breaking news
Medak
-
మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు ● హామీల అమలుకు నిరంతరం శ్రమిస్తున్నాం ● మహిళాశక్తి సంబరాల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి మెదక్‌జోన్/నర్సాపూర్: తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాల్లో మహిళలను భాగస్వాములను చేస్తూ, వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రోత్సహిస్తున్నామని కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. గురువారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దివంగత ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేశారని గుర్తు చేస్తూ, ఆమె పేదల అభ్యున్నతి కోసం పాటుపడ్డారని కొనియాడారు. గత ప్రభుత్వం మహిళలకు పావలా వడ్డీ ఇవ్వకుండా మోసం చేసిందని ఆరోపించారు. మహిళలకు పెట్రోల్ బంకులు ఇస్తున్నామని, నర్సాపూర్‌లో ప్రభుత్వ భూమి కేటాయించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. వడ్డీ లేని రుణాలు పొందిన మహిళలు సకాలంలో వాయిదాలు చెల్లించాలని సూచించారు. ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేశామన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని అధికారులకు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అనంతరం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, మహిళలకు మెప్మా పథకం కింద రూ. 2.55 కోట్ల చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. అలాగే వెల్దుర్తి మండలంలోని నాగ్సాన్పల్లి, హకీంపేట రోడ్లకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్‌రాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్‌రావు, ఆర్డీఓ మహిపాల్, తహసీల్దార్ శ్రీనివాస్, ఆయా సొసైటీల చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. కాగా ఇందిరా మహిళ శక్తి సంబరాల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి వివేక్‌కు డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, నాయకులు తదితరులు స్వాగతం పలికి సన్మానించారు. గత ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చింది మెదక్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మహిళా శక్తి సంబరాలకు మంత్రి హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వం రూ. 8 లక్షల కోట్లు అప్పు చేసిపెట్టిందని, అయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం మెదక్ ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతూ.. మహిళలకు స్థానిక సంస్థల రిజర్వేషన్లతో పాటు, మహిళలకు ప్రధాని మోదీ అమలు చేసిన 33 శాతం రిజర్వేషన్లను రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అమలు చేయా ల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో విచ్చలవిడిగా కొనసాగుతున్న బెల్ట్‌షాపులను నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఎమ్మెల్యే రోహిత్‌రావు మాట్లాడుతూ.. గడిచిన పదేళ్లలో మెదక్ ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా పోయిందని, 18 నెలల్లోనే అన్నిరంగాల్లో అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి మహిళకు కారు నడపటం రావాలని, మహిళలు డ్రైవింగ్ నేర్చుకునేందుకు తానూ కా రును బహుకరిస్తున్నట్లు తెలిపారు. ఆ కారును డీఆర్డీఓకు అప్పగిస్తానని తెలిపారు.మెదక్ కలెక్టరేట్: అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలని, ప్రభుత్వ లక్ష్యాలకనుగుణంగా అధికారులు పనిచేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన మెగా వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం కలెక్టరేట్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహించారు. వివిధశాఖల ప్రగతి పురోగతిని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధతో విద్యా, వైద్యంతో పాటు సంక్షేమం ప్రగతి పథంలో ముందుకు వెళ్తుందన్నారు. ఇదే స్ఫూర్తితో జిల్లా అధికారులు మరింత సమష్టిగా కృషి చేయాలని సూచించారు. -
చెత్త కదలదు.. మురుగు పోదు
● అధ్వానంగా పేట మున్సిపాలిటీ ● అపహాస్యమవుతున్న వంద రోజుల ప్రణాళిక ● ఇబ్బంది పడుతున్న ప్రజలు మున్సిపాలిటీ వివరాలు జనాభా (సుమారు) 25,000 పారిశుద్ధ్య కార్మికులు 37 ఇతర సిబ్బంది 23 చెత్త సేకరణ ట్రాక్టర్లు 3 ఆటోలు 3 ప్రతి రోజు సేకరిస్తున్న చెత్త 8 మెట్రిక్ టన్నులు పేరుకుపోయిన చెత్త కుప్పలు.. వీధుల్లో పారుతున్న మురుగు నీరు.. దోమల స్వైర విహారం.. వెరసి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వంద రోజుల ప్రణాళికలో పారిశుద్ధ్యానికి పెద్దపీట వేసినా రామాయంపేట మున్సిపాలిటీలో పరిస్థితులు అధ్వానంగా మారాయి. నిధుల కొరతతో అధికారులు నామమాత్రంగా పనులు కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. – రామాయంపేట(మెదక్) రామాయంపేట మేజర్ పంచాయతీ 2018లో మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. పట్టణంలో సుమారుగా 25 వేల పైచిలుకు జనాభా ఉంటుంది. కాగా ప్రతి రోజు సుమారు ఏడు నుంచి ఎనిమిది మెట్రిక్ టన్నుల మేర చెత్త సేకరణ జరుగుతోంది. 37 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నా, పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య పనులు కొనసాగడంలేదు. పట్టణంలో సేకరించిన చెత్తను ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న డంప్‌యార్డుకు తరలిస్తున్నారు. ఆరుబయట పోస్తున్న చెత్తా చెదారంతో పరిసరాలు కలుషితమై మురుగుకూపంగా మారి దుర్వాసన వెదజల్లుతుంది. దీంతో పాటు పట్టణంలోని మురుగునీరు నేరుగా మల్లెచెరువులో కలుస్తుండటంతో చెరువులోని నీరు పూర్తిగా కలుషితమైంది. మున్సిపాలిటీగా రూపాంతరం చెందినా పారిశుద్ధ్యం విషయమై ఎలాంటి మార్పు లేదని స్థానికులు పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా బీసీ, ఎస్సీకాలనీ, గుల్పర్తి, కోమటిపల్లిలో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉంది. ఐదో వార్డులో పెట్రోల్ బంక్ వెనుకభాగంలో ఇళ్ల మధ్య నిలిచిన మురుగు నీటితో కాలనీవాసులు ఇబ్బందులకు గురవుతున్నారు. దోమల నివారణకు మురికి కాలువల్లో క్రిమి సంహారక మందు పిచికారీ, ఫాగింగ్ వంటి కార్యక్రమాలు సక్రమంగా చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రణాళిక పనులు కొనసాగుతున్నాయి మున్సిపాలిటీ పరిధిలో వంద రోజుల ప్రణాళిక పక్కాగా అమలు చేస్తున్నాం. ఈమేరకు పట్టణం, శివారు గ్రామాల్లో పెద్దఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మురుగు కాలువల్లో ఫాగింగ్, క్రిమి సంహారక మందు పిచికారీ చేయడం వంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. – దేవేందర్, మున్సిపల్ కమిషనర్ -
షరా మామూలే
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రిజిస్ట్రేషన్‌శాఖ కార్యాలయాలు అక్రమాలకు నిలయాలుగా మా రాయి. అవినీతి నిరోధకశాఖ అధికారులు అప్పుడప్పుడు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నప్పటికీ ఈ శాఖలో కొందరు అధికారుల వసూళ్ల దందా మాత్రం ఆగడం లేదు. ముడుపులు ముట్టజెప్పనిదే డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కావడం లేదనేది బహిరంగ రహస్యంగా మారింది. 10 నెలల క్రితం సంగారెడ్డిలోని జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో పెద్ద ఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్ల దందా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. నోట్ల కట్టలను కార్యాలయం కిటికీలోంచి బయటకు విసిరేయడం కలకలం రేపింది. తాజాగా గురువారం సదాశివపేట ఎస్ఆర్ఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో నగదు పట్టుబడగా, కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్లు పట్టుబడ్డారు. రోజుకు రూ.లక్షల్లో చేతులు మారుతున్న ముడుపులు.. ఆయా స్థిరాస్తి విలువను బట్టి ఒక్కో డాక్యుమెంట్‌కు కనీసం రూ.ఐదు వేల నుంచి రూ.పది వేల చొప్పున ముడుపులు పుచ్చుకోవడం ఈ కార్యాలయాల్లో పరిపాటిగా తయారైంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 16 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు (ఎస్ఆర్ఓ) ఉన్నాయి. అత్యధికంగా పటాన్చెరు జాయింట్ –1, జాయింట్–2, సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, మెదక్, సిద్దిపేట, గజ్వేల్ తదితర ఎస్ఆర్ఓ కార్యాలయాల్లో ఎక్కువ సంఖ్యలో డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అవుతుంటాయి. ఒక్కో కార్యాలయంలో సగటు న 30 నుంచి 90 వరకు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. ఏదైనా ముహూర్తం, మంచి రోజులు ఉన్న రోజుల్లో ఈ కార్యాలయా ల్లో వందకు పైగా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అవుతుంటాయి. ఈ లెక్కన ఒక్కో కార్యాలయంలో రోజుకు కనీసం 50 డాక్యుమెంట్లకు రూ. 2.50 లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకు ముడుపులు చేతులు మారుతున్నాయి. డాక్యుమెంట్ల సంఖ్య ఎక్కువ ఉన్న రోజుల్లో కొన్ని కార్యాలయాల్లో రూ.ఐదు లక్షలకు మించి ముడుపులు చేతులు మారుతున్నాయనే ఆరోపణలున్నాయి. డాక్యుమెంట్ రైటర్లే కీలకం.. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అక్రమాలకు కొందరు డాక్యుమెంట్ రైటర్లే కీలకంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం డాక్యుమెంట్ రైటర్లు, దళారులు రిజిస్ట్రేషన్ కార్యాలయంలోకి వెళ్లకూడదు. కానీ వీరు ఏకంగా ఎస్ఆర్ఓల క్యాబిన్లలోకే దర్జాగా చొచ్చుకుని పోయి..పక్కనుంచి మరీ రిజిస్ట్రేషన్లు చేయిస్తుండటం పరిపాటైపోయింది. రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుకింగ్ విధానం వంటి సంస్కరణలు ప్రభుత్వం తెస్తున్నప్పటికీ ఈ కార్యాలయాల్లో అక్రమాలు మాత్రం ఆగకపోవడం గమనార్హం.వివాదాస్పద డాక్యుమెంట్లతో కాసుల పంట వివాదాస్పదమైన స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు ఈశాఖ అధికారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఇలాంటి ఒక్కో డాక్యుమెంట్‌కు రూ.లక్ష చొప్పున ముడుపులు పుచ్చుకుని రిజిస్ట్రేషన్లు చేశారనే ఆరోపణలు గతంలో వెల్లువెత్తాయి. లింకు డాక్యుమెంట్లు లేని స్థిరాస్తులు, కోర్టు వివాదాల్లో ఉన్న నివాస స్థలాలు, ఒకే భూమిలో రెండుసార్లు లేఅవుట్ చేసిన ప్లాట్లు, అనుమతి లేని లేఅవుట్లలో స్థలాలు, ఎల్ఆర్ఎస్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్లాట్లు ఇలా వివిధ రకాల వివాదాస్పద డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లలో రూ.లక్షల్లో చేతులు మారుతున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.అవినీతికి నిలయాలుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు చక్రం తిప్పుతున్న డాక్యుమెంట్ రైటర్లు నిత్యం రూ.లక్షల్లో చేతులు మారుతున్న ముడుపులు ఏసీబీ సోదాలు చేస్తున్నా ఆగని దందా -
మెదక్‌కు నిధుల వరద
మెదక్‌జోన్: మెదక్ జిల్లా ఇందిరాగాంధీ ఖిల్లా అని, ఇక్కడి నుంచి గెలుపొంది ప్రధాని అ య్యారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు కాంగ్రెస్‌లో చేరగా, వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి జిల్లా అభివృద్ధికి చేసిందేమి లేదన్నారు. మెదక్‌లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలిచేది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చి, ఏడుపాయల అమ్మవారి ఆలయాలకు సీఎం రేవంత్‌రెడ్డి కోట్లాది రూపాయల నిధులిచ్చారన్నారు. కేసీఆర్ ఏనాడైనా జిల్లా అభివృద్ధికి పాటుపడ్డారా..? అని ప్రశ్నించారు. అనంతరం జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ ఇచ్చిన ఇండ్లే ఉన్నాయని, ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే రోహిత్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చాకనే నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందన్నారు. తనను నమ్మి గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని, అభివృద్ధిలో మెదక్‌ను అగ్రగామిలో నిలబెడతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నాయకులు చంద్రపాల్, మ్యాడం బాలకృష్ణ, సుప్రభాతరావు తదితరులు పాల్గొన్నారు. చర్చి, ఏడుపాయలకు నిధులిచ్చింది కాంగ్రెస్సే.. బీఆర్ఎస్ పాలనలో ప్రగతి శూన్యం పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ -
స్వచ్ఛతపై కేంద్ర బృందం ఆరా
పాపన్నపేట(మెదక్): గ్రామాల్లో స్వచ్ఛత కార్యక్రమం పరిశీలించేందుకు స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ కేంద్ర బృందం సభ్యులు సుమలత, రాణి గురువారం కొడుపాక, చిత్రియాల్ గ్రా మాల్లో పర్యటించారు. ఈసందర్భంగా పాఠశాలలు, అంగన్వాడీ, మరుగుదొడ్ల వినియోగం, పారిశుద్ధ్యం, డంపింగ్‌యార్డ్ నిర్వహణ, ఇంకుడు గుంతలు తదితర వాటిని పరిశీలించారు. పథకాల అమలు తీరును గ్రామస్తుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం మిన్పూర్, అర్కెల గ్రామల్లో పర్యటించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విష్ణువర్ధన్, ఇన్చార్జి ఎంపీఓ పరమేశ్వర్, పంచాయతీ కార్యదర్శులు బాబునాయక్, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు. -
దోషులను కఠినంగా శిక్షించాలి
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కొల్చారం(నర్సాపూర్): దళిత నాయకుడు అనిల్ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, దోషులను 24 గంటల్లో అరెస్ట్ చేయాలని పోలీస్‌శాఖను ఆదేశించామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. గురువారం పైతర గ్రామంలో అనిల్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పుడిప్పుడే రాజకీయంగా ఎదుగుతున్న అనిల్‌ను హత్య చేయడం బాధాకరమన్నారు. హత్య చేసిన వారిపై వివిధ సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించినట్లు చెప్పారు. అనిల్ కుటుంబానికి పూర్తి న్యాయం చేస్తామని, అండగా ఉంటామని పేర్కొన్నారు. ఆయన వెంట మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్ఐ మహ్మద్‌గౌస్, డీబీఎస్ జిల్లా అధ్యక్షుడు శంకర్, ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు ప్రభాకర్, దళిత నాయకుడు బాబు తదితరులు ఉన్నారు. -
అటవీ భూమి కబ్జా
రామాయంపేట(మెదక్): ఐదెకరాల మేర అటవీ భూమిని కబ్జా చేసిన గిరిజనులను అదుపులోకి తీసుకున్న ఆశాఖ అధికారులు సదరు భూమిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని పర్వతాపూర్ పంచాయతీ పరిధిలో బాపనయ్య తండాకు చెందిన కొందరు తండాను ఆనుకొని ఉన్న అటవీ భూమిపై కన్నేశారు. రాత్రి సమయంలో ట్రాక్టర్లు, జేసీబీలతో చెట్లను తొలగించి సదరు భూమిని చదును చేశారు. సమాచారం అందుకున్న మెదక్ అటవీశాఖ రేంజ్ అధికారి మనోజ్‌కుమార్, డిప్యూటీ రేంజ్ అధికారి ఖుద్బొద్దీన్ తమ సిబ్బందితో వెళ్లి కబ్జాకు గురైన భూమిని పరిశీలించారు. చెట్లను తొలగించి అటవీ భూమిని కబ్జా చేసిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు వారితోనే మళ్లీ మొక్కలు నాటిస్తామని చెప్పారు. కాగా అటవీశాఖ అధికారులు ఇద్దరు గిరిజనులను అదుపులోకి తీసుకొని మెదక్ తరలిస్తుండగా, గిరిజనులు కొందరు అడ్డుకున్నారు. దీంతో వారిని సముదాయించారు. ఎవరైనా అక్రమంగా అటవీ భూములు కబ్జా చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి చేగుంట(తూప్రాన్)/చిన్నశంకరంపేట(మెదక్)/రామాయంపేట: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ శ్రీరాం అన్నారు. బుధవారం చేగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి సిబ్బందితో మాట్లాడారు. వర్షాకాలం సందర్భంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను ప్రజలకు వివరించాలని సూ చించారు. ఆశావర్కర్లు, సిబ్బంది గ్రామాల్లో సందర్శించి ఎప్పటికప్పుడు ఆరోగ్య సంబంధిత వివరాలను సేకరించాలన్నారు. ప్రజలు ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ నవ్య, మెడికల్ ఆఫీసర్ అనిల్‌కుమార్, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. అలాగే చిన్నశంకరంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు. అలాగే రామాయంపేట మండలంలోని ప్రగతి ధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి హవేళిఘణాపూర్(మెదక్): పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు పీఆర్టీయూ టీఎస్ సంఘం కృషి చేస్తుందని ఆ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తాళ్ల శ్రీనివాస్, సామ్యానాయక్ అన్నారు. బుధవారం మెదక్ మండల పరిధిలోని మాచవరం, మంభోజిపల్లి, రాజుపల్లి, మక్తభూపతిపూర్ తదితర పాఠశాలల్లో సభ్యత్వ నమోదు నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల సాధనలో పీఆర్టీయూ టీఎస్ ముందు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సంఘం బాధ్యులు శ్రీనివాస్, గోపిచంద్, సత్యనా రాయణరెడ్డి, మల్లారెడ్డి, సతీశ్‌రావు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. 19న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు మెదక్‌జోన్: ఈనెల 19వ తేదీన జిల్లాస్థాయి జూనియర్, సీనియర్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీ లు పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మధుసూదన్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 20 ఏళ్లలోపు బాల, బాలికలకు అవకాశం ఉంటుందన్నారు. ఇందులో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు వచ్చేనెల 3, 4వ తేదీలలో వరంగల్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. కాగా ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు వయస్సు ధ్రువీకరణపత్రం తీసుకురావాలని సూచించారు. -
ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు
డీఏఓ దేవ్కుమార్టేక్మాల్(మెదక్): నీటి వనరులున్న వ్యవసాయ క్షేత్రాల్లో ఆయిల్ పామ్ తోటలు సాగు చేస్తే రైతులు అధిక లాభాలు పొందవచ్చని జిల్లా వ్యవసాయాధికారి దేవ్‌కుమార్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని పల్వంచ గ్రామంలో పలువురు రైతుల వ్యవసాయ క్షేత్రాల్లో ఆయిపామ్ మొక్కలు నాటారు. ఈసందర్భంగా డీఏఓ మాట్లాడుతూ.. మిగితా పంటలతో పోలిస్తే ఆయిల్‌పామ్ సాగు వల్ల అధిక లాభాలు ఉంటాయన్నారు. ఈ ఏడాది మాత్రమే ఆయిల్‌పాం పంటకు సబ్సిడీ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం గ్రామంలో కొనసాగుతున్న ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. అలాగే టేక్మాల్ రైతు వేదికలో ఫర్టిలైజర్ డీలర్లకు ఈ–పాస్ మిషన్లను అందించారు. ఇందులో పెద్దశంకరంపేట ఏడీఏ రాంప్రసాద్, టెక్నికల్ ఏడీఏ వినయ్‌కుమార్, ఏఓ వందన, ఆయిల్‌పామ్ టెక్నికల్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు. -
కష్టపడి చదివితే మంచి భవిష్యత్తు
చిన్నశంకరంపేట(మెదక్): విద్యార్థులు ఏకాగ్రతతో చదివినప్పుడే మంచి భవిష్యత్తును పొందగలరని రాష్ట్ర మోడల్ స్కూల్స్ డైరెక్టర్ శ్రీనివాసచారి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మో డల్ స్కూల్‌ను ఆయన సందర్శించారు. ఈసందర్భంగా ద్వితీయ సంవత్సరం సీఈసీ విద్యార్థులతో మాట్లాడారు. బైపీసీ, ఎంపీసీ గ్రూపులను మించి మంచి భవిష్యత్తును సీఈసీ ద్వారా పొందవచ్చన్నారు. గ్రూప్–1 ఉద్యోగాలను ఎక్కువగా సీఈసీ విద్యార్థులే సాధిస్తున్నారన్నారు. అనంతరం పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. పలు ప్రశ్నలు వేసి వారి ప్రతిభను పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు మెరుగైన బోధన అందించడంతో పాటు ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. అనంతరం మధ్యా హ్న భోజనాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీదేవికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట డిప్యూటీ డైరెక్టర్ దుర్గాప్రసాద్, ఏఎంఓ రవికుమార్ ఉన్నారు.మోడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసచారి -
పాఠశాలకు డుమ్మా కొట్టొద్దు
కలెక్టర్ రాహుల్రాజ్కొల్చారం(నర్సాపూర్): విద్యార్థుల బంగారు భవిష్యత్తు విద్యతోనే సాధ్యమని, పాఠశాలకు డుమ్మా కొట్టకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. బుధవారం మండలంలోని దేశ్యా తండా ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో హాజరు పట్టికను పరిశీలించారు. రెండు, మూడు రోజులుగా పాఠశాలకు రాని విద్యార్థుల గురించి ఉపాధ్యాయులతో ఆరా తీశారు. పాఠశాల కు రాని విద్యార్థుల ఇళ్లకు స్వయంగా వెళ్లిన కలెక్టర్ తల్లిదండ్రులతో చర్చించారు. విద్యార్థులను పాఠశాలకు పంపించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన అన్ని మౌలిక వసతులను విద్యాశాఖ కల్పిస్తుందన్నారు. పిల్లలను ఇతర పనులకు తీసుకెళ్లకూడదన్నారు. ఉపాధ్యాయులు ఈ విషయంలో తల్లిదండ్రులతో ఎప్పటికప్పుడు చర్చించాలని ఆదేశించారు. ఆయన వెంట హెచ్ఎం ఏగొండ, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. -
కంకర పరిచి.. రోడ్డు మరిచి
నాలుగు జిల్లాలతో అనుసంధానమైన ప్రధాన రహదారి మరమ్మతులకు నోచుకోవడం లేదు. ఏడాదిన్నరగా కంకర పరిచి వదిలేయడంతో రోడ్డుపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. – రామాయంపేట/నిజాంపేట(మెదక్) నిజాంపేట మండలం చల్మెడ కమాన్ నుంచి నందగోకుల్, నస్కల్ మీదుగా రాంపూర్, నిజాంపేట వరకు 18 కిలోమీటర్లు ఉంటుంది. గతంలో నిర్మించిన తారురోడ్డు పూర్తిగా శిథిలం కావడంతో కొత్త రోడ్డు నిర్మాణానికి గతంలో రూ. 12.20 కోట్లు మంజూరయ్యాయి. గతంలో చేసిన పనులకు సంబంధించి బిల్లులు రాకపోవడంతో సంబంధిత కాంట్రాక్టర్ రోడ్డుపై కంకరపరిచి వదిలేశారు. దీంతో గత ఏడాదిన్నర కాలంగా కంకర రోడ్డుపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులపాలవుతున్నారు. పలువురు ప్రమాదాలకు గురైన సంఘటనలు ఉన్నాయి. వాహనాలకు సైతం తరచూ రిపేర్లు రావడం నిత్యకృత్యంగా మారింది. ఈ రహదారి కామారెడ్డి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు అనుసంధానం కావడంతో జిల్లావాసులతో పాటు ఆయా జిల్లాలకు చెందిన ప్రయాణికులు తరచూ ప్రయాణిస్తుంటారు. నెలల తరబడి కంకర పరిచిన రోడ్డుపై ప్రయాణించడం కష్టసాధ్యం కావడంతో నస్కల్ గ్రామస్తులు తారు రోడ్డు పనులు ప్రారంభించాలని పలుమార్లు పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. దీంతో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ చొరవ తీసుకొని సంబంధిత కాంట్రాక్టర్‌తో మాట్లాడి పనులు ప్రారంభించేలా చొరవ చూపారు. కాగా కాంట్రాక్టర్ నిజాంపేట నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ల మేర.. నస్కల్ వరకు మాత్రమే తారు రోడ్డు నిర్మాణం పూర్తి చేసి వదిలేశాడు. నస్కల్ గ్రామస్తులకు ఊరట లభించినా, చల్మెడ, రాంపూర్, నందగోకుల్ గ్రామాల ప్రజల కష్టాలు మాత్రం తీరలేదు. వెంటనే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించకపోతే ఆందోళన చేపడతామని వారు హెచ్చరిస్తున్నారు. పనులు ప్రారంభించేలా చర్యలు నిజాంపేట నుంచి రాంపూర్, నస్కల్, నందగోకుల్, చల్మెడ మీదుగా కమాన్ వరకు తారు రోడ్డు నిర్మాణానికి గతంలో రూ. 12.20 కోట్లు మంజూరయ్యాయి. కాంట్రాక్టర్ కంకర తొక్కించి పనులు ఆపివేయగా, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ జోక్యం చేసుకోవడంతో నాలుగు కిలోమీటర్ల మేర పూర్తయింది. మిగితా పనిని త్వరలో ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం. – సర్ధార్‌సింగ్, ఈఈ, రోడ్డు భవనాల శాఖ అసంపూర్తిగా నాలుగు జిల్లాల అనుసంధాన రహదారి 18 కిలోమీటర్లకు కేవలం నాలుగు కిలోమీటర్లే పూర్తి ఏడాదిన్నరగా వాహనదారుల అవస్థలు -
సర్కారు కాలేజీల్లో సార్లు లేరు
● వేధిస్తున్న లెక్చరర్ల కొరత ● జిల్లావ్యాప్తంగా 28 ఖాళీలు ● సరైన బోధన లేక పడిపోతున్న ఉత్తీర్ణత శాతం త్వరలో గెస్ట్ ఫ్యాకల్టీ కాలేజీల్లో 12 మంది లెక్చరర్ల కొరత ఉంది. త్వరలో గెస్ట్ ఫ్యాకల్టీని ఇవ్వనున్నట్లు ఉన్నతాధికారులు చెప్పారు. జిల్లాలో 16 పీడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. లెక్చరర్ల ద్వారా విద్యార్థులకు వ్యాయామం నేర్పిస్తున్నాం. – మాధవి, జిల్లా ఇంటర్ నోడల్ అధికారి మెదక్‌జోన్: నిరుపేద విద్యార్థులు చదువుకునే ప్రభు త్వ కాలేజీల్లో అధ్యాపకులు కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రభుత్వ కళాశాలల్లో బోధన, బోధనేతర సి బ్బంది కొరతతో నిరుపేద విద్యార్థుల చదువులు ము ందుకు సాగటం లేదు. ఫలితంగా ఏటా ఫలితాల్లో జిల్లా అట్టడుగు స్థాయికే పరిమితం అవుతోంది. 16 కాలేజీలు.. 5,417 మంది విద్యార్థులు జిల్లావ్యాప్తంగా 16 ప్రభుత్వ కళాశాలలు ఉండగా, వాటిలో 5,417 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరంలో 3,031 మంది విద్యార్థులుండగా వీరి సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అలాగే ద్వితీయ సంవత్సరంలో 2,386 మంది ఉన్నారు. కాగా, 16 కాలేజీల్లో మొత్తంగా పలు రకాల సబ్జెక్టులకు సంబంధించి 12 మంది లెక్చరర్ల పోస్టులు ఖాళీగా ఉండగా, కళాశాలకో వ్యాయామ ఉపాధ్యాయుడు (పీడీ) చొప్పున 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొన్నేళ్లుగా కళాశాలల్లో కాంట్రాక్టు పద్ధతిలో బోధించే గెస్ట్ లెక్చరర్లను ప్రభుత్వం గతేడాది క్రమబద్ధీకరించడంతో వారు విధులు నిర్వర్తించే చోటనే పర్మనెంట్ అయ్యారు. దీంతో కొంతమేర ఖాళీల కొరత తీరినప్పటికీ పూర్తిస్థాయిలో మాత్రం అధ్యాపకుల కొరత సమస్య తీరలేదు. సబ్జెక్టుల వారీగా లెక్చరర్లు లేకపోవటంతో విద్యార్థులు ప్రైవేట్ కళాశాలల్లో చేరుతున్నారు. దీంతో ఏటా ప్రభుత్వ కాలేజీల్లో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. ఇప్పటికై నా ఇంటర్ విద్యపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపి ఖాళీల కొరతను వెంటనే భర్తీ చేసి పేద విద్యార్థుల భవిష్యత్తును చక్కబెట్టాల్సిన బాధ్యత ఉందని పలువురు కోరుతున్నారు. ఏటా ఫలితాల్లో వెనకబాటే.. ఇంటర్మీడియెట్ ఫలితాల్లో మెదక్ జిల్లా ప్రతీఏటా వెనకబడుతోంది. 2023, 2024 సంవత్సరాల్లో అట్టడుగు స్థానంలో నిలవగా ఈ ఏడారి సైతం ఫస్టియర్ ఫలితాల్లో చివరిస్థానం (33వ స్థానం)కు పరిమితమైంది. సెకండియర్‌లో మాత్రం 29వ స్థానంలో నిలిచింది. -
బీజేపీకి పంజా గుడ్‌బై
రామాయంపేట/నిజాంపేట(మెదక్): జిల్లాలో బీజేపీకి బిగ్‌షాక్ తగిలింది. ఆపార్టీ మెదక్ నియో జకవర్గ ఇన్చార్జి పంజా విజయకుమార్ బుధవారం రాజీనామా చేశారు. మొదట్లో బీఆర్ఎస్ నుంచి నిజాంపేట జెడ్పీటీసీగా గెలుపొందిన ఆయన, ఆపార్టీలో ఇమడలేక గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. పార్టీలో బీసీ నాయకుల సహకారంలో ఈటల రాజేందర్ అనుచరుడిగా ముద్రపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నుంచి బీజేపీ తరఫున పోటీచేసి ఓటమి చెందారు. అనంతరం జరిగిన ఎంపీ ఎన్నికల్లో రఽఘునందన్‌రావు గెలుపు కోసం శాయశక్తులా కృషి చేశారు. అనతికాలంలోనే బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈసందర్భంగా ‘పంజా’ సాక్షితో మాట్లాడారు. పార్టీలో బీసీలకు సరైన న్యాయం జరగడం లేదని, నాయకులు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని వాడుకుంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో తాను సొంత డబ్బులు ఖర్చుపెట్టి పార్టీని ముందుకు నడిపించానని పేర్కొన్నారు. పార్టీ సిద్దాంతం కేవలం మాటలకే పరిమితమైందని, పార్టీలో అగ్రవర్ణాలకే ప్రాధాన్యత దక్కుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్ష పదవి సైతం బీసీలకు కాకుండా అగ్రవర్ణాలకే ఇచ్చారని, పార్టీలో సమన్యాయం ఎక్కడుందని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తల శ్రేయస్సును అధిష్టానం ఎంతమాత్రం పట్టించుకోవడం లేదని వాపోయారు. తాను ఏ పార్టీలో చేరేది త్వరలోనే ప్రకటిస్తానని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పంజా పార్టీని వీడటానికి వారం రోజుల ముందు నుంచి కాంగ్రెస్ నాయకులతో టచ్‌లో ఉన్నారని సమాచారం. ఈమేరకు ఆయన పలుమార్లు ఎమ్మెల్యేను కలిసినట్లు తెలిసింది. రెండు రోజుల్లో కాంగ్రెస్‌లో చేరడానికి ముహుర్తం ఖరారైనట్లు తెలిసింది. పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆరోపణ త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్న విజయకుమార్? -
సర్కార్ బడుల్లో సంగీత పాఠాలు
సర్కార్ బడికి సహకారమివ్వండిపాపన్నపేట(మెదక్): ఆట పాటలతో చదువు నేర్పుతూ విద్యార్థులను ఆల్రౌండర్లుగా తీర్చిదిద్దడానికి సర్కార్ బడుల్లో ఇక నుంచి సంగీత పాఠాలు నేర్పనున్నారు. పీఎంశ్రీ స్కూళ్ల నుంచి జిల్లాలో 13 పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందులోమోడల్ స్కూళ్లు,టీఎస్ రెసిడెన్షియల్ స్కూల్స్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలున్నాయి.మ్యూజిక్ విద్యలో భాగంగా విద్యార్థులను తబలా,హర్మోనియం,మృదంగం,వయోలిన్ తదితర వాయిద్య కళాకారులుగా తీర్చిదిద్దనున్నారు. తెలంగాణ టెక్నాలజి సర్వీసెస్ లిమిటెడ్ అధ్వర్యంలో టెండర్లు నిర్వహించి ఒక్కో పాఠశాలకు సుమారు రూ.91,500 విలువ చేసే వాయిద్య పరికరాలను పంపిణీ చేశారు.ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు ఆసక్తి గల విద్యార్థులకు సంగీత పాఠ్యాంశాలు నేర్పనున్నారు. ఇందుకు గాను వారానికి ఒక క్లాసు నిర్వహిస్తారు. ప్రణాళిక బాగానే ఉన్నా శిక్షకుల కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. 13 పాఠశాలల్లో మ్యూజిక్ పాఠాలు జిల్లాలో మొత్తం 31 పాఠశాలలు ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ)కింద ఎంపికయ్యాయి.వాటిలో టీఎస్ఎంఎస్ శంకరంపేట, రేగోడ్,కోమట్‌పల్లి,జక్కపల్లి,టీఎస్ఆర్ఇఐఎస్ మెదక్ (వార్డ్ నంబర్ 1)మెదక్ బాలురు,జెడ్పీహెచ్ఎస్ వెల్దుర్తి, పాపన్నపేట, బూరుగుపల్లి, మక్తభూపతిపూర్,శివ్వంపేట,చందాయిపేట, కాళ్లకళ్ ఉన్నాయి. వాయిద్య శిక్షకులు ఎలా! వాయిద్య పాఠాలు నేర్పేందుకు శిక్షకులు ఎలా అనే సమస్య అందరినీ పట్టి వేధిస్తోంది. బాలభవన్ నుంచి శిక్షకులను నియమించుకోవాలని అధికారులు సూచించారు. కానీ, మెదక్ జిల్లా లో అలాంటి బాల భవన్లేదు. దీంతో వారిని ఎలా నియమించుకోవాలని హెచ్ఎంలు ఆలోచనలో పడ్డారు.అయితే నాలుగు పరికరాలను ఒక్కరే బోధించే శిక్షకులు అరుదుగా ఉంటారు.ఒక్కో వాయిద్యానికి ఒక్కో నిపుణుడిని ఎంపిక చేయడం ఆర్థికంగా భారమే. శిక్షకులకు నెలకు రూ.10 వేల గౌరవ భృతి చెల్లించే అవకాఽశం ఉంది.ఇప్పటికే పాఠశాలలకు వాయిద్య పరికరాలు వచ్చాయి. ఈ నెలాఖరుకు శిక్షకులను ఎంపిక చేసి, వచ్చే నెల మొదటి తేదీ నుంచి క్లాసులు ప్రారంభించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆల్ రౌండర్లుగా తీర్చిదిద్దుతాం బట్టీ చదువులకు స్వస్థి చెప్పి,ఆట పాటలతో ఆకట్టుకునేలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దుతాం.అందులో భాగమే ప్రతీరోజు ఆటలు,సంగీత శిక్షణ,ఒత్తిడి లేని చదువులు. రాను రాను సర్కార్ బడుల రూపు రేఖలు మారిపోతున్నాయి. మంచి ఫలితాలు సాధిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది.ఆసక్తి గల సంగీత ప్రావీణ్యులు ఉంటే సంబంధిత హెచ్ఎంలను సంప్రదించాలి.బాలభవన్,బాలబడి సహాకారంతో శిక్షకులను నియమిస్తాం. –రాధాకిషన్, డిఈఓ, మెదక్ పాపన్నపేట(మెదక్): సర్కారు బడికి దాతలు సహకరించి అభివృద్ధికి తోడ్పడాలని డీఈఓ రాధాకిషన్ పిలుపు నిచ్చారు. మండల కేంద్రమైన పాపన్నపేటలో అమెరికాలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న మన్నె ఉపేందర్ తన తరఫున విద్యార్థులకు వాటర్ బాటిళ్లు, బ్యాగ్స్, షూలు, పుస్తకాలు, పెన్నులు మంగళవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఈఓ మాట్లాడుతూ...ప్రభుత్వ బడి మన అందరిదిగా భావించి దాని అభివృద్ధికి కృషిచేయాలన్నారు. పాపన్నపేట పాఠశాల పూర్వ విద్యార్థి ఉపేందర్ అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ప్యానల్ టీంలో సభ్యుడిగా పని చేసి,ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ తను చదువుకున్న బడిని మరిచిపోలేదని కొనియాడారు. అనంతరం కేజీబీవీని సందర్శించారు. పాపన్నపేట ఉన్నత పాఠశాలలో తెలుగు టీచర్ మంగ నర్సింలు రూపొందించిన పాఠ్య ప్రణాళికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంఈఓ ప్రతాప్‌రెడ్డి, హెచ్ఎంలు మహేశ్వర్, శ్రీనివాస్ రావు, టీచర్లు అంజాగౌడ్, నాగరాజు, వెంకట్ రాంరెడ్డి ఉన్నారు. డీఈఓ రాధాకిషన్పీఎంశ్రీ స్కూళ్లకు మహర్దశ జిల్లాలో 13 పాఠశాలల ఎంపిక వాయిద్య పరికరాలకు రూ.91.5 వేలు పరికరాలు సరే..శిక్షకులు ఎలా..! నెలకు రూ.10 వేలు ఇచ్చే యోచనలో సర్కార్ -
ఇందిరమ్మ ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలి
కలెక్టర్ రాహుల్ రాజ్ చేగుంట(తూప్రాన్): ఇందిరమ్మ ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలని లబ్ధిదారులకు కలెక్టర్ రాహుల్‌రాజ్ సూచించారు. మండలంలోని పులిమామిడితోపాటు బోనాల గ్రామాలను కలెక్టర్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఇళ్ల నిర్మాణం దశలను బట్టి ప్రభుత్వం డబ్బులను మంజూరు చేస్తుందన్నారు. జిల్లాలో 9వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా 5వేల ఇళ్లకు గ్రౌండింగ్ పూర్తి చేసి వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయని తెలిపారు. గ్రామాల్లోని పలు వీధులలో పర్యటించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్థానికులకు సూచనలు చేశారు. పాఠశాలల్లో సందర్శించి విద్యార్థులను పాఠ్యాంశాలపై ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. కార్యక్రమంలో ఎంపీడీఓ చిన్నారెడ్డితోపాటు పలు శాఖల అధికారులు ఉపాధ్యాయులున్నారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలి జేడ్పీ సీఈఓ ఎల్లయ్య తూప్రాన్: ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా మొక్కలు నాటాలని జేడ్పీ సీఈఓ, మండల ప్రత్యేకాధికారి ఎల్లయ్య పేర్కొన్నారు. మండలంలోని గుండ్రెడ్డిపల్లిలో వనమహోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...ప్రభుత్వం చేపడుతున్న వనమహోత్సవ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. అడవులు పెంచే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సతీశ్, తహసీల్దార్ శ్రీనివాస్, అటవీశాఖ అధికారి ప్రకాశ్, ఏపీఓ సంతోశ్, గ్రామస్తులు పాల్గొన్నారు. రుణాలను సద్వినియోగం చేసుకోవాలి మెప్మా పీడీ హన్మంతరెడ్డి రామాయంపేట(మెదక్): మహిళా సంఘాల సభ్యులు బ్యాంకులనుంచి తీసుకుంటున్న రుణాలను సద్వినియోగపర్చుకుని అభివృద్ధి చెందాలని మెప్మా పీడీ హన్మంతరెడ్డి సూచించారు. స్థానిక మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన వీధి విక్రయదారుల వ్యాపార మేళా (స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్), స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల మేళాను మున్సిపల్ కమిషనర్ దేవేందర్‌తో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే సభ్యులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే విధంగా బ్యాంకులనుంచి రుణాలు ఇప్పించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఆయన కమిషనర్‌తో కలిసి మహిళా సంఘాలు, వీధి వ్యాపారులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మెప్మా మహిళా సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. అతిథి అధ్యాపక పోస్టులకు ఆహ్వానం సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లాలోని మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాలలు, కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు మెదక్ ఆర్సీఓ గౌతంకుమార్‌రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. తాత్కాలిక పద్ధతిలో ఇంగ్లిష్, ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ, సోషల్, గణితం, హిందీ సబ్జెక్టులను బోధించేందుకు సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, బీఈడీ, పీజీ చేసి 50% మార్కులు తగ్గకుండా ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు. ఈ నెల 19న సంగారెడ్డిలోని ఆర్సీఓ కార్యాలయంలో దరఖా స్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9441250450ను సంప్రదించాలన్నారు. -
స్వచ్ఛతకు నిధులు
కేటాయింపు ఇలా.. మున్సిపాలిటీ నిధులు (రూ.లలో) అమీన్పూర్ 7,17,141 అందోల్–జోగిపేట 4,26,848 బొల్లారం 42,76,373 చేర్యాల 3,65,174 దుబ్బాక 5,49,240 గజ్వేల్–ప్రజ్ఞాపూర్ 66,26,784 హుస్నాబాద్ 4,33,385 మెదక్ 8,12,730 నర్సాపూర్ 3,79,634 రామాయంపేట 3,59,549 సదాశివపేట 6,96,026 సంగారెడ్డి 22,29,523 సిద్దిపేట 1,19,70,573 తెల్లాపూర్ 45,56,296 తూప్రాన్ 24,13,867 జహీరాబాద్ 12,05,599 నారాయణఖేడ్ 3,65,934 పట్టణాల్లో స్వచ్ఛత వెల్లివిరియనుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) 2.0లో భాగంగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి నిధులను కేటాయించారు. పలు మున్సిపాలిటీలు నిధులు లేక నిర్వహణకు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తీపికబురు అందించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 16 మున్సిపాలిటీలకు రూ.3.83కోట్లు మంజూరు చేసింది. – సాక్షి, సిద్దిపేట పట్టణాలకు ప్రతీ ఏటా స్వచ్ఛ భారత్ మిషన్ ర్యాంకులను కేటాయిస్తుంది. వివిధ కేటగిరిలలో ప్రతిభ కనబర్చిన మున్సిపాలిటీలకు స్వచ్ఛ భారత్ అవార్డులను ప్రకటిస్తుంది. సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్ పట్టణాలకు అత్యధికంగా అవార్డులు దక్కాయి. అక్టోబర్ 2021లో ప్రారంభమైన స్వచ్ఛ భారత్ మిషన్ 2026 అక్టోబర్ వరకు కొనసాగ నుంది. ఇందులో భాగంగా ప్రతీ సంవత్సరం పట్టణాలకు నిధులు కేటాయిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీలకు రూ.3,83,84,676 నిధులు మంజూరు చేశారు. ఆయా పట్టణాల్లో జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది. అత్యధికంగా సిద్దిపేట మున్సిపాలిటీకి, అత్యల్పంగా రామాయంపేట మున్సిపాలిటీకి నిధులు మంజూరయ్యాయి. వీటి నిర్వహణకు.. మున్సిపాలిటీలకు కేటాయించిన నిధులను ఘన వ్యర్థాల నిర్వహణ, సామర్థ్యాలు, నైపుణ్యాల పెంపు, విజ్ఞానం, కమ్యూనికేషన్, ప్రజారోగ్య పరిరక్షణకు ఉపయోగపడేలా వెచ్చించనున్నారు. అలాగే పారిశుద్ధ్య కార్యక్రమాలు, బయో మైనింగ్ కార్యక్రమాల నిర్వహణకు వినియోగించాలని ఆదేశించారు. సౌకర్యాలు ఇక మెరుగు మున్సిపాలిటీలలో వసూలయ్యే పన్నుల ద్వారా దాదాపు అన్ని కార్యక్రమాల నిర్వహణ కొనసాగుతోంది. అయితే ఆదాయం తక్కువగా వస్తుండటంతో కార్యాలయ భవనాల, టాయిలెట్ల నిర్వహణ అంతంతమాత్రంగానే ఉంటోంది. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ నిధులు మంజూరైన తరుణంలో మున్సిపాలిటీలలో సౌకర్యాలు మెరుగుపడే అవకాశం ఉంది. ‘స్వచ్ఛత’లో మెరుగైన ర్యాంక్ సాధిస్తాం స్వచ్ఛభారత్ నిధులను మున్సిపల్ పరిధిలో నిర్వహించే స్వచ్ఛత కార్యక్రమాలకు వినియోగిస్తాం. డీఆర్సీ సెంటర్, డంపింగ్ యార్డు అభివృద్ధి, టాయిలెట్స్ నిర్వహణ, ప్లాస్టిక్ నిషేధంపై, పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తాం. అందరి సమష్టి కృషితో స్వచ్ఛభారత్ మిషన్‌లో మెరుగైన ర్యాంక్ సాధించేందుకు కృషి చేస్తున్నాం. సీడీఎంఏ అనుమతితో నిధులు వినియోగిస్తాం. –మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్ హుస్నాబాద్ -
పుట్టెడు దుఃఖం మిగిల్చి..
పుట్టిన రోజుకు ముందేకొల్చారం(నర్సాపూర్): కాంగ్రెస్ ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి అనిల్ హత్య ఉమ్మడి జిల్లాలో కలకలం రేపింది. పేద కుటుంబంలో పుట్టిన అనిల్.. రాజకీయంగా అంచెలంచెలుగా జిల్లాస్థాయి నాయకుడిగా ఎదిగారు. పైగా ఆర్థికంగా బలపడ్డారు. అయితే సోమవారం హైదరాబాద్‌లో పార్టీ సమావేశానికి వెళ్లి తిరిగి వస్తుండగా అనూహ్య రీతిలో దుండగులు వెంటాడి వేటాడి కాల్పులు జరిపి అనిల్‌ను మట్టుబెట్టారు. దీంతో అతడి సొంతూరు కొల్చారం మండలం పైతరలో తీవ్ర విషాదం నెలకొంది. బుధవారం అనిల్ పుట్టిన రోజు ఉండటం.. ఒక రోజు ముందే హత్యకు గురికావడంతో అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. అయ్యో.. దేవుడా.. ‘అయ్యో.. బిడ్డా పుట్టిన రోజుకు ఒక ముందే మమ్మల్ని విడిచి పోయావా?.. దేవుడా మేమేం పాపం చేశాం.. నా బిడ్డను తీసుకెళ్లావా?’ అంటూ అనిల్ తల్లి యేసమ్మ రోదించడం అక్కడున్న వారిని కదిలించింది. బర్త్‌డే వేడుకలు చేసుకుందాం..అందరం కలుసుకుందాం అని చెప్పిన అనిల్‌ను ఇలా విగతజీవిగా చూస్తామని కలలు కూడా ఊహించలేదని స్నేహితులు కన్నీటిపర్యంతమయ్యారు. పదిమందికి సహాయం చేసే గుణం తప్ప మా అన్న ఎవరికీ చెడు చేయలేదని, శత్రువులు కూడా ఎవరూ లేరని అనిల్ సోదరుడు నవీన్ విలపిస్తున్నాడు. పోలీస్ ఈ విషయంలో పూర్తి దర్యాప్తు చేసి నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గ్రామంలో విషాదఛాయలు అనిల్ మృతితో పైతర గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. తల్లిదండ్రులు మాత్రం తను మా కుమారుడు ఎవరికి హాని తలపెట్టింది లేదని, కావాలనే పిలిచి తమ కుమారుడిని హత్య చేశారంటూ విలపిస్తున్నారు. అనిల్‌పై కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులతోపాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫోన్ మాట్లాడిన 15 నిమిషాలకే.. ఫోన్లో మాట్లాడిన 15 నిమిషాలకే యాక్సిడెంట్ అయ్యిందన్న వార్త అందిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లేశంగౌడ్ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు గాంధీభవన్‌లో జరిగిన నియోజకవర్గస్థాయి సమావేశానికి నాతో పాటు అనిల్, ఇంకా కొంతమంది నాయకులు పాల్గొన్నారన్నారు. తిరుగు ప్రయాణంలో అదే కారులో నేను మరికొంతమంది కలసి ప్రయాణమయ్యామన్నారు. నేను కూకట్పల్లి మెట్రోస్టేషన్ వద్ద దిగి వెళ్లిపోయానని తెలిపారు. రాత్రి 7:45కు ఫోన్ చేయగా అందర్నీ వారివారి గ్రామాల్లో దించేసి ఇంటికి వెళ్తున్నట్లు చెప్పారని, పావుగంట తర్వాత అనిల్‌కు యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చిందని వివరించారు. -
కొత్తపల్లి రైతు సేవా సహకార సంఘానికి అవార్డు
పాపన్నపేట(మెదక్): సొసైటీ సభ్యులకు మెరుగైన ఆర్థిక వినిమయ సేవలు అందించి లాభాల్లో రెతులకు 10% డివిడెంట్ పంచిన కొత్తపల్లి రైతు సేవా సహకార సంఘం చైర్మన్ త్యార్ల రమేశ్‌కు మంగళవారం హైదరాబాద్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, సహకార శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్, నాబార్డ్ జీఎం ఉదయ్‌భాస్కర్ చేతుల మీదుగా అవార్డు అందజేశారు. నాబార్డ్ ఆధ్వర్యంలో మెదక్ ఉమ్మడి జిల్లా నుంచి కొత్తపల్లి రైతుసేవా సహకార సంఘాన్ని ఎంపిక చేశారు. సొసైటీకి వచ్చిన లాభాల్లో సుమారు రూ.17.50 లక్షలను సభ్య రైతులకు 10% చొప్పున వారి ఖాతాల్లో జమ చేశారు. రైతులకు రుణాల పంపిణీ, వాటి రికవరీ, పెట్రోల్, డీజీల్ బంకుల నిర్వహణ, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, ఫర్టిలైజర్ సేవలు తదితర విభాగాల్లో సొసైటీ చేసిన సేవలను గుర్తించి ఈ అవార్డును అందజేసినట్లు చైర్మన్ రమేశ్ తెలిపారు. -
ఆయిల్‌పామ్ లక్ష్యం 2,500ఎకరాలు
రాష్ట్ర ఉద్యానశాఖ జాయింట్ డైరెక్టర్ సునీతకౌడిపల్లి(నర్సాపూర్): జిల్లాలో ఈ ఏడాది ఆయిల్‌పామ్ సాగు 2,500 ఎకరాల లక్ష్యాన్ని నిర్దేశించినట్లు రాష్ట్ర ఉద్యానశాఖ జేడీ సునీత వెల్లడించారు. మండల కేంద్రమైన కౌడిపల్లిలో టమాటా రైతు మహిపాల్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో కాకర, బీర కూరగాలయ పంటను, ముట్రాజ్‌పల్లి ఆయిల్‌పామ్ సాగును జిల్లా అధికారి ప్రతాప్‌సింగ్‌తో కలిసి మంగళవారం పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..జిల్లాలో ఇప్పటివరకు 1,739 రైతులు ఆయిల్ పామ్ సాగు కోసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. 930మంది రైతువాటాగా మొక్కలకు డబ్బులు కూడా చెల్లించారని తెలిపారు. ఆయిల్‌పామ్ సాగుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని ఒక్కసారి మొక్క నాటితే నాల్గవ ఏట నుంచి పంట కోతకు వస్తుందన్నారు. ఏడాదికి ఎకరాకు రూ 1.40లక్షల ఆదాయం వస్తుందని చెప్పారు. నాలుగేళ్లపాటు అంతర పంటగా సాగుచేసి అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. కూరగాయల పంటలకు సైతం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని, ఎకరా పందిరి సాగుకు రూ.1లక్ష సబ్సిడీ వస్తుందని వివరించారు. కార్యక్రమంలో డీహెచ్ఓ ప్రతాప్‌సింగ్, హార్టికల్చర్ అధికారి సంతోష్, రైతు మహిపాల్‌రెడ్డి, మౌనిక రైతులు కొర్రశ్రీను పాల్గొన్నారు. మెదక్ కలెక్టరేట్: ఉద్యాన శాఖ జాయింట్ డైరెక్టర్ సునీత తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు రూ.3.83 కోట్లు ● 16 మున్సిపాలిటీలకు కేటాయింపు ● అత్యధికంగా సిద్దిపేటకు.. అత్యల్పంగా రామాయంపేటకు ● మెరుగుపడనున్న పట్టణాలు -
ఒకేరోజు ముగ్గురు అధికారులు బాధ్యతల స్వీకరణ
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో మంగళవారం ఒకేరోజు ముగ్గురు అధికారులు నూతనంగా బాధ్యతలు చేపట్టారు. జిల్లా వ్యవసాయ అధికారిగా ఇక్కడ పనిచేసిన గోవింద్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో వ్యవసాయ శాఖ టెక్నికల్ అధికారి వినయ్‌కుమార్ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఆత్మ నాగర్ కర్నూల్నందు పని చేస్తున్న దేవ్‌కుమార్ బదిలీపై వచ్చి నూతన వ్యవసాయ అధికారిగా మంగళవారం బాధ్యతలు చేపట్టారు. అలాగే సంగారెడ్డి జిల్లా మెప్మాపీడీగా పనిచేస్తున్న గీత బదిలీపై వచ్చి మెదక్ జెడ్పీడీప్యూటీ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. మరోవైపు జిల్లా మెడికల్ కళాశాల నూతన ప్రిన్సిపాల్‌గా నితిన్ కబ్రా నియమితులయ్యారు. బాధ్యతలు చేపట్టిన ముగ్గురు అధికారులు కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆయన చాంబర్లో మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కలను అందజేశారు. -
రచ్చకెక్కొద్దు..
● విభేదాలొస్తే అంతర్గతంగా చర్చించుకోవాలి ● అవసరమైతే పీసీసీ దృష్టికి తీసుకురండి ● ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులకు పొన్నం సూచన సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: విబేధాలుంటే రచ్చకెక్కి మాట్లాడొద్దు.. ఏమైనా సమన్వయ సమస్య ఎదురైతే అంతర్గతంగా చర్చించుకొని పరిష్కరించుకోవాలి.. లేనిపక్షంలో టీపీసీసీ నాయకత్వం దృష్టికి తీసుకురావాలి.. అంతేకానీ ఇష్టానుసారంగా మాట్లాడొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ నేతలకు సూచించారు. సోమవారం గాంధీభవన్‌లో సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల కీలక నాయకులతో సమావేశం జరిగింది. సంస్థాగత నిర్మాణం గ్రామ, మండల, జిల్లా కార్యవర్గం, అనుబంధ సంఘాల నియామకం తదితర అంశాలపై పొన్నం నేతలతో చర్చించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే నామినెటేడ్, పార్టీ పదవుల ఎంపికలో ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. ఒక్కో నియోజకవర్గానికి రెండు చొప్పున రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ల పోస్టులు భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఈ నెలాఖరులోగా అన్ని నామినేటెడ్ పదవులతో పాటు, పార్టీ సంస్థాగత పదవుల భర్తీ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. నియోజకవర్గ ఇన్చార్జిలు ఆయా పదవుల కోసం ఇచ్చిన జాబితాలపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసి టీపీసీసీ, ఏఐసీసీ నాయకత్వానికి పంపుతామన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కష్టపడి పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ సురేష్‌షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, నీలం మధు, మెదక్ డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, ఆయా నియోజకవర్గాల ఇన్చార్జిలు రాజిరెడ్డి, నర్సారెడ్డి పాల్గొన్నారు. -
బాలికలు ఉన్నతంగా చదువుకోవాలి
అదనపు కలెక్టర్ నగేశ్ చేగుంట(తూప్రాన్): బాలికలు ఉన్నతంగా చదువుకోవాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. సోమవారం సాయంత్రం మండలంలోని రెడ్డిపల్లి కాలనీ కేజీబీవీని డీఈఓ రాధాకిషన్‌తో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో ఉపాధ్యాయులు బోధిస్తున్న తీరుపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లో అందిస్తున్న ఆహారంతో పాటు వసతుల కల్పనపై ఆరా తీశారు. నూతనంగా ఏర్పాటైన నార్సింగి కేజీబీవీ విద్యార్థినులు సైతం రెడ్డిపల్లి కాలనీలోనే చదువుకుంటున్నారని, వసతులు సరిపోవడం లేదని ఉపాధ్యాయులు వివరించారు. త్వరలోనే తగిన గదులను పరిశీలించి నార్సింగి మండల విద్యార్థులను తరలించే ఏర్పాట్లు చేస్తానని డీఈఓ హామీ ఇచ్చారు. వారి వెంట ఎంఈఓ నీరజ, పాఠశాల ఎస్ఓ శ్రీవాణి, సిబ్బంది ఉన్నారు. -
మహిళలను కోటీశ్వరులను చేస్తాం
నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డినారాయణఖేడ్: మహిళలను కోటీశ్వరులను చేయాలన్ననే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. సోమవారం ఖేడ్‌లోని ఓ ఫంక్షన్హాల్లో ఇందిర మహిళాశక్తి విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసంద ర్భంగా పలు మహిళా సంఘాల సభ్యులకు వడ్డీ రాయితీకి సంబంధించి రూ. 2,87,82,000 చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నాడు దివంగత వైఎస్సార్ మ హిళా సంఘాలకు పావలా వడ్డీ రుణాలు ఇచ్చారని, తర్వాత బీఆర్ఎస్ పట్టించుకోలేదన్నారు. తిరిగి తమ ప్రభుత్వం మహిళా సంఘాలకు చేయూతనందిస్తుందని తెలిపారు. నియోజకవర్గంలోని మహిళా సంఘాల సభ్యులు ముందుకు వస్తే రెండు బస్సులు, పెట్రోల్‌బంక్‌లు, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే మండలంలోని వెంకటాపూర్ అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. రూ. 3.86 కోట్లతో అర్బన్ పార్కుగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డీఎఫ్ఓ శ్రీధర్‌రావు, రేంజ్ అధికారిణి అనురాధ, సిబ్బందితో కలిసి వన మహోత్సవంలో భాగంగా మొక్కలను నాటారు. అలాగే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గిరిజా షెట్కార్, మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, ఐకేపీ పీడీ జ్యోతి, డీపీఎం సుధాకర్, ఏపీఎంలు వంశీకృష్ణ, సాయిలు, అనంతయ్య, కుమార్, శేఖర్, సీసీలు, మహిళా సంఘాల సభ్యులు, నాయ కులు త దితరులు పాల్గొన్నారు. -
18న జిల్లాకు బీజేపీ చీఫ్ రాక
నర్సాపూర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఈనెల 18న జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఎంపీ రఘునందన్‌రావు సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మొదటి సారి జిల్లాకు వస్తున్నందున ఆయన పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్, మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్న రమేష్‌గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎల్‌ఎన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాశీనాథ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలి
● కలెక్టర్ రాహుల్‌రాజ్ ● ప్రజావాణిలో 66 వినతుల స్వీకరణ మెదక్ కలెక్టరేట్: ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తూ వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం అదనపు కలెక్టర్ నగేశ్‌తో కలిసి కలెక్టరేట్లో వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ఒకే సమస్యపై పలుమార్లు వినతిని సమర్పించకుండా చూడాలన్నారు. ఎప్పటికప్పుడు గ్రీవెన్స్‌లో వచ్చిన దరఖాస్తులకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన పూర్తికాగానే తీసుకున్న నిర్ణయాన్ని సదరు ఫిర్యాదుదారుడికి సమాచారం చేరవేయాలన్నారు. లేనిచో మళ్లీ అదే సమస్యపైన వినతి సమర్పించేందుకు గ్రీవెన్స్‌కు ప్రజలు రావాల్సిన అవసరం ఏర్పడుతుందన్నారు. ఇదిలాఉండగా ప్రజావాణిలో వివిధ సమస్యలపై ప్రజలను 66 అర్జీలను సమర్పించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఎల్ల య్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావుతో పాటు ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. త్వరగా భూ సమస్యలు పరిష్కరించాలి చిలప్‌చెడ్(నర్సాపూర్): జిల్లావ్యాప్తంగా రైతులకు సరిపడా యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియో గం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాన్ని, తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి, ఎరువుల ధరల గురించి ఆరా తీశారు. జిల్లాలో సుమారు 4,500 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. రైతులకు యూరియా సరిపోకపోతే, ఇంకా తెప్పిస్తామన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. భూభారతి పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపికై న చిలప్‌చెడ్ మండలంలో వచ్చిన రెవెన్యూ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన కోడిగుడ్లు మెదక్ కలెక్టరేట్: విద్యార్థులకు నాణ్యమైన కోడిగుడ్లు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లాలోని కేజీబీవీలు, రెసిడెన్షియల్, అంగన్వాడీ కేంద్రాలు, సంక్షేమ హాస్టళ్ల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన కోడిగుడ్ల పంపిణీపై ప్రభుత్వం జీఓ విడుదల చేసినట్లు తెలిపారు. కోడిగుడ్ల సరఫరా ప్రక్రియ ఆన్లైన్ టెండర్ విధానం ద్వారా పారదర్శకంగా నిర్వహించినట్లు చెప్పారు. అనంతరం మెదక్ నుంచి బదిలీపై వెళ్తున్న లీడ్ బ్యాంక్ మేనేజర్ నరసింహమూర్తిని ఘనంగా సన్మానించారు. -
పరిశ్రమలు నిబంధనలు పాటించాలి
పటాన్చెరు టౌన్: అగ్ని ప్రమాదాల పట్ల పారిశ్రామికవేత్తలంతా అప్రమత్తంగా ఉండాలని, అగ్ని ప్రమాదాల నివారణకు ప్రతి పరిశ్రమలో రక్షణ పరికరాలు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని తెలంగాణ అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి తెలిపారు. సోమ వారం పాశమైలారం ఐలా ప్రాంగణంలో పారిశ్రామికవేత్తలతో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా కాలంగా కొన్ని పరిశ్రమల్లో అగ్ని ప్రమాద నియంత్రణ చర్యలు లేవని, పలు పరిశ్రమల్లో ఉపయోగిస్తున్న కెమికల్స్ వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అన్నారు. నిపుణులైన కార్మికులను నియమించడం ద్వారా అగ్ని ప్రమాదాలకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు. రాష్ట్రంలో జరిగిన ప్రమాదాల్లో అగ్నిమాపకశాఖ సమర్థవంతంగా పనిచేసి ఎక్కువ ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా కృషి చేయడం హర్షించ తగిన విషయమన్నారు. కాగా సిగాచీ పరిశ్రమ ఘోర ప్రమాదం నేపథ్యంలో అలెర్ట్‌గా ఉండాలని, అగ్ని ప్రమాదాల విషయంలో నిబంధనలు పాటించని పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు పారిశ్రామికవేత్తలతో పాటు జిల్లా ఫైర్ అధికారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి -
సింగూరు నీరు విడుదల చేయండి
మెదక్ కలెక్టరేట్: సింగూరు నుంచి ఘనపూర్ ప్రాజెక్టుకు సాగునీటిని విడుదల చేయాలని, లేదంటే రైతులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి హెచ్చరించారు. సోమవారం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డితో కలిసి ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే రైతులను పట్టించుకున్న పాపానపోవడం లేదని విమర్శించారు. సింగూరులో నీరు ఉన్నప్పటికీ ఘనపూర్ ప్రాజెక్టుకు 0.4 టీఎంసీలు వాటాగా రావాల్సినవి విడుదల చేయడం లేదని మండిపడ్డారు. గతం ప్రభుత్వంలో సమయానికి నీరు వదిలామని గుర్తుచేశారు. సింగూరు, కాళేశ్వరం జలాలు, కొండపోచమ్మ సాగర్ నుంచి హల్దీ ప్రాజెక్టుకు సాగు నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు జిల్లాలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ పాటించండం లేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ లు మల్లికార్జున గౌడ్, బట్టి జగపతి, లావణ్య రెడ్డి, ఇతర నాయకులు ఆంజనేయులు, లింగారెడ్డి, జుబేర్, జీవన్‌రావు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని ఆవేదన -
45కు చేరిన సిగాచీ మృతుల సంఖ్య
పటాన్చెరు టౌన్: ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ పరిశ్రమలో చోటుచేసుకున్న ప్రమాదంలో 44 మంది మృతదేహాలను కుటుంబ సభ్యులకు అధికారులు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మదినగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెస్ట్ బెంగాల్‌కు చెందిన తుడు తరపాడు (45) సోమవారం ఉదయం మృతి చెందాడు. ఈసందర్భంగా అధికారులు మృతుడి కుటుంబ సభ్యులకు తక్షణ సహాయం కింద రూ. లక్ష అందజేసి, అంబులె న్స్ ఏర్పాటు చేసి స్వస్థలానికి పంపించారు. ఈసందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ఇప్పటివరకు 45 మంది కార్మికులు మృతి చెందారని, వివిధ ఆస్పత్రుల్లో 13 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. దరఖాస్తుల ఆహ్వానం నారాయణఖేడ్: నిజాంపేట్ మండల పరిధిలోని గిరిజన సంక్షేమ మిని బాలికల గురుకులంలో ఔట్సోర్సింగ్ పద్ధతిన విధులు నిర్వర్తించేందుకు కుక్, ఆయా ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రీజినల్ కోఆర్డినేటర్ నాగార్జునరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గిరిజన మహిళా అభ్యర్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఈనెల 21 సాయంత్రం 4 గంటలలోగా గురుకులంలో సమర్పించాలని తెలిపారు. టెన్త్ విద్యార్హత అని, రూ. 9,750 వేతనం చెల్లిస్తామన్నారు. ఇతర వివరాలకు 7981090652 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తివేసేందుకు కుట్ర జోగిపేట(అందోల్): ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతుందని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సురేష్ అన్నారు. సోమవారం జోగిపేట ఎమ్మార్వో కార్యాలయం ఎదుట విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ. 7,200 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులను విద్యకు దూరం చేయాలని ప్రభుత్వం చూస్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులు ప్రవీణ్, సన్నీ దినేష్, మహేష్, శ్రీలత, దీపిక, చోటు, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఏడు మండలాలు.. 2,508 రేషన్ కార్డులు నర్సాపూర్: నియోజకవర్గంలోని ఏడు మండలాలకు 2,508 కొత్త రేషన్‌కార్డులు వచ్చాయని ఆర్డీఓ మహిపాల్ సోమవారం తెలిపారు. వాటిని లబ్ధిదారులకు అందజేస్తామని చె ప్పారు. నర్సాపూర్ మండలానికి 354, శివ్వంపేటకు 428, కౌడిపల్లికి 615, కొల్చారానికి 384, మాసాయిపేటకు 249, వెల్దుర్తికి 385, చిలప్‌చెడ్ మండలానికి 93 రేషన్‌కార్డులు మంజూరైనట్లు వివరించారు. ఉపాధ్యాయులకు అవగాహ న శివ్వంపేట(నర్సాపూర్): శాస్త్ర సాంకేతిక రంగాలపై విద్యార్థులు అవగాహన పెంచుకునే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి అన్నారు. సోమవారం శివ్వంపేటలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అటల్ టింకరింగ్ ల్యాబ్‌లపై 12 పాఠశాలలకు సంబంధించి 36 మంది ఉపాధ్యాయులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం జిల్లాలో 25 పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసిందన్నారు. ఆయా పాఠశాలల్లో రూ. 10 లక్షల విలువ గల రోబోటిక్స్‌తో పాటు అధునాతన ప్రయోగ పరికరాలను అందజేసిందన్నారు. సైన్స్, టెక్నాలజీ, గణితం, ఇంజనీరింగ్‌పై విద్యార్థులు పట్టు సాధించేందుకు ఎంతగానో ఉపయోగపడుతున్నారు. కార్యక్రమంలో ఎంఈఓ బుచ్చనాయక్, గెజిటెడ్ హెచ్ఎం, కోర్స్ కోఆర్డినేటర్ బాలచంద్రం తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్లు కట్టలేం!
మెదక్‌జోన్: ఇందిరమ్మ ఇంటి నిర్మాణం లబ్ధిదారులకు భారంగా మారింది. ముడి సరుకుల ధరలు అమాంతం పెరిగాయి. ఇసుక ఉచితంగా సరఫరా చేస్తామని, ఇందుకు అవసరమైన రవాణా ఖర్చులను మాత్రమే లబ్ధిదారుడు భరించాల్సి ఉంటుందని ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పటివరకు ఇసుక తెప్పించకపోవటంతో బయట మార్కెట్లో ఒక్కో ట్రాక్టర్‌కు రూ. 4 వేలు చెల్లించి లబ్ధిదారులు కొనుగోలు చేస్తున్నారు. కేవలం ఇసుకకే రూ. 30 నుంచి రూ. 40 వేలు ఖర్చు చేస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వం ఇచ్చే రూ. 5 లక్షలు పోనూ పేదలపై మరో రూ. లక్షకుపైగా భారం అదనంగా పడనుంది. మొదటి విడతలో 9 వేల ఇళ్లు మంజూరు జిల్లాలో మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలు ఉండగా, ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొ ప్పున జిల్లాకు 7 వేల ఇళ్లు మంజూరు కావాల్సి ఉంది. ఇవి కాకుండా జిల్లాలో గజ్వేల్, దుబ్బాక, ఆందోల్, నారాయణఖేడ్, నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాలు ఉండటంతో జిల్లాకు మొదటి విడతలో 9 వేల ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో ఇప్పటివరకు 5 వేల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాగా, అందులో 360 ఇళ్ల బేస్మెంట్ పూర్తి అయింది. వారికి రూ. లక్ష చొప్పున బిల్లులు అందించారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకా రం ఇందిరమ్మ ఇంటి నిర్మాణం 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగుల మేర నిర్మించుకోవాలి. ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల చొప్పున, నాలుగు విడతల్లో డబ్బు లను లబ్ధిదారుడి ఖాతాలో జమ చేయనుంది. ఒక్కో సిమెంట్ బస్తా ధర రూ. 360 కానీ ఇంటి నిర్మాణానికి వినియోగించే సిమెంట్, ఇసుకతో పాటు అన్నింటి ధరలు బయట మార్కెట్లో పెరిగాయి. ఇందులో ప్రధానంగా ఇంటి నిర్మాణానికి 150 బస్తాల సిమెంట్ అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇందుకోసం రూ. 42 వేలను ధరల పట్టికలో చూపించా రు. ఈ లెక్కన ఒక్కో బస్తా సిమెంట్‌కు ప్రభుత్వం రూ. 280 చొప్పున చెల్లిస్తోంది. కానీ ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఒక్కో బస్తా సిమెంట్ ధర రూ. 360 ఉంది. ఈ లెక్కన 150 బస్తాలకు రూ. 54 వేలు అవుతుంది. అంటే కేవలం సిమెంట్‌కు రూ. 12 వేలు అదనంగా లబ్ధిదారుడు భరించాల్సి ఉంటుంది. అలాగే ఇంటి నిర్మాణం మొత్తానికి 8 ట్రాక్టర్ల ఇసుక అవసరం ఉంటుందని, ఇసుకను లబ్ధిదారుడికి ఉచితంగా అందిస్తామని, రవాణా ఖర్చులు రూ. 8 వేలు ఇస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఇసుకను తెప్పించిది లేదు, ఉచితంగా ఇచ్చింది లేదు. ఫలితంగా లబ్ధిదారులు ఒక్కో ట్రాక్టర్ ఇసుకకు రూ. 4 వేల చొప్పున చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఈ లెక్కన రూ. 32 వేలు అదనంగా ఖర్చవుతోంది. అలాగే స్టీల్, కంకర, ఇటుకలు, ఇంటి నిర్మాణానికి ఉపయోగించే సా మగ్రి ప్రభుత్వం ఇచ్చే ధరతో పోలిస్తే అదనంగా చెల్లించాల్సి వస్తోంది. అందుకే ఇళ్లు మంజూరైనా కొంతమంది పేదలు ఇళ్ల నిర్మాణాలను ప్రా రంభించడం లేదు. ఇప్పటికై నా అధికారులు ఉచితంగా ఇస్తామన్న ఇసుకను త్వరగా తెప్పించి లబ్ధిదారులకు అందించాల్సిన అవసరం ఉంది.పెరిగిన నిర్మాణ వ్యయం జాడలేని ఉచిత ఇసుక ప్రభుత్వం ఇచ్చేది రూ. 5 లక్షలు లబ్ధిదారులపై అదనపు భారం -
కాంగ్రెస్ నేత హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, మెదక్: కాంగ్రెస్ నేత అనిల్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కడప జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే కుమారుడికి, అనిల్‌కు మధ్య విబేధాలు ఉన్నాయి. ఓ భూమి విషయంలో గత కొద్దిరోజులుగా వివాదం నడుస్తుంది. టీడీపీ ఎమ్మెల్యే కుమారుడి వద్ద అనిల్ రూ.80 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. ఘటనాస్థలంలో ఉన్న బెంజ్ కారు కూడా టీడీపీ ఎమ్మెల్యే కుమారుడిదేనని పోలీసులు అంటున్నారు. గత ఐదు నెలలుగా బెంజ్ కారు అనిల్ వద్దనే ఉంటుందని చెబుతున్నారు.మెదక్ – జోగిపేట ప్రధాన రహదారిపై నిన్న(సోమవారం రాత్రి కాంగ్రెస్ నేత అనిల్ అనుమానాస్పదంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. మండలంలోని పైతర గ్రామానికి చెందిన మరెల్లి అనిల్(28)జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. మెదక్ నుంచి స్వగ్రామానికి కారులో ఆయన ప్రయాణమయ్యాడు.చిన్నఘనాపూర్ విద్యుత్ సబ్ స్టేషన్ వద్దకు రాగానే కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అనిల్ మృతి చెందినట్లు తెలిపారు. అయితే, అనిల్ శరీరంపై బుల్లెట్ గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఘటనా స్థలంలో నాలుగు బులెట్లు లభ్యమయ్యాయి. -
మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నేత అనుమానాస్పద మృతి
సాక్షి, మెదక్ జిల్లా: కాంగ్రెస్ నేత అనిల్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని మెదక్ – జోగిపేట ప్రధాన రహదారిపై సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మండలంలోని పైతర గ్రామానికి చెందిన మరెల్లి అనిల్(28)జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. మెదక్ నుంచి స్వగ్రామానికి తన కారులో ప్రయాణమయ్యాడు.చిన్నఘనాపూర్ విద్యుత్ సబ్ స్టేషన్ వద్దకు రాగానే కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. దీంతో అనిల్‌కు ఛాతీలో బలమైన దెబ్బ తగిలి స్పృహ తప్పి పడిపోయాడు. అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అనిల్ మృతి చెందినట్లు తెలిపారు. అయితే, అనిల్ శరీరంపై బుల్లెట్ గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఘటనా స్థలంలో నాలుగు బులెట్లు లభ్యమయ్యాయి. -
డబుల్ బెడ్రూంల తాళాలు ఇవ్వండి
జహీరాబాద్ టౌన్: హోతి(కె) వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల తాళాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. సీపీఎం ఆధ్వర్యంలో శనివారం లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో డబుల్బెడ్రూం కాల నీకి తరలివచ్చారు. గత ప్రభుత్వంలో కేటాయించిన ఇళ్లను ఎందుకు అప్పగించడం లేద ని, 12 తేదీన ఇళ్ల తాళాలు ఇస్తామని చెప్పి ఎందుకు వాయిదా వేశారని ప్రశ్నించారు. తాళాలు ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదలమని బైఠాయించారు. జహీరాబాద్ రూరల్ ఎస్ఐ కాశీనాథ్ ఆందోళన కారులతో మాట్లాడారు. రెండవ శనివారం ఇళ్ల కేటాయింపు వాయిదా పడిందని, మరో రోజు అప్పగిస్తారని నచ్చజెప్పారు. అక్కడి నుంచి లబ్ధిదారులు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా చేశారు. ఈసందర్భంగా సీపీఎం నాయకుడు మహిపాల్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభు త్వం హోతి(కె) వద్ద పేదల కోసం 660 ఇళ్లను కట్టించగా అధికారులు డ్రా ద్వారా లబ్ధిదారులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారని చెప్పారు. -
చెరువులు నింపని వాన
ముఖం చాటేసిన వరుణుడు ● ముందుకు సాగని వ్యవసాయ పనులు ● ఆందోళనలో అన్నదాతలు ● బోర్ల కింద జోరుగా సాగు..జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు మండలం వర్షపాతం మి.మీ కొల్చారం 193.0 పెద్దశంకరంపేట 151.9 రేగోడ్ 161.7 అల్లాదుర్గం 159.4 టేక్మాల్ 145.7 పాపన్నపేట 135.6 హవేళిఘణాపూర్ 175.1 రామాయంపేట 172.3 నిజాంపేట 174.2 చేగుంట 164.1 నార్సింగి 129.8 చిన్నశంకరంపేట 152.9 మెదక్ 168.7 చిలప్‌చెడ్ 113.7 కౌడిపల్లి 107.6 నర్సాపూర్ 108.1 శివ్వంపేట 131.2 వెల్దుర్తి 145.7 తూప్రాన్ 152.0 మాసాయిపేట 92.7 మనోహరాబాద్ 53.9వరుణుడు ముఖం చాటేయడంతో జిల్లాలో వ్యవసాయ పనులు ముందుకు సాగడం లేదు. అడపాదడపా కురుస్తున్న వానలతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నా.. మరోవైపు ఆందోళన తప్పడం లేదు. జిల్లాలో ఇప్పటివరకు చెరువులు, కుంటల్లో నీరు చేరేంత వర్షాలు పడలేదు. మేలో కురిసిన వర్షాలతోనే ప్రస్తుతం రైతులు బోర్ల కింద సాగు చేస్తున్నారు. – మెదక్ కలెక్టరేట్ జిల్లాలో గతేడాది ఈ సమయానికి 171 మి.మీ వర్షం కురవగా, ఈఏడాది ఇప్పటివరకు 142.3 మి.మీ వర్షపాతం నమోదైంది. కానీ ఎక్కడా చెరువులు, కుంటల్లో నీరు చేరలేదు. కాగా మేలో కురిసిన భారీ వర్షాలతో భూగర్భజలాలు మెరుగుపడ్డాయి. దీంతో బోర్లలో నీటి ఊటలు పెరిగాయి. వాటిపై ఆధారపడిన రైతులు ప్రస్తుతం వరి సాగు చేస్తున్నారు. చెరువులు, కుంటలు, వర్షాలపై ఆధారపడిన వారు దుక్కులు దున్ని ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. వారం రోజుల క్రితం వర్షాలు కురిసినప్పటికీ ఆశించిన స్థాయిలో పడలేదని రైతులు వాపోతున్నారు. నాట్లు వేసేంత నీరు రాలేదని చెబుతున్నారు. జూన్ నుంచి ఇప్పటివరకు 142.3 మి.మీ వర్షం పడింది. అది కూడా భారీగా కాకుండా విడతల వారీగా కురిసింది. ఇదే సమయంలో ఎండలు మండుతుండటంతో ఎక్కడికక్కడే వర్షం నీరు ఆవిరైపోతుంది. దీంతో జిల్లాలోని ఒక్క చెరువు, కుంట పూర్తిస్థాయిలో నిండలేదు. కాగా జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు కొల్చారం మండలంలో అత్యధికంగా 193 మి.మీ వర్షం కురవగా, మనోహరాబాద్ మండలంలో అత్యల్పంగా 53 మి.మీ కురిసింది. మొత్తం 2,694 చెరువులు ఉండగా, ఒక్క చెరువు కూడా పూర్తిస్థాయిలో నిండలేదు. జిల్లాలో పంటల సాగు ఇలా.. జిల్లాలో వరి సాగు అంచనా 3,05,100 ఉండగా, ఇప్పటివరకు 7 వేల ఎకరాల్లో మాత్రమే సాగైంది. మరో 11 వేల ఎకరాలకు రైతులు నారుపోసి నాటు వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆరుతడి పంట అయిన పత్తి అంచనా 37,200 కాగా, ఇప్పటివరకు 33 వేల ఎకరాల్లో సాగు చేశారు. అలాగే మొక్కజొన్న 2,640 ఎకరాల అంచనా ఉండగా, ఇప్పటివరకు కేవలం 600 ఎకరాల్లో సాగైనట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు.వరి నారు పెరుగుతుంది చెరువు, కుంటలు వెలవెలబోతున్నాయి. బోర్లున్న రైతులు నాట్లు వేసుకుంటున్నారు. దుక్కులు దున్ని వానల కోసం ఆకాశం వైపు చూస్తున్నాం. వర్షం పడితేనే నాట్లు సాగుతాయి. వరి నారు కూడా పెరుగుతుంది. ఎంఎన్, ఎఫ్ఎన్ కెనాళ్ల నుంచి నీరు కూడా రావడం లేదు. – గజ్జెల బాలపోచయ్య, మద్దుల్వాయి -
అన్నిరంగాల్లో అభివృద్ధి: దామోదర
సంగారెడ్డిజోన్: ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించాలని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. శని వారం సంగారెడ్డిలోని తన నివాసంలో ఆందోల్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమా వేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను దశలవారిగా అమలు చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, రైతు భరోసా, భూ భారతి, రైతు రుణ మాఫీ, రైతు బీమాను అమలు చేయడంతో పాటు పెన్షన్లు, కొత్త రేషన్‌కార్డుల జారీ, సన్నబియ్యం, ధాన్యం కొనుగోళ్లు, సన్నాలకు రూ. 500 బోనస్ అమలు చేస్తున్నామని వివరించారు. ప్ర జా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాన్ని అభివృద్ధిని ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. ఆందోల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతానని పేర్కొన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్‌కుమార్ షెట్కార్, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలారెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు సంగమేశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, సిలారపు త్రిష, పీసీసీ సభ్యుడు కిషన్, ఏఎంసీ చైర్మన్లు సుధాకర్‌రెడ్డి, జగన్మోహన్రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్లు మల్లారెడ్డి, కచూర్రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, వివిధ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు దిగంబరరావు, శేషారెడ్డి, రమేష్, నిమ్మ రమేష్ పాల్గొన్నారు. -
బగలాముఖీని దర్శించుకున్న న్యాయమూర్తి
శివ్వంపేట(నర్సాపూర్): మండల కేంద్రంలో కొలువైన బగలాముఖీ శక్తి పీఠాన్ని శనివారం జిల్లా న్యాయమూర్తి నీలిమ దర్శించుకున్నారు. ఈసందర్భంగా వేద పండితుడు శాస్త్రుల వెంకటేశ్వరశర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు, జ్ఞాపిక అందజేశారు. శక్తిపీఠం విశిష్టత, నిర్మాణం గురించి న్యాయమూర్తికి వివరించారు. కార్యక్రమంలో పబ్బ రమేష్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు. 42 శాతం రిజర్వేషన్లు చరిత్రాత్మకం నర్సాపూర్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డిలు అన్నారు. శనివారం పార్టీ క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్, మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్, పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు నాయకులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో బీసీ వర్గాల్లో ఆనందం నెలకొందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. కాయకల్ప పురస్కారానికి ఖేడ్ ఆస్పత్రి ఎంపిక నారాయణఖేడ్: 2024– 25 సంవత్సరానికి ఖేడ్ ప్రాంతీయ ఆస్పత్రిని కాయకల్ప పురస్కారానికి కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిందని ఆస్పత్రి సూపరింటెండెంట్ రమేశ్ శనివారం తెలిపారు. ఆస్పత్రిలో ఉన్నత ప్రమాణాలతో అందిస్తున్న నాణ్యమైన ఆరోగ్యసేవలు, పరిశుభ్రత తదితర వాటికి సంబంధించి ఈ పురస్కారానికి ఎంపికై నట్లు చెప్పారు. ఆస్పత్రి అభివృద్ధి సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి మద్దతు, ఎంపీ సురేష్ షెట్కార్ సహకారం, సిబ్బంది అంకిత భావంతో పనిచేస్తుండటం వల్లే ఇది సాధ్యమైందని వివరించారు. విద్యార్థులు కష్టపడి చదవాలి పటాన్చెరు టౌన్: విద్యార్థులు కష్టపడి చదివితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారని ఇంటర్మీడియెట్ జిల్లా అధికారి గోవిందరావు అన్నారు. శనివారం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పటేల్‌గూడలో ఐఐటీ చుక్కా రామయ్య ఇష్టా జూనియర్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలను ఓ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుట్టినప్పుడు ఉయ్యాల్లో వేస్తారు, చనిపోయినప్పుడు నలుగురు మోస్తారు. ఈ మధ్యలో మనం ఏదో చేయాలనే తపన ఏర్పడాలన్నారు. అనంతరం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇంటర్ దశలోనే మంచి గోల్ పెట్టుకొని కష్టపడితే అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని అన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ చదువు మీద దృష్టి పెట్టాలని సూచించారు. ఏడాది పాటుసీపీఐ వందేళ్ల ఉత్సవాలుహుస్నాబాద్: సీపీఐ ఆవిర్భవించి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ చేసిన త్యాగాలు, పోరాటాలు, ప్రజాఉద్యమంలో సాధించిన విజయాలపై ఏడాదిపాటు సీపీఐ వందేళ్ల ఉత్సవాలను నిర్వహించనున్నట్లు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. పట్టణంలోని సీపీఐ భవన్లో శనివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ...కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపెడుతూ జిమ్మిక్కుల పాలన కొనసాగిస్తుందన్నారు. దేశంలో కార్పొరేట్ శక్తులు సహజ వనరులను కొల్లగొడుతూ లక్షల కోట్లకు పడగలెత్తుతున్నారని ఆరోపించారు. ఆర్థిక నేరస్తులైన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, లలిత మోదీ వంటి దొంగలకు ప్రధాని మోదీ వత్తాసు పలుకుతున్నారని తెలిపారు. -
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి
పరిగి ఎమ్మెల్యే, జిల్లా సంస్థాగతఎన్నికల ఇన్చార్జి రాంమోహన్‌రెడ్డి నారాయణఖేడ్: అతిత్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని పరిగి ఎమ్మెల్యే, పార్టీ సంస్థాగత ఎన్నికల జిల్లా ఇన్చార్జి రాంమోహన్‌రెడ్డి సూచించారు. ఖేడ్‌లోని ఓ ఫంక్షన్హాల్లో శనివారం నిర్వహించిన నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రజాపాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతోందన్నారు. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలను అందించడం జరుగుతోందని గుర్తు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి వివరించాలన్నారు. టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వాటి ద్వారా లబ్ధిపొందుతున్న విషయాలను సమగ్రంగా వివరించారు. జనాభా దమాషా ప్రకారం బీసీలకు సమానా వాటా దక్కాలనే ఉద్దేశంతో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడం జరుగుతోందన్నారు. టీపీసీసీ సభ్యు లు శంకరయ్యస్వామి, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనంద్ స్వరూప్ షెట్కార్, వినోద్‌పాటిల్, మాజీ ఎంపీపీ, జెడ్పీసీటీలు, ఆయా మండలాల పార్టీల అధ్యక్షులు నియోజకవర్గంలోని కాంగ్రెస్‌పార్టీ, అనుబంధ సంఘాల బాధ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఆర్టీసీకి మహిళా సంఘాల బస్సులు
సంగారెడ్డి జోన్: గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా సంఘాలు ఆర్థిక సాధికారత సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే పలు రంగాలలో అవకాశాలు కల్పిస్తుండగా, మహిళా సంఘాల ద్వారా బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది. జిల్లాకు 20 బస్సులు కేటాయించే అవకాశం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంతో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో అనేక రకాల కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా ఇప్పటికే మహిళా శక్తి క్యాంటీన్లు, మిల్క్పార్లర్లు, మహిళా పెట్రోల్ బంక్, పాఠశాల విద్యార్థులకు యూనిఫాం కుట్టడంతో పాటు వివిధ రకాలు యూనిట్లు ప్రవేశపెట్టింది. ఈక్రమంలో మహిళా శక్తి పథకం ద్వారా 600 బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇవ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగా జిల్లాకు 20 బస్సుల వరకు అప్పగించే అవకాశం ఉంది. మరింత ఆదాయం జిల్లాలో ఉన్న మండల మహిళా సమాఖ్య సభ్యులతో అద్దె బస్సులు ఇవ్వనున్నారు. రుణాలు తీసుకొని తిరిగి చెల్లించడంలో ఆలస్యం చేయకుండా ఉండటంతో పాటు వివిధ రకాల అర్హతలను పరిశీలించి సంఘాలను ఎంపిక చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ గ్రాంట్ ద్వారా రూ. 30 లక్షలు, సమాఖ్య సభ్యులతో రూ. 6 లక్షలు ఇప్పించి బస్సులను కొనుగోలు చేయనుంది. ఆ బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇవ్వనున్నారు. సంస్థ ప్రతి నెల సంబంధిత సభ్యులకు నెలకు సుమారు రూ. 70 వేలు చెల్లించనుంది. దీంతో సుమారు రూ. 14 లక్షల ఆదాయం సమకూరనుంది. ఫలితంగా మహిళలకు మరింత ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి.జిల్లా వివరాలు జిలా మహిళా సమాఖ్య 1 మండల మహిళా సమాఖ్యలు 25 గ్రామ మహిళా సమాఖ్యలు 695 మహిళా గ్రూపులు 18,488 గ్రూపులలోని మహిళా సభ్యులు 1,91,455 -
పెరగనున్న బీసీ పాలకులు
42 శాతం రిజర్వేషన్ అమలైతే 206 మందికి అవకాశం మెదక్‌జోన్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాలని తీర్మానించింది. ఇది అమలైతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ నేతలకు అధిక మొత్తంలో రాజ్యాధికారం దక్కనుంది. జిల్లాలో 2018లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 469 గ్రామ పంచాయతీలు, 4,086 వార్డులు ఉండగా, గత ప్రభుత్వం కొత్తగా 23 పంచాయతీలను ఏర్పాటు చేసింది. దీంతో జిల్లాలో పంచాయతీల సంఖ్య 492కు చేరుకుంది. అలాగే అప్పట్లో వార్డులు 4,086 ఉండగా, కొత్తగా 134 వార్డులను కొత్తగా ఏర్పాటు చేయటంతో వాటి సంఖ్య 4,220కి చేరుకుంది. ఈ నేపథ్యంలో అప్పటి రిజర్వేషన్ ప్రకారం సర్పంచ్‌లు ఎస్టీలకు 80, ఎస్సీలకు 66, బీసీలకు 120 కాగా, ఇతరులు 203 మంది ఉన్నారు. కాగా ఈ రిజర్వేషన్లో సుమారు సగం మంది మహిళలు కాగా, మిగితా సగం మంది పురుషులు ఉన్నారు. మండల, జిల్లా పరిషత్‌లోనూ .. గతంలో జిల్లావ్యాప్తంగా 189 ఎంపీటీసీలు ఉండగా, అప్పటి 22 శాతం రిజర్వేషన్ ప్రకారం బీసీలకు 41 సీట్లు లభించాయి. కాగా ఇటీవల ఒక ఎంపీటీసీ స్థానం పెరగటంతో ఆ సంఖ్య 190కి చేరుకుంది. ఈ లెక్కప్రకారం 42 శాతం రిజర్వేషన్ అమలైతే బీసీలకు 79 సీట్లు దక్కనున్నాయి. అలాగే ఎంపీపీలు, జెడ్పీటీసీలు గతంలో 20 చొప్పున ఉండగా, నూతనంగా మాసాయిపేట మండలాన్ని ఏర్పాటు చేయటంతో ఎంపీపీలు 21, జెడ్పీటీసీ స్థానాలు 21కి చేరుకున్నాయి. కాగా నూతన రిజర్వేషన్ అమలైతే బీసీలకు 8 సీట్ల చొప్పున పాలనాపరమైనా స్థానం కై వసం కానుంది.బీసీ రిజర్వేషన్ అమలైతే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలైతే, ప్రస్తుతం జిల్లాలో 492 గ్రామ పంచాయతీలకు గానూ ఎస్సీ, ఎస్టీలకు అప్పటి రిజర్వేషన్ అమలు కాగా, ఇతరుల రిజర్వేషన్లో కోతపడి బీసీలకు 206 మందికి పదవులు దక్కే అవకాశం ఉంది. అలాగే ఎస్సీలకు 66, ఎస్టీలకు 80, మిగితా 140 సీట్లలో ఇతరులు, (ఓసీలకు) అవకాశం ఉంటుంది. అలాగే వార్డు మెంబర్లకు సైతం ఇదే తరహా రిజర్వేషన్లు వర్తించనుంది. -
పురభివృది్ధకి నిధులు!
● జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు రూ. 60 కోట్లు ● ప్రతిపాదనలు పంపిన అధికారులు ● త్వరలో విడుదల చేయనున్న ప్రభుత్వంరామాయంపేట(మెదక్): పట్టణాల్లో నెలకొన్న సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఏ పని చేయాలన్నా నిధుల కొరతతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో మన్సిపాలిటీల్లో అభివృద్ధి కుంటుపడింది. ఇప్పటికే అధికారులు పలుమార్లు ప్రతిపాదనలు పంపినా నిధుల మంజూరు కాలేదు. తాజాగా ప్రభుత్వం పట్టణాల్లో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించింది. ఈ మేరకు త్వరలో నిధులు మంజూరు చేయడానికి కసరత్తు చేస్తుంది. కాగా ఆయా మున్సిపాలిటీల పరిధిలో నెలకొన్న సమస్యలను గుర్తించిన అధికారులు జిల్లాలోని మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీల పరిధిలో అభివృద్ధి పనుల నిమిత్తం రూ. 60 కోట్లు మంజూరు చేయాలని తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. పేరుకుపోయిన సమస్యలు జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో పేరుకుపోయిన సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సీసీ రోడ్లు, మురుగు కాలువలు పాక్షికంగా శిథిలమై రోడ్లపై మురుగు నీరు పారుతుంది. ఇళ్ల మధ్య నిలిచిన మురుగుతో ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతోంది. కొన్నిచోట్ల మురుగు కాలువల్లో నుంచి వేసిన పైపులైన్లతో తాగు నీరు కలుషితమవుతోంది. విలీన గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా వేధిస్తోంది. రహదార్లను ఆనుకొని ఉన్న పెంటకుప్పలతో దుర్వాసన వెదజల్లుతుంది. ఫలితంగా దోమల బాధ పెరిగిపోయింది. రామాయంపేట మున్సిపాలిటీలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. పాలకవర్గాల హయాంలోనే.. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో పాలకవర్గాల గడువు ముగియముందే ఆయా వార్డుల్లో చేపట్టాల్సిన పనుల గురించి చర్చించి ఆమోదం తెలిపాయి. ప్రధానంగా రహదారులు, మురుగు కాలువలు, వీధి దీపాలు, ఇతర సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు కాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. తాజాగా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అత్యవసరంగా చేపట్టాల్సిన పనుల నిర్వహణనకు త్వరలో నిధులు మంజూరు కానున్నాయి.ప్రతిపాదనలు పంపాం మున్సిపాలిటీలకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు తాము ప్రతిపాదనలు పంపాం. మంజూరయ్యే నిధులతో సీసీ రోడ్లు, మురుగు కాలువలతో పాటు ఇతర ప్రాధాన్యత గల పనులకు సంబంధించి నిర్మాణాలు చేపడుతాం. – దేవేందర్, మున్సిపల్ కమిషనర్, రామాయంపేట -
ఎంసీహెచ్‌లో సంపూర్ణ వైద్య సేవలు
కలెక్టర్ రాహుల్‌రాజ్ మెదక్‌జోన్/మెదక్ కలెక్టరేట్: మాతా, శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రంలో గర్భిణులకు, బాలింతలకు సంపూర్ణ వైద్య సేవలు అందుతున్నాయని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నవజాత శిశువుల ప్రత్యేక విభాగాన్ని పరిశీలించి వారికి అందుతున్న వైద్య సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రిలో జూన్‌లో 350 ప్రసవాలు నిర్వహించారన్నారు. ఫ్యామిలీ ప్లానింగ్‌కు సంబంధించి 50 మేజర్ సర్జరీలు జరగటం హర్షణీయం అన్నారు. ప్రతి పీహెచ్సీ పరిధిలో గర్భిణులను ఎప్పటికప్పుడు ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు పరిశీలించి ఎంసీహెచ్‌కు తరలించి ప్రసవాలతో పాటు వైద్యం అందిస్తున్నారన్నారు. ఆస్పత్రిలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైనా తన దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సునీతతో పాటు వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలుర కళాశాల వసతి గృహాన్ని సందర్శించారు. హాస్టళ్ల మరమ్మతులకు రూ. 2.21 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. -
అన్నను అతికిరాతకంగా చంపిన తమ్ముడు
మెదక్: సొంత అన్ననే తమ్ము డు కిరాతకంగా హతమార్చిన ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ మహమ్మద్ గౌస్, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... వసురాంతండాకు చెందిన రామావత్ మంత్యా (48)కు తండా పక్కనే పొలం ఉంది. ఇతని సొంత తమ్ముడు మోహన్ కూడా ఇదే తండాలో నివాసం ఉంటున్నాడు. గత యాసంగి సీజన్లో మోహన్ ట్రాక్టర్‌తో మంత్యా తన పొలాన్ని దున్నించాడు. కిరాయి డబ్బు చెల్లించలేదు. ఈ విషయమై అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మోహన్ ఇంట్లో తరచూ కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలవుతుండటం, నెల క్రితం అతడి మనవరాలు అనారోగ్యంతో చనిపోయింది. అన్న మంత్యా మంత్రాలు చేయడం కారణంగానే ఇలా జరిగిందని భావించాడు. రెండు రోజుల క్రితం పొలం దున్నడానికి అదే తండాకు చెందిన భిక్షపతి ట్రాక్టర్‌ను మంత్యా మాట్లాడాడు. విషయం తెలుసుకున్న మోహన్ తన డబ్బులు ఇవ్వకుండా ఎవరూ పొలం దున్నేది లేదంటూ గొడవపడ్డాడు. ఉద యం కల్లు దుకాణంలో మోహన్, భిక్షపతి కల్లు తాగారు. దున్నకం విషయమై మాట్లాడాలంటూ భిక్షపతి మంత్యాకు ఫోన్ చేయగా అక్కడకు వచ్చాడు. డబ్బుల విషయమై అన్నదమ్ముల మధ్య మాటామాట పెరిగింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న మోహన్ పక్కనే ఉన్న కల్లు సీసాను పగలగొట్టి మంత్యా గొంతులో ఇతర శరీర భాగాల్లో విచక్షణారహితంగా పొడిచాడు. ఆపై బండరాయితో తలపై, మర్మాంగాలపై మోదాడు. చేతి రుమాలుతో మెడకు బిగించి నేలపై తలను కొట్టి, కొద్ది దూరం వరకు ఈడ్చుకెళ్లాడు. విషయం తెలుసుకున్న మంత్యా భార్య లక్ష్మి , కుమారుడు ఘటనా స్థలానికి చేరుకొని రక్తపు మడుగులో ఉన్న మంత్యాను కొల్చారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్టు తెలిపారు. మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి సంఘటన స్థలానికి వచ్చారు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ ఘటన మొత్తాన్ని కల్లు దుకాణంలో ఉన్న కొందరు ఫోన్లో చిత్రీకరిస్తూ నిలుచున్నారే తప్ప ఘోరాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలి
● ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ● జిల్లాలో 41 మంది పిల్లలు, 8 కేసులు మెదక్ మున్సిపాలిటీ: బాలకార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించేందుకు కృషి చేస్తున్నామని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత 10 రోజులుగా జిల్లాలో నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్‌లో 41 మంది పిల్లలను గుర్తించి బాలల సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు తెలిపారు. అన్నిశాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్ దిగ్విజయంగా కొనసాగుతుందన్నారు. ముఖ్యంగా హోటళ్లు, ఇటుక బట్టీలు, నిర్మాణ పనులు, వ్యాపా ర సముదాయాల్లో పనిచేస్తున్న బాల కార్మికులను గు ర్తించి వారి తల్లిదండ్రులకు లేదా సంరక్షణ గృహాలకు తరలించి యజమానులపై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పిల్లల బాల్యం బడులకు అంకితం కావాలని, కార్మికులుగా కర్షకులుగా కొనసాగరాదని పేర్కొన్నారు. ఇప్పటివరకు జిల్లా లో 8 కేసులను నమోదు చేసినట్లు తెలిపారు. బాల కార్మికులను పనిలో ఉంచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కా ర్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, మధుసూదన్ గౌడ్, సీడీపీఓ కరుణ శ్రీ, చైల్డ్వెల్ఫేర్ అధికారి ఉప్ప లయ్య, ఇతర అధికారులు, ఆపరేషన్ ముస్కాన్ టీం సభ్యులు పాల్గొన్నారు. -
నేషనల్ వర్క్‌షాప్‌కు కలెక్టర్
మెదక్ కలెక్టరేట్: కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ (చిన్ననాటి విద్య)పై గురువారం ఢిల్లీలో జరిగిన నేషనల్ వర్క్‌షాప్‌కు కలెక్టర్ రాహుల్‌రాజ్ ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరయ్యారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఢిల్లీలో జరిగిన జాతీయ సమావేశానికి తెలంగాణ నుంచి మహిళా శిశు సంక్షే మ శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్ ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలిచారని పేర్కొన్నా రు. రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో అమలవుతు న్న నూతన కార్యక్రమాలు, పిల్లలకు ప్రైమరీ శిక్షణ, కొత్త యూనిఫాంలు అందించడం, ఇతర పోషణ, శిక్షణకు సంబంధించిన కార్యక్రమా లను సమావేశానికి హాజరైన వివిధ రాష్ట్రాల ప్రతినిధులతో పంచుకున్నానని తెలిపారు. పాపన్నపేట(మెదక్): పౌర్ణమిని పురస్కరించుకొని గురువారం ఏడుపాయల వన దుర్గమ్మకు పల్లకీ సేవ నిర్వహించారు. అర్చకులు మూల విరాట్టుకు పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవ విగ్రహానికి అర్చన నిర్వహించి పల్లకీ సేవ ప్రారంభించారు. ఆలయం నుంచి గోకుల్షెడ్డు వరకు ఊరేగింపు కొనసాగింది. ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. వన దుర్గమ్మకు పల్లకీ సేవ -
వైభవంగా గురుపౌర్ణమి
జిల్లావ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలను ప్రజలు వైభవంగా నిర్వహించారు. గురువారం ఉదయం నుంచే సాయిబాబాను దర్శించుకోవడానికి ఆలయాలకు పోటెత్తారు. దీంతో ఆలయాల వద్ద భక్తుల సందడి నెలకొంది. భక్తులకు నిర్వాహకులు అన్నప్రసాద వితరణ చేపట్టారు. పాఠశాలల్లో వ్యాసమహర్షి జయంతిని నిర్వహించారు. విద్యార్థులు గురువులను సన్మానించారు. కొల్చారం మండలంలోని రంగంపేట ఆశ్రమంలో గురు పౌర్ణమి వేడుకలకు ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్యే సునీతారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు. వారి వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రమేష్ కుమార్, నాయకులు తదితరులు ఉన్నారు. – వెల్దుర్తి(తూప్రాన్)/కొల్చారం (నర్సాపూర్) -
బడికి డుమ్మా కుదరిదిక
ఇక టీచర్లకూ ముఖ గుర్తింపు హాజరు ●ప్రధానోపాధ్యాయుడి వద్ద మొబైల్ యాప్ ●ప్రభుత్వ పచ్చజెండాకు ఎదురుచూపులు ●జిల్లాలో 3,551 టీచర్లు సర్కారు బడులను గాడిలో పెట్టేందుకు పాఠశాల విద్యాశాఖ సరికొత్త అస్త్రాన్ని సంధిస్తోంది. ఇప్పటివరకు విద్యార్థులకు ఎఫ్ఆర్ఎస్ విధానం ప్రవేశపెట్టిన ప్రభుత్వం, ప్రస్తుతం టీచర్లకు ఆ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు సన్నద్ధమవుతుంది. పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్న పెద్దపల్లి జిల్లాలో ఎఫ్ఆర్ఎస్ విధానం సత్ఫలితాలు ఇవ్వడంతో, రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. త్వరలోనే జిల్లాలో సైతం టీచర్ల ముఖ గుర్తింపు అటెండెన్స్ సిస్టం ప్రారంభం కాబోతుంది. – పాపన్నపేట(మెదక్) జిల్లాలో 118 గెజిటెడ్ హెచ్ఎంలు, 89 మంది ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు, 1,700 మంది ఎస్జీటీలు, 1,595 స్కూల్ అసిస్టెంట్లు, 37 లాంగ్వేజ్ పండిత్‌లు, 10 మంది పీఈటీలు, ఇద్దరు ఒకేషనల్ టీచర్లు కలిసి మొత్తం 3,551 మంది పని చేస్తున్నారు. సుమారు 83 వేల మంది విద్యార్థులు వివిధ ప్రభుత్వ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్నారు. గతేడాది 90 శాతం హాజరు లక్ష్యంగా విద్యార్థులకు ఎఫ్ఆర్ఎస్ విధానం అమల్లోకి తెచ్చింది. ఇది సత్ఫలితాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఏఐతో ఎఫ్ఆర్ఎస్ కృత్రిమ మేధ సాంకేతికతతో పని చేసే ఈ యాప్‌ను 2023లో రూపొందించారు. టీచర్ల వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్లో ఈ యాప్ ఓపెన్ చేసి విద్యార్థుల ముఖం వైపు చూపడం ద్వారా హాజరు నమోదు అవుతుంది. ఒకేసారి 15 నుంచి 20 మంది హాజరు తీసుకోవచ్చు. వాస్తవ విద్యార్థుల సంఖ్యతో మధ్యాహ్న భోజన వినియోగాన్ని ఖచ్చితంగా చూపడంతో పాటు, విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచవచ్చు. ఉన్నతాధికారులకు కూడా విద్యార్థుల హాజరు శాతం తెలిసిపోతుంది. అలాగే టీచర్లకు కూడా సత్ఫలితాలు వస్తాయన్న భావనతో అధికారులు ఈ విధానం అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. పైలట్ జిల్లాలో సత్ఫలితాలు ప్రధానోపాధ్యాయుడి మొబైల్లో ఫేషియల్ రికగ్ని షన్ యాప్‌ను ఉంచుతారు. టీచర్ పాఠశాల ఆవరణలో ఉండి ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనిని జిల్లా విద్యాశాఖాధికారితో పాటు పాఠశాల విద్య డైరెక్టరేట్‌కు అనుసంధానం చేస్తా రు. సాంకేతికత ఆధారపడిన ఈ విధానం ద్వా రా, టీచర్ ఎన్ని గంటలకు పాఠశాలకు వచ్చాడు, ఎప్పుడు వెళ్లాడు అనే అంఽశాన్ని పరిశీలించవచ్చు. పెద్దపల్లి జిల్లాలో ఈ విధానం ప్రవేశపెట్టడం ద్వారా టీచర్ల హాజరుశాతం, సమయపాలనలో మెరుగైన ఫలితాలు వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. సమయపాలన మెరుగు ఉపాధ్యాయులకు ఎఫ్ఆర్ఎస్ విధానం ప్రవేశపెట్టడాన్ని ఆహ్వానిస్తున్నాం. దీంతో సమయపాలన మెరుగవుతుంది. టీచర్లలో జవాబుదారి తనం పెరుగుతుంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో అనేక మార్పులు వచ్చాయి. విద్యార్థుల్లో సామర్థ్యాలు పెరుగుతున్నాయి. ఇటీవల ప్రకటించిన న్యాస్ ఫలితాలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. – పంతుల రాజు, ఉపాధ్యాయ సంఘం నాయకుడు -
బీఎల్ఓల పాత్ర కీలకం
నిజాంపేట(మెదక్)/చిలప్‌చెడ్(నర్సాపూర్): ఎన్నికల నిర్వహణలో బీఎల్ఓల పాత్ర కీలకమని అదనపు కలెక్టర్ నగేశ్, మెదక్ ఆర్డీఓ రమాదేవి అన్నా రు. నిజాంపేట మండల కేంద్రంలో గురువారం జరిగిన బీఎల్ఓల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పుల విషయమై అవగాహన కల్పించారు. అలాగే చిలప్‌చెడ్ రైతు వేదికలో బీఎల్ఓలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఈఆర్ఓ మహిపాల్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా ఓటరు జాబితా తయారు చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఈఆర్ఓ సహదేవ్, శిక్షకులు శ్రీనివాస్, కొండల్, శివశంకర్, ఆర్ఐలు సునీల్, వెంకటేశ్వర్, రెవెన్యూ సిబ్బంది, బీఎల్ఓలు పాల్గొన్నారు. -
కార్మికుల శ్రేయస్సు పట్టని ప్రభుత్వాలు
మెదక్ కలెక్టరేట్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులపై భారం వేస్తూ.. పెట్టుబడిదారులకు మేలు చేస్తున్నాయని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు ఆరోపించారు. గురువారం జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్లో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పని గంటలు పెంచి కార్మికులపై భారం వేస్తున్నాయని మండిపడ్డారు. కార్మికులు, ఉద్యోగుల సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తున్న సీఐటీయూ రాష్ట్ర 5వ మహాసభలు జిల్లాలో మొదటిసారిగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈఏడా ది డిసెంబర్ 7, 9 తేదీల్లో జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈనెల 19న ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశం మెదక్‌లో ఉంటుందన్నారు. సమావేశంలో ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య, సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు బాలమణి, కార్యదర్శి మల్లేశం, కోశాధికారి నర్సమ్మ, ఉపాధ్యక్షులు మహేందర్‌రెడ్డి, నాగరాజు, సహాయ కార్యదర్శి గౌరయ్య, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మల్లేష్, నాయకులు అజయ్ తదితరులు పాల్గొన్నారు.సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు -
రైతుల సమస్యలు పరిష్కరించాలి
చేగుంట(తూప్రాన్): రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని తెలంగాణ వ్యవసాయ సంఘం రాష్ట్ర కార్యదర్శి శోభన్ అన్నా రు. గురువారం చేగుంటలో రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రకటించినప్పటికీ వ్యవసాయ రుణాలు తగ్గిపోయాయన్నారు. రైతుభరోసా వంటి పథకాలకు డబ్బులు ఎక్కువ కేటాయించడం లేదన్నారు. అమెరికాలో రైతులకు 61 వేల డాలర్లు రాయితీ ఇస్తే భారత్‌లో కేవలం 282 డాలర్లు మాత్రమే ఇవ్వడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా, కర్నాటకలో అగ్రి టూరిజం పేరుతో 20 వేల ఎకరాలను బడా బాబులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను విస్మరిస్తే రాబోయే రోజుల్లో ఉద్యమాలు నిర్వహిస్తామని హె చ్చరించారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు లక్ష్మీనర్సయ్య, భాస్కర్, సాయి, దివాకర్, రమేశ్, స్వామి, బాలరాజు, అంజయ్యతో పాటు పలు గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. -
నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు
కొల్చారం(నర్సాపూర్)/హవేళిఘణాపూర్(మెదక్): ఫర్టిలైజర్ దుకాణదారులు రైతులకు నకిలీ విత్తనాలు అంటగడితే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా వ్యవసాయ అధికారి వినయ్ కుమార్ హెచ్చరించారు. గురువారం మండలంలోని పోతంశెట్టిపల్లిలో పలు దుకాణాలను తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లు, బిల్ బుక్స్, లైసెన్స్‌లను పరిశీలించారు. గడువు తీరిన విత్త నాలు, పురుగుల మందులను రైతులకు అంటగడితే కఠిన చర్యలు ఉంటాయన్నారు. రైతులు దుకాణం నుంచి కొనుగోలు చేసే ప్రతి వస్తువుకు రశీదు తప్పనిసరిగా ఇవ్వాలని ఆదేశించారు. ఏఓ, ఏఈఓలు తరచుగా దుకాణాలను తనిఖీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఓ శ్వేతకుమారి, ఏఈఓ నిరోషా ఉన్నారు. అనంతరం హవేళిఘణాపూర్ రైతు వేదికలో కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ నానో ఫెర్టిలైజర్స్‌పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘సబ్‌స్టేషన్ మంజూరు చేయాలి’ మెదక్‌జోన్: పట్టణంలో విద్యుత్ సమస్యలు ఉత్పన్నం అవుతున్నందున జిల్లా కేంద్రానికి 33/11 కేవీ సబ్‌స్టేషన్‌తో పాటు 25 ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేయాలని మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి గురువారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు గురువారం లేఖ రాశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడిచిన పదేళ్లలో పట్టణ విస్తీర్ణం బాగా పెరిగినందున, ప్రస్తుతం ఉన్న సబ్‌స్టేషన్‌తో సమస్యలు వస్తున్నాయని, సబ్‌స్టేషన్ మంజూరు చేసి సమస్యలు తీర్చాలని లేఖలో కోరారు. ప్రభుత్వ కాలేజీల్లో మెరుగైన బోధన శివ్వంపేట(నర్సాపూర్): ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థులకు మెరుగైన బోధన అందుతుందని ఉమ్మడి జిల్లా ఇంటర్మీడియెట్ ప్రత్యేక అధికారి కిషన్ అన్నారు. గురువారం శివ్వంపేటలోని జూనియర్ కాలేజీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా కాలేజీ స్థితిగతులు, విద్యార్థుల ప్రవేశాలు, బోధన గురించి అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే శివ్వంపేట జూని యర్ కాలేజీకి సంబంధించి సొంత భవన నిర్మాణానికి నిధులు మంజూరు అవుతాయన్నారు. ప్రభుత్వ కాలేజీల్లో ప్రతిభ కలిగిన అధ్యాపకులచే బోధన అందిస్తామని, విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ఉన్నతస్థాయికి ఎదగాల్సిన అవసనరం ఉందన్నారు. అనంతరం ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో కాలేజీ అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు. బీఆర్ఎస్ నేతలకు అహంకారం మెదక్ మున్సిపాలిటీ: మెదక్ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేతలు మాజీ మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, ప్రభాకర్‌రెడ్డి, రాజిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాస్‌రావును కలిసి ఫి ర్యాదు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. అధికారం పోయినా బీఆర్ఎస్ నేతలకు అహంకారం తగ్గలేదన్నారు. జిల్లా ప్రజలను కేటీఆర్ గాడిదలతో పోల్చడం సరికాదన్నా రు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్కు తగిన బుద్ధి చెబుతామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు శ్రీనివాస్‌చౌదరి, బొజ్జ పవన్, లక్కర్ శ్రీనివాస్ ఆంజనేయులుగౌడ్, ముత్యంగౌడ్, గంగాధర్, రాగి అశోక్, లల్లూ, లక్ష్మీనారాయణ, దుర్గప్రసాద్, మహేందర్‌రెడ్డి, శంకర్, లింగం, శ్రీకాంత్, కృష్ణ, రమేష్ గౌడ్, బానీ తదితరులు పాల్గొన్నారు. -
కల్తీ కల్లు విక్రయిస్తే కఠిన చర్యలు
నర్సాపూర్/వెల్దుర్తి(తూప్రాన్)/చిన్నశంకరంపేట(మెదక్): కల్తీ కల్లు విక్రయిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎకై ్సజ్ సీఐ గులాం ముస్తాఫా హెచ్చరించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. తమ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెండు రోజులుగా సర్కిల్ పరిధిలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నర్సాపూర్, కౌడిపల్లి, చిలప్‌చెడ్ మండలాల్లోని పలు గ్రామాల్లో తనిఖీలు చేపట్టామ ని వివరించారు. చిలప్‌చెడ్ మండలంలోని రహీంగూ డ తండాలో లైసెన్స్ లేకుండా అక్రమంగా కొనసాగుతున్న కల్లు దుకాణంలో తనిఖీలు చేసి కల్లును పారపోసి కేసు నమోదు చేశామన్నారు. కల్లు దుకాణం నిర్వాహకుడు తమను చూసి పారిపోయాడని, త్వరలోనే అతడిని పట్టుకుంటామని చెప్పారు. పలు కల్లు దుకాణాల నుంచి షాంపిల్స్ సేకరించామని, వాటిని లేబొరేటరీకి పంపుతామన్నారు. వైన్ షాపులలో ప్లాస్టిక్ గ్లాసులు, కవర్లు పెడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట ఎకై ్సజ్ ఎస్ఐ రాఘవేందర్రావు, చిలప్‌చెడ్ ఎస్ఐ నర్సింలుతో పాటు సిబ్బంది ఉన్నారు. అలాగే వెల్దుర్తి మండలంలోని పలు కల్లు దుకాణాలను రామాయంపేట ఎకై ్సజ్ సీఐ నరేందర్‌రెడ్డి తనిఖీ చేశారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో కల్లు డిపోలను పోలీసులు తనిఖీ చేశారు. -
శాకంబరిదేవిగా విద్యాధరి
వర్గల్ క్షేత్రంలో వైభవంగా మూల మహోత్సవం వర్గల్ సరస్వతి క్షేత్రంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. బుధవారం మూల నక్షత్ర మహోత్సవ వేళ అమ్మవారు పండ్లు, కూరగాయలు ఆభరణాలుగా ధరించి శాకంబరిదేవిగా దివ్యదర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచే మూల మహోత్సవ వేడుకలు మొదలయ్యాయి. గర్భగుడిలో మూలవిరాట్టుకు విశేష పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం కూరగాయలు, పండ్లు, ఆకు కూరలు ఆభరణాలుగా అమ్మవారిని కమనీయంగా అలంకరించారు. కుంకుమార్చన, సప్తశతి పారాయణం, సామూహిక భక్తజన లక్షపుష్పార్చన జరిపారు. చండీహోమం నిర్వహించి పూర్ణాహుతి చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ( – వర్గల్(గజ్వేల్) -
చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి
ఆర్డీఓ జయచంద్రారెడ్డితూప్రాన్: పట్టణ పరిధిలోని రావెల్లి మహాత్మ జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ స్కూల్‌ను ఆర్డీఓ జయచంద్రారెడ్డి బుధవారం సందర్శించారు. ఈసందర్భంగా హాస్టల్ వసతి, ఆహార ప్రమాణాలు, పరిశుభ్రత.. తదితర అంశాలపై ఉపాధ్యాయులు, హాస్టల్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. ఆరోగ్య పరిరక్షణ, భవిష్యత్తు కార్యాచరణపై అవగాహన కల్పించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఉన్నతస్థాయికి చేరుకోవాలని సూచించారు. కాగా హాస్టల్లో సమస్యలను విద్యార్థులు ఆర్డీఓ దృష్టికి తీసుకొచ్చారు. ఉన్నతాధికారుల సహకారంతో త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. -
ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోండి
మెదక్ మున్సిపాలిటీ: మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి బుధవారం ఎస్పీ డీవీ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రోహిత్ ఇటీవల ఓ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావుపై అసభ్య పదజాలంతో కూడిన అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు తీసుకోని కేసు నమోదు చేయాలని ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి -
గుణాత్మక విద్యనందించాలి
కలెక్టర్ రాహుల్‌రాజ్ హవేళిఘణాపూర్(మెదక్): నాణ్యమైన, గుణా త్మక విద్యను అందించడానికి ఎంఈఓలు, స్కూ ల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు చొరవ తీసుకోవాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. బుధవారం మండలకేంద్రంలోని డైట్ కళాశాలలో ప్రాథమిక, ఉన్నతస్థాయి విద్యా ప్రమాణాల మెరుగు కోసం ఎఫ్ఎల్ఎన్ మానిటరింగ్ సమా వేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రాథమిక ఉన్నతస్థాయి లో విద్యా ప్రమాణాల మెరుగుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకొని ఉత్తమ విద్యాబోధన చేసి ప్రతిభావంతులైన విద్యార్థులను తయారు చేయడంలో ఉపాధ్యా యులు పాత్ర కీలకమన్నారు. పని సర్దుబాటు విషయంలో ప్రభుత్వ నిబంధనల ఆధారంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. కార్యక్రమంలో డీఈఓ రాధాకిషన్, కో–ఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు. ‘బెస్ట్ అవైలబుల్’కు విద్యార్థుల ఎంపిక మెదక్‌కలెక్టరేట్: బెస్ట్ అవైలబుల్ పథకం కింద మిగిలి ఉన్న సీట్లను కేటాయించినట్లు కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. బుధ వారం కలెక్టరేట్లో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన లాటరీ ప్రక్రియను విద్యార్థులు తల్లిదండ్రు ల సమక్షంలో నిర్వహించారు. ఈసందర్భంగా మొత్తం 6 సీట్లకు 1వ తరగతికి ముగ్గురు, 5వ తరగతికి ముగ్గరిని ఎంపిక చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో షెడ్యూ ల్ కులాల అభివృద్ధి అధికారి విజయలక్ష్మితో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. -
కదం తొక్కిన కార్మికలోకం
మెదక్ కలెక్టరేట్: కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మికులు కదం తొక్కారు. బుధవారం దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మెదక్ ఎమ్మార్వో కార్యాలయం నుంచి రాందాస్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. ఈసందర్భంగా సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ మాట్లాడుతూ.. నాలుగు లేబర్ కోడ్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మిక వర్గం సమరశీల పోరాటాల ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి, వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను ముందుకు తీసుకొచ్చిందన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం జూలై 5 తేదీన పని గంటలను పెంచుతూ జీఓ 282 తీసుకొచ్చిందన్నారు. దేశవ్యాప్తంగా కార్మికవర్గాన్ని ఐక్యం చేసి దీర్ఘకాలిక పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సంతోష్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఏసు, అమృతి, శోభ, ఎల్లవ్వ, అంగన్వాడీ టీచర్లు రాజ్యలక్ష్మి, లత, దుర్గా, ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు. -
రేపు నీటి సరఫరాకు అంతరాయం
నర్సాపూర్: ఈనెల 11వ తేదీన నల్లాల ద్వారా మిషన్ భగీరథ నీటి సరఫరా ఉండదని ఆ పథకం ఏఈ రాజ్‌కుమార్ తెలిపారు. హత్నూర మండలంలోని బోర్పట్ల నుంచి నర్సాపూర్‌కు వచ్చే పైపులైన్‌కు లీకేజీ ఏర్పడినందున మరమ్మతులు చేపట్టనున్నట్లు చెప్పారు. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి నర్సాపూర్ రూరల్: వరికి బదులు ప్రత్యామ్నా య పంటలు సాగు చేసుకోవాలని నర్సాపూర్ వ్యవసాయ శాఖ ఏడీ సంధ్యారాణి రైతులకు సూచించారు. బుధవారం నర్సాపూర్ రైతు వేదికలో జాతీయ ఆహార, పోషక భద్రత పథకం కింద రైతులకు మినుములు, జొన్న విత్తనాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిని ఇచ్చే పంటలు సాగు చేసుకునే విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. రసాయన ఎరువుల వాడకాన్ని పూర్తిగా తగ్గించి సేంద్రియ ఎరువులతో పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏ ఓ దీపిక, ఏఈఓ మోహన్ రైతులు పాల్గొన్నారు. ఎస్ఈకి శుభాకాంక్షలు మెదక్ కలెక్టరేట్: విద్యుత్ శాఖ ఎస్ఈగా ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన నారాయణ నాయక్‌ను రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (టీఆర్వీకే) యూనియన్ నాయకులు బుధవారం కలిసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ సత్యనారాయణ, గౌరవ అధ్యక్షుడు అశోక్, అధ్యక్షుడు రమేశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ శేఖర్, ఉపాధ్యక్షులు ఉస్మాన్, కంపెనీ అసిస్టెంట్ సెక్రటరీ బాలయ్య, సలహాదారులు కిరణ్, మెదక్ డివిజన్ అధ్యక్షులు ఆకుల నాగరాజు అసిస్టెంట్ సెక్రటరీ భిక్షపతి, తూప్రాన్ డివిజన్ అధ్యక్షుడు చేపూరి రాములు, సెక్రటరీ వెంకటయ్య, ప్రభాకర్, సాయిలు, వెంకటేష్, అజీజ్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు శ్రద్ధగా చదవాలి కౌడిపల్లి(నర్సాపూర్): మండల కేంద్రంలోని బీసీ బాలుర హాస్టల్‌ను జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి జగదీష్ బుధవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి భోజనం తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ప్రకారం భోజనం అందుతుందా, బట్టలు, బ్లాంకెట్స్ ఇచ్చారా..? అని ఆరా తీశారు. హాస్టల్ విద్యార్థులకు ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందని చెప్పారు. శ్రద్ధగా చదువుకోవాలన్నారు. సమస్యలుంటే వార్డెన్‌కు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ జిల్లా సహాయ అధికారి గంగాకిషన్, వార్డెన్ ప్రణయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం మెదక్ కలెక్టరేట్: మెదక్ అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో నైట్ వాచ్మెన్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రాధాకిషన్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని యూఆర్ఎస్లలో వాచ్మెన్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఆసక్తి, అర్హత గల పురుష అభ్యర్థులు ఈనెల 12వ తేదీ సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు మెదక్ జిల్లా నివాసులై ఉండాలన్నారు. మెదక్ అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఉద్యోగం నిర్వహించాల్సి ఉంటుందన్నారు. 5.6 ఎత్తు కలిగి 10వ తరగతి ఉత్తీర్ణులై ఏదైనా సెక్యూరిటీ సంస్థచే శిక్షణ పొంది ఉండాలన్నారు. కనీస వేతనం రూ. 9,750 ఉంటుందని, మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తామన్నారు. -
మహిళలను కోటీశ్వరుల్ని చేస్తాం
అదనపు కలెక్టర్ నగేష్మెదక్ కలెక్టరేట్: కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సంబరాలను ప్రారంభించి మాట్లాడారు. విజయోత్సవ సంబరాల ఆవశ్యకత, నిర్వహణ గురించి దిశా నిర్దేశం చేశారు. స్వయం సహాయక సంఘాల మహిళలను అన్ని అంశాల్లో సాధికారత వైపు నడిపించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగా రుణాలను అందిస్తూ వివిధ యూనిట్ల ఏర్పాటుకు సహకారం అందిస్తుందన్నారు. పథకంతో లబ్ధిపొందిన మహిళలను ఆదర్శంగా తీసుకోని ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. ఈనెల 11 వరకు జరిగే సంబరాల్లో మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల వారీగా వడ్డీలేని రుణాలు, ప్రమాద బీమా, లోన్ బీమాలకు సంబంధించిన చెక్కుల పంపిణీ, కళాజాత ప్రదర్శనల ద్వారా అవగాహన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో డీపీఎం యాదయ్య, అడల్ట్ ఎడ్యుకేషన్ జిల్లా అధికారి మురళి, ఏపీఎం వెంకటస్వామి, టీఎంసీ మెప్మా సునీత, స్వయం సహాయక సభ్యులు పాల్గొన్నారు. -
ఆషాఢం సంబరాలు
టేక్మాల్(మెదక్): మండల కేంద్రంలోని కల్యాణ వెంకటేశ్వరస్వామి దేవాలయ ఆవ రణలో ఆషాఢమాసం సందర్భంగా మహిళలందరూ కలిసి బుధవారం గోరింటాకు సంబరాలను ఘనంగా నిర్వహించా రు. ముందుగా స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు వా యినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. చేతులకు గోరింటాకు పెట్టుకొని ఆట పాటలతో సందడి చేశారు. అభ్యంతరాలుంటే చెప్పండి మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని కేజీబీవీలలో ఉద్యోగాల కోసం గతంలో దరఖాస్తు చేసు కున్న అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు మరోసారి మెరిట్ లిస్ట్‌ను విద్యాశాఖ వెబ్సైట్లో ఉంచినట్లు డీఈఓ రాధాకిషన్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేజీబీవీలో ఖాళీగా ఉన్న అకౌంటెంట్ (3), ఏఎన్ఎం (4) ఉద్యోగాల భర్తీకి గతంలో మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. మెరిట్ జాబితాలో ఏమైనా అభ్యంతరాలుంటే సమగ్ర శిక్షా కార్యాలయంలో ఈనెల 12లోగా ఫిర్యాదులు అందజేయాలని సూచించారు. -
భూ పరిష్కారం షురూ!
● భూ భారతిలో దరఖాస్తు చేసిన అర్జీదారులకు రశీదులు ● త్వరలో క్షేత్రస్థాయిలో భూముల పరిశీలన ● పైలట్ ప్రాజెక్టుగా చిలప్‌చెడ్‌లో 118 దరఖాస్తుల పరిష్కారం భూసమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూ భారతిలో స్వీకరించిన దరఖాస్తుల పరిశీలనకు అధికార యంత్రాంగం శ్రీకారం చుట్టింది. దరఖాస్తులు ఇచ్చిన రైతులకు క్షేత్రస్థాయిలో భూముల పరిశీలను రెవెన్యూ అధికారులు సమాచారం ఇస్తున్నారు. త్వరలో క్షేత్రస్థాయిలో భూములను పరిశీలించనుండగా ఫైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన చిలప్‌చెడ్ మండలంలో ఇప్పటికే ఆ దిశగా అడుగులు పడ్డాయి. మెదక్‌జోన్: జిల్లా వ్యాప్తంగా 37,817 మంది రైతులు భూ భారతిలో దరఖాస్తులు చేశారు. ప్రతీ దరఖాస్తుదారుడికి ప్రత్యేకంగా ఓ నంబర్ ఇచ్చి రశీదులను ఇచ్చారు. వీటన్నింటినీ ఆన్లైన్లో పొందు పరిచిన అధికారులు వాటిలో ఎలాంటి దరఖాస్తులకు ముందస్తుగా పరిష్కరించాలని దానిపై అధికారులు కసరత్తు చేస్తునట్లు తెలిసింది. క్షేత్రస్థాయిలో భూములను స్వయంగా పరిశీలించేందుకు అధికారులు రైతులకు సమాచారమిస్తున్నారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలనకు తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ఐలతోపాటు నూతనంగా ఎంపిక చేసిన సర్వేయర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడ పరిస్థితులను బట్టి కొలతలు వేసి రైతుల వద్దనున్న భూ పత్రాలను స్వయంగా పరిశీలించనున్నారు. అనంతరం గ్రామస్తుల సమక్షంలో భూ సమస్యలను పరిష్కరించనున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. అత్యధికంగా ... జిల్లాలో 37 వేల దరఖాస్తులు రాగా వాటిలో అతి క్లిష్టమైనవి మిస్సింగ్ సర్వేనంబర్లు, విస్తీర్ణంలో తేడాలు, పట్టాదారు పేరులో తప్పిదాలు, ఒకరి పట్టా భూమి మరొకరిపై పట్టాచేయటం, లావాణి పట్టాభూముల్లో అన్నదమ్ములకు పంపిణీ చేయటం, విస్తీర్ణంలో వ్యత్యాసం తదితర దరఖాస్తులు అధికంగా ఉన్నాయి. ౖపైలట్ ప్రాజెక్టు మండలంలో కాగా, జిల్లాలో భూ భారతిని పైలట్ ప్రాజెక్టుగా చిలప్‌చెడ్ మండలాన్ని ఎంపిక చేసి ముందస్తుగా ఆ మండలంలో దరఖాస్తులను స్వీకరించారు. ఆ మండలంలో మొత్తం 1,045 దరఖాస్తులు రాగా వాటిలో ఇప్పటివరకు 118 దరఖాస్తులను పరిష్కరించినట్లు తెలిసింది. త్వరలో క్షేత్రస్థాయి పరిశీలన...! భూ భారతిలో రైతులనుంచి దరఖాస్తులు చేసుకున్న రైతులకు సమాచారం ఇచ్చాం. త్వరలో క్షేత్రస్థాయిలో భూములను పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తాం. అవసరమైన చోట ప్రభుత్వం నియమించిన సర్వేయర్లతో భూములను సర్వేచేసి సమస్యలను పరిష్కరిస్తాం. –మెంచు నగేశ్, అదనపు కలెక్టర్, మెదక్ -
బూత్ లెవల్ అధికారుల పాత్ర కీలకం
ఆర్డీఓ రమాదేవి పాపన్నపేట(మెదక్): ఓటర్ జాబితా తయారీలో బూత్ లెవల్ అధికారులదే కీలక పాత్ర అని మెదక్ ఆర్డీఓ రమాదేవి పేర్కొన్నారు. పాపన్నపేట ఉన్నత పాఠశాలలో మంగళవారం జరిగిన బూత్ లెవల్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్ పరిధిలోని ఇళ్లను సర్వే చేసి, కొత్త ఓటర్లను నమోదు చేయాలని సూచించారు. ఓటరు జాబితాలో తప్పులు ఉంటే,సరిదిద్దాలని చెప్పారు. అన్ని రకాల సమాచారాన్ని యాప్ లో నమోదు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సతీష్, డిప్యూటీ తహసీల్దార్ చరణ్, ఆర్ఐ నాగరాజు, మాస్టర్ ట్రైనర్ సత్యానారయణరెడ్డి, వరప్రసాద్, అంజాగౌడ్, నర్సింలు, దేవిసింగ్ పాల్గొన్నారు. -
ప్రజల హృదయాల్లో సజీవం
నర్సాపూర్: మాజీ ముఖ్యమంత్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి భౌతికంగా లేకపోయినా ప్రజల హృదయాల్లో సజీవంగా ఉన్నారని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ పేర్కొన్నారు. మహానేత వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని పిల్లల పార్కులో ఆయన విగ్రహానికి పలువురు కాంగ్రెస్ నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన పేదలు, రైతుల పక్షపాతిగా పేరు గడించారని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి, సొసైటీ చైర్మన్ రాజుయాదవ్, పార్టీ నాయకులు రిజ్వాన్, మల్లేష్, రవీందర్‌రెడ్డి, చిన్న ఆంజిగౌడ్, నరేందర్‌రెడ్డి, విశ్వంబరస్వామి, రషీద్, నగేశ్ తదితరులు పాల్గొన్నారు. హన్మంతాపూర్‌లో ఇండ్లకు పూజలు నర్సాపూర్ మున్సిపాలిటీలోని హన్మంతాపూర్‌లో మంగళవారం డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి పలువురు పార్టీ నాయకులతో కలిసి ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజలు చేశారు. -
ప్రకృతి, సేంద్రియ సాగు చేయాలి
తునికి కేవీకేలో ఎస్సీ రైతుల శిక్షణ కార్యక్రమంలో ఎన్‌ఏఏఆర్‌ఎం డైరెక్టర్ డాక్టర్ గోపాల్‌లాల్ కౌడిపల్లి(నర్సాపూర్): ప్రతి రైతు తప్పనిసరిగా ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం చేయాలని ఎన్‌ఏఏఆర్‌ఎం డైరెక్టర్ డాక్టర్ గోపాల్‌లాల్ తెలిపారు. మంగళవారం మండలంలోని తునికివద్దగల డాక్టర్ డి.రామానాయుడు ఏకలవ్య గ్రామీణ వికాస ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో ఎస్సీ రైతులకు ప్రకృతి, సేంద్రియ వ్యసాయంపై ఐదు రోజులు శిక్షణ కార్యక్రమం నిర్వహించగా ముగింపు కార్యక్రమానికి ఎన్‌ఏఏఆర్‌ఎం (నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసర్చ్ మేనేజ్మెంట్) డైరెక్టర్ డాక్టర్ గోపాల్‌లాల్ ముఖ్యఅతిధిగా హాజరైయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రైతు ఆరోగ్యం కోసం ప్రకృతి, సేంద్రియ సాగు చేయాలన్నారు. రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు మోతాదుకుమించి వాడటంతో భూమి, ఆహార ఉత్పత్తులు కలుషితం అవుతున్నాయని చెప్పారు. ప్రకృతి, సేంద్రియ సాగుతో భూమి, ఆహార పంటలు బాగుంటాయని చెప్పారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. ఈసందర్భంగా శిక్షణ పొందిన తునికి, రాయిలాపూర్, పోతిరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన 40మంది ఎస్సీ రైలులకు శిక్షణ సర్టిఫికెట్, బ్యాగ్, ప్రకృతి వ్యవసాయానికి ఉపయోగపడే పంచగవ్య, వావిలాకు కషాయం, వానపాముల ఎరువుతోపాటు జీవాంమృతం తయారికి డ్రమ్ములు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఏఏఆర్‌ఎం సైంటిస్ట్ డాక్టర్ బాలకృష్ణ, కేవీకే హెడ్ అండ్ సైంటిస్ట్ శంభాజీదత్తాత్రేనల్కర్, శాస్త్రవేత్తలు రవికుమార్, శ్రీనివాస్, ప్రతాప్‌రెడ్డి, శ్రీకాంత్, ఉదయ్‌కుమార్, భార్గవితోపాటు రైతులు పాల్గొన్నారు. -
నిబంధనలు పాటించాలి
నర్సాపూర్: బూత్ లెవెల్ ఆఫీసర్లు ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనలను పకడ్బందీగా పాటించాలని స్థానిక ఆర్డీఓ, నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మహిపాల్ సూచించారు. నర్సాపూర్‌లోని వైపర్ కాలేజీ ఆడిటోరియంలో మంగళవారం ఏర్పాటు చేసిన మండలంలోని బూత్ లెవెల్ ఆఫీసర్ల శిక్షణ శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఎల్ఓలు తమకు కేటాయించిన బూత్ పరిధిలో కమిషన్ నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో మండల తహసీల్దార్ శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ మహేశ్, ఆర్ఐ ఫైజల్, ట్రైనర్లు లక్ష్మినారాయణ, ప్రసన్నకుమార్, శ్రీనివాస్‌యాదవ్, బీఎల్ఓలు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు జిల్లా జట్టు మెదక్ మున్సిపాలిటీ: ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మంచిర్యాలలో జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల ఫుట్‌బాల్ పోటీలకు జిల్లా జట్టు సభ్యుడు మంగళవారం మెదక్ నుంచి తరలివెళ్లారు. మెదక్ జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులు తరలివెళ్లారు. ఈ జట్టుకు కోచ్‌గా జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారిణి పి.భాగ్యమ్మను నియమితులయ్యారు. ఎన్యూమరేటర్లకు పారితోషికం చెల్లించాలి నారాయణఖేడ్: గతేడాది సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన ఎన్యూమరేటర్లకు పారితోషికాన్ని చెల్లించాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు కాశీనాథ్ జాదవ్ డిమాండ్ చేశారు. సంఘం సభ్యత్వ నమోదులో భాగంగా మంగళవారం ఖేడ్ మండలంలోని పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేచేసి 8 నెలలు గడుస్తున్నా పారితోషికాన్ని చెల్లించకపోవడం విచారకరమన్నారు. పీఆర్సీ రిపోర్టును తెప్పించుకుని అమలు చేయాలని, పెండింగ్ డీఏలను విడుదల చేయాలని కోరారు. సీపీఎస్ విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. గురుకులాల టైంటేబుల్ మార్చాలని, కేజీబీవీ ఉద్యోగులకు ఉద్యోగభద్రత కల్పించి వారికి కనీస వేతనం ఇవ్వాలని కోరారు. పాఠశాలల పర్యవేక్షణకోసం ప్రత్యేకయంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. సంఘ ఖేడ్ మండల ప్రధానకార్యదర్శి శ్రీరామ్‌నాయక్, నాయకులు గంగామోహన్, మంగుబాయి, శోభారాణి, శంకర్రావు పాల్గొన్నారు. ప్రతి మహిళా కోటీశ్వరులు కావాలి సంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రమేశ్‌బాబు ఝరాసంగం(జహీరాబాద్): మహిళా సంఘాల్లోని ప్రతీ మహిళా కోటీశ్వరుల్ని చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రమేష్ బాబు స్పష్టం చేశారు. మండల కేంద్రమైన ఝరాసంగం పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయంలో మంగళవారం ఇందిరా మహిళా సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మహిళా ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ది సాధించేందుకు ముందుకు రావాలన్నారు. ప్రభుత్వం అందించే ప్రతీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీయం టిక్యానాయక్, తదితరులు పాల్గొన్నారు. -
సిగాచీ పరిశ్రమకు ఎన్డీఎంఏ
ప్రమాద స్థలం అధ్యయనంపటాన్చెరు: ఇటీవల భారీ ప్రమాదం జరిగిన పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ ఫార్మా పరిశ్రమను మంగళవారం జాతీయ విపత్తు నివారణ సంస్థ (ఎన్డీఎంఏ) బృందం సందర్శించింది. ఈ బృందం సభ్యులు ప్రమాద స్థలాన్ని నిశితంగా పరిశీలించి అణువణువూ గాలించారు. ప్రమాద వివరాలను ఆ సమయంలో కొనసాగుతున్న ఉత్పత్తి తదితర అంశాలను సుదీర్ఘంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్డీఎంఏ కేంద్ర బృందం కమిటీ సభ్యులు, సిగాచీ పరిశ్రమలో ప్రమాదం జరగడానికి గల కారణాలపై అధ్యయనంతో పాటు పరిశ్రమలో జరిగిన భారీ ప్రమాదానికి గల కారణాలు ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో ఏ పరిశ్రమల లోనూ పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై కేంద్రప్రభుత్వ నిర్వహణ సంస్థ కమిటీ సభ్యులు సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఘటన జరిగిన తీరును బృందం సభ్యులకు వివరించారు. ప్రమాదం జరిగిన తర్వాత చేపట్టిన సహాయక చర్యలను కమిటీ సభ్యులకు వివరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోశ్ పంకజ్, పరిశ్రమలశాఖ, అగ్ని మాపకశాఖ, కార్మికశాఖ, పో లీసు, రెవెన్యూశాఖల అధికారులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా సంక్షేమ పథకాలు
కలెక్టర్ రాహుల్రాజ్రేగోడ్(మెదక్): మారుమూల గ్రామాల్లో అర్హులందరికీ సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు జరిగేలా కృషి చేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. మండలంలోని సిందోల్, టి.లింగంపల్లి, తాటిపల్లి గ్రామాల్లో మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, నిర్మాణాలు, పారిశుద్ధ్యం పనులను పరిశీలించారు. ఇతర సంక్షేమ పథకాల మంజూరు తీరును అడిగి తెలుసుకున్నారు. ఆయా పాఠశాలలను తనిఖీ చేసి పాఠశాలల్లోని సమస్యలు, ఉపాధ్యాయుల పనితీరును అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో దశల వారీగా ప్రభుత్వం నగదును జమ చేస్తుందన్నారు. పరిశుభ్రత పాటించాలి ఇళ్ల పరిసరాల్లో పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు రాకుండా ఉంటాయని కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి కాలానుగుణ జ్వరాలకు దారితీసే డ్రెయిన్ వాటర్ నిల్వ వంటి సమస్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. దీని నివారించడానికి ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించాలని, దోమల లార్వాలను నివారించడానికి అన్ని పాత గోళాలు ఖాళీ చేయడం ముఖ్యమని చెప్పారు. ఏవైనా జ్వరాలు, ఇతర సీజనల్ వ్యాధులు వస్తే ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చికిత్సలు చేయించుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలిమెదక్ కలెక్టరేట్: జిల్లాలో అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి, భవన నిర్మాణ పనుల్లో పురోగతి సాధించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి కలెక్టర్ తన చాంబర్లో విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల సంస్థ, ఇంజనీరింగ్, పంచాయతీరాజ్, విద్యా శాఖ విభాగాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పురోగతి ఉన్న పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలన్నారు. సమావేశంలో డీఈఓ రాధాకిషన్, పంచాయతీరాజ్ ఈఈ నరసింహులు, విద్యా సంక్షేమ మౌలిక వసతుల సంస్థ ఈఈ శ్రీనివాస్ రెడ్డి, డీఈ నరసింహచారి, జేఈలు తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపాలిటీల్లో వార్డు కార్యాలయాలు
ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు చేయడం, పరిపాలనను ప్రజలకు మరింతగా చేరువ చేయడానికిగాను మున్సిపాలిటీల పరిధిలో వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు అన్ని మున్సిపాలిటీల్లో ఈ కార్యాలయాలు ఏర్పాటైతే ఆయా వార్డుల పరిధిలో ప్రజల ఇబ్బందులు తీరనున్నాయి. వార్డు పరిధిలోనే ప్రజలకు అన్ని రకాల సేవలు అందే అవకాశం ఉంటుంది. ఈమేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రజలకు సౌలభ్యంగా ఉంటుంది వార్డు కార్యాలయాల ఏర్పాటు నిర్ణయం మంచిది. కార్యాలయాలు ఏర్పాటైతే అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉంటారు. చాలా వరకు సమస్యలు వార్డు కార్యాలయాల్లోనే పరిష్కారమవుతాయి. –దేవేందర్, మున్సిపల్ చైర్మన్, రామాయంపేట● తొలుత నాలుగు మున్సిపాలిటీల పరిధిలో ఏర్పాటుకు కసరత్తు ● జిల్లాలో మొత్తం 75 వార్డుల్లో కార్యాలయాలు ఏర్పాటయ్యే అవకాశం ● తీరనున్న ప్రజల ఇబ్బందులు ● పరిపాలన మరింతగా ప్రజలకు చేరువయ్యే అవకాశం రామాయంపేట(మెదక్): జిల్లాలో మెదక్, తూప్రాన్, నర్సాపూర్, రామాయంపేట మున్సిపాలిటీలున్నాయి. వీటి పరిధిలో మొత్తం 75 వార్డులున్నాయి. ఇప్పటికే వార్డుకు ఒక అధికారి చొప్పున కొనసాగుతున్నారు. వీరు మున్సిపల్ కార్యాలయంనుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. వార్డు అధికారులు వార్డుల్లోకి సక్రమంగా రావడంలేదని, వారు కార్యాలయానికే పరిమితమయ్యారనే ఆరోపణలున్నాయి. కొత్తగా ఆయా వార్డుల్లో కార్యాలయాలు ఏర్పాటు చేస్తే సదరు అధికారి వార్డు పరిధిలోనే విధులు నిర్వహిచాల్సి ఉంటుంది. ప్రజలకు అందుబాటులో ఉండటంతోపాటు ప్రజలకు అన్ని రకాల సేవలందే అవకాశం ఉంటుంది. పాలన మరింతగా చేరువ వార్డు కార్యాలయాలు ఏర్పాటైతే ప్రజలకు పాలనా సౌలభ్యం అందుబాటులో ఉంటుంది. చాలావరకు సమస్యలు సకాలంలో పరిష్కారమయ్యే అవకాశం కలుగుతుంది. ఆయా వార్డులకు చెందిన ప్రజలు పనుల నిమిత్తం మున్సిపల్ కార్యాలయానికి వెళ్లే అవసరం ఉండదు. కాగా, వార్డుల్లో కార్యాలయాల ఏర్పాటు అంత సులభం కాదనే అభిప్రాయం నెలకొంది. కొత్తగా కార్యాలయం, ఫర్నీచర్, కంప్యూటర్ల ఏర్పాటు, తదితర అంశాలు ఖర్చుతో కూడుకుని ఉంటాయి. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే తప్ప ఈ సమస్యలు పరిష్కారం కావు. వార్డు కార్యాలయాల ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలు ● మున్సిపాలిటీల పరిధిలో వార్డు కార్యాలయాలు ఏర్పాటైతే ప్రజలకు పౌరసేవలు అందుబాటులో ఉంటాయి. ● జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఇతరత్రా పత్రాలు పొందడం సులభతరమవుతుంది. ● ఇంటిపన్ను, నీటి బిల్లులు వార్డు కార్యాలయాల్లోనే చెల్లించే అవకాశం ఉంటుంది. ● తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావడానికి వార్డు కార్యాలయం ఒక వేదికగా పనిచేస్తుంది. ● వీధి దీపాలు, పారిశుద్ధ్యం, తాగునీరు, వంటి ఇతర సమస్యలు వార్డు కార్యాలయాల ద్వారానే పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. ● కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలను వార్డు స్థాయిలో ప్రజలకు వివరించి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందజేసే అవకాశం కలుగుతుంది. ● వార్డు కార్యాలయాల ద్వారా ప్రజలకు మరిన్ని సేవలందుబాటులోకి వస్తాయి. ● ప్రభుత్వ నిర్ణయాలు, కొత్త పథకాలు, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని వార్డు కార్యాలయాలద్వారా ప్రజలకు త్వరితగతిన చేరవేసే అవకాశం ఉంటుంది. -
అర్జీలకు తక్షణ పరిష్కారం చూపాలి
మెదక్ కలెక్టరేట్: ప్రజావాణి అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్ఓ భుజంగరావు, జెడ్పీ సీఈఓ ఎల్లయ్యతో కలిసి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీలను పెండింగ్‌లో పె ట్టొద్దని, ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలన్నారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలపై అర్జీదారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కాగా ప్రజావాణికి వివిధ సమస్యలపై 61 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమంలో వివిఽ ద శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. నార్సింగి మండల కేంద్రంలో సేవాలాల్ భవన్ కోసం స్థలం కేటాయించాలని మండలంలోని ఆయా తండాలకు చెందిన గిరిజనులు కోరారు. ఈమేరకు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. మెదక్ పట్టణంలోని పలు చెరువులు, కుంటలు పూర్తిగా మురుగునీటితో కలుషితమవుతున్నాయని, వాటిని కాపాడి తాగునీటి కేంద్రాలుగా చేయాలని సీనియర్ సిటిజెన్ ఫోరం ఆధ్వర్యంలో కలెక్టర్‌కు ఫిర్యాదు అందజేశారు. పట్టణంలోని పలు చెరువులు కబ్జాకు గురయ్యాయని, వాటిని రక్షించాలని కోరారు. కలెక్టర్ రాహుల్‌రాజ్ ప్రజావాణికి 61 వినతులు ప్రజలకు సుపరిపాలన అందించాలి కొల్చారం(నర్సాపూర్): ప్రజా సమస్యలపై జవాబుదారితనంతో వ్యవహరించడం తప్పనిసరిని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. సోమవారం కొల్చారం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూ సంబంధిత రికార్డులను పరిశీలించారు. పారదర్శక రెవెన్యూ పాలన లక్ష్యంగా ప్రజలకు సుపరిపాలన అందించే విధంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాసచారి, కార్యాలయ సిబ్బంది ఉన్నారు. -
రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలి
పటాన్చెరు టౌన్: రాష్ట్ర ప్రభుత్వం పనిగంటలు పెంచుతూ తెచ్చిన జీఓ 282ను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు డిమాండ్ చేశారు. సోమవారం పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలోని రింగ్ రోడ్డు జంక్షన్ వద్ద నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఈనెల 9న దేశవ్యాప్త సమ్మెకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక వర్గానికి కవ్వింపు చర్యగా పని గంటలు పెంచుతూ జీవో జారీ చేయడం అత్యంత దుర్మార్గమన్నారు. ప్రభుత్వ చర్యతో శ్రమ దోపిడీకి చట్టబద్దత కల్పించినట్లేనని ఆందోళన వెలిబుచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చేపట్టే దేశవ్యాప్త సమ్మెలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వివిధ పరిశ్రమల కార్మికులు పాల్గొన్నారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాములు -
‘భగీరథ’ నీటిలో వానపాములు
నర్సాపూర్: మిషన్ భగీరథ నీరు కలుషితం అవుతోందని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. గతంలో నల్లాల ద్వారా చేప పిల్లలు రాగా, సోమవారం పట్టణంలోని ఎన్జీఓస్ కాలనీలోని కొందరి ఇళ్లకు నల్లాల ద్వారా సరఫరా అయిన నీటిలో వానపాములు, ఇసుక వచ్చినట్లు తెలిపారు. మిషన్ భగీరథ పథకం ద్వారా శుద్ధి చేసిన నీరు రావాల్సి ఉండగా, కలుషిత నీరు రావడంపై విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆ జీఓను ఉపసంహరించుకోవాలి రామాయంపేట(మెదక్): ఎనిమిది గంటల పనిదినాన్ని పది గంటలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ రామాయంపేటలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం నిరసన తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షురాలు బాలమణి ఆధ్వర్యంలో కార్మికులు అంబేడ్కర్ విగ్రహం వద్ద జీఓ ప్రతులు పట్టుకొని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం జీఓ ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. ప్రభుత్వం బేషరతుగా ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఈ నారాయణ నాయక్ బాధ్యతల స్వీకరణ మెదక్ కలెక్టరేట్: జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈ)గా నారాయణనాయక్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన ఎస్ఈ శంకర్ గత నెలలో ఉద్యోగ విరమణ చేశారు. హైదరాబాద్‌లో విద్యుత్ శాఖ ఎస్ఈగా విధులు నిర్వర్తిస్తున్న నారాయణ నాయక్ జిల్లాకు నూతనంగా నియమితులయ్యారు. ఈసందర్భంగా జిల్లాలోని డివిజనల్ ఇంజినీర్లు, ఏడీఈలు, ఏఈలు, అధికారులు, సిబ్బంది ఎస్ఈకి స్వాగతం పలికారు. నూతన ఎస్ఈ మాట్లాడుతూ.. విద్యుత్ శాఖకు సంబంధించి అధికారులు, సిబ్బంది, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. మున్సిపాలిటీ వద్దే వద్దు జిన్నారం (పటాన్చెరు): జిన్నారం మున్సిపాలిటీ ఏర్పాటుతో ప్రభుత్వం రైతుల నుంచి అసైన్డ్ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తుందని మండలంలోని రాళ్లకత్వ గ్రామస్తులు సోమవారం ఆందోళనకు దిగారు. పూర్తి రైతు ఆధారిత ప్రాంతమైన జిన్నారంను మున్సిపాలిటీగా మారిస్తే ఈ ప్రాంత ప్రజలు, రైతులకు భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద రైతులు సాగు చేసుకునేందుకు ఇచ్చిన ప్రభుత్వ భూములను తిరిగి తీసుకునే ప్రయత్నంలో భాగంగా సర్వే నంబర్ 286 రైతులకు నోటీసులు జారీ చేసిందన్నారు. మా అభిప్రాయాలు తెలుసుకోకుండా మున్సిపాలిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. గురు పౌర్ణమికి ముస్తాబు హత్నూర(సంగారెడ్డి): మండల కేంద్రమైన హత్నూర మధుర గ్రామ శివారులోని దత్తాచల క్షేత్రంలో గురు పౌర్ణమి వేడుకలను మంగళవారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు క్షేత్రాధిపతి సభాపతిశర్మ తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు. వేడుకలకు మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్యే సునీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి రాజిరెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలిపారు. -
దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేద్దాం
తూప్రాన్: కార్మికుల సమస్యల సాధన కోసం ఈనెల 9న చేపట్టే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు విష్ణు పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలో కార్మిక సంఘాల నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. తమ సమస్యల సాధన కోసం ప్రతి కార్మికుడు సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు ఆనంద్, మల్లేష్, నాగులు, భిక్షపతి, శ్రీనివాస్, నారాయణ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
బదిలీలు, పదోన్నతులు కల్పించాలి
టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు యాదగిరిమెదక్జోన్: ఉపాధ్యాయులకు బదిలీలు, పదో న్నతులను కల్పించటంతో పాటు విద్యాశాఖలో ఇన్చార్జిల స్థానంలో రెగ్యులర్ డీఈఓ, ఎంఈఓలను నియమించాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. విద్యాశాఖలో ఖాళీలను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలన్నారు. ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో రెగ్యులర్ ఉపన్యాసకుడు లేకపోవటంతో శిక్షణకు ఆటంకాలు ఏర్పడుతున్నాయన్నారు. మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న మెడికల్ బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నగదు రహిత వైద్య విధాన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొండల్‌రెడ్డి, సంఘ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. -
పేదల సంక్షేమానికి పెద్దపీట
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హవేళిఘణాపూర్(మెదక్): మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు ప్రభు త్వం అండగా ఉంటుందన్నారు. వారి సంక్షేమానికి సీఎం రేవంత్‌రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడారు. నియోజకవర్గ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పరశురాంగౌడ్, నాయకులు మహేందర్‌రెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
నేరుగా వచ్చి ఫిర్యాదు చేయండి
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు మెదక్ మున్సిపాలిటీ: ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమం చేపట్టామని, ప్రజలు నిర్భయంగా వచ్చి తమ సమస్యలు పరిష్కరించుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సూచించారు. సోమవారం జిల్లా ప్రధాన పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి 11 ఫిర్యాదులు స్వీకరించారు. వాటిని పరిశీలించి చట్టప్రకారం న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీస్స్టేషన్ల అధికారులను ఆదేశించారు. ప్రజలు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా వచ్చి ఫిర్యాదులు అందజేయాలని తెలిపారు. -
ఏమయ్యారో?
మంగళవారం శ్రీ 8 శ్రీ జూలై శ్రీ 2025ఆ ఎనిమిది మందికారెక్కిన కాంగ్రెస్ నాయకులు ● నేటికీ ఆచూకీ లభించని కార్మికుల జాడ ● సిగాచీ పరిశ్రమలో గల్లంతైన వారి కుటుంబీకుల్లో ఆందోళన ● రాత్రింబవళ్లు కొనసాగుతున్న తవ్వకాలు ఒకటి కాదు రెండు కాదు.. ఏడు రోజులు అవుతున్నా వారి ఆప్తుల జాడ లభించడం లేదు. వారేమయ్యారో అంతు చిక్కడం లేదు. తమను ఆదుకోవాల్సిన పెద్ద దిక్కు జాడ తెలియక మనోవేదనకు లోనవుతున్నారు. పరిశ్రమలో పని చేసేందుకు వచ్చిన వారు ఇలా ఆకస్మికంగా దూరం కావడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆఖరి చూపునకు కూడా నోచుకోకుండా పోతున్నామని కుమిలిపోతున్నారు. వారం రోజులుగా సిగాచీ పరిశ్రమ వద్ద పడిగాపులు కాస్తున్నారు. – పటాన్చెరు పాశమైలారం సిగాచీ పరిశ్రమలో జరిగిన విస్పోటనంలో గల్లంతైన కార్మికుల కోసం వారి కుటుంబాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. గత నెల 30న పరిశ్రమలో పేలుడు జరిగిన సమయంలో 143 మంది పనిచేస్తున్నారు. ఆ సమయంలో పనిచేస్తున్న వారిలో గాయాలపాలైన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను వారి బంధువులకు అప్పజెప్పారు. ఇంకా ఎనిమిది మంది కార్మికుల జాడ మాత్రం నేటికీ దొరకలేదు. వారేమయ్యారో అంతు చిక్కడం లేదు. వారి కుటుంబీకులు మాత్రం పరిశ్రమ వద్ద గత వారం రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. పరిశ్రమలో పని చేసేందుకు వచ్చిన వారు ఇలా ఆకస్మికంగా దూరం కావడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మరోవైపు అధికారులు రాత్రింబవళ్లు సిగాచీ పరిశ్రమలో గల్లంతైన వారి భౌతికకాయాల కోసం వెతుకులాట ముమ్మరం చేశారు. రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మట్టి దిబ్బల కింద, బూడిద మట్టిలో అణువణువు వెతుకుతున్నారు. అయితే అక్కడ పని చేస్తున్న వారిపై ఉన్నతాధికారులు, బాధితుల ఒత్తిడి రోజు రోజుకు పెరుగుతుంది. రెండు రోజుల క్రితం వరకు ఆ శిథిలాల్లో అక్కడక్కడ మాడిపోయిన మాంసం ముద్దలు లభించాయి. కానీ ప్రస్తుతం అలాంటి మానవ అవశేషాలు ఏవీ లభించడం లేదు. వెతుకులాట ప్రక్రియ దాదాపు తుదిదశకు చేరిందనే చెప్పాలి. పరిశ్రమలో పేలుడు జరిగిన సమయంలో దాదాపు 700 సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రత ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంత వేడికి శరీరాలు పూర్తిగా మాంసం ముద్దలుగా మారి బూడిదలో కానరాకుండా కలిసిపోయి ఉంటాయని భావిస్తున్నారు. న్యూస్రీల్పాలు అమ్ముతానని చెప్పి.. బండ్లగూడలో స్థిరపడిన ఓ కుటుంబానికి చెందిన ఆస్టిన్ పాల ప్యాకెట్లు వేసే పని చేస్తానని ఇంట్లో వారికి చెప్పి ఈ పరిశ్రమలో చేరాడట. ఆ పరిశ్రమలో ప్రమాదం జరగిన రోజు కంటే రెండు రోజుల ముందే అక్కడ డ్యూటీలో చేరాడు. మూడో రోజే ప్రమాదం జరిగింది. నేటికీ ఆ యువకుడి ఆచూకీ లభించడం లేదు. ఆస్టిన్ కుటుంబ సభ్యులు కనపడిన ప్రతి అధికారి కాళ్లపై పడుతున్నారు. కనీసం అతడి మృతదేహం అయినా ఇప్పించాలని రోధిస్తున్నారు. ఆస్టిన్ తోడబుట్టిన చెల్లెళ్లు, ఇతర కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఆస్టిన్‌తో పాటు రాహుల్ కుమార్ శర్మ, వెంకటేష్, సిల్వరీ రవి, శివ్జీ కుమార్, విజయ్ కుమార్ నిషద్, ఇర్ఫాన్ అన్సారీల ఆచూకీ కోసం వారి కుటుంబీకులు ఎదురుచూస్తున్నారు. -
పిల్లల భద్రతపై చర్యలు తీసుకోవాలి
మెదక్ కలెక్టరేట్: పిల్లల భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ నగేశ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ముందుగా మైనార్టీ పాఠశాలను పరిశీలించి మధ్యాహ్న భోజనం, వసతి సౌకర్యాలను ఆరా తీశారు. అనంతరం గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ బాలికల డిగ్రీ కళాశాలను పరిశీలించారు. అనుకూలమైన అభ్యాస వాతావరణాన్ని పెంపొందించే దిశలో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.అదనపు కలెక్టర్ నగేశ్ -
ప్రయాణికులకు బస్సులు కరువు
చేగుంట(తూప్రాన్): ప్రయాణికులకు సరిపడా బస్సులు లేవని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని ఇబ్రహీంపూర్ శివారులో ఆర్టీసీ బస్సులో సౌకర్యాలను పరిశీలించారు. ఉచిత బస్సు ప్రయాణం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చేగుంట– దుబ్బాక రూట్లో ఒకే బస్సు నడుస్తుందని పలువురు వివరించారు. అనంతరం బస్సు డ్రైవర్ కండక్టర్‌తో మాట్లాడి బస్సులపై ఆరా తీశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రయాణికులకు సరిపడా బస్సులను నడిపించడం లేదని ఆరోపించారు. ఉన్న బస్సుల్లో సౌకర్యాలు లేవని తెలిపారు. అధికారులు వెంటనే చేగుంట– దుబ్బాక రూట్లో ప్రయాణికులకు సరిపడా బస్సులు నడిపించాలన్నారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు నారాయణరెడ్డి, జిల్లా నాయకులు రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి -
‘మైనంపల్లి’వి గొప్పలే.. చేతల్లేవ్
● తన హయాంలో మంజూరైన పనులకు శంకుస్థాపనలు ● బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలుపద్మారెడ్డి ఫైర్ రామాయంపేట(మెదక్): తమ హయాంలో మంజూరైన నిధులతో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ శంకుస్థాపనలు చేస్తూ, తానే నిధులు మంజూరు చేయించానని గొప్పలు చెప్పుకుంటున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి ఆరోపించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధిని మరిచిన ఎమ్మెల్యే ప్రతిపక్షాలను దూషించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఇప్పటివరకు ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. తమ హయాంలో మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 30 కోట్లు మంజూరయ్యాయని, ఈ మేరకు టెండర్ల ప్రక్రియ సైతం పూర్తయిందని తెలిపారు. వాటికే ఎమ్మెల్యే మళ్లీ శంకుస్థాపన చేశారని విమర్శించారు. వాటికి సంబంధించిన జీఓ కాపీలను చూపించారు. మెదక్‌లో మెడికల్ కాలేజీ తమ హయాంలో మంజూరు చేయించగా, తానే చేయించినట్లు ఎమ్మెల్యే తప్పుడు ప్రకటనలు చేయడం తగదని హితవు పలికారు. రహదారుల నిర్మాణానికి గత ప్రభుత్వంలో నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. రామాయంపేట, మెదక్‌లో వందలాది డబుల్ బెడ్రూం ఇళ్లను నిరుపేదలకు పంచామన్నారు. ప్రజలు తరతరాలుగా మర్చిపోని విధంగా కేసీఆర్ అభివృద్ధి పనులు చేపట్టారని గుర్తు చేశారు. ప్రశ్నిస్తే కేసులు నమోదు చేయిస్తూ వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రామాయంపేట, చిన్నశంకరంపేట కెనాల్స్, రామాయంపేట రెవెన్యూ డివిజన్ కార్యాలయం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను రద్దు చేయించారని ఆరోపించారు. సమావేశంలో సహకార సంఘం అధ్యక్షుడు బాదె చంద్రం, మున్సిపల్ మాజీ చైర్మన్ జితేందర్‌గౌడ్, మాజీ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, బీఆర్ఎస్ యూత్ మండలాధ్యక్షుడు జలందర్ తదితరులు పాల్గొన్నారు. -
గురుకులాల్లో నాణ్యమైన విద్య
కలెక్టర్ రాహుల్రాజ్తూప్రాన్/నర్సాపూర్: ప్రభుత్వం గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు భోజనం అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నా రు. శుక్రవారం పట్టణంలో పలు గురుకులాలు, కళాశాలను తనిఖీ చేశారు. కిచెన్, డైనింగ్ హాల్, తరగతి గదులు, స్టోర్ రూంలను పరిశీలించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా..? అని ఆరా తీశారు. బియ్యం నిల్వ లు, కూరగాయల నాణ్యతను పరిశీలించారు. కాల పరిమితి ముగిసిన వాటిని ఎట్టి పరిస్థితు ల్లోనూ వినియోగించకూడదని నిర్వాహకులను హెచ్చరించారు. అలాగే సీజనల్ వ్యాధులు ప్రబలకుండ పాఠశాల సముదాయాన్ని, పరిసరాల ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం నర్సాపూర్‌లో మండలంలోని గురు కుల పాఠశాలలు, కాలేజీలను తనిఖీ చేశారు. సమస్యలు తెలుసుకొని, సౌకర్యాలు మెరుగుపరిచే దిశగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. నాణ్యత లేని బియ్యం వస్తే ఎంఈఓలకు ఫిర్యాదు చేయాలని సూచించారు. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మెదక్‌జోన్/మెదక్‌మున్సిపాలిటీ: మాదక ద్రవ్యాల వినియోగం, రవాణాపై ఉక్కుపాదం మోపాలని, అందుకోసం సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లాస్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సమాజానికి చీడ పురుగులా మారిన నిరోధానికి సమష్టిగా కృషి చేయాలన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో మాదకద్రవ్యాల నిరోధానికి పోలీస్‌శాఖ చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లను గుర్తించి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రమాదకరమైన మలుపుల వద్ద సైన్ బోర్డులు రేడియం స్టికర్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు. -
వీధి వ్యాపారులను పొదుపు వైపు మళ్లించి వ్యాపార అభివృద్ధికి బ్యాంకుల ద్వారా రుణాలిప్పించాలని ప్రభుత్వం యోచిస్తుంది. అందులో భాగంగా జిల్లా పరిధిలోని నాలుగు మున్సిపాలిటీల్లో కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్ (సీఐజీ)లను ఏర్పాటు చేయాలని మెప్మాకు ఆదేశాలు ఇచ్చింది. ఈమేరక
● వీధి వ్యాపారులతో పొదుపు సంఘాలు ● మున్సిపాలిటీల్లో ఏర్పాటుకు సన్నాహాలు ● మెప్మాకు ప్రభుత్వం ఆదేశం ● బ్యాంకుల నుంచి రుణ సదుపాయంజిల్లా వివరాలు.. మున్సిపాలిటీ వీధి ఏర్పాటు చేసే వ్యాపారులు సంఘాలు మెదక్ 4,096 25 నర్సాపూర్ 1,222 15 తూప్రాన్ 1,562 14 రామాయంపేట 1,320 20 మెదక్‌లో వీధి వ్యాపారుల కోసం నిర్మించిన షెడ్లుజిల్లావ్యాప్తంగా నాలుగు మున్సిపాలిటీల్లో 74 వరకు సంఘాలు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ప్రతి గ్రూపులో ఐదు నుంచి పది మంది సభ్యులు ఉండేలా చర్యలు చేపట్టారు. ఇప్పటికే జిల్లాలో మొదటి విడతగా మొత్తం 8,200 మంది వీధి వ్యాపారులను గుర్తించారు. వీరితో ఏర్పాటు చేసే గ్రూపుల్లో ఎంపిక చేసిన సంఘాల్లోని సభ్యులకు ముందుగా శిక్షణ ఇవ్వనున్నారు. వారు బ్యాంకు ఖాతాలు తెరిచిన వెంటనే సంఘాల పొదుపు ప్రక్రియను పరిశీలించి బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించనున్నారు. ఆరునెలల తర్వాత సంఘాలకు మొదటి విడతగా రూ. లక్ష, తర్వాత రూ. 3 నుంచి రూ. 5 లక్షలు, సకాలంలో చెల్లిస్తే రూ. 10 నుంచి రూ. 15 లక్షల వరకు రుణం పొందవచ్చు. అలాగే వీధి వ్యాపారులు ప్రత్యేకంగా వ్యాపారం చేసుకోవడానికి వీలుగా పీఎం స్వానిధి పథకం కింద దుకాణాలు నిర్మించనున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రమైన మెదక్‌లో పోస్టాఫీస్ పక్కనే 25 రేకుల షెడ్డులు నిర్మించారు. త్వరలో వీటిని వీధి వ్యాపారులకు కేటాయించనున్నారు. మిగితా మూడు మున్సిపాలిటీల్లో సైతం వీటిని నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. సభ్యులకు బీమా సదుపాయం పొదుపు సంఘంలో సభ్యులుగా చేరిన వ్యాపారులకు రూ. 2 లక్షల బీమా సదుపాయం కల్పించనున్నారు. ప్రమాదవశాత్తు సభ్యులు మృతిచెందితే వారికి బీమా వర్తిస్తుంది. ఈ మేరకు వీధి వ్యాపారులకు ఆయా మున్సిపాలిటీల పరిధిలో గుర్తింపు కార్డులు అందజేశారు. దుకాణాలు కేటాయించిన అనంతరం వారితో పట్టణ వ్యాపారుల కమిటీని ఏర్పాటు చేయనున్నారు. కమిటీ చైర్మన్‌గా మున్సిపల్ కమిషనర్ ఉంటారని సమాచారం. -
కొలువుదీరిన నాచగిరి పాలకవర్గం
● చైర్మన్‌గా రవీందర్‌గుప్తా ఏకగ్రీవం ● ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకారం వర్గల్(గజ్వేల్): ఉమ్మడి మెదక్ జిల్లాలో సుప్రసిద్ధమైన నాచారం గుట్ట లక్ష్మీ నృసింహ క్షేత్రంలో శుక్రవారం నూతన ధర్మకర్తల మండలి కొలువుదీరింది. నాచగిరి ఆలయ ముఖమండపంలో ధర్మకర్తల ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. ధర్మకర్తలుగా జగ్గయ్యగారి శేఖర్‌గుప్తా, దేశపతి ఉషశ్రీ, గాల కిష్టయ్య, కర్రె పద్మ, జగ్గన్నగారి సురేందర్‌రెడ్డి, జే.ఎస్ తిరుమల్‌రావు, రుద్ర శ్రీహరి, కొత్తపల్లి శ్రీనివాస్, చందా నాగరాజుగుప్తతోపాటు, ఎక్స్‌అఫీషి యో మెంబర్‌గా జగన్నాథాచార్యులుతో ఆలయ సహాయ కమిషనర్ విజయరామారావు, ఇన్స్పెక్టర్ విజయలక్ష్మిలు ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం చైర్మన్ ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల ఏకగ్రీవ ఆమోదంతో పల్లెర్ల రవీందర్‌గుప్తా చైర్మన్‌గా ఎన్నికయ్యారు. నూతన చైర్మన్‌ను మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి అభినందిస్తూ సన్మానించారు. చైర్మన్, పాలకమండలి ధర్మకర్తలు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్‌రెడ్డి, విజయమోహన్, శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ నిమ్మ రంగారెడ్డి తదితరులు పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా శనివారం నాచగిరి ఆలయ పాలకమండలి సమావేశం, సన్మాన సభ నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ తెలిపారు. -
ముసురుకుంటున్నాయ్..
● జ్వరాలతో జనం విలవిల ● జిల్లాలో నాలుగు డెంగీ కేసులు నమోదుమెదక్జోన్: వ్యాధులు ముసురుకుంటున్నాయి. ఇప్పటికే జిల్లాలో నాలుగు డెంగీ కేసులు నమోదయ్యాయి. వేలాది మంది జ్వరాలతో మంచం పట్టారు. గ్రామాలు చెత్తతో పేరుకుపోయి దుర్వాసనతో కంపుకొడుతున్నాయి. ఈగలు, దోమలకు నిలయంగా మారి వ్యాధులు విజృంభిస్తున్నాయి. అయి నా అధికారులు, పాలకులు పట్టించుకోకపోవటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 7,389 మందికి జ్వరాలు జిల్లాలో జూన్ నుంచి ఇప్పటివరకు నాలుగు డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇందులో 3 కేసులు రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో నమోదు కాగా, మరొకటి హవేళిఘనాపూర్ మండలం బూర్గుపల్లి గిరిజన తండాలో నమోదైంది. అక్కడ ప్రధానంగా పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేకపోవటంతో దోమలకు నిలయంగా మారిందని వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. అలాగే ముందస్తు చర్యల్లో భాగంగా జ్వర సర్వే కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు 7,389 మందికి జ్వరాలు రాగా, వారికి చికిత్స అందిస్తున్నారు. జ్వర పీడితులు ఎక్కువగా ఉన్న గ్రామంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. పలువురి నుంచి రక్త నమూనాలు సేకరించి డెంగీ, మలేరియా లాంటి పరీక్షలుచేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికుల సమ్మె బాట! జిల్లావ్యాప్తంగా 492 గ్రామ పంచాయతీలు ఉండగా, 1,697 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి గత నాలుగు మాసాల నుంచి వేతనాలు రావటం లేదు. నెలల తరబడి వేతనాలు రాకపోవటంతో కుటుంబాలు గడవటం లేదని, వేతనం ఇస్తే తప్ప పనులు చేయమని ఇటీవల పలు మండలాల్లో కార్మికులు ఎంపీడీఓలకు వినతిపత్రాలు అందించారు. ఇప్పటికే చెత్త ట్రాక్టర్లకు డీజిల్ పోయలేమని కార్యదర్శులు చేతులెత్తేశారు. దీంతో గ్రామాల్లో చెత్త సేకరణ నిలిచిపోయింది. ఇక కార్మికులు సైతం పనులు మానేస్తే పల్లెలు మరింత అధ్వానంగా మారే పరిస్థితి నెలకొంటుందని పలువురు వాపోతున్నారు.నిరంతరం వైద్య పరీక్షలు వానాకాలంలో సీజనల్ వ్యాధుల కట్టడికి నిరంతరం కృషి చేస్తున్నాం. ఆశావర్కర్లు గ్రామాల్లో జ్వర సర్వే చేసి ఏఎన్ఎంలకు సమాచారం ఇస్తున్నారు. వారు జ్వర పీడితులకు మందులు అందజేస్తున్నారు. అనుమానితులకు రక్త పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 4 డెంగీ కేసులు నమోదు కాగా, వారికి చికిత్స అందించాం. – శ్రీరాం, డీఎంహెచ్ఓ -
ఖర్గేకు సన్మానం
నర్సాపూర్: హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన ‘ కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరి’ సభలో పాల్గొన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ సన్మానించారు. పెండింగ్ వేతనాలు చెల్లించండి శివ్వంపేట(నర్సాపూర్): పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం కార్మికులతో కలిసి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు నెలలుగా కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు. న్యాయమైన డిమాండ్ల సాధనకు రానున్న రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. సమర్థవంతంగావిధులు నిర్వర్తించాలి కొల్చారం(నర్సాపూర్): ఎన్నికల విధులను సమర్థవంతగా నిర్వర్తించాలని ఆర్డీఓ మహిపా ల్ సిబ్బందికి సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో బీఎల్ఓలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఎలాంటి ఒత్తిడికి లోనూ కావొద్దన్నారు. బూత్‌స్థాయి అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. ఇంటింటికీ తిరుగుతూ ఓటర్ కార్డును పరిశీంచాలన్నారు. అంతకుముందు మాస్టర్ ట్రైనర్లు ఎన్నికల పత్రాలపై బీఎల్ఓలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్‌చారి, మాస్టర్ ట్రైనర్లు లక్ష్మీనారాయణ, ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య మెదక్ కలెక్టరేట్: దొడ్డి కొమురయ్య సాయుధ పోరాటంలో నేల రాలిన తొలి అమరుడని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో బీసీ సామాజిక ఉద్యమ నాయకుడు దొడ్డి కొమురయ్య, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య వర్ధంతిని వేర్వేరుగా నిర్వహించారు. ఈసందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్ నగేష్, ఇతరశాఖల అధికారులు ఉన్నారు. ఉత్తమ పంచాయతీల ఎంపికపై అవగాహన పెద్దశంకరంపేట(మెదక్): జాతీయ ఉత్తమ పంచాయతీల ఎంపిక, అవార్డులపై శుక్రవారం మెదక్ డీఎల్పీఓ సురేష్‌బాబు ఆయా శాఖల అధికారులు, గ్రామ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. జాతీయ ఉత్తమ పంచాయతీల ఎంపికపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఇన్చార్జి తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ షాకీర్‌అలీ, ఎంఈఓ వెంకటేశం, ఏఓ కృష్ణ, ఏఎస్ఐ చంద్రమోహన్, ఏపీఎం గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
శుక్రవారం
4-7-2025కార్మికుల ఆస్పత్రికి సుస్తీ డిస్పెన్సరీలు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. – 4లోపగలు కూలీ.. రాత్రి చోరీ చోరీ కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు ఏసీపీ సదానందం వెల్లడించారు. – 4లోSimultaneously Printed at Hyderabad | Bangalore | chennai | Delhi | Mumbai | Anantapur | Guntur | Kadapa | Khammam | Karimnagar | Kurnool | Mahaboobnagar | Mangalagiri | Nalgonda | Nellore | Nizamabad | Ongole | rajamahendravaram | Srikakulam | Tadepalli Gudem | Tirupathi | Vijayawada | Visakhapatnam | Warangal -
‘పంటల బీమాఅమలు చేయాలి’
నర్సాపూర్: రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా అమలు చేయాలని తెలంగాణ రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు యాదాగౌడ్, జిల్లా సలహాదారుడు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. గురువారం వారు మాట్లాడుతూ.. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం రైతులకు రక్షణగా ఉంటుందన్నారు. పంటల బీమా లేకపోవడంతో రైతులు పలు విధాలుగా నష్టాలు చవిచూస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి రైతులను ఆదుకునేందుకు బీమా అమలు చేయాలని కోరారు. రైతులకు సరిపడా ఎరువులు చిన్నశంకరంపేట(మెదక్): వర్షాకాలం పంటలకు సరిపడా ఎరువులు సిద్ధంగా ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని జిల్లా వ్యవసాయశాఖ అధికారి విన్సెంట్ వినయ్‌కుమార్ తెలిపారు. గురువారం మండలంలోని గవ్వలపల్లిలో ఆగ్రోస్ సెంటర్, పీఏసీఎస్, ఫ ర్టిలైజర్ దుకాణాల్లో ఎరువుల నిల్వలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 4 వేల మెట్రిక్ టన్నుల ఎరువు లు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఫర్టిలైజర్ దుకాణాల్లో ఈ–పాస్ విధానంలోనే రైతులు ఎరువులు కొనుగోలు చేయాలని సూచించారు. ఆయన వెంట ఏఓ ప్రవీణ్‌కుమార్ ఉన్నారు. ఆయిల్‌పాం సాగుతో అధిక లాభాలు రామాయంపేట(మెదక్): ఆయిల్‌పాం సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని ఏడీఏ రాజ్‌నారాయణ అన్నారు. గురువారం తన కార్యాలయంలో రైతుల వద్ద నుంచి దరఖా స్తులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందవచ్చన్నారు. పంట ఉత్పత్తులను నేరుగా కంపెనీలే కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చట్టం రూపొందించిందన్నారు. సబ్సిడీలు సైతం అందజేస్తుందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు సాయికృష్ణ, సందీప్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఓటు హక్కు నమోదు చేసుకోవాలి: ఆర్డీఓ శివ్వంపేట(నర్సాపూర్): 18 ఏళ్లు నిండిన యువతి, యువకులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఆర్డీఓ మహిపాల్‌రెడ్డి అన్నారు. గురువారం శివ్వంపేటలోని రైతు వేదికలో బీఎల్ఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి వెళ్లి 18 సంవత్సరాలు నిండిన వారి పేర్లు నమోదు చేసుకుని వారికి ఓటుహక్కు కల్పించేలా సిబ్బంది కృషి చేయాలన్నారు. తహసీల్దార్ కమలాద్రి, ఉప తహసీల్దార్ షఫీయోద్ధీన్, ఆర్ఐ కిషన్, బీఎల్ఓలు ఉన్నారు. అండగా ఉంటాం.. రామాయంపేట(మెదక్): కామారెడ్డి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మండలంలోని అక్కన్నపేటకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు లక్ష్మీనారాయణ కుటుంబాన్ని గురువారం పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి పరామర్శించారు. మృతుడి భార్య, కుటుంబ సభ్యులకు కొంత ఆర్థిక సహాయం అందజేశారు. పార్టీపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మున్సిపల్ మాజీ చైర్మన్ జితేందర్‌గౌడ్, సహకార సంఘం చైర్మన్ చంద్రం, సీనియర్ నాయకుడు పుట్టి యాదగిరి, యూత్ అధ్యక్షుడు ఉమామహేశ్వర్, మాజీ జెడ్పీటీసీ సంపత్, అబ్ధుల్ అజీజ్, శ్రీకాంత్సాగర్ పాల్గొన్నారు. -
సాంకేతికతతో కేసుల పరిష్కారం
ఎస్పీ డీవీ శ్రీనివాసరావుచిలప్చెడ్(నర్సాపూర్)/కౌడిపల్లి/నర్సాపూర్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని కేసులు త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం చిలప్‌చెడ్ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులు పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిర్యాదుదారులతో మర్యాదగా నడుచుకోవాలన్నారు. రాత్రి సమయంలో పెట్రోలింగ్ సక్రమంగా నిర్వహించాలన్నారు. సైబర్ నేరాలపై నిరంతరం అవగాహన కల్పించాలని, రోడ్డు ప్రమాదాల నివారణను అరికట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. వీలైనంత ఎక్కువగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా దృష్టి సారించాలన్నారు. అలాగే కౌడిపల్లి పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసి ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం నర్సాపూర్ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఫిర్యాదులు అందగానే వెంటనే స్పందించి బాధితులకు అండగా ఉండాలని చెప్పారు. సీసీ కెమెరాలు బిగించి, సక్రమంగా మానిటరింగ్ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో తూ ప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్, నర్సాపూర్ సీఐ జాన్‌రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సందీప్‌రెడ్డి, ఎస్ఐ నర్సింహులు పాల్గొన్నారు. -
రైతు మురిసె
మత్స్యకార మణిహారం..నీ కోసం.. నేనున్నానని..కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి ఎంపికైన ప్రసాద్ సూరి ‘సాక్షి’తో పంచుకున్న ముచ్చట్లు.. – వివరాలు ఫ్యామిలీ యువర్స్లోవాన కురిసె..జీవితంలోని సంక్షోభ సమయాల్లో తన తల్లి తనకు అండగా నిలబడిందని బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ చెప్పారు. – వివరాలు 2లోమొన్నటి వరకు ఆందోళనలో ఉన్న రైతులకు ఇటీవల కురుస్తున్న వర్షాలు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. జిల్లాలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే బోరు బావుల కింద వరి నాట్లు ప్రారంభం కాగా, వేలాది ఎకరాల్లో సాగు చేసిన పత్తితో పాటు ఆరుతడి పంటలకు వర్షాలు జీవం పోశాయి. – మెదక్‌జోన్ జిల్లావ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్లో 3.50 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. అందులో సింహభాగం 3.5 లక్షల ఎకరాల్లో వరి సాగు కానుంది. మిగితా 45 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు కానున్నాయి. కాగా మేలో కురిసిన ముందస్తు వర్షాలకు రైతులు దుక్కులు దున్ని పత్తి, కూరగాయలతో పాటు ఇతర ఆరుతడి పంటలు సాగు చేశారు. ఈ క్రమంలో జూన్‌లో ఆశించిన మేర వర్షాలు కురవలేదు. 112.7 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, కేవలం 81.5 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. ఈ లెక్కన 31.2 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం నమోదైంది. అయితే గత వారం రోజులుగా పుష్కలంగా వర్షాలు కురుస్తుండటంతో జిల్లాలోని కౌడిపల్లి, కొల్చారం, హవేళిఘనాపూర్, శివ్వంపేట, పాపన్నపేట, చిన్నశంకరంపేట, రామాయంపేట తదితర మండలాల్లో బోరుబావుల కింద రైతులు జోరుగా వరి నాట్లు వేస్తున్నారు. కాగా వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు, కుంటల్లోకి నీరు చేరిన తర్వాతే ఆయకట్టు భూముల్లో నాట్లు వేయనున్నారు. పెరిగిన భూగర్భజలాలు జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు భూగర్భజలాలు పెరిగాయి. మేలో 15.37 మిల్లీమీటర్లు ఉండగా, జూన్‌లో 14.22 మిల్లీ మీటర్లకు చేరుకుంది. ఈ లెక్కన 1.15 మిల్లీమీటర్ల మేర పెరగటంతో బోరుబావుల్లో నీటి ఊటలు పెరిగాయి. దీంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేవలం జూన్ చివరి వారం నుంచి వర్షాలు కురువటంతోనే భూగర్భజలాలు పెరిగాయని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. ఊపందుకున్న వ్యవసాయ పనులు పత్తి, ఆరుతడి పంటలకు జీవంహల్దీవాగుపై 12 చెక్‌డ్యాంలు జిల్లాలోని హల్దీ ప్రాజెక్టు తూప్రాన్, వెల్దుర్తి, మాసాయిపేట, కొల్చారం, చిన్నశంకరంపేట, మెదక్, హవేళిఘనాపూర్ మండలాల పరిధిలో విస్తరించి ఉంది. ఈ వాగుపై 12 చెక్ డ్యాంలు నిర్మించారు. ఏటా వేసవిలో కొండపోచమ్మసాగర్ నుంచి ఇందులోకి నీరు వదులుతారు. ఒక్కసారి నీరు వదిలితే 50 వేల ఎకరాల మేర వరి పంట పండుతుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పరిధిలోని 7 మండలాల్లో రైతులు వరి నాట్లు జోరుగా వేస్తున్నారు. -
317 జీఓ బాధితులకు న్యాయం చేయాలి
చేగుంట(తూప్రాన్): జీఓ 317 బాధితులకు న్యాయం చేయాలని తపస్ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ అన్నారు. గురు వారం మండలంలోని పలు పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాథమిక పాఠశాలల్లో తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని, నగదు రహిత ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానం రద్దు, సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మె కా లం వేతనం అందించాలన్నారు. మోడల్ పాఠశాలల ఉపాధ్యాయులకు ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలన్నారు. ఉపాధ్యాయ సమస్యలపై తపస్ సంఘం నిరంతరం పోరాడుతుందని తెలిపారు. కార్యక్రమంలో చేగుంట మండల తపస్ అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్, కృష్ణమూర్తి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఫార్మర్ రిజిస్ట్రీ అంతంతే!
ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ జిల్లాలో మందకొడిగా సాగుతోంది. సాంకేతిక సమస్యలు, రైతులు ముందుకు రాకపోవడంతో ఆశించిన మేర ముందుకు సాగడం లేదు. ఇప్పటివరకు కేవలం 24 శాతమే పూర్తి కావడం గమనార్హం. – మెదక్ కలెక్టరేట్ కేంద్ర ప్రభుత్వం రైతులకు 11 అంకెలతో కూడిన విశిష్ట గుర్తింపు కార్డుల జారీకి శ్రీకారం చుట్టింది. దీని ద్వారా ఆధార్‌కార్డు తరహా కార్డు అందించడంతో పాటు పక్కా వివరాలు అందుబాటులో ఉంటాయని భావించింది. అయితే జిల్లాలో ఆశించిన మేర ప్రక్రియ ముందుకుసాగడం లేదు. జిల్లాలో సాధారణ పట్టాలు కలిగిన రైతులు 2.96 లక్షలకు పైగా ఉండగా, ఇప్పటివరకు కేవలం 24 శాతమే నమోదు చేసుకున్నారు. కొన్ని రెవెన్యూ గ్రామాలు, ప్రత్యేక యాప్‌లో కనిపించకపోవడం, రైతులకు రెండు, మూడు గ్రామాల్లో భూములుంటే ఒక చోట నమోదు చేశాక.. మిగితావి అయినట్లుగా చూపుతుండటం, వివరాలు కనిపించకపోవడం వంటి సాంకేతిక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. గ్రామాల్లోకి వెళ్తున్న అధికారులు ప్రస్తుతం రైతుల వివరాల నమోదుకు ఏఈఓలకు అవకాశం కల్పించారు. వ్యవసాయ అధికారులు గ్రామాల్లోకి వెళ్లి ప్రత్యేకంగా నమోదు కార్యక్ర మాన్ని చేపడుతున్నారు. అయితే వర్షాకాలం పంటల సీజన్ ప్రారంభం కావడంతో రైతులు సాగు పనులకు వెళ్తున్నారు. దీంతో ఎక్కువ మంది నమోదు చేయించుకునేందుకు ముందుకు రావడం లేదు. ఆధార్ సంఖ్యతో అనుసంధానం ఉన్న సెల్‌ఫోన్‌తో రైతులు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మరో వైపు ఒక్కొక్కరి వివరాలు నమోదు చేసే సమయంలో మూడుసార్లు ఓటీపీ వస్తుంది. అయితే రెండోసారి ఓటీపీ సరిగా రావడం లేదు. అంతటా ఒకేసారి నమోదు చేస్తుండటంతో సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. దీంతో నమోదులో జాప్యం జరుగుతున్నట్లు సంబంధిత అధికారులుచెబుతున్నారు. అనేక ప్రయోజనాలు రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తుంది. పీఎం కిసాన్ సన్మాన్ నిధి, పీఎం సించాయి యోజన, పీఎం కిసాన్ మాన్–ధన్ యోజన, పీఎం ఫసల్ బీమా యోజన, కిసాన్ క్రెడిట్ కార్డు, ఉద్యానశాఖకు 60 శాతం సబ్సిడీ.. తదితర పథకాలను ప్రవేశపెట్టింది. ఈ పథకాలు పొందాలంటే విశిష్ట గుర్తింపు తప్పనిసరి అని స్పష్టం చేసింది. జిల్లాలో ఇప్పటివరకు 24 శాతమే పూర్తి వెంటాడుతున్న సాంకేతిక సమస్యలు ముందుకు రాని రైతులు తప్పనిసరి అంటున్న అధికారులుక్యాంపులు ఏర్పాటు చేశాం ఫార్మర్ రిజిస్ట్రీ కోసం వ్యవసాయ అధికారులు గ్రామాల్లో క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. అయితే రైతుల వివరాల నమోదుకు ముందుకు రావడం లేదు. దీనికి తోడు రైతుల ఆధార్‌కార్డుకు ఫోన్ నంబర్ లింకు లేకపోవడం, లింకు ఉన్న ఫోన్ అందుబాటులో లేకపోవడం, ఓటీపీల కోసం గ్రామాల్లో ఫోన్ సిగ్నల్స్ అందకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఫలితంగానే నమోదు ప్రక్రియ ఆలస్యమవుతోంది. – విన్సెంట్ వినయ్‌కుమార్, డీఏఓ -
ప్రభుత్వ బడుల్లో సోలార్ కిచెన్ షెడ్లు
కలెక్టర్ రాహుల్‌రాజ్ పెద్దశంకరంపేట(మెదక్): ప్రభుత్వ పాఠశాలల్లో త్వరలో సోలార్ కిచెన్ షెడ్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. గురువారం పెద్దశంకరంపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పీహెచ్‌సీని తనిఖీ చేశారు. ఈసందర్భంగా విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి మాట్లాడారు. రాబోయే రోజుల్లో వంట గ్యాస్‌తో పాటు సోలార్ కిచెన్ షెడ్లలో వంట వండేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. దీంతో కట్టెల పొయ్యి బాధలు ఉండవని, నిర్వాహకులకు వేతనాలు, బిల్లులు వెంటవెంటనే వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. నాణ్యత పాటిస్తూ మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందజేయాలన్నారు. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్లో చేరే విధంగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ ఉపాధ్యాయుడిగా మారి ఎస్సెస్సీ విద్యార్థులకు గణిత పాఠాలు బోధించారు. అలాగే పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరుశాతం, రోగులకు అందిస్తున్న సదుపాయాలను పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జి తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ షాకీర్‌అలీ, ఎంఈఓ వెంకటేశం, వైద్యాధికారి షరీఫొద్దీన్, హెచ్ఎం విఠల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
విద్యార్థులతో హోంవర్క్ చేయించాలి
డీఈఓ రాధాకిషన్ చిలప్‌చెడ్(నర్సాపూర్): సరైన సమయంలో సిలబస్ పూర్తి చేయడంతో పాటు, తప్పనిసరిగా విద్యార్థులతో హోంవర్క్ చేయించాలని డీఈఓ రాధాకిషన్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలతో పాటు చిట్కుల్ కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి లెక్కల పాఠ్యాంశాన్ని విన్నారు. విద్యార్థులతో మాట్లాడి, వారి హోంవర్క్‌ను పరిశీలించారు. ఐదో తరగతి విద్యార్థులతో ఎక్కాలు చదివించి దినచర్య గురించి అడిగి తెలుసుకున్నారు. కేజీబీవీలో నూతనంగా ప్రారంభమైన ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం విద్యార్థులతో చర్చించారు. బోధన, వసతులు ఎలా ఉన్నాయని ఆరా తీశారు. విద్యార్థులు మరింత అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పరిశుభ్రమైన వాతావరణంలో ఆహారం అందించాలన్నారు. మండల విద్యాధికారి విఠల్, కాంప్లెక్స్ హెచ్ఎం రమేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
శాఖలవారీగా నివేదికలు ఇవ్వండి
డీఎల్పీఓ సాయిబాబకౌడిపల్లి(నర్సాపూర్): గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన ప్రగతి నివేదికలను శాఖలవారీగా ఇవ్వాలని డీఎల్పీఓ సాయిబాబ తెలిపారు. గురువారం ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలోని వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి, జీవన ప్రమాణాలు, విద్య, వైద్యం, ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రత, జీవనోపాధి, ఉపాధిహామీ పనులు, విద్యుత్ సరఫరా, రక్షిత తాగునీటి పథకం.. తదితర వివరాలను అందించాలని సూచించారు. అధికారులు ఇచ్చిన నివేదికలను పంచాయతీ కార్యదర్శులు నేషనల్ పంచాయతీ అవార్డుల కోసం ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ కలీముల్ల, విద్యుత్‌శాఖ ఏఈ సాయికుమార్, పీఆర్ ఏఈ మారుతి, ఐసీడీఎస్ సూపర్వైజర్లు ఖమర్‌సుల్తానా, లక్ష్మి, ఏపీఓ పుణ్యదాస్ పాల్గొన్నారు. -
బతికి వస్తేనే మాకు బతుకు
అయినవారి కోసం ఆర్తనాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సిగాచీ పరిశ్రమ ఎదుట బాధిత కుటుంబసభ్యులు పడిగాపులు కాస్తున్నారు. చివరి చూపు దక్కక.. అంతిమ సంస్కారాలు సాగక దిక్కుతోచని స్థితికి గురవుతున్నారు. కనిపించిన వారినంతా.. ‘అయ్యా.. మా వాళ్లు ఏరీ? అంటూ దీనంగా వేడుకుంటున్నారు. ఈ పేలుడు ఘటన మిగిలి్చన విషాదం మూడు రోజులుగా కొనసాగుతుండటంతో బాధిత కుటుంబసభ్యులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఉపాధి కోసం వందల కిలోమీటర్ల దూరం నుంచి పొట్ట చేతపట్టుకుని వస్తే.. ఉపాధి దేవుడెరుగు.. ఉసురు పోయిందని బాధితులు కన్నీరు మున్నీరవుతుండటం అందరినీ కలిచివేస్తోంది. సంగారెడ్డి: కుటుంసభ్యులు మరణిస్తే వేదన అంతా ఇంతా కాదు.. మరణించాడని తెలిసి చివరి చూపు కోసం.. అంతిమ సంస్కారాలైనా చేసుకుందామంటే మృతదేహం లభించకపోతే.. ఆ శోకం రెట్టింపవుతుంది. సరిగ్గా ఇలాంటి ఆవేదనే సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలు అనుభవిస్తున్నాయి. తమ వారి జాడ చెప్పాలని, లేదంటే మృతదేహాన్ని అయినా అప్పగించాలని వారి కుటుంబసభ్యులు పడుతున్న యాతన అందరినీ కలిచివేస్తోంది. ఘటన జరిగిన సిగాచీ పరిశ్రమ వద్దకు తరలివస్తున్న బాధిత కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు.. తమ వారి ఆచూకీ కోసం అక్కడ ఉన్న అధికారులను వేడుకుంటున్నారు. హెల్ప్‌డెస్క్‌కు వెళ్లి ఆరా తీస్తున్నారు. మృతదేహాలను ఉంచిన పటాన్చెరు ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద అధికారులను సంప్రదిస్తున్నారు. గంటలు కాదు.. రోజులు గడుస్తున్నా తమ వారు కనిపించకపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు.క్యాంపులో బిక్కుమంటూ..బాధిత కుటుంబాల కోసం అధికారులు పాశమైలారం ఐలా కార్యాలయం వద్ద ప్రత్యేక సహాయ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో బాధితులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తమ వారి ఆచూకీ కోసం అక్కడి హెల్ప్డెస్్కలో రక్త నమూనాలను ఇచ్చి తమ వారి మృతదేహాల కోసం వేచి చూస్తున్నారు. అధికారుల నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందోనని ఆవేదనతో వేచి చూస్తున్నారు. ఆచూకీ తెలియగానే సమాచారం ఇస్తామని అధికారులు దాటవేస్తుండటంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దేవుడా కనికరించు దేవుడా ఒక్కసారి కనికరించు... నా భర్తను క్షేమంగా ఆస్పత్రి నుంచి బయటకు పంపు. గత జూలై 16న ధర్మరాజ్‌తో వివాహం జరిగింది. ఎనిమిది నెలల క్రితం నేను ఆయనతో కలిసి వచ్చి గృహిణీగా ఉంటున్నాను. సంవత్సరం తిరగక ముందే దేవుడు అగ్ని పరీక్ష పెట్టాడు. సిగాచి పేలుడులో నా భర్త గాయాలపాలయ్యాడు. ఐజీయూలో ఉన్న ఆయన ప్రాణాలతో తిరిగి రావాలని భగవంతుడిని కోరుకుంటున్న. – కశ్మీరా కుమారీ, బీహర్ నా భర్త రాజేష్ కుమార్ చౌదరీ సిగాచిలో లేబర్‌గా పని చేస్తున్నాడు. పొట్టచేత పట్టుకొని నగరానికి వలస వచ్చాం. అనుకోని ప్రమాదంలో నా భర్త తీవ్రంగా గాయపడటంతో ఎమి చేయాలో అర్థం కావడం లేదు. మాకు ఐదుగురు ఆడపిల్లలు ఉండగా ఇప్పటికే ఇద్దరి పెళ్లిళ్లు చేశాం.ఆయన జీతంతోనే కుటుంబం గడుస్తోంది. ఐసీయూలో ఉన్న ఆయన బతికి తిరిగి వస్తేనే మాకు బతుకు ఉంటుంది. – సనాపతి, బీహర్ కళ్ల ముందే కకావికలం సోమవారం ఉదయం 9.30 తరువాత సిగాచిలో పేలుడు సంభవించింది. స్టోర్ అసిస్టెంట్ ఆఫీసర్‌గా ఉన్న నేను కంపెనీ భవనం బయట ఉన్నాను. ఒక్క సారిగా భారీ పేలుడు శబ్ధం రావడంతో ఉలిక్కి పడ్డాను అంతలోనే పెద్ధ ఎత్తున మంటలు, దట్ట మైన పొగ భవన శిథిలాలు ఎగిరి వచ్చి తగలడంతో శరీరానికి గాయాలయ్యాయి.ప్రమాదాన్ని ఊహించుకుంటే భయమేస్తుంది. మూడు రోజులుగా చికిత్స అందించగా ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాను. –యశ్వంత్, విజయవాడ -
ఇందిరమ్మ ఇల్లు ఇస్తారా.. చావ మంటారా!
