International Women's Day
-
IWD ప్రతీ అడుగు కన్నీటి మడుగు
ఇంట్లో ఆడ, మగ తేడా చూపని తల్లిదండ్రులు.. ఉన్నత ఉద్యోగాల్లో కొలువుదీరుతున్న మహిళలు.. మహిళా దినోత్సవం రోజున మహోన్నత సత్కారాలు.. ఇది నాణేనికి ఓ వైపు కాగా.. నాణేనికి ఇంకో వైపు ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టిన ప్రతిక్షణం.. అడుగడుగునా ఆకతాయిల ఆగడాలు.. కామాంధుల కర్కశత్వం.. మోసం చేయాలనే కేటుగాళ్లు.. రోజుకో లైంగికదాడి.. సమాజంలో తప్పని లైంగిక వేధింపులు.. ఎన్ని కఠిన చట్టాలున్నా.. మహిళ నేటికీ సభ్యసమాజంలో వివక్షకు గురవుతూనే ఉంది. ఇంటి నుంచి బయటకు వచ్చిన తరువాత క్షేమంగా ఇల్లు చేరతామన్న ధీమా లేకపోయింది.తిరుపతి సిటీ: ఆకాశమే హద్దుగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. నవసమాజ నిర్మాణంలో స్త్రీ పాత్ర కీలకం. తెల్లవారకముందే దినచర్య మొదలుపెట్టి అర్ధరాత్రి వరకు అలుపెరగకుండా శ్రమిస్తున్నారు. ఇటు కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే అటు ఉద్యోగాల్లోనూ తమ సత్తా చాటుతూ శభాష్ అనిపించుకుంటున్నారు. కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొత్తపుంతలు తొక్కుతున్న నేటి తరణంలోనూ సమాజంలో మహిళలు వివక్షకు గురవుతూనే ఉన్నారు. వేధింపులు నిత్యకృత్యంగా మారాయి. ఇంట్లో నుంచి కాలు బయటపెడితే సమాజం అనుమానపు చూపులతో చంపుతోంది. కొందరి మానవమృగాల నుంచి మహిళాలోకానికి నేటికీ ముప్పుతప్పడం లేదు. ఇంట్లో ఆడ, మగ అనే వివక్ష ప్రస్తుతం చాలా వరకు తగ్గినా, బయట సమాజంలో ఎటువంటి మార్పు కనబడలేదు. ప్రపంచ మహిళా దినోత్సవం రోజున నేటి సమాజంలో మహిళల రక్షణ, వివక్ష అనే అంశంపై సాక్షి మహిళా సంఘాల నేతలతో, విద్యార్థినులతో మాట్లాడగా పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. ఇంట్లో పరిస్థితి మెరుగుపడినా.. బయటే భయం ఆధునిక యుగంలో కుటుంబంలో ఆడ, మగ వివక్షణ చాలా వరకు తగ్గింది. ఇద్దరీ సమానంగా చూడాలనే అవగాహన తల్లిదండ్రులకు కలిగింది. కానీ బయట కాలు పెడితే చాలు మళ్లీ ఇంటికి చేరినంతవరకు క్షణక్షణం భయంగానే బతకాల్సి వస్తోంది. పోలీసులు ఎంత అభయమిస్తున్నా, కఠిన చట్టాలున్నా సమాజంలో పరిస్థితి మారలేదు. మా తల్లిదండ్రులు నేను కళాశాలకు బయలు దేరినప్పటి నుంచి ఇంటికి వచ్చేవరకు నా కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. కనీసం ఐదు సార్లు ఫోన్ చేసి మాట్లాడుతారు. మహిళలకు బయట రక్షణ ప్రశ్నార్థకంగానే ఉంది. – సరళ, ఎంబీఏ విద్యార్థిని, తిరుపతి గౌరవించకపోయినా.. హాని కలిగించకుంటే చాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల భద్రత కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా అత్యాచారాలు, మానుభంగాలు, వేధింపులు తగ్గకపోవడం దారుణం. మ రిన్ని కఠినమైన చట్టాలు తీసుకురావాలి. మహిళలను గౌరవించకపోయినా పర్వా లేదు. కనీసం వారికి హాని కలిగించకుంటే చాలు. పదేళ్ల చిన్నారులను సైతం బయటకు ఒంటరిగా పంపాలంటే తల్లిదండ్రులకు వణుకుపట్టే పరిస్థితి ఉంది. సమాజంలో మార్పు రావాలి, మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకునేందుకు నూతన చట్టాలను తీసుకురావాలి. – పుష్పావతి, ప్రైవేటు కళాశాల ఉపాధ్యాయురాలు, తిరుపతి రూరల్పరిస్థితుల్లో మార్పు రాలేదు మహిళల రక్షణకు కఠిన చర్యలు తీసుకువస్తున్నాం..అవగాహన కార్యక్రమాలు నిర్వస్తున్నామంటున్నామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయినా పరిస్థితుల్లో మార్పు కనిపించడలేదు. ఇంటి నుంచి కాలు బయటపెడితే ప్రతి క్షణం భయం భయంగా బతకాల్సిన పరిస్థితి ఉంది. ఏ క్షణంలో ఏమిజరుగతుందో తెలియని పరిస్థితిలో మహిళలు ఉన్నారు. కళాశాలలోనూ, విధులు నిర్వహించే ప్రాంతాలలోనూ వేధింపులకు గురవుతున్న మహిళలు బయటకు చెప్పుకోలేక మానసికంగా కుంగిపోతున్నారు. మహిళా దినోత్సవం అంటూ హంగామా చేయడం కాదు..మహిళ రక్షణ కల్పించాలి. – డాక్టర్ సాయిలక్ష్మి, ఐద్వా జిల్లా కార్యదర్శి, తిరుపతిఒంటరిగా వెళ్లాలంటే భయం పాఠశాలకు, కళాశాలలకు విద్యార్థినులు ఒంటరిగా నేటి వెళ్లలేకపోతున్నారు. తల్లిదండ్రులు వెన్నంటి ఉంటే తప్ప వెళ్లలేని పరిస్థితి. విద్యాసంస్థల వద్ద, బస్టాండుల వద్ద భద్రత లేదు. ఓ మహిళా ఒంటరిగా నడిచి వెళుతుంటే సమాజం వింతగా అదోలా కన్నెత్తి చూస్తుంది. దారిన వెళ్లే పోకిరీలు అసభ్యమాటలతో వేధింపులకు గురికాక తప్పడం లేదు. తల్లిదండ్రుల అండ లేని విద్యార్థినుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బయట కాలుపెట్టాలంటే వణికిపోతున్నారు. కుటుంబంలో వివక్షణను తప్పించు కున్నా బయట ప్రపంచం వివక్షతో పాటు వేధింపులకు ఎంతో మంది మహిళలు గురవుతూనే ఉన్నారు. – ఆర్ ఆషా, పీడీఎస్ఓ,జిల్లా కార్యదర్శి, తిరుపతి (చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ : తెలుగు రాష్ట్రాల రూట్ గైడ్)ఆ రోజు ఆర్భాటాలు.. తర్వాత షరా మామూలే.. ప్రస్తుతం సమాజం ఎలా తయారైందంటే మహిళా దినోత్సవం రోజున సభలు, సమావేశాలు పెట్టి మహిళలను పొగుడుతూ సన్మానాలు చేయడం..మరుసటి రోజు నుంచి షరా మామూలుగా వివక్ష చూపడం ఇది నేటి సమాజం మహిళలకు ఇచ్చే గౌరవం. కుటుంబంలోని…కుటుంబంలోని మహిళలపై వివక్ష కాస్త తగ్గినప్పటికీ బయట కళాశాలల్లోనూ, బస్టాప్‌ల్లోనూ, ఉద్యోగం చేసే ప్రాంతాల్లోనూ నేటికీ వందకు 80శాతం మంది మహిళలు వివక్షకు, వేధింపులకు గురవుతూనే ఉన్నారు. ఈ సంస్కృతిలో మార్పు రావాలంటే కుటుంబంలోని ప్రతి పురుషుడు పర స్త్రీలను గౌరవించడం నేర్చుకోవాలి.– పవిత్ర, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షురాలు, తిరుపతి వివక్షకు గురవుతున్నారు ఉన్నత లక్ష్యంతో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఉన్నత చదువులు చదివిన మహిళలు నేడు వివక్షకు గురవుతుండడం దారుణం. విధులు నిర్వహిస్తున్న ఎంతో మంది ఉద్యోగినులు వివక్షతో పాటు వేధింపులకు గురవుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలను యావత్ సమాజం గమనిస్తూనే ఉంది. కానీ వాటి అరికట్టేందుకు ప్రభుత్వాలు తూతూ మంత్రంగా చర్యలు తీసుకుని చేతులు దులుపుకుంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీల్లో పనిచేస్తున్న మహిళా కారి్మకుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. – లక్ష్మమ్మ, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్, తిరుపతి -
పింఛన్లు, రేషన్ కోసం.. కుటుంబాలు విడిపోతున్నాయి
సాక్షి, అమరావతి: పింఛన్లు, రేషన్ కోసం కుటుంబాలు విడిపోతున్నాయని.. దీనిని నివారించేందుకు కొత్త విధానం తీసుకొస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చే లబ్ధి చిన్న కుటుంబాలకు కాకుండా పెద్ద కుటుంబాలకే ఇస్తానని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజధానిలో ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. కుటుంబమే మనకు ఒక భద్రత అన్న విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. ఇద్దరు, ముగ్గురు పిల్లలుంటే మహిళలకు మాదిరిగానే పురుషులకు కూడా రెండునెలల వరకు సెలవు ఇస్తానని తెలిపారు. ఒకప్పుడు ముగ్గురు పిల్లలను కనొద్దని చెప్పిన తానే ఇప్పుడు రాష్ట్రంలో జనాభా తగ్గుదల నేపథ్యంలో ‘ముగ్గురు పిల్లలు ముద్దు’ అంటూ ఫ్యామిలీ మ్యానేజ్మెంట్ అంటున్నానన్నారు. ‘రాబోయే పదేళ్లు నేను చెప్పింది వినండి, మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండకపోతే అప్పుడు నన్నడగండి’.. అంటూ వ్యాఖ్యానించారు. బాబు ఇంకా ఏమన్నారంటే..సెర్ప్, మెప్మాను ఒకే గొడుగు కిందకు తెస్తా..మా పార్టీ అధికారంలో లేనప్పుడు ఆయా ప్రభుత్వాలు పొదుపు సంఘాలను పట్టించుకోలేదు. బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలను 99.89 శాతం తిరిగి కట్టే వ్యవస్థ డ్వాక్రా వ్యవస్థే. రాబోయే రోజుల్లో మెప్మా, డ్వాక్రా (సెర్ప్) రెండింటిని వెలుగు అనే ఒక గొడుగు కిందకు తెస్తా. పొదుపు సంఘాల మహిళలు తయారుచేసే ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా విక్రయించేలా స్వయం పేరుతో ఒక బ్రాండ్‌ను ప్రారంభించా. ఈ ఏడాది మహిళల్లోనే లక్షల మంది పారిశ్రామికవేత్తలు తయారయ్యారు. మీకేదైనా అయితే నాకు ఫోను చేయండి.. ఎక్కడో యుద్ధం జరుగుతుంటే మన దగ్గర పెట్రోల్, గ్యాస్ రేట్లు పెరిగే పరిస్థితి ఉంది. ఓపెన్ మార్కెట్లో సిలిండర్ ధరలు పెరిగినా.. మా ఆడబిడ్డలకు నేను ఇచ్చే 3 సిలిండర్లు ఉచితంగానే ఇస్తా. ఐదేళ్లు గంజాయి బ్యాచ్‌లను తయారుచేశారు. ఆడబిడ్డలకు రక్షణలేకుండా పోయింది. మీకేదైనా జరిగితే నాకు ఫోన్ చేయండి. ఎవడైనా సరే.. తాటతీస్తా. ఇక ఈ కార్యక్రమంలో పొదుపు సంఘాలకు రూ.10,100 కోట్ల రుణాల చెక్కును సీఎం చంద్రబాబు అందజేశారు. -
అతివలకే అందలం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: మహిళ మాటకు విశ్వసనీయత ఎక్కువగా ఉంటుందని.. అందుకే ప్రభుత్వ పాలనలో మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వివిధ శాఖల్లో మహిళలకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమైన శాఖలకు మహిళలనే ఉన్నతాధికారులుగా నియమించామని అన్నారు. పలు జిల్లాలకు కలెక్టర్లుగా, అవకాశమున్న చోట ఎస్పీలుగా నియమించామని తెలిపారు. ఆదివారం ప్రజా భవన్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సీఎం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళ కేంద్రంగా పథకాలు..: ‘ఉక్కు మహిళ సోనియాగాంధీ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. మహిళలకు సరైన గుర్తింపు ఇవ్వాలని ప్రజాప్రభుత్వం నిర్ణయించింది. అందుకే మహిళ కేంద్రంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నాం. మహిళా సంఘాలు కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడేలా వెయ్యి బస్సులకు యజమానులను చేశాం. వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి ప్లాంట్లకు సైతం యజమానులుగా నిలబెట్టాం. ఎస్‌హెచ్‌జీలు ఉత్పత్తి చేసే వస్తువుల విక్రయం కోసం అమెజాన్‌తో అవగాహన కుదుర్చుకున్నాం. లోకల్ టాలెంట్‌ను గ్లోబల్ టాలెంట్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం’అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. కష్టపడే వారికి గుర్తింపు ఇవ్వాలి... ‘దేశంలో ఇంకా మహిళలు, పురుషులు, కులాలు అంటూ ఎన్నో రకాలుగా వివక్ష కనిపిస్తూనే ఉంది. అభివృద్ధి చెందిన అమెరికాలోనూ వివక్ష ఉన్నప్పటికీ అక్కడ కష్టపడే వారికి గుర్తింపు ఉంది. మన దేశంలోనూ కష్టపడే వారికి గుర్తింపు ఇవ్వాలి.. అవకాశాలు కల్పించాలి. నా ప్రయాణంలో అనేక మంది జర్నలిస్టులు, మహిళా జర్నలిస్టులు నా శ్రేయోభిలాషులుగా ఉన్నారు’అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మూసీ రివర్‌ఫ్రంట్‌కు అడ్డుపడుతున్నారు.. 2047 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దాలనే లక్ష్యంలో భాగంగా మూసీని ప్రక్షాళన చేయాలనుకుంటున్నాం. కానీ కొందరు ఈ ప్రభుత్వాన్ని ఏమీ చేయనివ్వకుండా అడ్డుపడుతున్నారు. అహ్మదాబాద్‌లో సబర్మతి రివర్‌ఫ్రంట్, ఢిల్లీలో యమునా రివర్ ఫ్రంట్, యూపీలో గంగా రివర్ ఫ్రంట్ నిర్మించిన వారు హైదరాబాద్‌లో మూసీ రివర్ ఫ్రంట్‌ను మాత్రం వద్దంటున్నారు. ఈసా నది ఒడ్డున 2004లో 9 మీటర్ల బఫర్ జోన్లో అపార్ట్మెంట్ కట్టారు. నదులకు 50 మీటర్ల బఫర్ జోన్ ఏర్పాటు చేస్తూ తర్వాత నిర్ణయం తీసుకున్నారు. 50 మీటర్ల లోపల కట్టడాలపై నిషేదం ఉంది. 50 శాతం బఫర్ జోన్ ఉంది. అందుకే ఆ అపార్ట్మెంట్ నివాసితులను పిలిచి మాట్లాడాం. వాళ్లకు ఏడెకరాల భూమి ఇచ్చి అందులో అపార్ట్మెంట్ కట్టుకోవడానికి కావాల్సిన డబ్బు డిపాజిట్ చేస్తామని చెప్పాం. కానీ రాజకీయ జోక్యం పెరిగింది. ప్రతి పార్టీ అక్కడికి వెళ్లి సానుభూతి చూపిస్తోంది. సానుభూతితో సమస్య పరిష్కారం కాదు. 50 మీటర్ల బఫర్‌జోన్‌లో ఉన్న అన్ని కట్టడాలకు విలువ సున్నాయే. ప్రత్యామ్నాయం చూపించాలని మేం ప్రయత్నిస్తుంటే రాజకీయ పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. బఫర్ జోన్లో ఉన్న వారికి జరిగే నష్టంపై చర్చిస్తే బాగుంటుంది. నగరాన్ని కాపాడుకోవడానికి, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక కావడానికి అందరి సహకారం కావాలి. గాంధీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు రూ. 200 కోట్లు ఖర్చు చేస్తే తప్పేంటి? ఈ నెల 13న మూసీ రివర్ ఫ్రంట్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం’అని సీఎం వివరించారు. త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై శుభవార్త ‘జర్నలిస్టుల మధ్య ఎలాంటి తేడా లేదు. డెస్కు జర్నలిస్టులు, బ్యూరో జర్నలిస్టులు అని వేరుగా చూడం. అందరూ సమానమే. ప్రైవేటు కార్యాలయాల్లో మహిళల సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. ఇటీవలే ఈ అంశంపై చర్చ చేశాం. త్వరలో నిర్ణయం తీసుకుంటాం. సోషల్ మీడియాలో తప్పుడు కథనాలపై ఫిర్యాదులకు ఒక వేదిక ఏర్పాటు చేస్తాం. నిజమైన జర్నలిస్టులెవరో, జర్నలిస్టు ముసుగులో వ్యాపారాలు చేస్తున్నవారెవరో తేడా తెలియాలి. అందుకోసం ప్రత్యేకంగా చట్టంపై అసెంబ్లీలో చర్చిస్తాం. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల అంశం సుదీర్ఘకాలంగా ఉంది. చట్టం వల్ల ఇబ్బంది లేకుండా ఇళ్ల స్థలాలపై నిర్ణయం తీసుకుంటాం. అతిత్వరలోనే జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి మంచి వార్త చెబుతా. ప్యూచర్ సీటీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జర్నలిస్టులకు మంచి కాలనీని డిజైన్ చేస్తాం’అని సీఎం వివరించారు. మహిళా సంక్షేమంలో తెలంగాణ అగ్రగామి: మంత్రి పొంగులేటి మహిళా సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అగ్రగామిగా ఉందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార–పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసే ప్రక్రియలో భాగంగా వడ్డీలేకుండా రూ. 23 వేల కోట్లు అందించినట్లు వివరించారు. రాష్ట్ర గౌరవాన్ని పెంచేలా మహిళలకు, మహిళా జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అక్రెడిటేషన్ కార్డుల మంజూరులోనూ వారికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. -
నీతా అంబానీ హీరోస్ ఉద్యమం.. ఎందుకంటే?
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. నీతా ముఖేష్ అంబానీ 'హీరోస్' ఉద్యమాన్ని ప్రారంభించి, ప్రతి మహిళా ఒక హీరో అని గొప్ప సందేశాన్ని ఇచ్చారు. ఈ ప్రత్యేక ప్రచారం కోసం, రిలయన్స్ ఫౌండేషన్ ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న రంగాలు అయిన విద్య, క్రీడలు, ఆరోగ్యం, మహిళా వ్యాపార ప్రోత్సాహం, పర్యావరణ సంరక్షణ & గ్రామీణ అభివృద్ధి వంటి విభాగాల్లోని మహిళా హీరోలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రతి మహిళలో ఉన్న ధైర్యం, ప్రతిభ & నాయకత్వాన్ని గుర్తించి, ప్రతి మహిళ తనలోని హీరోను కనుగొని ధైర్యంగా ముందుకు సాగాలని ప్రోత్సహించడమే లక్ష్యంగా నిర్వహించబడింది.On International Women’s Day, Mrs. Nita Mukesh Ambani launched the HERoes movement and gave a powerful message – Har Nari Hero Hai! For this special campaign, she is joined by Heroes from different areas that Reliance Foundation has focused on for decades – education, sports,… pic.twitter.com/ElEfEK8wu1— Reliance Industries Limited (@RIL_Updates) March 8, 2026 -
పదేపదే అలా చెప్పడం నాకు నచ్చదు : ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల గౌరవంపై స్టార్ హీరో ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళలను ఎలా గౌరవించాలో పదేపదే చెప్పడం తనకు నచ్చదని, ప్రతి పురుషుడు పుట్టుకతోనే ఆ సంస్కారంతో ఉండాలని అన్నారు. ఆదివారం ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రి ప్రారంభోత్సవం కోసం బెంగళూరు వెళ్లారు. ప్రారంభోత్సవం అనంతరం అక్కడి సిబ్బందితో ముచ్చటించారు. ఈ సందర్భంగా మహిళల గౌరవంపై ఆయనకు ఓ ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన సమాధానం ఇస్తూ.. ప్రతి వ్యక్తికి పుట్టుకతోనే మహిళలను గౌరవించే సంస్కారం ఉండాలని అన్నారు. ‘నా ఇద్దరు కొడుకులను (అభయ్ రామ్, భార్గవ్ రామ్) మహిళలను గౌరవిస్తూ పెరిగేలా నేను కచ్చితంగా చూసుకుంటాను’ అని ఆయన పేర్కొన్నాడు. సినిమాల్లోనే కాకుండా బయట కూడా ఎంతో హుందాగా వ్యవహరించే ఎన్టీఆర్, మహిళా భద్రత, గౌరవం గురించి ఇంత గొప్ప వ్యాఖ్యలు చేయడం పట్ల నందమూరి అభిమానులతో పాటు సామాన్యులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.‘డ్రాగన్’ లుక్ వైరల్‌కాగా, ఎన్టీఆర్ బెంగళూరుకు వస్తున్నాడని తెలిసి.. స్థానిక అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు.వారిని అభివాదం చేయడానికి ఎన్టీఆర్ కారులోంచి బయటికి వచ్చాడు. కారు మీదికి ఎక్కి అభిమానులకు అభివాదం చేశాడు. గాగుల్స్ పెట్టుకుని.. గుబురు గడ్డంతో కనిపించిన తారక్ సూపర్ స్టైలిష్‌గా కనిపించాడు.ప్రశాంత్ నీల్‌తో చేయబోతున్న డ్రాగాన్(వర్కింగ్ టైటిల్) సినిమా కోసమే ఎన్టీఆర్ ఈ లుక్‌లోకి మారాడు. ఇన్నాళ్లు తన లుక్ బయటపడకుండా జాగ్రత్తలు తీసుకున్న తారక్..ఇప్పుడు కొత్త అవతారంలో కనిపించడంతో ఆ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారింది. -
'ఆ ప్రాధాన్యతే నాకు ప్రేరణ'.. ఉపాసన స్పెషల్ పోస్ట్
అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా మెగా కోడలు ఉపాసన ప్రత్యేక పోస్ట్ చేసింది. ఈ రోజు నా లైఫ్ భిన్నదశల్లో నన్ను నేను అంగీకరించడం కోసమేనని తెలిపింది. ఇలా ఉండడం ఎల్లప్పుడూ సులభం కాదు.. కానీ నా శ్రేయస్సు, నా కుటుంబం కోసం నా ఆరోగ్యాన్ని ప్రాధాన్యతగా చేసుకోవడంతోనే ప్రేరణ పొందానని ట్వీట్ చేసింది. ఇవాళ మహిళ దినోత్సవం పురస్కరించుకుని ప్రత్యేక ఫోటోలను షేర్ చేసింది ఉపాసన.కాగా.. ఈ ఏడాది ఉపాసన కొణిదెల కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఉపాసనకు ఇప్పటికే ఓ కూతురు ఉండగా.. ఇటీవల ఓ పాప, బాబుకు జన్మనిచ్చారు. ఈ ఏడాది మెగా ఫ్యామిలీకి డబుల్ ఆనందాన్ని తీసుకొచ్చారు. రామ్ చరణ్‌కు వారసుడు పుట్టడంతో మెగా ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. అపోలో ఆస్పత్రి వద్ద పెద్దఎత్తున సంబురాలు చేసుకున్నారు. This Women’s Day is about accepting and embracing myself — in all the many shapes & sizes in different phases of my life. It isn’t always easy, but I’m motivated to make my health a priority, for my own wellbeing & for my family. 💛 pic.twitter.com/9NBdRIiQsH— Upasana Konidela (@upasanakonidela) March 8, 2026 -
ఒక్క రోజు స్ట్రాంగ్ ఏంటి?.. ఇప్పటికే ఉన్నారు: అనసూయ స్పెషల్ వీడియో
అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా టాలీవుడ్ నటి అనసూయ ప్రత్యేక వీడియోను షేర్ చేసింది. ఈ రోజు మీరు ఏం చేయబోతున్నారని చాలామంది అడుగుతున్నారని తెలిపింది. ఈ ఒక్క రోజు కాదు మాత్రమే కాదు.. ప్రతి రోజు మహిళలదే అని అన్నారు. అయితే ఈ రోజు మాత్రం కొంచెం డిఫరెంట్‌గా మాట్లాడతారని తెలిపారు. పురుషులు కూడా మహిళలను ఇబ్బంది పెట్టకుండా.. వారికి అండగా నిలిచి వారితో పాటు మీరు ఎదగాలని అనసూయ హితవు పలికారు.స్ట్రాంగ్ ఉమెన్ ఇప్పటికే చాలామంది ఉన్నారని అనసూయ అన్నారు. ఈ ఒక్క రోజు ఉమెన్ స్ట్రాంగ్ కావాలని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. కాగా.. మహిళల విషయంలో అనసూయ ఎప్పుడు స్పందిస్తూనే ఉంటుంది. గతంలో శివాజీ మహిళల దుస్తులపై కామెంట్స్ చేయడంతో అనసూయ గట్టిగానే ఇచ్చిపడేసింది. ఆ తర్వాత శివాజీ సైతం తన మాటలపై క్షమాపణలు చెప్పారు. ఇక సినిమాల విషయానికొస్తే అనసూయ గతేడాది అరి మూవీతో ప్రేక్షకులను అలరించారు. 💪🏻🙌🏻❤️✨#8thOfMarch2026 pic.twitter.com/fcWeoaIYwc— Anasuya Bharadwaj (@anusuyakhasba) March 8, 2026 -
Women's Day: 20, 30, 40, 50ల్లో ఇవి తప్పనిసరి!
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నారీ శక్తి గురించి చర్చలు జరుగుతున్నాయి. వయసు మారుతున్న కొద్దీ మహిళల శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ క్రమంలో వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి, మెరుగైన జీవన ప్రమాణాలను పెంపొందించుకునేందుకు ‘ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్’ కీలకమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఏ వయసులో ఏయే పరీక్షలు చేయించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.20 ఏళ్ల ప్రాయంలో వ్యాక్సినేషన్జీవితంలో అత్యంత చురుగ్గా ఉండే 20 ఏళ్ల వయసులో మహిళలు తమ ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలి. ఈ దశలో ప్రధానంగా గర్భాశయ క్యాన్సర్ నివారణకు పాప్ స్మియర్ పరీక్షతో పాటు, హెచ్ పీవీ (HPV) వ్యాక్సినేషన్ తీసుకోవడం ఉత్తమం. వీటితో పాటు రక్తహీనతను గుర్తించే హిమోగ్లోబిన్ పరీక్ష, థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్, రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పరిశీలించుకోవాలి. నెలసరిలో ఏవైనా అసాధారణ మార్పులు ఉంటే వెంటనే గైనకాలజిస్ట్‌ను సంప్రదించడం తప్పనిసరి.30 ఏళ్లలో క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ముప్పై ఏళ్లలో అడుగుపెట్టిన తర్వాత సంతానోత్పత్తి ఆరోగ్యంపై శ్రద్ధ వహించడంతో పాటు మెటబాలిక్ సమస్యలపై మహిళలు దృష్టి పెట్టాలి. ప్రతి 3 నుంచి 5 ఏళ్లకోసారి పాప్ స్మియర్ పరీక్షను కొనసాగించాలి. మధుమేహం, కొలెస్ట్రాల్ స్థాయిలు, విటమిన్ లోపాలను గుర్తించే పరీక్షలు చేయించుకోవడం అవసరం. ముఖ్యంగా కుటుంబంలో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ చరిత్ర ఉంటే, ముందస్తుగా క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయించుకోవడం మేలు.40 ఏళ్లలో బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్నలభై ఏళ్లు దాటిన మహిళల్లో 'పెరీ మెనోపాజ్' (మెనోపాజ్ ముందు దశ) లక్షణాలు మొదలవుతాయి. ఈ వయసులో ప్రతి రెండేళ్లకోసారి మమోగ్రామ్ పరీక్ష చేయించుకోవడం ద్వారా రొమ్ము క్యాన్సర్ ముప్పును తగ్గించవచ్చు. రక్తపోటు, థైరాయిడ్, హార్మోన్ల స్థితిగతులను నిరంతరం పర్యవేక్షించాలి. అవసరమైతే ఎముక సాంద్రతను తెలిపే 'బోన్ డెన్సిటీ' పరీక్షను కూడా చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.50 ఏళ్లలో హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీయాభై ఏళ్ల వయసులో మెనోపాజ్ కారణంగా ఎముకలు బలహీనపడటం, గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ దశలో బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్, కార్డియాక్ రిస్క్ అసెస్మెంట్, కోలన్ క్యాన్సర్ స్క్రీనింగ్ తప్పనిసరి. హాట్ ఫ్లాషెస్, నిద్రలేమి తదితర సమస్యలు తీవ్రంగా ఉంటే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ (HRT)పై వైద్యుల సలహా తీసుకోవాలి.60 ఏళ్ల పైబడిన తర్వాత..అరవై ఏళ్లు దాటిన తర్వాత కిడ్నీ (RFT), లివర్ (LFT) ఫంక్షన్ టెస్టులతో పాటు జ్ఞాపకశక్తికి సంబంధించిన 'కాగ్నిటివ్ హెల్త్' పరీక్షలు చేయించుకోవాలి. మెనోపాజ్ తర్వాత అకస్మాత్తుగా రక్తస్రావం కావడం లేదా పొత్తికడుపులో వాపు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టరును కలవాలి.ముందస్తుగా చేయించుకునే ఇటువంటి ఆరోగ్య పరీక్షలు ప్రాణాంతక వ్యాధులను ప్రారంభంలోనే అడ్డుకునేందుకు సహకరిస్తాయి. ఆరోగ్యంగా ఉన్నప్పుడే పరీక్షలు చేయించుకోవడం వల్ల చికిత్స ఖర్చు తగ్గడమే కాకుండా, ఆయుష్షు కూడా పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: Women's Day: ఇడ్లీలు అమ్ముతూ.. రిసెర్చ్ స్కాలర్ విజయ గాథ -
మహిళల అభ్యున్నతే సమాజ ప్రగతికి కొలమానం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల మహిళలతోపాటు యావత్ మహిళలందరికీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగినప్పుడే వారు నిజమైన పురోగతి సాధించినట్లని పేర్కొన్నారు. మహిళలు సంతోషంగా ఉంటే ఆ కుటుంబం బాగుంటుందని, తద్వారా గ్రామం, రాష్ట్రం చివరకు దేశం కూడా బాగుంటాయని తెలిపారు. అందుకే మహిళల సంక్షేమం, అభివృద్ధితోపాటు మహిళా సాధికారత లక్ష్యంగా తమ ప్రభుత్వం పలు పథకాలు, కార్యక్రమాలు రూపొందించి అమలు చేసిందని గుర్తుచేశారు. అన్ని రంగాల్లోనూ మహిళలను ప్రోత్సహించి, దాదాపు 32కు పైగా పథకాల ద్వారా వారికి భరోసా కల్పించామని చెప్పారు. మానవాళిలో సగభాగం మాత్రమే కాక, అభివృద్ధిలోనూ అంతకుమించిన పాత్ర పోషిస్తున్న మహిళల అభ్యున్నతే... ఏ సమాజం ప్రగతికైనా కీలకమైన కొలమానం అని తన సందేశంలో వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి
చందానగర్: చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలని, ఆర్థిక స్వావలంబన సాధనే లక్ష్యంగా ఆడబిడ్డలు కష్టపడాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. శనివారం చందానగర్‌లో అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా కేటీఆర్, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, పలువురు మాజీ కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నేటి సమాజంలో పురుషాధిక్యత అడుగడుగునా ఉందన్నారు. రాజకీయాలు కూడా దానికి అతీతం కాదన్నారు. పోటీ ప్రపంచంలో మహిళలు నిలదొక్కుకోవాలంటే రెట్టింపు ప్రయత్నం చేయక తప్పదన్నారు. అమ్మాయిలు తమ కాళ్ల మీద తాము నిలబడి ఆర్థిక స్వాతంత్య్రం సాధించే దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తనకు కూడా కూతురు ఉందని గుర్తు చేస్తూ, యువతకు ఆయన కీలక సూచనలు చేశారు.ఆర్థికంగా ఎవరి మీదా ఆధారపడకుండా, సొంతంగా ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచే స్థాయికి ఎదిగినప్పుడే సమాజంలో గౌరవం, గుర్తింపుతో పాటు మహిళలకు నిజమైన స్వేచ్ఛ లభిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో మహిళా రిజర్వేషన్లు అమలులోకి రానున్న నేపథ్యంలో విద్యావంతులు, సామాజిక స్థితిగతులపై అవగాహన ఉన్న మహిళలు రాజకీయాల్లోకి రావాలని సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల్లో› 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని, భవిష్యత్తులోనూ మహిళా సంక్షేమం కోసం మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అనంతరం సబితారెడ్డి, సునీతారెడ్డిలు మాట్లాడుతూ మహిళలకోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందన్నారు. మహిళలకు భద్రత, రక్షణ కావాలంటే కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం రావాలన్నారు. ఈ కార్యక్రమంలో సమాజానికి విశేష సేవలు అందించిన వివిధ రంగాలకు చెందిన సుమారు 40 మంది మహిళలకు పురస్కారాలు అందజేశారు. -
అన్నింటా 'ఆమె'
అడ్డంకులను అధిగమిస్తూ.. అవహేళనలు, అవమానాలను దాటుకుంటూ నేడు అన్ని రంగాలనూ ఆమె జయిస్తోంది. దేశ రక్షణ మొదలు క్రీడల వరకు.. ప్రభుత్వ కొలువుల నుంచి ప్రైవేటు ఉద్యోగాల దాకా అన్నింటా తనదైన ముద్ర వేస్తోంది. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు నిర్ణయాలు తీసుకోవడంలో ఆమె మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇంటి బడ్జెట్ తయారు చేయడం నుంచి దేశ బడ్జెట్ రూపొందించే స్థాయి దాకా అతివ హవా కొనసాగుతోంది. దేశంలో నారీ శక్తి ఇప్పుడు కేవలం నినాదానికే పరిమితం కాకుండా అదొక నిరంతర ప్రవాహంగా మారింది. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లోని మహిళామణుల సమాహారం. – సాక్షి, హైదరాబాద్దేశ రక్షణకు పాటుపడుతూ.. దేశ రక్షణ రంగంలోనూ అతివలు చురుగ్గా రాణిస్తున్నారు. స్క్వాడ్రన్ లీడర్ భావన కాంత్ (పోరాటంలో మొదటి మహిళా యుద్ధ పైలట్), కల్నల్ సోఫియా ఖురేషి (విదేశాలలో ఆర్మీ బృందానికి నాయకత్వం వహించిన మొదటి మహిళ) ఉన్నారు. భారత నావికాదళ యుద్ధనౌకకు మొదటి మహిళా కమాండర్‌గా ప్రేరణ దేవస్థలీ గుర్తింపు పొందారు. రక్షణ రంగం (డిఫెన్స్) లో భావనా కాంత్‌తోపాటు అవని చతుర్వేది మోహనా సింగ్ దేశ తొలితరం ఫైటర్ పైలట్లుగా ఖ్యాతిగాంచారు. అంతరిక్షం రంగంలో రీతూ కరిధాల్ (రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా) మంగళయాన్, చంద్రయాన్–2 మిషన్లలో కీలకపాత్ర పోషించారు. గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పారామిలిటరీ దళాల్లో పూర్తిగా పురుషులతో కూడిన సీఆర్పీఎఫ్ బృందానికి సిమ్రాన్ బాలా నాయకత్వం వహించారు. ‘భారత క్షిపణి మహిళ’గా పేరుగాంచిన డాక్టర్ టెస్సీ థామస్ డీఆర్డీవోలో కీలకమైన క్షిపణి ప్రాజెక్టులను ముందుండి నడిపించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో 20–30% మంది మహిళలు పనిచేస్తున్నారు.ఆటల్లో ఐకాన్లుగా..క్రీడారంగంలో మేరీ కోమ్ (బాక్సింగ్) మిథాలీ రాజ్ (క్రికెట్) వంటి క్రీడల్లో ఐకాన్లుగా మారారు. పి.వి. సింధు (బ్యాడ్మింటన్) రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. వివిధ రంగాల్లో ముందంజ...దేశంలో 20% స్టార్టప్ సంస్థలకు మహిళలు నాయకత్వం వహిస్తున్నారు. 2022 నాటికి అగ్రశ్రేణి కంపెనీలలో సీఈవో/ఎండీ పాత్రలలో మహిళా ప్రాతినిధ్యం 55% పెరిగింది. ప్రముఖ వ్యక్తులలో ఫల్గుణి నాయర్ (నైకా), కిరణ్ మజుందార్–షా (బయోకాన్) అగ్రభాగాన కొనసాగుతున్నారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ పరిశ్రమలో 30% మంది, వ్యవసాయ శ్రామికశక్తిలో దాదాపు 42% మంది అతివలు ఉన్నారు. జార్ఖండ్‌లోని ‘రాణి మిస్త్రీలు’(క్వీన్ మేస్త్రీలు) భవన నిర్మాణ రంగంలోకి ప్రవేశించడం ద్వారా సంప్రదాయ పాత్రలకు మించి ముందుకు సాగుతున్నారు. ఇంకా సవాళ్లు.. : అనేక రంగాల్లో మహిళలు పురోగతి సాధిస్తున్నప్పటికీ మహిళలు ఇప్పటికీ గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా లింగ వేతన అంతరం ఎక్కువగా కనిపిస్తోంది. పురుషులతో పోలిస్తే ఒకే రకమైన పనికి మహిళలకు తక్కువ వేతనం లభిస్తోంది. ప్రధానంగా వ్యవసాయ రంగంలో లింగ వేతన అంతరం ఎక్కువగా ఉంటోంది. గ్రామీణ మహిళలు పెద్ద సంఖ్యలో వ్యవసాయంలో జీతం లేని కుటుంబ కార్మికులుగా పనిచేస్తున్నారు. కార్పొరేట్, సైన్స్, టెక్నాలజీ రంగాల్లో మహిళలు ఉన్నతస్థాయి నాయకత్వ స్థానాలకు వెళ్లడానికి కష్టపడుతున్నారు, సీనియర్ స్థాయిల్లో వారి ప్రాతినిధ్యం తగ్గుతోంది. ‘బోర్డు’ల్లోనూ ఆమెప్రైవేట్ సంస్థల్లో 29% బోర్డు డైరెక్టర్ పదవులను, ప్రభుత్వ సంస్థల్లో 20% డైరెక్టర్ల పోస్టుల్లో మహిళలు కొనసాగుతున్నారు. ఈ ఏడాది జనవరి నాటికి దేశంలోని మొత్తం సంస్థల డైరెక్టర్ల పదవుల్లో 32 శాతం అతివలు ఉన్నారు. బోర్డులో కనీసం ఒక మహిళ ఉన్న ప్రైవేట్ కంపెనీలు మొత్తం పురుష బోర్డుల కంటే సగటున 16% నుంచి 29% ఎక్కువ నిధులను సేకరించాయి. 2015 తర్వాత స్థాపించిన కంపెనీలు పాత సంస్థల కంటే (16%) ఎక్కువ వైవిధ్యాన్ని (20% మహిళలు) కలిగి ఉన్నాయి. బోర్డులో కనీసం ఒక మహిళ ఉన్న ప్రైవేట్ కంపెనీలు, పూర్తిగా పురుషుల బోర్డులు ఉన్న వాటి కంటే ఏడాదిలోగా పబ్లిక్‌గా ఇష్యూకు వెళ్లే అవకాశం 10 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
స్ట్రాంగ్ ఉమెన్ అవుతారా?
ఉరుకుల పరుగుల జీవితంలో మహిళలు శారీరకంగా బలంగా ఉంటే సరిపోదు.. మానసికంగానూ బలంగా ఉండాలి. అపుడే అన్ని రంగాల్లోనూ రాణించగలుగుతారు. అందుకోసం కొన్ని అలవాట్లను మార్చుకోవాలి, అలవర్చుకోవాలి. ఒక చిన్న అలవాటు మీ వ్యక్తిత్వాన్ని అద్భుతంగా తీర్చిదిద్దగలదు, అదే సమయంలో పూర్తిగా దెబ్బతీయగలదు కూడా. మిమ్మల్ని మీరు ఒక స్ట్రాంగ్ ఉమెన్‌గా చూసుకోవాలనుకుంటే, మీరు అలవర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అలవాట్లు..భావోద్వేగాలపై నియంత్రణ ఈ ఉరుకుల పరుగుల జీవితంలో శారీరక బలంతో పాటే మానసికంగా దృఢంగా ఉండటమూ చాలా ముఖ్యం. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సరిగ్గా ఉపయోగించడమే మానసిక దృఢత్వానికి మొదటి మెట్టు. ఎప్పుడు మౌనంగా ఉండాలో, ఎప్పుడు మాట్లాడాలో తెలిసుండాలి. కోపం, బాధ కలిగినపుడు కుంగిపోకుండా.. ఆ భావాలను అర్థం చేసుకుని మరింత మానసిక పరిపక్వతతో ముందుకు సాగుతుండాలి.నో చెప్పడమే బెటర్అందరినీ మెప్పించాలనేం లేదు. అలా ప్రయత్నిస్తే మానసిక అలసట తప్పదు. అందుకే ఎదుగుదలకు, మనశ్శాంతికి అడ్డుపడే విషయాలకు నిర్మొహమాటంగా నో అని చెప్పగలగాలి. ఇందులో ఎటువంటి గిల్టీ ఫీలింగ్‌ని కలిగి ఉండకూడదు. సమయానికి విలువ ఇవ్వడం, అనవసరమైన బాధ్యతలను తిరస్కరించడం అనేది స్వార్థం కాదు, మీ ఆత్మగౌరవానికి నిదర్శనం.‘కాదు’ అని చెప్పగలగడం విజయానికే కాదు, ప్రశాంతమైన జీవనానికి కూడా తోడ్పడుతుంది.తప్పుల నుంచి పాఠాలుఓటమికి భయపడని వారే విజేతలుగా నిలుస్తారు. తమ తప్పులకు ఇతరులను నిందించకూడదు. బాధ్యత తీసుకోవాలి, లోపాలను విశ్లేషించుకోవాలి. ఆ తప్పులు మళ్లీ జరగకుండా చూసుకోవాలి. ఈ నేర్చుకునే తత్వం అన్ని పరిస్థితుల్లోనూ మిమ్మల్ని విజేతలుగా నిలబెడుతుంది.నేర్చుకోవడానికి సిగ్గుపడకపోవడం తమకు అన్నీ తెలుసు అని ఎప్పుడూ అనుకోకూడదు. తమకున్న జ్ఞానంపై నమ్మకం ఉన్నప్పటికీ, ఇతరుల అనుభవాలకు విలువ ఇవ్వాలి. ఏదైనా కొత్త విషయం తెలిసినప్పుడు దానిని మనస్ఫూర్తిగాస్వీకరించాలి. ఇతరులలోని మంచిని, గొప్ప లక్షణాలను అడాప్ట్ చేసుకోవడానికి ఎప్పుడూ వెనుకాడకూడదు. ఈ లక్షణాలు అలవర్చుకుంటే ఏ మహిళ అయినా తన జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోగలదు.అసూయ పడకపోవడం మానసిక బలానికి ప్రధాన వనరు అసూయ లేకపోవడం. ఇతరుల విజయాన్ని చూసి కుళ్లుకోవద్దు. బదులుగా వారి నుంచి స్ఫూర్తి పొందాలి. ప్రతి ఒక్కరి ప్రయాణం వేరని గుర్తించాలి. ఇతరులతో పోల్చుకోవడం మానేసి, నిన్నటి కంటే ఈరోజు తాము ఎంత మెరుగ్గా ఉన్నాము అనే దానిపైనే దృష్టి పెట్టాలి.చదవండి: ట్రావెలింగ్ నుంచి హోస్టింగ్ వరకుమార్పును స్వీకరించాలిప్రపంచంలో మార్పు అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. మార్పును చూసి భయపడకుండా దానిని ఒక అవకాశంగా మలచుకోవాలి. అది కెరీర్ అయినా.. వ్యక్తిగత జీవితం అయినా పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాలి. గతాన్ని తలచుకుని బాధపడటం కంటే, భవిష్యత్తు కోసం ప్రస్తుతం ప్రణాళికలు రచించుకోవాలి. -
పరుగే జీవితం
బస్సులలో ప్రయాణం చేసే సమయంలో మహిళా కండక్టర్లు విధుల్లో కనిపిస్తుంటారు. ఇంటిని, ఉద్యోగాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ బస్సు చక్రాల్లా తిరుగుతున్నవారి పనిని మౌనంగా గమనిస్తుంటాం. సికింద్రాబాద్‌లోని మచ్చబొల్లారంలో ఉంటున్న ఐదుపదుల స్వరాజ్య లక్ష్మి ఉద్యోగ బాధ్యతలతో పాటు జాతీయ, అంతర్జాతీయ రన్నింగ్ రేసులో పాల్గొని పతకాలూ సాధిస్తోంది. ‘వయసు మీద పడినా పనిలో చురుగ్గా ఉండాలంటే మహిళలకు క్రీడలు తప్పనిసరి’ అంటూ తన క్రీడా జీవితాన్ని వివరించింది లక్ష్మి.‘‘రోజూ ఉదయమే నాలుగున్నర గంటలకు డ్యూటీలో ఉంటాను. అంటే, మూడు గంటలకు నిద్రలేస్తాను. తిరిగి ఒంటి గంటకల్లా ఇంటికి వచ్చేస్తా. ఇంటి పనులు చూసుకొని, కాసేపు రెస్ట్ తీసుకొని, సాయంకాలం గ్రౌండ్‌కి వెళ్లి రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తాను. పాతికేళ్లుగా కంటోన్మెంట్లో కండక్టర్‌గా ఉద్యోగం చేస్తున్నాను, రన్నింగ్‌లోనూ నన్ను నేను నిరూపించుకుంటున్నాను.మార్చుకున్న షెడ్యూల్...చదువుకునే రోజుల్లో రన్నింగ్ అంటే బాగా ఇష్టం ఉండేది. ఇంటర్మీడియెట్ పూర్తవుతూనే పెళ్లయ్యింది. ఆ తర్వాత కండక్టర్‌గా ఉద్యోగంలో చేరాను. మా వారు ప్రైవేట్ ఉద్యోగి. మాకు ఓ బాబు. ఇంటర్ చదువుతున్నాడు. ఇంటి పనులు, ఉద్యోగం చేసుకున్నా ఇంకా సమయం మిగిలే ఉండేది. దీంతో చదువుకున్న రోజుల్లో వదిలేసిన రన్నింగ్‌ను ఉద్యోగంలో చేరాక కంటిన్యూ చేశాను. పదిహేనేళ్ల క్రితం ఆర్టీసీలో ఎవరైనా క్రీడాకారులు ఉంటే వాళ్లు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనవచ్చని తెలిసింది. దీంతో రన్నింగ్ అంటే ఇష్టం ఉండి, ప్రాక్టీస్ చేస్తున్న నాకు మంచి అవకాశం లభించినట్టు అనిపించింది. ఆ రోజు నుంచి నా టైమ్ టేబుల్‌ను నేనే మార్చుకున్నాను. ఉదయం డ్యూటీకీ వెళ్లి పోయి, మధ్యాహ్నానికి ఇంటికి వచ్చి, సాయంకాలానికి గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయడం... ఇన్నేళ్లుగా ఇదే షెడ్యూల్లో నా జీవన శైలి ఉంటుంది. విదేశీ పోటీల్లోనూ...దీంట్లో భాగంగానే ఇండోనేషియా, మలేషియాలో జరిగే రన్నింగ్ కాంపిటిషన్లలో పాల్గొని బంగారు పతకాలను సాధించాను. దేశీయస్థాయిలో రాజస్థాన్, చండీగడ్, ఢిల్లీలోనూ రన్నింగ్ పోటీల్లో పాల్గొన్నాను. ఈ యేడాది జనవరిలో అజ్మీర్‌లో జరిగిన రన్నింగ్ రేస్‌లో పాల్గొన్నాను. 400 మీటర్ల పరుగులో సెకండ్ ప్రైజ్, 800 మీటర్ల పరుగులో థర్డ్ ప్రైజ్ వచ్చింది. పోటీలలో పాల్గొనడానికి వెళ్లేటప్పుడు వసతి సదుపాయాలు నిర్వాహకులే చూస్తారు. ప్రయాణ ఖర్చులు మాత్రం నేను ఎలాగోలా సర్దుబాటు చేసుకుంటాను.మా మహిళా కండక్టర్లు కలిసినప్పుడు ‘మేమంతా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాం. కానీ, డ్యూటీ చేస్తూ ఈ వయసులో కూడా నువ్వు యాక్టివ్‌గా ఉన్నావు’ అంటుంటారు. పనిలో యాక్టివ్‌గా ఉండాలంటే ఏదో ఒక క్రీడ ఉంటేనే మంచిది. క్రీడల్లో పాల్గొంటే మన జీవనమే మారి పోతుంది. ప్రతీది ఛాలెంజ్‌గా తీసుకుంటాం. ధైర్యం వచ్చేస్తుంది. ఆరోగ్యంగానూ ఉంటాం. అందుకే, మా మహిళా ఉద్యోగులకు ‘ పోటీలో పాల్గొనక పోయినా సరే, ఏదో ఒక గేమ్‌ని ఎంచుకొని ప్రాక్టీస్ చేయమని చెబుతుంటాను’ అని వివరించింది ఈ క్రీడా కండక్టర్. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
విజయ వర్ణాలు
కాంతిపుంజంలో ఏడు రంగులు దాగి ఉంటాయి. స్త్రీ సామర్థ్యం ఒక కాంతి కిరణమే! ప్రసరించే ప్రతిచోటా వెలుతురై వెల్లివిరుస్తుంది. ప్రతి రంగూ మరో రంగుకు బలం ఇస్తుంది. స్త్రీలు ఆకాశంలో సగం మాత్రమే కాదు.. ఆకాశమంతా నిండిన ఏడు వర్ణాలు. ఇక్కడ ఏడు రంగాల్లో ఏడు గెలుపు కథలు చదవండి.మ్యాథ్స్ మాస్ట్రో నళిని అనంత రామన్ రంగం గణితంప్రపంచ ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్తలలో నళిని అనంత రామన్ ఒకరు. డైనమిక్ సిస్టమ్స్, క్వాంటంపై నళిని విశేష కృషి చేశారు. ఆమె పరిశోధన హెన్రీ పాయింకేర్ ప్రైజ్, ఇన్ఫోసిస్ ప్రైజ్‌తో పాటు అనేక అంతర్జాతీయ గుర్తింపులను సాధించింది. గణితంపై పని చేస్తున్న ప్రముఖ పరిశోధకులలో ఒకరిగా నిలిచింది. తల్లిదండ్రులిద్దరూ గణిత శాస్త్రవేత్తలు కావడంతో నళినికి అంకెలతో చిన్నప్పటి నుంచే అనుబంధం ఏర్పడింది. గణితానికి సంబంధించిన విశేషాలు వినడం అంటే కథలు విన్నంత సంతోషంగా ఉండేది. ‘గణితాన్ని బాగా ఇష్టపడేదాన్ని. అలా అని ఇతర సబ్జెక్లను నిర్లక్ష్యం చేయలేదు’ అని బాల్యాన్ని గుర్తు తెచ్చుకుంటారు నళిని. పదహారు సంవత్సరాల వయసులో ఫ్రాన్స్‌లో గణితానికి ప్రసిద్ధి చెందిన ‘ఎకోల్ నార్మల్ సుపీరియర్’ విద్యాసంస్థలో చేరింది. పీహెచ్డీ పూర్తి చేసిన తరువాత అనేక పరిశోధన సంస్థలలో పనిచేశారు నళిని. ప్రస్తుతం స్ట్రాస్బోర్గ్ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. సంక్లిష్టమైన గణిత సమస్యలను తేలికైన ఉదాహరణలతో అర్థం చేసుకునేలా చేయడం ఆమె ప్రత్యేకత. డైనమిక్ సిస్టమ్‌కు సంబంధించిన సారాంశాన్ని బిలియర్డ్స్ టేబుల్‌పై దొర్లే బంతిని ఉదాహరిస్తూ చెబుతుంటారు.చరిత్ర సృష్టించిన విజయంపూజా కృష్ణమూర్తిరంగం: క్రీడలుబ్రెజిల్ 135 ఆల్ట్రాను పూర్తి చేయడం ద్వారా పూజా కృష్ణమూర్తి చరిత్ర సృష్టించింది. 135 మైళ్ల కఠినమైన రేసుకు అర్హత పొంది విజయం సాధించిన మొదటి భారతీయ మహిళగా నిలిచింది. 48 గంటలలోనే ఈ రేసును పూర్తి చేసింది. ఈ ఘనత ఆమెను ప్రపంచ ప్రఖ్యాత రన్నర్లలో ఒకరిగా నిలిపింది. పర్వతాలతో ప్రేమ పూజాకు చిన్న వయసు నుంచే మొదలైంది. పూజ ను, ఆమె సోదరి ప్రియాను వారి తల్లి హిమాలయాలలో ట్రెక్కింగ్‌కు తీసుకెవెళ్లేది. ‘ట్రెక్కింగ్ వల్ల నాకు కలిగిన ప్రయోజనం ఓర్పు, క్రమశిక్షణ’ అని చెబుతుంది పూజ. ముంబైలోని సెయింట్ జేవియర్ కాలేజీలో పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ చేసిన పూజ ఆ తరువాత ఫిల్మ్ మేకింగ్ కోర్సులో చేరింది. పరుగు అనేది ఆమె జీవితంలోకి అనుకోకుండా వచ్చింది. 2011లో తల్లి, సోదరితో కలిసి హాఫ్–మారథాన్‌కు వెళ్లింది. ‘ఐదు కిలోమీటర్ల నా మొదటి పరుగు ప్రయాణం అలా మొదలైంది’ అంటూ జ్ఞాపకాల దారులలోకి వెళుతుంది పూజ. హాఫ్–మారథాన్ తరువాత పది కిలోమీటర్ల రేసులలో పాల్గొనడం మొదలుపెట్టింది. సరదాగా మొదలైన పూజాకృష్ణమూర్తి పరుగు ప్రయాణం చరిత్ర సృష్టించే వరకు వెళ్లింది.నవ యువ స్వర సంచలనం హన్సికా పరీఖ్రంగం: సంగీతంఇండియన్ పాప్ మ్యూజిక్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది హన్సికా పరీఖ్. అజ్మీర్‌లోని సంగీత కళాకారుల కుటుంబంలో పుట్టిన హన్సికా పరీఖ్‌కు సంప్రదాయ సంగీతం మాత్రమే కాదు నవతరం సంగీతం అంటే కూడా ఇష్టం. చిన్నప్పటి నుంచి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో మునిగి తేలింది హన్సిక. అలా అని అక్కడే ఉండి పోలేదు. ఆన్లైన్లో ఎప్పటికప్పుడూ కొత్త కొత్త సంగీత ధోరణుల గురించి తెలుసుకునేది. ఆమె పాట ప్రస్థానం ఎలా ప్రారంభం అవుతుంది అంటే.. మొదట ఏదైనా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా ట్యూన్ క్రియేట్ చేస్తుంది. ఆ ట్యూన్‌ను మెల్లగా మనసు పొరల్లోకి తీసుకుంటూ పదాలు అల్లుతుంది. ‘కొత్త సంగీత ధోరణుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, కొత్త ఆర్టిస్ట్‌లతో పనిచేయడం కూడా అంతే ముఖ్యం’ అంటుంది హన్సికా పరీఖ్.చిత్ర సంచలనంగీతా గంభీర్రంగం: సినిమాఈ సంవత్సరం ఆస్కార్ డాక్యుమెంటరీ రేసులో సంచలనం సృష్టించారు భారత సంతతికి చెందిన ఫిల్మ్ మేకర్ గీతా గంభీర్. రెండు వేర్వేరు చిత్రాలకు రెండు నామినేషన్లు సాధించారు. ‘ది పర్ఫెక్ట్ నైబర్’ అనే ఆమె చిత్రం ఫీచర్స్ విభాగంలో ‘బెస్ట్ డాక్యుమెంటరీ’కి నామినేట్ అయింది. మరో చిత్రం ‘ది డెవిల్ ఈజ్ బిజీ’ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్‌కు నామినేట్ అయింది. నామినేషన్లకు ముందే ఈ రెండు చిత్రాలు అకాడమీ 15 షార్ట్ లిస్ట్‌లో ఉన్నాయి. ‘రెండు చిత్రాలను చాలా ప్రేమతో, శ్రద్ధతో నిర్మించాను. ఈ చిత్రాలకు వచ్చిన స్పందన సంతోషంగా ఉంది’ అంటున్నారు గీత. గీతా గంభీర్ బోస్టన్‌లో జన్మించారు. ఆమె తండ్రి శరద్ ఇంజినీరింగ్ చదవడానికి భారతదేశం నుండి అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడి పోయారు. హార్వర్డ్ యూనివర్శిటీలో చదువుకున్న గీత డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకింగ్‌తో తన చిత్ర ప్రయాణాన్ని ప్రారంభించారు. ఫిల్మ్ ఎడిటర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గీత నాన్ ఫిక్షన్ ప్రోగ్రామింగ్ విభాగంలో అత్యుత్తమ పిక్చర్ ఎడిటింగ్‌లో రెండు ఎమ్మీ అవార్డ్‌లను గెలుచుకున్నారు.గేమ్ చేంజర్ఆశా శర్మరంగం: గేమింగ్తమ గేమింగ్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సీయీవోగా ఆశా శర్మను నియమించింది మైక్రోసాఫ్ట్. యూనివర్శిటీ ఆఫ్ మిన్నెసోటాలోని కార్ల్సన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో చదువుకున్న ఆశాశర్మకు టెక్నాలజీ, ప్రాడక్ట్, ఆపరేషన్ లీడర్‌షిప్‌లకు సంబంధించి పదిహేను సంవత్సరాల అనుభవం ఉంది. 2011లో మైక్రోసాఫ్ట్ మార్కెటింగ్ విభాగంలో తన కెరీర్ ప్రారంభించింది ఆశ. రెండు సంవత్సరాల తరువాత పోర్చ్ గ్రూప్‌లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టింది. ప్రొడక్షన్, ఇంజినీరింగ్, అమ్మకాలు, మార్కెటింగ్... మొదలైన వాటికి సంబంధించిన బాధ్యతలు చూసేది. ‘ఏ బాధ్యత తీసుకున్నా విజయవంతం చేస్తుంది’ అని పేరు తెచ్చుకున్న ఆశాశర్మ సరికొత్త బాధ్యతతోనూ తిరుగులేని విజయాన్ని సాధిస్తుందనడంలో సందేహం లేదు. ఏ.ఐ. ఐకాన్ అశ్వినిఅశోకన్రంగం: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్సిలికాన్ వ్యాలీలో పది సంవత్సరాలు పని చేసిన అశ్విని అశోకన్ కంప్యూటర్ విజన్ టెక్నాలజీని ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఇండియాకు వచ్చి, ఏఐ ప్లాట్‌ఫామ్ ‘మ్యాడ్ స్ట్రీట్ డెన్’ ప్రారంభించింది. అత్యంత ఆధునిక ఏఐ ఉత్పత్తులను నిర్మించడంలో ఈ కంపెనీ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ‘మన దేశంలో అద్భుతమైన ప్రతిభ ఉంది. అదే సమయంలో నిరుద్యోగం ఉంది’ అంటున్న అశ్విని తన కంపెనీ కోసం ప్రతిభావంతులను వెదకడంలో ఎప్పుడూ ముందుంటుంది. కార్నెగీ మెలన్ యూనివర్శిటీలో ఇంటరాక్షన్ డిజైన్‌లో మాస్టర్స్ చేసింది అశ్విని. ‘ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ట్రెండ్స్‌ను గమనించడం మంచిదేగానీ, వాటిని మనం గుడ్డిగా అనుసరించలేం. మన దేశ నిర్దిష్ట పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి’ అంటున్న అశ్విని ఏ.ఐ నాడి తెలిసిన నిపుణురాలు. ఏ.ఐ.ని సామాన్య ప్రజలకు ఎలా చేరువ చేయాలో తెలిసిన ఎంటర్ప్రెన్యూర్.ఆరోగ్య భాగ్యం సౌమ్య స్వామినాథన్రంగం: హెల్త్శిశు వైద్యురాలు, క్లినికల్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన అంశాలపై విశేష కృషి చేశారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ సెక్రెటరీగా పనిచేశారు. ఆ తరువాత ప్రపంచ ఆరోగ్య సంస్థలో డిప్యూటీ డైరెక్టర్‌గా చేరారు. అదే సంస్థలో చీఫ్ సైంటిస్ట్ అయ్యారు. కోవిడ్ కాలంలో శాస్త్రీయ పరిశోధనలకు సంబంధించి కృషి చేశారు. 2009 నుండి 2011 వరకు యూనిసెఫ్, యూఎన్‌డీపి/ వరల్డ్ బ్యాంక్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ల ‘రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్ ట్రాపికల్ డిసీజెస్’ అనే స్పెషల్ ప్రోగ్రామ్‌కు కో ఆర్డినేటర్‌గా పనిచేశారు. ‘మన దేశంలో అందరికీ పోషకాహారం అందడం లేదు’ అంటారు. ఆమె తరచూ ‘హిడెన్ హంగర్’ అనే మాట అంటుంటారు. అంటే... తగినంత ఆహారం తీసుకుంటున్నప్పటికీ శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ అందక పోవడం. పిల్లలకు తగినంత పోషకాలు లభించక పోతే జరిగే దీర్ఘకాలిక నష్టాల గురించి ఎన్నో వేదికలపై నొక్కి చెప్పారు. చెన్నైలో పుట్టిన సౌమ్య ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్ కూతురు. -
అభివృద్ధిలో ఆమె స్థానం ఎక్కడ?
దేశ జనాభాలో 48%గా ఉన్న మహిళల విద్య, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి, భద్రత తదితర అంశాలను తరచుగా సమీక్షించుకుంటూ, లోపాలను సవరించుకుంటూ ముందుకు సాగినప్పుడే దేశం వడివడిగా అభివృద్ధి పథంలోకి సాగుతుంది. మనం ఎంతో గొప్పగా, ఘనంగా చాటుకుంటున్న భారతదేశ ఆర్థికాభివద్ధి కథ (గ్రోత్ స్టోరీ)లో మహిళల భాగస్వామ్యం లేకుంటే అది ఓ అసంపూర్ణ కథాచిత్రంగానే మిగిలిపోతుంది. దేశం 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ కావాలన్న కల సాకారం కావాలంటే మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులు గణనీయంగా మెరుగుపడక తప్పదు. మెరుగుదల ఉన్నప్పటికీ...నిజం చెప్పాలంటే గత ఆరేళ్లలో దేశంలో మహిళల వికాసం, ప్రగతి అంతకు ముందెన్నడూ లేని స్థాయిలో మెరుగుపడ్డాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే, ప్రపంచ బ్యాంకు నివేదిక వంటి ప్రామాణిక సంస్థలు వెలువరించిన లెక్కల ప్రకారం చూస్తే మహిళల విద్య, ఆరోగ్యం, ఉపాధి, భద్రత రంగాలలో పెద్ద అడుగులేముందుకు పడ్డాయి. ముఖ్యంగా... 2023–24 నాటికి దేశంలో మహిళల విద్య 73 శాతానికి పెరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘బేటీ బచావో, బేటీ పఢావో’, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు... రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న మహిళాసంక్షేమ కార్యక్రమాల వల్ల పాఠశాలల్లో బాలికల ప్రవేశాలు ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలలో గణనీయంగా పెరిగాయి. స్టెవ్ు గ్రాడ్యుయేట్లలో మహిళల వాటా 43%కు పెరిగింది. ఇది ప్రపంచ దేశాలలోనే అత్యధికం. 2023–24 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం, మహిళా కార్మికశక్తి భాగస్వామ్యం 2017–18లో 23.3% ఉండగా 2024–25 నాటికి 37%కు పెరిగింది. ఇక చిన్న, సన్నకారు పారిశ్రామిక సంస్థలను నిర్వహించే మహిళా పారిశ్రామికవేత్తలసంఖ్య కోటిన్నరకు పెరిగి తద్వారా పుష్కలంగా ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పథకాలలో... ‘స్టాండ్ అప్ఇండియా’, ‘ముద్ర యోజన’, స్వయం సహాయక సంఘాలువంటివి మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి సహాయం చేస్తున్నాయి. ప్రస్తుతం దేశ స్థూల ఉత్పత్తిలో ఆర్థికంగా మహిళలు అందిస్తున్న వాటా 18 శాతంగా ఉంది. మహిళల సాధికారత దిశగా సాగిస్తున్న ప్రయాణం అంతకుముందు కంటే సంతృప్తికరంగా ఉన్నప్పటికీ, ప్రపంచ దేశాలతో, మరీ ముఖ్యంగా దక్షిణాసియా దేశాల కంటే కూడా బాగా వెనుకబడి ఉన్నాం. ఇందుకు అనేక కార ణాలు కనిపిస్తాయి. మహిళల విద్య, వారి భద్రత, ఆరోగ్యం, ఉపాధి రంగాలలో మన దేశం ర్యాంకు సంతృప్తికరంగా లేదు. చైనా,జపాన్‌లే కాదు థాయిలాండ్, శ్రీలంకల కంటే మనం వెనుకబడి ఉన్నాం అన్నది ఓ చేదు వాస్తవం.కొనసాగుతున్న హింసమహిళలకు భారతీయ సంస్కృతిలో గొప్ప స్థానం ఉందని చెబుతారు. కానీ ఆచరణలో అది అంతగా కనిపించదు. అయితే మహిళలపై ఒకప్పటిలా తీవ్రస్థాయిలో సాగిన దురాచారాలు,అకృత్యాలు ఇప్పుడు లేకపోవచ్చు గాని నేటికీ మహిళలపై భిన్న రూపాలలో హింస చోటు చేసుకుంటూనే ఉంది. మహిళల భద్రత అంశంలో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశాలలో భారత్ ఒకటిగా ఉంది. ‘నేషనల్ క్రైవ్‌ు రికార్డ్స్ బ్యూరో’ ప్రకారం 2022–23లో దేశంలో మహిళలపై 4.45 లక్షల నేరాలు జరిగాయి. రికార్డులకు ఎక్కని ఘోరాలు ఇంకా మరెన్నో ఉంటాయి.‘సమాన పనికి సమాన వేతనం’ అన్న చట్టం అమలులోకి రాకముందు మహిళలకు అతి తక్కువ వేతనాలు ఇవ్వడం భారత దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉంది. భవన నిర్మాణ రంగం, ఇతర రోజువారీ కూలీ పనులలో మగ కూలీకి ఇచ్చే భత్యం కంటే ఆడకూలీకిచ్చే మొత్తం ఇప్పటికీ తక్కువగా ఉంటోంది. నిజానికి మగవారు చేసే పని కంటే ఆడ వారు చేసే పని పొందికగా, నాణ్యతతో, అధిక ఉత్పాదకతతో ఉంటుందని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. అన్ని రంగా లలో మహిళల భాగస్వామ్యాన్ని గణనీయంగా పెంచడం ద్వారా సింగపూర్ ఆర్థికాభివృద్ధిలో ఎంతో ముందంజ వేసింది. కాగా, మన దేశంలో ఎటువంటి జీత భత్యాలు లభించని ఇంటి పనుల్లో పనిచేసే ఆడవారి సంఖ్య మగవారి కంటే మూడు నుంచి పది రెట్లు ఎక్కువ అని తేలింది.రాజకీయ విజయందేశ మహిళలకు స్థానిక సంస్థలలో గత కొన్నేళ్లల్లో రాజకీయ భాగస్వామ్యం పెరగటం వారు సాధించిన అతి గొప్ప విజయంగా పరిగణించాలి. మెజారిటీ రాష్ట్రాలు మహిళలకు స్థానిక సంస్థలలో 50 శాతం మేర రిజర్వేషన్లు అందిస్తున్నాయి. దీనివల్ల మొత్తం స్థానిక సంస్థలలో 14 లక్షల మహిళా ప్రజా ప్రతినిధులు భాగస్వాముల య్యారు. మరికొన్నేళ్లలో అసెంబ్లీ, పార్లమెంట్లలో సైతం మహిళ లకు 33% సీట్లు లభించనున్నాయి. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగంగా మహిళల భాగ స్వామ్యం అన్ని రంగాలలో ఉండాలంటే అందుకు నిర్మాణాత్మకమైన ప్రణాళికతో పాటు కార్యాచరణ అవసరం. ప్రధానంగా మహిళలకు నాణ్యమైన విద్య, సాంకేతిక నైపుణ్యాలు అందించాలి. స్కాలర్ షిప్‌లు, మెంటార్షిప్లతో వారికి ప్రోత్సాహం కల్పించాలి. స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా కార్యక్రమాలలో వారిని పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలి. గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధికి పొదుపు సంఘాలను మరింతగా ప్రోత్సహించాలి. మహిళా ఆంట్రప్రెన్యూర్సును తయారు చేయడానికి అవసరమైన బ్యాంకు రుణాలు, మార్కెట్ లింకేజీలు, ఇంక్యుబేషన్లు వంటివి అందించ గలగాలి. పాఠశాలలు, కాలేజీలు, పనిచేసే ప్రాంతాలలో మహిళలకు పూర్తి భద్రత కల్పించాలి. ప్రసిద్ధ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ చెప్పినట్లు – ప్రతి మహిళ తెలివితేటలను, సామర్థ్యాలను ఆర్థిక వనరుగా తీర్చిదిద్ది దేశ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానం చేయాలి. అప్పుడే భారతదేశం ఎదురుచూస్తున్న 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ ముందుగానే సాకారం అవుతుంది.-వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, ఏపీ శాసన పరిషత్ సభ్యులు-డా‘‘ ఉమ్మారెడ్డివెంకటేశ్వర్లు -
International Women's Day 2026 క్రీస్తు నందున్న స్త్రీ సాధికారత
‘ఇప్పుడైతే క్రీస్తునందు’ అన్న దృష్టికోణంలో నుండి చూడగలిగితే అన్నీ సానుకూలంగానే దర్శనమిస్తాయి. బైబిలు గ్రంథం స్త్రీని చిన్నచూపు చూసింది. స్త్రీని తక్కువ చేసి మాట్లాడింది వంటివి కూడా అర్ధరహిత వ్యాఖ్యలే. ఆదామువలె స్త్రీ కూడా దేవుని సృష్టి. దేవుడు ఆమెను తన స్వహస్తాలతోనే నిర్మించాడు. సాటియైన సహాయం అన్న కీర్తి ఆమె సొంతం. ఈ మాట దేవుడే చెప్పాడు.సమానత్వం అనేది అది నుండి ఇప్పటి వరకూ ఉంది. అది విజయవంతంగా కొనసాగుతూనే ఉంది. చూసే దృష్టిలోనే అంతా ఉంది. ఆ లోపం చూసే విధానపు తీరుదే. అసాధారణ ఆధ్యాత్మిక భావజాలం అలవరచుకుంటే అన్నీ అనుకూలమే. దేవుని పట్ల భయంతో ఇట్టివారే స్త్రీని గౌరవిస్తారు. ఉత్సాహ, ప్రోత్సాహాలతో ఆమెను అందలం ఎక్కిస్తారు. మమ్మల్ని పూజించకున్నా... దయచేసి గుర్తించి గౌరవించండి మాకు అదే చాలు అన్న వేడుకోలు యవ్వన స్త్రీలది. రోజు రోజుకు ఇలాంటి విషమ పరిస్థితులు నేటి సమాజంలో నెలకొంటున్నాయి. నేటి పురుష జన్మ వైవిధ్యం ఏమంటే, తల్లిగా దయతలచి ఒక స్త్రీ పెట్టిన భిక్షే అతనికి ఈ జన్మ. తమదైన పురుషజన్మ స్త్రీ నుండే, స్త్రీకి మరో జన్మ అను మరణకర సంకట స్థితి నుండే ఈ నా జన్మ అన్న సత్యం ఎరిగిన పురుషోత్తములే దేవునికి ఎప్పుడూ భయపడుతూ మెరుగైన సమాజం కోసం కృషి చేస్తారు. స్త్రీ శిశు సంక్షేమాన్ని కోరేవారంతా సమాజ ఉద్ధారకులే.చిన్న కుటుంబమైనా.. పెద్దదైన ఉమ్మడి కుటుంబమైనా... అందులోని వారంతా చేతులెత్తి మొక్కే విధంగా స్త్రీ సాధికారతను బైబిలు అద్భుతంగా వివరించింది (సామెతలు 31:10–31). తనలోని నైపుణ్యాన్ని గుర్తించి దానికి నిత్యం సానపెడుతూ శ్రమించే స్త్రీ విజయపథాన ఊరేగుతుంది అంటుంది బైబిలు. స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకు శిరస్సు దేవుడు. శిరస్సు అంటే ఏలుబడి లేదా పరి΄ాలన. ఇది దేవుని నియమం. భర్తను మినహాయించి యావత్తూ కుటుంబాన్ని ఆమె ఏలుతుంది.స్త్రీ వినయ విధేయతలు, మరీ ముఖ్యంగా ఆమె వినమ్రత తగ్గింపు, అణుకువ వంటివి ఆకట్టుకొని ఎవరినైనా ఇట్టే కట్టిపడేస్తాయి. ఈ వినయ సంపన్నతతోనే యేసు ‘నన్ను ఎలా మంచివాడు అంటున్నావు? మంచివాడు, సత్పురుషుడు, సద్బోధకుడు ఒక్కడే. ఆయనే దేవుడు’ అంటూ తగ్గించుకోవడం చూస్తే స్త్రీలకు ఇది గొప్ప ్ర΄ోత్సాహకరమే. ఎప్పుడూ హెచ్చించుకోక తగ్గింపు స్వభావంతో క్రీస్తు తనకు శిరస్సైన దేవుని మెప్పించడం మాదిరిగానే స్త్రీలు కూడా తమ స్వపురుషులను మెప్పించవచ్చు.– జేతమ్ -
వేదకాలం నుంచి నేటి కాలం వరకు.. విదుషీమణులు
ప్రాచీన కాలంలో, అంటే క్రీ.పూ.3000 సంవత్సరాల ముందు కాలం నుండీ కూడా మన దేశం ‘స్త్రీ విద్య’ ను ప్రోత్సహించి, గౌరవించింది. ఆనాటి నుండీ స్త్రీలు లౌకిక, అలౌకిక విద్యలలో పురుషులతో సమానంగా నిలుస్తున్నారు. వేదకాలంలోనే మహిళలు ఉపనయన సంస్కారాలు పొంది, వేదాధ్యయనం చేశారు. వేద మంత్రాలు దర్శించారు. తపస్వినులు, ఆధ్యాత్మికవేత్తలైన స్త్రీలను ‘ఋషికలు’ అంటారు. రోమశ, గార్గి వాచక్నవి, విశ్వవర, ఆత్రేయి, లోపాముద్ర, ఇంద్రాణి, మైత్రేయి, అపాల, యామి, పౌలోమి, ఘోష, ఖోన, జుహు, వాగంభ్రణి, సావిత్రి, దేవజామి, కక్షివతి, దక్షిణ ప్రజాపత్య, విశ్వావతి, పశుక్రపత్ని, దేవసూని, శాశ్వతి, అంగీరసి, శ్రీ లక్ష్మి, నోధ, శిఖతన్వరి, గౌపాయన, ఉభయభారతి, విజ్జిక, కామాక్షి వంటి స్త్రీలందరూ ఋషికలే. గృహజీవనానికి స్త్రీయే పునాది అని ఋగ్వేదం చెప్పింది. శక్తిస్వరూపిణి అయిన స్త్రీని గౌరవించి, ఆరాధించే సంస్కృతి మనది. పరబ్రహ్మలోని స్త్రీ పరమైన గుణాలు, శక్తులు కలిసి ‘స్త్రీ దేవతలు’ అవతరించారు. వారి గురించి తెలుసుకుందాం. లోపాముద్ర: అగస్త్య మహర్షి భార్య లోపాముద్ర సంస్కృత, తమిళ భాషలలో నిష్ణాతురాలు. లోపాముద్ర అంటే తనలో తానే లీనమైన ఆత్మనిష్ఠాపరురాలు అని అర్థం. అగస్త్యునికి, లోపాముద్రకు మధ్య జరిగిన సంవాదం, లోపాముద్ర పాండిత్యం, గెలుపును ఋగ్వేదం ప్రశంసించింది. అగస్త్యుడు, లోపాముద్ర సాహచర్యంలో సంవాదాలలో భౌతిక, ఆధ్యాత్మిక జీవితంలోని పవిత్రతను, పూర్ణత్వాన్ని గ్రహించాడని చెబుతారు.ఘోష: ఆమె దుర్గతమసుని మనుమరాలు. కక్షివంతుని కూతురు. దేవ వైద్యులైన అశ్వనీ కు మారులను స్తుతిస్తూ ఆ తండ్రీ కుమా రులు అనేక శ్లోకాలు రచించారు. పదవ ప్రకరణంలోని కొన్ని శ్లోకాలను తండ్రి, తాతగార్లతో సమానంగా ఘోష రచించింది. వాటిలోని ఒక శ్లోకంలో ఆమె అశ్వినులను వివాహం చేసుకోవాలనే ఆకాంక్షను వెల్లడిస్తుంది. కుష్ఠువ్యాధిచే కురూపి అయిన ఆమెను అశ్వనీ దే వతలు తమ వైద్యంతో ఆరోగ్యవంతు రాలిని, అందగత్తెను చేసి పెండ్లి చేసు కొంటారు.ఋగ్వేద మంత్ర ద్రష్ట మైత్రేయి: గొప్ప తాత్వికురాలు, ఋషిక అయిన మైత్రేయి కూడా ఋగ్వేద మంత్రాలను దర్శించింది. ఆమె తన భర్త అయిన యాజ్ఞవల్క్యుని వ్యక్తిత్వ, ఆధ్యాత్మిక ఆలోచనలను పరిణితి చెంచేలా చేయడంలో ప్రధానపాత్ర వహించింది. యాజ్ఞవల్క్యునికి కాత్యాయని అనే రెండవ భార్య కూడా ఉంది. ధర్మశాస్త్రాలు, వేదాలు బాగా చదివి, బ్రహ్మవాదినిగా మైత్రేయి ఘనత వహిస్తే, కాత్యాయని ఒక సాధారణ ఇల్లాలిగానే ఉండింది. ప్రాపంచిక చింతనలు విడిచి, సన్యాసికి అనువైన స్వీయ నియంత్రణ, సన్యాసి ప్రతిజ్ఞా పాలన చేయదలచి యాజ్ఞవల్క్యుడు ఒకరోజు తన ప్రాపంచిక ఆస్తిపాస్తులను తన ఇద్దరు భార్యలకు పంచదలిచాడు. ప్రపంచ సంపద తనకు శాశ్వతత్వాన్ని, ముక్తిని ఇవ్వలేదని భావించి మైత్రేయి తన భర్త నుండి కేవలం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ముముక్షత్వానికి కావలసిన శిక్షణను కోరుకొని మరీ పొందింది.బ్రహ్మజ్ఞాని గార్గి: వాచక్న మహర్షి కూతురు, వైదిక ప్రవక్త గార్గి. మానవ అస్తిత్వానికి, ఉనికికి, జీవితానికి మూలమేమిటి అనే అంశంపై గార్గి అనేక వేదమంత్రాలను దర్శించింది. ఎందరో వేదాంత వేత్తలను వాదంలో గెలిచిన యాజ్ఞవల్క్యునికి ఆత్మానాత్మల విచారం గురించి, బ్రహ్మ జ్ఞానం గురించి అనేక ప్రశ్నలను సంధించి గార్గి ఆయనను ముప్పుతిప్పలు పెట్టింది. గొప్ప విజ్ఞాని ఉభయభారతి: మధ్యయుగంలో తత్వవేత్త, మీమాంస, అద్వైత దర్శనాలలో ప్రవీణుడైన మండనమిశ్రుని భార్య అయిన ఉభయభారతి ఒక గొప్ప విజ్ఞాని. శ్రీ ఆదిశంకరాచార్యులకు, మండనమిశ్రునికి మధ్య జరిగిన అద్వైత సిద్ధాంత సంబంధిత వాదోపవాదాలకు ఆమె న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. పక్షపాత రహితంగా ఆ వాదనలలో తన భర్తను కాక, ఆదిశంకరులనే విజేతగా ప్రకటించిన విదుషీమణి ఆమె.ఆళ్వార్ ఆండాళ్: ఇంకా ఆ యుగంలో ‘తిరుప్పావై’ అనే భక్తి గీతాలను వ్రాసిన మొదటి మహిళా ఆళ్వార్ అండాళ్. స్త్రీ స్వేచ్ఛ, వ్యక్తిత్వంపై కవితలు వ్రాసిన కర్నాటకలోని శివ భక్తురాలు అక్క మహాదేవి. రాజస్థాన్ లోని కృష్ణ భక్తురాలు, సాంఘిక దురాచారాలను ప్రతిఘటించిన కవయిత్రి మీరాబాయి, సరళ భాషలో వేదాంతపరమైన నిగూఢార్థాలు చాటిచెప్పిన తత్వవేత్త లాలాదేవి, గ్రామీణుల సాధారణ జ్ఞానాన్ని వేదాంత విజ్ఞానంతో అనుసంధిస్తూ రచనలు చేసిన తమిళ కవయిత్రి అవ్వయ్యార్, ఇంకా సక్కుబాయి, ముక్తాబాయి, మదాలస, ఈ మధ్యకాలంలో తరిగొండ వెంగమాంబ, ఆదోని లక్షమ్మ, జిల్లెళ్ళమూడి అనసూయమ్మ మొదలైన యోగినులు, అంతర్బుద్ధి సిద్ధులైన మహిళలు ఎందరో ఉన్నారు.విజ్జిక: దండి మహాకవి తన ఒక రచనలో సరస్వతీ దేవిని తెలుపు దేహరంగు చ్ఛాయ కలదిగా వర్ణించాడు. విజయాంబిక (విజ్జిక) అనే కవయిత్రి నలుపురంగుతో ఉండేది. ఆమె దండి అభిప్రాయాన్ని ప్రతిఘటించింది. నల్లని దేహకాంతిగల అపర సరస్వతినైన నా గురించి తెలుసుకోకుండా సరస్వతి ధవళవర్ణిని అని దండికవి ఎలా అంటాడని ఆమె ప్రశ్నించింది. స్త్రీల ఆత్మవిశ్వాసానికి విజ్జిక ఒక ప్రతీక. ఇంకా గంగాదేవి, తాళ్ళపాక తిమ్మక్క, మొల్ల వంటి కవయిత్రులు రసవత్తర కావ్యాలు వెలువరించి పురుషులతో సమానంగా నిలిచినవారే.ఆధ్యాత్మిక వేత్త గౌతమి: బౌద్ధయుగంలో గౌతమ బుద్ధుని పెంపుడు తల్లి అయిన మహా ప్రజావతి గౌతమి ఒక ఆధ్యాత్మికవేత్త. ఆమె కాక బౌద్ధ వేదాంత ధ్యాన సన్యాసినులు ఖేమ, ఉప్పలావన, రెండవ భాస్కరుని కూతురైన లీలావతి వంటి ఆధ్యాత్మిక వేత్తలైన స్త్రీలుండేవారు. – డాక్టర్ గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి -
చీకటి – వెలుగులు
సాఫ్ట్వేర్ రంగంలో ‘నైట్ డ్యూటీ’ అనే మాట వింటూనే ఉంటాం. బతుకు పోరాటంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రోడ్లను ఊడ్చే మహిళా స్వీపర్లూ రాత్రిపూటే విధులను నిర్వర్తిస్తుంటారు. సికింద్రాబాద్‌లోని రేతిఫైల్ బస్ స్టేషన్ పరిసరాలలో రాత్రి రెండు గంటల సమయంలో రోడ్లను ఊడుస్తూ కనిపించింది కంతి రాణి. కాసేపు ఆమెతో మాట కలిపితే ఒంటిచేత్తో బతుకుబండిని ఎలా లాక్కొస్తుందో ఇలా మన ముందు ఆవిష్కరించింది..‘‘కష్టాలు వచ్చాయని ఆగిపోతమా? చావో బతుకో తేల్చుకోవాలి. రాత్రిపూట రోడ్లమీద పని అంటే మాకు భయమే ఉంటుంది. కానీ, బతుకు భయం అంతకన్నా పెద్దది. అందుకే, ధైర్యంగానే ఈ పని చేస్తుంటాం. రాత్రి ఏడు గంటలకు డ్యూటీలో చేరితే, మళ్లా తెల్లారి ఐదున్నర అయితది డ్యూటీ దిగేసరికి. ఇంటికి చేరేసరికి ఏడు గంటలు. రాత్రంగా రోడ్లు ఊడ్చి ఊడ్చి దుమ్ము కొట్టుకుపోయి ఉంటాం. అందుకని, ముందుగా స్నానం చేసి, ఇంటి పనులు చేసుకొని, ఇంట్ల వాళ్లకు ఇంత వండిæపెట్టి, నేను తిని, పగటేల పన్నెండు గంటలకు పడుకుంట. మళ్లా సాయంకాలం ఐదు గంటలకు లేచి, పనులు చేసుకొని, ఏడు గంటలకు డ్యూటీకి పోత. పదహారేళ్లుగా ఇదే నా పని.. ఒంటి చేతి కష్టమే!మా ఊరు జనగాం దగ్గర వెలిగొండ. చిన్నతనంలోనే మా అమ్మనాయన నాకు పెండ్లి చేశారు. మా అమ్మనాయనకు ముగ్గురు ఆడపిల్లలం, ఓ మగపిల్లాడు. నా భర్త పేరు జక్రయ్య. మా నాయిన సొంత అక్క కొడుకు. చిన్నప్పుడు బావిలో పడి, ఓ కాలు పనిచేయదు. ‘కాలు సరిగా పనిచేయని వాడిని ఎవరూ పెండ్లి చేసుకోరు’ అని నన్ను ఇచ్చి పెళ్లి చేసిండు మా నాయిన. నా పెళ్లి నాటికి నాకు పదిహేనేండ్లు కూడా లేవు. ఊళ్లో కొన్నాళ్లు ఉన్నం. ఇద్దరు ఆడపిల్లలు పుట్టిండ్రు. బతుకుదెరువు కష్టమైతే హైదరాబాద్ వచ్చినం. మొదట హౌజింగ్ బోర్డ్ ఏరియా లో ఉండేవాళ్లం. అక్కడే ఉప్పర్ పనికి పోయిన, ఇండ్లల్ల పనిచేసిన. మా ఆయన పనికెళితే, పడిపోయేటోడు. దీంతో నేనే ఆయన్ని ఇంట్లో ఉంచి, పిల్లలను స్కూల్‌కు పంపించి, పనికి పోయేదాన్ని. ఆ తర్వాత తెలిసినవాళ్ల ద్వారా స్వీపర్ పనిలో చేరిన. అప్పుడు యాప్రాల్‌లోని బాలాజీ నగర్‌కి వచ్చి, ఇల్లు తీసుకొని ఉన్నం. పిల్లలను పదోతరగతి వరకు చదివించిన. ఆ తర్వాత పెండ్లిండ్లు చేసిన. అన్నీ ఒంటి చేత్తోనే. కలిగిన దాంట్లో సాయం...మా అక్కచెల్లెళ్ల లో ఒక చెల్లెలికి, భర్త చనిపోయి మస్తు కష్టపడుతుంది. తమ్మునికి ముగ్గురు ఆడపిల్లలు. తమ్ముడికి ఆరోగ్యం బాలేక చనిపోయాడు. దీంతో మా మరదలు పిల్లలను పెంచడానికి మా లెక్కనే కష్టపడుతుంటది. అందుకని నాకు కలిగినదాంట్లో వాళ్లకు సాయం చేస్తుంటాను. పిల్లల పెండ్లిండ్లకు అప్పు అయ్యింది, మెల్లగా తీర్చుకుంటున్న. పండగలొస్తే మహా కష్టం..బోనాలు, వినాయక చవితి, జెండా పండగల సమయాలలో, పెద్ద పెద్ద సభలు జరిగినప్పుడు .. చాలా పని ఉంటది. ఎంతంటే... మాపని ఘోరం అని చెప్పచ్చు. గుడుల దగ్గర, స్టేషన్, ట్యాంక్‌బండ్.. వేరే వేరే చోట్లల్లా డ్యూటీ ఉంటుంది. ఆ రోజుల్లో చెత్త చానా ఎక్కువ ఉంటుంది. ఊడ్చి ఊడ్చి చేయి రెక్కలు బాగా నొప్పి పెడతాయి. ప్రాణాలు అరచేతిలోనే..యాక్సిడెంట్లు అవుతుంటాయి. అర్థరాత్రి దాటిందంటే ట్రాఫిక్ ఉండదు కదా! బండ్లు, వ్యానులు మస్తు స్పీడ్‌గా పోతుంటయి. ఆ సమయంలో రోడ్డు దాటుతుండగా, ఊడుస్తుండగా యాక్సిడెంట్లు అయినయి. మా గ్రూప్‌లోనే నలుగురైదుగురు చనిపోయారు. పానాలు అరచేతిలో పెట్టుకొని పనులు చేస్తుంటాం. ఇది కాకుండా తాగినోళ్లు ఉంటారు. తాగి, రోడ్డు పక్కనే పడిపోయిన వాళ్లు ఉంటారు. వాళ్లను జరగమంటే.. ఆ మత్తులో గలీజు మాటలు అనేటోళ్లు ఉంటారు. తిడుతుంటరు. మీద మీదకు వస్తుంటరు. పోలీసులు ఉంటారు. కానీ, రోజూ వాళ్లకు ఎన్నని చెబుతం. అందుకే, అలాంటోళ్ల నుంచి దూరంగా ఉంటూ మా పని మేం చేసుకుంటూ పోతుంటం. బతుకుదెరువు కోసం తప్పదు, అన్నీ భరిస్తాం. మా గ్రూప్‌లో పదిహేను మంది దాకా ఉంటాం. అందరివీ సమస్యలే. నెలకు నాలుగు రోజులు సెలవులు ఉంటాయి. అంతకు మించి ఒక్కరోజు సెలవు తీసుకున్నా జీతం కట్ అవుతది. నెలంతా ఊడ్చితే పదివేల రూపాయల దాకా వస్తాయి. అందులోనే అన్నీ సర్దుకుంటాం. ఇప్పుడంటే నా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. చిన్న చిన్న పిల్లలున్న తల్లుల కష్టం ఇంకా పెద్దది.ఒకరికి ఒకరం... మా గ్రూప్ వాళ్లం కలిసినప్పుడు ఒకరి కష్టాలు ఒకరం చెప్పుకుంటాం. కానీ, ఎవరి కష్టాలు వారివే. ఊడ్చి ఊడ్చి మెడలు గుంజుతాయి. మళ్లీ ఇంటికొచ్చి పనులు చేసుకోవాలి. ఈ పనిలో చేరిన కొత్తలో చేతనైంత కాలం పని చేసుకోవచ్చు అన్నారు. కానీ, అరవై ఏళ్లు దాటినవాళ్లు పని నుంచి దిగిపోయారు. వాళ్లకు పెన్షన్ ఏమీ లేదు. కానీ, వాళ్ల ఇంట్ల బిడ్డకో, కొడుకుకో మళ్లీ స్వీపర్ పని ఇస్తరు’ అంటూ రాత్రిళ్లు రోడ్లు ఊడ్చే పనుల్లోని చీకట్లను, బతుకులో నింపుకుంటున్న వెలుగును పంచుకుంది రాణి. – నిర్మలారెడ్డి, సాక్షి పీచర్స్ ప్రతినిధి -
సువర్ణ రేఖలు!
సామాన్యుల్లా కనిపిస్తారు గాని అసామాన్య స్త్రీలు వారు. రాక్షస సంహారం చేయరు గాని జీవితంలో ఎదురైన సమస్యల పెను భూతాన్ని తుదముట్టిస్తారు. ఎనిమిది చేతులుండవు గాని ఇంటి పని, పిల్లల పని, చిన్న ఉద్యోగం, అతి చిన్న ఉపాధి... అవలీలగా చేసి బతుకును నిలబెట్టుకుంటారు. గుంపులో ఒకరుగా కనిపిస్తారుగాని వారి పోరాట బలానికి ఎదురు నిలవాలంటే ఒక దేశ సైన్యం సరిపోదు.ఎల్లమ్మ, మల్లమ్మ, లక్ష్మి, సుజాత, మేరి, మస్తానమ్మ... మామూలు పేర్లుగా కనిపిస్తాయి గాని వీరంతా పిడుగుల దారుల్లో వడగండ్ల దాడుల్లో సాగుతున్న తెగువ చిరునామాలు. ఎవ్వరి తోడు లేకపోయినా వీరు ముందుకు నడుస్తారు. ఓడించాలని చూసే కొద్దీ గెలుస్తూ ఉంటారు. కష్టాలను లెక్క చేయరు. బాధల్లో కూడా నవ్వడం మానరు. మన ఇరుగూ పొరుగే ఉంటారు. కాని ఝాన్సీ లక్ష్మీబాయిని మించి ఉంటారు. కామన్ విమెన్ అన్ కామన్ జీవన పోరాటాలను తెలుసుకుందాం రండి.బిడ్డలకు ప్రోత్సాహమిస్తే చక్కగా ఎదుగుతారనే నమ్మకమే ఆమె బలం.. బలగం. చదువు, ఉద్యోగం, సొంత ఇల్లు, కుటుంబ అండ ఏమీ లేకున్నా... ఒంటరిగా ఐదుగురు కూతుళ్లను పోషిస్తూ, వారిని చేతనైనంతగా చదివిస్తోంది హైదరాబాద్ లాలాగూడలో ఉంటున్న సువర్ణ. భర్త మద్యానికి బానిసై ఎప్పుడో చనిపోయాడు. ఆదుకునే వారెవరూ లేకున్నా... పాచిపనిచేస్తూ, రెక్కల కష్టంతో సంసారాన్ని లాక్కొస్తోంది. కొండంత ఆత్మవిశ్వాసంతో జీవన పోరాటం చేస్తున్న సువర్ణను పలకరిస్తే.. ‘ మంచిగ సదువుకుంటేనే పిల్లలకు మంచి భవిష్యత్తు. అందుకే, ఎంత కష్టమైనా భరిస్తనమ్మ’ అని చెప్పింది... 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ సువర్ణ పాఠాలకు శ్రీకారం.‘‘నా అసలు పేరు సుహాసిని. పెళ్లయ్యాక సువర్ణ అని మార్చారు. ఇంకో రెండేళ్లు దాటితే నలభై ఏళ్లు వస్తాయి. మా చుట్టుపక్కల వాళ్లు ‘పిల్లల్ని కూడా పనిలో పెట్టరాదూ... ఎందుకంత కష్టపడతావు’ అని చెబుతుంటారు. కానీ, నాలాగా ఇళ్లలో పనులు చేసుకుంటే ఈ రోజు రూపాయి సంపాదించుకుంటారేమో... కానీ, చదువుకుంటే రేపు పది రూపాయలు సంపాదించుకుంటరు. అంతేకాదు, బయట ఎట్ల బతకాలో తెలుసుకుంటరు. మంచిగ బతుకతరు. అందుకే ‘కష్టమైనా పర్లేదు, నేనే ఇంకో నాలుగిండ్లలో పనిచేసి, బిడ్డల్ని చదివిస్తా’ అని చెబుతుంటా. ఐదుగురు కూతుళ్లలో పెద్దమ్మాయి పెండ్లి చేసిన. మిగతా నలుగురిలో ఇద్దరు ఇంటర్మీడియెట్, మరో ఇద్దరు స్కూల్లో చదువుకుంటున్నరు.ఎవరి అండా లేదు...నా చిన్నప్పుడే అమ్మానాయినలు చనిపోయారు. మా తాతనే నన్ను, మా చెల్లెల్ని సాదిండు. మా ఊరు తెలంగాణలోని గజ్వేల దగ్గర ధవలాపురం. అమ్మనాన్నలు లేరని హాస్టల్లో పెడితే ఐదవ తరగతి వరకు చదువుకున్నాం. ఆ తర్వాత మళ్లా తాత దగ్గరకు వచ్చేసినం. అప్పటినుంచి ఊళ్లనే. తాత ఏదో చేతనైన పని ఏదో చేసేవాడు. పదిహేనేళ్ల వయసులో మా ఊరి అబ్బాయితోనే పెళ్లయ్యింది. హైదరాబాద్‌కు వచ్చి, ఓ రూమ్ అద్దెకు తీసుకుని బతుకుతుండేవాళ్లం. కూతురు పుట్టిన రెండేళ్లకు అత్తింటివాళ్లతో గొడవలయ్యాయి. అవి పెద్దగై విడిపోవాల్సి వచ్చింది. ఎట్ల బతకాలో అర్థం కాలేదు. ఇళ్లలో పనికి కుదిరా. నా భర్త మరో పెళ్లి చేసుకున్నాడని తెలిసి, బాధతో కిరోసిన్ పోసుకుని, నిప్పు పెట్టుకున్న. గాంధీ ఆసుపత్రిలో నెల రోజుల పాటు చికిత్స కోసం ఉన్నా. బిడ్డ మొఖం చూసి, బతకాలని నిర్ణయించుకున్న. తిరిగి ఇళ్లలో పనిచేసుకుంటూ, బిడ్డను సాదుకుంటూ ఉండేదాన్ని. ఆ తర్వాత ఇంకో పెళ్లి చేసుకుంటే మంచిదని, మా కాలనీ వాళ్లే చెప్పడంతో మా దోస్త్ బంధువుతో రెండో పెళ్లి చేసుకున్న. మొదట జీవితం సాఫీగానే సాగిపోయింది. కానీ తర్వాత కొట్టడం, హింసించడం చేసేవాడు. తాగీతాగీ చనిపోయాడు.కష్టాలే మార్చాయి...పెద్ద బిడ్డ గర్భవతిగా ఉందని తెలిసి, డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లా. ‘గుండెకు రంధ్రం ఉంది, పిల్లలు పుడితే ఆమె బతకదు’ అన్నారు. చూస్తూ చూస్తూ బిడ్డను అలా వదిలేయలేక, గుండె ఆపరేషన్ చేయించిన. ఉండటానికి సొంత ఇల్లు లేదు. ఆఫీసుల చుట్టూ తిరగగా తిరగగా మొన్నటి నెలనే రేషన్ కార్డు వచ్చింది. వితంతు పింఛను లేదు. ఏ ఆస్తులూ లేవు. కానీ, పిల్లలు నా కష్టాన్ని అర్ధం చేసుకున్నరు. మంచిగ చదువుకుంటున్నరు. నా పిల్లలకు నేను అండ. పిల్లలు నాకు ఆసర అవుతున్నరు. రెక్కల కష్టమ్మీదనే బిడ్డలను సాకుతున్నాను అని, తెలిసినవాళ్లు ‘ఎన్నాళ్లు ఇట్లా కష్టపడతావు..’ అంటుంటారు. నా చిన్నప్పుడు అలాగే హాస్టల్లో ఉండి చదువుకునుంటే, ఏదైనా ఉద్యోగం చేసుకుని బతికేదాన్ని. కానీ, అప్పడు అమ్మనాన్నలేక, పరిస్థితులు బాగోలేక చదువుకోలేకపోయిన. నాలాగా నా పిల్లలు పనిమనుషులు కావద్దు. వాళ్ల జీవితాలు బాగుపడితే నా అన్ని కష్టాలూ చిన్నవే అయిపోతాయి’’ అని వివరించింది సువర్ణ కూతుళ్లను దగ్గరకు తీసుకుంటూ. అచంచలమైన ఆమె ఆత్మవిశ్వాసానికి చేతులెత్తి మొక్కాలనిపించింది. సారా ముంచింది...పిల్లలంతా ఏడాది, రెండేళ్ల తేడాతో పుట్టారు. కొడుకు కావాలని, ఆపరేషన్ చేయించుకోవద్దని బెదిరింపులు, చేయిచేసుకోవడం... సారాకు అలవాటు పడిన ఆయన పైసా సంపాదించకపోగా నా దగ్గరే పైసలు తీసుకునెటోడు. రోజంతా తాగుతూ పిల్లలను కూడ చూసుకునేవాడు కాదు. తాత చూస్తే బాగా ముసలాయన అయిపోయాడు. అప్పటికే చెల్లెలు పెళ్లయి వెళ్లిపోయింది. అయినా పిల్లలను తాత దగ్గరే వదిలేసి, పనికి పోయేదాన్ని. మా చిన్న బిడ్డ ఐదో ఏటన మా ఆయన చనిపోయాడు. ఇప్పటికి ఎనిమిదేళ్లు అయ్యాయి. ఆ తర్వాత తాత కూడా చనిపోయాడు. పిల్లలను స్కూల్లో వేసి, ఇళ్లలో పనిచేస్తూ ఇన్నేళ్లుగా గడుపుతున్నాను.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
పరిశోధనల్లో దారి దీపాలు
‘ఈసురోమని మనుషులుంటే ఇస్రో వరకు వెళ్లగలమా!’ అనేది సరదా పేరడీ అయితే కావచ్చుగానీ... అక్షరాలా నిజం.సైన్స్‌లో ‘రాణించాలంటే ఆసక్తి అనే శక్తి ఉండాలి. ఆ శక్తికి ఉత్సాహశక్తితోడైతే ‘అన్వేషణ’ అనే భవన నిర్మాణం జరుగుతుంది.ఆ భవనంలో ఎన్నో పరిశోధన చిత్రాలను ఆవిష్కరించారు మన మహిళా శాస్త్రవేత్తలు. ‘సైన్స్ అనేది పురుషుల రంగం’ అనే మాటకుకాలం చెల్లిందని తమ ప్రతిభ ద్వారా చెప్పకనే చెబుతున్నారు. సైన్స్ సామ్రాజ్యంలో సగర్వంగా విజయ పతాకం ఎగరేస్తున్నారు...శాస్త్రరంగంలో ‘షా’జీఆదిత్య ఎల్ 1 విజయవంతంగా ప్రారంభించిన తరువాత అక్కడి మిషన్ కంట్రోల్ సెంటర్ పోడియం దగ్గర నిలబడి ‘ఒక ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్‌కు సంబంధించిన కల నిజమైంది’ అన్నారు ఆదిత్య ఎల్ 1 ప్రాజెక్ట్ డైరెక్టర్ నిగర్ షాజీ. ‘కల నిజమైంది’ అనుకోవడం ఆమెకు ఇదే మొదటిసారి కాదు. తొలిసారిగా ఇంజినీరింగ్ కాలేజీలోకి అడుగుపెట్టినప్పుడు, ఇస్రోలోకి అడుగు పెట్టినప్పుడు ‘నా కల నిజమైంది’ అనుకున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కలలు కంటూ వాటిని సాకారం చేసుకుంటూ వస్తున్నారు. 1987లో షాజీ ఇస్రోలోకి అడుగు పెట్టారు. ‘వీనస్ మిషన్’కు అధ్యయన డైరెక్టర్‌గా, రిసోర్సెస్–2 ఏకి అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేయడంతో పాటు ఎన్నో ఉపగ్రహ కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు. భారతదేశపు మొట్టమొదటి సౌరమిషన్ ‘ఆత్య–ఎల్1’కి ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా సేవలందించడం ఆమె కెరీర్లో మైలు రాయి. శాస్త్ర రంగంలో దశాబ్దాల అనుభవం ఉన్న షాజీ ఇమేజ్ కంప్రెషన్, సిస్టమ్ ఇంజినీరింగ్‌లపై రచనలు చేశారు.ఆకాశదేశాన...చిన్నతనంలో అన్నపూర్ణి ఆకాశంలోని నక్షత్రాలను ఆసక్తిగా చూసేవారు. నక్షత్రాలు, ఖగోళ విషయాలపై అమితాసక్తి ఆమెను ఎక్కడి వరకు తీసుకు వెళ్లిందంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ డైరెక్టర్‌గా పనిచేసేవరకు.‘సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్‌ల గురించి చాలా మంది పిల్లలు భయపడతారు. ముందు ఆ భయాలను వదిలి వేయండి. నిస్సంకోచంగా, నిర్భయంగా వాటిని అధిగమించి దగ్గరకు వచ్చేయండి. ఆ తరువాత అవి మీకు ఆత్మీయ నేస్తాలు అవుతాయి’ అంటారు డా.అన్నపూర్ణి సుబ్రమణ్యమ్.సైంటిఫిక్ ఫిలాసఫీకంప్యుటేషనల్ బయాలజీ లో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న శాస్త్రవేత్త సంఘమిత్ర బందోపాధ్యాయ. ఎవల్యూషనరీ కంప్యుటేషన్, మెషిల్ లెర్నింగ్, బయో ఇన్ఫర్మేటిక్స్లో ఆమె పరిశోధనలు చేశారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ఐఎస్ఐ) తొలి మహిళా డైరెక్టర్‌గా పనిచేసిన సంఘమిత్ర ప్రస్తుతం ప్రైమ్ మినిస్టర్స్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్లో పనిచేస్తున్నారు. పాఠశాల రోజుల్లో సంఘమిత్ర జీవశాస్త్రం అంటేనే భయపడేవారు. ఆ తరువాత కాలంలో ఆ భయాన్ని పోగొట్టుకొని ఇష్టాన్ని పెంచుకున్నారు. శాస్త్రరంగంలో అద్భుతాలు సాధిస్తున్నారు. ‘అంకితభావంతో పనిచేసినప్పుడు అద్భుతాలు సాధించవచ్చు’ అనేది ఆమె సైంటిఫిక్ ఫిలాసఫీ. ‘ఇంజినీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్’ విభాగంలో ఇన్ఫోసిస్ ప్రైజ్, శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డ్లు గెల్చుకున్నారు. .....శాస్త్రరంగంలో సత్తాచాటుతున్న మహిళల్లో వీరు కొందరు మాత్రమే. అందరికీ వందనాలు.అప్పుడే మహిళల పురోగతిగౌరవప్రదమైన వాతావరణంలోనే సైన్స్ రంగంలో మహిళల పురోగతి సాధ్యం అవుతుందని నమ్ముతున్నాను. నాయకత్వ సామర్థ్యం, సంస్థాగత సంస్కృతి వ్యక్తిగత అభివృద్ధిని గణనీయంగా ఎలా ప్రభావితం చేస్తాయో స్వయంగా చూశాను. నా పీహెచ్డీ తరువాత పరిశోధనలను విలువైనవిగా భావించినప్పటికీ, శాస్త్రీయ సమాజానికి మద్దతు ఇవ్వడం ద్వారా విస్తృత ప్రభావాన్ని కలిగించవచ్చుని గ్రహించాను. ఐకేపీ నాలెడ్జ్ పార్క్‌లో బయో–ఇంక్యుబేషన్ పర్యావరణ వ్యవస్థను స్థాపించడం, స్కేలింగ్ చేయడం అనేది నా వరకు ఒక మైలురాయిగా మారింది. నా దృష్టిలో ‘సైన్స్‌లో పురోగతి’ అంటే జ్ఞానం నుంచి ఆవిష్కరణల వరకు నా ప్రభావ పరిధిని విస్తరించడం.– డా. ప్రియాంకన ముఖర్జీ, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ అండ్ హెడ్–బయోనెస్ట్, ఐకేపీ నాలెడ్జ్ పార్క్వారి ప్రోత్సాహమే నా బలంసైన్స్ రంగంలో మహిళల ప్రయాణం సంవత్సరాలుగా సాగుతుంది. అద్భుతంగా అభివృద్ధి చెందుతోంది. ఈ పురోగతిలో నేను భాగం అయినందుకు గర్వపడుతున్నాను. మహిళలు శాస్త్రీయరంగంలోకి ఎలా అడుగు పెడుతున్నారు అనేదానికి నిదర్శనమే నా ప్రయాణం. సైన్స్‌లో చాలామంది మహిళల మాదిరిగానే వృత్తిపరమైన, బాధ్యతలను కుటుంబ బాధ్యతలతో సమన్వయం చేసుకున్నాను. మైక్రోబయాలజీలో ఎం.ఎస్సీ. పూర్తి చేసిన తరువాత రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో నా కెరీర్ ప్రారంభించాను. ఇతరులతో కలిసి పనిచేస్తూనే మైక్రోబయాలజీలో పీహెచ్‌డీని విజయవంతంగా పూర్తి చేశాను. శాస్త్రీయ ఆలోచనలను సంస్థలుగా రూపాంతరం చెందేలా చేయడంలో సాయం చేస్తున్నాను.– డాక్టర్ సుధా కళ్యాణి, సీనియర్ మేనేజర్ అండ్ హెడ్, లైఫ్ సైన్స్ ఇంక్యుబేటర్, ఏకేపీ నాలెడ్జ్ పార్క్కాదంబిని గంగూలీకలకత్తా మెడికల్ కాలేజీ (1884)లో ప్రవేశం సాధించిన తొలి భారతీయ మహిళ కాదంబిని. తొలి మహిళా డాక్టర్, ప్రాక్టిషినర్గా చరిత్ర సృష్టించారు.మేరీ పూనెన్ లూకోస్భారతదేశంలో తొలి మహిళా సర్జన్ జనరల్ మేరీ పూనెన్ లూకోస్. మన దేశంలో తొలి మహిళా ప్రసూతి వైద్యురాలు.ఆనందీ బాయి జోషిపాశ్చాత్య వైద్యంలో పట్టా పుచ్చుకున్న తొలి మహిళా వైద్యురాలు ఆనందీ బాయి. బాంబే ప్రెసిడెన్సీ నుండి యూఎస్‌కు వెళ్లి పాశ్చాత్య వైద్యంలో రెండేళ్ల డిగ్రీ చేశారు.జానకీ అమ్మాల్ఎడవలత్ కక్కట్ జానకి అమ్మాల్ ప్రసిద్ధ బోటనిస్ట్. మొక్కల పెంపకం, సైటోజెనెటిక్స్, పైటోజియోగ్రాఫీలో పరిశోధనలు చేశారు. అల్హాబాద్లోని సెంట్రల్ బొటానికల్ లేబొరేటరీ తొలి డైరెక్టర్ (1952)కమలా సోహోనీకమలా సోహోనీ ప్రఖ్యాత జీవ రసాయన శాస్త్రవేత్త. 1939లో శాస్త్రీయ విభాగంలో పీహెచ్డీ చేసిన తొలి మహిళ.అసిమా ఛటర్జీఅసిమా ఛటర్జీ ప్రముఖ సేంద్రియ రసాయన శాస్త్రవేత్త. కలకత్తాలోని ఇండియన్ యూనివర్శిటీ నుండి 1944లో సైన్స్‌లో డాక్టరేట్ పొందిన తొలి మహిళ.కమల్ జయసింగ్ రణదివేకమల్ రణదివే ప్రసిద్ధ బయోమెడికల్ పరిశోధకురాలు. ఇండియన్ ఉమెన్ సైంటిస్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యురాలు. ముంబైలోని ఇండియన్ క్యాన్సర్ రిసెర్చ్ సెంటర్లో తొలిసారిగా టిష్యూ కల్చర్ రిసెర్చ్ ల్యాబ్‌ని ప్రారంభించారు.బీబా చౌదరిభారతదేశంలోని తొలి మహిళా భౌతికశాస్త్రవేత్తలలో బీబా చౌదరి ఒకరు. ఎన్నో విలువైన పరిశోధనలు చేసినప్పటికీ మహిళా శాస్త్రవేత్తగా ఆమెకు రావల్సిన గుర్తింపు రాలేదు.పూర్ణిమా సిన్హాభౌతికశాస్త్రంలో డాక్టరేట్ పొందిన మొదటి బెంగాలీ మహిళలలో పూర్ణిమా సిన్హా ఒకరు. ఎక్స్–రే క్రిస్టలాగ్రఫీ రంగంలో విశేష కృషి చేశారు.అన్నా మణిఅన్నా మణి ప్రఖ్యాత భౌతికశాస్త్రవేత్త, వాతావరణ శాస్త్రవేత్త. భారతవాతావరణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేశారు. పుణేలోని వాతావరణశాస్త్ర విభాగంలో చేరిన తొలి మహిళ. విండ్ ఎనర్జీ ఇన్‌స్ట్రుమెంట్‌కు సంబంధించి విశేష కృషి చేశారు. -
న్యూజెర్సీలో ఘనంగా ‘మాట’ మహిళా దినోత్సవ వేడుకలు
మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి పలు కార్యక్రమాలు చేపడుతున్న మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ - మాట అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. అమెరికాలోని న్యూజెర్సీలో ఉమెన్స్ డే వేడకలను అంగరంగ వైభవంగా నిర్వహించి.. వనితలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని మాట ఉమెన్ కమిటీ మరోసారి రుజువు చేసింది. ప్రముఖ సినీ నటి, ఇంద్రాణి ఫేమ్ అంకితా జాదవ్ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై.. ప్రసంగించారు. సింగర్ దామిని భట్ల, దీప్తి నాగ్ తో పాటు పలువురు ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అంకితా కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన మాట కార్యవర్గాన్ని అభినందించారు. అంకితా జాదవ్ నటించిన ఆల్బమ్ సాంగ్స్ ను ఈ వేదికగా ప్రదర్శించారు. ఈ వేడుకల్లో మహిళామణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కనువిందు చేశారు. ఇక వేదికపై నిర్వహించిన పలు కార్యక్రమాలు మహిళల సంతోషాల మధ్య ఆహ్లదంగా సాగాయి. యువతులు, మహిళల ఆట, పాటలతో.. సంబరాల సంతోషాలు అంబరాన్నంటాయి. అటు సంప్రదాయం.. ఇటు ఆధునికత ఈ రెండింటిని ప్రతిబింబిస్తూ ఎన్నో కార్యక్రమాలతో మహిళలు ఆకట్టుకున్నారు. శాస్త్రీయ నృత్యం, మోడ్రన్ డ్యాన్స్ రెండింటిలో తమకు సాటి లేదని నిరూపించారు.MS మాట కాంపిటీషన్, ఫ్యాషన్ షో, బ్యూటీ పాజెంట్ వంటి అద్భుతమైన ప్రదర్శనలు ఆహుతులను ఆకర్షించాయి. ఈ ప్రదర్శనల్లో మగువలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహిళా శక్తి ఏమిటో నిరూపించారు. అందాల ముద్దుగుమ్మలు హొయలు పోతూ ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేశారు. అందాల పోటీలకు నటి అంకితా జాదవ్ తో పాటు పలువురు ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. MS మాట కాంపిటీషన్ 2025 విజేతకు కిరీటాన్ని బహూకరించారు. పోటీల్లో పాల్గొన్న మగువలకు బెస్ట్ స్మైల్, బెస్ట్ వాక్ వంటి పలు విభాగాల్లో అవార్డులు అందించారు. ఫోటో బూత్, ఇండో వెస్ట్రన్ అవుట్ ఫిట్, ఫన్ ఫీల్డ్ గేమ్స్, రాఫెల్ టికెట్స్ వంటి కార్యక్రమాలు అమితంగా ఆకట్టుకున్నాయి.వేదికపై మగువలు, చిచ్చర పిడుగులు ప్రదర్శించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డ్యాన్స్‌లు, డిజె మ్యూజిక్ కార్యక్రమాలు హోరెత్తించాయి. సంప్రదాయ ఫ్యాషన్ షో, గేమ్స్ తో పాటు ఇతర కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా వెండర్స్ బూత్ ఏర్పాటు చేశారు. మహిళలు షాపింగ్ స్టాల్స్ దగ్గర సందడి చేశారు. తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతిఒక్కరికీ పసందైనా విందుభోజనం అందించారు. ఆహా ఏమి రుచి… తినరా మైమరచి.. అనే మాటను నిజం చేస్తూ ఎంతో రుచికరమైన భోజనాలు అందించారు. స్వీట్స్ నుంచి ఐస్ క్రీమ్ వరకు పలు వైరటీలతో రుచికరమైన వంటకాలు ఏర్పాటు చేశారు. మాట మహిళా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళా ప్రసంగాలతో పాటు అనేక సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మాట నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను సత్కరించారు. సంస్థ మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి మాట అధ్వర్యంలో చేపట్టిన ప్రణాళికలను నాయకులు వివరించారు. ఈ సందర్భంగా సంస్థ తరుపున చేస్తున్న పలు కార్యక్రమాలను వివరించారు. స్త్రీలు ప్రతి కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కుంటూ ముందుకు సాగాలని పలువురు ప్రముఖులు హితవు పలికారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. మాట పలువురిని అవార్డుతో సత్కరించింది. అలాగే సభా వేదికపై పలువురిని సన్మానించి, సత్కరించారు. మాట కార్యక్రమాలు అండగా ఉంటూ, సహాయసహాకారాలు అందిస్తున్న ప్రతిఒక్కరినీ నిర్వహకులు ప్రశంసించారు. ఈ సంబరాలను అద్భుతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన ప్రతిఒక్కరినీ మాట ఉమెన్ కమిటీ ప్రత్యేకంగా అభినందించింది. ఈ వేడుకకు విచ్చేసిన స్త్రీమూర్తులకు నిర్వహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. విందు - వినోదాలతో మాట - అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఎంతో ఉత్సహంగా సాగాయి. ఈ సంబరాల్లో మేము సైతం అంటూ వెయ్యి మందికి పైగా మహిళలు ముందుకొచ్చి ఉమెన్స్ డే వేడుకలను గ్రాండ్ సక్సెస్ చేశారు. సంబరమాశ్చర్యాలతో, ఆసాంతం ఆహ్లాద పరిచేలా ఈ వేడుకను కనువిందుగా నిర్వహించారు. వేలాదిగా ఆదర్శ వనితలు ఒక చోటు చేరి, అటపాటలతో, కేరింతలతో హోరేత్తించడం.. మాట విజయానికి మచ్చుతునకగా చెప్పవచ్చు. -
నేటి యువత..అలనాటి రెట్రో ఫ్యాషన్ తో కిస్సిక్ (ఫొటోలు)
-
క్రమశిక్షణతో మెలగాలి.. ఉన్నత లక్ష్యంతో సాగాలి..
సమాజంలో ఒత్తిడులను ఎదుర్కొని విజయవంతమైన మహిళగా ఎదగాలంటే ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలంటూ గురుకుల విద్యార్థి నులకు పలు రంగాల నిపుణులు, ప్రముఖులు మనోనిబ్బరం నింపారు. నవ్వుతూ, సంతోషంగా ఉండే ప్రయత్నం చేయాలని.. సమయాన్ని వృథా చేయకుండా క్రమశిక్షణతో మెలగా లని దిశానిర్దేశం చేశారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) కార్యదర్శి అలగు వర్షిణి ఆధ్వర్యంలో విద్యార్థి నులకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జూమ్ మీటింగ్ ద్వారా పలువురు ప్రముఖులు సలహాలు, సూచనలు ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని గురుకుల బాలికల పాఠశాలలు, కళాశాలల విద్యార్థినులు ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిపుణులు, ప్రముఖులు చెప్పిన అంశాలు, సూచనలివీ.. –సాక్షి, హైదరాబాద్మంచి నిర్ణయం తీసుకోవాలంటే ఇబ్బందులు తప్పవుఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో ఇక్కడ ఒక ఈ–సిగరెట్ కంపెనీ స్థాపించడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. పాలకులను, అధికార యంత్రాంగాన్ని సమన్వయపరచి ఆ కంపెనీ నెలకొల్పకుండా చేశాను. ఒకవేళ ఆ కంపెనీ నెలకొల్పి ఉంటే ఎంతోమంది అనారోగ్యా ల బారినపడేవారు. ఒక మంచి నిర్ణయం తీసుకోవాలంటే ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఉంటాయి. ‘బేటీ బచావో.. బేటీ పడావో, ఆయుష్మాన్ భవ’వంటి వినూత్న కార్యక్రమాలను దేశ ప్రజలకోసం ప్రవేశపెట్టే ఒక గొప్ప అవకాశం నాకు లభించింది. దేశం కోసం, ప్రజల కోసం, పేద ప్రజల కోసం ఉన్నతంగా ఆలోచిస్తే మన మదిలో ఇంకా ఎన్నో మంచి ఆలోచనలు, పథకాలు పుట్టుకొస్తాయి. – ప్రీతి సుదాన్, యూపీఎస్సీ చైర్మన్సంతోషంగా ఉండాలి, ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోవాలిమన ముఖంలో చిరునవ్వుతో, సంతోషంగా ఉండాలి. ఎప్పుడూ ఏదో కోల్పోయినట్టుగా ఉండొద్దు. మన ముఖంలో నవ్వు లేకపోతే ఇతరులు కూడా మనతో అలాగే ఉంటారు. సాధారణ ప్రభుత్వ స్కూళ్లతో పోల్చితే గురుకులాల్లో మెరుగైన సౌకర్యాలు ఉన్నాయి. సమయాన్ని వృథా చేసుకోకుండా ఉన్నతంగా రాణించేలా లక్ష్యాన్ని ఎంచుకోవాలి. దానిని చేరుకునేలా ముందుకు వెళ్లాలి. – ఛాయా రతన్, రిటైర్డ్ ఐఏఎస్సమయం వృథా చేసుకోవద్దు పస్తుతం మెడికల్ సీటు సాధించాలంటే చాలా కష్టపడాలి. నీట్ కోచింగ్‌కు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. అదే ప్రభుత్వం నెలకొల్పిన గురుకులాల్లో చక్కటి తర్పిదు ఇస్తున్నారు. నేను కూడా గౌలిదొడ్డి కళాశాలలో చదివాను. ఆ రోజుల్లో కేవలం సబ్జెక్టు పుస్తకాలను చదివి ర్యాంకు సాధించాను. ఇప్పుడు లైబ్రరీలు, డిజిటల్ రూపంలో పూర్తిస్థాయిలో మెటీరియల్ లభిస్తోంది. సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృథా చేయవద్దు. క్రమశిక్షణతో ఉండాలి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పట్ల స్రత్పవర్తనతో ఉండాలి. – డాక్టర్ శిరీష, ఎండి (మెడిసిన్) స్విమ్స్, తిరుపతిమన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకోవాలిమన జీవితం ఒక తెల్ల కాగితం వంటిది. అందులో ఎంత చక్కగా చిత్రాన్ని గీస్తే అంత అద్భుతంగా, అందంగా ఉంటుంది. మన జీవితం కూడా అంతే. మన జీవితాన్ని మనమే తీర్చిదిద్దుకోవాలి. కోవిడ్ సమయంలో 21వేల కాల్ సెంటర్లు పెట్టి, వేల మంది ప్రజల జీవితాలను కాపాడేలా పనిచేయడం ఎంతో సంతృప్తినిచ్చింది. – అలగు వర్షిణి, కార్యదర్శి, టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్భయం వదిలితేనే విజయం చాలా మంది భయంతో ఏ పనిలోనూ ముందుకు వెళ్లలేరు. భయాన్ని వీడితే ఎన్నో విజయాలు సాధించవచ్చు. విద్యార్థుల్లో భయమే వారి చదువులో వెనుకబాటు తనానికి కారణం.’అన్నారు. భయాన్ని వీడేందుకు పలు చిత్రాలను ఆమె ప్రదర్శించారు. ఈ చిత్రాలను వీక్షించిన విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. – డాక్టర్ గీతా చల్ల, చైల్డ్ అండ్ అడోలసెంట్ సైకాలజిస్ట్ శక్తి వంచన లేకుండా కృషి చేస్తే విజయం తథ్యంచదువుతోపాటు క్రీడలు కూడా నాకు ఎంతో ఇష్టం. క్రీడాకారిణిగా అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నా. ఇప్పటివరకు 42 పతకాలను సాధించాను. రానున్న ఏషియన్ గేమ్స్‌లో బంగారు పతకం సాధిస్తానన్న విశ్వాసం ఉంది. విద్యార్థులను ప్రోత్సహించే అధ్యాపకులకు, కోచ్‌లకు, తల్లిదండ్రులకు నా కృతజ్ఞతలు. – అగసారా నందిని, అంతర్జాతీయ క్రీడాకారిణి, బుధేల్ టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ డిగ్రీ కళాశాల, సంగారెడ్డి జిల్లా -
ట్రిలియన్ డాలర్ల శక్తి మహిళలే!
ఎప్పుడైనా కూడా మహిళలకు అండగా నిలిచింది ఇందిరమ్మ రాజ్యమే. ప్రజలు ఇందిరాగాందీని అమ్మ అని పిలిచారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ను అన్నా అన్నారు. ఇప్పుడు నన్ను కూడా అన్నా అని పిలుస్తున్నారు. తోబుట్టువు మాదిరిగా ఆదరిస్తున్నారు. అలాంటి తోబుట్టువుల కోసం నేను ఎలాంటి రిస్క్ అయినా ఎదుర్కొంటా. ఇందిరమ్మ శక్తి, ఎన్టీఆర్ యుక్తి.. రేవంత్ స్ఫూర్తితో మీరు ముందుకెళ్లండి. ప్రజా ప్రభుత్వం ప్రధాన లక్ష్యం ఆడబిడ్డల అభివృద్ధే. ఇందిరా మహిళా శక్తి అంటే ప్రపంచానికే ఆదర్శంగా నిలబడేలా తీర్చిదిద్దుతా.సాక్షి, హైదరాబాద్: తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చగల శక్తి మహిళలేనని.. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం లక్ష్యమని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి(Revanth Reddy) పేర్కొన్నారు. మహిళలను కోటీశ్వరులను చేస్తే ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్ర బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women's Day) నేపథ్యంలో శనివారం సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘ఇందిరా మహిళా శక్తి(Mahila Shakthi)’కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో పదేళ్లు చంద్రగ్రహణంతో మహిళలు చీకటిలోకి నెట్టబడ్డారు.వారు కనీసం మండల కేంద్రంలోని సమాఖ్య కార్యాలయానికి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. పదేళ్ల పాటు మహిళాభివృద్ధి జాడలేదు. ఇందిరమ్మ ప్రజాప్రభుత్వంతో మహిళలు మళ్లీ వెలుగులోకి వచ్చారు. రాష్ట్ర రాజధాని నగరానికి వచ్చి ఆత్మగౌరవాన్ని చాటే పరిస్థితికి వచ్చారు. జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు వడ్డీలేకుండా రుణాలు ఇవ్వడం మొదలు వివిధ ఆర్థిక పురోగతి కార్యక్రమాలతో సరికొత్త ఆర్థిక వ్యవస్థ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకు సాగుతోంది.రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లోని విద్యార్థుల కోసం 1.30 కోట్ల యూనిఫారాలు కుట్టే బాధ్యతను మహిళలు విజయవంతం చేశారు. మహిళా సంఘాల ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయి మార్కెటింగ్ కోసం హైటెక్ సిటీలో మహిళా బజార్ ఏర్పాటు చేశాం. సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు రూ.25 కోట్లతో మహిళా శక్తి భవనాలు నిర్మిస్తున్నాం. మహిళలను పారిశ్రామికవేత్తలను చేస్తున్నాం అదానీ, అంబానీలే కాదు.. తెలంగాణ మహిళలు విద్యుత్ వ్యాపారాన్ని చేయగలరనే ధీమాతో వారికి వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయిస్తున్నాం. వారిని పారిశ్రామికవేత్తలను చేస్తున్నాం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాకుండా.. ఆరీ్టసీకి బస్సులు అద్దెకు ఇచ్చే స్థాయికి తీసుకెళ్తున్నాం.వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులను వారి ద్వారా ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా ఎంఓయూ కుదిర్చాం. రాబోయే రోజుల్లో ప్రతీ మండలంలో మహిళలకు రైస్ మిల్లులు, గోడౌన్స్ నిర్మించే బాధ్యత తీసుకుంటా. మిల్లుల్లో ధాన్యాన్ని బొక్కుతున్న పందికొక్కులకు, దొంగలకు బుద్ధి చెబుతాం. ప్రభుత్వమే మహిళలకు స్థలం ఇస్తుంది, రుణాలు ఇస్తుంది, గోడౌన్స్ నిర్మించండి, వ్యాపారవేత్తలుగా మారండి. మీకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది. కార్పొరేట్ కంపెనీలతో పోటీపడేలా మహిళలు వ్యాపారాల్లో ముందుకెళ్లాలి. మహిళా సంఘాల్లో వయసు సడలింపు.. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల్లో (ఎస్‌హెచ్‌జీల్లో) 65 లక్షల మంది ఉన్నారు. మేం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు ఎస్‌హెచ్‌జీలలో చేరే నిబంధనలు సడలించాలని నిర్ణయించాం. ప్రస్తుతం 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య మహిళలు మాత్రమే సభ్యులుగా ఉన్నారు. ఇకపై 15 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మహిళలందరికీ అవకాశం కల్పించేలా నిబంధనలు తెస్తాం..’’అని సీఎం రేవంత్ తెలిపారు. ఎస్‌హెచ్‌జీలకు చెక్కును అందజేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, సీతక్క, కొండా సురేఖ, ఉత్తమ్, పొన్నం, జూపల్లి తదితరులు వడ్డీ లేకుండా రూ.21 వేల కోట్ల రుణాలు: డిప్యూటీ సీఎం భట్టి రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీలేకుండా రూ.21వేల కోట్ల రుణాలు ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. పదేళ్ల పాటు మహిళా సంఘాలకు పైసా సాయం చేయని గత ప్రభుత్వ నేతలు.. ఈరోజు ఎస్‌హెచ్‌జీలకు వడ్డీలేని రుణాలంటే వెకిలిగా నవ్వుతున్నారని మండిపడ్డారు. మహిళా సంఘాల అభివృద్ధి కోసం ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాలను తీసుకువస్తోందన్నారు.రాష్ట్రంలో మహిళలు తలెత్తుకుని మహాలక్ష్మిలా గౌరవంగా బతకాలన్నదే ప్రజాప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న హరీశ్‌రావు బడితె మాదిరి పెరిగారే తప్ప మహిళలకు కనీసం రుణాలు ఇప్పించలేకపోయారని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం ప్రతి రూపాయి పోగేసి ప్రజల సంపద పెరిగేందుకు కృషి చేస్తోందని.. దాన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు పిచ్చిమాటలు మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఇందిరా మహిళా శక్తి కింద ప్రజాప్రభుత్వం 20 రకాల అద్భుత కార్యక్రమాలను అమల్లోకి తీసుకురావడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. ‘ఇందిరా మహిళా శక్తి’ విశేషాలివీ.. ⇒ మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీకి అద్దెకు ఇవ్వనున్న బస్సులను సీఎం రేవంత్ జెండా ఊపి ప్రారంభించారు. ⇒ కార్యక్రమంలో 2,82,552 స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ)కు రూ.22,794.22 కోట్ల రుణాల చెక్కులను సీఎం అందించారు. ⇒ ఎస్‌హెచ్‌జీ సభ్యులకు రుణబీమా, ప్రమాద బీమా పథకాల కింద రూ.44.80 కోట్ల చెక్కును అందించారు. ⇒ మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న సోలార్ ప్లాంట్లకు సీఎం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ⇒ ఇందిరా మహిళాశక్తి మిషన్–2025 పాలసీని సీఎం ఆవిష్కరించారు. ⇒ సభకు ముందు సీఎం రేవంత్, మంత్రులు వివి ధ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి న కుటీర పరిశ్రమల స్టాళ్లను, మహిళా పెట్రోల్ బంకు నమూనాను పరిశీలించారు.బీఆర్ఎస్ నేతలది పైశాచిక ఆనందం రాష్ట్రంలో ఎలాంటి ప్రమాదం జరిగినా నన్ను తిడుతూ ప్రతిపక్షాలు పైశాచిక ఆనందం పొందుతున్నాయి. టన్నెల్ కూలి కార్మికులు మరణిస్తే సంతోషపడుతున్నారు. రోడ్డు ప్రమాదం జరిగితే నవ్వుతున్నారు. పంటలు ఎండితే బీఆర్ఎస్ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారు. వాళ్ల పైశాచిక ఆనందం కోసం నన్ను తిడుతున్నారు. ప్రజలకు కష్టం వస్తే ఆదుకోవడానికి ప్రయతి్నంచాలి. పదేళ్ల పాలన అనుభవంతో ప్రభుత్వానికి సూచనలు చేయాలి. కానీ పైశాచిక ఆనందం పొందడం మంచిది కాదు. అలాంటివారు బాగుపడరు. -
లండన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
బిందువు బిందువు కలిస్తేనే సింధువు అనే విధంగా యూకే లో నివసిస్తున్న తెలుగు మహిళలు అందరూ “తెలుగు లేడీస్ యుకె” అనే ఫేస్బుక్ గ్రూప్ ద్వారా కలుసుకుని అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు సహాయం కోరే వారికి మరియు సహాయం అందించే వారికి వారధిగా నిలిచే తెలుగు లేడీస్ ఇన్ యుకె గ్రూపును శ్రీదేవి మీనా వల్లి 14 ఏళ్ల క్రితం స్థాపించారు. ఈ గ్రూపులో ప్రస్తుతం ఐదు వేలకు పైగా తెలుగు మహిళలు ఉన్నారు.యూకే కి వచ్చినా తెలుగు ఆడపడుచులను ఆదరించి వారికి తగిన సూచనలు సలహాలు ఇస్తూ విద్యా వైద్య ఉద్యోగ విషయాల్లో సహాయం అందించడమే గ్రూప్ ఆశయమని శ్రీదేవి గారు తెలియజెప్పారు. ఈ సంవత్సరం యూకేలోని పలు ప్రాంతాల నుండి 300కు పైగా తెలుగు మహిళలు పాల్గొని ఆటపాటలతో ,లైవ్ తెలుగు బ్యాండ్ తో, పసందైన తెలుగు భోజనంతో పాటు,చారిటీ రాఫెల్ నిర్వహించి అవసరంలో ఉన్న మహిళలకు ఆసరాగా నిలిచారు.మస్తీ ఏ కాదు మానవత్వం లో కూడా ముందు ఉన్నాము అని నిరూపించారు.ఈవెంట్ లో డాక్టర్ వాణి శివ కుమార్ గారు మహిళలకు సెల్ఫ్ కేర్ గురించి ఎన్నో మంచి సూచనలు ఇచ్చారు. ఈవెంట్ కి వచ్చిన వాళ్లందరికీ మనసు నిండా సంతోషంతో పాటు మన తెలుగుతనాన్ని చాటిచెప్పేలా గాజులు,పూతరేకులు, కాజాలు వంటి పసందైన రుచులతో తాంబూలాలు పంచిపెట్టారు. ఈ ఈవెంట్లో శ్రీదేవి మీనావల్లితో పాటు సువర్చల మాదిరెడ్డి ,స్వాతి డోలా,జ్యోతి సిరపు,స్వరూప పంతంగి ,శిరీష టాటా ,దీప్తి నాగేంద్ర , లక్ష్మి చిరుమామిళ్ల , సవిత గుంటుపల్లి, చరణి తదితరులు పాల్గొన్నారు. -
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం, రాష్ట్రం, దేశం బాగుంటుందని తెలిపారు. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని అన్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు. “మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుంది. కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుంటే దేశం కూడా బాగుంటుంది’’ అని గట్టిగా నమ్మే వ్యక్తిని. ఆ దిశలోనే మన ప్రభుత్వ కాలంలో మహిళల అభ్యున్నతి, సాధికారతకు పెద్దపీట వేస్తూ పాలన చేశాం. అన్నిరంగాల్లో మహిళలను ప్రోత్సహించి, దాదాపు 32కు పైగా పథకాల ద్వారా వారికి భరోసా కల్పించాం.నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం కేటాయిస్తూ తొలిసారిగా చట్టం చేశాం. గిరిజన, దళిత మహిళలను డిప్యూటీ సీఎం, హోంమంత్రి లాంటి పెద్ద పదవులతో గౌరవించాం. మహిళల భద్రత, రక్షణ కోసం “దిశ’’ వ్యవస్థను ప్రవేశపెట్టాం. “ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు’’ అన్న నానుడిని నమ్ముతూ ఆ దిశగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టాం. నా భవిష్యత్ రాజకీయ ప్రస్థానం కూడా మహిళాభ్యున్నతే ప్రధాన లక్ష్యంగా సాగుతుంది’ అని తెలిపారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు. “మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుంది. కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుంటే దేశం కూడా బాగుంటుంది’’ అని గట్టిగా నమ్మే వ్యక్తిని. ఆ దిశలోనే మన ప్రభుత్వ కాలంలో మహిళల అభ్యున్నతి, సాధికార…— YS Jagan Mohan Reddy (@ysjagan) March 8, 2025 -
పుణ్యమూర్తివి నీవమ్మా.. మా ఇంటి కావలి తల్లివి నీవమ్మా
ఆధునిక సమాజంలో మహిళలకు గౌరవం దక్కడం ఇప్పిడిప్పుడే మొదలైంది. స్త్రీ విద్య.. స్త్రీలకు ఉద్యోగాలు.. రాజకీయ పదవులు.. సామాజిక హోదా ఈమధ్యనే పెరుగుతూ వస్తోంది. కానీ, ఈ మారుమూల పల్లెల్లో స్త్రీమూర్తులను సాక్షాత్తుగా దేవతలుగా కొలుస్తారు. తమ ఇంటి ఇలవేల్పులుగా ఆరాధిస్తారు. తమ కుటుంబాలను కాపాడే శక్తిగా.. అమ్మవారిగా పూజిస్తారు.. తమ ఇంట పండిన పంటలో తోలి గంపను ఆమెకు సమర్పిస్తారు.. తమ ఇంట వండిన వంటలు తొలిముద్దను ఆమెకు సమర్పిస్తారు. ఇంట్లో ఏదైనా పండగొచ్చినా పబ్బమొచ్చినా ఇళ్లలో వండుకునే పిండివంటల్లో తొలివాయి ఆమెకే ఇచ్చి.. అమ్మా నీ చలవతోనే మేమంతా చల్లగా ఉన్నాం.. నువ్విచ్చిన ఆస్తిపాస్తులు.. ఆశీస్సులతో ఇలా సాగుతున్నాం.. నువ్వు లేకున్నా నీ జ్ఞాపకాలు చాలు.. ఇదిగో నిన్ను చూస్తూ బతికేస్తాం అంటూ భక్తి.. ప్రేమ నిండిన కళ్ళతో ఆ స్మారకాలవద్ద పవిత్రంగా ప్రమిదలు వెలిగిస్తారు.. ఏదైనా ఇంట్లో ఒక మహిళా పుణ్యస్త్రీగా కన్నుమూస్తే ఆమెను పేరంటాలుగా గౌరవిస్తారు. ఆమె పేరిట ఒక స్మారక చిహ్నాన్ని నిర్మిస్తారు.. వీటిని గుండాం అంటారు. భర్తకన్నా ముందే తనువు చలించడం ఒక మహిళకు దైవత్వాన్ని తెచ్చిపెడుతోంది. అంటే ఆమె పుణ్యస్త్రీగా ముత్తైదువుగా కన్నుమూసి ఆ ఇంటి వారి పాలిట ఇలవేల్పుగా కొలువైపోతుంది. భారతీయ సమాజంలో విధవగా జీవించడం మహిళ ఒక శాపంలా భావిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో భర్తకన్నా ముందుగానే ప్రాణం విడిచివెళ్లిన స్త్రీ ఏకంగా దైవత్వాన్ని సంతరించుకుని ఆయా కుటుంబాల్లో దేవతలుగా కొలువుదీరుతారు. విజయనగరం జిల్లాలోని రాజాం, రేగిడి, వంగర, సంతకవిటి మండలాల్లో వందలాది పల్లెల్లో ఈ ఆచారం ఉంది.పంటపొలాలకు.. పాడిపశువుల నువ్వే అండాదండాఇక్కడ పొలాల్లో, రోడ్లకు ఇరువైపులా కనిపిస్తున్న ఈ చిన్న చిన్న నిర్మాణాలను ఇక్కడి స్థానికులు గుండాలు అని పిలుస్తారు. ఇటువంటి గుండాలు ప్రతీ గ్రామంలో వందల సంఖ్యలో ఉంటాయి. బొమ్మనాయుడువలస, బొద్దూరు, గుళ్ళ సీతారాంపురం, గడ్డి ముడిదాం, ఉణుకూరు, అరసాడ, కాగితాపల్ల వంటి పల్లెల్లో ప్రతి ఇంటికీ ఇలాంటి గుండాలు ఒంటరి.. వారువారు స్థోమతను బట్టి తమ పొలాల్లోను.. కల్లంలోనూ వీటిని నిర్మించి అందులో ఆ మహిళా ఆత్మను ప్రతిష్టించి ఆ గుండంలో ఆమె జీవించి ఉన్నట్లుగా భావిస్తారు. ఆ ఇంట జరిగే శుభ కార్యాల్లో తోలి కబురు ఆమెకే చెబుతారు. గర్భిణీలు.. పెళ్లికూతుళ్ళు కూడా అక్కడకు వెళ్లి దీపం పెట్టి.. నీలాగే గొప్ప ముత్తైదువులా జీవించేలా ఆశీర్వదించాలమ్మా అని ప్రార్థిస్తారు. అంతేకాకుండా పంటపొలాలు.. పాడిపశువులను సైతం ఆ పేరంటాలు కాపాడుతుందని.. వ్యవసాయపనుల సందర్భాల్లో ఎలాంటి ఇబ్బందులు.. ప్రమాదాలు కూడా రాకుండా ఆమె కావలి ఉంటుందని .. ఇంటికి చీడపీడలు.. అనారోగ్యాలు రానివ్వకుండా ఆ పేరంటాలు అడ్డంగా నిలబడుతుందని విశ్వాసంతో ఉంటారు. అందుకే ప్రతి గుండానికి లలితమ్మ పేరంటాలు.. లక్షమ్మ పేరంటాలు.. రాధమ్మ పేరంటాలు అని పేర్లు పెడుతూ మరణించిన తరువాత కూడా తమ భక్తిప్రపత్తులు చాటుకుంటారు. ఈ గ్రామాల్లో వందలాది ఇలాంటి స్మారకాలు ( గుండాలు) కనిపిస్తాయి. వాటికి ఏటా రంగులు వేసి.. చక్కగా ముస్తాబు చేసి అందులో తమ ఇంటి ముత్తైదువను చూసుకుంటారు. ఈరోజుల్లో మహిళలను గౌరవించడం మాట అటుంచి వారికి రక్షణ కూడా లేకుండా పోతున్న పరిస్థితుల్లో ఉండగా వందల ఏళ్ళనుంచీ ఆ పల్లెవాసులు మహిళలకు ఏకంగా దేవతా స్థానం కల్పించి మరణించాక కూడా ఆమెను తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూస్తూ.. ఏటా కొత్తబట్టలు.. పిండి వంటలు.. పళ్ళు ఫలాలు.. సమర్పిస్తారు.. ఇది కదా అసలైన మహిళా సాధికారత.. ఇది కదా మహిళలకు అసలైన గౌరవం..-సిమ్మాదిరప్పన్న. -
కోటి మంది డ్వాక్రా మహిళలకు ధోకా
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. యావత్ ప్రపంచం మహిళల హక్కులు, ఆర్థిక స్వావలంబన, ఉన్నతి కోసం మాట్లాడుకుంటున్న తరుణంలో చంద్రబాబు సర్కారు ఏకంగా మహిళా దినోత్సవం రోజే వారి సాధికారతకు తూట్లు పొడిచింది! అక్కచెల్లెమ్మల అభ్యున్నతి కోసం ఏర్పాటైన స్త్రీ నిధి బ్యాంకును పూర్తిగా నిర్వీర్యం చేస్తూ అడుగులు వేస్తోంది. కూటమి సర్కారు కొత్త పథకాలు విద్యాలక్ష్మి, కల్యాణలక్ష్మి కోసం ఇచ్చే రుణాలను స్త్రీ నిధి బ్యాంకు నుంచి ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో బ్యాంకు మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది.అదే అంతకు ముందు గత ఐదేళ్లూ మహిళా సాధికారతే ధ్యేయంగా వైఎస్ జగన్ ప్రతి అడుగూ వేశారు. అన్ని పథకాలను మహిళల పేరిటే అమలు చేసి ఆర్థిక ఆసరా కల్పించారు. ప్రతి పథకానికి బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించి చిత్తశుద్ధిని చాటుకున్నారు. వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా కార్యక్రమాల ద్వారా ఏకంగా రూ.427.27 కోట్ల మొత్తాన్ని అర్హులకు పారదర్శకంగా అందించారు.సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పొదుపు సంఘాల మహిళలకు స్త్రీ నిధి బ్యాంకు ఇచ్చే రూ.4 వేల కోట్ల రుణాల్లో రూ.1,000 కోట్ల చొప్పున కళ్యాణలక్ష్మీ, విద్యాలక్ష్మీ పథకాలకు నాలుగు శాతం వడ్డీకి రుణాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. మొత్తం రుణాల్లో నాలుగో వంతు రుణాలను తక్కువ వడ్డీకి ఇవ్వడం వల్ల స్త్రీ నిధి సంస్థ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోనుంది. గత ఐదేళ్లలో స్త్రీ నిధికి సంబంధించి దాదాపు రూ.4 వేల కోట్లు నిరంతరం పొదుపు సంఘాల మహిళల వద్ద రుణాలు రూపంలో ఉన్నాయి. పథకాల అమలుకు చిత్తశుద్ధితో బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ఇలా అడ్డదారిలో మళ్లించడం వల్ల పొదుపు సంఘాల వ్యవస్థ దెబ్బతింటుందనే ఆందోళన మహిళల్లో వ్యక్తమవుతోంది. కళ్యాణలక్ష్మి, విద్యాలక్ష్మి పథకాలకు బడ్జెట్లో నిధులు కేటాయించకుండా మహిళలను మోసం చేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం ‘స్త్రీ నిధి’ నిధులను వాడుకోవాలని నిర్ణయించింది. కోటి మందికి పైగా ఉన్న పొదుపు మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చే సంస్థ నిధులను వాడుకోవడం అంటే.. ఆ మేరకు డ్వాక్రా మహిళల రుణాల లభ్యత తగ్గించడమేననే ఆందోళన వ్యక్తమవుతోంది. అత్యవసర సమయాల్లో ఆర్థిక తోడ్పాటు అందించే స్త్రీ నిధి బ్యాంకును నష్టాల ఊబిలోకి గెంటేస్తోందని, సర్కారు నిర్వాకాలతో సంస్థ మూతపడితే పేద మహిళల ఆర్థిక అవసరాలకు తోడ్పాటు కరువై దిక్కుతోచని పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పథకాల అమలుకు బడ్జెట్లో నిధుల కేటాయింపులు లేకుండా.. స్త్రీ నిధి ద్వారా రుణాలు ఇప్పించాలన్న కూటమి సర్కారు యోచనపై అధికారులు విస్తుపోతున్నారు. 7 శాతం వడ్డీకి అప్పులు తెచ్చి... 4 శాతం వడ్డీకి రుణాలివ్వాలట! సొంత నిధులు తక్కువగా ఉండే స్త్రీ నిధి బ్యాంకు ఇతర బ్యాంకుల నుంచి ఏడు శాతం వడ్డీకి తీసుకొచ్చిన డబ్బులనే 11 శాతం వడ్డీకి పొదుపు మహిళలకు రుణంగా ఇస్తూ ఉంటుంది. ఏడు శాతానికి పైన తీసుకొనే నాలుగు శాతం వడ్డీలో రెండు శాతం వడ్డీ డబ్బులను తిరిగి గ్రామ, మండల సమాఖ్యలకు, మిగిలిన 2 శాతం వడ్డీ డబ్బులను స్త్రీ నిధి సిబ్బంది జీతాలు, సంస్థ నిర్వహణకు వినియోగిస్తుంటారు. స్త్రీ నిధి సంస్థ ఏడు శాతం వడ్డీకి తెచ్చుకుంటున్న నిధులను ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ఆలోచన చేస్తున్న కళ్యాణలక్ష్మీ, విద్యాలక్ష్మీ పథకాల లబ్దిదారులకు నాలుగు శాతం వడ్డీకే రుణాలు ఇప్పించేలా కసరత్తు చేశారు. ఈ ప్రక్రియకు సంబంధించి ప్రణాళిక ఇప్పటికే దాదాపు కొలిక్కి వచ్చింది. అంటే మూడు శాతం చొప్పున వడ్డీ డబ్బులను స్త్రీ నిధి బ్యాంకు నష్టపోవాల్సి ఉంటుంది. ఈ పథకాలు అమలు చేయడం వల్ల స్త్రీ నిధి సంస్థకు ఆర్థికంగా వాటిల్లే నష్టానికి సంబంధించి తిరిగి చెల్లింపులు, అదనపు సాయం అందించడం గురించి ఇప్పటిదాకా ప్రభుత్వ స్థాయిలో జరిగిన కసరత్తులో ఎక్కడా కనీసం చర్చ జరగలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. పూర్తిగా స్త్రీ నిధి సంస్థ నిధులతోనే ఈ పథకాలను అమలు చేసేలా అడుగులు పడుతున్నాయి. ఒకవైపు వడ్డీకి తెచ్చుకునే డబ్బులను మరోవైపు అంతకంటే తక్కువ వడ్డీకి రుణాలుగా ఇవ్వడం ద్వారా స్త్రీ నిధి సంస్థ నష్టాల ఊబిలోకి వెళ్లి మూతపడే అవకాశం ఉంటుందని మహిళా సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. స్త్రీ నిధి బ్యాంకు నిబంధనలివీ..స్త్రీ నిధి బ్యాంకు అందించే రుణాలను పేద మహిళల కుటుంబాల జీవనోపాధుల పెంపు లేదా ఆదాయ అభివృద్ధి కార్యక్రమాల కోసమే వెచ్చించాలి. రుణాలను సద్వినియోగం చేసుకుని మహిళల ఆదాయం పెరిగేలా తోడ్పాటునివ్వాలి. స్త్రీ నిధి నిబంధనలు గాలికి.. సాధారణంగా పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉండే మహిళలు బ్యాంకు లింకేజీ కార్యక్రమంలో కమర్షియల్ బ్యాంకు ద్వారా రుణాలు పొందుతుంటారు. బ్యాంకు లింకేజీ ద్వారా మహిళలు పొందే రుణాలను మూడు నాలుగేళ్ల కాల పరిమితితో నెలవారీ కిస్తీ రూపంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం క్యాష్ అండ్ క్రెడిట్ విధానం అమలులో ఉన్నా.. ఒక్కో సంఘం మూడు నాలుగేళ్లకు ఒకసారే బ్యాంకు లింకేజీ లోన్లు తీసుకుంటాయి. పొదుపు సంఘం ద్వారా మహిళలు ఒకసారి బ్యాంకు లింకేజీ రుణం పొందిన తర్వాత అత్యవసర సమయాల్లో స్త్రీ నిధి ద్వారా అదనపు ఆర్థిక రుణాన్ని పొందుతుంటారు. పొదుపు మహిళలకు బ్యాంకు లింకేజీ కార్యక్రమంలో రుణాలిచ్చినా, స్త్రీ నిధి ద్వారా రుణాలిచ్చినా నిబంధనల ప్రకారం ఆయా కుటుంబాల జీవనోపాధుల పెంపు లేదా ఆదాయ అభివృద్ధి కార్యక్రమాల కోసమే వెచ్చించాలి. ఆ రుణాలను ఉపయోగించుకొని తమ ఆదాయం పెంచుకోవాలి. అయితే కూటమి సర్కారు ఆలోచన దీనికి భిన్నంగా ఉంది. స్త్రీ నిధి బ్యాంకు నిబంధనలను తుంగలో తొక్కి కొత్త పథకాలకు మళ్లిస్తోంది. జగన్ హయాంలో ప్రభుత్వమే నేరుగా సాయం.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఐదేళ్ల పాటు పేద కుటుంబాల పిల్లల చదువులకు అండగా నిలుస్తూ అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యాదీవెన పథకాల ద్వారా తిరిగి చెల్లించే అవసరం లేకుండా నేరుగా పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసింది. కళ్యాణమస్తు, షాదీ తోఫా కార్యక్రమాల ద్వారా రూ.427.27 కోట్ల మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని విధానంలో అర్హులకు అందించింది. ఎన్నికల ముందు ఎడాపెడా హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు లబ్ధిదారులంతా తప్పనిసరిగా తిరిగి చెల్లించాల్సిన రుణాల రూపంలో విద్యాలక్ష్మీ, కళ్యాణలక్ష్మీ పథకాల అమలుకు సిద్ధమైంది. ఇందుకోసం 12 ఏళ్లుగా కోటి మందికి పైగా పొదుపు మహిళల ఆర్థిక అవసరాలు తీర్చిన స్త్రీ నిధి సంస్థను బలి పెడుతోంది. స్త్రీ నిధిని నష్టాల్లోకి నెట్టి నిర్వీర్యం చేసేలా అడుగులు వేయటాన్ని మహిళా సంఘాలు, రాజకీయ వర్గాలు తప్పుబడుతున్నాయి. నిధులు మళ్లిస్తే ఊరుకోం స్వయం సహాయక సంఘాల మహిళల జీవనోపాదులను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన స్త్రీ నిధి నిధులను ఇతర అవసరాలకు మళ్లిస్తే ఊరుకునేది లేదు. ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు ప్రకటించిన కళ్యాణలక్ష్మి, విద్యాలక్ష్మి పథకాలకు ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలి. ఆ పథకాల అమలుకు బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడం అన్యాయం. పొదుపు మహిళల అభ్యున్నతికి ఉద్దేశించిన స్త్రీ నిధిని మళ్లించేందుకు యత్నిస్తుండటం దారుణం. దీనివల్ల పొదుపు మహిళల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలి. – పి.నిర్మలమ్మ, ఐద్వా సీనియర్ నాయకురాలు, కర్నూలుస్త్రీ నిధిని మళ్లించడం దారుణం టీడీపీ కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమ పథకాలకు గండికొడుతోంది. మహిళా సాధికారిత గురించి గొప్పలు చెబుతూ కల్యాణలక్ష్మి, విద్యాలక్ష్మి పథకాలకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవటాన్ని బట్టి పాలకులకు చిత్తశుద్ధి లేదని రుజువవుతోంది. స్త్రీ నిధి బ్యాంకు రుణాలను ఇతర పథకాలకు మళ్లించే యత్నాలు సిగ్గుచేటు. ప్రభుత్వ మోసపూరిత విధానాలను మహిళలు గమనిస్తున్నారు. – ఎం.విజయ, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ప్రకాశం జిల్లా అధ్యక్షురాలు ఊరుకునేది లేదు.. కూటమి ప్రభుత్వం స్త్రీ నిధిని ఇతర పథకాలకు మళ్లిస్తే ఊరుకునేది లేదు. ఇలాంటి అనాలోచిత నిర్ణయాలతో డ్వాక్రా మహిళలకు రుణాలు తగ్గే ప్రమాదం ఉంది. బ్యాంకు నిబంధనలను తుంగలో తొక్కి అసంబద్ధ నిర్ణయాలు తీసుకోవడం సరికాదు. – చిట్టెమ్మ, డ్వాక్రా సంఘం సభ్యురాలు, చిత్తూరు జిల్లా.నిధులు కేటాయించకపోవడం దారుణం కళ్యాణలక్ష్మీ, విద్యాలక్ష్మి పథకాలకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం దారుణం. డ్వాక్రా మహిళల సాధికారతకు రుణాలు సమకూరుస్తున్న స్త్రీ నిధి బ్యాంకు నిధులను ఈ పథకాలకు మళ్లిస్తే డ్వాక్రా మహిళలకు సమస్యలు తప్పవు. డ్వాక్రా నిధులతో కుటుంబాలను నెట్టుకొస్తున్న పేద వర్గాల మహిళలు మళ్లీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితిని ఈ ప్రభుత్వం కల్పిస్తోంది. డ్వాక్రా మహిళలకు స్త్రీ నిధి రుణాలు అందని పరిస్థితి ఉత్పన్నం కానుంది. డ్వాక్రా మహిళలకు ద్రోహం తలపెట్టే యత్నాలను విరమించుకోవాలి. కళ్యాణలక్ష్మి, విద్యాలక్ష్మి పథకాలకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలి. డ్వాక్రా మహిళలకు ఇబ్బంది లేకుండా బ్యాంకు రుణాలను సక్రమంగా అందించి ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. – ఇ.చంద్రావతి, శ్రామిక మహిళా సంఘాల ప్రతినిధి, కాకినాడ జిల్లా -
అప్పుడే మహిళ ఎదిగినట్లు లెక్క!: శ్రుతీహాసన్
‘‘సమస్య ఎక్కడైనా ఉంటుంది. ఎలా ఎదుర్కొంటున్నామన్నదే ముఖ్యం. సమస్యలకు భయపడి పారిపోతే ఓడిపోతాం... ధైర్యంగా ఎదుర్కొంటే గెలుస్తాం’’ అంటున్నారు శ్రుతీహాసన్. తన తల్లి సారిక సినిమాలు చేసినప్పటి పరిస్థితులను, ఇప్పుటి పరిస్థితులను పోల్చి కొన్ని విషయాలు చెప్పారు శ్రుతి. ఇంకా ‘మహిళా దినోత్సవం’ సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో శ్రుతీహాసన్ చెప్పిన విషయాలు తెలుసుకుందాం.∙మీ అమ్మగారి కెరీర్‌ని చూశారు... అప్పటి ఆమె కెరీర్ పరిస్థితులను ఇప్పటి మీ కెరీర్‌తో పోల్చుకున్నప్పుడు ఏమనిపిస్తోంది? అప్పటి పరిస్థితుల గురించి అమ్మ నాతో చెప్పేవారు. ‘ఈక్వాలిటీ’ విషయంలో అప్పుడు ప్రాబ్లమ్ ఉండేదట. ఉమెన్‌కి చాలా తక్కువప్రాధాన్యం ఉండేదట. అలాగే అప్పట్లో ‘పీరియడ్స్’ గురించి బాహాటంగా మాట్లాడడానికి సిగ్గుపడేవాళ్లు. అసలు బయటకు చెప్పకూడదన్నట్లు ఉండేది. ఇబ్బందిగా ఉన్నా బయటకు చెప్పకుండా షూటింగ్ చేసేవాళ్లు. ఇప్పుడు పీరియడ్స్ ఇబ్బంది గురించి ఓపెన్‌గా చెప్పి, ఆ రోజు పని మానుకునే వీలు ఉంది.∙మరి... మీ జనరేషన్ హీరోయిన్లతో పోల్చితే అప్పటివారు ఏ విషయంలో హ్యాపీ? మాటల విషయంలో... అప్పట్లో కాస్త ఓపెన్‌గా మాట్లాడగలిగేవాళ్లు. కానీ ఇప్పుడు ఏం మాట్లాడితే ఏం వస్తుందోనని మాటలకు కత్తెర పెట్టాల్సిన పరిస్థితి. అయితే నేనలా కాదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాను. అది అందరికీ తెలిసిన విషయమే. సోషల్ మీడియా వల్ల ఏం మాట్లాడలేకపోతున్నారు. అన్ని కళ్లూ మనల్నే చూస్తున్న ఫీలింగ్. అంతెందుకు? పదిహేనేళ్ల క్రితం నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఇలా లేదు. రిలాక్సింగ్‌గా ఉండేది.ఇప్పుడు ఫొటోలు తీసేసి, సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. ఆ ప్రెజర్ చాలా ఉంది. ఈ ఒత్తిడి వల్ల పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు చాలామంది ఎక్కువ జాగ్రత్తగా ఉంటున్నారు. మా అమ్మ జనరేషన్లో ఉన్నంత కూల్‌గా ఉండలేని పరిస్థితి. ఇంకా చెప్పాలంటే స్కూల్ పిల్లలకు కూడా తిప్పలు తప్పడంలేదు. ‘అలా ఉన్నావు... ఇలా ఉన్నావు’ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇలా చిన్నప్పుడే ప్రెజర్ మొదలై పోతోంది. అయితే ఇప్పటి ఈ పరిస్థితిని నేను విమర్శించడంలేదు. మార్పుని స్వీకరించడమే. ∙ఇండస్ట్రీలో ‘క్యాస్టింగ్ కౌచ్’ ఎదుర్కొన్న నటీమణులు చాలామంది ఉన్నారు... మీకు అలాంటివి? నాకలాంటి చేదు అనుభవాలు లేవు. ఒకవేళ నాకు నచ్చని పరిస్థితి ఎదురైందంటే నిర్మొహమాటంగా చెప్పేస్తాను. నా పాలసీ ఒక్కటే. నేను ఎవరినైనా ఇష్టపడితే టూ హండ్రెడ్ పర్సెంట్ ఇష్టపడతాను... నాకు కంఫర్ట్‌గా ఉన్న చోట ఉంటాను. నాకు నచ్చని చోట ఉండను... నచ్చని మనుషులను నా లైఫ్‌లో నుంచి ఎగ్జిట్ చేసేస్తాను. ఇంకో విషయం ఏంటంటే... మనకు ఏదైనా నచ్చలేదనుకోండి గొడవపడక్కర్లేదు... అరిచి చెప్పక్కర్లేదు. ‘నాకు నచ్చలేదు’ అని కూల్‌గా చెప్పి, సమస్యకు ఫుల్స్టాప్ పెట్టేయాలి. ∙మీలా చాలామంది ధైర్యంగా ఉండలేరు... నిర్భయంగా మాట్లాడలేరు... వారికి మీరిచ్చే సలహా? భయాలు వదలండి. దయచేసి మీ మనసులోని సమస్యలను బయటకు చెప్పండి. మనసులోనే ఉంచుకుంటే ఆరోగ్యం చెడిపోతుంది. మనకు ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్లతో షేర్ చేసుకోవాలి. అయితే వారికన్నా కూడా ఒక మంచి కౌన్సెలర్ అవసరం. వాళ్లయితే మన మానసిక స్థితిని బాగా అర్థం చేసుకుని సలహాలు ఇవ్వగలుగుతారు. ఫిజికల్‌గా హెల్దీగా ఉండాలంటే ‘మెంటల్ హెల్త్’ చాలా ముఖ్యం. ∙కమల్‌హాసన్‌గారి కూతురు కావడం వల్లే మీకు ఇండస్ట్రీలో ఇబ్బందులు ఎదురు కాలేదనుకోవచ్చా? బ్యాక్‌గ్రౌండ్ అనేది ప్లస్సే... కాదనడంలేదు. నాన్నగారి పేరు నాకు హెల్ప్ అయింది. అయితే శ్రుతీహాసన్ అంటే కమల్‌హాసన్ కూతురు అనే విషయాన్ని మరచిపోయేలా చేయాలి. అప్పుడే నేను సక్సెస్ అయినట్లు. నా వర్క్‌తో నేను నిరూపించుకుని నాకంటూ పేరు తెచ్చుకున్నాను. పని పరమైన ఇబ్బందులు కామన్. అలాంటివి ఎప్పుడూ మా నాన్నగారికి చెప్పలేదు. నేనే సాల్వ్ చేసుకుంటుంటాను.∙‘మహిళా దినోత్సవం’ జరుపుకుంటారా? నా ఫ్రెండ్స్‌తో ‘అన్ని రోజులూ మనవే’ అంటుంటాను. ‘మేల్ డే’ అని లేదు. మరి... ‘ఉమెన్స్ డే’ ఎందుకు? అంటే... ఇంకా స్త్రీ వెనకబడి ఉన్నట్లేనా? అలాగే ‘ఉమెన్ ఓరియంటెడ్’ సినిమా అంటారు. ‘మేల్ ఓరియంటెడ్’ మూవీ అనరు. ముందు ఈ తేడా పోవాలి. మహిళా దినోత్సవం అనేది ప్రత్యేకంగా లేని రోజున ఉమెన్ ఎదిగినట్లు లెక్క. సినిమా ఇండస్ట్రీలో టెక్నికల్ డిపార్ట్మెంట్లో మహిళలు తక్కువగా ఉండటానికి కారణం? ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు మహిళల శాతం ఎక్కువే ఉంది. లేడీ టెక్నీషియన్స్ ఇంకా పెరుగుతారు. అంతెందుకు? నేను ఈ మధ్య లీడ్ రోల్ చేసిన ‘ది ఐ’ మూవీకి డైరెక్టర్,ప్రొడ్యూసర్, ఇంకా ఇతర విభాగాల్లో మహిళలే ఎక్కువ. ఆ విధంగా ఈ సినిమా నాకు స్పెషల్. -
ధైర్యంగా బతకాలి... ప్రశాంతంగా ఉండాలి: నదియా
‘‘మీ విలువ మీరు తెలుసుకోండి... మీకు నచ్చినట్లు మీరు బతకండి’’ అంటున్నారు నదియా. హీరోయిన్గా 1980–1990లలో విజయవంతమైన కెరీర్‌ని చూసిన నదియా బిజీగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని, అమెరికాలో సెటిలయ్యారు. 1994లో సినిమాలకు దూరమై, 2004లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సిల్వర్ స్క్రీన్‌కి వచ్చారు. ‘కారవాన్’ వాహన సౌకర్యాలు లేని రోజులను, ఇప్పుడు ఆ సౌకర్యాలు ఉన్న రోజులనూ చూస్తున్నారు నదియా. ‘మహిళా దినోత్సవం’ సందర్భంగా ‘సాక్షి’కి నదియా ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలోని విశేషాలు తెలుసుకుందాం. ‘‘నిజ జీవితాన్ని, నా సినీ జీవితాన్ని పంచుకుని నాకు విజయం అందించిన నా హీరోయిన్స్ అందరికీ, యావన్మంది మహిళలకు చేతులెత్తి నమస్కరిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు’’ అంటూ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ఈ ఫొటోను షేర్ చేసి, చిరంజీవి పేర్కొన్నారు⇒ టీనేజ్‌లో హీరోయిన్ అయిన మీకు అప్పటి షూటింగ్ వాతావరణం, అంతమంది వ్యక్తులతో పని చేయడం వంటివి ఇబ్బందిగా అనిపించేదా? మలయాళంలో నా తొలి సినిమా ‘నోకెత్త దూరత్తు కన్నుమ్ నాట్టు’ (1984). ఈ సినిమా తమిళంలో ‘పూవే పూచ్చూడవా’గా రీమేక్ అయింది. తమిళంలోనూ నేనే నటించాను. తమిళంలో నాకు తొలి సినిమా. ఆల్రెడీ ఒక భాషలో చేసిన సినిమా కావడం ఒక ప్లస్. మలయాళం సినిమా డైరెక్టర్ ఫాజిల్ తమిళంలోనూ చేశారు. అలాగే నాకు తమిళ్ అస్సలు రాకపోవడంతో ఓ ట్యూటర్‌ను పెట్టి, నేర్పించారు. దాంతో ఈజీ అయింది. షూటింగ్ పరంగా ఎలాంటి చేదు అనుభవాలు ఎదురు కాలేదు. దాంతో భయపడాల్సిన అవసరం రాలేదు. అలాగే ఆ సినిమా హిట్ కావడంతో వెనక్కి తిరిగి చూసుకోనంతగా బిజీ అయ్యాను.⇒ సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిలు నిలదొక్కుకోవాలంటే చాలా కష్టం అంటారు... ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందనే టాక్ కూడా వినిపిస్తుంటుంది... నేను నా అనుభవాల గురించి మాట్లాడతాను. నాతో పాటు మా నాన్న షూటింగ్‌కి వచ్చేవారు. ఒక్క నిమిషం కూడా ఆయన నన్ను ఒంటరిగా వదిలిపెట్టేవారు కాదు. ఆయన అంతగాప్రొటెక్ట్ చేయడంతో నాకు ప్రెజర్ ఉండేది కాదు. అలాగే వచ్చిన ప్రతి సినిమా కమిట్ చేయించేసి, నాతో ఓవర్ వర్క్ చేయించలేదు. వర్క్‌ని ఎంజాయ్ చెయ్ అన్నారు. నా పక్కన ఓ గైడింగ్ ఫోర్స్ (తండ్రిని ఉద్దేశించి) ఉండటంతో నాకెప్పుడూ ‘అన్‌సేఫ్’ అనిపించలేదు.⇒షూటింగ్ స్పాట్లో స్టార్స్‌కి ఏర్పాటు చేసే ‘కారవాన్’ వాహన సౌకర్యం అప్పట్లో లేదు. పల్లెల్లో షూటింగ్స్ చేసినప్పుడు కాస్ట్యూమ్స్ మార్చుకోవడానికి, ఇతర వ్యక్తిగత విషయాలకూ పడిన ఇబ్బందుల గురించి? మాకు బోలెడంత ప్రేమ దక్కేది. విలేజెస్లో ఎవరో ఒకరింట్లో కాస్ట్యూమ్స్ మార్చుకునేంత అభిమానం మా మీద ఉండేది. ‘ఏం ఫర్వాలేదు. మీ ఇల్లులా అనుకోండి’ అనేవాళ్లు. ఎలాంటి భయాలూ ఉండేవి కావు. ఇప్పడున్నన్ని సౌకర్యాలు లేకపోయినా హ్యాపీగానే ఉండేది.⇒ అప్పట్లో సౌకర్యం లేకపోయినా హ్యాపీగానే గడిచిందన్నారు... సో.. ఇప్పుడు కారవాన్ తదితర సౌకర్యాలు పొందుతున్న నటీమణుల లైఫ్ ఇంకా హ్యాపీ అనుకోవచ్చా... మాతో పోల్చుకుంటే ఇప్పటి అమ్మాయిలు హ్యాపీ కాదు. అన్ని సౌకర్యాలతో పాటు సమస్యలూ ఎక్కువే. ప్రతి క్షణం ఎవరో ఒకరు మనల్ని గమనిస్తున్న ఫీలింగ్. సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ వల్ల పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఈ జనరేషన్‌కి ఆ ప్రెజర్ ఎక్కువ.⇒మరి... ఈ ప్రెజర్‌ని ఎలా అధిగమించాలి? ప్రపంచం మారిపోయింది. మనమూ అందుకు తగ్గట్టు మారాలి. పరిస్థితులు ఇలా ఉన్నాయేంటని భయపడకుండా మన జాగ్రత్తల్లో మనం ఉండటమే. ⇒ నెగటివిటీ ఎక్కువ శాతం ఉన్న ఈ మోడ్రన్ వరల్డ్‌లో అమ్మాయిలు తమ లైఫ్‌ని ఎలా లీడ్ చేయాలంటారు? ధైర్యంగా, గర్వంగా బతకాలి. ఎందుకంటే ఆ దేవుడు సృష్టించిన ప్రత్యేకౖమైనమనుషులం మనం. ఎక్కడ ఉన్నా మనం సౌకర్యంగా ఉండటం మనకు ముఖ్యం. సౌకర్యం అంటే లగర్జీస్ కాదు. మనకు నచ్చినట్లుగా మనం ఉండటం. అలాగే మనం అనుకున్నది నిర్మొహమాటంగా చెప్పాలి. మన విలువని మనం తెలుసుకోవాలి. మనం మన గురించి ఏమనుకుంటున్నామో అదే మనం. తక్కువగా అనుకుంటే తక్కువగా... ఉన్నతంగా అనుకుంటే ఉన్నతంగా. అందుకే మన గురించి మనం ఉన్నతంగా అనుకోవాలి. ఆత్మవిశ్వాసంతో బతకాలి. ⇒ఇద్దరు అమ్మాయిల తల్లిగా మీ పిల్లలకు ఈ విషయాలు చెబుతుంటారా? చెబుతాం. మా అమ్మాయిలకు బాగా స్వేచ్ఛ ఇస్తాం. వాళ్ల ఇష్టాలను కాదనం. వద్దని చెప్పాల్సి వస్తే ఎందుకు వద్దో చెబుతాం. ఎంత జాగ్రత్తగా ఉండాలో వివరిస్తాం. ఒకప్పుడు పెద్దలు చెప్పిన మాటలను పిల్లలు వినేవాళ్లు. ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిన ఈ కాలంలో పిల్లలు చెప్పేది కూడా పెద్దలు వినాలి. మేం మా పిల్లలతో బాగా కమ్యూనికేట్ అవుతాం. మా పిల్లలకే కాదు... ఎవరికైనా నేను చెప్పేదేంటంటే... ధైర్యంగా బతకాలి... ప్రశాంతంగా ఉండాలి.నా జీవితం హ్యాపీ నా జీవితం మొత్తం సాఫీ. హీరోయిన్గా బిజీగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని, మా ఆయనతో అమెరికాలో సెటిలయ్యాను. ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ లైఫ్‌ని పరిపూర్ణంగా ఆస్వాదించాను. చాలా గ్యాప్ తర్వాత సినిమాలకు చాన్స్ వచ్చింది. ‘నటిగా నీ పూర్తి ప్రతిభని నువ్వు వినియోగించుకోలేదు.. సినిమాలు కంటిన్యూ చెయ్’ అని మా ఆయన, ‘మళ్లీ యాక్ట్ చెయ్ అమ్మా’ అని పిల్లలు అన్నారు. వచ్చాను.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్నాను. -
ఎందరో మహానుభావులు
స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని కాంక్షిస్తున్న నేపథ్యంలో వివిధ రంగాలకు నిర్దిష్ట లక్ష్యాలు నిర్వచించుకున్నాం. ఈ లక్ష్యం నెరవేరడంలో సైన్స్ కీలకపాత్ర పోషించనుంది. అయితే, భారతీయ శాస్త్ర రంగం అక్కడక్కడ కొన్ని సంస్థల్లో కనిపించే అద్భుతంగా ఉండకూడదు. సామాజిక సమస్యల పరిష్కారానికి అన్నిచోట్లా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా మారాలి. ఇవన్నీ జరగాలంటే, ప్రాథమిక విద్య నుంచి స్నాతకోత్తరం వరకూ శాస్త్ర రంగంలో పెట్టుబడులు గణనీయంగా పెరగాలి. ప్రభావశీల పరిశోధనలకు ఇచ్చే ప్రోత్సాహకాలు, బహుమతులు పెరగాలి. స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్‌రంగంతో ప్రభుత్వ భాగస్వామ్యం, సమాజంలోని అట్టడుగు వర్గాలు ముఖ్యంగా మహిళల ప్రాతినిధ్యం పెరగాలి.హేతుబద్ధమైన, ససాక్ష్యాలతో కూడిన పరిష్కారాలను చూపడం మొదలుపెడితే ప్రజాభిప్రాయం శాస్త్రవేత్తల నిర్ణయాలతో ఏకీభవిస్తుందని కోవిడ్ సమయంలో నిరూపితమైంది. మన అభివృద్ధిని అడ్డుకునే... పరిష్కారం లేని, రిస్క్ కారణంగా ప్రైవేట్ రంగం పెట్టుబడులు పెట్టని శాస్త్రపరమైన సమస్యలపై తక్షణం ప్రభుత్వం దృష్టి పెట్టాలి.బయో–ఈ3, నేషనల్ క్వాంటమ్ మిషన్ , డీప్ ఓషన్ మిషన్ వంటివి ఇలాంటి సమస్యల పరిష్కారం దిశగా శాస్త్రవేత్తల దృష్టిని కేంద్రీకరించేందుకు ప్రయత్నించాయి. ప్రోత్సాహకరమైన విషయం ఏమిటంటే, ఈ ఏడాది బడ్జెట్లో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో చేపట్టిన కార్యక్రమాలకు కేటాయింపులు రెట్టింపు కంటే పెరగడం.దేశంలోని శాస్త్ర పరిశోధనశాలల్లో మూలనపడ్డ అద్భుతమైన ఆవిష్కరణలు ఉన్నాయడంలో నాకు ఎలాంటి సందేహమూ లేదు. ప్రోత్సాహకాల లేమితో ఇవి ముందుకు కదలడం లేదు. వాయు కాలుష్యం, నీటిలోని సీసం, ఆర్సెనిక్ విషాల ఏరివేత, వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ కాలుష్యం, ముఖ్యంగా జలవనరులకు సంబంధించిన సమస్యలను శాస్త్ర పరిశోధన సంస్థలు కలిసికట్టుగా చేపట్టాలి. దేశ సమస్యలకు శాస్త్ర ఆధారిత పరిష్కారాలు కనుక్కునేందుకు అవసరమైన మౌలిక పరిశో ధనలకు కేంద్రం సంస్థాగత గ్రాంట్ల రూపంలో అధి కంగా సాయపడాలి. ఇదే సమయంలో అప్లికేషన్స్, వాటి వాణిజ్యీకరణ, పరిశోధనలను మరింత విస్తృత స్థాయికి తీసుకెళ్లడం వంటివి భాగస్వామ్య ఏర్పా ట్లతో ప్రోత్సహించవచ్చు. దేశంలో శాస్త్ర పరిశోధన సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపు తున్న సంస్థలు క్రమేపీ పెరుగుతున్నాయి. టాటా గ్రూపు లాంటివి వందేళ్లుగా ఈ పని చేస్తున్నాయి. ప్రభుత్వ నిధులకు ప్రైవేట్ పెట్టుబడులు, దేశీ దాతలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు తోడైతే సమాజానికి ఉపయోగపడే పరిశోధనలకు ఊతమివ్వవచ్చు. మహిళలకు సముచిత స్థానం...భారతీయ మహిళలు చాలా రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. పురిటిబిడ్డను కోల్పోయిన బాధ ఆనందీబాయి జోషీని ఎన్నో అడ్డంకులు అధిగమించి వైద్యశాస్త్రం చదువుకునేలా చేసింది. అది కూడా అమెరికాలోని పెన్సిల్వేనియా మహిళా కళాశాలలో. 1886లోనే ఈ ఘనత సాధించిన తొలి భారతీయ వైద్యురాలు ఆమె. దురదృష్టవశాత్తూ ఆ మరుసటి ఏడాదే ఆమె క్షయ వ్యాధికి బలైనా... ఎంతో మంది మహిళలు వైద్యం, వైద్య పరిశోధనల రంగాలను ఎంచుకునేందుకు స్ఫూర్తిగా నిలిచారు.ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి కానీ... ‘స్టెమ్’ రంగాల్లో (సైన్ ్స, టెక్నాలజీ, ఇంజినీరింగ్ అండ్ మేథమేటిక్స్) భారతీయ మహిళల భాగస్వామ్యం తక్కువ. ఈ రంగాల్లో కోర్సులందిస్తున్నసంస్థలపై ఇటీవల ఒక అధ్యయనం జరిగింది. అక్కడి బోధన సిబ్బందిలో కేవలం 16.6 శాతం మంది మాత్రమే మహిళలు. నేషనల్ ఇన్ స్టిట్యూషనల్ రీసెర్చ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్ ఐఆర్ఎఫ్) జాబితాలోని టాప్ ఎనిమిది సంస్థల్లో ఇది 10 శాతానికి మించడం లేదు. ఈ మహిళల్లోనూ 26.2 శాతం మంది మాత్రమే సీనియర్ స్థానాల్లో ఉన్నారు. దీన్నిబట్టే మహిళల విషయంలో ఎన్ని అసమానతలు ఉన్నాయో అర్థమవుతుంది. మహిళలు నాయకత్వ స్థానాల్లో ఉంటే సంస్థల సమర్థత పెరుగుతుందనీ, వ్యవహారాలు పారదర్శకంగా ఉంటాయనీ, పనులు సమతుల్యతతో సాగుతాయనీ దశాబ్దాల అధ్యయనాలు చెబుతున్నాయి. దేశంలోని శాస్త్ర, వైద్య సంస్థల్లోని ఈ అసమానతలను సరిదిద్దాలంటే మొత్తం వ్యవస్థలో మార్పులు చేయాల్సి ఉంటుంది. వనరుల కేటాయింపు, టాలెంట్ మేనేజ్మెంట్, పదోన్నతులు, బదిలీల వంటిఅంశాలపై నిర్ణయాలు తీసుకునే వ్యవస్థల్లో మహిళలకు తగిన భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేయాలి. అన్ని స్థాయుల్లోనూ మహిళలకు ఉద్యోగాల విషయంలో తగిన సలహాలు ఇచ్చేందుకు, శిక్షణ వంటివి కల్పించేందుకు ఏర్పాట్లు ఉండాలి. శిశు సంరక్షణ, డే కేర్ సర్వీసులు, ప్రసూతి సెలవులు, పిల్లలకు పాలు పట్టేందుకు ప్రత్యేకమైన గదులు, పని వేళల్లో వెసలుబాటు, ఇంట్లోంచే పని చేసే అవకాశాలు అన్ని స్థాయుల్లోనూ కల్పించాలి. మహిళలు మళ్లీ ఉద్యోగాల్లో చేరేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయి. వ్యవసాయం, ఆహార భద్రత, అంతరిక్ష ప్రయోగాలు, రక్షణ రంగ తయారీ, టీకాలు, వ్యాధి నిర్ధా రణ, ఫార్మా, ఐటీ వంటి అనేక రంగాల్లో భారతీయ శాస్త్రవేత్తల సామర్థ్యం, నాయకత్వం రెండింటికీ ఇప్పటికే ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. ఈ విజయాల నుంచి స్ఫూర్తి పొందుదాం.-వ్యాసకర్త ‘ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ’ చైర్పర్సన్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)-డా‘‘ సౌమ్య స్వామినాథన్ఆమె కోసం అతనుసందర్భంస్త్రీలు– ఎవరి నొప్పికి వారే మందు వేసుకుంటూ, ఎవరి యుద్ధం వాళ్ళే చేస్తూ, ఆకాశంలో సగాలమని నినదిస్తూ, పడుతూ, రెట్టింపు బలంతో లేస్తూ– చలిచీమల కవాతుకి అర్ధ శతాబ్ది. కడచి వచ్చిన కాలాలను ఈ మహిళా దినోత్సవం రోజున పాఠకురాలిగా తిరిగి చూడటమంటే వెన్ను నిలబెట్టిన అక్షరాలని కావిలించుకోవడం. ఎన్నెన్ని కథలు, కవిత్వాలు, నవలలు, నాటకాలు, వ్యాసాలు మీకోసం మేమున్నామని భుజంమీద చేయివేసి కన్నీరు తుడిచాయి! అక్షరాలలో దట్టించిన ధైర్యం, విశ్వాసం, విజ్ఞానం, పోరాటం నలుగడలా కమ్ముకుని స్త్రీశక్తి విస్ఫోటనమై ఎన్నెన్ని కొత్త విలువలు బారులు తీరాయి! ఇప్పటి, మునుపటి తరాల ముందుచూపు కవులకి, రచయితలకివందనాలు. ఆడపిల్లలను అమ్ముకుంటున్న రోజుల్లో, అతిబాల్య, అతివృద్ధ వివాహాల మారకంలో స్త్రీ వస్తువైన రోజుల్లో– ‘మగడు వేల్పన పాతమాట, ప్రాణసఖుడ’ని చెప్పి, ‘ఆధునిక మహిళ చరిత్ర పునర్లిఖిస్తుంద’ని నమ్మిన క్రాంతదర్శికి కృతజ్ఞతలు. ఒకటీ అరా ఘటనలు పట్టుకుని స్త్రీలు ఎంత నేరస్థులో నిరూపించడానికి వర్తమాన మీడియా ప్రయత్నిస్తున్న కాలాన– ‘స్త్రీల మీద ప్రపంచానికి యింత అపనమ్మకం గనుకనూ స్త్రీని శీలం విషయమై damn చెయ్యడమూ, గాయం చెయ్యడమూ ఇంత సులభం గనుకనూ స్త్రీ శీలం తన సొమ్మని పురుషుడు అనుకోవడం వల్లనూ స్త్రీని శిక్షించే అధికారం ప్రతి పురుషునికీఉండటం వల్లనూ స్త్రీ ఇంత మోసగత్తె అబద్ధీకురాలు ఐ జీవితమంతా నటిస్తోంద’ని స్త్రీల చెడుగు వెనుక కారణాలను బట్టబయలు చేసిన స్వేచ్చా మూర్తిని స్మరించుకుంటూ ముంజేతిపై నాలుగు ముద్దులు. స్త్రీల నవ్వు, నడక, మాట దుస్తులబట్టి ఆమెలైంగిక వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తున్న ఈ మాయదారి కాలంలో– చెడిపోయిన మనుషులను, సవతి తల్లి, కొడుకుల ప్రేమబంధాన్ని ఒప్పించేలా రాసి, ‘మనిషి నుంచి మనిషికి సాధ్యమైనంత హెచ్చు ఉపకారమూ సాధ్యమైనంత తక్కువ అపకారమూ జరిగేలా చూసు కోవడమే నీతి. తక్కిన బూటకపు నీతి నియమాలను నమ్మకండి’ అన్న భావ విప్లవకారునికి శాల్యూట్. ఉన్నదంతా కుటుంబానికి పెట్టి, అన్నిటికోసం చేయి సాచాల్సి వచ్చే స్త్రీలకి కొదవలేని మనదేశంలో– ‘అది నా ఇల్లు కాదా అని అడిగావు. అది నా ఇల్లు కాదు. ఒకప్పుడు నాదే అనుకున్నాను. ఆ ఇల్లు, మా ఆయన పెంచుకొంటున్న కుక్కదెట్లా కాదో, నాదీ అట్లానే కాదు. ఆయన కుక్కనీ అపేక్షగానే చూసుకొంటారు. నన్నూ ఆపేక్షగానే చూసుకొంటారు. అంతమాత్రాన ఆయనకులాగా మాకు ఇంటిమీద హక్కులుండవు. మేము మా బాధ్యతలు నిర్వహించడం ద్వారా ఆయన ఆపేక్షని ప్రతిఫలంగా పొందగలిగాము.అంతే!’ అని ధీమాగా చెప్పిన ఆమె కోసం ఒకఇంటిని దృఢంగా నిర్మించిన మంచి రచయితకు ధన్యవాదాలు.అరవై దాటితే ఇక జీవితం బోనస్ అంటూ స్త్రీలకి ప్రో ఏజింగ్ మెళకువలను తిరస్కరించే సమాజంలో – ‘చీకటిని చూసో, పరిసరాలలోని అపరిచితత్వాన్ని చూసో భయం వేసినప్పుడు, ఆకలితో బెంగతో జ్వరంతో జీవనలౌల్యాల తీరనిమంకుతనంతో అల్లాడినప్పుడు, ఒక్కసారి గుక్కపట్టి ఏడ్వాలనిపిస్తుంది. లాలన, రక్షణ ఇవ్వగలిగే ఒకే ఒక్క అమ్మని పిలవాలనిపిస్తుంద’ని తల్లి విలువని గుర్తించిన పసిబాలునికి కావిలింతలు. తన కుటుంబ స్త్రీలు తప్ప తక్కినవారంతా అవైలబుల్ వస్తువులుగా కనపడే మెజారిటీ మగ సమాజంలో– ‘బాగ్ ఒక మూలకి పడేసి, కుర్చీలోంచి నా కాళ్ళు తీసి అక్కడ కూర్చుని కళ్ళు మూసుకుని ‘యాభై వచ్చాయి.రెండునెలల నుంచి మెన్సెస్ రాలేదు. ఇప్పుడేమో రెండురోజుల నుంచి బ్లీడింగ్’ (I know that is not the complete story) ‘‘ఊ’’ అంటాను. ‘ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పటికి పది అయ్యింది.బ్లూ ఫిలిమ్స్ చూస్తూ కూర్చున్నాడు. ఓపిక లేదన్నా వినలేదు, బ్లీడింగ్ అవుతుందని చెబుతున్నా...’ అనేక ఆమెలపై సాగే హింసలను ఒకచోట ముద్దచేసి కళ్లముందు పెట్టుకుని ఆ నెప్పినంతా తానే తీసేసు కోవాలన్నంతగా తపించే పువ్వులాంటి మనసున్న కవికి కరచాలనం. స్త్రీల విలువను గుర్తించేవారు...ఇతర మతాలు, ఆచారాలు, అలవాట్ల పట్ల వల్లమాలిన ద్వేషాన్ని నూరిపోస్తున్న మెజారిటీ మత రాజకీయ చదరంగంలో– ‘పువ్వులు రాల్చుకునీ రాల్చుకునీ/ నన్ను కాడగా మిగిల్చావు/ ఇంకా ఏం మిగిలిందని/ ఈ కంకాళంపై కారుమబ్బు కప్పి నడిపిస్తున్నావు/ నా ముఖానికి వేలాడేసిన నఖాబ్/ ఎత్తి చూశావా ఎన్నడైనా/ నా కళ్లు/ రెండు అమాస చంద్రుళ్లను మోస్తుంటాయ్’ అంటూ స్వజనులు చూపే వివక్షని నిలదీసిన సాహసికి సలాములు. స్త్రీలు, తాము ఎవరిని ఎపుడు పెళ్లి చేసుకోవాలో సొంతంగా నిర్ణయం తీసుకోగల హక్కుని నిరాకరించే కుటుంబాలున్న సామాజిక చట్రంలో– ‘మీ ఊరికి మా వాడకి మధ్య ఎద్దుతునకల దండెం కడదాం /కాస్త మీ ఇంట్లో ఉన్న జంధ్యం తీసుకు రారాదూ /కులం గీతలు దాటిన ప్రేమలు చంపబడుతున్న చోట /పారుతున్న నెత్తుటి ప్రవాహంలో నిలబడి అడుగుతున్నా/ రావే పిల్లా రా/ హద్దులన్నీ చెరిపేసి/ సరిహద్దులు లేని సమాజంలోకి నడుద్దా’మంటూ స్త్రీలు కులాలు దాటగలరని నమ్మి, చేయందించిన ప్రేమికునికి వందనం. కొందరుంటారు, తమ ఆధిపత్యాలకి తామే గండికొట్టుకుని చుట్టూ తనకలాడుతున్న ఆరాట పోరాటాలతో మమేకమయ్యేవారు. కొందరున్నారు తమ జీవితాల్లో మేలిమి భాగమైన స్త్రీల విలువని గుర్తించి అక్షరాలలో నిలబెట్టినవారు. వారందరి తపనని, ప్రేమని, అక్కరని, బాధ్యతని గుర్తు చేసుకుంటూ, అభినందిస్తూ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.-వ్యాసకర్త ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏపీ కార్యదర్శిmalleswari.kn2008@gmail.com-కె.ఎన్. మల్లీశ్వరి -
అంతర్జాతీయ మహిళా దినోత్సవం: అద్భుతమైన సందేశం
ప్రపంచ వ్యాప్తంగా.. వివిధ రంగాలలో మహిళలు సాధించిన విజయాలకు గుర్తుగా, వారిని గౌరవించడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని (International Women’s Day) జరుపుకుంటారు. ఈ సందర్భంగా గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 'ప్రియాంక చిగురుపాటి' (Priyanka Chigurupati) ఓ సందేశాన్ని ఇచ్చారు.మహిళా దినోత్సవం అనేది.. ఒక వేడుక కంటే ఎక్కువ. ఇది ప్రతి మహిళలో దాగి ఉన్న శక్తిసామర్త్యాల జ్ఞాపకం. మన దేశంలో మహిళా వ్యవస్థాపకులు కేవలం వ్యాపారాలను మాత్రమే కాకుండా.. భవిష్యత్తులను రూపొందిస్తున్నారు. నేడు స్టాక్ మార్కెట్లోకి కొత్తగా అడుగుపెడుతున్న నలుగురు వ్యక్తులలో ఒకరు స్త్రీ కావడం గమనార్హం, గర్వించదగ్గ విషయం. ఇది కేవలం గణాంకాల కోసం చెప్పుకునే సంఖ్య కాదు.. వారు సొంతంగా నిలబడుతున్నారు అనేదానికి నిదర్శనం అని ప్రియాంక అన్నారు.మహళలు పురోగతి సాధించాలంటే.. ఒంటరి ప్రయత్నం కాకుండా, సమిష్టిగా కృషి చేయాల్సి ఉంటుంది. ఇది వ్యవస్థాగత అడ్డంకులను ఛేదించడానికి, ఆర్థిక.. వృత్తిపరమైన అభివృద్ధికి, స్త్రీ సామర్థ్యాన్ని గుర్తించడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.గ్రాన్యూల్స్.. నిజమైన సాధికారత పని ప్రదేశానికంటే ఉత్తమంగా ఉంటుంది. మహిళలను నాయకులుగా, ఆవిష్కర్తలుగా, సమాజంలో మార్పు తీసుకొచ్చేవారిగా అభివృద్ధి చెందే పర్యావరణ వ్యవస్థలను రూపొందించడమే కంపెనీ ఉద్దేశ్యం. వీరు శాస్త్రీయ పురోగతులను నడిపిస్తున్నా, విజయవంతమైన సంస్థలను నడుపుతున్నా లేదా ఆర్థిక భవిష్యత్తును రూపొందిస్తున్నా వారిని ఇంకా అభివృద్ధి చెందేలా చేయాలి. దీనికోసం మహిళా దినోత్సవం నుంచే పాటు పడాలని చెప్పారు. -
మా అమ్మ మాకు ఇన్స్పిరేషన్
-
International Women's Day 2025 : మీకు స్ఫూర్తినిచ్చిన వనితను గుర్తు చేసుకోండి!
ప్రతీ ఏడాది మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటాం. మహిళల హక్కులను గుర్తించడం, వారి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక విజయాలను,గౌరవించడమే దీని లక్ష్యం. ఈ సందర్భంగా లింగ సమానత్వం, పునరుత్పత్తి హక్కులు, మహిళలపై హింసపై పోరాటం, సమాన హక్కులు అంశాలపై విస్తృతంగా చర్చించుకోవడం అవసరం. తల్లిగా, సోదరిగా, భార్యగా, కుమార్తెగా మహిళ పాత్ర మన జీవితాల్లో చాలా కీలకమైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మీ జీవితంలో ప్రభావం చూపిన, లేదా మీరు మెచ్చిన నచ్చిన మహిళ గురించి ఒక నిమిషం వీడియో చేయండి. ఆమెతో మీ అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసుకోండి. దీనికి #VanithaVandanam యాడ్ చేయడం మర్చిపోద్దు! -
సృష్టికి మూలం.. సీఎం జగన్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
గుంటూరు, సాక్షి: జగనన్న సంకల్పంతో.. మహిళా రాజకీయ సాధికారతలో దేశంలో నెంబర్ వన్‌గా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. రాజకీయ, పాలనా పదవుల్లో మహిళలకు అగ్రతాంబూలం లభించింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. సృష్టికి మూలం మహిళలు. అలాంటి అక్కచెల్లెమ్మలకు మన ప్రభుత్వంలో అత్యున్నత పదవులు కల్పించాం, సంక్షేమ పథకాల్లోనూ ఎక్కువ శాతం వారినే లబ్ధిదారులను చేశాం. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమాజ, కుటుంబ శ్రేయస్సు కోసం పాటుపడుతున్న ప్రతి అక్కచెల్లెమ్మకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారాయన. సృష్టికి మూలం మహిళలు. అలాంటి అక్కచెల్లెమ్మలకు మన ప్రభుత్వంలో అత్యున్నత పదవులు కల్పించాం, సంక్షేమ పథకాల్లోనూ ఎక్కువ శాతం వారినే లబ్ధిదారులను చేశాం. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమాజ, కుటుంబ శ్రేయస్సు కోసం పాటుపడుతున్న ప్రతి అక్కచెల్లెమ్మకు నా హృద… pic.twitter.com/u8SkR9hoP7 — YS Jagan Mohan Reddy (@ysjagan) March 8, 2024 -
మహిళలు తీసుకోవాల్సిన పాలసీలు
అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో నారీమణులు క్రమంగా అన్ని విభాగాల్లో రాణిస్తున్నారు. మెరుగైన భవిష్యత్తు కోసం ముందుకు సాగుతున్నారు. దాంతో వారు తమ వ్యక్తిగత వృద్ధితోపాటు దేశ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావాన్ని చూపుతున్నారు. దేశపురోభివృద్ధికి కీలకపాత్ర పోషిస్తున్న మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగి ఆసుపత్రిపాలైతే ఆర్థికంగా చితికిపోకుండా బీమా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మహిళలు తమ ఆర్థిక రక్షణ కోసం కొన్ని రకాల సాధారణ బీమా పాలసీలను తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. అందులో ప్రధానంగా.. ఆరోగ్య బీమా ఇంట్లో మహిళలతోపాటు కుటుంబం అంతటికీ వర్తించేలా ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలి. కొన్ని బీమా పాలసీలు ప్రసూతి ఖర్చులను చెల్లిస్తాయి. కొత్తగా వివాహం అయిన వారు ఇలాంటి పాలసీలను పరిశీలించాలి. డెలివరీకి 90 రోజుల ముందు నుంచీ, డెలివరీ అయిన 90 రోజుల వరకూ ఏదైనా చికిత్స తీసుకుంటే ఆ ఖర్చులను పాలసీలు చెల్లిస్తాయి. తీవ్ర వ్యాధులకు.. కొన్ని జీవన శైలి, తీవ్రమైన వ్యాధులు వచ్చినప్పుడు ఆర్థిక రక్షణ కల్పించేలా పాలసీలు తీసుకోవాలి. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ లాంటివి మహిళలకు మాత్రమే వస్తాయి. ఇలాంటి వ్యాధులను గుర్తించినప్పుడు క్రిటికల్ ఇల్నెస్ పాలసీలు ఒకేసారి 100 శాతం పాలసీ విలువను చెల్లిస్తాయి. అనారోగ్యం వల్ల ఉద్యోగం చేయలేని పరిస్థితుల్లో 3 నెలల జీతాన్ని అందించే ఏర్పాటూ ఇందులో ఉంటుంది. వాహన బీమా మెట్రోనగరాలతోపాటు ఇతర సిటీల్లో దాదాపు చాలామంది మహిళలు వాహనాలు నడుపుతున్నారు. అయితే చాలా మంది వాహన ఇన్సూరెన్స్ అయిపోయన తర్వాత రెన్యూవల్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కచ్చితంగా వాహన బీమా ఉండేలా చూసుకోవాలి. కనీసం థర్డ్ పార్టీ బీమా పాలసీ లేకుండా వాహనాన్ని నడపకూడదు. ఇదీ చదవండి: ‘సొంతంగా కంపెనీ స్థాపించాలనుంది’ టర్మ్ పాలసీ ఏ క్షణాన ఏ ప్రమాదం ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. ప్రమాదవశాత్తు మనకు ఏదైనా జరిగితే మన కుటుంబం ఆర్థికంగా సమస్యలు ఎదుర్కోకుండా టర్మ్ పాలసీ తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. -
‘సొంతంగా కంపెనీ స్థాపించాలనుంది’
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్త్రీల ఆర్థికపరమైన అంశాలపై కొన్ని ఆసక్తికర సర్వేలు విడుదలయ్యాయి. ఇందులో భాగంగా దేశంలోని మహిళా ఉద్యోగుల్లో అత్యధికులు ఆంత్రప్రెన్యూర్స్‌గా ఎదగాలని భావిస్తున్నట్టు ఓ తాజా సర్వేలో తేలింది. సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు ఆన్లైన్ మార్కెటీర్ ఇండియాలెండ్స్ చేపట్టిన ఈ సర్వేలో స్పష్టమైంది. దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాలతోపాటు ప్రథమ, ద్వితీయ శ్రేణి పట్టణాల్లోగల 24-55 ఏళ్లకు చెందిన 10వేలకుపైగా మహిళా ఉద్యోగుల అభిప్రాయాలతో ఈ సర్వే జరిగింది. వీరిలో ఏకంగా 76 శాతం మంది తమకు సొంతంగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలనే కోరిక ఉన్నట్టు చెప్పడం విశేషం. ఇక 86 శాతం మంది బడ్జెటింగ్, ఇన్వెస్టింగ్, సేవింగ్, ఇతర ఆర్థిక అంశాలపై నైపుణ్యాన్ని పెంచుకోవాలనే ఆసక్తిని వ్యక్తపరిచినట్లు వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులపై డేటాను అందించే ఆన్లైన్ వేదిక ఇండియాలెండ్స్ తెలిపింది. పెరుగుతున్న రుణాలు.. గత ఏడాది మహిళలు తీసుకున్న రుణాల్లో 19 శాతం వృద్ధి కనిపించింది. 2023లో రూ.30.95 లక్షల కోట్ల రుణాలు తీసుకున్నారు. 2022లో రూ.26 లక్షల కోట్లేనని ఇటీవల విడుదల చేసిన ఓ నివేదికలో క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ కంపెనీ క్రిఫ్ హై మార్క్ తెలిపింది. ఇక అంతకుముందుతో పోల్చితే గతేడాది వ్యక్తిగత రుణాలు 26 శాతం పెరిగి రూ.12.76 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇదీ చదవండి: మహిళలకు బ్యాంక్ అదిరిపోయే ఆఫర్లు.. ప్రధాన స్థానాల్లో.. తాము ఎక్కువ రేటింగ్ ఇచ్చిన సంస్థల బోర్డుల్లో మహిళా డైరెక్టర్లు పెద్ద సంఖ్యలోనే ఉన్నారని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ తెలిపింది. 3,138 కంపెనీలకు బీఏఏ, ఆపై రేటింగ్‌నే ఇచ్చామని, వీటి బోర్డుల్లో సగటున 29 శాతం మహిళలే ఉన్నారని చెప్పింది. ఇదిలావుంటే ఫార్చూన్ ఇండియా 500 కంపెనీల్లో కేవలం 1.6 శాతం కంపెనీలకే మహిళలు నాయకత్వం వహిస్తున్నట్టు ఓ అధ్యయనంలో వెల్లడైంది. అయితే ఫార్చూన్ ఇండియా నెక్స్ 500 కంపెనీల్లో మహిళల సారథ్యంలో పనిచేస్తున్నవి 5 శాతంగా ఉన్నాయి. -
పర్యావరణ దీపికలు.. 'మనం నడవాల్సిన బాట ఇది!'
‘ఆట, పాట గురించే కాదు మనం నడిచే బాట గురించి కూడా ఆలోచించాలి’ అంటున్నారు ఈ యువ మహిళలు. మనం ప్రయాణించే మార్గం ఏది అనేదే భవిష్యత్‌ను నిర్దేశిస్తుంది. బంగారు భవిష్యత్ కోసం పర్యావరణ స్పృహతో ‘మనం నడవాల్సిన బాట ఇది’ అంటూ మార్గనిర్దేశ ఉద్యమ కార్యచరణలో భాగం అవుతున్నారు యువ మహిళలు. ‘అరుణోదయం ఊరుకోదు కిరణాలను సారించనిదే.. ప్రసరించే నీరు ఊరుకోదు పల్లం అంతుముట్టనిదే.. ప్రతిఘటించే మనసు ఊరుకోదు ప్రశ్నలను ఎక్కుపెట్టనిదే..’ అంటుంది ‘విశ్వంభర’ కావ్యం. ప్రశ్నలు ఎక్కుపెట్టి పర్యావరణ సంరక్షణ కోసం నడుం కట్టిన యువ మహిళల గురించి.. 'గర్విత గుల్హటి' నీరే ప్రాణాధారం.. బెంగళూరుకు చెందిన గర్విత గుల్హటి ఇంజనీరింగ్ చేసింది. ‘వై వేస్ట్?’ స్వచ్ఛంద సంస్థ కో–ఫౌండర్‌గా నీటి సంరక్షణకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. రెస్టారెంట్లలో నీటి వృథాను ఆరికట్టడంలో కీలక పాత్ర పోషించింది. బడి, కళాశాల, ప్రభుత్వ కార్యాలయాల్లో ‘నీటి సంరక్షణ’కు సంబంధించి ఎన్నో వర్క్‌షాప్‌లు నిర్వహించింది. ‘వై వేస్ట్?’ సంస్థ దేశవ్యాప్తంగా 20 నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ‘వై వేస్ట్?’ కోసం పనిచేస్తున్న తొలి దినాల్లో ‘సమయం వృథా చేయవద్దు. చదువు మీద దృష్టి పెట్టు’ ‘పర్యావరణ కార్యక్రమాల కోసం పనిచేయడానికి ఇది సరిౖయెన సమయం కాదు’ అని గర్వితతో అనేవారు కొందరు. వారి మాటలను పట్టించుకోకుండా ‘మన కోసం ΄్లానెట్ వేచి చూడదు కదా. మరి ఆలస్యం చేయడం ఎందుకు?’ అని ఆగకుండా ముందుకు వెళ్లింది. ‘వై వేస్ట్?’ ప్రారంభించడానికి కారణం గర్విత మాటల్లోనే..‘మహారాష్ట్ర, బెంగళూరులో కరువు పరిస్థితులు, రైతుల ఆత్మహత్యల గురించి చదివి బాధపడ్డాను. తాగు నీటి కోసం మహిళలు ఎండలో మైళ్ల దూరం నడవడం చూశాను. మన దేశంలో కోట్లాది మంది పిల్లలకు స్వచ్ఛమైన నీరు అందుబాటులో లేదు. దీని వల్ల ఎంతో మంది పిల్లలు చనిపోతున్నారు. ఇలాంటి ఎన్నో కారణాలను దృష్టిలో పెట్టుకొని వై వేస్ట్ ఆవిర్భవించింది’ పద్దెనిమిది సంవత్సరాల వయసులో గర్విత గుల్హటి ‘గ్లోబల్ చేంజ్‌మేకర్’ టైటిల్‌కు ఎంపికైంది. 'రిధిమ పాండే' నిగ్గదీసి అడిగే నిప్పు స్వరం! ఉత్తరాఖండ్‌కు చెందిన రిధిమ పాండే చిన్న వయసులోనే క్లైమెట్ యాక్టివిస్ట్‌గా పెద్ద పేరు తెచ్చుకుంది. పర్యావరణ కార్యకర్తలైన తల్లిదండ్రుల నుంచి స్ఫూర్తి పొందింది. ప్రకృతి విధ్వంసం, వాతావరణ మార్పులపై ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వడం లేదంటూ 2019లో రిధిమ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పర్యావరణ సంబంధిత కేసులను స్వీకరించడానికి 2010లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఏర్పాటు చేశారు. ‘ఎన్జీటీ’ రిధిమ కేసును స్వీకరించినప్పటికీ ఈ కేసు ‘ఎన్విరాన్మెంట్ పాక్ట్ అసెస్మెంట్’ పరిధిలోకి వస్తుందని కొట్టివేసింది. వాతావరణ సంక్షోభంపై చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, టర్కీ, అర్జెంటీనా దేశాలపై ఐక్యరాజ్య సమితి బాలల హక్కుల కమిటీకి ఫిర్యాదు చేసిన 14 మంది యువ ఉద్యమకారులలో రిధిమ ఒకరు. ఏకైక భారతీయురాలు కూడా.వాతావరణ సంక్షోభంపై రిధిమ గత కొన్ని ఏళ్లుగాఎన్నో వ్యాసాలు రాసింది. ఎన్నో దేశాలలో ఎన్నో ప్రసంగాలు చేసింది. వాతావరణ యువ ఉద్యమకారుల ప్రతి జాబితాలో చోటు సంపాదించింది. ‘చిల్డ్రన్ వర్సెస్ క్లైమెట్ చేంజ్’ పేరుతో పుస్తకం రాసింది. 'వర్ష రైక్వార్' ప్రతి ఊరుకు పర్యావరణ స్వరం! ‘గతంలో అద్భుతమైన పంట దిగుబడులు వచ్చేవి. క్రమక్రమంగా ఏటేటా పంట దిగుబడి క్షిణిస్తోంది. ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించే క్రమంలో పర్యావరణ అంశాలపై ఆసక్తి పెరిగింది’ అంటుంది మధ్యప్రదేశ్‌కు చెందిన వర్షా రైక్వార్. గతంలో చుట్టు పక్కల ఎన్నో వనాలు కనిపించేవి. అవి ఎందుకు అదృశ్యమయ్యాయి? అని స్థానికులను అడిగితే ‘విధిరాత. అంతే! మనం ఏం చేయలేం’ అని విధిపై భారాన్ని మోపారు. ఈ నేపథ్యంలో సామాన్య మహిళలకు ‘వాతావరణ మార్పులు–కారణాలు–మన కార్యచరణ’ గురించి తెలియజేయడానికి రేడియో జాకీగా ప్రస్థానంప్రారంభించింది వర్ష. పర్యావరణ రంగంలో కృషి చేస్తున్న చేంజ్మేకర్ల అసాధారణ కథలను ఎఫ్ఎం 90.4 రేడియో బుందెల్‌ఖండ్ ద్వారా వెలుగులో తీసుకువచ్చి పదిమందికి తెలిసేలా చేసింది. వాతావరణ మార్పులపై అవగాహనను క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్లిన వర్ష ‘యునైటెడ్ నేషన్స్ యంగ్ క్లైమెట్ లీడర్–2021’గా ఎంపికైంది. 'హీనా సైఫి' వాయు కాలుష్యంపై వార్.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరuЇలో ఎంబీఏ చదువుతున్న హీనా సైఫి ‘క్లైమెట్ చేంజ్ ఛాంపియన్’గా గుర్తింపు పొందింది. ఉమెన్ క్లైమెట్ కలెక్టివ్ (డబ్ల్యూసీసీ) వేదికలో పాలుపంచుకున్న 16 మంది ఉమెన్ ఛాంపియన్స్‌లో హీన ఒకరు. ఐక్యరాజ్య సమితి ‘వుయ్ ది చేంజ్’ క్యాంపెయిన్‌లో కూడా హీన భాగం అయింది. ఎనిమిదవ తరగతి పూర్తయిన తరువాత ‘ఇక చదివింది చాలు’ అన్నారు తల్లిదండ్రులు. అయితే హీన పట్టుదల ముందు వారి నిర్ణయం ఓడిపోయింది. పర్యావరణ సమస్యలపై అవగాహన లేకపోవడానికి చదువుకోకపోవడం ఒక కారణం అని గ్రహించిన హీన, పిల్లలు ఎవరైనా స్కూల్ మానేస్తే వారి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడేది. పిల్లలు తిరిగి స్కూలుకు వచ్చేలా చేసేది. అంతేకాదు...స్థానిక స్వచ్ఛంద సంస్థలో చేరి వాతావరణ మార్పులపై జరిగిన ఎన్నో సమావేశాలు, వర్క్‌షాప్‌లకు హాజరైయ్యేది. ‘క్లైమెట్ ఎజెండా’పై లక్నోలో జరిగిన సమావేశానికి హాజరై వాయు కాలుష్యం, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్....మొదలైన ఎన్నో విషయాల గురించి తెలుసుకుంది. తాను తెలుసుకున్న విషయాలను ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసేది. ‘సూరజ్ సే సమృద్ధి’ పేరుతో సౌరశక్తి ఉపయోగాల గురించి విస్తృతంగా ప్రచారం చేసింది. బడులలో పర్యావరణ అంశాలకు సంబంధించి పోస్టర్–మేకింగ్ యాక్టివిటీస్ నిర్వహించింది. 'నేహా శివాజీ నైక్వాడ్' గ్రీన్ రికవరీ! మన దేశంలోని కొద్దిమంది పర్యావరణ ఆధారిత డేటా సైంటిస్టులలో నేహా ఒకరు. క్లైమేట్ టెక్నాలజీ ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్ల ద్వారా క్లైమేట్ డేటా ఫోకస్డ్ సొల్యూషన్స్ కోసం చేపట్టే కార్యక్రమాలకు సహకారం అందిస్తోంది నేహా. ‘క్లైమేట్ కలెక్టివ్’ ఫౌండేషన్ ద్వారా యువ ఎంటర్ప్రెన్యూర్లకు వ్యాపార పరిజ్ఞానం, మార్కెట్ కనెక్షన్లు, సాంకేతిక సామర్థ్యం విషయంలో సహాయపడుతోంది. ‘క్లైమేట్ కలెక్టివ్’కు ముందు సాఫ్ట్వేర్, టెక్నాలజీకి సంబంధించిన మల్టీ నేషనల్ కన్సల్టింగ్ ఫర్మ్ ‘జెడ్ఎస్ అసోసియేట్స్’లో పని చేసింది నేహా. తన నైపుణ్యాన్ని ఉపయోగించి 140కి పైగా గ్రీన్ స్టార్టప్లనుప్రారంభించడంలో సహాయపడింది. యూఎన్–ఇండియా ‘వుయ్ ది చేంజెస్’ క్యాంపెయిన్‌కు ఎంపికైన పదిహేడు మంది యంగ్ క్లైమేట్ చేంజ్ లీడర్లలో నేహా ఒకరు. ‘జీరో–వేస్ట్’పై పని చేసే యూత్ సెల్ ‘సెల్ పర్వాహ్’కు కో–ఫౌండర్ అయిన నేహా ‘గ్రీన్ రికవరీని వేగవంతం చేయడానికి నావంతుగా క్షేత్రస్థాయిలో పనిచేయాలనుకుంటున్నాను’ అంటుంది. ఇవి చదవండి: International Womens Day 2024: 'మనల్ని మనం' గౌరవించుకుందాం! -
International Womens Day 2024: 'మనల్ని మనం' గౌరవించుకుందాం!
‘మహిళలను గౌరవిద్దాం’ అనే మాట తరచూ వింటుంటాం. మహిళ గురించి మాట్లాడే ఉన్నతమైన పదాలు మహిళా దినోత్సవం వరకే పరిమితం అవడం కూడా చూస్తుంటాం. ‘సమాజంలో వస్తున్న మార్పులను ఆహ్వానించే క్రమంలో స్త్రీ గౌరవానికి, రక్షణకు వెన్నుదన్నుగా నిలిచేది కూడా మొదట మహిళే అయి ఉండాలి’ అంటూ వివిధ రంగాలలోని మహిళలు తమ మాటల ద్వారా ఇలా వినిపిస్తున్నారు. మహిళా దినోత్సవ స్ఫూర్తితో ఆ మాటలను ఆచరణలోనూ పెట్టి మంచి ఫలితాలను చూద్దాం. ప్రయత్నించడం మానకూడదు.. మగవారితో పోల్చితే ఇంట్లో, ఆఫీసులోనూ స్త్రీల పాత్ర ఎక్కువే. రెండుచోట్లా నిబద్ధతతో పని చేస్తుంటారు. కానీ, రెండు చోట్లా అర్థం చేసుకునేవారుండరు. విసుగు అనిపిస్తుంటుంది. అలాగని, మన ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. ముప్పై ఏళ్ల క్రితం నేను పీజీ విద్యార్థిగా ఉన్నప్పుడు క్లాసులో అమ్మాయిలు ఐదు శాతం కన్నా తక్కువే ఉండేవారు. ఇప్పుడు.. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్‌లో 60 నుంచి 70 శాతం మంది అమ్మాయిలు ఉంటున్నారు. బాయ్స్ హాస్టల్స్‌లో కొన్నింటిని గర్ల్స్ హాస్టల్‌గా మార్చేద్దామని కూడా చూస్తున్నాం. పీహెచ్‌డి చేసే అమ్మాయిల సంఖ్యా పెరిగింది. పోరాడి సీట్లు, పదవులు దక్కించుకుంటున్నాం. అయితే, ఎంత పెద్ద చదువులు చదివినా, ఏ హోదాలో ఉన్న ముందు ఎవరిని వారు గౌరవించుకోవాలి. చదువులో, హోదాలో సమానత్వం కోసం పాటుపడాలనే కాదు మన ఆత్మగౌరవాన్ని కోల్పోకుండా ఆత్మస్థైర్యంతో ఎదగాలనుకోవాలి. కుటుంబంలో ఏ కష్టం వచ్చినా ఆ కుటుంబాన్ని కాపాడుకోగలమనే ధైర్యం ఉండాలి. రక్షించడానికి ఎవరో ఒక మగవాడైనా ఉండాలి అనే ఆలోచనను దూరం పెట్టాలి. అప్పుడే మన శక్తి ఏంటో మనకు తెలుస్తుంది. అందుకు తగిన సత్తాను సంపాదించుకోవడం మన లక్ష్యం అవ్వాలి. ఆత్మరక్షణ, కుటుంబ రక్షణ సమాజంలో మనల్ని ఉన్నతంగా చూపుతుంది. –ప్రొఫెసర్ సి.వి. రంజని, హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ సెంటర్ డైరెక్టర్, ఓయూ వ్యక్తిత్వాన్ని పోస్ట్‌మార్టం చేస్తున్నారు.. స్లోగన్స్ చెబుతున్నారు. కానీ, పాటించడం లేదు. మగవారితో సమానంగా కష్టపడుతున్నారు. కానీ, మగవారు స్త్రీని శారీరకంగా బలహీనులుగానే చూస్తారు. ఆమె శక్తి తెలిస్తే మగవారిలో ఆ ఆలోచనే రాదు. ఎక్కడైనా లైంగిక వేధింపులకు గురైన మహిళ ఎవరైనా ఉంటే ఆ సంఘటనను, సదరు వ్యక్తులను కాకుండా ముందు ఆమె వ్యక్తిత్వాన్ని పోస్ట్‌మార్టం చేస్తుంటారు. ఇంటి దగ్గర నుంచి పని ప్రదేశంలోకి ఒక మహిళ రావాలంటే ఎన్నో అడ్డంకులను దాటాల్సి ఉంటుంది. అక్కడా వేధింపులు తప్పవు. ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చిన అమ్మాయిలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. పెళ్లి చేసుకున్న అబ్బాయి వదిలేసి వెళ్లిపోతే, పుట్టింటి సహకారం అందక ఆ అమ్మాయి బతుకుదెరువులో చాలా వేధింపులను ఎదుర్కొంటున్నది. ఆమె జీవనం గురించి తప్పుగా మాట్లాడే మగవాళ్లు ఉన్నారు. సమస్యను ఎదుర్కోవడంలో గొడవ తప్పక జరుగుతుంది. కానీ, సింగిల్ ఉమెన్ గొడవ పడితే ఆమె వ్యక్తిత్వాన్ని కించపరుస్తుంటారు. తల్లి తన కూతురుకి ఒంటరిగా ఎలా జీవించాలో చెబుతూనే సమాజాన్ని ఎదుర్కొనే ధైర్యం ఇవ్వాలి. సోషల్ మీడియాలో ‘ఆమె’గౌరవానికి సంబంధించిన దారుణమైన వీడియోలు చూస్తున్నాం. ఏదైనా అమ్మాయికి సంబంధించిన సంఘటన జరిగినప్పుడు ‘అమ్మాయి ఎలాంటిది?’ అని ఆమెను నెగిటివ్ంగాప్రొజెక్ట్ చేస్తున్నారు. స్వలాభం కోసం చేసే ఇలాంటి ఎన్నో పనులు ‘ఆమె’ గౌరవాన్ని తీసేస్తూ బతికేస్తున్నారు. – డాక్టర్ జయశ్రీ కిరణ్, కాకతీయ ఫౌండేషన్, హైదరాబాద్ మన మీద మనకు నమ్మకం! మగవారితో పోల్చుకుంటే టైమ్ మేనేజ్ చేయగల శక్తి స్వతహాగా స్త్రీకి ఉంటుంది. ఒక గోల్ రీచ్ అవ్వాలని కష్టపడితే అది ఎంత దూరంలో ఉన్నా మనకు దగ్గర కావల్సిందే. మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆరోగ్యం బాగా లేదనో, సరైన చదువు లేదనో, కుటుంబ బాధ్యతలు ఉన్నాయనో.. ఇలా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఎంత కష్టమైన పరిస్థితులు ఎదురైనా మన కలలను మనమే డిజైన్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండి కూడా మనల్ని మనం బాగు చేసుకోవచ్చు. నాకు స్కూల్ వయసులో పెళ్లి అయింది. ఇద్దరు పిల్లలు. అయినా యోగా ట్రైనర్‌గా, బ్యుటీషియన్‌గా మేకప్ అకాడమీ నడుపుతున్నాను. పిల్లలిద్దరూ సెటిల్ అయ్యారు. ఇంటిని చక్కదిద్దుకుంటూనే నా పనులు చేసుకుంటూ వచ్చాను. సమస్యలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటాయి. నా కెందుకు ఈ సమస్య వచ్చింది అని ఏడ్చుకుంటూ కూర్చుంటే ఎప్పటికీ పరిష్కారం అవ్వదు. సానుభూతి తప్ప బయటి నుంచి గౌరవం కూడా లభించదు. మనమీద మనకున్న నమ్మకమే మనకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. – రూప, యోగా టీచర్ అండ్ బ్యూటీషియన్ భయం బిడియంతో శక్తి తగ్గుతుంది.. స్త్రీలను గౌరవించండి అనే మాట చాలా చోట్ల వింటూనే ఉంటాం. ఆ మాట వినటమే మన దౌర్భాగ్యం. ఎందుకంటే స్త్రీని గౌరవించాలి అని చెబితే గాని తెలియని సమాజంలో మనం జీవనం సాగిస్తున్నాం. ఉమ్మడి కుటుంబాలలో ఉన్నప్పుడు స్త్రీకి మాట్లాడే అవకాశం కూడా ఉండేది కాదు. ఇంటి పనుల్లో వంట పనుల్లో మునిగిపోయే వాళ్ళు. ప్రస్తుత పరిస్థితులు అలా లేవు. మారుతున్న టెక్నాలజీతో పాటు మనలో కూడా మార్పు రావాలి. భయం, బిడియం అనే భావాలతో స్త్రీ తన శక్తిని గుర్తించటం లేదు. ఒక తల్లి యవ్వనంలో ఉన్న తన కూతురుతోనో కొడుకుతోనో తన చిన్నప్పటి కబుర్లు, నెరవేరని కలలు, రక్తసంబంధాలు, స్నేహితుల గురించి, జీవితంలో అనుభవించిన కష్టాలు వాటిని ఎదుర్కొనే నేర్పరితనం... చర్చించడం లేదనిపిస్తోంది. నాటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు అనుకుంటారు. కానీ, ఏ కాలమైనా స్త్రీ ఎప్పుడూ మెలకువతో తనను తాను కాపాడుకోవాలనే స్పృహతో ఉండాలి. పాలకులు కూడా స్త్రీని అన్ని రంగాల్లో పైకి తెస్తున్నాం అని చెబుతుంటారు. కానీ, అమ్మాయిలపై అఘాయిత్యాలను మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. స్వతంత్ర దేశం కోసం ఎందరో స్త్రీలు తమ ్రపాణాలర్పించారు. వారి ్రపాణత్యాగాన్ని స్మరణ చేసుకున్నా మహిళగా ఈ సమాజంలో ఎలా ఉండాలి అనేది తెలుస్తుంది. మనలో మనకు ఐకమత్యం ఉండాలి. ఏ కారణం వల్ల ఒంటరిగా ఉంటున్న స్త్రీని సాటి స్త్రీ అర్థం చేసుకొని, ఆమెకు మద్దతునివ్వగలిగితే చాలు ధైర్యం పెరుగుతుంది. స్త్రీలు ఒకరికి ఒకరుగా నిలవాలి. పనిమనిషి పనిని కూడా గౌరవించడం కుటుంబంలో వారికే అర్ధమయ్యేలా తెలపాలి. పారిశుద్ధ్య కార్మికురాలి, పనిమనిషి, రోజువారీ పనుల్లో తారసపడే ప్రతి స్త్రీని గౌరవించాలని పిల్లలకు చె΄్పాలి. రేపటి తరంలో వచ్చే మార్పు కూడా సమాజానికి మేలు కలుగజేస్తుంది. – వి. ప్రతిభ, బిజినెస్ ఉమెన్ ఇవి చదవండి: International Womens Day 2024: ప్రతి రంగంలో ప్రతిభ -
సాధారణ మహిళలు సృష్టించిన చరిత్ర
మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2024లో స్త్రీ పురుష సమానత్వం కోసం పెట్టుబడిని పెట్టమని పిలుపునిచ్చింది ఐక్యరాజ్యసమితి. నినాదాలు ఎంత గొప్పగా ఉన్నా ఆచరణ ఉంటేనే మార్పు వస్తుంది. సాధారణ మహిళలు సృష్టించిన అసమాన్య చరిత్ర మహిళా దినోత్సవానికి నాంది పలికింది. పారిశ్రామికీకరణ మొదట్లో 19వ శతా» ్దం ఆరంభంలో ఇటలీ, ఇంగ్లాండ్, పోలండ్, రష్యా వంటి వివిధ దేశాల నుండి అమెరికాకు వలస వచ్చినవారు పరిశ్రమలలో పని చేస్తుండే వారు. కనీస సౌకర్యాలు లేకుండానే అతి తక్కువ వేతనంతో రోజుకు 15 గంటలు పని చేస్తుండేవారు. యూనియన్ చేసే సమ్మెలలో కూడా మగవారి డిమాండ్లనే పరిష్కరించేవారు. దీనితో 1820ల కాలంలోనే మహిళలు యూనియన్లుగా సంఘటితమవడం మొదలు పెట్టారు. 1857 మార్చి 8న పెద్ద సంఖ్యలో మహిళలు కవాతు చేశారు. పది గంటల పనిదినం, పురుషులతో సమాన హక్కులు, కనీస సౌకర్యా లను డిమాండ్ చేశారు. పోలీసుల లాఠీచార్జిని, కిరాయి రౌడీల దౌర్జ న్యాన్ని ఎదుర్కొన్నారు. 1900లో అంతర్జాతీయ మహిళా దుస్తుల శ్రామిక యూనియన్ ఏర్పడి మార్చి 8న మరిన్ని నిరసన ప్రదర్శ నలు జరిగాయి. 1908లో 1857 నాటి మార్చి 8 నిరస నను గుర్తు చేసుకుంటూ... పని గంటల తగ్గింపు, మెరుగైన పని పరిస్థి తులు, సమాన హక్కులతో పాటు చైల్డ్ లేబర్‌ను నిషేధించాలని ప్రదర్శన చేశారు. 1909లో 20వేల మందితో సుదీర్ఘకాలం పాటు సమ్మె చేశారు. సమ్మె పాక్షికంగా విజయం సాధించింది. కానీ చదువు రాని మహిళలు ఏమి చేయలేరని భావనను ఇది సవాలు చేసింది. వారిలో ఆత్మగౌరవాన్నీ, శక్తినీ నింపింది. ఇదే కాలంలో అమెరికా సోషలిస్టుల మద్దతు వీరికి లభించింది. ఈ పోరాటాలను పరిశీలిస్తూ ఎంతో స్ఫూర్తి పొందిన జర్మన్ కమ్యూనిస్టు నాయకురాలు క్లారా జెట్కిన్ ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్టమైన రోజున ప్రపంచవ్యాప్తంగా మహిళలు తమ డిమాండ్ల కోసం ఒత్తిడి తెచ్చేందుకు కేంద్రీకరించాలని 1910లో ‘కోపెన్ హెగెన్’లో జరిగిన రెండవ కాన్ఫరెన్స్‌లో ప్రతిపాదించింది. 17 దేశాలకు చెందిన 100 మంది మహిళా ప్రతినిధులు దీనిని ఏక గ్రీవంగా ఆమోదించారు. అప్పటినుంచి సోషలిస్టు పార్టీ పిలుపు నందుకొని మరిన్ని దేశాలలో మార్చి 8న మహిళా సమస్యలపై నిరసన కార్యక్రమాలు జరిగాయి. 1912లో గౌరవప్రదమైన జీవితం కోసం ‘మాకు రొట్టెలే కాదు గులాబీలు కావాలి’ అంటూ ప్ల కార్డ్స్ పట్టుకొని ప్రదర్శన చేశారు. ‘బ్రెడ్ అండ్ రోజెస్‘ పాట మార్చి 8 కవాతు గీతం అయింది. 1917లో రొట్టె, శాంతి కోసం డిమాండ్ చేస్తూ జరిపిన మహిళా దినం రష్యా విప్లవాన్ని ఒక మలుపు తిప్పింది. సోషలిస్టు దేశాలలో మొదటగా ఈ డిమాండ్లను పరిష్కరిస్తూ మార్చి 8న సెలవు దినంగా ప్రకటించారు. 1975లో ఐక్యరాజ్యసమితి మార్చి 8ని ‘అంతర్జాతీయ మహిళా దినో త్సవం’గా జరపాలని ప్రకటించింది. శ్రామిక మహిళలు చేసిన పోరాట ఫలితాలు ఆఫీసుల్లో పనిచేసే కొద్ది మంది మహిళలకే దక్కాయి. రాజకీయ పార్టీలు మహిళలను ఓటుబ్యాంకుగా మాత్రమే చూస్తూ ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి తర్వాత మరచిపోతున్నాయి. తమ సమస్యలపై ప్రశ్నిస్తూ మార్చి 8 స్ఫూర్తితో పోరాడితేనే మహిళల జీవితాలలో మార్పు వస్తుంది. – రాధ, చైతన్య మహిళా సంఘం -
పరువు, ప్రతిష్ఠ – స్త్రీల భద్రత
ఇటీవల ఝార్ఖండ్ పర్యటన కోసం వచ్చిన ఒక విదేశీ మహిళ సామూహిక అత్యాచారానికి గురైన విషయం అనేక చర్చలకి దారితీసింది. బాధితుల తరుపున వేసే ప్రశ్నని నేరంగా చూసే కర్మభూమి మనది. ఈసారి బాధ్యతని జాతీయ మహిళా కమిషన్ చైర్ విమన్ రేఖా శర్మ తీసుకున్నారు. అర్ధరాత్రి, అటవీ ప్రాంతంలో గుడారం వేసుకుని పడుకున్న స్పానిష్, బ్రెజిలియన్ జంటమీద ఏడుగురు వ్యక్తులు దాడిచేసి వారిని కొట్టి, కత్తి చూపి చంపుతామని బెదిరించి, వారి విలువైన వస్తువులు దోచుకుని, మహిళని సామూహికంగా రేప్ చేశారు. ఆసియా పాత్రికేయ రంగంలో పదిహేనేళ్లుగా పని చేస్తున్న డేవిడ్ జోసెఫ్ వోలోజ్కో అనే జర్నలిస్ట్ తన అనుభవాల మేరకి భారతదేశంలో విదేశీ మహిళలు ఒంటరిగా ప్రయాణించడం మంచిది కాదని చెప్పాడు. ఇది వైరల్ అయి రకరకాల కామెంట్స్ మొదలయ్యాయి. అందులో రేఖా శర్మ వేసిన రీట్వీట్– జాతీయ మహిళా కమిషన్ వైఖరిని స్పష్టం చేసింది. ‘ఇటువంటి ఘటనల మీద మీరెప్పుడైనా పోలీసు రిపోర్ట్ ఇచ్చారా? ఒకవేళ ఇవ్వకపోతే మీరు పూర్తిగా భాధ్య తారహితమైన మనిషి. కేవలం సోషల్ మీడియాలో రాసుకుంటూ దేశ పరువుని తీయాలనుకోవడం మంచిది కాదని’ హితవు పలికారు. పాతకాలపు సిని మాల్లో, సాహిత్యంలో స్త్రీలమీద అత్యాచారం జరిగిన ఘటనలు చూపించాల్సి వచ్చినపుడు కొన్ని విచి త్రాలు జరిగేవి. ‘ప్రాణం కన్నా మానం విలువైనదని’ చెప్పి ఆ స్త్రీపాత్రని చంపేయడమో, జీవితాంతం కుళ్ళి కుళ్ళి చావమని సూచించడమో లేదా అత్యాచారం చేసినవాడు పెద్దమనసు చేసు కుని పెళ్లికి సిద్ధపడ డమో చూపించేవారు. పరువు ప్రతిష్ఠలన్నీ స్త్రీల శరీర శీలం చుట్టూ కమ్ముకుని ఉంటాయనీ, శీలంపోతే పరువుపోతుందనీ నమ్మేవారు కనుక మూతముప్పిడి వ్యవహారాలు నడిచేవి. కాలం మారింది. స్త్రీల మీద లైంగికహింస తగ్గకపోయినా, కనీసం అత్యాచారాన్ని ఎలా చూడాలన్న దృష్టికోణంలో కొన్ని మార్పుల యితే వచ్చాయి. అత్యాచారానికి గురైన ఆ విదేశీ మహిళ కూడా, ‘వారు నన్ను చంపకుండా వదిలి పెట్టారు. థాంక్ గాడ్’ అన్నది. దాడికి గురైన వాస్తవం తప్ప ఇందులో పరువు గోల లేదు. భారతదేశంలో విదేశీ స్త్రీలకే కాదు, స్వదేశీ స్త్రీలకి కూడా రక్షణ లేకపోవడం వాస్తవం. ఇటువంటి వర్త మానం ఉన్నచోట భారత మహిళల భద్రత కన్నా దేశపరువు గురించి ఆలోచించే రేఖా శర్మ లాంటివారు ‘కొత్త స్త్రీలు’. వీరు మహిళలని మధ్యయుగాలకి నడి పించుకు వెళ్లగల సమర్థులు. ఈ ఘటన అటవీప్రాంతంలో జరిగింది. లైంగికంగా వేధించడం, అత్యాచారం చేయడం వంటి హింసాపద్ధతులని ప్రేరేపించే బైటి ప్రభా వాలకి అక్కడ ఆస్కారం తక్కువ. అటువంటిది మారుమూల ప్రాంతాల్లోకి కూడా కల్చరల్ పొల్యూషన్ వ్యాపించడమనేది జాగ్రత్త పడాల్సిన విషయం. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకువచ్చి, వారిని చూపించిన తీరుని బట్టి నిందితులు బహుశా స్థానికులు, అట్టడుగువర్గాల వారయ్యే అవకాశం ఉంది. బాధితురాలు విదేశీ మహిళ, అందునా ధైర్యంగా రిపోర్ట్ చేసిన మహిళ అని సంకోచం ఉన్నట్లుంది గానీ లేకపోతే ఈపాటికే ‘ఎన్కౌంటర్ న్యాయం’ డిమాండ్ ఎల్లెడలా వూపు అందుకునేదే. నేరానికి కూడా కులమూ, వర్గమూ ఉంటుంది కనుక, అనువుగా దొరికే నేరస్థుల విషయంలో నేరాన్ని మించిన శిక్షలను విధించి ప్రజాగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తారు కనుక, నిందితుల నేరానికి తగినశిక్ష మాత్రమే పడాలన్న మాటని పదేపదే ఇపుడు గుర్తు చేసుకోవాలి. వ్యాసకర్త ప్రరవే (ఏపీ శాఖ) కార్యదర్శి -
తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసొసియేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసొసియేషన్ ఆధ్వర్యంలో గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ సంబరాల్లో జిల్లా అకౌంట్స్ అధికారులతో పాటు అన్ని శాఖల్లోని మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. తమ ప్రతిభను చాటేలా వినూత్నంగా వివిధ ప్రదర్శనలు ఇచ్చారు. కొందరు డాన్స్‌తో అలరిస్తే.. మరికొందరు పాటలు పాడారు. మహిళలు అన్నింటా సమానమని చాటి చెప్పేలా తమ పాఠవాలను ప్రదర్శించారు. మిగతా కార్యక్రమాలల్లోనూ చురుగ్గా పాల్గొని ఎంజాయ్ చేశారు. తెలంగాణ గెజిటెడ్ అసొసియేషన్ ప్రతినిధి దీపారెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా జాయింట్ డైరెక్టర్ రజిని, శైలజా రాణి, చీఫ్ఫైనాన్స్ డిప్యూటీ సెక్రటరీ గీతా చౌదరీ తదితరులు హాజరయ్యారు. -
మహిళతో బీజేపీ ఎంపీ అనుచిత వ్యాఖ్యలు!.. నీ భర్త బతికే ఉన్నాడు కదా అంటూ..
సాక్షి, బెంగళూరు: కర్ణాటక బీజేపీ ఎంపీ మునిస్వామి వివాదంలో చిక్కుకున్నారు. మహిళా దినోత్సవం రోజున మహిళపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంపీని చిక్కుల్లో పడేశాయి. అసలేం జరిగిందంటే.. ఎంపీ మునిస్వామి మహిళా దినోత్సవం రోజు కోలార్ జిల్లాలో ఎగ్జిబిషన్ అండ్ సేల్స్ ఫెయిర్‌ను ప్రారంభించారు. ఈ క్రమంలో మార్కెట్లోని దుకాణాలను పరిశీలిస్తున్న ఎంపీ.. ఓ వస్త్ర దుకాణంలోని మహిళా వ్యాపారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మహిళను నుదుట బొట్టు ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నించారు. మీ భర్త బతికే ఉన్నారుగా అని అంటూనే అ అమ్మాయికి బొట్టు ఇవ్వండి అని ఇప్పిస్తాడు. ‘నీ పేరేంటి? నువ్వు బొట్టు ఎందుకు పెట్టుకోలేదు? నీ స్టాల్‌కు వైష్ణవి అని పేరు పెట్టి, బొట్టు ఎందుకు పెట్టుకోలేదు? నీకు కామన్ సెన్స్ లేదా? మీ భర్త ఇంకా బతికే ఉన్నారు కదా. ముందు బొట్టు పెట్టుకోండి’ అంటూ దుర్భాషలాడాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఎంపీ ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. మహిళా దినోత్సవం నాడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ విరుచుకుపడింది. బీజేపీ దుర్మార్గపు సంస్కృతికి ఈ వీడియో అద్దం పడుతోందని విమర్శించింది. దీనిపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ పీ చిదంబరం స్పందిస్తూ.. బీజేపీ భారత్‌ను హిందూత్వ ఇరాన్‌గా మారుస్తుందని మండిపడ్డారు. చదవండి: బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయా? నిజమేనా? "Wear a Bindi first. Your husband is alive, isn't he. You have no common sense" says this #BJP MP #Muniswamy to a woman vendor.#Karnataka #Kolar #WomensDay pic.twitter.com/YSedSDbZZB— Hate Detector 🔍 (@HateDetectors) March 9, 2023 -
ఇండస్ట్రీ కళకళ.. లేడీస్ స్పెషల్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘లేడీస్ స్పెషల్’ అంటూ కొత్త పోస్టర్స్‌తో ఇండస్ట్రీ కళకళలాడింది. ఆయా చిత్రబృందాలు వారి సినిమాల్లోని కథానాయికల పో స్టర్స్ను రిలీజ్ చేశాయి. ఆ పో స్టర్స్ పై ఓ లుక్ వేయండి. ఫారిన్ అన్విత ఫారిన్ వీధుల్లో ఎంచక్కా హ్యాపీగా వాక్ చేస్తున్నారు మిస్ అన్వితా రవళి శెట్టి. ఆమె సంతోషానికి గల కారణాలను వేసవిలో థియేటర్స్‌లో చూడాల్సిందే. అనుష్కా శెట్టి, నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం వేసవిలో రిలీజ్ కానుంది. కాగా ఈ చిత్రంలో చెఫ్ అన్విత రవళి పాత్రలో అనుష్క నటిస్తున్నారు. అన్వి త కొత్త పో స్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. శకుంతల ప్రేమ ప్రముఖ కవి కాళిదాసు రచించిన ప్రేమకావ్యం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా రూపోందిన చిత్రం ‘శాకుంతలం’. ఇందులో శకుంతలగా సమంత, దుష్యంత మహారాజుగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించారు. గుణశేఖర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఈ చిత్రంలోని సమంత కొత్త పో స్టర్‌ను రిలీజ్ చేశారు. అలాగే బుధవారం నుంచి సమంత ‘ఖుషి’ చిత్రం షూటింగ్లో పాల్గొంటున్నారు. ప్రమాదానికి చేరువలో.. ఉమెన్స్ డే రోజున ‘మ్యాన్’ సినిమాను అనౌన్స్ చేశారు హన్సిక. క్రైమ్ థ్రిల్లర్ జానర్లో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్‌గా రూపోందు తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. మద్రాస్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇగోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘‘వేటాడాలి. లేకపో తే మరొకరు మనల్ని వేటాడతారు. ఒక నిజానికి మనం దగ్గరవుతున్నామంటే అర్థం ప్రమాదానికి కూడా చేరువ అవుతున్నట్లే లెక్క’’ అని ఈ సినిమా గురించి పేర్కొన్నారు హన్సిక. మిస్ భైరవి ‘రామబాణం’ కోసం భైరవిలా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు డింపుల్ హయతి. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాల తర్వాత హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్లో రూపోందుతున్న ‘రామబాణం’లో డింపుల్ హయతి హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలోని ఆమె ఫస్ట్ లుక్ పో స్టర్‌ను రిలీజ్ చేసి, భైరవి పాత్రలో నటిస్తున్నట్లుగా వెల్లడించారు మేకర్స్. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొ ట్ల నిర్మిస్తున్న ఈ చిత్రం మే 5న విడుదల కానుంది. గీత సాక్షిగా.. నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపోందిన చిత్రం ‘గీత సాక్షిగా’. లాయర్ పాత్రలో చిత్రా శుక్లా నటించిన ఈ చిత్రకథ మరో తార చరిష్మా చుట్టూ తిరుగుతుంది. ఆదర్శ్, చిత్రా శుక్లా జంటగా రూపోందిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఈ నెల 22న రిలీజ్ కానుంది. ఈ చిత్రం నుంచి చిత్రా శుక్లా లుక్‌ని రిలీజ్ చేశారు. ఆంథోని మట్టిపల్లి స్క్రీన్‌ప్లే రాసి, దర్శకత్వం వహించారు. చేతన్ రాజ్ కథ అందించి, నిర్మించారు. ఇవే కాదు.. మహిళా దినోత్సవానికి మరికొందరు తారల కొత్త పో స్టర్స్ కూడా విడుదలయ్యాయి. -
మహిళల కోసం ‘సింగిల్ విండో’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మహిళలు వ్యాపార, వాణిజ్య రంగాల్లో ఎదిగేందుకు కృషి చేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం వారికి తగిన ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. ఇందుకోసం టీఎస్–ఐపాస్ తరహాలో త్వరలో ఓ ‘సింగిల్ విండో’విధానం తీసుకురానున్నట్లు వెల్లడించారు. దీనిపై అధికారులు, మహిళా వ్యాపారవేత్తలతో చర్చిస్తున్నామని, త్వరలోనే పేరు పెట్టి అమల్లోకి తీసుకువస్తామని చెప్పారు. బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వీ హబ్ 5వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఓ హోటల్లో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల్లో వినూత్న ఆవిష్కరణలతో పలువురికి ఉపాధి కల్పిస్తున్న మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కేటీఆర్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. వీ హబ్ వేదికగా ఉన్నత స్థాయికి మహిళలు రాష్ట్రాన్ని మహిళా పారిశ్రామికవేత్తల హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని మంత్రి చెప్పారు. మహిళలు ఏ రంగంలోనైనా అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని కొనియాడారు. మహిళలను ప్రోత్సహించేందుకు ఐదేళ్ల క్రితం వీహబ్‌ను ప్రారంభించామని, దాన్ని వేదికగా చేసుకుని ఎందరో మహిళలు ఉన్నతస్థాయికి చేరుకున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా 35,000 మందికి పైగా మహిళా ఉత్పాదకులను భాగస్వామ్యం చేయడంలో వీ హబ్ ప్రధాన పాత్ర పోషించిందని తెలిపారు. మహిళలను ప్రోత్సహించడంలో భాగంగా.. స్వయం సహాయక సంఘాలకు స్త్రీ నిధి కింద వేల కోట్ల రూపాయలను వడ్డీ లేని రుణాలుగా అందిస్తున్నామని చెప్పారు. తాజాగా రూ.750 కోట్ల వడ్డీ లేని రుణాలు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. అమ్మాయి తక్కువ అనే భావన తగదు ‘పిల్లలకు తల్లిదండ్రులు చిన్నప్పట్నుంచే విలువలు నేర్పించాలి. వారికి ఇష్టమైన చదువును చదివించాలి. తల్లిదండ్రుల వ్యవహారశైలి పిల్లలపై ప్రభావం చూపుతుంది. స్త్రీ, పురుషులకు ప్రతిభ సమానంగానే ఉంటుంది. కానీ కొందరు తెలిసీ తెలియక ‘అమ్మాయి తక్కువ.. అబ్బాయి ఎక్కువ’అనే భావన నేర్పిస్తున్నారు. అలా వివక్ష చూపించకుండా ఇద్దర్నీ సమానంగా చూడటం మన ఇంటి నుంచే ప్రారంభిస్తే.. వారు కూడా ఇతర అమ్మాయిల్ని, అబ్బాయిల్ని సమానంగా, గౌరవంగా చూస్తారు. అప్పుడే అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణించగలుగుతారు. మా ఇంట్లో నన్ను, నా చెల్లిని బాగా చదివించారు. నా చెల్లి యూఎస్ వెళ్తా అంటే నా కంటే ముందే పంపారు. మా పిల్లలను కూడా మేం సమానంగా చూస్తున్నాం. ఏం అవ్వాలనుకుంటే ఆ దిశగా ముందుకెళ్లాలని ప్రోత్సహిస్తున్నాం. పిల్లలకు ఆ నమ్మకం ఇవ్వగలిగితే అమ్మాయిలైనా, అబ్బాయిలైనా వంద శాతం అభివృద్ధి సాధిస్తారు. నా కూతురు 9వ తరగతి చదువుతోంది. తను మంచి ఆర్టిస్ట్ అవుతుంది అనుకుంటున్నాను. ఆమె ఏ రంగంలో ఉన్నా సరే మంచి మనిషిగా ఉండాలని కోరుకుంటున్నాను..’అని కేటీఆర్ అన్నారు. ‘బాస్’కి భయపడాల్సిందే.. ‘మహిళలు ఎక్కువ నిబద్ధతతో ఫోకస్డ్గా, బాధ్యతాయుతంగా ఉంటారు. మమ్మల్ని తొక్కేస్తున్నారు కూడా. మేం బయటకి ఎంత నటించినా ఇంట్లో మహిళలే బాస్‌లు. ఎంత పెద్ద నేత అయినా ఇంటికి వెళ్లాక బాస్‌కి భయపడాల్సిందే..’అంటూ కేటీఆర్ చమత్కరించారు. ఐదేళ్లలో 3,194 స్టార్టప్‌లు, చిన్న పరిశ్రమలు వ్యాపారాల నిర్వహణలో మహిళల భాగస్వామ్యం కీలకంగా మారిందని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ చెప్పారు. మహిళలను వివిధ రంగాల్లో ప్రోత్సహించడంలో వీ హబ్ పాత్రను వివరించారు. వీహబ్ ద్వారా గత ఐదేళ్లలో 3,194 స్టార్టప్‌లు, చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 5,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలు, 1,247 మంది విద్యార్థులు, 986 మంది సామాజికంగా ప్రభావశీలురైన పారిశ్రామికవేత్తలు, 609 మంది పట్టణ పారిశ్రామికవేత్తలతో వీ హబ్ విజయవంతంగా సాగుతోందని చెప్పారు. వివిధ రంగాల్లో మహిళలు ఎదిగిన తీరును వీ హబ్ సీఈవో దీప్తి రావుల వివరించారు. పలువురు మహిళలు తమ విజయానికి వీ హబ్ ఎలా తోడ్పడిందీ తెలిపారు. -
కేసీఆర్ పాలన మహిళలకు ల్యాండ్‌మైన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం మహిళలకు ఒక ల్యాండ్‌మైన్‌లా తయారయ్యిందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. ఎక్కడ బయటకు అడుగేస్తే ఎవరు వేధిస్తారోననే భయం మహిళల్లో నెలకొందన్నారు. బంగారు తెలంగాణలో మహిళలకు రక్షణ కరువైందని, రాష్ట్రంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు. బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ మహిళలకు రక్షణ కరువైందని నిరసిస్తూ ట్యాంక్‌బండ్‌పై నల్లబ్యాడ్జీలతో షర్మిల మౌనదీక్ష చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో గత ఐదేళ్లలో మహిళలపై దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలకు సంబంధించి వేల కేసులు నమోదయ్యాయన్నారు. ఆయా ఘటనలకు పాల్పడిన వారిలో ఎక్కువగా బీఆర్ఎస్ కార్యకర్తలే ఉన్నారని ఆమె ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ను మహిళా ద్రోహిగా అభివర్ణించారు. రాష్ట్రంలో మహిళా కమిషన్ డమ్మీగా మారిందని, ఒక మహిళా గవర్నర్‌కు కనీస గౌరవం సైతం లభించడం లేదని ఆక్షేపించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్టీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కవిత, చైతన్యారెడ్డి, కల్పనాగాయత్రీ, ఝాన్సీరెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ కోఆర్డినేటర్ వాడుక రాజ్‌గోపాల్, అధికార ప్రతినిధి గట్టు రాంచందర్‌రావు పాల్గొన్నారు. కాగా, దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు షర్మిలను అరెస్టు చేశారు. కాగా, దీక్షకు ముందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఫిలింనగర్లో బుధవారం చాకలి ఐలమ్మ విగ్రహానికి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల పూలమాల వేసి నివాళులర్పించారు. షర్మిల ‘బస్తీబాట’ వాయిదా:.. వైఎస్ షర్మిల తలపెట్టిన గ్రేటర్ హైదరాబాద్ బస్తీ బాటపై ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆ పార్టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గ్రేటర్ అధ్యక్షుడు వాడుక రాజగోపాల్ ఆరోపించారు. గురువారం చేపట్టాల్సిన పాదయాత్రకు పోలీసులు అనుమతిని నిరాకరించడంతో బస్తీబాట వాయిదా పడిందన్నారు. -
భారతదేశంలోని టాప్ 10 మహిళా స్వాతంత్ర్య సమరయోధులు (ఫోటోలు)
-
మహిళా సిబ్బందితో ప్రత్యేక రైలు
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సిబ్బందితో విశాఖపట్నం నుంచి రాయగడకు ప్రత్యేక రైలు బయల్దేరింది. ఈస్ట్‌కోస్ట్ రైల్వే ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ (ఈకార్వో) ప్రెసిడెంట్ పారిజాత సత్పతి.. వైస్ ప్రెసిడెంట్స్ కవితా గుప్తా, ప్రియాంక శ్రీదేవి, ఎగ్జిక్యూటివ్ సభ్యులతో కలిసి ఈ రైలును మంగళవారం విశాఖపట్నం రైల్వేస్టేషన్లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ ప్రత్యేక రైలుకు సహనాకుమారి లోకోపైలట్‌గా, కె.నాగమణి అసిస్టెంట్ లోకోపైలట్‌గా, ఎం.కళ్యాణి ట్రైన్ మేనేజర్‌గా, ఎస్.అంబిలి, జి.అచ్యుతాంబ, కె.సంతోíÙరావు, డి.రాధ టికెట్ తనిఖీ సిబ్బందిగా విధుల్లో ఉన్నారు. ఈ సందర్భంగా ఈకార్వో ప్రెసిడెంట్ పారిజాత సత్పతి మాట్లాడుతూ విశాఖ నుంచి మహిళా సిబ్బందిచే ప్రత్యేక రైలును నడిపించడం సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. ఈ రోజు విశాఖపట్నం రైల్వేస్టేషన్లో ఆపరేషన్స్, కమర్షియల్, ఆరీ్పఎఫ్.. ఇలా అన్ని విభాగాల్లోను మహిళలే విధులు నిర్వర్తించారని తెలిపారు. వాల్తేర్ డివిజన్ మహిళా సాధికారత విషయంలో ముందుంటుందని, అనేకమంది మహిళలను ట్రాక్ మెయింటెనెన్స్‌లో, ట్రైన్ ఆపరేషన్స్‌లో, ఆర్‌ఆర్‌ఐలో, ట్రైన్ మేనేజర్స్‌గా, టికెట్ తనిఖీ సిబ్బందిగా, కార్యాలయాల్లోను విధులు నిర్వర్తిస్తున్నారని గుర్తుచేశారు. వాల్తేర్ డివిజన్ ప్రత్యేకంగా మహిళల చేత కొన్ని విభాగాలనే నడుపుతున్నట్లు తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈకార్వో ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఆర్కే బీచ్‌లో వాకథాన్ నిర్వహించినట్లు చెప్పారు. -
ఈ మెట్రో స్టేషన్లలో మొత్తం మహిళా సిబ్బందే.. ఎందుకంటే?
ముంబై: అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఐదు రోజుల ముందు ముంబై మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. అకుర్లి, ఎక్సార్ మెట్రో స్టేషన్ల నిర్వహణ బాధ్యతను మొత్తం మహిళా సిబ్బందికే అప్పగించింది. మహిళా సాధికారతను చాటిచెప్పెందుకు ఇలా చేసింది. దీంతో ఈ రెండు మెట్రో స్టేషన్లలో పూర్తిగా మహిళా సిబ్బందే కన్పించనున్నారు. స్టేషన్ మేనేజర్ స్థాయి నుంచి సెక్యూరిటీ సిబ్బంది వరకు మొత్తం 76 మంది మహిళా ఉద్యోగులు విధులు నిర్వహించున్నారు. వీరికి మూడు షిఫ్టుల్లో డ్యూటీ ఉంటుంది. రవాణా రంగంలోలో మహిళల భాగస్వామ్యాన్ని గుర్తించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముంబై మెట్రో అధికారులు పేర్కొన్నారు. అంతేకాదు మహిళా దినోత్సవం సందర్భంగా తాత్కాలికంగా ఈ రెండు స్టేషన్లను మహిళా సిబ్బందికి అప్పగించలేదని, ఇకపై ఈ స్టేషన్ల బాధ్యత శాశ్వతంగా మహిళా ఉద్యోగులే చూసుకుంటారని అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులోనూ మహిళా అనుకూల నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. కాగా.. అకుర్లి, ఎక్సార్ మెట్రో స్టేషన్లు ఈ ఏడాది జనవరిలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం గమనార్హం.నెల రోజుల్లోనే వీటి బాధ్యతలను పూర్తిగా మహిళలకు అప్పగించారు. చదవండి: మనీష్ సిసోడియాకు కోర్టులో ఎదురుదెబ్బ.. -
ఆమెకు అండగా ఆంధ్రప్రదేశ్
‘సబల’... మహిళకు భరోసానిచ్చే పదం ఇది. తన మీద తనకు అనిర్వచనీయమైన నమ్మకాన్ని కలిగించే పదం. తరతరాలుగా నువ్వు ‘అబలవి, బలహీనురాలివి’ అన్నది సమాజం. ‘నువ్వు సబలవి’ అని చెప్పడమే ఓ ముందడుగు. ‘ఆమెకు అండగా ఆంధ్రప్రదేశ్’ మహిళ మనసును తాకే నినాదం. తరతరాలుగా మన సమాజం ‘అబలవి, బలహీనురాలివి’ అనే భావాన్ని మహిళల నరనరాన ఇంకింప చేసింది. ‘నువ్వు అబలవి కాదు, సబలవి’ అని ఎంతగా నినదించినప్పటికీ ‘అబల’ అనే భావం మెదడు నుంచి తొలగిపోయేది కాదు. ఏ మాత్రం అవాంఛనీయం కానీ ఆ భావాన్ని ‘సబల’ అనే మూడక్షరాల పదం క్షణం సేపట్లోనే తుడిచేస్తోంది. తాను సబలననే భావనే మహిళను శక్తిమంతం చేస్తుంది. నామకరణంలోనే విజయవంతమైన ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ మహిళాకమిషన్ రూపొందించింది. మార్చి ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ఏడాదిపాటు కొనసాగే కార్యాచరణ. కమిషనే మహిళ దగ్గరకు మహిళాకమిషన్ బాధ్యతలు రాజధానిలో ఆఫీస్‌లో కూర్చుంటే పూర్తయ్యేవి కావు. కమిషన్ దగ్గరకు వచ్చిన సమస్యను పరిష్కరిస్తే సరిపోదు. బాధిత మహిళలందరూ రాజధానిలో ఉండే కమిషన్ కార్యాలయానికి వెళ్లలేకపోవచ్చు. అందుకే ‘తామే బాధిత మహిళల దగ్గరకు వెళ్లాలి. కష్టంలో నీకు మేము తోడుగా ఉన్నామనే భరోసా కలిగించాలి. నీ కష్టం నుంచి బయటపడడానికి దారి ఉంది అని చెప్పాలి, ఆ దారిని చూపించాలి’ అనే ఉద్దేశంతో రాష్ట్రమంతటా కార్యక్రమాలను నిర్వహిస్తోంది మహిళాకమిషన్. నిస్సహాయ మహిళ ‘ప్రభుత్వం అనే పెద్ద వ్యవస్థ నాకు తోడుగా ఉంది. నాకేం భయం అక్కరలేదు’ అనుకున్నప్పుడే కమిషన్ తన బాధ్యతలను విజయవంతం గా నిర్వహించినట్లు... అంటున్నారు చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ. చైతన్య సమావేశాలు ‘సబల’ గురించి అవగాహన కల్పించడానికి రీజియన్ల వారీగా సెమినార్లు నిర్వహిస్తున్నారు. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల రీజియన్‌కు గుంటూరులో, కృష్ణ, గోదావరి జిల్లాలకు ఏలూరులో సమావేశాలు జరిగాయి. రాయలసీమ జిల్లాలకు కడపలో ఈ నెల 30వ తేదీన, ఉత్తరాంధ్ర జిల్లాలకు విశాఖపట్నంలో ఏప్రిల్ ఆరవ తేదీన జరగనున్నాయి. ‘‘మహిళాచైతన్యం విషయంలో ఇంకా వెనుకబడి ఉన్నామనే చెప్పాలి. గ్రామీణ మహిళల కోసం ప్రత్యేకంగా పని చేయాల్సి ఉంటుందని భావించాం. కానీ ప్రభుత్వ ఉద్యోగినులకు చాలామందికి పని ప్రదేశంలో లైంగిక వేధింపులకు గురైతే ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీలో రిపోర్ట్ చేయవచ్చనే విషయం తెలియకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. గత ప్రభుత్వాలు ఆ మేరకు ఉద్యోగినులను డార్క్‌లో ఉంచేశాయని తెలిసినప్పుడు ఆవేదన కూడా కలిగింది. దాంతో ఈ సమావేశాలకు ఉద్యోగినుల తరఫున ప్రతినిధులుగా జిల్లా, మండల స్థాయి ఉమెన్ అసోసియేషన్ లీడర్లను ఆహ్వానిస్తున్నాం. ఈ ఉమెన్ లీడర్లు ఆయా జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ‘పోష్ యాక్ట్ (పీఓఎస్‌హెచ్) 2013, సెక్సువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ యట్ వర్క్ ప్లేస్ 2013’ గురించి ఉద్యోగినులను చైతన్యవంతం చేస్తారు’’ అని చెప్పారామె. క్యాంపస్ కాప్స్ కాలేజీలు, యూనివర్సిటీల్లో క్యాంపస్ కాప్స్ ఏర్పాటు చేయడం ద్వారా స్టూడెంట్స్ అందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తోంది సబల. ఈ కాప్స్ తమ దృష్టికి వచ్చిన సమస్యలను స్వయంగా పరిష్కరిస్తారు. వాళ్ల స్థాయిని మించిన అంశం అయితే ఉమెన్ కమిషన్‌కు నేరుగా తెలియచేయడానికి వీలుగా ఇందుకోసమే ఒక మెయిల్ఐడీ ఉంటుంది. అలాగే ప్రతి విద్యాసంస్థలో ఇంటర్నల్ కంప్లయింట్స్ కమిటీ జాబితాను తప్పకుండా నోటిస్ బోర్డులో ఉంచాలి. గృహ హింస– గడపదాటని శక్తి రక్షణ కల్పించాల్సిన నాలుగ్గోడలే కత్తులబోనుగా మారితే ఇక ఆ మహిళ ఏం చేయాలి? సమాజంలోని హింసలో 30 శాతం గృహహింస కేసులేనంటే నమ్ముతారా? వరకట్న నిరోధక చట్టం ఉన్నప్పటికీ నేటికీ మహిళలకు వరకట్న వేధింపులు తప్పడం లేదు. మహిళల భద్రత కోసం రూపొందించిన చట్టాల గురించిన కనీస అవగాహన కూడా ఆ మహిళలకు లేకుండా జాగ్రత్త పడడం ఎంత అనైతికం? మహిళను చైతన్యవంతం చేయడం ప్రభుత్వ కర్తవ్యం మాత్రమే కాదు నైతిక విధి కూడా. ‘నువ్వు అబలవి కాబట్టి మేము ఆసరా ఇస్తాం’ అని చెప్పడం లేదు. ‘నువ్వు సబలవి, నీ శక్తి తెలుసుకో’ అని చెబుతోంది. గృహహింసకు వ్యతిరేకంగా చేసే యుద్ధంలో ఆ యోధ చేతిలో శక్తివంతమైన ఆయుధంగా మారుతోంది మహిళాకమిషన్. చర్యలు కఠినంగా ఉండక తప్పదు! పిల్లలపై లైంగిక వేధింపుల నిరోధానికి, భవిష్యత్తులో దాడులను నియంత్రించడానికి ఏకైక మార్గం... చర్యలు కఠినంగా తీసుకోవడమే. అలాగే తక్షణం స్పందించి చర్యలు తీసుకోవడమూ అవసరమే. లైంగిక వేధింపుల విషయంలో పోక్సో చట్టం గురించి వాళ్లకు తెలియచేసే ప్రయత్నం చేస్తోంది సబల. అలాగే మహిళకు ఎదురయ్యే వేధింపుల్లో తరాలుగా ఎదురవుతున్న సమస్యలిలా ఉంటే... ఇప్పుడు టెక్నాలజీ ఆధారంగా వంచనలు తోడయ్యాయి. ఈ సైబర్ నేరాలు, ప్రలోభాల బారిన పడకుండా మహిళలను రక్షించాలంటే ఆ నేరాల పట్ల అవగాహన కల్పించడమే అసలైన మార్గం. ఈ చట్టాల మీద, భద్రత మీద చైతన్యం కలిగించే పోస్టర్లను పంచాయితీ ఆఫీస్‌లో అతికించడంతోపాటు అంగన్వాడీ, ఆశా వర్కర్ల సహాయంతో గ్రామీణ మహిళలకు బుక్లెట్లు పంపిణీ చేస్తోంది ‘సబల’. మహిళలు చేతిలో ఉన్న ఫోన్ ద్వారా సమాచారాన్ని చేరవేయడానికి, సమస్యను తెలియాల్సిన చోటకు చేర్చడానికి సులువుగా వాట్సాప్ నంబర్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చింది. అండగా నిలుద్దాం! సబల ద్వారా ఈ ఉద్యమాన్ని గ్రామస్థాయికి తీసుకువెళ్లడమే మహిళాకమిషన్ ఉద్దేశం. అత్యాచారం, లైంగికవేధింపులు, హింసను ఎదుర్కోవడానికి మహిళకు ఆసరాగా ఉన్న చట్టాలేమిటో తెలియచేస్తోంది. బాధితుల్లో, బాధిత కుటుంబాల్లో ౖధైర్యం నింపే బాధ్యతను తీసుకుంది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చట్టాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన దిశ వంటి ప్రత్యేక చట్టం గురించి కూడా అవగాహన కల్పిస్తోంది సబల. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఆమె’కు అండగా నిలబడుతోంది. ‘ఆమె’ తన మనుగడ కోసం చేస్తున్న పోరాటంలో సమాజంలో ప్రతి ఒక్కరూ తమవంతుగా ‘ఆమె’కు అండగా నిలబడాలి. – వాకా మంజులారెడ్డి బాధితుల పక్షాన... పనిప్రదేశాల్లో ఎదురయ్యే సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక, బాధను దిగ మింగుకునే వారెందరో!. పైగా ఫిర్యాదిచ్చిన వారినే దోషిగా చిత్రీకరిస్తూ వేధింపులకు గురిచేస్తున్న వైనాలు అనేకం. ’సబల– ఆమెకు అండగా ఆంధ్రప్రదేశ్’ అభాగినులకు అండగా నిలుస్తుంది. ఐసీసీ కమిటీల ఏర్పాటుతో పాటు సబల వాట్సప్ నెంబర్ ను ఉద్యోగినులకు అందుబాటులోకి తేవడం సముచితం. – జి.నిరీష, జూనియర్ అసిస్టెంట్, గుంటూరు మహిళకు మనోధైర్యం లైంగిక వేధింపులు, అవమానాలతో కుంగిపోతున్న మహిళలకు ’సబల’ కొండంత అండ. మహిళా ఉద్యోగులకు మనోధైర్యాన్ని కల్పిస్తుంది. – బి. సుశీల, చైర్ పర్సన్, ఏపీజేఏసీ అమరావతి చైతన్యవారధి ‘సబల – అఅఅ’ ఆమెకు అండగా ఆంధ్రప్రదేశ్ (ట్రిపుల్ ఏ) నినాదాన్ని బలంగా వినిపిస్తున్న సబల ప్రభుత్వానికి మహిళలకు మధ్య చైతన్యవారధి. సంక్షేమంతో పాటు రక్షణ, భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోన్న తరుణంలో.. ఇంటర్నల్, లోకల్ కమిటీల ఏర్పాటు ఉద్యమంగా సాగుతోంది. – జి. నిర్మలా జ్యోతి, డిప్యూటీ కమిషనర్. (రాష్ట్ర జీఎస్టీ) విజయవాడ మహిళల బలం సబల సదస్సులు అర్ధవంతమైన చర్చలకు అవకాశమిచ్చాయి. లైంగిక వేధింపులు, హింసనే కాకుండా అనేక సమస్యల సత్వర పరిష్కారానికి సబల సదస్సులు దోహదపడతాయి. చట్టాల పై అవగాహన కల్పించడం మంచిదైంది. ఇప్పటి వరకు వెలుగులోకి రాని పోష్ చట్టం సబల వేదికల ద్వారా అందరికీ తెలిసి వస్తోంది. – రాజ్యలక్ష్మి, మెంబర్, ఆలిండియా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య, గుంటూరు ‘సబల’ పోటీలు! ఉమెన్ సేఫ్టీ, సెక్యూరిటీ, దిశ చట్టం గురించి స్కూళ్లు, కాలేజీల్లో వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలు నిర్వహించడానికి ప్రయత్నాలు మొదలు పెడుతున్నాం. పిల్లలకు ఒక విషయాన్ని పదిసార్లు పాఠం చెప్పినట్లు చెప్పడం కంటే ఒక పోటీ ద్వారా వాళ్ల మెదడులో ఆ అంశం ఎక్కువ కాలం నిక్షిప్తమై ఉంటుంది. ఈ పోటీలు అమ్మాయిలకు మాత్రమే పరిమితం కాదు, అబ్బాయిలకు కూడా. రాబోయే తరాలు కూడా ఇదే విషయం మీద శక్తియుక్తులను ధారపోయకుండా ఈ సమస్య ఈ తరంతో ఆగిపోవాలంటే... అమ్మాయిలను చైతన్యవంతం చేయడంతోపాటు అబ్బాయిలను సెన్సిటైజ్ చేయడం కూడా అవసరం. – వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్, మహిళాకమిషన్, ఆంధ్రప్రదేశ్ -
క్రికెటర్ల భార్యలైతే స్వేచ్ఛ ఉండకూడదా?
టీమిండియా మాజీ ఆటగాడు.. సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని అర్థాంగి సాక్షి సింగ్ ధోని వ్యక్తిగత స్వేచ్ఛపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఐపీఎల్ 2022 సీజన్ ఆడేందుకు ధోని జట్టుతో కలిసి సూరత్ క్యాంపెయిన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ధోనితో పాటే భార్య సాక్షి సింగ్ ధోని, కూతురు జీవా కుడా వచ్చారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని సీఎస్కే యాజమాన్యం నిర్వహించిన ప్రత్యేక సెషన్లో సాక్షి పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ''వంద కోట్ల మందిలో 11 మంది మాత్రమే ఆడే జట్టులో ఉన్న క్రికెటర్‌ను పెళ్లి చేసుకోవడం మా అదృష్టం. ముఖ్యంగా క్రికెట్‌ని మతంగా భావించే దేశంలో అభిమానుల ప్రేమను తట్టుకోలేం. ఒక క్రికెటర్‌ను పెళ్లాడితే మా జీవితం పూర్తిగా మారిపోతుంది. ఉదయాన్నే ఆఫీసుకి వెళ్లి, సాయంత్రం ఇంటికి వచ్చే భర్తను పెళ్లాడితే జీవితంలో పెద్దగా మార్పు ఉండదు. అయితే ఒక ఆటగాడిని పెళ్లి చేసుకుంటే చాలా మార్పులు వస్తాయి. స్వేచ్ఛ ఉండదు. కెమెరాలు వెంటాడుతున్నప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ దొరకదు. కొందరికి కెమెరాలతో ఇబ్బంది ఉండదు. మరికొందరు చాలా ఇబ్బంది పడతారు. అదీకాకుండా జనాలు, మనం ఎలా ఉండాలో కూడా నిర్ణయించేస్తారు. ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలాంటి ఫోటోలు పోస్టు చేయాలనేది వాళ్లే నిర్ణయిస్తారు. ఎంత క్రికెటర్ల భార్యలమైనా మాకు వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఉంటుంది. బయట మాకు ఎలాగు అవకాశం లేదు.. కనీసం సోషల్ మీడియా వేదికగా అయినా మా స్వేచ్చను ఉపయోగించుకోవాలనుకుంటాం. కానీ కొందరు దీనిని కూడా దూరం చేస్తున్నారు. ఇలాంటివి పట్టించుకోవడం వల్ల ఒత్తిడి తప్ప ఇంకేమి ఉండదు'' అంటూ తెలిపింది. ఇక గతేడాది ఐపీఎల్లో విజేతగా నిలిచిన సీఎస్కే మరోసారి ఫెవరెట్‌గా బరిలోకి దిగుతుంది. అందరికంటే ముందే ప్రాక్టీస్‌ను ప్రారంభించిన ధోని సేన ఫుల్ జోష్‌లో కనిపిస్తుంది. ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దీంతో ఎలాగైనా టైటిల్ గెలిచి ధోనికి కానుకగా ఇవ్వాలని సీఎస్కే భావిస్తోంది. మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 15వ సీజన్లో తొలి మ్యాచ్ కేకేఆర్, సీఎస్కే మధ్య జరగనుంది. చదవండి: WI vs ENG: పదేళ్ల క్రితమే ఎంట్రీ.. అరుదైన క్రికెటర్ల జాబితాలో చోటు IPL 2022: వార్న్ అంత్యక్రియలకు వార్నర్.. ఆందోళనలో ఢిల్లీ క్యాపిటల్స్ View this post on Instagram A post shared by Chennai Super Kings (@chennaiipl) -
భారతీయ మహిళలది విశిష్ట స్థానం: నిరంజన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: భారతీయ సంస్కృతిలో మహిళలది విశిష్ట స్థానమని, వారికి మన సమాజంలో ఇస్తున్న గౌరవం, స్వేచ్ఛ మరింత పెరగాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గురువారం శాసనసభలోని తన చాంబర్లో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు ధనసరి సీతక్క, బానోతు హరిప్రియ, పద్మా దేవేందర్ రెడ్డి, రేఖా నాయక్, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, కల్వకుంట్ల కవితలను సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో మహిళల పాత్ర కీలకమన్నారు. వారి భాగస్వామ్యం ఉన్న కుటుంబాలే అందులో రాణిస్తాయని వెల్లడించారు. -
హైదరాబాద్‌లో తొలి మహిళా స్టేషన్ హౌస్ ఆఫీసర్.. రాష్ట్రంలో ముగ్గురే!
సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని శాంతిభద్రతల విభాగం ఠాణాకు తొలి మహిళా స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ)గా ఇన్స్పెక్టర్ కె.మధులత నియమితులయ్యారు. నగర పోలీసు కమిషనరేట్‌లోని లాలాగూడ పోలీసుస్టేషన్లో మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. హోం మంత్రి మహమూద్ అలీ, నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. కీలక విభాగాల్లో విధులు.. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో ఎంఏ పూర్తి చేసిన మధులత 2002లో ఎస్సైగా పోలీసు విభాగంలో అడుగుపెట్టారు. సిద్దిపేట వన్ టౌన్ ఠాణాకు ప్రొబేషనరీ ఎస్సైగా పని చేశారు. అనంతరం సిద్దిపేట రెండో టౌన్, జోగిపేట, ములుగు, సిద్దిపేట రూరల్ శాంతిభద్రల విభాగం ఠాణాలకు ఎస్హెచ్ఓగా పని చేశారు. ఆపై సైబరాబాద్ (ఉమ్మడి) వచ్చిన మధులత నాచారం పోలీసుస్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వర్తించారు. 2012లో ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందారు. సరూర్‌నగర్ మహిళ పోలీసుస్టేషన్లో పాటు ఐటీ కారిడార్ ఉమెన్ పోలీసుస్టేషన్లకు ఇన్స్పెక్టర్గా సేవలు అందించారు. అనంతరం సీఐడీలో రెండున్నరేళ్లు, నగరానికి వచ్చిన తర్వాత దక్షిణ మండలం ఉమెన్ పోలీసుస్టేషన్, స్పెషల్ బ్రాంచ్‌ల్లో పని చేశారు. సైబరాబాద్‌లో అభయ సహా పలు కీలక కేసుల దర్యాప్తులోనూ మధులత కీలకంగా వ్యవహరించారు. అన్ని స్టేషన్లలోనూ ఉండాలి మహిళలు తమ శక్తి ఏమిటో గుర్తించుకోవాలి. వారిపై ఎంతో నమ్మకం ఉంచి హోంమంత్రి, నగర పోలీసు కమిషనర్ మధులతకు ఈ అవకాశమిచ్చారు. ఈ సంప్రదాయం ఇలాగే కొనసాగి అన్ని పోలీసుస్టేషన్లలో మహిళ ఎస్హెచ్ఓలు ఉండే రోజు వస్తుందని ఎదురు చూద్దాం. – చందన దీప్తి, నార్త్‌జోన్ డీసీపీ పోలీసు శాఖకు మంచి పేరు తేవాలి తొలిసారిగా హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో శాంతిభద్రతల విభాగం ఠాణాకు మహిళ అధికారిని నియమించాం. మధులత తన పనితీరుతో పోలీసు శాఖకు మంచి పేరు తేవాలి. మరింత మంది మహిళలు పోలీసు విభాగంలోకి రావాలి. – మహమూద్ అలీ, హోమ్ మంత్రి రాష్ట్రంలో ముగ్గురే.. 174 ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ కమిషనరేట్‌లో తొలిసారిగా మహిళను స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా నియమించాం. రాష్ట్రంలో 700 పోలీసుస్టేషన్లు ఉండగా ముగ్గురు మాత్రమే మహిళ ఎస్హెచ్ఓ ఉన్నారు. ఇన్స్పెక్టర్ మధులత తన విధులు సమర్థంగా నిర్వహించి రాబోయే మహిళ ఎస్సైలు, ఇన్స్పెక్టర్లకు మార్గదర్శకంగా నిలవాలి. – సీవీ ఆనంద్, కొత్వాల్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా ఈ బాధ్యతలు సద్వినియోగం చేసుకుని సీపీ నమ్మకాన్ని నిలబెడతా. పురుష అధికారులకు దీటుగా పని చేస్తూ 24/7 అందుబాటులో ఉంటా. మిగిలిన మహిళా అధికారులు, సిబ్బందికి ఆదర్శంగా ఉండేలా పనిచేసి శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటా. – మధులత, లాలాగూడ ఇన్స్పెక్టర్ -
ఉమెన్స్ డే రోజున పురుషులకు థ్యాంక్స్ చెప్పిన స్వీటీ
స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి వెండితెరపై కనిపించి చాలా రోజులు అవుతుంది. చివరిగా నిశబ్దం మూవీతో పలకిరించిన స్వీటీ.. ఆ తర్వాత ఏ సినిమాకు కమిట్ అవ్వలేదు. కనీసం సోషల్ మీడియలో అయిన ఫ్యాన్స్ పలకరిస్తుంది అనుకుంటే ఏదైన స్పెషల్ డే రోజునే దర్శనం ఇస్తుంది. పండగలు, కొద్ది మంది సెలబ్రెటీల బర్త్‌డేలకు మాత్రమే స్వీటీ నెట్టింట కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఉమెన్స్ డే సందర్భంగా సోషల్ మీడియాకు వచ్చింది. నిన్న(మార్చి 8) ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా స్వీటీ ఆసక్తికరంగా పోస్ట్ షేర్ చేసింది. ఈ మేరకు తన ఫ్యామిలీ ఫొటోను పంచుకుంది. ఈ పోస్ట్‌లో.. ‘అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ప్రతీ ఒక్కరికీ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. చదవండి: రెమ్యునరేషన్లో తగ్గేదే లే.. ఎవరెంత తీసుకుంటున్నారో తెలుసా? ప్రొఫెషనల్, ఫిజికల్, మెంటల్, సోల్ ఫుల్లీ అందరూ బెస్ట్ ఉండేందుకు ప్రయత్నించాలి. గతం గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. ఉన్న ఈ చిన్న జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. ప్రతీక్షణాన్ని అనుభవించాలి. రోజురోజుకూ ఎదుగుతూ ఉండాలి. తండ్రిగా, సోదరుడిగా, కొడుకుగా, ఫ్రెండ్‌గా, భర్తగా ఇలా ఎన్నో రకాలుగా ప్రేమను పంచుతూ, మమ్మల్ని ప్రత్యేకంగా గుర్తించడం, ప్రేమను పంచడం వంటివి చేస్తోన్న మగాళ్లందరికీ థ్యాంక్స్’ అని అనుష్క చెప్పుకొచ్చింది. ఇక స్వీటీ చాలా గ్యాప్ తర్వాత వరస ప్రాజెక్ట్స్ ఒకే అంటుంది. ఇప్పటికే ఆమె యూవీ క్రియేషన్స్‌లో రెండు, మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: మరో కొత్త బిజినెస్‌లోకి సామ్, ఇది నాగ చైతన్యకు పోటీగానా? View this post on Instagram A post shared by AnushkaShetty (@anushkashettyofficial) -
మహిళలకు సరైన ప్రోత్సాహం అందిస్తే ఉన్నత స్థాయికి చేరుతారు: జీవితా రాజశేఖర్
-
సాధికార యజ్ఞం
-
విదేశీ యువతిపై అత్యాచారయత్నం
సైదాపురం/గూడూరు: అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. భారత దేశ పర్యటనకు వచ్చిన ఓ విదేశీ యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు ఇద్దరు యువకులు. వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సీఐ శ్రీనివాసులురెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. లిథువేనియా దేశానికి చెందిన ఓ యువతి (26) భా రత దేశం పర్యటనకు వచ్చింది. సోమవారం శ్రీలం క నుంచి చెన్నై విమానాశ్రయానికి చేరుకుంది. గో వా వెళ్లేందుకు చెన్నై నుంచి బెంగళూరుకు బస్సులో బయల్దేరింది. ఆమె వద్ద ఇండియన్ కరెన్సీ లేకపోవడంతో బస్సు డ్రైవర్ ఆమెను బస్సు నుంచి దించేశా డు. అదే బస్సులోనే ఉన్న నెల్లూరు జిల్లా మనుబోలు మండలం బద్దెవోలు వెంకన్నపాళెం గ్రామానికి చెందిన ఇంగిలాల రమణయ్య కుమారుడు సాయికుమార్ ఆమెకు తన వద్ద ఉన్న డబ్బులు ఇచ్చాడు. ఆమెను పరిచయం చేసుకున్నాడు. సందర్శనీయ స్థలాలు చూపిస్తానని నమ్మించి తన స్వగ్రామం బద్దెవోలు వెంకన్నపాళెంకు తీసుకొచ్చాడు. గూడూరు రూరల్ పరిధిలోని ఎల్ఏపీ స్కూల్ ప్రాంతంలోని శారదానగర్‌కు చెందిన తన స్నేహితుడు షేక్ అబిద్‌తో కలిసి ఆమెపై అత్యాచారానికి పథకం రూపొందించాడు. మంగళవారం ఆమెకు కృష్ణపట్నం పోర్టు చూపుతామని చెప్పి, అబీద్‌తో కలిసి మోటార్ బైక్‌పై ఎక్కించుకుని బయలుదేరాడు. నిందితుల అరెస్టు చూపుతున్న పోలీసులు సైదాపురం సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేయాలనుకున్నారు. ఆ ప్రాంతం అనుమానాస్పదంగా ఉండడంతో వారి నుంచి తప్పించుకుని ఆ యువతి రోడ్డుపైకి వచ్చింది. రోడ్డుపై ఒంటరిగా భయంతో నిలబడ్డ ఆ యువతిని చూసి స్థానికులు సైదాపురం పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఆమె జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపింది. ఈలోగా యువకులిద్దరూ పరారయ్యారు. జిల్లా ఎస్పీ విజయారావు ఆదేశాలతో డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి పర్యవేక్షణలో సీఐ శ్రీనివాసులరెడ్డి, సైదాపురం, గూడూరు రూరల్, మనుబోలు ఎస్సైలు టీంలుగా ఏర్పడి గాలించి నిందితులను అరెస్టు చేశారు. -
హోప్ ఆధ్వర్యంలో ‘అచీవర్స్’ అవార్డులు
మాదాపూర్: మాదాపూర్‌లోని శిల్పారామంలో హోప్ అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్, సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేవేళ్ళ ఎంపీ రంజిత్‌రెడ్డి, సీతారెడ్డిలు హజరయ్యారు. కోవిడ్ సమయంలో అత్యుత్తమ సేవ చేసినందుకు డాక్టర్ మనీష్ రాందాస్, సంస్కృతంలో డాక్టరేట్ చేసినందుకు డాక్టర్ మృదుల అశ్విన్, మొదటి సారే సివిల్ సర్వీసెస్‌కు సెలెక్ట్ అయినందుకు కుమారి మేఘనలకు అఛీవర్స్ అవార్డులను అందజేశారు. -
వనితా వందనం
సాక్షి, నెట్వర్క్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లాల్లో పలు కార్యక్రమాలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో స్థానిక మండల ప్రజా పరిషత్, ఉప్పల చారిటబుల్ ట్రస్టు సంయుక్త ఆధ్వర్యంలో అమ్మ పాదపూజ కార్యక్రమం నిర్వహించారు. సృష్టిలో అమ్మను మించిన దైవం లేదని వక్తలు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో పలు ప్రాంతాల్లో ఆయా రంగాల్లో విశేష సేవలందించిన మహిళలను సన్మానించారు. దేవరకొండలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. కోదాడలో గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. మహబూబ్‌నగర్ ప్రధాన స్టేడియంలో జరిగిన వేడుకల్లో పలువురు మహిళలను స్ఫూర్తి పురస్కారాలతో సత్కరించారు. ఖమ్మం టీఆర్ఎస్ కార్యాలయంలో మహిళా ఉద్యోగులు, కార్మికులను సన్మానించారు. హనుమకొండ అంబేద్కర్ భవన్లో అంగన్వాడీ కార్యకర్తల నృత్యాలు అలరించాయి. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు మహిళా పారిశుధ్య కార్మికుల కాళ్లు కడిగారు. సిరిసిల్లలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞత తెలుపుతూ సాగిన కార్యక్రమంలో 2 వేల మంది మహిళలు ఓ మహిళా చిత్రం రూపంలో నిలబడగా అద్భుత దృశ్యం ఆవిష్క్రతమైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హనుమకొండలో నృత్యం చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు రంగారెడ్డి జిల్లా పడకల్లో అమ్మ పాదపూజకు హాజరైన మహిళలు హైదరాబాద్‌లోని విద్య కమిషనరేట్ ఎదుట ఆందోళన చేస్తున్న మహిళా టీచర్లు నిర్మల్‌లోని కార్యక్రమంలో కూర్చున్న మహిళలు చిరంజీవి బ్లడ్ బ్యాంకులో జరిగిన వేడుకల్లో పాల్గొన్న చిరంజీవి, సురేఖ దంపతులు నిర్మల్‌లో అవమానం... నిర్మల్ జిల్లా కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మహిళా ఉద్యోగులకు అవమానం జరిగింది. వేడుకలు జరుగుతున్న సమావేశ మందిరంలో మహిళా ఉద్యోగులు, అంగన్వాడీ టీచర్లకు కనీసం కుర్చీలు వేయలేదు. పైగా వేదికపై మొత్తం పురుషులే కూర్చున్నారు. దీంతో మహిళా ఉద్యోగులు, సిబ్బందిలో కొందరు నిల్చోగా.. మరికొందరు నేలపై కూర్చున్నారు. గర్భిణుల కోసం త్వరలో కొత్త పథకం గన్‌ఫౌండ్రీ: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం మహిళల సంక్షేమానికి ఎనలేని కృషి చేస్తోందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ కిట్ తరహాలో గర్భీణీ స్త్రీల కోసం త్వరలో ఓ కొత్త పథకాన్ని తీసుకురానున్నట్లు వెల్లడించారు. అనంతరం ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ ఆర్.లక్ష్మీరెడ్డి, ఐపీఎస్ అధికారి సుమతి, ‘సాక్షి’సీనియర్ జర్నలిస్టు సరస్వతి రమ, జానపద గాయని కనకవ్వలతో పాటు వివిధ రంగాలలో రాణిస్తున్న 40 మంది మహిళలకు విశిష్ట మహిళా పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ సునితా లక్ష్మారెడ్డి, మహిళా కార్పొరేషన్ ఛైర్మన్ ఆకుల లలిత తదితరులు పాల్గొన్నారు. నా బలం సురేఖనే: చిరంజీవి బంజారాహిల్స్: ‘నేను సినిమాలపై పూర్తి దృష్టిపెడితే ఆమె అన్నీ చూసుకునేది. నేను ఇంతవాన్ని కావడానికి కారణం, నా బలం ఆమే’ అని భార్య సురేఖను మెగాస్టార్ చిరంజీవి కొనియాడారు. జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంకులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. సినీ పరిశ్రమలోని 24 క్రాఫ్ట్‌లకు చెందిన మహిళా కార్మికులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ధైర్యంగా ఫిర్యాదు చేయాలి.. సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర మహిళా భద్రతా విభాగం తమ రీడిజైన్డ్ వెబ్సైట్ అత్యా«ధునిక హంగులతో అందుబాటులోకి తీసుకొచ్చింది. మంగళవారం వెబ్‌సైట్‌ను మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ స్వాతిలక్రా, డీఐజీ బి.సుమతి ఆవిష్కరించారు. బాధితులు ధైర్యంగా ఫిర్యాదుచేయాలని.. తమ వెబ్సైట్ https:// womensafetywing. telangana. gov. in సంప్రదించగలరని సూచించారు. 317 జీవోపై మహిళా టీచర్ల ఆందోళన.. మహిళాదినోత్సవం రోజున మహిళాటీచర్లు పాఠశాల విద్య కమిషనరేట్ ఎదుట గంటల తరబడి బైఠాయించారు. 13 జిల్లాలకు చెందిన మహిళాటీచర్లు, వారి భర్తలు, పిల్లలుసహా తరలి వచ్చి మంగళవారం ఆందోళనకు పూనుకున్నారు. 317 జీవో కారణంగా తాము పడుతున్న ఇబ్బందుల గురించి అధికారులకు విన్నవించేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు : కవిత మహిళా దినోత్సవాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తం గా ఉన్న ఆడబిడ్డలందరికీ ఆమె మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియ జేశారు. తన నివాసంలో మంగళవారం జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో అంగన్వాడీ ఉద్యోగులతో కలిసి కవిత కేక్ కట్ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పొన్నం అశోక్‌గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని కేక్ కట్ చేస్తున్న న్యాయమూర్తులు జస్టిస్ జి.శ్రీదేవి, జస్టిస్ పి.శ్రీసుధ, జస్టిస్ సి.సుమలత, జస్టిస్ జి.రాధాదేవి, జస్టిస్ పి.మాధవీ దేవి తదితరులు. -
మహిళ ఉద్యోగులకు మరింత సాధికారత: ట్రెస్విస్టా
ప్రముఖ గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీస్ ఎంటర్ప్రైజ్ ట్రెస్విస్టా (TresVista) ఇంటర్నేషనల్ వుమెన్స్ డే 2022 సందర్భంగా మహిళా ఉద్యోగుల సాధికారతను మరింత బలోపేతం చేసేందుకు పలు చర్యలను తీసుకుంది. మహిళా ఉద్యోగులకు మద్దతు ఇవ్వడానికి, సాధికారత కల్పించడానికి గత ఐదు సంవత్సరాలుగా విజయవంతమైన WiT (ఉమెన్ ఇన్ ట్రెస్విస్టా) సెల్‌ను కంపెనీ నిర్వహిస్తోంది. వీటి ద్వారా ఏడాది పొడవునా మహిళలకు షెనోమిక్స్, అనేక ఇతర టై-అప్ల కోసం ఆస్పైర్స్ భాగస్వామ్యంతో WiT వృత్తిపరమైన, వ్యక్తిగత వృద్ధికి మద్దతును అందిస్తూ మహిళలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా ట్రెస్విస్టా పెట్టుకుందని ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ క్యాలెండర్ సంవత్సరం ముగిసే నాటికి 2,000 మంది ఉద్యోగులతో టీమ్ పరిమాణాన్ని విస్తరించే ప్రణాళికలను ప్రకటించింది. వీటిలో 1,100 మంది ఉద్యోగులను కలిగి ఉండగా.. అందులో 42 శాతం మంది మహిళలు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 500పైగా కంపెనీలకు ట్రెస్ విస్టా తన సేవలను అందిస్తోంది. -
ఆమె మాటలు గుర్తుకొస్తున్నాయి
-
ఇళ్లు-ఇళ్ల స్థలాలు-ఆస్తి
-
ఇంత మంది ప్రజా ప్రతినిధులు
-
మన మహిళలకు దక్కిన గౌరవం
-
హిందీలో 'హర్ సర్కిల్' ప్లాట్‌ఫామ్‌ను లాంఛ్ చేసిన నీతా అంబానీ
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సాధికారత ప్లాట్‌ఫామ్ 'హర్ సర్కిల్'ను రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్పర్సన్ నీతా అంబానీ హిందీలో లాంఛ్ చేశారు. దీంతో హర్ సర్కిల్ యాప్ హిందీలో కూడా అందుబాటులోకి ఉండనుంది. మహిళా సాధికారతకు మరింత తోడ్పాటునిచ్చే దిశగా రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ గత ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా ’హర్ సర్కిల్’ పేరిట సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించారు. భిన్న సంస్కృతులు, వర్గాలు, దేశాలకు చెందిన మహిళలు తమ ఆలోచనలను పంచుకునేందుకు వీలుగా వేదికను తీర్చిదిద్దినట్లు ఆమె తెలిపారు. ఇందులో ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. జీవన విధానం, ఆరోగ్యం, ఆర్థికం, వినోదం, ఉద్యోగం, వ్యక్తిత్వ వికాసం తదితర అనేక అంశాలకు సంబంధించిన వీడియోలు, ఆర్టికల్స్ మొదలైనవి హర్ సర్కిల్ సబ్స్క్రయిబర్స్కు అందుబాటులో ఉంటాయని నీతా అంబానీ పేర్కొన్నారు. ఇప్పుడు ఈ ప్లాట్‌ఫామ్ మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ ప్లాట్‌ఫామ్ భారతదేశంలో వేగంగా వృద్ధిలోకి వస్తున్న ప్లాట్‌ఫామ్ కావడం విశేషం. ఓవరాల్ రీచ్ 42 మిలియన్లు అంటే 4.2 కోట్లు కావడం విశేషం. హర్ సర్కిల్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా హర్ సర్కిల్ హిందీ భాషలో అందుబాటులోకి వచ్చింది. మా నెట్వర్క్ ఆస్పత్రి అయిన సర్ హెచ్ఎన్ రిలయన్స్ హాస్పిటల్‌కు చెందిన వైద్య నిపుణులు 24 గంటల పాటు మెంటల్ వెల్నెస్, ఫిజికల్ ఫిట్నెస్, స్కిన్ కేర్, గైనకాలజికల్, కౌన్సిలింగ్ లాంటి అనేక అంశాల్లో ఉచిత సలహాలు ఇస్తున్నారు. దీంతో వేలాది మంది మహిళలు లాభపడుతున్నారు. ఫిట్నెస్, న్యూట్రిషన్, పీరియడ్స్, ఫెర్టిలిటీ, ప్రెగ్నెన్సీ, ఫైనాన్స్ లాంటివాటికోసం ప్రత్యేకంగా రూపొందించిన ట్రాకర్లను 1.50 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉచితంగా ఉపయోగిస్తున్నారు. (చదవండి: ఉక్రెయిన్‌కు ప్రపంచ బ్యాంక్ భారీ ఆర్ధిక సహాయం) -
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం జగన్ (ఫొటోలు)
-
30 ఏళ్ల క్రితం ఫొటో ట్రెండ్‌ను గుర్తించి.. కెమెరా పట్టుకుంది.. ఇప్పుడు ఏకంగా..
అయ్యతోపాటు బువ్వను పండించే వేళ ఆమె ఓ మట్టి మనిషి.. వంటింటి కొలిమిలో పడి రుచిని వండే వేళ ఆమె ఓ మర మనిషి.. గిన్నెలు కడిగి, బట్టలుతికే వేళ జీతమెరుగని ‘పని’ మనిషి! చదువుల గంధమద్దుకొని అన్ని రంగాల్లో రాణించే వేళ ఆమె ఓ మహా మనిషి. ఇప్పుడెందరో మనమధ్య మహా మనుషులున్నారు. అంతా తామై.. ఆకాశంలో సగమై రాణిస్తున్నారు. రంగమేదైనా.. రాణించడమే ఆమె లక్ష్యం. విధులేవైనా.. విధేయతగా పూర్తి చేయడమే ఆమె ధ్యేయం. పట్టుదల, ఓర్పు ఆమెకు ప్రత్యేక అర్హతలు. అందుకే ఇప్పుడామె ధీమాగా.. పురుషులకు దీటుగా అన్ని రంగాల్లోనూ రాణిస్తోంది.మంగళవారం ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు.. భర్త చనిపోయిన బాధను దిగమింగుకుంది. అప్పటివరకు ఇంటిగడప దాటని ఆమె పొలం బాట పట్టింది. ఉన్న వ్యవసాయాన్ని చేసుకోవాలనుకుంది. మగవారు చేసే పనులన్నింటినీ నేర్చుకుంది. ఇప్పుడు సాగులో.. మేటిగా నిలిచింది పాలకుర్తి మండలం విస్నూరు గ్రామానికి చెందిన మహిళా రైతు బచ్చు శ్రీలత. 2005 భర్త శ్రీనివాసరావు విద్యుదాఘాతంతో చనిపోయాడు. కుటుంబ భారం తనపై పడింది. బయటికి వెళ్లి బతికే పరిస్థితి లేదు. ఇద్దరు పిల్లలను చదివించుకుంటూ, తనకున్న నాలుగు ఎకరాల్లో వరితోపాటు ఆరుతడి పంటలు సాగు చేస్తోంది. వ్యవసాయానికి అవసరమైన వాటి కోసం బయటికి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉండడంతో బైక్ నడపడం నేర్చుకుంది. ఇప్పుడు ద్విచక్రవాహనంపై మండల కేంద్రానికి వచ్చి అవసరమైనవి తీసుకెళ్తుంది. దుక్కి దున్నడం నుంచి గొర్రు తోలడం, నాట్లు వేస్తే...కలుపు తీయడం వరకు అన్ని పనులు చేస్తున్న శ్రీలత నేటి తరానికి ఆదర్శమే. – పాలకుర్తి ఫొటో ట్రెండ్.. నో ఎండ్! బిడపు కవితకు ఫొటోగ్రఫీ అంటే తెలియదు. ప్రతాప్‌ను వివాహమాడాక ఈ రంగంపై ఆసక్తి పెంచుకుంది. 30 ఏళ్ల క్రితం ఫొటో ట్రెండ్‌ను గుర్తించి కెమెరా పట్టుకుంది. విరామం లేకుండా పాస్‌ఫొటోల నుంచి వెడ్డింగ్షూట్, చిల్డ్రన్స్ షూట్, ఇలా ఏ కార్యక్రమమైనా క్లిక్‌మనిపిస్తోంది కవిత. తనలా మరెంతో మంది మహిళలను ఫొటోగ్రాఫర్లుగా తీర్చిదిద్దాలని ఏడాదిన్నర క్రితం హనుమకొండలో సబిత ఫొటోగ్రఫీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించింది. – సాక్షి, వరంగల్ అడవిని అమ్మలా కాపాడుతూ.. భూపాలపల్లి అర్బన్: మారుమూల గ్రామమైన ఆజాంనగర్ రేంజ్ పరిధిలో నా డ్యూటీ. కొన్ని సందర్భాల్లో కలప స్మగ్లర్లు, పోడు రైతులు బెదిరిస్తారు. ఆర్నెళ్ల క్రితం పందిపంపుల శివారులో పోడు రైతులు నాపై, మా సిబ్బందిపై కిరోసిన్‌తో దాడి చేశారు. అన్నింటినీ సమర్థంగా ఎదుర్కొని అడవిని అమ్మలా కాపాడుకుంటున్నాం. మహిళగా ఈ ఉద్యోగంలో చేరినప్పటికీ సంతృప్తితో విధులు నిర్వహిస్తున్నా. – దివ్య, అటవీ రేంజ్ అధికారి, ఆజాంనగర్ టైలరింగ్.. ట్రైనింగ్! గూడూరు మండలం గుండెంగ శివారు అమృత తండాకు చెందిన బోడ వాణి టైలరింగ్‌లో రాణిస్తోంది. 2009లో వీరన్నతో వివాహం కాగా.. 2016లో ఆయన గుండెపోటుతో చనిపోయాడు. దీంతో ఇద్దరు పిల్లల బాధ్యత వాణి చూసుకోవాల్సి వచ్చింది. ఇంటర్లో కాలక్షేపానికి నేర్చుకున్న టైలరింగే ఆమెకిప్పుడు జీవనోపాధినిస్తోంది. పిల్లల్ని చదివిస్తోంది. తాను ఉపాధి పొందుతూ మరికొందరు మహిళలకు టైలరింగ్‌లో శిక్షణనిస్తోంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో తన పిల్లల్ని ప్రయోజకుల్ని చేయడానికి నిత్యం శ్రమిస్తోంది వాణి. చెప్పులు కుట్టి.. కొడుకును చదివించి! స్టేషన్‌ఘన్‌పూర్: డివిజన్ కేంద్రానికి చెందిన దేవరకొండ అరుణ భర్త పన్నెండేళ్ల క్రితం చనిపోయాడు. అప్పట్నుంచి కుటుంబ భారాన్ని ఆమె భుజాలపై మోస్తొంది. చెప్పులు కుడుతూ కొడుకును ఉన్నత చదువులు చదివించింది. కుమారుడు నరేశ్ సైతం తల్లి కష్టాన్ని గుర్తించి.. బాగా చదివి బీటెక్ పూర్తి చేశాడు. ప్రస్తుతం మంచి ప్యాకేజీతో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కులవృత్తిని నమ్ముకొని బిడ్డను ప్రయోజకున్ని చేసిన ఆ తల్లి ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. -
Anitha Rao: మహిళా ట్రెక్కర్‌గా.. హార్స్ రైడింగ్, పెయింటింగ్‌లోనూ.. హ్యాట్సాఫ్!
మురళీనగర్: విశాఖపట్నానికి చెందిన దేవనబోయిన అనితారావు (53)కు సాహసమే ఊపిరి. ఐదు పదులు దాటినా ఆమె పర్వతారోహణ, బైక్ రైడింగ్‌తో సత్తా చాటుకుంటున్నారు. సాహసయాత్రికురాలిగా, బైక్ రైడర్‌గా ఆమె పేరు తెచ్చుకున్నారు. తండ్రి కల్నల్ అర్జునరావు మిలట్రీలో పనిచేశారు. దీంతో ఆమెలోనూ సాహస గుణం అలవడింది. ప్రస్తుతం బీచ్‌రోడ్డులోని కిర్లంపూడి లేఅవుట్లో బాలాజీ టవర్స్‌లో ఉంటున్నారు. ఆమె భర్త కమాండర్ వి.రామకృష్ణ నేవీలో రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ఆంధ్రా యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేస్తూ యువతకు ఆదర్శగా నిలుస్తున్నారు. మహిళా ట్రెక్కర్‌గా.. ఢిల్లీ యూనివర్సిటీలో ఆమె ఎంఏ సైకాలజీ చేశారు. నేవీ ఆస్పత్రిలో కొంత కాలం సైకాలజిస్టుగా కౌన్సెలింగ్ సెక్షన్లో పని చేశారు. ప్రస్తుతం గృహిణిగా ఉంటూనే పెయింటింగ్‌లో స్పెషల్ కోర్సు చేస్తూ రెగ్యులర్ విద్యార్థిగా విద్యాభ్యాసం చేస్తున్నారు.. 2004నుంచి ట్రెక్కింగ్ చేస్తున్నారు. దేశంలోని 50కి పైగా పర్వత ప్రాంతాలకు సాహసయాత్ర చేశారు. విశాఖ యూత్ హాస్టల్ తరుఫున బృందాలకు టీమ్ లీడర్‌గా వ్యవహరిస్తూ అనేక ప్రాంతాలకు సాహసయాత్ర చేశారు. కాశ్మీరులోని సోనామార్గ్‌లోని జవహర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్ ఇన్స్టిట్యుట్లో 2015లో మౌంట్ ఇంజినీరింగు కోర్సు చేసిన ఆమెకు పర్వతారోహణపై పూర్తి అవగాహన ఉంది. ప్రతి ఏడాది మే/జూన్ నెలల్లో హిమాలయపర్వతాలకు వెళ్తారు. మౌంటినీరింగులో భాగంగా క్యాంప్ లీడరుగా లడక్‌లో 21రోజుల పాటు అనేక ఇబ్బందులను అధిగమించి విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆమె చెప్పారు. అత్యధిక పీక్‌పాయింటుగా అయిన ఒడిశాలోని ఈస్ట్రన్ ఘాట్స్‌లోని మహేంద్రగిరిని ఆమె అవలీలగా అధిరోహించారు. హార్స్ రైడింగ్‌లో.. అనితారావు బహుముఖ ప్రజ్ఞాశాలి. హార్స్ రైడింగులోనూ మంచి ప్రవేశం ఉంది. న్యూఢిల్లీలో 1986లో జరిగిన జాతీయ స్థాయి హార్స్ రైడింగ్ పోటీల్లో పాల్గొన్నారు. అంతే కాకుండా ఆమె నిర్వహించిన మోటారు బైక్ యాత్ర లిమ్కా బుక్ఆఫ్ రికార్డులో నమోదయ్యింది. 2009లో ఢిల్లీ నుంచి హిమాలయపర్వతాల్లో 3000 కిలోమీటర్లు యాత్ర చేశారు. 2011లో మనాలి నుంచి బైక్ యాత్ర చేశారు. దీనికి క్యాంపు లీడరుగా వ్యవహరించారు. ఈ రెండూ లిమ్కా బుక్ఆఫ్ రికార్డ్స్‌లో నమోదయినట్లు ఆమె చెప్పారు. గుజరాత్ నుంచి కేరళ వరకు 3000 కిలోమీటర్లు సైక్లింగ్ చేశారు. పెయింటింగ్‌లోనూ.. పెయింటింగ్‌లో ఆమె దిట్ట. పెన్సిల్ స్కెచింగ్, వాటర్ కలర్ పెయింగ్స్ వేస్తారు. విశాఖ మ్యూజియంలో, హవామహల్‌లో నిర్వహించిన పెయింటింగ్ ప్రదర్శనల్లో పాల్గొన్నారు. -
ప్రతి మహిళలో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది: సీఎం జగన్
-
సీఎం జగన్ కి మహిళల అరుదైన గౌరవం
-
రాజన్న కలను జగనన్న నిజం చేస్తున్నారు: మంత్రి తానేటి వనిత
-
సీఎం జగన్ గురించి అనురాధ అద్భుత ప్రసంగం
-
ఆ ఘనత సీఎం జగనన్నదే: డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి
-
పచ్చ రంగు, పిచ్చి గెడ్డం.. బాబుని ఉతికారేసిన వాసిరెడ్డి పద్మ
-
ఆడవాళ్లకు పోలీసు ఉద్యోగాలెందుకు?!.. అడవిలో ఆడపులులు వాళ్లు
వంటింటి కుందేళ్లన్నారు ఒకప్పుడు.. పులులతో సావాసం చేస్తున్నారిప్పుడు.. సున్నితత్వాన్ని ఆపాదించి కొన్నింటికే పరిమితం చేశారు.. అన్నింటినీ తలదన్ని అటవీ రక్షణకోసం నడుం కట్టారు.. పగలూ రాత్రి, తేడా లేదు.. ఎండా, వానల బెంగేలేదు అడవి కాచిన వెన్నెలను ఆస్వాదిస్తూ.. కలప స్మగ్లర్లనూ ఎదిరిస్తూ.. ప్రతిరోజూ సాహసంతో సహవాసం చేస్తున్నారు ‘మహిళా దినోత్సవం’సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం, గంగారం అడవిలోని బీట్ ఆఫీసర్లపై ‘సాక్షి’ప్రత్యేక కథనం. సాక్షి, మహబూబాబాద్/కొత్తగూడ: అడవి, అటవీ ఉత్పత్తులను కాపాడటం బీట్ ఆఫీసర్ల విధి. అసలు ఆడవాళ్లకు పోలీసు ఉద్యోగాలెందుకనే ప్రశ్నల నుంచి... మైదానాల్నే కాదు అడవులనూ రక్షించగలమని బాధ్యతలు తీసుకున్నారీ మహిళలు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం రేంజ్ నుండి సరిహద్దు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని దట్టమైన అడవిలో పూనుగుండ్ల, జంగాలగూడెం, మర్రిగూడెం, మడగూడెం, కొడిశల మిట్ల, పందెం, కార్లాయి వంటి గ్రామాలు. ఎటూ 30 కిలోమీటర్ల వైశాల్యం. ఎనిమిది మంది మహిళలు బీట్ ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు. ఓవైపు క్రూర మృగాలు.. మరోవైపు కలప స్మగ్లర్లు. అన్నివైపుల నుంచి సవాళ్లనూ ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు. కొన్ని సందర్భాల్లో క్యాంపుగా వెళ్తారు. మరికొన్ని సందర్భాల్లో ఒంటరిగా విధులు నిర్వహించాల్సి వస్తుంది. ఒక్కసారి అడవిలోకి అడుగుపెట్టారంటే... మొబైల్ సిగ్నల్స్ ఉండవు. వెంట తీసుకెళ్లిన ఆహారం అయిపోతే ఇక ఉపవాసమే. ఒక్కోసారి సెలయేరుల్లో నీటిని తాగాల్సి వస్తుంది. ఈ ప్రాంతమంతా దట్టమైన అడవి. తరుచుగా పులులు, చిరుతలు, ఎలుగు బంట్లు, ఇతర మృగాలు సంచరిస్తూ ఉంటాయి. గిరిజనులకు రక్షణ కల్పించేందుకు వాటి సంచారాన్ని గుర్తించాలి. ఏ వైపు నుంచి ఏ జంతువు వస్తుందో తెలియదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పనిచేయాల్సి ఉంటుంది. ప్రాణాలను పణంగా పెట్టి... అటవీ ప్రాంతం... టేకు, నల్లమద్ది, జిట్రేగు వంటి విలువైన కలపకు నెలవు. వీటిని దొంగిలించేందుకు స్మగ్లర్ల సంచారమూ ఎక్కువ. రాత్రి పగలు అనే తేడా లేకుండా అటవీ మార్గంలోని చెక్ పోస్టులు, డొంకదారుల వద్ద కాపు కాస్తుంటారు. జంతువుల నుండి ఆత్మరక్షణ పొందేందుకు ప్రభుత్వం ఇచ్చిన కొడవలిని పోలిన ఆయుధం ఒక్కటే ఉంటుంది. వాహనాలకు ఎదురు పోతే ఢీకొట్టి వెళ్తారు. ఈ పరిస్థితుల్లో స్మగ్లర్లను పట్టుకోవడం, ప్రభుత్వానికి అప్పగించడం... ప్రాణాలను పణంగా పెట్టి అడవిలో పెట్రోలింగ్ చేస్తుంటారు. అధికారులు, ఆదివాసీల మధ్య... రోజురోజుకూ అంతరించి పోతున్న అడవిని కాపాడటం వారి బాధ్యత. ఇందులో భాగంగా పోడు కొట్టడం, అటవీ భూముల్లో వ్యవసాయం చేసే రైతులను అడ్డుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తారు. దీంతో అటవీ ప్రాంతానికి వెళ్లి ట్రంచ్(కందకం)లు తీయాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు గిరిజనుల నుండి ప్రతిఘటన ఎదురవుతుంది. వారు దాడులు చేసే ప్రమాదమూ ఉంటుంది. కానీ విధి కదా. బాధ్యతగా నిర్వర్తించాలి. ఇక బాధ్యతల్లో ఉన్నది అడవి బిడ్డలైదే... అటు అధికారుల ఆదేశాలు... ఇటు తమ జాతి బతుకుదెరువు. ఎటూ తేల్చుకోలేని స్థితి. గిరిజనులను ఒప్పించడము కత్తిమీద సామే. అటు బంధాలకు బంధీలవ్వకుండా, అధికారుల ఆదేశాలను గౌరవిస్తూ... బ్యాలెన్స్డ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బీటెక్ చదివి... బీట్ ఆఫీసర్‌గా మంచి ఇంజనీర్ అవ్వాలనుకున్నా. ఈలోపే బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ పడింది. అప్లై చేస్తే ఉద్యోగం వచ్చింది. బీటెక్ చదివి... బీట్ ఆఫీసర్ ఉద్యోగమా? అన్నారు. ప్రభుత్వ ఉద్యోగం రావడమే అదృష్టం. వచ్చిన ఉద్యోగాన్ని అంకితభావంతో చేయాలనుకున్నా. ఇబ్బందులన్నీ ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నా. – దుబ్బ స్రవంతి, ఫారెస్టు బీట్ ఆఫీసర్ చాలెంజింగ్‌గా ఉంది... మాది మంగపేట మండలం. టీచర్ కావాలనుకున్నా. బీఈడీ చదివిన. ఉపాధ్యాయ పోస్టులు పడలేదు. ఈలోపే ఫారెస్టు బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు పడ్డాయి. కష్టపడి చదివి ఉద్యోగం సాధించాను. ఇది కఠినమైన ఉద్యోగమని ఇంట్లో వాళ్లు భయపడ్డారు. ‘మగవాళ్లు చేస్తున్నారు, నేనెందుకు చేయకూడదు’అని ఉద్యోగంలో చేరాను. విధి నిర్వహణ చాలెంజింగ్‌గా ఉంది. – కొండ లక్ష్మి, ఫారెస్టు బీట్ఆఫీసర్ అదృష్టంగా భావిస్తా.. మాది ములుగు జిల్లా మేడారం. ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశాను. అడవిలో పుట్టి పెరిగిన నేను మంచి ఉద్యోగంలో స్థిరపడాలని కలలుగన్నాను. మా ఇండ్లలో ప్రభుత్వ ఉద్యోగం రావడమే అదృష్టం. ఈ ఉద్యోగం వచ్చింది. అమ్మ, నాన్నలు కూడా ప్రోత్సహించారు. అడవిబిడ్డగా ఆదివాసీల మధ్య ఉద్యోగం చేయడం అదృష్టంగా భావిస్తున్నా. – ఆలెం వసంతలక్ష్మి, ఫారెస్టు బీట్ ఆఫీసర్ చిన్న పిల్లలను విడిచి నైట్ పెట్రోలింగ్‌కు... మాది ఉమ్మడి వరంగల్ జిల్లా వాడగూడ. కొత్తగూడ రేంజ్లో బీట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నా. కఠినమైన ఈ డ్యూటీలో చేరాలంటే ముందు భయపడ్డా. నాకు ఇద్దరు పిల్లలు. పసిపిల్లలను ఏజెన్సీ ప్రాంతమైన కొత్తగూడెం క్యాంపు ఆఫీసులో విడిచిపెట్టి నైట్ పెట్రోలింగ్‌కు వెళ్లాల్సి వచ్చేది. పిల్లలా... ఉద్యోగమా అనుకున్నప్పుడు. రెండూ ముఖ్యమే అనిపించింది. అలాంటి పరిస్థితుల్లోనూ వెనుకడుగేయకుండా పనిచేసినందుకు గర్వంగా ఉంటుంది. –బంగారం లలిత, ఫారెస్టు బీట్ ఆఫీసర్ కత్తిమీద సాములా... మాది గంగారం అడవి ప్రాంతంలోని మడగూడెం. నేను డిగ్రీ చదివిన. 2013లో బీట్ ఆఫీసర్‌గా చేరాను. కొంత కాలం ములుగు, ఏటూరు నాగారం ప్రాంతాల్లో పనిచేశాను. ఇప్పుడు కొత్తగూడ రేంజ్లో పనిచేస్తున్నాను. గత ఏడాది గిరిజనుల భూముల్లో ట్రంచ్‌లు వేసేందుకు వెళ్లాను. ఒక వైపు అధికారుల ఆదేశాలు. మరో వైపు ఆదివాసీ గిరిజనుల ఆందోళనలు. అడవి బిడ్డగా వారి వాదన సమంజసమే అనిపిస్తుంది. అయినా నా విధులు నేను నిర్వర్తించాలి. ఇలాంటప్పుడు కత్తిమీద సాములా ఉంటుంది. – సుంచ సంధ్యారాణి, ఫారెస్టు బీట్ ఆఫీసర్ -
నారీ భేరీ సౌండ్.. నారావారి కర్ణభేరీలో రీసౌండ్ రావాలి: రోజా
-
మళ్లీ ఆడపిల్లేనా..?! కాదు... అక్కడ ఆడపిల్ల పుడితే.. ఊరంతా ఆనందమే
సాక్షి, సంగారెడ్డి: ‘‘..మళ్లీ ఆడపిల్లేనా..?!’’రెండోకాన్పులో కూడా ఆడబిడ్డ పుట్టినప్పుడు ఇలాంటి మాట తరచూ వింటుంటాం. ఆడపిల్లను గుండెల మీద మోయలేని భారంగా భావిస్తుంటారు. కానీ, అక్కడ ఆడపిల్ల పుడితే ఊరంతా పండుగ వాతావరణమే.. ఇంటింటా సంబురమే. మిఠాయిలు పంచుకుంటారు.. గ్రామ పంచాయతీ భవనాన్ని విద్యుత్‌దీపాలతో అలంకరిస్తారు. చిన్నారికి, తల్లిదండ్రులకు కొత్తబట్టలు పెట్టి ఆ కుటుంబానికి భరోసా ఇస్తారు. ఆ గ్రామమే కొండాపూర్ మండలంలోని హరిదాస్పూర్. ఆదర్శంగా నిలుస్తున్న హరిదాస్పూర్పై ‘సాక్షి’ప్రత్యేక కథనం... ఆలోచన వచ్చింది అప్పుడే.. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆ గ్రామ సర్పంచ్ షఫీ, కార్యదర్శి రోహిత్ కులకర్ణి ఇంటింటికీ తిరిగి పారిశుధ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో కమలమ్మ ఇంటికి వెళ్లారు. ఆమెకు ముగ్గురు కూతుళ్లు. ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపింది. చిన్న కూతురు సత్యవతికి పెళ్లి చేసి అల్లుడిని ఇల్లరికం చేసుకుంది. సత్యవతికి మొదటి రెండు కాన్పుల్లో ఆడపిల్లలే పుట్టారు. మూడో కాన్పు కూడా ఆడపిల్లే పుట్టడంతో కమలమ్మ తీవ్ర నిరాశ చెందింది. సర్పంచ్, కార్యదర్శికి కమలమ్మ తన ఆవేదన చెప్పుకుంది. దీంతో ఈ కుటుంబానికి అండగా ఉండాలని భావించారు. ఆడపిల్ల పుట్టిన ప్రతి కుటుంబానికి భరోసా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. సుకన్య సమృద్ధి యోజన పథకం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇంటింటా విస్తృతంగా అవగాహన కల్పించారు. అప్పటి నుంచి గ్రామంలో ఆడపిల్ల పుడితే ఊరంతా పండుగ చేసుకోవడం ఆనవాయితీగా మారింది. చదవండి: ప్రియురాలి కండిషన్.. ప్రేమించిన అమ్మాయి దక్కదేమోనని.. సుకన్య సమృద్ధి యోజన పథకంలో నమోదు ఆడపిల్ల పుట్టిన వెంటనే ఆ చిన్నారి పేరిట బ్యాంకులో, పోస్టాఫీసులో ఖాతా తెరుస్తారు. కేంద్రం అమలు చేస్తున్న సుకన్య సమృద్ధి యోజన పథకంలో నమోదు చేస్తారు. ఈ పథకం కింద లబ్ధిదారులు చెల్లించాల్సిన మొత్తాన్ని రూ.వెయ్యిని గ్రామపంచాయతీవారే చెల్లిస్తారు. ఇలా ఇప్పటివరకు 85 మంది ఆడపిల్లల పేర్లను ఈ పథకం కింద నమోదు చేశారు. ఈ నేపథ్యంలో హరిదాస్పూర్ను ప్రభుత్వం ఉత్తమ గ్రామ పంచాయతీగా గుర్తించింది. మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో తమ గ్రామానికి అవార్డును అందజేయనున్నట్టు పంచా యతీ కార్యదర్శి రోహిత్ కులకర్ణి ‘సాక్షి’కి తెలిపారు. చదవండి: Ukraine Cat: ఉక్రెయిన్ నుంచి పిల్లిని తెచ్చుకున్నాడు.. కానీ -
International Womens Day 2022 : స్త్రీకి స్త్రీయే శత్రువా? నేను ఒప్పుకోను!
మాకూ హక్కులు కావాలి, మాకూ అవకాశాలు కావాలి అని మహిళలు దశాబ్దాలుగా ఉద్యమాలు చేస్తున్నా ఇంకా లింగ-సమానత్వం కోసం పోరాడాల్సిన పరిస్థితి. తమ ఉనికితోపాటు, పురుషులతో సమానంగా విద్యా, ఉద్యోగ, సామాజిక, రాజకీయ రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం కోసం కృషి చేస్తున్నారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జీ రాధారాణిని సాక్షి.కామ్ పలకరించింది. మహిళలందరికీ విమెన్స్ డే శుభాకాంక్షలు అందించిన ఆమె పలు విషయాలను పంచుకున్నారు. ‘‘ఇప్పటి యంగ్ జనరేషన్‌కు లింగ వివక్ష ఎక్కడ ఉంది అనిపించవచ్చు. చాలామంది టీనేజర్లకు ఈ విమెన్ డేస్ అవీ... అవసరమా అనిపిస్తుంది. కానీ వన్స్ పెళ్లి చేసుకొని కుటుంబ జీవితంలోకి ఎంటరైన ప్రతీ మహిళకు వివక్ష ఏ రూపంలో ఉంటుందనేది కనబడుతుంది. అర్థం అవుతుంది. తరతరాలుగా వివక్ష అనేది మనం జీవితాల్లో అంతర్లీనంగా జీర్ణించుకుపోయింది. గతంలో భార్యను భర్త కొట్టడం సహజమే కదా అన్నట్టుగా ఉండేవాళ్లం. ఈ పరిస్థితి నేడు మారినా ఇంకా చాలా మారాలి. ఈ కాస్త మార్పు అయినా మన పోరాటం, ప్రశ్నించడం మూలంగానే వచ్చాయి. ఆలోచించడం, ప్రశ్నించడం అనే ప్రక్రియ నిరంతరం సాగాలి. ముఖ్యంగా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మనం ఎక్కడ ఉన్నాం. ఎక్కడ లోపాలున్నాయి అనేది రివ్యూ చేసుకోవాలి. లోపాలను సరిదిద్దుకునేలా సమీక్షించుకోవాలి. మార్పుకోసం అవగాహన పెంచుకొని ముందుకు పోవాలి. అదే మార్చి 8 ఉద్దేశం. మహిళలకు న్యాయవాద వృత్తి సవాలే! ఏ ప్రొఫెషన్‌ను లైట్ తీసుకోకూడదు ఏ ప్రొఫెషన్ అయినా డెడికేటెడ్‌గా కమిటెడ్‌గా ఉండాలి. ధైర్యంగా ఉండాలి. వృత్తిని తేలిగ్గా తీసుకోకుండా, నిబద్ధతగా పనిచేసుకుంటూ పోవాలి. జ్యుడీషియల్ ప్రొఫెషన్లో సాధారణంగా సీనియర్లతో పోలిస్తే జూనియర్లకు అందులోనూ మహిళలకు ముఖ్యంగా క్రిమినల్ లాయర్స్‌కు వృత్తిలో నిలదొక్కుకోవడం చాలా కష్టం. కానీ సక్సెస్ఫుల్ విమెన్‌గా నిలవాలంటే ధైర్యంగా సవాళ్లను ఎదుర్కోవాలి. నిరుత్సాహ పడకుండా తామేంటో నిరూపించుకోగలగాలి. కుటుంబ సహకారం లేకుండా మహిళలు ముందుకు పోవడం చాలా కష్టం. నిజానికి మన బాధ్యతలు, పనితీరును బట్టి ఇంట్లో వాళ్లు అవగాహన పెంచుకుంటారు. ఇలాంటి పరిస్థితులన్నీ వర్కింగ్ విమెన్ పిల్లల గ్రోత్‌కు చాలా ఉపయోగపడతాయి. నాకు నా భర్త సహకారం చాలా ఉంది. పెళ్లి తరువాతే నేను గ్రాడ్యుయేషన్ చేశాను. ఆ తరువాత ఆయన సపోర్టుతోనే ఏలూరులో సీఆర్ఆర్ (ఈవినింగ్) లా కాలేజీలోలా చేశాను. మా కుటుంబలో ఎవరూ లీగల్ ప్రొఫెషనల్స్ లేరు. తండ్రులు, తాతలు, తెలిసినవాళ్లు ఎవరూ లేకుండానే ఈ స్థాయికి రాగలిగాను. ఇలానే అనుకున్న లక్ష్యం కోసం ప్రయత్నించి సాధించాలి. బార్ కౌన్సిల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి లీగల్ ప్రొఫెషనల్‌లోకి వచ్చేందుకు 33 శాతం రిజర్వేషన్ చాలా ఉపయోగపడుతోంది. చాలామంది మహిళలం సర్వీస్ కేండిడేట్స్‌గా వచ్చాం. అయితే బార్ నుంచి మహిళల ప్రాతినిధ్యం లభించకపోవడం ఒక లోపంగా కనిపిస్తోంది. అక్కడ పురుషుల డామినేషన్ కారణంగా మోర్ విమెన్ రావడం లేదు. ఇది మారాలి. బార్ నుంచి మహిళా లాయర్లు పెరగాలి. అలాగే బార్ కౌన్సిల్ ఎన్నికల్లో లేడీ రిప్రజెంటేటివ్‌గా ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఇక్కడ మహిళల రిప్రజెంటేషన్ పెరగాలి. డెసిషన్ మేకింగ్ పవర్ ముఖ్యం నా దృష్టిలో చదువుకోని స్త్రీ అయినా సరే స్వంతంగా నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండటమే సాధికారత. అలాగే చదువుకుని మంచి ఉద్యోగం చేసుకుంటూ ఉండి కూడా స్వయంగా నిర్ణయం తీసుకోలేక పోవడం దురదృష్టకరం. మహిళలకు విద్య, ఉద్యోగం రావడమే ఒక ఎంపవర్మెంట్. ఎడ్యుకేషన్ మహిళల్లో విశ్వాసాన్ని నమ్మకాన్ని ఇవ్వాలి. ఇస్తుంది కూడా. బయటికి వెళ్లి ఉద్యోగం చేసుకుని ఎలాగైనా జీవించవచ్చు అనే ధైర్యం విద్య ద్వారానే వస్తుంది. ఉద్యోగం చేయాలా వద్దా, పిల్లల్ని కనాలా వద్దా, ప్రమోషన్ తీసుకోవాలా వద్దా లాంటి నిర్ణయాలు మహిళలు స్వయంగా తీసుకోగలగాలి. డెసిసిషన్ మేకింగ్ పవరే విమెన్‌కు కీలకం. మన ఇండియాలో చాలామంది మహిళలకు పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి? ఎంతమంది పిల్లలు కావాలి అనేది స్వయంగా నిర్ణయించుకునే స్థితిలో లేరు. అలాగే ట్రాన్సఫర్, ఉద్యోగంలో ప్రమోషన్ తీసుకోవాలా లేదా అనే సందిగ్దంలో చాలా మంది ఉద్యోగినులు కెరీర్‌ను వదులుకుంటున్నారు. పిల్లల కోసమో, భర్తల ఒత్తిడితోనో, లేదంటే కుటుంబం కారణంగానో ఉద్యోగాలను వదిలేయాల్సిన పరిస్థితి. దీనికి నేటి మహిళలు ఆలోచించాలి. దీనిపై మరింత అవగాహన పెంచుకోవాలి. అంతేకాదు ఎవరికి ఓటు వేయాలి అనే డెసిషన్ కూడా స్వయంగా మహిళలే తీసుకోవాలి. ఆ పవర్ రావాలంటే ఎడ్యుకేషన్ ఉండాలి. స్త్రీలకు స్త్రీలే శత్రువులు అనేది నేను అసలు విశ్వసించను. మహిళల్లో ఈ భావజాలం మారేలా అవగాహన కల్పించలేకపోవడమే లోపం. దీన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది. కాగా 1963 జూన్ 29న రాధారాణి గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు.1989లో న్యాయశాస్త్రంలో పట్టా పొంది న్యాయవాదిగా, ఏపీపీగా విధులు నిర్వహించారు. ఆ తర్వాత 2008లో జిల్లా జడ్జిగా నియమితులై సంగారెడ్డి, నల్గొండ, సికింద్రాబాద్ ఫ్యామిలీ కోర్టు, నాంపల్లి కోర్టుల్లో పనిచేశారు. రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రిన్సిపల్ జడ్జిగా విధులు నిర్వంచారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. జీవితంలో అనుకున్న లక్ష్యాలను పట్టుదలగా సాధించి, ఉన్నత శిఖాలను అధిరోహించారు రాధారాణి. అంతేకాదు తాను కులాంతర వివాహం చేసుకుని, తన బిడ్డలకు కూడా కులాంతర వివాహాలను చేసి తానేంటో నిరూపించుకున్న రాధారాణిగారికి మహిళా దినోత్సవం సందర్భంగా హ్యాట్సాఫ్!!! -సాక్షి వెబ్ స్పెషల్ -
నేను స్త్రీ పక్షపాతి అవటానికి కారణం వారిద్దరే: చిరంజీవి
అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మహిళామణులందరికి శుభాకాంక్షలు తెలిపారు. మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిరంజీవి తన బ్లడ్ బ్యాంక్‌లో పని చేసే మహిళ డాక్టర్లు, మహిళలను భార్య సురేఖతో కలిసి సత్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కుటుంబంపై బాధ్యత తీసుకుంటున్న ప్రతి మహిళలకు నమస్కరిస్తున్నా. మహిళల శ్రమను గుర్తించడానికి ఈ రోజు సరైన రోజు అనిపించింది. చదవండి: విదేశాల్లో జగ్గూభాయ్, షాకింగ్ లుక్ షేర్ చేసిన నటుడు అందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మీ అందరి కష్టం చూస్తుంటే మా అమ్మ గారి కష్టం గుర్తుకు వస్తుంది. చిన్నప్పుడు నుంచి అమ్మ పడే కష్టం ఏంటో నాకు తెలుసు. తన కష్టం చూశాను కాబట్టే మీ అందరి కోసం ఈ చిరు సత్కారం’ అని అన్నారు. ఇక తాను స్త్రీ పక్షపాతి అవటానికి కారణం తన తల్లి, భార్య సురేఖ కారణమన్నారు. అంతేగాక ప్రస్తుతం మహిళలు అంతరిక్షం వరకు వెళుతున్నారని, ప్రతి ఒక్కరు మహిళలను గుర్తించాలన్నారు. ప్రపంచం గర్వించే స్థాయిలో స్త్రీ శక్తి ఉండాలని చిరంజీవి పేర్కొన్నారు. చదవండి: కండోమ్ టెస్టర్‌గా రకుల్, ఆమె తల్లిదండ్రులు ఏమన్నారంటే.. అలాగే ఈ సందర్భంగా చిరు తన భార్య సురేఖ గురించి మట్లాడారు. ‘నేను సక్సెస్ ఫుల్ హీరోగా మారడానికి నా భార్య సురేఖ కారణం. ఇంట్లో ఎటువంటి లోటు లేకుండా ఆమె చూసుకుంటుంది. నేను సినిమాలతో బిజీగా ఉంటే ఆమె ఇంట్లో నా తమ్ముళ్లను, పిల్లలను చూసుకునేది. నేను సినిమాలపై శ్రద్ధ పెడుతున్నానంటే తనే ప్రధాన కారణం. ’ అని ఆయన పేర్కొన్నారు. చివరగా టికెట్ల జీవో అంశంపై రిపోర్టర్ చిరంజీవిని ప్రశ్నించగా.. సినిమా టికెట్ల జీవో గురించి ఇప్పుడు మాట్లాడనని, ఇది సందర్బం కాదు అన్నారు. దీని గురించి అవసరమైతే ప్రత్యేకంగా మాట్లాడతాను అని ఆయన తెలిపారు. -
ఆర్సీబీలో మహిళా థెరపిస్ట్.. కైల్ జేమిసన్‌తో సంబంధమేంటి?
ఐపీఎల్లో ఆర్సీబీకి ఉన్న క్రేజ్ వేరు. ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయినప్పటికి ఫెవరెట్‌గానే కనిపిస్తోంది. ప్రతీసారి పేపర్‌పై బలంగా కనిపించే ఆర్సీబీ ఆటలో మాత్రం తడబడుతుంది. ఈ సీజన్లో కోహ్లి కెప్టెన్‌గా తప్పుకోవడంతో దినేష్ కార్తిక్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. మరి నూతన సారధ్యంలో ఆర్సీబీ కప్ కొడుతుందా అన్నది చూడాలి. ఈ విషయం పక్కనబెడితే.. ఆర్సీబీ యాజమాన్యం అంతర్జాతీయ మహిళ దినోత్సవం పురస్కరించుకొని తన ట్విటర్ వేదికగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపింది. '' ముందుగా ఆర్సీబీ జట్టులో థెరపిస్ట్‌గా పనిచేస్తున్న నవనీతా గౌతమ్‌కు ప్రత్యేక అభినందనలు. ప్రపంచంలో ఉన్న మహిళలందరూ నిజంగా సూపర్ హీరోలే.. అందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు'' అంటూ రాసుకొచ్చింది.ఆర్సీబీ నవ్‌నీతా గౌత్మ్కు శుభాకాంక్షలు చెప్పగానే సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ ఒక విషయాన్ని గుర్తుచేశారు. ''నవనీతా గౌతమ్.. కైల్ జేమిసన్ ఎక్కడ?'' అంటూ అడిగారు. అదేంటి నవ్నీతాకు, జేమిసన్‌కు రిలేషన్ ఏంటి అని ఆశ్చర్యపోకండి. విషయంలోకి వెళితే.. గతేడాది సీజన్లో అబుదాబి వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 4 వికెట్ల నష్టానికి 53 పరుగులతో ఆడుతుంది. బ్రేక్ సమయంలో కెమెరామెన్ ఒకసారి ఆర్సీబీ కూర్చొన్న డగౌట్ వైపు తిప్పాడు. అక్కడ ఒక ఇద్దరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కైల్ జేమిసన్ ప్యాడ్లు కట్టుకొని సిద్ధంగా ఉండగా.. అతనికి వెనకాల నవనీతా గౌతమ్ కూర్చొని ఉంది.వారిద్దరో ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు కానీ కెమెరా వారివైపు చూసేసరికి ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ చిరునవ్వులు ఇవ్వడం హైలెట్‌గా నిలిచింది. ఇదే విషయాన్ని అభిమానులు మరోసారి తాజాగా గుర్తుచేసుకుంటూ ఫన్నీ కామెంట్ చేశారు. ఎవరీ నవనీతా గౌతమ్.. కెనడాలోని వాంకోవర్‌లో ఏప్రిల్ 11, 1992లో నవనీతా గౌతమ్ జన్మించింది. థెరపిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన నవనీతా గ్లోబల్ టి20 కెనడా టీంకు మొదట మసాజ్ థెరపిస్ట్‌గా సేవలందించింది. ఆ తర్వాత ఆసియా కప్ క్యాంపెయిన్ సందర్భంగా భారతీయ మహిళా బాస్కెట్‌బాల్ జట్టుకు స్టాఫ్ సపోర్ట్‌గా వ్యవహరించింది. ఇక 2019లో ఆర్సీబీలో స్పోర్ట్స్ మసాజ్ థెరపిస్ట్‌గా జాయిన్ అయింది. ప్రస్తుతం ఐపీఎల్లో ఉన్న జట్లలో ఏకైక మహిళా థెరపిస్ట్ నవనీతా గౌతమ్ మాత్రమే. చదవండి: IPL 2022: ధోని క్రేజ్ తగ్గలేదనడానికి మరో సాక్ష్యం Cristiano Ronaldo: సంచలనం సృష్టిస్తున్న రొనాల్డో బహిరంగ స్నానం To all the women out there, you are the real superheroes! Wish you a very Happy Women’s Day! 🙌🏻🤩🦸♀️ #PlayBold #WomensDay #WeAreChallengers pic.twitter.com/ti4sUr2kMX — Royal Challengers Bangalore (@RCBTweets) March 8, 2022 If this isn't the next best idea for Imperial Blue's 'men will be men' series then I don't know what is😂 pic.twitter.com/L3IECeXH3R — Kanav Bali🏏 (@Concussion__Sub) September 20, 2021 -
రాజ్‌భవన్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు (ఫోటోలు)
-
International Women's Day 2022: రాజ్యాంగం కల్పించిన హక్కులు ఇవే
సాక్షి, నిర్మల్: మహిళలకు భారత రాజ్యాంగం ఎన్నో హక్కులు కల్పించింది. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. అంతేకాకుండా సఖి కేంద్రం, షీ టీంల ద్వారా ప్రభుత్వాలు మహిళలకు అండగా నిలుస్తున్నాయి. రాజ్యాంగం కల్పించిన హక్కులు ► వారసత్వంలో సమాన వాటా హక్కు ►భ్రూణహత్యల నిరోధక హక్కు ►గృహహింస నిరోధక హక్కు ►ప్రసూతి ప్రయోజనాల హక్కు ► న్యాయ సహాయ హక్కు ►గోప్యత హక్కు ►ఆన్లైన్లో ఫిర్యాదుల హక్కు ►అరెస్ట్ కాకుండా ఉండే హక్కు ►పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా ఉండే హక్కు ►సమాన వేతన హక్కు ►పని ప్రదేశంలో వేధింపులకు అడ్డుకట్ట ►పేరు చెప్పకుండా ఉండే హక్కు ►కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని పథకాలు ►ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ►బేటీ బచావో బేటీ పడావో ►సురక్షిత మాతృత్వ హామీ సుమన్ యోజన ►ఉచిత కుట్టు యంత్రం ►మహిళా శక్తి కేంద్ర పథకం ►సుకన్య సమృద్ధి యోజన నిర్మల్ జిల్లాలో సఖి కేంద్రం వివరాలు.. ►సఖి కేంద్రం ప్రారంభమైన తేదీ 18 –05 –2019 ►నమోదయిన కేసులు 717 ►పరిష్కారమైన కేసులు 586 ►పెండింగ్ కేసులు 131 ►సఖి కేంద్రం ద్వారా సర్వీసులు.. ►సైకో సోషల్ కౌన్సిలింగ్‌లు 2065 ►లీగల్ కౌన్సిలింగ్‌లు 73 ►వసతి కల్పించిన వారు 128 ►ఆరోగ్య పరీక్షలు 29 ►బాహ్య ప్రదేశాలలో కౌన్సిలింగ్ 16 ►ఏమర్జెన్సీ రెస్క్యూ సర్వీస్ 9 ►ఎఫ్ఐఆర్ నమోదు కేసులు 21 ►షీ టీం ద్వారా అందుతున్న సేవలు.. ►జిల్లాలో షీ టీంలు 2: నిర్మల్, భైంసా ►నమోదయిన మొత్తం కేసులు 45 ►ఫోక్సో కేసులు 27 ►నిర్వహించిన కౌన్సిలింగ్‌లు 120 ►అవగాహన కార్యక్రమాలు 158 ►హాజరైన విద్యార్థులు/ప్రజలు 16182 -
మహిళా శక్తికి నిదర్శనం అమ్మ..
సాక్షి ప్రతినిధి, చెన్నై: వెండితెరపై వెలుగులు నింపిన తొలితరం నటి రాజసులోచన. ఈమె బహుముఖ ప్రజ్ఞాశాలిగా కూడా చిరపరిచితురాలు. అనేక మూఢ నమ్మకాలు, అపోహలు ఉన్న నాటి సమాజంలో మహిళగా నాట్యరంగం, సినీ రంగంతో పాటు బోట్, కారు డ్రైవింగ్ వంటి అంశాల్లోనూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. తమ వాగ్దాటితో ఎంతో మంది ఔత్సాహిక కళాకారులకు మార్గనిర్దేశం చేశారు. తద్వారా మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తొలితరం నటి రాజసులోచన ఘనతలను.. ఎదుగుదల క్రమంలో మహిళా శక్తిని ప్రపంచానికి చాటిచెప్పిన తీరును.. ఆమె కవల కుమార్తెల్లో ఒకరైన దేవీకృష్ణ ‘సాక్షి’తో పంచుకున్నారు.. ‘‘మాతల్లి వెండి తెరపై ప్రతిభ చూపగా.. తండ్రి చిత్తజల్లు శ్రీనివాసరావు (సీఎస్‌రావు)తెరవెనుక ఉంటూ అనేక మంది నటీనటులను వెలుగులోకి తెచ్చారు. మా సోదరి యూఎస్‌లో స్థిరపడగా నేను చెన్నైలో నివాసిస్తున్నాను. తాత రైల్వేలో పనిచేస్తూ ఉద్యోగరీత్యా అమ్మ చిన్నతనంలోనే చెన్నైకి వచ్చారు. కె.ఎన్.దండాయుధపాణి పిళ్లై వద్ద ఆమె భరతనాట్యం అభ్యసించింది. వయొలిన్, వీణలో కూడా ప్రవేశం ఉంది. స్వయంగా డ్యాన్స్ స్కూల్‌ను స్థాపించి అందులో మాస్టరుగా కూచిపూడి వెంపటి చినసత్యాన్ని నియమించారు. అలాగే అమ్మ కూచిపూడి నృత్యాన్ని కూడా అభ్యసించారు. 1961లో పుష్పాంజలి నృత్య కళాకేంద్రం పేరుతో పాఠశాలను అమ్మ స్థాపించారు. యోగా, వ్యాయామం, సూర్య నమస్కారాలు, ఈత, కారు డ్రైవింగ్, బోట్ నడపడంలో విశేష ప్రతిభ చూపేవారు. బెంగళూరులో అమ్మ నాట్య ప్రదర్శనను చూసిన ఓ కన్నడ నిర్మాత సినిమాల్లో నటించాలని కోరారు. 1953లో గుణసాదరి అనే కన్నడ చిత్రం ద్వారా అమ్మ తెరంగేట్రం చేశారు. ఆ తరువాత తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో సుమారు 325కు పైగా సినిమాలు చేశారు. 1962లో అమ్మ రాజసులోచన.. మా నాన్న సీఎస్ రావును రెండో వివాహం చేసుకున్నారు’’ అని తెలిపారు. తెరంగేట్రం అలా.. 1966 జూలై 27న కవలపిల్లలుగా జన్మించాం. ఆ కాలంలో కవలలు పుట్టడం అరుదంట. అందుకే అమ్మకు డెలివరీ అయినప్పుడు సినీ ప్రముఖులంతా తరలివచ్చి మమ్మల్ని చూశారు. ఆ రోజుల్లో అన్ని భాషల మీడియాలో కూడా ఇది ఒక ప్రముఖ వార్తగా మారిందని.. మా తల్లిదండ్రులు చెప్పేవారు. కర్నూలు జిల్లా మంత్రాలయానికి వెళ్లినప్పుడు దైవ సన్నిధిలో అదే మా అక్కచెల్లెళ్ల నాట్య ప్రదర్శనను చూసిన ఒక నిర్మాత పట్టుబట్టి మా ఇద్దరి చేత తెరంగేట్రం చేయించాడు. దేవుడు చేసిన పెళ్లి అనే చిత్రంలో నటి శారద ద్విపాత్రాభినయం చేశారు. ఆమె బాల్యం నాటి పాత్రను కవలలైన మేం చేశాం. అమ్మ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు.. మా తల్లి అడుగుజాడల్లో నడుస్తూ సేవ, సంగీత కార్యాక్రమాలు చేపడుతున్నాం. ప్రస్తుతం నేను రోటరీ క్లబ్ 3232 డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ గవర్నర్‌గా పనిచేస్తున్నాను. మహిళా సభ్యులతో రోటరీ క్లబ్ ఆఫ్ చెన్నై స్పాట్లైట్ను 2014 జూన్‌లో ప్రారంభించాను. దీనికి చార్టర్డ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నాను. సహజంగా నేను గాయని కావడంతో 2013లో ‘ధ్వని ఎంటర్టైన్మెంట్’ అనే సంస్థను స్థాపించి ఈవెంట్ మేనేజిమెంట్ చేస్తున్నాను. మా నాన్న స్కృత్యర్థ్యం లాభాపేక్ష లేకుండా ‘నృత్య గాన లయ’ (ఎన్జీఎల్) ట్రస్ట్‌ను 2005లో నెలకొల్పి ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహిస్తున్నాను. యూఎస్‌లో స్థిరపడిన నా సోదరి శ్రీ గురుస్వామి సైతం గత 20 ఏళ్లుగా అక్కడ భారతీయ కుటుంబాలకు అవసరమైన సామాజిక సేవ చేస్తున్నారు. ‘సోషల్ వర్కర్ ఆఫ్ ది ఇయర్–2020–21’ అవార్డును ఆమె గత ఏడాది అందుకున్నారు. -
అవును... మన గంగవ్వే!
మిలుకూరి గంగవ్వ, అరవై ఏళ్ల గంగవ్వ, వ్యవసాయ కూలీ గంగవ్వ... ఉన్నట్లుండి యూ ట్యూబ్ స్టార్ అయిపోయిన గంగవ్వ... ఎప్పుడో స్టార్‌గా ఎదిగిపోయింది. ఇప్పుడు తాజాగా దేశం గుర్తించిన యూ ట్యూబ్ స్టార్ అయింది. ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ మీడియా మనదేశంలో ప్రభావవంతమైన, సాధికార మహిళలను గుర్తించిన క్రమంలో గంగవ్వను గుర్తు చేసుకుంది. చదవండి: ఇంటర్య్వూలో పూజ నోట అభ్యంతరకర పదం, పట్టేసిన నెటిజన్లు మనకు తెలిసిన మన గంగవ్వ ఇప్పుడు దేశవ్యాప్త మహిళాప్రభంజనం జాబితాలో చేరింది. నిజమే... గంగవ్వ నిజంగా ఒక ప్రభంజనం అనే చెప్పాలి. యూట్యూబ్‌లో ప్రసారమైన ‘మై విలేజ్ షో’ను గంగవ్వ కోసమే చూసిన వాళ్లున్నారు. ఆ షో చూస్తూ గంగవ్వకు అభిమానులైన వాళ్లున్నారు. ఆమెకు ఎంత ఫాలోయింగ్ అంటే... కాజల్ అగర్వాల్ వంటి సినీతారల కంటే గంగవ్వకే ఎక్కువ లైక్‌లు వచ్చేటంత. చదవండి: ప్రభాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన శ్యామల దేవి అందరి ఇంటి ‘అవ్వ’ గంగవ్వది తెలంగాణ రాష్ట్రం, లంబాడి పల్లి గ్రామం. పొలం పనులకు వెళ్లడం కోసం స్కూలు చదువు మధ్యలోనే ఆపేసింది. వ్యవసాయ పనులతోనే జీవితాన్ని కొనసాగించింది. ఆమెలో సహజనటి ఉందనే విషయం రెండో వ్యక్తికి కాదు తనకు కూడా తెలియకనే అరవై ఏళ్లు జీవించేసింది. ఆమె అల్లుడు తన హాస్య కథనంలో అతిథిగా కనిపించమని ఆమెను అడగడం కేవలం యాదృచ్ఛికమే. ఆ తర్వాత గంగవ్వ కెరీర్ గ్రాఫ్ అలా అలా పెరిగిపోయింది. ఇస్మార్ట్ శంకర్, మల్లేశం, లవ్‌స్టోరీ చిత్రాల్లో నటించింది. మొత్తానికి అలా మన కళ్ల ముందు ఎదిగిన మన గంగవ్వ కీర్తిపతాకం జాతీయస్థాయికి చేరింది. ‘అవ్వా! నువ్వు గ్రేట్. ఇవన్నీ ఎలా సాధించావు, నీకు భయంగా అనిపించలేదా’ అని అడిగితే ‘నీ శక్తి మీద నీకు నమ్మకం ఉంటే, నువ్వు ఏదైనా సాధించగలవు’ అంటోంది గంగవ్వ. -
ప్రతి మహిళలో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది: సీఎం జగన్
సాక్షి, విజయవాడ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ‘మహిళా సాధికారత–జగనన్న లక్ష్యం’ పేరుతో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగిస్తూ ఏమన్నారంటే.. మన మహిళలకు దక్కిన గౌరవం: ఈరోజు ఇక్కడ మహిళా ప్రపంచాన్ని చూస్తుంటే, మహిళా సాధికారతకు అర్థం చెబుతూ ఇక్కడికి వచ్చిన ప్రతి అక్క చెల్లెమ్మకు, ఇక్కడికి రాలేకపోయిన అందరు అక్కచెల్లెమ్మలకు మీ అన్న, మీ తమ్ముడు జగన్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నాడు. ఆధునిక ఆంధ్రప్రదేశ్‌కు మన సమాజంలో, మన ప్రభుత్వంలో మహిళలకు దక్కిన గౌరవానికి ఈరోజు ఇక్కడ ఉన్న నా అక్క చెల్లెమ్మలు అందరూ ప్రతినిధులు. ఎక్కడైనా ఏ సభలో చూసినా నాయకులు స్టేజ్ మీద ఉంటే ప్రజలు కింద ఉంటారు. కానీ ఇవాళ ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే, ఇటు స్టేజ్ మీద, అటు స్టేడియం నిండా ఈ వేల మందిలో ప్రతి ఒక్కరూ ప్రజా ప్రతినిధులే. ప్రతి ఒక్కరు ఎంపవర్డ్ ఉమెన్. ప్రతి ఒక్కరు సాధికారతకు ప్రతినిధులుగా నిలుస్తున్నారు. ఆమె మాటలు గుర్తుకొస్తున్నాయి: మీలో ఉన్న ఆత్మ విశ్వాసాన్ని చూస్తుంటే అయిన్ రైన్డ్ అనే మహిళ మాటలు గుర్తుకు వస్తున్నాయి. ‘నేను ఒక స్త్రీని కాబట్టి, నన్ను ఎవరు ఎదగనిస్తారన్నది ప్రశ్న కాదు. ఆత్మ విశ్వాసం ఉన్న నన్ను ఎవరు ఆపగలుగుతారు అన్నది ప్రశ్న’.. నిజంగా ఆమె చెప్పిన మాటలు, ఆ అర్థం ఈ రోజు ఇక్కడ కనిపిస్తోంది. అంచెలంచెలుగా ఎదుగుతున్న ప్రతి ఆడబిడ్డలోనూ, అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న ప్రతి మహిళలోనూ ఇటువంటి ఆత్మ విశ్వాసం ఈరోజు ఇక్కడ మన రాష్ట్రంలో నిదర్శనంలా కనిపిస్తోంది. ఇంత మంది ప్రజా ప్రతినిధులు: నా ఎదురుగా ఉన్న ఈ అక్కచెల్లెమ్మల్లో దాదాపు 99 శాతం మంది వార్డు మెంబర్లుగానో, సర్పంచ్‌లుగానో, ఎంపీటీసీ, జడ్పీటీసీలుగానో, మున్సిపల్ కౌన్సిలర్లుగానో, మున్సిపల్ ఛైర్మన్లుగానో, కార్పొరేటర్లుగానో, మేయర్లుగానో లేదా ఏదో ఒక కార్పొరేషన్ ఛైర్మన్‌గానో, డైరెక్టర్‌గానో ఉన్నారు. ఇంకా నా మంత్రివర్గ సహచరులైన అక్కచెల్లెమ్మలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్పర్సన్లు, మహిళా కమిషన్ ఛైర్మన్, సభ్యులు. బహుషా దేశ చరిత్రలో ఇటువంటి సమావేశం ఎప్పుడూ, ఎక్కడా జరిగి ఉండదని గర్వంగా చెబతున్నాను. ఇంటింటా చెప్పండి: ఇది మన ఆధ్వర్యంలో, మన ప్రభుత్వంలో జరుగుతుంది అంటే, ఇదంతా దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో జరుగుతుందని తెలియజేస్తున్నాను. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో లభించిన ఈ అధికారాన్ని అక్కచెల్లెమ్మల కోసం ఎలా ఉపయోగించామో, ఎలా అడుగులు వేశామో క్లుప్తంగా ఇవాళ మీ ముందు ఉంచుతున్నాను. ఈ నిజాలు, సందేశాన్ని గ్రామ గ్రామాన, ప్రతి నగరంలో ప్రతి ఇంట్లో చెప్పాలని సవినయంగా కోరుతున్నాను. రాజకీయ సాధికారత: రాజకీయ సాధికారత పరంగా మనం ఏం చేశామో మీ ముందుంచుతున్నాను. మహిళలకు చట్టసభల్లో 33 శాతం సీట్లు కేటాయించాలని చెప్పి 1993 నుంచి పార్లమెంటులో బిల్లులు పెడుతూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాలు లేవు. అయితే ఏ డిమాండ్లు లేకపోయినా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ విధానంలో ఇచ్చే కాంట్రాక్టుల్లో 50 శాతం ఇచ్చేలా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనది అని గర్వంగా చెబుతున్నాను. నామినేటెడ్ పదవుల్లో 51 శాతం పదవులు ఇచ్చిన తొలి ప్రభుత్వం మనదే. మొత్తం 1,154 డైరెక్టర్ పదవుల్లో అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన పదవులు 586 అని గర్వంగా చెబుతున్నాను. 202 మార్కెట్ యార్డు ఛైర్మన్ పదవుల్లో 102 మహిళలకే ఇచ్చాం. అంటే మొత్తంగా 1356 రాజకీయ నియామక పదవుల్లో 688, అంటే అక్షరాలా 51 శాతం అక్కచెలెక్లమ్మలకు కేటాయించాం. అంతే కాకుండా మనం ఇచ్చిన పదవులు చూస్తే, రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా శాసనమండలి వైస్ ఛైర్మన్‌గా నా సోదరి జకియాఖాన్ను నియమించాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నా మరో సోదరి, ఎస్టీ మహిళ పుష్పశ్రీవాణిని, రాష్ట్ర హోం మంత్రిగా నా మరో దళిత సోదరి సుచరితను నియమించాం. రాష్ట్ర తొలి చీఫ్ సెక్రటరీగానూ, ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నా సోదరి నీలం సాహ్నిని నియమించాం. జడ్పీ ఛైర్మన్లు.. ఆ 13 పదవుల్లో 7గురు నా అక్కచెల్లెమ్మలే ఉన్నారు. అంటే అక్షరాలా 54 శాతం అక్కచెల్లెమ్మలే ఉన్నారు. 26 జడ్పీ వైస్‌ఛైర్మన్ పదవుల్లో 15 మంది, అంటే 58 శాతం నా అక్కచెల్లెమ్మలే ఉన్నారు. ఇంకా 12 మేయర్ పోస్టులు, 24 డిప్యూటీ మేయర్ పదవులు.. మొత్తంగా 36 పదవుల్లో.. 18 అంటే 50 శాతం అక్కచెల్లెమ్మలే ఉన్నారు. మొత్తం మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డు మెంబర్లు 671 అయితే, వారిలో అక్కచెల్లెమ్మలకు 54 శాతం అంటే, 361 పదవులు దక్కాయి. ఇటీవల 75 మున్సిపాలిటీ ఎన్నికలు జరిగితే వాటిలో 73 చోట్ల వైయస్సార్సీపీ విజయం సాధించింది. వాటిలో అక్షరాలా 45 మంది, అంటే 64 శాతం నా అక్కచెల్లెమ్మలే ఛైర్పర్సన్లుగా ఉన్నారు. ఇంకా 2,123 వార్డు మెంబర్లలో 1,161 మంది, అంటే 55 శాతం నా అక్కచెల్లెమ్మలకే దక్కేట్లు చేశామని గర్వంగా చెబుతున్నాను. సర్పంచ్ పదవుల్లో 57 శాతం, ఎంపీటీసీల్లో 54 శాతం, మండల అధ్యక్షుల్లో 53 శాతం, జడ్పీటీసీల్లో 53 శాతం నా అక్కచెల్లెమ్మలకే దక్కేలా చేయగలిగామని మీ అన్నగా, తమ్ముడిగా చెబుతున్నాను. సచివాలయాలు–వలంటీర్లు: మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన దాదాపు 2.60 లక్షల వలంటీర్ ఉద్యోగాల్లో 53 శాతం నా చెల్లెళ్లు ఉన్నారు. ఇంకా దాదాపు 1.30 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తుండగా, వారిలో 51 శాతం నా చెల్లెమ్మలు ఉన్నారు. దేశంలో 28 రాష్ట్రాల చరిత్రలో మనకు సరిసమానంగా ఆడపడుచులను బలపర్చిన ప్రభుత్వం ఒక్కటి కూడా లేదు. పథకాలు-అక్కచెల్లెమ్మలు: ఈ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి. ఉందో లేదో మీరే చెప్పాలి. అమ్మ ఒడి: దేశంలోని ఏ ఒక్క రాష్ట్రంలో అయిన తమ పిల్లల్ని చదివిస్తున్న తల్లులకు రూ.15 వేలు ఇచ్చే జగనన్న అమ్మ ఒడి ఉందా? ఇక్కడ 44.50 లక్షల అక్కచెల్లెమ్మలకు ఈ రెండేళ్లలో రూ.13,022 కోట్లు ఈ పథకంలో ఇచ్చాం. వైఎస్సార్ ఆసరా: మిమ్మల్ని అడుగుతున్నాను. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాల వల్ల వారు ఇబ్బంది పడొద్దని, ఆ డబ్బులు తిరిగి ఇస్తున్న వైయస్సార్ ఆసరా వంటి పథకం ఉందా? ఈ పథకంలో పొదుపు సంఘాలకు చెందిన 80 లక్షల అక్కచెల్లెమ్మలకు చెల్లించిన సొమ్ము రూ.12,758 కోట్లు. మొత్తంగా 4 విడతల్లో నా అక్కచెల్లెమ్మలకు అక్షరాలా రూ.25,512 కోట్లు ఇవ్వనున్నది మీ అన్న, తమ్ముడి ప్రభుత్వం. అంతే కాకుండా ఈ డబ్బును పెట్టుబడిగా మార్చుకుని వ్యాపారం చేయాలనుకునే అక్కచెల్లెమ్మలకు బ్యాంకులతో మాట్లాడి అవకాశం చూపించడమే కాకుండా ఏటా దాదాపు రూ.20 వేల కోట్లు రుణాలు క్రోడీకరించే కార్యక్రమం కొనసాగుతోంది. వైఎస్సార్ సున్నా వడ్డీ: పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ పథకం మరెక్కడైనా ఉందా? వైయస్సార్ సున్నా వడ్డీ కింద ఇప్పటి వరకు కోటి మంది అక్కచెల్లెమ్మలకు అక్షరాలా రూ.2,354 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశాం. వైఎస్సార్ చేయూత: 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉండి, ఏ పథకం అందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్కచెల్లెమ్మలకు వరసగా 4 ఏళ్లలో రూ.75 వేలు ఇస్తూ వైయస్సార్ చేయూత పథకం దేశంలో ఎక్కడైనా ఉందా? ఈ ఒక్క పథకం ద్వారా 24.95 లక్షల నా అక్కచెల్లెమ్మలకు రెండు విడతలుగా ఇప్పటి వరకు రూ.9,180 కోట్లు అందించాం. కేవలం డబ్బులు ఇవ్వడమే కాకుండా బ్యాంకులు, వివిధ కార్పొరేట్ సంస్థలతోనూ మాట్లాడి, వారికి వ్యాపార అవకాశాలు చూపాం. ఆవులు, గేదెలు కొనుక్కుని అమూల్ సంస్థతో వ్యాపారం చేస్తున్నారు. రిలయన్స్, ఐటీసీ వంటి సంస్థలు వారికి తోడుగా నిలుస్తున్నాయి. ఆ విధంగా వారికి బ్రతికే మార్గాలు కూడా చూపుతున్నాం. ఇది దేశంలో ఎక్కడైనా ఉందా? వైఎస్సార్ పెన్షన్ కానుక: దేశంలోనే అత్యధికంగా రూ.2500 పెన్షన్ ఇవ్వడమే కాకుండా అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులకు ఈ స్థాయిలో ఇవ్వడం, అది కూడా ప్రతి నెలా ఒకటో తేదీన సెలవైనా, పండగైనా సరే ఇంటికి వెళ్లి ఏ ప్రభుత్వం అయినా ఇస్తోందా? వైఎస్సార్ పెన్షన్ కానుకలో 61.74 లక్షల పెన్షన్లు ఇస్తుండగా, వారిలో 36.50 లక్షల మంది అక్కచెల్లెమ్మలు ఉన్నారు. వారికి రూ.28,885 కోట్ల పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇళ్లు-ఇళ్ల స్థలాలు-ఆస్తి: ఇల్లు లేని ప్రతి నిరుపేదకు, అది కూడా అక్కచెల్లెమ్మ పేరుతో ఇంటి స్థలం ఇవ్వడమే కాకుండా, అక్షరాలా 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తూ, వాటిలో ఇళ్లు కట్టించడం దేశంలో మరెక్కడైనా ఉందా? ఈ ఒక్క పథకమే ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలో ఇల్లు పూరై్తన తర్వాత కనీసం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆస్తి పెట్టినట్లు అవుతుంది. ఇది దేశంలో ఎక్కడా లేదు. విద్యాదీవెన-వసతి దీవెన: పెద్ద చదువుల కోసం అప్పులపాలు కాకుండా ఏ ప్రభుత్వమైనా ఇక్కడి మాదిరిగా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ, విద్యాదీవెన, వసతి దీవెన వంటివి అమలు చేస్తోందా? అక్షరాలా జగనన్న విద్యాదీవెన ద్వారా 21.50 లక్షల తల్లులకు రూ.6,260 కోట్లు ఇచ్చాం. ఇందులో గత ప్రభుత్వం బకాయి పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ రూ.1800 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇక వసతి దీవెన కింద తల్లుల ఖాతాల్లో ఇప్పటి వరకు మరో రూ.2,305 కోట్లు జమ చేశాం. వైఎస్సార్ సంపూర్ణ పోషణ: వైఎస్సార్ సంపూర్ణ పోషణ కింద గర్భిణిలు, బాలింతలకు మంచి ఆహారం అందజేస్తున్నాం. ఆరేళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వడంతో పాటు, అంగన్వాడీలను ప్రీప్రైమరీ స్కూళ్లుగా మార్చడం, ఇంగ్లిష్ మీడియమ్ ప్రారంభిస్తున్నాం. మరోవైపు ఏడు షెడ్యూల్ ప్రాంతాల్లో, అంటే గిరిజన ప్రాంతాల్లోని వారికి ఇంకా మంచి పౌష్టికాహారం అందజేస్తూ సంపూర్ణ పోషణ ప్లస్ పథకం అమలు చేస్తున్నాం. ఈ పథకంలో అక్షరాలా 30.16 లక్షల మందికి మేలు కలుగుతోంది. ఈ పథకానికి గత ప్రభుత్వ హయాంలో ఏటా కేవలం రూ.600 కోట్లు ఖర్చు చేయగా, మనందరి ప్రభుత్వం ఏటా రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. ఇది దేశంలో ఎక్కడా లేదు. వైఎస్సార్ కాపు నేస్తం: వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 3.28 లక్షల అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటూ, రూ.75 వేలు ఇస్తున్నాం. ఇప్పటికే రెండు దఫాలుగా రూ.982 కోట్లు ఇచ్చాం. ఎవ్వరూ ఊహించని విధంగా ఈ పథకం అమలు చేస్తున్నాం. ఇలాంటి పథకాన్ని గత ప్రభుత్వం ఏనాడూ అమలు చేయలేదు. ఈబీసీ నేస్తం: వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా దేశంలోనే తొలిసారిగా పేద ఓసీ మహిళలకు ఆర్థిక సహాయం చేస్తున్నాం. 45 నుంచి 60 ఏళ్ల మ«ధ్య ఉన్న దాదాపు 3.93 లక్షల నిరుపేద ఓసీ అక్కచెల్లెమ్మలకు, ఒక్కో కుటుంబానికి ఏటా రూ.15 వేల చొప్పున వరసగా మూడేళ్లపాటు అందించనున్నాం. ఇప్పటికే రూ.589 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశాం. ఈ 34 నెలల్లో ఎంత మొత్తం?: ఇలా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 34 నెలల కాలంలో అక్కచెల్లెమ్మలకు నేరుగా ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా అందించిన మొత్తం ఏకంగా రూ.83,509 కోట్లు. అదే విధంగా పరోక్షంగా అక్కచెల్లెమ్మలకు రూ.34,841 కోట్ల లబ్ధి జరిగింది. ఆ విధంగా మొత్తంగా ఈ 34 నెలల కాలంలో అక్కచెల్లెమ్మలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా అందించిన సొమ్ము అక్షరాలా రూ.1.18 లక్షల కోట్లు. నిశ్శబ్ద విప్లవం: ఇవి కాక జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, వైయస్సార్ స్వేచ్ఛ, ఇంగ్లిష్ మీడియమ్, నాడు–నేడుతో స్కూళ్లలో సమూల మార్పులు.. ఇవన్నీ కూడా బాలికలను పెద్ద చదువులు చదివించడంలో ఒక నిశ్శబ్ద విప్లవంగా తోడ్పడుతున్నాయి. దిశ చట్టం-దిశ యాప్: ఇంకా మహిళల రక్షణ కోసం మనందరి ప్రభుత్వం ఎక్కడా జరగని విధంగా దిశ బిల్లు రూపొందించింది. నేరాల సంఖ్య తగ్గాలంటే శిక్ష విధించే కాలం తగ్గాలని చూశాం. అందుకే 7 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని, 14 రోజుల్లో విచారణ, 21 రోజుల్లో శిక్ష పడే విధంగా బిల్లు రూపొందించాం. అయితే ఈ బిల్లుకు కేంద్రం నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఒకవైపు ఆ అనుమతి కోసం ప్రయత్నిస్తూనే, మరోవైపు అందులో అంశాలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా దిశ యాప్ తెచ్చాం. ఇప్పటి వరకు 1.13 కోట్ల మంది అక్కచెల్లెమ్మలు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఫోన్లో ఆ దిశ యాప్ ఉంటే, అన్న తోడుగా ఉన్నట్లే. అక్కచెల్లెమ్మ ఆపదలో ఉంటే, ఆ యాప్‌లో ఎస్ఓఎస్ నొక్కినా లేదా ఆ ఫోన్ 5సార్లు ఊపితే చాలు, నగరాల్లో అయితే 10 నిమిషాలు, గ్రామాల్లో 20 నిమిషాలు కూడా దాటకముందే పోలీసులు చేరుకుంటున్నారు. ఇది దేశంలో ఎక్కడా లేని వ్యవస్థ పని చేస్తోంది. ఈ యాప్ ద్వారా ఇప్పటి వరకు ఆపదలో ఉన్న 900 మంది అక్కచెల్లెమ్మలను కాపాడడం జరిగింది. తగ్గిన దర్యాప్తు కాలం: అలా అక్కచెల్లెమ్మల కాల్స్ అటెండ్ చేయడమే కాకుండా, నేరాల దర్యాప్తు, ఛార్జ్షీట్ల దాఖలులో చాలా వేగం పెరిగింది. గత ప్రభుత్వ హయాంలో, అంటే 2017లో ఆ నేరాల దర్యాప్తుకు ఒక్కో కేసుకు సగటున 169 రోజుల సమయం పడితే, ఇప్పుడు 2021లో ఒక్కో కేసు దర్యాప్తు సగటు సమయం 61 రోజులకు తగ్గిందని సగర్వంగా తెలియజేస్తున్నాను. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ కేవలం 7 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి చార్జ్‌షీట్ దాఖలు చేసిన కేసులు మొత్తం 1,132. దేశంలో మహిళలపై నేరాలకు సంబందించి ఇంత వేగంగా దర్యాప్తు చేయడం లేదు. మహిళలపై సైబర్ నేరాలకు పాల్పడిన వారిపై 2,134 హిస్టరీ షీట్స్‌ను, 1,531 సైబర్ బుల్లీయింగ్ షీట్లు ఇప్పటి వరకు ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా సెక్సువల్ అఫెండర్లకు సంబంధించిన క్రైమ్ డేటా ఆధారంగా దాదాపు 2 లక్షల మందిని గుర్తించి, వారిని జియో ట్యాగింగ్ ద్వారా వెంబడిస్తున్నాం. ఎక్కడైనా అక్కచెల్లెమ్మలకు ఏ ఇబ్బంది కలిగినా ఈ ప్రభుత్వం ఊర్కోదు. దిశ ఫోరెన్సిక్ ల్యాబ్‌లు: దిశ ఫోరెన్సిక ల్యాబ్‌ల ఏర్పాటు దేశంలోనే అతి పెద్ద అడుగు. రూ.87 కోట్లు కేటాయించి, ప్రతి జిల్లాలో ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ప్రత్యేకంగా సిబ్బంది నియామకం కూడా జరిగింది. బ్రహ్మాస్త్రాలు: దిశ యాప్ ఒక బ్రహ్మాస్త్రం అయితే, మరో అస్త్రం ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో ఒక మహిళా పోలీస్ నియామకం. ఇది ఒక విప్లవాత్మక మార్పు. సమానంగా చూడాలి: పాప అయినా, బాబు అయినా ఇద్దరినీ ప్రతి కుటుంబం సమానంగా చూడాలి. ఆడవారి మీద ఆధిపత్యం, వేధించడం, చులకన చేయడాన్ని మనందరం కలిసికట్టుగా వ్యతిరేకించాలి. అలాంటి రాక్షస గుణాలు ఏ మనిషి కూడా చేయకూడని పనులు. మారుతున్న సమాజంలో మనుషులూ ఎదగాలి. గత పాలకులు ఏమన్నారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ‘కోడలు మగ పిల్లవాణ్ని కంటానంటే అత్త వద్దంటుందా?’ అన్నారు. అదే ఇవాళ మీ అన్నగా, తమ్ముడిగా ఒక మాట చెబుతున్నాను. నాకు ఉన్నది ఇద్దరూ ఆడపిల్లలే. మహిళాభ్యుదయమే లక్ష్యం: మహిళాభ్యుదయానికి కట్టుబడి అడుగులు ముందుకు వేస్తున్న మనందరి ప్రభుత్వానికి దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో మీ అందరికి ఇంకా మంచి చేసే అవకాశం రావాలని కోరుకుంటూ, మరోసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.. అంటూ సీఎం వైఎస్ జగన్ ప్రసంగం ముగించారు. ఆ తర్వాత కేక్ కట్ చేసిన ముఖ్యమంత్రి అక్కచెల్లెమ్మలకు స్వయంగా తినిపించారు. డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ.. ► మహిళా సాధికారత జగనన్న వల్లే సాధ్యమైందని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి తెలిపారు. దేశంలో ఏ మహిళకు దక్కని గౌరవం ఏపీ మహిళలకు దక్కిందని అన్నారు. సీఎం వైఎస్ జగన్‌కు మహిళలు ఎప్పటికీ రుణపడి ఉంటారని తెలిపారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. ► అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. మహిళా సాధికారత జగనన్న వల్లే సాధ్యమైందని తెలిపారు. మహిళలను సీఎం జగన్ అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. ►సీఎం జగన్ లాంటి మహిళా పక్షపాతి.. దేశంలోనే ఉండరని తెలిపారు. నారీ భేరీ సౌండ్.. నారావారి కర్ణభేరిలో రీసౌండ్ రావాలని అన్నారు. సీఎం జగన్ మహిళా సాధికారతను ఆచరణలో పెట్టి చూపించారని తెలిపారు. సీఎం జగన్ మహిళలను మహారాణులను చేశారని గుర్తుచేశారు. మహిళ బావుంటే, కుటుంబం బావుంటుందని నమ్మే వ్యక్తి.. సీఎం జగన్ అని అన్నారు. సీఎం జగన్ మహిళలందరికీ దేవుడితో సమానమని రోజా తెలిపారు. మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. ► మహిళ సాధికారత కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టినట్లు మంత్రి తానేటి వనిత తెలిపారు. మహిళలను లక్షాధికారులను చేయాలనేది మహానేత వైఎస్సార్ కల అని గుర్తుచేశారు. తండ్రి ఆశయ సాధనకు సీఎం వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు మహిళలను దగా చేశారని తెలిపారు. మహిళా సాధికారత జగనన్న వల్లే సాధ్యమైందని తెలిపారు. ► అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో స్త్రీ శిశు సంక్షేమ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్న మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ► ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలకు డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, ఎంపీలు బీశెట్టి వెంకట సత్యవతి, వంగా గీత, గొట్టేటి మాధవి, మహిళా కమీషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ, మంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యేలు రోజా, విడదల రజని, ఉండవల్లి శ్రీదేవి, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, పోతుల సునీత, కల్పలతా రెడ్డి, మాజీ ఎంపీ కిల్లి కృపారాణి, కృష్ణాజిల్లా జడ్పీ ఛైర్మన్ ఉప్పాల హారిక, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పలు కార్పొరేషన్ల ఛైర్ పర్సన్లు, డైరెక్టర్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆమెకు వందనం
-
మహిళా ఎంట్రప్రెన్యూర్షిప్ కోసం ‘సమర్థ్’
International Women's Day 2022: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని .. ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు కేంద్ర లఘు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ (ఎంఎస్ఎంఈ) సోమవారం ’సమర్థ్’ పేరిట ప్రత్యేక స్కీమును ఆవిష్కరించింది. స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా మహిళలు స్వావలంబన సాధించేందుకు ఇది తోడ్పడగలదని ఈ సందర్భంగా కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రి నారాయణ్ రాణె తెలిపారు. సమర్థ్ కింద ఎంఎస్ఎంఈ శాఖ నిర్వహించే నైపుణ్యాభివృద్ధి ఉచిత శిక్షణా స్కీములు అన్నింటిలోనూ మహిళలకు 20 శాతం సీట్లను ఔత్సాహిక మహిళా ఎంట్రప్రెన్యూర్లకు కేటాయిస్తామని పేర్కొన్నారు. 2022–23లో దీనితో 7,500 మంది పైచిలుకు మహిళలకు ప్రయోజనం చేకూరగలదని ఆయన వివరించారు. ఇక మార్కెటింగ్పరమైన సహకారం అందించే పథకాల్లో భాగంగా దేశ, విదేశ ఎగ్జిబిషన్లకు పంపించే ఎంఎస్ఎంఈ వ్యాపార బృందాల్లో 20 శాతం వాటా మహిళల సారథ్యంలోని సంస్థలకు లభిస్తుందని మంత్రి చెప్పారు. అలాగే 2022–23లో జాతీయ చిన్న పరిశ్రమల కార్పొరేషన్ (ఎన్ఎస్ఐసీ)కి సంబంధించిన కమర్షియల్ స్కీముల వార్షిక ప్రాసెసింగ్ ఫీజులో 20 శాతం రాయితీ కూడా మహిళా ఎంట్రప్రెన్యూర్లు పొందవచ్చని పేర్కొన్నారు. -
Work From Home: అమ్మాయిలూ.. అవకాశాలివిగో!
మహమ్మారి పుణ్యమాని మహిళలను కొత్త అవకాశాలు ఊరిస్తున్నాయి. పెట్టుబడి లేకుండా ఇంటి పట్టున ఉంటూనే సంపాదించే మార్గాలూ పుట్టుకొచ్చాయి. విదేశీ గడ్డపైనే ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు.. అదే విదేశీ సంస్థకు ఇంటి నుంచే పని చేసే పరిస్థితులొచ్చాయి. కావాల్సిందల్లా నైపుణ్యం పెంచుకుని, అవకాశాన్ని అందిపుచ్చువడమే. మార్కెట్‌కు అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకున్న మహిళల కోసం కంపెనీలు క్యూ కడు తున్నాయి. అడిగినంత వేతనం.. ఇచ్చేందుకూ దిగ్గజ సంస్థలు వెనుకాడడం లేదు. వ్యాపార, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై నిపుణుల అభిప్రాయాలతో సాక్షి బిజినెస్ బ్యూరో ప్రత్యేక కథనం.. వ్యాపారం ఆకర్షణీయం.. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పనిచేసే రోజులు పోయాయి. మహిళలకు వ్యాపారం అనుకూల, ఆకర్షణీయ కెరీర్‌గా మారిపోయింది. వ్యాపారంలో వైఫల్యాలనూ అంగీకరిస్తున్నారు. టెక్నాలజీ సాయంతో చిన్నగా ప్రారంభించి అంతర్జాతీయ స్థాయికి ఎదగొచ్చు అని నిరూపిస్తున్నారు. డబ్బులు సంపాదించడమేగాక వందలాది మందికి ఉపాధి అవకాశాలనూ సృష్టిస్తున్నారు. బిజినెస్‌లోకి రావాలంటే డబ్బు ఒక్కటే ప్రధానం కాదు. అంకిత భావం, సరైన మార్గదర్శి ఉండాలి. వ్యాపారం పేరుతో గతంలో ఇబ్బడిముబ్బడిగా రుణాలు తీసుకునేవారు. ఇప్పుడు అలా కాకుండా అవసరం మేరకే లోన్ తీసుకుంటున్నారు. దీంతో బ్యాంకులూ రుణాలిచ్చి ప్రోత్సహిస్తున్నాయి. –దీప్తి రావుల, సీఈవో, వీ–హబ్ ప్రత్యేక నైపుణ్యంతో.. కోవిడ్ రాకతో ఆటోమేషన్, డిజిటల్ పరివర్తన దిశగా కంపెనీలు సాగుతున్నాయి. ఇదే మహిళలకు కొత్త అవకాశాలను అందిస్తోంది. విదేశాలకు వెళ్లకుండానే ఎంఎన్సీల్లో జాబ్ సంపాదించి ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రత్యేక నైపుణ్యం ఉన్న మహిళల కోసం కంపెనీలు ప్రపంచం నలుమూలలా వెతుకుతున్నాయి. ఐటీతోపాటు ఫార్మా, బయాలాజిక్స్లోనూ ఇదే పరిస్థితి. అన్ని రంగాల్లోనూ కంపెనీలు సామర్థ్యం పెంచుకునే దిశగా అడుగులేస్తున్నాయి. ఒక రోల్లో కొరత ఉందంటే చాలు అభ్యర్థులకు కాసులు కురిపిస్తోంది. ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీలో రూ.5 లక్షల వేతనం ఉంటే.. కొత్త సంస్థ రూ.50 లక్షలు చెల్లించేందుకూ వెనుకాడడం లేదు. అమ్మాయిలకు స్థిరత్వం, నిబద్ధత ఉంటుందన్న భావన కంపెనీల్లో పెరిగింది. వీరికి అత్యంత కీలక విభాగాలనూ అప్పగిస్తున్నారు. – జయశ్రీ పవని, హెడ్, స్ట్రాటజిక్ రిక్రూట్మెంట్, స్ట్రయిక్ ఇట్–రైట్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ పెట్టుబడి లేకుండానే.. టెక్నాలజీని ఊతంగా చేసుకుని ఉపాధికి కొత్త మార్గాలను వెతుక్కుని మహిళలు సక్సెస్ అవుతున్నారు. పెట్టుబడి లేకుండానే ఇంటి నుంచే సంపాదిస్తున్నారు. వ్యాపారం చేయాలన్న తపన పల్లెల్లోని మహిళలకూ విస్తరించింది. సోషల్ మీడియాలో ఎంత చురుకుగా ఉంటే అంతలా ఆదాయం గడిస్తున్నారు. రాష్ట్రాలే కాదు విదేశీ గడ్డపైనా వ్యాపారాలను విస్తరిస్తున్నారు. ఆన్‌లైన్‌ను వేదికగా చేసుకుని డిజిటల్ మార్కెటింగ్, ఈవెంట్స్, యూట్యూబ్ బ్లాగ్స్, ట్యూషన్స్, డ్యాన్స్, మ్యూజిక్, న్యాయ సలహాలు, క్రాఫ్టŠస్, స్ట్రెస్ మేనేజ్మెంట్, మోటివేషనల్ క్లాసెస్ వంటివి ఉపాధిగా ఎంచుకుంటున్నారు. బ్యూటీ, ఫ్యాషన్ స్టైలిస్ట్‌గా, ఫిట్నెస్ శిక్షకులుగా కెరీర్ మలుచుకుంటున్నారు. ఇంటి వంటకాలను స్విగ్గీ, జొమాటో ద్వారా విక్రయిస్తున్నారు. ఉద్యోగం చేస్తూనే అదనపు సంపాదనపై దృష్టిపెడుతున్నారు. – లత చౌదరి బొట్ల, ఫౌండర్, నారీసేన. ఉద్యోగం మానేసినా.. అప్లికేషన్, ప్రాజెక్ట్ రూపకల్పన, అమలుకు ఐటీ కంపెనీలు విభిన్న సాంకేతికలను (టెక్ స్టాక్) ఉపయోగిస్తాయి. అభ్యర్థిలో టెక్నికల్ స్కిల్స్ ఏ మేరకు ఉన్నాయన్నదే ప్రధానం. కమ్యూనికేషన్ స్కిల్స్ అదనపు అర్హత మాత్రమే. కొత్త కోర్సులను నేర్చుకుని నూతన వర్షన్స్‌కు తగ్గట్టుగా అభ్యర్థులు అప్‌గ్రేడ్ అవ్వాలి. ఇలాంటి ఉద్యోగులకు ఒక్కొక్కరి చేతుల్లో మూడుకుపైగా ఆఫర్ లెటర్లు ఉంటున్నాయి. ఎక్కడ అధిక వేతనం ఆఫర్ చేస్తే అక్కడే చేరుతున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీలు తమ ఉద్యోగులు చేజారకుండా ప్రమోషన్‌తో వేతనం పెంచుతున్నాయి. మధ్యలో ఉద్యోగం మానేసినా నైపుణ్యం ఉన్న అభ్యర్థులను మళ్లీ చేర్చుకుంటున్నాయి. – రేచల్ స్టెల్లా రాజ్, టాలెంట్ అక్విజిషన్ అనలిస్ట్ -
ముందు ఇంటిని చక్కదిద్దాలి!
మానవ పరిణామక్రమం, అభి వృద్ధిలో పడుతూ, లేస్తూ చేసిన ప్రయాణంలో స్త్రీపురుషులిద్దరూ భాగస్వాములే! కానీ మనిషి చరిత్ర అంటే... మగవారి చరిత్రే అన్న అభి ప్రాయం చలామణి అవు తోంది. గడచిన చరిత్రలో వాటా కావాలని మహిళలేమీ ఇప్పుడు అడగడం లేదు. కానీ, వర్తమానం కూడా ఎందుకు ఊపిరి ఆడనివ్వడంలేదని అడుగుతున్నారు. ఒక్క మార్పునకు యుగాలకాలం మా విషయంలోనే ఎందుకని ప్రశ్నిస్తున్నారు. 50 ఏళ్లనాటి బాలికావిద్య, బాల్యవివాహం వంటివి... సమస్యల జాబితా నుండి ఇప్పటికీ తొలగి పోలేదు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్‌షిప్‌ల బ్లాక్ మెయిల్, మార్ఫింగ్‌లతో సమస్యల చిట్టా చాంతాడంత పెరిగింది. ఆకాశమే హద్దుగా ఆమెకు అవకాశాలు అంటున్నాం. ఏ స్థానంలో ఉన్నా ఆడతనమే కొలమాన మని ఆంక్షలు పెడుతున్నాం. ఆధునిక మహిళగా మారాలని అంటున్నాం. మల్టీ టాస్క్ ఉమెన్ అని బరువులు మోపుతున్నాం. ఏదయినా సాధించు... వంటిల్లు, పిల్లల విషయంలో మాత్రం సక్సెస్ సర్టిఫికేట్ ఉందా అని దబాయిస్తున్నాం. అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలని ఊరిస్తున్నాం. కానీ, పనిచేసే చోట... కీచకులను కట్టడి చేయలేకపోతున్నాం. ఆమె ఉద్యోగం చేయాలి, జీతంపై హక్కు మాత్రం లేదంటారు. స్వేచ్ఛ ఇస్తున్నాం... కానీ, రిమోట్ కంట్రోల్ మాత్రం తమ చేతిలోనే అంటారు. సృష్టికి మూలం స్త్రీ అంటారు. ప్రాణం తీయడానికి మాత్రం వెనుకాడరు. ఎంతటి ధైర్యలక్ష్మి తల్లులైనా విరక్తితో ముగింపు వాక్యం రాసేలా లొంగదీసి, కృంగదీసి ఆడుకుంది సమాజం, కుటుంబం. తనను తాను మార్చుకుంటూ... తనలో తాను పోటీ పడుతూ... కొత్త మనిషిలా ఆమె... మహిళ విషయంలో రోజురోజుకూ పతన మవుతూ... అనాగరికంగా అతను – కుటుంబాలు ఎందుకు అలజడులతో నిండుతున్నాయో అర్థమవుతోందా? తాకితే నేరం.., కనుసైగ చేసినా నేరమే. అశ్లీల పదం వాడితే శిక్ష... గృహ హింస నుండి రక్షణ. లైంగిక వేధింపు లకు పాల్పడితే ఖేల్ ఖతం. ఇలా ఎన్నెన్నో చట్టాలు... అయినా ఇవన్నీ ఎందుకు మహిళకు భరోసా ఇవ్వలేక పోతున్నాయి? చట్టం ఉన్నది శిక్షించడానికి! మరి, జీవించ డానికీ? సమాజం ఒక జీవనదిలా ప్రవహించాలి. కొన్నింటిని కలుపుకొంటూ... అడ్డుగా ఉన్న వాటిని పడ దోసుకుంటూ... కొన్నిసార్లు తానే ఒంపులు తిరిగి తప్పు కుంటూ బతకాలి, బతికించాలి... ప్రవహించాలి. చట్టం చేశాం కదా చప్పట్లు కొట్టండి అంటాయి చట్టసభలు. ఆ చట్టం జీవనదిలా కుటుంబాన్ని తాకక పోతే అందులో ఉన్న మహిళకు రక్షణ ఎలా సాధ్యం? ఇదే మనం ఎదుర్కొం టున్న అతి పెద్ద వైఫల్యం. మన దేశంలో మహిళలపై జరిగే నేరాల్లో దాదాపు 90 శాతం గృహ హింసకు సంబంధించినవి. క్రూరంగా, నిర్దాక్షి ణ్యంగా వ్యవహరించే కుటుంబాన్ని నేటి మహిళ నిల దీస్తోంది. తాను గెలవాలని, కుటుంబాన్ని గెలుచుకోవాలని ఆరాటపడుతుంది. ఇల్లే ఇంత విష వలయంగా ఉంటే ప్రతి మహిళ బయట ఎన్ని సమస్యలు ఎదుర్కొంటుందో ఊహిం చగలమా! ప్రతిరంగంలో దూసుకుపోతున్న అమ్మాయిలు చేస్తున్న అస్తిత్వ పోరాటం ఇప్పుడున్న చట్టాలకు అర్థమవు తోందా? తమను సమాన భాగస్వామిగా గుర్తించమని నిగ్గదీసి అడుగుతున్న నేటితరం అమ్మాయిలకు సూటిగా సమాధానం చెప్పే దమ్ము సమాజంలోని మిగతా సగానికి ఉందా? ఎదురవుతున్న సమస్యలపై పోరాటంలో పడుతూ... లేస్తూ... కెరటమై గెలుస్తూ సాగుతున్నారు. ఈ ప్రయా ణంలో వారికి ఒక దన్ను కావాలి. ఆ అండగా ప్రభుత్వం నిలిస్తే గుణాత్మక మార్పును కళ్లతో చూడగలం. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన చట్టం అటువంటి మార్పును మనకు చూపిస్తుంది. పాలకులుగా పెద్ద ఎత్తున మహిళలు ఇప్పుడు ఏపీలో ఉన్నారు. మహిళల అధికారాన్ని అంగీకరించక తప్పనిసరి పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. అందివచ్చిన ఈ అవకాశం ఆసరాగా మహిళా సాధికారతను విస్తరించాలి. ప్రభుత్వం, చట్టం, కుటుంబం... ఈ మూడింటినీ బలంగా అనుసంధానం చేయాలి. ఇందుకోసం ఏపీ రాష్ట్ర మహిళా కమిషన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏడాది పాటూ కార్యాచరణలో ఉండే ‘సబల’ కార్య క్రమాన్ని రూపొందించింది. ఈ రోజు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘సబల’ కార్యాచరణ ప్రారంభిస్తారు. వాసిరెడ్డి పద్మ వ్యాసకర్త చైర్పర్సన్, రాష్ట్ర మహిళా కమిషన్, ఆంధ్రప్రదేశ్ -
మహిళలే నవ భారత నిర్మాతలు
ఎన్ని అవరోధాలు, సవాళ్లు ఉన్నప్పటికీ భారతీయ మహిళలు తాము శక్తిమంతులమని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్నారు. అసమానతలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. విజయం సాధించాలనే నిబద్ధతతో ఉత్సాహంగా దూసుకుపోతున్నారు. నైపుణ్యం, గుర్తింపు, గౌరవం సాధించడానికి మహిళలు తాము చేసే ప్రయత్నాలలో ఎప్పటికీ నిరుత్సాహం చెందకుండా ఉండటమే వారిని మనకు నిజమైన ఆదర్శప్రాయులుగా చేస్తోంది. ‘నేటి లింగ సమానత్వమే రేపటి సుస్థిర సమాజం’... ఈ ఏడాది మన మహిళా దినోత్సవ నేపథ్యాంశం. మహిళలే మన నవ భారత నిర్మాతలు. కొన్ని దశాబ్దాల క్రితమే చిలకమర్తి లక్ష్మీ నరసింహం ‘ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పించినన్’ అన్నాడు. స్త్రీ–పురుష విభ జన జీవశాస్త్ర సంబంధమైనదే తప్ప పురుష ఆధి క్యతా ధోరణికి ఆమోద ముద్ర కాదని ప్రకటిం చాడు. ఆస్తిని విభజించినట్టే... స్త్రీ–పురుషుల్ని ఒక యూనిట్‌గా కాకుండా రెండు ‘వర్గా’లుగా చీల్చి తమ ఆధిక్యతా సామ్రాజ్యాన్ని స్త్రీమూర్తిపై స్థాపిం చుకోవడం కోసం పురుషులు తహతహలాడి నందునే మహిళా ఉద్యమాల ఆవశ్యకత వచ్చింది. ‘సెక్స్’ అనే పదం చాటున జరిగే ఈ కృత్రిమ విభజనకు 20వ శతాబ్దపు ఫ్రెంచి మహిళా ఉద్యమ నాయకురాలైన సిమన్ దిబోవర్ అడ్డుకట్ట వేసింది. ఆదిమ మానవుల్లో స్త్రీ–పురుషులు ఎదురు బొదురుగా నిల్చిన రెండు మానవా కృతులనీ, ఈ ఏకత్వాన్ని చెదర గొట్టింది స్త్రీమూర్తి కాదనీ దిబోవర్ ప్రకటిం చింది. యాజ్ఞవల్క్య ముని సహితం ‘రెండుగా చీలిన వెదురు బొంగే – సతి, పతి’ అన్నాడు! దిబోవర్ కన్నా పాతికేళ్లముందే గుడి పాటి వెంకటచలం... ‘స్త్రీకి కూడా శరీరం ఉంది, దానికి వ్యాయామం ఇవ్వాలి. ఆమెకు మెదడు ఉంది, దానికి జ్ఞానం ఇవ్వాలి. ఆమెకు హృదయం ఉంది, దానికి అనుభవం ఇవ్వాలి’ అన్నాడు! దిబోవర్ ఈ సమరంలో ‘పురుషులను తుడిచిపెట్టి ముందుకు సాగిపోవాలన్న దుష్ట తలంపు స్త్రీకి కలలో కూడా రా’దని చెబుతూ... కేవలం ఉద్య మాల వల్లనే, ఆచరణలో వినియోగంలోకి రాని కొన్ని అరకొర చట్టాలను సాధించుకున్నంత మాత్రాన్నే నిజమైన విమోచన కాదని చెప్పింది. స్త్రీలోని అంతర్ శక్తి ప్రబుద్ధమై తానూ జీవితానికి సాధికార వ్యాఖ్యాత కావాలన్నది ఆమె ప్రబోధం. అందుకే పితృస్వామిక వ్యవస్థలో అణగారుతూ వచ్చిన ‘మాధవి’కి తగిన ‘మాధ వుడు’ దొరికేదాకా ఈ పోరాటం ఆగబోదని చెప్పింది. స్త్రీ–పురుషుల మధ్య ఉన్న సంబంధం కేవలం మానవుల మధ్య అనుబంధం తప్ప మరొ కటి కాదన్న మార్క్స్ వాక్యాలతో దిబోవర్ తన ‘సెకండ్ సెక్స్’ ఉద్గ్రంథాన్ని ముగించడం విశేషం. అసలు ఫ్రెంచి విప్లవానికి మహిళలే పూర్తిగా నాయకత్వం వహించి ఉంటే ప్రపంచ చరిత్ర ఎలాంటి మలుపులు తిరిగి ఉండేదోనని సోవియెట్ సోషలిస్టు నేత వ్లాదిమిర్ లెనిన్ నిబిడాశ్చర్యం ప్రకటించాడు. ఎందు కంటే, అరకొర మార్పు లతో, పురుషాధిక్యతా రాజ కీయ పాలకవర్గాలు చేసే స్వార్థపూరిత చట్టాలు ఆచ రణలో ఉన్నంతకాలం, అవి ‘ఉనికి’లో ఉంటాయే గానీ, వాటి ‘ఉసురు’కు విలువ లేదు, రాదు. ఈ దుఃస్థితిలో ‘మహిళల అభ్యున్నతి కోసమే చట్టా లున్నా’యన్న పాలకవర్గాల మాటకు విలువ లేకుండా పోయింది. కారణం, చెప్పిన మాటకు, చేస్తున్న చట్టాలకు ఆచరణలో పొంతన లేకపోవ డమే. విలువ ఉన్న పక్షంలో శాసన వేదికల్లో వారి ప్రాతి నిధ్య శాతాన్ని ఎందుకు కుదిస్తున్నారు? 50 శాతం మహిళలకు ప్రాతినిధ్యం కల్పించవలసిన ప్పుడు కనీసం దాన్ని వారు రాజీపడి సర్దుకుం టున్న 30 శాతానికి కూడా ఎందుకు పెంచలేకపోతు న్నారు? విశ్వకవి టాగోర్ మాటలకు నేటికీ విలువ తగ్గ లేదు. ‘మన శత్రువు మన సంకెళ్లను ఎంత గట్టిగా బిగిస్తే, అంత బలంగానూ మన సంకెళ్లు తెగి పోతాయి. శత్రువు కళ్లు ఎంతగా చింత నిప్పులైతే, అంతగానూ మన కళ్లూ నిప్పులు చెరగగలవు’. ఇవాళ కాదు, 1950 నుంచీ అవినీతికి వ్యతి రేకంగా గళమెత్తిన ఉద్దండులైన దేశ ఉన్నతాధి కారులు – కౌల్దార్, వాంఛూ, సంతానం, దగ్లీ, కాల్కర్, వోహ్రా కమిటీల సిఫారసులన్నీ ఏ గంగలో కలిశాయి? చివరికి లోక్‌పాల్ గతి ఏమైంది? 75 సంవత్సరాల భారత స్వాతంత్య్రోద్యమం తర్వాత కూడా గాంధీజీ సంధించిన ప్రశ్నకు ఈ రోజుదాకా మనం సూటైన సమాధానం చెప్పలేని దుర్గతిలో ఉన్నాం. మన దేశంలో అర్ధరాత్రి వేళ స్త్రీ ఒంటరిగా, నిర్భయంగా బజారులో వెళ్లగల పరిస్థితి ఉందా? ‘పది గంటల పనిదినం’ యూరప్‌లో మొదటి సారిగా ప్రవేశపెట్టిన రోజున కారల్‌మార్క్స్ ఆ చట్టం గురించి చిత్రంగా వ్యాఖ్యానించాడు: ‘ఇది కష్టజీవులైన శ్రామిక వర్గానికి సూత్రబద్ధమైన విజయం. ఎందుకంటే, చరిత్రలో మొదటిసారిగా మధ్యతరగతి రాజకీయ అర్థశాస్త్రం కార్మికవర్గ రాజ కీయ అర్థశాస్త్రానికి పట్టపగలే లొంగిపోయింది. ధనస్వామ్య వ్యవస్థలో ‘విశ్రాంతి’ కూడా కొలది మందికి మాత్రమే అందుబాటులో గల ‘విలువైన వస్తువే’గానీ, రెక్కాడితేగానీ డొక్కాడని అసంఖ్యాక శ్రమజీవులైన స్త్రీ–పురుషుల బతుక్కి మాత్రం శాంతీ లేదు, విశ్రాంతీ లేదు’ అన్నాడు. ‘భారత ప్రజలమైన మేముగా రచించుకుని అంకితమిచ్చుకున్న’ రాజ్యాంగాన్ని ప్రజలకు వ్యతి రేకంగా స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకొనే హక్కు దేశ పాలక వర్గాలకూ, పార్టీలకూ లేదని చాటి చెప్పిన రాజ్యాంగం మనది. అయినా, మహిళా హక్కులకు సంబంధించి మహిళా ప్రతి నిధులు ప్రవేశపెడుతూ వచ్చిన పెక్కు ప్రతిపాదన లను ఏదో ఒక మిష పైన అమలులోకి రాకుండా శతధా అడ్డుకుంటూనే వచ్చారని మరవరాదు. ఫ్రెంచ్ మహిళల చొరవ వల్లనే బానిస దుర్గంగా పేరొందిన బాస్టిల్లీ స్థావరం కుప్పకూలింది. అదే యావత్తు ఫ్రెంచ్ ప్రజలకు ప్రజాస్వామ్య రక్షణ దుర్గంగా చరిత్రలో కీర్తికెక్కింది. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు -
మహిళలే నవ భారత నిర్మాతలు
ఎన్ని అవరోధాలు, సవాళ్లు ఉన్నప్పటికీ భారతీయ మహిళలు తాము శక్తిమంతులమని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్నారు. అసమానతలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. విజయం సాధించాలనే నిబద్ధతతో ఉత్సాహంగా దూసుకుపోతున్నారు. నైపుణ్యం, గుర్తింపు, గౌరవం సాధించడానికి మహిళలు తాము చేసే ప్రయత్నాలలో ఎప్పటికీ నిరుత్సాహం చెందకుండా ఉండటమే వారిని మనకు నిజమైన ఆదర్శప్రాయులుగా చేస్తోంది. ‘నేటి లింగ సమానత్వమే రేపటి సుస్థిర సమాజం’... ఈ ఏడాది మన మహిళా దినోత్సవ నేపథ్యాంశం. మహిళలే మన నవ భారత నిర్మాతలు. గొప్ప సంప్రదాయాలు, సమున్నత విలువలతో ప్రాచీన ఘనతను కలిగి వున్న సుసంపన్న భారత దేశంలో మహిళలు ఎల్ల ప్పుడూ తమ ప్రాము ఖ్యాన్ని చాటుతూనే వచ్చారు. ఎన్ని అవ రోధాలు ఉన్నప్పటికీ భారతీయ మహిళలు తాము శక్తిమంతులమని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నారు. రవీంద్రనాథ్ టాగోర్ మాటల్లో చెప్పాలంటే.. ‘మనకు స్త్రీలు అగ్నిదేవతలు మాత్రమే కాదు. భారతీయాత్మ జ్వాలలు కూడా’. ధీర వనిత ఝాన్సీరాణి లక్ష్మీబాయి, భారత దేశ తొలి ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి ఫూలే మొదలు... స్త్రీ విముక్తికి తన జీవితాన్ని అంకితం చేసిన రమాబాయి రణడె వరకూ ఎందరో మహి ళలు సంకల్పబలానికి తిరుగులేని నిదర్శనమై నిలి చారు. సరోజినీ నాయుడు సాహిత్య ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు. ఇటీవలి సంవత్సరాలలో సైతం ఎందరో మహిళామణులు అత్యున్నత స్థాయిలో పెద్ద పెద్ద సంస్థల నిర్వహణ చేపట్టి దేశా నికి పథనిర్దేశకులయ్యారు. ఎస్బీఐ తొలి మహిళా చైర్మన్ అరుంధతీ భట్టాచార్య, ఓఎన్జీసీ తొలి మహిళా సీఎండీ అల్కా మిట్టల్, ‘సెయిల్’ చైర్మన్ సోమా మండల్.. ఇలా ఎంతోమంది! హరియాణా మహిళ సంతోశ్ యాదవ్ రెండుసార్లు ఎవరెస్టును అధిరోహించి మహిళాశక్తిని శిఖరాగ్రంపై ప్రతిష్ఠిం చారు. ఇక బాక్సర్ మేరీకోమ్ పేరు తెలియని ఇల్లుందా భారత దేశంలో! మనమిప్పుడు ‘కార్యా చరణ దశాబ్దం’లోకి ప్రవేశించి ఉన్నాం. 2030 నాటికి సుస్థిరమైన అభివృద్ధిని సాధించి, ఈ భూమండలాన్ని మానవ జీవనానికి మరింత మెరుగైన ప్రదేశంగా మార్చడం మనముందున్న లక్ష్యం. లింగ సమానత్వం; మహిళలు, బాలికల సాధికారత అనేవి కూడా సుస్థిర అభివృద్ధి లక్ష్యా లలో భాగమైనవే. అదే సమయంలో.. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సంక్షోభ నిర్వహణ, సామా జిక అభివృద్ధి, సమాజంలోని బలహీన, అట్టడుగు వర్గాల అభ్యున్నతి, సంక్షేమం.. వీటన్నిటితో కూడిన ‘సుస్థిర భవిష్యత్తు’ అనే లక్ష్యాన్ని మహిళల భాగస్వామ్యంతో మాత్రమే సాధ్యం చేసుకో గలమని మనం గ్రహించాలి. నైపుణ్యం, గుర్తింపు, గౌరవం సాధించడానికి మహిళలు తాము చేసే ప్రయత్నాలలో ఎప్పటికీ నిరుత్సాహం చెందకుండా ఉండటమే వారిని మనకు నిజమైన ఆదర్శప్రాయులుగా చేస్తోంది. మహిళల్లోని సామర్థ్యాల గురించి ప్రఖ్యాత అమెరికన్ మత గురువు బ్రిగ్హామ్ యంగ్ సరిగ్గానే చెప్పారు. ‘‘మనం ఒక వ్యక్తిని విద్యావంతుడిని చేస్తే ఆ వ్యక్తికి మాత్రమే విద్య అందుతుంది. ఒక మహి ళకు విద్యను అందిస్తే ఒక తరం వారంతా విద్యా వంతులవుతారు’’ అంటారు బ్రిగ్హామ్. ‘నేటి లింగ సమానత్వమే రేపటి సుస్థిర సమాజం’.. అనే ఈ ఏడాది మహిళా దినోత్సవ ప్రధానాంశం.. బ్రిగ్హామ్ మాటలకు చక్కగా సరిపోలుతుంది. దేశంలో కోవిడ్–19 వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టీకా కార్యక్రమాన్ని విజయ వంతం చేయడంలో మహిళలే కీలకమైన పాత్ర పోషించారు. అంగన్వాడీ కార్యకర్తల నుంచి, పాలనా విభాగాలలో ఉన్నత స్థానాలలో ఉన్న మహిళా అధికారుల వరకు అందరూ ఇందుకోసం విశేషకృషి సల్పారు. కోవిడ్‌కు స్వదేశీ ‘కోవ్యాక్సిన్’ టీకాను అభివృద్ధి చేయడంలో విశ్వస్థాయి క్రియా శీలత కనబరిచిన భారత్ బయోటెక్ జాయింట్ ఎండీ సుచిత్రా ఎల్లా ‘పద్మభూషణ్’ అందు కున్నారు. 12–18 ఏళ్ల మధ్య వారికి ఇవ్వడం కోసం కోవిడ్ టీకాను అభివృద్ధి చేసిన బృందానికి బయో లాజికల్ ఇ కంపెనీ ఎండీ మహిమా దాట్ల నాయ కత్వం వహించి, తక్కువ సమయంలో ఉత్తమ ఫలితాలను సాధించడానికి ప్రేరణ అయ్యారు. 6వ ఆర్థిక అధ్యయనం ప్రకారం దేశంలో 80 లక్షల 5 వేల మంది మహిళా పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. స్టార్టప్‌లు (అంకుర సంస్థలు), ముఖ్యంగా మహిళా స్టార్టప్‌లు ఎందుకు మనకు ముఖ్య మైనవి? బెయిన్ అండ్ కంపెనీ, గూగుల్ విశ్లేషణల ప్రకారం 2030 నాటికి మన మహిళా వ్యాపార వేత్తలు 15 – 17 కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తారని అంచనా. 2018–21లో దేశంలోని స్టార్టప్‌లు కల్పించిన ఉద్యోగాల సంఖ్య 5 లక్షల 90 వేలు. ఇంత ప్రాముఖ్యం ఉన్న స్టార్టప్‌లను గతంలో చేజార్చుకుని ఉండొచ్చు. వర్తమానంలో తప్పక చేజిక్కించుకోవాలి. రాణించాలనే పట్టుదల అమ్మాయిలలో బలంగా ఉంటోంది. ‘ఆజాదీ కా అమృత్ మహో త్సవ్’లో భాగంగా గతేడాది సెప్టెంబర్ 6–12 తేదీల మధ్య కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 2,614 మంది స్వయం సహాయక బృందాల మహిళా వ్యాపారులకు కేవలం వారం వ్యవధిలోనే 8 కోట్ల 60 లక్షల రూపాయల రుణాలను ‘కమ్యూ నిటీ ఎంటర్ప్రైజ్ ఫండ్’ లోన్ కింద అందించింది. స్వయం సహాయక బృందాల ద్వారా మహిళలు తమను తాము శక్తిమంతం చేసుకోవడమే కాకుండా మన ఆర్థిక వ్యవస్థకూ నిలకడైన స్థిరత్వాన్ని చేకూర్చుతున్నారు. గత 6–7 ఏళ్లలో మహిళా స్వయం సహాయక సంఘాల ఉద్యమం విస్తృతం అయింది. నేడు దేశవ్యాప్తంగా 70 లక్షల స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. అర్థం చేసుకో వలసినది ఏమిటంటే, స్త్రీల శక్తి సామర్థ్యాలు దేశాన్ని గొప్ప శిఖరాలకు తీసుకు వెళతాయని! బండారు దత్తాత్రేయ వ్యాసకర్త హరియాణా రాష్ట్ర గవర్నర్ -
గుడ్‌న్యూస్: మహిళా దినోత్సవాన ఆర్టీసీ నజరానా!
సాక్షి, హైదరాబాద్: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని టీఎస్ ఆర్టీసీ మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేక కానుకలు ఇవ్వాలని నిర్ణయించింది. నగరంలో పీక్ అవర్స్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా నాలుగు ట్రిప్పులను నడపనున్నట్లు తెలిపింది. ఈనెల 8న 60 ఏళ్లు పైబడిన మహిళలు వయసు ధ్రువపత్రం చూపి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చని వెల్లడించింది. హెవీ వెహికిల్ నడపటంలో ఆసక్తి ఉన్న మహిళలకు ఉచితంగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయిస్తూ, ఆసక్తి ఉన్న లైసెన్స్‌దారులు సమీపంలోని డిపోలో దరఖాస్తు చేసుకోవచ్చని ఒక ప్రకటనలో పేర్కొంది. 8వ తేదీ నుంచి 14 వరకు జీహెచ్ఎంసీ, వరంగల్ నగరాల పరిధిలో టీ24 టికెట్ ధరలపై రాయితీ ఉంటుందని తెలిపింది. గర్భిణులు, పాలిచ్చే తల్లుల కోసం ఆర్డీనరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రెండు సీట్లు రిజర్వ్ చేస్తామంది. ఇక సిటీలో ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో డ్రైవర్ వెనక రెండు సీట్లను మహిళలకు కేటాయించినట్లు, గుర్తుగా ప్రత్యేక రంగులు వేయించనున్నట్లు వివరించింది. అలాగే మార్చి 31 వరకు బస్టాండ్లలో ప్రత్యేకంగా కేటాయించే పర్పుల్ కలర్ బాక్సుల్లో తమ టికెట్లు వేస్తే, డ్రా ద్వారా విజేతలను గుర్తించి సంబంధిత డిపో నుంచి 30 కి.మీ. పరిధిలో ఉచితంగా ప్రయాణించేలా నెలవారీ సీజన్ టికెట్‌తోపాటు బహుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మహిళా ప్రయాణికులు ఆర్టీసీ టికెట్‌తోపాటు తమ చిత్రాన్ని జోడిస్తూ 9440970000కు వాట్సాప్ చేస్తే, లక్కీ డ్రా తీసి విజేతలకు బహుమతులు అందిస్తామంది. చదవండి: గుడ్‌న్యూస్: ఆర్టీసీ ప్రయాణికులకు కాఫీ,టీ, స్నాక్స్ -
మహిళల ఆత్మబంధువు సీఎం కేసీఆర్
ఖైరతాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆదివారం పీపుల్స్ ప్లాజాలో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో మహిళా బంధు పేరుతో ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ మాట్లాడుతూ.. మహిళలు లేనిదే ప్రపంచమే లేదన్నారు. మహిళలకు సీఎం కేసీఆర్ ఆత్మబంధువుగా మారారని కొనియాడారు. పలు రంగాల్లో ఉత్తమ సేవలందించిన మహిళలను సత్కరించారు. ఈ సందర్బంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కార్పొరేటర్లు మన్నె కవిత, సంగీతా యాదవ్‌తో పాటు ఆశా, పారిశుద్ధ్య కార్మికులు కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఎస్.కె.హైమద్, సలావుద్దీన్, వనం శ్రీనివాస్ యాదవ్, ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
టీ పెట్టారు.. రూ.లక్షలు కొట్టారు
మాదాపూర్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో ఆదివారం తెలంగాణ టీ చాంపియన్ షిప్‌ను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ విచ్చేసి ఆనరరీ కాన్సుల్, రిపబ్లిక్ ఆఫ్ బల్గేరియా ఫర్ తెలంగాణ, సుచరిండియా ఏపీ సీఈఓ లయన్ కిరమ్, నిలోఫర్ కేఫ్ చైర్మన్ ఎ.బాబురావు, గోద్రేజ్ జెర్సీ సీఈఓ భూపేంద్రసూరి, మల్లారెడ్డి హెల్త్‌సిటీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రీతిరెడ్డి, హైబిజ్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ మాడిశెట్టి రాజ్గోపాల్లతో కలిసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మహిళలతో టీ చాంపియన్ షిప్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులు అభినందనీయులన్నారు. గతంలో ఎన్నడూ లేని సరికొత్త విధానంతో రకరకాల టీలను పరిచయం చేయడం సంతోషంగా ఉందన్నారు. పోటీల్లో 104 Ðమంది పాల్గొన్నారు. ప్రథమ బహుమతి కింద లక్ష రూపాయలు, ద్వితీయ బహుమతి రూ.50 వేలు, ముగ్గురు రన్నరప్‌లకు రూ.25 వేల చొప్పున మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందజేశారు. -
నిజమైన ‘మహిళాబంధు’ కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ నిర్వహించే ‘మహిళాబంధు కేసీఆర్’ సంబురాల్లో రాష్ట్రవ్యాప్తంగా మహిళలు భాగస్వాములు కావాలని మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. 6వ తేదీ నుంచి మూడురోజులపాటు నిర్వహించే ఈ సంబురాల్లో మహిళా సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించాలని పార్టీ నిర్ణయించిందన్నారు. వీరు శుక్రవారం టీఆర్ఎస్ శాసనసభాపక్షం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో కేసీఆర్ కిట్ ద్వారా 10లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరిందని, ఆరోగ్య లక్ష్మీ పథకం కింద ఐదు లక్షల మంది మహిళలకు పోషకాహారం అందించామన్నారు. కేసీఆర్ పాలనలో అధికార, విపక్షాలు అనే తేడా లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు చేరుతున్నాయని చెప్పారు. కార్యక్రమం లో ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి, ఎమ్మెల్యే బానోత్‌హరిప్రియ పాల్గొన్నారు. మహిళల భద్రతకు పెద్దపీట: సబితా ఇంద్రారెడ్డి మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ సీఎం కేసీఆర్ భరోసా కేంద్రాలు, షీ టీమ్స్ వంటివి ఏర్పాటుచేశా రని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వడ్డీ లేని రుణాల ద్వారా రాష్ట్రంలోని 40.58 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరిందన్నారు. మహిళల కోసం ప్రత్యేక పారిశ్రామిక పార్కులు, ప్రత్యేక విద్యాసంస్థలు ఏర్పాటు చేయడంతోపాటు రాజకీయ రంగంలోనూ మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని సబిత పేర్కొన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు జరిగిన కుట్రపై విచారణ జరుగుతోందని, దోషులెవరో పోలీసులు తేల్చుతారని చెప్పారు. -
మహిళాబంధు.. కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘మహిళాబంధు కేసీఆర్’పేరిట సంబురాలు నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు అద్దం పట్టేలా ఈ నెల 6వ తేదీ నుంచి మూడు రోజులపాటు వేడుకలు జరపాలని పార్టీ శ్రేణులను ఆదేశించింది ‘మహిళాబంధు కేసీఆర్’పేరిట నిర్వహించాల్సిన సంబురాలపై దిశానిర్దేశం చేసేందుకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గురువారం పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మూడురోజుల షెడ్యూల్‌ను కూడా విడుదల చేశారు. తొలిరోజు ప్రతి గ్రామంలో కేసీఆర్ ఫ్లెక్సీలకు రాఖీలు కట్టడంతోపాటు గ్రామాల్లోని పారిశుధ్య కార్మికులు, డాక్టర్లు, ప్రతిభ కలిగిన విద్యార్థినులు, ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు, స్వయం సహా యక సంఘాల్లో చురుకైన మహిళలను సన్మానిస్తారు. కేసీఆర్ కిట్, షాదీముబారక్, థ్యాంక్యూ కేసీఆర్ వంటి అక్షరాలతో కూడిన మానవహారాలు ఏర్పాటు చేస్తారు. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఒంటరి మహిళలు, బీడీ కార్మికుల పింఛన్లు వంటి కార్యక్రమాలతో లబ్ధి పొందతున్నవారి ఇళ్లకు వెళ్లి స్వీట్లు, చీరలు, గాజుల పంపిణీ చేస్తారు. పార్టీ రూపొందించిన కరపత్రాలతో ప్రచారం చేస్తారు. లబ్ధిదారులతో సెల్ఫీలు దిగి మహిళాబంధు కేసీఆర్, థాంక్యూ కేసీఆర్ హ్యాష్‌ట్యాగ్ పేరిట సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తారు. 8వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో మహిళలతో సమావేశాలు ఏర్పాటు చేసి సంబురాలు నిర్వహించాలని కేటీఆర్ ఆదేశించారు. మహిళా సంక్షేమానికి అపూర్వకానుకలు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా 10 లక్షల మంది పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థికసాయం చేయడంతోపాటు కేసీఆర్ కిట్ ద్వారా 11 లక్షల మందికి రూ.1,700 కోట్ల లబ్ధి చేకూర్చినట్లు కేటీఆర్ తెలిపారు. మహిళల నీటికష్టాలు దూరం చేసేందుకు మిషన్ భగీరథను అమలు చేస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. మాతాశిశు మరణాలు తగ్గాయని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయన్నారు. మహిళలకు భద్రత కల్పించడమే లక్ష్యంగా షీ టీమ్స్, భరోసా కేంద్రాల ఏర్పాటు, బాలికలకు ప్రత్యేకంగా విద్యాసంస్థల ఏర్పాటు, 70 లక్షల హైజీనిక్ కిట్ల పంపిణీ వంటి అనేక కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని కేటీఆర్ అన్నారు. -
మిథాలీ, పీవీ సింధులపై ప్రధాని మోదీ ప్రశంసలు
ఢిల్లీ: భారత మహిళా క్రికెటర్ మిథాలీరాజ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. మార్చి 8న ఘనంగా మహిళా దినోత్సవం జరుపుకున్నామని, ఇదే నెలలో చాలామంది భారత మహిళా క్రిడాకారిణిలు తమ పేరిట సరికొత్త రికార్డులు నమోదు చేయడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. మన్ కీ బాత్ 75వ ఎపిసోడ్లో భాగంగా ఆదివారం ఆలిండియా రేడియోలో జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశంలో విజేతలుగా నిలిచిన పలువురు మహిళల గురించి ప్రస్తావించారు. మహిళా క్రికెట్ చరిత్రలో 10 వేల పరుగుల మైలురాయిని దాటిన తొలి భారత క్రీడాకారిణిగా మిథాలీ రాజ్ నిలిచారని, ఆమె సాధించిన విజయానికి తాను అభినందనలు తెలియజేస్తున్నానని ప్రధాని చెప్పారు. అదేవిధంగా పీవీ సింధు గురించి కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. సింధు అద్భుతమైన క్రీడా ప్రదర్శనలతో అనేక అవార్డులు అందుకున్నారని ప్రధాని గుర్తుచేశారు. మిథాలీ, సింధు ఇద్దరూ భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలిచారని ఆయన కొనియాడారు. ఢిల్లీలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ షూటింగ్‌లోనూ మహిళలు పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచారని, బంగారు పతకాల జాబితాలోనూ భారత్ ముందంజలో ఉన్నదని ప్రధాని తెలిపారు. జనతా కర్య్ఫూ ప్రపంచానికి సూర్తి: ప్రధాని మోదీ 75వ మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా మోదీ ఏడాది పూర్తి చేసుకున్న జనతా కర్ఫ్యూపై కీలక వ్యాఖ్యలు చేశారు. జనతా కర్య్ఫూ సందర్భంగా ప్రజలు చూపించిన క్రమశిక్షణ.. యావత్ ప్రపంచానికే ప్రేరణగా నిలిచిందన్నారు. దేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. కురువృద్ధులు కూడా వ్యాక్సిన్ తీసుకోవడానికి ఉత్సాహంగా ముందుకు వస్తున్నారని ప్రధాని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో జయ్ చౌదరీ అనే వందేండ్ల వృద్ధుడు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాడని, యూపీలో 109 ఏండ్ల రామ్ దులయ్యా, ఢిల్లీలో 107 ఏండ్ల కేవల్ కృష్ణ కరోనా కరోనా టీకా వేయించుకున్నారని ప్రధాని చెప్పారు. చదవండి: 25 పతకాలతో టాప్‌లో.. చీఫ్ సెలెక్టర్ అయి ఉంటే.. అతన్ని తీసుకొచ్చేవాడిని -
వ్వాట్! ఏమన్నారూ.. అనేముందు ఆలోచించాలి
‘బర్గర్ కింగ్’ సేల్స్ నిన్న, మొన్న కొద్దిగా డౌన్ అయ్యాయి! బహుశా ఇది తాత్కాలికమే కావచ్చు. సేల్స్ పడిపోడానికి బర్గర్ ల రుచి తగ్గడం కారణం కాదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఈ మల్టీ నేషనల్ ఫుడ్ జెయింట్ సదుద్దేశంతో మహిళల కోసం చేసిన ఒక కెరీర్ ఆపర్చునిటీ ప్రకటన రుచించక, విషయం అపాలజీ వరకు వచ్చింది. ‘న్యూయార్క్ టైమ్స్’ దినపత్రికలో ఫుల్ పేజీ గా వచ్చిన ఆ ప్రకటనకు బర్గర్ కింగ్ 'Women belong in the Kitchen' అనే హెడ్డింగ్ పెట్టడం మహిళలకు ఆగ్రహం కలిగించింది. ‘వంటపని ఆడవాళ్లదే’ అని ఆ మాటకు అర్థం. మహిళలకు ఓటు హక్కు రాని వందేళ్ల క్రితం నాటి యూసేజ్ అది. ‘వాళ్లకేం తెలుసు వంటింటి కుందేళ్లు’ అని నలుగురు మగవాళ్లు కలసిన వేళల్లో నవ్వుకుంటూ అనుకునే మాట! బర్గర్ కింగ్ ఆ మాటనే యూజ్ చేస్తూ.. ‘లేడీస్, చెఫ్ లుగా మీరెందుకు రాణించకూడదు?! అక్కడా మగవాళ్ల డామినేషనేనా! రండి. మీకు మేము ట్రైనింగ్ ఇస్తాం. స్కాలర్ షిప్ ను ఇస్తాం. మిమ్మల్ని రెస్టారెంట్ ఇండస్ట్రీకి మహారాణులను చేస్తాం..’ అని ఆహ్వానించింది. ఇదంతా లోపల ఉన్నా.. పైకి కనిపించేదే కదా ఎవరైనా చూస్తారు! మహరాణుల ఆగ్రహంలో తప్పేమీ లేదు. మహారాజులే మాటను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి. ‘‘అవును. అయితే ఏంటి?!’’ అనే మాటను ఎప్పుడు అంటాం?! ఒక నిందో, అబద్ధపు ఆరోపణో, విమర్శో వచ్చి మీద పడినప్పుడు; మన నిజాయితీని అంగీకరించడానికి అవతలివారు సిద్ధంగా లేనప్పుడు; వివరించీ, వాదించీ ప్రయోజనం లేదనుకున్నప్పుడు.. తలనొప్పి వదిలించుకోడానికి ‘అవును. అయితే ఏంటి?’ అనేసి, పక్కకు వచ్చేస్తాం. ఎవరికి వారు.. ‘అవును. అయితే ఏంటి?’ అనేస్తే గొడవే లేదు. ఇంకెవరి తరఫునో.. ‘అవును. ఆమె అంతే. అయితే ఏంటి?’ అంటేనే వాగ్వాదాలు, యుద్ధాలు మొదలవుతాయి. ‘బర్గర్ కింగ్’ పేరు వినే ఉంటారు. బర్గర్ల విక్రయాలకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన మల్టీనేషనల్ రెస్టారెంట్ల అమెరికన్ కంపెనీ. చాలాచోట్ల దుకాణాలు ఉన్నాయి. ఉమెన్స్ డే రోజు ఆ కంపెనీ యూ.కె. సంస్థ ఇంచుమించు ఇలాంటి ఒక వివాదంలోనే చిక్కుకుంది. మహిళల తరఫున మాట్లాడబోయి, కొంచెం క్రియేటివ్‌గా మాట్లాడి మహిళల ఆగ్రహానికి గురైంది. పాపం బర్గర్ కింగ్ ఉద్దేశం మంచిదే. పెద్ద పెద్ద రెస్టారెంట్లో ఎందుకనో ఎక్కువగా పురుష చెఫ్‌లే కనిపిస్తారు. మహిళా చెఫ్‌లు కేవలం 20 శాతం మంది మాత్రమే. ఆ విషయాన్నే చెబుతూ.. ‘‘అన్ని రంగాల్లో ముందున్న మహిళలు చెఫ్‌లుగా మాత్రం వెనకబడి ఉండటం ఏంటి? మీకు ఆసక్తి ఉంటే చెప్పండి, మీకు స్కాలర్షిప్ ఇచ్చి, ట్రైనింగ్ ఇప్పించి, రెస్టారెంట్ల మహా సామ్రాజ్యాలకు మిమ్మల్ని మహరాణుల్ని చేస్తాం’’ అని బర్గర్ కింగ్.. ‘న్యూయార్క్ టైమ్స్’ దినపత్రికలో ఒక ఫుల్ పేజీ ప్రకటన ఇచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఆ ప్రకటన వచ్చింది కనుక బర్గర్ కింగ్ ఉద్దేశాన్ని శంకించే పనే లేదు. అయితే ఉద్దేశాలు మంచివే అయి ఉండవచ్చు కానీ కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్ల వల్ల అవి అపార్థాలకు కారణమై ప్రతిష్టను దెబ్బతీస్తాయి. ఈ ప్రకటనలోని పొరపాటు బర్గర్ కింగ్ తన పికప్ లైన్‌గా (లోపలికి లాగేసే ప్రారంభ వాక్యం) ‘ఉమెన్ బిలాంగ్ ఇన్ ది కిచెన్’ అనే మాటను వాడటం. ఆ మాటకు అర్థం ‘వంటపని ఆడవాళ్లదే’ అని. ఆ మాటలోని అంతరార్థం.. ‘అవును. అయితే ఏంటి? వాళ్లను అననివ్వండి. చెఫ్‌గా రాణించండి’ అని! బర్గర్ కింగ్ మహిళల వైపు మాట్లాడేందుకు, ఇలా మహిళలకు నచ్చని మాటను హెడ్డింగ్‌గా పెట్టడమే వివాదం అయింది. ఆ ఫుడ్ జెయింట్.. పేపర్లో మాత్రమే ఈ యాడ్ ఇచ్చి ఊరుకోలేదు. ట్విట్టర్లో కూడా పోస్ట్ చేసింది. ఆ పోస్టుకు రివర్స్ ట్వీట్లు వచ్చాయి. ‘ఏం మాటలివి బర్గర్ కింగ్. మహిళల్ని కించపరుస్తావా? నువ్వు తయారు చేసే బర్గర్లు రుచిగా ఉంటే సరిపోతుందా.. మాట శుచిగా ఉండొద్దా’ అని ట్విటిజెన్‌లు కామెంట్లు పెట్టారు. బర్గర్ కింగ్ సాయంత్రానికల్లా ఆ ట్వీట్‌ను తొలగించింది. పేపర్నైతే డిలీట్ కొట్టలేదు కదా. నష్టం జరిగిపోయింది. ఒడ్డున పడే మార్గంగా మహిళలకు క్షమాపణలు చెప్పింది. వాస్తవానికి ఆ ప్రకటన ఇప్పటికే బర్గర్ కింగ్‌లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిని ఉద్దేశించి ఇచ్చింది! అయితే యావత్ మహిళావనికి అది స్ఫూర్తిని, ప్రేరణను కలిగిస్తుందన్న ఆలోచనతో అలా బహిరంగ ప్రకటన ఇచ్చింది బర్గర్ కింగ్. ‘ఎక్కడైనా ప్రొఫెషనల్ కిచెన్ ఉందీ అంటే అక్కడ మహిళా చెఫ్ ఉన్నారనే’ అనే క్రియేటివ్ భావనకు వచ్చిన తిప్పలే ఇవి. రీడర్స్కి, నెటిజెన్లకు సరిగా అర్థం కాలేదు. ఎదురొచ్చి తగిలింది. ‘బర్గర్ కింగ్‌లోని మహిళా సిబ్బంది తమ కిచెన్ కలల్ని నిజం చేసుకోడానికి మేమొక స్కాలర్షిప్ ప్రోగ్రామ్ని ఈ మహిళా దినోత్సవం రోజున సగర్వంగా ప్రకటిస్తున్నాం’ అని కూడా ప్రకటనలో ఉంది. అది మాత్రమే ఉండి ఉంటే సరిపోయేది. వందేళ్ల నాటి మగాళ్ల మాట.. ‘ఉమెన్ బిలాంగ్ ఇన్ ది కిచెన్’ ను పట్టుకొచ్చి, శీర్షికగా పెట్టి, పర్యవసానంగా తలపట్టుకుంది బర్గర్ కింగ్. అంతర్జాతీయ మహిళాదినోత్సవం రోజు ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రికలో వచ్చిన బర్గర్ కింగ్ ఫుల్ పేజీ ప్రకటన. మహిళల ఆగ్రహానికి కారణం అయింది ఈ ప్రకటనలోని శీర్షికే అవును. ఇది వందేళ్లనాటి మాటే. ఇప్పుడు వాడటం మహిళల్ని కించపరచడమే. అమెరికాలో వందేళ్ల క్రితం మహిళలకింకా ఓటు హక్కు రాని కాలంలో మగాళ్లు మాత్రమే మనుషులు అన్నట్లు ఉండేది! నలుగురు మగాళ్లు ఒక చోట చేరినప్పుడు వాళ్ల నవ్వులాటలో.. స్త్రీల గురించి.. ‘వాళ్లకేం తెలుసు. వంటింటి కుందేళ్లు’ అనే మాట వాడుకలో ఉండేది. ఆడవాళ్లు ఇంటికీ, వంటకీ పరిమితం అనీ, బయటికి వెళ్లి వాళ్లే పనీ చెయ్యలేరని మగవాళ్లు బలంగా నమ్మిన కాలం నాటి రోజువారీ మాట ఈ ‘ఉమెన్ బిలాంగ్ ఇన్ ది కిచెన్’. కాలక్రమంలో మహిళలకు ఓటు హక్కు వచ్చింది. ఓటర్లుగా మాత్రమే కాదు, పోటీ చేసేవాళ్లుగా కూడా మహిళలు తామేంటో నిరూపించుకున్నారు. విజేతలుగా నిలిచారు. దేశాలను ఏలుతున్నారు. పురుష దేశాధినేతల కంటే కూడా సమర్థంగా పరిపాలిస్తున్నారు. ‘వంట పని ఆడవాళ్లదే’ అనే ఆ మాట దాదాపుగా భూస్థాపితం కూడా అయిపోయింది. ఇప్పుడు ఆ భూతాన్ని బర్గర్ కింగ్ వాళ్లు లేపి, మెడకు తగిలించుకున్నారు. మహిళల నుంచి అభ్యంతరం వ్యక్తం అవడంతో చెంపలు వేసుకున్నారు. చదవండి: బర్గర్ కింగ్‌కు భారీ ఎదురుదెబ్బ -
మా నాన్నను ధర్మేంద్ర ఏడిపించారు..
‘ఒక విదేశీ షూటింగ్‌కు నాతోపాటు మా నాన్న వచ్చారు. ధర్మేంద్రతో పాటలో యాక్ట్ చేయాలి. నాన్నకు అప్పటికే ధర్మేంద్ర నా వెంట పడటం తెలుసు. అందుకని నాన్న ప్రతిసారి మా కారు ధర్మేంద్ర ఎక్కకుండా అడ్డుకునేవారు. అయినా సరే ధర్మేంద్ర మా కారులోనే వస్తానని అనేవారు. నేను బ్యాక్సీట్లో కూచోగానే మా నాన్న వెంటనే డోర్ తీసుకుని నా పక్కన కూచునేవారు. ధర్మేంద్ర చాలా క్లవర్. ఇంకో డోర్ నుంచి ఆయన ఎక్కి నా పక్కన కూచునేవారు. వాళ్లు ఇలా నా కోసం ప్లాన్లు వేయడం సరదాగా అనిపించేది’ అన్నారు హేమమాలిని. 72 సంవత్సరాల హేమమాలిని నేటికి బాలీవుడ్ ‘డ్రీమ్‌గర్ల్’గా ఉన్నారు. అందుకే మొన్నటి ఆదివారం (మార్చి 7) విమెన్స్ డే సందర్భంగా ఇండియన్ ఐడెల్ ఎపిసోడ్‌ను ఆమె పేరున నిర్వహించారు. హేమమాలిని ఆ ఎపిసోడ్‌కు హాజరయ్యి ఆ సందర్భంగా చాలా విశేషాలు చెప్పారు హేమ మాలిని. అంతేకాదు, అందరినీ ఆశ్చర్యపరుస్తూ డాన్స్ చేశారు. ఆమె స్టెప్పులేసిన పాటల్లో ‘షోలే’లోని ‘జబ్ తక్ హై జాన్’ పాట ఒకటి. ‘షోలే’లో ఈ పాట క్లయిమాక్స్ లో వస్తుంది. గబ్బర్ సింగ్ ముందు మండుటెండలో బండరాళ్ల మీద పగిలిన గాజుపెంకులపై డాన్స్ చేస్తుంది హేమ మాలిని, ధరేంద్రను విడిపించుకోవడానికి. ఆ పాట వెనుక ఉన్న విశేషాలను కూడా ఆమె చెప్పారు– ‘ఆ పాట ఇలా ఉంటుందని దర్శకుడు రమేశ్ సిప్పి చెప్పారు. చేద్దాం... కాని షూటింగ్ నవంబర్, డిసెంబర్లో పెట్టుకోండి. అప్పుడు మైసూరు (షూటింగ్ జరుగుతున్న ప్రాంతం) చల్లగా ఉంటుంది అన్నాను. కాని రమేశ్ సిప్పీ వినలేదు. ఏప్రిల్ నెలఖారున షూటింగ్ పెట్టారు. అంత ఎండ లో రాళ్ల మీద డాన్స్ చేయడం ఎలా అనుకున్నాను. మా అమ్మ పాదాలకు ప్రత్యేకమైన సాక్సులు తయారు చేయించింది. అవి వేసుకుంటే కాళ్లు కాలవు.. సాక్సులు వేసుకున్నట్టు తెలియదు కూడా. వాటిని తొడుక్కుంటుంటే రమేశ్ సిప్పీ దూరం నుంచి చూసి ‘వద్దొద్దు్ద అవి వేయకండి’ అని వార్నింగ్ ఇచ్చారు. సరే... రాళ్ల మీద కాసిన్ని నీళ్లైనా పోయండి చల్లబడతాయి అన్నాను. దానికీ ఒప్పుకోలేదు. చివరకు పాటను అలాగే చేశాను. మొత్తం పాట తీయడానికి పది రోజులు పట్టింది. కాని ఫలితం ఎలా ఉందో మీరే చూశారుగా’ అన్నారామె. ‘జానీ మేరా నామ్ సినిమా సమయానికి నేను ఇంకా ఫీల్డుకి కొత్త. ఆ సినిమాలో వాదా తూ నిభాయా... పాట దేవ్ ఆనంద్ గారితో చేయాలి. రోప్ వేలో ఒక చైర్లో దేవ్ ఆనంద్ కూచుంటే ఆయన వొడిలో నేను కూచోవాలి. సరే.. సినిమాల్లో ఇవన్నీ తప్పవు. నేను దేవ్ గారి వొడిలో కూచున్నాక ప్రతిసారీ కరెంటు పోయేది. నేను అలాగే కూచుని ఉండాల్సి వచ్చేది. ఏమిటా అని చూస్తే తర్వాత తెలిసింది... కావాలనే కరెంట్ తీసేస్తున్నారని. ఇలాంటివి కూడా షూటింగ్లలో జరుగుతుంటాయి’ అన్నారామె. తను ఇంట్లో మూడో సంతానమని, తను గర్భంలో ఉండగానే ఈసారి పుట్టేది ఆడపిల్లే.. దానికి హేమ మాలిని అని పేరు పెట్టాలి అని తన తల్లి అనుకుందని ఆమె చెప్పారు. పుట్టక ముందే పేరు రెడీ చేసుకున్న ఆమె పుట్టాక ఆ పేరును డ్రీమ్ గర్ల్ హేమమాలినిగా నిలబెట్టుకున్నారు. -
బర్గర్ కింగ్‌కు భారీ ఎదురుదెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ: ఫాస్ట్‌ఫుడ్ బిజినెస్ కింగ్ బర్గర్ కింగ్ (యూకే)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జెండర్‌పరంగా మహిళలపై వివక్షపూరితంగా ట్వీట్ చేసి ఇబ్బందుల్లో పడింది. అందులోనూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలనుద్దేశించి వ్యాఖ్యానిస్తూ తన పురుషాధిక్య ధోరణిని చాటుకోవడం వివాదానికి తెరతీసింది. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో తప్పయిందంటూ లెంప లేసుకుంది. అయితే ఆ ట్వీట్‌ను తొలగించిన సంస్థ క్షమాపణ చెబుతూ మరో ట్వీట్ చేసింది. ఈ సమయంలో కూడా బర్గర్ కింగ్ తీవ్ర విమర్శల పాలైంది. స్వచ్ఛందంగా తప్పును ఒప్పుకోవాల్సిన సంస్థ తీవ్రమైన ట్రోలింగ్, అబ్యూసివ్ కమెంట్స్ కారణంగా ఈ ట్వీట్‌ను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. అంతే.. నెటిజన్లు బర్గర్ కింగ్‌పై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం స్కాలర్షిప్ కార్యక్రమాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా విమెన్ బిలాంగ్ ఇన్ ది కిచెన్ (మహిళలు వంట ఇంటికి చెందినవారు) అంటూ ట్వీట్ చేసింది. ట్వీట్‌తో పాటు న్యూయార్క్ టైమ్స్ ప్రింట్ ఎడిషన్‌లో పూర్తి పేజీ ప్రకటనను ప్రచురించినట్లు వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. "మహిళలు వంటగదిలో ఉన్నారంటూ పెద్ద యాడ్ ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్లు బర్గర్కింగ్పై ఫైర్ అయ్యారు. దీనికి తోడు బర్గర్ కింగ్ సమాధానంతో మరింత మండిపడ్డారు.నెటిజన్లు ట్వీట్ల పరంపర సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. (Women's Day: ఎస్బీఐ బంపర్ ఆఫర్లు) How stupid can you be? Especially on International Women’s Day... #smh https://t.co/FvEeHQh9am pic.twitter.com/LgkrKo5NZC — Alex Chin (@chinstachinsta) March 9, 2021 “Sorry our sexist bait tweet brought in sexists”🙃🙃 https://t.co/a9zTX2B2dx — _kairy_draws_ (@_kairy_draws_) March 9, 2021 Wait so you only deleted because of that but not because what you tweeted was distasteful? That's a pitiful non apology. https://t.co/Ch7y9NuD2y — Pat Orr (@Powerage1986) March 9, 2021 Wait so you only deleted because of that but not because what you tweeted was distasteful? That's a pitiful non apology. https://t.co/Ch7y9NuD2y — Pat Orr (@Powerage1986) March 9, 2021 -
ఉమెన్స్ డే: ఆమె కానిస్టేబుల్ కాదు.. హోం మంత్రి!
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఓ మహిళా కానిస్టేబుల్ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. మధ్య ప్రదేశ్‌లోని భోపాల్‌లో మీనాక్షి వర్మ అనే కానిస్టేబుల్‌కు ఒకరోజు హోంమంత్రిగా పనిచేసే అవకాశం లభించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ మీనాక్షిని మంత్రి మిశ్రా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన చైర్‌ను ఓ రోజు పాటు కానిస్టేబుల్ మీనాక్షి వర్మకు ఇచ్చినట్లు తెలిపారు. ఈ ఒక్కరోజు(సోమవారం) హోంశాఖ పూర్తిగా మీనాక్షి ఆదేశాల మేరకే పని చేస్తుందని పేర్కొన్నారు. అనంతరం సమస్యలు తెలపటానికి వచ్చిన ప్రజల నుంచి మీనాక్షీ వర్మ పలు వినతిపత్రాలు స్వీకరించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని తగిన విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాగా ప్రజా సమస్యలను హోంమంత్రి దృష్టికి తీసుకొచ్చిన ప్రజలు అక్కడ మంత్రి కూర్చునే స్థానంలో ఓ మహిళా కానిస్టేబుల్ ఉండటాన్ని చూసి షాక్ అయ్యారు. మహిళా దినోత్సవం రోజున తనకు దక్కిన ఈ అరుదైన గౌరవం తనకు జీవితాంతం గుర్తుండిపోతుందని మీనాక్షి అన్నారు. తాను హోంమంత్రిగా పనిచేసే అవకాశం తనకు దక్కుతుందని తాను కలలో కూడా ఊహించలేదని ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు మీనాక్షి హోమంత్రి కార్యాలయంలోనే సెక్యూరిటీ విధుల్లో ఉంటున్నారు. చదవండి: రాజస్తాన్ కమలంలో వర్గపోరు ! ప్రధాని అపాయింట్మెంట్ కోరిన సీఎం జగన్ Madhya Pradesh: Woman constable Meenakshi Verma took charge as state home minister for a day today. "I have given my chair to Meekankshi for the day on the occasion of #InternationalWomensDay," State Home Minister Narottam Mishra says. pic.twitter.com/zBD722giKd — ANI (@ANI) March 8, 2021 -
హ్యట్, క్రికెట్ బ్యాట్‌తో మంచు లక్ష్మి సందడి
-
హ్యాట్, బ్యాట్‌తో మంచు లక్ష్మి సందడి!
సాక్షి, హైదరాబాద్ : పేట్లబురుజులోని సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో సినీ నటి మంచు లక్ష్మి సందడి చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన మహిళా దినోత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. మహిళా శక్తికి ఎదురు లేదని..వారిప్పుడు అన్ని రంగాల్లో రాణిస్తూ హ్యాట్సాఫ్ అనిపించుకుంటున్నారని పేర్కొన్నారు. అనంతరం సీపీ అంజనీకుమార్‌తో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. రాష్ట్ర ఆదాయ పన్ను శాఖ కమిషనర్ వసుంధర సిన్హా తదితరులు పాల్గొన్నారు. చదవండి: క్రికెట్ ఆడుతున్న మంచులక్ష్మి : మరిన్ని ఫొటోలకోసం ఇక్కడ క్లిక్ చేయండి దృశ్యం 2: కేసు రీఓపెన్ చేయనున్న రానా! అజిత్ షూట్ చేశాడు.. మెడల్ ఇచ్చారు -
సమాధుల పక్కన ఆడశిశువు
డోర్నకల్: మహిళా దినోత్సవం రోజున మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బూరుగుపాడు గ్రామంలో ఓ దారుణం చోటుచేసుకుంది. గ్రామ సమీపాన సమాధుల పక్కన అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. పాలిథిన్ కవర్ చుట్టి ఉన్న పసికందు ఏడుపు విని సమీపంలో ఉన్న మహిళ అక్కడకు వెళ్లడంతో శిశువు కనిపించింది. బూరుగుపాడుకు చెందిన వేల్పుల వెంకటమ్మ సోమవారం ఉదయం 8 గంటల సమయంలో కాకరకాయల కోసం దర్గా ప్రాంతానికి వెళ్లగా పసికందు ఏడుపు వినిపించింది. పక్కనే పరిశీలించగా అక్కడి సమాధుల పక్కన కవర్లో ఆడశిశువు కనిపించింది. సమీపంలో ఎవరూ లేకపోవడంతో పసికందును ఆమె ఇంటికి తీసుకొచ్చింది. బొడ్డు పేగు, శరీరానికి రక్తం ఉండటంతో స్నానం చేయించిన తర్వాత పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలకు సమాచారం అందించింది. వారు వెంకటమ్మ ఇంటికి వచ్చి పసికందును పరిశీలించి అధికారులకు విషయాన్ని తెలియజేశారు. 108 సిబ్బంది గ్రామానికి చేరుకున్న తరువాత ఏఎన్ఎం సరస్వతి, అంగన్వాడీ కార్యకర్త హైమావతి, ఆశ కార్యకర్త సులోచన పసికందును డోర్నకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. నవజాత శిశువును పరీక్షించిన వైద్యులు పాపను వార్మర్లో ఉంచారు. 2.5 కేజీల బరువుతో పాప ఆరోగ్యంగా ఉందని చెప్పారు. బాలల హక్కుల కమిషన్ రాష్ట్ర సభ్యుడు బృందాధర్రావు, సీడీపీఓ ఇందిర, బాల రక్ష భవన్ కో–ఆర్డినేటర్ జ్యోతి, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి నరేశ్వై,ద్యాధికారి డాక్టర్ రంజిత్‌రెడ్డి, వైద్యురాలు డాక్టర్ విరాజిత తదితరులు ఆస్పత్రిలో పసికందును పరిశీలించారు. చైల్డ్ ప్రొటెక్షన్ ప్రతినిధులు పసికందును మహబూబాబాద్ శిశుగృహానికి తరలించారు. చదవండి: 20 ఏళ్ల క్రితమే అక్కడ మహిళా రాజ్యం -
స్పీకర్ పోచారం కంటతడి
అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఓ కార్యక్రమంలో కంటతడి పెట్టారు. సోమవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘అపురూపమైనదమ్మ ఆడజన్మ..’ పాటను ప్లే చేయగా, తన తల్లి దివంగత పరిగె పాపమ్మను గుర్తు చేసుకుని ఒక్కసారిగా పోచారం ఉద్వేగానికి గురయ్యారు. 102 ఏళ్ల వయసులో తన తల్లి మరణించారని, ఆమె ఇచ్చిన స్ఫూర్తితోనే తాను ప్రజాసేవకు అంకితమయ్యానని తెలిపారు. తన విజయాల్లో భార్య పుష్పమ్మ పాత్ర కూడా ఎంతో ఉందని ఆయన చెప్పుకొచ్చారు. – బాన్సువాడ చదవండి: అదుపులోనే భైంసా -
ఢిల్లీ సరిహద్దుల్లో నినదించిన మహిళా రైతులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులు సోమవారం మహిళా రైతుల నిరసనలతో మారుమోగాయి. కేంద్ర వ్యవసాయ చట్టాలను వాపసు తీసుకోవాలంటూ సింఘు, టిక్రీ, ఘాజీపూర్‌లలో రైతులు మూడు నెలలకు పైగా ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న నిరసనల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వ్యవసాయ సమస్యలతోపాటు మహిళలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వారు చర్చించారు. ఇతర సంఘాలకు చెందిన కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తమ అనుభవాలను వారు పంచుకున్నారు. పసుపు, ఆకుపచ్చ రంగుల దుస్తులు ధరించిన మహిళలు సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. కొందరు భాంగ్రా నృత్యాలు చేశారు. దేశ వ్యవసాయ రంగంలో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. రైతు నిరసనల్లో పాల్గొనే మహిళల సంఖ్య కూడా పెరుగుతోందని వారన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ట్రాక్టర్లు, కార్లు, టెంపోలు, జీపుల ద్వారా వారు ఢిల్లీ సరిహద్దుల్లోకి చేరుకున్నారని చెప్పారు. -
మహిళా రక్షణ ‘దిశ’గా మరో ముందడుగు
సాక్షి, అమరావతి: మహిళల రక్షణ ‘దిశ’గా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మహిళలకు తక్షణ రక్షణ కల్పించేందుకు పెట్రోలింగ్ వాహనాలు, క్రైం సీన్ మేనేజ్మెంట్ వెహికల్స్, మహిళా హెల్ప్ డెస్క్‌లు, దిశ సైబర్ కవచ్ కియోస్క్‌లను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా బాధితులకు నిమిషాల వ్యవధిలో సాయమందించనున్నారు. మహిళలు, బాలికల రక్షణ కోసం ఏర్పాటు చేసిన పెట్రోలింగ్ వాహనాలపై ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్ సకాలంలో ఘటనాస్థలికి చేరుకోవచ్చు. వీటికి జీపీఆర్ఎస్ అమర్చారు. దీని ద్వారా దిశ కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో పాటు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు టచ్‌లో ఉండొచ్చు. సహాయాన్ని 6 నుంచి 10 నిమిషాల్లో అందించేలా సిబ్బంది విధులు నిర్వహిస్తారు. మహిళలు, బాలికలకు అన్యాయం జరిగితే వెంటనే దర్యాప్తు బృందం, క్లూస్ టీంతో పాటు ఘటనా స్థలికి దిశ బస్(క్రైమ్ సీన్ మేనేజ్మెంట్ వెహికల్) కూడా వస్తుంది. ఫోరెన్సిక్ నిపుణులు, మెడికల్ అసిస్టెంట్, మహిళా పోలీసులు, వీడియో గ్రాఫర్, ఫొటోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్ సహా 8 మంది ప్రయాణించేలా ఈ వాహనాన్ని రూపొందించారు. నేర స్థలంలో ఆధారాల సేకరణ, బాధితురాలి ఫిర్యాదు, వైద్యం తదితర విషయాల్లో జాప్యం జరగకుండా సాయం అందిస్తారు.స్మార్ట్ ఫోన్లు వినియోగించే మహిళలు సైబర్ నేరాల బారిన పడకుండా 50 సైబర్ కవచ్ కియోస్క్‌లు ఏర్పాటు చేశారు. స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేయగానే అది స్కాన్ చేస్తుంది. హానికరమైన అప్లికేషన్లను గుర్తించి అప్రమత్తం చేస్తుంది. అలాగే పోలీస్స్టేషన్లలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. సమస్యలు, సందేహాలతో వచ్చే మహిళలకు ఈ హెల్ప్ డెస్క్‌లు భరోసా ఇవ్వనున్నాయి. ‘మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యమిస్తున్నాం. ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం’ అని హోం మంత్రి సుచరిత, డీజీపీ సవాంగ్ చెప్పారు. -
అక్క చెల్లెమ్మలకు అన్న కానుక.. మహిళా బడ్జెట్
దాదాపు 44.50 లక్షల మంది తల్లులకు, తద్వారా 85 లక్షల మంది పిల్లలకు ఏటా అమ్మఒడి ద్వారా రూ.6,500 కోట్లు చొప్పున రెండేళ్లలో ఇప్పటికే రూ.13,022 కోట్లు దేవుడి దయతో ఇవ్వగలిగాం. కేవలం ఈ ఒక్క పథకం ద్వారానే ఐదేళ్లలో రూ.32,500 కోట్లు నేరుగా తల్లుల చేతికే అందచేస్తాం. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా 87.75 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.6,792 కోట్లు ఇచ్చాం. ఈ ఒక్క పథకం ద్వారానే నాలుగేళ్లలో రూ.27 వేల కోట్లకుపైగా ఇవ్వబోతున్నాం. వైఎస్సార్ చేయూత ద్వారా 45 నుంచి 60 సంవత్సరాలున్న 24.56 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు రూ.4,604 కోట్లు ఇప్పటికే ఇచ్చాం. నాలుగేళ్లలో రూ.18 వేల కోట్లకుపైగా ఇవ్వబోతున్నాం. అమ్మ ఒడి, వైఎస్సార్ ఆసరా, చేయూత ఈ మూడు పథకాల ద్వారా అక్కచెల్లెమ్మల స్వావలంబన కోసం ఐదేళ్లలో రూ.78 వేల కోట్లకుపైగా నేరుగా వారికి అందిస్తాం. మధ్యవర్తులు, లంచాలు, అవినీతి, పక్షపాతం లేకుండా, పాత అప్పులకు జమ చేయకుండా వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్నాం. ‘‘మనం అమలు చేస్తున్న ప్రతి కార్యక్రమంలోనూ అక్కచెల్లెమ్మలకు అండగా నిలుస్తున్నాం. మారుతున్న సమాజాన్ని, రాబోయే రోజుల్లో పరిస్థితుల్ని, మహిళలకు ఎదురవుతున్న సవాళ్లను అర్థం చేసుకుని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా సాధికారత సాధించే దిశగా 21 నెలలుగా ఎన్నో అడుగులు ముందుకు వేస్తూ వచ్చాం. 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ మన రాష్ట్రం నుంచే ఆవిర్భవించాలనే దృఢ సంకల్పంతో రేపటితరం చిన్నారులకు అన్ని పథకాల్లోనూ సింహభాగం ఇచ్చామని సగర్వంగా తెలియజేస్తున్నాం’’ ‘‘ఇంటిని అన్ని రకాలుగా బాగుపర్చాలనే తపన, తాపత్రయం అక్కచెల్లెమ్మల్లోనే కనిపిస్తుంది. తమకు గుర్తింపు రాకపోయినా, ఉన్నత పదవుల్లో లేకున్నా ప్రతి ఇంట్లోనూ వారంతా మనల్ని ఉన్నతంగా చూసుకుంటారు, అందుకనే మనం ఇవాళ ఈ స్థానంలో ఉన్నామని గుర్తుంచుకోవాలి’’ – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: మహిళల కోసం ఈ ఏడాది బడ్జెట్లో ప్రత్యేకంగా కేటాయింపులు చేయనున్నట్లు సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా మహిళా బడ్జెట్ కాన్సెప్ట్ తెస్తున్నామని, అక్కచెల్లెమ్మలకు ఎంత ఖర్చు చేయబోతున్నామో అందులో తెలియచేస్తామని చెప్పారు. తొలిసారిగా ‘జెండర్’ బడ్జెట్‌ను ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడుతున్నామని, దేశంలో ఇంతవరకు ఇది ఎక్కడా జరగలేదని తెలిపారు. ప్రైవేట్, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై వేధింపులు నిరోధించడానికి కమిటీలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. పని ప్రదేశాల్లో మహిళల మీద వేధింపులు నిరోధించేందుకు కమిటీలు కచ్చితంగా ఏర్పాటు చేయాలని చట్టం చెబుతున్నా సక్రమంగా అమలు కావడం లేదన్నారు. రాష్ట్రమంతా కమిటీలు ఏర్పాటయ్యేలా పర్యవేక్షించాలని, సచివాలయం నుంచే ఈ పని ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు. ఈ కమిటీల ఏర్పాటు విప్లవాత్మక అడుగు కాబోతుందన్నారు. సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు, బాలికలకు అండగా నిలిచే పలు కార్యక్రమాలను ముఖ్యమంత్రి జగన్ క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. అన్ని పోలీస్ స్టేషన్లలో మహిళా హెల్ప్‌డెస్క్‌లను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. సైబర్ కియోస్క్‌లను ఆవిష్కరించడంతో పాటు 18 దిశ క్రైం సీన్ మేనేజ్మెంట్ వెహికల్స్, 900 దిశ పెట్రోలింగ్ వెహికల్స్‌ను సీఎం ప్రారంభించారు. బాలికలకు ఉచిత న్యాప్కిన్స్ అందించే స్వేచ్ఛ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. సీఎం జగన్ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ.. సీఎం క్యాంపు కార్యాలయంలో విధులు నిర్వర్తించే మహిళా సిబ్బందితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆ సేవలకు కొలమానాలు లేవు.. అక్క చెల్లెమ్మలకు, చిన్నారులకు, అవ్వలకు, అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళ అంటే ఆకాశంలో సగభాగం, సృష్టిలో కూడా సగ భాగమంటారు. మరి వాళ్ల హక్కుల్లో సగభాగాలు ఇస్తున్నామా? భూదేవి అంత సహనం, మానవత్వపు మమతలతో కుటుంబానికి చుక్కానిలా, కష్టాలూ నష్టాలూ దిగమింగుకుంటూ ఇంటింటా మహిళామూర్తులందించే సేవలకు కొలమానాలు లేవు. రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళల్లో 60 శాతం మాత్రమే అక్షరాస్యత ఉంది. ఇప్పటికీ 40 శాతం మందికి చదువు అందడం లేదు. ఆహారం మొదలు అధికారం వరకు అన్ని అంశాల్లోనూ గర్భస్థ శిశువు నుంచి జీవన సంధ్యలో ఉన్న అవ్వ వరకూ స్త్రీల పట్ల సమాజంలో ఉన్న వివక్షను ఇలాగే వదిలేస్తే సమాజం ఎటుపోతుందో ఒక్కసారి ఆలోచన చేయాలి. సైబర్ కవచ్ కియోస్క్‌ను ప్రారంభిస్తున్న సీఎం వైఎస్ జగన్, చిత్రంలో మంత్రులు, అధికారులు నాకు బాగా గుర్తుంది.. నాకు బాగా గుర్తుంది. అప్పట్లో నేను ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు నాడు సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడిన మాటలు నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. కోడలు మగపిల్లాడ్ని కంటానంటే అత్త వద్దంటుందా? అని నాడు ఏకంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో స్పీకర్ స్థానంలో ఉన్నవారు.. కారు షెడ్డులో ఉండాలి, ఆడవాళ్లు ఇంట్లో ఉండాలి.. అని అన్నారు. ఇటువంటి దారుణమైన పరిస్థితులను మార్చాలని అక్క చెల్లెమ్మలకు అండగా నిలిచాం. 21 నెలల్లోనే అక్క చెల్లెమ్మలకు 80 వేల కోట్లు ఈ 21 నెలల్లోనే అక్కచెల్లెమ్మల చేతిలో నేరుగా రూ.80 వేల కోట్లు పెట్టామని గర్వంగా చెబుతున్నాం. వైఎస్సార్ అమ్మఒడి పథకంతో రూ.13,022 కోట్లు, వైఎస్సార్ కాపునేస్తంతో రూ.491 కోట్లు, వైఎస్సార్ చేయూతతో రూ.4,604 కోట్లు ఇప్పటికే ఇచ్చాం.వైఎస్సార్ సున్నావడ్డీ కింద రూ.1,400 కోట్లు ఇవ్వగలిగాం. వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా 2 దఫాలుగా రూ.383 కోట్లు అందచేశాం. వైఎస్సార్ ఆసరాతో రూ.6,792 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ పింఛన్ కానుక కింద అక్కచెల్లెమ్మలకు రూ.15,613 కోట్లిచ్చాం. వైఎస్సార్ రైతు భరోసా కింద అక్కచెల్లెమ్మలను మాత్రమే లెక్కలోకి తీసుకుంటే రూ.3,567 కోట్లు, మత్స్యకార భరోసా కింద రూ.4.58 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద రూ.1,220 కోట్లు, జగనన్న విద్యాదీవెనతో రూ.1,806 కోట్లు, వైఎస్సార్ వాహనమిత్రతో రూ.45.69 కోట్లు, లా నేస్తంలో రూ.3.24 కోట్లు, జగనన్న తోడుతో రూ.136 కోట్లు, వైఎస్సార్ ఆరోగ్య ఆసరాతో రూ.50 కోట్లు, జగనన్న గోరుముద్దలో చిట్టి చెల్లెమ్మలను తీసుకుంటే రూ.415 కోట్లు, వైఎస్సార్ సంపూర్ణ పోషణ కింద రూ.1863 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇళ్ల పట్టాల కింద 30.76 లక్షల మంది అక్కచెల్లెమ్మలకి రూ.27 వేల కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.824 కోట్లు ఇవ్వగలిగాం. జగనన్న విద్యా కానుక ద్వారా చిట్టి చెల్లెమ్మలను లెక్కవేసుకుంటే రూ.334 కోట్లు ఇచ్చాం. మొత్తం రూ.80 వేల కోట్లు అక్కచెల్లెమ్మలకు అందచేశామని గర్వంగా చెబుతున్నాం. ఇక వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పూర్తైతే వీటి విలువ కనీసం రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు చేరుకుని ప్రతి అక్కచెల్లెమ్మకు నేరుగా ఆస్తి ఇచ్చినట్లవుతుంది. ► రాజకీయంగా అక్కచెల్లెమ్మలు సాధికారిత సాధించి దేశానికి దారి చూపే స్థాయికి ఎదగాలని నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం వారికే దక్కేలా చట్టం కూడా చేశాం. ► 13 జిల్లాల్లో 18 దిశ పోలీస్ స్టేషన్లు తెచ్చి పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాం. ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసే అంశం హైకోర్టు పరిశీలనలో ఉంది. మహిళలపై నేరాలు 7.5 శాతం తగ్గించగలిగాం. మహిళల మీద నేరాలకు పాల్పడ్డ కేసుల్లో దర్యాప్తునకు గతంలో వంద రోజులు పడితే ఇప్పుడు 53 రోజులకు అంటే దాదాపు సగానికి తగ్గించగలిగాం. లైంగిక దాడులకు సంబంధించి 1,194 కేసుల్లో చార్జిషీట్ నమోదు చేశాం. దిశ యాప్ బటన్ నొక్కిన 20 నిమిషాల్లోపే పోలీసులు చేరుకుని తోడుగా నిలిచే వ్యవస్థను తీసుకురాగలిగాం. ► కేసులను దర్యాప్తు చేయడానికి దిశ దర్యాప్తు వాహనాలను ప్రారంభిస్తున్నాం. 18 దిశ స్టేషన్లకు వీటిని అందచేస్తాం. వేగంగా కేసు దర్యాప్తు చేసేందుకు అన్నిరకాల సదుపాయాలు ఉంటాయి. దిశ పెట్రోలింగ్ పేరిట 900 స్కూటీలను ప్రారంభిస్తున్నాం. మహిళలు ధైర్యంగా తమ సమస్యలను చెప్పుకునేందుకు పోలీస్ స్టేషన్లలో మహిళా సహాయక డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నాం. సైబర్ కవచ్ కియోస్క్‌లను ఏర్పాటుచేసి సైబర్ నేరాలను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే 50 కియోస్క్‌లు పెట్టాం. సీఎం క్యాంపు కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవం సీఎం క్యాంపు కార్యాలయంలో మహిళా దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. మహిళా మంత్రులతో సీఎం జగన్ కేక్ కట్ చేయించారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ రూపొందించిన దేశానికి దిశ పుస్తకాన్ని ఆవిష్కరించారు. 58 ఫోరెన్సిక్ ల్యాబ్స్‌లో సైంటిఫిక్ ల్యాబ్ అసిస్టెంట్ల ఫలితాలను విడుదల చేశారు. ఏఎన్ఎం శాంతి, పారిశుధ్య కార్మికురాలు మాబున్ని, మహిళా కానిస్టేబుల్ సరస్వతి, వలంటీర్ కళ్యాణిలను సీఎం జగన్ సత్కరించారు. సీఎంతో ఒంగోలు వన్‌టౌన్ పీఎస్ నుంచి మహిళా హెల్ప్ డెస్క్ కానిస్టేబుల్ అలేఖ్య, కర్నూలు నుంచి కానిస్టేబుల్ దుర్గ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మహిళలకు క్యాజువల్ లీవ్స్ పెంపు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న మహిళలకు అదనంగా 5 క్యాజువల్ లీవ్స్ ప్రకటిస్తున్నాం. గతంలో ఉన్న వాటిని 15 రోజుల నుంచి 20 రోజులకు పెంచుతున్నాం. విద్యార్థ్ధినులకు శానిటరీ న్యాప్కిన్స్ ప్రభుత్వ స్కూళ్లలో 7 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థినులకు శానిటరీ న్యాప్కిన్స్ ఉచితంగా అందించే స్వేచ్ఛ కార్యక్రమానికి జూలై 1 నుంచి శ్రీకారం చుట్టబోతున్నాం. ప్రముఖ కంపెనీల న్యాప్కిన్స్ అందచేస్తాం. చేయూత కిరాణా దుకాణాల్లో తక్కువ ధరకే అందుబాటులోకి తెస్తున్నాం. -
వీల్ చెయిర్..విల్ చెయిర్
పట్టుదలతో ఏదైనా మార్చుకోవచ్చు అని తన జీవితాన్ని ఉదాహరణగా చూపుతుంది దీపా మాలిక్. దేశంలో పారా ఒలింపిక్ పతకం సాధించిన మొట్టమొదటి మహిళ గా ఘనత సాధించింది. హర్యానాలో పుట్టి పెరిగిన దీప వెన్నెముకలో ఏర్పడిన కణితి కారణంగా చక్రాల కుర్చీకి పరిమితమైంది. అనేక సవాళ్లను ఎదుర్కొని పతకాలు, పురస్కారాలు అందుకుంది. తన సమస్యలతో ఇప్పటికీ పోరాడుతూనే ఆ శక్తిని కుటుంబానికీ ఇస్తూ తనలాంటి వారిలో స్ఫూర్తిని నింపుతోంది. పద్మశ్రీ, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, అర్జున అవార్డు, ఆసియా పారా గేమ్స్‌లో 4 పతకాలు, యమునా నది మీదుగా ఈత కొట్టడం ఇవన్నీ సాధించడానికి ఒక జీవితం సరిపోదేమో అనిపిస్తుంది. కానీ, వాటన్నింటినీ సాధించి, ఓడిస్తున్న జీవితం తో పోరాడి గెలిచి చూపించింది. శక్తి పుంజం దీపా మాలిక్ తన చక్రాల కుర్చీలో కూర్చోగానే ఆ కుర్చీకే శక్తి వస్తుందేమో అనిపిస్తుంది. విధికి లొంగని శక్తి పుంజం అక్కడా ప్రకాశిస్తున్నట్టుగా ఉంటుంది. ‘భగవంతుడు ఇచ్చిన శరీరాన్ని ఎప్పుడూ ఫుల్‌గా ఛార్జ్ చేసి ఉంచండి. పరుగు, ఆట, గెంతడం.. వంటి వాటితో మీలో శక్తిని నింపండి’ అని మహిళలకు చెబుతుంది. దీపా బాల్యమంతా జైపూర్ లో గడిచింది. పెళ్లై ఇద్దరు కూతుళ్లకు తల్లి ఆమె. వారిద్దరూ చదువుకుంటున్నారు. ఆత్మవిశ్వాసాన్ని తగ్గించలేదు దీపా తన కుటుంబానికి వెన్నెముక. జూన్ 3, 1999న వెన్నెముక లో కణితి ఉన్నట్టు వైద్య పరీక్షలో తేలింది. నడుస్తున్న జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు తిరిగింది. కణితి ఆపరేషన్ తర్వాత, పక్షవాతం బారిన పడింది. కొన్నాళ్లు మంచానికే పరిమితమైన దీప తనకు తాను శక్తిని కూడగట్టుకుంది. రెండు యుద్ధాలను జయించిన వేళ కార్గిల్ యుద్ధ మేఘాలు శివార్లలో ఉరుముతున్న కాలం. ఈ యుద్ధంలో దీప భర్త విక్రమ్ కూడా దేశం కోసం పోరాడుతున్నాడు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సభ్యులు యుద్ధం చేస్తున్నప్పుడు ఇది చాలా కష్టమైన సమయం, ఒకటి దేశ శివార్లలో, మరొకటి శరీర శివార్లలో. ఈ సమయం దీప కుటుంబానికి చాలా సవాల్‌గా మారింది. కానీ చివరికి దీప కుటుంబం రెండు యుద్ధాలను గెలిచింది. ఒక వైపు భారత్ కార్గిల్ యుద్ధంలో విజయం సాధించింది. దీపకు మూడు వెన్నెముక కణితి శస్త్రచికిత్సలు విజయవంతమయ్యాయి. కానీ, పక్షవాతం రావడంతో మంచానికే పరిమితం అయ్యింది. దీంతో కొన్నిసార్లు దీప విచారంగా ఉండేది. ‘ఆ సమయంలో మా నాన్న ‘చీకటిని శపించడంలో అర్థం లేదు, నువ్వే దీపం కావాలి. అందుకే నీకా పేరు పెట్టాను’ అని చెప్పడంతో ఓ కొత్త శక్తి ఆవరించినట్టు అనిపించింది. అప్పటి నుంచి నాకు నేనుగా నిలదొక్కుకోవడానికి ఎంత ప్రయత్నం చేశానో మాటల్లో చెప్పలేను’ అని వివరించిన దీపా మాలిక్ చేతల్లో తన విజయాన్ని ప్రపంచానికి చాటింది. ఇప్పటికీ చాటుతూనే ఉంది. -
ఖైదీల పిల్లల కోసం ఒక హోమ్
యశోద ఉండటం వల్ల కృష్ణుడు చెరసాలలో కాకుండా ఆమె వొడిలో పెరిగాడు. మరి శిక్షలు పడ్డ ఖైదీలందరి పిల్లలకు ఈ యోగం ఉందా? ఎందుకు ఉండదు.. అమ్మను నేనున్నాను అంటుంది నిరోజ లక్ష్మి. 48 ఏళ్ల ఈ టీచరమ్మ ఒరిస్సాలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీల పిల్లల కోసం భువనేశ్వర్‌లో ఒక హోమ్ నడుపుతోంది. 2003లో మొదలైన ఈ హోమ్ ఇప్పటికి 200 మందిని సాకి సంతరించి ప్రయోజకుల్ని చేసింది. కన్న తల్లిదండ్రుల మీద ఏ పిల్లలకూ ప్రేమ పోదు. కాని ఈ పిల్లలకు మాత్రం నిరోజ మాత్రమే తల్లి తండ్రి దైవం. ఆ అమ్మాయి వయసు 12 ఏళ్లు ఉంటాయి. త్వరలో పరీక్షలు ఉన్నాయట. స్కూలుకు వెళ్లను అని హోమ్‌లోనే చదువుకుంటోంది. లెక్కల బుక్కు తీసి కిందా మీదా అవుతోంది. ఆ అమ్మాయి శ్రద్ధ చూస్తే తప్పక ఏదో పెద్ద చదువు చదివేలా ఉంది. ఆ పెద్ద చదువు ఆ హోమ్‌లో కాకుండా మరెక్కడ ఉన్నా ఆ అమ్మాయి చదవలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి తండ్రి జీవితఖైదు పడి శిక్ష అనుభవిస్తున్నాడు. ఆస్తి తగాదాల్లో భాగంగా ఆవేశంలో హత్య చేశాడతడు. తల్లికి మతి స్థిమితం సరిగా ఉండదు. ‘అందుకని మా హోమ్‌కు తెచ్చాను’ అంటుంది నిరోజ లక్ష్మి. పూర్తి పేరు నిరోజ లక్ష్మి మహాపాత్ర. భువనేశ్వర్‌లోని సెంట్రల్ జైలుకు సమీపంలోనే గత 17 సంవత్సరాలుగా నడుపుతున్న హోమ్ ఉంది. దాని పేరు ‘మధుర్‌మయి ఆదర్శ శిక్షానికేతన్’. దేశంలోనే బహుశా ఖైదీల పిల్లల కోసం ప్రత్యేకంగా నడిచే ఇలాంటి హోమ్ మరొకటి లేకపోవచ్చు. పిల్లలకు యశోదై పురుషులు జైలుకెళితే తల్లులు పిల్లలను చూసుకుంటారు. కాని కొన్ని కేసుల్లో స్త్రీలు జైలుకు వస్తారు. ఆ సమయంలో పురుషులు వారిని వారి ఖర్మానికి వొదిలి మరో పెళ్లి చేసుకుంటారు. అలాంటి తల్లుల పిల్లలను ఎవరు చూసుకుంటారు. జైలులో తల్లితో పాటు 8 ఏళ్ల వరకూ పిల్లలు ఉండే వీలు ఉన్నా ఐదేళ్ల వయసున్న పిల్లల దగ్గరి నుంచి తెచ్చి తన హోమ్‌లో సంరక్షిస్తుంది 48 ఏళ్ల నిరోజ. ‘ఒరిస్సాలో 18 జైళ్లు ఉన్నాయి. వీటిలో శిక్ష అనుభవిస్తున్న వారి పిల్లల్లో ఎవరికైతే ఆలనా పాలనా ఉండదో వారిని మా హోమ్‌కు తెచ్చుకుంటాను. జైలు అధికారుల అనుమతితో ఈ హోమ్ నడుస్తుంది. తల్లిదండ్రులు చేసిన తప్పుకు పిల్లలు శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు. అందరు పిల్లలకు మల్లే వారికి కూడా సమగ్ర పోషణ అవసరమంటుంది’ నిరోజ. 2003లో మొదలైన ఈ హోమ్‌కు ఒరిస్సాలోని ఒక స్వచ్ఛంద సంస్థ మద్దతు ఇస్తోంది. ఇప్పటి వరకూ ఈ హోమ్ నుంచి 200 మంది బాల బాలికలు చదువుకున్నారు. కొందరు ఇంజనీర్లు అయ్యారు. ఎం.సి.ఏ చదివారు. కొందరు సాంకేతిక కోర్సుల ద్వారా ఉపాధి పొందుతున్నారు. ‘ఏ సందర్భంలో చూసినా మా హోమ్‌లో 50 మంది బాల బాలికలు ఉంటారు’ అంటుంది నిరోజ. ఆమే అమ్మ ఆమే నాన్నా... నిరోజది జగత్సింగ్పూర్ జిల్లా తిర్తోల్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి టీచర్ గా కొన్ని స్కూళ్లలో పని చేసింది. ‘తల్లిదండ్రులు ఉన్న పిల్లల చదువుకు ఆటంకం లేదు. కాని జైళ్లల్లో ఉన్నవారి పిల్లల సంగతేమిటి అన్న ఆలోచన వచ్చింది. వెంటనే ప్రభుత్వ ప్రతినిధులను, జైళ్ల శాఖను కలిసి హోమ్ ప్రతిపాదనను చేశాను. జైళ్లల్లో అకారణంగా పిల్లలు ఉండిపోవడం కన్నా ఇలా హోమ్‌లో ఉండి చదువుకోవడం మేలని వారు సహకరించారు. ఈ హోమ్ కోసం 3 ప్రభుత్వ స్కూళ్లను లింక్ చేశారు. ఇక్కడి పిల్లలు అక్కడకు వెళ్లి చదువుకోవచ్చు. ప్రతి ఆదివారం లేదా వీలున్న సమయంలో ఆ పిల్లలను తీసుకెళ్లి తల్లిదండ్రులకు చూపించి వస్తాం. వారు నిజంగా చాలా సంతోషిస్తారు’ అంటుంది నిరోజ. హోమ్‌లో పిల్లల బాగోగులు నిరోజే చూసుకుంటుంది. వారికి పాఠాలు చెబుతుంది. డాన్స్, ఆర్ట్ ఇవన్నీ ఉంటాయి. ‘పిల్లలు చాలా సంతోషం గా ఉండి తల్లిదండ్రుల బెంగను మర్చిపోతారు’ అంటుంది నిరోజ. ఆమె ఇంతటితో ఆగలేదు. భువనేశ్వర్‌లో బధిర పిల్లల కోసమే జూనియర్ కాలేజీ కూడా ఏర్పాటు చేసింది. ‘దీంట్లో ఎవరూ చేరరు’ అని ఆమె ఫ్రెండ్స్ ఆమెకు చెప్పారు. కాని ఇప్పుడా కాలేజీలో రాష్ట్ర వ్యాప్త బధిర విద్యార్థులు దఖలు అవుతున్నారు. హోమ్‌లోని పిల్లలకు నిరోజ చాలా ఇష్టం. మాకు అమ్మైనా నాన్నైనా నిరోజే అంటారు. ఇలాంటి తల్లులే ఎందరో అభాగ్య బాలలకు చల్లని ఒడిలా నిలుస్తారు. నిరోజ లాంటి వాళ్లు ప్రతి రాష్ట్రంలో ఉంటే ఖైదీల పిల్లల భవిష్యత్తు మరింత మెరుగ్గా ఉంటుంది. – సాక్షి ఫ్యామిలీ -
పడిలేచిన ‘ప్రగతి’!
అవయవాలన్నీ బాగున్నప్పటికీ కష్టపడకుండా ఎవరో ఒకరి మీద ఆధారపడి జీవిస్తుంటారు కొందరు. రెండు చేతులు కోల్పోయిన ఓ అమ్మాయి మాత్రం ఎవరి మీదా ఆధారపడకుండా, తన పనులు తానే చేసుకుంటూ, ఖర్చులకోసం సొంతంగా సంపాదిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన ప్రగతి దురదృష్ట వశాత్తు రెండు చేతులను కోల్పోయింది. 2010లో ప్రగతి అనుకోకుండా విద్యుత్ సరఫరా అవుతున్న వైర్‌ను పట్టుకోవడంతో..∙రెండు చేతులు కాలిపోయాయి. చికిత్సలో భాగంగా చేతులను మోచేయి వరకు డాక్టర్లు తొలగించారు. దీంతో తన రోజువారి పనులు చేసుకోవడానికి కూడా ప్రగతి చాలా కష్టపడేది. అయినా ఎలాగైనా ఎవరిసాయం తీసుకోకుండా బతకాలనుకుంది. క్రమంగా తన ఆత్మవిశ్వాసం పెంపొందించుకుని మొబైల్ ఫోన్, కంప్యూటర్లను ఆపరేట్ చేయడం నేర్చుకుంది. అంతేగాకుండా ఒకపక్క విద్యార్థులకు పాఠాలు చెబుతూ మరోపక్క బ్యాంక్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. ‘‘ఎన్ని కష్టాలు ఎదురైనా అమ్మాయిలు తమ కలల్ని నిజం చేసుకోవడంలో వెనక్కి తగ్గకుండా కష్టపడి సాధించాలి’’ అని ప్రగతి చెప్పింది. మొదట్లో తన పనులు తాను చేసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉండేది. క్రమంగా పనులు చేసుకోవడం మొదలు పెట్టాను. అలా పనులు చేసుకోవడం వల్ల ఏదైనా చేయగలను అనిపించింది. ఈ క్రమంలోనే ఫోన్ ఆపరేట్ చేయగలిగాను. తల్లిదండ్రులకు భారం కాకూడదన్న ఉద్దేశ్యంతో టీచర్‌గా పనిచేస్తూ సంపాదిస్తున్నానని, భవిష్యత్తులో బ్యాంక్ ఉద్యోగం పొందడమే తన కలని ప్రగతి చెప్పింది. -
మహిళలకు 'మహా' మినహాయింపు.. ఎందులో తెలుసా..?
ముంబై: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మహారాష్ట్ర సర్కార్ తీపి కబురు చెప్పింది. మహిళల పేరిట జరిగే ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి స్టాంప్ డ్యూటీని ఒక శాతం తగ్గిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రకటించారు. సోమవారం జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి గానూ మహిళలకు భారీ కేటాయింపులు చేయన్నుట్లు ప్రకటించారు. మహిళలకు ఆస్తుల రిజిస్ట్రేషన్‌లో మినహాయింపు ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.1000 కోట్ల అదనపు భారం పడనుందని వివరించారు. మహిళలకు మహారాష్ట్ర సర్కార్ పెద్దపీట వేస్తుందని, రాష్ట్రంలో అమలవుతున్న మహిళా సంక్షేమ పథకాలే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. -
ఉమెన్స్ డే: రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు
ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహిళల గొప్పతనాన్ని, ఔనత్యాన్ని చాటుతూ రాజకీయ, క్రీడా, సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. తమ జీవితంలోని మహిళల గొప్పదనాన్ని వివరిస్తూ కామెంట్లు పెడుతున్నారు. అయితే కొందరు మాత్రం ఒక్కరోజు మాత్రమే మహిళలను గౌరవించడం.. పొగడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ‘‘ప్రతి రోజు ఆడవారిపై దారుణాలకు ఒడిగడుతూ, వారిని కించపరుస్తూ, అవమానపరుస్తూ కేవలం ఈ ఒక్క రోజును వారికి కేటాయిస్తున్నారా.. ఈ రోజును సెలబ్రేట్ చేసుకోమని చెబుతున్నారా’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ మహిళా దినోత్సవం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో ఆడవారిపై జరుగుతున్న అరాచకాలు.. వారు ఎదుర్కొంటున్న అవమానాలు ముగిసే రోజు రానంతవరకు తనకు ఉమెన్స్ డే అక్కర్లేదని స్పష్టం చేశారు. అంతేకాక తన ఇన్‌స్టాలో ఓ వ్యక్తి, మహిళపై దారుణంగా దాడి చేస్తున్న వీడియోని పోస్ట్ చేశారు రష్మీ. దాంతో పాటు ‘‘సారీ గైస్.. సమాజంలో ఈ విషయంలో మార్పు రానంతవరకు నాకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు వద్దు. ఒక పురుషుడు బహిరంగంగా మహిళను కించపరుస్తూ, ఆమెను అసభ్యపదజాలతంతో దూషిస్తూ, ఆమెపై చెప్పులు విసురుతున్నాడు. ఇదంతా అతడి తల్లిదండ్రుల ముందే చేస్తున్నాడు. ఈ ఘటన బాధాకరం. ఈ రోజు కూడా అన్ని రోజుల్లా ఒక రోజు మాత్రమే. స్త్రీ తత్వం కాదు. మానవత్వాన్ని సెలబ్రేట్ చేసుకుందాం. అందరినీ సమానంగా చూద్దాం. మనముందున్న సమస్యలను పరిష్కరించుకుందాం’’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దీనిపై నెటిజనులు ‘‘చాలా బాగా చెప్పార్ మేడం.. ఆడవారిని గౌరవించకుండా.. కేవలం ఇలాంటి రోజులు జరుపుకోవడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు’’ అంటూ కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) చదవండి: ఉమెన్స్ డే : రష్మి వ్యంగ్యాస్త్రాలు టిక్‌టాక్ వీడియోపై రష్మి ఆగ్రహం -
అన్నింటిని సహించాను.. భరించాను: సునీత
తన జీవితంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాని.. ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నానని అయితే వాటన్నింటినీ పునాదిరాళ్లుగా మార్చుకుని జీవితంలో ధైర్యంగా ముందుకు సాగుతున్నానని ప్రముఖ గాయని సునీత పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా మెసేజ్ చేశారు సునీత. ఆమె వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లకు ప్రతి రూపంగా నిలిచింది ఈ సందేశం. ఈ క్రమంలో సునీత.. ‘‘నా జీవితాన్ని మీరే నిర్ణయిస్తారు. ట్రోల్ చేస్తారు. నన్ను ప్రతిసారీ కిందకు లాగుతుంటారు. నాలో అభద్రతాభావాన్ని నెలకొల్పుతుంటారు. ఏదో ఒక విషయంలో నన్ను తప్పని నిరూపించాలని ప్రయత్నిస్తారు.. మీరు ఎప్పుడు నన్ను నమ్మరు.. నాకు అండగా నిలవరు. ఆఖరికి నేను చెప్పేది కూడా వినరు. నేను ఓడిపోయినప్పుడు నన్ను చూసి నవ్వుతుంటారు. ఇబ్బంది పెడుతుంటారు. ఎలాంటి కారణం లేకుండా నన్ను నిందించిన మీరే ఇప్పుడు నాకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నారా!?’’ అంటూ మెసేజ్ చేశారు. ‘‘నేను మీ శుభాకాంక్షలు స్వీకరిస్తున్నాను! ఎందుకంటే మీరు నాపై విసిరిన రాళ్లేనే పునాదులుగా మార్చుకుని నా బలాన్ని మరింత పెంచుకుని.. జీవితంలో ముందుకు సాగుతున్నాను. చిరునవ్వుతో అన్నింటినీ క్షమించాను. ప్రేమను పంచాను. ఎందుకంటే నేను ఒక స్త్రీని.. అన్నింటినీ సహించాను.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు’’ అని సునీత పెట్టిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. సెలబ్రిటీలు అంటే ట్రోలింగ్ తప్పదు. అయితే సునిత విషయంలో ఇది చాలా ఎక్కువగా జరిగింది. ముఖ్యంగా ఆమె రెండో వివాహం చేసుకున్న నాటి నుంచి విమర్శించే వారు అధికమయ్యారు. ఈ నేపథ్యంలో వారందరిని ఉద్దేశించి సునీత ఇలా వ్యగ్యంగా మెసేజ్ చేశారు. చదవండి: సింగర్ సునీత : ఇంట్రస్టింగ్ ఫోటో, వీడియో సింగర్ సునీత పెళ్లి: కత్తి మహేష్ కామెంట్స్ View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) -
సీఎం క్యాంప్ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు
-
అనుష్క, కూతురు ఫోటోతో కోహ్లి భావోద్వేగం
సెలబ్రిటీ కపుల్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ముందు వరుసలో ఉంటారు. విరుష్క జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయాలనూ తెలుసుకోవాలనే ఉత్సుకత అభిమానుల్లో ఉంటుంది. ఇక ఇటీవల విరాట్, అనుష్కలకు పాప జన్మించడంతో తరుచుగా వార్తలో నానుతున్నారు. తొలిసారి తల్లిదండ్రులు అవ్వడంతో ఆనందంలో మునిగి తేలుతున్నారు. తాజాగా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. కూతురు వామికాను ఎత్తుకున్న అనుష్క ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా మహిళందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ భావోద్వేగానికి లోనయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన కుటుంబం ఫోటోను షేర్ చేసిన కోహ్లి.. ‘పిల్లల పుట్టుకను చూడటం అనేది గొప్ప అనుభూతి. మాటల్లో వర్ణించలేని అదో అద్భుతమైన అనుభవం. దాన్ని ఎవరైనా ప్రత్యక్షంగా చూసిన తరువాత మహిళల నిజమైన బలం, దైవత్వాన్ని అర్థం చేసుకుంటారు. దేవుడు వారి కడుపులో మరో జీవితాన్ని సృష్టించాడు. ఎందుకంటే వారు పురుషుల కంటే బలంగా ఉన్నారు కాబట్టే. నా జీవితంలో ఇది మరిచిపోలేని విషయం. నా కూతురు కూడా ఆమె తల్లిలా ఎదుగుతుందని భావిస్తున్నాను. ప్రపంచంలోని అద్భుతమైన మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.’ అని ఎమోషనల్ అయ్యారు. View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) కాగా ఒక యాడ్ షూటింగులో పరిచయమైన విరాట్, అనుష్క తర్వాత ప్రేమికులుగా మారారు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి 2017 డిసెంబర్ 11న ఇటలీలో వివాహం చేసుకున్నారు. ఈ జంటను ‘విరుష్క’ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునేవారు. అనుష్క శర్మ, కోహ్లీకి జనవరి 11 న కుమార్తెకు జన్మనిచ్చారు. ఈ సంతోషకరమైన వార్తను విరాట్ తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. పాపాయి పుట్టిన 21 రోజుల అనంతరం అనుష్క తన మొదటి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి చిన్నారి పేరును వెల్లడించింది. విరాట్-అనుష్క తన కూతురుకు వామికా అని నామకరణం చేశారు. చదవండి: అనుష్క సెల్ఫీ: ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్ -
విమెన్స్ డే : ఎస్బీఐ బంపర్ ఆఫర్లు
సాక్షి, ముంబై: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గుడ్ న్యూస్ చెప్పింది. సొంతింటి కలని నిజం చేసుకోవాలనుకునే మహిళలకు తీపి కబురు అందించింది. గృహరుణాలపై ప్రత్యేక తగ్గింపు వడ్డీరేటును మహిళలకు అందించనుంది. హోంలోన్ల వడ్డీ రేటును అదనంగా 5 బేసిస్ పాయింట్లు తగ్గించనున్నట్లు సోమవారం ప్రకటించింది. తాజా సవరణ ద్వారా 6.70 శాతం వద్ద ప్రారంభ వడ్డీ రేట్లతో హోమ్ లోన్స్ ప్రత్యేకంగా మహిళలకు అందుబాటులో తీసుకొస్తున్నట్టు తెలిపింది. విమెన్స్ డే సందర్బంగా అందిస్తున్న ఈ అవకాశాన్ని మహిళలు వినియోగించుకోవాలని కోరింది. మీ కలల సౌథం.. మా లక్ష్యం అంటూ ట్వీట్ చేసింది. అలాగే యోనో యాప్ ద్వారా జరిపే బంగారు, డైమండ్ ఆభరణాల కొనుగోళ్లపై స్పెషల్ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. 30 శాతం దాకా తగ్గింపును ఆఫర్ చేస్తున్నట్టు ట్వీట్ చేసింది. Pamper yourself the right way! Avail this sparkling offer exclusively on YONO app.#SBICelebratesHer #WomensDay #Women #Jewellery #Offer pic.twitter.com/kimrjphHCW — State Bank of India (@TheOfficialSBI) March 8, 2021 Your Dream Home. Our Goal. 🏡💭 On #WomensDay, we make it special with an additional concession of 5 bps* to women borrowers and interest starting at 6.70%* onwards. To know more, visit: https://t.co/L7SN4HqGFg pic.twitter.com/CuXWtvBhxD — State Bank of India (@TheOfficialSBI) March 8, 2021 -
ఆడపిల్ల పెళ్లికి కానుకగా రూ.5,016..
ఆడపిల్లా.. అంటూ ఇప్పటికీ ముఖం చిట్లించే వారెందరో! కానీ ఈ ముగ్గురూ ఆడపిల్ల పుట్టుకను పండుగ చేస్తున్నారు. ఓ సర్పంచ్ ఆడపిల్ల పుడితే రూ.5 వేలు కానుకగా ఇస్తుంటే.. ఇంకో సర్పంచ్ ఆడపిల్లకు కట్నంగా రూ.5,016 అందజేస్తున్నారు. ఇంకో వైద్యురాలు ఆడపిల్ల పుడితే ఆపరేషన్ ఉచితంగా చేస్తున్నారు. ఈ ముగ్గురి పరిచయం.. ఆడబిడ్డ కట్నం రూ.5,016 ఇబ్రహీంపట్నం(కోరుట్ల): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ సర్పంచ్ నేరెళ్ల హేమలత మహిళా ప్రజాప్రతినిధిగా గ్రామాన్ని ప్రగతిపథంలో నడపడమే కాదు.. ఆ ఊళ్లో పుట్టే ప్రతి ఆడపిల్లకు అండగా నిలవాలనుకున్నారు. ఈ క్రమంలో ఏ ఇంట ఆడబిడ్డ పెళ్లి జరిగినా కట్నంగా రూ.5,016 ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పటి వరకు 36 యువతులకు చెక్కులను అందించారు. ఇటీవలే ఒకేసారి గ్రామంలో 67 మందికి కరోనా పాజిటివ్ రాగా పంచాయతీ సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి బాధితులకు పౌష్టికాహారం అందించారు. వలసకూలీలకు బియ్యం, నిత్యావసర సరుకులను అందచేశారు. తాను పదవిలో ఉన్నంత కాలం ఆడబిడ్డలకు పెండ్లి కానుకతో పాటు, తోటివారికి తోచిన సాయం చేస్తానని సర్పంచ్ హేమలత చెబుతున్నారు. ఆడపిల్ల పుడితే రూ.5 వేలు ఆదర్శంగా నిలుస్తున్న బీబ్రా సర్పంచ్ దహెగాం(సిర్పూర్): ఆడపిల్ల పుడితే తల్లి పేరిట రూ.5వేలు కానుకగా అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు కుమురంభీం జిల్లా దహెగాం మండలం బీబ్రా గ్రామ సర్పంచ్ బండ కృష్ణమూర్తి. మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టిన వెంటనే తన సొంత డబ్బును పోస్టాఫీసులో మాతృమూర్తి పేరిట డిపాజిట్ చేస్తున్నారీయన. ఆడపిల్ల అంటే మహాలక్ష్మి అని చెప్పే ఈయన.. ఆడపిల్లను తల్లిదండ్రులకు బరువుగా భావించకూడదంటారు. 2020 జూన్ 2న, తన తల్లిదండ్రులైన బండ సుదర్శన్–సులోచనల పెళ్లిరోజును పురస్కరించుకుని గ్రామ పంచాయతీలో మొదటి కాన్పుగా ఆడపిల్ల పుడితే రూ.5 వేలు చిన్నారి తల్లి పేరిట డిపాజిట్ చేస్తానని ఈయన గ్రామస్తుల ముందు ప్రకటించి.. అలాగే చేస్తున్నారు. ‘అపూర్వ’ సాయం భైంసాటౌన్(ముథోల్): ఆడపిల్ల అని తెలిస్తే.. గర్భంలోనే చిదిమేస్తున్న తల్లిదండ్రులను చూసి చలించిన ఆమె.. తనవంతుగా ఆడశిశువును బతికించే ప్రయత్నం చేస్తున్నారు. తన ఆస్పత్రికి కాన్పు కోసం వచ్చేవారికి ఆడపిల్ల పుడితే ఉచితంగా ఆపరేషన్ చేస్తున్నారు. భైంసాకు చెందిన డాక్టర్ అపూర్వ.. భర్త డాక్టర్ రజనీకాంత్‌తో కలిసి భైంసాలో ప్రైవేట్ ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. 2016 నుంచి తమ ఆస్పత్రిలో కాన్పు చేసుకున్న వారికి ఆడబిడ్డ పుడితే ఎలాంటి రుసుం లేకుండా ఆపరేషన్ చేస్తున్నారు. ఇప్పటికి 400 ఉచిత ఆపరేషన్లు చేశామని అంటున్నారీమె. ‘గర్భంలోని శిశువు ఆడపిల్ల అని తెలిస్తే చాలామంది అబార్షన్ చేయిస్తున్నారు. వైద్యవృత్తిలో ఉన్నందుకు మా వంతుగా ఆడపిల్లను కాపాడే ప్రయత్నం చేస్తున్నా’మని చెప్పారు డాక్టర్ అపూర్వ. -
వుమెన్స్ డే: టాలీవుడ్ సెలబ్రిటీల విషెస్
బంధాలకు బహుమానం, ఆనందాలకు నిలయం, బాధ్యతలకు బంధనం, ఆత్మీయతకు ఆవాసం, అనురాగానికి అమృతం, కుటుంబానికి ఆధారం 'ఆమె'. నేడు మహిళా దినోత్సవం సందర్భంగా టాలీవుడ్ సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతూ ఫొటోలు షేర్ చేశారు. ఏ ఇంట్లో అయితే మహిళ సంతోషంగా చిరునవ్వులు చిందిస్తుందో అక్కడ సంతోషం ద్విగుణీకృతమవుతుంది. ఈ ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు: నాగశౌర్య World is a happy place when the woman in the house smiles:) Wishing my world and every other woman in the world, A Very Happy Woman’s Day♥️🤗 #HappyWomensDay pic.twitter.com/PJCmVIOGsf — Naga Shaurya (@IamNagashaurya) March 8, 2021 పితృస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పోరాడుతున్న మహిళలందరికీ గౌరవాభినందనలు. మీ వల్లే సమానత్వం అంటే ఏంటో తెలుసుకోగలిగాం. కానీ ఇప్పటికీ మన సమాజం ఆదర్శంగా మాత్రం లేదు. హ్యాపీ ఉమెన్స్ డే: సుధీర్ బాబు Immense respect to all those sane human beings who fought against patriarchy and made us understand a basic thing called equality. Even today, we are just better as a society but no where ideal. Happy #WomensDay with a great hope for the future. — Sudheer Babu (@isudheerbabu) March 8, 2021 ఈ ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీరు ఎప్పటికీ ప్రకాశిస్తూ ఉండాలి: మహేశ్‌బాబు To mine, and all the incredible women around the globe, Happy Women's Day. Rise and shine above all! 😊 https://t.co/R4K9VMJHst — Mahesh Babu (@urstrulyMahesh) March 8, 2021 నేను ఏదైనా చేయగలనంటూ మీరందరూ ఎంతగానో ప్రోత్సహించారు. మీ వల్లే నాకీ జీవితం మరింత సులువైంది. నా ఈ సూపర్ వుమెన్స్‌తో పాటు మహిళలందరికీ హ్యాపీ వుమెన్స్ డే: సమంత View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) అమ్మ బుగ్గలు గిల్లుతున్న ఫొటోను షేర్ చేసిన హీరో సాయిధరమ్ తేజ్ AMMA ❤️ #HappyWomensDay pic.twitter.com/WuFv6DzIj1 — Sai Dharam Tej (@IamSaiDharamTej) March 8, 2021 -
మహిళలు.. ఆకాశంలో సగం: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: మహిళ అంటే ఆకాశంలో సగభాగమని.. ఆర్ధిక, సామాజిక, రాజకీయంగా మహిళలకు హక్కులు కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబానికి చుక్కానిలా ఉండి అందిస్తున్న సేవలకు కొలమానాలు లేవన్నారు. మహిళా మంత్రులతో స్వయంగా సీఎం వైఎస్ జగన్ కేక్ కట్ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘గత 21 నెలల్లో రాష్ట్ర మహిళా సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టాం. అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, కాపు నేస్తం మహిళల పేరిట ఇళ్ల స్థలం, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్లు వంటి పథకాలు తెచ్చాం ప్రతి రంగంలోనూ మహిళలు అభివృద్ధి చెందాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళల్లో 60 శాతం మాత్రమే అక్షరాస్యత ఉంది. ఇప్పటికీ 40 శాతం మంది మహిళలకు చదువు అందడం లేదు. చదువులకు పేదరికం అడ్డుకాకూడదనే అమ్మఒడి పథకం తీసుకొచ్చాం. రెండేళ్లలో రూ.13,220 కోట్లు అమ్మఒడి పథకం కింద ఇచ్చాం. ఐదేళ్లలో రూ.32,500 కోట్లను అమ్మఒడి కింద ఇస్తాం. వైఎస్సార్ చేయూత కింద రూ.4,604 కోట్లు ఇచ్చాం. ఇళ్ల స్థలాల ద్వారా మహిళలకు రూ.27వేల కోట్లు ఇచ్చాం. అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత ద్వారానే 21 నెలల్లో రూ.80వేల కోట్లు అందించాం. మహిళా ఉద్యోగుల క్యాజువల్ లీవ్స్ 20 రోజులకు పెంచాం. 13 జిల్లాల్లో దిశ పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేశాం. మహిళలపై నేరాలకు సత్వర విచారణ చేస్తున్నామని’’ సీఎం జగన్ అన్నారు. గతంలో మహిళలను ఉద్దేశించి చంద్రబాబు దారుణంగా మాట్లాడారని.. కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని హేళన చేశారన్నారు. మన తల్లులు మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దారు కాబట్టే.. ఇప్పుడు మనం ఈ స్థాయిలో ఉన్నామని సీఎం పేర్కొన్నారు. ఈ ఏడాది మహిళలకు ప్రత్యేక బడ్జెట్ దేశంలోనే తొలిసారిగా జెండర్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నామని సీఎం తెలిపారు. మహిళలపై వేధింపుల నిరోధానికి ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో కమిటీలు ఏర్పాటు చేస్తామని, 10 మందికి మించి మహిళలు ఉన్న కార్యాలయాల్లో కమిటీలు నియమిస్తామని పేర్కొన్నారు. ప్రతి పోలీస్స్టేషన్లోనూ మహిళా హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. దిశ వాహనాలను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్ 900 దిశ పెట్రోల్ వెహికల్స్, 18 దిశ క్రైం సీన్ మేనేజ్మెంట్ వెహికల్స్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. జీపీఎస్, దిశ యాప్ రెస్పాన్స్ సిస్టమ్‌తో అనుసంధానం చేసే సైబర్ కియోస్క్‌లను సీఎం ఆవిష్కరించారు. బాలికలకు ఉచిత నాప్కిన్స్ అందించే స్వేచ్ఛ కార్యక్రమాన్ని కూడా సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. సీఎం చేతుల మీదుగా 'దేశానికి దిశ' పుస్తకం ఆవిష్కరణ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రూపొందించిన 'దేశానికి దిశ' పుస్తకాన్ని సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించారు. మహిళా దినోత్సవం సందర్భంగా పలువురిని ముఖ్యమంత్రి సత్కరించారు. ఏఎన్ఎం శాంతి, స్వీపర్ మబున్నీసా, మహిళా కానిస్టేబుల్ సరస్వతి, వాలంటీర్ కల్యాణీని సీఎం సత్కరించారు. మీరు మా కుటుంబసభ్యులై ప్రతీ విషయంలో తోడుగా.. మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రకాశం జిల్లా ఒంగోలు ఒన్‌టౌన్ పోలీసు స్టేషన్ నుంచి విమెన్ హెల్ప్ డెస్క్‌లోని మహిళా కానిస్టేబుల్ అలేఖ్య సీఎం వైఎస్ జగన్‌తో మాట్లాడుతూ.. బాధిత మహిళ తన సమస్యను చెప్పగానే మేం ఒక మహిళగా తన బాధను అర్ధం చేసుకుని సత్వర న్యాయం చేయగలుగుతామని తెలిపారు. అలాగే ఒక నిరక్షరాస్యురాలైన మహిళ స్టేషన్‌కు వస్తే ఆమెకు రాయడం రాదు కావున వారు చెప్పిన ప్రతీ మాటను రికార్డ్ చేసి వారికి చదివి వినిపించి న్యాయం చేస్తామని చెప్పారు. అలాగే మానసిక సమస్యలతో బాధపడే వారు వచ్చినప్పుడు వారికి కౌన్సిలింగ్ చేయడంతో పాటు పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. హెల్ప్‌డెస్క్‌లో మహిళలు ఉండడం వల్ల మేం పూర్తిగా వారి బాధలు అర్ధం చేసుకుని సత్వర న్యాయం చేయగలుగుతామన్నారు. మహిళల కోసం మీరు చాలా చేస్తున్నారు సార్, మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒక చిన్న బిడ్డ పుట్టినప్పటి నుంచి వృద్దాప్యం వరకూ మీరు ప్రతీ విషయంలో మాకు తోడుగా ఉంటున్నారని తెలిపారు. బిడ్డలకు మేనమామగా, చదువుల విషయంలో అన్నలాగా, చేయూతనిస్తూ పెద్దన్నలా తోడుగా, వృద్దాప్యంలో కొడుకుగా ఉంటున్నారని తెలిపారు. మీరు మా కుటుంబసభ్యులై ప్రతీ విషయంలో తోడుగా ఉంటున్నారు. ధన్యవాదాలు సర్. దిశ పోలీస్ స్టేషన్ మహిళలకు వరం కర్నూల్ టూటౌన్ పోలీసు స్టేషన్ ఉమెన్ హెల్ప్ డెస్క్‌లో మహిళా కానిస్టేబుల్ దుర్గ సీఎం జగన్‌తో మాట్లాడుతూ.. మీరు ఏర్పాటు చేసిన దిశ పోలీస్ స్టేషన్ మహిళలకు ఒక వరం అని తెలిపారు. స్టేషన్‌కు వచ్చే మహిళలకు, తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో ఇబ్బందులు పడుతున్న వారికి మేమున్నామనే భరోసా ఇచ్చే అవకాశం దిశ పోలీస్ స్టేషన్ ద్వారా కలుగుతుందని చెప్పారు. దిశా యాక్ట్, మహిళా మిత్ర ద్వారా మహిళలకు భరోసా కల్పించడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: మహిళలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు టీడీపీ నేత అయ్యన్న తనయుడి రచ్చ రచ్చ.. -
20 ఏళ్ల క్రితమే అక్కడ మహిళా రాజ్యం
సాక్షి ప్రతినిధి, వరంగల్/గీసుకొండ: ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండున్నర దశాబ్దాల క్రితమే మహిళా పాలన జాతీయస్థాయి ఖ్యాతినార్జించింది. ఆదర్శ గ్రామంగా పేరెన్నికగన్న వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లి ఇందుకు వేదికైంది. దశాబ్దం పాటు ఇక్కడ మహిళలే ప్రజాప్రతినిధులుగా వెలుగొందారు. గీసుగొండ మండలంలో మచ్చాపురం శివారు గ్రామంగా ఉండే గంగదేవిపల్లి 1994లో ప్రత్యేక గ్రామ పంచాయతీగా అవతరించింది. అప్పట్లో గ్రామ జనాభా 1,291 మంది కాగా, 1995లో జరిగిన తొలి పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవిని మహిళలకు రిజర్వ్ చేశారు. సర్పంచ్ స్థానంతో పాటు 9 వార్డుల్లోనూ మహిళలే పోటీ చేయగా, వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికై ఆదర్శంగా నిలిచారు. ఆ తరువాత విడతలోనూ ఇదే ప్రత్యేకతను చాటుకుందీ గ్రామం. కూలీల నుంచి పాలకులుగా.. వ్యవసాయం, కూలి పనులు చేసుకునే మహిళలు పాలనా పగ్గాలు చేపట్టి గంగదేవిపల్లిని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దారు. 1995 ఆగస్టు 23న గ్రామ తొలి సర్పంచ్‌గా కూసం లలిత, ఉపసర్పంచ్‌గా పెండ్లి సరోజన, వార్డు సభ్యులుగా కూసం రాజేశ్వరి, దేవులపెల్లి విజయ, జంగం వీరలక్ష్మి, మామిండ్ల లక్ష్మి, చల్ల కట్టమ్మ, సింగిరెడ్డి నర్సమ్మ, గోనె లక్ష్మి ఎన్నికయ్యారు. బాల వికాస స్వచ్ఛంద సంస్థ సహకారంతో వీరంతా ప్రతీ పనికి కమిటీలు, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించారు. రెండోసారీ మహిళలకే పట్టం గ్రామపంచాయతీ రెండో విడత ఎన్నికలు 2001 ఆగస్టు 23న జరగ్గా, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పురుషులు పోటీపడినా మహిళలకే గ్రామస్తులు పట్టంకట్టారు. సర్పంచ్‌గా రెండోసారి కూసం లలిత, ఉపసర్పంచ్‌గా పెండ్లి జయసుధ, వార్డు సభ్యులుగా దేవులపెల్లి విజయ, కూసం రాజేశ్వరి, సల్ల సాంబలక్ష్మి, సల్ల కట్టమ్మ, మేడిద లక్ష్మి, మేడిద మల్లికాంబ, గూడ రాధమ్మ ఎన్నికై మహిళాసత్తా చాటారు. వీరి హయాంలో గంగదేవిపల్లి జాతీయ ఆదర్శ గ్రామంగా గుర్తింపు పొంది దేశ, విదేశీయులను ఆకర్షించింది. అన్నింటా వంద శాతం.. ►వంద శాతం ఇంటిపన్ను వసూలు ►వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం ►ఇద్దరు పిల్లలతో కుటుంబ నియంత్రణ ►వంద శాతం కుటుంబాలు చిన్నమొత్తాల పొదుపు ►వంద శాతం బడిఈడు పిల్లలు బడికి ►15–50 ఏళ్లలోపు వంద శాతం సంపూర్ణ అక్షరాస్యత ►వంద శాతం ప్రజలకు బాలవికాస ద్వారా పరిశుభ్రమైన తాగునీరు ►బాల కార్మికులు లేని గ్రామం ►1996–97, 1997–98లో మండల స్థాయిలో ఉత్తమ పంచాయతీ అవార్డులు ►1997–98, 2003–04, 2006–07లో మూడుసార్లు జిల్లా స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డులు ►2006–07లో ఎల్ఐసీ బీమా గ్రామీణ అవార్డు పురస్కారం -
ఉద్యమ స్ఫూర్తితో ముందడుగు
మార్చి 8 శ్రామిక మహిళల పోరాటానికి సంకేతం. 19వ శతాబ్దంలో న్యూయార్క్ నగరంలో సమాన వేతనానికి, పది గంటల పనికోసం మహిళల పోరాటాలు, త్యాగాల ఫలితంగా 1910లో మార్చి 8కి అంతర్జాతీయ మహిళా దినంగా గుర్తింపు వచ్చింది. వివిధ సందర్భాల్లో మహిళలు తమ హక్కుల కోసం, ఉనికి కోసం అనేక ఉద్యమాలు నిర్వహించారు. రష్యాలో జార్ చక్రవర్తి ఆగడాలకు వ్యతిరేకంగా రొట్టె కోసం 1917 విప్లవ కాలంలో మార్చి 8న పెట్రోగార్డ్లో వేలాది మహిళలు బ్యానర్లతో ప్రదర్శన చేశారు. మహిళలు బుర్ఖా వేసుకోకుండా బయటకు రాకూడదని 1970లో ఇరాన్ అధ్యక్షుడు అయతుల్లా ఖోమేని మార్చి 7న ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ వేలాది మహిళలు ప్రదర్శనలు జరిపారు. 2018 మార్చి 8న 170 దేశాల సమన్వయంతో అంతర్జాతీయంగా మహిళల సమ్మె జరిగింది. హింసకు, ఇంకా అనేక రకాల అణచివేతలకు వ్యతిరేకంగా ఎనిమిది రకాల డిమాండ్లతో రోడ్లన్నీ నిండిపోయాయి. మన దేశంలో 2012లో ఢిల్లీ రాజధాని నడిబొడ్డున నిర్భయపై అత్యంత పాశవికంగా జరిగిన అత్యాచారం, హత్యకు నిరసనలు వెల్లువెత్తాయి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, తెభాగా పోరాటంలో మహిళలు, పురుషులతో సమానంగా భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడి అమరులైనారు. 1970లో నాటి ఉత్తరప్రదేశ్‌లోని అడవులను పారిశ్రామికవేత్తల నుంచి రక్షించడానికి దశౌలీ గ్రామ స్వరాజ్య సంఘం ఆధ్వర్యంలో 2,500 చెట్లను నరకడాన్ని అడ్డుకున్నారు. మహిళలు చెట్లను హత్తుకొని కాపాడటం వల్ల దీనికి ‘చిప్కో’ ఉద్యమమనే పేరు వచ్చింది. 1995లో హరియాణాలోని ఖాప్ పంచాయతీ ఒక కుటుంబానికి శిక్ష వేసే క్రమంలో పన్నెండేళ్ల బాలికను అత్యాచారం చేయాలనే తీర్పునిచ్చింది. దీనికి వ్యతిరేకంగా గ్రామంలోని వెయ్యి మంది మహిళలు సంఘటితంగా ఉద్యమించారు. మణిపూర్‌లో 2004లో సాయుధ బలగాల చట్టానికి వ్యతిరేకంగా ముప్పైమంది మహిళలు నగ్నంగా ఇంఫాల్‌లో నిరసన ప్రదర్శన చేశారు.1992లో సారా వ్యతిరేక ఉద్యమం చరిత్ర సృష్టించింది. 1991లో నూతన ఆర్థిక సంస్కరణల ప్రభావం వల్ల మహిళలపై మరింత భారం పడింది. సామ్రాజ్యవాద సంస్కృతి కొత్త రూపాలలో మహిళలపై హింసను పెంచింది. రోజూ 88 మంది మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. 2019లో రాజస్తాన్‌లో 6,000, యూపీలో 3,165 అత్యాచార సంఘటనలు జరిగితే, రికార్డు కెక్కనివి ఎన్నో. 2019లో నమోదైన 32,033 అత్యాచార కేసుల్లో ఉత్తరప్రదేశ్‌లోనే 18 శాతం నమోదైనాయి. బాధితుల్లో 11 శాతం దళిత మహిళలే. 2017 డిసెంబర్లో భీమా కోరేగావ్ దళితుల ఆత్మగౌరవ పోరాటం, పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలోని వేలాది ముస్లిం మహిళల షాహిన్‌బాగ్ పోరాటం, నేటి కోట్లాది రైతుల పోరాటం దేశ చరిత్రలో 3 ప్రధాన పోరాటాలు. 40 సంవత్సరాల్లో అత్యధిక స్థాయికి నిరుద్యోగిత చేరింది. డీమానిటైజేషన్, జీఎస్టీ అసంఘటిత రంగాన్ని ఆర్థికంగా దెబ్బతీశాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ మాత్రమే కాదు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. దీనికితోడు లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన కుటుంబాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. కుటుంబ భారాన్ని మోయలేక మహిళలు ఆర్థిక ఒత్తిడికి లోనవుతున్నారు. భరించినంత కాలం మహిళలపై భారం పడుతూనే ఉంటుంది. మన ముందున్నది రైతాంగ వ్యవసాయ కార్మిక మహిళా ఉద్యమం. కార్పొరేట్ హిందూత్వ శక్తులకు వ్యతిరేకంగా అన్ని రంగాల మహిళలు మార్చి 8 స్ఫూర్తితో చేయి చేయి కలిపి అడుగులు వేయడమే కర్తవ్యం. – అనిత, చైతన్య మహిళా సంఘం -
జీతం రూ.7,500.. అయితేనేం మనసు పెద్దది!
