"ఆ మూడు పనుల వల్లే అమెరికా-భారత్ దూరం" | Trump Gratuitous Alienation Of India His Biggest Mistake | Sakshi
Sakshi News home page

"ఆ మూడు పనుల వల్లే అమెరికా-భారత్ దూరం"

Mar 7 2026 12:15 PM | Updated on Mar 7 2026 12:56 PM

 Trump Gratuitous Alienation Of India His Biggest Mistake

డొనాల్ట్ ట్రంప్ ఇంతకాలం పాటు తన విధానాలు చేష్టలతో భారత్‌ను ఇబ్బంది పెట్టే యత్నం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికాతో సత్సంబంధాలు ఉన్నప్పటికీ.. ట్రంప్ తన మాటలతో భారత్‌ను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. అయితే ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్‌ తాజాగా ఈ అంశంపై మాట్లాడారు. ట్రంప్ అనాలోచితంగా చేసిన మూడు పనులు అమెరికాకు భారత్‌ను దూరం చేశాయన్నారు.

ట్రంప్ విదేశాంగ విధానానికి తల ఊపే వ్యక్తిని కాదని ఆయన అన్నారు. ఆయన చేసిన పనుల వల్ల అమెరికాకు భారత్‌ దూరం అయ్యిందన్నారు.  "మెుదటగా ఆయన పన్నుల విధానం  భారత్‌తో దూరం పెంచింది. అనంతరం పాకిస్థాన్‌, భారత్‌ మధ్య జరిగిన యుద్ధం తన జోక్యంతోనే ముగిసిందని అనడం. ‌ తదనంతరం పాక్‌ సైన్యాధిపతి ఆసిమ్‌ మునీర్‌కు వైట్‌ హౌస్‌లో అతిథ్యం ఇవ్వడం" భారత్‌ను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయన్నారు.

పాకిస్థాన్‌ తరచుగా ఉగ్రవాదాన్నిప్రోత్సహిస్తుందనే  భారత్‌తో ఎన్నో ఏళ్లుగా అనేక వేదికలపై తెలుపుతుందని అయినప్పటికీ ట్రంప్ ఇలా చేయడం భారత్‌ను ఇబ్బందులకు గురిచేసిందన్నారు. అయితే ప్రస్తుతం పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో స్పష్టత లేదన్నారు. ఇరాన్‌లో ప్రభుత్వం మారుతుందో లేదో ఖచ్చితంగా చెప్పలేమని తెలిపారు.

కాగా ఇప్పటికే ఇరాన్ దాడుల తీవ్రత గణనీయంగా తగ్గిందని అదే సమయంలో ఇజ్రాయెల్ మరియు అమెరికా దాడుల తీవ్రత పెరిగిందన్నారు.  అయితే అమెరికా, ఇజ్రాయెల్‌లు పాలక వ్యవస్థల పైనే దాడి జరుపుతున్నాయని ఇరాన్ ఆర్థిక, సామాజిక మౌలిక వసతులకు హాని కలగకుండా  ఆ రెండు దేశాలు జాగ్రత్త పడుతున్నాయని ఆస్ట్రేలియా మాజీ ప్రధాని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement