యుద్ధం వేళ.. మరో ఇరాన్‌ నౌకకు భారత్‌ ఆశ్రయం | India gave safe harbour to another Iran ship IRIS Lavan | Sakshi
Sakshi News home page

యుద్ధం వేళ.. మరో ఇరాన్‌ నౌకకు భారత్‌ ఆశ్రయం

Mar 7 2026 7:41 AM | Updated on Mar 7 2026 8:47 AM

India gave safe harbour to another Iran ship IRIS Lavan

న్యూఢిల్లీ: ఇరాన్‌ నావికా దళానికి చెందిన ఒక యుద్ధ నౌకకు భారత్‌ అత్యవసర ఆశ్రయం కల్పించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఐఆర్‌ఐఎస్‌ లవాన్‌ నౌకలో(IRIS Lavan) సాంకేతిక సమస్య ఏర్పడటంతో మార్చి 4న దాన్ని కోచి నౌకాశ్రయంలోకి అనుమతించినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఈ నౌకలో 183 మంది సిబ్బంది ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.  

అయితే, ఇటీవల విశాఖ వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్​కు ఇరాన్‌కు చెందిన నౌక ఐరిస్ లవన్ వచ్చింది. అయితే తిరుగు ప్రయాణంలో నౌకలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో కొచ్చిలో దీన్ని నిలిపేందుకు అనుమతి ఇవ్వాలని ఇరాన్​ ఫిబ్రవరి 28న భారత ప్రభుత్వాన్ని కోరినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అందుకు మార్చి 1నే అనుమతి లభించిందని అధికారులు తెలిపారు. దీంతో ఐరిస్ లావన్ మార్చి 4న కొచ్చి ఓడరేవుకు చేరింది.

మరోవైపు, ఇటీవల విశాఖపట్నంలో భారత నౌకాదళంతో సంయుక్త విన్యాసాల్లో పాల్గొని తిరుగుముఖం పట్టిన ఇరాన్‌ యుద్ధ నౌక ఓఆర్‌ఐఎస్‌ దేనాను బుధవారం శ్రీలంక సముద్ర జలాల సమీపంలో అమెరికా దాడి చేసి ముంచేయడం తెలిసిందే. దాంతో అందులోని 87 మంది నావికులు దుర్మరణం పాలయ్యారు. అందుకు ప్రతీకారంగా మర్నాడే పర్షియన్‌ గల్ఫ్‌లో అమెరికా చమురు నౌకపై ఇరాన్‌ దాడికి దిగింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement