USAలో విద్యార్థిని అక్రమ అరెస్ట్? | Student illegally arrested in USA | Sakshi
Sakshi News home page

USAలో విద్యార్థిని అక్రమ అరెస్ట్?

Feb 27 2026 9:45 AM | Updated on Feb 27 2026 10:47 AM

Student illegally arrested in USA

అమెరికా ప్రభుత్వం విదేశీ విద్యార్థులపై ఎంత కఠిన వైఖరి అవలంభిస్తోందో తెలిసిన విషయమే. తాజాగా పాలస్తీనాకు మద్ధతుగా నిరసన జరిపిందంటూ ఒక విదేశీ  విద్యార్థిని USA సర్కార్ అరెస్టు చేసింది. అయితే  దీనిపై న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ జోక్యంతో  స్టూడెంట్‌ను రిలీజ్ చేసింది.

గురువారం ఉదయం ( USA)ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఒక అపార్టుమెంటులోకి అకస్మాత్తుగా ప్రవేశించారు. ఒక పాపకోసం వచ్చామంటూ అందులోని అక్కడ ఉన్న నివాసితులకు నమ్మబలికారు. అలా సోదాలు జరిపి కొలంబియా యూనివర్సిటీలో చదువుతున్న ఎల్లీ అఘయేవా అనే విద్యార్థిని అరెస్టు చేశారు. దీంతో ఆమె షాక్‌కు గురైంది. తనను DHS ప్రతినిధులు అక్రమంగా అరెస్టు చేశారని తనను కాపాడాలని ఇన్‌స్టాలో మెసేజ్ చేసింది.

ఆమె అరెస్టు వార్త విని కొలంబియా వర్సిటీలో నిరనసలు చెలరేగాయి. దీంతో న్యూయార్క్ మేయర్ జోహ్రానీ మామ్దానీ ట్రంప్‌తో భేటీ జరిపి  ఆ విద్యార్థిని విడుదల చేయాలని కోరడంతో ట్రంప్ వెంటనే ఓకే అన్నారు. దీంతో ఆమె రిలీజైంది. అయితే తనను అరెస్టు చేయడం ఎంతో షాక్‌కు గురిచేసిందని ఆ విద్యార్థిని తెలిపింది. అయితే ఎల్లీ అఘవేయా అజర్‌బైజాన్ దేశానికి చెందిన విద్యార్థిని. 

అయితే మామ్దానీ, ట్రంప్ ఒకే పార్టీకి చెందిన నేతలు కాదు. ఎన్నికల సమయంలో పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. అయినప్పటికీ ఆయన నిర్ణయాన్నిగౌరవించడం మేయర్‌ మాటకు గౌరవమిచ్చి ఆ విద్యార్థిని విడుదల చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. 

Advertisement
 
Advertisement
Advertisement