జగదేవ్‌పూర్(గజ్వేల్): ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఓ పేద కుటుంబం పురుగుల మందు డబ్బాతో నిరసన తెలిపింది. ఈ ఘటన మండలంలోని చాట్లపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు... గ్రామానికి 19 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. బుధవారం గ్రామ కార్యదర్శి సాయిబాబాతోపాటు ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలిసి లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణానికి ముగ్గులు పోసేందుకు వెళ్లారు. గ్రామానికి చెందిన స్వప్న రమేష్ దంపతులు తమది పేద కుటుంబమని, అన్ని అర్హతలు ఉన్నా.. మొదటి విడతలో ఇల్లు రాలేదని తెలిపారు. తమ పేరు ఎందుకు రాయలేదని అక్కడికి వచ్చిన అధికారులు, కమిటీ సభ్యులను నిలదీశారు. ఇల్లు మంజూరు చేయకుంటే ఇక్కడే పురుగుల మందు తాగుతామని హెచ్చరించారు. పురుగుల మందు డబ్బాతో దంపతులిద్దరూ గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దంపతులను సముదాయించారు. అనంతరం ఎంపీడీఓ రాంరెడ్డితో ఫోన్లో మాట్లాడారు. రెండో విడతలో ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించుకున్నారు. -
అభివృద్ధి నిరంతర ప్రక్రియ
మెదక్‌జోన్: అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో రూ. 3.65 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చి కోసం రూ. 30 కోట్లు మంజూరు చేశామన్నారు. అలాగే రూ. 3.65 కోట్లతో శభాష్నగర్, వెంకట్రావ్‌నగర్ కాలనీల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు గుర్తుచేశారు. వచ్చే నాలుగేళ్లలో నియోజకవర్గ రూపురేఖలు మారుస్తామన్నారు. అంతకుముందు మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘ సభ్యులకు రూ. 3.53 కోట్ల చెక్కు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మాజీ కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు -
స్నేహితుడి ఆచూకీ కోసం..
పొట్టచేతపట్టుకుని ఉపాధి కోసం ఒడిశా నుంచి పటాన్‌చెరుకు వచ్చారు 28 సంవత్సరాల దీపక్. తన స్నేహితులతో కలిసి ఇస్నాపూర్‌లోని ఓ గదిని అద్దెకుంటున్నాడు. మూగ్గురు మూడు కంపెనీల్లో పనిచేసుకుంటున్నారు. మూడు నెలల క్రితమే దీపక్ ఈ సిగాచీ పరిశ్రమలో చేరారు. సోమవారం ఉదయమే పనికి వెళ్లిన దీపక్ ఆచూకీ లేకుండా పోయింది. దీంతో ఒక్కడే ఇక్కడ ఉండటంతో ఆయనకు సంబంధించిన కుటుంబసభ్యులు ఎవరూ ఇక్కడ లేరు. దీపక్‌తో పాటు అద్దె గదిలో ఉంటున్న తన స్నేహితులు సునాముద్దీన్, బవుజీలు ఇతర స్నేహితులు ఇప్పుడు దీపక్ ఆచూకీ కోసం పరిశ్రమ వద్దకు వచ్చి అధికారుల వద్ద గోడు వెల్లబోసుకున్నారు. పటాన్చెరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లి అడిగితే అధికారుల నుంచి స్పందన లేదని సునాముద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. -
‘సాంస్కృతిక’సలహాదారుగా అంజన్న
దుబ్బాకటౌన్: రాష్ట్ర సాంస్కృతిక శాఖ సలహాదారు కమిటీ సభ్యుడిగా రాయపోల్ మండల కేంద్రానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, ఓయూ జేఏసీ చైర్మన్ దరువు అంజన్న నియామకమాయ్యరు. నేల కూలిన భారీ వృక్షం తప్పిన ప్రమాదం తూప్రాన్: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు స్థానిక బస్టాండ్ ఎదురుగా ఉన్న భారీ వృక్షం బుధవారం నేలకూలింది. ఈ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కాగా పార్కింగ్ చేసిన బైక్‌లు, ఆటో, రిక్షాలు దెబ్బతిన్నాయి. మున్సిపాలిటీ సిబ్బంది చర్యలు చేపట్టి చెట్టును తొలగించారు. -
సర్కార్ బడికే సై..
బడిబాట కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలంటూ విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు చేసిన ప్రచారం ఫలించింది. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది 834 మంది పిల్లలు అధికంగా చేరారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. – మెదక్జోన్జిల్లావ్యాప్తంగా 926 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రాథమిక, యూపీఎస్, ఉన్నత పాఠశాలలతో పాటు కేజీబీవీ, ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. కాగా వీటిలో గత సంవత్సరం బడిబాటలో భాగంగా 4,908 పిల్లలు చేరగా, ఈ ఏడాది 5,742 మంది పిల్లలు కొత్తగా చేరారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 74,529లకు చేరింది. కాగా ఏటా జూన్‌లో 15 రోజుల పాటు బడిబాట కార్యక్రమం నిర్వహించేది. ఈసారి మాత్రం ముందస్తుగా ఉపాధ్యాయులు మే నెలలోనే నిర్వహించారు. గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. వారి కృషి ఫలితంగా ఈ సారి విద్యార్థుల సంఖ్య పెరిగింది. అంతేకాకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ప్రభుత్వం వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. టీచర్ల పిల్లలు సైతం.. ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వర్తించే 25 మంది ఉపాధ్యాయులు వారి పిల్లలను స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి మార్పుకు నాంధి పలికారు. వీరిని ఆదర్శంగా తీసుకున్న పేద, మధ్య తరగతి వారు సైతం వారి పిల్లలను ప్రభుత్వ బడుల్లోకి పంపుతున్నారు. ప్రభుత్వ టీచర్లు వారి పిల్లలను సర్కారు బడుల్లోనే చదివించాలనే నిబంధన తీసుకొస్తే పేద, మధ్య తరగతి వారంతా వారి పిల్లలను ప్రైవేట్‌కు పంపకుండా సర్కార్ బడులకే పంపిస్తారని పలువురు పేర్కొంటున్నారు.సత్ఫలితాలిచ్చిన బడిబాట గతేడాది కంటే పెరిగిన విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది 5,742 మంది చేరిక -
టెన్త్, ఇంటర్‌పై ప్రత్యేక దృష్టి
ఫలితాల్లో ఈసారి మొదటి స్థానం దక్కాలి ● ఆ దిశగా విద్యాబోధన సాగాలి ● ఎన్రోల్మెంట్ పెంచాలి ● కలెక్టర్ రాహుల్రాజ్మెదక్ కలెక్టరేట్: ఈసారి పది, ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లాకు మొదటి స్థానం రావాలని, ఆ దిశగా విద్యాబోధన సాగాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి మెదక్ సమీకృత కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో నమోదు సంఖ్య పెంచాలన్నారు. అలాగే డ్రాపౌట్ సమస్య పరిష్కరించాలని అధికారులకు సూచించారు. విద్యార్థుల నమోదును పెంచుతూ డ్రాపౌట్స్ కారణాలను గుర్తించి పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులకు మరింత ప్రోత్సాహాన్ని అందించడం, డ్రాపౌట్స్‌పై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి ఉన్నతమైన విద్యా ప్రమాణాలతో పదో తరగతి, ఇంటర్మీడియెట్ ఫలితాలు మరింత మెరుగుపడే దిశగా కృషి చేయాలన్నారు. కష్టమైన సబ్జెక్టులపై, విద్యార్థులపై మరింత శ్రద్ధ పెట్టాలన్నారు. పది పాసైన విద్యార్థులను ఇంటర్లో చేరేలా, ఇంటర్ పాసైన వారిని డిగ్రీలో తప్పనిసరిగా చేరేలా కృషి చేయాలన్నారు. ఇందుకోసం పటిష్ట కార్యాచరణ ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులు, సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. అలాగే ప్రతి విద్యార్థికి చదువు ప్రాముఖ్యత తెలియజెప్పాలన్నారు. గ్రామీణ పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అందించాలన్నారు. సమావేశంలో డీఈఓ రాధాకిషన్, ఇంటర్ విద్యాశాఖ అధికారి మాధవి, నోడల్ అధికారులు ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా ఇరిగేషన్ అదనపు ఎస్ఈగా బాధ్యతలు చేపట్టిన రాజేంద్రప్రసాద్ కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. -
సింగూరులోకి వరద
1,560 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో సింగూరు జలాశయంపుల్కల్(అందోల్): మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో సింగూరు డ్యామ్‌లోకి వరద చేరుతోంది. బుధవారం 1,560 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరిందని ప్రాజెక్టు ఏఈ మహిపాల్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతం నారాయణఖేడ్, జహీరాబాద్ ప్రాంతంలో కురిసిన వర్షపు నీరంతా మంజీరా నది ద్వారా, మునిపల్లి మండలం దుబ్బవాగు ద్వారా డ్యాంలోకి నీరు చేరుతుందన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 19.219 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ సీజన్లో ఇప్పటివరకు మూడు టీఎంసీల నీరు చేరిందని అదికారులు తెలిపారు. డ్యామ్ ఎగువ భాగం మహారాష్ట్రలోని లాతూర్‌లో కురుస్తున్న వర్షం డ్యామ్‌లోకి చేరుతుందని అధికారులు తెలిపారు. -
అయినవారి కోసం కుటుంబసభ్యుల పడిగాపులు
మూడు రోజులుగా నరకయాతన ● ‘సిగాచీ’ పేలుడు మిగిల్చిన పెనువిషాదంఅయినవారి కోసం ఆర్తనాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సిగాచీ పరిశ్రమ ఎదుట బాధిత కుటుంబసభ్యులు పడిగాపులు కాస్తున్నారు. చివరి చూపు దక్కక.. అంతిమ సంస్కారాలు సాగక దిక్కుతోచని స్థితికి గురవుతున్నారు. కనిపించిన వారినంతా.. ‘అయ్యా.. మా వాళ్లు ఏరీ? అంటూ దీనంగా వేడుకుంటున్నారు. ఈ పేలుడు ఘటన మిగిల్చిన విషాదం మూడు రోజులుగా కొనసాగుతుండటంతో బాధిత కుటుంబసభ్యులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఉపాధి కోసం వందల కిలోమీటర్ల దూరం నుంచి పొట్ట చేతపట్టుకుని వస్తే.. ఉపాధి దేవుడెరుగు.. ఉసురు పోయిందని బాధితులు కన్నీరు మున్నీరవుతుండటం అందరినీ కలిచివేస్తోంది. – సాక్షిప్రతినిధి, సంగారెడ్డిక్యాంపులో బిక్కుమంటూ.. బాధిత కుటుంబాల కోసం అధికారులు పాశమైలారం ఐలా కార్యాలయం వద్ద ప్రత్యేక సహాయ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో బాధితులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తమ వారి ఆచూకీ కోసం అక్కడి హెల్ప్‌డెస్క్‌లో రక్త నమూనాలను ఇచ్చి తమ వారి మృతదేహాల కోసం వేచి చూస్తున్నారు. అధికారుల నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందోనని ఆవేదనతో వేచి చూస్తున్నారు. ఆచూకీ తెలియగానే సమాచారం ఇస్తామని అధికారులు దాటవేస్తుండటంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు.కుటుంసభ్యులు మరణిస్తే వేదన అంతా ఇంతా కాదు.. మరణించాడని తెలిసి చివరి చూపు కోసం.. అంతిమ సంస్కారాలైనా చేసుకుందామంటే మృతదేహం లభించకపోతే.. ఆ శోకం రెట్టింపవుతుంది. సరిగ్గా ఇలాంటి ఆవేదనే సిగాచీ పరిశ్రమ పేలుడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలు అనుభవిస్తున్నాయి. తమ వారి జాడ చెప్పాలని, లేదంటే మృతదేహాన్ని అయినా అప్పగించాలని వారి కుటుంబసభ్యులు పడుతున్న యాతన అందరినీ కలిచివేస్తోంది. ఘటన జరిగిన సిగాచీ పరిశ్రమ వద్దకు తరలివస్తున్న బాధిత కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు.. తమ వారి ఆచూకీ కోసం అక్కడ ఉన్న అధికారులను వేడుకుంటున్నారు. హెల్ప్‌డెస్క్‌కు వెళ్లి ఆరా తీస్తున్నారు. మృతదేహాలను ఉంచిన పటాన్చెరు ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద అధికారులను సంప్రదిస్తున్నారు. గంటలు కాదు.. రోజులు గడుస్తున్నా తమ వారు కనిపించకపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. -
అంగన్‌వాడీలబలోపేతానికి చర్యలు
వెల్దుర్తి(తూప్రాన్): రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల బలోపేతానికి చర్యలు తీసుకుంటుందని ఐసీడీఎస్ పీడీ హైమావతి అన్నారు. బుధవారం మండలంలోని శేరీల గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. చిన్నారుల వయసుకు తగ్గ ఎత్తు, ఎత్తుకు తగిన బరువు ఉన్నారా..? అని పరిశీలించారు. అనంతరం శిథిలావస్థకు చేరిన అంగన్వాడీ భవనాన్ని పరిశీలించారు. మరమ్మతులు చేపట్టినా ఫలితం ఉండదని, భవనాన్ని పూర్తిగా తొలగించి నూతన భవనం నిర్మించేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు. ఆమె వెంట టీచర్ దేవలత, సిబ్బంది ఉన్నారు. గ్రామాలు పరిశుభ్రంగాఉండాలి: డీపీఓ కౌడిపల్లి(నర్సాపూర్): వర్షాకాలం గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలని డీపీఓ యాదయ్య తెలిపారు. బుధవారం కౌడిపల్లి పంచాయతీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఈసందర్భంగా డీపీఓ మాట్లాడుతూ.. ప్రతి గ్రామం సంపూర్ణ పారిశుద్ధ్యంగా ఉండేలా చూడాలన్నారు. మురికి నీరు, చెత్త లేకుండా చూడాలని, రక్షిత తాగునీటి పథకంలో పైపులైన్ లీకేజీలు ఉంటే సరిచేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి వెంకటేశం, కారోబార్ ఎల్లం ఉన్నారు. మోడల్ ఇందిరమ్మఇల్లు బాగుంది కౌడిపల్లి(నర్సాపూర్): కౌడిపల్లి ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో రూ. 5 లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న మోడల్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణం, పంచాయతీ రాజ్ డివిజన్ కార్యాలయ భవానాన్ని అదనపు కలెక్టర్ నగేష్ బుధవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోడల్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణం బాగుందన్నారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణాలు ప్రారంభించాలన్నారు. గ్రంథాలయానికి సొంత భవనం కేటాయించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఆయన వెంట తహసీల్దార్ ఆంజనేయులు, ఆర్ఐ శ్రీహరి, పీఆర్ ఏఈ మారుతి తదితరులు పాల్గొన్నారు. పేదల సొంతింటి కల సాకారం కొల్చారం/నర్సాపూర్ రూరల్: పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం అని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి అన్నారు. బుధవారం కొల్చారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి నూతన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, ఎలాంటి అపోహకు గురికావొద్దని సూచించారు. అలాగే నర్సాపూర్ మండలంలోని ఇబ్రహీంబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రాజిరెడ్డి భూమి పూజ చేశారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో యాదగౌడ్, రామగౌడ్, నరేష్, బీమ్, రవీందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్, ఉపాధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రంగంపేట గ్రామ శాఖ అధ్యక్షుడు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రేమ చిగురించిన చోటే.. ప్రాణమూ పోయింది
ముద్దనూరు/పుట్రేల(విస్సన్నపేట): ఆ రెండు మనసులను పనిచేసే ప్రాంతమే పరిచయం చేసింది.. ప్రేమను చిగురించేలా చేసింది. పెళ్లిపీటల కోసం సిద్ధ పరచింది. మరో రెండు నెలల్లో ఒక్కటి చేయాలని చూసింది. కానీ ఇంతలోనే మృత్యువు ఆ ఇద్దరినీ కబళించింది. ఆ పనిచేసే ప్రాంతంలోనే పాశాన్ని విసిరింది. అనుకోని విపత్తు వారి ఆశలను ఆహుతి చేసింది. ఎన్నో ఆకాంక్షలతో కొత్త జీవితాన్ని ఆరంభించాలకున్న ఆ జంట.. ఇంట పెను విషాదాన్ని నింపింది. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఫార్మా పరిశ్రమలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన యువతీ, యువకులు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. వైఎస్సార్ కడప జిల్లా ముద్దనూరు మండలం పెనికలపాడు గ్రామానికి చెందిన నిఖిల్ కుమార్‌రెడ్డి(25), ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం పుట్రేలకు చెందిన రామాల. శ్రీరమ్య ఫార్మా పరిశ్రమలో ఉద్యోగులు. ఇక్కడే వారి మధ్య పరిచయం ఏర్పడింది. ఇరువురూ తమ పెద్దలను ఒప్పించారు. మరో రెండునెలల్లోనే పెళ్లిపీటలు ఎక్కాల్సిన తరుణంలో విషాదం వెంటాడింది. సోమవారం ఇద్దరూ పరిశ్రమలో విధుల్లో ఉన్నారు. ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో వారిద్దరూ మృతి చెందారు. ఈ ఘటనతో పెనికలపాడు, పుట్రేల గ్రామాల్లో మంగళవారం తీవ్ర విషాదం అలముకుంది.రెండునెలల్లో పెళ్లి చేద్దామనుకున్నాం...రామాల నారయ్య, పద్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, పెద్ద కుమార్తె జ్యోత్స్న బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తోంది. చిన్న కుమార్తె శ్రీరమ్య తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ పూర్తి చేసి ఆరు నెలల క్రితమే సిగాచి ఫార్మా కంపెనీలో ఉద్యోగంలో చేరింది. ఇంతలో ఘోర విపత్తులో చిన్న కుమార్తె ప్రాణాలు కోల్పోవడాన్ని తలచుకుంటూ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. నిఖిల్ రెడ్డి కుటుంబంతో మాట్లాడి ఆషాఢం వెళ్లిన తర్వాత పెళ్లి చేద్దామనుకున్నామని తీరా ఈ విషాద సంఘటనలో ఇరువురు చనిపోయారని మృతురాలి తల్లి పద్మ కన్నీరు మున్నీరుగా విలపించింది. -
రెండు రోజుల్లో అంగీకార పత్రాలు ఇవ్వాలి
అదనపు కలెక్టర్ నగేష్ మెదక్ కలెక్టరేట్: రైస్ మిల్లర్లు రెండు రోజుల్లో గ్యారెంటీ, అంగీకార పత్రాలను అందజేయాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. మంగళవారం రాత్రి కలెక్టరేట్లో రెవెన్యూ, పౌర సరఫరాలు, రైస్ మిల్లర్ల ప్రతినిధులతో రబీ కొనుగోలు ప్రక్రియ సంబంధించి బ్యాంక్ గ్యారంటీలు, సీఎంఆర్ డెలివరీపై అదనపు కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో రబీ ధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించి జిల్లాలో 36 రైస్ మిల్లులను గుర్తించామని తెలిపారు. ఆ మిల్లులకు సంబంధించి బ్యాంకు గ్యారెంటీ రెండు రోజుల్లోగా అందించాలన్నారు. గడువులోగా సీఎంఆర్ డెలివరీ పూర్తి చేయాలని మిల్లర్లను ఆదేశించారు. మిల్లులవారీగా కేటాయించిన ధాన్యం ఇప్పటివరకు అప్పగించిన బియ్యం వివరాలను తెలుసుకున్నారు. డెలివరీ ప్రక్రియను అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానంద్, డీఎం సివిల్ సప్లై జగదీష్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. -
జిల్లాలో 30,30(ఎ) యాక్ట్ అమలు
జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు మెదక్ మున్సిపాలిటీ: మెదక్ జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని (జులై 1న నుంచి 31 వరకు) జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా జిల్లాలో ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన లు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహించొద్దన్నారు. అలాగే ప్రజాధనాన్ని నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని హెచ్చరించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు సహకరించాలని కోరారు. భరోసా సిబ్బంది కృషి అభినందనీయం మెదక్ మున్సిపాలిటీ: ఫోక్సో కేసులు నిందితుడికి శిక్ష పడేలా విశేష కృషి చేసిన భరోసా సిబ్బందిని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అభినందించారు. ఆరేళ్ల బాలికపై జరిగిన లైంగికదాడి కేసులో శిక్షపడేలా కృషి చేసిన భరోసా సిబ్బందికి మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మహిళా భద్రత విభాగం అదనపు డీజీపీ చారుసిన్హా ప్రశంసా పత్రం అందజేశారు. ఈ తీర్పు భరోసా కేంద్రం యొక్క న్యాయ, మానసిక, సాంకేతిక సేవలపై అంకితభావాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. భవిష్యత్తులోనూ బాధితులకు న్యాయం, మానసిక బలాన్ని అందించేందుకు భరోసా కేంద్రం కృషి చేస్తూనే ఉంటుందన్నారు. -
విద్యుత్‌శాఖలో అక్రమ బదిలీలు
● నిబంధనలకు విరుద్ధంగా జారీ ● రద్దు చేయాలని ఫిర్యాదు మెదక్ కలెక్టరేట్: విద్యుత్‌శాఖ ఎస్ఈ నిబంధనలకు విరుద్ధంగా జారీచేసిన బదిలీ ఆర్డర్లను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మెదక్ విద్యుత్ కార్యాలయం ఎదుట మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్‌శాఖ ఎస్ఈ శంకర్ 30న తన రిటైర్మెంట్ రోజు రాత్రి 9 గంటలకు బదిలీల ఆదేశాలు ఇచ్చారన్నారు. ఉన్నతాధికారులు ఈ అక్రమ ఆదేశాలను వెంటనే రద్దు చేయాలని, లేకపోతే సీఎండీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు సత్యనారాయణ, అశోక్, శేఖర్, కిరణ్, నాగరాజు, ప్రతాప్‌రెడ్డి, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. -
ట్రేడ్ లైసెస్సుల ప్రక్రియ వేగవంతం
దుబ్బాక: మున్సిపాల్టీలో వాణిజ్య, వ్యాపార సముదాయాలకు జారీచేసే ట్రేడ్ లైసెన్స్‌ల ప్రక్రియను వేగవంతం చేయాలని సీడీఎంఏ అసిస్టెంట్ డైరెక్టర్ రుషికేష్ వాత్సవ్ ఆదేశించారు. మంగళవారం ఆయన మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ట్రేడ్ లైసెన్స్‌ల జారీ ప్రక్రియ, భువన్ యాప్ ద్వారా ఇంటి పన్నులు చెల్లించే వివరాలు, డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద పారిశుద్ధ్య నిర్వహణను కమిషనర్ రమేశ్ కుమార్‌తో కలిసి పరిశీలించారు. అనంతర ఆయన మాట్లాడుతూ ట్రేడ్ లైసెన్సుల దరఖాస్తులపై అవగాహన కల్పించాలన్నారు. భువన్‌యాప్‌లో భవనాలు, వాణిజ్య, వ్యాపారాల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, అనిల్‌రెడ్డి, నర్సయ్య తదితరులు ఉన్నారు. సీడీఎంఏ అసిస్టెంట్ డైరెక్టర్ రుషికేష్ శ్రీవాత్సవ్ -
సమ్మెలో కార్మికులు భాగస్వాములు కావాలి
శివ్వంపేట(నర్సాపూర్): కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 9న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో అన్ని వర్గాల కార్మికులు భాగస్వాములు కావాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని ఆశా సిబ్బందితో కలిసి మహేందర్‌రెడ్డి పీహెచ్సీ వైద్యురాలు సాయిసౌమ్యకు సమ్మె నోటీసు అందజేశారు. గతంలో పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కేంద్రం హరిస్తోందని, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలనే డిమాండ్‌తోపాటు ఇతర సమస్యలు సాధించుకునేందుకు సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. కౌడిపల్లి సీహెచ్‌సీలో డాక్టర్స్‌డే కౌడిపల్లి(నర్సాపూర్): మండల కేంద్రం కౌడిపల్లిలోని సీహెచ్‌సీ(పీహెచ్సీ) డాక్టర్స్ డేను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీహెచ్‌సీ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటలక్ష్మి, పీహెచ్సీ డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ ఫెర్నాజ్లను వైద్యసిబ్బంది ఘనంగా సన్మానించి కేక్ కట్‌చేసి డాక్టర్స్‌డేను నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సీహెచ్‌సీ, పీహెచ్సీ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మొక్కలను సిద్ధం చేయాలి పెద్దశంకరంపేట(మెదక్): వనమహోత్సవానికి అన్ని గ్రామాల్లో మొక్కలను సిద్ధం చేయాలని ఇన్చార్జి ఎంపీడీఓ షాకీర్‌అలీ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని శివాయిపల్లిలో నర్సరీని పరిశీలించారు. గ్రామాల వారీగా నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలను నాటాలని గ్రామ కార్యదర్శి సవితకు సూచించారు. నూతన నర్సరీకి సంబంధించి బ్యాగ్ ఫిల్లింగ్ పనులను పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఈజీఎస్ ఏపీఓ సంతోష్‌కుమార్, ఫీల్డ్అసిస్టెంట్ మల్లేశం తదితరులున్నారు. ఎల్లమ్మ ఆలయం పూజలు కొల్చారం(నర్సాపూర్): మండల కేంద్రంలో కొలువైన రేణుక ఎల్లమ్మ దేవి ఆలయంలో మంగళవారం అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి ఉదయం అభిషేకం, అలంకరణ పూజా కార్యక్రమాలతో పాటు మొక్కలు చెల్లించుకున్నారు. ఆలయ సన్నిధిలో అన్న ప్రసాదం నిర్వహించారు. ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం నంగునూరు(సిద్దిపేట): ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశం కోసం నిర్వహిస్తున్న ఈఏపీసెట్ కౌన్సెలింగ్ మంగళవారం ప్రారంభమైంది. రాజగోపాల్‌పేట పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన కౌన్సెలింగ్‌కు మొదటి రోజు 300 మంది విద్యార్థులు హాజరయ్యారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం విద్యార్థులకు ఐడీ, పాస్వర్డ్ అందజేశామని, ఐడీ పొందిన విద్యార్థులు కళాశాలలో చేరేందుకు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలని ప్రిన్సిపాల్ గోవర్ధన్ తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు అభినవ్ పాల్గొన్నారు. అవగాహన అవసరం మిరుదొడ్డి(దుబ్బాక): అంతర పంటలతో మ రింత ఆర్థికాభివృద్ధి సాధించాలంటే కంది సా గుపై అవగాహన ఉండాలని మండల వ్యవసా య అధికారి సత్యాణ్వేష్ సూచించారు. జాతీ య ఆహార భద్రత మిషన్ పప్పు దినుసులు 2025 పథకంలో భాగంగా రైతు వేదికలో రైతులకు కంది విత్తనాలను అందజేశారు. కార్యక్రమంలో ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. రెండు రోజుల్లో కాలేజీకి రోడ్డు హుస్నాబాద్‌రూరల్: పాలిటెక్నిక్ కాలేజీ రోడ్డు ను రెండు రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ ఆ దేశించారు.‘కాలేజీకి రోడ్డు నిర్మించరూ..?’ అనే శీర్షికన సోమవారం సాక్షిలో వచ్చిన కథనానికి కలెక్టర్ స్పందించి పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులను పనుల వివరాలపై ఆరా తీశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీకి రో డ్డు సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు ప డుతున్న విషయం తెలిసిందే. దీంతో డీఈ మ హేశ్ మంగళవారం పనులు ప్రారంభించారు. -
● విత్తన, ఎరువుల దుకాణాలపై కొరడా ● వ్యవసాయ, పోలీస్ అధికారుల తనిఖీలు ● నాసిరకం, కాలం చెల్లినవాటిని అమ్మితే చర్యలు ● అప్రమత్తంగా ఉండాలని సూచన
వర్షకాలం సీజన్ ప్రారంభమవడంతో రైతులు సాగుకు సిద్ధమయ్యారు. నకిలీ విత్తనాలతో నష్టపోకుండా చూడాలని వ్యవసాయ, పోలీసు అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. అప్పమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలిన రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. చిలప్‌చెడ్(నర్సాపూర్): మండలంలో పీఏసీఎస్, నాబార్డ్ పరిధిలో ఒక్కొక్కటి, అలాగే ఆగ్రో రైతుసేవా కేంద్రంతోపాటు మరో మూడు ప్రైవేట్ ఎరువుల దుకాణాలు ఉన్నాయి. అన్ని దుకాణాలలో అధికారులు నిరంతరం సోదాలు నిర్వహిస్తున్నారు. రికార్డులు పరిశీలించి, నకిలీ విత్తనాలమ్మితే దుకాణం సీజ్‌చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఎరువులు, విత్తనాలను అధిక ధరలకు అమ్మినా నేరమని, అలాంటి దుకాణ యజమానుల వివరాలు తమ దృష్టికి తీసుకురావాలని రైతులకు సూచిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి ఎరువులు, విత్తనాల ఎంపికలో రైతులు అప్రమత్తంగా ఉండాలి. కొనుగోలు చేసిన విత్తనాలు ఇతర దుకాణాలలో ఏ ధరలకు దొరుకుతున్నాయో ఆరా తీయాలి. అవసరమైతే వ్యవసాయాధికారుల సల హాలు తీసుకోవాలి. ముఖ్యంగా కొనుగోలు చేసిన రశీదులు తప్పనిసరిగా జాగ్రత్త చేసుకోవాలని అధికారులు చెప్తున్నారు.చిలప్చెడ్లోని ఓ ఎరువుల దుకాణంలో సోదాలు నిర్వహిస్తున్న ఏఓ, ఎస్ఐ -
జెండా పండుగను విజయవంతం చేయాలి
శివ్వంపేట(నర్సాపూర్): ఈ నెల 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి సైదుల్, జిల్లా అధ్యక్షుడు యాదగిరి అన్నారు. మంగళవారం శివ్వంపేటలో ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ కోసం దిమ్మె నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 30 సంవత్సరాలు ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సుదీర్ఘ పోరాటం వల్ల వర్గీకరణ సాధించుకున్నట్లు చెప్పారు. గ్రామస్ధాయి నుంచి ఎమ్మార్పీఎస్ జెండా పండుగలో అన్ని వర్గాల వారిని ఆహ్వానించి విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు పోచయ్య, లింగం, నర్సింలు, భిక్షపతి, సురేష్, తదితరులు ఉన్నారు. -
పర్యావరణ పరిరక్షణౖపై చిత్రలేఖనం పోటీలు
హవేళిఘణాపూర్(మెదక్): మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో లయన్‌న్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ అంశంపై చిత్రలేఖనం పోటీలు మంగళవారం నిర్వహించారు. ఈ పోటీల్లో 9వ తరగతి విద్యార్థిని ప్రసన్నకుమారి ప్రథమ బహుమతి, పదవ తరగతి విద్యార్థిని అక్షయ ద్వితీయ స్థానంలో నిలిచారు. వీరికి ప్రధానోపాధ్యాయులు కరుణాకర్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రాజేశం, శశి, శేఖర్ పాల్గొన్నారు. నర్సాపూర్‌లో.. నర్సాపూర్: లయన్స్‌క్లబ్ ఆఫ్ నర్సాపూర్ స్నేహ బంధు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు క్లబ్ అధ్యక్షుడు రాఘవేందర్రావు తెలిపారు. విద్యార్థులకు వ్యాస రచన పోటీలు, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలోని వైద్యులకు సన్మానం, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో లయన్స్‌క్లబ్ మాజీ గవర్నర్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, జోన్ చైర్మన్ బుచ్చెష్, అశోక్, వెంకటస్వామి పాల్గొన్నారు. -
ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అరవింద్
ప్రతీ ఇంటికి నల్లా కనెక్షన్ కౌడిపల్లి(నర్సాపూర్): రక్షిత మంచినీటి పథకంలో భాగంగా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఉండాలని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అరవింద్ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని పీర్లతండాలో మంచినీటి సరఫరా, ఇంటింటికి నల్లా కనెక్షన్లపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలు, తండాల్లో ప్రతి ఇంటికి నల్లాకనెక్షన్ ఉంది.. లేనిది సర్వే చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే మిషన్ భగీరథ పథకంలో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చినట్లు చెప్పారు. కొత్తగా నిర్మించిన ఇళ్లతో పాటు నల్లా కనెక్షన్లు లేని ఇళ్లను గుర్తించి అవసరమైన కనెక్షన్ల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపనున్నట్లు తెలిపారు. నిధులు మంజూరు కాగానే నల్లాలేని ఇంటికి నల్లాకనెక్షన్ ఇస్తామని తెలిపారు. -
వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి
మెదక్‌జోన్: రోజురోజుకు ఆర్థికంగా చితికిపోతున్న స్వర్ణకారులను ఆదుకునేందుకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని జిల్లా స్వర్ణకారుల సంఘం అధ్యక్షులు పూనా రవిచారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్వర్ణకారులు వృత్తిపై ఆధారపడి ఆత్మహత్యలకు పాల్పడాల్సిన దౌర్భాగ్య దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మెదక్‌లో మీడియాతో మాట్లాడారు. స్వర్ణకారుల కోసం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని అనేక సంవత్సరాలుగా పోరాటం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ నిర్లిప్త ధోరణితో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయన్నారు. ఇటీవల రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికై నా సానుకూలంగా స్పందించి స్వర్ణకారులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు ఏలేశ్వర బ్రహ్మచారి, కార్యదర్శి ఇటిక్యాల వేణు, కోశాధికారి ఎస్. కాశీనాతం, నాయకులు బ్రహ్మం,డి. మహేష్, సి.హెచ్.నరేష్, ఎం. నవీన్, రాజు తదితరులున్నారు. స్వర్ణకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు రవిచారి -
Pashamylaram: అప్పుడే మేల్కొనుంటే..
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: గతేడాది మార్చిలో సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్‌లో ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలి ఆరుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. ఈ పేలుడు ధాటికి చుట్టుపక్కల భవనాలు సైతం శిథిలమయ్యాయి. ఈ ఘటనలో అమాయక కారి్మకుల ప్రాణాలు గాలిలో కలిసిపోగా 30 మంది క్షతగాత్రులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ భారీ ఘటనతోనైనా సంబంధిత అధికారులు మేల్కొని ఉంటే..ఇప్పుడు ఇలా సిగాచీ పరిశ్రమలో భారీ పేలుడు ఘటన పునరావృతం అయ్యేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎస్బీ ఆర్గానిక్స్ ప్రమాదం జరిగినప్పుడు అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. కార్మికుల భద్రత విషయంలో ఎలాంటి ప్రమాణాలు పాటించాలి..ఎలాంటి భద్రతాపరమైన చర్యలు చేపట్టాలనే దానిపై కమిటీ నివేదిక ఇచ్చింది. అయితే ఈ కనీసం నిబంధనలు పాటించకపోవడంతో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. కీలకపని ప్రదేశాల్లో స్కిల్డ్ లేబర్ లేక.. పరిశ్రమల్లో కీలక పని ప్రదేశాల్లో స్కిల్డ్ లేబర్‌తో పనిచేయించాలి. ముఖ్యంగా రియాక్టర్లు, బాయిలర్లు, బ్లోయర్లు, ఇలా ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సంబంధిత అంశాల్లో అన్ని అర్హతలున్నవారికి విధులను అప్పగించాలి. కానీ, తక్కువ వేతనాలకు పనిచేస్తారనే కారణంగా ఇలాంటి కీలక ప్రదేశాల్లో అన్‌స్కిల్డ్ కార్మికులతో పనులు చేయించడంతో ఇలాంటి ప్రమాదాలకు దారితీస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాసులకు కక్కుర్తి పడుతున్న పరిశ్రమల యాజమాన్యాలు ఇలా కారి్మకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాక్టరీల ఇన్స్పెక్టర్ల తనిఖీలు ఏవీ.. పరిశ్రమల్లో కనీస భద్రతా ప్రమాణాలను పాటించేలా ఫ్యాక్టరీల ఇన్స్పెక్టర్లు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి. కానీ, ఈ తనిఖీలు జిల్లాలో మొక్కుబడిగా జరుగుతున్నాయనే విమర్శలున్నాయి. ఆయా పరిశ్రమల నుంచి ప్రతినెలా ఠంఛనుగా మామూళ్లు పొందుతున్న ఈ శాఖ అధికారులు పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను పాటించకపోయినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎస్బీ ఆర్గానిక్ పరిశ్రమ ప్రమాదానికి కొద్దిరోజుల ముందే ఇదే హత్నూర మండలంలో కోవాలెంట్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో నలుగురు కారి్మకులు మృత్యువాత పడ్డారు. ఇలా తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నప్పటికీ.. సంబంధిత అధికారుల్లో కనీసం చలనం లేకుండా పోయింది.ప్రమాదం జరిగాక హడావుడి సంబంధిత అధికారులు ఇలా ప్రమాదం జరిగాక హడావుడి చేస్తున్నారే తప్ప ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు తీసుకుంటున్న చర్యలు శూన్యమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. ఇందుకు ఎస్బీఆర్గానిక్స్ భారీ పేలుడు ఘటన జరిగిన కొన్ని రోజులకే ఇప్పుడు సిగాచీ పరిశ్రమలో అంతకుమించి భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో కారి్మకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రభుత్వం ఇకనైనా స్పందించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని, పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా నిబంధనలను అమలు చేయాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. -
యాజమాన్య నిర్లక్ష్యంతోనే ప్రమాదం
పటాన్చెరు టౌన్: యాజమాన్యం నిర్లక్ష్యం..ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు తూతూ మంత్రంగా చేపట్టే తనిఖీల మూలంగానే సిగాచి ఫార్మా పరిశ్రమలో పేలుడు ఘటన చోటుచేసుకుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన ప్రతీ కార్మికుడి కుటుంబానికి రూ.కోటి, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, క్షతగాత్రలకు మెరుగైన వైద్యంతోపాటు రూ.50లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. పటాన్చెరు నియోజకవర్గ పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో సోమవారం ఉదయం రియాక్టర్ పేలుడు జరిగిన విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఘటనాస్థలికి ఎమ్మెల్యే గూడెం చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా డీఐజి ఇక్బాల్, కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోశ్ పంకజ్‌తో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... 30 ఏళ్లుగా పరిశ్రమ నడిపిస్తున్న సిగాచి యాజమాన్యం ఎన్నడూ కార్మికుల భద్రత కోసం చర్యలు తీసుకోలేదన్నారు. గతంలో కూడా ఇదే పరిశ్రమలో భారీ పేలుడు సంభవించి పెద్ద సంఖ్యలో మృతి చెందారని గుర్తు చేశారు. ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సిన పరిశ్రమల తనిఖీల విభాగం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కార్మికుల భద్రతను గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించి పూర్తిస్థాయిలో విచారణ జరిపించి..ఘటనకు కారకులైన యాజమాన్యం, నిర్లక్ష్యం వహించిన పరిశ్రమ విభాగం అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మృతుల కుటంబాలకు రూ.కోటి, క్షతగాత్రులకు రూ.50 లక్షలపరిహారం ఇవ్వాలి ఒకరికి ఉద్యోగం కల్పించాలి అధికారులతో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గూడెం -
పోలీసుల ఓవరాక్షన్
కార్మిక కుటుంబాల పట్ల దురుసు ప్రవర్తన పటాన్చెరు: ‘నా భర్త ఎక్కడ’అంటూ కొందరు మహిళలు గుండలవిసేలా విలపించారు. ఓ మహిళ మాట్లాడుతూ తన భర్త పేరు ఆస్పత్రిలో చేరిన వారి జాబితాలో లేదు. చనిపోయిన వారి జాబితాలో కూడా లేదని చెబుతున్నారు. మరి ఎక్కడున్నారు..? చెప్పాలి అంటూ బాధితులు తమ వారి ఆచూకీ కోసం కలియదిరుగుతుంటే లోపలికి రాకూడదంటూ పోలీసులు వారి పట్ల అమానవీయంగా దురుసుగా వ్యవహరించారు. అనిత, సంజీవ్‌లాల్ అనే మహిళలు పోలీసులతో వాదిస్తూ పోలీసులపై రాయి ఎత్తి పట్టి తిట్టిపోశారు. ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిన మావాళ్లు ఇంటికి తిరిగి రాలేదు. పొద్దున్నుంచి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నా..అని ఓ మహిళ వాపోయింది. పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన విస్ఫోటనంలో చనిపోయిన, గాయపడిన వారి కుటుంబీకుల పరిస్థితి ఇది. -
చేతకాని సర్కారుకు బుద్ధి చెప్పాలి
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డికౌడిపల్లి(నర్సాపూర్): గ్రామాల్లో చెత్తను తొలగించడం చేతకాని ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. చెత్త ట్రాక్టర్లు నడపకపోవడం, మురికి కాలువలు శుభ్రం చేయకపోవడం, వీధి దీపాలు వెలగకపోవడం, పారిశుద్ధ్యం లోపించడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. కేసీఆర్ హయాంలో పల్లె ప్రగతి ద్వారా పల్లెలు శుభ్రంగా ఉండగా, నేడు కనీసం ట్రాక్టర్లలో డీజిల్ పోయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. డీజిల్ పోయలేమని పంచాయతీ కార్యదర్శులు అంటే మెమోలు ఇస్తున్నారని వాపోయారు. గత ప్రభుత్వంలో చేసిన పనులకు మేమెందుకు డబ్బులు ఇస్తామని మంత్రి సీతక్క చెప్పడం ఆమె అవివేకానికి నిదర్శనమన్నారు. ఈ పాలనపై 18 నెలలకే ప్రజలకు విరక్తి వచ్చిందన్నారు. అనంతరం ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ కలీముల్లకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సార రామాగౌడ్, మాజీ ఎంపీపీ రాజు, ఉపాధ్యక్షుడు నవీన్‌గుప్త, నాయకులు మహిపాల్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్, కాంతారావు పాల్గొన్నారు. అనంతరం మహ్మద్‌నగర్ గేట్ వద్ద సబ్‌స్టేషన్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించారు. -
అప్పుడే మేల్కొనుంటే..
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: గతేడాది మార్చిలో సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్‌లో ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలి ఆరుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. ఈ పేలుడు ధాటికి చుట్టుపక్కల భవనాలు సైతం శిథిలమయ్యాయి. ఈ ఘటనలో అమాయక కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోగా 30 మంది క్షతగాత్రులయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ భారీ ఘటనతోనైనా సంబంధిత అధికారులు మేల్కొని ఉంటే..ఇప్పుడు ఇలా సిగాచీ పరిశ్రమలో భారీ పేలుడు ఘటన పునరావృతం అయ్యేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎస్బీ ఆర్గానిక్స్ ప్రమాదం జరిగినప్పుడు అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. కార్మికుల భద్రత విషయంలో ఎలాంటి ప్రమాణాలు పాటించాలి..ఎలాంటి భద్రతాపరమైన చర్యలు చేపట్టాలనే దానిపై కమిటీ నివేదిక ఇచ్చింది. అయితే ఈ కనీసం నిబంధనలు పాటించకపోవడంతో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. కీలకపని ప్రదేశాల్లో స్కిల్డ్ లేబర్ లేక.. పరిశ్రమల్లో కీలక పని ప్రదేశాల్లో స్కిల్డ్ లేబర్‌తో పనిచేయించాలి. ముఖ్యంగా రియాక్టర్లు, బాయిలర్లు, బ్లోయర్లు, ఇలా ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సంబంధిత అంశాల్లో అన్ని అర్హతలున్నవారికి విధులను అప్పగించాలి. కానీ, తక్కువ వేతనాలకు పనిచేస్తారనే కారణంగా ఇలాంటి కీలక ప్రదేశాల్లో అన్‌స్కిల్డ్ కార్మికులతో పనులు చేయించడంతో ఇలాంటి ప్రమాదాలకు దారితీస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాసులకు కక్కుర్తి పడుతున్న పరిశ్రమల యాజమాన్యాలు ఇలా కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాక్టరీల ఇన్స్పెక్టర్ల తనిఖీలు ఏవీ.. పరిశ్రమల్లో కనీస భద్రతా ప్రమాణాలను పాటించేలా ఫ్యాక్టరీల ఇన్స్పెక్టర్లు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి. కానీ, ఈ తనిఖీలు జిల్లాలో మొక్కుబడిగా జరుగుతున్నాయనే విమర్శలున్నాయి. ఆయా పరిశ్రమల నుంచి ప్రతినెలా ఠంఛనుగా మామూళ్లు పొందుతున్న ఈ శాఖ అధికారులు పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను పాటించకపోయినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎస్బీ ఆర్గానిక్ పరిశ్రమ ప్రమాదానికి కొద్దిరోజుల ముందే ఇదే హత్నూర మండలంలో కోవాలెంట్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. ఇలా తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నప్పటికీ.. సంబంధిత అధికారుల్లో కనీసం చలనం లేకుండా పోయింది. ప్రమాదం జరిగాక హడావుడి సంబంధిత అధికారులు ఇలా ప్రమాదం జరిగాక హడావుడి చేస్తున్నారే తప్ప ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు తీసుకుంటున్న చర్యలు శూన్యమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. ఇందుకు ఎస్బీఆర్గానిక్స్ భారీ పేలుడు ఘటన జరిగిన కొన్ని రోజులకే ఇప్పుడు సిగాచీ పరిశ్రమలో అంతకుమించి భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ప్రభుత్వం ఇకనైనా స్పందించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని, పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా నిబంధనలను అమలు చేయాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. నాడు ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలి ఆరుగురు మృతి.. ఇదే తరహాలో ఇప్పుడు సిగాచీ పరిశ్రమలో ఘటన.. -
అర్జీలను తక్షణం పరిష్కరించాలి
ఆకలితో అలమటిస్తున్నా.. పక్షవాతంతో బాధపడుతున్నా.. తన బాగోగులు చూస్తారన్న ఆశతో ఉన్న అర ఎకరం ఇద్దరు కొడుకుల పేర రాశాను. కాని వారు నా ఆలనా పాలన చూడటం లేదు. అన్నం పెట్టకపోవడంతో అర్ధాకలితో అలమటిస్తున్నాను. తన భూమి తనకు ఇప్పించి ఆదుకోవాలని చేగుంట మండల కేంద్రానికి చెందిన పోచమ్మల లింగమ్మ కలెక్టర్‌ను వేడుకుంది.మెదక్ కలెక్టరేట్: ప్రజావాణి అర్జీలకు తక్షణ పరిష్కారం చూపాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలపై 97 దరఖాస్తులు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య ఇతర అధికారులు పాల్గొన్నారు. ● ఇద్దరు కొడుకులకు సమానంగా ఇల్లు పంచి ఇచ్చాను. కాని పెద్ద కొడుకు, చిన్న కొడుకుకు వాటా ఇవ్వడం లేదు. అలాగే నా బాగోగులు చూడటం లేదు. అడిగిన వారిపై దాడికి పాల్పడుతున్నాడు. న్యాయం చేయాలని కోరుతూ అల్లాదుర్గం మండలం చిల్వర గ్రామానికి చెందిన వంజరి నర్సింలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ● పెద్ద కూతురు భర్త చనిపోగా, ఇంట్లో ఉంచుకొని ఆసరా కల్పించాను. ఆలనా పాలనా చూస్తుందనుకున్నాను. కాని అక్రమంగా నా రెండు ఎకరాల భూ మి రాయించుకొని ఆగం చేస్తుంది. వెన్నుపూస విరిగి తీవ్ర అనారోగ్యంతో ఉన్న నన్ను పట్టించుకోవడం లేదని శివ్వంపేట మండలం పిలుట్లకు చెందిన పెద్ద గంగమ్మ ప్రజావాణిలో కలెక్టర్‌ను కోరింది. ● తాతల తరం నుంచి కాస్తులో ఉన్న భూమిని ఆక్రమించుకుంటూ తమను బెదిరిస్తున్నారని హవేళిఘణాపూర్ మండలం తొగిట గ్రామానికి చెందిన బాధితులు వాపోయారు.కలెక్టర్ రాహుల్‌రాజ్ -
పాశమైలారంలో భారీ పేలుడు.. మరుభూమిగా ఘటనా స్థలం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఉపాధి కోసం వస్తే ఏకంగా ఉసురే తీసేసింది సిగాచీ పరిశ్రమ. సోమవారం ఈ కంపెనీలో జరిగిన విస్ఫోటనం బతుకుదెరువుకోసం వలస వచ్చిన వారి జీవితాలను బుగ్గిపాలు చేసింది. పేలుడు ధాటికి దూరంగా ఎగిరిపడ్డ కార్మికుల మృతదేహాలతో..చిధ్రమైన శరీరభాగాలతో, కూలిన శిథిలాలతో సిగాచీ మరుభూమిని తలపించింది. తమ వారి ఆచూకీ కోసం బాధితుల ఆక్రందనలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం భీతిల్లింది. ఈ పారిశ్రామికవాడలో కార్మికుల కుటుంబాలు కోల్పోతున్నా పరిశ్రమ యాజమాన్యానికి మాత్రం సాధారణమేనని తరచూ జరిగే ప్రమాదాలు నిరూపిస్తూనే ఉన్నాయి. అనుభవాలు, ప్రమాద పాఠాల నుంచి యాజమాన్యాలు, ప్రభుత్వాలు గుణపాఠం నేర్వవని మరోసారి ఈ ప్రమాదంతో రుజువైంది. సోమవారం ఉదయం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటన ఆ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది.పారిశ్రామిక వాడలో విషాదంఉదయమే తమ ఇంటి నుంచి ఉద్యోగానికి వెళ్లిన కొద్ది సేపటికే ప్రమాదం జరిగినట్లు సమాచారం తెలుసుకున్న బాధిత కార్మికుల కుటుంబసభ్యుల ఆవేదన అంతా ఇంతా కాదు. కుటుంబసభ్యుల ఆచూకీ లభించకపోవడంతో కార్మికుల కుటుంబసభ్యుల ఆక్రందనలు మిన్నంటాయి. తమ వారు ఏమయ్యారో తెలియకపోవడంతో వారు అధికారుల చుట్టూ తిరిగారు. అక్కడి నుంచి స్పందన లేకపోవడంతో కన్నీరు మున్నీరయ్యారు. దీంతో పాశమైలారం పారిశ్రామికవాడలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన బాధిత కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. కాలినగాయాలతో బాధపడుతున్న తమ ఆత్మీయులను చూసి బోరున విలపించారు. కళ్లముందే విగత జీవులుగా మారిన తమ వారిని చూసి కన్నీరు మున్నీరుగా రోదించారు. తమ వారి జాడ ఎక్కడైనా లభిస్తుందేమోనని ఎదురు చూస్తున్నారు.ఎటు చూసినా హాహాకారాలు..వారంతా రోజు మాదిరిగానే విధుల్లోకి వచ్చారు. తమ తోటి కార్మికులు, ఉద్యోగులకు శుభోదయం చెప్పుకున్నారు. అప్పుడప్పుడే ఎవరికివారు తాము పని చేసే స్థలాల్లో నిమగ్నమవుతున్నారు. ఒక్కసారిగా మృత్యువు పేలుడు రూపంలో కబళించింది. ఉన్నపళంగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. పొగ పూర్తిగా కమ్ముకోవడంతో చుట్టూ చీకటి. అగ్నికీలలకు దేహాలు ఆహుతైపోయాయి. శరీరభాగాలకు మంటలు అంటుకున్నాయి. మరికొందరి శరీరాలు మాడి మసైపోయాయి. ఎటు చూసినా హాహాకారాలు. ప్రమాదం నుంచి బయటపడేందుకు ఆర్తనాదాలు.. సిగాచీ పరిశ్రమల్లో రియాక్టర్ పేలిన ఘటనకు సంబంధించి భీతావహ వాతావరణం ఇది. ఎక్కడపడితే అక్కడ కార్మికుల శవాలు. కాలి బూడిదై.. మసైపోయిన శరీర భాగాలు. ఇలా పేలుడు జరిగిన ప్రదేశం పూర్తిగా మరుభూమిని తలపించింది.ఉపాధి కోసం వచ్చి అనంత లోకాలకు..వారంతా పొట్ట చేతబట్టుకుని వచ్చిన నిరుపేద కుటుంబాలే. ఉపాధి కోసం వందల కిలోమీటర్లు నుంచి వచ్చిన కార్మికులే అధికం. బిహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా వంటి రాష్ట్రాల నుంచి భార్యాబిడ్డలతో వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. చాలీ చాలని జీతాలున్నప్పటికీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఈ కార్మికుల కుటుంబాల్లో ఈ పేలుడు ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. పొట్ట చేతబట్టుకుని వచ్చిన తమ వారిని మృత్యువు కబళించడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఉపాధి కోసం వస్తే ఉసురే పోయిందని విలపిస్తున్నారు. ఘటన జరిగి గంటలు గడుస్తున్నా తమ వారి ఆచూకీ లభించకపోవడంతో వారు తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. -
పద్మ చావుకు కారణమెవరు?
పాపన్నపేట(మెదక్): ‘వీఓఏ ఉద్యోగం చివరకు నా ప్రాణం మీదకు తెచ్చింది. బ్యాంకు, సెర్ప్ అధికారులు, తోటి ఉద్యోగులు కలిసి నా చావుకు కారణమయ్యారు. నా అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని, నా ద్వారా డబ్బులు తీసుకున్నారు. చివరకు నన్ను దోషిగా నిలబెట్టారు. ఇంత జరిగినా ఇంకా చచ్చిపోలేదా? అన్నట్లు కొందరు నిలదీస్తుంటే ఎలా బతకాలి. అందుకే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతున్నా. కలెక్టర్ గారు నా చావుకు కారణమైన వారిని మాత్రం వదలొద్దు. విచారణ జరిపి, నిందితులను గుర్తించి, నా ఆత్మకు శాంతి కలిగించండి’ అంటూ చివరిసారి లేఖ రాసి..ఉరి తాడుకు వేలాడింది.. పొడిచన్పల్లి వీఓఏ పద్మ. కానరాని అధికారులు పొడిచన్పల్లి వీఓఏ పద్మ ఆర్థిక నిందలు భరించలేక ఆత్యహత్య చేసుకొని 5 రోజులైంది. తనపై వచి్చన ఆరోపణలపై దర్యాప్తు జరపాలని చివరి కోరిక కోరుతూ.. లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. కానీ, ఇంత వరకు ఒక్క అధికారి కూడా కనీసం వారి ఇంటికి వచ్చి పరామర్శించిన పాపాన పోలేదు. 18 ఏళ్లు సేవ చేసినా కనీసం సానుభూతి కరువైంది. చివరకు వాట్సాప్ గ్రూపుల్లో సైతం ఆమె పేరును తొలగించి, జ్ఞాపకాలు సైతం చెరిపేశారని కొందరు తోటి ఉద్యోగులు, కుటుంబ సభ్యులు వాపోతున్నారు. నిధుల గోల్‌మాల్‌లో పాత్రదారులెవరు! పొడిచన్పల్లి గ్రామ సమాఖ్య పరిధిలో కొంత కాలం నుంచి జరిగిన సుమారు రూ.85 లక్షల కుంభకోణం రెండు నెలల క్రితం బయట పడింది. ఇందులో వీఓఏ పద్మతో పాటు బ్యాంకు అధికారులు, సెర్ఫ్ ఉద్యోగులు, సహచరుల పాత్ర ఉందన్న ఆరోపణలున్నాయి. కాగా తూతూ మంత్రంగా విచారణ జరిపిన అ«ధికారులు సీసీని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారన్న విమర్శలు వస్తున్నా యి. అయితే స్త్రీనిధి నుంచి నెలనెలా వస్తున్న రుణ రికవరీల డబ్బును కొంత మంది బ్యాంకు, సెర్ఫ్ అధికారులు వాడుకొని.. వాటిని చెల్లించడానికి డ్వాక్రా సంఘాల పేరిట సభ్యులకు తెలియకుండా రుణాలు తీసుకున్నారు. వాటిని పద్మ ద్వారా మళ్లించి, స్త్రీనిధికి జమ చేశారని పద్మ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అలాగే గ్రామ సంఘం నుంచి కూడా 18 చెక్కుల ద్వారా డబ్బులు డ్రా చేయించి పద్మను బలిచేశారని వాపోతున్నారు. అసలు డ్వాక్రా రుణాలు మొదట గ్రూపు ఖాతాలోకి, తర్వాత సభ్యుల బ్యాంకు ఖాతాలోకి వెళ్లాల్సి ఉండగా, అధికారుల ప్రమేయం లేకుండా పద్మ ఎలా కాజేస్తుందని ప్రశి్నస్తున్నారు. అలాగే గ్రామ సంఘం నిధులు సైతం అధ్యక్షురాలు, కార్యదర్శి, కోశాధికారి సంతకాలు లేకుండా ఆమె ఎలా మళ్లించుకుంటుందని అడుగుతున్నారు. పద్మ మరణానికి కారకులెవరు? డ్వాక్రా సంఘాల నిధుల గోల్‌మాల్‌లో ‘తిలా పాపం తలా పిడికెడు’అన్న చందంగా బ్యాంకు, సెర్ప్, తోటి ఉద్యోగుల పాత్ర ఉందని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. నిధుల గోల్మాల్ బయట పడగానే అధికారులంతా పద్మను బాధ్యురాలిని చేస్తూ నిధుల రికవరీ కోసం ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది. మరో వైపు కొంత మంది గ్రామస్తుల అవమానకర మాటలు, సంఘ సభ్యుల శాపనార్థాలు ఆమెను కుంగదీశాయని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. తన దగ్గర లేని డబ్బులు ఎలా చెల్లించాలనే ఆందోళన ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించాయని అంటున్నారు.బాధ్యులను గుర్తించి శిక్షించాలిఅమ్మ చివరి కోరిక మేరకు డ్వాక్రా రుణాల గోల్‌మాల్‌పై పూర్తి స్థాయి నిష్పాక్షిక విచారణ జరపండి. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోండి. మాకు అప్పులు తప్ప ఆస్తులు లేవు. మా అమ్మ అన్ని డబ్బులు తీసుకుంటే మా భూములు ఎందుకు అమ్ముకుంటాం. పెంకుటింట్లో ఎందుకు నివసిస్తాం. మేము చదివింది సర్కార్ బడిలోనే. మా అమ్మ చనిపోయి 5 రోజులు అయ్యింది. కనీసం చివరి కోరికకు అనుగుణంగా అధికారులు చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరం. పోయిన మా అమ్మను తెచ్చి ఇవ్వకున్నా, పోయిన పరువును కూడగట్టుకోవాలని పరితపిస్తున్నాం. – నవీన్ రెడ్డి (మృతురాలి కొడుకు) -
15 నెలల పాలనలో కలెక్టర్ మార్క్
మెదక్ కలెక్టరేట్: అన్నిరంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పాలనలో కలెక్టర్ రాహుల్‌రాజ్ ప్రత్యేక ముద్ర వేస్తున్నారు. ప్రభు త్వ లక్ష్యం నెరవేరాలి.. సంక్షేమ పథకాలు ప్రతి నిరుపేదకు అందాలి అనే లక్ష్యంతో 15 నెలల కాలంలో 255 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతూనే.. ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలుచేస్తున్నారు. ప్లాస్టిక్‌ను అరికడుతూ.. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తున్నారు. వసతి గృహాల్లో బస చేస్తున్నారు. పంట పొలాల్లో రైతులను నేరుగా కలిసి వ్యవసాయ స్థితిగతులు తెలుసుకుంటున్నారు. వైద్యారోగ్య శాఖను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. సీసీ కెమెరాలు ద్వారా నిత్యం పర్యవేక్షిస్తున్నారు. తడి, పొడి చెత్తపై పెద్దఎత్తున అవగాహన కల్పి స్తున్నారు. ఈ– ఆఫీస్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు 1,700 ఫైల్స్‌ను ఆన్లైన్ ద్వారా పరిష్కరించారు. ప్రభుత్వ పాలనపై ఢిల్లీలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ప్రసంగించి జిల్లా కీర్తిని చాటారు. పోలీస్, ఎకై ్సజ్ అధికారులను సమ న్వయం చేస్తూ జిల్లాలో డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల నివారణకు నిరంతరం కృషి చేస్తున్నారు. ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. -
ఆర్ఆర్తో ట్రాఫిక్ సమస్యలు దూరం
నారాయణఖేడ్: రింగురోడ్డుతో ట్రాఫిక్ సమస్యలు దూరమవుతాయని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రింగురోడ్డు పనులను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణంలోని రహదారిని విస్తరించడంతో పాటు పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామన్నారు. పట్టణం చుట్టూ రోడ్ల నిర్మాణం వల్ల ట్రాఫిక్ సమస్య తీరడంతోపాటు పట్టణం విస్తీర్ణం కూడా పెరిగనుందన్నారు. పేదల సంక్షేమానికి కృషి ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషిచేస్తోందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. క్యాంపు కార్యా లయంలో నియోజకవర్గంలోని వివిధ గ్రా మాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను అందజేశారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి -
అడుగుకో గుంత.. తప్పని చింత
రామాయంపేట(మెదక్): అది అత్యంత ప్రాధాన్యత గత అంతర్ జిల్లా లింకు రోడ్డు. మెదక్– కామారెడ్డి జిల్లాలలోని పల్లెలను కలుపుతూ వెలుతున్న ఈ రహదారి పూర్తిగా అధ్వానంగా మారింది. ఫలితంగా రెండు జిల్లాల పరిధిలోని గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కేవలం 11 కిలోమీటర్ల పరిధిలో రోడ్డుపై 135 గుంతలు ప్రమాదకరంగా మారాయి. రెండుసార్లు రద్దయిన టెండర్లు మండలంలోని లక్ష్మాపూర్, కాట్రియాల, దంతేపల్లి, పలు గిరిజన తండాలను కలుపుతూ కామారెడ్డి జిల్లాకు ఈరోడ్డు అనుసంధానమైంది. ప్రతిరోజు పెద్ద సంఖ్యలో వాహనదారులు ఈ దారిలో ప్రయాణాలు సాగిస్తారు. కామారెడ్డి జిల్లాకు చెందినవారు మెదక్, సంగారెడ్డి, నర్సాపూర్, జోగిపేట, తదితర ప్రాంతాలకు వెళ్లడానికి ఇదే దగ్గరి రహదారి. రామాయంపేట మీదుగా వెళితే దూరం పెరుగుతుంది. దంతేపల్లి, కాట్రియాల, పర్వతాపూర్, లక్ష్మాపూర్, పలు గిరిజన తండాలకు చెందిన ప్రజలు కామారెడ్డి, నిజామాబాద్, ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ఈరోడ్డు మార్గం ద్వారానే వెలుతారు. ఇంతటి ప్రాధాన్యం గల ఈ రహదారి శిథిలమై మూడేళ్లు గడుస్తున్నా, అదికారులు, ప్రజాప్రతినిధులు ఎంతమాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. రామాయంపేట– మెదక్ రోడ్డును కలుపుతూ మండలంలోని లక్ష్మాపూర్, దంతేపల్లి, మీదుగా కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం ఆరేపల్లి వరకు 11 కిలోమీటర్ల మేర తారు రోడ్డు పూర్తిగా అధ్వానంగా మారింది. ఈ రహదారి బాగు కోసం గత ప్రభుత్వంలో రూ. రెండున్నర కోట్లు మంజూరు కాగా, పనులు నిర్వహించడానికి కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. ఫలితంగా టెండర్ రద్దయింది. తాజాగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్డు మరమ్మతుకు రూ. 4.24 కోట్లు మంజూరు కాగా, టెండర్ పిలిచారు. ఈసారి కూడా ఎవరూ ముందుకు రాలేదు. పూర్తిగా గుంతలమయంగా మారిన రోడ్డుపై తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి రోడ్డును పూర్తిస్థాయిలో మరమ్మతు చేయించాలని పలువురు కోరుతున్నారు. మరమ్మతులకు నోచుకోనిఅంతర్ జిల్లా లింక్ రోడ్డు 11 కిలో మీటర్ల ప్రయాణం నరకప్రాయం ఇబ్బంది పడుతున్న వాహనదారులు -
వన మహోత్సవానికి సన్నద్ధం
వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. జిల్లావ్యాప్తంగా శాఖల వారీగా ఎక్కడెక్కడ, ఏ రకాల మొక్కలు నాటాలనే విషయమై ఇప్పటికే అధికారులు అంచనాకు వచ్చారు. – మెదక్జోన్జిల్లావ్యాప్తంగా 21 మండలాల పరిధిలో 492 గ్రామాలుండగా, 471 నర్సరీలు కొనసాగుతున్నాయి. వీటిలో 52.57 లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నాయి. కాగా ఈ ఏడాది 37.10 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వాటిలో సింహభాగం డీఆర్డీఓ శాఖ పరిధిలో 25.66 లక్షలు, అటవీశాఖ ఆధ్వర్యంలో 7.20 లక్షల మొక్కలు నాటనున్నారు. మెదక్, నర్సాపూర్ మున్సిపాలిటీల్లో 90 వేల చొప్పున మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అటవీ జాతి మొక్కలే అధికం ఈ సంవత్సరం నాటే మొక్కల్లో అటవీ జాతికి చెందిన మొక్కలనే అధికంగా నాటనున్నారు. ఇందులో ప్రధానంగా గుల్మహర్, రేణి, సీతాఫల్, నలిమినార, రావి, మర్రి, మద్ది, వేట, టేకు, తదితర అటవీ జాతికి చెందిన మొక్కలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మిగితావి ఇళ్లలో పెంచుకునేందుకు కొన్నిరకాల పూల మొక్కలను సైతం సిద్ధంగాఉంచారు.శాఖల వారీగా లక్ష్యం డీఆర్డీఓ 25,66,000 అటవీ 7,20,000 వ్యవసాయ 30,000 ఉద్యాన 25,000 పరిశ్రమలు 15,000 ఇరిగేషన్ 10,000 మైనింగ్ 15,000 ఎకై ్సజ్ 40,000 డీడబ్ల్యూఓ 6,000 ఇతరశాఖలు 23,000 మెదక్ మున్సిపాలిటీ 90,000 నర్సాపూర్ 90,000 రామాయంపేట 30,000 తూప్రాన్ 50,000జిల్లాలో 24 శాతం మేర అడవులు జిల్లాలో అన్నిరకాల భూములు 6 లక్షల వరకు ఉండగా, భూ భాగానికి 33 శాతం అడవులు ఉండాలి, కానీ జిల్లాలో కేవలం 24 శాతం మేరకు మాత్రమే అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ లెక్కన ఇంకా 9 శాతం మేర అడవులు తక్కువగా ఉన్నాయి. వర్షాకాలం ప్రారంభం అయి నెల రోజులు కావొస్తున్నా జిల్లాలో ఇప్పటికీ చెప్పుకోదగ్గ వర్షాలు కురవలేదు. కాగా వానలు సమృద్ధిగా కురిసిన వెంటనే మొక్కలు నాటడం ప్రారంభిస్తామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 37.10 లక్షల మొక్కలు లక్ష్యం శాఖల వారీగా కేటాయింపు సమృద్ధిగా వర్షాలు కురవగానేప్రారంభం -
తనిఖీకి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయాలి
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల తనిఖీ కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణ కోసం డీఈఓ, డిప్యూటీ ఈఓ, ఎంఈఓ, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులను వినియోగించుకోవాలన్నారు. అవసరమైన చోట అదనపు పోస్టులను మంజూరు చేయాలన్నారు. ఉపాధ్యాయుల పర్యవేక్షణ కోసం వినియోగించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ నాయకులు, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. టైలరింగ్‌లో ఉచిత శిక్షణ సంగారెడ్డి టౌన్: సంగారెడ్డి పట్టణం బైపాస్ రోడ్డులో ఉన్న ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో మహిళలకు టైలరింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మెదక్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 19 నుంచి 45 ఏళ్ల లోపు మహిళలు అర్హులని తెలిపారు. పూర్తి వివరాలకు 9490129839 నంబర్లో సంప్రదించాలని సూచించారు. జాబ్ మేళాతో నిరుద్యోగులకు మేలు నర్సాపూర్: నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి తెలిపారు. ఆదివారం పట్టణంలో జాబ్ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. సుమారు 60 కంపెనీల ప్రతినిధులు జాబ్ మేళాలో పాల్గొన్నారని చెప్పారు. నిరుద్యోగ యువత నుంచి స్పందన బాగున్నందున అవసరాన్ని బట్టి మళ్లీ జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, నాయకులు రిజ్వాన్, మల్లేష్, మహేష్‌రెడ్డి, సురేష్, సాగర్, చిన్న అంజిగౌడ్, నగేష్, రషీద్, ఎన్ఎస్యూఐ జిల్లా అద్యక్షుడు హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. గోశాలకు గ్రాసం అందజేత శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధిలోని దొంతి గోశాలకు పలువురు దాతలు అదివారం పశుగ్రాసం అందజేశారు. గోశాలలో గ్రాసం కొరతతో ఆవులు డొక్కలు చిక్కి.. బొక్కలు తేలాయని శనివారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. అందుకు గాను పలువురు దాతులు ముందుకు వచ్చారు. నర్సాపూర్‌కు చెందిన నరేష్‌యాదవ్, ఓంకార్ యాదవ్ కుటుంబ సభ్యులు ఎండు, పచ్చి పశుగ్రాసం గోశాల నిర్వాహకులకు అందజేశారు. ముత్యాలమ్మకుబండ్ల ఊరేగింపు మెదక్ మున్సిపాలిటీ: మెదక్ పట్టణంలోని నవాబుపేట వీధిలో గ్రామ దేవతలైన గట్టమ్మ, ముత్యాలమ్మ ఆలయాల చుట్టూ ఆదివారం భక్తులు బండ్ల ఊరేగింపు నిర్వహించారు. ఏటా ఆషాఢ మాసంలో గ్రామ దేవతలకు బండ్లు, బోనాల ఊరేగింపు నిర్వహించడం అనవాయితీ. నవాబుపేట, ఫత్తేనగర్, కోలిగడ్డ, గోల్కోండ వీధి, దాయర.. తదితర వీధులకు చెందిన భక్తులు బండ్ల ఊరేగింపులో పాల్గొన్నారు. -
రేపు ఖేడ్‌లో ప్రజావేదిక
నారాయణఖేడ్: ఖేడ్ మండల పరిషత్ కార్యాలయంలో ఈనెల 30వ తేదీన ప్రజావేదిక నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. 2024 ఏప్రిల్ 1 నుంచి ఈఏడాది మార్చి 31 వరకు ఖేడ్ మండలంలో జరిగిన ఉపాధి హామీ పనులపై ఈనెల 17 నుంచి గ్రామాల్లో 15వ విడత సామాజిక తనిఖీ ప్రారంభమైందన్నారు. తనిఖీపై తుది నివేదిక ఇవ్వడానికి ప్రజావేదికను నిర్వహిస్తున్నట్లు వివరించారు. మతోన్మాదుల కుట్రలు తిప్పికొట్టాలి: సీపీఎం సంగారెడ్డి ఎడ్యుకేషన్: భారత రాజ్యాంగ ప్రవేశిక నుంచి సోషలిజం, సెక్యులర్ పదా లను తొలగించాలని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి ప్రకటించిన వైఖరి భారత రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బండా రవికుమార్ అన్నారు. శనివారం సంగారెడ్డిలోని కేవల్ కిషన్ భవన్లో నాయకత్వ రాజకీయ శిక్షణ తరగతులకు హాజరై మాట్లాడారు. భారతదేశం మత రాజ్యం కాకూడదని, అభివృద్ధి చెందిన దేశాల సరసన పోటీ పడాలని రాజ్యాంగ స్ఫూర్తి వెల్లడిస్తుందన్నారు. దేశాన్ని మత రాజ్యంగా మార్చాలని మతోన్మాద శక్తులు చేసే ప్రయత్నాలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ప్రజలందరూ తమకు నచ్చిన మతాన్ని ఆచరిస్తూనే లౌకిక భావనతో పరమత సహనాన్ని కోరుకుంటున్నారన్నారు. ప్రజల మధ్య అనైక్యతను సృష్టించి మతాన్ని రాజకీయాల్లో ఉపయోగించుకోవడం బీజేపీకి అలవాటుగా మారిందని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం, రాజయ్య, మాణిక్యం, సాయిలు, రాంచందర్, నర్సింలు, జిల్లా కమిటీ సభ్యులు ప్రవీణ్, రేవంత్, నాగేశ్వర్ రావు, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఖేడ్‌లో నవోదయ ఏర్పాటుకు కృషి
ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణఖేడ్: ఖేడ్‌లో నవోదయ విద్యాలయం ఏర్పాటు చేసేందుకు తమ వంతుగా కృషి చేస్తున్నామని ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. ఖేడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1983–84లో పదో తరగతి చదువుకున్న విద్యార్థుల మిత్ర సోషల్ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన కళావేదికను శనివారం ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆందోల్ నవోదయ విద్యాలయం కోసం మంత్రి దామోదర, తన నియోజకవర్గంలో ఏర్పాటుకు ఎంపీ రఘునందన్‌రావు ప్రయత్నిస్తున్నాడని తెలిపారు. అయినా తమ వంతుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. తామూ ఈ పాఠశాలలోనే చదువుకున్నామని, పాఠశాల అభివృద్ధికి సీఎస్ఆర్ నిధులను సమీకరిస్తామన్నారు. యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాకేష్ షెట్కార్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్ షెట్కార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రాంతీయ ఆస్పత్రిలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి అధ్యక్షతన ఆస్పత్రి అభివృద్ధి సంస్థ సమావేశం నిర్వహించారు. రూ.40 లక్షలతో అవసరమైన పరికరాలున్న కొత్త అంబులెన్స్‌ను సమకూరుస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. వెద్యుల సమస్యలు పరిష్కరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. కోటి మంజూరయ్యాయన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ సంగారెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్ రమేష్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పిల్లల చదువు బాధ్యత పెద్దలదే
సీనియర్ సివిల్ జడ్జి రుబీనా ఫాతిమా మెదక్‌జోన్: బడీడు పిల్లలను చదివించే బాధ్యత పెద్దలదేనని సీనియర్ సివిల్ జడ్జి రుబీనాఫాతిమా అన్నారు. శనివారం పట్టణంలోని న్యూ హైస్కూల్లో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొని మాట్లాడారు. పిల్లలకు చదువుకునే హక్కు ఉందని, అది తల్లిదండ్రులు బాధ్యతగా తీసుకోవాలన్నారు. బాల్య వివాహాలు, పోక్సో చట్టాలపై విద్యార్థులకు వివరించారు. 6 నుంచి 14 ఏళ్ల పిల్లలకు ఉచితంగా విద్య అందించాలని చట్టం చెబుతోందన్నారు. పిల్లలకు శారీరక, మానసిక, ఆర్థిక బాధలు రాకుండా చూడాలని, చైల్డ్ లేబర్ వంటి సమస్యలు ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉంటున్నాయని అన్నారు. చిన్నారులపై లైంగిక దాడులు, వేధింపులను అరికట్టడానికి, బాధితులకు న్యాయం కల్పించడానికి ప్రత్యేకంగా పోక్సో చట్టం కట్టుదిట్టంగా అమలులో ఉందని చెప్పారు. -
జూలై 15 వరకు విత్తుకోవచ్చు
ఏడీఏ రాంప్రసాద్టేక్మాల్(మెదక్): వర్షాభావ పరిస్థితులతో రైతులు దిగులు చెందాల్సిన అవసరం లేదని జూలై 15 వరకు విత్తనాలు విత్తుకోవచ్చని పెద్దశంకరంపేట ఏడీఏ రాంప్రసాద్ తెలిపారు. శనివారం మండలంలోని బొడ్మట్‌పల్లిలో పత్తి పంటలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముందస్తుగా కురిసిన వర్షాలకు విత్తనాలు మొలకెత్తాయని తెలిపారు. ప్రస్తుతం వర్షాలు లేక రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, విత్తుకునేందుకు ఇంకా సమయం మించిపోలేదన్నారు. నేల పూర్తిగా తడిసిన తర్వాతే విత్తనాలు వేసుకోవాలని సూచించారు. రైతులు పంటల మార్పిడి చేస్తే అధిక దిగుబడులు పొందవచ్చని అన్నారు. పంటల సాగు లో వ్యవసాయాధికారుల సలహాలు, సూచ నలు తీసుకొని సహజ ఎరువులను వాడుతూ యాజమాన్య పద్దతులు పాటించాలని వివరించారు. -
వల్లూర్‌లో ముదిరిన చేపల వివాదం
చిన్నశంకరంపేట(మెదక్): నార్సింగి మండలం వల్లూర్‌లో ఏడాదిగా చెరువులో చేపలు పట్టుకునే విషయంలో గ్రామస్తులు, ముదిరాజ్‌లకు వివాదం నడుస్తోంది. వల్లూర్ చెరువులో చేపలు పట్టేందుకు ఇతర ప్రాంతాలకు చెందిన మత్స్యకారులను డీసీఎంలో ముదిరాజ్‌లు తీసుకురావడంతో గ్రామస్తులు అడ్డుకొని పోలీస్‌లకు అప్పగించారు. గతంలో పంచాయతీ వద్ద నిర్వహించిన గ్రామసభలో అధికారులు ఇరువర్గాలతో చర్చించారు. చెరువులో చేపలు పట్టేందుకు మత్స్యశాఖ సభ్యత్వం ఉన్నవారు మాత్రమే అర్హులని తేల్చిచెప్పారు. దీనికి గ్రామస్తులు కట్టుబడి ఉంటామన్నారు. అయితే ఇతరులు వస్తే మాత్రం అడ్డుకుంటామని చెప్పారు. కాగా శనివారం డీసీఎంలో వలలతో ఇతర ప్రాంతానికి చెందిన మత్స్యకారులను చేపలు పట్టేందుకు రావడంతో గ్రామస్తులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. రామాయంపేట సీఐ వెంకటరాజగౌడ్, ఎస్ఐ అహ్మద్ మోహినొద్దీన్ ఇరువర్గాలను సముదాయించారు. ముందస్తు చర్యల్లో భాగంగా 16 మంది ముదిరాజ్‌లను బైండోవర్ చేశారు. మరోవర్గానికి చెందిన వారిని సోమవారం బైండోవర్ చేయనున్నట్లు తెలిపారు.16 మంది ముదిరాజ్‌ల బైండోవర్ -
మున్సిపాలిటీల అభివృద్ధికి చర్యలు
కలెక్టర్ రాహుల్రాజ్నర్సాపూర్: జిల్లాలోని మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం కార్యక్రమాలతో పాటు పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. శనివారం ఉదయం మున్సిపల్ అధికారులతో కలిసి పలు వార్డుల్లో పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో సానిటేషన్, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపేందుకు సిద్ధం చేసినట్లు చెప్పారు. పట్టణ ప్రజలు బాధ్యతగా మెలిగి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు తమ సిబ్బందితో భాగస్వాములు కావాలని సూచించారు. తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపాలిటీ సిబ్బందికి అందజేయాలని వ్యాపారులకు సూచించారు. పట్టణంలోని ప్రతి ఇంటి వద్దకు చెత్త సేకరించే వాహనం వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను ఆదేశించారు. నిలువ ఉన్న నీటిని ఇంటి యజమానులతో కలిసి కలెక్టర్ పారబోశారు. నర్సాపూర్‌ను ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు అందరు సహకరించాలన్నారు. అనంతరం కోమటికుంటను పరిశీలించారు. కుంట పరిసరాల్లో చెత్త పారవేయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదే శించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించి, నిబంధనల మేరకు పనులు వేగవంతం చేయాలని చెప్పారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ శ్రీరాంచరన్‌రెడ్డి, మేనేజర్ మధుసూదన్, ఆర్ఐ ఫైజల్, ఇతర అధికారులు ఉన్నారు. -
నేడు జాబ్‌మేళా
నర్సాపూర్: పట్టణంలోని సాయికృష్ణ ఫంక్షన్హాల్లో ఆదివారం జాబ్‌మేళా ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నిరుద్యోగులకు సేవ చేయాలన్న ఉద్దేశంతో జాబ్‌మేళా ఏర్పాటు చేసేందుకు ఆయా కంపెనీల ప్రతినిధులతో చర్చించామన్నారు. సుమారు 60 కంపెనీల ప్రతినిధులు జాబ్‌మేళాకు వస్తారని, 1,000 ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంటుందన్నారు. నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని ఉద్యోగాలు పొందాలని సూచించారు. మొక్కలు నాటి సంరక్షించండి సంగారెడ్డిటౌన్: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా అటవీ శాఖ అధికారి దేవిలాల్ అన్నారు. శనివారం సంగారెడ్డిలోని ఓ పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కలు నాటడంతో పాటు సంరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. అటవీశాఖ అధికారి వేణుగోపాల్, పాఠశాల సిబ్బంది వేణు పాల్గొన్నారు. బేస్‌లైన్ టెస్టులు నిర్వహించాలి జహీరాబాద్ టౌన్: విద్యార్థుల్లో అభ్యసన సా మర్థ్యాలను పరిక్షించేందుకు బేస్‌లైన్ టెస్టులు నిర్వహించాలని డీఈఓ వెంకటేశ్వర్లు ఉపాధ్యాయులను ఆదేశించారు. శనివారం మండలంలోని హుగ్గెల్లి జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను అకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు ఎలా బోధించాలి.. వారు ఏమి నేర్చుకోవాలనే దాని గురించి ఇయర్ ప్లాన్, లెసన్ ప్లాన్, టీచింగ్ డైరీ, యూనిట్ ప్లాన్ రా యాలని సూచించారు. ఐఎఫ్‌పీ ప్యానె ల్లను వాడాలని ఉపాధ్యాయులకు సూచించారు. అసంపూర్తిగా ఉన్న ప్రాథమిక పాఠశాల కిచెన్, టాయిలెట్లను పరిశీలించారు. ఆయన వెంట ఎంఈఓ మాణయ్య ఉన్నారు. పింఛన్ల మంజూరుకు చర్యలు నర్సాపూర్: అర్హులకు పింఛన్లు మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని జూనియర్ సివిల్ జడ్జి హేమలత చెప్పారు. శని వారం ఆమె పట్టణంలోని విజన్ వృద్ధాశ్రమాన్ని ఆకస్మికంగా సందర్శించారు. వృద్ధులను అప్యాయంగా పలకరించారు. ఏమైనా ఇబ్బందులుంటే చెప్పాలని కోరారు. దీంతో పలువురు తమకు పింఛన్ రావడం లేదని, ఇప్పించాలని కోరారు. అర్హులకు పింఛన్లు మంజూరు చేయించేందుకు మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వృద్ధులను ప్రేమానురాగాలతో చూసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. విద్యుత్ స్తంభాలనుపునరుద్ధరించాలి హవేళిఘణాపూర్(మెదక్): కొన్ని రోజుల క్రితం ఈదురుగాలులతో కిందపడిపోయిన విద్యుత్ స్తంభాలను సరి చేసి రైతులకు సకాలంలో విద్యుత్ సరఫరా చేసే విధంగా చూడాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మండల పరిధిలోని స్కూల్ తండా శివారులో పడిపోయిన విద్యుత్ స్తంభాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. విద్యుత్ అధికారులు స్పందించి సకాలంలో చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మేకల సాయిలు, మాజీ సర్పంచ్ యశోద, వార్డు సభ్యులు రవి, సాయి లు, యామిరెడ్డి, దాస్, గణేష్ పాల్గొన్నారు. -
ఫైర్స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు
రామాయంపేట(మెదక్): తూప్రాన్, మేడ్చల్‌లో అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని అగ్నిమాపక శాఖ రీజినల్ ఫైర్ ఆఫీసర్ సుధాకర్‌రావు తెలిపారు. శనివారం ఆయన స్థానిక ఫైర్స్టేషన్ను తనిఖీ చేసి జిల్లా అధికారి వెంకటేశ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. తన పరిధిలో 19 జిల్లాల్లో సుమారుగా 70 అగ్నిమాపక కేంద్రాలున్నాయన్నారు. ఒక్కో కేంద్రంలో 16 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. అగ్ని ప్రమాదాల విషయమై తమ సిబ్బంది గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. కొత్తగా మహదేవ్పూర్, కేసముద్రం పట్ట ణాలకు అగ్నిమాపక కేంద్రాలు మంజూరయ్యాయన్నారు. మేడ్చల్ నుంచి నిజామాబాద్ వరకు జాతీ య రహదారిపై ఎక్కడా ఫైర్‌స్టేషన్ సదుపాయం లేకపోవడంతో ఇబ్బందులు కలుగుతున్నాయ న్నారు. అంతకుముందు ఫైర్ పరికరాలను పరిశీలించి పనితీరును తెలుసుకున్నారు.రీజినల్ ఫైర్ ఆఫీసర్ సుధాకర్‌రావు -
అంగన్వాడీల్లో ఫేస్ రికగ్నైజేషన్
● జూలై 1 నుంచి అమలుకు చర్యలు ● కేంద్ర మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ మెదక్ కలెక్టరేట్: సంక్షేమ పథకాల్లో ఎక్కడా అవినీతి చోటుచేసుకోకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రతి శాఖలోనూ సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేస్తుంది. ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా లబ్ధిదారుల గుర్తింపునకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే సరుకులు తీసుకునే చిన్నారులకు ‘ఎఫ్ఆర్ఎస్’ ద్వారా సరుకులు అందిస్తున్నారు. అయితే ఆరునెలల క్రితమే ఈ విధానం ప్రారంభమైనప్పటికీ ఆధార్‌కార్డు, సాంకేతిక సమస్యల కారణంగా వందశాతం అమలుకు నోచుకోలేదు. కాగా జూలై 1వ తేదీ నుంచి వందశాతం అమలు చేసేందుకు కేంద్ర సీ్త్ర, శిశు సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఐసీడీఎస్ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం అందజేసిన సెల్ఫోన్లలో పోషణ్ ట్రాకర్ యాప్ ద్వారా ఫేస్ రికగ్నైజేషన్ పకడ్బందీగా అమలు చేయనున్నారు. అందుకనుగుణంగా యాప్‌ను ఆధునీకరించారు. త్వరలో కొత్త సెల్ఫోన్లు! ప్రస్తుతం అంగన్వాడీల్లో వినియోగిస్తున్న సెల్ఫోన్ల సామర్థ్యం తక్కువగా ఉండటంతో టీచర్లు ఇబ్బంది పడుతున్నారు. వాటి స్థానంలో అధునాతనమైన కొత్త ఫోన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. వాటిని త్వరలోనే అందజేయనున్నారు.ప్రస్తుతం చిన్నారులకే.. అంగన్వాడీ కేంద్రాల్లో ఫేస్ రికగ్నైజేషన్ ప్రక్రియ మూడేళ్లలోపు చిన్నారులకు మాత్రమే కొనసాగుతుంది. పౌష్టికాహారం, బాలామృతం, గుడ్ల పంపిణీలో పారదర్శకత కోసమే దీనిని అమలు చేస్తున్నారు. మూడేళ్లలోపు చిన్నారుల కోసం ఇంటికి ఇచ్చే పోషకాహారాన్ని తల్లి ఫొటోను సెల్ఫోన్లో స్కాన్ చేస్తారు. తల్లులు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. – హైమావతి, డీడబ్ల్యూఓ0జిల్లా వివరాలు అంగన్వాడీ కేంద్రాలు 1,076 చిన్నారులు 50,997 గర్భిణులు 5,599బాలింతలు 4,507 -
సోలార్ ప్లాంట్లతో మహిళా సాధికారత
నర్సాపూర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్వహణను మహిళా సంఘాల ప్రతినిధులకు అప్పగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని గ్రామీ ణ పేదరిక నిర్మూలన సంస్థ రాష్ట్ర చీఫ్ ఆడిటింగ్ ఆఫీసర్ కృష్ణారావు తెలిపారు. పలుశాఖల అధికారులతో కలిసి నర్సాపూర్‌లోని దేవాదాయశాఖకు చెందిన భూములను శనివారం పరిశీలించారు. సోలార్ ప్లాంట్ ఏర్పాటుతో పాటు సబ్‌స్టేషన్‌కు పవర్ సరఫరా, తదతర అంశాల గురించి ఆరా తీశారు. స్థానికంగా ఏర్పాటు చేసే సోలార్ ప్లాంట్‌ను నాలుగు గ్రామాల మహిళా సంఘాలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారని చెప్పారు. కాగా రెండు మెగావాట్ల సోలార్ విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ప్లాంటు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. ఆయన వెంట జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాస్‌రావు, నాబార్డు ఏజీఎం రామారావు, కన్సల్టెంట్ రామకృష్ణ, తెలంగాణ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ సంస్థ అధికారి రవీందర్ చౌహాన్, ఏడీఈ రమణారెడ్డి, దేవాదాయ ఈఓ శ్రీనివాస్, ఏపీఎం గౌరిశంకర్, ఏపీఓ అంజిరెడ్డి, సర్వేయర్ అభిలాష్ తదితరులు ఉన్నారు.సెర్ప్ చీఫ్ ఆడిటింగ్ ఆఫీసర్ కృష్ణారావు -
కోర్టు భవనంపై నుంచి దూకిన కుటుంబం
మెదక్‌జోన్/మెదక్ కలెక్టరేట్/మెదక్ మున్సిపాలిటీ: అత్త, భార్యపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో ఓ వ్యక్తి భార్యాపిల్లలతో కలిసి శనివారం మెదక్ జిల్లా కోర్టుకు వచ్చాడు. కేసుకు హాజరైన అనంతరం రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో కుటుంబంతో కలిసి కోర్టు భవనం మూడో అంతస్తు నుంచి దూకాడు. ఘటనలో భార్య అక్కడికక్కడే దుర్మరణం చెందగా, ఇద్దరు పిల్లలు, అతడు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన డాకొల్ల నవీన్ ఐదేళ్ల క్రితం మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన రమ్య (24)ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి మూడేళ్లలోపు ఆడపిల్లలు రుచిక, యశ్విక ఉన్నారు. గతేడాది నవీన్ తన అత్తగారిల్లు లక్ష్మాపూర్‌కు వచ్చి గొడవపడ్డాడు. ఈ క్రమంలో అత్త రాజమణి, భార్య రమ్యను చంపే ప్రయత్నం చేశాడు. ఈ కేసులో రామాయంపేటలో నవీన్‌పై హత్యాయత్నం కేసు నమోదుకాగా, జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరిలో రమ్య సైతం నవీన్‌పై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఇటీవలే లోక్‌అదాలత్‌లో ఈ కేసుపై వారిద్దరూ రాజీపడినట్లు పోలీసులు తెలిపారు. కాగా, అత్త, భార్యపై హత్యాయత్నం కేసు విషయమై శనివారం కోర్టుకు హాజరైన నవీన్.. భార్య పిల్లలతో కలిసి కోర్టు భవనంపైనుంచి దూకాడు. భార్య అక్కడికక్కడే దుర్మరణం చెందగా నవీన్, పిల్లలు గాయపడ్డారు. వీరిని హుటాహుటిన మెదక్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్‌కు తరలించారు. అదనపు ఎస్పీ మహేందర్ ఘటనాస్థలిని పరిశీలించారు. కాగా, నవీనే భార్యాపిల్లలను చంపే కుట్రలో భాగంగా భవనంపైనుంచి తోసిఉంటాడని రమ్య కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. తల్లడిల్లుతున్న చిన్నారులు.. కాగా, బాలిక రుచికకు ఎడమ చేయి మూడు చోట్ల విరిగింది. ఛాతీలోనూ తీవ్ర గాయమైంది. ఏడాది న్నర వయసున్న యశ్విక నోట్లోని పళ్లన్నీ రాలిపో యాయి. తీవ్రగాయాలతో ఉన్న ఆ చిన్నారులను చూసిన వారంతా చలించిపోతున్నారు. -
డొక్కలు చిక్కి.. బొక్కలు తేలి
దొంతి వేణుగోపాలస్వామి ఆలయం వద్ద గోశాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. దీంతో మూగజీవాలు ఆకలితో అలమటిస్తున్నాయి. వాటి సంరక్షణను పట్టించుకునే నాథులు కరువయ్యారు. గోశాలలో గ్రాసం లేకపోవడంతో కేవలం నీటితోనే ఆలమంద సరిపెట్టుకుంటుంది. ఆరు రోజులుగా గోవులను మేత కోసం బయటకు తీసుకువెళ్లకపోవడంతో బక్కచిక్కి బొక్కలు తేలాయి. దీనికి తోడు గోశాల పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. దాతలు ముందుకు వచ్చి గ్రాసం అందించడంతో పాటు గోశాల పరిరక్షణకు కృషి చేయాలని పలువురు వేడుకుంటున్నారు. పశువైద్య సిబ్బంది గోవులకు వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. – శివ్వంపేట(నర్సాపూర్) -
వన మహోత్సవ లక్ష్యం సాధించాలి
డీఆర్డీఓ శ్రీనివాసరావుచిలప్చెడ్(నర్సాపూర్): వన మహోత్సవ లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు సరైన ప్రణాళిక రూపొందించుకోవాలని డీఆర్డీఓ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని జగ్గంపేటలో ఈజీఎస్ నిధులతో నిర్మిస్తున్న పౌల్ట్రీ షెడ్డుతో పాటు నర్సరీని, రహీంగూడలో జరుగుతున్న పంట కాలువ పనులను పరిశీలించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ఈ సీజన్లో నిర్వహించే వన మహోత్సవంలో మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో తప్పనిసరిగా 5 వేల మొక్కలు నాటాలన్నారు. అర్హులైన ప్రతి ఉపాధి కూలీకి పని కల్పించాలన్నారు. ఉపాధి పనులలో ప్రతీ రోజు తప్పనిసరిగా రెండుసార్లు హాజరు తీసుకోవాలని ఆదేశించారు. కూలీలకు త్వరగా డబ్బులు ఖాతాలో జమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎల్పీఓ సాయిబాబా, ఎంపీడీఓ ఆనంద్, ఏపీఓ శ్యాం, ఇన్చార్జి ఎంపీఓ తిరుపతి, ఈసీ భగవాన్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం చిలప్‌చెడ్ ఐకేపీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికై న పదాధికారులకు నిర్వహిస్తున్న శిక్షణను పరిశీలించారు. స్వశక్తి సంఘాలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ఎదగడంతో పాటు మరికొందరికి ఉపాధి చూపించాలని వివరించారు. -
జీతం.. మహాప్రభో..
● కాంట్రాక్టు వైద్యులకు మూడు నెలలుగా వేతనాలు కరువు ● జిల్లావ్యాప్తంగా 15 మంది ఎదురుచూపు మెదక్‌జోన్: కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వర్తించే వైద్యులకు మూడు నెలలుగా వేతనాలు అందలేదు. అలాగే విధుల్లో చేరి ఏడాది గడిచినా రెన్యూవల్ చేయలేదు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు కావడంతో వైద్యుల కొరత ఏర్పడింది. దీంతో గతే డాది ఏప్రిల్‌లో 15 మంది వైద్యులను కాంట్రాక్టు పద్ధతిన విధుల్లోకి తీసుకున్నారు. ఇందులో అసోసియేట్ ప్రొఫెసర్లతో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. కాగా వీరికి ఈ ఏడాది మార్చి వరకు మాత్రమే వేతనాలు అందాయి. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన జీతం రాలేదు. అంతేకాకుండా కాంట్రాక్టు పద్ధతిన నియమించిన ఉద్యోగులను ఏడాదికోసారి రెన్యూవల్ చేయాల్సి ఉంటుంది. అయితే గడువు దాటిపోయి మూడు నెలలు అవుతున్నా పట్టించుకోవడం లేదు. కాంట్రాక్టు కాల పరిమితి ఏడాది మాత్రమే కావటంతో రెన్యూవల్ చేస్తేనే వీరు చేసిన పనిదినాలకు వేతనాలు అడిగే హక్కు ఉంటుంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి మూడు నెలల పెండింగ్ వేతనాలు ఇప్పి ంచటంతో పాటు కాంట్రాక్టు రెన్యూవల్ చేయాలని వారు కోరుతున్నారు. -
గడువులోగా సమస్యలు పరిష్కరించాలి
అదనపు కలెక్టర్ నగేష్ నర్సాపూర్ రూరల్: ప్రభుత్వం విధించిన గడువులోగా రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తులను పరిష్కరించాలని అదనపు కలెక్టర్ నగేష్ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం నర్సాపూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సుల్లో 37 వేల దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. అసైన్డ్ భూములు, సాదా బైనామాలకు సంబంధించిన అర్జీలు ఎక్కువగా వచ్చినట్లు వివరించారు. అనంతరం సిబ్బందితో భూభారతిపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్డీఓ మహిపాల్, తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ సిద్ధిరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు తరలిన క్రీడాకారులు
రామాయంపేట(మెదక్): శనివారం నుంచి నిజామాబాద్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొనడానికి ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన 18 మంది క్రీడాకారులు శుక్రవారం తరలివెళ్లారు. మూడు రోజుల పాటు పోటీలు కొనసాగనున్నాయి. క్రీడాకారులకు బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి పంజా విజయకుమార్ టీ షర్టులు అందజేశారు. వారి వెంట కోచ్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు. ఏడుపాయల హుండీ ఆదాయం రూ. 48.48 లక్షలు పాపన్నపేట(మెదక్): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా మాత ఆలయంలో హుండీలను శుక్రవారం లెక్కించగా రూ. 48,48,340 ఆదాయం వచ్చింది. ఆలయ ప్రత్యేక అధికా రిణి అంజలిదేవి, ఈఓ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సిబ్బంది, వెంకట అన్నమాచార్య సేవా సమితి సభ్యులు, గోకుల్‌షెడ్డులో కానుకలు లెక్కించారు. వెండి, బంగారం మినహా 60 రోజుల్లో భక్తుల ద్వారా ఈ ఆదాయం సమకూరినట్లు ఈఓ తెలిపారు. పశువులకు టీకాలు తప్పనిసరి చిలప్‌చెడ్(నర్సాపూర్): వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా పశువులు, జీవాలకు నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని జిల్లా పశువైద్యాధికారి వెంకటయ్య సూచించారు. మండలంలోని ఫైజాబాద్‌లో శుక్రవారం పశువైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాడి పశువుల్లో గర్భకోశ వ్యాధులు రాకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో నర్సాపూర్ ఏడీ జనార్దన్‌రావు, మండల పశువైద్యాధికారి వినోద్‌కుమార్, అల్లాదుర్గం మండల పశువైద్యాధికారి ఆంజనేయులు, సిబ్బంది, రైతు లు పాల్గొన్నారు. ఫీజు బకాయిలు వెంటనే చెల్లించండి మెదక్ కలెక్టరేట్: జిల్లాలో గత మూడేళ్లుగా బెస్ట్ అవైలబుల్ పథకం కింద విద్యార్థులకు చెల్లించాల్సిన దాదాపు రూ. 1.70 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శంకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విజయలక్ష్మిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల్లో బెస్ట్ అవైలబుల్ పథకం కింద డే స్కాలర్, రెసిడెన్షియల్లో విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. వారి ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు మానసికంగా వేధిస్తున్నాయని వాపోయారు. కార్యక్రమంలో డీబీఎఫ్ జిల్లా అధ్యక్షుడు దుబాషి సంజీవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి దయాసాగర్ తదితరులు పాల్గొన్నారు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం పెద్దశంకరంపేట(మెదక్): మండల పరిధిలోని 132/33 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఇన్చార్జి ఏఈ యాసిన్ అలీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సబ్‌స్టేషన్ పరిధిలోని ఆయా గ్రామాల ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. -
పేట అభివృద్ధికి కట్టుబడి ఉన్నా
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రామాయంపేట(మెదక్)/చిన్నశంకరంపేట: అభివృద్ధిలో రామాయంపేటను ముందుకు తీసుకెళ్తానని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హామీ ఇచ్చారు. శుక్రవారం పట్టణంలో 83 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేసి మాట్లాడారు. తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత రూ. 19 కోట్ల మేర కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసినట్లు చెప్పారు. రామాయంపేట అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొంచినట్లు చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ రజనికుమారి, పీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు, సీనియర్ నాయకులు సరాపు యాదగిరి, రమేశ్‌రెడ్డి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. అలాగే నార్సింగి మండల కేంద్రంలో శేరిపల్లి, జప్తిశివనూర్, సంకాపూర్ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలి మెదక్ కలెక్టరేట్: అన్నిశాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సూచించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లో మెదక్, రామాయంపేట మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులపై కలెక్టర్ రాహుల్‌రాజ్‌తో కలిసి సమీక్షించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు ఉపయోగపడే పనులపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. వార్డుల్లో ఇంకా ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. -
అంగన్వాడీలకు గూడు
జిల్లాకు 42 భవనాలు మంజూరురామాయంపేట(మెదక్): అంగన్వాడీ కేంద్రాల బలోపేతం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జిల్లాకు 42 కొత్త భవనాలను మంజూరు చేసింది. త్వరలో నిర్మాణాలు ప్రారంభించేలా సన్నాహాలు చేస్తుంది. రేకుల షెడ్డులు, కనీస వసతులు కరువైన గదుల్లో కొనసాగిన కేంద్రాలకు త్వరలో మంచి రోజులు రానున్నాయి. జిల్లాలో 1,076 అంగన్వాడీ కేంద్రాలు జిల్లావ్యాప్తంగా మొత్తం 1,076 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో కేవలం 369 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలుండగా, మరో 404 ప్రభుత్వ పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లలో కొనసాగుతున్నాయి. 303 కేంద్రాలను మాత్రం అద్దె భవనాల్లో నెట్టుకొస్తున్నారు. కిరాయి చాలా తక్కువగా ఇస్తుండటంతో కేంద్రాలకు ఇవ్వడానికి యజమానులు సుముఖత వ్యక్తం చేయడం లేదు. రేకులషెడ్లు, పాక్షికంగా శిథిలమైన పురాతన భవనాలను అద్దెకు తీసుకొని కేంద్రాలు నడుపుతున్నారు. వీటిలో మూత్రశాలలతో పాటు కొన్నింటిలో విద్యుత్ సరఫరా సైతం లేదు. కనీస వసతులు సైతం కరువయ్యాయి. ఈ క్రమంలో జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పలుమార్లు ప్రభుత్వానికి వినతిపత్రం అందజేయగా, ఎట్టకేలకు 42 కేంద్రాలకు కొత్త భవనాలు మంజూరయ్యాయి. త్వరలో వీటి నిర్మాణాలు ప్రారంభించనున్నారు. కొంతమేర ఇబ్బందులు తీరుతాయి జిల్లాలో 42 అంగన్వాడీలకు సొంత భవనాలు మంజూరయ్యాయి. ఈమేరకు ప్రభుత్వం నుంచి తమకు ఉత్తర్వులు అందాయి. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. వీటి నిర్మాణం పూర్తయితే కొంతమేర ఇబ్బందులు తీరుతాయి. మిగితా వాటికి సైతం సొంత భవనాల మంజూరు కోసం ప్రయత్నిస్తున్నాం. – హైమావతి, డీడబ్ల్యూఓ -
సైబర్ నేరాలపై అవగాహన అవసరం
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు మెదక్ మున్సిపాలిటీ: సైబర్ నేరాలు, మూఢ నమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ అధికారులతో నెలవారీ క్రైం రివ్యూ నిర్వహించి, కేసుల గురించి ఆరా తీశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో సైబర్ మోసాల వల్ల జరిగే నష్టాలే అధికంగా ఉన్నాయన్నారు. యువత డ్రగ్స్‌కు బానిస కాకుండా కళాబృందాల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. గ్రేవ్ కేసుల దర్యాప్తులో ఎలాంటి జాప్యం చేయొద్దని సూచించారు. సీసీ కెమెరాల పనితీరు, ఏర్పాటులో సమాజం నుంచి సహకారం తీసుకోవాలన్నారు. రౌడీషీటర్లపై నిరంతర పర్యవేక్షణ ఉంచాలని అధికారులను ఆదేశించారు. మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ మహేందర్, తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్, మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
అర్హులకు ప్రభుత్వ పథకాలు అందాలి
కలెక్టర్ రాహుల్‌రాజ్ పెద్దశంకరంపేట(మెదక్): నిరుపేదలకు ప్రభుత్వ పథకాలను అందించేలా చర్యలు తీసుకుంటున్నా మని కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. శుక్రవారం మండలంలోని కమలాపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 9 వేల ఇళ్లు మంజూరు చేశామని, ఇందులో 4,500 వరకు గ్రౌండింగ్ అయ్యాయన్నారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. ప్రభుత్వం అందిస్తున్న ఏఐ, డిజిటల్ తరగతులను వినియోగించుకోవాలని సూచించారు. బడీడు పిల్లలు వందశాతం పాఠశాలలకు వెళ్తుండటంపై గ్రామస్తులను అభినందించారు. అలాగే అధికారులు ప్రతీ శుక్రవారం పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. మలేరియా, డెంగీ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఓపెన్ ప్లాట్లు, జనావాసాల మధ్య నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. అనంతరం ప్రజలకు నీటి నిల్వపై అవగాహన కల్పించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రీనివాస్, ఇన్చార్జి ఎంపీడీఓ షాకీర్‌అలీ, ఎంపీఓ జాకీర్ హుస్సేన్, మాజీ సర్పంచ్‌లు రాములు, శ్రీనివాస్‌గౌడ్, గ్రామ కార్యదర్శి రాజుగౌడ్, హౌసింగ్ ఏఈ ప్రియ తదితరులు ఉన్నారు. -
ఎకో మిత్రం.. ఆహ్వానం
మెదక్ కలెక్టరేట్: విద్యార్థుల్లో పర్యావరణ నైపుణ్యాలు, జీవనశైలిని అభివృద్ధి పర్చేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం జాతీయ విద్యార్థుల పర్యావరణ (ఎన్ఎన్పీసీ) క్విజ్ పోటీని ‘హరిత్–ది వే ఆఫ్ లైఫ్’అనే నినాదంతో కేంద్ర విద్యాశాఖ, పర్యావరణ శాఖలు నిర్వహించనున్నాయి. సమాజంలో పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టి, తగ్గిపోతున్న వన సంపదను పెంచడంతో పాటు విద్యార్థులు బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఈనెల 24న కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆవిష్కరించారు. జూలై 1 నుంచి రిజిస్ట్రేషన్ ఈ క్విజ్ పోటీలో పాల్గొనేందుకు విద్యార్థులు, యువకులు జూలై 1 నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు ఆన్లైన్ ’ఈకో మిత్రమ్’ యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. విద్యార్థుల ఆన్లైన్ నమోదుకు ఎలాంటి ఫీజు ఉండదు. మొక్క నాటుతున్న, నీరు సేవ్ చేస్తున్న, వ్యర్థాలను వేరు చేస్తున్న సెల్ఫీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ పోటీకి కేంద్ర విద్యా, పర్యావరణ మంత్రిత్వ శాఖల సహాయ సహకారం ఉంది. ఫలితాలు ఆగస్టు 30న ప్రకటిస్తారు. ఒకటో తరగతి నుంచి పీజీ వరకు.. విద్యార్థుల్లో పర్యావరణంపై చైతన్యం కలిగించడమే లక్ష్యంగా ఈ పోటీలు కొనసాగనున్నాయి. జిల్లాకు చెందిన 1వ తరగతి నుంచి డిగ్రీ, పీజీ, పరిశోధన విద్యార్థులు, ఇతర సామాన్య పౌరులు కూడా పాల్గొనవచ్చు. వీరిని గ్రూపుల వారీగా విభజిస్తారు. పోటీలో పాల్గొన్న ప్రతీ విద్యార్థికి ఈ–సర్టిఫికెట్ లభిస్తుంది. విద్యా సంస్థలకూ ప్రత్యేక గుర్తింపు ఇవ్వబడుతుంది. హిందీ, ఇంగ్లీష్, మరిన్ని భాషలలో క్విజ్ పోటీ ఉంటుంది. పర్యావరణంపై విద్యార్థులకు క్విజ్ పోటీలు జూలై 1 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రతిభ గల వారికి ఈ–సర్టిఫికెట్ ఐదు విభాగాలలో పోటీ ఈ ఏడాది మరింత ఎక్కువ మంది విద్యార్థులను భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఐదు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తాం. పోటీలో విద్యార్థులు మొక్కలు నాటడం, చెత్త వేరు చేయడం, నీటి సంరక్షణ వంటి అంశాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – రాజిరెడ్డి, జిల్లా సైన్స్ అధికారి -
వరుస చోరీలు.. ప్రజలు బెంబేలు
నర్సాపూర్‌లో తాజాగా ఓ సిమెంట్ దుకాణంలో చోరీ నర్సాపూర్: నర్సాపూర్‌లో ఇటీవల జరుగుతున్న వరుస చోరీలు పట్టణ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. పట్టణంలో వరుసగా ఐదోరోజు కూడా మూడు చోట్ల చోరీలు జరిగాయి. పట్టణంలోని చౌరస్తా సమీపంలోని యాదాగౌడ్‌కు చెందిన శ్రీనివాస స్టీల్ అండ్ సిమెంటు దుకాణంలో బుధవారం రాత్రి దొంగలు చొరబడి కౌంటర్లో ఉన్న రూ.6 వేలు ఎత్తుకెళ్లారు. ఇక మెయిన్‌రోడ్డుపై ఉన్న హైదర్‌బేగ్ కాంప్లెక్స్‌లోని లైఫ్ కేర్ మెడికల్ హాల్ తాళం ధ్వంసం చేసి లోపలికి వెళ్లి దుకాణంలో ఉన్న రూ.4 వేలు పట్టుకుపోయారు. అదే కాంప్లెక్స్‌లో ఉన్న ఓ క్లినిక్ లోపలికి చొరబడి కౌంటర్లో ఉన్న రూ.3,900లను ఎత్తుకెళ్లారు. ఈ మేరకు ఆయా దుకాణాల యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి చోరీలు జరిగిన ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. క్లూస్ టీం సభ్యులు ఆధారాలు సేకరించారు. ఇదిలా ఉండగా పట్టణంలో వరుసగా చోరీలు జరుగుతుండటంతో రాత్రివేళల్లో పోలీసులు పెట్రోలింగ్ పెంచాలని, చోరీ ముఠాలను వెంటనే పట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు. త్వరలో పట్టుకుంటాం: సీఐ జాన్‌రెడ్డి చోరీలకు పాల్పడుతున్న దొంగలను త్వరలోనే పట్టుకుంటాం. తమ సిబ్బంది రాత్రివేళల్లో పెట్రోలింగ్ చేస్తున్నారు. ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానస్పదంగా కనిపించినా తమకు సమాచారం ఇవ్వాలి. చోరీ ఘటనల్లో ఆధారాలు సేకరించాం. పాత రికార్డులతో సరి చూస్తున్నాం, త్వరలోనే దొంగలను పట్టుకుంటామని ఆయన వివరించారు. -
మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలి
సెర్ప్ ప్రాజెక్టు మేనేజర్ వసంతసేన కౌడిపల్లి(నర్సాపూర్): మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించాలని సెర్ప్ ప్రాజెక్టు మేనేజర్ వసంతసేన తెలిపారు. గురువారం కౌడిపల్లి ఐకేపీ కార్యాలయంలో నూతనంగా ఎంపికై న పదాధికారుల శిక్షణ కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. ఇందిర మహిళ శక్తి కార్యక్రమంలో భాగంగా డ్వాక్రా సంఘాలను బలోపేతం చేయాలని కోరారు. సంఘంలోని మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. ప్రతి నెల సంఘం సమావేశం నిర్వహించుకుని రుణాల చెల్లింపుపై సమీక్షించాలని చెప్పారు. నెలసరి లెక్కలు, రిజిస్టర్లు, సంఘం లావాదేవిలు సక్రమంగా నిర్వహించుకోవాలని తెలిపారు. మహిళల అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. అనంతరం సీఆర్పీలు శోభారాణి, అనురాధ శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీఎం సంగమేశ్వర్, మండల మహిళ సమాఖ్య అధ్యక్షురాలు పుణ్యమ్మ, కార్యదర్శి లత, కోశాధికారి రాధిక, సీసీలు దుర్గయ్య, శ్రీకాంత్, రమేష్, లక్ష్మి, పురుషోత్తం, నర్సింలు పాల్గొన్నారు. -
కేజీబీవీలకు మంచి రోజులు!
కేజీబీవీ మంజూరైన నిధులు ( రూ.లక్షల్లో) రేగోడ్ 21.690 అల్లాదుర్గం 3.856 చేగుంట 3.856 చిప్పల్తుర్తి 7.712 చిట్కుల్ 23.136 కొల్చారం 2.410 మెదక్ 26.992 పాపన్నపేట 3.856 రామాయంపేట 2.410 పెద్దశంకరంపేట 28.438 చిన్నశంకరంపేట 3.856 శివ్వంపేట 26.992 టేక్మాల్ 3.856 తూప్రాన్ 3.856 వెల్ధుర్తి 2.410జిల్లాలోని 15 స్కూళ్లలో మరమ్మతులు ● మొదటి విడతగా రూ.1.65 కోట్లు మంజూరు ● అన్నీ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం జిల్లాలోని కస్తూర్బా పాఠశాలలకు మంచి రోజులొచ్చాయి. ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలు పరిష్కారం కానున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ. 1.65 కోట్లు మంజూరు చేసింది. దీంతో విద్యార్థినులకు మౌలిక వసతులు సమకూరనున్నాయి. –రామాయంపేట(మెదక్) జిల్లాలో 15 కస్తూర్బా పాఠశాలలుండగా, వీటిలో తొమ్మిది పాఠశాలల్లో ఇంటర్ వరకు తరగతులు కొనసాగుతున్నాయి. ఈస్కూళ్లలో గత ఐదారేళ్లుగా సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. ఈ విషయమై అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా నిధులు మంజూరు కాలేదు. తాజాగా ఈ స్కూళ్లలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి గాను ప్రభుత్వం మొదటి విడతగా రూ. కోటి 65 లక్షలు మంజూరు చేసింది. చేపట్టనున్న పనులు ఇవే.. జిల్లాలోని 15 స్కూళ్లలో చిన్నా, పెద్ద మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయి. వీటితో విద్యుత్ పరంగా నెలకొన్న సమస్యలు పరిష్కరించనున్నారు. పలు స్కూళ్లలో విద్యార్థులకు వేడినీరు అందించే సోలార్ యంత్రాలు చెడిపోగా, ఈ నిధులతో వాటికి మరమ్మతులు చేయించనున్నారు. అలాగే నీటి సరఫరా పైపులైన్లతో పాటు పాక్షికంగా శిథిలమైన వాటర్ ట్యాంకులు రిపేర్ చేయనున్నారు. వంట గదులు, మూత్రశాలలు, మరుగుదొడ్ల మరమ్మతులకు ఈ నిధులు కేటాయించనున్నారు. పాఠశాల ఆవరణలో పారిశుధ్య నిర్వహణతో పాటు సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయించనున్నారు. అలాగే ఇతర అత్యవసర పనులకు, మైనర్ రిపేర్లకు, డ్రైనేజీ, ప్రహరీ నిర్మాణాలకు ఈ నిధులను వినియోగించనున్నారు. 7 పాఠశాలల్లో ఇంటర్మీడియెట్ తరగతులు ప్రారంభించడంతో గతంలో నిర్మించిన మూత్రశాలలు, మరుగుదొడ్లకు అదనంగా మరికొన్ని నిర్మించనున్నారు. విద్యార్థినుల బాధలు తీరినట్లే.. జిల్లావ్యాప్తంగా అన్ని కేజీబీవీ ల్లో మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయి. వీటితో దాదాపుగా అన్ని సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఇక విద్యార్థినుల బాధలు తీరినట్లే. త్వరలో పనులు ప్రారంభించనున్నారు. – రాధాకిషన్, జిల్లా విద్యాధికారి -
క్షేత్రస్థాయిలో భూ భారతి దరఖాస్తుల పరిశీలన
మెదక్ ఆర్డీఓ రమాదేవి చిన్నశంకరంపేట(మెదక్): భూ భారతి దరఖాస్తుల పరిష్కారం కోసం అవసరమైతే క్షేత్రస్థాయిలో సర్వేయర్‌తో కలిసి పరిశీలించాలని మెదక్ ఆర్డీఓ రమాదేవి ఆదేశించారు. గురువారం చిన్నశంకరంపేట తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అధికారులతో భూ భారతి దరఖాస్తుల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు అందించిన దరఖాస్తులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలన్నారు. సమావేశంలో తహసీల్దార్ మన్నన్, ఉప తహసీల్దార్ ప్రభుదాస్, ఆర్ఐ రాజు పాల్గొన్నారు. పకడ్బందీగా వంద రోజుల ప్రణాళిక మున్సిపల్ కమిషనర్ శ్రీరాంచరణ్‌రెడ్డి నర్సాపూర్: మున్సిపల్ కమిషనర్‌గా శ్రీరాంచరణ్‌రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో వంద రోజుల ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తానని చెప్పారు. పట్టణ అభివృద్ధికి, ప్రభుత్వ పథకాలు అర్హులందరికి అందించేందుకు కృషి చేస్తానన్నారు. ఇందుకు పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. కాగా, కమిషనర్‌ను మున్సిపల్ మేనేజర్ మధుసూదన్, ఇతర సిబ్బంది శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కూలీలకు పని కల్పించడమే లక్ష్యం డీఆర్డీఏ ఏపీడీ రంగాచారి కొల్చారం(నర్సాపూర్): కూలీలకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పని కల్పించడమే లక్ష్యంగా గ్రామ క్షేత్ర సహాయకులు పనిచేయాలని, పనుల్లో పారదర్శకత తప్పనిసరని డీఆర్డీఏ ఏపీడీ రంగాచారి అన్నారు. బుధవారం ఎంపీడీఓ రఫీక్ ఉన్నీసా అధ్యక్షతన మండల పరిషత్ సమావేశ మందిరంలో 15వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం జరిగింది. మండంలోని 21 గ్రామపంచాయతీల్లో 2024 జూన్ నుంచి 2025 జూన్ వరకు పంచాయతీరాజ్, ఎన్ఆర్ఈజీఎస్, అటవీశాఖల ద్వారా రూ.4 కోట్ల 65 లక్షల పనులు జరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. పనులు జరిగే సమయంలో క్షేత్ర సహాయకులు మాస్టర్స్‌లో దిద్దుబాటు చర్యలు చేపట్టామని, ఇందుకుగాను రూ.3వేలు జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఎంపీఓ కష్ణవేణి, ఏపీఓ మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేదల సంక్షేమానికి పెద్దపీట బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్ కొల్చారం(నర్సాపూర్): పేదల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లేశం గౌడ్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని ఎనగండ్ల గ్రామంలో శక్తి కేంద్రం ఇన్చార్జి శివప్రసాద్ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు హరీష్, ఉపాధ్యక్షుడు వెంకటయాదవ్, కార్యదర్శి నాగరాజు, మాజీ ఉపాధ్యక్షులు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. నేడు డీసెట్ ధ్రువపత్రాల పరిశీలన హవేళిఘణాపూర్(మెదక్): గతంలో డీసెట్ అర్హ త సాధించి ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కాని వారి కోసం శుక్రవారం ధ్రువపత్రాలను పరిశీలించేందుకు అవకాశం కల్పించినట్లు డైట్ ప్రిన్సిపాల్, డీఈవో రాధాకిషన్ తెలిపారు. అభ్యర్థులు ఒర్జినల్ సర్టిఫికెట్లతో కళాశాలకు చేరుకొని ధ్రువపత్రాలను పరిశీలించుకోవాలని సూచించారు. అభ్యర్థులు ఎంపిక కోసం 28 నుంచి 30వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలని, జూలై 1న ఆప్షన్లకు సంబంధించి ఎడిట్ ఆప్షన్ ఉంటుందని, ఫేజ్–1లో సీటు పొంది వివిధ కళాశాలలో ప్రవేశం పొందిన వారు సైడ్లింగ్ ఆప్షన్ వినియోగించుకోవచ్చని సూచించారు.