breaking news
Medak District Latest News
-
వానొస్తే గుబులే...!
శిథిలావస్థలో పెద్దాస్పత్రి ● పెచ్చులూడి.. ఉరుస్తున్న వైనం ● భయాందోళనలో వైద్యులు, రోగులు మెదక్‌జోన్: జిల్లా కేంద్రంలోని పెద్దాస్పత్రి భవనం శిథిలావస్థకు చేరింది. వర్షాలకు ఉరవటంతో తరచూ పై నుంచి పెచ్చులూడి పడుతున్నాయి. దీంతో రోగులు, వైద్యులు ఆందోళన చెందుతున్నారు. దానికి తోడు వైద్య పరికరాలు లేక పోవటం కూడా రోగులకు శాపంగా పరిణమిస్తోంది. మెదక్‌లో 35ఏళ్ల క్రితం 120 బెడ్ల ఆస్పత్రిని నిర్మించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏరియా ఆస్పత్రిని.. కాస్త జిల్లా ఆస్పత్రిగా మార్చారు. ప్రస్తుతం అది శిథిలావ్యస్థకు చేరింది. భారీ వర్షాలకు ఉరుస్తోంది. దీంతో ఆస్పత్రి అంతా తడిసి ముద్దయింది. ఆపరేషన్ థియేటర్, ఇన్‌పేషంట్లు ఉండే గదులు తప్ప అంతటా ఉరుస్తోంది. అక్కడక్కడ పెచ్చులూడి పడటంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని వైద్యులు, రోగులు ఆందోళన చెందుతున్నారు. పరికరాలు లేక అందని వైద్యం జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు కావడంతో వైద్యులతో పాటు ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెస ర్లు అందుబాటులో ఉన్నారు. కానీ పరికరాలు లేక పోవటంతో రోగులకు పూర్తి స్థాయిలో వైద్యం అందటంలేదు. ప్రస్తుతం డెంగీ వ్యాధి సోకి 14 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా, అందులో ముగ్గురికి మాత్రమే చికిత్స అందించారు. మిగతా వారిని హైదరాబాద్‌కు రెఫర్ చేశారు.ప్లేట్లెట్లు ఎక్కించాల్సి వస్తే పరికరాలు లేక గాంధీ, ఉస్మానియా తదితర ఆస్పత్రులకు పంపుతున్నారు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. గాంధీకి పంపుతున్నారు.. మెదక్‌కు చెందిన బాల మల్లయ్యకు కాలికి దెబ్బ తగిలి ఉబ్బింది పరీక్షించిన వైద్యులు.. వెంటిలె టర్‌పై ఉంచి వైద్యం చేయాల్సి ఉంది. ఆస్పత్రిలో వెంటిలెటర్ సౌకర్యం లేకపోవటంతో గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేశారు. -
నిర్లక్ష్యంతోనే చెరువులకు గండ్లు: క్రాంతి
అల్లాదుర్గం(మెదక్): ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతోనే చెరువులు, కుంటలు, కట్టుకాల్వలకు గండ్లు పడ్డాయని మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆరోపించారు. మంగళవారం అల్లాదుర్గంలో బంటికుంట చెరువుకు గండిపడటంతో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం పరిధిలో భారీ వర్షాలకు రైతుల పంటలు నీట ముని గినా, పేదల ఇళ్లు దెబ్బతిని కూలిపోయినా మంత్రి దామోదర స్పందించకపోవడం దారుణమన్నారు. నష్టపోయిన బాధితులకు వెంటనే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
పీఎస్‌హెచ్‌ఎంఏ ఉపాధ్యక్షుడిగా గాలయ్య
చిన్నశంకరంపేట(మెదక్): ప్రాథమిక పాఠశాలల ప్రాధానోపాధ్యాయుల సంఘం (పీఎస్‌హెచ్‌ఎంఏ) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చిన్నశంకరంపేట మండలం గజగట్లపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం వి.గాలయ్య ఎన్నికయ్యారు. ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంల సమస్యలపై పోరాడుతానని ఆయన చెప్పారు. తనపై నమ్మకంతో ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మురళీధర్‌గౌడ్, మురళీకి కృతజ్ఞతలు తెలిపారు. బాధితులను ఆదుకుంటాం అదనపు కలెక్టర్ నగేశ్ అల్లాదుర్గం(మెదక్): వర్షాలతో నష్టపోయిన బాధితులను ఆదుకుంటామని అదనపు కలెక్టర్ నగేశ్ భరోసా కల్పించారు. మంగళవారం అల్లాదుర్గం, చిల్వెర గ్రామాలలో ఆయన పర్యటించారు. అల్లాదుర్గంలో గండిపడిన బంటికుంట చెరువును పరిశీలించారు. రోడ్డుపై వరద ప్రవహిస్తుండటంతో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తహసీల్దార్ మల్లయ్యను అదేశించారు. అనంతరం చిల్వెర పెద్ద చెరువు కోతకు గురి కావడంతో ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ముందుస్తు జాగ్రత్తగా గండి పడకుండా మరమ్మత్తు చర్యలు చేపట్టాలన్నారు. ఆయన వెంట ఇరిగేషన్ ఈఈ రవీంద్ర కిషన్, అల్లాదుర్గం డీఈఈ సుబ్బలక్ష్మి, ఏఈ వైష్ణవి, ఎంపీడీఓ చంద్రశేఖర్, ఎంపీఓ లింగప్ప తదితరులు పాల్గొన్నారు. అప్రమత్తంగా ఉండండిజెడ్పీ సీఈఓ ఎల్లయ్య నిజాంపేట(మెదక్): భారీ వర్షాలకు చెరువులు, కుంటలు అలుగు పారడంతో ప్రమాదకరంగా ఉన్న కల్వర్టులు జెడ్పీ సీఈఓ ఎల్లయ్య పరిశీలించారు. నందిగామ సాయి చెరువు, చల్మెడ గ్రామంలోని సోమయ్య చెరువు అలుగు పారడంతో నిజాంపేట, చల్మెడ గ్రామాల మధ్య రోడ్డుకు రాకపోకలు నిచిలిపోయాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చల్మెడ , నిజాంపేట రోడ్డులో కల్వర్టులపై నుంచి వరద ప్రవహించడంతో రోడ్డును తాత్కలికంగా మూసి వేస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఎంపీడీఓ రాజిరెడ్డి, ఇన్చార్జి ఏంపీఓ వెంకట నర్సింహారెడ్డి, నగరం కార్యదర్శి ఆరిఫ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. ఫోరెన్సిక్ విభాగం మరింత బలోపేతం: ఎస్పీ మెదక్ మున్సిపాలిటీ: ఫోరెన్సిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తామని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. నేరాలను త్వరితగతిన పరిష్కరించడంలో ఫోరెన్సిక్ విభాగం ఎంతో కీలకమని చెప్పారు. మంగళవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ మొబైల్ వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యాధునిక పరికరాలతో రూపొందించిన ఈ వాహనాన్ని జిల్లా పోలీసులకు మెరుగైన సేవలందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ పాల్గొన్నారు. వేతనాలు వెంటనే చెల్లించాలి మెదక్ కలెక్టరేట్: పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని ఆశా వర్కర్స్ యూనియ న్ జిల్లా కార్యదర్శి సావిత్రి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం హవేళిఘణాపూర్ మండలంలోని సర్ధన పీహెచ్సీ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పీఆర్సీ, ఏరియర్స్, పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏఎన్ఎం జీఎన్ఎం ట్రైనింగ్ పూర్తిచేసిన ఆశావర్కర్లకు వెంటనే ఖాళీ పోస్టుల్లో ఉద్యోగాన్ని ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సరోజ, స్వప్న, సరళ, శోభ, సునీత తదితరులు పాల్గొన్నారు. -
జల దిగ్బంధంలోనే దుర్గమ్మ
పరిస్థితి సమీక్షించిన ఎస్పీ శ్రీనివాస్ రావుపాపన్నపేట(మెదక్): ఏడుపాయల వన దుర్గమ్మ ఆరో రోజు మంగళవారం జల దిగ్బంధంలోనే ఉంది. ఘనపురం ఆనకట్టపై నుంచి 54,916 క్యూసెక్కుల నీరు దిగువకు వదలడంతో మంజీరా జలాలు దుర్గమ్మ పాదాలను తాకుతూ ప్రవహిస్తున్నాయి. ఎస్పీ శ్రీనివాస్ రావు ఉదయం ఏడుపాయలకు వచ్చి వరద పరిస్థితిని సమీక్షించారు. మంజీరా నది వైపు ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సెల్ఫీల కోసం నది ప్రవాహం వైపు వెళ్లొద్దని సూచించారు. ఆయన వెంట రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్బీ సీఐ సందీప్ రెడ్డి, ఎస్సై శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. దుర్గమ్మ తల్లికి రాజగోపురంలోనే పూజలు నిర్వహించారు. ఎల్లాపూర్ వద్ద జల ప్రవాహం నిన్నటితో పోలిస్తే కొంచెం తగ్గింది. బీఆర్ఎస్ నేత పుణీత్ రెడ్డి దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట ఏడుపాయల మాజీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి ఉన్నారు. -
తక్షణమే మరమ్మతులు
● ఆర్అండ్బీ అధికారులకు కలెక్టర్ ఆదేశం ● కోతకు గురైన రోడ్డు పరిశీలన శివ్వంపేట(నర్సాపూర్): వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టేందుకు వెంటనే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. మంగళవారం మండల పరిధి పోతులబోగూడ వద్ద కోతకు గురైన వెల్దుర్తి,– ఉసిరికపల్లి ప్రధాన రోడ్డును, అలాగే.. గుండ్లపల్లిలో తెగిపోయిన కాల్వను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. పోతులబోగూడ వద్ద తెగిపోయిన రోడ్డుకు తక్షణ మరమ్మతులు చేపట్టి వాహన రాకపోకలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆర్అండ్బీ అధికారులను అదేశించారు. గుండ్లపల్లి వద్ద కట్టుకాల్వను తొలగించడంపై విచారణ జరపాలన్నారు. కాల్వకు వెంటనే మరమ్మతు చేపట్టాలని, వరదనీరు కుంటల్లోకి చేరే విధంగా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ సిబ్బందికి అదేశించారు. ఆయన వెంట ఆర్డీఓ మహిపాల్‌రెడ్డి, ఇరిగేషన్ డీఈ బుచ్చిబాబు, తహసీల్థార్ కమలాద్రి, ఎంపీడీఓ వెంకటలక్ష్మయ్య, ఆర్ఐ కిషన్, ఎంపీఓ తిరుపతిరెడ్డి, ఆర్అండ్బీ ఏఈ మహేష్, ఏఓ లావణ్య, జిల్లా రైతు సమితి గౌరవ అధ్యక్షుడు మైసయ్యయాదవ్ ఉన్నారు. అప్రమత్తంగా ఉండండి కౌడిపల్లి(నర్సాపూర్): భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. మండలంలోని తునికిలో కూలిన ఇళ్లను ఆయన పరిశీలించారు. ఖలీల్సాగర్ చెరువు, కుంటను పరిశీలించారు. మంజీర, హల్దీవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, సింగూరు నుంచి 43 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారని, దీంతో వరద పెరుగుతోందన్నారు. పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇళ్లు కూలిన వారికి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టా మని కలెక్టర్ తెలిపారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండకూడదన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ చెప్పారు.ఆయన వెంట తహసీల్దార్ కృష్ణ, ఆర్ఐ శ్రీహరి, పంచాయతీ కార్యదర్శి సౌజన్య ఉన్నారు.బస్తా యూరియా ఇవ్వలేరా..? వెల్దుర్తి(తూప్రాన్): యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఎమ్మెల్యే సునీతారెడ్డి విమర్శించారు. మంగళవారం మండల పరిధిలోని హల్దీ ప్రాజెక్టును సందర్శించి గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమృద్ధిగా వర్షాలు పడడంతో చెరువులు, కుంటల్లో జలకళ సంతరించుకుందని హర్షం వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. రోజంతా క్యూలో నిల్చున్నా ఒక్క బస్తా కూడా దొరకని పరిస్ధితి నెలకొందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచామని గుర్తు చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి రైతులకు కావాల్సిన యూరియా అందు బాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, నాయకులు నాగరాజు, శ్రీనివాస్, రమేష్‌గౌడ్, కృష్ణగౌడ్, తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి ప్రశ్న -
బుధవారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2025
భారీ వర్షాలతో జిల్లాలో రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కొన్నిచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శిథిల రోడ్లపై ప్రయాణం చేయాలంటేనే జనం జంకుతున్నారు. 25 ప్రాంతాల్లో 44 కి.మీ రోడ్డు శిథిలమవగా.. ఐదు చోట్ల 620 మీటర్ల రోడ్డు కొట్టుకుపోయింది. రోడ్లు భవనాల శాఖ అధికారులు నష్ట అంచనాల తయారీలో నిమగ్నమయ్యారు. తాత్కాలిక మరమ్మతులకు సుమారు రూ.1.63 కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ.48.93 కోట్లు అవసరం అవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. మెదక్ అర్బన్: భారీ వర్షాలతో మెతుకుసీమ వణికి పోతోంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరదల ఉధృతికి పలు చోట్ల రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. మెదక్– బొడ్మట్ రోడ్డులో బొడ్మట్‌పల్లి వద్ద 150 మీటర్ల రోడ్డు కోతకు గురైంది. నార్సింగి నుంచి శంకరంపేట వెళ్లే దారిలో 13 కి.మీ దూరంలో 200 మీటర్ల రోడ్డు ధ్వంసమైంది. కొత్తపల్లి –చింతకుంట దారిలో ఎలకుర్తి వద్ద 120 మీటర్లు, శివ్వంపేట మండలం చంది–కానుకుంట రోడ్డులో నవాబ్‌పేట వద్ద 20 మీటర్లు, పిల్లికోటాల్–చంది మార్గంలో పోతులబోగుడ వద్ద 30 మీటర్ల రోడ్డు కొట్టుకుపోయింది. టేక్మాల్ మండలం ధన్నూర, ఎలకుర్తి వద్ద రెండు చోట్ల వంతెనలు నిర్మించాల్సిన అవసరం ఉంది. గుండు వాగు ఉధృతికి ఈ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయి. పీఆర్ రోడ్ల మరమ్మతు కోసం రూ.40 లక్షలు పంచాయతీరాజ్ రోడ్ల తాత్కాలిక మరమ్మతుల కోసం సుమారు రూ.40 లక్షలతో అంచనాలు పంపి నట్లు ఈఈ నర్సింలు తెలిపారు. హవేళిఘనపూర్ మండలం ధూప్‌సింగ్ తండాకు వెళ్లే దారిలో గంగ మ్మ వాగు వంతెన రోడ్డు కోసుకుపోయి ఇబ్బంది కరంగా మారింది. రాజ్‌పేట–కొత్తపల్లి మధ్య రోడ్డు ధ్వంసమైంది. పాతూర్–మోటకాడి తండా నిర్మా ణం కోసం వేసిన కంకర ప్రయాణికుల పాలిట సమస్యగా మారింది. టేక్మాల్ మండలం సాలోజిపల్లి వంతెన, మల్కాపూర్ వంతెన శిథిలమయ్యా యి. శివ్వంసేట మండలం రాజన్నవాగు వంతెన, చిన్నగొట్టిముక్కుల చాకరిమెట్ల ఆలయం వద్ద రోడ్డు దెబ్బతిన్నది. అల్లాదుర్గం మండలం వెంకట్రావుపేట, రేగోడ్ రోడ్డులో సమస్యలు ఏర్పడ్డాయి. త్వరలో పనులు ప్రారంభిస్తాం: డీఈఈవరదలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల కోసం తక్షణ చర్యలు చేపడతామని డీఈఈ సర్ధార్ సింగ్ తెలిపారు. తక్షణ మరమ్మతుల కోసం రూ.1.63 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశాం. వెంటనే రాకపోకలు పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. భారీ వర్షాలతో వరదల ఉధృతి ఎక్కువగా ఉండటంతో రోడ్లు ధ్వంసమయ్యాయి. భారీ వర్షాలకు టేక్మాల్ మండలం చల్లపల్లి గ్రామానికి వెళ్లే ఈ రోడ్డు సగానికి కోసుకుపోయింది. తారు కొట్టుకుపోయి కంకర తేలింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ద్విచక్ర వాహనాలు మినహా ఇతర వాహనాలు వెళ్లడం లేదు. ఇది చల్లపల్లిలోనే కాదు.. జిల్లాలో చాలా చోట్ల ఇలాంటి పరిస్థితి నెలకొంది. – టేక్మాల్(మెదక్) -
పర్యావరణ హిత సంచులు
● జిల్లాకు 2.14 లక్షల సంచుల సరఫరా ● వచ్చే నెల రేషన్ కోటాతోపాటు పంపిణీ ● బియ్యం తీసుకెళ్లేలా నాణ్యతగా తయారీ 2.14 లక్షల సంచులు రామాయంపేట(మెదక్): జిల్లాలో రేషన్ వినియోగదారులకు ప్రభుత్వం పర్యావరణ హిత సంచులు అందించనుంది. ఈ మేరకు జిల్లాకు 2.14 లక్షల సంచులు మంజూరు కాగా, అధికారులు గోదాంల కు పంపించారు. రేషన్ వినియోగదారులకు సెప్టెంబర్ బియ్యం కోటాతోపాటు సంచులు ఇవ్వనున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతోపాటు అభయహస్తం చక్రంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఫొటో, పైభాగంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఫొటోలను సంచిపై ముద్రించారు. కార్డుల వారీగా సంచులను ఎంఎల్ఎస్ పాయింట్లకు సరఫరా చేశారు. లబ్ధిదారులు ఈ సంచుల్లోనే బియ్యం తీసుకెళ్లేలా నాణ్యతగా ఈ బ్యాగులను తయారు చేశారు.తెల్లకార్డు దారులకు సంచులు సెప్టెంబర్ కోటాలో భాగంగా ప్రతి వినియోగదారునికి రేషన్ డీలర్లు బియ్యంతోపాటు పర్యావరణ హిత సంచులు అందించాలి. ఈ సంచుల్లోనే బియ్యం తీసుకెళ్లాలి. ఈ సంచులు అన్ని విధాలుగా శ్రేయస్కరం. – జగదీశ్, జిల్లా పౌరసరఫరాల అధికారి జిల్లా పరిధిలో 520 రేషన్ దుకాణాలుండగా, కొత్తవాటితో కలిపి మొత్తం 2,32,579 తెల్ల కార్డులున్నాయి. ఈ కార్డులకు గాను ప్రతి నెలా 38 వేల క్వింటాళ్ల సన్నబియ్యం సరఫరా అవుతున్నాయి. జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి మూడు నెలల రేషన్ కోటాను ఒకేసారి వినియోగదారులకు అందజేశారు. గడువు ముగియడంతో సెప్టెంబర్ నుంచి నెలవారీ కోటా అందించనున్నారు. లబ్ధిదారుల వేలు ముద్రలు పోల్చుకున్న తరువాతే వారికి సంచులు, బియ్యం అందించనున్నారు. -
కాంగ్రెస్ నేతల ఇళ్లను ముట్టడిస్తాం
● యూరియా కొరత తీర్చాల్సిందే ● ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి చేగుంట(తూప్రాన్): యూరియా కొరత తీర్చకుంటే రైతులతో కలిసి కాంగ్రెస్ నేతల ఇళ్లను ముట్టడిస్తామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ నుంచి దుబ్బాక వెళ్తున్న ఎమ్మెల్యే.. చేగుంట రైతు సేవ కేంద్రం వద్ద ఆగి క్యూలైన్లో ఉన్న రైతులతో మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో సైతం యూరియా నిలువలను ఉంచామన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో మండల కేంద్రాల్లోనే యూరియా దొరకని పరిస్థితి నెలకొందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై దాదాపు రెండేళ్లు గడుస్తున్నా రైతుల కోసం చేసిందేమీ లేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం యూరియా కొరతను తీర్చాలన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్, రాజిరెడ్డి, రమేశ్, శివ, మాజీ సర్పంచ్ అశోక్ తదితరులు ఉన్నారు. ప్రభుత్వాల వైఫల్యమే కారణం మిరుదొడ్డి(దుబ్బాక): యూరియా కొరతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. యూరియా కొరత సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం అక్బర్పేట–భూంపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. సకాలంలో రైతులకు యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. -
సివిల్ తగాదాల్లో తల దూర్చొద్దు
ఎస్పీ డీవీ శ్రీనివాసరావుమెదక్మున్సిపాలిటీ: జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బంది సివిల్ తగాదాల్లో తలదూర్చితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు సివిల్ తగాదాల్లో పోలీసుల ద్వారా బాధపడిన వారు పోలీస్ కంట్రోల్ రూం 8712657888 నంబర్‌కు, లేదా తనను సంప్రదించాలని ఎస్పీ సూచించారు. అనంతరం జిల్లాస్థాయి ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. తక్షణ పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్ల ఎస్ఐ, సీఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని, పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి పైరవీలకు తావు లేకుండా పోలీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. -
ముంచెత్తిన వాన
మత్తడి దుంకుతున్న చెరువులు, కుంటలు ● పొంగిపొర్లుతున్న హల్దీ, మంజీరా ● పలు మండలాల్లో కొట్టుకుపోయిన రోడ్లు ● పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు ● నీట మునిగిన వివిధ పంటలు ● అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచన మెదక్‌జోన్: జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు ఏకధాటిగా పన్నెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది. పలు చోట్ల కుంటలకు గండ్లు పడగా, రోడ్లపై నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్– కామారెడ్డి సరిహద్దులో గల పోచారం ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. అటువైపు పర్యాటకులు వెళ్లకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. సింగూరు నుంచి దిగువకు నీరు వదటం, దానికి భారీ వర్షాలు తోడు కావడంతో మంజీరా పరవళ్లు తొక్కుతోంది. పది మండలాల్లో అతి భారీ వర్షం నమోదు కాగా, ఏడు మండలాల్లో మోస్తరుగా నమోదు అయిందని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. అత్యవసరమైతేనే బయటకు రండి టేక్మాల్(మెదక్)/వెల్దుర్తి(తూప్రాన్)/తూప్రాన్: గడిచిన 72 గంటల్లో జిల్లాలో భారీ వర్షం కురవడంతో సుమారు పది చోట్ల వంతెనలపై నుంచి వరద ప్రహిస్తుంది, అత్యవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలని ప్రజలకు కలెక్టర్ రాహుల్‌రాజ్ సూచించారు. సోమవారం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ఉప్పులింగాపూర్ బ్రి డ్జిని సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. సింగూరు, మంజీరా, హల్దీవాగు పరివాహాక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. లో లైన్ రోడ్స్, కా జ్వేలు, కల్వర్టులు, బ్రిడ్జిలు ఓవర్ ఫ్లో అవుతున్నందున, ఆయా చోట్ల ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. రానున్న 48 గంటల పాటు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ఉన్నందున ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర సమయంలో కలెక్టరేట్, పోలీస్ కంట్రోల్ రూమ్‌లకు సమాచారం ఇవ్వాలన్నారు. జిల్లాలో సుమారు 2,600 చెరువులు ఉండగా, అందులో 90 శాతం చెరువులు నిండిపోయాయన్నారు. వరద ప్రవహించే ప్రాంతాల్లో సెల్ఫీలు, చేపలు పట్టడానికి దూరంగా ఉండాలన్నారు. ఆయన వెంట వివిధశాఖల అధి కారులు ఉన్నారు. మంజీరా.. మహోగ్రం పాపన్నపేట(మెదక్): మంజీరా మహోగ్ర రూ పం దాల్చింది. సోమవారం ఘనపురం ఆనకట్టపై నుంచి 69,700 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. కలెక్టర్ రాహుల్‌రాజ్ ఎల్లాపూర్ వద్ద మంజీరా ప్రవాహాన్ని పరిశీలించారు. ఐదు రోజులుగా దుర్గమ్మ ఆలయం జల దిగ్బంధంలోనే ఉంది. రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. ఆరాతీసిన మంత్రి దామోదర బొడ్మట్‌పల్లిలో వరద నీటికి ఇళ్లలో చేరిన విషయాన్ని తెలుసుకున్న మంత్రి దామోదర రాజనర్సింహ డీపీఓ యాదయ్యతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరదనీరు రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని, అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. -
విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం
ఎమ్మెల్యే సునీతారెడ్డికౌడిపల్లి(నర్సాపూర్): విద్యార్థుల ఆరోగ్యంపై అధికారులు శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని తునికి ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నులి పురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చదువుపై శ్రద్ధ చూపుతారన్నారు. విద్యార్థులు మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ హరిబాబు, ఎంఈఓ బాలరాజు, మండల వైద్యాధికారి శ్రీకాంత్, వైద్య సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే చిత్రపటాన్ని గురుకుల పాఠశాల విద్యార్థి గీసి బహూకరించారు. -
వీరత్వానికి ప్రతీక సర్వాయి పాపన్న
మెదక్ కలెక్టరేట్: సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీక అని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. సోమ వారం కలెక్టరేట్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పాపన్నగౌడ్ జయంతి కా ర్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అన్నివర్గాలను కలుపుకొని అప్పటి నియంతృత్వ, నిరంకుశ శక్తులకు వ్యతిరేకంగా పాపన్నగౌడ్ పోరాడారని గుర్తుచేశారు. మహనీయుల స్ఫూర్తితో ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సీపీఎస్‌ను రద్దు చేయాలి మెదక్ కలెక్టరేట్: సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, సామ్యనాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లో నిర్వహించనున్న మహాధర్నా పోస్టర్‌ను సోమ వారం కలెక్టరేట్లో ఆవిష్కరించి మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ ఇవ్వాలని కోరారు. సీపీఎస్ విధానం ఉద్యోగ, ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిందన్నారు. మహాధర్నాకు జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మల్లారెడ్డి, సతీశ్‌రావు, శ్రీనివాశ్, మహేశ్ కుమార్, ఆయా మండలాల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అక్రమ నిల్వలపై కఠిన చర్యలు మెదక్ కలెక్టరేట్: జిల్లాలో యూరియా అక్రమ నిల్వలపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెనన్స్‌లో ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, డీఆర్ఓ భుజంగరావు, జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్‌తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా లోని వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న యూరియా వ్యవసాయం కోసం మాత్ర మే వినియోగించేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి హవేళిఘణాపూర్(మెదక్): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని గృహ నిర్మాణశాఖ పీడీ మాణిక్యం సూచించారు. సోమవారం మెదక్ మండలం పేరూరు లో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి మాట్లాడారు. నిరుపేదల శ్రేయస్సు కోసం ప్రభుత్వం ఇళ్లు మంజూ రు చేసిందదన్నారు. బిల్లులు వెంట వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతున్నాయని పేర్కొన్నారు. మెదక్ ఆర్టీసీ డిపో సందర్శనమెదక్ మున్సిపాలిటీ: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోను సోమవారం రాత్రి ఆర్టీసీ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కుశ్రోషా ఖాన్ స్థానిక ఆకస్మికంగా సందర్శించారు. ఈ మేరకు డిపో గ్యారేజీ, ట్రాఫిక్ సెక్షన్, బస్టాండ్లను పరిశీలించారు. ఆయన వెంట ప్రాంతీయ రీజినల్ మేనేజర్ విజయభాస్కర్, డిప్యూటీ రీజినల్ మేనేజ ర్ కృష్ణమూర్తి, సెక్రటరీ శ్రీనివాస్ ఉన్నారు. -
లక్షణంగా ఇందిరమ్మ ఇళ్లు
రామాయంపేట(మెదక్): ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనా.. నిర్మాణ పనులు ప్రారంభించేందుకు డబ్బు లు లేక పలువురు లబ్ధిదారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గడువు సమీపిస్తున్నా, ఇప్పటివరకు పనులు షురూ చేయలేదు. ఈ మేరకు వారిని ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా స్వయం సహాయక గ్రూపుల్లో సభ్యులుగా ఉండి, ఆర్థికంగా వెనుకబడిన లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించాలని చర్యలు చేపట్టింది. జిల్లాకు మొదటి విడతగా ప్రభుత్వం 9,125 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. పూరి గుడిసెల్లో నివాసం ఉంటున్న లబ్ధిదారులను గుర్తించి ప్రాధాన్యం ఇచ్చింది. వారికి నాలుగు విడతల్లో రూ. ఐదు లక్షలు అందించాలని నిర్ణయించింది. ఆర్థికంగా ఉన్న వారు ఇళ్ల నిర్మాణం ప్రారంభించగా, నిరుపేద లబ్ధిదారులు మాత్రం ఇంకా పనులు ప్రారంభించలేదు. ఇలాంటి వారు జిల్లావ్యాప్తంగా 3,600కు పైగానే ఉన్నారు. వీరికి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అండగా నిలుస్తుంది. లబ్ధిదారులు మహిళా గ్రూపుల్లో సభ్యులుగా ఉండి, కనీసం ఆరు నెలలుగా పొదుపు చేస్తున్న వారై ఉండాలని పేర్కొంది. వారిని గుర్తించడానికి మండలాల వారీగా అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. తాము గుర్తించిన లబ్ధిదారులకు రూ. లక్ష నుంచి రూ. రెండు లక్షల వరకు గ్రామ సమాఖ్యల ద్వారా రుణం ఇప్పించడానికి కృషి చేస్తున్నారు. వివరాల సేకరణలో అధికారులు గ్రామాల్లో కొనసాగుతున్న ఇందిమ్మ ఇళ్ల నిర్మాణంతో పాటు, ఇంకా పనులు ప్రారంభించని లబ్ధిదారులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఉన్నతాధికారులు మొదలుకొని గ్రామస్థాయి అధికారులు ప్రతి రోజూ ఇళ్ల నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ మేరకు వారు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సూచిస్తున్నారు. ఈ మేరకు నిర్మాణాలు ప్రారంభించని వారి జాబితా రూపొందిస్తున్నారు. ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించని వారికి డ్వాక్రా రుణం జిల్లా వివరాలు మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు 9,125 పనులు ప్రారంభించినవి 5,500 ప్రారంభం కానివి 3,625 బేస్మెంట్, గోడల వరకు పూర్తయినవి 1,700 వివరాలు సేకరిస్తున్నాం జిల్లావ్యాప్తంగా 3,500కు పైగా లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించలేదు. వారికి అవగాహన కల్పిస్తున్నాం. నిరుపేద స్థితిలో ఉన్న లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. వారు ఖచ్చితంగా మహిళా గ్రూపులో సభ్యురాలై ఉంటే రుణం కోసం వారి వివరాలను డీఆర్డీఓ అధికారులకు పంపిస్తాం. – మాణిక్యం, పీడీ, గృహ నిర్మాణశాఖ -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
అదనపు కలెక్టర్ నగేశ్చిలప్చెడ్(నర్సాపూర్)/కొల్చారం: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. మండల పరిధిలోని చిట్కుల్ శివారులో పాత వంతెనపై పొంగిపొర్లుతున్న మంజీరా ప్రవాహాన్ని, బద్రియా తండాలో తెగిపోయిన పోతాన్కుంట కట్టను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన చర్యలు చేపట్టాలన్నారు. కురుస్తున్న వర్షాలకు కట్టలు తెగడం, చెరువులకు గండ్లు పడడంలాంటివి జరిగితే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట జిల్లా పౌరసరఫరాల అధికారి నిత్యానంద్, తహసీల్దార్ సహదేవ్, ఎంపీడీఓ ప్రశాంత్, ఇరిగేషన్ ఏఈ హరీశ్‌రెడ్డి, ఎస్ఐ నర్సింహులు, అర్ఐ సునీల్‌సింగ్ తదితరులు ఉన్నారు. అలాగే కొల్చారం మండలంలోని సంగాయిపేట గ్రామ పెద్ద చెరువు అలుగును పరిశీలించారు. రైతులతో కలిసి గంగమ్మకు కొబ్బరికాయ కొట్టి పూజలు నిర్వహించారు. -
రైతు బీమాకు 7,100 మంది
మెదక్ కలెక్టరేట్: అన్నదాత అకాల మృత్యువాత పడితే ఆ కుటుంబం రోడ్డున పడకూడదని గత ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లాలో ఎంతో మంది రైతు కుటుంబాలను ఆదుకుంది. అయితే గతంలో రైతుబీమా నమోదు చేసుకోని వారే కాకుండా, ఇటీవల కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందిన వారికి కూడా అవకాశం కల్పించింది. ఇందుకోసం ఈనెల 14వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించింది. జిల్లాలో ఇటీవల కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందిన 12,145 మంది రైతులు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. దీంతో వ్యవసాయ అధికారులు గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించారు. దీంతో రైతులు సైతం ముందుకొచ్చారు. నిరాక్షరాస్యులైన రైతుల వివరాలు సేకరించి అధికారులే ఆన్లైన్ చేయించారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 7,100 మంది రైతులు బీమాకు నమోదు చేసుకున్నారు. కాగా ఈ పథకానికి ప్రభుత్వమే రైతుల తరఫున ప్రీమియం చెల్లిస్తుంది. రైతు అకాల మృత్యువాత పడితే వారి నామినీ అకౌంట్లో రూ. 5 లక్షలు జమవుతాయి. అయితే కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందిన మరికొంత మంది రైతులు అందుబాటులో లేక నమోదు చేసుకోలేకపోయారు. అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో ఉన్నవారు, ఇతరత్ర కారణాలతో కొంతమంది నమోదుకు ముందుకు రాలేదు. అయితే ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న ఆస్తి హత్యలకు భయపడి కొంతమంది నామినీ పెట్టడం ఇష్టం లేక నమోదు చేసుకోలేదని తెలిసింది. అత్యధికంగా పట్టణాల్లో నివసించేవారు, బడా రైతులు నమోదు చేసుకోనట్లు సమాచారం. -
భూముల రీ సర్వే చేయాలి
కొల్చారం(నర్సాపూర్): నియోజకవర్గంలో ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపుతో ముంపునకు గురవుతున్న నదీ పరివాహాక భూముల రీ సర్వే చేపట్టి, మార్కెట్ రేటు ప్రకారం రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఘనపురం ఆనకట్టను సందర్శించి, గంగమ్మకు పూజలు నిర్వహించారు. అనంతరం దుర్గామాతను దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆనకట్ట ఎత్తు పెంచడం ద్వారా నీటి సామర్థ్యం పెరిగి రైతులకు మరింత లాభం చేకూరుతుందని గత ప్రభు త్వం నిర్ణయం తీసుకుందన్నారు. అయితే ము ంపునకు గురవుతున్న ప్రాంతాల విషయంలో గతంలో చేపట్టిన సర్వే పూర్తిస్థాయిలో జరగలేదన్నారు. ప్రస్తుతం ఆనకట్టకు వస్తున్న నీటి ప్రవాహాన్ని పరిగణలోకి తీసుకొని రీ సర్వే చేపట్టాలన్నారు. కార్యక్రమంలో మెదక్ మాజీ సీడీసీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు, యాదయ్య, యాదాగౌడ్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్గుప్తా, నాయకులు పాల్గొన్నారు.నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి -
కొత్త కార్డుదారులకు రేషన్
సెప్టెంబర్ 1 నుంచి పంపిణీమెదక్ కలెక్టరేట్: కొత్త రేషన్ కార్డుదారులతో పాటు, పాత కార్డుదారులకు సెప్టెంబర్ 1 నుంచి ప్రజా పంపిణీ కేంద్రాల ద్వారా సన్నబియ్యం పంపిణీకి పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. వర్షాకాలంలో పేదలు వరదలు, వర్షాల వల్ల రేషన్ తీసుకోవడం ఇబ్బందికరంగా ఉంటుందని భావించిన కేంద్రం జూన్ నెలలో ఒకేసారి మూడు నెలల బియ్యం కోటాను పంపిణీ చేయాలని నిర్ణయించి జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన సరుకులను అందజేసింది. సెప్టెంబర్ నుంచి తిరిగి నెలవారీ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సెప్టెంబర్ నెల కోటా సన్న బియ్యం రాష్ట్రస్థాయి గోడౌన్స్ (స్టేజ్–1) నుంచి మండల లెవల్ స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్లకు పంపించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. సోమవారం నుంచి ఈ ప్రక్రియను ముమ్మరం చేయనున్నారు. కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారందరికీ సెప్టెంబర్‌లో సన్నబియ్యం పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికార యంత్రాంగానికి ఇప్పటికే ఆదేశాలను జారీ చేశారు. ఈ లెక్కన జిల్లాలో మొత్తం 520 చౌక ధరల దుకాణాల ద్వారా 2,16,000 కార్డుదారులకు ఆహార భద్రతా పథకం కింద ఉచితంగా 4,850 మెట్రిక్ టన్నుల బియ్యం అందజేయనున్నారు. కాగా, ఇందులో కొత్తగా జిల్లాలో 16,000 మంది కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయి. బియ్యంతో పాటు చేతిసంచి తెల్ల రేషన్ కార్డుదారులకు ఉచితంగా రేషన్‌తోపాటు ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన పర్యావరణహితమైన చేతి సంచిని ప్రభుత్వం అందజేయనుంది. తెల్లటి రంగులో ఉన్న ఈ బ్యాగుపైన సీఎం, డిప్యూటీ సీఎం, పౌరసరఫరాల శాఖ మంత్రి ఫొటోలు ముద్రించి మధ్యలో ఇందిరమ్మ అభయహస్తం పేరుతో ఆరు గ్యారంటీలకు సంబంధించిన వివరాలతోపాటును చేతిసంచిపై ముద్రించారు. బస్తాపై ‘అందరికీ సన్న బియ్యం ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం’ అనే నినాదం ముద్రించారు. రూ.50 విలువ చేసే ఈ బ్యాగును ఉచితంగానే సన్నబియ్యంతోపాటు అందజేస్తారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం కోసం పర్యావరణహితంగా తయారు చేసిన ఈ బ్యాగును అందజేయనున్నారు. కాగా, బియ్యంతో పాటు అప్పట్లో ఇచ్చిన తరహాలో కందిపప్పు, చింతపండు, ఉప్పు, నూనె, పసుపు, గోధుమలు, చక్కెర తదితర సరుకునులను సైతం అందించాలని ప్రజలు కోరుతున్నారు. -
మండపాల వివరాలు నమోదు చేసుకోవాలి
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు మెదక్ మున్సిపాలిటీ: జిల్లాలో వినాయక మండపాలు, విగ్రహాల వివరాలను పోలీస్‌శాఖ ఆన్లైన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు నిర్వాహకులకు సూచించారు. రానున్న గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం పూర్తిగా సంసిద్ధమై ఉందన్నారు. వినాయక చవితి మొదలు, నిమజ్జన తేదీ, సమయం, ప్రయాణించే దారి, మండప ప్రదేశం తదితర వివరాలను పొందుపరచాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ఉత్సవ కమిటీ సభ్యులు కృషి చేయాలని, మట్టి విగ్రహాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఎలాంటి అత్యవసర సమయంలోనైనా జిల్లా పోలీస్ యంత్రాంగం అందుబాటులో ఉంటుందని, వెంటనే డయల్ 100లో సంప్రదించాలని సూచించారు. బ్రిడ్జిని వెంటనే నిర్మించాలి మెదక్ కలెక్టరేట్: హవేళిఘణాపూర్ మండలంలోని ధూప్‌సింగ్ తండా వద్ద ఇటీవల కురిసిన వర్షాలతో తెగిపోయిన బ్రిడ్జిని వెంటనే నిర్మించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం బ్రిడ్జి వద్ద నిరసన తెలిపి మా ట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే పద్మారెడ్డి కేవలం పరిశీలనకే పరిమితం అ య్యారని విమర్శించారు. ఇప్పటికై నా ప్రభుత్వ అధికారులు పట్టించుకొని వెంటనే బ్రిడ్జి నిర్మా ణం చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, మండల అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్య దర్శి రంజిత్‌రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కంట్రోల్ రూమ్ ద్వారా సహాయక చర్యలు మెదక్ కలెక్టరేట్: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టరేట్లోని ఫ్లడ్ కంట్రోల్ రూం ద్వారా ప్రజలకు సహాయక చర్యలు అందిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. ఆదివారం రాత్రి కలెక్టరేట్లోని కంట్రోల్ రూంను సందర్శించారు. ఈసందర్భంగా ఫిర్యాదుల రిజిస్టర్‌ను తనిఖీ చేసి సిబ్బందికి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రజలకు సహాయం అందించడానికి, అత్యవసర పరిస్థితిని ఎదుర్కొవడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. వరదలు వచ్చినప్పుడు, వచ్చే అవకాశం ఉన్నప్పుడు చేపట్టే నియంత్రణ చర్యల కోసమే కంట్రోల్ రూమ్ సహాయపడుతుందన్నారు. రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలిమంత్రి దామోదర రాజనర్సింహ సంగారెడ్డి జోన్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. సంగారెడ్డిలోని మంత్రి నివాసంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...అందోల్ ని యోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా సుమారు రూ.44కోట్ల నిధులతో నూ తన రహదారుల నిర్మాణంతోపాటు రోడ్ల మరమ్మతు పనులు చేపట్టామన్నారు. అదేవిధంగా హెల్త్ సబ్ సెంటర్లు నిర్మాణం, గ్రామ పంచాయతీ, అంగన్వాడీ భవనం తదితర అభివృద్ధి పనుల్లో వేగం పెంచి పూర్తి చేయాలని ఆదేశించారు. సమీక్షలో పంచాయతీరాజ్ శాఖ ఎస్.ఈ జగదీశ్వర్, ఈఈ అంజయ్య, తదితరులు పాల్గొన్నారు. పోస్టర్ ఆవిష్కరణజహీరాబాద్ టౌన్: సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 1 హైదరాబాద్‌లో పీఆర్టీయూ నిర్వహించతలపెట్టిన మహాధర్నా పోస్టర్‌ను ఎమ్మార్పీస్ కార్యాలయం వద్ద ఆదివారం ఆ సంఘం నాయకులు ఆవిష్కరించారు. -
గంగమ్మ ఒడిలో దుర్గమ్మ
● పరవళ్లు తొక్కుతున్న మంజీరా ● సింగూరు ఇన్‌ఫ్లో 32,766 క్యూసెక్కులు ● అవుట్ ఫ్లో 43,634 క్యూసెక్కులు ● పెరిగిన పర్యాటకుల తాకిడిపాపన్నపేట(మెదక్): దుర్గమ్మ ఆలయం నాలుగు రోజులుగా గంగమ్మ ఒడిలోనే కొనసాగుతోంది. ఆదివారం సింగూరు నుంచి విడుదల చేసిన నీటి ప్రవాహం పెరగడంతో, మంజీరా పరవళ్లు తొక్కుతూ ఘనపురం ఆనకట్టపై నుంచి పొంగిపొర్లుతోంది. ఏడుపాయల్లో జలకళ ఉట్టి పడుతుండటంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సింగూరు ప్రాజెక్టులోకి 32,766 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తుండగా, ఇరిగేషన్ అధికారులు 43,634 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు భద్రతపై డ్యాం సేఫ్టీ కమిటీ ఇచ్చిన సూచనల మేరకు 520.5 మీటర్ల నీటి మట్టాన్ని దృష్టిలో ఉంచుకొని, నీటిని విడుదల చేస్తున్నారు. ఏడుపాయల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ తన బలగాలతో అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, గజ ఈతగాళ్లు, రెవెన్యూ, ఇరిగేషన్ సిబ్బంది స్థానికంగా ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు రాజగోపురంలోని దుర్గామాత ఉత్సవ విగ్రహాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జలకళను ఆస్వాదిస్తూ సాయంత్రం వరకు ఆనందంగా గడిపారు. -
ఇంకుడు గుంతలు మరిచారు
ఆసక్తి చూపని పట్టణ ప్రజలు● పట్టించుకోని అధికారులు ● పేట మున్సిపాలిటీలో దుస్థితిరామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 5,500 వరకు నివాస గృహాలున్నాయి. గతంలో నిర్మించిన, కొత్తగా నిర్మిస్తున్న గృహాల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వంద రోజుల ప్రణాళికలో సైతం ఈ అంశాన్ని చేర్చింది. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంత నిర్మించుకునేలా చర్యలు తీసుకో వాలని రాష్ట్ర పురపాలికశాఖ ఆదేశించింది. పట్టణంలో పెద్ద ఎత్తున గృహాల నిర్మాణ పనులు కొనసాగుతున్నా.. ఏ ఇంటి వద్ద ఇంకుడు గుంత కనబడటం లేదు. వుున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో అధికారులు సర్వే నిర్వహించి ఇంకుడు గుంతలు లేని నివాసాలను గుర్తించి నమోదు చేసుకున్నారు. వాటిని నిర్మించుకోని వారికి నోటీసులు ఇవ్వాలని అధికారులు జారీ చేసిన ఉత్తర్వులు కాగితాలకే పరిమితం అయ్యాయి. ఇంకుడు గుంత తప్పనిసరని, ఇంటి నిర్మాణానికి ముందు ఇచ్చే అనుమతిలో నమోదు చేసి ఉన్నా, ఎవరూ పట్టించుకోడం లేదు. గుంత నిర్మించుకోకపోతే నల్లా కనెక్షన్ తొలగించాలని ఉత్తర్వులో స్పష్టం చేశారు. వృథా అవుతున్న వర్షం నీరు వరుణుడు కరుణించినా.. వాన చుక్క భూమిలోకి ఇంకే పరిస్థితి కనిపించడం లేదు. భారీ వర్షాలు కురిసినా.. వేసవిలో సాగు, తాగునీటికి తిప్పలు తప్పడం లేదు. వర్షం నీటిని భూగర్భంలోకి ఇంకించేందుకు అవసరమైన ఇంకుడు గుంతలు తగినన్నీ లేకపోవడంతో భూగర్భ జలమట్టాలు ఆశించిన మేర పెరగడం లేదని భూగర్భ జల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విధిగా నిర్మించుకోవాలి ప్రతి ఇంటి వద్ద విధిగా ఇంకుడు గుంత నిర్మించుకోవాలి. ఇందుకు కేవలం రూ. నాలుగు వేల లోపే ఖర్చవుతుంది. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వు లు జారీ చేసింది. వీటితో ఎన్నో లాభాలున్నాయి. భవిష్యత్తులో నీటి ఎద్దడి సమస్య తలెత్తదు. – దేవరాజ్, టీపీఓ, రామాయంపేట మున్సిపాలిటీఉపయోగాలు.. ఇంకుడు గుంతలతో భూమిలో నీటి మట్టం పెరుగుతుంది. ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది. వర్షం నీరు ఇంకుడు గుంతల్లోకి మళ్లిస్తే రోడ్డుపై వరద నిలువదు. కాలుష్య నివారణతో పాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడతాయి. గుంతల్లో నీరు నిల్వ లేకుంటే దోమల బెడదను అరికట్టవచ్చు.ఇంటికో ఇంకుడు గుంత నినాదం ఆచరణలో చతికిలపడింది. ప్రతి ఇంటి వద్ద విధిగా నిర్మించుకోవాలనే ఆదేశాలు బేఖాతరవుతున్నాయి. వాన నీటిని ఒడిసి పట్టి భూమి లోపలికి పంపి భూగర్భజలాలు పెంపొందించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుండగా, అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారే ఆరోపణలు ఉన్నాయి. – రామాయంపేట (మెదక్) -
భయపడాల్సిన అవసరం లేదు
పాపన్నపేట(మెదక్)/టేక్మాల్: సింగూరు నుంచి లక్ష క్యూసెక్కుల నీరు వచ్చినా ఇబ్బంది లేదని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. ఆదివారం సాయంత్రం మండలంలోని ఎల్లాపూర్ బ్రిడ్జి వద్ద మంజీరా ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. ప్రస్తుతం 50 వేల క్యూసెక్కుల ఫ్లో సింగూరు నుంచి వస్తుందని, లక్ష క్యూసెక్కుల వరకు పెరిగినా భయపడాల్సిన అవసరం లేదన్నారు. వరద ఉధృతికి అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే టేక్మాల్ మండలంలోని పెద్ద చెరువు అలు గు, మండలం మీదుగా పారుతున్న గుండువాగును పరిశీలించారు. ముంపు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ రాకపోకలు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. రోడ్ల మీద నీరు పూర్తిస్థాయిలో తగ్గే వరకూ ప్రజలు బయటకు రావొద్దని, సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని కోరారు. ఆయన వెంట ఇరిగేషన్, ఇతరశాఖల అధికారులు ఉన్నారు. లక్ష క్యూసెక్కులు వచ్చినా ఇబ్బంది లేదు కలెక్టర్ రాహుల్‌రాజ్ -
తైబజార్.. జులుం
మెదక్‌జోన్: మెదక్ మున్సిపాలిటీ పరిధిలో కూరగాయల మార్కెట్ కొనసాగుతోంది. ఇటీవల తైబజార్‌ను మున్సిపల్ అధికారులు 8 నెలల కోసం వేలం వేయటంతో ఓ వ్యక్తి సుమారు రూ. 8 లక్షల పైచిలుకు టెండర్ పాడి దక్కించుకున్నాడు. ఈ మార్కెట్లో నిత్యం వందలాది మంది రైతులు, చిరు వ్యాపారులు కూరగాయలు విక్రయిస్తారు. వీరితో పాటు మార్కెట్‌కు వచ్చే లారీలు, కూరగాయల లోడ్లతో పాటు ఇతర సామగ్రి వచ్చినా తైబజార్ నిర్వాహకులు వసూళ్లు చేస్తున్నారు. కాగా దేనికెంత వసూలు చేయాలనే బోర్డులు మార్కెట్లో ఎక్కడా కనిపించడం లేదు. రైతుల నుంచి రూ. 20 నుంచి రూ. 30 వరకు వసూలు చేయాల్సి ఉండగా, అంతకు మించి వసూలు చేస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.అర్ధంతరంగా ఆగిన రైతు బజార్ నిర్మాణంరైతుబజార్ నిర్మాణం ఎప్పుడో..?రైతులు పండించిన ఉత్పత్తులు నేరుగా విక్రయించుకునేందుకు మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 2017లో మెదక్ కూరగాయల మార్కెట్ సమీపంలో రైతుబజార్ నిర్మాణం చేపట్టారు. 48 షాపుల విస్తీర్ణంతో చేపట్టిన భవన నిర్మాణానికి రెండు విడతల్లో ఇప్పటివరకు రూ. 6.86 కోట్లు విడుదలయ్యాయి. అయితే ఆ నిధులతో పూర్తిస్థాయిలో నిర్మాణం కాలేదు. మరుగుదొ డ్లు, లిఫ్ట్, విద్యుత్ సౌకర్యంతో పాటు తదితర వాటి కోసం మరో రూ. 1.30 కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇది పూర్తయితే 200 మంది రైతులు, చిరువ్యాపారులు పంట ఉత్పత్తులను విక్రయించుకునే అవకాశం ఉంది. కాగా రైతుబజార్ నిర్మాణం ప్రారంభమై 8 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇది పూర్తయితే రైతులు ఎలాంటి తైబజార్ చెల్లింపులు లేకుండా ఉచితంగా విక్రయించుకునే వీలు ఉంటుంది. మార్కె ట్‌కు జిల్లాలోని 8 మండలాల నుంచి రైతులు, కూరగాయలు తెస్తుంటారు. వారికి తోడు చిరు వ్యాపారులు సైతం స్థలం రోడ్లపైనే అమ్మకాలు చేస్తున్నారు. దీంతో తరచూ ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. వర్షం వస్తే అవస్థలు పడుతున్నారు.చర్యలు తీసుకుంటాం నిబంధనల ప్రకారం మాత్రమే తైబజార్ వసూలు చేయాలి. దౌర్జన్యం చేస్తే చర్యలు తప్పవు. దేనికి ఎంత వసూలు చేయాలనే బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించాం. త్వరలో ఏర్పాటు చేయిస్తాం. – శ్రీనివాస్‌రెడ్డి, మెదక్ మున్సిపల్ కమిషనర్మార్కెట్ నిర్వాహకుల రెట్టింపు వసూళ్లు పట్టించుకోని అధికారులు ఆందోళనలో రైతులు, చిరు వ్యాపారులు -
మోక్షమెప్పుడో..?
మెదక్‌జోన్: భూ భారతి దరఖాస్తుల పరిష్కారం జిల్లాలో ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. ఆగస్టు 15 వరకు పరిష్కరించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినా, క్షేత్రస్థాయిలో అమలు కాలేదు. జిల్లావ్యాప్తంగా జూన్ 3 నుంచి 20 వరకు నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో రైతుల నుంచి అధికారులు 38 వేల దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో ఇప్పటివరకు కేవలం 2 వేలు మాత్రమే పరిష్కరించారు. ఈ లెక్కన ఇంకా 36 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మిగితా వాటిని ఎప్పుడు పరిష్కరిస్తామనేది అధికారులు ఇప్పటివరకు స్పష్టత ఇవ్వడం లేదు. మిస్సింగ్ సర్వే నంబర్లే అధికం జిల్లాలో భూ సమస్యలకు సంబంధించి మొత్తం 38 వేల దరఖాస్తులు రాగా, అందులో అత్యధికంగా మిస్సింగ్ సర్వే నంబర్లకు సంబంధించినవే 10 వేల దరఖాస్తులు వచ్చాయని రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములకు సంబంధించినవి 7 వేలు, సాధా బైనామాలు 6,500, ఫౌతి (మ్యుటేషన్లు) 2 వేలు రాగా, పేర్లు, ఖాతా నంబర్లో తప్పులు, పొజిషన్లు, ఇనాం భూములు తదితర వాటికి సంబంధించి మరో 12,500 వరకు దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత జిల్లాలో క్షేత్రస్థాయి సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రభుత్వం జీపీఓలను నియమిస్తామని చెప్పింది. గతంలో వీఆర్ఓలుగా విధులు నిర్వర్తించిన వారికి రెండు సార్లు పరీక్షలు నిర్వహించినా, కేవలం 120 మంది మాత్రమే హాజరయ్యారు. అలాగే పరీక్షల్లో 99 మంది ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో 492 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో భూములు సర్వే చేసేందుకు లైసెన్స్డ్ సర్వేయర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించగా, 210 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో మొదటి విడతలో 107 మందికి 50 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. మిగితా 103 మందికి ఈనెల 18 నుంచి శిక్షణ ఇవ్వనున్నారు. కాగా ఇప్పటికే శిక్షణ పూర్తయిన 107 మంది సర్వేయర్లకు ఒక్కొక్కరికి 3 నుంచి 4 మండలాల చొప్పున కేటాయించారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న 10 మంది సర్వేయర్లు వీరికి క్షేత్రస్థాయి విధుల్లో సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. త్వరలోనే పరిష్కారం క్షేత్రస్థాయి సిబ్బంది కోసం రెండు సార్లు పరీక్ష నిర్వహిస్తే 99 మంది జీపీఓలు ఎంపికయ్యారు. వారితో పాటు ఆఫీస్ సిబ్బంది మరో 100 మంది వరకు ఉన్నారు. జిల్లాలో వ్యవసాయ క్లస్టర్లు 76 ఉండగా, పెద్ద క్లస్టర్‌కు ముగ్గురిని, చిన్న క్లస్టర్లకు ఇద్దరు చొప్పున నియమిస్తాం. అలాగే 107 మంది ట్రైనీ సర్వేయర్లు వచ్చారు. ఇక భూ సమస్యలను ముమ్మరంగా పరిష్కరిస్తాం. – నగేశ్, అదనపు కలెక్టర్ -
ఆదివారం శ్రీ 17 శ్రీ ఆగస్టు శ్రీ 2025
పాపన్నపేట(మెదక్): మంజీరా జోరు తగ్గలేదు. సింగూ రు నీరు పోటెత్తుతుండటంతో ఘనపురం ఆనకట్ట పొంగి పొర్లుతోంది. దుర్గమ్మ ఆలయాన్ని ముంచెత్తుతూ మంజీరా పరవళ్లు తొక్కుతోంది. మూడో రోజు శనివారం కూడా రాజగోపురంలోనే దుర్గమ్మకు పూజలు నిర్వహించారు. కలెక్టర్ రాహుల్‌రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ మహేందర్, సిబ్బందితో కలిసి ఏడుపాయలలో వరద పరిస్థితిని సమీక్షించారు. వరుస వర్షాలతో ఎగువ నుంచి సింగూరులోకి 31,400 క్యూసెక్కుల వరద చేరుతుంది. దీంతో ఇరిగేషన్ అధికారులు 6, 8, 9, 10, 11 నంబర్ గేట్లు ఎత్తి 43,300 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. గత రెండు రోజుల కన్నా వరద ఉధృతి పెరిగింది. రాజగోపురంలో దుర్గ మ్మ ఉత్సవ విగ్రహానికి భక్తులు పూజలు చేస్తున్నారు. జలకళను తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. ఏడుపాయల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అధికారు లు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. జోరు తగ్గని మంజీరా జలదిగ్బంధంలో దుర్గమ్మ రాజగోపురంలోనే పూజలు పరిస్థితిని సమీక్షించిన జిల్లా యంత్రాంగం -
చాకరిమెట్లలో శ్రావణ సందడి
శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధిలోని చాకరిమెట్ల సహకార ఆంజనేయస్వామి ఆలయంలో శ్రావణమాసం సందడి నెలకొంది. శనివారం అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దంపతులు సామూహిక వ్రతాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఈఓ శ్రీనివాస్, ఆలయ చైర్మన్ ఆంజనేయశర్మ, ప్రధాన అర్చకుడు దేవాదత్తశర్మ భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టారు. చెరువుల వద్దకు వెళ్లొద్దు ఎస్పీ శ్రీనివాస్‌రావు నర్సాపూర్: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ శ్రీనివాస్‌రావు అన్నారు. శనివారం రాయరావు చెరువును పరిశీలించి మాట్లాడారు. లోతట్టు ప్రాంతాలకు దూరంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. చెరువులు, నీటి వనరుల వద్దకు వెళ్లవద్దని ప్రజలను కోరారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100, పోలీస్ కంట్రోల్ రూం 8712656739 నంబర్లో సంప్రదించాలన్నారు. కాగా రాయరావు చెరువు వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహించాలని సిబ్బందికి చెప్పారు. ఆయన వెంట సీఐ జాన్‌రెడ్డి, ఎస్ఐ లింగం ఉన్నారు. నిల్వ నీటిని తొలగించాలి డీఏఓ దేవ్‌కుమార్ రామాయంపేట(మెదక్): భారీ వర్షాలతో పంటలకు నష్టం జరిగే అవకాశం ఉండటంతో రైతులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్ సూచించారు. శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. పంట చేనులో నిలిచిన నీటిని వెంటనే తొలగించాలన్నారు. కొన్ని మండలాల్లో మొక్కజొన్న, పత్తి చేనులో నీరు నిలిచినట్లు తెలిసిందని, నీటిని తొలగించకపోతే పంటలు దెబ్బతినే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పంటలకు ఎరువులు, క్రిమి సంహారక మందులు చల్లవద్దన్నారు. వర్షాలతో జిల్లాలో ఎక్కడా పంట నష్టం జరిగినట్లు సమాచారం లేదన్నారు. ఈమేరకు అన్ని మండలాల్లో వ్యవసాయ అధి కారులు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలిస్తూ సర్వే నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎక్కడైనా పంటలు దెబ్బతింటే తమకు సమాచారం అందజేయాలని కోరారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా శంకర్‌గౌడ్ రామాయంపేట(మెదక్): బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా రామాయంపేటకు చెందిన శంకర్‌గౌడ్ నియామకం అయ్యారు. ఈమేరకు జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్ శనివారం నియామకపత్రం అందజేశారు. ఎంపీ రఘునందన్‌రా వు, జిల్లా అధ్యక్షుడి సహకారంతో తనకు పదవి వరించిందని, పార్టీ నాయకులు, కార్యకర్తల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని శంకర్‌గౌడ్ హామీ ఇచ్చారు. అధికారులుఅందుబాటులో ఉండాలి పెద్దశంకరంపేట(మెదక్)/టేక్మాల్: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలకు అందుబాటులో ఉండాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య అధికారులను ఆదేశించారు. శనివారం పెద్దశంకరంపేట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ, పంచాయతీరాజ్, గ్రామ కార్యదర్శులతో వర్షాలపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో జ్వరాలు ప్రబలకుండా వైద్య సిబ్బందితో కలిసి అవగాహన కల్పించాలని సూచించారు. చెరువులు, కుంటల వద్ద రైతులకు జాగ్రత్తలపై వివరించాలని సూచించారు. అనంతరం టేక్మాల్ మండలంలో పర్యటించారు. పూర్తిగా వర్షాలు తగ్గే వరకు గుండువాగుపై నుంచి రాకపోకలను నిలిపివేయాలన్నారు. ఆయన వెంట ఇతర అధికారులు ఉన్నారు. -
యూరియా తిప్పలు.. క్యూలో రైతులు
చేగుంట(తూప్రాన్): చేగుంట మండల కేంద్రంలో శనివారం యూరియా కోసం రైతులు బారులు తీరారు. రైతు సేవా కేంద్రానికి యూరియా వస్తుందని తెలుసుకున్న రైతులు ఉదయం దుకాణం తెరిచేలోగా భారీగా చేరుకున్నారు. కేవలం 240 బస్తాల యూరియా రావడంతో నిర్వాహకులు రైతులను క్యూలో రావాలని కో రారు. దీంతో వర్షాన్ని సైతం లెక్క చేయకండా క్యూలో నిలబడ్డారు. గొడవ జరగకుండా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే యూరియా వచ్చిన గంటలోపే అయిపోయింది. ఆదివారం తెప్పిస్తామని అధికారులు హామీ ఇవ్వగా రైతులు వెళ్లిపోయారు. ఇబ్రహీంపూర్ సహకార సంఘం వద్ద సైతం యూరియా కోసం రైతులు ఎగబడటంతో కొంతసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. -
వరద హోరు
వాన జోరు..● పొంగిపొర్లుతున్న చెరువులు, కుంటలు ● జిల్లాకు అరెంజ్ అలర్ట్ జారీ ● ముందస్తు చర్యలు చేపట్టిన అధికారులునర్సాపూర్/కొల్చారం/రేగోడ్(మెదక్): జిల్లాలో ఎ డతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నర్సాపూర్ రాయరావు చెరువు అలుగు వద్ద శనివారం మత్స్యకారులు గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. పట్టణ ప్రజలు ఉదయం నుంచి చెరువు వద్ద సందడి చేస్తుండగా, పోలీసులు చెరువు వద్దకు ప్రజలు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. అలాగే రేగోడ్ మండలంలోని జగిర్యాల చెరువు అలుగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో జగిర్యాల–రేగోడ్ వైపు రాకపోకలు నిలిచిపోయాయి. ఎస్ఐ పోచయ్య చెరువును సందర్శించి పరిస్థితిని తెలుసుకున్నారు. కొల్చారం మండలవ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో చెరువులు, కుంటలు అలుగు పారుతున్నాయి. కింది భాగంలోని వరి పొలాలు నీట మునిగాయి. చిన్నఘనాపూర్ వైపు గల ఘనపురం ప్రాజెక్టు సింగూర్ జలాలతో నిండుకుండలా మారింది. ఆనకట్ట పైభాగం నుంచి రెండున్నర ఫీట్ల మేర నీరు ప్రవహిస్తుండడంతో జలకళ సంతరించుకుంది. పర్యాటకులు సెల్ఫీలు దిగేందుకు నీటిలోకి దిగే ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు భద్రతా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ నర్సాపూర్: వాతావరణ శాఖ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినందున ఆయా శాఖల అధికారులు, ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆదేశించారు. శనివారం రాయరావు చెరువును పలువురు అధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లాలోని నర్సాపూర్, శివ్వంపేట, టేక్మాల్, అల్లాదుర్గం తదితర మండలాల్లో అత్యధిక వర్షం కురిసిందని తెలిపారు. ఆదివారం వరకు వర్ష సూచన ఉన్నందున ప్రజలు అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని, దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. సింగూరు ప్రాజెక్టు నుంచి భారీ ఎత్తున నీరు విడుదల చేశారని, మంజీరా పరివాహాక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశామని వివరించారు. ప్రాజెక్టులు, చెరువుల వద్ద పర్యాటకులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. అధికారుల సెలవులు రద్దు చేశామని, అందరూ ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారు. ఆయన వెంట ఆర్డీఓ మహిపాల్‌రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు. అనంతరం నర్సాపూర్ మున్సిపాలిటీలోని 6, 7, 9వ వార్డులలో కలెక్టర్ పర్యటించారు ఇళ్లలోకి వర్షం నీరు రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ శ్రీరాంచరన్రెడ్డిని ఆదేశించారు. కంట్రోల్ రూమ్ పరిశీలన మెదక్ కలెక్టరేట్: జిల్లా కేంద్రంలోని కంట్రోల్ రూమ్‌ను శనివారం కలెక్టర్ రాహుల్‌రాజ్ పరిశీలించారు. ఎన్ని ఫిర్యాదులు వచ్చాయని సిబ్బందిని అ డిగి తెలుసుకున్నారు. -
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
మెదక్ కలెక్టరేట్: మున్సిపల్, పంచాయతీ కార్మికులకు నిధులు, నియామకాలు పెంచాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవన్లో సీఐటీయూ ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతేడాది నుంచి సబ్బులు, నూనెలు, గ్లౌజ్‌లు ఇవ్వడం లేదని మండిపడ్డారు. కార్మికులకు కనీస వేతనం రూ. 26 వేలు పెంచాలన్నారు. ప్రభుత్వాలు జీఓలను అమలు చేయకపోవడంతో కార్మికులు ప్రతినెల రూ. 6 వేల కోట్లు నష్టపోతున్నారని తెలిపారు. కాంటాక్ట్, అవుట్ సోర్సింగ్, డైలీ వేజ్ పేర్లతో నియమకాలు చేపడుతూ కార్మికులను అన్యాయం చేస్తుందన్నారు. ఉద్యోగ భద్రత కల్పించడం లేదని వాపోయారు. యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సుధాకర్, మహాసభల ఆహ్వాన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అడివయ్య, జిల్లా అధ్యక్ష, కార్య దర్శులు బాలమణి, మల్లేశం, జిల్లా కోశాధికారి నర్సమ్మ, నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్ -
తండాల్లో సమస్యల పరిష్కారానికి కృషి
రామాయంపేట(మెదక్): గిరిజన తండాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హామీ ఇచ్చారు. మండలంలోని జెమ్లా తండాలో సేవాలాల్ విగ్రహాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..నియోజకవర్గం అభివృద్ధే ధ్యేయంగా తాను పనిచేస్తున్నానన్నారు. నియోజకవర్గం పరిధిలో దాదాపు గిరిజన తండాలకు తారు రోడ్డు సదుపాయం కల్పించామని మిగిలిన తండాలకు సైతం త్వరలోనే రోడ్డు సదుపాయం కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రభుత్వ నిధులతోపాటు తన సొంత నిధులతో కూడా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. సమావేశంలో టీపీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేశ్‌రెడ్డి, పార్టీ నాయకులు బండారి మహేందర్‌రెడ్డి, పాండు నాయక్, బన్సీ తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ -
కాంగ్రెస్‌కు జిల్లా మహిళా అధ్యక్షురాలు రాజీనామా
పెద్దశంకరంపేట(మెదక్): కాంగ్రెస్ పార్టీలో తనకు సరైన గౌరవం దక్కడం లేదని మనస్తాపం చెందిన జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు అవుసుల భవాని శుక్రవారం తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి గెలుపుకోసం ఎంతగానో కృషి చేశానని, పార్టీ నిర్వహించే కార్యక్రమంలో తనకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజీనామా పత్రాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్‌పార్టీ మహిళా అధ్యక్షురాలు మొగిలి సునీతకు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. -
సాహసానికి పురస్కారం
సీఎం చేతుల మీదుగా అవార్డు అందుకున్న కానిస్టేబుల్ వంశీ మెదక్ మున్సిపాలిటీ:మెదక్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ వంశీ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. గ్రే హౌండ్స్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో అత్యుత్తమ కర్తవ్య నిర్వహణ, అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించినందుకు గాను ప్రెసిడెంట్ మెడల్ ఆఫ్ గ్యాలెంట్రీకి ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా వంశీని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస రావు అభినందించారు. అంగడి ఆగమాగం వర్షంతో కొట్టుకుపోయిన కూరగాయలు నర్సాపూర్: పట్టణంలో శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో అంగడి ఆగమాగమైంది. ప్రతి శుక్రవారం నర్సాపూర్‌లో అంగడి నిర్వహిస్తారు. కూరగాయలు, బట్టలు, ఇతర నిత్యావసర సరుకులు, పండ్లు, ఇండ్లలో వినియోగించే పనిమట్లు అమ్మే వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేసి విక్రయిస్తారు. సాయంత్రం కురిసిన కుండపోతకు కొనుగోళ్లు జరగలేదు. పైగా వర్షం నీటిలో కూరగాయలు కొట్టుకుపోయాయి. వర్షంతో తమకు చాలా నష్టం వచ్చిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా భారీ వర్షంతో రోడ్లపై నుంచి వర్షం నీరు ఎక్కువగా పారడంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బంది పడ్డారు. యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలే: దేవ్ కుమార్వెల్దుర్తి(తూప్రాన్): యూరియాను కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బంది పెడితే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవ్‌కుమార్ హెచ్చరించారు. మాసాయిపేట మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రం ఆగ్రోస్‌ను ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. స్టాక్ రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్మాలని, ఎక్కువ ధరలకు విక్రయిస్తే వారి లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి రాజశేఖర్, ఏఈఓ రజిత తదితరులు పాల్గొన్నారు. చిలప్‌చెడ్‌లో 14.6సెం.మీ వర్షంచిలప్చెడ్(నర్సపూర్): చిలప్‌చెడ్ మండలంలో గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు 14.6 సెం.మీ వర్షం కురిసింది. జిల్లాలోనే అత్యధిక వర్షపాతం నమోదైనట్లు మండల గణాంకాధికారి దివ్యభారతి శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. కాగా, కురుస్తున్న భారీ వర్షాలకు చిలప్‌చెడ్ మండలంలోని పలు గ్రామాల్లోని చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాల్లో పంటపొలాలు నీట మునిగాయి. చిలప్‌చెడ్‌లో కురిసిన వర్షానికి పాక్షికంగా కూలిన ఇళ్లు తహాశీల్దార్ సహాదేవ్ పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్ఐ సునీల్‌సింగ్ ఉన్నారు. చినుకుపడితే కరెంట్ కట్ సరఫరాలో తీవ్ర అంతరాయం నర్సాపూర్: నర్సాపూర్‌లో కరెంటు సరఫరాలో అంతరాయం సాధారణమైందని వినియోగదారులు వాపోతున్నారు. ప్రతి రోజు కరెంట్ కోతలు ఉంటున్నాయని, చినుకు పడితే కరెంటు పోతుందని, మళ్లీ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితులు ఉన్నాయని విమర్శించారు. రెండు రోజులుగా కరెంట్ సరఫరాలో అంతరాయం మరింత ఎక్కువైందని స్థానికులు తెలిపారు. శుక్రవారం సైతం కరెంటు చాలా సార్లు పోయిందని అన్నారు. కరెంట్ ఎక్కువ సార్లు పోవడంతో విద్యుత్తు పరికరాలు పాడుతున్నాయని అన్నారు. పట్టణంలో కరెంటు సరఫరాను మెరుగు పర్చాలని వినియోగదారులు కోరుతున్నారు. -
స్వాతంత్య్రం తెచ్చిన ఆనందం
పాపన్నపేట(మెదక్): తన కొడుకు ప్రయోజకుడు కావాలని.. తన కళ్ల ముందే ప్రశంసలు పొందాలని ఏ తండ్రైనా కలలు గంటాడు. తన తండ్రి సమాజంలో ఉన్నతుడిగా నిలవాలని ప్రతి కొడుకు ఆశిస్తాడు. మెదక్‌లో శుక్రవారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ పురస్కారాల వేడుక వారిద్దరి ఆశలను సఫలం చేసింది. పాపన్నపేటకు చెందిన కుకునూరి నరేందర్‌రెడ్డి మెదక్‌లో లైబ్రేరియన్‌గా పనిచేస్తున్నారు. మరో పది నెలల్లో పదవీ విరమణ చేయబోతున్నారు. ఆయన కొడుకు అర్జున్‌రెడ్డి మెదక్ కలెక్టరేట్లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన గ్రూప్ 3 పరీక్షల్లో స్టేట్‌టాపర్‌గా నిలిచారు. వారు వృత్తిపరంగా చేస్తున్న సేవలను గుర్తించిన జిల్లా అధికారులు ఆ తండ్రీకొడుకులకు ఉత్తమ ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. ఒకే వేదికపై తండ్రీతనయులు సత్కారం పొందిన తీరు అందరినీ ఆనంద పరిచింది.ఒకే వేదికపై తండ్రీకొడుకులకు పురస్కారం -
ఉధృతంగా మంజీరా
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మంజీర వరదల నేపథ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ రాహుల్‌రాజ్ వెల్లడించారు. సింగూరు నుంచి 20,265 క్యూసెక్కుల నీటిని దిగువకు వదలడంతో మంజీర ఉరకలెత్తి ప్రవహిస్తోంది. దీంతో ఘనపురం ఆనకట్ట పొంగిపొర్లుతోంది. శుక్రవారం ఏడుపాయల్లో పరిస్థితిని కలెక్టర్ రాహుల్‌రాజ్ ఇరిగేషన్, పోలీసు, ఆలయ అధికారులతో సమీక్షించారు. మంజీర వరద ఉధృతిని ఎప్పటి కప్పుడు అంచనా వేస్తుండాలని అధికారులకు సూచించారు. భక్తులెవరూ మంజీర నది వైపు వెళ్లకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్టాపర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. గజ ఈతగాళ్లు అందుబాటులో ఉండాలన్నారు. పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట ఇరిగేషన్ అధికారులు, పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్‌గౌడ్, పోలీసులు, ఆలయ సిబ్బంది ఉన్నారు. దుర్గమ్మను దర్శించుకున్న జిల్లా జడ్జి జిల్లా న్యాయమూర్తి నీలిమ శుక్రవారం కుటుంబ సభ్యులతో కలసి దుర్గమ్మ ను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సంధర్భంగా ఆలయ అర్చకులు, సిబ్బంది ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు. రాజగోపురంలో ఏర్పాటు చేసిన ఉత్సవ విగ్రహానికి ఆమె పూజలు చేశారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి, శాలువాతో సత్కరించారు.● సింగూరు నుంచి 20వేలక్యూసెక్కుల నీరు విడుదల ● పరిస్థితిని సమీక్షించిన కలెక్టర్ రాహుల్‌రాజ్ -
అవార్డులు మరింత బాధ్యతలు పెంచుతాయి
మెదక్ మున్సిపాలిటీ: అవార్డులు, రివార్డులు మరింత బాధ్యతలను పెంచుతాయని ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సూచించారు. జిల్లాలో ఉత్తమ సేవ ప్రశంసా పత్రాలు పొందిన పోలీసు అధికారులు, సిబ్బందితో ఎస్పీ మాట్లాడారు. అనంతరం వారిని అభినందించారు. మహనీయుల త్యాగాలను మరవొద్దు మనదేశానికి స్వాతంత్య్రం సాధించిన పెట్టిన మహనీయుల త్యాగాలను మరువొద్దని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద జాతీయ పతా కాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాయుధ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గౌరవ వందనాలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... మహనీయుల ప్రాణత్యాగాల ఫలితమే ఈ స్వాతంత్య్రమని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర పోలీసు సిబ్బంది దేశానికే గర్వకారణంగా ఉంటూ అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.ఎస్పీ డీవీ శ్రీనివాసరావు -
తిరంగా.. మురవంగా
మెదక్ కలెక్టరేట్: మెదక్ కలెక్టరేట్లో శుక్రవారం 79వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్‌రాజ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు, కలెక్టర్ రాహుల్‌రాజ్, జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావులతో కలిసి మహనీయుల చిత్ర పటాలకు నివాళులర్పించారు. అలాగే స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. దేశభక్తి గీతాలు, జానపద, సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే పాటలపై విద్యార్థులు నృత్య ప్రదర్శనలతో అలరించారు. విద్యార్థులకు మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే రోహిత్‌రావు, కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎస్పీ డీవీ శ్రీనివాసరావులు అభినందించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్ఓ భుజంగరావు, ఏఓ యూనస్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.కలెక్టరేట్లో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు -
అమర జవాన్ స్తూపం ఆవిష్కరణ
జహీరాబాద్ టౌన్: దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవానుల జ్ఞాపకార్థం ధనసిరి గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ స్మారక స్తూపాన్ని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం మాజీ సైనికులు ప్రారంభించారు. మొగుడంపల్లి మండలం ఽరాష్ట్ర సరిహద్దులో గల ధనసిరి గ్రామంలో దేశ రక్షణ కోసం ఎందరో సైన్యంలో చేరి సేవలందించారు. ఆర్మీలో వివిధ హోదాల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన వారు గ్రామంలో వీర అమర్ జవాన్ జ్యోతి స్మారక స్తూపం నిర్మాణానికి శ్రీకారం చుట్టి గ్రామస్తుల సహకారంతో పూర్తి చేశారు. 15 చదరపు అడుగుల ఎత్తు, 11 అడుగుల వెడల్పు ఎత్తులో గ్రానైట్ రాయితో ఇండియా గేట్ వద్ద మాదిరిగా నిర్మించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్శంగా మాజీ సైనికులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కె.మాణిక్‌రావు, మాజీ ఎంపీ.బీబీపాటిల్ హాజరై స్మారక స్తూపానికి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ధనసిరి గ్రామస్తులు సైన్యంలో చేరి దేశసేవ చేయడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకులతో పాటు బీదర్ జిల్లా నుంచి, మాజీ సైనికులు హబ్సి దేవరాజ్, కాశీనాథ్, అశోక్ ,గణపతి, సంజీవ్‌రెడ్డి, విశ్వనాథ్, చంద్రశెట్టి, బస్వరాజ్, మల్లికార్జున్, సురేశ్ యాదవ్, బక్కారెడ్డి, యూనూస్ తదితరులు పాల్గొన్నారు.పాల్గొన్న ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ సైనికులు -
అభివృద్ధిలో పరుగులు
శనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025● మెదక్ జిల్లాలో వేలాది కోట్లతో అభివృద్ధి పనులు ● స్వాతంత్య్ర వేడుకల్లో జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ మెదక్‌జోన్: అభివృద్ధిలో జిల్లా పరుగులు పెడుతోందని జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెదక్ జిల్లాను రూ.వేలాది కోట్లకు పైగా ఖర్చుచేసి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తోందన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు ఆయన పోలీస్‌ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. జిల్లా లో ఇప్పటివరకు 87,491 మంది రైతులకు గానూ రూ.645.41 కోట్లను రుణమాఫీ చేసిందన్నారు. 2024–2025 సీజన్‌కు సంబంధించి 3,19,144 మె ట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని 80,873 మంది రైతుల నుంచి సేకరించి వారికి రూ.740.42 కోట్లను చెల్లించామని వివరించారు. అలాగే 15 వేల మంది రైతుల నుంచి 62,747 మెట్రిక్ టన్నుల సన్నధాన్యం సేకరించామని, వీరికి బోనస్ కింద క్వింటాల్‌కు రూ.500 చొప్పున రూ.31.37కోట్లను త్వరలోనే రైతుల ఖాతాలో వేస్తామని చెప్పారు. రైతు భరోసా కింద వానాకాలం సీజన్లో 2,62,043 మంది రైతుల ఖా తాల్లో రూ.220.84 కోట్లను జమచేసినట్లు తెలిపారు. మెడికల్ కాలేజీ భవనానికి రూ.180 కోట్లు జిల్లాకు మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసి భవన నిర్మాణం కోసం రూ.180 కోట్లు, అలాగే నర్సింగ్ కాలేజీ భవనం కోసం మరో రూ.26 కోట్లను మంజూరు అయినట్లు మంత్రి వివేక్ తెలిపారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు వివరించారు. ఈ పథకం ద్వార జిల్లాలో ఇప్పటివరకు 18,626 మంది రోగులకు శస్త్రచికిత్సలు చేయగా...ఇందుకోసం రూ. 49.71 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిపారు. రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ పాఠశాల కాంప్లెక్స్‌ను రామాయంపేటకు మంజూరైందని వెల్లడించారు. అదేవిధంగా జిల్లాలోని 16 ప్రభుత్వ జూనియర్ కళాశాలల మరమ్మతుల కోసం రూ.3.26 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.3.2కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణాలు మహాలక్ష్మి పథకంలో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 3.2 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేయగా అందుకు రూ.83.50 కోట్ల లబ్ధిని మహిళలు పొందారని మంత్రి వివేక్ చెప్పారు. అలాగే గృహజ్యోతి పథకంలో భాగంగా 1,27,393 మంది విద్యుత్ వినియోగదారులకు 200 యూనిట్లలోపు జీరో బిల్లు జారీ కాగా ఇందుకోసం రూ.65.3 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం భరించిందని పేర్కొన్నారు.పేదలకు అండగా... జిల్లాలో 2,16,716 కుటుంబాలకు మూడు నెలలకు సరిపడే రేషన్ 13,923 మెట్రిక్ టన్నుల బియ్యం అందించినట్లు మంత్రి తెలిపారు. అలాగే జిల్లాలో 9,964 కొత్త రేషన్‌కార్డులను ఇచ్చామన్నారు. ఇందిరమ్మ పథకంలో భాగంగా జిల్లాకు మొదటి విడతలో 9,125 ఇళ్లు మంజూరు కాగా, అందుకు రూ.456.25 కోట్లు మంజూరయ్యాయని, వివిధ దశల్లో పనులు జరుగుతున్నాయని, ఇప్పటివరకు 1,302 మంది లబ్ధిదారులకు రూ.13.42 కోట్లను వారి ఖాతాల్లో జమచేశాం చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రోహిత్‌రావు, జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎస్పీ శ్రీనివాస్‌రావు, అదనపు కలెక్టర్ నగేష్ తదితరులు పాల్గొన్నారు. -
సొసైటీలు.. మరో ఆరు నెలలు
పీఏసీఎస్ పాలకవర్గాల పదవీకాలం పొడిగింపురామాయంపేట(మెదక్): సహకార సంఘాల పదవీ కాలం పొడిగిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వు లు జారీ చేసింది. 2020లో సహకార సంఘాలకు గత ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించింది. ఐదేళ్లు పూర్తి కావడంతో వాటి గడువు గత ఫిబ్రవరిలోనే ముగిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వీటి గడువును మరో ఆరు నెలల పాటు పొడిగించగా, ఆ గడువు సైతం నేటితో ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడం, ప్రస్తుత పరిస్థితుల్లో సహకార సంఘాల ఎన్నికల నిర్వహణ కష్టసాధ్యమవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం మళ్లీ ఆరు నెలల పాటు పొడిగించినట్లు తెలిసింది. ఆ సంఘాల పొడిగింపు లేనట్లే.. కేసులు కొనసాగుతున్న, నష్టాలబాట పట్టిన సంఘాల పొడిగింపు అనుమానస్పదమే. ఈమేరకు సహకార శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని సమాచారం. జిల్లాలో 37 సహకార సంఘాలుండగా, రాంపూర్ సంఘం పాలకవర్గాన్ని గతంలోనే రద్దు చేయగా, ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో కొనసాగుతుంది. మిగితా 36 సంఘాల్లో కనీసం 16కుపైగా సంఘాలు నష్టాల బాటలో ఉన్నాయి. మరికొన్ని సంఘాలకు సంబంధించి నిధుల దుర్వినియోగం, తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో విచారణ కొనసాగుతుంది. పొడిగింపు లేని సంఘాలకు త్వరలో ప్రత్యేక అధికారులను నియమించనున్నట్లు తెలిసింది. వాటి వివరాలు త్వరలో ప్రకటిస్తాం జిల్లాలోని 36 సంఘాలకు గానూ పొడిగించే అవకాశం లేని సొసైటీల వివరాలు త్వరలో ప్రకటిస్తాం. మిగితా సంఘాల పదవీకాలం పొడిగించారు. నాలుగైదు రోజుల్లో వారికి ఉత్తర్వులు అందే అవకాశం ఉంది. – కరుణాకర్, జిల్లా సహకార అధికారి -
పొంగే వాగులు, వంకలు దాటొద్దు
మెదక్ కలెక్టరేట్: ప్రజలు పొంగే వాగులు, వంతెనలు దాటే ప్రయత్నం చేయవద్దని కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. గురువారం హవేళిఘణాపూర్ మండలం ధూప్‌సింగ్ తండాలో లోలెవెల్ కాజ్వే, పోచారం డ్యాంను పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రకృతి విపత్తులలో ప్రజల రక్షణకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని, కాజ్వే, కల్వర్టుల వద్ద పటిష్ట పోలీసు భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. జిల్లాలో వరదలకు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చిన ఎదుర్కొనేందుకు 10 మంది సభ్యులతో ఎస్డీఆర్ఎఫ్ బృందం సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అనంతరం పోచారం డ్యాం నీటిమట్టం వివరాలను తెలుసుకున్నారు. అనంతరం హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్, ఎస్పీ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
విద్య, వైద్యం, అవినీతి రహితం
ఇదే నవ భారతానికి నాంది● ప్రజాప్రతినిధులుగావిద్యావంతులే రావాలి ● ప్రభుత్వ వ్యవస్థలను బలోపేతం చేయాలి ● ఉద్యోగ అవకాశాలు మెరుగుపర్చాలి ● సాంకేతికతను అందిపుచ్చుకోవాలి ● సాక్షి టాక్‌షోలో విద్యార్థులుమెదక్జోన్/నర్సాపూర్: బానిస సంకెళ్లు తెంచుకొని పరాయి పాలన నుంచి విముక్తి పొందిన మన దేశం.. 78 ఏళ్లలో ఎంతో పురోగతి సాధించింది. ఈ నేపథ్యంలో స్వాతంత్య్రం కోసం పోరాడిన వారి ఆశలు, ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి చెందిందా? పరిపాలన ఎలా సాగుతోంది? ఇంకా ఎలా ఉండాలి? టెక్నాలజీ, ఎడ్యుకేషన్, హెల్త్, నిరుద్యోగం వంటి అంశాలపై గురువారం మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో పాటు నర్సాపూర్ మండలంలోని పెద్దచింతకుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గురువారం సాక్షి టాక్‌షో నిర్వహించింది. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు 2047 నాటికి భారతదేశం ఎలా ఉండాలనే విషయాలను పంచుకున్నారు. విద్యావంతులు రావాలి రాజకీయాల్లోకి విద్యావంతులు రావాలి. చట్ట సభల్లోకి వెళ్లాలంటే కనీసం డిగ్రీ అర్హత ఉండాలి. సర్పంచ్, ఎంపీటీసీ పదవులకు పది, ఇంటర్ నిబంధన పెట్టాలి. – శ్రీనివాస్, బీకాం వైద్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి కార్పొరేట్ ఆస్పత్రులను తలదన్నే విధంగా ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయాలి. అన్నిరకాల జబ్బులకు ఉచిత వైద్యం అందించాలి. ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ఆస్పత్రులు నడపకూడదనే నిబంధన తీసుకురావాలి. – రవితేజ, బీకాం ఉపాధి మార్గాలు చూపించాలి దేశంలోని బడీడు పిల్లలందరూ చదువుకోవాలి. అందుకు అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరి ంచి నాణ్యమైన విద్యను అందించాలి. ఉన్నత చదువులు చదువుకున్న ప్రతీ విద్యార్థికి ఉపాధి మార్గాలు చూపాలి. – శ్రీజ బీకాం ప్రభుత్వ విద్య బలోపేతం చేయాలి ప్రాథమిక స్థాయి నుంచి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి. ప్రైవేట్ విద్యారంగాన్ని అదుపు చేయాలి. అవినీతిని అరికట్టి పారదర్శకతతో కూడిన పరిపాలనరావాలి. – కల్యాణ్, బీజెడ్‌సీఎస్ పరిపాలన నిజాయితీగా ఉండాలి పరిపాలన నిజాయితీగా ఉన్నప్పుడే దేశం అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తుంది. రాజకీయ నాయకుల భాగస్వామ్యంలో ప్రైవేట్ విద్యారంగం ఉన్నంత కాలం ప్రభుత్వ విద్యా విధానం అభివృద్ధి చెందదు. – లక్ష్మణ్‌గౌడ్, బీఏ ఒకే విద్యా విధానం అవసరం దేశమంతా ఒకే విద్యా విధానం అమలు చేయా లి. సాంకేతిక పరిజ్ఞానం మరింత అభివృద్ధి చెందే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించాలి. అన్ని రంగాల్లో డిజిటలైజేషన్ అమలు చేస్తూ, పరిపాలన మరింత మెరుగుపర్చాలి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. – ఒమన్ ఫైజల్, బీజెడ్‌సీఎస్ పరిశోధనలను ప్రోత్సహించండి పరిశోధనలకు నిధులు పెంచాలి. ప్రధా నంగా వైద్య రంగంలో మెడిసిన్ తయారీని ప్రోత్సహించాలి. విద్యా విధానంలో అవసరమైన మార్పులు చేయాలి. – ఐశ్వర్య, బీజెడ్‌సీఎస్ సాగులో సాంకేతికత అవసరం సాగులో సాంకేతికత పెరగాలి. పరిశ్రమలతో పాటు వ్యవసాయ రంగానికి చేరువకావాలి. పరిపాలన విధానంలో మార్పు లు రావాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యతగా పనిచేసి అందరికీ సమాన స్థాయిలో సేవలు అందించాలి. – స్నేహ, ఎంసీసీఎస్ చట్టాలు కఠినతరం చేయాలి డ్రగ్స్, మాదక ద్రవ్యాల విక్రయాలను అరికట్టి చట్టాలను కఠినంగా అమలుచేయాలి. మంచి సమాజ ఏర్పాటుకు కృషి చేయాలి. సాంకేతిక విద్యను పేదలకు చేరువ చేయాలి. అన్ని రంగాల్లో అవినీతిని అరికట్టాలి. – అనూష, ఎంపీసీఎస్ కంపెనీల కాలుష్యం పెరిగింది కంపెనీల నుంచి వచ్చే కాలుష్యాన్ని అదుపు చేయాలి. ఆహార పదార్థాల్లో కల్తీపై కఠినంగా వ్యవహరించాలి. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం ఉచితంగా అందజేయాలి. సాంకేతికతను గ్రామాలకు చేరువ చేయాలి. – రమేశ్, ఇన్చార్జి ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ -
ఖాకీ కవచాలు
మెదక్ మున్సిపాలిటీ: విపత్తుల వేళ పోలీస్‌శాఖ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపింది. ఇందులో భాగంగా డిచ్పల్లి 7వ బెటాలియన్‌కు చెందిన 25 మంది ఎస్డీఆర్ఎఫ్ బృందం గురువారం ఎస్పీ కార్యాలయానికి చేరుకుంది. వీరు కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణలో పనిచేస్తారు. కఠోర శిక్షణ తీసుకొని, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రంగంలోకి దిగుతారు. ప్రజలు ప్రమాదంలో చిక్కుకున్నారంటే.. స్థానిక పోలీస్‌స్టేషన్, డయల్ 100కు కాల్ చేసి సమాచారం అందిస్తే చాలు, వెంటనే అక్కడికి చేరుకుంటారు. సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక పరికరాల సహాయంతో ప్రమాదంలో ఉన్నవారి ప్రాణా లు కాపాడేందుకు కృషి చేస్తారు. ఎక్కడైనా రాకపోకలు నిలిచినా.. వరదల్లో చిక్కుకున్నా.. కాలనీల్లోకి వరదనీరు చేరి ప్రజలు ఇబ్బంది పడుతు న్నా.. వారిని కాపాడుతారు. ఇదే విషయమై ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జిల్లాలో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు సమాచారం ఉందని, ఎలాంటి ఆపద వచ్చిన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ బృందంతో పాటు జిల్లా కేంద్రంలో 4 క్యూఆర్టీ (క్విక్ రెస్పాన్స్ టీం) అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. అలాగే అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు లైవ్ జాకెట్లు, ఇతర అన్నిరకాల సామగ్రి ఉందన్నారు. విపత్తుల వేళ ప్రజల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా రెస్క్యూ టీంను ఏర్పాటు చేశామన్నారు.25 మందితో ప్రత్యేక రెస్క్యూ టీం -
పేదరికమే అతి పెద్ద సమస్య
దరిచేరని స్వేచ్ఛ, సమానత్వం ● అధికార యంత్రాంగం నీతిగా పనిచేస్తేనే స్వాతంత్య్ర ఫలాలు ● ‘సాక్షి’ సర్వేలో ఉమ్మడి జిల్లా ప్రజల మనోగతంసాక్షి, నెట్వర్క్: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 79 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇంకా పేదరికమే అతి పెద్ద సమస్య అనే అభిప్రాయం జిల్లా వాసుల్లో వ్యక్తమవుతోంది. పేదరిక నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ అవి అర్హులకు చేరడం లేదనేది స్పష్టమవుతోంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రత్యేక సర్వే నిర్వహించింది. ప్రజలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య? స్వేచ్ఛ – సమానత్వం ఎంత మందికి దరిచేరింది? స్వాతంత్య్ర ఫలాలు అందరికి దక్కాలంటే ఏ రంగం నీతి, నిజాయితీగా పనిచేయాలి? ఇలా మూడు ప్రధాన మైన అంశాలపై సర్వే చేపట్టింది. ఈ అంశాలపై సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల పరిధిలో వివిధ వర్గాలకు చెందిన 90 మంది అభిప్రాయాలను సేకరించింది. పేదరికం తర్వాత అతిపెద్ద సమస్య వైద్యమే అని సర్వేలో పేర్కొన్నారు. కుల వివక్ష కూడా ఎక్కువగానే ఉందని, అవినీతి కూడా ప్రధాన సమస్యల్లో ఒకటని తేలింది. అందని స్వేచ్ఛ–సమానత్వం.. స్వేచ్ఛ – సమానత్వం ఇంకా ప్రజలందరికి చేరువకాలేదని సాక్షి చేపట్టిన సర్వేలో వ్యక్తమైంది. 60 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సుమారు 28 శాతం మంది కొద్ది మందికే చేరువైందని చెప్పారు. 12 శాతం మంది అందరికీ స్వేచ్చ – సమానత్వం చేరువైందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. అధికార యంత్రాంగం నీతి నిజాయితీగా పనిచేస్తేనే స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కుతాయనే అభిప్రాయాన్ని సగం మందికి పైగా అభిప్రాయపడ్డారు. చట్టసభలు, న్యాయస్థానాలు మరింత నీతి, నిజాయితీగా పనిచేస్తేనే సాధ్యమవుతుందని తేల్చి చాలా మంది చెప్పారు.సర్వే ఫలితాలు ఇలా..స్వాతంత్య్ర ఫలాలుఅందరికీ దక్కాలంటేమరింత నీతి, నిజాయితీగాపనిచేయాల్సిన రంగం?దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లు పూర్తవుతోంది. ఇప్పటికీ మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య? స్వేచ్ఛ – సమానత్వం నిజంగానే అందరికీచేరుతోందా?మీడియా620చట్టసభలు4510అధికార యంత్రాంగంన్యాయ స్థానాలునాణ్యమైన విద్య -
పోటెత్తిన మంజీర
● పొంగిపొర్లుతున్న ఘనపురం ● సింగూరు నుంచి 5 వేల క్యూసెక్కులు విడుదల ● వన దుర్గమ్మ ఆలయం మూసివేత ● పరిస్థితిని సమీక్షించిన ఆర్డీఓ రమాదేవి పాపన్నపేట(మెదక్): మంజీర నది పోటెత్తింది. ఘనపురం ఆనకట్ట పొంగిపొర్లుతుంది. సింగూరు ప్రాజెక్టు నుంచి 5 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయడంతో గురువారం మంజీర పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుండటంతో ఏడుపాయల వనదుర్గా భవాని మాత ఆలయాన్ని మూసివేశారు. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి పూజలు చేస్తున్నారు. మెదక్ ఆర్డీఓ రమాదేవి, పాపన్నపేట తహసీల్దార్ సతీశ్, ఎస్సై శ్రీనివాస్‌గౌడ్, ఆలయ సిబ్బందితో కలిసి ఘనపురం ఆనకట్ట, ఆలయం ఎదుట వరద పరిస్థితిని సమీక్షించారు. నది వైపు భక్తులెవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఘనపురం ప్రాజెక్టు నుంచి మహబూబ్‌నహర్, ఫతేనహర్ కెనాల్లకు నీరు విడుదల చేస్తున్నారు. సమీప గ్రామాల ప్రజలు, మత్స్యకారులు మంజీర నది వైపు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కొల్చారం: ఘనపురం ఆనకట్ట మీదుగా ప్రవహిస్తున్న మంజీరా ఆలయాన్ని మూసి వేస్తున్న సిబ్బంది -
అదనపు బస్సుల కోసం ఆందోళన
చేగుంట(తూప్రాన్): అదనపు బస్సులు నడపాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు బుధవారం మోడల్ పాఠశాల వద్ద రాస్తారోకో నిర్వహించారు. బీ. కొండాపూర్ నుంచి చేగుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు బోనాల్, ఇబ్రహీంపూర్, రుక్మాపూర్, అనంతసాగర్, ఉల్లితిమ్మాయిపల్లి, అనంతసాగర్ గ్రామాలకు చెందిన విద్యార్థులు వస్తుంటారు. ఈరూట్లో మోడల్ పాఠశాల బస్సు ఒక్కటి మాత్రమే నడుస్తుండటంతో దాదాపు 200కు పైగా విద్యార్థులు ఒక్క బస్సులో వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల అవి సైతం అందుబాటులో లేకపోవడంతో కళాశాలకు హాజరుకాలేక పోతున్నారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు మోడల్ పాఠశాల సమీపంలో ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ అధికారులతో ఫోన్లో మాట్లాడి.. వారం రోజుల్లో సమస్యను పరిష్కరించకుంటే జాతీయ రహదారిపై రాస్తారోకో చేస్తామని హెచ్చరించారు. -
స్వచ్ఛతకు దూరం!
పేట మున్సిపాలిటీలో కొరవడిన పరిశుభ్రతచర్యలు తీసుకుంటున్నాం మున్సిపాలిటీలో స్వచ్ఛత విషయమై చర్య లు తీసుకుంటున్నాం. ఈమేరకు కొంత పురో గతి సాధించాం. అన్ని వార్డుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. డంప్‌యార్డులో కాకుండా ఇతర ప్రదేశాల్లో వేసిన చెత్త, చెదారాన్ని తొలగిస్తున్నాం. – దేవేందర్, మున్సిపల్ కమిషనర్ రామాయంపేట(మెదక్): రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛత కొరవడింది. తడి, పొడి చెత్త సేకరణ, పారిశుద్ధ్య పనుల నిర్వహణ, ఇతర రంగాల్లో అనుకున్న పురోగతి సాధించలేక చతికిలపడింది. దీంతో స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్‌లోనూ జిల్లాలోనే అట్టడుగు స్థానంలో నిలిచింది. లోపించిన సమన్వయం పట్టణాల్లో స్వచ్ఛతలో పోటీ తత్వాన్ని పెంపొందించడానికి ఏటా కేంద్రం స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలు నిర్వహిస్తుంది. చెత్త సేకరణకు సంబంధించి వివిద అంశాల ప్రతిపాదికన ఈ ర్యాంక్ నిర్ణయిస్తారు. ఇంటింటికీ తిరిగి చెత్త సేకరిస్తున్నారా..? సేకరించిన తడి, పొడి చెత్తను వేర్వేరు చేస్తున్నారా.. అనే విషయం కమిటీ పరిశీలిస్తుంది. ఈమేరకు కమిటీ సభ్యులు పట్టణంలో పరిశుభ్రత, పారిశుద్ధ్య కార్యక్రమాలపై స్థానికుల అభిప్రాయాలను సేకరించడంతో పాటు ప్రత్యక్షంగా వార్డుల్లో పర్యటించి పరిశుభ్రత ప్రమాణాలను పరిశీలించారు. మున్సిపాలిటీల్లో ఆయా అంశాలకు సంబంధించి కేటాయించిన మార్కుల ఆధారంగా ర్యాంకులను ఖరారు చేశారు. కేంద్ర బృందం సభ్యులు పట్టణంలో పర్యటించిన సమయంలో స్వచ్ఛత తోపించిన విషయం ప్రత్యక్షంగా పరిశీలించి ఫొటోలు సేకరించారు. పట్టణంలోని ఆయా వార్డుల్లో పారిశుద్ధ్యం లోపించి, దోమల బెడద తీవ్రమై స్థానికులు వ్యాధుల బారిన పడుతున్నారు. గుట్టపై ఎతైన ప్రదేశంలో ఉన్న డంప్‌యార్డులో కాకుండా పట్టణంలో సేకరించిన చెత్తను ఎక్కడ పడితే అక్కడే వేస్తున్నారు. ఫలితంగా వార్డు ల్లో దుర్వాసన వెదజల్లుతుంది. ఈవిషయమై పలు మార్లు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హెచ్చరించినా మున్సిపల్ అధికారుల వైఖరి మారలేదు. ఫలితంగా స్వచ్ఛత ర్యాంక్ దిగజారింది. ఈ విషయమై పట్టణ ప్రజలు సైతం పెదవి విరుస్తున్నారు. మున్సిపాలిటీ రాష్ట్ర ర్యాంక్ జాతీయ ర్యాంక్ రామాయంపేట 1321, 591 పారిశుద్ధ్య నిర్వహణలో విఫలం స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్లోఅట్టడుగు స్థానం -
జాతీయ సమైక్యత కోసమే ‘తిరంగా’
నర్సాపూర్: కుల, మత, ప్రాంతాలకు అతీతంగా భారతీయుల్లో జాతీయతను పెంపొందించడానికే తిరంగా యాత్ర చేపడుతున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్ చెప్పారు. బుధవారం నర్సాపూర్‌లో చేపట్టిన తిరంగా యాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాన్ని స్వాగతించడం, ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకోవడంతో పాటు దేశాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే దిశగా స్వదేశీ జాగరణ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. కాగా విద్యార్థులతో భారీ తిరంగా జెండాతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోశ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్నరమేశ్గౌడ్, నాయకులు శ్రీనివాస్, పెద్ద రమేశ్‌గౌడ్, బుచ్చేశ్‌యాదవ్, రాజేందర్ పాల్గొన్నారు.బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్ -
రైతు చట్టాలపై అవగాహన అవసరం
నర్సాపూర్/కౌడిపల్లి/కొల్చారం/చేగుంట(తూప్రాన్)/చిన్నశంకరంపేట(మెదక్): రైతు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు సునీల్ అన్నారు. లీప్స్ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం నర్సాపూర్ రైతు వేదికలో ఏర్పాటు చేసిన సాగు న్యాయ యాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చట్టాలను రైతులకు చుట్టాలుగా చేయాలనే లక్ష్యంతో సాగు న్యాయ యాత్ర చేపట్టినట్లు వివరించారు. రైతులు భూ, సాగు నీటి సమస్యలు, విత్తనం, పంట రుణాలు, పంటల బీమా మార్కెట్ తదితర వాటిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. భూమికి సంబంధించిన సమస్యలు, నాణ్యతలేని విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో నష్టం వాటిల్లితే చట్టాలను ఉపయోగించుకొని రైతులు న్యాయం పొందే అవకాశం ఉందన్నారు. సమావేశం అనంతరం మండలంలోని పెద్దచింతకుంటలో పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. అలాగే కౌడిపల్లి, కొల్చారం, చేగుంట, చిన్నశంకరంపేటలో పర్యటించి రైతులకు అవగాహన కల్పించారు. భూదాన్ బోర్డు మాజీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, రైతు కమిషన్ చైర్మన్ ఓఎస్డీ శ్రీహరి వెంకటప్రసాద్, అధికారులు రైతులు పాల్గొన్నారు. రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు సునీల్ -
ఆర్టీసీలో ఓవర్ డ్యూటీ!
● రోజుకు 12 నుంచి 14 గంటల విధులు ● స్పెషల్ ఆఫ్‌లు.. సెలవులు కరువు ● ఇదేంటని అడిగితే మెమోలు.. ● ఆందోళనలో డ్రైవర్లు, కండక్టర్లు మెదక్‌జోన్: BÈtïÜ {OyðlÐ]lÆý‡$Ï, MýS…yýlMýStÆý‡$Ï KÐ]lÆŠḥæ yýl*Åsîæ ™ø Ô>È-Æý‡-MýS…V>, Ð]l*¯]l-íÜ-MýS…V> AÌS-íÜ-´ù-™èl$-¯é²Æý‡$. °º…«§ýl¯]lÌS {ç³M>Æý‡… ÆøkMýS$ 8 VýS…rË$ Ð]l*{™èlÐól$ Ñ«§ýl$Ë$ °Æý‡Ó-Ç¢…-^é-Í. A…™èl-MýS$-Ñ$…_ ç³°^ólõÜ¢ B Ð]l$Æý‡$çÜsìæ Æøk òÜÌSÐ]l# E…r$…¨. {ç³çÜ$¢™èl… Æø kMýS$ 12 ¯]l$…_ 14 VýS…rÌS ´ër$ Ñ«§ýl$Ë$ °Æý‡ÓÇ¢…^éÍÞ Ð]lçÜ$¢…-¨. 14 VýS…rÌS ´ër$ Ñ«§ýl$ÌZÏ E…sôæ 6 VýS…r-ÌSMýS$ KÐ]lÆŠ‡ Osñæ… (Ksîæ) CÐéÓÍÞ E…yýlV>, MóSÐ]lÌS… VýS…r-¯]l²Æý‡, Ìôæ§é Æð‡…yýl$ VýS…r-ÌSMýS$ Ð]l*{™èlÐól$ Ksîæ CçÜ$¢¯é²Æý‡° íܺ¾…¨ Ðé´ù-™èl$-¯é²Æý‡$. VýS™èl…ÌZ òÜÌS-Ð]l#Ë$ C^óla-Ðé-Æý‡-°, çÜÐðl$à A¯]l…-™èlÆý‡… AÑ MýS*yé CÐ]lÓ-yýl… Ìôæ§ýl° BÐól-§ýl¯]l ^ðl…§ýl$-™èl$-¯é²Æý‡$. 100 బస్సులు.. 350కి పైగా సిబ్బంది మెదక్ డిపోలో పల్లె వెలుగు నుంచి మొదలుకొని ఎక్స్‌ప్రెస్, లగ్జరీ, సూపర్ లగ్జరీలు మొత్తం సు మారు 100 బస్సులు ఉండగా, డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది 350కి పైగా ఉన్నారు. కాగా కార్మిక చట్టాల ప్రకారం డ్రైవర్, కండక్టర్లు రోజుకు 8 గంటలు మాత్రమే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అయితే అంతకంటే ఎక్కువ సమయం పనిచేయాల్సి వస్తోందని డ్రైవర్లు వాపోతున్నారు. కార్మికులపై వేధింపులు ఆపాలనే డిమాండ్‌తో గతేడాది జూన్‌లో 53 మంది డ్రైవర్లు 3 రోజుల పాటు బస్సులు నిలిపి వేసి సమ్మెకు దిగారు. దీంతో దిగివచ్చిన యాజమాన్యం కార్మిక చట్టం ప్రకారం వెసులుబాటు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అందరూ విధుల్లో చేరాలని, ఉన్నతాధికారులతో చర్చించి సమ్మె చేసిన మూడు రోజుల వేతనాలు ఇస్తామని నిరసనను విరమింపజేశారు. నిబంధనల ప్రకారమే.. నిబంధనల ప్రకారమే డ్యూటీలు వేస్తున్నాం. అధిక సమయం పనిచేసిన వారికి ఓటీ లు ఇస్తున్నాం. గతంలో డ్రైవర్లు సమ్మె చేసిన విషయం నాకు తెలియదు. తాను గతేడాది ఆగస్టులో విధుల్లో చేరాను. – సురేఖ, డీఎం మెదక్ రూ. 24 లక్షలు జరిమానా అధికారుల హామీతో సమ్మె విరమించిన డ్రైవర్లు ఆ మరుసటి రోజు విధుల్లో చేరారు. అయితే డ్రైవర్లకు హక్కుల ప్రకారం న్యాయం చేయకపోగా, మూడు రోజుల పాటు బస్సులు నడపకుండా సమ్మె చేసినందుకు ఆర్టీసీకి రూ. 24 లక్షల నష్టం వచ్చిందని, ఆ మొత్తాన్ని సమ్మెలో పాల్గొన్న 53 మంది డ్రైవర్లు చెల్లించాలని స్పష్టం చేశారు. ఇందుకోసం ఒక్కో డ్రైవర్‌కు రూ. 45 వేల చొప్పున జరిమానా విధించారు. ఈ మొత్తాన్ని ప్రతి నెల ఒక్కో డ్రైవర్ వేతనంలో నుంచి రూ. 5,500 చొప్పున కోతపెట్టారు. ఈక్రమంలో బాధిత డ్రైవర్లు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు స్టే విధించడంతో ప్రస్తుతం వేతనాల్లో నుంచి కోత పెట్టడం మానేశారు. కాగా అప్పటి నుంచి యాజమాన్యం వేధింపులు మరింతగా ఎక్కువగా అయ్యాయని డ్రైవర్లు వాపోతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే మెమో ఇచ్చి ఇంక్రిమెంట్లు ఆపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అప్రమత్తంగా ఉండండి
మెదక్ కలెక్టరేట్: మూడు రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఈనెల 15న జరగనున్న స్వాతంత్య్ర వేడుకల ఏర్పాట్లను ఎస్పీ డీవీ శ్రీనివాసరావుతో కలిసి బుధవారం సాయంత్రం పరిశీలించారు. ఏర్పాట్లు ఘనంగా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం వర్షాల నేపథ్యంలో ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన సహాయక చర్యలపై శాఖలవారీగా దిశానిర్దేశం చేశారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అధికార యంత్రాంగం అండగా ఉంటుందన్నారు. అత్యవసర సేవలు అందించేందుకు కలెక్టరేట్లో కంట్రోల్‌రూం ఏర్పాటు చేశామన్నారు. తక్షణ సాయం కోసం 9391942254 నంబర్లో సంప్రదించాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ రమాదేవితో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. పశువులకు టీకాలు తప్పనిసరి చిలప్‌చెడ్(నర్సాపూర్): వానాకాలం సీజన్లో పశువులు వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉంటూ ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆదేశించారు. బుధవారం మండలంలోని బండపోతుగల్‌లో ఏర్పాటు చేసిన ఉచిత పశువైద్య శిబిరాన్ని సందర్శించారు. రికార్డులు పరిశీలించి జీవాలకు టీకాలు వేశారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం రైతులకు పశుగ్రాస విత్తనాలను పంపిణీ చేశారు. జిల్లాకు భారీ వర్ష సూచన తక్షణ సాయం కోసంకంట్రోల్ రూం ఏర్పాటు కలెక్టర్ రాహుల్‌రాజ్ -
పఠనాసక్తిని పెంపొందించాలి
చేగుంట(తూప్రాన్)/చిన్నశంకరంపేట/ మెదక్ కలెక్టరేట్ /తూప్రాన్: విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని చదువు నేర్పాలని డీఈఓ రాధాకిషన్ ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం మండలంలోని మోడల్ స్కూల్లో ఉపాధ్యాయులు తయారు చేసిన బోధనోపకరణాల మేళాను పరిశీలించి మాట్లాడారు. విద్యార్థులు ఆసక్తిగా చదువుకునే విధంగా బోధనోపకరణాలతో చదివించాలన్నారు. అనంతరం చిన్నశంకరంపేట మోడల్ స్కూల్లో ఏర్పాటుచేసిన మండల స్థాయి టీఎల్ఎం మేళాను సందర్శించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన టీఎల్ఎం మేళాలో పాల్గొన్నారు. అలాగే తూప్రాన్‌లో జరిగిన కార్యక్రమానికి ఆర్డీఓ జయచంద్రారెడ్డి, జెడ్పీ సీఈఓ ఎల్లయ్యతో కలిసి హాజరయ్యారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి నర్సాపూర్: మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్ అన్నారు. బుధవారం పట్టణంలోని బస్టాండ్ సమీపంలో పోలీసులు మాదక ద్రవ్యాల నిరోధక కార్యక్రమం నిర్వహించి ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈసందర్భంగా డీఎస్పీ మాట్లా డుతూ.. మాదక ద్రవ్యాలతో జీవితం నాశనం అవుతుందని, ఎవరైనా అమ్మినట్లు తెలిస్తే తమ కు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ మహిపాల్‌రెడ్డి, సీఐ జాన్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎస్ఐ లింగం,ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం న ర్సాపూర్ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించారు. గోవులు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నేడు క్రీడాకారుల ఎంపిక మెదక్ కలెక్టరేట్: అంతర్జాతీయ పాఠశాలల వాలీబాల్ పోటీల్లో పాల్గొనేందుకు గురువారం మెదక్‌లో క్రీడాకారుల ఎంపిక చేపట్టనున్నట్లు పాఠశాల క్రీడా సామాఖ్య కార్యదర్శి నాగరాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నేడు ఉదయం 9 గంటల నుంచి జిల్లా కేంద్రంలోని గుల్షన్ క్లబ్లో ఎంపిక ఉంటుందన్నారు. క్రీడాకారులు 15 సంవత్సరాలలోపు వారై ఉండాలని, వెంట ఒరిజినల్ వయసు ధృవీకరణ పత్రం, 5 కలర్ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకొని రావాలన్నారు. బాలురు 8 మంది, బాలికలు 8 మందిని ఎంపిక చేస్తామన్నారు. ఎంపికై న రెండు జట్లు ఈనెల 18, 19 తేదీల్లో రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. పూర్తి సమాచారం కోసం 9985111011, 89855 36704 నంబర్లలో సంప్రదించాలన్నారు. మహిళలను సంఘాల్లో చేర్పించాలి నర్సాపూర్: మహిళలను సంఘాలలో చేర్పించాలని నాన్ ఫాం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ మల్లే శం చెప్పారు. బుధవారం ఐకేపీ కార్యాలయంలో జరిగిన మండల సమాఖ్య ప్రతినిధుల ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మహిళలను కోటీశ్వరులను చేయాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమం చేపట్టిందన్నారు. 60 ఏళ్లు దాటిన మహిళలతో వయోవృద్ధుల సంఘాలు ఏర్పాటు చేయాలని, 14 నుంచి 18 సంవత్సరాల లోపు కిశోర బాలికల సంఘాలు, దివ్యాంగుల సంఘాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో మండల సమైఖ్య కార్యదర్శి మౌనిక పాల్గొన్నారు. డ్రగ్స్‌ను నిర్మాలిద్దాం అదనపు కలెక్టర్ నగేశ్ మెదక్ కలెక్టరేట్: డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యమని, జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జి ల్లాగా తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ నగేశ్ అధికారులకు సూచించారు. బుధవారం నషాముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్లో అధికారులతో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కా ర్యక్రమంలో వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. -
మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు సహించం
పీసీసీ ఉపాధ్యక్షుడు శ్రవణ్‌కుమార్‌రెడ్డి చేగుంట(తూప్రాన్): జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి పదేళ్లు ఎంపీగా ఉండి దుబ్బాకకు ఏం చేశారో చెప్పాలని పీసీసీ ఉపాధ్యక్షుడు శ్రవణ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం వడియారంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రులను అవమానించే విధంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. కేసీఆర్, హరీశ్‌రావు చెప్పిన మాటలను పక్కన పెట్టి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని హితవు పలికారు. పార్టీలకతీతంగా పనిచేస్తే సహకరిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు విష్ణువర్ధన్‌రెడ్డి, యూత్‌కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, నాయకులు ప్రశాంత్, స్వామి, రాజిరెడ్డి, ఐలయ్య, బాలకృష్ణ పాల్గొన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తం: డీఎంహెచ్ఓ చిన్నశంకరంపేట(మెదక్): సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్ అన్నారు. మంగళవారం నార్సింగి పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులకు అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయా లేదా అని ఆరా తీశారు. కుక్క, పాముకాటుకు అవసరమైన మందులను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. గర్భిణులకు అందించే వైద్యం, పరీక్షలను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికుమార్‌కు పలు సూచనలు చేశారు. ఆ జీఓలను వెంటనే సవరించాలి కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ధర్నా మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వం వేతన సవరణ చేస్తూ తీసుకొచ్చిన ఐదు ప్రిలిమినరీ జీఓలను వెంటనే సవరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం డిమాండ్ చేశారు. మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లే శం మాట్లాడుతూ 2021 సంవత్సరంలో విడుదల చేసిన కనీస వేతనాల ఐదు రకాల జీవోలను యథాతథంగా వెంటనే గెజిట్ చేయాలన్నారు. 73వ షెడ్యూల్ ఎంప్లాయిమెంట్ సంబంధించిన 68 రకాల జీఓలను ప్రభుత్వం సవరించడం లేదన్నారు. పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు జారీ చేసిన జీఓలను గెజిట్ చేయకపోవడం వల్ల ప్రతినెలా రూ.6వేల కోట్లు కార్మికులు నష్టపోతున్నారని వాపోయారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల జీఓలను సవరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సంతోష్, శ్రీనాథ్, శ్రీకాంత్, మల్లేష్, శేఖర్, రాములు, అజయ్, సత్యం, పాల్గొన్నారు. -
బ్లడ్ బ్యాంకులో.. నిల్వలు నిల్!
మెదక్ మున్సిపాలిటీ: బ్లడ్ బ్యాంకులో నిల్వలు నిండుకున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు అత్యవసర సమయాల్లో రక్త యూనిట్ అందక అనేక అవస్థలు పడాల్సి వస్తోంది. జిల్లాలో రక్తమార్పిడికి అవసరమయ్యే రోగుల సంఖ్య పెరిగింది. కానీ ఆస్థాయిలో రక్త నిల్వలు పెరగడం లేదు. దీంతో వైద్యసేవలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తగ్గిపోయిన నిల్వలు రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు, శస్త్ర చికిత్స సమయంలో రోగులకు రక్తం యూని ట్లు అవసరం ఉంటుంది. ఇందుకోసం జిల్లా కేంద్ర ఆస్పత్రి ఆవరణలో బ్లడ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జిల్లాలో రక్తం నిల్వలు అంతంత మాత్రంగానే అందుబాటులో ఉన్నాయి. దాత లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు పిలుపునిస్తున్నారు. కార్యాలయాలు, గ్రామాల్లో ఎప్పటికప్పుడు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నప్పటికీ, జిల్లాలో అవసరాలకు రక్త నిల్వలు సరిపోవడం లేదు. ప్రస్తుతం బ్లడ్ బ్యాంక్‌లో కొన్ని రకాల బ్లడ్ యూనిట్లు పూర్తిగా ఖాళీ అయినట్లు తెలుస్తోంది. కారణాలు ఇవే.. సాధారణంగా ఏ బాధితుడికి రక్తం ఇచ్చినా, ప్రత్యామ్నాయంగా అతడి సంబంధీకుల నుంచి రక్తం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల రక్త నిల్వలు తగ్గిపోకుండా ఉంటాయి. రక్తం అవసరమైన బాధితుల బంధువులు, స్నేహితులకు అవగాహన కల్పించపోవడమే నిల్వలు తగ్గిపోవడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. మరోవైపు రక్తదాతలను ప్రోత్సహించక పోవడం, రక్తం రిప్లేస్మెంట్ చేయక పోవడం వల్ల జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఈ పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. ప్రైవేట్‌లో ఇలా.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందే బాధితులకు రక్తం అవసరమైనప్పుడు ప్రభుత్వ నిల్వ కేంద్రంలోనూ లభించడం లేదు. దీంతో ప్రైవేట్ బ్లడ్ బ్యాంకుల్లో ఒక యూనిట్ బ్లడ్‌కు రూ.1,200 నుంచి 1,400 వరకు వసూలు చేస్తున్నారు. అయితే రక్తం యూనిట్‌కు డబ్బులు చెల్లించలేని నిరుపేదల నుంచి అదేస్థాయిలో యూనిట్ రక్తం తీసుకుంటున్నట్లు సమాచారం.కొన్ని గ్రూపులు పూర్తిగా ఖాళీ మరికొన్ని అంతంత మాత్రమే.. పట్టించుకోని వైద్యాధికారులు అత్యవసర సమయంలోరక్తం అందక అవస్థలుదాతలు ముందుకు రావాలి రేర్ గ్రూపు రక్త యూనిట్లు అందుబాటులో ఉండటం కష్టం. వాటిని అత్యవసర పరిస్థితుల్లో ఇతర ప్రాంతాల నుంచి తీసుకొస్తున్నాం. ఒక రక్తం యూనిట్ కేవలం నెలరోజులు మాత్రమే ఉంటుంది. జిల్లాలోని రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయాలి. స్వచ్చంద సంస్థలు, మానవతామూర్తులు స్పందించాలి. రక్తదానం చేయాలనుకుంటే 8977173917 నంబర్లో సంప్రదించాలి. – అశోక్, టెక్నీషియన్, బ్లడ్ బ్యాంక్, మెదక్ -
ప్రమాదాలకు చెక్ పెట్టాలి
● పరిశ్రమల్లో తనిఖీలు చేసినివేదికలు సమర్పించండి ● అధికారులకు కలెక్టర్ ఆదేశంమెదక్ కలెక్టరేట్: జిల్లాలోని రసాయన, ఔషధ పరిశ్రమలలో ప్రమాదాలు సంభవించకుండా తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మెదక్ సమీకృత కలెక్టరేట్లో ఫ్యాక్టరీలు, రసాయన పరిశ్రమల్లో భద్రతపై ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కమిటీతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు భద్రతపై దృష్టి సారిస్తూ కర్మాగారాలలో పనిచేసే కార్మికుల పూర్తి సమాచారం యాజమాన్యం దగ్గర ఉండాలని సూ చించారు. కార్మికులు మత్తు పదార్థాలు వాడుతున్న ట్లు తమ దృష్టికి వస్తే యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరిశ్రమల్లో అంతర్నిర్మిత భద్రతా వ్యవస్థలను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. జిల్లా స్థాయి కమిటీ ఆయా రసాయనిక పరిశ్రమలు, ఔషధ యూనిట్లను తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని చెప్పారు. అదనపు కలెక్టర్ నగేష్ , ఆర్డీవోలు రమాదేవి, మహిపాల్ రెడ్డి, జయచంద్రారెడ్డి, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మోహన్ బాబు, డైరెక్టర్ ఆఫ్ బాయిలర్స్ శ్రీనివాస రావు, కర్మాగారాల జిల్లా ఉప ప్రధాన అధికారి లక్ష్మి కుమారి, జిల్లా పరిశ్రమల మేనేజర్ ప్రకాష్ రావు, జిల్లా అగ్నియాపక శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, కార్మిక, తదితర శాఖధికారులు పాల్గొన్నారు. సౌర ప్లాంట్లపై మూడు రోజుల్లో నివేదిక జిల్లాలో సౌర విద్యుత్ ఏర్పాటు కోసం మూడు రోజుల్లో నివేదికలు అందజేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఆర్డీవోలు రమాదేవి, జయచంద్రారెడ్డి, మహిపాల్ రెడ్డి, రెడ్కో డీఎం రవీందర్ చౌహన్‌లతో తదితరులతో కలసి సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, వసతి గృహాలు, అన్ని యాజమాన్యాల గురుకులాలలో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ మేరకు ప్లాంట్ ఏర్పాటుకు కావాల్సిన వైశాల్యం, నెలకు విద్యుత్ వినియోగం వంటి వివరాలను నిర్ణీత నమూనాలో పూర్తిచేసి మూడు రోజుల్లోగా నివేదికలు అందించాలని ఆదేశించారు. కాగా, జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పౌష్టికాహారం అందించాలి నిజాంపేట(మెదక్): నిజాంపేట మండల పరిషత్ కార్యాలయం, పశువైద్యశాల, కల్వకుంట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం, ఆరోగ్య ఉప కేంద్రం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ రాహుల్‌రాజ్ పరిశీలించారు. వర్షాకాలంలో వ్యాధులు విస్తరించే ప్రమాదం ఎక్కువగా ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నపిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. కల్వకుంటలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థుల ప్రతిభను కొనియాడారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నిజాంపేట మండలం ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. ఇళ్లు త్వరితగతిన నిర్మించుకుంటే ప్రభుత్వం వెంటనే బిల్లులు జమ చేయనున్నట్లు తెలిపారు. పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలన్నారు. ఎంపీడీవో రాజిరెడ్డి పాల్గొన్నారు.ఉద్యోగులకు సెలవులు రద్దు: కలెక్టర్అప్రమత్తంగా ఉండండిమెదక్ కలెక్టరేట్: జిల్లాలో రానున్న 72 గంటల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని, అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి జిల్లాలోని ఆయా శాఖల అధికారులతో వర్షాల నేపథ్యంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వర్షాల నేపథ్యంలో అత్యవసర పరిస్థితులు ఎదురైన వెంటనే స్పందించేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ 24/7 పనిచేస్తుందని తెలిపారు. వరదలు, ఇళ్లకు నష్టం, రహదారులు ధ్వంసం, చెట్లు కూలిపోవడం వంటి విపత్కర పరిస్థితులు ఎదురైతే వెంటనే కంట్రోల్ రూమ్‌కు 9391942254 సమాచారం అందించాలని కలెక్టర్ కోరారు. ఈ నేపద్యంలో 13, 14, 15 మూడు రోజులు జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులకు, సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. అందరూ అందుబాటులో ఉండాలన్నారు. కాగా జిల్లాలో 11 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. పశుసంవర్ధక శాఖ పరిధిలో పురాతన కోళ్ల ఫారాలు, గోడలు కూలిపోయే ప్రమాదం ఉందని, తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాగునీటి , విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని చెప్పారు. -
ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలి
బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశంగౌడ్ చిన్నశంకరంపేట(మెదక్): స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేశంగౌడ్ కోరారు. మంగళవారం నార్సింగి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి 300 మీటర్ల జాతీయజెండాతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. దేశం కోసం పనిచేస్తున్న సైనికులకు మద్దతుగా నిలవాలని కోరారు.సిద్దిపేట బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, సత్యపాల్‌రెడ్డి, లింగారెడ్డి, గోవింద్, పట్టణ అధ్యక్షుడు నర్సింహులు, లక్ష్మణ్, శ్రీనివాస్, హరిబాబు, రాఖేష్, గురుపాదం, నరేష్, రమేష్, స్వామి, లక్ష్మణ్, దుర్గేష్, స్వామిగౌడ్ పాల్గొన్నారు. -
విద్య, వైద్యానికి ప్రాధాన్యం
● ఎమ్మెల్యే రోహిత్‌రావు ● సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీమెదక్జోన్: తమ ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. మంగళవారం పట్టణంలో నియోజకవర్గంలోని 223 మంది లబ్ధిదారులకు రూ.63 లక్షల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమం తమ ప్రభుత్వానికి రెండు కళ్లు లాంటివని చెప్పారు. ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. రామాయంపేటలో రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నామని తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఎమ్మెల్యే విమర్శించారు. తమ ప్రభుత్వం అర్హులందరికీ కార్డులు ఇచ్చి పేదలకు అండగా నిలిచిందని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ టి.చంద్రపాల్, కిసాన్‌సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి, శంకర్, బ్లాక్ కాంగ్రెస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పవన్, శ్రీనివాస్ చౌదరి, మహేందర్ రెడ్డి, నాగరాజు, ఆంజనేయులు గౌడ్ పాల్గొన్నారు. -
అగ్గి రాజేసిన కబ్జా వార్త
● కాంగ్రెస్, బీఆర్ఎస్ మాటల యుద్ధం ● మాజీ ఎమ్మెల్యేపై దాడికి యత్నం ● పెద్దశంకరంపేటలో ఉద్రిక్తత పెద్దశంకరంపేట(మెదక్): సోషల్ మీడియాలో వచ్చిన ఓ వార్త కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య అగ్గిరాజేసింది. పరస్పర దాడులకు దారి తీసింది. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సంఘటన మంగళవారం పెద్దశంకరంపేటలో చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలో ఆయా పార్టీలకు చెందిన నాయకులు కబ్జాలకు పాల్పడుతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ‘మీరంటే మీరు’అంటూ ఇరు పార్టీల మధ్య వాట్సాప్‌లో చర్చ సాగింది. చివరకు ఒకరిపై ఒకరు దూషణలు చేసుకునే స్థాయికి చేరింది. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్కు చెందిన మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్ ఇంటి ముట్టడికి వచ్చారు. ఆ సమయంలో శ్రీనివాస్ ఇంట్లో లేకపోవడంతో రోడ్డుపైనే ఆందోళనకు దిగారు. అదే సమయంలో మండల పరిధిలోని జూకల్‌లో పర్యటన ముగించుకొని పెద్దశంకరంపేటకు వచ్చిన నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, జంగం శ్రీనివాస్‌ను చూసి అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కోపోద్రిక్తులయ్యారు. నినాదాలు చేస్తూ భూపాల్‌రెడ్డి వాహనంపై ఒక్కసారిగా దాడికి యత్నించారు. ఎస్ఐ.ప్రవీణ్‌రెడ్డి తన సిబ్బందితో కలసి ఆందోళనకారులను చెదరగొట్టారు. అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి ఇరువర్గాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సీఐ మాట్లాడుతూ.. శాంతిభద్రతలకు విఘాతం కల్పించడం, వాట్సాప్ గ్రూపులలో ఒకరిపై ఒకరు దూషణలకు పాల్పడితే అడ్మిన్‌తో పాటు అసత్య ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
టీఎల్‌ఎంతో బోధన సులువు
పెద్దశంకరంపేట(మెదక్): బోధనాభ్యాస సామగ్రి మేళ (టీఎల్ఎం)తో బోఽధించడం ఉపాధ్యాయులకు సులభమవుతుందని జిల్లా విద్యాశాఖాధికారి రాధాకిషన్ అన్నారు. మంగళవారం పెద్దశంకరంపేటలో టీఎల్ఎం మేళాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు తయారు చేసిన బోధనాభ్యాస సామగ్రిని పరిశీలించారు. డీఈఓ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు తయారు చేసిన టీఎల్‌ఎంతో తరగతి గదిలోని చివరి విద్యార్థికి కూడా అర్థమయ్యేలా బోధన ఉండాలని, ఎఫ్‌ఎల్‌ఎంలో జిల్లా ముందుందని చెప్పారు. ఈ నెల 19న జిల్లా స్థాయి మేళాను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ వెంకటేశం, కాంప్లెక్స్ హెచ్ఎంలు విఠల్, అశోక్‌రెడ్డి, హెచ్ఎంలు మారుతి, బి.శ్రీనివాస్, సత్యకుమార్, కుమార్, ఎన్.శ్రీనివాస్, ఆనంద్, ప్రసన్న, రాములు, గోపి, రిటైర్డు హెచ్ఎంలు రామచంద్రాచారి,విజయ్‌కుమార్ తదితరులు ఉన్నారు. చందాయిపేటలో కస్తూర్బా పాఠశాల చేగుంట(తూప్రాన్): చందాయిపేటలో వృథాగా ఉన్న ఉన్నత పాఠశాల భవనాలను జిల్లా విద్యాధికారి రాధాకిషన్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులను సమన్వయపరిచి చందాయిపేటలో మాసాయిపేట మండల కస్తూర్బా పాఠశాల నిర్వహణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సందర్శించారు. విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలని చెప్పారు. పీఎంశ్రీ నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఆయన వెంట ప్రధానోపాధ్యాయడు కిషన్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అమర్ శేఖర్‌రెడ్డి, తపస్ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, ఉపాధ్యాయులు విఠల్‌రెడ్డి, నర్సింలు, ఊర్మిల తదితరులు ఉన్నారు. జిల్లా విద్యాధికారి రాధాకిషన్ పెద్దశంకరంపేటలో టీఎల్ఎంమేళా ప్రారంభం -
కోమటికుంట కాల్వను పునరుద్ధరించాలి
నర్సాపూర్: కోమటికుంట అలుగు కాల్వను పునరుద్ధరించాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె పట్టణంలో పర్యటించారు. తొలుత ఇరిగేషన్ డీఈఈ బుజ్జిబాబు, ఏఈ మణిభూషన్, మున్సిపల్ కమిషనర్ రాంచరణ్రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులతో కలిసి వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లు, పలు కాల్వలను పరిశీలించారు. అనంతరం రాయరావు చెరువు కట్టు కాల్వను పరిశీలించారు. కాల్వలో పేరుకుపోయిన పిచ్చి మొక్కలు తొలగించాలని సూచించారు. అనంతరం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నులి పురుగు నివారణ మాత్రలు వేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 731 సర్వే నంబర్లో 35ఎకరాల భూమి రెవెన్యూ శాఖదని గతంలో ఆ శాఖ అధికారులు తేల్చారని గుర్తు చేశారు. ఇటీవల అటవీశాఖ అధికారులు ఆ భూమి తమదని చెబుతున్నారని అన్నారు. ఈ భూమిలో ఇప్పటికే మున్సిపాలిటీకి చెందిన డంప్‌యార్డు నిర్మించడంతో పాటు ఓయూ పీజీ కాలేజీకి 10 ఎకరాలు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టేందుకు మిగితా భూమిని రెవెన్యూ అధికారులు కేటాయించారన్నారు. ప్రస్తుతం ఆ భూమి తమదని అటవీశాఖ చెప్పడంతో సమస్య తలెత్తిందన్నారు. ఈ విషయంపై కలెక్టర్‌తో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి -
రైతు బీమా.. ధీమా
రేపటితో ముగియనున్న గడువుమెదక్జోన్: రైతుబీమా దరఖాస్తు గడు వు రేపటితో ముగియనుంది. ఇప్పటికే అర్హులైన పాత వారితో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకునే రైతులందరికీ ఈనెల 14న ఎల్ఐసీ (బీమా) బాండ్లు రానున్నాయి. అలాగే నామినీ పేరు సవరణ చేసుకునేందుకు మంగళవారంతో గడువు ముగియనుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా 6 లక్షల పైచిలుకు వ్యవసాయ భూములుండగా, సుమారు 2 లక్షల వరకు రైతులు ఉన్నారు. గత ప్రభుత్వం 2018లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. రైతు ఏ కారణం చేత మరణించినా, ఆ కుటుంబానికి ఎల్ఐసీ పాలసీ తరఫున సదరు రైతు కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున బీమా సొమ్ము చెల్లిస్తుంది. ప్రతి ఏడాది బీమా ప్రీమియం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం సదరు ఎల్ఐసీకి చెల్లిస్తోంది. ఈ పథకంలో ఇప్పటివరకు 1,77,084 మంది రైతులు పాతవారు ఉండగా, జూన్ 5 వరకు జిల్లాలో కొత్తగా పట్టాపాస్ పుస్తకాలు పొందిన రైతులు 12,145 మంది ఉన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. కొత్తవారు సకాలంలో బీమాకు దరఖాస్తు చేసుకుంటే ఆ సంఖ్య 1,89,229కు చేరనుంది. బీమాకు అర్హులు వీరే.. రైతు బీమాకు 18 నుంచి 59 ఏళ్ల మధ్య గల రైతులు మాత్రమే అర్హులు. 1966 ఆగస్టు, 2007 ఆగస్టు మధ్యలో జన్మించిన వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. కాగా ఇప్పటికే ఈ పథకంలో 59 ఏళ్లు నిండిన రైతులు ఉంటే అధికారులు వారి పేర్లను తొలగిస్తారు. కొత్తగా పాస్ పుస్తకం పొందిన రైతులు ఆయా మండలాల ఏఈఓలు, ఏఓలకు పట్టాదార్ పాస్ పుస్తకం జిరాక్స్ తో పాటు ఆధార్‌కార్డు జిరాక్స్ అందజేస్తే బీమాకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేస్తారు. అలాగే నామినీ ఆధార్‌కార్డుతో పాటు వివరాలు అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. అర్హులు దరఖాస్తు చేసుకోవాలి కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకం పొందిన ప్రతి రైతు ఈనెల 13వ తేదీ వరకు రైతుబీమా కోసం దరఖాస్తు చేసుకోవాలి. నామినీ సవరణ చేసుకునే వారికి మంగళవారం సాయ ంత్రం వరకు అవకాశం ఉంది. ఈ పథకం రైతు కుటుంబాలకు కొండంత అండగా ఉంటుంది. – దేవ్‌కుమార్, జిల్లా వ్యవసాయాధికారి నేటితో ముగియనున్న నామినీ సవరణ జిల్లాలో 1.77 లక్షల రైతుల ఇన్సూరెన్స్ రెన్యూవల్ కొత్తగా పాస్‌పుస్తకాలు పొందినవారు 12 వేల పైచిలుకు.. -
రెండు, మూడు రోజుల్లో సరఫరా
నర్సాపూర్ శాండ్ బజార్ రెండు మూడు రోజుల్లో ప్రారంభం అవుతుంది. మెదక్, తూప్రాన్‌లో కూడా త్వరలో ప్రారంభిస్తాం. లబ్ధిదారులు పిల్లర్లే వేయాల్సిన అవసరం లేదు. రాతి గోడలపైన స్లాబ్ పటిష్టంగా ఉంటుంది. మేసీ్త్రలు కూడా న్యాయమైన చార్జీలు తీసుకొని, లబ్ధిదారులకు సహకరించాలి. వ్యాపారులు సరైన ధరలకు సామగ్రి విక్రయించాలి. ఇందుకోసం మండల స్థాయిలో కమిటీలు వేసి అవగాహన సదస్సులు నిర్వహించాం. ఇక నుంచి ఆధార్ ఆధారంగా బిల్లులు చెల్లిస్తాం. – మాణిక్యం, డీఈ, హౌసింగ్ -
ఇందిరమ్మ ఇంటికి ఇసుక తిప్పలు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిరుపేదలకు భారంగా మారింది. ఇంటి నిర్మాణానికి ఇసుక తిప్పలు తప్పడం లేదు. జిల్లాలో శాండ్ బజార్లు ఏర్పాటు చేసి ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామన్న అధికారుల మాటలు నీటి మూటలుగానే మారాయి. దీంతో ఇంటి నిర్మాణ వ్యయంలో సుమారు మూడో వంతు ఇసుక కోసమే ఖర్చు చేయాల్సిన దుస్థితి నెలకొందని లబ్ధిదారులు వాపోతున్నారు. బయట టన్నుకు రూ. 2,600 చెల్లించి కొనుగోలు చేస్తున్నామని, దీనికి రవాణా చార్జీలు అదనమని వాపోతున్నారు. – మెదక్ అర్బన్ జిల్లాలో మెదక్, నర్సాపూర్, తూప్రాన్ పట్టణాల్లో శాండ్ బజార్లు ఏర్పాటు చేయాలని అధికారుల సంకల్పించారు. కాళేశ్వరం, భద్రాచలం తదితర ప్రాంతాల నుంచి ఇసుక తీసుకొచ్చి, ఈ పాయింట్లలో నిల్వ చేసి, లబ్ధిదారులకు ఉచితంగా సరఫరా చేయాలని సంకల్పించారు. అయితే ట్రాన్స్‌పోర్టు మాత్రం లబ్ధిదారులే భరించాలని సూచించారు. కానీ ఇప్పటివరకు సంబంధిత ప్రాంతాల్లో ఇసుక నిల్వలకు స్థలం దొరకడం లేదని తెలిసింది. కలెక్టర్ ఆదేశాల మేరకు తాత్కాలికంగా, మార్కెట్ యార్డుల్లో శాండ్ బజార్లు ఏర్పాటు చేసి లబ్ధిదారులకు ఇసుక సరఫరా చేయాలని ఆదేశించినట్లు సమాచారం. కాగా త్వరగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలన్న అధికారుల ఆదేశాల మేరకు లబ్ధిదారులు వ్యయ, ప్రయాసల కోర్చి, బయట టన్నుకు రూ. 2,600 చెల్లించి ఇసుక కొనుగోలు చేస్తున్నారు. దీనికి ట్రాన్స్‌పోర్టు అదనం. ఒక్క ఇందిరమ్మ ఇంటికి సుమారు 60 టన్నుల ఇసుక అవసరం అవుతుందని మేసీ్త్రలు చెబుతున్నారు. ఈ లెక్కన చూస్తే, ఇందిరమ్మ ఇంటి బిల్లులో సుమారు రూ. 1,80,000 వరకు ఇసుకకే ఖర్చు అవుతుంది. ఇదిలా ఉంటే ఇందిరమ్మ ఇళ్లు అన్నీ ఒకేసారి ప్రారంభం కావడంతో నిర్మాణ వ్యయాలు కూడా పెరిగాయి. సిమెంట్, స్టీల్, మేసీ్త్రలు, కూలీల ఖర్చులు అమాంతంగా పెరిగిపోయాయి. దీంతో ప్రభుత్వం ఇచ్చే బిల్లుకు అదనంగా సుమారు రూ. 3 లక్షల వరకు లబ్ధిదారులు భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బిల్లుల చెల్లింపులో సైతం కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. బ్యాంకు పాస్‌బుక్‌లో పేర్లు తప్పుగా నమోదు కావడం, ఆధార్, బ్యాంకు లింకు లేకపోవడం, తదితర కారణాలతో బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతున్నట్లుతెలుస్తుంది.పాపన్నపేటలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇల్లు -
అర్జీలను త్వరగా పరిష్కరించాలి
మెదక్ కలెక్టరేట్: కలెక్టరేట్లో సోమవారం జరిగిన జిల్లాస్థాయి ప్రజావాణిలో కలెక్టర్ రాహుల్‌రాజ్, అదనపు కలెక్టర్ నగేశ్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య ఇతర జిల్లా అధికారులతో కలిసి వినతులు స్వీకరించారు. మొత్తం 66 అర్జీలు రాగా వాటిని పరిశీలించారు. త్వరితగతిన అర్జీలు పరిష్కరించి ప్రజలకు సమాఽ దానం చెప్పాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. కాగా ఓ దివ్యాంగురాలు తనకు ఇందిరమ్మ ఇంటి మంజూరులో నెలకొన్న సమస్యను కలెక్టర్‌కు విన్నవించారు. స్పందించిన ఆయన దివ్యాంగురాలికి న్యాయం జరిగేలా చూడాలని డీఎల్పీఓకు సూచించారు. అనంతరం దివ్యాంగురాలు కలెక్టర్‌కు రాఖీ కట్టింది. నులి పురుగులను నులుమేద్దాం మెదక్‌జోన్: నులి పురుగుల నివారణకు అల్బెండజో ల్ మాత్రలు తప్పనిసరిగా వాడాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. జాతీయ నులి పురుగుల దినో త్సవం సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పలువురికి మాత్రలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కడుపులో ఏర్ప డే నులిపురుగుల వల్ల పిల్లల ఎదుగుదల మందగించడంతో పాటు నీరసం, రక్తహీనత, చదువులో ఏకాగ్రత కోల్పోతారని అన్నారు. నివారణకు ఏకై క మార్గం మాత్రలు మింగటమేనన్నారు. జిల్లాలో 1 నుంచి 19 ఏళ్ల వయస్సు గల వారు 2,11,964 మంది ఉన్నారని, అందరికీ మాత్రలు పంపిణీ చేస్తామన్నారు. అనంతరం వంటశాల, నిత్యావసర వస్తువులు, కూరగాయలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ శ్రీరామ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ అనిలా, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ మాధురి, మలేరియా అధికారి నవ్య, ప్రోగ్రాం అధికారి హరిప్రసాద్ పాల్గొన్నారు. కలెక్టర్ రాహుల్‌రాజ్ ప్రజావాణికి 66 వినతులు -
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
శివ్వంపేట(నర్సాపూర్): మనోహరాబాద్ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ ఏఈ రాకేశ్ తెలిపారు. శివ్వంపేట మండలంలోని సికింద్లాపూర్, గోమారం, చండి, శభాశ్పల్లి పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యా హ్నం 2 గంటల వరకు ఆయా సబ్స్టేషన్ల పరిధిలో త్రీ ఫేజ్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు చెప్పారు. వినియోగదారులు, రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ‘పైరవీలకు తావు లేదు’ మెదక్ మున్సిపాలిటీ: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్ర జల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 21 ఫిర్యాదులు రాగా, వాటిని పరిశీలించి చట్ట ప్రకారం ఫిర్యాదుదారులకు న్యాయం జరిగేలా చూడాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, పైరవీలకు తావు లేకుండా స్వచ్ఛందంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. పరిశ్రమల్లో ప్రమాదాలను నివారించాలి మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, మంగళవారం జరిగే సమావేశానికి ట్రేడ్ యూనియన్లను ఆహ్వానించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అజ్జమర్రి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం అదనపు కలెక్టర్ నగేశ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని పరిశ్రమల్లో నిత్యం ఏదో ఒకచోట ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. సరైన రక్షణ చర్యలు ఉండటం లేదని వాపోయారు. గతంలో ట్రేడ్ యూనియన్‌తో సేఫ్టీ కమిటీ వేశారని, ఒక్కసారి కూడా అధికారులు సమావేశం జరపలేదని వా పోయారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి నర్సమ్మ పాల్గొన్నారు. హెచ్‌పీసీకి విద్యార్థి ఎంపిక మెదక్ కలెక్టరేట్: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (రామంతాపూర్)కు సోమవారం లాటరీ ద్వా రా విద్యార్థిని ఎంపిక చేశారు. జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్ పాల్గొన్నారు. పాఠశాలలో 1వ తరగతికి ఇంగ్లీష్ మీడియంలో ఒక సీటు ఖాళీ ఉండగా, ఇటీవల పత్రిక ప్రకటన చేశారు. ఇందుకు పలువురు విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, నార్సింగి మండలం జప్తిశివనూర్కు చెందిన దొబ్బల రోసిన ఎంపికై నట్లు తెలిపారు. అంగన్వాడీల్లో ప్రీ ప్రైమరీ నిర్వహించాలి మెదక్ కలెక్టరేట్: అంగన్వాడీ కేంద్రాల్లోనే ప్రీ ప్రైమరీ పీఎం శ్రీ విద్యను నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం డీడబ్ల్యూఓ హైమావతికి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశం మాట్లాడుతూ.. కేంద్రం ప్రీ ప్రైమరీ పీఎం శ్రీ విద్యను తీసుకొచ్చి అంగన్వాడీ కేంద్రాలను నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. జిల్లాలో 3 నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులు, గర్భిణుల్లో పోషకాహార లోపాన్ని నివారించడంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. కేంద్రం ప్రత్యేక వలంటీర్లను నియమించి అదనపు కేంద్రాలను నిర్వహించాలని చూస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను కాపాడుకోకుండా, కేంద్రానికి వత్తాసు పలుకుతుందని మండిపడ్డారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షురాలు జబీన్ ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. జాతీయస్థాయి యోగా పోటీలకు ఎంపిక -
ఫీ‘వర్రీ’
నర్సాపూర్: మున్సిపాలిటీ పరిధిలో పలువురు డెంగీతో పాటు మలేరియా, వైరల్ ఫీవర్‌తో సతమతం అవుతున్నారు. పట్టణంలోని ఆరో వార్డులో ఒకే ఇంటిలో ముగ్గురు, మరో ఇంటిలో ఒకరు డెంగీ బారిన పడి ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంటున్నట్లు తెలిసింది. తాజాగా మరో ఇద్దరు డెంగీ బారినపడ్డారని తెలిసింది. దోమలు పెరగకుండా అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై మండల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రఘువరుణ్ను వివరణ కోరగా, గతంలో ఐదుగురు డెంగీ బారినపడి వైద్యం చేయించుకొని ఇంటికి వచ్చారని, తాజాగా మరో ఇద్దరు వైద్యం పొందుతున్నారని చెప్పారు. తమ సిబ్బంది ఇంటింటికీ తిరిగి ఫీవర్ సర్వే చేస్తున్నారని, వ్యాధులు ప్రబలకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. -
నేరాల నియంత్రణకు కృషి చేయాలి
మెదక్‌మున్సిపాలిటీ/శివ్వంపేట(నర్సాపూర్)/వెల్దుర్తి(తూప్రాన్): నేరాల నియంత్రణకు పోలీస్ సిబ్బంది కృషి చేయాలని ఎస్పీ శ్రీనివాస్‌రావు అన్నారు. సోమవారం సాయంత్రం శివ్వంపేట పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. పరిసరాలు, రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గ్రామాల్లోని ప్రధాన కూడలిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్య లు చేపట్టాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రమాదాలు జరిగే చోట సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. డ్రగ్స్, గంజాయి వంటి అమ్మకాలు జిల్లాలో ఎక్కడా జరగకుండా కఠినంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్, సీఐ రంగాకృష్ణ, ఎస్ఐ మధుకర్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు. అనంతరం వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్ కేసుల గురించి ఆరా తీశారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసేవారికి తగిన గుర్తింపు వస్తుందన్నారు. ఇదిలాఉండగా సైబర్ నేరాలపై జిల్లా పోలీ స్ ప్రధాన కార్యాలయం నుంచి ఎస్పీ ఒక ప్రకటన విడుదల చేశారు. అప్రమత్తంగా ఉండటంతోనే సైబర్ నేరాలను అడ్డుకోగలమని తెలిపారు.ఎస్పీ శ్రీనివాస్‌రావు -
సమస్యల పరిష్కారానికి పోరాటం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్క రాములు మెదక్ కలెక్టరేట్: గ్రామాల్లో ప్రజా సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని, సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేపడుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్క రాములు తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్లో జరిగిన జిల్లాస్థాయి పార్టీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి గ్రామంలో మురుగు నీటి కాలువలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించామన్నారు. పంచాయతీలకు బడ్జెట్ లేక పారిశుద్ధ్య పనులు చేపట్టడం లేదన్నారు. దోమలు, ఈగలు పెరిగి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు అడివయ్య, జిల్లా కార్యదర్శి నర్స మ్మ, కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం పాల్గొన్నారు. -
నిర్మాణ పనుల్లో వేగం పెంచండి
మెదక్ మున్సిపాలిటీ: ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మాణ పనులు గడువులోగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం మెదక్ పట్టణంలోని గాంధీనగర్ వీధిలో రూ. 5 కోట్లతో ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆదివారం కలెక్టర్ ఆకస్మికంగా నిర్మాణ పనులను పరిశీలించారు. ముందుగా మ్యాప్‌ను పరిశీలించి సంబంధిత కాంట్రాక్టర్‌ను పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. నవంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని పంచాయతీరాజ్ ఈఈని ఆదేశించారు. జ్వర సర్వే పకడ్బందీగా నిర్వహించాలి కౌడిపల్లి(నర్సాపూర్): మూడు రోజులకు మించి జ్వరంతో బాధపడితే తక్షణమే దగ్గరలోని పీహెచ్‌సీని సందర్శించి వైద్యులతో పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ రోగులకు సూచించారు. ఆదివారం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రిజిస్టర్లను పరిశీలించారు. వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా సీజనల్ వ్యాధు లు సంభవిస్తున్నాయని, జ్వరం వచ్చినప్పుడు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని చెప్పారు. కౌడిపల్లి మండలంలో నిర్మాణంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ భవనాన్ని పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలతో సెప్టెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని ఈఈ టీజీఎంఐడీసీని ఆదేశించారు. అనంతరం కౌడిపల్లిలోని సమీకృత బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేశారు.కలెక్టర్ రాహుల్‌రాజ్ -
మంజీరాపై రబ్బరు డ్యాం
నారాయణఖేడ్: మంజీరా నదిపై మనూరు మండలం రాయిపల్లి వద్ద రబ్బరు డ్యాం ఏర్పాటుకు వీలైనంత త్వరగా సమగ్ర ప్రణాళిక (డీపీఆర్) రూపొందించి అందజేయాలని కన్సల్టెన్సీ నిర్వాహకులకు ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి సూచించారు. నీటి పారుదల శాఖ విశ్రాంత సీఈ విఠల్‌రావు, హైడ్రో కన్స్ట్రక్ట్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ శ్రీధర్‌రెడ్డి, ప్రాజెక్టు సమన్వయకర్త ప్రకాశ్‌రెడ్డి ఆదివారం రాయిపల్లి వద్ద మంజీరా నది పరీవాహక ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి రబ్బరు డ్యాం గురించి వివరించారు. మంజీరా నదిపై రాయిపల్లి వద్ద గల వంతెనను ఆరు ప్యానెళ్లుగా.. 320 మీటర్ల మేర రబ్బరు డ్యాం ఏర్పాటు చేయాలి. రూ. 200 కోట్లు ఖర్చువుతుందని ప్రాథమిక అంచనా. బుల్లెట్ ప్రూఫ్ ఉండి ఎంత వరద వచ్చినా తట్టుకుంటుంది. 50 ఏళ్ల వరకు జీవితకాలం ఉండగా, నిర్వహణ ఖర్చు నిర్మాణ వ్యయంలో ఒక శాతం మాత్రమే ఉంటుంది. అయిదు మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేసుకోవచ్చు. అవసరాలకు అనుగుణంగా హెచ్చుతగ్గులు చేసుకోవచ్చు. పూడిక సమస్య ఉండదు. ఖేడ్, అందోలు, జహీరాబాద్ ప్రాంతాల్లో భూగర్భజలాలు పెరిగి వేసవిలోనూ బోర్లు పనిచేసే అవకాశాలు ఉంటాయి. త్వరలోనే డీపీఆర్ రూపొందించి అందజేస్తామని కన్సల్టెన్సీ నిర్వాహకులు వివరించారు. త్వరలో డీపీఆర్ పరీవాహక ప్రాంతాన్ని పరిశీలించిన ఇంజనీర్లు -
లోటును మించి..!
మారిన జిల్లా వర్షపాత ముఖచిత్రంమూడు మండలాల్లో అత్యధికం మూడు రోజులుగా జిల్లాలో సాధారణం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటివరకు మూడు మండలాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. ఈనెలలో రామాయంపేట మండలంలో 42 మి.మీ వర్షం కురిసింది. చేగుంటలో 28 మి.మీ, నర్సాపూర్‌లో 20 మి.మీ మేర అత్యధిక వర్షపాతం నమోదైంది. కాగా జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది అన్నిరకాల పంటలు 3.50 లక్షల ఎకరాలు సాగు కావాల్సి ఉండగా, ఇప్పటికే ఆరుతడి పంటలు 50 వేల ఎకరాల్లో సాగయ్యాయి. వరి 3 లక్షల ఎకరాల మేర సాగు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు 2.43 లక్షల ఎకరాలు సాగైనట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన ఇంకా 57 వేల ఎకరాలు సాగులోకి రావాల్సి ఉంది. జిల్లా వర్షపాత వివరాలు మి.మీలో.. నెల వర్షపాతం నమోదు కావాల్సింది జూన్ 81.7 112.4 జూలై 119.4 206.6 ఆగస్టు 400.7 387.7 (ఇప్పటివరకు)మెదక్‌జోన్: మెతుకుసీమను వర్షాలు మురిపించాయి. నిన్నటి వరకు లోటు వర్షపాతంలో ఉండగా, ఒక్కసారిగా సాధారణానికి మించి నమోదైంది. సాగుకు మరో వారం రోజుల గడువు మాత్రమే ఉండటంతో రైతులు ముమ్మరంగా నాట్లు వేస్తున్నారు. ఈసారి సాధారణ సాగు అవుతుందని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లావాప్తంగా జూన్‌లో 112.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 81.7 మి.మీ వర్షం కురిసింది. ఈ లెక్కన 30.7 మి.మీ తక్కువగా నమోదైంది. జూలైలో 206.6 మి.మీ కురవాల్సి ఉండగా, 119.4 మి.మీ నమోదైంది. ఈ లెక్కన 87.2 మి.మీ తక్కువగా నమోదైంది. గడిచిన జూన్, జూలైలో మొత్తంగా 319 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా, 201.1 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. 117.9 మి.మీ తక్కువగా నమోదైంది. ఈనెలలోనే ప్లస్.. గడిచిన రెండు నెలల్లో మైనస్ వర్షపాతం నమోదు కాగా, ఈనెలలో గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు లోటు నుంచి ప్లస్‌కు చేరుకుంది. ఈనెల 10వ తేదీ వరకు 387.7 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా, ఇప్పటివరకు 400.7 మి.మీ వర్షం నమోదు అయింది. ఈ లెక్కన 13 మి.మీ ఎక్కువగా కురిసిందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ మూడు రోజుల్లోనే జిల్లాలో 46.8 మి.మీ వర్షం కురిసింది. ఈనెలలో ఇప్పటివరకు 10.6 మి.మీ వర్షం కురవాల్సి ఉంది. ఈలెక్కన 36.2 మి.మీ అధికంగా నమోదైందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. -
బడులకు స్టార్ రేటింగ్
పాపన్నపేట(మెదక్): పాఠశాలలను హరిత వనాలుగా.. పరిశుభ్ర కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు బడులకు రేటింగ్ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. గతంలో ఉన్న స్వచ్ఛ విద్యాలయ పురస్కార్‌లో మార్పులు చేసి, స్వచ్ఛ ఏవమ్ విద్యాలయ రేటింగ్ (ఎస్‌హెచ్‌వీఆర్) 2025–26 పేరిట బడులకు రేటింగ్ పథకం ప్రారంభించనున్నారు. జాతీయ స్థాయికి ఎంపికై న పాఠశాలలకు స్వచ్ఛ విద్యాలయ పురస్కార్‌తో పాటు రూ. లక్ష ప్రోత్సాహకం అందించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మొత్తం ఆరు ప్రధాన కొలమానాలకు సంబంధించి 60 సూచికల ఆధారంగా ఒకటి నుంచి ఐదు స్టార్లు కేటాయించనున్నారు. ఒక్కో జిల్లా నుంచి 8 పాఠశాలలను ఈ పథకం కింద ఎంపిక చేస్తారు. ఉమ్మడి జిల్లాలో 4,698 పాఠశాలలు ఉమ్మడి జిల్లాలో వివిధ కేటగిరిలకు చెందిన 4,698 పాఠశాలలున్నాయి. మెదక్‌లో 1067, సిద్దిపేటలో 1,862, సంగారెడ్డిలో 1,769 పాఠశాలలున్నాయి. 1 నుంచి 10వ తరగతి వరకు ఉన్న అన్ని పాఠశాలలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా పాఠశాలల హెచ్ఎంలు ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఎస్‌హెచ్‌వీఆర్ పోర్టల్‌లో నమోదు చేయాలి. ప్రతి సూచికకు సంబంధించిన ఆధారాలు అప్లోడ్ చేయాలి. పరిశీలకులు స్వయంగా పరిశీలించి ఒకటి నుంచి ఐదు వరకు రేటింగ్ ఇస్తారు. ఉత్తమ స్కోర్ సాధించిన బడులకు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో గుర్తింపు ఇస్తారు. ఒక్కో జిల్లా నుంచి 8 పాఠశాలలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. రాష్ట్రస్థాయిలో గరిష్టంగా 20 పాఠశాలలకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తారు. వాటిని జాతీయ స్థాయికి పంపిస్తారు. జాతీయ స్థాయికి ఎంపికై న పాఠశాలలకు రూ. లక్ష చొప్పున ప్రోత్సాహక నగదు అందజేస్తారు. సంబంధిత హెచ్ఎంలు, ప్రిన్సిపాల్స్ దేశంలోని ప్రముఖ సంస్థలను సందర్శించే అవకాశం కల్పిస్తారు. 6 అంశాలు.. 60 సూచికలు ప్రధానం ఆరు అంశాల ఆధారంగా పాఠశాలలకు రేటింగ్ ఇస్తారు. పాఠశాలలో నీటి సదుపాయం, వాన నీటి సంరక్షణ, వినియోగం, టా యిలెట్ సౌకర్యాలు, విద్యార్థులకు సబ్బుతో హాండ్ వాషింగ్, వ్యర్థాల నిర్వహణ, మొక్కల పెంపకం, ప్లాస్టిక్ వాడకం తగ్గించడం, విద్యు త్ సదుపాయం, బిహేవియర్ మా ర్పు, కెపాసిటీ నిర్మాణం, మిషన్ లైఫ్ యాక్టివిటీస్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తారు.పచ్చదనం.. పరిశుభ్రతే లక్ష్యం ఒక్కో జిల్లా నుంచి 8 పాఠశాలలు ఎంపిక జాతీయస్థాయికి ఎంపికై తే రూ. లక్ష ప్రోత్సాహకం మెదక్‌లో 1,067, సిద్దిపేట 1,862, సంగారెడ్డి 1,769 స్కూళ్లు -
అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు
బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్ వెల్దుర్తి(తూప్రాన్): ప్రధాని మోదీ అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్, మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కవితారెడ్డి అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టి 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చేపట్టిన మహాజన్ సంపర్క్ అభియాన్‌కు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందన్నారు. ఆదివారం మండలంలోని మానెపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొని కేంద్ర పథకాలను ఇంటింటికీ తిరిగి ప్రజలకు వివరించారు. గ్రామంలో అమరవీరుల విగ్రహాలను శుభ్రపరిచి పూలమాలలు వేశారు. అలాగే జానకంపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ మధును సత్కరించారు. కార్యక్రమంలో ఓబీసీ సెల్ మండల అధ్యక్షుడు వెంకటేశం, మండల ఇన్చార్జి బాలరాజు, మండల అధ్యక్షుడు దాసు, నాయకులు పాల్గొన్నారు. -
మల్లన్న దరి.. భక్తఝరి
కొమురవెల్లి మల్లన్న ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ పరిసరాలు స్వామి వారి నామస్మరణతో మారుమోగాయి. తెల్లవారుజామునుంచే స్వామిదర్శనానికి భక్తులు బారులు తీరారు. అభిషేకాలు, నిత్యకల్యాణం, ప్రత్యేకపూజలు చేశారు. పట్నాలు, గంగిరేణు చెట్టుకు ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఏర్పాట్లను ఆలయ ఏఈఓ బుద్ది శ్రీనివాస్, పర్యవేక్షకులు శ్రీరాములు, సురేందర్ రెడ్డి, ఆలయ ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్ పర్యవేక్షించారు. – కొమురవెల్లి(సిద్దిపేట) -
దుర్వాసన భరించలేం
జిన్నారం(పటాన్చెరు): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని అయ్యమ్మ చెరువు నిండుకుండలా మారింది. సమీ పంలోని ఇళ్లకు వరద నీరు రావడంతో దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రసాయన వ్యర్థ జలాలతో కలుషితమయంగా మారిన చెరువు నీరు ఇళ్లకు సమీపంలోకి రావడంతో వాసన తట్లుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు నీటిలో ఉండే పాములు, ఇతర కీటకాలు ఇళ్లల్లోకి రావడంతో ఆందోళన చెందుతున్నారు. సమస్యను తక్షణమే పరిష్కరించేలా అధికారులు చర్యలు చేపట్టాలని పట్టణ వాసులు కోరుతున్నారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
రేగోడ్(మెదక్): అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మండల కేంద్రంలో శనివారం మంత్రి పర్యటించారు. కార్యకర్తలతో ముచ్చటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ గృహాన్ని పరిశీలించి, మండలానికి మంజూరైన ఇళ్లు, నిర్మాణ పనులు ఎలా ఉన్నాయని కాంగ్రెస్ నాయకులను అడిగి తెలుసుకున్నారు. మండలంలో విద్యుత్ తీగలు వేలాడుతుండటం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇళ్లు మంజూరవుతాయని, ప్రభుత్వ నిబంధనల ప్రకా రం ఇళ్లు నిర్మించుకోవాలని సూచించారు. సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తూనే.. మండలాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం మహిళలు మంత్రి దా మోదరకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు కిషన్, మాజీ జెడ్పీటీసీలు యాదగిరి, రాజేందర్ పాటిల్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ శ్యాంరావు కులకర్ణి, గ్రామ పార్టీ అధ్యక్షుడు శంకరప్ప, మాజీ సర్పంచ్ విజయభాస్కర్, మాజీ ఎంపీటీసీ నరేందర్, కో ఆప్షన్ మాజీ సభ్యు డు చోటుమియా, వట్పల్లి ఏఎంసీ డైరెక్టర్ శ్రీధర్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.మంత్రి దామోదర రాజనర్సింహ -
సృజనాత్మకతకు వేదిక
ముక్కు మూసుకొని నిరసన తెలుపుతున్న ప్రజలుజిల్లా వివరాలు విద్యాసంవత్సరం వచ్చిన ప్రాజెక్ట్‌లు 2022–23 54 2023–24 38 2024–25 54మెదక్ కలెక్టరేట్: విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు ‘ఇన్స్పైర్ మనక్’ చక్కని వేదిక. ఈ పోటీల్లో విద్యార్థులందరూ పాల్గొనేలా కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్లు ఉపాధ్యాయులకు సూచించాయి. దరఖాస్తు ఇలా.. ముందుగా పాఠశాలను www.inspireawards&dst.in ద్వారా వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇదివరకే వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే స్కూల్ అథారిటీ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ తయారు చేసే విద్యార్థి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలు, ఫొటో, ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారం ఇన్స్పైర్ వెబ్సైట్ ద్వారా అప్లోడ్ చేసుకోవాలి. విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను సెప్టెంబర్ 15వ తేదీలోపు సంబంధిత వెబ్సైట్ ద్వారా అప్లోడ్ చేయాలి. ఎంపికై తే రూ. 10 వేలు బహుమానం ప్రభుత్వ, ప్రైవేట్, జెడ్పీహెచ్ఎస్, ఎయిడెడ్, కేజీబీవీ, మోడల్ స్కూల్స్, మైనార్టీ, గురుకులాల్లో 6 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులుగా నిర్ధారించారు. ప్రతి తరగతి విద్యార్థి ఒక సబ్జెక్ట్‌ను ఎంపిక చేసుకోవాలి. విద్యార్థులు రూపొందించే ప్రాజెక్టుల అవసరాల మేరకు ప్రభుత్వం ఆర్థిక సాయం కింద రూ.10 వేలు అందిస్తుంది. విద్యార్థులు తాము రూపొందించే ప్రాజెక్ట్ వివరాలను ఆన్లైన్లో ఇన్స్పైర్ మనక్ వెబ్‌సైట్‌కు పంపించాలి. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ వారు విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టు వివరాలను సరిచూసుకొని ఎంపికై న విద్యార్థి ఖాతాలో డబ్బులు జమ చేస్తారు. అయితే వివిధ రకాలైన ప్రయోగాల్లో రెగ్యులర్‌గా అనుకరణలు వస్తున్నాయని అధికారులు గుర్తించారు. గతంలో ఇన్స్పైర్ మనక్‌లో ప్రదర్శించిన ప్రాజెక్ట్‌లు తిరిగి ఈసారికి అనుమతించరు. కేవలం కొత్త ఆలోచనలు, కొత్త పద్ధతులతో రూపొందించిన వాటికి మాత్రమే ప్రోత్సాహం ఉంటుంది. పాఠశాలల్లో ‘ఇన్స్పైర్ మనక్’ సెప్టెంబర్ 15 వరకు అవకాశంప్రతి పాఠశాల నుంచి ఐదు ప్రాజెక్టులు జిల్లాలో ఎక్కువగా ప్రైవేట్ పాఠశాలలు ఇన్స్పైర్ మనక్‌లో పాల్గొంటున్నాయి. అలా కాకుండా ప్రతి ప్రభుత్వ పాఠశాల నుంచి తప్పనిసరిగా ఐదు ప్రాజెక్ట్‌లు ఇన్స్పైర్ మనక్‌లో ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధన ప్రకారం జిల్లాలోని అన్ని పాఠశాలలు పోటీకి సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో తప్పనిసరిగా ఐడియా కాంపిటీషన్ బాక్స్‌ను ఏర్పాటు చేసి ఉత్తమమైన ఐదు ప్రాజెక్టులను అప్లోడ్ చేయాలని ప్రభుత్వం సూచించింది.విద్యార్థులను ప్రోత్సహించాలి ఉపాధ్యాయులు ప్రోత్సాహం అందిస్తే విద్యార్థులు అద్భుతాలు సృష్టించగలరు. వారిలో దాగి ఉన్న సృజనాత్మకత టీచర్లకే తెలుస్తుంది. వారు నూతన ఆవిష్కరణలు తయారు చేసేందుకు చక్కని వేదిక ఇన్స్పైర్ మనక్. దీని ద్వారా దేశానికి శాస్త్రవేత్తలను అందించేందుకు కృషి చేయాలి. – చిలుముల రాజిరెడ్డి, జిల్లా సైన్స్ అధికారి -
ఉత్తమ ఫలితాలు సాధించాలి
టేక్మాల్(మెదక్): కేజీబీవీల్లో చదివే విద్యార్థినులు ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. శనివారం మండలంలోని కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, స్టోర్ రూం, వంటగదిని పరిశీలించారు. అనంతరం విద్యార్థినులతో మాట్లాడారు. చదువులో రాణిస్తే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని తెలిపారు. విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. ఈసందర్భంగా విద్యార్థినులు కలెక్టర్‌కు రాఖీలు కట్టి పండగ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బంది గురించి ఆరా తీసి రిజిస్టర్ తనిఖీ చేశారు. సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలు జరిగేలా కృషి చేయాలని వైద్యులకు సూచించారు. నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి పాపన్నపేట(మెదక్): వినయోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. శనివారం మండల పరిధిలోని మి న్పూర్ 220/132/33 కేవీ సబ్‌స్టేషన్‌ను సందర్శించారు. అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు జరుగుతున్న విద్యుత్ సరఫరా తీరును పరిశీలించారు. సాంకేతిక సిబ్బందికి కొన్ని సూచనలు చేశారు. ప్రణాళికలు సిద్ధం చేయండి మెదక్ కలెక్టరేట్: జిల్లాలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, ఖాళీ ప్రభుత్వ స్థలాలు గుర్తించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు అదనపు కలెక్టర్ నగేశ్‌తో కలిసి పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరా సౌర గిరిజల వికాస పథకం అమలు వేగవంతం చేయాలని సూచించారు. కలెక్టర్ రాహుల్‌రాజ్ -
వర్షాతిరేకం..!
● అత్యధికంగా శివ్వంపేటమండలంలో 41.1 మి.మీ నమోదు ● ఆరుతడి పంటలకు జీవంమెదక్జోన్/నర్సాపూర్/శివ్వంపేట/మనోహరాబాద్(తూప్రాన్): జిల్లాలో శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు లోటు వర్షపాతం నమోదు కాగా, పంటలసాగు ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. ఇప్పటికే సాగుచేసిన పంటలకు నీటి తడులు అందలేదు. ఈ వర్షంతో వర్షాధార పంటలకు జీవం పోసినట్లు అయింది. జిల్లావ్యాప్తంగా ఈఏడాది 3.50 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగుకావాల్సి ఉండగా, ఇప్పటివరకు సుమారు 2.50 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఈ లెక్కన ఇంకా లక్ష ఎకరాల్లో వరి సాగు కావాల్సి ఉంది. ఆరుతడి పంటలతో పాటు పత్తి, కూరగాయల సాగు అంచనా మేరకు సాగైంది. ఇదిలాఉండగా గత వారం రోజులుగా వేసవిని తలపించే విధంగా ఎండలు దంచికొట్టాయి. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యా రు. పంటలు సైతం వాడుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారు జాము నుంచి మధ్యాహ్నం వరకు 9.4 మిల్లీమీటర్ల వర్షం కురవటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా జిల్లాలో ఇప్పటీవరకు 377 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, 353 మిల్లీ మీటర్ల వర్షం మాత్రమే నమోదు అయినట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన ఇంకా 24 మిల్లీ మీటర్ల వర్షం తక్కువగా కురిసింది. నర్సాపూర్‌లో అతలాకుతలం నర్సాపూర్ మున్సిపాలిటీలోని పలు కాలనీలు వర్షానికి అతలాకుతలం అయ్యాయి. మురికి కాల్వల వ్యవస్థ సరిగా లేకపోవడంతో గోకుల్‌నగర్, విఘ్నేశ్వర కాలనీలో పలువురి ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. దీంతో ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు. పట్టణంలోని పోస్టాఫీస్ ఏరియాలో రోడ్లపై నుంచి వరద పారింది. పంది వాగు నుంచి రాయరావు చెరువులోకి భారీగా వర్షం నీరు వచ్చి చేరుతోంది. దీంతో పట్టణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా మండలంలో 33 మిల్లీ మీటర్ల వర్షం నమోదైందని సంబంధిత అధికారులు తెలిపారు. అలాగే శివ్వంపేట మండలవ్యాప్తంగా కురిసిన భారీ వర్షంతో చెక్‌డ్యాంలు మత్తడి దూకాయి. చెరువులు, కుంటల్లోకి భారీగా వర్షం నీరు వచ్చి చేరింది. జిల్లాలోనే అత్యధికంగా మండలంలో 41.1 మిల్లీ మీటర్ల వర్షాపాతం నమోదైంది. అలాగే మనోహరాబాద్, పోతారం, పర్కిబండ, తుపాకులపల్లి, పాలట గ్రామాల్లో శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కుండపోత వర్షం కురిసింది. పోతారం– తు పాకులపల్లి మధ్య రోడ్డుపై వరద చేరడంతో వాహనదారుల రాకపోకలకు ఇబ్బందు లు కలిగాయి. పలు వీధులు చెరువులను తలపించాయి.జిల్లా అంతటా భారీ వర్షం -
బేషరతుగా క్షమాపణలు చెప్పాలి
నర్సాపూర్: దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మంత్రులు, కలెక్టర్‌పై చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. బాధ్యత గల ఎమ్మెల్యే పదవిలో ఉంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేయడం విచారకరమన్నారు. బీఆర్ఎస్ రైతు ధర్నా పేరుతో తమ ఉనికి కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేసిందని ఆరోపించారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే గ్రామాల్లో తిరగలేరని హెచ్చరించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు ఆటలో కొత్త ప్రభాకర్‌రెడ్డి కీలుబొమ్మగా మారారని విమర్శించారు. ఉన్నత స్థానంలో ఉన్న కలెక్టర్ రాహుల్‌రాజ్ పట్ల అసభ్యంగా మాట్లాడడం విచారకరమన్నారు. సమావేశంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
12న పరిశ్రమల కమిటీ సమావేశం
మెదక్ కలెక్టరేట్: ఈనెల 12న జిల్లాలోని హానికర పరిశ్రమల కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా పరిశ్రమల ఉప ప్రధాన అధికారి లక్ష్మీకుమారి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టర్ రాహుల్‌రాజ్ అధ్యక్షతన కలెక్టరేట్లో జరిగే ఈ సమావేశానికి జిల్లాలోని అన్ని హానికర పరిశ్రమల కమిటీ సభ్యులు విధిగా హాజరు కావాలన్నారు. సమావేశానికి కమిటీ సభ్యులు, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల పరిశ్రమల అధికారులు, జిల్లా పర్యావరణ అధికారి, లేబర్ కమిషనర్, ఫైర్ తదితర శాఖల అధికారులు హాజరుకానున్నట్లు తెలిపారు. మంత్రులపై వ్యాఖ్యలు సిగ్గుచేటు పటాన్చెరు టౌన్: దళిత మంత్రులు దామోదర, వివేక్ వెంకటస్వామిపై దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలు సిగ్గుచేటని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి అన్నారు. శనివారం పటాన్చెరు డివిజన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రి దామోదర కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. ఇప్పటికై నా కొత్త ప్రభాకర్‌రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, మాజీ పీసీసీ కార్యదర్శి మతిన్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అతిక్, హనుమంత్ తదితరులు పాల్గొన్నారు. యూరియా కోసం బారులు కౌడిపల్లి(నర్సాపూర్): యూరియా కోసం రైతులు బారులు తీరారు. శనివారం మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి 450 బస్తాల యూరియా రాగా, వివిధ గ్రామాలకు చెందిన రైతులు భారీగా తరలివచ్చారు. నిర్వాహకులు రైతు ఆధార్‌కార్డు, ఈ–పాస్ మిషన్ల ద్వారా యూరియా విక్రయించారు. రైతులు ఆందోళన చెందవద్దని సరిపడా యూ రియా అందుబాటులో ఏఓ స్వప్న తెలిపారు. నులి పురుగుల నివారణే లక్ష్యం డీఎంహెచ్ఓ శ్రీరామ్ మెదక్ కలెక్టరేట్: పిల్లల్లో నులి పురుగుల నివారణే లక్ష్యంగా జిల్లాలోని పిల్లలందరికీ అల్బెండజోల్ మాత్రలు వేసేలా చర్యలు చేపడుతున్నట్లు డీఎంహెచ్ఓ శ్రీరామ్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఈనెల 11న జాతీయ నులి పురుగుల దినోత్స వం సందర్భంగా మాత్రలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. జిల్లావ్యాప్తంగా 19 ఏళ్లలోపు పిల్లలు 2,11,964 మంది ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. సోమవారం ఉదయం నుంచే అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో మాత్రలు వేసేలా తగు ఆదేశాలు జారీ చేశామన్నారు. జిల్లాలోని అన్ని సబ్ సెంటర్, పీహెచ్సీలలో మాత్రలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఆర్టీసీ ‘స్పెషల్’ దోపిడీదుబ్బాకటౌన్: పండుగ పూట ఆర్టీసీ సంస్థ ప్రయాణీకులపై చార్జీల పిడుగు పడింది. పండుగ స్పెషలంటూ బస్సులు నడుపుతూ అదనపు చార్జి వసూల్ చేయడం ప్రారంభించింది. దీంతో పండుగ పూట ప్రయాణికులపై పెను భారం పడింది. మహాలక్ష్మి పేరుతో మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తూనే అదనపు చార్జీల పేరుతో మగవారి జేబుకు చిల్లుపెట్టింది. దుబ్బాక నుంచి సిద్దిపేటకు మామూలు రోజుల్లో ఎక్స్‌ప్రెస్ బస్సుకు రూ.40 టికెట్ ఉండగా రాఖీ పౌర్ణమి సందర్భంగా ఏకంగా రూ.70 వసూలు చేయడంతో ప్రయాణికులు మండిపడుతున్నారు. రూ.70 పెట్టిన కనీసం బస్సుల్లో సీటు దొరకపోవడం గమనార్హం. ఎక్స్‌ప్రెస్ పేరు పెట్టి గ్రామ గ్రామాన బస్సు ఆపడంతో ప్రయాణికులు విసుగు చెందారు. -
ఉప్పు – నిప్పు
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలతో వేడెక్కిన రాజకీయం దుబ్బాక: కాంగ్రెస్–బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధంతో దుబ్బాక రాజకీయం రాజు కుంటుంది. ఇరుపార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. రెండ్రోజులక్రితం మెదక్ సభలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి కాంగ్రెస్ మంత్రుల పనితీరుపై తీవ్రస్థాయిలో దనుమాడారు. దీనికి కౌంటర్‌గా నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి అంతేస్థాయిలో ధ్వజమెత్తడంతో దుబ్బాక రాజకీయం ఉప్పు నిప్పుగా మారింది. దీనికి ఆజ్యం పోసేట్లు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఒకరిపై ఒకరు సామాజిక మాధ్యమాల్లో సైతం రాజకీయ విమర్శలు చేసుకుంటుండటంతో దుబ్బాకలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఆదివారం మంత్రి వివేక్ పర్యటన సైతం రద్దయింది. ఇంటెలిజెన్స్ సూచన మేరకే... ప్రస్తుతం దుబ్బాక నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆదివారం మంత్రి వివేక్ పర్యటన రద్దు అయింది. వాస్తవానికి తొగుట, మిరుదొడ్డి, దుబ్బాక, భూంపల్లి, అక్బర్పేట, దౌల్తాబాద్ మండలాల్లో పర్యటించి లబ్ధిదారులకు కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను పంపిణీ చేయాల్సి ఉంది. ఈ కార్యక్రమాల ఏర్పాట్లు సైతం అధికారులు సిద్ధం చేశారు. అయితే ఇంటెలిజెన్స్ అధికారుల సూచనల మేరకు శనివారం సాయంత్రం మంత్రి వివేక్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్–కాంగ్రెస్ మాటల యుద్ధం ఉద్రిక్తత నేపథ్యంలోనే మంత్రి వివేక్ పర్యటన రద్దు -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
కలెక్టర్ రాహుల్రాజ్హవేళిఘణాపూర్(మెదక్): ప్రస్తుత వర్షాకాలం సీజన్లో బ్రిడ్జి, చెరువు, కుంటలు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆదేశించారు. శుక్రవారం మండల పరిధిలోని దూప్‌సింగ్ తండా బ్రిడ్జిని పరిశీలించారు. నిర్మాణ పనుల్లో జరిగిన జాప్యంపై పీఆర్ ఈఈ గోపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. గతంలో రూ. 3 కోట్లతో నిర్మాణమైన ఈ బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి తండావాసులకు వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. భారీ వ ర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా ప్రజలు వర్షాకాలంలో వ్యాధుల బారిన పడే అవకాశం ఉన్నందున ఆదిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో వాగులు, వరద ఉధృతి ఉన్న ప్రాంతాల్లో రెవెన్యూ, పోలీస్‌శాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంత రం ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ పంచాయతీ ఎన్నికల కోసం గ్రామ యూనిట్లు, వార్డుల వారీగా ఓటర్ల జాబితా వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే హవేళిఘణాపూర్ రైతు ఆగ్రోస్ సేవా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా నిల్వలపై ఆరా తీశారు. ఎరువుల కొరత లేకుండా రైతులకు అవసరం ఉన్న యూ రియాను అందుబాటులో ఉంచాలని నిర్వాహకులను ఆదేశించారు. ఆయన వెంట జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఇన్చార్జి ఎంపీడీఓ కృష్ణమోహన్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఆ మాటలు వెనక్కి తీసుకోండి
మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వ పాలనా అధికారుల మనోభావాలు దెబ్బతిసేలా మాట్లాడితే సహించేది లేదని టీఎన్జీఓస్ జిల్లా జేఏసీ చైర్మన్ దొంత నరేందర్ అన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి కలెక్టర్‌పై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ శుక్రవారం భోజన విరామ సమయంలో కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలెక్టర్ రాహుల్‌రాజ్ జిల్లాలో ప్రగతి పాలన అందిస్తున్నారని తెలిపారు. ఏ ప్రభుత్వం అధికారంలో సంక్షేమ పథకాలను చిత్తశుద్ధితో ప్రభుత్వ అధికారులు అమలు చేస్తారన్నారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే కలెక్టర్‌పై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. -
సంతోషంగా పండుగ జరుపుకోండి
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు మెదక్ మున్సిపాలిటీ: రాఖీ పౌర్ణమిని జిల్లా ప్రజలంతా సంతోషంగా జరుపుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. అక్కా తమ్ముళ్లు, అన్నా చెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని, రక్షణను, ప్రేమను రక్షాబంధన్ ప్రతిబింబిస్తుందన్నారు. ఈ పర్వదినం ప్రతి కుటుంబానికి సంతోషం, ఐక్యత, ఆనందం తీసుకురావాలని ఆకాంక్షించారు. అందుబాటులో యూరియా నిజాంపేట(మెదక్): రైతులకు అందుబాటులో యూరియా ఉందని జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం మండల కేంద్రంలోని పలు పీఏసీఎస్ కేంద్రా లను సందర్శించి రికార్డులను పరిశీలించారు. నానో యూరియా, డీఏపీ వాడకంపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు రాజ్‌నారాయణ, మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి రైతులు పాల్గొన్నారు. రోడ్డు నిర్మాణం కోసం సంతకాల సేకరణ రామాయంపేట(మెదక్): మున్సిపాలిటీ పరిధిలోని కోమటిపల్లి తండాకు తారు రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ గిరిజనులు శుక్రవారం సంతకాల సేకరణ చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం తండాకు తారు రోడ్డు మంజూరు కాగా, కాంట్రాక్టర్ రోడ్డు నిర్మించే క్రమంలో కంకర పరిచి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము సేకరించిన సంతకాలను కలెక్టర్‌కు అందజేస్తామని తండావాసులు పేర్కొన్నారు. సమగ్ర విచారణ జరపాలి చేగుంట(తూప్రాన్): మండలంలోని బీ.కొండాపూర్‌లో జరిగిన ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య విచారణ జరిపారు. శుక్రవారం గ్రామాన్ని సందర్శించి బాధి త కుటుంబ సభ్యులతో మాట్లాడారు. జూన్ 18న గ్రామంలో ఓ మైనర్ బాలిక కిడ్నాప్ కేసు విషయంలో బ్యాగరి చంద్రం కుటుంబ సభ్యు లు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ.. ఈసంఘటన విషయంలో పోలీస్ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయం గురించి కలెక్టర్, ఎస్పీతో మాట్లాడుతానని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ నరేందర్‌గౌడ్, సీఐ వెంకటరాజాగౌడ్, తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, తహసీల్దార్ శ్రీకాంత్, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
నో స్టాప్..!
● అక్కన్నపేట స్టేషన్లోఆగని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ● పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు తప్పని తిప్పలు రామాయంపేట(మెదక్): జిల్లాలోనే అతి పెద్దదైన అక్కన్నపేట రైల్వేస్టేషన్లో అజంతా, రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లు ఆగకపోవడంతో ఏళ్లుగా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కామారెడ్డి, మేడ్చల్ మధ్య అతిపెద్ద స్టేషన్ ఇదే కావడంతో అత్యంత రద్దీగా ఉంటుంది. ఆదాయపరంగా మిగితా స్టేషన్ల కంటే మెరుగే. కాగా తిరుపతి, షిరిడీతో పాటు ఇతర పుణ్యక్షేత్రాలైన బాసర, నాందేడ్‌లోని గురుద్వారా ఆలయాలకు వెళ్లడానికి ఈస్టేషన్ నుంచి సదుపాయం లేకపోవడంతో భక్తులు అవస్థలు పడుతున్నారు. ప్రతీరోజు అక్కన్నపేట స్టేషన్ మీదుగా తిరుపతి వెళ్లే రాయలసీమ, షిరిడీ వెళ్తున్న అజంతా ఎక్స్‌ప్రెస్ హాల్ట్ కోసం గతంలో గ్రామ స్తులతో పాటు ప్రయాణికులు పలుమార్లు రైల్‌రోకో నిర్వహించి కేసుల పాలై కోర్టుల చుట్టూ తిరిగారు. కాగా మెదక్, సిద్దిపేట, ఇతర నగరాల నుంచి తిరుపతి, షిరిడీతో పాటు ఇతర పుణ్యక్షేత్రాలకు వెళ్లడానికి నిత్యం వందలాది మంది ప్రయాణికులు వ్యయ ప్రయాసల కోర్చి కామారెడ్డి స్టేషన్‌కు వెలుతున్నారు. ఈవిషయమై బీజేపీ నాయకులు ఢిల్లీ వెళ్లి అప్పటి రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభుకు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుత ఎంపీ రఘునందన్‌రావు దృష్టికి సైతం తీసుకెళ్లారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు సమస్య పరిష్కారానికై కృషి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.ఇబ్బంది పడుతున్నాం అక్కన్నపేట స్టేషన్లో రాయలసీమ, అజ ంతా ఎక్సప్రెస్ల స్టాప్ లేకపోవడంతో పుణ్యక్షేత్రాలకు వెళ్లడానికి భక్తు లు ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది కామారెడ్డి స్టేషన్‌కు వెళ్లి అక్కడి నుంచి వెళ్తున్నారు. కామారెడ్డి, మేడ్చల్ స్టేషన్ల మధ్య ఇదే అతిపెద్ద స్టేషన్ కావడంతో ఈ విషయమై ఆశాఖ ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. – పోచమ్మల అశ్విని, రామాయంపేట -
సమయపాలన తప్పనిసరి
డీఎంహెచ్ఓ శ్రీరామ్మెదక్ కలెక్టరేట్: సమయపాలన పాటించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని డీఎంహెచ్ఓ శ్రీరామ్ వైద్య సిబ్బందికి సూచించారు. శుక్రవారం పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు గోల్కొండ వీధిలో గల బస్తీ దవాఖానాను ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా ఆస్పత్రిలోని రికార్డులు, మందులను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన సేవలందించాలని ఆదేశించారు. అలాగే ఫీవర్ సర్వే నిర్వహించి కలరా, టైఫాయిడ్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్ఓ హరి ప్రసాద్, ఇతర వైద్యులు, సిబ్బంది ఉన్నారు. -
యాంత్రీకరణకు మోక్షం
● ఎట్టకేలకు రాయితీపై సాగు పరికరాలు ● ఏడేళ్ల తర్వాత నిధుల కేటాయింపు ● ఉమ్మడి జిల్లాకు 16వేల యూనిట్లు ● రూ.4.96కోట్లు మంజూరు ● మహిళా రైతులకు 50శాతం సబ్సిడీ ● లబ్ధిదారులను ఎంపిక చేయనున్న కమిటీలువ్యవసాయ యాంత్రీకరణకు మోక్షం లభించింది. దాదాపు ఏడేళ్ల తర్వాత వ్యవసాయ పరికరాల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది. కానీ ఈ ఏడాది కేవలం పనిముట్లకే పరిమితం చేశారు. పంటల సాగులో కూలీల ఖర్చును తగ్గించడానికి వ్యవసాయ యాంత్రీకరణ దోహదపడనుంది. 2025–26 సంవత్సరానికి ఉమ్మడి మెదక్ జిల్లాకు 16,275 యూనిట్లకు రూ.4.96కోట్లు మంజూరు చేశారు. త్వరలో రైతులకు పరికరాలను అందించేందుకు వ్యవసాయ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. – సాక్షి, సిద్దిపేట ఉమ్మడి మెదక్ జిల్లాలో దాదాపు 12లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. రైతులకు అందించే వ్యవసాయ పరికరాలను మహిళా రైతులతో పాటు ఎస్సీ, ఎస్టీ రైతులకు 50శాతం రాయితీపై ఇవ్వనున్నారు. మిగతా వారికి 40శాతంతో అందించనున్నారు. ఐదు ఎకరాలకంటే తక్కువ భూములు ఉన్న రైతులకు సబ్సిడీ పై వివిధ రకాల పరికరాలు అందిస్తారు. స్ప్రేయర్లు, ట్రాక్టర్‌తో నడిచే వ్యవసాయ పరికరాలు రోటోవేటర్లు, నాగళ్లు, గొర్రు, కలుపు తీసే యంత్రాలు, పవర్ ట్రిల్లర్లు, మొక్కజొన్న తీసే యంత్రం తదితర వాటిని అందజేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా సంగారెడ్డి జిల్లాకు, అత్యల్పంగా మెదక్ జిల్లాకు నిధులు కేటాయించారు. ఎంపిక బాధ్యత కమిటీలదే.. వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను అందజేసేందుకు జిల్లా, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. రాయితీ రూ.లక్ష దాటితే జిల్లా కమిటీ ఆమోదం తప్పనిసరి. ఐదు ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న వారు ఈ రాయితీ పథకానికి అర్హులు. జిల్లా కమిటీలో కలెక్టర్ చైర్మన్‌గా, డీఏఓ, ఆగ్రోస్, ఎల్డీఎం, శాస్త్రవేత్త సభ్యులుగా ఉండనున్నారు. మండల స్థాయి కమిటీలో మండల వ్యవసాయాధికారి, తహసీల్దార్, ఎంపీడీవోలు ఉంటారు. ఈ పరికరాల కోసం అర్హులను ఈ కమిటీలు ఎంపిక చేయనున్నారు. ఏడేళ్ల తర్వాత.. 2017–18 సంవత్సరం వరకు యాంత్రీకరణ పథకం అమలులో ఉంది. మళ్లీ ఏడేళ్ల తర్వాత పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ ఏడాది నిధులను మంజూరు చేశారు. గతంలో ట్రాక్టర్లు అందించే వారు. ఈ ఏడాది కేవలం యాంత్రీకరణ పనిముట్ల వరకే పరిమితం చేశారు. గతంలో మాదిరిగా ట్రాక్టర్లు సైతం అందిస్తే రైతులు ఆర్థికంగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది.నిధుల కేటాయింపు ఇలా..జిల్లా నిధులు(రూ.) యూనిట్లు మెదక్ 1,08,40,408 2,713 సంగారెడ్డి 2,23,45,603 7,883 సిద్దిపేట 1,64,79,528 5,679 -
నులిమేద్దాం
మెదక్‌జోన్: నులి పురుగుల సమస్య పిల్లలను కుంగదీస్తోంది. శారీరక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రక్తహీనతకు గురి చేస్తోంది. ఈనెల 11న జాతీయ నులి పురుగు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో 1 నుంచి 19 ఏళ్ల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 1 నుంచి 19 ఏళ్లు గల చిన్నారులు 1,92,695 మంది ఉన్నారు. గతంలో ఏటా ఫిబ్రవరి, ఆగస్టు మాసాల్లో పిల్లలకు మాత్రలు పంపిణీ చేసేవారు. 2020లో కరోనా మహమ్మారి తర్వాత ఆగస్టులో మాత్రమే ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఈనెల 11న ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లాలో గుర్తించిన పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేయనున్నారు. అనారోగ్యంతో ఉన్న పిల్లలతో పాటు మిగిలిన వారికి ఈనెల 18న వేయనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. కాగా 1 నుంచి 2 సంవత్సరాలు గల చిన్నారులకు సగం మాత్ర, 2 నుంచి 3 ఏళ్ల వారికి పూర్తి మాత్ర, 3 నుంచి 19 ఏళ్ల పిల్లలు మాత్రను నమిలి మింగాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. పిల్లల్లో అనారోగ్యం పిల్లలు చేతులు శుభ్రం చేసుకోకుండా భోజనం చేయటం, మట్టిలో ఆడుకోవటం లాంటి కారణాలతో 1 నుంచి 19 ఏళ్ల వయస్సు గల పిల్లల కడుపులో నులి పురుగులు తయారవుతాయి. అవి కడుపులో రక్తాన్ని పీల్చటంతో పాటు పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతాయి. తరచూ అనారోగ్యం బారిన పడటం, బరువుకు తగిన ఎత్తు, ఎత్తుకు తగ్గ బరువు ఉండకపోవటంతో పాటు చురుకుదనం కోల్పోతున్నారు. ప్రస్తుతం ఇలాంటి పిల్లలు అంగన్వాడీ సెంటర్లలో 275 మంది ఉన్నట్లు గుర్తించారు. 11న నులి పురుగు నిర్మూలన కార్యక్రమం 1 నుంచి 19 ఏళ్ల పిల్లలకు పంపిణీ జిల్లాలో 1.92 లక్షల మంది గుర్తింపు తప్పనిసరి వేయించాలి ఈనెల 11న జాతీయ నులి పురుగు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో చిన్నారులకు తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలి. ఈ కార్యక్రమంలో 550 మంది ఆశా వర్కర్లు, 256 మంది ఏఎన్ఎంలు, 39 మంది సూపర్వైజర్లతో పాటు ఇతర సిబ్బంది సుమారు 900 మంది పాల్గొననున్నారు. – శ్రీరాం, డీఎంహెచ్ఓ -
మొక్కల సంరక్షణ అందరి బాధ్యత
మనోహరాబాద్(తూప్రాన్): మానవాళికి ప్రాణవాయువును అందించే మొక్కలను పెంచే బాధ్యత ప్రతీ ఒక్కరూ తీసుకోవాలని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. శుక్రవారం జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో మండలంలోని కాళ్లకల్ శివారులో గల లోకేశ్ మిషన్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో మొక్కలు నాటి మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, పరిశ్రమల శాఖ లక్ష్యం మేరకు మొదటి విడతలో 2,000, రెండో విడతలో 3,000 మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. దీనికి ఆయా పరిశ్రమల ప్రతినిధులు స్పందించి ముందుకు రావడం హర్షనీయమన్నారు. ఆయన వెంట ఇండస్ట్రియల్ జనరల్ మేనేజర్ ప్రకాశ్‌రావు, తహసీల్దార్ ఆంజనేయులు, డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి, పరిశ్రమల డైరెక్టర్ శ్రీనివాసరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ నగేశ్ -
ప్రభుత్వ ఆస్పత్రి తనిఖీ
చిన్నశంకరంపేట(మెదక్): చిన్నశంకరంపేట ప్రభుత్వ ఆస్పత్రిని గురువారం కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆకస్మికంగా సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు. ఈసందర్భంగా సిబ్బందితో మాట్లాడి, అస్పత్రిలో అందుబాటులో ఉన్న మందులను పరిశీలించారు. మెడికల్ ఆఫీసర్ సాయిసింధుకు పలు సూచనలు ఇచ్చారు. ఆస్పత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహాధర్నాకు తరలిరండి: పీఆర్టీయూ చిన్నశంకరంపేట(మెదక్): సెప్టెంబర్ 1న ఉపాధ్యాయ సమస్యలపై హైదరాబాద్‌లో నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు తాళ్ల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని చందంపేట, సూరారం, ధరిపల్లి, గవ్వలపల్లి, కొర్విపల్లి పాఠశాలల్లో ఉపాధ్యాయులతో సభ్యత్వ నమోదు చేయించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో తాత్సా రం చేస్తుందని మండిపడ్డారు. కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మల్లారెడ్డి, మండల అధ్యక్ష, కార్యదర్శులు హరిబాబు, నరేశ్, చారి, నాగరాణి పాల్గొన్నారు. యూరియా కొరత సృష్టిస్తే చర్యలు నర్సాపూర్: మండలంలో సరిపడా యూరియా అందుబాటులో ఉందని, కృత్రిమ కొరత సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ ఏడీ సంధ్యారాణి హెచ్చరించారు. గురువారం ఏఓ దీపికతో కలిసి పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలు, గోదాంలలో తనిఖీలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నానో యూరియాతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని, పర్యావరాణాన్ని కాపాడుతుందని వివరించారు. పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించాలి రామాయంపేట(మెదక్): మండలంలోని తొనిగండ్లలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను గురువారం జెడ్పీ సీఈఓ ఎల్లయ్య పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన గ్రామంలో పర్యటించి పారిశుద్ధ్య పరిస్థితులను సమీక్షించారు. పంచాయతీ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రా న్ని సందర్శించారు. గ్రామంలో పారిశుద్ధ్య పను లు సక్రమంగా నిర్వహించాలని, సీజనల్ వ్యా ధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీ ఓ సజీలుద్దీన్, పంచాయతీ కార్యదర్శి ఉన్నారు. 18 ఫీట్లకు చేరిన పోచారం నీటిమట్టం హవేళిఘణాపూర్(మెదక్): జిల్లా సరిహద్దులో ఉన్న పోచారం డ్యామ్‌లో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. గతేడాది ఈ సమయానికి నిండిన డ్యామ్ ఈసారి పెద్దగా వర్షాలు కురువకపోవడంతో నిండలేదు. ప్రస్తుతం డ్యామ్‌లో 18 ఫీట్ల మేర నీరు చేరింది. మరో మూడు ఫీట్ల నీర చేరితే పొంగిపొర్లే అవకాశం ఉంది. -
భరోసా సేవలు అభినందనీయం
జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ మెదక్ మున్సిపాలిటీ: భరోసా సెంటర్ సేవలు అభినందనీయమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని భరోసా సెంటర్లో 3వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు ఎస్పీ మహేందర్‌తో కలిసి న్యాయ మూర్తి కేక్ కట్‌చేశారు. ఈసందర్భంగా పిల్లల పై లైంగిక దాడుల నివారణ, బాధితుల పునరావాసంపై చర్చించారు. పునరావాసంపై మరి ంత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నా రు. స్కూల్ విద్యార్థుల సహకారంతో రూపొందించిన అవగాహన చిత్రాన్ని విడుదల చేశారు. ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని వీక్షించాలని సూచించారు. కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, జిల్లా సంక్షేమ అధికారి హైమావతి, జిల్లా బాలల సంక్షేమ అధికారి కరుణశీల తదితరులు పాల్గొన్నారు. -
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
మెదక్ కలెక్టరేట్: విద్యారంగంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర కిరణ్ డిమాండ్ చేశారు. ఈమేరకు విద్యార్థులతో కలిసి గురువారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 1 నుంచి 4 వరకు విద్యార్థి అధ్యయన యాత్ర నిర్వహించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, జనరల్ హాస్టళ్లు, కేజీబీవీ, గురుకులాలను సందర్శించి సమస్యలు తెలుసుకున్నట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్ శిథిలావస్థలో ఉన్నాయని తెలిపారు. కేజీబీవీ, గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. శిథిలావస్థలో భవనాలు, మరుగుదొడ్లు, మూత్రశాలలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ నగేశ్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నవీన్, అజయ్ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు ఆంజనేయులు, కార్తీక్, పోచయ్య, ర మేశ్, అజయ్‌కుమార్, విద్యార్థులు త దితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ మెడలు వంచుతాం
హామీలు అమలు చేయిస్తాం ● సగం మందికే రుణమాఫీ.. ● సన్న వడ్లకు బోనస్ అందలేదు ● రైతు ధర్నాలో మాజీ మంత్రి హరీశ్‌రావు మెదక్ కలెక్టరేట్/మెదక్‌జోన్: ప్రభుత్వ మెడలు వంచి ఇచ్చిన హామీలు అమలు చేసేలా బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద నిర్వహించిన రైతు మహాధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ధర్నాకు వచ్చిన రైతుల్లో ఎంతమందికి రుణమాఫీ కాలేదో చేతులు ఎత్తాలని కోరగా, 30 శాతం మంది చేతులు ఎత్తారు. అలాగే బోనస్ రాని రైతులు ఎంతమంది అని పేర్కొనగా.. అక్కడున్న వారంతా చేతులు ఎత్తారు. ఇదీ కాంగ్రెస్ సర్కారు తీరని ఎద్దేవా చేశారు. కాగా ధర్నా మధ్యలో హరీశ్‌రావుకు ఫోన్ రావడంతో మళ్లీ వచ్చి జాయిన్ అవుతానంటూ వెళ్లిపోయారు. అనంతరం నాయకులు కలెక్టరేట్‌కు వెళ్లి డీఆర్ఓ భుజంగరావుకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశధర్‌రెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్లు బట్టి జగపతి, మల్లికార్జున్‌గౌడ్, పార్టీ నాయకులు, రైతులు పెద్దఎత్తున పాల్గొన్నారు. కాంగ్రెస్– బీజేపీ మిలాఖత్: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌లు మిలాఖత్ అయ్యా యని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. మోదీ, రేవంత్ కేసీఆర్ మీదికి ఒంటికాలిపై లేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కేవలం ఈటల రాజేందర్, వెంకటరమణారెడ్డి, మహేశ్వర్‌రెడ్డి తప్ప, మిగితా వారంతా రేవంత్‌రెడ్డికే వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరువందల రోజులవుతుండగా, ఇప్పటికీ 600 రైతు ఆత్మహత్యలు జరిగాయన్నారు. బీజేపీకి రైతుల మీద ప్రేమ లేదన్నారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పాలన్నారు. రైతులు ఎరువుల కోసం చెప్పులు వరుసలో పె ట్టాల్సిన దుస్థితి మళ్లీ వచ్చిందని వాపోయారు. కృష్ణా, గోదావరి నీళ్లు నియంత్రణ లేక గంగలో కలిసిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ను వీడిన వారంతా సొంత గూటికి రావడానికి సిద్ధమవుతున్నారని తెలిపారు. ప్రాజెక్టుల గేట్లు బద్దలు కొడతాం: ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మూడు రోజుల్లో జిల్లాకు సాగునీరందించే ప్రాజెక్టుల నుంచి కాల్వలకు నీరు విడుదల చేయకపోతే ప్రాజెక్ట్‌ల గేట్లు బద్దలు కొడతామని దుబ్బాక ఎమ్మె ల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నీళ్ల మంత్రి ఉత్తమ్ జిల్లాకు నీరందించే ప్రాజెక్టులపై ఒక్కసారి కూడా సమీక్ష జరిపిన పాపానపోలేదన్నారు. జిల్లా మంత్రి దామోదరకు ఎంతసేపు కమీషన్ల ధ్యాసే తప్ప.. రైతుల సమస్యలు పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ప్రజల సమస్యలు పట్టించుకోకపోవడంతో వివేక్‌కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారన్నారు.జగ్గారెడ్డికి మంత్రులు కమీషన్లు ఇవ్వడం లేదని ఏడుస్తున్నారని ఎద్దేవాచేశారు. గడిచిన రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలకు పైసా నిధులు ఇవ్వలేదన్నారు. మేడిగడ్డలో పిల్లర్ కుంగితే బాగు చేయలేదన్నారు. మెదక్ కలెక్టర్ కాంగ్రెస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు, ఇది సరికాదు, పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. ఇచ్చిన హామీలు గాలికి: పద్మారెడ్డి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు 420 హామీ లను గాలికి వదిలేసిందని ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందడానికే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను బూచిగా చూపిస్తున్నారని విమర్శించారు. సన్నవడ్లకు బోనస్ ఇస్తామని రైతులను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరాటం ఇది ఆరంభం మాత్రమే అన్నారు. కేసీఆర్‌పై అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదన్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాంత్రి కిరణ్ మాట్లాడుతూ.. రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన హా మీలను విస్మరించిన సీఎం రేవంత్‌కు ప్రజ లు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తే కాంగ్రెస్ దానిని నాశనం చేసిందన్నారు. -
ఇక రైతు విజ్ఞాన కేంద్రం!
● జిల్లాలో ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు ● రైతులకు మేలంటున్న వ్యవసాయశాఖరామాయంపేట(మెదక్): రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగా జిల్లాలో రైతు విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే ఆధునిక వ్యవసాయం పట్ల రైతులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయశాఖ, నూతన వ్యవసాయ విధానం, సాంకేతికత, శాసీ్త్రయ పద్ధతుల ద్వారా పంట దిగుబడులు పెంచే విధంగా శిక్షణ ఇస్తుంది. ఈక్రమంలో డ్రోన్ల వినియోగం, సేంద్రియ వ్యవసాయంపై రైతులు మొగ్గు చూపుతున్నారు. ఆధునిక వ్యవసాయ విధానంతో పంట దిగుబడి పెరగడంతో పాటు నీరు, ఎరువుల వినియోగం తగ్గుతుంది. రైతు విజ్ఞాన కేంద్రం ఏర్పాటైతే జిల్లా కేంద్రాల్లోనే శాస్త్రవేత్తలు అందుబాటులో ఉంటారని సమాచారం. అయితే రాష్ట్రవ్యాప్తంగా 15 జిల్లాల్లో కొత్తగా ప్రభుత్వం ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా, ఇందులో మెదక్ జిల్లా కూడా ఉంది. రైతు విజ్ఞాన కేంద్రం అందుబాటులోకి వస్తే ఆధునిక ప్రయోగశాలలు, విత్తన ఉత్పత్తులకు సంబంధించి క్షేత్రాలు ఉంటాయని వ్యవసాయ శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. నిరంతర పరిశోధనలు, ప్రయోగాలు, శిక్షణ కార్యక్రమాలకు ఉపయోగపడుతుందన్నారు. డ్రోన్లు, ఇతర వ్యవసాయ యంత్రాల వినియోగంపై రైతులకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇస్తారు. పంట సమస్యలు, చీడ పీడల నివారణ, నే ల రకం, తదితర సమస్యల విషయమై నేరుగా రైతులే వారితో మాట్లాడే అవకాశం కలుగుతుంది. తమ మట్టి నమూనాను పరిక్షించుకోవడానికి ఈ కేంద్రాల్లో ప్రయోగశాలలు అందుబాటులో ఉంటాయి. ఇదే విషయమై జిల్లా వ్యవసాయాధికారి దేవ్‌కుమార్ మాట్లాడుతూ.. రైతు విజ్ఞాన కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి అధికారికంగా ఇప్పటి వ రకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదని, అయితే కేంద్రం ఏర్పాటైతే రైతులకు సాంకేతిక పరంగా ఎంతగానో ఉపయోగం ఉంటుందని తెలిపారు. -
ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరాలి
మెదక్‌జోన్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్ సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమా వేశంలో పాల్గొని మాట్లాడారు. కార్యకర్తలు ప్రజలతో కలిసి తిరంగా యాత్ర, ఇతర దేశభక్తి పూరిత కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు దేశ సమైక్యత, సమగ్రత కోసం ప్రతిజ్ఞ చేయాలన్నారు. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీ దృఢ సంకల్పం, నిర్ణయాత్మక నాయకత్వానికి సాయుధ దళాల ధైర్య సాహసాలు, దేశ ప్రజల ఉమ్మడి ఆకాంక్షలు తోడవడంతో ఆపరేషన్ సిందూర్ గొప్ప విజయం సాధించిందన్నారు. మోదీ నాయకత్వంలో కొత్త సుసంపన్న, బలమైన, ఆత్మనిర్భర్ భారత్‌కు ఇది నిదర్శనమన్నారు. ఆపరేషన్ సిందూర్ అఖండ విజ యం తర్వాత దేశవ్యాప్తంగా ప్రజలు జాతీయ పతాకంతో దేశభక్తి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, ఎంఎల్ఎన్ రెడ్డి, రాష్ట్ర కౌ న్సిల్ మెంబర్ రాగి రాములు, నాయకులు రమేశ్, శ్రీనివాస్‌గౌడ్, సత్య నారాయణ, కాశీనాథ్, మధు సూదన్‌తో పాటు ఆయా మండలాల ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశంగౌడ్ -
కాంగ్రెస్‌తోనే పేదల సంక్షేమం
రామాయంపేట(మెదక్)/చిన్నశంకరంపేట: కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క రేషన్‌కార్డు కూడా ఇవ్వకుండా ప్రజలను మోసం చేసిందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్‌రాజ్‌తో కలిసి లబ్ధిదారులకు రేషన్‌కార్డులను అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నిరుపేదలకు ఇళ్ల మంజూరు విష యమై ఎంతమాత్రం పట్టించుకోలేదన్నారు. కా ంగ్రెస్ అధికారంలోకి రాగానే నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందని వివరించా రు. నిరుపేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని రామాయంపేటకు రూ. 200 కోట్లతో సమీకృత గురుకులం మంజూరు చేయించినట్లు తెలి పారు. అలాగే నిజాంపేటలో రేషన్‌కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, మెదక్ ఆర్డీఓ రమాదేవి, జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానందం, తహసీల్దార్ రజనికుమారి, పీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం చిన్నశంకరంపేట మండల కేంద్రంలో కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎమ్మెల్యే రోహిత్ లబ్ధిదారులకు కొత్త రేషన్‌కార్డులను పంపిణీ చేశారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క రేషన్‌కార్డు ఇవ్వలేదు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ -
నాణ్యతగా ఇళ్లు నిర్మించుకోవాలి
జెడ్పీ సీఈఓ ఎల్లయ్య తూప్రాన్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని లబ్ధిదారులు నాణ్యతగా నిర్మించుకోవాలని జెడ్పీ సీఈఓ ఎల్లయ్య సూచించారు. బుధవారం మండలంలోని వెంకటాయపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పర్యవేక్షించారు. ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం రూ. 5 లక్షల చొప్పున ఇంటి నిర్మాణం కోసం కేటాయించిందన్నారు. అనంతరం గ్రామంలోని పలు వీధుల్లో పర్యటించారు. పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా పంచాయతీ సిబ్బంది చర్యలు చేపట్టాలని సూచించారు. విషపూరితమైన రోగాలు వచ్చి ప్రజలు ఆస్పత్రుల పాలవుతున్నారని, ఇందుకోసం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఆయన వెంట ఎంపీడీఓ సతీశ్, సిబ్బంది ఉన్నారు. -
కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించాలి
నర్సాపూర్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించి, దో షులను శిక్షించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీయాదవ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాళేశ్వరం కుంభకోణంలో అప్పటి ఆర్థిక మంత్రి పాత్రను బయటకు తీయాలన్నారు. కాళేశ్వరం అవినీతిపై కాంగ్రెస్ తాత్సారం చూస్తుంటే బీఆర్ఎస్ తప్పిదాలను కప్పి పుచ్చేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తున్నట్లుగా ఉందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఘటనలో చర్యలు లేవన్నారు. సమావేశంలో ఓబీసీ రాష్ట్ర ఉపా ధ్యక్షుడు రమేశ్‌గౌడ్, నాయకులు సురేశ్, రమణారావు, ఆంజనేయులుగౌడ్ పాల్గొన్నారు. -
మహనీయుడు జయశంకర్
మెదక్ కలెక్టరేట్: తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఆయన జయంతిని పురస్కరించుకొని పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వరాష్ట్ర సాధనకు జయశంకర్ మార్గదర్శనంగా నిలిచారని కొనియాడారు. కార్యక్రమంలో డీఆర్ఓ భుజంగరావు, ఏఓ యూనస్, బీసీ సంక్షేమ అధికారి జగదీశ్, సహాయ అధికారి గంగా కిషన్, ఎస్సీ సంక్షేమ అధికారి విజయలక్ష్మి పాల్గొన్నారు. నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం మనోహరాబాద్(తూప్రాన్): మండల కేంద్రంలోని 132/11 కేవీ సబ్‌స్టేషన్‌లో మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో గురువారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని కాళ్లకల్ విద్యుత్ ఏఈ రాజ్‌కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి టేక్మాల్(మెదక్): గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య అన్నారు. బుధవారం మండలంలోని బొడ్మట్‌పల్లిలో పర్యటించారు. అనంతరం ఆరోగ్య ఉపకేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలన్నారు. తడి, పొడి చెత్త వేరు చేయాలని, దోమలు వృద్ధి చెందకుండా, గుంతల్లో నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీఓ రియాజొద్దీన్, వైద్యురాలు హర్షిత, పంచాయతీ కార్యదర్శి మౌనిక, సిబ్బంది ఉన్నారు. పారిశుద్ధ్య పనులు చేపట్టండి రామాయంపేట(మెదక్): మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టి ఫాగింగ్ నిర్వహించాలని మెదక్ ఆర్డీఓ రమాదేవి సిబ్బందిని ఆదేశించారు. బుధవా రం పట్టణంలోని నాలుగో వార్డులో మురుగు కాలువలను పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పారిశుద్ధ్యానికి సంబంధించి కమిషనర్ దేవరాజ్‌కు, ఇతర సిబ్బందికి పలు సూచనలు చేశారు. అంతకుముందు ఆర్డీఓ తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. ఆమె వెంట రజనికుమారి, ఇతర అధికారులు ఉన్నారు. ఢిల్లీ ధర్నాలో జిల్లా నేతలు నర్సాపూర్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌తో బుధవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన ధర్నా లో జిల్లాకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. -
యూరియా కోసం పడిగాపులు
కొల్చారం(నర్సాపూర్): పంటలకు అవసరమైన యూరియాను డిమాండ్ మేరకు సరఫరా చేయాలని మండలంలోని రైతులు కోరుతున్నారు. ఇప్పటికే బోర్ల కింద వరి నాట్లు పూర్తయిన నేపథ్యంలో యూరియా అవసరం పెరిగింది. ప్రస్తుతం సరఫరా అవుతున్న యూరియా ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. యూరియా పక్కదారి పడుతుందన్న ఉద్దేశంతో అధికారుల ప్రైవేట్ ఎరువుల దుకాణాలకు, ఎఫ్‌ఈఓలకు సరఫరా చేయడం లేదు. కేవలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు మాత్రమే సరఫరా చేస్తున్నారు. పీహెచ్‌సీలకు యూరియా వచ్చిందన్న వార్త తెలిసిన వెంటనే పెద్దఎత్తున రైతులు అక్కడికి చేరుకోవడంతో గందరగోళ వాతావరణం నెలకొంటుంది. దీంతో చేసేది లేక సహకార సంఘాల సిబ్బంది ఆధార్‌కార్డుకు రెండు నుంచి ఐదు బస్తాల చొప్పున ఇస్తున్నారు. అయితే ఇది ఏ మాత్రం సరిపోదని రైతులు వాపోతున్నారు. బుధవారం మండలంలోని రంగంపేట, వరిగుంతం ప్రాథమిక వ్యవసాయ సహకార సఘాలకు 560 బస్తాల చొప్పున యూరియా రాగా, గంటలోనే అయిపోయింది. యూరియా అందని రైతులు నిరాశతో వెను తిరిగారు. అవసరం మేరకు యూరియా నిల్వలు ఉన్నాయని అధికారులు చెప్పడం గమనార్హం. -
చెరువు చెంతనే చెత్త
సర్వయ్యకుంట కలుషితం ● చెత్తను డంప్ చేసి తగులబెడుతున్న మున్సిపల్ సిబ్బంది ● చర్యలు తీసుకోవాలని స్థానికుల వేడుకోలురామాయంపేట(మెదక్): మున్సిపాలిటీ పరిధి జాతీయ రహదారి సమీపంలోని సర్వయ్య కుంట అధ్వానంగా మారింది. మున్సిపల్ సిబ్బంది చెరు వు పక్కనే చెత్తను డంప్ చేస్తున్నారు. దీంతో చెరువునీరు కలుషితం కావడంతో పాటు ఆహ్లాదం కనుమరుగవుతోంది. చెరువు జనావాసాలకు దూరంగా దట్టమైన గుట్టలు, కొండలను ఆనుకొని ఉండడంతో నీరు స్వచ్ఛందంగా ఉండడంతో పాటు వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. జాతీయ రహదారి పక్కనే ఉండడం, చెరువు పక్కనే ఓ హోటల్ ఉండడంతో ప్రయాణికులు కొద్దిసేపు ఆగి సేద తీరుతారు. గత ప్రభుత్వ హయాంలో చెరువును బతుకమ్మ కుంటగా మార్చి కట్టను కూడా వెడల్పు చేయించారు. ప్రతి సంవత్సరం బతుకమ్మలను, వినాయక చవితి సందర్భంగా విగ్రహాలను ఇందులోనే నిమజ్జనం చేస్తారు. డంపింగ్ యార్డు ఉన్నా.. చెరువును ఆనుకొని ఉన్న గుట్టల పైభాగంలో మున్సిపాలిటీ డంపింగ్ యార్డు నిర్మించారు. ప్రతి రోజూ ట్రాక్టర్లు, ట్రాలీ ఆటోల్లో సేకరించిన చెత్తను చెరువు పక్కనుంచే డంపింగ్ యార్డుకు తీసుకెళ్తారు. అయితే ఎత్తైన గుట్టల పైభాగంలో ఉన్న డంపింగ్ యార్డు వద్దకు వెళ్లాలంటే మున్సిపల్ సిబ్బందికి కష్టమవుతోంది. ఏ మాత్రం పట్టుతప్పినా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వర్షం పడితే అక్కడికి వెళ్లడం అసాధ్యం. దీంతో 15 రోజులుగా మున్సిపల్ సిబ్బంది చెత్తను డంపింగ్ యార్డుకు తరలించకుండా చెరువును ఆనుకొనే పోస్తున్నారు. ఆ ప్రాంతంలో పేరుకుపోయిన చెత్తను అక్కడే తగులబెడుతున్నారు. ఫలితంగా అక్కడి వాతావరణం కలు షితం కావడంతో వర్షాలు వచ్చినప్పుడు చెత్త చెరువులోకి చేరి దుర్వాసన వస్తోంది. స్వచ్ఛమైన చెరువు నీటిలో మున్సిపల్ సిబ్బంది చెత్తను వేస్తుండడంతో నీరు కలుషితం అవుతుందని పట్టణ ప్రజలు వా పోతున్నారు. అధికారులు డంపింగ్‌యార్డును వేరే ప్రాంతంలో ఏర్పాటు చేసి చెరువు వద్ద చెత్తను పోయకుండా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. చర్యలు తీసుకుంటాం పట్టణ శివారులోని సర్వయ్య కుంటలో చెత్త వేస్తున్న విషయం నా దృష్టికి రాలేదు. చెత్త, పొగతో చెరువు నీటితో పాటు వాతావరణం కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. చెరువు వద్ద చెత్త వేయకుండా తగిన చర్యలు తీసుకుంటాను. ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తా. – దేవేందర్, మున్సిపల్ కమిషనర్ -
ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు
జిల్లా ఉద్యాన అధికారి ప్రతాప్‌సింగ్ తూప్రాన్: ఆయిల్‌పామ్ సాగుతో రైతులు అధిక దిగుబడి సాధించవచ్చని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమలశాఖ అధికారి ప్రతాప్‌సింగ్ అన్నారు. బుధవారం మండలంలోని అల్లాపూర్, రావెల్లిలో రైతు లు వ్యవసాయ క్షేత్రాల్లో ఆయిల్‌పామ్ మొక్క లు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్‌పాం సాగుకు సబ్సిడీ అందిస్తుందని తెలిపారు. చీడపీడల బెడద తక్కువగా ఉంటుందని, ఈ మొక్కల ద్వారా 30 ఏళ్ల వరకు ఆదాయం లభిస్తుందన్నారు. తోటలో అంతర పంటలు వేసుకొని ఆదాయం పొందవచ్చన్నారు. ఆసక్తి గల రైతులు వివరాలకు 8977725910 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి గంగమల్లు, ఏఈఓ సంతోశ్‌కుమార్, ఆయిల్‌పాం కంపెనీ మేనేజర్ కృష్ణ, అశోక్, ఫీల్డ్‌ఆఫీసర్ నిశాంత్, గ్రామ రైతులు పాల్గొన్నారు. -
ఓపీఎస్‌లకు వేతనాలేవి?
ఆరు నెలలుగా ఉద్యోగుల ఇబ్బందులుమెదక్జోన్: ఆరు నెలలుగా వేతనాలు అందక ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు (ఓపీఎస్) తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో 492 గ్రామాలు ఉండగా, 44 మంది ఓపీఎస్లు విధులు నిర్వర్తిస్తున్నారు. 2021లో విధుల్లో చేరిన వీరు రెగ్యులరైజ్ అవుతుందన్న ఆశతో నాలుగేళ్లుగా నామమాత్రపు వేతనంతో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి ప్రతి 3 నెలలకోసారి ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేస్తుంది. కాగా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలకు సంబంధించి ఇప్పటికీ వేతనాలు రాలేదు. ఆర్డర్ కాపీ ట్రెజరీకి రాకపోవడంతో వేతనాలు విడుదల కానట్లు తెలుస్తోంది. గోటి చుట్టపై రోకలి పోటు అసలే ఔట్సోర్సింగ్ ఉద్యోగం, నామమాత్రపు వేతనంతో జీవనం సాగిస్తున్నారు. ఆరు నెలలుగా జీతాలు రాకపోగా, వీరు విధులు నిర్వహించే పంచాయతీల్లో చెత్త సేకరణ వాహనాలకు డీజిల్ పోయించడం, ప్రభుత్వ సభలు, సమావేశాలు నిర్వహిస్తే అందుకు సంబంధించిన ఖర్చులు సైతం అప్పులు చేసి వెచ్చిస్తున్నామని పలువురు ఓపీఎస్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా నిత్యం ఉదయం పంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్లి ఆన్లైన్ సిస్టం ద్వారా ఫొటో దిగి పంపించడంతో పాటు ప్రభుత్వం అప్పగించే ప్రతి పనిని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణాల్లో ప్రతిరోజు లబ్ధిదారులతో మమేకమై వారికి తగు సలహాలు, సూచనలు చేయడంతో పాటు ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఫొటోలను నిర్ధేశిత గ్రూప్‌లలో పోస్టు చేయాల్సి ఉంటుంది. లేదంటే లబ్ధిదారులకు బిల్లులు రాకుండా పోతాయి. వీటిన్నంటిని భరిస్తున్న ఓపీఎస్లు రాబోయే రోజుల్లో రెగ్యులరైజ్ అవుతుందన్న ఆశతో పనిచేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలలుగా వేతనాలు రాక కుటుంబ పోషణ, ఏడాదిన్నరగా సర్పంచ్‌లు లేక పంచాయతీల నిర్వహణ భారంగా మారిందన్నారు. ఒక్కొక్కరం రూ. 3 నుంచి రూ. 5 లక్షల వరకు అప్పులు చేసినట్లు పలు వురు ఓపీఎస్లు వాపోయారు. ఆర్డర్ రాకపోవడంతోనే.. ఓపీఎస్‌లకు మే, జూన్, జూలైకి సంబంధించి వేతనాలు వచ్చాయి. కాని ప్రభుత్వం నుంచి ఓపీఎస్‌ల కంటిన్యూ ఆర్డర్ రాలేదు. అందు వల్లనే వారికి ట్రెజరీలో బిల్లులు పాస్‌కాలేదు. అలాగే కొంత మందికి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించి వేతనాల విష యంలో ఆయా ఎంపీడీఓలు బిల్లులు పెట్టలేదు. అందుకే వారికి వేతనాలు రాలేదు. – యాదయ్య, డీపీఓ -
భూ సమస్యలను పరిష్కరించాలి
అదనపు కలెక్టర్ నగేశ్ టేక్మాల్(మెదక్): భూ భారతి దరఖాస్తులను వెంట వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. బుధవారం మండలంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని అకస్మికంగా తనిఖీ చేసి రికార్డుల ను పరిశీలించారు. అనంతరం రెవెన్యూ సిబ్బంది తో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దరఖాస్తులను పరిశీలిస్తూ అవసరమైతే ఫీల్డ్‌కు వెళ్లి పరిశీలించి సమస్యలు పరిష్కరించాలన్నారు. పూర్తి చేసిన ఫైల్స్ వివరాలను ఎప్పటికప్పుడూ ఆన్లైన్ చేసి, ఉన్నతాధికారులకు నివేదిక అందించాలని ఆదేశించారు. వచ్చిన దరఖాస్తులను ఒకటికి, రెండు సార్లు పరిశీలిస్తూ పరిష్కరించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని హెచ్చరించారు. ఆయన వెంట తహసీల్దార్ తులసీరాం, ఆర్ఐ సాయి శ్రీకాంత్, జూనియర్ అసిస్టెంట్లు నవీన్‌కుమార్, గణేశ్, సర్వేయర్ మహేశ్ ఉన్నారు. -
మొక్కలు నాటి సంరక్షించాలి
కలెక్టర్ రాహుల్రాజ్నర్సాపూర్/నర్సాపూర్ రూరల్: విద్యార్థులు తాము నాటిన మొక్కలను కాపాడే బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. బుధవారం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వన మహోత్సవంలో భాగంగా అధికారులు, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కాలేజీలో హాజరుశాతం పెరిగిందని, వందశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. కాలేజీ పక్కనే ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మెనూ పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ మహిపాల్‌రెడ్డి, జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి మాధవి, తహసీల్దార్ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ శేషాచారి, లెక్చరర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం మండలంలోని రెడ్డిపల్లి పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సమయపాలన పాటిస్తూ రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అనంతరం ఓపి రిజిస్టర్, మందుల స్టాక్, ఇతర రికార్డులను పరిశీలించారు. అలాగే గ్రామాన్ని సందర్శించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు త్వరగా నిర్మించుకుంటే దశలవారీగా బిల్లులను ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ మహిపాల్‌రెడ్డి, ఎంపీడీఓ మధులత, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు చేయండి మెదక్ కలెక్టరేట్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయా లని కలెక్టర్ అధికారుల సూచించారు. బుధవారం కలెక్టరేట్లో వేడుకల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉత్తమ పని తీరు కనబర్చిన ఉద్యోగుల వివరాలు కలెక్టరేట్‌కు పంపించాలన్నారు. అనంతరం ఈనెల 11 నుంచి జిల్లాలో నిర్వహించనున్న జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవానికి సంబంధించి సన్నాహక సమావేశం నిర్వహించారు. అల్బెండజోల్ మాత్రలు సిద్ధంగా ఉన్నాయని, చిన్నారులతో పాటు కౌమార దశలో ఉన్న యువతకు వేయాలని ఆదేశించారు. -
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి
మెదక్ కలెక్టరేట్: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొండల్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కొండల్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను కాపాడాల్సిన బాధ్యత టీచర్లపై ఉందన్నారు. విద్యారంగ బడ్జెట్‌ను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే కుట్ర చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో టీచర్లను నియమించకుండా నాణ్యమైన విద్య ఎలా సాధ్యమన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న పీఆర్సీని వెంటనే అమలు చేయాలన్నారు. అన్ని రకాల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలన్నారు. 5571 ిపీఎస్ హెచ్ఎం పోస్టులు ప్రకటించాలని, డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేసి, జీవో నెంబర్ 25 ను సవరించాలన్నారు. కేజీబీవీ ఉపాధ్యాయులకు సమ్మె కాలపు వేతనం ఇవ్వాలన్నారు. మోడల్ స్కూల్ టీచర్ 010 హెడ్ కింద జీతాలు ఇవ్వాలని కోరారు. అనంతరం కలెక్టరేట్ ఏఓ యూనస్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘల పోరాట కమిటీ నాయకులు యాదగిరి. వెంకట్ రామ్ రెడ్డి, పద్మా రావు,శ్రీనివాస్ రావు,శ్రీనివాస్ రెడ్డి,గోపాల్, సురేందర్, రవీందర్ రెడ్డి, నసీరుద్దీన్,నజీరోద్దీన్, కవిత, రజిత,సంగీత, దేవీ సింగ్, అజయ్,రవి, నాగేష్, శేఖర్, గంగాధర్,నర్సింలు,గిరి, నాచారం,శేఖర్ తదితరులు పాల్గొన్నారు. పీఆర్సీ వెంటనే అమలు చేయాలి టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొండల్ రెడ్డి కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయ సంఘాల నిరసన -
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి
మెదక్ మున్సిపాలిటీ: జిల్లాలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా మొదటిరోజు మంగళవారం మెదక్‌లో విస్తృతంగా పర్యటించారు. వివిధ వార్డులను సందర్శిస్తూ పాత టైర్లు, గోళాలు, నీరు నిల్వ ఉన్న వాటిని పరిశీలించి దగ్గరుండి పారబోయించారు. నిల్వ ఉన్న ప్రదేశాల్లో దోమలు గుడ్లు పెట్టి లార్వాలను ఉత్పత్తి చేసి దోమల సంతతిని పెంపొందించుకొని క్యూలెక్స్, ఎనా పిల్స్, దోమల రూపంలో మలేరియా, డెంగ్యూ విష జ్వరాలతో పాటు ప్రజలకు అంటూ వ్యాధులు వ్యాప్తి చెందుతాయని, దోమల నిర్మూలన లక్ష్యంగా పనిచేయాలన్నారు. మున్సిపాలిటీలు, జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో తప్పనిసరిగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. అనంతరం మెదక్‌లోని పశువైద్యశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయ పనితీరును, పశువైద్యుల హాజరు, ఔషధాల నిల్వలు, రోగ నిర్ధారణ పరికరాల వినియోగం, రికార్డ్ నిర్వహణ, పశువులకు వ్యాక్సినేషన్ వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, పశుసంవర్ధక శాఖ ఏడి వెంకటయ్య, పశువైద్యాధికారులు పాల్గొన్నారు. 7,668 యూనిట్లు మంజూరు హవేళిఘణాపూర్(మెదక్): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి సంస్థల క్రమబద్ధీకరణ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. మంగళవారం మెదక్ మండలం రాజ్‌పల్లిలో స్వయం సహాయక గ్రూపు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యూనిట్లను ఆయన పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా వడ్డీ లేని రుణాల కింద 7,668 యూనిట్లు నెలకొల్పామని, రూ.20 లక్షల వరకు రుణాలు అందజేశామన్నారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి సంస్థల క్రమబద్ధీకరణ పథకం కింద 150 యూనిట్లు మంజూరయ్యాయని, మహిళా సభ్యులు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే పీఎం ఎఫ్ఎంఈ పథకం కింద రెండు లక్షల నుంచి 10 లక్షల వరకు రుణాలు అందించగా, 30శాతం సబ్సిడీ మంజూరు చేశామన్నారు. కార్యక్రమంలో ఏపీడీ సరస్వతి, ఏపీఎం నాగరాజు, డీజీఎం యాదగిరి, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు. దోమల నివారణకు ఫాగింగ్ చేయాలి మెదక్‌లో కలెక్టర్ విస్తృత పర్యటన -
కేసీఆర్‌ను బద్నాం చేసేందుకే..
మెదక్ మున్సిపాలిటీ: కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి అద్భుతమైన కట్టడం కేవలం కేసీఆర్ వల్లనే సాధ్యమైందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీశ్‌రావు కాళేశ్వరం ప్రాజెక్టుపైన ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను మెదక్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వీక్షించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేసీఆర్‌ను బద్నామ్ చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ ఆటలు సాగనివ్వబోమని స్పష్టం చేశారు. వ్యవసాయం, తాగునీటికి ఎంతో ఉపయోగపడే కాళేశ్వరంపై విఫల ప్రాజెక్టు అని చిత్రీకరించేందుకు కాంగ్రెస్ కుటిల రాజకీయాలకు పాల్పడుతోందని వారు విమర్శించారు. కాళేశ్వరంపై గ్రామాల్లో ప్రజలకు వివరిస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు హేమలత, మాజీ ఉపాధ్యక్షురాలు లావణ్య రెడ్డి, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు, మెదక్, నర్సాపూర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కాళేశ్వరంపై కుట్ర రాజకీయాలు బీఆర్ఎస్ నేతలు పద్మారెడ్డి, సునీతారెడ్డి ధ్వజం -
దళారులను నమ్మి మోసపోవద్దు
కొల్చారం(నర్సాపూర్): ప్రభుత్వం నిర్దేశించిన కొలతల ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని హౌసింగ్ శాఖ పీడీ మాణిక్యం సూచించారు. మంగళవారం మండలంలోని వరిగుంతం గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారులు నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ దళారులను నమ్మి లబ్ధిదారులు మోసపోవద్దని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన కొలతల ప్రకారం నిర్మాణం చేపట్టాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లల్లో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా నిరంతరం అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారని పేర్కొన్నారు ఇసుక, సిమెంట్, స్టీల్ అధిక ధరలకు విక్రయించకుండా కలెక్టర్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. లబ్ధిదారులు అధిక ధరలు చెల్లించి ఇబ్బంది పడవద్దు అని ఆయన సూచించారు. పీడీ వెంట ఎంపీడీవో రఫీకున్నిసా, హౌసింగ్ ఏఈ ప్రవళిక, పంచాయతీ కార్యదర్శి శ్రీదేవి ఉన్నారు. నిబంధనల ప్రకారమే ఇందిరమ్మ ఇళ్లు హౌసింగ్ పీడీ మాణిక్యం -
లక్ష్యం.. 2500 ఎకరాలు
కౌడిపల్లి(నర్సాపూర్): రైతులు ఆయిల్‌పామ్ సాగుతో అధిక ఆదాయం పొందవచ్చని జిల్లా వ్యవసాయాధికారి దేవ్‌కుమార్, డీహెచ్ఎస్ఓ ప్రతాప్‌సింగ్ అన్నారు. మంగళవారం కౌడిపల్లిలో రైతులు సత్తిరెడ్డి, బాల్రెడ్డిలకు చెందిన 22 ఎకరాలలో ఆయిల్‌పామ్ సాగుకు అధికారులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయిల్‌పామ్ ఒకసారి సాగు చేస్తే నిరంతర ఆదాయం వస్తుందన్నారు. ఎకరాకు మొక్కలు, డ్రిప్, మెయింటెనెన్స్‌కు ప్రభుత్వం రూ 48వేలు సబ్పిడీ ఇస్తుందన్నారు. నాలుగేళ్ల తర్వాత ఎకరాకు రూ 1.40లక్షల లాభం వస్తుందని చెప్పారు. జిల్లాలో ఈ ఏడాది 2,500 ఎకరాలలో ఆయిల్‌పామ్ సాగు లక్ష్యం పెట్టుకున్నామని, ఇప్పటివరకు 1,900 మంది రైతులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఇందులో 930మంది రైతులు మొక్కలకు డబ్బులు చెల్లించారని చెప్పారు. 370 ఎకరాలలో మొక్కలు నాటినట్లు తెలిపారు. నాలుగేళ్లపాటు అంతర పంటగా సాగుచేసి అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. రైతులు వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్ సాగు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఓ స్వప్న, ఏఈఓ సాహితి, లివ్పామ్ రిసోర్స్ కంపెనీ మేనేజర్ కృష్ణరాజ్, అసిస్టెంట్ మేనేజర్ జాన్సన్, ఫీల్డ్ అఫీసర్ మౌనిక, రైతులు సత్తిరెడ్డి, బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నానో యూరియాతో పంటలకు మేలు మనోహరాబాద్(తూప్రాన్): పంటలకు నానో యూరియా వాడితే ఎంతో ప్రయోజనం చేకూరుతుందని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్ అన్నారు. మంగళవారం మనోహరాబాద్ మండలం కూచారం గ్రామ రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. అనంతరం రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ.. భూ పరిస్ధితులకు అనుగుణంగా పంటలు వేయాలని, పంటమార్పిడితో నష్టల నుం,చి తప్పించుకోవచ్చని చెప్పారు. అంతకు ముందు వీడియో సమీక్షలో వ్యవసాయ యూనివర్సిటీ నుంచి శాస్త్రవేత్తలు వరి పంటల్లో వెదజల్లే పద్ధతి, జాగ్రత్తలు, ఆయిల్‌పాం పంటల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఏడీఏ సంధ్యారాణి, మండల వ్యవసాయ అధికారి స్రవంతి, టిక్నికల్ అధికారి యాదగిరి, ఏఈఓలు సచిన్, నరేందర్‌గౌడ్ పాల్గొన్నారు. ఆయిల్ పామ్ సాగుతో అధిక ఆదాయం జిల్లా వ్యవసాయాధికారి దేవ్‌కుమార్ -
మడి తడపని మంజీరా
పాపన్నపేట(మెదక్): తలాపునే ఘనపురం ప్రాజెక్టు ఉన్నా.. మడి తడవని పరిస్థితి. ఫతేనహర్ కెనాల్ నీరు దౌలాపూర్ గుట్టలను దాటి పాపన్నపేట చేరాలంటే ఏటా భగీరథ యత్నమే. కెనాల్ నిర్మాణంలో ఉన్న లోపాలు అన్నదాతకు శాపంగా మారాయి. కాలువ కింద ఉన్న ప్రతి గ్రామానికి నీరు అందినా, చివరి ఆయకట్టు పాపన్నపేటకు మాత్రం కన్నీరే దిక్కవుతుంది. ఎలాగైనా కాలువ నీటిని మళ్లించి, ఎండి పోతున్న పంటలను రక్షించుకోవాలన్న ఆశతో రైతులు జేసీబీతో కాలువ తీశారు. కానీ మంజీరా నీరు మాత్రం వారి మడులకు చేరలేదు. ఘనపురం.. జీవనాధారం ఘనపురం ఆనకట్ట పాపన్నపేట మండలానికి జీవనాధారం. అయితే ఫతేనహర్ కెనాల్ నిర్మాణం పాపన్నపేటకు వచ్చే సరికి ఎత్తుగా మారుతుంది. దీంతో పైన ఉన్న అన్ని గ్రామాల రైతులు నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తే పాపన్నపేటకు నీరందని పరిస్థితి. ఈ కాలువల పునర్నిర్మాణం చేయాలని దశాబ్దాలుగా రైతులు డిమాండ్ చేస్తున్నా, వారి వేదన అరణ్య రోదనగానే మిగిలింది. ఘనపురం నీటి కోసం రైతన్నల పాట్లు ఫతేనహర్ కెనాల్ నిర్మాణంలో లోపాలు చివరి ఆయకట్టుకు కన్నీరు వాడుముఖం పట్టిన వరినాట్లు వరుణుడు కరుణించక మండలంలో వేసిన వరినాట్లు వాడుముఖం పట్టాయి. ఇతర గ్రామాలకు ఘణపురం ఆనకట్ట నీరు ఫతేనహర్ కెనాల్ ద్వారా అందుతున్నా, పాపన్నపేట రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. అసలే కాలువ నిర్మాణం నీటి ప్రవాహానికి వ్యతిరేకం.. ఆపై నిర్వహణ కరువై పిచ్చి మొక్కలు పేరుకు పోయాయి. దీంతో రైతన్నలు తలా ఇంత చందాలు వేసుకొని జేసీబీతో కాలువ శుభ్రం చేయించారు. అయినా, ఆశించిన ఫలితం దక్కలేదు. దీంతో ఉసూరుమంటూ వెనుదిరిగారు. ఎగువన ఉన్న గ్రామాల రైతులు తమ వైపు వెళ్లే నీటికి అడ్డుకట్ట వేస్తే, పాపన్నపేటకు నీరు వచ్చే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. ఒకవేళ ఆ నీరు వస్తే, మొదట చౌదరి చెరువు, ఆపై పాత చెరువులోకి నీరు చేరి సుమారు 300 ఎకరాల్లో పంటలు పండుతాయని పేర్కొంటున్నారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
జిల్లా వైద్యాధికారి శ్రీరాం పాపన్నపేట(మెదక్): వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి శ్రీరాం అన్నారు. మంగళవారం ఆయన మండల పరిధిలోని పొడిచన్పల్లి పీహెచ్‌సీని సందర్శించారు. దోమల వల్ల అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజలు జ్వరం లక్షణాలతో ఆస్పత్రికి వస్తే, తగిన పరీక్షలు చేయాలని చెప్పారు. ఆరోగ్య కేంద్రాల్లో సరిపడా మందులు ఉంచాలని కోరారు. కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి నవ్య తదితరులు పాల్గొన్నారు. కేజీబీవీలో కుక్‌పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం మిరుదొడ్డి(దుబ్బాక): మిరుదొడ్డిలోని కేజీబీవీ (కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం)లో రెండు సహాయ వంట మనుషుల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఎంఈఓ ప్రవీణ్ బాబు తెలిపారు. మిరుదొడ్డిలో మంగళవారం ఆయన మాట్లాడుతూ...7వ తరగతి కనీస విద్యార్హత కలిగిన మహిళలు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 6, 7 తేదీలల్లో సంబంధిత కేజీబీవీలో దరఖాస్తులను అందజేయాలని కోరారు. -
‘భూభారతి’ వేగవంతం చేయండి
ఆర్డీఓ రమాదేవి పాపన్నపేట(మెదక్): భూభారతిలో రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించాలని మెదక్ ఆర్డీఓ రమాదేవి సూచించారు. మంగళవారం ఆమె పాపన్నపేట మండల తహశీల్దార్ కార్యాలయం సందర్శించారు. భూభారతిలో వచ్చిన సమస్యలు వాటి పరిష్కారం కోసం తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆధారాలు పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. తహసీల్దార్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలి గిరిజన సంక్షేమ అధికారి నీలిమా చిన్నశంకరంపేట(మెదక్): పరిసరాల పరిశుభ్రతపై గ్రామపంచాయతీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని గిరిజన సంక్షేమ జిల్లా అధికారి నీలిమా కోరారు. మంగళవారం నార్సింగి మండల కేంద్రంతో పాటు నర్సంపల్లిపెద్దతండాలో పారిశుద్ధ్య పనులను పరిశిలించారు. ఈ సందర్భంగా నార్సింగిలో పలు నివాస గృహాల వద్ద నీటి నిల్వ లేకుండా చేయాలని, అవగాహన కల్పించారు. పెద్దతండాలో పాఠశాలను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఆనంద్, ఈజీఎస్ ఏపీఓ రాజేశ్వర్‌గౌడ్, ఈఓ నాగభూషనం, ఏఎన్ఎం రేణుక పాల్గొన్నారు. మహిళా ప్రొటెక్షన్ సెల్ చైర్‌పర్సన్‌గా సుశీల నారాయణఖేడ్: నేషనల్ హ్యూమన్‌రైట్స్ సోషల్ జస్టిస్ కమిషన్ సంస్థ మహిళా ప్రొటెక్షన్ సెల్ నిజాంపేట మండల చైర్‌పర్సన్‌గా సుశీల నియమితులయ్యారు. మంగళవారం నారాయణఖేడ్‌లోని సంస్థ ప్రాంతీయ కార్యాలయంలో సంస్థ జిల్లా అధ్యక్షుడు బి.కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సంస్థ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ రహీం ఈ మేరకు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల సమస్యలను అధికారులు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని ఆయన సూచించారు. సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి మైనొద్దీన్, జిల్లా ఇతర బాధ్యులు రాజ్‌కుమార్, అఖిల్ పాల్గొన్నారు. ఆహార శుద్ధి యంత్రాలప్రదర్శన హుస్నాబాద్: ప్రధాన మంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ(పీఎంఎఫ్ఎంఈ) పఽథకం కింద స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం ఆహార శుద్ధి యంత్రాల ప్రదర్శన నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులకు యంత్రాల పని తీరుపై అవగాహన కల్పించారు. ప్రతీ యూనిట్ రూ.1లక్ష నుంచి రూ.30 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించనున్నారు. ప్రతీ యూనిట్‌కు 35% రాయితీ అందించనున్నారు. ఆహారశుద్ధి రంగాన్ని సంస్థాగతంగా బలోపేతం చేయడం, సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలకు మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ బృహత్తర పఽథకాన్ని ప్రవేశపెట్టినట్లు సంస్థల ప్రతినిధులు తెలిపారు. చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలి కొమురవెల్లి(సిద్దిపేట): చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధించేవరకు పోరాటం కొనసాగుతుందని జేఏసీ చైర్మన్ వకుళాభరణం నర్సయ్య పేర్కొన్నారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధనకోసం మండలంలోని అన్నిగ్రామాల్లో మంగళవారం బైక్‌ర్యాలీ నిర్వహించి మండల కేంద్రంలో తహసీల్దార్ దివ్యకు వినతిపత్రం అందించారు. -
సైబర్ వలలో విద్యావంతులే అధికం
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు మెదక్ మున్సిపాలిటీ: సైబర్ నేరగాళ్ల వలలో విద్యావంతులే అధికంగా ఉంటున్నారని, ఉచితం, ఎక్కువ లాభం అంటే మోసం అని గ్రహించాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ వినియోగం పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయన్నారు. ఆశ, భయం, మానవ తప్పిదం వల్లే సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. బ్యాంకు అధికారులమని ఫోన్ చేస్తే నమ్మవద్దని, అనుమానం ఉంటే సంబంధిత బ్యాంకు అధికారులను సంప్రదించాలని సూచించారు. 16 ఫిర్యాదులు జిల్లా ప్రధాన పోలీస్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ జిల్లాస్థాయి ప్రజావాణి నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు 16 సమస్యలపై ఫిర్యాదులు అందజేశారు. -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
వెల్దుర్తి(తూప్రాన్): ప్రజాపాలన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో పార్టీ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అమలు కాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిందని, తర్వాత హామీలను పూర్తిగా విస్మరించిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పనితీరు సమైక్యాంధ్ర పాలనను గుర్తు తెస్తుందన్నారు. ముఖ్యంగా రైతులకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారన్నారు. దీనిని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో ఈనెల 7న పార్టీ తరఫున పెద్దఎత్తున ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లాలో సగటు వర్షపాతం నమోదు కాక రైతులు ఆకాశం వైపు చూస్తుంటే, అటు సింగూరు, ఇటు కొండపోచమ్మ సాగర్ నుంచి నీటిని విడుదల చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఒకవిధంగా, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నచోట మరోవిధంగా ప్రొటోకాల్ పాటించడం విచారకరమన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ కార్యక్రమంగా మారుస్తున్న అధికార పార్టీ నాయకుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ సుభాశ్‌రెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ హేమలత, సీనియర్ నాయకులు తిరుపతిరెడ్డి, చంద్రాగౌడ్, మెదక్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కృష్ణాగౌడ్, మాజీ జెడ్పీటీసీ రమేశ్‌గౌడ్, భూపాల్‌రెడ్డి, మాజీ ఎంపీపీ హరికృష్ణ, రాజశేఖర్‌గౌడ్, శ్రవణ్‌కుమార్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 7న మెదక్‌లో పెద్దఎత్తున ధర్నా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి -
అమ్మాయిలకు అండగా షీటీం
డీఎస్పీ నరేందర్‌గౌడ్ చేగుంట(తూప్రాన్): చదువుకునే అమ్మాయిలకు రక్షణగా షీటీం పోలీసులు పనిచేస్తారని తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్ అన్నారు. చేగుంట మోడల్ పాఠశాలలో సోమవారం విద్యార్థులకు షీటీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో డీఎస్పీ మాట్లాడారు. ఆకతాయిల వేధింపులను అరికట్టడానికి షీటీం పోలీసులు కృషి చేస్తారన్నారు. అధికంగా డబ్బులు వస్తాయని ఫోన్లలో వచ్చే ప్రకటనలు నమ్మి మోసపోవద్దని చెప్పారు. యువతను మత్తు పదార్థాలు డ్రగ్స్ పెడదారి పట్టేలా చేస్తాయని, వాటి నివారణ కోసం కృషి చేయాలన్నారు. అమ్మాయిలను వేధించే విషయంలో పోక్సో చట్టం గురించి వివరించారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నతంగా ఎదిగితే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సంతోషిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేగుంట ఎస్ఐ చైతన్యకుమార్‌రెడ్డి, ప్రిన్సిపాల్ చంద్రకళ, షీటీం సభ్యులు విద్యార్థులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌తోనే పేదల సంక్షేమం
నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణఖేడ్/కంగ్టి/కల్హేర్: పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదలకు రేషన్ కార్డులు, ఇళ్లు ఇవ్వలేదని, పేదల సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. కంగ్టిలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇన్నాళ్లు రేషన్ కార్డులు లేక పేదలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో బేస్మెంట్ పూర్తిచేసిన వారికి చెక్కులు పంపిణీ చేశారు. అలాగే కల్హేర్ మండలం సిర్గాపూర్‌లో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. మండలంలోని కృష్ణాపూర్ వద్ద నల్లవాగు కాల్వలో పూడిక తీత, చెట్ల పొదల తొలగింపు పనులను పరిశీలించారు. నల్లవాగు ప్రాజెక్టు నిండితే కాల్వల ద్వారా సాగు నీటి సరఫరాకు ఆటంకం లేకుండా పూడిక తీత పనులు చేపడుతున్నామని తెలిపారు. అనంతరం ఖేడ్‌లో గొల్లకురుమ సంఘం నియో జకవర్గ, మండలాల నూతన కార్యవర్గాలను అభినందించారు. నియోజకవర్గంలోని గొల్లకురుమల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట అధికారులు, నాయకులు ఉన్నారు. -
సత్వరమే అర్జీలు పరిష్కరించండి
వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్ రాహుల్రాజ్మెదక్ కలెక్టరేట్: ప్రజలు మనపై నమ్మకంతో అర్జీలు అందజేస్తున్నారు.. వెంట వెంటనే పరిష్కరించి సమాధానం ఇవ్వాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులకు సూచించారు. సోమ వారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలు 111 వినతులు అందజేశారు. ఇందులో అత్యధికంగా భూ సమస్యలపై 32, పెన్షన్ల కోసం 12, ఇందిరమ్మ ఇళ్లు 12, ఇతర సమస్యలపై 57 దరఖాస్తులు అందజేయగా, కలెక్టర్ స్వీకరించి మాట్లాడారు. అధికారులు సానుకూలంగా స్పందించి దరఖాస్తులు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ శ్రీనివాసరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. నేటి నుంచి జిల్లాలో చేపట్టే ప్రత్యేక శానిటేషన్ డ్రైడేను పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి వెల్దుర్తి(తూప్రాన్): వర్షాకాలంలో సీజనల్ వ్యాఽ దులు ప్రబలకుండా ప్రతిఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని మాసాయిపేటలోని పలు కాలనీల్లో ఆకస్మికంగా పర్యటించారు. పలు నివా సా ల వద్ద నీటి తొట్లు, పాత టైర్లలో నిల్వ ఉన్న నీటిని గుర్తించి సిబ్బందిచే పారబోయించారు. కలెక్టర్ రాహుల్‌రాజ్ ప్రజావాణికి 111 దరఖాస్తులు -
అంగన్వాడీలకు పరికరాలు
సద్వినియోగం చేసుకోవాలి అంగన్వాడీ కేంద్రాల్లో ఫ్రీ స్కూల్ విద్యా విధానాన్ని మెరుగుపర్చడం కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇందులో భాగంగానే కేంద్రాలకు 60 రకాల పరికరాలు, ఆట వస్తువులు, టేబుళ్లు, మ్యాట్లు పంపిణీ చేశారు. వీటిని కేంద్రాల్లో సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. – హైమావతి, జిల్లా సంక్షేమాధికారిణి ● చిన్నారుల భద్రతకు ప్రత్యేక చర్యలు ● జిల్లాలో 1,076 కేంద్రాలు ● 50 వేల మంది విద్యార్థులు ● బలోపేతం కానున్న ఫ్రీ స్కూల్ విద్య అంగన్వాడీలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కేంద్రాల్లోని చిన్నారులను ఆకట్టుకునే విధ ంగా పలు రకాల వసతుల కల్పనకు పెద్దపీట వేసింది. ఈ మేరకు కేంద్రాలకు 60 రకాల పరికరాలు, రంగు రంగుల మ్యాట్లు, టేబుళ్లు పంపిణీ చేసింది. కేంద్రాల్లో ఫ్రీ స్కూల్ విద్యా విధానాన్ని మెరుగుపరిచే దిశగా మాతా, శిశు సంక్షేమశాఖ కృషి చేస్తుంది. – రామాయంపేట(మెదక్) జిల్లా పరిధిలో 21 మండలాల్లో మొత్తం 1,076 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 50 వేల పైచిలుకు విద్యార్థులున్నారు. కేంద్రాల్లో సరైన సదుపాయాలు లేక చిన్నారులు ఇబ్బందులపాలవుతున్నారు. అపరిశుభ్ర వాతావరణంలో నేలపై కూ ర్చొని ఆహారం తీసుకుంటున్నారు. దీంతో వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉండటంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అన్ని కేంద్రాలకు మౌలిక సదుపాయాలు కల్పించి, వాటిని బలో పేతం చేసే దిశగా కృషి చేస్తుంది. ఇందులో భాగంగా జిల్లా పరిధిలోని అన్ని కేంద్రాలకు రంగు రంగుల మ్యాట్లతో పాటు టేబుళ్లు, ఫ్రీ స్కూల్ కిట్లు, పుస్తకాలు పెట్టుకోవడానికి వీలుగా ర్యాక్‌లతో పాటు 60 రకాల పరికరాలు పంపిణీ చేశారు. కేంద్రాల్లోని చిన్నారులను మ్యాట్లపై కూర్చొబెట్టి చదువు చెబుతున్నారు. వారు ఒకే చోట కూర్చొని అల్పాహారం చేసే లా ప్రత్యేకంగా ప్రతి కేంద్రానికి రెండు టేబుళ్లు సరఫరా చేశారు. స్కూల్ కిట్‌లో కథలకు సంబంధించి చిన్న చిన్న బొమ్మల పుస్తకాలతో పాటు ఆటలు ఆడుకోవడానికి వీలుగా సామగ్రి అందించారు. పుస్తకాల ర్యాక్, నాలుగు ప్రియదర్శిని పుస్తకాలు, బ్లూటూత్, ఫజిల్స్, వివిధ చార్టులు, వాటర్ కలర్స్ బ్రష్‌లతో పాటు పలు రకాల పండ్ల బొమ్మలు అందజేశారు. చిన్నారులను నేలపై కాకుండా మ్యాట్లపై మాత్రమే కూర్చొబెట్టాలని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కాగా తాము కేంద్రాలకు మంజూరు చేసిన పరికరాలు వినియోగిస్తున్నారా..? లేదా అనే విషయమై పర్యవేక్షించేందుకు మ్యాట్లపై చిన్నారులను ఉంచి ప్రతి రోజు యాప్‌లో ఫొటోలు అప్లోడ్ చేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. -
కార్మికుల హక్కులపై కేంద్రం దాడి
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరయ్య తూప్రాన్: బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులపై దాడి చేస్తుందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరయ్య ఆరోపించారు. సోమవారం పట్టణంలో రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం ఆధ్వర్యంలో ‘లేబర్ కోడ్స్– కార్మికులపై ప్రభావం’ అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌కు ముఖ్య అతిథిగా హా జరై మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకువచ్చిందని అన్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం పని గంటలు పెంచుతూ జీఓ విడుదల చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం సీఐటీయూ మెదక్ జిల్లా కార్యదర్శి మల్లేశం మాట్లాడుతూ..జిల్లాలో మొదటిసారిగా సీఐటీయూ రాష్ట్ర 5వ మహాసభలు డిసెంబర్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్య క్రమంలో ఆహ్వాన సంఘం వైస్ చైర్మన్ అడివయ్య, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి
కార్యకర్తలకు జగ్గారెడ్డి పిలుపు కొండాపూర్(సంగారెడ్డి): స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధం కావాలని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మండల పరిధి మల్కాపూర్ చౌరస్తాలోని ఓ ఫంక్షన్హాల్లో నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలో ఎంపీపీలతో పాటు మున్సిపల్లో కూడా కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలన్నారు. మరో 8 ఏళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని, పేదల సంక్షేమం కోసం సీఎం రేవంత్‌రెడ్డి అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారని తెలిపారు. 10 ఏళ్ల లో కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని నాశనం చేసిందన్నారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ రాంరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, సదాశివపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కుమార్, ఎంపీటీసీ నరసింహారెడ్డి, నాయకులు వెంకటేశంగౌడ్, శ్రీకాంత్‌రెడ్డి, నరసింహులు, ప్రభుదాస్, మల్లారెడ్డి, సునీల్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్ల అమలుకు ఉద్యమం నర్సాపూర్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం టీపీసీసీ ఉద్యమం చేపట్టిందని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ అన్నారు. ఢిల్లీలో చేపట్టిన మూడు రోజుల ఉద్యమంలో పాల్గొనేందుకు సోమవారం జిల్లాకు చెందిన పార్టీ నాయకులతో కలిసి వెళ్లారు. కాగా బీసీలకు కాంగ్రెస్ హయాంలోనే న్యాయం జరుగుతుందని, 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యే వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు. డిప్లొమాలో అవకాశం మెదక్‌జోన్: పదో తరగతి పాసైన విద్యార్థినులు ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌లో చేరాలనుకుంటే ఎలాంటి ఎంట్రెన్స్ రాయకున్నా నేరుగా డిప్లొమాలో చేరవచ్చని మెదక్ ప్రభు త్వ మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ భవాని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, సివిల్ ఇంజనీర్ మూడు కోర్సులు ఉన్నాయని తెలిపారు. ఈనెల 10వ తేదీ వరకు కళాశాలలో నేరుగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి హవేళిఘణాపూర్(మెదక్): పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని పీఆర్టీయూటీఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం మండల పరిధిలోని జక్కన్నపేట, రాజ్‌పేట, సర్ధన, కూచన్‌పల్లిలో పీఆర్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2023 జూలై 1 నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీ, రెండేళ్లు గడిచినా నివేదికలు వెలువరించకపోవడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో నరేందర్‌రెడ్డి, రఘుబాబు, సంతోశ్, లక్ష్మీకాంతం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సిగాచీ బాధితులను ఆదుకోండి: సీఐటీయూ సంగారెడ్డి ఎడ్యుకేషన్: సిగాచీ పరిశ్రమ ప్రమాదంలో మృతిచెందిన కార్మిక కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో బాధిత కార్మిక కుటుంబ సభ్యులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈసందర్భంగా రాములు మాట్లాడుతూ.. ప్రమాదం జరిగి నెలరోజులు దాటినా బాధిత కుటుంబాలకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పూర్తి నష్టపరిహారం చెల్లించడంతో పాటు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కార్మిక సంఘాలను ఏకతాటిపైకి తెచ్చి పోరాడుతామని హెచ్చరించారు. దీక్షలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మల్లేశం, జిల్లా కార్యదర్శులు జయరాజ్, సాయిలు, రాష్ట్ర కమిటీ సభ్యులు రాజయ్య, నాయకులు మాణిక్యం, పాండురంగారెడ్డి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
బిల్లును అడ్డుకుంటున్నది బీజేపీనే
నారాయణఖేడ్: బీసీ రిజర్వేషన్ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించినప్పటికీ కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని సీపీఐ రాష్ట్ర నాయకుడు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. నారాయణఖేడ్‌లో ఆదివారం నిర్వహించిన సీపీఐ జిల్లా నాల్గవ మహాసభల్లో పాల్గొని మాట్లాడారు. బీజేపీ నాయకులు స్వార్థం కోసం అడ్డుపడుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరం నిర్మాణం విషయంలో తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ఆ సమస్యల పరిష్కారం కోసం ఎంతటి పోరాటాలకై నా తమ పార్టీ సిద్ధంగా ఉంటుందన్నారు. సింగూరు జలాలు సంగారెడ్డి జిల్లా ప్రజలకే అందాలన్నారు. జిల్లాలో తాగు, సాగునీటి కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. నిరుద్యోగ సమస్యను నిర్మూలించడానికి కర్మాగారాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో జిల్లా ఇన్చార్జి ఈటీ నర్సింహా, కార్యదర్శి సయ్యద్ జలాలొద్దీన్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు మంద పవన్, నాయకులు ప్రకాశ్‌రావు, జిల్లా సహాయ కార్యదర్శి ఆనంద్, కార్యవర్గ సభ్యులు రహేమాన్, తాజొద్దీన్, దత్తురెడ్డి, మహబూబ్‌ఖాన్, రుబీనా తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరంలో ఎవరు తప్పు చేసినా ఉపేక్షించొద్దు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు -
బోనం.. వైభవం
వెల్దుర్తి(తూప్రాన్): మండలంలోని ఎం.జలాల్పూర్ శివారులోని కాళికామాత దేవాలయం వద్ద శ్రావణమాసాన్ని పురస్కరించుకొని ఆదివారం బోనాలు ఊరేగింపు ఘనంగా చేపట్టారు. ఉదయం నుంచే వేద పండితులు హోమం, అర్చనలు, అభిషేకం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి రాజిరెడ్డితో పాటు పలువురు వేర్వేరుగా ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
కలెక్టర్ సైకిల్ సవారీ
రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రి తనిఖీరామాయంపేట(మెదక్)/హవేళిఘణాపూర్: ఆకస్మిక పర్యటనలతో కలెక్టర్ రాహుల్‌రాజ్ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఈమేరకు ఆదివారం తన సతీమణితో కలిసి మెదక్ నుంచి సైకిల్‌పై 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామాయంపేట చేరుకున్నారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. అటెండెన్స్ రిజిస్టర్‌తో పాటు మందుల స్టాక్‌ను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. జ్వరాలకు సంబంధించి కేసులను రిజిస్టర్ లో నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని జిల్లా పరిధిలో వైద్యశాఖను అప్రమత్తం చేశామన్నారు. ఇతర జిల్లాలతో పోలిస్తే జిల్లాలో వ్యాధుల సంఖ్య తగ్గిందన్నారు. త్వరలో ఆస్పత్రికి గైనకాలజిస్ట్ పోస్టు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం హవేళిఘణాపూర్ మండల కేంద్రంలోని ఎంజేపీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులకు పాఠాలు బోధించారు. స్టోర్‌రూంను పరిశీలించి విద్యార్థులకు పెడుతున్న మెనూ గురించి ప్రిన్సిపాల్ సృజనను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు వందశాతం తరగతులకు హాజరయ్యేలా చూడాలన్నారు. సామర్థ్యం కలిగిన వారిని ప్రోత్సహించి ఉన్నతస్థాయికి ఎదిగేందుకు కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. -
బీసీలకు కాంగ్రెస్ అన్యాయం
ఎమ్మెల్సీ అంజిరెడ్డిప్రభుత్వ భూమిని కాపాడండిపటాన్చెరు టౌన్: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయత్నం బీసీలకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చదని, ప్రతిపాదిత బీసీ రిజర్వేషన్లలో 10 శాతం ముస్లిం కోటా ఉన్నందున వారికి 32 శాతం రిజర్వేషన్లు మాత్రమే లభిస్తాయని ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు డివిజన్లోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు. మహా సంపర్క్ అభియాన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ కార్యకర్తలు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అమలు చేసే చాలా పథకాలు కేంద్రం నిధులతోనే అమలు చేస్తున్నారని తెలిపారు. గత 11 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం రైతుల సంక్షేమం, దాని అనుబంధం రంగాల కోసం ఏకంగా రూ. 71 లక్షల కోట్లు ఖర్చు చేసిందన్నారు. అన్నివర్గాల సంక్షేమం బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయలేక, జనహిత పాదయాత్ర అని కొత్త డ్రామాకు తెరతీశారని విమర్శించారు. ప్రజలు కాంగ్రెస్, బీఆర్ఎస్లను నమ్మే స్థితిలో లేరన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకే పట్టం కడతారని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, కన్వీనర్ శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. కౌడిపల్లి(నర్సాపూర్): ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరుతూ 765డీ జాతీయ రహదారిపై వెల్మకన్న గ్రామస్తులు ఆదివారం రాస్తారోకో చేశారు. ఈసందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. గ్రామ శివారులోని సర్వే నంబర్ 447లో ప్రభుత్వ భూమిని కౌడిపల్లికి చెందిన వ్యక్తి అసైన్డ్ ల్యాండ్ పేరిట కబ్జా చేస్తున్నాడని ఆరోపించారు. ఈవిషయమై మండల, డివిజన్, జిల్లా రెవెన్యూ అధికారులతో పాటు హైదరాబాద్ సీసీఎల్‌లో సైతం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయినప్పటికీ స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధుల అండతో కబ్జాకు పాల్పడుతున్నాడని వాపోయారు. రాస్తారోకోతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఎస్ఐ రంజిత్‌రెడ్డి గ్రామస్తులకు నచ్చజెప్పి రాస్తారోకోను విరమింపజేశారు. అనంతరం గ్రామస్తులు ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. -
బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి
ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణఖేడ్: బీసీ రిజర్వేషన్ల బిల్లుకు పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించాలని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పార్లమెంట్లో బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం ఉలుకు పలుకు లేని విధంగా వ్యవహరిస్తోందన్నారు. ఇదే విషయమై ఈనెల 5న పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇవ్వనుండగా, రాష్ట్రం నుంచి నాయకులు, ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాలతో 6న ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద ధర్నా, 7న రాష్ట్రపతికి వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. జంతర్ మంతర్ వద్ద ధర్నాకు నియోజకవర్గం నుంచి 20 మంది కార్యకర్తలు తరలివెళ్లనున్నారని వివరించారు. గెస్ట్ లెక్చరర్లకు ఆహ్వానం జోగిపేట(అందోల్): జోగిపేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఖాళీగా ఉన్న గెస్ట్ లెక్చరర్ల పోస్టులకు దరఖాస్తులు ఆహానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ వాణి తెలిపారు. సీఎంఈ పోస్టులు 5, ఈసీఈ 4, ఇంగ్లీష్ 1, గణితం 2, ఫిజిక్స్ 2, కెమిస్ట్రీ 2 మొత్తం 16 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డిగ్రీ, పీజీ అర్హత కలిగి ఉండాలని, ఇంటర్వ్యూ తేదీని అభ్యర్థులకు తెలియజేస్తామన్నారు. అలాగే ఈనెల 5, 6 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామన్నారు. సీఎస్ఈ, ఈసీఈ కోర్సులకు సంబంధించి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. నవోదయ దరఖాస్తు గడువు పొడిగింపు న్యాల్కల్(జహీరాబాద్): వర్గల్‌లోని నవోదయ విద్యాలయంలో 2026– 2027 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 13 వరకు పొడిగించినట్లు ఎంఈఓ మారుతి రాథోడ్ తెలిపారు. గత నెల 29తో గడువు ము గిసినప్పటికీ విద్యార్థుల సౌకర్యార్థం పొడిగించినట్లు చెప్పారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల లేదా ప్రభుత్వంచే గుర్తింపు పొందిన పాఠశాలలో ప్రస్తుతం 5వ తరగతి చదువుతూ ఉండాలన్నారు. ఆసక్తి గల విద్యార్థులను వెంటనే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏడుపాయలలో భక్తుల సందడి పాపన్నపేట(మెదక్): ఏడుపాయల పుణ్యక్షేత్రం ఆదివారం వేలాది భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారికి దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది, పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఆ ఉద్యోగుల తొలగింపు సరికాదు: సీఐటీయూ మెదక్ కలెక్టరేట్: కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు వెంటనే నిలిపివేసి, వారికి రావా ల్సిన పెండింగ్ బకాయిలు చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్లో ఆయన మాట్లాడారు. 36 ప్రభుత్వ శాఖల్లో 90 వేల మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నట్లు తెలిపారు. వీరిని రెన్యూవల్ చేయకుండా దాదాపు 4,500 మందిని ప్రభుత్వం పక్కన పెట్టడం దారుణం అన్నారు. వారికి నాలుగు నెలల నుంచి వేతనాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తుందని మండిపడ్డారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి: ఎస్ఎఫ్ఐ జోగిపేట(అందోల్): జిల్లావ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మహేశ్ డి మాండ్ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. జోగిపేట ఎస్సీ మహిళా కాలేజీ హాస్టల్‌కు తక్షణమే నూతన భవనం ఏర్పాటు చేయా లని, స్కూల్, కళాశాల హాస్టల్ రెండు ఒకే దగ్గర ఉండడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. బాలికల ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలన్నారు. -
అదును దాటుతోంది!
నారు ముదురుతోంది ● జిల్లాలో సాధారణ సాగు 3.50 లక్షల ఎకరాలు ● ఇప్పటి వరకు సాగైంది 2.19 లక్షలే.. ● ఆందోళనలో అన్నదాతలు మెదక్‌జోన్: ఖరీఫ్ సాగు ఆశాజనకంగా లేదు. ఇంకా చాలా చోట్ల నీటి వనరులు నీరు లేక వెలవెలబోతున్నాయి. ఇటీవల మూడు, నాలుగు రోజులు ముసురు పెట్టినా, చెరువులకు నీటిని అందించే వా గులు వంకలు పారలేదు. చెరువులు, కుంటలు నిండలేదు. ముందస్తు వర్షాలతో జూన్‌లోనే వరి నార్లు పోసుకున్న రైతులు.. వరి నారు ముదురుతుండటంతో సాగుపై ఆందోళన చెందుతున్నారు. వరి సాగైంది 60 శాతమే.. ఈఏడాది జిల్లాలో 3.50 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. అయితే ఇప్పటివరకు 2.19 లక్షల ఎకరాలు మాత్రమే సాగైంది. వర్షాధార పంటలు అంచనా మేరకు సాగైనప్పటికీ, వరి మాత్రం 60 శాతం దాటలేదు. సాగుకు కేవలం 12 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. ఖరీఫ్‌లో వరి 3,05,000 ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు 1,79,676 ఎకరాలు రైతులు సాగు చేశారు. ఈలెక్కన 60 శాతం మాత్రమే సాగైంది. ఇంకా 40 శాతం కావాల్సి ఉంది. నిండని నీటి వనరులు జిల్లావ్యాప్తగా 2,694 చెరువులు, కుంటలు ఉన్నాయి. వీటి ఆయకట్టు భూములు 1,25,138 ఎకరాలు ఉంది. కాగా, ఇప్పటివరకు భారీ వర్షాలు కురవకపోవటంతో ఏ ఒక్క చెరువు పూర్తిస్థాయిలో నిండలేదు. దీంతో ఆయకట్టు భూములన్నీ బీడుగా దర్శనం ఇస్తున్నాయి. జిల్లాలో అతిపెద్ద చెరువు కొంటూర్ ఆయకట్టు 1,350 ఎకరాలు ఉంటుంది. దీని నీటి సామర్థ్యం 0.3 టీఎంసీ కాగా, ప్రస్తుతం అందులో 25 శాతం నీరు కూడ లేదు. చెరువు ఎప్పుడు నిండుతుందా అని ఆయకట్టు రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇది నిండితేనే 8 గ్రామాల భూములు సస్యశ్యామలం అవుతాయి. వరి నాటుకు 25 రోజులే గడువు వరి నారు పోసిన 25 నుంచి 30 రోజుల గడువులో నాట్లు వేయాలి. లేనిచో ఆశించిన పిలకలు రాక దిగుబడి తగ్గిపోతుంది. అంతే కాకుండా తెగుళ్లు సైతం అధికంగా సోకే అవకాశం ఉంటుంది. నెలరోజులు దాటిన వరి నారును నాట్లు వేయాలనుకునే రైతులకు వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు. నారుమడి పోసి నెలరోజులు దాటిన రైతులు నాట్లను దగ్గర, దగ్గర వేయాలని చెబుతున్నారు. కాగా ఈనెల 15 వరకు మాత్రమే నాట్లు వేస్తే ఆశించిన దిగుబడి వస్తోందని చెప్పకనే చెబుతున్నారు.జిల్లాలో లోటు వర్షపాతం! జిల్లాలో జూన్, జూలై మాసాలు కలిపి 331 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, ఇప్పటివరకు 280.8 మిల్లీ మీటర్ల వర్షం మాత్రమే నమోదు అయింది. దీంతో భూగర్భజలాలు పెరగకపోగా, ఇప్పటికే బోర్ల ఆధారంగా సాగు చేసిన వరి పంటలకు నిత్యం బోర్లను నడిపించటంతో నీటి ఊట లు తగ్గుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. -
గ్రూపులుంటేనే మజా!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి /వట్పల్లి : రాజకీయ పార్టీల్లో ఆధిపత్య పోరు, గ్రూపులు లేకుంటే ఆ పార్టీ అభివృద్ధి చెందదని, గ్రూపులు ఉంటేనే ఉత్సాహం ఉంటుందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. గ్రూపు తగాదాలు లక్ష్మణ రేఖ దాటవద్దని సూచించారు. అన్ని నియోజకవర్గాల్లో గ్రూ పులు ఉంటాయని, ఎన్నికలు వస్తే అన్ని గ్రూపులు ఒక్కటై పోరాడి విజయం సాధించాలని హితవు పలికారు. తాము మాత్రం అన్ని గ్రూపులకు సమాన ప్రాధాన్యమిస్తామని స్పష్టం చేశారు. జనహిత పాదయాత్రలో భాగంగా కాంగ్రెస్ నాయ కులు శనివారం జోగిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో నిర్వహించిన శ్రమదాన కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం సంగుపేటలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమని, చాలా ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్న వారికే ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. పార్టీకి కొత్త నీరు కూడా అవసరమని అందుకే 15 శాతం కొత్తవారిని కూడా తీసుకుంటున్నామని, పాత, కొత్తల కలయికతో ముందుకు సాగుతున్నామని వివరించారు. సర్వేల ఆధారంగానే స్థానిక టికెట్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇస్తామని, సర్వేల ఆధారంగానే ఈ టికెట్ల కేటా యింపు ఉంటుందని మహేశ్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. నిత్యం ప్రజలతో మమేకమయ్యే వారి ఇంటికే స్థానిక సంస్థల ఎన్నికల టికెట్లు నడిచివస్తాయ ని తెలిపారు. చాలా ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్న వారికి కార్పొరేషన్ డైరెక్టర్ పోస్టులు ఇస్తామని చెప్పారు. పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించండి: కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడిన వారినే గుర్తించాలని పలు వురు కాంగ్రెస్ కార్యకర్తలు మీనాక్షి నటరాజన్, మహేశ్‌కుమార్ గౌడ్లకు విజ్ఞప్తి చేశారు. తమ పబ్బం గడుపుకునేందుకు పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వద్దని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసే అధికారం ఇందిరమ్మ కమిటీలకు ఇవ్వాలని కోరారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ సురేశ్‌షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, సెట్విన్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గిరిధర్‌రెడ్డి, పార్టీ నాయకులు చంద్రశేఖర్, రెడ్డిపల్లి ఆంజనేయులు, ఆవుల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రూపులు, ఆధిపత్య పోరు లేకుండాపార్టీ అభివృద్ధి చెందదు ఎన్నికలు వస్తే అంతా ఒక్కటై పోరాడాలి పాత, కొత్త నాయకుల కలయికతోముందుకు సాగుదాం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలోపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ పటాన్చెరు నాయకులు దూరం జనహిత పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి పటాన్చెరు నియోజకవర్గం కార్యకర్తలు, నాయకులు దూరంగా ఉన్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి ముఖ్య కార్యకర్తలు నేతలు ఈ సమావేశానికి హాజరైనప్పటికీ, ఈ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ శ్రేణులు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. -
రసాభాసగా చెక్కుల పంపిణీ
హత్నూర(సంగారెడ్డి): హత్నూర రైతు వేదికలో శనివారం నిర్వహించిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, రేషన్ కార్డుల పంపిణీ రసాభాసగా మారింది. ఎమ్మెల్యే సునీతారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభి షేకం చేసేందుకు సమావేశ మందిరంలోకి ఒక్కసారిగా వచ్చారు. దీంతో వెంటనే అక్కడే ఉన్న బీఆర్ఎస్ నాయకులు వారిని అడ్డుకోవడానికి యత్నించగా, ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు పార్టీల నాయకులను బయటకు లాక్కెళ్లారు. ప్రజల సంక్షేమం కోసం తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే సునీ తారెడ్డి పేర్కొన్నారు. అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్‌ను, మంత్రులను కూడా కలుస్తానని ఆమె స్పష్టం చేశారు. నియోజకవర్గంలో తాను చేపట్టే కా ర్యక్రమాల విషయాలలో అధికార పార్టీ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తుండటం సరికాదన్నారు. -
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి
మెదక్ మున్సిపాలిటీ: పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ నగేశ్ అధికారులను ఆదేశించారు. వంద రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా శనివారం పట్టణంలోని 23, 31వ వార్డులో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పర్యటించారు. ఈసందర్భంగా ఇంటింటికీ తిరిగి తడి, పొడి, హానికరమైన చెత్తను వేరుచేసి మున్సిపల్ వాహనాలకు ఇవ్వాలని సూచించారు. అలాగే దోమలు వ్యాప్తి చెందకుండా అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డికి సూచించారు. అనంతరం ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలను తీర్చాలని సూచించారు. కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ ఇన్చార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ నాగరాజు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ వెంకటేశ్, వార్డు అధికారులు, శానిటరీ జవాన్లు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ నగేశ్ -
భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దు
మెదక్ మున్సిపాలిటీ: భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా కోదండ రామాలయాన్ని దేవాదాయ శాఖలో విలీనం చేయడం దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని రామాలయం ఎదుట రహదారిపై బీఆర్ఎస్ నాయకులు, భక్తులతో కలిసి రాస్తారోకో చేపట్టారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేవాదాయ శాఖ జీఓ రద్దు చేసి విలీనాన్ని విరమించుకోకుంటే అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. పట్టణ ప్రజలు, భక్తుల విరాళాలతో గత 49 ఏళ్ల క్రితం నిర్మించిన దేవాలయానికి ప్రభుత్వం నేటి వరకు ఎలాంటి సహాయ సహకారాలు అందించ లేదన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉదయం 7 గంటలకు పోలీసుల బందోబస్తుతో దేవాదాయ శాఖ అధికారులు దొంగల్లా హుండీతో పాటు దర్శసత్రాన్ని సీజ్ చేయడం సరికాదన్నారు. ఈ ఆలోచనను దేవాదాయశాఖ తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కుట్ర పూరితంగానే దేవాదాయశాఖకు అప్పగించిందని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, జెడ్పీ మాజీ ఉపాధ్యక్షురాలు లావణ్యరెడ్డి, పట్టణ కన్వీనర్ ఆంజనేయు లు, కృష్ణారెడ్డి, భక్తులు పాల్గొన్నారు.బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి -
విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దాలి
పాపన్నపేట(మెదక్): ప్రతి విద్యార్థికి కనీస అభ్యసన సామర్థ్యాలు రావాలని జిల్లా విద్యాధికారి రాధాకిషన్ అన్నారు. శనివారం ఆయన కుర్తివాడలో జరిగిన యూపీ స్థాయి గణితం కాంప్లెక్స్ సమావేశాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి స్థాయికి తగ్గ సామర్థ్యాలు వచ్చేలా చూడాల్సిన బాధ్యత టీచర్లదేనన్నారు. చతుర్విద ప్రక్రియలపై దృష్టి సారించాలని కోరారు. నిత్య జీవితంలో లెక్కలు ముఖ్యమైనందున, గణితంపై పట్టు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. టీచర్లు సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఎఫ్ఆర్ఎస్ విధానం అమల్లోకి వచ్చినందున, ప్రతి ఒక్కరూ దానిని పాటించాలన్నారు. ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దాలని కోరారు. కార్యక్రమంలో టేక్మాల్, పాపన్నపేట మండలాల టీచర్లు, కాంప్లెక్స్ హెచ్ఎం శ్రీనివాస్‌రావు, సీఆర్పీ దేవయ్య పాల్గొన్నారు.డీఈఓ రాధాకిషన్ -
సీసీ కెమెరాలతోనేరాల నియంత్రణ: ఎస్పీ
తూప్రాన్: ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం అని ఎస్పీ శ్రీనివాస్‌రావు అన్నారు. శనివారం తూప్రాన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్‌ను ప్రారంభించారు. అనంతరం అదనపు ఎస్పీ మహేందర్‌తో కలిసి మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో గంజాయి, సైబర్ నేరాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అనంతరం మొబైల్స్ పోగొట్టుకున్న బాధితులకు రికవరీ చేసినవి అందజేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన తూప్రాన్ డీఎస్పీ నరేందర్‌గౌడ్, సీఐ రంగకృష్ణ, ఎస్ఐ శివానందం, మున్సిపల్ కమిషనర్ గణేశ్‌ను అభినందించారు. అనంతరం మండలంలోని ఇమామ్‌పూర్‌లో గ్రామస్తులు సొంత నిధులతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. దరఖాస్తుల అహ్వానం మెదక్ కలెక్టరేట్: స్కాలర్‌షిప్‌ల కోసం ఎస్సీ విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా ఎస్సీ అభివృద్ధిశాఖ అధికారిణి విజయలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2025– 26 విద్యా సంవత్సరానికి జిల్లాలోని ఎస్సీ విద్యార్థులు ఫ్రెష్, రెన్యూవల్ స్కాలర్షిప్లు అందజేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. జిల్లాలోని విద్యార్థులంతా సెప్టెంబర్ 30లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
నానోతో మేలు
ఎకరానికి అరలీటర్తో లాభాలెన్నో..మెదక్ కలెక్టరేట్: రైతులు ఎక్కువగా నత్రజని ఎరువులు వాడితే భూసారం తగ్గిపోయే ప్రమాదం ఉందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. భూసారాన్ని తగ్గించే యూరియాను అధిక మొత్తంలో వాడొద్దని అవగాహన సదస్సులు నిర్వహించి మరీ చెబుతున్నారు. ఇదే సమయంలో భూసారంపై ప్రభావం చూపని ద్రవరూపంలో ఉండే నానో యూరియా వినియోగించాలని సూచిస్తున్నారు. నానో యూరియా అనేది ద్రవ రూపంలో ఉండే ఒక కొత్త నత్రజని ఎరువు. దీని కణాల పరిమాణం 20 నుంచి 50 నానో మీటర్లు మాత్రమే. ఇది ఆకులపై పిచికారీ చేయడం ద్వారా పనిచేస్తుంది. పంట దిగుబడిని సగటున 8 శాతం వరకు పెంచగలదని వివిధ పరిశోధనల్లో తేలిందని వ్యవసాయ శాఖ చెబుతుంది. మొక్కల పోషక వినియోగ సామర్థ్యాన్ని సైతం 80 శాతం వరకు మెరుగుపరుస్తుంది. నానో వాడకం వల్ల రవాణా, నిల్వ ఖర్చులు తగ్గుతాయి. బస్తాలను మోయాల్సిన అవసరం ఉండదు. ఇది మొక్కలకు నిరంతరంగా నత్రజనిని అందించే రిజర్వాయర్లా పనిచేస్తుంది. సుస్థిర వ్యవసాయానికి తోడ్పడుతుంది. దీనిని సాధారణ స్ప్రేయర్లతో పిచికారీ చేయవచ్చు. చాలా వరకు పురుగు మందులు, తెగుళ్ల మందులతో కలిపి వాడవచ్చు. మిశ్రమాన్ని కలిపే ముందు ‘జార్ టెస్ట్‘ (గాజు సీసా పరీక్ష) తప్పనిసరి చేయాల్సి ఉంటుంది. కలుపు మందులతో కలిపి వాడకపోవడమే మంచిది. పంటకు బహుళ ప్రయోజనం రైతులకు అవగాహన కల్పిస్తున్నవ్యవసాయ శాఖజిల్లాలో పంటల సాగు వానాకాలం సీజన్లో సాగు అంచనా 3.50 లక్షల ఎకరాల్లో జరుగుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. కాని వర్షాభావ పరిస్థితుల్లో జిల్లాలో ఇప్పటివరకు అన్ని రకాలు పంటల సాగు 1.38 లక్షలు మాత్రమే సాగయ్యాయి. ఇందులో అత్యధికంగా వరి, పత్తి పంటలు సాగైనట్లు తెలిసింది.అందుబాటులో ఉంది నానో యూరియా జిల్లాలో కావాల్సిన మేర అందుబాటులో ఉంది. గుళికల యూరియాతో పోలిస్తే అత్యధిక ప్రయోజనాలు ఇందులో లభిస్తాయి. నానో యూరియా పిచికారి చేయడం వల్ల కేవలం పంట మాత్రమే వినియోగించుకుంటుంది. భూసారం తగ్గకుండా ఉంటుంది. రైతులు గుళికల యూరియాకు బదులుగా నానో యూరియాను వినియోగించాలి. ఈమేరకు రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. – దేవ్‌కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి అతి తక్కువ ధర నానో యూరియా వినియోగంతో పంట సాగు ఖర్చు తగ్గుతుంది. అర లీటర్ ద్రావణం 45 కేజీల గుళికల యూరియా బస్తాకు సమానంగా పనిచేస్తుంది. బస్తా యూరియా రూ. 278 కాగా, నానో యూరియా రూ. 225కే అర లీటర్ లభిస్తుంది. దీంతో రైతులకు ఖర్చులు అదా అవుతాయి. మరోవైపు భూసారంపై ఎలాంటి ప్రమాదం చూపకుండా రైతులకు ప్రయోజనకారిగా ఉంటుంది. చిన్న, సన్నకారు రైతులకు ఇది ఆర్థికంగా లాభదాయకం. నానో యూరియా వినియోగంతో పంటల్లో పచ్చదనం చురుగ్గా పెరుగుతుంది. గుళికల యూరియాను రైతులు పంట సాగుకు రెండు నుంచి మూడుసార్లు వినియోగిస్తున్నారు. ఇందులో నత్రజని 30 నుంచి 50 శాతమే వినియోగంలోకి వస్తుంది. మిగితా ఎరువు వృథాగా పోతుంది. దీంతో నేల, గాలి, నీరు కలుషితం అవుతుంది. నానో యూరియా మాత్రం కేవలం పంటకు మాత్రమే ఉపయోగపడుతుంది. -
చిన్న పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం
నర్సాపూర్: పాఠశాలలకు వచ్చే చిన్న పిల్లల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జూనియర్ సివిల్ జడ్జి హేమలత సూచించారు. శనివారం మండల ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలను బయటకు ఎందుకు పంపుతున్నారని ఉపాద్యాయులను ప్రశ్నించారు. మౌలిక సదుపాయాలు లేనందున బయటకు పంపాల్సి వస్తుందని వారు వివరించారు. పిల్లల పట్ల అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. శిథిలావస్థకు చేరిన పాఠశాల గదులలో విద్యార్థులకు విద్యా బోధన చేపట్టడం సరికాదన్నారు. ఉన్నతాధికారులకు విషయం చెప్పారా..? అని ప్రశ్నించారు. కాగా పాఠశాల భవనం శిథిలావస్థకు చేరిన విషయాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తానని తెలిపారు. అనంతరం పక్కనే ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు.జూనియర్ సివిల్ జడ్జి హేమలత -
రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే
వెల్దుర్తి(తూప్రాన్): భవిష్యత్తులో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. శనివారం మండలంలోని ఏదులపల్లిలో పలువురు యువకులు ఎంపీ సమక్షంలో బీజేపీలో చేరగా, వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీలో చేరిన యువకులు ప్రజాసేవలో పాలు పంచుకోవాలన్నారు. తన గెలుపునకు కృషి చేసిన నాయకులు, కార్యకర్తలను స్థానిక ఎన్నికల్లో గెలిపించుకునే బాధ్యత తనపై ఉందన్నారు. జిల్లాలో తాను ఎంపీగా గెలిచిన కొన్ని నెలల వ్యవధిలోనే కేంద్ర నుంచి రూ. వందల కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నానన్నారు. పార్టీలో చేరిన వారిలో ఏబీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్, మండల అధ్యక్షుడు దాసు, నాయకులు శ్రీనివాస్‌గౌడ్, నర్సింలు, వెంకటేశం, నరేష్, బాలకిషన్, శేఖర్‌గౌడ్, శ్రీధర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. హిందువులు చైతన్యవంతులు కావాలి మెదక్‌జోన్: హిందూ మతం మీద ఉద్దేశపూర్వకంగా దాడులు జరుగుతున్నాయని, హిందువులు చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఆసన్నమైందని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. మెదక్ కోదండ రామాలయాన్ని అధికారులు శనివారం ఎండోమెంట్ పరిధిలోకి తీసుకోవడంతో ఆలయాన్ని సందర్శించి మాట్లాడారు. వేణుగోపాలస్వామి ఆలయాన్ని ఎండోమెంట్ పరిధిలోకి తీసుకున్నాక అక్కడ దీపం పెట్టేవారు ఎందుకు లేరని ప్రశ్నించారు. ఆలయ కమిటీ తప్పులు చేస్తే శిక్షించాలి, అవసరమైతే వారిని తప్పించి మరో కమిటీని నిర్ణయించాలి, కానీ అధికార పార్టీ నేతలు చెబితే తాళాలు వేస్తారా..? అని ప్రశ్నించారు. కశ్మీర్లో సైనికుల ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాటం చేస్తుంటే, యూపీఏ నేతలు మాత్రం పాక్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అంతకుముందు బీజేపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. అన ంతరం పట్టణంలోని గాంధీనగర్‌లో కేన్సర్ ఆస్పత్రి కోసం స్థలాన్ని పరిశీలించారు. దేశంలోనే మొట్ట మొదటగా జిల్లా కేంద్రంలో కేన్సర్ ఆస్పత్రిని దాతల సహకారంతో పాటు ఎంపీ నిధులు వెచ్చించి నిర్మిస్తానన్నారు.మెదక్ ఎంపీ రఘునందన్‌రావు -
రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు
కౌడిపల్లి(నర్సాపూర్): రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధులు జమయ్యాయని డీఏఓ దేవ్‌కుమార్ తెలిపారు. శనివారం మండలంలోని తునికి కేవీకేలో 20వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధుల విడుదల కార్యక్రమాన్ని శాస్త్రవేత్తలు, రైతులు, వ్యవసాయ కళాశాల విద్యార్థులతో కలిసి వీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 88,257 మంది రైతులకు రూ 17. 65 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసిందన్నారు. రైతులు పెట్టుబడికి సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. పంటల సాగులో సమస్యలుంటే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. అనంతరం కేవీకే హెడ్ అండ్ సైంటిస్ట్ శంభాజీ దత్తాత్రేయ నల్కర్ మాట్లాడుతూ.. ప్రతి రైతు ప్రకృతి, సేంద్రియ సాగు చేయాలన్నారు. పంటల సాగులో ఆవు పేడ, మూత్రం, జీవామృతం, జీవన ఎరువులు, కషాయాలు వినియోగించాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఏడీఏ రాజశేఖర్, కేవీకే శాస్త్రవేత్తలు శ్రీకాంత్, రవికుమార్, ప్రతాప్‌రెడ్డి, భార్గవి, శ్రీనివాస్, ఉదయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో 88,257 మందికి రూ.17.65 కోట్లు జమ డీఏఓ దేవ్‌కుమార్ -
టీచర్లకు పదోన్నతులు
పాపన్నపేట(మెదక్): ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం అయింది. బదిలీలు లేకుండానే ప్రమోషన్లు ఇవ్వడానికి విద్యాశాఖ సిద్ధమైంది. ఈనెల 2 నుంచి 11 వరకు ప్రమోషన్ల షెడ్యూల్ విడుదల అయింది. జిల్లాలోని అర్హులైన టీచర్ల నుంచి 25 మంది జీహెచ్ఎంలుగా, 123 స్కూల్ అసిస్టెంట్లు, 32 పీఎస్ హెచ్ఎంలు పదోన్నతి పొందనున్నారు. కేవలం ఏడాది వ్యవధిలో మరోసారి ప్రమోషన్లు ఇస్తుండటంతో టీచర్లలో ఆనందం వ్యక్తమవుతుంది. తద్వారా సబ్జెక్టు టీచర్ల కొరత తీరనుంది. 180 మంది అర్హులకు పదోన్నతులు జిల్లాలో 871 ఎంపీపీ, జెడ్పీ స్కూల్స్, 37 గవర్నమెంట్ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో వివిధ కేటగిరిలకు చెందిన 4,191 మంది టీచర్లు పనిచేస్తున్నారు. కాగా 25 జీహెచ్ఎం, 123 స్కూల్ అసిస్టెంట్, 32 పీఎస్ హెచ్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జీహెచ్ఎం పోస్టులు మల్టీజోన్–1 కిందకు రాగా, మిగితావి జిల్లా స్థాయి కేడర్ పోస్టులే. అయితే 2023లో ప్రమోషన్లపై 18 జిల్లాల పరిధిలో నుంచి వచ్చిన జీహెచ్ఎంలు తమకు బదిలీలు నిర్వహించి, తర్వాత ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. కాని వారి వేదన అరణ్య రోదన గానే మారింది. గతంలో స్కూల్ అసిస్టెంట్లకు 2024 జూన్, జూలై నెలలో పదోన్నతులు కల్పించారు. షెడ్యూల్ ఇలా.. ఈనెల 2న వెబ్సైట్లో ఖాళీల ప్రదర్శన, 3న సీనియారిటీ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ, 4న అభ్యంతరాల పరిష్కారం, తుది సీనియారిటీ జాబితా విడుదల, 6న గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతి కోసం, స్కూల్ అసిస్టెంట్లు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం, 7న స్కూల్ అసిస్టెంట్లకు జీహెచ్ఎంలుగా పదోన్నతి కల్నిస్తూ ఉత్తర్వుల జారీ, 8న ఎస్జీటీల సీనియారిటీ తుది జాబితా విడుదల, 10న స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించేందుకు ఎస్జీటీలు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే ప్రక్రియ ప్రారంభం, 11న ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు విడుదలు చేయనున్నారు.● ప్రారంభమైన ప్రక్రియ ● 25 జీహెచ్ఎం, 155 మందికి స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ ● 11 వరకు కౌన్సెలింగ్ ● తీరనున్న సబ్జెక్ట్ టీచర్ల కొరత -
ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచండి
కలెక్టర్ రాహుల్‌రాజ్ రామాయంపేట(మెదక్): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. శనివారం మండలంలోని దంతేపల్లి, కిషన్ తండాల్లో పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. నిర్మాణ పనులు ఆలస్యం చేయవద్దని, త్వరితగతిన పూర్తి చేసుకోవాలని ఆదేశించారు. బిల్లులు కూడా వెంట వెంటనే మంజూరవుతున్నాయని, నేరు గా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనున్నట్లు చెప్పారు. అనంతరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. అనంతరం ఆయన గ్రామంలో పర్యటించారు. కుండీలలో నిల్వ ఉన్న నీటిని పరిశీలించి వెంటనే నీటిని తొలగించాలన్నారు. నీటిని నిల్వ ఉంచితే దోమల సంఖ్య పెరుగుతుందని వివరించారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ సజీవొద్దీన్, ఇతర అధికారులు ఉన్నారు. ఎఎల్ఎం పోస్టులుమంజూరు చేయాలి పాపన్నపేట(మెదక్): జిల్లాకు 51 అసిస్టెంట్ లైన్మెన్ పోస్టులు మంజూరు చేయాలని ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు శనివారం మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. జిల్లాలో 200 గ్రామాలకు సరిపడా ఎఎల్ఎంలు లేక విద్యుత్ సేవలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. ఈ మేరకు పాపన్నపేట మండలానికి 15, మెదక్ పట్టణానికి 5, ఘనపూర్ 6, మెదక్ 6, రామాయంపేట 5, చిన్నశంకరంపేట 7, నిజాంపేట మండలానికి 7 పోస్టులు మంజూరు చేయాలని కోరారు. ‘విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు’ రామాయంపేట(మెదక్): సీజనల్ వ్యాధులపై ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. శనివారం మండలంలోని ప్రగతి ధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు. సిబ్బంది సక్రమంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. విధిగా ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించాలన్నారు. అంతకుముందు రిజిస్టర్‌ను తనిఖీ చేసి ఫార్మసీ, ల్యాబ్ వార్డులను పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు. ఆయన వెంట ఆస్పత్రి వైద్యురాలు హరిప్రియతో పాటు ఏఎన్ఎంలు, నర్సులు ఉన్నారు. మరో భవనంలోకి మార్చండి అల్లాదుర్గం(మెదక్): మండల పరిధిలోని చిల్వెర అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా మహి ళా, శిశు సంక్షేమశాఖ అధికారిణి హైమావతి శనివారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా అంగన్వాడీ భవ నం పెచ్చులూడి శిథిలావస్థకు చేరిందని, మరో భవనంలోకి మార్చాలని అదేశించారు. కేంద్రం ఆపరిశుభ్రంగా ఉండటంపై టీచర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో తల్లి పాల వారోత్సవాలు నిర్వహించాలని సూచించారు. లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలిమెదక్ కలెక్టరేట్: జిల్లాలోని పోలీస్, ఎకై ్సజ్ శాఖలు సమన్వయంతో పనిచేసి సెప్టెంబర్ 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఆర్ఎం సుభవల్లి అన్నారు. శనివారం జిల్లా పోలీస్, ఎకై ్సజ్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు అధిక సంఖ్యలో కేసుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. -
కార్పొరేట్‌కు దీటుగా సంక్షేమ హాస్టళ్లు
పాపన్నపేట(మెదక్): సంక్షేమ హాస్టళ్లు కార్పొరేట్‌కు దీటుగా ఉండాలని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. శుక్రవారం రాత్రి ఆయన కొత్తపల్లి ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాన్ని సందర్శించారు. ముందుగా విద్యార్థులతో మమేకమై వారి సా మ ర్థ్యాలను పరిశీలించారు. వసతి సౌకర్యా లు, మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా..? అని స్వయంగా అడిగి తెలుసుకున్నా రు. విద్యార్థులకు అన్నిరకాల సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంచిగా చదువుకొని సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. -
మాకొద్దు.. జీపీఓ!
పాత సర్వీస్ పోతుందని.. గత ప్రభుత్వం రెవెన్యూశాఖ నుంచి 562 మంది వీఆర్ఓలను తప్పించి వివిధ శాఖల్లోకి పంపింది. అయితే పని చేసిన సర్వీస్‌ను ప్రస్తుతం పనిచేస్తున్న శాఖలో కలపాలని అప్పట్లో వీఆర్ఓలు, వీఆర్ఏలు ఆందోళన చేసి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు ఐదేళ్లుగా కోర్టులో కొనసాగుతుంది. కాగా ప్రస్తుతం మళ్లీ ఈ శాఖను వదిలి గ్రామ పాలనాధికారి (జీపీఓ)గా చేరితే పాత సర్వీస్ పోతుందని, ఇప్పటికే రెవెన్యూలో ఒక్కొక్కరం రెండు దశాబ్దాలుగా విధులు నిర్వర్తించామని, ఆ సర్వీస్ పోతే తీరని నష్టం జరుగుతుందని, అందుకే జీపీఓగా రావడానికి ఇష్టపడటం లేదని పలువురు వీఆర్ఓలు పేర్కొన్నారు. ● పూర్వ వీఆర్ఓ, వీఆర్ఏల అనాసక్తి ● రెండుసార్లు నోటిఫికేషన్ ఇచ్చినా స్పందన కరువు ● పరీక్షకు హాజరైంది కేవలం142 మంది మాత్రమే మెదక్‌జోన్: గ్రామ పాలన అధికారి (జీపీఓ)గా పనిచేసేందుకు పూర్వ వీఆర్ఓ, వీఆర్ఏలు అనాసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికి రెండుసార్లు పరీక్షలు నిర్వహించినా వెనుకంజ వేశారు. జీపీఓలుగా చేరితే పాత సర్వీస్‌ను పరిగణలోకి తీసుకోకపోవటమే ఇందుకు కారణం అని తెలుస్తోంది. ఫలితంగా అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో 392 రెవెన్యూ గ్రామాలు జిల్లాలో 21 మండలాలు, 492 పంచాయతీలు ఉండగా, 392 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. గతంలో 562 మంది వీఆర్ఓలుగా జిల్లాలో విధులు నిర్వర్తించారు. గత ప్రభుత్వం వీఆర్ఓ, వీఆర్ఏలను తొలగించి వారిని వివిధ శాఖల్లోకి పంపింది. 2023లో అధికారంలోకి వచిన కాంగ్రెస్ ప్రభుత్వం రెవెన్యూ శాఖకు పూర్వవైభవం తెస్తామని, గ్రామానికో జీపీఓను నియమించి భూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని పేర్కొంది. గతంలో వీఆర్ఓలుగా పనిచేసిన వారు తిరిగి రావాలని కోరింది. అందుకోసం రెండుసార్లు రాత పరీక్షలు నిర్వహించింది. అయితే ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. మొదటిసారి జిల్లావ్యాప్తంగా 104 మంది దరఖాస్తు చేసినా, పరీక్షకు 79 మంది మాత్రమే హాజరయ్యారు. వారిలో ఉత్తీర్ణత సాధించింది 47 మంది మాత్రమే. రెండోసారి జూలై 27న పరీక్ష నిర్వహించగా, 73 మంది దరఖాస్తు చేశారు. పరీక్ష రాసింది మాత్రం 63 మంది మాత్రమే. ఈ ఫలితాలు ఇంకా విడుదల కాలేదు. గతంలో జిల్లాలో సుమారు 562 మంది వీఆర్ఓలుగా విధులు నిర్వర్తించారు. వారు ప్రస్తుతం జీపీఓలుగా రావటానికి ఆసక్తి చూపటం లేదు. -
నాణ్యమైన బోధన అందించాలి
డీఈఓ రాధాకిషన్చిన్నశంకరంపేట(మెదక్): విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలి డీఈఓ రాధాకిషన్ ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం మండలంలోని మడూర్ జెడ్పీ పాఠశాలలో తెలుగు పండిత్‌లకు నిర్వహించిన కాంప్లెక్స్ మీటింగ్‌లో పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయులు బోధన విషయంలో నైపుణ్యతను చాటి చెప్పాలన్నారు. తెలుగు ఉపాధ్యాయులకు ఉన్న ప్రత్యేక గుర్తింపును కాపాడుకోవాలన్నారు. పాఠ్యంశాలతో పాటు నీతి, ప్రేరణ కల్గించే కథలను విద్యార్థులకు చెప్పాలన్నారు. ప్రభుత్వం అందించిన డిజిటల్ బోర్డును ఉపయోగించుకోవా లని తెలిపారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి ప్రతిభను పరిశీలించారు. పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళిక తో ముందుకు సాగాలని సూచించారు. ఆయన వెంట కాంప్లెక్స్ హెచ్ఎం రవీందర్‌రెడ్డి ఉన్నారు. -
జనహితకు జేజేలు
వట్పల్లి(అందోల్): కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన జనహిత పాదయాత్రకు అనూహ్య స్పందన లభించింది. ఆ పార్టీ కార్యకర్తలు కదంతొక్కారు. ఆందోల్ మండలంలోని సంగుపేట చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించి పాదయాత్రను ప్రారంభించారు. మంత్రులు, దామోదర రాజనర్సింహ, వివేక్, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్న ఈ పాదయాత్రలో ఆద్యంతం కార్యకర్తలు ఉత్సాహంగా.. ఉల్లాసంగా కనిపించారు. పాదయాత్ర సందర్భంగా ‘జై కాంగ్రెస్ .. జై సోనియా, జై రాహుల్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దారి పొడవునా వారి పాదయాత్రకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున భారీ సైజుల్లో ప్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. ప్రజాహితమే మా ధ్యేయం: దామోదర ప్రజాహితమే తమ ప్రభుత్వ ధ్యేయమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధ్యక్షతన జోగిపేటలోని హనుమాన్ చౌరస్తా వద్ద నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. తొమ్మిదిన్నరేళ్ల తర్వాత సోనియా గాంధీపై నమ్మకంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజలు అవకాశం కల్పించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయమని స్పష్టం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌కు కట్టుబడి ఉన్నాం: పొన్నం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి తమకు అప్పగించిందని విమర్శించారు. తొమ్మిది రోజుల్లో రైతు భరోసా పథకం కింద రూ.9వేల కోట్ల పెట్టుబడి సహాయాన్ని అందించి రైతుల ఇళ్లల్లో పండగ వాతావరణం కల్పించిందని చెప్పారు. సన్న వడ్లకు బోనస్ అందించామని, రేషన్‌కార్డులను అందిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాదిలో లక్ష ఉద్యోగాలు: వివేక్ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను గ్రామాల్లో వివరించాలన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో డబుల్బెడ్రూంలు అందజేయలేదని కానీ ప్రజాప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఒక్కొక్క వాగ్దానాన్ని పూర్తిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. రాబోయే ఏడాదిలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని వెల్లడించారు. కాంగ్రెస్ పాదయాత్రకు అనూహ్య స్పందన ఆద్యంతం ఉత్సాహంగా.. ఉల్లాసంగా.. దారిపొడవునా హోరెత్తిన నినాదాలు -
చినుకు పడితే.. వణుకే!
రామాయంపేట(మెదక్): రామాయంపేట పట్టణ ంలో మోస్తారు వర్షం కురిసిందంటే చాలు ప్రధాన రహదారులు జలమయం అవుతున్నాయి. ఏకంగా అక్కల బస్తీలోని ఇళ్లలోకి వరద నీరు ప్రవేశిస్తుంది. దీంతో కాలనీవాసులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. పట్టణంలో గతంలో ఎప్పుడో నిర్మించిన రహదారులు, మురుగు కాలువలు పాక్షికంగా శిథిలమై యథేచ్ఛగా వదర నీరు రోడ్డుపై పారుతుంది. ఏ రోడ్డుపై ఎక్కడ గుంత ఉందో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో వాహనదారులు భయం, భయంగా వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రధాన రహదారి జలమయం ఇటీవల కురిసిన వర్షాలకు సిద్దిపేట ప్రధాన రహదారిపై పెద్దఎత్తున వరద నీరు ప్రవహించింది. రోడ్డుపై ఇసుక మేటలు వేసింది. ద్విచక్ర వాహనదారులు రోడ్డుపై వెళ్తున్న క్రమంలో ప్రమాదానికి గురై కింద పడిన సంఘటనలు ఉన్నాయి. మున్సిపల్ సిబ్బంది రోడ్డుపై పేరుకుపోయిన ఇసుకను తొలగించినా, మళ్లీ వర్షం కురవడంతో రోడ్డుపై ఇసుక చేరింది. చిన్నపాటి వర్షం కురిసినా వరద నీరు నిలిచి ప్రయాణాలకు ఆటంకంగా మారుతుంది. డివైడర్ నిర్మించిన అధికారులు రోడ్డు మరమ్మతుల విషయమై పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నా యి. అలాగే మోస్తారు వర్షం కురిసినా పట్టణంలోని 11వ వార్డు అక్కల బస్తీలో వరదనీరు ఇళ్లలోకి ప్రవేశిస్తుంది. ఏటా తమకు ఈ ఇబ్బందులు తప్పడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పెద్దఎత్తున వరద నీరు ఇళ్లలోకి చేరిందని, ఇళ్లలో ఉన్న దుస్తులు, నిత్యావవసర సరుకులు సైతం తడిసిపోయాయని వాపోయారు. పేటలో ముంపు ముప్పు తప్పేనా..? శాశ్వత చర్యలకు పడని ముందడుగు ఇళ్లలోకి చేరుతున్న వర్షం నీరు పట్టించుకోని అధికారులు ఇబ్బంది పడుతున్న పట్టణ ప్రజలు చర్యలు చేపడుతున్నాం వర్షాలు పడితే రహదారులపై నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాం. ఇటీవల తారు రోడ్డుపై భారీ వర్షం మూలంగా ఇసుక మేట వేయగా, పూర్తిగా తొలగించాం. అక్కల గల్లీలో ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించకుండా చర్యలు తీసుకుంటాం. – దేవేందర్, మున్సిపల్ కమిషనర్ -
అవగాహన, అప్రమత్తతే కీలకం
ఎస్పీ డీవీ శ్రీనివాసరావుమెదక్ మున్సిపాలిటీ: సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి పోలీస్ అధికారి పూర్తి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం జిల్లా ప్రధాన పోలీస్ కార్యాలయంలో సైబర్ వారియర్స్‌కు సైబర్ క్రైం, నియంత్రణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సైబర్ నేరాలను నిరోధించేందుకు ప్రతి పోలీస్ అధికారి సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు. ప్రతి కేసును సీరియస్‌గా తీసుకొని బాధితులకు తక్షణ న్యాయం జరిగేటట్లు చూడాలన్నారు. పోలీస్‌స్టేషన్‌లో సైబర్ వారియర్స్ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటారని, ఎవరైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే గోల్డెన్ అవర్‌లో సంప్రదిస్తే డబ్బులను తిరిగి తెచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రజలు పూర్తి అవగాహన, అప్రమత్తతతో ఉండాలని సూచించారు. అనంతరం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హైదరాబాద్ నుంచి వచ్చిన టీషర్ట్స్‌ను సిబ్బందికి అందజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్సీ మహేందర్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నిబంధనలు తప్పనిసరి
చిలప్‌చెడ్(నర్సాపూర్): ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని, లేకపోతే బిల్లులు రావని జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ మాణిక్యం చౌహాన్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను పరిశీలించి మాట్లాడారు. చిలప్‌చెడ్‌లో 54 ఇళ్లు మంజూరు కాగా, ప్రస్తుతం 15 నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. గ్రామంలో ఇంటి నిర్మాణాలు చేపట్టిన పలువురికి రెండు విడతల బిల్లులు సైతం వచ్చాయన్నారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు ఇంటి పనులు ప్రారంభించకపోతే మంజూరు పత్రాలు వెనక్కి తీసుకుంటామన్నారు. అదేవిధంగా కొత్తగా ఇల్లు నిర్మించేవారికి సైతం అవకాశాలు కల్పిస్తామన్నారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి కృష్ణ తదితరులు ఉన్నారు. దరఖాస్తుల ఆహ్వానం చేగుంట(తూప్రాన్): పాలిటెక్నిక్‌లో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని చేగుంట ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ చక్రవర్తి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణలోని 11 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో 135 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. చేగుంట పాలిటెక్నిక్‌లో 9 పోస్టులు ఖాళీగా ఉండగా, టెక్నికల్ పోస్టులకు ఎంటెక్, నాన్ టెక్నికల్ పోస్టులకు పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. ఈనెల 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు కళాశాలలో సంప్రదించాలని సూచించారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి: ఎస్ఎఫ్ఐ మెదక్ కలెక్టరేట్: విద్యారంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామర కిరణ్ డిమాండ్ చేశారు. శుక్రవారం మెదక్‌లో నిర్వహించిన విద్యార్థి అధ్యయన యాత్రలో పాల్గొని మాట్లాడారు. ఈనెల 5 వరకు యాత్ర కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలిస్తామన్నారు. ముఖ్యంగా నర్సాపూర్‌లోని పీజీ కళాశాలకు సొంత భవనం, మెదక్‌కు ఇంజనీరింగ్, పీజీ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరారు. తూప్రాన్, పెద్దశంకరంపేటలలో డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మొటిక్ చార్జీలు తక్షణమే పెంచాలన్నారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు నవీన్, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. హెచ్‌పీఎస్‌లో ఖాళీ సీట్లు మెదక్ కలెక్టరేట్: రామంతాపూర్, బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సీట్లు ఖాళీగా ఉన్నట్లు ఎస్సీ, ఎస్టీ శాఖల అధికారులు విజయలక్ష్మి, నీలిమ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 1వ తరగతి ఇంగ్లీష్ మీడియంలో ఎస్సీ విద్యార్థులకు ఒక సీటు ఖాళీగా ఉండగా, ఎస్టీ విద్యార్థులకు ఆరు సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఈనెల 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు పత్రాలు కలెక్టరేట్లోని ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి కార్యాలయాల్లో లభిస్తాయని సూచించారు. నానో యూరియాతో అధిక దిగుబడి కౌడిపల్లి(నర్సాపూర్): రైతులు నానో ద్రవరూప ఎరువులు వాడటం వల్ల తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు పొందవచ్చని డీఏఓ దేవ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం మండలంలోని తునికి వద్దగా రామానాయుడు ఏకలవ్య గ్రామీణ వికాస ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో రైతులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా డీఏఓ మాట్లాడుతూ.. రైతులు నానో ఎరువులను తరలించడం సైతం సులభంగా ఉంటుందని చెప్పారు. అనంతరం కేవీకే హెడ్ అండ్ సైంటిస్ట్ శంభాజీ దత్తాత్రేయ నల్కర్ మాట్లాడుతూ పంట మార్పిడి చేయాలన్నారు. భూసార పరీక్షల ఆధారంగా తగిన మోతాదులో ఎరువులు వాడాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీఏ రాజ్‌నారాయణ, కోరామండల్ ప్రతినిధి రోషన్, కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ ప్రతాప్‌రెడ్డి వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. -
రేషన్‌కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ
కలెక్టర్ రాహుల్రాజ్వెల్దుర్తి(తూప్రాన్)/చిన్నశంకరంపేట(మెదక్)/నర్సాపూర్: అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేస్తామని, ఇది నిరంతర ప్రక్రియ అని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. శుక్రవారం వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లో నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను ఎమ్మెల్యే సునీతారెడ్డితో కలిసి ఆయా మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో లబ్ధిదారులకు అందజేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో సుమారు 9,964 కుటుంబాలకు నూతన రేషన్‌కార్డులు అందజేశామని తెలిపారు.మహిళా సాధికారితకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే సునీతా రెడ్డి మాట్లాడుతూ.. రేషన్‌కార్డు ప్రతి కుటుంబానికి అవసరమన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రేషన్‌కార్డు ప్రామాణికమని, దానిని దృష్టిలో ఉంచుకొని అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు మంజూరు చేయాలన్నారు. అదేవిధంగా మండలంలో విద్యార్థులకు రవాణా వ్యవస్థను మెరుగు పరచాలన్నారు. నిబంధనలు పెట్టకుండా అవసరమైన మేరకు యూరియా పంపిణీ చేయాలన్నారు. కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం చిన్నశంకరంపేటలోని అగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా కొరత సృష్టించిన, అధిక ధరలకు విక్రయించినా లైసెన్స్‌లు రద్దు చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అలాగే నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్కులో కాటేజీలను పరిశీలించారు. నెలాఖరులోగా పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. -
ప్రభుత్వ బడుల్లోనే మెరుగైన బోధన
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి కౌడిపల్లి(నర్సాపూర్)/శివ్వంపేట: ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉన్నారని, విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి సూచించారు. గురువారం కౌడిపల్లికి చెందిన పోల నవీన్ రూ. 59 వేలతో ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో కిచెన్‌షెడ్ నిర్మించగా ప్రారంభించి మాట్లాడారు. యువత సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. పాఠశాలలో నీటి సమస్యను తీర్చేందుకు బోర్ వేయిస్తానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం మనఊరు– మన బడి ద్వారా పాఠశాలల్లో సమస్యలు తీర్చిందన్నా రు. ప్రస్తుత ప్రభుత్వం విద్యను నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో హెచ్ఎం లలితాదేవి, మాజీ సీడీసీ చైర్మన్ దుర్గారెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ కలీముల్ల, నాయకులు మన్సూర్, మహిపాల్‌రెడ్డి, కాంతారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే అనంతరం శివ్వంపేట మండల పరిధి ఉసిరికపల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. అన్నివర్గాలకు సముచిత స్థానం కల్పించిన అంబేద్కర్ అందరివాడని కొనియాడారు. విగ్రహ ఏర్పాటుకు కృషిచేసిన నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. -
లింగ వివక్షత నిర్మూలనపై అవగాహన
నర్సాపూర్ రూరల్: లింగ వివక్షతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్‌రావు అన్నారు. గురువారం మండలంలోని చిన్నచింతకుంటలో ఐకేపీ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు (జెండర్) లింగ వివక్షతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందినప్పుడే లింగ వివక్షత లేకుండా పోతుందన్నారు. ప్రస్తుత పిల్లలకు కుటుంబ పెద్దలను గౌరవించడం, అన్యోన్యంగా ఉండే విధానాన్ని అలవర్చాలని సూచించారు. కార్యక్రమంలో జెండర్ సెంట్రల్ టీం సభ్యులు నసీం, అదనపు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సరస్వతి, స్టేట్ ప్రాజెక్ట్ మేనేజర్ల సరిత, లింగంగౌడ్, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ వెంకటేశ్ సిబ్బంది పాల్గొన్నారు. -
బల్దియా బరి.. నేతల గురి
రామాయంపేట(మెదక్): త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయా పార్టీల్లో ఆశావహులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తమ, తమ వార్డుల్లో పట్టు సాధించడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పటికే మెదక్, రామాయంపేట మున్సిపాలిటీల్లో ఫలానా వార్డు నుంచి తాము పోటీలో ఉంటామని నాయకులు తమ పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఎలాగైనా బల్దియాల్లో పాగా వేయాలని అధికార కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తుంది. బీఆర్ఎస్ సైతం పట్టు నిలుపుకోవడానికి ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతోంది. మెదక్ మున్సిపాలిటీలో 32 వార్డులుండగా, తూప్రాన్‌లో 16, నర్సాపూర్ 15, రామాయంపేటలో 12 వార్డులు ఉన్నాయి. ఇదిలా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సమాయత్తం కావడంతో మున్సిపాలిటీల్లోనూ ఎన్నికలు జరిపేందుకు ఆశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత జనవరిలో పాలకవర్గాల పదవీకాలం పూర్తి కాగా, ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. పాలకవర్గం ఉన్నప్పుడు, వార్డుల్లో నెలకొన్న సమస్యలు ఎంతో కొంత పరిష్కారమయ్యేవి. ప్రజలు తమ సమస్యలను కౌన్సిలర్ల దృష్టికి తీసుకెళ్లేవారు. ప్రస్తుతం మున్సిపాలిటీల్లో ఏ పని సరిగా జరగడం లేదనే ఆరోపణలున్నాయి. -
బాల్య వివాహాలు జరిపిస్తే చర్యలు
వెల్దుర్తి(తూప్రాన్): బాల్య వివాహాలు జరిపిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఐసీడీఎస్ సూపర్వైజర్ మాధవి హెచ్చరించారు. మాసాయిపేట మండలం కొప్పులపల్లిలో గురువారం ఓ మైనర్ బాలిక నిశ్చితార్థ వేడుకలను పోలీసులతో కలిసి అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికకు చిట్టోజిపల్లికి చెందిన ఓ యువకుడితో కుటుంబసభ్యులు ఇటీవల పెళ్లి సంబంధం నిశ్చయించారు. సమాచారం అందుకున్న ఐసీడీఎస్ సూపర్వైజర్ మాధవి, వెల్దుర్తి పోలీసులు, పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ కార్యకర్తలతో సంఘటనా స్థలానికి చేరుకొని నిశ్చితార్థ వేడుకలను అడ్డుకున్నారు. మైనర్ బాలికలకు వివాహం జరిపించడం వల్ల కలిగే అనర్థాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అమ్మాయికి 18 ఏళ్లు నిండిన తర్వాతే పెళ్లి జరిపిస్తామని, అప్పటి వరకు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోమని బాలిక తల్లిదండ్రుల నుంచి లిఖిత పూర్వకంగా హామీని తీసుకున్నారు.