breaking news
Donald Trump
-
మనీ లాండరింగ్ సందేహాలు.. యూఎస్ కోర్టులో క్యాపిటల్ వన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన ‘ట్రంప్ ఆర్గనైజేషన్’ బ్యాంక్ ఖాతాల రద్దు వివాదంలో మలుపు చోటుచేసుకుంది. 2021లో ట్రంప్ కుటుంబానికి చెందిన 300కి పైగా ఖాతాలను మూసివేయడానికి ఎలాంటి రాజకీయ కారణాలు లేవని, మనీ లాండరింగ్ సమీక్షలో వెల్లడైన తీవ్రమైన ఆర్థిక లావాదేవీల సందేహాలే అసలు కారణమని ప్రముఖ ఆర్థిక సంస్థ ‘క్యాపిటల్ వన్’ అమెరికా ఫెడరల్ కోర్టుకు స్పష్టం చేసింది.రాజకీయ కక్షసాధింపు కాదన్న బ్యాంక్2021 జనవరి 6న వాషింగ్టన్ క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి అనంతరం తమ రాజకీయ భావజాలం నచ్చక బ్యాంక్ అక్రమంగా తమ ఖాతాలను మూసివేసిందని (‘డీ-బ్యాంకింగ్’) ట్రంప్, ఆయన కుమారుడు ఎరిక్ ట్రంప్ ఫ్లోరిడాలోని ఫెడరల్ కోర్టులో దావా వేశారు. ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ క్యాపిటల్ వన్ కోర్టులో కీలక పిటిషన్ దాఖలు చేసింది.తమ 'యాంటీ మనీ లాండరింగ్' నిపుణుల బృందం నెలల తరబడి జరిపిన సమగ్ర విశ్లేషణ, సందేహాస్పద ఆర్థిక లావాదేవీల తీరుతెన్నుల పరిశీలన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ తెలిపింది. ఫెడరల్ బ్యాంకింగ్ మార్గదర్శకాలు, బ్యాంక్ అంతర్గత నియమావళి ప్రకారమే ఖాతాలను క్లోజ్ చేశామని, ఇందులో ఎలాంటి రాజకీయ ప్రేరేపిత కోణం లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా వేరే బ్యాంకుల్లో ఖాతాలు తెరుచుకోవడానికి ట్రంప్ బృందానికి అనేక నెలల సమయం, పొడిగింపులు కూడా ఇచ్చామని నివేదికలో పేర్కొంది.బిలియన్ డాలర్ల లీగల్ పోరాటంక్యాపిటల్ వన్‌తో పాటు మరొక దిగ్గజ బ్యాంక్ ‘జేపీమోర్గన్ ఛేజ్’పై కూడా ట్రంప్ 5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.41,500 కోట్లు) పరిహారం కోరుతూ దావా వేశారు. అమెరికాలో కన్జర్వేటివ్ నాయకులు, వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకుని బ్యాంకింగ్ వ్యవస్థల నుంచి తొలగిస్తున్నారని ట్రంప్ వర్గం తీవ్రంగా ఆరోపిస్తోంది. అయితే, చట్టపరమైన లేదా ఇమేజ్ పరమైన ముప్పు ఉన్న ఖాతాలపై రిస్క్ నిర్వహణలో భాగంగా చర్యలు తీసుకోవడం సాధారణ ప్రక్రియ అని బ్యాంకింగ్ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.పెరిగిన డీ-బ్యాంకింగ్ వివాదంఈ వివాదం అమెరికా రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ట్రంప్ తన రెండో విడత పాలనలో ‘అమెరికన్లందరికీ న్యాయమైన బ్యాంకింగ్ హక్కులు’ పేరుతో ప్రత్యేక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. రాజకీయ ప్రాతిపదికన కస్టమర్ల ఖాతాలను మూసివేయడాన్ని ఇది నిషేధిస్తుంది. ఒకవైపు మనీ లాండరింగ్ నిబంధనలను బ్యాంకింగ్ దిగ్గజాలు కోర్టులో తెరపైకి తెస్తుండగా, మరొకవైపు ట్రంప్ న్యాయ బృందం దీనిని వ్యాపార ప్రత్యర్థుల కుట్రగా అభివర్ణిస్తుండటంతో ఈ చట్టపరమైన పోరాటం అంతర్జాతీయ ఆర్థిక వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.ఇదీ చదవండి: మెరుపు తగ్గిన మేలిమి బంగారం -
యుద్ధం ఆపేందుకు తలపట్టుకుంటున్న ట్రంప్?
వాషింగ్టన్: ఇరాన్‌పై దాడులకు అమెరికా సెంట్రల్ కమాండ్ సరికొత్త వ్యూహం అనుసరించనుందా అంటే అవుననే సమాధానమస్తుంది.. ఈ విషయమై ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చేలా సరికొత్త వ్యూహాలను తెలియజేయాలని ఆ దేశంలోని సైనికులను కోరిందట.. సంప్రదాయేతర, సృజనాత్మక మార్గాలను" సూచించాల్సిందిగా విస్తృత శ్రేణి సైనిక విశ్లేషకులను సంప్రదించిందని కథనాలు పేర్కొన్నాయి.ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా ఉంది.. ఇరాన్‌పై దాడి చేసి వారం రోజుల్లోగా యుద్ధాన్ని ముగించవచ్చు అనకున్న ట్రంప్‌కు యుద్దం ప్రారంభమై ఐదునెలలు గడుస్తోన్నా యుద్ధం ముగించే దారి దొరకడం లేదు. అలా అని ఇరాన్ భూభాగంలోకి సైనికులను పంపితే పెద్దఎత్తున ప్రాణనష్టం జరిగే అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అలాగని దాడులు ఆపేస్తే అమెరికా పట్టు సడలిపోతుంది. దీంతో ఏం చేయాలో తోచక తల పట్టుకోవాల్సిన పరిస్తితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో యూఎస్ సెంట్రల్ కమాండ్ కంట్రోల్ కొత్తగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.ఇరాన్‌ను ఏవిధంగా మరింతగా దెబ్బతీయవచ్చు లేదా కట్టడి చేయవచ్చు అనే అంశంపై ఆర్మీ విశ్లేషకులు, అధికారుల నుంచి కొత్త ప్రతిపాదనలను సేకరించాలని ఒక సీనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అంతర్గతంగా ఈ అభ్యర్థనను పంపినట్లు సమాచారం. ఇరాన్‌తో చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడటం ,పరిమితమైన సైనిక ప్రత్యామ్నాయాలు ఉన్న నేపథ్యంలో అమెరికా ఈ సరికొత్త విశ్లేషణలు లేదా ఆలోచనల కోసం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.సీఎన్ఎన్ (CNN) నివేదిక ప్రకారం.. గత వారం సెంట్రల్ కమాండ్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్‌లోని ఒక అధికారి ఈమెయిల్ ద్వారా ఈ బ్రెయిన్‌స్టార్మింగ్ (ఆలోచనల సేకరణ) సెషన్‌ను ప్రారంభించారు. ఈమెయిల్ ద్వారా ఇలా ప్రజల లేదా సిబ్బంది అభిప్రాయాలను సేకరించడం (క్రాగ్సోర్సింగ్ పద్ధతి) సైన్యంలో చాలా అరుదైన విషయం, ఈ విషయాన్ని పట్టి చూస్తే తన నిబంధనల ప్రకారం ఇరాన్‌ను ఒప్పందానికి అంగీకరించేలా చేయడానికి అధ్యక్షుడు ట్రంప్‌కు చాలా కష్టమని తెలుస్తోందని కథనాలు ప్రచురించాయి.అమెరికా గత కొన్ని వారాలుగా ఇరాన్‌పై పెద్ద ఎత్తున వైమానిక దాడులు చేస్తున్నప్పటికీ, ఇరాన్ వెనక్కి తగ్గకపోవడం, తమ వైఖరి మార్చుకోకపోవడంతో అమెరికా రక్షణ రంగానికి ఒక రకమైన ప్రతిష్టంభన ఏర్పడింది. కేవలం బాంబులు వేయడం వల్ల ఇరాన్‌ను లొంగదీసుకోవడం సాధ్యం కాదనే వాస్తవం అమెరికాకు అర్థమయ్యింది. ఒకవేళ ఇరాన్ భూభాగంలోకి గ్రౌండ్ ట్రూప్స్ (భూతల సైన్యం)ను పంపడం లేదా భూగర్భంలో ఉన్న అణు కేంద్రాలపై భారీ దాడులు చేయడం వల్ల అమెరికాకు ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉంది. అలాగే ఆయుధ నిల్వలు తరిగిపోవడం, చమురు ధరలు పెరగడం వంటి సమస్యల వల్ల అమెరికా ప్రత్యక్షంగా పెద్ద యుద్ధానికి వెనుకంజ వేస్తోంది.దీంతో కొత్త దారుల కోసం అన్వేషణ ఇప్పటివరకు అనుసరించిన పద్ధతులు కాకుండా, ఎలాంటి పెద్ద యుద్ధ నష్టం లేకుండా ఇరాన్‌ను దెబ్బతీయడానికి లేదా చర్చల ముందుకు రప్పించడానికి పూర్తిగా భిన్నమైన, ఎవరూ ఊహించని మార్గాలు అవసరమని అమెరికా సైనిక వర్గాలు భావిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరగా ఒక విజయాన్ని లేదా స్పష్టమైన ఒప్పందాన్ని కోరుకుంటున్నప్పటికీ, దానికి తగిన సరైన సైనిక ప్రత్యామ్నాయాలు తక్షణమే అందుబాటులో లేకపోవడాన్ని ఈ అంతర్గత ఈమెయిల్ స్పష్టం చేస్తోంది. -
‘మీకు బోలెడు లాభాలొచ్చాయ్’
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టినప్పటికీ పెట్రోల్ బంకుల్లో సామాన్య వినియోగదారులకు ధరల ఉపశమనం లభించకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలోని ప్రధాన చమురు కంపెనీలు అనైతికంగా విపరీతమైన లాభాలు ఆర్జిస్తున్నాయని ఆరోపిస్తూ పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను తక్షణమే తగ్గించాలని ఆదేశించారు. ‘చమురు దిగ్గజాలు అధిక లాభాలు గడిస్తున్నాయి. పెట్రోల్ బంకుల్లో ఇంధన ధరలను వెంటనే తగ్గించండి’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో హెచ్చరిక జారీ చేశారు.ఇటీవల పశ్చిమాసియాలో ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతలు, సరఫరా అడ్డంకుల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరిగి ఎక్సన్ మొబిల్, షెవ్రాన్ వంటి అమెరికన్ చమురు సంస్థలు గత త్రైమాసికంలో రికార్డు స్థాయి లాభాలను నమోదు చేశాయి. అయితే, మిలిటరీ చర్యలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 83 డాలర్ల స్థాయికి పడిపోయాయి. ముడిచమురు ధరలు పడిపోయినా రిటైల్ మార్కెట్లో పెట్రోల్ ధరలను తగ్గించకుండా కంపెనీలు లాభపడటంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈక్రమంలో షెవ్రాన్ సీఈఓ మైక్ విర్త్‌ను ట్రంప్ నేరుగా లక్ష్యంగా చేసుకున్నారు. తమ ప్రభుత్వ వ్యూహాత్మక విధానాలు, మద్దతు వల్లే వెనిజువెలా వంటి ప్రాంతాల్లో షెవ్రాన్ తిరిగి బలమైన స్థానానికి చేరుకుని భారీగా ఆర్జిస్తోందని, కానీ ఆ క్రెడిట్‌ను యాజమాన్యం గుర్తించడం లేదని విమర్శించారు. ‘ప్రభుత్వ పరిపాలన అందించిన మద్దతు, స్థిరత్వం లేకపోతే అమెరికా చమురు పరిశ్రమ దెబ్బతినేది. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన కంపెనీలు ఆ ప్రయోజనాన్ని ధరల తగ్గింపు రూపంలో ప్రజలకు అందించాల్సిందే’ అని స్పష్టం చేశారు.అమెరికాలో త్వరలో జరగనున్న మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో పెరుగుతున్న జీవన వ్యయం, ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలు రిపబ్లికన్ పార్టీకి రాజకీయంగా పెద్ద సవాలుగా మారాయి. దీంతో ఓటర్ల అసంతృప్తిని చల్లార్చేందుకు ట్రంప్ ఇంధన దిగ్గజాలపై ఒత్తిడి పెంచుతున్నారు. చమురు కంపెనీలు వెంటనే స్వీయ నియంత్రణ పాటించి బంకుల్లో ధరలు తగ్గించకపోతే ధరల పెంపుపై జస్టిస్ డిపార్ట్మెంట్ ద్వారా విచారణ జరిపించేందుకు సైతం వైట్‌హౌస్ వెనుకాడకపోవచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: దేశంలోనే అత్యధిక శ్రీమంతులున్న టాప్-10 ఇంటిపేర్లు -
ట్రంప్‌కు బిగ్ షాక్.. టారిఫ్‌లపై కోర్టుకెక్కిన 25 రాష్ట్రాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న టారిఫ్ విధానానికి సొంత దేశంలోనే సవాళ్లు ఎదురవుతున్నాయి. భారత్ సహా 60 దేశాలపై విధించిన కొత్త దిగుమతి సుంకాలను నిలిపివేయాలని కోరుతూ అమెరికాలోని 25 రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి. ట్రంప్ ప్రభుత్వం తన అధికారాలను మించి వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ దాఖలైన ఈ పిటిషన్.. ఆయన వాణిజ్య విధానానికి మరో న్యాయ పరీక్షగా మారింది.ట్రంప్ ప్రభుత్వం గత నెలలో ట్రేడ్ యాక్ట్-1974లోని సెక్షన్ 301 కింద కొత్త టారిఫ్‌లను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ సుంకాలు 10 శాతం నుంచి 12.5 శాతం వరకు ఉన్నాయి. భారత్, యూరోపియన్ యూనియన్ సహా మొత్తం 60 వాణిజ్య భాగస్వామ్య దేశాల నుంచి వచ్చే దిగుమతులపై ఇవి వర్తిస్తున్నాయి. అయితే బలవంతపు కార్మిక వ్యవస్థ ద్వారా తయారయ్యే వస్తువుల దిగుమతులను అడ్డుకోవడం, వాణిజ్య నిబంధనలను కఠినతరం చేయడమే ఈ టారిఫ్‌ల ఉద్దేశమని ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది.“అధ్యక్ష అధికారాలను ఆయన దాటారు”ఈ టారిఫ్‌లను వ్యతిరేకిస్తూ 25 డెమొక్రటిక్ పాలిత రాష్ట్రాలు అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కోర్టులో పిటిషన్(U.S. Court of International Trade) దాఖలు చేశాయి. ఒరెగాన్, న్యూయార్క్ వంటి రాష్ట్రాలు ఈ న్యాయపోరాటంలో ఉన్నాయి. ట్రంప్ ప్రభుత్వం గతంలో కోర్టులు తప్పుబట్టిన విస్తృత టారిఫ్ విధానాన్నే మరో చట్టపరమైన మార్గంలో అమలు చేస్తోందని రాష్ట్రాలు ఆరోపించాయి. సెక్షన్ 301ను సాధారణంగా నిర్దిష్ట దేశాలు లేదంటే పరిశ్రమల అన్యాయ వాణిజ్య చర్యలపై ఉపయోగిస్తారని.. దాదాపు అన్ని దిగుమతులపై భారీ సుంకాలు విధించేందుకు ఉపయోగించలేమని వాదించాయి.ఈ కేసు ప్రస్తుతం అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కోర్టు పరిశీలనలో ఉంది. పిటిషన్‌పై తదుపరి విచారణ షెడ్యూల్ కోసం ఇరు వర్గాలు ఎదురుచూస్తున్నాయి. కోర్టు నిర్ణయం ట్రంప్ టారిఫ్ విధాన భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశముంది.భారత్‌పై ప్రభావం ఎంత?ట్రంప్ కొత్త టారిఫ్‌ల పరిధిలో భారత్ కూడా ఉంది. తొలుత భారత్‌పై 12.5 శాతం సుంకం విధించగా.. కొన్ని చర్యల తర్వాత దాన్ని 10 శాతానికి తగ్గించినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. అయితే చమురు, సహజ వాయువు, ఎరువులు వంటి కొన్ని ఉత్పత్తులకు ఈ కొత్త సుంకాల నుంచి మినహాయింపు ఇచ్చారు. అయినప్పటికీ భారత్ నుంచి అమెరికాకు వెళ్లే పలు ఉత్పత్తులపై ఈ టారిఫ్‌ల ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.ట్రంప్ టారిఫ్ విధానంపై వరుస ఎదురుదెబ్బలుటారిఫ్లను అమెరికా ఆర్థిక ప్రయోజనాలకు కీలక ఆయుధంగా ట్రంప్ భావిస్తున్నారు. విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి.. అమెరికా తయారీ రంగాన్ని ప్రోత్సహించడమే తన లక్ష్యమని ఆయన చెబుతున్నారు. అయితే ఆయన తీసుకున్న టారిఫ్ నిర్ణయాలకు ఇప్పటికే న్యాయపరమైన అడ్డంకులు ఎదురయ్యాయి. గతంలో అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA) కింద విధించిన భారీ సుంకాలపై అమెరికా కోర్టులు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అనంతరం ట్రంప్ ప్రభుత్వం ఇతర చట్టపరమైన మార్గాలను అనుసరిస్తోంది.మరోసారి కోర్టు తీర్పుపైనే ఉత్కంఠతాజాగా 25 రాష్ట్రాలు దాఖలు చేసిన పిటిషన్.. ట్రంప్ వాణిజ్య విధానానికి కీలక పరీక్షగా మారింది. కోర్టు ఈ టారిఫ్‌లను నిలిపివేస్తే ట్రంప్ ఆర్థిక ఎజెండాకు పెద్ద ఎదురుదెబ్బ తగలనుంది. ఒకవేళ కోర్టు ప్రభుత్వం వైపు మొగ్గుచూపితే.. భవిష్యత్తులో మరిన్ని దేశాలపై సుంకాల విధింపుకు మార్గం సుగమం అయ్యే అవకాశం ఉంది.ప్రస్తుతం అమెరికా కోర్టు నిర్ణయం కోసం వాణిజ్య వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ తీర్పు భారత్ సహా పలు దేశాలతో అమెరికా వాణిజ్య సంబంధాలపై కూడా ప్రభావం చూపే అవకాశముంది. -
ఇరాన్‌పై ట్రంప్ ‘టూ ఆప్షన్స్’ బాంబ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చర్చల విషయంలో ఇరాన్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరాన్ ముందు ఇప్పుడు రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయని.. వాటిలో ఏదో ఒకటి ఎంచుకోవడం తప్ప మరో మార్గం లేదని అల్టిమేటం జారీ చేశారు. తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ట్రంప్ స్పందిస్తూ.. ఇరాన్ బహిరంగంగా అమెరికాతో చర్చలు జరగడం లేదని చెబుతున్నప్పటికీ, సమస్య పరిష్కారం కోసం చర్చలకు ప్రయత్నించిందని పేర్కొన్నారు. దశాబ్దాలుగా ఇరాన్ సృష్టించిన సమస్యకు పరిష్కారం కోసం తాము చర్చలు జరుపుతున్నామని అన్నారు.“ఒకటి ఒప్పందం చేసుకోవడం.. లేదంటే పూర్తిగా లొంగిపోవడం” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.హర్ముజ్ జలసంధిపై ట్రంప్ హెచ్చరికప్రపంచంలోని అత్యంత కీలకమైన వాణిజ్య మార్గాల్లో ఒకటైన హర్ముజ్ జలసంధి అంశంపైనా ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాంతంపై అమెరికా నౌకాదళానికి పూర్తి నియంత్రణ ఉందని, తమ అనుమతి లేకుండా ఇరాన్‌కు ఎలాంటి రాకపోకలు జరగవని స్పష్టం చేశారు. “ఒప్పందం కుదిరే వరకు లేదా పూర్తిగా లొంగిపోయే వరకు ఎలాంటి మార్పు ఉండదు” అనే రీతిలో ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి.దాడి నుంచి చర్చల వైపు ట్రంప్ అడుగుఇరాన్పై రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద దాడి చేస్తామని మొన్న హెచ్చరించిన ట్రంప్.. నిన్న ఆ సైనిక చర్యను తాత్కాలికంగా నిలిపివేశారు. గల్ఫ్ దేశాలు ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ నేతల సూచనలతో పాటు దౌత్య మార్గాలకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు సోమవారం ప్రారంభమవుతాయని ట్రంప్ చెప్పినప్పటికీ.. వాటి వివరాలను వెల్లడించలేదు.ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ రియాక్షన్ ఇదేఅంతకు ముందు అమెరికా వ్యాఖ్యలను ఇరాన్ ఖండించింది. ప్రస్తుతం వాషింగ్టన్‌తో ఎలాంటి చర్చలు జరగడం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ.. అమెరికాతో చర్చలు జరుగుతున్నాయన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ప్రస్తుతం తాము ఒమన్‌తో మాత్రమే సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. హర్ముజ్ జలసంధిలో తాత్కాలిక సురక్షిత రాకపోకల ఏర్పాటుకు సంబంధించిన చర్చలు మాత్రమే జరుగుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇరాన్‌కు డీల్ లేదంటే పూర్తిగా లొంగిపోవడం అనే ఆప్షన్లు ఉంచారు. అయితే ట్రంప్ ఫ్రెష్వార్నింగ్పై ఇరాన్ స్పందన రావాల్సి ఉంది. మరోవైపు.. ఇరాన్ తన సార్వభౌమత్వంపై రాజీపడబోదనే సంకేతాలు ఇస్తోంది. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని చెబుతూనే, ఉద్రిక్తతలు మరింత పెరగకుండా దౌత్య మార్గాలను కొనసాగించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే క్షిపణి బెదిరింపులు, సైనిక కదలికలతో వేడెక్కిన పరిస్థితుల్లో.. ట్రంప్ తాజా అల్టిమేటం, ఇరాన్ తిరస్కరణతో తదుపరి పరిణామాలపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. -
మళ్లీ చర్చల వంతు: ట్రంప్
కైరో/వాషింగ్టన్: ఇరాన్ విషయంలో గత కొన్ని వారాలుగా క్షిపణులు, డ్రోన్లకు పనిచెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా మంతనాల కోసం మధ్యవర్తులకు పనిచెప్పారు. యుద్ధంలో మారణహోమం తప్పితే సత్ఫలితాలు ఏమీ ఉండవని, అందుకే చర్చల పర్వానికి తెరతీస్తున్నానని సోమవారం ప్రకటించారు. ఈ మేరకు అధ్యక్షుని అధికార విమానం ‘ఎయిర్‌ఫోర్స్ వన్’లో మీడియాతో ట్రంప్ మాట్లాడారు. ‘‘ఇరాన్‌పై కనివినీ ఎరుగని స్థాయిలో దాడులకు సిద్ధమయ్యాం. రెండో ప్రపంచయుద్ధం తర్వాత ఎన్నడూ ఎవరూ చూడని భీకరస్థాయిలో ఇరాన్‌పై దాడులు చేయాలని నిర్ణయించాం. తీరా రణరంగంలోకి దూకే వేళ పశ్చిమాసియాలో సౌదీ అరేబియాసహా మా మిత్రదేశాలు వద్దు అని వారించాయి. చర్చల మార్గం తెరచే ఉందని గుర్తుచేశాయి. అందుకే మళ్లీ చర్చల మార్గంలో అమెరికా పయనిస్తోంది. చర్చలకు రావాలని ఇరాన్ అధికారులు సైతం ఆహ్వానాలు అందాయి. అందుకే సోమవారం నుంచి మధ్యవర్తుల ద్వారా చర్చలు మొదలుపెడతాం’’అని ట్రంప్ ప్రకటించారు. చర్చలు లేవన్న ఇరాన్ ఇరాన్ సోమవారం ట్రంప్ ప్రకటనకు భిన్నంగా స్పందించింది. ‘‘ఒమన్‌తో మాత్రమే మేం చర్చలు జరుపుతున్నాం. అది కూడా నౌకల సురక్షిత ప్రయాణ అంశంపై చర్చిస్తున్నాం. అమెరికాతో ప్రస్తుతం సంప్రతింపుల ప్రక్రియ నిలిచిపోయింది’’అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ సోమవారం స్పష్టంచేశారు. -
ట్రంప్.. అబ్బో! చాలా దూరం వెళ్లారా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం ఇచ్చే అంశాల్లో వలస విధానం ఒకటి. అక్రమ వలసదారులపై కఠిన చర్యలు, భారీ స్థాయిలో బహిష్కరణలు, సరిహద్దు నియంత్రణ వంటి నిర్ణయాలతో ట్రంప్ తన మద్దతుదారుల్లో బలమైన గుర్తింపు సంపాదించారు. అయితే ఇప్పుడు అదే వలస విధానం ఆయనకు రాజకీయ సవాల్‌గా మారుతోందా?.. తాజా సర్వే ఫలితాలు అలాంటి సంకేతాలనే ఇస్తున్నాయి.ట్రంప్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాల విషయంలో పెద్ద సంఖ్యలో అమెరికన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు అసోసియేటెడ్ ప్రెస్–NORC సెంటర్ ఫర్ పబ్లిక్ అఫైర్స్ రీసెర్చ్ నిర్వహించిన సర్వే వెల్లడించింది. అక్రమ వలసదారులపై చర్యలు తీసుకోవడంలో, చట్టబద్ధ వలసలను పరిమితం చేయడంలో ట్రంప్ తన అధికార పరిధిని మించుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ప్రారంభంలో ఆయన వలస విధానానికి ఉన్న మద్దతు 49 శాతంగా ఉండగా.. ప్రస్తుతం అది 39 శాతానికి పడిపోయింది. అంటే కేవలం కొన్ని నెలల్లోనే మద్దతు 10 శాతం పాయింట్లు తగ్గినట్లు సర్వే చెబుతోంది. 2024 అధ్యక్ష ఎన్నికల సమయంలో వలసల అంశం ట్రంప్ ప్రచారంలో కీలకంగా మారిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను దేశం నుంచి పంపించే విషయంలో ట్రంప్ తన అధికారాన్ని మించి వ్యవహరిస్తున్నారని 47 శాతం మంది అమెరికన్లు భావిస్తున్నారు. చట్టబద్ధ వలసలపై ఆంక్షలు విధించే విషయంలోనూ దాదాపు సగం మంది ప్రజలు ఆయన చర్యలు మరీ కఠినంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అయితే ట్రంప్ సొంత పార్టీ రిపబ్లికన్లలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. దాదాపు 80 శాతం మంది రిపబ్లికన్ ఓటర్లు ట్రంప్ వలస విధానాలను సమర్థిస్తున్నారు. వలసల అంశం ఇప్పటికీ ఆయన బేస్ ఓటర్లను ఏకం చేసే ప్రధాన అంశంగానే కొనసాగుతోంది. అయితే కొన్ని చర్యలపై మాత్రం విస్తృత స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తోంది. వలసదారులను గుర్తించేందుకు ట్రాఫిక్ తనిఖీలను ఉపయోగించడం, ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లను నగరాల్లోకి పంపించడం వంటి చర్యలు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉన్నాయని పలువురు అమెరికన్లు అభిప్రాయపడుతున్నారు. వలస నియంత్రణ అవసరమే అయినప్పటికీ.. దాని అమలు విధానం ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా ఉండాలని కోరుతున్నారు.వలస విధానంతో పాటు ఆర్థిక అంశాల్లోనూ ట్రంప్‌కు సవాళ్లు ఎదురవుతున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థను ఆయన నిర్వహిస్తున్న తీరుపై కేవలం 32 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక పరిస్థితి బాగోలేదని దాదాపు 70 శాతం మంది అమెరికన్లు అభిప్రాయపడటం గమనార్హం. అయితే రిపబ్లికన్ ఓటర్లలో మాత్రం ట్రంప్‌పై నమ్మకం కొనసాగుతోంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆయన పనితీరును 69 శాతం మంది రిపబ్లికన్లు సమర్థించారు.వలసలపై కఠిన వైఖరి ట్రంప్ రాజకీయ గుర్తింపులో కీలక భాగం. సరిహద్దు భద్రత, అక్రమ వలసల నియంత్రణ అంశాలతో ఆయన తన మద్దతు వర్గాన్ని బలపరిచారు. కానీ తాజా సర్వే మరో విషయాన్ని సూచిస్తోంది. ట్రంప్ ప్రధాన మద్దతుదారులు ఆయన వెంటే ఉన్నప్పటికీ.. మధ్యస్థ ఓటర్లు, స్వతంత్ర ఓటర్లలో అసంతృప్తి పెరుగుతోందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.వలసలపై ట్రంప్ దూకుడు.. అదే అంశం ఇప్పుడు ఆయనకు కొత్త సవాల్‌గా మారుతోందా? తాజా సర్వే మాత్రం అమెరికన్లలో మారుతున్న అభిప్రాయాలకు అద్దం పడుతోంది. రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ అంశం కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది. కఠిన వలస విధానాలు ట్రంప్‌కు రాజకీయ బలాన్నిస్తాయా? లేక సాధారణ అమెరికన్లలో వ్యతిరేకతను పెంచుతాయా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
యుద్ధానికి బ్రేక్.. ఇరాన్ కీలక ప్రకటన
అమెరికా-ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నడుమ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. క్షిపణులు, దాడుల హెచ్చరికలతో హోరెత్తిన వాతావరణం ఒక్కసారిగా చర్చల వైపు మళ్లింది. ఇరాన్‌పై భారీ సైనిక చర్యకు సిద్ధమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు దౌత్య మార్గానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇరాన్‌తో ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయని ప్రకటించిన ట్రంప్.. సోమవారం నుంచి చర్చలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. దీంతో పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ భయాలు కొంత తగ్గే సంకేతాలు కనిపిస్తున్నాయి.ఇరాన్ కీలక మౌలిక వసతులపై భారీ దాడులకు అమెరికా ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ.. చివరి దశలో వాటిని నిలిపివేసినట్లు ట్రంప్ తెలిపారు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఖతార్ వంటి గల్ఫ్ దేశాలు యుద్ధాన్ని విస్తరించకుండా దౌత్య పరిష్కారానికి అవకాశం ఇవ్వాలని కోరినట్లు ట్రంప్ చెప్పారు.ఇరాన్‌పై తాను చేపట్టబోయిన సైనిక చర్య సాధారణ దాడి కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆ దాడి జరిగి ఉంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన అతిపెద్ద దాడుల్లో ఒకటిగా నిలిచేదని వ్యాఖ్యానించారు. “నేను ప్రజలను చంపాలని కోరుకోవడం లేదు. యుద్ధంలో చాలా మంది ప్రాణాలు కోల్పోతారు. ఒకవేళ దాడి జరిగి ఉంటే భారీ విధ్వంసం జరిగేది.. తిరిగి నిర్మించడానికి ఎన్నో సంవత్సరాలు పట్టేది” అని ట్రంప్ పేర్కొన్నారు.అందుకే యుద్ధం కంటే చర్చల ద్వారా పరిష్కారం సాధించడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇరాన్‌తో ఒప్పందం కుదిరితే ప్రాణనష్టం, విధ్వంసం రెండింటినీ నివారించవచ్చని తెలిపారు.“ఇరాన్‌తో ఒక ఒప్పందం దగ్గరలోనే ఉంది” అని ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తించాయి. అయితే ఈ ఒప్పందంలో ఏ అంశాలపై రాజీ కుదరబోతోందన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.ఇరాన్ కీలక వ్యాఖ్యలుమరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ కూడా అమెరికాతో చర్చలపై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందానికి అమెరికా కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. “అమెరికా తన హామీలను గౌరవించాలి.. పరస్పర నమ్మకంతో ముందుకు సాగాలి” అనే సంకేతాలను పెజెష్కియన్ ఇచ్చారు.జూన్‌లో కుదిరిన తాత్కాలిక అవగాహన ఒప్పందమే భవిష్యత్‌లో ఇరాన్ విదేశాంగ విధానానికి కీలక ఆధారంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. ఇరాన్ తన ప్రయోజనాలను కాపాడుకునే విషయంలో వెనక్కి తగ్గబోదని కూడా ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.టెహ్రాన్‌కు దౌత్య బృందాలు!అమెరికా-ఇరాన్ మధ్య చర్చలకు మార్గం సుగమం చేసేందుకు మధ్యవర్తి దేశాలు రంగంలోకి దిగుతున్నాయి. గత 24 గంటల్లో చోటుచేసుకున్న పరిణామాల తర్వాత.. టెహ్రాన్‌లో పరోక్ష చర్చలకు వేదిక సిద్ధమవుతోందని సమాచారం. అమెరికా, ఇరాన్ మధ్య నేరుగా చర్చలు కాకుండా.. ఒమన్, ఖతార్ వంటి దేశాలు మధ్యవర్తిత్వం వహించే అవకాశం ఉంది.ఇప్పటికే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ.. సౌదీ అరేబియా, పాకిస్థాన్ తదితర దేశాలతో సంప్రదింపులు జరిపారు. ప్రాంతీయ దేశాల సహకారంతో యుద్ధ ఉద్రిక్తతలను తగ్గించి, హార్ముజ్ జలసంధి విషయంలో ఒక అవగాహనకు రావడమే లక్ష్యంగా దౌత్య ప్రయత్నాలు సాగుతున్నాయి.హర్ముజ్ జలసంధిపై అసలు పోరుఅమెరికా-ఇరాన్ చర్చల్లో అత్యంత కీలక అంశంగా హర్ముజ్ జలసంధి మారింది. ప్రపంచ చమురు రవాణాలో ఈ మార్గానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. పర్షియన్ గల్ఫ్ నుంచి ప్రపంచ మార్కెట్లకు వెళ్లే భారీ స్థాయి చమురు రవాణా ఈ జలసంధి ద్వారానే జరుగుతుంది. అందుకే ఏ చిన్న అంతరాయం ఏర్పడినా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంటుంది.ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ.. ఒమన్‌తో హార్ముజ్ నిర్వహణపై జరుగుతున్న చర్చలు చివరి దశకు చేరుకున్నాయని వెల్లడించారు. అయితే ఇవి అమెరికాతో నేరుగా జరుగుతున్న చర్చలు కావని ఇరాన్ స్పష్టం చేసింది. యుద్ధానికి ముందు ఉన్న పరిస్థితులకు హర్ముజ్‌ను పూర్తిగా తీసుకెళ్లడం సాధ్యం కాదని కూడా సంకేతాలు ఇచ్చింది.హర్ముజ్ కోసం తెర వెనుక డీల్!హర్ముజ్ జలసంధి విషయంలో కొత్త విధానం రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవరు పర్యవేక్షిస్తారు? నౌకల రాకపోకలు ఎలా ఉంటాయి? భద్రతా ఏర్పాట్లు ఎలా ఉండాలి? వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల్లో ఒమన్ కీలక పాత్ర పోషిస్తోంది. గతంలోనూ అమెరికా-ఇరాన్ మధ్య రహస్య దౌత్య చర్చలకు ఒమన్ వేదికగా నిలిచింది.ఇరాన్ వ్యూహం.. చర్చలు కూడా, ఒత్తిడి కూడాఇరాన్ ఒకవైపు చర్చలకు సిద్ధమని చెబుతూనే.. మరోవైపు తన వ్యూహాత్మక బలాన్ని కొనసాగిస్తోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ.. సౌదీ విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ తదితరులతో సంప్రదింపులు జరిపారు. ప్రాంతీయ భద్రత, స్థిరత్వంపై చర్చించినట్లు ఇరాన్ వెల్లడించింది. అయితే హార్ముజ్‌పై తన ప్రభావాన్ని మాత్రం కొనసాగించాలని భావిస్తున్నట్లు స్పష్టం చేసింది.అణు అంశమే అసలు పరీక్ష!అమెరికా-ఇరాన్ మధ్య జరిగే ఏ ఒప్పందానికైనా అణు కార్యక్రమం ప్రధాన అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఇరాన్ అణు సామర్థ్యాలను పరిమితం చేయాలని అమెరికా కోరుతోంది. మరోవైపు తమపై ఉన్న ఆంక్షలను తొలగించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఈ రెండు అంశాలపై రాజీ కుదిరితేనే చర్చలు విజయవంతమయ్యే అవకాశం ఉంది.ట్రంప్ ప్రకటనతో చమురు ధరలు దిగొచ్చాయియుద్ధ భయాల మధ్య పెరిగిన చమురు ధరలు ట్రంప్ తాజా ప్రకటనతో తగ్గుముఖం పట్టాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 4 డాలర్లకు పైగా పడిపోయింది. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊరట లభిస్తుందని మార్కెట్లు భావిస్తున్నాయి.ఎర్రసముద్రంలో ఉత్కంఠ!మరోవైపు సౌదీ అరేబియా నుంచి బయలుదేరిన రెండు చమురు నౌకలు బాబ్ అల్ మందెబ్ జలసంధిని దాటాయి. హౌతీల హెచ్చరికల మధ్య కూడా చమురు రవాణా కొనసాగుతుండటం గమనార్హం. అయితే భద్రతా కారణాలతో కొన్ని నౌకలు తమ ఆటోమేటిక్ ట్రాకింగ్ వ్యవస్థలను నిలిపివేసినట్లు సమాచారం.ఇజ్రాయెల్ చూపు చర్చలపైనేఅమెరికా-ఇరాన్ చర్చలను ఇజ్రాయెల్ కూడా నిశితంగా పరిశీలిస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమంపై ఎలాంటి రాజీ వచ్చినా అది తమ భద్రతకు ముప్పుగా భావించే ఇజ్రాయెల్.. గతంలో ఇరాన్‌పై కఠిన వైఖరి ప్రదర్శించింది. అందుకే ఈ చర్చలు కేవలం వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య వ్యవహారం కాకుండా మొత్తం పశ్చిమాసియా భవిష్యత్తును ప్రభావితం చేసే పరిణామంగా మారాయి.యుద్ధానికి ముగింపా? లేదంటే.. అమెరికా-ఇరాన్ మధ్య చర్చలకు మార్గం సుగమమైనప్పటికీ.. పూర్తి ఒప్పందం ఇంకా దూరంలోనే ఉంది. హర్ముజ్ నియంత్రణ, అణు కార్యక్రమం, ఆంక్షల తొలగింపు, భద్రతా హామీలపై ఇరు దేశాల మధ్య ఇంకా విభేదాలు కొనసాగుతున్నాయి. యుద్ధం అంచుల నుంచి చర్చల బల్లపైకి వచ్చిన అమెరికా-ఇరాన్ సంబంధాలు.. నిజంగా శాంతి దిశగా అడుగులు వేస్తాయా? లేక ఇది కేవలం వ్యూహాత్మక విరామమేనా? అన్నది రాబోయే చర్చలే తేల్చనున్నాయి. -
త్వరలోనే యుద్ధానికి ముగింపు
వాషింగ్టన్: పశ్చిమాసియాలో ముద్ధం త్వరలో ముగిసిపోతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంకేతాలిచ్చారు. ఇరాన్‌పై యుద్ధాన్ని ముగించడానికి గల్ఫ్‌లోని మిత్రదేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయని తెలిపారు. ఐదు నెలలుగా కొనసాగుతున్న ఈ సంఘర్షణలో ప్రస్తుతానికి కొత్త దాడులకు ఆదేశాలు జారీ చేయడాన్ని వాయిదా వేస్తున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు ట్రంప్ శనివారం సోషల్ మీడియాలో పోస్టుచేశారు. యుద్ధానికి ముగించడానికి వీలుగా ఇరాన్‌తో ఒప్పందాన్ని పూర్తి చేసే విషయంలో అమెరికాతో కలిసి పనిచేసేందుకు ఇజ్రాయెల్ అంగీకరించిందని వెల్లడించారు. త్వరగా ఘర్షణ ముగించండి: సౌదీ యువరాజు హార్మూజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్‌పై దాడులను అమెరికా మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు రావడంపై సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన శనివారం ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడారు. సంఘర్షణకు సాధ్యమైనంత త్వరగా తెరదించాలని, శాంతి సాధన కోసం చొరవ చూపాలని ట్రంప్‌ను కోరినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ అమెరికా సైన్యం ఇరాన్ ఇంధన, మౌలిక సదుపాయాలపై దాడులు ఉధృతం చేస్తే అందుకు ప్రతిస్పందనగా గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలు, మౌలిక సదుపాయాలపై ఇరాన్ సైన్యం భీకర స్థాయిలో విరుచుకుపడే ప్రమాదం ఉందని సౌదీ అరేబియా ఆందోళన చెందుతోంది. -
పశ్చిమాసియాలో ప్రమాదకర పాచికలాట
సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ 2025 నవంబర్ 18న అమెరికా సందర్శించారు. పౌర అణు శక్తి వినియోగ సహకారంపై సంప్రదింపులు పూర్తయ్యాయని అదే రోజు సంయుక్త ప్రకటన వెలువడింది. ఆ మేరకు ఒప్పందంపై రెండు దేశాలు సంతకాలు చేశాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న కోట్లాది డాలర్ల పౌర అణు శక్తి భాగస్వా మ్యానికి దీనితో చట్టపరమైన పునాది ఏర్పడిందని వైట్ హౌస్ పేర్కొంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ప్రమాణాలను పకడ్బందీగా పాటిస్తూ సహకారాన్ని ఇచ్చిపుచ్చు కోనున్నట్లు ప్రకటించారు. అయినా, అణ్వస్త్ర నిర్మాణ వ్యాప్తిపై ఇది అటు ఇజ్రాయెల్, ఇటు యూఏఈలలో ఆందోళనను రేకెత్తించడంతో ఈ అంశం మరింత జటిలంగా మారింది. అబ్రహాం ఒప్పందాలతో ముడిఇపుడు అమెరికా–సౌదీ ఒప్పందాన్ని సౌదీ అరేబియా అబ్రహాం ఒప్పందాలకు కట్టుబడి ఉండే అంశంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముడిపెట్టారు. పౌర అణు ఒప్పందానికి ఆమోదం తెలుపడం చిటికెలో పని. కాకపోతే ‘చాలా మన్నన పొందిన, సఫలమైన అబ్రహాం ఒప్పందాలకు సౌదీ అరేబియా పూర్తిగా కట్టుబడి ఉండాలి’ అని ట్రంప్ జూలై 23న బాహాటంగానే వెల్లడించారు. యురేనియంను ‘శుద్ధి చేసే సామగ్రి’ ఉండబోదని కూడా ట్రంప్ తెలిపారు. కానీ, యురేనియంను శుద్ధి చేయడాన్ని నివారించే నియమ నిబంధనలు ఒప్పందం ముసాయిదాలో కొరవడ్డాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా రెండింటిని ముడిపెట్టడంతో మొత్తం పరిస్థితి మారి పోయినట్లు అయింది. ఇది ఇక ఎంతమాత్రం అణు శక్తిని పౌర అవస రాలకు వినియోగించుకునేందుకు సంబంధించినదిగానో లేదా రష్యా, చైనాలను దూరం పెట్టేందుకు కుదుర్చుకున్నదిగానో లేదు. దౌత్యం ఒక లావాదేవీగా తయారైంది. అసలే అణు శక్తి చిక్కు ముడులతో కూడుకున్న దక్షిణాసియాలో ఇది ఇంకా గుబులు రేపు తోంది. ట్రంప్ నిర్ణయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కార్యాలయం వెంటనే స్వాగతించింది. సౌదీ గుర్తింపు ‘మధ్య ప్రాచ్యంలో శాంతి స్థాపనకు సంబంధించి ఒక చారిత్రక ముంద డుగు’ అని అది జూలై 23న వ్యాఖ్యానించింది. ఇజ్రాయెల్ అంగీకరించినట్టేనా?తెరవెనుక పరిస్థితులను బట్టి ఈ సమన్వయం ఒక ఎత్తుగడగా కనిపిస్తోంది. తుర్కియేకు అధునాతన ఎఫ్–35 విమానాల విక్ర యాన్ని వ్యతిరేకించాలని నెతన్యాహు కోరుకుంటున్నారనీ, సౌదీ అణు ఒప్పందం ఈ ప్రాంతంలో ఆయుధ పోటీని రేకెత్తిస్తుందని ఆందోళన చెందుతున్నారనీ ఇజ్రాయెలీ అధికారులు మీడియాకు తెలిపారు. ఇటీవల ట్రంప్‌ను కలుసుకునేందుకు ముందు నెతన్యాహు తన మనసులో మాటను వెల్లడించారు. సౌదీ అరేబి యాతో అమెరికా అణు సహకారం సైనిక శక్తి విషయంలో ఇజ్రా యెల్కున్న గుణాత్మక పైచేయిపై రాజీపడేటట్లు చేయదని హామీ లభించాలని ఆయన అన్నారు. ఏదైతేనేం జెరూసలెం కోరుకున్నది సాధించింది. సౌదీ అణు ఒప్పందం ఇజ్రాయెల్‌తో ముడిపడినఅంశమని ఇపుడు తేటతెల్లమైంది. రెండవసారి అధికారానికి వచ్చినప్పటి నుంచి కూడా అబ్రహాం ఒప్పందాలను మరింత విస్తరించాలని ట్రంప్ కోరుకున్నారు. సాధా రణ పరిస్థితులు నెలకొనాలంటే ‘పాలస్తీనా ఒక ప్రత్యేక రాజ్యంగా అవతరించేందుకు స్పష్టమైన బాటలు పరవా’లని సౌదీలు స్పష్టం చేశారు. గాజాలో పరిస్థితులు క్షీణించాక సౌదీ మరింత పట్టుసడలని వైఖరిని కనబరచింది. సాధారణ పరిస్థితుల స్థాపనపై చర్చలను అది 2023 అక్టోబర్ 14న విరమించుకుంది. ‘పాలస్తీనా రాజ్య స్థాప నను వ్యతిరేకిస్తున్న ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రస్తుత ప్రభు త్వాన్ని శాంతి స్థాపనకు చిత్తశుద్ధితో పనిచేసే భాగస్వామిగా’ చూడ లేమనే మొన్నీమధ్య జూలై 25 వరకు రియాద్ భావిస్తూ వచ్చింది. మారిన అమెరికా తీరుఅణ్వస్త్ర వ్యాప్తి నిరోధక విధానం విషయంలో అమెరికాలో వచ్చిన మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గల్ఫ్‌లో యురేనియం శుద్ధికి అనుమతించకూడదనే వైఖరినే అమెరికా 15 ఏళ్ళుగా అనుస రిస్తూ వచ్చింది. యూఏఈ కూడా 2009లోనే దాన్ని విరమించుకుంది. తాజా అమెరికా ఒప్పందం కింద సౌదీ ఆ నిబంధనను తిర స్కరించింది. అంతర్జాతీయ అణు శక్తి సంస్థ అదే పనిగా పర్యవేక్షించడాలు, పరిశీలించడాలు చేయకూడదని కూడా సౌదీ పేర్కొంది. తెహ్రాన్ రహస్యంగా యురేనియంను శుద్ధి చేసే సదుపా యా లను నిర్వహిస్తోందనే కారణంతోనే ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడికి దిగాయి. ఈ ఒప్పందం ఏ విధంగా ఆవిష్కృత మవుతుందోనని అబుదాబి, కైరో, అమ్మాన్, అంకారా ఎదురు చూస్తున్నాయి. ఇంతవరకు యురేనియంను శుద్ధి చేసే శక్తి పశ్చిమా సియాలో ఒక్క ఇరాన్‌కే పరిమితం అనుకున్నారు. ఇపుడు యురేని యంను శుద్ధి చేయగల సామర్థ్యాన్ని ఆ ప్రాంతంలో దాదాపు ఐదు దేశాలు సంతరించుకోగలవని కొత్త ఆందోళనలు మొదలయ్యాయి. ‘‘ఇజ్రాయెల్ వద్ద బాంబు ఉందనుకుందాం. ఇపుడు అమెరికా ఆమోదంతో సౌదీ అరేబియా కూడా యురేనియంను శుద్ధి చేయగల శక్తిని సంతరించుకుంటుంది. మరి మేం మాత్రం ఆ పని ఎందుకు చేయకూడదు?’’ అని ఇరాన్ వాదిస్తోంది. ఇరాన్‌తో అమెరికా కుదు ర్చుకోవాలని భావించిన అణు ఒప్పందం అటకెక్కింది. ఇరాన్ లోపలికి వెళ్ళి తనిఖీలు జరపడానికి అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు ఉన్న అవకాశం పరిమితం. ఇటువంటి పరిస్థితుల్లో అమెరికా ఆశీర్వా దంతో సౌదీ అరేబియా నిర్వహించే అణుశక్తి కార్యక్రమం పూర్తి ఆత్మవంచన, ద్వంద్వ ప్రమాణాల కిందకే వస్తుంది. ఇజ్రాయెల్ వైపు నుంచి చూస్తే ఈ ఒప్పందం దాని చాపకిందకు నీరు తేవడమే. అణ్వాయుధాలు కలిగిన దేశంగా ఇజ్రాయెల్ 50 ఏళ్ళుగా గుత్తాధిపత్యాన్నే అనుభవిస్తూ వచ్చింది. అది ఆ పనిని చాటుమాటునే నిర్వహిస్తూ వచ్చి ఉండవచ్చు. సౌదీ పౌర అణుశక్తి కార్యక్రమాన్ని అబ్రహాం ఒప్పందాలతో ముడిపెట్టడాన్ని పైకి స్వాగ తించి ఉండవచ్చు. కానీ, లోలోపల అణ్వస్త్ర నిర్మాణ సామర్థ్యం కలి గిన మరో అరబ్ దేశం అవతరిస్తోందని మథన పడుతోంది. సుస్థిరతకు అవకాశమెక్కడ? తాజా ఒప్పందంతో ఆ ప్రాంతంలో ఏ దేశానికాదేశం రక్షణకంచెలు ఏర్పాటు చేసుకోవాలని భావిస్తాయి. ఆయుధాల సమీకర ణకు పోటీపడతాయి. తప్పుడు అంచనాలు ప్రమాదకర స్థితినిసృష్టిస్తాయి. ఇంక ప్రాంతీయ సుస్థిరతకు అవకాశమెక్కడ? రష్యా అణు శక్తి సంస్థ రోసటామ్, చైనా నేషనల్ న్యూక్లియర్ కార్పొరేషన్లను కట్టడి చేయడానికి సౌదీ అణు కార్యక్రమం దోహద పడుతుందనీ, అమెరికా విస్తృత వ్యూహాత్మక ప్రయోజనాలను నెరవేరుస్తుందనీ అమెరికా మొదట్లో భావించింది. ఇపుడు అబ్రహాం ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని చెప్పడం ద్వారా సౌదీ–ఇజ్రా యెల్ మధ్య కూడా రాజీ కుదిర్చినట్లు అవడం తన విదేశాంగ విధానానికి కలికితురాయిగా మారుతుందని ట్రంప్ సంబరపడు తున్నారు. అందుకు రియాద్‌కు పౌర అణు శక్తి పేరుతో తీపిని తిని పిస్తున్నారు. ఈ క్రమంలో, నియమ నిబంధనలను తుంగలో తొక్కారు. పౌర అణు శక్తి వినియోగానికి సౌదీకున్న హక్కును కాదనలేం. రష్యా–చైనాలతో పోటీ పడేందుకు అమెరికాకు ఉన్న హక్కును కూడా తోసిపుచ్చలేం. కానీ, ఉద్రిక్తతలతో అట్టుడుకుతున్న ప్రాంతంలో యురేనియం శుద్ధికి ద్వారాలు తెరవడం ఎంతవరకు సబబు? ఇజ్రాయెల్‌తో సయోధ్య కుదుర్చుకోవాలనీ, సాధారణ పరిస్థితుల స్థాపనకు తోడ్ప డాలనీ అమెరికా పెడుతున్న షరతును సౌదీ ఇప్పటికే తిరస్కరించింది. ఒకవేళ ఒప్పందం మూలపడ్డా, అది తెచ్చిన ప్రమాణం నిలిచే ఉంటుంది: అణు శక్తిని సంపాదించుకునేటట్లు చేయడంలో అమెరికా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రాజకీయ ప్రయోజనాలు చూసు కుంటోంది. ఒకసారి భూతాన్ని బయటకు తెస్తే, దాన్ని తిరిగి సీసాలో బంధించడం కష్టం. -వ్యాసకర్త ‘సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్’ డైరెక్టర్, న్యూఢిల్లీ-సి. ఉదయ్ భాస్కర్ -
అమెరికా ప్రజలు అప్పుల్లో కూరుకుపోతున్నారా?
డొనాల్డ్ ట్రంప్ తరచూ.. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎన్నడూ లేనంత బలంగా ఉందని చెబుతున్నారు. దేశంలో ఉపాధి అవకాశాలు పెరిగాయని, ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉందని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు పీటర్ షిఫ్ (Peter Schiff) మాత్రం ఈ వాదనను ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో కీలక వ్యాఖ్యలు చేశారు.పీటర్ షిఫ్ ప్రకారం.. అమెరికా ఆర్థిక వ్యవస్థ నిజంగా బలంగా ఉంటే ప్రజలు తమ రోజువారీ ఖర్చులు, రుణాల చెల్లింపులు సకాలంలో చేయగలగాలి. కానీ.. ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించలేకపోతున్న వారి సంఖ్య 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత ఎన్నడూ లేనంత స్థాయికి చేరిందని ఆయన పేర్కొన్నారు.Trump claims the U.S. economy is booming like never before, yet serious credit-card delinquencies are at their highest rate since the aftermath of the 2008 financial crisis. This shows that Americans are struggling to pay their bills, which is consistent with bad, not good times.— Peter Schiff (@PeterSchiff) August 2, 2026క్రెడిట్ కార్డు బకాయిలు ఎక్కువకాలం చెల్లించకుండా ఉండటాన్ని ఆర్థిక రంగంలో 'సీరియస్ క్రెడిట్ కార్డ్ డెలింక్వెన్సీ'గా పరిగణిస్తారు. ఇలాంటి కేసులు పెరగడం అంటే.. ప్రజలు తమ ఆదాయంతో ఖర్చులను నిర్వహించలేకపోతున్నారని, ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని అర్థం. అందుకే ట్రంప్ చెబుతున్నట్లుగా అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందనే వాదనకు ఈ గణాంకాలు సరిపోవని పీటర్ షిఫ్ అంటున్నారు.ప్రజలు అప్పులు తీర్చలేకపోతుంటే.. దానిని మంచి ఆర్థిక పరిస్థితిగా ఎలా చెప్పగలమని పీటర్ షిఫ్ ప్రశ్నించారు. అయితే.. ప్రస్తుత అమెరికా ఆర్థిక పరిస్థితిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు ఉద్యోగాల పెరుగుదల, ఆర్థిక వృద్ధి వంటి సూచీలను ప్రస్తావిస్తే, మరికొందరు ప్రజలపై పెరుగుతున్న రుణభారం, అధిక జీవన వ్యయం, క్రెడిట్ కార్డు బకాయిలను ప్రధాన సమస్యలుగా చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. అమెరికా ఆర్థిక వ్యవస్థపై చర్చ కొనసాగుతూనే ఉంది.ఇదీ చదవండి: బ్యాంకులు మీ డబ్బుతో ఏం చేస్తాయో తెలుసా? -
ఇరాన్ దాడులపై ట్రంప్ కీలక నిర్ణయం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌పై దాడి ఆలోచనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. టెహ్రాన్‌తో పాటు కొన్ని మధ్య ప్రాచ్యదేశాల అభ్యర్థనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మరోసారి హర్ముజ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ వ్యవహారశైలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడుతారో ఎవరికీ తెలియదు. ఇటీవలే మరోసారి ఇరాన్‌పై రెచ్చిపోతూ వస్తున్న ట్రంప్ ఆ దేశాన్ని హెచ్చరిస్తూ పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈ సారి ఇరాన్‌పై కనీవినీ ఎరుగని రీతిలో దాడి చేస్తామని హెచ్చరించారు. ఇంతలోనే మరోసారి ప్లేటు ఫిరాయంచారు. ట్రంప్ మాట్లాడుతూ.. "ఇరాన్‌పై అమెరికా ప్రతిపాదిత దాడి వాయిదాపడింది. దానికోసం ఇరాన్‌తో పాటు కొన్ని మధ్యప్రాచ్య దేశాలు ఒక రాజీ ప్రతిపాదన తెచ్చాయి. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నాం.హర్ముజ్ జలసంధిని తక్షణమే తిరిగి తెరవడం, ఈ నేపథ్యంలోనే ఇరాన్ అణు ముప్పును తొలగించే ఒప్పందం ముసాయిదాపై అంగీకారం కుదిరింది" అని ట్రంప్ అన్నారు.ఇరాన్‌పై దాడి విరమణపై కీలక నిర్ణయంలో అమెరికాతో పాటు ఇజ్రాయెల్ సైతం ఉంది అని ట్రంప్ పేర్కొన్నారు.కాగా ఆక్సియోస్ నివేదిక ప్రకారం సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడినట్లు కథనాలు వచ్చాయి. ఇరాన్‌పై దాడి విషయంలో సంయమనం పాటించాలని, ఇరాన్‌పై జరగబోయే పెద్ద దాడిని ఎట్టిపరిస్థితుల్లో నివారించాలని విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నాయి. ప్రస్తుత పరిస్థితులుప్రస్తుతం అమెరికా-ఇరాన్‌ల మధ్య పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా మారాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై భారీ వైమానిక దాడులు చేయడానికి సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఇటీవల కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌పై గతంలో ఎన్నడూ చూడని విధంగా దాడులు చేస్తామని హెచ్చరించారు. అయితే, ఇరాన్, సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాల విజ్ఞప్తి మేరకు ఒక తాత్కాలిక యుద్ధ విరామానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. గత మూడు రోజులుగా ఇరు దేశాలు దాడులను నిలిపివేశాయి. -
నెతన్యాహు దూకుడు.. ట్రంప్‌కు బిగ్ షాక్!
గాజాలో యుద్ధ మంటలు ఇంకా కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. ఇజ్రాయెల్ మాత్రం తన సైనిక చర్యలను కొనసాగిస్తోంది. ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికకు అనుగుణంగా పరిస్థితులు మారుతాయని భావించిన వేళ.. గాజాపై వరుసగా జరుగుతున్న వైమానిక దాడులు మరోసారి ఉద్రిక్తతలను పెంచుతున్నాయి.పాలస్తీనా ఆరోగ్య అధికారుల ప్రకారం, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు గాజా సిటీ, మధ్య గాజాలోని దెయిర్ అల్-బలాహ్ ప్రాంతాల్లో దాడులు నిర్వహించాయి. దెయిర్ అల్-బలాహ్లోని ఓ నివాస భవనంపై జరిగిన దాడిలో ఓ వ్యక్తి, అతని భార్య మృతి చెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. గాజా సిటీలో జరిగిన మరో దాడిలో ఇద్దరు మరణించగా, వారిలో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.గాజా యుద్ధానికి ముగింపు పలకాలని ట్రంప్ నేతృత్వంలో అమెరికా దౌత్య ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. హమాస్ ఆయుధాలను వదులుకునేందుకు అంగీకరించిందని ట్రంప్ ప్రకటించినప్పటికీ.. ఆ ప్రతిపాదన అమలు దశకు చేరుకోవడంలో ఇజ్రాయెల్ వైఖరి కీలక అడ్డంకిగా మారిందని పరిస్థితులు సూచిస్తున్నాయి. ట్రంప్‌కు చెందిన ‘బోర్డ్ ఆఫ్ పీస్’ విడుదల చేసిన 15 అంశాల రోడ్‌మ్యాప్‌లో కాల్పుల విరమణ, భద్రతా ఏర్పాట్లు, యుద్ధం ముగింపు దిశగా చర్యలు ప్రతిపాదించారు. అయితే, హమాస్ నిరాయుధీకరణ, ఇజ్రాయెల్ సైన్యం ఉపసంహరణ వంటి అంశాలపై ఇరు వర్గాలు తమ వైఖరుల నుంచి వెనక్కి తగ్గడం లేదు.హమాస్ మాత్రం ఇజ్రాయెల్ దాడులను నిలిపివేసి, సైన్యాన్ని వెనక్కి తీసుకున్న తర్వాతే ఆయుధాల అంశంపై చర్చకు సిద్ధమని చెబుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం హమాస్ పూర్తిగా ఆయుధాలను వదిలేసిందనే స్పష్టమైన ఆధారాలు కనిపించే వరకు సైనిక చర్యలను ఆపబోమని స్పష్టం చేస్తోంది. ఈ పరిణామాలతో ట్రంప్ శాంతి ప్రయత్నాలకు ఇజ్రాయెల్ వైఖరి పెద్ద సవాల్‌గా మారింది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఈ ప్రతిపాదనపై బహిరంగంగా స్పందించకపోయినా, ఆయన ప్రభుత్వంలోని కొందరు మంత్రులు మాత్రం శాంతి ఒప్పందంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జాతీయ భద్రతా మంత్రి ఇటమార్ బెన్-గ్విర్ హమాస్‌పై సైనిక చర్యలు కొనసాగించాలని డిమాండ్ చేశారు.ఇక దౌత్య ప్రయత్నాల్లో భాగంగా మాజీ ఫతా నేత మహ్మద్ దహ్లాన్ మాట్లాడుతూ.. ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ ఇజ్రాయెల్‌తో గాజాపై దాడులు నిలిపివేయడానికి చర్చలు జరుపుతున్నారని తెలిపారు. అయితే ఒప్పందం విజయవంతం కావాలంటే ఇజ్రాయెల్ సైనిక చర్యలను నిలిపివేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అమెరికా ఒత్తిడి, అంతర్జాతీయ పిలుపులు ఉన్నప్పటికీ గాజాలో దాడులు కొనసాగుతుండటం ట్రంప్ దౌత్య ప్రయత్నాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. కాల్పుల విరమణకు మార్గం సుగమం కావాలంటే హమాస్ నిరాయుధీకరణ, ఇజ్రాయెల్ భద్రతా హామీలు, గాజా భవిష్యత్ పాలనపై ఇరు వర్గాల మధ్య రాజీ తప్పనిసరిగా మారింది. ప్రస్తుతం గాజాలో పరిస్థితి చూస్తే.. వాషింగ్టన్ నుంచి వస్తున్న శాంతి పిలుపులకు మించిన ప్రాధాన్యతను ఇజ్రాయెల్ తన భద్రతా లక్ష్యాలకు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో ట్రంప్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ప్రణాళిక భవిష్యత్తు అనిశ్చితంగా మారింది. -
గల్ఫ్ దేశాలను వీడండి.. అమెరికా పౌరులకు ట్రంప్ అత్యవసర హెచ్చరిక
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్, అమెరికా వరుస దాడులు తీవ్రతరమయ్యాయి. దీంతో, మధ్యప్రాచ్యంలో భద్రతా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న అమెరికా పౌరులకు అమెరికా విదేశాంగ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. భద్రతా ముప్పులు పెరుగుతున్నందున వీలైతే మధ్యప్రాచ్య దేశాలను విడిచి వెళ్లాలని, లేకపోతే ఎప్పుడైనా అత్యవసరంగా బయలుదేరాల్సిన పరిస్థితి రావచ్చని ముందస్తుగా సిద్ధంగా ఉండాలని సూచించింది.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, ఇరాక్, ఇజ్రాయెల్, జోర్డాన్, కువైట్, లెబనాన్, ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియాలోని అమెరికా రాయబార కార్యాలయాల ద్వారా తాజా ప్రయాణ సూచనలను విడుదల చేసింది. గగనతల మూసివేతలు, విమాన సర్వీసుల రద్దు, ప్రయాణాలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అమెరికా పౌరులకు సూచించింది. మధ్యప్రాచ్యానికి వెళ్లే ప్రయాణాలను కూడా పునరాలోచించాలని విదేశాంగ శాఖ పేర్కొంది. అంతకుముందు చేసిన సూచనల కంటే తాజా సూచన మరింత కఠినంగా ఉండటం గమనార్హం.ఇక, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. అవసరమైతే ఇరాన్‌పై తీవ్ర చర్యలు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించగా, అమెరికా దాడులకు తగిన ప్రతీకారం తప్పదని ఇరాన్ ప్రకటించింది. ఇదే సమయంలో ఇరాన్‌కు చెందిన డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని కువైట్ సైన్యం వెల్లడించింది. రెండు రోజుల క్రితం ఇరాన్‌పై భారీ స్థాయిలో దాడులు నిర్వహించినట్లు అమెరికా సైన్యం ప్రకటించడంతో ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ ఘర్షణలు మరిన్ని దేశాలకు విస్తరించే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతుండగా, ఇంధన ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.Middle East: Americans currently in the Middle East should exercise caution and heightened vigilance and should be prepared for flight cancellations, periodic airspace closures, and potential travel disruptions. Some airlines in the region have postponed resumption of earlier… pic.twitter.com/d1ZmzRBBHN— TravelGov (@TravelGov) August 1, 2026మరోవైపు.. అమెరికా హెచ్చరికలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మాట్లాడుతూ.. అమెరికా మరోసారి సైనిక చర్యలకు దిగితే దానికి ‘నిర్ణయాత్మక, తీవ్రమైన ప్రతిస్పందన’ ఇస్తామని హెచ్చరించారు. అలాగే సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, ఇజ్రాయెల్‌లోని ఇంధన మౌలిక సదుపాయాలను కూడా లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇరాన్‌పై దాడులకు తమ భూభాగాన్ని లేదా సౌకర్యాలను ఉపయోగించేందుకు ఏ దేశం అనుమతించవద్దని ప్రాంతీయ దేశాలకు ఆయన హెచ్చరించారు. అదే సమయంలో, అమెరికా హెచ్చరికలు ఉద్రిక్తతలను మరింత పెంచే చర్యలని ఇరాన్ విమర్శించింది. తమపై ఎలాంటి దాడి జరిగినా తగిన రీతిలో ప్రతీకారం తీర్చుకుంటామని, ప్రాంతీయ యుద్ధాన్ని కోరుకోవడం లేదని, అయితే తమ భద్రత విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేసింది. -
వలసదారులపై ‘మెగా హియరింగ్’ కత్తి!
హార్లింగన్ (అమెరికా): డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో వలసదారులపై మెగా హియరింగ్ కత్తి వేలాడుతోంది. నాలుగు రాళ్లు వెనకేసుకుందామనో.. తిండికి కొరత ఉండదనో.. రాజకీయ కక్షల కారణమో తెలియదు కానీ... అమెరికాకు వలసవెళ్లే వారి సంఖ్య ఏటికేడాదీ ఎక్కువ అవుతోంది. సరైన పత్రాలు, వీసాలతో వస్తే తప్పు లేకపోవచ్చు. కానీ.. చాలామంది అక్రమంగా అమెరికాలోకి చొరబడి తిష్టవేస్తూండటంతోనే సమస్య. ఇలాంటి అక్రమ వలసదారులను గుర్తించి, విచారించి వారి స్వదేశాలకు తిప్పి పంపడమూ ఏళ్లుగా జరుగుతున్న కార్యక్రమం. అయితే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తరువాత ఈ ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. ఇందుకు తార్కాణమే ఈ మెగా హియరింగ్స్. వలసదారులకు సంబంధించిన కేసులు కేసులు దశాబ్దకాలంలో 37 లక్షలకు చేరుకున్న నేపథ్యంలో అధికారులు వాటిని చకచక తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నమే ఈ మెగా హియరింగ్. పెండింగ్ కేసులను తగ్గించడానికి ఒక్కో జడ్జికి ఎక్కువ సంఖ్యలో కేసులు కేటాయిస్తున్నారు. ఈ ఏడాది జూన్ నెలలో మాత్రమే అమెరికా వ్యాప్తంగా 1300 మెగా హియరింగ్స్ జరిగినట్లు వలసదారుల హక్కుల కోసం పోరాడే సంస్థ ‘మొబైల్ పాథ్వేస్’ విశ్లేషణలో తేలింది. గత ఏడాది జూన్‌తో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ. అక్రమ వలసదారుల కేసుల విచారణ సమయాన్ని ఆరు నెలల నుంచి నెలకు తగ్గించింది. అయితే ఈ హడావుడి కార్యక్రమం వల్ల అక్రమవలసదారుల మాట ఎలా ఉన్నా... సరైన కారణాలతో అక్కడకు వెళ్లిన వారిపై కూడా తిరస్కరణ వేటు పడుతోందని మొబైల్ పాథ్వేస్ సీఈవో బార్ట్లో మెయిజ్ స్కోరుప తెలిపారు. మెగా హియరింగ్స్‌లో ఒక్కో న్యాయమూర్తికి రోజుకు 50 నుంచి 150 వరకు కేసులు కేటాయిస్తున్నారు. ఫలితంగా కోర్టు బయట గంటల తరబడి వేచి ఉండటం.. తీరా న్యాయమూర్తి ముందుకు వెళ్లిన తరువాత నిమిషాల్లో వాదనలు పూర్తయి ప్రతికూల తీర్పులు వెలువడటం సాధారణమవుతోందని తెలుస్తోంది. విచారణ సమయం తగ్గిపోవడం వల్ల కొంతమంది సరైన న్యాయవాదిని కూడా వెతుక్కోలేకపోతున్నారు. ఇంకొందరు లాయర్ల చేతిలో మోసపోతున్నారు కొలంబియా వ్యక్తి ఒకరు ఆశ్రయం (అసైలమ్) హోదా కోరుతూ 1,500 పేజీల సాక్ష్యాలు సమరి్పంచారు. అవి చాలవు మరికొన్ని కావాలని న్యాయమూర్తి కోరినా.. వాటిని సమర్పిందుకు సమయం ఇవ్వకపోవడంతో అతడు వెనుదిరగాల్సి వచ్చింది. ఏ కారణం చేతనైనా విచారణకు హాజరు కాకపోతే ఇక అంతే సంగతులు. ‘‘అసైలమ్ క్లెయిమ్ వదిలేశారు’’అని పరిగణించి, వెంటనే స్వదేశాలకు పంపేయాలని ఆర్డర్లు జారీ చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఇలా హాజరు కాని వారి సంఖ్య కూడా రెట్టింపయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2025 జనవరిలో ఈ సంఖ్య 20% ఉండగా, 2026 జూన్ నాటికి 40%కి చేరింది. 2025 జనవరిలో స్వదేశాలకు తిప్పి పంపాలన్న ఆదేశాలు 33,000 వరకూ ఉంటే 2026 జూన్ నాటికి ఇది 79,000కి పెరిగింది. న్యూయార్క్, చికాగో వంటి నగరాల్లో కేసు విచారణకు హాజరు కాని వారి రేటు మిగిలిన చోట్ల కంటే ఆరు రెట్లు ఎక్కువగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. పద్ధతి లేకుండా పోతోంది.. మెగా హియరింగ్స్ కారణంగా వలసదారుల కేసులు ఒక పద్ధతి లేకుండా విచారణ పూర్తి చేసుకుంటున్నాయని ఇమ్మిగ్రేషన్ హక్కులపై పోరాడుతున్న సంఘాలు వాపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో కేసులు విచారణలో ఉన్న వారు కోర్టు భవనంలోనే ఉన్నప్పటికీ, నిర్దిష్టమైన విచారణ ప్రాంతానికి రాలేదన్న కారణంతో ‘‘హాజరు కాలేదు’’అని ముద్ర వేసి స్వదేశాలకు తిప్పి పంపినట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఇమ్మిగ్రేషన్ చట్టాలు కఠినంగానే ఉండాలని కోరుకునే వారు మాత్రం ఇలాంటి మెగా హియరింగ్స్ వల్ల పెండింగ్ కేసులు తగ్గుతాయని వాదిస్తున్నారు. 2025లో 37 లక్షల పెండింగ్ కేసులు ఉండగా, 2026లో అది 35 లక్షలకు తగ్గింది. అంటే ఏడాది కాలంలో రెండు లక్షల కేసులు విచారించారన్నమాట. సహజంగానే ఇంతటి పనిభారం న్యాయవాదులకు కూడా మోయలేని భారంగా మారింది. ఒక లాయర్ ఒకే రోజులో 20 కేసులు వాదించాడని, ఇది మునుపటితో పోలిస్తే పది రెట్లు ఎక్కువని సమాచారం. -
వినాశకర దాడులు చేస్తాం
వాషింగ్టన్/కైరో: హార్మూజ్ జలసంధిపై ఇరాన్ తనదైన పట్టును నిలుపుకోవడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు మరింత చిర్రెత్తిపోతోంది. దీంతో ఇకమీదట అత్యంత విశానకర స్థాయిలో దాడులు చేస్తామని ఇరాన్‌ను ట్రంప్ తాజాగా హెచ్చరించారు. మేరీల్యాండ్‌లో క్యాంప్ డేవిడ్ ప్రెసిడెన్షియల్ రీట్రీట్ కార్యక్రమంలో తన కేబినెట్ సహచరులతో భేటీలో ట్రంప్ మాట్లాడారు. ‘‘హార్మూజ్‌ను బేషరతుగా ఇరాన్ తెరవాల్సిందే. మధ్యవర్తిత్వం ద్వారా చర్చల ప్రక్రియ పూర్తిగా విఫలమైతే ఇరాన్‌పై మళ్లీ విధ్వంసకదాడుల పర్వం మొదలవుతుంది. మా దాడులను ఇరాన్ విజయవంతంగా అడ్డుకుంటుందని అస్సలు అనుకోను. ఎందుకంటే వాళ్ల నేవీ నాశనమైంది. గగనతల రక్షణ వ్యవస్థ నిరీ్వర్యమైంది. ఈమధ్య అమెరికా దాడుల తీవ్రతను తగ్గించడంతో వాళ్లు సాయుధ శక్తిసామర్థ్యాలపరంగా కాస్తంత పుంజుకున్నారేమో. కానీ అమెరికా దాడులను తీవ్రతరంచేయనుంది. గెలవడమే మా ధ్యేయం. ఇక దాడులను తట్టుకోలేం అని ఇరాన్ కాళ్లబేరానికొచ్చేస్థాయిలో దాడులు చేస్తాం’’అని ట్రంప్ ప్రకటించారు. కువైట్‌పై ఇరాన్ దాడులు అమెరికాకు మిత్రదేశంగా ఉన్న కువైట్‌పై ఇరాన్ శనివారం దాడులుచేసింది. అయితే ఇరాన్ డ్రోన్లను నేలకూల్చామని కువైట్ రక్షణశాఖ తెలిపింది. అత్యంతకీలకమైన ప్రాంతాలపై ఇరాన్ దాడులకు ప్రయతి్నంచింది. బుబియాన్ ద్వీపంలోని వాహన తయారీ కర్మాగారంపై దాడికి యతి్నంచింది. ఆ ప్రయత్నాలను మేం వమ్ముచేశాం’అని కువైట్ రక్షణశాఖ అధికార ప్రతినిధి జనరల్ అబ్బుల్అజీజ్ తెలిపారు. మరోవైపు ఒమన్‌లోని లీమా సమీపంలోని హార్మూజ్ జలసంధిలో ట్యాంకర్నౌకపై ఇరాన్ దాడిచేసిందని బ్రిటన్ నావికాదళం తెలిపింది. ఖాసాబ్ సిటీకి వాయవ్యంగా 21 నాటికల్ మైళ్లదూరంలో సముద్రజలాల్లో మరో సరుకు రవాణా నౌక సమీపంలో పేలుడు సంభవించింది. ఈ రెండు ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. -
ఇంతకీ ఖమేనీ ఎక్కడ?.. ఆ రహస్యం ఇదేనా?
