'ఆ ప్రాధాన్యతే నాకు ప్రేరణ'.. ఉపాసన స్పెషల్ పోస్ట్ | Upasana Konidela Shares Special Post On International Womens Day, Check Out Post Viral On Social Media | Sakshi
Sakshi News home page

Upasana konidela: 'ఆ ప్రాధాన్యతే నాకు ప్రేరణ'.. ఉపాసన స్పెషల్ పోస్ట్

Mar 8 2026 1:58 PM | Updated on Mar 8 2026 4:40 PM

upasana konidela special post on ahead of international womens day

అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా మెగా కోడలు ఉపాసన ప్రత్యేక పోస్ట్ చేసింది. ఈ రోజు నా లైఫ్‌ భిన్నదశల్లో నన్ను నేను అంగీకరించడం కోసమేనని తెలిపింది. ఇలా ఉండడం ఎల్లప్పుడూ సులభం కాదు.. కానీ నా  శ్రేయస్సు, నా కుటుంబం కోసం నా ఆరోగ్యాన్ని ప్రాధాన్యతగా చేసుకోవడంతోనే ప్రేరణ పొందానని ట్వీట్ చేసింది. ఇవాళ మహిళ దినోత్సవం పురస్కరించుకుని ప్రత్యేక ఫోటోలను షేర్ చేసింది ఉపాసన.

కాగా.. ఈ ఏడాది ఉపాసన కొణిదెల కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఉపాసనకు ఇప్పటికే ఓ కూతురు ఉండగా.. ఇటీవల ఓ పాప, బాబుకు జన్మనిచ్చారు. ఈ ఏడాది మెగా ఫ్యామిలీకి డబుల్ ఆనందాన్ని తీసుకొచ్చారు. రామ్ చరణ్‌కు వారసుడు పుట్టడంతో మెగా ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. అపోలో ఆస్పత్రి వద్ద పెద్దఎత్తున సంబురాలు చేసుకున్నారు. 
 

 

Advertisement
 
Advertisement
Advertisement