బాలభీముడు..ఏకంగా 5.9 కిలోలు.. | NY mom delivers 5.9 kg baby boy stunned by supersized newborn arrival | Sakshi
Sakshi News home page

పుట్టుకతో రికార్డు..ఏకంగా 5.9 కిలోల బరువు

Feb 27 2026 12:26 PM | Updated on Feb 27 2026 12:34 PM

NY mom delivers 5.9 kg baby boy stunned by supersized newborn arrival

పుట్టుకతోనే రికార్డు సృష్టించింది ఈ నవజాత శిశువు. అసాధారణ జననంగా నిలిచింది. ఈ ఘటన న్యూయార్క్‌లో చోటు చోసుకుంది. జనవరి 31న కయుగా మెడికల్‌ ఆస్పత్రిలో  5.9 కిలోల బరువున్న షాన్‌ జూనియర్‌ అనే మగబిడ్డ  జన్మించాడు. సగటు నవజాత శిశువు బరువు కంటే దాదాపు రెండు రెట్లు బరువుతో ఒక మగబిడ్డ జన్మించడంలో అక్కడున్న వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది ఆశ్చర్యపోయారు. తమ ఆస్పత్రిలో ఇప్పటివరకు జన్మించిన అత్యంత బరువైన శిశువని అన్నారు. 

ఆ శిశువు తల్లిదండ్రలు టెర్రికా, షాన్‌ దంపతులు తమ బిడ్డ పెద్దగా పుడతాడని అనుకున్నాం కానీ..మరి ఇంత బారీగా పుడతాడని అనుకోలేదని, చాలా షాక్‌ అయ్యామని చెబుతున్నారు. ఆ బిడ్డకు డైపర్లు మూడు నుంచి ఆరునెలల బిడ్డకు ఉపయోగించవే వాడాల్సి వచ్చిందని అన్నారు. తాను మూడు నెలల వయసున్న శిశువుకి జన్మనిచ్చానని సంబరపడిపోతోంది తల్లి టెర్రికా. ఆ బాలభీముడు జన్మించిన మరో ఆడ శిశువు జన్మించింది. ఆ బిడ్డ బరువు కేవలం 1.8 కిలోలు మాత్రమే. సదరు ఆస్పత్రి ఈ ఇద్దరు పిల్లల జనన వేడుకలను జరుపుకుంది.

ప్రతి జననం ప్రత్యేకమైనది, ఆ తల్లిదండ్రులకు ఓ మధుర జ్ఞాపకం కూడా అని అన్నారు. కాగా చరిత్రలో ఇప్పటి వరకు నమోదైన అత్యంత బరువైన శిశువు జనవరి 19, 1878న ఒహియోలోని సెవిల్లెలో జన్మించింది. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ప్రకారం..బేబ్‌గా పిలిచే ఆ శిశువు పుట్టినప్పుడు ఆశ్చర్యకరంగా 9.98 కిలోలు బరువు, 28 అంగుళలా పొడవుతో ఉన్నాడు. దాంతో ఇప్పటివరకు నమోదు చేయబడ్డ అతిపొడవైన బరువైన నవజాత శిశవుగా రికార్డులెక్కింది. అయితే ఆ శిశువు కేవలం 11 గంటలు మాత్రమే జీవించింది. 

(చదవండి: నటి రష్మిక మందన్న 'కొడగు' శారీ స్టైల్‌..! ఈ చీరకట్టు స్పెషాల్టీ ఇదే..)
 

Advertisement
 
Advertisement
Advertisement