పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం భారత్‌పై పడింది. దీంతో వంటగ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. డొమెస్టిక్ సిలిండర్‌పై రూ.60 పెంపు జరగగా వాణిజ్య సిలిండర్‌పై రూ. 115 పెరిగింది. ఈ ధరలు తక్షణమే అమలులోకి వస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే కేంద్ర ప్రభుత్వ పథకం ఉజ్వల ద్వారా అందించే సిలిండర్ ధరలు మాత్రం యథాతథంగా ఉండనున్నట్లు తెలిపింది.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. దీంతో చమురు రవాణా చేసే నౌకలు నిలిచిపోయాయి. ఈ ప్రభావంతో చమురు ధరలు పెరిగాయి. ఈ ధరలతో హైదరాబాద్‌లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 965కు చేరుకుంది.
ఢిల్లీలో డొమెస్టిక్ ధర ప్రస్తుతం రూ. 913 ఉండగా, ముంబైలో రూ. 852 చెన్నైలో రూ.928 కి చేరుకుంది. అయితే యుద్ధప్రభావంతో భవిష్యత్తులో కొరత ఏర్పడకుండా ఉండేందుకు చమురు ఉత్పత్తులను భారీగా పెంచాలని కేంద్రం ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే భారత్ వద్ద తాత్కాలికంగా చమురు నిల్వలు ఉన్నాయని పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇది వరకే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.