ప్రపంచంలోనే దిగ్గజ నిఘా సంస్థలు ఏవని ఎవరైనా ప్రశ్నిస్తే.. ఠక్కున వచ్చే సమాధానాలు.. ఇజ్రాయెల్‌కు చెందిన మొస్సాద్.. అమెరికాకు చెందిన సీఐఏ..! తమ శత్రువు ప్రపంచంలోని ఏ మూలన దాక్కొన్నా.. లేపేస్తామనే ధీమా ఈ రెండు సంస్థలకు ఉంది. అయితే.. మధ్యప్రాశ్చ్యంలో ఇప్పుడు ఈ రెండు సంస్థల విషయంలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఏకు మేకై కూర్చున్నాడు. ఈ రెండు నిఘా సంస్థల టెక్నాలజీకి దొరకకుండా జాగ్రత్తపడుతున్న ఖమేనీ.. ఇప్పుడు అటు ట్రంప్.. ఇటు నెతన్యాహుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. ఇంతకీ ఖమేనీ ఎక్కడున్నాడు? ఆయన విషయంలో మొస్సాద్, సీఐఏ ఎందుకు విఫలమవుతున్నాయి?కంటిమీద కునుకు లేకుండా..అది 2020 నవంబరు 27వ తేదీ.. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలో ఇరాన్ అణు సాంకేతికతకు పెద్దదిక్కుగా ఉన్న మోహాసేన్ ఫాఖ్రిజాదేహ్ (Mohsen Fakhrizadeh) కారులో ప్రయాణిస్తున్నారు. మొస్సాద్, సీఐఏ నిఘా సంస్థల టార్గెట్‌గా ఆయన ఉన్నారు. ఆ కారుపై దాడికి ఈ సంస్థలు ఒక్క ఏజెంట్‌ని కూడా నియమించలేదు. కానీ, ఉపగ్రహ చిత్రాల ద్వారా ఆయనను గుర్తించి.. ఏఐ ఆధారిత మెషీన్ గన్ సాయంతో అత్యంత కచ్చితత్వంతో అతణ్ని మట్టుబెట్టాయి. హాలీవుడ్ చిత్రాలను తలపించిన ఈ డిజిటల్ ఆపరేషన్‌తో ప్రపంచదేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. అత్యాధునిక శాటిలైట్లు, ప్రపంచంలోనే నంబర్ వన్ హ్యాకర్లతో ఇజ్రాయెల్, అమెరికాలు అతణ్ని అంతమొందించాయి. అంతటి టెక్నాలజీ ఉన్నా.. ఖమేనీ జాడను కనిపెట్టలేకపోవడం ఇప్పుడు ఈ రెండు నిఘా సంస్థలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.చిన్న ఫోన్ కాల్ మాట్లాడినా..ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని హతమార్చిన ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ అప్పట్లోనే ఓ భారీ ప్రకటన చేసింది. తమ తదుపరి టార్గెట్ కొత్తగా నియమితులయ్యే సుప్రీం లీడరేనన్నది అందులోని సారాంశం. లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్న హిజ్బుల్లా చీఫ్‌లను, గాజా కేంద్రంగా ఉన్న హమాస్ నేతలను లేపేసిన విధానాన్ని ఈ సందర్భంగా ఉటంకించింది. ఆ తర్వాత మొజ్తబా ఖమేనీ ఇరాన్‌కు కొత్త సుప్రీం లీడర్ అయ్యారు.అయితే.. ఆయనను ఇంతవరకు ఎవరూ బహిరంగంగా చూడలేదు. చివరికి ఇటీవల జరిగిన ఆయన తండ్రి ఆయతుల్లా ఖమేనీ అంత్యక్రియలకు సైతం మొజ్తబా హాజరుకాలేదు. దీంతో.. ఆయనను ట్రేస్ చేయడంలో మొస్సాద్, సీఐఏ చతికిలపడిపోతున్నాయి. ముఖ్యంగా.. మొజ్తబా ఇప్పుడు జీరో డిజిటల్ పాలసీని అందిపుచ్చుకున్నట్లు తెలుస్తోంది. అంటే.. ఎలాంటి డిజిటల్ గాడ్జెట్స్‌ను తన దరిచేరనీయకుండా ఆయన జాగ్రత్తపడుతున్నారు. చిన్న ఫోన్‌కాల్ మాట్లాడినా.. తనను మొస్సాద్ గుర్తింస్తుందని ఆయనకు బాగా తెలుసు. అందుకే.. ఆయన డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.మొజ్తబా.. అదే ఫాలో అవుతున్నారా?ఇంకా వివరంగా చెప్పాలంటే.. ఒకప్పుడు అమెరికాను గడగడలాడించిన అల్-ఖాయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ అవలంబించిన మోడల్‌ను మొజ్తబా ఫాలో అవుతున్నారు. లాడెన్ చేసిన పొరపాట్లు తన విషయంలో రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. నిజానికి పాకిస్థాన్‌లో తలదాచుకున్న లాడెన్‌ను చేరడానికి.. అతని కమ్యూనికేటర్లను సీఐఏ ట్రాక్ చేసింది. మొజ్తబా విషయానికి వస్తే.. ఆయన కమ్యూనికేటర్లు.. అంటే.. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ అధికారులు ఎవరనే విషయం కూడా బయటి ప్రపంచానికి తెలియదు. కేవలం మొజ్తబా రాసి ఇచ్చే చిన్నచిన్న చీటీలు మాత్రమే అడపాదడపా వెలుగులోకి వస్తున్నాయి.మొజ్తబా ఎక్కడ? ఇంతకీ మొజ్తబా ఇప్పుడు ఎక్కడున్నారు? ఈ ప్రశ్నకు రెండు వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ జరిపిన దాడిలో మొజ్తబా భవనం ధ్వంసమైంది. ఆయన భార్య ఈ దాడిలో మరణించినట్లు వార్తలొచ్చాయి. తీవ్రంగా గాయపడిన మొజ్తబా ప్రస్తుతం ఓ బంకర్లో చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. ఇక రెండో వాదన విషయానికి వస్తే.. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నుంచి తననుతాను కాపాడుకునేందుకు మొజ్తబా తనకు అత్యంత నమ్మకమైన మిత్రదేశం రష్యాలోని ఓ బంకర్లో తలదాచుకుంటున్నారనే ప్రచారం ఉంది. ప్రస్తుతం మొజ్తబా తెరవెనకే ఉంటూ.. ఇరాన్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. దేశ రక్షణ, విదేశీ విధానాల వంటి కీలక నిర్ణయాలను ఐఆర్జీసీ కమాండర్లు నిర్వర్తిస్తున్నారు.ఇరాన్ మైండ్‌గేమ్ ఆడుతోందా?ఏఐ ఆధారిత టెక్నాలజీ ఎంతగా అందుబాటులోకి వచ్చినా.. అంతరిక్షం నుంచి భూగాళాన్నే జల్లెడ పట్టేలా శాటిలైట్లు ఉన్నా.. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా మాత్రం పాతకాలపు రహస్య పద్ధతులకు జైకొట్టారు. అందుకే.. మొస్సాద్, సీఐఏలకు షాక్‌ల మీద షాక్ ఇస్తున్నారు. అయితే.. మొజ్తబా నిజంగానే బంకర్లలో తలదాచుకుంటున్నారా? లేక ఇరాన్ ఆయన పేరుతో మైండ్‌గేమ్ ఆడుతోందా? అనేది ఆసక్తికరంగా మారింది.-హెచ్.కమలాపతిరావు, సీనియర్ జర్నలిస్ట్ -
సాక్షి కార్టూన్: 01-08-2026
సాక్షి కార్టూన్: 01-08-2026 -
ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్.. ఈ సారి దాడి ఎప్పుడు చూడనిది
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌పై రెచ్చిపోయారు. ఈ వారాంతంలో ఇరాన్‌పై కనీవినీ ఎరుగని రీతిలో దాడులు చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో టెహ్రాన్‌ని లొంగిపోయేలా చేసేలా అత్యంత కఠినమైన దాడులు చేయాలని సైన్యాన్ని హెచ్చరించినట్లు సమాచారం.పశ్చిమాసియా యుద్ధంలో ట్విస్టుల మీద ట్విస్టులు నడుస్తున్నాయి. యుద్ధం ముగుస్తుందనుకునేలోపే మళ్లీ తీవ్రస్థాయికి చేరింది.ఇది చాలదన్నట్లు ఇటీవలే అమెరికాకు మద్ధతుగా సౌదీ అరేబియా సైతం రంగప్రవేశం చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి ఇరాన్‌కు ఝలకిచ్చారు.వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.." టెహ్రాన్‌ను లొంగిపోయేలా ఇరాన్‌పై కఠినమైన దాడులు చేయండి. వారు అబద్ధాలు చెబుతారు. తప్పుగా అన్వయిస్తారు. ఇరాన్‌పై విశ్వాసం కోల్పోతున్నాము మనము వారిని చాలా తీవ్రంగా దెబ్బతీద్దాం. దీంతో ఏదో ఒక సమయంలో, ఇకపై దీనిని భరించలేమని వారు చెబుతారు," అని ట్రంప్ అన్నట్లు కథనాలు పేర్కొన్నాయి. ఈ యుద్ధంలో అమెరికా ఎట్టిపరిస్థితుల్లో గెలవాలని కోరుకుంటున్నట్లు తెలిపాయి.అత్యంత కఠినమైన బాంబు దాడిగా?కాగా అక్కడి కథనాల ప్రకారం, ఇరాన్ యొక్క ఇంధన మౌలిక సదుపాయాల లక్ష్యాలు, రిఫైనరీలే టార్గెట్‌గా ఈ దాడులు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు జరిగిన బాంబుదాడులలో అత్యంత తీవ్రమైనదిగా నిలిచేలా ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. ఈ భారీ దాడులను అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపేలా ప్రణాళిక వేస్తున్నట్లు సమాచారం. -
ఇరాన్ రహస్య కోట.. ట్రంప్ బాంబులు చేరగలవా?
ఒక పర్వతం.. దాని లోపల అంతుచిక్కని సొరంగాలు.. ప్రపంచ శక్తుల కళ్లన్నీ దానిపైనే. ఇరాన్ అణు కార్యక్రమంలో అత్యంత రహస్యంగా భావిస్తున్న ‘పికాక్స్ మౌంటెన్’ ఇప్పుడు మరోసారి అంతర్జాతీయ చర్చకు కేంద్రంగా మారింది. ఇందుకు కారణం.. ఇటీవలి కాలంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేస్తున్న వరుస హెచ్చరికలు. ‘ఆ ప్రాంతాన్ని త్వరలోనే.. చాలా తీవ్రంగా లక్ష్యంగా చేసుకుంటాం’ అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మధ్యప్రాచ్యంలో కొత్త ఉద్రిక్తతలకు తెరతీశాయి. ఇప్పటికే ఇరాన్‌లోని కొన్ని అణు కేంద్రాలపై దాడులు జరిగిన నేపథ్యంలో.. ఇప్పుడు అమెరికా చూపు పికాక్స్ మౌంటెన్‌పై పడిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.పర్వతం లోపల ఏముంది?ఇరాన్‌లోని నటాంజ్ అణు సముదాయానికి దక్షిణంగా ఉన్న ఈ పర్వత ప్రాంతం బయటికి చూస్తే సాధారణ కొండలా కనిపిస్తుంది. కానీ దాని లోపల భారీ భూగర్భ నిర్మాణం ఉందని ఉపగ్రహ చిత్రాలు సూచిస్తున్నాయి. ‘కుహ్-ఎ కొలాంగ్’గా పిలిచే ఈ ప్రాంతానికి ఆంగ్లంలో పికాక్స్ మౌంటెన్ అనే పేరు వచ్చింది. పికాక్స్ అంటే కొండను తవ్వే పనిముట్టు. పేరు మాదిరిగానే ఈ ప్రాంతం లోపల భారీ సొరంగ వ్యవస్థ ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.ఉపగ్రహ చిత్రాల్లో ఈ ప్రాంతంలో నాలుగు సొరంగ ప్రవేశ మార్గాలు కనిపిస్తున్నాయి. రెండు తూర్పు వైపు, మరో రెండు పడమర వైపు ఉన్నట్లు గుర్తించారు. ఇటీవలి చిత్రాల్లో అక్కడ నిర్మాణ వాహనాలు, కొత్త రహదారి పనులు, సొరంగాల వద్ద కదలికలు కనిపించడం అనుమానాలను పెంచింది.అణు కేంద్రానికి ప్రత్యామ్నాయమా?2020లో నటాంజ్ అణు కేంద్రంలో జరిగిన అనుమానాస్పద విధ్వంసం తర్వాత.. మరింత సురక్షితమైన, ఆధునిక భూగర్భ కేంద్రాన్ని నిర్మిస్తామని ఇరాన్ ప్రకటించింది. ఆ కేంద్రం పికాక్స్ మౌంటెన్ అయి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇక్కడ అధునాతన సెంట్రిఫ్యూజ్‌లను ఏర్పాటు చేసే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. సెంట్రిఫ్యూజ్‌లు యురేనియం శుద్ధికి ఉపయోగపడతాయి. తక్కువ స్థాయి శుద్ధితో అణు విద్యుత్ అవసరాలకు ఉపయోగించే యురేనియం తయారు చేయవచ్చు. అయితే అత్యధిక స్థాయి శుద్ధి చేస్తే అణ్వాయుధాల తయారీలోనూ ఉపయోగించే అవకాశం ఉంటుంది.Iran : ( Video ) Israeli Channel 14 explains what Pickaxe Mountain is and what it has become . Iran's most strategic asset in its necular program. 👇 pic.twitter.com/TipMFrNOM9— Kbar57 (@kbar57) July 30, 2026ట్రంప్ ఎందుకు గురి పెట్టారు?పికాక్స్ మౌంటెన్‌లో అత్యంత శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉండవచ్చని కొన్ని వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇదే అమెరికా ఆందోళనకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. జూలై 21న ట్రంప్ మాట్లాడుతూ.. “ఆ ప్రాంతాన్ని త్వరలోనే భారీగా దెబ్బతీస్తాం” అని వ్యాఖ్యానించారు. తర్వాత కూడా ఒప్పందం కుదరకపోతే పికాక్స్ మౌంటెన్‌ను లక్ష్యంగా చేసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. అయితే ఇరాన్ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తోంది. అక్కడ ఎలాంటి అణు కార్యకలాపాలు జరగడం లేదని చెబుతోంది. అమెరికా బెదిరింపులు దాడికి సాకులు మాత్రమేనని విమర్శిస్తోంది.అమెరికా బాంబులతోనైనా కూలుతుందా?పికాక్స్ మౌంటెన్కు ఉన్న అతిపెద్ద రక్షణ.. దాని లోతు. ఈ కేంద్రం భూమికి దాదాపు 100 మీటర్ల లోపల ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. భూగర్భ లక్ష్యాలను ఛేదించేందుకు అమెరికా వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధాల్లో GBU-57 బంకర్ బస్టర్ బాంబులు ఒకటి. ఇవి భారీగా రక్షణ కలిగిన నిర్మాణాలను ఛేదించేందుకు రూపొందించబడ్డాయి. అయితే ఇంత లోతులో ఉన్న పికాక్స్ మౌంటెన్‌ను పూర్తిగా ధ్వంసం చేయడం అంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు. లోపలి నిర్మాణం ఎలా ఉందో స్పష్టంగా తెలియకపోవడం కూడా మరో సమస్య. కేంద్రంలోని సొరంగ మార్గాలు, విద్యుత్ వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు, సరఫరా మార్గాలను దెబ్బతీయడం ద్వారా కార్యకలాపాలను నిలిపివేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) అంచనాల ప్రకారం.. 2025లో ఇరాన్ వద్ద దాదాపు 440 కిలోల (970 పౌండ్ల) 60 శాతం శుద్ధి చేసిన యురేనియం నిల్వలు ఉన్నాయి. ఈ నిల్వల్లో కొంత భాగం లేదా మొత్తం పికాక్స్ మౌంటెన్ భూగర్భ కేంద్రంలో ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనికి ఇప్పటివరకు ఎలాంటి ఖచ్చితమైన ఆధారాలు లేవు. అంతేకాదు.. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత నటాంజ్, ఫోర్డో అణు కేంద్రాల్లో దెబ్బతినకుండా మిగిలిన కొన్ని అధునాతన సెంట్రిఫ్యూజ్‌లను కూడా పికాక్స్ మౌంటెన్కు తరలించి ఉండవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి.ఒక పర్వతం.. రెండు దేశాల పోరుపికాక్స్ మౌంటెన్ ఇప్పుడు కేవలం ఓ అణు కేంద్రం అనుమానంతో ఉన్న ప్రాంతం మాత్రమే కాదు.. అమెరికా–ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలకు ప్రతీకగా మారింది. ఒకవైపు అమెరికా “అణు బెదిరింపును అడ్డుకోవాలి” అంటోంది. మరోవైపు ఇరాన్ “దాడికి ప్రతీకారం తప్పదు” అని హెచ్చరిస్తోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో భూమి లోపల దాగిన ఈ రహస్య కేంద్రంపై నిజంగా బాంబులు పడతాయా? లేక ఇది కేవలం ఒత్తిడి వ్యూహమా? అన్నది ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. -
ఇరాన్ ఉలిక్కిపడేలా.. ట్రంప్, నెతన్యాహు మెగా ఆపరేషన్!
మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్ భారీ స్థాయి వైమానిక దాడులకు సిద్ధమవుతున్నాయా? అంటే తాజా పరిణామాలు అవుననే సంకేతాలు ఇస్తున్నాయి. ఇరాన్ ఇంధన మౌలిక వసతులపై ఇప్పటివరకు జరగని స్థాయిలో దాడుల ప్రణాళిక సిద్ధమవుతున్నట్లు అమెరికా అధికారులను ఉటంకిస్తూ సీబీఎస్ న్యూస్ వెల్లడించింది.ఈ దాడుల్లో ఇరాన్‌లోని కీలక విద్యుత్ కేంద్రాలు, చమురు శుద్ధి కర్మాగారాలు వంటి వ్యూహాత్మక లక్ష్యాలను ఎంచుకున్నట్లు సమాచారం. ఇరాన్ సైనిక కార్యకలాపాలు, ప్రభుత్వ వ్యవస్థను కొనసాగించే సామర్థ్యాన్ని బలహీనపర్చడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ ఉండొచ్చని అమెరికా అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ భారీ ఆపరేషన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా తుది అనుమతి ఇవ్వలేదని సమాచారం. పెంటగాన్ కూడా లక్ష్యాలపై స్పందించేందుకు నిరాకరించింది.ప్రపంచ మార్కెట్లు సోమవారం ప్రారంభమయ్యేలోపు ఈ ఆపరేషన్‌ను ముగించాలని అమెరికా వర్గాల్లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇరాన్ ఇంధన సరఫరాలపై దాడులు జరిగితే ప్రపంచ చమురు మార్కెట్లు, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉండటంతో ఈ అంశంపై జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్‌ను కూడా ఈ ప్రణాళికల్లో భాగస్వామిగా ఉంచినట్లు తెలుస్తోంది. వాషింగ్టన్‌తో టెల్ అవీవ్ సన్నిహిత సమన్వయం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇరాన్‌పై పూర్తి స్థాయి సైనిక చర్యకు తిరిగి వెళ్లే నిర్ణయం ఇంకా తీసుకోలేదని ఓ ఇజ్రాయెల్ అధికారి స్పష్టం చేశారు.ట్రంప్ అధ్యక్షతన క్యాంప్ డేవిడ్‌లో జరిగిన కేబినెట్ సమావేశంలో ఇరాన్‌పై సైనిక ఎంపికలపై చర్చ జరిగినట్లు సమాచారం. కొందరు అధికారులు ఈ చర్యకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, ట్రంప్ మాత్రం ఇరాన్‌పై కఠిన వైఖరిని ప్రదర్శిస్తూ చాలా తీవ్రంగా దెబ్బతీస్తాం అనే సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అమెరికా లక్ష్యం ఇరాన్ అణ్వస్త్ర సామర్థ్యాన్ని అడ్డుకోవడమేనని వైట్‌హౌస్ స్పష్టం చేసింది. అధ్యక్షుడి నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చినా అమలు చేసేందుకు అమెరికా సైన్యం సిద్ధంగా ఉందని పెంటగాన్ పేర్కొంది. టెహ్రాన్ నగర విద్యుత్ సరఫరాను దెబ్బతీయడం వంటి ప్రత్యామ్నాయాలపైనా అమెరికా అధికారులు చర్చించినట్లు సమాచారం.మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ చర్యలపై ఇరాన్ తీవ్ర హెచ్చరికలు చేసింది. ఎలాంటి అమెరికా దాడి జరిగినా ప్రతీకార చర్యలకు సమగ్ర ప్రణాళిక సిద్ధంగా ఉందని ఇరాన్ భద్రతా వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్‌లోని కీలక మౌలిక వసతులు, ప్రాంతీయంగా ఉన్న అమెరికా ఇంధన వ్యవస్థలను లక్ష్యంగా చేసుకునే సామర్థ్యం తమకు ఉందని హెచ్చరించాయి. -
జాగ్రత్త.. అమెరికాలోనూ ఇదే పరిస్థితి రావొచ్చు: ట్రంప్
ఒకవైపు స్పెయిన్ సరిహద్దులో వేలాది మంది వలసదారుల ప్రవాహం.. మరోవైపు అమెరికా సరిహద్దులపై రాజకీయ చర్చ. స్పెయిన్‌లోని సియుటా ప్రాంతంలో చోటుచేసుకున్న భారీ వలస సంక్షోభాన్ని ఉదాహరణగా చూపిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అక్రమ వలసల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. యూరప్‌లో కనిపిస్తున్న ఈ దృశ్యాలు భవిష్యత్‌లో అమెరికాలోనూ పునరావృతమయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.“ఆ దృశ్యాన్ని గుర్తుంచుకోండి. తప్పు విధానాలు కొనసాగితే మూడేళ్లలో అమెరికాలోనూ ఇదే పరిస్థితి రావొచ్చు” అని ట్రంప్ వ్యాఖ్యానించారు. స్పెయిన్‌లోని సియుటా(Ceuta)లో చోటుచేసుకున్న పరిణామాలను ప్రస్తావిస్తూ.. సరిహద్దుల రక్షణ, అక్రమ వలసల నియంత్రణపై కఠిన చర్యలు అవసరమని ఆయన అన్నారు.అమెరికా వలసలపై ట్రంప్ ఆందోళనఅక్రమ వలసల నియంత్రణ ట్రంప్ రాజకీయ అజెండాలో మొదటి నుంచీ కీలక అంశంగా ఉంది. అమెరికా–మెక్సికో సరిహద్దు నుంచి పెద్ద సంఖ్యలో వలసదారులు ప్రవేశించడంపై ఆయన గతంలోనూ తీవ్ర విమర్శలు చేశారు. సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేయాలని, అక్రమంగా వచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పదేపదే డిమాండ్ చేశారు.స్పెయిన్ సరిహద్దులో జరిగిన ఘటనను కూడా ట్రంప్ ఇదే వాదనకు ఉదాహరణగా చూపించారు. నియంత్రణ లేని వలసలు ఏ దేశానికైనా సామాజిక, భద్రతా సమస్యలు సృష్టించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.అసలేం జరిగింది?ఉత్తర ఆఫ్రికాలోని మొరాకో నుంచి స్పెయిన్‌కు చెందిన చిన్న భూభాగం సియుటాలోకి గత రెండు రోజులుగా వేలాది మంది వలసదారులు ఒక్కసారిగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. యూరప్‌లోకి చేరేందుకు ప్రయత్నించే వలసదారులకు సియుటా కీలక మార్గంగా మారింది.గురువారం నుంచి సరిహద్దు వద్ద పరిస్థితులు తీవ్రంగా మారాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు కంచెలు దాటేందుకు ప్రయత్నించడంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. కొందరు సముద్ర మార్గంలో ఈదుకుంటూ స్పెయిన్ భూభాగంలోకి చేరేందుకు ప్రయత్నించారు.ఈ క్రమంలో జరిగిన ప్రమాదాల్లో కనీసం 57 మంది మృతి చెందినట్లు సియుటా ప్రాంత అధ్యక్షుడు జువాన్ జీసస్ వివాస్ వెల్లడించారు. కొందరు సముద్రంలో మునిగి చనిపోగా, మరికొందరు సరిహద్దు కంచె వద్ద జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.24 గంటల్లోనే 60 వేల మంది?సియుటా ప్రాంతంలోకి గత 24 గంటల్లోనే దాదాపు 60 వేల మంది ప్రవేశించినట్లు ప్రాంతీయ అధికారులు తెలిపారు. అయితే స్పెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ మాత్రం గురువారం నుంచి సుమారు 50 వేల మంది సరిహద్దు దాటినట్లు అంచనా వేసింది. వీరిలో చాలా మందిని తిరిగి మొరాకోకు పంపించినట్లు స్పెయిన్ అధికారులు తెలిపారు. 48 వేల మందికి పైగా ఇప్పటికే మొరాకోకు తిరిగి వెళ్లిపోయారని అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరికొందరు కూడా గంటల వ్యవధిలో వెనక్కి వెళ్తున్నారని పేర్కొంది.ఎందుకు ఒక్కసారిగా పెరిగింది వలసల ప్రవాహం?సియుటా వైపు ఇంత భారీ సంఖ్యలో వలసదారులు రావడానికి ప్రధాన కారణం.. యూరప్‌లోకి ప్రవేశించే అవకాశంగా ఈ మార్గాన్ని భావించడమే. ఆఫ్రికాలోని పేదరికం, నిరుద్యోగం, రాజకీయ అస్థిరత, మెరుగైన జీవితం కోసం చేసే ప్రయత్నాలు అనేక మందిని యూరప్ వైపు నడిపిస్తున్నాయి. అయితే ఇంత పెద్ద సంఖ్యలో ఒకేసారి సరిహద్దు దాటే ప్రయత్నం జరగడం అసాధారణమని అధికారులు చెబుతున్నారు. మానవ అక్రమ రవాణా ముఠాలు కూడా వలసదారులను ప్రేరేపిస్తున్నాయని స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ ఆరోపించారు.స్పెయిన్ చర్యలు.. యూరప్‌లో ఆందోళనపరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు స్పెయిన్ అదనపు భద్రతా బలగాలను సియుటాకు పంపింది. సైన్యం, పోలీసులు, డ్రోన్లు, సముద్ర భద్రతా బృందాలను రంగంలోకి దించింది. ఈ ఉదంతంపై యూరోపియన్ యూనియన్(EU) కూడా స్పందించింది. యూరప్ నిబంధనలను పాటించకుండా ఎవరినీ అనుమతించబోమని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ స్పష్టం చేశారు.స్పెయిన్‌లోని సియుటా సంక్షోభం ఇప్పుడు కేవలం ఆ దేశ సమస్యగా కాకుండా.. యూరప్ సరిహద్దు భద్రత, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వలసల సమస్యపై మరోసారి చర్చకు దారితీసింది. ట్రంప్ వ్యాఖ్యలతో ఈ అంశం అమెరికా రాజకీయాల్లోనూ మరోసారి ప్రాధాన్యం సంతరించుకుంది. -
గాజాలో శాంతికి ట్రంప్ డీల్?
వాషింగ్టన్/కైరో: ఇజ్రాయెల్ – పాలస్తీనా సమస్యకు ఒక పరిష్కారం దొరికిందా? పాలస్తీనా హక్కుల కోసం పోరాడుతున్న హమాస్ ఆయుధాలు త్యజించేలా.. ఇజ్రాయెల్ గాజా ప్రాంతం నుంచి తన బలగాలను ఉపసంహరించుకునేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రతిపాదన చేయడం.. ఇందుకు హమాస్ సైతం అంగీకరించడంతో ఆశలు కొద్దిగా చిగురిస్తున్నాయి. ఇజ్రాయెల్–గాజాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తొమ్మిది నెలలకు అమెరికా గురువారం తాజా ప్రకటన చేయడం గమనార్హం. ఈ ఒప్పందంలోని రెండు దశలో భాగంగా హమాస్ ఆయుధాలు వీడాల్సి ఉంది. అదే సమయంలో గాజా పునర్ నిర్మాణానికి ఒక అవగాహన కుదరాల్సి ఉంది. అయితే అప్పట్లో ఇరుపక్షాల మధ్య చర్చలు స్తంభించిపోగా.. తాజాగా దశలవారీగా దీన్ని అమలు చేసేందుకు అంగీకారం కుదిరిందని ట్రంప్ తన ఎక్స్ ఖాతాలో ప్రకటించారు. ‘‘హమాస్ ఆయుధాలు వీడిన వెంటనే ఇజ్రాయెల్ తన బలగాలను ఉపసంహరించుకుంటుంది. అంతర్జాతీయ స్థిరీకరణ బలగాలు కొత్త పాలస్తీనా పోలీస్ వ్యవస్థతో కలిసి గాజా ప్రాంతంలోని పౌరుల భద్రత బాధ్యతలు తీసుకుంటుంది’’అని ఆయన వివరించారు. ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం హమాస్ తన ఆయుధాలు వీడటమే కాకుండా... గాజా ప్రాంతంలోని తమ సొరంగ మార్గాలు అన్నింటినీ ధ్వంసం చేయాల్సి ఉంది. ట్రంప్ ప్రతిపాదనలకు తాము అంగీకారం తెలిపినట్లు హమాస్ కూడా శుక్రవారం ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ కూడా ఘర్షణ వైఖరిని వీడాలని, బలగాలను ఉపసంహరించుకోవాలని హమాస్ అధికారి ఒకరు తెలిపారు. ట్రంప్ ఒప్పందంపై ఇజ్రాయెల్ తన వైఖరిని ఇంకా ప్రకటించాల్సి ఉంది. దశలవారీగా అమలు ట్రంప్ ప్రతిపాదన వాస్తవరూపం దాల్చేందుకు మంచి అవకాశాలే ఉన్నట్టు అమెరికాతోపాటు గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి ఏర్పాటైన బోర్డ్ ఆఫ్ పీస్ అధికారులు కూడా ఆశాభావంతో ఉన్నారు. ఎంత సమయం పడుతుందన్నది మాత్రం కచ్చితంగా చెప్పలేమని వీరు అంటున్నారు. అయితే రానున్న రెండు వారాల్లో గాజా పోలీసు బలగాలు మాత్రం టెక్నక్రటిక్ బోర్డ్ ఆఫ్ పీస్‌కు అందజేయనున్నారని తెలిపారు. గాజా పోలీసు బలగాలతోపాటు అనేక ఇతర సంస్థలు కూడా భారీ ఎత్తున ఆయుధాలు కలిగి ఉండటం గమనార్హం. వీరంతా ఒప్పందంలో భాగంగా ఉంటారా? అన్నది ప్రశ్న. హమాస్ వద్ద ఉన్న భారీ ఆయుధాల అప్పగింత, ధ్వంసం, సొరంగాల విధ్వంసం వంటివి తరువాతి దశల్లో జరగవచ్చునని, ఇందుకు కనీసం ఏడాది సమయం పట్టవచ్చునని పేరు చెప్పేందుకు ఇష్టపడని బోర్డ్ ఆఫ్ పీస్ అధికారి ఒకరు తెలిపారు. అనుమానంగానే ఇజ్రాయెల్.. ట్రంప్ శాంతి ప్రతిపాదనపై హమాస్ అంగీకారం తెలిపినప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం ఇంకా సంశయంలోనే కొట్టుమిట్టాడుతోంది. హమాస్ ఆయుధాలు అప్పగిస్తుందన్న నమ్మకం ఇజ్రాయెల్‌కు లేదు. అయితే ఇజ్రాయెల్ ఇప్పుడు కొత్తగా చేయాల్సిందేమీ లేదని, గతంలో వారు అంగీకరించినట్టు గాజా ప్రాంతం నుంచి తమ బలగాలను ఉపసంహరించుకోవడం మాత్రమే చేస్తే చాలని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. దాంతోపాటే గాజా ప్రాంతంపై వైమానిక దాడులు నిలిపివేసేందుకు కూడా ఇజ్రాయెల్ గతంలోనే అంగీకరించిందని చెప్పారు. ఒకవేళ ఇజ్రాయెల్ తానిచ్చిన మాటకు కట్టుబడకపోతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ‘‘తీవ్రంగా నిరాశ చెందుతారు’’అని వ్యాఖ్యానించారు. డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నేతన్యాహూలు మంగళవారమే వైట్‌హౌస్‌లో సమావేశమైన సంగతి ఇక్కడ చెప్పుకోవాలి. ఈ సమావేశం సందర్భంగా చర్చించిన అంశాలపై మాత్రం ఇద్దరు నేతలు నోరు విప్పలేదు. ఇజ్రాయెల్‌పై దాడులు మొదలైన తరువాత ఇరువురు నేతలు కలుసుకోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. తాజా పరిణామాలపై ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం కూడా ఏ రకమైన వ్యాఖ్య చేసేందుకు ఇష్టపడలేదు. -
అమెరికా ఉద్యోగానికి లక్ష డాలర్ల ఫీజు?
వాషింగ్టన్: చదువు తరువాత అమెరికాలోనే ఉద్యోగం చేసేందుకు వీలు కల్పించే ఆప్షన్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) వీసా ఫీజు లక్ష డాలర్లు కానుందా? అవునంటోంది వాల్‌స్ట్రీట్ జర్నల్. హెచ్–1బీ వీసా ఫీజులను లక్ష డాలర్లకు పెంచేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రయత్నాలు న్యాయస్థానాల్లో బెడిసికొట్టడంతో ఇప్పుడు ‘డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ’(డీహెచ్ఎస్)ఈ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. విదేశీ విద్యార్థులు అమెరికా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ తరువాత తాము చదువుకున్న సబ్జెక్టులోనే ఏడాది నుంచి మూడేళ్లు ఉద్యోగం చేసేందుకు ఈ ఓపీటీ వీసా ఉపయోగపడుతుంది. యూఎస్ యూనివర్శిటీల్లో అత్యధిక నియామకాలు చేపట్టే టెక్నాలజీ ఆధారిత కంపెనీలు హెచ్–1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే ఓపీటీ ఫీజు లక్ష డాలర్లకు పెంచే విషయంపై డీహెచ్ఎస్ ఆచితూచి ఒక ప్రకటన చేసింది. అధికారిక ప్రకటన వెలువడేంత వరకూ ఏదీ ఫైనల్ కాదని స్పష్టం చేసింది. ‘‘అందుబాటులో ఉన్న విషయాలన్నింటిపై చర్చలు జరుగుతూనే ఉంటాయి. చట్టపరంగా ఈ దేశానికి వలస వచ్చే వ్యవస్థ సమగ్రతను కాపాడేందుకు వీటిని ఉపయోగిస్తాం’’అని అధికార ప్రతినిధి ఒకరు ప్రకటించారు. ఇతర దేశాల నుంచి గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకునే వారు దరఖాస్తుతోపాటు లక్ష డాలర్ల బాండ్ ఒకటి సమర్పించేలా కూడా డీహెచ్ఎస్ ఆలోచన చేస్తున్నట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం తెలిపింది. దరఖాస్తుదారు అమెరికా వచ్చి పౌరసత్వం పొందిన తరువాత బాండ్ మొత్తాన్ని తిరిగి పొందవచ్చు. -
ట్రంప్‌ను టెన్షన్ పెడుతున్న ఇజ్రాయెల్
అంతా తన ప్లాన్ ప్రకారమే సాగుతుందని భావించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అనూహ్యంగా ఓ కొత్త సవాల్ ఎదురైంది. సన్నిహిత మిత్రదేశం నుంచే వస్తున్న సంకేతాలు ఇప్పుడు వాషింగ్టన్లో చర్చకు దారితీస్తున్నాయి. ఒకవైపు కీలక అంతర్జాతీయ సంక్షోభానికి ముగింపు పలికేందుకు ట్రంప్ ప్రయత్నిస్తుండగా.. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వైఖరి ఈ ప్రక్రియకు పరీక్షగా మారుతోంది.గాజాలో మూడేళ్లుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. హమాస్, ఇతర సాయుధ గ్రూపులు పూర్తిగా నిరాయుధీకరణకు అంగీకరించాయని, దీనితో శాశ్వత శాంతి దిశగా ముందడుగు పడిందని ఆయన వెల్లడించారు.ట్రంప్ ప్రతిపాదించిన 20 అంశాల ప్రణాళికలో హమాస్ ఆయుధాలు వదిలేయడం ప్రధాన అంశంగా ఉంది. ఇప్పటివరకు దీనిపై ప్రతిష్ఠంభన కొనసాగగా.. తాజాగా అంగీకారం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. ఒప్పందం అమలులో భాగంగా బందీల విడుదల, ఖైదీల మార్పిడి, సైనిక బలగాల క్రమంగా ఉపసంహరణ వంటి అంశాలు కీలకంగా మారనున్నాయి. అయితే ఈ పరిణామాల మధ్య ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వైఖరే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. ఒప్పందం అమలు, భద్రతా హామీలు, భవిష్యత్ పరిస్థితులపై ఇజ్రాయెల్ ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని కోరుతోంది. తమ దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని నెతన్యాహు ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు.ట్రంప్ దృష్టి మాత్రం ఈ పరిణామాలను దౌత్య విజయంగా మార్చుకోవడంపైనే ఉంది. అమెరికా మధ్యవర్తిత్వంతో దీర్ఘకాలిక పరిష్కారం సాధించాలని ఆయన భావిస్తున్నారు. అయితే ఒప్పందంలోని నిబంధనలు అమలు కావడం, వాటిపై ఇజ్రాయెల్ రాజకీయ వర్గాల స్పందన ఇప్పుడు కీలకంగా మారనుంది.గాజా పాలనలో హమాస్ పాత్ర ఉండకూడదని, ఆయుధ వ్యవస్థలు తొలగించాల్సి ఉంటుందని ప్రతిపాదనలో పేర్కొన్నారు. అంతర్జాతీయ పర్యవేక్షణలో కొత్త పరిపాలనా వ్యవస్థ ఏర్పాటుకు మార్గం సుగమం చేయాలని ప్రణాళికలో ఉంది. అనంతరం పాలస్తీనా అథారిటీ సంస్కరణలతో గాజా బాధ్యతలు చేపట్టే అంశం కూడా ఇందులో భాగంగా ఉంది.అయితే నెతన్యాహు ప్రభుత్వంలోనే ఈ ప్రతిపాదనలపై భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. కఠిన వైఖరి కలిగిన వర్గాలు ఎలాంటి రాజీ చర్యలనైనా వ్యతిరేకించే అవకాశం ఉంది. దీంతో ట్రంప్ ప్రయత్నాలు కేవలం హమాస్‌తో ఒప్పందానికే పరిమితం కాకుండా.. ఇజ్రాయెల్ రాజకీయ సమీకరణాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది.మరోవైపు పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితులపై కూడా దృష్టి పెరుగుతోంది. కీలక జలమార్గాల్లో నౌకాయాన రక్షణ కోసం పలు దేశాలు కలిసి మారిటైమ్ డిఫెన్స్ అలయన్స్‌ను ఏర్పాటు చేశాయి. ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సముద్ర మార్గాల భద్రతకు ఈ కూటమి ప్రాధాన్యం ఇస్తోంది.ఇప్పుడు అసలు పరీక్ష ఒప్పందం ప్రకటించడం కాదు.. దాన్ని అమలు చేయడమే. ట్రంప్ దౌత్య ప్రయత్నాలకు నెతన్యాహు ప్రభుత్వం ఎంతవరకు సహకరిస్తుంది? గాజాలో శాంతి ప్రక్రియ ముందుకు సాగుతుందా? లేదంటే కొత్త అడ్డంకులు ఎదురవుతాయా?.. హమాస్ ఏదైనా సడన్ ట్విస్ట్ ఇస్తుందా? అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.ట్రంప్ తీవ్రంగా నిరాశ చెందుతారు: అమెరికా అధికారిఇజ్రాయెల్ తన అంగీకారాలకు కట్టుబడి ట్రంప్ 20 అంశాల ప్రణాళికను ముందుకు తీసుకెళ్లాలని అమెరికా సీనియర్ అధికారి కోరారు. ప్రణాళిక అమలుకు ఇజ్రాయెల్ సహకరించకపోతే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ “చాలా నిరాశ చెందుతారని” హెచ్చరించారు. బందీల విడుదల, యుద్ధం ముగింపు కోసం కుదిరిన ఒప్పందాన్ని ఇరు పక్షాలు గౌరవించాలని ఆయన అన్నారు. గతంలో అనుమానాలు ఉన్నప్పటికీ హమాస్ బందీలను అప్పగించిందని, ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా తన హామీలను నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. -
అమెరికాలో భారతీయ విద్యార్థులకు భారీ షాక్!
అమెరికాలో చదువు పూర్తి చేసి ఉద్యోగం పొందాలని కలలు కనే విదేశీ విద్యార్థులకు, ముఖ్యంగా భారతీయులకు కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ తర్వాత అమెరికాలో పని చేసేందుకు ఉపయోగించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) విధానంపై భారీగా 1 లక్ష డాలర్ల ఫీజు విధించే ప్రతిపాదనను ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.అమెరికాలో F-1 విద్యార్థి వీసాపై చదివే విదేశీ విద్యార్థులకు చదువు పూర్తయిన తర్వాత కొంతకాలం అక్కడే ఉండి తమ విద్యకు సంబంధించిన రంగంలో ఉద్యోగం చేసే అవకాశం OPT ద్వారా లభిస్తుంది. ప్రస్తుతం సాధారణ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు గరిష్ఠంగా ఒక సంవత్సరం వరకు OPT కింద పనిచేయవచ్చు. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) కోర్సులు చేసిన వారికి ఈ గడువు మూడు సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ సమయంలో విద్యార్థులు ఉద్యోగ అనుభవం సంపాదించడంతో పాటు, తర్వాత H-1B వర్క్ వీసా పొందేందుకు ప్రయత్నిస్తారు.అయితే ఈ అవకాశానికి ఏకంగా 100,000 డాలర్ల ఫీజు విధించే ఆలోచన ఇప్పుడు చర్చకు వచ్చింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే.. అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాల మార్గం మరింత ఖరీదైనదిగా మారే అవకాశం ఉంది. అయితే ఈ నిర్ణయంపై ఇంకా తుది ప్రకటన వెలువడలేదు.ఎవరిపై భారం పడనుంది?ప్రతిపాదిత ఫీజును విద్యార్థులే చెల్లించాలా? లేక వారిని ఉద్యోగంలోకి తీసుకునే కంపెనీలే చెల్లించాలా? అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. విద్యార్థులే చెల్లించాల్సి వస్తే.. చాలా మందికి ఇది అందనంత భారంగా మారే అవకాశం ఉంది. కంపెనీలు చెల్లించాల్సి వస్తే.. విదేశీ గ్రాడ్యుయేట్లను నియమించుకోవడంపై సంస్థలు వెనుకడుగు వేసే పరిస్థితి రావచ్చని నిపుణులు భావిస్తున్నారు. దీంతో అమెరికన్ విద్యార్థులకు ప్రాధాన్యం పెరిగి, అంతర్జాతీయ విద్యార్థుల ఉద్యోగ అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.భారతీయ విద్యార్థులపై ప్రభావం ఎంత?అమెరికా ఉన్నత విద్యకు భారతీయ విద్యార్థులు ప్రధాన వర్గంగా ఉన్నారు. ప్రస్తుతం లక్షలాది మంది భారతీయులు అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నారు. చాలామంది విద్యార్థులు కేవలం డిగ్రీ కోసం మాత్రమే కాకుండా.. చదువు పూర్తయ్యాక అక్కడే ఉద్యోగం చేసి అంతర్జాతీయ అనుభవం పొందాలనే లక్ష్యంతో అమెరికాకు వెళ్తున్నారు.అమెరికా విద్య కోసం కుటుంబాలు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెడుతున్న నేపథ్యంలో.. OPTపై భారీ ఫీజు ప్రతిపాదన విద్యార్థులపై ఆర్థిక ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది.నాలుగేళ్ల వీసా పరిమితి కూడా!OPT ఫీజు ప్రతిపాదనతో పాటు అంతర్జాతీయ విద్యార్థుల వీసా నిబంధనల్లో మరో కీలక మార్పు కూడా తెరపైకి వచ్చింది. ఇప్పటివరకు విదేశీ విద్యార్థులు “డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్” విధానంలో అమెరికాలో ఉండేవారు. అంటే.. వారు తమ కోర్సును నిబంధనల ప్రకారం కొనసాగిస్తున్నంత కాలం అమెరికాలో ఉండే అవకాశం ఉండేది.తాజా ప్రతిపాదనల ప్రకారం.. విద్యార్థులకు గరిష్ఠంగా నాలుగేళ్ల వరకు మాత్రమే ఉండే అనుమతి ఇవ్వాలనే ఆలోచన ఉంది. అంతకంటే ఎక్కువ సమయం అవసరమైతే.. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం నుంచి ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుంది.ట్రంప్ ప్రభుత్వం చెబుతున్న కారణంఅమెరికా వలస విధానాన్ని మరింత పర్యవేక్షించడం, చట్టబద్ధమైన వలస వ్యవస్థను బలోపేతం చేయడం, దేశ భద్రతను పెంచడమే లక్ష్యంగా ఈ మార్పులు చేస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది. అయితే విద్యా రంగ నిపుణులు మాత్రం.. ఇలాంటి నిబంధనలు అమెరికాను అంతర్జాతీయ విద్యార్థులకు తక్కువ ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.ఇప్పటికిప్పుడు ఆందోళన అవసరం లేదా?$100,000 OPT ఫీజు ప్రతిపాదన ఇంకా చర్చల దశలోనే ఉంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే అమెరికా వలస విధానంలో క్రమంగా కఠినమైన మార్పులు వస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో చదువు పూర్తి చేసి అక్కడే కెరీర్ నిర్మించుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు ఇకపై మార్గం మరింత ఖరీదైనదిగా, నిబంధనలతో కూడుకున్నదిగా మారే అవకాశం ఉంది. -
గాజా శాంతి ఒప్పందంపై ట్రంప్ కీలక ప్రకటన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. గాజాలో శాంతిస్థాపనే లక్షంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని ఇకపై హమాస్ చేతిలో ఎటువంటి ఆయుధాలుండవని పూర్తి నిరాయుధీకరణ జరుగుతుందని పేర్కొన్నారు.గాజా స్ట్రీట్‌లో శాంతి స్థాపన కోసం ఏర్పాటైన బోర్ట్ ఆఫ్ పీస్ సాధించిన అత్యంత కీలక విజయమని పేర్కొన్నారు.2023 అక్టోబర్‌లో ఇజ్రాయెల్, హమాస్ మధ్య తీవ్రమైన భీకర యుద్ధం ప్రారంభమైంది. ఈ సంఘర్షణలో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరగడంతో పాటు, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. గాజాలో చెలరేగిన ఈ యుద్ధం కారణంగా ఇప్పటివరకు 73,000 మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా అంటే పరిస్థితి ఎంత తీవ్రతరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ట్రంప్ గాజాలో శాంతిస్థాపన పునర్నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి 'బోర్డ్ ఆఫ్ పీస్' ఏర్పాటు చేశారు.కాగా ప్రస్తుతం గాజాలో శాంతి స్థాపన కోసం ఒక కీలక ఒప్పందం జరిగినట్లు తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా పోస్ట్ చేశారు. "ఈ రోజు బోర్డ్ ఆఫ్ పీస్ ఒక చారిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. గాజాలో శాంతి, భద్రతలు నెలకొనడానికి ఇది ఒక అద్భుతమైన ముందడుగు ఈ నిరాయుధీకరణ ప్రక్రియ జాగ్రత్తగా దశలవారీగా జరుగుతుంది " అని పేర్కొన్నారు. ఈ ఒప్పందాన్ని కుదర్చడంలో కీలక పాత్ర పోషించిన ఈజిప్ట్, ఖతార్, టర్కీ మధ్యవర్తులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.కాగా ఈ ఒప్పందంపై హమాస్ నుండి ఎలాంటి తక్షణ అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే, తమ ఆయుధాలను విడనాడే ప్రక్రియ దిశగా హమాస్ అడుగులు వేస్తోందని కైరోలోని మధ్యవర్తులతో చర్చలు జరుపుతున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం గాజాలో శాంతి స్థాపనను అక్కడి పోలీసులతో పాటు 'ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్' (ISF) చేపడుతుంది.అయితే పాలస్తీనాలో ఇప్పటికీ హింస చెలరేగుతోంది. గత గురువారం గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇద్దరు పిల్లలతో సహా కనీసం నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు ఆరోగ్య అధికారులు వెల్లడించారు. హమాస్ తన ఆయుధాలను పూర్తిగా విడిచిపెట్టాలని ఆ సంస్థను సైనికంగా నిరాయుధీకరణ చేయాలనేది ఇజ్రాయెల్ ప్రధాన డిమాండ్ ఒకవేశ ఇది కార్యరూపం దాలిస్తే త్వరలోనే ఆ ప్రాంతంలో శాంతి నెలకొనే అవకాశం ఉంది. -
అమెరికా ‘హెవీ వేవ్’ దాడులు.. విస్తరిస్తున్న యుద్ధం!
మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు మరింత కమ్ముకుంటున్నాయి. అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రాంతీయ యుద్ధం దిశగా సాగుతున్నాయి. ఇరాన్ నుంచి అమెరికా స్థావరాలపై జరిగిన క్షిపణి దాడులకు ప్రతీకారంగా అమెరికా భారీ వైమానిక దాడులు చేపట్టింది. దక్షిణ ఇరాన్‌లోని కీలక ప్రాంతాలపై ‘హెవీ వేవ్’ పేరుతో దాడులు నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఈ దాడులతో పాటు ఇరాక్‌లో ఇరాన్ అనుకూల మిలీషియాలపై అమెరికా, సౌదీ అరేబియా సంయుక్త చర్యలు చేపట్టడం, యెమెన్‌లో హౌతీల కదలికలు, హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరగడం.. మొత్తం ప్రాంతాన్ని యుద్ధ వాతావరణంలోకి నెట్టాయి.ఇరాన్‌లోని రెవల్యూషనరీ గార్డ్ (IRGC)కు చెందిన స్థావరాలే లక్ష్యంగా తాజాగా అమెరికా దాడులు జరిపింది. సైనిక కమాండ్ కేంద్రాలు, మిసైల్, డ్రోన్ సదుపాయాలు, తీర రక్షణ వ్యవస్థలు, సముద్ర కార్యకలాపాలకు సంబంధించిన కేంద్రాలను టార్గెట్ చేసినట్లు అమెరికా వెల్లడించింది. అబాదాన్, బుషెహర్, కిష్, క్విష్మ్ దీవులు, ఖుజెస్తాన్ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. కిష్ దీవిలోని కజెరూన్ ప్రాంతంలోనూ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు సమాచారం.క్విష్మ్లో నివాస భవనంపై మిసైల్.. రెస్క్యూ కొనసాగింపుఅమెరికా దాడుల్లో క్విష్మ్ దీవిలోని ఓ నివాస భవనం దెబ్బతింది. మిసైల్ దాడితో భవనం కూలిపోవడంతో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. సహాయక బృందాలు రంగంలోకి దిగి ఇద్దరు చిన్నారులను రక్షించి ఆస్పత్రికి తరలించాయి. మరో ముగ్గురి కోసం శిథిలాల తొలగింపు, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటన యుద్ధంలో పౌర ప్రాంతాలు కూడా ప్రభావితమవుతున్నాయన్న ఆందోళనలను పెంచింది.‘ఇప్పుడు మా వంతు’.. ట్రంప్ హెచ్చరికల తర్వాతే దాడులుఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా బలగాలపై దాడులకు ప్రతిస్పందన తప్పదని స్పష్టం చేసిన ఆయన.. “ఇప్పుడు కొట్టే వంతు మాది” అనే సంకేతాలు ఇచ్చారు. ఇరాన్ నుంచి దాడులను ఆపాలని కోరినా అమెరికా చర్యలు తప్పవని ట్రంప్ వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే వైమానిక దాడులు ప్రారంభమయ్యాయి.జోర్డాన్‌లో అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులుఇటీవల జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసినట్లు అమెరికా ఆరోపించింది. దీనికి ప్రతీకారంగానే తాజా ఆపరేషన్ చేపట్టినట్లు వాషింగ్టన్ వెల్లడించింది. మరోవైపు ఇరాన్ మాత్రం తమ చర్యలను అమెరికా బెదిరింపులకు ప్రతిస్పందనగా సమర్థించుకుంది. అమెరికా ఒత్తిడి కొనసాగితే ప్రతిఘటన కూడా కొనసాగుతుందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ హెచ్చరించింది.ఇరాక్‌లో అమెరికా–సౌదీ దాడులు.. తీవ్ర ఉద్రిక్తతయుద్ధ ప్రభావం ఇరాక్‌కు కూడా చేరింది. ఇరాన్‌కు అనుబంధంగా ఉన్న మిలీషియా గ్రూపుల స్థావరాలపై అమెరికా, సౌదీ అరేబియా సంయుక్త దాడులు జరిపాయి. ఈ దాడుల్లో పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ (PMF)కు చెందిన పలువురు సభ్యులు మరణించినట్లు సమాచారం. కనీసం 20 మంది మృతి చెందినట్లు ఆ సంస్థ ప్రకటించింది. అయితే ఇరాక్ ప్రభుత్వం ఈ చర్యలను తీవ్రంగా ఖండించింది. తమ దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించారని, అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించింది.రంగంలోకి హౌతీలు.. యెమెన్ నుంచి మరో ముప్పుఇరాన్కు మద్దతుగా వ్యవహరిస్తున్న యెమెన్‌లోని హౌతీ గ్రూపు కూడా ఈ ఘర్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. సౌదీ అరేబియా చమురు రవాణా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని హౌతీలు దాడులు చేసినట్లు సమాచారం. దీనికి ప్రతిగా హోడెయిడా ప్రావిన్స్‌లోని హౌతీ స్థావరాలపై దాడులు జరిగినట్లు తెలుస్తోంది. దీంతో యుద్ధ ప్రభావం గల్ఫ్ ప్రాంతం దాటి యెమెన్ వరకు విస్తరించింది.హర్ముజ్ జలసంధిలో పెరుగుతున్న టెన్షన్ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి మరోసారి యుద్ధ కేంద్రంగా మారింది. ఈ మార్గంలో ప్రయాణించే నౌకలపై ఇరాన్ ఆంక్షలు విధించడం, అనుమతి లేని మార్గాల్లో వెళ్లే ట్యాంకర్లను అడ్డుకుంటామని హెచ్చరించడం ఉద్రిక్తతలకు కారణమైంది. ఇరాన్ నౌకాదళం మూడు చమురు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించింది. మరోవైపు అమెరికా మాత్రం అంతర్జాతీయ నౌకాయానానికి ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. హర్ముజ్‌లో అమెరికా ఆంక్షలను దిక్కరించిన లావిన్ ట్యాంకర్‌పై దాడి జరిగింది. ఇంజిన్ రూమ్‌పై కాల్పులు జరపడంతో నౌక దెబ్బతింది. ఈజిప్ట్ పోర్టులో డ్రోన్ దాడి కలకలం?యుద్ధం కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోందన్న సంకేతంగా ఈజిప్ట్‌లోని డమియెట్టా పోర్టులో అమెరికాకు చెందిన ఎల్ఎన్జీ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి ఘటన కలకలం రేపింది. దాడి తర్వాత నౌకలో మంటలు చెలరేగాయి. మంటలు మరో నౌకకు కూడా వ్యాపించాయి. అత్యవసర సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఇది ఇరాన్ జరిపిన డ్రోన్ దాడియేనా?.. లేదంటే అగ్నిప్రమాదమా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. చమురు ధరలకు యుద్ధ సెగమిడిల్ ఈస్ట్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ చమురు మార్కెట్లపై పడుతోంది. యుద్ధ భయాలతో క్రూడాయిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఏకంగా సెంచరీ దాటేశాయి. ఇరాన్ చమురు స్థావరాలు, హర్ముజ్ జలసంధి భద్రతపై అనిశ్చితి కొనసాగితే ప్రపంచ ఇంధన సరఫరాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ప్రాంతీయ యుద్ధంగా మారుతున్న ఘర్షణఅమెరికా–ఇరాన్ మధ్య మొదలైన పోరు ఇప్పుడు ఇరాక్, యెమెన్, సౌదీ అరేబియా, సముద్ర మార్గాల వరకు విస్తరించింది. ఒకవైపు ప్రతీకార దాడులు.. మరోవైపు చమురు మార్గాలపై ముప్పు.. ఇంకోవైపు మిత్ర దేశాల జోక్యం.. ఇవన్నీ కలిసి మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చుతున్నాయి. -
ట్రంప్-నెతన్యాహు భేటీ.. ఇరాన్‌పై ఫైనల్ గేమ్‌కు రంగం సిద్ధం?
ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మధ్య జరిగిన కీలక భేటీ ప్రపంచ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వైట్‌హౌస్‌లో దాదాపు 90 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో ఇరాన్‌ను ఎదుర్కొనే భవిష్యత్ వ్యూహాలపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.అమెరికాను వెంటనే మరో యుద్ధంలోకి నెట్టాలనే ఉద్దేశంతో కాకుండా.. దౌత్య చర్చలు, ఆర్థిక ఆంక్షలు, అవసరమైతే సైనిక చర్య అనే మూడు మార్గాలను పరిశీలించడమే ఈ భేటీ ప్రధాన ఉద్దేశమని ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు.ఇరాన్‌పై మూడు మార్గాలు.. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అమెరికా, ఇజ్రాయెల్ ముందున్న అవకాశాలపై చర్చ జరిగింది.1. చర్చల మార్గం:ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అమెరికా ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్లు చర్చల్లో పాల్గొంటున్నప్పటికీ.. ఇరాన్ అణు కార్యక్రమంపై ఇరుదేశాల మధ్య ఇంకా తీవ్ర విభేదాలు ఉన్నట్లు సమాచారం. ఈ విషయంలో నెతన్యాహుకు అనుమానాలు ఉన్నట్లు తెలుస్తోంది.2. ఆర్థిక ఒత్తిడి:ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలు విధించడం, నౌకా నిర్బంధాన్ని కొనసాగించడం ద్వారా ఒత్తిడి పెంచే అంశాన్ని కూడా పరిశీలించారు.3. సైనిక చర్య:చర్చలు, ఆంక్షలు ఫలించని పరిస్థితుల్లో తిరిగి సైనిక దాడులను విస్తరించే అవకాశాన్ని కూడా చర్చించినట్లు సమాచారం.చమురు ధరలపై ట్రంప్ ఆందోళనఇరాన్తో ఘర్షణ కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా చమురు ధరలు పెరగడం, ఇంధన మార్కెట్లలో అస్థిరత వంటి అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇరాన్‌కు ప్రస్తుతం ఉన్న ప్రధాన వ్యూహాత్మక ఆధారం హార్మూజ్ జలసంధి అని, దానిని ఒత్తిడి సాధనంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోందని నెతన్యాహు పేర్కొన్నట్లు సమాచారం.సిరియా నుంచి సౌదీ వరకు.. ఇరాన్‌తో పాటు మధ్యప్రాచ్యంలోని ఇతర పరిణామాలపైనా ట్రంప్, నెతన్యాహు చర్చించారు. సిరియాలో ఇజ్రాయెల్, టర్కీ సైనిక ఉనికి, దక్షిణ సిరియాలో భద్రతా పరిస్థితులపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకున్నట్లు సమాచారం. అలాగే, అమెరికా-సౌదీ అణు ఒప్పందం, భవిష్యత్‌లో సౌదీ అరేబియా-ఇజ్రాయెల్ సంబంధాల సాధారణీకరణ అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక, రక్షణ రంగంలో అమెరికాపై ఆధారాన్ని క్రమంగా తగ్గించుకోవాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. వచ్చే పదేళ్లలో స్వదేశీ రక్షణ సామర్థ్యాలను పెంచుకోవడంతో పాటు, కొత్త తరం యుద్ధ విమానాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని నెతన్యాహు ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై అమెరికా తదుపరి నిర్ణయం ఎలా ఉండబోతోందన్న అంశం ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. ట్రంప్-నెతన్యాహు భేటీ తర్వాత మధ్యప్రాచ్య పరిణామాలు మరింత కీలక దశలోకి ప్రవేశించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. -
మళ్లీ భీకర యుద్ధం.. ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా
అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరుకున్నాయి. జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులకు ప్రతీకారంగా అమెరికా బుధవారం రాత్రి ఇరాన్‌పై భారీ వైమానిక దాడులు ప్రారంభించింది. ఇరాన్ భూభాగంపై దాదాపు వారం రోజుల తర్వాత అమెరికా చేపట్టిన తొలి ప్రత్యక్ష దాడులు ఇవే.అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఈ దాడులను ధ్రువీకరించింది. ఇరాన్ నుంచి అమెరికా బలగాలపై జరిగిన దాడులకు ఇది “శక్తివంతమైన ప్రతిస్పందన” అని పేర్కొంది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు దాడులు ప్రారంభమైనట్లు తెలిపింది.U.S. forces began launching strikes against Iran at 8 p.m. ET today. The strikes are a powerful response to yesterday's attempted Iranian attacks on U.S. forces based in the Middle East.— U.S. Central Command (@CENTCOM) July 30, 2026ట్రంప్ హెచ్చరికల తర్వాతే..ఇరాన్‌పై దాడులకు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు. జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడి చేసిన నేపథ్యంలో.. ‘‘ఇరాన్‌కు గట్టి సమాధానం ఇస్తాం.. చాలా బలంగా ఎదురుదాడి చేస్తాం’’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘‘వాళ్లు దాడి చేశారు.. ఇప్పుడు మా వంతు వచ్చింది’’ అంటూ ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ చర్యలకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.🚨 BREAKING: President Trump is warning adversaries that a forceful U.S. response is coming after a drone attack on an LNG tanker off the coast of Egypt."We're going to hit them very hard."Trump confirmed five rockets were fired and signaled that retaliation is imminent,…— Stephen Gardner (@StephenGardnerX) July 29, 2026దక్షిణ ఇరాన్లో పేలుళ్ల శబ్దాలుఅమెరికా దాడుల తర్వాత దక్షిణ ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. అయితే అమెరికా దాడుల లక్ష్యాలు, నష్టం వివరాలు ఇంకా పూర్తిగా వెల్లడికాలేదు.ప్రతిఘటన ఉంటుంది: ఇరాన్అమెరికా బెదిరింపులు కొనసాగినంత కాలం తమ ప్రతిఘటన కొనసాగుతుందని ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. అమెరికా బలగాలపై తాము చేపట్టిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించింది.ఇరాన్ నావికా దళాలు హార్ముజ్ జలసంధి వైపు వెళ్తున్న మూడు చమురు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు కూడా సమాచారం వెలువడింది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన ఈ మార్గంపై ఉద్రిక్తతలు పెరగడం అంతర్జాతీయంగా ఆందోళనకు కారణమవుతోంది.ఇరాక్‌లోనూ ఉద్రిక్తతలు..ఇరాక్‌లో అమెరికా, సౌదీ అరేబియా సంయుక్త దాడులపై అక్కడి ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ దాడుల్లో పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్‌కు చెందిన 20 మంది మరణించగా.. మరో 32 మంది గాయపడినట్లు సమాచారం. ఈ పరిణామాలు ఇరాక్‌ను కూడా ప్రాంతీయ ఘర్షణలోకి లాగుతున్నాయని అక్కడి అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.చర్చల నుంచి యుద్ధం వైపు?..కొద్ది రోజుల క్రితం ఇరాన్‌తో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని ట్రంప్ చెప్పినప్పటికీ.. తాజా పరిణామాలతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇరాన్ తీవ్ర చర్యలకు దిగితే యుద్ధాన్ని మళ్లీ ప్రారంభించాల్సి వస్తుందని ట్రంప్ గతంలో హెచ్చరించారు.అమెరికా తాజా దాడులతో పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ ప్రతిస్పందన ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి పరిణామాలు ప్రపంచ చమురు మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. -
అమెరికాకు బిగ్ షాక్.. ఆ సంచలన సర్వేలో ఏముంది?
ఈ మధ్య ఒక ఆసక్తికరమైన వార్త.. 'ప్యూ రీసెర్చ్ సెంటర్' (Pew Research Center) ఒక సంచలన సర్వే రిపోర్ట్ రిలీజ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 37 దేశాల్లో ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ సర్వే చేశారు. దీంట్లో బైటపడిన మోస్ట్ ఐ-క్యాచింగ్, షాకింగ్ విషయం ఏంటంటే..? ఆధునిక చరిత్రలో మొట్టమొదటిసారిగా, ప్రజలు అమెరికా కంటే చైనానే ఎక్కువగా ఇష్టపడుతున్నారట..! అవును..! మీరు చదివింది నిజమే..! ప్రపంచవ్యాప్తంగా అమెరికా సాధించుకున్న 'సాఫ్ట్ పవర్' క్రమక్రమంగా ఎలా కరిగిపోతుందో చెప్పడానికి ఇదొక పెద్ద నిదర్శనం.ఈ సర్వే అసలు ఏం చెబుతుందంటే..అసలు అమెరికా మీద ఈ వ్యతిరేకత ఎందుకు పెరుగుతోంది..? చైనా గ్రాఫ్ ఎందుకు అకస్మాత్తుగా పైకి వెళ్తోంది..? దీనివల్ల ప్రపంచ రాజకీయాల్లోనే కాకుండా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నిజంగానే ఏమైనా మార్పు వస్తుందా? ముందుగా ఈ సర్వే అసలు ఏం చెబుతుందంటే.. అమెరికా గ్రాఫ్ పడిపోవడానికి కేవలం అమెరికా తప్పులే కారణం కాదు..! చైనా తన ఇమేజ్ను గతంతో పోలిస్తే చాలా మెరుగుపరుచుకుంది. సర్వే చేసిన 37 దేశాల సగటు చూసుకుంటే.. చైనాకు అనుకూలంగా 51 శాతం మంది ఓటు వేస్తే, వ్యతిరేకత 39 శాతమే ఉంది..! అంటే చైనాకు నెట్ పాజిటివ్ ఇమేజ్ ఉందన్నమాట..! ముఖ్యంగా దక్షిణ అమెరికా, ఆఫ్రికా, సౌత్-ఈస్ట్ ఆసియా దేశాల్లో చైనాకు మంచి మద్దతు ఉంది. మన ఇండియా మాత్రం దీనికి మినహాయింపు అనుకోండి..!కారణం ఇదే..అలాగే, పేద దేశాల్లో చైనాకు ఆదరణ చాలా ఎక్కువగా ఉంది. ఐరోపా లాంటి ధనిక దేశాల్లో చూస్తే.. స్వీడన్, జర్మనీ, నెదర్లాండ్స్ లాంటి అత్యంత ధనిక దేశాల ప్రజలు చైనాను కాస్త తక్కువగా ఇష్టపడినా, ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 తర్వాత చైనా మీద ఉన్న నెగెటివిటీ అయితే చాలావరకు తగ్గిపోయింది. కానీ, అమెరికా పరిస్థితి పూర్తిగా తారుమారైంది..! ఆ 37 దేశాల సగటు తీసుకుంటే.. అమెరికాను కేవలం 37 శాతం మందే ఇష్టపడుతున్నారు. ఏకంగా 57 శాతం మంది అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడారు.కేవలం 9 దేశాల్లో మాత్రమే..గత ఏడాదితో పోలిస్తే, ఒక్క మెక్సికో మినహా ప్రతి దేశంలోనూ అమెరికా మీద అభిమానం దారుణంగా పడిపోయింది. ఒకప్పుడు అమెరికా అంటే పడిచచ్చే జర్మనీ లాంటి దేశాల్లో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే.. జర్మనీలో కేవలం 27 శాతం మందే అమెరికాను ఇష్టపడుతున్నారు. కానీ చైనాను ఇష్టపడేవాళ్ళు మాత్రం దానికంటే ఎక్కువే ఉన్నారు..! ప్రపంచంలో కేవలం 9 దేశాల్లో మాత్రమే.. అంటే బ్రెజిల్, ఘనా, హంగేరి, పోలాండ్, ఫిలిప్పీన్స్, సౌత్ కొరియా, ఇండియా, జపాన్, ఇజ్రాయెల్ ఇప్పటికీ చైనా కంటే అమెరికానే బెటర్ అనుకుంటున్నారు.ఇదొక్కటే సమస్య కాదు..సరే..! అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి..? ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది 'డొనాల్డ్ ట్రంప్' గురించి. అమెరికా వెలుపల ట్రంప్‌కు పాపులారిటీ ఎంత తక్కువగా ఉందో ఈ సర్వే మరోసారి నిరూపించింది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 23 శాతం మందికి మాత్రమే ట్రంప్ మీద నమ్మకం ఉందట..! జో బైడెన్‌తో పోలిస్తే ఇది చాలా తక్కువ..! అయితే ఇదొక్కటే సమస్య కాదు..! అమెరికా గత దశాబ్ద కాలంగా ప్రతి నాలుగేళ్లకోసారి వైట్‌హౌస్‌లో నాయకులు మారినప్పుడల్లా తన విదేశాంగ విధానాన్ని మార్చేస్తూ వస్తోంది. దీనివల్ల 'అమెరికా ఒక నమ్మకమైన భాగస్వామి కాదు' అనే అభిప్రాయం ప్రపంచ దేశాల్లో బలపడింది.కానీ.. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది..! కానీ, ఇక్కడ ట్రంప్ లాంటి వాళ్ళైతే ఒకటే మాట అనొచ్చు.. 'ఐ డోంట్ కేర్!' అని..! ఎందుకంటే, మెత్తగా మాట్లాడితే సాఫ్ట్ పవర్ వస్తుంది. కానీ, అందరూ మనల్ని మోసం చేస్తారనేది ఆయన వాదన. టారిఫ్‌లు, మిలిటరీ బెదిరింపులు లాంటి 'హార్డ్ పవర్' ఉపయోగించడం ద్వారానే అమెరికా తన పనులు సాధించుకోవచ్చని ట్రంప్ గట్టిగా నమ్ముతారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది..! హార్డ్ పవర్‌ని మాత్రమే నమ్ముకోవడం వల్ల కొన్ని షార్ట్-టర్మ్ లాభాలు రావచ్చు. కానీ, లాంగ్-టర్మ్‌లో అమెరికా చాలా నష్టపోతోంది. ఇప్పుడు చైనా లాంటి మరో పెద్దన్న ఉన్నాడు..ఇందులో మొదటిది.. ఇతర దేశాలు అమెరికా దెబ్బకు భయపడి తమని తాము రక్షించుకోవడానికి కొత్త దారులు వెతుక్కుంటాయి. రెండవది.. ఇది మల్టీపోలార్ (Multipolar) ప్రపంచం..! ఇప్పుడు చైనా లాంటి మరో పెద్దన్న ఉన్నాడు. కండబలం చూపిస్తే మిగతా దేశాలు చైనాతో చేతులు కలిపేస్తాయి. అప్పుడు అమెరికా బొక్క బోర్లా పడాల్సిందే..!. ఇక మూడవది.. అమెరికా నాయకులు ఒక భ్రమలో ఉంటారు..! 'మా దగ్గర బలం ఉంది. కాబట్టి మిగతా దేశాలు మేము చెప్పినట్లు వింటాయి' అని. కానీ, ఇది తప్పు..! బ్రెజిల్ లాంటి దేశాల ఉదాహరణే తీసుకోండి. ట్రంప్ బ్రెజిల్ మీద టారిఫ్ బాంబులు వేస్తామని బెదిరించినా, అక్కడి అధ్యక్షుడు 'లూలా' వెనక్కి తగ్గలేదు సరికదా.. మరింత గట్టిగా బదులిచ్చారు. ఎందుకంటే అక్కడ ప్రజలకు జాతీయవాదం ముఖ్యం. కాబట్టి, లూలా అలా చేయడం వల్ల అక్కడి ప్రజల్లో ఆయన గ్రాఫ్ ఇంకా పెరిగింది..!అమెరికా నెగ్గుకురాగలదా..?మొత్తానికి చూస్తే.. రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ హయాం, అమెరికాకు ఒక పెద్ద టెస్ట్ కేస్ అని చెప్పవచ్చు..! దశాబ్దాలుగా అమెరికా అంటే 'సాఫ్ట్ పవర్'.. 'హార్డ్ పవర్' రెండింటి కలయిక. మరి ఇప్పుడు కేవలం కండబలం అదే.. Hard Power మాత్రమే చూపించి అమెరికా నెగ్గుకురాగలదా..? లేదా తన గ్లోబల్ లీడర్షిప్ను కోల్పోతుందా..? రాబోయే రోజుల్లో కాలమే సమాధానం చెబుతుంది.-హెచ్.కమలాపతిరావు, సీనియర్ జర్నలిస్ట్ -
పుతిన్‌కు ఉచ్చు బిగిస్తున్న అమెరికా.. రష్యాకు డబుల్ స్ట్రైక్
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగిస్తున్న రష్యాపై మరింత ఆర్థిక ఒత్తిడి తీసుకురావాలనే లక్ష్యంతో రూపొందించిన కీలక ఆంక్షల బిల్లుకు అమెరికా సెనేట్ తొలి ఆమోదం తెలిపింది. బిల్లును తదుపరి దశకు తీసుకెళ్లేందుకు నిర్వహించిన విధానపరమైన (ప్రొసీజరల్) ఓటింగ్‌లో 86-12 ఓట్లతో తీర్మానం ఆమోదం పొందింది. దీంతో ఈ బిల్లుపై సెనేట్‌లో పూర్తి స్థాయి చర్చకు మార్గం సుగమమైంది.ఈ కీలక ఓటింగ్ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ అమెరికా క్యాపిటల్ భవనానికి హాజరయ్యారు. ఇటీవల మరణించిన రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహమ్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అమెరికా వెళ్లిన జెలెన్స్కీ, ఓటింగ్‌కు ముందు పలువురు రిపబ్లికన్, డెమోక్రాటిక్ సెనేటర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం సెనేట్ గ్యాలరీలో కూర్చొని ఓటింగ్ ప్రక్రియను ప్రత్యక్షంగా వీక్షించారు.సెనేటర్లతో సమావేశంలో జెలెన్స్కీ మాట్లాడుతూ.. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ ప్రస్తుతం కీలక పురోగతి సాధిస్తోందని, అయితే విజయం సాధించాలంటే అమెరికా నుంచి మరింత సైనిక, ఆర్థిక, రాజకీయ మద్దతు అవసరమని తెలిపారు. ఈ ఆంక్షల బిల్లు ఉక్రెయిన్ ప్రజలకు నైతిక బలాన్ని ఇవ్వడమే కాకుండా, రష్యాపై అంతర్జాతీయ ఒత్తిడిని మరింత పెంచుతుందని ఆయన పేర్కొన్నట్లు సమావేశానికి హాజరైన సెనేటర్లు వెల్లడించారు. కాగా, ఈ బిల్లును రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహమ్, డెమోక్రాటిక్ సెనేటర్ రిచర్డ్ బ్లూమెంథల్ సంయుక్తంగా రూపొందించారు. జూలై 10న వైట్ హౌస్‌తో ఈ బిల్లుపై ఒప్పందానికి వచ్చిన మరుసటి రోజే గ్రాహమ్ ఆకస్మికంగా మరణించారు. ఆయన మరణానికి ముందు ఉక్రెయిన్ వెళ్లి జెలెన్స్కీతో కూడా సమావేశమయ్యారు. ఈ బిల్లు గ్రాహమ్ రాజకీయ జీవితంలో అత్యంత కీలకమైన వారసత్వంగా నిలుస్తుందని బ్లూమెంథల్ పేర్కొన్నారు.బిల్లులోని ముఖ్యాంశాలు:రష్యా నుంచి చమురు, సహజ వాయువు, ఇతర ఎగుమతులను కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీ సుంకాలు విధించే అవకాశం.పుతిన్‌తో పాటు రష్యా ఉన్నత రాజకీయ, సైనిక నాయకులు, ఆర్థిక సంస్థలు, ఇంధన రంగంపై కొత్త ఆంక్షలు.ఇప్పటికే ఉన్న ఆంక్షలను తప్పించుకునేందుకు రష్యా ఉపయోగిస్తున్న పాత చమురు ట్యాంకర్లపై కూడా చర్యలు.జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అవసరమైతే కొన్ని ఆంక్షలను తాత్కాలికంగా మినహాయించే అధికారం అమెరికా అధ్యక్షుడికి కల్పించే నిబంధన.అయితే అధ్యక్షుడికి అదనపు టారిఫ్ అధికారాలు ఇవ్వడంపై కొందరు డెమోక్రాటిక్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధనలను సవరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సవరణలపై చర్చ అనంతరం బిల్లుపై అమెరికా సెనేట్‌లో తుది ఓటింగ్ జరగనుంది. ఈ బిల్లు చట్టంగా మారితే రష్యా యుద్ధ ఆర్థిక వనరులపై గట్టి దెబ్బ పడటంతో పాటు, ఉక్రెయిన్‌కు అమెరికా మద్దతు మరింత బలపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
రెచ్చిపోయిన ఇరాన్.. ట్రంప్ రియాక్షన్‌పై టెన్షన్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుతున్నాయన్న సమయంలో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు ఇస్తున్న వేళ.. ఇరాన్ మరోసారి తన సైనిక శక్తిని ప్రదర్శించింది. అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. మంగళవారం సాయంత్రం ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నుంచి పలు బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినట్లు CENTCOM తెలిపింది. జోర్డాన్‌లో ఉన్న అమెరికా బలగాల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు పేర్కొంది. అయితే వాటన్నింటినీ విజయవంతంగా అడ్డుకున్నామని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) వెల్లడించింది.‘‘ఇది ఆకస్మిక దాడికి చేసిన ప్రయత్నం. ప్రయోగించిన అన్ని క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్నాం’’ అని అమెరికా కమాండ్ వెల్లడించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా సమాచారం లేదని తెలిపింది.ట్రంప్ చర్చల మాటలు.. ఇరాన్ క్షిపణుల బదులుఇటీవల ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యలకు తాత్కాలిక విరామం ప్రకటించిన ట్రంప్.. చర్చలకు అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఇరాన్‌తో మంచి చర్చలు జరుగుతున్నాయని, ఒప్పందం కుదిరే అవకాశం ఉందని కూడా చెప్పారు. అయితే చర్చలు విఫలమైతే మళ్లీ సైనిక చర్యలు ప్రారంభిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఈ పరిణామాల మధ్యే ఇరాన్ క్షిపణి దాడి జరగడం అంతర్జాతీయంగా ఆసక్తిని రేపుతోంది.ట్రంప్‌కు ఇరాన్ హెచ్చరిక సంకేతమా?ఇరాన్ తాజా చర్యను అమెరికాకు ఒక బలమైన సందేశంగా విశ్లేషకులు చూస్తున్నారు. తమను పక్కన పెట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అంగీకరించబోమని చెప్పే ప్రయత్నంగానే ఈ దాడిని భావిస్తున్నారు. ఇటీవల అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన ఘర్షణల్లో భాగంగా అమెరికా బలగాలు ఇరాన్‌కు చెందిన పలు లక్ష్యాలపై దాడులు చేశాయి. ఆ తర్వాత ట్రంప్ దౌత్యానికి అవకాశం కల్పిస్తూ సైనిక చర్యలను నిలిపివేశారు.మళ్లీ మొదలైన యుద్ధం?తాజా క్షిపణి దాడి నేపథ్యంలో అమెరికా తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది. ట్రంప్ ఇప్పటికే ఇరాన్‌పై కఠిన వైఖరి ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఇప్పుడు జరిగిన దాడికి అమెరికా ఎలా స్పందిస్తుందన్నది కీలకంగా మారింది. మరోవైపు మధ్యప్రాచ్యంలో అమెరికా నౌకాదళం, సైనిక బలగాల మోహరింపు కొనసాగుతోంది. ఇరాన్-అమెరికా మధ్య మరోసారి ప్రత్యక్ష ఘర్షణకు దారితీస్తుందా? లేదంటే దౌత్య మార్గంలోనే పరిష్కారం దొరుకుతుందా అన్నది వేచి చూడాల్సి ఉంది.హౌతీల దాడులతో మరింత టెన్షన్ఇదే సమయంలో యెమెన్‌కు చెందిన ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో సౌదీ చమురు నౌకను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు ప్రయోగించినట్లు ప్రకటించారు. మరోవైపు సౌదీ అరేబియా, అమెరికా కలిసి ఇరాక్‌లోని ఇరాన్ అనుకూల మిలీషియా స్థావరాలపై దాడులు చేసినట్లు CENTCOM తెలిపింది. ఈ పరిణామాలన్నీ కలిసి మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి.ఇక ట్రంప్ నిర్ణయం ఏంటి?ఇరాన్ క్షిపణి దాడికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. చర్చలకు అవకాశం ఇస్తూనే.. సైనికంగా కఠిన చర్యలకు వెనుకాడబోమన్న ట్రంప్ వైఖరి నేపథ్యంలో తదుపరి పరిణామాలు కీలకం కానున్నాయి. -
వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో నెతన్యాహూ భేటీ
వాషింగ్టన్: ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ మంగళవారం వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఇద్దరు నేతలు ఏకాంతంగా దాదాపు గంటన్నరపాటు చర్చలు జరిపారు. ఇరాన్‌తో యుద్ధం మొదలయ్యాక వీరిద్దరూ సమావేశమవ్వడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. వీరి మధ్య చర్చలు సానుకూలంగా, ఫలప్రదంగా జరిగాయని అనంతరం వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కెరొలిన్ లీవిట్ చెప్పారు. ఇద్దరు నేతలు చర్చించిన అంశాలపై వైట్‌హౌస్‌గానీ, ఇజ్రాయెల్ ప్రభుత్వం గానీ స్పందించలేదు. కాగా, ట్రంప్, నెతన్యాహూలకు ఇది కీలక సమావేశం.ఎన్నికలు సమీపిస్తున్న వేళ సొంత దేశంలో ప్రజాదరణ తగ్గిపోతుండటంపై నెతన్యాహూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ట్రంప్ సైతం ఇరాన్‌తో యుద్ధం ప్రారంభించి, తలనొప్పులు తెచ్చుకున్నారు. నవంబర్‌లో మధ్యంతర ఎన్నికలు జరుగనుండగా ఇరాన్‌తో యుద్ధం కొనసాగించలేక, నిలిపివేసి ఓటమిని అంగీకరించలేక ఆపసోపాలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇద్దరు నేతల మధ్య దెబ్బతిన్న సంబంధాలు తిరిగి గాడినపడే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు. -
పట్టువదలని ట్యారిఫ్ విక్రమార్కుడు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పట్టువదలని విక్రమార్కునివలె ఈ నెల 24న భారత్ సహా మొత్తం 60 దేశాలపై మరో విడత దిగుమతి సుంకాలను పెంచారు. అవి అదే రోజు నుంచి అమ లుకు కూడా వచ్చాయి. ఈసారి ఆయన చెప్పిన కారణం: ఈ దేశాలు కార్మికులతో బలవంతపు చాకిరీ చేయించి ఉత్పత్తి చేస్తున్న సరకులను తమ దేశానికి ఎగు మతి చేస్తున్నాయని! ట్రంఫ్ ట్యారిఫ్ల పరంపర ఎప్పుడు మొదలై ఎట్లా సాగుతున్నదో, అందుకు తను చెప్తూ వస్తున్న ఛప్పన్నారు కారణాలేమిటో తెలిసినవే. అత్యవసర చట్టం నెపంతో...2025 జనవరిలో అధ్యక్షునిగా బాధ్యత స్వీకరించిన వెంటనే, ‘అమెరికా ఫస్ట్ ట్రేడ్ పాలసీ మెమోరాండం’ పత్రంపై సంతకం చేశారు. తర్వాత వారం రోజులకు సమస్త దేశాలపై 10 శాతం నుంచి 25 శాతం దిగుమతి సుంకాలు పెంచారు. అందులో చిన్న దేశాలు, పెద్ద దేశాలు, మిత్ర దేశాలు, శత్రు దేశాలనే తేడాలు చూప లేదు. ఇతరులతో అమెరికాకు గల వాణిజ్య లోటు ఈ చర్యకు కారణ మన్న ఆయన, తమకు వాణిజ్య మిగులు ఉన్న దేశాలనూ మినహా యించలేదు. ఒక్క మానవ మాత్రుడైనా నివసించక పెంగ్విన్స్ మాత్రమే ఉండే దీవులనూ తన జాబితాలో చేర్చారు. ఆయన విధానాలను, తీరును చూడగా తన పదవీ కాలం ముగిసే 2029 జనవరి వరకు ఈ ధోరణి ముగియక పోవచ్చునని పిస్తున్నది. ఆ చర్చలోకి వెళ్లే ముందు ఈ నెల 24 నాటి సుంకాల గురించి చెప్పుకోవాలి. సుంకాలను మొదట భారీగా పెంచినప్పుడు, అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టాన్ని (ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనమిక్ పవర్స్ యాక్ట్) ఉపయోగించారు. ఇతర దేశా లతో వాణిజ్య లోటు అమెరికా ఆర్థిక వ్యవస్థకే ముప్పు కలిగించగల స్థాయికి పెరిగిందనీ, కనుక ఇటువంటి అత్యవసర చర్యలను అమెరి కన్ కాంగ్రెస్ ఆమోదం లేకుండానే తీసుకునే అధికారం ఆ చట్ట ప్రకారం అధ్యక్షునికి ఉందనీ అన్నారు. కానీ, అటువంటి పరిస్థి తులు లేవనీ, కనుక ఆ చర్యలు చెల్లవనీ అక్కడి సుప్రీంకోర్టు ఈ సంవత్సరం ఫిబ్రవరిలో కొట్టివేసింది. అంతవరకు ప్రపంచ దేశాల నుంచి వసూలు చేసిన వందలకొద్ది బిలియన్ల అదనపు సుంకాలను వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించింది.దానితో ఆందోళనకు గురైన అమెరికా అధ్యక్షుడు ఆ నష్టాన్ని పూడ్చుకోవటానికి కొత్తదారులు వెతకటం మొదలు పెట్టారు. సుప్రీం తీర్పు నుంచి తప్పించుకునేందుకు తనకు ప్రత్యామ్నా యాలు ఉన్నాయని వెంటనే ప్రకటించిన ఆయన, కాంగ్రెస్ అను మతి వెంటనే అక్కరలేని 1974వ సంవత్సరపు వాణిజ్య చట్టాన్ని ఆశ్రయించారు. అందులోని 301వ నిబంధన మేరకు వేర్వేరు దేశాలపై 10 శాతం నుంచి 12.5 శాతం వరకు ట్యారిఫ్‌లు ప్రకటించారు. అయితే ఆ నిబంధన ఒక పరిమిత కాలం వరకే అమలులో ఉంటుంది. ఆ గడువు తీరటంతో ఈ నెల 24న అదే స్థాయి శాతా లతో ట్యారిఫ్లను శాశ్వతంగా మార్చారు. ఆ ప్రకారం ఇండియాపై రేటు 10 శాతం అయింది.సుంకాల మజిలీలుఈ ట్యారిఫ్ల యాత్రలో భారత దేశానికి, ఇతరులకు సంబంధించి కూడా పలు మజిలీలు ఉన్నాయి. 2025 ఫిబ్రవరిలో మొదటి విడత సుంకాలలో భాగంగా ఇండియాపై 25 శాతం విధించిన ఆయన, మనం రష్యా చమురును ఖరీదు చేస్తున్నందుకు ఆగ్రహించి మరో 25 శాతం పెంచారు. అట్లా అది 50 శాతం అయింది. ఇతరత్రా డబ్ల్యూటీవోతో నిమిత్తం లేకుండా, ఇంకా చెప్పాలంటే ఆ నిబంధనలను ఉల్లంఘిస్తూ, వేర్వేరు దేశాలతో వేర్వేరు వాణిజ్య ఒప్పందాలను తమకు అనుకూలంగా చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందుకోసం చర్చల పద్ధతిని గాక ఒత్తిడులు, బ్లాక్‌మెయిలింగ్‌ను ఎంచుకున్నారు. అది తట్టుకోలేని దేశాలు విడిగా ఒప్పందాలకు ఒప్పుకోగా ట్యారిఫ్ల శాతం అపుడు కొంత తగ్గించారు. ఆ విధంగా ఇండియాపై సుంకాలు 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గాయి. ఇపుడు 10 శాతంతో కలిపి 28 శాతం అవుతున్నాయి.జపాన్, దక్షిణ కొరియా వంటి బలమైన ఆర్థిక వ్యవస్థలు కూడా ఇందుకు మినహాయింపు కాలేదు, అమెరికాకు సన్నిహిత రాజ్యాలై నప్పటికీ– కెనడా, యూరప్ వంటి మిత్ర దేశాలు ఒకమేర రాజీ పడుతూ ప్రత్యామ్నాయ వాణిజ్య సంబంధాల కోసం అన్ని ఖండా లలో అన్వేషణలు మొదలు పెట్టాయి. రష్యాకు అమెరికాతో గల వాణిజ్య సంబంధం అతి స్వల్పం అయినందున ఇరువురి మధ్య వచ్చేదీ పోయేదీ ఏమీ లేకపోయింది. ఆంబోతులు పోట్లాడితే లేగదూడల కాళ్లు విరిగాయన్నట్లుగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై భారీ సుంకాలను అమెరికా విధించటంతో ఇతరులతో పాటు ఇండియా చాలానే నష్టపోయింది. ఆ ట్యారిఫ్‌లకు ప్రతిగా తాము కూడా అమెరికాపై ఎదురు సుంకాలు వేయగలమని కెనడా, యూరప్ హెచ్చరికలు చేసి ఆ పని కొంత మేర చేశాయి గానీ, పూర్తిగా ధిక్కరించి నిలిచింది చైనా ఒక్కటే.బలవంతపు చాకిరీలు నిజమేనా?ఇపుడు మాట్లాడుకోవలసిన ఆసక్తికరమైన విషయం ఒకటు న్నది. అది ఇండియా తదితర దేశాలు బలవంతపు చాకిరీతో ఉత్ప త్తులు చేసి అమెరికాకు విక్రయిస్తున్నాయనే ఆరోపణ. ఈ విషయమై యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్టీఆర్) జరిపిన విచారణలో ధ్రువీకరణలు లభించాయని ట్రంప్ ప్రభుత్వం చెప్తు న్నది. అమెరికా, యూరప్ వర్ధమాన దేశాలను ఒత్తిడి చేసేందుకు బాలకార్మికులు, మితిమీరిన పని గంటలు, బలవంతపు చాకిరీ వంటి వాదనలు ఎప్పటినుంచో చేస్తున్నాయి. విచిత్రమేమంటే, సాక్షాత్తూ అమెరికాలోనే రకరకాలుగా బలవంతపు చాకిరీ, శ్రామి కుల దోడిపీ జరుగుతున్నదని చెప్పే నివేదికలున్నాయి. కనుక, ఈ వాదన ఇతరులను ఒత్తిడి చేసే సాధనం మాత్రమే. ఇంతకూ జనవరి 2025తో ఆరంభించి శవం కోసం చెట్టెక్కు తూనే ఉన్న అమెరికా అధ్యక్షుని లక్ష్యాలు ఎంతవరకు నెరవేరు తున్నట్లు? అన్ని దేశాలూ తమను దోచుకుంటున్నాయంటూ సుంకాల హెచ్చింపును ఆరంభించినపుడు 900 బిలియన్ల మేర ఉండిన వాణిజ్య లోటు నేడు కూడా ఇంచుమించు అంతే ఉంది. కేవలం పారిశ్రామిక ఉత్పత్తులను తీసుకుంటే మరింత పెరిగి 1.2 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. ట్యారిఫ్ల హెచ్చింపుతో ఏమీ ఒరగ లేదు. పన్నులు పెంచుతామని హెచ్చరించినా బయటి నుంచి తిరిగి వచ్చిన అమెరికన్ కంపెనీలు చాలా కొద్ది. కనుక ‘మాగా’ నినాదం మేర ఉద్యోగాలూ పెరగలేదు. ఆ విధంగా విక్రమార్కుని భుజంపై శవం నిలవకుండా ఉంది.మనమిక చూడవలసింది అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఏ విధంగా జరగనున్నదనేది. అందుకోసం ఫ్రేమ్ వర్క్ అనేది కుదిరినా, తుదిరూపపు చర్చలు సాగుతున్నాయి. ప్రభుత్వం కొంత పట్టుదలగా ఉన్నమాట నిజం. అదే సమయంలో అది హానికరంగా ఉండకూడదని రైతులు, మత్స్యకారులు, జౌళి రంగం, ఇతర వర్గాలు ఒత్తిడి చేస్తున్నాయి. చివరకు ఏమయేదీ చూడాలి!టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
నెతన్యాహుకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టర్కీకి ఎఫ్-35 యుద్ధ విమానాల విక్రయంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యక్తపరిచిన అభ్యంతరాలను స్పష్టంగా తోసిపుచ్చారు. అమెరికా రక్షణ సామగ్రి విక్రయాలను ఏ విదేశీ నాయకుడూ శాసించలేరని ఆయన తేల్చిచెప్పారు. సోమవారం ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో మీడియాతో మాట్లాడుతూ, వాషింగ్టన్ రక్షణ రంగ విక్రయాలపై ఇజ్రాయెల్ జోక్యం చేసుకోవడాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. ‘మేము ఏది విక్రయించాలో ఎవరూ మాకు చెప్పలేరు’ అని స్పష్టం చేశారు.టర్కీ ఒక అద్భుతమైన మిత్రదేశమని, సిరియాతో సహా ప్రాంతీయ వ్యవహారాలలో అంకారా పాత్ర ఎంతో కీలకమని ట్రంప్ ప్రశంసించారు. టర్కీ, ఇజ్రాయెల్ మధ్య సత్సంబంధాలు లేనప్పటికీ, అమెరికా-టర్కీ బంధం బలంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అధునాతన ఎఫ్-35 స్టెల్త్ యుద్ధ విమానాలను టర్కీకి అందించడం వల్ల మధ్యప్రాచ్యంలో అధికార సమీకరణాలు మారుతాయని, ఆ దేశానికి ఈ సాంకేతికత ఇస్తే ప్రాంతీయ అస్థిరత పెరుగుతుందని నెతన్యాహు ఇటీవల సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో హెచ్చరించిన విషయం తెలిసిందే. టర్కీకి దురాక్రమణ పూరిత ఆశయాలు ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.రష్యా నుంచి ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేసిన కారణంగా, ట్రంప్ మొదటి హయాంలోనే 2019లో టర్కీని ఎఫ్-35 ఉమ్మడి ప్రాజెక్ట్ నుంచి అమెరికా తప్పించింది. నాటో భద్రతా ఆందోళనల నడుమ ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, తాజా పరిణామాలు అంకారాతో రక్షణ రంగ సహకారాన్ని పునరుద్ధరించడానికి ట్రంప్ సుముఖంగా ఉన్నట్లు స్పష్టం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ భయాందోళనలను పక్కనపెట్టి, అమెరికా అధ్యక్షుడి ఈ నిర్ణయం అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.ఇది కూడా చదవండి: అస్సాం: నీటిలో 631 గ్రామాలు.. 4.45 లక్షల మంది విలవిల -
ట్రంప్ శాంతి మంత్రం.. ఇరాన్ షాక్!
అమెరికా–ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కాస్త చల్లబడుతున్న వేళ.. శాంతి ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష దాడులు మూడు రోజులుగా నిలిచిపోవడంతో చర్చలకు అవకాశం ఏర్పడిందని చెప్పారు. అయితే దౌత్య ప్రయత్నాలు విఫలమైతే తిరిగి సైనిక చర్యలకు దిగుతామని హెచ్చరించారు.‘‘ఇరాన్‌తో మంచి చర్చలు జరుగుతున్నాయి. ఏదో ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉంది’’ అని ట్రంప్ ఎయిర్‌ఫోర్స్ వన్‌లో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. అయితే చర్చలు ఫలించకపోతే గతంలో చేపట్టిన చర్యలను తిరిగి కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దౌత్య మార్గాల ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తే అది అందరికీ మంచిదేనని పేర్కొన్న ఆయన.. అమెరికా ప్రయోజనాలు, భద్రత విషయంలో మాత్రం ఎలాంటి రాజీ ఉండదని సంకేతాలు ఇచ్చారు. ఇరాన్‌తో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, అవసరమైతే తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని ట్రంప్ తెలిపారు.ప్రత్యక్ష చర్చలు లేవంటున్న ఇరాన్అమెరికాతో నేరుగా ఎలాంటి చర్చలు జరగడం లేదని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది. మధ్యవర్తుల ద్వారా అమెరికా నుంచి కొన్ని సందేశాలు అందుతున్నాయని, కానీ ప్రస్తుతం అధికారిక చర్చలు మాత్రం లేవని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ తెలిపారు. ఇటీవలి కాలంలో అమెరికా దాడులతో ఇరాన్‌లోని పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయని, ప్రతిగా ఇరాన్ కూడా అమెరికా అనుబంధ లక్ష్యాలపై దాడులు చేసిందని సమాచారం. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఎంతకాలం కొనసాగుతుందన్నది ఆసక్తిగా మారింది.‘అమెరికా ఆయుధ నిల్వలు తగ్గలేదు’.. ట్రంప్ఇరాన్పై దీర్ఘకాలిక సైనిక చర్యలకు అమెరికా వద్ద క్షిపణులు, ఆయుధ నిల్వలు సరిపోవడం లేదన్న వార్తలను ట్రంప్ ఖండించారు. అమెరికా వద్ద భారీగా ఆయుధ నిల్వలు ఉన్నాయని, అవసరానికి మించి ఉన్నాయని పేర్కొన్నారు. అయితే గత బైడెన్ ప్రభుత్వ హయాంలో ఉక్రెయిన్‌కు భారీగా ఆయుధాలు పంపడం వల్ల నిల్వలపై ఒత్తిడి ఏర్పడిందని ట్రంప్ ఆరోపించారు. ప్రస్తుతం అత్యాధునిక ఆయుధ వ్యవస్థల ఉత్పత్తిని వేగవంతం చేస్తున్నామని చెప్పారు.సౌదీ చమురు స్థావరాలపై డ్రోన్ దాడులుపశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గలేదు. సోమవారం సౌదీ అరేబియాలోని చమురు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులు జరిగాయి. ఇరాన్ అనుకూల వర్గాలే ఈ దాడులకు కారణమని సౌదీ ఆరోపించింది. మరోవైపు యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు కూడా సౌదీ చమురు మౌలిక వసతులపై దాడులు చేసినట్లు ప్రకటించారు. అయితే దీనిపై సౌదీ నుంచి అధికారిక స్పందన రాలేదు.హర్ముజ్ జలసంధిపైనే అసలు పంచాయితీప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి ఇప్పుడు ప్రధాన వివాదంగా మారింది. ఈ మార్గంపై నియంత్రణ తమదేనని ఇరాన్ చెబుతుండగా.. నౌకల రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని అమెరికా పట్టుబడుతోంది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఇటీవల ఈ మార్గంలో ప్రయాణిస్తున్న కొన్ని నౌకలను అడ్డుకున్నట్లు సమాచారం. దీంతో ప్రపంచ చమురు మార్కెట్లు ఆందోళనకు గురయ్యాయి. అయితే తాజా కాల్పుల విరమణ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో కొంత ఉపశమనం కనిపించింది.చర్చలా? దాడులా? ఉత్కంఠ కొనసాగింపుఅమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలపై ఆశలు కనిపిస్తున్నప్పటికీ.. ఇరు దేశాల ప్రకటనల్లో భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. ఒకవైపు చర్చలకు సిద్ధమంటూ సంకేతాలు ఇస్తూనే.. మరోవైపు సైనిక చర్యలకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరికలు రావడం మిడిల్ఈస్ట్ సంక్షోభాన్ని మరింత సంక్లిష్టంగా మారుస్తోంది.ట్రంప్ మాటల్లో శాంతి సంకేతాలు కనిపిస్తున్నా.. హర్ముజ్ జలసంధి, ఆయుధ నిల్వలు, ప్రాంతీయ దాడులు ఈ ఒప్పందానికి అసలు పరీక్షగా మారనున్నాయి. -
ఖర్గ్ ద్వీపంపై ట్రంప్ ‘ఏఐ’ దండయాత్ర
వాషింగ్టన్: ఖర్గ్ ద్వీపం విషయంలో ట్రంప్ మరోసారి ఇరాన్‌ని రెచ్చగొట్టారు. ఆ ఐలాండ్‌పై దాడి చేస్తున్నట్లు ఉన్న ఏఐ చిత్రాన్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదే విధంగా అమెరికా వద్ద అవసరానికి మించి ఆయుధాలున్నాయని తమ వద్ద ఉన్నాయని ఇరాన్ శక్తిమంతమైన చమురు కూడలి అయిన ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం అమెరికాకు పెద్ద కష్టమైన పనేం కాదన్నారు.ఇరాన్‌కు చెందిన ఖర్గ్ ద్వీపంపై ట్రంప్ కన్ను ఇప్పటిది కాదు.. యుద్ధం ప్రారంభం నుంచే తరచుగా ఆ ద్వీపంపై ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఖర్గ్ ద్వీపాన్ని అమెరికా బలగాలు "చాలా సులభంగా" ఆక్రమించగలవని, అమెరికా కావాలనుకుంటే ఇరాన్ చమురు సంపదను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవచ్చని ఆయన గతంలో పేర్కొన్నారు. సైనిక దాడులపై వ్యాఖ్యలు: గతంలో జరిగిన దాడుల సమయంలో, ఖర్గ్ ద్వీపంలోని సైనిక స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశామని, సరదాగా మరోసారి దాడులు చేయగలమని ఆయన హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మరోసారి కయ్యానికి కాలు దువ్వారు.ఇరాన్‌తో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా అమెరికా వద్ద ఉన్న పేట్రియాట్ ఇంటర్‌సెప్టర్ క్షిపణుల నిల్వలు తగ్గిపోతున్నాయని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈనేపథ్యంలో ట్రంప్ స్పందించారు " "ప్రపంచంలోనే అత్యధికంగా, అమెరికా అవసరానికి మించి మా దగ్గర ఆయుధాలు ఉన్నాయి.వాటిలో శక్తిమంతమైన చమురు కూడలి అయిన ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం అమెరికాకు పెద్ద కష్టమైన పనేం కాదు." అని అన్నారు.ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది సేపటికే ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన 'ట్రూత్ సోషల్'లో అనేక AI చిత్రాలను పంచుకున్నారు. వాటిలో ఒక చిత్రం, ఇరాన్ యొక్క అతిపెద్ద చమురు ఎగుమతి కేంద్రమైన ఖర్గ్ ద్వీపంపై జరిగిన వైమానిక దాడిని చూపించింది. దానికి ఆయన, ఖర్గ్పై దాడి అని శీర్షిక పెట్టారు. -
ట్రంప్ బాంబు పేలుతుందనుకుంటే.. తుస్సుమంది!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా కాలంగా ఒకే ఆరోపణను బలంగా వినిపిస్తున్నారు. ‘‘అమెరికా పౌరులు కాని వాళ్లు భారీ సంఖ్యలో.. అక్రమంగా ఓట్లు వేస్తున్నారు. అదే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తోంది’’ అని పదేపదే చెబుతున్నారు. ఈ వాదననే ఆధారంగా చేసుకుని ఓటరు నమోదు సమయంలో పౌరసత్వాన్ని తప్పనిసరిగా నిరూపించాలనే వాదన తెరపైకి తెస్తున్నారు. అయితే ఆ వాదనలో ఏమాత్రం పస లేదనే ఆసక్తికరమైన విషయం ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది.ఎన్నికల భద్రతను కాపాడాలంటే పౌరసత్వ ధ్రువీకరణను మరింత కఠినతరం చేయాల్సిందేనని ట్రంప్ వాదిస్తున్నారు. అందుకే సేవ్ అమెరికా యాక్ట్(SAVE America Act) లాంటి చట్టాలకు మద్దతు తెలుపుతున్నారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కాపాడాలంటే ఇవి అవసరమని ఇటు రిపబ్లికన్ పార్టీ కూడా చెబుతోంది. అయితే డెమొక్రటిక్ పార్టీ మాత్రం దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఇటు ఈ అంశం భారత పాఠకులకు కొత్తగా అనిపించాల్సిన అవసరం లేదు. ఇటీవల భారత్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన Special Intensive Revision (SIR) ప్రక్రియపై కూడా తీవ్ర రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించి అర్హుల పేర్లను కొనసాగించడం, అనర్హుల పేర్లను తొలగించడం లక్ష్యంగా ఈ ప్రక్రియ చేపట్టామని ఎన్నికల సంఘం చెప్పగా.. ప్రతిపక్షాలు మాత్రం పలు ప్రాంతాల్లో నిజమైన ఓటర్ల పేర్లు తొలగించే అవకాశం ఉందంటూ ఆందోళనలు వ్యక్తం చేశాయి. దీంతో ఓటరు నమోదు, ధ్రువీకరణ, ఎన్నికల జాబితాల విశ్వసనీయత దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు అమెరికాలోనూ ఇదే తరహాలో SAVE America Act చుట్టూ చర్చ సాగుతోంది. అయితే అక్కడ అసలు వివాదం విదేశీయుల అక్రమ ఓటింగ్ నిజంగానే విస్తృతంగా జరుగుతోందా? లేదా అనే అంశంపైనే కేంద్రీకృతమైంది.అమెరికాలో 1996 నుంచి ఫెడరల్ ఎన్నికల్లో పౌరులు కానివారు ఓటు వేయడం చట్టరీత్యా నేరం. అప్పటి నుంచి ఇప్పటి వరకు నమోదైన ఫెడరల్ కోర్టు రికార్డులను రాయిటర్స్ విశ్లేషించగా, దేశవ్యాప్తంగా కేవలం 129 కేసులు మాత్రమే నమోదైనట్లు తేలింది. అందులో 73 మంది మాత్రమే నేరాన్ని అంగీకరించడమో లేదంటే కోర్టులు దోషులుగా నిర్ధారించాయి. అంటే.. అధ్యక్ష ఎన్నికలో కోట్లాది ఓట్లు నమోదయ్యే అమెరికాలో ఈ సంఖ్య చాలా స్వల్పమని పరిశీలన చెబుతోంది.ఈ కేసులను లోతుగా పరిశీలిస్తే మరో విషయం కూడా బయటపడింది. నమోదైన చాలా ఘటనలు పెద్ద ఎత్తున పన్నిన ఎన్నికల కుట్రలకు సంబంధించినవి కావు. గ్రీన్ కార్డు కలిగిన కొందరు శాశ్వత నివాసితులు తాము కూడా ఓటు వేయడానికి అర్హులమని పొరపాటుగా భావించడం, మరికొన్ని సందర్భాల్లో పరిపాలనా లోపాల వల్ల పేర్లు ఓటరు జాబితాలో చేరడం వంటి కారణాలే ఎక్కువగా కనిపించాయి. దేశవ్యాప్తంగా విదేశీయులు సమన్వయంతో ఎన్నికలను ప్రభావితం చేశారనే ఆధారాలు మాత్రం బయటపడలేదు. అయినప్పటికీ ట్రంప్ మాత్రం తన వాదనపై వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు ఎన్నికల నిపుణులు, పౌరహక్కుల సంస్థలు మాత్రం ఈ వాదనను ప్రశ్నిస్తున్నాయి. విదేశీయుల అక్రమ ఓటింగ్ విస్తృతంగా జరుగుతోందని నిరూపించే బలమైన ఆధారాలు లేనప్పుడు కఠిన నిబంధనలు తీసుకురావడం వల్ల చట్టబద్ధమైన అమెరికా పౌరులే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సహజీకృత అమెరికా పౌరులు(అంటే విదేశాల్లో పుట్టి, తర్వాత అమెరికా పౌరసత్వం పొందిన వారు) అవసరమైన పత్రాలు వెంటనే సమర్పించలేక ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. ఇటీవల న్యూజెర్సీలో సాఫ్ట్వేర్ లోపం కారణంగా కొందరు పౌరులు కానివారి పేర్లు పొరపాటున ఓటరు జాబితాలో నమోదైన ఘటన కూడా చర్చనీయాంశమైంది. అయితే ఆ ఘటనలో కూడా వాస్తవంగా ఓటు వేసిన వారి సంఖ్య చాలా పరిమితంగానే ఉందని, దానిని దేశవ్యాప్తంగా జరుగుతున్న భారీ ఎన్నికల మోసానికి నిదర్శనంగా చెప్పలేమని అధికారులు స్పష్టం చేశారు.మొత్తంగా చూస్తే, అమెరికా ఎన్నికల్లో విదేశీయులు భారీ సంఖ్యలో అక్రమంగా ఓటు వేస్తున్నారన్న ట్రంప్ ఆరోపణలకు ఇప్పటివరకు అందుబాటులో ఉన్న అధికారిక రికార్డులు బలమైన మద్దతు ఇవ్వడం లేదని ప్రముఖ మీడియా సంస్థ రాయిటర్స్ పరిశీలన తేల్చింది. ఎన్నికల భద్రతపై రాజకీయ వాదోపవాదాలు కొనసాగుతున్నప్పటికీ, నమోదైన కేసులు మాత్రం సమస్య పరిమిత స్థాయిలోనే ఉందని సూచిస్తున్నాయి. దీంతో ట్రంప్ చేసిన ఆరోపణలు ఒకవైపు ఉంటే... అధికారిక రికార్డులు మాత్రం మరో చిత్రాన్ని చూపిస్తున్నాయని ఈ విశ్లేషణ స్పష్టం చేసింది. -
భారీ దాడులకు సిద్ధమైన అమెరికా.. ఒక్కసారిగా ఎందుకు ఆగింది?
వాషింగ్టన్: ఇరాన్‌పై భారీ సైనిక దాడి చేపట్టాలన్న ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతానికి పక్కన పెట్టారు. పెంటగాన్ వద్ద ఉన్న వాయు రక్షణ ఆయుధ నిల్వలు ప్రమాదకర స్థాయిలో తగ్గిపోతాయని సీనియర్ సలహాదారులు హెచ్చరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. శుక్రవారం ట్రంప్, ఆయన కేబినెట్ సభ్యులు, సీనియర్ సలహాదారులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో అమెరికా సైన్యం వద్ద పేట్రియట్ ఇంటర్‌సెప్టర్ క్షిపణులు, ఇతర రక్షణ వ్యవస్థల నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయన్న అంశమే ప్రధానంగా చర్చకు వచ్చింది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కేన్ కూడా ఇరాన్‌పై యుద్ధాన్ని మరింత పెంచాలన్న అంశాన్ని ట్రంప్ పరిశీలిస్తున్న సమయంలో అమెరికా వద్ద ఆయుధ నిల్వలు తగ్గిపోతున్నాయని హెచ్చరించారు.వాయు రక్షణ ఆయుధ నిల్వలు తగ్గిపోవడమే అమెరికా వరుస రాత్రి దాడులను నిలిపివేయడానికి ప్రధాన కారణమా, లేక ఈ విరామం కొనసాగుతుందా అన్నది ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు పశ్చిమాసియాలో పెద్ద యుద్ధం చెలరేగడం, గల్ఫ్ దేశాలతో సంబంధాలు దెబ్బతినడం, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం, ఇంధన సరఫరా అంతరాయం, శరణార్థుల సంక్షోభం మరింత పెరగడం వంటి అంశాలపై కూడా ట్రంప్, ఆయన సలహాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం, ఇరాన్‌పై పెద్ద స్థాయి యుద్ధ చర్యలు చేపట్టడం సాధ్యమేనని, కానీ అలా చేస్తే పశ్చిమాసియాలో అమెరికా సైనిక చర్యలను పర్యవేక్షించే సెంట్రల్ కమాండ్ వద్ద ఉన్న ఇంటర్‌సెప్టర్ క్షిపణుల నిల్వలు ప్రమాదకరంగా తగ్గిపోతాయని జనరల్ డాన్ కేన్ వ్యక్తిగతంగా ట్రంప్‌కు వివరించారు.ముగ్గురు అమెరికా సైనికులు మృతితో.. గత వారం జోర్డాన్‌లో ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి అమెరికా వాయు రక్షణ వ్యవస్థను దాటి దాడి చేయడంతో ముగ్గురు అమెరికా సైనికులు మరణించిన ఘటన తర్వాత ఈ చర్చలు జరిగాయని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.శుక్రవారం అమెరికా బలగాలు పూర్తి సిద్ధంగా ఉన్నాయని, దాడికి రెడీగా ఉన్నాయని ట్రంప్ ప్రకటించినా, చివరకు భారీ బాంబు దాడులకు ఆయన అనుమతి ఇవ్వలేదు. ఈ వారం ప్రారంభంలో ఆక్సియోస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో "ఇప్పటివరకు ఎప్పుడూ లేనంత భారీ దాడి చేయించాలన్న అంశాన్ని పరిశీలిస్తున్నాను. నిర్ణయానికి చాలా దగ్గరగా ఉన్నాను. అందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నాం" అని ట్రంప్ చెప్పారు.ఇరాన్ తీర ప్రాంత రాడార్లు, నౌకలపై దాడి చేసే క్షిపణి ప్రయోగ కేంద్రాలు, నౌకాదళ వాహనాలు, రవాణా వ్యవస్థలు, పిక్‌యాక్స్ పర్వతం అడుగున ఉన్న భూగర్భ అణు కేంద్రం వంటి వ్యూహాత్మక లక్ష్యాలపై పలుదశల్లో దాడి చేసే ప్రణాళికలను పెంటగాన్ సిద్ధం చేసింది. అయితే దీర్ఘకాలం దాడులు కొనసాగితే ఇప్పటికే తగ్గిపోయిన క్షిపణి నిల్వలపై తీవ్ర ఒత్తిడి పడుతుందని అధికారులు హెచ్చరించారు.ట్రంప్ సీనియర్ సలహాదారుల్లో పలువురు, జారెడ్ కుష్నర్ సహా, భారీ సైనిక దాడికి బదులుగా నిరంతర దౌత్య చర్చలు, ఆర్థిక ఒత్తిడి కొనసాగించే వ్యూహానికే మద్దతు ఇస్తున్నారు. ఇదే సమయంలో, అసోసియేటెడ్ ప్రెస్ కథనం ప్రకారం.. దాదాపు రెండు వారాలుగా నిరంతరంగా సాగిన వైమానిక దాడుల తర్వాత అమెరికా సైన్యం తొలిసారి రాత్రి దాడులను నిలిపివేసింది. తాత్కాలిక కాల్పుల విరమణను పునరుద్ధరించే ప్రయత్నాలు కూడా వేగం పుంజుకున్నాయి. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలపై రాజీ మార్గం కనుగొనేందుకు మధ్యవర్తులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.అయితే ప్రాంతీయ ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇరాన్ మద్దతుతో ఉన్న యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాలోని యాన్బు, జిజాన్ ప్రాంతాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్టు ప్రకటించారు.హోదైదాపై సౌదీ వైమానిక దాడులకు ప్రతీకారంగానే అరామ్కోకు చెందిన కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నామని వారు తెలిపారు. -
విమానం మార్చేసిన ట్రంప్.. ఎందుకలా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల ప్రారంభంలో టర్కీలో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశాన్ని ముగించుకుని తిరిగి వెళ్లే సమయంలో తన ప్రయాణ విమానాన్ని అత్యవసరంగా మార్చవలసి వచ్చింది. ఇరాన్ ప్రాక్సీ దళాల నుండి ఆయనకు ముప్పు ఉందని నిఘా వర్గాల సమాచారం అందడంతో సీక్రెట్ సర్వీస్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రముఖ పత్రిక 'ది న్యూయార్క్ టైమ్స్' వెల్లడించింది.ట్రంప్ టర్కీకి వెళ్లేటప్పుడు ఖతార్ ప్రభుత్వం బహుమతిగా ఇచ్చిన సరికొత్త 'బోయింగ్ 747-8' విమానంలో ప్రయాణించారు. అయితే భద్రతా కారణాల రీత్యా తిరిగి వస్తున్నప్పుడు పాత 'ఎయిర్ ఫోర్స్ వన్' విమానంలో ప్రయాణించాలని సీక్రెట్ సర్వీస్ అధికారులు ఆయనను కోరారు. ఈ ముప్పు ప్రత్యేకించి ఖతార్ విమానానికి మాత్రమే కాకుండా, అధ్యక్షుడితో పాటు ఆయన ప్రయాణించే ఏ విమానాన్నైనా టార్గెట్ చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. మొదట్లో ఈ విమానం మార్పును వైట్‌హౌస్ సాధారణ విషయంగానే పేర్కొంది. బ్రిటన్‌లోని అమెరికా సైనికులు.. కొత్త విమానాన్ని తిలకించేందుకే తాను విమానం మార్చినట్లు ట్రంప్ బహిరంగంగా తెలిపారు. కానీ.. అసలు కారణం భద్రతా ప్రమాదాలేనని అధికారులు తరువాత స్పష్టం చేశారు. ఖతార్ బహుమతిగా ఇచ్చిన బోయింగ్ 747-8 విమానంలో పాత ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ఉండే అధునాతన క్షిపణి రక్షణ వ్యవస్థలు లేవు.ఈ నేపథ్యంలో ఈ విమానం భద్రతపై గతంలోనూ విమర్శలు వచ్చాయి. ఈ ఘటన తర్వాత ఈ విమానాన్ని మరింత అప్‌గ్రేడ్ చేసేందుకు త్వరలో సుమారు ఒక నెలపాటు సర్వీస్ నుంచి తప్పించనున్నట్లు వైట్‌హౌస్ ప్రెస్ కార్యదర్శి కరెలిన్ లీవిట్ వెల్లడించారు. అమెరికా అగ్రనేతలకు ముప్పు తీవ్రత ఊహించని స్థాయిలో పెరిగిందని సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ సీన్ కుర్రాన్ పేర్కొన్నారు. -
మీడియాపై నోరు పారేసుకున్న ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నాడు. వైట్‌హౌస్ వ్యవహారాలను చూసే పత్రికా విలేకరులతో జరిగిన విందు సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొందరిని విమర్శించి.. మరికొందరిపై ప్రశంసలు కురిపించి ప్రజా ప్రతినిధులు కొందరిపై జోకులేస్తూ సుమారు గంట సేపు మాట్లాడిన ట్రంప్ తాను మూడోసారి కూడా గద్దెనెక్కవచ్చునని వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఈ వైట్‌హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ ఈ ఏడాది ఏప్రిల్‌లోనే జరగాల్సి ఉండింది. అయితే ఆ సమావేశంలో అజ్ఞాత వ్యక్తి ఒకరు కాల్పులు జరపడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ నేపథ్యంలో వాయిదా పడ్డ డిన్నర్ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ తాను ఎన్నో మాట్లాడాలి అనుకున్న చాలా అంశాలను కొట్టేశానని అన్నారు. ‘‘ఏప్రిల్‌లోనే ఈ స్పీచ్ ఇవ్వాలని అనుకున్నా.. కాకపోతే గన్‌మాన్ కాల్పులతో తప్పనిసరిగా వాయిదా వేయాల్సి వచ్చింది’’అని వ్యాఖ్యానించారు. ‘‘మూడు నెలల క్రితం చెప్పినట్లే... షో నడుస్తూనే ఉండాలి’’అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన ట్రంప్ ఆ రోజు మూక హత్యలు జరిగి ఉండేవని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తరువాత ఆయన తనదైన శైలిలో హాస్యం, వ్యంగ్యం కలిపేస్తూ విమర్శలు, తిట్లు అందుకున్నారు. కరెస్పాండెంట్స్ డిన్నర్‌కు తాను వచ్చే ఏడాదీ హాజరవుతానని వ్యాఖ్యానించారు. మీడియాతో ట్రంప్ సంబంధాల్లో ఈ డిన్నర్ ఒక అరుదైన క్షణంగా నిలిచిపోనుంది. ఎందుకంటే రెండోసారి అధికారం చేపట్టినప్పటి నుంచి ఇదే మీడియా ప్రతినిధులపై ట్రంప్ రకరకాలుగా మాటల దాడులు చేయడం, కొందరిపై కేసులేయడం, మరికొందరిపై ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోవడం తెలిసిందే. ఈ క్రమంలోనే తన సమావేశాలకు హాజరు కావొద్దంటూ నిషేధం విధించిన కొందరు విలేకరులు కూడా ఈ డిన్నర్ సమావేశాలకు హాజరు కావడం గమనార్హం. ట్రంప్‌కు మొదటనుంచి కొంతమంది రాజకీయ నేతలన్నా.. మీడియా ప్రతినిధులన్నా పీకలదాకా కోసం. జేన్ ఫోండా, బ్రూస్ స్ప్రింగ్స్టీన్ వంటి వారితోపాటు మాజీ అధ్యుక్షుడు ఒబామాకు ఆయన రకరకాల పేర్లు పెట్టి పిలుస్తూంటాడు. ఒబామాను కాస్తా ‘బరాక్ హుస్సేన్ ఒబామా’అంటూంటారు. అలాగే జిమ్మీ ఫాలన్, జిమ్మీ కిమ్మెల్, ప్రజా ప్రతినిధులు ఇల్హాన్ ఒమార్, డి–మిన్, కాలిఫోరి్నయా రాష్ట్ర గవర్నర్ గావిన్ న్యూసోమ్, న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ వంటి వారిపై కూడా తన గంట ప్రసంగంలో తనదైన రీతిలో విమర్శలు కురిపించారు ట్రంప్. వీటిల్లో కొన్ని వివక్షాపూరితమైనవి కూడా ఉండటం విశేషం. జర్నలిజమ్ వృత్తి అంటే తనకు గౌరవమేనని అన్న ట్రంప్ తనను సవాలు చేస్తూ రాసిన కథనాలపై మాత్రం విమర్శలు కురిపించారు. వచ్చేసారి తాను ‘ట్రంప్–2028’అన్న టోపీ వేసుకుని అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తానని నవ్వుతూ చెప్పిన ఆయన ఆ వెంటనే జోక్ చేస్తున్నానని సర్దుకున్నారు. సాహసవీరులకు అవార్డులు.. ఏప్రిల్ కాల్పుల సమయంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన సీక్రెట్ సరీ్వస్ ఏజెంటు విక్టర్ గోంజాల్వెజ్తోటు, వాషింగ్టన్ హిల్టన్ (సమావేశం జరిగిన హోటల్) హోటల్ సిబ్బంది కొందరిని తాజా డిన్నర్ సమావేశంలో సత్కారం జరిగింది. గత అనుభవం దృష్ట్యా ఈసారి కొంచెం చిన్న వేదికను ఎంచుకున్నారు. అలాగే భద్రతను కట్టుదిట్టంగా నిర్వహించారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.... పత్రికా స్వేచ్ఛ సంబరాలు అన్న పేరుతో ఈ సమావేశాలు జరగడం. సుమారు 700 మంది ఈ డిన్నర్ సమావేశాల్లో పాల్గొన్నారు. రెడ్ కార్పెట్ వంటి హంగులేవీ కనిపించలేదు. అయితే ఈ సమావేశానికి హాజరైన వారిలో కొంతమంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజా సమావేశం ఒకప్పుటి ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ ప్రస్తుత వాల్డ్రాఫ్ అస్టోరియాలో జరగడం కొసమెరుపు. -
లక్ష డాలర్ల వీసా ఫీజుకు అమెరికా కోర్టు బ్రేక్!
వాషింగ్టన్: హెచ్–1బీ వీసాల కోసం చెల్లించాల్సిన ఫీజులను లక్ష డాలర్లకు పెంచాలన్న ట్రంప్ నిర్ణయం బెడిసికొట్టింది. ఫీజు పెంపును తిరస్కరిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసేందుకు ఫెడరల్ అప్పీల్స్ కోర్టు సమర్థించింది. యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి లియో టి సొరోకిన్ జూన్ 8వ తేదీ ఒక తీర్పునిస్తూ హెచ్–1బీ వీసా కోసం లక్ష డాలర్ల ఫీజు వసూలు చేయడం అక్రమమని, కాంగ్రెస్ ఆమోదం లేదని స్పష్టం చేశారు. అయితే అమెరికన్ ప్రభుత్వం ఈ తీర్పును అప్పీల్స్ కోర్టులో సవాలు చేసింది. బోస్టన్లోని ఫస్ట్ సర్క్యూట్ అప్పీల్ కోర్టులో ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ దీనిపై విచారణ జరిపి డిస్ట్రిక్ట్ కోర్టు తీర్పును సమర్థించింది. ఈ కేసులోకక్షిదారులైన ఇరవై రాష్ట్రాల డెమోక్రాట్ ప్రభుత్వాల వాదన సరైందేనని స్పష్టం చేసింది. 1989 సుప్రీం కోర్టు తీర్పును ఉటంకిస్తూ, ఎగ్జిక్యూటివ్ శాఖ ఆర్థిక భారాలు (ఫీజులు లేదా పన్నులు) విధించాలంటే కాంగ్రెస్ స్పష్టమైన అనుమతి అవసరం అని పేర్కొంది. ఈ ఫీజు వల్ల రాష్ట్రాలకు పెద్ద నష్టం జరగదని కేంద్రం వాదించినా, కోర్టు దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. 2025 సెపె్టంబర్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త హెచ్–1బీ వీసాలకు 100,000 అమెరికన్ డాలర్ల ఫీజును ప్రకటించిన విష యం తెలిసిందే. భారతీయ ఐటీ నిపుణులు అమెరికాలో స్థిరపడేందుకు ఈ హెచ్–1బీ వీసాను ఎక్కువగా ఉపయోగిస్తూంటారు. ప్రత్యేక నైపుణ్యమున్న విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు అమెరికన్ కంపెనీలకు ఈ వీసా అవకాశమిస్తుంది. అమెరికన్ టెక్ కంపెనీలు భారత్, చైనా వంటి దేశాల నుంచి సుమారు 65 వేల మందిని ఈ వీసా ద్వారా నియమిస్తాయి. అధిక విద్యార్హత కలిగిన విదేశీ ఉద్యోగులు మరో 20 వేల మంది కూడా ఈ వీసాల ద్వారా అమెరికాలో ఉద్యోగాలకు అర్హులవుతూంటారు. సాధారణంగా ఈ వీసాల ఫీజులు 2,000–5,000 డాలర్ల వరకూ ఉంటాయి. -
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త సవాల్.. సెక్షన్ 301తో దర్యాప్తు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ యూనియన్ (EU)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూఎస్ కంపెనీలపై ఈయూ ఉద్దేశపూర్వకంగా భారీ జరిమానాలు విధిస్తుండటాన్ని ఆయన తప్పుబట్టారు. దీనిపై సెక్షన్ 301 కింద దర్యాప్తు ప్రారంభిస్తామని హెచ్చరించారు. అవసరమైతే.. ఈయూపై భారీ దిగుమతి సుంకాలు కూడా విధిస్తామని ప్రకటించారు.ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్టులో.. యూరోపియన్ యూనియన్ అమెరికా కంపెనీలను ఆదాయ వనరుగా చూస్తోందని విమర్శించారు. ''ఎలాంటి కారణం లేకుండా యాపిల్‌కు 15 బిలియన్ డాలర్లు, మెటాకు 3 బిలియన్ డాలర్లు, అమెజాన్‌కు 2.5 బిలియన్ డాలర్లు, ఇంకా అనేక ఇతర సంస్థలకు జరిమానా విధించిన తర్వాత, గూగుల్‌కు మరో 1 బిలియన్ డాలర్ల జరిమానా విధించారని మాకు ఇప్పుడే సమాచారం అందింది" అని అన్నారు. ఈ జరిమానాలన్నీ అన్యాయమైనవని, అమెరికా కంపెనీలపై వివక్ష చూపే చర్యలని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ పరిస్థితి ముఖ్యంగా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పాలన ప్రారంభమైన తర్వాత మరింత ఎక్కువైందని ట్రంప్ ఆరోపించారు. అయితే తన ప్రభుత్వం అలాంటి చర్యలను సహించబోదని స్పష్టం చేశారు. అమెరికా కంపెనీల ప్రయోజనాలను కాపాడటం తమ బాధ్యత అని ట్రంప్ స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో ట్రంప్ సెక్షన్ 301 ఇన్వెస్టిగేషన్ చేపడతామని ప్రకటించారు. అమెరికా ట్రేడ్ యాక్ట్‌లోని సెక్షన్ 301 ప్రకారం.. ఇతర దేశాలు అమెరికా వ్యాపారాలకు అన్యాయం చేస్తున్నాయనే అనుమానం ఉంటే అమెరికా ప్రభుత్వం దర్యాప్తు చేయవచ్చు. దర్యాప్తులో ఆరోపణలు నిజమని తేలితే, ప్రతిస్పందనగా ఆయా దేశాలపై అదనపు సుంకాలు విధించే అధికారం అమెరికాకు ఉంటుంది.అయితే.. యూరోపియన్ యూనియన్ మాత్రం, ఈ జరిమానాలను చట్టబద్ధమైన నియమాల ప్రకారమే విధిస్తున్నట్లు చెబుతోంది. కానీ ట్రంప్ చేసిన హెచ్చరికతో అమెరికా-యూరోపియన్ యూనియన్ మధ్య వాణిజ్య సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ అమెరికా నిజంగానే భారీ సుంకాలు విధిస్తే, రెండు దేశాల మధ్య వాణిజ్యం మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.ఇదీ చదవండి: ఒంటిపై చొక్కాలేదు.. కానీ రూ.100 కోట్ల సంపద! -
ట్రంప్ ప్రాణాలకు ముప్పు? విమాన మార్పు వెనుక రహస్యం!
-
ఇరాన్ అణు బాంబు ప్లాన్ ట్రంప్ వార్నింగ్ తో ..!
-
కమలా హారిస్‌కు ఓటు వేశారని.. ట్రంప్ దురాగతం!
వాషింగ్టన్: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌కు మద్దతు తెలిపి, డెమోక్రాట్ సెనేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాలకు కేటాయించిన వందలాది సమాఖ్య ఇంధన గ్రాంట్లను రద్దు చేసినట్లు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం కోర్టులో అంగీకరించింది. బైడెన్ హయాంలో మంజూరైన బిలియన్ల డాలర్ల నిధుల రద్దును సవాల్ చేస్తూ పలువురు లబ్ధిదారులు దాఖలు చేసిన వ్యాజ్యానికి సంబంధించి ఈ నెలలో సమర్పించిన కోర్టు ధృవీకరణ పత్రంలో ఈ సంచలన వాస్తవం వెలుగు చూసింది.ట్రంప్ ప్రభుత్వంలోని ఇంధన శాఖ (డీఓఈ) రద్దు చేసిన మొత్తం 284 గ్రాంట్ల నిర్ణయం పూర్తిగా రాజకీయ ప్రాతిపదికనే తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ప్రాజెక్టుల పనితీరు, చట్టపరమైన అంశాలు, ఖర్చుల తగ్గింపు లేదా ఇతర కార్యాచరణ కారణాల వల్ల ఈ నిధులను నిలిపివేయలేదని, కేవలం బ్లూ స్టేట్స్ (డెమోక్రాట్ల ఆధిపత్యం ఉన్న రాష్ట్రాలు)లో ఉన్నందువల్లే వాటిని రద్దు చేసినట్లు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దాదాపు రద్దు అయిన అన్ని ప్రాజెక్టులు డెమోక్రాట్ రాష్ట్రాలకే చెందిపవి కావడం గమనార్హం.ఈ పరిణామంపై డెమోక్రాట్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఓట్లు వేయలేదనే కక్షతో పన్ను చెల్లింపుదారుల సొమ్మును ట్రంప్ యంత్రాంగం నిలిపివేసిందని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ ధ్వజమెత్తారు. తాము ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నియంతృత్వంలోనా అని ఆయన ప్రశ్నించారు. ఈ నిర్ణయం పూర్తిగా అమెరికా వ్యతిరేక చర్య అని సెనేటర్ ప్యాటీ ముర్రే, ప్రతినిధి మార్సీ కప్టర్ సంయుక్త ప్రకటనలో విమర్శించారు. కాగా, కోర్టు దాఖలు చేసిన పత్రాలకు, గతంలో ఇచ్చిన ప్రకటనలకు ఎలాంటి విరుద్ధత లేదని ఇంధన శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: జంతర్‌మంతర్‌లో ఇన్ఫెక్షన్ల కలకలం.. తల్లడిల్లిపోతున్న విద్యార్థులు! -
డబుల్ గేమ్ మొదలుపెట్టిన ట్రంప్
ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని చెబుతూనే.. అవసరమైతే భారీ సైనిక చర్యకు వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ ఇప్పుడు చర్చల్లో మరింత సీరియస్‌గా వ్యవహరిస్తోందని చెప్పిన ఆయన.. ఒప్పందం కుదరకపోతే గతం కంటే తీవ్ర స్థాయి దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడిన అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్‌పై భారీ దాడులకు సంబంధించి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. అయితే అమెరికా సైన్యం మాత్రం పూర్తిగా సిద్ధంగా ఉందని, ‘‘మేం సిద్ధంగా ఉన్నాం.. అవసరమైతే ముందుకు వెళ్తాం’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.‘డీల్ లేదంటే భారీ దాడులు’ఇరాన్‌కు ఇప్పుడు రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాతో ఒక ఒప్పందానికి రావడం లేదా మరింత తీవ్ర స్థాయి సైనిక చర్యలను ఎదుర్కోవడం అని హెచ్చరించారు. ‘‘మేము వారితో మాట్లాడుతున్నాం. గతంతో పోలిస్తే ఇరాన్ ఇప్పుడు మరింత సీరియస్‌గా కనిపిస్తోంది. అయితే చర్చలు ఫలిస్తాయని ఇప్పుడే చెప్పలేం’’ అని ట్రంప్ అన్నారు.‘లాక్డ్ అండ్ లోడెడ్’అమెరికా సైనిక సామర్థ్యంపై ట్రంప్ మరోసారి స్పష్టత ఇచ్చారు. అవసరమైతే ఇరాన్‌పై మరింత భారీ దాడులకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దౌత్య మార్గానికి అవకాశం ఇస్తున్నప్పటికీ.. సైనిక ఎంపికను పూర్తిగా పక్కన పెట్టలేదని ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమమే ఈ వివాదానికి ప్రధాన కారణమని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేసే దిశగా ముందుకు సాగకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.ఇరాన్ మాత్రం..మరోవైపు అమెరికా ఒత్తిళ్లకు తాము తలొగ్గబోమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తెలిపారు. బెదిరింపులు, ఒత్తిళ్లతో ఇరాన్‌ను నియంత్రించలేరని స్పష్టం చేశారు. చర్చలకు తాము సిద్ధమే అయినప్పటికీ.. బలవంతపు షరతులను అంగీకరించబోమని పేర్కొన్నారు. మరోవైపు మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు వారాలుగా అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఘర్షణలు, సైనిక చర్యల నేపథ్యంలో ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హర్ముజ్ జలసంధిపై ప్రభావం పడుతోంది. గల్ఫ్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు ఆందోళనకరంగా మారడంతో వాణిజ్య నౌకల రాకపోకలు, సముద్ర రవాణాపై అనిశ్చితి నెలకొంది.ఈ పరిణామాల నేపథ్యంలో హర్ముజ్ ప్రాంతంలో వేలాది మంది నౌకా సిబ్బంది భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వందలాది నౌకలు ఆగిపోయాయని.. దాదాపు 6 వేల మంది నౌకా సిబ్బంది ఈ ప్రాంతంలోని ఉద్రిక్త పరిస్థితుల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నట్లు అంతర్జాతీయ సముద్ర సంస్థ (IMO) పేర్కొంది. నౌకల రాకపోకలకు అంతరాయాలు, భద్రతా పరమైన సవాళ్ల కారణంగా సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది.రష్యా, చైనాపైనా ట్రంప్ దృష్టిఇరాన్కు రష్యా, చైనా ఆయుధ సహాయం అందిస్తున్నాయన్న వార్తలపైనా ట్రంప్ స్పందించారు. ఆ దేశాల అధినేతలు ఇరాన్‌కు ఆయుధాలు అందించబోమని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే ఇరాన్ విషయంలో అమెరికా తదుపరి నిర్ణయం ఏంటన్నది ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తి రేపుతోంది. ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన మార్గాల్లో ఒకటైన హర్ముజ్ జలసంధిలో ఏదైనా పెద్ద పరిణామం చోటుచేసుకుంటే అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు సఫలం అవుతాయా? లేక పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారతాయా? అన్నది ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. -
అమెరికా-సౌదీ అణు ఒప్పందంలో ఊహించని మలుపు!
వాషింగ్టన్: అమెరికా-సౌదీ అరేబియా మధ్య కుదిరిన పౌర అణు ఒప్పందంపై ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణీకరిస్తేనే ఈ ఒప్పందం అమలవుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అబ్రహాం ఒప్పందంలో భాగంగా సౌదీ అరేబియా ఇజ్రాయెల్‌ను అధికారికంగా గుర్తించాలని ఆయన షరతు విధించారు. ఈ అనూహ్య నిర్ణయంపై సర్వత్రా చర్చనీయాంశమవుతుండగా, వైట్‌హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ దీనిని గట్టిగా సమర్థించారు.సౌదీ అరేబియా మనస్తత్వాన్ని, అక్కడి నాయకుల విధానాలను ట్రంప్ అద్భుతంగా అర్థం చేసుకున్నారని మిల్లర్ తెలిపారు. ‘అమెరికాలో మరే ఇతర నాయకుడికన్నా ట్రంప్‌కు సౌదీ మనస్తత్వంపై సంపూర్ణ అవగాహన ఉంది. ఆయన నిర్ణయాలపై ప్రజలు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా నమ్మకం ఉంచాలి’ అని ఆయన పేర్కొన్నారు. వాషింగ్టన్, రియాద్ దేశాలు అణు సహకార ఒప్పందంపై సంతకాలు చేసిన మరునాడే ట్రంప్ ఈ కొత్త షరతును తెరపైకి తేవడం గమనార్హం.మరోవైపు పాలస్తీనా సమస్యకు స్పష్టమైన పరిష్కారం లభించే వరకు ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు నెరకొనే ప్రసక్తే లేదని సౌదీ అరేబియా స్పష్టం చేసింది. ప్రస్తుత పరిణామాలపై సౌదీ వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని సమాచారం. ఈ తాజా పరిణామం మధ్యప్రాచ్య రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ అణు ఒప్పందం అమలు కావాలంటే అమెరికా కాంగ్రెస్ ఆమోదం కూడా తప్పనిసరి కావడంతో, భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.ఇది కూడా చదవండి: ఇరాన్ డేంజర్ ప్లాన్.. అమెరికా సంచలన నివేదిక! -
భారత్‌పై పదిశాతం సుంకాలు!
వాషింగ్టన్/న్యూఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికా మరోసారి భారత్‌పై టారిఫ్‌ల కొరడా ఝళిపించింది. బలవంతపు చాకిరితో వచ్చిన ఉత్పత్తులను నియంత్రించే లక్ష్యంతోనే ఈ టారిఫ్‌లు విధిస్తున్నట్లు ప్రకటించింది. తాజా ఆదేశాలతో అమెరికా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే 99 శాతం వస్తువులపై పది నుంచి 12.5 శాతం టారిఫ్ వర్తిస్తుంది. బలవంతపు చాకిరి ద్వారా వచ్చిన ఉత్పత్తుల ఎగుమతులపై నిషేధం విధిస్తూ చట్టసవరణలు చేసిన కారణంగా భారత్‌పై పది శాతం పన్ను మాత్రమే విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ప్రకటించారు. వాణిజ్య సంస్థల ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ భారత్ లాంటి దేశాలను మరింత ప్రోత్సహించేందుకు పది శాతం టారిఫ్ విధించాలని వాణిజ్య సంస్థల ప్రతినిధులు సూచించారని తెలిపారు. కొత్త టారిఫ్‌లు మొత్తం అరవై దేశాల దిగుమతులకు వర్తిస్తాయని, బలవంతపు చాకిరితో ఉత్పత్తి అయిన వస్తువుల ఎగుమతులపై నిషేధం లేని చైనా, యునైటెడ్ కింగ్డమ్, జపాన్లతోపాటు మొత్తం 43 దేశాలకు 12.5 శాతం, మిగిలిన దేశాలపై 10 శాతం టారిఫ్‌లు వర్తిస్తాయని వాణిజ్య సంస్థల ప్రతినిధి జేమిస్ గ్రీర్ తెలిపారు. కొత్త టారిఫ్‌లు అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి తరువాత అమల్లోకి రానున్నాయి. -
అలా చేస్తే మీ పని అంతే.. చైనా,రష్యాలకు ట్రంప్ వార్నింగ్
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ రష్యా,చైనాలపై ఫైరయ్యారు. ఈ రెండు దేశాలు ఇరాన్‌కు ఎట్టిపరిస్తితుల్లో ఆయుధాలు విక్రయించవద్దని తీవ్రంగా హెచ్చరించారు. ఒకవేళ ఆ పని చేస్తే అది ఆ దేశాలకే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని అది వారి దేశ ప్రయోజనాలకు ఏమాత్రం మంచిది కాదని స్పష్టం చేశారు.ట్రంప్ తన అధికారిక ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేస్తూ "చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈ ఏడాది మే నెలలో బీజింగ్‌లో జరిగిన సమావేశంలో తమ దేశం నుంచి ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇరాన్‌కు ఆయుధాలు విక్రయించబోమని హామీ ఇచ్చారు. మా మధ్య ఉన్న సంబంధాల దృష్ట్యా ఆయన మాటను నమ్ముతున్నాను" అని అన్నారు.అదే విధంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ సైతం ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్నప్పటికీ, ఇరాన్‌కు ఆయుధాలు అమ్మబోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా తనకు హామీ ఇచ్చారని ట్రంప్ చెప్పారు.అదే సమయంలో ఉక్రెయిన్‌కు అమెరికా ఆయుధాలు అమ్మడంపై మాట్లాడుతూ "నేను ఉక్రెయిన్‌కు నేరుగా ఆయుధాలు అమ్మడం లేదని, కేవలం నాటో (NATO) దేశాలకే విక్రయిస్తున్నానని పుతిన్‌కు తెలుసు. నాటో దేశాలు పూర్తి ధర చెల్లించి కొనుగోలు చేస్తాయి, ఆ తర్వాత ఆ ఆయుధాలు ఎలా పంపిణీ అవుతాయో నాకు తెలియదు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.ఇటీవలి కాలంలో అమెరికా సైనిక స్థావరాలపై జరిగిన వరుస దాడులకు సంబంధించి, ఇరాన్‌కు రష్యా మరియు చైనాలు లక్ష్యాల సమాచారాన్ని అందిస్తున్నాయా లేదా అనే అంశంపై వాషింగ్టన్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో దర్యాప్తు జరుపుతోంది. ఇంతలోనే ట్రంప్ ఇరుదేశాలకు వార్నింగ్ ఇచ్చారు. -
ఇరాన్ ఆస్తులపై ట్రంప్ గురి.. టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఇరాన్‌కు చెందిన స్తంభింపజేసిన నిధులను(ఫ్రీజ్డ్ ఫండ్స్) వినియోగిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. అయితే ఈ ప్రకటనపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. అమెరికా ఆధీనంలో ఉన్న ఇరాన్‌కు చెందిన స్తంభింపజేసిన నిధులను.. అమెరికా నౌకలు, సరుకు రవాణా నౌకలు, ఇతర సంబంధిత ఆస్తులకు జరిగిన నష్టాల భర్తీకి ఉపయోగిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. ఇరాన్ చర్యల వల్ల జరిగిన నష్టాలకు పరిహారం చెల్లించేందుకు ఈ నిధులను వినియోగిస్తామని ఆయన స్పష్టం చేశారు. అయితే అమెరికా–ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ట్రంప్ ప్రకటన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. వాషింగ్టన్ మళ్లీ దాడులు ప్రారంభించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు మరింత వేడి పెంచాయి.“ఇకపై నౌకలు, సరుకు లేదా వాటికి సంబంధించిన ఏదైనా ఆస్తికి జరిగే నష్టాలను అమెరికా ఆధీనంలో ఉన్న ఇరాన్ డబ్బుతో చెల్లిస్తాం” అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ నష్టాలు భారీగా ఉండొచ్చని, అయినప్పటికీ ఇది న్యాయమైన చర్య అని ఆయన సమర్థించారు. ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో రెండు సౌదీ చమురు నౌకలపై దాడులకు పాల్పడినట్లు ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.ఇరాన్ ఘాటు కౌంటర్ట్రంప్ ప్రకటనపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తీవ్రంగా స్పందించారు. ఇతర దేశాల ఆస్తులను స్వాధీనం చేసుకుని భవిష్యత్తు నష్టపరిహారాలకు వినియోగించడం “పేలుడు స్వభావం కలిగిన ప్రమాదకరమైన సంప్రదాయానికి నాంది” అని వ్యాఖ్యానించారు. “ఒక దేశానికి చెందిన ఆస్తులను మరో దేశం సంబంధం లేని అంశాలకు ఉపయోగించడం సాధారణమైతే.. భవిష్యత్తులో ఏ దేశ ఆస్తులకూ భద్రత ఉండదు. దీని ఫలితంగా ఏర్పడే గందరగోళం శాంతియుతంగా ఉండదు” అని అరాఘ్చీ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అంతర్జాతీయ నిబంధనలను బలహీనపరిచే చర్యగా ఆయన ట్రంప్ నిర్ణయాన్ని అభివర్ణించారు.నిధుల విలువ ఎంత?ఇరాన్‌పై అమెరికా ఆంక్షల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు ఆర్థిక వ్యవస్థల్లో ఆ దేశానికి చెందిన భారీ మొత్తంలో నిధులు నిలిచిపోయాయి. ఈ నిధుల ఖచ్చితమైన విలువ స్పష్టంగా తెలియకపోయినా.. కొన్ని నివేదికల ప్రకారం వాటి విలువ సుమారు 124 బిలియన్ డాలర్ల నుంచి 167 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని అంచనా. ఈ స్తంభింపజేసిన నిధుల విడుదల ఇరాన్–అమెరికా మధ్య గత చర్చల్లో కీలక డిమాండ్‌గా ఉంది. అయితే ఇటీవల కుదిరిన అవగాహన ఒప్పందం కూడా ముందుకు సాగలేదు.హౌతీల దాడులతో మళ్లీ ఉద్రిక్తతలుఇటీవల ఎర్ర సముద్రంలో సౌదీకి చెందిన రెండు చమురు నౌకలపై దాడులకు యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు బాధ్యత వహించారు. హౌతీ అధికార ప్రతినిధి యాహ్యా సరీ మాట్లాడుతూ.. “ఎన్సీలియా (ENCELIA), లైలా (LAYLA)” అనే రెండు సౌదీ నౌకలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. సౌదీ రవాణా అధికారులు కూడా ఎన్సీలియా నౌకపై దాడి జరిగిందని, బాబ్ అల్-మందెబ్ జలసంధి వద్ద నౌక ముందుభాగంలో మంటలు చెలరేగినట్లు ధ్రువీకరించారు. ఇరాన్ కూడా హార్ముజ్ జలసంధిలో నిబంధనలు పాటించని వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుంటోందని అమెరికా ఆరోపిస్తోంది.యుద్ధం నుంచి ఆర్థిక పోరాటం వరకుఅమెరికా–ఇరాన్ ఘర్షణ ఇప్పటివరకు ప్రధానంగా సైనిక, దౌత్య స్థాయిలో కొనసాగింది. అయితే తాజా పరిణామాలతో ఆర్థిక ఆస్తులు కూడా ఈ పోరాటంలో కీలక ఆయుధాలుగా మారుతున్నాయి. ఒక దేశానికి చెందిన విదేశీ నిధులను మరో దేశం నష్టపరిహారాల కోసం వినియోగించడం అంతర్జాతీయ చట్టపరంగా కొత్త చర్చలకు దారితీయొచ్చని నిపుణులు చెబుతున్నారు. అమెరికా మాత్రం తన చర్యలను సమర్థిస్తూ.. తమ వాణిజ్య ప్రయోజనాలు, నౌకల భద్రతకు జరిగిన నష్టాలకు బాధ్యులను జవాబుదారీ చేయడమే లక్ష్యమని చెబుతోంది.న్యూయార్క్‌లో కత్తిపోట్ల కలకలంఇదిలా ఉండగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగిన రెండు కత్తిపోటు ఘటనలు కూడా చర్చనీయాంశంగా మారాయి. మాన్హాటన్లోని అప్పర్ వెస్ట్ సైడ్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులపై దాడి చేసిన 51 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. దాడి సమయంలో నిందితుడు “అల్లాహు అక్బర్” అని నినదించినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొనడంతో.. ఇది విద్వేష నేరమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రాథమిక విచారణలో నిందితుడి మానసిక ఆరోగ్య పరిస్థితి కూడా కారణం అయి ఉండొచ్చని అధికారులు వెల్లడించారు. దాడిలో గాయపడిన ఇద్దరు బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.ప్రపంచానికే ప్రమాదకర సంకేతమా?ఒక దేశానికి చెందిన స్తంభింపజేసిన ఆస్తులను మరో దేశం తన ప్రయోజనాలకు వినియోగించడం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో కొత్త వివాదాలకు దారితీసే అవకాశం ఉంది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో ఇతర దేశాల విదేశీ నిధుల భద్రతపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆస్తుల స్వాధీనం వంటి చర్యలు సాధారణ పరిణామంగా మారితే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నమ్మకం, పెట్టుబడుల భద్రతపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.ప్రపంచానికి పెరుగుతున్న సవాళ్లుఒకవైపు ఇరాన్ స్తంభింపజేసిన నిధుల వినియోగంపై అమెరికా–ఇరాన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా.. మరోవైపు అమెరికాలో భద్రత, విద్వేష నేరాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. తాజా పరిణామాలు యుద్ధాలు కేవలం యుద్ధ రంగానికే పరిమితం కావని.. అవి ఆర్థిక వ్యవస్థలు, అంతర్జాతీయ నిబంధనలు, ప్రపంచ భద్రతపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయని మరోసారి స్పష్టం చేస్తున్నాయి. -
సౌదీ ఆఫర్‌తో కొత్త పవర్ గేమ్... పాక్ ఎంట్రీతో బిగ్ ట్విస్ట్!
ప్రపంచ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా, సౌదీ అరేబియా మధ్య కుదిరిన కొత్త పౌర అణు ఒప్పందం మధ్యప్రాచ్య శక్తి సమీకరణాలను మార్చే అంశంగా మారింది. బయటకు చూస్తే ఇది అణు విద్యుత్ అవసరాల కోసం కుదిరిన ఒప్పందంలా కనిపిస్తున్నా, దీని వెనుక ఉన్న వ్యూహాత్మక అవకాశాలే ఇప్పుడు అంతర్జాతీయ చర్చకు కారణమవుతున్నాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదించిన ఈ ఒప్పందం ద్వారా సౌదీ అరేబియాకు తన దేశంలోనే యురేనియం శుద్ధి చేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం లభించవచ్చని తెలుస్తోంది. అణు విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ఈ సాంకేతికతను ఒక నిర్దిష్ట స్థాయికి మించి అభివృద్ధి చేస్తే, అణు ఆయుధాల తయారీకి అవసరమైన పదార్థాలను కూడా ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఈ ఒప్పందం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది.ఈ పరిణామం ఇజ్రాయెల్‌లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఇప్పటికే ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ ఉద్రిక్తతలు, భద్రతా సవాళ్లను ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్, సౌదీ భవిష్యత్తులో అణు సామర్థ్యం సాధించే అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ఒక దేశం అణు సాంకేతికతను అభివృద్ధి చేసిన తర్వాత దాని వినియోగం పూర్తిగా శాంతియుతంగానే ఉంటుందని ఎప్పటికీ హామీ ఇవ్వలేమన్నది ఇజ్రాయెల్ వాదన. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ గతంలో చేసిన ఒక వ్యాఖ్య కూడా ఇప్పుడు మళ్లీ చర్చకు వచ్చింది. ఇరాన్ అణు ఆయుధాన్ని అభివృద్ధి చేస్తే, సౌదీ కూడా అదే దిశలో అడుగులు వేయాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే సౌదీ అణు కార్యక్రమంపై ఇజ్రాయెల్ అప్రమత్తంగా ఉంది.ఈ పరిణామంలో మరో దేశం పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. అదే పాకిస్థాన్. సౌదీ అరేబియా, పాకిస్థాన్ మధ్య దశాబ్దాలుగా బలమైన వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి. రక్షణ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో రెండు దేశాలు సన్నిహితంగా వ్యవహరిస్తున్నాయి. పాకిస్థాన్ అణు కార్యక్రమానికి గతంలో సౌదీ మద్దతు ఇచ్చిందనే ఆరోపణలు అంతర్జాతీయ స్థాయిలో వినిపించినప్పటికీ, ఇరు దేశాలు వాటిని అధికారికంగా అంగీకరించలేదు. 1980లలో పాకిస్థాన్ అణు కార్యక్రమం వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో సౌదీతో రహస్య అవగాహన ఉందనే వార్తలు వచ్చాయి. భవిష్యత్తులో ప్రాంతీయ సంక్షోభం ఏర్పడితే పాకిస్థాన్ నుంచి అణు సహకారం పొందే అవకాశం ఉందనే ఊహాగానాలు అప్పటి నుంచి కొనసాగుతున్నాయి. ఇప్పుడు సౌదీకి అణు సాంకేతికతపై మరింత సానుకూలత లభించే అవకాశం రావడంతో ఈ పాత చర్చలు మరోసారి తెరపైకి వచ్చాయి.అయితే ఒక దేశం అణు ఆయుధాన్ని తయారు చేయడం అంత సులభమైన ప్రక్రియ కాదు. యురేనియం శుద్ధి సామర్థ్యం ఒక భాగం మాత్రమే. దానికి తోడు అణు వార్‌హెడ్ రూపకల్పన, క్షిపణి వ్యవస్థల అభివృద్ధి, సాంకేతిక పరీక్షలు, భద్రతా వ్యవస్థలు వంటి అనేక అంశాలు అవసరం. అయినప్పటికీ, అణు సామర్థ్యానికి దారితీసే సాంకేతిక మార్గం తెరుచుకోవడం కూడా అంతర్జాతీయ భద్రతలో కీలక పరిణామంగానే పరిగణిస్తారు. అమెరికా దృష్టిలో ఈ ఒప్పందం కేవలం అణు విద్యుత్ ప్రాజెక్టు కాదు. మధ్యప్రాచ్యంలో తన ప్రభావాన్ని కొనసాగించడం, సౌదీతో సంబంధాలను మరింత బలోపేతం చేయడం, చైనా వంటి దేశాల ప్రభావాన్ని పరిమితం చేయడం వంటి వ్యూహాత్మక లక్ష్యాలు కూడా ఇందులో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇక ఇజ్రాయెల్ మాత్రం భద్రతా కోణంలో ఈ పరిణామాన్ని చూస్తోంది. భవిష్యత్తులో సౌదీ అణు సామర్థ్యం ప్రాంతీయ శక్తి సమతుల్యతను మార్చే అవకాశం ఉందని ఆ దేశంలోని పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఒప్పందం ఇంకా పూర్తి స్థాయిలో అమల్లోకి రావాల్సి ఉంది. అమెరికా కాంగ్రెస్ పరిశీలన, అంతర్జాతీయ పర్యవేక్షణ, భద్రతా నిబంధనలు వంటి అనేక దశలు ముందున్నాయి. అయినప్పటికీ, ఈ పరిణామం ఒక విషయం స్పష్టం చేస్తోంది. -
అమెరికా-ఇజ్రాయెల్ కొత్త డీల్.. భారత్‌కు జాక్‌పాట్?
ప్రపంచ రాజకీయాల్లో, రక్షణ రంగంలో నిశ్శబ్దంగా జరిగిన ఒక పరిణామం ఇప్పుడు అంతర్జాతీయ చర్చకు దారి తీస్తోంది. అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించిన 2027 నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ (NDAA) సాధారణ రక్షణ బిల్లు మాత్రమే కాదు. రాబోయే దశాబ్దాల్లో ప్రపంచ శక్తి సమీకరణాలను ప్రభావితం చేసే కీలక అడుగుగా విశ్లేషకులు చూస్తున్నారు.చాలామంది అనుకుంటున్నట్లుగా ఇది అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాల విలీనం కాదు. యుద్ధభూమిలో రెండు దేశాల సైనికులు ఒకే కమాండ్ కింద పనిచేయబోరు. కానీ అంతకంటే శక్తివంతమైన అంశాన్ని ఈ బిల్లు లక్ష్యంగా పెట్టుకుంది. అదే రక్షణ సాంకేతిక ప్రపంచాన్ని ఒక్కటిగా మార్చడం. కృత్రిమ మేధస్సు, డ్రోన్ స్వార్మ్స్, సైబర్ వార్ఫేర్, క్వాంటమ్ టెక్నాలజీ, లేజర్ ఆయుధాలు, తదుపరి తరానికి చెందిన క్షిపణి రక్షణ వ్యవస్థలు.. ఇవన్నీ ఇక నుంచి అమెరికా, ఇజ్రాయెల్ కలిసి అభివృద్ధి చేయనున్నాయి. పరిశోధన నుంచి తయారీ వరకు, పరీక్షల నుంచి ఉత్పత్తి వరకు ఒకే రక్షణ ఆవిష్కరణ వ్యవస్థను నిర్మించేందుకు ఈ బిల్లు బాటలు వేస్తోంది.ఇటీవలి యుద్ధాల్లో ఇజ్రాయెల్ సాధించిన అనుభవం, చైనాతో పెరుగుతున్న సాంకేతిక పోటీ, భవిష్యత్తు యుద్ధాల్లో ఆధిపత్యం సాధించాలన్న అమెరికా వ్యూహం.. ఈ మూడు అంశాలే ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. అందుకే ఈ భాగస్వామ్యానికి వందల మిలియన్ డాలర్ల నిధులు కేటాయిస్తూ అమెరికా ముందడుగు వేసింది. సుమారు 750 మిలియన్ డాలర్ల నిధులను కేటాయించాలని ప్రతిపాదించారు. ఇందులో క్షిపణి రక్షణ, డ్రోన్ నిరోధక వ్యవస్థలు, సొరంగాల గుర్తింపు సాంకేతికతలు, కొత్త రక్షణ సాంకేతికతల అభివృద్ధికి నిధులు వినియోగించనున్నారు.భారత్ పేరు ఎందుకు వినిపిస్తోంది?ఈ పరిణామం భారత్‌కు కూడా కీలక అవకాశాలను తీసుకురాగలదని రక్షణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇజ్రాయెల్ ఇప్పటికే భారతదేశానికి ప్రధాన రక్షణ భాగస్వామిగా ఉంది. ఫాల్కన్ ఎయిర్‌బోర్న్ వార్నింగ్ వ్యవస్థలు, బరాక్ క్షిపణులు, హెరాన్ డ్రోన్లు, హారోప్ లోయిటరింగ్ మ్యూనిషన్స్, రాడార్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ పరికరాలు వంటి అనేక కీలక వ్యవస్థలను భారత్ ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసింది. మరోవైపు అమెరికాతో iCET, INDUS-X వంటి కార్యక్రమాల ద్వారా రక్షణ సాంకేతిక సహకారాన్ని భారత్ విస్తరిస్తుండగా, ఇజ్రాయెల్‌తో కూడా పరిశోధన, ఆవిష్కరణల కోసం ప్రత్యేక భాగస్వామ్య కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దీంతో అమెరికా, ఇజ్రాయెల్ రెండింటితోనూ ఆధునిక రక్షణ సాంకేతిక రంగంలో కలిసి పనిచేసే అరుదైన స్థానంలో భారత్ నిలిచింది.అయితే, ఇది అవకాశమే గానీ హామీ కాదు. అమెరికా ఎగుమతి నియంత్రణలు, మేధోసంపత్తి హక్కులు, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు ఈ మార్గంలో సవాళ్లుగా మారే అవకాశమూ ఉంది. అందుకే భారత్ విదేశీ భాగస్వామ్యాలపై మాత్రమే ఆధారపడకుండా, స్వదేశీ రక్షణ సాంకేతిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. -
ఇది చాల్లేదు.. ఇరాన్‌కు ఇంకా నొప్పి తెలియట్లేదు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఇరాన్ మౌలిక వసతులపై అమెరికా బలగాలు దాడులు కొనసాగిస్తుండగా.. ప్రతిగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ కౌంటర్ అటాక్‌లు జరుపుతోంది. మరోవైపు ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు కూడా రంగంలోకి దిగడంతో ఈ ఘర్షణ మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై మరింత కఠిన చర్యలకు దిగాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఇరాన్‌పై భారీ స్థాయి సైనిక చర్యను పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇప్పటికే జరుగుతున్న దాడులు సరిపోలేదని భావిస్తున్న ఆయన.. “ఇరాన్‌కు ఇంకా తగినంత నొప్పి తెలియలేదు” అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆక్సియోస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్‌పై గతంలో కంటే పెద్ద స్థాయిలో దాడి చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. “నేను భారీ దాడి గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పటివరకు జరిగిన వాటికంటే పెద్దదిగా ఉంటుంది. నిర్ణయం తీసుకునే దశకు చేరుకున్నాను” అని పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా అలజడి రేగింది. అయితే కొత్త దాడికి సంబంధించి అధ్యక్షుడు తుది నిర్ణయం తీసుకోలేదని అమెరికా అధికారులు వెల్లడించారు. ఎలాంటి కొత్త సైనిక ఆదేశాలు కూడా జారీ కాలేదని తెలిపారు.చర్చలకు ఇరాన్ సిద్ధంగా లేదు: ట్రంప్ఇరాన్ చర్చలకు ఆసక్తి చూపుతున్నప్పటికీ.. ఒప్పందానికి రావడానికి సిద్ధంగా లేదని ట్రంప్ ఆరోపించారు. “వారికి ఇంకా తగినంత నొప్పి తెలియలేదు” అని వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై ఒత్తిడి కొనసాగాల్సిన అవసరం ఉందని ఆయన సంకేతాలు ఇచ్చారు.13వ రోజూ అమెరికా దాడులుమరోవైపు ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యలు కొనసాగుతున్నాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకారం.. వరుసగా 13వ రాత్రి కూడా ఇరాన్ సైనిక లక్ష్యాలపై దాడులు జరిగాయి. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సామర్థ్యాన్ని తగ్గించడం, వాణిజ్య నౌకలపై ముప్పును అడ్డుకోవడమే తమ లక్ష్యమని అమెరికా చెబుతోంది.ఇజ్రాయెల్ మద్దతుపై ట్రంప్ వ్యాఖ్యలుఇటు.. ఇరాన్‌పై కొత్త ఆపరేషన్ జరిగితే ఇజ్రాయెల్ వెంటనే అమెరికాతో కలిసి వస్తుందని ట్రంప్ అన్నారు. “నేను అడిగితే ఇజ్రాయెల్ రెండు నిమిషాల్లో చేరుతుంది” అని వ్యాఖ్యానించారు. అయితే అమెరికా చర్యలకు ఇజ్రాయెల్ సహకారం తప్పనిసరి కాదని స్పష్టం చేశారు.హర్ముజ్ జలసంధిపై ఉత్కంఠఅమెరికా–ఇరాన్ ఘర్షణ ప్రభావం ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన హార్ముజ్ జలసంధిపై పడుతోంది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళనలు నెలకొన్నాయి. ఇరాన్ కూడా తనపై దాడులు కొనసాగితే ప్రాంతీయ చమురు, గ్యాస్ మౌలిక సదుపాయాలపై ప్రతీకారం ఉంటుందని హెచ్చరించింది.యుద్ధం విస్తరిస్తుందా?ఇరాన్‌కు మద్దతుగా ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో సౌదీ నౌకలపై దాడులు చేసినట్లు ప్రకటించారు. దీంతో మధ్యప్రాచ్య సంక్షోభం మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ట్రంప్ పన్నుల బాంబు .. 60 దేశాలకు చుక్కలే?
వాషింగ్టన్ డీసీ: డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రపంచానికి షాకిచ్చారు. ఉత్పత్తుల తయారీల వెట్టిచాకిరీ (ఫైర్డ్ లేబర్) అడ్డుకట్ట నిబంధనలను సరిగ్గా అమలు చేయడం లేదనే ఆరోపణలతో పన్నుల మోత మోగించారు. దాదాపు 60 భాగస్వామ్య దేశాలకు చెందిన వస్తువులపై దిగుమతి సుంకాలు పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు.డొనాల్ట్ ట్రంప్ మరోసారి పన్నుల యుద్ధం ప్రకటించారు. గతంలో విధించిన సుంకాల గడువు ముగుస్తుండడంతో వాటి స్థానంలో కొత్త సుంకాలను అమల్లోకి తెచ్చారు. ఈ నూతన పన్నులు 10 శాతం నుండి 12.5 శాతం వరకు ఉండనున్నాయి. ఈ పన్నులతో భారత్, చైనా, జపాన్, బ్రిటన్ యురోపియన్ యూనియన్ (EU) వంటి ప్రముఖ ఆర్థిక వ్యవస్థలపై ఈ ప్రభావం పడనుంది.ఈ విషయమై అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్ మాట్లాడుతూ "అమెరికాలో దాదాపు ఒక శతాబ్దం నుంచి వెట్టిచాకిరీ ద్వారా తయారయ్యే వస్తువుల దిగుమతిపై నిషేధం ఉంది. దానిని మేము కఠినంగా అమలు చేస్తున్నాం. మన వాణిజ్య భాగస్వామ్య దేశాలు కూడా అదే పని చేయాల్సిన సమయం వచ్చింది." అని అన్నారు.గత ఫిబ్రవరిలో ట్రంప్ విధించిన అనేక సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత ప్రత్యామ్నాయ అధికారాలను ఉపయోగించి 150 రోజుల పాటు విధించిన 10 శాతం తాత్కాలిక సుంకం గడువు తీరడంతో, 'ట్రేడ్ యాక్ట్ 1974 - సెక్షన్ 301' కింద నెలల తరబడి విచారణ జరిపి చట్టబద్ధంగా నిలిచేలా ఈ కొత్త సుంకాలను రూపొందించారు. ఏ దేశంపై ఎంత?10 శాతం సుంకం వెట్టిచాకిరీపై కఠిన చట్టాలను అమలు చేస్తున్న కెనడా, బ్రిటన్, యురోపియన్ యూనియన్ వంటి దేశాలకు తక్కువ రేటైన 10% సుంకం వర్తిస్తుంది. 12.5 శాతం సుంకం: వెట్టిచాకిరీ నిరోధంలో తగిన చర్యలు తీసుకోలేదని అమెరికా భావించిన చైనా, జపాన్ వంటి భాగస్వామ్య దేశాలపై 12.5% సుంకం పడనుంది. కాగా ఉక్కు, అల్యూమినియం వంటి ఇదివరకే ప్రత్యేక రక్షణ సుంకాలు ఉన్న రంగాలకు, అలాగే 'యుఎస్-మెక్సికో-కెనడా ఉచిత వాణిజ్య ఒప్పందం కింద అమెరికాలోకి వచ్చే వస్తువులకు ఈ కొత్త సుంకాల నుంచి మినహాయింపు లభించింది. -
సౌదీలో ‘అణు’కుంపటి
అందరి సలహాలూ బేఖాతరు చేసి ఇరాన్‌పై యుద్ధ భేరి మోగించి పశ్చిమాసియాను అగ్నిగుండంగా మార్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్... ఇప్పుడు మరో ప్రమాదకర క్రీడకు సిద్ధపడ్డారు. సౌదీ అరేబియాతో తమకు ‘శాంతియుత అణు సహకార ఒప్పందం’ కుదిరిందంటూ అమెరికా ఇంధన శాఖ విడుదల చేసిన తాజా ప్రకటన ప్రకంపనలు రేపుతోంది. తన నిర్ణయం పర్యవసానాలూ, పరిణామాల గురించి పూర్తిగా తెలిసే ట్రంప్ ఇందుకు సిద్ధపడ్డారా అనే సందేహం అందరిలో తలెత్తుతోంది. ఇది పశ్చిమాసియా అమరికను సంపూర్ణంగా మార్చే... ఇప్పటికే సాగుతున్న ఆయుధ పోటీని మరింత పెంచే ప్రమాదకర నిర్ణయం. 30 యేళ్లపాటు కొనసాగే ఈ ఒప్పందం కింద యురేనియం శుద్ధికి అవసరమైన సామర్థ్యాన్ని సౌదీ సంతరించుకుంటుందని, అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ప్రమాణాలను సాధించటంతోపాటు ప్రాంతీయ భద్రతకూ, అమెరికా భద్రతకూ కూడా తోడ్పడుతుందని అమెరికా అంటోంది. రాగలకాలంలో దేశానికి ఇది వందలకోట్ల వాణిజ్యాన్ని తీసుకొస్తుందనీ... దేశ ఆర్థిక, వ్యూహాత్మక లక్ష్యాలు నెరవేరటానికి దోహదపడుతుందనీ కూడా చెప్పుకుంటోంది. ఒకపక్క తన చర్యల ద్వారా అణ్వాయుధ తయారీకి దోహదపడుతూ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధమే ధ్యేయమని చెప్పటం ఉత్త వంచన. ఈ అణు ఒప్పందం 2008లో మన్మోహన్ సింగ్ తొలి ఏలుబడిలో మన దేశంతో అమెరికా కుదుర్చుకున్న ‘123’ ఒప్పందమే కదా అనిపిస్తుంది. అగ్రరాజ్యాలతోపాటు మనతోసహా పలు దేశాల దగ్గర అణ్వాయుధాలున్నాయి. అదనంగా సౌదీ దగ్గర ఉంటే నష్టమేమిటన్న సందేహాలు కూడా కలుగుతాయి. పైగా ఇది పౌర అణు ఒప్పందమే అనిపిస్తుంది. కానీ తరచిచూస్తే ఇందులో లొసుగులు బయటపడతాయి. సౌదీ అణువిద్యుత్ ప్రాజెక్టులు స్థాపించుకోవటానికే ఇది ఉపయోగపడుతుందని అమెరికా వాదన. ప్రకృతిలో లభించే యురేనియంలోని రెండు ఐసోటోపుల్లో ఒకటైన యూ– 235 మాత్రమే అణు విచ్ఛేదనానికీ, గొలుసు చర్య జరిగి అపారమైన శక్తి విడుదలకూ తోడ్పడు తుంది. యురేనియంను 3 నుంచి 5 శాతంవరకూ శుద్ధి చేస్తే అణు విద్యుత్ ఉత్పాదన సాధ్యమవుతుంది. శుద్ధి 90 శాతానికి చేరితే అణుబాంబు తయారీకి ఉపయోగపడుతుంది. అయితే విద్యుదుత్పాదన తర్వాత వాడేసిన ఇంధనంతో ప్లూటోనియం తయారీ అవకాశం ఎప్పుడూ ఉంటుంది. దాన్ని నిరోధించేందుకే ‘గోల్డ్ స్టాండర్డ్’ పేరుతో అమెరికా కఠినమైన షరతు విధిస్తోంది. దాన్నుంచి సౌదీకి మినహాయింపు ఇవ్వటం పైనే అందరికీ ఆందోళన. ఆ షరతు ఉంటుందని తాజాగా అమెరికా ఇస్తున్న వివరణ నమ్మశక్యంగా లేదు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్పీటీ)పై ఇరాన్ సంతకం చేసినా, అణుబాంబు తయారీకి వ్యతిరేకంగా అక్కడ ఫత్వా అమల్లో ఉన్నా ఆ దేశం అణు బాంబుకు సిద్ధపడుతోందన్న సంశయాలు అమెరికాకూ, ఇజ్రాయెల్‌కూ ఉన్నాయి. తరచు ఇరాన్‌పై అమెరికా విరుచుకుపడటానికి కారణం అదే. ‘ఇరాన్ ఆ పని చేస్తే... మేం సైతం ఆ బాటలోనే వెళ్తాం’ అని సౌదీ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ గత కొన్నేళ్లుగా పదే పదే చెబుతున్నారు. అలాంటి దేశానికి మినహాయింపు ఇవ్వటమంటే బాహాటంగా దాన్ని అణ్వస్త్ర దేశంగా మారడానికి ప్రోత్సహించటమే అవుతుంది. అమెరికా మిత్రులు ఏం చేసుకున్నా మినహాయింపునిస్తాం... శత్రుదేశాలను మాత్రం నిరుత్సాహపరుస్తాం’ అనే నైజం అత్యంత ప్రమాదకరమైనది. ‘మనిషి అణుబాంబును కనిపెట్టాడు. కానీ ప్రపంచంలో ఏ ఎలుకా ఎలుకలబోను తయారుచేసుకోదు’ అని ఐన్‌స్టీన్ చేసిన వ్యాఖ్య ఆంతర్యం స్పష్టమే. ఇది స్వీయ హననానికి దారితీసే తెలివిమాలిన చర్య. భవిష్యత్తులో అణుశక్తి దేశంగా మారాక సౌదీ, అమెరికా చెప్పుచేతల్లో ఉండదు. తాము చేస్తే తప్పేమిటని ఇరాన్ సైతం ఆ బాట పడుతుంది. చిన్న నిప్పురవ్వ కూడా ఆ ప్రాంతాన్ని ఇప్పుడే భగ్గున మండిస్తుంటే ఇక అణ్వాయుధాలుంటే చెప్పేదేముంది? ఇప్పటికే ఇజ్రాయెల్ స్వీయరక్షణకంటూ అమెరికా దానికి అణ్వాయుధాలు సరఫరా చేసింది. దాని రక్షణ పేరుచెప్పే తరచు ఇరాన్‌పై దాడులు చేస్తోంది. నిజానికి స్వతంత్ర పాలస్తీనా ఆవిర్భవిస్తే ఇజ్రాయెల్‌కు ఇలాంటి రక్షణల అవసరమే ఉండదు. దాన్ని సాకారం చేయకుండా ఈ ప్రాంతాన్ని అణ్వస్త్రాల మయం చేయటం క్షమించరాని నేరం. -
ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్.. ఇకపై హర్మూజ్ లో ఒక్క నౌకపై దాడి చేసినా
-
మార్కెట్‌కు చమురు సెగ
ముంబై: ముడిచమురు ధరలు పరుగులు తీయడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా సుంకాల హెచ్చరికలతో దేశీయ స్టాక్ మార్కెట్ మూడో రోజూ నష్టపోయింది. బ్యాంకు షేర్లలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో బుధవారం సెన్సెక్స్ 715 పాయింట్లు కోల్పోయి 76,755 వద్ద నిలిచింది. నిఫ్టీ 191 పాయింట్లు పతనమై 24,000 స్థాయి దిగువన 23,996 వద్ద స్థిరపడింది. దలాల్ స్ట్రీట్ ఒక శాతం పతనంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4.25 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. మొత్తం మార్కెట్ క్యాప్ రూ.480 లక్షల కోట్లకు దిగివచ్చింది. రోజంతా నష్టాల్లోనే అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల ప్రభావంతో సూచీలు ఉదయమే బలహీనంగా ప్రారంభమయ్యాయి. ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. సూచీలు ఏ దశలో కోలుకోలేక, రోజంతా నష్టాల్లో ట్రేడయ్యాయి. ఒకానొక దశలోనూ సెన్సెక్స్ 829 పాయింట్లు క్షీణించి 76,641 వద్ద, నిఫ్టీ 226 పాయింట్లు కుప్పకూలి 23,961 వద్ద ఇంట్రాడే కనిష్టాలు నమోదు చేశాయి. నష్టాలు ఎందుకంటే ఎర్రసముద్రంలో సౌదీ చమురు ట్యాంకర్లపై హౌతీల ముప్పు తీవ్రమవడం, హార్మూజ్ జలసంధిలో సరఫరా అడ్డంకులు తలెత్తడంతో ముడిచమురు (బ్రెంట్ క్రూడ్) ధర బ్యారెల్‌కు 92 డాలర్లపైకి చేరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జెనరిక్ మందుల దిగుమతులపై దశలవారీగా 200% వరకు సుంకాలు (టారిఫ్‌లు) విధిస్తామని ప్రకటించారు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించకపోగా, ఈ ఏడాది పెంచే అవకాశం ఉందన్న అంచనాలు బలపడ్డాయి. పదేళ్ల కాలపరిమితి కలిగి బాండ్లపై రాబడులు 4.63 శాతానికి పెరిగాయి. గత నాలుగు రోజులుగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) రూ. 6,000 కోట్లకు పైగా విలువైన భారతీయ షేర్లను విక్రయించారు. ఈ పరిణామాలన్నీ, దేశీయ స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ఒత్తిడి పెంచాయి.28 పైసలు తగ్గిన రూపాయిడాలర్ మారకంలో రూపాయి విలువ 28 పైసలు బలహీనపడి 96.53 వద్ద స్థిరపడింది. ముడిచమురు ధరలు అనూహ్యంగా పెరగడం, భౌగోళిక రాజకీయ అనిశ్చితి అధికమవడం రూపాయిపై తీవ్ర ఒత్తిడి పెంచాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకునేందుకు వెనుకాడారు. దేశీయ ఈక్విటీ మార్కెట్ల పతనం సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీశాయి. ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 96.36 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 96.25 – 96.60 పరిధిలో ట్రేడైంది. ట్రంప్ సుంకాల హెచ్చరికలపై మళ్లీ నెలకొన్న ఆందోళనలు కూడా ఫారెక్స్ ట్రేడర్ల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. ఫార్మా షేర్లకు ‘సుంకాల’ భయాలుఅమెరికాకు ఎగుమతి అయ్యే జెనరిక్ ఔషధాలపై దిగుమతి సుంకాలను (టారిఫ్) విధిస్తామంటూ యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో భారతీయ ఫార్మా కంపెనీల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ‘‘ఫార్మా కంపెనీలు అమెరికాలోనే స్వదేశీ తయారీ యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు రెండేళ్ల గడువు ఇస్తున్నాం. 2026 ఆగస్టు 1 నుంచి రెండేళ్ల పాటు సున్నా శాతం సుంకాన్ని కొనసాగిస్తాం. ఆ తర్వాత ఒక ఏడాది పాటు (2028 ఆగస్టు నుంచి) 100 శాతం, ఆపై (2029 ఆగస్టు నుంచి) 200 శాతం చొప్పున దిగుమతి సుంకాలు ఉంటాయి’’ అని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాకు అత్యధికంగా జెనరిక్ మందులను ఎగుమతి చేసే దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. దీంతో ఫార్మా కంపెనీల మార్జిన్లు, ఎగుమతి ఆదాయాలపై తీవ్ర ప్రభావం చూపొచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. బీఎస్ఈలో లుపిన్ షేరు అత్యధికంగా 4.21 శాతం పతనమైంది. అరబిందో ఫార్మా (1.99%), డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ (1.95%), గ్లెన్‌మార్క్ (1.49%), ఆల్కెమ్ ల్యాబ్స్ (1.43%), సిప్లా (1.08%), సన్ ఫార్మా (0.98%), బయోకాన్ (0.57%) షేర్లు నష్టాల్లో ముగిశాయి. హెచ్డీఎఫ్సీ మార్కెట్ క్యాప్ లక్ష కోట్లు ఆవిరిహెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లో ముగిసింది. బీఎస్ఈలో ఈ షేరు ఒక శాతానికి పైగా నష్టపోయి రూ.753.15 వద్ద స్థిరపడింది. ఒక దశలో 1.50 శాతం పతనమై రూ.750.25 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు జూన్ త్రైమాసికంలో ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడం, నికర వడ్డీ మార్జిన్ల తగ్గదలతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు రేకెత్తించాయి. ముఖ్యంగా, మార్జిన్ ఒత్తిళ్ల కారణంగా గడిచిన మూడు ట్రేడింగ్ సెషన్లలో ఈ షేరు ఏకంగా 8.11% మేర పతనమైంది. ఈ ఊహించని పతనంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. లక్ష కోట్లు ఆవిరై, రూ. 11.59 లక్షల కోట్లకు దిగివచ్చింది. -
అణు కేంద్రంపై బాంబులేస్తాం
వాషింగ్టన్/దుబాయ్: ఇరాన్ అణ్వాయుధ ఆశను శాశ్వతంగా చెదరగొట్టేందుకు ఎంతకైనా తెగిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దక్షిణ ఇరాన్‌లోని నటాంజ్ అణు శుద్ధి కర్మాగారం సమీపంలో పర్వతం అడుగున నిర్మాణ దశలో ఉన్న ‘పిక్‌యాక్స్ మౌంటేన్’అణుకేంద్రంపై దాడులు చేయాలని భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. మంగళవారం శ్వేతసౌధంలో మీడియాతో ట్రంప్ మాట్లాడారు. 2025లో 12 రోజులపాటు ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ బాంబులేశాయి. కానీ పిక్‌యాక్స్ పర్వత ప్రాంతం జోలికి పోలేదు. ఇప్పుడు ఆ ప్రాంతం పని పడతామని ట్రంప్ వెల్లడించారు. హార్మూజ్‌లో స్వేచ్ఛాయానం చేసే నౌకలపై ఇరాన్ దాడి చేసినప్పుడల్లా ఆ దేశంలోని ఒక విద్యుత్‌ఉత్పత్తి కేంద్రం లేదా ఒక వంతెనను నేలమట్టంచేస్తానని ట్రంప్ హెచ్చరించారు. ‘‘ఇరాన్ క్షిపణి, రాకెట్, డ్రోన్ మరేదైనా ఆయుధ వ్యవస్థను ప్రయోగిస్తే ఒక్కో దాడికి అమెరికా బదులుతీర్చుకుంటుంది. ఇరాన్ దాడిచేస్తే ప్రతిసారీ ఒక పవర్ ప్లాంట్ లేదా బ్రిడ్జిని బద్దలుకొడతాం’’అని ట్రంప్ ‘ట్రూత్‌సోషల్’లో ఒక పోస్ట్‌పెట్టారు. హెచ్చరికలతోడు అమెరికా వైమానిక దళా లు మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉద యం దాకా ఇరాన్‌లోని పలు ప్రాంతాలపై దాడు లు చేశాయి. ఈ దాడులను ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్జీసీ)లోని గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకునే ప్రయత్నంచేశాయి. దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌లోని ఏలాట్ నగర శివారు ప్రాంతం అఖాబాపై దాడులు చేసింది. -
ఫిఫా అధ్యక్షుడికి ఐరాస అత్యున్నత పదవి..?
2026 ఫిఫా ప్రపంచకప్ విజయవంతంగా ముగిసిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినోపై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఒక్కతాటిపైకి తీసుకురాగల నాయకత్వ లక్షణాలు ఇన్ఫాంటినోకు ఉన్నాయని ప్రశంసిస్తూ, ఆయన ఐక్యరాజ్యసమితి (UN) తదుపరి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాలని ట్రంప్ కోరుకుంటున్నట్లు నివేదికలు వెల్లడించాయి.అయితే, ట్రంప్ వ్యాఖ్యలు చేసినంత మాత్రాన ఇన్ఫాంటినో యూఎన్ ప్రధాన కార్యదర్శి కాలేరు. ఆ పదవికి ఎంపిక కావాలంటే ముందుగా 15 సభ్య దేశాలున్న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UN Security Council) మద్దతు అవసరం. ఐదు శాశ్వత సభ్య దేశాల్లో (అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా) ఏ ఒక్క దేశం వీటో విధించినా అభ్యర్థిత్వం నిలిచిపోతుంది.భద్రతా మండలి ఆమోదం లభించిన తర్వాతే అభ్యర్థి పేరును యూఎన్ సర్వసభ్య సమావేశం (General Assembly) తుది ఆమోదానికి పంపుతుంది. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ పదవీకాలం ఈ ఏడాది డిసెంబరుతో ముగియనుండటంతో, కొత్త ప్రధాన కార్యదర్శి ఎంపిక ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది.ఇప్పటివరకు జియానీ ఇన్ఫాంటినో ఈ పదవికి పోటీ చేయాలనే ఆసక్తి వ్యక్తం చేసినట్లు లేదా ట్రంప్‌తో అధికారికంగా చర్చలు జరిపినట్లు ఎలాంటి నిర్ధారణ లేదు.ఇక యూఎన్ ప్రధాన కార్యదర్శి రేసులో చిలీ మాజీ అధ్యక్షురాలు మిచెల్ బాచెలెట్, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రోస్సీ పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి.కాగా, ప్రపంచకప్ విజయవంతంగా నిర్వహించిన తర్వాత భవిష్యత్తులో మరోసారి టోర్నీని అమెరికాలో నిర్వహించాలని ట్రంప్ ఫిఫాను కోరనున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల కిందట ముగిసిన ఫైనల్లో అర్జెంటీనాపై గెలిచి స్పెయిన్ ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. విజేతకు ట్రంప్ చేతుల మీదుగా ట్రోఫీని బహుకరించారు. ఈ టోర్నీని అమెరికా,కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా నిర్వహించాయి. -
ఇరాన్ కు ట్రంప్ స్టాంగ్ వార్నింగ్
-
భారత్ ‘ఫార్మా’కు ట్రంప్ భారీ షాక్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాకు దిగుమతి అయ్యే జనరిక్ ఔషధాలపై భారీ టారిఫ్‌లు విధించనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం ద్వారా ఔషధ తయారీని తిరిగి అమెరికాలోనే ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కొత్త విధానం భారత ఔషధ పరిశ్రమపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.ట్రంప్ సోషల్ మీడియా వేదిక ట్రూత్ వేదికగా చేసిన పోస్టులో.. రానున్న ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని జనరిక్ ఔషధాలపై రెండేళ్ల పాటు సున్నా శాతం టారిఫ్ కొనసాగుతుందని తెలిపారు. ఆ గడువు ముగిసిన తర్వాత ఒక సంవత్సరం పాటు 100 శాతం టారిఫ్, ఆ తర్వాత 200 శాతం టారిఫ్ అమల్లోకి వస్తుందని వెల్లడించారు. అమెరికాలోనే జనరిక్ ఔషధాల తయారీని పెంచేందుకు, విదేశీ కంపెనీలు అక్కడ ప్లాంట్లు, తయారీ సదుపాయాలు ఏర్పాటు చేయాలని ప్రోత్సహించడమే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశమని పేర్కొన్నారు. నిర్ణయించిన గడువులోగా అమెరికాలో ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయని కంపెనీలపై ఈ టారిఫ్‌లు ఒక విధమైన జరిమానాగా పనిచేస్తాయని ట్రంప్ చెప్పారు.అమెరికా ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకే ఈ విధానాన్ని తీసుకొస్తున్నామని ఆయన తెలిపారు. పేటెంట్ ఉన్న బ్రాండెడ్ లేదా ఇన్నోవేటివ్ ఔషధాలపై ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం యథాతథంగా కొనసాగుతుందని కూడా స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో భారత ఔషధ పరిశ్రమలో ఆందోళన నెలకొనే అవకాశం ఉంది. ప్రపంచానికి తక్కువ ధరలో నాణ్యమైన జనరిక్ మందులను సరఫరా చేస్తున్నందుకు భారత్‌ను ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్‌గా పిలుస్తారు. ముఖ్యంగా భారత ఔషధ ఎగుమతులకు అమెరికా అతిపెద్ద మార్కెట్‌గా ఉంది.గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) నివేదిక ప్రకారం, 2025లో భారత్ అమెరికాకు 9.7 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలను ఎగుమతి చేసింది. ఇది భారత్ మొత్తం ఔషధ ఎగుమతులైన 25.8 బిలియన్ డాలర్లలో 38 శాతానికి సమానం. రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, అంటువ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలకు అమెరికాలో విస్తృతంగా ఉపయోగించే జనరిక్ మందుల్లో భారత కంపెనీల వాటా కీలకంగా ఉంది.ట్రంప్ ప్రకటించిన విధానం అమల్లోకి వస్తే, అమెరికాకు ఎగుమతులు చేసే భారత ఫార్మా కంపెనీలు అక్కడే తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. లేకపోతే భారీ టారిఫ్‌ల కారణంగా అమెరికా మార్కెట్లో తమ ఉత్పత్తుల ధరలు పెరగడంతో పాటు పోటీ సామర్థ్యం కూడా తగ్గే అవకాశం ఉంది. మరోవైపు, అమెరికాలో తయారీని విస్తరించే కంపెనీలకు మాత్రం దీర్ఘకాలంలో ప్రయోజనం కలగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ విధానం తుది రూపంలో ఎలా అమలవుతుంది, ఎలాంటి మినహాయింపులు ఉంటాయి, అంతర్జాతీయ ఔషధ కంపెనీలు ఎలా స్పందిస్తాయి అనే అంశాలపై దీని వాస్తవ ప్రభావం ఆధారపడి ఉంటుంది. -
ట్రంప్ నిర్ణయంతో మిడిల్ ఈస్ట్‌లో కొత్త టెన్షన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సౌదీ అరేబియాతో న్యూక్లియర్ డీల్‌కు ఆమోదం తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా సౌదీ తన భూభాగంలోనే యురేనియం శుద్ధి (ఎన్రిచ్మెంట్) చేపట్టే అవకాశం లభించనుంది. అయితే గతంలో అమెరికా కుదుర్చుకున్న అణు ఒప్పందాలతో పోలిస్తే.. సౌదీ డీల్‌లో కీలక భద్రతా నిబంధనలు లేకపోవడంపై అంతర్జాతీయంగా కలకలం రేగింది.ట్రంప్ ప్రభుత్వం ఆమోదించిన ఈ ఒప్పందం దాదాపు 30 ఏళ్ల పాటు కొనసాగనున్నట్లు సమాచారం. దీని విలువ పదుల బిలియన్ల డాలర్లుగా ఉండనుంది. ఈ ఒప్పందం అమలైతే సౌదీ అరేబియాలో పౌర అణు విద్యుత్ కార్యక్రమాల నిర్మాణంలో అమెరికా కంపెనీలు కీలక పాత్ర పోషించనున్నాయి. ఇతర దేశాల కంపెనీలకు అవకాశాలు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. అణు ఇంధన రంగంలో అమెరికా ఆధిపత్యాన్ని పెంచే వ్యూహంలో భాగంగానే ఈ ఒప్పందాన్ని చూస్తున్నారు.సంప్రదాయ భద్రతా నిబంధనలు లేవా?అమెరికా గతంలో కుదుర్చుకున్న అణు ఒప్పందాల్లో.. అణు సాంకేతికత దుర్వినియోగం కాకుండా కఠినమైన నిబంధనలు ఉండేవి. కానీ సౌదీతో కుదుర్చుకున్న తాజా ఒప్పందంలో అలాంటి కొన్ని కీలక రక్షణ చర్యలు లేకపోవడం చర్చకు దారితీసింది. ముఖ్యంగా యురేనియం ఎన్రిచ్మెంట్ అనుమతి ఇవ్వడం భవిష్యత్ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.వైట్‌హౌస్‌లో కీలక భేటీ తర్వాత నిర్ణయంఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో వైట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం అణు ఒప్పందంపై ముందడుగు పడింది. ఈ ఒప్పందానికి సంబంధించిన ప్యాకేజీని త్వరలోనే అమెరికా కాంగ్రెస్ పరిశీలనకు పంపనున్నట్లు సమాచారం.‘123 అగ్రిమెంట్’లో భాగంగా..అమెరికా విదేశీ దేశాలతో అణు సహకారం కోసం రూపొందించే ప్రత్యేక ఒప్పందాన్ని సాధారణంగా ‘123 Agreement’ అని పిలుస్తారు. తాజా ఒప్పందంలో భాగంగా అమెరికా ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్, సౌదీ ఇంధన మంత్రి ప్రిన్స్ అబ్దుల్అజీజ్ బిన్ సల్మాన్ సంతకాలు చేసినట్లు సమాచారం.మిడిల్ ఈస్ట్‌లో కొత్త అణు సమీకరణాలు?చమురు సంపదతో ప్రపంచంలో కీలక శక్తిగా ఉన్న సౌదీ.. ఇప్పుడు అణు ఇంధన రంగంలో అడుగులు వేయడం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. అమెరికా-సౌదీ అణు ఒప్పందం మిడిల్ ఈస్ట్ వ్యూహాత్మక సమీకరణాలను మార్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇరాన్ అణు కార్యక్రమం నేపథ్యంలో ఈ ఒప్పందం ప్రాధాన్యత సంతరించుకుంది. -
కెనడాపై ట్రంప్ టారిఫ్ కొరడా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పొరుగు దేశం కెనెడాపై మరోసారి టారిఫ్‌ల కొరడా ఝళిపించారు. అమెరికాలో తయారయ్యే వాహనాలు, మద్యం, పాల ఉత్పత్తులపై కెనెడా వివక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఆ దేశపు దిగుమతులు అత్యధికంపై యాభై శాతం టారిఫ్ విధిస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. కొత్త పన్నులు మరో ముప్ఫై రోజుల్లో అమల్లోకి రానున్నాయి. ఈ పరిణామం కాస్తా ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న ఇరుదేశాల సంబంధాలను మరింత దిగజార్చడమే కాకుండా ఆర్థిక గందరగోళానికి దారితీస్తుందని అంచనా. రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ట్రంప్ పలు దేశాలపై టారిఫ్‌లతో విరుచుకుపడగా చైనా, కెనెడాలు మాత్రమే ప్రతీకార పన్నులను విధించిన విషయం తెలిసిందే.ఈ కారణంగానే కెనెడాకు బుద్ది చెప్పాలని ట్రంప్ తాజా టారిఫ్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా పేరు చెప్పేందుకు ఇష్టపడని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. టారిఫ్‌లను ప్రకటిస్తూ ట్రంప్ మూడు ఉత్తర్వులపై సంతకాలు చేశారని, అది కూడా 1930 నాటి వాణిజ్య చట్టంలోని వివాదాస్పద సెక్షన్ 338 కింద ఉత్తర్వులు వెలువడ్డాయని ఆ అధికారి తెలిపారు. ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచేందుకు ట్రంప్ వాడే అవకాశం ఉన్నందున ఈ సెక్షన్‌ను రద్దు చేయాలని డెమోక్రాటిక్ పార్టీ ప్రతినిధులు ఏడాదిగా కోరుతున్నారు. ట్రంప్ కొత్తగా విధించిన టారిఫ్‌ల నుంచి ఇంధన ఉత్పత్తులు, పొటాష్, చేపలు, కొన్ని కీలకమైన ఖనిజాలకు మాత్రమే మినహాయింపు ఉంది.దిగుమతి పన్నుల విషయమై జరిగిన యునైటెడ్ స్టేట్స్–మెక్సికో–కెనెడా ఒప్పందంలో రక్షణ కల్పించిన వస్తువులకు కొత్త టారిఫ్‌లు వర్తిస్తాయని అమెరికా చెబుతోంది. అయితే ఈ ఒప్పందం 2020లోనే ముగియడం తదుపరి పునరుద్ధరించకపోవడంతో పరిస్థితి గందరగోళంగా ఉంది. తాజా టారిఫ్‌లపై కెనెడా ఇప్పటివరకూ స్పందించలేదు కానీ... ఒంటారియో అధ్యక్షుడు డగ్ ఫోర్డ్ మాత్రం ఈ నిర్ణయం కాస్తా వాణిజ్య పోరుకు దారితీసే అవకాశముందని వ్యాఖ్యానించారు.ప్రతి అదనపు టారిఫ్‌కు కెనెడా దీటుగా ప్రతి టారిఫ్‌లు విధిస్తుందని ఫోర్డ్ తన సోషల్‌మీడియా పోస్టులో తెలిపారు. కెనెడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ సీఈఓ కాన్డేస్ లియాంగ్ కూడా ట్రంప్ నిర్ణయం దురదృష్టకరమని చెబుతూ కొత్త టారిఫ్‌లు అమల్లోకి వచ్చేందుకు 30 రోజుల గడువు ఉన్నందున ఏమైనా జరగవచ్చునని అన్నారు. మరోవైపు కెనెడాపై విధించిన తాజా టారిఫ్‌లు అంతార్జతీయంగానూ ఆర్థిక అస్థిరతకు దారితీయవచ్చునని కాటో ఇన్స్టిట్యూట్కు చెందిన స్కాట్ లిన్సికోమ్ ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ ముందు బోలెడన్ని రిస్‌్కలు కెనెడాపై విధించిన తాజా టారిఫ్‌లు రాజకీయంగా, ఆర్థికంగానూ ట్రంప్‌కు ఇబ్బందికరమైన పరిస్థితులను కల్పించవచ్చునని పరిశీలకుల అంచనా. నవంబరులో మధ్యంతర ఎన్నికలు జరుగుతూండటం ఒక కారణం. గత ఏడాది లిబరేషన్ డే సందర్భంగా విధించిన పన్నులు స్టాక్మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయి. ద్రవ్యోల్బణం, ఆర్థిక మందగమనంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో ట్రంప్ టారిఫ్‌లపై వెనక్కు తగ్గారు. ఈ సారి ఏం చేస్తారన్నది వేచి చూడాల్సిందే. -
లెబనాన్‌కు ఇతోధిక సాయమందిస్తాం
వాషింగ్టన్: లెబనాన్‌కు తాము అవసరమైన మేర సాయం అందిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మంగళవారం వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు జోసెఫ్‌తో సమావేశం అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఇజ్రాయెల్, ఇరాన్ అనుకూల హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపునకు మధ్య అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో లెబనాన్‌లో శాంతి నెలకొంది. ఇవే పరిస్థితులను కొనసాగేలా చూడాలని, ఇజ్రాయెల్ బలగాలు ఆక్రమించుకున్న భూభాగాలను తిరిగి తమ మిలటరీకి అప్పగించాలని జోసెఫ్ అమెరికా ప్రభుత్వాన్ని కోరుతున్నారు.‘లెబనాన్ తీవ్ర నిర్లక్ష్యానికి గురైన దేశం. తగిన గౌరవం కల్పించేందుకు చర్యలు తీసుకోబోతున్నాం. ఆ దేశానికి ఎంతగానో సాయం అందజేబోతున్నాం’అని తెలిపారు. ‘లెబనాన్‌లో శాంతి కోసం కృషి చేస్తున్నాం. అయితే, ఇరాన్‌తో యుద్ధం తీవ్రతరం కావడంతో మా దృష్టంతా అటువైపు ఉంది. ఇరాన్ యుద్ధం పశ్చిమాసియాలో అస్థిరతను సృష్టించింది. యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ నాయకుడితో చర్చలపై నాకు పెద్దగా ఆసక్తి లేదు’అని ట్రంప్ అన్నారు. కాగా, 2009 తర్వాత లెబనాన్ అధ్యక్షుడు వైట్ హౌస్‌ను సందర్శించడం ఇదే మొదటిసారి. -
ఇరాన్ దెబ్బకు అమెరికా విలవిల
-
భారతీయులకు ట్రంప్ బిగ్ షాక్.. ఇక అమెరికా ఆశలు గల్లంతే
-
ఓడరేవులే టార్గెట్ గా అమెరికా భీకర దాడులు
-
నెతన్యాహుకు ట్రంప్ కవచం.. అమెరికా గడ్డపై అది అసాధ్యం!
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ‘అరెస్ట్ వ్యవహారం’ అమెరికాలో ఈసారికి రాజకీయ దుమారం రేపుతోంది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ నేపథ్యంలో.. న్యూయార్క్ పర్యటనకు వస్తే నెతన్యాహును అరెస్ట్ చేసే అవకాశం ఉందని నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలకు స్వయానా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి కౌంటర్ ఇచ్చారు.‘‘బెంజమిన్ నెతన్యాహు అమెరికాలో ఎక్కడా, ఎప్పుడూ అరెస్ట్ కాబోరు’’ అంటూ ట్రంప్ స్పష్టం చేశారు. సెప్టెంబర్‌లో ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశాల కోసం నెతన్యాహు న్యూయార్క్‌కు వచ్చే అవకాశం ఉండటంతో ఈ అంశం తెరపైకి వచ్చింది.‘అరెస్ట్ చేయాలనే ప్రశ్నే లేదు’.. ట్రంప్ స్పష్టంనెతన్యాహు అమెరికా పర్యటనపై చర్చ జరుగుతున్న వేళ.. ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అమెరికా భూభాగంలో ఇజ్రాయెల్ ప్రధానిని అరెస్ట్ చేసే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదని పేర్కొన్నారు. ఇటీవల ఇరాన్‌తో జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ పాత్రను కూడా ట్రంప్ ప్రశంసించారు. అయితే న్యూయార్క్ మేయర్ మమ్దానీ పేరును నేరుగా ప్రస్తావించకపోయినా.. ఆయన వ్యాఖ్యలకు సమాధానంగానే ట్రంప్ ప్రకటన వెలువడినట్లు భావిస్తున్నారు.మమ్దానీ వ్యాఖ్యలతో మొదలైన వివాదంన్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నెతన్యాహు నగరానికి వస్తే చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో పరిశీలిస్తున్నామని తెలిపారు. ‘‘నెతన్యాహు ది హేగ్‌లో ఉండాల్సిన వ్యక్తి’’ అని వ్యాఖ్యానించిన ఆయన.. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ఆయనపై వారెంట్ జారీ చేసిందని గుర్తుచేశారు. అయితే అదే సమయంలో చట్టాలకు లోబడే తాము పనిచేస్తామని కూడా మమ్దానీ స్పష్టం చేశారు. రాజకీయ అభిప్రాయాల ఆధారంగా కాకుండా.. న్యూయార్క్ చట్టాలు, అమెరికా నిబంధనల ప్రకారమే నిర్ణయం ఉంటుందని తెలిపారు.ఐసీసీ వారెంట్ చుట్టూ వివాదంగాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలకు సంబంధించి ఆరోపణలపై 2024లో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే ఇజ్రాయెల్ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. ఐసీసీకి తమపై అధికార పరిధి లేదని పేర్కొంది. ఇదిలా ఉండగా.. అమెరికా, ఇజ్రాయెల్ రెండూ ఐసీసీని ఏర్పాటు చేసిన రోమ్ ఒప్పందంలో భాగస్వాములు కావు. దీంతో ఐసీసీ వారెంట్లను అమలు చేయాల్సిన చట్టపరమైన బాధ్యత అమెరికాకు లేదని నిపుణులు చెబుతున్నారు.ఇజ్రాయెల్ ఆగ్రహంమమ్దానీ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ కూడా తీవ్రంగా స్పందించింది. ఐసీసీని ‘నకిలీ న్యాయస్థానం’గా అభివర్ణిస్తూ.. నెతన్యాహుపై జారీ చేసిన వారెంట్ అసంబద్ధమని పేర్కొంది. మమ్దానీ దేశీయ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఇజ్రాయెల్ ఆరోపించింది.సెప్టెంబర్ పర్యటనపై ఉత్కంఠప్రతి ఏడాది సెప్టెంబర్‌లో జరిగే ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశాలకు ప్రపంచ దేశాల నేతలు న్యూయార్క్‌కు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో నెతన్యాహు గత రెండేళ్ల పర్యటనల సందర్భంగా.. ఇలాంటి చర్చే నడుస్తూ వస్తోంది. అరెస్ట్ భయంతోనే ఆయన ప్రత్యామ్నాయ మార్గాల్లో.. అతి గోప్యంగా న్యూయార్క్‌కు చేరుకుంటున్నారనే చర్చా జరుగుతోంది. అంతేకాదు.. ఐరాసలోనూ ఆయనకు ‘నిరసన గళం’తో చేదు అనుభవం ఎదురవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో.. మామ్దానీ కామెంట్ల నేపథ్యంలో ఈసారి పర్యటనపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఒకవైపు ఐసీసీ వారెంట్.. మరోవైపు అమెరికా రక్షణగా నిలవడం.. ఇంకోవైపు న్యూయార్క్ మేయర్ వ్యాఖ్యలు.. ఈ పరిణామాలతో నెతన్యాహు అమెరికా పర్యటన అంతర్జాతీయ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. -
స్పెయిన్ చేతిలో ట్రోఫీ.. ట్రంప్‌ను ఆటాడుకున్నారు!
ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్లో స్పెయిన్ చారిత్రక విజయం సాధించిన వేళ.. అసలు మ్యాచ్ కంటే ట్రోఫీ ప్రదానోత్సవమే ఎక్కువగా చర్చనీయాంశమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేదికపైకి రావడం, ఆ తర్వాత ట్రోఫీ లిఫ్ట్ సమయంలో అక్కడే నిలబడిపోవడం సోషల్ మీడియాలో సెటైర్లకు కారణమైంది.న్యూజెర్సీ: అర్జెంటీనాపై 1-0 తేడాతో విజయం సాధించి స్పెయిన్ రెండోసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. మ్యాచ్ అనంతరం న్యూయార్క్–న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ట్రోఫీ ప్రదానోత్సవానికి ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినోతో కలిసి ట్రంప్ మైదానంలోకి వచ్చారు. అయితే ట్రంప్ ఎంట్రీకి ప్రేక్షకుల్లోని ఓ వర్గం నుంచి భారీగా ‘బూస్’(నిరసన నినాదాలు) వినిపించాయి. కొద్దిసేపటికే ప్రేక్షకులు చల్లబడ్డా.. ఆ తర్వాత జరిగిన పరిణామం మాత్రం వైరల్‌గా మారింది.ట్రోఫీ ఇచ్చి అలాగే.. స్పెయిన్ కెప్టెన్ రోడ్రికి ట్రంప్ వరల్డ్‌కప్ ట్రోఫీ అందించారు. సాధారణంగా ట్రోఫీ అందుకున్న కెప్టెన్ తన జట్టుతో కలిసి దానిని ఎత్తి సంబరాలు చేసుకుంటాడు. అదే సమయంలో ట్రంప్ అక్కడి నుంచి తప్పుకోవాల్సి ఉండగా.. కొద్దిసేపు ఆటగాళ్ల మధ్యే నిలబడి ఉన్నారు. దీంతో అధికారులు సంకేతాలు ఇవ్వడంతో ట్రంప్ పక్కకు జరిగారు. ఆ తర్వాత రోడ్రి తన సహచరులతో కలిసి ప్రపంచకప్ ట్రోఫీని పైకెత్తి ఘనంగా సంబరాలు చేసుకున్నారు.President Donald J. Trump presents the World Cup Trophy to Spain, the 2026 @FIFAWorldCup Champions! 🏆 pic.twitter.com/SHsoBhYm1b— The White House (@WhiteHouse) July 19, 2026ఈ చిన్న ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి. ‘‘ట్రోఫీ ఇచ్చారు కానీ ఫోటోలో ఉండాలనుకున్నారు’’ అంటూ నెటిజన్లు సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు.క్లబ్ వరల్డ్‌కప్ ఘటన గుర్తొచ్చిందా?ఈ ఘటనపై గతంలో జరిగిన క్లబ్ వరల్డ్‌కప్ ఫైనల్ ట్రోఫీ వేడుకను కూడా పలువురు గుర్తు చేస్తున్నారు. అప్పట్లోనూ ట్రంప్ విజేత జట్టు ఆటగాళ్లతో కలిసి స్టేజ్‌పై ఎక్కువసేపు ఉండటంపై చర్చ జరిగింది. అయితే ఈసారి ఫిఫా ప్రోటోకాల్ ప్రకారం చివరకు ఆయన పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది.స్పెయిన్ చరిత్ర.. వేదికపై ట్రంప్ హైలైట్ఇక ఫైనల్ మ్యాచ్‌లో ఫెర్రాన్ టోరెస్ అదనపు సమయంలో చేసిన గోల్‌తో స్పెయిన్‌కు విజయం దక్కింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో అర్జెంటీనా ఆటగాడు ఎంజో ఫెర్నాండెజ్ రెడ్‌కార్డ్‌తో బయటకు వెళ్లడంతో ఆ జట్టు 10 మందితో మ్యాచ్‌ను ముగించింది. లియోనెల్ మెస్సీ వరుసగా రెండోసారి ప్రపంచకప్ గెలవాలన్న కల నెరవేరలేదు. స్పెయిన్ ఆటగాళ్లు చరిత్ర సృష్టించిన రాత్రి.. ట్రోఫీ వేడుకలో ట్రంప్ ఎపిసోడ్ కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. -
ఫ్యామిలీకి అదే చివరి కాల్ అనుకున్నా.. ఇరాన్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
టెహ్రాన్: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో శాంతి చర్చలు జరుపుతున్న సమయంలో ఇరాన్ ప్రతినిధులు తీవ్ర ప్రమాద పరిస్థితుల్లో పనిచేశారని ఆయన వెల్లడించారు. మేము ఎప్పుడు చనిపోతామో.. మాపై బాంబులు ఎప్పుడు వేస్తారోననే భయంతో వణికిపోయినట్టు చెప్పుకొచ్చారు.ఇరాన్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అరాఘ్చి మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యప్రాచ్య ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్తో జరిగిన సంభాషణను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన.. ‘చర్చలు జరుగుతున్న సమయంలో ఏ క్షణంలోనైనా సమావేశంపై బాంబు దాడి జరగొచ్చనే భయం ఉండేది. కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఇది చివరి సంభాషణ కావచ్చేమో అన్న ఆలోచన వచ్చేది’ అని తెలిపారు.అనంతరం.. అమెరికా, ఇజ్రాయెల్ నుంచి వస్తున్న ఒత్తిళ్లకు ఇరాన్ తలొగ్గలేదని ఆయన స్పష్టం చేశారు. అణు కార్యక్రమంలో యురేనియం ఎన్రిచ్మెంట్ను పూర్తిగా నిలిపివేయాలన్న డిమాండ్‌ను అంగీకరించలేదని, తమ హక్కుల విషయంలో వెనక్కి తగ్గబోమని పేర్కొన్నారు. ‘చర్చలు జరపాలి.. బెదిరింపులు లేదా ప్రలోభాలతో మమ్మల్ని మార్చలేరు’ అని అరాఘ్చి వ్యాఖ్యానించారు. చర్చల ద్వారా తమ లక్ష్యాలను సాధించలేమని భావించిన తర్వాతే అమెరికా యుద్ధ మార్గాన్ని ఎంచుకుందని ఆయన ఆరోపించారు. అమెరికా సైనిక ఒత్తిడితో ఇరాన్‌ను లొంగదీయవచ్చన్న వాదనలను కూడా అరాఘ్చి ఖండించారు. ‘ఇరాన్ వెనిజులా కాదు. ఒక నాయకుడిని తొలగిస్తే మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోదు. ఇరాన్లో అధికార వ్యవస్థ అనేక స్థాయిల్లో పనిచేస్తుంది’ అని ఆయన అన్నారు.ఇదిలా ఉండగా, అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఇరాన్‌పై వరుసగా తొమ్మిదో రోజు వైమానిక దాడులు కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులకు ఉపయోగిస్తున్న ఇరాన్ సైనిక సామర్థ్యాలను బలహీనపరచడమే తమ లక్ష్యమని అమెరికా తెలిపింది. మరోవైపు ఇరాన్ మీడియా ప్రకారం.. తబ్రిజ్, చాబహార్, కొనారక్, బందర్ మహ్షహర్ తదితర ప్రాంతాల్లో పేలుళ్లు జరిగినట్లు సమాచారం వెలువడింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కూడా సిరియాలోని అల్-తన్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా ప్రత్యేక ఆపరేషన్స్ కేంద్రంపై దాడి చేసినట్లు ప్రకటించింది. -
ఇరాన్ యుద్ధం తీవ్రరూపం.. భారత పౌరులకు కేంద్రం హెచ్చరిక
మధ్యప్రాచ్యంలో అమెరికా–ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు కొనసాగుతున్న వేళ, ఇరాక్‌లో జరిగిన ఓ ఆపరేషన్‌లో అమెరికా సైనికుడు మరణించగా, మరో సైనికుడు గాయపడ్డాడు. దీంతో, ఇరాన్‌పై దాడుల మరింత పెంచాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలిచ్చారు. ఇదే సమయంలో ఇరాన్‌కు ప్రయాణాలను నివారించాలని, ఇప్పటికే అక్కడ ఉన్న భారతీయులు భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దేశం విడిచి రావడాన్ని పరిశీలించాలని భారత్ సూచించింది.అమెరికా సైనికుడు మృతిఅమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకారం, ఉత్తర ఇరాక్‌లో కూలిపోయిన ఇరాన్‌కు చెందిన ఒక డ్రోన్లోని పేలని ఆయుధ భాగాలను నిర్వీర్యం చేసే సమయంలో అమెరికా సైనికుడు ప్రాణాలు కోల్పోగా, మరో సైనికుడు స్వల్పంగా గాయపడ్డాడు. జూలై 18న ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో సైనికుల వివరాలను వారి కుటుంబాలకు సమాచారం ఇచ్చిన తర్వాత వెల్లడిస్తామని CENTCOM తెలిపింది. ఈ తాజా మరణంతో గత దాదాపు ఐదు నెలలుగా కొనసాగుతున్న ఘర్షణల్లో మరణించిన అమెరికా సైనికుల సంఖ్య 17కు చేరింది.ఇరాన్‌పై వరుస దాడులుఉద్రికత్తల నేపథ్యంలో ఇరాన్‌పై అమెరికా మరోసారి వైమానిక దాడులు ప్రారంభించింది. ఇది వరుసగా తొమ్మిదో రాత్రి దాడులుగా CENTCOM పేర్కొంది. హర్మూజ్ జలసంధి ద్వారా ప్రయాణించే వాణిజ్య నౌకలు, పౌర నావికులపై దాడులకు ఉపయోగిస్తున్న ఇరాన్ సైనిక సామర్థ్యాలను బలహీనపరచడమే తమ లక్ష్యమని అమెరికా తెలిపింది. అయితే తాజా దాడుల్లో ఏ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నారో, ఎంత నష్టం జరిగిందో అమెరికా అధికారులు ఇంకా వెల్లడించలేదు. అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు అక్కడి మీడియా తెలిపింది.ఇరాన్ ప్రయాణంపై భారత్ కీలక సూచనపశ్చిమాసియా ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం భారత పౌరులకు ప్రయాణ సూచన జారీ చేసింది. ఇరాన్‌కు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని భారత్ కోరింది. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారతీయులు తమ భద్రతను దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా దేశం విడిచి వెళ్లే అవకాశాలను పరిశీలించాలని సూచించింది. ఇరాన్లో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక అధికారుల సూచనలు పాటించాలని, తాజా భద్రతా పరిస్థితులను గమనించాలని భారత రాయబార కార్యాలయం సూచించింది.బహ్రెయిన్‌లో అమెరికా పౌరులకు హెచ్చరికఇదే సమయంలో బహ్రెయిన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం కూడా భద్రతా హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్ నుంచి ముప్పు ఉందని సమాచారం అందినట్లు పేర్కొంది. అమెరికా పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. -
ట్రంప్ పోస్టులు ముందుగా చూడాలంటే రూ.85 లక్షలు ఇవ్వాలి..
వాషింగ్టన్: ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ ‘పెయిడ్ డేటా సర్వీస్ ప్లాన్’ను ప్రకటించింది. దీని ద్వారా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా ట్రూత్ సోషల్లోని ప్రముఖ ఖాతాల పోస్టులు అత్యంత వేగంగా అందుతాయి. ట్రూత్ ఏపీఐ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్.. ప్రభావం ఎక్కువగా చూపే 10 ఖాతాల కంటెంట్‌ను బ్యాంకులు, హెడ్జ్ ఫండ్లు, ట్రేడింగ్ సంస్థలకు సాధారణ యాప్ నోటిఫికేషన్ల కంటే వేగంగా అందిస్తుంది. ట్రూత్ ఏపీఐ సేవ ధర $60,000 నుంచి $100,000 మధ్య (సుమారు రూ.51 లక్షల నుంచి రూ.85 లక్షల మధ్య) ఉండొచ్చని సమాచారం.రాయిటర్స్ నివేదిక ప్రకారం.. కొన్ని సెకన్ల ఆలస్యం కూడా ఆర్థికంగా కొందరికి నష్టాలను తెచ్చిపెడుతుంది. అటువంటి ఖాతాదారులను దృష్టిలో పెట్టుకుని ఈ సర్వీస్ రూపొందించారు. తాజా సమాచారం వచ్చిన వెంటనే చర్యలు తీసుకునే ఆల్గోరిథమిక్ ట్రేడింగ్ సంస్థలు ఇందులో ఉన్నాయి. ఆల్గోరిథమిక్ ట్రేడింగ్ అంటే కంప్యూటర్ ప్రోగ్రామ్‌లు ముందే నిర్ణయించిన నియమాల ఆధారంగా ఆటోమేటిక్‌గా కొనుగోలు, అమ్మకాలు చేసే విధానం.ఇప్పటి వరకూ ఇలాంటి సంస్థలు ట్రూత్ సోషల్ను అందరిలాగే గమనించేవి లేదా ప్లాట్‌ఫాం నిబంధనలకు విరుద్ధంగా డేటాను సేకరించేవి. ట్రూత్ ఏపీఐ ఆ లోటును భర్తీ చేసే పరిష్కారంగా తీసుకొచ్చారు. సోషల్ మీడియా వ్యాపారానికి బయట కొత్త ఆదాయ మార్గాన్ని ఓపెన్ చేయాలనే లక్ష్యంతో డేటా లైసెన్సింగ్‌లో ట్రంప్ మీడియా వేసిన తొలి అధికారిక అడుగు ఇదే. ప్లాట్‌ఫాంలో వచ్చే పోస్టులకు మార్కెట్లు ఇప్పటికే స్పందిస్తున్నాయని, వేగంగా సమాచారం పొందాలనే డిమాండ్ పెరుగుతుందని తాత్కాలిక సీఈవో కెవిన్ మెక్‌గర్న్ తెలిపారు.ఇందుకే పోస్టులను వేగంగా చదవాలి ట్రంప్ పోస్టులు సుంకాల ప్రకటనల నుంచి చైనా వాణిజ్య విధానంపై వ్యాఖ్యల వరకు ఎన్నో సందర్భాల్లో మార్కెట్లపై ప్రభావం చూపించాయి. 2025 ఏప్రిల్ 9న కొత్త సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ఆయన పోస్టు చేసిన వెంటనే వాల్ స్ట్రీట్ సూచీలు భారీగా ఎగిశాయి.మార్కెట్ వర్గాలు కూడా ఈ ప్రభావాన్ని అంగీకరిస్తున్నాయి. ట్రూత్ సోషల్‌లో మార్కెట్‌ను నిరంతరం ప్రభావితం చేసేది ట్రంప్ ఒక్కరేనని ఒక ఫండ్ మేనేజర్ చెప్పారు. అందుకే ఆయన పోస్టులు ముందుగానే అందడం అత్యంత విలువైనదిగా భావిస్తున్నారు.అయితే ఈ చెల్లింపు సర్వీసు అసమానతలను పెంచుతుందని విమర్శకులు అంటున్నారు. వేగంగా సమాచారం అందడం వల్ల భారీ నిధులు ఉన్న సంస్థలకు, చిన్న సంస్థలపై పైచేయి లభించే అవకాశం ఉందని చెబుతున్నారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. సెనేటర్ రాన్ వైడెన్ ఈ చర్య వల్ల ట్రంప్ కుటుంబానికి ఆర్థిక లాభం చేకూరడంతో పాటు వాల్ స్ట్రీట్ లాభాలు కూడా పెరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. స్థాయుల వారీగా డేటా అందించడం కొత్త విషయం కాదు. ఇది సెక్యూరిటీస్ చట్టాలను ఉల్లంఘించకపోవచ్చు. అయినా సమాన అవకాశాలపై సందేహాలు తలెత్తొచ్చు. ఈ సర్వీసు రోజంతా పర్యవేక్షణ సౌకర్యంతో పాటు 2022 నుంచి ఉన్న పాత పోస్టుల భద్రపరిచిన రికార్డులను కూడా అందిస్తుంది. ఆగస్టు 1న ప్రారంభం కానున్న ఈ సేవకు ఇప్పటికే తొలి ఖాతాదారులు చేరారు. రాజకీయ ప్రభావాన్ని ఆదాయంగా మార్చే ప్రయత్నాలను ట్రంప్ మీడియా మరింత దూకుడుగా విస్తరిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. -
ఇరాన్‌పై అమెరికా ఉక్కుపాదం.. దాడికి దాడే సమాధానం..
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో జరిపిన దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మరణించారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో ఆదివారం తెల్లవారుజామున ఇరాన్‌పై అమెరికా తాజాగా మరోసారి భీకర వైమానిక దాడులు నిర్వహించింది.అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకారం, జోర్డాన్ దాడిలో మరో అమెరికా సైనికుడు ఇంకా గల్లంతయ్యాడు. నలుగురు గాయపడగా చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మృతుల కుటుంబాలకు సమాచారం ఇచ్చే వరకు వారి పేర్లను వెల్లడించబోమని సెంట్కామ్ తెలిపింది. అలాగే, హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలకు ముప్పు కలిగించే ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా, జోర్డాన్ దాడికి బాధ్యులైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) బలగాలనే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేపట్టినట్లు అమెరికా వెల్లడించింది.🚨 Cluster missiles from Iran are raining down on U.S. military bases in Bahrain and Jordan.In one of the fiercest attacks on the Epstein Club since the war began... pic.twitter.com/c5RYWJ7gp3— IRGC (@IRGC_NEWS) July 18, 2026ఈ సందర్భంగా అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మాట్లాడుతూ.. ఇద్దరు అమెరికా సైనికుల మరణం తమ సంకల్పాన్ని మరింత బలపరిచిందని, దీనికి తగిన ప్రతిస్పందన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, ఇరాన్‌కు చెందిన మెహర్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం, దక్షిణ ఇరాన్‌లోని సిరిక్ పోర్టు నగరంతో పాటు హాజీబాద్ సమీప ప్రాంతాలపై అమెరికా దాడులు జరిపింది. అయితే ప్రాణనష్టం జరిగినట్లు ఇప్పటివరకు సమాచారం లేదు.మరోవైపు, ఇరాన్ సుప్రీం నాయకుడు మొజ్తబా ఖమేనీ అమెరికాకు "మరచిపోలేని గుణపాఠం నేర్పుతాం" అంటూ హెచ్చరించారు. అమెరికా ఒప్పందాలను పదేపదే ఉల్లంఘిస్తోందని, అధ్యక్షుడు ట్రంప్ హామీలకు విశ్వసనీయత లేదని ఆయన విమర్శించారు. హర్మూజ్ జలసంధిపై ఆధిపత్యం కోసం అమెరికా ప్రయత్నిస్తోందని ఇరాన్ ఆరోపిస్తుండగా.. వాణిజ్య నౌకలను ఇరాన్ బెదిరిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.After death of 2 American soldiers in Jordan due to Iranian missile strikes, US forces launched a massive strikes campaign against IRGC targets across Iran. Currently over 30 US fighter jets are hitting the IRGC targets across Iran. pic.twitter.com/fjNH7MxQh2— Baba Banaras™ (@RealBababanaras) July 19, 2026ఇక గల్ఫ్ దేశాలు పరిస్థితిని అత్యంత నిశితంగా గమనిస్తున్నాయి. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరగడంతో ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అన్ని పక్షాలు వెంటనే కాల్పులు నిలిపి, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని మరోసారి పిలుపునిచ్చింది.🚨 U.S. President Donald Trump has reportedly ordered CENTCOM to “open the gates of hell” on Iran following the deaths of American service members in Jordan.U.S. officials say tonight’s strikes are expected to be significantly larger than previous rounds.Meanwhile, U.S.… pic.twitter.com/G5jhqPtgcQ— The Iran Watcher 🇮🇷 (@TheIranWatcher) July 18, 2026 -
కొనసాగిన దాడుల పర్వం
దుబాయ్: ఇరాన్‌తో తాత్కాలిక శాంతి ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు ట్రంప్ ప్రకటించిన మరుసటి రోజు నుంచి వరుసగా ఏడోరోజూ ఇరాన్‌పై అమెరికా సేనలు రాత్రిపూట దాడులను శనివారమూ కొనసాగించాయి. దీంతో ఇరాన్‌వ్యాప్తంగా అమెరికా దాడుల్లో గత ఏడు రోజుల్లో చనిపోయిన ఇరానియన్ల సంఖ్య 50కి పెరిగిందని ఆ దేశ ఆరోగ్యమంత్రిత్వశాఖ శనివారం ప్రకటించింది. జూన్ 27 తర్వాత అమెరికా మొదలెట్టిన భీకర దాడుల్లో ఇప్పటిదాకా 500 మందికిపైగా గాయపడ్డారు. శనివారం సైతం ఇరాన్‌లోని మౌలిక వసతులు, సైనిక లక్ష్యాలపై అమెరికా పదులకొద్దీ ఆత్మాహుతి డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడి భారీ స్థాయిలో విధ్వంసం సృష్టించింది. నిఘా ప్రాంతాలు, సాయుధ ఉపకరణాలు, రహదారులు, వంతెనలు, భూగర్భ ఆయుధాగారాలు, నావికాదళ సామర్థ్యాలను నాశనంచేశామని శనివారం ఉదయం అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అమెరికా దాడిలో దక్షిణ ఇరాన్‌లోని డీసాలినేషన్ ప్లాంట్ ధ్వంసమైంది.దీంతో ఈ ప్లాంట్ నుంచి 20 గ్రామాలకు తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో జనం అల్లాడిపోయారని హార్మూజన్ ప్రావిన్స్ డెప్యూటీ గవర్నర్ ఇస్లాయిల్ దెహస్తానీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిదాడులు ఆరంభించిన ఇరాన్.. దాడులకు ఇరాన్ దీటుగా బదులిచ్చింది. అమెరికా పేట్రేగిపోతున్నా మౌనం దాల్చిన దాని మిత్రదేశాలపై ఇరాన్ క్షిపణులకు పనిజెప్పింది. దీంతో కువైట్‌లోని నీటి శుద్ధీకరణ(డీసాలిలేషన్)ప్లాంట్, విద్యుత్‌ఉత్పత్తి కేంద్రాలు పేలుళ్లతో మార్మోగిపోయాయి. చమురుశుద్ధి కర్మాగారంపై దాడిలో పలువురు కువైట్ సిబ్బంది గాయాలపాలయ్యారు. దాడులతో పల విద్యుత్ ఉత్పత్తి కర్మాగారాల్లో ఉత్పత్తిని వెంటనే నిలిపేశారు. కువైట్‌లోని డీసాలినేషన్ ప్లాంట్లపై ఇరాన్ దాడిచేయడం వరుసగా ఇది రెండోరోజు. కువైట్ తన తాగునీటి అవసరాల కోసం 90 శాతం డీసాలినేషన్ ప్లాంట్ల మీదనే ఆధారపడుతోంది. ఇరాన్ దాడుల కారణంగా మంటల్లో చిక్కుకున్న ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న పలువురు అగ్నిమాపక సిబ్బంది,కారి్మకులు గాయపడ్డారని కువైట్ ఫైర్ ఫోర్స్ తెలిపింది. క్షిపణులు పడుతుండటంతో ముందు జాగ్రత్తగా విమానాశ్రయాల నుంచి రాకపోకలను కువైట్ నిలిపేసింది. ఇరాక్‌లోని ఇర్బిల్ నగరంపైనా ఇరాన్ డ్రోన్లను ప్రయోగించింది. ఇరాన్ మిస్సైళ్లను విజయవంతంగా అడ్డుకున్నామని జోర్డాన్ ప్రకటించింది. బహ్రెయిన్‌లో ముందుజాగ్రత్తగా సైరన్లు మోగించి ప్రజలను ప్రభుత్వం అప్రమత్తంచేసింది. సౌదీ అరేబియా సైతం రెండు ప్రాంతాల్లో హెచ్చరికలగా సైరన్లు మోగించి తర్వాత నిలిపేసింది. అమెరికా సేనలకు ఆశ్రయం కల్పించే ప్రతి పశ్చిమాసియా దేశంపై దాడులు కొనసాగుతాయని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్(ఐఆర్జీసీ) శనివారం పునరుద్ఘాటించింది.మర్చిపోలేని గుణపాఠం చెప్తాం: మొజ్తబా అమెరికాకు ఖమేనీ హెచ్చరిక దుబాయ్: తమ దేశంపై ఇంకా దాడులు కొనసాగిస్తే మర్చిపోలేని గుణపాఠం చెప్తామని అమెరికాను ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ ఘాటుగా హెచ్చరించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. దీన్ని ప్రభుత్వ టీవీ ఛానల్లో చదివి వినిపించారు. తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత నూతన సుప్రీంలీడర్‌గా నియమితుడైన మొజ్తబా ఖమేనీ ఇప్పటిదాకా బహిరంగంగా ప్రజలకు కనిపించలేదు. మధ్యంతర ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంతకం విలువలేనిది, చెల్లనిది అని మొజ్తబా తేల్చిచెప్పారు. జోర్డాన్‌పై దాడిలో ఇద్దరు అమెరికా సైనికుల మృతి దుబాయ్: జోర్డాన్‌లోని తమ స్థావరాలపై ఇరాన్ శనివారం జరిపిన దాడిలో ఇద్దరు సైనికులు చనిపోయారని, ఒకరి జాడ గల్లంతైందని అమెరికా సైన్యం ప్రకటించింది. గత కొంతకాలంగా జరుగుతున్న ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికులు చనిపోవడం ఇదే తొలిసారి. ఇరాన్ నుంచి దూసుకొచ్చిన బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను నిలువరించేందుకు అమెరికా, జోర్డాన్ సైనిక సిబ్బంది ప్రయత్నిస్తుండగా తమ సైనికులు ప్రాణాలు కోల్పోయారని అమెరికా శనివారం పేర్కొంది. ఇరాన్ దాడుల్లో నలుగురు సైనికులు సైతం గాయపడ్డారు. వాళ్లకు సమీప ఆస్పత్రుల్లో ప్రథమ చికిత్స చేసి డిశ్చార్జ్‌చేశారు. చనిపోయిన ఇద్దరు అమెరికా సైనికుల పూర్తి వివరాలను సైన్యం ఇంకా బయటపెట్టలేదు. -
ఇరాన్ పై భారీ వైమానిక దాడులకు ట్రంప్ ప్లాన్
వాషింగ్టన్ డీసీ: ఇరాన్‌పై పెద్దఎత్తున దాడులకు ట్రంప్ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం అందుతోంది.ఈ మేరకు వైట్‌హౌస్‌లో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రత్యర్థి దేశానికి చెందిన మౌలిక సదుపాయాలు, సైనిక స్థావరాలే టార్గెట్‌గా దాడులు జరపాలని అందుకు గానూ పెద్దఎత్తున గగనతల ఇంధన సరఫరా విమానాలను ఇజ్రాయెల్ పంపినట్లు ఆక్సియోస్ కథనాలు ప్రచురించింది. కాగా ఇదివరకే ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ సమీపంలో ఉన్న బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయం ,దక్షిణ ఇజ్రాయెల్‌లోని రామోన్ ఎయిర్‌పోర్టులలో పదుల సంఖ్యలో ఇంధన సరఫరా విమానాలున్నాయి. అయితే వీటికి అదనంగా భారీగా రీప్యూయలింగ్ విమానాలను పంపేందుకు ట్రంప్ యంత్రాంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.దాడులు ప్రధానంగా అణుఇంధన కేంద్రాలు, విద్యుత్ ప్లాంట్లు, ఇతర వ్యూహాత్మక లక్ష్యాలపై ఉండనున్నట్లు సమాచారం. అయితే దీనిపై ట్రంప్ తుది నిర్ణయం తీసుకోనప్పటికీ దాడికి ప్రణాళికలు ఖచ్చితంగా రచించినట్లు తెలుస్తోంది. సుదీర్ఘ దూరం ప్రయాణించి దాడులు చేసే యుద్ధ విమానాలకు గాల్లోనే ఇంధనం నింపడానికి ఈ ట్యాంకర్ విమానాలు చాలా కీలకం.కాగా ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ఇటీవల పూర్తిగా విఫలమైంది. దీంతో దౌత్యపరమైన చర్చలు ఆగిపోయి, మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్, అమెరికా దేశాలు ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఇరాన్ సైతం ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో మరోసారి తీవ్ర ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. -
డొనాల్డ్ ట్రంప్‌ను హతమారిస్తే. రూ. 96కోట్లు
ఇరాన్‌పై వరుసగా ఏడవ రాత్రి కూడా అమెరికా దాడులు నిర్వహించింది. ఇరాన్ సైనిక సామర్థ్యాలను మరింత బలహీనపరిచేలా ఈ దాడులు జరిగాయని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) శుక్రవారం నాటి ప్రకటనలో పేర్కొంది. మరోవైపు అమెరికా యుద్ధ విమానాల్ని కూల్చి వేశామని, మరికొన్నింటికి తీవ్ర నష్టాన్ని కలిగించామని ఇరాన్ గురువారం ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఇరాన్ మద్దతు ఉన్న ఇరాకీ మిలీషియా (సాయుధ ముఠాల) సంకీర్ణ కూటమి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపిన వారికి 10 మిలియన్ డాలర్ల (సుమారు 96.28 కోట్ల రూపాయలు) బహుమతిని ఇస్తామని ప్రకటించింది. ఈ ప్రకటన రగులుతున్న ఇప్పటికే యుద్ధ జ్వాలలకు మరింత ఆజ్యం పోసింది. డొనాల్డ్ ట్రంప్‌ను చంపిన వారికి లేదా ఆ ఆపరేషన్‌కు నిధులు సమకూర్చిన వారికి, సహాయం చేసిన వారికి ఈ బహుమతి అందుతుందని 'ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్' (IRI) తెలిపింది. ఈ 10 మిలియన్ డాలర్ల మొత్తాన్ని తమ సభ్యులు, మద్దతుదారుల నుండి సేకరించిన విరాళాల ద్వారా సమకూర్చినట్లు వారు పేర్కొన్నారు. అయితే దీనిని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు చూపలేదు.ఇటీవల వైట్ హౌస్‌లో ఇరాక్ ప్రధాన మంత్రి అలీ అల్-జైదీతో జరిగిన సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ... 2020లో ఇరాన్ అగ్ర సైనిక కమాండర్ మేజర్ జనరల్ ఖాసీం సులేమానీ, ఇరాకీ మిలీషియా నాయకుడు అబూ మహదీ అల్-ముహందిస్లను చంపడంలో తన పాత్రను బహిరంగంగా ప్రస్తావించారు. దీనికి ప్రతిచర్యగా ఐఆర్ఐ ఈ ప్రకటన చేసింది.ఇరాక్, సిరియా , గల్ఫ్ ప్రాంతంలోని ఇతర చోట్ల ఉన్న అమెరికా దళాలు, దౌత్య కార్యాలయాలు మరియు మిత్రదేశాలపై వందలాది డ్రోన్, రాకెట్, క్షిపణి దాడులకు ఈ గ్రూపులే కారణమని అమెరికా ఆరోపిస్తోంది. ప్రస్తుత అమెరికా-ఇరాన్ ఘర్షణల నేపథ్యంలో, ఇరాన్ సరిహద్దుల వెలుపల తన సైనిక ఒత్తిడిని కొనసాగించడానికి టెహ్రాన్‌కు ఈ మిలీషియాలు ప్రధాన ఆయుధాలుగా మారాయి. -
విదేశీ ట్రక్కు డ్రైవర్లకు ఉద్వాసన: ట్రంప్
వాషింగ్టన్: అమెరికాలో వలసదారులైన డ్రైవర్లలో గుబులు మొదలైంది. వారి స్థానంలో అమెరికన్ మాజీ సైనికులను నియమించాలన్న ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెరపైకి తీసుకొచ్చారు. వలసవచ్చి డ్రైవర్లుగా పనిచేస్తున్న వారిలో చాలామంది మత్తుమందులు, మద్యం ప్రభావంతో అనేక ప్రమాదాలకు కారణమవుతున్నారని ఆయన ఆరోపించారు. వారివల్ల ప్రజల ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఆ డ్రైవర్లను తొలిగించాలని స్పష్టం చేశారు. ఒకవేళ ట్రంప్ ప్రతిపాదన అమల్లోకి వస్తే అమెరికాలోని భారతీయ వలసదారులకు నష్టం తప్పదని ఆందోళన వ్యక్తమవుతోంది. వీరిలో వేలాది మంది ఇటీవలి కాలంలో రవాణా రంగంలో ప్రవేశించారు. అమెరికాలో దాదాపు లక్షన్నర మంది భారతీయులు డ్రైవర్లుగా పని చేస్తున్నట్లు అంచనా. వీరిలో ఎక్కువ మంది పంజాబ్, హరియాణాకు చెందినవారే ఉన్నారు. తాజాగా పెన్సిల్వేనియాలో జరిగిన సైనిక పెట్టుబడుల సదస్సులో ట్రంప్ మాట్లాడారు. వలసదారులైన ట్రక్కు డ్రైవర్లపై తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. వీరిలో చాలామంది అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించినవారే కాకుండా, భారీ ట్రక్కులను నడపడానికి సరైన పత్రాలు, లైసెన్సులు వారివద్ద లేవని తెలిపారు. అలాంటి డ్రైవర్లు అమెరికాలో ఉండడంతమకు ఇష్టం లేదన్నారు. నిబంధనలు తెలియనివారిని, మద్యం మత్తులో వాహనాలు నడిపేవారిని ఎలా భరించాలని ప్రశ్నించారు. విదేశీ డ్రైవర్ల స్థానంలో అమెరికా మాజీ సైనికులను నియమించాలని భావిస్తున్నట్లు స్పష్టంచేశారు. -
ఇరాన్‌పై నిప్పుల వర్షం
దుబాయ్: పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య దాడులు నానాటికీ తీవ్రతరం అవుతున్నాయి. తాత్కాలిక శాంతి ఒప్పందం అకస్మాత్తుగా ముగిసిన తర్వాత రెండు దేశాలు పరస్పరం కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. ప్రధానంగా హార్మూజ్ జలసంధిపై ఆధిపత్యం కోసం క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగుతున్నాయి. హార్మూజ్‌పై టెహ్రాన్ పట్టును సడలించేలా ఒత్తిడి పెంచడానికి బలప్రయోగం తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఇందులో భాగంగా గురువారం అర్ధరాత్రి తర్వాత అమెరికా తన వైమానిక దాడుల పరంపరను మరింత ఉధృతంచేసింది. ఇరాన్లో కీలక వంతెనలు, విద్యుత్ వ్యవస్థలపై దాడి చేయడంతోపాటు గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో చాబహార్ ఓడరేవు వద్ద ముఖ్యమైన నిఘా టవర్‌ను కూల్చివేసింది. ఇరాన్ సైతం వెంటనే ప్రతిదాడికి దిగింది. ఖతార్, కువైట్, జోర్డాన్‌పై క్షిపణులు ప్రయోగించింది. బహ్రెయిన్, ఒమన్, సిరియాలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. కువైట్‌లో విద్యుత్, నీటి శుద్ధి ప్లాంట్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. పెద్ద సంఖ్యలో విద్యుత్ ఉత్పాదన యూనిట్లకు నష్టం వాటిల్లిందని కువైట్ ఆందోళన వ్యక్తంచేసింది. గల్ఫ్‌లో అమెరికా యుద్ధ విమానాలను ధ్వంసం చేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) ప్రకటించింది. జోర్డాన్‌లో మోహరించిన అమెరికా యుద్ధ విమానాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి, డ్రోన్ దాడులు జరిపినట్లు స్పష్టంచేసింది. ఈ దాడుల్లో పలు అమెరికన్ యుద్ధ విమానాలు, గగనతల ఇంధన సరఫరా విమానాలు ధ్వంసం కాగా, మరికొన్ని తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొంది. అయితే, తమ భూభాగం మీదుగా వచ్చిన మూడు క్షిపణులను అడ్డుకొని, కూల్చివేసినట్లు జోర్డాన్ సైన్యం తేల్చిచెప్పింది. విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలి ఇరాన్‌లోని దక్షిణ హార్మూజ్గాన్ ప్రావిన్స్‌లో వంతెనలపై అమెరికా సైన్యం వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో కనీసం ఏడుగురు మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ టీవీ వెల్లడించింది. హార్మూజ్ జలసంధిలో ఇరాన్ తీర నగరమైన బందర్ ఖమీర్పైనా దాడులు జరిగాయి. ప్రధాన రహదారులు, రైల్వే వంతెనలను కూడా విడిచిపెట్టలేదు. ప్రధాన రేవు పట్టణమైన బందర్ అబ్బాస్, రాజధాని టెహ్రాన్ మధ్య అనుసంధానం లేకుండా చేయడమే అమెరికా లక్ష్యంగా కనిపిస్తోంది. తమ దేశంలో విద్యుత్ మౌలిక సదుపాయాలపై దాడులు జరిగినట్లు ఇరాన్ అంగీకరించింది. దక్షిణ ప్రావిన్స్‌లలో ప్రజలు విద్యుత్‌ను చాలా పొదుపుగా వాడుకోవాలని ఇరాన్ ఇంధన మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. టార్గెట్ చాబహార్ పోర్టు! ఇరాన్లో పదుల సంఖ్యలో లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు అమెరికా సైనిక దళాల సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. వరుసగా ఆరో రోజు ఇరాన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడినట్లు వెల్లడించింది. అమెరికా వైమానిక దాడిలో చాబహార్ ఓడరేవు వద్ద ఒక టవర్ కూలిపోయినట్లు ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ తెలియజేసింది. ఓడరేవులోకి వచ్చే నౌకలను ఈ టవర్ నుంచే పర్యవేక్షిస్తారు. నిఘా టవర్ కూలిపోతున్న ఫొటోను అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. భారత ప్రభుత్వ సహకారంతో ఇరాన్ నిర్వహిస్తున్న చాబహార్ ఓడరేవు అమెరికా దాడులకు పదేపదే లక్ష్యంగా మారుతోంది. ఇక్కడ దాడులు జరిగినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా సైతం ధ్రువీకరించింది. శుక్రవారం ఉదయం 6 గంటల కల్లా అమెరికా దాడుల కారణంగా ఇరాన్లో కనీసం 38 మంది మరణించారని, 400 మందికి పైగా గాయపడ్డారని ఆరోగ్య శాఖ ప్రతినిధి హొస్సేన్ కెర్మన్పూర్ వెల్లడించింది. కుర్దిష్ రెబెల్ గ్రూప్‌పై ఇరాన్ దాడులు ఇరాన్ దాడుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలంటూ ఖతార్ ప్రభుత్వం తమ పౌరులను రెండుసార్లు హెచ్చరించింది. ఇరాన్ క్షిపణులను అడ్డుకోవడానికి గగనతల రక్షణ వ్యవస్థలను సన్నద్ధం చేశారు. అమెరికా, ఇరాన్ మధ్య చర్చలకు ఖతార్ మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇరాన్ ప్రయోగించిన మూడు క్షిపణులను మధ్యలోనే అడ్డుకున్నట్లు జోర్డాన్ సైన్యం ప్రకటించింది. మరోవైపు ఉత్తర ఇరాన్‌లోని కుర్దిష్ రెబెల్ గ్రూప్ ‘కొమాలా’పై దాడులు జరిగాయి. ఈ ఘటనలో కనీసం తొమ్మిది మంది మరణించగా, మరికొందరు గాయపడ్డారు. ఇరాన్ సైన్యమే ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న ఒక ట్యాంకర్ దాడికి గురైందని బ్రిటిష్ సైన్యం తెలిపింది. -
2020 నాటి ఎన్నికల్లో చైనా జోక్యం
వాషింగ్టన్: 2020 నాటి అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అమెరికా ఓటింగ్ వ్యవస్థలో అత్యంత ఆందోళనకరమైన లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన గురువారం రాత్రి వైట్‌హౌస్‌లో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రైమ్‌టైమ్ ప్రసంగం చేశారు. దాదాపు అరగంట పాటు మాట్లాడారు. అప్పట్లో తన ప్రత్యర్థి జో బైడెన్‌కు అనుకూలంగా ఎన్నికలను ప్రభావితం చేయడానికి చైనా కుట్రలు సాగించిందని, ఆ విషయాన్ని నిర్ధారించే వందలాది నిఘా ఫైళ్లను తాను బహిర్గతం చేశానని చెప్పారు. తన వ్యక్తిగత సమాచారంతో సహా 22 కోట్ల మంది ఓటర్ల వివరాలను చైనా అక్రమంగా సేకరించిందని మండిపడ్డారు. 18 రాష్ట్రాల్లోని ఓటర్ల డేటాను చైనా కొనుగోలు చేసిందని, దొంగిలించిందని లేదా హ్యాక్ చేసిందని ట్రంప్ అన్నారు. ఈ విషయాన్ని నిఘా అధికారులు ప్రభుత్వానికి గానీ, కాంగ్రెస్‌కు గానీ చెప్పలేదని నిందించారు. అమెరికా పౌరులు కాని 2,78,000 మంది ఓటర్లుగా నమోదైనట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం గుర్తించిందని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలో ఓటర్లకు సంబంధించిన సమాచారం చాలావరకు బహిరంగంగానే అందుబాటులో ఉంటుంది. అయితే, ఓటింగ్ విధానాలను మార్చడానికి లేదా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి చైనా ఈ సమాచారాన్ని వాడుకుందని తేల్చడానికి ట్రంప్ ఎటువంటి ఆధారాలనూ చూపలేదు. 2020 నాటి ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ట్రంప్ ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, విదేశీ జోక్యం వల్ల ఫలితాలు తారుమారు అయ్యాయని ఆయన పదేపదే ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అందుకు సాక్ష్యాధారాలను మాత్రం బయటపెట్టడం లేదు. మరోవైపు, కాంగ్రెస్‌పై నియంత్రణను నిర్ణయించే రాబోయే మధ్యంతర ఎన్నికలపై ప్రజల్లో సందేహాలు రేకెత్తించడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నారని విపక్ష డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకోలేదని బలమైన నమ్మకం ఉన్నట్లు అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్ 2021 నాటి నివేదికలో పేర్కొంది. ఇదిలా ఉండగా, ట్రంప్ ప్రజామోద రేటింగ్ 37 శాతానికి పడిపోయినట్లు వాషింగ్టన్ పోస్ట్–ఇప్సోస్ నిర్వహించిన తాజా సర్వేలో తేలింది. జీవన వ్యయం పెరగడం, ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం పట్ల చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడయ్యింది. ప్రత్యక్ష ప్రసారం చేయాలా? వద్దా? తన ప్రసంగాన్ని తప్పనిసరిగా ప్రత్యక్ష ప్రసారం చేయాలని మీడియా సంస్థలకు ట్రంప్ తేల్చిచెప్పారు. ప్రత్యక్ష ప్రసారం చేయకపోతే ఆంక్షలు విధిస్తానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని ప్రసార, కేబుల్ వార్తా సంస్థలు అత్యంత క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొన్నాయి. ప్రసారం చేయాలా? వద్దా? అనేదానిపై ఎటూ తేల్చుకోలేకపోయాయి. అమెరికా మీడియా సంస్థల్లో తన వ్యతిరేకులు ఉన్నారని ట్రంప్ చాలా రోజులుగా ఆక్షేపిస్తున్నారు. మీడియాపై పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ‘‘మీడియా సంస్థలు మోసాలకు పాల్పడుతున్నాయి. అలాంటి సంస్థల లైసెన్సులను రద్దు చేయాలి. కోట్లాది డాలర్ల విలువైన మన ప్రజా ఆస్తి ఎయిర్‌వేవ్స్‌ను (ప్రసార తరంగాలను) ఎలాంటి రుసుమూ చెల్లించకుండానే వాడుకుంటున్నాయి. మాకు కావాల్సిందల్లా ఎన్నికలు, వార్తల ప్రసారంలో నిజాయితీ మాత్రమే’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే, ట్రంప్ ప్రసంగాన్ని కొన్ని చానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేయగా, మరికొన్ని చేయలేదు. ట్రంప్ ఆరోపణలు అవాస్తవం: చైనా అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకుందంటూ అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఆరోపణలను చైనా తిప్పికొట్టింది. అమెరికా అధ్యక్షుడి వాదనలు కల్పితం, దురుద్దేశపూర్వకం అని స్పష్టంచేశారు. అందులో ఏమాత్రం వాస్తవం లేదని కొట్టిపారేసింది. నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని ట్రంప్‌కు సూచించింది. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తమ విధానం కాదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ శుక్రవారం పేర్కొన్నారు. అమెరికా ఎన్నికలపై తమకు ఎలాంటి ఆసక్తి లేదని, ఎన్నడూ జోక్యం చేసుకోలేదని వెల్లడించారు. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో ఎల్లప్పుడూ ఎవరు జోక్యం చేసుకుంటారో, ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, వ్యాపారాలు, సాధారణ పౌరులపై ఎవరు నిఘా పెడతారో, విదేశీ పౌరుల డేటాను ఎవరు దొంగిలిస్తారో అంతర్జాతీయ సమాజానికి బాగా తెలుసని స్పష్టంచేశారు. సొంత ప్రవర్తనను సమీక్షించుకోవాలని అమెరికాకు హితవు పలికారు. చైనాను ఎన్నికల అంశంగా వాడుకోవద్దని, చైనా–అమెరికా సంబంధాలను మెరుగుపరిచే దిశగా మరింత కృషి చేయాలని అమెరికాకు స్పష్టంచేశారు. -
ట్రంప్ దూసిన వీసా కత్తి!
మితవాద రాజకీయం ఊరకే ఉండదు. నిరంతరం కొత్త శత్రువుల్ని వెదుక్కుంటుంది. తన చర్యల పర్యవసానంగా పుట్టుకొచ్చే సంక్షోభాలనుంచి జనం దృష్టి మరల్చడానికి నానా తంటాలూ పడుతుంది. ఆ రాజకీయంలోనే పుట్టి, దాన్ని మరింత దిగజార్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండో దఫా వచ్చాక వలసలపై కత్తిగట్టారు. అమెరికాలో చదువుకోవటానికొచ్చినవారు గరిష్ఠంగా నాలుగేళ్లకు మించి ఉండటానికి వీల్లేదంటూ తాజాగా తీసుకురావాలనుకుంటున్న నిబంధన ఆ పరంపరలో భాగమే. ఇతరేతర వీసాల సంగతి సరేసరి. ప్రపంచ దేశాల్లోని వారందరికీ ఉన్నత చదువుల గమ్యస్థానం అమెరికాయే. అక్కడ చదువుకుంటే సాఫ్ట్వేర్, ముఖ్యంగా కృత్రిమ మేధ (ఏఐ) రంగాల్లో మెరుగైన జీతాలతో కొలువులొస్తాయన్న నమ్మకమే అందుకు కారణం. అయితే ట్రంప్ తీసుకున్న కొత్త నిర్ణయంవల్ల విద్యార్థులకు మాత్రమే కాదు... అక్కడి విద్యాలయాలు, టెక్ రంగ సంస్థలకు కూడా సమస్యలొస్తాయి. విద్యాలయాల వేల కోట్ల ఆదాయం పడిపోతే, టెక్రంగ సంస్థలకు నిపుణుల కొరత ఏర్పడుతుంది. ఎందుకంటే స్థానికులతో పోలిస్తే విదేశాలనుంచి వచ్చే విద్యార్థులు చదువుల్లో, తెలివితేటల్లో చాలా ముందంజలో ఉంటారు. డిగ్రీ చదువులకొచ్చేవరకూ స్వదేశీయులకు అంతా ఉచితమే అయినా, అటుపై తడిసిమోపెడవుతుంది. వారితో పోలిస్తే నిజానికి విదేశీ విద్యార్థులు రెండు మూడు రెట్లు అధికంగా చెల్లించాలి. ఆ మొత్తంతోనే స్థానికులకు స్కాలర్‌షిప్‌లిస్తారు. వారినుంచి తక్కువ ఫీజు వసూలు చేస్తారు. స్థానికులు హ్యూమనిటీస్, ఆర్ట్స్, బిజినెస్ మేనేజ్మెంట్, లా తదితర కోర్సుల్లో ఆసక్తి కనబరుస్తారు. సాంకేతిక రంగంలో దూసుకెళ్లే అమెరికాకు ‘స్టెమ్’(సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్) విభాగంలో నిపుణులు అవసరం. విదేశీయులు కఠినమైన వడపోత తర్వాత ఆ కోర్సులు చదవడానికి వెళ్లినవారు గనుక ఆ కోర్సులను సులభంగా ఆకళింపు చేసుకుంటారు. స్టెమ్ కోర్సుల్లో మాస్టర్స్, పీహెచ్డీ స్థాయిలో 70 శాతం సీట్లు విదేశీయులకే లభించటం ఇందుకే. స్థానికుల్ని వారితో పోటీపడేలా తీర్చిదిద్దటానికి తాము చేయాల్సిందేమిటన్న దృష్టి ట్రంప్‌కుగానీ, ఆయన ముందున్న పాలకులకుగానీ లేదు. తగినంతమంది సాంకేతిక నిపుణులు స్థానికంగా లభ్యంకాకపోవటంవల్లనే అమెరికా దిగ్గజ టెక్ సంస్థలు విదేశాలనుంచి వచ్చేవారిని ఎంపిక చేసుకోవాల్సివస్తున్నది. అలా భర్తీ చేసుకోనట్టయితే ఇన్నోవేషన్ రంగంలో ఆ దేశం వెనకబడిపోతుంది. అదిగాక విదేశీ విద్యార్థులు చెల్లించే వేలాది కోట్ల డాలర్ల ఫీజులు, టెక్ సంస్థల విస్తరణ, లాభార్జనల వల్ల మరిన్ని వేలకోట్ల డాలర్లు పన్నుల రూపంలో ఖజానాకు సమకూరుతాయి. ఇతరత్రా సంస్థల సంగతలావుంచి మన భారత సంస్థలు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కార్పొరేట్ పన్ను రూపంలోనే నిరుడు 867 కోట్ల డాలర్లు (రూ. 73,000 కోట్లకు పైగా) చెల్లించాయి. మొత్తంగా అన్ని సంస్థలూ 13,008 కోట్ల డాలర్లకు పైగా (రూ. 10,99,166 కోటు్ౖలపైగా) చెల్లించాయి. ఇవిగాక జీఎస్టీ, కస్టమ్స్ సుంకం, ఉద్యోగులు చెల్లించే టీడీఎస్‌లు అదనం. ఇంతగా లాభపడుతూ బాధిత దేశంగా శోకించటం అమెరికాకే చెల్లింది. వీసా వ్యవస్థ దశాబ్దాలుగా దుర్వినియోగమవుతున్నదనీ, దేశ భద్రత ప్రమాదంలో పడిందనీ గొంతుచించుకుంటున్న అమెరికా తాను ఎడాపెడా వర్ధమాన, వెనకబడిన దేశాలనుంచి దశాబ్దాలుగా కొల్లగొడుతున్న సంపద గురించి మాట్లాడదు. ఇందులో ఆ దేశాల పాలకుల తప్పు కూడా ఉంది. మన దేశం సంగతే తీసుకుంటే 2047 కల్లా ‘వికసిత్ భారత్’ తీసుకొస్తామంటారు. కానీ అమెరికా మాదిరిగా కనీసం డిగ్రీవరకూ ఉచిత విద్య, నామమాత్రపు ఫీజులతో ఆపై విద్య అందుబాటులోకి తెచ్చే ఆలోచన చేయరు. జీడీపీలో కనీసం 6 శాతం విద్యకు వ్యయం చేయాలన్న లక్ష్యం పాటించరు. హైస్కూల్ విద్యవరకూ శ్రద్ధ పెడుతున్నట్టు కనబడుతూ ఆపై చదువుల్ని కార్పొరేట్లకు వదిలేశారు. వేలాదిమంది ప్రొఫెసర్ల కొరతతో విశ్వవిద్యాలయాలు దయనీయ స్థితిలో పడినా పట్టదు. కొలువుల సంగతి సరేసరి. ఇలాంటి స్థితిలో ట్రంప్ బెదిరిస్తే, పరిమితులు విధిస్తే నిస్సహాయంగా మిగలటం తప్ప మన యువత చేయగలిగేది ఏముంది? -
ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్‌కు ట్రంప్
అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరుగనున్న ఫిఫా వరల్డ్‌కప్ 2026 ఫైనల్ మ్యాచ్ చూసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరుకానున్నారు. ఈ సమాచారాన్ని వైట్‌హౌస్ అధికారికంగా ధృవీకరించింది.వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ట్రంప్ శుక్రవారం న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్‌లో ఫిఫా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని, ఆదివారం ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించనున్నారు.ఇప్పటికే ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినో కూడా ఫైనల్ అనంతరం ట్రంప్‌తో కలిసి విజేత జట్టుకు ప్రపంచకప్ ట్రోఫీ అందజేస్తామని ప్రకటించారు.అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు జరిగిన 102 మ్యాచ్‌లకు ట్రంప్ గానీ, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గానీ హాజరుకాలేదు. అయితే అమెరికా జట్టు ఆడిన కొన్ని మ్యాచ్‌లకు కేబినెట్ సభ్యులు హాజరయ్యారు.అమెరికా చరిత్రలో అత్యధికంగా వీక్షించబడిన, అత్యంత భద్రతతో నిర్వహించిన, అత్యంత విజయవంతమైన ప్రపంచకప్‌కు ట్రంప్ హాజరుతో ఘన ముగింపు లభిస్తుందని లెవిట్ పేర్కొన్నారు.ఫైనల్ మ్యాచ్ న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఆదివారం మధ్యరాత్రి (సోమవారం) 12:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్త క్రీడాభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇదిలా ఉంటే, ఇటీవల అమెరికా ఆటగాడు ఫోలారిన్ బాలోగన్ రెడ్‌కార్డు సస్పెన్షన్ వ్యవహారంలో ట్రంప్ ఫిఫా అధ్యక్షుడు ఇన్ఫాంటినోతో మాట్లాడిన విషయం వివాదాస్పదమైంది. ట్రంప్ విజ్ఞప్తి చేసినప్పటికీ నిర్ణయ ప్రక్రియలో తాను జోక్యం చేసుకోలేదని ఇన్ఫాంటినో స్పష్టం చేశారు.అనంతరం బాలోగన్పై విధించిన ఒక మ్యాచ్ నిషేధాన్ని ఫిఫా తాత్కాలికంగా ఎత్తివేయడం విమర్శలకు దారితీసింది. అయినప్పటికీ, ప్రీక్వార్టర్‌లో బెల్జియం చేతిలో అమెరికా 1-4 తేడాతో ఓటమి పాలైంది. -
'మాకేం అవసరం'.. పెద్దన్నకు చైనా స్ట్రాంగ్ కౌంటర్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి 2020 అధ్యక్ష ఎన్నికల వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. చైనా అమెరికా ఎన్నికల డేటాలో భారీ స్థాయిలో జోక్యం చేసుకుందని, దాదాపు 22 కోట్ల (220 మిలియన్) మంది అమెరికన్ ఓటర్ల వివరాలను అక్రమంగా సేకరించిందని సంచలన ఆరోపణలు చేశారు. ప్రపంచ రాజకీయాల్లో "పెద్దన్న"గా భావించే ఆయన.. అమెరికా ఎన్నికల భద్రతపైనే విదేశీ జోక్యం జరిగిందంటూ చేసిన ఆరోపణలు ఇప్పుడు అంతర్జాతీయ చర్చకు దారితీశాయి. అయితే, ట్రంప్ ఆరోపణలకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా చైనా కౌంటర్ ఇచ్చింది. వైట్‌హౌస్‌లో ప్రైమ్‌టైమ్‌లో ప్రసంగించిన ట్రంప్.. 2020 ఎన్నికల సమయంలోనే చైనా అమెరికా ఓటర్ల డేటాను లక్ష్యంగా చేసుకుని చరిత్రలోనే అతిపెద్ద డేటా చోరీకి పాల్పడిందని ఆరోపించారు. దీంతో అమెరికా ఎన్నికల భద్రత తీవ్ర ప్రమాదంలో పడిందన్నారు. ఎన్నికల వ్యవస్థలోని లోపాలను "డీప్ స్టేట్"లోని కొందరు కావాలనే దాచిపెట్టారని కూడా విమర్శించారు.ట్రంప్ ఆరోపణలకు అమెరికాలోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి లియూ చాంగ్ స్పందించారు. "అమెరికా ఎన్నికలతో మాకేం అవసరం?. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదన్న సూత్రాన్ని చైనా ఎప్పుడూ పాటిస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తిగా అమెరికా అంతర్గత అంశం. వాటి ఫలితాన్ని అమెరికా ప్రజలే నిర్ణయిస్తారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చైనా ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు.. భవిష్యత్తులో కూడా జోక్యం చేసుకోదు. అలాంటి అవసరం కూడా మాకు లేదు" అని స్పష్టం చేశారు.ఇక ట్రంప్ తన ప్రసంగంలో.. రష్యా, చైనా, ఇరాన్, ఉత్తర కొరియా నుంచి అమెరికా ఎన్నికల వ్యవస్థ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న అమెరికా ఎన్నికల విధానం నిష్పక్షపాత, పారదర్శక ఎన్నికలకు ఏమాత్రం సరిపోదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రతి ఓటు ఖచ్చితంగా లెక్కించబడేలా, హ్యాకింగ్ లేదంటే విదేశీ జోక్యానికి అవకాశం లేకుండా ఎన్నికల వ్యవస్థను పూర్తిగా పునర్నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ఎన్నికల మౌలిక వసతుల్లో ఉన్న బలహీనతలను వెల్లడించే కీలక నిఘా సమాచారాన్ని ప్రజలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు.అమెరికాలో ఓటర్ల నమోదుకు పౌరసత్వ ధ్రువీకరణ తప్పనిసరి చేసే సేవ్ యాక్ట్ SAVE Actను వెంటనే ఆమోదించాలని కాంగ్రెస్‌ను ట్రంప్ కోరారు. అయితే, ఈ బిల్లు అమలైతే లక్షలాది మంది చట్టబద్ధ ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఓటర్ల హక్కుల సంఘాలు హెచ్చరిస్తున్నాయి. అమెరికా చట్టాల ప్రకారం విదేశీయులు ఓటు వేయడం ఇప్పటికే నిషేధితమే.ఇక 2020 ఎన్నికల్లో భారీ మోసం జరిగిందన్న ట్రంప్ ఆరోపణలకు ఇప్పటివరకు ఎలాంటి న్యాయపరమైన నిర్ధారణ లభించలేదు. ట్రంప్, ఆయన మద్దతుదారులు దాఖలు చేసిన 60కుపైగా కేసుల్లో ఎన్నికల ఫలితాలను మార్చే స్థాయి అక్రమాలు జరిగాయని ఏ కోర్టూ తేల్చలేదు. రీకౌంట్లు, ఆడిట్లు, ట్రంప్ హయాంలోని న్యాయశాఖ కూడా అలాంటి ఆధారాలు గుర్తించలేదు.అంతేకాకుండా, ఎన్నికల మోసంపై తన ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయని ఏబీసీ, ఎన్బీసీ వంటి టీవీ నెట్‌వర్క్‌లపై కూడా ట్రంప్ మండిపడ్డారు. అవి ఎన్నికల వ్యవస్థను ప్రభావితం చేసే కుట్రలో భాగమని ఆరోపిస్తూ.. వాటి ప్రసార లైసెన్సులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. -
ఓట్ల చోరీ.. చైనాపై ట్రంప్ సంచలన ఆరోపణలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో భారీ అక్రమాలు జరిగాయని పాత పాటే పాడిన ఆయన.. ఈసారి ఆసియా దేశమైన చైనాపై తీవ్ర ఆరోపణలు చేశారు. కోట్ల సంఖ్యలో అమెరికన్ల ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని ఆ దేశం దొంగిలించిందని ఆరోపించారు. అంతేకాదు అమెరికా ఎన్నికల చరిత్రలోనే అతిపెద్ద డేటా ఉల్లంఘన (Data Breach)గా దీనిని అభివర్ణించారు. అమెరికా ప్రైమ్ టైమ్ స్పీచ్‌లో భాగంగా.. ట్రంప్ సంచలన ఆరోపణలకు దిగారు. ఎన్నికల భద్రతపై దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. కోట్ల 22 కోట్ల (220 మిలియన్ల) అమెరికన్ ఓటర్ల డేటాను చైనా చోరీ చేసిందన్నారు. ఇటీవల గోప్యత నుంచి తొలగించిన (డీక్లాసిఫై చేసిన) నిఘా పత్రాల్లో చైనా భారీ స్థాయిలో అమెరికా ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించినట్లు పేర్కొన్నారని చెప్పారు. ఆ డేటాలో ఓటర్ల పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, రాజకీయ పార్టీ అనుబంధం వంటి సున్నితమైన వివరాలు ఉన్నాయని తెలిపారు. ఈ సమాచారాన్ని ఓటరు నమోదు ప్రక్రియతో పాటు ఇతర దురుద్దేశపూర్వక కార్యకలాపాలకు ఉపయోగించే అవకాశం ఉందని ఆయన ఆరోపించారు.#WATCH | US President Donald Trump says, "The documents cover five major areas of concern. They show that over a period of years, starting during the 2020 election cycle, the People's Republic of China carried out what is believed to be the largest compromise of election data in… pic.twitter.com/V8efjdVqT1— ANI (@ANI) July 17, 2026'డీప్ స్టేట్ నిజాలను దాచింది'అమెరికా ఎన్నికల వ్యవస్థపై దాడి చేసే సామర్థ్యం చైనాతో పాటు రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్‌కు ఉందని అమెరికా నిఘా వ్యవస్థ గుర్తించినట్లు ట్రంప్ తెలిపారు. చైనా ఎన్నికల జోక్యానికి సంబంధించిన కీలక నిఘా సమాచారాన్ని అమెరికా ఇంటెలిజెన్స్ వ్యవస్థలోని కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని ఆరోపించారు. తన తొలి అధ్యక్ష పదవీకాలంలో ఈ సమాచారం తనకు, అమెరికా ప్రజలకు తెలియకుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని ఇప్పటికే జాతీయ నిఘా విభాగం (ODNI), న్యాయశాఖ (DOJ), ఎఫ్‌బీఐ, సీఐఏలను ఆదేశించినట్లు వెల్లడించారు. సమాచారం దాచిన వారిపై ఉద్యోగాల నుంచి తొలగింపుతో పాటు అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని సూచించినట్లు చెప్పారు.మళ్లీ అదే మాట2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారీ అక్రమాలు జరిగాయని ట్రంప్ మరోసారి పునరుద్ఘాటించారు. ఆ ఎన్నికల్లో ఉపయోగించిన కొన్ని ఓటింగ్ యంత్రాల్లో లోపాలు ఉన్నాయని, ఎన్నికల వ్యవస్థలో అనేక బలహీనతలు బయటపడ్డాయని ఆరోపించారు. అమెరికా ఎన్నికల భద్రతను బలోపేతం చేయాలంటే కఠినమైన ఎన్నికల సంస్కరణలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.ఓటర్లకు పౌరసత్వ ధ్రువీకరణ తప్పనిసరి?భవిష్యత్తులో ఎన్నికల అక్రమాలను అరికట్టేందుకు ఓటర్ల నమోదు సమయంలో అమెరికా పౌరసత్వాన్ని నిరూపించే అధికారిక పత్రాలు తప్పనిసరి చేయాలని ట్రంప్ ప్రతిపాదించారు. ఫొటో ఐడీ లేకుండా ఓటు హక్కు కల్పించకూడదని, రాష్ట్రాలు-కేంద్రం మధ్య ఓటర్ల సమాచార మార్పిడిని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ లక్ష్యంతో రిపబ్లికన్లు మద్దతిస్తున్న సేవ్ అమెరికా యాక్ట్ SAVE America Act వంటి చట్టాలను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.ఆధారాలు చూపలేదు.. నిఘా వర్గాల వేర్వేరు అభిప్రాయాలుఅయితే తన ప్రసంగంలో ట్రంప్ ఈ ఆరోపణలకు ప్రత్యక్ష ఆధారాలు మాత్రం వెల్లడించలేదు. ఇదిలా ఉండగా, అమెరికా నిఘా వర్గాలకు చెందిన కొన్ని సమాచారం ప్రకారం.. చైనా ఎన్నికలను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేసి ఉండవచ్చన్న అనుమానాలు ఉన్నప్పటికీ, 2020 ఎన్నికల్లో ఓట్ల లెక్కింపును మార్చిందని లేదంటే ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేసిందని నిర్ధారించే ఆధారాలు లేవని పేర్కొన్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.అలాగే 2020 ఎన్నికల ఫలితాలను ట్రంప్ గతంలోనూ పలుమార్లు ప్రశ్నించినప్పటికీ, అమెరికా కోర్టులు, రీకౌంట్లు, అధికారిక సమీక్షల్లో ఎన్నికల ఫలితాన్ని మార్చే స్థాయిలో అక్రమాలు జరిగినట్లు ఆధారాలు వెలుగుచూడలేదని గతంలో తేలింది. అయినప్పటికీ ఎన్నికల భద్రత అంశాన్ని ట్రంప్ మరోసారి జాతీయ చర్చగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. -
స్టూడెంట్ వీసాకు కాల పరిమితి
వాషింగ్టన్: ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా అక్రమంగా అమెరికాలో చొరబడిన విదేశీయులతోపాటు సక్రమంగా వచ్చిన విదేశీ విద్యార్థుల మీదా ట్రంప్ సర్కార్ కఠిన నిబంధనల కత్తిని దూస్తోంది. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులను ఇష్టారీతిన పరిమితికి మించి ఎక్కువకాలం తమ గడ్డపై ఉండనివ్వబోమని అమెరికా ప్రభుత్వం తెగేసి చెబుతోంది. విద్యార్థి వీసా(ఎఫ్–1 కేటగిరీ)తో దేశంలో అడుగుపెట్టిన విదేశీయులు గరిష్టంగా నాలుగు సంవత్సరాలు మాత్రమే అమెరికా ఉండేందుకు అవకాశం కల్పిస్తామని హోంల్యాండ్ సెక్యూరిటీ మంత్రిత్వశాఖ తాజాగా ఒక నిబంధన తెచ్చింది. గతంలో ఒక కోర్సులో చేరిన విదేశీ విద్యార్థులు ఉద్దేశపూర్వకంగా ఒక సబ్జెక్ట్ పరీక్ష రాయకపోవడమో, లేదంటే రాసి ఫెయిల్ కావడమో చేసేవారని ఆరోపణలు ఉన్నాయి. ఆ కోర్సు లేదా పరిశోధన పూర్తయ్యేదాకా వీసా గడువు పొడిగించాలని సంబంధిత విద్యాసంస్థ లేదా ఉన్నతాధికారి నుంచి అనుమతి పొంది నెలల తరబడి అదనంగా అమెరికాలో తిష్టవేస్తున్నారని ఆరోపణలున్నాయి. ఇలాంటి వాటికి ఇకపై తావులేకుండా వీసాతో అమెరికాలో అడుగుపెట్టిన సరిగ్గా నాలుగేళ్ల తర్వాత స్వదేశం తిరిగి వెళ్లిపోవాల్సిందేనని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం కొత్త నిబంధనలో స్పష్టంచేసింది. విదేశీ అంతర్జాతీయ జర్నలిస్టులు సైతం ఐ కేటగిరీ వీసాతో అమెరికాకు వస్తే ఇకపై గరిష్టంగా 240 రోజులు మాత్రమే ఇక్కడ ఉండొచ్చు. చైనా జర్నలిస్టులకు ఈ గడువును మరీ దారుణంగా 90 రోజులకే పరిమితంచేశారు. సాంస్కృతిక సంబంధాల కేటగిరీలో జే–1 వీసాతో అమెరికాలోకి అడుగుపెట్టి విశ్వవిద్యాలయాల్లో సేవలందించే పరిశోధకులు, విద్యావేత్తలు తదితరలు సైతం నాలుగేళ్ల నిర్దిష్ట కాలావధి వరకే అమెరికాలో ఉండేందుకు అవకాశం ఉండనుంది. గతంలో ఈ మూడు కేటగిరీలకు నిర్దిష్టమైన గడువు అంటూ ఏమీ లేదు. ఎఫ్–1, జే–1 కేటగిరీలకు నాలుగేళ్ల గడువు ముగియగానే అమెరికా సిటిజెన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్)లో ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టే(ఈఓఎస్) దరఖాస్తు పెట్టుకుని గడువు పొడిగించుకునేవాళ్లు. ఈ లొసుగును అడ్డుపెట్టుకుని కొందరు ఏకంగా దశాబ్దాల తరబడి అమెరికాలో తిష్టవేశారని ఆరోపణలు రావడంతో ట్రంప్ సర్కార్ ‘డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్’కు చరమగీతం పాడి కొత్తగా ‘ఎక్స్పైరీ డేట్’రూల్‌ను తీసుకొస్తోంది. భారత్‌లో కేంద్ర ప్రభుత్వ ‘గెజిట్’మాదిరి అమెరికాలో ‘ఫెడరల్ రిజిస్ట్రీ’లో సంబంధింత నిబంధనలు ప్రచురితమైన 60 రోజుల తర్వాత ఇవి అమల్లోకి రానున్నాయి. భారతీయ విద్యార్థులకు కొత్త కష్టాలు 1990 తొలినాళ్ల నుంచి అమల్లో ఉన్న పాత నిబంధనను తొలగించి కొత్త నిబంధన తీసుకొస్తే లక్షలాది మంది భారతీయ విద్యార్థులు, పరిశోధకులు, విద్యావేత్తలపై ప్రతికూల ప్రభావంచూపే ఆస్కారముంది. కఠిన సబ్జెక్టులతో ఉత్తీర్ణులుకాలేక తమ కోర్సులు/డిగ్రీలు/రీసెర్చ్‌ను పూర్తిచేయలేకపోయినా భారతీయ విద్యార్థులు ఇకపై అదనంగా నెలల తరబడి అమెరికాలో ఉండిపోయే సువర్ణావకాశం చేజారే వీలుంది. దీంతో అసంపూర్ణ చదువులు, డిగ్రీ పట్టాలతో భారత్‌కు తిరిగి రావాల్సి ఉంటుంది. వీసాతో అమెరికాకు వెళ్లాక అడ్మిషన్ ప్రక్రియలో, పరిశోధనా పత్రం జారీలో ఆలస్యం, ఆరోగ్య సమస్యలు, ఇతరత్రా కారణాలతో అక్కడే ఉండిపోవాల్సి వస్తే ఆలోపే ‘ఎక్స్పైరీ డేట్’దాటిపోతే చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉన్నట్లు ప్రభుత్వం పరిగణిస్తుంది. అప్పుడు ఆలస్యంగా అమెరికాను వీడేప్పుడు వాళ్లపై కనిష్టంగా మూడేళ్లు, గరిష్టంగా పదేళ్లపాటు అమెరికాకు తిరిగిరాకుండా నిషేధం విధించే ప్రమాదముందని వీసారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డాక్టోరల్ విద్యార్థులు, వైద్యులు, వర్సిటీల్లో పరిశోధకులు, విజిటింగ్ స్కాలర్లు, మెడికల్ ట్రైనీలకు సైతం ఇదే నిబంధన వర్తించనుంది. అమెరికా 2024లో ఏకంగా 18 లక్షల స్టూడెంట్ వీసా అడ్మిషన్లు ఇచ్చింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 11 శాతం ఎక్కువ. 2024లో అమెరికా ఏకంగా 5 లక్షల ఎక్సే్ఛంజ్ విజిటర్(జే–1) వీసాలు మంజూరుచేసింది. అదే ఏడాది 37,300 మంది జర్నలిస్టులకు ఐ కేటగిరీ వీసాలిచ్చింది. ఒక మీడియా ఈవెంట్ తర్వాత మరో ఈవెంట్లో మీడియా ప్రతినిధిని అని చెప్పుకుంటూ కొందరు జర్నలిస్టులు ఏళ్ల తరబడి అక్కడే ఉండిపోయారని గతంలో వార్తలొచ్చాయి. అయితే ఈ నిబంధనను ఫెడరల్ రిజిస్ట్రీలో ప్రచురించాక దీనిపై అమెరికా ఉభయ చట్టసభలు సమీక్ష జరుపుతాయి. రెండు సభలూ నిబంధనను ఆమోదిస్తే అది చట్టంలో భాగంగా మారుతుంది. లేదంటే 60 రోజుల్లోపు అది అమల్లోకి రావడం ఆగిపోయే ఆస్కారముంది. -
ప్రభుత్వ పథకాలు పొందే వాళ్లకు నో గ్రీన్‌కార్డ్
మయామి: విదేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన వాళ్లలో ఆర్థికంగా నిలదొక్కుకున్న వాళ్లకే గ్రీన్‌కార్డ్‌లను జారీ చేయాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. మనుగడ కోసం ప్రభుత్వంపై ఆధారపడే వలసదారులకు గ్రీన్‌కార్డ్ ఇవ్వడంలో అర్థంలేదని ట్రంప్ సర్కార్ ఓ నిర్ణయానికొచ్చింది. ఇకపై ఫుడ్ స్టాంప్‌లు, మెడిక్ఎయిడ్, హౌసింగ్ ఓచర్లు, ఇతరత్రా ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి లబ్ధి పొందే వలసదారులకు గ్రీన్కార్డ్ల జారీపై పునరాలోచన చేయాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. సంబంధిత ‘పబ్లిక్ చార్జ్’విధాన నిర్ణయం తాలూకు వివరాలను గురువారం అమెరికా తన ఫెడరల్ రిజిస్టర్లో కని్పంచాయి. ఈ నిబంధనలను జూలై 20వ తేదీన ప్రచురించే ఆస్కారముంది. వాస్తవానికి ఈ నిబంధనను ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పుడు 2020 ఫిబ్రవరిలో అమలుచేశారు. తాము ప్రభుత్వానికి ఏరకంగానూ భారంగా మారబోమని, ప్రభుత్వ పథకాల నుంచి లబ్దిపొందట్లేమని హామీ ఇచ్చిన వాళ్లను గ్రీన్‌కార్డ్ ఆశావహుల జాబితాలో పరిశీలించేవాళ్లు. కానీ తర్వాతి అధ్యక్ష ఎన్నికల్లో జోబైడెన్ గెలిచాక డెమొక్రటిక్ ప్రభుత్వం ఈ నిబంధనను తొలగించింది. తాజాగా ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపట్టాక ఈ పాత నిబంధనను మళ్లీ తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. -
బ్రేకింగ్: ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. పరిస్థితి ఉద్రిక్తం!
-
ట్రంప్‌ను అంతం చేస్తాం : శవపేటికతో ఇరాన్ హోర్డింగ్ కలకలం
టెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హతమార్చేందుకు ఇరాన్ సరికొత్త కుట్రలు పన్నుతోందన్న నిఘా సమాచారం మేరకు ట్రంప్ చాలా ఘాటుగా స్పందించారు. తనను హతమార్చేందుకు ఇరాన్ ప్రయత్నిస్తే, ఇరాన్ సర్వనాశనం కాక తప్పదని హెచ్చరించారు. అయితే ఇటీవల ట్రంప్, నెతన్యాహూ సహా, 13 మంది నేతల పేర్లతో హిట్ లిస్ట్‌ను ప్రకటించింది ఇరాన్. తాజాగా టెహ్రాన్‌లోని ఎంగెలాబ్ స్క్వేర్‌లో డొనాల్డ్ ట్రంప్ శవపేటికలో ఉన్నట్లు చూపుతున్న ఒక భారీ బిల్బోర్డ్ (హోర్డింగ్) కలకలం రేపుతోంది. ఈ భారీ బిల్‌బోర్డ్‌లో ట్రంప్ బాడీని ఒక నల్లటి శవపేటికలో ఉన్నట్లు చూపించడం సంచలనంగా మారింది.అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత, ఇరాన్ ట్రంప్‌ను అంతం చేస్తామని ఇరాన్పదే పదే చెబుతోంది. ఆ శవపేటికపై పర్షియన్ , ఇంగ్లీష్ భాషలలో "మేము ట్రంప్‌ను చంపుతాము" (We Will Kill Trump) అని రాసి ఉంది. యుద్ధం ప్రారంభంలో దక్షిణ ఇరాన్‌లోని మినాబ్ నగరంలో ఒక ప్రాథమిక పాఠశాలపై జరిగిన దాడిని గుర్తుచేస్తూ "మినాబ్ పిల్లల జ్ఞాపకార్థం" అనే నినాదాలు కూడా ఉండటం గమనార్హం. ఇదీ చదవండి: మూడో పెళ్లి : ఫత్వా, లవ్ జిహాద్ ఆరోపణలపై స్పందించిన ఆమీర్కొత్తగా ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లో, తెరిచి ఉన్న నల్లటి శవపేటికలోంచి అమెరికా అధ్యక్షుడి మృతదేహం బయటకు తొంగి చూస్తున్నట్లుగా ఉంది. జుట్టు చెదిరిపోయి ఉంది, కళ్ళు, నోరు మూసుకుని ఉన్నాయి. ముందుకు పొడుచుకు వచ్చిన పొట్టపై ఉన్న ఎర్రటి టై మీద అతని చేతులు ఉన్నాయి. పాదాలు నిటారుగా పైకితేలి ఉన్నాయి.ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీంలీడర్ అలీ ఖమేనీ మరణించారు. ఈ దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, కోడలు, మనవడు కూడా మరణించారు. వీరితోపాటు ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నసీర్జాదే, రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మహమ్మద్ పాక్పూర్ తదితర కీలక సైనిక, రాజకీయ నాయకులు కూడా హతమయ్యారు. ఈ ఘోర హత్యలు ఇరాన్ ప్రజల్లో, ప్రభుత్వంలో ప్రతీకార జ్వాలలు రగిలిస్తున్నాయి. తమ నేతల హత్యలకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞచేసిన ఇరాన్ వ్యూహంలో భాగంగానే అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాలలో విప్లవాత్మక చిత్రాలు, యుద్ధ స్మారకాలు , సైనిక శక్తిని ప్రదర్శించే ఇలాంటి భారీ బిల్‌బోర్డ్‌లను ఏర్పాటు చేస్తోంది.ఇదీ చదవండి: కీలక ఫెడ్ పదవులు : రఘురామ్ రాజన్, మరో ఇద్దరు భారతీయ నిపుణులుకాగా ఇరాన్ బిల్‌బోర్డులపై బెదిరింపు లేదా వ్యంగ్య చిత్రాలు కొత్తేమీ కాదు. మే నెలలో, పాశ్చాత్య, ముఖ్యంగా అమెరికన్ ప్రేక్షకులను లక్ష్యంగా ఒక ద్విభాషా బిల్‌బోర్డులో, ట్రంప్ నోటికి కుట్లు వేసినట్లుగా, దానిపై హోర్ముజ్ జలసంధి చిత్రాన్ని, దాని పక్కన "ది బ్రేకింగ్ పాయింట్" అన్న బోర్డులను ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: ఏకంగా 10 అడుగుల కోబ్రా : చున్నీలా మెడలో చుట్టేసుకుంది -
అమెరికా కిరీటానికి చైనా సవాల్.. పవర్ గేమ్‌లో కొత్త మలుపు!
ఒకప్పుడు ప్రపంచ రాజకీయాల్లో అమెరికా పేరు అంటేనే ఆధిపత్యం, ప్రభావం, నాయకత్వానికి ప్రతీకగా భావించేవారు. ఆర్థిక శక్తి, సాంకేతిక ఆధిపత్యం, సైనిక బలం, అంతర్జాతీయ సంస్థలపై ప్రభావంతో అమెరికా దశాబ్దాలుగా ప్రపంచ వేదికపై అగ్రస్థానంలో కొనసాగుతోంది. కానీ ఇప్పుడు ప్రపంచ ప్రజాభిప్రాయంలో ఓ ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. తాజా ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే ప్రకారం, కొన్ని దేశాల్లో ప్రజలు అమెరికా కంటే చైనాపై ఎక్కువ సానుకూల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన ఈ అంతర్జాతీయ సర్వేలో 36 దేశాలు, ప్రాంతాల్లో ప్రజల అభిప్రాయాలను పరిశీలించారు. ఇందులో అనేక దేశాల్లో చైనా పట్ల సానుకూల దృక్పథం పెరిగినట్లు వెల్లడైంది. ముఖ్యంగా 25 దేశాల్లో చైనాపై ఉన్న అనుకూల అభిప్రాయాలు అమెరికాతో పోలిస్తే ఎక్కువగా నమోదయ్యాయి. ఇది ప్రపంచ శక్తి సమీకరణాల్లో మారుతున్న ధోరణులకు సంకేతంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే, దీని అర్థం ప్రపంచం మొత్తం చైనాను అమెరికా కంటే గొప్ప శక్తిగా అంగీకరించిందని కాదు. ప్రజల అభిప్రాయాలు ఒక్కో దేశంలో ఒక్కో విధంగా ఉన్నాయి. ఆర్థిక సంబంధాలు, భద్రతా ప్రయోజనాలు, రాజకీయ పరిస్థితులు, స్థానిక ప్రజల అనుభవాల ఆధారంగా అమెరికా, చైనాలపై అభిప్రాయాలు మారుతున్నాయి.చైనా పట్ల పెరుగుతున్న సానుకూలతకు ప్రధాన కారణాల్లో ఒకటి ఆ దేశ ఆర్థిక ప్రభావం. గత కొన్ని దశాబ్దాల్లో చైనా ప్రపంచ తయారీ కేంద్రంగా ఎదిగింది. ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాల్లో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రహదారులు, రైల్వేలు, పోర్టులు, విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా తన ప్రభావాన్ని పెంచుకుంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ వంటి ప్రాజెక్టుల ద్వారా అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలతో ఆర్థిక సంబంధాలను బలపరిచింది.మరోవైపు అమెరికాపై కొన్ని దేశాల్లో అభిప్రాయాలు మారడానికి అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు కారణమయ్యాయి. విదేశీ విధాన నిర్ణయాలు, యుద్ధాల్లో అమెరికా పాత్ర, ప్రపంచ వ్యవహారాల్లో దాని జోక్యం వంటి అంశాలపై కొన్ని ప్రాంతాల్లో విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్యం, కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అమెరికా విధానాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అయితే అమెరికా బలం ఇంకా గణనీయంగానే ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉండటం, డాలర్ ఆధిపత్యం, ఆధునిక సాంకేతిక రంగం, ప్రముఖ విశ్వవిద్యాలయాలు, సైనిక కూటములు వంటి అంశాల్లో అమెరికా ముందంజలో ఉంది. అనేక దేశాలు ఇప్పటికీ భద్రత, పెట్టుబడులు, సాంకేతిక సహకారం కోసం అమెరికాతో బలమైన సంబంధాలను కొనసాగిస్తున్నాయి. చైనాపై కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక ఆందోళనలు ఉన్నాయి. మానవ హక్కులు, రాజకీయ స్వేచ్ఛ, పారదర్శకత, దక్షిణ చైనా సముద్ర వివాదాలు వంటి అంశాలపై పలు దేశాలు చైనాను విమర్శిస్తున్నాయి. అందువల్ల చైనా పట్ల సానుకూల అభిప్రాయం పెరగడం అంటే అన్ని అంశాల్లో ఆ దేశానికి మద్దతు పెరిగిందని భావించలేం.ప్యూ సర్వేలో మరో ఆసక్తికర అంశం నాయకులపై ఉన్న అభిప్రాయాలు. కొన్ని దేశాల్లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పట్ల ఉన్న అభిప్రాయాలు అమెరికా అధ్యక్షుడి పట్ల ఉన్న అభిప్రాయాల కంటే మెరుగ్గా నమోదైనట్లు సర్వే వెల్లడించింది. ఇది వ్యక్తిగత నాయకత్వంపై ఉన్న అంతర్జాతీయ అభిప్రాయాల్లో కూడా మార్పులను సూచిస్తోంది. ఇక, భారత్ విషయానికి వస్తే పరిస్థితి కొంత భిన్నంగా ఉంటుంది. భారత్‌కు అమెరికాతో వ్యూహాత్మక, రక్షణ, సాంకేతిక సంబంధాలు పెరుగుతున్నాయి. అదే సమయంలో చైనా భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల్లో ఒకటైనా, సరిహద్దు వివాదాలు, భద్రతా అంశాలు రెండు దేశాల సంబంధాల్లో కీలకంగా ఉన్నాయి. అందుకే భారత్‌లో అమెరికా, చైనా పట్ల అభిప్రాయాలు ఇతర దేశాల కంటే ప్రత్యేకంగా ఉంటాయి.మొత్తంగా చూస్తే, ఈ ప్యూ సర్వే ప్రపంచ శక్తి సమీకరణాల్లో వస్తున్న మార్పులకు ఒక అద్దంలా కనిపిస్తోంది. అమెరికా ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ, చైనా ఆర్థిక, దౌత్య ప్రభావం వేగంగా విస్తరిస్తోంది. రాబోయే కాలంలో ప్రపంచ నాయకత్వ పోరు కేవలం సైనిక బలం లేదా ఆర్థిక శక్తితోనే కాకుండా... ప్రజల అభిప్రాయాలు, దౌత్య సంబంధాలు, అభివృద్ధి నమూనాలపై కూడా ఆధారపడనుంది. -
శత్రువే అయినా ప్రశంసించాల్సిందే.. ఇరాన్‌ను పొగిడిన ట్రంప్!
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతున్న వేళ.. డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ఆసక్తి రేపుతున్నాయి. ఒకవైపు ఇరాన్‌పై సైనిక ఒత్తిడి కొనసాగిస్తూనే.. మరోవైపు అదే దేశానికి ట్రంప్ బహిరంగంగా కృతజ్ఞతలు తెలిపారు. శత్రుదేశాన్నే ప్రశంసించేలా ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక ఓ ఆసక్తికర పరిణామం ఉంది.2024 డిసెంబర్ నుంచి ఇరాన్లో నిర్బంధంలో ఉన్న అమెరికా-ఇరాన్ ద్వంద్వ పౌరసత్వం కలిగిన డెనా కరారీకి తాజాగా విముక్తి లభించింది. ఆమెను ఇరాన్ విడుదల చేయడాన్ని 'సద్భావ సంకేతం' (Goodwill Gesture)గా అభివర్ణించిన ట్రంప్.. ఆ దేశ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ట్రూత్ సోషల్‌లో స్పందిస్తూ.. "ఆమె ఇప్పుడు సురక్షితంగా ఇరాన్ వెలుపల ఉంది. ఆరోగ్యం కూడా బాగానే ఉంది. ఈ సద్భావ చర్యను అమెరికా అభినందిస్తోంది" అని పేర్కొన్నారు.ట్రంప్ పోస్టు అనంతరం మానవ హక్కుల న్యాయవాది జారెడ్ జెన్సర్.. విడుదలైన మహిళ డెనా కరారీనేనని ధృవీకరించారు. 2024లో కుటుంబ సభ్యులను కలిసేందుకు ఇరాన్‌కు వెళ్లిన ఆమెను అక్కడి అధికారులు దేశం విడిచి వెళ్లనీయలేదు. అనంతరం 2025లో అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల తర్వాత ఆమెపై గూఢచర్యం ఆరోపణలు నమోదు చేశారు. అంతకుముందు.. డెనా అమెరికాలోని ఓ టెక్నాలజీ కంపెనీలో ఉద్యోగం చేయడంతో పాటు ఇరాన్లో పేద పిల్లల కోసం సేవా కార్యక్రమాలు నిర్వహించే స్వచ్ఛంద సంస్థను నడిపేవారు. డెనా కరారీ విడుదలకు ట్రంప్ చేసిన నిరంతర ప్రయత్నాలే కారణమని జారెడ్ జెన్సర్ తెలిపారు. ప్రస్తుతం ఆమె అమెరికాకు తిరుగు ప్రయాణంలో ఉన్నట్లు వెల్లడించారు. గత రెండు దశాబ్దాల్లో 20 దేశాల్లో 340 మందికిపైగా ఖైదీల విడుదలకు జెన్సర్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉండగా.. ఇరాన్‌తో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని ట్రంప్ మరోసారి పేర్కొన్నారు. ‘‘ఇరాన్ చర్చలు కోరుకుంటోంది. వారితో ఒప్పందం కుదురుతుందేమో చూడాలి. అయితే వారు సరిగ్గా, మర్యాదగా ప్రవర్తించాలి (They better behave)’’ అంటూ హెచ్చరించారు. అలా కాదని ఘర్షణలు కొనసాగితే ఇరాన్ త్వరలోనే ఓటమి పాలవుతుందని కూడా వ్యాఖ్యానించారు. అయితే చర్చలు ఎప్పుడు ప్రారంభమవుతాయన్న విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.మరోవైపు అమెరికా హర్ముజ్ జలసంధి పరిసరాల్లో ఇరాన్‌కు చెందిన తీర రక్షణ వ్యవస్థలు, క్షిపణి ప్రయోగ కేంద్రాలపై రెండో విడత దాడులు కొనసాగిస్తోంది. దీనికి ప్రతిస్పందించిన ఇరాన్.. ఇది తమ ఉనికికే సంబంధించిన యుద్ధమని పేర్కొంటూ, అవసరమైతే ప్రాంతీయ ఇంధన ఎగుమతులకు అంతరాయం కలిగించే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. -
'బిగ్ న్యూస్' అంటూ ట్రంప్ సస్పెన్స్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఉత్కంఠ రేపుతున్నారు. ఇవాళ రాత్రికి ప్రత్యేక ప్రైమ్‌టైమ్ ప్రసంగం చేయనున్నట్లు ప్రకటించారు. "ఇది నిజంగానే చాలా పెద్ద వార్త" అంటూ ఆసక్తిని మరింత పెంచారు. అయితే ఆ ప్రకటన ఏంటన్నది మాత్రం ఇప్పటికీ రహస్యంగానే ఉంచారు.వైట్‌హౌస్ తెలిపిన వివరాల ప్రకారం.. ట్రంప్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. దీంతో.. యుద్ధం సంబంధిత ప్రకటన కాదనేది స్పష్టమైపోయింది. అయితే.. ప్రసంగంలో ప్రధానంగా అమెరికా ఎన్నికల వ్యవస్థ, మరీ ముఖ్యంగా 2020 అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన కొత్త సమాచారం, ఓటింగ్ యంత్రాల భద్రత వంటి అంశాలు ఉండే అవకాశం ఉంది. అలాగే తాజాగా డీక్లాసిఫై చేసిన నిఘా సమాచారాన్ని కూడా ఆయన ప్రస్తావించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.ఈ ప్రసంగం నవంబర్‌లో జరగనున్న అమెరికా మధ్యంతర (మిడ్‌టర్మ్) ఎన్నికలకు కొద్ది నెలల ముందే రావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్‌పై ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో ట్రంప్ తన మద్దతుదారులను మరింత ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో ఆయన ప్రజల్లో ఎన్నికల వ్యవస్థపై అనుమానాలు పెంచే అవకాశం ఉందని డెమొక్రాట్లు విమర్శిస్తున్నారు.మళ్లీ అదే వివాదమా?2020 అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ఓడిపోయిన ట్రంప్.. అప్పటి నుంచి ఎన్నికల్లో భారీ అక్రమాలు జరిగాయని పదేపదే ఆరోపిస్తున్నారు. అయితే ఆ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లభించలేదని అనేక దర్యాప్తులు, కోర్టు విచారణలు స్పష్టం చేశాయి. అమెరికా సైబర్ సెక్యూరిటీ సంస్థ (CISA) కూడా 2020 ఎన్నికలను అమెరికా చరిత్రలోనే అత్యంత భద్రమైన ఎన్నికలుగా పేర్కొంది.అయినప్పటికీ ట్రంప్ ప్రభుత్వం 2020 ఎన్నికలకు సంబంధించిన పలు పత్రాలను సేకరించడం, దర్యాప్తులను కొనసాగించడం, ఓటింగ్ విధానాల్లో మార్పులకు ప్రయత్నించడం వంటి చర్యలు చేపడుతోంది. ఓటర్ల గుర్తింపు నిబంధనలు కఠినతరం చేయడం, మెయిల్-ఇన్ బ్యాలెట్లపై పరిమితులు విధించడం వంటి అంశాలను కూడా ట్రంప్ ముందుకు తీసుకొస్తున్నారు.ఇక ట్రంప్ ప్రసంగంపై డెమొక్రాట్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలపై ఆధారంలేని ఆరోపణలను మరోసారి ప్రజల ముందుకు తీసుకువచ్చి ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని దెబ్బతీయొద్దని వారు హెచ్చరిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం.. శుక్రవారం ఉదయం 6గం. ప్రాంతంలో ట్రంప్ ప్రసంగం ఉండనుంది.. -
ట్రంప్ ముఖచిత్రంతో బంగారు డాలర్
వాషింగ్టన్: అమెరికా 250 ఏళ్ల అవతరణ వేడుకలను పురస్కరించుకుని ముద్రించ తలపెట్టిన దేశాధ్యక్షుడు ట్రంప్ ముఖచిత్రంతో కూడిన ఒక డాలర్ బంగారు నాణెం ఫొటోలను అమెరిక ఆర్థికమంత్రి స్కాట్ బెస్సెంట్ బుధవారం విడుదల చేశారు. అమెరికా దేశభక్తికి, స్వేచ్ఛకు ఇవి చిహ్నాలని ఆయన ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. అమెరికా ఫెడరల్ చట్టాల ప్రకారం జీవించి ఉన్న వ్యక్తుల చిత్రాలతో నాణేలను ముద్రించడంపై నిషేధముంది. అయితే, అమెరికా 250వ వార్షికోత్సవ ప్రత్యేక డిజైన్ల చట్టం–2020 ప్రకారం ఈ నాణెం విడుదలకు చట్టపరంగా ఎటువంటి అడ్డంకులు లేవని ఆర్థికమంత్రిత్వ శాఖ చెబుతోంది. నాణెం ముద్రణ ఇప్పటికే మొదలైందని, త్వరలో మార్కెట్లోకి విడుదలవుతుందని తెలిపింది. గతంలో 1926లో అమెరికా 150వ వార్షికోత్సవం సందర్భంగా అప్పటి 30వ అధ్యక్షుడు కాలి్వన్ కూలిడ్జ్ తన సొంత చిత్రం, జార్జ్ వాషింగ్టన్ చిత్రంతో కూడిన అర–డాలర్ నాణేన్ని విడుదల చేశారు. -
'రేపు రాత్రి నుంచే నరకం చూపిస్తాం'.. ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరాయి. శాంతి ఒప్పందం విఫలమయ్యాక ఇరాన్‌పై అమెరికా దాడులను ఉధృతం చేసింది. అందుకు ప్రతిగా బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేస్తోంది.ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్ పద్ధతి మార్చుకుంటే మంచిది అని, లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు."నాకు డెడ్లైన్లు పెట్టడం నచ్చదు. కానీ అక్కడ ఏం జరుగుతుందో ఇరాన్‌కు బాగా తెలుసు. వారు సైలెంట్‌గా ఉంటే మంచిది. మేము రేపు రాత్రి ఇరాన్‌పై తీవ్రమైన దాడులు చేయబోతున్నాం. ఆ తర్వాత రోజు కూడా మా దాడులు కొనసాగుతాయి. వచ్చే వారం నుంచి పరిస్థితి చాలా దారుణంగా మారబోతుంది. మేము వారి పవర్ ప్లాంట్లు, వంతెనలను ధ్వంసం చేయబోతున్నాం. వారు చర్చలకు రాకపోతే వాటన్నింటినీ కూల్చేస్తాం" అని ట్రంప్ బుధవారం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. -
కల్లోల పశ్చిమాసియా!
అమెరికా–ఇరాన్‌ల మధ్య గతవారం రోజులుగా అడపాదడపా సాగుతున్న దాడులు మంగళవారానికల్లా మరింత ఉగ్రరూపం దాల్చాయి. ఇప్పటికే అమెరికా స్థావరాలపై ఇరాన్ చేసిన దాడులు ఇద్దరు భారతీయ నావికుల ప్రాణాలు తీశాయి. దక్షిణ ఇరాన్‌పై అమెరికా సాగించిన దాడుల్లో 30 మంది పౌరులు, ఏడుగురు సైనికులు మరణించటం, దాదాపు 260 మంది గాయపడటం గమనిస్తే గతానికి మించి ఈసారి పౌర ప్రాంతాలను అమెరికా లక్ష్యంగా చేసుకుందని తెలుస్తుంది. అంతేకాదు... అరుదుగా చేసే పగటిపూట దాడులు కూడా మొదలెట్టింది. ఇరాన్ సైతం అమెరికా మిత్ర దేశాలపై ప్రతీకార దాడులు చేస్తోంది. గత నెల 17న ఇరు దేశాలమధ్యా కుదిరిన శాంతి ఒప్పందంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు చిత్తశుద్ధి లేదని అమెరికన్ కాంగ్రెస్‌లోని పాలక, విపక్ష నేతలు గ్రహించారు. యుద్ధం ఎప్పుడో అయిపోయిందని బొంకటం మొదలుకొని కాల్పుల విరమణకు అంగీకారం కుదిరిందని చెప్పడం వరకూ ట్రంప్ ఒక పథకం ప్రకారం నడిపించారు. తన అధికారాలకు పరిమితులు విధిస్తూ యుద్ధ అధికారాల చట్టంకింద సెనేట్‌లోనూ, ప్రతినిధుల సభలోనూ చేసిన రెండు తీర్మానాలతో బెంబేలెత్తిన ట్రంప్ మొదట యుద్ధం ఎప్పుడో ఆగిందని అబద్ధమాడారు. మరికొన్ని రోజులు గడిచాక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని, శాంతి ఒప్పందం దిశగా ఇది తొలి అడుగ న్నారు. తీరా ఇప్పుడు మళ్లీ యుద్ధ భేరి మోగించారు. నిజానికి అమెరికా దాడులు ఆపింది ఎప్పుడూ లేదు. ఏదో వంకతో ఇరాన్‌పై కొనసాగిస్తూనే ఉంది. కేవలం కొంత వ్యవధి గడిచింది గనుకే యుద్ధం మొదలైనట్టు అధికారికంగా కాంగ్రెస్‌కు వర్తమానం పంపారు. పర్యవసానంగా 60 రోజులపాటు మళ్లీ యుద్ధం సాగించవచ్చన్నది ఆయన వ్యూహం. ఇది చెల్లుబాటు కాదనీ, ఈ విషయంలో ట్రంప్ ఇష్టారాజ్యం సాగనివ్వబోమనీ ఇరు పార్టీల ప్రతినిధులూ చెబుతున్నది ఆచరణలో ఎంతవరకూ నెరవేరుతుందో చూడాలి. గ్యాస్ ధరలు అపరిమితంగా పెరగటం, ఇతరేతర సరుకులు సైతం అందుబాటులో లేకపోవటంతో జనం బెంబే లెత్తుతుండగా మరిన్ని దాడులతో ఇరాన్ దారి కొస్తుందని ట్రంప్ కలగంటున్నారు. ఇరాన్‌తో లడాయి మొదలయ్యాక గ్యాస్ కోసం అమెరికా ఇంతవరకూ 5,640 కోట్ల డాలర్లు అదనంగా వెచ్చించిందని డెమాక్రాట్ల ఆధ్వర్యంలోని ఉమ్మడి ఆర్థిక కమిటీ అంచనా వేసింది. తాజా పరిణామాలతో వార్షిక రక్షణ విధాన బిల్లు ప్రవేశించకుండా సెనేట్‌లో 50–46 ఓట్ల తేడాతో నిరోధించటంతో ఆయన దిక్కుతోచని స్థితిలో పడ్డారనే చెప్పాలి. సొంత పార్టీకి చెందినవారే అడ్డం తిరగటంతో బిల్లు సభాప్రవేశానికి అవసర మైన 60 ఓట్లు లభించలేదు. హార్మూజ్ జలసంధి విషయంలో ఏం చేయాలో ట్రంప్‌కు పాలుబోవడం లేదని ఆయన పరస్పర విరుద్ధ ప్రకటనలే చెబుతున్నాయి. ఇకపై హార్మూజ్‌లో నౌకల రాక పోకలు సక్రమంగా జరిగేలా చూడటం తమ బాధ్యతనీ, అందుకు 20 శాతం సుంకం వసూలు చేస్తామనీ ప్రకటించి 24 గంటలు గడవకుండా మాట మార్చారు. దేశదేశాల అధినేతలూ అమెరికాలో వందలకోట్ల డాలర్లు పెట్టుబడి పెడతామనటంతో నిర్ణయం మారిందట! అమెరికా, దాని మిత్రపక్షాలూ ఎప్పటిలాగే స్వేచ్ఛాయుత హార్మూజ్ కొన సాగాలని కోరుతూ రాగా, ఇప్పుడు అందుకు విరుద్ధమైన ప్రకటన రిపబ్లికన్లను సైతం దిగ్భ్రమపరిచింది. అంతర్జాతీయ జలరవాణా మార్గంపై ఏ దేశమైనా ఎలా పెత్తనం చేస్తుందన్న వారి ప్రశ్నకు ట్రంప్ దగ్గర జవాబు లేదు. సాధారణ సమయాల్లో హార్మూజ్‌ను రోజుకు 130 రవాణా నౌకలు దాటేవి. అవికాస్తా సోమవారానికి 10కి పడిపోయాయి. తాజా దాడుల తర్వాత అది పూర్తిగా స్తంభించి పోయింది. యుద్ధాలు, అస్థిరత చమురు కార్పొరేషన్లకు అసాధారణ లాభాలు తెస్తాయి. కానీ చమురు, సహజవాయు దిగుమతులపై ఆధారపడ్డ దేశాలు ఆర్థికంగా కుంగి పోతాయి. పర్యావరణ పరిరక్షణ కోసమైనా పునరుత్పాదక ఇంధన వనరులపై దృష్టి కేంద్రీకరిద్దామని ఇన్ని దశాబ్దాలుగా ఏ దేశమూ చిత్తశుద్ధితో అనుకోలేదు. ఎక్కడో ఒకచోట తలెత్తే సంక్షోభానికి ప్రపంచమంతా మూల్యం చెల్లించే ప్రస్తుత విధానం మంచిదో, ప్రత్యామ్నాయ వనరుల ఆసరాతో ఉన్నంతలో మెరుగ్గా మనుగడ సాగించటం ఉత్తమమో ప్రపంచ దేశాలన్నీ తేల్చుకోవటం తప్ప వేరే మార్గం లేదు. -
పీకాక్స్ పర్వతంపై ట్రంప్ గురి.. అవసరమైతే లేపేస్తాం
-
భారత్, చైనాకు గుడ్‌న్యూస్.. అమెరికా కీలక నిర్ణయం!
రష్యా చమురు కొనుగోళ్లపై భారత్, చైనాలకు ఊరట లభించింది. రష్యా ఇంధన రంగాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా చట్టసభ సభ్యులు తీసుకొచ్చిన కఠిన ఆంక్షల బిల్లులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. తొలుత రష్యా నుంచి చమురు, సహజ వాయువు దిగుమతి చేసుకునే దేశాలపై 500 శాతం వరకు భారీ టారిఫ్‌లు విధించే ప్రతిపాదన ఉండగా, తాజాగా సవరించిన బిల్లులో ఆ పరిమితిని 100 శాతానికి తగ్గించారు. దీంతో అమెరికా టారిఫ్ ముప్పు నుంచి భారత్, చైనాలకు తాత్కాలిక ఉపశమనం లభించినట్లైంది.రష్యాపై ఒత్తిడి పెంచేందుకు రూపొందించిన ఈ ద్వైపాక్షిక బిల్లును రిపబ్లికన్ పార్టీకి చెందిన దివంగత సెనేటర్ లిండ్సే గ్రాహమ్, డెమొక్రటిక్ సెనేటర్ రిచర్డ్ బ్లూమెంథాల్ తొలిసారిగా ప్రవేశపెట్టారు. రష్యా అధికారులు, సంస్థలపై ఆంక్షలు విధించడంతో పాటు.. రష్యా ఇంధనంపై ఆధారపడుతున్న దేశాలపై టారిఫ్‌ల ద్వారా ఒత్తిడి తీసుకురావడం ఈ బిల్లు ప్రధాన లక్ష్యం.ప్రారంభ ప్రతిపాదనలో రష్యా నుంచి ఇంధనం దిగుమతి చేసుకునే దేశాలపై ఒకే విధంగా 500 శాతం భారీ సుంకాలు విధించే అవకాశం ఉండేది. ఈ నిబంధన అమల్లోకి వస్తే రష్యా చమురుకు ప్రధాన కొనుగోలుదారులైన భారత్, చైనా వంటి దేశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉండేది. అయితే తాజాగా సవరించిన వెర్షన్లో రష్యా చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై విధించే టారిఫ్‌ను గరిష్ఠంగా 100 శాతానికి తగ్గించారు.కొత్త ప్రతిపాదనలో కొన్ని దేశాలకు మినహాయింపులు కూడా కల్పించారు. రష్యా సహజ వాయువు దిగుమతులు మొత్తం రష్యా ఎగుమతుల్లో 15 శాతం కంటే తక్కువగా ఉన్న దేశాలు, ఆ దిగుమతులను తగ్గించేందుకు గణనీయమైన చర్యలు తీసుకుంటున్నట్లయితే ఆ దేశాలకు మినహాయింపు లభించే అవకాశం ఉంది. ఈ నిబంధనతో జపాన్, ఫ్రాన్స్, హంగేరీ, బెల్జియం వంటి దేశాలు ప్రయోజనం పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ బిల్లుకు ప్రస్తుతం అమెరికా సెనేట్‌లో మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే 26 మంది సెనేటర్లు సహ-ప్రతిపాదకులుగా ఉన్నారని సెనేట్ వర్గాలు తెలిపాయి. మరింత మంది సభ్యులు మద్దతు ఇస్తారని, బిల్లు ఆమోదం పొందే అవకాశాలు ఉన్నాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.రష్యా చమురు కొనుగోలు చేసే అతిపెద్ద దేశాల్లో చైనా, భారత్ ముందంజలో ఉన్నాయి. వీటితో పాటు స్లోవేకియా, హంగేరీ, అజర్బైజాన్ కూడా రష్యా ముడి చమురు దిగుమతిదారులుగా ఉన్నాయి. రష్యా సహజ వాయువు దిగుమతుల్లో చైనా, ఫ్రాన్స్, జపాన్, హంగేరీ, బెల్జియం ప్రధాన కొనుగోలుదారులుగా ఉన్నాయి. ఇక, రష్యా చమురు ఆదాయం తగ్గించడం ద్వారా ఉక్రెయిన్ యుద్ధంపై మాస్కోపై ఒత్తిడి పెంచాలన్నది అమెరికా లక్ష్యం. అయితే భారత్ మాత్రం తన ఇంధన అవసరాలు, ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తోంది. చౌక ధరలకు లభించే రష్యా ముడి చమురు భారత ఇంధన భద్రతకు కీలకంగా మారింది. 500 శాతం టారిఫ్ ప్రతిపాదన నుంచి 100 శాతం పరిమితికి మారడం భారత్‌కు తక్షణ ఉపశమనంగా కనిపిస్తోంది. అయితే రష్యా చమురు అంశం అమెరికా-భారత్ సంబంధాల్లో, అలాగే ప్రపంచ ఇంధన రాజకీయాల్లో భవిష్యత్తులో కూడా కీలక అంశంగానే కొనసాగనుంది. -
చీకటితో పోరాడుతున్న క్యూబా.. ట్రంప్ శాపమేనా?
క్యూబా మరోసారి తీవ్రమైన విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. జూలై 15న దేశంలోని జాతీయ విద్యుత్ గ్రిడ్ (National Electric System - SEN) పూర్తిగా కుప్పకూలడంతో దాదాపు మొత్తం దేశం చీకటిలో మునిగిపోయింది. కేవలం రెండు వారాల వ్యవధిలో ఇది మూడో దేశవ్యాప్త బ్లాక్అవుట్ కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.అధికారుల వివరాల ప్రకారం.. తూర్పు క్యూబాలోని హోల్గుయిన్ (Holguín) ప్రాంతంలోని ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఫ్రీక్వెన్సీ సమస్య తలెత్తింది. దీంతో జాతీయ విద్యుత్ గ్రిడ్ అస్థిరమై పూర్తిగా కుప్పకూలింది. ఫలితంగా రాజధాని హవానాతో పాటు దాదాపు మొత్తం దేశానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.సంక్షోభానికి ప్రధాన కారణాలు ఇవి:తీవ్రమైన ఇంధన కొరత: క్యూబాకు అవసరమైన ఇంధనంలో కేవలం 40 శాతం మాత్రమే దేశీయంగా ఉత్పత్తి అవుతుంది. మిగిలినది దిగుమతులపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం విదేశాల నుంచి ఇంధన సరఫరా తీవ్రంగా తగ్గిపోయింది.పాత విద్యుత్ కేంద్రాలు: దేశంలోని అనేక థర్మల్ పవర్ ప్లాంట్లు 30–40 ఏళ్ల కంటే పాతవి. నిర్వహణ లోపం, విడిభాగాల కొరత కారణంగా తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి.ఆర్థిక సంక్షోభం: విదేశీ మారకద్రవ్యం కొరత కారణంగా కొత్త విద్యుత్ ప్రాజెక్టులు చేపట్టడం, అవసరమైన ఇంధనం కొనుగోలు చేయడం ప్రభుత్వానికి కష్టంగా మారింది.ప్రజలపై తీవ్ర ప్రభావం..ఈ బ్లాక్అవుట్ వల్ల దేశవ్యాప్తంగా సాధారణ జీవనం దెబ్బతింది. ఆసుపత్రులు అత్యవసర సేవల కోసం జనరేటర్లపై ఆధారపడుతున్నాయి. తాగునీటి పంపింగ్ వ్యవస్థలు నిలిచిపోవడంతో నీటి సరఫరా దెబ్బతింది. మొబైల్, ఇంటర్నెట్ సేవలు అంతరాయం కలిగాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయక రవాణా వ్యవస్థలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఫ్రిజ్‌లు పనిచేయక ఆహార పదార్థాలు పాడైపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల మధ్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.విద్యుత్ పునరుద్ధరణ ఎలా చేస్తున్నారు?క్యూబా విద్యుత్ సంస్థ దేశమంతా ఒకేసారి విద్యుత్ అందించలేకపోవడంతో "మైక్రో గ్రిడ్లు" (Micro-islands) ఏర్పాటు చేస్తోంది. చిన్న చిన్న ప్రాంతాల్లో ముందుగా విద్యుత్ సరఫరా ప్రారంభించి, ఆ తర్వాత వాటిని కలిపి జాతీయ గ్రిడ్‌ను క్రమంగా పునరుద్ధరించే ప్రయత్నం కొనసాగుతోంది. ముందుగా ఆసుపత్రులు, నీటి సరఫరా కేంద్రాలు, ఆహార ఉత్పత్తి కేంద్రాలకు విద్యుత్ అందిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే విద్యుత్ పాక్షికంగా పునరుద్ధరించబడింది.అమెరికా ఆంక్షల ప్రభావంక్యూబా ప్రభుత్వం ఈ పరిస్థితికి అమెరికా విధించిన ఆర్థిక, ఇంధన ఆంక్షలే ప్రధాన కారణమని చెబుతోంది. అమెరికా చర్యల వల్ల వెనిజులా, మెక్సికో వంటి దేశాల నుంచి చమురు సరఫరా గణనీయంగా తగ్గిందని హవానా ఆరోపిస్తోంది. మరోవైపు, విశ్లేషకులు మాత్రం క్యూబా విద్యుత్ వ్యవస్థలో దశాబ్దాలుగా కొనసాగుతున్న పెట్టుబడుల కొరత, పాత మౌలిక వసతులు, నిర్వహణ లోపాలు కూడా సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేశాయని పేర్కొంటున్నారు.కాగా, 2026లోనే క్యూబాలో ఇది ఐదో ప్రధాన జాతీయ స్థాయి విద్యుత్ అంతరాయం. వరుస బ్లాక్అవుట్ల కారణంగా ప్రజల సాధారణ జీవితం తీవ్రంగా దెబ్బతింటోంది. అనేక కుటుంబాలు సోలార్ ప్యానెల్లు, బ్యాటరీలు లేదా చిన్న జనరేటర్లపై ఆధారపడాల్సి వస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ఈ సంక్షోభం తీవ్ర ప్రభావం చూపుతోంది. -
హర్ముజ్‌లో మళ్లీ అమెరికా బ్లాకేడ్.. ఇరాన్ సంచలన ప్రకటన
పశ్చిమాసియాలో యుద్ధ మంటలు మరోసారి ఎగిసిపడే పరిస్థితి కనిపిస్తోంది. వరుసగా నాలుగో రోజూ అమెరికా-ఇరాన్ మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. మధ్యవర్తుల ప్రయత్నాలతో ఉద్రిక్తతలు తగ్గి.. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వస్తుందని అంతా భావించిన వేళ.. పరిణామాలు మళ్లీ మారిపోయాయి. పరస్పర ఆరోపణలు, కవ్వింపు చర్యలతో శాంతి ఒప్పందం ప్రశ్నార్థకంగా మారింది. హర్ముజ్ జలసంధిపై అమెరికా తీసుకున్న తాజా నిర్ణయం ఒప్పందాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఇరాన్ ఆరోపించింది. దీంతో ఆ అవగాహన ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ఇరాన్ విదేశాంగ శాఖ సంచలన ప్రకటన చేసింది.గత నెలలో స్విట్జర్లాండ్ వేదికగా ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (MoU) ప్రకారం.. ఘర్షణలను నిలిపివేసి, రెండు నెలల కాలపరిమితిలో శాంతి ఒప్పందం దిశగా ముందుకు సాగాల్సి ఉంది. ఇందులో కీలకమైన అణు అంశంపై ఒప్పందం కూడా భాగంగా ఉంది. అయితే అమెరికా పదేపదే ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించిందని ఇరాన్ ఆరోపిస్తోంది. ముఖ్యంగా ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా మళ్లీ నౌకాదళ దిగ్బంధాన్ని అమలు చేయడం.. ఈ ఒప్పందాన్ని పూర్తిగా దెబ్బతీసిందని టెహ్రాన్ మండిపడుతోంది.హర్ముజ్‌పై మళ్లీ ఆధిపత్య పోరుప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి మరోసారి ఘర్షణ కేంద్రంగా మారింది. ఇరాన్‌కు చెందిన నౌకలు ఈ మార్గంలో ప్రయాణించే విషయంలో అమెరికా ఆంక్షలు విధించడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా చర్యలకు ప్రతిస్పందనగా ఇరాన్ మరోసారి దాడులకు దిగిందని సమాచారం. మధ్యప్రాచ్యంలో అమెరికా సైనిక స్థావరాలు ఉన్న ప్రాంతాలపై కూడా ఇరాన్ ప్రతీకార చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గంలో రవాణా అయ్యే చమురు, సహజ వాయువులో భారీ వాటా హర్ముజ్ మార్గం గుండా సాగుతుంది. అందుకే ఈ ప్రాంతంలో ఏర్పడే ఏ సంక్షోభమైనా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది."హర్ముజ్‌పై పూర్తి ఆధిపత్యం మాదే"ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరీబాబాది సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధ పరిస్థితుల్లో హర్ముజ్ జలసంధిపై పూర్తి నియంత్రణ సాధించేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. "ఎలాంటి మూల్యం చెల్లించాల్సి వచ్చినా హర్ముజ్‌పై మా సార్వభౌమ హక్కును కాపాడుకుంటాం" అని ఆయన పేర్కొన్నట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. సాధారణ పరిస్థితుల్లో హర్ముజ్ జలసంధి నిర్వహణలో ఇరాన్‌తో పాటు ఒమన్‌కూ పాత్ర ఉంటుంది. అయితే జాతీయ భద్రత దృష్ట్యా ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో మొత్తం మార్గంపై నియంత్రణ అవసరమని ఇరాన్ వాదిస్తోంది.చర్చలకు నో చెప్పిన ఇరాన్అమెరికాతో మళ్లీ చర్చలు జరిపే ఉద్దేశం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. తమపై ఒత్తిడి పెంచే చర్యలను కొనసాగిస్తే.. తగిన విధంగా స్పందిస్తామని హెచ్చరించింది. ఇప్పటికే ఇరు దేశాల మధ్య ప్రతీకార దాడులు కొనసాగుతుండగా.. తాజాగా ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ఇరాన్ ప్రకటన చేయడం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది.హర్ముజ్‌పై బ్లాకేడ్.. మళ్లీహర్ముజ్ జలసంధి పరిణామాల్లో అమెరికా బ్లాకేడ్ కీలక అంశంగా మారింది. ఇరాన్‌పై ఒత్తిడి పెంచే చర్యల్లో భాగంగా అమెరికా తొలిసారి ఏప్రిల్ 13న ఇరాన్ నౌకాశ్రయాలకు వెళ్లే, అక్కడి నుంచి బయటకు వచ్చే నౌకలపై నౌకాదళ దిగ్బంధాన్ని ప్రారంభించింది. ఈ చర్యతో గల్ఫ్ ప్రాంతంలో నౌకాయాన ఉద్రిక్తతలు పెరిగాయి. అయితే అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి అవగాహన (MoU) కుదిరిన తర్వాత పరిస్థితులు కొంత చల్లబడ్డాయి. ఆ ఒప్పందంలో భాగంగా అమెరికా జూన్ 18న బ్లాకేడ్‌ను ఎత్తివేసింది. కాల్పుల విరమణ కొనసాగుతుందని, తదుపరి చర్చలకు మార్గం సుగమం అవుతుందని భావించారు. కానీ తాజాగా మళ్లీ ఉద్రిక్తతలు పెరగడంతో అమెరికా జూలై 14 నుంచి ఇరాన్ నౌకాశ్రయాలపై నౌకాదళ దిగ్బంధాన్ని పునరుద్ధరించింది. ఇరాన్ మాత్రం ఈ చర్యను ఒప్పంద ఉల్లంఘనగా అభివర్ణిస్తూ.. శాంతి ఒప్పందాన్ని అమెరికానే నిర్వీర్యం చేసిందని ఆరోపిస్తోంది.ప్రపంచానికి కొత్త ఆందోళనహర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు మరింత పెరిగితే.. దాని ప్రభావం అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణకే పరిమితం కాకపోవచ్చు. ప్రపంచ ఇంధన సరఫరాలో అత్యంత కీలకమైన మార్గాల్లో ఒకటైన ఈ జలసంధిలో రవాణాకు ఆటంకాలు ఏర్పడితే.. అంతర్జాతీయ చమురు మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే ముడిచమురు, సహజ వాయువులో భారీ వాటా హర్ముజ్ మార్గం గుండా సాగుతుంది. ఈ మార్గంలో ఏ చిన్న అంతరాయం ఏర్పడినా సరఫరా వ్యవస్థ దెబ్బతిని.. చమురు ధరలు ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉంది. దాని ప్రభావం పెట్రోల్, డీజిల్ ధరల నుంచి.. రవాణా ఖర్చులు, నిత్యావసర వస్తువుల ధరల వరకు కనిపించే అవకాశం ఉంటుంది.ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పలు సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ.. హర్ముజ్‌లో సంక్షోభం మరింత ముదిరితే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే భారత్ వంటి దేశాలు పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాయి. అందుకే హర్ముజ్ జలసంధిపై అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు కేవలం రెండు దేశాల సమస్యగా కాకుండా.. ప్రపంచ ఇంధన భద్రతకు, అంతర్జాతీయ ఆర్థిక స్థిరత్వానికి కొత్త సవాలుగా మారాయి. -
మాస్కోతో దోస్తీ.. భారత్‌పైనా ట్రంప్ గురి!
రష్యా నుంచి ముడిచమురు దిగుమతుల విషయంలో భారత్‌కు అమెరికా మరోసారి గట్టి హెచ్చరికలు పంపుతోంది. ఇప్పటివరకు కొన్ని వెసులుబాట్లతో కొనసాగిన పరిస్థితులకు తెరదించేలా.. రష్యా ఇంధన రంగంతో వ్యాపారాలు కొనసాగించే దేశాలపై భారీ సుంకాలు విధించే ప్రతిపాదన సిద్ధం చేసింది. అయితే మిత్రదేశం భారత్‌కు షాక్ ఇస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దానికి పూర్తి మద్దతు తెలిపినట్లు వైట్‌హౌస్ వెల్లడించింది.రష్యాపై ఆంక్షలను మరింత కఠినతరం చేసే ఓ బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ప్రకటించినట్లు వైట్‌హౌస్ వెల్లడించింది. ఈ విషయాన్ని ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీ అధికారికంగా ధృవీకరించింది. ‘సాంక్షనింగ్ రష్యా యాక్ట్’ పేరుతో తీసుకొచ్చిన ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే.. రష్యా ఇంధన రంగంతో సంబంధాలు కొనసాగించే దేశాలపై అమెరికా అధ్యక్షుడికి భారీ సుంకాలు విధించే అధికారం లభిస్తుంది. ఈ బిల్లులో భాగంగా దిగుమతులపై గరిష్ఠంగా 500 శాతం వరకు టారిఫ్‌లు విధించే అవకాశం ఉంది. అంటే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాల ఎగుమతులు తీవ్రంగా ప్రభావితమయ్యే పరిస్థితి ఏర్పడొచ్చు.టార్గెట్‌లో భారత్, చైనాఈ బిల్లును ముందుకు తీసుకెళ్లిన రిపబ్లికన్ నేత లిండ్సే గ్రాహమ్ గతంలోనే భారత్, చైనాలను ప్రధానంగా ప్రస్తావించారు. రష్యా చమురు, గ్యాస్ ఆదాయాలకు ఈ రెండు దేశాలే కీలక ఆధారాలని ఆయన వాదించారు. భారత్, చైనా కలిసి రష్యా ఇంధన ఎగుమతుల్లో భారీ వాటాను కలిగి ఉన్నాయని పేర్కొంటూ.. ఈ డిమాండ్‌ను తగ్గించడం ద్వారా మాస్కోపై ఆర్థిక ఒత్తిడి పెంచవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ బిల్లుకు బలమైన మద్దతుదారుగా ఉన్న గ్రాహమ్.. ఇటీవల ఉక్రెయిన్ పర్యటన ముగించుకుని అమెరికాకు తిరిగొచ్చిన అనంతరం ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన మరణం తర్వాత కూడా ఈ బిల్లును ముందుకు తీసుకెళ్లాలని పలువురు సెనేటర్లు భావిస్తున్నారు.భారత్‌కు ఎందుకు ఆందోళన?ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యా నుంచి తక్కువ ధరకు లభిస్తున్న ముడిచమురు భారత్‌కు కీలకంగా మారింది. దేశ ఇంధన అవసరాలను దృష్టిలో పెట్టుకునే రష్యా నుంచి చమురు దిగుమతులు చేస్తున్నామని భారత్ స్పష్టం చేస్తోంది. అయితే అమెరికా కొత్త ఆంక్షలు అమల్లోకి వస్తే.. భారత్ ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఫార్మా, టెక్స్టైల్స్, ఐటీ సేవలు రంగాలు ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశముందని అంచనా. 500 శాతం టారిఫ్‌లు అమలైతే భారత ఆర్థిక వృద్ధి దాదాపు 0.5 శాతం వరకు తగ్గే ప్రమాదం ఉందని కొన్ని అంచనాలు చెబుతున్నాయి.ఒకవైపు ముప్పు.. మరోవైపు వాణిజ్య అవకాశంరష్యా చమురు విషయంలో అమెరికా ఒత్తిడి పెంచుతున్న సమయంలోనే.. భారత్ మరో కీలక వాణిజ్య ఒప్పందంతో ముందుకు వెళ్తోంది. భారత్-బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (CETA) జూలై 15 నుంచి అమల్లోకి రానుంది. దీనితో భారత ఎగుమతిదారులకు బ్రిటన్ మార్కెట్లో మరిన్ని అవకాశాలు లభించే అవకాశం ఉంది. అంటే ఒకవైపు రష్యా చమురు విషయంలో అమెరికా ఒత్తిడి.. మరోవైపు కొత్త వాణిజ్య భాగస్వామ్యాలతో అవకాశాలు.. ప్రస్తుతం భారత్ దౌత్య, ఆర్థిక సమతుల్యతను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొంటోంది.చమురు కోసం స్నేహమా? ఆర్థిక భద్రతా?భారత్ మాత్రం తన వైఖరిలో మార్పు లేదని మొదటి నుంచి చెబుతోంది. ఇంధన దిగుమతులు దేశ ఆర్థిక అవసరాల ఆధారంగా జరుగుతున్నాయని, ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని వివరిస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ బిల్లుకు అమెరికా కాంగ్రెస్‌లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొందరు సెనేటర్లు రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ఇది అవసరమని చెబుతుండగా.. మరికొందరు భారత్, చైనా వంటి దేశాలపై భారీ సుంకాలు విధించడం ప్రపంచ వాణిజ్యానికి నష్టం కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు.ఇక ముందు ఏం జరుగుతుంది?ట్రంప్ మద్దతుతో ఈ బిల్లుకు మరింత ఊపు వచ్చినప్పటికీ.. ఇది చట్టంగా మారాలంటే కాంగ్రెస్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఒకవేళ ఇది అమల్లోకి వస్తే.. రష్యాతో భారత్ ఇంధన సంబంధాలు మాత్రమే కాదు.. భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. రష్యా చమురు కొనుగోళ్లు.. ఇప్పుడు భారత్‌కు ఆర్థిక లాభమా? లేక అమెరికా టారిఫ్‌ల రూపంలో కొత్త సవాలా? అన్నది అంతర్జాతీయ వాణిజ్యంలో కీలక చర్చగా మారింది. -
ట్రెంపరితనం తెచ్చిన తంటా!
అగ్రరాజ్యం అమెరికా ఏకాకి అవుతోందా? మిత్రులు ముఖం చాటేస్తున్నారా? అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు ఆర్థికంగా గుదిబండలవుతున్నాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం అవును అంటున్నారు జాన్ ఫైనర్. న్యూయార్క్‌టైమ్స్ పత్రికలో ఈయన రాసిన కథనం ప్రకారం అధ్యక్షుడి తెంపరితనం కాస్తా పౌరులకు వందల కోట్ల డాలర్ల నష్టం తీసుకొచ్చింది. మిత్రదేశాలనూ వదలకుండా చేస్తున్న హెచ్చరికలు అంతర్జాతీయంగా అమెరికా ఒంటరయ్యేందుకు కారణమవుతోందని విశ్లేషిస్తున్నారు.అధ్యక్షుడిగానే కాదు.. అంతకుముందు కూడా డొనాల్డ్ జే ట్రంప్ వైఖరి వివాదాస్పదమే. ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారం కావచ్చు. వివాహం, అక్రమసంబంధాలు, పన్నులు ఎగ్గొట్టడం.. ఇలా బోలెడన్నిసార్లు అంతర్జాతీయంగా చర్చల్లో నిలిచారు. అయితే రెండోసారి గద్దెనెక్కిన తరువాత ఈ వివాదాల జోరు మరింత పెరిగిందేమో అన్న అంచనాలు ఏర్పడ్డాయి. మేక్ అమెరికా గ్రేట్ ఎగేన్(మాగా) నినాదంతో ఎన్నికల్లో విజయం సాధించాక అక్రమ వలసదారులు, టారిఫ్‌లు, వీసాల వంటి విషయాల్లో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు పలుమార్లు విమర్శలకు గురయ్యాయి.ఈ నేపథ్యంలోనే న్యూయార్క్ టైమ్స్ కాలమిస్ట్ జాన్ ఫైనర్ ఈ తెంపరి నిర్ణయాల తాలూకూ ఆర్థిక భారంపై వివరణాత్మక విశ్లేషణ ఒకటి చేశారు. దాని ప్రకారం ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం కారణంగా అమెరికాలో ఇప్పటికే పెట్రోలు, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పెట్రోలు, డీజిల్ ధరలు సుమారు 15 శాతం వరకూ పెరగ్గా, యూరియా ధర ఏకంగా యాభై శాతం ఎక్కువైంది. డీఏపీ కోసం 27 శాతం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఈ పెంపు కాస్తా అమెరికన్లపై ఇప్పటికే సుమారు 13,200 కోట్ల డాలర్ల ఆర్థిక భారం మోపిందని అంచనా. తగ్గిన పర్యాటకులు, విద్యార్థులు... కఠిన వీసా నిబంధనలు అమలు చేయడం, యుద్ధభయం వంటి కారణాలతో అమెరికాకు వస్తున్న పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2024తో పోలిస్తే 2025లో అమెరికాకు వచ్చిన పర్యాటకుల సంఖ్య సుమారు 40 లక్షలు తక్కువ. ఫలితంగా ఆర్థిక వ్యవస్థకు 800 కోట్ల డాలర్ల నష్టం జరిగిందని లెక్కలేస్తున్నారు. వీసాల విషయంలో తీసుకొస్తున్న మార్పుల కారణంగా భారత్‌తోపాటు అనేక ఇతర దేశాల విద్యార్థులు అమెరికాకు కాకుండా ఇతర యూరోపియన్ దేశాలకు మళ్లుతూండటం గమనార్హం. ఫలితంగా అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో చేరే విద్యార్థులు 2024తో పోలిస్తే 2025లో 17 శాతం తక్కువైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2026కు సంబంధించిన పూర్తి వివరాలు లభ్యం కాలేదు కానీ ఈ ఏడాది తగ్గుదల సుమారు 10 శాతం వరకూ ఉండవచ్చునని అంచనా. ఫలితంగా ఏటా కనీసం వంద కోట్ల డాలర్ల నష్టం ఉండొచ్చని తెలుస్తోంది. యూరప్‌తో మిలటరీ సంబంధాలు రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలోనే అమెరికా, నాటోల మధ్య విపరీతమైన అభిప్రాయభేదాలు బహిర్గతమయ్యాయి. ట్రంప్ ఒంటెత్తు పోకడను పలు దేశాలు బహిరంగంగానే విమర్శించాయి. దీని ఫలితం సుస్పష్టం. 2025లో యూరోపియన్ దేశాలు మిలటరీపై పెట్టిన ఖర్చులు 14 శాతం వరకూ అంటే సుమారు 86,400 కోట్ల డాలర్లకు చేరినా అమెరికా కంపెనీల నుంచి చేసిన కొనుగోళ్లు సగానికి తగ్గడం గమనార్హం. ఇదే సమయంలో అమెరికా పొరుగున ఉన్న కెనడా 15,000 కోట్ల డాలర్లతో యూరోపియన్ డిఫెన్స్ ఫండ్‌లోకి చేరిపోయింది.చైనాతో తన సంబంధాలను సుదృఢం చేసుకునే దిశగా అడుగులేస్తోంది. ఆసియా దేశాల్లో జపాన్ తన మిలటరీ సామర్థ్యాన్ని పదును పెట్టుకుంటోంది. ఇందులో అమెరికా కంపెనీల స్థానంలో దక్షిణ కొరియా కంపెనీలు ముందంజలో ఉన్నాయి. భారత్ కూడా ఏఐ వంటి కీలక టెక్నాలజీల విషయంలో దేశీ కంపెనీలు లేదంటే చైనీస్ కంపెనీల్లో మెరుగైన వాటిని వెతుక్కుంటున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు అమెరికాకు దూరంగా జరుగుతున్నట్లు, ఇందుకు ట్రంప్ తీరు, అమెరికా ప్రభుత్వంలో పెరిగిన అవినీతి, వాణిజ్య వైరాలు, కృత్రిమ మేధ విషయంలో అస్పష్ట వైఖరి, విధానాలు కారణమని కాలమిస్ట్ ఫైనర్ విశ్లేషించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం..హోర్ముజ్ జలసంధిపై టోల్ రద్దు
ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి వివాదంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హోర్ముజ్ జలసంధిని ఉపయోగించే నౌకలపై 20శాతం రుసుము వసూలు చేయాలనే తన ప్రతిపాదనను ట్రంప్ ఉపసంహరించుకున్నారు. దీనికి బదులుగా గల్ఫ్ దేశాలు అమెరికాతో కుదుర్చుకోబోయే భారీ పెట్టుబడులు, వాణిజ్య ఒప్పందాలతో టోల్ ఫీజును భర్తీ చేయనున్నట్టు ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. కాగా హోర్ముజ్ జలసంధి భద్రతా వ్యయాన్ని భరించడానికి నౌకల కార్గో విలువపై 20 శాతం టోల్ ఫీజు విధిస్తామని సోమవారమే ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే గల్ఫ్ దేశాల రాజులు, ఎమిర్స్ నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ తర్వాత ట్రంప్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అయితే టోల్ ప్లాన్ రద్దయినప్పటికీ, ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించనున్న ఆర్థిక, రవాణా దిగ్బంధనం మాత్రం మరికొద్ది గంటల్లో అమలు కానుంది. మరోవైపు ట్రంప్ ప్రకటనపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హర్మూజ్ నిర్వహణలో అమెరికా జోక్యాన్ని అంగీకరించబోమని ఇరాన్ గట్టి హెచ్చరిక చేసింది. -
హఫ్తా వివాదం.. యుద్ధ భారం ప్రపంచ దేశాలపైనా?
ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయగా భావించే హర్ముజ్ మరోసారి అంతర్జాతీయ ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది. అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఘర్షణల వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రతిపాదన తీవ్ర చర్చకు దారితీసింది. జలసంధి మార్గంలో ప్రయాణించే నౌకల సరకు విలువపై 20 శాతం వరకు ఫీజు వసూలు చేయాలని ఆయన సూచించడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.‘‘ఈ అత్యంత సున్నితమైన ప్రాంతానికి అమెరికా భద్రత కల్పిస్తోంది. అందుకు తగిన పరిహారం చెల్లించాలి’’ అన్నది ట్రంప్ వాదన. అయితే.. అంతర్జాతీయ జలమార్గంపై రుసుము విధించే ఆలోచనను పలువురు నిపుణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. భద్రత పేరుతో తప్పనిసరి వసూలు చేయడం సరికాదని విమర్శిస్తున్నారు.ఫీజు అందుకేనట!పర్షియన్ గల్ఫ్‌ను అరేబియా సముద్రంతో కలిపే హర్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రతిరోజూ భారీగా చమురు, గ్యాస్ రవాణా ఈ మార్గం గుండా సాగుతుంది. అమెరికా దశాబ్దాలుగా గల్ఫ్ ప్రాంతంలో నౌకాదళాన్ని మోహరించి భద్రత కల్పిస్తున్నామని చెబుతోంది. తాజాగా ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రాంత రక్షణ కోసం అమెరికా భారీగా ఖర్చు చేస్తోంది. ఇకపై అందుకు పరిహారం రావాలి’’ అని పేర్కొన్నారు. సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, కువైట్, బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాలు ఈ ఖర్చును భరించాలని ఆయన సూచించారు. విమర్శలకు స్పందనట్రంప్ ప్రతిపాదనపై విమర్శకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. భద్రత కల్పిస్తామని చెప్పి దానికి ప్రతిగా డబ్బు వసూలు చేయడం ‘ప్రొటెక్షన్ మనీ’ /‘హఫ్తా’ తరహాలో ఉందని ఆరోపిస్తున్నారు. (బెదిరించి లేదంటే ఒత్తిడి చేసి క్రమం తప్పకుండా వసూలు చేసే డబ్బును కూడా హప్తా అంటారు). అయితే అమెరికా మాత్రం ఈ విమర్శలను ఖండిస్తోంది. ఇది ఎలాంటి బలవంతపు వసూలు కాదని.. ప్రపంచ వాణిజ్య మార్గాన్ని రక్షించేందుకు చేస్తున్న ఖర్చుకు పరిహారం మాత్రమేనని చెబుతోంది.అంతర్జాతీయ చట్టాలపై ప్రశ్నలుహర్ముజ్ జలసంధి అంతర్జాతీయ నౌకాయాన మార్గం. అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం ఇక్కడ నౌకలకు స్వేచ్ఛా రవాణా హక్కు ఉంటుంది. ఇలాంటి మార్గంలో ప్రయాణానికి తప్పనిసరి టోల్ లేదంటే ఫీజు విధించే హక్కు ఎవరికీ లేదని నిపుణులు చెబుతున్నారు. ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ సముద్ర రవాణా సంస్థ కూడా ఇలాంటి రుసుములకు చట్టపరమైన ఆధారం లేదని పేర్కొన్నట్లు తెలుస్తోంది.ఇరాన్‌కు కలిసొచ్చే అంశమా?ట్రంప్ ప్రతిపాదన మరోవైపు ఇరాన్‌కు కొత్త వాదనను అందించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. గతంలో ఇరాన్ కూడా హర్ముజ్‌పై తన ప్రభావాన్ని ఉపయోగించుకునే ప్రయత్నాలు చేసింది. నౌకల భద్రత పేరుతో రుసుములు వసూలు చేసే ఆలోచనలను ఆ దేశ వర్గాలు ప్రస్తావించాయి. ఇప్పుడు అమెరికానే ఫీజు ప్రతిపాదించడం వల్ల.. ‘‘అమెరికాకు అవకాశం ఉంటే మాకు ఎందుకు ఉండకూడదు?’’ అనే వాదనను ఇరాన్ ముందుకు తీసుకురావచ్చని భావిస్తున్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కూడా ట్రంప్ వ్యాఖ్యలపై వ్యంగ్యంగా స్పందించారు. ‘‘20 శాతం ఎక్కువే.. మేము న్యాయంగా వ్యవహరిస్తాం’’ అంటూ వ్యాఖ్యానించారు.యుద్ధం చేసింది ఎవరు.. బిల్లు చెల్లించేది ఎవరు?విమర్శకుల వాదన ప్రకారం.. ‘‘సంక్షోభాన్ని సృష్టించి.. దాని భద్రత ఖర్చును ప్రపంచానికి అప్పగించే ప్రయత్నమా?’’ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ ప్రతిపాదనపై ప్రధాన విమర్శ ఇదే. అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణల కారణంగా ఇప్పటికే చమురు మార్కెట్లు అస్థిరంగా మారాయి. ఇంధన ధరలు పెరిగాయి. ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం పడింది. ఇప్పుడు ఆ పరిస్థితిని ఎదుర్కొనే ఖర్చును అంతర్జాతీయ రవాణాపై మోపడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఆధిపత్య పోరు ముదురుతుందా?ట్రంప్ ప్రతిపాదన అసలు ఆచరణలోకి వస్తుందా? అనేది ఇప్పుడే చెప్పలేం. కానీ ఈ ప్రకటనతో హజ్ మరోసారి అమెరికా-ఇరాన్ ఆధిపత్య పోరుకు వేదికగా మారింది. పంచ చమురు సరఫరాకు కీలకమైన ఈ జలమార్గం.. ఇకపై కేవలం వాణిజ్య మార్గంగానే కాకుండా, రాజకీయ ఒత్తిళ్లు, సైనిక ఆధిపత్యం, ఆర్థిక పోరాటాలకు కేంద్ర బిందువుగా మారే అవకాశం కనిపిస్తోంది. -
అమెరికా బాంబులకూ అందని ఇరాన్ రహస్యం!
భూమి లోపల వందల అడుగుల లోతు.. చుట్టూ పర్వతాల రక్షణ.. అత్యాధునిక ఆయుధాలు కూడా సులభంగా చేరుకోలేని నిర్మాణం.. ఇది ఏదో సాధారణ సైనిక స్థావరం కాదు. ఇరాన్‌లోని ఓ రహస్య భూగర్భ కేంద్రం ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. అదే ‘పికాక్స్ మౌంటెన్’. ఇరాన్ అణు కార్యక్రమానికి కీలక కేంద్రంగా మారిందన్న అనుమానాలతో పాటు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా హెచ్చరికలతో ఈ రహస్య స్థావరం మరోసారి చర్చకు వచ్చింది.‘‘పికాక్స్ మౌంటెన్ (Pickaxe Mountain)ను కూడా ధ్వంసం చేస్తాం.. ఇరాన్ సిద్ధంగా ఉండాలి’’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా హెచ్చరిక ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఈ రహస్య భూగర్భ కేంద్రంపైకి మళ్లించింది. ఇప్పటికే ఇరాన్‌లోని కీలక అణు స్థావరాలపై దాడులు చేసిన అమెరికా.. తదుపరి లక్ష్యంగా ఈ పర్వతాన్ని ఎంచుకుందా? అనే చర్చ మొదలైంది. అసలు పికాక్స్ మౌంటెన్‌లో ఏముంది? ఎందుకు అమెరికా దీనిపై ఇంత ప్రత్యేక దృష్టి పెట్టింది? అణు కార్యక్రమానికి ఇది ఎంత కీలకం? అన్న ప్రశ్నలు అంతర్జాతీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేపుతున్నాయి.జాగ్రోస్ పర్వతాల్లో దాగిన ‘భూగర్భ కోట’ఇరాన్‌లోని జాగ్రోస్ పర్వత శ్రేణుల్లో ఉన్న ఈ కేంద్రం.. స్థానికంగా కుహ్-ఎ కొలాంగ్ గాజ్ లా (Kuh-e Kolang Gaz La) పేరుతో కూడా గుర్తింపు పొందింది. ఇరాన్ అణు కార్యక్రమంలో కీలకమైన నాటాంజ్(Natanz) అణుశుద్ధి కేంద్రం నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఇది ఉంది. నాటాంజ్ కేంద్రం గతంలో దాడులకు గురైనప్పటికీ.. పికాక్స్ మౌంటెన్ మాత్రం భిన్నమైన నిర్మాణంతో తయారవుతోంది. పర్వతాన్ని తొలిచి దాని లోపల భారీ సొరంగాలు, భూగర్భ గదులు నిర్మిస్తున్నట్లు ఉపగ్రహ చిత్రాలు సూచిస్తున్నాయి. ఇదే అమెరికా వ్యూహకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది. ఎందుకంటే ఇది కేవలం ఓ భవనం కాదు.. పర్వతాన్ని సహజ కవచంగా మార్చుకున్న భారీ రక్షణ వ్యవస్థ.బంకర్ బస్టర్ బాంబులకూ సవాల్పికాక్స్ మౌంటెన్‌పై ప్రపంచ దేశాల దృష్టి పడటానికి ప్రధాన కారణం దీని లోతు. నిపుణుల అంచనా ప్రకారం ఈ భూగర్భ సముదాయంలోని కొన్ని ప్రాంతాలు భూమి లోపల 260 నుంచి 330 అడుగుల లోతులో ఉండొచ్చని తెలుస్తోంది. అమెరికా వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన బంకర్ బస్టర్ ఆయుధాలు కూడా పరిమిత స్థాయిలో మాత్రమే చొచ్చుకుపోగలవు. సాధారణంగా ఇవి వందల అడుగుల మట్టి, రాళ్ల పొరలను లేదంటే బలమైన కాంక్రీట్ నిర్మాణాలను ఛేదించగలిగినా.. ఇంత లోతులో ఉన్న నిర్మాణాలను ధ్వంసం చేయడం సవాల్‌గా మారుతుంది. అందుకే పికాక్స్ మౌంటెన్.. అమెరికా సైనిక వ్యూహాలకు ఓ పెద్ద పరీక్షగా మారింది.అసలు అక్కడ ఏం జరుగుతోంది?ఈ రహస్య స్థావరం నిర్మాణం 2020 ప్రాంతంలో ప్రారంభమైంది. నాటాంజ్‌లో జరిగిన విధ్వంసం తర్వాత కొత్త సెంట్రిఫ్యూజ్ అసెంబ్లీ కేంద్రం నిర్మిస్తున్నామని ఇరాన్ అప్పట్లో వెల్లడించింది. అయితే నిర్మాణ స్థాయి, భద్రతా ఏర్పాట్లు మాత్రం అనేక అనుమానాలకు దారితీశాయి. కొందరు అణు నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది కేవలం పరికరాల తయారీ కేంద్రం మాత్రమే కాకుండా, రహస్య యురేనియం శుద్ధి కేంద్రంగా లేదంటే కీలక అణు పదార్థాల నిల్వ ప్రాంతంగా ఉపయోగపడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇరాన్ వద్ద ఉన్న అధిక శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఇలాంటి రహస్య భూగర్భ కేంద్రాల్లో భద్రపరిచి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఐఏఈఏకు అందని రహస్యంపికాక్స్ మౌంటెన్ ఇప్పటివరకు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA) తనిఖీలకు అందుబాటులోకి రాలేదు. దీంతో ఈ కేంద్రంలో జరుగుతున్న కార్యకలాపాలపై మరింత ఆసక్తి, అనుమానాలు పెరిగాయి. ఉపగ్రహ చిత్రాల విశ్లేషణలో.. గత దాడుల తర్వాత కూడా అక్కడ నిర్మాణ పనులు కొనసాగుతున్నట్లు గుర్తించారు. కొత్త భద్రతా గోడలు, బలపరిచిన ప్రవేశ మార్గాలు, తవ్వకాల ఆనవాళ్లు కనిపించినట్లు నిపుణులు చెబుతున్నారు. ఇది భవిష్యత్తులో జరిగే దాడులను ఎదుర్కొనేలా ఇరాన్ ఈ కేంద్రాన్ని మరింత బలోపేతం చేస్తోందన్న అభిప్రాయాలకు కారణమైంది.ట్రంప్ హెచ్చరికలతో పెరిగిన ఉత్కంఠగతంలో ఇరాన్ అణు కేంద్రాలపై దాడుల తర్వాత.. ఆ దేశ అణు కార్యక్రమాన్ని దెబ్బతీశామని అమెరికా ప్రకటించింది. అయినప్పటికీ పికాక్స్ మౌంటెన్ మాత్రం ఇంకా అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలింది. ఇప్పుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో ఈ భూగర్భ స్థావరం మరోసారి వార్తల్లోకి వచ్చింది. అమెరికా నిజంగానే ఈ కేంద్రంపై దాడికి దిగుతుందా? లేదంటే ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు మాత్రమే ఈ హెచ్చరికలు చేస్తున్నదా? అన్నది ఆసక్తికరంగా మారింది. పర్వతం లోపల దాగిన ఈ రహస్యం.. రాబోయే రోజుల్లో అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
మొజ్తబా పని అయిపోయినట్లే!.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇరాన్ సైనిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని పేర్కొన్న ట్రంప్.. మొజ్తబా పరిస్థితి కూడా ఏమీ బాగోలేదని, ఆయన పని అయిపోయినట్లేనని వ్యాఖ్యానించారు.ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ సైనిక సామర్థ్యం తీవ్రంగా దెబ్బతిందని అన్నారు. "వారికి నౌకాదళం లేదు.. వైమానిక దళం లేదు.. గగనతల రక్షణ వ్యవస్థ కూడా ధ్వంసమైంది. వారి కీలక నాయకులంతా హతమయ్యారు" అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఖమేనీ కుటుంబం గురించి ప్రస్తావిస్తూ.. మేం జరిపిన దాడుల్లో అయతొల్లా ఖమేనీ చనిపోయారు. ఆ తర్వాత సుప్రీం లీడర్ అంటూ ఆయన వారసుడు మొజ్తబా ఖమేనీ వచ్చారు. ఆయన పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఆయన 90 శాతం దెబ్బతిన్నారు. ఆయన పని కూడా దాదాపు అయిపోయినట్లే అని అన్నారు. అయితే మొజ్తబా పరిస్థితిపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి ఆధారాలను అమెరికా విడుదల చేయలేదు. ఇరాన్ కూడా దీనిపై అధికారికంగా స్పందించలేదు.తండ్రి మరణం తర్వాత తెరపైకి.. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ పేరు ఒక్కసారిగా అంతర్జాతీయ చర్చల్లోకి వచ్చింది. ఇరాన్ రాజకీయ వ్యవస్థపై ప్రభావం ఉన్న వ్యక్తిగా మొజ్తబాను పరిగణిస్తుంటారు. అయతొల్లా మరణం తర్వాత సుప్రీం ఎవరు? అనే సమయంలో ఆయన పేరు పరిశీలనకు వచ్చింది. అయితే.. గతంలో ఆయనపై ఉన్న విమర్శలు, వివాదాలు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయనకు ఆ గౌరవం దక్కడంపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే మత పెద్దలు, ఐఆర్జీసీ మాత్రం ఆయన వైపే మొగ్గు చూపించింది. అయితే సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా మొజ్తబా ఇప్పటివరకు బహిరంగంగా కనిపించకపోవడం అనేక అనుమానాలకు దారితీసింది. ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో అయతొల్లా ఖమేనీ కుటుంబ సభ్యులు కొందరు మరణించారు. అయితే ఆ దాడిలో కొడుకు మొజ్తాబా మాత్రం తీవ్ర గాయాలతో బయటపడ్డారనే ప్రచారం ప్రచారం మాత్రం జోరుగా సాగింది. ముఖ్యంగా తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలకు కూడా మొజ్తబా హాజరు కాలేదు. టెహ్రాన్‌లో జరిగిన అంత్యక్రియల ప్రార్థనల్లో ఆయన సోదరులు మాత్రమే పాల్గొన్నారు. దేశ అత్యున్నత నాయకత్వ బాధ్యతలు చేపట్టిన వ్యక్తి ఇప్పటిదాకా కనిపించకపోవడం తీవ్ర చర్చకు కారణమైంది.త్వరలో ప్రజల ముందుకు వస్తారా?ఇటీవల మొజ్తబా ఖమేనీ త్వరలోనే ప్రజల ముందుకు రానున్నారనే ప్రచారం జరుగుతోంది. తన తండ్రి జ్ఞాపకార్థం నిర్వహించే భారీ స్మారక సభలో ఆయన పాల్గొనే అవకాశం ఉందని ఇరాన్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సభలో ఆయన ప్రత్యక్షమైతే.. సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇదే తొలి బహిరంగ కార్యక్రమం కానుంది. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి, నాయకత్వ సామర్థ్యంపై వస్తున్న ఊహాగానాలకు తెరపడుతుందని భావించారు.‘తండ్రి మరణానికి ప్రతీకారం’ అంటూ ప్రకటనలుఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి గాయపడిన మొజ్తబా అజ్ఞాతంలోనే కొనసాగుతున్నారు. సందేశాలు ఏమున్నా సరే.. అత్యంత గోప్యంగా ఆయనకు చేరవేస్తూ వస్తున్నారు. అలాగే ఆయన నుంచి బదులు కూడా అలాగే ప్రపంచానికి తెలియజేస్తున్నారు. తాజాగా తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ మరణానికి ప్రతీకారం తప్పదంటూ మొజ్తబా కూడా ప్రకటన ఇచ్చినట్లు ఇరాన్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో మొజ్తబా ఖమేనీ ప్రజల ముందుకు నిజంగానే వస్తారా?.. ట్రంప్ ప్రకటన ఉత్తదేనని తేలుస్తారా? అన్నది కీలకంగా మారింది.హర్ముజ్‌పై ట్రంప్ ప్రకటన.. భగ్గుమన్న ఇరాన్ఇదే సమయంలో ట్రంప్ హర్ముజ్ జలసంధిపై కూడా కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌పై సముద్ర దిగ్బంధనాన్ని తిరిగి అమలు చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. హర్ముజ్ గుండా ప్రయాణించే కార్గో నౌకల నుంచి 20 శాతం రుసుము వసూలు చేయాలన్న ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. దీనిపై ఇరాన్ భగ్గుమంది. హర్ముజ్ విషయంలో అమెరికా జోక్యం సహించబోమని.. తమ నౌకలపై ఆధిపత్యం ప్రదర్శిస్తే బలప్రయోగానికి దిగుతామని హెచ్చరించింది. ఇటు అమెరికాకు సహకరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని గల్ఫ్ దేశాలను సైతం వారించింది. -
హర్ముజ్ జలసంధిపై కొత్త ఆధిపత్య పోరు!
ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి.. ఉద్రిక్తతలతో పాటు మరోసారి అంతర్జాతీయ రాజకీయాల కేంద్రంగా మారింది. జలసంధి గుండా వెళ్లే ప్రతి కార్గో నౌకపై 20 శాతం టోల్ వసూలు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది. నౌకల భద్రత కోసం తాము ఎంతో చేస్తున్నామని.. భారత్ సహా పలు దేశాలు ఈ రుసుము చెల్లించాల్సిందేనని అంటున్నారాయన. దానికి ఇరాన్ కాస్త ఘాటుగానే బదులిచ్చింది.ట్రూత్ సోషల్‌లో ట్రంప్ చేసిన పోస్టులో.. ఇకపై అమెరికా "ది గార్డియన్ ఆఫ్ ది హర్ముజ్ స్ట్రైట్"గా వ్యవహరిస్తుందని ప్రకటించారు. ప్రపంచ వాణిజ్య నౌకలకు భద్రత కల్పించేందుకు అమెరికా భారీ ఖర్చు చేస్తున్నందున, ఆ ఖర్చుకు ప్రతిఫలంగా హర్ముజ్ (Strait of Hormuz) గుండా వెళ్లే ప్రతి కార్గోపై 20 శాతం రుసుము వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తామని వెల్లడించారు. దీనికి విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ స్పందిస్తూ.. "హర్ముజ్‌కు నిజమైన సంరక్షకులు ఇరానేనని అన్నారు. అంతేకాదు 20 శాతం రుసుము చాలా ఎక్కువ.. మేమైతే న్యాయమైన రుసుమే వసూలు చేస్తాం" అంటూ వ్యంగ్యంగా స్పందించారు.ఇరాన్ ఘాటు కౌంటర్ట్రంప్ వ్యాఖ్యలపై ఎక్స్ (X) వేదికగా స్పందించిన అరాగ్చీ.. "వాణిజ్య నౌకలకు సురక్షిత మార్గం కల్పించే వారికి పారితోషికం ఇవ్వాలన్న ట్రంప్ మాట సరైనదే. కానీ హర్ముజ్‌కు ఎప్పటినుంచో నిజమైన గార్డియన్ ఇరానే. ఇకముందూ అలాగే ఉంటుంది" అన్నారు. అయితే ట్రంప్ ప్రతిపాదించిన 20 శాతం టోల్‌పై సెటైర్ వేస్తూ.. "20 శాతం చాలా ఎక్కువ. మేమైతే న్యాయంగా వ్యవహరిస్తాం" అని వ్యాఖ్యానించారు. దీంతో హర్ముజ్‌పై అమెరికా-ఇరాన్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది.POTUS is absolutely right. Whoever provides secure and safe passage of commercial vessels through the Strait of Hormuz should be compensated for this service. Iran has always been the GUARDIAN of the Strait and will remain so FOREVER.20% is of course too much. We will be fair— Seyed Abbas Araghchi (@araghchi) July 13, 2026మరోసారి అమెరికా బ్లాకేడ్ఇదే సమయంలో ఇరాన్‌పై అమెరికా మరోసారి సముద్ర దిగ్బంధనాన్ని (Maritime Blockade) అమలు చేయడం ఉద్రిక్తతను పెంచింది. జూలై 14 సాయంత్రం 4 గంటల (ET) నుంచి ఇరాన్ పోర్టులకు వచ్చే, వెళ్లే నౌకలపై దిగ్బంధన చర్యలు తిరిగి ప్రారంభిస్తున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకటించింది. ఇరాన్ పోర్టులకు వెళ్తున్న లేదా అక్కడి నుంచి వస్తున్న నౌకలను అమెరికా దళాలు తనిఖీ చేస్తాయని, గల్ఫ్ ఆఫ్ ఒమన్, హర్ముజ్ పరిసరాల్లో ప్రయాణించే నౌకలు అమెరికా నౌకాదళంతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని సూచించింది.పాత ఒప్పందం ముగిసిందా?గతంలో ఏప్రిల్ 13 నుంచి జూన్ 18 వరకు అమెరికా ఇదే తరహా దిగ్బంధనం అమలు చేసింది. అనంతరం అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం కుదరడంతో దానిని ఎత్తివేశారు. అయితే ఇటీవల ఆ ఒప్పందం ఇక అమల్లో లేదని ట్రంప్ ప్రకటించడంతో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది.ఇరాన్ మాత్రం గత నెల కుదిరిన మధ్యంతర ఒప్పందం ప్రకారం హర్ముజ్‌లో రవాణాను నియంత్రించే హక్కు తమకే ఉందని, అవసరమైతే టోల్ కూడా వసూలు చేసే అధికారం ఉందని చెబుతోంది. దీనిని అమెరికా పూర్తిగా తిరస్కరిస్తోంది. అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం ప్రపంచ నౌకలకు స్వేచ్ఛగా ప్రయాణించే హక్కు ఉందని వాషింగ్టన్ వాదిస్తోంది.ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావంప్రపంచంలో ఉత్పత్తి అయ్యే చమురు, ద్రవీభవించిన సహజ వాయువు (LNG)లో దాదాపు 20 శాతం హోర్ముజ్ జలసంధి గుండా రవాణా అవుతుంది. అందువల్ల ఈ మార్గంలో ఏ చిన్న అంతరాయం వచ్చినా ప్రపంచ ఇంధన ధరలపై తీవ్ర ప్రభావం పడుతుంది.విశ్లేషకుల అంచనా ప్రకారం.. ట్రంప్ ప్రతిపాదించిన 20 శాతం టోల్ అమల్లోకి వస్తే, పూర్తిగా చమురుతో నిండిన ఒక సూపర్ ట్యాంకర్ దాదాపు 30 మిలియన్ డాలర్ల వరకు అదనపు రుసుము చెల్లించాల్సి రావచ్చు. ఇప్పటివరకు ఇరాన్ వసూలు చేసినట్లు భావిస్తున్న రుసుము సుమారు 2 మిలియన్ డాలర్ల పరిధిలోనే ఉందని అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి.ఇంధన వ్యయం భారీగా పెరగడంతో అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు, రవాణా ఖర్చులు, ద్రవ్యోల్బణంపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో హర్ముజ్ జలసంధి చుట్టూ అమెరికా-ఇరాన్ ఆధిపత్య పోరు మరింత ఉత్కంఠగా మారింది. -
భారత్ సహా ప్రపంచానికి ట్రంప్ షాక్.. 20% భరించాల్సిందే..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం కీలక ప్రకటన చేశారు. హార్మూజ్ జలసంధి గుండా రవాణా అయ్యే ప్రతి సరుకుపై అమెరికా 20% ఛార్జీ వసూలు చేస్తుందని ప్రకటించారు. "ఇప్పటి నుంచి అమెరికాను 'హార్మూజ్ జలసంధి సంరక్షక దేశం'గా పిలుస్తారు. ఈ అత్యంత ఉద్రిక్త ప్రాంతంలో భద్రత, రక్షణ కల్పించే పనికి అయ్యే ఖర్చు మొత్తాన్ని సరుకులపై 20% రేటుతో తిరిగి వసూలు చేస్తాం. ఈ ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుంది" అని ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్టు చేశారు.హార్మూజ్ జలసంధి తెరిచే ఉందని, అలాగే కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఇరాన్ నౌకలు దేశంలోకి రావడం, బయటకు వెళ్లడం అడ్డుకునే దిగ్బంధాన్ని అమెరికా మళ్లీ అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. "హార్మూజ్ జలసంధి తెరిచే ఉంది. ఇరాన్ ఉన్నా లేకపోయినా అలాగే ఉంటుంది. ఇరాన్ నౌకలు, ఆ దేశ వినియోగదారుల నౌకల రాకపోకలను మాత్రమే అడ్డుకునే దిగ్బంధాన్ని మళ్లీ అమలు చేస్తున్నాం. మిగతా అన్ని దేశాల నౌకలకు హార్మూజ్ జలసంధి వినియోగంపై ఎలాంటి ఆంక్షలు ఉండవు" అని ట్రంప్ తెలిపారు. ఈ పోస్టుకు కొన్ని గంటల ముందు ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ట్రంప్ ఇదే అంశంపై మాట్లాడారు. "ఆ జలసంధిని మేమే నియంత్రిస్తాం. దాన్ని నిర్వహించే బాధ్యత కూడా మాదే కావచ్చు. ఆ జలసంధికి సంరక్షకులమవుతాం. దానికి అయ్యే ఖర్చు మాకు తిరిగి రావాలి" అని ట్రంప్ చెప్పారు.ఇరాన్ ఘాటు హెచ్చరికట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ ఖాతమ్ అల్-అన్బియా సైనిక కమాండ్ ప్రతినిధి వీడియో సందేశం ద్వారా స్పందించారు. హార్మూజ్ జలసంధి నిర్వహణలో అమెరికా జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ జలమార్గం విషయంలో అమెరికాతో సహకరించే గల్ఫ్ దేశాల చర్యను యుద్ధ చర్యగానే పరిగణిస్తామని హెచ్చరించారు.అమెరికా, ఇరాన్ వరుసగా రెండో రోజు పరస్పర దాడులు జరుపుకుంటున్న వేళ ఈ హెచ్చరిక వచ్చింది. హోర్ముజ్ జలసంధిపై తమకే నియంత్రణ ఉందని రెండు దేశాలూ చెబుతున్నాయి. -
అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు
-
ట్రంప్, నెతన్యాహుతో పాటు 13 మంది టార్గెట్? ఇరాన్ రివెంజ్ లిస్ట్ కలకలం!
టెహ్రాన్: పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య మరో కీలక పరిణామం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది. టెహ్రాన్ మున్సిపాలిటీకి చెందిన 'హమ్షాహ్రీ' (Hamshahri) పత్రిక వివాదాస్పద ప్రచురణలో 13 మంది కీలక నేతలతో కూడిన రివెంజ్ లిస్ట్‌ను ప్రకటించింది. ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, పలువురు యూరోపియన్ నాయకులతో సహా 13 మంది విదేశీ నేతలతో కూడిన ప్రతీకార జాబితాను ప్రకటించడం ప్రకంపనలు రేపుతోంది.ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో నాటి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన కుమారుడు 'ఆయతుల్లా మోజ్తబా ఖమేనీ'.. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేసిన కొద్ది రోజులకే ఈ గ్రాఫిక్ వెలుగులోకి రావడం గమనార్హం. తన తండ్రి మరణానికి ప్రతీకారం తప్పదని, ఇందుకు బాధ్యులైన వారు పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని మొజ్తాబా ఇప్పటికే తీవ్రంగా హెచ్చరించారు. ఇది తమ దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్ అని, దానిని కచ్చితంగా నెర వేరుస్తానని కూడా అన్నారు.శాంతియుత మరణం ఉండదు - మోజ్తబా ఖమేనీఈ వారం ప్రారంభంలో జరిగిన తన తండ్రి అంత్యక్రియల తర్వాత మోజ్తబా ఖమేనీ శనివారం తన మొదటి బహిరంగ సందేశాన్ని విడుదల చేస్తూ, ప్రతీకారం తప్పదని స్పష్టం చేశారు. ప్రతీకారం తమ దేశ సంకల్పం, ఇది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ నేరస్థులకు కంటిమీద కునుకు ఉండదు. వారికి ప్రశాంత మరణం ఉండదని ప్రతిజ్ఞ చేశారు. ఇరాన్ టార్గెట్ చేయబోయే వ్యక్తుల జాబితాను సిద్ధం చేసినట్లు సుప్రీం లీడర్ పేర్కొన్నప్పటికీ, ఆయన ఎవరి పేర్లను ప్రత్యక్షంగా వెల్లడించలేదు. అలాగే, హమ్షాహ్రీ పత్రిక ప్రచురించిన ఈ జాబితాను ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ఆమోదించినట్లు ఎలాంటి ఆధారాలు లేవు.ఇదీ చదవండి: మటన్ వర్సెస్ చికెన్ : కుర్చీలు విరిగాయ్, తలలు పగిలాయ్!ఆన్లైన్లో విడుదల చేసిన ఈ ఇన్ఫోగ్రాఫిక్లో మోజ్తబా ఖమేనీ ప్రకటనతో పాటు 13 మంది విదేశీ నాయకుల ఫోటోలను ప్రదర్శించారు. వారిలో ముఖ్యులు:డోనాల్డ్ ట్రంప్ (అమెరికా అధ్యక్షుడు)బెంజమిన్ నెతన్యాహు (ఇజ్రాయెల్ ప్రధాని)కీర్ స్టార్మర్ (బ్రిటన్ ప్రధాని)మార్కో రూబియో (అమెరికా విదేశాంగ మంత్రి)పీట్ హెగ్సెత్ (అమెరికా రక్షణ మంత్రి)ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ (ఫ్రాన్స్ అధ్యక్షుడు)జార్జియా మెలోని (ఇటలీ ప్రధాని)ఫ్రీడ్రిచ్ మెర్జ్ (జర్మనీ ఛాన్సలర్)ఈ గ్రాఫిక్ ఆన్లైన్లో మాత్రమే పబ్లిష్ అయింది. ఆదివారం నాటి ప్రింట్ ఎడిషన్‌లో దీనిని ప్రచురించలేదు.ఇదీ చదవండి : 82 ఏళ్ల వృద్ధుడి పెన్షన్ ఖాతాలో రూ. వందల కోట్లు, ఏం చేశాడో తెలుసా? The Islamic Republic of Iran has published a list of its "revenge targets" in the daily newspaper Hamshahri and calls for the murder of the following individuals pic.twitter.com/fYxQYJpuOm— Afshin Ismaeli (@Afshin_Ismaeli) July 12, 2026 -
భీకర దాడులకు దిగిన ఇరాన్.. గల్ఫ్‌లో మళ్లీ మంటలు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరాయి. అమెరికా జరిపిన వరుస వైమానిక దాడులకు ప్రతిగా ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై కౌంటర్ ఎటాక్‌కు దిగింది. డ్రోన్లు, క్షిపణులతో బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, ఖతార్, ఒమన్ ప్రాంతాల్లోని అమెరికా మద్దతు స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు టెహ్రాన్ ప్రకటించింది.ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (IRGC) ప్రకారం.. బహ్రెయిన్‌లోని షేక్ ఇసా వైమానిక స్థావరంపై దాడి చేసింది. అక్కడి అమెరికా సైనిక కార్యకలాపాలకు సంబంధించిన డ్రోన్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, హెలికాప్టర్ నిర్వహణ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. అమెరికా డ్రోన్ ఫ్లీట్‌లో కీలక భాగాన్ని ధ్వంసం చేసినట్లు టెహ్రాన్ ప్రకటించింది. అయితే ఈ దాడులకు సంబంధించి అమెరికా నుంచి ఇప్పటివరకు అధికారిక ధ్రువీకరణ రాలేదు.ఆ స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులుఅమెరికా దాడులకు ప్రతీకారంగా కువైట్, జోర్డాన్‌లలోనూ తమ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని ఇరాన్ తెలిపింది. కువైట్‌లోని అలీ అల్ సేలెం, అహ్మద్ అల్ జాబర్ సైనిక స్థావరాలు, జోర్డాన్‌లోని ప్రిన్స్ హసన్ ఎయిర్‌బేస్, అలాగే ఖతార్, ఒమన్‌లోని అమెరికా మద్దతు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు ప్రకటించింది. జోర్డాన్ స్థావరంలోని ఇంధన నిల్వలు, ఆయుధ గిడ్డంగులను ధ్వంసం చేసినట్లు ఇరాన్ పేర్కొంది. అయితే జోర్డాన్ మాత్రం.. ఇరాన్ నుంచి వచ్చిన నాలుగు క్షిపణులను తమ రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని తెలిపింది. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని స్పష్టం చేసింది.గల్ఫ్ దేశాల్లో హైఅలర్ట్ఇరాన్ ప్రతిదాడుల నేపథ్యంలో గల్ఫ్ దేశాలు అప్రమత్తమయ్యాయి. బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, యూఏఈ దేశాల్లో భద్రతా హెచ్చరికలు జారీ అయ్యాయి. పలు ప్రాంతాల్లో సైరన్లు మోగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఖతార్‌లో ఇరాన్ దాడుల సమయంలో శకలాలు పడి ముగ్గురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. కువైట్‌లోని ఓ చమురు డ్రిల్లింగ్ ప్లాట్‌ఫామ్‌పై జరిగిన దాడిలో ఓ కార్మికుడు గాయపడినట్లు సమాచారం. ఒమన్‌లోనూ డ్రోన్ దాడుల నేపథ్యంలో అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు.ఇరాన్ సైనిక సామర్థ్యాలే లక్ష్యం: అమెరికామరోవైపు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM).. ఇరాన్‌పై చేపట్టిన తాజా దాడులను సమర్థించుకుంది. అంతర్జాతీయ నౌకా రవాణాకు ఇరాన్ నుంచి ఎదురవుతున్న ముప్పును తగ్గించడమే తమ లక్ష్యమని పేర్కొంది. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, తీర ప్రాంత రాడార్ కేంద్రాలు, క్షిపణి, డ్రోన్ సామర్థ్యాలు, చిన్న యుద్ధ నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు అమెరికా తెలిపింది. హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడటమే తమ చర్యల ఉద్దేశమని స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తాజా పరిణామాలపై స్పందించారు. ‘‘మేము వారిని తీవ్రంగా దెబ్బతీస్తున్నాం’’ అని వ్యాఖ్యానించారు.హర్ముజ్ మూసివేశామన్న ఇరాన్తాజా ఘర్షణలకు ప్రధాన కారణంగా మారింది హర్ముజ్ జలసంధి. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన ఈ మార్గాన్ని మూసివేశామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ ప్రకటించింది. అయితే అమెరికా ఈ ప్రకటనను ఖండించింది. ‘‘హర్ముజ్ జలసంధిపై ఇరాన్‌కు నియంత్రణ లేదు. అంతర్జాతీయ నౌకల రాకపోకలు కొనసాగుతున్నాయి’’ అని అమెరికా సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది.షిప్ ట్రాకింగ్ సమాచారం ప్రకారం.. జలసంధి మీదుగా నౌకల రాకపోకలు భారీగా తగ్గాయి. అయితే పూర్తిగా నిలిచిపోలేదని సమాచారం. కొన్ని చమురు ట్యాంకర్లు మాత్రం ఈ మార్గం గుండా ప్రయాణించినట్లు తెలుస్తోంది.నౌకలపై దాడులే అసలు కారణంహర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడుల నేపథ్యంలో అమెరికా ఇరాన్‌పై తాజా దాడులు ప్రారంభించింది. అమెరికా ఆరోపణ ప్రకారం.. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ ఓ వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకుంది. దీనికి ప్రతిగా అమెరికా దాడులు చేపట్టినట్లు తెలిపింది. అయితే ఇరాన్ మాత్రం.. అనుమతి లేకుండా ప్రయాణించిన ఓ నౌకపై హెచ్చరిక కాల్పులు మాత్రమే జరిపామని పేర్కొంది. ఈ ఘటనతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.చమురు ధరలకు సెగహర్ముజ్ జలసంధిపై నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ చమురు మార్కెట్లపై పడింది. అమెరికా-ఇరాన్ మధ్య దాడులు కొనసాగడంతో బ్రెంట్ క్రూడ్ ధరలు నాలుగు శాతానికి పైగా పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ బ్రెంట్ ధర సుమారు 79 డాలర్లకు చేరింది. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన ఈ మార్గంలో రవాణా అంతరాయం ఏర్పడితే.. అంతర్జాతీయంగా ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.మళ్లీ యుద్ధ భయాలుఅమెరికా-ఇరాన్ మధ్య గత నెలలో కుదిరిన తాత్కాలిక ఒప్పందం భవిష్యత్తుపైనా తాజా పరిణామాలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. హోర్ముజ్ జలసంధి సమస్యను పరిష్కరించి ఉద్రిక్తతలు తగ్గించేందుకు దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ.. పరస్పర దాడులతో పరిస్థితి మళ్లీ అదుపు తప్పుతోంది. ఇరు దేశాలు వెనక్కి తగ్గకుండా దాడులు కొనసాగిస్తే.. పశ్చిమాసియాలో యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హర్ముజ్ జలసంధి చుట్టూ కొనసాగుతున్న ఈ పోరు.. ప్రపంచ ఇంధన భద్రతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. -
ట్రంప్ ‘ట్రంప్‌కార్డ్’ ఇక లేరు.. గ్రాహం మృతిపై అనుమానాల కలకలం!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత సన్నిహితుడు, రిపబ్లికన్ పార్టీలో కీలక నేతగా ఉన్న సెనేటర్ లిండ్సే గ్రాహం (71) ఇక లేరు. ఆకస్మిక అనారోగ్యంతో ఆయన శనివారం కన్నుమూశారు. ఉక్రెయిన్ పర్యటన ముగించుకుని అమెరికాకు తిరిగొచ్చిన కొద్ది గంటల్లోనే ఆయన మృతి చెందడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.గ్రాహం కార్యాలయం తొలుత దీనిని ‘‘ఆకస్మిక అనారోగ్యం’’గా పేర్కొంది. అయితే వైద్య పరీక్షల నివేదికలు వచ్చాక.. మరణంపై మరో ప్రకటన చేసింది. గుండెకు అనుసంధానమైన ప్రధాన ధమని ఏఓర్టాలో చీలిక (aortic dissection) కారణంగానే ఆయన కన్నుమూసినట్లు తెలిపింది. తన సన్నిహితుడు గ్రాహం మరణంపై ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనకు అత్యంత నమ్మకమైన మిత్రుల్లో ఒకరిని కోల్పోయానని పేర్కొన్నారు.‘‘లిండ్సే గ్రాహం గొప్ప వ్యక్తి, గొప్ప సెనేటర్. ఆయన ఎప్పుడూ పనిచేస్తూనే ఉండేవారు. నిజమైన అమెరికన్ దేశభక్తుడు’’ అంటూ ట్రంప్ నివాళులర్పించారు. మరణానికి ముందు రోజు రాత్రి కూడా గ్రాహం తనతో మాట్లాడారని ట్రంప్ తెలిపారు. ఉక్రెయిన్ పర్యటన గురించి వివరించారని, సుదీర్ఘ ప్రయాణం కారణంగా అలసిపోయినట్లు చెప్పారని వెల్లడించారు.భారత్‌పై ద్వేషం.. అంతర్జాతీయ రాజకీయాల్లో గ్రాహం పేరు ఇటీవల భారత్ విషయంలో ఎక్కువగా వినిపించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై 500 శాతం వరకు టారిఫ్‌లు విధించే ప్రతిపాదనకు ఆయన మద్దతు తెలిపారు. రష్యా చమురు కొనుగోళ్ల ద్వారా భారత్ సహా ఆ దేశాలు ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా సహకరిస్తున్నాయంటూ ఆయన విమర్శించారు. ‘‘రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేస్తూ యుద్ధానికి ఊతమిస్తే.. అమెరికా కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది’’ అంటూ గతంలో గ్రాహం తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ట్రంప్‌కు కీలక వారధిలిండ్సే గ్రాహం అమెరికా రాజకీయాల్లో మూడు దశాబ్దాలకు పైగా ప్రభావం చూపిన నేత. 2002లో సెనేట్‌కు ఎన్నికైన ఆయన.. రక్షణ, విదేశాంగ విధానాల్లో రిపబ్లికన్ పార్టీకి కీలక స్వరంగా ఎదిగారు. ట్రంప్ మొదటి అధ్యక్ష పదవీకాలంలో విమర్శకుడిగా ఉన్నప్పటికీ.. తర్వాత ఆయనకు అత్యంత సన్నిహిత మద్దతుదారుల్లో ఒకరిగా మారారు. ట్రంప్ ‘‘అమెరికా ఫస్ట్’’ విధానానికి దగ్గరగా ఉన్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా అమెరికా ప్రభావం కొనసాగాలని గ్రాహం బలంగా నమ్మేవారు.ట్రంప్ శిబిరానికి భారీ లోటులిండ్సే గ్రాహం మరణం ట్రంప్ రాజకీయ శిబిరానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. సెనేట్‌లో ట్రంప్ విధానాలకు మద్దతుగా నిలిచే కీలక గొంతుకల్లో ఒకటి ఇప్పుడు లేకుండా పోయింది. ఉక్రెయిన్ పర్యటన తర్వాతే మృతి.. అనుమానాల కలకలంమరణానికి ముందు రోజు గ్రాహం ఉక్రెయిన్‌లో పర్యటించారు. అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో సమావేశమై.. రష్యాపై మరిన్ని ఆంక్షలు, ఉక్రెయిన్‌కు మద్దతు అంశాలపై చర్చించారు. దీంతో ఆయన మరణంపై కొన్ని MAGA వర్గాల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. రష్యా లేదంటే ఇరాన్ ప్రమేయం ఉండొచ్చంటూ సోషల్ మీడియాలో కొందరు పోస్టులు చేశారు. మరికొందరు.. ఉక్రెయిన్ పర్యటన, రష్యాపై ఆంక్షల పిలుపు, గతంలో వచ్చిన బెదిరింపులను ప్రస్తావించారు. అయితే ఈ ఆరోపణలకు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. అధికారులు కూడా ఎలాంటి కుట్ర కోణాన్ని నిర్ధారించలేదు. గ్రాహం కుటుంబంలో గుండె సంబంధిత సమస్యల చరిత్ర ఉందని కూడా సమాచారం.ఇరాన్‌పై కఠిన వైఖరి.. ఇజ్రాయెల్‌కు మద్దతుగ్రాహం ఇరాన్ విషయంలో కూడా కఠిన వైఖరి అవలంబించారు. ఇరాన్ అణు, క్షిపణి కార్యక్రమాలను అడ్డుకునేందుకు సైనిక చర్యలకు కూడా ఆయన మద్దతు తెలిపారు. గాజా యుద్ధ సమయంలో ఇజ్రాయెల్‌కు ఆయన బహిరంగంగా మద్దతు ప్రకటించారు. దీంతో ఆయనపై మధ్యప్రాచ్యంలో విమర్శలు కూడా వచ్చాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. గ్రాహంను ‘‘ఇజ్రాయెల్‌కు గొప్ప మిత్రుడు’’గా అభివర్ణించారు.ఇక గ్రాహం స్థానంలో ఎవరు?గ్రాహం మృతితో దక్షిణ కరోలినా సెనేట్ స్థానంలో ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతానికి ఆయన స్థానాన్ని తాత్కాలికంగా భర్తీ చేసే అధికారం రాష్ట్ర గవర్నర్ హెన్రీ మెక్‌మాస్టర్‌కు ఉంది. ఆయన తాత్కాలిక సెనేటర్‌ను నియమించనున్నారు. ఈ రేసులో నాన్సీ మేస్ (Nancy Mace)(దక్షిణ కరోలినా ప్రతినిధుల సభ సభ్యురాలు), రిపబ్లికన్ హౌస్ సభ్యుడు రస్సెల్ ఫ్రై (Russell Fry), లెఫ్టినెంట్ గవర్నర్పామెలా ఎవెట్ (Pamela Evette).. వీళ్లతో పాటు మరికొందరి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. అయితే ఇది తాత్కాలిక నియామకం మాత్రమే. గ్రాహం ఈ ఏడాది తిరిగి ఎన్నికలకు సిద్ధమవుతున్నందున.. ప్రత్యేక రిపబ్లికన్ ప్రైమరీ నిర్వహించి కొత్త అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నవంబర్ సాధారణ ఎన్నికల్లో తుది పోటీ జరుగుతుంది. -
మళ్లీ ట్రిగ్గర్ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం
వాషింగ్టన్/టెహ్రాన్: పశ్చిమాసియాపై మళ్లీ దట్టమైన యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. మధ్యవర్తి ఖతార్ చొరవతో కాల్పుల విరమణపై ఆశలు చిగురిస్తున్నాయనుకున్న సమయంలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి దూకుడు ప్రదర్శించారు. హర్ముజ్ జలసంధి పరిసరాల్లోని ఇరాన్ సైనిక లక్ష్యాలపై అమెరికా సెంట్రల్ కమాండ్ ఆదివారం సాయంత్రం నుంచి తాజా వైమానిక దాడులు ప్రారంభించింది. వాణిజ్య నౌకలు, పౌర నౌకాయానాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ చర్యలు కొనసాగిస్తోందని ఆరోపిస్తూ ఈ దాడులకు ట్రంప్ ఆదేశాలు జారీ చేసినట్లు అమెరికా ప్రకటించింది.ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హర్ముజ్ జలసంధి ఇప్పుడు అమెరికా-ఇరాన్ మధ్య ప్రధాన యుద్ధరంగంగా మారింది. "వాణిజ్య నౌకలపై దాడి చేసే ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యం" అని సెంట్కామ్(CENTCOM) ప్రకటించింది. మరోవైపు అమెరికా జోక్యం ఆగే వరకు హర్ముజ్‌లో రాకపోకలను అనుమతించబోమని ఇరాన్ స్పష్టం చేస్తోంది. దీంతో ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన ఈ సముద్ర మార్గం తీవ్ర ఉద్రిక్తతకు కేంద్రబిందువైంది.ఓవైపు దాడులు, మరోవైపు..అమెరికా తాజా దాడులు హర్మొజ్ జలసంధికి సమీపంలోని హోర్మోజ్గాన్, ఖుజెస్టాన్, సిస్తాన్-బలూచిస్తాన్ ప్రావిన్సులపై కేంద్రీకృతమయ్యాయి. బందర్ అబ్బాస్, జాస్క్, సిరిక్, ఖెష్మ్ దీవి, చాబహార్ ప్రాంతాల్లో భారీ పేలుళ్లు చోటుచేసుకున్నట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఖొండాబ్‌లోని హెవీ వాటర్ కేంద్రం సమీపంలోనూ దాడులు జరిగినట్లు సమాచారం.దీనికి ప్రతిగా హర్ముజ్ గుండా వెళ్తున్న వాణిజ్య నౌకలపై ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కాల్పులు జరిపిందని అమెరికా ఆరోపించింది. ఇరాన్ ప్రయోగించిన ఒక క్రూయిజ్ క్షిపణి, ఒక ఆత్మాహుతి డ్రోన్‌ను కూల్చివేసినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది.నీటి పంపింగ్ కేంద్రంపై దాడి.. ఒకరు మృతిఖుజెస్టాన్ ప్రావిన్స్‌లోని మహ్షహర్ ప్రాంతంలో వ్యవసాయ నీటి పంపింగ్ స్టేషన్‌పై జరిగిన దాడిలో ఒక భద్రతా సిబ్బంది మృతి చెందగా, మరో నలుగురు గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. గాయపడిన వారికి చికిత్స కొనసాగుతోంది.ఐదో విడత దాడులుకాల్పుల విరమణ ప్రకటించి మూడు వారాలు కూడా గడవకముందే అమెరికా ఐదో విడత వైమానిక దాడులు చేపట్టింది. శనివారం ఒక్కరోజే ఇరాన్లో 140కి పైగా లక్ష్యాలపై దాడులు చేసిన అమెరికా.. తాజా దాడులతో మరింత ఒత్తిడి పెంచుతోంది. మరోవైపు బహ్రెయిన్, ఖతార్, కువైట్, ఒమన్, జోర్డాన్‌లోని అమెరికా ప్రయోజనాలపై ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగిస్తోంది.క్షీణించిన నౌకల రాకపోకలుయుద్ధ ప్రభావం సముద్ర రవాణాపై స్పష్టంగా కనిపిస్తోంది. యుద్ధానికి ముందు రోజుకు సుమారు 130 నౌకలు హర్ముజ్ జలసంధిని దాటుతుండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 22కు పడిపోయినట్లు అంతర్జాతీయ షిప్పింగ్ సంస్థల అంచనాలు చెబుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 79 డాలర్ల వద్దకు చేరడంతో ప్రపంచ ఇంధన మార్కెట్లలో ఆందోళన పెరిగింది.భారత్‌కూ ప్రభావంఒమన్ తీరంలో దాడికి గురైన జీఎఫ్ఎస్ గెలాక్సీ GFS Galaxy కంటైనర్ నౌకలో చిక్కుకున్న భారతీయ నావికుల్లో 23 మందిని రక్షించినట్లు భారత ప్రభుత్వం వెల్లడించింది. మరో నావికుడి కోసం గాలింపు కొనసాగుతోంది. హర్ముజ్‌లో పరిస్థితులు మరింత దిగజారితే భారత చమురు దిగుమతులు, సముద్ర వాణిజ్యంపై కూడా ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇక ముందు ఏం జరుగుతుంది?హర్ముజ్ జలసంధిపై నియంత్రణ విషయంలో అమెరికా-ఇరాన్ ఎవరూ వెనక్కి తగ్గే సంకేతాలు కనిపించడం లేదు. ఒకవైపు అమెరికా వరుస వైమానిక దాడులతో ఒత్తిడి పెంచుతుంటే.. మరోవైపు ఇరాన్ సముద్ర మార్గాన్ని తన ఆధీనంలో ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ప్రతిష్ఠంభన కొనసాగితే ప్రపంచ చమురు సరఫరా, అంతర్జాతీయ వాణిజ్యం, పశ్చిమాసియా భద్రతపై మరింత తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. -
అమెరికా గడ్డపై అతిపెద్ద 'బంగారు గని' నిజమేనా?
ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు ఇన్వెస్టర్లలో తీవ్ర చర్చకు దారితీసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూఎస్ భూభాగంలో 1 ట్రిలియన్ డాలర్ల (సుమారు రూ. 84 లక్షల కోట్లు) విలువైన ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు నిక్షేపాన్ని వెలికితీసేందుకు ఒక పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నారంటూ ఆయన పేర్కొన్నారు.తనకు సన్నిహితుడైన ప్రముఖ పసిడి నిపుణుడు జిమ్ రిక్కార్డ్స్ సమాచారం ప్రకారం.. ఈ పథకం ద్వారా రాబోయే కొన్ని నెలల్లోనే 10 రెట్లు లాభాలు వచ్చే అవకాశం ఉందని కియోసాకి చెప్పుకొచ్చారు. అయితే, కియోసాకి పోస్ట్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.అసలు నిజం ఏంటి?ఆర్థిక నిపుణుల విశ్లేషణ ప్రకారం.. ఈ పోస్ట్‌లో పేర్కొన్న "ట్రంప్ గోల్డ్ మైన్" అనేది కొత్తగా కనుగొన్నదేమీ కాదు. అలాస్కా ప్రాంతంలో ఎప్పటి నుంచో వివాదాల్లో ఉన్న 'డాన్లిన్ గోల్డ్' (Donlin Gold) లేదా 'పెబుల్ మైన్' (Pebble Mine) వంటి పాత మైనింగ్ ప్రాజెక్టులను ఉద్దేశించి ఈ ప్రచారం జరుగుతోంది. ఇవి పెద్ద నిక్షేపాలే అయినప్పటికీ, అధ్యక్షుడి ఒక్క ఆదేశంతో రాత్రికి రాత్రే బంగారం బయటకు వచ్చేసే పరిస్థితి లేదు. వీటికి ఎన్నో పర్యావరణ అనుమతులు, చట్టపరమైన చిక్కులు ఉన్నాయి.10 రెట్ల లాభాలు సాధ్యమేనా?కొద్ది నెలల్లోనే 10 రెట్లు లాభాలు వస్తాయనే వాదనను మార్కెట్ నిపుణులు తీవ్రంగా కొట్టిపారేస్తున్నారు. ఇదంతా జిమ్ రిక్కార్డ్స్ నడుపుతున్న ఒక ప్రీమియం ఫైనాన్షియల్ న్యూస్‌లెటర్ సబ్స్క్రిప్షన్లను అమ్ముకోవడానికి చేస్తున్న పబ్లిసిటీ స్టంట్ అని కొందరు ఆరోపిస్తున్నారు. బంగారం, మైనింగ్ రంగాలు చాలా అస్థిరంగా ఉంటాయని, తక్కువ సమయంలో ఇలాంటి అసాధారణ లాభాలు రావడం దాదాపు అసాధ్యమని వారు హెచ్చరిస్తున్నారు. -
హర్మూజ్ జలసంధిని మూసేస్తున్నాం : ఇరాన్
టెహ్రాన్ : ఇరాన్–అమెరికా పరస్పర దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. హర్మూజ్ జలసంధిలో గుర్తింపు లేని, అనధికారిక నౌకల రాకపోకలకు అనుమతి లేదని ఇరాన్ ముందునుంచే హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో, తాజాగా అనధికారికంగా ప్రయాణిస్తున్నట్లు పేర్కొన్న ఓ వాణిజ్య నౌకపై ఇరాన్ కాల్పులు జరిపింది. అనంతరం హర్మూజ్ జలసంధిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆ జలసంధి గుండా చమురు ట్యాంకర్లు సహా వాణిజ్య నౌకల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది.ఈ పరిణామాల మధ్య, కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఇరాన్ ఆరోపించింది. మూడో దఫా తమ భూభాగంపై అమెరికా దాడులకు పాల్పడిందని పేర్కొంటూ, దీనికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది. హర్మూజ్ జలసంధి గుండా స్వేచ్ఛగా ప్రయాణించే వాణిజ్య నౌకలపై దాడులు చేస్తూ, ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీయాలనే ప్రయత్నాలు తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని వెల్లడించింది.యుద్ధాన్ని ముగించేందుకు గత నెలలో కుదిరిన ఒప్పందాన్ని మరింత బలోపేతం చేసే చర్చలు హర్మూజ్ జలసంధి భద్రత లేకుండా ముందుకు సాగలేవని అమెరికా ఉన్నతాధికారులు గతంలో పేర్కొన్నారు. ఈ అంశంపై ఇరాన్ కూడా స్పష్టమైన బహిరంగ ప్రకటన చేస్తుందని తాము ఆశిస్తున్నట్లు వారు తెలిపారు.ఈ నేపథ్యంలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసింది. నిబంధనలను ఉల్లంఘించిన ఓ వాణిజ్య నౌకపై కాల్పులు జరిపామని, హర్మూజ్ జలసంధిని తాత్కాలికంగా మూసివేస్తున్నామని వెల్లడించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.వాణిజ్య నౌకలపై ఇరాన్ చర్యలు, వాటికి అమెరికా ప్రతిస్పందనల నేపథ్యంలో యుద్ధ విరమణకు కుదిరిన తాత్కాలిక ఒప్పందానికి విఘాతం ఏర్పడింది. ఈ పరిస్థితులపై చర్చించేందుకు ఇరాన్, ఒమన్ విదేశాంగ మంత్రులు శనివారం సమావేశమైన అనంతరం ఈ ప్రకటనలు వెలువడ్డాయి.ఇదిలా ఉండగా, తన తండ్రి, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణమని ఆరోపిస్తూ, ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. దీనికి ప్రతిస్పందించిన ట్రంప్, తనపై ఎలాంటి దాడికి ప్రయత్నించినా ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. -
న్యూయార్క్ టైమ్స్ రిపోర్టర్లకుకోర్టు నోటీసులు
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ కొత్త విమానం గురించి వార్త రాసినందుకు అమెరికా వార్తా పత్రిక న్యూయార్క్ టైమ్స్ రిపోర్టర్లకు కోర్టు నోటీసులు జారీ అయ్యాయి. ఖతర్ బహుమతిగా ఇచ్చిన విమానాన్ని డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడి అధికారిక విమానంగా మార్చిన సంగతి, వారం రోజుల క్రితమే ఇది అందుబాటులోకి వచ్చిన విషయమూ తెలిసిందే. అయితే ఈ కొత్త విమానంలో భద్రతా వ్యవస్థలను ప్రశ్నిస్తూ న్యూయార్క్ టైమ్స్ రిపోర్టర్లు వార్తలు ప్రచురించారు. దీనిపై శుక్రవారం తమ రిపోర్టర్లు జూలియన్ ఈ. బార్న్స్, ఎరిక్ లిప్టన్, టైలర్ పేజర్, ఎరిక్ ష్మిట్లకు నోటీసులు జారీ అయినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. రానున్న బుధవారం మాన్హాటన్లోని ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ ముందు సాక్ష్యం ఇవ్వాలన్నది ఈ నోటీసుల సారాంశం. ఫెడరల్ ఏజెంట్లు కొంతమంది జర్నలిస్టుల ఇళ్లకు వెళ్లి మరీ నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఇదీ నేపథ్యం...డొనాల్డ్ ట్రంప్ గత వారం కొత్త ఎయిర్ ఎయిర్ ఫోర్స్వన్లో టర్కీలో జరిగిన నాటో సదస్సుకు వెళ్లారు. అయితే బుధవారం మాత్రం పాత ఎయిర్ ఫోర్స్–వన్‌లో ఇంగ్లాండ్‌లోని మిల్డెన్హాల్లో ఉన్న రాయల్ ఎయిర్‌ఫోర్స్ కేంద్రానికి వెళ్లారు. ఆసక్తికరంగా కొత్త విమానమూ అక్కడకు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో ట్రంప్ కొత్త విమానంలో తిరిగి వచ్చారు. అమెరికా – ఇరాన్‌ల మధ్య కాల్పుల ఒప్పందం విఫలమైన సందర్భంలోనే విమానాల మార్పు జరిగింది. అమెరికా ఇరాన్‌పై దాడులు చేయగా ఇరాన్ మూడు గల్ఫ్ అరబ్ దేశాలపై క్షిపణులు ప్రయోగించింది. ఈ నేపథ్యంలో 40 కోట్ల డాలర్ల ఖర్చుతో మార్పులుచేర్పులు చేసిన కొత్త ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ఆధునిక భద్రత వ్యవస్థలు లేవేమో అన్న అనుమానంతో న్యూయార్క్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. భద్రతా దళాల సూచనల మేరకు అధ్యక్షుడు పాత విమానంలో వెళ్లారని తెలిపింది. అయితే ట్రంప్ వాటిని ఖండించారు. సైనికులకు కొత్త ఎయిర్ఫోర్స్వన్ను చూపేందుకే మిల్డెన్హాల్లో ఆగినట్లు సోషల్ మీడియాలో తెలిపారు. వైట్ హౌస్ కొత్త విమానంలో భద్రతా లోపాలు లేవని స్పష్టం చేసింది. న్యూయార్క్ టైమ్స్ రిపోర్టర్లకు నోటీసులు జారీ చేసిన విషయంపై శనివారం వరకూ వైట్‌హౌస్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. -
నన్ను చంపితే ఇరాన్ భూస్థాపితం
దుబాయ్/వాషింగ్టన్: ఇరాన్ భూతలంపై అమెరికా.. అమెరికా మిత్రదేశాలపై ఇరాన్ బాంబులేస్తూ పశ్చిమాసియాలో రణజ్వాలల్ని కొనసాగిస్తుండగా శనివారం మాత్రం పరస్పర హెచ్చరికల పర్వానికి తెరలేపారు. తండ్రి మరణానికి కారణమైన ట్రంప్‌ను అంతమొందిస్తామని ఇరాన్ నూతన సుప్రీంనేత మొజ్తాబా ఖమేనీ ప్రతిజ్ఞచేసిన కొన్ని గంటలకే ట్రంప్ సైతం దీటైన హెచ్చరిక చేశారు. తనను చంపితే ప్రపంచపటంలో ఇరాన్ లేకుండా చేస్తామని, దారుణ వినాశనం సృష్టించేలా 1,000 క్షిపణులు దాడికి సిద్ధంగా ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరించారు. ఈ మేరకు శనివారం ఆయన తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘ఇరాన్ ప్రభుత్వం గనక నన్ను చంపితే మరుక్షణమే ఇరాన్‌ను భూస్థాపితం చేసేందుకు 1,000 క్షిపణులు లోడ్ చేసి సిద్ధంగా ఉన్నాయి. అవి వినాశనం సృష్టించాక మిగతా భూమిని మరుభూమిగా మార్చేందుకు వేలాదిగా మిస్సైళ్లు వరసబెట్టి విరుచుకుపడతాయి. ఒకవేళ నన్ను చంపితే ఇరాన్‌పై ఎంతటి స్థాయిలో దాడిచేయాలో మా సైన్యానికి సమగ్రస్థాయిలో ఆదేశాలు ఇప్పటికే ఇచ్చేశా. ఇరాన్లో అంగుళం స్థలం కూడా వదలకుండా ఏడాది పొడవునా దాడులు చేయాలని గతంలోనే తగు ఆజ్ఞలు జారీచేశా’’అని ట్రంప్ హెచ్చరించారు. ప్రతీకారం తీర్చుకుంటాం: మొజ్తాబా అంతకుముందు శుక్రవారం దివంగత ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా ఇరాన్ అధికార వార్తఛానల్లో మొజ్తాబా ఖమేనీ సందేశాన్ని ప్రసారంచేశారు. ‘‘ట్రంప్‌ను చంపాలనేది మా దేశ సంకల్పం. ఈ సంకల్పాన్ని సాధించి తీరతాం. అమరత్వం పొందిన మా నేత రక్తాన్ని చిందేలా చేసినందుకు ప్రతీకారం తీర్చుకుంటాం. ఘోరాలకు పాల్పడిన వాళ్లను వదలిపెట్టం. రెండు యుద్దాల్లో మా వాళ్లు అమరులయ్యేలా చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటాం. నేరాలు చేసిన హంతకుల అంతుచూస్తాం’’అని మొజ్తాబా అన్నారు. హార్మూజ్‌ను తమ గుప్పిట పట్టామని ఇరాన్ చేసిన ప్రకటనను అమెరికా సీనియర్ ఉన్నతాధికారి తప్పుబట్టారు. ఇరాన్ తక్షణం హార్మూజ్‌ను తెరచి ఉంచామని ప్రకటన చేయాలని హెచ్చరించారు. హార్మూజ్ గుండా వెళ్లే నౌకలకు ఎలాంటి హానీ తలపెట్టొద్దని డిమాండ్‌చేశారు. గత రెండ్రోజుల్లో అమెరికా దాడుల్లో ఇరాన్లో 17 మంది చనిపోయారు. 115 మంది గాయపడ్డారని ఇరాన్ ఆరోగ్యశాఖ అధికార ప్రతినిధి హుస్సేన్ కెర్మాన్‌పూర్ తెలిపారు. మరోవైపు మధ్యవర్తి ఒమన్ దేశంతో చర్చల కోసం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్అరాఘ్చీ సిద్ధమయ్యారు. తమ క్రూడ్, ఫ్యూయల్‌ను విక్రయించకుండా అమెరికా ఆంక్షలు విధించడం సబబుగా లేదు అని అరాఘ్చీ ఆగ్రహం వ్యక్తంచేశారు. -
తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాను: ఖమేనీ స్ట్రాంగ్ వార్నింగ్
టెహ్రాన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల తర్వాత తొలి సందేశం విడుదల చేశారు. అల్ జజీరా కథనం ప్రకారం.. "నా తండ్రి రక్తం చిందేలా చేశారు.. నేను తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాను. ఇది మా దేశం కోరిక కూడా" అని చెప్పారు.అంత్యక్రియలకు హాజరైన లక్షలాది మందికి మొజ్తబా ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రికి నివాళులు అర్పించారు. భారీ సంఖ్యలో ప్రజలు హాజరుకావడం శత్రువుకు గట్టి దెబ్బగా అని, అది చరిత్రాత్మక ఘట్టమని చెప్పారు.ఇదిలా ఉంటే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. ఇరాన్ తనను హత్య చేయాలని ప్రయత్నిస్తే ఆ దేశం పూర్తిగా నాశనం అవుతుందని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇరాన్ వైపు 1,000 క్షిపణులు ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నాయని, అవసరమైతే వేలాది క్షిపణులను కూడా ప్రయోగిస్తామని పేర్కొన్నారు.ఇరాన్‌పై ట్రంప్‌నకు వైరం ఎప్పుడు మొదలైంది?ఈ వివాదం మూలాలు 2020 జనవరిలో ఉన్నాయి. అప్పట్లో ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇరాక్‌లోని బాగ్దాద్ విమానాశ్రయం సమీపంలో అమెరికా డ్రోన్ దాడిలో ఇరాన్ అత్యంత శక్తిమంతమైన సైనిక కమాండర్ ఖాసిం సోలేమానీ మరణించారు.ఆ సమయంలో సోలేమానీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రతిజ్ఞ చేసింది. ఆ తర్వాత అమెరికా సంస్థలు, ట్రంప్‌ను, ఆయన మాజీ అధికారులను ఇరాన్ లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం చేయవచ్చని పలుసార్లు ప్రకటించాయి. అయితే, ఈ ఆరోపణలను ఇరాన్ ఎప్పటికప్పుడు ఖండిస్తోంది. ట్రంప్‌ను ఇరాన్ చంపేసే ప్రయత్నాలు చేస్తుందన్న వాదనలు ఇప్పటికీ ఉన్నాయి. నిపుణులు ఏమంటున్నారు? టెహ్రాన్ అప్లైడ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మోస్తఫా ఖోష్చెష్మ్ మీడియాతో మాట్లాడుతూ.. హోర్ముజ్ జలసంధి ఎప్పటి నుంచో ఇరాన్ నియంత్రణలోనే ఉందని, యుద్ధం తర్వాత దానిపై నియంత్రణ వదులుకోవడాన్ని ఇరాన్ ప్రజలు అంగీకరించరని చెప్పారు.యుద్ధం సమయంలో హార్మూజ్ జలసంధి మూసివేయడంతో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయని, అది ఇరాన్ చేతిలో అత్యంత శక్తిమంతమైన ఒత్తిడి సాధనంగా మారిందని చెప్పారు. దీనివల్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దేశీయంగా ఒత్తిడి పెరిగిందని, సైనిక బలాన్ని ఉపయోగించినా హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవలేకపోయారని తెలిపారు. అమెరికాతో చర్చలు జరపడం వల్ల ఇరాన్‌కు ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదని, పైగా ఇంకా ఎక్కువ నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు. -
ఇరాన్ మాస్టర్ ప్లాన్ ట్రంప్ కు స్పాట్ పెట్టారుగా.....!
-
అమెరికా హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్
టెహ్రాన్: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పీక్ స్టేజ్ చేరుకున్నాయి. యుద్ధ విరమణ ఒప్పందం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ కూడా గట్టిగా స్పందించింది. అమెరికా ఎలాంటి సైనిక చర్యలకు దిగినా తగిన ప్రతీకార చర్యలు తప్పవని ఇరాన్ కీలక నేతలు హెచ్చరించారు.ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, చర్చల బృందానికి నేతృత్వం వహిస్తున్న మహమ్మద్ బాఘర్ ఘాలిబాఫ్ అమెరికాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై దాడి జరిగితే దానికి తగిన సమాధానం ఇస్తామని, ఒత్తిళ్లు, బెదిరింపులతో తమను వెనక్కి తగ్గించలేరని ఆయన హెచ్చరించారు. హార్మూజ్ జలసంధి తిరిగి సాధారణ స్థితికి రావాలంటే ఇరాన్ షరతులు, ఏర్పాట్లను పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని ఆయన పేర్కొన్నారు.ఇటీవల అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందం తర్వాత కూడా వివాదాలు పూర్తిగా చల్లారలేదు. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు ఒప్పంద ఉల్లంఘనల ఆరోపణలు చేసుకుంటున్నాయి. అమెరికా వైపు నుంచి కొత్త హెచ్చరికలు రావడం, ఇరాన్ నుంచి ప్రతీకార చర్యల ప్రకటనలు రావడంతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధి ఈ వివాదానికి కేంద్రంగా మారింది. ఈ మార్గం ద్వారా భారీ స్థాయిలో చమురు రవాణా జరుగుతుండటంతో అక్కడి పరిస్థితులు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికా హార్మూజ్‌లో స్వేచ్ఛాయుత నౌకా రవాణాకు హామీలు కోరుతుండగా, ఇరాన్ మాత్రం తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తోంది.మరోవైపు దౌత్య మార్గాలు పూర్తిగా మూసుకుపోలేదు. ట్రంప్ చర్చలు కొనసాగించేందుకు ఇరాన్‌తో అంగీకారం కుదిరిందని చెబుతున్నప్పటికీ, కాల్పుల విరమణ ముగిసిందని కూడా స్పష్టం చేశారు. దీంతో ఒకవైపు చర్చలు, మరోవైపు సైనిక హెచ్చరికలు కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. తాజా పరిణామాలు కేవలం రెండు దేశాల మధ్య వివాదంగా కాకుండా, మధ్యప్రాచ్య భద్రత, ప్రపంచ చమురు సరఫరా, అంతర్జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపే అంశంగా మారాయి. -
ఇరాన్‌పైకి వెయ్యి క్షిపణులు.. నాన్‌స్టాప్‌గా ఏడాదిపాటు దాడులు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత ఎగసిపడేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస ప్రకటనలు చేస్తున్నారు. శాంతి చర్చలకు ఇరాన్ ఇప్పుడు దిగి వచ్చినా ప్రయోజనం ఉండకపోవచ్చన్న ఆయన.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను హత్య చేయడానికి ప్రయత్నిస్తే.. అమెరికా నుంచి వెయ్యి క్షిపణులు వెంటనే ఆ దేశంపై విరుచుకుపడతాయని హెచ్చరించారు. తొలి దాడితో ఆగకుండా.. అవసరమైతే ఏడాది పాటు ఇరాన్‌లోని కీలక ప్రాంతాలను పూర్తిగా ధ్వంసం చేసేలా అమెరికా సైన్యానికి ముందుగానే ఆదేశాలు జారీ చేశానని వెల్లడించారు. తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. "అమెరికా అధ్యక్షుడిని, ముఖ్యంగా నన్ను హత్య చేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తే.. వెయ్యి క్షిపణులు ఇప్పటికే లక్ష్యంగా సిద్ధంగా ఉన్నాయి. తొలి దాడి తర్వాత వేలాది క్షిపణులు వెంటనే ప్రయోగిస్తాం. అమెరికా సైన్యానికి అవసరమైన అన్ని ఆదేశాలు ఇప్పటికే ఇచ్చాం. ఒక సంవత్సరం పాటు అవసరమైతే ఇరాన్‌లోని ప్రతి కీలక ప్రాంతాన్ని పూర్తిగా ధ్వంసం చేయడానికి సైన్యం సిద్ధంగా ఉంది. అవసరమైతే ఈ గడువును పొడిగించే అవకాశం కూడా ఉంది" అని పేర్కొన్నారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి.బ్యాక్ టు బ్యాక్ వార్నింగులుట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల అమెరికా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా.. తనకు ఏదైనా జరిగితే ఇరాన్‌పై ప్రపంచం ఎన్నడూ చూడని స్థాయిలో బాంబుల వర్షం కురిపించాలని ముందుగానే అధికారులకు ఆదేశాలు ఇచ్చానని చెప్పారు. తనపై కొత్త హత్య కుట్రకు సంబంధించి ఇజ్రాయెల్ వద్ద ఎలాంటి తాజా సమాచారం లేదని, అయితే చాలా ఏళ్లుగా తానే ఇరాన్ 'కిల్ లిస్ట్'లో మొదటి లక్ష్యంగా ఉన్నానని మరోసారి పునరుద్ఘాటించారు.సోలేమానీ హత్యతో మొదలైన వైరం2020లో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్‌కు చెందిన అగ్ర సైనికాధికారి ఖాసెం సోలేమానీ మరణించారు. అప్పటి నుంచి ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌కు చెందిన పలువురు నేతలు హెచ్చరిస్తూ వస్తున్నారు. అమెరికా దర్యాప్తు సంస్థలు కూడా గతంలో ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్‌కు అనుబంధంగా ఉన్న వ్యక్తులు కుట్రలు పన్నినట్లు వెల్లడించాయి. అయితే ఇరాన్ ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు ఖండిస్తోంది. అయితే అయతొల్లా ఖమేనీ మరణంతో మళ్లీ ట్రంప్‌ను టార్గెట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.శాంతి చర్చలపైనా కఠిన వైఖరిఇదిలా ఉండగా.. అమెరికాతో మళ్లీ చర్చలు కొనసాగించాలని ఇరాన్ కోరినట్లు ట్రంప్ తెలిపారు. అయితే అమెరికా ఇప్పటికే ఇరాన్‌కు కాల్పుల విరమణ ముగిసిందని స్పష్టం చేసిందన్నారు. చర్చలకు అంగీకరించినా.. ఇరాన్‌పై తమ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని సంకేతాలు ఇచ్చారు.పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు?అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్న సమయంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు మరోసారి ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఒకవైపు మధ్యవర్తి దేశాలు శాంతి చర్చలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తుండగా.. మరోవైపు "వెయ్యి క్షిపణులు సిద్ధంగా ఉన్నాయి.. ఏడాది పాటు దాడులు కొనసాగుతాయి" అంటూ ట్రంప్ చేసిన హెచ్చరికలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మళ్లీ పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
నన్ను ఏమైనా చేస్తే.. ట్రంప్ షాకింగ్ కామెంట్లు
వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు క్రమంగా చల్లారుతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తనను హత్య చేయాలనే కుట్రలు పన్నుతోందని చాలాకాలంగా ఆయన చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా.. ఆ విషయాన్ని ఇజ్రాయెల్ నిఘా వర్గాలు కూడా ప్రస్తావించాయి కూడా . ఈ నేపథ్యంలో తనపై హత్యాయత్నం విజయవంతమైతే.. ఇరాన్‌పై ప్రపంచం ఎన్నడూ చూడని స్థాయిలో దాడులు చేయాలని ముందుగానే అధికారులకు ఆదేశాలు ఇచ్చానని ట్రంప్ అంటున్నారు. అమెరికా మీడియాతో మాట్లాడిన ట్రంప్.. "నేను చాలా కాలంగా ఇరాన్ లక్ష్యంగా ఉన్నాను. ఒకవేళ నాకు ఏదైనా జరిగితే.. వాళ్లు ఇప్పటివరకు చూడని స్థాయిలో ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపించాలని ముందుగానే ఆదేశాలు ఇచ్చాను" అని అన్నారు. ఇటీవల ఇజ్రాయెల్ నుంచి తనపై కొత్త హత్య కుట్రకు సంబంధించిన హెచ్చరికలు వచ్చాయా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. "కొత్తగా ఏమీ లేదు. చాలా ఏళ్లుగా వాళ్ల హిట్ లిస్ట్‌లో నేనే మొదటి లక్ష్యం" అని చెప్పారు."అలాంటి పరిస్థితి వస్తే ఇరాన్ ప్రపంచ పటంలో లేకుండా పోతుంది" అంటూ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. అయితే ట్రంప్ వ్యాఖ్యల వెనుక 2020లో జరిగిన ఖాసెం సోలేమానీ హత్య ఘటన కీలకంగా నిలిచింది. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా జరిపిన వైమానిక దాడిలో ఇరాన్‌కు చెందిన అగ్ర సైనికాధికారి ఖాసెం సోలేమానీ మరణించారు. అప్పటి నుంచి ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌కు చెందిన పలువురు నేతలు పరోక్షంగా హెచ్చరిస్తూ వచ్చారు. ఇరాన్ సుప్రీం లీడర్(మాజీ) అయతొల్లా ఖమేనీని యుద్ధంలో హతమార్చడంతో ఆ దేశం పగతో రగిలిపోతోంది. ఈ నేపథ్యంలోనే తాను ఇరాన్ 'కిల్ లిస్ట్'లో అగ్రస్థానంలో ఉన్నానని ట్రంప్ పలుమార్లు వ్యాఖ్యానించారు.ఇటీవల నాటో సమావేశం సందర్భంగా కూడా ట్రంప్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. "ఇరాన్లో ఒక నాయకత్వం వెళ్లింది.. ఇంకో నాయకత్వం వచ్చింది.. అది కూడా మారింది. నేను కూడా ఎప్పుడు ఉంటానో తెలియదు. ఎందుకంటే వాళ్ల ప్రధాన లక్ష్యం నేనే" అంటూ వ్యాఖ్యానించారు. "ఇప్పటివరకు అదృష్టం కలిసి వచ్చింది. కానీ అది ఎప్పటికీ అలాగే ఉంటుందని చెప్పలేం" అని కూడా పేర్కొన్నారు.ఇదే సమయంలో ఇరాన్‌తో శాంతి చర్చలపై కూడా ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా-ఇరాన్ మధ్య అవగాహన ప్రక్రియ ముగిసిపోయిందని, ఇక ఆ దేశ చర్చల బృందంపై తనకు ఎలాంటి విశ్వాసం లేదని అన్నారు. "వాళ్లతో చాలా సమయం వృథా చేశాం. వాళ్లు హింసను నమ్మే వ్యక్తులు. అధికారులు మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు.. కానీ దాంతో పెద్దగా ప్రయోజనం ఉండదని నా అభిప్రాయం" అని వ్యాఖ్యానించారు.ఇటీవల అమెరికా ఇరాన్‌లోని పలు కీలక స్థావరాలపై దాడులు జరిపిన అనంతరం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. మరోవైపు మధ్యవర్తి దేశాలు శాంతి చర్చలను పునరుద్ధరించే ప్రయత్నాలు చేస్తున్న వేళ ట్రంప్ తాజా వ్యాఖ్యలు పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇదిలా ఉండగా, ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇరాన్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. మేం మంచివాళ్లం గనుక ఇరాన్‌కు వారం సెలవు ఇచ్చాం(ఖమేనీ వారం సంతాపదినాలను ఉద్దేశించి..) అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారాయన. ఈ క్రమంలోనే ఖమేనీ అంతిమయాత్రలో.. ట్రంప్‌తో పాటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ వ్యతిరేక నినాదాలు వినిపించాయి. దీంతో అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న విభేదాలు ఇంకా పూర్తిగా చల్లారలేదనే సంకేతాలు వెలువడుతున్నాయి.ట్రంప్ చేసిన తాజా హెచ్చరికలు, ఇరాన్ నుంచి వస్తున్న ప్రతీకార స్వరాల నేపథ్యంలో పశ్చిమాసియా పరిస్థితులు మళ్లీ ఏ మలుపు తిరుగుతాయన్నది ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా మారింది. -
అనిశ్చితిలో వెలుగురేఖ
‘బలవంతుడ నాకేమని...’ అనుకుంటే దశాబ్దాల తరబడి అమెరికా నిర్మించుకుంటూ వస్తున్న పునాదులు కదిలిపోతాయని ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఇంకా జ్ఞానో దయం కాలేదు. నాటో శిఖరాగ్ర సదస్సుకు పోయి ఈసారి కాస్తంత స్నేహపూర్వకంగా మాట్లాడినా అటువైపునుంచి మునుపటి సాన్నిహిత్యం లేదని తుర్కియేలో ముగిసిన ఆ సదస్సు తీరుతెన్నులు చెబుతున్నాయి. అమెరికాతో ఇప్పటికీ సన్నిహిత సంబంధాలే ఉన్న మన దేశం సైతం ఆయన తరచు చేసే ప్రకటనల కారణంగా ఇబ్బంది పడుతోంది. హఠాత్తుగా ‘ఇండో–పసిఫిక్’ పేరు మారాక లోలోన అసంతృప్తి సరేసరి. ఈ నేపథ్యంలో ఇండో–పసిఫిక్ విషయంలో మన వైఖరిని తేటతెల్లం చేసేలా, మన చొరవను మరింత పెంచేలా ప్రధాని నరేంద్ర మోదీ ఇండొనేసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఆరు రోజుల పర్యటన ఈ నెల 6న మొదలైంది. ఇప్పటికే ఇండొనేసియా, ఆస్ట్రేలియా పర్యటనలు పూర్తి చేసుకున్న మోదీ శుక్రవారం న్యూజిలాండ్ చేరుకున్నారు. అమెరికా, చైనాలతో... వాటి వైఖరులతో సంబంధం లేకుండా భద్రత, వాణిజ్యం తదితర రంగాల్లో భిన్న దేశాల సహకారం అవసరమని మన దేశం భావించబట్టే ఈ పర్యటన ఖరారైంది. ఈ మూడూ సాగరప్రాంత దేశాలు. ఎప్పుడో 1992లోనే రూపుదిద్దుకున్న ‘లుక్ ఈస్ట్’ విధానానికి కొనసాగింపుగా మన దేశం ‘మహాసాగర్’ దార్శనికతను ప్రతిపాదించింది. పరస్పర సంపూర్ణ అభివృద్ధికి ప్రాంతాలవారీ భద్రత, సమగ్రవృద్ధి అవసరమన్నదిదాని సారాంశం. సాధారణ ఆర్థిక సంబంధాలు మొదలుకొని భారీ రక్షణ, ఇంధన భాగస్వామ్యం వరకూ అనేకం దీని పరిధిలోకొస్తాయి. ఆస్ట్రేలియాతో గురువారం కుదిరిన పౌర అణుశక్తి ఒప్పందం చరిత్రాత్మకమైనది. ఇదిగాక ఆధునిక సాంకేతికతలూ, రక్షణ, భద్రత సహకారం, సరఫరా గొలుసు మెరుగు పరచటం తదితరాలకు సంబంధించి మరో 18 ఒప్పందాలు కుదిరాయి. పారిస్ఒప్పందం కింద స్వచ్ఛ ఇంధన లక్ష్యం సాధనకు మన అణు రియాక్టర్లకు నిరంతరాయంగా యురేనియం అవసరమవుతుంది. ప్రస్తుతం ఉన్న 7.7 గిగావాట్ల అణు విద్యుత్‌ను 2047కల్లా 100 గిగావాట్లకు పెంచాలని భారత్ నిర్దేశించుకుంది. ఇందుకోసం ప్రపంచ యురేనియం నిక్షేపాల్లో 28 శాతంగల ఆస్ట్రేలియాతో ఒప్పందం కుదరటం కీలక పరిణామం. ప్రపంచ పరిణామాల కారణంగా హఠాత్తుగా నిలిచిపోతున్న ఇంధన సరఫరా తీరును సరిదిద్దటానికి ఎల్ఎన్జీ, బొగ్గు, డీజిల్వంటి సంప్రదాయ ఇంధన వనరుల విషయంలో పరస్పరం సహకరించుకుంటూ ఇంధన భద్రతను బలోపేతం చేసుకోవాలని రెండు దేశాలూ నిర్ణయించుకున్నాయి. ఏనాటి నుంచో సాన్నిహిత్యంగల ఇండొనేసియాతో మరిన్ని రంగాల్లో సహకారానికి ఈ నెల 6నుంచి 8వరకూ వరసగా మూడురోజులపాటు కొనసాగిన పర్యటనలో ఒప్పందాలు కుదిరాయి. మన బ్రహ్మోస్, అస్త్ర క్షిపణుల్ని కొనుగోలు చేయటానికి ఇండొనేసియా ఒప్పందం కుదుర్చుకుంది. ఇరు దేశాలూ కలిసి ఇండొనేసియాలోని ఆచే, అండమాన్, నికోబార్ దీవుల్లో నౌకాశ్రయాలను నిర్మించటానికి కూడా అధినేతలిద్దరూ అంగీకరించారు. అలాగే హిందూసముద్రం మొదలుకొని పసిఫిక్ మహాసముద్రంవరకూ పరస్పర సహకారంతో సముద్రజలాల్లో భద్రతను పెంచటానికి ఒప్పందం కుదిరింది. ఇప్పటికే జపాన్, దక్షిణ కొరియాలతో ఉన్న సహకారానికి ఇండొనేసియా కూడా తోడుకావటం వల్ల ఇండో–పసిఫిక్‌లో పటిష్టమైన సమన్వయం ఏర్పడుతుంది. చైనాతో అంటకాగటానికిట్రంప్ ప్రయత్నిస్తున్న దశలో ఇది కీలక పరిణామం. నిరుడు మన దేశంలో న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ పర్యటించినప్పుడు ద్వైపాక్షిక రక్షణ సహకార ఒప్పందం కుదిరింది. దాంతోపాటు మొన్న ఏప్రిల్‌లో రెండు దేశాలూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) కుదుర్చుకున్నాయి. దీన్ని మున్ముందు మరింత విస్తృతపర్చుకోవటానికి ఇప్పటికే ఇరు దేశాలూ నిర్ణయించుకున్నాయి. కూటముల్లో చేరే విషయంలో న్యూజిలాండ్‌కు పెద్దగా ఆసక్తి లేదు. అయితే ప్రాంతీయ భద్రతను పెంపొందించుకోవటానికి భారత్, ఆస్ట్రేలియాలతో కలిసి పనిచేయాలని ఇప్పటికే నిర్ణయించుకుంది. మొత్తానికి మోదీ మూడు దేశాల పర్యటన ఇండో–పసిఫిక్‌లో భారత్ పలుకుబడిని మరింత పెంచుతుంది. -
పశ్చిమాసియాలో ఆగిన యుద్ధం.. మళ్లీ చర్చల బాట!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య రెండు రోజుల పాటు భీకర దాడులు కొనసాగాయి. అయితే.. ఆ శాంతి చర్చలను మళ్లీ పట్టాలెక్కించేందుకు మధ్యవర్తి దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. దీంతో యుద్ధం తాత్కాలికంగా ఆగిందని సమాచారం.అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన పరస్పర దాడులతో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అయితే ప్రస్తుతం ఇరు దేశాలు చర్చల దిశగా అడుగులు వేస్తున్నట్లు అల్‌జజీరా ఓ కథనం ఇచ్చింది. అందులో.. వాషింగ్టన్ ఇప్పటికీ ఇరాన్‌తో చర్చలకు కట్టుబడి ఉందని ఓ అమెరికా అధికారి వెల్లడించారు. ఇరు దేశాల మధ్య సాంకేతిక స్థాయి చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇదే విషయాన్ని మొదటి నుంచి చెబుతున్నట్లు గుర్తు చేశారాయన.ఇవాళ.. కొత్తగా దాడులేం జరగలేదు. అంతకు ముందు బుషెహర్ సైనిక స్థావరం వద్ద బాంబుల మోత మోగింది. అయితే అమెరికా-ఇజ్రాయెల్ తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించాయి.ఖతార్ చొరవతో..అమెరికా-ఇరాన్ ఘర్షణను తగ్గించేందుకు ఖతార్ మధ్యవర్తిత్వ ప్రయత్నం చేస్తోంది. ఘర్షణలకు పరిష్కారం కేవలం దౌత్యం, చర్చల ద్వారానే సాధ్యమని ఖతార్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఖతార్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాజిద్ అల్ అన్సారీ మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో శాశ్వత భద్రత, స్థిరత్వం కోసం సంభాషణలు, దౌత్య మార్గాలకే తమ దేశం ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. లండన్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దులో..అమెరికా-ఇరాన్ మధ్య పరిస్థితి చాలా చల్లబడ్డప్పటికీ.. లెబనాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దక్షిణ లెబనాన్‌లోని నబాతియే ప్రాంతంలో ఇజ్రాయెల్ డ్రోన్ దాడి జరిగింది. చెత్తను తరలిస్తున్న ఓ వాహనంపై జరిగిన ఈ దాడిలో ఇద్దరు గాయపడినట్లు లెబనాన్ జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. షుకిన్, కఫర్ దజ్జల్ ప్రాంతాల సమీపంలో ఉదయం ఈ ఘటన జరిగినట్లు సమాచారం.ఇజ్రాయెల్ దాడుల కారణంగా లెబనాన్‌లో మార్చి 2 నుంచి ఇప్పటివరకు 4,321 మంది మరణించగా.. 12,203 మంది గాయపడినట్లు అధికారులు చెబుతున్నారు. జూన్ 26న అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య దళాల ఉపసంహరణకు సంబంధించి ఒప్పందం కుదిరినప్పటికీ.. తాజా దాడి ఆందోళన కలిగిస్తోంది.చర్చలే కీలకంఅమెరికా-ఇరాన్ మధ్య తాజా పరిణామాలు తాత్కాలిక శాంతి సంకేతాలను ఇస్తున్నప్పటికీ.. పూర్తిస్థాయి కాల్పుల విరమణ, దీర్ఘకాలిక ఒప్పందంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ భద్రత, పరస్పర నమ్మకం వంటి అంశాలపై చర్చలు కీలకంగా మారనున్నాయి. రెండు రోజుల దాడుల తర్వాత ఇప్పుడు తుపాకులు మౌనంగా ఉన్నా.. శాంతి శాశ్వతమవుతుందా? అన్నది రాబోయే దౌత్య చర్చలపైనే ఆధారపడి ఉంది. -
ట్రంప్ ICE దూకుడు.. మెక్సికో సంచలన ప్రకటన
అమెరికాలో అక్రమ వలసదారులపై కఠిన చర్యలు కొనసాగుతున్న వేళ.. మెక్సికో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో అమెరికా కోర్టుల్లో న్యాయ పోరాటం చేస్తామని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ సంచలన ప్రకటన చేశారు. అమెరికాలో తమ పౌరులు మరణించడంపై పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలని.. బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.అమెరికా వలస, కస్టమ్స్ అమలు సంస్థ (ICE) అక్రమ వలసదారుల్ని అదుపు తీసుకునే చర్యల్లో భాగంగా.. పలువురిని చంపింది. అదే సమయంలో.. అదుపులోకి తీసుకునే క్రమంలో మరికొందరు ప్రమాదవశాత్తూ మరణించారు. అయితే అలా మరణించిన మెక్సికన్ పౌరుల కేసుల్లో అమెరికా కోర్టుల్లో నేరపూరిత ఫిర్యాదులు (Criminal Complaints) దాఖలు చేయనున్నట్లు క్లాడియా ప్రభుత్వం ప్రకటించింది.షీన్బామ్ ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ.. తమ పౌరుల ప్రాణాలకు రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. కేవలం దౌత్యపరమైన నిరసనలతో సరిపెట్టకుండా, నేర విచారణలు జరగాలని అమెరికా న్యాయవ్యవస్థను ఆశ్రయిస్తామని చెప్పారు. అమెరికాలో జరిగిన ఈ మరణాలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిగి బాధ్యులను శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా ఇటీవల టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో జరిగిన కాల్పుల ఘటన నిలిచింది. 52 ఏళ్ల మెక్సికన్ పౌరుడు లోరెన్సో సాల్గాడో అరౌజోను ఐస్ అధికారులు నిర్వహించిన ఆపరేషన్ సందర్భంగా కాల్చి చంపారు. అమెరికా అంతర్గత భద్రతా శాఖ (DHS) ప్రకారం.. అతను తన వాహనాన్ని అధికారులపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో ఆత్మరక్షణలో కాల్పులు జరిపినట్లు తెలిపింది. అయితే ఈ వాదనను మృతుడి కుటుంబం, మెక్సికో ప్రభుత్వం తీవ్రంగా ఖండించాయి. అతను గుర్తు తెలియని వ్యక్తులు వెంబడిస్తున్నారని భావించి భయంతో వాహనం నడిపాడని అంటున్నారు. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ చేస్తున్నారు.మరో వైపు.. ఈ కేసుల్లో అమెరికా రాష్ట్రాల ప్రాసిక్యూటర్లతో పాటు ఫెడరల్ న్యాయ శాఖను కూడా ఆశ్రయించనున్నట్లు మెక్సికో విదేశాంగ ఉపమంత్రి రొబర్టో వెలాస్కో వెల్లడించారు. అంతేకాదు, వలస నిర్బంధ కేంద్రాలను నిర్వహిస్తున్న ప్రైవేటు సంస్థలపై పౌర నష్టపరిహార (Civil) కేసులు కూడా వేయనున్నట్లు ప్రకటించారు. గతంలో దౌత్య మార్గాన ఫిర్యాదులు చేసినప్పటికీ ఆశించిన ఫలితం రాకపోవడంతో ఇప్పుడు నేరుగా న్యాయపోరాటానికి దిగుతున్నట్లు ఆయన వివరించారు.మెక్సికో విదేశాంగ శాఖ గణాంకాల ప్రకారం.. 2025 జనవరి నుంచి ఇప్పటివరకు ఐస్ కస్టడీలో 14 మంది మెక్సికన్ పౌరులు మరణించారు. అదుపులోకి తీసుకునే క్రమంలో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాలు సాధారణ సంఘటనలు కావని, మానవ హక్కుల ఉల్లంఘనల కోణంలో పరిశీలించాల్సిన అవసరం ఉందని మెక్సికో అభిప్రాయపడుతోంది.ఇదిలా ఉండగా, అమెరికా అంతర్గత భద్రతా శాఖ మాత్రం మెక్సికో ఆరోపణలను తోసిపుచ్చింది. ఐస్ కస్టడీలో మరణాల సంఖ్య పెరిగిందన్న వాదన సరికాదని, అదుపులో ఉన్న వారికి అవసరమైన వైద్యసేవలు, చట్టపరమైన హక్కులు కల్పిస్తున్నామని తెలిపింది. హ్యూస్టన్ ఘటనలో కూడా అధికారి ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపినట్లు పేర్కొంది. అయితే ఈ అంశంపై అమెరికా న్యాయ శాఖ నుంచి అధికారిక స్పందన ఇంకా వెలువడలేదు.అమెరికాలో అక్రమ వలసలను అరికట్టేందుకు చేపడుతున్న కఠిన చర్యలు, పెరుగుతున్న నిర్బంధాలు, కాల్పుల ఘటనలపై ఇప్పటికే మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు మెక్సికో ప్రభుత్వం నేరుగా అమెరికా కోర్టుల్లో క్రిమినల్ ఫిర్యాదులు దాఖలు చేయాలని నిర్ణయించడం రెండు దేశాల మధ్య వలస విధానాలపై మరో పెద్ద దౌత్య, న్యాయ వివాదానికి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఇజ్రాయెల్ నిఘా అస్త్రం.. మళ్లీ దగ్గరవుతున్న ట్రంప్-నెతన్యాహు!
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుతున్నాయనుకున్న సమయంలో మరోసారి మంటలు చెలరేగాయి. హర్ముజ్ జలసంధి పరిణామాలు, పరస్పర ఆరోపణలతో ఇరు దేశాల మధ్య టెన్షన్ పెరుగుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను మట్టుపెట్టేందుకు ఇరాన్ స్కెచ్ వేసిందన్న ప్రచారం సంచలనంగా మారింది. ఈ విషయాన్ని స్వయంగా ట్రంపే వెల్లడించడం.. నాటో సదస్సు ప్రయాణంలో భద్రతా కారణాలతో విమానం మార్చుకోవడం.. వరుసగా చర్చనీయాంశాలయ్యాయి. అయితే ఈ మొత్తం పరిణామాల్లో ఇజ్రాయెల్ నిఘా సమాచారం కీలకంగా మారినట్లు తెలుస్తోంది.తన నిఘా వ్యవస్థ ద్వారా ఈ సమాచారాన్ని అందుకున్న ఇజ్రాయెల్ వెంటనే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ట్రంప్‌కు ముప్పుపై కీలక వివరాలను అమెరికాకు అత్యవసరంగా చేరవేసిందని.. ఈ హెచ్చరికతో అమెరికా భద్రతా వ్యవస్థ అప్రమత్తమైందని పలు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. మరోవైపు ఇరాన్‌తో ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.ఇజ్రాయెల్ అందించిన నిఘా సమాచారం ట్రంప్ వైఖరిలో మార్పునకు కారణమైందా? అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న కాల్పుల విరమణ ప్రక్రియపై దీని ప్రభావం పడనుందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.ఇజ్రాయెల్ హెచ్చరిక.. అమెరికా దూకుడు?అమెరికా మీడియా కథనాల ప్రకారం.. ఇరాన్ నుంచి ట్రంప్‌కు ముప్పు ఉందన్న సంకేతాలను అమెరికా నిఘా సంస్థలు ఇప్పటికే గుర్తించాయి. అయితే, ఒక నిర్దిష్ట హత్యా ప్రణాళికకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఇజ్రాయెల్ తాజాగా అమెరికా రక్షణ శాఖకు అందించినట్లు తెలుస్తోంది.ఈ సమాచారాన్ని అమెరికా స్వతంత్రంగా పూర్తిస్థాయిలో ధ్రువీకరించలేదని కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి. అదే సమయంలో.. ఇరాన్‌పై మరింత కఠిన వైఖరి అవలంబించేలా ట్రంప్‌పై ఒత్తిడి తీసుకురావడానికి ఇజ్రాయెల్ ఈ నిఘా సమాచారాన్ని ఉపయోగించిందా? అన్న చర్చ కూడా అమెరికా వర్గాల్లో సాగుతోంది. అయితే భద్రతా అంశంగా ఈ హెచ్చరికను అమెరికా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ భద్రతను మరింత కట్టుదిట్టం చేయడంతో పాటు.. ఇరాన్ కదలికలపై నిఘాను పెంచినట్లు సమాచారం.మరోవైపు, ఈ పరిణామం అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. నేరుగా ఘర్షణకు వెళ్లకుండా పరిష్కారం కోరుతున్న ట్రంప్ వైఖరిలో ఈ హెచ్చరిక మార్పు తీసుకొస్తుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.మళ్లీ దగ్గరవుతున్న ట్రంప్-నెతన్యాహుఇరాన్ విషయంలో ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య భిన్నాభిప్రాయాలు బహిర్గతమయ్యాయి. ఇరాన్‌పై ఒత్తిడిని కొనసాగించాలని నెతన్యాహు భావించగా.. యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, చమురు మార్కెట్లపై పడే ప్రభావాలను దృష్టిలో పెట్టుకుని ట్రంప్ దౌత్య పరిష్కారం వైపు మొగ్గు చూపారు.ఈ క్రమంలో లెబనాన్ పరిణామాలు, శాంతి ఒప్పందం ఆలస్యం వంటి అంశాలపై ట్రంప్ ఇజ్రాయెల్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక దశలో నెతన్యాహును ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో.. ఇరు దేశాల మధ్య దూరం పెరుగుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.అయితే, తాజాగా ట్రంప్‌కు ఇరాన్ నుంచి ముప్పు ఉందన్న నిఘా సమాచారం నేపథ్యంలో అమెరికా-ఇజ్రాయెల్ సంబంధాల్లో మళ్లీ సాన్నిహిత్యం పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా చేపడుతున్న చర్యలు, భద్రతా పరిస్థితులపై ట్రంప్, నెతన్యాహు మధ్య ఫోన్ సంభాషణ జరిగినట్లు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం వెల్లడించింది.ఇరాన్ ముప్పు నేపథ్యంలో గత విభేదాలను పక్కన పెట్టి.. రెండు దేశాలు మళ్లీ వ్యూహాత్మక సమన్వయంపై దృష్టి పెడుతున్నాయా? అన్న చర్చ ఇప్పుడు మొదలైంది.కొత్తేం కాకపోయినా..ట్రంప్‌కు ఇరాన్ నుంచి ముప్పు ఉందన్న ఆరోపణలు కొత్తవేమీ కాదు. ట్రంప్ తొలి అధ్యక్ష పదవీకాలంలో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కీలక కమాండర్ ఖాసిం సోలైమనీ మరణించారు. ఆ ఘటన తర్వాత ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌లోని కొన్ని వర్గాలు బహిరంగంగా హెచ్చరించాయి.ఆ తర్వాత కూడా ట్రంప్‌కు వ్యతిరేకంగా ఇరాన్‌లోని కొన్ని వర్గాల నుంచి హెచ్చరికలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల ఇరాన్లో జరిగిన సంతాప కార్యక్రమాల్లోనూ ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలు వినిపించినట్లు సమాచారం. అయితే ఇరాన్ నిజంగానే ఇలాంటి కుట్రకు పాల్పడుతోందా? లేక దౌత్య, వ్యూహాత్మక పోరాటంలో భాగంగానే ఈ ఆరోపణలు తెరపైకి వచ్చాయా? అన్నది ఇంకా స్పష్టతకు రావాల్సి ఉంది.అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు వరుసగా అవరోధాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ హత్యా కుట్ర ఆరోపణలు, ఇజ్రాయెల్ నిఘా సమాచారం, అమెరికా భద్రతా చర్యలు, ఇరాన్ ప్రతిస్పందనలు.. మరోసారి పశ్చిమాసియా రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి.శాంతి దిశగా సాగాల్సిన చర్చలకు తాజా పరిణామాలు మరో పరీక్షగా మారాయి. ట్రంప్-ఇరాన్ ఘర్షణలో తదుపరి అడుగు ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. -
పుతిన్ తగ్గేదేలే.. మళ్లీ మంటలు రేపే యుద్ధమా?
ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న శాంతి ప్రయత్నాలకు.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదని తెలుస్తోంది. పైగా యుద్ధాన్ని ముగించే దిశగా చర్చల కంటే.. మరింత తీవ్రతరం చేసే వ్యూహాలపైనే మాస్కో దృష్టి పెట్టినట్లు సమాచారం. క్రెమ్లిన్‌కు సన్నిహితంగా ఉన్న ముగ్గురు వ్యక్తులు రాయిటర్స్‌కు వెల్లడించిన వివరాల ప్రకారం.. రానున్న నెలల్లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరింత ఉధృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. ట్రంప్ ఇటీవల పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీలతో వేర్వేరుగా ఫోన్ సంభాషణలు జరిపారు. యుద్ధానికి పరిష్కారం అనుకున్నదానికంటే దగ్గరలోనే ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే పుతిన్ మాత్రం ప్రస్తుత యుద్ధ లక్ష్యాలను సాధించే వరకు వెనక్కి తగ్గే పరిస్థితిలో లేరని క్రెమ్లిన్ వర్గాలు చెబుతున్నాయి.డాన్‌బాస్‌పై పట్టు కోసం..రష్యా అధ్యక్షుడి ప్రధాన లక్ష్యం ఉక్రెయిన్‌లోని తూర్పు డాన్బాస్ ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవడమేనని సమాచారం. ఈ ప్రాంతంపై నియంత్రణ సాధిస్తేనే యుద్ధంలో విజయాన్ని సాధించినట్లు భావిస్తున్నారని పుతిన్‌కు సన్నిహితంగా ఉన్న ఓ వ్యక్తి వెల్లడించారు. కాల్పుల విరమణతో ప్రస్తుత యుద్ధ రేఖలను కొనసాగించే ప్రతిపాదనలను పుతిన్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే డాన్‌బాస్‌లో మిగిలిన ప్రాంతాలను కూడా త్వరలోనే తమ బలగాలు స్వాధీనం చేసుకుంటాయని రష్యా అధ్యక్షుడు నమ్ముతున్నారని సమాచారం.చమురు కేంద్రాలపై దాడులతో ఒత్తిళ్లుఇటీవల ఉక్రెయిన్ డ్రోన్లతో రష్యాలోని చమురు శుద్ధి కేంద్రాలు, పోర్టులు, నిల్వ కేంద్రాలపై దాడులు చేసింది. ఈ దాడుల కారణంగా రష్యాలోని పలు ప్రాంతాల్లో ఇంధన కొరత సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ దాడులు పుతిన్‌ను మరింత ఆగ్రహానికి గురిచేశాయని, ప్రతిగా ఉక్రెయిన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలనే నిర్ణయానికి ఆయన వచ్చినట్లు సమాచారం. ఇటీవల రష్యా కీవ్‌తో పాటు పలు ఉక్రెయిన్ నగరాలపై డ్రోన్లు, క్షిపణులతో భారీ దాడులు చేసింది. ఇందులో పలువురు పౌరులు మృతి చెందారు.డాన్బాస్ దాటి కొత్త భూభాగాలపై కన్ను?ఉక్రెయిన్ దాడులకు ప్రతిస్పందనగా సరిహద్దు ప్రాంతాల్లో మరిన్ని భూభాగాలను స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉందని పుతిన్ ఇటీవల రష్యా సైనిక అధికారులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. వీటిని భద్రతా ప్రాంతాలుగా మార్చాలన్నది రష్యా ఉద్దేశమని ఆయన సంకేతాలిచ్చారు. ఉక్రెయిన్ మాత్రం తమ నిఘా నివేదికల ప్రకారం పుతిన్ శాంతి కోసం కాకుండా యుద్ధాన్ని కొనసాగించేందుకు కొత్త ఆపరేషన్లకు సిద్ధమవుతున్నారని ఆరోపిస్తోంది. అవసరమైతే ఉక్రెయిన్ వెలుపల ఉన్న యూరప్ దేశాలపై కూడా రష్యా దృష్టి పెట్టే అవకాశం ఉందని కీవ్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.నాటోతో ప్రత్యక్ష ఘర్షణకు అవకాశంరష్యా సైనిక వర్గాల్లో ఇటీవల యుద్ధాన్ని మరింత విస్తరించే అంశంపై చర్చలు పెరిగాయి. ముఖ్యంగా బాల్టిక్ దేశాల్లోని నాటో స్థావరాలపై దాడుల అవకాశాలను కూడా కొందరు ప్రస్తావిస్తున్నారు. అలాంటి చర్యలు జరిగితే అమెరికా నేతృత్వంలోని నాటో కూటమితో రష్యాకు ప్రత్యక్ష ఘర్షణ ఏర్పడే ప్రమాదం ఉంది. అయితే రష్యా నేరుగా నాటోతో యుద్ధం కోరుకోకపోయినా.. కూటమిలో విభేదాలు సృష్టించే లక్ష్యంతో చిన్నచిన్న దాడులకు పాల్పడే అవకాశం ఉందని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.యుద్ధానికి పెరుగుతున్న మూల్యం2022లో పూర్తిస్థాయి యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు లక్షలాది మంది సైనికులు మృతి చెందడం, గాయపడటం లేదా కనిపించకుండా పోవడం జరిగిందని అంచనాలు చెబుతున్నాయి. అయినప్పటికీ రష్యా దళాలు డాన్బాస్ ప్రాంతంలో నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. ఉక్రెయిన్ డ్రోన్ల వినియోగం రష్యా సంఖ్యాబలానికి సవాల్‌గా మారింది. దాదాపు 1,200 కిలోమీటర్ల పొడవైన యుద్ధ రేఖపై పురోగతి సాధించేందుకు రష్యా భారీగా శ్రమిస్తోంది.పుతిన్‌కు విజయం అవసరంక్రెమ్లిన్కు సన్నిహితంగా ఉన్న వర్గాల ప్రకారం.. పుతిన్ ఈ యుద్ధంలో ఏదో ఒక స్పష్టమైన విజయాన్ని చూపించాలని భావిస్తున్నారు. ముఖ్యంగా డాన్‌బాస్‌పై పూర్తి ఆధిపత్యం సాధించడం ఆయన రాజకీయంగా కీలక విజయంగా చూస్తున్నట్లు సమాచారం. అందుకే అమెరికా శాంతి ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ.. రష్యా ఇప్పట్లో యుద్ధం నుంచి వెనక్కి తగ్గే సంకేతాలు కనిపించడం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
మౌలిక వసతులపై భీకర దాడులు
దుబాయ్: చర్చలతో తేలదని, బాంబులతోనే తేల్చుకుంటామని ప్రకటించిన కొద్దిసేపటికే ఇరాన్‌పై క్షిపణుల వర్షం కురిపించి పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధాగ్నిని ప్రజ్వరిల్లజేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలతో రెండోరోజూ ఇరాన్‌పై అగ్రరాజ్యసేనలు విరుచుకుపడ్డాయి. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు, ఆయుధాగారాలు, ఎయిర్పోర్ట్ రన్వేలతోపాటు ఈసారి మౌలిక వసతులపై అమెరికా గురిపెట్టింది. దీంతో ఇరాన్‌లోని రైల్వేలైన్లు, వంతెనలు, నౌకాశ్రయాలు దాడుల బారిన పడ్డాయి. గత 48 గంటల్లో ఇరాన్‌లోని గగనతల రక్షణ వ్యవస్థలు, డ్రోన్లు, క్షిపణి స్థావరాలు, సైనిక స్పీడ్ బోట్లు, మౌలికవసతులు ఇలా మొత్తంగా కీలకమైన 170 లక్ష్యాలపై దాడులు చేశామని అమెరికా సైనిక సెంట్రల్ కమాండ్ గురువారం ప్రకటించింది. హార్మూజ్ జలసంధి గుండా సరకు రవాణా నౌకల స్వేచ్ఛా వాణిజ్యాన్ని అడ్డుకునే ఇరాన్ సామర్థ్యాన్ని మరింతగా దెబ్బతీసే లక్ష్యంతోనే దాడులు చేస్తున్నామని సెంట్రల్ కమాండ్ స్పష్టంచేసింది. తొలిసారిగా చాబహార్ నౌకాశ్రయం మీదా దాడి చేసింది. నౌకల రాకపోకలను నియంత్రించే షాహీద్ బెహెప్తి మారిటైమ్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ సైతం ధ్వంసమైంది. చాబహార్‌లోని ఇరాన్ నేవీకి చెందిన ఇమామ్ అలీ స్థావరంపైనా అమెరికా యుద్ధవిమానాలు బాంబులు జారవిడిచాయి. బందర్ అబ్బాస్ నౌకాశ్రయం సమీపంలో ఎనిమిది పేలుళ్లు జరిగాయి. అబూ మూసా ద్వీపంపైనా అమెరికా దాడిచేసింది. బుషెహర్‌లోని అణు విద్యుత్కేంద్రం సమీపంలో గురువారం మధ్యాహ్నం బాంబుల శకలాలు పడ్డాయని ఇరాన్ ప్రకటించింది. అయితే దాడిలో న్యూక్లియర్ ప్లాంట్‌కు ఏమైనా నష్టం జరిగిందా లేదా అనే వివరాలను ఇరాన్ వెల్లడించలేదు. దాడుల కారణంగా ఆ ప్రాంతంలో రేడియోధార్మికత పెరిగినట్లు ఎలాంటి ప్రకటనలు వెలువడలేదు. గతంలోనూ ఈ ప్రాంతంలో అమెరికా బాంబులేసింది. ఇరాన్లో రష్యా సాంకేతికనిపుణుల సాయంతో నడుస్తున్న ఏకైక అణువిద్యుత్కేంద్రం ఇదొక్కటే. గురువారం నైరుతి ఇరాన్‌లోని ఖుజెస్తాన్లో జరిగిన దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్షెహర్ ఎయిర్‌పోర్ట్‌లో దాడిలో అగ్నిమాపక సిబ్బందిలో ఒకరు చనిపోయారు. గత 48 గంటల్లో అమెరికా దాడులతో ఇరాన్లో మరణాల సంఖ్య ముగ్గురు ఐఆర్జీసీ సభ్యులతో కలిపి 14కు పెరిగింది. దేశవ్యాప్తంగా మొత్తంగా 78 మంది గాయపడ్డారని ఇరాన్ ఆరోగ్యమంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి హుస్సేన్ కెర్మాన్‌పూర్ తెలిపారు. తాజాగా దాడులు మొదలయ్యాక మృతులు, క్షతగాత్రుల వివరాలను ఇరాన్ ప్రకటించడం ఇదే తొలిసారి. ఈశాన్య ఇరాన్‌లోని గోలెస్తాన్ ప్రావిన్స్‌లో అఖాలా పరిధిలో అగ్ తెఖెన్ఖాన్ రైల్వే వంతెనను అమెరికా క్షిపణిదాడులతో పేల్చేసింది. మష్హాద్ నగరంలో ఇరాన్ సుప్రీంనేత అయతొల్లా అలీ ఖమేనీ ఖననప్రక్రియను చూసేందుకు దేశరాజధాని టెహ్రాన్ నుంచి తరలివచ్చే జనం ఈ కీలక రైల్వేమార్గంలోనే వస్తారు. కార్యక్రమానికి భారీస్థాయిలో జనం హాజరుకాకుండా అడ్డుకునేందుకే రైల్వేలైన్‌ను అమెరికా పేల్చేసిందని ఇరాన్ ఆరోపించింది. ఉత్తర ఇరాన్‌ను చైనా, రష్యా, తుర్క్మెనిస్తాన్లతో అనుసంధానించే ఓగ్టే ఖాన్ రైల్వే వంతెననూ అమెరికా పేల్చేసింది. మౌలిక వసతులపై దాడిచేసి అమెరికా ఘోరమైన యుద్ధనేరాలకు పాల్పడుతోందని ఇరాన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. దీటుగా బదులిచ్చిన ఇరాన్.. మెరుపుదాడులకు ఇరాన్ సైతం దీటుగా బదులిచ్చింది. అమెరికా మిత్రదేశాలపై క్షిపణులతో విరుచుకుపడింది. అమెరికా నావికాదళ 5వ ఫ్లీట్‌కు ప్రధాన కార్యాలయమైన బహ్రెయిన్‌లోని ప్రధాన స్థావరంపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. కువైట్, ఖతర్‌ల మీదా ఇరాన్ దాడులుచేసింది. అమెరికా సైన్యం, యుద్ధవిమానాలకు స్థావరంగా మారిన జోర్డాన్ మీదా ఇరాన్ తన ప్రతాపం చూపించింది. అజ్రాక్‌లోని మువాఫాక్ సాల్తీ అమెరికా విమానస్థావరంపై 10 క్షిపణులు పడ్డాయి. దీంతో జనం సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచిస్తూ పలు మార్లు సైరన్లు మోగాయి. దీంతో దాడుల భయంతో జనం పరుగులుతీశారు. గగనతలంలో క్షిపణులు, డ్రోన్లు, రాకెట్లు కన్పించడంతో అమెరికా పౌరులు సురక్షిత ప్రాంతంలో తలదాచుకోవాలని జోర్డాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఒక అడ్వైజరీ జారీచేసింది. ఎనిమిది ఇరాన్ క్షిపణులను నేలమట్టంచేశామని జోర్డాన్ ప్రకటించింది. అయితే దాడులు కొనసాగితే పశ్చిమాసియాలో అమెరికాకు చెందిన ఏ ఒక్క స్థావరం కూడా సురక్షితంగా ఉండబోదని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్(ఐఆర్జీసీ) గురువారం హెచ్చరించింది. హార్మూజ్ గుండా తగ్గిన నౌకల రవాణా.. తాజా దాడులతో హార్మూజ్ గుండా సరకు రవాణా నౌకల రాకపోకలు తగ్గిపోయాయి. యుద్ధం మొదలుకాకముందు ఈ మార్గంలో ప్రతి 24 గంటల్లో ఏకంగా 130 నౌకలు వెళ్లేవి. గత వారం సైతం రోజుకు 70 నౌకలు వెళ్లేవి. గురువారం ఆ సంఖ్య పదిలోపునకు పడిపోయిందని ఇంటర్ట్యాంకో సంస్థ మెరైన్ డైరెక్టర్ ఫిల్ బెల్షెర్ చెప్పారు. -
భారత్–పాక్ యుద్ధాన్ని నేనే ఆపేశా
వాషింగ్టన్: గత ఏడాది భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధాన్ని తానే స్వయంగా జోక్యం చేసుకొని నిలిపివేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించారు. ఆయన బుధవారం తుర్కియే నుంచి తిరిగివస్తూ ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో మాట్లాడారు. భారత్–పాక్ యుద్ధంలో 11 ఫైటర్ జెట్లు నేలకూలాయని చెప్పారు. అయితే, అవి ఏ దేశానికి చెందినవన్న సంగతి బయటపెట్టలేదు. భారత్–పాక్ యుద్ధం సహా ప్రపంచవ్యాప్తంగా 8 యుద్ధాలను తాను ఆపేశానని అన్నారు. ఈ ఘనత సాధించినందుకు నోబెల్ శాంతి బహుమ తికి తాను అన్నివిధాల అర్హుడినని స్పష్టంచేశారు. తనకంటే అర్హులు ఇంకెవరున్నారని ప్రశ్నించారు. ఒకవేళ తాను జోక్యం చేసుకోకపోతే భారత్–పాక్ ఘర్షణ అణు యుద్ధంగా మారేదని పేర్కొన్నారు. యుద్ధాన్ని ఆపడం ద్వారా 3 కోట్ల నుంచి 5 కోట్ల మంది ప్రజల ప్రాణాలను కాపాడారంటూ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తనను ప్రశంసించారని ట్రంప్ గుర్తుచేశారు. అణు యుద్ధమే జరిగితే అంతకంటే ఎక్కువగానే ప్రాణనష్టం వాటిల్లి ఉండేదన్నారు. పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్తాన్ భూభాగంలో ముష్కర మూకల స్థావరాలపై గత ఏడాది మే 7న ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
అమెరికా వెళ్లడం మరింత కఠినం
అమెరికా కలలకు మరిన్ని సంకెళ్లు పడుతున్నాయి! హెచ్1–బీతోపాటు గ్రీన్‌కార్డులు, స్టూడెంట్ వీసాలు పొందడమూ చాలా చాలా కష్టం కానుంది. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరిక ప్రభుత్వం వచ్చే నెల నుంచి కొత్త నిబంధనలను ప్రవేశపెడుతూండటం దీనికి కారణం. ప్రస్తుతానికి ఇవి ప్రతిపాదనలు మాత్రమే కానీ.. ఓకే అయితే మాత్రం అమెరికన్ వీసా కావాలంటే కొండలు కరగాల్సిందే అంటున్నారు నిపుణులు. ఖర్చుతోపాటు విపరీతమైన స్క్రూటినీ, దస్తావేజులు అవసరమవుతాయని, భారతీయ ఐటీ ఉద్యోగులకు మరిన్ని కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. వివరాలు... ‘మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్’స్లోగన్‌తో రెండోసారి అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ అక్రమవలస దారులను తరిమేస్తామని తరచూ హూంకరిస్తున్నారు. ఇందుకు తగ్గట్టే ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐస్) విభాగం అక్రమ వలసదారుల ఏరివేతను యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది కూడా. అంతేకాకుండా... ఇతర దేశస్తులు అమెరికాలో పని చేయడంపై కూడా ఆయన మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తొలిసారి గద్దెనెక్కినప్పుడు కూడా అమెరికన్ ఉత్పత్తులే కొనాలని, అమెరికన్లకు మాత్రమే ఉద్యోగాలివ్వాలని ప్రతిపాదించిన ఆయన విదేశీ నిపుణులకు ఇచ్చే హెచ్1–బీ వీసాల జారీ ప్రక్రియను కఠినతరం చేయాలని చెబుతూ వచ్చారు. ఈ క్రమంలో డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్)తోపాటు ఐస్ కూడా వీసాల జారీ, అక్రమ వలసదారుల ఏరివేత విషయంలో ఎన్నో మార్పులు చేశారు కూడా. తాజాగా హెచ్1–బీ వీసాల జారీ నిబంధనల్లో పలు మార్పులను ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం డీహెచ్ఎస్, కార్మీక, విదేశీ వ్యవహారాల శాఖల ఉమ్మడి అజెండాలో ప్రచురితమైంది. ప్రజాభిప్రాయ సేకరణ (టెక్ కంపెనీలు, యూనివర్శిటీలు, వలస కార్మీకుల హక్కుల పరిరక్షణ సంఘాలు) తరువాత అవసరమైతే మార్పులు చేర్పులు చేస్తారు. ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురించిన తరువాత అమల్లోకి వస్తాయి. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఈ ప్రతిపాదనలు వచ్చే నెల నుంచే అమలు కానున్నట్లు తెలుస్తోంది. ఓపీటీపైనా ఫోకస్అమెరికాలో చదువుకునే విద్యార్థులు ఆయా రంగాల్లో ప్రాక్టికల్ ట్రెయినింగ్ పొందేందుకు వీలు కల్పించే ఓపీటీ కార్యక్రమంలోనూ పలు మార్పులను ప్రతిపాదించారు. 2024 –25లో భారత్ నుంచి సుమారు 3.6 లక్షల విద్యార్థులు విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లగా ప్రస్తుతం వారు కోర్సుకు తగ్గట్టుగా ఎంతకాలమైనా అక్కడ ఉండేందుకు అవకాశం ఉంది. కొత్త ప్రతిపాదనల ప్రకారం మాత్రం ఇలా కుదరదు. నిర్దిష్ట సమయం మాత్రమే అనుమతిస్తారు. ఆ తరువాత పొడింపునకు దరఖాస్తు చేసుకోవాలి. దీంతోపాటే వచ్చే ఏడాది ఫ్రిబరి నుంచి ప్రాక్టికల్ ట్రెయినింగ్ నిబంధనలను సమీక్షించనున్నారు సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెడిసన్ రంగాల్లో చదివేవారికి ఇచ్చే రెండేళ్ల పొడిగింపుపై ఫోకస్ పెట్టారు. .వీటితోపాటే కొంతమంది విదేశీయులు అమెరికాలో చట్టబద్ధంగా ఉద్యోగాలు చేసుకునేందుకు అవకాశమిచ్చే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్స్ (ఈఏడీ) విషయంలోనూ మార్పులు రానున్నాయి. తుది నిబంధనలు ఈ నెలలోనే రానున్నాయి. ఫలితంగా ఈఏడీల ఆటోమెటిక్ పొడిగింపునకు బ్రేక్ పడుతుంది. సాధారణంగా హెచ్1–బీ వీసాదారుల భార్య/భర్తలే ఎక్కువగా ఈ ఈఏడీల ఆధారంగా ఉద్యోగాలు చేస్తూంటారు. ఈఏడీల పొడిగింపు ఆలస్యమైతే వారు తాత్కాలికంగానైనా ఉద్యోగాలు చేసే అవకాశం లేకుండా పోతుంది. ఇవీ మార్పులుముందుగా వీసా నిబంధనల్లో రాగల మార్పులు చూద్దాం. అమెరికన్ కంపెనీలు విదేశీ నిపుణులకు ఉద్యోగాలిచ్చేందుకు అవకాశమిచ్చే హెచ్1–బీ వీసాల ఫీజులు గణనీయంగా పెరిగే అవకాశముంది. అంతేకాకుండా.. ఉద్యోగితోపాటు, కంపెనీ తాలూకూ వివరాలను మరింత నిశితంగా పరిశీలించనున్నారు. క్లయింట్ సైట్లలో ఉద్యోగులు ఎలాంటి పనులు చేస్తున్నారో వివరంగా చెప్పాల్సి ఉంటుంది. హెచ్1–బీ వీసా ఉల్లంఘనలకు పాల్పడిన కంపెనీల విషయంలో మరింత కఠినంగా ఉండనున్నారు. యూనివర్శిటీలు, పరిశోధన సంస్థలకు ప్రస్తుతం ఉన్న వార్షిక కోటా మినహాయింపు రద్దయ్యే లేదా కుదించే అవకాశముంది. అమెరికాలో శాశ్వత నివాసానికి అవకాశమిచ్చే గ్రీన్‌కార్డుల విషయానికి వస్తే పెర్మ్ లేబర్ సర్టీఫికెట్లు జారీ చేసేందుకు వసూలు చేసే ఫీజులను కూడా పెంచాలని కార్మీక శాఖ ప్రతిపాదిస్తోంది. సాధారణంగా కంపెనీలు తమ వద్ద పనిచేస్తున్న హెచ్1–బీ వీసాదారులకు గ్రీన్‌కార్డు ఇవ్వాలని కార్మిక శాఖకు ప్రతిపాదిస్తారు. అమెరికన్లు చేయలేని పని హెచ1–బీ వీసాదారు చేస్తున్నాడని, అతడికి ఇచ్చే వేతనం అమెరికన్లకు ఇచ్చే వేతనం కంటే ఎక్కువగా ఉందని కంపెనీ నిరూపిస్తే పెర్మ్ సర్టీఫికెట్ లభిస్తుంది. ఇందుకయ్యే ఖర్చును పెంచడం ద్వారా గ్రీన్ కార్డులను మరింత తగ్గించున్నారన్నమాట. ఇంకోలా చెప్పాలంటే కంపెనీలు హెచ్1–బీ ఉద్యోగులకు చెల్లించాల్సిన కనీస వేతనాలు పెరుగుతాయి. వీసాల పొడిగింపునకూ ఫీజులు వసూలు చేయాని కార్మీక శాఖ ప్రతిపాదిస్తోంది. పెర్మ్ సర్టిఫికెట్ జారీ ప్రక్రియను కూడా మార్చనున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రైల్వే బ్రిడ్జిపై అమెరికా దాడులు.. లబోదిబోమంటున్న మూడు దేశాలు
టెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. కొనసాగుతున్న ఘర్షణలకు ముగింపు పలికేందుకు ఇరాన్-అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తామని, అవసరమైతే ఖర్గ్ ద్వీపాన్ని కూడా స్వాధీనం చేసుకునేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఇరాన్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.ఈ క్రమంలో ఇరాన్, చైనా, రష్యా దేశాల మధ్య భూమార్గం ద్వారా జరిగే వ్యూహాత్మక వస్తు రవాణాకు కీలకంగా భావించే ఆక్ తఖే ఖాన్ రైల్వే బ్రిడ్జిని అమెరికా వైమానిక దళం క్షిపణి దాడి చేసినట్లు అంతర్జాతీయ కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఇరాన్ ఉత్తర ప్రాంతంలోని గొలిస్తాన్ ప్రావిన్స్‌లో ఉన్న ఈ రైల్వే వంతెన చైనా- తుర్క్మెనిస్తాన్-ఇరాన్ రైల్వే కారిడార్‌లో అత్యంత కీలకమైన భాగం. అమెరికా విధించిన ఆంక్షలు, ఇరాన్ సముద్ర రేవులపై ఉన్న పరిమితుల కారణంగా ఇరాన్, రష్యా, చైనా దేశాలు ఆయుధాలు, ముడి చమురు, ఇతర సరుకుల రవాణాకు ఈ ప్రత్యామ్నాయ రైలుమార్గాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నాయి. ఈ మూడు దేశాల ఆర్థిక, సైనిక సహకారాన్ని దెబ్బతీయాలనే వ్యూహంతోనే అమెరికా ఈ కీలక మౌలిక సదుపాయాన్ని లక్ష్యంగా చేసుకుని క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ డ్రోన్ దాడులు జరిపింది. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని ప్రకటించిన కొద్ది గంటల్లోనే అమెరికా ఈ దాడులకు పాల్పడినట్లు కథనాలు వెల్లడిస్తున్నాయి.అమెరికా హెచ్చరిక.. ఇరాన్ ప్రతిస్పందనఈ దాడిని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ధృవీకరించింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, దెబ్బతిన్న రైలుమార్గాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరిస్తామని ఇరాన్ విదేశాంగ శాఖ వెల్లడించింది. పౌర మౌలిక సదుపాయాలపై అమెరికా జరిపిన ఈ దాడి అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమైన 'యుద్ధ నేరం' అని ఇరాన్ ఆరోపించింది. దీనికి ప్రతీకారంగా కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా సైనిక స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిపినట్లు ఇరాన్ ప్రకటించడంతో ఆయా ప్రాంతాల్లో ఎయిర్రైడ్ సైరన్లు మోగాయి.మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. ‘ఇరాన్ మాపై చేసే ప్రతి దాడికి 20 రెట్లు తీవ్రంగా ప్రతిస్పందిస్తాం’ అని హెచ్చరించారు. వరుస పరిణామాలతో అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్లతో పాటు క్రిప్టోకరెన్సీ మార్కెట్లలోనూ తీవ్ర ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటున్నాయి. -
అమెరికా వెళ్లేవారికి ట్రంప్ సర్కార్ షాక్..
-
ఇరాన్ అంటే అంత భయమా?.. ట్రంప్ గగన ప్రయాణంలో ట్విస్ట్
ఇరాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఓ నిర్ణయం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే ఖతార్ నుంచి అందుకున్న వేల కోట్ల విలువైన కొత్త ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం ఉండగానే.. తిరుగు ప్రయాణంలో ఆయన పాత విమానాన్ని ఎంచుకోవడం ఆసక్తి రేపుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్న వేళ ట్రంప్ విమానం మార్చడం వెనుక భద్రతా కారణాలున్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ట్రంప్ కోసం ఖతార్ ప్రభుత్వం సుమారు 400 మిలియన్ డాలర్లు (దాదాపు ₹3,400 కోట్లు) విలువైన బోయింగ్ 747-8 లగ్జరీ జెట్‌ను బహుమతిగా ఇచ్చింది. ఖతార్ రాజ కుటుంబం ఉపయోగించిన ఈ విమానాన్ని అమెరికా అధ్యక్షుడి ప్రయాణాలకు అనుగుణంగా మార్పులు చేశారు. అమెరికా రక్షణ సంస్థ ఎల్3హ్యారిస్ టెక్నాలజీస్ ఈ విమానంలో భద్రతా వ్యవస్థలు, రహస్య కమ్యూనికేషన్ సదుపాయాలు, రక్షణ సాంకేతికతను అమర్చింది. బోయింగ్ సంస్థ కొత్త ఎయిర్‌ఫోర్స్ వన్ విమానాల తయారీలో ఆలస్యం అవుతున్న నేపథ్యంలో.. ఈ విమానాన్ని తాత్కాలికంగా ‘బ్రిడ్జ్ ఎయిర్‌ఫోర్స్ వన్’గా ఉపయోగిస్తున్నారు.ఈ విమానం గురించి ట్రంప్ ‘‘అద్భుతం (truly magnificent)’’ అంటూ ప్రశంసించారు. యూరప్‌లోని పలు అమెరికా సైనిక స్థావరాలకు తీసుకెళ్లి అక్కడి సైనికులకు చూపించాలని కూడా ఆయన చెప్పారు. ఇందులో భాగంగా బ్రిటన్‌లోని రాయల్ ఎయిర్‌ఫోర్స్ మిల్డెన్‌హాల్ స్థావరంలో అమెరికా సైనిక సిబ్బందికి ఈ విమానాన్ని చూపించారు.కొత్త విమానం ఉండగా.. పాతదానిలో ప్రయాణంనాటో సదస్సు సమావేశం కోసం ట్రంప్ ఈ కొత్త ఎయిర్‌ఫోర్స్ వన్‌లో టర్కీకి వెళ్లారు. అయితే తిరుగు ప్రయాణంలో మాత్రం అనూహ్యంగా పాత ఎయిర్‌ఫోర్స్ వన్ను ఎంచుకున్నారు. అంకారా నుంచి బ్రిటన్‌లోని రాయల్ ఎయిర్‌ఫోర్స్ మిల్డెన్‌హాల్ (RAF Mildenhall) స్థావరం వరకు పాత విమానంలో ప్రయాణించిన ట్రంప్.. అక్కడ కొత్త విమానాన్ని ఎక్కి అమెరికాకు తిరిగి వెళ్లారు.ఇరాన్ ముప్పు కారణమా?కొత్త విమానాన్ని వదిలి పాతదానిలో ఎందుకు ప్రయాణించారన్న ప్రశ్నకు ట్రంప్ స్పష్టమైన కారణం చెప్పలేదు. అయితే ఇరాన్ నుంచి తనకు ముప్పు ఉందని వ్యాఖ్యానించారు. ‘‘ఇరాన్ హిట్ లిస్ట్‌లో నేనే నంబర్ వన్’’ అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఈ వ్యవహారంపై మరింత ఆసక్తిని పెంచాయి. అధ్యక్షుడి భద్రతను దృష్టిలో పెట్టుకుని సీక్రెట్ సర్వీస్ అధికారులు పాత విమానాన్ని ఎంచుకోవాలని సూచించినట్లు కొన్ని మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి. అయితే ట్రంప్ పేషీ మాత్రం విమానం మార్పు భద్రతా కారణాలతో కాదని తెలిపారు.కొత్త విమానం భద్రతపై సందేహాలు?కొత్త ఎయిర్‌ఫోర్స్ వన్‌లో అధునాతన కమ్యూనికేషన్ వ్యవస్థలు, క్షిపణి రక్షణ సదుపాయాలు వంటి మార్పులు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే తక్కువ సమయంలోనే మార్పులు పూర్తి చేయడంతో భద్రతా ప్రమాణాలపై కొందరు నిపుణులు సందేహాలు వ్యక్తం చేశారు. ఇప్పటికే వినియోగంలో ఉన్న పాత ఎయిర్‌ఫోర్స్ వన్ విమానాలు ఎన్నో ఏళ్లుగా పరీక్షించబడ్డ రక్షణ వ్యవస్థలను కలిగి ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.విమానం బహుమతిపై వివాదంవిదేశీ ప్రభుత్వం నుంచి ఇంత విలువైన విమానాన్ని స్వీకరించడంపై అమెరికాలో రాజకీయ, నైతిక విమర్శలు కూడా వచ్చాయి. విమానం బహుమతిగా వచ్చినప్పటికీ.. భద్రతా మార్పులు, సాంకేతిక అప్గ్రేడ్ల కోసం అమెరికా భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ట్రంప్ పదవీకాలం ముగిసిన తర్వాత ఈ విమాన యాజమాన్యాన్ని డొనాల్డ్ జే. ట్రంప్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీ ఫౌండేషన్‌కు బదిలీ చేసే ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.మొత్తంగా.. ‘అద్భుతం’ అని ట్రంప్ మెచ్చిన విమానాన్నే తిరుగు ప్రయాణంలో పక్కన పెట్టడం.. ఇరాన్ ఉద్రిక్తతల వేళ కొత్త చర్చకు దారితీసింది. -
ఒక్క దెబ్బ కొడితే.. 20 రెట్లు బలంగా కొడతాం
వాషింగ్టన్: ఇరాన్‌పై తాజా దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. తమపై లేదంటే తమ మిత్రదేశాలపై ఇరాన్ ఎలాంటి దాడికి పాల్పడినా.. దానికి 20 రెట్లు బలమైన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి వద్ద అమెరికా నౌకలను లక్ష్యంగా చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేశారు.అమెరికా దళాలు ఇరాన్‌పై వరుసగా రెండో రోజు దాడులు కొనసాగించాయి. ఇరాన్ ఆగ్నేయ ప్రాంతంలోని ఇరాన్షహర్ ఎయిర్‌బేస్‌పై దాడి చేసినట్లు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వీడియోలు, చిత్రాలను విడుదల చేశారు. ఈ స్థావరాన్ని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ) వినియోగిస్తున్నట్లు అమెరికా వర్గాలు తెలిపాయి. అమెరికా దాడుల తర్వాత ఇరాన్‌లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు జరిగినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. దక్షిణ తీర ప్రాంతంలోని బుషెర్, చాబహార్, కొనారక్, బందర్ అబ్బాస్, సిరిక్ ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించినట్లు పేర్కొంది. బుషెర్లోనే ఇరాన్ అణు విద్యుత్ కేంద్రం ఉంది. ‘‘చూస్తూ ఊరుకోం’’: ట్రంప్ఇరాన్ నుంచి వచ్చే ఏ దాడినైనా తిప్పికొడతామని ట్రంప్ తెలిపారు. ‘‘వాళ్లు మమ్మల్ని ఒక్కసారి కొడితే.. మేము 20 రెట్లు బలంగా సమాధానం ఇస్తాం’’ అని వ్యాఖ్యానించారు. ఇరాన్‌తో కుదిరిన తాత్కాలిక ఒప్పందం ముగిసిందని గతంలో ప్రకటించిన ట్రంప్.. చర్చలకు మాత్రం అవకాశం ఉందని చెప్పారు. ఇరాన్ తమతో ఒప్పందం కుదుర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఇరాన్ గతంలో చేసుకున్న ఒప్పందాలను గౌరవిస్తుందా? అన్నదే ప్రధాన సందేహమని అన్నారు. అందుకే ఎలాంటి ఒప్పందం విషయంలోనూ తొందరపడబోమని స్పష్టం చేశారు. ఇది సాధారణ యుద్ధం కోసం చేస్తున్న చర్య కాదని.. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని ట్రంప్ పేర్కొన్నారు.ఇజ్రాయెల్ మౌనం వెనుక వ్యూహమేంటి?అమెరికా-ఇరాన్ మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్న వేళ ఇజ్రాయెల్ వైఖరి ఆసక్తికరంగా మారింది. ఇరాన్‌ను ప్రధాన భద్రతా ముప్పుగా చూస్తున్న ఇజ్రాయెల్.. తాజా పరిణామాలపై నిశితంగా గమనిస్తోంది. అయితే ఈ దశలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మౌనం పాటిస్తోంది. అమెరికా చర్యలకు మద్దతు ఇస్తూనే.. పరిస్థితులు ఏ దిశగా వెళ్తాయో అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.ప్రతీకార చర్యలకు దిగిన ఇరాన్అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా స్పందించింది. బహ్రెయిన్, కువైట్, ఖతార్‌లపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిగినట్లు సమాచారం. అయితే ఈ దాడుల్లో జరిగిన నష్టంపై వెంటనే స్పష్టత రాలేదు. కువైట్ సైన్యం మాత్రం డ్రోన్లు, క్షిపణులను అడ్డుకునేందుకు చర్యలు చేపట్టినట్లు ప్రకటించింది.హర్ముజ్‌పై ఇరాన్ పట్టుహర్ముజ్ జలసంధిపై నియంత్రణ తమకే ఉందని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ ఘలీబాఫ్ మాట్లాడుతూ అమెరికా బెదిరింపులకు తలొగ్గేది లేదన్నారు. ‘‘మీరు దాడి చేస్తే.. మిమ్మల్ని కూడా దాడి చేస్తాం’’ అంటూ హెచ్చరించారు. హర్ముజ్ మార్గంలో నౌకల రాకపోకలు ఇరాన్ నిబంధనల ప్రకారమే సాగుతాయని తెలిపారు.చర్చలకు బ్రేక్?ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం దిశగా జరుగుతున్న ప్రయత్నాలకు తాజా పరిణామాలు అడ్డంకిగా మారాయి. ఇరువైపులా దాడులు, ప్రతిదాడులతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. బెదిరింపులు బలానికి సంకేతం కాదని, అమెరికా విధానాల వైఫల్యాన్ని చూపిస్తున్నాయని విమర్శించింది.పెరిగిన చమురు ధరలుఅమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ చమురు మార్కెట్‌పై పడింది. కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందన్న ట్రంప్ వ్యాఖ్యల తర్వాత చమురు ధరలు దాదాపు 8 శాతం పెరిగాయి. హర్ముజ్ జలసంధిలో పరిస్థితులు మరింత దిగజారితే ప్రపంచ ఇంధన సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఇరాన్ హిట్ లిస్ట్‌లో నేనే నంబర్ వన్.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఇరాన్ టార్గెట్ చేసిన హిట్ లిస్ట్‌లో (కిల్ లిస్ట్)లో మొదటి స్థానంలో ఉన్నానని ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై దాడి చేసే ఇరాన్ ప్లాన్ చేసిందని చెప్పుకొచ్చారు. ఇరాన్ దాడి అవకాశం ఉన్నప్పటికీ అలాంటి బెదిరింపులకు భయపడబోనని స్పష్టం చేశారు.నాటో సదస్సు సందర్భంగా మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ఇటీవల ఇరాన్‌పై అమెరికా చేపట్టిన సైనిక దాడులను సమర్థించారు. ఇరాన్ దూకుడు చర్యలకు ప్రతిస్పందనగానే అమెరికా బలంగా వ్యవహరించిందని, దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదన్నారు. అవసరమైతే మరింత కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ భద్రతకు ముప్పు ఏర్పడితే వెంటనే స్పందిస్తామని తెలిపారు.కాగా, 2020లో ఇరాన్ సైనిక అధికారి ఖాసిం సులేమానీ హత్య తర్వాత ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌కు చెందిన పలువురు నాయకులు హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ట్రంప్‌పై హత్యాయత్నాలకు సంబంధించిన కుట్రలను అమెరికా దర్యాప్తు సంస్థలు కూడా వెలుగులోకి తెచ్చాయి. అయితే తాను ఇరాన్ 'కిల్ లిస్ట్'లో మొదటి స్థానంలో ఉన్నానన్న ట్రంప్ వ్యాఖ్యకు సంబంధించి ఇరాన్ నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ వెలువడలేదు.ఇక, ట్రంప్ తాజా వ్యాఖ్యలు అమెరికా-ఇరాన్ సంబంధాల్లో నెలకొన్న ఉద్రిక్తతలను మరోసారి ప్రపంచ దృష్టికి తీసుకొచ్చాయి. ఈ పరిణామాలను ఐక్యరాజ్యసమితి, నాటో సభ్యదేశాలు, మధ్యప్రాచ్య దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. ప్రాంతీయ భద్రత, చమురు సరఫరా, అంతర్జాతీయ వాణిజ్యంపై ఈ ఉద్రిక్తతల ప్రభావం ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
భీకరంగా మారిన అమెరికా-ఇరాన్ యుద్ధం!
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలిక శాంతి ఒప్పందం "ముగిసిపోయింది" అని ప్రకటించిన కొన్ని గంటల్లోనే అమెరికా సైన్యం ఇరాన్‌పై మరోసారి భారీ వైమానిక దాడులకు దిగింది. హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతీకారంగానే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అమెరికా స్పష్టం చేసింది. చాబహార్, బందర్ అబ్బాస్, కొనారక్, ఇరాన్షహర్ సహా దక్షిణ ఇరాన్‌లోని పలు కీలక ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించగా, కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది.అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) అధికారిక ప్రకటనలో, హర్ముజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛకు ముప్పుగా మారుతున్న ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని మరింత బలహీనపరచడమే తాజా దాడుల లక్ష్యమని వెల్లడించింది. వాణిజ్య నౌకలు, పౌర సిబ్బందిపై జరిగిన దాడులకు ఇరాన్‌ను బాధ్యుడిగా నిలబెడుతున్నామని స్పష్టం చేసింది.హెచ్చరిక తర్వాతే దాడులుమంగళవారం హర్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న మూడు సరకు నౌకలపై జరిగిన దాడులకు ప్రతీకారంగానే తాజా ఆపరేషన్ చేపట్టినట్లు ట్రంప్ ప్రకటించారు. "నిన్న నౌకలపై జరిగిన దాడికి ఇదే సమాధానం. మళ్లీ అలాంటి దాడులు జరిగితే ఇంకా తీవ్రమైన చర్యలు తీసుకుంటాం" అని ఆయన హెచ్చరించారు.టర్కీలో జరిగిన నాటో సదస్సులో మాట్లాడుతూ, "ఇరాన్‌తో శాశ్వత ఒప్పందం కుదిరినా అది నిలుస్తుందనే నమ్మకం లేదు. వాళ్లు విశ్వసనీయులు కాదు. నా దృష్టిలో తాత్కాలిక ఒప్పందం ఇప్పటికే ముగిసింది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే పూర్తి స్థాయి యుద్ధం మళ్లీ ప్రారంభమవుతుందని మాత్రం తాను భావించడం లేదని కూడా చెప్పారు.మరింత తీవ్రంగా అమెరికా దాడులురాయిటర్స్ కథనం ప్రకారం.. బుధవారం జరిగిన దాడులు మంగళవారం కంటే మరింత విస్తృతంగా సాగాయి. ఇరాన్ దక్షిణ తీరంలోని కీలక సైనిక, నౌకాదళ మౌలిక సదుపాయాలనే ప్రధానంగా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది.ఇరాన్లో అతిపెద్ద నౌకాశ్రయం ఉన్న బందర్ అబ్బాస్, నౌకాదళ స్థావరాలు ఉన్న కొనారక్, వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన చాబహార్ ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. చాబహార్లో సముద్ర రవాణా నియంత్రణ టవర్‌కు నష్టం వాటిల్లినట్లు స్థానిక మీడియా తెలిపింది. పేలుళ్ల అనంతరం అక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇరాన్‌షహర్‌లో కూడా వరుస పేలుళ్లు నమోదయ్యాయి.అమెరికా స్థావరాలే లక్ష్యంగా..అమెరికా దాడులకు ముందు ఇరాన్ కూడా ప్రతిస్పందించింది. బహ్రెయిన్, కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు జరిపినట్లు ప్రకటించింది. అలాగే అమెరికా తాజా దాడులకు ప్రతీకారంగా మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరాలపై "భారీ దాడి"కి సిద్ధమవుతున్నామని ఇరాన్ భద్రతా వర్గాలకు చెందిన నూర్ న్యూస్ వెల్లడించింది.హర్ముజ్ జలసంధే అసలు కేంద్రబిందువుప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదో వంతు హర్ముజ్ జలసంధి గుండా వెళ్తుంది. ఈ వ్యూహాత్మక మార్గంపై ప్రభావం చూపగల సామర్థ్యం ఇరాన్‌కు ఉండటంతో అంతర్జాతీయంగా దీనికి అత్యంత ప్రాధాన్యం ఉంది. వాణిజ్య నౌకలపై దాడుల ద్వారా చర్చల్లో పైచేయి సాధించాలనే వ్యూహాన్ని ఇరాన్ అనుసరిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కారణంగానే అమెరికా హర్ముజ్‌లో ఇరాన్ సామర్థ్యాన్ని బలహీనపరచడంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.శాంతి చర్చలకు మరోసారి దెబ్బజూన్ 17న కుదిరిన అవగాహన ఒప్పందం ఆధారంగా శాశ్వత శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు కనిపించినప్పటికీ, తాజా దాడులతో ఆ ఆశలు దాదాపు ఆవిరయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT) నుంచి వైదొలగడం, అణు విధానంలో మార్పులు చేయడం, ఎర్ర సముద్రానికి కీలక ద్వారమైన బాబ్ ఎల్ మండెబ్ జలసంధిని మూసివేయడం వంటి ప్రతీకార చర్యలను కూడా ఇరాన్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.చమురు మార్కెట్లలో కలకలంతాజా దాడుల ప్రభావంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు వెంటనే స్పందించాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు ఒక దశలో సుమారు 7 శాతం వరకు ఎగసిపడగా, తర్వాత బ్యారెల్‌కు సుమారు 79 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి. హర్ముజ్ జలసంధిలో పరిస్థితులు మరింత దిగజారితే ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
ఇక చర్చలు టైమ్ వేస్ట్!
అంకారా: పశ్చిమాసియాలో సంఘర్షణను ముగించడానికి ఇరాన్‌తో కుదుర్చుకున్న మధ్యంతర శాంతి ఒప్పందం.. తద్వారా కాల్పులు విరమణ ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చిచెప్పారు. బుధవారం తుర్కియేలోని అంకారాలో నాటో శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇరాన్ నాయకులను ‘నీచులు, రోగులు’గా అభివర్ణించారు. ఇరాన్‌తో సంబంధాలు పెట్టుకోవడానికి తాను ఇష్టపడటం లేదని స్పష్టం చేశారు. ఇరాన్‌తో మూడు వారాల క్రితం సంతకాలు చేసిన అవగాహనా ఒప్పందం(ఎంఓయూ) ముగిసిందని పేర్కొన్నారు. ఇకపై వాళ్లతో(ఇరాన్) ఒప్పందాలు చేసుకోవాలని ఎంతమాత్రం అనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటన్నది కచ్చితంగా తెలియరాలేదు. కానీ, ఇరాన్‌కు వ్యతిరేకంగా ఆయన చేసిన ప్రకటన వెంటనే ప్రభావం చూపింది. చమురు ధరలు 5 శాతానికిపైగా పెరిగాయి. యుద్ధాన్ని ముగించడానికి మధ్యంతర ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత అమెరికా, ఇరాన్‌లు తమ కాల్పుల విరమణను కొనసాగించడానికి ఇబ్బంది పడుతున్నాయి. హార్మూజ్ జలసంధిపై పూర్తిస్థాయిలో పట్టు బిగించేందుకు ఇరాన్ ప్రయత్నిస్తుండగా, అమెరికా అందుకు అంగీకరించడం లేదు. బహుశా ఈ రాత్రి కూడా దాడులు! ఇరాన్ నేతలపై ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘వారు ముమ్మాటికీ నీచులు, రోగగ్రస్తులు, దుర్మార్గులు, హింసాత్మక మనస్తత్వం కలిగిన వ్యక్తులు. వారి వద్ద అణ్వాయుధం ఉంటే ప్రయోగిస్తారు’’అని ఆక్షేపించారు. అయితే, అమెరికా, ఇరాన్ ప్రతినిధులు చర్చలను కొనసాగించవచ్చని ట్రంప్ సూచించారు. కానీ, ఆ చర్చల్లో ఒరిగేదేమీ ఉండదని, టైమ్ వేస్ట్ అంటూ కొట్టిపారేశారు. పిచ్చివాళ్లతో చర్చలు జరపడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. అబద్ధాలకోరులతో చర్చించడం అంటే సమయం వృథా చేసుకోవడం తప్ప ఇంకేమీ కాదన్నారు. ఇరాన్‌పై మళ్లీ దాడులకు అమెరికా సన్నద్ధమవుతోందని ట్రంప్ తెలిపారు. నిన్న రాత్రి వారిపై తీవ్రమైన దాడి చేశామని, బహుశా ఈ రాత్రి కూడా గట్టిగా దాడి చేస్తామని స్పష్టంచేశారు. హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతీకారంగానే తమ దాడులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇరాన్ చాలా దారుణంగా వ్యవహరించిందని మండిపడ్డారు. హార్మూజ్‌లో నౌకలపై డ్రోన్లు, క్షిపణిని ప్రయోగించిందని ఆరోపించారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే తీవ్రస్థాయిలోదాడులకు దిగుతామని ఇరాన్ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని ఘాటుగా హెచ్చరించారు. ఇరాన్ చమురు మౌలిక సదుపాయాలు ఉన్న ఖర్గ్ ద్వీపాన్ని స్వా«దీనం చేసుకుంటామని అన్నారు. అవసరమైతే ఇరాన్‌కు చెందిన విద్యుత్ కేంద్రాలను, నీటి శుద్ధి ప్లాంట్లను ధ్వంసం చేస్తామని ట్రంప్ చెప్పారు. మంగళవారం ఖర్గ్ ద్వీపంపై దాడులు ఉన్నప్పటికీ అక్కడి చమురు కేంద్రాలపై మాత్రం జరగలేదని ఆయన పేర్కొన్నారు. ‘‘బహుశా మేము ఖర్గ్ ఐలాండ్‌ను స్వా«దీనం చేసుకోవచ్చు. దాన్ని మేము స్వా«దీనం చేసుకునే అవకాశం ఉంది. దాని గురించి ఇరాన్ చేయగలిగేది ఏమీ ఉండదు’’అని ట్రంప్ తేల్చిచెప్పారు. మరోవైపు దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ చమురు అమ్మకాలపై అమెరికా మళ్లీ ఆంక్షలు విధించింది. అమెరికా, ఇరాన్‌ల మధ్య ఘర్షణ ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చడం ప్రపంచాన్ని మరోసారి ఆందోళనకు గురిచేస్తోంది. -
Breaking: మళ్లీ ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు
అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త దాడులపై హెచ్చరించిన కొన్ని గంటల్లోనే అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఇరాన్‌పై తాజా వైమానిక దాడులను ప్రారంభించినట్లు ప్రకటించింది. హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతిస్పందనగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అమెరికా తెలిపింది.ఇరాన్ దక్షిణ తీరంలోని వ్యూహాత్మక నౌకాశ్రయ నగరాలైన చాబహార్, బందర్ అబ్బాస్ పరిసర ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. రాడార్ వ్యవస్థలు, వైమానిక రక్షణ కేంద్రాలు, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) వినియోగించే సైనిక మౌలిక సదుపాయాలే ప్రధాన లక్ష్యాలుగా అమెరికా దాడులు సాగించినట్లు సమాచారం."హోర్ముజ్ జలసంధిలో స్వేచ్ఛాయుత నౌకాయానానికి ముప్పు కలిగించే ఇరాన్ సామర్థ్యాన్ని బలహీనపర్చడమే ఈ దాడుల ఉద్దేశం" అని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఇటీవల వాణిజ్య నౌకలపై జరిగిన దాడులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని అమెరికా ఆరోపించింది.కాగా ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిపోయిందని ప్రకటిస్తూ, అవసరమైతే ఇరాన్‌పై మరింత కఠిన చర్యలకు వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఆయన ప్రకటించిన కొన్ని గంటల్లోనే అమెరికా దాడులు చేయడం గమనార్హం.At the direction of the Commander in Chief, U.S. Central Command forces have started conducting additional strikes against Iran to further degrade their ability to threaten freedom of navigation in the Strait of Hormuz. The United States is holding Iran accountable for recent…— U.S. Central Command (@CENTCOM) July 8, 2026JUST IN: 🇮🇷🇺🇸 Smoke rises in Iran following US strikes. pic.twitter.com/HdCsYaiiXC— BRICS News (@BRICSinfo) July 8, 2026 -
మళ్లీ మొదటికి...!
అమెరికా–ఇరాన్‌ల మధ్య కుదిరిన అరవై రోజుల అవగాహన ఒప్పందం(ఎంఓయూ) ఇరవై రోజులకే ముక్కలైంది. శాంతి సాధన దిశగా తొలి అడుగు పడిందని అందరూ సంతోషించి ఎంతో కాలం కాకుండానే అది ముగిసిపోయింది. తుర్కియేలో జరిగే నాటో శిఖరాగ్ర సదస్సుకొచ్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ సంగతి ప్రకటించారు. ఈ రాత్రికి భీకరదాడులుంటాయని కూడా హెచ్చరించారు. నిలకడ తక్కువ... నోటి దురుసు ఎక్కువవున్న ట్రంప్ ఎంఓయూపై సంతకాలైన క్షణంనుంచి రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. కిందపడినట్టు ప్రపంచమంతటికీ తెలిసినా తనదే పైచేయి అని చెప్పడానికి తాపత్రయపడ్డారు. ఎంఓయూ తర్వాత ఇలా జరగటం ఇది మూడో సారి. ఈ దాడులకు దీటుగా బదులిచ్చినట్టు, అమెరికా మిత్ర దేశాల్లోని దాని స్థావరాలపై క్షిపణులు ప్రయోగించినట్టు ఇరాన్ చెబుతోంది. ఒప్పందం కుదిరిందన్న మాటేగానీ... పశ్చిమాసియా అంతటా ఒక విధమైన ఉద్రిక్తత, అనిశ్చితి కొనసాగుతూనే ఉన్నాయి. హార్మూజ్ జలసంధినుంచి నౌకలు సురక్షితంగా బయటపడటం అనునిత్యం వార్తే అయింది. శాంతి అనేది వీరోచిత శ్రమనూ, త్యాగాన్నీ కోరుతుందని ఆధ్యాత్మికవేత్త థామస్ మెర్టన్ అంటాడు. పరస్పర అవగాహనతో తప్ప బలప్రయోగంతో శాంతి అసాధ్యమన్నది విఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మాట. వీరత్వమూ, త్యాగమూ ట్రంప్‌కు ఏమాత్రం సరిపడని పదాలు. బలప్రయోగంతోనే శాంతి సాధ్యమన్నది ఆయన కుండే మూఢవిశ్వాసం. గత నెల జూన్ 17న కుదిరిన ఆ ఒప్పందం ఈ స్వల్పకాలం బతికివుందంటేనే ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే సంతకం చేసింది అమెరికానే అయినా, ఆ దేశాన్ని శాసించేది ఇజ్రాయెల్. ఆ రోజే శాపనార్థాలు పెట్టిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ... మధ్యమధ్యలో లెబనాన్‌పై ఏదో వంకన దాడులు సాగిస్తూనే వచ్చారు. నాటో శిఖరాగ్ర సదస్సుకు అంకారా వచ్చిన సందర్భంలో తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ ఇచ్చిన విందుకు హాజరై వెళ్లాక హఠాత్తుగా ట్రంప్ ఈ దాడుల ప్రకటన చేయగానే సభ్య దేశాలు నివ్వెరపోయాయి. హార్మూజ్ జలసంధిలో మూడు వాణిజ్య నౌకలపై ఇరాన్ చేసిన దాడులకు ప్రతీకారంగానే ఇలా చేయాల్సివచ్చిందనీ, ముడి చమురు విక్రయించడానికి ఇరాన్కిచ్చిన లైసెన్సు రద్దయిందనీ ఆయన చెప్పాక పరిస్థితి మళ్లీ మొదటికొచ్చిందని అందరికీ అర్థమైంది. శాంతి కోసం నాటో దేశాలు చేసిందేమీ లేదు గానీ... అది కుదిరితే లబ్ధిపొందడానికి మాత్రం పాకులాడాయి. వేరే దేశాల పర్యటనల మధ్యన యుద్ధానికి దిగమని అధ్యక్షుడు ఆదేశించటం అరుదు. 2011లో బ్రెజిల్ పర్యటనలో ఉండగా అప్పటి అధ్యక్షుడు ఒబామా లిబియాపై దాడులకు ఆదేశించారు. ఆయుధాలపై నాటో దేశాలు ఖర్చుపెట్టాల్సిందేనని పట్టుబడుతున్న ట్రంప్‌ను ప్రసన్నం చేసుకోవటానికి అవి నానా తంటాలూ పడుతున్నాయి. అందులో సింహభాగం అమెరికన్ ఆయుధాలకే వెచ్చిస్తున్నామని చెబితే విని సంతోషపడతారని ఊహించాయి. కానీ ఇరాన్‌పై దాడులు మొదలైనాక సహకరించమని కోరితే జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ నిరాకరించాయన్న కోపం ఆయనకు పోలేదు. ఆ సంగతి ఎర్డోగాన్ చెవిన వేయడంతోపాటు, తుర్కియే కోసమే నాటోలో కొనసాగుతున్నామని కూడా చెప్పారు. కాసేపటికే తాజా దాడుల సంగతి ప్రకటించారు. అవగాహన ఒప్పందం వాలకం చూస్తేనే ఎవరికీ విశ్వాసం కలగలేదు. దానివల్ల ఒరిగిందల్లా హార్మూజ్‌లో నౌకలపై ఇరాన్ దాడులు నిలిపేయటం, ముడి చమురు అమ్ముకోవటానికి అమెరికా ఇరాన్‌ను అనుమతించటం. హార్మూజ్‌లో సుంకాల వసూలు, స్తంభించిన ఇరాన్ ఆస్తుల బదలాయింపు, ఇరాన్ అణు కార్యక్రమం నిలిపేయటం వంటివన్నీ తదుపరి చర్చలకు వాయిదాపడ్డాయి. ఇరాన్ బలంగా కోరుకునే అంశాలన్నీ ఎంఓయూలో ప్రస్తావనకు రాకపోవటంతో మొదట్లోనే చాలామంది పెదవి విరిచారు. ఈ యుద్ధంతో అన్ని దేశాలూ ఆర్థికంగా దెబ్బతిన్నాయి. తాజా దాడుల తర్వాత స్టాక్ మార్కెట్లు కళ్లు తేలేస్తున్నాయి. ముడిచమురు ధర 5 శాతం పెరిగింది. ఇరాన్ మత నాయకుడు ఖమేనీ అంత్యక్రియల పర్వం పూర్తయ్యేవరకూ కూడా ట్రంప్ ఆగలేక పోయారు. తన హామీని తానే ఉల్లంఘించారు. ఎన్నిసార్లు భంగపడుతున్నా ట్రంప్‌కు తత్వం బోధపడక పోవటం విచారకరం. అగ్రరాజ్యాధినేతగా బాధ్యతాయుత ప్రవర్తన అవసరమని ఆయన గ్రహించేదెన్నడో? -
మార్కెట్లో ట్రంప్ కల్లోలం
ముంబై: ‘‘ఇరాన్‌తో అమల్లో ఉన్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగిసింది. ఇక భవిష్యత్తులో ఎలాంటి చర్చలు ఉండవు. కేవలం సంప్రదింపులు మాత్రమే ఉంటాయి’’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. హార్మూజ్ జలసంధి ద్వారా చమురు సరఫరాలకు అంతరాయం ఏర్పడొచ్చన్న ఆందోళనతో అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధర 6.18 శాతం ఎగిసి బ్యారెల్‌కు 78.74 డాలర్లకు చేరుకుంది. ఈ ప్రభావంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు గడిచిన మూడు నెలల్లోనే అతిపెద్ద పతనాన్ని నమోదు చేశాయి. సెన్సెక్స్ 1,667 పాయింట్లు క్షీణించి 76,504 వద్ద ముగిసింది. నిఫ్టీ 517 పాయింట్లు కోల్పోయి 23,882 వద్ద స్థిరపడింది.ఒక్కరోజే ఇన్వెస్టర్ల మార్కెట్ సంపద రూ.8.96 లక్షల కోట్లు కరిగిపోయింది. దీంతో బీఎస్ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.471 లక్షల కోట్లకు దిగివచ్చింది. రోజంతా అమ్మకాల ఒత్తిడే... బలహీన అంతర్జాతీయ సంకేతాల మధ్య సూచీలు నష్టాలతోనే ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. రోజంతా అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. చివరి గంటలో విక్రయాలు మరింత ఉధృతమయ్యాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 1,922 పాయింట్లు క్షీణించి 76,259 వద్ద, నిఫ్టీ 594 పాయింట్లు కోల్పోయి 23,805 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో ఆయా రంగాల ఇండెక్సులన్నీ నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సర్వీసెస్ సూచీ 3.21 శాతం క్షీణించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు 2.76%, ప్రైవేటు బ్యాంకులు 2.74%, ఎఫ్ఎంసీజీ 2.54 %, ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.49 శాతం నష్టపోయాయి. మిడ్‌క్యాప్ సెలెక్ట్ 2.14 %, స్మాల్‌క్యాప్ సెలెక్ట్ 1.61 శాతం క్షీణించాయి. సెన్సెక్స్ సూచీలో అన్ని షేర్లూ డీలా సెన్సెక్స్ సూచీలో 30 షేర్లూ నష్టాలతో ముగిశాయి. ఇండిగో (–5.22%), మారుతీ (–4.11%), హెచ్‌యూఎల్ (–3.36%), బజాజ్ ఫైనాన్స్ (–3.07%), కోటక్ మహీంద్రా (– 2.93%) షేర్లు అత్యధికంగా పతనమయ్యాయి. మరోవైపు, అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ (– 2.27%), ఐసీఐసీఐ బ్యాంక్ (–2.36%), రిలయన్స్ (–2.35%), ఎల్అండ్టీ(–2.41%), ఎయిర్టెల్ (–1.82%) షేర్లు నష్టపోయాయి. ఆయిల్, ఏవియేషన్, పెయింట్స్ షేర్లు బేర్.. క్రూడ్ సెగతో మార్కెటింగ్ మార్జిన్లపై ఒత్తిడి పెరుగుతుందన్న అంచనాలతో హెచ్‌పీసీఎల్ (–4.60%), ఐఓసీ (–3.51%), బీపీసీఎల్ (–3.20%) షేర్లు బలహీనపడ్డాయి. ఏటీఎఫ్ ధరల ఆందోళనతో ఇండిగో (–5.02%), స్పైస్‌జెట్ (–3.04%) పడ్డాయి. షాలీమార్ పెయింట్స్ 4.44 శాతం, ఇండిగో పెయింట్స్ 4.18 శాతం, ఏషియన్ పెయింట్స్ 2.49 శాతం, బర్జర్ పెయింట్స్ 2.26 శాతం క్షీణించాయి.బలహీనంగా అంతర్జాతీయ మార్కెట్లు భౌగోళిక, రాజకీయ ఉద్రికత్తల దెబ్బతో ప్రపంచ మార్కెట్లన్నీ ఎరుపెక్కాయి. కొరియా (–5.65%), జపాన్ (–2.15%), చైనా (–0.49%) నష్టపోయాయి. జర్మనీ (–1.96%), ఫ్రాన్స్ (–2.11%) పతనమయ్యాయి. బ్రిటన్ (–1.44%), అమెరికా స్టాక్ సూచీలు ఒకటిన్నర శాతం నష్టాల్లో ట్రేడవుతున్నాయి.న్యాక్ ప్యాకేజింగ్ లిస్టింగ్ సక్సెస్ న్యాక్ ప్యాకేజింగ్ లిస్టింగ్ విజయవతమైంది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.170)తో పోలిస్తే 9.41% ప్రీమియంతో రూ.186 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. 13% లాభపడి రూ.192 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 7.47 శాతం లాభంతో రూ.183 వద్ద ముగిసింది.ఉదయం 9.15సెన్సెక్స్ 77,816 (–365)మధ్యాహ్నం 1.45సెన్సెక్స్ 77,559 (–622)మధ్యాహ్నం 3.30సెన్సెక్స్ 76,504 (–1,677) -
"ఖర్గ్ ద్వీపం స్వాధీనం చేసుకుంటాం"
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌కు డేంజర్ వార్నింగ్ ఇచ్చారు. ఆ దేశ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామన్నారు. ఖర్గ్ దీపాన్ని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. అయితే ఇదివరకే ఇకపై ఇరాన్‌తో చర్చలు ఉండవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. ఇరాన్ తప్పులు చేస్తూనే ఉందని చర్చల పేరుతో ఇరాన్ తమ సమయాన్ని వృథా చేస్తోందని ఆ దేశంతో సీజ్ఫైర్ ముగిసిందని చెప్పారు. కాగా తాజాగా మరోసారి ట్రంప్ వార్నింగ్ ఇవ్వడంతో ఏ జరగనుందా అనే ఆందోళన టెన్షన్ సర్వత్వా నెలకొంది. కాగా ఈ రోజు బుధవారం అంకారాలో జరిగిన నాటో సదస్సులో విలేకరులతో మాట్లాడిన ట్రంప్ " ఇరానీయులు అబద్ధాలు చెప్పేవాళ్లు, మోసగాళ్లు, చెడ్డ మనస్తత్వం ఉన్నవాళ్లు" అంటూ ట్రంప్ విమర్శించారు. గత రాత్రి ఇరాన్‌కు చెందిన చాలా ప్రమాదకరమైన వ్యక్తులపై అమెరికా దాడులు జరిపిందని చెప్పారు. హార్మూజ్ జలసంధి గుండా వెళ్తున్న మూడు నౌకలపై దాడి జరిగిన తర్వాత ఈ దాడులు జరిగాయి. ఆ దాడిని ఇరాన్ సైన్యమే జరిపిందని అమెరికా ఆరోపించింది.కాగా ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్నాయి. రేపు గురువారం ఆయన స్వస్థలం మషాద్ నగరంలో జరుగుతాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ దాడి చేస్తామని ప్రకటించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కాగా ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా ఇరానీయన్లు అమెరికాపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. అమెరికాకు మరణం, ఇరాన్‌కు మరణం అనే నినాదాలతో హోరెత్తించారు. -
మళ్లీ యుద్ధమా? ట్రంప్ వ్యాఖ్యలతో చమురు ధరలు భగ్గు!
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ముదిరిన ఉద్రిక్తతల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ అవగాహనా ఒప్పందం (MoU) ముగిసిందని, ఇకపై ఎలాంటి చర్చలు ఉండవంటూ ప్రకటించారు. మరొకవైపు ఇరాన్ నాయకత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఈ నేపథ్యంలో, టర్కీలోని అంకారాలో జరుగుతున్న నాటో (NATO) సదస్సులో ట్రంప్ మాట్లాడుతూ.. తాము ఇరాన్‌కు చెందిన అత్యంత ప్రమాద కరమైన వ్యక్తులపై శక్తివంతమైన దాడులు చేశాం. వాళ్లు దుర్మార్గులు, మానసిక రోగులంటూ దుమ్మెత్తి పోశారు. అంతేకాదు ఇరాన్‌ను పూర్తిగా అణ్వాయుధ రహిత దేశంగా (Denuclearisation) మారుస్తామని ట్రంప్ హెచ్చరించారు.ఇదీ చదవండి: ఆమీర్ భార్య గౌరి బ్రైడల్ లుక్ : 'పఠానీ హార్' విశేషాలు తెలుసా?ఇది ఇలా ఉంటే ట్రంప్ వ్యాఖ్యల ప్రభావం గ్లోబల్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. ఇండియన్ స్టాక్ మార్కెట్లలో సెన్సెక్స్ సుమారు 1,506 పాయింట్లు, అంటే 1.93శాతం పతనమై, 76,673.86 వద్దకు చేరగా, నిఫ్టీ 50 కూడా 461 పాయింట్లు 1.89శాతం నష్టపోయి 23,937.65దిగువకు పడిపోయింది. ఫార్మా, మెటల్ రంగాలు మినహా మిగిలిన అన్ని రంగాలు నష్టాల్లో నడిచాయి.చమురుపై ప్రభావంఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ముడి చమురు ధరలు మళ్లీ ఆకాశంవైపు చూస్తున్నాయి. ముఖ్యంగా ట్రంప్ ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఒకేసారి 5 శాతానికి పైగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 5.3 శాతం ఎగిసి 78.09 డాలర్ల స్థాయిని అధిగమించగా, డబ్ల్యూటీఐ (WTI) క్రూడ్ 5.4 శాతం పెరిగి 74.23 డాలర్ల వద్దకి చేరుకుంది.ఇదీ చదవండి: రెడ్ బెనారసీ డ్రెస్‌లో పార్టీ లుక్.. తొలిసారి ఇలా అన్షులా!స్పెయిన్‌పై ట్రంప్ ఆగ్రహం.. నాటోపై అసంతృప్తిఇరాన్పై సైనిక చర్యల కోసం అమెరికాకు తమ సైనిక స్థావరాలను, వైమానిక మార్గాన్ని ఉపయోగించు కోవడానికి స్పెయిన్ నిరాకరించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్.. స్పెయిన్‌ను నాటోలో ఒక దారుణ మైన భాగస్వామిగా అభివర్ణిస్తూ, ఆ దేశంతో అన్ని రకాల వాణిజ్య సంబంధాలను నిలిపివేయాలని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్‌ను ఆదేశించారు. ఉగ్రవాదానికి పెద్ద పీట వేసే ఇరాన్ విషయంలో నాటో కూటమి తమకు మద్దతుగా నిలబడటం లేదని, గ్రీన్లాండ్ విషయంలో కూడా నాటో ప్రవర్తన తనకు నచ్చలేదని ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: యువ క్రికెటర్ బలి : ఇంత ప్రమాదమా ఈ వ్యాధి? లక్షణాలేంటి? -
ఇకపై ఇరాన్‌తో చర్చలు ఉండవు: ట్రంప్
ఇకపై ఇరాన్‌తో చర్చలు ఉండవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. ఇరాన్ తప్పులు చేస్తూనే ఉందని తెలిపారు. చర్చల పేరుతో ఇరాన్ తమ సమయాన్ని వృథా చేస్తోందని అన్నారు. ఇరాన్‌తో సీజ్ఫైర్ ముగిసిందని చెప్పారు. దీంతో యుద్ధం మరింత భీకరంగా కొనసాగే ముప్పు ఉందని నిపుణులు భావిస్తున్నారు. బుధవారం అంకారాలో జరిగిన నాటో సదస్సులో విలేకరులతో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరానీయులను "అబద్ధాలు చెప్పేవాళ్లు, మోసగాళ్లు, చెడ్డ మనస్తత్వం ఉన్నవాళ్లు" అంటూ ట్రంప్ విమర్శించారు. గత రాత్రి ఇరాన్‌కు చెందిన చాలా ప్రమాదకరమైన వ్యక్తులపై అమెరికా దాడులు జరిపిందని చెప్పారు. హార్మూజ్ జలసంధి గుండా వెళ్తున్న మూడు నౌకలపై దాడి జరిగిన తర్వాత ఈ దాడులు జరిగాయి. ఆ దాడిని ఇరాన్ సైన్యమే జరిపిందని అమెరికా ఆరోపించింది."వాళ్లు తమ సొంత ప్రజలకు హాని చేశారు. నిరసనల్లో పాల్గొన్న 54,000 మందిని చంపారు. గత రాత్రి ఇరాన్‌కు చెందిన చాలా ప్రమాదకరమైన వ్యక్తులపై మేము చాలా శక్తిమంతంగా దాడి చేశాం. వాళ్లలో ఏదో సమస్య ఉంది" ట్రంప్ అన్నారు.ఈ ఘర్షణ లక్ష్యం ఇదే..ఇరాన్‌ను "దుష్ట దేశం"గా పేర్కొన్న ట్రంప్.. ఈ ఘర్షణ లక్ష్యం ఇరాన్ అణు సామర్థ్యాన్ని లేకుండా చేయడమేనని, అమెరికా ఇరాన్‌ను "డి-న్యూక్" చేస్తుందని మరోసారి చెప్పారు."గత రాత్రి మేము ఇరాన్‌పై చాలా తీవ్రంగా దాడి చేశాం. మీరు దాడి చేసిన ప్రతిసారీ మేమూ దాడి చేస్తామని నేను వాళ్లకు చెప్పాను. వాళ్లు నీచంగా వ్యవహరిస్తారు. అందరి వెంట పడతారు. బహుశా నా వెంట కూడా పడవచ్చు. వాళ్లు మాకు నచ్చరు. నాకు వాళ్లు నచ్చరు. వాళ్లు దుష్టులు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని తొలగించడమే మా లక్ష్యం. మేము దాన్ని డి-న్యూక్ చేస్తాం" అని ట్రంప్ చెప్పారు. -
ట్రంప్ కొత్త రూల్స్.. భారత ఉద్యోగుల్లో వణుకు!
వాషింగ్టన్: అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వీసాలు, ఎంప్లాయ్మెంట్ ఆధారిత గ్రీన్ కార్డ్‌లు, అంతర్జాతీయ విద్యార్థుల వీసా కాలపరిమితి, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్‌లలో కీలక మార్పులు తీసుకురావడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఈ నూతన ప్రతిపాదనలు అమల్లోకి వస్తే, అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయ నిపుణులు, విద్యార్థులపై అత్యధిక ప్రభావం పడే అవకాశం ఉంది.హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, లేబర్, స్టేట్ డిపార్ట్మెంట్లు విడుదల చేసిన తాజా నిబంధనల ప్రకారం, థర్డ్-పార్టీ క్లయింట్ సైట్లలో పనిచేసే హెచ్-1బీ ఉద్యోగుల అర్హతలను మరింత కఠినతరం చేయనున్నారు. ఐటీ కన్సల్టింగ్ కంపెనీలు గట్టి నిబంధనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే, 50 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండి, అందులో సగానికి పైగా హెచ్-1బీ లేదా ఎల్-1 వీసాదారులు ఉన్న పెద్ద కంపెనీలకు వీసా పొడిగింపుల (ఎక్స్టెన్షన్స్) సమయంలో అదనపు బయోమెట్రిక్ ఫీజులను విధించనున్నారు.మరోవైపు, గ్రీన్ కార్డ్ ప్రక్రియకు కీలకమైన 'పెర్మ్ (PERM) లేబర్ సర్టిఫికేషన్' విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయనున్నారు. విద్యార్థుల విషయానికొస్తే, ఇప్పటివరకు ఉన్న 'డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్' విధానాన్ని రద్దు చేసి, గరిష్టంగా నాలుగేళ్ల నిర్ణీత కాలపరిమితిని (ఫిక్స్డ్ టెన్యూర్) ప్రవేశపెట్టనున్నారు. దీనివల్ల చదువు పూర్తయిన తర్వాత ప్రతిసారీ వీసా పొడిగింపునకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా, హెచ్-4 వీసాదారుల వర్క్ పర్మిట్ (ఈఏడీ) ఆటోమేటిక్ ఎక్స్‌టెన్షన్‌ను నిలిపివేయనున్నారు. దీనివల్ల దాదాపు లక్ష మంది భారతీయులు ఉపాధి కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. -
‘ఆంక్షలను తొలగించబోతున్నా.. మీకు సంతోషమేనా?’
అంకారా: రష్యా నుంచి క్షిపణి రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేసినందుకు గాను గతంలో తుర్కియేపై విధించిన ఆంక్షలను ఎత్తి వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ప్రకటించారు. ట్రంప్ ప్రకటనతో ఆ దేశం అమెరికా నుంచి ఎఫ్–35 ఫైటర్ జెట్లను కొనుగోలు చేసేందుకు అవకాశం ఏర్పడిందని విశ్లేషకులు అంటున్నారు.అంకారాలో మంగళవారం తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్‌తో జరిగిన సమావేశంలో ట్రంప్.. ‘ఆంక్షలను తొలగించబోతున్నా, మీకు సంతోషమేనా?’అంటూ ప్రశ్నించారు. ఈ అంశంపై తమ అధికారులు తగు చర్యలను ప్రారంభించినట్లు చెప్పారు. అమెరికాఎఫ్–35 యుద్ధ విమానాల ప్రోగ్రామ్‌లోకి తుర్కియే తిరిగి ప్రవేశించడానికి ఇంకా అడ్డంకులు అనేకం ఉన్నప్పటికీ ’కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్’ (కాట్సా) కింద విధించిన ఆంక్షలను తొలగించడంతో ఆ విమానాలను దక్కించుకోవడానికి తుర్కియేకు మార్గం సులువు కానుంది. -
‘మర్యాదగా ఒప్పందానికైనా రండి.. లేదంటే కథ ముగిస్తాం’
అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పీక్ స్టేజీకి చేరాయి. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశానికి మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. "మర్యాదగా మాతో ఒప్పందానికైనా రావాలి.. లేదంటే కథ ముగించేస్తాం అంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా- ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ మరణించగా.. ప్రస్తుతం ఇరాన్లో ఆయన అంత్యక్రియల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వైట్‌హౌస్ వేదికగా ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. తాము ఏ రకంగానైనా విజయం సాధించి తీరుతామంటూ ధీమా వ్యక్తం చేశారు. "మేం ఎలాగైనా గెలవబోతున్నాం. అయితే ఒక ఒప్పందానికి వస్తాం.. లేదా కథ ముగించేస్తాం. ఇరాన్ పని ముగించడం మాకేమీ అంత కష్టం కాదు. కానీ, నేను ఒప్పందానికే మొగ్గు చూపుతాను.. ఎందుకంటే అక్కడ ఉన్న 91 మిలియన్ల (9 కోట్లకు పైగా) ప్రజలు ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు. మేం అనుకుంటే కేవలం ఒక్క గంటలోనే ఇరాన్‌లోని వంతెనలన్నింటినీ నేలమట్టం చేయగలం" అని ట్రంప్ హెచ్చరించారు.అలాగే ఇరాన్ వద్ద ఎట్టిపరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు ఉండటానికి వీల్లేదని ట్రంప్ స్పష్టం చేశారు. మేం ఆ దేశం నుంచి రేడియోధార్మిక పదార్థాలను, సంపన్న యురేనియంను స్వాధీనం చేసుకోబోతున్నాం. ఇరుదేశాల మధ్య యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ఉన్న ధరల కంటే ప్రస్తుతం క్రూడాయిల్ ధరలు బ్యారెల్‌కు మరింత తగ్గాయి. మేం కొన్ని రాయితీలు సాధించాం. వాటిని వారు కొనసాగించాల్సిందే" అని ఆయన పేర్కొన్నారు.గత నెలలోనే అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం కుదిరి.. కాల్పుల విరమణ అమలులో ఉన్నప్పటికీ ట్రంప్ మాత్రం తన దూకుడు తగ్గించడం లేదు. జూలై 3న జరిగిన ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ అగ్రనాయకత్వం, మతాధికారులు భారీగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందేఅమెరికా మీడియా సంస్థ 'ఆక్సియోస్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... నాయకులంతా అక్కడే గుమికూడారు. ఒక్క దెబ్బతో వారందరినీ మట్టుబెట్టే అవకాశం మాకు వచ్చింది. కానీ మేం అలా చేయలేదు. ఎందుకంటే వారందరినీ చంపేస్తే ఆ తర్వాత మేం ఎవరితో చర్చలు జరపాలి?" అని అన్నారు. ఖమేనీ అంత్యక్రియలకు అంతమంది తరలిరావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. "చాలామంది ఇరాన్ ప్రజలు ఖమేనీకి వ్యతిరేకమనుకున్నా.. బహుశా అవన్నీ నకిలీ కన్నీళ్లు కావచ్చు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రస్థాయిలో మండిపడింది. ఆర్మేనియాలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా ట్రంప్‌పై తీవ్ర విమర్శలు గుప్పించింది. జూలై 4న 250వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్న అమెరికాకు అసలు నాగరికత, చరిత్రే లేవని ఎద్దేవా చేసింది. "మనుషులను చంపగలరు.. కానీ ఆదర్శాలను కాదు. మీరు ఆయతుల్లా ఖమేనీని చంపి ఉండొచ్చు. కానీ నిజానికి మీరు ఒక సెంట్ల సీసాను పగలగొట్టారు.. దాంతో ఆ సువాసన ఇప్పుడు అన్ని వైపులా వ్యాపించింది. ఈ విషయాలు మీకు అర్థం కావు... ఎందుకంటే అమెరికాకు అటు నాగరికత లేదు, ఇటు చరిత్ర లేదు, అసలు గౌరవమే లేదు. .ఖమేనీ అంత్యక్రియలకు తరలివచ్చిన జనసందోహాన్ని చూసైనా అమెరికా వాస్తవాన్ని గ్రహించాలని ఇరాన్ ఈ సందర్భంగా హితవు పలికింది. -
ఖమేనీ అంత్యక్రియల్లో ఇరాన్ సంచలన పిలుపు!
టెహ్రాన్: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల వేళ ఇరాన్ రాజధాని టెహ్రాన్ తీవ్ర ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. ఇక్కడి ప్రసిద్ధ ఇస్లామిక్ ప్రార్థనా స్థలం ‘గ్రాండ్ మొసల్లా' కాంప్లెక్స్ లక్షలాది మంది ఇరానీయులతో కిక్కిరిసిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త వైమానిక దాడిలో ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు మరణించారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం, అలజడి కారణంగా దాదాపు నాలుగు నెలల ఆలస్యం తర్వాత ఇరాన్ ప్రభుత్వం ఇప్పుడు వారం రోజుల పాటు సాగే ఈ భారీ అంత్యక్రియల ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది.ఈ అంత్యక్రియల ప్రార్థనలు కేవలం శోకసంద్రంగానే కాకుండా, ఇజ్రాయెల్, అమెరికాలపై ప్రతీకారం తీర్చుకోవాలనే నినాదాలతో హోరెత్తాయి. ప్రార్థనా మందిరంలో చేరిన లక్షలాది మంది ప్రజలు ఇరాన్ జాతీయ జెండాలతో పాటు, ప్రతీకారానికి చిహ్నమైన ఎరుపు రంగు జెండాలను ప్రదర్శించారు. ఖమేనీ మృతికి కారణమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులను అంతమొందించాలంటూ పెద్ద ఎత్తున ప్లకార్డులు, పోస్టర్లు, గ్రాఫిటీలను ప్రదర్శించారు.అమెరికా నశించాలి,ఇజ్రాయెల్ నశించాలి అనే నినాదాల మధ్య.. ఇరాన్ మిలటరీ త్రివిధ దళాధిపతులు, అగ్రశ్రేణి రాజకీయ నాయకులు బహిరంగంగా హాజరయ్యారు. ట్రంప్‌ను చంపడం మా బాధ్యత అంత్యక్రియల వేళ లౌడ్స్పీకర్లలో ఈవెంట్‌ను నడిపిస్తున్న మొహమ్మద్ రసౌలి అనే కవి మాట్లాడుతూ..ఇకపై శవాల కఫనే మా వస్త్రం. ఖమేనీ రక్తం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం.. ట్రంప్‌ను హతమార్చడం ఇకపై మా బాధ్యత’అని పిలుపునివ్వడంతో లీడర్లు, ప్రజలు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు.ఈ ఉద్రిక్తతల మధ్య అర్మేనియాలో ఇరాన్ రాయబారి ఖలీల్ షిర్‌ఘోలామి ఎక్స్ వేదికగా స్పందిస్తూ అమెరికా, ఇజ్రాయెల్‌లపై తీవ్ర విమర్శలు చేశారు. ‘మీరు మనుషులను చంపగలరు కానీ వారి ఆదర్శాలను చంపలేరు. మీరు అయతుల్లా ఖమేనీని చంపడం ద్వారా ఒక అత్తరు సీసాను పగులగొట్టారు. ఇప్పుడు దాని సువాసన (ఆదర్శం) అంతటా వ్యాపించింది. నాగరికత, చరిత్ర, గౌరవం లేని మీకు ఇది ఎప్పటికీ అర్థం కాదు’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇరాన్‌లోని వరుస పరిణామాలు అంతర్జాతీయంగా చర్చాంశనీయమయ్యాయి. -
భారత్‌పై ఇజ్రాయెల్ ప్రధాని కీలక వాఖ్యలు
ఇజ్రాయెల్‌కు అమెరికా మాత్రమే ఏకైక శక్తివంతమైన మిత్రదేశం అంటూ యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ చేసిన వ్యాఖ్యలను ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తోసిపుచ్చారు. అమెరికాకు ఆవల కూడా భారత్ సహా ఇతర దేశాల మద్దతు ఇజ్రాయెల్‌కు ఉందన్నారు. లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్యలు, ఇరాన్-అమెరికా కుదుర్చుకున్న శాంతి ఒప్పందం.. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య విభేదాలు పెరుగుతున్న నేపథ్యంలో నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశారు.వాన్స్ చేసిన వ్యాఖ్యలపై నెతన్యాహు స్పందిస్తూ.. తమకు అనేక దేశాల అండ ఉందని.. వాటిలో చిన్న దేశమైన ఇండియా కూడా ఉందన్నారు. అక్కడ 140 కోట్ల జనాభా ఉంది. అక్కడ మాకు ఎంతటి అపారమైన మద్దతు ఉందో తెలుసా" అంటూ ఆయయన వ్యాఖ్యానించారు. అభిప్రాయభేదాలు ఉన్నప్పటికీ వాన్స్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని నెతన్యాహు చెప్పారు. ఆయనకు నాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. అంతమాత్రాన ఆయన చెప్పే ప్రతిదానితో నేను ఏకీభవిస్తానని కాదు. అలాగే వైట్‌హౌస్‌లో తమకు లభించిన అత్యంత గొప్ప స్నేహితుడని.. తాను భావించే ప్రెసిడెంట్ ట్రంప్‌కు, తనకు మధ్య ఎటువంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు.నెలల తరబడి సాగుతున్న ఘర్షణలను ముగించడానికి, హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి విస్తృత ప్రాంతీయ చర్చలు కోసమే ఇరాన్‌తో శాంతి ఒప్పందాన్ని రూపొందించినట్లు వాన్స్ సమర్థించుకున్నారు. వాషింగ్టన్ అందిస్తున్న సైనిక మద్దతును ఇజ్రాయెల్ నాయకులకు గుర్తు చేస్తూ, ఇజ్రాయెల్ రక్షణ ఆయుధాలలో మూడింట రెండు వంతులు అమెరికా తయారు చేసిందని వాన్స్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్‌కు సమస్య ట్రంప్ కాదు. అమెరికా అధ్యక్షుడే తమ పెద్ద సమస్య అని ఇజ్రాయెల్‌లో ఎవరైనా భావిస్తే.. వారు వాస్తవ పరిస్థితులను గ్రహించాలి" అంటూ వాన్స్ వ్యాఖ్యానించారు. -
ఎప్పటికీ అగ్రస్థానంలోనే..
వాషింగ్టన్: అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత ఆనందకరమైన, అద్భుతమైన మైలురాళ్లలో ఒకటిగా అభివర్ణించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం రాజధాని వాషింగ్టన్‌లోని నేషనల్ మాల్లో ‘సెల్యూట్ అమెరికా’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న యోధులతోపాటు పలువురు ప్రముఖులను సత్కరించారు. వియత్నాం యుద్ధరంగంలో ప్రత్యేక దళాలకు నాయకత్వం వహించిన తొలి నల్లజాతి అధికారిని సన్మానించారు.తనదైన శైలిలో ప్రసంగిస్తూ జనాన్ని ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. కమ్యూనిజంపై విమర్శలు ఎక్కుపెట్టారు. మనం ఎల్లప్పుడూ అగ్రస్థానంలో ఉంటామని అమెరికన్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అమెరికాను ఎట్టిపరిస్థితుల్లోనూ పతనం కానివ్వబోమని తేల్చిచెప్పారు. తాము ఎల్లప్పుడూ అత్యుత్తమంగానే ఉంటామన్నారు. ‘సేవ్ అమెరికా చట్టాన్ని’ ఆమోదించాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు.‘‘రోజు మన దేశం మళ్లీ విజయం సాధిస్తోంది. మునుపెన్నడూ లేనంత గొప్పగా పునరాగమనం చేసింది. మనం అమెరికాను గొప్పగా తీర్చిదిద్దాలని భావిస్తున్నాం. సేవ్ అమెరికా చట్టాన్ని ఆమోదించడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధిస్తాం. దీని ప్రకారం ఓటర్లందరూ తమ ఓటరు గుర్తింపు కార్డును చూపించాలి. అలాగే పౌరసత్వానికి సంబంధించిన రుజువును తప్పనిసరిగా సమర్పించాలి’’ అని ట్రంప్ తేల్చిచెప్పారు. ఇది నాకు ‘మూడో పర్యాయం’మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికవుతానని ట్రంప్ సరదాగా వ్యాఖ్యానించారు. తన హయాంలో అమెరికా సైన్యం ఎన్నో విజయాలు సాధించిందని హర్షం వ్యక్తంచేశారు. దేశ సైనిక సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నానని వివరించారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ను ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడారు. తన ప్రస్తుత అధ్యక్ష పదవీకాలాన్ని ‘రెండో పర్యాయం’ అని కాకుండా ‘మూడో పర్యాయం’ అని పిలిచి ఉండాల్సిందని చెప్పారు. 2020 నాటి ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, అందుకే బైడెన్ గెలిచారని ట్రంప్ పదేపదే ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.వాస్తవానికి ఆ ఎన్నికల్లో విజయం తనదేనని అంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత బలమైన, శక్తివంతమైన దేశంగా అమెరికా ఎదగడం చరిత్రలో యాదృచి్ఛకంగా జరిగిన పరిణామం కాదని ట్రంప్ తేల్చిచెప్పారు. అధ్యక్షుడిగా తన మొదటి పదవీ కాలంలో సైన్యాన్ని గొప్పగా పునరి్నరి్మంచామని అన్నారు. వాస్తవానికి సైన్యాన్ని మూడో పదవీకాలంలో ఉపయోగిస్తామని చెప్పాలని వెల్లడించారు. కానీ, అలా చెప్పే ఉద్దేశం లేదన్నారు. వివాదానికి ఆస్కారం కల్పించడం తనకు ఇష్టం లేదన్నారు. స్వర్ణయుగానికి ఆరంభం మాత్రమేఎంతోమంది వీరుల త్యాగంతో అమెరికా జెండా ఎల్లప్పుడూ స్వేచ్ఛ, న్యాయాలకు చిహ్నంగా నిలుస్తోందని ట్రంప్ అన్నారు. చరిత్రకు సాక్షిగా నిలిచిన పలు అమెరికా జాతీయ జెండాలను నేషనల్ మాల్లో ప్రదర్శించారు. అమెరికా తొలినాటి జెండా కూడా ఇందులో ఉంది. 1777 నాటి జెండాను ట్రంప్ చూపించారు. అప్పట్లో 13 రాష్ట్రాలకు ప్రతీకగా 13 నక్షత్రాలు, 13 పట్టీలు ఉన్న జెండా అని చెప్పారు. యార్క్‌టౌన్ యుద్ధ సమయంలో విజయగర్వంతో రెపరెపలాడిన నక్షత్రాలు, పట్టీల జెండాను గుర్తుచేసుకున్నారు.నిరంకుశత్వంపై స్వేచ్ఛ సాధించిన విజయాన్ని, అణచివేతపై స్వాతంత్య్రం పొందిన ఆధిక్యతను 1776 జూలై 4 నుంచి 2026 జూలై 4 వరకు అమెరికన్ స్ఫూర్తి సాధించిన చిరస్థాయి విజయాన్ని నేడు గొప్ప వేడుకగా నిర్వహించుకుంటున్నామని వివరించారు. అమెరికాను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామని ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు. ‘‘ఇది అమెరికా స్వర్ణయుగానికి ఆరంభం మాత్రమే. రెండున్నర శతాబ్దాల క్రితం నాటి తరహాలోనే ఒక విషయాన్ని ప్రకటిస్తున్నాం. మా దేశం, మా పిల్లల కోసం, స్వేచ్ఛా ఆశయం కోసం మా దేశాన్ని ఎవరూ చేరుకోని సరికొత్త శిఖరాలకు చేరుస్తాం.దేశాన్ని మరింత గొప్పగా, మెరుగ్గా, శక్తివంతంగా తీర్చిదిద్దుతాం. అమెరికాను మరింతగా ప్రేమిస్తాం’’ అని ట్రంప్ స్పష్టంచేశారు. అనారోగ్యం, వైకల్యం, సైనిక విధి నిర్వహణ లేదా ప్రయాణం వంటి అనివార్య కారణాలు ఉంటే తప్ప ఇకపై పోస్ట్ ద్వారా ఓటు వేసే విధానం ఉండదని చెప్పారు. దాంతో ఎన్నికల్లో మోసాలకు అవకాశం ఉండదని అభిప్రాయపడ్డారు. ఇందులో అర్థం కాని విషయం ఏదీ లేదన్నారు.కమ్యూనిజాన్ని ట్రంప్ మళ్లీ తప్పుపట్టారు. ‘‘కమ్యూనిస్ట్ వ్యవస్థ అమెరికన్ వ్యవస్థకు పూర్తిగా భిన్నమైనది. కమ్యూనిస్ట్ వ్యవస్థ ఎప్పుడూ విజయవంతం కాలేదు. ఆ ప్రమాదకరమైన వ్యవస్థ తిరిగి అమెరికాలో తన వికృత రూపాన్ని చూపిస్తామంటే ఇక్కడ ఎవరూ ఒప్పుకోరు. అమెరికా ఎప్పటికీ కమ్యూనిస్ట్ దేశం కాదు’’ అని ట్రంప్ పునరుద్ఘాటించారు. -
ట్రంప్ వార్నింగ్.. ఒకే చోట ఇరాన్ అగ్రనేతలు.. ఒక్క దెబ్బతో అంతం చేయగలం
-
ట్రంప్‌నకు ఝలక్.. మాజీ అధ్యక్షుల సందేశంపై కొత్త చర్చ!
వాష్టింగన్: అమెరికా స్వాతంత్ర్యానికి 250 సంవత్సరాలు పూర్తైన సందర్భంలో విడుదలైన ఒక రాజకీయ సందేశం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, బరాక్ ఒబామా, అలాగే డెమోక్రటిక్ నేత, న్యూయార్క్ సిటీ మేయర్ జోహ్రాన్ మమ్దానీ ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ పరిపాలన విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా వలస విధానాలు మరియు ఇరాన్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతలపై వారంతా ఆందోళన వ్యక్తం చేశారు.ఈ సందేశం సాధారణంగా దేశభక్తి, ఐక్యతను ప్రతిబింబించే 250వ వార్షికోత్సవ వేడుకల సందర్భంలో వెలువడటంతో, దీనికి మరింత రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. జాతీయ స్థాయిలో వేడుకల వాతావరణం కొనసాగుతుండగా, ఈ వ్యాఖ్యలు అమెరికా రాజకీయాల్లో ఉన్న విభేదాలను మరోసారి వెలుగులోకి తెచ్చాయి.వలస విధానాలపై తీవ్ర విమర్శలుమాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్ మరియు ఒబామా తమ సందేశంలో అమెరికా వలస విధానాలు గతంతో పోలిస్తే మరింత కఠినతరంగా మారాయని పేర్కొన్నారు. వారి అభిప్రాయం ప్రకారం, అమెరికా స్థాపించిన విలువలలో ఒకటైన అవకాశాల సమానత్వం ప్రస్తుతం ప్రమాదంలో పడుతోందని వారు హెచ్చరించారు. వలసదారులపై తీసుకుంటున్న కఠిన చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు సామాజిక వైవిధ్యాన్ని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు. అమెరికా చరిత్రలో వలసదారుల పాత్ర కీలకమని, ఆ సంప్రదాయాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని సూచించారు.ఇరాన్ ఉద్రిక్తతలపై ఆందోళనవిదేశాంగ విధానాల అంశంలో ఇరాన్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రమాదకర స్థాయికి చేరుతున్నాయని మాజీ అధ్యక్షులు హెచ్చరించారు. దౌత్యపరమైన చర్చలకు బదులు సైనిక ధోరణి పెరుగుతుందన్న సంకేతాలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. అమెరికా.. ప్రపంచ శాంతి మరియు స్థిరత్వంలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని, ఆ లక్ష్యానికి దౌత్య మార్గాలే ప్రధానంగా ఉండాలని వారు సూచించారు.మమ్దానీ ఫైర్.. మరోవైపు.. న్యూయార్క్ సిటీ మేయర్ జోహ్రాన్ మమ్దానీ కూడా ఈ సందేశంలో పాల్గొని, ప్రస్తుత విధానాలు సామాన్య ప్రజల అవసరాలను పక్కన పెడుతున్నాయని వ్యాఖ్యానించారు. ఆరోగ్యం, వలసలు, ఆర్థిక అసమానతలు వంటి అంశాల్లో ప్రభుత్వం మరింత మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే, అమెరికా 250వ స్వాతంత్ర్య వార్షికోత్సవం సాధారణంగా జాతీయ ఐక్యత, గర్వానికి ప్రతీకగా నిలుస్తుంది. అయితే ఈసారి విడుదలైన ఈ రాజకీయ సందేశం, వేడుకల వాతావరణాన్ని కొంతవరకు రాజకీయ చర్చల వైపు మళ్లించింది. ఒకవైపు దేశ చరిత్రను స్మరించుకుంటూ వేడుకలు జరుగుతుండగా, మరోవైపు విధానాలపై విమర్శలు అమెరికా రాజకీయ వ్యవస్థలో ఉన్న విభేదాలను ప్రతిబింబిస్తున్నాయి.


