ఆ సమయంలో ఒకరినొకరు మరింత దగ్గరగా తెలుసుకున్నారని ఆమె గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత రాజమౌళికి ‘స్టూడెంట్ నంబర్ 1’ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం రావడంతో వారి బంధంపై మరింత స్పష్టత ఏర్పడిందని తెలిపారు. ‘రాజమౌళి చాలా సిగ్గుపడే వ్యక్తి. ఆయన పనిపైనే ఎక్కువగా దృష్టి పెడతారు. సినిమాలే ఆయన ప్రపంచం. అయితే కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యం ఇస్తారు. దర్శకుడిగా ఎంతటి పనిలో ఉన్నా కుటుంబ బంధాలను ప్రేమగా చూసుకుంటారు. ఇద్దరి మధ్య వ్యక్తిగత విషయాల్లో పెద్దగా అభిప్రాయ భేదాలు ఉండవు. దాదాపు 99 శాతం విషయాల్లో తమ అభిప్రాయాలు కలుస్తాయి. సినిమాలకు సంబంధించిన పనుల విషయంలో అప్పుడప్పుడు చిన్నచిన్న భేదాలు వచ్చినప్పటికీ, వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒకే ఆలోచనతో ముందుకు సాగుతాం’ అని వెల్లడించారు.సినిమాలే కాదు.. ప్రయాణాలంటేనూ ఇష్టం!రాజమౌళి, రమా రాజమౌళికి సినిమాలతో పాటు ప్రయాణాలంటే కూడా ఎంతో ఇష్టమట. సెలవులు దొరికినప్పుడు వివిధ దేశాలను సందర్శించడం తమకు ఇష్టమైన వ్యాపకమని రమా రాజమౌళి వెల్లడించారు. భవిష్యత్తులో రిటైర్మెంట్ తర్వాత ఏయే ప్రాంతాలు, దేశాలు చూడాలనే విషయంపై కూడా తరచూ మాట్లాడుకుంటామని చెప్పారు. అంతేకాదు.. తాము సందర్శించిన దేశాలకు సంబంధించిన నాణేలను సేకరించి, వాటిని ఒక ఫ్రేమ్‌లో భద్రపరచుకోవాలని ముందుగానే ప్రణాళిక వేసుకున్నామని తెలిపారు. సినిమాల ప్రపంచంలో నిరంతరం బిజీగా ఉండే రాజమౌళి దంపతులు వ్యక్తిగత జీవితానికి, ప్రయాణాలకు కూడా సమయం కేటాయించాలనుకోవడం విశేషం.(ఇదీ చదవండి: రణబాలి బడ్జెట్ 120 కోట్లు.. విజయ్, రష్మికల రెమ్యునరేషన్ ఎంతంటే?) -
జెన్‌జీ ఆవేశం.. ఐపీఎస్ ఐశ్వర్య కూల్ ట్రీట్మెంట్
ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఢిల్లీలో సాగుతున్న నిరసనలు ఉద్రిక్తంగా మారిన వేళ.. ఓ మహిళా ఐపీఎస్ అధికారి అందరి దృష్టిని ఆకర్షించారు. జెన్‌జీ యువత ఆవేశం, నినాదాలతో అశోక్ రోడ్డు హోరెత్తిన సమయంలో.. ఆందోళనకారులతో నేరుగా మాట్లాడి పరిస్థితిని అదుపులో ఉంచేందుకు ప్రయత్నించారు. నిరసనల మధ్య ఆమె సంయమనంతో వ్యవహరించిన తీరు, ఆందోళనకారులతో మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లు ఆమెను లాఠీ ఝళిపించని ‘లేడీ సింగం’ అంటూ ప్రశంసిస్తున్నారు.ఆ ఐపీఎస్ పేరు ఐశ్వర్య సింగ్. వయసు 31 సంవత్సరాలు. 2022 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఢిల్లీ పోలీసు విభాగంలో దక్షిణ ఢిల్లీ అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏడీసీపీ)గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె తండ్రి జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ కూడా సీనియర్ ఐపీఎస్ అధికారి కావడం విశేషం.జెన్‌జీ ఆవేశం నడుమ ఆమె..అక్టోబర్ 8న ఢిల్లీలో ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల సంఘం తీరుపై అసంతృప్తితో ఆందోళనకు దిగిన నిరసనకారులు నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో అశోక్ రోడ్డులో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. యువత ఆవేశం, నిరసనల తీవ్రత మధ్య పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు.లాఠీకి బదులు మాటలతో..ఈ సమయంలో ఐశ్వర్య సింగ్ ఆందోళనకారులను అడ్డుకున్నారు. నేరుగా మాట్లాడిన తీరు ప్రత్యేకంగా నిలిచింది. పరిస్థితి మరింత ఉద్రిక్తం కాకుండా చూడటంతోపాటు, నిరసనకారులను అదుపు చేసేందుకు ఆమె ప్రయత్నించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయ్యాయి. ఆవేశంతో ఉన్న నిరసనకారుల మధ్య ఆమె చూపిన ఆత్మవిశ్వాసం, సంయమనం నెటిజన్ల ప్రశంసలు అందుకున్నాయి. అందుకే ఆమెను ‘లేడీ సింగం’ అంటూ పలువురు అభివర్ణిస్తున్నారు.Kudos to @aishwarya_ips for displaying tremendous courage, restraint and leadership amidst immense pressure https://t.co/qUCf1LhXww— Sameer (@BesuraTaansane) October 8, 2026ఇరువైపులా ఆరోపణలుఅయితే ఈ నిరసనల సందర్భంగా పోలీసులపై దాడులు జరిగాయని అధికారులు ఆరోపించగా, కొందరు ఆందోళనకారులు పోలీసులు తమ పట్ల దురుసుగా వ్యవహరించారని విమర్శించారు. ఇలాంటి పరస్పర ఆరోపణల మధ్య ఐశ్వర్య సింగ్ వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది. నిరసనల సమయంలో పోలీసుల బాధ్యత కేవలం గుంపును చెదరగొట్టడమే కాకుండా, పరిస్థితులు అదుపు తప్పకుండా చూడటం కూడా. ఈ నేపథ్యంలో ‘జెన్‌జీ’ ఐశ్వర్య సింగ్ వీడియోలు వైరల్ కావడం, ఆమెకు ప్రశంసలు రావడం ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: కటకటాల్లోకి జైలర్ దివ్య -
స్టార్ హీరోయిన్‌తో తమన్ డ్యాన్స్.. జోష్‌లో మ్యూజిక్ డైరెక్టర్..
టాలీవుడ్లో మరో ఆసక్తికరమైన చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. అనీష్, అనస్వర రాజన్ జంటగా నటిస్తున్న సినిమా ‘ఇట్లు అర్జున’. మహేశ్ ఉప్పల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల నిర్మిస్తున్నారు. అక్టోబర్ 30న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.తాజాగా ఈ చిత్ర బృందం విశాఖపట్నంలోని గీతం కళాశాలలో మూడో పాట విడుదల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఈవెంట్లో సంగీత దర్శకుడు తమన్, హీరోయిన్ అనస్వర రాజన్ కలిసి స్టేజ్‌పై డ్యాన్స్ చేశారు. వీరిద్దరి సందడి అక్కడున్న వారిని అలరించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.మూగవాడిగా అనీష్..‘ఇట్లు అర్జున’ సినిమాలో అనీష్ మూగవాడైన అర్జున పాత్రలో కనిపించనున్నాడు. అనస్వర రాజన్ కీర్తి పాత్రలో ప్రేక్షకులను పలకరించనుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. మరి అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి. (ఇదీ చదవండి: నానా పటేకర్ మృతి.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఎమోషనల్)Thaman & Anaswara Dance for #MaheshBabu's Kalavathi 😅 @MusicThaman @AnaswaraRajan_ #SSThaman #AnaswaraRajan #IttluArjuna https://t.co/J2UYQlit98— Jadal Targaryen (@ParodyPeaks) October 8, 2026 -
రాజు నోరెళ్లబెట్టేలా.. రాణి ఏం చేసిందో తెలుసా?
సాధారణంగా రాజకుటుంబ సభ్యులు విలాసవంతమైన జీవితం, అధికారిక కార్యక్రమాలతో వార్తల్లో నిలుస్తుంటారు. కానీ థాయ్‌లాండ్ రాణి సుతిదా(48) మాత్రం తన సాహసంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఏకంగా యుద్ధ విమానాన్ని ఒంటరిగా నడిపి తన ఏవియేషన్ కెరీర్లో కీలక మైలురాయిని చేరుకున్నారు. తద్వారా ప్రపంచంలోనే తొలి పైలట్ క్వీన్ ఘనత సాధించారు. భర్త, థాయ్ రాజు మహా వజిరలాంగ్‌కార్న్ నోరెళ్లబెట్టి చూస్తుండగా ఆమె ఈ ఘనత సాధించడం విశేషం.థాయ్‌లాండ్ దక్షిణ ప్రాంతంలోని సూరత్ థాని ప్రావిన్స్‌లో ఉన్న వింగ్ 7 వైమానిక స్థావరంలో గురువారం (అక్టోబర్ 8) రాణి సుతిదా ఈ సాహసయాత్ర చేపట్టారు. స్వీడన్లో తయారైన జేఏఎస్ 39సీ గ్రిపెన్ సింగిల్ సీటర్ యుద్ధ విమానంలో తొలిసారి ఒంటరిగా ప్రయాణించారు. విమానయాన ప్రణాళికపై వివరాలు తెలుసుకుని, టేకాఫ్‌కు ముందు విమానాన్ని తనిఖీ చేసిన అనంతరం ఆమె గగనతలంలోకి దూసుకెళ్లారు.ఈ ఘట్టాన్ని రాజు మహా వజిరలాంగ్‌కార్న్ ప్రత్యక్షంగా వీక్షించారు. ఆ సమయంలో ఆయన ఆశ్చర్యపోతూ చూస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. విమానం నుంచి దిగిన తర్వాత రాణికి పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. గ్రిపెన్ యుద్ధ విమానాన్ని నడిపిన గుర్తింపుగా ఇచ్చే ‘గ్రిపెన్ ఆర్డర్ గోల్డెన్ ప్యాచ్’ను కూడా అందజేశారు.విమానయానంలో అపార అనుభవంరాణి సుతిదాకు విమానాలు నడపడంలో మంచి అనుభవమే ఉంది. ఇప్పటివరకు వివిధ రకాల విమానాల్లో కలిపి 1,188.48 గంటల పాటు ప్రయాణించినట్లు బ్యాంకాక్ పోస్ట్ వెల్లడించింది. సెస్నా, పిలాటస్, పైపర్ వంటి విమానాలతోపాటు బోయింగ్ 737 ప్రయాణికుల విమానాలను కూడా ఆమె నడిపారు. 2010 మే 13న బ్యాంకాక్‌లోని వింగ్ 6 స్థావరంలో సెస్నా టీ-41డీ విమానాన్ని నడపడంతో ఆమె పైలట్ ప్రయాణం ప్రారంభమైంది. ఆ తర్వాత రెండు సీట్ల గ్రిపెన్ జేఏఎస్ 39డీ యుద్ధ విమానంలోనూ ప్రయాణించారు. తాజాగా సింగిల్ సీటర్ గ్రిపెన్ను ఒంటరిగా నడిపి మరో మైలురాయిని చేరుకున్నారు.రాజుతో కలిసి విమాన ప్రయాణాలురాణి సుతిదా రాజుతో కలిసి దేశీయ, అంతర్జాతీయ పర్యటనల సందర్భంగా విమానాల్లో కో-పైలట్‌గా కూడా వ్యవహరించారు. గతేడాది ఏప్రిల్‌లో భూటాన్ పర్యటన సందర్భంగా రాజదంపతులు కలిసి రాజకుటుంబ విమానాన్ని నడిపారు. పర్వత ప్రాంతాల మధ్య అత్యంత క్లిష్టమైన విమానాశ్రయంగా పేరున్న పారో విమానాశ్రయంలో విమానాన్ని దించారు.🇹🇭 ‘The World’s only Pilot Queen’ – #Thailand’s Queen Suthida of Thailand passed her solo flight training with JAS 39C #Gripen. King Vajiralongkorn observed the training and congratulated her with a bouquet of flowers at Wing 7 Royal Air Force Base #SuratThani. พระปรีชาสามารถของ “พระราชินีนักบิน” หนึ่งเดียวในโลก #พระราชินี ทรงฝึกทำการบินโซโล่เดี่ยวกับเครื่องบินขับไล่ JAS 39C Gripen เป็นครั้งแรก และผ่านการทดสอบไปได้ด้วยดี ซึ่ง #ในหลวง ได้ทอดพระเนตรและพระราชทานช่อดอกไม้แสดงความยินดีในครั้งนี้ ณ กองบิน 7 #สุราษฎร์ธานี #KingVajiralongkorn #QueenSuthida #ThaiRoyalFamily #ข่าวในพระราชสำนัก #ทรงพระเจริญ— Royal World Thailand 🇹🇭 (@rwthofficial) October 8, 2026తాజా సోలో ఫ్లైట్‌తో సైనిక, పౌర విమానయాన రంగాల్లో తన అనుభవాన్ని రాణి మరోసారి చాటుకున్నారు. రాజకుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూనే విమానయానంపై ఆసక్తిని కొనసాగిస్తున్న ఆమె.. ఇప్పుడు యుద్ధ విమానాన్ని ఒంటరిగా నడిపిన ఘనతతో వార్తల్లో నిలిచారు.74 ఏళ్ల థాయ్‌లాండ్ రాజు మహా వజిరలాంగ్‌కార్న్ (రామా X)కు ఇప్పటివరకు నలుగురు భార్యలు ఉన్నారు. ఆయన మొదట 1977లో సోమ్సావలిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత యువధిదా పోల్ప్రసెర్త్ను పెళ్లి చేసుకున్నారు. మూడో భార్య శ్రీరస్మి సువాదీతో 2001లో వివాహం జరగ్గా, 2014లో విడిపోయారు. నాలుగో భార్యగా 2019లో సుతిదాను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె థాయ్‌లాండ్ రాణిగా కొనసాగుతున్నారు.బాడీగార్డ్ నుంచి క్వీన్‌గా 1978 జూన్ 3న దక్షిణ థాయ్‌లాండ్‌లోని హాట్ యాయ్‌లో జన్మించిన సుతిదా అసలు పేరు సుతిదా తిడ్జాయ్. బ్యాంకాక్‌లోని అసంప్షన్ యూనివర్సిటీలో కమ్యూనికేషన్ ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. 2000–2003 మధ్య జపాన్ ఎయిర్‌లైన్స్‌లో, ఆ తర్వాత 2008 వరకు థాయ్ ఎయిర్వేస్లో విమాన సహాయకురాలిగా పనిచేశారు. అనంతరం రాజు భద్రతా విభాగంలో చేరి సైనిక, రాజభవన భద్రతా బాధ్యతల్లో ఉన్నత స్థానాలకు ఎదిగారు. 2019 మే 1న రాజు వజిరలాంగ్కార్న్ను వివాహం చేసుకోగా, అదే ఏడాది మే 4న ఆయన పట్టాభిషేకం సందర్భంగా రాణి హోదా పొందారు.ఇదీ చదవండి: అదే నిజమైతే .. పాక్ నాలుగు ముక్కలవ్వడం ఖాయం -
నవరసాల నానా.. మీమ్స్‌లో ఎప్పటికీ కేరాఫ్!
తెరపై ఎన్నో విలక్షణ పాత్రలు.. ఒక్కో పాత్రలో ఒక్కో రకమైన హావభావాలు. సీరియస్ సన్నివేశమైనా.. కామెడీ సీన్ అయినా.. తన ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేయడం నానా పటేకర్ ప్రత్యేకత. ఆయన నటించిన కొన్ని సన్నివేశాలు సినిమాలకే పరిమితం కాలేదు. సోషల్ మీడియాలో మీమ్ టెంప్లేట్లుగా మారి ఇప్పటికీ నెటిజన్లను నవ్విస్తూనే ఉన్నాయి. నానా పటేకర్ మరణంతో ఆయన లేని లోటు కనిపిస్తున్న వేళ.. ఆ ఫేమస్ సీన్లు మరోసారి గుర్తుకొస్తున్నాయి.‘క్రాంతివీర్’లో ఆ నవ్వు..1994లో విడుదలైన ‘క్రాంతివీర్’ నానా పటేకర్ కెరీర్లోనే ప్రత్యేకమైన సినిమా. ఇందులో ఆయన పోషించిన ప్రతాప్ పాత్రకు భారీ గుర్తింపు వచ్చింది. అయితే ఈ సినిమాలోని ఓ సీరియస్ సన్నివేశం మాత్రం ఏళ్ల తర్వాత మీమ్ మెటీరియల్‌గా మారింది. మంచంపై పడుకుని నానా పటేకర్ పగలబడి నవ్వే సీన్ ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది.ఎవరైనా చెప్పిన మాటను నమ్మలేనప్పుడు.. ‘ఇదేం కామెడీ రా బాబు’ అనే భావాన్ని వ్యక్తం చేయాలన్నా.. ఎదుటివారిని సరదాగా ఎగతాళి చేయాలన్నా ఈ సీన్‌ను నెటిజన్లు ఉపయోగిస్తుంటారు. ఈ సినిమా తెలుగులో మోహన్‌బాబు హీరోగా ‘పుణ్యభూమి నా దేశం’ పేరుతో రీమేక్ అయింది.కాఫీ కప్పుతో ‘కంట్రోల్ ఉదయ్’2007లో వచ్చిన ‘వెల్కమ్’లో ఉదయ్ శెట్టి పాత్ర నానా పటేకర్‌కు మరో రేంజ్లో క్రేజ్ తీసుకొచ్చింది. కోపం వచ్చిన ప్రతిసారీ తనను తానే కంట్రోల్ చేసుకుంటూ ‘కంట్రోల్ ఉదయ్.. కంట్రోల్’ అంటూ చెప్పే సన్నివేశం ఇప్పటికీ సోషల్ మీడియాలో ఫేమస్.కోపాన్ని ఆపే సందర్భాల్లో ఈ డైలాగ్‌ను మీమ్‌గా ఉపయోగించడం నెటిజన్లకు అలవాటుగా మారిపోయింది. అదే సినిమాలో చాయ్ తాగుతూ ఒక్కసారిగా నవ్వే నానా పటేకర్ ఎక్స్ప్రెషన్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఎవరి మాట విని నవ్వాలో.. ఏడవాలో అర్థం కాని పరిస్థితులను చూపించడానికి ఈ సీన్‌ను మీమ్స్‌లో ఉపయోగిస్తుంటారు.‘ఏ దేనా..’ అంటూ డ్యాన్స్2010లో వచ్చిన ‘తుమ్ మిలో తో సహీ’లోనూ నానా పటేకర్ కామెడీ టైమింగ్ ఆకట్టుకుంటుంది. డబ్బుల కోసం ఓ హిజ్రా డ్యాన్స్ చేస్తూ నానాను కవ్వించే సన్నివేశంలో ఆయన కూడా అదే తరహాలో డ్యాన్స్ చేస్తూ నవ్వులు పూయిస్తారు.‘ఏ దేనా.. మైం తేరే లియే నాచీ’ అంటూ డబ్బులు అడిగే ఈ సీన్ కూడా సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో చక్కర్లు కొడుతోంది. సరదాగా ఎవరినైనా ఆటపట్టించే సందర్భాల్లో ఈ సన్నివేశాన్ని నెటిజన్లు ఉపయోగిస్తుంటారు.చిల్లరకు చాక్లెట్ ఇస్తే..నానా పటేకర్ నటించిన మరో సన్నివేశం నవ్వించడమే కాకుండా ఆలోచింపజేస్తుంది. షాపింగ్ చేసిన తర్వాత తిరిగి ఇవ్వాల్సిన చిల్లరకు బదులుగా చాక్లెట్ ఇవ్వడంతో ఆయన తీవ్రంగా స్పందిస్తారు. డబ్బులకు బదులు చాక్లెట్ ఎందుకు తీసుకోవాలంటూ.. తన చెప్పులనే చిల్లరగా ఇస్తానన్నట్టుగా ఆయన ఇచ్చే రియాక్షన్ ఈ సీన్‌కు ప్రత్యేక ఆకర్షణ. ఈ సన్నివేశం కూడా చాలాకాలంగా సోషల్ మీడియాలో మీమ్‌గా వైరల్ అవుతోంది.నానా ఎక్స్ప్రెషన్స్కు తిరుగులేదు!సినిమా మారింది.. పాత్ర మారింది.. సందర్భం మారింది.. కానీ నానా పటేకర్ ఎక్స్ప్రెషన్స్ మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. విలన్‌గా భయపెట్టినా.. సీరియస్ పాత్రలో ఆలోచింపజేసినా.. కామెడీ సన్నివేశంలో నవ్వించినా తన ముఖ కవళికలతో సన్నివేశానికి ప్రాణం పోయడం ఆయనకు మాత్రమే సాధ్యమైంది. అందుకే నానా పటేకర్ నటించిన కొన్ని సీన్లు థియేటర్లలో ప్రేక్షకులను అలరించడంతో ఆగిపోలేదు. ఏళ్ల తర్వాత కూడా సోషల్ మీడియాలో కొత్త సందర్భాలకు కొత్త అర్థాలతో మీమ్స్‌గా పుట్టుకొస్తూనే ఉన్నాయి. నటుడిగా ఆయన తెరపై వదిలిన ముద్రకు ఇవి కూడా ఓ నిదర్శనమే.(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లో కొత్త ట్విస్ట్.. నామినేషన్స్‌లో ఉన్నవారికి..) -
అక్కాయ్.. నీ ఐఫోన్ పాస్వర్డ్ జల్దీ చెప్పు
ఐఫోన్ చోరీకి గురైంది. ఆ అమ్మాయి చాలా బాధపడింది. అయితే నెల రోజుల తర్వాత అదే ఫోన్ నుంచి ఆమెకో మెసేజ్ వచ్చింది. ‘నీ ఐఫోన్ పాస్వర్డ్ ఏంటో త్వరగా చెప్పు?’అని. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది. అతని నుంచి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్‌కు చెందిన కౌశికీ ధ్యాని తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ రీల్ వైరల్ అవుతోంది. అందులో ఆమెకు ఓ వ్యక్తి ఫోన్ పాస్వర్డ్ చెప్పమంటూ అడిగాడు. దానికి ఆమె ఆ ఫోన్ పోయింది కదా.. దయచేసి వెనక్కి ఇచ్చేయ్ భయ్యా అంటూ బతిమాలింది. అయితే అతను మాత్రం కన్ఫర్మేషన్ కోసం చేశానంటూ బదులిచ్చాడు.. అతను ఎవరనే మిస్టరీ మాత్రం కంటిన్యూ అయ్యింది. ఇందుకు సంబంధించిన చాటింగ్ స్క్రీన్‌షాట్ బయటకు రావడంతో.. ఆ చిలిపి దొంగ కథ వైరల్ అయ్యింది. కౌశికీ వెల్లడించిన వివరాల ప్రకారం.. డెహ్రాడూన్‌లోని క్లెమెంట్ టౌన్లో సెప్టెంబర్ 12న చోరీ జరిగింది. ఆమె ఐఫోన్‌తో పాటు తన స్నేహితుడి సోదరుడు సాక్షం నేగి ఫోన్లు, మరికొందరి మొబైళ్లు చోరీకి గురయ్యాయి. అదే ప్రాంతంలోని ఇళ్ల నుంచి ల్యాప్‌టాప్‌లు, మ్యాక్బుక్లు, మొబైల్ ఫోన్లు, ఇతర విలువైన వస్తువులు కలిపి లక్షల రూపాయల సొత్తు చోరీ అయినట్లు ఆమె పేర్కొన్నారు.అందునా ఒకే భవనంలో 5–6 మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు చోరీ అయ్యాయని కౌశికీ ఓ జాతీయ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అదే రోజు సమీపంలోని పీజీలు, హాస్టళ్లలోనూ చోరీలు జరిగాయని.. ఫిర్యాదులు చేసినా పోలీసులు అలసత్వం ప్రదర్శించారని అన్నారామె.అయితే కౌశికీకి ఎదురైన అనుభవమే ఇప్పుడు ఈ వ్యవహారంలో ఆసక్తికరంగా మారింది. చోరీకి గురైన ఐఫోన్లో ఆమె కాంటాక్ట్ నంబర్ కనిపించేలా ఉండటంతో.. ఫోన్ చేతికి వచ్చిన వ్యక్తి తనను కాంటాక్ట్ అయ్యాడని ఆమె తెలిపారు. తర్వాత తనకు ఎస్ఎంఎస్, వాట్సాప్ మెసేజ్‌లు వచ్చాయని.. అందులో ఐఫోన్ పాస్వర్డ్ చెప్పాలని కోరారని చెప్పారు. అంతేకాదు.. చోరీపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయని కౌశికీ ఆరోపించారు. స్టేషన్లో ఎవరూ అందుబాటులో లేరని చెప్పి తర్వాత రావాలని సూచించారని ఆమె పేర్కొన్నారు. ఫిర్యాదులు తీసుకోవడంలోనూ నిర్లక్ష్యం జరిగిందని ఆరోపించారు. ‘పోలీసులు తమను పట్టుకోలేరనే ధీమాతో దొంగలు భయపడటం లేదు’ అంటూ ఆమె తన సోషల్ మీడియా పోస్టులో తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే పోలీసులు మాత్రం ఆమె ఆరోపణలను ఖండించారు. ఈ వ్యవహారాన్ని పోలీసులు విస్మరించలేదని డెహ్రాడూన్ సిటీ ఎస్పీ శేఖర్ సుయల్ తెలిపారు. కేసుపై సర్కిల్ ఆఫీసర్ దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు.ఇదీ చదవండి: విమానంపై పడ్డ పిడుగు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే! -
శాకాహరం అందించే కేఎఫ్‌సీ గురించి తెలుసా..!
కేఎఫ్‌సీ అనగానే నోరూరించే ఫ్రైడ్ చికెన్ పీస్‌లు గుర్తొస్తాయి. ఈ అమెరికన్ ఫుడ్ బ్రాండ్ భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా సుమారు 150 దేశాల్లోని ప్రాంతాల్లో సర్వీస్ అందిస్తోంది. అయితే అహ్మదాబాద్ సమీపంలోని ఒక ప్రత్యేకమైన కేఎఫ్‌సీ కేవలం శాకాహార భోజనం మాత్రమే అందిస్తుంది. దీని గురించి ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకాఇన్స్టాగ్రామ్లో పంచుకుంటూ ఇలా రాసుకొచ్చారు పోస్ట్‌లో. ఇది శాకాహార భోజనం మాత్రమే లభించే కేఎఫ్‌సీ ఫుడ్కోర్ట్. గోయెంకా షేర్ చేసిన పోటోల సైన్‌బోర్డుపై చూడముచ్చటి శ్రీకృష్ణుని చిత్రం కూడా ఉంది. ప్రధాన బోర్డు కింగ..ఆ ఫుడ్ కోర్టులో పనిచేస్తున్న టీటైమ్, బాంబే పావ్ భాజీ, కృష్ణ ఇన్ వంటి ఆహార సంస్థల పేర్లను కూడా చూడొచ్చు. కాగా, ఈ ఫుడ్ కోర్టు ఉచిత పార్కింగ్ సౌకర్యం తోపాటు సౌకర్యవంతమైన ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, శుభ్రమైన వాష్‌రూమ్‌లను అందిస్తుండటం విశేషం. గుజరాత్‌లోని హిమ్మత్‌నగర్ సమీపంలో షామ్లాజీ అహ్మదాబాద్ హైవేపై ఈ శ్రీకృష్ణ ఫుడ్‌కోర్టు ఉందట. నెటిజన్లు ఇది చికెన్ లేని కేఎఫ్సీనా అని చమత్కరిస్తూ పోస్టులు పెట్టారు.KFC food court where only vegetarian food is available! Only in Ahmedabad…. https://t.co/owsl362YIr— Harsh Goenka (@hvgoenka) October 4, 2026 ఇదీ చదవండి: రైతుగా సివిల్ ఇంజనీర్..! అరటిపండ్లతో ఏకంగా రూ. 35 లక్షలు.. -
ప్రియాంక చోప్రా మెచ్చిన పల్లెటూరి యశోద
తలపై కొంగు.. పక్కా పల్లెటూరి మనిషి.. పొలాల్లో పని చేస్తూ వీడియోలు చేస్తుంటుంది. మాములుగా అయితే ఆమె గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటాం. ఆమె వీడియోను నటి ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. ఎందుకంత ప్రత్యేకంగా ప్రియాంక పోస్ట్ చేసింది అంటారా?. ఆమె టాలెంట్ అలాంటిది కాబట్టి!.ప్రియాంక చోప్రా తన వీడియోను షేర్ చేయడం యశోదాకు ఊహించని ఆనందాన్ని ఇచ్చింది. ఆ విషయాన్ని ఆమె మరో వీడియో ద్వారా తన ఫాలోవర్లతో పంచుకున్నారు. అంతేకాదు.. అదే రోజు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె 4 లక్షల మంది ఫాలోవర్ల మైలురాయిని కూడా అందుకున్నారు. ‘‘చాలామందికి ఇది ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీ మాత్రమే కావచ్చు. కానీ నాకు మాత్రం ఎంతో ప్రత్యేకమైన క్షణం’’ అంటూ యశోదా ఆనందం వ్యక్తం చేశారు.యశోదా లోధి స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లా సిరతు ప్రాంతం. యశోదకు ఏడాది వయసున్నప్పుడే ఆమె తల్లిదండ్రులు బంధువులకు అప్పగించారు. పిల్లలు లేని బువా, ఫూఫా ఆమెను పంజాబ్‌లోని లుధియానాకు తీసుకెళ్లి పెంచారు. 12వ తరగతి వరకు హిందీ మీడియంలోనే చదువుకున్న ఆమె.. ఇంగ్లిష్ నేర్చుకోవడానికి ఎలాంటి ప్రత్యేక శిక్షణ తీసుకోలేదు. కానీ, ఇతరులు ఇంగ్లిష్‌లో మాట్లాడే వీడియోలను పదేపదే వింటూ.. వారిని అనుకరిస్తూ సొంతంగా సాధన చేశారు. క్రమంగా మాట్లాడటంలో పట్టు సాధించారు. ఆ తర్వాత తాను నేర్చుకున్నదాన్ని ఇతరులకు కూడా నేర్పించాలని నిర్ణయించుకున్నారు.గ్రామీణ మహిళలు, విద్యార్థులు సులభంగా అర్థం చేసుకునేలా రోజువారీ జీవితానికి సంబంధించిన ఉదాహరణలతో ఇంగ్లిష్ పదాలు, వాక్యాలు, గ్రామర్ నేర్పడం మొదలుపెట్టారు. పొలంలో పని చేయడం, ఇంటి పనులు చేసుకోవడం, కుటుంబ సభ్యులతో మాట్లాడటం.. ఇలా తన చుట్టూ జరిగే విషయాలనే పాఠాలుగా మార్చుకున్నారు.‘దేహాతీ’ అనే పేరే బ్రాండ్‌గా..యశోదా తన గ్రామీణ నేపథ్యాన్ని ఎప్పుడూ దాచుకోలేదు. చీర, కొంగుతోనే ఎక్కువ వీడియోల్లో కనిపిస్తూ.. ‘‘పల్లెటూరిలో పుట్టాం.. ఇంగ్లిష్ మాట్లాడకూడదా? మళ్లీ పుడతామా ఏంటి?’’ అన్నట్టుగా తన ప్రయాణాన్ని కొనసాగించారు. అందుకే ‘దేహాతీ మేడమ్’(పల్లెటూరి మేడమ్)కు ప్రత్యేక గుర్తింపుగా మారింది. ఆమె వీడియోలు గ్రామీణ ప్రాంతాల్లో ఇంగ్లిష్ నేర్చుకోవాలనుకునే వారిలో మంచి ఆదరణ పొందాయి.యూట్యూబ్‌తో మొదలై..యశోదా ఇంగ్లీష్ విత్ దెహతీ మేడమ్ ‘English With Dehati Madam’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి స్పోకెన్ ఇంగ్లిష్, గ్రామర్, రోజువారీ సంభాషణలకు సంబంధించిన వీడియోలు చేయడం మొదలుపెట్టారు. తొలినాళ్లలో పెద్దగా స్పందన లేకపోయినా.. క్రమంగా ఆమె వీడియోలకు ఆదరణ పెరిగింది. కొద్దికాలంలోనే లక్షల మంది ఆమెను ఫాలో చేయడం మొదలుపెట్టారు. 2023 నాటికే ఆమె ఛానెల్‌కు సుమారు 3 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉండగా.. ఆమెకు యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్ కూడా లభించింది. ఆమె ప్రత్యేకత పుస్తకాల్లోని ఇంగ్లిష్‌ను చెప్పడం కంటే.. సాధారణ జీవితంలో ఎలా మాట్లాడాలో నేర్పడమే. అందుకే గ్రామీణ నేపథ్యం ఉన్నవారికి ఆమె వీడియోలు సులభంగా కనెక్ట్ అయ్యాయి.భర్త నుంచి విమర్శలు.. యశోదా ప్రయాణం మొదట్లో అంత సులభంగా సాగలేదు. తాను యూట్యూబ్ ద్వారా ఏదైనా సాధించగలనని చెప్పినప్పుడు కుటుంబం నుంచి కూడా వెంటనే ప్రోత్సాహం లభించలేదట. భర్త నుంచే ఆమెకు తిట్లు పడ్డాయట. పనులు మానేసి అవేం వీడియోలు అంటూ ఆయన నిరుత్సాహపరిచేవారని ఆమె గుర్తు చేసుకుంటున్నారు. అయినా తన ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు. వినడం, మాట్లాడటం, తప్పులు సరిదిద్దుకోవడం.. ఇదే తన ఇంగ్లిష్ నేర్చుకునే మార్గమని ఆమె చెబుతుంటారు. ఇప్పుడు ఆయనే ఆమె భుజం తట్టి అభినందిస్తున్నారట. ఇప్పుడు గ్లోబల్ వైడ్.. గ్రామీణ ప్రాంతంలో సాధారణ జీవితాన్ని గడుపుతూ తనకు తానే ఇంగ్లిష్ నేర్చుకున్న యశోదా.. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు ప్రభుత్వం,ఎన్జీవోల తరఫున పలు ఈవెంట్లలో పాల్గొని మరికొందరిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. అలాంటి వ్యక్తి వీడియోను ప్రియాంక చోప్రా షేర్ చేయడంతో.. పల్లెటూరి మేడమ్ పేరు మరోసారి దేశవ్యాప్తంగా చర్చలోకి వచ్చింది.ఇదీ చదవండి: వారెవ్వా.. చీరలో ఆమె పరుగులు! వెనక ఎమోషనల్ కథ -
నవంబర్ 13.. అసలు ఏం జరగబోతోంది?
నవంబర్ 13, 2026.. ఈ తేదీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కారణం.. ఆ రోజే ప్రపంచం అంతం కానుందంటూ వైరల్ అవుతున్న ప్రచారం. ఏకంగా 66 ఏళ్ల క్రితమే శాస్త్రవేత్తలు ఈ తేదీని ‘డూమ్స్‌డే’గా పేర్కొన్నారని పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో అసలు ఏం జరుగుతుంది? నిజంగానే నవంబర్ 13న ప్రపంచం అంతం కాబోతోందా?.. కంగారుపడాల్సిన అవసరమే లేదు! అసలు విషయం ఏంటో చర్చిద్దాం.ఈ ప్రచారానికి కారణం 1960లో ప్రముఖ శాస్త్రీయ జర్నల్ ‘సైన్స్’లో ప్రచురితమైన పరిశోధనా పత్రం. ఆస్ట్రియాలో జన్మించిన భౌతిక శాస్త్రవేత్త హెయింజ్ వాన్ ఫోయర్స్టర్, అతని సహచరులు ప్యాట్రిసియా ఎం. మోరా, లారెన్స్ డబ్ల్యూ. అమొరే ఈ అధ్యయనాన్ని రూపొందించారు. దీనికి డూమ్స్ డే: ఫ్రైడే నవంబర్ 13 ఏడీ 20206 (Doomsday: Friday, 13 November, A.D. 2026) అనే పేరు పెట్టారు.క్రీస్తు శకం ప్రారంభం నుంచి 1958 వరకు ప్రపంచ జనాభా పెరుగుదలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి.. దాన్ని గణిత నమూనాలో విశ్లేషించారు. జనాభా పెరుగుదల సాధారణ వేగంతో కాకుండా.. కాలం గడిచేకొద్దీ మరింత వేగంగా పెరుగుతోందని వారు గుర్తించారు.లెక్కలు అనంతానికి వెళ్తే..అప్పటి జనాభా పెరుగుదల రేటు ఎలాంటి మార్పూ లేకుండా ఇలాగే కొనసాగుతుందని ఊహించి తమ గణిత సూత్రాన్ని భవిష్యత్తులోకి పొడిగించారు. అలా లెక్కలు వేస్తే ఒక దశలో జనాభా సంఖ్య ‘అనంతం’ (infinity) వైపు వెళ్తుందని తేలింది. ఆ గణిత నమూనాలో ఈ ‘సింగ్యులారిటీ’కి చేరుకునే తేదీ నవంబర్ 13, 2026గా వచ్చింది. అందుకే పరిశోధకులు ఆ తేదీకి ‘డూమ్స్‌డే’ అనే పేరు పెట్టారు. అంతేగానీ ఇది ప్రపంచం పేలిపోతుందని, భూమి నాశనమవుతుందని చేసిన జోస్యం కాదు. జనాభా పెరుగుదలను ఒకే గణిత సూత్రంతో నిరవధికంగా కొనసాగిస్తే వచ్చే అసాధ్యమైన ఫలితాన్ని చూపించడానికి పెట్టిన పేరు.శాస్త్రవేత్తలు ఏం చెప్పాలనుకున్నారు?ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా జనాభా వేగంగా పెరుగుతోంది. కుటుంబాల్లో ఎక్కువ మంది పిల్లలు ఉండటం, తదుపరి తరాల్లోనూ అదే ధోరణి కొనసాగడం వంటి పరిస్థితులు జనాభా విస్ఫోటంపై ఆందోళనలకు దారితీశాయి. “మన మునిమనుమలు ఆకలితో చనిపోరు.. జనాభా ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి అవుతారు” అనే భావనను పరిశోధకులు అప్పట్లో వ్యక్తం చేశారు. అంటే వారి ప్రధాన ఉద్దేశం మానవాళిని భయపెట్టడం కాదు.. జనాభా పెరుగుదల, ఆహారం, వనరులు, పర్యావరణం వంటి అంశాలపై ముందుగానే ఆలోచించాల్సిన అవసరాన్ని చెప్పడం.మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి?1960లో వేసిన లెక్కలు యథాతథంగా కొనసాగలేదు. ప్రపంచవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక పరిస్థితులు మారాయి. పట్టణీకరణ పెరగడం, మహిళల విద్య, కుటుంబ నియంత్రణ, వివాహాల వయసులో మార్పులు, జీవనశైలిలో మార్పులు వంటి అనేక కారణాలతో చాలా దేశాల్లో జననాల రేటు గణనీయంగా పడిపోయింది. ఒకప్పుడు జనాభా వేగంగా పెరుగుతున్న దేశాల్లోనూ ఇప్పుడు జననాల రేటు తగ్గుతోంది. కొన్ని దేశాల్లో జనాభా ఇప్పటికే తగ్గడం మొదలైంది.ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం ప్రస్తుతం ప్రపంచ జనాభా 8.2 బిలియన్లకు పైగా ఉంది. ప్రస్తుత ధోరణుల ప్రకారం ప్రపంచ జనాభా ఈ శతాబ్దం మధ్య తర్వాత గరిష్ఠ స్థాయికి చేరుకుని.. ఆ తర్వాత స్థిరపడటం లేదంటే క్రమంగా తగ్గే అవకాశం ఉంది.నవంబర్ 13న ఏం జరగబోతోంది?అందుకే 1960 పరిశోధన పత్రంలోని తేదీని చూసి భయపడాల్సిన అవసరం లేదు. నవంబర్ 13, 2026న ప్రపంచం అంతం అవుతుందని ఆ పేపర్ చెప్పలేదు. అలా ఏదైనా ప్రచారం కనిపిస్తే.. పట్టించుకోకండి. ఎవరైనా ప్రపంచ అంతానికి సంబంధించిన శాస్త్రీయ అంచనాగా చెబితే అది తప్పుదోవ పట్టించడమే.మొత్తానికి.. 1960లో చేసిన ఓ గణిత లెక్కకు వచ్చిన తేదీ ఇప్పుడు సోషల్ మీడియాలో ‘ప్రపంచ అంతం’గా వైరల్ అవుతోంది. కానీ నవంబర్ 13, 2026ను డూమ్స్డేగా భావించాల్సిన అవసరం లేదు. కానీ, ఆ పరిశోధన చెప్పిన సందేశం మాత్రం ఇప్పటికీ కీలకమే!. భూమిపై ఉన్న వనరులకు అనుగుణంగా మానవ జనాభా, వినియోగాన్ని నిర్వహించుకోవాల్సిన అవసరం.ఇదీ చదవండి: ప్రవక్తపై హిందూ యువకుడి పోస్ట్.. మరణశిక్షతో కలకలం -
చెత్త ఏరుకుంటూ..అన్ని లక్షలా పెన్షనా!
కష్టానికి తగిన ఫలితం తప్పక ఉంటుందని చెప్పే స్టోరీ. మన పెద్దలు తరుచుగా కష్టే ఫలి అని చెప్పేమాటకు నిలువెత్తు నిదర్శనం ఈ వృద్ధుడు. పాపం అతడికి కూడా తెలియదు అంత మొత్తం పెన్షన్ ఉందన్న విషయం. చివరికి తెలుసుకుని కలలో కూడా అనుకోలేదంటూ ఉబ్బితబ్బిబవుతున్నాడు. అసలేం జరిగిందంటే..చైనాకు చెందిన 71 ఏళ్ల రు(Ru) అనే వృద్ధుడు హునాన్ ప్రావిన్స్‌లోని చాంగ్డేలో జీవనోపాధి కోసం 21 ఏళ్లుగా పాత సామాన్లు (స్క్రాప్) ఏరుకుంటూ జీవించాడు. సెప్టెంబర్ చివరలో తన పెన్షన్ ఖాతాతో అనుసంధానమైన బ్యాంక్ కార్డు అందింది. అందులో డబ్బు ఎంతో ఉందో బ్యాలెన్స్ చెక్‌చేయగా ఏకంగా రూ. 61 లక్షలు ఉన్నట్లు తెలుసుకుని విస్తుపోయాడు. తనకు పెన్షన్ పొందే అర్హత ఉందని తెలియదని అంటున్నాడు. ఇంత మొత్తం వచ్చేలా చేసిన సామాజికి సంక్షేమ అధికారులు, ప్రభుత్వ విభాగాలకు కృతజ్ఞతలు తెలిపాడు. అస్సలు ఇంత మొత్తం కలలో కూడా ఊహించలేదని అంటున్నాడు. నిజానికి రు గతంలో హునాన్‌లోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే దుకాణంలో 30 ఏళ్ల పాటు పనిచేశాడు. 2000 ప్రారంభంలో ఉద్యోగులు పునరవ్యవస్థీకరణ సమయంలో తన ఉద్యోగం కోల్పోయాడు. అందుకుగానూ కొంత పరిహారం లభించింది. ఆ డబ్బు అయిపోయాక..ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. చివరికి జీవనోపాధి కోసం పాత సామాన్లు ఏకుంటూ జీవించడం ప్రారంభించాడు. ఆ తర్వాత చాంగ్డేకు వెళ్లి..పాడుబడిన భవనంలో నివశించడంతో అతడి గురించి వెలుగులోకి వచ్చిది. సంక్షేమ శాక సిబ్బంది అతడిని గుర్తించి తాత్కాలికి వసతి గృహానికి వెళ్లమని కోరితే..మొదట్లో అందకు ఒప్పుకోలేదు. చివరికి ఆశ్రయానికి వెళ్లడానికి అంగీకరించి అధికారులకు తన నేపథ్యం వివవరించడంతోనే అతడి గురించి వెలుగులోకి వచ్చింది. 2015లో పదవీ విరమణ వయస్సు వచ్చినప్పటి నుండే 'రు' పెన్షన్ పొందడానికి అర్హుడని అధికారులు తెలిపారు. అతనికి పెన్షన్ నెలకు రూ. 50 వేలుగా అంచనా వేశారు. అధికారులు దశాబ్ద కాలం నుంచే చెల్లిస్తుండటంతో అంత పెద్ద మొత్తంగా మారింది. పెన్షన్‌కు అర్హత పొందాలంటే..విడిగా దీర్ఘకాలిక బీమా చెల్లింపులు చేయాలేమో అనుకున్నాడు రూ. కానీ తనకున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇన్సూరెన్స్ తీసుకోవడం అతడి వల్ల సాధ్యం కాలేదు. అయితే అతడు ప్రభుత్వ ఆధ్వర్యంలోని దుకాణంలో పనిచేస్తున్నప్పుడూ తన జీతంలో కొంత భాగం భీమా కోసం కేటాయించడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. చైనా నిబంధనల ప్రకారం, 15 ఏళ్లకు పైగా బీమా చెల్లింపులు చేసిన వారు పదవీ విరమణ వయస్సు వచ్చిన తర్వాత పెన్షన్‌కు అర్హత పొందవచ్చు. అలా రు అనే వృద్ధుడికి ఇన్ని లక్షలు అకౌంట్ చేరాయి. అయితే బ్యాంక్ కార్డుని తిరిగి ఇస్తూ సంక్షేమ అధికారులు డిజిటల్ మోసాల బారినపడకుండా కేర్‌ఫుల్‌గా ఉండాలని సూచించారు రుకి. రెండు దశాబ్దాలకు పైగా పారేసిన వస్తువులను సేకరించి జీవనం సాగించిన రుకి జీవితచరమాంకలో ఇంత మొత్తం నిజంగా ఊహంచని గొప్ప ఆర్థిక మలుపు కదూ ..!ఇదీ చదవండి: తెలుగు మీడియం బ్యాగ్రౌండ్ నుంచి దుబాయ్ వరకు..! -
‘40 సినిమాలకు డైలాగ్స్ రాశా.. 500 చిత్రాల్లో నటించా.. కానీ..’
టాలీవుడ్లో తనదైన నటన, రచనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు, రచయిత ఎల్బీ శ్రీరామ్. ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను నవ్వించి, మెప్పించిన ఆయన.. కొంతకాలంగా వెండతెరకు దూరంగా ఉంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ‘గరివిడి లక్ష్మి’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సినిమాలకు దూరం కావడానికి గల కారణాలను వెల్లడిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. అంతే కాకుండా తన సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.10 నుంచి 15 ఏళ్లు రంగస్థలంపై..‘సినిమాల్లో రాకముందు దాదాపు 10 నుంచి 15 ఏళ్లు రంగస్థలంపై నటించాను. నాటకరంగంలో ఎంతో అనుభవం సంపాదించిన తర్వాతే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాను. ఆ అనుభవంతోనే నటుడిగా దాదాపు 500 సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించే అవకాశం లభించింది. ‘హలో బ్రదర్’, ‘హిట్లర్’ ఇలా సుమారు 40 సూపర్‌హిట్ చిత్రాలకు డైలాగ్స్ రాశాను. ప్రస్తుతం స్థాయికి తగ్గట్లుగా నటించేందుకు సరైన పాత్రలు రావడం లేదు. అందుకే వెండి తెరకు కొంత కాలంగా దూరంగా ఉంటున్నా. దీంతో యూట్యూబ్‌లో షార్ట్ఫిలిమ్స్ చేస్తున్నాను. కమర్షియల్ సినిమాల్లో అవకాశాలు తగ్గినా.. డిజిటల్ కంటెంట్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటా’ అని ఎల్బీ శ్రీరామ్ భావోద్వేగంగా మాట్లాడారు.‘గరివిడి లక్ష్మి’ సినిమాతో.. కాగా ఎల్బీ శ్రీరామ్ ‘గరివిడి లక్ష్మి’ సినిమాతో మరోసారి వెండితెరపై సందడి చేయనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రంలో ఆయన ‘బుర్రకథ గురువు’ పాత్రలో కనిపించనున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆనంది ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రం అక్టోబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.(ఇదీ చదవండి: మెగా, నందమూరి మల్టీస్టారర్.. దర్శకుడిగా బోయపాటి రెడీ!) Memorable Frames with the Esteemed Guests & Team #GarividiLakshmi at the Trailer Launch Event ❤️🔥 WATCH TRAILER HERE! -- https://t.co/f9vANVZgm9 GRAND RELEASE IN THEATRES ON 17th OCTOBER 2026 ❤️ #GarividiLakshmionOct17th https://t.co/XtFKqdGzel— People Media Factory (@peoplemediafcy) October 5, 2026 -
'జిమ్ జిమ్ తార' పాట.. ఒక్క పాటతో సోషల్ మీడియా షేక్
సినిమా విడుదలకు ముందే ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ రావాలంటే భారీ ప్రమోషన్ బడ్జెట్, స్టార్ హీరోలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, వరుసగా రీల్స్, ఈవెంట్స్ అవసరమని భావించే రోజుల్లో ఓ చిన్న సినిమా టీమ్ మాత్రం అందుకు భిన్నమైన దారిని ఎంచుకుంది. ఒక్క క్రియేటివ్ ఐడియాతో భారీ ప్రమోషన్ ఖర్చును తగ్గించడమే కాకుండా తమ సినిమాను జనాల్లోకి బలంగా తీసుకెళ్లింది. ఆ మూవీనే 'పర్ణశాల'.హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని ‘జిమ్ జిమ్ తార’ పాట ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారుతోంది. సినిమా ప్రమోషన్లో భాగంగా చిత్ర బృందం చేసిన ఓ వినూత్న ప్రయత్నం అనూహ్యమైన స్పందనను తీసుకొచ్చింది. ఇప్పటికే లక్ష్మీదేవితో ‘జిమ్ జిమ్ తార’ పాటను పాడించిన చిత్ర బృందం, సినిమా ప్రచారానికి ఈ పాటనే ప్రధాన ఆయుధంగా మలుచుకోవాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా రూపొందించిన ప్రమోషనల్ మూవ్.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది.‘జిమ్ జిమ్ తార’ పాటకు వచ్చిన స్పందన సినిమాకు కూడా బజ్ తీసుకొచ్చేలా మారితే అది థియేట్రికల్ బిజినెస్‌తో పాటు ఓటీటీ, ఆడియో హక్కుల మార్కెట్‌పైనా సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. సినిమా విడుదలకు ముందే ఓ పాట ఇంతగా వైరల్ కావడం ‘పర్ణశాల’ టీమ్‌కు ప్లస్ పాయింట్‌గా మారింది. మరి ఈ హైప్ థియేటర్ల వరకు కొనసాగుతుందా? ‘జిమ్ జిమ్ తార’ క్రియేట్ చేసిన బజ్ సినిమాకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వై.జి.భరత్ దర్శకత్వంలో, మంచి వెంకట్ నిర్మిస్తున్న ‘పర్ణశాల’ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. -
అమ్మాయిగా మారి నేటికి పదేళ్లు.. ‘బిగ్‌బాస్’ ఫేమ్ ప్రియాంక ఎమోషనల్ పోస్ట్
బుల్లితెరపై తనదైన కామెడీ, అల్లరితో ప్రేక్షకులను అలరించిన ప్రియాంక సింగ్.. తన జీవితంలో ఎన్నో సవాళ్లను దాటి ఈ స్థాయికి చేరుకుంది. ‘జబర్దస్త్’ కామెడీ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె.. ఆ తర్వాత ‘బిగ్‌బాస్’ ఐదో సీజన్లో అడుగుపెట్టి మరింత దగ్గరైంది. అయితే తెరపై ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ప్రియాంక జీవితం వెనుక ఎన్నో కన్నీళ్లు, నిద్రలేని రాత్రులు, ఒంటరి పోరాటం ఉన్నాయని కొంతమందికే తెలుసు.ఇదే విషయాన్ని.. తాను కోరుకున్న జీవితాన్ని సొంతం చేసుకునేందుకు పదేళ్ల క్రితం వేసిన అడుగు గురించి తాజాగా సోషల్‌మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టింది. ఇప్పుడీ పోస్ట్ అభిమానులకు కన్నీరు తెప్పిస్తోంది. అసలు ఆమె ఎవరు.. అని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ విషయాలు ఒకసారి చూద్దాం.(ఇదీ చదవండి: సోషల్ మీడియాకు భయపడి 'ఆదర్శ కుటుంబం' వాయిదా)‘అప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి’‘పదేళ్లు గడిచాయంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. అప్పట్లో నేను ఎదుర్కొన్న బాధ, కన్నీళ్లు, నిద్రలేని రాత్రులు, ఒంటరితనం అన్నీ ఇప్పటికీ నా కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ‘ఏం చేయాలి? అసలు నేను ఎవరు?’ అని ఎన్నోసార్లు నన్ను నేను ప్రశ్నించుకున్నా. అయినప్పటికీ నేను కోరుకున్న వ్యక్తిగా జీవించాలనే పట్టుదలతో ముందుకు సాగాను’ అని ప్రియాంక పేర్కొంది.‘నేను సాధించాను’గడిచిన పదేళ్లలో వ్యక్తిగత జీవితంతో పాటు కెరీర్లోనూ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని ఆమె తెలిపింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తాను కృంగిపోలేదని చెప్పింది. ‘ఈ రోజు అద్దంలో నన్ను నేను చూసుకుంటూ ‘నేను సాధించాను’ అని గర్వంగా చెప్పుకోగలను. ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టకుండా ప్రశాంతంగా, సంతోషంగా జీవిస్తున్నాను. ఈ అందమైన జీవితాన్ని, ముందుకు సాగే ధైర్యాన్ని ఇచ్చిన విశ్వానికి ధన్యవాదాలు’ అని రాసుకొచ్చింది.తన పదేళ్ల క్రితం ప్రారంభించిన ప్రయాణాన్ని ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే తనకు తానే గర్వంగా అనిపిస్తోందని ప్రియాంక తెలిపింది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె అభిమానులు, నెటిజన్లు ప్రియాంక ధైర్యాన్ని మెచ్చుకుంటూ అభినందనలు తెలుపుతున్నారు.(ఇదీ చదవండి: తమిళ రాజకీయాల్లోకి మరో హీరో.. పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమా?) View this post on Instagram A post shared by Priyanka Singh (@priyankasingh.official_) -
రక్షకుడిలో నాగార్జునను మించిపోయాడే!
రక్షకుడు సినిమా ఇంట్రోలో నాగార్జున కుక్కతో జాగింగ్‌కు వెళ్లాడు. ఒకడు క్రికెట్ మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలుస్తుందని.. ఇండియా ఓడుతుందని బెట్టింగ్ నిర్వహిస్తుంటాడు. ఆ మాటతో నరాలు తెగెంత కోపం తెచ్చుకుని వాడి చెంపలు వాయిస్తాడు నాగ్. కలలో కూడా ఇండియా ఓడిపోకూడదని కోరుకోకూడదని అక్కడున్నవాళ్లకు క్లాస్ పీకుతాడు. సందర్భం వేరైనా ఇక్కడో భారతీయుడు కూడా ఇలాంటి మమ‘కారమే’ ప్రదర్శించాడు.ఓ షాపింగ్ మాల్. లైవ్‌స్ట్రీమ్‌లో కెమెరా ఆపమని చెప్పినా వినలేదు. పదే పదే రిక్వెస్ట్ చేసినా పట్టించుకోకుండా వ్యక్తిగత దూషణకు దిగాడు. అయినా సున్నితంగా వాళ్లు వద్దని చెబుతూ వచ్చారు. ఈసారి హద్దులు దాటి జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడు. దేశాన్ని తిట్టాడు. సహనం నశించిన ఓ భారతీయుడు.. ఫట్‌మని అతడి చెంప చెల్లుమనిపించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కెనడాకు చెందిన స్ట్రీమర్ జాన్ లై(John Ly).. ఆన్లైన్లో జాన్వాట్స్గోయింగ్ఆన్ (JohnWhatsGoingOn) పేరుతో కంటెంట్ చేస్తుంటాడు. వియత్నాంలోని సైగాన్లో ఓ స్టోర్ వద్ద అతడు లైవ్‌స్ట్రీమింగ్ చేస్తుండగా ఇద్దరు భారతీయులు అతడి కెమెరా ముందుకు వచ్చారు. అయితే తమను అనుమతి లేకుండా చిత్రీకరించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. కెమెరాను తమవైపు తిప్పొద్దని పలుమార్లు కోరారు. అయితే జాన్ మాత్రం లైవ్‌స్ట్రీమ్‌ను ఆపకుండా వారితో మాట్లాడటం కొనసాగించాడు. ఈ క్రమంలో.. వారిని వ్యక్తిగతంగా దూషించాడు. అంతటితో ఆగకుండా రేసిస్ట్ వ్యాఖ్యలు చేశాడు. భారత దేశాన్ని ఇష్టానుసారం తిడుతూ కామెంట్లు చేశాడు. ఆ మాటలతో ఇద్దరు భారతీయుల్లో ఒకరికి ఒళ్లు మండిపోయింది. జాన్ దగ్గరకు వెళ్లి అతడి చెంపపై కొట్టాడు. ఆ సమయంలోనూ లైవ్‌స్ట్రీమ్ కొనసాగుతూనే ఉండటంతో మొత్తం ఘటన కెమెరాలో రికార్డయింది. జాన్ కూడా ఆ సమయంలో హిందీలో వారిని దూషిస్తూ మాట్లాడుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈలోపు కొందరు భారతీయులు అక్కడ గుమిగూడి జాన్‌ను అలాంటి మాటలొద్దని హెచ్చరించారు.🚨 WATCH: 🇮🇳 Indian men confront and slap a racist 🇨🇦 Canadian streamer in 🇻🇳 Vietnam after he passed racist remarks and filmed them up close on a live Kick stream while his chat posted “F*** INDIA” and “dirty Indian.” https://t.co/od9ABGN9OB— Beats in Brief 🗞️ (@beatsinbrief) October 4, 2026ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఎక్స్, ఇన్స్టాగ్రామ్, రెడిట్ తదితర ప్లాట్‌ఫామ్‌లలో నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా తమను రికార్డు చేయొద్దని పలుమార్లు చెప్పిన తర్వాత కూడా జాన్ చిత్రీకరణ కొనసాగించడంపై కొందరు ప్రశ్నలు సంధిస్తున్నారు.సాధారణంగా.. ఐఆర్ఎల్ (IRL) స్ట్రీమింగ్‌లో క్రియేటర్లు తాము ఉన్న ప్రదేశంలో జరిగే విషయాలను నేరుగా ప్రసారం చేస్తుంటారు. ఈ క్రమంలో చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కూడా కెమెరాలో కనిపించడం సాధారణమే. అయితే ఎవరైనా తమను రికార్డు చేయొద్దని స్పష్టంగా అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు.. ఆపేయాలి. కానీ, జాన్ ఉద్దేశపూర్వకంగా వాళ్లను దూషిస్తూ గొడవ పడ్డాడు. సో.. అతనిదే తప్పని మెజారిటీ నెటిజన్లు చెబుతున్నారు.ఒక్కటి సరిపోదేమో భయ్యా!జాన్ కంటెంట్ దాదాపుగా ఇతర దేశాలను అవమానించేలా ఉంటుంది. ఆ దేశాలకు వెళ్తూ.. అక్కడి మనుషుల్ని, ఆహారపు అలవాట్లను హేళన చేస్తుంటాడు అతను. అతని వీడియోలో చాలా మట్టుకు ఇవే. అలాంటి కంటెంట్‌తోనే ఫాలోవర్స్, సబ్‌స్క్రయిబర్స్‌ను పెంచుకుంటూ పోతున్నాడు. అంతేకాదు.. కాళిమాత విషయంలోనూ ఓ వీడియో నెట్టింట విమర్శలకు తావిచ్చింది. దీంతో.. అతని ప్రొఫైల్ చూసిన వాళ్లంతా ఒకటి కాదు.. మరో నాలుగు తగిలిస్తే సరిపోయేదేమో అనే కామెంట్లు చేస్తున్నారు.KICK STREAMER JOHNWHATSGOINGON CONTINUES TO MOCK INDIANS Seems that slap wasn't enough. JohnWhatsGoingOn posted a video of him wearing a black turban, smiling while displaying and insulting Hindu deity imagery and engaging with chat comments referencing Indian accents He also says he is “ready to go to war” and “can’t wait to get assaulted again,” appearing to remain defiant amid the backlash.— Subodh Kumar (@kumarsubodh_) October 5, 2026 -
కొడుకుని మార్చబోయి.. ఆమెనే గేమింగ్ క్వీన్‌గా!
కుమారుడి గేమింగ్ అలవాటుని మారుద్దామని అనుకుంది. దీనికి బానిసై మార్కులు కూడా తక్కువ వస్తున్నాయని భావించి ఆ అలవాటుని దూరం చేసేందుకు అతడితో తరుచుగా గొడవపడుతుండేది. అతడి చేతా ఆ అలవాటుని మానిపిద్దాం అనుకుని చేసిన ప్రయత్నం..చివరికి ఆమెనే అందులో క్వీన్‌గా చేసి, అదే ఆమె కెరీర్‌గా మారిపోయింది. నెట్టింట ఈ స్టోరీ వైరల్‌గా మారింది. ఆ అమ్మే చైనాకు చెందిన జోంగ్ జువాన్జువాన్. తన టీనేజ్ కుమారుడు కోసం ఇంటర్నెట్ కేఫ్‌లకు వెళ్లాల్సి వచ్చేది. అతడి గేమింగ్ అలవాటు వల్ల తానే బలవంతంగా ఇంటికి తీసుకురావల్సి వచ్చేది. ఆంటీ జువాన్‌గా పిలిచే ఈ బామ్మ తన కుమారుడు ఆన్లైన్ గేమింగ్‌లో మంచి పేరుగాంచాడు. అతడు సెకండరీ స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడు బామ్మ జోంగ్వై ఖరి వేరుగా ఉండేది. అతడికి ఈ గేమ్‌ల పట్ల ఉన్న వ్యామోహం కారణంగా మార్కులు తక్కువుగా వచ్చేవి. అతడిని ఆచూకీ దొరకాలంటే ఇంటర్నెట్ కేఫ్‌లకు వెళ్లి వెతకాల్సి వచ్చేది. దీంతో అమ్మ కొడుకుల మధ్య తరుచుగా ఈ విషయమై విపరీతమైన గొడవలు జరుగుతుండేవి. అసలు ఎందుకలా తన కుమారుడు సువోడే ఉద్యోగాన్ని సైతం వదిలిపెట్టి..ఎక్కువ గంటలు ఆ గేమింగ్లతోనే గడుపడానికి అసలు కారణం ఏంటని, అసలు అందులో అతడిని అంతగా ఆకర్షిస్తున్నది ఏంటి వంటివి తెలుసుకుందామని సాగిన ప్రయాణం..ఆ బామ్మను గేమింగ్ నేర్చుకోవాలనేందుకు దారితీసింది. సడెన్‌గా తన అమ్మ ఈ వీడియో గేమ్‌ల పట్ల ఇంత ఆసక్తి చూపిస్తుందేంటని..ఆశ్చర్యపోతూనే ఆమెకు అందులో శిక్షణ ఇచ్చాడు. మొదట్లో కంటి చూపు మందగించడంతో ఇబ్బంది పడింది. అలాగే ఆ ఆన్లైన్ టెక్నాలజీని అర్థం చేసుకోవడంలో తడబడేది. ఆ తర్వాత సాధని చేసి..అందులో మంచి నైపుణ్యం సాధించి..ఏకంగా ఎనిమిదివేల గంటలకు పైగా గేమ్‌ప్లే కూడగట్టాడు. అలా 2022లో లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభించింది. ఒక పెద్ద వయసు మహిళ గట్టి పోటీ ఇచ్చేలా ఆడుతుండటం చూసి ఆన్లైన్ వీక్షకులంతా విస్తుపోయేవారు. సెప్టెంబర్ 2024లో కౌంటర్-స్ట్రైక్: గ్లోబల్ ఆఫెన్సివ్ కోసం జరిగిన ఒక ఆన్లైన్ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లోనే ఈ 60 ఏళ్ల జోంగ్ బామ్మకు పెద్ద బ్రేక్ వచ్చింది. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన 17 ఏళ్ల రష్యన్ గేమింగ్ స్టార్ డాంక్నే మట్టికరింపించేలా విజయకేతనం ఎగరువేసింది. ఆమె వెనుక నుంచి వేరే వ్యక్తి ఎవరైనా ఆడుతున్నారా ఏంటి అని సందేహలు కూడా వ్యక్తం చేసేవారు ఆన్లైన్ వీక్షకులు. అయితే సుయోడే తన తల్లి ఆడుతున్నప్పుడే వివిధ కోణాల నుంచి రికార్డు చేసేలా కెమెరాలు ఫిక్స్ చేసేవాడు. ఈ వయసులో ఇదేంటని కొందరు విమర్శించినా..తాను వంటగదికే పరిమితం కావాలా అని జాంగ్ ఎదురుప్రశ్న వేసి, ఆ మాటలకు అడ్డుకట్ట వేసేది. అంతేగాదు ఆ బామ్మ గేమింగ్ అనేది మెదడును చురుకుగా ఉంచుతుంది, కంటి సమన్వయాన్ని మెరుగుపరుస్తుందని వాదిస్తుండటం విశేషం. విచిత్రం ఏంటంటే ఒకప్పుడూ గేమింగ్‌లో మునిగితేలుతున్న బాలుడిని తిట్టే ఆ 60 ఏళ్ల అమ్మనే..ఇంటర్నెట్ ఆఫ్ చేసేలా జ్రాగత్తలు తీసుకుంటాన్నాడు కుమారుడు సువోడే. దీంతో ఆమెకు ఇంటర్నెట్లో విఫరీతమైన ఫాలోవర్లు రావడమే కాదు..మచి ఫేమ్ కూడా వచ్చిందని అంటోంది. చాలామంది నెటిజన్లు జువాన్ఆంటీ మిమ్మల్ని సోషల్ వీడియోలో గేమ్స్ ఆడటం చూశాం అంటూ సంబరంగా చెబుతుండటం విశేషం. ఇదీ చదవండి: అక్కడ వరుడే అత్తారింటికి వెళ్తాడు..! -
హనుమాన్ చాలీసా.. ఇప్పుడు గ్లోబల్ సెన్సేషన్!
హనుమాన్ చాలీసా.. ఇప్పుడు మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఫ్లైదుబాయ్ విమానంలో ప్రాణాపాయ పరిస్థితిని ఎదుర్కొన్న భారత కెప్టెన్ స్మిట్ మచ్చార్.. తీవ్ర గాయాలతో ఉన్న సమయంలో హనుమాన్ చాలీసా పఠించానని, దాని ద్వారా ధైర్యం, బలం కూడగట్టుకుని కాక్‌పిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించానని ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన వీడియో కాల్లో వెల్లడించారు. ఆ ఘటన తర్వాత హనుమాన్ చాలీసా గురించి ఇంటర్నెట్లో వెతుకులాట, చర్చ కూడా పెరిగింది. ఫ్లైదుబాయ్ దుబాయ్–టెల్ అవీవ్ విమానంలో కో-పైలట్ దాడికి గురైన కెప్టెన్ స్మిట్ మచ్చార్ తీవ్రంగా గాయపడ్డారు. విమానం అదుపు తప్పే పరిస్థితుల్లోనూ ప్రయాణికుల భద్రత కోసం కాక్‌పిట్ డోర్ తెరిచేందుకు ఆయన ప్రయత్నించారు. అనంతరం ప్రధాని మోదీతో జరిగిన వీడియో సంభాషణలో ఆ సమయంలో తన పరిస్థితిని వివరించారు. తాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా పఠిస్తానని, ఆ ఘటనలోనూ దానినే పఠిస్తూ ధైర్యం కూడగట్టుకున్నానని చెప్పారు.ఆ మాటలతో ఆసక్తికెప్టెన్ స్మిట్ మచ్చార్ స్వయంగా హనుమాన్ చాలీసా ప్రస్తావన చేయడంతో.. ఆ భక్తిగీతం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఆన్లైన్లో పెరిగింది. హనుమాన్ చాలీసా ఏమిటి? దాన్ని ఎవరు రచించారు? అందులో ఏముంది? వంటి అంశాలపై నెటిజన్లు వెతకడం, చర్చించడం మొదలైంది. సంక్షోభ సమయంలో తనకు ధైర్యం ఇచ్చిన ప్రార్థనగా కెప్టెన్ చెప్పిన ఈ ప్రస్తావన సోషల్ మీడియాలోనూ విస్తృతంగా చర్చకు వచ్చింది.రెండింతల వేగంతో అమెరికన్ పఠనంఇదిలా ఉండగా టెక్సాస్‌లో ఉంటున్న నిక్ డియర్మన్ హనుమాన్ చాలీసాను సాధారణ వేగానికి దాదాపు రెండింతల వేగంతో పఠిస్తూ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. రెండు రెట్ల వేగంతో పఠిస్తానని చెప్పి ప్రారంభించిన ఆయన.. ఎక్కడా తడబడకుండా, లయను కోల్పోకుండా చివరి వరకు కొనసాగించారు. వేగంగా పఠించినప్పటికీ పదాలను స్పష్టంగా పలకడంతో వీడియోకు సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చింది. కొందరు నెటిజన్లు ఆయన పఠనాన్ని ప్రశంసించగా.. మరికొందరు తాము కూడా అంత బాగా పఠించలేమంటూ సరదాగా కామెంట్లు చేశారు.ఏమిటీ హనుమాన్ చాలీసా?హనుమంతుడిని స్తుతిస్తూ రచించిన ప్రసిద్ధ భక్తిగీతమే హనుమాన్ చాలీసా. భక్తకవి తులసీదాసు దీనిని అవధీ భాషలో రచించినట్లు సంప్రదాయంగా భావిస్తారు. ఇందులో హనుమంతుడి బలం, ధైర్యం, జ్ఞానం, వినయం, శ్రీరాముడిపై ఆయనకున్న భక్తిని కీర్తించే 40 చౌపాయిలు ఉంటాయి. ‘చాలీసా’ అనే పదానికి నలభై అనే అర్థం ఉండటంతో ఈ గీతానికి హనుమాన్ చాలీసా అనే పేరు వచ్చింది.భక్తిలోనే కాదు.. ధైర్యానికి ప్రతీకగాహనుమాన్ చాలీసాను భక్తులు సాధారణంగా ప్రార్థనగా పఠిస్తారు. భయం, ఆందోళన.. కష్టకాలంలో పఠించడం ద్వారా మనసుకు ప్రశాంతత, ధైర్యం, ఏకాగ్రత కలుగుతాయని చాలామంది విశ్వసిస్తారు. అయితే ఇవి విశ్వాసానికి సంబంధించిన అంశాలు. కెప్టెన్ స్మిట్ మచ్చార్ చెప్పిన అనుభవం కూడా ఆయన వ్యక్తిగత విశ్వాసంతో ముడిపడి ఉంది. ఒకవైపు వేల అడుగుల ఎత్తులో ప్రాణాపాయ పరిస్థితిని ఎదుర్కొన్న భారత పైలట్.. తనకు ధైర్యాన్నిచ్చింది హనుమాన్ చాలీసా అని చెప్పడం, మరోవైపు అమెరికాలోని ఓ వ్యక్తి దానిని రెండింతల వేగంతో పఠిస్తూ వైరల్ కావడం.. ఇలా వరుస ఘటనలతో హనుమాన్ చాలీసా ఇప్పుడు భారతదేశాన్ని దాటి ప్రపంచవ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది.ఇదీ చదవండి: వారెవ్వా.. ఆమె ఉల్లి కన్నీళ్లు తుడిచిందిగా! View this post on Instagram A post shared by Nick Dearman - Neurodivergent Holistic Health Coach (@neurodivergent_nick) -
అమ్మా.. రూ. 12 లక్షలు కాదు.. రూ.1.2 కోట్లు! వైరల్‌గా ఐఐటీ గ్రాడ్యుయేట్ స్టోరీ..
సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన..కలలో కూడా ఊహించనంత ప్యాకేజ్ అందుకుని తల్లిదండ్రులనే సంభ్రమాశ్చర్యాలకు లోనుచేశాడు. అతడు తన వేతనం ఎంతో చెబుతున్నప్పుడు తల్లి అమాయకంగా అడిగిన ప్రశ్న..ప్రతి ఒక్కరి మనసుని కదలిస్తుంది. ఆ యువకుడి విజయగాథ పేదరికం ప్రతిభకి అడ్డంకి కాదని నిరూపించిన స్ఫూర్తిదాయక కథనం.అతడే శశాంక్ అగర్వాల్. రాజస్థాన్‌లోని బారన్‌కి చెందిన శశాంక్ కుటుంబ నేపథ్యం ఆర్థికంగా అంతంత మాత్రమే. అతడి తండ్రి నెలకు రూ. 3 వేలు సంపాదించేవారు. కానీ కుమారుడిని మాత్రం తమ శక్తికి మించి మంచి విద్యను అందించేలా చదవించడం విశేష. ఆ కష్టమే ఇవాళ ఫలించి ఎదిగొచ్చిన కొడుకుగా, మంచి ప్రయోజకుడిగా నిలబెట్టింది. అతను ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆల్ ఇండియా ర్యాంక్ సాధించి ఐఐటీ బొంబాయిలో చదువుకుని టెక్నాలజీ అండ్ క్వాంటిటేటివ్ ఫైనాన్స్‌లో పనిచేశాడు. ఆ తర్వాత అతనికి ప్రతిష్టాత్మక క్వాడైలో కంపెనీలో ఏకంగా రూ. 1.2 కోట్లు ప్యాకేజ్ పొందాడు. ఆ విషయాన్ని తన తల్లితో చెప్పగానే ఆమె రూ. 12 లక్షలా అని అమాయకంగా అడగగా..లేదు అమ్మా..రూ.1 కోటి 20 లక్షలు అని బదులివ్వడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. అరకొర సంపాదనతో గడిపే ఆ పేరెంట్స్ తమ బిడ్డ ఆ రేంజ్లో వేతనం సంపాదించడాన్ని కలా నిజమా అని ఉబ్బితబ్బిబవుతున్నారు. శశాంక్ మాత్రం ఈ అద్భుతమైన ప్యాకేజ్ తన కష్టానికి వచ్చిన ఫలితం అని అంటున్నాడు. ప్రతిదానికి కష్టపడాలని..అదే మనల్ని విజయతీరాలకు చేరుస్తుందని అంటుఉన్నాడు. తాను కూడా ఇంటర్లో బాగా ఆటలు ఆడేవాడినని, మొబైల్ గేమ్స్ అంటే పిచ్చి అని చెప్పుకొచ్చాడు. ఒక దశలో తన ప్రిపరేషన్ చాలా అసంపూర్ణంగా ఉండేదని, గుర్తుచేసుకున్నాడు. అయితే గురవులు, తల్లిదండ్రలు మార్గదర్శకత్వంలో తన దృక్పథం మార్చుకుని లక్ష్యంపై ఫోకస్ పెట్టినట్లు చెప్పుకొచ్చాడు. తనలా ఇంటర్లో సరిగా ఫోకస్ పెట్టలేనట్లయితే బాధపడుతూ కూర్చోవద్దు..ప్రయత్నించండి, కనీసం బాగా చదవి ఆ బాధను అధిగమించేలా చూడండి అని సూచిస్తున్నాడు. ఏ ప్రయత్నం చేయకుండా వృధా చేశాననే బాధ కెరీర్లో ఒకానొక దశలో ఎవ్వరికైనా కలుగుతుంటుంది. దానికి ఒక్కటే మార్గం కష్టపడి చదవడం ద్వారానే ఆ సమస్యను అధిగమించగలరని అంటున్నాడు. అలాగే చదవడానికి ఎప్పటికీ ఆలస్యం ఉండదు. కేవలం మన దృక్పథమే మారాలని నొక్కి చెబుతున్నాడు.ఇదీ చదవండి: Swara Bhasker: పెళ్లికి ముందే రెండుసార్లు IVF ఫెయిల్.. పెళ్లైన తొమ్మిది నెలల్లోనే బిడ్డ.. -
జస్ట్ 25 సెకన్లలో కిడ్నాప్!
ఇంటి బయట కూర్చున్న యువతిని.. సడన్‌గా దూసుకొచ్చిన ఓ వ్యక్తి బలవంతంగా ఎత్తుకెళ్లాడు. కారులో ఎక్కించేందుకు ప్రయత్నించగా.. సమయ స్ఫూర్తిని ప్రదర్శించి కొందరు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ, కిడ్నాపర్ బలం ముందు వాళ్లు నిలవలేకపోయారు. కేవలం 25 సెకన్లలో జరిగిన ఈ కిడ్నాప్ కేసులో.. ఇప్పుడు మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని లాల్‌బాయి–ఫూల్బాయి ప్రాంతంలో మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో ఓ యువతి అపహరణకు గురైంది. ఇంటి బయట ఉన్న యువతి వద్దకు నంబర్ ప్లేట్ లేని కారులో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారిలో ఒకరు కారు దిగి యువతి వద్దకు వెళ్లాడు. ఆమెను కారులోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా కుటుంబసభ్యులు, పొరుగువారు అడ్డుకునేందుకు ప్రయత్నించారు.Ujjain - A 19-year-old woman, who is reportedly the daughter of a police constable posted with the traffic department, was allegedly abducted by two men in Ujjain on. The incident took place in the Lalbai Phulbai area and was captured on a nearby CCTV camera, the woman was… pic.twitter.com/XqPjplOaUU— NextMinute News (@nextminutenews7) September 30, 2026కొందరు యువతిని వెనక్కి లాగేందుకు కూడా ప్రయత్నించినట్లు సీసీటీవీ దృశ్యాల్లో కనిపించింది. అయినప్పటికీ యువతిని కారులోకి తీసుకెళ్లి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కిడ్నాప్ కేసు నమోదైంది.రాత్రంతా గాలింపు.. ట్విస్ట్ఈ ఘటనపై పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. యువతిని తీసుకెళ్లిన వ్యక్తుల్లో ఒకరిని ఉజ్జయినిలోని ఉర్దుపురాకు చెందిన ధ్రువ్ కుమావత్‌గా గుర్తించారు. అతడి కోసం, మరో వ్యక్తి కోసం పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అయితే కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే యువతి కుటుంబానికి ఓ వీడియో వచ్చింది.అందులో.. ఆశ్చర్యకరంగా యువతి ధ్రువ్‌తో కలిసి కనిపించింది. తామిద్దరం పెద్దవాళ్లమని(మేజర్లు), తమ ఇష్టప్రకారమే ఇంటి నుంచి వెళ్లిపోయామని, పెళ్లి కూడా చేసుకున్నామని ఆ వీడియోలో వారు తెలిపారు.బలవంతం చేయలేదు..మరో వీడియోలో యువతి మరింత స్పష్టంగా స్పందించింది. తనను ఎవరూ బలవంతంగా తీసుకెళ్లలేదని చెప్పింది. తాను కారులోకి ఎక్కుతున్న సమయంలో తన సోదరి చేయి పట్టుకుందని, ఆ తర్వాతే ఈ ఘటన కిడ్నాప్లా కనిపించిందని పేర్కొంది. తామిద్దరం స్వచ్ఛందంగానే వెళ్లిపోయామని తెలిపింది. అంతేకాదు.. తమపై కుటుంబసభ్యులు ఒత్తిడి చేయవద్దని, రెండు మూడు రోజుల్లో పోలీసుల ఎదుట హాజరవుతామని యువతి, ఆమెతో ఉన్న వ్యక్తి వీడియోలో కోరారు. అయితే ఈ వీడియోలు వెలుగులోకి వచ్చినప్పటికీ పోలీసులు కిడ్నాప్ కేసు దర్యాప్తును ఆపలేదు. A 19-year-old woman was allegedly dragged into a car in Ujjain as locals tried to intervene, with the entire incident captured on CCTV. Hours later, videos surfaced in which the woman and the accused man claimed they had married and left voluntarily.Police have registered a… pic.twitter.com/NLArUfl9Gt— IndiaToday (@IndiaToday) September 30, 2026 VIDEO CREDITS: INIDIATODAY Twitter(X) -
ఫ్లైదుబాయ్ ఘటన.. అతని మాటలే నిజమయ్యాయి!
ఆకాశంలో ఏదైనా ప్రమాదం జరిగితే.. ప్రయాణికులకు తొలుత గుర్తొచ్చేది పైలట్. కానీ అత్యవసర పరిస్థితుల్లో కాక్‌పిట్ బయట ఉన్న సిబ్బంది ఎంత కీలకమో చెప్పిన ఓ పైలట్ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయనే ఫ్లైదుబాయ్ పైలట్ కెప్టెన్ స్మిట్ మచ్చార్. 174 మంది ప్రాణాలు కాపాడి.. రియల్ హీరో అంటూ ప్రపంచం నుంచి జేజేలు అందుకుంటున్నాడు ఈ భారతీయుడు ఇప్పుడు. దుబాయ్ నుంచి టెల్ అవీవ్(ఇజ్రాయెల్) వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడికి గురై తీవ్రంగా గాయపడినప్పటికీ.. తెగువ ప్రదర్శించిన కెప్టెన్ స్మిట్ మచ్చార్ ఎలాగోలా కాక్‌పిట్ తలుపు తెరవగలిగారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం.. విమానంలో అదనంగా ఉన్న మరో ఇద్దరు పైలట్లు విమానాన్ని సౌదీ అరేబియాలోని టబుక్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. లేకుంటే ఘోరం జరిగి ఉండేదేమో!. ఫ్లైదుబాయ్ ఘటనలో కెప్టెన్ స్మిట్ మచ్చార్‌కు తల, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. ఆయన భారీగా రక్తం కోల్పోయి స్పృహ కోల్పోయే స్థితికి చేరుకున్నా.. ప్రయాణికులతో మాట్లాడుతూనే ఉన్నారు. విమానం సౌదీ అరేబియా టబుక్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యే వరకు చికిత్స అందించిన ఇజ్రాయెలీ డెంటిస్ట్.. మచ్చార్ పరిస్థితి తీవ్రంగానే ఉన్నప్పటికీ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని తెలిపారు. ప్రస్తుతం ఆయనకు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయ్యిందని.. ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు చెబుతున్నారు.“గాల్లో ఏదైనా తప్పు జరిగితే.. మీ ప్రాణాలను ఎవరు కాపాడతారు? క్యాబిన్ క్రూ కాపాడగలరు” అంటూ గతంలో స్మిట్ మచ్చార్ చెప్పిన మాటలు.. ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి. స్మిట్ మచ్చార్ ప్రయాణం మొదటి నుంచీ విమానయానంతో ముడిపడి లేదు. చిన్నప్పటి నుంచీ పైలట్ కావాలన్నది ఆయన కల కాదు. గుజరాతీ మూలాలున్న స్మిట్ మచ్చర్ ముంబైలో చదువుకున్నారు. స్కూలింగ్ తర్వాత కుటుంబ వ్యాపారంతో సంబంధం ఉన్న టెక్స్టైల్ ఇంజినీరింగ్ కోర్సులో చేరారు. ఆ తర్వాత మేనేజ్మెంట్ కోర్సులో చేరారు.అక్కడే ఓ రోజు జరిగిన ఏవియేషన్ సెమినార్ ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. విమానయానంపై ఆసక్తి కలిగింది. అప్పటికి ఆయన వయసు కేవలం 19 ఏళ్లు. పైలట్ కావాలన్నది నా చిన్ననాటి కల కాదు.. జీవితంలో చాలా తర్వాత అది నా ముందుకొచ్చింది అని 2025లో బోనాఫైడ్ బాంటర్ పోడ్కాస్ట్లో స్మిట్ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఆ క్షణం తల్లి భయపడింది!పైలట్ కావాలన్న తన నిర్ణయం కుటుంబంలోనూ ఆసక్తికరమైన స్పందనకు కారణమైందని మచ్చార్ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. తల్లి తొలుత భయపడగా.. తండ్రి మాత్రం తన నిర్ణయాన్ని ప్రశాంతంగా స్వీకరించారు. “ఎలా, ఎక్కడ చేయాలో చూసుకో” అంటూ తండ్రి ప్రోత్సహించారని మచ్చార్ ఆ పాడ్‌కాస్ట్‌లో గుర్తుచేసుకున్నారు.ఆ తర్వాత పైలట్ శిక్షణ కోసం న్యూజిలాండ్ వెళ్లారు. అదే ఆయన తొలి విదేశీ ప్రయాణం. చిన్న విమానంలో శిక్షణ సమయంలో తొలి ఫ్లయింగ్ అనుభవం కూడా అంత సులభంగా అనిపించలేదు. అనంతరం బెంగళూరు నుంచి ఢిల్లీకి కమర్షియల్ విమానంలో ప్రయాణించినప్పుడు కూడా భయపడ్డానని చెప్పారు. అయితే విమానం కంటే.. శిక్షణలో ఉన్న పైలట్‌గా తనపై ఉన్న బాధ్యతే ఎక్కువగా భయపెట్టిందని వివరించారు. వేల గంటల అనుభవంశిక్షణ పూర్తయ్యాక మచ్చార్ వాణిజ్య విమానయానంలోకి అడుగుపెట్టారు. ముంబైలోని స్పైస్‌జెట్‌లో సుమారు 11 ఏళ్లు పనిచేశారు. సీనియర్ కమాండర్‌గా మాత్రమే కాకుండా లైన్ ట్రైనింగ్ కెప్టెన్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. అంటే ఇతర పైలట్లకు శిక్షణ ఇవ్వడం, వారి పనితీరును పరిశీలించడం వంటి బాధ్యతలు కూడా ఆయనపై ఉండేవి. 2022 జూన్‌లో ఫ్లైదుబాయ్‌లో డైరెక్ట్ ఎంట్రీ కెప్టెన్‌గా చేరారు. బోయింగ్ 737-800, 737 MAX 8, MAX 9 విమానాలపై కలిపి ఆయనకు 9,750 గంటలకు పైగా ఫ్లయింగ్ అనుభవం ఉన్నట్లు ఆయన ప్రొఫైల్‌ను బట్టి తెలుస్తోంది. ఆ ఇంట్లో మరో పైలట్..మచ్చార్ కుటుంబంలో విమానయానంపై ఆసక్తి ఆయనతోనే ఆగిపోలేదు. ఆయన సోదరుడు కూడా పైలట్. ఇటీవలే అతను కూడా ఫ్లైదుబాయ్‌లో చేరారంట. స్మిట్ మచ్చార్ తన భార్య, పిల్లలతో కలిసి దుబాయ్‌లో నివసిస్తున్నారు. ఘటన విషయం తెలియగానే కుటుంబం ఆందోళనకు గురైంది. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతుండగా.. భారత అధికారులు కుటుంబంతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారు.#CaptainSmitMachchhar ने अपने एक इंटरव्यू में कहा था कि “जब हवा में कुछ गलत होता है, तो आपकी जान बचाने वाला कौन होगा? Crew आपकी जान बचा सकता है।”आज उनके वही शब्द सच साबित हुए।Flydubai FZ1073 में खुद घायल होने के बावजूद इस बहादुर कैप्टन ने विमान को बचाने में अहम भूमिका… pic.twitter.com/ylRQduYqLw— Akshay Chaudhary (Modi ka Pariwar) (@_Akshay_8800) October 1, 2026 ఆ మాటలు ఇప్పుడు వైరల్2025లో ఇచ్చిన పాత ఇంటర్వ్యూలో మచ్చార్ క్యాబిన్ క్రూ ప్రాధాన్యాన్ని ప్రత్యేకంగా వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులకు వైద్యుడు దొరకకపోవచ్చు.. కానీ క్యాబిన్ క్రూకు భద్రత, అత్యవసర పరిస్థితులు, ప్రథమ చికిత్సపై శిక్షణ ఉంటుందని చెప్పారు. “ఏదైనా తప్పు జరిగితే.. వాళ్లు అవసరం” అనే ఆయన మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. టెక్స్టైల్ ఇంజినీరింగ్ చదివి కుటుంబ వ్యాపారంలోకి వెళ్లాల్సిన యువకుడు.. 19 ఏళ్ల వయసులో తీసుకున్న ఒక్క నిర్ణయంతో పైలట్ అయ్యారు. నేడు అదే వృత్తిలో ఎదురైన అత్యంత భయానక క్షణంలో తన అనుభవాన్ని ఉపయోగించి విమానంలోని వందలాది మందికి భద్రత కల్పించడంలో కీలకంగా నిలిచారు. ఒకప్పుడు విమానం ఎక్కేటప్పుడే భయపడిన ఆ యువకుడి మాటలే.. ఇప్పుడు ఆకాశంలో జరిగిన అత్యంత ప్రమాదకర ఘటన తర్వాత మరోసారి ప్రపంచం గుర్తుచేసుకుంటోంది.ఇదీ చదవండి: స్మిట్.. నువ్వో హీరోవి! భారత్ గర్విస్తోంది -
సుందర్.. ఈయనో రాక్షసుడు! ఎవరికీ తెలియదు: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మధ్య వైట్‌హౌస్ వద్ద జరిగిన సరదా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టెక్ దిగ్గజాలతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ట్రంప్.. పిచాయ్‌ను ఉద్దేశించి “ఈయనో మాన్స్టర్.. కానీ ఎవరికీ తెలియదు” అంటూ వ్యాఖ్యానించారు. దీనికి సుందర్ పిచాయ్ కూడా ఒక్క నవ్వు నవ్వి బదులిచ్చారు.వైట్‌హౌస్ వద్ద మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ట్రంప్.. పిచాయ్‌ను పిలిచి “సుందర్.. ఏమైనా చెబుతావా?” అని అడిగారు. పిచాయ్ “ముందుగా థ్యాంక్స్...” అని చెప్పబోతుండగానే ట్రంప్ ఆయనకు అడ్డుపడ్డారు. “వీళ్లెవరో మీకు అసలు తెలియదు. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన వ్యక్తులు వీళ్లు. ఈయన (సుందర్ పిచాయ్) ఓ మాన్స్టర్(రాక్షసుడు).. కానీ ఎవరికీ ఈ విషయం తెలియదు” అని ట్రంప్ అన్నారు. అంతేకాదు.. ఇలాంటి టెక్ దిగ్గజాలకు ప్రతిరోజూ మీడియాతో మాట్లాడాల్సిన అవసరం లేకపోవడం ఎంత మంచి జీవితమో అంటూ వ్యాఖ్యానించారు.“మీకు గుర్తుండాల్సిన పేరు ఒక్కటే.. సుందర్” అని పిచాయ్‌ను ఉద్దేశించి ట్రంప్ అన్నారు. ట్రంప్ వ్యాఖ్యలకు పిచాయ్ అలా ఒక నవ్వు నవ్వి సరదాగా స్పందించారు. “నేను మాన్స్టర్ని అన్నదానికంటే ఇది మంచి ట్యాగ్‌లైన్ అవుతుందని ఆశిస్తున్నా” అంటూ అక్కడ నవ్వులు పూయించారు.Trump: This guy (Sundar Pichai) is a monster, and nobody knows him. What a great life! To be a Monster and not have to go through this. All you have to know is — sundarr! Sundar is his name. pic.twitter.com/smlS58lQdW https://t.co/1swuCa4RYT— Nicholas Mugalli (@RealNickMugalli) September 29, 2026ట్రంప్ భేటీ సారాంశం ఏంటంటే..వైట్‌హౌస్‌లో ట్రంప్.. సుందర్ పిచాయ్‌తో పాటు మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, ఆంత్రోపిక్ సీఈవో డారియో అమోడీ, ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్, ఓపెన్ఏఐ ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రాక్‌మన్ తదితర టెక్ రంగ ప్రముఖులతో సమావేశమయ్యారు. అధునాతన ఏఐ వ్యవస్థల భద్రత, కంపెనీల అంతర్గత నియంత్రణలు, ప్రమాదాల పర్యవేక్షణ తదితర అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా ‘వైట్‌హౌస్ అకార్డ్ ఆన్ సూపర్ ఇంటెలిజెన్స్’ పేరుతో స్వచ్ఛంద ఒప్పందాన్ని ప్రకటించారు. ఇందులో ఏఐ మోడళ్లపై అంతర్గత రిస్క్ సమీక్షలు, స్వతంత్ర ఆడిట్లు, కంపెనీ బోర్డుల పర్యవేక్షణ వంటి చర్యలు ఉన్నాయి. ఇది ప్రభుత్వ చట్టబద్ధ నియంత్రణ కాకుండా కంపెనీలు స్వచ్ఛందంగా పాటించే భద్రతా ప్రమాణాల ఒప్పందం.అమోడీకి ట్రంప్ వార్నింగ్?సమావేశంలో ఆంత్రోపిక్ సీఈవో డారియో అమోడీ(Dario Amodei)తోనూ ట్రంప్ సరదాగా మాట్లాడారు. అమోడీని తన పక్కకు పిలిచిన ట్రంప్.. “ఆయన ఓకే అని మాత్రమే చెప్పారు” అంటూ వ్యాఖ్యానించి, వెంటనే “బీ కేర్‌ఫుల్” అని హెచ్చరించినట్లు నవ్వుతూ చెప్పారు.అధునాతన ఏఐ వల్ల మానవాళికి ప్రమాదాలు ఉండొచ్చని అమోడీ గతంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ట్రంప్ ఈ సరదా వ్యాఖ్య చేసినట్లు తెలుస్తోంది. దీనిపై అమోడీ కూడా నవ్వుతూ.. ఏఐ రేసులో అమెరికా ముందుండాల్సిన అవసరం ఉందని, అదే సమయంలో టెక్నాలజీని సురక్షితంగా అభివృద్ధి చేసేందుకు అందరూ కలిసి పనిచేయాలని చెప్పారు.‘సూపర్ ఇంటెలిజెన్స్’పై పిచాయ్ ఏమన్నారంటే..ఏఐకి సూపర్ ఇంటెలిజెన్స్‌గా ట్రంప్ నామకరణం చేసిన సంగతి తెలిసిందే. సమావేశం అనంతరం పిచాయ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ట్రంప్, ఇతర టెక్ నాయకులతో ముఖ్యమైన చర్చ జరిగిందని, వైట్‌హౌస్ అకార్డ్ ఆన్ సూపర్ ఇంటెలిజెన్స్‌పై సంతకం చేసినట్లు తెలిపారు. ఏఐ అభివృద్ధిలో తగిన పరీక్షలు, మూల్యాంకనాలు, రెడ్ టీమింగ్, దుర్వినియోగం నివారణకు భద్రతా చర్యలను కొనసాగిస్తామని చెప్పారు. ఈ రంగంలో ఆవిష్కరణలు కొనసాగిస్తూనే బాధ్యతాయుతమైన అభివృద్ధి, భద్రతా ప్రమాణాల విషయంలో ఇతర సంస్థలతో కలిసి పనిచేస్తామని పిచాయ్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఏఐకి కొత్త పేరు పెట్టిన ట్రంప్ -
తారక్ దొరకడం నా అదృష్టం.. రాజీవ్ కనకాల ఎమోషనల్
స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రానికీ ఇప్పటికీ అభిమానులు ఉంటారు. అందులో ఉన్న పాటలు అలాంటివి మరి. కీరవాణి స్వరపరిచిన.. ఎక్కడో పుట్టి..ఎక్కడో పెరిగి పాట కోసం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ కాలేజ్ ఈవెంట్ అయిన మొదటిగా వేసే పాట ఇది. అయితే 'స్టూడెంట్ నెంబర్ వన్' విడుదలై నిన్నటితో 25ఏళ్లు పూర్తయింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం ఇది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సినీ ప్రస్థానానికి పునాది వేసిందనే చెప్పాలి. 2001, సెప్టెంబర్ 27న విడుదలైన చిత్రం 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడ వైరల్ అవుతోంది.పాతికేళ్ల క్రితం..‘ వెండితెరపైకి వచ్చిన ‘స్టూడెంట్ నెంబర్ వన్’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు.. నా వ్యక్తిగత జీవితంలో, సినీ కెరీర్లో ఒక మరుపురాని సువర్ణ అధ్యాయం. అంతకముందు ఎన్నో సినిమాలు చేసినా ఈ సినిమా చేసిన తర్వాతే నాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తర్వాతే నేను నటనను పూర్తిస్థాయి వృత్తిగా ఎంచుకుని చిత్ర పరిశ్రమలో రాణించగలిగాను. ఇందుకు రాజమౌళి, కీరవాణికి చాలా థ్యాంక్స్. ఇందులో నేను పోషించిన ‘సత్య’ పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో బలంగా నాటుకుపోయింది. ఇప్పటికీ ఏ వేదికపైకి వెళ్లినా ప్రేక్షకులు నన్ను ఆ పాత్ర పేరుతో గుర్తుచేసుకుని ఆప్యాయంగా పలకరిస్తుంటే కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది’ అని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి:సినిమా ఆలస్యం.. హైదరాబాద్ పీవీఆర్ మల్టీప్లెక్స్‌కు జరిమానా!25 Years of Student No.1 ❤️🎬25 ఏళ్ల క్రితం వచ్చిన Student No.1… ఒక సినిమా మాత్రమే కాదు, నా జీవితంలో ఒక ప్రత్యేకమైన అధ్యాయం.ఈ సినిమా తర్వాతే నేను పూర్తిగా సినిమాల్లోకి వచ్చాను. ‘సత్య’ అనే పాత్రతో ప్రేక్షకులకు దగ్గరయ్యాను. ఇప్పటికీ ఎక్కడికి వెళ్లినా ఆ పాత్ర గురించి గుర్తు… pic.twitter.com/cdlynlflls— Raajeev kanakala (@RajeevCo) September 29, 2026 -
పెళ్లిళ్లు కావట్లేదని ఊరినే అమ్మేస్తున్నారు!
ఒక గ్రామం మొత్తాన్ని అమ్మకానికి పెట్టారు. ఆ ఊరిని ఎవరు కొనాలనుకున్నా.. ధర చెల్లించాల్సిన అవసరం లేదు. ఆశ్చర్యపోతున్నారా? మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో తుల్షి గ్రామస్తులు చేసిన ఈ పని వెనుక ఓ తీవ్రమైన సమస్య ఉంది. ఏళ్ల తరబడి వెంటాడుతున్న నీటి కష్టాలతో విసిగిపోయి ప్రభుత్వ దృష్టిని ఆకర్షించేందుకు వారు ఈ వినూత్న నిరసనకు దిగారు.తుల్షి గ్రామంలో దాదాపు 7 వేల మంది నివసిస్తున్నారు. వ్యవసాయం, పశుపోషణే ప్రధాన జీవనాధారం. అయితే కొన్నేళ్లుగా గ్రామంలోని బావులు, చెరువులు ఎండిపోవడంతో తాగునీటి కోసం కూడా ట్యాంకర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది.దగ్గర్లోనే కాలువలు, అయినా ..తుల్షి సమీపంలోనే సీనా–మాధా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కాలువలు వెళ్తున్నాయి. అయినా ఆ నీరు తమ గ్రామానికి మాత్రం అందడం లేదని స్థానికులు చెబుతున్నారు. ప్రాజెక్టులో భాగంగా గ్రామానికి సమీపంలో సుమారు 800 మీటర్ల తవ్వకం పనులు 26 ఏళ్లుగా పూర్తికాలేదని సర్పంచ్ శరద్ మోరే తెలిపారు. ఆ పనులు పూర్తయితే తుల్షి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.ప్రభుత్వం నుంచి ఏళ్లుగా హామీలు వస్తున్నా పరిస్థితిలో మార్పు లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జల్ జీవన్ మిషన్ కింద పనులు చేపట్టినా.. గ్రామంలోని నీటి వనరులే ఎండిపోవడంతో ఆశించిన ప్రయోజనం కనిపించడం లేదని చెబుతున్నారు.నిరాహార దీక్ష.. పాత్రలతో నిరసనసమస్య పరిష్కారం కోసం గ్రామస్తులు సెప్టెంబర్ 14 నుంచి నిరాహార దీక్ష చేపట్టారు. అనంతరం మాధా తహసీల్దార్ కార్యాలయం ఎదుట పాత్రలు మోగిస్తూ ‘థాలీ నాద్’ నిరసన నిర్వహించారు. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.గ్రామంలో 14 చెరువులు, బావులు పూర్తిగా ఎండిపోయాయని స్థానికులు చెబుతున్నారు. వీటిని నీటితో నింపితే తాగునీటి సమస్యతోపాటు సాగునీటి ఇబ్బందులు కూడా కొంతవరకు తీరతాయని అంటున్నారు. ఇందుకోసం ప్రతిపాదనలు, అంచనాలు సిద్ధం చేసి అధికారులకు పలుమార్లు వినతులు సమర్పించినా ఫలితం లేదని వాపోతున్నారు.రూ.90 లక్షలు మంజూరు.. కానీ?తుల్షిలోని భవానీ పర్కొలేషన్ ట్యాంక్‌కు సీనా–మాధా పథకం నుంచి క్లోజ్డ్ పైప్‌లైన్ ద్వారా నీటిని తరలించేందుకు 2025–26లో రూ.90 లక్షలు మంజూరు చేసినట్లు ప్రకటించారు. ఈ పనితో గ్రామ తాగునీరు, సాగునీటి అవసరాలు తీరతాయని అధికారులు పేర్కొన్నారు. అయితే నిధులు మంజూరయ్యాయని మాత్రమే వింటున్నామని.. క్షేత్రస్థాయిలో మాత్రం పనులు కనిపించడం లేదని గ్రామస్తులు అంటున్నారు.STORY | 'Village for Sale’: Parched hamlet's desperate plea amid water crisis in MaharashtraDesperate for water and watching their farms and wells dry up, residents of a village in Maharashtra's Solapur district have put up a striking banner declaring "Village for Sale",… pic.twitter.com/9tTKzrEX9d— Press Trust of India (@PTI_News) September 29, 2026ఇక నీటి కష్టాలు గ్రామ సామాజిక జీవితంపైనా ప్రభావం చూపుతున్నాయని సర్పంచ్ చెబుతున్నారు. నీటి కొరత కారణంగా వ్యవసాయం, పశుపోషణ దెబ్బతిన్నాయని.. గ్రామంలోని సుమారు 350 మంది పురుషులకు పెళ్లిళ్లు కావడం లేదని ఆయన తెలిపారు. తమ గ్రామ పరిస్థితిని చూసి ఇతర ప్రాంతాల కుటుంబాలు సంబంధాలు ఇవ్వడానికి వెనుకాడుతున్నాయని పేర్కొన్నారు.మా కష్టాన్ని చూడండి!తుల్షి గ్రామస్తుల ‘విలేజ్ ఫర్ సేల్’ నిరసనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. పుణెలో మీడియాతో మాట్లాడిన వ్యవసాయ మంత్రి దత్తాత్రేయ భరణే.. గ్రామానికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయం చేస్తుందని తెలిపారు. అయితే తమకు ఇక హామీలు వద్దని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసి శాశ్వతంగా నీళ్లు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ‘‘విలేజ్ ఫర్ సేల్’’ బోర్డు పెట్టడం వెనుక ఉద్దేశం ఊరిని నిజంగా అమ్మడం కాదని.. తమ నీటి కష్టాన్ని ప్రభుత్వానికి, ప్రపంచానికి తెలియజేయడమేనని సర్పంచ్ శరద్ మోరే తెలిపారు. నీళ్లు వచ్చే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ఎంత పని చేశావ్ ఏనుగా? -
పాములు, చేపలు రోడ్డెక్కాయి!
చరిత్రలోనే ఎన్నడూ చూడని దుస్థితిని ఎదుర్కొంటున్నారు అక్కడి ప్రజలు. ఇళ్ల నుంచి బయటకు రావాలన్నా.. రోడ్లపై అడుగు పెట్టాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది. రోడ్లు, అపార్ట్మెంట్ ప్రాంగణాలు, మార్కెట్లు నీట మునగడంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఎటు చూసినా నీరే కనిపిస్తుండగా.. ఆ వరద నీటిలో పాములు, చేపలు తేలుతూ కనిపించడం మరింత కలవరపెడుతోంది. మరోవైపు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలు ఈ భయానక పరిస్థితిని కళ్లకు కడుతున్నాయి.థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు బ్యాంకాక్‌లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల కార్లు కిటికీల వరకు, మరికొన్ని చోట్ల దాదాపు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. అపార్ట్మెంట్ ప్రాంగణాల్లో పార్క్ చేసిన వాహనాల్లో పైకప్పులు మాత్రమే కనిపించే పరిస్థితి ఏర్పడింది. వరద నీటిలో పాములు, చేపలు సైతం కొట్టుకొస్తూ కనిపించడంతో స్థానికులు మరింత ఆందోళనకు గురయ్యారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోల్లో వీటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే ఇదే అదనుగా కొందరు ఆకతాయిలు ఏఐ వీడియోలతో మరింత బెంబేలెత్తిస్తున్నారు.📍Bangkok ,Thailand 🇹🇭 "Bangkok is flooded, even the fish 🐟 🐠 🐟 are on the streets 🛣️ ! Before, traffic jams were caused by too many cars, now you might still need to watch out for fish in the water"#bangkok #thailand #heavyrain #climatechange #Elnino #flooding… pic.twitter.com/p6b1x2KWLp— sustainme.in® (@sustainme_in) September 28, 2026 Banjir di Bangkok pic.twitter.com/zpQzpWdcqd— @ (@anthraxxxx) September 26, 2026ప్రధాన రహదారులపైనా భారీగా నీరు నిలిచిపోయింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి జెట్స్కీ(బోట్ తరహా వాహనం)తో వరద ముంచెత్తిన రోడ్డుపై దూసుకెళ్లిన వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై థాయ్ పోలీసులు చర్యలు తీసుకుని అతడిని అరెస్టు చేశారు.थाईलैंड में भीषण बाढ़ की वजह से सड़कों पर विशालकाय रेटिकुलेटेड पायथन तौर रहे हैं. किसी जानवर को निगलने के कारण अजगर का पेट काफी फूला हुआ था, जिसके चलते यह पानी में ठीक से तैर या हिल-डुल नहीं पा रहा था.दूसरी तरफ घरों के भीतर भी जहरीले सांप घुस रहे हैं, pic.twitter.com/2AhvcpdbZ1— Ruby Arun रूबी अरुण (@arunruby08) September 26, 2026మీటర్ లోతు నీటిలో.. బ్యాంకాక్‌లోని బాంగ్ కాపి ప్రాంతంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కొన్ని చోట్ల వరద నీరు దాదాపు మీటర్ వరకు చేరింది. అయినప్పటికీ వ్యాపారులు దుకాణాలు మూసివేయకుండా వినూత్నంగా వ్యాపారం కొనసాగించారు. ప్లాస్టిక్ క్రేట్లు, ఫోమ్ బాక్సులు, బేసిన్లను నీటిపై తేలేలా చేసి వాటిలో కూరగాయలు, చేపలు, మాంసం, ఇతర నిత్యావసరాలను విక్రయించారు. ప్రజలు నీటిలోనే నడుచుకుంటూ సరుకులు కొనుగోలు చేశారు. దీంతో మార్కెట్ మొత్తం ఓ ‘ఫ్లోటింగ్ మార్కెట్’ను తలపించింది.7 లక్షల మందిపై ప్రభావంవారాంతపు వరదలకు బ్యాంకాక్‌లో 3.29 లక్షల కుటుంబాలు.. దాదాపు 7 లక్షల మంది ప్రభావితమైనట్లు నగర అధికారులు వెల్లడించారు. భారీ వర్షాలతో డ్రైనేజీ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడింది. కొన్ని ప్రాంతాల్లో ప్రధాన రహదారులు, నివాస ప్రాంతాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. అయితే సోమవారం నుంచి వర్షం కొంత తగ్గడంతో అధికారులు డ్రైనేజీ, నీటి తొలగింపు చర్యలను వేగవంతం చేశారు.తాజా అధికారిక సమాచారం ప్రకారం.. బ్యాంకాక్‌తో పాటు థాయ్‌లాండ్‌లోని మరికొన్ని ప్రాంతాల్లో వరద పరిస్థితి కొనసాగుతోంది. సెప్టెంబర్ 28 నాటికి దేశవ్యాప్తంగా 27 ప్రావిన్సులు, బ్యాంకాక్‌లో వరదల ప్రభావం ఉన్నట్లు థాయ్ ప్రభుత్వం తెలిపింది. దాదాపు 5.76 లక్షల కుటుంబాలు, 17.93 లక్షల మంది ప్రభావితమైనట్లు పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో నీటిమట్టాలు తగ్గుతుండగా.. మరికొన్ని చోట్ల ఇంకా పెరుగుతున్నాయి.విమానాశ్రయంలో భారీగా లగేజీలు..వరద ప్రభావం బ్యాంకాక్ సువర్ణభూమి విమానాశ్రయానికీ తాకింది. వరదల కారణంగా గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బంది విధులకు చేరుకోవడం కష్టమైంది. దీంతో బ్యాగేజీ నిర్వహణలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు 6 వేల బ్యాగేజీలు ఆలస్యమైనట్లు సమాచారం. కొన్ని బ్యాగేజీ ట్రాలీలు కూడా పనిచేయకపోవడంతో టెర్మినల్‌లో లగేజీ భారీగా పేరుకుపోయింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు థాయ్ ఎయిర్వేస్ కార్యాలయ సిబ్బంది, మేనేజర్లు, సైనిక సిబ్బందిని రంగంలోకి దించింది. ప్రయాణికులకు నేరుగా వాళ్ల ఇళ్లకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.సెలవులు ప్రకటించిన ప్రభుత్వంవరదల తీవ్రత దృష్ట్యా థాయ్ ప్రభుత్వం బ్యాంకాక్, పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు సోమ, మంగళవారాల్లో ప్రత్యేక సెలవులు ప్రకటించింది. ప్రైవేటు సంస్థలు, బ్యాంకులు, ఆసుపత్రులు తదితరాలు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది.వర్షం తగ్గినా.. ముప్పు మాత్రం!తాజా పరిస్థితిలో బ్యాంకాక్‌లో వర్షం కొంత తగ్గుముఖం పట్టింది. ప్రధాన కాలువల్లో నీటిమట్టాలను తగ్గించి.. రోడ్లు, నివాస ప్రాంతాల్లోని నీటిని బయటకు పంపేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. అయితే తక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో ఇంకా వరద నీరు నిలిచే ఉంది. మరోవైపు థాయ్ వాతావరణ శాఖ దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తర, మధ్య, తూర్పు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, నదులు పొంగిపొర్లడం, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అప్రమత్తం చేసింది.ఇదీ చదవండి: ఇరాన్ ఎట్టకేలకు దిగొచ్చిందా? -
పెళ్లిపై మనసు విప్పిన అంజలి.. వాళ్ల సంతోషం కోసమే..
నటి అంజలి కోసం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే అంజలీకి పెళ్లి గురించి ఎప్పుడూ ఏదో ఒక ప్రశ్న ఎదురవుతూనే ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లి ప్రస్తావన రావడంతో ఆమె తనదైన శైలిలో స్పందించారు. ప్రస్తుతం పెళ్లి చేసుకోవాలనే ఆలోచన తనకు లేదని అంజలి స్పష్టం చేశారు.‘అది నా పెళ్లి. ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చేసుకుంటా. పెళ్లి విషయంలో అంత తొందర ఎందుకు?’ అంటూ అంజలి ప్రశ్నించారు. తన స్నేహితులు పెళ్లి పేరుతో చేసే హడావుడిపై కూడా ఆమె ఫన్నీగా కామెంట్ చేశారు. ‘పెళ్లి కూతురి కంటే నా ఫ్రెండ్స్‌కే పెళ్లి వేడుకలంటే ఎక్కువ ఇష్టం. రెడీ అవ్వడం, ఫొటోషూట్లు చేయడం, సందడి చేయడం వాళ్లకు చాలా ఇష్టం. వాళ్లు ఎంజాయ్ చేయడానికి నేను పెళ్లి చేసుకోవాలా?’ అంటూ నవ్వుతూ అన్నారు.మీరే పెళ్లి చేసుకోండి..‘మీరే పెళ్లి చేసుకోండి.. నేను వచ్చి రెడీ అయి మీ ఫొటోషూట్‌లో పాల్గొంటా అని నా ఫ్రెండ్స్‌తో చెబుతుంటా. వాళ్ల సరదా, సంతోషం కోసం నేను ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం ఎందుకు? ఆ విషయంలో మాత్రం వాళ్ల మాట వినను’ అని అంజలి సరదాగా అంటూ నవ్వులు పూయించారు. సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే విశాల్ నటించిన ‘మకుటం’లో కనిపించారు. రామ్ దర్శకత్వంలో సూరి, నివిన్ పౌలీలు కీలక పాత్రలు పోషించిన ‘ఏళు కడల్ ఏళు మలై’(తెలుగులో సంచారి)లోనూ నటించారు. ఈ చిత్రం అక్టోబర్ 1న విడుదల కానుంది.ఇదీ చదవండి: ‘మగధీర’కి లేని లాజిక్ ప్యారడైజ్‌కు ఎందుకు..?: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల -
పెన్ను పెట్టి రాసిన నా మొదటి డైలాగ్ ఆయనదే: త్రివిక్రమ్
వెంకటేశ్–త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. ఇటీవల విడుదలైన టీజర్ ఆకట్టుకోగా.. తాజాగా చిత్రంలోని తొలి పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హీరో వెంకటేశ్‌పై చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘కవి సమయం కాదు.. సంగీత సమయం. అందుకే ఎక్కువగా మాట్లాడను’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన త్రివిక్రమ్.. వెంకటేశ్ తన ఫెవరెట్ హీరో అని తెలిపారు.ఇదీ చదవండి: ముగ్గురు భామలతో వెంకీ డ్యాన్స్.. 'నారాయణమ్మ' సాంగ్ రిలీజ్వెంకటేశ్ నా ఫెవరెట్ హీరో..‘వెంకటేశ్ నా ఫెవరెట్ హీరో. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నేను పెన్ను పెట్టి రాసిన మొదటి డైలాగ్ ఆయన సినిమాకే. అదే ‘పవిత్ర బంధం’. నా జర్నీ ఆయనతోనే మొదలైంది. అందుకే నేను ఆయనకు ఎప్పటికీ కృతజ్ఞుడినే. నిజానికి అప్పట్లో నేను ఎవరో ఆయనకు తెలియదు. తర్వాత ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా సమయంలో మళ్లీ నన్ను గుర్తు చేసుకున్నారు’ అని త్రివిక్రమ్ చెప్పారు.అలా తన సినీ ప్రయాణం వెంకటేశ్‌తోనే మొదలైందని గుర్తుచేసుకున్న ఆయన.. ఇప్పటికీ వెంకటేశ్ దగ్గర తనకు భయం ఉంటుందని చెప్పడం ఆసక్తికరంగా మారింది.‘ఎందుకో తెలియదు.. ఆయన దగ్గర నాకు భయం ఉంటుంది. బహుశా గౌరవంతో కూడిన ఇష్టం వల్ల వచ్చిన భయం అయి ఉంటుంది’ అంటూ త్రివిక్రమ్ చెప్పడంతో నవ్వులు పూశాయి. ఇదీ చదవండి: కేసీఆర్‌ది 4 నిమిషాలే.. థియేటర్లో దద్దరిల్లింది.. చూసుకోండి మరి..: కేటీఆర్ -
చైనా నగరాలు చూసొచ్చా.. మన లీడర్లు మోసం చేస్తున్నారేమో!
రోజూ మన కళ్లముందు కనిపించే రోడ్లు.. ట్రాఫిక్.. నగరాల పరిస్థితి.. ఇవన్నీ మనకు అలవాటైపోయినవే. కానీ, కొన్నిసార్లు మరో దేశంలోని నగరాలను చూసిన తర్వాత.. మన చుట్టూ ఉన్న పరిస్థితులను కొత్త కోణంలో చూడాల్సి వస్తుంది. ఓ విదేశీ పర్యటన.. తిరిగొచ్చాక చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్.. ఇప్పుడు నెటిజన్ల మధ్య పెద్ద చర్చకు దారితీసింది.‘చైనాలోని సాధారణ నగరాలను సందర్శించి తిరిగి భారత వీధుల్లోకి వస్తే.. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్ అధికారులు, మొత్తం వ్యవస్థ మనల్ని ఎంతగా మోసం చేసిందో అర్థమవుతుంది’ అంటూ భారతీయ మూలాలున్న అమెరికన్ ప్రొఫెసర్ రాజేశ్వరి అయ్యర్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఆమె పోస్టుకు భారీగా లైక్స్, షేర్లు, కామెంట్లు వచ్చాయి. చైనాలోని నగరాల దృశ్యాలతో కూడిన పోస్టులు కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి.‘ఇలాంటి పోస్టులు పెడితే పరువునష్టం కేసు ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘చైనా అభివృద్ధిని మెచ్చుకునేవాళ్లు.. అక్కడి నియంత్రణల గురించి కూడా మాట్లాడాలి’ అని మరో వ్యక్తి బదులిచ్చారు. ఇంకొకరు స్పందిస్తూ.. ‘చైనాలో ఇలా బహిరంగంగా మాట్లాడితే.. ఉదయానికే కనిపించరు. భారత్‌లో మాత్రం యువత రోడ్డెక్కి నిరసనలు తెలిపేంత స్వేచ్ఛ.. ఇంత ప్రజాస్వామ్యం ఉంది’ అని వ్యాఖ్యానించారు.Once you visit random cities in China and come back to Indian streets, you realize how much you’ve been scammed by your local MLAs, MPs, IAS and the whole system. pic.twitter.com/uETFhAjSvk— Dr. Rajeshwari Iyer (@RajeshwariRW) September 25, 2026అంత దాకా ఎందుకు..అయితే ఆమె వ్యాఖ్యలకు అందరూ ఏకీభవించలేదు. కొందరు నెటిజన్లు చైనాతో భారత్‌ను పోల్చాల్సిన అవసరం లేదని.. బ్యాంకాక్, వియత్నాం, ఇండోనేషియా, మలేసియా వంటి దేశాల్లోని నగరాలను చూసినా భారత్‌లో మౌలిక వసతులు, పరిశుభ్రత, పౌర సదుపాయాల్లో తేడా కనిపిస్తుందని కామెంట్ చేశారు. ‘చైనానే కాదు.. బ్యాంకాక్ వెళ్లినా అభివృద్ధి, పరిశుభ్రత, పౌరస్పృహలో భారీ వ్యత్యాసం కనిపిస్తుంది’ అంటూ ఒకరు స్పందించారు. మరికొందరు వియత్నాం, ఇండోనేషియా, మలేసియాలను కూడా ప్రస్తావించారు.చైనా మోడల్‌పై మరో వాదనమరోవైపు.. చైనా నగరాల్లో కనిపించే వేగవంతమైన రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు, హైస్పీడ్ రైళ్లను ప్రశంసించిన కొందరు నెటిజన్లు.. వాటిని భారత్‌లోని ప్రజాస్వామ్య వ్యవస్థతో నేరుగా పోల్చడం సరికాదని వాదించారు. చైనాలోని వేగవంతమైన అభివృద్ధి వెనుక ఒకే పార్టీ పాలన, కేంద్రీకృత నిర్ణయ వ్యవస్థ వంటి అంశాలు ఉన్నాయని కొందరు ప్రస్తావించారు. ప్రజా పర్యవేక్షణ, రాజకీయ స్వేచ్ఛ, సోషల్ క్రెడిట్ వ్యవస్థ వంటి అంశాలను కూడా వారు చర్చలోకి తీసుకొచ్చారు.భిన్నాభిప్రాయాలుచైనా హైస్పీడ్ రైళ్లను మెచ్చుకున్న ఒక నెటిజన్.. వాటి నిర్మాణానికి తక్కువ కార్మిక వ్యయం, జపాన్ నుంచి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలు కూడా కారణమని వ్యాఖ్యానించారు. రైళ్ల నిర్మాణం ఒకవైపు ఉద్యోగాల కల్పన, మరోవైపు రవాణా వ్యవస్థ అభివృద్ధి కార్యక్రమంగా సాగిందని పేర్కొన్నారు. కేవలం రైళ్ల నిర్మాణాన్ని ఆధారంగా చేసుకుని దేశాల మధ్య పోటీని అంచనా వేయడం సరైందని కాదని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో.. దుబాయ్‌లాంటి చోట్ల రోడ్లు, భవనాల నిర్మాణానికి మన దేశం నుంచి కార్మికులు వెళ్తారని, వాళ్లనే ఉపయోగించి ఇక్కడ హైక్లాస్ రోడ్లను నిర్మించడం మన ప్రభుత్వాలకు చేత కాదా? అంటూ ఒకరు ప్రశ్నించారు.నెహ్రూ.. మోదీని మాత్రమే నిందించాలా?భారత్‌లో మౌలిక వసతుల సమస్యలకు రాజకీయ నాయకులను మాత్రమే బాధ్యులను చేయడం సరిపోదని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. నెహ్రూ నుంచి మోదీ వరకు ప్రభుత్వాలను నిందించడం కంటే.. దశాబ్దాలుగా కొనసాగుతున్న అధికార యంత్రాంగం, అవినీతి, జవాబుదారీతనం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. భారత్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి రాజకీయ సంకల్పంతో పాటు అధికార వ్యవస్థలోనూ మార్పులు అవసరమని ఆ వ్యాఖ్య సారాంశం.ఎవరీ రాజేశ్వరి అయ్యర్?డాక్టర్ రాజేశ్వరి అయ్యర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే భారతీయ మూలాలున్న అమెరికన్ ప్రొఫెసర్. ఆమె ఎక్స్ ప్రొఫైల్‌లో ఎన్ఐటీ పుదుచ్చేరి, ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థినిగా, డైరెక్టర్, ప్రొఫెసర్‌గా వివరాలు ఉన్నాయి. భారత్‌లో రిజర్వేషన్లు, పన్నులు, ప్రభుత్వ వ్యవస్థ, ప్రజా మౌలిక వసతులు వంటి అంశాలపై ఆమె తరచూ పోస్టులు చేస్తుంటారు. గతంలోనూ భారత్ నుంచి అమెరికాకు తిరిగి వెళ్లడానికి కారణాలను వివరిస్తూ ఆమె చేసిన పోస్టులు వార్తల్లో నిలిచాయి.She is visiting the Netherlands. This is how the Netherlands looks.Hope the Bihar MLA can transform Bihar and make it look like this one day. https://t.co/VzRVQ2rmZe pic.twitter.com/8qpU7yTFMi— Dr. Rajeshwari Iyer (@RajeshwariRW) September 26, 2026చైనా పర్యటన అనుభవం నుంచి మొదలైన ఈ పోస్టు ఇప్పుడు కేవలం చైనా-భారత్ నగరాల పోలికకే పరిమితం కాకుండా.. మౌలిక వసతులు, పట్టణ ప్రణాళిక, అధికార యంత్రాంగం, అవినీతి, ప్రజాస్వామ్యం, జవాబుదారీతనం వంటి విస్తృత అంశాలపై సోషల్ మీడియా చర్చకు దారితీసింది. -
24ఏళ్ల కుర్రాడిలా మహేశ్.. క్లీన్ షేవ్ అంటూ..
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’. అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ఎస్ కార్తికేయ, కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇదీ చదవండి: గానమే ఈమెకు గుర్తింపు తెచ్చింది.. ఏకంగా రాష్ట్రపతి చేతుల మీదగానే..24 ఏళ్ల కుర్రాడిగా..కాగా.. ‘వారణాసి’లో మహేశ్‌బాబు పాత్రకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సినిమాలోని ఓ కీలక ఎపిసోడ్లో మహేశ్ 24 ఏళ్ల కుర్రాడిగా కనిపించనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను మహేశ్ పూర్తి చేసినట్లు సమాచారం. త్వరలోనే డబ్బింగ్ పనులను కూడా ప్రారంభించనున్నారని తెలుస్తోంది.ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేశ్ ‘రంభ ఊర్వశి మేనక’..ఎయిర్‌పోర్ట్‌లో స్టైలిష్ లుక్‌లో..ఇదిలా ఉంటే.. తాజాగా మహేశ్‌బాబు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో స్టైలిష్ లుక్‌లో కనిపించారు. క్లీన్ షేవ్‌తో ఉన్న ఆయనను చూసిన అభిమానులు ‘వారణాసి’లోని యంగ్ లుక్‌పై వస్తున్న వార్తలను గుర్తు చేసుకుంటున్నారు. అంతేకాదు.. కెమెరా వైపు చూస్తూ మహేశ్ నవ్వుతూ, ‘గడ్డం లేదు బాస్.. ఇప్పుడు ఏం చేద్దాం?’ అన్నట్టుగా సైగ చేశారు. దీంతో మహేశ్ కొత్త లుక్కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు ఈ క్లీన్ షేవ్ లుక్ ‘వారణాసి’లోని 24 ఏళ్ల యువకుడి పాత్ర కోసమేనా? అనే చర్చ అభిమానుల్లో మొదలైంది. Babu gestures..🤣🤣🤣❤️❤️❤️❤️#MaheshBabu #Varanasi pic.twitter.com/ZGINIwlqR4— Vajrang (@UrsVajrang) September 25, 2026 -
‘ఎందుకింత దురద..? ఏం చూసుకొని సినిమాల్లోకి వచ్చావ్..?’
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. ఇందులో నటించిన పలువురు తమ పాత్రలతో ఆకట్టుకున్నారు. అలాంటి వారిలో సంపూర్ణేష్ బాబు కూడా ఉన్నారు. ‘బిర్యాని’ అనే విభిన్నమైన పాత్రలో కనిపించిన ఆయన.. తనదైన నటనతో మెప్పించారు.‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌లో.. అయితే ప్రస్తుతం సంపూర్ణేష్ బాబుకు సంబంధించిన ఓ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంపూర్ణేష్ బాబును సీనియర్ జర్నలిస్ట్ కొన్ని ప్రశ్నలు అడిగారు. ‘సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేదు. హీరో అయ్యేంత నీలో ఏముంది? అసలు సినిమాల్లోకి ఎందుకు వచ్చావు? ఎందుకు అంత దురద? ‘ది ప్యారడైజ్’లో అవకాశం రావడం నీ కెరీర్లో ఊహించని మలుపు. ఇలాంటి సినిమాల్లో నీకు ఎవరు అవకాశం ఇస్తారు?’ అంటూ ప్రశ్నించారు.సంపూర్ణేష్ పై ప్రశంసలు..ఈ ప్రశ్నలకు సంపూర్ణేష్ బాబు ఎలాంటి అసహనం వ్యక్తం చేయకుండా ఎంతో ప్రశాంతంగా సమాధానాలు ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేదని, పేద కుటుంబం నుంచి వచ్చారని ఇలా ప్రశ్నించడం అవసరమా?’ అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సంపూర్ణేష్ బాబు మాత్రం ప్రశ్నలు ఎంత కఠినంగా ఉన్నా ఓర్పుగా ఇంటర్వ్యూను ఎదుర్కొన్న తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాల్లో రాణించేందుకు నేపథ్యం కంటే ప్రతిభ, పట్టుదల ముఖ్యమని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంపూర్ణేష్ బాబు.. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’లోనూ కొత్త తరహా పాత్రలో కనిపించారు. ఇదీ చదవండి: కుటుంబ బంధాలపై బిగ్‌బాస్ ట్విస్ట్.. కన్నీళ్లు పెట్టికున్న ఝాన్సీ -
చెన్నై బ్రేక్‌ఫాస్ట్‌పై నటి సమంత పొగడ్తల జల్లు!
టాలీవుడ్ నటి సమంత తన ప్రెగ్నెంట్‌కి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ..చిల్ అవుతోంది. మాతృత్వపు మధురిమకు సంబంధించి..ప్రతి నెలలో తనలో వస్తున్న మార్పులు..ఎదుర్కొంటున్న అనుభవం గురించి పంచుకుంటూ కాబోయే తల్లిగా పలు సూచనలు కూడా అందిస్తోంది. ఈసారి బ్రేక్‌ఫాస్ట్‌కి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ తన భర్త రాజ్ నిడిమోరుని పార్ట్‌టైం తమిళుడిగా అభివర్ణించింది. View this post on Instagram A post shared by Ranjana Priya | Chennai Blogger (@ranjanas_view)అంతేగాదు చెన్నై అల్పాహారం అనుభవంపై ప్రశంసల వర్షం కురిపించింది. అందుకు సంబంధించి..రకరకాల చట్నీలు, సాంబార్‌తో కూడిన దోశ ఫోటోని షేర్ చేస్తూ..చెన్నై అల్పాహారంకి మించిది లేదు అని ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో రాసుకొచ్చింది. కాగా సమంత-రాజ్‌లు డిసెంబర్లో తమ బిడ్డకు స్వాగతం పలకనున్నారు. మా ఇంటి బంగారం సక్సెస్ మీట్లో తన గర్భధారణ విషయాన్ని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అలాగే తన నటనకు కొన్నేళ్ల పాటు విరామం తీసుకోనున్నట్లు కూడా పేర్కొంది.ఇదీ చదవండి: ‘రెండుసార్లు’ జన్మించిన శిశువు! మెడికల్ మిరాకిల్) -
ప్రశ్న విని పగలబడి నవ్విన హీరోయిన్
అనీశ్, అనస్వర రాజన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. మహేశ్ ఉప్పల దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు వెంకీ కుడుముల నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబరు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆమెకు ఎదురైన ఓ వింత ప్రశ్న నవ్వులు పూయించింది. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది.ఇంతకంటే మంచి రియాక్షన్ ఉండదు..‘యాక్టర్‌గా మీ హిస్ట్రియానిక్స్(నటన, హావాభావాలు)పై ఎలా కామెంట్ చేస్తారు?’ అంటూ ఓ జర్నలిస్ట్ అనస్వర రాజన్‌ను ప్రశ్నించాడు. ఈ ప్రశ్న విన్న వెంటనే ఆమె ఒక్కసారిగా అవాక్కై.. ఆ తర్వాత నవ్వడం మొదలుపెట్టింది. పక్కనే ఉన్న సాయి అనీష్ కూడా నవ్వడంతో అక్కడి వాతావరణం సరదాగా మారిపోయింది. అనస్వర రియాక్షన్‌కు ప్రేక్షకులు కూడా చప్పట్లతో స్పందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు అనస్వర సహజమైన రియాక్షన్‌ను మెచ్చుకుంటున్నారు. అసలు ఆ ప్రశ్న ఎందుకు అడిగారంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ‘ఆ ప్రశ్నకు ఇంతకంటే మంచి రియాక్షన్ ఉండదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.సినిమాల విషయానికి వస్తే..ఇక అనస్వర రాజన్ ఇప్పటికే ‘సూపర్ శరణ్య’తో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. తన సహనటి మమిత బైజుతో తనకున్న స్నేహం గురించి కూడా ఆమె ఇటీవల మాట్లాడింది. మమిత సినిమాలు మంచి విజయం సాధిస్తుండటంపై సంతోషంగా ఉందని, తామిద్దరం ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటామని తెలిపింది. ‘ఇట్లూ అర్జున’తో పాటు అనస్వర ‘కాకా’ సినిమాలోనూ నటిస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవికి కుమార్తెగా కనిపించనుంది. సంక్రాంతి సందర్భంగా 2027 జనవరి 13న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. #AnaswaraRajan Laughter Therapy will make the Journalist go sleepless in trauma for years. Silly Questions! pic.twitter.com/uvgWxiT20K— Star Talkies (@startalkies_ofl) September 21, 2026 -
ఆరోజు మొదలై.. నేటికి 48 ఏళ్లు.. చిరంజీవి పోస్ట్ వైరల్
అప్పుడెప్పుడో చిరంజీవి కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం ‘పునాది రాళ్లు’. అయితే.. ఆ తర్వాత నటించిన ‘ప్రాణం ఖరీదు’ ముందుగా విడుదలైంది. కె.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరు నరసింహ అనే పాత్రను పోషించారు. అయితే చిరంజీవి హీరోగా నటించిన ‘ప్రాణం ఖరీదు’ విడుదలై నేటికి 48 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అభిమానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు‘ఈ 48 ఏళ్లలో ఎన్నో పాత్రలు పోషించాను. ఎన్నో విజయాలను చూశాను. ఎన్నో అవార్డులు, గౌరవాలు అందుకున్నాను. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నన్ను నమ్మి అవకాశాలు ఇచ్చిన ప్రతి నిర్మాతకు, నాలోని నటుడిని కొత్త కొత్త కోణాల్లో ఆవిష్కరించిన ప్రతి దర్శకుడికి, నా ప్రతి సినిమా వెనుక అహర్నిశలు శ్రమించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి సహకారమే నన్ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. అయితే ఆ విజయాలన్నింటికంటే గొప్పది… మీరు నాపై చూపించిన ప్రేమ. ఆ గౌరవాలన్నింటికంటే విలువైనది… మీ హృదయాల్లో నాకు ఇచ్చిన స్థానం. నన్ను మీ కుటుంబ సభ్యుడిగా భావించి, ఇంతటి అపూర్వమైన ప్రేమాభిమానాలను అందించిన ప్రతి ఒక్క అభిమానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే..చిరంజీవి హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ కాకా. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ ఇటీవలే ప్రకటించి గ్లింప్స్‌ను విడుదల చేశారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న రెండో చిత్రం కావడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు. మరో పక్క ‘విశ్వంభర’ సినిమాలోనూ నటిస్తున్నారు. 22 సెప్టెంబర్ 1978ఆరోజు మొదలైన నా సినీ ప్రయాణం నేటితో 48 వసంతాలు పూర్తి చేసుకుంది.ఈ 48 ఏళ్లలో ఎన్నో పాత్రలు పోషించాను. ఎన్నో విజయాలను చూశాను. ఎన్నో అవార్డులు, గౌరవాలు అందుకున్నాను.ఈ సుదీర్ఘ ప్రయాణంలో నన్ను నమ్మి అవకాశాలు ఇచ్చిన ప్రతి నిర్మాతకు, నాలోని నటుడిని కొత్త కొత్త… pic.twitter.com/5wBJnXl3MP— Chiranjeevi Konidela (@KChiruTweets) September 22, 2026 -
వినాయకుడి లడ్డూని రూ.కోటికి పాడిన రాజమౌళి..!
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఫహాద్ ఫాజిల్. శశాంక్ యేలేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ నిర్మించారు. సారా పాలేకర్, సౌరభ్ సచ్దేవ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఫహాద్ ఫాజిల్, సారా పాలేకర్ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, ఎస్ఎస్ కార్తికేయ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పలు విషయాలపై ఆసక్తికరంగా ముచ్చటించారు.మీ సంగతి అక్టోబర్ 2న చెప్తా..అనంతరం కార్యక్రమంలో వినాయకుడి లడ్డూ వేలం నిర్వహించారు. ఈ వేలంలో ఎస్ఎస్ రాజమౌళి ఏకంగా రూ.కోటి బిడ్ వేసి లడ్డూను సొంతం చేసుకున్నారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా దీనిని వేలంపాటలో సొంతం చేసుకున్నారు. అనంతరం ఆ లడ్డూని మాయం చేయడంతో ‘మీ సంగతి అక్టోబర్ 2న చెప్తా’ అని రాజమౌళి సరదాగా నవ్వులు పూయించారు.రాజమౌళి విషయానికి వస్తే..రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా పాన్ వరల్డ్ స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్‌తో ‘వారణాసి’ అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రుద్ర, శ్రీరాముడిగా రెండు పాత్రల్లో కనిపించనున్నారు మహేశ్‌బాబు. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ఎస్ కార్తికేయ, కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది. దాదాపు 120 దేశాల్లో ‘వారణాసి’ని రిలీజ్ చేయనున్నారు. ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లో భగ్గుమన్న నామినేషన్స్.. ‘నేను నీ వెంట పడ్డానా..?’ SS Rajamouli bid ₹1cr for a laddu.Watch the funny promotional clip 🤣#DontTroubleTheTrouble pic.twitter.com/zrUld7XEHk— Mr SP (@Lonely_prabh) September 21, 2026 -
10వేల మందికి అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన నాని..! ఫ్యాన్స్‌కు పండగే..
నేచురల్ స్టార్ నాని తన ఫ్యాన్స్‌తో తనకున్న అనుబంధాన్ని మరోసారి చాటుకున్నారు. ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన భారీ ఫ్యాన్స్ మీట్ ఇందుకు వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న నాని అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దాదాపు 10 వేల మంది ఫ్యాన్స్ హాజరైన ఈ ఈవెంట్లో నాని వారితో ప్రత్యేకంగా ముచ్చటించారు. అభిమానులను కలుసుకోవడంతో పాటు వారితో ఫొటోలు దిగుతూ ఉత్సాహపరిచారు. వంటకాలతో భోజనం..అంతేకాదు.. కార్యక్రమానికి వచ్చిన అభిమానుల కోసం నాని ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. వెజ్, నాన్-వెజ్ వంటకాలతో వారికి ఘనంగా భోజనం పెట్టించారని సమాచారం. కాగా ‘ది ప్యారడైజ్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ఈ ఫ్యాన్స్ మీట్‌కు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఫ్యాన్స్ కోసం నాని తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.ప్యారడైజ్ స్టోరీ రివీల్..తాజాగా ఈ మూవీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు హీరో నాని. ప్రమోషన్లలో భాగంగా ప్రెస్‌మీట్ నిర్వహించగా..ఈ మూవీ కథ లైన్ ఏంటో చెప్పేశారు. ఈ మూవీని 1984–85 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించినట్లు నాని వెల్లడించారు. అసలు ఉనికి లేని ఒక జాతి తమ ఉనికి కోసం చేసే తిరుగుబాటు కథాంశంతో రూపొందించినట్లు ఆయన తెలిపారు. సవారీలు అనే తెగకు ఎలాంటి ఐడెంటిటీ ఉండదు.. వాళ్లు ఎవరినైనా చంపినా కేసు ఉండదు.. వాళ్లను చంపినా ఎవరూ పట్టించుకోరు.. ఆ జాతి తమ మనుగడ కోసం చేసిన యుద్ధమే ది ప్యారడైజ్ స్టోరీ అని నాని రివీల్ చేశారు. Natural Star @NameisNani with fans ❤️#TheParadise pic.twitter.com/dNf8kNXO64— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) September 21, 2026 -
మన గుమ్మడి నర్సయ్యలా.. స్టేషన్ బయట ఆ మాజీ ప్రధాని!
పదవి పోయినా జీవనశైలి మారలేదు. హోదా ఎంత పెద్దదైనా.. ప్రజలకు మాత్రం దూరం కాలేదు. రాజకీయాల్లో ఒకప్పుడు అత్యున్నత పదవిలో ఉన్న నేత.. ఇప్పుడు కూడా నిత్యం సామాన్యుల మధ్యే కనిపిస్తున్నారు. మన దగ్గర మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య సింప్లిసిటీకి, ప్రజాసేవకు ఎలా కేరాఫ్‌గా నిలిచారో.. జపాన్‌లో 69 ఏళ్ల మాజీ ప్రధాని యోషిహికో నోడా కూడా అదే తరహాలో ఆసక్తి రేపుతున్నారు.జపాన్ మాజీ ప్రధాని యోషిహికో నోడా(Yoshihiko Noda).. ఒకప్పుడు దేశాన్ని నడిపించిన నేత. ఇప్పుడు నిత్యం ఉదయాన్నే రైల్వే స్టేషన్‌కు వెళ్లి ప్రయాణికులకు కరపత్రాలు పంచుతున్నారు. తాజాగా చిబా ప్రిఫెక్చర్‌లోని మినామి-ఫునాబాషి స్టేషన్ వద్ద ఆయన అలా కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొందరు ఆయన్ని గుర్తించి పలకరించగా.. మరికొందరు బిజీగా ఉండటంతో కరపత్రాలు తీసుకోకుండానే వెళ్లిపోయారు. అయినా నోడా మాత్రం తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగారు. ఆయన తీరే అంత!ఇది నోడాకు కొత్త వ్యవహారం కాదు. గత నలభై ఏళ్లుగా ఆయన ఈ పని చేస్తూ వస్తున్నారు. మధ్యలో ఆయన రాజకీయ జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. చిబా ప్రిఫెక్చర్ అసెంబ్లీ నుంచి జపాన్ పార్లమెంట్ వరకు ఎదిగారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2011లో జపాన్ ప్రధానమంత్రి అయ్యారు. 2012లో ప్రధాని పదవి నుంచి తప్పుకున్నా.. స్టేషన్ వద్ద ప్రజలను కలుసుకునే అలవాటును మాత్రం వదులుకోలేదు.Japan ex-PM Noda hands out flyers pic.twitter.com/CWnEuDoZpK— RT (@RT_com) September 18, 2026ఇప్పుడు ఆయన పంచే కరపత్రాల్లో స్థానిక సమస్యలు, విపత్తు బీమా, పిల్లల సంరక్షణ, ప్రిఫెక్చర్ సంస్కరణలు వంటి అంశాలు ఉంటున్నాయి. అంటే.. పదవిలో ఉన్నా, లేకపోయినా ప్రజలతో నేరుగా మాట్లాడటానికే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారు.హోదా మారినా.. రొటీన్ మారలేదు1986 అక్టోబర్ 1న జేఆర్ సుడానుమా స్టేషన్ వద్ద కరపత్రాలు పంచడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈ రొటీన్‌ను కొనసాగిస్తున్నారు. ఒక దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి.. ఏళ్ల తర్వాత కూడా ఉదయాన్నే రైల్వే స్టేషన్లో నిలబడి ప్రయాణికులకు కరపత్రాలు పంచడం ఆసక్తి కలిగిస్తోంది. పెద్ద కార్యక్రమాలు, భారీ హంగామా లేకుండా సాధారణంగా ప్రజలను కలవడం నోడా రాజకీయ జీవితంలో భాగంగా మారిపోయింది.మన దగ్గర గుమ్మడి నర్సయ్య కూడా ఇలాంటి సాదాసీదా జీవనశైలితోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇల్లెందు నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన.. హంగూ ఆర్భాటాలకు దూరంగా ఉండేవారు. బస్సులు, రైళ్లలో ప్రయాణించడం, సాధారణంగా ప్రజల మధ్య కనిపించడం ఆయన జీవనశైలిలో భాగంగా ఉండేది. అందుకే పదవి తర్వాత కూడా సాధారణ జీవనశైలిని కొనసాగిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండటం.. ఈ ఇద్దరి మధ్య పోలికకు కారణమైంది.ప్రధాని పదవి దేశ రాజకీయాల్లో అత్యున్నత హోదా. అయినా ఆ పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా ప్రజలను కలిసే విధానం మారలేదు. అలాగని ఆయన ఏదో వైరల్ కావడం కోసమో ఈ పని చేయడం లేదు. స్వచ్చందంగా కొందరు నెటిజన్లు ఆయన గురించి పోస్టులు చేస్తుంటారు. హోదా ఎంత పెద్దదైనా.. ప్రజల్లోకి వెళ్లడానికి పెద్ద కాన్వాయ్, హంగామా అవసరం లేదని నోడా రొటీన్ గుర్తుచేస్తోంది. ఈ సింప్లిసిటీ ఈ జనరేషన్ నేతల్లో ఉంటేనా.. సోషల్ మీడియా పోస్టులు, ఫొటోషూట్లకే పరిమితం కాకుండా.. ఇలా నేరుగా ప్రజల మధ్య కనిపించే రాజకీయాలు ఇంకెన్ని కనిపించేవో!.ఇదీ చదవండి: సినీ ఫక్కీలో బస్సును హైజాక్ చేసి.. -
బతికుండగానే చంపేశారు.. నటి భావోద్వేగం..
చిత్రసీమలో తన విలక్షణ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి వడివుక్కరసి గురించి సోషల్ మీడియాలో ఓ తప్పుడు వార్త వైరల్‌గా మారింది. ఆమె అనారోగ్యంతో కన్నుమూశారంటూ కొందరు ప్రచారం చేయడంతో అభిమానులు, సినీ వర్గాలు ఆందోళనకు గురయ్యాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్వయంగా వడివుక్కరసి స్పందించడంతో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.‘నేను బతికే ఉన్నా. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. నా ఆరోగ్యం పట్ల ఆందోళన చెందవద్దు. నా యోగక్షేమాలు తెలుసుకునేందుకు ప్రయత్నించిన శ్రేయోభిలాషులు, అభిమానులకు ధన్యవాదాలు’ అంటూ ఓ టీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. సినీ ప్రస్థానం ఇది..1978లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన వడివుక్కరసి.. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో 350కి పైగా చిత్రాల్లో నటించారు. రజినీకాంత్, కమల్ హాసన్ వంటి అగ్ర హీరోలతో కలిసి పనిచేశారు. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపైనా తనదైన ముద్ర వేశారు. 40కి పైగా టీవీ సీరియల్స్‌లో కీలక పాత్రలు పోషించి ప్రేక్షకులకు చేరువయ్యారు. తెలుగు ప్రేక్షకులకు కూడా వడివుక్కరసి సుపరిచితమే. రజినీకాంత్ నటించిన 'శివాజీ', 'అరుణాచలం' వంటి చిత్రాల్లో ఆమె పోషించిన పాత్రలు మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. చిరంజీవి, మోహన్‌బాబు కలిసి నటించిన 'పట్నం వచ్చిన పతివ్రతలు', 'నేటి సిద్ధార్థ' వంటి సినిమాల్లోనూ ఆమె కనిపించారు.68 ఏళ్ల వయసులోనూ..కెరీర్ తొలిదశలో ప్రతినాయక ఛాయలున్న పాత్రలు చేసిన ఆమె.. ఆ తర్వాత తల్లి, బామ్మ, అత్త వంటి భావోద్వేగ పాత్రల్లోనూ మెప్పించారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'అశోక్'లో విలన్‌గా ఆకట్టుకోగా.. సునీల్ హీరోగా నటించిన 'అందాల రాముడు'లో మనవడిపై ప్రేమను చూపించే నానమ్మగా భావోద్వేగాన్ని పండించారు. తరువాత కూడా చాలా సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తుంపు తెచ్చుకున్నారు. దాదాపు ఐదు దశాబ్దాలుగా సినిమాలు, సీరియల్స్‌లో నటిస్తూ వస్తున్న వడివుక్కరసి.. ప్రస్తుతం 68 ఏళ్ల వయసులోనూ నటిగా కొనసాగుతున్నారు. అలాంటి సీనియర్ నటిపై మృతి వార్తలు ప్రచారం కావడంతో ఆమె అభిమానులు ఆందోళన చెందారు. అయితే తాను క్షేమంగానే ఉన్నానని ఆమె స్పష్టం చేయడంతో అభిమానులు ఆమె బతికి ఉండగానే చంపేశారు కదరా అంటూ సోషల్‌మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ తప్పుడు ప్రచారానికి తెరపడింది.ఇదీ చదవండి: కృష్ణుడు ఎలిమినేట్.. ‘నీలో మా నాన్న కళ్లు చూసుకున్నా అన్నా..’ -
పాండా అంటూ ట్రోలింగ్.. వినాయకుడు ఎలిమినేట్..?
బిగ్‌బాస్ సీజన్ 10లో ఎలిమినేషన్ హీట్ కొనసాగుతోంది. ఇప్పటికే చైత్ర హౌస్ నుంచి బయటకు వెళ్లగా.. ఇప్పుడు తదుపరి ఎలిమినేషన్‌పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈసారి కృష్ణుడి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. దీంతో చైత్ర తర్వాత కృష్ణుడే బయటకు వెళ్తాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.కృష్ణుడి ఆటపై అసంతృప్తి..నిన్నటి ఎపిసోడ్లో బిగ్‌బాస్ కృష్ణుడు, సృష్టిల ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. గత వీకెండ్లో వారు ఎలా ఆడారో ప్రేక్షకుల్లా కూర్చొని చూడాలని చెబుతూ ఇద్దరినీ స్టోర్ రూంలో కూర్చోబెట్టాడు. దీంతో పాటు ప్రేక్షకులు సైతం కృష్ణుడుని అన్ సేఫ్‌లోనే ఉంచారు. దీంతో కృష్ణుడి ఆటతీరుపై బిగ్‌బాస్ కూడా ఫోకస్ పెట్టాడనే చర్చ మొదలైంది.నెటిజన్లు మీమ్ వీడియోలు..మరోవైపు హౌస్‌లో కృష్ణుడి ఆట కూడా పెద్దగా హైలైట్ కావడం లేదనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో దేబ్జానీ.. కృష్ణుడిని పాండాతో పోలుస్తూ చేసిన కామెంట్ కూడా వైరల్‌గా మారింది. ఆ మాటను ఆధారంగా చేసుకుని నెటిజన్లు మీమ్ వీడియోలు రూపొందిస్తున్నారు. దీంతో కృష్ణుడిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా కనిపిస్తోంది.వినాయకుడి నిమార్జనానికి వేళైంది అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.గతంలో చైత్ర విషయంలోనూ..గతంలో చైత్ర విషయంలోనూ ఇలాంటి చర్చే మొదలై.. చివరకు ఆమె ఎలిమినేట్ అయింది. ఇప్పుడు అదే తరహాలో కృష్ణుడి పేరు వినిపిస్తుండటంతో ఈసారి ఏం జరుగుతుందన్న ఆసక్తి పెరిగింది. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ చర్చ నిజమైన ఎలిమినేషన్ ఫలితమా? లేక కేవలం ప్రేక్షకుల అంచనా మాత్రమేనా? అనేది తెలియాలంటే ఎలిమినేషన్ ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.(ఇదీ చదవండి: ఒకేసారి రెండు ఓటీటీల్లోకి హారర్ థ్రిల్లర్.. డోంట్ మిస్)#Debjani ee #Krishnudu konchem #Panda laaga unnadu 🤣🤣🤣#BiggBossTelugu10 pic.twitter.com/gOlYGi5I9n— Naresh Bandari (@BiggBossAddict) September 10, 2026 -
13 ఏళ్ల వయసులో కన్నబిడ్డ కోసం పోరాటం?!
ఆడుకోవాల్సిన వయసులో పెళ్లి. చదువుకోవాల్సిన వయసులో మాతృత్వం. చివరకు దూరమైన బిడ్డ కోసం ఆమె తల్లడిల్లిపోయింది. కేవలం 13 ఏళ్ల వయసులోనే తన ఏడు నెలల కొడుకు కోసం కోర్టు మెట్లెక్కిన ఆమె.. ఆ న్యాయపోరాటంలో విజయం సాధించింది. చిన్నారి అనామికా కథ.. ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.అనామికా అకర్త్కు సోషల్ మీడియా ద్వారా 22 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా.. అటు నుంచి అటు పెద్దల అంగీకారంతో పెళ్లికి దారితీసింది. అప్పటికి ఆమె వయసు కేవలం 11 ఏళ్లే. బాల్యం అంటే ఏమిటో పూర్తిగా అర్థం చేసుకునే స్థితి కూడా లేదు. అయినప్పటికీ వివాహం జరిగింది. ఆ తర్వాత ఆమె 2026లో ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది.అయితే కొద్ది నెలలకే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ ఏడాది మేలో భర్త, అత్తమామలు అనామికను ఇంటి నుంచి బయటకు పంపించారు. అయితే అనామిక బిడ్డను మాత్రం తమ వద్దే ఉంచుకున్నారు. దీంతో తన కుమారుడిని తిరిగి తనకు అప్పగించాలని కోరుతూ అనామిక కోర్టును ఆశ్రయించింది.‘ఆమె కూడా ఇంకా చిన్నారే’ఈ కేసును విచారించిన కోర్టు.. ఏడు నెలల శిశువును అనామిక సంరక్షణకు అప్పగించాలని ఆదేశించినట్లు వైరల్ వీడియో సారాంశం. ఈ సందర్భంగా న్యాయమూర్తి.. బిడ్డ తల్లి అనామిక కూడా ఇంకా చిన్నారేనన్న విషయాన్ని ప్రస్తావించినట్లు ఆ వైరల్ కథనాల్లో కనిపిస్తోంది. అలా తన బాల్యాన్ని కోల్పోయిన ఓ బాలిక.. ఇప్పుడు తన బిడ్డ భవిష్యత్తు కోసం పోరాడి నెగ్గిందన్నమాట. బంగ్లాదేశ్‌లో జరిగిన ఈ ఘటన.. ఇప్పుడు నెట్టింట రకరకాల చర్చలకు దారి తీసింది. కఠిన చట్టం ఉన్నా.. బాల్య వివాహాలు మాత్రంబంగ్లాదేశ్లోనూ బాల్య వివాహాలను కట్టడికి చట్టాలు ఉన్నప్పటికీ.. ఆచరణలో మాత్రం సమస్య కొనసాగుతోంది. యూనిసెఫ్ గణాంకాల ప్రకారం.. బంగ్లాదేశ్‌లో 20–24 ఏళ్ల వయసున్న మహిళల్లో దాదాపు 47 శాతం మంది 18 ఏళ్లలోపే వివాహం చేసుకున్నవారే. పేదరికం, సామాజిక ఒత్తిళ్లు, సంప్రదాయాలు వంటి కారణాలు బాల్య వివాహాలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. చిన్న వయసులో పెళ్లి కావడం వల్ల బాలికల చదువుకు ఆటంకం కలగడమే కాకుండా.. ముందస్తు గర్భధారణ, ప్రసవ సంబంధ ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఆధారపడటం, హింసకు గురయ్యే ముప్పు కూడా పెరుగుతుందని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. బంగ్లాదేశ్ కోర్టులో అనామికకు న్యాయం జరిగింది. కొన్నిచోట్ల మరో దేశం వినిపిస్తోంది. అలాగే ఆమె వయసు విషయంలోనూ భిన్న వాదనలు చేస్తున్నారు కొందరు నెటిజన్లు. ఏది ఏమైనా అంత చిన్న వయసులో ఓ బాలిక తన బిడ్డ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిన ఈ ఘటన.. బాల్య వివాహం కేవలం ఓ పెళ్లి కాదని గుర్తుచేస్తోంది. ఒక చిన్నారి చేతుల్లో బిడ్డను పెట్టడమే కాదు.. ఆమె చదువు, స్వేచ్ఛ, కలలు, భవిష్యత్తును కూడా ముందుగానే బాధ్యతల కింద నలిపేస్తోంది. అనామికకు దక్కిన ఈ విజయం ఆమె బిడ్డను తిరిగి ఇచ్చింది.. కానీ ఇలాంటి పరిస్థితుల్లోకి మరో బాలిక వెళ్లకుండా ఆపగలమా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.🚨 SHOCKING: CHILD MARRIED AT 11, MOTHER AT 13!Anamika Akter, reportedly married to a 22 year old man at just 11, became a mother at 13.A CHILD is now raising another CHILD. 💔How is this still happening in Bangladesh? pic.twitter.com/Ayg0vJIN77— News Matrix (@NewsMatrixIND) September 18, 2026 -
ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న‘ఇరుముడి’.. పల్లెల్లో ఏకంగా తెరలు
మొన్నటి వరకు థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ‘ఇరుముడి’ ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. థియేటర్లలో సినిమా మిస్ అయినవారు ఇంటి వద్దే చూస్తూ భావోద్వేగానికి గురవుతున్నారు. ఈమేరకు సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తుండడంతో వైరల్‌గా మారుతున్నాయి.ప్రత్యేకంగా తెరలు ఏర్పాటు.. ముఖ్యంగా పల్లెల్లో ‘ఇరుముడి’ని ప్రత్యేకంగా తెరలు ఏర్పాటు చేసి ప్రదర్శిస్తున్నారు. వీధుల్లో పెద్ద స్క్రీన్లు పెట్టి కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి సినిమాను చూస్తున్న వీడియోలు నెట్టింట దర్శనమిస్తున్నాయి. వినాయక చవితి సందర్భంగా కొన్ని గ్రామాల్లో వెండి తెరపై సినిమాను ప్రదర్శించడం విశేషంగా మారింది. థియేటర్లకు వెళ్లలేకపోయిన ప్రేక్షకులు ఇలా తమ గ్రామాల్లోనే సినిమాను చూసే అవకాశం రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ‘ఇరుముడి’ ఓటీటీలోనే జోరు చూపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించి గ్రామల్లో ప్రదర్శనల వీడియోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.200 కోట్లకు పైగా కలెక్షన్లుకాగా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో చేసిన సినిమా 'ఇరుముడి'. తండ్రి కూతురు అనుబంధంతో తెరకెక్కిన స్టోరీకి అయ్యప్ప స్వామి మాల నేపథ్యాన్ని జోడించారు. గత నెల 21న థియేటర్లలో రిలీజైంది. తెలుగులో విశేషాదరణ దక్కించుకుంది. దీంతో బాక్సాఫీసులో రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడీ చిత్రం సెప్టెంబరు 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదీ చదవండి: బిగ్‌బాస్ తొలి కెప్టన్ రైతు బిడ్డ.. లక్ష నజరానా Vizianagaram district devada village lo irumudi movie grama prajalu inkaa aadharisthunnaru. Vinayaka chavithi sandharbam gaa committee members ilaa grama prajaliki chupisthunnaru🙏🙏🙏#irumudimovie #mythrimoviemakers#gvprakash#raviteja#sivanirvana pic.twitter.com/xPBhrmbrlJ— 𝗥𝗔𝗝𝗔𝗦𝗔𝗔𝗕 (@RAJU_BHAI_LUV) September 18, 2026 -
భర్తకు నయనతార బర్త్ డే విషెస్.. ఫోటోలు
-
మోదీ టీచర్ వయసు.. ఇదిగో క్లారిటీ!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పాఠాలు చెప్పిన మాజీ ఉపాధ్యాయుడు హెచ్‌సీ పటేల్ ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మోదీ చిన్ననాటి జ్ఞాపకాలను పటేల్ గుర్తుచేసుకోవడం ఒకవైపు ఆసక్తికరంగా మారితే.. మరోవైపు ఆయన ప్రస్తుత వయసుపై నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇద్దరికీ ఒకే వయసు ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఆయన చెప్పిన సబ్జెక్ట్‌ల విషయంలోనూ పొంతన కుదరకపోవడమూ.. చర్చకు దారి తీసింది.హెచ్‌సీ పటేల్ గుజరాత్‌లోని వడ్నగర్లో మోదీ చదువుకున్న పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారట. 1965 జూన్ నుంచి 1967 మే వరకు మోదీకి మ్యాథ్స్, సైన్స్ బోధించినట్లు పటేల్ స్వయంగా గుర్తుచేసుకున్నారు. అయితే ఎన్డీటీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో పటేల్ 10, 11 తరగతులకు మ్యాథ్స్, సైన్స్ బోధించారని పేర్కొన్నారు. పీటీఐ ఆధారంగా వచ్చిన మరో కథనంలో 11, 12 తరగతుల సైన్స్ టీచర్‌గా పేర్కొన్నారు. ఇక్కడే అసలు కథ ఆరంభమైంది.మోదీ 1950 సెప్టెంబర్ 17న జన్మించారు. అంటే 1965లో ఆయన వయసు సుమారు 14–15 ఏళ్లు. 1967లో స్కూల్ విద్య పూర్తిచేసే సమయానికి ఆయన వయసు 16–17 ఏళ్ల మధ్య ఉంటుంది. అందువల్ల పటేల్ ఆ సమయంలో ఉపాధ్యాయుడిగా ఉన్న విషయం మాత్రం ఆయన చెప్పిన వివరాలతో స్పష్టంగా ఉంది. మరి టీచర్ వయసెంత? అంటూ ట్రోలింగ్ మొదలైంది.Ahmedabad, Gujarat: Teacher of Prime Minister Narendra Modi, H.C. Patel says, "I taught Narendra Modi for two years, from June 1965 to 1967 May, when he was in Classes 10 and 11. In Class 11, he would sometimes come to my house for tuition-not every day, but occasionally. There… pic.twitter.com/d7L7wCqk9N— IANS (@ians_india) September 17, 2026మోదీకి 14–16 ఏళ్ల వయసులో పాఠాలు చెప్పిన టీచర్.. ఇప్పుడు 76 ఏళ్ల మోదీతో పోలిస్తే మరింత వయసులో ఉండాలని కొందరు నెటిజన్లు లెక్కలు వేస్తున్నారు. సాధారణంగా టీచర్, విద్యార్థి మధ్య ఉండే వయసు తేడాను ప్రస్తుత వయసులతో పోల్చుతూ.. పటేల్ 80 లేదంటే 90లలో ఉండాల్సి ఉంటుందని కొందరు పోస్టులు చేస్తున్నారు.‘మోదీ.. చాలా షార్ప్’ఓవైపు ఈ చర్చ నడుస్తుండగా.. పటేల్ మాత్రం మోదీ విద్యార్థిగా ఉన్న రోజుల గురించి ఎన్నో విషయాలు గుర్తుచేసుకున్నారు. మోదీ చాలా చురుకైన విద్యార్థి అని, స్కూల్లో జరిగే దాదాపు ప్రతి కార్యక్రమంలో పాల్గొనేవారని చెప్పారు. ఒకసారి పాఠశాల భవనం ప్రహరీ నిర్మాణానికి నిధులు సేకరించేందుకు నిర్వహించిన నాటకంలో మోదీ జోగీదాస్ ఖుమాన్ పాత్ర పోషించారని తెలిపారు. కత్తితో నటిస్తూ కాఠియావాడీ భాషలో సంభాషణలు చెప్పిన ఆయనకు ప్రేక్షకుల నుంచి దాదాపు పది నిమిషాల పాటు చప్పట్లు(స్టాండింగ్ ఒవేషన్) లభించాయని పటేల్ గుర్తుచేసుకున్నారు.చిన్నప్పటి నుంచే మోదీకి ఈత అంటే ఆసక్తి ఉండేదని కూడా పటేల్ చెప్పారు. వడ్నగర్లోని శర్మిష్ఠ చెరువులో ఈత కొట్టే సమయంలో ఓసారి పిల్ల మొసలిని ఇంటికి తీసుకొచ్చారని.. తల్లి హీరాబెన్ దానిని తిరిగి చెరువులో వదిలేయాలని చెప్పడంతో మరుసటి రోజు మళ్లీ చెరువులో వదిలేశారని వివరించారు.రాజకీయాల్లోకి వచ్చినా.. టీచర్‌ను మర్చిపోలేదుమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తనను గుర్తించారని పటేల్ తెలిపారు. 2001లో మోదీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో తాను అక్కడికి వెళ్లినప్పుడు.. జన సందోహం మధ్య తనను గుర్తించిన మోదీ వచ్చి పాదాలకు నమస్కరించారని చెప్పారు. తర్వాత 2005లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోదీ తన పాత ఉపాధ్యాయులను సత్కరించిన కార్యక్రమాన్ని కూడా గుర్తు చేశారు.సోషల్ మీడియాలో ప్రశ్న.. అసలు క్లారిటీ ఇదేఅయితే మోదీ, ఆయన టీచర్ పటేల్ వయసు 76 అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఓ జాతీయ మీడియా క్లారిటీ ఇచ్చింది. పటేల్ వయసు 90–91 ఏళ్ల మధ్య ఉంటుందని పేర్కొంది. దీంతో ఆయన వయసుపై సోషల్ మీడియాలో వచ్చిన అనుమానాలకు తెరపడినట్టయింది. ఇక ఆయన చెప్పిన సబ్జెక్ట్‌ల విషయంలో ఎన్డీటీవీ, పీటీఐ కథనాల్లో కనిపించిన తేడా మాత్రం ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారింది.Age of PM modi - 76Age of Teacher - 75 pic.twitter.com/kVODe4xyd7 https://t.co/e0mimnacaU— AIN (@Tejusurya_) September 17, 2026ఇదీ చదవండి: ఆ స్టార్ హీరోలు చట్టాన్ని ఉల్లంఘించారని తెలుసా? -
సాధారణ ఫుడ్ డెలివరీ కాస్తా..ఫ్లైట్‌లో ఇంటికి వెళ్లేలా..!
ఓ ఫుడ్ డెలివరి బాయ్, కస్టమర్ మధ్య జరిగి భావోద్వేగ కథ. ఎప్పటిలానే డెలివరి చేసిన ఫుడ్ ఆర్డర్ ఆరోజు ఊహించని మలుపు తిరిగి కృతజ్ఞతతో కళ్లు చెమ్మగిల్లే కథగా మారింది. కొన్ని సాయాలు ఎంత పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయో..పొందే వరకు లేదా అందే వరకు తెలియదేమో. కానీ ఆ హృద్యమైన కథ విన్నాక..ఆ ఫుడ్ డెలివరీ బాయ్‌ని నిస్సందేహంగా అదృష్టవంతుడు అని చెప్పొచ్చు.అసలేం జరిగిందంటే..అంకిత్ పాండే అనే వ్యక్తి ఈ కథను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆయన చాలాసార్లు ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నారు. ఆరోజు కూడా ఎప్పటిలానే ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే వచ్చిన డెలివరీ బాయ్ కూడా అపరిచితుడేం కాదు. చాలాసార్లు అతడు పాండే ఇంటికి వచ్చిన డెలివరీ బాయే. అయితే ఆరోజు ఎందుకో అతడు చాలా తేడాగా ఉన్నట్లు గమనించాడు. డెలివరీ బాయ్ కూడా చాలా సంకోచంగా కొంచెం నీళ్లు కావాలని అడిగాడు. దాంతో పాండే అతడిని లోనికి ఆహ్వానించాడు. మంచి నీళ్లు ఇచ్చి అతడి ముఖం తేరిపార చూసి..ఏమైందని నెమ్మదిగా అడిగాడు. అతడి కళ్లు ఎర్రబడి ఏడ్చినట్టు ఉండటంతో ఏదో తేడా కొడుతుందని..అతడితో మాటలు కలిపాడు పాండే. దాంతో ఆ డెలివరీబాయ్ తన పరిస్థితిని పూసగుచ్చినట్లు వివరించాడు. తన తల్లి ఉదయం మెట్లపై నుంచి పడిపోయిందని, ఆమె పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉందని, ప్రస్తుతం ఆమె ఐసీయూలో ఉందంటూ బోరుమన్నాడు. వీలైనంత త్వరితగతిన వెళ్దామంటే తన ఊరికిపోయే రైలు రాత్రి 11 గంటలకంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈలోగా ఏ వార్త వింటానో అని ప్రతి క్షణం ఓ నరకంలా టెన్షగా ఉందంటూ గద్గద స్వరంతో మాట్లాడాడు. దాంతో చలిపోయిన పాండే తక్షణమే అతడు ఫ్లైట్‌లో వెళ్లేలా ఏర్పాట్లు చేశాడు. రూ. 4000ల టికెట్‌తో విమానంలో వెళ్లేలా బుక్ చేశాడు. తాను ఇంతవరకు విమానం ఎక్కలేదని చెప్పడంతో..పాండే తనలోని ఆందోళన అర్థం చేసుకుని, సాయంగా ఒక స్నేహితడుని కూడా ఏర్పాటు చేశాడు. దాంతో ఆ డెలివరీ బాయ్ తన స్వస్థలానికి సకాలంలో వెళ్లి..తన తల్లి బాగోగులు చూసుకొన్నాడు. ఆ మరుసటి రోజే తన తల్లికి ప్రమాదం తప్పిందని, కొద్ది రోజుల్లోనే ఇంటికి తిరిగి వస్తుందని ఆనందంగా పాండేకి చెప్పాడు. అలాగే ఆ డెలివరీ బాయ్ విమాన టికెట్‌కి అయిన రూ. 4 వేలు తిరిగి ఇచ్చేశాడని, కానీ వాటిని తన తల్లి ఆరోగ్య ఖర్చులకు ఉపయోగించుకోమని వద్దని వారించినట్లు పోస్ట్‌లో చెప్పుకొచ్చారు పాండే. చివరగా.. ఒక చిన్న సహాయం ఎంత పెద ప్రభావాన్ని చూపి, ఒక వ్యక్తికి ఎంత పెద్ద భరోసాని ఇస్తుంది అనడానికీ ఈ ఘటనే ఉదాహరణ అంటూ తన పోస్ట్‌ని ముగించారు. నెటిజన్లు పాండే ఉదారతకు ఫిదా అవుతూ ప్రశంసలు కురిపించడంతో ఈ పోస్ట్ నెట్టింట అమితంగా వైరల్ అయ్యింది. నిజంగా ఈ కథ..లక్షలు వెచ్చించి భారీ సహాయాలు చేయకపోయినా..కనీసం మన చుట్టూ ఉండే వాళ్ల ముఖాల్లోని దిగులు, కష్టంగా గడుస్తున్న రోజుని అర్థం చేసుకుని తగిన సాయం అందించగలిగితే చాలు అనేందుకు ఈ సంఘటనే నిలువెత్తు నిదర్శనం. Update on yesterday's story... I wasn't expecting this.The Zomato delivery partner I booked a flight for yesterday called me this morning.His first words were,"Bhaiya... mummy ab danger se bahar hain. Doctor ne kaha 4–5 din mein ghar aa jayengi."A few minutes later, he… https://t.co/g8r354En4M pic.twitter.com/PDw7TMXXAL— Ankit Pandey (@iamankitpande) July 11, 2026 ఇదీ చదవండి: రాజకీయ ఫ్యాషన్‌కి కేరాఫ్‌గా మోదీ..! చివరికి అది కాస్తా..) -
ఆఫీసులో కుక్కల హల్చల్.. ట్రెండింగ్‌లో వీడియో
నిరసనలు పలు రకాలు.. సమస్యను బట్టి వినూత్నంగా, వెరైటీగా చేపట్టేవి మరికొన్ని. కానీ వీధికుక్కల బెడదపై చేపట్టిన ఈ నిరసన మాత్రం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. అధికారులెంతకూ పట్టించుకోవడం లేదంటూ ఏకంగా కుక్కలనే నగర పంచాయతీ కార్యాలయంలోకి తీసుకొచ్చి అధికారి టేబుల్‌పై వదిలేశారు. అంతేకాదు.. కరెన్సీ నోట్లతో దండ వేసి మరీ తమ నిరసనను వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఎక్స్‌లో వైరల్‌గా మారి ట్రెండింగ్‌లోకి వచ్చింది.మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా నిఫాడ్ నగర్ పంచాయతీ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. యువసేన జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రాంధవే ఆధ్వర్యంలో కార్యకర్తలు ఈ నిరసన చేపట్టారు. చిన్న సంచుల్లో తీసుకొచ్చిన వీధికుక్కలను కార్యాలయంలోకి తీసుకెళ్లి చీఫ్ ఆఫీసర్ ధీరజ్ భామ్రే టేబుల్‌పై వదిలారు. దీంతో అవి అక్కడి నుంచి అటూ ఇటూ పరుగులు తీయడం వీడియోలో కనిపించింది.Yuva Sena district chief Vikram Randhave reportedly released 4–5 stray dogs inside the Niphad Nagar Panchayat chief officer’s office to protest the growing stray dog menace and alleged inaction by the civic body. 💀😭 pic.twitter.com/0wgQpHP00l— Ghar Ke Kalesh (@gharkekalesh) September 16, 2026నిఫాడ్ పట్టణంలో వీధికుక్కల సంఖ్య పెరిగిపోయిందని, వాటి వల్ల చిన్నారులు, వృద్ధులు, మహిళలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కార్యకర్తలు ఆరోపించారు. పలువురు కుక్కకాటుకు గురయ్యారని, ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదని పేర్కొన్నారు. గణేశ్ ఉత్సవాల సమయంలో మండపాలకు వచ్చే ప్రజల్లోనూ వీధికుక్కల కారణంగా భయాందోళన నెలకొందని తెలిపారు.వీధికుక్కలకు స్టెరిలైజేషన్ నిర్వహించడంతోపాటు వాటిని పట్టుకునేందుకు తగిన చర్యలు చేపట్టాలని రాంధవే డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకుండా టెండర్ ప్రక్రియలపైనే అధికారులు దృష్టి పెడుతున్నారని ఆరోపించారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే మరోసారి ఇదే తరహాలో అధికారుల కార్యాలయంలో కుక్కలను తీసుకొచ్చి నిరసన చేపడతామని హెచ్చరించారు.ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఖండ్వాలోనూ వీధికుక్కల సమస్యను నిరసిస్తూ ఓ వ్యక్తి కుక్క మాస్క్ ధరించి ప్రజావాణికి హాజరైన ఘటన వైరల్‌గా మారింది. తాజాగా నిఫాడ్‌లో కార్యకర్తలు ఏకంగా కుక్కలనే అధికారుల కార్యాలయంలోకి తీసుకురావడంతో ఈ నిరసనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.Khandwa, Madhya Pradesh - In a highly unusual form of protest, the Leader of the Opposition in the Khandwa Municipal Corporation, Deepak Rathore, arrived at the district Collectorate during a public hearing accompanied by a man wearing a dog mask. The demonstration was aimed at… pic.twitter.com/fkUih3zv4F— NextMinute News (@nextminutenews7) August 19, 2026ఇదీ చదవండి: మొసలిని ఇంటికి తెచ్చాడు.. అమ్మ మాటతో వెనక్కి వెళ్లాడు -
వెంటాడిన 3,700 ఏళ్ల నాటి వైరస్.. 5 లక్షల గొర్రెలు, మేకలు మృతి!
ఏథెన్స్: గ్రీస్‌లో 2025లో, అలాగే ఈ ఏడాది వైరస్ వ్యాప్తి కారణంగా దాదాపు 5 లక్షల గొర్రెలు, మేకలు మృతి చెందడం లేదా వ్యాధి నియంత్రణలో భాగంగా వధించాల్సి వచ్చింది. అత్యధిక మరణాల రేటు కలిగిన ఈ వైరస్ సుమారు 3,700 ఏళ్ల నాటిదని శాస్త్రవేత్తలు గుర్తించారు. పురాతన గ్రంథాలు రాసేందుకు ఉపయోగించిన గొర్రె చర్మపు పార్చ్మెంట్లో ఈ వైరస్‌కు సంబంధించిన ఆనవాళ్లు ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైంది.యూనివర్సిటీ కాలేజ్ డబ్లిన్‌కు చెందిన మాలిక్యులర్ పాపులేషన్ జెనెటిక్స్ ల్యాబ్ పరిశోధకుడు లూయిస్ ఎల్హోట్ నేతృత్వంలోని బృందం ఈ అధ్యయనం నిర్వహించింది. సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం గొర్రె చర్మంపై రాసిన యార్క్ గాస్పెల్స్ సహా పలు చారిత్రక పత్రాలను పరిశీలించారు. అంతేకాకుండా కాంస్య యుగానికి చెందిన గొర్రెల దంతాలను కూడా విశ్లేషించారు. వైరస్‌కు సంబంధించిన అత్యంత పురాతన ఆధారాలు ఈ దంతాల్లోనే లభించాయని పరిశోధకులు తెలిపారు.కాంస్య యుగంలోనే యూరేషియన్ స్టెప్పీ ప్రాంతంలోని పెంపుడు గొర్రెల మందల్లో ప్రస్తుతం అత్యంత అంటువ్యాధిగా, తీవ్ర ప్రభావం చూపే వ్యాధికారక వైరస్ ఉన్నట్లు గుర్తించినట్లు ఎల్హోట్ తెలిపారు. స్టెప్పీ ప్రాంతంలోని ఆ కాలానికి చెందిన గొర్రెల్లో వ్యాధికారకానికి సంబంధించిన ఆధారాలు లభించడం.. అక్కడి పశుపోషక సమాజాలు అనేక రకాల పశు వ్యాధులతో పోరాడి ఉండొచ్చని సూచిస్తోందన్నారు.మధ్యయుగ కాలంలో జంతువుల చర్మంతో తయారు చేసిన పత్రాల్లో ఎస్పీపీవీ జన్యువులు పెద్ద సంఖ్యలో కనిపించాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీంతో ఆ కాలంలో గొర్రెలకు ఈ వైరస్ సోకడం యూరప్ సమాజాలకు తరచూ ఎదురైన సమస్యగా భావిస్తున్నారు.షీప్పాక్స్కు కారణమయ్యే క్యాప్రిపాక్స్వైరస్.. మనుషుల్లో మశూచికి కారణమయ్యే వేరియోలా వైరస్‌కు దగ్గరి సంబంధం కలిగి ఉంది. క్రీస్తుశకం మొదటి శతాబ్దంలో రోమ్‌లో ఈ వ్యాధికి సంబంధించిన తొలి లిఖిత ఆధారాలు లభించాయి. రచయిత లూసియస్ కొలుమెల్లా గొర్రెల చర్మంపై ఏర్పడే గాయాలను ‘పస్ట్యూల్స్’గా పేర్కొన్నారు. పశువుల లెక్కలు, వ్యవసాయ గ్రంథాల్లో ఈ వ్యాధిని ‘పాక్స్’ లేదా ‘వేరియోలా’గా కూడా పేర్కొన్నారు. వ్యాధి విజృంభించిన ప్రతిసారీ వ్యవసాయ ఉత్పత్తి తగ్గినట్లు ఆ రికార్డులు సూచిస్తున్నాయి.మధ్యయుగ యూరప్‌లో పశువులకు అర్థంకాని వ్యాధులు సోకినప్పుడు వాటిని చేతబడి ప్రభావంగా కూడా ప్రజలు భావించేవారు. షీప్‌పాక్స్ వైరస్ జంతువుల చర్మంలో నిలిచిపోయేది. ఆ చర్మాన్ని పార్చ్మెంట్ తయారీకి ఉపయోగించడంతో శాస్త్రవేత్తలు పురాతన పత్రాల ద్వారా వైరస్ చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేశారు.ఈ వ్యాధి తూర్పు యూరప్, కాకేసస్ స్టెప్పీ ప్రాంతాల్లో తొలుత ఉద్భవించి ఉండొచ్చని భావిస్తున్నారు. అక్కడి ప్రజలు గొర్రెలను దుస్తులు, మాంసం, పాల ఉత్పత్తుల కోసం పెంచేవారు. పెద్ద నివాస ప్రాంతాలు లోహాలు, సిరామిక్ వస్తువుల వాణిజ్య కేంద్రాలుగా ఉండేవి. అనారోగ్యంతో ఉన్న గొర్రెలు ఈ వస్తువులతో సంబంధం కలిగి ఉన్నప్పుడు, విదేశీ వ్యాపారులు తెలియకుండానే వైరస్‌ను తమ ప్రాంతాలకు తీసుకెళ్లి ఉండొచ్చని పరిశోధకులు తెలిపారు. ఇతర గొర్రెల మందలతో కలవడం కూడా వ్యాధి వ్యాప్తికి కారణమై ఉండొచ్చన్నారు.చారిత్రక పత్రాలను పరిశీలించిన ఎల్హోట్కు.. చర్మం బయటి భాగంతో పోలిస్తే మాంసం వైపు ఎక్కువ వైరస్ డీఎన్ఏ కనిపించింది. గొర్రెలను పెంపుడు జంతువులుగా మార్చిన సమయంలోనే షీప్‌పాక్స్ ఉద్భవించి ఉండొచ్చని ఆయన భావిస్తున్నారు. ఈ వ్యాధి లక్షణాల్లో జ్వరం, ఆకలి తగ్గడం, కళ్ల నుంచి స్రావాలు రావడం, ఉన్ని లేని ప్రాంతాల్లో చర్మంపై గాయాలు ఏర్పడటం కనిపించాయి.ఇదీ చదవండి: ఒకవైపు 6 మి.మీ. గణేశుడు.. మరోవైపు 50 వేల విగ్రహాలు! -
జూనియర్ ఎన్టీఆర్ దేవర బ్యూటీ.. ఇప్పుడెందుకు ట్రెండ్ అవుతోంది..!
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన యాక్షన్ మూవీ దేవర. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జూనియర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్‌గా దేవర-2 కూడా ఉందని ఇప్పటికే ప్రకటించారు మేకర్స్.దేవర భార్యగా శృతి..అయితే దేవరలో ఎన్టీఆర్ భార్యగా మెప్పించిన బ్యూటీ శృతి మరాఠే. ఈ ముద్దుగుమ్మ తన అందంతో అభిమానులను కట్టిపడేసింది. ఇందులో కేవలం నటనతో మాత్రమే కాదు.. తన గ్లామర్‌తో సినీ ప్రియులను ఆకట్టుకుంది. తాజాగా శృతి పేరు ఒక్కసారిగా సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఇప్పుడు ఉన్నట్లుండి శృతి మరాఠే నెట్టింట వైరల్‌గా మారింది. ట్విటర్లో ఆమె పేరు ఏకంగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అసలు శృతి ఇప్పుడెందుకు ట్రెండ్ అవుతుందో మనం కూడా తెలుసుకుందాం.స్పెషల్ అట్రాక్షన్‌గా శృతి..దేవరలో ఎన్టీఆర్ భార్యగా ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం జరుగుతున్న వినాయక చవితి వేడుకల్లో సందడి చేసింది. ముంబయిలో గణేశ్ ఆగమన్ సందర్భంగా హీరోయిన్ శృతి మరాఠే బ్యాండ్ వాయించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఇందులో శృతి డోలు వాయిస్తూ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఆమెను చూసిన నెటిజన్స్ దేవరలో హీరోయిన్గా శృతినే తీసుకోవాల్సిందంటూ కామెంట్స్ పెడుతున్నారు. వినాయక చవితి వేడుకల్లో #ShrutiMarathe#Devara ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్! ✨#NTR #JrNTR pic.twitter.com/tEkWjgnWe2— Bollam Suresh (@bollamsuresh11) September 15, 2026 -
ఇరుముడి సక్సెస్.. చిన్నారి నక్షత్రకు సర్ప్రైజ్
‘ఇరుముడి’ విజయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విడుదలైనప్పటి నుంచి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కూడా సినిమా దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడీ ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులనూ అలరించేందుకు సిద్ధమైంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నక్షత్ర (మణమ్మ) కీలక పాత్రలో నటించింది. చిన్న వయసులోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా తండ్రీకూతురు సెంటిమెంట్ సన్నివేశాల్లో నక్షత్ర నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఈ సన్నివేశాలను చూసి చాలామంది ప్రేక్షకులు భావోద్వేగానికి గురయ్యారు. (ఇదీ చదవండి: ‘ఇరుముడి’కి ఈ పాప రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..!)నక్షత్రతో కేక్ కట్ చేయించి..తాజాగా నక్షత్ర చదువుతున్న పాఠశాల యాజమాన్యం ఆమె విజయాన్ని ప్రత్యేకంగా అభినందించింది. స్కూల్లో నక్షత్రతో కేక్ కట్ చేయించి ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు ఆమెను అభినందించారు. చిన్నారి నక్షత్రను అందరూ ప్రశంసిస్తున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమా విజయంతో పాటు నక్షత్ర నటనకు ఇంతటి గుర్తింపు రావడంపై నెటిజన్లు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: ది ప్యారడైజ్ క్రేజ్.. ఈసారి ఏకంగా వినాయకుడే.. Nakshatra Celebrated the success of #Irumudi with her teachers and friends l! 🥹✨#RaviTeja #BlockbusterIrumudi pic.twitter.com/lrCyYv01IB— Neeraj Kumar (@73forever_) September 15, 2026 -
3 వేల కోట్ల ఆస్తులు.. బిచ్చగాడిలా మారిన ఎమ్మెల్యే!
ఆయన రాష్ట్రంలోనే అత్యంత సంపన్న ఎమ్మెల్యేల్లో ఒకరు. కోట్లాది రూపాయల ఆస్తులు.. భద్రతా సిబ్బంది.. ఖరీదైన వాహనాలు.. ఎక్కడికి వెళ్లినా హంగామా. కానీ ఒక్కరోజు మాత్రం ఇవన్నీ పక్కనపెట్టి వీధుల్లో బిచ్చగాడిగా కూర్చున్నారు. చేతిలో డబ్బులు లేకపోయినా.. అడిగిన వారికి తనకు తోచినంతగా ఇవ్వమని కోరారు. చివరకు అదే రూపంలో వచ్చిన ఆహారాన్ని స్వీకరించి తిన్నారు. ఇంతకీ ఇదంతా ఎందుకు?మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షా ఈ వింత అనుభవాన్ని స్వయంగా చవిచూశారు. జైన సంప్రదాయంలో కొనసాగుతున్న ప్రత్యేక మాసం సందర్భంగా తన ఆధ్యాత్మిక గురువు చేసిన సూచనతో ఆయన ఈ పని చేశారు. ముంబైలోని ఘాట్కోపర్ వీధుల్లో కొంతసేపు బిచ్చగాడి వేషంలో గడిపారు. ఇందులో భాగంగా.. తన భద్రతా సిబ్బందిని, వాహనాలను పక్కనపెట్టారు. ఖరీదైన వస్తువులన్నింటినీ వదిలి.. మేకప్ వేసుకుని తనను ఎవరూ గుర్తుపట్టకుండా జాగ్రత్తపడ్డారు. అనంతరం రోడ్లపై కూర్చుని ప్రజలను ఆహారం, డబ్బు అడిగారు.రూ.20.. సమోసా ఉచితం!ఈ అనుభవం తనకు జీవితంలోని వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకునే అవకాశం ఇచ్చిందని పరాగ్ షా తెలిపారు. సాధారణంగా తనను కలవడానికి ప్రజలు వరుసలో నిలబడతారని.. కానీ తాను వారి దగ్గరకు వెళ్లినప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెప్పారు.ఓ వ్యక్తి తనకు రూ.20 ఇచ్చి “వెళ్లి తిను బాబా” అని చెప్పినట్లు షా గుర్తుచేసుకున్నారు. మరోవైపు ఓ సమోసా విక్రేత వద్దకు వెళ్లి తన దగ్గర డబ్బులు లేవని చెప్పగా.. అతడు ఎలాంటి డబ్బులు తీసుకోకుండా చిరునవ్వుతో సమోసా ఇచ్చాడని తెలిపారు.“నేను డబ్బులు లేవని చెప్పినా.. ఆ పేద చిరు వ్యాపారి ఏ మాత్రం మొహం చాటేయకుండా నవ్వుతూ సమోసా ఇచ్చాడు. ముంబై ప్రజల్లో ఒకరికొకరు సాయం చేసే గుణం ఉంది” అని షా తన అనుభవాన్ని వివరించారు.మేకప్ తొలగించి మళ్లీ అక్కడికే..కొన్ని గంటలపాటు బిచ్చగాడిగా గడిపిన తర్వాత పరాగ్ షా మేకప్ తొలగించుకున్నారు. అనంతరం తాను గతంలో తిరిగిన ప్రాంతాలకే వెళ్లి.. తనను గుర్తుపట్టని సమయంలో ప్రజలు ఎలా స్పందించారో మరోసారి పరిశీలించారు. ఈ అనుభవాన్ని తన గురువుతో పాటు ఇతరులతోనూ పంచుకున్నారు.₹5,000 CRORE MLA BECOMES A ‘BEGGAR’ FOR A DAYGhatkopar East MLA Parag Shah, known for his immense wealth, reportedly took on the life of a beggar as part of a spiritual exercise suggested by his Jain guru, Namramuni Maharaj.He gave up his security, luxury cars and expensive… pic.twitter.com/Vv601XljkQ— Subodh Kumar (@kumarsubodh_) September 15, 2026తనకు లభించే గౌరవం, హోదా, అధికారాల వెనుక ఉన్న భిన్నమైన ప్రపంచాన్ని ఈ అనుభవం చూపించిందని షా అన్నారు. “నన్ను కలవడానికి వచ్చే ప్రజలే.. నేను వారి దగ్గరకు వెళ్లినప్పుడు నాకంటే ఎత్తుగా కనిపించారు. అదే జీవితంలోని వాస్తవం” అని ఆయన వ్యాఖ్యానించారు.రిచ్చెస్ట్ ఎమ్మెల్యేఘాట్కోపర్ ఈస్ట్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న పరాగ్ షా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు. 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన సమర్పించిన అఫిడవిట్లో రూ.3,383 కోట్లకు పైగా ఆస్తులను ప్రకటించారు. దీంతో అప్పట్లో మహారాష్ట్రలోనే అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచారు. రాజకీయాల్లోకి రాకముందు వ్యాపారవేత్తగా ఉన్న ఆయన.. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లో కార్పొరేటర్‌గానూ పనిచేశారు.ఇంతటి సంపద, హోదా ఉన్న వ్యక్తి ఒక్కరోజు అన్నింటినీ పక్కనపెట్టి సామాన్యుడిలా, చివరకు బిచ్చగాడి రూపంలో ప్రజల మధ్య కూర్చోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే తనకు ఈ అనుభవం “జీవితంలోని వాస్తవాన్ని చూపించింది” అని పరాగ్ షా చెప్పడం అసలు ఉద్దేశాన్ని స్పష్టం చేస్తోంది. -
Delhi: వెనక్కి వచ్చి మరీ డ్రైవర్‌కు థ్యాంక్స్ చెప్పిన యువరాజు
పెద్దల నుంచి సామాన్యుల వరకు.. ఎవరినైనా గౌరవించే తీరు ప్రత్యేకమే. అలాంటి ఓ చిన్న పని ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ చేసిన ఈ చిన్న పని.. ఆయన వినయానికి నిదర్శనంగా నిలిచింది.18వ బ్రిక్స్ సదస్సు కోసం భారత్‌కు వచ్చిన ఆయన.. సెప్టెంబర్ 12న ఢిల్లీ నుంచి తిరిగి వెళ్లే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానాశ్రయానికి బయలుదేరేందుకు కారులో నుంచి దిగిన షేక్ ఖలీద్.. అక్కడున్న అధికారులకు వీడ్కోలు చెబుతున్నారు. ఇంతలో తనను తీసుకొచ్చిన డ్రైవర్‌కు మాత్రం చెప్పకుండా వెళ్లిపోతున్నానని గుర్తించారు.వెంటనే వెనక్కి తిరిగిన ఆయన.. కారు వద్దకు వెళ్లి డ్రైవర్‌తో చేతులు కలిపారు. కాసేపు అతడితో మాట్లాడి మరీ వీడ్కోలు చెప్పారు. ఆ డ్రైవర్ భారతీయుడని ఏఎన్ఐ తెలిపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.‘చిన్న పని.. పెద్ద మనసు!’యువరాజు చేసిన ఈ చిన్న పనిని నెటిజన్లు తెగ ప్రశంసిస్తున్నారు. హోదా, స్థాయి చూడకుండా డ్రైవర్‌ను ప్రత్యేకంగా పలకరించడాన్ని ఆయన వినయానికి నిదర్శనంగా అభివర్ణిస్తున్నారు. ‘ఇదే అసలైన క్లాస్’ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు యూఏఈ వ్యవస్థాపకుడు షేక్ జాయెద్ విలువలను ఈ ఘటన గుర్తుచేస్తోందని పేర్కొన్నారు.భారత్ పర్యటనలో భాగంగా షేక్ ఖలీద్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఇంధన సరఫరాలు, వాణిజ్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్థిక సహకారం, విద్య, పర్యాటకం తదితర అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. హైదరాబాద్ హౌస్‌లో జరిగిన భేటీలో భారత్–యూఏఈ బంధాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపైనా చర్చించారు.18వ బ్రిక్స్ సదస్సు సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగింది. ‘బిల్డింగ్ రెసిలియెన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ’ అనే థీమ్‌తో జరిగిన ఈ సదస్సుకు 13 మంది ప్రపంచ నేతలు, 17 ప్రతినిధి బృందాలు హాజరయ్యాయి.అయితే అంతర్జాతీయ స్థాయి సమావేశాలు, కీలక చర్చల మధ్య.. ఒక భారతీయ డ్రైవర్‌కు స్వయంగా వెనక్కి వెళ్లి వీడ్కోలు చెప్పిన అబుదాబి యువరాజు తీరు మాత్రం ప్రత్యేకంగా నిలిచింది.#WATCH | Delhi: Crown Prince of Abu Dhabi, Sheikh Khaled bin Mohamed bin Zayed Al Nahyan departs from India after BRICS Summit 2026. pic.twitter.com/cw3XPOlTTz— ANI (@ANI) September 12, 2026 -
ప్రపంచంలోనే పురాతన చెట్టు..
వయసు తెలుసుకోవడానికి నరికేశారు! ఒక చెట్టు వయసు తెలుసుకోవడానికి ఏం చేస్తారు? దాని కాండం నుంచి చిన్న ముక్క తీసి పరిశీలిస్తారు. కానీ అమెరికాలో జరిగిన ఒక పరిశోధనలో మాత్రం ప్రపంచంలోని అత్యంత పురాతన చెట్లలో ఒకటైన చెట్టును పూర్తిగా నరికేశారు. ఆ తర్వాతే దాని అసలు వయసు బయటపడింది. అమెరికాలోని నెవాడా రాష్ట్రంలోని వీలర్ పీక్ ప్రాంతంలో పెరిగిన ఈ చెట్టుకు స్థానికంగా ప్రోమీథియస్’ అనే పేరు ఉండేది. ఇది గ్రేట్ బేసిన్ బ్రిసిల్‌కోన్ పైన్ జాతికి చెందిన చెట్టు. 1964లో భూగోళ శాస్త్ర పరిశోధకుడు డొనాల్డ్ ఆర్. కర్రీ ఈ ప్రాంతంలో ఐస్ ఏజ్ అంటే మంచు యుగంపై పరిశోధన చేసే సమయంలో ప్రోమీథియస్ను గుర్తించాడు. ఈ చెట్ల కాండంలోని వలయాలు అంటే ట్రీ రింగ్స్ అనేవి గతంలోని వాతావరణ పరిస్థితులను తెలుసుకోవడానికి, ఆ చెట్టు వయసును అంచనా వేయడానికి ఉపయోగపడతాయి.అనుమతి ఇచ్చిన అమెరికాకర్రీ మొదట చెట్టు నుంచి చిన్న నమూనా తీసి వయసును అంచనా వేయాలని ప్రయత్నించాడు. అయితే ప్రోమీథియస్ విషయంలో పూర్తి కాండాన్ని పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమెరికా అటవీ శాఖ అనుమతితో చివరకు ఆ చెట్టును నరికారు. అయితే దాన్ని ఎందుకు నరికాల్సి వచ్చిందన్న విషయంలో వివిధ కథనాలు ఉన్నాయి. అసలు కారణం ఏమిటో పూర్తిగా స్పష్టంగా తెలియదని నేషనల్ పార్క్ సర్వీస్ చెబుతోంది.చెట్టును నరికిన తర్వాత కాండంలోని వలయాలను లెక్కించగా 4,862 రింగ్స్ కనిపించాయి. కఠినమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఒక రింగు ఏర్పడకపోవచ్చని భావించి, ప్రోమీథియస్ వయసును సుమారు 4,900 సంవత్సరాలుగా అంచనా వేశారు. ఆ సమయంలో ఇదే అత్యంత పురాతనమైన చెట్టుగా రికార్డ్ అయింది.ఇప్పుడు ఆ అవసరం లేదు..నేడు ఇలాంటి పురాతన చెట్ల వయసును తెలుసుకోవడానికి వాటిని పూర్తిగా నరకాల్సిన అవసరం లేదు. చెట్టు కాండంలోకి చాలా చిన్న డ్రిల్‌తో వెళ్లి చెక్క నమూనాను తీసే ‘ఇంక్రిమెంట్ బోరర్’ వంటి పరికరాలను ఉపయోగిస్తున్నారు. ఆ నమూనాలోని రింగ్స్‌పై రీసెర్చ్ చేసి చెట్టు వయసును అంచనా వేయవచ్చు. చెట్టుకు తక్కువ నష్టం కలిగించే మరికొన్ని సాంకేతిక పద్ధతులు కూడా అందుబాటులోకి వచ్చాయి. అంటే.. ప్రోమీథియస్ నరికిన 1964తో పోలిస్తే, నేడు ఇలాంటి పురాతన చెట్లను కాపాడుకుంటూనే వాటి వయసు గురించి తెలుసుకునే అవకాశాలు పెరిగాయి. నేడు ప్రోమీథియస్ లేదు. అయితే చెట్టు నరకగా మిగిలిన కాండం, మొదలు భాగం నేటికీ అక్కడే ఉంది. వయసు తెలుసుకోవడానికి చెట్టును నరకడంపై అప్పట్లో వివాదం చెలరేగింది. ఈ ఘటన తర్వాత పురాతన చెట్లను సంరక్షించడం, వాటిపై పరిశోధనలు నిర్వహించే విధానంపై కూడా చర్చ మొదలైంది. ప్రోమీథియస్ మాత్రం 1964లో నరికే సమయానికి తెలిసిన అత్యంత పురాతన చెట్టుగా చరిత్రలో నిలిచింది. అయితే 2012లో కాలిఫోర్నియాలో 5,065 ఏళ్ల బ్రిసిల్‌కోన్ పైన్ అనే మరో చెట్టును గుర్తించారు. ఇప్పుడు ఇదే ప్రపంచంలో ది ఓల్డెస్ట్ ట్రీ. ఇదీ చదవండి: ఎట్టకేలకు 105 ఏళ్ల తల్లిని కలిసిన 85 ఏళ్ల కుమార్తె -
నెక్ట్స్ మిషన్ ప్రకటించిన బిట్టూ భాయ్
ఒక నది బాగుపడాలంటే అధికారులు రావాలి.. భారీ నిధులు కేటాయించాలి.. పెద్ద సంఖ్యలో సిబ్బంది పనిచేయాలి. కానీ 20 ఏళ్ల యువకుడు మాత్రం ఇవేవీ లేకుండానే ఓ నదిని శుభ్రం చేసి చూపించాడు. నెలల తరబడి ఒంటరిగా శ్రమిస్తూ ప్లాస్టిక్, చెత్తాచెదారం తొలగించి అజ్నార్ నదికి కొత్త రూపు తీసుకొచ్చాడు. సోషల్ మీడియాలో అతడి పని వైరల్ కావడంతో ఆపై ఏకంగా అంతర్జాతీయ పర్యావరణ సంస్థ నుంచి ఉద్యోగ ఆఫర్ అందుకున్నాడు. ఇప్పుడు తన తదుపరి కార్యాచరణ సైతం ప్రకటించేశాడు..మధ్యప్రదేశ్‌కు చెందిన బిట్టూ తబాహీ అసలు పేరు సురేంద్ర సింగ్ చౌధరి. అజ్నార్ నది కాలుష్యంతో నిండిపోవడాన్ని చూసిన అతడు.. సమస్య గురించి మాట్లాడటంతో ఆగిపోలేదు. స్వయంగా రంగంలోకి దిగి నదిలో పేరుకుపోయిన ప్లాస్టిక్, చెత్త, ఇతర వ్యర్థాలను తొలగించడం మొదలుపెట్టాడు. అవసరమైన ప్రాథమిక సామగ్రిని తన సొంత డబ్బుతో సమకూర్చుకుంటూ.. ఎవరూ తోడుగా లేకపోయినా పదేపదే నది వద్దకు వెళ్లి శుభ్రం చేస్తూ వచ్చాడు.మార్పును వీడియోలుగా..నది శుభ్రం చేసే ముందు పరిస్థితి ఎలా ఉంది.. తాను శ్రమించిన తర్వాత ఎలా మారింది అన్న విషయాలను బిట్టూ సోషల్ మీడియాలో వీడియోల రూపంలో పంచుకున్నాడు. తొలుత స్థానికంగా కనిపించిన ఈ ప్రయత్నం క్రమంగా నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. చెత్తతో నిండిన నది ప్రాంతాన్ని స్వయంగా శుభ్రం చేస్తున్న అతడి వీడియోలు వైరల్ కావడంతో బిట్టూ పేరు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది.డచ్ సంస్థ నుంచి ఉద్యోగ ఆఫర్..బిట్టూ చేసిన పని చివరకు ‘ది ఓషన్ క్లీన్అప్’ దృష్టిని కూడా ఆకర్షించింది. డచ్ పర్యావరణవేత్త బోయన్ స్లాట్ స్థాపించిన ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా సముద్రాలు, నదుల్లోని ప్లాస్టిక్ కాలుష్యాన్ని తొలగించేందుకు పనిచేస్తోంది. బిట్టూ కృషిని గుర్తించిన సంస్థ అతడికి ఉద్యోగ ఆఫర్ ఇచ్చింది. దీంతో సోషల్ మీడియాలో అతడికి మరింతగా అభినందనలు వెల్లువెత్తాయి.‘తర్వాత ఏ రాష్ట్రానికి రావాలి?’..ఉద్యోగ ఆఫర్ వచ్చిన తర్వాత బిట్టూ సోషల్ మీడియాలో మరో వీడియోను షేర్ చేశాడు. తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన అతడు.. ఇక తర్వాత ఏ రాష్ట్రానికి వెళ్లి శుభ్రత కార్యక్రమం చేపట్టాలని అడిగాడు. దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి అక్కడి నదులు, పరిసరాలను శుభ్రం చేయాలనే తన ఆలోచనను వెల్లడించాడు.దీంతో నెటిజన్లు కూడా పెద్ద సంఖ్యలో స్పందించారు. బిహార్, ఉత్తరాఖండ్, మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల పేర్లను సూచిస్తూ కామెంట్లు చేస్తున్నారు. తమ ప్రాంతాల్లోనూ ఇలాంటి శుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నారు.కొసమెరుపు.. బిట్టూ శుభ్రం చేసిన అజ్నార్ నది మళ్లీ కాలుష్యం బారిన పడడం ప్రారంభమైంది. కొందరు చెత్తాచెదారం అందులో వేయడం.. వాటి ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో కొందరు యువకులు అక్కడ గస్తీ కాస్తూ బిట్టూ కష్టం వృథా కానివ్వకుండా కాపాడుకుంటున్నారు. -
భార్య.. భర్త.. ప్రియుడు.. ముగ్గురూ మంచోళ్లే!
వివాహేతర సంబంధాల మోజులో నేరాలు ఘోరాలు జరుగుతున్న రోజుల్లో.. భర్తను చంపే భార్యలు, భార్యలను హతమార్చే భర్తలు, ప్రేమ పేరుతో బ్లాక్మెయిల్ చేసే ఘటనలు తరచూ కనిపిస్తున్నాయి. కానీ దీనికి పూర్తి భిన్నంగా.. ఒక భార్య తనకు భర్త వద్దని, ప్రియుడితోనే ఉంటానని తెగేసి చెప్పింది. దీంతో ఆ భర్త తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కథలో ట్విస్టులు మాత్రం సినిమాను మించి ఉన్నాయి!..ఈవీవీ డైరెక్షన్లో వచ్చిన కన్యాదానం చిత్రంలో.. తన స్నేహితుడి ప్రేమను నిలబెట్టేందుకు భార్యనిచ్చి దగ్గరుండి వివాహం జరిపిస్తాడు హీరో. ఆ క్లైమాక్స్‌ను ఏమాత్రం తీసిపోని రేంజ్లో జరిగిన ఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. భార్యను ఎంతో అపురూపంగా చూసుకుంటే.. ఆమె మాత్రం అతను వద్దని తెగేసి చెప్పింది. దీంతో ఆ సినిమాలో శ్రీకాంత్ చేసినట్లే.. ప్రియుడి వద్దకే భార్యను చేర్చాడా భర్త. లక్నోకు చెందిన ప్రాంతీయ రక్షక్ దళ్ (PRD) జవాన్ విక్కీకి సొనాలీతో ఏడాది క్రితం వివాహమైంది. అయితే పెళ్లికి ముందే సొనాలీకి తన చిన్ననాటి స్నేహితుడితో ప్రేమ వ్యవహారం ఉంది. ఇద్దరూ స్కూల్ టైం నుంచే స్నేహితులు. ఆ స్నేహం కాస్తా వాళ్లతో పాటే పెరిగి ప్రేమగా మారింది. అయితే అతనితో వివాహానికి పెద్దలు ఒప్పుకోలేదు. బలవంతంగా విక్కీకి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే పెళ్లి తర్వాత కూడా ఆమె తన ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతూనే ఉంది. భర్తను మోసం చేయొద్దని.. సుఖంగా కాపురం చేసుకోమని ఆ ప్రియుడు ఆమెకు హితబోధ చేస్తూ వచ్చాడు. అయితే ఆమె మాత్రం అలా ఉండలేనంటూ తెగేసి చెప్పింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 5న సొనాలీ అత్తింటి నుంచి అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో భర్త విక్కీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సమీప జిల్లాలకు సమాచారం పంపి గాలింపు చేపట్టారు. చివరకు..సొనాలీ హర్దోయ్‌లో ఓ వ్యక్తితో కలిసి ఉన్నట్లు గుర్తించారు. అతను తన ప్రియుడని చెప్పడంతో అంతా కంగుతిన్నారు. బుధవారం పోలీసులు ఇద్దరినీ లక్నోకు తీసుకొచ్చి కుటుంబ సభ్యుల సమక్షంలో మాట్లాడించారు. గంటల తరబడి నచ్చజెప్పినా సొనాలీ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. భర్తతో ఒక్క క్షణం కూడా ఉండటం తనకు ఇష్టం లేదని, తన చిన్ననాటి ప్రియుడితోనే జీవితాంతం ఉండాలనుకుంటున్నానని స్పష్టం చేసింది. ఆ సమయంలో ప్రియుడు.. భర్త వద్దకే వెళ్లిపోవాలంటూ సూచించడం గమనార్హం.అయితే భార్య మాటలు విన్న విక్కీ కొంతసేపు షాక్‌కు గురైనా.. చివరకు ఆమె నిర్ణయాన్ని గౌరవించాడు. “ఇందులో బలవంతం ఏమీ లేదు. ఎవరితో అయితే సంతోషంగా ఉంటావో వారితోనే ఉండు” అని చెప్పాడు. అనంతరం ఇరువర్గాల అంగీకారంతో అవసరమైన చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేశారు. ఆ తర్వాత సొనాలీ, ఆమె చిన్ననాటి ప్రియుడు స్థానిక ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం ఏడడుగులు వేశారు. ఈ సమయంలో ఆమె భర్త విక్కీ స్వయంగా భార్యను ప్రియుడికి అప్పగించాడు.పెళ్లి తర్వాత కూడా చిన్ననాటి ప్రేమను కొనసాగించిన సొనాలీ.. చివరకు తన ప్రియుడినే ఎంచుకుంది. అయితే ఈ ప్రేమకథలో ఊహించని మలుపు చోటుచేసుకుంది. సాధారణంగా ఇలాంటి వ్యవహారాలు బయటపడితే గొడవలు, దాడులు, హత్యలు, బ్లాక్‌మెయిలింగ్‌ల వరకు వెళ్లే ఘటనలు చూస్తుంటాం. కానీ ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు.. భర్త బలవంతం చేయకుండా భార్య నిర్ణయాన్ని గౌరవించాడు. అంతేకాదు.. ఆమె చేయిని ప్రియుడి చేతిలో పెట్టి దగ్గరుండి పెళ్లి జరిపించాడు. ఆ వీడియోనే నెట్టింట వైరల్ అవుతోంది.In #Lucknow's Malihabad, a PRD (Prantiya Rakshak Dal) jawan arranged his wife's marriage to her lover. His wife had run away from home, and upon discovering she was having an affair, the husband deemed it appropriate to have her married to the man rather than create a dispute. pic.twitter.com/9SC6Vdq05m— Siraj Noorani (@sirajnoorani) September 11, 2026 -
నో స్కూల్, నో సిలబస్, నో స్క్రీన్! ఉత్తరాఖండ్ దంపతుల సరికొత్త పేరెంటింగ్ పాఠాలు
ఇటీవల కాలంలో చాలామంది సంపాదన, పిల్లలను సెటిల్ చేయడం వంటి ఉరుకుల పరుగుల జీవితం వద్దంటూ ప్రకృతితో ఉండటానికి ఇష్టపడుతున్నారు. కొందరు ఆ క్రమంలో ప్రయాణాలు చేస్తుంటే ఇంకొందరు మాత్రం గజిబిజి వాతావరణం మాకే కాదు మా పిల్లలకు వద్దు అంటూ మన పూర్వీకుల జీవిన విధానంలో బతికి చూపిస్తూ..మర్చిపోతున్న లేదా విస్మరిస్తున్న అద్భుత పేరెంటింగ్ పాఠాలను గుర్తు చేస్తున్నారు. ఆ కోవకు చెందినవారే ఈ దంపతులుఆ దంపతులే ఉత్తరాఖండ్‌కు చెందిన ఆదిత్య, గరిమలు. ఈ జంట ఉత్తరాఖండ్‌లో మారుమూల గ్రామం బస్గావ్లో నివశిస్తూ..అన్ని రకాల ఒత్తిళ్లు, కాలుష్యంకు దూరంగా ప్రశాంత జీవితాన్ని అనుభవిస్తున్నారు. చెప్పాలంటే వారు కోరుకున్న కలల జీవితంలో ఆనందంగా గడుపుతున్నారు. తమ బిడ్డకు కూడా నో స్కూల్, నో స్క్రీన్, నో సిలబస్ వంటి ఎలాంటి ఒత్తిడులు దరిచేరనీకుండా ప్రకృతితో మమేకమయ్యేలా పెంచుతున్నారు. ఆ చిన్నారి ప్రతీదీ సహజసిద్ధంగా నేర్చుకునేలా పెంచుతున్నారు. అంతకుముందు ఈ దంపతులు జీవన విధానం ఎలా ఉండేదంటే..సిమ్లాలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన ఆదిత్య, కార్పొరేట్ రంగంలో ఉన్నత స్థానాలకు ఎదగడమే విజయానికి కీలకం అని నమ్మేవారు. ఆ నేపథ్యంలోనే ఆదిత్య ఫ్యాషన్ మేనేజ్మెంట్ చేయడం కోసం ఢిల్లీకి వెళ్లాడు, అక్కడ గరిమను కలిశాడు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక, గరిమకు మంచి ఉద్యోగం లభించింది, శిక్షణ కోసం ప్రపంచమంతా పర్యటించే అవకాశం కూడా దొరికింది. అయితే ఆ ఆనందం ఎంతోసేపు నిలువలేదు, తీవ్రమైన ఒత్తిడి బారినపడింది. ఇక 2015లో ఆదిత్య ఉద్యోగ రీత్యా ఈ జంట వివాహం చేసుకుని సింగపూర్‌కు వెళ్లిపోయారు. అక్కడ గరిమ తన ఉద్యోగాన్ని వదిలేసి, బాలల మనస్తత్వ శాస్త్రం(చైల్డ్ సైకాలజీ) చదవడంపై దృష్టి సారించింది. ఆ సబ్జెక్టులో మరింత లోతుగా పరిశోధన చేయడంతో కార్పొరేట్ లైఫ్ జీవితాలను ఎలా నాశనం చేస్తుందో గ్రహించారు. దాంతో ఇద్దరు చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నారు. 33 ఏళ్లకే ఆదిత్య ఉద్యోగాన్ని వదిలేసి గర్భవతిగా ఉన్న గరిమను తీసుకుని ఉత్తరాఖండ్‌కి వచ్చేశాడు. ప్రకృతి మూలికలకు స్వస్థపరిచే శక్తి, ప్రకృతి ఆధారిత పాఠశాల విద్య వారి జీవితాలను ఎంతలా తీర్చిదిద్దుతాయో అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. అంతేగాదు వారి కూమారుడు వేదాస్ ఇప్పటి వరకు ఏ పాఠశాలకు వెళ్లలేదు, అతని ప్రాథమిక విద్య అంతా ప్రకృతి నుంచే స్వయంగా నేర్చుకున్నాదే. సూర్యోదయంతో మేల్కోవడం నుంచి పక్షుల కిలకిలరావాలు, వర్షపు వాసన వంటివి స్వయంగా అనుభవిస్తాడు, తనే తెలుసుకుంటాడని చెబుతున్నారు ఆదిత్య గరిమ దంపతులు. అంతేగాదు ఆ చిన్నారే స్వయంగా మొక్కలు నాటుతాడు, కంపోస్ట్ కూడా తయారు చేస్తాడని అన్నారు. అతను మట్టితో చిత్రాలు గీస్తాడు, నేర్చుకుంటాడని చెప్పుకొచ్చారు. అలాగని తామేమి పరీక్షలకు వ్యతిరేకం కాదని, వాళ్లని గుడ్డిగా ఒత్తిడికి గురిచేయడాన్ని నిరాకరిస్తామని అన్నారు. తమ బిడ్డ వేగంతో నేర్చుకుంటూ ఉత్సుకతతో ఉండటమే గాక ప్రకృతి తన రోజువారి జీవితంతో బలమైన అనుబంధం కలిగి ఉండాలని ఆశిస్తున్నారు. చెప్పాలంటే..చిన్నారులు ప్రతి విషయాన్ని విశ్వంతో స్వయంగా అనుభవిస్తూ నేర్చుకున్న జ్ఞానం, అద్భుతాలు, ఆవిష్కరణాలకు దారితీస్తుందని తమ జీవన విధానంతో చెప్పకనే చెబుతున్నారు. నెటిజన్లు కూడా ఆ దంపతుల ధైర్యానికి మెచ్చుకుంటూ..చక్కటి ముందడుగు వేశారంటూ ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) (చదవండి: యూట్యూబ్ సాయంతో శాండ్విచ్ తయారీ..ఇవాళ ఏకంగా..!) -
తొలిసారి కొడుకు ఫొటో రివీల్ చేసిన వరుణ్ తేజ్, లావణ్య
టాలీవుడ్ నటుడు వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి దంపతులు తమ కుమారుడు వాయువ్ తేజ్ ఫొటోను తొలిసారి సోషల్ మీడియాలో పంచుకున్నారు. వాయువ్ తొలి పుట్టినరోజు సందర్భంగా ఈ ఫొటోను షేర్ చేయడంతో అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 2025 సెప్టెంబర్‌లో వరుణ్–లావణ్య దంపతులకు కుమారుడు జన్మించిన విషయం తెలిసిందే. అనంతరం తమ బిడ్డకు ‘వాయువ్ తేజ్’ అనే పేరు పెట్టినట్లు వెల్లడించారు.కుమారుడి ఫొటోను షేర్ చేసిన వరుణ్ తేజ్.. “నా ప్రపంచాన్నే మార్చేశావు” అంటూ ఎమోషనల్ అయ్యాడు. ‘నా ప్రియమైన వాయువ్ తేజ్.. నా ప్రపంచాన్ని సాధ్యమైనంత అందంగా మార్చేశావు. నిన్ను తొలిసారి కళ్లారా చూడకముందే నీతో ప్రేమలో పడిపోయాను. నీ తండ్రిగా ఉండటం నా జీవితంలోనే అత్యంత అందమైన విషయం’ అంటూ వరుణ్ తేజ్ భావోద్వేగ పోస్ట్ చేశాడు.వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తొలిసారి 2017లో వచ్చిన ‘మిస్టర్’ సినిమాలో కలిసి నటించారు. ఆ సమయంలో ఏర్పడిన స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. కొన్నేళ్ల పాటు తమ ప్రేమ విషయాన్ని ప్రైవేట్‌గా ఉంచిన ఈ జంట 2023లోకుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇదీ చదవండి: ‘డిసి’ సక్సెస్.. లోకేశ్, అనిరుధ్‌లకు ఖరీదైన గిఫ్ట్స్ My dear boy, you changed my world in the best way possible. I fell in love with you even before I laid my eyes on you for the first time. Being your father is the most beautiful part of my life.Happy 1st birthday, Vaayuv.I love you, always.❤️😘 pic.twitter.com/nUfXCuBJXF— Varun Tej Konidela (@IAmVarunTej) September 10, 2026 -
ఇక రిటైర్ కావాలనుకుంటున్నా: అమితాబ్ బచ్చన్
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. ఎంతోకాలంగా తనను బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువ చేసిన ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (KBC) కార్యక్రమానికి గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు పరోక్షంగా వెల్లడించారు. ప్రస్తుతం ఈ షో 18వ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఆయన.. తాజాగా రాసిన బ్లాగ్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లో రాంప్రసాద్, చరణ్‌లకు షాక్! ఎలిమినేట్ అవుతారా? కొనసాగించడం కష్టంగా మారుతోందికార్యక్రమానికి వచ్చే కొందరు కంటెస్టెంట్ల వ్యక్తిగత జీవితాల్లోని విషాదకర ఘటనలు తనను తీవ్రంగా కలచివేస్తున్నాయని అమితాబ్ పేర్కొన్నారు. వాళ్లు పడిన బాధలను పంచుకుంటున్నప్పుడు నా భావోద్వేగాలను అదుపు చేసుకోవడం నాకు కష్టంగా ఉంటోంది. హోస్ట్‌గానూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం కష్టంగా మారుతోంది. ఇక నేను రిటైర్ కావాలనుకుంటున్నా.. ఇప్పటికే ఆలస్యమైంది.’ అంటూ తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. దీంతో అమితాబ్ ఇక KBC నుంచి తప్పుకోనున్నారా? అనే చర్చ మొదలైంది.ఇదీ చదవండి: మీ దగ్గర టాలెంట్ ఉంటే.. నాదగ్గరికి రండి: ఉదయభాను2000లో ప్రారంభమైన KBCకి తొలి సీజన్ నుంచి అమితాబ్ బచ్చనే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. మూడో సీజన్‌కు మాత్రం షారుక్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. గతంలోనూ అమితాబ్ KBC నుంచి తప్పుకోనున్నారనే వార్తలు వచ్చినప్పటికీ.. అవి నిజం కాలేదు. ఇప్పుడు కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ( విజయ్ దేవరకొండ ‘రణబాలి’ టీజర్ చూశారా..) -
రూ. 90 లక్షల జీతం వదులుకుని ఇండోర్ వ్యవసాయం ..! కట్‌చేస్తే ..
చాలామందికి కార్పొరేట్ జీవితంలో లక్షల్లో జీతం ఆర్జించాలన్నది డ్రీమ్. అందుకోసం ఎంతలానో కష్టపడుతుంటారు. కానీ కొందరు అంత లగ్జరీ లైఫ్‌ని సునాయాసంగా కాదనుకుని వ్యవసాయం వైపుగా అడుగులు వేసి రైతులనకు అండగా నిలుస్తుంటారు. ఆ క్రమంలో కొందరు భారీ లాభాలతో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించి పారిశ్రామికవేత్తలుగా మారుతున్నారు. అలాంటి కోవకు చెందినవాడే చత్తీశ్‌గఢ్‌కు చెందిన మోహిత్ నిఝూవన్ కూడా. అతడు ఏ పది, ఇరవై లక్షల జీతం కూడా ఏ రేంజ్ కార్పొరేట్ జీతాన్ని కాదనుకున్నాడో వింటే నోటమాటరాదు. మరి ఆ వ్యక్తి అంత లగ్జరీ లైఫ్ వదులుకుని అంతకుమించిన సక్సెస్‌ని ఎలా అందుకున్నాడో తెలుసుకుందామా..!.చత్తీశ్‌గఢ్‌కు చెందిన మోహిత్ నిఝూవన్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి మంచి మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. హాయిగా బిందాస్లా సాగిపోతున్నా లైఫ్‌కి సడెన్ బ్రేక్‌లు వేసి..అగ్రికల్చర్ రంగం వైపుకి అడుగులు వేశాడు. అది కూడా ఎలాంటి వ్యవసాయం ఎంచుకుంటే బెస్ట్ అని కూలంకషంగా తెలుసుకునేందుకు 2020లో తన ఉద్యోగానికి రిజైన్ చేసేశాడు. నియంత్రిత వాతావరణంలో పెంచగలిగే పోషకాలు అధికంగా ఉండే మొక్కతోట కూరలైన మైక్రోగ్రీన్ అనే ఇండో ఫార్మింగ్ ప్రారంభిస్తే ఎలా ఉంటుందని అనుకున్నాడు. అనుకున్నదే తడుపుగా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నాడు గానీ..పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టడం కంటే..తక్కువ మొత్తంలో పెట్టి అదృష్టం పరీక్షించుకోవాలనుకున్నాడు మోహిత్. అందుకే కేవలం రూ. 30 వేలతో చండీగఢ్‌లోని తన ఇంటి రెండో అంతస్థులో వంద చదరపు అడుగుల స్థలంలో మైక్రోగ్రీన్స్‌ని పెంచడం ప్రారంభించాడు. తొలినాళ్లలో సాగు, ఉత్పత్తి, వినియోగదారులు కొనుగోలు చేసేలా వ్యాపార నమునాని నిర్మించడం వంటి వాటి గురించి క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. ఒక చిన్న ప్రయోగంగా మొదలుపెట్టి క్రమంగా ఎవర్గ్రీన్ మైక్రోగ్రీన్గా ఎదగడం ప్రారంభించింది. అలా చిన్న ర్యాక్ కాస్తా మూడు ర్యాక్‌లు, ట్రేలుగా వర్టికల్ ఇండోర్ఫామ్ని స్థాపించాడు. ప్రారంభంలో 21 సేంద్రీయా రకాలపై దృష్టిసారించి రసాయనాలు వినియోగించకుండా సాగు చేస్తే గణనీయమైన ఫలితం వచ్చింది. దాంతో నెమ్మదిగా తన ఫామ్‌ని 500 చదరపు అడుగులకు విస్తరించేలా సొంతంగా ఫామ్‌ని ఏర్పాటు చేశాడు. అది కాస్తా విస్తరించి ఏకంగా 12 వేల ట్రైలు ఉత్పత్తి చేయగల సామర్థ్యానికి చేరుకుంది. అలా ప్రస్తుతం అతను నెలకు 12 లక్షల ఆదాయం చొప్పున ఏడాదికి ఏకంగా 1.44 కోట్లకు పైనే ఆర్జిస్తున్నాడు. కేవలం చిన్న వ్యాపార ప్రయోగంగా మొదలు పెట్టి..కోట్ల ఆదాయానికి చేరుకున్నాడు. అంతేగాదు ఇంటి మిద్దె నుంచి మొదలై..సొంతంగా ఫామ్‌ని నిర్మించుకునే రేంజ్‌కి వెళ్లాడు. అలాగే ఈ మైక్రోగ్రీన్స్ వ్యాపారంలోకి రావాలనుకునే రైతులకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు శిక్షణ కూడా ఇస్తున్నాడు. ఇక్కడ సాగు తోపాటు వాణిజ్యపరమైన అంశాలపై పట్టు సాధించడంతో విజయం సాధించగలిగాడు. అందుకని రైతులకు కూడా ఈ అంశాల్లో తర్ఫీదు పొందేలా సాయం చేస్తుంటాడు. కాగా మోహిత్ తన మైక్రోగ్రీన్ వ్యాపార సక్సెస్ జర్నీని నెట్టింట షేర్ చేసుకోవడంతో గొప్ప ప్రయాణం మిత్రమా..నిజంగా స్ఫూర్తిదాయకం అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు నెటిజన్లు.Meet Mohit Nijhawan, a https://t.co/BC6fLkcQNf Computer Science graduate. This guy left his 90 LPA corporate career to grow tiny greens. Today, he has built https://t.co/7yvufGmkSg, a ₹1.44 crore business with approximately ₹60 lakhs in profit annually.He walked away from a… pic.twitter.com/HI4OPKOm7l— Vikas Alwys (@VikasAlwys) September 5, 2026 (చదవండి: మేనకోడలు చిరుకోరికను తీర్చడం కోసం ఆ మామ ఏం చేశాడంటే..!) -
‘హనుమాన్ అంశ్’ కి తగ్గని క్రేజ్.. పంచెకట్టుతో విద్యార్థులు
బాలీవుడ్లో ఇటీవల విడుదలై అనూహ్య విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ‘హనుమాన్ అంశ్’ ఒకటి. పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకుల ఆదరణతో క్రమంగా వసూళ్లను పెంచుకుంటూ దూసుకెళ్లింది. ప్రస్తుతం రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబెట్టింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, హనుమాన్ భక్తుడు నీమ్ కరోలి బాబా జీవితం, ఆయన బోధనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు విశాల్ చతుర్వేది.ఎక్కువమంది చదివింది: స్నేహితులుగా ఎంట్రీ.. బిగ్‌బాస్‌లో ప్రత్యర్థులవుతారా..?సంప్రదాయ వస్త్రధారణలో అయితే ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు. తాజాగా ఈ సినిమాని చేసేందుకు ఓ పాఠశాల విద్యార్థులు ఢిల్లీలోని పీవీఆర్‌కు వెళ్లారు. సంప్రదాయ వస్త్రధారణలో పంచెకట్టుతో థియేటర్‌కు వెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఇటీవలే ఈ సినిమా కోసం పడిన కష్టాలను డైరెక్టర్ విశాల్ వివరించారు. సినిమా విడుదలైన సమయంలో షోలు, థియేటర్ల సంఖ్య భారీగా తగ్గిపోయిందని.. ఆ సమయంలో బాలీవుడ్ నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: ‘సినిమా హిట్ అయ్యాకే బాలీవుడ్ నన్ను గుర్తించింది’ हनुमान अंश ने सिनेमाघरों को सच में मंदिर बना दिया ❤️🚩PVR में गुरुकुल के युवा ब्रह्मचारियों ने जब #HanumanAnsh देखी, तो उनके चेहरों की चमक देखने लायक थी। 🙏यह सिर्फ फिल्म नहीं, हमारी संस्कृति, संस्कार और प्रभु हनुमान की भक्ति से जुड़ने का अनुभव है। 🇮🇳🚩#आ_गया_है_अवतार pic.twitter.com/fNVGglsGrh— Divya Singh (@DivyaSi51590883) September 7, 2026 -
‘పిచ్చి సినిమా అన్నవాల్లే చీఫ్ గెస్ట్లుగా వచ్చారు’
ఈవీవీ సత్యనారాయణ. ఈ పేరు తెలియని వారు ఉండరు. ఒకప్పుడు వినోదాత్మక చిత్రాలంటే గుర్తు వచ్చే మొదటి డైరెక్టర్ ఈయన. సినిమా చేసేందుకు వెళ్లిన ప్రేక్షకులకు చివరి వరకు కుర్చిలో కూర్చొపెట్టడంలో డైరెక్టర్ సత్యనారాయణకు వెన్నతో పెట్టిన విద్య. ఈయన తీసిన సినిమాలు అలాంటివి మరి. ‘ప్రేమ ఖైదీ’, ‘హలో బ్రదర్’, ‘అల్లుడా మజాకా’, ‘జంబలకిడి పంబ’, ‘కన్యాదానం’ వంటి మరెన్నో చిత్రాలు తీశారు. ‘జంబలకిడి పంబ’తో ఓ డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సాధించారు. అయితే ఈ మూవీ కోసం అల్లరి నరేష్ ఓ బ్రాడ్‌కాస్ట్‌లో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ఇదీ చదవండి: బిగ్‌బాస్ తొలి కంటెస్టెంట్.. రైతుబిడ్డ ఝాన్సీరివర్స్ గేర్‌గా ..‘జంబలకిడి పంబ కథను నాన్న అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడే రాసుకున్నారు. ఈ సినిమాని నరేశ్ గారిని హీరోగా పెట్టి తీశారు. అయితే కథ వినిపించినప్పుడు టైటిల్ పేరు ‘రివర్స్ గేర్’ అని ఫిక్స్ అయ్యారు. కథలో అంతా రివర్స్‌గా జరుగుతుంటది అని. రివర్స్ గేర్ అంటే బాగోదేమో, నెగెటివ్ టాక్ వెళ్తుంది అని నరేశ్‌గారు అభిప్రాయ పడ్డారు. తర్వాత మూవీ పేరుని ‘జంబలకిడి పంబ’గా ఫిక్స్ చేశారు. సగం చూసి వెళ్లిపోయారు..తర్వాత సినిమా కొనడానికి వచ్చే వాళ్లు మూవీ చూసి ఆడవాళ్లు మగాళ్లుగా అయిపోవడం ఏంటి.? అంతా డిఫరెంట్‌గా ఉందని.. ఇదోక పిచ్చి సినిమా అన్నారు. సినిమా సగం చేసే వెళ్లిపోయారు. అయితే సినిమాపై ఉన్న నమ్మకంతో నాన్న సొంతంగా రిలీజ్ చేశారు. ఇక్కడ క్రేజీ విషయం ఏంటంటే.. ఆ రోజు మధ్యలో వెళ్లిపోయిన వారినే 100 రోజల ఫంక్షన్‌కు చీఫ్ గెస్ట్లుగా వచ్చారు’ అని అల్లరి నరేశ్ తెలిపారు.ఇదీ చదవండి: ‘బిగ్‌బాస్’ కొత్త ఇల్లు సిద్ధం -
‘సినిమా హిట్ అయ్యాకే బాలీవుడ్ నన్ను గుర్తించింది’
బాలీవుడ్లో ఇటీవల విడుదలై అనూహ్య విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ‘హనుమాన్ అంశ్’ ఒకటి. పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకుల ఆదరణతో క్రమంగా వసూళ్లను పెంచుకుంటూ దూసుకెళ్లింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, హనుమాన్ భక్తుడు నీమ్ కరోలి బాబా జీవితం, ఆయన బోధనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు విశాల్ చతుర్వేది.ఈ సినిమా మంచి విజయం సాధించడంతో మొదట్లో ఈ సినిమా కోసం వచ్చిన కష్టాలను విశాల్ వివరించారు. సినిమా విడుదలైన సమయంలో షోలు, థియేటర్ల సంఖ్య భారీగా తగ్గిపోయిందని.. ఆ సమయంలో బాలీవుడ్ నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదని ఆయన పేర్కొన్నారు. 25 షోలకు పడిపోయాం‘ఆగస్టు 7న విడుదలైన ఈ చిత్రానికి తొలుత దేశవ్యాప్తంగా 350కిపైగా షోలు దొరికాయి. ఇతర భారీ చిత్రాల విడుదలతో ఈ సినిమా షోల సంఖ్య గణనీయంగా తగ్గింది. అయితే ప్రేక్షకులే ఈ సినిమాను నడిపించారు. పెద్ద సినిమాలు విడుదల కావడంతో మా షోలను థియేటర్లు తగ్గించాయి. ఒకానొక సందర్భంలో 250 షోల నుంచి 25 షోలకు పడిపోయాం. మల్టీప్లెక్స్‌లు కూడా ప్రధాన ప్రాంతాల్లో మా సినిమాను ప్రదర్శించేందుకు అంతగా ఆసక్తి చూపించలేదు’ అని విశాల్ తెలిపారు.ఇదీ చదవండి: ఎయిర్‌హోస్ట్ నుంచి హీరోయిన్గా.. ఇదే రాశీ సింగ్ సక్సెస్ జర్నీఆ పోస్టు ఇచ్చిన ధైర్యం..‘సాధారణంగా పోస్టులను పెద్దగా పట్టించుకోను. కానీ ఆ సమయంలో నా సినిమా ఆడలేదేమోనని లోలోపల బాధపడుతున్నా. అప్పుడు ఒక పోస్ట్ కనిపించింది. ‘నీ పని నువ్వు చేయి.. మిగతాది నేను చూసుకుంటాను’ అనే సందేశం ఉంది. మొదటి వారం చివర్లో ఆ మాటలు నన్ను ఎంతో ప్రోత్సహించాయి’ అని ఆయన గుర్తుచేసుకున్నారు.బాలీవుడ్ నుంచి సాయం..‘హనుమాన్ అంశ్’తో పాటు ‘అవారాపన్ 2’, ‘బత్వారా’ చిత్రాలు థియేటర్లలోకి వచ్చాయి. సినిమా కష్టాల్లో ఉన్న సమయంలో హిందీ చిత్ర పరిశ్రమ నుంచి తాను ఆశించినంత మద్దతు లభించలేదని విశాల్ అన్నారు. ‘సినిమా విజయవంతం అయిన తర్వాత చాలామంది నాకు ఫోన్ చేసి అభినందించారు. కాగా రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం రూ.75 కోట్ల వసూళ్లకు చేరువలో ఉందని విశాల్ తెలిపారు. త్వరలోనే అంతర్జాతీయ స్థాయిలోనూ సినిమాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.ఇదీ చదవండి: ఓటీటీలు సోమరిపోతుల కోసమే: నటుడు శివాజీ -
కృష్ణాష్టమి స్పెషల్.. అనుసూయ డ్యాన్స్ వైరల్
నిత్యం సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే యాంకర్ అనసూయ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఓ ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. తులసి కోమలవేణి అనే కన్నడ భక్తి పాటకు నృత్యం చేసి వీడియోను షేర్ చేశారు. కృష్ణుడుకి అంతా తెలుసు. నాకు అది చాలు అనే క్యాప్షన్‌ను చివర్లో జోడించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
అలాంటి సినిమాల విషయంలో తాప్సీ సంచలన నిర్ణయం
కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి తాప్సీ పన్ను. ప్రస్తుతం ‘గాంధారి’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇటీవల కాలంలో వస్తున్న హింస, షాక్ వాల్యూతో కూడిన భారీ చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘2015లో వచ్చిన సినిమాలను చూస్తే అది ఒక కలల కాలంలా అనిపిస్తోంది. ఒకవేళ ఇప్పుడు కెరీర్ ప్రారంభించి ఉంటే.. నాకు అసలు కెరీర్ ఉండేది కాదు. ఇప్పుడు వస్తున్న చిత్రాలు అలా ఉన్నాయి. అప్పట్లో నచ్చిన చిత్రాలు చేసే అదృష్టం రావడం చాలా సంతోషంగా ఉంది. కొద్ది రోజుల కిందట ఫ్యామిలీతో ఓ సినిమా చూశాను. తర్వాత నేను సినిమాల నుంచి తప్పుకుంటేనే మంచిదేమో అనిపించింది. ఎందుకంటే అలాంటి సినిమాలు చేయడం కంటే రిటైర్ అవ్వడమే మేలు. అని తెలిపారు.ఇదీ చదవండి: బిగ్‌బాస్ చరిత్రలోనే అత్యధిక రెమ్యునరేషన్ ఈమెదే.. ఎంతంటే..?నచ్చని సినిమాలు చేయలేను..‘ నా వృత్తి అంటే చాలా ఇష్టం. కానీ అదే పనిని గుడ్డిగా ప్రేమిస్తూ.. నచ్చని సినిమాలు చేయలేను. మనం చేసిన సినిమాలే ఫిల్మోగ్రఫీని నిర్ణయిస్తాయి. కాలం మారుతుంది. పదేళ్ల తర్వాత ఏదో ఒక కొత్త జానర్ రావచ్చు. కానీ చేసిన సినిమాలు మాత్రం అలాగే ఉంటాయి. ఎవరైనా భవిష్యత్తులో నా ఫిల్మోగ్రఫీని చూస్తే.. చేసిన సినిమాల గురించి నాకు కానీ, నాతో కలిసి పనిచేసిన వారికి కానీ ఇబ్బందిగా అనిపించకూడదు. అందుకే ప్రస్తుత ట్రెండ్ కంటే నా ఫిల్మోగ్రఫీకే నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను’ అని తాప్సీ పేర్కొన్నారు.‘గాంధారి’తో మరోసారి..తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన ‘గాంధారి’కి దేవాశిష్ మఖీజా దర్శకత్వం వహించారు. కనికా ధిల్లాన్ కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు నిర్మించారు. జాయ్‌పుర్రా అనే కల్పిత పట్టణం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో.. తన కుమార్తె అదృశ్యమైన తర్వాత ఓ అంధ తల్లి సాగించే పోరాటం ఆధారంగా తీర్చిదిద్దారు. ఇష్వాక్ సింగ్, జతిన్ సర్నా, స్వస్తికా ముఖర్జీ, మితా వశిష్ఠ్, ఛాయా కదమ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈరోజు (సెప్టెంబర్ 3) నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఇదీ చదవండి: శ్రీకృష్ణుడిగా రామ్ చరణ్.. అంత పెద్ద రిస్క్ చేస్తాడా? -
నెలకు రూ.2 లక్షల జీతం చాలా డేంజర్ అంటున్న టెకీ..
నెలకు రూ.2 లక్షల జీతం వస్తే.. ఇంకేం కావాలి.. ఇక జీవితానికి తిరుగులేదని చాలామంది భావిస్తారు. కానీ బెంగళూరుకు చెందిన టెక్ ప్రొఫెషనల్ శశాంక్ దీక్షిత్ మాత్రం ఇదే ఆదాయం ఒక దశలో కెరీర్‌కు ‘డేంజర్’గా మారొచ్చంటున్నారు. ఆయన చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం ఉద్యోగ నెటిజన్లలో విస్తృత చర్చకు దారితీసింది.జీతం ఎక్కువ కావడం సమస్య కాదు..శశాంక్ దీక్షిత్ వాదన ప్రకారం.. నెలకు రూ.2 లక్షలు సంపాదించడం ప్రమాదకరమని చెప్పడానికి కారణం ఆ మొత్తం ఎక్కువగా ఉండటం కాదు. ‘జస్ట్ ఎనఫ్’గా అనిపించడం అసలు సమస్య. ఈ స్థాయి ఆదాయం ఒక వ్యక్తికి మంచి జీవనశైలిని అందించడంతో పాటు, ప్రస్తుత ఉద్యోగం, కెరీర్ గురించి కొత్తగా ఆలోచించాల్సిన అవసరం లేదనే భావనను కలిగించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.తల్లిదండ్రులకు ‘బాగానే సంపాదిస్తున్నా’ అని చెప్పడానికి, వారాంతాల్లో హాయిగా గడపడానికి, రోజువారీ ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఈ ఆదాయం సరిపోతుందని ఆయన పేర్కొన్నారు. దీంతో ఒక దశలో ఉద్యోగి తన సామర్థ్యాన్ని పెంచుకోవడం కంటే.. ప్రస్తుత జీతాన్ని కాపాడుకోవడంపైనే ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉందని వివరించారు.జీతమే గుర్తింపుగా మారితే..దీక్షిత్ చెప్పిన మరో కీలక అంశం ‘కంఫర్ట్ జోన్’. మంచి జీతం, సౌకర్యవంతమైన జీవితం అలవాటైన తర్వాత ఉద్యోగం వదిలి స్టార్టప్ ప్రారంభించడం, కెరీర్ మార్చుకోవడం లేదా తక్కువ జీతంతో కొత్త అవకాశాన్ని ఎంచుకోవడం రిస్క్‌గా కనిపిస్తుంది.‘ఇప్పటికే కోల్పోవడానికి ఏదో ఉంది’ అనే ఆలోచన అక్కడ మొదలవుతుందని ఆయన అంటున్నారు. ఫలితంగా ఒకప్పుడు చేయాలనుకున్న పనులను ‘వచ్చే నెల’, ‘వచ్చే ఏడాది’ అంటూ వాయిదా వేసుకుంటూ వెళ్లే పరిస్థితి ఏర్పడవచ్చని హెచ్చరించారు. చివరకు ఆశయం పోయిందని కాదు.. దాన్ని పట్టించుకోనంతగా సంపాదించడం మొదలుపెట్టామని గ్రహించే పరిస్థితి రావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలుదీక్షిత్ పోస్ట్‌కు పలువురు ఉద్యోగులు మద్దతు తెలిపారు. మంచి జీతం కొన్నిసార్లు ‘బంగారు పంజరం’లా మారుతుందని, సౌకర్యాన్ని వదులుకోవడం కష్టమవుతుందని కొందరు తమ అనుభవాలను పంచుకున్నారు. మరికొందరు మాత్రం రూ.2 లక్షల జీతాన్ని సమస్యగా చూడటం సరికాదని అన్నారు.ఇదీ చదవండి: యాపిల్ కొత్త సీఈవో వచ్చేశారు.. ఎంత భారీ జీతమో తెలుసా?ఒక యూజర్ ప్రకారం.. అసలు ప్రమాదం రూ.2 లక్షల ఆదాయం కాదు; నెలకు రూ.2 లక్షలు ఖర్చు చేసే జీవనశైలి ఏర్పడటమే. ఆదాయం పెరిగిన కొద్దీ ఖర్చులు, రుణాలు, కుటుంబ బాధ్యతలు పెరిగితే ఉద్యోగాన్ని వదిలే స్వేచ్ఛ తగ్గిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు, ఇదే సమస్య అధిక ఆదాయం ఉన్నవారికీ ఎదురవుతుందని మరొకరు వ్యాఖ్యానించారు.₹2L/month is the most dangerous number Not because it's too little, because it's just enough, Just Enough !!!Enough to stop asking questionsEnough to tell your parents you're doing wellEnough to enjoy weekendsSlowly, your salary becomes your identity, You focus on… pic.twitter.com/kJYTuEGYCY— Shashank Dixit (@ShashankDixit_x) September 1, 2026 -
‘డాడీ గుర్తొస్తున్నావ్..’.. కన్నీటితో తడిపేస్తున్న ఇన్‌స్టా పోస్ట్!
అర్ధరాత్రి వేళ కుమార్తె పంపిన ఆ సందేశం చూసి, ఆమె తండ్రి ఏకంగా 14 గంటల పాటు ప్రయాణించి, ఆమె దగ్గరకు చేరుకున్న ఘటన సామాజిక మాధ్యమాల్లో అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ‘ఆపిల్.కైవల్య’ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ తన తండ్రి ముకేశ్ హీరో తనపై చూపిన అనురాగాన్ని వీడియో రూపంలో పంచుకున్నారు.రాత్రి సుమారు 1:50 గంటల సమయంలో ఆమె తన తండ్రికి ‘డాడీ చాలా గుర్తొస్తున్నావ్’ అంటూ ఓ సందేశం పంపారు. కుమార్తె నుంచి వచ్చిన ఆ ఒక్క మాటే ఆయనను వెంటనే ప్రయాణానికి పురికొల్పింది. మరుసటి రోజు ఉదయం ఆమె తలుపు తీసి చూసేసరికి, వీపున బ్యాగ్‌తో తండ్రి గుమ్మం ముందు నిల్చుని కనిపించారు. కేవలం ఎనిమిది గంటల పాటు కుమార్తెతో గడపడం కోసం ఆయన 14 గంటల పాటు ప్రయాణించి వచ్చారు. ఆయన తిరిగి తాను ఉండే చోటుకు వెళ్లడానికీ మరో 14 గంటల సమయం పడుతుంది.ఆ కొద్దిపాటి సమయంలోనే ఆ తండ్రీకూతుళ్లు ఎంతో విలువైన క్షణాలను పంచుకున్నారు. ఆమెతో కలిసి బైక్ రైడ్‌కు వెళ్తూనే ఆయన ఆఫీస్ ఫోన్ కాల్స్ మాట్లాడారు. వినోద కేంద్రానికి వెళ్లి సరదాగా సమయం గడిపారు. అనంతరం రెస్టారెంట్లో భోజనం చేశారు. కేవలం బయటకు వెళ్లడమే కాకుండా, కుమార్తె వంటగదిలోని గిన్నెలు కడగడం సహా పలు చిన్నపాటి పనులను ఆయనే స్వయంగా చేసిపెట్టారు.ఈ వీడియోను పంచుకుంటూ.. ‘నిన్ను చూడాలని ఉందని చెప్పాను.. వెంటనే వచ్చేశారు. 14 గంటల ప్రయాణం, ఒక్క రోజు కలయిక, అడగకుండానే చేసిపెట్టిన ఎన్నో పనులు’ అని ఆ యువతి రాసుకొచ్చారు. తల్లిదండ్రులు తమ మాటల్లో ఎప్పుడూ తోడుంటామని చెప్పకపోవచ్చు కానీ, చేతల్లో ఆ ప్రేమను చాటుతారని ఆమె భావోద్వేగంతో వివరించారు. అనంతరం ఆయన స్లీపర్ బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. మాటల కంటే చేతలే గొప్పవని నిరూపించిన ఈ వీడియో నెటిజన్ల మనసులను అమితంగా హత్తుకుంటోంది.ఇది కూడా చదవండి: ఆ ముగ్గురిలో అయోధ్య సీఈవో.. నేడు వెల్లడి? -
‘అప్పట్లో నాకు చాలా గర్వం.. ఇలా ఉంటే ఇండస్ట్రీలో కష్టమన్నారు’
ఒకప్పుడు తన అందం, గ్లామర్‌తో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక నమిత. స్టార్ హీరోల సరసన నటిస్తూ వరుస విజయాలు అందుకున్న ఆమె.. కెరీర్ మొదట్లో తన ప్రవర్తన ఎలా ఉండేదో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇప్పుడీ ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.ఎం చెప్పారంటే..‘నటిగా కెరీర్ ప్రారంభించిన తొలిరోజుల్లో నాలో చాలా గర్వం ఉండేది. ఎవరినీ లెక్క చేసేదాన్ని కాదు. అయితే ఓ సందర్భంలో కొంతమంది నన్ను హెచ్చరించారు. ‘నువ్వు ఇలాగే ప్రవర్తిస్తే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండలేవు. ఇలా ఉండటం మంచిది కాదు’ అని చెప్పారు. ఆ మాటలు నాపై చాలా ప్రభావం చూపించాయి. ఆ తర్వాత నెమ్మదిగా నా ప్రవర్తనను మార్చుకున్నాను’ అని నమిత తెలిపారు. తన వల్ల తోటి నటులు, టెక్నీషియన్లు, జూనియర్ ఆర్టిస్టులు ఇబ్బంది పడిన విషయాన్ని కూడా ఆమె గుర్తుచేసుకున్నారు. ‘నా ప్రవర్తన కారణంగా చాలామంది ఇబ్బంది పడ్డారు. ఈ విషయం నాకు చాలా మంది చెప్పారు. ఆ తర్వాత నా తప్పును అర్థం చేసుకుని నన్ను నేను మార్చుకున్నాను’ అని నమిత పేర్కొన్నారు.ఎక్కువ మంది చదివింది: ‘కల్కి2’పై బిగ్ అప్డేట్..!17 ఏళ్ల వయసులో..17 ఏళ్ల వయసులో మిస్ సూరత్‌గా ఎంపికన నిమితను ఈ తర్వాత మిస్ ఇండియా పోటీల్లో థర్డ్ రన్నరప్‌గా నిలిచారు. ఆ తర్వాత సినిమా అవకాశాలు రావడంతో దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘సొంతం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత పలు తెలుగు చిత్రాల్లో నటించి ‘బిల్లా’, ‘సింహా’వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బొట్టు అనే చిత్రంలో నటించి చివరిగా తెలుగు ప్రేక్షకులకు కనిపించారు. 2017లో తమిళ బిగ్‌బాస్ రియాల్టీ షోలో పాల్గొన్నారు. తర్వాత రాజకీయాల్లోనూ అడుగు పెట్టారు.ఇదీ చదవండి: నాకూ బ్రేకప్ అయింది: విజయ్ దేవరకొండ -
మంగాయమ్మ కథ మళ్లీ తెరపైకి.. అసలు కారణమిదే!
లేటు వయసులో కవలలకు జన్మనిచ్చి అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మంగాయమ్మ పేరు మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాత విషయమే కదా.. ఇప్పుడెందుకు తెర మీదకు వచ్చింది? అని చాలామంది అనుకుంటున్నారు. ఏడేళ్ల తర్వాత ఆమె కథ గుర్తు చేసుకోవడానికి ఓ ప్రత్యేక కారణం లేకపోలేదు. ఆ కవల పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారు? తల్లి వయసు పెరుగుతున్న నేపథ్యంలో వారి భవిష్యత్తు ఎలా ఉండబోతోందన్న చర్చే ఇందుకు కారణంగా మారింది.2019లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంగాయమ్మ, ఆమె భర్త రాజారావు ఐవీఎఫ్ ద్వారా కవలలకు తల్లిదండ్రులయ్యారు. దాదాపు ఆరు దశాబ్దాల వైవాహిక జీవితం తర్వాత వారికి సంతానం కలగడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. డోనర్ అండాన్ని ఉపయోగించి, రాజారావు స్పెర్మ్‌తో ఐవీఎఫ్ చికిత్స నిర్వహించారు. అనంతరం సిజేరియన్ ద్వారా మంగాయమ్మ ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చారు. వారికి రమా తులసి, ఉమా తులసి అని పేర్లు పెట్టారు. అలా వాళ్ల కథ దేశవ్యాప్తంగా ఆ టైంలో వైరల్ అయ్యింది.57 ఏళ్ల నిరీక్షణ తర్వాత..మంగాయమ్మకు 1962లో రాజారావుతో వివాహమైంది. ఎన్నో ఏళ్లుగా సంతానం కోసం ఎదురుచూశారు. అన్ని ప్రయత్నాలు చేశారు. చివరకు ఈ దంపతులు ఐవీఎఫ్ ద్వారా పిల్లలను కనాలని నిర్ణయించుకున్నారు. 2019లో వైద్యుల పర్యవేక్షణలో ఐవీఎఫ్ చికిత్స చేయించుకోగా.. తొలి ప్రయత్నంలోనే గర్భం దాల్చారు. మెనోపాజ్ దశ దాటిపోవడంతో.. డోనర్ అండాన్ని రాజారావు వీర్యంతో ఫలదీకరించి ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా గర్భధారణ చేశారు.ఆ వయసులో తల్లి కావడం సంచలనం..విదేశాల్లో ఇలాంటివి సహజమే కావొచ్చేమో!. కానీ, మన మంగాయమ్మ 74 ఏళ్ల వయసులో పిల్లలకు జన్మనివ్వడం దేశంలో పెద్ద చర్చకే దారితీసింది. వయసు కారణంగా సహజంగా గర్భం దాల్చే అవకాశం లేకపోవడంతో ఐవీఎఫ్ పద్ధతిని ఆశ్రయించారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగి చివరకు కవలలు జన్మించారు. దీంతో వృద్ధాప్యంలో మాతృత్వంపై వైద్య, సామాజిక, నైతిక అంశాలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.ఏడాదికే భర్త మృతిఅయితే మంగాయమ్మ కుటుంబంలో ఆనందం ఎక్కువకాలం నిలవలేదు. కవలలు జన్మించిన మరుసటి ఏడాదే ఆమె భర్త రాజారావు గుండెపోటుతో కన్నుమూశారు. అప్పటికి ఆయన వయసు 84 ఏళ్లు. దీంతో ఇద్దరు చిన్నారుల బాధ్యత పూర్తిగా మంగాయమ్మపై పడింది. భర్తను కోల్పోయిన తర్వాత కూడా ఆమె తన పిల్లలను చూసుకుంటూ వారి పెంపకాన్ని కొనసాగించారు.74-year-old Andhra woman had twins through IVF😮 pic.twitter.com/WBXKsnc5Wv— Vije (@vijeshetty) August 31, 2026ఇప్పుడు ఏడేళ్ల వయసు..2019లో జన్మించిన రమా తులసి, ఉమా తులసి ప్రస్తుతం ఏడేళ్ల వయసులో ఉన్నారు. మంగాయమ్మ వయసు మాత్రం ఇప్పుడు 80 ఏళ్లకు చేరువైంది. ఈ నేపథ్యంలో తల్లి వయసు పెరుగుతున్న కొద్దీ పిల్లల భవిష్యత్తు, సంరక్షణ ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలు తాజాగా తెరపైకి వస్తున్నాయి. వాళ్లు ఇప్పుడు ఎలా ఉన్నారు? అనే ప్రశ్నతో.. ఇదే అంశం పాత కథనాలను, అప్పటి ఫొటోలను సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అయ్యేలా చేసింది.అప్పట్లోనూ విమర్శలు..వృద్ధాప్యంలో ఐవీఎఫ్ ద్వారా పిల్లలను కనడంపై అప్పట్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఒకవైపు ఎన్నో ఏళ్ల కలను దంపతులు నెరవేర్చుకున్నారంటూ పలువురు అభినందించగా.. మరోవైపు తల్లిదండ్రుల అధిక వయసు కారణంగా పిల్లల భవిష్యత్తు, ఆరోగ్యం, సంరక్షణ వంటి అంశాలపై ప్రశ్నలు తలెత్తాయి.ఇప్పుడు వయసుపై చర్చ ఎందుకు?భారత్‌లో సహాయక పునరుత్పత్తి సాంకేతికతకు సంబంధించిన నిబంధనలు కూడా ఈ చర్చకు మరో కోణాన్ని తీసుకొచ్చాయి. 2021లో వచ్చిన చట్టం ప్రకారం ఐవీఎఫ్ సేవలకు మహిళల వయసుపై పరిమితులు విధించారు. దీంతో మంగాయమ్మ అంత వయసులో ఐవీఎఫ్ ద్వారా తల్లి అయిన ఘటన అప్పటి నిబంధనల నేపథ్యంలోనూ ప్రత్యేకంగా నిలిచింది.మొత్తంగా.. ఆలస్యంగానైనా తల్లైన మంగాయమ్మ కథ ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నది కేవలం ఆమె రికార్డు కోసం కాదు. ఏడేళ్ల వయసుకు చేరుకున్న ఆమె కవలల భవిష్యత్తు, వృద్ధాప్యంలో తల్లిదండ్రులుగా మారడంపై అప్పట్లో మొదలైన చర్చ మళ్లీ తెరపైకి రావడమే తాజా వైరల్‌కు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.ఇదీ చదవండి: ఆ కుటుంబాన్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు! -
అందుకే ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్స్క్రిప్షన్ పెట్టా..!
తెలుగు చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి విష్ణుప్రియ. సోషల్ మీడియాలోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. త్వరలో ‘రంభ ఊర్వశి మేనక’ సినిమాతో ప్రేక్షకులకు కనిపించనుంది విష్ణుప్రియ. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌లో పాల్గొన్న విష్ణుప్రియ ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్, సోషల్ మీడియా ద్వారా వచ్చే ఆదాయం కోసం వెల్లడించారు. షోలో కంటే ఇక్కడే ఎక్కువ..‘షోల కంటే, మూవీస్ కంటే కూడా విష్ణుప్రియ సోషల్ మీడియా ద్వారానే ఎక్కువ సంపాదిస్తోంది’ అనే ప్రచారంపై ఆమె క్లారిటీ ఇచ్చారు. ఇది తన ఒక్కరి విషయంలోనే కాదని.. చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా డబ్బులు ఎక్కువ అర్జిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా బ్రాండ్ ప్రమోషన్స్, సోషల్ మీడియా ద్వారా వచ్చే ప్రాజెక్టుల నుంచి రెమ్యునరేషన్ గణనీయంగా ఉంటుందని చెప్పారు. ఇది అదృష్టంగా భావిస్తున్నా..‘టీవీలో రెండు ఎపిసోడ్లకు వచ్చే పారితోషికం కంటే సోషల్ మీడియాలో ఒక్క ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుంది. అక్కడ పడే కష్టానికి.. ఇలా ప్రతిఫలం ఉంటుంది. అయితే చాలామందిలో టాలెంట్ ఉన్నప్పటికీ సరైన అవకాశాలు రావడం లేదు. నా విషయంలో మాత్రం ఫోన్ ప్రతిరోజూ అవకాశాల కోసం మోగుతూనే ఉంటుంది. ఇది అదృష్టంగా భావిస్తున్నా’ అని విష్టప్రియ తెలిపింది.ఎక్కువ మంది చదివింది: చిన్నారులే.. కానీ రెమ్యునరేషన్లో తోపులు.. ఎవరికి ఎంతంటే?ఇన్‌స్టాగ్రామ్‌లో సంపాదన ఎంత? విష్టుప్రియ ఇన్స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్‌తో బాగానే సంపాదిస్తోందిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం సబ్స్క్రిప్షన్ తీసుకున్నవాళ్లు 4728 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఒక నెలకి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే రూ.390లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన మొత్తం సుమారు.రూ.18లక్షల పైనే సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవి కాకుండా బ్రాండ్ ప్రమోషన్స్, సోషల్ మీడియా ద్వారా వచ్చే ప్రాజెక్టులు ద్వారా కూడా అదనంగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం.సినిమా విషయానికి వస్తే..అల్లరి నరేష్ హీరోగా వస్తోన్న లేటేస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’. ఈ సినిమాకు చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహించారు. సురభి హీరోయిన్. ఈ చిత్రం సెప్టెంబర్ 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్– హాస్య మూవీస్ బ్యానర్స్‌పై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతమందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంది. ఇటీవలే విడుదలైన సాంగ్‌లో అల్లరి నరేశ్‌తో కలిసి రాశీ సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్‌లు చిందులేశారు. నరేష్ వీకే, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఇదీ చదవండి: గణేశుడిని ఇంట్లోనే నిమర్జనం.. ఆపై మొక్కగా.. -
గణేశుడిని ఇంట్లోనే నిమర్జనం.. ఆపై మొక్కగా..
వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు మరో వినూత్న కార్యక్రమం ముందడుగు పడింది. ప్రకృతిపై బాధ్యతను చాటేలా రూపొందించిన ‘సీడ్ గణేశ’ ప్రచారాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’కు సంబంధించిన ప్రతినిధులు మద్దతు తెలిపారు.(ఎక్కువ మంది చదవింది: ఇదో కొత్త అనుభూతి.. ‘టాక్సిక్’పై స్టార్‌హీరోల ప్రశంసలు)భక్తితో పాటు ప్రకృతి పరిరక్షణకెమెకిల్స్తో కూడిన కలర్స్‌తో వినాయకుడి విగ్రహాలను నిమర్జనం చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతినండంతో పాటు పర్యావరణానికి తీవ్ర ఆటంకం కలుగుతోంది. దీంతో నా మిత్రుడు తెలంగాణ మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ఆలోచన మేరకు సహజ పదార్థాలు, విత్తనాలతో ‘సీడ్ గణేశ’ విగ్రహాలను రూపొందించారు. పూజ అనంతరం ఈ విగ్రహాన్ని ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు. అనంతరం సరైన విధంగా నీరు పోస్తూ సంరక్షిస్తే.. అందులోని విత్తనాలు మొలకెత్తి మొక్కగా ఎదుగుతాయి. ఇలా వినాయకుడిని పూజించడంతో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు’ అని ఈ విగ్రహాల ప్రాముఖ్యతను చిరంజీవి వివరించారు.చిరంజీవికి కృతజ్ఞతలు‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ను అభినందిస్తూ, ‘సీడ్ గణేశ’ కార్యక్రమానికి మద్దతు తెలిపిన చిరంజీవికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ప్రోత్సాహకరమైన మాటలు మరింత మందిని పర్యావరణహితమైన వినాయక చవితి వేడుకల వైపు నడిపిస్తాయని పేర్కొన్నారు. వినాయకుడి ఆశీస్సులు పొందుతూనే.. ప్రకృతి పరిరక్షణను మన బాధ్యతగా గుర్తించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ‘గణేశుడిని పూజిద్దాం.. మొక్కను పెంచుదాం.. ప్రకృతిని కాపాడుదాం’ అనే సందేశంతో ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.This Ganesh Chaturthi, I am happy to have Megastar Chiranjeevi garu unveil and launch the #SeedGanesha campaign. 🙏Seed Ganesha is a small effort to bring together devotion and care for nature. Made with natural materials and seeds, the idol can be immersed at home after the… pic.twitter.com/iFcpX8D6En— Santosh Kumar J (@SantoshKumarBRS) August 31, 2026ఇదీ చదవండి: ‘నాతో సినిమా చేయడానికి పొలం అమ్మేశారు’ -
65 ఏళ్ల వయసులో టిఫిన్ సర్వీస్! ఇవాళ ఏకంగా రూ. 2.5 కోట్లు..
జీవితంలో ఏ దశలో ఉన్నా సరే కొత్తగా ఏదైనా చేయాలనే సంకల్పం ఉంటే..ఏవిధంగానైనా ముందుకు సాగిపోగలం అనే మాటకు నిలువెత్తు నిదర్శనం ఆమె. శరీరానికి వయసు తప్ప మనసుకి కాదు..యువకులకు తీసిపోని విధంగా కష్టపడగలమని నిరూపించి సంశయంతో కాలక్షేపం చేస్తున్న తన ఏజ్వాళ్లకు, యువతకు స్ఫూర్తిగా నిలిచింది. వాస్తవంగా ఆరుపదుల వయసులో కాళ్ల నొప్పులు, చేతుల నొప్పులు అని బాధపడుతుంటారు. కానీ ఆ వయసులో తనకంటూ ఓ గుర్తింపు కోసం ఆరాటపడుతూ..చిన్నాగా ఏదైనా చేయాలనుకోవడమే విశేషం అనుకుంటే..ఏకంగా శారీరక శ్రమతో కూడిన ఆహార వ్యాపారం చేయాలనుకోవడం అతిపెద్ద సాహసం. నీ వల్ల కాదు అన్న వాళ్లే విస్తుపోయేలా సక్సెస్ అందుకుని ముందుకు సాగిపోతోంది ఈ బామ్మ. ఆ బామ్మే పాట్నాకు చెందిన దేవ్నీ దేవి. 65 ఏళ్ల వయస్సులో తనకంటూ గుర్తింపు వచ్చేలా ఏదైనా చేయాలని అనిపించిందామెకు. బాధ్యతలు తీరిన సమయంలో కాయకష్టం చేసే పనివైపుకి మళ్లిందామె. చిన్న ఆలోచనతో మొదలైన చిన్న స్టార్లప్ లాంటి వ్యాపారం ఆమెది. ముందుగా ఇంట్లో వండిన సాధారణ భోజనాన్ని రూ. 20లకే విక్రయించే చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకుంది. చిన్నగా ప్రారంభమైన ఆమె టిఫిన్ సెంటర్ కాస్తా..అనతి కాలంలోనే విశేష ఆధరణ లభించి, ఎక్కువ ఆర్డర్లు రావడం మొదలైంది. అంతేగాదు ఆమె చేతి రుచి భోజనప్రియుల మనసుని గెలుచుకుంది. దాంతో చూస్తుండగానే చిన్న వ్యాపారం కాస్తా..రుచికి నమ్మకమైన పేరుగా గుర్తింపు తెచ్చుకుని రూ. 2.5 కోట్ల ఆహార వ్యాపారంగా మారింది. దేవ్నీ దేవి ఈ వ్యాపారం చేయాలనుకునే నిర్ణయానికి కుటుంబం నుంచి, బంధువుల నుంచి ఎలాంటి మద్దతు లేకపోయినా..కఠిన శ్రమ, ఓర్పుతో విజయం సాధించి చూపారామె. నాణ్యత, రుచిలో రాజీపడకుండా ఎంతో శ్రద్ధతో తాజగా వండిన భోజనం అందించి కార్మికులు, విద్యార్థులు, కుటుంబాల నమ్మకాన్ని గెలుచుకుంది. అది కూడా సరసమైన ధరలో మంచి భోజనం అందించే టిపిన్ సెంటర్‌గా పేరుతెచ్చుకునేలా కష్టపడింది. ఆ శ్రమకు తగిన గుర్తింపు లభించేలా పెద్ద ఆహార వ్యాపారంగా విస్తరించింది. అంతేగాదు క్యాటరింగ్ సేవలను ప్రారంభించి, ఎక్కువమందికి తన సర్వీస్‌ని అందించేలా రెస్టారెంట్‌ను కూడా తెరిచారామె. ఆరోజు ఈ వయసులోనా అని ముఖం చిట్లించిన వాళ్లే సిగ్గుపడేలా ఉవ్వెత్తున ఎగిసిపడేలా అందనంత ఎత్తుకు ఎదిగింది. కొత్తగా ఏ పని చేయాలన్న లేదా ప్రారంభించి విజయం సాధించడానికి వయసు ఎప్పటికీ అడ్డంకి కాదు..అది మీ మనస్సులోని సంకల్పం ముందు నిలువదు అని చెప్పే స్ఫూర్తిదాయక కథ. దైర్యం, ఓర్పు, నిరంత కృషి ఉన్నవాళ్లకి అపజయం అన్నదే కలగదు అనే మాటకు దేవ్నీ దేవి కథే ఓ ఉదాహరణ. View this post on Instagram A post shared by startup universe (@startup_universe) (చదవండి: అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్యంగా చాక్లెట్లు..!) -
నేపాల్: లక్కీ హౌస్ వెనక.. అసలు కథ ఇదే!
నేపాల్ వరద బీభత్సంలో.. ఓ ఆకుపచ్చ ఇల్లు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. చుట్టూ ఉన్న ఇళ్లు, నిర్మాణాలు భారీ వరద ప్రవాహానికి కొట్టుకుపోతున్నా.. ఈ ఇల్లు మాత్రం మొండిగా నిలబడింది. ఇంటి చుట్టూ నీరు, బురద, భారీ బండరాళ్లు దూసుకొస్తున్నా.. బాల్కనీలో చిక్కుకున్న కుటుంబం సైతం సురక్షితంగా బయటపడింది. దీంతో ‘ఈ ఇంటిని కట్టిన ఇంజనీర్ ఎవరు? ఇంతటి వరదను ఇది ఎలా తట్టుకుంది?’ అనే చర్చ మొదలైంది.నేపాల్‌లోని హిమాలయ లోయల్లో ఆగస్టు 26న ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. భారీ నీటితో పాటు బురద, బండరాళ్లు, చెట్ల దుంగలు ఒక్కసారిగా దిగువ ప్రాంతాల వైపు దూసుకొచ్చాయి. మార్గంలో కనిపించిన ఇళ్లు, వంతెనలు, రహదారులను ధ్వంసం చేశాయి. ఈ విధ్వంసానికి సంబంధించిన వీడియోల్లో మాత్రం ఓ ఆకుపచ్చ ఇల్లు ప్రత్యేకంగా కనిపించింది. వరద నీరు ఆ ఇంటిని దాదాపు చుట్టుముట్టింది. చుట్టుపక్కల ప్రాంతం మొత్తం బురద, శిథిలాలతో నిండిపోయింది. అయినప్పటికీ ఇంటి నిర్మాణం కూలిపోలేదు. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు బాల్కనీలోకి చేరి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. చివరకు వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.అసలు కారణం ఇదే.. ఈ ఇల్లు అక్కడి ఇతర నిర్మాణాలతో పోలిస్తే భిన్నంగా ఉండటమే ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. హిమాలయ ప్రాంతాల్లో అనేక ఇళ్లు రాళ్లతో నిర్మిస్తారు. ఇవి ఇంటిపై పడే నిలువు బరువును తట్టుకోగలిగినా.. వరద నీరు అడ్డంగా ఢీకొన్నప్పుడు ఏర్పడే భారీ ఒత్తిడిని తట్టుకోవడం కష్టం. కానీ వైరల్‌గా మారిన ఇంటికి రీన్ఫోర్స్డ్ కాంక్రీట్ (RCC) ఫ్రేమ్ ఉన్నట్లు నిర్మాణ నిపుణుల విశ్లేషణలో తేలింది. పిల్లర్లు, బీములు, పునాదులను స్టీల్ రాడ్లతో అనుసంధానించడంతో మొత్తం నిర్మాణం ఒక బలమైన ఫ్రేమ్‌లా పనిచేసింది. వరద నీరు, బురద, రాళ్లు ఢీకొన్నప్పుడు ఏర్పడిన అడ్డదిశ ఒత్తిడిని ఈ ఫ్రేమ్ కొంత మేర గ్రహించి పునాది వైపు మళ్లించింది.Good News,Dear citizens of world,All those were praying and worried about what happened to people in the Green House during the catastrophic Nepal FloodsThe family and house survived the ordeal. pic.twitter.com/iElo4qXvBL— Woke Eminent (@WokePandemic) August 28, 2026ఇంజినీరింగ్ ఒక్కటే కాదు.. అదృష్టం కూడా!అయితే ఇంటి నిర్మాణమే దాన్ని కాపాడిన ఏకైక కారణం కాదు. వరద ప్రవాహం నేరుగా ఇంటిని ఢీకొనకపోవడం కూడా అత్యంత కీలకంగా మారింది. భారీ బండరాళ్లు, చెట్లు, మట్టి కలిసిన ప్రవాహంలో అత్యంత బరువైన శిథిలాలు సాధారణంగా ప్రధాన ప్రవాహ మార్గంలోనే దూసుకుపోతాయి. ఈ ఇల్లు ఆ ప్రధాన ప్రవాహ మార్గానికి కొద్దిగా పక్కన, కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉంది. దీంతో వరద శక్తిలో కొంత భాగం ఇంటిని నేరుగా ఢీకొట్టకుండా ఇరువైపులా విడిపోయి వెళ్లింది.ఇంటి ఆకారం కూడా ప్లస్ పాయింట్ఇంటి కాంపాక్ట్ ఆకారం కూడా వరద ప్రవాహాన్ని మళ్లించడంలో సహాయపడినట్లు నిపుణులు చెబుతున్నారు. నీరు నేరుగా ఇంటి గోడను ఢీకొని అక్కడే నిలిచిపోకుండా.. ఇరువైపులా ప్రవహించే అవకాశం ఏర్పడింది. వరదతో వచ్చిన బురద ఇంటి చుట్టూ పేరుకుపోవడం కూడా మరో రక్షణగా మారింది. అది సహజమైన ర్యాంప్‌లా ఏర్పడి.. తర్వాత వచ్చిన ప్రవాహాల దిశను కొంత మార్చినట్లు నిపుణుల విశ్లేషణ.‘ఇంజినీర్ ఎవరు?’ అనే ప్రశ్నకు..సోషల్ మీడియాలో ఈ ఇల్లు వైరల్ కావడంతో ‘ఇంత బలంగా కట్టిన ఇంజినీర్ ఎవరు?, ఏ సిమెంట్ వాడారు’ అనే ప్రశ్నలు వచ్చాయి. అంతేకాదు.. బిహార్‌లో చిన్నపాటి వరదలకు కూడా బ్రిడ్జిలు కొట్టుకుపోవడం, ఈ మధ్య వేల కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఎక్స్‌ప్రెస్ వేలు కూడా కొట్టుకుపోతుండడంతో .. ఆ ఇంజినీర్ సాబ్‌ను ఇక్కడికి రప్పించాలనే చర్చా సరదాగా నడిచింది. అయితే ఆ ఇంజనీర్ ఎవరు? అనే విషయాన్ని త్వరలో చెబుతామని ఆ కుటుంబం అంటోంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నందున.. తమను ఇబ్బంది పెట్టొద్దని స్థానిక మీడియాను ఆ కుటుంబం వేడుకుంది. ఇటు నెట్టింట కూడా.. దాని బలమైన పునాదే అంత పెద్ద వరదను తట్టుకుని నిలబడిందనే దానిపై దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు.ప్రతి ఇల్లు ఇలా నిలబడుతుందా?కచ్చితంగా కాదు. ఇదే తరహా నిర్మాణం ఉన్న ప్రతి ఇల్లు ఇలాంటి విపత్తును తట్టుకుంటుందని చెప్పలేం. వరద వేగం, నీటి పరిమాణం, బండరాళ్ల దెబ్బ, పునాది బలం, నిర్మాణ నాణ్యత, అది కట్టిన ప్లేస్ కూడా ఫలితాన్ని నిర్ణయిస్తాయి. అందుకే వైరల్ వీడియోలో కనిపిస్తున్న ఆ ఇల్లు కేవలం ‘అదృష్టవంతమైన ఇల్లు’ కాదు.. సరైన నిర్మాణ విధానం, అనుకూలమైన స్థానం రెండూ కలిసి పనిచేసిన అరుదైన ఉదాహరణ. చుట్టూ విధ్వంసం జరిగినా.. ఆ చిన్న ఇల్లు మాత్రం నిలబడటం ఇప్పుడు నేపాల్ వరదల విషాదంలో ఆశ్చర్యపరిచే దృశ్యంగా మిగిలిపోయింది. రాబోయే రోజుల్లో ఈ ఇల్లు.. పర్యాటక ప్రదేశంగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో!. ఇదీ చదవండి: అటు అమెరికాలోనూ పెను విధ్వంసం! -
హీరోయిన్ ఇంట్లో సందడిగా వరలక్ష్మి వ్రతం (ఫొటోలు)
-
నేపాల్ అంతటా హృదయవిదారక దృశ్యాలే!
నేపాల్‌ను భీకర వరద కుదిపేసిన నాలుగు రోజుల తర్వాత కూడా అక్కడి పరిస్థితి హృదయవిదారకంగానే ఉంది. ఇంకా రెండు వేల మందికి పైగా ఆచూకీ తెలియరావాల్సి ఉండగా.. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చన్న అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నదులు, బురద, శిథిలాల నుంచి వరుసగా మృతదేహాలు బయటపడుతుండటంతో ఆస్పత్రులు, మార్చురీలు నిండిపోయాయి. నేపాల్ ఆకస్మిక వరదలు మహా విషాదాన్ని మిగిల్చేలా కనిపిస్తోంది. బోటె కోషి వరదల ఉధృతికి కొట్టుకుపోయిన మృతదేహాలు త్రిశూలి, నారాయణి నదుల వెంట దిగువ ప్రాంతాలకు చేరుతున్నాయి. ఒక్క చిత్వన్లోనే శనివారం ఉదయానికి 233 మృతదేహాలు లభించినట్లు పోలీసులు తెలిపారు. నౌవల్పరాసి తూర్పులో మరో 158, గోర్ఖాలో 48, నౌవల్పరాసి పశ్చిమలో 47 మృతదేహాలు వెలుగుచూశాయి. వందలాది మంది జాడ తెలియరాకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఆస్పత్రుల్లో స్థలం లేక.. నేపాల్-టిబెట్ పరిసరాల్లోని ఆస్పత్రుల్లో మార్చురీల సామర్థ్యం 350 మృతదేహాలుగా తెలుస్తోంది. ఈ తరుణంలో సామర్థ్యం మించిపోవడంతో మృతదేహాలను ఇతర భవనాలకు తరలిస్తున్నారు. మృతదేహాలను భద్రపరిచేందుకు భారత్పూర్ సహా పలు ప్రాంతాల్లో తాత్కాలిక కేంద్రాలను(బాడీ మేనేజ్మెంట్ సెంటర్లు) ఏర్పాటు చేయాల్సి వచ్చింది. కొన్ని చోట్ల టెంట్ల కింద కూడా ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. కమ్యూనిటీ హాళ్లు, పోలీస్ ప్రాంగణాలు, ఇతర భవనాలను తాత్కాలిక మార్చురీలుగా మార్చేసినట్లు అక్కడి అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే కోల్డ్ స్టోరేజీ కొరత, హఠాత్తుగా కురుస్తున్న భారీ వర్షాలు మృతదేహాలను భద్రపరచడం అధికారులకు మరో పెద్ద సవాలుగా మారాయి. ఎవరో గుర్తించడమే కష్టం..చాలా మృతదేహాలు బురద, శిథిలాల్లో తీవ్రంగా దెబ్బతినడంతో ముఖాలను చూసి గుర్తించడం సాధ్యం కావడం లేదు. దీంతో అధికారులు మృతదేహాల ఫొటోలు తీస్తూ, శరీరంపై ఉన్న గుర్తులు, దుస్తులు, టాటూలు, ఆభరణాలు, వేలిముద్రలు నమోదు చేస్తున్నారు. అవసరమైన చోట డీఎన్ఏ నమూనాలను కూడా సేకరించి కుటుంబ సభ్యులతో సరిపోల్చే ప్రక్రియ చేపడుతున్నారు.బంధువుల కోసం ఆర్తనాదాలు..కళ్లెదుటే అయినవాళ్లు కొట్టుకుపోతుంటే.. నిస్సహాయంగా చూస్తున్న ఉండిపోయిన వాళ్లు అధికారులను బతిమాలుకుంటున్నారు. వాళ్ల ఆచూకీ చెప్పాలంటూ కన్నీళ్లతో వేడుకుంటున్నారు. తాజా లెక్కల ప్రకారం నేపాల్‌లో వందలాది మంది ఇంకా గల్లంతై ఉండగా, మొత్తం విపత్తులో 2,000కుపైగా మంది ఆచూకీ తెలియడం లేదని తాజా నివేదికలు చెబుతున్నాయి. తాత్కాలిక బాడీ-మేనేజ్మెంట్ సెంటర్ల వద్ద తమ వారి కోసం కుటుంబ సభ్యులు ఫొటోలు, మొబైల్ చిత్రాలు పట్టుకుని తిరుగుతున్నారు. మృతదేహాలపైనా దోపిడీ..ఈ విపత్తు వేళ కొందరి అమానవీయ ప్రవర్తన కూడా వెలుగులోకి వచ్చింది. వరదలో కొట్టుకొచ్చిన మహిళ మృతదేహం నుంచి చెవిపోగులు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ ఘటన నేపాల్‌లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. అయినా ఆ తతంగం ఆగడం లేదని తెలుస్తోంది. మరోవైపు నదుల్లో కొట్టుకొస్తున్న మృతదేహాలతో పాటు వస్తువులు, బ్యాగులు కూడా కనిపిస్తున్నాయి. వాటి నుంచి నగదు, నగల కోసం కొందరు పడవల్లో పరుగులు తీస్తున్నారు. ఆ దృశ్యాలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎటు చూసినా విషాదం, ఆర్తనాదాలు, మృతదేహాలే కనిపిస్తున్న దారుణ పరిస్థితి నెలకొంది.ఇదీ చదవండి: ఆ సరస్సు నీటి రంగు మారింది.. చైనా వార్నింగ్ -
సమంతా.. మీ బేబీకి ఏం పేరు పెడతారు..? రిప్లై అదిరింది..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు. భర్త రాజ్ నిడిమోరుతో కలిసి తమ తొలి బిడ్డకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తన ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా సోషల్‌మీడియాలో నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ (AMA) సెషన్లో ఆసక్తికర విషయాలాన్ని వెల్లడించారు.ఇప్పటికే 11 కిలోలు పెరిగాను‘కొత్తగా తల్లులు కాబోతున్నవారూ.. ఎలా సాగుతోంది?’ అని ఓ అభిమాని సమంతను ప్రశ్నించారు. దీనికి ఓ అభిమాని ‘బరువు పెరుగుతోంది’ అని బదులిచ్చారు. దానికి స్పందించిన సమంత.. ‘నాకూ అదే అనిపిస్తోంది. ఇప్పటికే 11 కిలోలు పెరిగాను’ అంటూ చెప్పుకొచ్చారు. ‘ఈ మాతృత్వ దశను ఎంజాయ్ చేస్తున్నారా?’ అని మరో అభిమాని అడగగా.. ‘మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాను’ అని సమంత బదులిచ్చారు. మరొకరు పుట్టబోయే బిడ్డకు ఏం పేరు పెడతారు? అని అడగగా.. దానికి మీ అందరి సహాయం కావాలి అని బదులిచ్చింది.రాజ్‌తో కలిసి బేబీమూన్ఇటీవల సమంత భర్త రాజ్ నిడిమోరుతో కలిసి బేబీమూన్‌కు వెళ్లిన ఫొటోలను కూడా సోషల్‌మీడియాలో పంచుకున్నారు. కొత్త ప్రదేశాన్ని సందర్శిస్తూ ఇద్దరూ కలిసి గడిపిన క్షణాలు ఆ ఫొటోల్లో కనిపించాయి. అంతేకాకుండా తన వర్కౌట్ సెషన్స్‌కు సంబంధించిన కొన్ని గ్లింప్స్‌ను కూడా ఆమె అభిమానులతో పంచుకున్నారు.‘మా ఇంటి బంగారం’ తర్వాత బ్రేక్సమంత చివరిగా ‘మా ఇంటి బంగారం’ చిత్రంలో కథానాయికగా కనిపించారు. ఈసినిమా 100కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో సమంతతో పాటు గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం సమంత మాతృత్వం కోసం విరామం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: కంగనా నోట అన్నయ్య..! రాఖీతో ముగిసిన మాటల యుద్ధం -
ఆ అక్కా తమ్ముళ్లది విమాన బంధం..! ఇద్దరూ..
రాఖీ పూర్ణిమ సందర్భంగా కొన్ని బంధాలు నిజంగా ఆశ్చర్యం కలిగించేలా ఎలా స్ఫూర్తిగా ఉంటాయో తెలుసా..!. అందుకు ఈ ఇద్దరు తోబుట్టువులే ఉదాహరణ. ఔను మీరు వింటుంది నిజమే. ఒకే ఇంట్లోని ఏ తోబుట్టువులు కూడా ఒకే రంగంలో కొనసాగడం అనేది అత్యంత అరుదు. ఒకవేళ కొనసాగినా..సహోద్యోగులగా ఉండటం అనేది..చాలా వృత్తిల్లో సాధ్యం కాదు. కానీ ఈ అక్కా తమ్ముళ్లు ఒకే వృత్తిని ఎంచుకోవడమే కాదు..ఒకో చోట కొలిగ్స్‌గా ఉంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. అలా అని ఇద్దరికీ పెద్ద ఏజ్ గ్యాప్ ఉండదనుకుంటే పొరపాటే.ఆ తోబుట్టువులే మణిపూర్‌కి చెందిన వాహెంగ్‌బామ్ సురేయా, రోహిత్ సింగ్‌లు. వారిద్దరికి విమానయానం ఉద్యోగానికి మించి అని చెప్పొచ్చు. ఇంఫాల్‌లో ఎనిమిదేళ్ల వయసు తేడాతో పెరిగిన ఇద్దరూ..ఎయిర్ ఇండియాలో క్యాబిన్ క్రూ సభ్యులు. ఇద్దరికి ఒకే రకమైన కఠినమైన షెడ్యూళ్లు, ఒకే చోట వేచి ఉండటం తదితరాలన్ని ఎదుర్కొంటుంటారు. అయితే వారి కుటుంబంలో విమానయాన రంగంలోకి ప్రవేశించిన తొలి వ్యక్తి సురేయా కాగా, ఆమె తమ్ముడు కూడా ఆమె బాటలో పయనించి ఈ వృత్తిని ఎంచుకోవడం విశేషం. అక్క సురేయా 2014లో విమానయాన జర్నీని ప్రారంభించింది. అయితే అక్క డ్యూటీ నుంచి తిరిగి వచ్చాక రోహిత్‌కి వివిధ ప్రాంతాలు, ఆ వృత్తి విధివిధానాల గురించి ఆమె కథలు కథలుగా చెప్పేది. ఆమె అనుభవాలు వింటూ పెరిగిన రోహిత్‌కి తెలియకుండానే ఆ వృత్తిపై అమితంగా ఆసక్తి పెరిగిపోయింది. అలా చివరికి కొన్నేళ్ల తర్వాత అక్క మాదిరిగానే ఎయిర్ ఇండియాలో చేరి తన చిన్న నాటి కలను వృత్తిగా మార్చుకుఉన్నాడు. అన్నింట్లకంటే విశేషం ఏంటంటే ఒకే ఎయిర్‌లైన్ పనిచేయడంతో వారి బంధం మరింత స్ట్రాంగ్‌గా మారింది. ఎంత బిజీ షెడ్యూళ్లు ఉన్నా ఒకరినొకరు సులభంగా అర్థ చేసుకుంటుంటారు. అలాగే ఒకరికొకరు తమ అనుభవాలను పంచుకుంటుంటామని చెబుతున్నారు. అయితే ఈ వృత్తి కారణంగా తోబుట్టువుల నుంచి సహోద్యోగులుగా కూడా మారామని నవ్వుతూ చెబుతుంటారు ఇద్దరూ. అలా తామిద్దరి లైఫ్‌స్టైల్ ఒకటే కాబట్టి ప్రతీది పూర్తిగా వివరించకుండానే..అవతల వాళ్ల బిజీని అర్థం చేసుకుంటామని అంటున్నారు. అలాగే తాము విరామ సమయాల్లో కలిసి గడుపుతామని, అది మాకు ఇంట్లో ఉన్న అనుభూతిని ఇస్తుందంటున్నారు. అంతేగాదు మాకు ఎయిర్ ఇండియా క్యాబ్ కేటాయించినప్పుడూ మా ఇద్దరి అడ్రస్ ఒకటే కావడంతో క్యాబ్ డ్రైవర్ ఎయిర్ ఇండియా ఫ్యామిలీ ప్యాకేజీలను ఎప్పుడు అద్దెకు ఇవ్వడం ప్రారంభించింది అని జోక్ చేస్తుంటాడని చెబుతున్నారు. ఒక్కోసారి తన తమ్ముడు రోహిత్‌కి డ్యూటీ లేకపోతే తనకోసం వేడివేడిగా భోజనం తీసుకొస్తాడని, అది నాకు ఇంట్లో ఉన్న అనుభూతిని అందిస్తుందని చెబుతోంది సురేయా. ఇక తమ్ముడు రోహిత్ తన అక్క శ్రద్ధ , దయను ప్రశంసిస్తూ..క్యాబిన్ సిబ్బందిగా ఆమె ఆత్మవిశ్వాసం, వృత్తి నైపుణ్యం, ప్రవర్తించే తీరుకి తాను సదా అభిమానిని అంటున్నాడు. నిజంగా ఇలాంటి అదృష్టం ఎందరి సోదర సోదరీమణులకు దక్కుతుంది చెప్పండి. (చదవండి: హమ్మయ్యా ఎట్టకేలకు గంగానదిలో స్నానమాచరించా..! వీడియో వైరల్) -
హమ్మయ్యా ఎట్టకేలకు గంగానదిలో స్నానమాచరించా..! వీడియో వైరల్
భారతీయ సంస్కృతి, ఇక్కడ ఆచార వ్యవహారాలు ఎందరో విదేశీయులను ఆకర్షించాయి. దాంతో ఈ గడ్డపైనే ఉండిపోవాలని నిర్ణయించుకుని మరి స్థిరపడినవారు కూడా ఉన్నారు. కానీ ఈ జపాన్ అమ్మాయి ఆధ్యాత్మిక అనుభూతి కోసం ఏం చేసిందో తెలిస్తే విస్తుపోతారు. జపాన్ కంటెంట్ క్రియేటర్ మాయో జపాన్ ఇటీవల భారతదేశ పర్యటనలో భాగంగా హరిద్వార్‌లోని గంగా ఘాట్ వద్ద ఒక ఆధ్యాత్మిక అనుభూతిని పొందింది. అందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఆ వీడియోలో ఆమె సంప్రదాయ దుస్తులు ధరించి కెమెరా వైపు చూస్తూ..జీవితంలో మొదటిసారి గంగాస్నానం చేస్తున్నాని చెప్పింది. ఆ తర్వాత నదిలో ఏర్పాటు చేసిన భద్రతా గొలుసులు పట్టుకుని నీటిలో మునిగి స్నానం చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. నదీప్రవాహానికి కొట్టుకుపోకుండా గట్టిగా గొలుసులు పట్టుకుని కనిపిస్తుంది వీడియోలో. ఆ తర్వాత ఆమె స్నానం సరిపోతుందా అని అక్కడే ఉన్న స్థానికుడిని అడుగుతుంది కూడా. మొత్తం మూడుసార్లు హిందూ భక్తుల మునిగినట్లుగానే మునిగి స్నానం చేస్తుందామె. ఒక అపరిచితుడి సాయంతో ఈ వీడియోని తీయగలిగానని, ఆయన చాలా అద్భుతంగా తీశారని ప్రశంసించిందామె. చివరగా ఆమె బాగా స్నానం చేశాను, చాలా సంతోషంగా ఉంది. అని అన్నారామె. అయితే ఆమెకు హిందీ ఎలా వచ్చు అని సందేహించకండి. ఎందుకంటే..ఆమె హిందీ, భారతీయ సంస్కృతులపై 13 ఏళ్లకు పైగా అధ్యయనం చేసి, ఎట్టకేలకు గంగా నదిలో పవిత్ర స్నానం చేసి, చాలా మంచి అనుభూతి పొందింది. అంతేగాదు చివర్లో ఈ ఊహించని జీవిత ప్రయాణం అందించినందుకు భారత్‌కి సదా ధన్యావాదాలు అని పోస్ట్‌లో పేర్కొంది కూడా. నెటిజన్లు ఈ పుణ్యస్నానం తర్వాత నిజంగానే మీలో మంచి మార్పు వచ్చింది. ఇది గంగా నది అనుగ్రహం అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Mayo Japan (@mayojapan) (చదవండి: గూగుల్‌లో రూ. 83 లక్షల వేతనం వదులుకుని..సేంద్రీయ వ్యవసాయం!) -
ఓనం వేడుకలో కృతి శెట్టి.. (ఫోటోలు)
-
నాన్న కల కోసం..29 ఏళ్లకే రిటైర్మెంట్! చివరికి ఇద్దరూ..
ఇటీవల ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక కాలేజ్‌లలో చదివిన చాలామంది ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు వదిలి నచ్చిన పనిలో ఆనందం వెతుక్కుంటున్న వారిని ఎందరినో చూశాం. మరికొందరు లక్షల్లో జీతాలు ఆర్జించి..చీకు చింతా లేని రిటైర్మెంట్ కోసం సేవింగ్స్ ప్లాన్ చేసుకుని మరి త్వరితగతిని పదవీవిరణమ చేస్తున్న వారిని చూశాం. కానీ అలా కాకుండా సంపాదన మొదలయ్యే స్టేజ్‌లోనే రిటైర్మెంట్ ప్రకటించి ఈ మహిళ ఏం చేస్తుందో తెలిస్తే..ఆశ్చర్యపోవడమే కాదు అభినందించకుండా ఉండరు కూడా. ఎందుకంటే..ఇంతకీ ఆమె ఏం చేస్తోందంటే..మహారాష్ట్రకి చెందిన స్నేహా రాజ్‌గురు అనే మహిళ తాను ఆధునిక పోటీ ప్రపంచపు ఒత్తిడిని వద్దనుకుని మరి పెర్మాకల్చర్(కృత్రిమ ఎరువులు, రసాయనాలకు దూరంగా సహజ పద్ధతిలో వ్యవసాయం చేయడం)ను ఎంచుకున్నట్లు తెలిపింది. ఆ నిర్ణయం తనకు ఎన్ని విధాలుగా మేలు చేసిందో వివరిస్తూ..ఆ జర్నీ గురించి వీడియో రూపంలో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. తాను ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే 29 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకున్నట్లు తెలిపింది. అంతేగాదు తాను భూమిని ఎలా కొనుగోలు చేసి, పండ్లు, కూరగాయలు పండించడం ప్రారంభించిందో వీడియోలో వివరించారు. తాను ఒకప్పుడూ.. బాలీవుడ్లో పనిచేసేదాన్ని అని, తనకు ప్రయాణాలపై ఉన్న మక్కువ కారణంగా ఈ ఫెర్మాకల్చర్ గురించి తెలుసుకునే అవకాశం ఏర్పండిందని వెల్లడించింది. ఇక తన తండ్రి టాటా మోటర్స్‌లో 30 ఏళ్లకు పైగా పనిచేశారని, పదవీవిరమణ తర్వాత ప్రకృతికి దగ్గరగా జీవించాలని ఆశించినట్లు చెప్పుకొచ్చింది. ఆ నేపథ్యంలోనే ఇలా ఇద్దరం కలిసి ఫామ్ ప్రారంభించాలని నిర్ణయానికి వచ్చామని తెలిపింది. ఇక తన ఫెర్మాకల్చర్ జర్నీ గురించి మాట్లాడుతూ..ముందుగా తాను చిన్న భూభాగాన్ని కొనడమే తన మొదటి అడుగుగా పేర్కొంది. దానికి బాప్బేటీ ఫామ్(తండ్రి కూతుళ్ల) ఫామ్ అని పేరుపెట్టినట్లు వెల్లడించింది. ఆ తర్వాత పండ్ల చెట్లను నాటినట్లు పేర్కొంది. దీనికి తక్కువ శ్రమ పైగా మనతోపాటే పెరుగుతాయి. పైగా ఏళ్ల తరబడి చక్కగా పండ్లను అందిస్తాయన్నారు. దీనివల్ల మన ఆహారాన్ని మనమే స్వయంగా పండించుకుని తింటున్న ఆనందం దక్కుతుందని అంటోంది. అలాగే లాక్డౌన్ లేదా యుద్ధం లాంటివి వచ్చినప్పుడూ ఎవ్వరిపైన ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడదని చెబుతోంది. అదీగాక అన్నింటి కన్నా ముఖ్యంగా కడుపు నింపుకునేలా మంచ ఆహారాన్ని అందించే స్థలాన్ని పొందామనే ఆనందం సొంతమవుతుందని అంటోంది. ఇక్కడ పదవీవిరమణ అనేది వయసుకి సంబంధించింది కాదని, ఒత్తిడిని వద్దని శాంతిని ఎంచుకోవడం గురించని నొక్కి చెబుతోంది. చివర్లో మీరు కూడా ఇలాంటి జీవితం గురించి కలలు కంటున్నారా అని ప్రశ్నిస్తూ.. తన సంభాషణను ముగించింది వీడియోలో. నెటిజన్లు కూడా 29 ఏళ్లకే పదవీ విరమణ చేయడం అద్భుతం!!. నిజంగా ఇది చాలా బాగుంది అంటూ పోస్టులు పెట్టారు. కాగా, ఈ బాప్బేటీ ఫామ్ మహారాష్ట్రలోని కోయాలిలో, సరస్సు కనిపించే ఒక కొండప్రాంత వ్యవసాయ క్షేత్రం. View this post on Instagram A post shared by Baapbeti Permaculture Farm | Farmstay in Pune (@baapbetifarm) (చదవండి: 'తిరంగా' దుస్తుల వివాదం..ఊర్వశి రౌతేలా స్పందన ఇదే..!) -
'కైండా చిక్' ట్రెండ్.. మీనాక్షి చౌదరి కూడా (ఫొటోలు)
-
దొంగల భయంతో ఆస్పత్రికి నగలు తెస్తే..
ఆస్పత్రిలో లక్షల విలువైన నగల సంచి మాయమైంది. దొంగతనం కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. నర్సు, ఆయమ్మలు.. సిబ్బంది ఇలా అందరినీ ప్రశ్నించారు. ఆపై సీసీ కెమెరాలను పరిశీలించగా అసలు ‘దొంగ’ ఎవరన్నది తెలిసి ఖాకీలు సైతం అవాక్కయ్యారు. అది రెండు కాళ్ల మనిషి కాదు.. నాలుగు కాళ్ల కుక్క ఆ సంచిని నోట కరుచుకుని ఆస్పత్రి నుంచి దౌడు తీసింది.మధ్యప్రదేశ్‌లోని మంద్సౌర్ జిల్లా ఆస్పత్రిలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. కయాంపూర్కు చెందిన లతాబాయి తన కుమారుడికి చికిత్స చేయించేందుకు ఆస్పత్రికి వచ్చింది. ఇంట్లో నగలు ఉంచి రావడం సురక్షితం కాదని భావించి సుమారు రూ.4 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను తన వెంట తీసుకొచ్చింది. ఆమె వద్ద ఉన్న సంచిలో బంగారు మంగళసూత్రం, చెవి దుద్దులు, బంగారు పూసలు, వెండి పట్టీలు తదితర ఆభరణాలతో పాటు సుమారు రూ.2 వేల నగదు, కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. అయితే ఆగస్టు 24న తెల్లవారుజామున ఆ బ్యాగు కనిపించకుండా పోయింది.సంచి మాయమైన విషయాన్ని గుర్తించిన లతాబాయి వెంటనే కోత్వాలి పోలీసులను ఆశ్రయించింది. ఆస్పత్రిలోనే ఎవరో నగలను దొంగిలించి ఉంటారని అనుమానించారు. దీంతో పోలీసులు ఆస్పత్రిలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించడం మొదలుపెట్టారు. అయితే తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో రికార్డైన దృశ్యాలు చూసి పోలీసులే షాక్ అయ్యారు. సర్జికల్ వార్డులోకి ఓ వీధి కుక్క వచ్చింది. అక్కడ ఉన్న సంచిని వాసన చూసి.. నోట కరుచుకుని మెల్లగా బయటకు వెళ్లిపోయింది. సంచిలో ఉన్న ఆహార పదార్థాల వాసనకు ఆకర్షితమైన కుక్క దాన్ని తిండి సంచిగా భావించి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. ఇక అక్కడి నుంచి మొదలైంది పోలీసుల ‘డాగ్ ట్రాకింగ్ ఆపరేషన్’. ఆస్పత్రి పరిసరాల్లోని సీసీ కెమెరాలను ఒక్కొక్కటిగా పరిశీలిస్తూ కుక్క ఎటువైపు వెళ్లిందో పోలీసులు పరిశీలించారు. చివరకు.. కుక్కను, అది తీసుకెళ్లిన సంచిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదృష్టవశాత్తూ అందులోని బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు, ఇతర వస్తువులు కూడా చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఫార్మాలిటీస్ పూర్తి చేసిన అనంతరం వాటిని లతాబాయికి అప్పగించారు. తన విలువైన వస్తువులను తిరిగి అందించిన పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. సోసల్ మీడియాలో ఆ కుక్క వీడియో చూసి.. ‘‘అరేయ్ చింటూ బ్రో.. ఏంట్రా ఇది’’ అంటూ ఫన్నీ కామెంట్లు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఘటనలో దొంగతనం జరగకపోయినా.. ఆస్పత్రిలోకి వీధి కుక్క ఎలా ప్రవేశించింది? రోగులు, వారి వెంట వచ్చే వారి భద్రతకు తీసుకుంటున్న చర్యలేంటి? అనే ప్రశ్నలు మాత్రం తలెత్తాయి.🚨 STRAY DOG TURNS THIEF IN MANDSAUR!A stray dog was caught on CCTV carrying away a bag containing jewellery worth ₹4 lakh and nearly ₹2,000 cash from Mandsaur District Hospital.Police traced its route and recovered everything. The belongings were later returned to the… pic.twitter.com/MjYAzeQfCH— Ghar Ke Kalesh (@gharkekalesh) August 25, 2026 ఇదీ చదవండి: వైరల్ కావాలనే ఆశతో గర్ల్‌ఫ్రెండ్‌తో అలా.. -
‘ఇరుముడి’ ఫీవర్.. స్వామి గెటప్‌లో వార్నర్
రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’. తండ్రీకూతురు సెంటిమెంట్‌కి అయ్యప్ప స్వామి నేపథ్యాన్ని జోడించి మూవీ తీయండంతో డైరెక్టర్ శివ నిర్వాణ మంచి మార్కులు కొట్టేశాడు. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. అయ్యప్ప మాలలో రవితేజ చాలా సహజంగా కనిపంచాడు. చాలామంది అయ్యప్ప భక్తులు తమని తాము ఆ రవితేజ పాత్రలో ఊహించుకుంటున్నారు. ఇప్పుడీ ఫీవర్ అంతర్జాతీయస్థాయికి పాకింది.గతంలోనూ వైరల్..అయ్యప్ప మాల ధరించిన గెటప్‌లో ఆస్ట్రేలియా క్రికెట్ ప్లేయర్ డేవిడ్ వార్నర్.. ఫ్యాన్ ఎడిట్ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రీపోస్ట్ చేశాడు. ఇప్పుడు ఇది వైరల్‌గా మారింది. అయితే వార్నర్ అభిమానులకు ఇదే కొత్త కాదు. ఇంతకముందు తెలుగులో రిలీజ్ అయిన సినిమాలు, పాటలకు ఎన్నో సార్లు తనదైన స్టైల్లో డైలాగ్‌లు చెప్పడం, స్టెప్పులు వేయడం వంటి చేశాడు. ఇలా చేయడంతో ఇంతక ముందు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. ఇప్పుడు అదే స్టైల్లో ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేయడంతో మరోసారి వైరల్‌గా మారాడు.ఇదీ చదవండి: 'ఇరుముడి'కి పట్టం కట్టిన ప్రేక్షకులు.. ఎన్ని కోట్లు వచ్చాయ్? -
వైరల్ అవ్వాలని.. 3,400 ముద్దులు!!
సోషల్ మీడియాలో వైరల్ కావాలని ఏదో ఒకటి తుంటరి పని చేసేవాళ్లు ఎక్కువైపోయారు. అదే తరహాలో ఇక్కడో యువకుడు చేసిన వింత స్టంట్ చివరకు ఊహించని తీరానికి చేరింది. తన స్నేహితురాలి పెదాలతో కారు నిండా ముద్దులతో నింపేసి.. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో ఏకంగా మిలియన్ల వ్యూస్ సాధించడంతో సంబురపడిపోయింది. ఇంతటితో ఆగితే.. మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమంటుంది.. అసలు కథలోకి వెళ్దాం పదండి..గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన వీడియోలో లిప్‌స్టిక్ ముద్దుల గుర్తులతో పూర్తిగా నిండిపోయిన స్విఫ్ట్ కారు కనిపించింది. ఆ కారును నగర రహదారిపై వేగంగా నడుపుతున్నట్లు కూడా వీడియోలో కనిపించడంతో పోలీసులు దృష్టి సారించారు. వాహనం వివరాలను సేకరించి దాని ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసులు కారును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దాని యజమానిని కూడా విచారణకు పిలిచారు.విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా ట్రెండ్‌ను అనుసరించి వీడియోను వైరల్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్టంట్ చేసినట్లు ఆ యువకుడు పోలీసులకు చెప్పాడు. తన మహిళా స్నేహితురాలే కారుపై దాదాపు 3,400 లిప్‌స్టిక్ ముద్దుల గుర్తులు వేసిందని చెప్పాడు. ఈ మొత్తం ప్రక్రియకు సుమారు మూడున్నర గంటలు పట్టిందని, లిప్‌స్టిక్ కోసం రూ.800–900 వరకు ఖర్చయిందని వివరించాడు. కారును మొత్తం ముద్దుల గుర్తులతో నింపి వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినట్లు చెప్పాడు.యువకుడు అనుకున్నట్లుగానే వీడియో సోషల్ మీడియాలో దూసుకెళ్లింది. దాదాపు 55 లక్షల(5.5M) మంది వీడియోను వీక్షించినట్లు అతడు తెలిపాడు. అయితే అదే వైరల్ వీడియో అతడిని పోలీసుల వద్దకు తీసుకెళ్లింది. మధ్యప్రదేశ్ బోఫాల్‌లో జరిగింది ఈ ఘటన. ఆ కారు ఓనర్ పేరు ఆదిత్య సికర్వార్.స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ అభిషేక్ రఘువంశీ మాట్లాడుతూ.. సుమారు రెండు రోజుల క్రితం ఈ వీడియో తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. పటేల్‌నగర్–సిటీ సెంటర్ ప్రాంతంలో లిప్‌స్టిక్ గుర్తులతో ఉన్న స్విఫ్ట్ కారు వేగంగా వెళ్తున్నట్లు వీడియోలో కనిపించిందన్నారు. వీడియో ఆధారంగా వాహనాన్ని గుర్తించి థాటీపూర్లో పట్టుకున్నట్లు చెప్పారు.ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు వివిధ మోటార్ వాహన చట్టంలోని నిబంధనల కింద ఆదిత్యకు సుమారు రూ.5,500 చలాన్ విధించినట్లు పోలీసులు తెలిపారు. తన తప్పును అంగీకరించిన ఆదిత్య.. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోనే కారుపై ఉన్న వేలాది లిప్‌స్టిక్ గుర్తులను స్వయంగా శుభ్రం చేసుకున్నాడు. తన మహిళా స్నేహితురాలే ఈ ఆలోచన ఇచ్చిందని ఆదిత్య చెప్పాడు. తాను కారు పార్క్ చేసి వెళ్లిన సమయంలో ఆమె కారుపై ముద్దుల గుర్తులు వేసిందని వివరించాడు. సోషల్ మీడియాలో ఇలాంటి ట్రెండ్ నడుస్తుండటంతో వీడియో చేస్తే వైరల్ అవుతుందని భావించామని, అనుకున్నట్లుగానే భారీగా వ్యూస్ వచ్చాయని తెలిపాడు. అయితే ఈ వీడియో కారణంగా ట్రాఫిక్ పోలీసుల నుంచి చర్యలు ఎదురవుతాయని ఊహించలేదని చెప్పాడు. ఇకపై ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తానని, ఇలాంటి స్టంట్‌ను పునరావృతం చేయబోనని పోలీసులకు హామీ ఇచ్చాడు.వైరల్ కోసం చేసిన వింత ప్రయోగం.. లక్షల వ్యూస్ తెచ్చిపెట్టినా, చివరకు చలాన్‌తో పాటు పోలీస్ స్టేషన్లో కారు కడిగే పరిస్థితిని తెచ్చిపెట్టింది. Love was in the air… and all over the car! 3,400 kisses got Gwalior's "Kissing Car" 5.5 million views and a ₹5,500 challan. He wanted to make a "reelationship" go viral. Traffic Police made sure it came with a "fine ending" @GargiRawat pic.twitter.com/d2GwGeHbUS— Anurag Dwary (@Anurag_Dwary) August 25, 2026 ఇదీ చదవండి: ఓనం హిందువుల పండుగ కాదా? -
ఐఐటీ చదివి గూగుల్‌లో జాబ్ కొట్టాలనుకుంటే..ఏకంగా ఆ కంపెనీనే..!
చాలామంది యువత ఐఐటీలో చదవాలి మంచి టెక్ కంపెనీలో జాబ్ సంపాదించాలి అని కలలు కంటారు. అయితే అందరు ఆ డ్రీమ్‌ని నిజం చేసుకోలేరు. అది కొందరికే సాధ్యమవుతుంది. ఇక్కడ ఈ యువకుడు అలానే ఆ కలను నిజం చేసుకోలేకపోయాడు. కానీ ఆ కంపెనీని తనకు స్వాగతం పలికేలా సొంతంగా తనకంటూ మార్గాన్ని సృష్టించి ఆ డ్రీమ్‌ని నెరవేర్చుకున్నాడు. కష్టించి పనిచేస్తే..అనుకున్నది మరొకరకంగా సాధించి తీరుతామనేందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. అతడే భవిష్య రాఘవ్. పాఠశాలల రోజుల్లో విద్యార్థిగా ఉండగా తల్లిదండ్రులు అతడిపై ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు. అతడు బాగా చదివి ఐఐటీలో సీటు సాధించి గూగుల్‌లో ఉద్యోగం సంపాదించాలని కోరుకునేవారు. అతడు కూడా అలానే అనుకున్నాడు. అయితే అన్నీ అనుకున్నట్లుగా జరిపోవు కదా..! ఇక్కడ రాఘవ్ ఐఐటీలో సీటు సాధించ లేకపోయాడు. ఇక గూగుల్‌లో కెరీర్ అనే మాటకే ఛాన్స్ ఏది అనుకున్నారు అంతా. కానీ అతడు తన డ్రీమ్‌ని వదిలేయాలని అనుకోలేదు. సొంతంగా కంటెంట్ క్రియేషన్ చేయడం ప్రారంభించి..తనకంటూ ఒక ప్రత్యేక కెరీర్ మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక పక్క నేర్చుకుంటూ..పనిచేస్తూ..నిరంతరం ప్రయత్నిస్తూ ముందుకుసాగాడు. ఈ రోజు ఏకంగా Google Pixel 11 Series ప్రత్యేక లాంచ్ ఈవెంట్‌కు స్వయంగా Google నుంచే ఆహ్వానం లభించింది రాఘవ్‌కి. ఆ విషయాన్నే ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నాడు. తానుసాంప్రదాయ మార్గంలో గూగుల్‌ని చేరుకోలేకపోయా..కానీ తన ప్రత్యేక మార్గం ద్వారా అదే కంపెనీకి చేరుకుని కలలు ఎన్నటికీ చెదిరిపోవు అని నిరూపించగలిగానని ఆనందంగా చెబుతున్నాడు. తన కెరీర్లో ఊహించని మలుపుకి సంబంధించిన స్ఫూర్తిదాయక కథను షేర్చేస్తూ..గూగుల్ కార్యాలయంకి వెళ్లినప్పుడు దిగిన ఫోటోలను పంచుకున్నారు. View this post on Instagram A post shared by Bhavishya Raghav | Tech Gadgets (@bhavishyaa._) (చదవండి: ట్రావెల్ వీడియోల్లో ఇంత కిక్ ఉందా? ఏడాదికి రూ.85 లక్షలు ఆర్జించే ఉద్యోగాన్నే..) -
స్టైలిష్ లుక్‌లో ప్రియాంక చోప్రా.. ఈ డ్రెస్ ఎన్ని లక్షలంటే..
న్యూయర్క్‌లో జరిగిన ‘ది సైకిల్ ఆఫ్ లవ్’ ప్రీమియర్‌లో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా తన స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకుంది. పూర్తిగా బ్లాక్ అవుట్‌ఫిట్‌లో కనిపించిన ఆమె.. తన సిగ్నేచర్ ఎలిగెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రియాంక ధరించిన ఈ డ్రెస్..ప్రియాంక ధరించిన అవేక్ మోడ్( Awake mode) బ్లాక్ మ్యక్సీ డ్రెస్ అసలు ధర దాదాపు రూ.14.2 లక్షలు ఉంటుందట. అయితే ప్రస్తుతం ఇది రూ.90 వేలకే దొరుకుతోందని సమాచారం. సినిమాల విషయానికి వస్తే..ఇక ‘ది సైకిల్ ఆఫ్ లవ్’ విషయానికి వస్తే 1977లో తన ప్రేమను కలుసుకునేందుకు దాదాపు 6000 మైళ్లు సైకిల్‌పై ప్రయాణించిన పీకే మహానందియా జీవిత ప్రయాణాన్ని తెరకెక్కించిన డాక్యుమెంటరీ ఇది. ఈ చిత్రానికి ప్రియాంక చోప్రా సహ నిర్మాతగా వ్యవహరించింది.కాగా.. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబుతో కలిసి ‘వారణాసి’ చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఆమె మందాకిని పాత్రలో కనిపించనుంది. ఇదీ చదవండి: ఇన్నాళ్లకు కనిపించిన రష్మిక.. -
ఈ అనుభూతి మాటల్లో చెప్పలేను.. 'దృశ్యం' పాప (ఫొటోలు)
-
మూడుగంటల ట్యాక్సీ ప్రయాణం..ప్రేమకథగా ఎలా మారిందంటే..!
కొన్ని ప్రేమకథలు ఎలా మొదలవుతాయో తెలియదు. వింటుంటే చాలా ఆశ్చర్యంగా, అస్సలు అదెలా సాధ్యం అనేలా ఉంటాయి. అలాంటి అందమైన ప్రేమకథ నెట్టింట వైరల్‌గా మారింది. మూవీని తలపించే వారి ప్రేమకథ వింటుంటే ఆశ్చర్యం, బాధ కలుగక మానవు. అన్ని ఎమోషన్స్ పలికించే ఆ అందమైన ప్రేమకథ ఎలా చిగురించిందంటే..లోరెన్ స్టెఫానీ రెండేళ్ల క్రితం పర్యాటకురాలిగా భారత్‌లోకి అడుపెట్టి మరి కుటుంబం ఏర్పరచుకుని మరి తిరిగి పయనమైంది. అస్సలు ఆమె ఆస్ట్రేలియా నుంచి తమిళనాడులోని మధురైకి పర్యాటన నిమిత్తం వచ్చింది. కానీ ఆ పర్యాటన కాస్తా ఆమెకు భాగస్వామిని, ఓ కుటుంబాన్ని ఏర్పరిచింది. అది కూడా జస్ట్ మూడు గంటల జర్నీ ఆమె లైఫ్‌నే టర్న్ తిప్పింది. ప్రేమకు దారితీసిన ట్యాక్సీ జర్నీ..మధుర విమానాశ్రయంలో దిగిన లోరెనా స్టెఫానీ అక్కడ తమిళనాడు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ఒక ట్యాక్సీని మాట్లాడుకుంది. ఆ డ్రైవర్‌తో కలిసి సుమారు మూడు గంటలు ప్రయాణించింది. ఆ సమయంలో వారి మధ్య సంభాషణ స్నేహంగా, ఆ తర్వాత విడదీయరాని బంధాన్ని ఏర్పరిచి ప్రేమకు దారితీసింది. ఎంతలా అంటే..ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా మారింది. అయితే వారి మధ్య ఖండాల అంతరమే కాదు సంస్కృతుల పరంగా కూడా చాలా భేదం ఉంది. ఇక్కడ రబీక్ ముస్లిం. లోరెనా క్యాథలిక్. అంటే రెండు మతాలు. రెండు దేశాలు. రెండు పూర్తిగా భిన్నమైన ప్రపంచాలు మధ్య సాగిన అపూర్వ ప్రేమకథ. ఆ విషయం ఇరుకుటుంబాలకు తెలియజేసినప్పుడు మాములు వ్యతిరేకత రాలేదు. అస్సలు ఎవ్వరు అంగీకరించేందుకు ముందుకు రాలేదు. దాంతో ఆ జంట ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం ప్రక్రియను పూర్తిచేసి, తమ బంధాన్ని అధికారం చేసుకున్నారు. ఆ మార్గంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ..తమకు ఈ బంధం ఎంత ముఖ్యం అనేది ఆ క్లిష్టపరిస్థితులే అర్థమయ్యేలా చేశాయని అంటోంది ఈ జంట. సంతోషం..బాధ ఒకేసారి..ఆ ఆ తర్వాత వారి జీవితంలో సంతోషకరమైన ఘట్టం కుమార్తె జననంతో వచ్చింది. అయితే లోరెనా ఆస్ట్రేలియాలోని ఆస్పత్రిలో కుమార్తెకు జన్మనిచ్చింది. కానీ రబీక్ వీసా దృష్ట్యా భారత్‌లోనే ఉండిపోయాడు. ఫోన్లో తన బిడ్డను చూస్తూ తన ప్రేమను చాటుకుంటున్నాడు. బిడ్డ పుట్టిందని తెలిసినా రబీక్ వెళ్లి చూసుకోలేని పరిస్థితి అయినా..అది తనకు బాధకలిగిందని సగర్వంగా చెబుతోంది లోరెనా. ఎందుకంటే..ఈ బిడ్డ తమ ప్రేమకు చిహ్నమని, భౌతికంగా దూరంగా ఉన్నా మానిసికంగా తమ బిడ్డను కలిసే పెంచుతాం, సమంగా బాధ్యతలు పంచుకుంటామని అంటోంది లోరెనా. రెండు దేశాలు, ఒకే కుటుంబం..ఎప్పటికీ వదులుకోలేని ప్రేమ..ఇక్కడ లోరెనా ఆస్ట్రేలియాలో ఉన్నారు. రబీక్ భారతదేశంలో ఉన్నారు. వారి కుమార్తె ఈ రెండు దేశాల మధ్య పెరుగుతోందని ఆమెకు తోడుగా తల్లి ఉంది, తండ్రి వీసా మంజూరు కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. అంటే..ప్రస్తుతం మా చిన్న కుటుంబం రెండు దేశాల్లో విస్తరించి ఉంది, అని నవ్వుతూ చెబుతోంది లోరెనా . రబీక్ తమ దగ్గరకు చేరే రోజు కోసం కొండంత ఆశతో ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం వీసా ప్రక్రియ కొనసాగుతూనే ఉంది, దూరం అలాగే ఉంది..అయినప్పటికీ, లోరెనా ఈ కఠిన పరిస్థితిని అధిగమించి చివరికి చేరవవుతామనే నమ్మకం సడలదని ధీమాగా చెబుతోంది. ఎందుకంటే ఇప్పటికే తాము చాలా కష్టాలు ఓర్చుకుని ఇక్కడి వరకు వచ్చాం. దీన్ని కూడా కచ్చితంగా అధిగమించుతామని, తన భర్త రబీక్కు కచ్చితంగా వీసా మంజూరవుతుందని నమ్మకంగా చెబుతోందామె. తమది, మతాలు, సరిహద్దులు, వ్యతిరేకతలను దాటుకుని వచ్చిన ‘’స్వచ్చమైన ప్రేమ’’ అని అంటున్నారు ఈ దంపతులు. View this post on Instagram A post shared by People of India (@officialpeopleofindia) (చదవండి: ర్యాంకుల విషయంలో పిల్లల పట్ల అలా వ్యవహరించొద్దు..! హీరో సూర్య పేరెంటింగ్ టిప్స్) -
బ్యూటీఫుల్ డ్రెస్‌లో మలయాళ బ్యూటీ అభిరామి అందాలు.. ఫోటోలు
-
చెత్తను డబ్బుగా మారుస్తూ..నెలకు రూ. 40 లక్షలు!
చెత్త ఏరుకుంటూ డబ్బు సంపాదించేవారిని చూశాం. అదేనండి ప్లాస్టిక్ బాటిళ్లు, వేస్ట్ సీసాలను అమ్ముకుంటూ జీవనోపాధిగా మార్చుకున్నవాళ్లు ఉన్నారు. అలాగే రీసైక్లింగ్‌తో కూడా ఆదాయం గడించిన వారు ఉన్నారు. కానీ ఏకంగా ఆ ప్లాస్టిక్‌ని రీసైకిల్ చేసి..ఇతర గృహోపకరణాలుగా మార్చి..లక్షల్లో డబ్బు ఆర్జిస్తూ లక్షాధికారిగా మారడం గురించి విన్నారా..?. ఔను వేస్టునే డబ్బుగా మార్చి ప్రభంజనం సృష్టిస్తున్నాడో వ్యక్తి. అందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.ప్రథమ్ అనే వ్యక్తి షేర్ చేసిన ఈ సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం..ఒక కుటుంబ వివాహ వేడుకలో తన కజిన్ చేతికి ఉన్న రోలెక్స్ వాచ్‌ని చూసి మొదలైన ప్రశ్నతో ఈ విషయం వెలుగులో వచ్చింది. తాను పారేసే ప్లాస్టిక్‌ని రీసైక్లింగ్ చేసే వ్యాపారంలో లక్షలు ఆర్జిస్తున్నట్లు తెలిపాడు. అయినా చెత్త వ్యాపారం ఈ రేంజ్లో డబ్బు తెచ్చిపెడుతుందా అని ప్రథమ్ విస్తుపోయాడు. అయితే అతడు ఉన్నది సంప్రదాయ ప్లాస్టిక్ వ్యాపారం కాదు..దీని వెనుక ఏదో ఉందనే కుతూహలంతో తన కజిన్‌ని అడగగా..కేవలం ప్లాస్టిక్ వ్యర్థాలను అమ్మడంపై కాకుండా, వాటిని రీసైక్లింగ్ చేయడంపైనే ఇంతలా ఆర్జించడం అనేది ఆధారపడి ఉంటుందని చెప్పాడు. కజిన్ చెప్పిన విధానం ప్రథమ్ని మరింత ఆశ్చర్యపరిచింది. అదెలాగా చెప్పమని కోరగా.." అతడి కజిన్ తాను ఫ్యాక్టరీ వ్యర్థ సీసాలు, డబ్బాలు, ఇతర ప్లాస్టిక్ స్క్రాప్‌ను తీసుకుని, వాటిని రీసైకిల్ చేసి..ప్లాస్టిక్ గ్రాన్యూల్స్‌గా ప్రాసెస్ చేస్తున్నట్లు వివరించాడు. అయితే తాను వ్యర్థ సీసాలు, డబ్బాలు ప్లాస్టిక్ స్క్రాప్‌ను కిలోకు సుమారు రూ. 13 చొప్పున కొని, వాటిని రీసైకిల్ చేయగా వచ్చిన ప్లాస్టిక్ గ్రాన్యూల్స్‌ని కిలోకు సుమారు రూ. 8 నుంచి 90కి అమ్ముతాం. దీన్ని కార్లు, ఆటో విడిభాగాలు, ప్లాస్టిక ప్యాకేజింగ్, దుస్తుల ఫైబర్లు, పైపులు, గృహోపకరణాలు, పారిశ్రామిక విడిభాగాలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అంతేగాదు వివిధ రకాల ప్లాస్టిక్‌లకు వేర్వేరు లక్షణాలు ఉంటాయి, కాబట్టి ఆ పదార్థాన్ని వేరు చేయడం రీసైక్లింగ్‌లో ఒక ముఖ్యమైన భాగం అని చెప్పుకొచ్చాడు ప్రథమ్ కజిన్. అంటే నెలకు 50 టన్నుల రీసైక్లింగ్ని కిలో రూ. 80ల చొప్పున అమ్మితే దాదాపు 40 లక్షల దాక అమ్మకాలు వస్తాయని చెప్పాడు. అంటే లక్షల్లో ఆదాయం గడించగలమని ప్లాస్టిక్ వ్యర్థా వెనుకున్న వ్యాపారం గురించి చెప్పుకొచ్చాడు.అప్పుడు అర్థమైంది అతడు వ్యర్థాల నుంచి సంపదను సృష్టించే వ్యాపారంలో ఉన్నాడని అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చాడు ప్రథమ్. నెటిజన్లు కూడా వావ్ ఇది చాలా తెలివైన ఆలోచన, పారేసే వ్యర్థాలతో కోట్లు గడిస్తున్నాడు. పైగా ప్లాస్టిక్‌ని ముడిసరుగా మార్చడంలోనే అసలైన సంపద ఉందని భలే చూపించాడు అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.Recently, I met my cousin at a relative’s wedding.We rarely talk, but I noticed his limited-edition Rolex.Curious, I asked, “What do you do?”He said, “Plastic business.”I assumed it was normal plastic trading business.Then I asked, “How are you making so much money?”…— Pratham (@CapitalLens_) August 19, 2026 (చదవండి: ఉద్యోగం చేస్తూనే 64 ఏళ్ల వయసులో ఎంటెక్..! ఓ తండ్రి సక్సెస్ స్టోరీ..) -
ఉద్యోగం చేస్తూనే 64 ఏళ్ల వయసులో ఎంటెక్..!
పదవీవిరమణ వయసు వచ్చేటప్పటికీ కాస్త వేటిపై అంత ఆసక్తి ఉండదు. ముఖ్యంగా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనే ఆసక్తి చాలా అరుదు. ఒకవేళ ప్రయత్నించినా మధ్యలోనే వదిలేస్తారు. కానీ ఈ పెద్దయన రిటైర్ అయిపోయాక కూడా మరో ఉద్యోగంలో కొనసాగుతూ..ఎంటెక్ పూర్తి చేశాడు. అంతేకాదండోయ్ తన తరగతిలో టాప్ 10 విద్యార్థులలో ఒకరిగా నిలవడం విశేషం. అందుకు సంభందించిన విషయాన్ని ఆయన కుమారుడు శశాంక్ శ్రీవాస్తవ్ నెట్టిట షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. శశాంక్ శ్రీ వాస్తవ సోషల్ మీడియా పోస్ట్ ఎక్స్‌లో ఇలా రాసుకొచ్చారు. “ 64 ఏళ్ల వయసులో మా నాన్నగారు ఎం.టెక్ పూర్తి చేశారు. గతనెలలోనే ఈ కోర్సుని పూర్తి చేశారు. ఆయన వయసులో సగం వయసున్న విద్యార్థులతో పోటీపడి మరీ..టాప్ 10లో నిలిచారు. ఆయన కేవలం రిటైర్డ్ వ్యక్తి మాత్రమే కాదని 2022లో పదవీవిరమణ చేసిన వెంటనే ఉత్తరప్రదేశ్‌లోని మున్సిపల్ కార్పొరేషన్లను పర్యవేక్షంచే నియంత్రణ సంస్థలో డిప్యూటీ సీఈవోగా చేరారు. ఆయన ప్రతి వారం రోడ్డు మార్గంలో దాదాపు వెయ్యికిలోమీటర్లు మేర జిల్లాలను సందర్శిస్తూ, క్షేత్రస్థాయిలో పనులను సమీక్షిస్తారు. పని ఒత్తిడి ఉన్నప్పటికీ..తన తండ్రి చదువుకోవడానికి సమయం కేటయించుకుంటారు. ఆ ప్రయాణాల మధ్యలోనే నోట్స్ రాసుకుని వాటిని చదివి, యువ విద్యార్థుల కంటే మెరుగ్గా పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు మా నాన్న గారు" అని రాసుకొచ్చారు. అయినా జీవితం మరింత బిజీగా మారేక్దొద్దీ చాలామంది నేర్చుకోవడం, నైపుణ్యాలను పెంపొందించుకోవడంపై దృష్టిపెట్టడం మానేస్తుంటారని, అది తాను చూశానని అన్నాడు. అంతేగాదు జీవితంలో ఇక కొత్తగా నేర్చకోవాలనే ఆశ ఉన్నా..ప్రాధాన్యత మాత్రం ఇవ్వలేరని, వాస్తవికతలో అది ఆచరణసాధ్యం కూడానని చెప్పుకొచ్చాడు. అయితే తన తండ్రి అలాంటి ఆలోచనను దరిదాపుల్లోకి రానివ్వలేదని, ఆయన 40, 60ల కూడా నైపుణ్యాలను పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టేవారని అన్నారు. ఇక తన తండ్రి ఎంటెక్‌తో ఆగడం లేదని, ఐఐఎం లక్నోలో ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌లో చేరడం ఆయన తదుపరి లక్ష్యమని అన్నాడు. పైగా చాలామంది లక్ష్యాలు నిర్దేశించుకోవడం మానేసే వయసులో దరఖాస్తు పత్రాలు నింపుతారని అన్నాడు. అందువల్ల తనకు నైపుణ్యాను పెంపొందించుకోవడంలో ప్రేరణ పొందాల్సిన అవసరం ఏర్పడలేదని ఎందుకంటే అది అది తన డీఎన్ఏలోనే ఉందని చమత్కరిస్తూ.. పోస్ట్‌ని ముగించారు శశాంక్ శ్రీ వాస్తవ్. చాలామంది నెటిజన్లు చదువు కొనసాగించడంపై స్ఫూర్తిని నింపిందన్నారు. ఆయన్ను చూసి చాలా గర్వపడాలి, చాలా నేర్చుకోవాలి కూడా అంటూ పోస్టులు పెట్టారు.(చదవండి: విక్రమ్ సారాభాయ్ పతకాన్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళ..!) -
వేలాది మల్లెపూవులతో డిజైన్ చేసిన గౌనులో వధువు..! అమ్మమ్మ కోసం..
ముంబైలో జన్మించిన వధువు అవివా మెహతా, మేరీల్యాండ్‌లో పెరిగిన డేనియల్ హాన్‌ను ఇటీవలే వివాహం చేసుకున్నారు. ఈ వివాహం కొరియన్ సంప్రదాయంలో భారతీయ ప్యాషన్ మేళవింపుతో జరిగింది. ఇక్కడ భారత వధువు ధరించిన దుస్తులు అత్యంత హైలెట్‌గా నిలిచాయి. అంతేగాదు వారి వివాహ వస్త్రధారణ రెండు సంస్కృతులు, తరతరాల కుటుంబ వారసత్వ సంపద, భారత్ ప్రసిద్ధ డిజైనర్ల కలయికగా నిలిచింది. వధువు ధరించిన డిజైనర్వేర్లివే..ఆ జంట పెళ్లి వేడుకలు సాంప్రదాయ కొరియన్ పేబెక్ కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి, ఇక్కడ వధూవరులు తమ పెద్దలకు నమస్కరించి, వారికి టీ అందించి, ఇరు కుటుంబాల నుంచి ఆశీర్వాదాలు, సలహాలు అందుకుంటారు. వధువు అవివా ఐవరీ, ముత్యపు తెలుపు, లేత గులాబీ రంగుల పెళ్లికూతురి హన్బోక్ను వంశపారంపర్య ఆభరణాలతో ధరించగా, డేనియల్ ఇటీవల న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో తొలిసారిగా ప్రదర్శించిన 'ది హన్బోక్' వారి దుస్తులను ఎంచుకున్నాడు. ఇక డిన్నర్ కోసం, అవివా 'ఐల్ ఆఫ్ మండే' నుండి తెప్పించుకున్న పాతకాలపు బరువైన పట్టు దుస్తులలో వింటేజ్ ఫ్యాషన్‌ను అనుసరించింది. ఆమె ఈ లుక్కు 'అమారిస్ జ్యువెల్స్' వారి ఆకుపచ్చల చెవిపోగులు, 'రెనే కావోవిల్లా' బూట్లను జతచేశారు. కానీ ఆమె ఆభరణాలే అత్యంత భావోద్వేగభరితమైన స్పర్శను జోడించాయి. 'వోగ్ ఇండియా' ప్రకారం, ఆమె డిన్నర్ ఈవెంట్‌కు తన నానమ్మ నెక్లెస్‌ను, రిసెప్షన్ కార్యక్రమానికి తన నానమ్మ వజ్రాల నెక్లెస్‌ను ధరించారు. అలాగే బహిరంగంగా జరిగే వేడుకలో అవివా తరుణ్ తాహిలియాని లెహంగాలో నడిచింది. ఈ లెహంగాలో క్రిస్టల్స్, ముత్యాలు, సీక్విన్స్‌తో అలంకరించిన చేతి ఎంబ్రాయిడరీ చేసిన స్కర్ట్. దానికి మ్యాచింగ్‌గా వేలాడే లేస్ రెక్కలతో కూడిన బ్లౌజ్ ఎంచుకున్నారు. తన తల్లి పెళ్లికి తరుణ్ తాహిలియాని దుస్తులనే ఎంచుకోవడంతో అవివా కూడా అవే ఎంచుకుంది. ఆమె చివరగా కొంగల చిత్రాలతో ఎంబ్రాయిడరీ చేసిన ట్యూల్ ముసుగుతో తన రూపాన్ని పూర్తి చేసింది. ఆ పక్షి దీర్ఘాయువుకు సంబంధించిన కొరియన్ చిహ్నం, ఇది డేనియల్ వారసత్వానికి మరో సూక్ష్మమైన సూచనను అందిస్తుంది. దీంతోపాటు అవివా తన మెడలో నానమ్మ వజ్రాల నెక్లెస్‌ను కూడా ధరించింది. పువ్వులతో డిజైన్ చేసిన మోడ్రన్ గౌను..రిసెప్షన్ కోసం, అవివా గౌరవ్ గుప్తా స్ప్రింగ్/సమ్మర్ 2026 కౌచర్ కలెక్షన్లోని లుక్ 15లోకి మారింది. ఇది వేలాది చేతితో తయారు చేసిన పూగుత్తులతో కప్పబడిన ఆకర్షణీయమైన సిల్క్-షిఫాన్ ట్యూల్ గౌనులో మెరిసిందామె. ఇలా పువ్వును ఎంచుకోవడం యాదృచ్ఛికం కాదు. మల్లెపువ్వు అవివా అమ్మమ్మకు ఇష్టమైన పువ్వు. ఆమె ఆరోగ్య రీత్యా అమెరికాకు వచ్చే పరిస్థితిలో లేకపోవడంతో ఆమె తనతో ఉండేలా తనకిష్టమైన వాటితో ఆత్మీయతను చాటుకుంది. వేలాది సున్నితమైన మల్లెపూల కుచ్చుల వల్ల, ఆ కౌచర్ గౌను కేవలం రిసెప్షన్ డ్రెస్ కంటే ఎంతో అర్థవంతమైనదిగా మారింది. సముద్ర తీరపు నేపథ్యంలో, ఆ పూల అలంకరణలు స్వయంగా హాజరు కాలేకపోయిన అమ్మమ్మకు నివాళిగా నిలిచాయి. డేనియల్ పెళ్లి దుస్తులు కూడా అంతే వ్యక్తిగతంగా ఉన్నాయి. అతను టైకి బదులుగా ఓపెన్ కాలర్‌తో, వెడల్పాటి కాళ్ల ప్యాంటుతో, ప్రత్యేకంగా కుట్టించిన నలుపు రంగు డబుల్-బ్రెస్టెడ్ వాట్సన్ ఎల్లిస్ సూట్‌ను ధరించాడు. అవివా మెహతా హాన్ పేరుకు సంక్షిప్త రూపమైన AMH అనే అక్షరాలు అతని చొక్కా కఫ్ మీద ఎంబ్రాయిడరీ చేశారు. వరుడు హాన్ కూడా తన దివంగత తాతగారికి చెందిన పాతకాలపు కొరియన్ వాచ్‌ను కూడా ధరించాడు. ఈ జంట తమ ఆహార్యాన్ని విభిన్న సంస్కృతుల కలియిక. భారతీయ ఫ్యాషన్, అలాగే బంధాల గొప్పతనం చాటేలా పూర్తి చేశారు. View this post on Instagram A post shared by Aviva Mehta (@vivamehta) (చదవండి: మేఘాలను గమనిస్తూ, వీడియోలు తీస్తూ..నెలకు రూ. 8.5 లక్షలు!) -
లస్సీ అమ్ముతూ నెలకు రూ. 80 వేలు..!
పెద్ద పెద్ద ఉద్యోగాలు, ఉన్నత స్థాయిలో స్థిరపడిన వాళ్లే స్ఫూర్తిదాయకం కాదు అని చెప్పే కథ. మన చుట్టూ చిన్న చితక పనులు చేస్తూ..నిరంతరం కష్టపడతూ ఉన్నతంగా బతికే స్థాయికి వచ్చినవాళ్లు ఉన్నారు. మనం అటుకేసి చూడం. గొప్ప గొప్పోళ్లు కంటికి కనిపించినట్లు..కష్టజీవులు వైపుకి దృష్టిసారించం. వాళ్లను ఒక్కసారి పలకరిస్తే..కష్టం అంటే ఏంటో..పైకి రావడం ఎలాగో కచ్చితంగా తెలుసుంది. అందుకు ఈ కంటెక్ క్రియేటర్ సోషల్ మీడియా షేర్చేసిన ప్రేరణాత్మక స్టోరీనే ఉదాహరణ. ప్రస్తుతం ఈ కథ నెట్టింట వైరల్‌గా మారింది. డిజిటల్ క్రియేటర్ ఉపేన్ వర్మ స్ఫూర్తిదాయక వీడియోని పంచుకున్నారు. అది నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంది. ఆ వీడియోలో ఢిల్లీకి చెందిన లస్సీ వ్యాపారితో డిజిటల్ క్రియేటర్ ఉపేన్ వర్మ జరిపిన సంభాషణ కనిపిస్తోంది. ఆ ఇంటర్వ్యూలో లస్సీ వ్యాపారి ఒక విషాదాన్ని దిగమింగుకుంటూ..సాగించిన తన అద్భుత జర్నీ గురించి మాట్లాడారు. తాను చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి కుటుంబా భారమంతా తనపై పడిందని చెప్పుకొచ్చాడు. తాను 11 ఏళ్ల వయసులో కుటుంబ బాధ్యతను మోసినట్లు తెలిపాడు. అప్పటి నుంచే రోజు కషపడి పనిచేసేవాడినని చెప్పాడు. అప్పట్లో లస్సీ అమ్ముతూ రోజుకి కేవలం రూ. 250లు సంపాదించేవాడినని అన్నాడు. అలా సంపాదించిన డబ్బుతోనే తన తోబుట్టువుల పెళ్లిళ్లు చేశానని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత తాను పెళ్లిచేసుకుని ఒక ఇల్లు కూడా కట్టుకున్నానని వెల్లడించాడు. తన తండ్రి తమకంటూ ఉండటానికి కనీసం ఇల్లు కూడా లేదని బాధపడుతూనే చనిపోయాడని..ఆ నేపథ్యంలోనే ఆహర్నిశలు కష్టపడి తనకంటూ ఒక ఇల్లు కూడా నిర్మించుకోగలిగానని అన్నాడు. ప్రస్తుతం దేవుడి దయవల్ల బాగానే సంపాదిస్తున్నానని, ఇప్పుడు లస్సీ అమ్ముతూ నెలకు రూ. 80 వేల నుంచి రూ. 90 వేలు వరకు ఆర్జిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అదంతా విని కంటెంట్ క్రియేటర్ జీవితంలో అస్సలు ఏ అద్భుతం జరగదని అనుకునేవారికి ఏం చెప్పాలనుకుంటున్నారని అడగగా..ఆ వ్యక్తి మిత్రులారా కష్టపడి పనిచేయండి, కష్టపడటం ఆపకపోతే..మిమ్మల్ని తప్పక దేవుడు ఆశ్వీరదిస్తాడు, అద్భుతం జరిగినట్లుగా గొప్పవారవుతారని అన్నాడు. ఆ వ్యక్తితో సంభాషణ ముగిసిన వెంటనే ఇప్పటివరకు చేసిన ఇంటర్వ్యూ అనుభవాలలో ఇది అత్యంత అద్భుతమైనదని కంటెంట్ క్రియేటర్ వర్మ అన్నాడు. ఈ వ్యక్తి కథ మీరు ఏదైనా సాధించాలనుకుంటే, దాన్ని సాధించగలరని చూపిస్తుంది. ఇక్కడ విజయం సాధించడానికి మీకు కావలసిందల్లా దృఢ సంకల్పం ఒక్కటే అంటూ తన సంభాషణను ముగించాడు డిజిటల్ క్రియేటర్ వర్మ. నెటిజన్లు కూడా అద్భుతమైన కథను పంచుకున్నారని, కఠిన వాస్తవాలతో కూడిన ఇలాంటి కథలే మనసుని తాకుతాయంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Upen Verma (@upenverma) (చదవండి: మేయర్-రోకిటాన్స్కీ-కస్టర్-హౌజర్ సిండ్రోమ్ అంటే..! పాపం ఆ మహిళ 20 ఏళ్లుగా..) -
ఫ్రీ పెట్రోల్ కోసం ఆశగా వెళ్తే..
కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు ఇటీవలి కాలంలో జనాలను ఆకట్టుకునే పేరుతో చేసే ప్రచారాలు ఎంతవరకు నిజమో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వైద్యం పేరిట డబ్బులు వసూలు చేసే స్కాములు, సాయం పేరుతో పెయిడ్ వీడియోలు ఇలా ఎన్నో ఉదంతాలు చూస్తూనే ఉన్నాం. తాజాగా సోషల్ మీడియాలో ‘ఫ్రీ పెట్రోల్’ అంటూ వచ్చిన ఓ ప్రకటనను నమ్మి.. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వాహనదారులు పెట్రోల్ బంకుల వద్దకు పరుగులు తీశారు. తీరా అక్కడ వారికి ఊహించని పరిణామం ఎదురైంది.రాకేశ్ ట్రెహాన్ అనే వ్యక్తి సోషల్ సర్వీస్ పేరిట నెట్టింట కాస్త ఫాలోయింగ్ ఉన్న వ్యక్తే. అయితే.. ఉచితంగా పెట్రోల్ పంపిణీ చేస్తానంటూ ప్రకటించడంతో.. మంగళవారం సాయంత్రం ఛండీగడ్(పంజాబ్) వాహనదారులు బంకుల వద్దకు టూవీలర్లు, కార్లు భారీ సంఖ్యలో చేరుకున్నాయి. అయితే అప్పటికే భారీ వర్షం మొదలైంది. ఉచితంగా వచ్చే పెట్రోల్ కోసం జనాలు దానిని పెద్దగా లెక్క చేయలేదు. ఈ లోపు క్యూ లైన్ భారీగా పెరిగిపోయింది.అయితే చెప్పిన టైంకి పెట్రోల్ పంపిణీ ప్రారంభం కాలేదు. ఈలోపు బంక్‌ల వద్ద పరిస్థితులు చేజారిపోతుండడంతో నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు వచ్చి వాహనదారులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. ఈలోపు బంక్వాళ్లు కేవలం 15 మందికి ఉచితంగా పెట్రోల్ కొట్టి.. మిగతావాళ్లకు నో చెప్పారు. ఫ్రీ టోకెన్లు అయిపోయాయని చెప్పడంతో మిగతా వాళ్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఉచిత పెట్రోల్ ఇస్తారన్న సమాచారంతో దూర ప్రాంతాల నుంచి వచ్చినవారిని ఇలా వెనక్కి పంపడం ఏమిటని ప్రశ్నించారు. రాకేశ్‌ను బండ బూతులు తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.Chandigarh: The city witnessed chaos after a video of a petrol langar organized by Amritsar-based Rakesh Trehan, alias Raja Di King, went viral. A large crowd had gathered at the spot before the police arrived, and after their arrival, the crowd was evacuated from the petrol… pic.twitter.com/pA1iPQ4mh8— IANS (@ians_india) August 18, 2026 ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో చూసి వచ్చిన సుమన్ అనే మహిళ.. పెట్రోల్ ఇవ్వడానికి పంపు సిబ్బంది అనుమతించలేదని తెలిపారు. కేవలం 10–15 మందికి మాత్రమే టోకెన్లు ఇచ్చినట్లు చెప్పారు. అన్షు అనే మరో వ్యక్తి తాను దాదాపు రెండు గంటల పాటు భారీ వర్షంలో పెట్రోల్ పంపు వద్ద వేచి చూసినట్లు తెలిపారు.రాకేశ్ రియాక్షన్పరిస్థితిపై రాకేశ్ ట్రెహాన్ స్పందించారు. సోషల్ మీడియాలో ‘రాజా ది కింగ్’గా గుర్తింపు పొందిన ఆయన.. భారీ వర్షం కారణంగానే కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు వీడియో ద్వారా వెల్లడించారు. వర్షంలో ప్రజలు ఇబ్బందులు పడటం, అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉండటంతో పెట్రోల్ పంపిణీని నిలిపివేసినట్లు తెలిపారు. అక్కడికి వచ్చినవారికి ఆయన క్షమాపణలు చెప్పారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి వర్షంలో నిలబడాల్సిన పరిస్థితి రావడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు.ఆగస్టు 21 నుంచి మళ్లీ.. మూడు రోజుల పాటు!తాజా ప్రకటన ప్రకారం ‘పెట్రోల్ లంగర్’ను ఆగస్టు 21న నిర్వహించనున్నట్లు రాకేశ్ ట్రెహాన్ తెలిపారు. అదే సమయం, అదే ప్రాంతంలో కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. పెట్రోల్ పంపిణీ కోసం ఆగస్టు 21న కూపన్లు లేదంటే కార్డులు జారీ చేస్తామని వెల్లడించారు. ఆగస్టు 21, 22, 23 తేదీల్లో మూడు రోజుల పాటు ఉచిత పెట్రోల్ పంపిణీ కొనసాగుతుందని ప్రకటించారు. -
అదితి రావు స్టన్నింగ్ లుక్స్.. సిద్ధార్థ్‌తో స్పెషల్ మూమెంట్స్! (ఫొటోలు)
-
అదిరిపోయే లుక్స్‌తో రాశి ఖన్నా.. (ఫొటోలు)
-
మహిళా ఏఐ ఇన్ఫ్లుయెన్సర్లు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా..!
ఇప్పుడంతా ఏఐ సాంకేతికదే హవా. ఎటు చూసినా..ఏం చేసినా ఏఐ సాంకేతికత లేకుండా పనికాదన్నట్లుగా ఉంది పరిస్థితి. ఆఖరికి సోషల్‌మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా అందులో కూడా దాని హవా ఏ రేంజ్లో ఉందంటే మనషుల కంటే శరవేగంగా వ్యూస్, పాపులారిటీ సంపాదించేసుకుంటున్నాయి. వాటి ఆదాయాలు కూడా ఓ రేంజ్లో ఉన్నాయి. అచ్చం మనుషుల్లాగా కనిపించే వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో సృష్టిస్తున్న ప్రభంజనం మాములుగా లేదు. అందులోనూ మహిళా ఏఐ ఇన్ఫ్లుయెన్సర్లు ఎంత ఆర్జిస్తున్నారో తెలిస్తే కంగుతింటారు. దీనిపై గ్రాండ్ వ్యూ రీసెర్చ్ జరిపిన సర్వే ప్రకారం.. ఈ విభాగంలో మార్కెట్ ఆదాయంలో 68% వాటా మహిళల రూపంలో ఉండే "ఏఐ ఇన్ఫ్లుయెన్సర్ల"దే నని తేలింది. మానవ ఇన్ఫ్లుయెన్సర్ కంటే వీరు సుమారు 40 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారని ఈ సర్వే వెల్లడించింది. ఇన్‌స్టాగ్రామ్‌లోని వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్ ఫాలోవర్లలో 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళలు 44.76% ఉన్నారు. ఇది సాధారణ ఇన్ఫ్లుయెన్సర్ ఖాతాల ఫాలోవర్ల సంఖ్యకు దాదాపు రెట్టింపు. అంతేకాదండోయ్ ఈ ఏఐ మహిళా అవతార్లతో అనేక ప్రముఖ లగ్జరీ ఫ్యాషన్ హౌస్‌లు కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నాయట. మరి ఆ మహిళా ఏఐ ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరో చూద్దామా..!.బ్రెజిలియన్ మ్యాగజైన్ 'లూయిజా' సృష్టించిన వర్చువల్ స్టార్ ‘లూ డో మగలు’ వార్షిక ఆదాయం సుమారుగా ₹25 కోట్లు. ఆమెకు ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి సోషల్ ఫ్లాట్‌ఫామ్‌లలో లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారట. ‘లూ మిక్వేలా’ అనే మహిళా వర్చువల్ స్టార్‌తో ప్రాడా, కాల్విన్ క్లైన్ వంటి ఫ్యాషన్ హౌస్‌లు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆమె నికర ఆస్తి విలువ ఏకంగా రూ. 150 కోట్లు. గులాబీ రంగు జుట్టు కలిగిన స్పానిష్ ఏఐ మోడల్ ‘ఐటానా లోపెజ్’ అమెజాన్ స్పెయిన్, జియెసెలిన్ వటి బ్రాండ్లతో స్కాలర్షిప్ అందుకుంటోంది. ఆమె వార్షిక ఆదాయం రూ. 1 కోటిని మించి ఉంటుందట. భారత్‌లో ఏఐ ఇన్ఫ్లుయెన్సర్ల క్రేజ్..మన దేశంలో కూడా వీటి క్రేజ్పెరుగుతోందట. సుమారు 55% ఎంగేజ్మెంట్ రేటుతో, ఈ గ్లోబల్ ట్రెండ్‌లో భారతదేశం ముందుందట. అనేక ప్రముఖ దేశీయ బ్రాండ్లు తమ ప్రచారాలలో వీటిని చేర్చుకుంటున్నాయని నివేదికలు చెబుతున్నాయి. కైరా అనే ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు దాదాపు 2.4 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. నైనా అనే ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు ఏకంగా .7 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. వ్రిత్తికా పటేల్ అనే ఏఐ మోడల్‌కు లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నారట. ఆఖరికి సాంకేతికతలో కూడా మహిళా ఏఐ అవతార్లదే అగ్రస్థానం కదూ..!.(చదవండి: 15 రోజులకు మించి బతికే ఛాన్స్ లేదన్నారు..కానీ ఆ అమ్మాయి ఇవాళ..) -
నెలకు రూ.33 లక్షలు.. బిగ్‌బీ కొత్త లీజు ఒప్పదం!
బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ మరో భారీ రియల్ ఎస్టేట్ ఒప్పందంతో వార్తల్లో నిలిచారు. ముంబైలోని అంధేరీ వెస్ట్‌లో ఉన్న ఓ వాణిజ్య భవనంలోని మూడు అంతస్తులను ప్రముఖ పోషకాహార సంస్థకు లీజుకు ఇచ్చారు. లింక్ రోడ్డులోని సిగ్నేచర్ భవనంలో ఉన్న సుమారు 8,428 చదరపు అడుగుల విస్తీర్ణంలోని కార్యాలయ స్థలాన్ని అమితాబ్ బచ్చన్ లీజుకు ఇచ్చినట్లు సమాచారం.అద్దె రూపంలో రూ.21.88 కోట్లు..ఈ ఒప్పందం ప్రకారం ఆయనకు నెలకు రూ.33 లక్షల అద్దె రానుందట. 2026 ఆగస్టు 15 నుంచి ఐదేళ్ల పాటు ఈ ఒప్పందం కొనసాగనుందట. మొత్తం కాలానికి అద్దె రూపంలో సుమారు రూ.21.88 కోట్లు వచ్చే అవకాశం ఉందని టాక్. ప్రతి ఏడాది అద్దెను 5 శాతం పెంచేలా ఒప్పందంలో నిబంధనను చేర్చినట్లు తెలుస్తోంది.మరోసారి చర్చ..అద్దెకు తీసుకున్న సంస్థకు కార్యాలయ స్థలంతో పాటు తొమ్మిది పార్కింగ్ స్థలాలను కూడా వినియోగించుకునే హక్కు కల్పించారట. ఈ లావాదేవీలో భాగంగా రూ.1.98 కోట్ల భద్రతా డిపాజిట్‌ను చెల్లించినట్లు సమాచారం.ఇప్పటికే ముంబైలో పలు విలాసవంతమైన నివాసాలు, వాణిజ్య భవనాలను కలిగి ఉన్న అమితాబ్ బచ్చన్.. ఇటీవల అయోధ్యలోనూ భారీగా పెట్టుబడులు పెట్టారు. దీంతో ఆయన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యంపై మరోసారి చర్చ మొదలైంది.ఇదీ చదవండి: 15ఏళ్ల తరువాత ‘జిందగీ’ సీక్వెల్‌పై అప్డేట్ -
పాల ప్యాకెట్ల కింద లిక్కర్ బాటిల్స్!.. క్లాస్‌రూంలోనే దావత్!!
యువతను మత్తు పదార్థాల బారినుంచి దూరం చేయడమే లక్ష్యంగా తమిళనాడులో విజయ్ ప్రభుత్వం చర్యలు చేపడుతున్న సమయంలో.. అదే రాష్ట్రంలో ఓ గవర్నమెంట్ స్కూల్లో ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. క్లాస్‌రూంలో.. అదీ అమ్మాయిలు మద్యం సేవిస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన విజయ్ సర్కార్ తీవ్ర చర్యలకు ఉపక్రమించింది. కన్యాకుమారి జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకున్న ఘటన కలకలం రేపింది. తరగతి గది సమీపంలో ఇద్దరు విద్యార్థినులు మద్యం సేవిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ పాఠశాలలో నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఆ తరగతులు ముగిసిన తర్వాత కొందరు విద్యార్థులు పాఠశాలలోనే ఉండగా ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.విజయ్ ప్రభుత్వం యువతలో పెరుగుతున్న మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. జిల్లా స్థాయిలో నిఘా వ్యవస్థలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో.. తుక్కలై ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులు మద్యం సేవిస్తున్న వీడియో వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది.వైరల్ వీడియోతో కదిలిన యంత్రాంగంమద్యం సేవిస్తున్న దృశ్యాలను మరో విద్యార్థి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు తెలుస్తోంది. వీడియో వైరల్ కావడంతో కన్యాకుమారి జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించింది. విద్యార్థినులు ఎవరు? పాఠశాల ప్రాంగణంలోకి మద్యం ఎలా వచ్చింది? పర్యవేక్షణలో లోపం జరిగిందా? అనే అంశాలపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రమీలా ఎవాంజెలిన్ను మరో పాఠశాలకు బదిలీ చేశారు. విద్యాశాఖ అధికారులు కూడా ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు.రాజ్‌కుమార్ అరెస్ట్విద్యార్థినులకు మద్యం అందించింది ఎవరు అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. తొలుత తోటి విద్యార్థులపై అనుమానం వ్యక్తమైనప్పటికీ.. వారి ప్రమేయం లేదని తేలినట్లు పోలీసులు తెలిపారు. తర్వాత తక్కలై ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల రాజ్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు పాలు సరఫరా చేసే వ్యక్తిగా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఓ విద్యార్థినికి పరిచయస్తుడైన రాజ్‌కుమార్.. ఆమె కోరడంతో మద్యం కొనిచ్చినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.కౌన్సెలింగ్‌కు ఆదేశాలుఘటన అనంతరం విద్యార్థినుల తల్లిదండ్రులను పిలిపించిన అధికారులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. విద్యార్థినులకు కూడా మానసిక నిపుణుల ద్వారా కౌన్సెలింగ్ అందించాలని సూచించారు. మరోవైపు.. విద్యాసంస్థల్లో మత్తు పదార్థాల నియంత్రణ, పర్యవేక్షణ మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యువతను మత్తుకు దూరంగా ఉంచేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల మధ్య ఇలాంటి ఘటనలు మరింత అప్రమత్తత అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. -
బాలీవుడ్‌పై సీనియర్ నటి సంచలన వ్యాఖ్యలు
40ఏళ్లుగా సినిమా, బుల్లితెర రంగాల్లో రాణిస్తున్న బాలీవుడ్ సీనియర్ నటి కిటు గిద్వానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. బాలీవుడ్లో స్పష్టమైన నిబంధనలు లేవని.. అది అసలు నిజమైన ఇండస్ట్రీ కాదని వ్యాఖ్యానించారు.‘పదేళ్లు పనిచేసిన నటికి మరో పదేళ్లు హుందాగా జీవించే అవకాశం ఉండాలి. కానీ మన దగ్గర ( బాలీవుడ్లో) అలాంటి పరిస్థితి లేదు. నటీనటులకు ఒకేసారి పారితోషికం చెల్లించి, సినిమాపై ఉన్న అన్ని హక్కులను నిర్మాతలే ఉంచుకుంటారు. వయసు పెరిగిన మహిళలకు ఇండస్ట్రీలో సరైన పాత్రలు రావడంలేదు. టెలివిజన్‌లో 30 ఏళ్లు దాటిన మహిళలను అమ్మమ్మ పాత్రల్లో చూపించడం విచిత్రంగా ఉంది. ముఖంపై వృద్ధాప్యం ఛాయలు లేకపోయినా అలాంటి పాత్రలే ఇస్తున్నారు’ అని అన్నారు.1980,90 కాలంలో బుల్లితెర, సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కిటు గిద్వానీ. ‘హోళీ’ సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించారు. అనంతరం ‘ఎయిర్ హోస్టెస్’, ‘స్వాభిమాన్’, ‘శక్తిమాన్’ వంటి సిరియాల్లో నటించారు. ‘ఫ్యాషన్’, ‘ధోబీ ఘాట్’ ‘జానే తు యా జానే నా’ వంటి చిత్రాల్లోనూ నటించారు. -
పాట పాడినందుకు విధుల నుంచి తొలగించారు..! ఇవాళ ఏకంగా..
డ్యూటీలో పాడపాడటమే శాపమై ఉపాధిని కోల్పోయేలా చేసింది. విధి ఒకడోర్ మూసేస్తే మరో దారి తెరుచుకుంటుంది అనేలా అతడికి మరో అవకాశం వెత్తక్కుంటూ వచ్చి..తనకు నచ్చిన విధంగా బతకేలా చేసింది. ఈ ఘటన కోల్‌కతాలో చోటుచేసుకుంది. సుమారు 40 ఏళ్ల వయసున్న షోవోన్ చక్రవర్తి, సాల్ట్ లేక్‌లోని సెక్టార్ Vలో ఒక ఆఫీసులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. స్వతహాగా అతడు సంగీత కళాకారుడు. అతను శాంతినికేతన్‌లోని సంగీత్ భవన్లో విద్యార్థులకు సంగీతం బోధించేవాడు. అయితే ఆ చక్రవర్తికి సంగీతం ద్వారా వచ్చే ఆదాయం అతని ఖర్చులను తీర్చలేకపోయింది. అదీగాక కరోనా మహమ్మారి అతడి జీవితాన్ని పూర్తిగామార్చేసింది. ఆ టైంలో బోధించే విద్యార్థుల సంఖ్య తగ్గడంతో ఆర్థిక ఒత్తిళ్లు అధికమై..జీవనోపాధి కోసం సెక్యూరిటీ గార్డుగా పనిచేయక తప్పలేదు. అలా అతడు విధి నిర్వహణలో ఉండగా ఒకరోజు రవీంద్రనాథ్ ఠాగూర్ పాటను ఆలపిస్తుండగా ఎవరో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అతడు సంగీత విద్వాంసుడు కావడంతో చాలా అలవోకగా ఆ ప్రసిద్ధ సంగీతాన్ని సునాయాసంగా ఆలపించాడు. పైగా నెటిజన్లు కూడా అతడి గాత్రానికి మంత్రముగ్ధలై ప్రశంసల వర్షం కురిపించారు. కానీ అతడు పనిచేసే చోట యజమానులకు ఇదంత నచ్చలేదు. పైగా అతడిని తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించారు. అతడి కథను చిత్రనిర్మాత ప్రతీమ్ డి గుప్తాకి నెట్టింట షేర్ చేయడంతో..యూనిఫాం ధరిస్తే..ప్రతిభను వదిలేయమనడం సరైంది కాదంటూ నెట్టింట చర్చలు మొదలయ్యాయి. అయితే చిత్ర నిర్మాత ప్రతీమ్ మాత్రం ఆయన ఆర్థికపరిస్థితులు అనుకూలించక ఈ వృత్తిలో వచ్చారే తప్ప ఆయన సెక్యూరిటీ గార్డు కాదు. పైగా పిల్లలకు సంగీత నేర్పించాలనేది అతడి ధ్యేయం. పైగా ఎవరినీ వ్యక్తి ఎలాంటి ఆర్థిక సాయం కూడా కోరలేదు. అతడి కథ వైరల్ వీడియో ద్వారా చాలామందికి చేరింది, పైగా అతడికి మద్దతిచ్చేందుకు సాయం చేసేందుకు చాలామంది ముందుకు వచ్చారు. కానీ అతడికి కావాల్సింది అది కాదంటూ బెంగాలీ గాయకుడు రూపంకర్ బాగ్చి రంగంలోకి దిగి అక్టోబర్‌లో కోల్‌కతాలోని కళా మందిర్ ఆడిటోరియంలో చక్రవర్తి కోసం సంగీత కచేరిని ఏర్పాటు చేసి ప్రోత్సహించారు. ఇలాంటి సాయం అతడికి తిరిగి సంగీతకారుడిలా జీవించే గొప్ప అవకాశంగా ఉంటుందని అన్నారు రచయిత, చిత్ర నిర్మాత ప్రతీమ్. అంతేగాదు షిప్ట్‌లో ఉండి సెక్యూరిటీ గార్డు పాటపడటం తప్పుకాదు..అతడు కొద్దిసేపు కళకారుడిగా ఉండాలని ఆశపడటమే తప్పు అని అన్నారు. (చదవండి: పర్యావరణహిత బెలూన్లు..! జస్ట్ తొమ్మిది నెలల్లో..) -
టీచర్‌కు అండగా.. చుక్కలు చూపించిన జెన్ఆల్ఫా
దేశవ్యాప్తంగా యువత, విద్యార్థుల నిరసనలు చర్చనీయాంశంగా మారుతున్న సమయంలో జార్ఖండ్‌లో జరిగిన ఓ ఆందోళన ఆసక్తిని రేకెత్తిస్తోంది. జెన్‌జీ బాటలోనే తాము కూడా అంటూ ‘జెన్ ఆల్ఫా’గా రోడ్డెక్కెంది. ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలు మరీ వయొలెంట్‌గా ఉండడంతో.. నెట్టింట ఆసక్తికరమైన చర్చా నడుస్తోంది. కొత్త తరం పిల్లలు తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేయడం, తమ డిమాండ్ల కోసం రోడ్డెక్కడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. జార్ఖండ్‌లోని గర్వా జిల్లాలో ఓ ఉపాధ్యాయుడి బదిలీని వ్యతిరేకిస్తూ హైస్కూల్ విద్యార్థులు చేపట్టిన నిరసన తీవ్రరూపం దాల్చింది. కాండీ బ్లాక్ పరిధిలో విద్యార్థుల ఆందోళనను అడ్డుకునేందుకు వచ్చిన బ్లాక్ చీఫ్ పింకు పాండే.. ఓ విద్యార్థిపై చేయి చేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. అసలు ఏం జరిగిందంటే..గర్వా జిల్లాలోని హైస్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు మలయ్ సింగ్ బదిలీ కావడంపై విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బదిలీని నిలిపివేయాలంటూ మూడు రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్నారు. వీళ్లకు తల్లిదండ్రులు కూడా తోడయ్యారు. మొదట జిల్లా కలెక్టరేట్ వద్ద ప్రారంభమైన ఆందోళన.. తర్వాత కాండీ బ్లాక్ వరకు విస్తరించింది. రోడ్డుపై బైఠాయించి రాకపోకలను అడ్డుకున్నారు. తమ డిమాండ్ నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని విద్యార్థులు స్పష్టం చేశారు.ఈ తరుణంలో విద్యార్థులతో మాట్లాడేందుకు బ్లాక్ చీఫ్ పింకు పాండే అక్కడికి చేరుకున్నారు. అయితే చర్చ జరుగుతున్న సమయంలో ఓ విద్యార్థిని ఆయన చెంపదెబ్బ కొట్టారు. ఈ ఘటనతో ఆగ్రహించిన విద్యార్థులు, నిరసనకారులు తీవ్రంగా స్పందించారు. పాండే వాహనాన్ని ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆయన అక్కడి నుంచి పరుగులు తీసి పోలీస్ స్టేషన్లో ఆశ్రయం పొందాల్సి వచ్చింది.ఆ తర్వాత విద్యార్థులు కూడా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని.. ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. విద్యార్థుల డిమాండ్లపై అధికారులు చర్చలు జరుపుతున్నారు.జెన్ ఆల్ఫా గళం.. స్కూల్ రోడ్డు కోసం పోరు!ఉత్తరప్రదేశ్‌లోని చందూపూర్ గ్రామంలో జెన్ ఆల్ఫా విద్యార్థులు తమ సమస్యపై గళమెత్తారు. స్కూల్‌కు వెళ్లేందుకు సరైన రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ దాదాపు 200 మంది విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలు, బ్యానర్లతో విద్యార్థులు తమ డిమాండ్‌ను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వర్షాకాలంలో మట్టి రోడ్డుతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థులు, తల్లిదండ్రులు తెలిపారు. అనారోగ్యంతో ఉన్న వారిని ఆస్పత్రికి తరలించడంలోనూ సమస్యలు వస్తున్నాయని చెప్పారు. రోడ్డు సమస్యను పరిష్కరించాలని కోరుతూ చాలాసార్లు విజ్ఞప్తి చేసినా తాత్కాలికంగా మట్టి పోసి వదిలేశారని, వర్షాలతో మళ్లీ దారంతా బురదగా మారిందని ఆరోపించారు. కలెక్టర్ కార్యాలయానికి చేరుకునే ప్రయత్నం చేసిన విద్యార్థులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా.. వారు తమ నిరసనను కొనసాగించారు. విద్యార్థుల పోరాటానికి పలువురు మద్దతు తెలిపారు.జెన్ ఆల్ఫా అంటే ఎవరు?జెన్‌జీ తర్వాతి తరమే జెన్ ఆల్ఫా (Generation Alpha). సాధారణంగా 2010 నుంచి 2024 మధ్య జన్మించిన వారిని జెన్ ఆల్ఫాగా పరిగణిస్తారు.ఈ తరం పిల్లలు చిన్నప్పటి నుంచే స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ టెక్నాలజీ మధ్య పెరిగారు. అందుకే వీరిని కొందరు “డిజిటల్ నేటివ్స్” అని కూడా పిలుస్తారు. వీరికి తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో భయం తక్కువగా ఉంటుందని, సామాజిక అంశాలపై వేగంగా స్పందించే స్వభావం ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇటు మధ్యప్రదేశ్ జబల్పూర్లోనూ విద్యా వ్యవస్థలో సంస్కరణలు కోరుతూ కొందరు పిల్లలు రోడ్డెక్కడం గమనార్హం.#Jabalpur में Gen Alpha का धरना प्रदर्शन.चीन-अमेरिका हमारे देश की शिक्षा व्यवस्था सुधारने के लिए इन छात्रों को Funding कर रहा है- कट्टर अंधभक्त pic.twitter.com/3IVFzMuuFC— NEYU MADHYAPRADESH (@NEYU4MP) August 13, 2026ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా యువత నిరసనలు, సామాజిక ఉద్యమాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జెన్ జీ (సుమారు 1997–2012 మధ్య జన్మించిన తరం) ఉద్యమాలు వార్తల్లో నిలిచాయి. ఇప్పుడు చిన్న వయసులోనే తమ హక్కులు, న్యాయం, విద్యా సమస్యలపై స్పందిస్తున్న జెన్ ఆల్ఫా పిల్లలు కూడా చర్చలోకి వస్తున్నారు. జార్ఖండ్ ఘటనలో విద్యార్థులు తమ ఉపాధ్యాయుడి కోసం ఏకంగా రోడ్డెక్కడం.. ఈ కొత్త తరం వైఖరిపై మరోసారి చర్చకు తెరతీసింది. -
ఉద్యోగంపోతే కంపెనీ ఇలా వ్యవహరిస్తుందా..?
కంపెనీలు ఉద్యోగులు పట్ల ఎలా వ్యవహరిస్తాయో చెప్పే సందేశాత్మక స్టోరీ నెట్టింట వైరల్‌గా మారింది. ఇటీవల కాలంలో చాలా కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. అచ్చం అలానే ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి కంపెనీ ఫార్మాల్టీలు పూర్తిచేయడానికి వెళ్తే తనకు ఎదురైన అనుభవం రెడ్డిట్‌లో షేర్ చేసుకున్నాడు. తన కంపెనీలో చివరి వర్కింగ్ డే రోజు తనకు తగిన పాఠం నేర్పిందంటూ తను ఎదుర్కొన్న అనుభవాన్ని పంచుకున్నారు. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందంటూ మాట్లాడిన మాటలు అందరి మనసులను తాకాయి. అసలేం జరిగిందంటే..బెంగళూరు టెకీ రెడిట్ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చాడు. తను ఉద్యోగం పోవడంతో కంపెనీకి తిరిగి ల్యాప్‌టాప్ ఇచ్చేసి చివరి రోజు కంపెనీ ఫార్మాల్టీలు పూర్తి చేసేందుకు తన రెండేళ్ల కుమారుడితో ఆఫీస్‌కి వెళ్లినట్లు పేర్కొన్నాడు. ఎందుకంటే తన భార్య కూడా ఉద్యోగం చేయడంతో వేరే గత్యంతరం లేక తన కుమారుడిని తీసుకుని ఆఫీసుకు వచ్చానని చెప్పాడు. అలాగే కార్యాలయం నిబంధనలను బ్రేక్ చేసే ఉద్దేశ్యం తనకు లేదని, అలాగే ఇలా పిల్లలతో రావడాన్ని కంపెనీ అనుమతించదని తెలుసని కూడా రాశారు.చివరి రోజు కంపెనీ ఇచ్చిన ల్యాప్‌టాప్ వంటి కార్యాలయ సామాగ్రిని ఇచ్చేసి..ఫార్మాల్టీస్ పూర్తి చేయడానికే కదా అని తప్పనిపరిస్థితుల్లో ఇలా కుమారుడితో వచ్చినట్లు వెల్లడించారు. తను కూడా తన పరిస్థితి వివరించినా..సెక్యూరిటీ గార్డు అందుకు నిరాకరించాడు. రిక్వస్ట్ చేసినా..కంపెనీ నుంచి నో అనే సమాధానమే వచ్చింది. చివరికి చేసేది లేక తన సహోద్యోగికి ఫోన్ చేసి, తన పిల్లాడిని ఓ ఐదు నిమిషాలు చూసుకోమని చెప్పి..కంపెనీ ఫార్మాల్టీస్ పూర్తి చేసేందుకు వెళ్లానని చెప్పారు. కానీ ఆ పని ఐదు నిమిషాల్లో పూర్తవుతుంది అనుకుంటే..అది కాస్తా 15 నిమిషాలు పైనే పట్టిందని నిజాయితీగా వివరించారు. కానీ చివరి రోజు తనకు ఎదురైన మొత్త అనుభవం తనకు చాలా బాధనే మిగిల్చిందన్నారు. అలాగే కనువిప్పు కలిగించే గొప్ప పాఠం కూడా నేర్పిందని చెప్పారు. తాను కంపెనీపై ఎలాంటి ఆరోపణలు చేయడం లేదని కూడా స్పష్టం చేశారు. అయితే ఈ సంఘటనతో పనితో ఉన్న సంబంధం గురించి పునరాలోచించేలా చేసింది. కంపెనీ అనేది కంపెనీ మాత్రమే. దానికి నీ వ్యక్తిగత పరిస్థితులతో సంబంధం ఉండదు. ఏళ్ల తరబడి పనిచేసినా..కంపెనీకి మన జీవితంలో ఎంత వరకు ప్రాముఖ్యత ఇవ్వాలో అంతే ఇవ్వాలి, ఎందుకంటే అది చివరికి ఒక వ్యాపార సంబంధంగానే మిగిలిపోతుందనేది గుర్తురెగాలి. అందుకే కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలి, పనికి అతీతమైన జీవితాన్ని నిర్మించుకోవడం అనేది చాలా ముఖ్యం అని రాసుకొచ్చాడు పోస్ట్‌లో. అయితే ఇక్కడ వర్క్ కూడా ముఖ్యమే కానీ కుటుంబ జీవితం కూడా అంతే ముఖ్యం అంటూ తన పోస్ట్‌ని ముగించాడు. నెటిజన్లు కూడా కంపెనీ మీరు వెళ్లిపోగానే మరో ఉద్యోగిని తక్షణమే నియమిస్తుంది అదే మీ కుటుంబానికి మీ స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు. అందుకే ఏ కంపెనీ కూడా మన ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని, ప్రేమించే వ్యక్తులతో గడిపే సమయాన్ని త్యాగం చేసేంత విలువైనది కాదు అంటూ పోస్టులు పెట్టారు.(చదవండి: తండ్రి చెంత జైలులోనే ఆ చిన్నారి..!ఆ ఐఏఎస్ అధికారి అడిగిన ప్రశ్న..) -
ట్రంప్‌కే షాక్ ఇచ్చిందా? ఐయామ్ ప్రెగ్నెంట్ అంటూ..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చుట్టూ మరోసారి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ మొదలైంది. అయితే ఈసారి కారణం ట్రంప్ తీసుకున్న నిర్ణయం కాదు.. ఆయన పక్కన నిల్చున్న ఓ మహిళ. ట్రంప్ కీలక ఆదేశంపై సంతకం చేస్తున్న సమయంలో ఆయన పక్కన కనిపించిన మహిళపై నెట్టింట రకరకాల ఊహాగానాలు వైరల్ అయ్యాయి. చివరకు ఆ మహిళే స్పందించి అసలు విషయం వెల్లడించాల్సి వచ్చింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో వ్యాక్సినేషన్ విధానానికి సంబంధించి కీలక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేస్తున్నారు. ఆ సమయంలో ఓ మహిళ ఆయన పక్కన నిల్చున్నారు. వీడియోలో ఆమె పదేపదే తల ఊపుతూ, ఒక చేయిని తన పొట్టపై ఉంచుకున్నట్లు కనిపించింది. ఆ వెంటనే మత్తులోకి జారుకున్నట్లు కనిపించిన ట్రంప్.. హఠాత్తుగా అప్రమత్తం అయ్యారు. దీంతో కొందరు సోషల్ మీడియా యూజర్లు విచిత్రమైన వాదనలు మొదలుపెట్టారు.Claims she has a button fitted on her belly, and when she gets the nod that he’s asleep she moves her hand and presses a button that wakes him. They’re calling her The Zapper. No idea if it’s true but it *appears* to line up. pic.twitter.com/hgx4x6iQp6— Tim Brannigan (@tim_brannigan) August 11, 2026ట్రంప్‌కు షాక్ ఇచ్చిందా?..కొందరు నెటిజన్లు ఆమె చేతిలో ఏదో పరికరం ఉందని, ట్రంప్‌ను అప్రమత్తం చేసేందుకు విద్యుత్ షాక్ ఇచ్చిందంటూ ఊహాగానాలు ప్రచారం చేశారు. ఈ ప్రచారం వేగంగా వ్యాపించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఆమె పేరు జేమీ లీగ్ ఫ్రాంక్లిన్ (Jayme Leagh Franklin). ఆమె అమెరికాలోని కన్జర్వేటివ్ మీడియా, లైఫ్‌స్టైల్ బ్రాండ్ ది కన్జర్వేటర్ (The Conservateur) వ్యవస్థాపకురాలు, సీఈవో.నెట్టింట వస్తున్న వింత ఆరోపణలపై స్పందించిన ఫ్రాంక్లిన్.. తాను గర్భవతినని వెల్లడించారు. తన పొట్టపై చేయి పెట్టుకోవడానికి కారణం అదే అని స్పష్టం చేశారు. “నేను కేవలం గర్భవతిని మాత్రమే” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ట్రంప్‌కు తాను షాకిచ్చి అప్రమత్తం చేశానంటూ తనపై వస్తున్న ఊహాగానాలను చూసి ఆశ్చర్యపోయినట్లు ఆమె తెలిపారు.ఆ కార్యక్రమంలో ఎందుకు ఉన్నారు?వైట్‌హౌస్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ట్రంప్, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ జూనియర్ల మధ్య ఫ్రాంక్లిన్ నిల్చున్నారు. బాలల వ్యాక్సినేషన్ సిఫార్సుల్లో మార్పులకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేస్తున్న సమయంలో ఈ వీడియో రికార్డ్ అయింది. ఆ తర్వాత ఫ్రాంక్లిన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ట్రంప్‌తో కలిసి ఓవల్ ఆఫీస్‌లో ఉండటం గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.ఎవరు జేమీ లీగ్ ఫ్రాంక్లిన్?జేమీ లీగ్ ఫ్రాంక్లిన్ గతంలో ట్రంప్ పాలనలో పనిచేశారు. నార్త్ కరోలినాకు చెందిన ఆమె కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్క్లీ నుంచి 2020లో పట్టా పొందారు. 2019లో అమెరికా సెనేట్‌లో లెజిస్లేటివ్ ఇంటర్న్‌గా పనిచేసిన ఆమె.. 2020 ట్రంప్ ఎన్నికల ప్రచారంలో కోయలిషన్ కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు. అనంతరం ట్రంప్ తొలి వైట్‌హౌస్ పాలనలో కరస్పాండెన్స్ డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆమె నడుపుతున్న ది కన్జర్వేటర్.. రాజకీయాలు, సంస్కృతి, విశ్వాసం, ఫ్యాషన్, బ్యూటీ అంశాలపై కంటెంట్ అందించే కన్జర్వేటివ్ మీడియా సంస్థగా కొనసాగుతోంది. అదీ అసలు ముచ్చట. -
ప్రకృతి ఒడిలో టాలీవుడ్ హీరోయిన్ యోగా (ఫొటోలు)
-
పెళ్లి తర్వాత తొలి సినిమా.. వాయిదా?
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. వీరిద్దరి పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి చేసిన తొలి సినిమా ఇదే కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకుడు. కాగా సెప్టెంబర్ 11న రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. కానీ ఇప్పుడీ ప్రాజెక్ట్ వాయిదా పడే అవకాశమున్నట్లు తెలుస్తోంది.అక్టోబర్ 30న విడుదల?‘రణబాలి’ని అక్టోబర్ 30న విడుదల చేయాలని చిత్రబృందం ఆలోచిస్తుందట. ఇటీవల రష్మికకు గాయం కావడమే దీనికి కారణం! ప్రస్తుతం ఆమె కోలుకున్నారని త్వరలోనే షూటింగ్లో పాల్గొంటారని సమాచారం. అయితే ఈ విడుదల తేదీపై చిత్ర బృందం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.‘రణబాలి’లో విజయ్ 19వ శతాబ్దానికి చెందిన ఓ తిరుగుబాటుదారుడుగా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. బ్రిటిష్ సైనికుడిని గుర్రంపై లాక్కెళ్తున్న సన్నివేశం సినిమాపై ఆసక్తిని పెంచేస్తోంది. రష్మిక జయమ్మ పాత్రలో కనువిందు చేయనుంది.రష్మికకు గాయం..రవీంద్ర పుల్లే దర్శకత్వంలో రష్మిక చేస్తున్న యాక్షన్ సినిమా ‘మైసా’. ఇందులో గోండు తెగకు చెందిన మహిళగా రష్మిక కనిపించనుంది. ఇటీవల ఓ పాట షూటింగ్ చేస్తుండగా ఈమె నడుముకు బలమైన గాయమైంది. దీంతో వైద్యులు ఆరు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. -
ఆమె కండక్టర్‌తో వెళ్లిపోయింది.. అంతే!
వివాహేతర సంబంధాల మోజులో.. నేరాలు-ఘోరాలు జరుగుతున్న కాలం ఇది. కట్టుకున్న బంధాలను పక్కన పెట్టి క్షణిక సుఖాల కోసం తీసుకుంటున్న నిర్ణయాలు ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. అనుమానాలు, ఆవేదనలు, ఆగ్రహాలతో పలు ఘటనలు తీవ్ర పరిణామాలకు దారి తీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తి.. అందునా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన వ్యక్తి, అందమైన తన భార్య ఓ కండక్టర్‌కి మనసిచ్చి వెళ్లిపోయిందంటూ నేరుగా వీడియో రిలీజ్ చేయడం సంచలన చర్చకు దారి తీసింది.మలయాళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, నటుడు అఖిల్ NRD వ్యక్తిగత జీవితం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. తన భార్య మేఘా ఓ కండక్గర్తో వెళ్లిపోయిందని నేరుగా ఆయనే వీడియో విడుదల చేయడం నెటిజన్లను షాక్‌కు గురి చేసింది. నైటీలో లగేజీతో ఆమె స్పీడ్‌గా వెళ్లి.. ఓ వ్యక్తితో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. వివాహేతర సంబంధాల నేరాల నేపథ్యంలో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. CCTV visuals are currently going viral on social media, claiming that Kerala YouTuber Akhil NRD's wife, Megha Nair, has run away with a bus conductor. Watch the video to see the reality behind it! 👇 pic.twitter.com/N9WUns571W— Vijitha (@Vijitha96) August 11, 2026అయితే భర్తను చంపకుండా వదిలేసి వెళ్లిపోయింది ఆమె గ్రేట్ అంటూ కొందరు.. ప్రేమించి పెళ్లి చేసుకుని ఇదేం పని? అని మరికొందరు.. ఆ కండక్టర్లో ఆమెకేం నచ్చిందో అని మరికొందరు ఇలా కామెంట్ల రచ్చతో చర్చకు దారి తీశారు. ఈ నేపథ్యంలో.. ఈ పరిణామంపై అఖిల్ స్నేహితుడు, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ సాయి కృష్ణ స్పందించడంతో మరింత ఆసక్తి నెలకొంది. అఖిల్-మేఘా వివాహానికి తాను హాజరయ్యానని చెప్పిన సాయి కృష్ణ.. ఈ వార్త విని తాను షాక్‌కు గురయ్యానని తెలిపారు. ఈ విషయంపై అఖిల్‌తో మాట్లాడానని, అయితే ఈ విషయంలో ఎవరినీ నిందించేందుకు అఖిల్ ఇష్టపడటం లేదని పేర్కొన్నారు.“ఆమె వెళ్లిపోయింది.. అంతే!”భార్య చేసిన నమ్మక ద్రోహంపై అఖిల్ రియాక్షన్‌ను సాయి కృష్ణ మీడియాకు వెల్లడించాడు. ఆమె వెళ్లిపోయింది అంతే అని ఒక్క ముక్కలో తేల్చేశాడు. ‘‘ఈ విషయంలో ఎవరినీ తప్పుబట్టను..నిందించను. దేవుడు నాకు ఇలా రాసిపెట్టాడు. ఇలాంటి పరిస్థితులు ఎవరి జీవితంలోనైనా ఎదురవుతాయి. నా తల్లిదండ్రులు నాకు మద్దతుగా నిలిచారు. ఈ విషయంలో నేను అదృష్టవంతుడిననే అనుకుంటున్నా. ఈ విషయాన్ని మరింతగా చర్చించడం ఇష్టం లేదు’’ అంటూ అఖిల్ అన్నాడట.సోషల్ మీడియాలో ఈ వ్యవహారంపై వస్తున్న చర్చలపై కూడా సాయి కృష్ణ స్పందించారు. పరిచయమైన వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లో సమస్యలు వచ్చినప్పుడు వాటిని సంచలనంగా మార్చకుండా, కొంత బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.మెర్చంట్ నేవీ నుంచి సోషల్ మీడియా స్టార్..అఖిల్ ఎన్ఆర్డీ ప్రయాణం కూడా ప్రత్యేకమైనదే. తొలుత ఆయన మెర్చంట్ నేవీలో పనిచేశాడు. ఆ తర్వాత డిజిటల్ కంటెంట్‌పై ఆసక్తితో ఆ రంగంలోకి అడుగుపెట్టాడు. టిక్‌టాక్ ద్వారా వీడియోలు చేయడం ప్రారంభించి.. కామెడీ వీడియోలు, లైఫ్‌స్టైల్ కంటెంట్, వ్లాగ్స్‌తో భారీగా ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నాడు. తర్వాత యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన యూట్యూబ్ ఛానల్‌కు లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియా పాపులారిటీతో నటుడిగానూ అవకాశాలు అందుకున్నాడు.సినిమాల్లోకి ఎంట్రీసోషల్ మీడియా స్టార్ నుంచి మాలీవుడ్‌లో చిన్నాచితకా అవకాశాలు అందుకున్నాడు అఖిల్. 2026లో మలయాళ చిత్రం ‘ఆశకల్ ఆయిరం’ ద్వారా నటుడిగా తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ‘మహారాజా హాస్టల్’ చిత్రంలోనూ నటించాడు. సోషల్ మీడియా స్టార్ నుంచి సినిమా నటుడిగా ఆయన ప్రయాణం కొనసాగుతోంది.2024లో వివాహం..అఖిల్, మేఘా కొంతకాలం ప్రేమలో ఉన్న అనంతరం 2024లో వివాహం చేసుకున్నారు. మేఘా కూడా అఖిల్ సోషల్ మీడియా పోస్టుల్లో కనిపించేవారు. వీరి జంటకు అభిమానుల్లో మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం వీరి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జరిగిన దానిపై మేఘగానీ, ఆమె కుటుంబంగానీ ఇంకా స్పందించలేదు. అయితే.. అఖిల్ వీడియో రిలీజ్ చేశాక ‘‘ఇది కూడా సోషల్ మీడియా స్టంటేనా?’’ అని కొందరు అనుమానం సైతం వ్యక్తం చేశారు. -
కొత్త భార్యపై ప్రేమ.. మాజీ భార్యను గుర్తుచేస్తున్న నెటిజన్లు
బాలీవుడ్ నటి ఊర్మిళ మటోండ్కర్ మాజీ భర్త మోహ్సిన్ అక్తర్ మీర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ ఏడాది జూన్‌లో నిధా భట్‌ను వివాహం చేసుకున్న ఆయన.. తాజాగా తన రిసెప్షన్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా తన భార్యపై ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తూ ఓ నోట్ రాశారు. అది ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.‘నువ్వు కేవలం నా భార్యగా మాత్రమే కాదు.. నా ఇల్లు, ప్రశాంతత, ప్రతిరోజూ నాకు ఇష్టమైన వ్యక్తిగా మారావు. నిన్ను నా జీవితంలోకి తీసుకొచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు. ప్రతి దశలో నిన్ను ప్రేమిస్తూ, నీకు అండగా ఉంటానని మాటిస్తున్నాను. మనం కలిసి నిర్మించబోయే అందమైన భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్నా’ అంటూ రాసుకొచ్చారు.ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ‘అందమైన జంట.. మీ ఇద్దరూ ప్రేమతో, ఆనందంగా ఉండాలి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం మోహ్సిన్ను ట్రోల్ చేస్తున్నారు. గతంలో ఊర్మిళతో ఉన్న సమయంలోనూ ఇలాంటి హామీలే ఇచ్చి ఉంటారని కామెంట్లు చేస్తున్నారు. అసలు ఊర్మిళ, మోహ్సిన్ మధ్య ఏం జరిగిందని కొందరు ప్రశ్నిస్తున్నారు.గతంలోనూ వైరల్..మోహ్సిన్ తన రెండో పెళ్లి సమయంలోనూ సోషల్‌మీడియాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. ‘స్వచ్ఛమైన ఉద్దేశాలు, నిజమైన ప్రేమతో పాటు దేవుడి నిర్ణయాన్ని విశ్వసించాలి. సరైన సమయంలో నిధాను నా జీవితంలోకి తీసుకొచ్చారు. ఆమె నా జీవితంలో వెలుగులు నింపింది’ అని రాసుకొచ్చారు.2016లో ఊర్మిళతో వివాహం..ఊర్మిళ మటోండ్కర్, మోహ్సిన్ అక్తర్ మీర్ 2016 ఫిబ్రవరి 4న అత్యంత సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. వీరిది మతాంతర వివాహం కావడంతో పాటు.. ఇద్దరి మధ్య దాదాపు పదేళ్ల వయసు తేడా ఉండటంతో అప్పట్లో వార్తల్లో నిలిచారు. 2014లో ఓ వివాహ వేడుకలో ఊర్మిళను కలిసిన మోహ్సిన్.. ఆ తర్వాత ఆమెతో ప్రేమలో పడ్డారని సమాచారం. రెండేళ్ల తర్వాత వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. -
ఫైరింగ్ కియారా.. అందం ఏ మాత్రం తగ్గలే (ఫొటోలు)
-
ఐశ్వర్య రాజేశ్ ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు)
-
34 ఏళ్ల క్రితం ప్రేమికులుగా.. కాలం మారిందంతే!
నాగార్జునసాగర్ కేవలం ఓ పర్యాటక ప్రదేశం మాత్రమే కాదు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన సతీమణి గీత జీవితంలో ఓ ప్రత్యేక జ్ఞాపకంగా నిలిచిపోయిన ప్రదేశం. మూడు దశాబ్దాలకు పైగా కాలం గడిచినా.. ఆ ప్రాంతంతో ముడిపడిన అనుబంధం మాత్రం వాళ్లకు అలాగే ఉండిపోయింది. అందుకే ఆ జ్ఞాపకాలను మరోసారి ఆ జంట గుర్తు చేసుకుంది.34 ఏళ్ల క్రితం యువకుడు రేవంత్‌రెడ్డి, గీత దంపతుల జీవితంలో ప్రేమ జ్ఞాపకాలకు వేదికైన నాగార్జునసాగర్.. ఇప్పుడు మరోసారి వారిని ఆకర్షించింది. అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నం. అప్పట్లో సాధారణ జీవితంలో ఉన్న వారు.. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో అదే ప్రాంతానికి చేరుకున్నారు.వరుణయాగం తర్వాత.. సోమవారం నాగార్జునసాగర్‌లో నిర్వహించిన వరుణయాగంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన సతీమణి గీత పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం దంపతులు విజయవిహార్ అతిథిగృహం వద్ద కృష్ణానది తీరానికి వెళ్లారు. ఆ ప్రాంతంలో గడిపిన క్షణాలు, అప్పటి జ్ఞాపకాలను వారు గుర్తుచేసుకున్నట్లు సమాచారం. ఒకప్పుడు తమ జీవితంలో ప్రత్యేకమైన అధ్యాయానికి వేదికైన ఆ ప్రదేశాన్ని ఇప్పుడు మళ్లీ సందర్శించడం భావోద్వేగ క్షణంగా మారింది.ఒక ఫొటో.. రెండు కాలాల కథఈ సందర్భంగా అప్పటి జ్ఞాపకాలకు సంబంధించిన పాత ఫొటోతో పాటు.. ప్రస్తుతం సీఎం దంపతులు సాగర్ వద్ద ఉన్న ఫొటోను కలిపి కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. “అప్పుడు ప్రేమ ప్రయాణం మొదలైన చోటే.. ఇప్పుడు జీవిత ప్రయాణంలో మరో మైలురాయి” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.రాజకీయాలకతీతంగా ఓ వ్యక్తిగత క్షణంసాధారణంగా రాజకీయ నేతల ప్రతి అడుగు రాజకీయ కోణంలోనే చర్చకు వస్తుంది. కానీ నాగార్జునసాగర్ పర్యటనలో మాత్రం రేవంత్‌రెడ్డి దంపతుల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ మధుర జ్ఞాపకం తెరపైకి వచ్చింది. రాజకీయ పోరాటాలు, పదవులు, బాధ్యతలకు అతీతంగా.. జీవితంలో కొన్ని ప్రదేశాలు ప్రత్యేక గుర్తులుగా మిగిలిపోతాయి. నాగార్జునసాగర్ కూడా రేవంత్–గీత దంపతులకు అలాంటి ఓ భావోద్వేగ ప్రదేశంగా నిలిచింది.ప్రేమ నుంచి బాధ్యతల వరకు.. సాగర్ సాక్షిగాయువకుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి వరకు సాగిన ప్రయాణంలో ఎన్నో మలుపులు వచ్చాయి. కానీ కొన్ని జ్ఞాపకాలు మాత్రం కాలంతో మారవు. ప్రేమకు సాక్షిగా నిలిచిన నాగార్జునసాగర్.. ఇప్పుడు ముఖ్యమంత్రి దంపతుల పాత జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేసిన వేదికగా మారింది. -
గోవిందాతో ఆ యువ నటి.. మళ్లీ తెరపైకి ‘కోమల్’ పేరు!
బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా వ్యక్తిగత జీవితం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ముంబై విమానాశ్రయంలో ఆయన యువ నటి కోమల్ రాణి స్వర్ణకర్‌తో కలిసి కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో గతంలో గోవిందా భార్య సునీత ఆహూజా చేసిన వ్యాఖ్యలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఇంతకీ ఆ ‘కోమల్’ ఎవరు? సునీత గతంలో ఎందుకు ఆమె పేరు ప్రస్తావించారో తెలుసుకుందాం..!గోవిందా, కోమల్ రాణి మధ్య గత నాలుగేళ్లుగా సంబంధం ఉందంటూ గతంలో కొన్ని వార్తలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. ఉత్తరాఖండ్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి వీరిద్దరూ కలిసి హాజరైనట్లు కూడా కొన్ని కథనాలు పేర్కొన్నాయి. అయితే ఈ ప్రచారంపై గోవిందా కానీ, కోమల్ కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.గతంలో సునీత ఏం చెప్పారు?గోవిందా వివాహేతర సంబంధాలపై గతంలో జరిగిన చర్చ సందర్భంగా సునీత ఆహూజా ఓ ఇంటర్వ్యూలో ‘కోమల్’ అనే పేరును ప్రస్తావించారు. ఓ ఇంటర్వ్యూలో కోమల్ పేరు గురించి ప్రశ్నించగా.. ఆ విషయంలో కొంత క్లారిటీ రావాల్సి ఉందని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. గోవిందా విషయంలో ఎప్పుడైనా వివాహేతర సంబంధానికి సంబంధించిన ఆధారాలు తనకు లభిస్తే మాత్రం క్షమించబోనని సునీత స్పష్టం చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు వీరిద్దరు కలిసి కనిపించడంతో సునీత అప్పట్లో ప్రస్తావించిన ‘కోమల్’ ఈమెనేనా? వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఎవరీ కోమల్ రాణి స్వర్ణకర్?ఉత్తరప్రదేశ్‌కు చెందిన కోమల్ రాణి స్వర్ణకర్ త్వరలో ‘రూపా’ అనే చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. -
‘కిరాయి కోటిగాడు’గా మహేశ్.. వీడియో అదిరింది!
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు నిన్న (ఆగస్టు 9) సోషల్‌మీడియా వేదికగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేసిన ఓ ప్రత్యేక పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. సందీప్ ఏఐ వీడియోతో శుభాకాంక్షలు చెప్పగా.. మహేశ్ ఫిదా అయ్యాడు. లెంజడరీ నటుడు కృష్ణ నటించిన ‘కిరాయి కోటిగాడు’ సినిమాలో చెప్పిన ఓ డైలాగ్‌ను ఏఐతో రీక్రియేట్ చేసి పోస్ట్ చేశాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ప్రస్తుతం ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం స్పిరిట్. భద్రకాళి పిక్చర్, టి. సిరీస్ బ్యానర్స్‌పై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృష్ణ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. త్రిప్తి దిమ్రి హీరోయిన్. మహేశ్ బాబు విషయానికి వస్తే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి చిత్రంతో 2027లో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. View this post on Instagram A post shared by Sandeep Reddy Vanga (@sandeepreddy.vanga) -
బిగ్‌బాస్ హౌస్‌లోకి మరో జబర్దస్త్ కమెడియన్!
బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 త్వరలో ప్రారంభం కానుంది. ఈసారీ కింగ్ నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. షోను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు మేకర్స్ ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపికపై దృష్టి సారించారు. సెలబ్రిటీలతో పాటు సామాన్యులకూ అవకాశం కల్పించేందుకు ‘అగ్నిపరీక్ష 2’ ద్వారా కంటెస్టెంట్లను ఎంపిక చేస్తున్నారు. అయితే ఇప్పటికే పలువురు ఈ సీజన్ 10 ఆడిషన్స్‌కు హాజరవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు షోలోకి ఎంట్రీ ఇవ్వబోయే కంటెస్టెంట్ల విషయంలో సోషల్ మీడియాలో రోజుకో పేరు వైరల్ అవుతోంది. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో క్రేజీ పేరు చేరినట్లు టాక్ నడుస్తోంది. జబర్దస్త్ నటుడు రామ్ ప్రసాద్ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టనున్నారనే వార్త ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్ ప్రసాద్.. తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. బుల్లితెరతో పాటు సినిమాల్లోనూ నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన బిగ్‌బాస్ హౌస్‌లోకి వస్తే షోలో కామెడీ మరింత పెరిగే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే బిగ్‌బాస్ టీమ్ రామ్ ప్రసాద్‌ను సంప్రదించిందని, ఆయన కూడా షోలో పాల్గొనేందుకు ఓకే చెప్పారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
కంగనా చేతిలో గొడుగు..ధర తెలిస్తే షాకే..!
ఎప్పుడూ ఏదో ఒక ప్రత్యేకతతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్. తాజాగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు హాజరైన ఆమె మరోసారి తన స్టైలిష్ లుక్‌తో అందరి దృష్టినీ ఆకర్షించారు. అయితే ఈసారి ఆమె చీర, హ్యాండ్‌బ్యాగ్ కంటే చేతిలో పట్టుకున్న గొడుగే హైలైట్‌గా మారింది. సాధారణంగా వర్షం నుంచి రక్షణ కోసం ఉపయోగించే గొడుగును కూడా ఫ్యాషన్ స్టేట్మెంట్గా మార్చేశారు కంగనా. ఇంతకీ ఆమె చేతిలో ఉన్న ఆ గొడుగు ప్రత్యేకత ఏంటి? దాని ధర ఎంతో తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే!కంగనా రనౌత్ పార్లమెంట్ హౌస్‌కు వెళ్లే సమయంలో రంగురంగుల ప్రింటెడ్ గొడుగుతో కనిపించారు. సాధారణ నలుపు రంగు గొడుగులకు భిన్నంగా ఆమె చేతిలోని ఆక్వా కలర్ గొడుగు ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఈ గొడుగును ప్రముఖ లగ్జరీ డిజైన్ హౌస్ గుడ్ ఎర్త్ రూపొందించిందట. దీని ధర రూ.6,100. అంటే గొడుగు కోసం ఆరు వేలకు పైగా ఖర్చు చేశారు కంగనా. చీర, బ్యాగ్‌తో పాటు రంగురంగుల గొడుగు ఆమె లుక్కు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. -
బీఎండబ్ల్యూ బైక్‌పై వచ్చిన రైడర్ని చూసి విస్తుపోయిన వ్యాపారవేత్త..!
ఒక్కోసారి కొన్ని జీవిత పాఠాలు..కొన్ని ప్రయాణాల్లో ఊహించని విధంగా తెలుసుకుంటాం. మరికొన్ని మనకన్న వయసులో చిన్న వాళ్లైనా యువత నుంచి నేర్చుకుంటుంటాం. అలాంటి గొప్ప జీవిత పాఠాన్నే ఒక ఉబర్ రైడర్ నుంచి నేర్చుకున్నాడు ఓ వ్యాపారవేత్త. అసలేం జరిగిందంటే..ముంబై వ్యాపారవేత్త ఆఫీస్ నుంచి ఇంటి వెళ్లేందుకు రైడ్ బుక్‌చేసుకున్నాడు అప్పుడు ఎదురైన అనుభవాన్ని లింక్డ్ని పోస్ట్‌లో పంచుకున్నారు. అప్పటికే చాలా ఆలస్యమైపోవడంతో రాత్రి 8.25 గంటలకు రైడ్ ఖరారైందని తెలిపారు. తనను తీసుకువెళ్లడానికి బీఎండబ్ల్యూ బైక్ రావడం చూసి విస్తుపోయానని అన్నారు. ఆ రైడర్ రాగానే బ్రో మీరెందుకు ఉబర్ నడుపుతున్నారని ప్రశ్నించినట్లు చెప్పారు. దాని ఆ రైడర్ ఇచ్చిన సమాధానం..తనకు గొప్ప స్ఫూర్తిదాయకమైన పాఠాన్ని నేర్పిందంటూ రాసుకొచ్చారు పోస్ట్‌లో. ఆ రైడర్‌తో వ్యస్థాపకుడు జైన్‌తో సార్ ఇదే నా మొట్టమొదటి ఉబర్ రైడ్ అని చెబుతూ ఇది తాను డబ్బు కోసం చేయడం లేదని అన్నారు. అతను కొత్త వ్యక్తులను కలవాలని, సంభాషణలు ప్రారంభించాలని, విభిన్న దృక్కోణాలను అర్థంచేసుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. అలాగే తన కథను కూడా పంచుకున్నట్లు తెలిపారు. తాను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అని, వివిధ వ్యాపారాలు ప్రయత్నించినట్లు తెలిపాడన్నారు. అయితే కొన్ని డబ్బులు సంపాదించి పెట్టగా, మరికొన్ని జీవిత పాఠాలను నేర్పించాయన్నారు. ప్రస్తుతం తాను కొత్త అవకాశాలను అన్వేషిస్తూ..మాస్టర్ డిగ్రీ చేయాలని చూస్తున్నట్లు చెప్పాడని తెలిపారు. ఆ తర్వాత తాను కుతూహలంతో మరీ ఈ బీఎండబ్ల్యూ బైక్ గురించి అని ప్రశ్నించగా..అతడు చిరునవ్వుతో తన వ్యాపారాల ద్వారా సంపాదించిన కొంత సొమ్ము, అలాగే పేరెంట్స్ ఇచ్చిన కొద్దిపాటి సాయంతో దీన్ని కొన్నట్లు తెలిపాడు. ఆ విషయాన్ని కూడా అతడు చాలా సింపుల్‌గా చెప్పాడని అన్నారు. తన రైడ్ మగిశాక..అతడు తనకు ప్రజలతో కలిసి పనిచేయడం ఇష్టం అని, ఈవెంట్లు నిర్వహిడం తనకు సంతోషన్ని ఇస్తుందని చెప్పాడు. బదులుగా మిత్రమా మీ జర్నీలో అన్ని విజయాలు సాధించాలని మనసారా కోరుకుంటున్నానంటూ తన సంభాషణను ముగించినట్లు తెలిపారు. ఆయన ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ ఒక వాక్యం తన మదిలో అలాగే నిలిచిపోయిందన్నారు. "మీ కలలను వెంబడించే ధైర్యం, ఉత్సాహం మీకు ఉన్నంత వరకు, పెద్ద కలలు కనడంలో ఎలాంటి నష్టం లేదు.” అని అన్నారు. ఒక్కోసారి ఇలాంటి స్ఫూర్తి ఒక సీఈవో, పారిశ్రామికవేత్త, బెస్ట్ సెల్లింగ్ రచయితల పుస్తకాల ద్వారా రాదు అంటూ పోస్ట్‌ని ముగించారు. కాగా, ఆశీష్ జైన్ తన కెరీర్‌ను ఎయిర్‌టెల్‌లో ప్రారంభించారు. ఏళ్లుగా అతను విప్రోతో సహా వివిధ సంస్థలలో పనిచేశారు. ఆయన 2012లో తన సొంత కంపెనీని ప్రారంభించారు.(చదవండి: అమెరికాలో కెమికల్ ఇంజనీరింగ్ ..కానీ జీతం రూ. 960!) -
అమెరికాలో కెమికల్ ఇంజనీరింగ్ ..కానీ జీతం రూ. 960!
ఇవాళ ఐఐటీ, ఐఏఎం చేసిన వాళ్లు ఏం రేంజ్లో ప్యాకేజ్‌లు తీసుకుంటారో తెలిసిందే. ఎవరి నోట చూసినా.. ఇన్నేసి లక్షలు, కోట్లు అని మాత్రమే వింటుంటాం. అలాంటిది అమెరికాలో కెమికల్ ఇంజనీరింగ్ చేస్తే..ఇంక ఏ రేంజ్లో జీతం ఉంటుంతో చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది అతడు ఎంత జీతం తీసుకున్నాడో వింటే మతిపోవడం ఖాయం. అందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట షేర్ వైరల్‌గా మారింది. సిండికేట్ బ్యాంక్ మాజీ ఛైర్మన్ అజయ్ నానావతి ఆ పోస్ట్‌ని షేర్ చేశారు. ఆయన లింక్డ్ఇన్ పోస్ట్‌లో తాను అమెరికాలో కెమికల్ ఇంజనీరింగ్ చదివి భారతదేశానికి తిరిగి రాగానే తనను నియమించుకోవడానికి ఎన్నో కంపెనీలు ఎగబడతాయని అనుకున్నానంటూ రాశారు. కానీ తన మొదటి నియామక పత్రాన్ని పంచుకుంటూ..1977లో టాటాలో తన మొదటి ఉద్యోగ జీతం కేవలం రూ. 960లు అని చెప్పారు. అది తెలుసుకుని బహుళజాతి సంస్థలో మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న తన తండ్రి సైతం అవాక్కయ్యరని అన్నారు. కానీ ఆయన ఆ టాటా జాబ్ ఆఫర్‌ని అంగీకరించమనే ప్రోత్సహించారని తెలిపారు. అదే సమయంలో తనకు పలు కంపెనీల నుంచి అంతకుమించి ఎక్కువ జీతాలిస్తామని ఆఫర్లు కూడా వచ్చాయన్నారు. అయితే శాలరీ కంటే బాంబే హౌస్‌లో పనిచేసే అవకాశం ముఖ్యం కావడంతో తాను టాటానే ఎంచుకున్నట్లు వెల్లడించారు. కానీ ఇవాళ వెనక్కి తిరిగి చూసుకుంటే బహుశా అదే అత్యంత తెలివైన కెరీర్ నిర్ణయమని అన్నారు నానావతి. సామర్థ్యాన్ని అనుసరించే జీతం వస్తుందనేది తన నమ్మకమని నొక్కిచెప్పారు. అయితే ప్రస్తుత నియామకాల వాతావరణంలో చాలామంది యువ నిపుణులు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, కన్సల్టింగ్, ప్రైవేట్ ఈక్విటీ తదితర రంగాలను ముందుగా జీతం అనే కోణంలోనే చూస్తున్నారని నానావతి అన్నారు. అయితే, ఆయన మాత్రం కెరీర్ తొలినాళ్లలో సంపాదించడంపై కంటే నేర్చుకోవడంపైనే ఫోకస్ పెట్టమని అన్నారు. అధిక జీతం కోసం వెంపర్లాడే ముందు, యువ నిపుణులు తమ రంగంలో లోతైన నైపుణ్యాన్ని పెంచుకోవాలని, అసాధారణమైన నాయకులతో కలిసి పనిచేయాలని, సవాలుతో కూడిన వాతావరణాలను కోరుకోవాలని, సరైన విచక్షణ , విశ్వనీయతను పెంచుకోవాలంటూ తన పోస్ట్‌ని ముగించారు. అయితే ఈ పోస్ట్‌తో నెటిజన్లు ఏకభవించడమే గాక, అనుభవజ్ఞులైన ఉద్యోగులు సైతం జీతభత్యాలకు వాల్యూ ఇవ్వడం కంటే జిజ్ఞాస, అభ్యాసం, సంస్థాగత సంస్కృతి, లక్ష్యం, విలువలే ముఖ్యమని అన్నారు. ఆ తర్వాత ఆటోమేటిగ్గా ఆరోగ్యం, సంపద రెండూ కాలక్రమేణ పెరుగుతాయని అన్నారు.(చదవండి: 97 ఏళ్ల వయసులో ఆకాశంలోకి దూసుకెళ్లి..గిన్నిస్ రికార్డు!) -
బ్లాక్ డ్రెస్‌లో గోల్డెన్ హార్ట్.. ఈషా రెబ్బ స్టన్నింగ్ లుక్స్!(ఫొటోలు)
-
గాల్లో నరకం.. ఒక్క క్షణం ప్రాణాలపై ఆశలు వదిలేసుకున్నాం!
ప్రశాంతంగా సాగుతున్న విమాన ప్రయాణం.. అంతలోనే ఒక్కసారిగా భారీ కుదుపులు. క్షణాల్లోనే ప్రయాణికులు గాల్లోకి ఎగిరిపడ్డారు. లగేజీ బిన్లు తెరుచుకున్నాయి.. క్యాబిన్ ప్యానెల్స్ ఊడిపోయాయి.. కేకలు, ఆందోళనలతో విమానం భయానక దృశ్యంగా మారింది. ఫుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రయాణికులకు జీవితాంతం గుర్తుండిపోయే భయాన్ని మిగిల్చింది.ఎయిర్ ఇండియాకు చెందిన విమానం మంగళవారం థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. విమానంలో 137 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. ప్రయాణం మధ్యలో క్రూజింగ్ దశలో ఉన్న సమయంలో విమానం ఒక్కసారిగా తీవ్ర టర్బులెన్స్‌కు(కుదుపు) గురైంది. దీంతో గాయాల పాలైన ప్రయాణికులు.. ప్రాణభీతితో వణికిపోయారు. కొందరు ప్రయాణికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎలాంటి ముందస్తు హెచ్చరిక జారీ కాలేదు. హఠాత్తుగా విమానం భారీగా ఊగిపోయింది. ఒక్కసారిగా విమానం కిందకు పడిపోయినట్లు అనిపించింది. కొందరు ప్రయాణికులు సీట్ల నుంచి పైకి ఎగిరి పైభాగాన్ని ఢీకొన్నారు. క్యాబిన్లో లగేజీ కిందపడటం, ఓవర్‌హెడ్ బిన్లు దెబ్బతినడం, ప్యానెల్స్ ఊడిపోవడం వంటి పరిస్థితులు కనిపించాయి. ప్రయాణికులు భయంతో కేకలు వేయగా.. కొందరు ప్రార్థనలు చేస్తూ కనిపించారు.మేము బతకమని అనుకున్నాంఇటలీకి చెందిన వివియానా అనే ప్రయాణికురాలు తన అనుభవాన్ని వివరిస్తూ.. “ఒక్కసారిగా టర్బులెన్స్ మొదలైంది. నా సోదరి సీటు నుంచి గాల్లోకి ఎగిరిపోయింది. నా తల్లి తలకు గాయమైంది. వెనుక కూర్చున్న పలువురికి గాయాలయ్యాయి. ఓ ప్రయాణికుడి ముఖంపై రక్తం కనిపించింది. మేము చనిపోతామని అనుకున్నాం” అంటూ ఆ భయానక క్షణాలను గుర్తుచేసుకుంది.మరో ప్రయాణికుడు మాట్లాడుతూ.. తన తండ్రి సీటు నుంచి పైకి ఎగిరి విమానం పైభాగానికి తగిలి కిందపడ్డారని తెలిపాడు. తన భార్య, రెండేళ్ల చిన్నారి కూడా గాల్లోకి ఎగిరిపడి గాయపడ్డారని, ఈ ఘటన తమకు “పునర్జన్మలా అనిపించింది” అని చెప్పాడు.వీడియోలు తీయొద్దన్నారుఈ ఘటనపై విమానంలో ప్రయాణించిన కంటెంట్ క్రియేటర్ శిల్పి జైన్ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. విమానం కూలిపోతుందేమోనని భయపడ్డామని, ఆ సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నామని చెప్పారు. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయొద్దని సిబ్బంది కోరారని, ఎయిర్‌లైన్ ప్రతిష్ఠ దెబ్బతింటుందని చెప్పినట్లు ఆరోపించారు. ల్యాండింగ్ తర్వాత కూడా వెంటనే వైద్య సాయం అందలేదని, కొంతమంది ప్రయాణికులు సహాయం కోసం వేచి చూడాల్సి వచ్చిందని శిల్పి జైన్ పేర్కొన్నారు. 17 మందికి గాయాలుఈ ఘటనలో మొత్తం 17 మంది గాయపడగా.. వారిలో నలుగురు క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. విమానం ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత గాయపడిన వారిని వైద్య పరీక్షల కోసం తరలించారు. కొందరిని ఆస్పత్రుల్లో చేర్చారు. ఎయిర్ ఇండియా స్పందిస్తూ.. ప్రయాణ సమయంలో కొద్దిసేపు తీవ్ర టర్బులెన్స్ ఎదురైందని, ప్రయాణికులు, సిబ్బందికి అవసరమైన సహాయం అందిస్తున్నామని తెలిపింది. తీవ్రమైన ప్రాణాపాయం లేదని పేర్కొంది. ఘటనపై స్పందించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు.. ఢిల్లీలోని ఆసుపత్రికి వెళ్లి గాయపడిన ప్రయాణికులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.టర్బులెన్స్ ఘటనలు పెరుగుతున్నాయా?ఇది ఇటీవలి కాలంలో నమోదైన మరో తీవ్రమైన టర్బులెన్స్ ఘటన. 2026లోనే ఆస్ట్రేలియా నుంచి హాంకాంగ్ వెళ్తున్న క్యాథే పసిఫిక్ విమానం తీవ్ర టర్బులెన్స్‌కు గురై 10 మంది గాయపడ్డారు. అంతకుముందు 2025లో డెల్టా ఎయిర్‌లైన్స్ విమానం తీవ్ర టర్బులెన్స్ కారణంగా అత్యవసరంగా దారి మళ్లించాల్సి వచ్చింది. ఆ ఘటనలో 25 మంది వరకు గాయపడ్డారు. వాతావరణ మార్పులు, గాలి ప్రవాహాల్లో అనూహ్య మార్పుల కారణంగా తీవ్రమైన టర్బులెన్స్‌లు మరింత తరచుగా ఎదురవుతున్నాయనే చర్చ కూడా జరుగుతోంది. ప్రయాణికులకు మరోసారి హెచ్చరికఈ ఘటన మరోసారి విమానంలో ఉన్నప్పుడు సీటు బెల్ట్ ధరించడం ఎంత ముఖ్యమో గుర్తు చేసింది. సాధారణంగా విమానం గాల్లో ఉన్నప్పుడు చిన్న కుదుపులు సహజమే అయినా.. ఇలాంటి ఆకస్మిక టర్బులెన్స్‌లు ఊహించని ప్రమాదాలకు దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని నిమిషాల గందరగోళం.. 145 మందికి పైగా ప్రయాణికుల జీవితాల్లో మాత్రం మరచిపోలేని భయానక అనుభవంగా మిగిలిపోయింది. -
పట్టుచీరలో బుట్టబొమ్మలా తెలుగు హీరోయిన్ (ఫొటోలు)
-
వయసుతో పాటు అందమూ పెరుగుతోంది! (ఫొటోలు)
-
కింద రొమాన్స్.. పైన హారర్!
పెళ్లి అనేది జీవితంలో ఓ మధుర జ్ఞాపకం. ఆ క్షణాలను మరింత అందంగా మలుచుకునేందుకు ఇప్పుడు చాలా మంది జంటలు ప్రీ వెడ్డింగ్ షూట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రత్యేకమైన లొకేషన్లు, అద్భుతమైన విజువల్స్ కోసం కొందరు వేల నుంచి లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తూ.. దేశాలు దాటి మరీ ఫొటోషూట్లు చేయించుకుంటున్నారు. ప్రేమను, అనుబంధాన్ని అందమైన ఫ్రేమ్‌లలో బంధించేందుకు చేసే ఈ ప్రయత్నాలు ఒక్కోసారి ఊహించని మలుపులు తీసుకుంటాయి. అలాంటి ఓ ప్రీ వెడ్డింగ్ ఫొటోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందమైన ప్రేమ దృశ్యంగా ఉండాల్సిన ఆ చిత్రం.. చూసిన వారిని కాసేపు భయపెట్టించింది. ఫొటోలో కనిపించిన ఓ వింత దృశ్యం.. “అక్కడ ఎవరైనా వేలాడుతున్నారా?” అనే అనుమానాన్ని రేకెత్తించింది. అయితే అసలు విషయం తెలుసుకున్న తర్వాత ఇదంతా కెమెరా యాంగిల్ చేసిన మాయ అని తేలింది. అసలు ఆ ఫొటోలో ఏం కనిపించింది? నెటిజన్లు ఎందుకు షాక్ అయ్యారు?బాలికి చెందిన ఫొటోగ్రఫీ సంస్థ లెమురియాంట్స్(Lemuriarts).. టెడ్డీ, స్టెఫానీ అనే జంట ప్రీ వెడ్డింగ్ షూట్లో భాగంగా తీసిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందమైన ప్రదేశంలో ఆ జంట నడుచుకుంటూ వెళ్తున్న ఆ ఫొటో మొదటి చూపులో చాలా సాధారణంగానే కనిపించింది. కానీ ఫొటో పైభాగాన్ని గమనించిన కొందరు నెటిజన్లకు మాత్రం ఓ వింత విషయం కనిపించింది. ఆకాశంలో గాల్లో వేలాడుతున్నట్లుగా కనిపించిన రెండు కాళ్లు అందరి దృష్టిని ఆకర్షించాయి.“ఎవరైనా వేలాడుతున్నారా?”ఫొటో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. “అక్కడ ఎవరో వేలాడుతున్నట్లు కనిపిస్తోంది” అంటూ కొందరు కామెంట్లు చేశారు. మరికొందరు “మొదటిసారి చూసినప్పుడు భయమేసింది” అంటూ తమ అనుభవాన్ని పంచుకున్నారు. ఈ ఫొటో ఎక్స్ (X)లోనూ వైరల్‌గా మారింది. లక్షలాది మంది వీక్షించడంతో.. ఆ వింత దృశ్యంపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.రొమాన్స్ కింద.. హారర్ పైన!ఫొటోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. “ఒకే ఫొటోగ్రాఫర్.. కింద రొమాన్స్, పైన హారర్” అంటూ కొందరు సరదాగా కామెంట్లు చేశారు. మరికొందరు “ఇది క్రైమ్ సీన్ ఫొటోలా కనిపిస్తోంది” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.అసలు నిజం ఏంటంటే..అయితే ఫొటోను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత అసలు విషయం బయటపడింది. అవి ఎవరో వేలాడుతున్న కాళ్లు కాదని, కెమెరా యాంగిల్ వల్ల అలా కనిపించాయని నెటిజన్లు గుర్తించారు. కొంతమంది ప్రకారం.. ముందుభాగంలో నిచ్చెనపై నిలబడి ఉన్న వ్యక్తి కాళ్లు, ఫొటో తీసిన కోణం కారణంగా గాల్లో వేలాడుతున్నట్లుగా కనిపించాయి. జంటపై ఫోకస్ చేయడం, బ్యాక్‌గ్రౌండ్ దూరం కారణంగా ఈ వింత భ్రమ ఏర్పడింది.కెమెరా యాంగిల్ చేసిన మాయనిజానికి ఈ ఫొటోలో ఎలాంటి భయానక ఘటన లేదని స్పష్టమైంది. కేవలం సరైన కోణంలో పడిన చిత్రం.. వేలాది మందిని క్షణం పాటు అయోమయానికి గురిచేసింది. ప్రేమ జంట జ్ఞాపకంగా తీసిన ఓ ప్రీ వెడ్డింగ్ ఫొటో.. చివరకు సోషల్ మీడియాలో “మిస్టరీ ఫొటో”గా మారడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
కొండ కోనల్లో టాలీవుడ్ హీరోయిన్ ఎంజాయ్ (ఫొటోలు)
-
దోమలు, నల్లులు.. హైదరాబాద్ ఐఐటీలో చేదు అనుభవం!
భారతదేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ హైదరాబాద్‌లో చేరిన ఓ జపాన్ విద్యార్థిని అనుభవాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. భారత్‌కు వచ్చిన ఆనందంతో పాటు.. హాస్టల్ వసతిలో ఎదురైన సమస్యలను కూడా ఆమె ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా పంచుకోవడంతో ఈ అంశం వైరల్‌గా మారింది.ఐఐటీ హైదరాబాద్‌లో తాను తొలి జపాన్ విద్యార్థినినని చెప్పుకున్న హిరో(Japan Student Hiro).. భారత్‌లో తన మొదటి వారం అనుభవాలను వీడియో రూపంలో పంచుకుంది. విమాన ప్రయాణం నుంచి క్యాంపస్ చేరుకునే వరకు జరిగిన విషయాలను వివరించిన ఆమె.. ఐఐటీ హైదరాబాద్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సెల్ నుంచి లభించిన స్వాగతంపై ప్రశంసలు కురిపించింది. భారత్‌కు రావడం ఎంతో ఉత్సాహంగా అనిపించిందని చెప్పిన హిరో.. క్యాంపస్‌లో తనకు మంచి స్వాగతం లభించిందని పేర్కొంది. కొత్త స్నేహాలు, కొత్త వాతావరణం తనకు ప్రత్యేక అనుభూతిని ఇచ్చాయని తెలిపింది.అయితే ఈ ఆనందంతో పాటు కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యాయని ఆమె వెల్లడించింది. హాస్టల్ గదిలో సమస్యలు ఉన్నాయని, మంచంపై చనిపోయిన పురుగులు కనిపించాయని చెప్పింది. అంతేకాకుండా దోమకాట్ల కారణంగా తీవ్ర ఇబ్బంది పడ్డానని, నల్లులతో అలర్జీ రావడంతో భారత్‌లో తొలిసారి ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చిందని వివరించింది.తన హాస్టల్ గది పరిస్థితులను చూపిస్తూ ఆమె చేసిన వీడియోలో వసతి సమస్యలను ప్రస్తావించింది. అయితే ఐఐటీ హైదరాబాద్ మొత్తం అనుభవాన్ని ప్రతికూలంగా చూపించకుండా.. ఒకవైపు సంస్థ నుంచి లభించిన సహకారాన్ని, మరోవైపు ఎదురైన సవాళ్లను సమతుల్యంగా వివరించింది. హిరో ఈ వీడియోతో పాటు తన అనుభవానికి సంబంధించిన రెండో భాగాన్ని కూడా త్వరలో పంచుకుంటానని తెలిపింది. ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.హిరో వీడియో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు ఆమెకు పలు సూచనలు చేశారు. కొత్త దేశంలో చదువుకునేందుకు వచ్చినప్పుడు ఎదురయ్యే చిన్న చిన్న ఇబ్బందులను ఓపికగా ఎదుర్కోవాలని, ఏదైనా సమస్య ఉంటే నేరుగా ఐఐటీ హైదరాబాద్ యాజమాన్యం, అంతర్జాతీయ విద్యార్థుల విభాగం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. పరువు లాంటి సదుపాయాలు విద్యార్థులే ఏర్పాటు చేసుకుంటారని.. ఆమె కొన్న పరుపు సరైంది ఉండకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు.. హాస్టల్ పరిశుభ్రత, వసతి సమస్యలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో పాటు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తే త్వరగా పరిష్కారం లభిస్తుందని తెలిపారు. అలాగే భారతీయ సంస్కృతి, వాతావరణానికి అలవాటు పడేందుకు కొంత సమయం పడుతుందని, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని హిరోకు సూచించారు. అదే సమయంలో ఇంకొందరు నెటిజన్లు మాత్రం విదేశీ విద్యార్థులు ఎదుర్కొనే ఇలాంటి సమస్యలపై విద్యాసంస్థలు మరింత శ్రద్ధ పెట్టాలని అభిప్రాయపడ్డారు.ఐఐటీ హైదరాబాద్ స్వాగతానికి ఫిదా అయిన జపాన్ విద్యార్థిని.. హాస్టల్లో ఎదురైన దోమలు, పురుగుల సమస్యలను బయటపెట్టడంతో ఆమె అనుభవం ఇప్పుడు వైరల్‌గా మారింది. దీనిపై నిర్వాహకులు ఏమైనా స్పందిస్తారేమో చూడాలి. -
మటన్ నల్లీ వివాదంలో నలిగిన పెళ్లి!
‘పెళ్లి బాజాలు మోగాయి.. తలంబ్రాలు పడాల్సిందే.. కానీ, ఇంతలోనే పన్నీర్ ముక్క ప్లేట్లో పడలేదు! మటన్ నల్లీ కనబడలేదు! ఇంకేముంది.. అప్పటి వరకు సందడిగా కనిపించిన వివాహ వేదిక.. ఒక్కసారిగా రణరంగంగా మారిపోయింది. ఫైనల్‌గా పెళ్లి క్యాన్సిల్. ఒక్కటి కావాల్సిన జంట చెరోదారిన వెనుదిరిగింది. వినడానికి వింతగా ఉన్నా ఇదే నిజం. ఈ మధ్యకాలంలో ఇలాంటి అనూహ్యమైన విచిత్రాలు, ఊహించని వివాదాలు తరచుగా ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో మారుమోగుతూనే ఉన్నాయి. అలాంటి కొన్ని సంఘటనలు..మటన్ నల్లీ వివాదం.. తెలంగాణలో జరిగిన ఈ సంఘటనలో వధువు తరఫు వారు ఏర్పాటు చేసిన నాన్ వెజ్ మెనూలో మటన్ బోన్ మ్యారో లేకపోవడమే గొడవకు ప్రధాన కారణం. దీనిని తమకు అవమానంగా భావించిన వరుడు కుటుంబ సభ్యులు వివాహాన్ని రద్దు చేస్తున్నట్లు అనూహ్యమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. దీంతో జీవితాంతం ఒక్కటిగా ఉండాల్సిన బంధం పెళ్లిపీటల దగ్గరే తెగిపోయింది.మటర్ పన్నీర్లో ‘పన్నీర్’ ఏది?సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ సంఘటనలో మటర్ పన్నీర్ కూర ఘర్షణకు దారితీసింది. అతిథులు ఎంతో ఇష్టంగా తినే పన్నీర్ డిష్‌లో అసలు పన్నీర్ ముక్కలే కనిపించకపోవడంతో వివాదం మొదలైంది. వధువు, వరుడి తరఫు బంధువుల మధ్య చిన్నగా ప్రారంభమైన మాటల యుద్ధం కాస్తా .. దాడిచేసుకునే వరకు వెళ్లి పెళ్లి ఆగిపోయింది.స్నేహితుల మాటతో పెళ్లి క్యాన్సిల్స్నేహితుల సలహాతో వధువు తన వివాహాన్ని రద్దు చేసుకున్న విచిత్ర సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. 20 ఏళ్ల యువతికి ఆమె కుటుంబ సభ్యులు 30 ఏళ్ల మేనబావతో వివాహం నిశ్చయించారు. అయితే తన స్నేహితులతో చర్చించిన అనంతరం, ఈ సంబంధం సరికాదని భావించిన వధువు పెళ్లిని రద్దు చేసుకుంది.డబ్బులు లెక్కించలేదని!ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లాలో డబ్బులు లెక్కపెట్టలేని వరుడిని చూసి వధువు పెళ్లిని రద్దు చేసుకుంది. వివాహ తంతు జరుగుతుండగా వరుడి ప్రవర్తనపై పూజారికి అనుమానం వచ్చి వధువు కుటుంబానికి సమాచారం ఇచ్చాడు. సందేహంతో వరుడికి కొన్ని కరెన్సీ నోట్లు ఇచ్చి లెక్కపెట్టమనగా, అతడు లెక్కపెట్టలేక నిలబడిపోయాడు. దీంతో వరుడి మానసిక స్థితి సరిగ్గా లేదనే నిజాన్ని అతని కుటుంబం దాచిపెట్టిందని గ్రహించి వధువు వివాహాన్ని రద్దు చేసుకుని పెళ్లిపీటల నుంచే వెళ్లిపోయింది.డ్యాన్స్ వద్దనడంతో..పెళ్లి ఊరేగింపులో వధువు డ్యాన్స్ చేయడాన్ని వరుడు నిరాకరించాడని.. పెళ్లిని రద్దు చేశాడు వధువు తండ్రి. ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురంలో చోటుచేసుకున్న ఈ సంఘటనలో చిన్న విషయంలో మొదలైన వివాదం పెళ్లి ఆగిపోయేలా చేసింది. పెళ్లి వేడుకలో భాగంగా ఇరువైపుల కుటుంబ సభ్యులు, బంధువులు డ్యాన్స్‌లు చేస్తుండగా.. వధువరులిద్దరినీ డ్యాన్స్ చేయాల్సిందిగా వారి స్నేహితులు కోరారు. దీనికి వరుడు నిరాకరించడంతో పాటు వధువు డ్యాన్స్ చేయడాన్ని కూడా వరుడు నిరాకరించాడు. దీంతో వధువు తండ్రి పెళ్లిని రద్దు చేశాడు. విందులో వంటకాల పట్ల వచ్చిన చిన్నపాటి అసంతృప్తులు హాస్యంగా అనిపించినప్పటికీ, పెళ్లి సంబంధాల్లో పారదర్శకత లోపించడం, నిజాలు దాచడం వంటి విషయాలు పీటల మీద పెళ్లిళ్లు ఆగడానికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. -
చిన్న పిల్లలా వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ (ఫొటోలు)
-
వింటేజ్ కెమెరాతో వింటేజ్ స్టైల్లో మానస (ఫొటోలు)
-
ట్రెడిషనల్ లుక్‌లో కట్టిపడేసిన అందాల భామ రజిష విజయన్ (ఫొటోలు)
-
బోరున వర్షం.. వీఐపీనే గొప్ప!
జోరున వర్షం.. బస్ షెల్టర్‌లో నిల్చున్న ప్రజలు.. ఇంతలో వీఐపీ కాన్వాయ్ వస్తుందనే సమాచారం. అక్కడ ఉండకూడదంటూ ప్రజల్ని పోలీసులు పక్కకు తరిమేసిన దృశ్యాలు. దీనికి సంబంధించిన 23 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వర్షం కురుస్తున్న సమయంలో బస్ షెల్టర్‌లో ఆశ్రయం పొందుతున్న ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులను పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరుతూ బయటకు పంపించారు. కొందరిని నెట్టివేస్తున్నట్లు వీడియోలో కనిపించడం వివాదానికి కారణమైంది. రాజస్థాన్ జైపూర్‌లోని జేఎల్ఎన్ మార్గ్‌లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.వీఐపీ ప్రోటోకాల్.. ప్రజల హక్కుల కంటే పెద్దదా?ప్రజల పన్నుల డబ్బుతో నిర్మించిన బస్ షెల్టర్‌లోనే ప్రజలకు చోటు లేకుండా చేయడం ఏంటంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వీఐపీ భద్రత పేరుతో సామాన్యుల ఇబ్బందులను పట్టించుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.Indian policemen are removing people from under the shed because some lowlife VIP is about to pass by. Feudalism is not a system. It is about the DNA. People don't rebel and vote for psychopaths. Policemen from the lower caste implement what they claimed to have suffered.…— Jayant Bhandari (@JayantBhandari5) July 29, 2026సోషల్ మీడియా వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ స్పందిస్తూ..“ప్రజల పన్నుల డబ్బుతో నిర్మించిన బస్ స్టాప్‌లో కూడా ప్రజలు నిలబడలేని పరిస్థితి వచ్చింది. కారణం.. వీఐపీ ప్రోటోకాల్” అంటూ విమర్శించింది. “భారీ వర్షంలో తలదాచుకునేందుకు బస్ షెల్టర్‌లో ఉన్న పాదచారులు, బైక్ రైడర్లను ప్రజల రక్షకులుగా ఉండాల్సిన పోలీసులే బయటకు పంపించడం సిగ్గుచేటు. వీఐపీ ప్రోటోకాల్ మానవత్వం కంటే గొప్పదా? లేక సామాన్యుడికి ఆశ్రయం పొందే హక్కు లేదా?” అంటూ ప్రశ్నించింది.సోషల్ మీడియాలో దుమారంఈ ఘటనపై నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. ప్రజల కోసం ఏర్పాటు చేసిన సదుపాయాలను వీఐపీ రాకపోకల కోసం అడ్డుకోవడంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వీఐపీ భద్రత అవసరమే అయినప్పటికీ.. సాధారణ ప్రజల పట్ల కనీస మానవత్వం, గౌరవం పాటించాల్సిందేనని పలువురు కామెంట్లు చేస్తున్నారు.అయితే ఈ ఘటనపై రాజస్థాన్ పోలీసుల నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. అలాగే ఆ కాన్వాయ్ ఎవరిదన్న వివరాలు కూడా ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. -
శ్రీదేవి విజయ్ కుమార్ శ్రీలంక ట్రిప్ (ఫొటోలు)
-
మల్లెపూలు.. వడ్డాణంతో అందంగా రుక్మిణి (ఫొటోలు)
-
'నీట్' వైరల్ గర్ల్.. ఇన్ స్టాతో రూ.10 లక్షల సంపాదనా?
నీట్ పేపర్ లీకేజీ విషయమై కొన్నిరోజుల క్రితం వరకు దేశవ్యాప్తంగా ఎంతలా విద్యార్థి నిరసనలు జరిగాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ ప్రధాన్ రాజీనామా చేయడంతో అంతా సద్దుమణిగింది. అయితే గత బుధవారం ముంబైలో నిరసన జరుగుతున్న టైంలో పోలీస్ వ్యాన్ని అడ్డుకుని ఓ అమ్మాయి తెగ వైరల్ అయిపోయింది. ఆమెనే రియా యాదవ్. ఈమె నటి, మోడల్ అయిన ఈమె వైరల్ ఫొటోని సెలబ్రిటీలు కూడా షేర్ చేశాడు. అయితే తనకొచ్చిన ఫేమ్‌ని క్యాష్ చేసుకునేందుకు ఇన్‌స్టాలో సబ్స్క్రిప్షన్ మొదలుపెట్టిందని, ఏకంగా రూ.10 లక్షల వరకు సంపాదించేసిందని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. ఈ వ్యాఖ్యలు ఆమె చెవినపడేసరికి ఘాటుగా స్పందించింది.(ఇదీ చదవండి: నటుడు చనిపోయిన 16 ఏళ్లకు సొంతింటి కల సాకారం)'ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ ద్వారా నేను ఎలాంటి ఆదాయం పొందలేదు. చెప్పాలంటే ఇప్పటికే వచ్చిన ఆదాయాన్ని స్వీకరించేందుకు నా బ్యాంక్ ఖాతాని కూడా ఇన్ స్టాకి కనెక్ట్ చేయలేదు. నిజాలు తెలుసుకోకుండా నాపై విమర్శలు చేస్తున్నవారు.. జీవితంలో ఏదైనా సాధించకుండా ఇతరులపై ఆరోపణలు చేయడం సులభమే. నాపై విమర్శలు చేస్తున్న వారిలో ఒక్కరూ నాతో ప్రత్యక్షంగా మాట్లాడలేదు. ఎలాంటి పరిచయం కూడా లేదు''ఈ విషయంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. నాపై లేదా మరెవరిపైనా నెగిటివ్, సైబర్ వేధింపులకు సంబంధించిన పోస్టులు కనిపిస్తే వాటిని రిపోర్ట్ చేయండి. పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతే ఓ అభిప్రాయం ఏర్పరుచుకోండి. పౌరుల హక్కుల కోసం నిలబడటంతో పాటు తోటి పౌరుల పట్ల బాధ్యతతో వ్యవహరించడం కూడా అంతే ముఖ్యం. నేను తీసుకున్న వైఖరి ఉద్దేశం అదే. సత్యమేవ జయతే' అని రియా యాదవ్ పోస్ట్ పెట్టింది.రియా యాదవ్ ఎవరు?రియా యాదవ్ నిరసనకారిణి మాత్రమే కాదు. నటి, మోడల్, వ్యాపారవేత్తగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఈమె సోషల్ మీడియా ప్రొఫైల్ ప్రకారం.. మ్యూజిక్ వీడియోల్లో నటించింది. చేతితో తయారు చేసే దుస్తుల కోసం 'రిహియాసత్' పేరుతో ఓ వ్యక్తిగత బ్రాండ్ కూడా నిర్వహిస్తోంది. మొన్నటివరకు రూ.140 నెలవారీ రుసుముతో సబ్స్క్రిప్షన్ ఉంచిన ఈమె.. ఇప్పుడు విమర్శలు రావడంతో దానిని పూర్తిగా తొలగించింది.(ఇదీ చదవండి: చెన్నైలో 'జన నాయగన్' షోలకు బ్రేక్.. కారణమేంటంటే?) View this post on Instagram A post shared by ʀʜɪʏᴀ ʏᴀᴅᴀᴠ (@rhiyaahir) -
'44 ఏళ్లకే జీవితం మొదలవుతుంది': ఓప్రా సలహాపై త్రిష రిప్లై ఇదే..!
వృద్ధాప్య, స్వీయ అభివృద్ధికి సంబంధించిన పోస్ట్‌ని త్రిషా కృష్ణన్ షేర్ చేశారు. ఆ పోస్ట్‌లో మీడియా ఐకాన్ ఓప్రా విన్ఫ్రే వృద్ధాప్యం, స్వీయ ఆవిష్కరణ, వ్యక్తిగత ఎదుగుదలపై ఆమె చర్చిస్తున్న వీడియో క్లిప్‌ని రీట్వీట్ చేస్తూ..ఇలా రాశారు. ఆ వీడియోలో క్లిప్‌లో ఓప్రా కీకీ పామర్ పాడ్‌కాస్ట్ 'బేబీ, దిస్ ఈజ్ కీకీ పామర్'కనిపిస్తారు. అక్కడ ఆమె, జీవితంలో తాను ఏ దశకు తిరిగి వెళ్లాలనుకుంటున్నారో తన అభిప్రాయాలను పంచుకుంటుంది. మళ్లీ 30 ఏళ్ల వయస్సులో ఉండాలనుకుంటున్నారా అని ప్రశ్నించగా, ఓప్రా ఇలా సమాధానమిచ్చారు. లేదు తాను తిరిగి 30 ఏళ్ల వయస్సులో ఉండాలనుకోవడం లేదన్నారు. ఎందుకంటే ఇతరులను మెప్పించడానికి ప్రయత్నించడం మానేసే విధంగా మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు. తాను ఇప్పుడు మార్గదర్శకత్వం వహించిన 30 ఏళ్ల ప్రారంభంలో ఉన్న కొందరు అమ్మాయిలు ఇంతకంటే ముందే దీనిలోకి వచ్చారు, కానీ తన విషయానికొస్తే 44 ఏళ్ల వయసులో తెలుసుకున్నా. ఫలితంగా తన ఎదుగుదలను తానే స్వయంగా చూడగలిగానంటోంది. ఎందుకంటే ఇతరుల కోసం, ఇతరుల్లా కనిపించడం కోసం గానీ పనిచేయడం..పూర్తి పట్టుదలతో ఒక లక్ష్యంతో తన కోసం తను జీవించడం నేర్చుకున్నా.. అంటూ తన సంభాషణను ముగిస్తుంది ఓప్రా . ఈ వీడియో క్లిప్‌ని షేర్ చేస్తూ.."ఆమెన్" అనే ఒక్క పదంతో రీపోస్ట్ చేశారు. గత మే4నే ఈ బ్యూటీ 43వ పుట్టినరోజు జరుపుకుంది. అది జరిగిన రెండు నెలలకే ఈ పోస్ట్ రావడంతో సర్వత్రా ఈ విషయం హాట్‌టాపిక్‌గా మారింది. కాగా, దక్షిణాది సినిమా రంగంలో అత్యంత ప్రసిద్ధి చెందిన తారలలో ఒకరైన త్రిష, రెండు దశాబ్దాలకు పైగా అగ్ర కథనాయికగా కొనసాగారు. అనేక విజయవంతమైన తెలుగు, తమిళ చిత్రాలలో మెరిశారు, అలాగే అత్యంత ప్రజాదరణ పొందిన కథనాయికగా వెలుగొందుతున్నారు.(చదవండి: ఫ్లైట్ జర్నీలో ఫేస్ షీట్‌మాస్క్‌తో త్రిష..ఇది చర్మానికి మంచిదేనా?) -
రాజీనామా ఖుషీ.. హుషారుగా స్టెప్పులేసిన సీజేపీ లీడర్స్
నీట్ పేపర్ లీకేజీ.. విద్యార్థుల ఆత్మహత్యలు.. మంత్రి రాజీనామా అంశంతో ఆందోళనలు చేపట్టిన కాక్రోచ్ జనతా పార్టీ తమ డిమాండ్లు నెరవేరడంతో రిలాక్స్ అయ్యింది. గత రాత్రి ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో ఆ పార్టీ నేతలు, పలువురు స్టూడెంట్స్ గ్రాండ్‌గా పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. రకరకాల వంటకాలతో.. డీజే పాటలతో హుషారెత్తించే స్టెప్పులేశారు. అయితే.. ఖుషీగా వాళ్లు చేసిన ఆ పార్టీపై ఇప్పుడు దుమారం రేగుతోంది.కొందరు అమ్మాయిలు(సీజేపీ ప్రతినిధులు/నీట్ అభ్యర్థులు?!) జోష్‌గా డ్యాన్సులు చేయగా.. అటు చర్చల్లో పాల్గొన్న అశుతోష్ రాంకా, సౌరబ్ దాస్ ఇద్దరూ కూడా హుషారుగా వాళ్లతో కలిసి స్టెప్పులు కలిపారు. అందరూ కలిసి హోటల్లో సంబురాల్లో మునిగిపోయారు. మరోవైపు.. సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే ఓ మూలన కూర్చుని పార్టీ చూస్తున్నట్లు వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. రాజీనామా సందర్భంగా ఖుషీ అంటూ ఆ పార్టీ అధికారిక ఎక్స్ ఖాతా నుంచే ఈ వీడియో(Resignation की ख़ुशी) పోస్ట్ కావడం గమనార్హం.Resignation की ख़ुशी 🥹 pic.twitter.com/QT4Y5j4cy6— Cockroach Janta Party (@CJP_for_India) July 26, 2026అయితే ఈ వీడియోపై పలువురు అభ్యంతరాలు.. ఇంకొందరు తిట్టిపోస్తున్నారు. నిరసనల్లో పాల్గొన్న కొందరు విద్యార్థులకు పార్లమెంట్ మార్చ్ సందర్భంగా గాయాలైన సంగతి తెలిసిందే. వాళ్లు కోలుకోకముందే కాక్రోచ్ నాయకత్వంలో ఉన్నవాళ్లు ఇలా పార్టీ చేసుకోవడానికి కొందరు తీవ్రంగా తప్పు బడుతున్నారు. నీట్ కారణంగా దేశవ్యాప్తంగా పలువురు అభ్యర్థులు బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో అసలు ఉద్యమం ఉద్దేశాన్ని నీరుగార్చేలా వీళ్ల తీరు ఉందంటూ మండిపడుతున్నారు.అదే సమయంలో యాంటీ నెటిజన్లు మాత్రం.. ఇది కాక్రోచ్ల నిజ స్వరూపం అంటూ మండిపడుతున్నారు. నిరసనల్లో ఆందోళనకారులకు అరటిపండ్లు, బ్రెడ్ పకోడీలు పంచుతూ గుర్తింపు పొందిన జునైద్ అనే యువకుడి గురించి కూడా పోస్టులు వైరల్ అవుతున్నాయి. ‘అభిజీత్ దీప్కే నా కాల్స్‌కు స్పందించడం లేదు’.. అంటూ అతను కంటతడి పెట్టిన ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది. షాదాబ్ సైఫీ సైతం ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆ జోష్ పార్టీలో కనిపించకపోవడంతో.. ఇలాంటి కొందరిని కేవలం తమ అవసరాలే దీప్కే వాడుకున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక వాంగ్‌చుక్ ప్రస్తావన లేకుండానే.. గత రెండ్రోజులుగా సీజేపీ వ్యవహరిస్తుండడమూ విమర్శలకు తావిస్తోంది. మరోవైపు.. అభిజీత్ దీప్కే తనకు టైఫాయిడ్ సోకిందని ట్రీట్మెంట్ ఫొటోలను వైరల్ చేశాడని.. కానీ సాయంత్రానికే ఇంటికి దగ్గర్లో ఉన్న హోటల్లో పన్నీర్ టిక్కా తింటూ ఎంజాయి చేస్తున్నాంటూ ఇంకొందరు మండిపడుతున్నారు. అయితే ఇటు ఈ యువతకు మద్దతుగా పోస్టులు చేసేవాళ్లు కొందరు కనిపిస్తున్నారు. -
టీసీఎస్ ఉద్యోగాన్ని కాదనుకుని రైస్ వ్యాపారం..! కట్‌చేస్తే ఏడాదికి..
కొన్ని సమయాల్లో కంఫర్ట్ జోన్ కంటే రిస్క్ తీసుకుంటేనే గొప్ప విజయాలను సొంత చేసుకోగలం. అలా చేసి ఎందరో విజేతలుగా నిలిచిన ఘటనలు చూశాం. అంత ముక్తకంఠంలో మహారిస్క్ అన్నా..తగ్గేదేలే అంటూ ముందుకు సాగి..అందర్నీ ఆశ్చర్యపరిచేలా సక్సెస్‌ని అందుకున్నారు. అలాంటి కోవకు చెందని వాడే ఈ వ్యక్తి. చాలామంది కోరుకునే డ్రీమ్ జాబ్‌ని కాదనుకుని ఎలాంటి వ్యాపారం రంగంలోకి దిగాడో వింటే నోటమాటరాదు.అందుకు సంబంధించిన విషయాన్ని అంకిత్ పాండ్ సోషల్‌మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ ఎక్స్పోస్ట్లో అంకిత్ పాండే ఇలా రాసుకొచ్చారు. తన స్నేహితుడు టీసీఎస్ క్యాంపస్ ప్లేస్‌మెంట్‌ని వద్దనుకుని మరి వ్యాపారం చేయాలి నిర్ణయించుకున్నాడు. మొదట అదడి నిర్ణయం విని స్నేహితులంతా తప్పు చేస్తున్నావంటూ విమర్శించారని చెప్పాడు. కానీ అతడు గ్రామాలు, రాష్ట్రాలలోని రైతుల నుంచి నేరుగా బియ్యాన్ని సేకరించి వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నాడు. అందుకోసం ఆ వ్యాపారవేత్త రైతుల నుంచి నేరుగా బియ్యాన్ని కొనుగోలు చేసి, దాన్ని శుభ్రపరిచి, దానికి తన సొంత బ్రాండ్ప్యాకేజీ చేయించాడు. వాటిని సుమారు 200 రిటైల్ దుకాణాలకు సరఫరా చేశారు. మధ్యవర్తులను తొలగించి, ఒక స్థిరమైన రిటైల్ నెట్‌వర్క్‌ను నిర్మించడం ద్వారా, ఆయన లాభదాయకమైన, నిలకడైనా వ్యాపారాన్ని సృష్టించారని సమాచారం.వ్యాపారం ట్రిక్ ఏంటంటే..రైతుల నుంచి కిలో బియ్యాన్ని రూ. 35ల చొప్పున కొనుగోలు చేస్తారు. ప్యాకేజింగ్‌కు, కిలోకు రూ. 3లు, రవాణా ఖర్చుకు మరో రూ. 2 అదనం. దీంతో మొత్తం ఖర్చు కిలోకు రూ. 40 అవుతుంది. అంటే ప్యాకేజీ చేసిన బియ్యాన్ని రిటైలర్లకు కిలోకు రూ. 50 చొప్పున అమ్ముతారు. రిటైలర్లు దానిని వినియోగదారులకు కిలోకు సుమారు రూ. 55–57 చొప్పున అమ్ముతారు. దీంతో అమ్మిన ప్రతి కిలోపై వారికి రూ. 10 లాభం వస్తుందని వివరంగా చెప్పుకొచ్చారు పోస్ట్‌లో. ప్రస్తుతం ఈ వ్యాపారం ప్రతి నెలా తమ రిటైల్ భాగస్వాములకు సుమారు 200 క్వింటాళ్లు, అంటే 20 వేల కిలోగ్రాముల బియ్యాన్ని సరఫరా చేస్తోందని పాండే అనఆనరు. ఈ గణాంకాల ఆధారంగా తన స్నేహితుడు సుమారు రూ. 25 లక్షలు సంపాదిస్తున్నాడని అంచనా వేశారు. అయితే నెటిజన్లు తీసుకునే రిస్క్‌ని బట్టి ఫలితం కూడా ఆస్థాయిలో ఉంటుందని సదరు వ్యక్తిని ప్రశంసించగా, మరికొందరు పైకి చూడటానికి సునాయాసంగా కనిపిస్తున్నా..టీసీఎస్ ఉద్యోగంతో పోలిస్తే..వ్యాపారం నుంచి లాభం పొందడం అనేది కొంచెం కష్టమే అంటూ పోస్టులు పెట్టారు.(చదవండి: స్విగ్గీ రైడర్‌గా వైద్యవిద్యార్థి..! కట్‌చేస్తే కోటీశ్వరుడిగా..) -
మోదీ మ్యాజిక్ ఇలాగే ఉంటుంది మరి!
నరేంద్ర మోదీ.. ఈ పేరుకు ఉన్న గ్లోబల్ క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రపంచ దేశాల అధినేతలు సైతం ఆయనతో కరచాలనం చేసేందుకు, సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపుతుంటారు. అంతర్జాతీయ వేదికలపై మోదీకి లభించే ఆదరణకు ఇదే నిదర్శం కూడా. అలాంటి వ్యక్తి తొలిసారి జాతిని ఉద్దేశించి.. అదీ నీట్‌లాంటి నిరసనల మీద సెల్ఫీ వీడియో పోస్ట్ చేస్తే స్పందన ఎలా ఉంటుందో ఊహించగలరా?. నీట్-యూజీ పేపర్ లీక్, పరీక్షల వ్యవస్థలో లోపాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారింది. విద్యార్థుల భవిష్యత్తు, పరీక్షల పారదర్శకతపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ గురువారం రాత్రి మోదీ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. అందులో.. పేపర్ లీక్‌పై ఆందోళనలను అర్థం చేసుకున్నామని, కఠిన చర్యలకు దిగుతున్నామని ప్రకటించారు. ఇకనైనా ఆందోళనలు విరమించాలి అంటూ పరోక్షంగా ఆయన నిరసనకారులకు విజ్ఞప్తి చేశారు. అయితే.. ఈ వీడియోకు భారీ స్పందన లభించింది. కోట్లాది మంది వీక్షణలు, లక్షల సంఖ్యలో స్పందనలతో ఆ వీడియో వైరల్‌గా మారింది.ప్రధాని మోదీ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఈ సెల్ఫీ వీడియోకు తక్కువ సమయంలోనే పెద్ద ఎత్తున వ్యూస్, లైక్స్, కామెంట్లు వచ్చాయి. సుమారు 25 కోట్ల మందికి పైగా ఈ వీడియోను వీక్షించగా.. 10 లక్షలకు పైగా కామెంట్లు, కోటిన్నరకు పైగా లైక్స్‌తో దూసుకుపోతోంది. అయితే అన్ని ప్లాట్‌ఫారమ్‌లతో కలిపి ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని తెలుస్తోంది. More strict actions against paper leaks to come in tomorrow’s Cabinet! pic.twitter.com/NRysBukk5U— Narendra Modi (@narendramodi) July 23, 2026నీట్ వివాదంపై వీడియో సందేశంలో స్పందించిన ప్రధాని.. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలను సహించేది లేదని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. యువత ఆశలు, భవిష్యత్తుతో ఎలాంటి రాజీ ఉండదని భరోసా ఇచ్చారు.ఈ వీడియోపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు కనిపించాయి. ప్రధాని సందేశాన్ని స్వాగతించిన పలువురు.. ఇది విద్యార్థులకు భరోసా ఇచ్చే ప్రయత్నమని పేర్కొన్నారు. మరోవైపు, ప్రతిపక్షాలు మాత్రం నీట్ వివాదంలో బాధ్యులపై చర్యలు, వ్యవస్థలో సమూల మార్పులపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి.శుక్రవారం రాత్రి మరో వీడియోను రిలీజ్ చేశారాయన. ఈసారి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన మోదీ.. “ధన్యవాదాలు మిత్రులారా. నిన్న (గురువారం) రాత్రి మీతో మాట్లాడే అవకాశం లభించింది. నా వీడియోను ఎంతోమంది చూసి, విలువైన సూచనలు అందించారు. మీ ప్రేమ, ఆదరణకు హృదయపూర్వక కృతజ్ఞతలు” అని అన్నారు. యువత నుంచి వచ్చిన సానుకూల స్పందన తనకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Narendra Modi (@narendramodi)ఇక మోదీకి ఉన్న వ్యక్తిగత బ్రాండ్ ఇమేజ్, సోషల్ మీడియా ప్రభావం మరోసారి ఈ వీడియోల ద్వారా చర్చకు వచ్చింది. దేశీయ రాజకీయాలతో పాటు అంతర్జాతీయ వేదికలపై కూడా ప్రత్యేక గుర్తింపు పొందిన మోదీ.. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోనూ భారీ స్థాయిలో ప్రజలతో అనుసంధానమవుతున్నారు. అంతేకాదు.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ యువతకు చేరువ కావాలంటూ మంత్రులకు సైతం నిన్నటి కేబినెట్ భేటీలో మోదీ సూచించడం గమనార్హం. నీట్ వివాదం నేపథ్యంలో వచ్చిన ఈ సెల్ఫీ వీడియో.. కేవలం ఓ రాజకీయ సందేశంగానే కాకుండా, సోషల్ మీడియాలో మోదీకి ఉన్న ప్రజాదరణకు మరో ఉదాహరణగా నిలిచిందని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. -
20 ఏళ్లుగా భార్యతో మాటల్లేవ్.. కానీ కలిసే ఉన్నారు! కారణం తెలిస్తే కంగుతింటారు
ఇటీవల కాలంలో భార్యభర్తల సంబంధాలు ఎంత దారుణంగా వికృతంగా ఉన్నాయో చూస్తూనే ఉన్నాం. కొన్నింటిని చూస్తే..మనసు కలిచివేస్తుంది కూడా. అలాంటి తరుణంగా ఈ ఇద్దరి భార్యభర్తల మధ్య చోటుచేసుకున్న అభిప్రాయ భేదం అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఏ సంబంధంలోనైనా..పొరపొచ్చాలు సహజం. కానీ ఈ ఆలుమగలు..మధ్య ఎదురైనా అత్యంత సాధారణ అభిప్రాయభేదం వాళ్లను వేరు చేయలేదు..కానీ వారి మధ్యమాటలను దూరం చేసింది. ఇరువురి మధ్య భౌతికంగా దూరం లేదు గానీ మానసికంగా కలిసి లేరు, మాటల్లేవ్. పాపం వాళ్లని కలిపేందుకు సిద్ధమయ్యాడు కూమారుడు. మరి అతడి ప్రయత్నం ఫలించిందా అంటే..ఈ విచిత్ర ఘటన జపాన్‌లో చోటుచేసుకుంది. దాదాపు దశాబ్దం క్రితం ప్రపంచం దృష్టిని ఆకర్షించిన అద్భుతమైన ప్రేమకథ. అసాధారణ మలుపుతో భావోద్వేగంగా ముగిసినా..ఇప్పటికీ ప్రజలను ఆకర్షిస్తూనే ఉంది. 2017లో, 18 ఏళ్ల యువకుడు హోక్కైడోలోని ఒక టెలివిజన్ షోకు అసాధారణమైన విజ్ఞప్తి చేశాడు. తన జీవితంలో చాలా కాలంగా కొనసాగుతున్న ఒక కుటుంబ సమస్యకు సహాయం చేయమని కోరడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తన తల్లిదండ్రులు దాదాపుగా 20 ఏళ్లుగా కలిసి జీవిస్తున్నప్పటికీ సరిగ్గా మాట్లాడుకోవడం ఎప్పుడు చూడలేదని అందువల్ల తాను మళ్లీ కలిపి చక్కగా మాట్లాడుకునేలా చేయాలనుకున్నట్లు తెలిపాడు. అందుకోసం సదరు టెలివిజన్ షోన్ని సహాయం చేయమని అర్థిస్తాడు. అతడి పేరెంట్స్ ఓటో కటాయమా ( యామా, భార్య యూమి ఒకే ఇంట్లో ఉంటున్నా..రెండు దశాబ్దాలుగా ఇద్దరి మధ్య మాటల్లేవ్. ముగ్గురు పిల్లలను పెంచారు, కలిసే భోజనం చేశారు. అయినా ఒకరితో ఒకరు అర్థవంతంగా ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. అంత నిశబ్ద వాతావరణం వెనుక ఇద్దరి మధ్య ఎలాంటి వాగ్వాదం గానీ తీవ్రమైన ద్రోహం గానీ చోటు చేసుకోలేదు. కానీ ఎందుకని ఇద్దరి మధ్య సైలన్స్ చోటు చేసుకుందంటే..పిల్లల పట్ల భార్య చూపిస్తున్న శ్రద్ధ చూసి అసూయతో కటాయామా మాట్లాడటం మానేశారట. యామీ మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడల్లా..అతను కేవలం తల ఊపడం, అవును అని మాత్రమే స్పందించి ఊరుకునేవారట. ఈ పరిస్థితిని చూసి వాళ్ల చిన్న కుమారుడు వాళ్లను తిరిగి కలిపేందుకు టెలివిజన్ సాయం కోరాడు. ఆ కార్యక్రమం నిర్వాహాకులు ఆ దంపతులు మొదట డేట్‌కు వెళ్లిన పార్కులోనే కలుసుకునేలా ఏర్పాటు చేసింది. ముగ్గురు పిల్లలు పేరెంట్స్‌ని దూరం నుంచి గమనిస్తూనే ఉన్నారు. దాదాపు 20 ఏళ్ల మౌనాన్ని వీడుతూ..కటాయమా తన భార్యతో ఇలా అన్నారు, "ఏదో తెలియని కారణం వల్ల మనం మాట్లాడుకుని చాలా కాలం అయ్యింది. నువ్వు పిల్లల గురించి చాలా ఆందోళన చెందావు. యూమి, ఇప్పటి వరకు నువ్వు చాలా కష్టాలను భరించావు. నేను ఎందుకు మాట్లాడటం లేదో నువ్వు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు పిల్లలను తనకంటే అత్యంత ప్రేమగా చూసుకోవడంతో అసూయపడ్డాను, అలిగాను. అందువల్ల మాట్లాడలేదు. జరిగిపోయినా కాలాన్ని వెనక్కి తేలేను కానీ..మళ్లీ మాట్లాడుకోవడం మొదలుపెట్టడం మాత్రం సాధ్యమే మరి మాట్లాడుకుందామా.. అని అతను అడగడంతో..ఆ షోని చూస్తున్నవాళ్ల ముఖాల్లో ఒక్కసారిగా నవ్వులు విరబూశాయి. ఈ భావోద్వేగమైన పునః కలయిక నెట్టింట త్వరగా వైరల్ అయ్యి..అందర్నీ అమితంగా ఆకర్షించింది. చాలా ఏళ్ల నిశబ్దం తర్వాత మళ్లీ కలవడానికి ఆ జంట చూపిన సుముఖతను చాలా మంది ప్రశంసించారు. అంతేగాదు ప్రస్తుతం మారుతున్న సంబంధాల ధోరుణుల కారణంగా ఈ దంపతుల కథ అందరి మనసులను తాకింది.(చదవండి: జీవితాన్నే డాక్యుమెంట్ చేస్తూ..రూ. 8.35 కోట్లు..!) -
బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న ప్రముఖ నటి (ఫొటోలు)
-
శ్రీనిధి.. అందాల నిధి (ఫొటోలు)
-
రాజుల కాలం కాదు.. ముగ్గురంటే ఎలా బాసూ!
“భయ్యా.. పెళ్లి చేసుకున్నావా?”“అవును..”“కంగ్రాట్స్.. సంతోషంగా ఉన్నావా?”“అదే అర్థం కావడం లేదు బాబూ.. సంతోషమో.. సవాలో!”“అదేందన్నా.. ఎందుకలా అంటున్నావ్?”“ఒక్కరిని మెప్పించడమే కష్టంగా ఉంటుంది కదా.. అలాంటిది ముగ్గురి మనసులు గెలవాలంటే రోజులో 24 గంటలు సరిపోతాయా చెప్పు!”ఇది ఏదో సినిమా కథ కాదు.. ఉత్తరప్రదేశ్‌లో వైరల్‌గా మారిన ఓ పెళ్లి కథ. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ పరిచయమైన ఓ యువకుడు.. ఆ పరిచయమే చివరకు పెళ్లి బంధంగా మారిందని చెబుతున్న ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఒకే వ్యక్తిని వివాహం చేసుకున్నారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. ఈ పెళ్లి నిజమేనా? చట్టబద్ధమేనా? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. View this post on Instagram A post shared by Rajput girl (@ak_rajput9990)కెమెరామెన్ నుంచి భర్త వరకు..ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాకు చెందిన సరోజ్, సావిత్రి, సంతోష్ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లుగా పనిచేస్తున్నారు. వారి వీడియోలకు కెమెరామెన్‌గా పనిచేసిన వికాస్ అలియాస్ విక్కుతో పరిచయం ఏర్పడింది. మొదట రీల్స్‌లో భర్త పాత్ర పోషించిన వికాస్.. చివరకు నిజ జీవితంలోనే వారి జీవిత భాగస్వామిగా మారాడు. పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. మొదట అంతా ఇదేదో సోషల్ మీడియా స్టంట్ అనుకున్నారు. కానీ ముగ్గురు సోదరీమణులు స్వయంగా స్పందిస్తూ.. “ఇది నిజమైన పెళ్లి. మా ఇష్టంతో తీసుకున్న నిర్ణయం” అని తెలిపారు.విడిపోవడం ఎందుకని..ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. ఇద్దరు సొంత రక్తం. మరొకరు.. ఆ ఇంట్లోనే పెరిగారు. చిన్నప్పటి నుంచి ముగ్గురం కలిసే పెరిగామని చెబుతున్నారు. వేర్వేరు కుటుంబాల్లోకి వెళ్లిపోవడం ఇష్టం లేకే ఒకే వ్యక్తిని వివాహం చేసుకున్నామని వెల్లడించారు. “మేమంతా పెద్దవాళ్లమే. మా జీవితంపై నిర్ణయం తీసుకునే హక్కు మాకు ఉంది” అంటూ వారు స్పష్టం చేశారు. వికాస్ కూడా వారి నిర్ణయానికి అంగీకరించాడని, అందరూ కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే ఈ వివాహం జరిగిందని తెలిపారు. సరే.. మనసులు కలిశాయి.. మరి చట్టం?ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. “ప్రేమకు హద్దులు ఉండవు” అని వారు చెబుతున్నా.. చట్టానికి మాత్రం కొన్ని పరిమితులు ఉంటాయి. భారతీయ చట్టాల ప్రకారం హిందూ వివాహ చట్టం ఒక వ్యక్తికి ఒకేసారి ఒక భార్య ఉండే విధానాన్ని గుర్తిస్తుంది. అంటే.. ఇలాంటి వివాహం చట్టపరంగా చెల్లుబాటు అవుతుందా? అధికారికంగా నమోదు జరిగిందా? అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కూడా వివరాలు సేకరిస్తున్నారు. View this post on Instagram A post shared by Rajput girl (@ak_rajput9990)“రాజుల కాలం వేరు.. ఇప్పటి చట్టాలు వేరు”ఈ పెళ్లిపై ప్రశ్నలు రావడంతో ముగ్గురు సోదరీమణులు పాతకాలపు ఉదాహరణలు చెబుతున్నారు. రాజులకు ఒకటి కంటే ఎక్కువ మంది భార్యలు ఉండేవారని పేర్కొంటున్నారు. కానీ న్యాయ నిపుణుల ప్రకారం.. చారిత్రక ఆచారాలు, ప్రస్తుత చట్టాలు ఒకేలా ఉండవు.రీల్ లైఫ్ బాగుంది.. రియల్ లైఫ్ ఎలా?సోషల్ మీడియాలో ఓ వీడియోకు లక్షల వ్యూస్ రావచ్చు. కానీ నిజ జీవితంలో ఒక బంధాన్ని కొనసాగించాలంటే ప్రేమతో పాటు బాధ్యత, అవగాహన కూడా అవసరం. ఇప్పటివరకు ఈ కథలో అందరి మాట ఒక్కటే.. “మేము సంతోషంగా ఉన్నాం. సోషల్ మీడియా ఆదాయంతో కుటుంబాన్ని నడిపిస్తున్నాం. మొగుడి పేరిట కాస్త భూమి ఉంది” అని. కానీ అసలు పరీక్ష మాత్రం ముందుంది. రీల్లో కలిసి కనిపించడం సులువు.. రియల్ లైఫ్‌లో కలిసి నడవడమే అసలు సవాల్!. -
అత్యంత ఖరీదైన 'టీ'.. కిలో రూ. 9 కోట్లా..! ఐతే..
ఏ చాయ్.. చటుక్కున తాగరా భాయ్ అని పాడుకుంటూ ఆనందంగా ఉదయాన్నే ఆస్వాదిస్తుంటా. టీ అనేది నిత్యజీవితంలో ఒక భాగం అనేలా స్థిరపడిపోయింది. ఒక పూట సిప్ చేయకపోతే ఏదో వెలితి. ఆఫీస్ బాయ్ నుంచి ఉన్నతస్థాయి ఉద్యోగుల వరకు అంతా మెచ్చే ఈ చాయ్‌లో అత్యంత విలాసవంతమైన రకం కూడా ఉందన్న విషయం తెలుసా!. అత్యంత ఖరీదు అంటే వేలల్లో ఉందనుకుంటున్నారేమో కాదు..ఏకంగా కోట్లు పైమాటే. గ్రాముల్లో కొనాలంటే లక్షలు వెచ్చించాల్సిందే. ఇంతకీ ఏంటా ఆ చాయ్ ప్రత్యేకత, ఎక్కడ పండిస్తారు తదితర విశేషాల గురించి సవివరంగా తెలుసుకుందామా.!.ప్రపంచంలో అత్యంత ఖరీదైన 'టీ' చైనాలోని మాండరిన్లో లభిస్తుంది. ఈ 'టీ' పేరు డా హాంగ్ పావో. దీని అర్థం ఎర్రని వస్త్రం. ఇదేం పేరు అనుకోకండి. ఎందుకంటే ఈ పేరు వెనుక గమత్తైన కథతో పాటు ఇది ఎక్కడ పండిస్తారో తెలిస్తే కంగుతింటారు. దీన్ని ఊలాంగ్ టీ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే చైనాలో ఫుజియాన్ ప్రావిన్స్‌లో అద్భుతమైన వుయి పర్వతాల్లో పండటంతో దీనికి ఆ పేరు వచ్చింది. ఈ టీకి శతాబ్దాల నాటి చరిత్ర, రాజరిక వారసత్వం ఉంది. ఈ డా హాంగ్ పావో రుచి సాధారణంగా అర్థం కాదట. నెమ్మదిగా ఆస్వాదిస్తేనే దాని రుచి తెలుస్తుందట. గ్రీన్ టీ లేదా బ్లాక్ టీలా కాకుండా, ఈ రెండింటి రుచులకు మధ్యస్థంగా గాఢతను కలిగి ఉంటుందట. తాజా ఆర్కిడ్లతో పోల్చబడే పూల సువాసనలతో పాటు, వేయించిన, పండ్ల వంటి పొగ వాసనలతో మిళితమై ఉంటుంది. దీనికి సహజమైన తీపితో కూడిన రుచి ఉంటుందట. టీ ప్రియులు దీన్ని ఎంతో విలువైనదిగా అపురూపమైనదిగా చూస్తారట.ఎందుకంత ఖరీదు అంటే..వుయి పర్వతాల కొండచరియల మధ్య, పురాణ మాతృ వృక్షాలుగా ప్రసిద్ధి చెందిన ఆరు అసలైన డా హాంగ్ పావో పొదలు మాత్రమే ఉన్నాయి. ఈ పురాతన మొక్కలు వందల ఏళ నాటివని అక్కడ ప్రజలు విశ్వసిస్తారు. అంతేగాదు చైనా వీటిని వెలకట్టలేని జాతీయ సంపదగా అభివర్ణిస్తుంది. ఇవి కేవలం ఆరు మాత్రమే ఉండటం కారంణంగా తేయాకు ఉత్పత్తి కూడా పరిమితమే కావడంతో అత్యంత ఖరీదైనదిగా మారిందట. కిలో టీ ధర వచ్చేసి రూ. 9 కోట్లు పై మాటే. ఇప్పటివరకు జరిగిన అత్యంత ప్రసిద్ధ టీ వేలంపాటలలో ఒకదానిలో, 20 గ్రాముల అసలైన డా హాంగ్ పావో సుమారు రూ. 20 లక్షలు. ఒక గ్రాము అసలైన టీ ధర వచ్చేసి రూ. 1.2 లక్షలు. చెప్పాలంటే. ఇది బంగారం కంటే 30 రెట్లు విలువైనది. అయితే చైనా ప్రభుత్వం ఈ టీపై నిషేధం విధించింది. నిషేధం ఎందుకంటే..భవిష్యత్ తరాల కోసం ఆరు అసలైన మాతృ వృక్షాలను రక్షించడానికి, 2006లో చైనా ప్రభుత్వం వాటి నుంచి ఆకులను వాణిజ్యపరంగా సేకరించడాన్ని శాశ్వతంగా నిషేధం విధించింది. ఈ పురాతన పొదలు ఇప్పుడు చైనా సాంస్కృతిక వారసత్వంలో భాగంగా సంరక్షిస్తున్నారు. ఆ నేపథ్యంలో ఈ టీని సేకరించడానికి ఎవ్వరి అనుమతి లేదు. వాటి అపారమైన చారిత్రక, సాంస్కృతిక విలువ కారణంగా చైనా ప్రభుత్వం ఆ చెట్లకు సుమారు ₹142 కోట్లు బీమా కూడా చేయించిందట.అంతేగాదు ఈ మాతృ వృక్షాల నుంచి వచ్చిన చివరి పంటను బీజింగ్ ప్యాలెస్ మ్యూజియంలో భద్రపరిచారట. ప్రస్తుతం మార్కెట్లో లభించే డా హాంగ్ పావో, అసలైన మాతృ వృక్షాల నుంచి సేకరించిన టీ కాదట. ఆ గొప్ప రుచిని పునః సృష్టించడం కోసం అసలైన మాతృ వృక్షాల నుంచి జాగ్రత్తగా పెంచిన కృత్రిమ సంతతి (క్లోన్ల) నుంచి ఉత్పత్తి చేయబడుతుందట. ఈ చాయ్ వెనకున్న ఆసక్తికర కథనం..ఒక యువ పండితుడు చక్రవర్తి పరీక్షల కోసం బీజింగ్‌కు వెళ్లే మార్గంలో వుయి పర్వతాల గుండా ప్రయాణిస్తుండగా, అతను అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. సమీపంలోని ఒక ఆలయానికి చెందిన సన్యాసి కొండలపై పెరుగుతున్న ఒక ప్రత్యేకమైన టీ పొద నుంచి ఆకులను ఉపయోగించి టీ తయారు చేయగా, ఆ పండితుడు త్వరగా కోలుకున్నాడు. ఆ తర్వాత చక్రవర్తి పరీక్షలలో ప్రథమ స్థానం సాధించాడు. కొన్నేళ్లకు చక్రవర్తినే స్వయంగా అనారోగ్యానికి గురయ్యాడు. దాంతో ఆ పండితుడు అదే టీని తయారు చేసి ఇవ్వగా చక్రవర్తి కూడా ఆ యువకుడిలానే కోలుకున్నారట. బహుమతిగా, చక్రవర్తి ఆ పండితుడికి ఒక అద్భుతమైన ఎర్రటి ఉత్సవ వస్త్రాన్ని బహూకరించారు. తమ ఇద్దరి ప్రాణాలను కాపాడిన ఆ తేయాకును గౌరవించాలనే ఉద్దేశ్యంతో, ఆ పండితుడు ఆ వూయి పర్వతాల వద్దకు వెళ్లి, చక్రవర్తి ఇచ్చిన వస్త్రాన్ని తేయాకు పొదలపై కప్పాడు. అప్పటి నుంచి, ఆ తేయాకును డా హాంగ్ పావో, లేదా “పెద్ద ఎర్ర వస్త్రం” అని పిలుస్తున్నారని చైనా జానపద కథనం. ఎలా తయారు చేస్తారంటే..సాధారణం 95-100°C వద్ద అప్పుడే మరిగించిన నీటిలో చాలాసారు నానబెట్టి తీసిని డా హాంగ్ పావో ఆకులను వేస్తారట. కనీసం మూడు సార్లు నానబెట్టి.. మరిగే నీటిలో వేస్తే అత్యంత గాఢమైన రుచులు బయటకు వస్తాయట. ప్రతిసారి నానబెట్టగానే పూల వంటి తీపిదనం వస్తుందని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: ఒత్తైన జుట్టు కోసం..! గాయని అరుణా సాయిరామ్ హెయిర్ టిప్స్) -
ఆలయ ఆవరణలో త్రిష-విజయ్‌ల ఫ్లెక్సీ.. కేసు నమోదు
తమిళనాడులో ఫ్లెక్సీ కలకలం రేగింది. సేలం జిల్లా ఆత్తూర్‌లో ఏర్పాటు చేసిన ఓ ఆలయ ఉత్సవ బ్యానర్ వివాదానికి దారితీసింది. ఆ బ్యానర్లో ప్రముఖ నటి త్రిషను అమ్మవారి రూపంలో చిత్రించడం, ఆ పైన తమిళనాడు ముఖ్యమంత్రి, విజయ్ ఫొటోను కూడా ‘సిగ్నేచర్ ఫోజు’తో ఉంచడంపై స్థానికంగా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.పెరియా మారియమ్మన్ ఆలయ ఆడి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ బ్యానర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఫ్లెక్సీలో త్రిష అమ్మవారి గెటప్‌లో కూర్చున్నట్లు ఉంది. ఆ పైన విజయ్ అసెంబ్లీలో చేసిన సిగ్నేచర్ ఫోజుతో ఉన్నారు. ఆ పక్కనే ఇద్దరు అభిమానుల ఫొటోలు చెరో వైపు ఉన్నాయి. కొందరు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సినీ నటిని దేవతా రూపంలో చూపించడం సరైంది కాదన్నారు. వివాద నేపథ్యంలో రాత్రికి రాత్రే బ్యానర్‌ను అక్కడి నుంచి తొలగించారు. ఆ ప్లేస్‌లో మరొకటి ఏర్పాటు చేశారు. అయితే అప్పటికే తమ దాకా విషయం రావడంతో పోలీసులు కూడా రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. అనుమతి లేకుండా బ్యానర్ ఏర్పాటు చేయడం, అందునా అభ్యంతరకరంగా ఉండడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. బ్యానర్ ఏర్పాటు చేసిన దుకాణ యజమాని గోకుల్, దానిని అమర్చిన చంద్రుపై చర్యలకు సిద్ధమయ్యారు. వాళ్లిద్దరూ పరారీలో ఉన్నట్లు సమాచారం. విజయ్-త్రిష ఫొటోలపై చర్చఇటీవల తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో విజయ్, నటి త్రిష పేర్లు తరచూ చర్చల్లో నిలుస్తున్నాయి. ఎన్నికల ముందే వీళ్ల బంధం బయటపడడం, ఎన్నికల విజయంపై విజయ్‌కు త్రిష అభినందనలు తెలియజేయడం, ప్రమాణస్వీకారం నాడు చేసిన హడావిడి.. పుట్టినరోజు వేడుక జరపడం ఇలా ఉండగానే ఈ నేపథ్యంలో ఆలయ ఉత్సవ బ్యానర్లో ఇద్దరి ఫొటోలు కలిసి కనిపించడం మరోసారి ఆసక్తిని రేపింది. అదే సమయంలో ఆలయ ఉత్సవాల్లో సినీ ప్రముఖుల ఫొటోలను విచ్చలవిడగా వాడడం, అభిమానుల బ్యానర్ సంస్కృతిపై ఈ ఘటన మరోసారి చర్చకు దారితీసింది. -
భర్త డ్రీమ్ కోసం..పేరెంటింగ్ బాధ్యతలన్నీ ఆమెపైనే! పోస్ట్ వైరల్
టెక్ ప్రపంచం రోజురోజుకి ఎలా మారిపోతోందో తెలిస్తే విస్తుపోతారు. ఏ ప్రపంచంలో ఉన్నామనే ఫీల్ కలుగుతుందని అంటున్నారు నెటిజన్లు. వృత్తి బాధ్యతల్లో నిష్టాతులు అవ్వడం కోసం వ్యక్తిగత జీవితమే చిక్కుల్లోకి వెళ్లిపోవాల్సిందేనా అనే ఆందోళలను మొదలవ్వుతున్నాయి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కాదు..కెరీర్‌నే ముఖ్యమా అనే సందేహాలు లేవనెత్తాయి. ఏఐ సాంకేతికత అన్నింటిని సులువు చేసిందా..లేక టెకీలను దిక్కుతోచని పరిస్థితుల్లోకి నెట్టేసి..ఆనందానికే దూరం చేసిందా అంటే అవుననే అంటున్నారు పలువురు. ఎందుకంటే నెట్టంట వైరల్ అవుతున్న పోస్ట్ ఈ ప్రశ్నలనే లేవనెత్తుతోంది. ఏఐ టెకీల వృత్తి జీవితాన్ని ఇంతలా మార్చేసిందా అని నెట్టింట చర్చలు మొదలయ్యాయి. అసలేం జరిగిందంటే..2008 ఆర్థిక సంక్షోభం తర్వాత దాదాపు రెండు దశాబ్దాల పాటు, మెటా, గూగుల్ లేదా మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలలో ఉద్యోగం సంపాదించడం అత్యంత సురక్షితమైన, ప్రతిష్టాత్మకమైన కెరీర్ మార్గాలలో ఒకటిగా పరిగణించారు. టెక్ రంగం అధిక జీతాలు, స్థిరత్వాన్ని అందించడం తోపాటు కంప్యూటర్ సైన్స్ రంగం బాగా అభివృద్ధి చెందింది. అయితే గత కొన్నేళ్లుగా ఏఐ కారణంగా జరిగిన ఉద్యోగకోతలు అవకాశాల గనిగా ఉన్న సిలికాన్ వ్యాలీకి ఉన్న పేరు ఎలా దెబ్బతిందో తెలిసిందే. ఆ నేపథ్యంలో ఓ టెకీ తీసుకున్న నిర్ణయం కుటుంబంపైన, వ్యక్తిగతంగానూ ఎంత ప్రభావం చూపిందో తెలిస్తే..వామ్మో అంటారు. నెట్టింట వైరల్ అవుతున్న వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం..శాన్‌ప్రాన్సిస్కోకు చెందిన 31 ఏళ్ల టెక్ ఉద్యోగి అయిన ఒక భార్య, తన భర్త ‘AI నేటివ్’ ఉద్యోగిగా మారాలనే తపన వల్ల పిల్లల పెంపకం బాధ్యతలన్నీ తన భుజాలపై మోయాల్సి వచ్చిందంటూ పోస్ట్‌లో తన గోడుని వెళ్లబోసుకున్నారు. పేరు చెప్పాడానికి ఇష్టపడని ఆమె తన భర్త ఆశయం తనపై కుటుబం నిర్వహణ భారం ఎలా మోయాల్సి వచ్చిందో వివరించారు. తన భర్త కొన్ని నెలలు క్రితం ఏఐ నేటివ్‌గా మారడంపై ఫోకస్ పెట్టడం కోసం పిల్లల పెంపకం బాధ్యతలన్నీ తననే చూసుకోమని కోరారని పోస్ట్‌లో పేర్కొందామె. ఏఐ నేటివ్ ఉద్యోగి అంటే..ఆటోమేషన్ సాధనాల ఆధారంగా తమ పని విధానాన్ని పూర్తిగా పునఃరూపకల్పన చేసుకున్న వ్యక్తి అని అర్థం. అప్పుడప్పుడు చేసే పనుల కోసం చాట్బాట్లను ఉపయోగించే సాంప్రదాయ నిపుణుడు లేదా AI-ఆసక్తి గల ఉద్యోగిలా కాకుండా, ఒక AI నేటివ్ కృత్రిమ మేధను ఒక ప్రధాన భాగస్వామిగా ఉపయోగిస్తారు.ఇక ఆమె తన భర్త AI ప్రాజెక్టులపై పనిచేస్తూ తన ఆఫీసులోనే తనను తాను బంధించుకున్నప్పుడు ఆ అనుభవం తనకు ఏదోలా అనిపించిందని తెలిపింది. అయితే ఆయన కోరుకున్నట్లుగా తన కంపెనీలో తానే అగ్రశ్రేణి ఏఐ వినియోగదారుడిగా మారాడు, అందుకు తనకు కృతజ్ఞతలు కూడా చెప్పారంటూ పోస్ట్‌ని ముగించింది. ఈ పోస్ట్ తల్లిదండ్రుల బాధ్యతలు వర్సెస్ వృత్తిపరమైన బాధ్యతలపై చర్చలు లేవెనెత్తి హాట్‌టాపిక్‌గా మారింది. నిజంగా ఇక్కడ మానవత్వం పూర్తిగా కోల్పోతున్నాం, చిన్న చిన్న ఆనందాలన్నీ వదులుకుంటూ గడుపుతున్నాం. ఇదేం జీవింతం అంటూ ఆందోళనలు వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు.This is pretty bleak. pic.twitter.com/dr0BYzr3NO— Alec MacGillis (@AlecMacGillis) July 20, 2026 (చదవండి: నిరసనల్లో షబానా అజ్మీకి ఆకస్మిక తలతిరుగుడు..! ఎందుకిలా అంటే..) -
వైన్స్ షాపులో ఐదు గంటల హైడ్రామా! ప్రాణాలకు తెగించి..
ఉదయం వేళ.. అంతా సాధారణంగానే సాగుతోంది. షాప్‌లో పనులు చేసుకుంటున్న సిబ్బందికి కాసేపట్లో ఎదురుకాబోయే ప్రమాదం గురించి అసలు ఊహే లేదు. ఇంతలో ఒక్కసారిగా.. ఆకోశ్రంతో ఉన్న ఓ చిరుత అక్కడికి దూసుకొచ్చింది. క్షణాల్లోనే ప్రశాంతంగా ఉన్న ప్రదేశం భయానకంగా మారిపోయింది. ఎదురుగా క్రూర మృగం.. తప్పించుకునే అవకాశం దాదాపు లేదు. అప్పటికే చిరుత దాడిలో గాయపడిన ఓ వ్యక్తి పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. అయితే.. ఆ సమయంలో ఓ సేల్స్‌మెన్ చూపించిన ధైర్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రాణాలకు తెగించి తీసుకున్న ఒక్క నిర్ణయంతో అతడు పెద్ద ప్రమాదాన్ని తప్పించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ ఘటన రాజస్థాన్‌లోని టోంక్ జిల్లా టోడారాయ్సింగ్ పట్టణంలో సోమవారం (జూలై 20) ఉదయం చోటుచేసుకుంది. ఉదయం సుమారు 8.45 గంటల సమయంలో స్థానిక ప్రాంతంలోని పొదల్లో చిరుత దాక్కుని ఉన్నట్లు గుర్తించారు. అటవీ వాలంటీర్ రాకేష్ దాన్ని గుర్తించి దగ్గరకు వెళ్లాడు. చిరుతను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తుండగానే.. అది ఒక్కసారిగా అతడిపై దాడి చేసింది. చిరుత దాడితో స్థానికులు అప్రమత్తమయ్యారు. అయితే అప్పటికే ఆ జంతువు అక్కడి నుంచి తప్పించుకుని సమీపంలోని ఓ లిక్కర్ షాప్ వైపు పరుగులు తీసింది.చిరుత ఒక్కసారిగా షాప్‌లోకి దూసుకురావడంతో అక్కడి వారంతా షాక్‌కు గురయ్యారు. మొదట షాప్ యజమాని ఫతే లాల్ కోలీపై అది దాడి చేసింది. ఆ తర్వాత లోపల ఉన్న సేల్స్‌మెన్ సంజయ్ గుర్జర్‌పై విరుచుకుపడింది. చిరుత దాడిలో సంజయ్‌కు ముక్కు, భుజం, చేతులపై గాయాలయ్యాయి. అయినప్పటికీ అతడు భయంతో కుప్పకూలిపోలేదు. పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే తెగువ చూపి సమయస్ఫూర్తిని ప్రదర్శించాడు.చిరుతను బయటకు వదిలేస్తే చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ప్రమాదం తప్పదని సంజయ్ గ్రహించాడు. ఆ క్షణంలో తన ప్రాణాలను పణంగా పెట్టి షాప్ షట్టర్‌ను కిందికి దించాడు. దీంతో చిరుత లోపలే చిక్కుకుపోయింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. జైపూర్ నుంచి ప్రత్యేక రెస్క్యూ బృందాన్ని రప్పించారు. దాదాపు ఐదు గంటల పాటు సాగిన ఆపరేషన్ తర్వాత చిరుతకు మత్తు మందు ఇచ్చి సురక్షితంగా పట్టుకున్నారు.ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. షాప్‌లో చిరుత సంచరించిన తీరు, రెస్క్యూ ఆపరేషన్, సేల్స్‌మెన్ ధైర్యం నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఒకవైపు నాలుగు కాళ్ల మృగం.. మరోవైపు గాయాలతో ఉన్న పరిస్థితి.. అయినప్పటికీ సరైన సమయంలో తీసుకున్న నిర్ణయంతో సంజయ్ పెద్ద ప్రమాదాన్ని అడ్డుకున్నాడు. చిరుతను బంధించింది అటవీ శాఖ బృందమే అయినా.. ఆ ఐదు గంటల హైడ్రామాలో తొలి హీరో మాత్రం సేల్స్‌మెన్ సంజయ్ గుర్జర్నే అని స్థానికులు ప్రశంసిస్తున్నారు. Leopard attacks man inside wine shop in Todaraisingh, Tonk, Rajasthan caught on CCTV pic.twitter.com/agUYH14EBL— Ghar Ke Kalesh (@gharkekalesh) July 20, 2026 -
స్టన్నింగ్ లుక్స్‌లో కాజల్ అగర్వాల్ (ఫొటోలు)
-
ఏంటిది? కర్ణాటక పాస్‌పోర్ట్ కోసం భారీ క్యూలు..
స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియా చెక్-ఇన్ల కాలంలోనూ పాతకాలపు స్టాంపుల సేకరణకు మళ్లీ ఆదరణ పెరుగుతోంది. ఇండియా పోస్ట్ కర్ణాటక పోస్టల్ సర్కిల్ ప్రవేశపెట్టిన ‘ఫిలాటెలీ పాస్‌పోర్ట్’ ప్రస్తుతం ప్రయాణికులు, స్టాంప్ కలెక్టర్లలో కొత్త క్రేజ్‌గా మారింది. తాజా ఎడిషన్ విడుదల నేపథ్యంలో బెంగళూరులోని జనరల్ పోస్టాఫీసు ముందు వందలాది మంది తెల్లవారుజామునే క్యూలు కట్టడం ఈ ఆసక్తికి నిదర్శనంగా నిలిచింది. ఈ పాస్‌పోర్ట్ 2024 చివర్లో తొలిసారి అందుబాటులోకి రాగా, ఇప్పుడు కర్ణాటక వ్యాప్తంగా సుమారు 100 పర్యాటక, వారసత్వ ప్రాంతాలను కలుపుతూ నవీకరించిన ఎడిషన్‌ను విడుదల చేశారు. సుమారు 1,500 కాపీల తాజా బ్యాచ్‌కు కూడా భారీ డిమాండ్ నెలకొన్నట్లు తెలుస్తోంది.ఫిలాటెలీ పాస్‌పోర్ట్ అంటే?పేరు పాస్‌పోర్ట్ అయినప్పటికీ దీనికి విదేశీ ప్రయాణాలతో ఎలాంటి సంబంధం లేదు. ఇది కర్ణాటకలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించే వారికి ప్రత్యేక జ్ఞాపకంగా రూపొందించిన కలెక్టర్ బుక్లెట్. ఇందులో ప్రతి గమ్యస్థానానికి ఒక ప్రత్యేక పేజీ ఉంటుంది. ఆ ప్రాంతానికి సమీపంలోని గుర్తించిన పోస్టాఫీసుకు వెళ్లి పోస్టల్ స్టాంప్‌ను కొనుగోలు చేసి, అక్కడ మాత్రమే లభించే పర్మనెంట్ పిక్టోరియల్ క్యాన్సిలేషన్ (PPC) ముద్రను వేయించుకోవాలి. దేవాలయాలు, కోటలు, మ్యూజియంలు, వన్యప్రాణి అభయారణ్యాలు, చారిత్రక ప్రదేశాలకు ప్రత్యేక గుర్తులతో ఈ ముద్రలు అందుబాటులో ఉంటాయి.ట్రావెలింగ్‌కి కొత్త అర్థంప్రతి ముద్ర నిజంగా ఆ ప్రాంతాన్ని సందర్శించిన గుర్తుగా నిలుస్తుంది. అందుకే ఈ పాస్‌పోర్ట్‌ను చాలామంది ఒక ‘ట్రావెల్ ఛాలెంజ్’గా కూడా భావిస్తున్నారు. అన్ని గమ్యస్థానాలను సందర్శించి ముద్రలు సేకరించడం ద్వారా రాష్ట్రాన్ని విభిన్న కోణాల్లో అన్వేషించే అవకాశం లభిస్తుంది. సాధారణ సావనీర్లా కొనుక్కునే వస్తువు కాకుండా, స్వయంగా ప్రయాణించి సంపాదించాల్సిన జ్ఞాపకంగా ఇది ప్రత్యేకతను సంతరించుకుంది.సోషల్ మీడియాలో వైరల్ఫిలాటెలీ పాస్‌పోర్ట్‌కు సోషల్ మీడియా కూడా ఊపునిచ్చింది. వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక పోస్టల్ ముద్రలు సేకరిస్తున్న వీడియోలు, రీల్స్ వైరల్ కావడంతో యువత కూడా దీనిపై ఆసక్తి చూపుతోంది. దీంతో స్టాంప్ కలెక్టర్లకే పరిమితమైన ఈ అభిరుచి ఇప్పుడు ట్రావెల్ లవర్స్, హెరిటేజ్ ప్రియులను కూడా ఆకర్షిస్తోంది.పాత అభిరుచికి కొత్త ఊపుఫిలాటెలీ అంటే స్టాంపుల సేకరణను ప్రోత్సహించేందుకు ఇండియా పోస్ట్ ఇప్పటికే ప్రత్యేక కవర్లు, స్మారక స్టాంపులు, ‘దీన్‌దయాళ్ స్పార్ష్’ వంటి పథకాలను అమలు చేస్తోంది. ఇప్పుడు ఫిలాటెలీ పాస్‌పోర్ట్ ద్వారా ఆ అభిరుచిని ప్రయాణ అనుభవంతో మేళవించింది. డిజిటల్ యుగంలో ప్రతి ప్రయాణాన్ని భౌతిక గుర్తుగా నిలిపే ఈ వినూత్న ప్రయత్నం కర్ణాటకలో విశేష ఆదరణ పొందుతోంది. View this post on Instagram A post shared by Karnataka Postal Circle (@karnatakapostalcircle) -
ఫ్రెండ్స్‌తో కలిసి టాలీవుడ్ హీరోయిన్ నైట్ పార్టీ (ఫొటోలు)
-
ట్రెండింగ్ హీరోయిన్ ప్రీతి ముకుందన్ (ఫొటోలు)
-
చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయింది, యాసిడ్ బాధితురాలు..! కానీ ఇవాళ ఆమె..
జీవితంలో ఎడతెగని సమస్యలు ఎదురైతే..ఎవ్వరికైనా జీవితంపై విసుగు వచ్చేస్తుంది. పుట్టుకతోనే కష్టాలు అనేవి..మనిషిలో ఒక విధమైన నిరాసక్తత పెంచుతుంది. కానీ ఈ అమ్మాయి మాత్రం వాటన్నింటితో మరింత ఉన్నతంగా ఎదిగి..గొప్ప తల్లిగా మారింది. కంటేనే తల్లి కాదు అంటూ 'అమ్మ' అనే పదానికి గొప్ప అర్థం ఇచ్చింది. ఆ మహిళే దేవాంశి యాదవ్. ఏ బిడ్డ మోయకూడదని వేదనను ఎదుర్కొంది చిన్నతనంలో. తండ్రి ఆమెకు తొమ్మిది నెలల వయసున్నప్పుడే ఉగ్రవాద బాంబు దాడిలో మరణించాడు. ఆమెకు ఆయన ఎలా ఉంటారో కూడా తెలియదు. పోలీసు అధికారి అయిన తల్లి ఆధ్వర్యంలో పెరిగిందామె. పోనీ అక్కడితో ఆ చిన్నారికి కష్టాలు ఆగిపోలేదు. ఆ తర్వాత లైంగిక దాడి, యాసిడ్ దాడి నుంచి ప్రాణాలతో బయటపడిన వారియర్ ఆమె. ఈ రెండు చేదు అనుభవాలు ఎవ్వరినైనా ఒంటరిగా నిస్తేజంగా మార్చేస్తాయి. కానీ ఆ కష్టాలు ఆమెను మరింత దృఢంగా మార్చాయి. ఎంతలా అంటే తాను తల్లిలా ఒక బిడ్డకు పూర్తి ప్రేమతో కూడిన జీవితం ఇవ్వాలనేంత విశాల హృదయాన్ని అందించే స్థాయికి మార్చింది. టీనేజ్‌లో ఉండగా ఏ అమ్మాయి అయినా..తన తోటి పిల్లలతో ఎంజాయ్ చేస్తే దేవాంశి మాత్రం తాను జీవసంబంధమైన తల్లిగా కాకుండా దత్తత తల్లిగా ఒక బిడ్డకు మంచి జీవితాన్ని ఇవ్వాలనే ఆశయంతో పెరిగడం విశేషం. అది నిజం కావడానికి చాలా సమయమే పట్టింది. View this post on Instagram A post shared by Devanshi 🇮🇳 (@devanshi__yadav) ఆ చిన్నారితో నెరవేరిన కల..ఇరవైలలో దేవాంశి ఢిల్లీలోని ఒక అనాథాశ్రమంలో బోధిస్తున్నప్పుడు, వినికిడి, మాటల లోపంతో బాధపడుతున్న చిన్నారిని చూసింది. దేవాంశి ఆ చిన్నారిని దత్తత తీసుకోవాలనుకుంది. ఆ సంస్థ అందుకు అనుమతించలేదు. ఆ అనుభవమే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఎందుకంటే తక్షణమే దత్తత తీసుకునేందుకు ప్లాన్ చేసుకుని కావల్సిన డాక్యమెంట్లు సిద్దంచేసుకుని కోర్టు అనుమతితో వన్మయిని అనే ఐదు నెలల చిన్నారిని సొంత చేసుకుంది. ఆ ఒక్కక్షణంలో ప్రదీది తనకు అపురూపమైనదిగా మారిందని అంటోంది దేవాంశి. ప్రస్తుతం ఆ బిడ్డకు ఏడు సంవత్సరాలు..కానీ ఆమెకు అన్ని తెలిసేలానే పెంచింది. దత్తత, సరోగసి అనేవి ఆ చిన్నారికి తెలుసు. పైగా తన గురించి అభద్రతా భావంతో కాకుండా.. ఎంతగానో ప్రేమించే గొప్ప తల్లితో ఉన్నా అనే భావనతో పెంచింది ఆ చిన్నారిని దేవాంశి. అంతా తనను ఒంటరి తల్లిగా ఎలా పెంచేస్తావని ప్రశ్నిస్తే..వాటికి ఆమె తన చేతల ద్వారా సమాధానిచ్చింది. పితృస్వామ్యాన్ని నిశ్శబ్దంగా బద్దలుకొట్టేలా ఆ చిన్నారి అధికారిక పత్రాలన్నింటిలో తన పేరుతో రిజిస్ట్రర్ చేసి..ఎంతో సాధించిన విజయంలా అనిపిస్తుందని సగర్వంగా చెబుతోంది దేవాంశి. అంతేగాదు తన తల్లి సైతం ఆ బిడ్డను ఎంతో అపురూపంగా చూస్తుందని చెబుతోంది. ఇక దేవాంశి లైంగిక హింస, గృహ హింస బాధితులు, బాలల సంక్షేమం కోసం పనిచేసే 'షహీద్ రామశ్రయ వెల్ఫేర్ సొసైటీ' అనే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు. ఆమె ఒక న్యాయవాది కూడా. ఇవన్ని చేస్తూ తల్లిగా బాధ్యతలను కూడా నిర్వర్తిస్తుండటం విశేషం. ఇదేమంతా ఈజీ కాకపోయినా..తన కూతురు తనతోపాటు ఉంటూ..న్యాయవాదం, మానసిక ఆరోగ్యం గురించి పాఠ్యపుస్తకాల ద్వారా కాకుండా తన తల్లి రోజు వారీ ఆచరణ ద్వారా నేర్చుకునేలా చేస్తున్నా అని నవ్వుతూ చెబుతోందామె. ఇది పెంపకానికి, తల్లి అను మాటకు గొప్ప అర్థంలా ఉంది కదా ఆమె స్టోరీ. View this post on Instagram A post shared by Devanshi 🇮🇳 (@devanshi__yadav) (చదవండి: రూ. 38 వేలు జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి టీ దుకాణం..! ఇప్పుడు ఏకంగా..) -
రూ. 38 వేలు జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి టీ దుకాణం..! ఇప్పుడు ఏకంగా..
జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి వ్యాపారం చేయడానికి చాలామంది భయపడతారు. పెట్టుబడి పెట్టి వ్యాపారం రన్ చేశాక..అనుకున్న విధంగా లాభలు రాకపోతే..పరిస్థితి కష్టం కదా అని రిస్క్ చేసేందుకు ప్రయత్నించం. కానీ ఈ వ్యక్తి కథ విన్నాక..ట్రై చేస్తే తప్పు లేదు అనే ధైర్యం కలుగుతుంది. అందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఆ పోస్ట్ ప్రకారం..సదరు వ్యక్తి పొరుగున నివశించే వ్యక్తి స్వీట్ల బాక్స్‌తో తన వ్యాపార విస్తరణను సెలబ్రేట్ చేసుకోవడానికి రావడంతో ఈ విషయం తెలిసిందంటూ మొదలవుతుంది పోస్ట్. ఆ ఎదురింటి వ్యక్తి 'టెలిపెర్ఫార్మెన్స్'లో పనిచేస్తూ నెలకు సుమారు రూ. 38,000 సంపాదించేవాడు. మే నెలలో ఉద్యోగానికి రాజీనామ చేశారు. మరో కార్పొరేట్ ఉద్యోగానికి బదులుగా ఆటో స్టాండ్ దగ్గర టీ దుకాణం పెట్టడానికి దాదాపు రూ. 2 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా, సాధారణ టీని రూ. 10కి, ప్రీమియం టీని రూ. 20కి విక్రయించడం ప్రారంభించారు. అలాగే టీ తయారు చేయడానికి, వినియోగదారులకు అందించడానికి ఇద్దరు మహిళలను నియమించుకున్నారు. ప్రస్తుతం ఆ దుకాణంలో సుమారు 400 కప్పుల టీ అమ్ముడవుతోందని, తద్వారా రోజుకు రూ. 6,000 లేదా నెలకు రూ. 1.8 లక్షల ఆదాయం వస్తోంది. ఒక వేళ ఆ వ్యక్తి పాత ఉద్యోగంలోనే కొనసాగితే..వార్షిక జీతాల పెంపు (appraisals) కోసం ఎదురుచూస్తూ ఇప్పటికీ నెలకు రూ. 38,000 మాత్రమే సంపాదిస్తూ ఉండేవారు. అతడికి ఆ వ్యాపారానికి అద్దెకు రూ. 25,000, సిబ్బంది జీతాలకు రూ. 30,000, విద్యుత్, ముడి సరుకుల కోసం రూ. 25,000 ఖర్చులను మినహాయించిన తర్వాత కూడా వ్యాపారి నెలకు దాదాపు రూ. 1 లక్ష లాభాన్ని ఆర్జిస్తున్నట్లు సమాచారం. ఆయన వ్యాపారం ఇప్పటికే మరింత వృద్ధి చెందింది. ఆ టీ దుకాణంలో ఇటీవల వడా పావ్, సమోసాలు, జిలేబీలు అందించే కౌంటర్‌ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆ ఎదురింటి వ్యక్తి తనకు స్వీట్ల పంచడంతోనే ఈ విషయం తెలిసిందంటూ పోస్ట్‌లో రాసుకొచ్చాడు సదరు వ్యక్తి. నెటిజన్లు ఆ వ్యక్తి ధైర్యంగా తీసుకున్న రిస్క్‌ను ప్రశంసించడమే కాదు, మధ్యతరగతి వాళ్లకు ఇలా చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టే టీ వ్యాపారాలింటివే బెటర్..తొలిరోజు తక్కువ అమ్మకాలు వచ్చినా..క్రమంగా పుంజుకుంటుందంటూ పోస్టులు పెట్టారు.(చదవండి: కాంచీపురం చీరలో దేవతలా సాయిపల్లవి..!) -
కేవలం ఆటో నడుపుతూ నెలకు రూ. 60 వేలు..!
గిగ్ ఎకానమీ చాలామంది ఎలాంటి అవకాశాలు అందిస్తోందో చెప్పే వైరల్ పోస్ట్ ఇది. చదువు కోకపోయినా ఆర్థికం ఎలా నిలదొక్కుకున్నాడో వివరిస్తూ..నెటింట వైరల్‌గా మారాడు ఆ ఆటోడ్రైవర్. ఇన్‌స్టాగ్రామ్‌లో చక్కెర్లు కొడుతున్న ఈ పోస్ట్ నెటిజన్లను అమితంగా ఆకర్షిస్తోంది. ఆకాశ్ అనే ప్రయాణికుడు షేర్ చేశాడు ఈ పోస్ట్‌ని. తాను సాధారణంగా క్యాబ్‌లోనే వెళ్తానని, ఆ రోజు ఎందుకనో ఆటోటో వెళ్లాలనుకున్నాడు. సాధారణంగా మొదలైన ప్రయాణం ఆ ఆటోడ్రైవర్‌తో జరిగిన సంభాషణతో ఆసక్తికరంగా మారింది. ఆకాష్ ఆ డ్రైవర్ని ఎంత సంపాదిస్తారని ప్రశ్నించాడు. దానికి అతడు చెప్పిన సమాధానం ఆకాశ్‌ని అమితంగా ఆశ్చర్యపరిచింది. తన ఆదాయం స్థూల అంచనాను చెబుతూ..ఖర్చులు పోను నెలకు సుమారు రూ. 45 వేలు సంపాదిస్తున్నట్లు తెలిపాడు. అలాగే గతంలో గురుగ్రామ్‌లో ఒక కంపెనీ రూ. 25 వేలు జీతంతో సూపర్వైజర్గా పనిచేసినట్లు తెలిపారు. రోజుకు రూ. 1500 నుంచి 2000 ఆర్జిస్తున్నాని, కేవలం ఎనిమిది గంటల డ్రైవింగ్ అని చెప్పాడు. నెలకు దగ్గర దగ్గర రూ. 50 నుంచి రూ 60 వేలు దాక సంపాదించగలనని అన్నారు. వాటిలో ఖర్చులోపోను కనీసం రూ. 40 వేలు దాక మిగలుతుందని అన్నారు. అంతేగాదు గిగ్ ఎకానమీ కల్పిస్తున్న ప్రయోజనాల గురించి అందరికీ తెలియాలంటూ పోస్ట్‌ని ముగించాడు. నెటిజన్లు సైతం ఆశ్చర్చపోతూ..నా జీతమే అతడికంటే తక్కువేమో అని ఒకరు, బెంగళూరు రండి అక్కడ ఆటోడ్రైవర్లు నెలకు కనీసం రూ. 2 లక్షల దాక సంపాదిస్తున్నారు అని కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Akash Gupta | KaashSeAkash (@kaashseakash) (చదవండి: ఆ ఉద్యోగం వదిలేయడానికి.. ఏకంగా 74 లక్షల మూల్యం..!)


