ఇరాన్‌పై అమెరికా - ఇజ్రాయెల్ భీకర యుద్ధం 6వ రోజుకు చేరుకుంటుండగా, గురువారం అమెరికా '100 గంటల ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' (Operation Epic Fury) పేరుతో మొదటి 100 గంటలకు సంబంధించిన యుద్ధ దృశ్యాలను అమెరికా సెంట్రల్ కమాండ్ గురువారం విడుదల చేసింది.
ఇరాన్‌లోని సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఫిబ్రవరి 28న ప్రారంభమై, భారీ దాడులను కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్‌తో సమన్వయంతో ఇరాన్‌పై తన దాడులకు అమెరికా సైన్యం 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' అని పేరు పెట్టింది.
అత్యంత శక్తివంతమైన ఆపరేషన్ : అమెరికా-ఇజ్రాయెల్ ద్వయం ఇరాన్‌లోని టెహ్రాన్ తదితర నగరాల్లో భారీ దాడులు చేపట్టింది. దాడులు మొదలు పెట్టిన తొలిరోజే ఇరాన్ సుప్రీం అయతుల్లా ఖమేనీని మట్టు బెట్టినట్టు సమాచారం. ఇవి చరిత్రలో అత్యంత ప్రాణాంతకమైన, అత్యంత సంక్లిష్టమైన ,అత్యంత ఖచ్చితమైన వైమానిక ఆపరేషన్‌గా అమెరికా అభివర్ణించింది.గత అర్థ శతాబ్ద కాలంగా అమెరికన్లకు ముప్పుగా పరిణమించిన ఇరాన్ సామర్థ్యాన్ని తుడిచిపెట్టడమే దీని ఉద్దేశమని పేర్కొంది. అయితే ఈ దాడులను తీవ్రంగా ప్రతిఘటించిన ఇరాన్ పెద్ద ఎత్తున ప్రతీకార దాడులు చేస్తోంది. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.
ఇదీ చదవండి: కెనడాలో భారతీయ ఇన్‌ఫ్లుయెన్సర్ నాన్సీ దారుణ హత్య
ఈ ఆపరేషన్‌లో, అమెరికన్ దళాలు అనేక అధునాతన విమానాలు, ఆయుధ వ్యవస్థలను మోహరించాయి. అత్యాధునిక ఆయుధ సంపత్తిని వాడింది. వీటిల్లో B-2 స్టెల్త్ బాంబర్లు & F-35 ఫైటర్లు ఉన్నాయి. ఇవి శత్రు రాడార్లకు చిక్కకుండా లోపలికి చొచ్చుకుపోయి దాడి చేయగల సామర్థ్యం వీటి సొంతం. ఇంటర్మీడియట్-రేంజ్ బాలిస్టిక్ క్షిపణులను అడ్డగించి నాశనం చేయడానికి రూపొందించిన అధునాతన అమెరికన్ యాంటీ-బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ (THAAD) కూడా అమెరికన్ దళాలు ఉపయోగించాయి.
ఇదీ చదవండి: రూ. 250 కోట్ల భరణం ఆఫర్ : జోరుగా మంతనాలు చేస్తున్న విజయ్
అంతేకాదు ఈ యుద్ధంలో మొదటిసారిగా LUCAS (Low-cost Unmanned Combat Attack System) అనే సరికొత్త డ్రోన్లను అమెరికా ప్రయోగించింది. ఇవి రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో వాడిన ఇరాన్ 'షాహెద్ 136' డ్రోన్ల నమూనాలో రూపొందించినవి.నిఘా ,ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించడానికి MQ-9 రీపర్ డ్రోన్లను వినియోగించింది. ఈ ఆపరేషన్‌కు సంబంధించి విడుదలైన వీడియోలో "మేము ఈ యుద్ధాన్ని ప్రారంభించలేదు... కానీ ప్రెసిడెంట్ ట్రంప్ నాయకత్వంలో మేము దీనిని ముగిస్తున్నాము" అని ఒక స్వరం, అమెరికా విదేశాంగ విధానంలో వచ్చిన దూకుడును సూచిస్తోంది.
"100 Hours" of Operation Epic Fury. pic.twitter.com/XW5ZnRAJJL
— U.S. Central Command (@CENTCOM) March 4, 2026


