ప్రియుడి మోసం: ఇదే అదునుగా అగంతకుడి దారుణ హత్యాచారం | Odisha Woman assault by boyfriend then stranger and dies | Sakshi
Sakshi News home page

ప్రియుడి మోసం: ఇదే అదునుగా అగంతకుడి దారుణ హత్యాచారం

Feb 28 2026 4:08 PM | Updated on Feb 28 2026 4:23 PM

Odisha Woman assault by boyfriend then stranger and dies

భువనేశ్వర్‌ : ఒడిశాలో 23 ఏళ్ల మహిళ హత్యాచార ఘటన కలకలం రేపింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన  ప్రియుడు  ఆమెపై అత్యాచారం చేసి వదిలేశాడు. ఆ తరువాత  సాయం చేస్తానని చెప్పి నమ్మించిన మరో అగంతకుడు ఆమెను అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  స్థానికంగా తీవ్ర ఆందోళన రేపిన హృదయవిదారకమైన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

పోలీసుల సమాచారం ప్రకారం గుడిలో పెళ్లి చేసుకుందామని బాధితురాల్ని ప్రియుడు నమ్మించాడు. దీంతో  ఫిబ్రవరి 22న ఆ మహిళ తన ఇంటి నుండి పారిపోయింది. అయితే ప్రియుడు ఆమెను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి, అత్యాచారం చేసి రహమా బస్ స్టాండ్‌లో వదిలేశాడు.  ఒంటరిగా ఉన్న ఆమెను చూసి జార్ఖండ్‌కు చెందిన మరో వ్యక్తి గమనించాడు. ఆమె బలహీనతను ఆసరాగా తీసుకొని సాయం చేస్తానని నమ్మించి ‍ ఆమెను పారదీప్ పట్టణంలోని అద్దెకు తీసుకున్న వసతి గృహానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు. చివరికి బాధిత మహిళను నాలుగు అంతస్తుల భవనం పైకప్పు నుండి తోసేశాడు. ఆ మహిళ మృతదేహాన్ని మరుసటి రోజు ఉదయం గుర్తించామని  జగత్సింగ్‌పూర్ పోలీసు సూపరింటెండెంట్ అంకిత్ కుమార్ వర్మ తెలిపారు. బాధితురాలి సోదరుడు ఫిబ్రవరి 25న పారదీప్ మోడల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇద్దరు నిందితులను  అరెస్టు చేసి, కిడ్నాప్, అత్యాచారం, హత్య కేసు నమోదు చేశారు.   

ఇదీ చదవండి: Liquor Policy: కేజ్రీవాల్‌కు క్లీన్‌ చిట్‌, అన్నా హజారే కీలక వ్యాఖ్యలు

బిజు జనతాదళ్ (BJD) అధినేత మాజీ ముఖ్యమంత్రి  నవీన్ పట్నాయక్ దీనిపై తీవ్రంగా స్పందించారు. మైనర్లు, వికలాంగుల సహా ఎవరికీ రాష్ట్రంలో రక్షణ లేదంటూ ఆయన ట్వీట్‌ చేశారు. ఇంకా ఎంతమంది అమాయకుల ప్రాణాలు పోతాయని ప్రశ్నించారు. పట్టపగలు కూడా భయానక వాతావరణం నెలకొంది. ఇటువంటి దారుణాలు పదేపదే జరుగుతున్నా కనీస చర్యలు లేవనీ, అసలు రాష్ట్రంలో పాలన ఉందా అని ఆయన మండిపడ్డారు. అంగుల్‌లోని కనిహాన్, సంబల్‌పూర్‌లోని కుచిండా , పారాదీప్ ప్రాంతాల నుండి వస్తున్న దుశ్చర్యల వార్తలు కలవరపెడుతున్నాయన్నారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.  

ఇదీ చదవండి: కాకినాడ: వేట్లపాలెంలో భారీ పేలుడు..18 మంది సజీవ దహనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement