breaking news
Movies
-
తెలుగు ప్రేక్షకుల ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను.. ఎమోషనల్ అయిన సూర్య
‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఎమోషనల్ అయ్యారు. గత 28 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ప్రేమ, ఆదరణే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని అన్నారు. శివకుమార్ కుమారులైన తమను తెలుగు ప్రజలు దత్త పుత్రుల్లా గుండెల్లో పెట్టుకున్నారని తెలిపారు. విశ్వనాథ్ అండ్ సన్స్’లో హ్యూమన్ ఎమోషన్స్ అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమాకు మొదట్నుంచి త్రివిక్రమ్‌గారి సపోర్ట్ ఉంది. ఈ సినిమా నాకు మంచి జ్ఞాపకాలను ఇచ్చిందన్నారు.‘గజినీ’లో సంజయ్ రామస్వామి పాత్రను ఎలా ఆదరించారో.. అదే వింటేజ్ మ్యాజిక్‌ను మళ్లీ తీసుకురావాలనే ఉద్దేశంతో దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ ఈ కథను రూపొందించారని సూర్య చెప్పారు. హైదరాబాద్‌లో ఆరు నెలల షూటింగ్ అనుభవం తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. వెంకీ అట్లూరి రైటింగ్, సిన్సియారిటీని ప్రశంసిస్తూ.. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని ఉందని తెలిపారు.‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’కు అందించిన ప్రేమనే ఆగస్టు 14న విడుదల కానున్న ‘విశ్వనాథ్ & సన్స్’కు కూడా అందించాలని తెలుగు ప్రేక్షకులను కోరారు.‘‘రాధికగారు ఈ సినిమాలో ఒక మ్యాజిక్. ఇక లైఫ్‌లో మీకు డబ్బు, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా మిమ్మల్ని మీరు నమ్మితే... మమితలా ఇంత మంచి పొజిషన్లో ఉంటారు. జూనియర్ ఆర్టిస్టు కుమార్తె నుంచి ఇప్పుడు ఆమె ఈ వేదికపై ఉన్నారు. మిమ్మల్ని మీరు నమ్మండి. వెంకీ ఈ సినిమాలో మూడు అందమైన మహిళా క్యారెక్టర్స్ రాశారు. వెంకీతో నేను ఓ బయోపిక్ చేయాల్సింది. కానీ ఈ సినిమా చేశాం. ఈ సినిమాలోని ప్రతిక్షణాన్ని ఆస్వాదించాను. ఈ చిత్రం మా అందరికీ స్పెషల్’’ అని సూర్య అన్నారు.వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకుల ముఖంపై ఒక చిరునవ్వు ఉంటుంది. సూర్య నటించిన చాలా సినిమాలు ఫ్రై డే రోజునే నేను చూశాను. కానీ నేను ఆయన్ను డైరెక్ట్ చేసిన సినిమా ఈ ఫ్రై డే రిలీజ్ కానుంది. చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాతో ప్రేక్షకులను 90 శాతం ఎంటర్టైన్ చేస్తానని చెప్పగలను’’ అని అన్నారు. ‘‘చాలా రోజుల తర్వాత స్టేజ్‌పై ధైర్యంగా చెబుతున్నా... ఈ సినిమా చాలా బాగుంది. ఇందులో మదర్ అండ్ సన్స్ రిలేషన్ అద్భతంగా ఉంటుంది. అమ్మను ప్రేమించే ప్రతి ఒక్కరికీ ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది’’ అన్నారు నాగవంశీ. ‘‘కొత్త పాయింట్‌తో వెంకీ అట్లూరి మంచి కథ రాశారు. ఈ సినిమాలో మూడు పాటలు రాశాను’’ అన్నారు రామజోగయ్య శాస్త్రి. ఈ వేడుకలో పాల్గొన్న నిర్మాతలు వై. రవిశంకర్, కేఎల్ నారాయణ, జూబ్లీహిల్స్ ఎమ్ఎల్ఏ నవీన్ యాదవ్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ హిట్ కావాలని ఆకాంక్షించారు. సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. మమితా బైజు, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. -
‘కొరియన్ కనకరాజు’పై చిరంజీవి ప్రశంసలు.. సత్య కోసం మరోసారి
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రబృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.‘‘కొరియన్ కనకరాజు’ని ఇండియా నుంచి కొరియాకి వెళ్లిన తర్వాత చూస్తుంటే ఒక కొరియన్ మూవీ చూసినట్టు ఉంటుంది. ఇందుకు చాలా ఖర్చు అయి ఉంటుందనుకున్నాను. కానీ లిమిటెడ్ బడ్జెట్‌తోనే తెరకెక్కించారు మేర్లపాక గాంధీ. విజువల్స్ మీద, ఎడిటింగ్ సెన్స్ ఉండాలి డైరెక్టర్‌కి. కొరియా వెళ్లినా అంత ఖర్చు కాలేదంటే అది గాంధీ ప్లానింగ్... తన భయం, భక్తి. నిర్మాతలు బతకాలి... మనతో పాటు నిర్మాతలూ నాలుగు డబ్బులు సంపాదించుకోవాలనుకోవాలి. అంతేకానీ నిర్మాతలను నలిపేసి సినిమా తీయకూడదు. తక్కువ రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేయగలగాలి. ప్రతి ఒక్కరూ ఇది అమలు చేయాలి. ఇక 2026 సెకండ్ హాఫ్ ‘పెద్ది’ సినిమా హిట్‌తో మొదలైంది. ఆ తర్వాత ‘మా ఇంటి బంగారం, చెన్నై లవ్ స్టోరీ’, ఇప్పుడు ‘కొరియన్ కనకరాజు’... ఇలా వరుసగా సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ‘‘ఒక సినిమా విజయం సాధిస్తే ఎంతోమందిలో ఆనందాన్ని నింపుతుంది. అది మరోసారి ‘కొరియన్ కనకరాజు’తో పునరావృతమైంది’’ అని చెప్పారు. ముఖ్యంగా నటుడు సత్య కామెడీ తనను ఎంతగానో ఆకట్టుకుందని చిరంజీవి తెలిపారు. ఈ సినిమాకి “మేర్లపాక గాంధీ ఇంజనీర్ అయితే.. వరుణ్ ఐరన్ పిల్లర్, సత్య కాంక్రీట్ లాంటివాడని ఆయన ప్రశంసించారు. ఈ చిత్రంలో సత్య నటన నాకు చాలా నచ్చింది. అతని కోసం ఈ సినిమాను మరోసారి చూడాలనిపిస్తుందన్నారు.అలాగే హీరోయిన్ రితిక గ్లామర్, ఎనర్జీ, మురళీధర్ గౌడ్ సహజ నటనను ప్రశంసించారు. మంచి కంటెంట్, కొత్తదనం, హెల్దీ ఎంటర్టైన్మెంట్ ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు తప్పకుండా వస్తారని చిరంజీవి పేర్కొన్నారు. ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ పట్ల వరుణ్ తేజ్, తమన్, మేర్లపాక గాంధీ, రితిక తదితరులు ఆనందం వ్యక్తం చేశారు. -
'సంజయ్ రామస్వామిని మళ్లీ చూస్తారు': నాగవంశీ
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా వస్తోన్న టాలీవుడ్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్గా కనిపించనుంది. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మేకర్స్. తాజాగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్‌కు సూర్యతో నిర్మాత నాగవంశీ కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడారు. సూర్య గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ మూవీతో సూర్యలో మరోసారి సంజయ్ రామస్వామిని గుర్తుకు తెస్తామని ప్రకటించారు. ఈ సినిమా అద్భుతంగా వచ్చిందని అన్నారు. మదర్ సెంటిమెంట్ ఈ మూవీలో మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ సినిమా చూశాక మీ మదర్‌ను పదిరెట్లు ఎక్కువగా ప్రేమిస్తారని అన్నారు. రాధిక క్యారెక్టర్ చూస్తే అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో చూస్తారని అన్నారు. ఈ సినిమా త్రివిక్రమ్‌కు కూడా నచ్చిందని వెల్లడించారు. ఆయన మెచ్చుకున్న ఏ సినిమా నాది ఫెయిల్ అవ్వలేదని పేర్కొన్నారు. -
చిరంజీవిని చూసి పొట్టిమామ ఎమోషనల్.. వీడియో వైరల్..!
వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు ఈవెంట్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఈ ఈవెంట్‌కు హాజరైన చిరంజీవికి ఊహించని పరిణామం ఎదురైంది. ఈ చిత్రంలో పొట్టి మామగా మెప్పించిన నటుడు మెగాస్టార్ కాళ్లపై పడబోయారు. ఇది గమనించిన చిరు అతన్ని వెంటనే దగ్గరికి తీసుకుని ఓదార్చారు. అతనితో ఫోటో దిగి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన హారర్ కామెడీ మూవీ కొరియన్ కనకరాజు. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా వసూళ్లు రాబడుతోంది. ఈ నేపథ్యంలోనే మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించారు. చాలా రోజుల తర్వాత వరుణ్ తేజ్‌కు హిట్ పడడంతో మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.A Fan Emotional moment ❤️@KChiruTweets #KoreanKanakaraju pic.twitter.com/tP2BZUHdRb— ⛩️GHANI BHAI 🗡️🐉 (@Ghanibhaipspk) August 11, 2026 Tears of pure joy! 🥺 Seeing Megastar @KChiruTweets live on stage became an emotional moment for one of the Korean Kanakaraju artists .... pic.twitter.com/nCSq5ypX0S— Let's X OTT GLOBAL (@LetsXOtt) August 11, 2026 -
'ఈ వయసులో సిగ్గుచేటు'.. ఉదయనిధికి త్రిష స్ట్రాంగ్ కౌంటర్
ప్రస్తుతం కోలీవుడ్‌లో త్రిష పేరే ఎక్కువగా వినిపిస్తోంది. విజయ్ సీఎం అయ్యాక ఆమె పేరు మార్మోగిపోయింది. ఇటీవల మరోసారి త్రిష పేరు తెరమీదకొచ్చింది. ఉదయనిధి స్టాలిన్.. త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదైంది. ఈ కేసులో ఉదయనిధిని అరెస్ట్ చేయగా ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.ఈ వివాద జరిగిన దాదాపు వారం రోజులవుతోంది. తాజాగా ఈ కాంట్రవర్సీపై హీరోయిన్ త్రిష తనదైన శైలిలో కౌంటరిచ్చింది. నేరుగా ఉదయనిధి పేరు ప్రస్తావించకుండానే గట్టిగానే ఇచ్చిపడేసింది. ఈ మేరకు తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. 'ఈ వయసులో డ్రామా చేయడం సిగ్గుచేటు. వెళ్లి కొంత డబ్బు సంపాదించు, మనశ్శాంతిని పొందు' అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేసింది. అయితే మరోవైపు ఈ పోస్ట్ విజయ్ భార్య సంగీతను ఉద్దేశించి పెట్టారని కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవలే సంగీత విడాకుల కేసు వెనక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలోనే త్రిష ఆమెను ఉద్దేశించి పోస్ట్ చేశారని మరికొందరు భావిస్తున్నారు. ఏదేమైనా ఓకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు.. అటు ఉదయనిధికి.. ఇటు సంగీతకు కౌంటరిచ్చేసిందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. అసలేం జరిగిందంటే..నటి త్రిషను ఉద్దేశించి ఉదయనిధి స్టాలిన్ "డబుల్ మీనింగ్" వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో అరెస్ట్ చేసి ఆయనను విచారించిన తర్వాత పోలీసులు విడుదల చేశారు. తంజావూరుకు తీసుకెళ్లి గంటకుపైగా పోలీసులు విచారించారు. అంతకుముందు మద్రాస్ హైకోర్టు.. దర్యాప్తునకు అవసరమైనప్పుడు ఉదయనిధి స్టాలిన్ పూర్తిగా సహకరించాలని ఆదేశించింది. విచారణ పూర్తైన వెంటనే ఆయనను విడుదల చేయాలని పోలీసులకు సూచించింది. -
మెగాస్టార్- బాబీ కాంబో.. టైటిల్ లీక్ చేసిన చిరు
చిరంజీవి- బాబీ కాంబోలో మరో చిత్రం రానుంది. వాల్తేరు వీరయ్య మూవీ తర్వాత మరో ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నారు. ఈ మూవీని మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మిస్తుండగా..గతంలో ఈ సినిమాకు కాకాజీ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపించిన సంగతి తెలిసిందే.అయితే చిరు తన సినిమాలకు సంబంధించి అప్పుడప్పుడు అభిమానులకు అప్డేట్స్ ఇస్తుంటారు. చిరు లీక్స్ పేరుతో ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్లు ఇవ్వడం ఆయనకు సరదా. తాజాగా మెగా158 మూవీ టైటిల్ కూడా అలాగే లీక్ చేశారు. కొరియన్ కనకరాజు ఈవెంట్‌కు హాజరైన మెగాస్టార్.. యాంకర్ ప్రశ్నకు అప్డేట్ ఇవ్వబోయాడు. అదే ఫ్లోలో తమన్‌ను అడుగుతూ.. సేమ్ టైటిల్ కదిరిలాగా అంటూ సగంలోనే ఆపేశారు. దీంతో ఈ మూవీకి టైటిల్ కదిరి నరసింహుడు అనే టైటిల్ పెట్టనున్నారని తెలుస్తోంది. చిరంజీవి మరోసారి చిరు లీక్స్ పేరుతో తన సినిమా టైటిల్ బయటపెట్టేశారు. -
‘పిల్ల పిల్ల పిల్ల’ సాంగ్ బాగుంది: నిర్మాత సురేష్ బాబు
రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మిస్సింగ్ మేఘన’. ఫస్ట్ కాపి మూవీస్, కేడి&కో బ్యానర్ పై పంచుమర్తి నరేష్ బాబు ప్రొడ్యూసర్ గా, వాచస్పతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ రివీలింగ్ పోస్టర్ లాంచ్ సెన్సేషనల్ డైరెక్టర్ వి. వి. వినాయక్ చేతుల మీదుగా జరగగా ఇప్పుడు ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘పిల్ల పిల్ల పిల్ల’ని నిర్మాత సురేష్ బాబు చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ.. ఫస్ట్ సింగిల్ పిల్ల పిల్ల పిల్ల సాంగ్ చాలా బాగుంది. మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానంటూ చిత్రబృందానికి ఆల్ ద బెస్ట్ చెప్పారు.దర్శకుడు వాచస్పతి మాట్లాడుతూ..ఇండియన్ ఫిలిం ఫీల్డ్ లో సురేష్ ప్రొడక్షన్స్ కి ఉన్న పేరు మనందరికీ తెలుసు. సురేష్ బాబుచేతుల మీదుగా మా ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ నరేష్ గారికి, కో ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారికి మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్న బెక్కం వేణుగోపాల్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమాలో అద్భుతమైన పాటలు అందించిన ఆర్. ఆర్. ధృవన్ కి, అలాగే ఈ పాట పాడిన మనందరి ఫేవరెట్ సింగర్ జావేద్ అలీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.నిర్మాత నరేష్ మాట్లాడుతూ..‘మా సినిమా ప్రారంభోత్సవం రామానాయుడు స్టూడియోలో జరిగింది. రామానాయుడు స్టూడియో అధినేత గోల్డెన్ హ్యాండ్ సురేష్ బాబు చేతుల మీదుగా ఫస్ట్ సింగిల్ లాంచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ ధృవన్ తో మాకు ఇది రెండో సినిమా. తంత్ర మ్యూజికల్ గా ఎంత సక్సెస్ అయిందో ఈ సినిమా కూడా అంతే సక్సెస్ అవుతుంది. ధృవన్ గారే రాసి మ్యూజిక్ అందించి, జావేద్ అలీ గారితో పాడించిన ఈ పాట మంచి సక్సెస్ అవుతుంది. అదే విధంగా ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించి మంచి సక్సెస్ అందిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం’ అన్నారు. -
జునియర్ ఎన్టీఆర్ భుజానికి సర్జరీ.. ఎక్కడంటే?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌కు ఇటీవల గాయపడ్డారు. జూలై 27న సాయంత్రం జూ ఎన్టీఆర్ భుజానికి గాయమైనట్లు ఎన్టీఆర్ కార్యాలయం వెల్లడించింది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేసింది. ఎన్టీఆర్ పూర్తిగా కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు స్పష్టం చేసిందితాజాగా ఎన్టీఆర్ గాయానికి సర్జరీ జరగనుందని ఎన్టీఆర్ కార్యాలయం వెల్లడించింది. హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో ఈ శస్త్రచికిత్స జరనుందని తెలిపింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఇక సినిమాల విషయానికొస్తే ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. తొలిసారి వస్తోన్న ఆ కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
యశ్ టాక్సిక్.. రన్ టైమ్ అంతేనా?
కన్నడ స్టార్ యశ్ హీరోగా వస్తోన్న యాక్షన్ అండ్ గ్యాంగ్‌స్టర్ మూవీ టాక్సిక్. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్‌కు సిద్ధమైంది. ఈనెల 26న థియేటర్లలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా.. మరింత బోల్డ్ అండ్ వయొలెంట్‌గా చూపించారు. ఈ మూవీ కేవలం పెద్దలకు మాత్రమేనని ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో చర్చ మొదలైంది. భారీ బడ్జెట్ మూవీ కావడంతో రన్‌టైమ్ గురించి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ మూవీ రన్‌టైమ్ దాదాపు 3 గంటల 11 నిమిషాలని ప్రచారం జరుగుతోంది. ఈ రన్‌టైమ్ చూస్తుంటే కాస్తా తక్కువగానే ఉన్నట్లుగానే అనిపిస్తోంది. ఎందుకంటే ఈ మూవీలో అధికంగా వయొలెన్స్, యాక్షన్ సన్నివేశాలు ట్రైలర్లో కనిపించాయి. అందువల్లే గీతూ మోహన్ దాస్ ఇదే నిడివితో సెన్సార్‌కు పంపినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ సినిమాను ప్రైమ్ బిగ్ స్క్రీన్ ఫార్మాట్ ఐమాక్స్‌లో కూడా విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ ఫార్మాట్లో రిలీజవుతోన్న రెండో కన్నడ సినిమా ఇదే కావడం విశేషం. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ స్థాయిలో నిర్మించారు. ఈ చిత్రంలో నయనతార, కియారా అడ్వాణీ, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి, తారా సుతారియా హీరోయిన్లుగా నటించారు. -
‘ఎన్టీఆర్ చికెన్’ కామెంట్స్‌పై ఎంఎస్ రాజు క్లారిటీ
‘అగధ’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో స్వర్గీయ నందమూరి తారక రామారావుపై ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎం. ఎస్ రాజు చేసిన ‘చికెన్’ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. పలువురు నెటిజన్స్ ఎం.ఎస్ రాజుని విమర్శిస్తూ కామెంట్స్ చేశారు. తాజాగా ఈ ‘చికెన్’ వ్యాఖ్యలపై ఎం.ఎస్ రాజు వివరణ ఇచ్చాడు. ఎన్టీఆర్‌పై అంతులేని అభిమానంతోనే ఆ మాటలు అన్నానని.. అంతకు మించి తనకు ఎలాంటి దురుద్దేశం లేదని ఆయన చెప్పాడు.ప్రీరిలీజ్ ఈవెంట్ ఎం.ఎస్ రాజు ఏమన్నారంటే.. ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘అగధ’ ప్రీరిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎం.ఎస్ రాజు మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం తాను ఎంతో కష్టపడ్డాడని చెప్పాడు. తను పడిన కష్టం గురించి చెబుతూ..‘ఏడాదిన్నర పాటు ఎన్టీ రామారావు గారిలాగే నేను కూడా ఉదయం 3 గంటలకే నిద్ర లేచాను. ఆయనలాగా చికెన్ తినలేదు కానీ.. నేనే పాలు కాచుకొని తాగుదాం అనుకుంటే నా భార్యలేచి కాఫీ పెట్టి ఇచ్చేది. అక్కడ నుంచి మొదలెడితే అర్థరాత్రి వరకు సినిమా గురించే ఏదో ఒక పని చేసేవాడిని’అని చెప్పాడు. అయితే ఎన్టీఆర్‌లాగా చికెన్ తినలేదని వ్యంగ్యంగా అనడాన్ని కొంతమంది నెటిజన్స్ తప్పుపట్టారు. ఎం.ఎస్ రాజుని ట్రోల్ చేస్తూ పెద్ద ఎత్తున పోస్టులు చేశారు.అభిమానంతోనే అలా.. తాజాగా ఈ వ్యాఖ్యలపై ఎం.ఎస్ రాజు వివరణ ఇచ్చాడు. రామారావుగారిపై ఉన్న అభిమానంతోనే అలా అన్నానని చెప్పాడు. ‘నేను ఇంత వరకు ఏ సినిమాకి కూడా బ్రహ్మ ముహుర్తంలో లేచి పని చేయలేదు. కానీ ‘అగధ’ కోసం ఎన్టీ రామారావు గారిలా ఉదయం మూడు గంటలకే నిద్ర లేచేవాడ్ని. ఆయన్ను స్పూర్తిగా తీసుకుని పని చేశాను అని చెప్పే క్రమంలో అందరికీ తెలిసిన విషయాన్ని నేను సరదాగా చెప్పాను. ఆయన ఉదయాన్నే చికెన్ తింటారు అన్నది అందరికీ తెలిసిందే. పొద్దున లేవగానే వ్యాయామం చేసేవాడు. ఆ తర్వాత స్నానం చేసుకొని పూజ చేసి.. తినడానికి వెళ్లేవాడు. పక్కనే మేము ఉంటే కూడా తినడానికి తీసుకెళ్లేవాడు. మాకు కూడా గారెలు, చికెన్ తెప్పించే వాళ్ళు. ఆయన ఒక మంచి కోడిని ఎదురుగా పెట్టుకొని తినేవాళ్లు. నేను జరిగిందే చెప్తున్నాను. ఆయన మాట్లాడిన ప్రతి మాట వైరల్ అయ్యేది అప్పట్లో సోషల్ మీడియా ఉంటే. ఆయన గొప్ప వ్యక్తి. ఆయనలా ఉండాలి అని అనుకున్నాను. ఆయనలా ఉదయాన్నే లేచి పూజ చేసుకొని సినిమా చేశాను చికెన్ ఒక్కటే తినలేదు కాబట్టి ఆ మాట చెప్పాను అంతే. రామారావు గారి మీదున్న అంతులేని అభిమానంతోనే ఆ మాటలు నేను సరదాగా అన్నాను. మా నాన్న గారు, రామారావు గారికి మంచి అనుబంధం ఉంది. మా నాన్న గారికి రామారావు గారితో సినిమా చేసే ఛాన్స్ వచ్చినా చివరి నిమిషంలో ఎన్నికల వల్ల మిస్ అయింది. ఆయన నిబద్దత, క్రమశిక్షణను దగ్గర్నుండి చూశాను. ఎన్టీఆర్ గారి ఆత్మ మాత్రం నన్ను ట్రోల్ చేయదు. మిగతా ఎవరు ట్రోల్ చేసినా నాకు పర్లేదు’ అని ఎం.ఎస్ రాజు అన్నారు. ‘అగధ’ విషయానికొస్తే.. శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు నిర్మించిన ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భాను చందర్ కీలక పాత్రలు పోషించారు. ఆగస్ట్ 14న ఈ చిత్రం విడుదల కానుంది. -
కొత్త భార్యపై ప్రేమ.. మాజీ భార్యను గుర్తుచేస్తున్న నెటిజన్లు
బాలీవుడ్ నటి ఊర్మిళ మటోండ్కర్ మాజీ భర్త మోహ్సిన్ అక్తర్ మీర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ ఏడాది జూన్‌లో నిధా భట్‌ను వివాహం చేసుకున్న ఆయన.. తాజాగా తన రిసెప్షన్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా తన భార్యపై ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తూ ఓ నోట్ రాశారు. అది ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.‘నువ్వు కేవలం నా భార్యగా మాత్రమే కాదు.. నా ఇల్లు, ప్రశాంతత, ప్రతిరోజూ నాకు ఇష్టమైన వ్యక్తిగా మారావు. నిన్ను నా జీవితంలోకి తీసుకొచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు. ప్రతి దశలో నిన్ను ప్రేమిస్తూ, నీకు అండగా ఉంటానని మాటిస్తున్నాను. మనం కలిసి నిర్మించబోయే అందమైన భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్నా’ అంటూ రాసుకొచ్చారు.ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ‘అందమైన జంట.. మీ ఇద్దరూ ప్రేమతో, ఆనందంగా ఉండాలి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం మోహ్సిన్ను ట్రోల్ చేస్తున్నారు. గతంలో ఊర్మిళతో ఉన్న సమయంలోనూ ఇలాంటి హామీలే ఇచ్చి ఉంటారని కామెంట్లు చేస్తున్నారు. అసలు ఊర్మిళ, మోహ్సిన్ మధ్య ఏం జరిగిందని కొందరు ప్రశ్నిస్తున్నారు.గతంలోనూ వైరల్..మోహ్సిన్ తన రెండో పెళ్లి సమయంలోనూ సోషల్‌మీడియాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. ‘స్వచ్ఛమైన ఉద్దేశాలు, నిజమైన ప్రేమతో పాటు దేవుడి నిర్ణయాన్ని విశ్వసించాలి. సరైన సమయంలో నిధాను నా జీవితంలోకి తీసుకొచ్చారు. ఆమె నా జీవితంలో వెలుగులు నింపింది’ అని రాసుకొచ్చారు.2016లో ఊర్మిళతో వివాహం..ఊర్మిళ మటోండ్కర్, మోహ్సిన్ అక్తర్ మీర్ 2016 ఫిబ్రవరి 4న అత్యంత సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. వీరిది మతాంతర వివాహం కావడంతో పాటు.. ఇద్దరి మధ్య దాదాపు పదేళ్ల వయసు తేడా ఉండటంతో అప్పట్లో వార్తల్లో నిలిచారు. 2014లో ఓ వివాహ వేడుకలో ఊర్మిళను కలిసిన మోహ్సిన్.. ఆ తర్వాత ఆమెతో ప్రేమలో పడ్డారని సమాచారం. రెండేళ్ల తర్వాత వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. -
సినిమాగా మీర్జాపూర్ సిరీస్.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది
ఓటీటీలో ఆడియన్స్ క్రేజ్ దక్కించుకున్న సూపర్ సిరీస్ ‘మీర్జాపూర్’. ఇప్పుడు ఇగే వెబ్ సిరీస్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో కాలీన్ భయ్యాగా పంకజ్ త్రిపాఠి, గుడ్డూ పండిట్‌గా అలీ ఫజల్, మున్నా భయ్యాగా దివ్యేందు తమ ఐకానిక్ రోల్స్‌తో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇక జితేంద్ర కుమార్ ఎంట్రీ ఇచ్చి 'బబ్లూ పండిట్' పాత్రను పోషించడం కథలో అతిపెద్ద ట్విస్ట్‌గా మారబోతోంది. వీరితో పాటు భోజ్‌పురి స్టార్ రవి కిషన్ ఒక పవర్ఫుల్ రోల్లో మెరవనున్నారు.తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగులో ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్లో యాక్షన్ సీన్స్, డైలాగ్స్ చూస్తుంటే హిట్ ఖాయమని తెలుస్తోంది. ఈ సినిమా వెబ్ సిరీస్‌లకు ప్రీక్వెల్‌గా సినిమా ఉంటుందని గతంలోనే టీమ్ తెలిపింది. సిరీస్ మూడు పార్ట్‌లలో చనిపోయినవారంతా తెరపై కనిపిస్తారని వెల్లడించింది. ఈ చిత్రాన్ని అమెజాన్ ఎంజిఎం స్టూడియోస్, ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గుర్మీట్ సింగ్ దర్శకత్వం వహించగా.. సెప్టెంబర్ 4న థియేటర్లలో రిలీజ్ కానుంది. -
టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!
టాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ రచయిత, సీనియర్ నటుడు కృష్ణేశ్వర రావు కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాస కోశ, గుండె సమస్యలతో బాధపడుతున్న ఆయన.. ఈ రోజు(ఆగస్ట్ 11) గుంటూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కృష్ణేశ్వర రావు పూర్తి పేరు ఎల్లాప్రగడ సౌభాగ్య కృష్ణశ్వరరావు. పాఠశాల రోజుల నుంచే నాటకరంగంపై మక్కువ పెంచుకున్న కృష్ణశ్వరరావు, తన సుదీర్ఘ ప్రస్థానంలో 1,500కు పైగా నాటకాల్లో నటించారు. నాటకరంగంలో ఎన్నో ప్రయోగాలు చేసి, నంది అవార్డులు సైతం అందుకున్నారు. ‘ప్రచండ భారతం’తో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాకు ఆయనే కథను అందించాడు. శ్రీరాములయ్య, జయం మనదేరా చిత్రాలకు రచయితగా పనిచేశారు.రచయితగానే కాకుండా నటుడిగా కూడా కృష్ణేశ్వరరావు ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు చేశారు. దర్శకుడు వంశీతో పరిచయం కావడం ఆయన సినీ ప్రయాణంలో మరో ముఖ్యమైన మలుపు. వంశీ దర్శకత్వంలో ‘కొంచెం టచ్‌లో ఉంటే చెప్తాను’, ‘గోపి గోపిక గోదావరి’ వంటి చిత్రాల్లో నటించారు. ‘వీర తెలంగాణ’, ‘సరదాగా కాసేపు’, ‘వెన్నెల్లో హాయ్ హాయ్’, ‘వశం’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘నాంది’, ‘విరూపాక్ష’ తదితర చిత్రాల్లోనూ కనిపించారు. ముఖ్యంగా 2014లో విడుదలైన ‘చందమామ కథలు’ సినిమాలో బిచ్చగాడి పాత్ర ఆయనకు సినీ ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఆ పాత్రకు గాను ఆయన నంది స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకున్నారు. చిన్న పాత్ర అయినా తన సహజమైన నటనతో ఆ పాత్రను గుర్తుండిపోయేలా చేయడం ఆయన ప్రత్యేకత. బుధవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
ఐదేళ్ల తర్వాత మరో ఓటీటీకి తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
టాలీవుడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో వచ్చిన లవ్ అండ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'మంచి రోజులు వచ్చాయి'. ఈ మూవీలో సంతోష్ శోభన్, మెహరీన్ జంటగా నటించారు. 2021లో థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం ఈ మూవీ ఆహా ఓటీటీలో అందుబాటులో ఉంది.అయితే దాదాపు రిలీజైన ఐదేళ్ల తర్వాత ఈ మూవీ మరో ఓటీటీకి వచ్చేసింది. ఈ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. కాగా.. ఈ మూవీని ఎస్కేఎన్, వీ సెల్యూలాయిడ్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ సినిమాలో వెన్నెల కిశోర్, సప్తగిరి, వైవా హర్ష, అశిష్ ఘోష్ ముఖ్యపాత్రల్లో నటించారు. A feel-good love story that still brings all the smiles! Catch #ManchiRojulochaie streaming now on @PrimeVideoIN ❤️Watch here 👉 https://t.co/fffHKkjwb7#SantoshSobhan #MehreenPirzada #TeluguFilmNagar pic.twitter.com/Ku5akrizPf— Telugu FilmNagar (@telugufilmnagar) August 11, 2026 -
'రంభ, ఊర్వశి, మేనక భూలోకానికి వస్తే..' ఆసక్తిగా టీజర్
అల్లరి నరేష్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’. కామెడీ గోస్ కాస్మిక్ అన్నది ట్యాగ్‌లైన్ ఈ సినిమాకు చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్– హాస్య మూవీస్ బ్యానర్స్‌పై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి.తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇంద్రలోకం నుంచి భూలోకానికి రంభ, ఊర్వశి, మేనక వస్తే ఎలా ఉంటుందనే ఆసక్తికర కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించారు. టీజర్లో సన్నివేశాలు ఫుల్ కామెడీని తలపిస్తున్నాయి. ఈ మూవీతో అల్లరి నరేశ్ తన కామెడీ ట్రాక్‌లో సక్సెస్ కొట్టేలా కనిపిస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతమందిస్తున్నారు. ఈ మూవీలో నరేష్ వీకే, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబరు 4న గ్రాండ్ రిలీజ్ కానుంది. -
అగ్నివీర్‌గా స్టార్ నటుడి కుమార్తె.. ఎవరో తెలుసా?
సినిమా ఇండస్ట్రీలోకి సినీ స్టార్స్ ఫ్యామిలీ నుంచి చాలామంది ఎంట్రీ ఇవ్వడం మనం చూస్తుంటాం. మన పిల్లలు కూడా తల్లిదండ్రులను ఫాలో అవుతుంటారు. ముఖ్యంగా సినిమాల్లోకి వచ్చేవారు దాదాపు సినీ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచే వస్తుంటారు. అది మన టాలీవుడ్లో కాస్తా ఎక్కువగానే ఉంటుంది.కానీ అందుకు భిన్నంగా ఓ షాకింగ్ డెసిషన్ తీసుకుంది స్టార్ నటుడి కుమార్తె. ఆమె మరెవరో కాదు.. రేసుగుర్రంలో విలన్‌గా మెప్పించిన రవికిషన్ కూతురు. బాలీవుడ్ నటుడు రవి కిషన్ కుమార్తె ఇషితా శుక్లా ఇండస్ట్రీని కాదని విభిన్నమైన కెరీర్ ఎంచుకుంది. అగ్నివీర్‌గా రక్షణ దళంలో చేరారు. తండ్రిలా కాకుండా డిఫరెంట్ కెరీర్‌ను ఎంచుకుంది.రవి కిషన్ కుమార్తె అయిన ఇషితా శుక్లాకు చిన్న వయసులోనే ఆర్మీలో పని చేయాలన్న ఆసక్తి పెరిగింది. బాలీవుడ్‌కు వెళ్లకుండా.. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీసీ)లో చేరారు. ఆ తర్వాత సైనిక శిక్షణ పొంది రక్షణ రంగంలో పనిచేసేందుకు సిద్ధమైంది. ఇషిత ఢిల్లీ డైరెక్టరేట్‌కు చెందిన 7 గర్ల్స్ బెటాలియన్‌లో పనిచేశారు. కర్తవ్య పథ్‌లో గణతంత్ర దినోత్సవ పరేడ్ కోసం కూడా శిక్షణ తీసుకున్నారు. కాగా.. ఇషిత శుక్లా 2023లో అగ్నివీర్‌గా చేరినట్లు తెలుస్తోంది. దీంతో దేశానికి సేవ చేయాలన్న ఇషిత నిర్ణయాన్ని అనుపమ్ ఖేర్‌తో సహా పలువురు ప్రముఖులు ప్రశంసించారు. -
పెట్టింది చీమంతా.. వచ్చింది కొండంతా.. ఆ సినిమాలు ఇవే!
వందల కోట్లు ఖర్చు చేసినా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన చిత్రాలు కోలీవుడ్‌లో చాలానే ఉన్నాయి. పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కి అంచనాలను తారుమారు చేసిన తమిళ సినిమాలూ ఉన్నాయి. స్టార్డమ్తో పనిలేకుండా కథలో దమ్ముండి బాక్సాఫీస్ వద్ద ఈ ఏడాది భారీ వసూళ్లు రాబట్టిన కొన్ని తమిళ సినిమాల కోసం ఓ లుక్కేద్దాం..!విత్ లవ్:‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమాతో సత్తా చాటిన యువ దర్శకుడు అభిషన్ జీవింత్ హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘విత్ లవ్’. ఇందులో ఛాంపియన్ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్గా నటించింది. మదన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సౌందర్య రజనీకాంత్, మాగేశ్ రాజ్ కలిసి నిర్మించారు. కేవలం రూ.4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని ఏకంగా రూ.39 కోట్ల వసూళ్లను రాబట్టింది.తాయ్ కిళవి:ఒకప్పటి హీరోయిన్ రాధిక ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ తమిళ సూపర్‌హిట్ చిత్రం ‘తాయ్ కిళవి’. రాధికను లీడ్ రోల్లో పెట్టి తమిళ హీరో శివకార్తికేయన్ నిర్మించిన ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. రూ.10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.82 కోట్ల మేర వసూళ్లను సాధించింది.యూత్:తమిళ నటుడు కరుణాస్ వారసుడు కెన్ కరుణాస్ హీరోగా పరిచయమైన చిత్రం ‘యూత్’. ఈ సినిమాకు కెన్ కరుణాస్ దర్శకత్వం వహించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. కురప్పయ్య సీ రామ్, సులోచన కుమార్ నిర్మించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. రూ.8 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.81 కోట్ల వసూళ్లు రాబట్టింది.బ్లాస్ట్:అర్జున్ సర్జా, అభిరామి, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్లాస్ట్’. తెలుగులో ‘బ్లాస్ట్ జోన్’ పేరుతో విడుదలైంది. సుభాష్ కె.రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. రవి బస్రూర్ సంగీతం అందించారు. లీడ్ రోల్స్‌లో నటించిన వారు పెద్ద స్టార్లు కాకపోయినా.. ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. రూ.18 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం రూ.75 కోట్ల వసూళ్లను రాబట్టింది. -
'విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ.. సెట్స్‌లో రియల్ చిరుతపులి ఎంట్రీ'
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటేస్ట్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ చిత్రానికి టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా అంచనాలు మరింత పెరిగాయి. ఈ మూవీలో ప్రేమలు బ్యూటీ మమతా బైజు హీరోయిన్గా నటించింది. మధ్య వయస్కుడితో 20 ఏళ్ల అమ్మాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మేకర్స్. ఈ సందర్భంగా డైరెక్టర్ వెంకీ అట్లూరి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ మూవీ షూటింగ్ టైమ్‌లో ఎదురైన భయానక అనుభవాన్ని షేర్ చేశారు. ఊటీలో ఈ సినిమా షూట్ చేస్తున్నప్పుడు సెట్స్‌లోకి చిరుతపులి వచ్చిందని తెలిపారు. అది తమ కళ్ల ముందు నుంచే వెళ్లిందని గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా గడ్డ కట్టే చలిలో 102-103 ఫీవర్‌తో సూర్య, మమిత బైజు దాదాపు 11 రోజుల పాటు ఊటీలోనే షూట్లో పాల్గొన్నారని వెంకీ తెలిపారు. కాగా..ఈ సినిమా ఆగస్ట్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. -
ముక్కుపుడక మింగేసిన హీరోయిన్.. వీడియో వైరల్
షూటింగ్ సెట్లో చిన్న చిన్న ప్రమాదాలు జరగడం సినీ పరిశ్రమలో కొత్తేమీ కాదు. నటీనటులు సన్నివేశాలను సహజంగా చూపించేందుకు చేసే ప్రయత్నాల్లో అనుకోని ఘటనలు చోటుచేసుకుంటుంటాయి. తాజాగా ప్రముఖ నటి, గాయని షెహ్నాజ్ గిల్‌కు కూడా ఇలాంటి ఊహించని అనుభవమే ఎదురైంది. ఓ సన్నివేశం కోసం వేగంగా పరుగెత్తుతున్న సమయంలో ఆమె ముక్కుపుడక అనుకోకుండా ఊడి నోట్లోకి వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.షెహ్నాజ్ గిల్ నటిస్తున్న తాజా పంజాబీ చిత్రం ‘ఇష్క్నామా’. అరవింద్ ఖైర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఓ సీన్ కోసం ఆమె వేగంగా పరుగెత్తుతుండగా.. ముక్కుకు ఉన్న పుడక అనుకోకుండా ఊడి నోట్లోకి జారిపోయింది.ఈ ఘటనతో షెహ్నాజ్ ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరయ్యారు. తీవ్రంగా దగ్గుతూ ఇబ్బంది పడుతున్న ఆమెకు పక్కనే ఉన్న సహనటుడు సౌరభ్ సచ్‌దేవా వెంటనే స్పందించారు. ఆమె వీపుపై తడుతూ సహాయం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను షెహ్నాజ్ గిల్ ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వీడియో చూసిన అభిమానులు షెహ్నాజ్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. నటన పట్ల ఆమె చూపిస్తున్న అంకితభావాన్ని ప్రశంసిస్తూనే.. షూటింగ్ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సన్నివేశాలను పర్ఫెక్ట్గా చేయాలనే ప్రయత్నంలో నటీనటులు ఎదుర్కొనే ఇలాంటి అనుకోని ప్రమాదాలు అభిమానులను కలవరపెడుతున్నాయి.ఇక ‘ఇష్క్నామా’ విషయానికి వస్తే.. భారత్‌లోని పంజాబ్‌కు చెందిన నిమ్మ అనే సిక్కు కవి, పాకిస్తాన్ పంజాబ్‌కు చెందిన నసీమ్ అనే ముస్లిం యువతి మధ్య సాగే సరిహద్దుల అతీతమైన ప్రేమకథగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో షెహ్నాజ్ గిల్, జై రంధావా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సౌరభ్ సచ్‌దేవా, అంజుమ్ బత్రా, మహన్బీర్ భుల్లర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Shehnaaz Gill (@shehnaazgill) -
ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా
ఓటీటీలోకి ఈ వారం చాలానే సినిమాలు రాబోతున్నాయి. వాటిలో కాక్ టెయిల్ 2, భారతభాగ్య విధాత, కాటలన్, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ తదితర మూవీస్ ఉన్నాయి. వీటితో పాటు 20కి పైగా చిత్రాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా ఓ తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా రిలీజ్‌కి సిద్ధమైంది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: దేశ విభజనతో నలిగిపోయిన 'ప్రేమ'కథ.. ఓటీటీ సినిమా రివ్యూ)సనత్, మడోన్నా సెబాస్టియన్, ఎమాయా ప్రధాన పాత్రలు చేసిన చిత్రం 'హార్టిన్'(Heartin Movie). జూన్ 26న తమిళం వరకు మాత్రమే రిలీజైంది. ఓ మాదిరి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడీ సినిమా ఈ శుక్రవారం(ఆగస్టు 14) నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకురానున్నారు. అలానే విదేశాల వరకు సింప్లీ సౌత్ ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు.'హార్టిన్' విషయానికొస్తే.. శివ(సనత్) కాలేజీ చదువుతున్నప్పుడు సాహిత్య(మడోన్నా సెబాస్టియన్)ని ప్రేమిస్తాడు. రిలేషన్షిప్ కూడా మెంటైన్ చేస్తాడు. తర్వాత కొన్నాళ్లకు సాధన(ఎమాయా)తో ప్రేమలో పడతాడు. ఇలా ఒకేసారి ఇద్దరిని లవ్ చేస్తాడు. తర్వాత ఏమైంది? ఈ ట్రయాంగిల్ ప్రేమకథలో ఎవరు ఒక్కటయ్యారు? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి రోజా రీఎంట్రీ సినిమా) -
‘డీసీ’ని రామ్‌గోపాల్‌వర్మ సినిమాతో పోల్చిన దర్శకుడు!
అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో లోకేశ్ కనగరాజ్ కథానాయకుడిగా వచ్చిన చిత్రం డీసీ. పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని మంచి వసూళ్లను రాబెడుతోంది. అయితే ఈ చిత్రం చూసిన మలయాళ దర్శకుడు రంజిత్ కుమార్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. దాదాపు మూడు దశాబ్దాల క్రితం రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘సత్య’చూసినప్పుడు ఎలా అనిపించిందో ఈ సినిమా చూసినప్పుడూ అదే అనుభూతి కలిగిందని పేర్కొన్నారు.సినిమా చూసి ఇలా అనుకున్నా..‘దాదాపు 30 ఏళ్ల క్రితం తిరువనంతపురంలోని కృపా థియేటర్లో‘’ సినిమాను చూశాను. థియేటర్ బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఈ మాధ్యమాన్ని చూపించగలనా? అని నాకు నేను ప్రశ్నించుకున్నాను. ఇప్పుడు డీసీ చూసికూడా దాదాపు ఇదే అనుభూతి కలిగింది’ అని శంకర్ పేర్కొన్నాడు.‘సత్య’ ఎలా ఉంటుందంటే..1998 జూలై 03న విడుదలైన ‘సత్య’ సినిమాని రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించారు. మనోజ్ బాజ్పేయీ, జేడీ చక్రవర్తి, ఊర్మిళా మటోండ్కర్, సౌరభ్ శుక్లా, షెఫాలీ షా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. విశాల్ భరద్వాజ్ సంగీతం అందించగా, సందీప్ చౌతా నేపథ్య సంగీతం సమకూర్చారు. ముంబయి అండర్‌వరల్డ్ నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ డ్రామాలో.. సత్య అనే యువకుడు పరిస్థితుల కారణంగా గ్యాంగ్‌స్టర్ ప్రపంచంలోకి అడుగుపెట్టడం, అక్కడి స్నేహాలు, ప్రేమ, నేరాలు, సంఘర్షణలే ప్రధాన కథగా తెరకెక్కించారు. సహజమైన పాత్రలు, వాస్తవికమైన టేకింగ్‌తో ‘సత్య’ భారతీయ గ్యాంగ్‌స్టర్ సినిమాల్లో ప్రత్యేక చిత్రంగా నిలిచింది.డీసీ ఎలా ఉంటుందంటే..డీసీ.. కూడా గ్యాంగ్‌స్టార్ స్టోరీనే కానీ..అంతర్లీనంగా ఓ మంచి ప్రేమ కథతోపాటు ఓ బలమైన సామాజిక అంశాన్ని ఇందులో చర్చించారు. భావోద్వేగాలకూ పెద్దపీట వేయడంతో ఓ డిఫరెంట్ గ్యాంగ్‌స్టర్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. -
కోతి వీడియోతో చిక్కుల్లో పడ్డ హీరో విక్రమ్
తమిళ స్టార్ హీరో విక్రమ్ చిక్కుల్లో పడ్డారు. ఓ అరుదైన విదేశీ జాతి కోతితో కలిసి చేసిన వీడియోనే దీనికి కారణం. విమర్శలు రావడంతో సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ చేసిన 24 గంటల్లోనే విక్రమ్ దానిని డిలీట్ చేశాడు. ఇంతకీ అసలేమైంది? ఏంటి వివాదం?(ఇదీ చదవండి: కలలో శివుడు.. ఇది సాధారణంగా అనిపించలేదు: పూరీ కూతురు)ఆదివారం హీరో విక్రమ్.. అరుదైన జాతికి చెందిన లార్ గిబ్బన్ కోతితో ఆడుకుంటున్న ఓ వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఇందులో సదరు కోతిని అనుకరిస్తూ విక్రమ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. కొందరు దీన్ని చూసి లైక్ కొట్టగా మరికొందరు మాత్రం వన్యప్రాణి సంరక్షణ అధికారులకు ఫిర్యాదు చేశారు. అరుదైన జాతి కోతి.. విక్రమ్ దగ్గరకు ఎలా వచ్చింది? దీనిని పెంపుడు జంతువులా పెంచుకోవచ్చా అని పలు సందేహాలు రేకెత్తించారు.దీంతో విక్రమ్ తన వీడియోని డిలీట్ చేశాడు.విక్రమ్ తన వియ్యంకుడు(కూతురి మామ), ప్రముఖ బిజినెస్‌మ్యాన్ సీకే రంగనాథన్ ఇంటికి వెళ్లినప్పుడు ఈ కోతితో కలిసి వీడియో చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో ఆధారంగా అటవీశాఖ అధికారులు విచారణ మొదలుపెట్టినట్లు సమాచారం. సదరు కోతిని రంగనాథన్ ఎక్కడ కొనుగోలు చేశారు? వన్యప్రాణుల అక్రమ రవాణా ముఠా హస్తం ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.విక్రమ్ వీడియోలో కనిపించిన కోతి పేరు లార్ గిబ్బన్ (Lar Gibbon). ఇది అంతరించిపోయే దశలో ఉన్న జంతు జాతుల్లో ఒకటి. ఈ జాతికి సిటెస్(CITES) నిబంధనలతో పాటు భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కూడా రక్షణ ఉంది. అవసరమైన అనుమతులు, పత్రాలు లేకుండా లార్ గిబ్బన్ని పెంపుడు జంతువుగా ఉంచడం చట్టబద్ధమేనా? అని ఈ వీడియో వల్ల ప్రశ్నలు తలెత్తుతున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి రోజా రీఎంట్రీ సినిమా)நடிகர் விக்ரம் தனது இன்ஸ்டாகிராம் பக்கத்தில் பகிர்ந்த அரிய வகை 'லார் கிப்பன்' (#LarGibbon) குரங்குடன் விளையாடும் வீடியோ வைரலானதை அடுத்து, தமிழ்நாடு வனத்துறை விசாரணைக்கு உத்தரவிட்டுள்ளதால் அந்தப் பதிவு நீக்கப்பட்டுள்ளது.#Actor #vikram pic.twitter.com/YNiXjY1eFw— M.M.NEWS உடனடி செய்திகள் (@rajtweets10) August 11, 2026 -
మూగజీవాలకు అండగా అడివి శేష్
విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు స్టార్ హీరో అడివి శేష్. ‘క్షణం’, ‘గూఢచారి’, ‘మేజర్’, ‘హిట్’ వంటి చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ప్రస్తుతం సినిమాలతోనే కాకుండా సామాజిక అంశాలపైనా దృష్టిసారిస్తున్నారు. భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న మూగజీవాల కోసం ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. వాటికి అండగా నిలిచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.ఏం చేయబోతున్నాడంటే..అసోం, కేరళ, గుజరాత్, దిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పుణెతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లోని మూగజీవాలను రక్షించేందుకు స్థానిక జంతు సంరక్షణ సంస్థలు, రెస్క్యూ బృందాలతో కలిసి అడివి శేష్ బృందం పనిచేయనుంది. వరదల్లో చిక్కుకున్న, గాయపడిన జంతువులను రక్షించడంతో పాటు వాటికి ఆహారం, తాగునీరు, ఆశ్రయం, వైద్య చికిత్స అందించనున్నారు.ఓ ప్రాణాన్ని కాపాడొచ్చు..అడివి శేష్ మాట్లాడుతూ.. ‘వర్షాకాలం మనలో చాలామందికి అందంగా కనిపిస్తుంది. కానీ వేలాది మూగజీవాలకు ఇది అత్యంత కష్టమైన సమయం. మనకు వర్షం పడితే వెళ్లేందుకు ఇల్లు ఉంది. కానీ వాటికి అలాంటి సౌకర్యం ఏదీ లేదు. ఆహారం దొరకకపోవడం, ఆశ్రయం లేక వర్షంలో తడవడం వల్ల అనారోగ్యం బారిన పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాటిని కాపాడేందుకు ఈ కార్యక్రమం చేపట్టాం.జంతు సంరక్షణ కోసం పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ ఇంటి బయట వాటికి కాస్త ఆశ్రయం కల్పించడం, ఆహారం, స్వచ్ఛమైన నీరు అందించడం వంటివి చేస్తే చాలు. మనం చేసే ఈ చిన్న సాయంతో ఒక ప్రాణాన్ని కాపాడొచ్చు’ అని అన్నారు.జంతు సంరక్షణ సంస్థలు, రెస్క్యూ సిబ్బంది, వాలంటీర్లు ప్రతిరోజూ చేస్తున్న సేవలను అడివి శేష్ అభినందించారు. వర్షాకాలంలోనే కాకుండా ఏడాది పొడవునా మూగజీవాల సంరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం అందించాలని పిలుపునిచ్చారు.ఇక సినిమాల విషయానికొస్తే.. అడివి శేష్ చివరిగా ‘డకాయిట్’లో కనిపించారు. ఈ సినిమా తర్వాత ఆయన డెబ్యూ దర్శకుడు వినయ్ కుమార్ సిరిగినీడితో కలిసి ‘G2’ (గూఢచారి 2) చేస్తున్నారు. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
ఓటీటీలోకి రోజా రీఎంట్రీ సినిమా
ప్రముఖ నటి, వైఎస్సార్సీపీ నేత ఆర్కే రోజా గత పదిపదకొండేళ్ల నుంచి సినిమాలు చేయట్లేదు. అడపాదడపా షోల్లో మాత్రమే కనిపిస్తున్నారు. ఓ తమిళ సినిమాతో నటిగా రీఎంట్రీ ఇచ్చింది. తమిళంలో హిట్ అయిన చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఈ చిత్రం సంగతేంటి? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: దేశ విభజనతో నలిగిపోయిన 'ప్రేమ'కథ.. ఓటీటీ సినిమా రివ్యూ)రోజా రీఎంట్రీ ఇచ్చిన తమిళ సినిమా 'అన్బే డయానా'. పారి ఎలావళగన్ హీరో కమ్ దర్శకుడు. రమ్య రంగనాథన్ హీరోయిన్. జూలైలో తమిళం వరకు థియేటర్లలో రిలీజైంది. హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రాన్ని ఈ నెల 28 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకురానున్నారు.'అన్బే డయానా' విషయానికొస్తే.. కృష్ణ ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు. ఆంగ్లో ఇండియన్ అమ్మాయి డయానాతో ప్రేమలో పడతాడు. డయానా ఫ్రీ బర్డ్ అంటే మందు, సిగరెట్లు లాంటి అలవాట్లు ఉంటాయి. కానీ కృష్ణ భిన్నమైన వాతావరణంలో పెరుగుతాడు. డయానాతో ప్రేమకు కృష్ణ తల్లి సరళ(ఆర్కే రోజా) అడ్డు చెబుతుంది. తన కులానికే చెందిన మరో అమ్మాయితో కొడుకు పెళ్లి ఫిక్స్ చేస్తుంది. ఆ తర్వాత ఏమైంది? తను ప్రేమించిన డయానా కోసం కృష్ణ ఏం చేశాడు? కొడుకు ప్రేమ.. సరళలో ఎలాంటి మార్పును తీసుకొచ్చిందనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
కలలో శివుడు.. ఇది సాధారణంగా అనిపించలేదు: పూరీ కూతురు
దర్శకుడు పూరీ జగన్నాథ్ దేవుడిని పెద్దగా నమ్మడు! ఇదే విషయాన్ని మ్యూజింగ్స్, పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు. ఈయన కూతురు పవిత్ర మాత్రం శివుడిపై భక్తిభావన పెంచుకుంటోంది. అందుకు తగ్గట్లే తనకు కలలో శివుడు కనిపించాడని, ఇది సాధారణంగా అనిపించలేదని చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఇన్ స్టాలో ఆసక్తికర పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: అక్కకు పక్షవాతం.. కానీ ఆమె వల్లే డ్యాన్స్ నేర్చుకున్నా: హీరోయిన్)'కొన్నేళ్ల క్రితం ఎలాంటి ప్రాక్టీస్ లేకుండానే పెన్‌తో మండల చిత్రాలు గీయడం ప్రారంభించాను. ఇది నేర్చుకున్న నైపుణ్యం కాదు. సహజంగా పుట్టుకొచ్చిన ఓ అభిరుచి. కాలక్రమేణా ఇది నా ఆధ్యాత్మిక ప్రయాణంలో ఓ భాగమైంది. శివుడు నా జీవితంలో దేవుడు మాత్రమే కాదు. నా బలం, నా ఓదార్పు. నా మనసు ఆనందంతో నిండినప్పుడు, బాధపడినప్పుడు నేను మాట్లాడుకునేది ఆయనతోనే. గతేడాది కేదార్నాథ్ ఆలయానికి సంబంధించిన ఓ అందమైన కల వచ్చింది. అది సాధారణమైన కలలా అనిపించలేదు. శివుడే నన్ను పిలుస్తున్నట్లుగా అనిపించింది. తర్వాతి రోజే కేదార్నాథ్ ఆలయాన్ని మండల ఆర్ట్ శైలిలో గీయడం ప్రారంభించాను''దాదాపు వారం రోజుల పాటు ప్రతి గీతలోనూ ఓ ప్రార్థన, ప్రతి ఆకృతిలోనూ ఓ భావాన్ని, ప్రతి రంగులోనూ నా భక్తిని నింపుతూ ఆ చిత్రాన్ని గీయడం పూర్తి చేశాను. దీనిని ఒక వారం పాటు గీసినప్పటికీ చాలా కాలంగా గీస్తున్నట్టుగా అనిపించింది. ఇది పూర్తయిన తర్వాత నాలో ఓ ప్రశాంతత నెలకొంది. దీనిని మొదట నా కుటుంబ సభ్యులతో మాత్రమే పంచుకున్నా. కానీ ఇప్పుడు కృతజ్ఞతతో ఆ చిత్రాన్ని అందరితో పంచుకోవాలని నిర్ణయించుకున్నాను. హర హర మహాదేవ్' అని పూరీ జగన్నాథ్ కూతురు పవిత్ర రాసుకొచ్చింది.(ఇదీ చదవండి: 'ఇరుముడి' సినిమాకు శబరిమలతో సంబంధం లేదు) View this post on Instagram A post shared by Pavithra Puri (@pavithrapuri_) -
మాతృత్వం ఓవైపు.. సినిమా మరోవైపు
సినీ తారలు అనుకున్నది సాధించేందుకు ఎంతటి కష్టాన్నైనా లెక్కచేయరు అనడానికి ఈ బాలీవుడ్ బ్యూటీ చక్కటి ఉదాహరణ. మాతృత్వం వంటి కీలక దశలోనూ తన వృత్తిపట్ల నిబద్ధతను చాటుకుంటోంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె. ప్రస్తుతం ఎనిమిదో నెల గర్భంతో ఉంది. అయినప్పటికీ షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వకుండా ‘రాకా’లో తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేసేందుకు కష్టపడుతోందట. సంబంధించిన విషయాలు వైరల్ కావడంతో ఆమెపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.షూటింగ్లో మళ్లీ బన్నీ..అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న భారీ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ చిత్రం ‘రాకా’. ఇందులో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవల కాస్త విరామం తీసుకున్న బన్నీ.. మళ్లీ షూటింగ్లో పాల్గొన్నట్లు సమాచారం. మరోవైపు దీపికాకు సెప్టెంబర్‌లో డెలివరీ ఉండటంతో.. అంతకంటే ముందే తనకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేసేందుకు ఆమె పట్టుదలతో పనిచేస్తోందట. షూటింగ్ షెడ్యూల్ రాత్రివేళ వరకు కొనసాగుతున్నా సెట్లోనే ఉంటూ తన సన్నివేశాలను పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె అంకితభావాన్ని చూసి చిత్రబృందం సైతం ఆశ్చర్యపోతున్నట్లు సమాచారం.గతంలోనూ వైరల్..దీపికా దాదాపు ఏడు నెలల గర్భంతో ఉన్న సమయంలోనూ ‘రాకా’ కోసం రోజూ షూటింగ్లో పాల్గొన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండటంతో ఆమె పాత్ర సవాల్‌తో కూడుకున్నదని తెలుస్తోంది. అయితే ఆమె పరిస్థితికి అనుగుణంగా చిత్రబృందం షూటింగ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘రాకా’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అట్లీ మాస్ టేకింగ్‌కు అల్లు అర్జున్ క్రేజ్ తోడవడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. 2027లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు టాక్. -
'ఇరుముడి'కి శబరిమలతో సంబంధం లేదు
రవితేజ హీరోగా చేస్తున్న లేటెస్ట్ సినిమా 'ఇరుముడి'. పోస్టర్స్ దగ్గర నుంచి పాటల వరకు చూస్తుంటే ఇది అయ్యప్ప దీక్ష, స్వామి మాల నేపథ్య కథతో తీశారని చాలామంది అనుకున్నారు. అయితే శబరిమలకు ఈ మూవీతో ఎలాంటి సంబంధం లేదని చెప్పి దర్శకుడు శివ నిర్వాణ స్పష్టం చేశాడు. వచ్చే శుక్రవారమే చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: తల్లిదండ్రులని చూసుకోవడం కంటే గొప్ప అదృష్టం లేదు: నాగార్జున)'ఈ సినిమా స్టోరీకి శబరిమలతో ఎలాంటి సంబంధం లేదు. హీరో జీవితంలో 41 రోజుల అయ్యప్ప దీక్ష ఓ భాగం మాత్రమే. దీక్ష టైంలో అయ్యప్ప భక్తులు తమ అలవాట్లు, నియమావళి విషయంలో నిష్టగా ఉంటారు. వ్యసనాలు ఉన్న ఓ మనిషి ఈ దీక్ష స్వీకరించాల్సి వస్తే అతడు మద్యానికి దురంగా ఉండాల్సి వస్తుంది. దీంతో కథలో సంఘర్షణ మొదలవుతుంది. కఠినమైన నియమాలు ఉంటాయి కాబట్టి నేను అయ్యప్ప స్వామి దీక్ష నేపథ్యాన్ని తీసుకున్నాను. అంతే తప్ప శబరిమలతో సినిమా స్టోరీ కాదు. 41 రోజుల దీక్ష కథే మూవీని మరింత ప్లస్. దీక్షకు ముందు ఏం జరిగింది? దీక్షలో ఉన్నప్పుడు ఏం జరిగిందనే విషయాలు ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తాయి' అని డైరెక్టర్ శివ నిర్వాణ చెప్పుకొచ్చాడు.ఈ సినిమాలో రవితేజ భార్యగా హీరోయిన్ ప్రియాభవానీ శంకర్ నటించింది. జీవీ ప్రకాశ్ సంగీతమందించాడు. తండ్రికూతురు అనుబంధం కూడా ఈ మూవీలో ప్రధానంగా ఉండనుందని ప్రమోషనల్ కంటెంట్ ద్వారా తెలుస్తోంది.(ఇదీ చదవండి: అక్కకు పక్షవాతం.. కానీ ఆమె వల్లే డ్యాన్స్ నేర్చుకున్నా: హీరోయిన్) -
అక్కకు పూర్తిగా పక్షవాతం.. కానీ ఆమె వల్లే డ్యాన్స్ నేర్చుకున్నా
తమిళ ప్రముఖ హీరోయిన్ దుషారా విజయన్.. తన జీవితంలో చెరిగిపోని విషాదాన్ని తలుచుకుని ఎమోషనల్ అయింది. అక్క మరణాన్ని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఈమె నటించిన లేటెస్ట్ సినిమా 'జీడీఎన్'. దీని ప్రమోషన్లలో భాగంగా చాలా విషయాలు మాట్లాడిన దుషార.. అక్కడతో తన అనుబంధం, పుట్టుకతోనే ఆమెకొచ్చిన పక్షవాతం గురించి చెప్పింది.(ఇదీ చదవండి: తల్లిదండ్రులని చూసుకోవడం కంటే గొప్ప అదృష్టం లేదు: నాగార్జున)దుషారా విజయన్‌కు ఇద్దరు అక్కలు ఉండగా వారిలో రెండో అక్క దుర్గా దాదాపు పదేళ్ల క్రితం కన్నుమూసింది. ఈమెకు పుట్టుకతోనే మ్యోపతి అనే వ్యాధి ఉంది. దీని కారణంగా ఆమె మెడ కింది భాగం పూర్తిగా పక్షవాతానికి గురైందని దుషార చెప్పుకొచ్చింది.'మెడ పైభాగం వరకు ఆమెకు ఎలాంటి సమస్య లేదు. మెడ కింది భాగం మాత్రం పూర్తిగా పక్షవాతానికి గురైంది. అందుకే రోజువారీ పనులన్నింటికీ మేమే సహాయం చేయాల్సి వచ్చేది. నాకు చిన్నప్పటి నుంచే డ్యాన్స్‌పై ఆసక్తి ఏర్పడటానికి అక్కే కారణం. నేను డ్యాన్స్ చేస్తుంటే వీల్‌ఛైర్‌లో కూర్చుని ఇలా చెయ్ అలా చెయ్ అని సూచించేది. నేను ఆమెని చాలా మిస్ అవుతున్నాను. ఎక్కడికి వెళ్లినా నేను దేవుడిని మొక్కను. నా అక్క ఫొటో చూసి ప్రార్థిస్తాను' అని దుషారా చెప్పింది.తమ్ముడితో అనుబంధం గురించి మాట్లాడిన దుషారా.. దాదాపు ఏడేళ్ల పాటు తమ్ముడితో కలిసి చెన్నైలో నివసించాను. టెక్నికల్‌గా చెప్పాలంటే నేను వాడికి తల్లిలాంటిదాన్ని. వాడు నాకు నా బిడ్డ లాంటివాడు అని పేర్కొంది. సార్పట్ట పరంపరై, నచ్చతిరం నగర్గిరదు, రాయన్, వేట్టయాన్ తదితర సినిమాల్లో నటించింది. ఈ శుక్రవారం ఈమె ఓ హీరోయిన్గా చేసిన 'మకుటం' రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: నేను ప్రేమలో పడటానికి కారణం 'ఇళయరాజా':దుషారా విజయన్) -
తల్లిదండ్రులని చూసుకోవడం కంటే గొప్ప అదృష్టం లేదు
తన తల్లిదండ్రులని తలుచుకుని హీరో నాగార్జున భావోద్వేగానికి లోనయ్యారు. ఈయన నిర్మించిన 'పళ్లబురుసు' అనే చిన్న సినిమా ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కానుంది. దీని ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రం జరిగింది. ఇందులోనే నాగ్ మాట్లాడుతూ ఎన్నడూ లేనంతలా ఎమోషనల్ అయ్యారు. తండ్రితో జ్ఞాపకాలని గుర్తుచేసుకున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలో ట్రెండింగ్ సినిమా.. త్వరలో మూడో పార్ట్?)'నా తండ్రి ప్రారంభించిన ఈ సంస్థతో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఈ ఏడాదిలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాం. అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్‌ని మరింత విస్తరించాం. నా తల్లిదండ్రులని ఎంతో ప్రేమగా, బాధ్యతగా చూసుకున్నాను. నా భార్య అమల కూడా అదృష్టవంతురాలు. ఎందుకంటే ఆమె కూడా తల్లిదండ్రులని ఎంతో శ్రద్ధగా చూసుకుంటోంది. తల్లిదండ్రులు మన కోసం చేసిన త్యాగాలని గుర్తించి వారికి అండగా నిలవడం మన జీవితంలో అత్యంత విలువైన బాధ్యత. తల్లిదండ్రులని ప్రేమగా చూసుకోవడం కంటే జీవితంలో గొప్ప అదృష్టం మరొకటి ఉండదు' అని నాగార్జున అన్నారు.అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి 50 ఏళ్లు పూర్తయింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెట్టారు. మొన్ననే కొడుకు అఖిల్‌తో తీసిన 'లెనిన్' సక్సెస్ అయింది. అలానే నాగ్ కూడా తన 100వ సినిమా చేస్తున్నారు. దీని షూటింగ్ కూడా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోంది.(ఇదీ చదవండి: ‘వారణాసి’లో హనుమంతుడిగా రామ్ చరణ్?)నేను నా తల్లిదండ్రులను చూసుకున్నాను.. అమల కూడా అదృష్టవంతురాలు .. పెరెంట్స్ ను దగ్గరుండి చూసుకుంటోంది. మన చినప్పుడు వారే మన వేలు పట్టుకుని నడిపించారు. అలాంటి వారిని చూసుకోవాలిగా..!#Nagarjuna #PallaburusuOnAug14th #Amala #Akhil #Nagachaitanya pic.twitter.com/JbvaRNZ2gN— SZN (@Suzenbabu) August 10, 2026 -
ఓటీటీలో ట్రెండింగ్ సినిమా.. త్వరలో మూడో పార్ట్?
ఓ సినిమాకు సీక్వెల్ తీయాలా వద్దా అనేది మొదటి భాగం సక్సెస్ బట్టి ఉంటుంది. అలాంటి రీసెంట్ టైంలో వచ్చిన సీక్వెల్ సినిమా 'గట్ట కుస్తీ 2'. చెల్లా అయ్యావు దర్శకత్వంలో విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా వీటిని తెరకెక్కించారు. రెండో పార్ట్ అద్భుతమైన హిట్ అయ్యేసరికి కొనసాగింపుగా మూడో భాగం ఉంటుందా అనే ప్రశ్న వచ్చింది. దీనికి దర్శకుడు సెల్లా అయ్యావు బదిలిస్తూ ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించడమే దానికి సీక్వెల్ తీయడానికి కారణం అని పేర్కొన్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలో భార్యభర్తల కామెడీ సినిమా 'గట్ట కుస్తీ 2' తెలుగు రివ్యూ)సాధారణంగా పార్ట్ 2 తీస్తున్నప్పుడు దానిపై అంచనాలు ఎక్కువగా ఉంటాయని, ఇదే విషయాన్ని విష్ణు విశాల్‌తో చెప్పాను. అయితే పేరు కోసం పార్ట్ చేయొద్దని, మంచి కథ కుదిరితేనే చేద్దామని చెప్పారు. దీంతో ఆరు నెలల పాటు కష్టపడి కథ సిద్ధం చేసుకుని అది అందరికీ నచ్చిన తర్వాతే గట్ట కుస్తీ 2 ప్రారంభించాను. మొదటి భాగం కంటే రెండో భాగం ఎక్కువగా ఆదరణ పొందటం సంతోషం. తదుపరి చిత్రాలు చేస్తున్నప్పుడు సక్సెస్ అయిన చిత్రాల పేర్లతో మాత్రమే చేయకూడదని భావించాను. అలానే కథకు కొనసాగింపు ఉండాలని భావించాను. అలాంటి కథ సెట్ అయ్యేసరికి గట్ట కుస్తీ చిత్రాన్ని రెండు భాగాలు రూపొందించినట్లు చెప్పారు.మంచి కథ కుదిరితే గట్ట కుస్తీ 3 తీస్తానని దర్శకుడు చెల్లా అయ్యావు చెప్పారు. ప్రస్తుతం కెన్ కరుణాస్ హీరోగా చిత్రాన్ని తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు. ఇది ప్రేమ, వినోదంతో కూడిన కుటుంబ సమేతంగా చూసి ఆనందించే కథా చిత్రంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 'గట్ట కుస్తీ 2' ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.(ఇదీ చదవండి: కారు ప్రమాదంలో ఏఆర్ రెహమాన్ కొడుకు) -
కళామతల్లికి కులమతాలు లేవు: మంచు మనోజ్
‘‘ఇండస్ట్రీకి కులం, గోత్రం లేదు. కళామతల్లికి కులమతాలు లేవు. చిన్న, పెద్ద, కొత్త, పాత అనే తేడా లేకుండా కంటెంట్ బాగున్న సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. ‘గజ’ టీజర్ బాగుంది. మణిశర్మగారు అద్భుతమైన సంగీతం ఇచ్చారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని హీరో మంచు మనోజ్ చెప్పారు. సతీష్ జై హీరోగా నటించి, దర్శకత్వం వహించిన సినిమా ‘గజ’. ఫెర్నాజ్ హీరోయిన్ గా నటించారు.చలమలశెట్టి సునీల్ సమర్పణలో సతీష్ జై ఫిల్మ్స్‌పై డాక్టర్ మైత్రి శరణ్, సతీష్ జై నిర్మించారు. సోమవారం నిర్వహించిన ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరై, టీజర్ లాంచ్ చేశారు. సతీష్ జై మాట్లాడుతూ–‘‘ఒక ప్రేక్షకుడిగా ఆలోచించి ‘గజ’ కథ రాసుకున్నాను.సినిమాలోని ప్రతి సన్నివేశం ఎంగేజింగ్‌గా ఉంటుంది’’ అన్నారు. ‘‘మా మూవీని సపోర్ట్ చేయాలి’’ అన్నారు నిర్మాత మైత్రి శరణ్, చలమలశెట్టి సునీల్. ఈ కార్యక్రమంలో ఫెర్నాజ్, సహ– నిర్మాతలు మధు సూదన్ , పద్మనాభ రెడ్డి, నిర్మాత ‘సెవెన్ హిల్స్’ సతీష్, కెమెరామెన్ జగదీష్ చీకటి, లిరిసిస్ట్ మిట్టపల్లి సురేందర్ మాట్లాడారు. -
సమయానికి విలువ ఇస్తుంది: డి.సురేష్ బాబు
‘‘నిర్మాత బెక్కెం వేణుగోపాల్ ద్వారా ‘హుషార్ పిట్టలు’ సినిమా గురించి తెలిసింది. మా సురేష్ ప్రోడక్షన్స్ ప్రతినిధులు ఈ మూవీ చూసి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వడంతో సురేష్ ఏషియన్ ఫిలింస్ ద్వారా విడుదల చేస్తున్నాం. ప్రేక్షకుల డబ్బు, సమయానికి విలువ ఇచ్చే చిత్రం ఇది’’ అని నిర్మాత డి.సురేష్‌బాబు తెలిపారు. అన్షు, వాసవి గణేషన్ జంటగా నటీంచిన చిత్రం ‘హుషార్ పిట్టలు’.బిక్షు దర్శకత్వంలో పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మించారు. ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఫిలింస్ సంస్థలు ఈ నెల 15న విడుదల చేస్తున్నాయి. సోమవారం నిర్వహించిన ‘హుషార్ పిట్టలు’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి డి.సురేష్‌బాబు ముఖ్య అతిథిగా హాజరై, ట్రైలర్ రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా డైరెక్టర్ బిక్షు మాట్లాడుతూ–‘‘ఈ చిత్రంలో వాణిజ్య అంశాలతో పాటు ఓ సందేశం కూడా ఉంది’’ అని చెప్పారు. ‘‘ఇలాంటి మంచి సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అని వాసవీ గణేషన్ , అన్షు, సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత బెక్కెం వేణుగోపాల్, కెమెరామెన్ రుద్రసాయి, నటులు గోవర్థన్ , భాను, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
విడుదల తేదీ ఖరారు
బాలీవుడ్ హీరోలు సల్మాన్ ఖాన్ , సంజయ్‌దత్ నటించిన అంతర్జాతీయ చిత్రం ‘7 డాగ్స్’ ఇండియాలో రిలీజ్ కానుంది. ఈజిప్ట్ సూపర్‌స్టార్స్ అహ్మద్ ఎజ్, కరీమ్ అబ్దెల్ అజీజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఇంటర్నేషనల్ మూవీ ‘7 డాగ్స్’. ‘బ్యాడ్ బాయ్స్ ఫర్ లైఫ్’, ‘బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై’ చిత్రాల ఫేమ్ దర్శక–ద్వయం ఆదిల్ ఎల్ అర్బీ, బిలాల్ ఫల్లా తెరకెక్కించారు. ఇటాలియన్ నటి మోనికా బెల్లూసి, అమెరికన్ యాక్టర్ గియాన్ కర్లో అలెశ్శాండ్రో కీలక పాత్రల్లో నటించారు. సెలా స్టూడియోస్, జనరల్ ఎంటర్టైన్ మెంట్ అథారిటీ, రియాద్ సీజన్ నిర్మించిన ఈ చిత్రం మిడిల్ ఈస్ట్‌లో ఈ ఏడాది మే 27న అరబిక్, ఇంగ్లిష్ భాషల్లో విడుదలై హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమాను ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఈ నెల 21న భారత్‌లో రిలీజ్ చేయనున్నట్లు సోమవారం ప్రకటించి, ఓ వీడియో విడుదల చేశారు. -
‘వారణాసి’లో హనుమంతుడిగా రామ్ చరణ్?
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్‌స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వారణాసి’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.ఇక ఈ సినిమా కథ త్రేతాయుగం నేపథ్యంలో జరిగే సన్నివేశాల కోసం మహేశ్ బాబును శ్రీరాముడిగా చూపించనున్నట్లు ఇప్పటికే రాజమౌళి వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘట్టానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే ఇందులో హనుమంతుడి పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.మొదట్లో ఈ పాత్ర కోసం ప్రముఖ నటుడు మాధవన్ పేరు వినిపించింది. అయితే ఆ పాత్రకు అవసరమైన ఇంటెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ దృష్ట్యా రామ్ చరణ్ అయితే హనుమాన్ పాత్ర తెరపై మరింత ప్రభావవంతంగా ఉంటుందని రాజమౌళి భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే జక్కన్న 'మగధీర' ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలను చరణ్‌తో చేశాడు. ఆ చిత్రాల అనుభవం కూడా ఈ కాంబినేషన్‌పై ఆసక్తిని మరింత పెంచుతోంది. అయితే రామ్ చరణ్ ‘వారణాసి’లో హనుమంతుడిగా నటిస్తున్నారనే వార్తపై 'వారణాసి' చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ నిజంగా ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం సినిమాపై అంచనాలు మరో స్థాయికి చేరడం ఖాయం. -
పల్లెటూరి ప్రేమ కథా చిత్రం.. ఆసక్తిగా పోస్టర్
శ్రీరామ్, రమిక శివు జంటగా నటిస్తోన్న లేటేస్ట్ లవ్ ఎంటర్టైనర్ ప్రేమనే ఊరిలో. ఈ మూవీకి మనోజ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని గ్రామీణ ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రేమ, భావోద్వేగాలు, మానవ సంబంధాలు, పల్లె జీవనశైలిని ప్రతిబింబించే కథగా రూపొందిస్తున్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్ రివీల్ చేశారు. ఈ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. టైటిల్‌కు తగ్గట్టుగానే ప్రేమను పల్లె అందాలతో ముడిపెట్టి చూపించిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తి పెంచింది. ఈ చిత్రంలో తపస్విని పూనాచ, రంగాయణ రఘు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి సునద్ గౌతమ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మహారత్న ప్రొడక్షన్స్, ఎస్కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
'నా తొమ్మిదేళ్ల కష్టం.. ఆయన వల్లే సాధ్యమైంది'.. కామాక్షి ఎమోషనల్
టాలీవుడ్ నటి కామాక్షి భాస్కర్ల గురించి పరిచయం అక్కర్లేదు. పలు విభిన్న పాత్రలతో అభిమానులను మెప్పించింది. తాజాగా మరో మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఎంఎస్ రాజు డైరెక్షన్లో వస్తోన్న అగధ మూవీలో నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్‌కు హాజరైన కామాక్షి తన కెరీర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానంటే.. నా తొమ్మిదేళ్ల కష్టమని కామాక్షి తెలిపింది. నా ఫ్యామిలీ సపోర్ట్‌తోనే ఇంతవరకు వచ్చానని ఎమోషనలైంది. నా కెరీర్‌కి పునాది రాయి వేసింది మాత్రం ఎంఎస్ రాజుగారు మాత్రమేనని తెలిపింది. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకి అవకాశాలు రావడమే కష్టమని ఏడ్చేసింది. అలాంటిది నన్ను సినిమాలో లీడ్ రోల్లో తీసుకున్నారని తెలిపింది. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ మారుతోందని.. నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు నేను రుణపడి ఉంటానని భావోద్వేగానికి గురైంది కామాక్షి.నన్ను స్క్రీన్‌పై చూసింది చాలా తక్కువ.. నేను చేసిన క్యారెక్టర్స్ చూసి నన్ను అలాంటివే చేస్తుందని అనుకుంటారు.. కానీ నా తొమ్మిదేళ్ల కష్టం వాళ్లకు మాత్రమే తెలుసన్నారు. ఈ రోజు ఇక్కడ నేను నిలబడేందుకు నా ఫ్యామిలీ ఎంతో త్యాగాలు చేయాల్సి వచ్చిందని కామాక్షి ఎమోషనల్ కామెంట్స్ చేసింది. మా అన్న, అమ్మ, పిన్ని నాకోసం ఇక్కడికి వచ్చారంటూ ఏడుస్తూ మాట్లాడింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కాగా.. ఈ చిత్రంలో ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. -
'శివ కోసం ఎడ్లబండిపై వచ్చా.. ఇప్పుడు శివ ఎదురుగా ఉన్నా'
బలగం మూవీతో ఫేమ్ తెచ్చుకున్న వాళ్లలో సుధాకర్ రెడ్డి ఒకరు. ఈ చిత్రంలో తన నటన, తెలంగాణ యాసతో అందరినీ ఆకట్టుకున్నారు. తాజాగా మరో మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. పక్కా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన పళ్లబురుసుతో అలరించేందుకు వస్తున్నారు. టైటిల్‌తోనే ఆసక్తి పెంచిన ఈ సినిమా రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా కింగ్ నాగార్జున హాజరయ్యారు.ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన నటుడు సుధాకర్ రెడ్డి ఎమోషనలయ్యారు. నాగార్జున నటించిన శివ మూవీ చూసేందుకు మేము ఎడ్లబండ్లు కట్టుకుని వచ్చామని తెలిపారు. ఆ రోజు సినిమా చూసి మిగిలిపోయిన మిరపకాయ బజ్జీలు తిని ఇంటికెళ్లామని గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లో నాగేశ్వరరావు, ఎన్టీఆర్ ఇలా పాడేవారు, ఇలా చేసేవారని రచ్చకట్ట దగ్గర మాట్లాడుకునే వాళ్లమని అన్నారు. కానీ ఈ రోజు నేను శివ(నాగార్జున) ముందు నిలబడి మాట్లాడుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉందని సుధాకర్ రెడ్డి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని కళాకారులను ఇంతవరకు తీసుకొచ్చేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.కాగా.. బలగం నటులు సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న లేటేస్ట్ రూరల్ కామెడీ ఎంటర్టైనర్ పళ్లబురుసు. ఈ చిత్రానికి ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రంలో ప్రజ్వల్, గోమతి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు పవన్ సీహెచ్ సంగీతమందించగా.. ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది. -
ప్రభాస్ మూవీలో ఛాన్స్.. మీ టాలెంట్ బయటికి తీయండి..!
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్లో భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, కీలక పాత్రల్లో కనిపించారు. ప్రస్తుతం ఈ మూవీ సీక్వెల్ పనులతో బిజీగా ఉన్నారు నాగ్ అశ్విన్.తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి అదిరిపోయే న్యూస్ చెప్పారు మేకర్స్. ఈ చిత్రంలో మీరు కూడా భాగం అవ్వాలని అనుకుంటున్నారా? ప్రభాస్ మూవీలో ఛాన్స్ కొట్టేయాలనుందా? మరి ఇంకెందుకు ఆలస్యం మీ టాలెంట్ చూపించే వీడియోలను పంపండి. ఈ క్రేజీ ఛాన్స్ కొట్టేయండి అంటున్నారు మేకర్స్.తాజాగా ఈ సీక్వెల్ మూవీలో నటించాలనుకునే వారి కోసం క్యాస్టింగ్ కాల్ వచ్చేసింది. ఈ అరుదైన గోల్డెన్ ఛాన్స్‌ను మీ రెండు చేతులతో ఒడిసి పట్టుకోండి. నటనపై ఆసక్తి, ప్రతిభ ఉన్నవారికి ఎలాంటి షరతులు లేకుండా ఈ మూవీ ఛాన్స్ ఇస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ క్రేజీ ఛాన్స్ కోసం తమ వివరాలను, పోర్ట్‌ఫోలియోలను kalkiuniversecasting@gmail.com అనే మెయిల్ చేయాలని ప్రకటనలో పేర్కొన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీలోని టాలెంట్ బయటికి తీసి ప్రభాస్ మూవీలో నటించే ఛాన్స్ కొట్టేయండి. Here’s an opportunity for all aspiring actors! Come be a part of the KALKI CINEMATIC UNIVERSE. 📩 kalkiuniversecasting@gmail.com#Kalki2898AD #CastingCall pic.twitter.com/hUKIoRfv2k— Kalki 2898 AD (@Kalki2898AD) August 10, 2026 -
యశ్ టాక్సిక్.. పారితోషికం ఎవరికి ఎన్ని కోట్లంటే?
కన్నడ స్టార్ యశ్ హీరోగా వస్తోన్న యాక్షన్ అండ్ బోల్డ్ మూవీ టాక్సిక్. ఈ మూవీకి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ పలుసార్లు వాయిదా పడగా.. ఎట్టకేలకు ఆగస్టు 26న థియేటర్లలోకి రానుంది. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఫుల్ బోల్డ్ అండ్ వయొలెంట్‌గా ఉంది. ఈ ట్రైలర్‌తో టాక్సిక్‌పై అంచనాలు మరింత పెరిగాయి.ట్రైలర్ తర్వాత టాక్సిక్ మూవీ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టాక్సిక్ మూవీకి సంబంధించి ఓ టాక్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమాకు యశ్, కియారా, నయనతార ఎంత తీసుకున్నారనే దానిపై చర్చ నడుస్తోంది. ఈ భారీ బడ్జెట్ మూవీకి కాస్తా గట్టిగానే ఛార్జ్ చేశారని తెలుస్తోంది.ఈ సినిమాకు కేజీఎఫ్ స్టార్ యశ్ దాదాపు రూ.50 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నారని శాండల్‌వుడ్‌లో టాక్ వినిపిస్తోంది. హీరోయిన్ కియారాకు కూడా భారీగానే ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఆమెకు ఏకంగా రూ.15 కోట్లు చెల్లించనున్నారని సమాచారం. అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార రూ.12 నుంచి 18 కోట్ల వరకు పారితోషికం అందుకోనున్నట్లు తెలుస్తోంది.అలాగే కాంతార ఫేమ్ రుక్మిణీ వసంత్ సైతం భారీగానే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం రూ.3 నుంచి 5 కోట్ల వరకు ఛార్జ్ చేయనుందని టాక్. అలాగే బాలీవుడ్ భామలు హ్యుమా ఖురేషీ, తారా సుతారియా రూ.2 నుంచి 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకోనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ లెక్కన కేవలం హీరో, హీరోయిన్లకే దాదాపు వంద కోట్ల వరకు ఖర్చు చేయనున్నారని అర్థమవుతోంది. ఇంత భారీ ఎత్తున నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలా రాణిస్తుందో వేచి చూడాల్సిందే. -
స్పైడర్ మ్యాన్.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం..!
హాలీవుడ్ మూవీ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇండియాలోనూ ఈ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తొలి రోజు నుంచే కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. జూలై 30న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఇండియన్ బాక్సాపీస్ వద్ద అరుదైన రికార్డ్ సాధించింది.ఈ చిత్రం ఇప్పటి వరకు ఇండియా వ్యాప్తంగా రూ.500 కోట్ల మైలురాయిని అధిగమించింది. ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా స్పైడర్ మ్యాన్ నిలిచింది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. కాగా.. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా లేటెస్ట్ చిత్రం 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే'. టామ్ హోలండ్, జెండయా ప్రధాన పాత్రలు చేశారు. ఇండియాలో తొలి వీకెండ్ ముగిసేసరికి రూ.309 కోట్లతో సరికొత్త రికార్డులు సృష్టించింది. A historic 500 Cr milestone, made possible by you ❤️🕷️#SpiderManBrandNewDay in cinemas now, in English, Hindi, Tamil, Telugu, Malayalam & Kannada. Book your tickets via the link in bio! pic.twitter.com/ihXdQFB2po— Sony Pictures India (@SonyPicsIndia) August 10, 2026 -
మమితా బైజు సంచలన నిర్ణయం.. కారణం ఇదే!
మలయాళ నటి మమితా బైజు వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ‘ప్రేమలు’తో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యారు. ‘డ్యూడ్’, ‘జన నాయకన్’ వంటి చిత్రాలతో బిజీగా మారారు. త్వరలో స్టార్ హీరో సూర్య సరసన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినీ కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ఆమె పంచుకున్నారు.‘సోషల్ మీడియా ద్వారా వచ్చే పబ్లిసిటీ కంటే మానసిక ప్రశాంతతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ఇకపై సోషల్ మీడియాకు దూరంగా ఉంటా. నా సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ను వ్యక్తిగతంగా కాకుండా పీఆర్ టీమ్ ద్వారా వెల్లడిస్తా’ అని స్పష్టం చేశారు. తన అభిమాన హీరో గురించి మాట్లాడుతూ.. తాను అల్లు అర్జున్‌కు వీరాభిమానినని మమితా తెలిపారు. ఆయన నటించిన సినిమాల్లో ‘ఇద్దరమ్మాయిలు’ సినిమా ఇష్టమన్నారు. ఆ సినిమాలో ఉపయోగించిన వాచ్, ధరించిన టీషర్ట్ స్టైల్ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని వెల్లడించారు. తాను కూడా ఆ స్టైల్‌ను కాపీ చేసేదాన్నని చెబుతూ నవ్వులు పూయించారు. -
విజయ్ సేతుపతి స్లమ్‌డాగ్.. పవర్ఫుల్ రోల్ గ్లింప్స్ రిలీజ్
విజయ్ సేతుపతి హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ 'స్లమ్ డాగ్-33 టెంపుల్ రోడ్'. ఈ సినిమాకు టాలీవుడ్ డైరక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ బాలీవుడ్ భామ టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. టబు రోల్ పరిచయం చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు.ఈ గ్లింప్స్ చూస్తుంటే టబు పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ఇన్కమ్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ గౌరీ హెగ్డేగా కనిపించనుంది. ఈ చిత్రంలో టబు రోల్ హైలెట్‌గా ఉండనుందని గ్లింప్స్ చూస్తుంటే అర్థమవుతోంది. 'మా ఓల్డ్ సిటీలో ముందు కాలుస్తాం.. తర్వాత మాట్లాడతాం' అనే డైలాగ్ మరింత ఆసక్తి పెంచుతోంది. కాగా.. ఈ మూవీలో సంయుక్త, దునియా విజయ్, జరీనా వహాబ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్లో పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మిస్తున్నారు. -
గోవిందాతో ఆ యువ నటి.. మళ్లీ తెరపైకి ‘కోమల్’ పేరు!
బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా వ్యక్తిగత జీవితం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ముంబై విమానాశ్రయంలో ఆయన యువ నటి కోమల్ రాణి స్వర్ణకర్‌తో కలిసి కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో గతంలో గోవిందా భార్య సునీత ఆహూజా చేసిన వ్యాఖ్యలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఇంతకీ ఆ ‘కోమల్’ ఎవరు? సునీత గతంలో ఎందుకు ఆమె పేరు ప్రస్తావించారో తెలుసుకుందాం..!గోవిందా, కోమల్ రాణి మధ్య గత నాలుగేళ్లుగా సంబంధం ఉందంటూ గతంలో కొన్ని వార్తలు, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. ఉత్తరాఖండ్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి వీరిద్దరూ కలిసి హాజరైనట్లు కూడా కొన్ని కథనాలు పేర్కొన్నాయి. అయితే ఈ ప్రచారంపై గోవిందా కానీ, కోమల్ కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.గతంలో సునీత ఏం చెప్పారు?గోవిందా వివాహేతర సంబంధాలపై గతంలో జరిగిన చర్చ సందర్భంగా సునీత ఆహూజా ఓ ఇంటర్వ్యూలో ‘కోమల్’ అనే పేరును ప్రస్తావించారు. ఓ ఇంటర్వ్యూలో కోమల్ పేరు గురించి ప్రశ్నించగా.. ఆ విషయంలో కొంత క్లారిటీ రావాల్సి ఉందని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. గోవిందా విషయంలో ఎప్పుడైనా వివాహేతర సంబంధానికి సంబంధించిన ఆధారాలు తనకు లభిస్తే మాత్రం క్షమించబోనని సునీత స్పష్టం చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు వీరిద్దరు కలిసి కనిపించడంతో సునీత అప్పట్లో ప్రస్తావించిన ‘కోమల్’ ఈమెనేనా? వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఎవరీ కోమల్ రాణి స్వర్ణకర్?ఉత్తరప్రదేశ్‌కు చెందిన కోమల్ రాణి స్వర్ణకర్ త్వరలో ‘రూపా’ అనే చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. -
సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులు ఇచ్చేస్తా: డైరెక్టర్
రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో వస్తోన్న లేటేస్ట్ మూవీ 'పాంచాలి పంచభర్తృక'. ఈ చిత్రంలో సరీ ఫర్, రోల్ రిడా, రాజ్ పవన్, జెమినీ సురేష్, వెంకట్ దుగ్గిరెడ్డి ఇతర కీలక పాత్రల్లో నటించారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రానికి గంగ సప్తశిఖర దర్శకత్వం వహించారు. ఈ మూవీని రాయల్ థ్రోన్ ప్రొడక్షన్స్, ఓం సాయిరాం ఆర్ట్స్ బ్యానర్స్‌పై వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ), రాజ్ పవన్ శ్రీకాంత్ సెట్టివారి, సాయినాథ్ మణ్యం నిర్మించారు ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.డైరెక్టర్ గంగ సప్తశిఖర మాట్లాడుతూ..' మా సినిమా ఆద్యంతం మిమ్మల్ని ఎంటర్ టైన్ చేస్తుంది. సినిమా మీకు నచ్చకపోతే మా రాయల్ థ్రోన్ బ్యానర్ ఇన్‌స్టా పేజికి టికెట్ పంపండి.. మీ డబ్బులు రిటర్న్ ఇస్తాం. ప్రేక్షకులు మెచ్చిన ఏ సినిమా అయినా ఫెయిల్ కాదు. మా సినిమా ఈ నెల 14న రిలీజ్ అవుతోంది. అమెరికాలో కూడా పెద్ద సంఖ్యలో మా మూవీ రిలీజ్ కానుంది. రాజేంద్రప్రసాద్ ఈ సినిమాలో పాటలు, ఫైట్స్ చేశారు. ఇటీవల కాలంలో మాలాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రాలేదని చెప్పగలను. ఈ సినిమా మేకింగ్‌లో ప్రతి ఆర్టిస్ట్, టెక్నీషియన్ నాకు సపోర్ట్ చేశారు. వారందరికీ థ్యాంక్స్ చెబుతున్నా.' అన్నారు. కాగా.. ఈ సినిమాకు మహేశ్ నారాయణ, బి షేక్ సంగీతమందించారు. -
లోకేశ్ కనగరాజ్ ‘డీసీ’ కలెక్షన్స్ ఎన్ని కోట్లు?
దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ తీసిన ‘డీసీ’ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. లోకేశ్ కనగరాజ్, వామికా గబ్బి ప్రధాన పాత్రలు చేసిన ఈ యాక్షన్ డ్రామా తొలి వీకెండ్ ముగిసే సరికి మంచి వసూళ్లు రాబట్టింది. ట్రేడ్ అంచనాల ప్రకారం మూడో రోజైన ఆదివారం మన దేశంలో రూ.9.55 కోట్ల నెట్ కలెక్షన్ సాధించిందని, శనివారం రూ.7కోట్లు వచ్చాయని టాక్. దీంతో మూడు రోజులకు కలిపి ఇండియాలో రూ. 20.95 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయని సమాచారం. గ్రాస్ రూ.24.11 కోట్లు అని తెలుస్తోంది.ఎక్కడెక్కడ ఎంత సాధించిందంటే..డీసీ తమిళంలో ఎక్కువ వసూలు చేసింది. ఆదివారం తమిళంలో రూ.6.60 కోట్లు నెట్.. తెలుగులో రూ. 2.30 కోట్లు, హిందీలో రూ. 65 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. మూడో రోజు ఓవర్సీస్లో రూ.2.25 కోట్లు రాబట్టిందని సమాచారం. దీంతో ఇప్పటివరకు ఓవర్సీస్ గ్రాస్ రూ.7.75 కోట్లకు చేరింది. ఇండియా, ఓవర్సీస్ కలిపి ‘డీసీ’ ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలక్షన్ రూ. 31.86 కోట్లుగా నమోదైంది.లోకేశ్ నటనకు ప్రశంసలు..డీసీలో దేవదాస్ పాత్రలో మెరిసిన లోకేశ్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ఇప్పటికే దర్శకుడిగా మంచి స్టార్డమ్ సంపాదించిన లోకేశ్.. హీరోగానూ తొలి ప్రయత్నంలోనే ఆకట్టుకున్నాడు. దీంతో లోకేశ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. వామికా గబ్బి పోషించిన చంద్రపాత్రకు కూడా మంచి పేరు వచ్చింది. వీళ్లిద్దరితో పాటు సంజనా కృష్ణమూర్తి.. పార్వతి పాత్రలో నటించారు. -
కారు ప్రమాదంలో ఏఆర్ రెహమాన్ కొడుకు
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కొడుకు అమీన్ ప్రయాణిస్తున్న కారు.. సోమవారం వేకువజామున రోడ్డు ప్రమాదానికి గురైంది. అయితే అమీన్ స్వల్వ గాయాలతో బయటపడటంతో రెహమాన్ ఊపిరి పీల్చుకున్నారు. చెన్నైలోని ఒలింపియా టెక్ పార్క్ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న లగ్జరీ కారు ఒక క్యాబ్‌ని ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది.పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున 3:30 గంటల టైంలో అమీన్ తన స్నేహితుడితో కలిసి జవహర్లాల్ నెహ్రూ రోడ్డులో గిండి వైపు వెళ్తున్నారు. వారి వాహనం ఒలింపియా టెక్ పార్క్ దగ్గరకు రాగానే, పక్కనే ఉన్న రోడ్డు నుంచి క్యాబ్ ఒక్కసారిగా మెయిన్ రోడ్ మీదకు వచ్చింది. దీంతో అమీన్ ప్రయాణిస్తున్న కారు, క్యాబ్ ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో అమీన్, అతని స్నేహితుడితో పాటు క్యాబ్‌లో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారిని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం చికిత్స అందించి, అందరినీ డిశ్చార్జ్ చేశారు. ఎవరికీ తీవ్రమైన గాయాలు కాలేదని పోలీసులు స్పష్టం చేశారు. కానీ ప్రమాదంలో రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. -
బాలకృష్ణ స్టెప్.. పశ్చాత్తాపడుతున్న శేఖర్ మాస్టర్
ఇప్పుడంతా సోషల్ మీడియా జమానా నడుస్తోంది. సినిమాల్లో ఎలా పడితే అలా సీన్స్ పెట్టినా, ఏది పడితే ఆ స్టెప్ వేసినా మనోభావాలు దెబ్బతినడం, ట్రోల్స్-విమర్శలు రావడం సర్వసాధారణం. గతేడాది సంక్రాంతికి ఇలానే 'డాకు మహారాజ్' మూవీలో బాలకృష్ణ వేసిన ఓ స్టెప్ చాలా విమర్శలకు కారణమైంది. అయితే దీన్ని కంపోజ్ చేసినందుకు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ పశ్చాత్తాపపడుతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.'ఈ స్టెప్ కొరియోగ్రాఫ్ చేసినందుకు ఎప్పుడైనా పశ్చాత్తపపడ్డారా? అనే యాంకర్ ప్రశ్నకు బదులిస్తూ.. ఆ పాటకు స్టెప్స్ కంపోజ్ చేస్తున్నప్పుడు తెలియలేదు. స్పెషల్ సాంగ్ ఎలా చేస్తామో ఇది అలానే చేశాను. కానీ జనాలు వేరేలా అర్థం చేసుకున్నారు. స్టెప్ అందరికీ తెలుసు కానీ నేను కంపోజ్ చేశానని చాలామందికి తెలీదు. కానీ చాలా వైరల్ అయింది' అని శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చాడు.బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ తదితరులు ప్రధాన పాత్రలు చేసిన ఈ సినిమాకు బాబీ దర్శకుడు. ప్రేక్షకుల నుంచి కంటెంట్ పరంగా మంచి స్పందనే దక్కించుకుంది కానీ 'దబిడి దిబిడి' పాటలో బాలయ్య, ఊర్వశి రౌతేలా పిరుదులపై బాదినట్లు ఉండే స్టెప్ మాత్రం చాలా ట్రోలింగ్కి గురైంది. ఇప్పుడు శేఖర్ మాస్టర్ దానిని చేసినందుకు పశ్చాత్తాపడుతున్నని చెప్పడంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది.Sekhar Master regretting for Dabidi Dabidi“I regret doing the ‘Dabidi Dabidi’ step. I thought it would be received differently, but it turned out the way it did. Everyone knows that step, but many may not know that I was the choreographer.” #Balakrishna #UrvashiRautela…— The Cine Gossips (@TheCineGossips) August 10, 2026 -
తెలంగాణ గొప్పతనం గురించి చెబుతూ హీరోయిన్ ఎమోషనల్
ఆదివారం హైదరాబాద్ వ్యాప్తంగా బోనాల వేడుక సందడిగా జరిగింది. పలు దేవాలయాల్లో టాలీవుడ్ సెలబ్రిటీలైన విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా తదితరులు కనిపించారు. ఇక మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర ఆలయంలో జరిగిన బోనాల ఉత్సవాలలో 'జాతిరత్నాలు' హీరోయిన్ ఫరియా అబ్దుల్లా పాల్గొంది. తీన్మార్ డ్యాన్స్ చేసి అలరించింది. అలానే తెలంగాణ కల్చర్ గొప్పతనం గురించి చెబుతూ ఎమోషనల్ అయింది.(ఇదీ చదవండి: 'ఇంద్రపుత్ర'గా అబ్బవరం పాన్ ఇండియా ప్రయత్నం)'చాలా కొత్తగా ఉంది. తెలంగాణ కల్చర్ అంటే ఇలానే ఉంటది. అందరినీ అంగీకరిస్తారు. అందరితో కలిసి ఉంటారు. అది బెస్ట్' అని ఫరియా భావోద్వేగానికి గురైంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలానే పోతురాజులతో కలిసి ఆకట్టుకునే డ్యాన్స్ కూడా చేసింది. ఈ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.వేరే మతానికి చెందిన అమ్మాయి అయినప్పటికీ బోనాల్లో పాల్గొని ఫరియా మతసామరస్యం చాటుకుంది. కెరీర్ విషయానికొస్తే.. జాతిరత్నాలు తర్వాత బంగార్రాజు, లైక్ షేర్ సబ్‌స్క్రైబ్, రావణాసుర, ఆ ఒక్కటి అడక్కు, కల్కి 2898 ఏడీ, మత్తు వదలరా 2, గుర్రం పాపిరెడ్డి, గాయపడ్డ సింహం చిత్రాల్లో నటించింది.(ఇదీ చదవండి: నేను ప్రేమలో పడటానికి కారణం 'ఇళయరాజా': హీరోయిన్ దుషార)తెలంగాణ కల్చర్ గొప్పతనం గురించి చెబుతూ ఎమోషనల్ అయిన ఫరియా అబ్దుల్లా..,❤️🥹🙌🏻తెలంగాణ వాళ్ళు అందరినీ ఆక్సెప్ట్ చేస్తారు..అందరితో కలిసి ఉంటారు ఇది నిజంగా బెస్ట్…🙌🏻_ @fariaabdullah2 pic.twitter.com/Lt1muoc6VF— ChAnduBRS✊🏻 (@IamPRVChAnduBRS) August 10, 2026Unmatched Energy And Full-On Bonalu Vibes! ❤️🔥🔥@FariaAbdullah Bringing Her Own Spark To The #Bonalu Festival In Hyderabad. Absolutely Love The Energy! 💃#Bonalu2026 #FariaAbdullah pic.twitter.com/SwrZYJBzR5— Hari SaaHo (@HariSaaho19) August 9, 2026 -
ఓటీటీలో అదరగొడుతున్న సినిమా.. వీరి రెమ్యూనరేషన్స్ ఎంతో తెలుసా!
తమిళ హీరో అధర్వ మురళి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఇదయం మురళి’. థియేటర్లలో విడుదలై మంచి స్పందన అందుకుంది. అయితే ఈ సినిమా ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన తర్వాత సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటీనటులు కనిపించడంతో వాళ్లు తీసుకున్న రెమ్యూనరేషన్స్ ఎంతన్నదానిపై ఆసక్తి నెలకొంది. మరి ఎంత తీసుకున్నారంటే..ధర్వ మురళి: ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.3 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు టాక్. ప్రీతి ముకుందన్: ఈ సినిమాకు సుమారు రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు తీసుకుందట.కయాదు లోహర్: ఈ బ్యూటీ రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం.నిహారిక ఎన్ఎం: ఆమెకు ఈ సినిమాకు సుమారు రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు పారితోషికం అందినట్లు తెలుస్తోంది.నట్టి నటరాజ్: ఈ సినిమాకు సుమారు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అందుకున్నట్లు సమాచారం. తమన్: ఈ సినిమాకి సంగీత దర్శకుడు తమన్. ఈయన యాక్టర్‌గానూ ఈ సినిమాలో కనిపించారు. రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు తీసుకున్నట్లు తెలుస్తోంది.మాళవిక మోహనన్: ఆమె సుమారు రూ.3 కోట్ల వరకు తీసుకున్నారని సమాచారం.ఫహాద్ ఫాజిల్: సాధారణంగా ఒక్కో సినిమాకు ఫహాద్ రూ.7 కోట్ల వరకు తీసుకుంటారట.మొత్తంగా ‘ఇదయం మురళి’లో అధర్వ మురళితో పాటు ఫహాద్ ఫాజిల్, మాళవిక మోహనన్, కయాదు లోహర్, తమన్ వంటి పలువురు ప్రముఖులు కనిపించడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. -
నేను ప్రేమలో పడటానికి కారణం 'ఇళయరాజా'
సర్పట్ట పరంపరై, రాయన్, వేట్టయాన్ లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమున్న హీరోయిన్ దుషారా విజయన్.. గతవారం 'జీడీ నాయుడు'తో థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను ప్రేమలో ఉన్న సంగతి బయటపెట్టింది. రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్నానని.. అయితే తాను ప్రేమలో పడటానికి ఇళయరాజా ఓ కారణమని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.(ఇదీ చదవండి: కాబోయే భార్య గురించి విశాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్)'ప్రస్తుతం నేను ప్రేమలో ఉన్నాను. దాని గురించి ఎక్కువగా చెప్పలేను కానీ రిలేషన్షిప్లో రెండేళ్లుగా ఉన్నాం. నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితం చాలా బాగుంది. పెళ్లెప్పుడు చేసుకోవాలని ఇంకా అనుకోలేదు. నా తల్లిదండ్రులకు కూడా ఈ సంగతి తెలుసు. సినిమాల్లోకి రావడానికి నేను ఎంతలా కష్టపడ్డానని వారికి తెలుసు కాబట్టి వివాహం విషయమై నాపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు''నా పార్ట్నర్ కూడా నా కెరీర్‌ని ఎంతో సపోర్ట్ చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తి దొరకడం నా అదృష్టం. అతడి దగ్గర నేను చిన్నపిల్లలా ఉంటాను. ప్రతి విషయంలోనూ అతడిపైనే ఆధారపడతాను. నా దగ్గర రూ.1000 ఉంటే, నేను ప్రేమించే వాళ్లకు దాన్ని ఇచ్చేస్తాను. నా ప్రేమ అలాంటిది. నేను ఎదుటివారికి ఇచ్చే గౌరవమే నాకు కూడా తిరిగి రావాలని కోరుకుంటాను. ప్రేమలో నేను చూసేది గౌరవం, నమ్మకం మాత్రమే''మా ఇద్దరికీ ట్రిప్స్ అంటే చాలా ఇష్టం. మా తొలి పరిచయం దుబాయ్‌లో జరిగింది. మా నాన్న స్నేహితుడి ద్వారా ఆయనతో పరిచయమయ్యాడు. మేమిద్దరం కలిసి కారులో వెళ్తున్నప్పుడు ఇళయరాజా పాట ప్లే అయింది. అది నాకు ఇష్టమైన పాట కావడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. మా ఇద్దరినీ కలిపిన తొలి అంశం ఇళయరాజానే అని నాకు అనిపిస్తుంది' అని దుషార తన లవ్ స్టోరీ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: 'ఇంద్రపుత్ర'గా అబ్బవరం పాన్ ఇండియా ప్రయత్నం) -
‘కిరాయి కోటిగాడు’గా మహేశ్.. వీడియో అదిరింది!
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు నిన్న (ఆగస్టు 9) సోషల్‌మీడియా వేదికగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేసిన ఓ ప్రత్యేక పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. సందీప్ ఏఐ వీడియోతో శుభాకాంక్షలు చెప్పగా.. మహేశ్ ఫిదా అయ్యాడు. లెంజడరీ నటుడు కృష్ణ నటించిన ‘కిరాయి కోటిగాడు’ సినిమాలో చెప్పిన ఓ డైలాగ్‌ను ఏఐతో రీక్రియేట్ చేసి పోస్ట్ చేశాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ప్రస్తుతం ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం స్పిరిట్. భద్రకాళి పిక్చర్, టి. సిరీస్ బ్యానర్స్‌పై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృష్ణ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. త్రిప్తి దిమ్రి హీరోయిన్. మహేశ్ బాబు విషయానికి వస్తే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వారణాసి చిత్రంతో 2027లో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. View this post on Instagram A post shared by Sandeep Reddy Vanga (@sandeepreddy.vanga) -
'ఇంద్రపుత్ర'గా అబ్బవరం పాన్ ఇండియా ప్రయత్నం
తెలుగు యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకడు. షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్ ప్రారంభించి, రాజావారు రాణిగారు' మూవీతో హీరో అయ్యాడు. తర్వాత పలు సినిమాలు చేశాడు గానీ చాలావరకు ఫ్లాపులే. ఎట్టకేలకు 'క' అనే థ్రిల్లర్ సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. దీని తర్వాత వచ్చిన 'దిల్రుబా' డిజాస్టర్ కాగా.. కె ర్యాంప్, చెన్నై లవ్ స్టోరీ చిత్రాలు సక్సెస్ అయ్యాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్, దర్శకుడిగా ఓ మూవీ చేస్తున్న కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ తన అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. 'ఇంద్రపుత్ర' పేరుతో మూవీని అనౌన్స్ చేశారు. సోమవారం ఈ టైటిల్ ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. కాటమరాయుడు, గాండీవధారి అర్జున, కుడి ఎడమైతే, కాంతార ఛాప్టర్ 1 సినిమాలకు పనిచేసిన శ్రీకాంత్ పుప్పాల దీంతో దర్శకుడిగా మారుతున్నాడు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.కిరణ్ అబ్బవరం పాన్ ఇండియా ప్రయత్నం మెచ్చుకోదగిందే గానీ అదెంత వరకు వర్కౌట్ అవుతుందనేది భవిష్యత్తులో తెలుస్తుంది. ఎందుకంటే పోస్టర్ చూస్తుంటే డివోషనల్ స్టోరీలా అనిపిస్తుంది. కానీ ఈ జానర్ ఇప్పుడు పాతబడిపోయింది. అదే టైంలో కిరణ్ మార్కెట్ కూడా టాలీవుడ్ వరకే పరిమితం. ఈ నిర్మాత గతంలో తెలుగు హీరో సుధీర్ బాబుతో 'జటాధర' అని ఓ మూవీ చేస్తే అది ఘోరంగా ఫెయిలైంది. మరి ఈసారి ఏం చేస్తారనేది చూడాలి?(ఇదీ చదవండి: ఆ ఒక్క కారణం వల్లే 'టెంపర్' రీమేక్ చేశా: విశాల్) -
అమితాబ్‌తో నటించాలనే కోరిక.. కోమాలో పాత్ర
బాలీవుడ్ నటి ప్రీతి జింటా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అందం, నటనలతో అప్పట్లో ఓ స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ 18వ సీజన్ తొలి ఎపిసోడ్లో అమిర్‌ఖాన్, సన్నీడియోల్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బచ్చన్ కుటుంబంతో కలిసి పనిచేసిన జ్ఞాపకాల్లో తనకు అత్యంత ఇష్టమైనది ఏంటని ప్రీతిని అడగ్గా.. ఓ సరదా సంఘటన గుర్తుచేసుకుంది.‘బచ్చన్ కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తా, గౌరవిస్తా. అమిత్జీతో కలిసి నటించాలని చాలా రోజులుగా ఎదురుచూశాను. అందుకోసం చాలా ప్రయత్నించాను. చివరకు 2003లో వచ్చిన ‘అర్మాన్’లో ఆయనతో నటించే అవకాశం వచ్చింది. దర్శకురాలు హనీ ఇరానీతో ఈ సినిమాలో అమిత్జీతో నాకు ఒక్క సీన్ అయినా ఉండాలని అడిగాను. అందుకు హనీ ఇరానీ సరదాగా.. ‘‘అమిత్జీతో నటించాలని అంతగా కోరుకుంటున్నావా? అయితే ఆ సీన్లో నువ్వు చనిపోవాల్సిందే’’ అన్నారు. దీంతో మూవీ నా పాత్రని కోమాలో ఉండేలా పెట్టారు. నేను కోమాలో ఉన్నట్లు నటించాలి. అమిత్జీ నా దగ్గరకు వచ్చారు. ఆయన ఎదురుగా ఉండటంతో తెగ భయపడిపోయాను. చనిపోయినట్లు నటించడం ఎంత కష్టమో అప్పుడే తెలిసింది. నేను కదులుతుండటంతో.. ‘ప్రీతి సీన్ పాడుచేస్తున్నారు.. మీరు కదులుతున్నారు’ అని టీమ్ వాళ్లు నాపై కోపంగా అరిచేవాళ్లు’ అని ప్రీతి జింటా చెప్పుకొచ్చింది.2003లో రిలీజైన ‘అర్మాన్’లో అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, ప్రీతి జింటా ప్రధాన పాత్రలు చేశారు. ప్రీతి తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. వెంకటేశ్ సరసన ‘ ప్రేమంటే ఇదేరా’, మహేశ్ రాజకుమారుడు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. -
ఆ ఒక్క కారణం వల్లే 'టెంపర్' రీమేక్ చేశా
ఇప్పుడంటే ఓటీటీల రీచ్ కారణంగా రీమేక్ సినిమాలు చాలావరకు తగ్గిపోయాయి. కొన్నేళ్ల ముందు వరకు ఈ ట్రెండ్ విపరీతంగా ఉండేది. ఉదాహరణ తీసుకుంటే తెలుగులో హిట్ అయిన మూవీని తమిళం లేదా కన్నడలో రీమేక్ చేశారు. అలా 2015లో ఎన్టీఆర్ చేసిన 'టెంపర్'ని నాలుగేళ్ల తర్వాత తమిళంలో 'అయోగ్య' పేరుతో రీమేక్ చేశాడు. చేస్తే చేశారు గానీ మళ్లీ తెలుగులో దాన్ని డబ్బింగ్ చేసి వదిలారు. ఇది చూసి చాలామంది షాకయ్యారు. చేసిందే రీమేక్.. మళ్లీ డబ్బింగ్ కూడానా అని నవ్వుకున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)తాజాగా ఇదే సందేహానికి హీరో విశాల్ స్వయంగా సమాధానమిచ్చాడు. ఇతడు హీరోగా నటించి తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా 'మకుటం'.. ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుంది. దీని ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు ఆడియెన్స్ నుంచి ఈ ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానమిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.'టెంపర్' క్లైమాక్స్‌లో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ మరెవరూ తిరిగి చేయలేరు. అంతటి అద్భుతమైన మ్యాజిక్ మరింత మందికి చేరువ కావాలనే ఒక్క ఉద్దేశంతోనే నేను ఈ సినిమాని రీమేక్ చేశాను. ఎన్టీఆర్ యాక్టింగ్ చూస్తున్నప్పుడు అసలు స్క్రిప్ట్ ఏంటనే విషయమే పూర్తిగా మరిచిపోయా. ఆయన ప్లే చేసిన ఎమోషన్స్ నన్ను అలా స్టన్ అయ్యేలా చేశాయి. ఎన్టీఆర్‌ని స్క్రీన్‌పై చూస్తున్నప్పుడు అగ్నిపర్వతం పేలినట్లు అనిపించింది. ఆయనలోని ఎనర్జీ, ఇంటెన్సిటీ నెక్స్ట్ లెవెల్. నేను చేసిన రీమేక్‌ని తెలుగులో డబ్బింగ్ చేసిన సంగతి నాకు తెలీదు. ఒకవేళ నేను నిర్మాత అయ్యుంటే ఆ తప్పు చేసేవాడిని కాదు' అని విశాల్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: కాబోయే భార్య గురించి విశాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్)"Telugu dub of #Temper tamil remake was the thing I was not aware of. If i was involved in the production, I wouldn't let it happen."- #Vishal pic.twitter.com/xKP32YIYlx— Movies4u Official (@Movies4u_Officl) August 9, 2026 -
లాభాల్లోకి 'కొరియన్ కనకరాజు'.. కలెక్షన్ ఎంతంటే?
మెగాహీరో వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ 'కొరియన్ కనకరాజు'. హారర్ కామెడీగా తీసిన ఈ చిత్రం గత వీకెండ్ థియేటర్లలోకి వచ్చింది. మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ మంచి వసూళ్లు సాధించింది. మూడు రోజుల్లోనే రూ.35 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకుంది. అలానే అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ అయిపోయింది.(ఇదీ చదవండి: దేశ విభజనతో నలిగిపోయిన 'ప్రేమ'కథ.. ఓటీటీ సినిమా రివ్యూ)గత కొన్నాళ్లుగా గని, గాంఢీవధారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్, మట్కా సినిమాలతో వరస డిజాస్టర్లు అందుకున్న వరుణ్ తేజ్.. ఈ మూవీతో మళ్లీ దారిలో పడ్డాడు. ఈ వీకెండ్ వరకు 'కొరియన్ కనకరాజు' జోరు ఉండేలా అనిపిస్తుంది. కొరియన్ బ్యాక్ డ్రాప్ హారర్ కథతో తీసిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన రితికా నాయక్ హీరోయిన్. కమెడియన్ సత్య కీలక పాత్ర చేశాడు. మేర్లపాక గాంధీ దర్శకుడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్) -
బాలీవుడ్ నుండి సౌత్ సినిమా వరకు.. ‘ప్లాగరిజం’ వివాదాలు!
సాహిత్యంలో నవలలు, నాన్-ఫిక్షన్, వ్యాసాలు, పీహెచ్డీ థీసిస్‌ల విషయంలో ‘ప్లాగరిజం’ (సాహిత్య చోరీ లేదా భావజాల దొంగతనం) అనే పదం సాధారణంగా వినిపిస్తూ ఉంటుంది. అయితే నాటకాలు, లలిత కళలు, సినిమా వంటి ఇతర సాంస్కృతిక, సృజనాత్మక రంగాలకు కూడా ఇది వర్తిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ‘ప్లాగరిజం’ నిబంధనలను అత్యధికంగా ఉల్లంఘిస్తున్న రంగం బహుశా సినిమానే అనే మాట వినిపిస్తోంది. ఎందుకంటే 1970లలో లేదా మరెప్పుడో ప్రపంచంలో ఎక్కడో తీసిన ఒక సినిమాను కాపీ కొట్టడం లేదా దాదాపుగా దానినే పోలిన చిత్రాన్ని రూపొందిండం, దానికి ఆధునిక పాత్రలను అద్దడం, కథలో చిన్న మార్పులు చేయడం, కథనంలో మాత్రం స్వల్ప పోలికలను ఉంచుకుని దానిని తమ సొంత సృష్టిగా ప్రచారం చేసుకోవడం చిత్రనిర్మాతలకు సులభం కావడంతో ఇది అత్యంత సాధారణంగా జరుగుతుంటుంది.‘ప్లాగరిజం’ అంటే..ఒకరి ఆలోచనలు, సమాచారం, భాష లేదా రచనను అసలు మూలాన్ని తగిన విధంగా గుర్తించకుండా (క్రెడిట్స్ ఇవ్వకుండా) ఉపయోగించడాన్ని ‘ప్లాగరిజం’ అంటారు. అసలైనదిగా నమ్మించే ప్రయత్నంలో ఒక రకమైన అనైతికత ఉండటం దీనిలోని ప్రధానాంశం. కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు జరిగే కాపీరైట్ ఉల్లంఘనకు, ‘ప్లాగరిజం’నకు ఎప్పుడూ ఒకే అర్థం ఉండదు. బౌద్ధిక ఆస్తి (ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ) రంగానికి చెందిన చాలా పదాల మాదిరిగానే, ‘ప్లాగరిజం’ కూడా ఆధునిక యుగానికి చెందిన భావనగా పరిణమించింది. భారతీయ లేదా అంతర్జాతీయ చలనచిత్రాల నుంచి కథలు, పాత్రలు, థీమ్‌లు, కథనాలను ‘అరువు తెచ్చుకోవడం’, ‘స్ఫూర్తి పొందడం’, ‘ప్రేరణ పొందడం’ లేదా ‘అడాప్ట్ చేసుకోవడం’ వంటివి హిందీ చలనచిత్ర పరిశ్రమలో కోకొల్లలుగా ఉన్నాయి.చార్లీ చాప్లిన్ సినిమా సినిమాతో..ఈ కోవలో ముందుగా గుర్తుకు వచ్చే చిత్రం రాజ్ కపూర్ నిర్మించిన ‘శ్రీ 420’. చార్లీ చాప్లిన్ సినిమా ‘ట్రాంప్’ (అవసరాల కోసం తిరిగే వ్యక్తి) ఇమేజ్ను స్ఫూర్తిగా తీసుకున్నారనే విమర్శలను ఈ చిత్రం ఎదుర్కొంది. రాజ్ కపూర్, నర్గిస్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘చోరీ చోరీ’ (1956) చిత్రం, క్లార్క్ గేబుల్, క్లాడియా కోల్బర్ట్ నటించిన హాలీవుడ్ హిట్ చిత్రం ‘ఇట్ హ్యాపెండ్ వన్ నైట్’ (1934)కి కాపీయే. ‘ఫిర్ సుభా హోగి’ (1958) చిత్రంలో రాజ్ కపూర్ ప్రధాన పాత్ర పోషించారు. ఇది దోస్తోవ్స్కీ రాసిన సామాజిక దృక్పథం కలిగిన ‘క్రైమ్ అండ్ పనిష్మెంట్’ నవల ఆధారంగా రూపుదిద్దుకుంది. క్వెంటిన్ టరాంటినో చిత్రం ‘రిజర్వాయర్ డాగ్స్’కి రీమేక్‌గా వచ్చిన ‘కాంటే’ చిత్రంలో బ్యాంక్ దొంగతనం నేపథ్యంలో బాలీవుడ్ పాటలు, నృత్యాలను జోడించారు.నైతికపరమైన ఉల్లంఘన 1991లో మహేష్ భట్ దర్శకత్వంలో, ఆయన కూతురు పూజా భట్, అమీర్ ఖాన్ ప్రధాన పాత్రల్లో అదే (కాంటే) సినిమాకు ఆధునికత, గ్లామరస్ జోడించి ‘దిల్ హై కి మాన్తా నహీ’ వచ్చింది. కాపీకి మూలమైన చిత్రం లేదా దర్శకుడి పేరును టైటిల్స్‌లో పేర్కొంటే ‘ప్లాగరిజం’ చేసినట్లు కాదు. కానీ చాలా సందర్భాలలో ఇది జరగదు. అయినా వారు నైతికపరమైన నిజాయితీని ఉల్లంఘించినవారవుతారు (చట్టపరంగా కాకపోయినా). జాన్ అబ్రహాం, నానా పటేకర్ నటించిన ‘టాక్సీ నంబర్ 9211’ (2006) చిత్రం, బెన్ అఫ్లెక్, శామ్యూల్ జాక్సన్ నటించిన ‘చేంజింగ్ లేన్స్’ (2002) ఆధారంగా తెరకెక్కిందని చెబుతారు.మోహన్‌లాల్.. ‘నేరు’పెద్ద దర్శకులు, భారీ బడ్జెట్ సినిమాలు ‘ప్లాగరిజం’ చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటుంటాయి. స్క్రిప్ట్‌లు, సన్నివేశాలు లేదా పాటలను కాపీ చేశారనే ఆరోపణలపై అనేక చిత్రాలు సవాళ్లను ఎదుర్కొన్నాయి. అయితే విదేశీ నిర్మాతలు, బ్యానర్లు వీటిని పట్టించుకోరు. దక్షిణాది రాష్ట్రాల సినిమాలు దీనికి మినహాయింపు కాదు. మలయాళ చిత్రం ‘నేరు’ (2023) విషయంలో, పిటిషనర్ దీపక్ ఉన్ని కేరళ హైకోర్టును ఆశ్రయించారు. జీతూ జోసఫ్, మోహన్‌లాల్ తెరకెక్కించిన ఈ కోర్టు రూమ్ డ్రామాలో తాను ఇదివరకే వారికి చెప్పిన స్క్రిప్ట్ లోని ఆలోచనలను ఉపయోగించారని ఆయన ఆరోపించారు. జీతూ జోసఫ్ దర్శకత్వం వహించిన ‘నేరు’ విడుదలపై కేరళ హైకోర్టు స్టే నిరాకరించింది. ఇక్కడ చిత్రంలో మోహన్‌లాల్ పెద్ద స్టార్‌గా ఉండటమే కారణం కావచ్చని అంటారు.కమల్ హాసన్.. ‘పాపనాశం’కమల్ హాసన్ కూడా తన కొన్ని సినిమాల్లో ‘ప్లాగరిజం’ ఆరోపణలను ఎదుర్కొన్నారు. దీనికి ఒక ఉదాహరణ ‘పాపనాశం’. ‘ఒరు మజక్కాలతు’ నవల కాపీరైట్లను ఉల్లంఘించారంటూ సతీష్ పాల్ నిర్మాతలు, దర్శకుడు జీతూ జోసఫ్‌పై దావా వేశారు. అయితే చిత్ర నిర్మాతలు, కమల్ హాసన్ మద్దతుతో దర్శకుడు జీతూ జోసఫ్ ఆ కేసును విజయవంతంగా ఎదుర్కొన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, సోనాక్షి సిన్హా నటించిన తమిళ చిత్రం ‘లింగా’పై మధురైకి చెందిన చిత్రనిర్మాత కె.వి. రవి రత్నం ఇది తన అసలు కథ అని ఆరోపించారు. అయితే ‘లింగా’ దర్శకుడు కె.ఎస్. రవికుమార్, రజనీకాంత్ స్వయంగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తూ, ‘లింగా’ పొన్కుమరన్ రాసిన కథ ఆధారంగా తెరకెక్కిందని తెలిపారు.ముంబై ఫిలింమేకర్స్ మాట ఇదే..జాతీయ అవార్డు గెలుచుకున్న కన్నడ చిత్రం ‘బ్యారి’ చట్టపరమైన పోరాటాన్ని ఎదుర్కొంది. చివరకు రచయిత్రి సారా అబూబక్కర్ నవలను అనధికారికంగా అడాప్ట్ చేసుకున్నందుకు ఆమెకు పరిహారం చెల్లించాల్సి వచ్చింది. అలాగే మ్యూజికల్ సిమిలారిటీకి సంబంధించి కాపీరైట్ క్లెయిమ్‌ల కారణంగా ‘కాంతారా’ చిత్రం హిట్ ట్రాక్ ‘వరాహ రూపం’ చట్టపరమైన ఆంక్షలు ఎదుర్కొంది. లక్ష్మణ్ దర్శకత్వం వహించి జయం రవి, అరవింద్ స్వామి నటించిన ‘బోగన్’ చిత్రం 2017లో ‘ప్లాగరిజం’ వివాదంలో చిక్కుకుంది. ప్రముఖ భారతీయ చలనచిత్ర విశ్లేషకుడు ఎంకే రాఘవేంద్ర రాసిన ‘ప్లాగిరిజంగ్ ఫర్ బాలీవుడ్’ అనే పత్రం ప్రకారం ‘పాపులర్ ఇండియన్ సినిమా హాలీవుడ్‌ను అనుకరిస్తుందని భావిస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో పశ్చిమ దేశాల సినిమాలతో పోలిస్తే తమ చిత్రాల కంటెంట్, ఫార్మాట్ భిన్నంగా ఉంటాయని ముంబై ఫిలింమేకర్స్ చెబుతున్నారు. భారతీయ ప్రేక్షకుల కోసం సినిమాలు తీయడంలో నిర్దిష్టమైన పద్ధతి ఉంటుందని వారు చెబుతున్నారు. అయితే హాలీవుడ్ ‘కాపీ’ చిత్రాలు విజయవంతం కావాలంటే ఆ చిత్రాల్లో భారతీయుల తీరు తెన్నులను, ఇక్కడి సంస్కృతిని సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నారు. అయితే ఇతరుల భావాలు, కాన్సెప్ట్‌ల ద్వారా ‘స్ఫూర్తి’ పొందడాన్ని, వాటికి భాష, సాంస్కృతిక కోణాలు, భారతీయతను జోడించి సినిమాలు తీయడాన్ని రాఘవేంద్ర సైద్ధాంతికంగా వ్యతిరేకించ లేదు. ఇది కూడా చదవండి: రష్యా నుంచి భారత్‌కు రైలు.. కొత్త కారిడార్ ప్లాన్? -
ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్
మరో వారం వచ్చేసింది. ఈసారి ఇండిపెండెన్స్ డే-వీకెండ్ కలిసొచ్చింది. దీంతో పలు తెలుగు సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. వాటిలో సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' స్పెషల్ అట్రాక్షన్ కాగా.. అగధ, పళ్లబురుసు, అనకాపల్లి లాంటి తెలుగు మూవీస్ అలానే విశాల్ 'మకుటం' అనే డబ్బింగ్ చిత్రం కూడా విడుదల కానుంది. వీటిలో దేనిపైనా పెద్దగా బజ్ అయితే లేదు.(ఇదీ చదవండి: దేశ విభజనతో నలిగిపోయిన 'ప్రేమ'కథ.. ఓటీటీ సినిమా రివ్యూ)మరోవైపు ఓటీటీల్లో 22 వరకు సినిమాలు, సిరీస్ ఈ వారం స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో రష్మిక 'కాక్ టెయిల్ 2', భారతభాగ్య విధాత లాంటి హిందీ చిత్రాతో పాటు మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే తెలుగు మూవీ కూడా ఉంది. ఉన్నంతలో ఇవే కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. వీకెండ్లో ఏమైనా సర్ప్రైజ్ స్ట్రీమింగ్‌లు ఉండొచ్చు. ఇంతకీ ఏ సినిమా ఏ ఓటీటీలోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఆగస్టు 10 నుంచి 16 వరకు)హాట్స్టార్హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 3 ఫినాలే (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 10108 బేస్ హాస్పిటల్: ఉరి (హిందీ సిరీస్) - ఆగస్టు 15జీ5భారత భాగ్య విధాత (హిందీ మూవీ) - ఆగస్టు 14నిబ్బానిబ్బీ (మరాఠీ సినిమా) - ఆగస్టు 14సన్ నెక్స్ట్మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ (తెలుగు సినిమా) - ఆగస్టు 14ఆహాచెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె-యూఎస్ఏ (తెలుగు కుకింగ్ షో) - ఆగస్టు 13నెట్ఫ్లిక్స్మిడ్ వింటర్ బ్రేక్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 10రోరీ స్కోవెల్: షో మస్ట్ గో ఆన్ (ఇంగ్లీష్ షో) - ఆగస్టు 11మౌరిన్హో (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - ఆగస్టు 11నాండో బిట్వీన్ టూ వరల్డ్స్ (బ్రెజిలియన్ సిరీస్) - ఆగస్టు 12ఏ చైల్డ్ ఆఫ్ మై ఓన్ (ఇంగ్లీష్ సినిమా) - ఆగస్టు 13డోంట్ సే గుడ్ లక్ (ఇంగ్లీష్ మూవీ) - ఆగస్టు 13మై బ్రిలియంట్ కెరీర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 13కాక్ టెయిల్ 2 (హిందీ సినిమా) - ఆగస్టు 14మోరియా (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 14ఉమెత్తో (ఆఫ్రికన్ సిరీస్) - ఆగస్టు 14మై బెస్ట్ ఫ్రెండ్, హిస్ గర్ల్‌ఫ్రెండ్ అండ్ మీ (జర్మన్ మూవీ) - ఆగస్టు 14అమెజాన్ ప్రైమ్ద ట్రెయిటర్స్ సీజన్ 2 (హిందీ రియాలిటీ షో) - ఆగస్టు 13సోనీ లివ్కౌన్ బనేగా కరోడ్‌పతి 18వ సీజన్ (హిందీ రియాలిటీ షో) - ఆగస్టు 10ఆపిల్ టీవీ ప్లస్ఉమెన్ ఇన్ బ్లూ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఆగస్టు 12లయన్స్ గేట్ ప్లేఆఖరి సవాల్ (హిందీ సినిమా) - ఆగస్టు 14మనోరమ మ్యాక్స్కాట్టలన్ (మలయాళ మూవీ) - ఆగస్టు 13(ఇదీ చదవండి: ఓటీటీలో సైకలాజికల్ హారర్ సినిమా 'బ్యాక్ రూమ్స్' తెలుగు రివ్యూ) -
ఫస్ట్ టైమ్ ఈ మూవీలో ఫైట్స్ చేశాను
అంజలి తెలుగమ్మాయి అయినప్పటికీ తమిళంలో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది పరందు పో చిత్రంలో మెరిసింది. ఈమె నటిస్తున్న తమిళ మూవీస్ వరసగా రిలీజ్‌కి సిద్ధమవుతున్నాయి. విశాల్‌కు జంటగా నటించిన మకుటం.. ఈ శుక్రవారం తెలుగు, తమిళంలో విడుదల కానుంది. 'ఏళు కడల్ ఏళు మలై' త్వరలో విడుదల కానుంది. వీటితో పాటు ఈగై అనే మరో తమిళ చిత్రం, ఒరు పెరుంగలియాట్టం అనే మలయాళ సినిమా ఈమె చేతిలో ఉన్నాయి.(ఇదీ చదవండి: ఇప్పటివరకు అలాంటిదేం జరగలేదు: జ్యోతిక)కాగా ఇటీవల చైన్నెలో జరిగిన 'మకుటం' మీడియా సమావేశంలో పాల్గొన్న అంజలి.. తన మిత్రుడు విశాల్ దర్శకుడిగా తొలి హిట్ అందుకోవాలని విషెస్ చెప్పింది. తమిళ కెరీర్లో తొలిసారి ఇందులోనే ఫైట్ సీన్స్ చేశానని చెప్పుకొచ్చింది. ఇదే మూవీలో అంజలి, విశాల్ చేసిన నచ్చావు మచ్చాన్ అనే పాట ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. కాగా వరుసగా విడుదలవుతున్న తన చిత్రాలతో ఈ బ్యూటీ మరోసారి తన సత్తాని చాటుకోబోతుంది.(ఇదీ చదవండి: సినిమా ఫ్లాప్‌ని ఒప్పుకొన్న తెలుగు దర్శకుడు) -
ఇప్పటివరకు అలాంటిదేం జరగలేదు
సూర్య, జ్యోతికది హిట్ జోడీ. పెళ్లికి ముందు పలు సినిమాల్లో కలిసి నటించిన వీళ్లు.. తర్వాత ఎవరికి వారు కెరీర్ పరంగా బిజీ అయిపోయారు. సూర్య తమిళ చిత్రాలతో బిజీగా ఉంటే, జ్యోతిక హిందీ చిత్రాల్లో నటిస్తోంది. అయితే మళ్లీ కలిసి నటించబోతున్నట్లు టాక్ నడుస్తుండగా దీనిపై జ్యోతిక స్పందించింది.(ఇదీ చదవండి: నటికి చేదు అనుభవం.. లిప్ కిస్ పెట్టిన లేడీ ఫ్యాన్)మేం మళ్లీ కలిసి నటించడానికి సిద్ధం అవుతున్నట్లు, కథలు కూడా వింటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు అలాంటిదేవీ జరగలేదు. మంచి కథ సెట్ అయితే కలిసి నటించడానికి సిద్దమే. తమకు ఆఫ్ స్క్రీన్‌లోనూ మంచి ప్రేమ లభిస్తోంది. ఆన్ స్క్రీన్‌లో తమని చూడాలని ఎవరూ కోరుకోవడం లేదు అనుకుంటా అని జ్యోతిక చెప్పుకొచ్చింది.సూర్య నటించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఈ శుక్రవారం థియేటర్లలో రిలీజ్ కానుంది. జీతూ మాధవన్ దర్శకత్వంలో నటిస్తున్న మూవీ షూటింగ్ పూర్తి అయ్యింది. 'రోలెక్స్' గురించి మాట్లాడుతూ లోకేశ్ కనకరాజ్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా చిత్రం చేసే పనిలో ఉన్నారని, తర్వాత 'విక్రమ్ 2' ఉందని.. అయినా రోలెక్స్ మూవీ ఉంటుందనీ, కథను రెడీ చేస్తున్నట్లు లోకేశ్ కనక రాజ్ చెబుతున్నాడని, అయితే అది ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది కాలమే చెప్పాలని సూర్య అన్నాడు. (ఇదీ చదవండి: సినిమా ఫ్లాప్‌ని ఒప్పుకొన్న తెలుగు దర్శకుడు) -
బ్రో... రిలాక్స్!
తిట్టకుండా తిట్టినట్లు కౌంటర్ ఇచ్చారు మృణాల్ ఠాకూర్. అసలేం జరిగిందంటే... తన కన్నా వయసులో పదేళ్లు చిన్న అయిన స్టార్ క్రికెటర్ యశస్వి జైస్వాల్‌తో మృణాల్ డేటింగ్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ వార్త గురించి ఆమె కాస్త ఘాటుగానే స్పందించారు. ‘‘బ్రో... రిలాక్స్. మేమిద్దరం ఎక్కడైనా జంటగా కనిపించామా? మీరు చూపించండి. చదువుకున్న మీలాంటివాళ్లు ఇలాంటి వదంతులు నిజం అని ఎలా నమ్ముతారు? దేశంలో ఎంతో జరుగుతోంది. జెన్ జీ నుంచి నేర్చుకుని, సరైన టాపిక్స్ మీద వీడియోలు చేయండి... అప్పుడు మీకు కావల్సినన్ని వ్యూస్ వస్తాయి’’ అని సోషల్ మీడియా వేదికగా మృణాల్ ఠాకూర్ స్పందించారు. ఇక ముంబైలోని ఓ కేఫ్ నుంచి మృణాల్, యశస్వి జైస్వాల్ విడి విడిగా వచ్చిన ఓ వీడియోను ఉద్దేశించి... ఈ ఇద్దరూ డేటింగ్ అనే వార్తను ప్రచారం చేయడం మొదలుపెట్టారు. తాజాగా మృణాల్ చేసిన కామెంట్‌కి నెటిజన్లు ఆమెకు మద్దతుగా ‘అబద్ధపు వార్తను ఎలా ప్రచారం చేస్తున్నారో? అసలు ఇద్దరు వ్యక్తులు ఒకే రోజు ఒకే రెస్టారెంట్‌కి వెళ్లకూడదా?’ అంటూ వదంతులు ప్రచారం చేస్తున్నవారిని ఉద్దేశించి కామెంట్ చేశారు. -
ఆమిర్‌తో అట్లీ?
ఆమిర్ ఖాన్ హీరోగా నటించనున్న కొత్త చిత్రంపై పూర్తి స్థాయిలో ఇంకా సరైన స్పష్టత రావడం లేదు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్, ‘త్రీ ఇడియట్స్’ సీక్వెల్, దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో ఓ సూపర్ హీరో మూవీ, అశుతోష్ గోవారీకర్ దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ మూవీ అంటూ ఆమిర్ నెక్ట్స్ చిత్రాలపై వార్తలు వినిపిం చాయి. కానీ ఇప్పటివరకు ఏ సినిమా సెట్స్‌కు వెళ్లలేదు.తమిళ దర్శకుడు అట్లీ ఇటీవల ఆమిర్ ఖాన్‌కు ఓ స్టోరీ లైన్ చె ప్పారట. ఈ కథ నచ్చి, ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నారట ఆమిర్. అయితే ఫైనల్ నరేషన్ జరగాల్సి ఉందట. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో చేస్తున్న ‘రాకా’ చిత్రీకరణతో అట్లీ బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయ్యాక ఆమిర్–అట్లీ కాంబినేషన్ సినిమా గురించి మరింత సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉంది. మరి... వీరి కాంబినేషన్ సెట్ అవుతుందా? వేచి చూడాల్సిందే. -
హాలీవుడ్లో యానిమేషన్ మూవీ
బాలీవుడ్ దర్శకురాలు నిత్య మెహ్రా ఓ యానిమేషన్ సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ హాలీవుడ్ యానిమేషన్ సినిమాను పారామౌంట్ పిక్చర్స్, జొనాథన్ గోల్డ్‌స్టైన్, జాన్ ఫ్రాన్సిస్ డేలీ, కునాల్ నయ్యర్ కలిసి నిర్మించనున్నారట. న్యూజెర్సీకి చెందిన ఇండో–అమెరికన్ టీనేజ్ అమ్మాయి అనుకోకుండా బాలీవుడ్ మ్యూజికల్ ప్రపంచంలోకి వెళ్లినప్పుడు, ఈ యంగ్ అమ్మాయికి ఎదరైన సవాళ్లు? పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని హాలీవుడ్ టాక్.‘బార్ బార్ దేఖో’ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అయిన నిత్య ఆ తర్వాత ‘మేడ్ ఇన్ హెవెన్’ సిరీస్‌తో పాపులర్ అయ్యారు. ఇప్పుడు హాలీవుడ్లో చేయనున్న యానిమేషన్ మూవీపై ఫోకస్ పెట్టారు. -
చిన్న కరెక్షన్!
విమర్శలను కూల్‌గా ఎదుర్కోవడం ఒక కళ. అందుకు తాజా ఉదాహరణ కీర్తి సురేష్. నాని హీరోగా నటించిన ‘ది ప్యారడైజ్’ చిత్రంలో కీర్తి ఒక స్పెషల్ సాంగ్‌కి డ్యాన్స్ చేశారు. కీర్తి ఈ పాట చేయడాన్ని విమర్శిస్తూ, ఓ యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేసింది. అవకాశాలు లేక ఇలా ఐటమ్ సాంగ్ చేసిందని ఆ యువతి విమర్శించింది. పైగా కన్నడ సినిమా ‘ది ప్యారడైజ్’లో కీర్తి నటించినట్లుగా పేర్కొంది.ఈ విమ ర్శకు కీర్తి సురేష్ కూల్‌గా సమాధానం ఇచ్చారు. ‘వేరే లెవెల్ (కన్నడ సినిమా అని చెప్పడాన్ని ఉద్దేశించి అయ్యుండొచ్చు)... చిన్న కరెక్షన్... నాని నటిస్తున్నది తెలుగు సినిమా... కన్నడ సినిమా కాదు’ అంటూ సోషల్ మీడియా వేదికగా కీర్తి స్పందించారు. అంతే... ‘భలే చురక వేశావ్... సరైన రీతిలో చె ప్పావ్’ అన్నట్లుగా పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు. ఇక నాని–కీర్తి సురేష్ ‘దసరా’ వంటి సూపర్ హిట్ మూవీలో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు నాని ‘ది ప్యారడైజ్’లో కీర్తి స్పెషల్ సాంగ్ చేశారు. ఈ చిత్రం సెప్టెంబరు 24న విడుదల కానుంది. -
అక్టోబరులో ఆరంభం
రవితేజ, శ్రీవిష్ణు హీరోలుగా హసిత్ గోలి దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కనుందనే టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించనున్నారట. కాగా, ఈ సినిమా రెగ్యులర్ షూట్‌ను సెప్టెంబరు చివర్లో లేదా అక్టోబరు ప్రారంభంలో మొదలుపెట్టాలని దర్శకుడు హసిత్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాను వచ్చే సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలనుకుంటున్నారు.అందుకే వీలైనంత త్వరగా షూటింగ్ ఆరంభించి, పూర్తి చేస్తే పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్‌కు మరింత సమయం లభిస్తుందని భావిస్తున్నారట హసిత్. ఇదిలా ఉంటే... రవితేజ హీరోగా నటించిన తాజా సినిమా ‘ఇరుముడి’ ఈ నెల 21న రిలీజ్ కానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్‌తో రవితేజ బిజీగా ఉంటారు. ఆ తర్వాత చిన్న విరామం తీసుకుంటారట. ఆ బ్రేక్ తర్వాత హసిత్‌తో చేయనున్న సినిమా చిత్రీకరణలో పాల్గొంటారట రవితేజ. ఈ చిత్రానికి ‘వీరాధి వీరులంట: కేరాఫ్ మహిళా మండలి’ అనే టైటిల్ అనుకుంటున్నారని సమాచారం. -
సినిమా ఫ్లాప్‌ని ఒప్పుకొన్న తెలుగు దర్శకుడు
తెలుగులో ప్రతివారం చాలా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. వాటిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుని హిట్ అయ్యేవి చాలా తక్కువగానే ఉంటాయి. కాకపోతే తమ మూవీ ఫ్లాప్ అయింది లేదంటే జనాలకు నచ్చలేదని విషయాన్ని దర్శకులు బహిరంగంగా ఒప్పుకోరు. కానీ డైరెక్టర్ అజయ్ భూపతి మాత్రం ట్వీట్ చేశాడు. పూర్తి బాధ్యత తనదేనని రాసుకొచ్చాడు.(ఇదీ చదవండి: నటికి చేదు అనుభవం.. లిప్ కిస్ పెట్టిన లేడీ ఫ్యాన్)మహేశ్ బాబు అన్న రమేశ్ బాబు కొడుకు జైకృష్ణ హీరోగా చేసిన తొలి సినిమా 'శ్రీనివాస మంగాపురం'. పదిరోజుల క్రితం థియేటర్లలో రిలీజైంది. కానీ తీసికట్టు కథాకథనాల కారణంగా తొలిరోజే ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. జైకృష్ణ యాక్టింగ్ పర్లేదనిపించినప్పటికీ ఓల్డ్ స్కూల్ తరహా మూవీ కావడంతో ప్రేక్షకులు తిరస్కరించారు. ఈ క్రమంలోనే తాజాగా అజయ్ భూపతి ట్వీట్ చేశాడు.'శ్రీనివాస మంగాపురం నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. ఎన్నో భావోద్వేగాలను, మధురమైన జ్ఞాపకాలను అందించింది. వాటిని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. జై కృష్ణ, రషా తడానీతో పనిచేస్తున్నప్పుడు వారు కొత్తవాళ్లనిపించలేదు. బాగా నటించారు. అశ్వనీదత్ గారితో కలిసి పనిచేయడం కూడా నాకు దక్కిన గొప్ప గౌరవం. కిరణ్ గారికి కూడా ధన్యవాదాలు. ఈ మూవీ ఫలితానికి సంబంధించిన పూర్తి బాధ్యత నేనే తీసుకుంటున్నా. త్వరలోనే మళ్లీ పుంజుకుని, మీ అందరికీ నచ్చే చిత్రంతో మీ ముందుకు వస్తా' అని అజయ్ భూపతి ట్వీట్ చేశాడు.ఈ దర్శకుడు కెరీర్ విషయానికొస్తే 'ఆర్ఎక్స్ 100'తో సెన్సేషన్ హిట్ అందుకుని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత 'మహాసముద్రం'తో డిజాస్టర్ అందుకున్నాడు. మళ్లీ 'మంగళవారం' క్రేజీ మూవీ తీసి సక్సెస్ సాధించాడు. ఇప్పుడు 'శ్రీనివాస మంగాపురం'తో ఫెయిల్యూర్ చవిచూశాడు. కాకపోతే ఫ్లాప్ ని కూడా నిజాయతీగా అంగీకరించాడు.(ఇదీ చదవండి: ‘శ్రీనివాస మంగాపురం’మూవీ రివ్యూ)#SrinivasaMangapuram is a very special film for me. It has given me so many emotions and memories that I will always cherish.Working with #JayaKrishna & #Rasha never felt like working with newcomers... they gave their best. Working with #AshwiniDutt Garu was also a great…— Ajay Bhupathi (@DirAjayBhupathi) August 8, 2026 -
నటికి చేదు అనుభవం.. లేడీ ఫ్యాన్ అత్యుత్సాహం
హిందీలో మూడు నాలుగు సినిమాలు చేసిన నటి నిఖితా రావల్‌కి ఊహించని అనుభవం ఎదురైంది. తాజాగా ఓ కార్యక్రమంలోనే ఈమె ఫొటోలకు పోజులిస్తుండగా ఓ మహిళా అభిమాని వచ్చి సెల్ఫీ అడిగింది. ఈ క్రమంలోనే అత్యుత్సాహం ప్రదర్శించింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఇప్పుడు వైజాగ్ రోడ్డుపై నడవలేకపోతున్నా: అల్లు అర్జున్)మిస్టర్ హాట్ మిస్టర్ కూల్, బ్లాక్ అండ్ వైట్, హీరో తదితర సినిమాల్లో నటించిన నిఖితా రావల్ మంచి డ్యాన్సర్‌గానూ గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అయితే కొత్త ప్రాజెక్టులేం చేయట్లేదు. ఇప్పుడు అభిమాని ఈమెకు లిప్ కిస్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే బాలీవుడ్లో ఇలాంటివి నిజంగా జరగడం కంటే ఎక్కువగా పీఆర్ స్టంట్స్‌గా చేస్తుంటారు. తమ గురించి ఎవరూ పట్టించుకోవట్లేదు. ఎలాంటి మూవీ ఛాన్సులు రాకపోతే ఏదో ఒకలా వైరల్ అవ్వాలని ప్రయత్నిస్తుంటారు. మరి నిఖితా రావల్ కూడా ఇలాంటి స్టంట్ ఏమైనా చేసిందా? లేదంటే నిజంగా జరిగిందా అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: మూడు నెలల తర్వాత ఓటీటీలోకి తెలుగు సినిమా)SHOCKING 😲 😱😭😲#NikitaRawal Forcefully Kissesd by her Female FAN . Or just a PR Gimmick ? pic.twitter.com/WJF8uuC4y5— Manoz Kumar (@ManozTalks) August 9, 2026 -
మూడు నెలల తర్వాత ఓటీటీలోకి తెలుగు సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా తెలుగువి ఎప్పుడొస్తుంటాయా అని ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. అలా మూడు నెలల క్రితం థియేటర్లలో రిలీజైన ఓ తెలుగు మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులోకి రానుంది?(ఇదీ చదవండి: ఇప్పుడు రోడ్డుపై నడవలేకపోతున్నా: అల్లు అర్జున్)త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ జంటగా నటించిన మూవీ 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్'. రైతుల నేపథ్య కథతో దీన్ని తీశారు. ఈ ఏడాది మే 15న థియేటర్లలోకి వచ్చింది. పెద్దగా పేరున్న నటీనటులు లేకపోవడం, కంటెంట్ కూడా ఓ మాదిరిగా ఉండటంతో ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు దీనిని ఈ శుక్రవారం(ఆగస్టు 14) నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు.'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' విషయానికొస్తే.. అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే అరవింద్ (త్రిగుణ్).. తన జాబ్‌కి రాజీనామా చేసి స్వదేశానికి తిరిగొస్తాడు. ఆ తర్వాత ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని ఫిక్స్ అవుతాడు. ఇందులో కొత్త పద్దతులు ప్రవేశపెట్టడమే కాకుండా రైతులు ఆదాయం పెంచడానికి 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' యాప్ తీసుకొస్తాడు. దీనితో రైతుల జీవితం ఎలా మారింది? మహి(పాయల్ రాధాకృష్ణ)తో అరవింద్ ప్రేమ సంగతేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: కంటతడి పెట్టించే ప్రేమకథా సినిమా.. ఓటీటీ సినిమా తెలుగు రివ్యూ) -
బుల్లిగౌనులో ఆషిక బర్త్ డే సెలబ్రేషన్.. బాలనటిని గుర్తుపట్టారా?
ఆషికా రంగనాథ్ పుట్టినరోజు సెలబ్రేషన్స్ఓరచూపుతో మాయ చేస్తున్న రుక్మిణి వసంత్టాలీవుడ్ బాలనటి అవంతిక గ్లామరస్ పోజులుచీరలో గాజులతో సింపుల్‌గా 'కోర్ట్' శ్రీదేవిడెలివరీ తర్వాత భర్తతో కలిసి రెబా సెలబ్రేషన్మేకప్ లేకుండా క్యూట్ పోజులిచ్చిన మృణాల్ View this post on Instagram A post shared by Sri devi (@srideviactor) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth) View this post on Instagram A post shared by Ritika_nayak (@ritika_nayak__) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) View this post on Instagram A post shared by Ivana (@i__ivana_) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Yukti Thareja (@realyukti) View this post on Instagram A post shared by avantika (@avantika) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) -
'కింగ్డమ్' విలన్... తెలుగులోకి హీరోగా ఎంట్రీ
విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' సినిమాలో విలన్‌గా మెప్పించిన వెంకటేశ్ వీపీ.. స్వతహాగా మలయాళీ అయినప్పటికీ తొలి సినిమాతోనే తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. పక్కా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తీస్తున్న 'డీజీపీ' (వర్కింగ్ టైటిల్) మూవీలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. గోదావరిఖనికి చెందిన సురేశ్ తేజ్ దర్శకుడు కాగా శివ బొమ్మక్ నిర్మాత.(ఇదీ చదవండి: లోకేశ్ 'డిసి'.. విజయ్ దేవరకొండే చేయాలి కానీ)ఈరోజు (ఆగష్టు 9) వెంకటేశ్ వీపీ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం అతడికి ఆహ్వానం పలుకుతూ వినూత్న రీతిలో వీడియో విడుదల చేసింది. ఈ నేపథ్యంలో వెంకీ.. మూవీ యూనిట్‌కు ధన్యవాదాలు తెలిపాడు. 'దాదాపు ఏడాది కాలంగా ఇలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. ఎట్టకేలకు ఇది జరిగింది. రుద్రాంశ్ సెల్యూలాయిడ్‌తో కలిసి పనిచేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ చిత్రం నాకెంతో ప్రత్యేకం. నా జీవితంలో దక్కిన ఈ సంతోషాలకు ఎంతో కృతజ్ఞుడిని. కొత్త ప్రయాణం మొదలు' అని వెంకీ భావోద్వేగానికి లోనయ్యాడు.కేరళకు చెందిన వెంకటేశ్ వీపీ బుల్లితెరపై యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుని ఒక్కోమెట్టు ఎక్కుతూ హీరోగా ఎదిగాడు. మలయాళంలో పలు సినిమాల్లో నటించిన అతడు కింగ్డమ్ మూవీతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. మురుగన్ అనే విలన్ పాత్రలో ఒదిగిపోయాడు. తెలుగులో రెండో సినిమాతోనే హీరోగా అవకాశం దక్కించుకున్నాడు.(ఇదీ చదవండి: దేశ విభజనతో నలిగిపోయిన 'ప్రేమ'కథ.. ఓటీటీ సినిమా రివ్యూ) View this post on Instagram A post shared by Ruudranshcelluloid (@ruudranshcelluloid) -
దేశ విభజనతో నలిగిపోయిన 'ప్రేమ'కథ.. ఓటీటీ సినిమా రివ్యూ
ప్రేమకథలకు భాషతో సంబంధం లేదు. బాగుండాలే గానీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. అలా రీసెంట్ టైంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన హిందీ సినిమా 'మై వాపస్ ఆవుంగా'. జూన్‌లో థియేటర్లలో రిలీజైంది. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నసీరుద్దీన్ షా, దిల్జిత్ దోసాంజ్, వేదాంగ్ రైనా, శార్వరి వాఘ్ ప్రధాన పాత్రధారులు. రెండు రోజుల క్రితం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఇంతకీ ఇదెలా ఉంది? ఏడిపించేంతలా ఇందులో ఏముందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ మిస్టరీ థ్రిల్లర్ 'ఉయిర్' తెలుగు రివ్యూ)కథేంటి?చంఢీగడ్‌లో ఉండే 95 ఏళ్ల కీను అలియాస్ ఇషార్ సింగ్ గ్రెవాల్ (నసీరుద్దీన్ షా) ఎలాగైనా సరే పాకిస్థాన్‌లోని సర్గోదా నగరానికి వెళ్లాలని పట్టుబడుతుంటాడు. అదలా ఉండగానే స్ట్రోక్ వస్తుంది. దీనికి తోడు మెల్లమెల్లగా జ్ఞాపకశక్తిని కోల్పోతుంటాడు. చివరదశలో తాతకు తోడుగా ఉండేందుకు ఇంగ్లాండ్‌లో నుంచి మనవడు నిర్వార్(దిల్జీత్ దోసాంజ్)స్వదేశానికి తిరిగొస్తాడు. తాతతో మాట్లాడుతూ ఆయన గతం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఇంతకీ కీను.. పాక్ ఎందుకు వెళ్లాలనుకుంటున్నాడు? ఎవరిని కలవాలనుకుంటున్నాడు? అసలు 1947 దేశ విభజన టైంలో ఏం జరిగింది? అనేది అసలు స్టోరీ.ఎలా ఉందంటే?భారత్-పాక్ విడిపోయి 78 ఏళ్లు అయిపోయింది. అప్పుడేం జరిగిందో కళ్లారా చూసిన సరిహద్దు రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు చాలావరకు జీవించిలేరు. ఇప్పటితరానికి ఆ సంగతులేవి పెద్దగా తెలీదు. చరిత్ర పుస్తకాల్లోని ఫొటోలుగా మాత్రమే చూశారు, చూస్తున్నారు. కానీ దేశవిభజన జరిగినప్పుడు నరకాన్ని అనుభవించిన ఆనాటి తరం పరిస్థితి ఏంటి? తమ సొంత ఇళ్లని, ప్రాణానికి ప్రాణమైన మనుషుల్ని వదిలేసి ఇక్కడికి వచ్చినవాళ్ల బాధేంటి? వారు తమ జీవితాంతం మోసిన ఆ గుండెకోత, గాయాల విలువెంత? అనేది ఓ ప్రేమకథతో చూపించిన సినిమానే 'మై వాపస్ ఆవుంగా'.సినిమా మొదలైన నిమిషాల్లోనే స్టోరీలోకి నేరుగా వెళ్లిపోతాం. 1947లో మన దేశంలోని పంజాబ్‌కి వలస వచ్చిన ఓ కుర్రాడు.. తిరిగి పాకిస్థాన్‌లోని పంజాబ్‌కి వెళ్లాలని ప్రయత్నం చేసే సీన్‌తో కథ మొదలవుతుంది. అసలు ఇంతకీ ఇతడెవరు? దేశ విభజన జరగకముందు ఎలా ఎక్కడ ఉండేవాడు? ఎవరిని ప్రేమించాడు? అసలు 1947లో ఏం జరిగింది? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన జియా అనే అమ్మాయిని వదిలేసి ఎందుకు రావాల్సి వచ్చింది? అనే విషయాల్ని ఒక్కొక్కటిగా చూపించారు.మూవీ ప్రారంభమైన కాసేపటికి స్క్రీన్‌ప్లే కాస్త నెమ్మదిస్తుంది. ఇంటర్వెల్ వచ్చేసరికి ఈ పాత ప్రేమకథలో ఇక చెప్పడానికి ఏముంది? అనిపించింది. ఎప్పుడైతే సెకండాఫ్ మొదలవుతుందో మన మదిలో మెదిలిన ఒక్కో ప్రశ్నకు సమాధానాలు కనిపిస్తాయి. అప్పటివరకు సరదాగా, థ్రిల్లింగ్‌గా సాగిన సినిమా కాస్త గుండెల్ని పిండేసేలా మారుతుంది. క్లైమాక్స్‌లో అయితే ఏడిపించేసింది. అంతా అయిపోయిన తర్వాత అద్భుతమైన ప్రేమకథ చూశామే అని అనుభూతి కలిగింది.1947 విభజన అనగానే చాలామంది దాన్ని రాజకీయంగానే చూస్తారు. కానీ ఈ సినిమాలో ఆ సంఘటనని మనుషుల జీవితాలని శాశ్వతంగా మార్చిన విషాదంగా చూపించారు. మతాలు వేరు అయినప్పటికీ కీను-జియా ప్రేమించుకుంటూ ఉంటారు. అమాయకమైన ప్రేమ, చిలిపితనం, దొంగచూపులతో సాగుతున్న వీరి బంధాన్ని 1947 విభజన ఛిద్రం చేస్తుంది. రాడ్‌క్లిఫ్ అనే బ్రిటీషర్ గీసిన విభజన రేఖ కారణంగా కీను తప్పనిసరి పరిస్థితుల్లో భారత్‌కు రావాల్సి వస్తుంది. జియా పాక్‌లోనే ఉండిపోతుంది. తిరిగి కలుస్తానని ఆమెకు మాట ఇచ్చిన కీను.. ఆ జ్ఞాపకంతోనే జీవితాన్ని కొనసాగిస్తాడు. కానీ కలవలేకపోతాడు.ఇది జరిగిన 78 ఏళ్ల తర్వాత కీను మనవడు.. తాత కోరికని ఎలా నెరవేర్చాడు? ఈ క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడనేది ఇందులో హృద్యంగా చూపించారు. దేశం కోసం చేసే త్యాగం మాత్రమే గొప్పది కాదు, స్వస్థలాన్ని వదిలి వెళ్లాల్సిన శరణార్థి కన్నీటిలోనూ అపారమైన విలువ ఉందని ఇందులో అద్భుతంగా చూపించారు.ప్రస్తుత సమాజంలో ప్రేమకు విలువ లేకుండా చేశారు. కానీ అప్పట్లో ప్రేమ అంటే ఎలా ఉండేదో తెలియాలంటే ఈ మూవీ చూడండి. ఓ సీన్లో కీను, జియాని ముద్దుపెట్టుకుంటాడు. ఆమె ఇబ్బందిపడేసరికి ఇక జీవితంలో ఎప్పుడు ఇలా చేయనని అంటాడు. పెళ్లయినా సరే నన్ను ముద్దుపెట్టుకోవా అని జియా గోముగా అడుగుతుంది. ఈ సీన్ చూస్తున్నప్పుడు భలే క్యూట్‌గా అనిపిస్తుంది. అలానే రాజకీయాల కోసం రెండు మతాలు, దేశాల మధ్య చిచ్చుపెట్టి బ్రిటీషర్లు ఎలాంటి దమనకాండ సృష్టించారో ఇందులో కంటతడి పెట్టించేలా చూపించారు. 'శత్రువు వెళ్లిపోయాడు.. మనలో మనల్ని శత్రువులుగా మార్చాడు' అనే డైలాగ్ అప్పటి పరిస్థితులకు అద్దం పడుతుంది.ఎవరెలా చేశారంటే?ఇందులో 95 ఏళ్ల వృద్ధుడిగా చేసిన నసీరుద్దీన్ షా కళ్లతోనే హావాభావాలు పలికించాడు. తన నటన అనుభవం ఏంటో ఇందులో మరోసారి చూపించాడు. యుక్త వయసు కీనుగా చేసిన వేదాంగ్ రైనా, జియాగా చేసిన శార్వరి వాఘ్ కూడా వాళ్ల పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేశారని చెప్పొచ్చు. చూస్తున్నంతసేపు వీళ్లు కనిపించరు సదరు పాత్రలే దర్శనమిస్తాయి. దిల్జీత్ దోసాంజ్ కూడా తాత కోరికని నెరవేర్చే మనవడి పాత్రలో పర్లేదనిపించాడు. మిగిలిన వాళ్లు కూడా తమకిచ్చిన రోల్స్‌కి న్యాయం చేశారు.ఈ సినిమాలో నటీనటులు ఎంత తోడ్పాటు అందించారో డైరెక్టర్ ఇంతియాజ్ అలీ, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అంతకుమించి కష్టపడ్డారు. విజయానికి మూలకారకులు వీళ్లే. తనదైన టేకింగ్‌తో దర్శకుడు.. కథలో లీనమయ్యేలా రెహమాన్ తన మ్యూజిక్‌తో ప్రేమకథకు ప్రాణం పోశాడు.ఈ సినిమా నిడివి 2 గంటల 46 నిమిషాలు. హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. కానీ స్క్రీన్ మీదున్న పాత్రలతో ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యేలా చేయడంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ అయ్యాడు. అందువల్ల సినిమా చూస్తున్నప్పుడు టైమ్ ఎలా గడిచిపోయిందో కూడా మనకు తెలియదు. గడియారంలోని ముల్లుల కంటే పాత్రల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ మనల్ని కట్టిపడేస్తుంది. ఎలాంటి అసభ్యకర సీన్స్ లేవు. కుటుంబంతోనూ కలిసి చూడొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలో సైకలాజికల్ హారర్ సినిమా 'బ్యాక్ రూమ్స్' తెలుగు రివ్యూ) -
నటిగా కాదు.. భార్యగా ఆ ఛాన్స్ వదులుకున్నా: ఐశ్వర్య
షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమా 2014లో ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పనక్కర్లేదు. అయితే ఈ సినిమాలో దీపికా పాత్రకు ముందుగా ఐశ్వర్యరాయ్ బచ్చన్‌ను సంప్రదించారట దర్శకురాలు ఫరాఖాన్. కానీ ఆ సమయంలో భర్త అభిషేక్ బచ్చన్‌తో కూడా నటిస్తుండటం, షారుఖ్‌తో ఎక్కువ కెమిస్ట్రీ సీన్లు ఉండటంతో ఆమె ఆ అవకాశాన్ని తిరస్కరించిందట.ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య మాట్లాడుతూ.. ‘‘ఆరాధ్య పుట్టిన తర్వాత సినిమాలకు కొంత విరామం తీసుకున్నా. ‘హ్యాపీ న్యూ ఇయర్’ చేసి ఉంటే మంచి కంబ్యాక్ అయ్యేది. నటిగా ఆ అవకాశాన్ని వదులుకోవడం అంత సులభం కాదు. కానీ భార్యగా ఆ నిర్ణయం తీసుకున్నా’’ అని చెప్పింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా ఐశ్వర్య చివరిగా ‘పొన్నియిన్ సెల్వన్’లో కనిపించింది. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీపికా విషయానికి వస్తే సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘కింగ్’ సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమాలోనూ నటిస్తోంది. -
ఇప్పుడు వైజాగ్ రోడ్డుపై నడవలేకపోతున్నా: అల్లు అర్జున్
ప్రస్తుతం 'రాకా' సినిమాతో బిజీగా ఉన్న అల్లు అర్జున్.. వైజాగ్‌లో కనిపించాడు. తన 'ఏఏఏ సినిమాస్' మల్టీప్లెక్స్‌ని ఘనంగా ప్రారంభించాడు. హైదరాబాద్‌లో ఇప్పటికే ఇలా ఓ మల్టీప్లెక్స్ ఉండగా.. ఇప్పుడు విశాఖపట్నంలోనూ లాంచ్ చేశాడు. ఈ సందర్భంగా బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు వైజాగ్ రోడ్డుపై అస్సలు నడవలేకపోతున్నానని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: భారత క్రికెటర్ జైస్వాల్‌తో డేటింగ్? క్లాస్ పీకిన మృణాల్)'గంగోత్రి' రోజుల్లో వైజాగ్ రోడ్డుపై ఎవరూ నన్ను గుర్తుపట్టేవారు కాదు. ఇప్పుడు అదే రోడ్డుపై నడవలేకపోతున్నాను. 'రాకా' షూటింగ్ ముంబైలో జరుగుతోంది. వైజాగ్ ప్రజల కోసం ఒక రోజు బ్రేక్ అడిగి వచ్చాను. అయితే పోలీసులు నన్ను ఎయిర్పోర్ట్ నుంచి పువ్వుల్లో పెట్టుకుని తీసుకొచ్చారు. వాళ్లకు థ్యాంక్స్' అని అన్నాడు. ఇక ఎదురుగా ఉన్న కొందరు అభిమానులు ఫొటో కావాలని అడగడంతో అందరూ ఇక్కడికి వచ్చేయండి అని స్టేజీపైకి ఆహ్వానించాడు. ఫ్యాన్స్‌కి నో అని చెప్పటం నా వల్ల కాదమ్మా అని అన్నాడు.ఎనిమిది స్క్రీన్లు ఉన్న ఈ మల్టీప్లెక్స్‌లో 'పుష్ప'లో గడ్డం కింద చేయి పెట్టే పోజు ఉన్న బన్నీ బొమ్మని ప్రదర్శన కోసం ఉంచారు. అలానే అల్లు అర్జున్‌కి సంబంధించిన పలు సినిమా స్టిల్స్ కూడా ఉంచారు. ఇకపోతే ప్రస్తుతం 'రాకా' చేస్తూ బిజీగా ఉన్నప్పటికీ మరోవైపు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలోనూ తన 23వ మూవీ చేయనున్నాడు. దీని ప్రీ ప్రొడక్షన్ వర్క్ హైదరాబాద్‌లో జరుగుతోంది.(ఇదీ చదవండి: ఆమె బదులు మరెవరున్నా తల పీక్కుని పారిపోయేవాళ్లు: విశాల్)#Gangotri Movie Shooting రోజుల్లో #Vizag రోడ్లపై వెళ్తున్నప్పుడు Nannu ఎవరూ గుర్తుపట్టేవారు కాదు...#AlluArjun pic.twitter.com/6Hevu8EiXN— Milagro Movies (@MilagroMovies) August 9, 2026The ICONIC PUSHPA Pose @alluarjun 🙅🏻🔥📍 AAA Cinemas, Vizag#AlluArjun @aaacinemasoffl #Pushpa2TheRule pic.twitter.com/V0o18cVzUj— Pushpa2TheRule 𝕏🧢 (@uicaptures) August 9, 2026 -
అప్పుడు కలవనివ్వలేదు.. ఇప్పుడు అదే హీరోతో!
మలయాళ నటి మమితా బైజు ప్రస్తుతం వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉంది. ప్రేమలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ‘డ్యూడ్’ ‘జన నాయకన్’ చిత్రాలతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. సూర్యతో కలిసి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో ఈ శుక్రవారం(ఆగస్టు 14) ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కేరళలో శనివారం జరిగింది. ఇందులో మాట్లాడిన మమిత తన చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తుచేసుకుంది.‘2015లో సూర్య ఓ కార్యక్రమం కోసం కొచ్చి వచ్చారు. అప్పుడు నేను ఎనిమిది, మా అన్నయ్య ఇంటర్ చదువుతున్నాం. సూర్యని చూసేందుకు అన్నయ్య తన స్నేహితులతో కలిసి కొచ్చి వెళ్లాడు. నేనూ వెళ్తానంటే మా తల్లిదండ్రులు పంపించలేదు. అన్నయ్య సూర్యతో ఫొటో దిగి చూపించాడు. నేను చాలా బాధపడ్డాను. ఇప్పుడు అదే హీరోతో కలిసి నటించే అవకాశం దక్కింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సూర్యతో కలిసి ఒకే వేదికపై నిలబడటం అదృష్టంగా భావిస్తున్నాను’ అని మమిత చెప్పుకొచ్చింది. అభిమానిగా సూర్యని చూడాలనుకున్న తనకు.. ఇప్పుడు ఆయన సినిమాలో నటించే అవకాశం రావడం గొప్ప ఆశీర్వాదమని పేర్కొంది.వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 45 ఏళ్ల వ్యక్తి 20 ఏళ్ల అమ్మాయితో ప్రేమలో పడటం అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. ఇందులో రవీనా టాండన్, రాధికా శరత్‌కుమార్, నాజర్ తదితరులు కీలక పాత్రలు చేశారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించాడు. -
ఆమె బదులు మరెవరున్నా తల పీక్కుని పారిపోయేవాళ్లు
తమిళ హీరో విశాల్ తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా 'మకుటం'. హీరో కూడా ఇతడే. అంజలి, దుషారా విజయన్ హీరోయిన్లు. ఆర్బీ చౌదరి నిర్మించిన 99వ చిత్రమిది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతమందించాడు. ఈ శుక్రవారం(ఆగస్టు 14) తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఇందులో విశాల్ త్రిపాత్రాభినయం చేశాడు. తాజాగా చైన్నెలోని ఓ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: ఓటీటీలో సైకలాజికల్ హారర్ సినిమా 'బ్యాక్ రూమ్స్' తెలుగు రివ్యూ)దర్శకుడుగా నాకు అవకాశమిచ్చిన నిర్మాత ఆర్బీ చౌదరికి ఎప్పటికీ రుణపడి ఉంటా. ఆయన పరిచయం చేసిన 45వ దర్శకుడిని నేను. ఆమధ్య 14 నెలలుగా ఖాళీగా ఉన్నప్పుడు నా కష్టకాలంలో అండగా నిలిచి ప్రోత్సహించిన నా కాబోయే భార్య సాయి ధన్సికకు ధన్యవాదాలు. ఆమె స్థానంలో ఎవరైనా ఉంటే తల పీక్కుని పారిపోయేవారు. నా గురువు అర్జున్‌కి కృతజ్ఞతలు. నన్ను నటించమని ప్రోత్సహించింది ఆయనే. రాంగోపాల్ వర్మ తీసిన 'శివ' చూసిన తర్వాత దర్శకుడిని అవ్వాలనే కోరిక కలిగింది. అది 35 ఏళ్ల తర్వాత ఇప్పుడు నెరవేరింది. నా తల్లిదండ్రులకు ఎప్పుడు రుణపడి ఉంటాను. వారి ప్రోత్సాహమే నన్ను స్థాయికి చేర్చింది అని విశాల్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: త్రివిక్రమ్ మాతో మాత్రమే సినిమాలు ఎందుకు చేస్తారంటే?: నాగవంశీ) -
వారణాసిలో హనుమంతుడి పాత్ర.. రాజమౌళి ప్లాన్ అదేనా?
మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో వస్తోన్న మోస్ట్ అడ్వెంచరస్ మూవీ వారణాసి. వీరిద్దరి కాంబినేషన్లో తొలిసారి వస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ రోజు మహేశ్ బాబు బర్త్ డే కావడంతో జక్కన్న క్రేజీ అప్డేట్ ఇచ్చారు. మహేశ్ బాబు రుద్ర పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. అంతేకాకుండా మందాకినిగా చేస్తోన్న ప్రియాంక చోప్రా పోస్టర్ కూడా పంచుకున్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో క్రేజీ టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం త్రేతాయుగం ఎపిసోడ్లో మహేశ్ బాబు రాముడిగా కూడా కనిపించనున్నారు. ఈ నేపథ్యంలోనే హనుమంతుడి రోల్ ఎవరనే విషయంపై చర్చ మొదలైంది. ఈ పాత్రలో ఎవరు చేస్తున్నారనే దానిపై ఆడియన్స్‌లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. అయితే ఈ పాత్ర కోసం జక్కన్న ఇప్పటికే వేట ప్రారంభించినట్లు తెలుస్తోంది. హనుమాన్ లాంటి పవర్ఫుల్ రోల్ కోసం బాలీవుడ్ నటుడు మాధవన్ పేరు పరిశీలించారని టాక్. కానీ తాజాగా మరో పేరు వినిపిస్తోంది. టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్‌ను ఈ పాత్ర కోసం తీసుకోవాలని భావిస్తున్నారట. రామ్ చరణ్ అయితేనే కరెక్ట్‌గా సెట్ అవుతాడని దర్శకధీరుడు ఆలోచనలో ఉన్నారట. ఈ విషయంపై ఇప్పటికైతే ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఒకవేళ ఇదే నిజమైతే బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ ఖాయమని టాలీవుడ్ సినీ వర్గాలు భావిస్తున్నాయి. -
బిగ్‌బాస్ హౌస్‌లోకి మరో జబర్దస్త్ కమెడియన్!
బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 త్వరలో ప్రారంభం కానుంది. ఈసారీ కింగ్ నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. షోను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు మేకర్స్ ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపికపై దృష్టి సారించారు. సెలబ్రిటీలతో పాటు సామాన్యులకూ అవకాశం కల్పించేందుకు ‘అగ్నిపరీక్ష 2’ ద్వారా కంటెస్టెంట్లను ఎంపిక చేస్తున్నారు. అయితే ఇప్పటికే పలువురు ఈ సీజన్ 10 ఆడిషన్స్‌కు హాజరవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు షోలోకి ఎంట్రీ ఇవ్వబోయే కంటెస్టెంట్ల విషయంలో సోషల్ మీడియాలో రోజుకో పేరు వైరల్ అవుతోంది. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో క్రేజీ పేరు చేరినట్లు టాక్ నడుస్తోంది. జబర్దస్త్ నటుడు రామ్ ప్రసాద్ బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టనున్నారనే వార్త ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్ ప్రసాద్.. తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. బుల్లితెరతో పాటు సినిమాల్లోనూ నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన బిగ్‌బాస్ హౌస్‌లోకి వస్తే షోలో కామెడీ మరింత పెరిగే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే బిగ్‌బాస్ టీమ్ రామ్ ప్రసాద్‌ను సంప్రదించిందని, ఆయన కూడా షోలో పాల్గొనేందుకు ఓకే చెప్పారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
మహేశ్ బాబు బర్త్ డే.. నమ్రతా స్పెషల్ పోస్ట్
మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ తన భర్తకు బర్త్ డే విషెస్ తెలిపింది. హ్యాపీ బర్త్ డే ఎంబీ.. ప్రతి రోజు మాకు ఎంతో స్పెషల్ చేస్తున్నందుకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది. ఈ ఏడాది మరింత ప్రేమ, ఆరోగ్యం, సంతోషంగా గడవాలని కోరుకుంటున్నట్లు నమ్రతా రాసుకొచ్చింది. మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నామంటూ ఇన్‌స్టాలో ఫ్యామిలీ ఫోటోను షేర్ చేసింది.కాగా.. టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ తనయుడైన మహేశ్ బాబు.. నమ్రతాను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరు జంటగా వంశీ చిత్రంలో నటించారు. ఆ తర్వాత ప్రేమలో పడిన ఈ జంట పెళ్లి చేసుకుని వివాహబంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత నమ్రతా సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. వీరికి సితార, గౌతమ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక సినీ కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం మహేశ్ బాబు.. రాజమౌళితో కలిసి వారణాసి మూవీ చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
కంగనా చేతిలో గొడుగు..ధర తెలిస్తే షాకే..!
ఎప్పుడూ ఏదో ఒక ప్రత్యేకతతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్. తాజాగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు హాజరైన ఆమె మరోసారి తన స్టైలిష్ లుక్‌తో అందరి దృష్టినీ ఆకర్షించారు. అయితే ఈసారి ఆమె చీర, హ్యాండ్‌బ్యాగ్ కంటే చేతిలో పట్టుకున్న గొడుగే హైలైట్‌గా మారింది. సాధారణంగా వర్షం నుంచి రక్షణ కోసం ఉపయోగించే గొడుగును కూడా ఫ్యాషన్ స్టేట్మెంట్గా మార్చేశారు కంగనా. ఇంతకీ ఆమె చేతిలో ఉన్న ఆ గొడుగు ప్రత్యేకత ఏంటి? దాని ధర ఎంతో తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే!కంగనా రనౌత్ పార్లమెంట్ హౌస్‌కు వెళ్లే సమయంలో రంగురంగుల ప్రింటెడ్ గొడుగుతో కనిపించారు. సాధారణ నలుపు రంగు గొడుగులకు భిన్నంగా ఆమె చేతిలోని ఆక్వా కలర్ గొడుగు ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఈ గొడుగును ప్రముఖ లగ్జరీ డిజైన్ హౌస్ గుడ్ ఎర్త్ రూపొందించిందట. దీని ధర రూ.6,100. అంటే గొడుగు కోసం ఆరు వేలకు పైగా ఖర్చు చేశారు కంగనా. చీర, బ్యాగ్‌తో పాటు రంగురంగుల గొడుగు ఆమె లుక్కు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. -
యశ్ టాక్సిక్.. ఆ రూల్‌కు నయనతార బ్రేక్
కన్నడ హీరో యశ్ నటిస్తోన్న యాక్షన్ మూవీ టాక్సిక్ ట్రైలర్ రిలీజైంది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన మూవీ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ట్రైలర్ విడుదల చేసి ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ కాగా.. లేడీ సూపర్ స్టార్ నయనతార కీలక పాత్ర పోషించింది. ట్రైలర్ చూస్తుంటే వయొలెన్స్‌తో పాటు బోల్డ్ కంటెంట్‌ను తలపిస్తోంది.అయితే ఈ మూవీ సంగతి పక్కనపెడితే.. నయనతార చేసిన పనికి సినీ ప్రియులు షాకవుతున్నారు. గతంలో ఏ మూవీకి కూడా ప్రమోషన్స్ చేయడం నాకు ఇష్టముండదని ప్రకటించింది. అందుకే తాను ప్రమోషన్స్ ఈవెంట్స్‌కు దూరంగా ఉంటానని తెలిపింది. అలా చెప్పిన నయన్.. మూవీ ప్రమోషన్స్‌కు హాజరు కావడం అభిమానులను, నెటిజన్లను షాకింగ్‌కు గురి చేస్తోంది. బెంగళూరులో జరిగిన ఈవెంట్‌కు నయనతార రావడంపై సినీ ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. తాను టాక్సిక్ ఈవెంట్‌కు హాజరు కావడంపై కోలీవుడ్ భామ క్లారిటీ ఇచ్చింది.నయనతార మాట్లాడుతూ.. 'సినిమా ప్రచార కార్యక్రమాలకు హాజరు కావడం నాకు ఇష్టం లేదని కాదు. నాకు వాటిలో అంతగా నైపుణ్యం లేదు. అందుకే నేను వాటికి చాలా దూరంగా ఉంటాను. కానీ చాలా కొన్ని కారణాల వల్ల ఇది నాకు చాలా ప్రత్యేకం. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చానంటే యశ్ కారణం. అతను కేవలం ఒక ఫోన్ కాల్ చేశాడు. నేను ఈ కార్యక్రమానికి హాజరయ్యా. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. దీనికి చాలా కారణాలున్నాయి.' అని అన్నారు. కాగా.. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటించగా.. హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రలు పోషించారు. #Nayanthara’s speech at #Toxic trailer launch!.. pic.twitter.com/utsRVrK9Ku— Gv (@gowtham0725) August 8, 2026 -
‘టాక్సిక్’లో కియారా విధ్వంసం.. యశ్ స్పందన ఇదే!
కియారా అద్వానీకి టాక్సిక్ సినిమా కెరీర్లోనే ఓ మైలురాయిగా నిలిచిపోతుందా..? అంటే ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో యశ్, నయనతార చేసిన వ్యాఖ్యలు చూస్తే అవుననే అనిపిస్తోంది. సినిమాలో కియారా నటన, ఆమె అంకితభావంపై వీరిద్దరూ ప్రశంసలు కురిపించారు. వేదికపై కియారాను ఉద్దేశించి యాశ్ మాట్లాడుతూ..‘ ఈ సినిమాలో నీ పాత్ర కోసం ఎంతో కష్టపడ్డావు. నీ అంకితభావాన్ని నేను దగ్గర నుంచి చూశాను. ఈ సినిమాలో నువ్వు చూపించిన నటన భవిష్యత్తు కంటే ముందుంది. ఇప్పుడు చాలా మంది ఎదో మాట్లాడొచ్చు. కానీ సినిమా రిలీజ్ అయ్యాక వాళ్లే ప్రశంసలు కురిపిస్తారు’ అన్నారు. నయనతార సైతం కియారా కోసం ఆకాశానికెత్తేశారు. ‘ ఇది నీ కెరీర్లోనే అత్యుత్తమ చిత్రాల్లో ఒకటి. టాక్సిక్‌కు ముందు కియారా.. తరువాత కియారా అనేలా నీ కెరీర్ మారిపోతుంది. ఈ సినిమాలో నువ్వు అద్భుతంగా నటించావు’ అని ప్రశంసించారు. కాగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ చిత్రంలో యాశ్ తండ్రీకొడుకులుగా రెండు పాత్రల్లో కనిపించననున్నాడు. తండ్రీతనయుల మధ్య సంఘర్షణ, వారి భిన్నమైన ఆలోచనలు, కోపం నేపథ్యంలో కథ సాగినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టం అవుతోంది. చివర్లో తండ్రీకొడుకులు ఒకరిని ఒకరు కొట్టుకోవడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకాలపై వెంకట్ కె.నారాయణ, యశ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 26న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
మొన్న ప్యారడైజ్.. నిన్న టాక్సిక్.. ఏం సందేశం ఇస్తున్నారు?
యశ్ హీరోగా వస్తోన్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ – అప్స్. ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, తార సుతారియా, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషీ ప్రధాన పాత్రల్లో నటించారు. గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో వెంకట్ కె. నారాయణ, యశ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న రిలీజ్ కానుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. ఈ మూవీ కేవలం పెద్దల కోసం మాత్రమేనని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌లో వయొలెన్స్, గన్స్, స్టైలిష్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు బోల్డ్ టచ్ ఉన్న సన్నివేశాలు, గ్లామరస్ పాటలు సినిమాపై ఆసక్తితో పాటు చర్చకు కూడా కారణమయ్యాయిఅయితే తాజాగా టాక్సిక్ మూవీలో కియారా రోల్‌పై మొదటి నుంచి విమర్శలొస్తున్నాయి. ఆమె తల్లి అయిన కొద్ది నెలల్లోనే ఇలాంటి బోల్డ్ రోల్ చేయడంపై నెట్టింట ట్రోల్స్ చేస్తున్నారు. టాక్సిక్ బోల్డ్ సాంగ్ రిలీజ్ తర్వాత ఆమెపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. ముఖ్యంగా ఈ మూవీ డైరెక్టర్ కూడా లేడీ కావడంతో టాక్సిక్‌పై మరింత ఆసక్తికరంగా మారింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులోనూ వయొలెన్స్, బోల్డ్ సన్నివేశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ ఈవెంట్‌కు హాజరైన హీరో యశ్.. హీరోయిన్ కియారాపై ప్రశంసలు కురిపించారు. ఆమె ఒక ప్రళయం అంటూ కొనియాడారు. ముఖ్యంగా ట్రోలింగ్స్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు యశ్. నువ్వు ఈ సినిమాలో చాలా గొప్ప పాత్ర పోషించావని కొనియాడారు. నయనతార సైతం కియారాపై ప్రశంసలు కురిపించింది.అయితే ఈ సినిమాలో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉండడంపై నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ రోజుల్లో సినిమా అంటే కేవలం వయొలెన్స్, బోల్డ్కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడుతున్నారు. ఇలాంటి సినిమాలతో సమాజానికి ఏం ప్రయోజనం అని ప్రశ్నిస్తున్నారు. ఏదైనా మూవీ తీస్తే కథలో కొంతైనా సందేశాత్మకంగా ఉండాలని అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి కంటెంట్‌ను ఎక్కువగా తీసుకురావడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. టాక్సిక్ మాత్రమే కాదు.. ఇటీవలే రిలీజైన ది ప్యారడైజ్ టీజర్లో కూడా కేవలం హింసనే చూపించారు. రక్తపాతాన్ని తలపించేలా టీజర్ విడుదల చేశారు. ఇదంతా చూస్తుంటే డైరెక్టర్స్ సృజనాత్మకత పక్కనపెట్టి.. కేవలం హింస, బోల్డ్నే నమ్ముకున్నారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. సినిమా అంటే సమాజానికి ఓ సందేశం ఇచ్చేలా ఉండాలి కానీ.. కేవలం డబ్బుల కోసం ఇలా చేయడం ఎంత వరకు కరెక్ట్ అనేది ఓ సారి ప్రశ్నించుకోవాలి. సినిమాను సినిమాగానే చూడాలి అని అంటారు.. కరెక్టే కానీ.. దానికి కూడా లిమిట్స్ ఉంటాయని గ్రహించాలని నెటిజన్స్ కోరుతున్నారు. -
రామ్ చరణ్ పెద్ది మూవీ.. ఆ రోల్‌పై మరో నటి విమర్శలు
మెగా హీరో రామ్ చరణ్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించగా.. జగపతి బాబు, శివరాజ్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ మూవీలో హీరోయిన్ పాత్రపై అప్పట్లో విమర్శలొచ్చాయి. ఆ తర్వాత కొన్ని సీన్స్ కూడా తొలగించారు. జాన్వీని కేవలం గ్లామర్ కోసమే తీసుకున్నారా? అని పలువురు విమర్శించారు. తాజాగా మరో నటి జాన్వీ కపూర్ పాత్రపై విమర్శలు చేసింది. కోలీవుడ్, టాలీవుడ్లో పలు సినిమాల్లో మెప్పించిన ఆదితి బాలన్ పెద్దిలో హీరోయిన్ పాత్రను తప్పుబట్టింది.తాను ఇటీవలే పెద్ది మూవీ చూశానని ఆదితి బాలన్ అన్నారు. అసలు జాన్వీ కపూర్ క్యారెక్టర్ ఎందుకు రాశారో అర్థం కాలేదన్నారు. ఆ పాత్ర కరెక్ట్ కాదని నాకు అనిపించిందన్నారు. ఆమె పాత్రను అలా కాకుండా కొంచెమైనా ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటే బాగుండేగని ఆదితి బాలన్ తన అభిప్రాయం వ్యక్తం చేసింది. #AditiBalan comments on #JanhviKapoor’s characterisation in #Peddi#Ramcharan pic.twitter.com/ajn8AjxmeF— MLReviews🎥🎬 ♥️ (@MovieLove999) August 8, 2026 -
మహేశ్ బాబు-రాజమౌళి కాంబో.. వారణాసి బర్త్ డే అప్డేట్ ఇదే
మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో వస్తోన్న మోస్ట్ అడ్వెంచరస్ మూవీ వారణాసి. ఇప్పటికే ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు రాజమౌళి. ఈ మూవీ వచ్చే ఏప్రిల్ 7న ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ప్రిన్స్ మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ మూవీలో రుద్రను పరిచయం చేస్తూ పోస్టర్ విడుదల చేశారు. రౌద్రం ఒక్కటే అతడి స్వభావం కాదు అనే క్యాప్షన్ పెట్టారు. కాగా.. ఈ చిత్రంలో మహేశ్ బాబు.. రుద్ర, శ్రీరాముడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు.తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్లో మహేశ్ బాబు చాలా సింపుల్‌గా కనిపించారు. పొడవైడ జుట్టు, గడ్డంతో రిలీజ్ చేసిన మహేశ్ బాబు పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇది చూస్తుంటే రుద్ర పాత్ర ప్రపంచ యాత్రికుడిగా ఉండనుందని అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్గా కనిపించనుంది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. Another trip around the Sun… before we travel across time. Happy Birthday Rudhra 💙 @urstrulymahesh #Varanasi pic.twitter.com/Iqa3QLtHiR— Varanasi (@VaranasiMovie) August 9, 2026 -
టాక్సిక్ భామ.. అక్కడ కూడా అడుగు పెట్టనుందా?
భార తీయ సినిమాలో కోలీవుడ్ సినిమా ప్రత్యేక స్థానానికి చేరుకుంది. పలు తమిళ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా వసూ ళ్ల వర్షం కురిపిస్తున్నాయి. అందుకే పలువురు ప్రముఖ బాలీవుడ్ బ్యూటీలు తమిళంలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ప్రియాంక చోప్రా నుంచి ఐశ్వర్యారాయ్, దిశా పటానీ వరకు పలువురు ఉత్తరాది భామలు తమిళ చిత్రాలు చేశారు. తాజాగా మరో టాప్ హీరోయిన్ దృష్టి కోలీవుడ్ పై పడినట్లు సమాచారం. ఆ బ్యూటీ ఎవరో కాదు టాక్సిక్ భామ కియారా అద్వానీ.బాలీవుడ్లో అత్యధిక పారితోషికం అందుకుంటోన్న నటిమణుల్లో ఈమె ఒకరు. 2014లో ఫగ్లీ అనే చిత్రం ద్వారా కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత పలు భారీ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగారు. హిందీ చిత్రాలు నటిస్తూనే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ మహేష్ బాబుకు జంటగా భరత్ అనే నేను చిత్రంతో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ ఛేంజర్ చిత్రంలో రామ్ చరణ్‌తో జత కట్టారు. తాజాగా ఈమె కన్నడ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి టాక్సిక్ చిత్రంలో యష్‌కు జంటగా నటించారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది.ఇలా దక్షిణాదిలో తెలుగు, కన్నడం ప్రేక్షకులకు దగ్గరైన కియార అద్వానీ దృష్టి ఇప్పుడు కోలీవుడ్‌పై పడినట్లు సమాచారం. ఒక తమిళ ప్రముఖ నటుడు ఈమెను కోలీవుడుకు పరిచయం చేసే ప్రయత్నంలో ఉన్నట్టు తెలిసింది. కథను కూడా చెప్పినట్లు, అందులో నటించడానికి కియారా అద్వానీ సుముఖంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
గాడ్ వర్సెస్ ఈవిల్
కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భాను చందర్, షిజు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘అగధ’. ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో అజయ్ కేఆర్ సమర్పణలో శ్రీ ఆదివరాహ ప్రోడక్షన్స్ పతాకంపై కాశీ విశాలాక్షి బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో శ్రవణ్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఎం.ఎస్. రాజుగారు దర్శకత్వం వహించిన ‘డర్టీ హరి’లో నటించాను. కానీ ఆ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజైంది. ఆ తర్వాత అజయ్ భూపతిగారి డైరెక్షన్‌లోని ‘మంగళవారం’ చిత్రంలో కీలక పాత్ర చేశాను.ఇప్పుడు ‘అగధ’లో నటించాను. ఈ చిత్రంలో నేను పోషించిన క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. ఇందులో నెగెటివ్ పాత్ర అనేది ఉండదు. పరిస్థితుల వల్లే పాత్రలు అలా ప్రవర్తిస్తుంటాయి. గుడ్ వర్సెస్ బ్యాడ్, గాడ్ వర్సెస్ ఈవిల్ అన్నట్టుగా కథ సాగుతుంది. కథ చెప్పిన నాలుగో రోజే సెట్స్‌కి వెళ్లాను. దీంతో ఈ పాత్ర కోసం నేను ప్రిపేర్ అవ్వాల్సింది అంతా సెట్స్‌లో అయ్యాను.ఈ సినిమా చేయడం యాక్టర్‌గా నాకో కొత్త అనుభూతిని ఇచ్చింది. ఎం.ఎస్. రాజుగారు ఎప్పుడూ కొత్తగా ప్రయత్నిస్తుంటారు. ఈ చిత్రం కోసం ఆయన రాసిన కథ ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తుంది. ఇక ఇండస్ట్రీలో హీరోకి బాక్సాఫీస్ నంబర్లే ముఖ్యం. ‘అగధ’తో నాకు ఆ బాక్సాఫీస్ సక్సెస్ స్టాంప్ వస్తుందని నమ్ముతున్నాను. ప్రస్తుతం దర్శక–ద్వయం రాజ్ అండ్ డీకే దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన రైటర్ చంద్ర తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తున్నాను. ముగ్గురు స్నేహితుల కథ ఇది’’ అని అన్నారు. -
మరో ప్రేమకథలో..?
యంగ్ హీరోయిన్స్ జాన్వీ కపూర్, శ్రీలీల కలసి హిందీలో ఓ సినిమా చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. దర్శకుడు ఉమేష్ బిష్ట్ ట్రయాంగిల్ లవ్‌స్టోరీతో కూడిన డార్క్ రొమాంటిక్ థ్రిల్లర్ కథను రెడీ చేశారట. ఏక్తా కపూర్, గునీత్ మోంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని, ఈ చిత్రంలోనే జాన్వీ కపూర్, శ్రీలీల లీడ్ రోల్స్‌లో నటించనున్నారని బాలీవుడ్ సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయట. ఒకే అబ్బాయిపై ఇద్దరు అమ్మాయిలు విపరీతమైన ప్రేమ పెంచుకుంటే ఏం జరుగుతుంది? అనే కోణంలో ఈ సినిమా కథనం సాగుతుందని బీ టౌన్ టాక్.అలాగే ఈ చిత్రంలో కొన్ని క్రైమ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయట. కాగా, ఈ సినిమాలో హీరోగా నటించే యాక్టర్ కోసం దర్శక–నిర్మాతలు పలువురి యువ హీరోల పేర్లను పరిశీలిస్తున్నారని, త్వరలోనే ఓ హీరోను ఫైనలైజ్ చేసి, సినిమాను అధికారికంగా ప్రకటించేలా సన్నాహాలు చేస్తున్నారని భోగట్టా. మరి... ఇద్దరు అమ్మాయిల ప్రేమను పొందగలిగే ఆ హీరో ఎవరు? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. ఇదిలా ఉంటే... హిందీలో శ్రీలీల ఇప్పటికే కార్తీక్ ఆర్యన్ సరసన ఓ ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరీ ఫిక్స్ అయితే... బాలీవుడ్లో మరో ప్రేమకథా చిత్రం శ్రీలీల డైరీలో ఉంటుంది. -
భావోద్వేగాల ఇరుముడి
ఒకవైపు నోటిలో కత్తితో, మరోవైపు అయ్యప్ప మాల ధరించి... ఇలా రెండు రకాల లుక్స్‌లో రవితేజ కనిపించనున్న చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవానీశంకర్ హీరోయిన్గా నటించగా, ఆయన కుమార్తెగా బేబీ నక్షత్ర నటించింది. ఈ నెల 21న ‘ఇరుముడి’ చిత్రం విడుదల కానుంది.ఈ నేపథ్యంలో ఈ 12న భీమవరంలో ఓ భారీ ఈవెంట్‌ని నిర్వహించి, ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు ‘‘ఇరుముడి’లో రవితేజ ఇప్పటివరకు ఏ సినిమాలో కనిపించనంత ఫ్యామిలీ ఓరియంటెడ్ క్యారెక్టర్లో కనిపిస్తారు. ముఖ్యంగా తన కుమార్తెతో ఆయనకు ఉండే అనుబంధం ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటుంది. కుటుంబ బంధాలు, భావోద్వేగాలు ప్రధానంగా సాగే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది’’ అని దర్శక–నిర్మాతలు తెలిపారు. -
ముందుగా విదేశాల్లోనే...
‘రామాయణ’ సినిమా విడుదల విషయంలో చిన్న మార్పు ఉన్నట్లు ఈ చిత్రనిర్మాత నమిత్ మల్హోత్రా తెలిపారు. భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘రామాయణ’. నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, లక్ష్మణుడిగా రవి దుబె, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ పతాకంపై నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది.కాగా, ‘రామాయణ పార్ట్ 1’ ఈ ఏడాది దీపావళికి, ‘రామాయణ పార్ట్ 2’ వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానున్నాయి. అయితే తొలి భాగం ఇండియాలో కంటే ముందుగా విదేశాల్లోనే విడుదల కానుంది. ‘‘విదేశీ మార్కెట్లలో సినిమాల విడుదల సాధారణంగా శుక్రవారం నుంచే ప్రారంభం అవుతుంది. అందుకే అక్కడ నవంబరు 6న ‘రామాయణ పార్ట్ 1’ని రిలీజ్ చేస్తాం. ఇండియాలో మాత్రం దీపావళి పండగ రోజునే అంటే... నవంబరు 8నే రిలీజ్ చేస్తాం’’ అని ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు నమిత్ మల్హోత్రా. -
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో నాయికా!
సెట్స్‌కు వెళ్లడానికి హీరో రెడీ. స్టార్ట్... కెమెరా... యాక్షన్ చెప్పడానికి దర్శకుడు రెడీ. బడ్జెట్ కేటాయించేందుకు ప్రోడ్యూసర్ రెడీ. కానీ హీరోయిన్ మాత్రం నాట్ రెడీ. అవును... ప్రస్తుతం కొన్ని తెలుగు సినిమాల పరిస్థితి ఆల్మోస్ట్ ఇదే. తమ హీరోకు సరిగ్గా సెట్ అయ్యే హీరోయిన్ వెతుకులాటలో బిజీగా ఉన్నారు దర్శక–నిర్మాతలు. ఈలోపే ఫలానా సినిమాలో ఫలానా హీరోయిన్ అంటూ... కొన్ని గాసిప్స్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. మరి... ఏయే హీరోకి ‘ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో నాయికా!’ చూద్దాం... ఎవరెవరు జోడీ కడతారో మరి...ముచ్చటగా మూడోసారి ‘ఖిలాడి’, ‘భర్తమహాశయులకు విజ్ఞప్తి’ చిత్రాల తర్వాత హీరో రవితేజ, హీరోయిన్ డింపుల్ హయతి ముచ్చటగా మూడోసారి కలిసి నటించనున్నారా? అంటే... ప్రస్తుతానికి అవుననే సమాధానమే వినిపిస్తోంది. రవితేజ, శ్రీవిష్ణు హీరోలుగా హసిత్ గోలి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందనే టాక్ కొన్ని రోజులుగా ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాను ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించనున్నారని సమాచారం. అంతేకాదు... ఈ సినిమాకు ‘వీరాధి వీరులు కేరాఫ్ మహిళా మండలి’ అనే టైటిల్‌ను కూడా పరిశీలిస్తున్నారట మేకర్స్.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలన్నది చిత్రయూనిట్ ప్లాన్ అట. దీంతో ఈ ఏడాది అక్టోబరులో ఈ సినిమా రెగ్యులర్ షూట్‌ను స్టార్ట్ చేయాలని హసిత్ గోలి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టారట హసిత్. ఇందులో భాగంగానే రవితేజకు జోడీగా నటించేందుకు డింపుల్ హయతిని సంప్రదించారని తెలిసింది.మరి... మూడోసారి కూడా రవితేజ–డింపుల్‌ల జోడీ సెట్ అవుతుందా? చూడాలి. అలాగే శ్రీ విష్ణుకు జోడీగా ఓ యంగ్ నటి కనిపిస్తారట. మరోవైపు రవితేజ నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’ ఈ ఆగస్టు 21న విడుదల కానుంది. అలాగే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుందనే ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.దీపిక ప్లేస్‌లో ఆలియా? ప్రభాస్ ప్రస్తుతం ‘స్పిరిట్, ఫౌజి’ సినిమాల చిత్రీకరణలతో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాల చిత్రీకరణలు పూర్తయిన తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్షన్ లోని ‘కల్కి 2898 ఏడీ’ సినిమా సీక్వెల్ ‘కల్కి 2898 ఏడీ 2’ చిత్రీకరణలో పాల్గొంటారు ప్రభాస్. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ చిత్రంలోని ఇతర ముఖ్య తారాగణం అయిన కమల్‌హాసన్, అమితాబ్ బచ్చన్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. త్వరలోనే ప్రభాస్ కూడా షూట్లో జాయిన్ అవుతారు. అయితే ఈ మూవీలోని మరో ప్రధానమైన లీడ్ రోల్‌ను ‘కల్కి 2898 ఏడీ’ పార్ట్ 1లో దీపికా పదుకోన్ చేశారు. కొన్ని కారణాల వల్ల ‘కల్కి 2’లో దీపికా పదుకోన్ నటించడంలేదని చిత్రయూనిట్ ప్రకటించింది.ఈ నేపథ్యంలో దీపిక పదుకోన్ ప్లేస్‌లో ఎవరు నటిస్తారు? అనే చర్చ ఎప్పట్నుంచో జరుగుతోంది. తొలుత సాయి పల్లవి, కీర్తి సురేష్ వంటి హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఇటివలి కాలంలో ఆలియా భట్ పేరు వినిపిస్తోంది. త్వరలో ప్రభాస్‌తో పాటు లీడ్ హీరోయిన్ కూడా సెట్స్‌లో పాల్గొనాల్సి ఉందట. దీంతో దీపిక ప్లేస్‌ను భర్తీ చేసేది ఎవరు? అనే విషయంపై త్వరలోనే ఓ స్పష్టత వచ్చే అవకాశం లేక పోలేదు. వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ‘కల్కి 2’ సినిమా 2027 చివర్లో రిలీజ్ అవుతుందని టాక్.గాడ్ ఆఫ్ వార్‌లో... ‘అరవిందసమేత వీరరాఘవ’ (2018) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మైథాలజీ నేపథ్యంలో రానుంది. ఈ చిత్రానికి ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు మేకర్స్. లార్డ్ కుమారస్వామి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని ఇటీవల విడుదలైన ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ స్పష్టం చేస్తోంది. భారీ బడ్జెట్‌తో సూర్యదేవర రాధాకృష్ణ, నందమూరి కల్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి.ఈ సినిమా షూటింగ్‌ను వచ్చే ఏడాది ప్రారంభించాలనుకుంటున్నారు. కాగా, ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు మేకర్స్ కియారా అద్వానీని సంప్రదిస్తున్నారని, ఆ దిశగా సన్నాహాలు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఇటీవల ‘డ్రాగన్’ సినిమా చిత్రీకరణలో గాయపడ్డారు ఎనీ్టఆర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందనే ప్రచారం సాగుతోంది. దీంతో ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా చిత్రీకరణ ప్రారంభం కావడానికి మరింత సమయం పట్టేలా కనిపిస్తోంది. అయితే ఈ అంశాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.చరణ్‌కు జోడీగా... ‘రంగస్థలం’ వంటి సూపర్ హిట్ ఫిల్మ్ తర్వాత హీరో రామ్‌చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా ‘ఆర్సీ 17’ (వర్కింగ్ టైటిల్). రామ్‌చరణ్ కెరీర్ లోని 17వ సినిమా ఇది. ఈ చిత్రాన్ని ఏడాదిన్నర క్రితమే ప్రకటించినప్పటికీ ఇంకా సెట్స్‌కు వెళ్లలేదు. ‘పెద్ది’ సినిమా చిత్రీకరణతో రామ్‌చరణ్ బిజీగా ఉండటం వల్ల ‘ఆర్సీ 17’ సినిమా సెట్స్‌కు వెళ్లలేదు. అయితే ఈ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాదే ప్రారంభించాలని అనుకున్నారు మేకర్స్. కానీ ‘పెద్ది’ చిత్రీకరణ సమయంలో రామ్‌చరణ్ చేతికి గాయమైంది. దీంతో ఇటీవల కోయంబత్తూరులో చేతికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు రామ్‌చరణ్.ఈ గాయం నుంచి కోలుకుని తిరిగి రామ్‌చరణ్ షూట్లో పాల్గొనేందుకు దాదాపు మూడు నెలల సమయం పడుతుందట. దీంతో ఈ సినిమా షూటింగ్‌ను ఈ ఏడాది చివర్లో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారట సుకుమార్. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగు తున్నాయి. అలాగే ఈ సినిమాలో నటించే నటీనటుల ఎంపికపై కూడా సుకుమార్ దృష్టి సారించారట. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్ర కోసం కొంతమంది కథానాయికల పేర్లును పరిశీలిస్తున్నారు మేకర్స్. సమంత, రష్మిక మందన్నా వంటి ప్రముఖ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. తాజాగా రుక్మిణీ వసంత్ పేరు తెరపైకి వచి్చంది. మరి... రామ్‌చరణ్‌కు జోడీగా రుక్మిణీ వసంత్‌నే నటిస్తారా? వేచి చూడాల్సిందే.రాకాలో నలుగురు నాయికలు? అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘రాకా’. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ ఒక హీరోయిన్గా కన్ఫార్మ్ అయ్యారు. అయితే ఇందులో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేస్తున్నారని, దీంతో ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్స్‌కు చాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా ఈ చిత్రంలోని ఇతర హీరోయిన్ రోల్స్‌కు ఫైనలైజ్ అయ్యారని, ఆల్రెడీ ముంబైలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్లో ఈ ముగ్గురూ పాల్గొంటున్నారని టాక్.అయితే జాన్వీ, రష్మిక, మృణాల్లు ఈ సినిమాలో భాగమైన అంశంపై మాత్రం ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.పైగా రష్మిక ఈ చిత్రంలో నెగటివ్ రోల్ చేస్తున్నారట. దీంతో ఆమె ఈ చిత్రంలో అల్లు అర్జున్‌కు జోడీగా కనిపించక పోవచ్చట. మరి... అల్లు అర్జున్‌కు జోడీగా కనిపించే హీరోయిన్స్ ఎవరు? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడక తప్పదు. కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానుందనే ప్రచారం జరుగుతోంది. రణ్వీర్ సింగ్ బ్లాక్ బస్టర్ సినిమా ‘ధురంధర్’ తరహాలో తక్కువ టైమ్ గ్యాప్‌లోనే ‘రాకా’ రెండు భాగాలు రిలీజ్ కానున్నాయని సమాచారం.రోమియో ప్రేయసి... నాని తాజా సినిమా ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమా ఈ సెప్టెంబరు 24న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే కాస్త గ్యాప్ తీసుకుని, ఆ తర్వాత సుజిత్ డైరెక్షన్‌లోని ‘బ్లడీ రోమియో’ సినిమాలో నటిస్తారు నాని. అక్టోబరులో ఈ సినిమా రెగ్యులర్ షూట్‌ను స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ముందుగా హైదరాబాద్‌లో, ఆ తర్వాత ఢిల్లీలో ఈ సినిమా షెడ్యూల్స్ జరుగుతాయని తెలిసింది. కానీ... ఈ సినిమా మేజర్ షూటింగ్ మాత్రం లండన్‌లో ప్లాన్ చేశారని సమాచారం. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? అన్నది ఇంకా ఫైన లైజ్ కాలేదు. ప్రస్తుతానికి భాగ్యశ్రీ భోర్సేను అనుకుంటున్నారట మేకర్స్. ఇప్పటికే ఆమెతో చిత్రయూనిట్ సంప్రదింపులు జరిపిందని, ‘ది ప్యారడైజ్’ సినిమా విడుదలై, నాని ‘బ్లడీ రోమియో’ షూట్‌ను స్టార్ట్ చేసిన తర్వాత భాగ్యశ్రీ ఎంపికపై ఓ అధికారిక ప్రకటన వస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా ఫుడ్ మాఫియా నేపథ్యంలో సాగే ఓ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఉండబోతోందని ఇటీవల రిలీజైన ఈ సినిమా కంటెంట్ పరోక్షంగా స్పష్టం చేస్తోంది. నానికి చెందిన నిర్మాణ సంస్థ యునానిమస్ ప్రోడక్షన్స్, నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై వెంకట్ బోయనపల్లి ఈ ‘బ్లడీ రోమియో’ను నిర్మించనున్నారు. 2027లో ఈ సినిమా విడుదల కానుంది.సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలో... రామ్ హీరోగా నటిస్తూ, కథ అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్న తొలి సినిమా ‘రా పో 23 (వర్కింగ్ టైటిల్). ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా చిత్రీకరణ ఆల్రెడీ మొదలైంది. ప్రస్తుతం పాండిచ్చేరిలో కీలక సన్ని వేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ షూటింగ్ షెడ్యూల్లో కొంత టాకీ పార్టుతో పాటు ఓ సాంగ్‌ను, ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు రామ్. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటిస్తారనే విషయాన్ని మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కాగా, హీరోయిన్ పాత్రకు శ్రీనిధి శెట్టి, సంయుక్తా మీనన్ పేర్లను పరిశీలించారట. సంయుక్త ఆల్మోస్ట్ ఖరారు అయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబరులోనే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ అనుకున్న సమయానికి ప్రారంభం కాని కారణంగా కాస్త ఆలస్యంగా ఈ చిత్రం రిలీజ్ కానుంది. అంటే... ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అవుతుందని చెప్పాచ్చు.ఎల్లమ్మ..! ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘ఎల్లమ్మ’. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ రూరల్ బ్యాక్‌డ్రాప్ చిత్రానికి ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్రకు తొలుత కీర్తి సురేష్‌ను అనుకున్నారట. కానీ ఇటీవల ఓ సందర్భంలో ఈ సినిమాలో తాను నటించడం లేదని ఆమె స్పష్టం చేశారు. ఆ తర్వాత సాయి పల్లవి, మృణాల్ ఠాకూర్, మమితా బైజు వంటి హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఈ చిత్రంలో ఇప్పటివరకు ఎవరూ ఫైనలైజ్ కాలేదు. త్వరలోనే ఈ సినిమా హీరోయిన్ గురించి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.నో హీరోయిన్!ఒకవైపు కొన్ని సినిమాల్లో హీరోయిన్ల అన్వేషణ జరుగుతోంటే ఒక సినిమాకి మాత్రం హీరోయినే అక్కర్లేదట. ఎందుకంటే అసలు హీరోయిన్ లేకుండానే ఓ సినిమా తెరకెక్కనుందని సమాచారం. అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటన వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది ప్రారంభంలో మొదలు కానుంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్గా కొంతమంది బాలీవుడ్ కథానాయికల పేర్లు వినిపించాయి. కానీ కథ రీత్యా ఈ చిత్రంలోని హీరోయిన్ పాత్రకు పెద్దగా స్కోప్ లేక పోవడంతో అసలు ఈ సినిమాలో హీరోయిన్ పాత్రనే తొలగించాలని మేకర్స్ అనుకుంటున్నారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. ఈ అంశంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.ఇంకా మరికొందరు తెలుగు హీరోలు నటించనున్న మరికొన్ని కొత్త సినిమాల్లో హీరోయిన్ ఫైనలైజ్ కాలేదు.– ముసిమి శివాంజనేయులు -
భాగ్యశ్రీకి బంపరాఫర్.. ఆ స్టార్ హీరో సరసన ఛాన్స్?
అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన ‘లెనిన్’ సినిమా సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకి మరో క్రేజీ ఆఫర్ దక్కబోతున్నట్టు తెలుస్తోంది. నేచురల్ స్టార్ నాని హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘బ్లడీ రోమియో’ సినిమాలో భాగ్యశ్రీని హీరోయిన్గా తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.రవితేజ హీరోగా వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీకి వరుసగా క్రేజీ సినిమాలు వచ్చాయి. కానీ ఆశించిన స్థాయిలో విజయాలు మాత్రం దక్కలేదు. ‘లెనిన్’తో ఆమెకు తొలి సాలిడ్ హిట్ దక్కింది. ఈ సక్సెస్‌తో భాగ్యశ్రీ ప్రస్తుతం టాలీవుడ్లో వరుస అవకాశాలు అందుకుంటోంది. మరోవైపు తమిళంలో కూడా శివకార్తికేయన్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. -
త్రివిక్రమ్ మాతో మాత్రమే సినిమాలు ఎందుకు చేస్తారంటే?
తెలుగు స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా ఉండే పేరు త్రివిక్రమ్. అతడు, అత్తారింటికి దారేది, అరవింద సమేత, అల వైకుంఠపురములో, జులాయి, ఖలేజా, సన్నాఫ్ సత్యమూర్తి, జల్సా, నువ్వే నువ్వే, అఆ తదితర సినిమాలతో తనదైన పేరుని సొంతం చేసుకున్నారు. అభిమానులతో ముద్దుగా మాటల మాంత్రికుడు అని పిలిపించుకుంటూ ఉంటారు.(ఇదీ చదవండి: సినిమా మీద మేం చేసే ఆ ఖర్చంతా వేస్ట్: నిర్మాత నాగవంశీ)అయితే గత పదేళ్ల కాలంలో త్రివిక్రమ్ తీసిన సినిమాలు చూస్తే.. అన్నీ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అనే నిర్మాణ సంస్థలోనే తెరకెక్కించారు. ఇలా ఒకే నిర్మాతతో కలిసి ఎందుకు పనిచేస్తున్నారనే దానికి నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. తాజా ఇంటర్వ్యూలో త్రివిక్రమ్-తమ బంధం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.'బాబాయి(చినబాబు).. ఇండస్ట్రీలోకి రావాలనుకున్నప్పుడు మొదటి మూవీ త్రివిక్రమ్ దర్శకత్వంలో నిర్మించాలనుకున్నారు. త్రివిక్రమ్ పనితీరు, సినిమాలపై ఆయనకున్న అభిమానం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. 'జులాయి' తొలి చిత్రం. ఇది ప్రారంభమైనప్పటి నుంచి త్రివిక్రమ్‌తో మా అనుబంధం మరింత బలపడింది. 'హారిక అండ్ హాసిని క్రియేషన్స్' బ్యానర్ పేరుని ఆయనే సూచించారు. లోగో కూడా త్రివిక్రమ్ డిజైన్ చేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన బయట బ్యానర్(నిర్మాణ సంస్థ)లో సినిమా చేయలేదు. దీనికి ఎలాంటి అగ్రిమెంట్స్ లేవు. మా మధ్య ఉన్న రిలేషన్షిప్ అలాంటిది. ఓ కుటుంబంలా అయిపోయాం' అని నిర్మాత నాగవంశీ చెప్పుకొచ్చారు.త్రివిక్రమ్ ప్రస్తుతం తీస్తున్న 'ఆదర్శ కుటుంబం', త్వరలో ఎన్టీఆర్‌తో తీయబోయే మూవీ కూడా ఇదే సంస్థలో నిర్మిస్తున్నారు. మరోవైపు నాగవంశీ.. సితార నిర్మాణ సంస్థ తరఫున పలు మూవీస్ తీస్తూ బిజీగా ఉన్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలో సైకలాజికల్ హారర్ సినిమా 'బ్యాక్ రూమ్స్' తెలుగు రివ్యూ) -
ఓటీటీలో సైకలాజికల్ హారర్ సినిమా.. తెలుగు రివ్యూ
అప్పుడప్పడు క్రేజీ కాన్సెప్ట్‌తో సినిమాలు వస్తుంటాయి. చూస్తున్నంతసేపు వావ్ అనిపిస్తాయి. అలాంటి ఓ మూవీనే 'బ్యాక్ రూమ్స్'. 20 ఏళ్ల అమెరికన్ యూట్యూబర్ కేన్ పార్సన్స్ దీనికి దర్శకుడు. ఈ హాలీవుడ్ చిత్రం మన దగ్గర ఈ ఏడాది జూన్‌లో థియేటర్లలో రిలీజైంది. సరికొత్త హారర్ ఫీల్‌తో భయపెట్టింది. ఇప్పుడిది సోనీ లివ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఈ చిత్రం ఎలా ఉంది? అంతగా ఇందులో ఏముందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: 'కొరియన్ కనకరాజు' మూవీ రివ్యూ)కథేంటి?క్లార్క్(చివటేల్ ఎజియోఫోర్) ఓ ఆర్కిటెక్ట్. కానీ పరిస్థితుల కారణంగా ఓ ఫర్నీచర్ స్టోర్‌లో పనిచేస్తుంటాడు. భార్య నుంచి విడిపోయి ఒంటరిగా స్టోర్‌లోనే బతికేస్తుంటాడు. ఇతడి థెరపిస్ట్ మేరీ(రెనే రెయిన్స్వ్). ఓ రోజు క్లార్క్.. అనుకోకుండా తన స్టోర్‌లోనే ఉన్న ఓ రహస్య ప్రదేశాన్ని చూస్తాడు. అనుకోని పరిస్థితుల్లో దాని లోపలికి వెళ్తాడు. అదో అనంతమైన పసుపు గదుల సమూహం. ఇంతకీ ఇవేంటి? ఈ 'బ్యాక్ రూమ్స్' నుంచి క్లార్క్ బయటపడ్డాడా? ఇతడి కోసం వెతుకుతూ అందులోకి వెళ్లిన మేరీకి ఏమైంది? అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఇది రెగ్యులర్ సినిమా కాదు. దెయ్యాల్లాంటివి లేకపోయిప్పటికీ భయపెడుతుంది. చిత్రమైన సీన్స్ దెబ్బకు జుగుప్సకరంగానూ అక్కడక్కడ అనిపిస్తుంది. అదే టైంలో తర్వాత ఏం జరుగుతుందనే థ్రిల్ పంచుతుంది. ఓవరాల్‌గా ఈ మూవీ మీకో చిత్రమైన అనుభూతిని కలుగజేస్తుంది.మనిషి తన ట్రామా నుంచి పారిపోతూ తన తప్పుల్ని అంగీకరించకుండా అదే జ్ఞాపకాలతో బతికితే చివరకు తనలోని డార్క్నెస్సే మనల్ని ఎలా మింగేస్తుంది అనే అంశాన్ని సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌గా ఇందులో చూపించారు. ప్రధాన పాత్రధారి అయిన క్లార్క్ ట్రామాకు బలవగా.. మేరీ మాత్రం దాన్ని ఎదురించి బయటపడుతుంది. అయితే ఈ మూవీ హారర్ కంటే సైకలాజికల్ హారర్ అనుభవాన్ని అందిస్తుంది. ట్రామా ఎదురైతే బాధపడటం కంటే దాన్ని ఎదుర్కోండి అనే సత్యాన్ని విజువల్‌గా చూపిస్తుంది.ఇంగ్లీష్‌లోనే స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాలో స్టోరీ చాలా సాధారణంగా మొదలవుతుంది. కానీ ప్రధాన పాత్రధారి అయిన క్లార్క్.. ఎప్పుడైతే అనంతమైన పసుపు గదుల్లోకి అడుగుపెడతాడో నెక్స్ట్ ఏం జరుగుతుంది? అసలు దీని నుంచి ఎలా బయటపడతాడు? అనిపిస్తుంది. స్టోరీకి కనెక్ట్ అయితే మనం కూడా అతడితో అందులో చిక్కుకుపోయామా అనే ఫీలింగ్ కలుగుతుంది.'అబ్సెషన్' తరహాలోనే ఈ సినిమాలోనూ ప్రధానంగా రెండే పాత్రలు కనిపిస్తాయి. ఇవి కాకుండా మరో మూడు నాలుగు ఉంటాయంతే. అమెరికాతో పాటు విదేశాల్లో సెన్సేషన్ సృష్టించింది. గంట 50 నిమిషాల పూర్తి మూవీ చూసినా సరే చాలా సందేహాలు మిగిలిపోతాయి. అసలు అలా ఎందుకు జరిగింది? చివరకు ఏమైందనే ప్రశ్నలు ఉండిపోతాయి.సినిమాలో చూపించిన అనంతమైన పసుపు గదుల్ని గ్రాఫిక్స్‌లో కాకుండా నిజంగానే సృష్టించారు. అసలు ఇవన్నీ ఎలా తయారు చేశారు? అసలు ఇలాంటి ఆలోచన దర్శకుడికి ఎలా వచ్చిందా? అని సందేహం కలగకమానదు. ప్రధాన పాత్రలు చేసిన ఎజియోఫర్, రెయిన్స్వ్ అద్భుతంగా నటించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సన్నివేశాలకు తగ్గట్లు మూడ్‌ని ఎలివేట్ చేసింది. మీరు సరికొత్తగా ఉండే మూవీ ఏదైనా చూద్దామనుకుంటే మాత్రం దీన్ని అసలు మిస్ కావొద్దు.- చందు డొంకాన(ఇదీ చదవండి: లోకేశ్ కనకరాజు ‘డీసీ’ మూవీ రివ్యూ) -
యష్ 'టాక్సిక్' ట్రైలర్ రిలీజ్
యశ్ హీరోగా నటించిన ద్విభాషా (కన్నడ, ఇంగ్లిష్) చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ – అప్స్’. ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, తార సుతారియా, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషీ ప్రధాన పాత్రల్లో నటించారు. గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో వెంకట్ కె. నారాయణ, యశ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ‘టాక్సిక్’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను బెంగళూరులో నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన కన్నడ స్టార్శివ రాజ్‌కుమార్ మాట్లాడుతూ– ‘‘ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఈ సినిమా కోసం మేమందరం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. యశ్ నాకు బ్రదర్‌లాంటివాడు. తను ప్రతి సినిమాతో ఎదుగుతుండటం చాలా ఆనందంగా ఉంది’’ అని అన్నారు. యశ్ మాట్లాడుతూ– ‘‘నాకు ఇది చాలా ప్రత్యేకమైన సినిమా. నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేసిన సినిమా ఇది. ఇందులో రెండు, మూడు విభిన్నమైన లుక్స్‌లో కనిపిస్తాను. దాని కోసం చాలా సమయం అవసరమైంది. ఇండియన్ సినిమాను గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పై నిలబెట్టాలనే సంకల్పంతో ఈ సినిమా చేశాం. ఈ సినిమాను కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించాం. ఎంతోమంది ప్రతిభావంతులు ప్యాషన్‌తో హార్డ్ వర్క్ చేశారు. (ఇదీ చదవండి: భారత క్రికెటర్ జైస్వాల్‌తో డేటింగ్? క్లాస్ పీకిన మృణాల్)గీతూ మోహన్‌దాస్ ఈ సినిమా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఆమె విషయంలో ప్రతి ఒక్కరూ చాలా గర్వపడతారు. నిర్మాత వెంకట్‌గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆయన ఎప్పుడూ రాజీపడలేదు. అలాగే నా భార్య రాధిక స పోర్ట్ లేక పోతే ఈ సినిమా చేయగలిగేవాడిని కాదు. నేను ఇండియన్ సినిమాకు ఒక కార్మికుడిలా పని చేస్తాను. నా బెస్ట్ ఇవ్వడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తాను. ‘టాక్సిక్’ కచ్చితంగా మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది. ఈ సినిమా గుర్తుండి పోతుంది’’ అన్నారు. దర్శకురాలు గీతు మోహన్‌దాస్ మాట్లాడుతూ– ‘‘మమ్మల్ని నమ్మి కేవీఎన్గారు అన్నీ సమకూర్చడంవల్లే ఈ సినిమా సాధ్యమైంది. యశ్ వండర్ఫుల్ యాక్టర్, బ్రిలియంట్ ప్రోడ్యూసర్, అద్భుతమైన కో రైటర్. మా ప్రోడక్షన్ టీమ్‌కి, డైరెక్షన్ టీమ్‌కి, నటీనటులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. వాళ్లందరి హార్డ్ వర్క్ వల్లే ఈ సినిమా సాధ్యపడింది’’ అని చెప్పారు.‘‘దేశాల సరిహద్దులు దాటి ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు వెంకట్ కె. నారాయణ. ‘‘నేను ఎక్కడికి వెళ్లినా ఈ సినిమా గురించే అడుగుతున్నారు. ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్ట్‌లో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది’’ అని హ్యూమా ఖురేషి అన్నారు. ‘‘నా కెరీర్లో ‘బిఫోర్ టాక్సిక్, ఆఫ్టర్ టాక్సిక్’ అని తప్పకుండా అంటారు. ఇది నాకు చాలా స్పెషల్ మూవీ’’ అని కియారా అద్వానీ తెలిపారు. ‘‘మంచి క్యారెక్టర్ ఇచ్చి, నన్ను ప్రోత్సహించిన గీతూగారికి థాంక్యూ. ఈ సినిమా నాకో గొప్ప అనుభవం’’ అని రుక్మిణి వసంత్ పేర్కొన్నారు. ‘‘గతంలో గీతూతో కలిసి ఒక సినిమా చేశాను. కానీ ‘టాక్సిక్’ చేస్తున్నప్పుడు ఆమె పూర్తిగా వేరుగా కనిపించారు. ఈ సినిమా కథను ఆమె మైండ్ బ్లోయింగ్‌గా చెప్పారు’’ అని నయనతార చెప్పారు.(ఇదీ చదవండి: సినిమా మీద మేం చేసే ఆ ఖర్చంతా వేస్ట్: నిర్మాత నాగవంశీ) -
సమంత తిండిగోల.. తల్లి కూతురి బర్త్ డే సెలబ్రేషన్
ఆగస్టు నెల జ్ఞాపకాల్ని పంచుకున్న సమంతఅందంగా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్నటి సుప్రీత 25వ పుట్టినరోజు సెలబ్రేషన్తాజ్ మహల్ దగ్గర రుక్సార్ ధిల్లాన్ పోజులుజిమ్ వర్కౌట్ ఫొటోలు షేర్ చేసిన ధనశ్రీలంగా ఓణీలో ముద్దుగా హీరోయిన్ మానస చౌదరి View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Rukshar Dhillon (@rukshardhillon12) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) View this post on Instagram A post shared by Cherukuri Maanasa Choudhary (@maanasa.choudhary1) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) -
బాబంటే.. బాబే..
సినీ రంగంలో స్టార్లకు కొదవలేదు. కానీ వెండితెరపై విజయాలకే పరిమితం కాకుండా..నిజ జీవతంలోనూ వేలాది మంది జీవితాల్లో చిరునవ్వులు పూయించేవారు మాత్రం అరుదు. ఈ జాబితాల్లో ముందువరసలో ఉంటారు సూపర్‌స్టార్ మహేశ్ బాబు. కోట్లాది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న ఆయన.. నిజ జీవితంలో పసి హృదయాల రారాజుగా నిలిచారు. బాలనటుడిగా మొదలై.. భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రభావశీల నటుడిగా ఎదిగారు. ఆయన ప్రస్థానం.. విజయాలు, వైఫల్యాలు, రికార్డులు, సేవా కార్యక్రమాలు, కుటుంబ విలువలు, క్రమశిక్షణాల సమ్మేళనం. ప్రతి పాత్రలో నటుడిగా ఎదుగుతూ.. ప్రతి సేవా కార్యక్రమంలో మనిషిగా ఉన్నతంగా నిలిచిన మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవిత ప్రయాణంపై ప్రత్యేక కథనం.తమిళనాడులో జననం..సూపర్‌స్టార్ కృష్ణ తనయుడిగా ఆగస్టు 09,1975లో తమిళనాడులో జన్మించారు మహేశ్ బాబు. సినీ కుటుంబంలో పుట్టడంతో వెండి తెర కొత్త కాలేదు. చిన్నప్పటి నుంచి కెమెరాలు, షూటింగ్‌ల మధ్య పెరిగినా..తండ్రి పేరును ఆసరగా చేసుకోకుండా ప్రతిభే లక్ష్యంగా అడుగులు వేశారు. అదే ఆలోచన ఆయన్ని కోట్లాది అభిమానుల కథానాయకుడిని చేసింది.నాలుగేళ్లలోపే గుర్తింపు..చాలామంది హీరోలు యుక్త వయసులో అడుగుపెడితే.. ఈ రారాజు మాత్రం నాలుగేళ్లలోనే సినీ ప్రపంచంలోకి రంగ ప్రవేశం చేశారు. ‘నీడ’తో ప్రారంభమైన ఆయన ప్రయాణం వరుసగా పలు చిత్రాల వరకు కొనసాగింది. చిన్న వయసులోనే తన సహజమైన నటనతో దర్శకులను, ప్రేక్షకులను ఆకట్టుకుని భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకున్నారు. బాలనటుడిగా మంచి గుర్తింపు వచ్చినప్పటికీ చదువుకు ఇబ్బందులు ఎదరవకూడదనే ఉద్దేశంతో కొన్నేళ్లు పూర్తిగా సినిమాలకు బ్రేక్ వేశారు మహేశ్. తమిళనాడులో విద్యాభ్యాసం పూర్తి చేసి మళ్లీ కమ్‌బ్యాక్ ఇచ్చారు.రాజకుమారుడుతో హీరో.. ఒక్కడుతో స్టార్1999లో వైజయంతీ పతాకంపై రాజకుమారుడు సినిమాతో హీరోగా ఆరగ్రేటం చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. హీరోగా సినీ ప్రపంచానికి పరిచయం చేసింది దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కావడం విశేషం. తర్వాత వచ్చిన మురారి నటుడిగా గుర్తింపు తీసుకురాగా.. ఒక్కడుతో స్టార్ హీరోగా ఎదిగాడు. ఆ తర్వాత వచ్చిన పోకిరి, అతడు, దూకుడు, శ్రీమంతుడు, భరత్ అనే నేను,మహర్షి వంటి చిత్రాలు ఆయన స్థాయిని మరింత పెంచాయి.నిజ జీవితంలో శ్రీమంతుడై..శ్రీమంతుడు సినిమాతో గ్రామాన్ని దత్తత తీసుకునే సందేశాన్ని తెరపైకి తీసుకొచ్చిన ప్రిన్స్.. అదే ఆలోచనను నిజ జీవంతంలోనూ ఆచరించి శ్రీమంతుడిగా మారారు. గ్రామాల అభివృద్ధికి చేయూతనిస్తూ.. సమాజానికి సాయం చేయాలనే దృక్పథంతో ముందుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని బుర్రిపాలెం, తెలంగాణలోని సిద్దాపురం గ్రామాలను దత్తత తీసుకుని వాటి అభివృద్ధికి నాంది పలికారు. దీంతో బాధ్యత గల పౌరుడిగానూ గుర్తింపు సంపాదించుకున్నారు.హృదయాల రారాజుగా.. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న పేద చిన్నారులకు మహేశ్ బాబు ఫౌండేషన్ అనే సేవా సంస్థని స్థాపించి ఉచితంగా గుండె ఆపరేషన్స్ చేయించాడు. ఇప్పటి వరకు 5000లకు పైగా శాస్త్రచికిత్సలు చేసి వారి పాలిట దేవుడిగా నిలిచాడు. అందుకే చిన్నారులతో మొదలు అభిమానుల సైతం ఆయన్ని పసి హృదయాల రారాజుగా పిలుచుకుంటారు. -
భారత క్రికెటర్ జైస్వాల్‌తో డేటింగ్? క్లాస్ పీకిన మృణాల్
సినిమా సెలబ్రిటీలకు సంబంధించి ఎప్పటికప్పుడు రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. అలా రీసెంట్ టైంలో హీరోయిన్ మృణాల్ ఠాకుర్ గురించి ఒకటి బయటకొచ్చింది. భారత యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్‌తో డేటింగ్లో ఉందని అన్నారు. ముంబైలోని ఓ కాఫీ షాప్‌లో జంటగా కనిపించారని పుకార్లు తెగ అల్లేశారు. ఇప్పుడు దీనిపై స్వయంగా మృణాల్ స్పందించింది. కామెంట్ పెట్టి క్లాస్ పీకింది.(ఇదీ చదవండి: సినిమా మీద మేం చేసే ఆ ఖర్చంతా వేస్ట్: నిర్మాత నాగవంశీ)తను-జైస్వాల్ వైరల్ వీడియోకు సంబంధించి ఓ ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ కనిపించగా.. దానికి మృణాల్ కామెంట్ పెట్టింది. ఒకేచోట కనిపించినంత మాత్రాన ఇద్దరి మధ్య సంబంధం ఉందని ఎలా భావిస్తారు? అలా ఎలా అనుకుంటారు? అని ప్రశ్నించింది.'బ్రో రిలాక్స్.. మేమిద్దరం కలిసి ఎక్కడ కనిపించాం? మీరు ఇంత చదువుకున్నవాళ్లు కానీ ఇలాంటి పుకార్లను నిజమని ఎలా నమ్ముతున్నారు? దేశంలో ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. జెన్-జీ నుంచి కొంత నేర్చుకోండి. సరైన సమస్యలపై వీడియోలు చేయండి. అప్పుడు మరిన్ని వ్యూస్ వస్తాయి' అని మృణాల్ కామెంట్ చేసినట్లు ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇది రూమర్‌కి స్పందించినట్లు లేదు. చిన్నపాటి క్లాస్ పీకినట్లు ఉంది.అయితే మృణాల్‌పై డేటింగ్ రూమర్స్ ఇదేం కొత్త కాదు. తమిళ హీరో ధనుష్‌తో డేటింగ్లో ఉందని, వాలంటైన్స్ డే నాడు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తెగ మాట్లాడుకున్నారు. తీరా చూస్తే అవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమేనని తేలిపోయింది. ఈ బ్యూటీ కెరీర్ విషయానికొస్తే.. ఈ ఏడాది ఈమె నుంచి మూడు సినిమాలొచ్చాయి. వాటిలో 'డెకాయిట్' అనే తెలుగు మూవీ ఉంది. త్వరలో 'పూజా మేరీ జాన్' అనే ఓటీటీ చిత్రంలో కనిపించనుంది.(ఇదీ చదవండి: లోకేశ్ 'డిసి'.. విజయ్ దేవరకొండే చేయాలి కానీ) -
కాంతార 3 కోసం లొకేషన్స్ వెతుకుతున్నారా..?
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న కన్నడ స్టార్ రిషబ్ శెట్టి కాస్త బ్రేక్ తీసుకుని ఫ్యామిలీతో ప్రకృతి ఒడిలో సేదతీరుతున్నారు. ఈ మేరకు వీరు ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను భార్య ప్రగతి శెట్టి సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ అవుతున్నాయి. ఫొటోలను చూసిన అభిమానులు రిషబ్ నిజంగానే ఫ్యామిలీ ట్రిప్‌కు వెళ్లారా..? లేక కాంతార 3 కోసం లొకేషన్స్ వెతుకుతున్నారా..? అని కామెంట్స్ చేస్తున్నారు. కాంతార చిత్రంతో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యారు రిషబ్ శెట్టి. 2017లో పెద్దల అంగీకారంతో ప్రేమవివాహం చేసుకోగా ఇద్దరు పిల్లలు( రాధ్య, రణ్విత్). సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి సమయం కేటాయించడంలో ముందు వరుసలో ఉంటారీయన. ప్రస్తుతం ప్రకృతి అందాల మధ్య ప్రశాంతంగా గడుపుతున్న ఫొటోలు వైరల్ కావడంతో అభిమానులు సోషల్ మీడియాకు పని చెప్తున్నారు. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులు రిషబ్ చేతిలో ఉన్నాయి. ‘జై హనుమాన్’ చిత్రంలో ఆంజనేయుడిగా, ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్- ఛత్రపతి శివాజీ మహారాజ్’లో ఛత్రపతి శివాజీగా సినీ ప్రేక్షకులను పలకరించనున్నాడు. వీటితో పాటు ‘కాంతార ఛాప్టర్ 3’ పైనా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. -
లోకేశ్ 'డిసి'.. విజయ్ దేవరకొండే చేయాలి కానీ
ఈ వీకెండ్ థియేటర్లలో రిలీజైన సినిమాల్లో వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'కి మిక్స్డ్ టాక్ వచ్చింది. కొందరు బాగుందని అంటున్నారు. మరికొందరు నచ్చలేదని అంటున్నారు. దీనితో పాటే 'డిసి' అనే తమిళ డబ్బింగ్ బొమ్మ కూడా రిలీజైంది. ఇందులో స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ హీరోగా నటించగా.. అనిరుధ్ సంగీతమందించాడు. రా అండ్ రస్టిక్ యాక్షన్ స్టోరీతో దీన్ని తీశారు. దీనికి అంతటా పాజిటివ్ టాక్ వస్తోంది. అయితే ఈ మూవీ విజయ్ దేవరకొండ చేయాల్సింది. ఆ విషయమే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: సినిమా మీద మేం చేసే ఆ ఖర్చంతా వేస్ట్: నిర్మాత నాగవంశీ)'తమిళ దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ నా దగ్గరకు ఓ ఆసక్తికరమైన కథతో వచ్చాడు. నాకు చెప్పాడు. అదే టైంలో నేను చేస్తున్న ఓ సినిమా స్టోరీ.. దీనికి పోలినట్లు ఉండటంతో నేను అది ఓకే చేయలేకపోయాను' అని స్వయంగా విజయ్ దేవరకొండ చెప్పిన పాత వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.ఈ వీడియో బట్టి చూస్తే విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' సినిమా చేస్తున్న టైంలో దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ 'డిసి' కథతో విజయ్‌ని కలిశాడు. కానీ సెట్ కాలేదు. దీంతో హీరోగా లోకేశ్ కనగరాజ్‌ని తీసుకున్నారు. అలా రౌడీ హీరో చేయాల్సిన మూవీతో దర్శకుడు లోకేశ్ హీరోగా మారాడు. నటుడిగా తొలి చిత్రంతోనే సక్సెస్ అందుకున్నాడు. ఒకవేళ విజయ్ దేవరకొండ 'డిసి' చేసుంటే ఎలా ఉండేదో?ఇకపోతే విజయ్ దేవరకొండ ప్రస్తుతం రణబాలి, రౌడీ జనార్ధన సినిమాలతో బిజీగా ఉండగా.. లోకేశ్ కనగరాజ్, అల్లు అర్జున్‌తో తాను తీయాల్సిన #AA23 ప్రాజెక్ట్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు.(ఇదీ చదవండి: లోకేశ్ కనకరాజు ‘డీసీ’ మూవీ రివ్యూ) DC VDK pic.twitter.com/mD6vEUCMEQ— Telugu Chitraalu ² (@TC_Backup) August 8, 2026 -
డబ్బులు పెట్టి మేం చేసే ఆ పనివల్ల ఒక్క టికెట్ కొనరు
తెలుగులో ఏ సినిమా అయినా ఫలానా రోజున రిలీజ్ అవుతుందంటే.. హీరో,హీరోయిన్, దర్శకుడు, నిర్మాత ఇలా టీమ్ అంతా అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో కనిపిస్తారు. ఇంటర్వ్యూలు, కాలేజీ టూర్స్ అని తెగ హడావుడి చేస్తుంటారు. వీటికి అదనంగా పేపర్ యాడ్స్, సిటీ అంతా హోర్డింగ్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లాంటివి ప్రచారంలో భాగమవుతుంటాయి. అయితే వీటి వల్ల ఒక్క టికెట్ కొనరని ప్రముఖ నిర్మాత నాగవంశీ అంటున్నారు. తాజాగా ఓ యూట్యూబర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేశారు.(ఇదీ చదవండి: లోకేశ్ కనకరాజు ‘డీసీ’ మూవీ రివ్యూ)'ఏడాదికి నాలుగు సినిమాలు రిలీజ్ చేస్తున్న నిర్మాతగా చెబుతున్నా. ప్రమోషన్స్ అంటూ మేం ఖర్చు చేసే ప్రతి రూపాయి వృథానే. డబ్బులు పెట్టి చేసే పబ్లిసిటీ వల్ల ఒక్క టికెట్ తెగదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ వల్ల ఒక్క టికెట్ కొనరు. ఆర్గానిక్‌గా ఓ టీజర్ నచ్చి పాట నచ్చితే ప్రేక్షకులు వస్తారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయకపోతే.. ఏ ప్రమోషన్స్ చేయరా? సినిమాని వదిలేస్తారా? సినిమాకు బజ్ లేదని అంటారు. పోనీ ఇవేమైనా చేస్తే బజ్ వస్తుందా? టికెట్ తెగుతుందా? గ్యారంటీ ఏమైనా ఉందా? అంటే తెలీదు. న్యూస్ పేపర్ యాడ్స్, హోర్టింగ్స్.. వీటివల్ల ఏమొస్తుంది? టికెట్ ఏం తెగదని ఎన్ని రకాలుగా చెప్పినా అర్థం చేసుకోరు. వీరభద్రుడు, బ్లాస్ట్, లెనిన్, చెన్నై లవ్ స్టోరీ.. ఈ సినిమాల మార్నింగ్ షో కలెక్షన్‌కి సెకండ్ షో కలెక్షన్‌కి సంబంధం లేదు. ఉదయం షోకి రాత్రి షోకి మధ్య ఉన్న 10-12 గంటల గ్యాప్‌లో ఏం ప్రమోషన్ చేస్తారు? ఏం చేయంగా! సినిమా బాగుందటే టాక్ వల్లే ఇలా జరిగింది' అని నాగవంశీ చెప్పుకొచ్చారు.ఈయన చెప్పిన దానిబట్టి చూస్తే నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఎంత పెద్ద హీరో సినిమా అయినా టాక్ బాగోలేదు అని వస్తే జనాలు లైట్ తీసుకుంటారు. అదే టైంలో ఎలాంటి స్టార్స్ లేని, అసలు బజ్ లేని చిన్న చిత్రం బాగుందంటే ప్రేక్షకులే నెత్తిన పెట్టుకుంటారు. గతంలో ఇలాంటివి చాలా జరిగాయి. ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయి.ఇకపోతే నాగవంశీ నిర్మించిన 'లెనిన్' సినిమా గత నెలలో రిలీజ్ కాగా ఇప్పుడు సూర్యతో చేసిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' రాబోతుంది. వచ్చే శుక్రవారం ఇది తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. వచ్చే నెలలో ఈయన నిర్మించిన 'ఎపిక్' థియేటర్లలోకి రాబోతుంది. ఇందులో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటించారు. అలానే ఆనంద్ దేవరకొండ చేసిన 'తక్షకుడు' అనే చిత్రం దీపావళి టైంలో నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోనే రిలీజైన తెలుగు సినిమా) -
‘డీసీ’ మరోసారి నిరూపించింది: నిర్మాత సురేష్ బాబు
‘‘ప్రేక్షకులు చాలా తెలివైనవారు. ఓ మూవీ ట్రైలర్ చూసి సినిమా ఎలా ఉంటుందో అర్థం చేసుకుంటారు. కొత్తదనం కనిపిస్తే థియేటర్‌కు వస్తారు. సినిమా బాగుంటే ఆడియన్స్ తప్పకుండా ఆదరిస్తారని ‘డీసీ’ మరోసారి నిరూపించింది. ప్రతి షోకి ఆదరణ పెరుగుతోంది. ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు’’ అని నిర్మాత డి. సురేష్ బాబు తెలిపారు. లోకేష్ కనగరాజ్ హీరోగా, వామికా గబ్బి, సంజనా కృష్ణమూర్తి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘డీసీ’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ మూవీని ఏషియన్ సినిమాస్ శుక్రవారం తెలుగులో రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో నిర్మాత సునీల్ నారంగ్ మాట్లాడుతూ– ‘‘డీసీ’ అన్ని చోట్ల విజయవంతంగా ప్రదర్శితమవుతూ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ మూవీకి అన్ని ్ర΄ాంతాల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. స్క్రీన్స్ కూడా పెరుగుతున్నాయి. ఈ విజయం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది’’ అన్నారు నిర్మాత శిరీష్ రెడ్డి. -
నేరుగా ఓటీటీలోనే రిలీజైన తెలుగు సినిమా
ఈ వారం ఓటీటీల్లో చాలా సినిమాలు రిలీజయ్యాయి. వాటిలో లెనిన్, ఓ సుకుమారి, ఎమ్మార్పీ లాంటి తెలుగు చిత్రాలు ఉండగా హృదయం మురళి, వంద దేవుళ్లు, ఉయిర్, మై వాపస్ ఆవుంగా లాంటి డబ్బింగ్‌లు.. వదంది 2, ఆపరేషన్ సఫేద్ సాగర్ తదితర తెలుగు డబ్బింగ్ సిరీస్‌లు కూడా వచ్చాయి. ఇలా చూసేందుకు బోలెడన్ని ఉండగా మరో తెలుగు మూవీ నేరుగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ మిస్టరీ థ్రిల్లర్ సినిమా 'ఉయిర్' తెలుగు రివ్యూ)రాము, శివకృష్ణ, ప్రదీప్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'పంచనామా'. లెక్క ప్రకారం గత నెలలో థియేటర్లలో రిలీజ్ కావాలి. కానీ అది జరిగినట్లు లేదు. దీంతో తాజాగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. కాకపోతే అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ థ్రిల్లర్ స్టోరీతో తీసిన ఈ మూవీకి జాన్ రమేశ్ దర్శకత్వం వహించాడు.'పంచనామా' విషయానికొస్తే.. నగరంలో వరస హత్యలు జరుగుతాయి. ఇవి ఎవరు చేస్తున్నారో తెలీక పోలీసులు తలలు పట్టుకుంటారు. హంతకుడి గురించి ఒక్క క్లూ కూడా దొరకదు. దీంతో స్పెషల్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. ఇంతకీ ఈ హత్యలకు కారణం ఎవరు? పోలీసులు చివరకు నిందితుడిని పట్టుకున్నారా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి కంగనా రనౌత్ థ్రిల్లర్ సినిమా.. అధికారిక ప్రకటన) -
‘ఓహ్ మై డాగ్’ తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే..!
బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన ‘ఓహ్ మై డాగ్’ ఆగస్టు 7న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. అమిత్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను జంతుప్రేమికులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. కుక్కలు, మనుషుల మధ్య అనుబంధాన్ని ప్రధానంగా చూపించారు. ఈ సినిమాకు మంచి స్పందన వస్తున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద తొలిరోజు బోల్తాకొట్టినట్లు కనిపిస్తోంది. సాక్నిల్క్(saknilk) ప్రకారం.. ఇండియాలో తొలి రోజు ‘ఓహ్ మై డాగ్’ సుమారు రూ.85లక్షల నెట్ వసూళ్లు సాధించింది. గ్రాస్ కలెక్షన్లు దాదాపు రూ.1.02 కోట్లుగా నమోదయ్యాయి. శుక్రవారం ఈ సినిమా 844 షోలను ప్రదర్శంచారు. తక్కువ సంఖ్యలో తెరలపై విడుదల కావడం కూడా ఈ వసూళ్లపై ప్రభావం చూపించినట్లు తెలుస్తోంది. వీకెండ్ కావడంతో వసూళ్లు పెరిగే అవకాశముంది.ఈ సినిమాని కుక్కలు,వాటితో మనుషులకు ఏర్పడే అనుబంధమే ప్రధాన కథాంశంగా తెరకెక్కించారు దర్శకుడు అమిత్ రాయ్. గతంలో పంకజ్ త్రిపాఠితో ‘ ఓహ్ మై గాడ్’ గా ఇప్పుడు ‘ఓహ్ మై డాగ్’గా టైటిల్ మార్చి తెరకెక్కించారు. ఇక సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. సుమారు రూ.8 కోట్ల నుంచి రూ.25 కోట్ల మధ్య ఉంటుందని సమాచారం. -
ఓటీటీలో దూసుకెళ్తున్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్
ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు రఘు కుంచే ప్రధాన పాత్రలో నటించి, సంగీతాన్ని అందించిన ‘గేదెలరాజు’ ఓటీటీలో విశేష ఆదరణ పొందుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 24న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఆహాలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అత్యధికంగా రీ-వాచ్ అవుతున్న చిత్రాల్లో ఒకటిగా కొనసాగుతుండగా, ఆహాలో కూడా ట్రెండింగ్‌లో నిలిచింది. మోటూరి క్రియేషన్స్ బ్యానర్‌పై రఘు కుంచే సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి చైతన్య మోటూరి దర్శకత్వం వహించారు. ఆయన నాన్-లీనియర్ స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.గేదెల రాజు కథేంటంటే..కాకినాడకు చెందిన రౌడీ షీటర్ గేదెల రాజు(రఘు కుంచె) కార్పోరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటాడు. స్థానిక ఎమ్మెల్యే గేదెల రాజుకే టికెట్ కేటాయిస్తాడు. అదే పార్టీకి చెందిన దుర్గ(శ్రీకాంత్ అయ్యంగార్) కూడా టికెట్ ఆశిస్తాడు. వీరిద్దరికి పడకపోవడంతో..ఎమ్మెల్యే ఇంటికి పిలిపించుకొని కలిసి పని చేయాలని చెబుతారు. అందుకు ఇద్దరు నిరాకరించి..అక్కడ నుంచి వెళ్లిపోతారు. అదే రోజు రాత్రి గేదెల రాజు హత్యకు గురవుతాడు.ఎమ్మెల్యే మనిషి కావడంతో పోలీసులు ఈ కేసుని సీరియస్‌గా తీసుకుంటారు. గేదెర రాజు సోదరుడు శ్యాంబాబుతో పాటు దుర్గను కూడా పిలిచి విచారిస్తారు. అయితే ఈ కేసుతో వాళ్లకు సంబంధం లేదని తెలుస్తుంది. మరి గేదెల రాజుని చంపిందెవరు? ఎందుకు చంపారు? రిచ్ (వికాస్)-మీరా(మౌనిక), విజయ్ (రామచంద్రం)-సత్య(టీనా శ్రావ్య)లతో గేదెల రాజుకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు హంతకులను పోలీసులు కనిపెట్టారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
సల్మాన్‌ఖాన్ ఇంటి ముందు కానిస్టేబుల్ మృతి.. ఏం జరిగింది..!
ముంబైలో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఇంటి వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ గణేశ్(41) అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సల్మాన్‌ఖాన్ నివాసం వద్ద భద్రతా ఏర్పాట్లలో భాగంగా గణేశ్ విధులకు వచ్చారు. డ్యూటీలో ఉండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలారు. తోటి పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.సల్మాన్‌కు భద్రత ఎందుకంటే..గతంలో సల్మాన్‌ఖాన్‌కు గ్యాంగ్‌స్టార్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి వచ్చిన బెదిరింపుల నేపథ్యంలో ఆయన నివాసం వద్ద పోలీసులు భద్రత పెంచారు. మరోపక్క 1990లో ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా చిత్రీకరణ సమయంలో కృష్ణజింకలను వేటాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై కూడా బిష్ణోయ్ బృందం కఠినంగా ఉన్నట్లు చెబుతుంటారు. 2024లో సల్మాన్ నివాసమైన బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్మెట్స్ వద్ద కాల్పులు చేటుచేసుకున్నాయి. దీంతో అక్కడ కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.నా భద్రత.. దేవుడి చేతుల్లోనే..తనకు వస్తున్న బెదిరింపులు, ఏర్పాటు చేసి బందోబస్తుపై సల్మాన్‌ఖాన్ గతంలో మాట్లాడుతూ..‘ భారీ భద్రత మధ్య జీవించడం, బయటకు వెళ్లి రావడం కొన్నిసార్లు ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ బెదిరింపులకు నేను బయపడను. నా భద్రత అంతా దేవుడి చేతుల్లోనే ఉంటుంది’ అని అన్నారు. -
‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్‌డే కలెక్షన్స్ .. అన్ని కోట్లా?
చాలా రోజుల తర్వాత మెగాహీరో వరుణ్ తేజ్ డీసెంట్ హిట్ కొట్టాడు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’. నిన్న(ఆగస్ట్ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి..తొలి రోజు మిశ్రమ స్పందన లభించింది. కథగా చూస్తే ఈ హారర్ కామెడీ రొటీన్ అయినప్పటికీ.. కామెడీ సీన్లు వర్కౌట్ అయ్యాయని పలు వెబ్సైట్లు తమ రివ్యూల్లో పేర్కొన్నాయి. అయితే టాక్‌తో సంబంధం లేకుండా తొలి రోజు ఈ చిత్రం భారీ వసూళ్లనే సాధించింది. (చదవండి: 'కొరియన్ కనకరాజు' మూవీ రివ్యూ అండ్ రేటింగ్)మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.20 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మధ్యకాలంలో వరుణ్ నటించిన చిత్రాలేవి ఫస్ట్‌డే ఈ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేదనే చెప్పాలి. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రితికా నాయర్ హీరోయిన్గా నటించింది. సత్య, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించాడు. 10.20 CRORES+ GROSS for the NON-STOP ENTERTAINER #KoreanKanakaraju on Day 1 including Premieres 🤎🤎🤎ALL TIME HIGHEST OPENING GROSSER FOR @IamVarunTej 🔥🔥🔥The entire team is Truly grateful to the audience for showering the film with such incredible love and support at the… pic.twitter.com/3QHHtRQjRn— UV Creations (@UV_Creations) August 8, 2026 -
టీవీ నటిని పెళ్లాడిన భారత క్రికెటర్.. ఫొటోలు వైరల్
భారత క్రికెటర్ రమణ్‌దీప్ సింగ్ ఓ ఇంటివాడయ్యాడు. బుల్లితెర నటి చార్లీ చౌహాన్‌ను పెళ్లి చేసుకున్నాడు. అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను చార్లీ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి.కేకేఆర్ ఆల్‌రౌండర్‌గా..ఈ క్రమంలో నూతన వధూవరులు రమన్‌దీప్ సింగ్- చార్లీ చౌహాన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా చండీగఢ్‌లో 1997లో జన్మించిన రమణ్‌దీప్ సింగ్.. క్రికెట్‌పై మక్కువతో బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. దేశవాళీ క్రికెట్లో పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున 2022లో అరంగేట్రం చేశాడు.ప్రస్తుతం కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఆడుతున్న రమణ్‌దీప్ సింగ్.. ఐపీఎల్లో ఇప్పటి వరకు 38 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 299 పరుగులు తీయడంతో పాటు.. ఏడు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ రైటార్మ్ మీడియం పేసర్.టీమిండియా తరఫున అరంగేట్రంఇక ఐపీఎల్లో సత్తా చాటిన రమణ్‌దీప్ సింగ్‌కు 2024లో టీమిండియా సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ సందర్భంగా అతడు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. భారత్ తరఫున ఇప్పటికి రెండు మ్యాచ్‌లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ కేవలం 15 పరుగులు చేయడంతో పాటు ఒక వికెట్ తీయగలిగాడు.ఎవరీ చార్లీ చౌహాన్?చార్లీ చౌహాన్ బుల్లితెర నటి. బెస్ట్ ఫ్రెండ్స్ ఫరెవర్ సిరీస్‌లో ఏలా అనే పాత్రతో ఆమె గుర్తింపు పొందింది. ఆ తర్వాత కైసీ యే యారియాన్లో ముక్తి వర్ధన్ అనే పాత్ర పోషించింది. అదే ఎంటీవీ రోడీ సీజన్ 7లోనూ చార్లీ పాల్గొంది.నటుడు కున్వార్ అమర్‌తో కలిసి నచ్ బలియే అనే డ్యాన్స్ ప్రోగ్రామ్‌లోనూ చార్లీ భాగమైంది. గతంలో వీరిద్దరు రిలేషన్షిప్లో ఉన్నారనే ప్రచారం జరిగింది. ఇక యే హై ఆషికి 4 వంటి షార్ట్ ఫిలిమ్స్‌లోనూ చార్లీ నటించింది.కేవలం నటనకే పరిమితం కాకుండా సంగీతం, రైటింగ్లోనూ చార్లీకి ప్రవేశం ఉంది. పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌కి ఆమె రచయితగా పనిచేసింది. అయితే, రమణ్‌దీప్ సింగ్‌తో చార్లీ ఎనిమిదేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. పెళ్లి ఫొటోలు పంచుకుంటూ.. ‘‘ఎనిమిదేళ్లుగా మేము.. ఇప్పుడిలా.. శాశ్వత బంధంలోకి అడుగుపెట్టాము’’ అని చార్లీ చౌహాన్ ఇచ్చిన క్యాప్షన్‌ను బట్టి ఇది నిజమని తేలింది.చదవండి: మూడేళ్లుగా తిరుతుగున్నా... ప్లీజ్ సాయం చేయండి: పంత్ -
‘యముడు’ మూవీ రివ్యూ
ప్రస్తుతం మైథలాజికల్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘యముడు’. ‘ధర్మో రక్షతి రక్షితః’ ఉపశీర్షిక. జగన్నాధ పిక్చర్స్ బ్యానర్‌పై జగదీష్ ఆమంచి హీరోగా, దర్శకుడిగా వ్యవహరిస్తూ నిర్మించిన ఈ చిత్రంలో శ్రావణి శెట్టి హీరోయిన్గా నటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..అనాథ అయిన విశ్వనాథ్(జగదీశ్ ఆమంచి).. ఓ రోజు గుడిలో అను(శ్రావణి శెట్టి)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకొని జీవితంలో సెటిల్ అవ్వాలనుకుంటాడు. మరోవైపు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జగడ్.. తన స్నేహితుడు ఆకాశ్‌తో కలిసి సరదా పాటలు పాడుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటాడు. అతనికి హరిణి(అద్విక శర్మ)అనే స్నేహితురాలు ఉంటుంది. ఆమె అంటే జగడ్కి చాలా ఇష్టం. కానీ హరిణి మాత్రం జగడ్ ప్రేమని సీరియస్‌గా తీసుకోదు. అంతేకాదు అతని ఫ్రెండ్ ఆకాశ్‌తో కమిట్ అవుతుంది కూడా. కొన్నాళ్లకి జగడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి స్థాయికి వెళ్లడం.. గ్రామీ అవార్డు కూడా పొందడంతో అతన్ని పెళ్లి చేసుకోని సెటిల్ అవ్వాలని హరిణి ప్లాన్ వేస్తుంది. ఆమెకు అడ్డుగా ఉన్న ప్రియుడు ఆకాశ్‌ని చంపేయాలనుకుంటుంది. అదే సమయంలో ఊరిలోని మహిళలు వరుసగా హత్యగావించబడతారు. ఈ కేసు పోలీసులకు సవాలుగా మారుతుంది. అసలు ఈ హత్యలు చేసేదెవరు? ఎందుకు చేస్తున్నారు? ఆకాశ్ అడ్డుని తొలగించుకోవాలనుకున్న హరిణి ప్లాన్ వర్కౌట్ అయిందా లేదా? విశ్వ ఎవరు? అతని నేపథ్యం ఏంటి? జగడ్..హరిణిల వివాహం జరిగిందా లేదా? చివరకు ఏమైంది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..మైథలాజికల్ చిత్రాలకు ఇప్పుడు తెలుగులో మంచి ఆదరణ ఉంది. దానికి క్రైమ్ బేస్డ్ స్టోరీ యాడ్ అయితే.. మరింత ఆకట్టుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమే ఈ ‘యముడు’. ఇందులో వరుస హత్యలు అనే కాన్సెప్ట్ రొటీన్ గా ఉన్నా... వాటికి మైథాలజికల్ టచ్ ఇస్తూ... సినిమాను గరుడ పురాణంతో అనుసంధానం చేసి తెరకెక్కించిన విధానం బాగుంది. ఫస్టాఫ్‌లో ఒకవైపు లవ్‌స్టోరీ చూపిస్తూనే.. హత్యలను చూపించడంతో దాని వెనుక ఉన్నదెవరు అనే క్యూరియాసిటీ ప్రెక్షకుల్లో పెంచేశాడు. ఇక సెకండ్ హాఫ్ లో ఒక్కొక్కటిగా క్రైమ్ సీన్ వెనుక ఉన్న సీక్రెట్స్ ను రివీల్ చేస్తూ క్లైమాక్స్ లో ఇచ్చిన ముగింపు మహిళలకు ఓ మెసేజ్ ఇస్తుంది.ఎవరెలా చేశారంటే.. హీరోగా... దర్శకుడిగా... నిర్మాతగా జగదీశ్ ఆమంచి ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్స్ పక్కన పెడితే... మిగతా అంశాల్లో తన ప్రతిభను ఆన్ స్క్రీన్ పై చూపించాడు. అతనికి జంటగా నటించిన ఇద్దరు అమ్మాయిలు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. అద్విక శర్మ హాట్ గా కనిపించి యూత్ ను ఆకట్టుకుంది. ఆకాష్ కూడా తన పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించాడు. మిగతా పాత్రలన్నీ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.. సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. యముణ్ణి బేస్ చేసుకుని రాసుకున్న సంభాషణలు ఆకట్టుకుంటాయి. క్రైం బేస్డ్ మైథాలజికల్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకునే వారికి ఈ సినిమా నచ్చుతుంది. - రేటింగ్: 2.5/5 -
ఒకప్పుడు తోపు యాక్టర్.. ఇప్పుడు ఆటో డ్రైవర్!
సినిమాల్లో ఒక్క అవకాశం వస్తే చాలు.. జీవితం మారిపోతుందని చాలామంది అనుకుంటారు. కానీ తమిళ నటుడు మారిముత్తు జీవితం చూస్తే పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుందని అర్థమవుతుంది. ఒకప్పుడు వెండితెరపై నటుడిగా మెరిసిన ఆయన.. ఇప్పుడు కుటుంబాన్ని పోషించుకునేందుకు ఆటో నడుపుతున్నారు. ఎం. శశికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం సుబ్రమణ్యపురం 2008లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులో అనంతపురం 1980 పేరుతో ఈ సినిమా విడుదలైంది. శశికుమార్, జై, స్వాతి తదితరులు నటించిన ఈ చిత్రంలో మారిముత్తు కూడా కీలక పాత్రలో కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే సినిమా విజయవంతమైనప్పటికీ ఆయనకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.మదురైలో జన్మించి..మదురైలో జన్మించిన మారిముత్తు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా మూడో తరగతి వరకే చదువుకున్నట్లు సమాచారం. చిన్నప్పటి నుంచే వివిధ పనులు చేస్తూ జీవనం సాగించారు. రేడియో రిపేర్ షాప్‌లోనూ పనిచేశారు. అనంతరం సినిమా అవకాశాల కోసం చెన్నై వెళ్లారు.అక్కడ ఓ సినిమా చిత్రీకరణ సమయంలో చిత్రబృందం మారిముత్తు ఫొటో తీసుకుంది. కొద్ది రోజుల తర్వాత ఆడిషన్‌కు పిలవడంతో ఆయన సినీ ప్రయాణం మొదలైంది. అలా సుబ్రమణ్యపురంలో నటించే అవకాశం దక్కింది.అయితే ఆ తర్వాత ఆశించిన అవకాశాలు రాకపోవడంతో కుటుంబ పోషణ కోసం ఆటో నడపడం మొదలుపెట్టారు. ఇలా ఆటో నడుపుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమాల్లో నటించిన వ్యక్తి.. జీవనం కోసం ఆటో నడపడం చూసి పలువురు ఆయన పట్టుదలను ప్రశంసిస్తున్నారు. మళ్లీ సుబ్రమణ్యపురం 2 వంటి సినిమాలో మంచి పాత్ర దక్కుతుందని మారిముత్తు ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. -
ధురంధర్ ‘పీక్ డీటెయిలింగ్’ కోసం ఇన్ని కోట్లు ఖర్చా..!
అదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురంధర్’, ‘ధురంధర్: ది రివెంజ్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే సినిమాల విజయంతో పాటు సోషల్ మీడియాలో మరో విషయం విపరీతంగా వైరల్ అయింది. అదే ‘పీక్ డీటెయిలింగ్’. ప్రతి సన్నివేశంలోని చిన్న చిన్న అంశాలపై దర్శకుడు చూపించిన శ్రద్ధను ప్రేక్షకులు ప్రశంసిస్తూ ఈ పదాన్ని మీమ్స్‌గా మార్చేశారు.. తాజాగా నటుడు ఆర్.మాధవన్ ఈ ‘పీక్ డీటెయిలింగ్’ వెనుక ఉన్న ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. సినిమాల్లోని డీటెయిలింగ్ కోసం అదిత్య ధర్ ఏకంగా రూ.10 కోట్లు అదనంగా ఖర్చు చేశారని చెప్పారు.ఓ ఇంటర్వ్యూలో మాధవన్ మాట్లాడుతూ.. ‘దాదాపు ఎనిమిది గంటల నిడివి ఉన్న ప్రాజెక్ట్‌లో ప్రతి చిన్న విషయాన్ని తెరపై చూపించేందుకు దర్శకుడు ఎంతో సమయం, డబ్బు ఖర్చు పెట్టారు. సినిమా కోసం రూ.10 కోట్లు అదనంగా కేవలం డీటెయిలింగ్ కోసమే ఖర్చు చేశారని నాకు తెలిసింది. ‘నీకు పిచ్చా? అవన్నీ ఎవరు చూస్తారు? కనిపించవు కదా?’ అని అనేవాడిని’ అని అన్నారు.ఇక ‘పీక్ డీటెయిలింగ్ బై అదిత్య ధర్’ అనే పదం ట్రెండ్‌పై అదిత్య ధర్ కూడా స్పందించారు. తన పుట్టినరోజు సందర్భంగా ఎక్స్‌లో చేసిన పోస్టులో మీమ్స్‌ను ప్రస్తావిస్తూ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా ఆర్. మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన ‘G.D.N.’ ఆగస్టు 7న థియేటర్లలో విడుదలైంది. జీడీ నాయుడు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ బయోపిక్కు కృష్ణకుమార్ రామకుమార్ దర్శకత్వం వహించారు. మాధవన్‌తో పాటు సత్యరాజ్, జయరామ్, ప్రియమణి, దుషారా విజయన్ కీలక పాత్రల్లో నటించారు. -
హీరోగా హిట్ కొట్టిన అల్లు అర్జున్ దర్శకుడు
పక్కా మాస్ కమర్షియల్ కథాచిత్రాల దర్శకుడు లోకేశ్ కనకరాజ్. మానగరం చిత్రం ద్వారా దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన ఈయన తొలి చిత్రంతోనే కమర్షియల్‌గా హిట్ అందుకున్నారు. ఆ తర్వాత కార్తీ హీరోగా ఖైదీ, విజయ్ కథానాయకుడిగా మాస్టర్, లియో, కమలహాసన్ హీరోగా విక్రమ్, రజనీకాంత్ హీరోగా కూలి వంటి భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రాలను తెరకెక్కించి.. ఇది తన బాణి అని తెలియజేశారు. ప్రస్తుతం ఈయన దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకుడుగా పాన్ ఇండియా చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.(చదవండి: లోకేశ్ కనకరాజు ‘డీసీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)ఇలాంటి పరిస్థితుల్లో దర్శకుడు లోకేశ్ కనకరాజ్ కథానాయకుడిగా అవతారం ఎత్తి నటించిన చిత్రం డీసీ. ఈ చిత్రం కూడా ఆయన గత చిత్రాల స్థాయిలోనే పగ, ప్రతీకారం వంటి అంశాలతో ఫుల్ మాస్ ఎంటర్ టైనర్‌గా రూపొందింది. ఇందులో లోకేశ్ కనకరాజ్ ఒక గ్యాంగ్ స్టర్‌గా నటించారు. ఈయన పోలీసులకే పెద్ద సవాల్‌గా మారతాడు. అసలు ఈయన ఎందుకు తుపాకీ, కత్తులను చేతపట్టాల్సి వచ్చింది? పోలీసులపై ఎందుకు కక్ష కట్టాల్సి వచ్చింది? ఈయన తన తండ్రి తనకు కొడుకే లేడు అన్నంతగా నైరాశ్యానికి ఎందుకు గురయ్యాడు? వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన చిత్రం డీసీ. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ భారీ యాక్షన్ ఓరియంటెడ్ కథా చిత్రానికి అరుణ్ మదేశ్వరన్ దర్శకత్వం వహించారు. నటి వామిక గబ్బి, సంజన హీరోయిన్లుగా నటించిన ఇందులో దర్శకుడు కస్తూరి రాజా, తలైవాసల్ విజయ్, క్రిష్ దయాళ్, అవినాష్దేవన్,, జవహర్ శక్తి, శరత్ రవి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. అనిరుద్ సంగీతాన్ని, ముఖేష్ ఛాయాగ్రహణంను అందించారు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. -
శింబుకు అమ్మగానా?.. యంగ్ బ్యూటీ ఏమన్నారంటే..?
కోలీవుడ్‌లో ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తున్న చిత్రాల్లో అరసన్ ఒకటి. దీనికి కారణం నటుడు శింబు కథా నాయకుడుగా నటిస్తుండడమే. ఆయనతోపాటు విజయ్ సేతుపతి, ఆండ్రియా, యోగిబాబు, సముద్రఖని, విక్రాంత్, కిషోర్, అమీర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కలైపులి ఎస్ ధాను తన వీ.క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రం ఇది. దీనికి వెట్రిమారన్ కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇది ఉత్తర చైన్నె నేపథ్యంలో సాగే గ్యాంగ్ స్టర్స్ కథా చిత్రమని సమాచారం. ఇందులో నటుడు శింబు రెండు గెటప్పుల్లో కనిపించనున్నారు. చిత్రం షూటింగ్ చాలా వరకు పూర్తి చేసుకుందని తెలిసింది. ఇందులో నటి ఆండ్రియా చిన్న వయసులో శింబుకు తల్లిగా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన ఆమె అరసన్ చిత్రంలో తాను నటుడు శింబుకు తల్లిగా నటిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. తాను ఈ చిత్రంలో చంద్ర అనే పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. ఇందులో తన పాత్ర చాలా వైవిధ్య భరితంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈమె ఇంతకు ముందు ధనుష్ హీరోగా నటించిన వడచైన్నె చిత్రంలోనూ చంద్ర అనే పాత్రలోనే నటించారన్నది గమనార్హం. -
శ్రీదేవితో రహస్య వివాహం నుంచి భార్య బెదిరింపుల వరకు..
బాలీవుడ్ లెజెండరీ నటుడు, ‘డిస్కో కింగ్’, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి అనారోగ్యంతో కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలోనే డిశ్చార్జ్ కానున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన జీవితంలోని పలు అంశాలు మరోమారు చర్చల్లోకి వచ్చాయి. మిథున్ చక్రవర్తి సినీ ప్రయాణం అద్భుతంగా సాగినా, ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం అనేక వివాదాలు, విషాదాలు, నాటకీయ పరిణామాలతో నిండిపోయింది. పరిశ్రమలోని పలువురు ప్రముఖ నటీమణులతో ఆయన సాగించిన ప్రేమాయణాలు, రహస్య వివాహాలు నాడు సంచలనం సృష్టించాయి.కమల్ హాసన్ మాజీ భార్యతో..1970లలో మిథున్ చక్రవర్తి వరుస హిట్లతో సినిమా రంగంలో దూసుకుపోతున్నారు. ఆ సమయంలో ‘హమారా సంసార్’ చిత్రంలో కమల్ హాసన్ మాజీ భార్య సారికతో ఆయన కలిసి నటించారు. అప్పుడు ఇద్దరి మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం ప్రేమగా మారింది. అయితే కొద్ది నెలలకే ఈ బంధం అర్ధాంతరంగా ముగిసిపోయిందంటారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సారికనే స్వయంగా మిథున్‌కు దూరమైనట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.మోడల్,నటి హెలెనా లూక్‌తో వివాహంసారికతో బ్రేకప్ తర్వాత మానసికంగా కుంగిపోయిన మిథున్, మోడల్ కమ్ నటి హెలెనా లూక్‌కు దగ్గరయ్యారు. జావేద్ ఖాన్‌తో ఐదేళ్ల రిలేషన్షిప్ ముగిసిన హెలెనా కూడా ఆ సమయంలో ఒంటరిగానే ఉన్నారు. ఇద్దరి పరిస్థితులు ఒకేలా ఉండటంతో 1979లో వారు వివాహం చేసుకున్నారు. కానీ ఈ బంధం కేవలం నాలుగు నెలలు మాత్రమే నిలిచింది. మిథున్ ప్రవర్తన కారణంగా హెలెనా విడాకులు తీసుకున్నారని అంటారు.హెలెనా బయటపెట్టిన మిథున్ టాక్సిక్ నేచర్విడాకుల తర్వాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన హెలెనా లూక్, మిథున్‌తో తన అనుభవాన్ని ఒక పీడకలగా అభివర్ణించారు. మిథున్ తనను మానసికంగా ఎంతో వేధించారని, తన మాజీ ప్రియుడితో సంబంధం ఉందని నిత్యం అనుమానించే వారని ఆమె వెల్లడించారు. మిథున్‌కు అప్పట్లోనే వేరే మహిళలతో సంబంధాలు ఉండటం వల్లే, తనపై లేనిపోని అభూతకల్పనలు ఆపాదించేవారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. విడాకుల అనంతరం హెలెనా బాలీవుడ్‌కు పూర్తిగా దూరమై న్యూయార్క్‌లో స్థిరపడ్డారు.కిశోర్ కుమార్ మాజీ భార్య యోగితా బాలితో పెళ్లిహెలెనాతో విడాకుల అనంతరం మిథున్ జీవితంలోకి సింగర్ కిశోర్ కుమార్ మాజీ భార్య యోగితా బాలి ప్రవేశించారు. కిశోర్ కుమార్‌కు విడాకులు ఇచ్చిన తర్వాత, యోగితా 1979లో మిథున్‌ను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత తన సినిమా కెరీర్‌ను పూర్తిగా పక్కన పెట్టి, సంసారమే సర్వస్వంగా బతుకుతానని ఆమె ప్రకటించారు. ఈ దంపతులకు మహాక్షయ్ (మిమోహ్), ఉష్మే, నామాషి అనే ముగ్గురు కుమారులు జన్మించడంతో పాటు దిశాని అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు.శ్రీదేవి ఎంట్రీతో వైవాహిక జీవితంలో తుఫాన్అంతా సజావుగా సాగుతున్న సమయంలో 1985లో మిథున్ జీవితంలోకి దివంగత నటి శ్రీదేవి అడుగుపెట్టారు. ‘జాగ్ ఉతా ఇన్సాన్’ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరూ ఒకరికొకరు దగ్గరయ్యారు. అప్పటికే పెళ్లయినప్పటికీ మిథున్.. శ్రీదేవితో ప్రేమలో పడిపోయారు. మీడియా కథనాల ప్రకారం, వీరిద్దరూ 1985లో అత్యంత రహస్యంగా వివాహం కూడా చేసుకున్నారు. ఈ సీక్రెట్ మ్యారేజ్ బాలీవుడ్ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది.భార్య యోగితా బాలి ఆత్మహత్యాయత్నంమిథున్, శ్రీదేవిల రహస్య వివాహం, వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న యోగితా బాలి తీవ్రంగా కుంగిపోయారు. భర్త మోసాన్ని తట్టుకోలేక ఆమె ఆత్మహత్యకు యత్నించినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. తరువాత ఆమె, తన పిల్లలతో కలిసి మిథున్ నుంచి దూరంగా వెళ్లిపోయారు. ఈ పరిణామం మిథున్, నిర్మాత బోనీ కపూర్ మధ్య ఉన్న స్నేహ బంధాన్ని కూడా శాశ్వతంగా దెబ్బతీసింది.శ్రీదేవితో పెళ్లి రద్దు.. యోగితా బాలితో తిరిగి..మిథున్ తన మొదటి భార్య యోగితాకు విడాకులు ఇవ్వలేడని, ఆమెను పూర్తిగా వదిలించుకోలేడని గ్రహించిన శ్రీదేవి కీలక నిర్ణయం తీసుకున్నారు. 1988లో మిథున్‌తో జరిగిన వివాహాన్ని ఆమె చట్టబద్ధంగా రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత శ్రీదేవి బోనీ కపూర్‌ను వివాహం చేసుకోగా, మిథున్ తిరిగి తన మొదటి భార్య యోగితా బాలి వద్దకు చేరారు. యోగితను ఒప్పించి ఆమెను ఇంటికి రప్పించుకున్న మిథున్, ఆ తర్వాత తమ మూడో సంతానాన్ని స్వాగతించారు. ఎన్నో వివాదాలు, కష్టాలను ఎదుర్కొన్న మిథున్ చక్రవర్తి ప్రస్తుతం తన భార్య యోగితా బాలి, పిల్లలతో కలిసి ఉంటున్నారు. వారి కుమారులు మిమోహ్, ఉష్మే, నామాషి, కూతురు దిశాని కూడా సినీరంగంలో రాణిస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘రక్త సంబంధం’.. ఇది సీరియల్ కాదు.. సినిమా కానే కాదు! -
రుక్మిణి.. తళుక్కుమణి..
‘కాంతారా’ ఫేమ్ రుక్మిణి వసంత్ శుక్రవారం సందడి చేశారు. నగరంలోని హోటల్ తాజ్‌డెక్కన్ వేదికగా తనిష్క్ఆ ధ్వర్యంలో ఫెస్టివల్ సీజన్ ‘మల్లె’ జ్యువెలరీ కలెక్షన్‌ను ఆమె ఆవిష్కరించారు. సినిమా వంటి గ్లామర్ ఫీల్డ్ అమ్మాయిలకు అందం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని, దీనికి ఆభరణాలు మరింత ప్రాధాన్యం చేకుర్చుతాయన్నారు. తనకు వజ్రాలన్నా, బంగారు ఆభరణాలన్నా ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్థ రీజినల్ బిజినెస్ మేనేజర్ వాసుదేవ రావు పాల్గొని.. వజ్రాలపై వంద శాతం ఎక్సే్ఛంజ్ వాల్యుయేషన్ అందిస్తున్నట్లు వెల్లడించారు. -
నా కొడుకు మీద కేసెయ్యాలి!
‘సేటూ... నా కొడుకు మీద కేసెయ్యాలి’ అంటూ ‘బలగం’ మూవీ ఫేమ్ సుధాకర్ రెడ్డి చెప్పే డైలాగ్‌తో ‘పళ్ళ బురుసు’ మూవీ ట్రైలర్ మొదలైంది. సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్, గోమతి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘పళ్ళ బురుసు’. ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సమర్పణలో ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణని, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. శుక్రవారం ఈ మూవీ ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘నాకు పళ్ళ బురుసు (టూత్ బ్రష్) కొనియ్యలే... పెట్టండి సేటూ కేసు పెట్టండి’, ‘మీరు రోజూ గా పళ్ళ బురుసుతోనే పండ్లు తోముతారా? గందుకనే మస్తు తెల్లగున్నయ్’ అంటూ సుధాకర్ రెడ్డి, ‘కేసే... మీ మామనే నా మీద కేసు ఏసుండు’, ‘నా ఇజ్జత్ తీయనీకే ఉన్నవ్ నువ్వు’, ‘ఏమైనా సరే నేను హైకోర్టుకు ΄ోతా’ అంటూ మురళీధర్ గౌడ్ చెప్పే డైలాగులు ట్రైలర్లో ఉన్నాయి. కిరణ్ మచ్చా, ప్రజ్వల్ యాద్మ, గోమతి రెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: వినోద్ కె. బంగారి, సంగీతం: పవన్. -
ప్రతి ఎపిసోడ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు: వరుణ్ తేజ్
‘‘కొరియన్ కనకరాజు’ సినిమాకి గురువారం సాయంత్రం ప్రీమియర్స్ నుంచి వచ్చిన స్పందన చూసి చాలా ఆనందంగా అనిపించింది. మేము ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన ప్రేక్షకుల నుంచి వచ్చింది. సినిమాలోని ప్రతి ఎపిసోడ్‌ను వారు ఎంజాయ్ చేస్తున్నారు. మా మూవీని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మాకు (వరుణ్ తేజ్–లావణ్య త్రిపాఠి) బాబు పుట్టిన తర్వాత ఈ సక్సెస్ రావడం నాకు చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది’’ అని హీరో వరుణ్ తేజ్ తెలిపారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్, రితికా నాయక్ జోడీగా నటించిన చిత్రం ‘కొరియన్ కనకరాజు’.యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్లో మేర్లపాక గాంధీ మాట్లాడుతూ– ‘‘నాకు కావాల్సిన హిట్ ‘కొరియన్ కనకరాజు’గా వచ్చింది. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా’ సినిమాల తర్వాత ప్రేక్షకులు థియేటర్లలో ఇంతగా నవ్వుతూ ఎంజాయ్ చేయడం మళ్లీ ఈ చిత్రంతో చూడడం ఆనందంగా ఉంది’’ అని చెప్పారు.‘‘మేమంతా నమ్మి చేసిన ఒక మంచి ఎంటర్టైనర్ను ప్రేక్షకులు కూడా అదే స్థాయిలో ఆదరిస్తుండటం హ్యాపీగా ఉంది’’ అన్నారు రితికా నాయక్. ‘‘గమ్యం’ సినిమా సమయంలో థియేటర్ల దగ్గర హౌస్‌ఫుల్ బోర్డులు చూసిన ఆనందం ఇప్పుడు ‘కొరియన్ కనకరాజు’తో మళ్లీ కనిపిస్తోంది’’ అని నిర్మాత రాజీవ్ రెడ్డి పేర్కొన్నారు. ‘‘వరుణ్ తేజ్ విజయంలో మేం భాగం కావడం ఆనందంగా ఉంది’’ అని నిర్మాత శిరీష్ తెలిపారు. -
నెలాఖర్లో హాయ్
ఈ నెలాఖర్లో థియేటర్స్‌లో ‘హాయ్’ చెప్తానంటున్నారు నయనతార. కవిన్, నయనతార లీడ్ రోల్స్‌లో నటించిన తమిళ సినిమా ‘హాయ్’. విష్ణు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కె. భాగ్యరాజ్, ప్రభు, రాధికా శరత్‌కుమార్, వీటీవీ గణేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జీ స్టూడియోస్, ది రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్లపై నయనతార, విఘ్నేష్ శివన్, ఎస్.ఎస్. లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మించారు.కాగా, ఈ చిత్రాన్ని ఈ నెల 28న రిలీజ్ చేయనున్నట్లు శుక్రవారం కొత్త విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ‘‘బంధాలు, అనుబంధాలు, హాస్యంతో సాగే ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ఇది’’ అని తెలిపారు దర్శకుడు విష్ణు. ఇక ఈ సినిమాను తొలుత ఈ నెల 14న రిలీజ్ చేయనున్నట్లు పేర్కొన్నారు మేకర్స్. అయితే 28కి వాయిదా వేశారు. -
మళ్లీ వివాదం.. సుమలత తీరుపై ఫిల్మ్ ఫెడరేషన్ ఆగ్రహం
టాలీవుడ్ ఫిల్మ్ ఫెడరేషన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు సహాయ నిరాకరణ చేస్తున్నట్లు ప్రకటించింది. డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జానీ మాస్టర్ భార్య సుమలత తీరును ఎండగడుతూ లేఖ విడుదల చేసింది. చిరంజీవి, ఫిల్మ్ ఛాంబర్ ఫెడరేషన్ నిర్ణయాలను ధిక్కరిస్తూ మీరు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఫిల్మ్ ఫెడరేషన్ ఆరోపించింది.సస్పెండ్ చేసినా సభ్యులను కలుపుకుపోవాలని కౌన్సిల్ సమావేశంలో అందరం నిర్ణయం తీసుకోని మీకు అవకాశం ఇచ్చామని ఫిల్మ్ ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఈ రోజు నుంచి మీకు ఫెడరేషన్ ఎటువంటి సహాయసహకారాలు అందించమని ఫిల్మ్ ఫెడరేషన్ తీర్మానించింది. మీ అసోసియేషన్ సమస్యల పరిష్కారం లో ఫెడరేషన్ ఎటువంటి బాధ్యత తీసుకోదని లేఖలో పేర్కొంది. ఫిల్మ్ ఛాంబర్‌తో జరిగే వేతనాల అగ్రిమెంట్ విషయంలో ఫెడరేషన్ ఎటువంటి సపోర్ట్ చేయదని తెలిపింది. ఫెడరేషన్ నిర్ణయంతో మిగతా 23 క్రాఫ్ట్స్ కూడా డాన్సర్స్ అసోసియేషన్‌కు సహాయనిరాకరణ కొనసాగనుంది. -
కొరియన్ కనకరాజుతో మరో హిట్.. టాలీవుడ్ లక్కీ ఛార్మ్ రితికా!
తెలుగు సినీ ప్రియులను తన అందం, అభినయంతో కట్టిపడేస్తోంది భామ రితికా నాయక్. ఇటీవల వచ్చిన 'కొరియన్ కనకరాజు చిత్రంతో మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో ఆమె నటనకు, స్క్రీన్ ప్రెజెన్స్‌కు ప్రేక్షకుల నుంచి విశేష ప్రశంసలు లభిస్తున్నాయి. ఓ వైపు మెస్మరైజ్ చేసే అందం, మరోవైపు పాత్రలో లీనమయ్యే నటనతో రితికా థియేటర్లలో మ్యాజిక్ చేస్తోంది.బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో దూసుకుపోతుండటంతో, టాలీవుడ్లో ఇప్పుడు ఈ ముద్దుగుమ్మను నిర్మాతలు లక్కీ ఛార్మ్‌గా భావిస్తున్నారు. ఈ చిన్నదాని గోల్డెన్ లెగ్ ఐరన్ లెగ్ కాదని.. ప్రాజెక్ట్‌కి ప్లస్ పాయింట్ అని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అందం ఉన్నచోట అభినయం ఉండదు అంటారు, కానీ రితికా నాయక్ ఆ మాటను తప్పుగా నిరూపించింది. 'కొరియన్ కనకరాజు' మూవీలో నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. క్యూట్ లుక్స్, సహజమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో తన పాత్రకు ఒదిగిపోయింది. రాబోయే రోజుల్లో ఈ భామ మరిన్ని పెద్ద ప్రాజెక్టుల్లో మెరిసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. -
విశాల్ మకుటం.. తెలుగు ట్రైలర్ రిలీజ్
కోలీవుడ్ హీరో విశాల్ హీరోగా వస్తోన్న తాజా చిత్రం మకుటం. ఈ మూవీకి తానే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో దుషార విజయన్, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలోనే మకుటం తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో విశాల్ మూడు గెటప్ల్లో కనిపించనున్నారు. ఈ ట్రైలర్ చూస్తుంటే యాక్షన్‌తో పాటు కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తెలుగు ట్రైలర్ చూసేయండి. -
'నన్ను కమిట్మెంట్ అడిగారు'.. చాందిని చౌదరి షాకింగ్ కామెంట్స్
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే పదం కామన్. ముఖ్యంగా నటీమణులు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొని ఉంటారు. ఇప్పటికే పలువురు సినీతారలు తమకెదురైన చేదు అనుభవాలను పలు సందర్భాల్లో బయటికి చెప్పుకొచ్చారు. తాజాగా మరో టాలీవుడ్ నటి సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన కామెంట్స్ చేసింది.టాలీవుడ్ నటి చాందిని చౌదరి తనకెదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని పంచుకుంది. 2015లో ఓ బ్రాండ్ అంబాసిడర్ ఛాన్స్ పేరుతో తనను పిలిచారని తెలిపింది. ఆ సమయంలో ఓ వ్యక్తి ఫోన్ చేసి కమిట్మెంట్ ఇవ్వాలని అడిగారని గుర్తు చేసుకుంది. తాను తిరస్కరించడంతో మా అమ్మకు ఫోన్ చేసి కూడా అవమానించాడని చాందిని చౌదరి వెల్లడించింది. అంతేకాకుండా తనపై నెగెటివ్ ప్రచారం చేశారని చెప్పుకొచ్చింది. చాందినికి పొగరు ఎక్కువనే ముద్ర వేశారని..అది ఇప్పటికీ తనని ఇబ్బంది పెడుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడిదే టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. -
ఆస్పత్రిలో సీనియర్ నటుడు.. సీఎం పోస్ట్‌తో వెలుగులోకి..
కోల్‌కతా: సీనియర్ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి ఆస్పత్రిలో చేరారు. కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొంతున్నారు. గురువారం ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స చేశారని తెలుస్తోంది. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతారని భావిస్తున్నారు. మిథున్ చక్రవర్తిని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి శుక్రవారం పరామర్శించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఫేస్బుక్లో షేర్ చేయడంతో మిథున్ అనారోగ్యం గురించి బయట ప్రపంచానికి తెలిసింది.''ప్రముఖ సినీ నటుడు, బీజేపీ కేంద్ర కమిటీ సభ్యులలో ఒకరైన మిథున్ చక్రవర్తి అనారోగ్య కారణాలతో కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. నేను ఈరోజు ఆయన్ను పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్లాను. ఆయనతో మాట్లాడి, ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలుసుకున్నాను. ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను'' అని సువేందు అధికారి ఫేస్బుక్లో పేర్కొన్నారు.మిథున్‌ను పరామర్శించిన తర్వాత ఆస్పత్రి వెలుపల సీఎం సువేందు మీడియాతోనూ మాట్లాడారు. గురువారం రాత్రి ఆయనకు చిన్న శస్త్రచికిత్స జరిగిందని వెల్లడించారు. తాను ఆస్పత్రిలో చేరిన విషయం బహిరంగపరచకూడదని మిథున్ అనుకున్నారని చెప్పారు. కాగా, మిథున్ చక్రవర్తి ఆస్పత్రిలో చేరారన్న విషయం తెలుసుకుని ఆయన అభిమానులు, శ్రేయాభిలాషులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. మిథున్ చక్రవర్తి త్వరగా కోలుకోవాలి: శత్రుఘ్న సిన్హా పట్నా: మిథున్ చక్రవర్తి అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని టీఎంసీ ఎంపీ, సీనియర్ నటుడు శత్రుఘ్న సిన్హా ఆకాంక్షించారు. పట్నాలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మిథున్ చక్రవర్తి ఆస్పత్రిలో చేరిన విషయం తనకు ఇప్పుడే తెలిసిందని చెప్పారు. మిథున్ తనకు మంచి మిత్రుడని, ఆయనతో సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు.చదవండి: ఫడ్నవీస్ ప్రభుత్వంపై మరాఠా ఉద్యమ నేత ఫైర్''మిథున్ ఆసుపత్రిలో ఉన్నారని నాకు ఇప్పుడే తెలిసింది. ఈ విషయం విని చాలా బాధపడ్డాను. మిథున్ చక్రవర్తి నాకు మంచి స్నేహితుడు.. చాలా మంచి కళాకారుడు, గొప్ప స్టార్. ఆయన ఒక అద్భుతమైన మానవతావాది కూడా. ఆయనకు జంతువులంటే చాలా ఇష్టం. తన వద్ద ఉన్న పెంపుడు కుక్కలు, పిల్లులను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. ఆయనకు ప్రజల పట్ల, ముఖ్యంగా పేదల పట్ల కూడా ప్రగాఢమైన శ్రద్ధ ఉంది. నాకు మిథున్ పట్ల ఎంతో గౌరవం ఉంది. ఆయన నాకు చాలా ప్రియమైన , ప్రత్యేకమైన వ్యక్తి. ఆయన త్వరగా కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను. మా ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆయన్ను పరామర్శించడానికి వెళ్లారు, ఆయన సరైన పనే చేశారు. మిథున్‌కు ప్రజలందరి ప్రేమ, మద్దతు, ఆశీస్సులు దక్కాల''ని శత్రుఘ్న సిన్హా అన్నారు. -
'చిన్న వయసులోనే పెళ్లిచూపులు.. నేను తప్పించుకున్నా'
ప్రముఖ బాలీవుడ్ నటి షెహనాజ్ గిల్ బీటౌన్‌లో సుపరిచితమైన పేరు. ఇటీవలే ఆమె ఇష్క్నామా అనే మూవీతో ప్రేక్షకులను పలకరించింంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన షెహనాజ్.. ప్రేమ అంటే ముఖ్యమైన వ్యక్తులకు సమయం, స్వేచ్ఛ ఇవ్వడమేనని అన్నారు. అయితే పెళ్లిళ్లకు తాను దూరంగా ఉండేదాన్ని అని వెల్లడించారు.ప్రేమ, పెళ్లి సంబంధాలపై తన అభిప్రాయాలను షెహనాజ్ గిల్ వెల్లడించారు. మా కుటుంబంలో పెళ్లి చూపులు చిన్న వయసులోనే చూసేవారని తెలిపింది. అమ్మాయిలకు చాలా చిన్న వయసు నుంచే త్వరలో పెళ్లి అవుతుందని చెప్పేవారని గుర్తు చేసుకుంది. అలా వరుడి కోసం అన్వేషణ చాలా ముందుగానే మొదలవుతుందని పేర్కొంది. మా బంధువుల్లో ఒకరు నాకు పెళ్లి చేయాలని చూసింది.. కానీ నేను మాత్రం అస్సలు ఒప్పుకోలేదని తెలిపింది. పెళ్లిళ్లకు వెళ్తే సంబంధాలు కుదర్చడానికి ప్రయత్నిస్తారని షెహనాజ్ వెల్లడించింది. అందుకే నేను ఎక్కువగా పెళ్లిళ్లకు వెళ్లడం కూడా మానేసేదాన్ని అని తన అనుభవాన్ని పంచుకుంది. ఇప్పుడు నా కెరీర్ పరంగా సక్సెస్ అయ్యానని.. ఇప్పుడు అందరూ నా వెంట పడుతున్నారని నవ్వుతూ చెప్పుకొచ్చింది. కాగా.. షెహనాజ్ గిల్ నటించిన 'ఇష్క్నామా' చిత్రం జూలై 24న థియేటర్లలో విడుదలైంది. -
ఎన్టీఆర్ డైలాగ్పై వివాదం.. వరుణ్ తేజ్ రియాక్షన్ ఇదే..!
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు ఇవాళే థియేటర్లలోకి వచ్చేసింది. అయితే ఈ మూవీలోని ఓ డైలాగ్ వివాదానికి దారితీసింది. ఎన్టీఆర్ డైలాగ్ చుట్టు వివాదం మొదలైంది. దీనిపై హీరో వరుణ్ తేజ్ స్పందించారు. మూవీ ప్రెస్‌మీట్‌కు హాజరైన ఆయన డైలాగ్పై క్లారిటీ ఇచ్చారు.అయితే ఇందులో తాము సీనియర్ ఎన్టీఆర్‌ను అగౌరపరచలేదని వరుణ్ తేజ్ స్పష్టం చేశారు. ఆయనపై మేము ట్రోల్ చేయలేదని.. కేవలం ఇమిటేట్ మాత్రమే చేశామని క్లారిటీ ఇచ్చారు. ట్రోలింగ్‌కు.. ఇమిటేషన్‌కు చాలా తేడా ఉందన్నారు. గొప్ప గొప్ప నటులను ఇమిటేట్ చేస్తారని అన్నారు. ఎవరినీ తక్కువ చేయాలనే ఉద్దేశం తమకు లేదన్నారు. ఇందులో ఫన్నీ మాత్రమే చూడాలని ఆడియన్స్‌ను వరుణ్ తేజ్ కోరారు. కాగా.. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. హారర్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. -
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్.. ట్రైలర్ వచ్చేసింది
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా వస్తోన్న టాలీవుడ్ మూవీ విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో ప్రేమలు బ్యూటీ మమిత బైజు హీరోయిన్గా కనిపించనుంది. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు మేకర్స్.ఈ నేపథ్యంలోనే విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉన్న ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీని పుల్ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్‌గా డ్రామాగా రూపొందించారని ట్రైలర్లో తెలిసిపోతోంది. 'గెలిచేదాకా ఆగకూడదు.. గెలిచాక ఎక్కువగా మాట్లాడకూడదు' అనే డైలాగ్ ఆడియన్స్‌లో మరింత ఆసక్తిని పెంచుతోంది. కాగా.. ఈ చిత్రంలో సూర్య 40 ఏళ్ల వ్యక్తిగా, మమిత బైజు 20 ఏళ్ల అమ్మాయిగా నటించారు. ఈ చిత్రంలో రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రలు చేశారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. -
‘రామాయణ’ ట్రైలర్‌కు పాక్ యూట్యూబర్ల ఫిదా..!
నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ’పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ట్రైలర్‌పై పాకిస్థాన్‌కు చెందిన కొందరు యూట్యూబర్ల స్పందనలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ట్రైలర్‌లోని భారీ విజువల్స్, వీఎఫ్ఎక్స్లపై ప్రశంసలు కురిపించారు. రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, యశ్ రావణుడిగా, సాయిపల్లవి సీతగా కనిపిస్తున్న ఈ చిత్రంలోని పలు సన్నివేశాలు తమను ఆకట్టుకున్నాయని పాకిస్థానీ కంటెంట్ క్రియేటర్లు పేర్కొన్నారు.గతంలో విడుదలైన ‘రామాయణ’ ఫస్ట్ గ్లింప్స్‌తో పోలిస్తే తాజా వీఎఫ్ఎక్స్లో చాలా మార్పు కనిపిస్తోందని, ఈసారి విజువల్స్ మరింత మెరుగ్గా ఉన్నాయని తెలిపారు.రూ.4 వేల కోట్లపై ..‘రామాయణ’కు భారీగా రూ.4 వేల కోట్ల బడ్జెట్ ఖర్చవుతోందన్న ప్రచారంపై స్పందిస్తూ సినిమా నిర్మాణానికి పెట్టుబడిదారులు ఉంటారని, ప్రేక్షకుల జేబులో నుంచి డబ్బు తీసుకుని సినిమా తీయడం లేదన్నారు. ‘రామాయణ’లో కనిపిస్తున్న సాంకేతికత, నిర్మాణ విలువలు చూసి ఆశ్చర్యపోయామన్నారు. ఇంత భారీ చిత్రాన్ని రూపొందించడానికి భారత్, బాలీవుడ్‌కు ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఎలా వస్తుందోనని ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు. -
Dharman: ధర్మన్ మూవీలో ఛాన్స్.. రాశీ ఖన్నా ఆసక్తికర కామెంట్స్
స్టార్ హీరో సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో డ్రాగన్ ఫేం దర్శకుడు అశ్వత్ మారిమత్తు తెరకెక్కిస్తున్న చిత్రం ‘ధర్మన్’. ఈ సినిమాలో రాశీఖన్నా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రంలో రజినీకాంత్‌తో పనిచేసిన అనుభవం.. ఈ సినిమాలో అవకాశం ఎలా వచ్చిందో.. ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. నటులు ఖైదీలు..రజినీకాంత్ సూపర్‌స్టార్ హోదా కంటే.. ఆయనలోని గొప్ప విషయాలను తెలుసుకోవాలని ఎంతో ఆసక్తి ఉండేది. ఈ క్రమంలోనే రజినీ సార్ ఒక మాట చెప్పారు. నటులు ఖైదీలు అని అన్నారు. తొలిత నాకు అర్థంకాలేదు. తర్వాత అర్థమైంది. స్టార్డమ్ వచ్చిన తర్వాత మనలోని స్వేచ్ఛని కొంత భాగాన్ని కోల్పోవల్సి వస్తుందని అతని ఉద్దేశం’ అని తెలిపింది. ఈ సినిమాలో రజినీకాంత్ పోషిస్తున్న ధర్మన్ వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసే పాత్ర నాది’ అని పేర్కొంది.ఈ అవకాశం ఎలా వచ్చిందంటే..‘2025లో విడుదలైన డ్రాగెన్ మూవీ నాకు ఎంతగానో నచ్చింది. ఈ విషయమై అశ్వత్‌కు మెసేజ్ చేశా. త్వరలోనే మనం కలిసి పనిచేద్దాం అంటూ రిప్లై ఇచ్చారు. గడిచిన కొద్ది రోజుల్లోనే ‘ద టైం హ్యాజ్ కమ్’ అంటూ అతని నుంచి మరో మెసేజ్ వచ్చింది. ఆయన ధర్మన్ కథ వివరించారు. కథ నచ్చడం, రజినీ సార్‌తో కలిసి పనిచేసేందుకు అవకాశం రావడంతో వెంటనే ఓకే చెప్పేశా’ అని తెలిపింది. కాగా ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్, టర్మరిక్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ సిరులు సమకూర్చుతున్నారు. ఈ చిత్రంలో వైద్యుడిగా రజినీ వెండితెరని పలకరించనున్నట్లు సమాచారం. ఈ మూవీలో సిమ్రాన్, యోగి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
సామాన్య భక్తురాలిగా శ్రీలీల.. వీడియో వైరల్
హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం ఆధ్యాత్మిక సేవలో బిజీగా ఉన్నారు. ఇటీవలే అరుణాచలం సందర్శించిన బ్యూటీ.. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అయితే వీఐపీ సంప్రదాయానికి భిన్నంగా శ్రీలీల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. సామాన్య భక్తురాలిగా సర్వదర్శనం క్యూ లైన్లో వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో శ్రీలీల నిర్ణయంపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.తెలుగులో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ భామ పలు సూపర్ హిట్ సినిమాలు చేసింది. పెళ్లి సందడి మూవీతో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల.. ధమాకా, భగవంత్ కేసరి, రాబిన్‌హుడ్, మాస్ జాతర లాంటి సినిమాల్లో మెప్పించింది. ఈ ఏడాది పరాశక్తి మూవీతో అభిమానులను అలరించిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం రజినీకాంత్ సరసన ఛాన్స్ కొట్టేసిందని టాక్ వినిపిస్తోంది. #SreeLeela visited Tirupati to seek blessings 🙏Humble way as she opted for common queue darshan, avoids VVIP access 👏pic.twitter.com/OO9Cns4bfF— Balaji (@RDBalaji) August 7, 2026 -
నా రెండో బిడ్డ కళ్లలో ఆయనని చూసుకుంటున్నా
తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్గా చేసి ఆపై డ్యాన్స్ రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించిన పూర్ణ.. ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో జీవితాన్ని ఆస్వాదిస్తోంది. అయితే తన తండ్రి చనిపోయి తొమ్మిదేళ్లు అయిన సందర్భంగా ఆయనని మరోసారి గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురైంది. ఆయనని ఎప్పటికీ మర్చిపోలేమని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.(ఇదీ చదవండి: రూ.కోటి అప్పు తీర్చేందుకు బూతు సినిమాల్లో నటించా)'ప్రియమైన ఉప్పా(నాన్న) ఈ లోకాన్ని విడిచి అల్లా సన్నిధికి చేరి తొమ్మిదేళ్లు గడిచినా, ఆయన జ్ఞాపకాలు కుటుంబ సభ్యుల హృదయాల్లో ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. ఆయనని ప్రత్యక్షంగా చూసే అవకాశం నాకు లభించకపోయినా, ఆయన ప్రేమ, దయ, ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా చూసుకునే స్వభావం గురించి ఎన్నో కథలు విన్నాను. అవి విన్న ప్రతిసారీ ఆయనని ఒకసారి అయినా కలిసుంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంది'నా రెండో బిడ్డ కళ్లలో ఆయన ప్రతిబింబాన్ని చూస్తున్నా. అల్లా మా కుటుంబానికి ఆయన జ్ఞాపకాన్ని గుర్తుచేసే అందమైన వరంగా ఈ బిడ్డని ప్రసాదించాడనిపిస్తోంది. ఆయన ప్రేమ, ఆశీర్వాదం ఇప్పటికీ కుటుంబంతోనే ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఉప్పా(నాన్న) అల్లా దగ్గరకు చేరి తొమ్మిదేళ్లు అయినప్పటికీ, ఉమ్మాకు(అమ్మ) మాత్రం అది నిన్న జరిగినట్లే అనిపిస్తోంది. కాలం గడిచినా ఆయన లేని లోటు, ఆయనపై ఉన్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. ప్రతిరోజూ ఆయనని తలుచుకుంటూనే ఉన్నాం. ఆయన మా హృదయాల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారు. ఎప్పటికీ మరచిపోలేము' అని పూర్ణ ఎమోషనల్ అయింది.పూర్ణ ఫ్యామిలీ విషయానికొస్తే.. కేరళకు చెందిన ఈమె దుబాయిలో ఉండే షనీద్ అసిఫ్ అలీ అనే బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. చివరగా ఈమె గతేడాది డిసెంబరులో రిలీజైన 'అఖండ 2' మూవీలో కనిపించింది.(ఇదీ చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన తెలుగు సీరియల్ హీరోయిన్) View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) -
రామ్ చరణ్ పెద్ది.. పెద్ద మైనస్ అదొక్కటే..!
మెగా హీరో రామ్ చరణ్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా మెప్పించగా.. జగపతి బాబు, శివరాజ్‌కుమార్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ మూవీకి టాలీవుడ్ మాటల రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ రివ్యూ ఇచ్చారు. పరుచూరి పాఠాలు అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఒక ఊర్లో రైలు ఆగాలి అనే చిన్న పాయింట్‌తో కథను నడిపించడం అద్భుతంగా ఉందన్నారు. మూవీ చివర్లో ఇచ్చిన సందేశం తనకు నచ్చిందన్నారు.ఒక చిన్న పాయింట్ తీసుకుని మూడు గంటల సినిమా తీయడం అంటే మాటలు కాదని అన్నారు. అయితే పెద్ది రన్‌టైమ్ విషయంలో మరింత జాగ్రత్త పడాల్సిందని తెలిపారు. రామ్ చరణ్ కాకుండా మరెవరైనా చేసి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదని నా అభిప్రాయమని వెల్లడించారు. ఈ సినిమా మొత్తాన్ని రామ్ చరణ్ తన భుజాలపై మోశారని ప్రశంసించారు. అతని వల్లే పెద్దికి కలెక్షన్స్ వచ్చాయని పరుచూరి తెలిపారు.పరుచూరి మాట్లాడుచూ.. 'ఓట్లే లేని ఊర్లో రైలు ఆగాలనే పాయింట్ తీసుకుని గొప్పగా రాశారు. ఎలా అయినా ఊరికి గుర్తింపు తీసుకురావాలని హీరో క్రికెట్, కుస్తీల్లో ఓడిపోయినప్పటికీ.. చివర్లో రన్నింగ్‌లో సత్తా చాటి తన పోరాటంలో అనుకున్నది సాధించాడు. ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ వేషధారణలు ఏవీ తెలుగు వాళ్లకు నచ్చేలా లేకపోవడం పెద్ద మైనస్. హీరోయిన్ పాత్ర నిడివి చాలా తక్కువ. ఈ మూవీ రన్‌టైమ్ ఇంకా 30 నుంచి 40 నిమిషాల వరకు తగ్గించే అవకాశం ఉంది. నిడివి తగ్గించి హీరోయిన్ పాత్ర ఎక్కువ చూపించి ఉంటే ఓటీటీలో ఇంకా ఆదరణ దక్కేదేమో' అని అన్నారు. -
లోకేశ్ కనకరాజు ‘డీసీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
ఖైదీ, విక్రమ్, లియో, కూలీ లాంటి చిత్రాలతో దర్శకుడిగా తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న తమిళ దర్శకుడు లోకేశ్ కనకరాజు. ఆయన హీరోగా చేసిన తొలి సినిమా డీసీ(DC). అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వామికా గబ్బి హీరోయిన్గా నటించింది. అనిరుధ్ మ్యూజిక్ అందించాడు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ మూవీ నేడు(ఆగస్ట్ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. గ్యాంగ్‌స్టర్ సర్కార్ టీమ్‌లో కీలకంగా పని చేస్తే వ్యక్తి దేవదాస్ అలియాస్ దాసు(లోకేశ్ కనకరాజ్). పోలీసు ఆయుధాలు దొంగిలించడం వీళ్ల పని. అలా ఓ సారి పోలీసుల వాహనంపై దాడి చేసి ఆయుధాలు దొంగిలిస్తారు. అదే ప్రాంతంలో ఓ సామాన్య వ్యక్తి తన కొడుకు చదవుకు కోసం పొలం అమ్మి రూ. 7లక్షలు తీసుకెళ్తుంటాడు. ఈ డబ్బులను ఓ పోలీసు అధికారి తీసుకొని, అతన్ని దారుణంగా చంపేస్తాడు. దీంతో అతని భార్య దేవదాస్ బృందాన్ని ఆశ్రయిస్తుంది. విషయం తెలుసుకున్న దాసు.. ఆ పోలీసు అధికారిని హత్య చేస్తాడు. దీంతో బోగరాజు నేతృత్వంతోని ఓ ప్రత్యేక పోలీసు బృందం.. దాసు గ్యాంగ్ కోసం వెతుకడం ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో దాసు..తన బృందంతో కలిసి విజయవాడలోని ఓ బార్లో తలదాచుకుంటారు. అక్కడ బార్ సింగర్ పార్వతిని (సంజనా కృష్ణమూర్తి) చూసి దేవదాస్ ప్రేమలో పడతాడు. అయితే పోలీసుల దాడితో ఆమె ప్రాణాలు కోల్పోతుంది. ఆ తర్వాత వేశ్యగా ఉన్న చంద్ర(వామికా గబ్బి)కు విముక్తి కలిపిస్తాడు దేవదాస్. దీంతో ఆమె కూడా దాస్ వెంటనే వస్తుంది. వీరి జర్నీ ఎలా కొనసాగింది? అసలు చంద్ర ఎందుకు వేశ్యగా మారింది? దేవదాస్ గ్యాంగ్‌స్టర్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది? పేదవాడి కొడుకు చదువు కోసం దేవదాసు చేసిన పోరాటం ఎలా ముగిసింది? అనేదే ఈ సినిమా అసలు కథ. ఎలా ఉందంటే.. డీసీ.. కొత్త కథేమి కాదు. రొటీన్ గ్యాంగ్‌స్టర్ స్టోరీనే కానీ..అంతర్లీనంగా ఓ మంచి ప్రేమ కథతోపాటు ఓ బలమైన సామాజిక అంశాన్ని ఇందులో చర్చించారు. ఇంత రా అండ్ రస్టిక్ కథలో కూడా భావోద్వేగాలను పెద్దపీట వేయడంతో ఓ డిఫరెంట్ గ్యాంగ్‌స్టర్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఓ పేదవాడు తన కొడుకును గొప్పగా చదివించాలని ఆశ పడడం.. పోలీసు అధికారి అత్యాశతో పోయి అతన్ని చంపేయడం..ఇలా కథ ప్రారంభమే ఎమోషనల్‌గా ఉంటుంది. ఆ తర్వాత పోలీసులు, గ్యాంగ్‌స్టర్ మధ్య భారీ ఎన్కౌంటర్ జరుగడంతో అసలు కథలోకి దర్శకుడు తీసుకెళ్తాడు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు దేవదాస్ గ్యాంగ్ విజయవాడకు వెళ్లడం..అక్కడ పార్వతి పరిచయంతో కథ మరో మలుపు తీరుగుతుంది. పార్వతి ఎపిసోడ్ మొత్తం హృదయాలకు హత్తుకునేలా సాగుతుంది. ఇక చంద్ర ఎంట్రీ.. ఆమె ప్లాష్‌బ్యాక్ మరింత భావోద్వేగానికి గురి చేస్తుంది. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్ అదిరిపోతుంది. రొటీన్ సన్నివేశాలు, యాక్షన్ సీన్స్ అయినప్పటికీ.. అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ దాన్ని కొత్తగా మార్చేసింది. కొన్ని చోట్ల అనిరుధ్ ఇచ్చిన బీజీఎంకి థియేటర్ అంతా ఊగిపోతుంది. సెకండాఫ్‌లో కూడా కథనం పరుగులు పెడుతుంది. చంద్ర కూడా దాస్ టీమ్‌తో కలిసి ప్రయాణం చేయడం.. పోలీసులు వీరి కోసం వెతకడం..తప్పించుకునే క్రమంలో వచ్చే యాక్షన్ సీన్లు.. అన్నీ అదిరిపోతాయి. డబ్బుల కోసం చంద్ర వేసిన ప్లాన్ థియేటర్స్‌లో ఈళలు వేయిస్తుంది. కొన్ని చోట్ల కథనం నెమ్మదిగా సాగినా.. అనిరుధ్ బీజీఎంతో బోర్ కొట్టకుండా చేశాడు. క్లైమాక్స్ రొటీన్‌గానే ఉంటుంది. అయితే లోకేశ్ మినహా మిగతా నటీనటులు తెలుగు ప్రేక్షకులను అంతగా తెలియకపోవడంతో ఆ పాత్రలతో పెద్దగా కనెక్ట్ కాలేకపోతాం. సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్స్ కూడా పెద్ద ఉండవు. కథ మొత్తం ఒకే లైన్ మీద సాగుతుంది. అలాగే మితిమీరిన హింస కూడా ఓ వర్గం ప్రేక్షకులకు ఇబ్బందిగా అనిపిస్తుంది. గ్యాంగ్‌స్టర్ సినిమాలను ఇష్టపడేవాళ్లకు ఈ సినిమా నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. ఇనాళ్లు తెర వెనుక ఉన్న లోకేశ్.. తొలిసారి తెరపై కనిపించి, ఆకట్టుకున్నాడు. దేవదాస్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఆ పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగుంది. పెద్ద పెద్ద డైలాగులు లేకుండా కేవలం తన కళ్ళతో, హావభావాలతోనే చెప్పాల్సిన విషయం అర్థమయ్యేలా చెప్పేశాడు. వేశ్య చంద్ర పాత్రకి వామికా గబ్బి వందశాతం న్యాయం చేసింది. నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర అది. సెకండాఫ్‌లో ఆమె పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది. ఇక సంజన.. తెరపై కనిపించేది కాసేపే అయినా..తనదైన నటనతో ఆకట్టుకుంది. పోలీసులు అధికారితో పాటు దాస్ గ్యాంగ్ మెంబర్స్ కూడా తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. అనిరుధ్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం. తనదైన బీజీఎంతో రొటీన్ గ్యాంగ్‌స్టర్ కథను తెరపై డిఫరెంట్‌గా కనబడేలా చేశాడు. ఓ యాక్షన్ సీన్‌కి పెళ్లి బరాత్ బీజీఎం ఇవ్వడం హైలెట్. సినిమాటోగ్రపీ బాగుంది. ఎడిటింగ్ షార్ప్‌గా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఓటీటీలోకి కొత్త థ్రిల్లర్ సినిమా.. అధికారిక ప్రకటన
ప్రస్తుతం లోక్‌సభ ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్.. మరోవైపు సినిమాలు కూడా చేస్తోంది. అలా ఈ ఏడాది ఈమె నుంచి వచ్చిన మూవీ 'భారత భాగ్య విధాత'. 26/11 దాడుల నేపథ్య కథతో తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ మిస్టరీ థ్రిల్లర్ సినిమా 'ఉయిర్' తెలుగు రివ్యూ)కంగనా రనౌత్ ప్రధాన పాత్ర చేసి ఓ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు మనోజ్ తపాడియా దర్శకుడు. 26/11 దాడులు జరిగినప్పుడు ముంబైలోని కామా ఆస్పత్రిలో అంజలి అనే నర్స్, 20 మంది గర్భిణిలని రక్షించింది. ఆమె జీవితకథ స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తీశారు. జూన్ 12న థియేటర్లలో రిలీజైంది గానీ జనాలు పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చే శుక్రవారం (ఆగస్టు 14) నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు.26/11 టెర్రర్ ఎటాక్ సమయంలో ఆస్పత్రిలో రోగులని కాపాడిన గీతా మాధవ్ (కంగనా రనౌత్) అనే నర్స్ పోరాటం, ఆమె ధైర్యం, అలానే ఈమెకు తోడుగా మరికొందరు నర్సులు కూడా ఎలాంటి సాహసం చేశారు? చివరకు ఏమైందనేదే 'భారత భాగ్య విధాత' స్టోరీ.ఇకపోతే ఓటీటీల్లో ఈ వారం బోలెడన్ని కొత్త సినిమాలు వచ్చేశాయి. వీటిలో లెనిన్, ఓ సుకుమారి, ఎమ్మార్పీ, హృదయం మురళి, వంద దేవుళ్లు, డార్క్ సీక్రెట్స్, వదంది 2, సఫేద్ సాగర్, ఉయిర్, మై వాపస్ ఆవుంగా లాంటి స్ట్రెయిట్, డబ్బింగ్ తెలుగు మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు కామెడీ సినిమా)An untold story of ordinary nurses who stood with extraordinary courage on the darkest night of 26/11.Some heroes were never seen. Their stories were never told.Until now.Bharat Bhhagya Viddhaata Trailer Out Now.#BharatBhhagyaViddhaata premieres on 14th Aug on Hindi Zee 5… pic.twitter.com/gq6b61Piet— ZEE5Official (@ZEE5India) August 7, 2026 -
ఓటీటీలో రికార్డ్.. ఆ జాబితాలో మొదటి చిత్రంగా దురంధర్
ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన చిత్రాల్లో దురంధర్ ముందు వరుసలో ఉంటుంది. దంగల్, బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప చిత్రాల సరసన చేరింది. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద రూ.3 వేల కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో రణ్వీర్ సింగ్ హీరోగా మెప్పించారు. సారా అర్జున్ హీరోయిన్గా కనిపించింది.తాజాగా ఈ మూవీ మరో రికార్డ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తోన్న దురంధర్ అరుదైన రికార్డ్ సాధించింది. ఈ ఏడాది ప్రపంచంలో అత్యధికంగా వీక్షించిన ఆంగ్లేతర చిత్రాల జాబితాలో మొదటిస్థానంలో నిలిచింది. కాగా.. ఈ మూవీకి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేష్ బేడీ, సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటించారు. ధురందర్ పార్ట్-1 డిసెంబర్ 2025లో థియేటర్లలో విడుదలైంది. ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలో సీక్వెల్ దురంధర్ ది రివెంజ్ రిలీజైంది. -
ఆయన నన్ను ఆటపట్టిస్తున్నారని అనుకున్నా: ఐశ్వర్యరాయ్
సినిమాల్లోకి రాకముందే ఐశ్వర్యరాయ్ యాడ్ ఫిల్మ్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాటోగ్రాఫర్ రాజీవ్ మీనన్‌తో కలిసి పలు ప్రకటనల్లో పనిచేశారు. ఆ సమయంలోనే దర్శకుడు మణిరత్నం తన సినిమాలో ఐశ్వర్యని హీరోయిన్గా తీసుకోవాలని అనుకున్నారు. అదే సంగతి రాజీవ్ మీనన్ ఐష్‌కి చెప్పారు. దీంతో తనని ఆటపట్టిస్తున్నారని ఈమె అనుకుంది. అదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.'రాజీవ్ మీనన్‌తో నేను ఎన్నో యాడ్ ఫిల్మ్స్‌లో పనిచేశా. అప్పటికే నేను మణిరత్నంకు అభిమానిని అనే విషయం ఆయనకు తెలుసు. షూటింగ్ టైంలో మణిరత్నం సినిమాల్లోని పాటలని రోజూ వినిపించేవారు. ఓ రోజు మణిరత్నం తన సినిమాలో నన్ను తీసుకోవాలని భావిస్తున్నట్లు రాజీవ్ చెప్పారు. కానీ ఆయన నన్ను ఆటపట్టిస్తున్నారని అనుకున్నాను. ఆ తర్వాత మణిరత్నంను కలిసినప్పుడు.. ‘ఇరువర్’( తెలుగులో ఇద్దరు )నటించడానికి ఆసక్తి ఉందా? అని ఎంతో సున్నితంగా అడిగారు' అని ఐశ్వర్యరాయ్ చెప్పుకొచ్చారు.ప్రస్తుతం మణిరత్నం.. విజయ్ సేతుపతి, సాయిపల్లవి జంటగా ఓ సినిమా తీస్తున్నారు. రొమాంటిక్ డ్రామా కాన్సెప్ట్. కాగా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఐశ్వర్య విషయానికొస్తే.. ‘ఇరువర్,( తెలుగులో ఇద్దరు) తర్వాత ‘గురు’, ‘రావణ్’ చిత్రాల్లోనూ మణిరత్నంతో కలిసి పనిచేశారు. వీరి కాంబినేషన్లో వచ్చిన చివరి చిత్రం 'పొన్నియిన్ సెల్వన్'. ప్రస్తుతం ఐష్ కొత్తగా మూవీస్ చేయట్లేదు. -
హీరోయిన్‌తో తెలుగు హీరో డేటింగ్?
రాజమండ్రిలో పుట్టి తెలుగులోనే వరస సినిమాలు చేసినప్పటికీ పెద్దగా ఫేమ్ తెచ్చుకోలేకపోయిన హర్షవర్ధన్ రాణే.. తర్వాత హిందీలోనే హీరోగా మంచి గుర్తింపు అందుకున్నాడు. ఫిదా, అవును, అవును 2, ప్రేమ ఇష్క్ కాదల్ తదితర చిత్రాల్లో నటించాడు. గత కొన్నాళ్ల నుంచి మాత్రం బాలీవుడ్లోనే వరస ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇకపోతే ఓ హీరోయిన్‌తో డేటింగ్లో ఉన్నాడనే రూమర్స్ మళ్లీ వినిపించాయి. సోషల్ మీడియాలో వీళ్లిద్దరూ పోస్ట్ చేసిన ఫొటోలే దీనికి కారణం.(ఇదీ చదవండి: కీర్తి సురేశ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ)హర్షవర్ధన్ రాణే, హీరోయిన్ సంజీదా షేక్ కలిసి పుణె సమీపంలోని పాన్షెట్లో వెకేషన్ ఎంజాయ్ చేసినట్లు కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో వీళ్లిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ బాలీవుడ్లో ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఇద్దరూ ఒకే చోట ఉన్నప్పటికీ ఫొటోలను వేర్వేరు యాంగిల్స్‌లో పోస్ట్ చేశారు. దీంతో వీరిద్దరూ కలిసే ట్రిప్‌కు వెళ్లారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.వీళ్లిద్దరి గురించి డేటింగ్ వార్తలు రావడం ఇదేం మొదటిసారి కాదు. 2023లో గిర్ అటవీ ప్రాంతంలో ఇద్దరూ ఒకేచోట ఉన్నట్లుగా అనిపించే ఫొటోలను షేర్ చేయడంతో ఇదంతా మొదలైంది. 2020లో రిలీజైన 'తైష్' మూవీలో కలిసి నటించారు. 2021లో వచ్చిన థ్రిల్లర్ మూవీ 'కున్ ఫయా కున్'లో మరోసారి జంటగా కనిపించారు. హర్షవర్ధన్ ఇప్పటికే సింగిలే కానీ సంజీదా షేక్ మాత్రం ఆమిర్ అలీని పెళ్లి చేసుకుని 2021లో విడాకులు తీసుకుంది. ఓ కూతురు ఉండగా.. ఆమె ఇప్పుడు సంజీదా దగ్గరే ఉంటున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: రూ.కోటి అప్పు తీర్చేందుకు బూతు సినిమాల్లో నటించా) View this post on Instagram A post shared by Sanjeeda Shaikh (@iamsanjeeda) View this post on Instagram A post shared by Harshvardhan Rane (@harshvardhanrane) -
రూ.కోటి అప్పు తీర్చేందుకు బూతు సినిమాల్లో నటించా
1987 నుంచి హిందీ సినిమాల్లో నటిస్తున్న సుస్మితా ముఖర్జీ తన జీవితంలోని చాలా కష్టమైన కాలం గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. రూ.కోటి అప్పు తీర్చడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో మహిళలని అవమానించే సి-గ్రేడ్ చిత్రాలు చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించి ఇన్ స్టాలో ఓ వీడియోని పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన తెలుగు సీరియల్ హీరోయిన్)గోల్ మాల్, రక్తచరిత్ర, జర హట్కే జర భచ్కే తదితర సినిమాలతో పాటు పలు సీరియల్స్‌లోనూ నటించిన ఈమె.. చివరగా గతేడాది వచ్చిన 'డబ్బా కార్టెల్' వెబ్ సిరీస్‌లో నటించింది. అయితే తనని 'మేడమ్.. మీరు ఎందుకు అలాంటి చెత్త సినిమాల్లో నటించారు?' అని ఒకరు ప్రశ్నించారని, ఆ ప్రశ్న తన జీవితంలోని బాధాకరమైన రోజుల్ని గుర్తు చేసిందని సుస్మితా చెప్పింది.'అవి మహిళలని అవమానించే సి-గ్రేడ్ సినిమాలు. అవి పూర్తిగా నేను తీసుకున్న తప్పుడు నిర్ణయాలే. నేను నా మనసుని అమ్ముకున్నానా? అవును.. అమ్ముకున్నాను. అప్పట్లో నాకు ఆ పని నచ్చలేదు ఇప్పటికీ నచ్చదు. కానీ ఏం చేయలేని పరిస్థితి. 2002లో నా భర్తతో కలిసి ప్రారంభించిన ప్రయాస్ ప్రొడక్షన్ సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయింది. రూ.కోటి అప్పు మిగిలింది. అదే టైంలో టెక్నాలజీ కారణంగా మా సంస్థతో పాటు మరికొన్ని నిర్మాణ సంస్థలు దివాలా తీశాయి''అప్పు ఇచ్చినవాళ్లు తరచూ మా ఇంటికి వచ్చి డబ్బులు డిమాండ్ చేసేవారు. దీంతో మళ్లీ నటిగా పనిచేయడం ప్రారంభించాల్సి వచ్చింది. నేను సంపాదించిన ప్రతి రూపాయి అప్పు తీర్చడానికే వెళ్లేది. ఆ రూ.కోటి తీర్చేందుకు నేను, నా భర్త ఎన్నో సంవత్సరాలు చాలా కష్టపడ్డాం. నా కెరీర్లో విమర్శలు ఎదుర్కొన్న ఆ సినిమాల వెనుక ఉన్న అసలు కారణం ఇదే. ఆ నిర్ణయాలు వ్యక్తిగత ఇష్టంతో కాదు. పరిస్థితుల ఒత్తిడిలో తీసుకోవాల్సి వచ్చింది' అని సుస్మితా ముఖర్జీ స్పష్టం చేసింది.(ఇదీ చదవండి: కీర్తి సురేశ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ) View this post on Instagram A post shared by Susmita Mukherjee (@susmita_mukherjeeofficial) -
దగ్గుబాటి సోదరులపై కేసును కొట్టేయలేం: హైకోర్టు
దగ్గుబాటి కుటుంబానికి హైకోర్టులో చుక్కెదురైంది. హైదరాబాద్‌లోని ఓ ఆస్తి లీజు వివాదానికి సంబంధించి దగ్గుబాటి సురేశ్‌బాబు, వెంకటేశ్‌లపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో క్రిమినల్ నేరాలకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు ఉన్నందున విచారణను ఈ దశలో నిలిపేయడం సరికాదంటూ దగ్గుబాటి సోదరులు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. హైదరాబాద్‌లోని ఓ ఆస్తిని డబ్ల్యూ3 హాస్పిటాలిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు లీజుకు ఇచ్చాక తెలెత్తిన వివాదంలో దగ్గుబాటి సోదరులపై దాఖలైన కేసును నాంపల్లి కోర్టు విచారిస్తోంది. లీజు ప్రాంగణంలోకి చొరబడి వస్తువులు ఎత్తుకెళ్లడంతోపాటు బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదుదారు నందకుమార్ ఆరోపించారు. ఈ కేసును కొట్టేయాలంటూ సురేశ్‌బాబు, వెంకటేశ్‌లు హైకోర్టును ఆశ్రయించారు. -
కీర్తి సురేశ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ
సొంత భాష మలయాళంలో తొలుత నటిగా ఎంట్రీ ఇచ్చి ఆపై కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్లో సినిమాలు చేసిన కీర్తి సురేశ్.. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్, కెరీర్ పరంగా బిజీగా ఉంది. రీసెంట్ టైంలో నాని 'ప్యారడైజ్'లో ఐటమ్ సాంగ్ చేసిందని రూమర్స్ వచ్చాయి. అలానే విజయ్ దేవరకొండ 'రౌడీ జనార్ధన'లోనూ హీరోయిన్గా చేస్తోంది. ఇవలా ఉండగానే ఓ తమిళ చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేసింది.(ఇదీ చదవండి: దీనికంటే ఇంకేం ఆశించగలం.. ఉదయనిధి అరెస్ట్‌పై విశాల్)తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కొత్త సినిమాని ప్రకటించారు. డోరోతీ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఓ టీజర్ రిలీజ్ చేశారు. సనత్, రిషీకాంత్ ప్రధాన పాత్రలు చేస్తుండగా.. కీర్తి సురేశ్ హీరోయిన్గా చేస్తోంది. ఇదో పీరియాడిక్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. ఇళయరాజా సంగీతమందిస్తుండగా ఈ చిత్రాన్ని వచ్చే నెల అంటే సెప్టెంబరు 25న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. (ఇదీ చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన తెలుగు సీరియల్ హీరోయిన్) -
బిడ్డకు జన్మనిచ్చిన తెలుగు సీరియల్ హీరోయిన్
తెలుగులో పదేళ్ల క్రితం ప్రసారమైన 'వరూధిని పరిణయం' సీరియల్‌తో బోలెడంత గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ చందన శెట్టి శుభవార్త చెప్పింది. తనకు గత నెల 26వ తేదీన కూతురు పుట్టిందనే సంగతి దాదాపు పదిరోజుల తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో వెల్లడించింది. కూతురికి సంబంధించిన ఒకటి రెండు ఫొటోలని పంచుకుంది.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు కామెడీ సినిమా)స్వతహాగా కన్నడ అమ్మాయి అయిన చందన శెట్టి.. 2013 నుంచి 2016 వరకు ప్రసారమైన 'వరూధిని పరిణయం' సీరియల్‌తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత దేవయాని, పవిత్ర బంధం సీరియల్స్ కూడా చేసింది. మధ్యలో తమిళ్లో రెండు సీరియల్స్ చేసి అనంతరం మళ్లీ తెలుగులో 'స్వర్ణా ప్యాలెస్' చేసింది. అలానే తెలుగు, కన్నడలో పలు సినిమాలు చేసినప్పటికీ పెద్దగా సక్సెస్ రాలేదు. దీంతో యాక్టింగ్ పక్కనబెట్టేసి 2024 ఏప్రిల్‌లో ఓ ఎన్నారైని పెళ్లి చేసుకుంది.ఈ ఏడాది ఏప్రిల్‌లో తన ప్రెగ్నెన్సీ సంగతి బయటపెట్టన చందన.. ఇప్పుడు ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఈమె అమెరికాలోని కాలిఫోర్నియాలో భర్తతో కలిసి జీవిస్తోంది. ఇకపోతే సీరియల్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న చందన తల్లి సరస్వతి ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్. అలా తల్లిలానే చందన తొలుత డబ్బింగ్ కెరీర్‌ని ఎంచుకుంది. 2008-12 మధ్య దాదాపు 45 సినిమాల్లో హీరోయిన్లకు గాత్ర దానం చేసింది. తర్వాతే సీరియల్స్‌లోకి వచ్చింది.(ఇదీ చదవండి: బ్రష్ కొనివ్వలేదని కేసు.. 'పళ్లబురుసు' ట్రైలర్ రిలీజ్) View this post on Instagram A post shared by Chandana Segu (@chandanasegu_official) -
గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల?
శ్రీలీల.. ఈ తార కోసం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె డాన్స్‌కి, యాక్టింగ్‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అయితే ఈ అమ్మడు నటిస్తున్న సినిమాలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. వరుస అవకాశాలు అందుకుంటున్నా.. విజయాలు మాత్రం ఆమెకు దూరంగానే ఉంటున్నాయి. అంతేకాదు.. మధ్యలో తప్పుకున్న లెనిన్ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో శ్రీలీలకు ఏదీ కలిసి రావడం లేదని అభిమానులు నిరాశపడుతున్నారు. ఇలాంటి సమయంలో శ్రీలీలకు ఓ భారీ అవకాశం దక్కిందనే వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.టాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ బిజీగా మారుతున్న ఈ హీరోయిన్‌కు మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లో చోటు దక్కిందని టాక్ . ఇంతకీ శ్రీలీలకు అవకాశం ఇచ్చిన ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా? సూపర్‌స్టార్ రజనీకాంత్. ఆయన 173వ చిత్రంగా తెరకెక్కుతున్న 'ధర్మాన్' సినిమాలో శ్రీలీల కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందట. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్‌తో శ్రీలీల మరోసారి విజయాల బాట పడుతుందో లేదో చూడాలి మరి. -
బ్రష్ కొనివ్వలేదని కేసు.. 'పళ్లబురుసు' ట్రైలర్ రిలీజ్
తెలంగాణ నేపథ్యంతో రీసెంట్ టైంలో చాలానే సినిమాలు వస్తున్నాయి. అలాంటి ఓ చిత్రమే 'పళ్లబురుసు'. వచ్చే శుక్రవారం(ఆగస్టు 14) థియేటర్లలో రిలీజయ్యే ఈ మూవీని నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మించింది. 'బలగం' ఫేమ్ సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రలు చేశారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసి స్టోరీ ఏంటనేది బయటపెట్టారు.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు కామెడీ సినిమా)టూత్ బ్రష్ కొనివ్వలేదని ఓ ముసలాయన.. తన కొడుకుపైనే పోలీస్ కేసు పెట్టేందుకు వెళ్తాడు. దీని కారణంగా ఈ కుటుంబంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఓ 'పళ్లబురుసు' ఎంత పనిచేసింది అనే నేపథ్యంగా ఎమోషనల్ స్టోరీని చూపించబోతున్నారని తెలుస్తోంది. పల్లెటూరిలో తండ్రి కొడుకు మధ్య సాగే భావోద్వేగ కథ, కోర్టు నేపథ్యంలో నడిచే ఆసక్తికరమైన డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. ఉదయ్ చౌహాన్ దర్శకుడు.(ఇదీ చదవండి: ఇది మేం ఊహించలేదు.. ఉదయనిధి అరెస్ట్‌పై విశాల్) -
దీనికంటే ఇంకేం ఆశించగలం.. ఉదయనిధి అరెస్ట్‌పై విశాల్
మూడు నాలుగు రోజుల క్రితం తమిళ రాజకీయాల్లో ఎంత రచ్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కావేరీ జలాల కోసం చేసిన ఓ నిరసన కార్యక్రమంలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్.. హీరోయిన్ త్రిష గురించి ద్వందార్థం వచ్చేలా మాట్లాడటం సంచలనమైంది. దీంతో అధికార టీవీకే పార్టీ ఈయన్ని అరెస్ట్ చేసింది. ఆపై బెయిల్‌పై ఉదయనిధి విడుదలయ్యారు. ఈ వ్యవహారంపై ఖుష్బూ, చిన్మయి లాంటి సెలబ్రిటీలు.. ఉదయనిధి తీరుని విమర్శించారు. ఇప్పుడు హీరో విశాల్ కూడా ఈ సంఘటనపై స్పందించాడు. ఈ క్రమంలోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: 'త్రిషకు సారీ చెప్పాలి.. మరి సంస్కారం ఆయనకు ఉందో లేదో')"నేను ఉదయనిధి ప్రసంగాన్ని చూశాను. ఎవరు ఏమైనా మాట్లాడే స్వేచ్ఛ ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో కొన్ని పరిమితులు పాటించడం అవసరం. రాజకీయాల్లో ముందుగానే సిద్ధం చేసిన స్పీచ్ మాట్లాడటం ఒకటి, ఆవేశంలో మాట్లాడటం మరొకటి. లయోలా కాలేజీలో నాకు సీనియర్ అయిన విజయ్ ఒకరోజు నా బ్యాచ్‌మేట్ అయిన ఉదయనిధి స్టాలిన్ ని అరెస్టు చేస్తారని మేమెప్పుడూ ఊహించలేదు. ఉదయనిధి చాలా విషయాలు చూశారు. ఇప్పుడు విజయ్ రాజకీయాల్లో ఉన్నారు. ఇవన్నీ రాజకీయాల్లో భాగమే. దీనికంటే ఇంకేం ఆశించగలం. ఇదే రాజకీయాలు' అని విశాల్ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.విశాల్ హీరోగా నటించిన 'మకుటం' వచ్చే శుక్రవారం(ఆగస్టు 14) థియేటర్లలోకి రానుంది. దీని ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలోనే పై వ్యాఖ్యలు చేశాడు. ఇకపోతే కొన్నిరోజుల క్రితం మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రావొచ్చని పరోక్షంగా కామెంట్స్ చేశాడు. అందులో భాగంగానే ఉదయనిధి అరెస్ట్‌పై స్పందించినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఏదో ఒకరోజు కమ్యూనిజందే గెలుపు.. శోభిత రాజకీయ వ్యాఖ్యలు)LATEST 🔔 : Actor #VISHAL About Udhayanithi's ARREST ! • Loyola College Senior (VIJAY) Enga Batchmate -ta (UDHAY) Arrest Panrathu Ellam Nanga Neenaichukuda Pakkala.. 😅• Udhay Pesunathu Thappu -nala Than Police Arrest Pannanga pic.twitter.com/rSukDwmQLx— Prakash Vijay (@PrakazVijay_Of) August 6, 2026 -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు కామెడీ సినిమా
ఓటీటీల్లో ఈ వారం బోలెడన్ని కొత్త సినిమాలు వచ్చేశాయి. వీటిలో లెనిన్, ఓ సుకుమారి, హృదయం మురళి, వంద దేవుళ్లు, డార్క్ సీక్రెట్స్, వదంది 2, సఫేద్ సాగర్, ఉయిర్, మై వాపస్ ఆవుంగా లాంటి స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పుడు వీటికి తోడు ఓ తెలుగు క్రైమ్ కామెడీ చిత్రం ఎలాంటి ప్రకటన లేకుండా రెండు ఓటీటీల్లో అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ దీని సంగతేంటి?నరేశ్ అగస్త్య, సుదర్శన్, రాజ్ కసిరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ఎమ్మార్పీ'. గత నెల 17న థియేటర్లలో రిలీజైంది కానీ సరైన కంటెంట్ లేకపోవడంతో దీన్ని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో మూడు వారాలు తిరిగేసరికల్లా అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.'ఎమ్మార్పీ' విషయానికొస్తే.. మనోహర్(నరేష్ అగస్త్య), రవి(కసిరెడ్డి రాజ్ కుమార్), పరమేశ్వరరావు(సుదర్శన్) ఫ్రెండ్స్. కలిసి ఓ బిజినెస్ చేద్దామని ఓ రౌడీ షీటర్ రూ.50 లక్షలు అప్పు తీసుకుంటారు. బిజినెస్‌లో నష్టాలు రావడంతో వడ్డీ కూడా కట్టలేకపోతారు. అనుకోని పరిస్థితుల్లో వీళ్లు సదరు రౌడీ షీటర్ ఇంటికెళ్లిన టైంలో అతడి తండ్రి చనిపోతాడు. అయితే ఆ శవాన్ని కిడ్నాప్ చేసి డబ్బులు సంపాదించి తమ అప్పు తీర్చాలని వీళ్లు ముగ్గురు అనుకుంటారు. తీరా కిడ్నాప్ చేసిన తర్వాత చూస్తే ఓ మహిళ శవం ఉంటుంది. ఇంతకీ ఆమె ఎవరు? చివరకు వీళ్ల ముగ్గురి పరిస్థితి ఏమైందనేదే మిగతా స్టోరీ. -
ఆ సినిమాకు ఆస్కార్ రావాల్సిందే! లేకుంటే..
ఓ భారీ బడ్జెట్ చిత్రం విడుదలకు ముందే ఆస్కార్ చర్చకు దారితీసింది. ఆ సినిమా అవార్డుల బరిలో నిలవకపోతే తాను నిరాశ చెందుతానంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. అసలు ఆయన ఆ స్థాయిలో ఎందుకు ప్రశంసించారు? ఆ సినిమాపై ఆయనకున్న అంచనాలు ఏంటి?..ఆ సినిమా మరేదో కాదు.. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక ‘రామాయణం’. ఈ భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రం ‘రామాయణం’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని ఆకాంక్షించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. ఆస్కార్ అవార్డులపై కీలక వ్యాఖ్యలు చేశారు.🚨BIG: Maharashtra CM Devendra Fadnavis on #Ramayana "I'll be VERY disappointed if Ramayana doesn't win an Oscar." pic.twitter.com/ylrzro3xE7— Daily Bollywood (@Bollywooz) August 6, 2026ముంబైలో ప్రైమ్ ఫోకస్ స్టూడియో ప్రారంభోత్సవంలో మాట్లాడిన ఫడ్నవీస్.. ‘రామాయణం’కు ఆస్కార్ రాకపోతే అకాడమీ జ్యూరీపై తాను నిరాశ చెందుతానని అన్నారు. రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ నటిస్తున్న ఈ చిత్రం “దశాబ్దపు సినిమా కాదు.. సహస్రాబ్దపు చిత్రం” అని ప్రశంసించారు. నిర్మాత నమిత్ మల్హోత్రా భారీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిస్తున్న ఈ చిత్రం భారతీయ కథలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నమని ఫడ్నవీస్ పేర్కొన్నారు. గతంలోనూ ‘రామాయణం’ విజువల్స్, సాంకేతిక ప్రమాణాలను ఆయన ప్రశంసించారు.రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం 2026 నవంబర్ 6న దీపావళికి ముందు ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండో భాగం 2027 దీపావళి సమయంలో విడుదల కానుంది.ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు. భారతీయ ఇతిహాసాన్ని ప్రపంచ ప్రేక్షకులకు చేరువ చేయడమే లక్ష్యంగా చిత్ర బృందం అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. మొన్నీమధ్యే అధికారికంగా ట్రైలర్ రిలీజ్ చేయగా.. విశ్లేషణతో రకరకాల చర్చలు నడిచాయి. తాజాగా ఇంగ్లీష్ వెర్షన్ ట్రైలర్‌నూ వదిలారు. దీంతో విడుదలకు ముందే ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. -
‘రామాయణ’ డేట్ ఫిక్స్
రామాయణం ఆధారంగా హిందీలో రూపొందిన చిత్రం ‘రామాయణ’. నితీష్ తివారి దర్శకత్వంలో ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోంది. కాగా, ‘రామాయణ: పార్ట్ 1’ చిత్రాన్ని ఈ ఏడాది నవంబరు 6న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్నారు.ఇప్పటికే ‘రామాయణ’ తొలి భాగం ట్రైలర్‌ను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేశారు. తాజాగా ఇంగ్లిష్ ట్రైలర్‌ను రిలీజ్ చేసి, ‘రామాయణ పార్ట్ 1’ను నవంబరు 6న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు మేకర్స్. ‘రామాయణ’ ఇంగ్లిష్ ట్రైలర్లో సంభాషణలు ‘బ్రహ్మ ఏఐ’ అనే కృత్రిమ మేధ సాయంతో పాత్రల లిప్ సింక్‌కు తగ్గట్లు రెడీ చేశారనే టాక్ వినిపిస్తోంది.ఇక ఈ చిత్రాన్ని ఇండియాలో ధర్మా ప్రోడక్షన్స్ రిలీజ్ చేస్తుండగా, ఓవర్సీస్లో సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ రిలీజ్ చేయనుంది. నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ సినిమాకు యశ్ సహ–నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ‘రామాయణ పార్ట్ 2’ని వచ్చే ఏడాది దీపావళి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు ఆల్రెడీ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
దేవదాస్... పార్వతిల ప్రయాణం
‘‘ఒక పార్టీలో లోకేష్ కనగరాజ్గారిని కలిశాను. మనిద్దరం కలిసి పని చేస్తే బాగుంటుందని చెప్పాను. ‘డీసీ’ చిత్రకథ ఆయనకు చాలా నచ్చడంతో హీరోగా నటించేందుకు వెంటనే ఓకే చెప్పారు. భారతీరాజా, సెల్వరాఘవన్, ధనుష్... వంటి వార్లను నేను డైరెక్ట్ చేశాను. దర్శకులతో పని చేయడం సులభంగా ఉంటుంది. ఎందుకంటే డైరెక్టర్ విజన్‌ని త్వరగా అర్థం చేసుకుంటారు’’ అని అరుణ్ మాథేశ్వరన్ తెలిపారు. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘డీసీ’. వామికా గబ్బి, సంజనా కృష్ణమూర్తి హీరోయిన్లుగా నటించారు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏషియన్ సినిమాస్ ద్వారా ఈ చిత్రం తెలుగులో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా అరుణ్ మాథేశ్వరన్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘డీసీ’ ఒక వైల్డ్ గ్యాంగ్‌స్టర్ కథ. దేవదాస్ తన ప్రయాణంలో చంద్ర, పార్వతిని కలుస్తాడు.ఆ తర్వాత వీరి జర్నీ ఎలా సాగుతుంది? అనేది ఈ సినిమా. దేవదాస్ అంటే అందరికీ క్లాసిక్ లవ్ స్టోరీ గుర్తుకు వస్తుంది. అదే పాత్రలను గ్యాంగ్‌స్టర్ ప్రపంచంలో చూపిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఈ కథను రూపొందించాను. లోకేష్ కనగరాజ్ అద్భుతంగా నటించారు. వామికా గబ్బి సెక్స్ వర్కర్ పాత్రలో కనిపిస్తారు. దేవదాస్‌ను కలిశాక ఆమె జీవితం ఎలా మారుతుంది? అనేదే ఆమె పాత్ర ప్రయాణం. ఇళయరాజాగారి బయోపిక్ భవిష్యత్తులో ఉంటుంది’’ అని పేర్కొన్నారు. -
'కొరియన్ కనకరాజు' మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: కొరియన్ కనకరాజునటీనటులు: వరుణ్ తేజ్, రితికా నాయర్, సత్య, సునీల్ తదితరలునిర్మాణ సంస్థ: యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్నిర్మాతలు :రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడిరచయిత, దర్శకుడు: మేర్లపాక గాంధీసంగీతం: తమన్ ఎస్.ఎస్సినిమాటోగ్రాఫర్: మనోజ్ రెడ్డిఎడిటర్: సత్య జివిడుదల తేది: ఆగస్ట్ 7, 2026మెగా హీరో వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడి చాలా కాలమైంది. వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం బోల్తా పడుతున్నాడు. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో హారర్ కామెడీ ‘కొరియన్ కనకరాజు’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘కొరియన్ కనకరాజు’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(ఆగస్ట్ 7) విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది? ఈ మూవీతో వరుణ్ తేజ్ హిట్ ట్రాక్ ఎక్కడా లేదా? రివ్యూలో చూద్దాం.కథ ఏంటంటే?కొరియాలో ఓ వ్యక్తి చనిపోతాడు. అతని అస్తికలు అనంతపూర్‌లోని పెనుగొండకు వస్తాయి. ఆ ఊర్లోనే కనకరాజు (వరుణ్ తేజ్) ఉంటాడు. తన ఫ్రెండ్ కిష్టప్ప (సత్య) ఫోటో స్టూడియోలోనే తన చెక్క భజన బృందాన్ని కూడా నిర్వహిస్తుంటాడు. అక్కడ చెంగా రెడ్డి (సునీల్) మనుషులు, మేనల్లుడు కర్రి శీను (టెంపర్ వంశీ)తో కనకరాజుకి నిత్యం గొడవలు జరుతుంటాయి. అదే ఊరికి చెందిన చైత్ర (రితికా నాయక్) కియా కంపెనీలో పని చేస్తూ, కొరియాకి వెళ్లి సెటిల్ అవ్వాలనే లక్ష్యంతో ఉంటుంది. అలాంటి చైత్రని కనకరాజు ఇష్టపడతాడు. కనకరాజు ఒంట్లోకి ఆ కొరియా ఆస్థికలు వెళ్తాయి. అక్కడి నుంచి కనకరాజు కొరియాలో మాట్లాడేస్తుంటాడు. కొరియా భాషను అర్థం చేసుకునే చైత్ర ఆ ఆత్మ చివరి కోరికను తెలుసుకుంటుంది. దీంతో కనకరాజు, చైత్ర, కిష్టప్ప కొరియాకి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు కనకరాజు ఒంట్లో నుంచి ఆ కొరియన్ ఆత్మ బయటకు వెళ్తుందా? ఆ కొరియన్ డాన్‌ను చంపింది ఎవరు? చివరకు ఆ ఆత్మ నుంచి కనకరాజుకి విముక్తి లభించిందా? లేదా? అన్నది కథ.ఎలా ఉందంటే..‘కొరియన్ కనకరాజు’ కథని చూస్తే మేర్లపాక గాంధీ ఇంకా ఏ కాలంలో ఉన్నాడా? అని అనిపిస్తుంది. ఎప్పుడో అరిగిపోయిన ఆత్మల కథను తీసుకు వచ్చి ఇప్పుడు మళ్లీ ఆడియెన్స్‌కి అందించాడు. అయితే ఇక్కడ కొరియా ఆత్మని తీసుకోవడం...దానికి పెనుగొండ బ్యాక్ డ్రాప్ పెట్టడం కాస్త కొత్తదనం. మిగతాదంతా రోటీన్. ఊహకందలే సాగుతుండటం ప్రధానంగా మైనస్ అని చెప్పుకోవచ్చు. అయితే కథ ఎలా రాసుకున్నా కూడా కామెడీ ట్రాక్ మాత్రం అదిరిపోయింది. సత్యతో చేయించిన కామెడీనే ఈ సినిమాని నిలబెడుతుంది.ఫస్టాఫ్ రొటీన్‌గా సాగుతుంది. హీరో ఎంట్రీ.. ఆ ఎంట్రీలోనే పాట, ఫైట్ అన్నట్టుగా ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఎంట్రీ, లవ్ ట్రాక్.. కాసేపటికి మళ్లీ ఫైట్, ఆ తర్వాత కామెడీ సీన్ అన్నట్టుగా ఫస్ట్ హాఫ్ సాగుతుంది. కనకరాజులోకి ఆత్మ వచ్చిన తర్వాత కథ ఆసక్తికరంగా మారుతుంది.అయితే ఇంటర్వెల్ బ్లాక్ కాస్త ఇంట్రెస్ట్‌గానే అనిపిస్తుంది. సెకండాఫ్ లో వచ్చే కొరియన్ డాన్ ఫ్లాష్ బ్యాక్ ఆసక్తికరంగా ఉంటుంది. ఆత్మలు, పూజలు అంటూ చేసే సీన్లలోనూ లాజిక్స్ కనిపించవు. అవి మరీ సిల్లీగా అనిపిస్తాయి. అయితే ఇలాంటి సీన్లన్నీ కూడా సత్య కామెడీతో కనిపించకుండా పోతాయి. క్లైమాక్స్ అయితే మరీ ఘోరంగా ఉంటుంది. ఆ ఏఐ షాట్స్, ఆత్మలు కొట్టుకునే సీన్లు ట్రోలింగ్ మెటీరియల్ అయ్యే అవకాశం ఉంది. క్లైమాక్స్ మాత్రం నిరాశ పర్చేలానే ఉంది. ఎవరెలా చేశారంటే..ఇందులో వరుణ్ తేజ్ రెండు డిఫరెంట్ పాత్రలను పోషించి మెప్పించాడు. రాయలసీమలోని పల్లెటూరి కుర్రాడు కనకరాజుగా, , కొరియన్ ఆత్మ ఆవహించిన తర్వాత గ్యాంగ్ స్టర్‌గా.. రెండు విభిన్న పాత్రలో కనిపించిన వరుణ్.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. యాక్షన్‌తో పాటు కామెడీ కూడా బాగా పండించాడు. ఇక రితికా నాయర్ తెరపై అందంగా కనిపించింది. ఇక ఈ సినిమాలో వరుణ్ తర్వాత బాగా పండిన పాత్ర సత్యది. తనదైన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టేశాడు. వరుణ్, సత్య కాంబోలో వచ్చే కామెడీ సీన్లు బాగా నవ్విస్తాయి. బుల్లిరాజు కూడా మరోసారి నవ్వులు పూయించాడు. సిునీల్ తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. తమన్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
తెరపైకి సర్దార్ పాపన్న జీవితం
చారిత్రక వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన యానిమేషన్ సినిమా ‘సర్దార్ సర్వాయి పాపన్న’. వీజీ మూవీ మేకర్స్ సమర్పణలో దీపక్ న్యాతి నిర్మాణ పర్యవేక్షణలో వెంకటేశ్ గౌడ్ లింగంపల్లి ఈ సినిమాను రూపొందించారు. ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వచ్చే వారం విడుదల కానుంది. ఈ సినిమా పోస్టర్ లాంచ్ ఈవెంట్లో దర్శక–నిర్మాత వెంకటేశ్ గౌడ్ మాట్లాడుతూ– ‘‘మాకున్న ఆర్థిక వనరుల దృష్ట్యా ఇది భారీ బడ్జెట్ సినిమా అనే చెప్పాలి.సర్దార్ పాపన్న 376వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని మా ‘సర్దార్ సర్వాయి పాపన్న’ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నాం. ఈ చిత్రాన్ని ఈ నెల 7నే రిలీజ్ చేద్దాం అనుకున్నాం. కానీ చిన్న సినిమాలకు థియేటర్స్ ఇబ్బందులు ఉన్నాయి. దీంతో ఈ నెల 14 లేదా 21న రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం’’ అని చెప్పారు. ‘‘నేను ఈ సినిమా చూశాను. సర్దార్ పాపన్న గొప్పతనాన్ని ఎక్కడా తగ్గించుకుండా తెరకెక్కించాడు వెంకటేశ్ గౌడ్. అన్ని కులాల వారిని ఏకం చేసి అన్యాయాలపై తిరుగుబాటు చేసిన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న. ట్యాంక్ బండ్ మీద కూడా పాపన్న విగ్రహం పెట్టేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాకు ప్రేక్షకులు మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు ప్రతాని రామకృష్ణ గౌడ్. ‘‘విదేశీయులు కీర్తించిన ఘన చరిత్ర సర్దార్ సర్వాయి పాపన్నది. ఎన్నో ఇబ్బందులు తట్టుకుని ఈ సినిమాను ఏఐ, యానిమేషన్ మూవీగా రూపొందించారు వెంకటేశ్’’ అని తెలిపారు దీపక్ న్యాతి. -
మేం లాభాల్లోనే ఉన్నాం: సాయి రాజేష్
‘‘నా దర్శకత్వంలో వచ్చిన ‘బేబి’ మూవీ తెలుగులో బ్లాక్‌బస్టర్ అయింది. ఈ మూవీ నా దర్శకత్వంలో హిందీలో రీమేక్ అవుతోంది. ఈ షూటింగ్లో బిజీగా ఉండటంతో ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాకు నేను దర్శకత్వం వహించాలనుకోలేదు’’ అని సాయి రాజేష్ చెప్పారు. కిరణ్ అబ్బవరం హీరోగా, శ్రీ గౌరీప్రియ హీరోయిన్గా నటించిన చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’. దర్శకుడు సాయి రాజేష్ కథ అందించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు.సాయి రాజేష్, ఎస్కేఎన్ నిర్మించిన ఈ సినిమా జూలై 24న విడుదలైంది. ఈ నేపథ్యంలో సాయి రాజేష్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ– ‘‘చెన్నై లవ్ స్టోరీ’కి మొదటి రెండు రోజులు సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం జరిగింది. వాకౌట్ అనే ప్రచారం చేశారు. నిజంగా ప్రేక్షకులు వాకౌట్ చేస్తే 50 కోట్ల రూపాయల వసూళ్లు దక్కవు కదా? మేం లాభాల్లోనే ఉన్నాం. ఇంటర్వెల్ సీన్ చూశాక నాకంటే రవి నంబూరి ఈ సినిమాను బాగా రూపొందించాడనే ఫీల్ కలిగింది.నా డైరెక్షన్‌లోని ‘బేబి’ హిందీ రీమేక్ షూటింగ్ మరో 20 రోజులు బ్యాలెన్స్ ఉంది. సంపూర్ణేశ్ బాబుతో ‘హృదయ కాలేయం, కొబ్బరిమట్ట’ వంటి హిట్ మూవీస్ చేశాను. మా ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా చేస్తాను. అక్టోబర్ తర్వాత నా దర్శకత్వంలో ఓ తెలుగు చిత్రం ప్రకటిస్తాను’’ అని తెలిపారు. -
క్లైమాక్స్ హృదయాన్ని హత్తుకుంటుంది: నిర్మాత బెక్కెం వేణుగోపాల్
అన్షు, వాసవి గణేషన్ జంటగా నటించిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ సినిమా ‘హుషారు పిట్టలు’. బిక్షు దర్శకత్వంలో పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్‌పై వెంకట్ యాదవ్ నిర్మించారు. ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ సంస్థలు ఈ నెల 15న విడుదల చేస్తున్నాయి. ఈ సందర్భంగా చిత్రబృందం నిర్వహించిన సమావేశంలో ‘టోంగా టోంగా’, ‘ శుక్రవారం నాడు సక్కని గడియ’ పాటలను రిలీజ్ చేశారు.అనంతరం హీరో అన్షు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా విషయంలో మాకు అంతా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. మా సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను’’ అన్నారు. ‘‘దర్శకుడిని కావాలన్న నా ఆకాంక్ష ఈ సినిమాతో నెరవేరింది. ఈ నెల 10న మా సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేస్తున్నాం. ట్రైలర్ చూసిన తర్వాత మా సినిమాపై ఉన్న అబీప్రాయాలు మారిపోతాయి’’ అని చెప్పారు. ‘‘ఇటీవల విడుదలైన మా సినిమా టీజర్‌కు ప్రశంసలు వచ్చాయి... విమర్శలూ వచ్చాయి. కానీ టీజర్ వైరల్ అయ్యి, హిట్ అయ్యింది. ప్రేక్షకులు మా సినిమాను చూస్తే, వారి డబ్బులకు తగిన ఫలితం ఉందని సంతృప్తి చెందుతారని చెప్పగలను’’ అన్నారు వెంకట్ యాదవ్.‘‘ఈ సినిమా కేవలం యూత్‌కే కాదు... మంచి సందేశం ఉన్న కమర్షియల్ చిత్రం. నిర్మాత సురేష్‌బాబుగారు చూసి, నచ్చి, ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటాయి’’ అని చెప్పారు నిర్మాత బెక్కెం వేణుగోపాల్. ‘‘హిట్ సినిమా లేకపోతే ఇండస్ట్రీ గుర్తించదు. నాకు ఈ సినిమాతో కమర్షియల్ సక్సెస్ వస్తుందని అనుకుంటున్నాను’’ అని తెలిపారు సంగీత దర్శకుడు చరణ్ అర్జున్. వాసవి గణేషన్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గీత రచయిత చిరంజీన్, డీవోపీ రుద్రసాయి, నటులు గోవర్థన్, భాను, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
రెండున్నర గంటలు నవ్వుకుంటారు: వరుణ్ తేజ్
‘‘ఎప్పటి నుంచో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా చేయాలని ఉండేది. రెండున్నర గంటల పాటు ప్రేక్షకులు రిలాక్స్ అయి నవ్వుకునే సినిమా చేయాలనే ఉద్దేశంతో ‘కొరియన్ కనకరాజు’ చేశాను. నాన్‌స్టాప్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ మూవీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది’’ అని హీరో వరుణ్ తేజ్ అన్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్, రితికా నాయక్ జోడీగా, సత్య కీలక పాత్ర పోషించిన చిత్రం ‘కొరియన్ కనకరాజు’. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో గురువారం వరుణ్ తేజ్ పంచుకున్న విశేషాలు. ⇒ నేను ఏ కథ విన్నా థియేటర్లో కూర్చొని సినిమా చూస్తున్న ప్రేక్షకుడిలాగే వింటాను. మేర్లపాక గాంధీ ‘కొరియన్ కనకరాజు’ కథ చెప్పినప్పుడు నవ్వుతూనే ఉన్నాను. ఇందులోని ఎంటర్టైన్మెంట్ నాకు చాలా నచ్చింది. నటుడిగా వెవిధ్యమైన పాత్రలు చేయాలని ఉంటుంది. ఆ క్రమంలో కొన్ని సీరియస్ పాత్రలు కూడా చేశాను. పొడవుగా ఉండే హీరోలు కామెడీ చేయకూడదనే ఒక అబీప్రాయం ఉంది... అది సరైనది కాదు. పాత్రను సరిగ్గా రాస్తే కామెడీ కుదురుతుంది. ‘కొరియన్ కనకరాజు’లో కామెడీతో పాటు యాక్షన్ కూడా చాలా బాగా కుదిరింది. ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రలు చేయడం సవాల్‌గా అనిపించింది. రెండు విభిన్నమైన బాడీ లాంగ్వేజ్‌లు, రెండు భిన్నమైన మనస్తత్వాలు చూపించే చాన్స్ రావడం సంతోషంగా అనిపించింది. ఈ పాత్ర నటుడిగా చాలా తృప్తినిచ్చింది. ⇒ గాంధీ పాత్ర రాయలసీమ నేపథ్యంలో సాగుతుంది. అందుకే ఆ యాసపై ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేశాను. మరో పాత్ర కోసం కొరియన్ భాష నేర్చుకున్నాను. హెయిర్ స్టైల్ పూర్తిగా కొరియన్ లుక్‌లో ఉండాలని నిర్ణయించుకున్నాం. ప్రతి పాత్రలో నేను కనిపించకుండా ఆ పాత్ర మాత్రమే కనిపించేలా ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను. ఈ సినిమాలో నాది, సత్య పాత్ర చాలా కీలకం. మేమిద్దరం రాయలసీమ యాస నేర్చుకుని, వర్క్ చేశాం.⇒ రాజీవ్‌గారు, వంశీగారు చాలా ప్యాషన్ ఉన్న ప్రోడ్యూసర్స్. ఇద్దరూ కలిసి సినిమాకు కావాల్సిన సపోర్ట్ ఇచ్చారు. ఇక పర్సనల్‌గా మాకు అబ్బాయి పుట్టిన తర్వాత షూటింగ్ లేకపోతే ఇంట్లోనే ఉంటున్నాను. నేను నటించనున్న ‘బరి’ సినిమా ప్రీ- ప్రోడక్షన్ జరుగుతోంది. అది పూర్తిగా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ. నేను చిన్నప్పటి నుంచి వాలీబాల్ ఆడేవాడిని. అదే బ్యాక్‌డ్రాప్‌తో ఈ కథ ఉంటుంది.


