ఒక్క రోజు స్ట్రాంగ్ ఏంటి?.. ఇప్పటికే ఉన్నారు: అనసూయ స్పెషల్ వీడియో | Tollywood actress anasuya special video on international womens day | Sakshi
Sakshi News home page

Anasuya: ఒక్క రోజు స్ట్రాంగ్ ఏంటి?.. ఇప్పటికే ఉన్నారు: అనసూయ స్పెషల్ వీడియో

Mar 8 2026 1:33 PM | Updated on Mar 8 2026 1:35 PM

Tollywood actress anasuya special video on international womens day

అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా టాలీవుడ్ నటి అనసూయ ప్రత్యేక వీడియోను షేర్ చేసింది. ఈ రోజు మీరు ఏం చేయబోతున్నారని చాలామంది అడుగుతున్నారని తెలిపింది. ఈ ఒక్క రోజు కాదు మాత్రమే కాదు..  ప్రతి రోజు మహిళలదే అని అన్నారు. అయితే ఈ రోజు మాత్రం కొంచెం డిఫరెంట్‌గా మాట్లాడతారని తెలిపారు. పురుషులు కూడా మహిళలను ఇబ్బంది పెట్టకుండా.. వారికి అండగా నిలిచి వారితో పాటు మీరు ఎదగాలని అనసూయ హితవు పలికారు.

స్ట్రాంగ్‌ ఉమెన్ ఇప్పటికే చాలామంది ఉన్నారని అనసూయ అన్నారు. ఈ ఒక్క రోజు ఉమెన్ స్ట్రాంగ్‌ కావాలని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. కాగా.. మహిళల విషయంలో అనసూయ ఎప్పుడు స్పందిస్తూనే ఉంటుంది. గతంలో శివాజీ మహిళల దుస్తులపై కామెంట్స్ చేయడంతో అనసూయ గట్టిగానే ఇచ్చిపడేసింది. ఆ తర్వాత శివాజీ సైతం తన మాటలపై క్షమాపణలు చెప్పారు. ఇక సినిమాల విషయానికొస్తే అనసూయ గతేడాది అరి మూవీతో ప్రేక్షకులను అలరించారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement