లారీ డ్రైవర్‌తో పెళ్లి : లివింగ్‌ పార్టనర్‌ని దారుణంగా హత్య చేసిన టీవీ నటి | Bengaluru Actor eliminates Livein Partner Mouth Him With Lover Help | Sakshi
Sakshi News home page

లారీ డ్రైవర్‌తో పెళ్లి : లివింగ్‌ పార్టనర్‌ని దారుణంగా హత్య చేసిన టీవీ నటి

Mar 2 2026 7:43 PM | Updated on Mar 2 2026 8:00 PM

Bengaluru Actor  eliminates Livein Partner Mouth Him With Lover Help

బెంగళూరులోదారుణం చోటు చేసుకుంది. టీవీ నటి పార్టీ పేరుతో పిలిచి ప్రియుడిని హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బెంగళూరులోని మంజునాథనగర్‌లో  ఫిబ్రవరి 18న  జరిగిన ఈ దిగ్భ్రాంతికరమైన  హత్య దాదాపు 12 రోజుల తరువాత వెలుగులోకి వచ్చింది.

గత ‍కొన్ని రోజులుగా టీవీ నటి  నటి ఊర్మిళ అలియాస్ బిందు, మోహన్ ‍ కృష్ణా రావు (40) కొంత కాలంగా 'లివ్-ఇన్' రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. తాజాగా లారీ డ్రైవర్ వినయ్ అనే మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే దీన్ని మోహన్ రావు వ్యతిరేకించడంతో అతని హత్యకు పూనుకున్నారని నార్త్-వెస్ట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) డీల్‌ నాగేష్ తెలిపారు.

ఇదీ చదవండి: న్యూక్లియర్‌ వాచ్‌ డాగ్‌ వార్నింగ్‌, స్పందించని ఇరాన్‌

దీంతో తన పెళ్లికి అడ్డుగా ఉన్నాడన్న కారణంగా మోహన్ రావును వదిలించుకోవడానికి ప్లాన్‌ వేసింది. ముందుగా వేసుకున్న ప్లాన్‌  ప్రకారం  బిందు, మోహన్ కలిసి ఉంటున్న ఇంట్లోనే పార్టీ ఏర్పాటు చేశారు. ఫుల్‌గా మద్యం సేవించిన తర్వాత, వినయ్ తన స్నేహితుడు ధనుష్‌తో కలిసి మోహన్ రావుపై ఎటాక్‌ చేశాడు. కాళ్లు చేతులు కట్టేసి, నోటికి, ముక్కు టేపులు వేసి మరీ మోహన్ రావును పలుమార్లు కత్తితో పొడిచారు. దీంతో ఊపిరి ఆడకపోవడంతో మోహన్ రావు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అనంతరం నిందితులు అక్కడి నుండి పరారయ్యారు.

అయితే హత్య జరిగిన 12 రోజుల తర్వాత, ఆ ఇంటి నుండి తీవ్రమైన దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి చూడగా కుళ్ళిపోయిన స్థితిలో మోహన్ రావు మృతదేహం లభ్యమైంది. ప్రస్తుతం పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, ఈ క్రైమ్‌లో ఎవరి పాత్ర ఎంత ఉందనే దానిపై విచారణ జరుపుతున్నారు. బిందు  'భజరంగి', 'పోలీస్ క్వార్టర్స్', 'కాలభైరవ' వంటి సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement