
సాహసకృత్యాలతోనే కాదు స్మార్ట్‌గా కూడా గిన్నిస్ రికార్డులు సృష్టించొచ్చని నిరూపించాడు ఈ వ్యక్తి. అందరూ స్మార్ట్ కార్డులు(credit cards) ఖర్చుపెట్టడానికి ఉపయోగిస్తే..ఆయన దాన్ని ఆదాయ వనరుగా మార్చేసుకున్నాడు. అది ఎంతలా అంటే..రోజు మొత్తం క్రెడిట్ కార్డు లేకుండా పని కాదన్నంత రేంజ్‌లో. అలా ఏకంగా ఎన్ని క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తున్నాడో తెలిస్తే కంగుతింటారు. అంతేకాదండోయ్ అన్నేసి కార్డులు ఉపయోగించడంతో గిన్నిస్ రికార్డుల్లకెక్కాడు కూడా.
అతడే మనీష్ ధమేజ్. ఇతడి కథ అత్యంత విచిత్రంగా అనిపించినా..తెలివిగా, స్మార్ట్‌గా బతకడంలో అందరికి స్ఫూర్తిగా నిలుస్తాడు. ఆయన క్రెడిట్ కార్డులతో ఏప్రిల్ 30, 2021న గినిస్ రికార్డు నెలకొల్పాడు. వాట్ క్రెడిట్ కార్డుతో గిన్నిస్ రికార్డా..? అని విస్తుపోకండి. ఎందుకంటే ఆయన క్రెడిట్ కార్డుని ఖర్చు చేసి.. అప్పలు పాలవ్వలేదు. దాన్ని ఆయన ఎలాంటి అప్పు లేకుండా..మంచి ఆదాయ వనరుగా మార్చేసుకున్నాడు.
అలా ఆయన వద్ద మొత్తం 1,638 చెల్లుబాటు అయ్యే క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఆయన రోజు క్రెడిట్ లేకుండా మొదలవ్వదట. అంతలా క్రెడిట్ కార్డులంటే ఇష్టమట. కాంప్లిమెంటరీ, ట్రావెలింగ్ రైల్వే లాంజ్, ఎయిర్‌పోర్ట్ లాంజ్, ఫుడ్, స్పా, హోటల్ వోచర్లు, కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఫ్లైట్ టిక్కెట్లు, కాంప్లిమెంటరీ షాపింగ్ వోచర్లు, కాంప్లిమెంటరీ సినిమా టిక్కెట్లు, కాంప్లిమెంటరీ గోల్ఫ్ సెషన్లు, కాంప్లిమెంటరీ ఇంధనం ఇలా ఎన్నో క్రెడిట్ కార్డులన్నీ వాడేస్తారట.
ప్రతి రివార్డు పాయింట్లను వేస్ట్ చేయకుండా ఉపయోగించేయడంతో.. అవన్నీ అప్పులుగా కాకుండా ఆదాయ వనరుగా మారింది మనీష్‌కి. ఆ నేపథ్యంలోనే ఆయన వద్ద అంతలా క్రెడిట్ కార్డుల కలెక్షన్ ఉందని గిన్నిస్ వరల్డ్ రికార్డు పేర్కొనడం గమనార్హం. అంతేగాదు 2016లో నోట్ల రద్దు సమయంలో అందరూ డబ్బులు కోసం బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూలో నిలబడితే.. ఇతడు మాత్రం క్రెడిట్ కార్డుతో పనికానిచ్చేశాడట. ఆయన బ్యాంకు నగదు కోసం త్వరపడడట. క్రెడిట్ కార్డుల సాయంతో డిజటల్‌గా డబ్బుని ఖర్చు చేయగలను అని చెబుతున్నారు.
ఇక ఆయన విద్యా నేపథ్యం ఏంటంటే..కాన్పూర్ సీఎస్‌జీఎం విశ్వవిద్యాలయం నుంచి బీసీఏ, లక్నో ఇంటిగ్రల్ విశ్వవిద్యాలయం నుంచి ఎంసీఏ, ఇగ్నో నుంచి సోషల్ వర్క్‌లో మాస్టర్ డిగ్రీ తదితరాలు పూర్తి చేశారు. ఈయన్ను చూస్తే..సాంకేతికతను వినియోగించుకుంటూ..తెలివిగా ఆర్థిక విషయాలను ప్లాన్ చేస్తే..సాధారణ విషయాలు కూడా అసాధారణంగా మారిపోతాయనేందుకు మనీష్ స్టోరీనే ఉదాహరణ కదూ..!.
During India’s 2016 demonetisation, when the country faced a cash shortage, Manish relied on his credit cards and managed his expenses through digital payments with ease. For him, credit cards are more than financial tools. They are a way of life. pic.twitter.com/g7V8Sztl1Z
— Fact Point (@FactPoint) October 10, 2025
(చదవండి: ఇదేందీ ఇది.. చనిపోయిన వాళ్లతో జీవించడమా..?! పర్యాటకులు సైతం..)