అవినీతికి చోటు లేదు
మున్సిపాలిటీ నిధుల ఖర్చు విషయంలో ఎ లాంటి అవినీతికి పాల్పడలేదు. లెక్కలన్నీ పారదర్శకంగానే ఉన్నాయి. ప్రభుత్వం గుర్తించిన హాకా సంస్థ ద్వారానే కొనుగోళ్లు జరిపాం. గిట్టని వారు చేస్తున్న ఆరోపణలు ఇవి.
– దేవేందర్, మున్సిపల్ కమిషనర్
రుజువైతే కఠిన చర్యలు
అవినీతి, ఆరోపణల విషయమై విచారణ జరిపిస్తాం. ఈమేరకు కలెక్టర్‌కు లేఖ రాశాం. మున్సిపాలిటీలో చేపట్టిన పనులు, ఖర్చు వివరాలు, ఆర్థిక లావాదేవీలను పరిశీలించాలని ఆదేశాలు జారీ చేశాం. నిధులు దుర్వినియోగమైనట్లు తెలితే సంబంధిత అధికారులను సస్పెండ్ చేయిస్తాం.
– మైనంపల్లి రోహిత్, ఎమ్మెల్యే
అవినీతికి చోటు లేదు