ఒకరు అంగన్వాడి టీచర్.. ఇందులో ప్రత్యేకతేమిటంటారా? ఏడు పదుల వయసులోనూ ఈమె చెప్పే పాఠాలు వినడానికి పిల్లలు చెవికోసుకుంటారు. ఇక మరొకరు.. అరుణ. కాటికాపరి. శ్మశానమంటేనే భయపడే పరిస్థితుల్లో.. ఆమె మాత్రం మృతదేహానికి అంతిమ సంస్కారాల దగ్గరి నుంచి దహనం అయ్యే వరకు ఒంటిచేత్తో పనులు చక్కబెడుతుంది. ప్రత్యేకించి అనాథ శవాలకు ఆమె ఆత్మబంధువు. భద్రాచలం: శవం, శ్మశానం.. ఈ పేర్లు వింటేనే ఒళ్లు జలదరిస్తుంది.. ఆ చోటునే తన జీవనాధారంగా చేసుకున్న కథ అరుణది. అనాథ శవాలకు, కోవిడ్ మృతులకు అన్నీ తానై అంతిమ సంస్కారాలను నిర్వహించిన ‘సంస్కారం’ ఆమెది. కాటికాపరిగా ఓ మహిళ.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. అరుణ నిజం చేసి చూపిస్తోంది. భద్రాచలానికి చెందిన ముత్యాల అరుణకు రాజమండ్రికి చెందిన శ్రీనివాస్‌తో 12 ఏళ్లప్పుడే పెళ్లయింది. 16 ఏళ్లొచ్చేసరికి ఇద్దరు కుమారులు జన్మించారు. శ్రీనివాస్ భద్రాచలంలోని వైకుంఠఘాట్‌లో పనిచేస్తూ, అనారోగ్యంతో మూడేళ్ల క్రితం మృతిచెందాడు. దీంతో అరుణ జీవితంలో అంధకారం.. ఏం చేయాలో తెలియని స్థితిలో గుండె ధైర్యం తెచ్చుకుని భర్త చనిపోయిన 16 రోజులకే శ్మశానవాటికలో అడుగుపెట్టింది. కాటికాపరిగా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించే బాధ్యత తీసుకుంది. అంత్యక్రియలకు కట్టెలు తదితర సామగ్రి, ఇతర ఖర్చుల నిమిత్తం మృతుడి కుటుంబసభ్యులు ఎంతో కొంత ఇస్తారు. కానీ అనాథ శవాలకు ఎవరూ చిల్లిగవ్వ ఇవ్వరు. అయినా అనాథ శవాలకు అన్నీ తానే అయి అంత్యక్రియలు నిర్వహిస్తోందీమె. రూ.7,500 జీతమే తన జీవనాధారమని చెబుతోంది. అయినవారెవరూ కడచూపునకు రాకున్నా.. 15 మంది కరోనా మృతుల ఖనన కార్యక్రమాలను నిర్వహించింది అరుణ. వీరి అస్థికలను తానే గోదావరిలో కలిపింది. అవ్వ చెప్పే పాఠం.. ఎంతో ఇష్టం ఇందూరు(నిజామాబాద్ అర్బన్): భూలక్ష్మికి 70 ఏళ్లు. అంగన్వాడీ టీచర్‌గా ఇప్పటికీ చురుకుగా సేవలందిస్తున్నారు. పిల్లలకు తనదైన శైలిలో బోధిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఉత్తమ అంగన్వాడీ టీచర్‌గా అవార్డులూ పొందారు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఈమె 1989 ఫిబ్రవరిలో అంగన్వాడీ కార్యకర్తగా విధుల్లో చేరారు. 32 ఏళ్లుగా నగరంలోని పూసలగల్లిలో అంగన్వాడీ టీచర్‌గా సేవలందిస్తున్నారు. చిన్నారులకు ఆట పాటలతో విద్యనందిస్తున్నారు. తనదైన శైలిలో చిన్నారులకు ప్రీస్కూల్ పాఠాలు చెబుతున్నారు. దీంతో ఈ కేంద్రంలో పిల్లలను చేర్పించడానికి తల్లిదండ్రులు ఇష్టపడుతుంటారు. కేంద్రంలో ఎప్పుడూ 20–30 మంది చిన్నారులు ఉంటారు. వయసు మీదపడినా.. ఆమె విధి నిర్వహణలో మాత్రం ఆ ఛాయలే కనిపించవు. దీంతో ఆమె పనితనానికి మెచ్చిన ఐసీడీఎస్ అధికారులు 2019లో మహిళా దినోత్సవం సందర్భంగా అవార్డు అందించారు. చిన్నచిన్న బోధనోపకరణాలను ఉపయోగించి పిల్లలకు పూసగుచ్చినట్టు చెప్పడం, వారి వయసుకు తగ్గ రీతిలో బోధనాంశాలను మలచడం భూలక్ష్మి ప్రత్యేకత. -
నారీ శక్తిని చాటి చెప్తున్న మహిళలు
‘యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే, తత్ర దేవతాః‘ అనేది ఆర్యోక్తి. ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని అర్థం. నిజమే మరి, సమాజంలో స్త్రీకి నేడు ఎంతో ప్రాధాన్యత పెరిగింది. ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న మహిళల పట్ల సమాజ దృక్పథం పూర్తిగా మారింది. అలాగే ఆమె పనిచేస్తున్న సంస్థలో భద్రతపై కూడా ప్రభుత్వాలు, ఆయా సంస్థలు బాధ్యత తీసుకొని తగిన రక్షణ కల్పించడానికి చక్కని చర్యలు తీసుకుని ఆమెను తోబుట్టువులా ఆదరిస్తున్నారు. సమాజ నిర్మాణంలో స్త్రీ పాత్ర ఎంతో ఉన్నతమైనది. అందుకే స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం. మహిళలు ఆత్మగౌరవంతో స్వశక్తితో ఆర్థిక అవసరాలను తామే తీర్చుకోగలిగే గొప్ప అవకాశాలను తామే స్వయంగా నిర్మించుకొని ‘స్త్రీ శక్తి ‘అంటే ఏమిటో ప్రపంచానికి చాటి చెబుతున్నారు. విద్యా, వ్యాపారం, రాజకీయాలు, వైద్యం, క్రీడలు, టెక్నాలజీ, అంతరిక్షం, బ్యాంకింగ్ వంటి పలు రంగాలలో మహిళలు రాణిస్తూ రంగం ఏదైనా ఉన్నత శిఖరాలను చేరుకుని స్త్రీ శక్తిని చాటి చెప్తున్నారు. స్త్రీ మూర్తి అన్నం కలిపి గోరుముద్దలు తినిపించేటప్పుడు తన బిడ్డపై ఉన్న ప్రేమని కూడా కలిపి మరీ తినిపిస్తుంది. ఇంత గొప్పగా ప్రేమామృతాలు కురిపిస్తున్న స్త్రీమూర్తి ఎక్కడ చూసినా వంచనకు గురవుతూనే ఉంది. ఇంటా, బయటా బాధ్యతలు సమతూకం చేసుకుంటూ ముందుకు సాగిపోతున్న స్త్రీలపై కొంతమంది మృగాళ్లు చేసే దారుణ అఘాయిత్యాలకు అంతు లేకుండా పోతోంది. వీటిని నియంత్రించడానికి ప్రభుత్వం ఎంత కఠిన చట్టాలు తీసుకొచ్చినా అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళలకు మరింత భద్రత కల్పించే విధంగా చక్కని దిశాచట్టాన్ని ప్రవేశపెట్టి దోషికి తక్షణమే శిక్షపడేలా చట్టంలో మార్పులు తెచ్చి మహిళల రక్షణకు మేమున్నామంటూ అభివృద్ధి పథంలోకి దూసుకు వెళుతున్నాయి ప్రభుత్వాలు. మహిళలకు మరింత రక్షణగా ఉండే విధంగా మహిళల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే దిశగా పనిచేస్తున్నాయి. ప్రతి ఒక్కరికి ‘రోటీ, కపడా మఖాన్‘ ఎంత అవసరమో గుర్తించి మహిళలకు చక్కని పథకాలను ప్రవేశపెట్టి వాటిని మహిళా అవసరాలకు అనుగుణంగా అందిస్తూ ప్రతి మహిళ కళ్ళల్లో వెలుగు రేఖల్ని నింపుతున్నారు. ఇలా ప్రతి మహిళా కూడా ఈ పథకాన్ని సొంతం చేసుకుని తమ బిడ్డల్ని చక్కగా చదివిస్తూ భావిభారత పౌరులుగా తీర్చిదిద్దుతూ ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటే అదే మనకు నిజమైన మహిళా దినోత్సవం. – పింగళి భాగ్యలక్ష్మి... కాలమిస్టు, రచయిత్రి -
వంద శాతం సమాన హక్కులు కల్పిస్తున్న దేశాలు ఇవే..
ఆకాశంలో సగం.. అన్నింటా సమానం.. మహిళా దినోత్సవం వస్తే చాలు..మనం ఎప్పుడూ చెప్పుకునేది ఇదే.. నిజంగానే ఆకాశంలో సగమేనా? అన్నింటా సమానమేనా? దీనిపై తాజాగా ప్రపంచబ్యాంకు ‘వుమెన్, బిజినెస్ అండ్ ద లా’ పేరిట ఓ నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం.. 194 దేశాల లెక్క తీస్తే.. కేవలం పది దేశాల్లోనే స్త్రీలకు పూర్తిస్థాయిలో సమాన హక్కులను కల్పిస్తున్నారు. పురుషులతో సమాన హక్కులు అంటే ఇక్కడ నోటి మాటలా చెప్పడం కాదు.. వాటిని పరిరక్షిస్తూ.. ఆయా దేశాల్లో చట్టపరమైన, న్యాయపరమైన రక్షణ కూడా కలిగి ఉండటం. అంటే.. స్వేచ్ఛగా తిరగడం, తనకు నచ్చిన పనిని ఎంచుకునే హక్కు కలిగి ఉండటం, వివాహం విషయంలో స్వేచ్ఛ, సమాన వేతనం, పింఛన్లు, వ్యాపార నిర్వహణ, ఆస్తిపాస్తులు కలిగి ఉండటం ఇలా చాలావాటికి సంబంధించి ఆయా దేశాల్లో చేసిన చట్టాలను ఈ నివేదిక తయారీలో పరిగణనలోకి తీసుకున్నారు. 2019 జాబితాలో చివరి స్థానంలో ఉన్న సౌదీ అరేబియా.. 2020కి వచ్చేసరికి చాలా మెరుగైన ర్యాంకును సాధించింది. అక్కడ కొత్తగా తెచ్చిన చట్టాలే ఇందుకు కారణమని సదరు నివేదిక పేర్కొంది. 2020 జాబితాలో యెమెన్(26.9%) చివరి స్థానంలో నిలిచింది. ఇంతకీ మహిళలకు వందకు వంద శాతం సమాన హక్కులు కల్పిస్తున్న ఆ పది దేశాలు ఏమిటో.. మిగతావాటి పరిస్థితి ఏంటో కొన్ని దేశాల వారీగా ఓసారి చూసేద్దామా.. -
ఇది మహిళా నాయకత్వ సంవత్సరం
ఓ ఏడాది వచ్చినట్టు మరో ఏడాది మార్చి 8 ఉండదు. నూట పది సంవత్సరాల మార్చి ఎనిమిది శ్రామిక మహిళల సంఘర్షణల మైలురాళ్లు నాటుకుంటూ వస్తున్నది. గతేడాది పౌరసత్వం మా హక్కంటూ గడగడ వణికించే చలిలో రోడ్డుపై నిరవధిక శాంతియుత సత్యాగ్రహానికి కూర్చున్న వేలాదిమంది మహిళల పట్టుదల నివ్వెరపరిచింది. అబద్ధపు ప్రచారాలనీ, విద్వేషపు దాడుల్నీ, అనేక కుట్రల్నీ తట్టుకుంటూ దాదాపు మూడునెలలు దేశవ్యాప్తంగా వందల బైఠాయింపులు జరిగాయి. అవన్నీ దాదాపుగా మహిళల చొరవతో, మహిళల నిర్వహణతో నడచినవే. దేశ చరిత్రలో మొదటిసారి పురుషులు సహకార భూమికలో దర్శనమిచ్చారు. ఇప్పుడు నాలుగో నెలలోకి చేరిన రైతుల సత్య సంగ్రామానికి పునాది షాహీన్‌బాగ్. ధరల నిరంతర పెరుగుదల, కోల్పోయిన ఉపాధి, మూతబడిన సూక్ష్మ, చిన్న, మధ్య గృహ పరిశ్రమలు, పెరిగిపోతున్న నిరుద్యోగం, ఇంటాబయటా పెరిగిపోతున్న హింస... వీటితో విసిగి అధికార నిచ్చెనలో అట్టడుగున ఉండే మహిళలు ‘ఇక చాలు’ అంటున్నారు. వ్యవసాయ ఆర్డినెన్స్‌లు వచ్చిన నాటి నుండి మహిళా రైతులు, కూలీలు వాటిని అర్థం చేసుకున్నారు. ‘మా పొలాల్లో మేమే కూలీలుగా మారే కార్పొరేటు, కాంట్రాక్టు వ్యవసాయ విధానం’ వద్దన్నారు. ఊరూరు, ఇల్లిల్లూ తిరిగారు. ఈ చట్టాల గురించి వివరించారు. ఊరేగింపులు చేశారు. టోల్‌ప్లాజాల వద్ద ధర్నాలు చేశారు. ఢిల్లీకి చేరారు. ఎక్కడా వెనుదిరిగి చూడలేదు. భయపడలేదు. నిరంతరాయంగా సాగుతున్న ఢిల్లీ సరిహద్దుల ముట్టడిలో వారు వేదిక నిర్వాహకులు, స్త్రీల ప్రత్యేక కార్యక్రమాల రూపకర్తలు, తీర్మానాల రచయిత్రులు, యాంకర్లు, ఎకౌంటెంట్లు, వంటలక్కలు, పది చేతుల్తో పనులు చక్కబెట్టే ఉద్యమకారులు. లంగరు (సామూహిక వంటశాల)లో ఎక్కువ భాగం పనులన్నీ పురుషులే చేయటం గమనార్హం. ఎక్కడ అవసరం అయితే అక్కడికి ట్రాలీల నిండా వండిన ఆహారంతో ట్రాక్టరు స్వయంగా నడుపుకుంటూ పోయే 80 ఏళ్ల నవనీత్ సింగ్ చాలా మామూలుగా చెబుతుంది, ‘నా భర్త పోయాక నేనే 50 ఏళ్లుగా వ్యవసాయం చేసి కుటుంబాన్ని ఒక దారికి తెచ్చాను. ఈ చట్టాలతో నా కుటుంబ ఆధారమే నేలమట్టం అవుతుంది. ఎంతకాలం అయినా పట్టని చట్టాలు వాపస్ తీసుకోవాల్సిందే’ అని. అసంఖ్యాకమైన స్త్రీల మాదిరి గానే ‘బతకడం కోసం ఏది అవసరం అయితే అది చెయ్యాలి’ అనేది ఆమె జీవన సూత్రం. మనుగడ ప్రశ్నార్థకం అయ్యింది కాబట్టే ఈరోజు స్త్రీలు ఉద్యమాల అనుచరులుగా, సహచరులుగా ఉండే పాత్రనుదాటి రూపకర్తలుగా, సమన్వయకారులుగా నిలబడుతున్నారు. వంటపని, ఇంటిపని, పిల్లల పెంపకం, వృద్ధుల సేవలు, బయట ఉపాధి వ్యవహారం... బహుళ ముఖ్యమైన పనులు ఒకేసారి చక్కబెట్టే వారి సామర్థ్యం ఉద్యమాల్లో భిన్న పాత్రలు అలవోకగా పోషించడానికి అనుభవాన్నిచ్చింది కనుకనే వంతులవారీ సరిహద్దుల ముట్టడిలో వుంటూ, ఊరేగింపులు, ధర్నాలు స్థానికంగా నిర్వహిస్తూ... వ్యవసాయ పనులకు ఇబ్బంది లేకుండా చూసుకుంటూ ఉద్యమాల కోసం వెళ్లిన సహచరుల చేలను కూడా పండిస్తున్నారు. భారీ మద్దతు ఒకప్పుడు ఖాప్ పంచాయతీల్లో స్త్రీలకు ప్రవేశం లేదు. అక్కడ స్త్రీలకు ప్రతికూల నిర్ణయాలే ఎక్కువ. ఇవాళ కిసాన్ పంచాయతీల్లో మేలిముసుగులు తొలగించి రాజపుత్రులు, జాట్ స్త్రీలే కాకుండా దళిత మహిళలు సైతం వేదికలెక్కి ఉపన్యాసాలిస్తున్నారు. తీర్మానాలు చేస్తున్నారు. శతాబ్దాలుగా కరడుగట్టిన ఆధిపత్య వ్యవస్థల్ని ఈ ఉద్యమం బీటలు వారుస్తున్నది. విచిత్రంగా ప్రపంచ వేదిక నుండి ఈ ఉద్యమానికి భారీ మద్దతు లభించింది కూడా ప్రధానంగా ప్రాచుర్యంగల స్త్రీల నుంచే. ఒక రియానా, ఒక గ్రేటా థన్‌బర్గ్ అధికార పీఠం కింద భూకంపం పుట్టించారు. విశ్వవిద్యాలయాల ఉద్యమం నుండి నేటి రైతు ఉద్యమం దాకా యువతులపై, స్త్రీలపై ప్రభుత్వ దాడులు అరెస్టులు సర్వసాధారణం అయ్యాయి. కార్మిక కర్షక సమన్వయానికి ప్రతీకగా నిలిచిన నవదీప్కౌర్తో పాటు హిందీ సినీ మహిళా తారలు కూడా ప్రభుత్వ కక్ష సాధింపులకు ఎరవుతున్నారు. రైతులకు మద్దతు ఇవ్వడమే వారి పాపం. కరోనా కాలంలో అంతులేకుండా పెరిగిపోయిన గృహ హింస, ఇంటి చాకిరీకి తోడు మానసిక, శారీరక, లైంగిక హింస... పడిపోయిన ఆదాయాలు, గందరగోళం అయిన విద్యా సామాజిక జీవనం, అన్నింటినీ తట్టుకుని కుటుంబాలను సాధారణ స్థితికి చేర్చడానికి స్త్రీలు తాపత్రయపడ్డారు. గత సంవత్సరం వారి అస్తిత్వమే ఒక పోరాటంగా మారింది. అయినా స్త్రీలు ఓడిపోవడానికి నిరాకరించారు. డెన్మార్క్, ఇథియోపియా, ఫిన్లాండ్, జర్మనీ, ఐస్లాండ్, న్యూజిలాండ్, స్లోవాకియాతోపాటు 20 దేశాలకు అధినేతలుగా ఉన్న మహిళలు కోవిడ్‌కు సత్వరంగా స్పందించారు. సమర్థవంతంగా నివారించారు. కనుకనే ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం, ఈ ఏడాది మార్చి 8ని ‘నాయకత్వంలో స్త్రీలు– కోవిడ్ 19 ప్రపంచంలో సమానత్వ సాధన కోసం’ అనే నినాదంతో జరుపుకోవాలని పిలుపిచ్చింది. ‘మీటూ’ ప్రియారమణికి, పర్యావరణ కార్యకర్త దిశా రవికి న్యాయస్థానాలిచ్చిన తీర్పులు స్త్రీలు తమపై జరిగే హింసపై మాట్లాడటానికి, భూమిపై తమ హక్కును ప్రకటించడానికి భరోసా కల్పించాయి. బాధితులయిన పసిబిడ్డల్ని అక్కున చేర్చుకోవాల్సిన చట్ట చౌకీదారు నేరస్తులకు సానుభూతి చూపింది. కానీ, మెలకువలో ఉన్న మహిళా ఉద్యమం ఎటువంటి ‘పెడ’ ధోరణుల్ని సహించనని నిర్ద్వంద్వంగా స్పందించింది. ఈ ఏడాది ఉద్యమకాలం, ఈ మార్చి 8 మహిళా నాయకత్వ విజయం. రైతులు, కార్మికులు, విద్యార్థినులు, మేధావులు అందరూ ఉద్యమకారులుగా బరిలో నిలిచిన సందర్భం. భయాన్ని కోల్పోయేంతగా భయపెడితే మీకు వణుకుపుట్టిస్తాం అని నిర్బంధాలకూ, విద్వేషాలకూ మహిళలు ఐక్యంగా తెగేసి చెప్పిన ఏడాదికి జేజేలు. – దేవి, సాంస్కృతిక కార్యకర్త -
ఆకాశంలో సగం అవకాశాల్లో శూన్యం
మన దేశంలో 54% మంది వ్యవసాయం ఆధార కుటుంబాలే. ఇందులో 80 శాతం వ్యవసాయ పనులు చేసే మహిళలకు రైతులుగా గుర్తింపు లేదు. మహిళలను, వాళ్ళ సమస్యలను దృష్టిలో పెట్టుకొని, సరైన వ్యవసాయ పద్ధతులు కాని, విధానాలను కాని రూపొందించక పోవటం వలన మహిళా రైతులు పడిన కష్టానికి సరిపడా ఫలితం దక్కటం లేదు. ముఖ్యంగా ఒంటరి మహిళల విషయానికి వచ్చే సరికి పరిస్థితి మరీ దారుణంగా వుంది. సాక్షి, హైదరాబాద్ : వ్యవసాయంలో శ్రమతో కూడిన చాలా పనులు మహిళలు చేస్తున్నారు. వరిలో నాట్లు వేసే దగ్గర నుంచి, మెట్ట పంటలలో విత్తనాలు వేయటం, కలుపు తీయటం వంటి చాలా పనుల వరకూ మహిళలు ఒంగి చేయటం మనం రోజూ చూస్తుంటాం. ఈ పనులు చూడటానికి సులభంగా కనిపించినప్పటికీ, శారీరకంగా ఎక్కువ శ్రమ చేయాలి. ఈ పనులలో శ్రమ తగ్గటానికి సరిపడా పనిముట్లు లేకపోవటం చాలా పెద్ద సమస్య. వ్యవసాయంలో భారీ యాంత్రీకరణ మీదనే ఎక్కువ దృష్టి పెట్టటం వలన మహిళలు తమకున్న కొద్దిపాటి ఉపాధి అవకాశాలను కోల్పోతున్నారు. అలా కాకుండా శ్రమను తగ్గించి పనిని సులభంగా చేసే పనిముట్లు చేయటంతో పాటు, మహిళలకు శిక్షణ ఇచ్చి శ్రమ సంఘాల వంటివి ఏర్పాటు చేస్తే ఉపయోగం వుంటుంది. రసాయనాల అవశేషాల బెడద వ్యవసాయంలో పురుగుల నివారణకు, కలుపు నివారణకు వాడే రసాయనాలలో విష ప్రభావంతో పాటు హార్మోన్లు కలిగి వుంటాయి. సాధారణంగా మహిళలు, చిన్న పిల్లల శరీరంలో కొవ్వు శాతం ఎక్కువ వుండటం వలన ఈ రసాయనాల అవశేషాలు శరీరంలో నిలువ ఉండటానికి అవకాశం వుంటుంది. వీటికి తోడు హోర్మోనల్ ప్రభావం కూడా వుండటం వలన మహిళల పునరుత్పత్తి వ్యవస్థ, ఋతుచక్రంపై ప్రభావం పడుతుంది. ఈ రసాయనాల వినియోగం ఎక్కువ వున్న ప్రాంతాలలో చాలా మంది మహిళలకు గర్భసంచి తీసివేసిన వార్తలు కూడా వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో కలుపు నివారణకు వాడుతున్న కొన్ని రసాయనాలు (గడ్డి మందు) అనేక విష ప్రభావాలు కలిగి వున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థతో సహా అనేక నివేదికలు తెలియచేస్తున్నాయి. అలాగే పత్తి విత్తనోత్పత్తిలో చిన్న వయసులో వున్న ఆడపిల్లలు ‘క్రాసింగ్’ పనులు చేస్తున్నప్పుడు మొక్కల మీద చల్లిన రసాయనాలలో చాలా వరకు చేతి వేళ్ళ లేత చర్మం ద్వారా శరీరంలోకి ప్రవేశించి విషప్రభావం చూపిస్తాయి. చదవండి: నగర యంత్రాంగంలో నారీమణుల ప్రత్యేక ముద్ర అలాగే, ఆకుకూరలు, కూరగాయలు, పూల తోటల్లో రసాయనాలు చల్లిన వెంటనే కోసినప్పుడు కూడా ఇలాంటి విష ప్రభావాలు కనపడుతున్నాయి. వ్యవసాయంలో రసాయనాల వినియోగం తగ్గించుకోవటంతో పాటు వాడకంలో జాగ్రత్తలు పాటించాలి. ఇప్పటికే ఇలాంటి నివేదికలు అనేకం వున్న నేప«థ్యంలో పొలంలో పని చేసే వారి మీద ప్రభావం చూపే అన్ని రకాల రసాయనాల మీద నియంత్రణ విధించాల్సిన అవసరం వుంది. పౌష్టికాహార లోపం ఆహార భద్రత కోసం అనేక పథకాలు ఉన్నప్పటికీ అవన్నీ కేవలం బియ్యం / గోధుమలు పెంపకం వరకే పరిమితం కావటం వలన పోషకాహార లోపాలు కనిపిస్తున్నాయి. శ్రమకు సరిపడా పోషకాహారం తీసుకోక పోవటం వలన ఆరోగ్యం బాగా దెబ్బ తింటోంది. ఈ సమస్యను నివారించటానికి ఇంటి ఆవరణలో, బడులలో, గ్రామస్థాయిలో కాయకూరల, కోళ్ళు, పశువుల పెంపకంపై అవగాహన కల్పించి, ప్రోత్సహించేందుకు అవసరమైన సహాయం చేయటం వలన ఆదాయం పెరగటంతో పాటు పోషకాహార లోపాలను నివారించవచ్చు. వలసల భారం కుటుంబంలో పురుషులు వలస పోవటం వలన ఇంటిపనులు, వ్యవసాయ పనులు అన్ని కూడా మహిళల మీదే భారం పడుతున్నాయి. అలాగే మద్యం, రసాయనాల ప్రభావం.. వంటి అనేక అనారోగ్య కారణాల వలన భర్త చనిపోతే కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత మహిళ మీద పడుతోంది. అలాగే, ఆస్తుల పంపిణీ విషయంలో మహిళల పట్ల వివక్ష వుండటం వలన న్యాయంగా వారికి రావలసిన భూములు కూడా వారి పేరు మీదకు రావటం లేదు. చాలా రాష్ట్రాలలో మహిళలకు వ్యవసాయ భూమి అందుబాటులోకి తేవటానికి, హక్కులు ఇవ్వటానికి చేసిన ప్రయత్నాలు మెరుగైన ఫలితాలు చూపిస్తున్నాయి. మహిళలకు భూమి హక్కులపై అవగాహన, న్యాయ సహాయం ఇవ్వటంతో పాటు కొన్ని (కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్..) రాష్ట్రాలలో వీరిని సంఘాలుగా ఏర్పాటు చేసి భూమి పంపకం చేయటం, కౌలుకు తీసుకోవటానికి సహాయం చేయటం ద్వారా వీరి జీవనోపాధులను బలోపేతం చేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలు అన్ని రాష్ట్రాలలో చేయాల్సి వుంది. ప్రస్తుతం ఉన్న లోపాలు సరిదిద్ది మహిళలకు రావాల్సిన హక్కులు కల్పించటంతో పాటు వివక్షను సరిచేసి, సరైన అవకాశాలు కల్పించ గలిగితేనే కుటుంబం అభివృద్ధితో పాటు గ్రామాభివృద్ధిలో మహిళలు తమ పాత్ర పోషించగలుగుతారు. మహిళల అభివృద్ధిలోనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు వుందని గుర్తించి ఆ వైపుగా విధానాల రూపకల్పన, ప«థకాల రచన, ప్రయత్నాలు చేయటం ఎంతైనా అవసరం. 80 శాతం పని.. 13 శాతం భూమి.. వ్యవసాయంలో 80 శాతం పనులను మహిళలు చేస్తున్నప్పటికీ భూమి హక్కు 13 శాతం మందికి మించి లేదు. నేషనల్ కౌన్సెల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనమిక్ రీసెర్చ్ (ఎన్.సి.ఎ.ఇ.ఆర్.) సంస్థ 2018లో చేసిన ఒక సర్వే ప్రకారం వ్యవసాయ భూముల్లో 2 శాతం మాత్రమే మహిళల పేరు మీద వున్నాయి. ఉత్పత్తికి ఆధారమైన ముఖ్య వనరు అయిన భూమిపై హక్కు లేకపోవటంతో వ్యవసాయానికి సంబంధించిన రుణాలు, రాయితీలు వంటివి అన్ని భూమి హక్కు పత్రంతో ముడిపడి వుండటం వలన ఖర్చులు ఎక్కువ పెట్టాల్సి వస్తున్నది. వీటికి తోడు, కొన్ని రాష్ట్రాలలో ధాన్యం సేకరణ, ఆదాయ భద్రత కింద ఇచ్చే అనేక ప«థకాలు భూమి హక్కు లేని మహిళలకు అందటం లేదు. అలాగే అనేక రాష్ట్రాల్లో కుటుంబ ఆస్తిలో మహిళలకు సమాన హక్కు వుండాలని చట్టాలు వున్నాయి. ఇటీవలే దీని మీద సుప్రీంకోర్టు కూడా రూలింగ్ ఇవ్వటం జరిగింది. అయినా, సమస్య తీవ్రత తగ్గలేదు. -
నాకు రెండే రెండిష్టం: ఒకటి స్మిమ్మింగ్, మరొకటి టూర్
ఎప్పుడూ ఎవరో ఒకరు తోడుండాల్సిందేనా?! మనకు మనంగా ఎక్కడికీ వెళ్లలేమా! వెళ్లిరాలేమా! మనకోసం ఒకరు తోడు ఉండటం మంచిదే. స్కూల్‌కి అక్క తోడు. కాలేజ్‌కి అన్న తోడు. పెళ్లయ్యాక భర్త తోడు. ఎప్పుడైనా మనసు ‘సోలో’గా వెళ్లానుకుంటే? తోడు రావడానికి సిద్ధంగా ఉండాల్సింది మనకు మనమేగా!! బళ్ళారి నివాసి రజని లక్కా ట్రావెల్ అనుభవాలు.. ఆమె మాటల్లో... నా ప్రధానమైన ఇష్టాల్లో ఒకటి స్మిమ్మింగ్, మరొకటి టూర్. అయితే సోలో ట్రావెలర్‌ని కాదు. ఎప్పుడూ బంధువులు, స్నేహితులతో కలిసి వెళ్లేదాన్ని. కానీ 2014 ఆగస్టులో కెనడాకి ఒక్కదాన్నే వెళ్లాను. ఒంటరిగా ప్రయాణించడం అదే తొలిసారి, కెనడాకు వెళ్లడమూ మొదటిసారే. అప్పుడు మాంట్రియెల్‌లో ‘ఫినా మాస్టర్స్ స్విమ్మింగ్ వరల్డ్ కప్ చాంపియన్‌షిప్ జరిగింది. ఆ పోటీల కోసం కెనడాలో అడుగుపెట్టాను. పోటీలు పది రోజులు, కానీ మరో ఇరవై రోజులు దేశంలో పర్యాటక ప్రదేశాలను చూడడానికే ఉండిపోయాను. వెనక్కి చూసుకుంటూ వెళ్లాను మాంట్రియెల్‌లో యాక్సెసరీ కార్డు తీసుకున్నాను. ఆ కార్డు ఉంటే నగరంలో బస్సులు, మెట్రో రైళ్లు అన్నింటిలోనూ ప్రయాణించవచ్చు. చూడాలనిపించిన పర్యాటక ప్రదేశానికి ఏ రూట్లో వెళ్లాలో మ్యాప్ చూసి తెలుసుకోవడం, ఆ రూట్ రైలు, బస్సు ఎక్కి వెళ్లిపోవడమే. అక్కడ రైల్వే లైన్ అండర్ గ్రౌండ్లో ఉంటుంది. రైళ్లు పైకి కనిపించవు. రైల్వే స్టేషన్ నుంచి బయటపడడం అంటే ఆ స్టేషన్‌తో కలిసి ఉన్న మాల్‌లోకి వెళ్లడమే. మాల్ నుంచి రోడ్డు మీదకు రావాలి. నేను మాంట్రియెల్‌లో మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్నప్పుడు బస్ పాయింట్ నుంచి వాళ్ల ఇంటి వరకు దాదాపు ఒకటిన్నర కిలోమీటరు నడిచి వెళ్లాను. నడిచినంత సేపూ భయం, నేను ఒంటరిగా ఉండడంతో ఎవరైనా ఫాలో అవుతారేమోననే బెరుకుతో పది అడుగులకోసారి వెనక్కి చూసుకున్నాను. నేను భయపడినట్లు ఎవరూ ఫాలో కాలేదు. అక్కడ సిస్టమ్ చాలా సెక్యూర్డ్‌గా ఉంది. ఇండియాలో కూడా అంత ధైర్యంగా ఒంటరిగా తిరగలేమేమో అనిపించింది. రెండు గంటల ఆలస్యం... అంతే! ఒకరోజు స్విమ్మింగ్ చాంపియన్ షిప్ ఓపెనింగ్ సెరిమనీ పూర్తయిన తర్వాత మెట్రో రైల్లో ఇంటికి రావాలి. ఆ రోజు అక్కడ పబ్లిక్ హాలిడే అనుకుంటాను. ఆ రష్ చూస్తే జనం అంతా రోడ్లమీదనే ఉన్నారా అనిపించింది. ఆ రష్లో రైలు ఎక్కలేక కొంచెం ఖాళీగా ఉన్న రైలు కోసం ఎదురుచూస్తూ ఉండిపోయాను. తీరా మా ఫ్రెండ్స్ ఇంటికి చేరేసరికి రెండు గంటలు ఆలస్యం అయింది. ఈ లోపు నేనింకా ఇంటికి రాలేదని మా ఫ్రెండ్స్ పోలీస్ కంప్లయింట్ ఇవ్వడం, పోలీసులు వచ్చి ఆ ఇంట్లో నా గది, బ్యాగ్ తనిఖీ చేయడం జరిగిపోయాయి. ఆ తర్వాత కూడా నేను ఇల్లు చేరినట్లు నిర్ధారణ అయ్యే వరకు ఫోన్లో ఫాలో అప్ చేశారు. ట్రైన్ రష్ కారణంగా ఆలస్యం అవుతోందని ఇంట్లో వాళ్లకు తెలియచేయడానికి నా దగ్గర ఫోన్ లేదు. కెనడా సిమ్ అప్పటికింకా రాకపోవడంతో నా దగ్గర మొబైల్ ఫోన్ లేకపోయింది. ఆ మరుసటి రోజు ఫ్రెండ్స్ వాళ్ల సిమ్ ఒకటి ఇవ్వడంతో ఒక సమస్య తీరింది. నయాగరా వీక్షణం మాంట్రియెల్ నుంచి టొరంటోలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లాను. అదొక అనుభవం. మాంట్రియెల్‌లో ఫ్రెండ్స్ ఇచ్చిన మొబైల్ సిమ్ వాళ్లకు ఇచ్చేసి టొరంటోకెళ్లాను. అక్కడ దిగగానే పబ్లిక్ ఫోన్ నుంచి బంధువులకు ఫోన్ చేసి నగరంలో దిగినట్లు చెప్పి, నయాగరా వాటర్ ఫాల్స్ చూసుకుని సాయంత్రానికి ఇంటికి వస్తానని సమాచారం ఇచ్చాను. నయాగరా నుంచి మా బంధువులుండే ఏరియా వరకు బస్‌లో వచ్చేశాను. పబ్లిక్ బూత్ నుంచి ఫోన్ చేశాను. వాళ్లు ఫోన్ తీయలేదు. ఏం చేయాలో తోచలేదు. దగ్గరలో ఒక కల్చరల్ ప్రోగ్రామ్ జరుగుతుంటే చూస్తూ ఓ గంట సేపు గడిపాను. మళ్లీ ఫోన్ చేసినప్పుడు వాళ్లు ఫోన్ తీశారు. ఇంటికి అడ్రస్, డైరెక్షన్ చెప్పారు. టొరంటో తర్వాత మా అన్న కూతురు ఉండే కాల్గరీలో పదిహేను రోజులున్నాను. కాల్గరీ గ్లేసియర్లు, లేక్‌లకు ప్రసిద్ధి. బాగా ఎంజాయ్ చేశాను. తిరిగి మాంట్రెయల్కు వచ్చి ఇండియాకి వచ్చే విమానం ఎక్కాను. నెలరోజుల కెనడా ట్రిప్ అలా జరిగింది. నేను చెప్పేదొక్కటే భయపడితే సాధించేదేమీ ఉండదు. ధైర్యం ఉంటే వయసు కూడా అడ్డంకి కాదు. సోలో ట్రిప్కెళ్లినప్పుడు నా వయసు 54. టూర్ బస్సులో తొమ్మిది దేశాలు ఒక రోజు టూరిస్టు బస్‌లో క్యూబెక్ సిటీ టూర్కెళ్లాను. మాంట్రియెల్‌లో పికప్ చేసుకుని టూర్ పూర్తయ్యాక మాంట్రియెల్‌లో దించింది. అప్పుడు ఆ బస్సులో ప్రయాణించింది పదిహేను మందిమి మాత్రమే. వాళ్లలో తొమ్మిది దేశాల వాళ్లం కలిసి ప్రయాణించాం. -
కన్నతల్లే ఆమెను బ్రోకర్లకు అప్పగించింది
'దేవదాసి’ ఆచారం పేరుతో కొన్నిచోట్ల, ఆకలి చంపుకొనే మార్గం కానరాక మరికొన్నిచోట్ల, బలవంతంగా ఇంకొన్నిచోట్ల.. వేశ్యావాటికలకు చేరుతున్న వాళ్లెందరో! ఇలాంటి వాళ్లలో చాల్వాడి భీమవ్వ ఒకరు. కుటుంబం కోసం విధిలేక విషయంలో చిక్కినప్పటికీ ఓ స్వచ్ఛంద సంస్థ చేయూతతో బయటపడి, బలపడిన ఆమె.. ఆ తర్వాత తనలా ఇంకెవరూ ‘దేవదాసి’ బాట పట్టకూడదని చేస్తున్న పోరాటం ప్రశంసనీయమైనది. దేశానికి పశ్చిమాన, కొంకణ్ తీరంలో ఉండే చిన్న రాష్ట్రం గోవా. అక్కడే ఓ చిన్నపట్టణమైన వాస్కోలోని ఓ మురికివాడలో పుట్టింది భీమవ్వ. ఐదుగురు చెల్లెళ్లు్ల. తండ్రి తాగుబోతు. తల్లి చిత్తుకాగితాలు, గాజు సీసాలు ఏరుకొని, వాటిని అమ్ముతూ కుటుంబాన్ని పోషించేది. బతుకు పోరాటం చాలా కష్టంగా సాగేది. భీమవ్వకు పదిహేనేళ్లు రాగానే ‘దేవదాసి’ దురాచారంలోకి మభ్యపెట్టి దింపింది ఆమె తల్లి. కుటుంబం బతకాలంటే తప్పదని ఒప్పించింది. నాలుగు నెలలు గడిచాయో లేదో ఓ బ్రోకర్ చేతికి చిక్కిన భీమవ్వ వాస్కోలోని బైనా అనే వేశ్యావాటికకు చేరింది. అక్కడ లైంగికంగా చిత్రహింసలకు గురైంది. తప్పించుకోవటానికి రెండు, మూడుసార్లు ప్రయత్నించి పట్టుబడింది. ఒకసారి తల్లే తిరిగి బ్రోకర్లకు అప్పగించింది. చివరికి విధిలేక అక్కడే కొససాగింది. ఆ సమయంలోనే.. అక్కడ తనలాంటి అభాగ్యులు, బలవంతంగా తీసుకు రాబడిన వాళ్లు చాలామంది ఉన్నట్లు గుర్తించింది. స్వచ్ఛంద సంస్థ చేయూత దాదాపు రెండేళ్లు గడిచాక 2003లో ఓ రోజు స్థానిక క్రైంబ్రాంచ్ అధికారులు ‘అన్యాయ్ రహిత్ జిందగీ(ఏఆర్‌జడ్)’ స్వచ్ఛంద సంస్థతో కలసి బైనాపై దాడి చేశారు. భీమవ్వతోపాటు చాలామందిని అక్కడి నుంచి బయటపడేశారు. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఓ కేంద్రంలోకి వీరిని తరలించారు. ఆ కేంద్రం నుంచి భీమవ్వ విడుదలయ్యాక ఆమె బాగోగులు చూసుకునే బాధ్యతను ఏఆర్‌జడ్ సంస్థే తీసుకుంది. తమ ఆఫీసులో ఉద్యోగం ఇచ్చింది. ఈ క్రమంలో భీమవ్వ ఎంతో మంది మహిళలను కలుసుకొని, వారి గాథలు వింది. తానంటే తప్పించుకుంది. మరి అదే వేశ్యావృత్తిలోకి బలవంతంగా నెట్టివేయబడుతున్న అమ్మాయిల పరిస్థితేంటీ?’ అని ఆలోచింది. వారికోసం ఏమైనా చేయాలని నిర్ణయించుకుంది. వెంటనే తనలాంటి దేవదాసీలతో కలసి ఓ సంఘం ఏర్పాటు చేసింది. అమ్మాయిల్ని దేవదాసిగా మార్చబోతున్న కుటుంబాలను గుర్తించి, వారిని అడ్డుకుంది. ఈ క్రమంలో ఇప్పటిదాకా సుమారు 800 మంది బాలికలను వీరు కాపాడింది. అంతేకాదు, వారి ఉపాధికి తగిన మార్గాలనూ చూపింది. వేశ్యావృత్తిలోని వందలాది మందికి విముక్తి కల్పించి, వారికి దారి దివ్వె అయింది. సీఐఐ అవార్డు దేవదాసి వ్యవస్థ నుంచి బాలికలను కాపాడడం, మహిళల అక్రమ రవాణాను అడ్డుకోవడం, వేశ్యావృత్తి నుంచి బయటపడిన వారికి ఉపాధి కల్పించడడం వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేస్తున్న భీమవ్వను 2019లో సీఐఐ ఉమెన్ ఎగ్జమ్‌ప్లర్ అవార్డు వరించింది. ఈ పురస్కారం తనకెంతో ప్రోత్సాహం ఇచ్చిందంటుందామె. ‘అవార్డు వచ్చిందని తెలియగానే నమ్మలేకపోయా. చాలాసేపటి వరకు ఏడుపు ఆపుకోలేకపోయాను. దాదాపు 200 మంది ఈ అవార్డు బరిలో ఉన్నా నాకు దక్కడమంటే అద్భుతం అనిపిస్తోంది. చదువులేని, వాస్కో పట్టణం తప్ప మిగిలిన ప్రపంచాన్ని చూడని నాకు ఈ అవార్డు దక్కడం ఎంతో ఆనందాన్నిచ్చింది. అయితే భవిష్యత్తులో నా పనిని నేను మరింత బాధ్యతగా నిర్వహించేందుకు ఈ అవార్డు నాకో ప్రోత్సాహం కలిగించింది’ అని దృఢనిశ్చయంతో చెబుతోంది భీమవ్వ. -
నగర యంత్రాంగంలో నారీమణుల ప్రత్యేక ముద్ర
సాక్షి, హైదరాబాద్ : ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం.. అమ్మలా లాలించడమే కాదు అధికారిగా పాలించడంలోనూ తమదైన శైలితో ముందుకెళ్తున్నారు మహిళామణులు. నగర పరిపాలనలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. విధానపరమైన నిర్ణయాల అమలులోనూ అతివలు అందెవేసిన చేయిగా నిలుస్తున్నారు. తమదైన ముద్రతో నగర శివారు నుంచి రాష్ట్ర మంత్రి మండలిలోనూ ప్రాతినిధ్యం వహిస్తూ ఔరా అనిపిస్తున్నారు. విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి, నగర మేయర్‌గా గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా శ్రీలత, రంగారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్‌గా తీగల అనితారెడ్డి సారథ్యం వహిస్తున్నారు. హైదరాబాద్ కలెక్టర్‌గా, మేడ్చల్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్‌గా శ్వేతా మహంతి కొనసాగుతున్నారు. వీరితో పాటు మరికొందరు నారీమణులు ప్రభుత్వ పాలనలోని పలు ప్రధాన విభాగాల్లో కీలక పదవులతో పాటు క్షేత్ర స్థాయిలో సైతం ప్రధాన భూమికగా ఉన్నారు. సమర్థ సేవలతో నగర వాసుల మన్ననలు అందుకుంటున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తమదైన పాత్రను ఇనుమడింపజేస్తున్నారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం హైదరాబాద్ కలెక్టర్, మేడ్చల్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్వేతా మహంతి బల్దియా పరిధిలో.. హైదరాబాద్ మహానగర పాలక వర్గంలో సగానికిపైగా మహిళామణులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పాలనా యంత్రాంగంలో సైతం పలు కీలక పదవుల్లో మహిళలే ఉన్నారు. ఉప్పల్ డిప్యూటీ కమిషనర్‌గా అరుణ కుమారి, సంతోష్‌నగర్ డీసీగా మంగ తాయారు, చాంద్రాయణగుట్ట డీసీగా రీచా గుప్తా, కుత్బుల్లాపూర్ డీసీగా మంగ తాయారు, కూకట్పల్లి డీసీగా ప్రశాంతి, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌గా ప్రావీణ్య, కూకట్పల్లి జోనల్ కమిషనర్‌గా మమత, ప్రధాన కార్యాలయంలో రెవెన్యూ విభాగం అడిషనల్ కమిషనర్ ప్రియాంక, పరిపాలన విభాగానికి సరోజ, ఎన్నికల విభాగానికి పంకజ, ఎస్ఎన్డీపీ ఓఎస్డీగా వసంత, ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్‌గా సరోజా రాణి, యూసీడీ విభాగం పీడీగా సౌజన్య నగర వాసులకు సేవలందిస్తున్నారు. హైదరాబాద్ డీఈఓ రోహిణి హైదరాబాద్ జిల్లాలో.. హైదరాబాద్ జిల్లాలో కలెక్టర్‌గా శ్వేతా మహంతి పాలనపై తనదైన ముద్ర వేస్తున్నారు. జిల్లా విద్యాశాఖాధికారిగా రోహిణి, చీఫ్ రేషనింగ్ అధికారిణి బాలమాయాదేవి, ప్రభుత్వ భూముల న్యాయ విభాగం అధికారిగా, స్పెషల్ కలెక్టర్‌గా సంగీత, సికింద్రాబాద్ రెవెన్యూ డివిజన్ అధికారిగా వసంతకుమారి తదితరులు విధులు నిర్వర్తిస్తున్నారు. మేడ్చల్ డీఆర్డీఏ పీడీ జ్యోతి, మేడ్చల్ డీఈఓ విజయకుమారి చదవండి: సివంగి సింగిల్‌గానే వస్తుంది మేడ్చల్‌లో జిల్లా పరిధిలో.. మేడ్చల్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్‌గానూ శ్వేతా మహంతి సేవలందిస్తున్నారు. జిల్లా విద్యాశాఖాధికారిగా విజయ కుమారి, జిల్లా పౌరసరఫరాల అధికారిగా పద్మజ, ఉపాధి కల్పన అధికారిగా నిర్మల, బీసీ సంక్షేమ శాఖ అధికారిగా ఝాన్సీరాణి, డీఆర్డీఏ పీడీగా జ్యోతి, కార్మిక శాఖాధికారిణి ప్రభావతి, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణిగా విజయకుమారి, జిల్లా వ్యవసాయ అధికారిగా రేఖామేరి, ఆర్డబ్ల్యూఎస్ అధికారిగా జ్యోతి, పౌరసంబంధాల శాఖ డీడీగా నాగాంజలిలు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలా పలు రంగాల్లో మహిళలు దూసుకెళ్తున్నారు. పురుషులకు దీటుగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారనేందుకు వీరే నిదర్శనం. అతివలు అన్ని రంగాల్లో ఎదగాలి: సబితారెడ్డి మహిళలు గౌరవించిన చోట దేవతలు కొలువుంటారని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. జిల్లా ప్రజలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక సంస్థల్లో యాభై శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. -
మహిళల కోసం ‘హర్ సర్కిల్’
న్యూఢిల్లీ: మహిళా సాధికారతకు మరింత తోడ్పాటునిచ్చే దిశగా రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ తాజాగా ’హర్ సర్కిల్’ పేరిట సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఆవిష్కరించారు. భిన్న సంస్కృతులు, వర్గాలు, దేశాలకు చెందిన మహిళ లు తమ ఆలోచనలను పంచుకునేందుకు ఇది వేదికగా ఉండగలదని ఆమె తెలిపారు. ఇందులో ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. జీవన విధానం, ఆరోగ్యం, ఆర్థికం, వినోదం, ఉద్యోగం, వ్యక్తిత్వ వికాసం తదితర అనేక అంశాలకు సంబంధించిన వీడియోలు, ఆర్టికల్స్ మొదలైనవి హర్ సర్కిల్ సబ్స్క్రయిబర్స్కు అందుబాటులో ఉంటాయని నీతా అంబానీ పేర్కొన్నారు. ప్రాథమికంగా ఇంగ్లీష్‌లో ఉండే హర్ సర్కిల్ క్రమంగా ఇతర భాషల్లో కూడా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. -
ఉద్యమ వేదికల వద్ద మహిళా దినోత్సవం
న్యూఢిల్లీ/భోపాల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమ వేదికల వద్ద సోమవారం అన్ని కార్యక్రమాలు మహిళల ఆధ్వర్యంలో జరగనున్నాయి. టిక్రీ, సింఘు, ఘాజీపూర్ ఉద్యమ కేంద్రాల వద్ద వేదిక ఏర్పాటు, ప్రసంగాలు, కార్యక్రమాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్ల నుంచి ఆహార పంపిణీ వరకు అన్ని కార్యక్రమాలను మహిళలే నిర్వహించనున్నారు. వేలాదిగా మహిళా రైతులు, విద్యార్థినులు, సామాజిక కార్యకర్తలు ఇందులో పాలుపంచుకోనున్నారు. వ్యవసాయ రంగంలో మహిళలు గణనీయ పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారికి సరైన గుర్తింపు లభించడం లేదనే ఉద్దేశంతో, వారికి సముచిత గుర్తింపు, గౌరవం అందించే లక్ష్యంతో మహిళా దినోత్సవం రోజు పూర్తిగా వారి ఆధ్వర్యంలోనే అన్ని కార్యక్రమాలు జరిగేలా ప్రణాళిక రూపొందించారు. ఇందులో పాలు పంచుకోవడం కోసం పంజాబ్, హరియాణాల నుంచి వేల సంఖ్యలో మహిళలు వస్తున్నారని రైతు ఉద్యమ నేతలు తెలిపారు. సింఘు సరిహద్దు వద్ద ర్యాలీని సైతం నిర్వహించనున్నారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు గత మూడు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. మరోవైపు, రైతు నేత, భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ సింగ్ తికాయత్ మార్చి నెలలో మధ్యప్రదేశ్‌లో జరగనున్న పలు రైతు సభల్లో పాల్గొననున్నారు. మార్చి 8న షోపూర్లో, మార్చి 14న రేవాలో, మార్చ్ 15న జబల్పూర్లో జరిగే సభల్లో ఆయన పాల్గొని, రైతు ఉద్యమానికి మద్దతు కూడగడ్తారని బీకేయూ ప్రతినిధి వెల్లడించారు. ఉత్తరాఖండ్, రాజస్తాన్, కర్ణాటక, తెలంగాణల్లోనూ పర్యటిస్తారన్నారు. కాగా, తికాయత్‌పై మధ్య ప్రదేశ్‌లో 2012 నాటి ఒక హత్యాయత్నం కేసులో అరెస్ట్ వారంట్ పెండింగ్‌లో ఉంది. ఆ సమయంలో జైతారిలో పవర్‌ప్లాంట్‌కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో తికాయత్ కూడా పాల్గొన్నారు. ఆ సందర్భంగా చోటు చేసుకున్న హింసకు సంబంధించి తికాయత్ అరెస్టయ్యారు. బెయిల్‌పై విడుదలైన తికాయత్ ఆ తర్వాత కోర్టుకు హాజరుకాలేదు. దాంతో, వారంట్ జారీ అయింది. -
స్కూళ్లు, కాలేజీల్లో శానిటరీ న్యాప్కిన్స్ సరఫరా
సాక్షి, అమరావతి: ఆరోగ్యకరమైన సమాజంలో బాలికలు పెరిగేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం.. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న వారికి ఉచితంగా శానిటరీ న్యాప్కిన్స్ను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం ప్రారంభించనున్నారు. అన్ని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో చదువుతున్న 12–18 సంవత్సరాల విద్యార్థినులకు ప్రభుత్వం వీటిని ఇవ్వనుంది. శానిటరీ న్యాప్కిన్స్ కూడా కొనుగోలు చేయలేని తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నట్లు పలు సర్వేల్లో తేలింది. దీని వల్ల బాలికల విద్యకు విఘాతం కలుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రస్తుతం ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న కౌమార దశ బాలికలు 12.50 లక్షల వరకు ఉన్నట్లు అంచనా. ఒక్కొక్కరికి సంవత్సరానికి 120 ప్యాడ్స్ ప్రకారం 15 కోట్ల ప్యాడ్స్ కావాల్సి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందుకోసం రూ.41.4 కోట్ల నిధులు అవసరం అవుతాయి. తక్కువ ధరతో సరఫరాకు ఆలోచన ► పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని వైఎస్సార్ చేయూత దుకాణాల్లో శానిటరీ న్యాప్కిన్లను మహిళలకు తక్కువ ధరలకు విక్రయించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ► ఇందు కోసం మెప్మా, సెర్ప్‌లు రాష్ట్ర స్థాయిలో టెండర్ నిర్వహించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ శానిటరీ నాప్కిన్లు లబ్ధిదారులకు ఎల్–1 రేటు కంటే 15% మార్జిన్‌తో అందించవచ్చని అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో చేయూత స్టోర్లు 35,105, పట్టణాల్లో 31,631 ఉన్నాయి. ► రాష్ట్రంలో 18–50 ఏళ్ల వయస్సు ఉన్న మహిళల సంఖ్య సుమారు 1.26 కోట్లు ఉంటుదని అంచనా. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే– 4 (2015–16) ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 15–24 సంవత్సరాల వయస్సు గల మహిళలు 67.5% మంది నెలవారీ పరిశుభ్రమైన పద్ధతిని ఉపయోగిస్తున్నారు. జాతీయ సగటు 57.6%గా ఉంది. ► జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే – వి (2019–20) ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో15–24 సంవత్సరాల వయస్సు గల మహిళలు 85.1% మంది రక్షణకు పరిశుభ్రమైన పద్ధతిని ఉపయోగిస్తున్నారు. (పట్టణాల్లో 90.6%, గ్రామీణ ప్రాంతాల్లో 82.5%) పరిశుభ్రమైన పద్ధతిలో స్థానికంగా తయారు చేసిన న్యాప్కిన్లు, శానిటరీ న్యాప్కిన్లు, టాంపోన్లు ప్రస్తుతం అందుతున్నాయి. మిగిలిన వారందరూ కూడా ఆరోగ్యకరమైన పద్ధతిని పాటించడం కోసమే ప్రభుత్వం చొరవ తీసుకుంది. -
సరిలేరు ఆమెకెవ్వరు...
ఆమె గరిటె తిప్పితే.... కడుపు నిండుతుంది. ఆమె పాట పాడితే... మనసు పరవశిస్తుంది. ‘ఆమె’ ఆట ఆడితే... విజయమే బానిసవుతుంది. పతకం మురిసిపోతుంది. యావత్ దేశం గర్వపడేలా చేస్తుంది. ఆమె ఇప్పుడు ఆకాశంలోనే సగం కాదు... ఆటల్లోనూ ఘనం. క్రీడా సమరంలో క్రియాశీలం. ఇంకా చెప్పాలంటే ఒలింపిక్స్‌లాంటి ప్రతిష్టాత్మక పోటీల్లో ఈ వీరనారిత్వమే పతకాలను తెచ్చిపెడుతోంది. వ్యక్తిగత క్రీడల్లో 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టర్, తెలుగుతేజం కరణం మల్లీశ్వరి త్రివర్ణ శోభితం చేస్తే... 2012 లండన్ ఒలింపిక్స్‌లో షట్లర్ సైనా నెహ్వాల్, బాక్సర్ మేరీకోమ్... 2016 రియో ఒలింపిక్స్‌లో షట్లర్ పీవీ సింధు, రెజ్లర్ సాక్షి మలిక్‌లే పతకాలు, శతకోటి భారతీయుల ఆకాంక్షలు నెరవేర్చారు. ఇప్పుడు అదే ఉత్సాహంతో, అంతే కదన కుతూహలంతో ‘టోక్యో’ వెళ్లేందుకు కష్టపడుతున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా 2021 టోక్యో ఒలింపిక్స్‌లో భారత ఆశల పల్ల్లకిని మోయనున్న షట్లర్ సింధు, బాక్సర్లు మేరీకోమ్, సిమ్రన్‌జిత్, పూజా రాణి, లవ్లీనా, ఆర్చర్ దీపిక కుమారి, రెజ్లర్ వినేశ్ ఫొగాట్, మహిళా షూటర్లు మనూ భాకర్, రాహీ సర్నోబత్, ఇలవేనిల్ వలారివన్, అంజుమ్ మౌద్గిల్, అపూర్వీ చండేలా, తేజస్విని సావంత్, యశస్విని సింగ్, చింకీ యాదవ్, అథ్లెట్స్ భావన, ప్రియాంక గోస్వామి, రాణి రాంపాల్ నాయకత్వంలోని భారత హాకీ జట్టు సభ్యులకు మనసారా కంగ్రాట్స్ చెబుదాం. విమెన్ ఇండియా... విన్ ఇండియా. కేవలం ఒలింపిక్ క్రీడాంశాల్లోనే కాకుండా నాన్ ఒలింపిక్ క్రీడల్లోనూ భారత మహిళా క్రీడా కారిణులు మెరిసిపోతున్నారు. గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక తమ మేధోసంపదతో రెండు దశాబ్దాలుగా ప్రపంచ చెస్‌లో భారత్ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. పదిహేను నెలల క్రితం ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌షిప్‌లో హంపి స్వర్ణ పతకాన్ని గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. బీబీసీ మీడియా సంస్థ అందించే ‘ఈ ఏడాది అత్యుత్తమ భారతీయ క్రీడాకారిణి’ అవార్డు రేసులో రాణి రాంపాల్ (హాకీ), వినేశ్ (రెజ్లర్), మనూ భాకర్ (షూటింగ్), ద్యుతీ చంద్ (అథ్లెటిక్స్)లతో కలిసి హంపి బరిలో నిలిచింది. మహిళా దినోత్సవం సందర్భంగా బీబీసీ సంస్థ ఈరోజు విజేతను ప్రకటించనుంది. -
West Bengal Elections 2021: సివంగి సింగిల్‌గానే వస్తుంది
ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. కరోనా సంక్షోభం ప్రపంచ దేశాల్ని కుదిపేస్తున్న వేళ ఐక్యరాజ్య సమితి ఈ ఏడాది ‘‘మహిళా నాయకత్వం, కోవిడ్–19 ప్రపంచంలో స్త్రీ, పురుషులు సమానంగా భవిష్యత్ నిర్మించుకోవడం’’అన్న థీమ్‌తో ఉత్సవాలు నిర్వహిస్తూ స్ఫూర్తి నింపుతోంది. కరోనా మహమ్మారిపైన యుద్ధం చేయడమే కాదు, తన జీవితాన్నే ఒక పోరాటంగా మలచుకున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ సారి మహిళా దినోత్సవం థీమ్‌కి అసలు సిసలు ప్రతీకగా నిలుస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఇప్పుడు అందరి దృష్టి ఆమెపైనే ఉంది. నిరసనల నిప్పు కణిక పురుషాధిక్య రాజకీయ ప్రపంచంలో సింగిల్ ఉమన్‌గా నెగ్గుకు రావడం అంత సులభం కాదు. అయినప్పటికీ ఆమె ఏ రోజూ అదరలేదు. బెదరలేదు. పదిహేనేళ్ల వయసులోనే కాంగ్రెస్ విద్యార్థి సంఘంలో చేరిన ఆమె నిరసనలే ఆయుధంగా చేసుకున్నారు. దీదీ : ది అన్‌టోల్డ్ మమతా బెనర్జీ అనే పుస్తకంలో మమత ధైర్య సాహసాల గురించి రచయిత సుతాపా పాల్ రాస్తూ ‘‘1977లో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జయప్రకాశ్ నారాయణ్ విస్తృతంగా ప్రచారం చేసే రోజుల్లో జేపీకి ఎదురొడ్డి నిలబడిన ఏకైక మహిళా నాయకురాలు మమతా బెనర్జీయే. కోల్‌కతాలో జేపీ ర్యాలీ తీసినప్పుడు మమత ఆయన కాన్వాయ్ ముందుకు కదలకుండా అడ్డం పడ్డారు. అప్పుడే బెంగాల్ ఆమెలో ఒక నిప్పు కణిక దాగుందని తెలుసుకుంది’’అంటూ మమతని ప్రశంసించారు. 1998లో సొంత పార్టీ పెట్టాక సుదీర్ఘ కాలం ఆమె పోరాటాల్లోనే గడిపారు. మమత చేసేవన్నీ వీధిపోరాటాలని ప్రత్యర్థులు ఎద్దేవా చేసినా ఆ పోరాట స్ఫూర్తే ఆమెకు అధికారానికి దగ్గర చేసింది. సింగూరు, నందిగ్రామ్ ఉద్యమాలతో రాష్ట్ర వ్యాప్తంగా మమత దీదీ పేరు మారుమోగిపోయింది. 2011లో ఎన్నికల్లో కమ్యూనిస్టుల కంచుకోటని బద్దలు కొట్టి మమత మహారాణిలా సీఎం సీట్లో కూర్చున్నారు. అధికారంలోకి వచ్చాక కూడా ఆమె అదే పంథాలోనే నడుస్తున్నారు. కేంద్రాన్ని లెక్క చేయకుండా తన సొంత దారిలో నడవడం ముఖ్యమం త్రుల్లో మమత ఒక్కరికే చెల్లింది. పెద్ద నోట్ల రద్దుని మొదటి సారి గట్టిగా వ్యతిరేకించింది మమతయే. జాతీయ పౌర రిజిస్టర్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. కేంద్ర పథకాలు, తెచ్చే చట్టాలు తనకు నచ్చకపోతే అమ లు చేయడం లేదని బహిరంగంగానే చెప్పే దమ్మున్న నాయకురాలు. శారదా చిట్‌ఫండ్ కేసు తన మెడకు చుట్టుకున్నా 2019లో అప్పటి కోల్‌కతా కమిషనర్ రాజీవ్కుమార్ని అరెస్ట్ చేయడానికి వచ్చిన సీబీఐ అధికారుల్ని తన సొంత పోలీç Üు బలగాలతో అరెస్ట్ చేసిన సాహసవంతురాలు. విభిన్న వ్యక్తిత్వం మమత బెంగాలీల కూతురు, అభిమానులకు అక్క, నేటి తరం రాజకీయ వేత్తలకి అమ్మ. ప్రత్యర్థులకు కలకత్తా కాళిక. ఆమె రాజకీయ జీవితాన్ని తరచి చూస్తే ఒకే స్త్రీ మూర్తిలో ఎన్నో కోణాలు కనిపిస్తాయి. గత ఏడాది మార్చిలో ప్రభుత్వం అమ్మాయిల పెళ్లి కోసం రూ.25 వేలు ఇచ్చే పథకం రూపాశ్రీలో భాగంగా మమత ఒక పెళ్లికి హాజరయ్యారు. పెళ్లికి వెళ్లడం సాధారణమైనా ఆ వేడుకల్లో ఇతర మహిళలతో కలిసి చీర కొంగు చుట్టి డ్యాన్స్ చేయడం అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. ఏప్రిల్ 21, 2020.. అది కరోనా కాలం, లాక్డౌన్ విధించడంతో ప్రజలంతా ఇళ్లల్లోనే బందీలై విసుగెత్తిపోయిన రోజులు. అలాంటి సమయంలో కోల్‌కతా వీధుల్లోని లౌడ్ స్పీకర్లలో ఆమె స్వరం మారు మోగుతూ ఉండేది. ‘‘నేను మీ మమతా బెనర్జీ. మిమ్మల్ని నేరుగా కలవలేకపోయినందుకు మన్నించండి. మరికొద్ది రోజులు ఓపిక పట్టండి. ఇళ్లల్లోనే క్షేమంగా ఉండండి. మహమ్మారిని తరిమి కొడితే స్వేచ్ఛగా మీరు బయటకి రావొచ్చు’’అంటూ ఆమె అనునయంతో నచ్చచెప్పారు. ఆ క్షణంలో బెంగాలీలకు తమకు ఓ అమ్మ తోడు ఉందన్న భరోసా కలిగింది. అంతకు ముందు రోజే బెంగాల్లో కరోనా కేసులు పెరిగిపోయాయంటూ పరిస్థితుల్ని సమీక్షించడానికి కేంద్ర బృందం కోల్‌కతాకి వచ్చింది. కానీ మమత వారిని క్షేత్రస్థాయిలో పర్యటించకుండా అడ్డుకున్నారు. లాక్డౌన్ సమయంలో ఎ లా వస్తారంటూ వారిని ఎక్కడా తిరగనివ్వలేదు. నా రాష్ట్ర ప్రజల బాగోగులు గురించి నేను చూసుకుంటానని వారిని వెనక్కి పం పేశారు. అప్పు డు ప్రత్యర్థుల్లో ఆమెకు కలకత్తా కాళిక కనిపించింది. బెంగాల్ కూతురినే కోరుకుంటోందా ? బెంగాల్ నిజెర్ మెయేకీ చాయ్ (బెంగాల్ తమ కూతురినే కావాలనుకుంటోంది) అన్న నినాదంతో ఈ సారి ఎన్నికల బరిలోకి దిగారు. ఒక మహిళగా రాజకీయాల్లోకి మహిళలు రావాల ని ప్రోత్సహిస్తున్నారు. ఈ సారి అసెంబ్లీ బరి లో 50 మంది మహిళల్ని నిల్చోబెట్టారు. బెంగాల్ ఆత్మగౌరవ నినాదంతో దేశంలోనే అత్యంత శక్తిమంతుడైన నాయకుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఢీ కొడుతున్నారు. ప్రతీ రోజూ ట్రెడ్‌మిల్లుపై అయిదారు కిలోమీటర్లు పరుగులు తీసే ఆమె ఎన్నికల పరుగు పందెంలో ఎంత దూరం వెళ్లగలరో మరి కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది. -
జగిత్యాల.. ఆడబిడ్డల అడ్డా
సాక్షి, జగిత్యాల: ఆమె ఆధిక్యం.. దాదాపు రాష్ట్రమంతా కనిపిస్తోంది. ఆడబిడ్డ అంటే భారం, బాధ, వివక్ష అనుకునే అడ్డంకులను దాటి.. అమ్మాయి అంటే ఆనందం అంటూ ‘ఊపిరి’పోస్తున్నాయి. ఫలితంగా రాష్ట్రం దేశ సగటును మించి పురుషుల కంటే ఎక్కువ మహిళలతోనే కళకళలాడుతోంది. ఇటీవల భారత ప్రభుత్వం విడుదల చేసిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే నివేదిక (2019–20) ప్రకారం.. రాష్ట్రంలో ప్రతీ 1,000 మంది పురుషులకు 1,049 మంది మహిళలు ఉన్నారు. రాష్ట్రంలో సర్వే చేసిన 31 జిల్లాల్లో (ములుగు, నారాయణపేట మినహా) ఆడబిడ్డల అడ్డగా జగిత్యాల తొలిస్థానంలో.. నిర్మల్, రాజన్నసిరిసిల్ల రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. పురుషులకంటే తక్కువ జనాభాతో హైదరాబాద్(959), ఆదిలాబాద్(992), మల్కాజిగిరి(996), వికారాబాద్(998) జిల్లాలున్నాయి. -
కష్టాలను భరించి.. కరోనాను ఎదిరించి.. నారీ వారియర్
కరోనా.. ఏడాదిగా ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి.వైరస్ వ్యాప్తి మొదలైన కొత్తలో అంతా ఆందోళనే. ఇంట్లోంచి కాలు బయటపెట్టాలన్నా వణికే పరిస్థితి. అత్యవసర రంగాలకు చెందినవాళ్లు తప్పనిసరి పరిస్థితుల్లో భయం భయంగానే విధులకు వచ్చారు. కరోనా అంటేనే హడలిపోయే పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి పనిచేశారు. అలాంటి ఫ్రంట్‌లైన్ వారియర్లలో ఎందరో మహిళలు ఉన్నారు. డాక్టర్లు, నర్సులు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులు, పోలీసులు ఇలా చాలా రంగాల్లో మహిళలు తమ సేవలు అందించారు. వైరస్ వ్యాప్తి అరికట్టడానికి కృషి చేశారు, కోవిడ్ బారినపడ్డ వారికి చికిత్స అందించారు. నిత్యావసరాలు అందజేసి బాధితుల ఆకలినీ తీర్చారు. ఒకవైపు కుటుంబాన్ని, మరోవైపు సమాజాన్ని రక్షించే అత్యున్నత బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు. సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారు చేసిన సేవలు, అభిప్రాయాలతో ప్రత్యేక కథనం.. తొలి కరోనా బాధితుడికి సేవలు చేశా.. ‘‘గాంధీ ఆస్పత్రిలో మొదటి కరోనా రోగిని చేర్చినప్పుడు నేను డ్యూటీలో ఉన్నాను. కరోనా పేరు వింటేనే వణికిపోయే పరిస్థితుల్లో విధులు ఎలా నిర్వర్తించాలా అన్న ఆందోళన కలిగింది. మొదట చాలా భయం వేసింది. అయినా ధైర్యం తెచ్చుకున్నాను. రోజూ రెండు సార్లు బాధితుడి వద్దకు వెళ్లి వైద్య సేవలు అందించేదాన్ని. అదే సమయంలో మానసికంగా ధైర్యం చెప్పాను. నా కుటుంబ సభ్యులు భయపడినా.. నన్ను ప్రోత్సహించడంతో ఆత్మ విశ్వాసం కలిగింది. ఇప్పటిదాకా 100 మందికి పైగా కరోనా రోగులకు సేవలు చేశాను. లతా జ్యోత్స్న (హెడ్ నర్సు), సారా (స్టాఫ్ నర్స్) కలిసి టీంగా పనిచేశాం. జాగ్రత్తగా ఉండటం వల్ల నాకు, మా కుటుంబ సభ్యులెవరికీ వైరస్ సోకలేదు.’’ –అరుణాదేవి, స్టాఫ్‌నర్సు, గాంధీ ఆస్పత్రి, హైదరాబాద్ అరుణాదేవి, కవిత, డాక్టర్ జూలకంటి మాధవి జనం దగ్గరికి రానివ్వని పరిస్థితుల్లో.. లాక్ డౌన్ సమయంలో మా ఆరోగ్య కేంద్రం పరిధి మాలపల్లిలో కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేశారు. పాజిటివ్ వారిని 14 రోజుల పాటు పరిశీలించాల్సి ఉండేది. కానీ కంటైన్మెంట్ జోన్ పెట్టిన కాలనీ వాసులు మమ్మల్ని చాలా ఇబ్బందిపెట్టేవారు. కరోనా పేరిట అనవసరంగా బదనాం చేస్తున్నామని తిరగబడ్డారు. తెలిసిన వారు సైతం దగ్గరకు రానివ్వలేదు. పాజిటివ్ కేసుల పరిశీలనకు వెళ్లినప్పుడు ఒకట్రెండు సార్లు కొట్టేందుకు ప్రయత్నించారు. ప్రాణాలకు తెగించి పనిచేయాల్సి వచ్చింది. నాకు, నా ద్వారా ఇంట్లో వాళ్లకు కరోనా వస్తుందేమోనని ప్రతిరోజూ భయంగానే ఉండేది. అన్నీ తట్టుకుని పనిచేశాం. – కవిత, ఆశ కార్యకర్త, మాలపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రం, నిజామాబాద్ జిల్లా సిబ్బందిలో 70 శాతంపైగా మహిళలమే.. కరోనా అనుమానాస్పద కేసులన్నీ ఉస్మానియా ఆస్పత్రికి వచ్చేవి. సిబ్బందిలో 70 నుంచి 80 శాతం మంది మహిళలే. స్వీపర్ నుంచి పైస్థాయి వరకు అందరం గంటల కొద్దీ పీపీఈ కిట్లు వేసుకొని పనిచేయాల్సి వచ్చింది. మాది క్రిటికల్ కేర్ విభాగం కావడంతో పేషెంట్లకు మరింత దగ్గరగా పనిచేయాల్సి వచ్చేది. అంతా ఆత్మ విశ్వాసంతో పనిచేశాం. నేను అనెస్థీషియా నేషనల్ టాస్క్‌ఫోర్స్ కమిటీకి తెలంగాణ కోఆర్డినేటర్‌గా ఉండేదాన్ని. కరోనా చికిత్సపై ఢిల్లీ, మహారాష్ట్ర డాక్టర్లతో మాట్లాడేదాన్ని. ఎప్పటికప్పుడు చికిత్స పద్ధతులు మారేవి. నాకు, చాలా మంది పీజీ విద్యార్థులకు వైరస్ లక్షణాలు కనిపించకున్నా.. యాంటీబాడీస్ మాత్రం వచ్చాయి. – డాక్టర్ జూలకంటి మాధవి, క్రిటికల్ కేర్ విభాగం, ఉస్మానియా ఆస్పత్రి, హైదరాబాద్ చనిపోతావని భయపెట్టినా.. గాంధీ ఆస్పత్రిలో మొదటి కేసు వచ్చినప్పుడు నేను ఆ గదికి వెళ్లి శుభ్రం చేసేదాన్ని. కొందరైతే చచ్చిపోతావు అని భయపెట్టారు. గతంలో స్వైన్‌ఫ్లూ కేసులు వచ్చినప్పుడూ ఇలాగే సేవలు చేశా. ఏదైతే అది అవుతుందనుకొని ధైర్యంగా ఉన్నాను. మొదట్లో ఇంట్లో వాళ్లు కూడా ఇంత రిస్క్ ఎందుకన్నారు. ఉద్యోగం మానేయమన్నారు. 150 మంది కరోనా రోగులకు సేవ చేశాను. నేను కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం చేస్తున్నాను. ఇంత సేవ చేసిన మాకు వేతనం పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. – అంబాల రాధిక, స్వీపర్, గాంధీ ఆస్పత్రి అంబాల రాధిక, స్వప్న టెస్టులు చేస్తుంటే భయం వేసేది కరోనా అనుమానితులకు టెస్టులు చేయాల్సిన డ్యూటీ నాది. కరోనా ఎవరి నుంచి సోకుతుందో తెలియని పరిస్థితుల మధ్య రోజూ టెస్టులు చేయాల్సి వచ్చేది. ఓవైపు భయంగా ఉన్నా.. నా విధులు నన్ను ముందుకు నడిపించాయి. మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లి కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించాం. – స్వప్న, ఏఎన్ఎం, మిరుదొడ్డి (దుబ్బాక) కనిపించని శత్రువుతో యుద్ధం చేశాం కరోనా సమయంలో పోలీస్ డిపార్ట్మెంట్ కీలకంగా వ్యవహరించాల్సి వచ్చింది. నేను ఆ సమయంలో నిత్యావసరాల సరఫరాకు ఆటంకం కలగకుండా చూసే కంట్రోల్ రూం బాధ్యతలు చూశాను. 24 గంటలపాటు అనేక మంది వ్యాపారులను కలవాల్సి వచ్చింది. అదే క్రమంలో నాకూ కరోనా పాజిటివ్ వచ్చింది. చాలా భయపడ్డాను. డీజీపీ, వైద్యులు, మా కుటుంబ సభ్యులు అండగా నిలిచారు. క్వారంటైన్లో ఉన్నప్పుడు పిల్లలు గుర్తుకొచ్చి బాధ వేసేది. కనిపించని శత్రువుతో 25 రోజుల పాటు పోరాడాను. యోగా చేశాను, పుస్తకాలు చదివాను. నాకు నేను ధైర్యం చెప్పుకుని విజేతగా నిలిచాను. – స్వాతి లక్రా, ఐజీ, విమెన్‌సేఫ్టీ వింగ్ చీఫ్ స్వాతి లక్రా, జ్యోత్స్న పిల్లల గురించి బాధపడ్డా.. జూలైలో నాకు గాంధీ ఆస్పత్రిలో బందోబస్తు డ్యూటీ వేశారు. డాక్టర్లు, సిబ్బంది, పేషెంట్లు, టెస్టుల కోసం వచ్చే వాళ్లతో మాట్లాడాల్సి వచ్చేది. ఓ రోజు అకస్మాత్తుగా తలనొప్పి మొదలైంది. మొదట్లో తేలికగా తీసుకున్నా.. తర్వాత టెస్టుకు వెళ్లాను. ముందు జాగ్రత్తగా పిల్లలకు దూరంగా ఉన్నాను. ఒకరోజు తర్వాత పాజిటివ్‌గా ఫలితం వచ్చింది. నాకేం భయం అనిపించలేదు. కానీ ఒక తల్లిగా నా పిల్లలకు వచ్చి ఉంటుందేమోనన్న అనుమానం స్థిమితంగా ఉండనీయ లేదు. మా బాబుకు మూడు రోజుల తర్వాత పాజిటివ్ గా తేలింది. అయితే రెండు వారాల్లోనే కోలుకున్నాం. 15 రోజుల తర్వాత మళ్లీ డ్యూటీలో చేరాను. – జ్యోత్స్న, ఇన్స్పెక్టర్ -
మహిళలు అద్భుతాలు చేయగలరు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులతో పోటీపడుతూ తమ ప్రతిభను చాటుకుంటున్నారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. జనాభాలో సగం వున్న మహిళలకు అవకాశాలు ఇస్తే అద్భుతాలు చేసి చూపిస్తారన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధిలో మహిళలది అత్యంత కీలకపాత్ర అని పేర్కొన్నారు. వారిని అభివృద్ధి పథంలో నడిపించేందుకు తెలంగాణ ప్రభు త్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 8న ప్రభుత్వ మహిళా ఉద్యోగులందరికీ సెలవుదినంగా ప్రకటించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. గవర్నర్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మహిళలందరికీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. శతాబ్దాలుగా మన వారసత్వం, సంస్కృతి, సం ప్రదాయాలు మహిళలను ఆదిశక్తిగా ఆరాధిస్తూ గౌరవిస్తున్నాయని పేర్కొన్నారు. సమసమాజ స్థాపనకు లింగ సమానత్వపు స్ఫూర్తి పెంపొందించడం, మహిళలు అన్ని రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారని కొనియాడారు. కోవిడ్–19 మహ మ్మారి సమయంలో ఫ్రంట్‌లైన్ వారియర్లుగా ధైర్య సాహసాలు ప్రదర్శించిన, త్యాగాలు చేసిన మహిళలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. -
ఆ మార్పు నీతోనే..!
‘మార్పు నీతోనే మొదలవ్వాలి’ అంటున్నారు హీరోయిన్ సమంత. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమంత మహిళలను ఉద్దేశించి సోషల్‌మీడియా వేదికగా ఓ సందేశాన్ని షేర్ చేశారు. ‘‘మన స్థాయి, విలువ ఏంటో తెలుసుకునే తరుణం వచ్చింది. మన అర్హతకు తక్కువగా మనం ఉండాల్సిన అవసరం ఏమాత్రం లేదు. నన్ను నేను మరింత నమ్మాలని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా చాలెంజ్ చేసుకుంటున్నాను.. మిమ్మల్ని కూడా చేయమని అడుగుతున్నాను. నీలో నుంచే సాధికారిత రావాలి. ఆ మార్పు నీతోనే మొదలవ్వాలి’’ అని పేర్కొన్నారు సమంత. కాగా ప్రస్తుతం తెలుగులో ‘శాకుంతలం’ సినిమా చేస్తున్న సమంత తమిళంలో ‘కాదు వాక్కుల రెండు కాదల్’ అనే సినిమాలో నటిస్తున్నారు. -
మహిళలకు ఏపీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మహిళల సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. గడచిన 21 నెలల్లో మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినట్టు తెలిపారు. అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, కాపు నేస్తం, మహిళల పేరుతోనే ఇంటి స్థలాలు, వైఎస్సార్ సంపూర్ణ పోషణ వంటి పథకాల ద్వారా వారికి లబ్ధి చేకూర్చినట్టు వివరించారు. నామినేటెడ్ పోస్టులతోపాటు నామినేషన్ పనుల్లోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసినట్టు తెలిపారు. మహిళలపై జరిగే నేరాల్లో వేగవంతమైన దర్యాప్తు, సత్వర న్యాయం కోసం దిశ బిల్, ప్రత్యేక న్యాయస్థానాలు తెచ్చినట్టు సీఎం వైఎస్ జగన్ వివరించారు. సమాజాభివృద్ధిలో మహిళలదే కీలక భూమిక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ సాక్షి, అమరావతి: జాతీయ సమగ్రత, శాంతి సామరస్యాలను పెంపొందించడంలో భారతీయ మహిళలు ఎల్లప్పుడూ కీలక పాత్ర పోషిస్తున్నారని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సమాజాభివృద్ధిలో మహిళలు స్ఫూర్తిమంతమైన పాత్ర పోషిస్తున్నారని ఆయన కొనియాడారు. కరోనా మహమ్మారిపై పోరులో మహిళా శాస్త్రవేత్తలు, వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలతోపాటు సాధారణ మహిళలు కూడా ముఖ్య భూమిక వహించారన్నారు. -
మహిళా నమామి వారధి
‘దేవుడు అన్నిచోట్లా ఉండలేక..’ అని మనకో స్త్రీ–స్తుతి ఉంది. అన్నిచోట్లా ఉండలేక ఆ భగవంతుడు స్త్రీని సృష్టించాడని! నిజమే. ఈ పన్నెండు నెలలూ స్త్రీ చాలా చోట్ల ఉండవలసి వచ్చింది. ఏం చేస్తుంది మరి?! దేవుడు పరుగులు తీయలేకపోయాడు. ఆమెకంటే అధికుడిననుకునే మానవుడు ‘నేనూ అన్నిచోట్లా ఉండలేను’ అనేశాడు! ఇక ప్రతి చోటా స్త్రీనే. పనిగంటలు పెరిగిన వంటిళ్లలో అన్నపూర్ణమ్మగా.. చెత్త పేరుకుపోతున్న వీధులలో పారిశుధ్య ప్రాణదాతగా.. ఊరెంతకీ రాని ఎండ దారుల్లో వలసమాతగా.. ఊపిరులు పోస్తున్న ఆసుపత్రులలో అమృతమయిగా; ఇంటింటా గడపల్లో, ఊరూరా కూడళ్లలో ఒక్కర్నీ బయటికి రానివ్వని రక్షణనేత్రిగా ప్రతిచోటా స్త్రీనే. అన్నమూ నీళ్లిస్తూ హైవేలలో, ఉన్నదేదో పంచి ఇస్తూ చుట్టుపక్కల్లో, విరుగుడు కనిపెడుతూ లేబరేటరీల్లో.. మనిషి ఆశ, ఆయువు తనే అయి, తిరగడం ఆగబోతున్న గ్లోబుకు గ్లూకోజ్ అందించి తిరిగే వేగాన్ని పెంచిందీ, మానవ జీవనాన్ని మళ్లీ గాడిలో పెట్టిందీ స్త్రీనే. ఎంత శక్తి, ఎంత ఓర్పు, ఎంత నేర్పు, ఎంత నిబ్బరం, ఎంత త్యాగం.. దేవుడు కూడా ఆశ్చర్యపోయి ఉంటాడు స్త్రీలోని తన ప్రతిరూపాన్ని ఇంత మల్టీటాస్కింగ్‌లో చూసి! ఐక్యరాజ్య సమితి కూడా అలాగే స్టన్ అయింది. ‘వ్వావ్ షి ఈజ్ ద లీడర్’ అంది! భద్రమైన భావి సమాజ నిర్మాణానికి మహిళే లీడర్ అని ప్రకటించింది. అటువంటి కొందరు లీడర్స్‌కి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా సాక్షి ‘ఫ్యామిలీ’ నమస్సులు తెలియజేస్తోంది. నమో నమామి మహిళామూర్తి.. మానవీయ స్ఫూర్తి. క్యాన్సర్ రోగుల చివరి మజిలీకి ‘స్పర్శ్’ ద్వారా స్వస్థత కలిగిస్తున్న శారద లాక్డౌన్ టైమ్‌లో అందించిన సేవలు, ధైర్యం, టీమ్ లీడింగ్ అసమానమైనవి. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఈ స్వస్థత ఆలయంలోకి అడుగు పెడితే అక్కడ కనిపించే దృశ్యాలు మనసును తడి చేస్తాయి. ‘కరోనా కష్టం సామాన్యమైనది కాదు. కానీ, ఎదుర్కోవాల్సిందే అనుకున్నా’ అంటూ లాక్డౌన్ టైమ్‌ని వివరించారు శారద. ‘‘లాక్డౌన్ ప్రకటించగానే మనల్ని మనం రిస్క్‌లో పెట్టుకోవాల్సిన అవసరం ఉందా.. అనే దశ నుంచి ఆలోచించాను. ‘నేనే ఇలా భయపడితే... రేపో మాపో చనిపోతామని తెలిసిన వాళ్లని వదిలేయచ్చా..’ అనిపించింది. దాంతో నాకేదో వస్తుందేమో అనే ఆలోచననే మానేశాను. ధైర్యంగా ముందడుగు నాతో పాటు నలుగురు నర్సులు, ఐదుగురు ఆయాలు క్లినిక్‌లో, బయట వాలంటీర్లు పని చేస్తున్నారు. అందరికీ కరోనా ఏ రూపంలో వస్తుందో అనే భయం. టీమ్ లీడర్‌గా జాగ్రత్తలు తీసుకుంటూ ధైర్యమిస్తూ ముందుకు తీసుకెళ్లడం పెద్ద టాస్క్. ‘మా అమ్మగారు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. మాకేం చేయాలో తెలియట్లేదు’ అంటూ విదేశాల్లో ఉండిపోయి రాలేకపోయిన పిల్లల అభ్యర్థన. అలాంటి తల్లులకు, తండ్రులకు దాదాపు 30 ఇళ్లకు వెళ్లి సేవలు అందించాం. ఇంత మంది చనిపోయారు అని రోజూ సాయంత్రం హెల్త్ బులెటెన్.. ‘మాక్కూడా కరోనా వస్తుందా? చనిపోతామా’ అనేవారు పేషెంట్లు. వారిలో మనోధైర్యం నింపడానికి ప్రతి క్షణం పనిచేశాను. అంతిమయాత్ర మరో రిస్క్ మరణించినవారికి గౌరవంగా వీడ్కోలు పలకాల్సిన సమయంలో ఒంటరిగా అంతిమయాత్ర కు వెళుతున్నారని వార్తలు. అలాంటిది క్యాన్సర్ పేషంట్ చనిపోతే.. అదో పెద్ద కష్టం. చనిపోతున్న తల్లికి బిడ్డలు కూడా రాలేని పరిస్థితి. విపరీతమైన క్షోభ. నెల రోజులు, రెండు నెలలు, 15 రోజుల వ్యవధిలో చనిపోయిన వారున్నారు. మనుషుల భావోద్వేగాలకు సంబంధించిన సేవ ఇది. ‘ఒకబ్బాయి ఇసిఐఎల్ నుంచి బంజారాహిల్స్‌లో మా క్లినిక్‌కి వాళ్లమ్మ కోసం రోజూ ఉదయం నడుచుకుంటూ వచ్చేవాడు. వాళ్లమ్మది చివరి స్టేజ్. అతను అమ్మకు దగ్గరగా ఉండలేడు. అంత దూరం నుంచి ఎందుకు రిస్క్.. అంటే మీ ద్వారా మా అమ్మ గురించి వినడానికైనా ఇక్కడుంటాను కదా! అనేవాడు. అలా చివరి మజిలీ పేషెంట్స్ 11 మంది ఉండేవారు. వాళ్ల పిల్లలతో వీడియో కాల్ చేసి మాట్లాడించేవాళ్లం. అడ్డు చెప్పద్దని అడ్డుకున్నాను నాకు 57 ఏళ్లు. మా వారు అమ్మాయిని చూడటానికని అమెరికా వెళ్లి, లాక్డౌన్ కారణంగా అక్కడే ఉండిపోయారు. ఇక్కడ నేనొక్కదాన్నే. ఈ వయసు వారికి కరోనా త్వరగా ఎఫెక్ట్ అవుతుందన్న వార్తలు. మా వారు, అమ్మాయి నుంచి ఫోన్లు. కరోనా కాలం ఈ సేవలు ఆపేయమని. ‘కష్టకాలంలో ఆపేస్తే నన్ను నేను క్షమించుకోలేను, అడ్డుచెప్పద్దు’ అన్నాను. కళ్లతో ప్రేమను పంచుతూ.. స్పర్శ అనేది శక్తిమంతమైన విధానం. ఆ స్పర్శనే వద్దనేది కరోనా నినాదం. చాలా కఠినమైన సందేశం. కళ్లతో ప్రేమను చూపుతూ, మాటల్లో ధైర్యం చెబుతూ కదిలాం. కోవిడ్ సమయంలో 24 గంటలు సేవలో ఉన్నా మాలో ఎవరికీ కోవిడ్ రాలేదు. అదంతా మా సంకల్పమే. కష్టకాలంలోనూ చివరిమజిలీకి చేరుకున్నవారికి చేయూత అందించాను అనే తృప్తి మిగిలింది’’ అని శారద వివరించారు. క్యాన్సర్ ఇక చికిత్సకు తగ్గదని నిర్ధారించిన పేషంట్లను పాలియేటివ్ కేర్‌కు రిఫర్ చేస్తారు వైద్యులు. అలా వచ్చిన వారు కుటుంబం నుంచి దూరమయ్యామనే బాధ, నొప్పి, సామాజికం గా దూరం, ఆర్థిక సమస్యలతో పాటు ఆధ్యాత్మికంగానూ ఎన్నో బాధలు ఉంటాయి. ‘నేనేం తప్పు చేశాను. భగవంతుడా నాకెందుకీ శిక్ష వేశావు’ అని మధనపడుతుంటారు. అలాంటి వారికి స్పర్శ్‌లో స్వస్థత అందుతుంది. ఇక్కడ పేషంట్లను బతికున్నన్ని రోజులు భద్రంగా చూసుకునే ఆలయం. అలాంటి వారి మీద కరోనా పిడుగు పడినప్పుడు అండగా నిలిచారు శారద. ఊహించని కష్టం వచ్చిపడినప్పుడు ఎలా ఎదుర్కోవాలో కూడా తెలియని కష్టంలో ఉన్నప్పుడు చివరి మజిలీలో ఉన్న తల్లికి అసహాయ స్థితిలో ఉన్న బిడ్డకు వారధిగా నిలిచారు శారద లింగరాజు. డాక్టర్ దణ్ణం పెట్టారు చిత్తశుద్ధితో సేవచేసిన వైద్యదూత మా ఆస్పత్రిని కోవిడ్ నోడల్ సెంటర్‌గా ప్రకటించారు. ప్రాణభయంతో వణికిపోతున్న కరోనా బాధితులకు సేవలు అందించడమే మహాభాగ్యం అనుకున్నా. తొమ్మిది నెలలపాటు అలుపెరుగకుండా పనిచేశాం. పీపీఈ కిట్ లోపల చెమటకు చీమలు కుట్టినట్లు శరీరమంతా చురుక్కుమనేది. నాలుక పిడచకట్టుకు పోతున్నా, డీహైడ్రేషన్‌తో చుక్క నీళ్లు కూడా తాగే అవకాశం లేదు. పంటిబిగువున అన్నిబాధలను భరిస్తూ డ్యూటీ చేశాం. కరోనా ఏడాదిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. గతేడాది మార్చిలోనే గాంధీలో మొదటి కరోనా మృతి నా ఎదురుగానే అయింది. ఆయనను కాపాడేందుకు వైద్యులు, సిబ్బంది తీవ్రంగా శ్రమించినా ఫలితం దక్కలేదు. అప్పటినుంచి ప్రతి పేషెంట్‌కీ వైద్యసేవతోపాటు కౌన్సెలింగ్ ఇచ్చి మనోధైర్యం కల్పించే వాళ్లం. పేట్లబురుజు ప్రభుత్వ ఆస్పత్రి గైనకాలజిస్టు కరోనాతో గాంధీలో చేరింది. డిశ్చార్జ్ అయి వెళ్తూ ఆమె రెండు చేతులెత్తి నమస్కరించడం నాలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. వేలాది ప్రాణాలకు కాపాడడంలో మా సేవ ఉందని సంతృప్తి ఉంది. భారత సైనికదళాలు... గాంధీ ఆస్పత్రి వైద్యులు, సిబ్బందిపై పూలవర్షం కురిపించిన తర్వాత... స్థానికులు, కుటుంబ సభ్యులు నాపై పూలవర్షం కురిపించి అభినందించడాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. వేలాది మంది కరోనా బాధితుల మధ్య విధులు నిర్వహించినా కరోనా రాకపోవడం నిజంగా అదృష్టమే. జోజి కే అలెక్స్, స్టాఫ్‌నర్సు, గాంధీ హాస్పిటల్ సేవకు ఏటీఎమ్ స్ఫూర్తి జీవనంలో పేదరాలే కానీ, సేవలో సంపన్నురాలు అనిపించుకుంది ఎల్బినగర్ రాక్హిల్స్ కాలనీకి చెందిన లక్ష్మమ్మ. ఒక అపార్ట్మెంట్లో వాచ్‌మన్‌గా పనిచేసే లక్ష్మమ్మ నెల జీతం ఆరువేల రూపాయలు. లాక్డౌన్ టైమ్‌లో అందులో సగం డబ్బును ఖర్చుపెట్టి, వలసకార్మికుల కోసం ఆహారం వండిపెట్టేది. ఆమె చేసిన సేవ మరికొందరికి స్ఫూర్తినిచ్చింది. లాక్డౌన్ సమయంలో చేసిన పని గురించి అడిగితే ‘కష్టం చూడలేక తోచిన సాయం చేశాను’ అని తెలిపింది. వలసకార్మికులకు వండి పెడుతూ... ‘‘నేను పనిచేసే అపార్ట్మెంట్లో పది ప్లాట్లు ఉంటాయి. ఉన్న ఊరు వదిలిపెట్టి బతుకుతెరువు కోసం పట్నం వచ్చినం. రెక్కల కష్టంతో గడుపుకొస్తున్నం. కరోనా భయంతో ఎవరూ ఇళ్లు వదిలిపెట్టి రాలేని పరిస్థితి. మేమూ అదే పాటించేవాళ్లం. అయితే, మా చుట్టుపక్కల బిల్డింగ్ పనులు చేసేవారు కొందరున్నారు. వారంతా వలస వచ్చి పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. అందులో పిల్లలు, చంటి పిల్లల తల్లులూ ఉన్నారు. బిల్డింగ్‌ల పనులు ఆగిపోవడంతో వారికి పనిలేదు, చేతిల పైసలు లేవు. వారి అవస్థలు చూడలేక రోజూ కొంతమందికి అన్నం వండి పెట్టేదాన్ని’ అని తన దయార్ద్ర మనసును చాటుకుంది లక్ష్మమ్మ. ఒక అడుగుతో కదిలిన వేయి అడుగులు లక్ష్మమ్మ చేస్తున్న సాయాన్ని స్ఫూర్తిగా తీసుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాము రైస్ ఏటీఎమ్‌ను ఏర్పాటు చేసి, ఇప్పటికీ పేదలకు సాయం అందిస్తున్నారు. మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచడం కోసం మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకుని 80 మంది మహిళలకు కుట్టుమిషన్లు పంచుతున్నారు. లాక్డౌన్ టైమ్ నాటి సంఘటనలను, తనలో స్ఫూర్తిని నింపిన లక్ష్మమ్మ గురించి వివరించిన రాము దోసపాటి మాట్లాడుతూ –‘ఒక రోజు మా అబ్బాయి కోసం చికెన్ షాప్‌కి వెళితే, అక్కడ 20 కేజీల చికెన్ తీసుకుంటున్న లక్ష్మమ్మను చూశాను. ఈ సమయంలో అంత చికెన్ ఎందుకని అడిగాను. ‘వలస కార్మికులు తిండి లేక అవస్థపడుతున్నారు సారు. వారి కోసం వండిపెడుతున్నాను. చాలా ఆశ్చర్యపోయాను. ఆమె చేస్తున్న సేవను స్ఫూర్తిగా తీసుకున్నాను. ఆమె చెప్పిన వివరాలతో ఆ చుట్టుపక్కల ప్రాంతంలో భవన నిర్మాణ, వలసకార్మికులు ఎంతమంది ఉన్నారో చూశానో. వారి దయనీయ పరిస్థితికి కళ్లలో నీళ్లు వచ్చాయి. రైస్ ఏటీఎమ్ ద్వారా పేదలకు ఇప్పటికీ సాయం చేస్తున్నాను’ అని తెలిపారు. మనసెరిగిన నేస్తం చేయూత ఫ్యాషన్ డిజైనర్‌గా కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి నేను సైతం అంటూ ముందడుగు వేసింది నిహారికారెడ్డి. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడాలో తన డిజైనర్ స్టూడియో ద్వారా 15 మందికి ఉపాధి కల్పిస్తోంది. లాక్డౌన్ సమయంలో తన దగ్గర పనిచేసే వారిని వారి ఊళ్లకు, ఇళ్లకు చేర్చడమే కాకుండా చేనేత రంగానికి తన వంతు సాయం చేయడానికి ముందుకు కదిలింది. నిత్యావసర సరుకుల పంపిణీలో మరొక అడుగు ముందుకు వేసి అమ్మాయిలకు శానిటరీ న్యాప్కిన్స్ పంచింది. ‘‘మా వారు కణ్ణన్ సినిమా రంగంలో ఉన్నారు. ఓ రోజు మా ఇంటికి నెలకు సరిపడా సరుకులున్న బ్యాగ్ వచ్చింది. చిరంజీవిగారు అందరికీ సరుకులు పంచారని తెలిసింది. అది చూశాక ఇలాంటి పాకెట్స్ నిరుపేదలకు అందివ్వాలనే ఆలోచన వచ్చింది. దాంతోపాటు అమ్మాయిలు, అమ్మలు గుర్తుకువచ్చారు. వారి కోసం శానిటరీ ప్యాడ్స్ కొనుగోలు చేసి, సరుకులతో పాటు అందించాం. మా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో పేద ఇళ్ల ముందుకు తీసుకెళ్లి మేం సిద్ధం చేసిన ప్యాకెట్స్ పెట్టి వచ్చాం. చేనేతకు చేరువగా.. నేను డిజైనర్ కావడంతో చేనేత కార్మికుల పరిస్థితి లాక్డౌన్ టైమ్‌లో ఎలా ఉందో ఊహించగలను. చీరలు అమ్ముడు పోకపోతే డబ్బు చేతికి రాదు, వారి రోజువారి జీవనం కష్టమైపోతుంది. అందుకే పర్మిషన్ తీసుకుని నేరుగా నారాయణపేట్ చేనేతకార్మికుల దగ్గరకు వెళ్లి వారి నుంచి మెటీరియల్ కొన్నాను. ఫేస్బుక్ లైవ్ ప్రోగ్రామ్స్ చేశాను. వారి స్థితి చూసి, కొంతమంది ఆర్డర్ మీద అప్పటికప్పుడు ఆ చీరలను తెప్పించుకున్నారు. లాక్డౌన్ టైమ్‌లో కొన్న చేనేతచీరలతో ఇప్పుడు రీక్రియేషన్ డిజైన్స్ చేస్తున్నాను. బంగారం తాకట్టు నిత్యావసర సరుకులు, మాస్కులు, శానిటైజర్లు అందివ్వడానికి అప్పులు చేయాల్సి వచ్చింది. ఇప్పటికీ ఇందుకు సంబంధించిన డబ్బును షాపుల్లో కడుతున్నాను. నా సేవకు మిత్రులు కొంత సాయంగా నిలిచారు. అయినా డబ్బు సరిపోక పోతే నా బంగారం పై లోను తీసుకున్నాను. దీంతో సరుకుల పంపిణీ కార్యక్రమం ఒక యజ్ఞంలా నడించింది. కరోనా సమయంలో సేవలు అందించినందుకు గాను చిరంజీవిగారి చేతుల మీదుగా కరోనా వారియర్ అవార్డు అందుకున్నాను. అది నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింద’ని వివరించారు. – నిర్మలారెడ్డి -
13 రాష్ట్రాల నుంచి 50 మంది అమ్మాయిలు...
నడిపించడమా, కలిసి నడవడమా.. ఏది లీడర్షిప్? రెండూ! ‘యు గో దట్ సైడ్’ అని వేలూ చూపించాలి’, ‘ఇదిగో నాతో రా.. ’ అని చెయ్యీ అందివ్వాలి. పాలిటిక్స్‌లో మహిళలు ప్రజలకు మరింతగా అందుబాటులో, మరింతగా ప్రజామోదంతో ఎందుకు ఉంటారంటే.. ఇందుకే! ఈ రెండు లీడర్షిప్ క్వాలిటీలూ వాళ్లలో అంతర్నిర్మాణంగా ఉన్నందుకే! అలాంటిది.. శిక్షణ కూడా తోడైతే? ఆమె లీడ్ చేస్తుంది. వర్తమానాన్ని, భవిష్యత్తునీ! అలా పొలిటికల్ లీడర్‌షిప్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న ఫస్ట్ బ్యాచ్ మహిళా బృందం నేడు బయటికి వస్తోంది. 13 రాష్ట్రాల నుంచి 50 మంది అమ్మాయిలు... ‘జన గణ మన.. జన మొర విన, కల నిజమయ్యే.. కాలం ఇదే.. ఛక్ ఛక్ ఛక్..’ మంటూ వస్తున్నారు! అన్ని రంగాల్లోనూ నాయకత్వ స్థానంలో మహిళలు అద్వితీయ శక్తి సామర్థ్యాలతో సంస్థల్ని ముందుకు నడిపిస్తున్నా కూడా రాజకీయ రంగం మాత్రం వాళ్లను వెనక్కి లాగుతోంది. నిజానికి మహిళలు రాణించడానికి, సమాజాన్ని సంస్కరించడానికి తగిన వేదిక రాజకీయాలే. అందుకే ‘స్త్రీ శక్తి’ స్వచ్ఛంద సంస్థ, సి.ఎ.పి.ఎఫ్. (చీవెనింగ్ ఆలుమ్నీ ప్రాజెక్ట్ ఫండ్) కలిసి మహిళల కోసం ‘షి లీడ్స్’ అనే రాజకీయ శిక్షణా కార్యక్రమాన్ని ఫిబ్రవరి 24న వర్చువల్‌గా ప్రారంభించాయి. ఫస్ట్ బ్యాచ్ అది. శిక్షణ నేటితో పూర్తవుతుంది. ఈ లోపే రెండో బ్యాచ్ మొన్న శనివారమే మొదలైంది. తొలి బ్యాచ్‌లో 13 రాష్ట్రాలకు చెందిన 50 మంది మహిళలు కోర్సు పూర్తి చేశారు. రాజకీయ నాయకత్వంతోనే సమానత్వ సాధన షీ లీడ్స్ కోర్సులో శిక్షణ ఇస్తున్నవారంతా అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులే! రాజకీయ రంగ ప్రవేశం, ఎన్నికల్లో పోటీ చేయడం, చట్టసభల్లో ప్రజా సమస్యల్ని లేవనెత్తడం అనేవి షీ లీడ్స్ సిలబస్‌లోను ప్రధాన అధ్యాయాలు. వాటిల్లో మళ్లీ ఉప–అధ్యాయాలు. రోజుకు 5 గంటల పాటు వారం రోజులు శిక్షణ ఉంటుంది. కోర్సు పూర్తి చేయగానే సర్టిఫికెట్ వస్తుంది. ‘‘అయితే సర్, ఈ సర్టిఫికెట్ మాకు రాజకీయ రంగ ప్రవేశానికి యోగ్యతనిస్తుందా?’’ అని ఓ అభ్యర్థి తొలి రోజు క్లాసులోనే అడిగారు!సహజంగా వచ్చే సందేహమే. ‘‘అసలు మీకు ఈ కోర్సులో చేరాలన్న ఆలోచన రావడమే మీ యోగ్యత. సర్టిఫికెట్ అనేది మీ పాలనా పరమైన పరిజ్ఞానానికి థియరీ రూపం మాత్రమే. ప్రాక్టికల్‌గా మీరెప్పుడో లీడర్స్ అయిపోయారు’’ అని ఉత్తరాఖండ్ మాజీ గవర్నర్, కాంగ్రెస్ పార్టీ మాజీ కేంద్రమంత్రి మార్గరెట్ అల్వా చెప్పడం ఫస్ట్ బ్యాచ్ ‘యువ పొలిటీషియన్స్’కి స్ఫూర్తినిచ్చే సమాధానం అయింది. స్ఫూర్తి మాత్రమే కాదు. ఉత్సాహం కూడా. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ రాజీవ్ గౌడ, బీజేపీ లోక్‌సభ ప్రస్తుత ఎంపీ హీనా గవిట్, సమాజ్‌వాదీ ప్రతినిధి ఘనశ్యామ్ తివారీ ‘షీ లీడ్స్’ ఫస్ట్ బ్యాచ్‌కి రాజకీయ పాఠాలు చెప్పినవారిలో ఉన్నారు. ఈ కోర్సుకు ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ డెమొక్రసీ’, నేత్రి, శక్తి సంస్థలు కూడా సహకారం అందించాయి. ‘‘మహిళా నాయకుల్ని ప్రజలు అంగీకరిస్తారు. మహిళా నాయకులూ ప్రజలకు అందుబాటు లో ఉంటారు. అందుకే మహిళలు చొరవగా రాజకీయాల్లోకి రావాలి’’ అని అల్వా తరగతుల ప్రారంభంలోనే చెప్పారు. ‘‘మీరొస్తే రాజకీయాల్లో కులాల ప్రభావం తగ్గుతుంది’’ అంటూ.. రాజకీయాల్లోకి మహిళలు ఎక్కువ సంఖ్యలో రావడం వల్ల సమాజానికీ, దేశానీ జరిగే మంచి గురించి మాట్లాడారు హీనా గవిట్. రెండో బ్యాచ్ ‘షీ లీడ్స్’ క్లాసులకు ఆప్ పార్టీ నుంచి పృథ్వీరెడ్డి, వందనా కుమారి, మాజీ బీజేపీ ఎంపీ అర్చనా చిత్నిస్ వస్తున్నారు. అసలు ఇలాంటి కోర్సు ఎందుకు అనే ప్రశ్న కూడా క్లాస్ రూమ్‌లో ఓ విద్యార్థినిని నుంచి వచ్చింది. ‘మంచి ప్రశ్న’ అన్నారే కానీ, ‘ఇలాంటి కోర్సులో ఎందుకు చేరావు?’ అని రాజకీయ గురువులు అడగలేదు. ‘‘పాలిటిక్స్‌లోనూ ఇదే విధమైన సావధానత ఉండాలి. అలా మహిళా నేతలు మాత్రమే ఉండగలరు. భారతదేశ మహిళా రాజకీయ శక్తిని బలోపేత చేయడం కోసం ఇలాంటి ఒక కోర్సు అవసరం అని మేము భావించాం’’ అని ‘స్త్రీశక్తి’ సంస్థ వ్యవస్థాపకురాలు రేఖా మోడీ అన్నారు. త్వరలోనే కాలేజీలు, విశ్వవిద్యాలయాలలో షీ లీడ్స్ సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా ఆమె తెలిపారు. మహిళల స్వభావంలోనే నాయకత్వ గుణాలు ఉంటాయి. అయితే పురుషాధిక్యత ఆ గుణాలను మాటలతో, చేతలతో ఏళ్లుగా అప్రాముఖ్యం చేస్తూ వస్తోంది. బాధితులు ఎవరైతే అవుతారో సహజంగానే వారి స్వరం ప్రశ్నిస్తుంది. వారి పిడికిలి బిగుస్తుంది. వారి గళం నినదిస్తుంది. అందుకే సామాజికంగా కూడా అణచివేతల్ని, అవకతవకల్ని, దౌర్జన్యాలను చూస్తున్నప్పుడు మహిళలే ముందుగా స్పందిస్తారు. వాళ్లే ఎందుకు ముందుగా స్పందిస్తారంటే.. ప్రతి అపసవ్యత పర్యవసానం చివరికి వారి మీదే పడుతుంది. మరీ ఈ రాజకీయ కోర్సులో చేరడానికి అర్హత ఏమిటి? రాజకీయ రంగ ప్రవేశానికి ఈ కోర్సు దారి చూపుతుందా? మళ్లీ రెండు ప్రశ్నలు. రేషన్ క్యూలో నిలుచుని ఉన్నప్పుడు మీ కంటపడిన డీలర్ అక్రమాన్ని మీరు చూస్తూ ఊరుకోకుండా జనం తరఫున వేలెత్తి చూపిన క్షణమే మీరు రాజకీయ రంగ ప్రవేశం చేసినట్లు. రాజకీయ శిక్షణలో చేరేందుకు కూడా ఆ అడిగే తత్వమే, నిలదీసే ఆగ్రహమే క్వాలిఫికేషన్. -
వెండితెరపై పాటలకు...స్టెప్‌లకే ఆమె పరిమితమా?
-
అమ్మాయిలకు స్వేచ్ఛ ఇవ్వాలి: సీరత్ కపూర్
అమ్మాయంటే వంచిన తల ఎత్తకూడదు, గట్టిగా నవ్వకూడదు, నచ్చిన జాబ్ చేయకూడదు... మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు ఇలాంటి ఆంక్షలు కూడా చాలావరకూ తగ్గాయి. అయితే ఇంకా కొన్ని చోట్ల స్వేచ్ఛ లేని అమ్మాయిలను చూస్తున్నాం. ‘‘అమ్మాయిలకు హద్దులు పెట్టొద్దు.. స్వేచ్ఛ ఇవ్వండి’’ అంటున్నారు హీరోయిన్ సీరత్ కపూర్. మహిళా దినోత్సవం సందర్భంగా చిన్నప్పుడు జరిగిన ఓ విషయాన్ని గుర్తు చేసుకున్నారామె. ఆ విషయం గురించి సీరత్ కపూర్ మాట్లాడుతూ – ‘‘చిన్నప్పుడు మా స్కూల్లో ఆర్ట్ కాంపిటీషన్ జరిగింది. నేను ఒక అమ్మాయి బొమ్మ గీశాను. అమ్మాయి చేతులు ముడుచుకున్నట్లుగా ఉన్న ఆ బొమ్మను చూసి, మా అమ్మగారు ‘సిరీ... అలా చేతులు ముడుచుకోకూడదు. హద్దులెందుకు? ఫ్రీగా వదిలేయాలి’ అన్నారు. అమ్మ మాటల్లో ఎంతో అర్థం ఉంది. అమ్మాయికి స్వేచ్ఛ ఇవ్వాలని ఆ విధంగా చెప్పారు మా అమ్మ. కానీ ఆ ప్రైజ్ కన్నా విలువైన విషయాన్ని మా అమ్మ చెప్పారు. ‘ఇలా ఉండకూడదు... అలా చేయకూడదు’ అని మా ఇంట్లో నాకెప్పుడూ ఆంక్షలు విధించలేదు. ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేయకుండా ఆమె నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాను’’ అన్నారు. అన్నట్లు.. . ‘రన్ రాజా రన్’, ‘టైగర్’, ‘రాజుగారి గది 2’, ‘టచ్ చేసి చూడు’ వంటి చిత్రాల్లో నటించిన సీరత్ చేసిన హిందీ చిత్రం ‘మారీచ్’ విడుదలకు సిద్ధమవుతోంది. 2014లో విడుదలైన ‘జిద్’ ద్వారా బాలీవుడ్‌కి పరిచయమైన సీరత్ ఆరేళ్ల తర్వాత చేసిన హిందీ చిత్రం ఇది. -
ఎనిమిది 12 అయితే ఆమెకు ఎదురీతే..
ఈ కాలం అమ్మాయిలు.. చదవని డిగ్రీ లేదు.. చేయని ఉద్యోగం లేదు.. పొందని అవకాశం లేదు.. రాష్ట్రాలూ ఏలుతున్నారు..అరే.. స్పేస్లోకీ వెళ్తుంటే!! వాళ్లకు అండగా ఎన్ని చట్టాలు? 498 (ఏ), డొమెస్టిక్ వయొలెన్స్, నిర్భయ..! బస్సుల్లో వాళ్లకు సీట్లు.. స్థానిక పాలనాసంస్థల్లో సీట్లు.. ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్స్.. ఇంకా.. ఆగొచ్చు అక్కడితో! ఎంత చదువుకుంటున్నా.. ఎన్నో కొలువుల్లో ఉన్నా.. ఆఖరికి అంతరిక్షంలోకి వెళ్లినా ఎక్కడా నాయకత్వంలో లేరు. మహిళాపాలకులనూ వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు! ఎన్ని చట్టాలు వచ్చినా వాళ్ల మీద హింస మాత్రం ఆగట్లేదు. బస్సుల నుంచి స్థానిక పాలనా సంస్థల దాకా ఉన్న సీట్లూ వాళ్లను నాయకులుగా నిలబెట్టేవి కావు. ఉద్యోగాల్లో రిజర్వేషన్లూ ఆడవాళ్లను బాసులుగా చేయట్లేదు. అన్నీ నేర్చుకొని.. లేదా నేర్చుకోవాలనే తపన చూపించి నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలనుకుంటే... ‘నేను డ్రైవింగ్ నేర్చుకోనా?’ ఉత్సుకతో అడిగిన భార్యకు ‘ముందు పరాఠా చేయడం నేర్చుకో.. డ్రైవింగ్ సంగతి తర్వాత’ అని భర్త చెప్పే సీన్ల (థప్పడ్ అనే బాలీవుడ్ సినిమాలోనిది)వంటివే ఎదురవుతుంటాయి. తప్ప ‘మిష్టర్ పెళ్లాం’ సినిమాలో లాగా ‘మీ సరకుల్లో చచ్చులు, పుచ్చులు ఉండవని.. ఉంటే చూపించమని సవాల్ చేయండి.. క్వాలిటీనే మీ బ్రాండ్‌గా మార్చుకోండి.. సేల్స్ ఎందుకు పెరగవో చూద్దాం’ అని సలహా ఇచ్చిన మహిళలోని ప్రతిభను మెచ్చి, ఆత్మవిశ్వాసాన్ని, నాయకత్వ లక్షణాన్నీ గుర్తించి మేనేజర్ స్థాయి ఉద్యోగం ఇచ్చిన యాజమాన్యం.. అలాంటి సీన్లు కనిపించవు. చర్విత చర్వణంలాంటి ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే.. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి యూఎన్ విమెన్ ఈ ఏడు ప్రకటించిన థీమ్.. ‘‘విమెన్ ఇన్ లీడర్షిప్: అచీవింగ్ ఏన్ ఈక్వల్ ఫ్యూచర్ ఇన్ ఏ కోవిడ్–19 వరల్డ్’’. మహిళలు నాయకత్వం వైపు అడుగులేస్తూ స్త్రీ, పురుష సమానత్వాన్ని సాధించాలని యూఎన్ విమెన్ వింగ్ ఏటా ఒక్కో థీమ్‌తో ప్రపంచాన్ని చైతన్య పరుస్తోంది. ఆ స్ఫూర్తిని అందుకుంటున్న దేశాలున్నాయి. ఆ ప్రయాణాన్ని ఇదివరకే ప్రారంభించిన దేశాలూ ఉన్నాయి. నిర్లక్ష్యం చేస్తున్న దేశాలూ లేకపోలేదు. మనం ఏ జాబితాలో ఉన్నామో మహిళలకు సంబంధించి తాజా పరిస్థితులు, పరిణామాలు, పర్యవసానాలను బట్టి అర్థమవుతూనే ఉంది. సందర్భం కాబట్టి ఇటీవల కేంద్ర ప్రభుత్వ కార్మికశాఖ చేసిన పన్నెండు పని గంటలు, మూడు రోజుల సెలవులు అనే ప్రతిపాదనను మహిళా కోణంలోంచి చూద్దాం. ప్రభుత్వాలు ఎలాంటి ప్రతిపాదన చేసినా.. చేయాలనుకున్నా దాని ప్రభావం స్త్రీల మీద ఎలా ఉంటుందో.. ఎలా ఉండబోతుందో ఒకటికిపదిసార్లు చర్చించి, తరచి చూసుకొని నిర్ణయాలు తీసుకోవాలి. చట్టాలుగా తేవాలి. ప్రతిపాదన దశలో మహిళా వర్గం నుంచి వస్తున్న స్పందన, ప్రతిస్పందనలనూ పరిగణనలోకి తీసుకోవాలి. కార్మికశాఖ ప్రతిపాదించిన ఈ పనిదినాల మార్పు మీద మెట్రో నగరాల్లో చర్చ మొదలై పోయింది. ‘రోజూ పన్నెండు గంటల చొప్పున వారానికి నాలుగు పనిదినాలు, మూడు వారాంతపు సెలవులు లేదా ఇప్పుడెలా ఉందో అలాగే అంటే రోజుకి ఎనిమిది గంటల చొప్పున వారానికి ఆరు పనిదినాలనే అనుసరించడం. ఇది ఐచ్ఛికం. ఈ రెండింటిలో ఉద్యోగి ఏ పద్ధతినైనా అవలంబించవచ్చు’ అనేదే ఆ ప్రతిపాదన. ఇది కేవలం మహిళలకు మాత్రమే కాదుకదా.. ఉద్యోగులు అందరికీ కదా? అవును. కానీ ప్రభావం మాత్రం మొత్తం స్త్రీల మీదే ఉంటుంది. అన్నేసి గంటల పనివేళలు ఎవరికైనా ఇబ్బంది. మగవాళ్లు రోజంతా ఆఫీస్‌లో గడిపితే ఇంట్లోని మహిళలు అదనపు భారాన్ని మోయాలి. ఆఫీస్‌కెళ్లే ఆడవాళ్ల తిప్పలైతే చెప్పక్కర్లేదు. విలువలేని ఇంటి చాకిరీతోపాటు ఎంతోకొంత విలువ చేసే ఆఫీస్ చాకిరీ కలసి రోజుకు 24 గంటలూ సరిపోవు. ‘ఎనిమిది, తొమ్మిది గంటల పనివేళలకే ఇంట్లోంచి ఉదయం బయలుదేరితే రాత్రికి గానీ ఇల్లు చేరని పరిస్థితి. నగరాల్లోని ట్రాఫిక్ ఇక్కట్లు ఆ సమయాల్ని మరింత సాగదీస్తాయి. రోజుకి పన్నెండు గంటలంటే ఊహించుకోవడానికేమీ లేదు. ‘అయినా ఇది ఐచ్ఛికమే అంటున్నారు కదా?’ అని కొంతమంది ఉద్యోగినులు, ఉద్యోగులనూ అడిగితే.. ‘ముందు ఆప్షన్‌గానే ఇస్తారు తర్వాత అది తప్పనిసరి నిబంధనగా మారుతుంది. సపోజ్.. మా ఆఫీస్ (ప్రభుత్వ కార్యాలయం)లో కొంతమందిమి ట్వల్వ్ అవర్స్, త్రీ డేస్ వీకెండ్‌ను ఆప్షన్‌గా తీసుకున్నాం అనుకోండి. ఇంకొంతమంది వన్ డే వీకెండ్ ఆప్షన్లో ఉన్నారనుకోండి. ఒక పనికి సంబంధించి ఆ టూ కేటగిరీస్ మధ్య కో ఆర్డినేషన్ ఎలా కుదురుతుంది? యూనిఫార్మిటీ ఉన్నప్పుడే పనులు సవ్యంగా జరగడం కష్టం.. ఇక ఒకే సెక్షన్లో ఇలా డిఫరెంట్ కేటగిరీస్‌లో పనిచేసే వాళ్ల మధ్య ఎలా కుదురుతుంది? దాంతో అందరికీ పన్నెండు గంటల పనివేళలే తప్పనిసరి చేసేస్తారు’ అని చెప్పారు. ఉద్యోగినులు, అందులోనూ వర్కింగ్ మదర్స్‌ను కదిలిస్తే.. ‘ట్వల్వ్ వర్కింగ్ అవర్స్ కన్నా త్రీ డేస్ వీకెండే అట్రాక్ట్ చేస్తుంది ఎవరినైనా. అబ్బా.. మూడు రోజులు హాలీడేస్ అనిపిస్తుంది. కానీ దానికి మొత్తం నాలుగు రోజులను పణంగా పెడుతున్నామన్న ధ్యాస రాదు. ఒకవేళ ఉద్యోగులుగా మనం లాజికల్‌గా ఉండి వన్ డే వీకెండ్ ఆప్షన్‌కి వెళితే ఇంట్లో ప్రెజర్ మొదలవుతుంది. మూడు రోజులు సెలవులిస్తుంటే హాయిగా పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఉండక ఒక్క రోజు సెలవుకి వెళ్లడం ఎందుకు? అని. రోజూ పన్నెండు గంటలు ఆఫీస్‌లో.. ప్లస్ నాలుగ్గంటలు ట్రాఫిక్‌లో ప్రయాణాలతో పదహారు గంటలు బయటే గడిపితే ఇంటి పని ఎప్పుడు చేసుకోవాలి? ఎన్నింటికి నిద్రపోవాలి? ఉదయం ఎన్నింటికి లేవాలి? పిల్లలను ఎవరు చూసుకోవాలి? వాళ్ల తిండీతిప్పలకు అత్త, అమ్మ మీదో.. లేకపోతే సర్వెంట్ మెయిడ్ మీదో ఆధారపడ్డా.. వాళ్ల చదువుసంధ్యలు ఎవరు పట్టించుకోవాలి? దీని బదులు ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చోవడం బెటర్ అనిపిస్తుంది. ఆ వెసులుబాటైనా కల్పించేలా లేవు కదా పెరిగిన ధరలు. మొండికేసి ఉద్యోగమే ముఖ్యం అనుకుంటే ఏదోకరోజు రోగాల కుప్పై సంపాదించుకున్నదంతా మెడికల్ బిల్లులకు పే చేయాల్సి వస్తుంది. అమ్మో... తలచుకుంటేనే భయంగా ఉంది’ అంటున్నారు. నిజమే.. ఇంకా చట్టంగా రాకుండా.. కేవలం చర్చల్లోనే ఈ ప్రతిపాదన ఇంతగా వణికిస్తోంది. బయట పనుల్లో స్త్రీలు భాగస్వాములైనంత చొరవగా, వేగంగా ఇంటి పనుల్లో మగవాళ్లు భాగస్వాములు కాలేదు. మనకది నేటికీ వింత సంస్కృతే. అమ్మాయి ఉద్యోగం చేయాలి, ఇంట్లో పనీ చూసుకోవాలి. పిల్లల పెంపకమూ ఆమె బాధ్యతే. అసలు మహిళా దినోత్సవం వచ్చిందే పనివేళల కుదింపు, శ్రమకు తగ్గ వేతనం, ఓటు వేసే హక్కు కావాలనే డిమాండ్‌తో. వందేళ్ల పైబడ్డ చరిత్ర ఆ విప్లవానిది. ఈ వందేళ్లలో సాధించిన నాగరికత ఆధునిక స్త్రీ సవాళ్లను గుర్తించాలి.. సమానత్వాన్ని చేకూర్చాలి. శ్రమకు తగ్గ వేతనం నుంచి సమాన వేతన లక్ష్యానికి చేరాలి. కానీ సాంకేతిక యుగంలో కూడా స్త్రీ విషయంలో ఇంకా ప్రాథమిక దశే మనది. మహిళలు గడప దాటితే ఎక్కడికి వెళ్తున్నారో పోలీస్‌స్టేషన్‌లో చెప్పి, వివరాలు నమోదు చేసి వెళ్లాలనే నిబంధన (మధ్యప్రదేశ్‌లో) పెట్టే స్థితిలో ఉంటే సమానత్వం మాటెక్కడిది? పాశ్చాత్య దేశాలు మనకు భిన్నంగా ఉన్నాయి. ఫ్రాన్స్‌లో వారానికి 35 గంటల పని నియమం. అమెరికాలో వారానికి 40 గంటలు. మన దగ్గర వారానికి 48 గంటలు. లేబర్ యాక్ట్ ప్రకారం రోజుకి తొమ్మిది గంటలు గరిష్ట పరిమితి. ఏ రోజైనా తొమ్మిది గంటలకంటే ఎక్కువ పనిచేయించుకుంటే దాన్ని ఓటీగా పరిగణించి రెట్టింపు డబ్బులు చెల్లించాలి. స్వీడన్లో ఎనిమిది గంటల పనివేళలను ఆరు గంటలకు మార్చారు. దీనివల్ల ఉత్పత్తిలో ఎలాంటి ఆటంకాలు రాకపోగా పని సామర్థ్యం పెరిగినట్టుగా గమనించారు. అంతేకాదు ఉద్యోగుల ఇళ్లల్లోనూ ఆరోగ్యకర వాతావరణం నెలకొందని అధ్యయనాలు తెలిపాయి. కాలక్రమేణా ఈ పనిగంటల విధానాన్ని ఇలా సరళం చేసేలా ఆలోచించాలి కాని క్లిష్టతరం చేయడమేంటి? పారిశ్రామిక విప్లవ పూర్వకాలానికి వెళ్తున్నామా అనిపిస్తోంది కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ ఆలోచనలు వింటూంటే’ అని ప్రశ్నిస్తున్నారు సామాజికవేత్తలు. తలనొప్పి వ్యవహారంగా.. సాంకేతికత తెచ్చిన ఆధునికత ఎంత విస్తృతమైనా ఇంటా, బయటా మహిళల భద్రత విషయంలో మనం అనాగరికంగానే ఉన్నాం. ఆడవాళ్లకు ఉద్యోగాలిస్తే అన్నీ సవాళ్లే అని విసుక్కునే యాజమాన్యాలే ఎక్కువ. అమ్మాయిలకు ఉద్యోగాలంటే ఆఫీస్ డెకొరమ్ను డిసిప్లిన్‌లో పెట్టాలి, రాత్రి తొమ్మిది దాటితే రవాణా సౌకర్యం కల్పించాలి, యాంటీ సెక్సువల్ హెరాస్మెంట్ సెల్‌ను ఏర్పాటు చేయాలి, మెటర్నిటీ లీవ్‌ను ఇవ్వాలి.. ఇదంతా తలనొప్పి వ్యవహారంగా భావించే యాజమాన్యాలు చాలానే ఉన్నాయి. దీని కన్నా మహిళలను తీసుకోకుండా ఉంటేనే నయం కదా అనే ఆచరణలోకి వచ్చేస్తున్నాయి. పని ప్రదేశాల్లో స్త్రీలకు ఎదురయ్యే ఇబ్బందులను అరికట్టే సరైన యంత్రాంగం లేదు. ఇప్పుడీ పనిగంటల పెంపు మహిళల ఉద్యోగ జీవితాన్ని మరింత అభద్రతలోకి నెట్టడమే కదా! మా ఉద్యోగ హక్కును, అవకాశాలను హరించేయడమే కదా? అంటున్నారు ఈ తరం అమ్మాయిలు. నోటితో నవ్వి నొసటితో వెక్కిరించడమే.. మహిళలు లీడర్షిప్ వైపు రావాలి. ఆర్థిక, సాంఘిక, రాజకీయంగా నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలి అని ఉపన్యాసాలు ఇస్తున్నాం.. వింటున్నాం. ఇలా మహిళా దినోత్సవాల పేరిట స్ఫూర్తినీ పంచుతున్నాం. ఇంకో వైపు ఈ గంటల పెంపు వంటివాటినీ అమలు చేయచూస్తున్నాం. మహిళా కోణంలోంచి చూస్తే పొమ్మనలేకుండా పొగబెట్టే కార్యక్రమంగానే తోస్తోంది. వాళ్లంతట వాళ్లు ఉద్యోగాల నుంచి తప్పుకునేలా చేసే ప్రణాళికే ఇది. యాజమాన్యాల కోసం చేస్తున్న ప్రతిపాదన. ఇలాంటి అడ్డంకులను పేరుస్తూ కమాన్ లేడీస్.. మీరు సాధించగలరు.. అన్నిరంగాల్లో మీరు లీడర్స్‌గా రావాలి అని ప్రోత్సహించడంలో అర్థం ఉందా? నోటితో నవ్వి నొసటితో వెక్కిరించడం కాదా ఇది .. అని అభిప్రాయపడుతున్నారు నాయకత్వ బరిలో ఉన్న చాలా మంది మహిళలు. ఈ అభిప్రాయం అపోహ కాదనే అనిపిస్తోంది. దీని మీద చర్చలు విస్తృతం కావాలి. పురుషులూ పాలుపంచుకోవాలి. ఇంట్లో అయినా బయట అయినా శ్రమలో స్త్రీ, పురుషుల సమభాగస్వామ్యం ఉండాలి. మహిళలు ఐచ్ఛికంగా ఉద్యోగాలు వదులుకోవడం కాదు.. ఇన్నాళ్లుగా ఈ సమాజం పురుషుడికి ఇచ్చిన నాయకత్వ వరాన్ని వాళ్లు వదులుకోవాలి. స్త్రీలకూ ఆ అవకాశం ఉండాలని గ్రహించాలి. ఆ హక్కును మహిళలూ తీసుకోవాలి. దీని కోసం మహిళల పరిధిని కుదించే నిబంధనలు కాదు.. వాళ్ల స్వేచ్ఛాస్వాతంత్య్రాలు, ప్రజ్ఞ, సామర్థ్యాలను గౌరవించే ప్రతిపాదనలు, చట్టాలు కావాలి. సవాళ్లు.. అవకాశాల తీరు ► మన చట్టసభల్లో కేవలం 14 శాతం మంది మాత్రమే మహిళలు. ► పారిశ్రామిక సంస్థల విషయానికి వస్తే పేరున్న అయిదు వందల కంపెనీల్లో కేవలం అయిదు శాతం స్త్రీలు మాత్రమే సీఈఓలుగా ఉన్నారు. ప్రపంచంలో మనం ► 193 దేశాల్లోని చట్టసభల్లో స్త్రీల భాగస్వామ్యం లెక్క తీస్తే మనం 150వ స్థానంలో ఉన్నాం. భద్రత స్కేలు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లెక్కల ప్రకారం 2018తో పోల్చితే 2019లో మహిళల మీద నేరాల సంఖ్య 7.3 శాతం పెరిగింది. ఈ నేరాల్లో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. దళితుల మీద నేరాల విషయానికి వస్తే ఆ స్థానాన్ని రాజస్థాన్ తీసుకుంది. ► 2019లో మహిళల మీద జరిగిన నేరాల సంఖ్య 4,05,816 (నమోదైన కేసులు). 2018లో ఈ సంఖ్య 3,78,236. ► లైంగిక దాడుల విషయానికి వస్తే 5వేల 997 కేసులతో రాజస్థాన్ ఆ అపఖ్యాతిని మోస్తోంది. ఆ వరుసలో 3,065 కేసులతో ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో నిలబడింది. ► పోక్సోయాక్ట్ కింద నమోదైన నేరాల్లో 7,444 కేసులతో ఉత్తరప్రదేశ్ ముందుంది. తర్వాత మహారాష్ట్ర. అక్కడ నమోదైన కేసుల సంఖ్య 6,402. ► వరకట్న కేసుల్లోనూ ఉతర్తప్రదేశ్కే అపకీర్తి కిరీటం. నమోదైన కేసుల సంఖ్య 2,410. తర్వాత బిహార్. కేసుల సంఖ్య.. 1,220. ► యాసిడ్ దాడుల్లోనూ ఉత్తరప్రదేశ్‌దే ప్రథమ స్థానం. నమోదైన కేసులు 42. రెండో స్థానంలో పశ్చిమ బెంగాల్ ఉంది. నమోదైన కేసులు 36. ( ఎన్సీఆర్బీ 2019 ) 12 గంటల పనిదినం అకాల మరణమే! ఉద్యోగుల చేత వారానికి 4 రోజులే పని చేయించి, రోజుకి 8 గంటల బదులు 12 గంటలు పని చేయించుకోవచ్చుననే ప్రతిపాదన వల్ల ప్రధానంగా స్త్రీలకు జరిగే నష్టం.. స్త్రీలు నాయకత్వ స్థానాల్లోకి ఎదగడానికి కావలిసిన పరిస్థితులు.. స్త్రీ–పురుష సమానత్వ సాధనకు పురుషులు చేయాల్సిన కృషి.. వీటన్నిటికీ శాశ్వత పరిష్కారం ఇప్పుడున్న పెట్టుబడిదారీ విధానాన్ని తీసెయ్యడమే. అది ఇప్పటికిప్పుడు జరిగే పని కాదు కాబట్టి, తాత్కాలిక పరిష్కారాల గురించి ఆలోచించాలి. ప్రస్తుతం నూటికి 90 శాతం పని స్థలాల్లో, 8 గంటల పని దినం అయినా అమలులో లేదు, కాయితాల మీద తప్ప. రోజుకి 8 గంటల చొప్పున వారంలో 6 రోజుల పని అయినా, రోజుకి 12 గంటల చొప్పున వారంలో 4 రోజులే పని అయినా, పని చేసేది 48 గంటలే గదా? అని ప్రభుత్వమూ, యజమానులూ వాదించవచ్చును. కానీ, 12 గంటల పని దినంలో, 8 గంటల పని దినంలో కన్నా శ్రమ తీవ్రత ఘోరంగా వుంటుంది. యజమానులు ఉత్పత్తి సాధనాలను, ఎప్పటికప్పుడు మార్చివేసి, ఉద్యోగులు (కార్మికులు) సృష్టించే అదనపు విలువని పెద్ద ఎత్తున గుంజు కోగలుగుతారు. 12 గంటల పని దినంలో వుండే శ్రమ తీవ్రత, మార్క్స్ తన ‘కాపిటల్’ పుస్తకం లో చెప్పినట్టు ‘‘అది కార్మికుని వాస్తవ ఆయుష్షును తగ్గించడం ద్వారా ఒక నిర్ణీత కాల పరిమితిలో అతని ఉత్పత్తి కాలాన్ని పొడిగిస్తుంది.’’ అది క్రమంగా ‘‘అకాల అశక్తతనీ, మరణాన్నీ ఉత్పత్తి చేస్తుంది.’’ కాబట్టి, కార్మికులు 8 గంటల పనిదినం అనే నియమాన్ని యజమానులు కచ్చితంగా అమలు పరచాలని డిమాండు చేయడమే తాత్కాలిక పరిష్కారం. ఇంటి పని అనేది ఇప్పటికీ ప్రధానంగా స్త్రీల బాధ్యతగానే వుంది కాబట్టి, 12 గంటల పని దినం వల్ల, బైటికి వెళ్ళి పనులు చేసే స్త్రీల మీద, శారీరకం గానూ, మానసికంగానూ ఒత్తిడి పెరుగుతుంది. ఆ స్త్రీలు పిల్లలకెప్పుడు తిండి పెడతారు? పిల్లల్ని ఎప్పుడు బడికి పంపుతారు? ఇంట్లో వుండే వృద్ధుల్ని ఎలా చూసుకుంటారు? రోజుకి 12 గంటల చొప్పున కాక, 24 గంటల చొప్పున అయితే, 2 రోజుల్లోనే కార్మికులు ఇళ్ళకు వెళ్ళకుండా 48 గంటలు పని ఇచ్చేస్తారు గదా! అది యజమానులకు ఎంత మేలు! స్త్రీలు నాయకత్వ స్థానాలలోకి ఎదగడం అంటే, ఉద్యోగాలలో, పని స్థలాల్లో, శారీరక శ్రమలు చేసే వారిపైనా, కొన్ని రకాల మేధా శ్రమలు చేసే వారి పైనా‘అధికార’ స్థానాల్లో వుండడమే! ఇప్పుడు ఆ స్థానాల్లో మొగవాళ్ళే ఎక్కువగా వున్నారు కాబట్టి. ఆ అధికార స్థానాల్లో, పురుషులకైనా, స్త్రీలకైనా ‘పర్యవేక్షణ’ అనే సహజంగా అవసరమయ్యే పనీ వుంటుంది. ‘పెత్తనం’ అనే అసహజ కార్యమూ వుంటుంది. పర్యవేక్షణ శ్రమలు చేసే అవకాశం కోసం స్త్రీలు డిమాండు చెయ్యవచ్చును. పెత్తనం శ్రమ చేసే అవకాశం ఎవ్వరికీ వుండకూడదు. కానీ, ‘తప్పుడు సామాజిక సంబంధాల’(‘‘ఫాల్టీ సోషల్ రిలేష¯Œ ్స’’) వల్ల ఆ స్థానాలు అవసరం అయ్యాయి. స్త్రీ–పురుష సమానత్వం కోసం స్త్రీలూ, పురుషులూ కృషి చేయవలిసింది, సమసమాజం కోసమే! అంటే, స్తీలకీ, పురుషులకీ ఇద్దరికీ ఇంటి పనీ, ఇద్దరికీ బైటి పనీ అనే శ్రమ విభజన అమలు జరిగే సమాజం కోసం కృషి చెయ్యాలి. భిన్నంగా ఉంటుందని ఊహించలేం ఆడవాళ్ల జీవితాలు ఎన్నో సమస్యలతో ముడిపడి ఉంటాయి. ఇంటి, వంట పని దగ్గర్నుంచి భర్తకు, పిల్లలకు లంచ్ బాక్స్‌లు సర్దివ్వడం వరకు ఒత్తిడి అంతా ఆడవాళ్లే భరించాల్సి వస్తోంది. కాబట్టి పన్నెండు గంటల ఆఫీస్ పనివేళల వల్ల రోజూ వారి జీవితం మరింత భారమవుతుంది. లాక్డౌన్ టైమ్‌లో మహిళల మీద పెరిగిన హింసను గమనిస్తే వారానికి మూడు సెలవులు ఆ హింసకు భిన్నంగా గడుస్తాయని ఊహించలేం. అలాగని పన్నెండు గంటల సమయాన్ని ఆఫీస్‌కూ వెచ్చించలేరు కదా. ఇంటి, వంట పనిలో మగవాళ్లు విధిగా భాగస్వాములైతే తప్ప మహిళలపై భారం, హింస తగ్గే సూచనలు లేవు. మారిన కాలానికి అనుగుణంగా మగవాళ్ల మనస్తత్వం మారకుండా ఎంతకాలం నిర్లజ్జగా, స్తబ్ధుగా, కటువుగా ఉంటుందో అంతకాలం స్త్రీ, పురుషుల సంబంధాలు హింసాపూరితంగానే ఉంటాయి అనడంలో సందేహం లేదు. ఈ కోణంలో ఆలోచన చేయకుండా తెచ్చే ఎలాంటి పాలసీలైనా మహిళా సాధికారతకు అడ్డంకులే తప్ప వాళ్ల లీడర్షిప్ను పెంచే ప్రయత్నాలు కావు. – అంకురం సుమిత్ర, సామాజిక కార్యకర్త వలంటరీగా ఇంటికి పంపించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వ కార్మికశాఖ ప్రతిపాదన వింటుంటే ఆ మధ్య జరిగిన ఓ సంఘటన గుర్తొస్తోంది. ఆడవాళ్లు ఆటోలు నడుపుతుంటే మేల్ ఆటోడ్రైవర్లంతా స్ట్రయిక్ చేశారు. ఇదొక్కటే కాదు గ్లోబలైజేషన్ తొలినాళ్లనాటి సంఘటనలూ గుర్తొస్తున్నాయి. అప్పుడూ ఇంతే.. అసంఘటిత రంగంలో ఉన్న ఆడవాళ్లంతా పనులు మానేసేట్టు చేశారు. దానికి అతీతంగా ఏమీ ఉండబోదు ఈ పన్నెండు గంటల పనివేళలు, మూడు రోజుల సెలవు దినాల ప్రతిపాదన. ఆర్గనైజ్డ్ సెక్టార్లోంచి కూడా మహిళలను వలంటరీగా ఇంటికి పంపించే ప్రయత్నం ఇది. మళ్లీ మహిళలను నాలుగు గోడలకే పరిమితం చేసే కుట్ర ఇది. ఎన్టీఆర్ ఇలాగే ఇష్టం వచ్చినట్టు పనిగంటలను మార్చాడు. ప్రభావం ఆడవాళ్ల మీదే పడింది. ఇప్పుడూ అలాగే ఉంటుంది. కుటుంబంలోని స్త్రీ, పురుషుల మధ్య ఎలాంటి అవగాహన, అండర్స్టాండింగ్ పెంచే వాతావరణం కల్పించకుండా ఇలాంటి చట్టాలు తెస్తే బలయ్యేది మహిళలే. పురుషాధిపత్య మైండ్‌సెట్‌ను మార్చకుండా నాయకత్వం దిశగా మహిళలు నడవాలి అనడం మీనింగ్ లెస్. – కొండవీటి సత్యవతి, భూమిక ఎడిటర్ మానవ హక్కుల ఉల్లంఘనే.. పన్నెండు గంటల పనివేళలు, మూడు రోజుల సెలవులు అనేది కచ్చితంగా రాంగ్ డైరెక్షనే. ఉద్యోగినులకే కాదు, ఇంట్లో ఉన్న స్త్రీలకూ ఇది భారమే. నిజానికి ఇప్పుడున్న వారానికి 48 గంటల పనివేళలన్నదే చాలా బర్డెన్. దాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి కాని రోజులో శ్రమ భారాన్ని పెంచే ప్రయత్నం ఏంటి? ఇదంతా ఉద్యోగుల కోణంలోంచి జరుగుతున్న మేలు కాదు.. యాజమాన్యాలకు చేయాలనుకున్న మేలుగానే అనిపిస్తోంది. ఒకరంగా ఇది మానవ హక్కుల ఉల్లంఘన. ప్రభావం తప్పకుండా మహిళ మీదే పడుతుంది. మహిళలు నాయకత్వం వైపుగా రావడానికి సహజంగా ఉండే అడ్డంకులే సవాలక్ష. వాటి దృష్ట్యా మహిళలకు వెసులుబాటు కల్పించాల్సింది పోయి ఇలాంటి ప్రతిపాదనలతో మరింత క్లిష్టం చేస్తున్నాం. ఈ ప్రతిపాదన ఆప్షన్ అంటున్నారు కాని ఒకసారి మొదలైతే అది ఆప్షన్‌గా ఉండదు. అనివార్యంగా మారుతుంది. తప్పనిసని అవుతుంది. ఈ సందర్భంగా గృహిణుల శ్రమనూ చర్చించాలి. – విస్సా కిరణ్ కుమార్, రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడు. లీడర్షిప్ ప్రతిబంధకాలు ఇప్పటికే వర్క్‌ప్లేస్‌లో ఉన్న సెక్సువల్ హెరాస్మెంట్స్కి ఈ పని గంటల పెంపు కూడా తోడైతే ఆ స్ట్రెస్ తట్టుకోలేక మహిళలు ఉద్యోగాలు మానేసే అవకాశాలే ఎక్కువ. ఇంట్లో ఆడవాళ్ల పనినీ అన్‌పెయిడ్ లేబర్‌గా చూస్తున్నాం. ఆఫీస్ పని చేసినా ఇంటి పనీ ఆమె బాధ్యతే అన్నట్టుగా ఉంటుంది మన ధోరణి. ఈ క్రమంలో ఈ ప్రపోజల్, రిఫార్మ్స్ అన్నీ కూడా విమెన్ లీడర్షిప్కు ప్రతిబంధకాలుగా ఉంటున్నాయే తప్ప వాళ్లను ప్రోత్సహించేలా ఉండట్లేదు. ట్వల్వ్ అవర్స్ వర్కింగ్ అనేది అయితే కచ్చితంగా కంపెనీలకు లాభమయ్యేదే. – స్వేచ్ఛ, న్యాయవాది ప్రైవేట్ యాజమాన్యాలకు ఆహ్వానం ఈ ప్రతిపాదన చాలా అశాస్త్రీయమైంది. ఇది ప్రైవేట్ యాజమాన్యాలకు ఆహ్వానంగా ఉందే తప్ప ఉద్యోగులకు ఒరగబెట్టేదేం లేదు. ముఖ్యంగా మహిళల మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. వాళ్ల మానసిక, శారీరక అరోగ్యాన్ని దెబ్బతినే ప్రమాదం ఉంది. రోజూ పన్నెండు గంటలు ఆఫీస్ పనితోనే సరిపోతే మిగిలిన వ్యక్తిగత పనుల సంగతేంటి? వాటికి వాళ్లెప్పుడు సమయం వెచ్చించాలి? అలాగే భద్రతా ప్రశ్నార్థకమే. – గౌతమ్, న్యాయవాది -
హృదయాకాశం
-
సినిమాల్లో... సగమెక్కడ?
వాళ్ళు... ఆకాశంలో సగం! అందరి జీవితాల్లోనూ సగం!! ప్రతి మనిషి జీవితానికీ మూలం వాళ్ళే! ప్రతి మగాడి విజయం వెనుకా వాళ్ళే!! కళలకు కేంద్రం వాళ్ళే! కలలకు అందమూ వాళ్ళే!! కానీ... పురుషాధిక్య ప్రపంచంలో స్త్రీలకు దక్కాల్సిన స్థానం దక్కుతోందా? సినీ లోకంలో స్త్రీకి ప్రాధాన్యం లభిస్తోందా? నలుగురు మహిళా టెక్నీషియన్లతో స్పెషల్ డిస్కషన్ ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు , మళ్లీ రాత్రి 11.30కు ‘మహానటి’ సినిమా చేసేప్పుడు ఈ సినిమాకు చెందిన యూనిట్లో 99శాతం మంది మహిళలే ఉన్నారు. అది నాకు చాలా సంతోషంగా అనిపించింది - అనీ మాస్టర్, కొరియోగ్రాఫర్ పాతికేళ్ళ క్రితం నేను ఫస్ట్ సినిమాల్లో జాయిన్ అవుతానన్నప్పుడు మా నాన్నగారు కాళ్లు విరగ్గొడతానన్నారు. ఇప్పుడైతే పరిస్థితులు మారాయి. స్త్రీల టీమ్ వల్ల సినిమాలో మెల్ల మెల్లగా ఫిమేల్ పాయింట్ ఆఫ్ వ్యూ పెరుగుతుంది. - సునీత తాటి, నిర్మాత ఇప్పుడు మేం మహిళా సాంకేతిక నిపుణులుగా రాణిస్తున్నాం అంటే అందుకు భానుమతీ రామకృష్ణ వంటి తొలితరం వారు వేసిన పునాదులే కారణం. స్త్రీలు సినిమాల్లోకి వస్తే... మన ఇంట్లో వాళ్ళ కన్నా... ఎదురింటి, పక్కింటివాళ్ళ వల్లే పెద్ద ప్రాబ్లమ్! - చైతన్య పింగళి, రైటర్ అండ్ కో-డైరెక్టర్ ఒక మహిళా సాంకేతిక నిపుణురాలిగా నేను రాణిస్తున్నాను అంటే దానికి కారణం నా కుటుంబం నుంచి నాకు లభించిన సపోర్టే. - మోనికా రామకృష్ణ ప్రొడక్షన్ డిజైనర్ - ఇంటర్వ్యూ: రెంటాల జయదేవ -
ఏదైనా నిగ్గదీసి అడిగే చైతన్యం ఆమె సొంతం
ఆమె సినిమాలకు పాడతారు... కానీ ఛాన్స్ కోసం వాళ్ళు చెప్పినట్టు ఆడరు. ఆమె స్టార్లకు గొంతు అరువిస్తారు... కానీ రాజీ పడి గొంతు విప్పద్దంటే ఊరుకోరు. ఆమె జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు... అయినా సరే తారాలోకంలోని తప్పులుచూసి తల వంచుకు వెళ్ళిపోరు! ఆమె గళంలో ఆవేశం ఉంది. ఆమె అక్షరంలో ఆవేదన ఉంది. ఆమెకంటూ భిన్నమైన ఆలోచనా ఉంది. ఆధునిక స్త్రీ చైతన్యానికి ఓ ప్రతీక – సినీ గాయని చిన్మయి శ్రీపాద. ఏదైనా నిగ్గదీసి అడిగే ఆమె చైతన్యం... ఇవాళ సమాజంలో... ముఖ్యంగా సినీ రంగంలో... ప్రతిధ్వనిస్తున్న చిన్మయ నాదం! చిన్మయ వాదం!! అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా – సాక్షి టీవీ స్పెషల్ ఇంటర్వ్యూలో చిన్మయి శ్రీపాద పంచుకున్న మనోభావాలు... ► మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి ఏడాదీ సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ ఇలాంటి ఓ రోజు ఉంది అంటే... ఇందు కోసం చాలామంది మహిళలు ఎన్నో త్యాగాలు చేసి ఉంటారు. దాడులకు లింగభేదం లేదు. అమ్మాయిలపైనే కాదు, అబ్బాయిలపైనా జరుగుతున్నాయి. ► మహిళా దినోత్సవం అని ఏడాదికోసారి మనం జరుపుకొంటున్నాం. ఆ తర్వాత మనం మహిళల గురించి మర్చిపోతున్నాం. ‘కట్నం ఇవ్వకూడదు... అడగకూడదు’ అని మన దేశంలో చట్టం ఉంది. కానీ అమ్మాయికిచ్చే కట్నం మీదే ఆమె లైఫ్ అంతా తిరుగుతోంది. ఇటీవల రష్మీ అనే అమ్మాయి 7 కోట్ల కట్నం ఇచ్చింది. కానీ వేధింపుల వల్ల చనిపోయింది. సో... ఒక అమ్మాయి ఎంత బాధ భరించినా ఫర్లేదు. పెళ్లి చేస్తే చాలనుకుంటున్నారు. చట్టాలున్నా భ్రూణహత్యలు చేస్తున్నారు. ► సోషల్ మీడియాలో ‘అమ్మాయి లంటే ఇలానే ఉండాలి’ అని కొన్ని మీమ్స్ ఉంటాయి. ‘మేం మగాళ్లం, ఫెమినిజం గురించి కూడా మేమే చెబుతాం’ అంటారు. ► ఇప్పటికీ మహిళలపై లైంగిక వేధింపులు, ఈవ్‌టీజింగ్, గృహహింస జరుగుతూనే ఉన్నాయి. అమ్మాయిలపై ఇవి నార్మలే... జరుగుతాయి అంటారు. ఎబ్యూజ్ అనేది నార్మల్ అని మన పేరెంట్స్ మనకు చెబుతున్నారు. కానీ ఎబ్యూజ్ అనేది ఎందుకు నార్మల్? ఒక అమ్మాయిగా నేను ఎందుకు ఎబ్యూజ్కు గురి కావాలి? ► దిశ కేసులో కూడా చూడండి. ‘ఆమె దుప్పటా వేసుకుందా? ఆ టైమ్‌లో ఆ అమ్మాయి అక్కడ ఏం చేస్తోంది? అప్పుడు పెద్ద టైమ్ కూడా కాలేదు’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు. అర్ధరాత్రి ఓ మహిళ ఒంటరిగా తిరిగినప్పుడు మనకు స్వాతంత్య్రం వచ్చినట్లు అని గాంధీజీ చెప్పారు. కానీ ఇప్పటికీ ఆ పరిస్థితులు లేవు. ► వైరముత్తు గురించి నేను మొదట్లో మాట్లాడకపోవడానికి కారణం మా అమ్మగారు నన్ను మాట్లాడనివ్వకపోవడమే! మనల్ని ఎవరు సపోర్ట్ చేస్తారు? సొసైటీలో మనకెలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అని భయపడ్డారు. ► సోషల్ మీడియాలో నాపై రేప్ థ్రెట్ వస్తే కేసు పెట్టాను. 2011 నుంచి ఆ కేస్ నడుస్తూనే ఉంది. ఇండియాలోనే ఫస్ట్ సైబర్ క్రైమ్ కేస్ అది. ► చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల గురించి మనం ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం. కానీ ఇప్పటికీ రాలేదు. ఎందుకంటే ఎక్కువగా మగాళ్ళే ఉన్నారు కదా! ఇక, ఒక కంపెనీలో 10మంది ఉద్యోగులుంటే ఐసీసీ అనేది (ఇంటర్నల్ కంప్లయింట్స్ కమిటీ) ఉండాలి అనేది రూల్. విశాఖ గైడ్లైన్స్కి తగ్గట్లు అన్ని ఆఫీసుల్లో కమిటీలు న్నాయా? ఎన్ని కంపెనీలు ఫాలో అవుతున్నాయి. ► ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడటాన్ని సమాజంలో పెద్ద క్రైమ్‌గా చూస్తారు. ఆ అమ్మాయి, అబ్బాయి ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు. ఒకవేళ వాళ్లు లవ్‌లో ఉంటే వారి తల్లితండ్రులతో మాట్లాడుకుంటారు. అంతేకానీ... అదొక పెద్ద నేరంలా చూడకూడదు. ఒక అబ్బాయి, అమ్మాయి మాట్లాడుకోవడమే తప్పు అనే కల్చర్ మారాలి. కల్చర్ అంటే... నిరంతరం మారుతూ ఉండేది. మనం 1852లో ఎలా ఉన్నాం? ఇప్పుడు ఎలా ఉన్నాం? టైమ్‌తో పాటు మారాలి. పాతకాలంలోలాగానే ఉండాలనుకుంటే టీవీలు చూడకూడదు. ఇంటర్నెట్ వాడకూడదు. ► ‘నువ్వు..మగాడివికాబట్టి ఏడవకూడదు. బాధపడకూడదు’ అంటారు. అమ్మాయిలు మేకప్ వేసుకోవడానికి మూడు నాలుగు గంటలు పడుతుంది అని మాట్లాడుతుంటారు. కానీ మేకప్ ఆర్టిస్టు, హెయిర్ డ్రెస్సింగ్ల పని గురించి కూడా ఆలోచించాలి. మేల్ యాక్టర్‌కు ఫిమేల్ హెయిర్ డ్రెస్సరెందుకు ఉండకూడదు. సూపర్ స్టార్ రజనీకాంత్‌కి వర్క్ చేసే మహిళ భానుగారు మేకప్ ఉమన్‌గా యూని యన్‌లో గుర్తింపు కోసం కోర్టుకు వెళ్ళాల్సొచ్చింది. ► నేను సింగర్‌గా వచ్చి 19 ఏళ్లు. నాతో మిస్ బిహేవ్ చేసింది వైరముత్తు ఒక్కరే. మంచివాళ్ళు చాలా మంది ఉన్నారు. కొద్దిమంది వల్లే ఇండస్ట్రీకి చెడ్డపేరు. ► నేను ఓపెన్‌గా మాట్లాడుతున్నాను అంటే నాకు మా ఆయన (నటుడు రాహుల్ రవీంద్రన్) మంచి సపోర్ట్ ఇచ్చారు. చాలామంది అమ్మాయిలు ఎందుకు బయటకు చెప్పడం లేదంటే వాళ్ల తల్లితండ్రులే ఫ్రీడమ్ ఇవ్వరు. అన్నదమ్ములే తమ సిస్టర్ను తప్పుపడుతున్నట్లు మాట్లాడుతున్నారు. చైన్ స్నాచింగ్ గురించి, బ్యాగ్ దొంగతనం గురించి చెప్పొచ్చు. కానీ సెక్సువల్ హెరాస్మెంట్ గురించి బయటకు చెబితే, అందులో అమ్మాయిల తప్పు ఉన్నట్లు మాట్లాడతారు. దొంగతనం కేసుల్లో దోషులను తప్పుపడితే.... హెరాస్మెంట్ కేసుల్లో మహిళలదే తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు. ► రేప్ కేసుల్లో కూడా తొందరగా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అలాగే సెక్స్ ఎడ్యుకేషన్ కూడా కావాలి. ఇప్పుడు రద్దీ బస్సులో ఒక ఆకతాయి గిల్లితే గిల్లాడు లెమ్మని అమ్మాయిలు చెప్పలేరు. దానికి సాక్ష్యం అంటే ఏం చూపిస్తాం? ► 21వ శతాబ్దంలోనూ సినిమాల్లో మహిళలను భోగవస్తువులుగా చూడటం తగ్గడం లేదు. అమ్మాయి ఒక బికినీ కానీ, చిన్న షార్ట్ కానీ వేసుకుంటే... కెమెరా చూపిస్తుంది ఎక్కడ చూడాలనేది! ఇంగ్లీష్ సినిమాల్లో బికినీ హీరోయిన్స్‌ను మామూ లుగానే చూపిస్తారు. కానీ మన సినిమాల్లో కెమెరా జూమ్‌లో చూపిస్తుంటారు. ► సమంత వండర్ వుమన్ . సమంత కూడా లైంగికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొని, గెలిచారు. సమంతకూ, నాకు పూర్వజన్మ కనెక్షన్ ఉందనుకుంటా. రాహుల్, సమంత ఓ తమిళ సినిమా ద్వారా కెరీర్‌ను స్టార్ట్ చేశారు. నా తెలుగు డబ్బింగ్ కెరీర్ సమంత ద్వారానే మొదలైంది. నా కంటే ముందు రాహుల్, సమంత మంచి ఫ్రెండ్స్. ► నా భర్త రాహుల్ నా కన్నా పెద్ద ఫెమినిస్టు. విపరీతంగా చదివే రాహుల్ నన్ను మార్చాడు. క్యాస్టిజమ్, సెక్సిజమ్ గురించి రాహులే నాకు ఎక్కువ చెప్పాడు. మహిళల డ్రెస్‌తో సంబంధం లేకుండా వారి ఫేస్‌లు చూసే మాట్లాడాలన్నది రాహుల్ నుంచే నేను నేర్చుకున్నా. రాహుల్ నన్ను సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టే మేము ప్రశాంతంగా ఉన్నాం. మా ఫ్యామిలీ అంతా బాగుంది. ► సినీ గీత రచయిత వైరముత్తు దుష్ప్రవర్తన గురించి ఓపెన్ గా చెప్పా. కానీ, తమిళ డబ్బింగ్ యూనియన్ ప్రెసిడెంట్ రాధా రవి నన్ను బ్యాన్ చేశారు. కోర్టుకు వెళ్లా. ఇప్పటికీ పోరాడుతున్నా. సింగర్‌గా ఛాన్సులు తగ్గిపోయాయి. బాధగానే ఉంది. కానీ మా ఇంట్లో నన్ను సపోర్ట్ చేస్తున్నారు. నాకు కూడా కొన్ని వార్నింగ్‌లు వచ్చాయి. ‘పొలిటికల్ పార్టీల గురించి మాట్లాడితే ఐటీ రైడ్స్ జరుగుతాయి’ అని చెప్పారు. ► జర్నలిస్టు ఎం.జె. అక్బర్ లైంగిక వేధింపులపై 20 మంది మహిళా జర్నలిస్టులు ఆరోపించారు. ప్రియా రమణి వర్సెస్ అక్బర్ కేసులో తాజా తీర్పు రిలీఫ్. కానీ, నువ్వు రేప్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని రీసెంట్గా ఓ జడ్జ్ అడిగారు. చాలా విషయాలు నేను ఓపెన్‌గా మాట్లాడతా. నా గురించి నేను ఆలోచించను. సొసైటీకి మంచి జరిగితే చాలు. -
‘షీ’టీమ్ మహిళా దినోత్సవ వేడుకలు
-
ఈ తరంలో పుట్టడం నా అదృష్టం: మిస్ ఇండియా ఎర్త్
సనత్‌నగర్: వజ్ర సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం మహిళా పోలీసు అధికారులని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ కొనియాడారు. కరోనా లాక్డౌన్ సమయంలో మహిళా పోలీసు అధికారులు విధి నిర్వహణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని స్ఫూర్తిగా నిలిచారన్నారు. ‘షీ’టీమ్, హైదరాబాద్ పోలీసు సంయుక్తంగా బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లోని ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను రెండు రోజుల ముందుగానే శుక్రవారం నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరైన అంజనీకుమార్ మాట్లాడుతూ మహిళా శక్తి సామర్థ్యాలను సమాజానికి తెలియపర్చాలనే ఉద్దేశ్యంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని రెండు రోజులు ముందుగానే నిర్వహించడం జరిగిందన్నారు. మహిళలు సహనానికి ప్రతీకగా అభివర్ణించారు. ఆర్మీ, నేవీ, పారామిలటరీ, పోలీసు వంటి విభాగాల్లో ప్రత్యేక యూనిఫాం వేసుకుని మహిళలు తమ సేవలను అందించడం గర్వకారణమన్నారు. నగర పోలీసు విభాగంలో 33 శాతం మంది మహిళలు ఉన్నారన్నారు. సిటీ పోలీసు కమిషనరేట్‌తో పాటు హెడ్ క్వార్టర్స్‌కు మహిళా పోలీసులు భద్రతగా నిలుస్తున్నారన్నారు. మహిళా పోలీసు అధికారులు అందించే ఈ రకమైన సేవలు దేశంలో మరే ఇతర నగరాల్లోనూ లేవన్నారు. షీ టీమ్స్, భరోసా సెంటర్, ఐటీ సెల్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయన్నారు. నగరంలోని అన్ని పోలీస్స్టేషన్లలో మహిళా పోలీసు అధికారుల కోసం ప్రత్యేకమైన విశ్రాంతి గదులు, వాష్‌రూమ్‌లు, ఛేంజింగ్ గదులను కేటాయించామన్నారు. 2020 ఏడాది పోలీసు అధికారులు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారని, ఎందరో పోలీసు అధికారులు కరోనా బారిన పడ్డారన్నారు. అందులో మహిళా అధికారులు కూడా ఉన్నారన్నారు. కరోనా బారిన పడినప్పటికీ 14 రోజుల క్వారంటైన్లో ఉండి ఆ వెనువెంటనే విధుల్లోకి చేరడం వారి అంకితభావానికి నిదర్శనంగా నిలిచిందన్నారు. మహిళా పోలీసు అధికారులైతే ఇంట్లో చిన్న పిల్లలు, పెద్దలు ఉన్నప్పటికీ కరోనా సమయంలో ఏమాత్రం వెరవకుండా అర్ధరాత్రి సైతం సేవలు అందించారని, వారందరికీ నా సెల్యూట్ అన్నారు. మార్చి 8 ఒక్కరోజు మాత్రమే కాదని, ప్రతిరోజూ మహిళా దినోత్సవమేనన్నారు. మహిళలను గౌరవించడం ప్రధాన బాధ్యత అన్నారు. ప్రత్యేక అతిథిగా హాజరైన మిస్ ఇండియా ఎర్త్, ఆల్ ఇండియాస్ బెస్ట్ క్యాడెట్ డాక్టర్ తేజస్విని మనోజ్ఞ మాట్లాడుతూ తాను ఈ తరంలో జన్మించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. నిరంతరం ప్రజాభద్రత, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తున్న పోలీసులు అధికారులకు ఆమె సెల్యూట్ చేశారు. ‘ఆడ పిల్లగా పుట్టినందుకు మనమందరంగా గర్వపడదాం..మార్పు కోసం ప్రయత్నిద్దాం..దేశం కోసం పాటుపడదామని’ ఈ సందర్భంగా ఆమె నినదించారు. కార్యక్రమంలో ఆదాయపన్ను శాఖ చీఫ్ కమిషనర్, నగర పోలీసు కమిషనర్ సతీమణి వసుంధర సిన్హా, ట్రాఫిక్ అదనపు కమిషనర్ అనిల్‌కుమార్, పోలీసు అదనపు కమిషనర్లు డీఎస్ చౌహాన్, జాయింట్ కమిషనర్(ఎస్బీ) తరుణ్ జోషి, నార్త్‌జోన్ డీసీపీ కల్మేశ్వర్ సింగనవర్, శిరీష తదితరులు పాల్గొన్నారు. చదవండి: ‘అమ్మా నన్ను కన్నందుకు’.. మేడమ్ మీవల్లే (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


