ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు | Devagudi And Vanchana Movies OTT Streaming Now | Sakshi
Sakshi News home page

OTT Movies: ఏడాదిన్నర తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు మూవీ

Mar 3 2026 2:47 PM | Updated on Mar 3 2026 3:07 PM

Devagudi And Vanchana Movies OTT Streaming Now

ప్రతివారం ఓటీటీల్లోకి కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈసారి కూడా ఓం శాంతి శాంతి శాంతిః, విత్ లవ్, గాంధీ టాక్స్, తన్వి ది గ్రేట్, లాలో కృష్ణ సదా సహాయతే తదితర మూవీస్ స్ట్రీమింగ్‌లోకి రానున్నాయి. అలాంటిది ఇప్పుడు ఓ రెండు చిత్రాలు ఎలాంటి సౌండ్ లేకుండా సైలెంట్‌గా స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. ఇంతకీ అవేంటి? ఎందులో అందుబాటులోకి వచ్చాయి?

(ఇదీ చదవండి: యంగ్ హీరోలని డామినేట్ చేసిన డీ గ్లామర్ బామ్మ సినిమా)

'వంచన' అనే కోర్ట్ రూమ్ థ్రిల్లర్ సినిమా.. 2024 నవంబరు 8న థియేటర్లలోకి వచ్చింది. ఉమా మహేశ్ హీరోగా నటించి దర్శకత్వం కూడా వహించాడు. దాదాపు ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు సన్ నెక్స్ట్ ఓటీటీలోకి మంగళవారం నుంచి స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఈ మూవీ విషయానికొస్తే.. ఓ చర్చి ఫాదర్ దారుణ హత్యకు గురవుతాడు. దీంతో అనుమానితుడిగా ఉన్న అతడి డ్రైవర్‌ని అరెస్ట్ చేస్తారు. అయితే సదరు డ్రైవర్ నిర్దోషి అని నమ్మిన క్రిమినల్ లాయర్ కృష్ణ.. ఈ కేసుని వాదించేందుకు సిద్ధమవుతాడు. దర్యాప్తులో భాగంగా లాయర్ కృష్ణకు ఎదురైన సవాళ్లేంటి? హంతకుడు ఎవరు? అనేదే మిగతా స్టోరీ.

అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'దేవగుడి'. జనవరి 30న థియేటర్లలోకి వచ్చింది. చిన్న సినిమా కావడంతో జనాలు దీన్ని పట్టించుకోలేదు. రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో జరిగే యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దీన్ని తెరకెక్కించారు. ఇది కూడా ఇప్పుడు సన్ నెక్స్ట్ ఓటీటీలోనే అందుబాటులోకి వచ్చింది. 

'దేవగుడి' విషయానికొస్తే.. వీరారెడ్డి(రఘు కుంచె) ఓ ఫ్యాక్షన్ లీడర్. తన అనుచరుల్లో ఒకరి కొడుకు అయిన ధర్మ(అభినవ్ శౌర్య), తన కొడుకుతో స్నేహంగా ఉండటాన్ని తట్టుకోలేడు. ధర్మతో తన కూతురు శ్వేత(అనుశ్రీ) ప్రేమలో ఉందని తెలిసి అతడిని ఊరి నుంచి గెంటేస్తాడు. తర్వాత కొన్నాళ్లకు వీరారెడ్డి అనారోగ్యానికి గురవడంతో అతడిని శత్రువులు చంపేస్తారు. మరోవైపు శ్వేత కనిపించకుండా పోతుంది. శ్వేతని ఎవరు కిడ్నాప్ చేశారు? ధర్మ-ఈమె ఒక్కటయ్యారా లేదా అనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: 'విరోష్' పెళ్లి కానుక.. శుభవార్త చెప్పిన విజయ్ దేవరకొండ)

Advertisement
 
Advertisement
Advertisement