విజయ్‌, రష్మిక రిసెప్షన్‌ రూల్స్‌.. సింగిల్‌ ఎంట్రీ కోడ్‌ | Vijay and Rashmika Wedding Reception Rules | Sakshi
Sakshi News home page

విజయ్‌, రష్మిక రిసెప్షన్‌ రూల్స్‌.. సింగిల్‌ ఎంట్రీ కోడ్‌

Mar 3 2026 2:10 PM | Updated on Mar 3 2026 2:19 PM

Vijay and Rashmika Wedding Reception Rules

విజయ్‌ దేవరకొండ, రష్మిక రిసెప్షన్‌ వేడుక గురించి ఒక వార్త సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇటీవల వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. తమ ఫ్యాన్స్‌ కోసం దేశవ్యాప్తంగా పలు నగరాల్లో స్వీట్లు పంచారు. ప్రధాన ఆలయాల్లో భోజనాలు పెట్టారు. ఇలా తమ సంతోషాన్ని అందరితో పంచుకున్నారు. అయితే, మార్చి 4న వీరి వివాహ రిసెప్షన్‌ జరగనుంది. ఈ వేడుకలో సినీ, రాజకీయ నాయకులు పాల్గొననున్నారు. అందుకోసం పోలీసులు కఠినమైన భద్రతను ఏర్పాటు చేశారు.

(ఇదీ చదవండి: 'విరోష్' పెళ్లి కానుక.. శుభవార్త చెప్పిన విజయ్ దేవరకొండ)

మార్చి 4, 2026న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో  విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ రిసెప్షన్‌ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు చాలామంది సినీ, రాజకీయ నాయకులు పాల్గొననున్నారు. దీంతో కార్యక్రమానికి ఎంట్రీ అయ్యే వారికి చాలా కఠినమైన నియమాన్ని విధించింది. రిషెప్షన్‌కు వచ్చే  అతిథులు లోపలికి వెళ్లాలంటే ఒకసారి మాత్రమే ఉపయోగించగల QR కోడ్‌ను ఏర్పాటు చేశారు. రోండోసారి ఆ కోడ్‌ పనిచేయదు. ఒక్కసారి లోపలికి ఎంట్రీ ఇస్తే బయటకు వచ్చేందుకు ఛాన్స్‌ వుండదు.

రిసెప్షన్‌కు ఆహ్వానం, QR కోడ్‌లు లేని వారు అక్కడికి రావద్దని ఇప్పటికే తెలిపారు. ఇది పూర్తిగా పోలీసుల నిఘాలో ఉన్నందున హాజరు కావద్దని వారు అధికారికంగా ప్రకటించారు. పరిస్థితిని అర్థం చేసుకుని భద్రతా చర్యలకు సహకరించాలని విజయ్‌ టీమ్‌ కోరింది.

(ఇదీ చదవండి: సొంతూరు ప్రజలకు విందు.. విజయ్‌పై విమర్శలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement