సీఎం యోగీ మోమున నవ్వులు పూయించిన బుడ్డోడు, వైరల్‌ వీడియో | Toddler chips request Yogi Adityanath gives a packet Watch video | Sakshi
Sakshi News home page

సీఎం యోగీ మోమున నవ్వులు పూయించిన బుడ్డోడు, వైరల్‌ వీడియో

Jan 19 2026 3:08 PM | Updated on Jan 19 2026 3:39 PM

Toddler chips request Yogi Adityanath gives a packet Watch video

పిల్లలతో ఇంటరాక్షన్‌ ఎపుడూ హృద్యంగానే ఉంటుంది.  అది రాజైనా, మంత్రి అయినా, ఎలాంటి వారైనా సరే ఒత్తిడిని మర్చిపోయి హాయిగా నవ్వుకోవాల్సిందే. ఎపుడూ గంభీరంగా కనిపించే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను  మోముపై నవ్వులు పూయించిన  వీడియో ఒకటి నెట్టింట తెగ సందడి  చేస్తోంది. స్టోరీ ఏంటీ అంటే

యూపీలోని గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయంలో జరిగిన వార్షిక కిచిడీ మేళాలో ఈ ఘటన చోటుచేసుకుంది. యూపీ సీఎం సంప్రదాయం ప్రకారం గోరఖ్‌నాథునికి కిచిడీని సమర్పించారు. అనంతరం భక్తులతో ముచ్చటించారు. ఈ క్రమంలో అక్కడొక చిన్నారితో  ముద్దుగా పలకరించారు. ఇదే  కరెక్ట్‌ టైం అనుకున్నాడో ఏమో గానీ ఆ బుడ్డోడు  తన మనసులోని కోరికను ముఖ్యమంత్రి చెవిన పడేశాడు.  దీంతో అక్కడున్నవారంతా సరదాగా నవ్వుకున్నారు. ఇంతకీ ఆ చిన్నారి అడిగింది ఏమిటో చిన్న పిల్లలంతా ఇష్టపడే చిప్స్‌ ప్యాకెట్‌.  దీంతో ముఖ్యమంత్రి స్వయంగా పిల్లవాడికి చిప్స్ ప్యాకెట్లను అందజేయడంతో వాడి మొహం మతాబులా వెలిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. మిషన్‌ ఎకాంప్ల్‌ష్‌డ్‌ కొంతమంది వ్యాఖ్యానించారు. సీఎం చూపిన ఆప్యాయతకు నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. 

ఇదీ చదవండి: మ్యాట్రిమోనియల్ స్కాం : కోట్లు నష్టపోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement