యువతితో అసభ్య వీడియోలు తీసిన దర్శకుడు | hyderabad director blackmails aspiring actress after filming obscene scenes in car | Sakshi
Sakshi News home page

యువతితో అసభ్య వీడియోలు తీసిన దర్శకుడు

Mar 7 2026 7:33 AM | Updated on Mar 7 2026 11:57 AM

hyderabad director blackmails aspiring actress after filming obscene scenes in car

హైదరాబాద్‌: వెండితెరపై వెలిగిపోవాలని నగరానికి వచ్చిన ఆ యువతిని ఓ దర్శకుడు ట్రాప్‌ చేసి సినిమా షూటింగ్‌ పేరుతో ఆమెను కారులో కూర్చుండబెట్టుకొని అసభ్యకరమైన సీన్లు తీసి సోషల్‌ మీడియాలో పోస్టే చేసి బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్న ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... శ్రీకృష్ణానగర్‌లో నివసిస్తున్న శంకర్‌(25) రీల్స్‌తో పాటు వెబ్‌సిరీస్‌లకు దర్శకత్వం వహిస్తుంటాడు. 

కాకినాడకు చెందిన యువతి(23) సినిమాల్లో వేషాల కోసం హైదరాబాద్‌కు వచ్చి యూసుఫ్‌గూడలోని తన స్నేహితురాలి వద్ద ఉంటున్నది. ఇటీవల ఓ వెబ్‌ సిరీస్‌లో వేషం ఉందంటూ శంకర్‌ ఆ యువతిని పిలిపించుకున్నాడు. కారులో కూర్చుండబెట్టుకొని కెమెరాతో షూట్‌ చేయసాగాడు. అసభ్యకరమైన డైలాగ్‌తో పాటు ఆమె చేత అసభ్య చేష్టలతో షూటింగ్‌ నిర్వహించి దాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. దీంతో యువతి తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసింది. 

ఇలాంటి వేషాలు వేస్తున్నావేంటంటూ ఆమెను ప్రశ్నించారు. ఆ వీడియో తొలగించాలని శంకర్‌కు చెప్పగా నిర్లక్ష్యం చేశాడు. మిగతా సోషల్‌ మీడియా ఖాతాల్లో కూడా ఆమె చేత పలికించిన డైలాగ్‌లు సన్నివేశాలను పోస్ట్‌ చేయడమే కాకుండా బ్లాక్‌ మెయిల్‌ చేయసాగాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్‌ పోలీసులు యువ దర్శకుడు శంకర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement