ఎల్లలు దాటేలా ఏడుపాయల జాతర | - | Sakshi
Sakshi News home page

ఎల్లలు దాటేలా ఏడుపాయల జాతర

Jan 29 2026 8:35 AM | Updated on Jan 29 2026 8:35 AM

ఎల్లలు దాటేలా ఏడుపాయల జాతర

ఎల్లలు దాటేలా ఏడుపాయల జాతర

మాట్లాడుతున్న కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

మెదక్‌ కలెక్టరేట్‌: ఏడుపాయల వనదుర్గా మాత జాతర ఎల్లలు దాటేలా ఘనంగా నిర్వహించాలని, ఇందుకోసం రెండు రోజుల్లో ప్రణాళికా సిద్ధం చేయాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతరలో భక్తులకు ఎలా ంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, పార్కింగ్‌, విద్యుత్‌, తాగునీరు సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. జాతర పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, మరుగుదొడ్లు, చెత్త సేకరణ, దోమల నివారణకు ఫాగింగ్‌ వంటివి ఎప్పటికప్పుడు నిర్వహించాలన్నారు. రవాణా, బస్సులు, వాహనాలు, గజ ఈతగాళ్లు, అన్ని చోట్ల సీసీ కెమెరాలు, పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌, వివిధ స్టాల్స్‌, క్యూలైన్ల ఏర్పాటు చేయాలన్నారు. జాతరలో ఏ వస్తువు అయినా ఎక్కువ ధరకు అమ్మకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా కలెక్టరేట్‌లో మీడియా సెంటర్‌ను ప్రారంభించారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ ప్రకటనల కోసం మీడియో సెంటర్‌లో తప్పనిసరిగా అను మతి తీసుకోవాలని సూచించారు. అనంతరం రంజాన్‌ ఏర్పాట్లపై సమీక్షించారు. ముస్లింలు పండుగను ప్రశాంతంగా జరుపుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అదనపు ఎస్పీ మహేందర్‌, అదనపు కలెక్టర్‌ నగేశ్‌, నర్సాపూర్‌ ఆర్డీఓ మహిపాల్‌రెడ్డి, డీఎస్పీ ప్రసన్నకుమార్‌, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement