ఇరాన్‌పై మొదలైన భీకర దాడులు: భారతీయులకు కీలక ఆదేశాలు | Israel Attack Iran US military has begun ops against Iran, India issues advisory | Sakshi
Sakshi News home page

Israel Attack Iran : భీకర దాడులు, భారతీయులకు కీలక ఆదేశాలు

Feb 28 2026 1:37 PM | Updated on Feb 28 2026 1:51 PM

Israel Attack Iran US military has begun ops against Iran, India issues advisory

Israel Attack Iran ఇరాన్ అంతటా ఇజ్రాయెల్ భీకర దాడులను ప్రారంభించింది. శనివారం తెల్లవారుజామున ఇరాన్‌పై  అనేక నగరాల్లో “ముందస్తు” వైమానిక దాడులను ప్రారంభించింది.రాజధాని టెహ్రాన్, చుట్టుపక్కల ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది. మరోవైపు ఈ  అమెరికా దాడులను ప్రారంభించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ధృవీకరించారు. 

ఇరాన్ అణు కార్యక్రమంపై తాజా చర్చలతో తాను "సంతోషంగా లేను" అని ట్రంప్ చెప్పిన కొన్ని గంటల తర్వాత ఈ దాడులు జరిగాయి. ఇరాన్‌ బెదిరింపులను నిలువరించేందుకే ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దాడులు జరిగిన వెంటనే, ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.  ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) హోమ్ ఫ్రంట్ కమాండ్ పౌరులను రక్షిత ప్రాంతాలకు సమీపంలో ఉండాలని, బైటికి రావద్దని ఆదేశాలు జారీ చేశాయి.ఇస్ఫహాన్, కోమ్, కరాజ్, కెర్మాన్షాలలో పేలుళ్లు సంభవించాయని, టెహ్రాన్‌లోని రెండు ప్రదేశాలలో పేలుళ్లు సంభవించాయని దీంతో నగర కేంద్రంలో  దట్టమైన  పొగ కమ్ముకుందని పలు మీడియా వార్తల ద్వారా తెలుస్తోంది. 

అప్రమత్తంగా ఉండండి
ఈ దాడుల నేపథ్యంలో ఇండియా అక్కడి భారతీయులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న భద్రతా పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఇజ్రాయెల్‌లోని భారతీయ పౌరులందరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక  జారీ చేసింది. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఇజ్రాయెల్ అధికారులు ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం జారీ చేసిన భద్రతా మార్గదర్శకాలు ,సూచనలను భారతీయ పౌరులు ఖచ్చితంగా పాటించాలని సూచించింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement