Israel
-
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక పరిణామం
టెహ్రాన్: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. శత్రుదేశాలు దాడులకు తెగబడితే రెట్టింపు ప్రతి దాడులు చేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఆదేశాలు జారీ చేశారు.ఆదివారం మొజ్తాబా ఖమేనీతో ఇరాన్ ఖతం అల్ అన్బియా సెంట్రల్ హెడ్‌క్వార్టర్స్ చీఫ్ కమాండర్ అలీ అబ్దుల్లాహి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో వారిరువురి మధ్య పశ్చిమాసియా యుద్ధం, కాల్పుల విరమణ, అమెరికా-ఇజ్రాయెల్ దాడుల అంశాలపై చర్చ జరిగింది.ఈ సందర్భంగా అమెరికా-ఇజ్రాయెల్ దాడులపై ప్రతి దాడులు చేయాలని, శత్రువులను దృఢంగా ఎదుర్కొనేలా కొత్త మార్గదర్శకాలు జారీ చేసినట్లు ప్రముఖ మీడియా సంస్థ ఫార్స్ న్యూస్ తెలిపింది. ఇరాన్ సాయుధ దళాలు అమెరికా-ఇజ్రాయెల్ ఏ చర్యనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని కమాండర్ అబ్దుల్లాహి పేర్కొన్నారు. శత్రువు ఏ తప్పు చేసినా ఇరాన్ ప్రతిస్పందన వేగంగా, తీవ్రంగా ఉంటుంది అని ఆయన హెచ్చరించినట్లు ఫార్స్ న్యూస్ హైలెట్ చేసింది. తాజా ప్రకటనతో గల్ఫ్ ప్రాంతంలో ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇరాన్ సైన్యం, ఐఆర్జీసీ తరచూ అమెరికా, దాని మిత్రదేశాలకు హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్నాయి. హర్మూజ్ జలసంధి వంటి కీలక చమురు మార్గాల భద్రతపై కూడా ఈ పరిణామాలు ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. -
శత్రువు గుండెల్లో నిద్ర పోవడం అంటే ఇదేనేమో..!
-
దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు
బీరూట్: దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. శనివారం జరిగిన దాడుల్లో ఏడుగురు చనిపోయారు. హెజ్బొల్లా, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నా పరస్పర దాడులు ఆగకపోవడం గమనార్హం. మొత్తం 9 గ్రామాల ప్రజలను వెంటనే నివాసాలు వదిలివెళ్లిపోవాలంటూ ఇజ్రాయెల్ ఆర్మీ హెచ్చరికలు జారీ చేసింది.కెఫర్ దజాల్లో ఓ కారుపై జరిగిన దాడిలో ఇద్దరు, ల్వైజాహ్ గ్రామంలోని నివాసంపై జరిగిన దాడిలో ముగ్గురు, షౌకిన్పై దాడిలో మరో ఇద్దరు మృతి చెందారని ప్రభుత్వం తెలిపింది. సరిహద్దుల్లోని యరౌన్లోని కేథలిక్ చర్చిలోని కొంత భాగాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ ధ్వంసం చేసినట్లు నిర్వాహకులు ఆరోపించారు.కాగా, హెజ్బొల్లా లక్ష్యంగా 24 గంటల వ్యవధిలో సుమారు 50 వైమానిక దాడులను చేపట్టినట్లు ఇజ్రాయెల్ మిలటరీ వెల్లడించింది. శనివారం తీర ప్రాంతంలోని బయెద్ అనే గ్రామంలోని ఓ ఇంట్లో చేరిన ఇజ్రాయెల్ బలగాలే లక్ష్యంగా డ్రోన్ దాడి చేసినట్లు హెజ్»ొల్లా సైతం ప్రకటించుకుంది. -
బీటలువారిన ఒపెక్!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒకటి తలిస్తే జరిగేది ఎప్పుడూ మరోటి. ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై క్షిపణుల వర్షం కురిపిస్తే అది నాలుగురోజుల్లో పాదాక్రాంతమవుతుందని అంచనావేసుకుని ప్రారంభించిన యుద్ధం కాస్తా వికటించి ఆయన ఆ ఊబిలో కూరుకుపోయారు. దాన్నుంచి ఎలా బయటపడాలో తెలియని తరుణంలో పశ్చిమాసియాలో ఆయన ఉద్దేశించని పరిణామం సంభవించింది. మే 1 నుంచి పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ (ఒపెక్)నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రకటించింది. దాన్నుంచి మాత్రమే కాదు... 2016లో ఏర్పడిన ‘ఒపెక్ ప్లస్’నుంచి కూడా వైదొలగనున్నట్టు తెలిపింది. ఒపెక్‌లో సభ్యత్వం తీసుకోని రష్యావంటి ఇతర చమురు ఉత్పత్తి దేశాలతో ఈ గ్రూప్ ఏర్పడింది. ఒపెక్ ప్రపంచ చమురు ఉత్పత్తుల పరిమాణాన్నీ, ఎగుమతుల్నీ, వాటి ధరల్నీ నిర్దేశిస్తున్న కీలక సంస్థ. ప్రపంచ ఆర్థికవ్యవస్థ తీరుతెన్నులు దానిపైనే ఆధారపడతాయి. ప్రపంచ పెట్రో ఉత్పత్తుల్లో ఒపెక్ వాటా మూడోవంతుకన్నా ఎక్కువ. ఒపెక్ నుంచి తప్పుకోవాలన్న యూఏఈ ఆలోచన చాలా పాతది. కానీ ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ వచ్చింది. కానీ ఇరాన్ యుద్ధంతో అది తుది నిర్ణయానికొచ్చింది.ఒపెక్ సంస్థ ఆవిర్భావానికీ, విస్తరణకూ పాశ్చాత్య బహుళజాతి సంస్థల నిర్వాకం కారణం. చమురు దేశాలు ఎంత ఉత్పత్తి చేయాలో, ఏ ధర నిర్ణయించాలో అవి నిర్దేశించేవి. వాటి చెప్పుచేతల్లో ఉండటం ఇక సాధ్యంకాదన్న నిర్ణయానికొచ్చిన చమురు దేశాలు 1960 సెప్టెంబర్‌లో బాగ్దాద్‌లో సమావేశమై ఒపెక్ ఏర్పాటుకు తీర్మానించాయి. ఇరాన్, కువైట్, ఇరాక్, సౌదీ అరేబియా, వెనెజులా దేశాలు ఇందులో భాగస్వాములు. 1967లో యూఏఈ చేరింది. 1973లో అరబ్–ఇజ్రాయెల్ యుద్ధంలో ఇజ్రాయెల్‌ను వెనకేసుకొస్తున్న అమెరికా, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, పోర్చుగల్ తదితర దేశాల వైఖరిపై ఆగ్రహించిన ఒపెక్... చమురు ఉత్పత్తిని గణనీయంగా తగ్గిస్తూ, ఆ దేశాలకు ఎగుమతుల్ని నిషేధించింది. దాంతో పెను సంక్షోభం ఏర్పడింది. అనంతరకాలంలో ఈ దేశాలన్నీ అమెరికాకు సాగిలబడ్డాయి. అది వేరే కథ!ఒపెక్‌లో రాజుకుంటున్న అసంతృప్తికి సౌదీ పెద్దన్న పాత్ర పోషిస్తుండటం ఒక కారణం. ఏ దేశం ఎంత ఉత్పత్తి చేయాలో అదే నిర్ణయించటంవల్ల తమకు అన్యాయం జరుగుతున్నదని సభ్యదేశాల్లో ఎప్పటినుంచో అసంతృప్తి ఉంది. అందుకే 2019లో ఖతార్, ఆ మరుసటి ఏడాది ఈక్వెడార్, 2024లో అంగోలా సంస్థనుంచి వైదొలగాయి. ఆ వరసలో యూఏఈ నాలుగో దేశం. అంతర్జాతీయ చమురు ధరల్ని బట్టి ఉత్పత్తిని నియంత్రించుకుంటూ, అది కోరుకున్న ధరలో ఉండేలా చూసుకోవటం ఒపెక్ అలవాటు. తన తొలి ఏలుబడిలో ఒపెక్ దేశాలపై ట్రంప్ తీవ్రంగా విరుచుకుపడిన సందర్భాలున్నాయి. చమురు ధరలు పెంచుతూ ప్రపంచ ఆర్థికవ్యవస్థను అస్తవ్యస్థం చేస్తున్నాయన్నది ఆయన ఆరోపణ. అయితే 2020లో కోవిడ్ సమయంలో పాతాళానికి పడిపోయిన చమురు ధరలతో దివాలా స్థితికి చేరిన అమెరికన్ సంస్థల్ని కాపాడుకునేందుకు ఉత్పత్తిని తగ్గించమని ఒపెక్‌ను వేడుకున్నది కూడా ఆయనే. సౌదీ తీరుపై యూఏఈ ఆగ్రహంతో ఉండటానికి కారణం ఉంది. అది ప్రస్తుతం రోజుకు 35 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేస్తోంది. తనకున్న సామర్థ్యంతో అంతకన్నా ఎక్కువ చేయగలిగినా, సౌదీ అరేబియా నిర్దేశిస్తున్న కోటా ఆటంకంగా ఉంది. వచ్చే ఏడాదికల్లా దాన్ని 50 లక్షల బ్యారెళ్లకు పెంచాలంటే తప్పుకోవటమే ఉత్తమమని అది భావిస్తోంది. ఈలోగా ఇరాన్ యుద్ధం దాని సమస్యల్ని పెంచింది. గల్ఫ్ దేశాల్లో ఇరాన్ దాడుల్లో ఆ దేశమే అధికంగా నష్టపోయింది. కనుకనే ఈ బాదరబందీని వదుల్చుకోవాలని నిర్ణయించుకుంది. పర్యవసానంగా వెనువెంటనే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర మూడు శాతం పెరిగిన మాట వాస్తవమే అయినా, దీర్ఘకాలంలోగానీ దాని అసలు ప్రభావం కనబడదు. యూఏఈ మిత్రదేశంగా భారత్‌కు ఈ పరిణామం లాభదాయకమే. కానీ ఒపెక్ ఎలాంటి ఆంక్షలు పెడుతుందో చూడాలి. మొత్తానికి ఇన్నాళ్లూ కలిసికట్టుగా ఉన్నట్టు కనబడిన గల్ఫ్, ఒపెక్ బీటలువారుతున్నాయి. ఈ పరిణామం పశ్చిమాసియాలో అమెరికా పలుకుబడిని తగ్గిస్తుంది. ఇరాన్ పాదాక్రాంతం మాటేమో గానీ... అమెరికాకు మున్ముందు ఇది సమస్యాత్మకం. -
జలసంధిలో చట్టాల ఉల్లంఘన!
ప్రపంచమంతా ఇరాన్ యుద్ధంలో పాకిస్తాన్ మధ్యవర్తిత్వం, కాల్పుల విరమణ, యుద్ధ విరమణ గురించి ఉత్కంఠగా పరిశీలిస్తున్నది. విచిత్రమయిన, ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఈ యుద్ధంలో న్యాయాన్యాయాలు, ధర్మాధర్మాలు, మధ్యవర్తి అర్హతల గురించిన చర్చ మచ్చుకు కూడా లేదు. యుద్ధంలో భాగస్వాములు కాని అరబ్ దేశాల అవస్థల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. అందరి దృష్టీ కేవలం హార్మూజ్ జలసంధిని ఒకవైపు ఇరాన్, మరోవైపు పరోక్షంగా అమెరికా దిగ్బంధించడం మీదనే ఉన్నది. ఎందుకంటే హార్మూజ్ గుండా చమురు, గ్యాస్ నిరాటంకంగా రవాణా జరిగితే చాలు, మిగతా విషయాలు మాకేమిటనే ధోరణిలో ప్రపంచ దేశాలు ఉన్నాయి. అంతర్జాతీయ చట్టాలు, ఒప్పందాల ఉల్లంఘన గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. ‘బలవంతుడి మాటే చట్టం’ అని ప్రపంచ దేశాలు రాజీ పడినట్టుగా కనిపిస్తున్నది. అంతర్జాతీయ చట్టాల అమలుకు బాధ్యత తీసుకోవాల్సిన ఐక్యరాజ్య సమితి కోమాలో ఉన్నట్టుగా తోస్తున్నది.మౌనం దాల్చిన ప్రపంచ దేశాలు!పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో జరుగుతున్న శాంతి చర్చలలో ప్రతిష్ఠంభనకు రెండు ప్రధాన పీటముడులు ఉన్నాయి. ఒకటి, హార్మూజ్ దిగ్బంధనం; రెండు, ఇరాన్ అణు కార్యక్రమం. హార్మూజ్ జలసంధిని పూర్తిగా నియంత్రించే అధికారం తనకున్నదని ఇరాన్ వాదిస్తున్నది. మొదటి విడత చర్చల తర్వాత ఇరాన్ కాస్త మెత్తబడి హార్మూజ్ నుండి అన్ని నౌకల రవాణాకు సహకరించడానికి ముందుకొచ్చింది. కానీ, ఇరాన్ రేవు పట్టణాల నుండి వచ్చే నౌకలను, ఇరాన్ రేవులకు వెళ్లే నౌకలను అడ్డగిస్తామని అమెరికా మంకుపట్టు పట్టడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ఈ సందర్భంగా అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇరాన్, అమెరికాలకు ఈ రకంగా ప్రపంచ వాణిజ్యాన్ని అడ్డుకొనే హక్కు ఉందా అని ప్రపంచ దేశాలు ప్రశ్నించాల్సింది పోయి, నోరు మెదపకుండా కూర్చోవడం శోచనీయం. సన్నని జలసంధులు, సముద్ర మార్గాల గుండా సరుకుల రవాణాను నియంత్రించడానికి రెండు ప్రధాన అంతర్జాతీయ చట్టాలున్నాయి. 1. యుఎన్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ (యు.ఎన్.సి. ఎల్.ఓ.ఎస్), 2. శాన్ రెమో మాన్యువల్. యు.ఎన్.సి.ఎల్.ఓ.ఎస్. రెండు రకాల జలసంధి రవాణా మార్గాలను గుర్తించింది. అవి : 1. ఇన్నోసెంట్ పాసేజ్, 2. ట్రాన్సిట్ పాసేజ్. తీరం నుంచి 12 నాటికల్ మైళ్ల దూరం లోపు నౌకల రవాణా జరిగితే ఆ మార్గాన్ని ఇన్నోసెంట్ పాసేజ్‌గా పరిగణిస్తారు. యు.ఎన్.సి.ఎల్.ఓ.ఎస్. ఆర్టికల్ 19 కింద తీరదేశాల భద్రతకు ముప్పు లేకుండా నౌకలు ప్రయాణించవచ్చు. ఆర్టికల్ 25 (3) ప్రకారం తీర దేశం ఇన్నోసెంట్ ప్యాసేజ్ గుండా నౌకల రవాణాను తన దేశ భద్రత దృష్ట్యా తాత్కాలికంగా నిలిపివేయవచ్చు. భౌగోళిక రాజకీయ వ్యూహాలు12 నాటికల్ మైళ్లకు ఆవల ఉండే జలమార్గాలను ట్రాన్సిట్ ప్యాసేజ్గా పరిగణిస్తారు. యు.ఎన్.సి.ఎల్.ఓ.ఎస్. ఆర్టికల్ 44 ప్రకారం తీరదేశాలు ట్రాన్సిట్ ప్యాసేజ్ గుండా నౌకల రవాణాను అడ్డుకోవడం నిషేధం. ఇరాన్–ఒమన్ తీరాలను విభజించే హార్మూజ్ జలసంధి వెడల్పు కనిష్ఠంగా 21 నాటికల్ మైళ్లు. ఒమన్, ఇరాన్ సార్వభౌమ సముద్ర జలాలు (టెరిటోరియల్ వాటర్స్) చెరొక 12 నాటికల్ మైళ్లకు విస్తరిస్తే మొత్తం 24 నాటికల్ మైళ్లు. కానీ జలసంధి 21 నాటికల్ మైళ్లు మాత్రమే. అంటే నౌకలు ఇరాన్ సార్వభౌమ సముద్ర జలాల గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. అందుకే ఇరాన్ హార్మూజ్‌ను ఇన్నోసెంట్ పాసేజ్‌గా పరిగణిస్తూ, తన భద్రత దృష్ట్యా మూసివేస్తానని వాదిస్తున్నది. ఇక అమెరికా హార్మూజ్ జలసంధి గుండా ఇరానియన్ రేవు పట్టణాలకు నౌకల రవాణాను అడ్డుకోవడం యు.ఎన్.సి.ఎల్.ఓ.ఎస్ నిబంధనలను, యుఎన్ ఛార్టర్, హై సీస్ ఫ్రీడమ్ యాక్ట్ నిబంధనలను అతిక్రమించడమే. 1908లో ఇరాన్లో చమురు నిల్వలు కనుగొన్నప్పటి నుంచి మధ్యప్రాచ్యం... యూకే, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా; అనంతరం అమెరికాల జియోపొలిటికల్ వ్యూహంలో పావుగా మారింది. యూకే, ఫ్రాన్స్, డచ్, జర్మన్, యూఎస్ఏల చమురు కంపెనీలు, రాత్స్‌చైల్డ్ వంటి యూదుల ప్రైవేట్ బ్యాంకులు చక్రం తిప్పాయి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఒట్టమాన్ సామ్రాజ్యాన్ని ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా పంచుకున్నాయి. టర్కీ, ఇరాన్, ఇరాక్, సిరియా, లెబనాన్ల సరిహద్దులను తమ ఇష్టానుసారం చమురు నిల్వల ప్రయోజనాల ఆధారితంగా నిర్ధారించాయి. వలస పాలకులు, చమురు కంపెనీల వారు సరిహద్దులను గీయటం, మధ్యప్రాచ్యంలో సున్నీ–షియా–కుర్ద్ –యూదుల మధ్య వైషమ్యాలు తీవ్రరూపం దాల్చటం... ప్రస్తుత రావణకాష్టానికి కారణం. షియాల ప్రాబల్యమున్న ఇరాన్–ఇరాక్‌ల నుంచి రక్షణ కోసం అరబ్ దేశాలు అమెరికా పంచన చేరాయి. అమెరికా ఈ దేశాలలో సైనిక స్థావరాలను ఏర్పాటు చేసి, రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసింది. పెట్రో డాలర్ బూమ్‌తో అరబ్ దేశాలు బలమైన ఆర్థిక శక్తులుగా తయారయ్యాయి. కానీ పొరుగున పాలస్తీనా (గాజా), సిరియా, లెబనాన్, ఇరాన్, ఇరాక్లలో అనిశ్చితి కొనసాగుతున్నది. ఈ ప్రాంతీయ అనిశ్చిత స్థితి తమ ఆర్థిక, రాజకీయ స్థిరత్వానికి ముప్పు అని గుర్తించి అరబ్ దేశాలు క్రమంగా ఇజ్రాయిల్‌తో మైత్రికి ముందుడుగు వేశాయి. ఇజ్రాయిల్‌తో సంబంధాలను మెరుగుపరచుకున్నాయి. ఇరాన్ మంత్రి రష్యా పర్యటన!2020 కల్లా చైనా, రష్యా, భారత్‌లు అమెరికాకు ప్రత్యామ్నాయ శక్తులుగా ఆవిర్భవించాయి. 2023లో చైనా మధ్యవర్తిత్వంలో సౌదీ అరేబియా ఇరాన్‌తో సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నాలు చేసింది. భారత్ ప్రతిపాదించిన ఐమెక్ (ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్)లో యూఏఈ, సౌదీ చేరాయి. అమెరికా–ఐరోపాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఏర్పాటయిన బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) కూటమిలో సౌదీ, యూఏఈలు 2024లో సభ్యులుగా చేరడం అరబ్ దేశాల నూతన వ్యూహాన్ని బలపరుస్తున్నది. డాలర్‌కు ప్రత్యామ్నాయంగా యూఏఈ, సౌదీలు ‘పెట్రో యువాన్’ను బలపరచటానికి తోడ్పడుతున్నాయి. భారత్–యూఏఈలు డాలర్లో కాకుండా స్థానిక కరెన్సీలలో వాణిజ్యానికి ఒప్పందం చేసుకున్నాయి. యూఎస్ఏ నాయకత్వంలోని పశ్చిమ దేశాల స్విఫ్ట్ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా యూఏఈ, సౌదీ, చైనా, హాంకాంగ్‌లు ఎం–బ్రిడ్జ్ ప్రాజెక్టును పరీక్షిస్తున్నాయి. డాలర్లకు బదులుగా ఖతర్, సౌదీలు బంగారంలో పెట్టుబడులను అధికం చేస్తున్నాయి. మరోవైపు అరబ్ దేశాలు గత దశాబ్దకాలంగా చైనా, భారత్, రష్యాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకుంటున్నాయి. భారత్ అనుసరిస్తున్న మల్టీ అలైన్మెంట్ విధానం అరబ్ దేశాలకు కూడా అనుసరణీయంగా కన్పిస్తున్నది. ఈ నేపథ్యంలో, ఇరాన్–అమెరికాల మధ్య శాంతి చర్చల సమన్వయ ప్రయత్నాలలో భాగంగా ఇరాన్ విదేశాంగ మంత్రి జరిపిన రష్యా పర్యటన క్రమంగా ప్రాధాన్యత సంతరించుకుంటోంది. ఇరాన్ యుద్ధంలో రష్యా ప్రత్యక్ష పాత్రకు బహుశా ఇది నాంది కావచ్చు. గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
ఒక్కటైన గల్ఫ్ దేశాలు?.. ట్రంప్‌కు ఖమేనీ బిగ్ షాక్?
టెహ్రాన్: ఇరాన్‌పై అమెరికా యుద్ధంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. గల్ఫ్ దేశాలతో ఏకమై హర్మూజ్ జలసంధిలో అమెరికా చేస్తున్న ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ పిలుపునిచ్చారు. ఈ మేరకు గల్ఫ్ దేశాలకు తన స్వహస్త్రాలతో లేఖ రాసినట్లు రాయిటర్స్ కథనం తెలిపింది.గురువారం మొజ్తాబా ఖమేనీ రాసిన లేఖలో ఫిబ్రవరి 28న నుంచి అమెరికా,ఇజ్రాయెల్‌తో ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి గల్ఫ్,హర్మూజ్ జలసంధికి సంబంధించి కొత్త అధ్యాయం రూపుదిద్దుకుంటోంది.ఇరాన్ గల్ఫ్ దేశాల్ని సురక్షితం చేస్తుందని, హర్మూజ్ జలసంధిపై అమెరికా చేస్తున్న దుర్వినియోగాలను’నిర్మూలిస్తుందని అన్నారు. హర్మూజ్ జలసంధి కొత్త నిర్వహణ అన్ని గల్ఫ్ దేశాలకు శాంతి, పురోగతి, ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుందని మొజ్తాబా కమేనీ రాసిన లేఖలో స్పష్టం చేశారు.గల్ఫ్ ప్రాంతంలో అమెరికా ఉనికిని అనవసరమని మొజ్తాబా ఖమేనీ పేర్కొన్నారు. భవిష్యత్తులో అమెరికా లేకుండా గల్ఫ్ ప్రాంతం మరింత శాంతి, అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. అంతేకాదు ఇరాన్ అణు, క్షిపణి సామర్థ్యాలను జాతీయ ఆస్తులుగా పరిరక్షిస్తామని ప్రకటించారు. పర్షియన్ గల్ఫ్‌లో అమెరికా ఉనికే ఆ ప్రాంతంలో అస్థిరతకు ప్రధాన కారణం. ఆ దేశానికి తన సొంత భద్రతను కాపాడుకునే సామర్థ్యం లేదు. అమెరికాను అభిమానించే వారికి, అమెరికా భద్రత కల్పిస్తుందనే ఆశ అసలు లేదు.ఇరాన్ శత్రువులకు దాని జలాల లోతుల్లో తప్ప మరెక్కడా స్థానం లేదు. వేలాది కిలోమీటర్ల దూరం నుంచి పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్రంలో అల్లకల్లోలం సృష్టిస్తున్న శత్రువులకు అక్కడ మరెక్కడా స్థానం లేదని స్పష్టం చేశారు.ఖమేనీ రాసిన ఈ లేఖ, ఇరాన్ నేవీ కమాండర్ షెహరామ్ ఇరానీ టార్పిడో గురించి వివరిస్తూ అమెరికాను బెదిరించిన తర్వాత వెలువడింది. ఇరాన్ నేవీ తన ప్రకటనలో, శత్రు యుద్ధనౌకలను, జలాంతర్గాములను చీల్చగల సూపర్ జలాంతర్గామి ఆయుధాన్ని ఊహించమని పేర్కొంది. ‘హూట్’ (ఇరాన్ భాషలో హూట్ అంటే తిమింగళం) అనే పేరున్న ఈ సూపర్ వెపన్ దెబ్బకు శత్రువులు భయపడుతున్నారు. యుద్ధ సమయంలో ఇరాన్ నావికాదళం బలహీనపడినప్పటికీ, త్వరలోనే కొత్త ఆయుధంతో శత్రువుపై దాడి చేస్తామని ప్రకటించింది.‘ఏ క్షణమైనా కొత్త ఆయుధంతో శత్రువును ఢీకొంటాం. బహుశా వాళ్లకు హార్ట్ అటాక్ రాకపోవచ్చు’ అని వ్యాఖ్యానించారు. కాగా, హర్మూజ్ జలసంధి ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని.. ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం గల్ఫ్ దేశాల భవిష్యత్తు రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. -
దౌత్యమా... ఇంకా దాదాగిరీయేనా?
మొదటి విడత చర్చలు ఏప్రిల్ 12న విఫలమై, రెండవ విడతకు ముహూర్తమైనా కుదరని స్థితిలో, తాను దౌత్యానికి మారదలచుకున్నారా లేక దాదాగిరీ పద్ధతిలోనే కొనసాగుతారా అనేది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తేల్చుకోవలసి ఉంది. లేదంటే ఇరాన్‌తో మళ్ళీ చర్చలు గానీ, సమస్య పరిష్యారం గానీ జరిగే సూచనలు లేవు. రెండవ విడత కోసం పాకిస్తాన్ ప్రయత్నిస్తుండగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఇస్లామాబాద్‌కు ఏప్రిల్ 24, 25వ తేదీలలో వెళ్ళి చర్చల పునరారంభానికి తమ షరతులేమిటో చెప్పి తిరిగిపోవటం, తమ ప్రతినిధుల ప్రయాణాన్ని ట్రంప్ అకస్మాత్తుగా రద్దు చేయటాన్ని బట్టి అర్థమవుతున్నది ఇదే. అరాగ్చీ ప్రతిపాదించిన షరతులేమిటో అధికారికంగా వెల్లడి కాలేదు గానీ, అవి గతానికన్నా భిన్నంగా ఉండే అవకాశం తక్కువ. అసలు విషయం అది కాదు. ఇరాన్‌కు సంబంధించి అమెరికా, ఇజ్రాయెల్‌ల లక్ష్యాలు మారటమన్నది మౌలిక ప్రశ్న. ఒకసారి అది తేలితే ఇచ్చి పుచ్చుకునే పద్ధతిలో రాజీలు కుదరటం సాధ్యమవుతుంది. మొదట్నుంచీ అదే వైఖరిఈ మాట అనటం ఎందుకంటే, ఇరాన్ పట్ల దౌత్యానికి బదులు దాదాగిరీ వైఖరిని తన మొదటి విడతలోనే (2017–21) ప్రదర్శించిన ట్రంప్, ఈ రెండవ విడతలోనూ అదే పని చేస్తున్నారు. ఇరాన్‌తో చర్చలు ఒక కొలిక్కి వస్తుండగానే ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్‌తో కలిసి దాడులు ఆరంభించటం మొదలుకొని, మొదటి విడత చర్చల వైఫల్యం మీదుగా ఈ రెండవ విడత చర్చల అనిశ్చితి వరకు తను చూపుతున్నది ఆసాంతం దాదాగిరీయే. తమ అసమానమైన ఆర్థిక, సైనిక శక్తులు మినహా ఆయన నోటి నుంచి మరొక మాట వినిపించదు. వాటిని ఉపయోగించి ఇరాన్ సహా ఎవరినైనా సర్వనాశనం చేయగలమంటారు. ఇందులో దౌత్య విధివిధానాలు ఆవగింజంతయినా కనిపిస్తున్నాయా?ట్రంప్‌లో దౌత్య నీతి లక్షణాలుంటే, యురేనియం శుద్ధి విషయమై ఇరాన్, అమెరికాల మధ్య (రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలతో కలిపి) 2015లో కుదిరిన ఒప్పందం సజావుగా సాగుతుండగా 2018లో దానిని అకస్మాత్తుగా రద్దు చేసేవారు కాదు. ఇరాన్‌పై యుద్ధానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ఎంత ఒత్తిడి చేసినా బుష్, ఒబామా, బైడెన్లు నిరాకరించిన స్థితిలో, తాను దాడులకు సిద్ధమయ్యేవారు కాదు. పరిష్కారం లభించవచ్చుననుకున్న ప్రతి దశలోనూ ఆ అవకాశాలను ఇజ్రాయెల్ భంగపరుస్తుండగా మౌనం వహించేవారు కాదు. వాస్తవానికి దాదాగిరీ లక్షణాన్ని ఆయన చూపుతున్నది ఇరాన్ విషయంలోనే కాదు. రెండవసారి అధ్యక్షుడు అయినప్పటి నుంచి పనామా కాలువ, కెనడా, గ్రీన్‌ల్యాండ్, వెనిజులా విషయమై చేసిందేమిటో తెలిసిందే. యుద్ధాలు ఆపే ప్రతిజ్ఞలు చేసిన మనిషి, 9 యుద్ధాలు ఆపానంటూ ఇప్పటికి కొత్తగా 8 సైనిక దాడులు సాగించారు. టారిఫ్‌లు, బలవంతపు వాణిజ్య ఒప్పందాల అరాచకం సరేసరి. ఇందులోనూ గమనించదగ్గ విశేషం ఒకటున్నది. తన పులి చారలు, కోరలను అనునిత్యం ప్రదర్శించి ప్రపంచాన్ని భయపెట్టజూసే ఆయనలో ‘కాగితం పులి’ లక్షణాలు కూడా ఉన్నాయి. అది, బలహీనుల ముందు విజృంభించి బలవంతుల ఎదుట తగ్గి ఉండటం. పనామా, వెనిజులా విషయంలో జరిగింది ఒకటైతే, తనను ధిక్కరించిన కెనడా, గ్రీన్‌ల్యాండ్ (యూరప్), బ్రెజిల్, దక్షిణాఫ్రికాల సంగతి వేరయ్యింది. ఉక్రెయిన్ యుద్ధంపై రష్యాను లొంగదీయలేక తానే రాజీకి ప్రయత్నిస్తున్నారు. చైనా మాట అయితే చెప్పనక్కరలేదు. ఇరాన్ ప్రతిఘటనలు మరొక దృష్టాంతం.పరిష్కారానికి రాజమార్గంకొంత లోతుకి వెళ్ళినట్లయితే, ట్రంప్ ద్వారా ప్రదర్శితమవుతున్న ఈ లక్షణాలన్నీ అమెరికా సామ్రాజ్యవాదం క్రమంగా బలహీనపడుతూ... దానికి స్లో–మోషన్ సంకేతాల వంటివి. అమెరికన్ నాయకత్వపు ‘నాటో’ కూటమిలోనే పెరుగుతున్న భిన్నాభిప్రాయాలు, కనీసం ఇరాన్ దిగ్బంధానికైనా ఏ ఒక్కరూ కలిసి రాకపోవటం, మరొక స్థాయిలో బహుళ ధ్రువ ప్రపంచ ఆకాంక్షలు విస్తరిస్తుండటం ఈ మార్పులను ప్రతిఫలిస్తున్నాయి. ఈ పలు విధాలైన పరిణామాల దశలో ఇరాన్ ఒక హీరోలా లేచి నిలుచున్నది. అందువల్ల అమెరికా అధ్యక్షుడు వాస్తవాలను కనీసం ఇప్పటికైనా గుర్తించి, ఇజ్రాయెల్ ప్రభావం నుంచి బయటపడి, దౌత్యమార్గం వైపు మళ్లటం మంచిదవుతుంది. తమ సార్వభౌమతను, హక్కులను కాపాడుకునేందుకు ఇరాన్ చూపుతున్న దృఢ సంకల్పం, ప్రతిఘటన సాధారణమైనవి కావు. మనం స్వయంగా చూసినంతవరకు వియత్నాం(1955–75), అఫ్గానిస్తాన్(2001–21) తర్వాత, 1953 నుంచి మొదలై నేటికీ సాగుతున్న ఇరాన్ పోరాటం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. యురేనియం శుద్ధి తదితర అంశాలపై చర్చలు సానుకూలంగా జరుగుతుండగానే అకస్మాత్తుగా దాడులు జరిపి ఇరాన్ రాజకీయ, సైనిక నాయకత్వాలను నిర్మూలించటం నుంచి మొదలు కొని, ఇరాన్ రేవులను దిగ్బంధించటం వరకు గల క్రమం అంతా చూపుతున్నది అమెరికా దౌత్య నీతినా లేక బస్తీ రౌడీ లక్షణాలనా? ఇరాన్ రెండవ విడత చర్చలకు నిరాకరించటమే సరైనదని భావించక తప్పదు. విదేశాంగ మంత్రి అరాగ్చీ ఇస్లామాబాద్‌లో 25వ తేదీన మరోమారు అన్నమాట: అమెరికాకు విశ్వసనీయత లేకుండా పోయిందనీ, అది కుదిరేవరకు తాము చర్చలకు వెళ్లబోమనీ, ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమనీ. ఆ తర్వాత ఒమాన్, రష్యా సందర్శనల వెనుక ఆయన తెహ్రాన్‌కు తిరిగి వెళ్ళి అన్ని పరిస్థితులను సమీక్షించుకున్నపుడు, వైఖరి అంటూ మార్చుకోవలసింది స్వదేశంలోనూ విశ్వసనీయతను కోల్పోతున్న డొనాల్డ్ ట్రంప్ మాత్రమే అని అర్థమవుతుంది. సమస్య పరిష్కారానికి రాజమార్గం ఎదుటనే ఉంది. అది అంతర్జాతీయ నిబంధనల మేరకు అణుశుద్ధికి ఇరాన్‌కు గల హక్కులకు అడ్డుచెప్పకపోవటం, పాలస్తీనా సృష్టిని అంగీకరించటం, గ్రేటర్ ఇజ్రాయెల్ పథకాన్ని రద్దు చేయటం!టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
నాస్ట్రడామస్ చెప్పిన అంతిమ యుద్ధం మొదలైందా?
-
యూఏఈకి ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ రక్షణ
అబుదాబి: పశ్చిమాసియా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ దాడుల నుంచి సురక్షితంగా ఉండేందుకు యూఏఈ చర్యలకు ఉపక్రమించింది. ఇజ్రాయెల్ అందించిన ‘ఐరన్ డోమ్’ను యూఏఈ మోహరించింది. ఇరాన్ నుంచి పెరుగుతున్న డ్రోన్, క్షిపణి ముప్పులను ఎదుర్కొనేందుకు ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.గత కొన్నేళ్లుగా ఇజ్రాయెల్, యూఏఈ సంబంధాలు మరింత బలపడుతున్నాయి. అబ్రహాం ఒప్పందాల తర్వాత రెండు దేశాలు రక్షణ రంగంలో సహకారం పెంచుకుంటూ వెళ్తున్నాయి. తాజాగా, యూఏఈలో ఐరన్ డోమ్ వ్యవస్థను అమలు చేయడం ద్వారా ఇరాన్ నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కోవడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంది. రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ 4–70 కిలోమీటర్ల పరిధిలోని రాకెట్లు, మోర్టార్లు, డ్రోన్లను అడ్డుకుంటుంది. మిర్ ఇంటర్‌సెప్టర్ అనే క్షిపణులు లక్ష్యాన్ని గాల్లోనే ధ్వంసం చేస్తాయి. ఎల్టా సిస్టమ్స్ రాడార్ ద్వారా వచ్చే ముప్పులను గుర్తించి, వెంటనే ప్రతిస్పందిస్తుంది. ఇజ్రాయెల్‌లో ఈ వ్యవస్థ 90శాతం విజయవంతమైనట్లు తెలుస్తోంది. ఇరాన్ గత కొన్నేళ్లుగా యూఏఈ, సౌదీ అరేబియా వంటి దేశాలపై డ్రోన్ దాడులు జరిపింది. 2025లో యూఏఈపై జరిగిన దాడుల్లో 2,200కి పైగా డ్రోన్లు ఉపయోగించింది. ఈ నేపథ్యంలో యూఏఈలో ఐరన్ డోమ్‌ను వినియోగంలోకి తెచ్చింది. యూఏఈ ఇప్పటికే అమెరికా నుంచి పాట్రియట్, థాడ్ రక్షణ వ్యవస్థలను పొందింది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ చేరడంతో యూఏఈ రక్షణ మరింత బలపడనుంది. అమెరికా,ఇజ్రాయెల్,యూఏఈ త్రైపాక్షిక సహకారం ఇరాన్‌పై వ్యూహాత్మక ఒత్తిడిని పెంచుతుంది. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్,యూఏఈ,అమెరికా బలమైన కూటమి ఏర్పడుతోంది. తాజా పరిణామంతో యూఏఈలోని చమురు, వాణిజ్య కేంద్రాలు ఇప్పుడు మరింత రక్షణగా ఉండనున్నాయి. ఇరాన్ దాడులు కొనసాగితే, ఐరన్ డోమ్ వ్యవస్థ యూఏఈ భద్రతకు కీలకంగా మారుతుంది. మొత్తం మీద, యూఏఈలో ఐరన్ డోమ్ అమలు కేవలం రక్షణ చర్య మాత్రమే కాదు .. ఇరాన్ ముప్పు పెరుగుతున్న ఈ సమయంలో, యూఏఈ భద్రతా వ్యూహంలో కీలక మలుపేనని నిపుణులు భావిస్తున్నారు. -
యుద్దం వేళ.. నెతన్యాహుకు షాక్ తప్పదా?
జెరూసలేం: పశ్చిమాసియాలో యుద్ధం వేళ ఇజ్రాయెల్ రాజకీయం మరో టర్న్ తీసుకుంది. యుద్ధాలు బిజీగా ఉన్న ప్రస్తుత ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుకు చెక్ పెట్టేందుకు ప్రత్యర్థులు చేతులు కలిపారు. రాబోయే ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎన్నికల్లో నెతన్యాహును ఓడించేందుకు కొత్త రాజకీయ పార్టీ ఏర్పటైంది. ఇజ్రాయెల్ మాజీ ప్రధానులు ఇద్దరు కలిసి నెతన్యాహును గద్దె దించే లక్ష్యంతో కొత్త రాజకీయ పార్టీని పెట్టారు. ఈ నేపథ్యంలో యుద్ధ వాతావరణంతో అట్టుడుకుతున్న ఇజ్రాయెల్‌కు ఎన్నికల హీట్ తోడైంది.ఇజ్రాయెల్‌లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం ఇజ్రాయెల్ మాజీ ప్రధానులు నఫ్తాలి బెన్నెట్, యైర్ లాపిడ్ కొత్త రాజకీయ పార్టీని పెట్టారు. ఈ కొత్త పార్టీకి 'టుగెదర్, లెడ్ బై బెన్నెట్' అని నామకరణం చేశారు. ఈ ఏడాది జరగబోయే ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ఒకే కూటమిగా పోటీ చేయనున్నాయి. ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహును గద్దె దించే లక్ష్యంతో తమ పార్టీలైన యెష్ అటిడ్ (యైర్ లాపిడ్), బెన్నెట్ 2026 (నఫ్తాలి బెన్నెట్)ను విలీనం చేశారు. అయితే, విచ్ఛిన్నమైన ప్రతిపక్షాన్ని ఏకం చేయడమే ఈ ఇద్దరు రాజకీయ నాయకుల కూటమి లక్ష్యం. కాగా, నెతన్యాహుకు నఫ్తాలి బెన్నెట్, యైర్ లాపిడ్ ప్రధాన రాజకీయ ప్రత్యర్థులు.Former Israeli PMs Bennett and Lapid formed a new 'TOGETHER' party to topple Netanyahu's government. Bennett and Lapid: "The State of Israel must change direction." pic.twitter.com/wpHuAedDTP— World Vibe (@world_vibe_en) April 27, 2026అయితే, కొత్త పార్టీ ప్రధానంగా జాతీయ భద్రత, సైనిక సేవా సంస్కరణలు, మరియు సామాజిక సమానత్వంపై దృష్టి పెట్టింది. ఈ పార్టీకి మద్దతు ప్రధానంగా మధ్యతరగతి, సెంటర్-రైట్ మరియు సెక్యులర్ వర్గాల నుండి వస్తోంది. తాజా సర్వేలు ప్రకారం, ఈ కూటమి నెతన్యాహు ఆధ్వర్యంలోని లికుడ్ పార్టీకి గట్టి సవాలు విసరగలదని సూచిస్తున్నాయి.రాజకీయ నేపథ్యం..ఇజ్రాయెల్‌లో అస్థిర రాజకీయ పరిస్థితులు కొనసాగుతున్నాయి. గత నాలుగేళ్లలో ఐదు సార్లు ఎన్నికలు జరిగాయి.నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ పార్టీ బలంగా ఉన్నప్పటికీ, మెజారిటీ సాధించలేకపోయింది.చిన్న పార్టీల మధ్య కూటమి విభేదాలు తరచూ ప్రభుత్వ పతనానికి దారితీస్తున్నాయి.ఈ నేపథ్యంలో బెన్నెట్–లాపిడ్ కొత్త పార్టీ, ప్రతిపక్షాన్ని ఒకే వేదికపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.2026 చివరిలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.ప్రభావంఈ కొత్త పార్టీ ఏర్పాటుతో ఇజ్రాయెల్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.ప్రతిపక్షం ఏకమైతే, నెతన్యాహు ఆధిపత్యానికి సవాలు ఏర్పడుతుంది.అయితే, ఇజ్రాయెల్ రాజకీయ చరిత్రలో కూటమి ప్రభుత్వాలు ఎక్కువకాలం నిలవలేకపోవడం ఒక పెద్ద సవాలుగా ఉంది.సవాళ్లు..అరబ్ పార్టీలతో కూటమి లేకపోవడం వల్ల కొత్త పార్టీకి క్లిష్టం కావచ్చు.గతంలో బెన్నెట్–లాపిడ్ ప్రభుత్వ అనుభవం (2021–22) తక్కువకాలం మాత్రమే నిలవడం ఓటర్లలో అనుమానం కలిగించవచ్చు. -
సడన్ ట్విస్ట్.. ఇరాన్లో యుద్ధం సీను మారింది?
టెహ్రాన్ : పశ్చిమాసియా యుద్ధం వేళ ఇరాన్లో వాతావరణం మారింది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో మంచుకురుస్తోంది. దశాబ్ధానికిపైగా కరువుతో అల్లాడుతున్న ఇరాన్లో క్రమంగా వాతావరణం మారుతోంది. ఖాళీగా ఉన్న జలాశయాలు, ఎండిపోయిన సరస్సుల్లో మళ్లీ జీవం కనిపిస్తోంది. అయితే వాతావరణం ఒక్కసారిగా మారడంపై ఓ ఆసక్తికర వాదన తెరపైకి వచ్చిందిసోషల్ మీడియాలో దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంతకీ ఇరాన్లో మార్పుల వెనుక అసలు సీక్రెట్ అదేనా. ఇరాన్లో కరువు పరిస్థితులు శతృదేశాల కుట్రే పూరితంగా సృష్టించినవేనాఅమెరికా ఇరాన్ యుద్ధం మొదలై యాబై రోజులు దాటిపోయింది. ఈ యుద్ధంలో ఇరాన్‌పై అమెరికా భారీ దాడులే చేసింది. క్షిపణులు, వైమానిక దాడులతో బీభత్సమే సృష్టించింది. దీని కోసం పెద్ద సంఖ్యలో ఆయుధ శక్తిని ఉపయోగించింది. ఇప్పటికే కరువుతో అల్లాడుతున్న ఇరాన్‌ను ఈ యుద్ధం మరింత కష్టాల్లోకి నెట్టింది. అయినా, ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అమెరికా,ఇజ్రాయెల్‌కు ఇరాన్ అదే స్థాయిలో బదులిస్తోంది.ఇలాంటి సమయంలో ఇరాన్ వాతావరణం మారిపోవడం అందరిని ఆశ్చర్య పరుస్తోంది. నిత్యం కరువుతో అల్లాడే ఇరాన్లో ఇప్పుడు భారీ స్థాయిలో వర్షాలు, మంచు కురుస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వాతావరణంలో ఏర్పడిన ఆకస్మిక మార్పుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఇక్కడే ఓ ఆసక్తికరమైన వాదన తెరపైకి వచ్చింది. దేశ వాతావరణాన్ని తారుమారు చేయడానికి వాడటానికి వినియోగించే రాడార్లను, ఇజ్రాయెల్ వాతావరణ యంత్రాలను ఇరాన్ ధ్వంసం చేయడం వల్లే ఈ వాతావరణ మార్పు సంభవించిందన్న వాదనపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నిజానికి దశాబ్ధానిపైగా ఇరాన్ కరువుతో అల్లాడుతోంది. ఖాళీగా ఉన్న జలాశయాలు, ఎండిపోయిన సరస్సులే అక్కడి నీటి సంక్షోభం గురించి చెప్పడానికి ఉదహారణలుగా నిలుస్తున్నాయి.ఈ క్రమంలో యాభైరోజుల యుద్ధం తర్వాత అక్కడి వాతావరణంలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి. భారీ వర్షాలు, మంచు, ఉష్ణోగ్రతలు తగ్గడంతో అక్కడ పచ్చదనం చిగురులు తొడుగుతోంది. ఆనకట్టలు వాటి పూర్తి సామర్ధ్యానికి వస్తున్న తరుణంలో ఇరాన్ మీడియా కుట్ర సిద్ధాంతాలతో హోరెత్తుతోంది. అమెరికా-ఇజ్రాయెల్ వాతావరణ ఇంజినీరింగ్ యంత్రాలను ఇరాన్ ధ్వంసం చేయడమే వాతావరణంలో ఆకస్మిక మార్పులకు కారణమన్నది వారి వాదన.ఈ యుద్ధంలో ఇరాన్ అమెరికాకు చెందిన అధునాతన రాడార్ వ్యవస్థలపై, ఇజ్రాయెల్ వాతావరణ యంత్రాలపైన దాడి చేసిన మాట నిజమే. అమెరికా, ఇజ్రాయెల్ ఉపయోగించే క్షిపణి వ్యవస్థలు కేవలం ముందస్తు అలెర్ట్ కోసమే కాకుండా మధ్యధరా సముద్రంలోని తేమను ఇరాన్ పొరుగు ప్రత్యర్ధుల వైపు మేఘాలను మళ్లించడానికి వీటిని ఉపయోగించారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి.నిజానికి వర్షపు నీరు దొంగతనం అనే చర్చ ఇరాన్లో ఎప్పటి నుంచో ఉంది. 2018 నుంచి ఈ వాదన పదే పదే తెరపైకి వస్తోంది. ఇజ్రాయెల్,అమెరికా, యూఏఈ జియో ఇంజినీరింగ్‌ను ఉపయోగించి వాతావరణ సరళిని తారు మారు చేస్తున్నాయనేది ఇరాన్ వాదన. ఇప్పుడు సోషల్ మీడియాలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. -
నెతన్యాహు భీకర ఆదేశాలు.. దాడులు షురూ
జెరూసలేం: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం పొడిగించిన కొద్ది రోజులకే ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య దాడులు మళ్లీ మొదలయ్యాయి. కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై భారీ దాడులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సరిహద్దుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.ఇజ్రాయెల్ సైన్యానికి నెతన్యాహు గ్రీన్ సిగ్నల్ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతం, అలాగే దక్షిణ లెబనాన్‌లోని తమ సైనిక స్థావరాలపై హిజ్బుల్లా రాకెట్లు, డ్రోన్లతో దాడులకు దిగడాన్ని ఇజ్రాయెల్ తీవ్రంగా పరిగణించింది. ఈ చర్యను బహిరంగ ఒప్పంద ఉల్లంఘనగా అభివర్ణిస్తూ, లెబనాన్‌లోని హిజ్బుల్లా లక్ష్యాలపై దాడులు చేయాలని శనివారం నెతన్యాహు ఇజ్రాయెల్ రక్షణ దళాలను (ఐడీఎఫ్) ఆదేశించారు. తమ భూభాగంపైకి వచ్చిన వైమానిక లక్ష్యాలను విజయవంతంగా అడ్డుకున్నామని సైన్యం ప్రకటించింది.లెబనాన్‌లో ఉద్రిక్తతఇజ్రాయెల్ తాజా దాడుల్లో దక్షిణ లెబనాన్‌లో ఆరుగురు మరణించినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నబతియే జిల్లాలోని యోహ్మోర్ అల్-షకీఫ్ గ్రామంలో జరిగిన రెండు వేర్వేరు దాడుల్లో ఒక ట్రక్కు, మోటార్ సైకిల్ ధ్వంసమై నలుగురు ప్రాణాలు కోల్పోగా, బింట్ జుబైల్ జిల్లాలోని సఫాద్ అల్-బత్తిఖ్ లో జరిగిన మరో దాడిలో ఇద్దరు మృతి చెందారు, 17 మంది గాయపడ్డారు. ఆయుధాలు తరలిస్తున్న సాయుధ వాహనాలను, హిజ్బుల్లా ఆపరేటివ్‌లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది.సందిగ్ధంలో శాంతిమంత్రంమరోవైపు, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగానే తాము దక్షిణ లెబనాన్‌లోని ఇజ్రాయెల్ ఆర్మీ వాహనంపై దాడి చేశామని, ఇది కేవలం ఆత్మరక్షణ చర్య మాత్రమేనని హిజ్బుల్లా సమర్థించుకుంటోంది. ఏప్రిల్ 17న ప్రారంభమై, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనతో ఇటీవల పొడిగించిన ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉద్దేశపూర్వకంగా విచ్ఛిన్నం చేస్తున్నారని ఇరుపక్షాలు ఒకరినొకరు నిందించుకుంటున్నాయి. తాజా హింసతో ఈ శాంతి ఒప్పందం ప్రశ్నార్థకంగా మారింది.ఇది కూడా చదవండి: భోపాల్ విషాద సాక్షి.. రఘు రాయ్ ఇకలేరు -
మూడు విశ్వాసాల కేంద్రం
ఇటీవలి ఇజ్రాయెల్–ఇరాన్ ఉద్రిక్తతల్లో కొంతకాలం నిర్బంధాలకు గురైన జెరూసలేం నగరంలోని ప్రార్థనా స్థలాలు, కాల్పుల విరామ సమయంలో మళ్లీ తెరుచుకున్నాయి. ‘వెయిలింగ్ వాల్’గా ప్రసిద్ధి చెందిన పశ్చిమ గోడ వద్ద యూదులు; అల్–అఖ్సా మసీదులో మహమ్మ దీయులు; పరిశుద్ధ సమాధి ఆలయంలో క్రైస్తవులు– ఇలా మూడు ముఖ్య మతాలవారూ ఒకేసారి ప్రార్థనలు చేస్తున్న ఈ చిన్న నగరం ఎందుకు ప్రపంచాన్ని ఇంతలా ఆకర్షిస్తోంది? యుద్ధ మేఘాల మధ్య కూడా ఆధ్యాత్మిక ఆకర్షణను ఎలా నిలబెట్టుకోగలుగుతోంది?క్రీ. పూ. 1000 ఏళ్ల ప్రాంతంలో పాత ఇశ్రాయేలును పాలించే యూదురాజు దావీదు ‘జెబూసులు’ అనే స్థానిక తెగల నుంచి జెరూసలేం నగరాన్ని జయించి, దానిని ఏకీకృత ఇశ్రాయేలు రాజ్య రాజధానిగా చేశాడు. అతని కుమారుడు సాలమన్ ఆ నగరంలో నేడు ‘టెంపుల్ మౌంట్’గా పిలుస్తున్న కొండపై మొట్ట మొదటి యూదు ఆలయం నిర్మించాడు. ఆ ఆలయాన్ని తరువాతి కాలంలో బాబిలోనియన్లు, ఆ తరువాత రోమన్లు ధ్వంసం చేశారు. మిగిలిన అవశేషమైన గోడను ఈ రోజు ‘ఏడ్పుల గోడ’గా పిలుస్తున్నారు. మూడు వేల సంవత్సరాల చరిత్ర గలిగిన ఆ కొండ, దానిపై ఒకప్పుడున్న ఆలయం గుర్తుగా మిగిలిన అవశేషం యూదులకు పరమ పవిత్రమైన ప్రార్థనా స్థలాలు.క్రైస్తవ మతానుయాయులకు, జెరూసలేం యేసుక్రీస్తు జీవితంతో ముడిపడి ఉంది. యేసు ఇక్కడే బోధించాడు, శిలువ వేయబడ్డాడు, పునరుత్థానం చెందాడు. నాలుగవ శతాబ్దంలో ‘పరిశుద్ధ సమాధి’ నిర్మాణంతో ఇది క్రైస్తవుల పుణ్యక్షేత్రంగా మారింది. ‘గోల్గతా’ లేదా ‘కల్వరి’గా పిలిచే శిలువ వేయబడిన స్థలం, క్రీస్తు సమాధి అయ్యి పునరుజ్జీవం పొందిన అనంతరం ఖాళీ అయిన సమాధి, శిక్షాస్థలి నుండి శిలువ వరకు క్రీస్తు నడిచి వెళ్ళిన ‘వేదన మార్గం’ (లేదా డోలోరోసా), సమాధికి వెళ్ళే మార్గంలో, క్రీస్తు అనుభూతులను జ్ఞప్తికి తెచ్చే 14 ముఖ్య ప్రాంతాలు– క్రైస్తవులకు పరమ పూజనీయాలు.ముస్లింలు అల్–ఖుద్స్గా పిలుచుకునే జెరూసలేం నగరం వారికి మక్కా, మదీనాల తరువాత అత్యంత పవిత్రమైన స్థలం. ఇస్లాం మొదటి రోజుల్లో జెరూసలేం వైపే ఖిబ్లా, అంటే ‘నమాజు చేసే దిక్కు’ ఉండేది; తరువాతి రోజుల్లో కారణాంతరాల వల్ల ఈ దిక్కు మక్కాలోని ‘కాబా’ వైపునకు మారింది. మహమ్మద్ ప్రవక్త ఒక రాత్రి మక్కా నుంచి జెరూసలేం వచ్చి; హరామ్ అల్ షరీఫ్ (అదే ప్రాంతాన్ని యూదులు ‘టెంపుల్ మౌంట్’గా పిలుస్తారు)లోని ‘పునాది శిల’ నుంచి స్వర్గారోహణ చేశాడని మహమ్మదీయులు విశ్వసిస్తారు. అదే శిలపై తరువాతి కాలంలో నిర్మించబడిన ‘రాతి గుమ్మటం’, దాని పరిసరాలలోని ‘అల్–అఖ్సా మసీదు’... ఇవన్నీ మహమ్మదీయులకు ఎనలేని ప్రాధాన్యం కలిగిన స్థలాలు. మహమ్మద్ ప్రవక్త స్వర్గారోహణ ప్రస్థానంలో అత్యంత కీలకమైన ఇస్రా, మిరాజ్‌లకు కూడా ఈ ప్రాంతం కేంద్ర బిందువు.ఒకే మూల పురుషుడుఆరాధనా స్థలాలలోనే కాదు, ఆవిర్భావంలో కూడా ఈ మూడు మతాలకు విశేషమైన సారూప్యత, సామీప్యత ఉన్నాయి. ‘ఒకే దైవం’ అనే సిద్ధాంతాన్ని విశ్వసించి, బోధించిన ప్రప్రథమ ప్రవక్త ‘అబ్రహమ్’ లేదా ‘ఇబ్రహీమ్’. ఆ ప్రవక్త కుమారుడైన ఇసాక్‌కు జాకబ్ జన్మించాడు. ‘ఇజ్రాయెల్’ అనే దైవదత్త నామాంతరం కలిగిన జాకబ్ నుండి యూదులు ఉద్భవించటంతో, వారి ప్రాంతం ‘ఇజ్రాయెల్’గా పేరొందింది. జన్మతః యూదు మతస్థుడైన క్రీస్తు మరణానంతరం... ఆయనను విశ్వసించే యూదు సమూహం వారి అసలు మతాన్నుండి విడివడటంతో క్రైస్తవులుగా వారిని పిలుస్తున్నారు. అబ్రహమ్ మరో కుమారుడైన ఇస్మాయిల్ నుండి ఇస్లాం ఆవిర్భవించిందని విశ్వసిస్తారు. ఇలా ఒకే మూల పురుషుడు గలిగిన మూడు మతాలవారు, ఒకే భౌగోళిక ప్రాంతంలో తమ తమ విశ్వాసాలకు అనుగుణంగా ప్రార్థనలు నిర్వహించడం అసాధారణం కాదు.ఒకే ప్రవక్త నుండి ఉద్భవించి, ఒకే చరిత్రను పంచుకోవడం వల్ల జెరూసలేం మూడు మతాలవారికీ ముఖ్య కేంద్రంగా ఖ్యాతికెక్కింది. చిత్రంగా, అదే చారిత్రక వాస్తవం శతాబ్దాలుగా సంఘర్షణలకు, ఉద్రిక్తతలకు – ఒక్కోసారి మానవ హననానికి కూడా కారణమవుతోంది. యుద్ధ విరామంలో ఈ పవిత్ర స్థలం తిరిగి అందరినీ అక్కున జేర్చుకోవడం సుస్థిరమైన శాంతిని స్థాపించే సుదీర్ఘ ప్రస్థానంలో చిన్న ఆశాకిరణం.కృష్ణబాలాజీ పల్లపోతువ్యాసకర్త ఎస్బీఐలో, పశ్చిమాసియా దేశాల్లో విధులు నిర్వహించిన విశ్రాంత ఉన్నతాధికారి -
రణభారం
యుద్ధం ఎక్కడ జరిగినా, ఎవరెవరి మధ్య జరిగినా, యుద్ధ ప్రభావం ప్రపంచమంతటా ఉంటుంది. జరిగే యుద్ధంతో ఎలాంటి సంబంధం లేని దేశాలు సైతం ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ప్రస్తుతం ఇరాన్‌కు, అమెరికా, ఇజ్రాయెల్‌లకు జరుగుతున్న యుద్ధ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో భారీ స్థాయిలో ప్రాణనష్టం జరిగింది. ఉభయ పక్షాల సైనికులు సహా దాదాపు పదివేల మంది ఇప్పటికే మరణించారచమురు కేంద్రాలు, విద్యుత్ కేంద్రాలు సహా భారీ ఆస్తినష్టం కూడా జరిగింది. అయినా, ఇది ఇప్పుడిప్పుడే ముగిసే సూచనలు కనిపించడం లేదు. యుద్ధంలో వినియోగిస్తున్న అధునాతన విధ్వంసక ఆయుధాలు విపరీతమైన ప్రాణనష్టాన్ని, ఆస్తినష్టాన్ని మాత్రమే కాదు, పర్యావరణానికి కూడా అంతులేని చేటు తెచ్చిపెడుతున్నాయి. ఈ యుద్ధం వల్ల తలెత్తే విపరిణామాల గురించి ఒక విహంగ వీక్షణం...భారత్‌కు భారీ ఆర్థిక నష్టంప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని అమెరికా–ఇరాన్ యుద్ధంతో భారత్‌కు ఎలాంటి సంబంధం లేదు. అయినా, ఈ యుద్ధం భారత్‌లో ఆర్థిక భూకంపాన్ని సృష్టించిందనే చెప్పుకోవచ్చు. యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు భారత స్టాక్ మార్కెట్లో మదుపరుల సొమ్ము ఏకంగా రూ. 41 లక్షల కోట్లకు పైగా ఆవిరైపోయింది. ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు రూ.89 వేల కోట్లకు పైగా పెట్టుబడులను వెనక్కు తీసుకున్నారు.డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 93.30 మేరకు పడిపోయింది. రూపాయి విలువను నిలకడగా ఉంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన నిల్వల నుంచి దాదాపు రూ.1.25 లక్షల కోట్లు ఖర్చు చేసింది. ఇక ముడి చమురు బ్యారెల్ ధర వంద డాలర్లకు పైబడటంతో భారత్ ప్రతినెలా దిగుమతి బిల్లు వేలాది కోట్ల రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. యుద్ధం కారణంగా ‘ఇంధన’ సెగ భారత్‌నూ తాకుతోంది. దీనివల్ల వంటగ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు గణనీయంగా పెరిగాయి. వీటి పర్యవసానంగా నిత్యావసరాల ధరలూ పెరిగి, సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి.భారత్‌పై యుద్ధ ప్రభావం⇒ డాలర్‌తో రూపాయి విలువ పతనం రూ. 93.30⇒ రిజర్వ్ బ్యాంకు నిల్వల నుంచి ఖర్చు రూ. 1.25 లక్షల కోట్లు⇒ స్టాక్ మార్కెట్ నష్టాలు రూ. 41.00 లక్షల కోట్లుఅమెరికా, ఇజ్రాయెల్‌ల సైనిక ఖర్చుయుద్ధం మొదలైన మొదటి ఆరు రోజుల్లోనే అమెరికా ఏకంగా రూ.1.01 లక్షల కోట్లు ఖర్చు చేసింది. యుద్ధం ప్రభావం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఇప్పటి వరకు పడిన భారం దాదాపు రూ.17.4 లక్షల కోట్లు ఉండవచ్చని ఆర్థిక నిపుణుల అంచనా. ఇరాన్‌పై దాడుల కోసం ఇజ్రాయెల్ వారానికి సగటున రూ. 27,000 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇజ్రాయెల్ ఇప్పటి వరకు రూ.1.56 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు అంచనా. యుద్ధం కోసం అమెరికా రోజువారీగా సగటున రూ. 7,500 కోట్లు, ఇజ్రాయెల్ రోజువారీగా సగటున రూ. 2,700 కోట్లు చొప్పున ఖర్చు చేస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి.ప్రపంచానికి ఆర్థిక విఘాతంప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధం ఫలితంగా యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్న దేశాలే కాకుండా, ఇతర దేశాలకు కూడా ఆర్థిక విఘాతం తప్పని పరిస్థితులు ఉన్నాయి. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనాల ప్రకారం యుద్ధం కారణంగా ఈ ఏడాది పలు దేశాల స్థూల జాతీయోత్పత్తికి (జీడీపీ) గణనీయమైన నష్టం వాటిల్లనుంది. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ ప్రకటించిన తాజా అంచనాల ప్రకారం యుద్ధం వల్ల ఇరాన్ జీడీపీకి అత్య«ధికంగా సుమారు 20%–25% మేరకు నష్టం వాటిల్లనుంది. ఇజ్రాయెల్ జీడీపీకి సుమారు 5%, అమెరికా జీడీపీకి 1.2% నష్టం కలగనుంది. యుద్ధంతో సంబంధం లేకున్నా, దీని ప్రభావం భారత్ జీడీపీని 1.1% మేరకు దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి.‘నాటో’ దేశాలు యుద్ధానికి దూరంగా ఉంటున్నా, చమురు ధరల భారం కారణంగా యూరోపియన్ యూనియన్, బ్రిటన్ సహా ‘నాటో’ దేశాల జీడీపీ 0.5% నుంచి 2% మేరకు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. యుద్ధ పరిస్థితుల వల్ల యూరోపియన్ యూనియన్ సహా ‘నాటో’ దేశాలు రక్షణ వ్యయాన్ని మరింతగా పెంచాల్సిన పరిస్థితులు అనివార్యం కానున్నాయి. రష్యాతో తెగతెంపులు చేసుకున్నాక యూరోపియన్ యూనియన్ దేశాలు చమురు కోసం గల్ఫ్ దేశాలపై ఆధారపడుతున్నాయి. హర్ముజ్ జలసంధి మూసివేత ఫలితంగా యూరోపియన్ యూనియన్ దేశాలలో ఇంధన ధరలు మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.యుద్ధం ఇలాగే మరిన్ని రోజులు కొనసాగేటట్లయితే, యుద్ధంతో ప్రత్యక్ష సంబంధంలేని దేశాలకు కూడా ఆర్థిక ఇబ్బందులు తప్పవు. యుద్ధం ఫలితంగా పలు దేశాలలో వృద్ధి గణనీయంగా తగ్గిపోవడమే కాకుండా, ధరల పెరుగుదల ఎక్కువై ‘స్టాగ్ఫ్లేషన్’ పరిస్థితి నెలకొనే అవకాశాలు ఉన్నాయని ప్రపంచబ్యాంకు సహా పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. ‘స్టాగ్ఫ్లేషన్’ పరిస్థితుల్లో ఉత్పాదకత, ఉపాధి కుంటుపడతాయి. ఫలితంగా చాలా దేశాల్లో సామాన్యులపై పెనుభారం పడే అవకాశాలు ఉన్నాయి.విధ్వంసకరమైన ఆయుధాలుఅమెరికా–ఇజ్రాయెల్ ఒకవైపు, ఇరాన్ మరోవైపు ఈ యుద్ధంలో విధ్వంసకరమైన ఆయుధాలతో తలపడుతున్నాయి. ఇప్పటి వరకు వినియోగించిన ఆయుధాలు అత్యంత ఖరీదైనవి, అధునాతనమైనవి. ఈ ఆయుధాలు ఎంత ఖరీదైనవో, ఇవి సృష్టించే విధ్వంసం వల్ల సంభవించే నష్టం అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఉభయ పక్షాలూ ఈ యుద్ధంలో ఉపయోగిస్తున్న ప్రధానమైన ఆయుధాల వివరాలుఎఫ్ 35 లైటెనింగ్–2 విమానంరాడార్లకు చిక్కకుండా లక్ష్యాలపై బాంబులను జారవిడవగల యుద్ధవిమానం ఇది. ఈ విమానాలను అమెరికా పదుల సంఖ్యలోనే ఇరాన్‌పై దాడుల కోసం రంగంలోకి దించింది. ఇరాన్ క్షిపణుల దెబ్బకు ఇప్పటి వరకు ఎఫ్35 లైటెనింగ్ విమానాలు రెండు నేలకూలాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి రూ.960 కోట్లు.లూకాస్ డ్రోన్లుశత్రు స్థావరాల మీద దాడుల కోసం రూపొందించిన డ్రోన్ ఇది. తక్కువ ఖరీదు చేసే ఈ డ్రోన్లను అమెరికా బలగాలు ఇరాన్‌పై దాడుల్లో ఇప్పటికే వందల సంఖ్యలో ప్రయోగించింది. వీటి ఖరీదు ఒక్కొక్కటి రూ.32 లక్షలు.టొమాహాక్ క్రూజ్ మిసైల్స్దాదాపు 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలిగిన క్షిపణి ఇది. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో అమెరికా బలగాలు దాదాపు 850 టొమాహాక్ క్షిపణులను ఉపయోగించింది. వీటి ఖరీదు ఒక్కొక్కటి రూ.23 కోట్లు.ఎస్ఎం3 ఇంటర్‌సెప్టర్ క్షిపణులుశత్రువుల క్షిపణులను మార్గమధ్యంలోనే ధ్వంసం చేయడానికి రూపొందించిన శక్తిమంతమైన ఆయుధం ఇది. ఇరాన్‌పై జరిగిన దాడుల్లో ఇప్పటి వరకు అమెరికా బలగాలు దాదాపు వంద వరకు ఈ క్షిపణులను ఉపయోగించాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి రూ. 116 కోట్లు.యారో–3ఇది శక్తిమంతమైన ఇంటర్‌సెప్టర్ క్షిపణి. శత్రు బలగాలు ప్రయోగించే క్షిపణులను 100 కిలోమీటర్ల ఎత్తులోనే నాశనం చేయగల సామర్థ్యం గల అధునాతన ఆయుధం ఇది. ఇరాన్‌పై జరుగుతున్న దాడుల్లో ఇజ్రాయెల్ బలగాలు ఇప్పటి వరకు దాదాపు 35 వరకు యారో–3 క్షిపణులను ఉపయోగించాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి సుమారు రూ.33 కోట్లు.ఐరన్ డోమ్ఇది కూడా ఇంటర్‌సెప్టర్ క్షిపణి. శత్రు బలగాలు ప్రయోగించే క్షిపణులను 70 కిలోమీటర్ల దూరంలోనే పడగొట్టగల సామర్థ్యం గల ఆయుధం ఇది. ఇరాన్‌పై దాడుల్లో ఇజ్రాయెల్ బలగాలు ఐరన్ డోమ్ క్షిపణులను ఇప్పటి వరకు వందల సంఖ్యలోనే ప్రయోగించినట్లు సమాచారం. వీటి ఖరీదు ఒక్కొక్కటి సుమారు రూ.42 లక్షలు.ఫతా–2ధ్వని వేగాన్ని మించిన వేగంతో దూసుకుపోయి, సుమారు 1500 కిలోమీటర్ల దూరంలోని శత్రు స్థావరాలను ధ్వంసం చేయగల శక్తిమంతమైన ఆయుధం. దీని ఖరీదు ఒక్కొక్కటి సుమారు రూ.93 లక్షలు.ఖైబర్ షెకాన్ఇది దాదాపు రెండువేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగల శక్తిమంతమైన ఆయుధం. అమెరికా బలగాలు ‘ఆపరేషన్ ఫ్యూరీ’ మొదలుపెట్టిన తర్వాత ఇరాన్ బలగాలు దాదాపు 180 వరకు ఖైబర్ షెకాన్ క్షిపణులను ప్రయోగించాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి సుమారు రూ.35 కోట్లు.షాహెద్–136 డ్రోన్లుశత్రు స్థావరాలపై దాడుల కోసం తక్కువ ఖరీదుతో రూపొందించిన డ్రోన్లు ఇవి. అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలపై ఇరాన్ బలగాలు ఇప్పటి వరకు దాదాపు రెండువేల వరకు ఈ డ్రోన్లను ఉపయోగించాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి రూ.27 లక్షలు.ప్రపంచ దేశాలకు ఇక్కట్లుఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం ఫలితంగా ప్రపంచ దేశాలకు అనేక ప్రతికూల ఫలితాలు తప్పవని అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు హెచ్చరిస్తున్నాయి. మరికొన్నాళ్లు ఇదే పరిస్థితి దొరికితే చాలా దేశాలు చమురు సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదు. ముడి చమురు ధరలు మరో ముప్పయి శాతం పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదని అంతర్జాతీయ నిపుణుల అంచనా. చమురు ధరల పెరుగుదల వల్ల నిత్యావసరాల ధరలు పెరిగి, సామాన్యులు గడ్డు పరిస్థితుల్లో పడే అవకాశాలు ఉన్నాయి.ద్రవ్యోల్బణం, మాంద్యం ఏకకాలంలో ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీసే అవకాశాలు కూడా ఉన్నాయని ఐఎంఎఫ్ వంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి. దీనివల్ల పలు దేశాల జీడీపీ వృద్ధి తిరోగమనం చెందవచ్చని కూడా చెబుతున్నాయి. ఈ యుద్ధం వల్ల ఇరాన్‌తో పాటు పశ్చిమాసియా దేశాలకు తీవ్ర నష్టం ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. పరస్పర దాడుల్లో ఇరాన్ సరిహద్దుల్లోని సౌదీ అరేబియా, యూఏఈ తదితర దేశాలలో భారీ నిర్మాణాలకు ముప్పుతో పాటు, తీవ్ర జననష్టం జరిగే ప్రమాదాలు ఉన్నాయి.చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి మూసివేత వల్ల అంతర్జాతీయ నౌకా వాణిజ్యానికి అవరోధాలు ఏర్పడి పశ్చిమాసియా దేశాలకు నిత్యావసరాల సరఫరా నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల పశ్చిమాసియాలో ఆహార సంక్షోభం ఏర్పడే పరిస్థితులు తలెత్తవచ్చు. పశ్చిమాసియాకు వెలుపల చమురు ఉత్పాదనలో కీలకమైన రష్యా తనతో సానుకూల సంబంధాలు కలిగిన దేశాల చమురు లోటు తీర్చడానికి ముందుకు వచ్చి, బలమైన కూటమిని ఏర్పాటు చేసుకునే సూచనలు ఉన్నాయి. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఇప్పుడే అంచనా వేయడం కష్టమే! -
హార్ముజ్ లో రణరంగం.. లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం
-
ఇజ్రాయెల్–హెజ్బొల్లా కాల్పుల విరమణ
వాషింగ్టన్: ఇజ్రాయెల్–హెజ్బొల్లా మధ్య కొనసాగుతున్న కాల్పుల విరమణను మరో మూడు వారాలపాటు పొడిగించేందుకు ఇజ్రాయెల్, లెబనాన్ అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురువారం ప్రకటించారు. అమెరికాలోని ఇజ్రాయెల్, లెబనాన్ రాయబారుల మధ్య వైట్‌హౌస్‌లో జరిగిన రెండో విడత చర్చల్లో ఈమేరకు ఒప్పందం కుదిరిందన్నారు. లెబనాన్‌కు హెజ్బొల్లా నుంచి అవసరమైన భద్రతను అమెరికా కల్పిస్తుందని ట్రంప్ భరోసా ఇచ్చారు. -
ఇజ్రాయెల్ దాడిలో మహిళా జర్నలిస్టు మృతి.. అంతర్జాతీయంగా ఉద్రిక్తత
-
ఇజ్రాయెల్ దాడిలో మహిళా జర్నలిస్టు మృతి
బీరూట్: లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో మహిళా జర్నలిస్టు అమల్ ఖలీల్ ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్–హెజ్బోల్లా యుద్ధ సంబంధ వార్తలను సేకరించేందుకు విధి నిర్వహణలో భాగంగా యుద్ధక్షేత్రంలో ఉన్న ఉన్నప్పుడు అమల్ ఖలీల్‌పై దాడి జరిగింది. ఈ దాడిలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఆమెతోపాటు వచ్చి యుద్ధం ఫొటోలు తీస్తున్న ఫ్రీలాన్స్ ఫొటోగ్రాఫర్ జినాబ్ ఫరాజ్ తీవ్రంగా గాయపడ్డారు. లెబనాన్‌లోని అల్–అఖ్బర్ వార్తాపత్రికలో పనిచేస్తున్న 43 ఏళ్ల ఖలీల్, ఫోటోగ్రాఫర్ ఫరాజ్ ఇద్దరూ ఒకే వాహనంలో ప్రయాణిండగా వీళ్ల సమీపంలోని మరో వాహనంపై దాడి జరిగింది. దీంతో ఆ వాహనంలోని ఇద్దరు ప్రాణాలుకోల్పోయారు. ఇది చూసి వీరిద్దరూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సమీప ఇంట్లోకి వెళ్లి దాక్కున్నారు. అయితే తర్వాత ఆ ఇంటి మీద సైతం వైమానిక దాడి జరిగింది. దీంతో ఇల్లు ధ్వంసమైంది. విషయం తెల్సి లెబనాన్ ఆర్మీ, పౌర రక్షణ బలగాలు, లెబనాన్ రెడ్ క్రాస్ సంస్థ సభ్యులు హుటాహుటిన ఆ ఇంటికి చేరుకున్నారు. ఆరుగంటల తర్వాత శిథిలాల నుంచి ఖలీల్ మృతదేహాన్ని బయటకుతీశారు. దక్షిణ లెబనాన్‌లోని అల్–తిరీ గ్రామంలో ఈ దాడి ఘటన చోటుచేసుకుంది. -
ఇరాన్లో కుమ్ములాట… మొజ్తాబా ఖమేనీని సైడ్ చేసేశారా?
టెహ్రాన్: ఇరాన్ అంతర్గత అంతర్యుద్ధంతో కొట్టుమిట్టాడుతోంది. ఇరాన్‌పై అమెరికా యుద్ధంలో నిర్ణయాలు తీసుకునే అంశంపై ఓ వైపు సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ.. ఆయన్ని కాదని ఐఆర్జీసీ (ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్) చాపకింద నీరులా ప్రభుత్వంపై పట్టు బిగించే ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ అంతర్గత పోరాటం కారణంగా పాకిస్థాన్‌లో జరగాల్సిన అమెరికా- ఇరాన్ కాల్పుల విరమణ చర్చలు విఫలమయ్యాయి. ఫలితంగా ‘ఆపరేషన్ సక్సెస్ - పేషెంట్ డెడ్’ అన్న చందంగా ఇరాన్ వ్యవహారం మారింది. ప్రస్తుతం ఈ పరిణామం ప్రపంచ దేశాల్లో హాట్‌టాపిక్‌గా మారి, అంతర్జాతీయ వేదికలపై తీవ్ర చర్చలకు దారితీస్తోంది. అమెరికా సైతం చర్చలు విఫలమవడానికి, ఆలస్యం అవ్వడానికి కారణం ఇదేనని స్పష్టంగా చెబుతోంది. ఇంతకీ ఇరాన్లో ఏం జరుగుతోంది. ఇరాన్-అమెరికా శాంతి ఒప్పంద చర్చలు మరింత ఆలస్యమవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ గైర్హాజరీ, ఆయన నిర్ణయాల్లో స్పష్టత లేకపోవడమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది.ఆరు వారాల క్రితం అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఆయన వారసుడిగా మొజ్తాబా ఖమేనీ ఎన్నికయ్యారు. అయితే ఇప్పటివరకు ప్రజలు ఆయనను ప్రత్యక్షంగా చూడలేదు, ఆయన గొంతు వినలేదు. పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్ కీలక నేతలను కోల్పోవడం వల్ల భయాందోళనలో ఉన్నారని సమాచారం.అమెరికా మీడియా నివేదికల ప్రకారం, మొజ్తాబా ప్రత్యక్ష నిర్ణయాల్లో పాల్గొనకపోవడం వల్ల ఇరాన్ నాయకత్వంలో విభేదాలు పెరిగాయి. అణు కార్యక్రమంపై చర్చల్లో ఇరాన్ ప్రతినిధులకు ఎంత అధికారం ఇవ్వాలో స్పష్టత లేకపోవడం చర్చలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం ఇరాన్ వద్ద 60 శాతం శుద్ధి చేసిన యురేనియం 440 కిలోల నిల్వ ఉంది. ఇది 90 శాతం ఆయుధ స్థాయి కంటే తక్కువ అయినప్పటికీ, ఎనిమిది నుంచి పన్నెండు అణు బాంబులు తయారు చేయగల సామర్థ్యం ఉంది. ఈ అంశమే చర్చల్లో ప్రధాన అడ్డంకిగా మారింది.ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్‌కి చెందిన అలీ వాయేజ్ ప్రకారం, మొజ్తాబా స్వయంగా చర్చలు జరిపే స్థితిలో లేరు. ఆయన కేవలం విస్తృత నిర్ణయాలకు ఆమోదం తెలుపుతున్నారని, చర్చల వ్యూహాల్లో ఆయన పాత్ర లేదని చెప్పారు. ఆయన గైర్హాజరీని ఇరాన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చూపిస్తోందని, ఇది అంతర్గత విమర్శల నుంచి రక్షణగా పనిచేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మొజ్తాబా ప్రత్యక్షంగా కనిపించకపోవడం ఇరాన్ పాలనకు సవాలుగా మారింది. ఆయన పేరుతో టీవీల్లో వార్తలు, సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. కొన్నిసార్లు ఏఐ ద్వారా రూపొందించిన వీడియోలతో సందేశాలు పంపడం ఆయన ఆరోగ్యంపై, ఆయన ఎక్కడున్నారనే అనుమానాలను మరింత పెంచుతోంది.ఫిబ్రవరి 28న అమెరికా-ఇరాన్ దాడుల్లో మొజ్తాబా గాయపడ్డారని సీఎన్ఎన్ నివేదిక తెలిపింది. మరోవైపు, రాయిటర్స్ ప్రకారం ఆయన ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ, యుద్ధం, అమెరికాతో చర్చల వంటి ప్రధాన అంశాలపై నిర్ణయాల్లో పాల్గొంటున్నారని సమాచారం.ఇరాన్ ప్రభుత్వంలో కుమ్ములాటఇరాన్లో ప్రస్తుతం పెద్ద రాజకీయ కుమ్ములాట జరుగుతోంది. ఐఆర్జీసీ (ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్) ప్రభుత్వంపై పట్టు బిగించింది. అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ నియామకాలను అడ్డుకోవడం, ముఖ్యంగా ఇంటెలిజెన్స్ మంత్రిని నియమించడాన్ని నిరోధించడం ద్వారా అధ్యక్షుడిని పూర్తిగా పక్కకు పెట్టిందన్న ఆరోపణలు సైతం ఉన్నాయి.మొజ్తాబా ఖమేనీ గైర్హాజరీ, ఆయన నిర్ణయాల్లో స్పష్టత లేకపోవడం వల్ల ఐఆర్జీసీ మరింత ఆధిపత్యం సాధించింది. ఆయన చుట్టూ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసి, ప్రభుత్వ అధికారులకు ఆయనను కలిసే అవకాశం లేకుండా చేసింది. దీంతో పశ్చిమాసియాలో సంక్షోభ సమయంలో తీసుకునే నిర్ణయాలు ఆలస్యమవుతున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నప్పటికీ, అది ఎప్పుడు జరుగుతుందో స్పష్టత లేదు. మొజ్తాబా ఖమేనీ గైర్హాజరీ, ఆయన నిర్ణయాల్లో స్పష్టత లేకపోవడం, ఐఆర్జీసీ ఆధిపత్యం పెరగడం వల్లే శాంతి చర్చలు నిలిచిపోయాయని విశ్లేషకులు చెబుతున్నారు -
చల్లారని పశ్చిమాసియా!
పశ్చిమాసియా మళ్లీ మొదటికొచ్చింది. అమెరికా–ఇరాన్‌ల మధ్య కుదిరిన రెండు వారాల అరకొర కాల్పుల విరమణకు ఆదినుంచీ అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. అది కాస్తా మంగళవారం అర్ధరాత్రి ముగియబోతుండగా, ఇరుపక్షాల మధ్యా పాకిస్తాన్లో జరగాల్సిన రెండో విడత చర్చలకు అమెరికా దుందుడుకు చర్యవల్ల గండిపడింది. అరేబియా సముద్రం వైపునుంచి హార్మూజ్ జలసంధిలో ప్రవేశించబోతున్న ఇరాన్ రవాణా నౌకపై సోమవారం వేకువజామున దాడిచేసి, ధ్వంసం చేసి చర్చల విషయంలో తనకు చిత్తశుద్ధి లేదని ఆ దేశం మరోసారి నిరూపించుకుంది. కనుక రెండో విడత చర్చలకు పోదల్చుకోలేదని ఇరాన్ ప్రకటించటంలో వింతేమీ లేదు. శత్రుత్వంతో రగిలిపోయే వైరిపక్షాలమధ్య ఏకాభిప్రాయ సాధన అంత సులభం కాదు. ఇరుపక్షాలూ నిజాయితీగా వ్యవహరిస్తే ఏదోమేరకు అపోహలు తొలగే అవకాశం ఉంటుంది. కానీ ఒప్పందం కుదిరిన మరుక్షణంనుంచీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పొంతనలేని ప్రకటనలు చేస్తూ ఇరాన్‌ను రెచ్చగొట్టారు. మరోపక్క ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాయకత్వంలో రెండో విడత చర్చల కోసం పాకిస్తాన్‌కు ప్రతినిధి బృందాన్ని పంపారు. విట్కాఫ్, తన అల్లుడు జేడీ కుష్నెర్లాంటి రియలెస్టేట్ ఏజెంట్లున్న ఈ ప్రతినిధి బృందానికి కాల్పుల విరమణ గురించి ఏం అవగాహన ఉంటుంది? అసలు హార్మూజ్ జలసంధిని ఇకపై తామే పర్యవేక్షిస్తామనీ, రాకపోకలకు ఎవరినీ అనుమతించబోమనీ గతవారం ట్రంప్ ప్రకటించినప్పుడే ఆ ఒప్పందం కాస్తా అర్థరహితంగా మారింది. ఇరాన్‌ను చుట్టుముట్టి దిగ్బంధిస్తే, దాని ఆర్థిక మూలాలను దెబ్బతీస్తే పాదాక్రాంత మవుతుందని ఇప్పటికీ ట్రంప్ కలలుగంటున్నారు. నష్టపోకతప్పని స్థితి ఏర్పడితే అది తనతో ఆగకుండా ప్రపంచం మొత్తానికి అంటుకునేలా ఇరాన్ ప్రత్యామ్నాయాన్ని సిద్ధపరిచే ఉంచింది. తాజా పరిణామాలతో సోమవారం ముడి చమురు ధర ఒక్కసారిగా 7 శాతం పెరిగి బ్యారెల్ చమురు 89 డాలర్లకు చేరుకోవటం జరగబోయేదేమిటో సూచిస్తోంది. గత నెల్లాళ్ల చమురు ధరలు గమనిస్తే ఇప్పటికీ ఆ ధరలు దాదాపు 10.4 శాతంమేర తక్కువగానే ఉన్నాయి. కానీ నిరుటితో పోల్చిచూస్తే 41.01 శాతం అధికం! అసలు గతవారం ట్రంప్ ప్రకటన తర్వాత ఇరాన్ సంయమనం పాటించకపోతే ఈపాటికే ఆ ప్రాంతం ఘర్షణలతో అట్టుడికేది. ఎక్కడో వేలమైళ్ల దూరంనుంచి వచ్చి, నావికా దళాలను మోహరించి దిగ్బంధిస్తామని హెచ్చరిస్తే ఏ దేశమైనా సహించగలదా? సమర్థవంతంగా వ్యవహరించగలిగితేనే మధ్యవర్తి పాత్ర పోషించాలని పాకిస్తాన్‌కు ఈ పరిణామాల తర్వాతైనా అర్థమైవుండాలి. మధ్యవర్తిత్వమంటే పోస్టుమాన్ పని కాదు. భిన్న వాదనల్ని వినిపిస్తున్న ఇరుపక్షాలూ వాస్తవ పరిస్థితులేమిటో గ్రహించేలా చేసి, తన తర్కంతో ఒప్పందానికి ఒప్పించే నేర్పుండాలి. వెనకుండి ప్రోత్సహించిన చైనా ఏం చెప్పిందోగానీ... తనకు హఠాత్తుగా దక్కిన ఈ నడమంత్రపు కీర్తితో పాకిస్తాన్ అన్నీ మరిచినట్టు కనిపిస్తోంది. తమ వద్ద యురేనియం ఉండాలో లేదో నిర్ణయించటానికి అమెరికా ఎవరన్న ఇరాన్ తాజా ప్రశ్నకు ట్రంప్ ఏం జవాబివ్వగలరు? అమెరికా దగ్గర దండిగా అణ్వాయుధా లున్నాయి. దశాబ్దాల క్రితమే తన మిత్రదేశం ఇజ్రాయెల్‌కు సైతం వాటిని చేరేసింది. అది అమెరికా అవలక్షణాలను పుణికిపుచ్చుకుని పశ్చిమాసియా దేశాలను బెదిరిస్తూ, అకారణంగా దాడులకు పాల్పడుతూ ఈ ప్రాంత శాంతికి విఘాతం కలిగిస్తోంది.ఇలాంటి స్థితిలో తన ఆత్మరక్షణకు ఇరాన్ సైతం అదే బాట పడితే ఆశ్చర్యమేముంది? జరుగుతున్న పరిణామాలు గమనిస్తే, కాల్పుల విరమణ పేరిట మాయచేసి ఇరాన్‌ను లొంగదీసుకోవాలన్నదే ట్రంప్ ఆంతర్యంగా కనబడుతోంది. ఇప్పటికిప్పుడు యుద్ధ విరమణ ప్రకటించినా అమెరికాలో ఇప్పటికే 3.3 శాతానికి చేరిన ద్రవ్యోల్బణం కనీసం మరో ఏడాది వరకూ దిగిరాదు. 38 సభ్యదేశాలున్న ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ(ఓఈసీడీ) పరిధిలో ద్రవ్యోల్బణం 4 శాతం దాటొచ్చన్న అంచనాలున్నాయి. కనుక ఇప్పటికైనా అమెరికా తన వైఖరి మార్చుకోవాలి. ఓటమిని అంగీకరించి గౌరవప్రదంగా తప్పుకోవడం తప్ప ప్రత్యామ్నాయం లేదని గ్రహించాలి. -
ఇరాన్ రాజకీయాల్లో కలకలం.. ఖమేనీ అంత్యక్రియలు ఎప్పుడు?
టెహ్రాన్: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించి నెలలు గడుస్తున్నా,ఆయన అంత్యక్రియలు ఇప్పటి వరకూ పూర్తి కాలేదు. దీనికి కారణం ఇరాన్ ప్రభుత్వంలో నెలకొన్న భయాలేనని అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి. ఖమేనీ అంత్యక్రియలను బహిరంగంగా నిర్వహిస్తే భారీ ఎత్తున జనసమూహం కారణంగా భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని సమాచారం.ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఖమేనీ మరణించారు. ఆ రోజు నుంచి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితులు కొంత సర్దుమణిగినట్లు కనిపిస్తున్నా అంత్యక్రియలు మాత్రం ఇంకా పూర్తి కాలేదు.మార్చి 4న మూడు రోజుల పాటు రాష్ట్ర అంత్యక్రియలు నిర్వహించేందుకు ఇరాన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. కానీ అమెరికా–ఇజ్రాయెల్ వరుస దాడుల కారణంగా ఆ ప్రణాళికను విరమించుకుంది. ఫలితంగా ఖమేనీ అంత్యక్రియలు ఇప్పటికీ జరగకపోవడం చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ ప్రభుత్వంలోని పలువురు ప్రముఖులు ప్రాణాలు కోల్పోవడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. ఖమేనీ మరణం తర్వాత ఆయన కుమారుడు మోజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టినా, ఇప్పటివరకు ప్రజల ముందుకు రాకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది.1989లో ఇస్లామిక్ విప్లవ నాయకుడు, తొలి సుప్రీం లీడర్ రుహుల్లా మోసావీ ఖమేనీ మరణించిన మరుసటి రోజే ఆయన అంత్యక్రియలు భారీ ఎత్తున జరిగాయి. లక్షలాది మంది ప్రజలు తేహ్రాన్ వీధుల్లోకి పోటెత్తారు. కానీ అలీ ఖమేనీ మరణం తర్వాత అలాంటి దృశ్యాలు కనిపించకపోవడం విశేషం.ఈ నేపథ్యంలో అమెరికాలోని ఇరాన్ విశ్లేషకుడు బెహ్నామ్ బెన్ తలెబ్లూ మాట్లాడుతూ.. ఇరాన్ ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించలేనంత బలహీనంగా ఉంది. ప్రజా వీధులు తమవని ఎప్పుడూ చెప్పుకుంటుంది. కానీ వాస్తవానికి ప్రజలు నిరసనలకు దిగుతారనే భయంతో 50 రోజుల పాటు ఇంటర్నెట్ను బ్లాక్ చేసింది” అని వ్యాఖ్యానించారు.అంత్యక్రియల ఆలస్యానికి కారణాలుగా వైమానిక దాడుల ముప్పు, జాతీయవాద నిరసనలు మళ్లీ చెలరేగే అవకాశం, అలాగే మోజ్తబా ఖమేనీ ఖననానికి ఆశించిన స్థాయిలో ప్రజల ముందుకు రాకపోవడం వంటి కారణాలుగా అంతర్జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకారం, ఖమేనీ స్వస్థలం మష్హాద్ నగరాన్ని అంత్యక్రియల స్థలంగా పరిశీలిస్తున్నారు. మష్హాద్‌లోని ఇమామ్ రెజా దర్గా షియా ముస్లింలకు పవిత్ర స్థలం. అక్కడే ఖమేనీని సమాధి చేయాలన్న ప్రతిపాదన ఉందని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. -
ఇజ్రాయెల్ పై ట్రంప్ ప్రశంసల వర్షం
-
యుద్ధం వేళ మిత్ర దేశాలకు ట్రంప్ ఝలక్..
వాష్టింగన్: ఇరాన్, అమెరికా యుద్ధం, ఉద్రిక్తత వేళ అధ్యక్షుడు ట్రంప్.. ఇజ్రాయెల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇజ్రాయెల్.. అమెరికాకు అత్యంత నమ్మకమైన, శక్తిమంతమైన మిత్రదేశమని కితాబు ఇచ్చారు. అమెరికాకు గొప్ప భాగస్వామి అంటూ వ్యాఖ్యానించారు. అయితే, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికాను అనవసర యుద్ధాల్లోకి లాగుతున్నారన్న విమర్శల మధ్య ట్రంప్ ఇలాంటి ప్రకటన చేయడం విశేషం.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదిక ట్రూత్ వేదికగా.. ఇజ్రాయెల్ ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా అమెరికాకు గొప్ప భాగస్వామి. అమెరికాకు ఇజ్రాయెల్ అత్యంత నమ్మకమైన, శక్తిమంతమైన మిత్రదేశం. ఇజ్రాయెల్ ప్రజలు ధైర్యవంతులు, తెలివైనవారు, సాహసవంతులు. ఇరాన్ యుద్ధం వంటి సంక్షోభం లేదా ఒత్తిడి సమయంలో ఇతర దేశాలు తమ అసలు స్వరూపాన్ని బయటపెడుతుంటే, ఇజ్రాయెల్ మాత్రం గట్టిగా నిలబడి పోరాటం చేస్తోంది. విజయం ఎలా సాధించాలో ఇజ్రాయెల్‌కు బాగా తెలుసు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అయితే, అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికాను అనవసర యుద్ధాల్లోకి లాగుతున్నారన్న విమర్శల మధ్య ఈ మద్దతు ప్రకటన వెలువడటం విశేషం.President Donald Trump strongly praised Israel, declaring:"Whether people like Israel or not, they have proven to be a GREAT Ally of the United States of America."A powerful reaffirmation of the enduring US-Israel strategic partnership.#Trump #Israel #USIsraelAlliance… pic.twitter.com/YXqqMcoo9j— News Narrative (@NewsNarrative1) April 19, 2026ఇదిలా ఉండగా.. మధ్య ప్రాచ్యంలో పరిస్థితులు రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఒకవైపు అమెరికా-ఇజ్రాయెల్ మైత్రి బలపడుతుండగా, మరోవైపు ఇరాన్ చర్యలు పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తున్నాయి. హార్మూజ్ జలసంధి మూసివేత వంటి నిర్ణయాలు అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన సరఫరాపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు పరిస్థితులను దగ్గరగా పరిశీలిస్తున్నాయి. -
ఇక చాలూ.. ఇజ్రాయెల్‌పై ట్రంప్ అసహనం
పశ్చిమాసియా ఉద్రిక్తతలు, శాశ్వత శాంతి స్థాపనకు ప్రయత్నాలు కొనసాగుతున్న వేళ.. మిత్రదేశం ఇజ్రాయెల్ తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా లెబనాన్‌పై దాడులు కొనసాగించడం సరికాదన్నారు. ఈ క్రమంలో దాడులు ఇకనైనా ఆపాలంటూ ట్రంప్ సూచించారు.‘‘లెబనాన్‌పై ఇజ్రాయెల్ ఇక దాడులు చేయడానికి వీల్లేదు. వాళ్లు దాడులు చేయకుండా అమెరికా నిషేధం విధించింది. ఇక చాలు..’’ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. అమెరికా మధ్యవర్తిత్వంతోనే లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. భారత కాలమానం ప్రకారం.. గురువారం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం తర్వాతే హర్ముజ్ జలసంధిని ఇరాన్ తెరిచేందుకు అంగీకరించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ రెండు వారాల యుద్ధ విరమణ.. శాంతి చర్చలకు ఇరాన్-అమెరికాలు ముందుకు వచ్చాయి. అయితే లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగడంతో ఇరాన్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆ దాడులు ఆగకుంటే శాంతి చర్చలు ముందుకు సాగవని చెబుతూ వచ్చింది. ఇజ్రాయెల్ ఏమో.. లెబనాన్ గడ్డపై ఆశ్రయం పొందుతున్న హెజ్బొల్లా గ్రూపులతో తమ దేశానికి ముప్పు ఉందని చెబుతూ దాడులు కొనసాగించింది. దీంతో లెబన్నాన్-ఇజ్రాయెల్ మధ్య చర్చల కోసం అమెరికా రంగంలోకి దిగాల్సి వచ్చింది.ట్రంప్ తాజా హెచ్చరికలపై ఇజ్రాయెల్ ఇంకా స్పందించలేదు. కానీ, ఈ వార్నింగ్ కంటే ముందే ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ అంశంపై పరోక్షంగా స్పందించారు. దక్షిణ లెబనాన్‌లో తమ సైన్యం మోహరింపు కొనసాగుతుందని ప్రకటించారు. ‘‘రాకెట్ దాడులు, డ్రోన్ల ముప్పు ఇంకా ఇజ్రాయెల్ తొలగిపోలేదు. అందుకే మేం చేయాలనుకున్నది చేస్తాం. అదేంటో ఇప్పుడు నేను మీ ముందు చెప్పలేను’’ అని మీడియా ముందు నెతన్యాహు ప్రకటించారు.ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ బలగాల దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చెలరేగాయి. 38 రోజుల తర్వాత ఇరు దేశాలకు శాంతి చర్చలకు అంగీకరించాయి. అయితే లెబనాన్ కూడా ఈ కాల్పుల విరమణలో భాగమని ఇరాన్ చెబుతుండగా.. అదసలు వేరే అంశమని ట్రంప్ చెబుతూ వస్తున్నారు. ఎల్లుండి ఇస్లామాబాద్ వేదికగా రెండో దఫా చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఏప్రిల్ 22వ తేదీతో ఇరాన్ అమెరికా మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగియనుంది. -
ఇరాన్ యురేనియం మా చేతికి
వాషింగ్టన్/దుబాయ్/బీరూట్/ఇస్లామా బాద్: భీకర దాడుల దెబ్బకు ఇరాన్ తమ డిమాండ్లకు తల ఊపుతోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఒక కీలక పోస్ట్ పెట్టారు. ‘‘ఇరాన్ భూగర్భ అణు కేంద్రాల్లోని దాచిపెట్టిన అత్యంత శుద్ధమైన 450 కేజీల యురేనియం నిల్వలపై అమెరికా బీ2 బాంబర్లు భారీ బాంబును పడేసి సర్వనాశనం చేశాయి. దీంతో యురేనియం రేణువులుగా మట్టిలో కలిసిపోయింది. ఆ అణుమట్టి మా చేతికి రాబోతోంది. ఈ మట్టిని అప్పగించేందుకు ఇరాన్ ఒప్పుకుంది. ఇందుకోసం ఎలాంటి నగదు చేతులు మారబోదు’’అని అన్నారు. శుద్ధ యురేనియం అప్పగింతపై మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతర్, పాకిస్తాన్‌గానీ ఇటు ఇరాన్‌గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు మరోదఫా చర్చలకు పాకిస్తాన్ రంగం సిద్ధంచేస్తోంది. ఇస్లామాబాద్ వేదికగా గత వారం జరిగిన చర్చలు విఫలమవడంతో ఈసారి వినూత్న ప్రతిపాదనలతో ముందుకెళ్లి ఎలాగైనా రెండో దఫా చర్చలను విజయవంతంచేయాలని పాక్ కృతనిశ్చయంతో ఉంది. ఇందుకోసం పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ ఖతర్, సౌదీ అరేబియాల అగ్రనేతలతో చర్చలు ముగించుకుని గురువారమే టెహ్రాన్‌కు చేరుకుని ఇరాన్ అగ్రనాయకత్వంతో విస్తృతంగా చర్చించారు. ఆదివారం లేదా వచ్చే వారం పాక్‌లోని ఇస్లామాబాద్ లేదా రావల్పిండిలో అమెరికా–ఇరాన్ చర్చలు జరిగే ఆస్కారముంది. కాల్పులవిరమణ ఒప్పందం గడువు ఏప్రిల్ 22వ తేదీన ముగిసేలోపే శాశ్వత శాంతి ఒప్పందం ఖరారుచేయాలని మధ్యవర్తిత్వ దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. చర్చలు సఫలమైతే శాంతి ఒప్పందంపై సంతకాల కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇస్లామాబాద్‌కు వెళ్తానని ట్రంప్ ప్రకటించారు. చర్చలు సానుకూలంగా సాగుతుంటే, తప్పదనుకుంటే కాల్పుల విరమణ గడువును పొడిగిస్తానని ట్రంప్ చెప్పారు. నేరుగా చర్చలొద్దు: హెజ్భొల్లా ఇజ్రాయెల్‌తో నేరుగా ప్రత్యక్ష చర్చలకు దిగకూడదని లెబనాన్ ప్రభుత్వాన్ని హెజ్భొల్లా సాయుధులు హెచ్చరించారు. ‘‘నేరుగా ప్రత్యక్ష చర్చలకు దిగితే దక్షిణ లెబనాన్ సరిహద్దు ఆక్రమిత ప్రాంతాల్లో శాశ్వతంగా తిష్టవేసేందుకు ఇజ్రాయెల్ కుట్ర పన్నుతుంది. అలా జరక్కుండా చూడాల్సిన బాధ్యత మీదే. అసలే మీది అసమర్థ ప్రభుత్వం. అనాలోచితంగా మీరు తీసుకునే నిర్ణయాలు లెబనాన్ భవిష్యత్తును అంధకారంలోకి నెడతాయి’’అని హెజ్భొల్లా పార్లమెంటరీ విభాగ నాయకుడు హసన్ ఫదలల్లాహ్ హెచ్చరించారు. దక్షిణ లెబనాన్‌పై దాడిచేస్తే మేం చూస్తూ ఊరుకోబోమని హెజ్భొల్లా పునరుద్ఘాటించింది. మరోవైపు లెబనాన్– ఇజ్రాయెల్ కాల్పుల విరమణపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ శుక్రవారం ఆనందం వ్యక్తంచేశారు. ‘‘ట్రంప్ ముక్కుసూటి, దౌత్యనీతితో ఈ కాల్పుల విరమణను సుసాధ్యంచేశారు’’అని షెహబాజ్ పొగిడారు. ఒప్పందానికి తూట్లు! ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య కుదిరిన పదిరోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి శుక్రవారం ఇజ్రాయెల్ తూట్లు పొడిచింది. బిన్ట్ జబేయిల్ జిల్లాలోని కౌనిన్ గ్రామంలో ఇజ్రాయెల్ డ్రోన్ దాడిచేసింది.ఈ ఘటనలో ఒక సిరియన్ మూలాలున్న వ్యక్తి చనిపోయారు. ముగ్గురు గాయపడ్డారు. దాడిలో కారు, బైక్ ధ్వంసమయ్యాయి. దక్షిణ లెబనాన్‌పై పలు చోట్ల మోర్టార్ దాడులు జరిగాయని లెబనాన్ ఆర్మీ, అమెరికా శాంతిదళ సభ్యులు శుక్రవారం తెలిపారు. దాడులపై ఇజ్రాయెల్ స్పందించలేదు. కానీ కాల్పులవిరమణ వేళ కవి్వంపు చర్యలకు దిగినా తాము దీటుగా దాడులతో సమాధానం చెప్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. మరోవైపు రాకెట్లు, క్షిపణులతో ఉన్న సాయుధ హెజ్భొల్లాను పూర్తిగా నిర్వీర్యంచేస్తేగానీ తమ లక్ష్యం నెరవేరదని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ శుక్రవారం వ్యాఖ్యానించారు. దక్షిణ లెబనాన్‌లోకి చొచ్చుకొచ్చామని, వెనుతిరిగే ప్రసక్తే లేదని తెలిపారు. బలగాల ఉపసంహరణ ఉండబోదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ స్పష్టంచేశారు. కాగా లెబనాన్‌పై ఇప్పటికే అతిగా దాడులుచేశారని, ఇక ఆపేయాలని ఇజ్రాయెల్‌కు ట్రంప్ శుక్రవారం సూచించారు. తిరిగొస్తున్న స్థానికులు.. లెబనాన్‌లో పదిరోజులపాటే కాల్పులమోత ఆగుతుందని తెల్సి కూడా గతంలో వలసపోయిన వేలాది మంది స్థానికులు తిరిగి తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. లిటానీ నది మీదుగా ఖాస్మియే వంతెన మీదుగా దక్షిణ లెబనాన్‌కు వేలాది మంది జనం కార్లు, వాహనాల్లో బయల్దేరడంతో ఆ మార్గంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. పరుపులు, సూట్‌కేసులు, నిత్యావసర వస్తువులతో వాహనాలు నిండిపోయాయి. మరోవైపు ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటిదాకా 2,294 మంది చనిపోయారని లెబనాన్ ప్రకటించింది. -
ఉత్తర ఇజ్రాయెలపై హెజ్బొల్లా రాకెట్, డ్రోన్ దాడులు
-
ఇజ్రాయెల్, లెబనాన్ కాల్పుల విరమణ
కైరో/వాషింగ్టన్/దుబాయ్/ఇస్లామాబాద్: దశాబ్దాలుగా శత్రుత్వంతో రగిలిపోయిన ఇజ్రాయెల్, లెబనాన్ల మధ్య ఎట్టకేలకు శాంతి పవనాలు వీచాయి. పదిరోజులపాటు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఇరుదేశాల మధ్య అమల్లోకి రానుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ప్రకటించారు. భారతకాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకిరానుంది. దశాబ్దాల తర్వాత తొలిసారిగా అమెరికా వేదికగా ఇజ్రాయెల్, లెబనాన్ జరిపిన చర్చలు ఫలించాయని ట్రంప్ తన సొంత సామాజికమధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ప్రకటించారు. ‘‘లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్‌తో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో ఇప్పుడు చక్కటి సంభాషణ పూర్తయింది. ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణకు ఇద్దరూ అంగీకరించారు. 34 ఏళ్ల తర్వాత వాషింగ్టన్ వేదికగా ఇరుదేశాల ప్రతినిధులు భేటీ అయ్యారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ డేన్ రెజీన్ కెయిన్‌లు ఇరుదేశాల నేతలను సమన్వయ పరుస్తూ శాశ్వత శాంతికి కృషిచేస్తారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 9 యుద్దాలను ఆపే అదృష్టం నాకు దక్కింది. ఇది పదోది. తదుపరి చర్చల కోసం శ్వేతసౌధానికి రావాలని ఔన్, నెతన్యాహూలను ఆహ్వానించా’’అని ట్రంప్ ప్రకటించారు. ఆగని కాల్పులు! ఓవైపు కాల్పులు మరికొన్ని గంటల్లో ఆగిపోతాయని ట్రంప్ చెబుతుంటే మరోవైపు లెబనాన్‌లోని హెజ్బొల్లా, ఇజ్రాయెల్ బలగాలు పరస్పర కాల్పుల్లో బిజీగా మారాయి. గురువారం సైతం ఇరువైపులా కాల్పులు, బాంబుల మోత మోగింది. ఉత్తర ఇజ్రాయెల్ సరిహద్దులోని ప్రాంతాలపై హెజ్»ొల్లా రాకెట్లు, డ్రోన్లతో దాడిచేసింది. లెబనాన్‌లోని బీరూట్ సహా టైర్, నబాతేహ్, బిన్ట్ జబేయిల్‌లపై ఇజ్రాయెల్ దాడులను ఉధృతంచేసింది. ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య తొలి దఫా శాంతి చర్చలు విఫలంకావడంతో మరో దఫా చర్చలకు పాకిస్తాన్ ప్రయత్నాలు ముమ్మరంచేసింది. పాక్ సాయుధబలగాల చీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ గురువారం ఇరాన్‌లోని టెహ్రాన్‌కు చేరుకుని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబఫ్తో చర్చలు జరిపారు. ఈయన వెంట పాక్ అంతర్గత మంత్రి మొహ్సీన్ నఖ్వీ సైతం చర్చల్లో పాల్గొన్నారు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కారŠప్స్(ఐఆర్జీసీ) ప్రధానకార్యాలయం ‘ఖాతమ్ అల్–అన్బియా’ను మునీర్ బృందం వెళ్లి ఆర్మీ కమాండర్లతో కాల్పుల విరమణపై చర్చించారు. తర్వాత మునీర్ నేరుగా అమెరికా వెళ్లి ట్రంప్‌తో చర్చిస్తారని వార్తలొచ్చాయి. మరోవైపు ఖతర్ ద్వారా మధ్యవర్తిత్వాన్ని మరింత ఉధృతంగా కొనసాగించేందుకు పాక్ ప్రయతి్నస్తోంది. ఇందుకోస పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ గురువారం ఖతర్‌కు వచ్చారు. 10వేల సైన్యంతో దిగ్బంధం 10వేల మంది నావికులు, మెరైన్లు, యుద్దవిమాన పైలట్లు, యుద్ద విమానాలు, నిఘా నౌకలు, హెలికాప్టర్లను హార్మూజ్ దిగ్బంధం కోసం అమెరికా రంగంలోకి దింపింది. ‘‘వేల సైన్యం, ఆయుధాలు, నౌకలు, హెలికాప్టర్లను మొహరించాం. ఏ ఒక్క విదేశీ సరకు రవాణా నౌక హారూŠమ్జ్ను దాటడానికి వీల్లేదు. మా బెదిరింపులకు భయపడి ఇప్పటికే 15 నౌకలు వెనక్కి వెళ్లిపోయాయి’’అని అమెరికా జాయింట్ చీఫ్స్ చైర్మన్ జనరల్ డేన్ కెయిన్ ప్రకటించారు. హార్మూజ్ జలసంధి సహా తమ నౌకాశ్రయాల దిగ్బంధాన్ని అమెరికా ఎత్తేయకపోతే గల్ఫ్ దేశాలతో వాణిజ్యాన్ని ఆపేస్తామని ఇరాన్ నూతన సుప్రీంనేత మొజ్తాబా ఖమేనీ సైనిక సలహాదారు అలీ అబ్దుల్లాహీ హెచ్చరించారు. అయితే కాల్పుల విరమణను మరికొన్ని రోజులు పొడిగించాలని అమెరికా, ఇరాన్ సూత్రపాయ ఒప్పందానికి వచ్చాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. -
నాటో కూటమి కథ కంచికేనా?
ఇరాన్ యుద్ధం ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైనిక కూటమి ‘నాటో’లో అంతర్యుద్ధానికి కారణమవటం ప్రపంచ జియో పొలిటికల్ చదరంగాన్ని మరింత సంక్లిష్టం చేస్తున్నది. తమ దేశాల నౌకా బలగాలను హార్మూజ్ జలసంధి వద్ద మోహరింప చేయాలన్న యూఎస్ అధ్య క్షుడి విజ్ఞప్తిని నాటో దేశాలు తిరస్కరించాయి. తమ దేశాలలోని సైనిక స్థావరా లను వినియోగించటానికి అంగీకరించ లేదు. ఈ యుద్ధం మా (నాటో) యుద్ధం కాదని తేల్చి చెప్పాయి. అమెరికా అధ్యక్షుడు నాటో కూటమిని ‘కాగితపు పులి’గా అభి వర్ణిస్తూ యూఎస్ఏ దాన్నుండి వైదొలుగుతుందని బెదిరించాడు. ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ని (ఇరాన్ యుద్ధాన్ని) సమర్థించని, యూఎస్ఏకు సహాయపడని మిత్ర దేశాలను యూఎస్ఏ రక్షించ బోదని ఆ దేశ రక్షణ మంత్రి పీటర్ హెగ్సెత్ హెచ్చరించాడు. ఐరో పాను రక్షించటానికి మాత్రమే నాటో కూటమి ఏర్పడలేదనీ, యూఎస్ ఏను సమర్థించటం కూడా నాటో ప్రధాన విధి అనీ యూఎస్ఏ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో అభిప్రాయ పడ్డాడు.ప్రపంచాన్ని శాసించిన శక్తిరెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత 1949లో పన్నెండు దేశాలతో ఆవిర్భవించిన నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) కూటమి ఇటీవల స్వీడన్ చేరికతో 32 దేశాలకు విస్తరించింది. సోవియట్ రష్యాను అడ్డుకోవటానికి యూఎస్ఏ నాయ కత్వంలో ఏర్పడిన ఈ సైనిక–రాజకీయ కూటమి గత 75 ఏళ్లలో ప్రపంచ రాజకీయాలను శాసించిందనటంలో సందేహం లేదు. ఈ 32 సభ్య దేశాలలో ఏ ఒక్క దేశం మీద దాడి జరిగినా దానిని మొత్తం కూటమి మీద దాడిగా పరిగణిస్తుంది. 32 సభ్య దేశాలే కాకుండా, 40 ఇతర దేశాలతో కూడా ఈ కూటమి సైనిక, వ్యూహాత్మక ఒప్పందాలను చేసుకున్నది. సోవియట్ రష్యాను నిలువరించటానికి స్థాపించబడిన ‘నాటో కూటమి’ని సోవియట్ విచ్ఛిన్నం తరువాత కొనసాగించాల్సిన ఆవశ్యకత లేదు. రష్యా బలహీనంగా ఉండటాన్ని ఆసరాగా చేసు కొని ఈ కూటమి సోవియట్ ప్రాబల్య ప్రాంతాలలోనికి విస్తరించింది. ఇదే ఉక్రెయిన్ యుద్ధానికి దారి తీసింది. నాటో సభ్య దేశాలలో యూఎస్ఏ నాయకత్వంలో సైనిక స్థావరాలను ఏర్పాటు చేశారు. ఈ స్థావరాలలో అత్యాధునిక యుద్ధ విమానాలు, శత్రు క్షిపణులను ఎదుర్కొనే మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను, అమెరికన్ సైనికులను మోహరించి ఆ యా దేశాలకు యూఎస్ఏ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసింది. సైనిక, గూఢచర్య సమాచారాన్ని, సైబర్ సమాచారాన్ని పంచుకోవటమే కాకుండా మిలిటరీ డ్రిల్స్ నిర్వహిస్తూ ఈ దేశాలపై సోవియట్ యూనియన్ (రష్యా), ఇతర శత్రు దేశాలు కన్నెత్తి చూడకుండా కాపాడుతున్నది.యూఎస్ఏ నీడన ఐరోపా1990వ దశకం నుండి క్రమంగా నాటో దేశాలలో అలసత్వం ప్రవేశించింది. తమ దేశాల సైనిక, రక్షణ బాధ్యతను పూర్తిగా యూఎస్ఏ పైన తోసివేశాయి. తమ రక్షణ ఖర్చులను తగ్గించి, పూర్తిగా సంక్షేమం, అభివృద్ధిపైన దృష్టి పెట్టాయి. జర్మనీ, ఫ్రాన్స్, యూకే, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాలకు రష్యా ముప్పుగా కనప డటం ఆగిపోయింది. నాటో కూటమి ఒప్పందం ప్రకారం ప్రతి సభ్య దేశం తన జీడీపీలో కనీసం 2 శాతం రక్షణ రంగంపై ఖర్చు చేయా లనే నిబంధనను ఖాతరు చేయలేదు. మొత్తం రక్షణ వ్యయంలో 65 శాతం యూఎస్ఏ భరిస్తోంది. ఇదే సమయంలో ఈ ఐరోపా దేశాలు తమ తయారీ రంగాన్ని దాదాపుగా చైనాకు అవుట్సోర్సింగ్ చేశాయి. మానవ వనరుల కొరతను ఎదుర్కోవటానికి సిరియా, జోర్డాన్, లెబనాన్, ఈజిప్టు, మొరాకో, అల్జీరియా వంటి దేశాల నుండి చౌక శ్రామికుల వలసలను ప్రోత్సహించాయి. ఇంధన అవసరాలకు రష్యా నుండి చౌకగా వచ్చే గ్యాస్ దిగుమతులపై ఆధారపడ్డాయి. స్థూలంగా పరిశీలిస్తే జర్మనీ, ఫ్రాన్స్, యూకే, ఇటలీ, స్పెయిన్ మొదలగు ఐరోపా దేశాలు గత నాలుగు దశాబ్దా లలో బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎగుమతి–దిగుమతి వ్యాపారం, విలాస వస్తువుల తయారీ వంటి రంగాల ఆధారంగా ఆర్థిక వ్యవస్థను నిర్మించుకున్నాయి. తక్కువ ఖర్చుతో ఉన్నత జీవన ప్రమాణాలను అను భవిస్తున్నాయి.ట్రంప్ 2025లో అధికారంలోకి రాగానే ‘అమెరికా ఫస్ట్’ నినా దాన్ని అందుకొన్నాడు. నాటో రక్షణ వ్యయంలో కూటమి దేశాలు తమ వంతు వాటాను భరించాల్సిందేనని మెలిక పెట్టాడు. ఐరోపా దేశాల రక్షణ బాధ్యతను మోస్తున్నందుకు ప్రతిఫలంగా ఇరాన్ యుద్ధంలో మద్దతు ఇవ్వాలని పట్టుబడుతున్నాడు. అమెరికా కోణంలో ఆలోచిస్తే ఈ వాదన సహేతుకంగానే కనిపిస్తుంది. ఇరాన్ యుద్ధం తమ యుద్ధం కాదనేది యూకే, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ వంటి దేశాల వాదన. ఇదే కోణంలో ఆలోచిస్తే ఉక్రెయిన్ యుద్ధం కూడా యూఎస్ఏ యుద్ధం కాదు. ఉక్రెయిన్ నాటో సభ్య దేశం కూడా కాదు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాను ఎదుర్కొంటున్నది యూఎస్ఏ సైనిక సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞానం, యూఎస్ఏ ఆర్థిక సహాయమనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.మాటలతో మారిన తీరు2003 ఇరాక్ యుద్ధంలో కూడా నాటో దేశాలు పాల్గొనటం విషయంలో ఇదేరకమైన భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. అయిన ప్పటికీ యూకే, స్పెయిన్, ఇటలీ, పోలండ్ తమ సైనికులను యూఎస్ఏకు మద్దతుగా పంపించాయి. ప్రస్తుత ఇరాన్ యుద్ధం వచ్చేసరికి పరిస్థితులు మారిపోయాయి. ఇజ్రాయెల్, అమెరికా ఈ యుద్ధాన్ని ప్రారంభించేముందు నాటో దేశాలతో చర్చించలేదు. గ్రీన్‌ల్యాండ్ విషయంలో ఐరోపా దేశాలను ట్రంప్ బేఖాతరు చేశాడు. వ్యక్తిగతంగా ఫ్రాన్స్, జర్మనీ, యూకే దేశాధినేతలను కించ పరుస్తూ వ్యాఖ్యలు చేశాడు. వలసలను ప్రోత్సహిస్తూ ఐరోపా దేశాలు తమ నాగరికతను నాశనం చేసుకుంటున్నాయని వ్యాఖ్యా నించాడు. ఉక్రెయిన్‌కు సహాయం అందించటంలో యూరోపియన్ యూనియన్‌కు అడ్డుగా వ్యవహరించిన హంగరీ దేశాధినేత విక్టర్ ఓబ్రామ్ను సమర్థించాడు. ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఓబ్రా మ్కు యూఎస్ ఉపాధ్యక్షుడు వాన్స్ బహిరంగంగా మద్దతు పలి కాడు. అయితే ఈ ఎన్నికల్లో 16 ఏళ్లుగా హంగరీని పాలిస్తున్న ఓబ్రామ్ ఓడిపోయాడు. ఓబ్రామ్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు కూడా సన్నిహితుడు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా వైపు హంగరీ మొగ్గు చూపింది. పుతిన్ పరంగా ట్రంప్ మెతక వైఖరిని కొనసాగిస్తున్నాడు. ఇది ఐరోపా దేశాలకు మింగుడుపడటం లేదు. రష్యా నుండి చౌకగా లభించే గ్యాస్ దిగుమతులు ఆగిపోవటంతో ఐరోపా దేశాలు ఖతర్, యూఏఈ, సౌదీ నుండి ఎల్ఎన్జీ దిగుమతులపై ఆధారపడుతున్నాయి. అందువలన హార్మూజ్ జల సంధి కేంద్రంగా జరుగుతున్న ఇరాన్ యుద్ధం కొనసాగటం వాటికి ఇష్టం లేదు. ఈ యుద్ధం కేవలం యూఎస్ఏ–ఇరాన్ మధ్య కాదు. ఇజ్రాయెల్ చేరికతో యుద్ధానికి ‘మతం రంగు’ అలుముకోవటం ఖాయం. ఫ్రాన్స్‌లో 6.7 మిలియన్ల ముస్లిం జనాభా ఉంది. మొత్తం జనాభాలో సుమారు 10 శాతం. జర్మనీలో సుమారుగా 5.7 శాతం (4.7 మిలియన్లు) ముస్లిం జనాభా ఉన్నది. ఈ యుద్ధంలో భాగస్వా ములయితే తమ దేశాలలోని ముస్లిం పౌరుల మద్దతు ప్రమాదంలో పడుతుంది. నాటో దేశాలు మారుతున్న పరిణామాల నేపథ్యంలో తమ రక్షణ బడ్జెట్లను పెంచి, సైనిక సామర్థ్యం వైపు దృష్టి పెడుతు న్నాయి. ఐరోపా దేశాల మధ్య సైనిక సంబంధాలను పటిష్ఠం చేయాలని చూస్తున్నాయి. పారిశ్రామిక రంగాన్ని పునరుజ్జీవనం చేయటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. భారత్, చైనాలతో సన్నిహిత సంబంధాలకు ప్రాధాన్యతనిస్తున్నాయి.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
'10వ యుద్ధాన్ని ఆపుతున్నా': ట్రంప్ పోస్ట్ వైరల్
మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్, లెబనాన్ల మధ్య 10 రోజుల కాల్పుల విరమణను ప్రకటించారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియా పోస్ట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.ట్రంప్ తన ప్రకటనలో.. లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ (Joseph Aoun) ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu)తో జరిగిన చర్చలు చాలా సానుకూలంగా జరిగాయని తెలిపారు. ఈ చర్చల ఫలితంగా రెండు దేశాలు శాంతి దిశగా ముందడుగు వేయడానికి అంగీకరించాయని పేర్కొన్నారు. ఈ కాల్పుల విరమణ తూర్పు ప్రామాణిక కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు లేదా భారత ప్రామాణిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3:30 గంటలకు ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చేశారు.ట్రంప్ తన పాత్రను విశేషంగా ప్రస్తావిస్తూ.. ఇప్పటివరకు ప్రపంచంలో 9 యుద్ధాలను ఆపగలిగానని, ఇది తన 10వ విజయంగా నిలుస్తుందని తెలిపారు. ఇది ఆయన రాజకీయ దృక్పథాన్ని, అంతర్జాతీయ వ్యవహారాల్లో తన జోక్యాన్ని ప్రతిబింబిస్తుంది.వాషింగ్టన్ డీసీలో ఇజ్రాయెల్, లెబనాన్ దేశాలు '34 ఏళ్లలో తొలిసారిగా సమావేశమయ్యాయని' ట్రంప్ అన్నారు. ఆ రెండు దేశాలు "శాశ్వత శాంతి"ని సాధించేలా చూడాలని తాను ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ డాన్ కెయిన్లను ఆదేశించినట్లు కూడా ఆయన తెలిపారు. -
వారి మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందోచ్..!
ఇజ్రాయెల్-లెబనాన్ల మధ్య జ్వాలాగ్ని చల్లారనుందా?, ఆ రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందా? యుద్ధానికి ఇరు దేశాలు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చాయా? అంటే అవుననక తప్పదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు తాత్కాలికంగా యుద్ధానికి విరామం ఇవ్వాలని నిర్ణయించాయి. ఈ విషయాన్ని ట్రంప్ ఓ ప్రకటనలో తెలిపారు. తన మధ్యవర్తిత్వంతో ఇరు దేశాలు కాల్పుల విరమణ అంగీకారం తెలిపాయని, ఈ నేపథ్యంలో గంటల వ్యవధిలోనే ఇరు దేశాల్లో వినిపించిన బాంబుల మోతలకు ముగింపు పలకనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ప్రధానంగా లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఆఊన్‌తో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్ రుబియో ఫోన్ చేసి చర్చలు జరిపారు. అయితే ఇది సత్పలితాన్ని ఇచ్చింది. శత్రుదేశమైన ఇజ్రాయెల్ ముందస్తు హామీ ఇస్తే తాము కాల్పుల విరమణకు కట్టుబడతామని స్పష్టం చేశారు. దాంతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూను ఒప్పించారు ట్రంప్. నెతన్యాహూ కూడా ఓకే అనండంతో 10 రోజుల యుద్ధానికి బ్రేక్ ఇచ్చారు. మూడు దశాబ్దాల క్రితం ఇరు దేశాల మధ్య చర్చలు జరగ్గా, తాజాగా వారి మధ్య చర్చలు జరగడం గమనార్హం. -
రెండో దశ చర్చలు జరుగుతాయా? కథ మళ్లీ మొదటికొస్తుందా?
టెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ పాకిస్థాన్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్ ఏప్రిల్ 15న ఇరాన్ చేరుకున్న విషయం తెలిసిందే. అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ చర్చలు జరిగేలా చేయడానికి ఇరాన్లో మునీర్ ఉన్నత స్థాయి చర్చల్లో పాల్గొన్నారు. ఇరాన్-అమెరికా మధ్య పాకిస్థాన్‌లో చర్చలు పునఃప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు ఇటీవలే యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ కూడా సంకేతాలు ఇచ్చారు. అందుకు సంబంధించే పాక్ ప్రతినిధి బృందంతో మునీర్ ఇరాన్ వెళ్లినట్లు ఆ దేశ సైన్యం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. తాజాగా, మునీర్ ఇరాన్ పర్యటనపై మరికొన్ని అంశాలు బయటకు వచ్చాయి. ఇరాన్ పర్యటన ముగిశాక మునీర్ అమెరికాకు కూడా వెళ్లనున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఇరాన్ అణు కార్యక్రమం అంశంలో ముందడుగు పడే అవకాశం ఉందని పాకిస్థాన్ అధికారులు భావిస్తున్నారని అల్ జజీరా మీడియా చెప్పింది. అమెరికా ఇచ్చిన ఆఫర్‌ను ఇరాన్‌కు ఆసిమ్ మునీర్ ఇప్పటికే వివరించినట్లు తెలుస్తోంది. ఇరాన్ సందేశాన్ని కూడా తీసుకెళ్లి మునీర్ అమెరికాకు ఇవ్వనున్నారు. ఆ తర్వాత అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్‌లో లేదా ఇతర దేశంలో చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ అణు శుద్ధి ప్రక్రియను ఎంతకాలం ఆపాలనే విషయంలో అమెరికా, ఇరాన్ మధ్య ఏకాభిప్రాయం లేదు. కొందరు ఐదేళ్లు ఆపాలని, మరికొందరు 20 ఏళ్లు ఆపాలని చెబుతున్నారు. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న ప్రధాన విభేదం. మరొక ప్రధాన అంశం ఇరాన్ వద్ద ఉన్న 440 కిలోగ్రాముల (972 పౌండ్ల) యురేనియం నిల్వ. ఈ నిల్వను మరో దేశానికి తరలించడం లేదా శుద్ధి స్థాయిని తగ్గించడం వంటి పలు మార్గాలు పరిశీలనలో ఉన్నాయి.ఆ నిల్వతో 10 అణ్వాయుధాలు చేయొచ్చు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రకారం.. ఇప్పటికే ఇరాన్ 60% స్వచ్ఛత వరకు 440.9 కిలోగ్రాముల (972 పౌండ్ల) యురేనియం నిల్వను శుద్ధి చేసింది. ఇది 90% ఆయుధ-స్థాయి స్వచ్ఛతకు చేరడానికి ఒక చిన్న అడుగు దూరంలో ఉంది.ఒకవేళ ఇరాన్ తన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని నిర్ణయించుకుంటే, ఆ నిల్వతో 10 అణ్వాయుధాల వరకు తయారు చేయగలదని ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రోస్సీ ఏపీకి ఇచ్చిన ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో హెచ్చరించారు. ఐఏఈఏ మార్గదర్శకాల ప్రకారం.. ఇంత అధికంగా శుద్ధి చేసిన అణు పదార్థాన్ని సాధారణంగా ప్రతి నెల తనిఖీ చేయాలి.ఈ పరిణామాల మధ్య, మునీర్ ఇరాన్ పర్యటన తరువాత వాషింగ్టన్ వెళ్లే అవకాశం ఉంది. ఇది మధ్యవర్తిత్వ ప్రయత్నాల్లో భాగమని పాక్ భద్రతా వర్గాలు తెలిపాయి. బుధవారం అరాఘ్చీ టెహ్రాన్‌లో మునీర్‌ను స్వాగతిస్తూ, చర్చలకు సహకరించిన పాకిస్థాన్ పాత్రను ప్రశంసించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల మధ్య ప్రాంతీయ శాంతి, స్థిరత్వం అంశాలను ప్రస్తావించారు.ఇస్లామాబాద్‌లో కొన్ని రోజుల క్రితం జరిగిన చర్చలు ఫలితం లేకుండా ముగిసిన తర్వాత ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయని అందరూ భావించారు. డొనాల్డ్ ట్రంప్ హార్మూజ్, ఇరాన్ ఓడ రేవుల దిగ్బంధం చేయించడంతో ఇది సమీప భవిష్యత్తులో తీవ్ర ప్రతికూల పరిణామాలను దారి తీయవచ్చు. ఇరాన్ అణు కార్యక్రమం, కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్‌ను చేర్చడం, ఇతర "రెడ్ లైన్" అంశాలపై వెనక్కి తగ్గకపోతుండడంతో.. తదుపరి జరిపే ఉన్నత స్థాయి సమావేశమే చివరి ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ అన్ని అంశాల్లో వెనకడుగు వేసేలా కనపడడం లేదు. ఇటువైపేమో రెండో దశ చర్చలు జరగకపోయినా, అవి మళ్లీ విఫలమైనా భీకర యుద్ధం తప్పదని ఇప్పటికే ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చే ప్రమాదం ఉంది. -
యుద్ధమైనా.. శాంతి చర్చలైనా.. మేం ఒక్కటే
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఇరాన్ కీలక ప్రకటన చేసింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా గౌరవించి తీరాల్సిందేనని పేర్కొంది. అదే సమయంలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, శాంతి చర్చల ప్రతినిధి మహ్మద్ బాఘేర్ ఘలీబాఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం అయినా.. శాంతి చర్చలైనా.. ఇరాన్, దాని మిత్ర శక్తులు ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటాయని స్పష్టం చేశారు. హెజ్బొల్లా ధైర్యం, రెసిస్టెన్స్ ఐక్యత వల్లే లెబనాన్‌లో కాల్పుల విరమణను సాధ్యమైందని అన్నారాయన. యుద్ధం జరిగినా, శాంతి ఒప్పందం వచ్చినా.. ఇరాన్, రెసిస్టెన్స్(మిత్ర శక్తుల) శక్తులు ఒక్కటిగానే ఉంటాయని.. ఈ శక్తులు కలకాలం ముందుకు సాగుతాయన్నారు. అలాగే.. ఇజ్రాయెల్‌కు ప్రాధాన్యత ఇవ్వడమే పనిగా పెట్టుకున్న అమెరికా ఆ విధానాన్ని వదిలేయాలని సూచించారు. శాంతి ఒప్పందాన్ని గౌరవించాలని అమెరికాకు హితవు పలికారు. హర్ముజ్ జలసంధి అమెరికా దిగ్బంధనం(బ్లాకేడ్) కొనసాగుతోంది. ఈ చర్య అంతర్జాతీయ చమురు రవాణాపై తీవ్ర ప్రభావం చూపడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ మరోసారి అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. ఈ జోక్యాన్ని చూస్తూ ఊరుకోబోమని చెబుతోంది. లెబనాన్‌లో కాల్పుల విరమణ ఇంకా ఆచరణలోకి రాలేదు. అమెరికా మధ్యవర్తితత్వంతో ఇజ్రాయెల్-లెబనాన్ ప్రతినిధుల మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. హెజ్బొల్లా-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు తగ్గినా.. చిన్నపాటి దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే ఘలీబాఫ్ వ్యాఖ్యలు పశ్చిమాసియా సంక్షోభంలో రెసిస్టెన్స్ శక్తుల ఐక్యతను బలపరిచే ప్రయత్నంగా కనిపిస్తోంది. ఇరాన్ చెబుతున్నట్లు.. అమెరికా గనుక ఇజ్రాయెల్ ఫస్ట్ విధానాన్ని వీడి శాంతి ఒప్పందాన్ని గౌరవించకపోతే ప్రాంతీయ స్థిరత్వం మళ్లీ దెబ్బతినే అవకాశం ఉంది. ఇక అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు త్వరలో మళ్లీ ఇస్లామాబాద్‌లోనే జరగనున్నాయి. తొలి దఫా చర్చలు విఫలం కావడంతో.. ఎవరో ఒకరు దిగి రావాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే అటు అమెరికా.. ఇటు ఇరాన్ తగ్గేదే లే అంటున్నాయి. బంతి ఇరాన్ కోర్టులోనే ఉందని అమెరికా అంటుంటే.. తమ డిమాండ్లలో ఏ ఒక్కటి తగ్గినా చర్చలు ముందుకు సాగవని ఇరాన్ అంటోంది. పాక్ మధ్యవర్తిత్వంలో తొలుత ఇరాన్, అమెరికా ప్రతినిధులు పరోక్ష చర్చలు జరుపుతారు. ఫలితాలు సానుకూలంగా ఉంటే ప్రత్యక్ష చర్చలు జరగొచ్చు. -
ట్రంప్‌కు కళ్లెం వేసే మార్గమేమిటి?
ఇరాన్‌తో 12వ తేదీన జరిగిన చర్చలు విఫలమైన తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన గమనించదగ్గది. చాలా అంశాలలో ఇరాన్‌తో ఏకాభి ప్రాయం కుదిరిందనీ, అణ్వాయుధాల తయారీని ఆపటంపై వారు పట్టుదల విడవలేదనీ, అందుకే చర్చలు విఫల మయ్యాయనీ అన్నారు. వారికి అణ్వస్త్ర ఉత్పత్తి సామర్థ్యాన్ని ఎప్పటికీ దక్కనివ్వ బోమని ప్రకటించారు. ఆ తర్వాత రెండు రోజులలో ప్రపంచ నాయ కుల స్పందనలను గమనించగా, ఆయన మాటలను ఎవరూ విశ్వ సించటం లేదని అర్థమవుతున్నది. చర్చలు, ఒప్పందాల విషయమై తమను లోగడ రెండుసార్లు మోసం చేసిన ఆయన ఈసారి కూడా తమ విశ్వాసాన్ని పొందలేకపోయారన్న ఇరాన్ వ్యాఖ్యలు సరేసరి!ఒప్పందం రద్దు ట్రంప్ పుణ్యమే!చర్చల మినిట్స్ అందుబాటులో లేనందున అణుపరిశోధనలు, యురేనియం శుద్ధి, అణ్వస్త్రాల ఉత్పత్తి విషయమై నిర్దిష్టంగా ఎవ రేమి అన్నారో మనకు తెలియదు. అయినప్పటికీ ఈ కీలకమైన అంశంపై చర్చలకు ముందూ, తర్వాతా ఎవరేమన్నారో తెలిసిందే. అదే విధంగా గతంలో జరిగిందేమిటో కూడా. వాటన్నింటిని పరి గణనలోకి తీసుకున్నప్పుడు, ఇస్లామాబాద్ చర్చలు విఫలం కావటా నికి కారణం ట్రంప్ వైఖరి అని తేలికగా అర్థమవుతుంది. అందుకే ఆయనకు మిత్రదేశాల నుంచి కూడా మద్దతు లభించటం లేదు. ఒబామా అధ్యక్షునిగా ఉన్నప్పుడు, యురేనియం శుద్ధి విష యమై ఇరాన్‌కు, భద్రతా సమితిలో శాశ్వత సభ్యత్వం గల అమె రికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్లతో పాటు జర్మనీకి మధ్య 2015 లోనే ఒప్పందం జరిగింది. దానిని ‘జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్’ అన్నారు. దాని ప్రకారం ఇరాన్ శాంతియుత అవస రాల కోసం యురేనియంను 3.67 శాతం వరకు శుద్ధి జరపవచ్చు. అణ్వాయుధాల తయారీకి కావలసిన శుద్ధి 90 శాతం. ఈ శుద్ధి కార్యక్రమాన్ని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఇన్స్పెక్టర్లు తరచూ తనిఖీ చేయవచ్చు.ఆ ప్రకారం 2015 నుంచి 2018 వరకు సజావుగానే సాగుతుండిన ఒప్పందాన్ని ట్రంప్ తన మొదటి హయాంలో ఆకస్మికంగా రద్దు చేయటంతో సమస్యలు మొదలయ్యాయి. అట్లా రద్దు చేసినా తమ వైపు నుంచి కొంతకాలం పాటు ఒప్పంద నిబంధనలకు కట్టుబడి ఉండిన ఇరాన్, ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకోక పోవటంవల్లనే యురేనియం శుద్ధి స్థాయిని 60 శాతం వరకు తీసుకువెళ్లి ఆపింది. అణ్వస్త్ర తయారీ మాత్రం తమ అజెండాలో లేదని అయతొల్లా ఖమేనీ ఫత్వా సైతం జారీ చేశారు. అటువంటి ఆయుధాల ఉత్పత్తి ఇస్లాంకు విరుద్ధమన్నారు. ఇవన్నీ తెలిసిన విషయాలే గాక, ఫిబ్రవరి 28 నుంచి అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ముందు రోజు లలో అమెరికా, ఇరాన్ మధ్య ఒమాన్ మధ్యవర్తిత్వం ద్వారా తిరిగి చర్చలు, అవి దాదాపు ఒక కొలిక్కి రానుండగా దాడులు జరగడం తెలిసిందే. ఈ నేపథ్యాన్నంతా గుర్తు చేసుకోవటం ఎందుకంటే, అణ్వస్త్రాలను ఆపటమే తమ అత్యంత ప్రాధాన్య లక్ష్యమనీ,అందుకు ఇరాన్ కలిసి రానందునే చర్చలు ముందుకు సాగలేదనీ ట్రంప్ వాదించబూనటం తెంపరితనం మాత్రమే అవుతుంది. ప్రపంచం అందువల్లనే ఆయనను నమ్మటం లేదు.దిగ్బంధనం– గందరగోళంఇస్లామాబాద్ చర్చలకు ముందే ఇరువురు తమ తమ షరతులు ప్రకటించారు. అవి ఇంచుమించు గత నెల షరతుల వంటివే. అయి నప్పటికీ, రాజీ అంటూ జరగాలి గనుక చర్చల సమయంలో కొంత పట్టువిడుపులు ఉంటాయనే భావన కలిగింది. ఇటువంటి దౌత్య చర్చలు ఎపుడైనా పలు విడతలుగా సాగుతూ క్రమంగా కొన్ని రాజీ లతో అంతిమ ఒప్పందం జరుగుతుంది. ఈసారి కూడా చర్చలు 21 గంటలపాటు సాగిన తర్వాత, రాగల రోజులలో తిరిగి చర్చలు ఉండగలవనే సంకేతాలు రెండు దేశాల ప్రతినిధుల నుంచి వినిపించాయి. కానీ, ‘ఖలునికి నిలువెల్ల విషముగదరా సుమతీ’ అన్నట్లు తన నిలువెల్ల ‘ఆయుధాలు, సైనిక బలం’ అన్న మిడిసిపాటు తప్ప దౌత్యనీతి అనే మాటకు చోటులేని ట్రంప్ మాత్రం వెంటనే హార్మూజ్ దిగ్బంధం అంటూ హెచ్చరించటంతో ఆగక, దిగ్బంధనం కోసం తమ నౌకా దళాలకు ఉత్తర్వులు జారీ చేశారు.దానితో ఇరాన్ లొంగి వస్తుందని ఆయన అంచనా వేసిన ట్లున్నారు. కానీ, జరిగిందేమిటి? ప్రపంచమంతటా చమురు ధరలు పెరిగి, స్టాక్స్ పడిపోయాయి. చర్చలు నెరవేరగలవన్న ఆశాభావా లతో తగ్గిన చమురు, పెరిగిన స్టాక్స్, ఆయన పుణ్యమా అని తిరిగి గందరగోళంలో పడ్డాయి. నిజానికి హార్మూజ్ ద్వారా రవాణా అయ్యే చమురు, ఇతర సరకులు అన్నీ ఇరాన్వేమీ కాదు. అరబ్ దేశాలవి, బయటి దేశాలవి కూడా గణనీయంగా ఉన్నాయి. అది తర్వాత బోధ పడి కావచ్చు, మొత్తం హార్మూజ్‌ను కాకుండా ఇరాన్ రేవులను మాత్రమే దిగ్బంధిస్తామన్నారు. అందుకు ఇరాన్ తాము ఆ ప్రాంతంలోని అరబ్ రేవులన్నింటిపై దాడులు జరపగలమని హెచ్చరించింది. ఆ జలసంధిలో మైన్స్ మరొకవైపు ఉండనే ఉన్నాయి. ఈ హెచ్చరిక లతో మళ్లీ గందరగోళం మొదలైంది.చట్టాలకు లోబడేట్టుగా...ఒప్పందాలు, ఒప్పంద చర్చలను ప్రతిసారీ భంగపరుస్తున్న ఇజ్రాయెల్ ఈసారి కూడా ఆ పని చేస్తుండటం మొదటినుంచీ కనిపించిందే. యుద్ధ విరమణ లెబనాన్‌కు సైతం వర్తించాలన్న షర తును ఇరాన్ మొదటనే విధించగా, అందుకు ట్రంప్ పాకిస్తాన్ ద్వారా సమ్మతి తెలిపారు. కానీ ఇజ్రాయెల్ తమకు దానితో నిమిత్తం లేదంటూ దాడులు కొనసాగించగా, ట్రంప్ కూడా అది వేరే అంశమంటూ వాదించారు. చర్చలపట్ల ట్రంప్, నెతన్యాహూల ఆంతరంగిక ఆలోచనలకు అద్దంపట్టిన విషయాలలో ఇదీ ఒకటి. అందుకు తగినట్లుగానే ట్రంప్ ఇజ్రాయెల్‌కు మరిన్ని ఆయుధాలు సరఫరా చేస్తుండగా, మధ్యవర్తి పాకిస్తాన్ చేష్టలుడిగి మిన్నకుంటున్నది.అసలు వాస్తవం ఏమంటే, అమెరికాకు గానీ, ఇజ్రాయెల్కుగానీ ఇరాన్ అణు పరిశోధనలు వట్టి సాకు మాత్రమే. అమెరికాకు కావలసింది అక్కడ ఒక సామంత రాజ్యాన్ని నెలకొల్పి చమురు నిల్వలు తమ అధీనంలోకి తెచ్చుకోవటం. వెనిజులా వలెనే ఇరాన్ చమురు గురించి స్వయంగా ట్రంప్ చెప్పిందే. ఇజ్రాయెల్‌కు కావలసింది గ్రేటర్ ఇజ్రాయెల్ ఏర్పడి, ఆ ప్రాంతంలో ఇరాన్ ఒక శక్తిగా మిగలక పోవటం. ప్రపంచమంతా ఇప్పటికే గుర్తించిన ఈ వాస్తవాలు తిరిగి రుజువవుతున్నాయి.ట్రంప్ అరాచకానికి కళ్లెం వేయగల మార్గం ఒకే ఒకటి కని పిస్తున్నది. ఇది ఇట్లానే అందరినీ చుట్టుముట్టరాదంటే రష్యా, చైనా, యూరోపియన్ యూనియన్, ఇండియా, ఆసియాన్ కూటమి, ఆఫ్రికన్ యూనియన్, బ్రెజిల్ వంటి దక్షిణ అమెరికా దేశాలు కలిసి, అమెరికా పూర్తిగా అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఐక్యరాజ్యసమితి ద్వారా మాత్రమే వ్యవహరించాలంటూ ఏకగ్రీవ తీర్మానం చేయాలి. ఒక నిర్ణీత వ్యవధిలో అందుకు అంగీకరించనట్లయితే అమెరికా, ఇజ్రాయెల్‌లతో దౌత్య సంబంధాలు రద్దు చేసుకోకున్నా, సస్పెండ్ చేయగలమని హెచ్చరించాలి.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
చర్చలు జరుపుతూనే బాంబుల వర్షం.. 13 మంది మృతి
బీరుట్: లెబనాన్, ఇజ్రాయెల్ మూడు దశాబ్దాల తర్వాత మొట్టమొదటిసారి ఇప్పుడు అమెరికాలో దౌత్య చర్చలు నిర్వహించాయి. చివరిసారిగా ప్రత్యక్ష చర్చలు 1993లో జరిగాయి. ప్రస్తుతం జరుగుతున్న చర్చలను చారిత్రక చర్చలని పేర్కొంటున్నారు. అయితే, అటు చర్చలు జరుగుతుండగానే ఇటు లెబనాన్‌పై బుధవారం ఇజ్రాయెల్ మళ్లీ భీకర దాడులకు దిగింది. దక్షిణ లెబనాన్ పట్టణాలపై మరిన్ని ఘోర దాడులను ప్రారంభించింది. లెబనాన్ ప్రభుత్వ నేషనల్ న్యూస్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం జరిగిన దాడుల్లో 13 మంది మరణించారు. లెబనాన్, ఇజ్రాయెల్ ప్రతినిధులు అమెరికాలో సమావేశమైన 24 గంటలు కూడా గడవకముందే ఈ ఘటన జరిగింది.హిజ్బుల్లా రాకెట్ల ప్రయోగంఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా రాకెట్లను ప్రయోగించింది. ఉత్తర ఇజ్రాయెల్ నివాస ప్రాంతాలపై ఈ దాడులు జరిపామని ప్రకటించింది. హిజ్బుల్లా సుమారు 30 రాకెట్లు ఉత్తర ఇజ్రాయెల్‌పై ప్రయోగించిందని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇందులో మెటులా, కఫర్ గిలాడి, కిర్యాత్ ష్మోనా ఉన్నాయి. సరిహద్దు ఉద్రిక్తతలు ఎంతగా కొనసాగుతున్నాయో ఇది సూచిస్తోంది. అదే సమయంలో, ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్‌లో దాడులు జరిపాయి. సైడాన్ జిల్లా అల్-బబ్లియా ప్రాంతంలో డ్రోన్ దాడి, ఖలీలా పట్టణంపై వైమానిక దాడి జరిగినట్లు సమాచారం.గాజాలో వాడిన విధానాలను దక్షిణ లెబనాన్‌లోనూ ఇజ్రాయెల్ సైన్యం వాడుతున్నట్లు తెలుస్తోంది. హారెట్జ్ నివేదిక ప్రకారం.. ఇజ్రాయెల్ దళాలు గాజాలో ఉపయోగించిన విధానాల్లాగే దక్షిణ లెబనాన్ గ్రామాలను ధ్వంసం చేస్తున్నాయి. ఈ సమాచారం ఇజ్రాయెల్ సైనికులను ఉటంకిస్తూ వెలువడింది.ఇళ్లను ప్రణాళికాబద్ధంగా కూల్చివేస్తున్నారు. కొందరు సైనికులు రోజువారీగా కూల్చిన భవనాల సంఖ్య ఆధారంగా లక్ష్యాలు నిర్ణయిస్తున్నారని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ దళాలు సరిహద్దు ప్రాంతాలను దాటి మరింత లోతుగా దక్షిణ లెబనాన్‌లోకి ప్రవేశించాయి. ఈ ఆరోపణలపై ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటివరకు స్పందించలేదు. -
3 దశాబ్దాల తర్వాత ఆ 2 దేశాల మధ్య చరిత్రాత్మక చర్చలు
వాషింగ్టన్: ‘లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు ఆపాలి’.. ఇరాన్ చేస్తున్న ప్రధాన డిమాండ్లలో ఇది ఒకటి. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆపలేదు. లెబనాన్‌లో తాజా యుద్ధం మార్చి 2న మొదలైంది. ఇరాన్ మద్దతుతో లెబనాన్ సాయుధ గ్రూపు హిజ్బుల్లా ఇజ్రాయెల్‌పై కాల్పులు జరిపింది. దీంతో లెబనాన్‌లో ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. 2,000 మందికి పైగా మృతి చెందగా, అందులో 165 మంది పిల్లలు, 250 మహిళలు ఉన్నారు. ఇప్పుడు ఎట్టకేలకు ఇజ్రాయెల్-లెబనాన్ చర్చలు జరిపాయి. ప్రస్తుతం ఇరు దేశాల ప్రతినిధులు అమెరికాలో ఉన్నారు.లెబనాన్, ఇజ్రాయెల్ మూడు దశాబ్దాల తర్వాత తొలిసారి దౌత్య చర్చలు నిర్వహించాయి. ఇజ్రాయెల్, లెబనాన్‌కు మధ్య దౌత్య సంబంధాలు లేవు. చివరిసారిగా ప్రత్యక్ష చర్చలు 1993లో జరిగాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లా మధ్య ఘర్షణను ముగించాలనే లక్ష్యంతో అమెరికాలో ఇప్పుడు ఈ సమావేశం జరిగింది. ఈ చర్చలకు మధ్యవర్తిత్వం చేసిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ.. ఇది చరిత్రాత్మక అవకాశమని చెప్పారు. హెజ్బొల్లా ప్రభావం లేకుండా చేసేందుకు ఇదో అవకాశమని అన్నారు.అమెరికా చేసిన ప్రకటన ప్రకారం.. లెబనాన్, ఇజ్రాయెల్ పక్షాలు ప్రత్యక్ష చర్చలు ప్రారంభించేందుకు అంగీకరించాయి. ఇజ్రాయెల్ అన్ని ప్రభుత్వేతర ఉగ్రవాద గ్రూపులను నిరాయుధీకరణ చేయాలని కోరింది. అంటే ఇందులో హెజ్బొల్లా కూడా వస్తుంది.లెబనాన్ కాల్పుల విరమణ కోరింది. మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొనే చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పింది. లెబనాన్‌లో హిజ్బుల్లాను నిరాయుధీకరణ చేయడం, ఆ గ్రూపు లేకుండా చేయడమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ తెలిపింది. గాజా యుద్ధం కొనసాగిన సమయంలో (2023, 2024లో) కూడా హిజ్బుల్లాతో ఇజ్రాయెల్ పోరాడింది.అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగాట్ మాట్లాడుతూ.. చర్చల తర్వాత విడుదల చేసిన ప్రకటనలో ఇజ్రాయెల్, లెబనాన్ రెండు పక్షాలు హెజ్బొల్లా ప్రభావాన్ని తగ్గించే దిశగా పని చేయడానికి అంగీకరించాయి. హెజ్బొల్లా దాడుల నుంచి తనను తాను రక్షించుకునే ఇజ్రాయెల్ హక్కుకు అమెరికా మద్దతు తెలిపిందని ఆయన చెప్పారు. -
మళ్లీ యుద్ధ మేఘాలు!
చరిత్రాత్మకం అన్నారు. ఉన్నతస్థాయి చర్చలన్నారు. దౌత్యం పూర్తి స్థాయిలో పనిచేస్తోందన్నారు. శాంతికి పశ్చిమాసియా చేరువలో ఉందన్నారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామా బాద్‌లో 21 గంటలపాటు కొనసాగిన అమెరికా–ఇరాన్ ప్రతినిధి బృందాల చర్చలపై ఎప్పటికప్పుడు మీడియాలో వచ్చిన సమాచారం సారాంశమిది. తీరా బయటికొచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చర్చలు విఫలమయ్యాయని ప్రకటించి నిష్క్రమించారు. ఆ వెంటనే ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బెదిరింపు భాష మొదలైంది. అమెరికా ఏకపక్ష వైఖరివల్ల 47 సంవత్సరాల తర్వాత ఆ రెండు దేశాలమధ్యా నేరుగా సాగిన చర్చలు చివరికిలా నీరుగారాయి. వచ్చేవారం మరోసారి చర్చలుంటాయని చెబుతున్నారు. కానీ అమెరికా వైఖరి మారకపోతే ప్రయోజనం శూన్యం. ట్రంప్ వచ్చాక చర్చల అర్థమే మారిపోయింది. చర్చలంటే ఆయన శాసిస్తే ఎదుటిపక్షం శిరోధార్యంగా స్వీకరించటం తప్ప మరేంకాదు. అసలు ఈ యుద్ధంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న వాన్స్ నాయకత్వాన ప్రతినిధి బృందాన్ని పంపటంలోనే ఆయన నిజాయితీలేమి వెల్లడైంది. ఏ అధికారమూ లేని, సొంతంగా ఎలాంటి చొరవా తీసుకోలేని ఆ అశక్త బృందం చివరకు ఉత్త డొల్లగా మిగిలిపోయింది. ట్రంప్ తీరు 90వ దశకం మొదట్లో సోవియెట్ యూనియన్ కుప్పకూలిననాటి పరి స్థితుల్ని తలపిస్తోంది. అంతవరకూ సోవియెట్ భాగస్వామ్య రాష్ట్రాలుగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కడికక్కడ సమావేశాలు జరగటం, దేశంనుంచి విడిపోతున్నట్టు ప్రకటించటం రివాజై పోయింది. నిజంగా అలా ప్రకటించేవారి బలాబలాలేమిటో, ఆ తీర్మానాలు అమలయ్యే అవకాశం ఉందో లేదో తెలియని స్థితి. ఇలాంటి అనిశ్చితే ఇప్పుడు అమె రికాను ఆవరించింది. నరమేథాన్ని సాగిస్తూ ఘనవిజయాలుగా ప్రకటించుకోవటం, ఇరాన్ నాగరికత ఈ రాత్రితో అంతం కాబోతున్నదని ప్రకటించటం, అంతలోనే చర్చలకు రావాలంటూ బెదిరించటం ట్రంప్ అలవాటు చేసుకున్నారు. ఇజ్రాయెల్‌తోపాటు ఈ యుద్ధానికి లోపాయికారీగా మద్దతిచ్చిన దేశాలన్నీ ఇరాన్నుంచి శరపరంపరగా వచ్చి పడుతున్న క్షిపణుల ధాటికి బెంబేలెత్తినా, అక్కడ పెనువిధ్వంసం చోటుచేసుకుంటున్నా ట్రంప్ బడాయి మాటలు ఆగలేదు. ఆయన ప్రకటనలకు భిన్నమైన స్థితిగతులున్నాయని సైనికా ధికారులే మీడియాకు రహస్యంగా చెప్పటం అమెరికాలో కుప్పకూలుతున్న వ్యవస్థలకు ఆనవాలు. సోవియెట్ కనుమరుగయ్యే ముందు కూడా ఇలాంటి ధోరణులే కనబడ్డాయి. ఇతర దేశాల సహకారంతో హార్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తామని ట్రంప్ చెప్పిన కొన్ని గంటలకే, అందుకు తాము అంగీకరించబోమని నాటో భాగస్వామ్య దేశాలు బ్రిటన్, ఫ్రాన్స్‌లు ప్రకటించి గాలి తీశాయి. ‘హార్మూజ్ దిగ్బంధం’ అంటూ చేసిన ప్రకటనకు అర్థం ఇరాన్ నౌకాశ్రయాల దిగ్బంధమని అమెరికా సైన్యం ఆ వెంటనే తెలిపింది. సోమవారం నుంచి అమల్లోకి వచ్చిందని కూడా ప్రకటించారు. కానీ గల్ఫ్ దేశాలే దీన్ని నిరసిస్తున్నాయి. ట్రంప్ చర్య ఈ ప్రాంతం మొత్తాన్ని శాశ్వతంగా యుద్ధ ఊబిలోకి దించేస్తుందని సౌదీ అరేబియాతోసహా చాలా దేశాలు ఆందోళనపడుతున్నాయి. సౌదీ చమురు ఎగుమతులు యుద్ధానికి ముందు మాదిరే రోజుకు 70 లక్షల బ్యారెళ్లకు చేరు కున్నాయి. అవి ఎర్ర సముద్రం గుండా వెళ్తున్నాయి. కానీ అమెరికా దుందుడుకు చర్యకు దిగితే యెమెన్‌లోని హౌతీలు ఆ ఎగుమతుల్ని దెబ్బతీస్తారు. తన నాయకత్వాన ఇన్ని దశాబ్దాలుగా సాగిన ఏకధ్రువ ప్రపంచం కళ్లముందు కుప్పకూలుతున్న వైనాన్ని అమెరికా గ్రహించకపోతే పోయిందిగానీ... చైనా నాయకత్వంలో కొత్త అమరిక మొగ్గతొడుగుతోందన్న సంగతైనా అది తెలుసుకోవాలి. ఈ యుద్ధం తనకూ, ఇరాన్‌కూ మధ్య పంచాయతీ కాదు. అది పశ్చిమాసియాకు పరిమిత మైంది అంతకన్నా కాదు. ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని క్రమేపీ బలహీనపరుస్తున్న ఒక నిరర్థక యుద్ధం. అది చైనా నాయకత్వాన కొత్త కూటమికి పురుడు పోస్తున్న ప్రమాదకర యుద్ధం. ఆర్థికంగా, సైనికంగా ప్రపంచంలోనే తాము సర్వశక్తిమంతులమని ఇరాన్‌తో చర్చలకు చాన్నాళ్లముందు జేడీ వాన్స్ అన్నారు. ట్రంప్ ప్రభావం ఆయనపై ఎక్కువే ఉన్నట్టుంది. ఆ దృశ్యం మారుతున్న సంగతిని అమెరికా నాయకత్వం ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. -
యుద్ధం వేళ మోదీకి ట్రంప్ ఫోన్.. ఏకంగా 40 నిమిషాలు..
న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఫోన్ చేశారు. మోదీతో ట్రంప్ సుమారు 40 నిమిషాలు మాట్లాడారు. ఇటీవల పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో జరిగిన అమెరికా–ఇరాన్ శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఒప్పందం కుదరలేదు. దీంతో అనిశ్చితి ఇంకా తొలగిపోలేదు. ఇరాన్ సముద్ర మార్గాలను అమెరికా దిగ్బంధనం చేసింది.యుద్ధానికి సంబంధించి పలు అంశాలపై ట్రంప్‌తో మోదీ కీలక చర్చలు జరిపారు. “నా స్నేహితుడు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఫోన్ కాల్ అందింది. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంతో సాధించిన గణనీయ పురోగతిని సమీక్షించాము. అన్ని రంగాల్లో మా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. పశ్చిమాసియా పరిస్థితి గురించి కూడా చర్చించాము. హార్మూజ్ జలసంధిని తెరిచి, భద్రంగా ఉంచడం, దాని ప్రాముఖ్యత గురించి మాట్లాడుకున్నాం” ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. Received a call from my friend President Donald Trump. We reviewed the substantial progress achieved in our bilateral cooperation in various sectors. We are committed to further strengthening our Comprehensive Global Strategic Partnership in all areas. We also discussed the…— Narendra Modi (@narendramodi) April 14, 2026కాగా, ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలు, యుద్ధం మళ్లీ పెరగకుండా నియంత్రించడం వంటి అంశాలపై మోదీ చర్చించినట్లు తెలుస్తోంది. అమెరికా-ఇరాన్ చర్చలు విఫలమైన తర్వాత తదుపరి దౌత్య చర్యలు ఎలా ఉండాలి అన్న అంశాలపై కూడా ఇరువురు నేతలు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఇది అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ తర్వాత ఇద్దరు నేతల మధ్య తొలిసారి జరిగిన చర్చ. ‘‘భారత ప్రజలు మిమ్మల్ని అభిమానిస్తారు” అని ఫోన్ కాల్ సమయంలో ట్రంప్‌కు మోదీ చెప్పారు. వారి మధ్య జరిగిన చర్చ విషయాలను అధికారికంగా వెల్లడించలేదు. అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య మోదీ, ట్రంప్ జరిపిన చర్చకు ప్రాధాన్యం సంతరించుకుంది. మోదీకి తాజా సమాచారం అందిస్తుంటారు: సెర్జియో ఇద్దరు నేతలు పశ్చిమాసియా పరిస్థితి, వాణిజ్యం వంటి అంశాలపై చర్చించినట్లు భారత్‌లోని అమెరికా రాయబారి సెర్జియో గోర్ తెలిపారు. “కొన్ని నిమిషాల క్రితమే వారు ఫోన్ సంభాషణ ముగిసింది. అధ్యక్షుడు ట్రంప్ చాలా యాక్టివ్‌గా ప్రధానమంత్రి మోదీకి తాజా సమాచారం అందిస్తారు. పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలపై అధ్యక్షుడు వివరాలు చెప్పారు. అలాగే అమెరికా, భారత్ మధ్య వాషింగ్టన్లో జరుగుతున్న కీలక అంశాలపై కూడా చర్చ జరిగింది” అని గోర్ చెప్పారు. -
War Updates: అమెరికా, ఇరాన్ శాంతి చర్చల్లో కీలక పరిణామం
పశ్చిమాసియాలో యుద్ధం ఇంకా కొనసాగుతోంది. అమెరికా నౌకలు ఇప్పటికే హర్ముజ్‌ను తమ ఆధీనంలోకి తీసుకోగా.. తీవ్ర ప్రతిఘటన తప్పదని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగిస్తోంది. -
హార్మూజ్ దిగ్బంధం, ఇరాన్ రేవులను నిర్బంధించిన అమెరికా. అమెరికా చర్యలపై తీవ్రంగా మండిపడ్డ ఇరాన్
-
రెండేళ్ల పాప: యుద్ధంలోనే పుట్టి.. యుద్ధంలోనే మృతి..
టైర్ (లెబనాన్): ఆ పాప వయసు కేవలం రెండేళ్లు మాత్రమే. యుద్ధంలోనే పుట్టింది.. యుద్ధంలోనే కన్నుమూసింది. తనచుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని ఆ పాపను యుద్ధమే బలితీసుకుంది.ఇజ్రాయెల్ దాడుల్లో ఆ పాప తండ్రి మృతి చెందాడు. తండ్రి అంత్యక్రియల సమయంలో ఇజ్రాయెల్ దాడిలో ఆ రెండేళ్ల పసిపాప కూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ హృదయవిదారక ఘటన దక్షిణ లెబనాన్‌లో చోటుచేసుకుంది. చనిపోయిన బాలిక పేరు టలీన్ సయీద్. ఇజ్రాయెల్ దాడిలో ఆ పసిపాప అక్క అలైన్ సయీద్ (7) బయటపడింది. గత వారం దక్షిణ లెబనాన్‌లో తన ఇంటిపై ఇజ్రాయెల్ చేసిన దాడి నుంచి కూడా అలైన్ సయీద్ ప్రాణాలతో బయటపడింది. స్రిఫా గ్రామంలో సయీద్ ఇంటిపై బుధవారం దాడి జరిగింది. అదే రోజు అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ప్రారంభమైంది. ఇది తమ దేశానికి కూడా వర్తిస్తుందని లెబనాన్‌లో చాలామంది భావించారు. ఇజ్రాయెల్ దాడులు చేయడంతో లెబనాన్‌లో 350 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సయీద్ కుటుంబానికి చెందిన మరో నలుగురు బంధువులు కూడా మృతి చెందారు.“కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని చెప్పారు. దీంతో మేము గ్రామానికి వెళ్లాం. శవపేటిక వద్ద ప్రార్థనలు చదివి ఇంటికి నడుచుకుంటూ వస్తున్నాం. ఒక్కసారిగా ఒక తుపాను మాపై పడుతున్నట్టుగా అనిపించింది” అని నాసర్ సయీద్ (64) అనే వ్యక్తి తమపై జరిగిన బాంబు దాడుల గురించి తెలిపాడు. అతను కూడా ఈ దాడి నుంచి బయటపడ్డాడు.ఆదివారం, అతను ఇతర బంధువులతో కలిసి దక్షిణ పోర్ట్ నగరం టైర్‌కు వెళ్లి పచ్చని గుడ్డలతో కప్పిన మృతదేహాలను తీసుకున్నాడు. వాటిలో ఒక మృతదేహం చాలా చిన్నగా ఉంది. అది అతని మనవరాలు టలీన్ సయీద్ మృతదేహం. అలైన్ సయీద్ చెల్లెలే టలీన్ సయీద్.పసిపాప టలీన్ తలపై, కుడి చేతిపై బ్యాండేజ్‌లు, ముఖంపై గీతలు ఉన్నాయి. అది చూసిన వారికి కన్నీరు ఆగలేదు. లెబనాన్‌లో తాజా యుద్ధం మార్చి 2న ప్రారంభమైంది. లెబనాన్ సాయుధ గ్రూపు హిజ్బుల్లా, ఇరాన్ మద్దతుతో ఇజ్రాయెల్ స్థావరాలపై కాల్పులు జరిపింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ వైమానిక, భూతల దాడులు పెంచింది. వీటిలో 2,000 మందికి పైగా మృతి చెందారు. అందులో 165 మంది పిల్లలు, దాదాపు 250 మహిళలు ఉన్నారు.బాంబు దాడులు కొనసాగుతున్నాయి. లెబనాన్‌లో కాల్పుల విరమణకు ఇరాన్ పట్టుబడుతోంది. ఇరాన్-అమెరికాతో జరిపిన చర్చల్లో దీనిపై సానుకూల ప్రకటన రాలేదు. లెబనాన్ అధికారులతో వేరే మార్గంలో చర్చలు కొనసాగించాలని ఇజ్రాయెల్ చూస్తోంది. -
వీటి వల్లే చర్చలు విఫలం.. ఇకపై ఏం జరుగుతుంది?
పాకిస్థాన్‌లో అమెరికా-ఇరాన్ మధ్య ఏకంగా 21 గంటలు చర్చలు జరిగినప్పటికీ అవి ఫలించలేదు. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేసే ప్రయత్నాన్ని ఆపాలని హామీ ఇవ్వలేదని అమెరికా తెలిపింది. చర్చల విఫలం కారణంగా 14 రోజుల కాల్పుల విరమణ అనిశ్చితిలో పడింది. ఎందుకు ఎందుకు విఫలమయ్యాయి? ఒప్పందం కుదరకపోతే.. గతంలో ఎవరూ చూడని విధంగా మరింత పెద్దగా, మెరుగ్గా, శక్తిమంతంగా సైనిక చర్య ఉంటుందని ట్రంప్ చెప్పినట్లే చేస్తారా?డిమాండ్లు విఫలం కావడానికి ప్రధాన కారణంఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయదన్న హామీ కావాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. ఇదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాన లక్ష్యం. చర్చల సమయంలో డొనాల్డ్ ట్రంప్‌తో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నిరంతరతరం సంప్రదింపులు జరిపారు. అమెరికా డిమాండ్లను అసంబద్ధం అంటూ ఇరాన్ తిరస్కరించింది. అణు పరిమితులు, ప్రాంతీయ అంశాలపై వాషింగ్టన్ వైఖరి చర్చల పురోగతిని అడ్డుకుందని ఇరాన్ మీడియా తెలిపింది.ఇటీవల కొన్ని వారాల యుద్ధం తర్వాత అమెరికా-ఇరాన్ మధ్య నమ్మకం బాగా తగ్గిపోయింది. ఒకేసారి జరిగిన చర్చల్లోనే పరిష్కారం రావాలని ఆశించడం సరికాదని ఇరాన్ అభిప్రాయపడ్డారు. పలు అంశాలపై ఇరాన్ ఏ మాత్రం తగ్గలేదు. ఇరాన్ “రెడ్ లైన్లు”గా ఆంక్షల ఉపశమనం, యుద్ధ పరిహారం, లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్యలపై పరిమితులను ప్రస్తావించింది. హార్మూజ్ జలసంధి అంశం ఇరు దేశాలపై ఒత్తిడి పెంచింది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు, హిజ్బుల్లాపై ఆపరేషన్లు చర్చలను మరింత క్లిష్టం చేశాయి.యుద్ధం ప్రారంభం నుంచి 2,000 మందికి పైగా మరణించారని లెబనాన్ అధికారులు తెలిపారు. హిజ్బుల్లాతో కాల్పుల విరమణను ఇజ్రాయెల్ తిరస్కరించింది. తాము నిజాయితీతో చర్చించామని అమెరికా, ఇరాన్ రెండు దేశాలూ చెప్పుకుంటున్నాయి. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన 14 రోజుల కాల్పుల విరమణ ఏమవుతుందన్న విషయంపై, తదుపరి చర్యలపై చర్చలు విఫలమయ్యాక వాన్స్ స్పష్టత ఇవ్వలేదు. రెండు పక్షాలు కాల్పుల విరమణ పాటించాలని పాకిస్థాన్ కోరింది.అమెరికా చెప్పినట్లు చేస్తే భారీ విధ్వంసంఒప్పందం కుదరకపోవడంతో ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దౌత్య ప్రయత్నాలు తిరిగి మొదలవుతాయా? కాల్పుల విరమణ ముగుస్తుందా? అన్న ప్రశ్నలు మొదట వస్తున్నాయి. చర్చలు కుదరకపోవడంతో పశ్చిమాసియాలో అస్థిరత పెరిగే ప్రమాదం ఉంది. ప్రస్తుతమైతే కాల్పుల విరమణ కొనసాగుతోంది.తదుపరి చర్యలపై స్పష్టత లేదు. చర్చలు విఫలమైన తర్వాత ఇరాన్‌పై మళ్లీ దాడులు జరిగే ప్రమాదం పెరిగింది. హార్మూజ్ జలసంధి వివాదం పరిష్కారం కాలేదు. చర్చల ద్వారా తిరిగి తెరవడంపై అనిశ్చితి నెలకొంది. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ నౌకల మోహరింపుతో ఇరాన్‌పై సైనిక చర్యకు అమెరికా ఇప్పటికీ సిద్ధంగానే ఉంది. ఒప్పందం కుదరకపోతే భీకర దాడులు చేస్తామని ఇప్పటికే ట్రంప్ ప్రకటించడంతో చెప్పినట్లే చేస్తారా? అన్న ఆందోళన నెలకొంది. అమెరికా తన సైన్యాన్ని ఇరాన్ సరిహద్దులకు సమీపంలోకి తరలించింది. ఒప్పందం కుదిరే వరకు ఈ బలగాలు అక్కడే ఉంటాయని ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ భూభాగంలోకి సైన్యం ప్రవేశిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇటు ఇరాన్ కూడా హెచ్చరించింది. గతంలో అఫ్గానిస్థాన్, ఇరాక్‌లో అమెరికా చేసిన ఆపరేషన్లు గుర్తుకు వస్తున్నాయి. అయితే, అమెరికా భూతలదాడులు చేస్తే కొన్నేళ్లపాటు యుద్ధం జరిగే అవకాశాలు ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు, మొదట ఇరాన్‌లోని విద్యుత్ ప్లాంట్లు, బ్రిడ్జిలను కుప్పకూల్చుతామని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. గతంలో ఎవరూ చూడని విధంగా మరింత పెద్దగా, మెరుగ్గా, శక్తిమంతంగా సైనిక చర్య ఉంటుందని, ఈ నిర్ణయాన్ని ముందే తీసుకున్నామని ట్రంప్ చెప్పారు. అమెరికా చెప్పినట్లు చేస్తే భారీ విధ్వంసమే జరుగుతుంది. -
కొత్త ప్రపంచం వైపు అడుగులు?
‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ అనే ట్రంప్ నినాదం ఆచరణలో తల్లకిందులు కాబోయే కాలం తరుముకొస్తున్నదా? ప్రపంచ వ్యాప్తంగా ఈ చర్చ జరుగుతున్నది. ఇప్పటికీ అమెరికా సూపర్ పవర్ హోదాను అనుభవిస్తూనే ఉన్నది. అమెరికా ఆజ్ఞలు ఖండాంతరాల్లో ఇంకా చెల్లుబాటు అవుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది మధ్యతరగతి యువతీ యువకులకు అమెరికా ఒక ఆశల పందిరిగా దర్శనమిస్తూనే ఉన్నది. తానా అంటే తందానా అనేందుకు పాకిస్తాన్ వంటి తొత్తు దేశాలు కూడా అమెరికాకు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచ జీడీపీలో అమెరికా అతి పెద్ద వాటాదారుగానే కొనసాగుతున్నది. దాని మిలిటరీ బడ్జెట్ ఒక్కటే భారతదేశపు మొత్తం బడ్జెట్‌కు రెట్టింపు.అయినప్పటికీ భవిష్యత్తులో అమెరికాకు దిగే మెట్లు తప్ప ఎక్కే మెట్లు లేవనే వాదన బలంగా వినిపిస్తున్నది. అంతర్జాతీయ రిజర్వు కరెన్సీగా అమెరికా డాలర్ పెత్తనం కారణంగా 39 ట్రిలియన్ డాలర్ల అప్పును అది మేనేజ్ చేయగలుగుతున్నది. కానీ డాలర్ పెత్తనానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. ‘బ్రిక్స్’ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి చేరితే అమెరికాకు గడ్డు కాలమే! ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడి ఫలితాలు ప్రమాదకరమైన ఫలితాలనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హార్మూజ్‌ను ‘విముక్తం’ చేయకుండా, ఇరాన్ పాలనా వ్యవస్థను మార్చకుండా యుద్ధం నుంచి తప్పుకొంటే డాలర్ పెత్తనానికి పునాది వంటి పెట్రో డాలర్ వ్యవస్థ విచ్ఛిన్నం కావచ్చు. యుద్ధం కొనసాగిస్తే రోజులూ, నెలల్లో అది ముగిసే అవకాశం లేదు. మోయలేని భారంగా మారుతుంది.వాణిజ్య రంగంలో ట్రంప్ స్వీయ రక్షణాత్మక చర్యలు చేపట్టారు. దేశాల వారీగా వాణిజ్య లోటును సవరించుకునే పేరుతో ఎడాపెడా ట్యారిఫ్‌లు విధిస్తూ పోతున్నారు. ఈ చర్యలు అంతిమంగా అమెరికాకు నష్టం చేస్తాయని నిపుణులు చెబు తున్న మాటలను ఆయన చెవికెక్కించుకోవడం లేదు. ట్యారిఫ్ దాడులతో ఆయన అంతర్జాతీయ సమాజం నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆర్థిక గమనాన్ని సంపూర్ణంగా మార్చే సామర్థ్యం గల ఏఐ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో చైనా భారీయెత్తున పెట్టుబడులు పెట్టింది. ఈ రేస్‌లో రెండు దేశాల మధ్య దూరం పెద్దగా లేదు. త్వరలో చైనావాళ్లు అమెరికాను ఓవర్టేక్ చేసినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదనే అంచనాలు వెలువడుతున్నాయి.దౌత్యపరంగా కూడా ట్రంప్ దారుణమైన వైఫల్యాలను మూటగట్టుకుంటున్నారు. ఎనిమిది దశాబ్దాలుగా అమెరికాకు కుడిభుజంగా ఉంటున్న ‘నాటో’ కూటమిని ఆయన స్వయంగా విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. గ్రీన్‌ల్యాండ్ రచ్చ, క్యూబాకు బెదిరింపులు, వెనుజువేలా అధ్యక్షుని కిడ్నాప్ వంటివన్నీ అంత ర్జాతీయ సమాజం నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కోవలసి వచ్చాయి. యుద్ధరంగంలో వస్తున్న సాంకేతికపరమైన మార్పులు అమెరికా భారీ మిలిటరీని కలవరపెడుతున్నాయి. చౌకరకం డ్రోన్లు, సైబర్ తంత్రాలు, ఉపగ్రహ విధ్వంసక దాడులు పైచేయి సాధిస్తున్నాయి. ఇరాన్ ఘర్షణలో ఈ పరి ణామం అనుభవంలోకి వచ్చింది. భారీ బడ్జెట్ సినిమాలను చిన్న సినిమాలు అల్లాడించాయి.ఈ రకమైన పరిణామాలన్నీ అమెరికా ఏకచ్ఛత్రాధిపత్యా నికి క్రమక్రమంగా ఎసరు పెట్టే స్వభావం కలిగినవే! కాకపోతే ఈ క్రమాన్ని ఇరాన్ యుద్ధం వేగిరపరిచిందనే అంచనాలు వెలు వడుతున్నాయి. ఈ సందర్భంగా రెండో ప్రపంచ యుద్ధానంతర అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు నికోలస్ స్పీక్‌మాన్ ప్రతి పాదించిన రిమ్‌ల్యాండ్ థియరీని గుర్తుచేస్తున్నారు. యూరే షియా ప్రధాన భూభాగానికి అంచు మాదిరిగా ఉండే తీర ప్రాంతాన్ని ‘రిమ్‌ల్యాండ్’ అన్నారు. స్పీక్‌మాన్ లెక్క ప్రకారం పశ్చిమ యూరప్ నుంచి మొదలుకుని పశ్చిమాసియా, దక్షిణా సియా, తూర్పు ఆసియా, ఆగ్నేయాసియాలు ఈ రిమ్‌ల్యాండ్ పరిధిలోకి వస్తాయి. ఇరవయ్యో శతాబ్దం అట్లాంటిక్ దేశాలదైతే, ఇరవై ఒకటో శతాబ్దం మాత్రం ఈ రిమ్ల్యాండ్దేననీ, ఈ ప్రాంతంపై ఎవరు ఆధిపత్యం సాధిస్తే వారిదే ప్రపంచాధిపత్య మని ఆయన ప్రతిపాదించారు.తర్వాత కాలంలోని అమెరికన్ అంతర్జాతీయ నిపుణులు రిమ్‌ల్యాండ్ థియరీ నుంచి పశ్చిమ యూరప్‌ను తొలగించి ఆఫ్రికా కొమ్ము దగ్గర నుంచి అరబ్ ద్వీపకల్పం, పర్షియా పీఠ భూమి, భారత ఉపఖండం మీదుగా తూర్పున చైనా కోస్తా ప్రాంతం దాకా, ఆగ్నేయంగా ఇండోనేషియా ద్వీప సముదాయం దాకా ఈ పరిధిలోకి వస్తుందని చెబుతున్నారు. కైరో నుంచి జకార్తా దాకా అనవచ్చు. లేదా ఎర్ర సముద్రం నుంచి దక్షిణ చైనా సముద్రం (తూర్పు), జావా సముద్రం (ఆగ్నేయం) దాకా అని కూడా చెప్పవచ్చు. హిందూ మహాసముద్ర ప్రాంత మని కూడా పిలవవచ్చు. ‘ఇది ఇండియన్ ఓషన్ సెంచరీ’ అని పిలవడంలో అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులకు ఏకాభి ప్రాయం ఉన్నది.యూరప్ దేశాల వలసల వేటలకు ముందు ఈ ప్రాంత వాణిజ్యాన్ని భారత్, చైనాలు శాసించాయి. భూమార్గం ద్వారా యూరేషియా ప్రాంతాలలో చైనా వర్తకం జరిగితే సముద్రమార్గ వాణిజ్యంలో భారత్ ఆధిపత్యం వహించింది. భారత నావికా దళాలు ఆగ్నేయాసియా దేశాల్లో హిందూ సామ్రాజ్యాలను నెల కొల్పిన చరిత్ర మనకు తెలిసిందే. హార్మూజ్ జలసంధి ద్వారా ఇప్పుడు పెట్రోలియం తెచ్చుకుంటున్నాం కానీ, పూర్వకాలంలో ఎక్కువగా అరబ్బీ గుర్రాలను ఇక్కడినుంచే తీసుకొచ్చేవారట! ప్రాచీన తెలుగు సాహిత్యంలో హురుమంజి (హార్మూజ్) ప్రస్తా వన చాలా సందర్భాల్లో వచ్చిందని చెబుతున్నారు.అత్యధిక జనాభా, అందులోనూ యువతరం, వేగంగా పెరుగుతున్న మధ్యతరగతి జనాభా, విస్తారంగా సహజ వన రులు, ప్రపంచ వాణిజ్యంలో సింహభాగాన్ని ఆక్రమిస్తున్న నేపథ్యం దృష్ట్యా ఇండియన్ ఓషన్ ప్రాంతాన్ని అమెరికా విదేశాంగ నిపుణులు ప్రత్యేక దృష్టితోనే చూస్తూ వచ్చారు. ఇక్కడ ఆధిపత్యాన్ని కోల్పోతే ప్రపంచాధిపత్యానికి కూడా నూకలు చెల్లినట్టే అనే అవగాహన వారికి మొదటి నుంచి ఉన్నది. అందుకే డిగోగార్షియా దీవిలో అతిపెద్ద మిలిటరీ స్థావ రాన్ని అమెరికా ఏర్పాటు చేసుకున్నది. వివిధ దేశాల్లో ఉన్న స్థావరాల కంటే ఇది చాలా పెద్దది. ముఖ్యంగా పశ్చిమాసియా వ్యవహారాలను అదుపు చేయడం దీని బాధ్యత. తూర్పున ఇండో–పసిఫిక్ ప్రాంతంలో అమెరికా తన బలిష్ఠమైన సప్తమ నౌకాదళాన్ని (సెవెంత్ ఫ్లీట్) చాలాకాలం నుంచే మోహరించింది. అయినప్పటికీ ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా నుంచి అమెరికాకు గట్టి పోటీనే ఎదురుకానున్నది. ఇరాన్ యుద్ధ ఫలి తంగా పశ్చిమాసియాలో అమెరికా తన పట్టును కోల్పోతే ఒక సరికొత్త నూతన అధ్యాయానికి స్వాగతం పలకడానికి ప్రపంచం సిద్ధంగా ఉంటుంది.ఇరాన్‌పై ‘ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో మహా విధ్వంసకరమైన దాడికి ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా ఎందుకింత హఠాత్తుగా ఒడిగట్టిందో అమెరికా అధికార వర్గాలే అర్థం చేసుకోలేకపోతు న్నాయి. బిలియన్లకొద్దీ డాలర్లను ఏ ప్రయోజనాన్ని ఆశించి తగ లేస్తున్నారని అమెరికన్లు నిలదీస్తున్నారు. ఆరు వారాల యుద్ధం తర్వాత ఈరోజు (శనివారం) పాకిస్తాన్లో ఇరాన్ – అమెరికాలు చర్చలకు ఉపక్రమించాయి. ఆరు వారాల యుద్ధంలో అమెరికా సాధించిందేముంది? అలీ ఖమేనీని, ఉన్నత స్థానాల్లోని మరి కొందరినీ హతం చేశారు. కానీ పాలనా వ్యవస్థ మారలేదు. ఇరాన్ పాలనా వ్యవస్థను మార్చడమన్నది అమెరికా పెట్టుకున్న ప్రధానమైన మూడు యుద్ధ లక్ష్యాల్లో ఒకటి. అది నెరవేరలేదు.అణుశుద్ధి కార్యక్రమాలను పూర్తిగా నిర్మూలించడం మరో లక్ష్యం. అదీ నెరవేరలేదు. పైగా ఇరాన్ ఇప్పటికే అణ్వస్త్రాలను సమకూర్చుకోగల సామర్థ్యాన్ని సంతరించుకున్నదని ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త థియోడర్ పోస్టల్ సంచలన విషయాన్ని బయటపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా పలు టెలివిజన్లు శనివారం నాడు ఆయన ఇంటర్వ్యూలను ప్రసారం చేశాయి. హార్మూజ్ మార్గాన్ని ఇరాన్ చెర నుంచి విముక్తి చేస్తామని పలికిన బీరాలు కూడా నీరుగారిపోయాయి. ఇరాన్ దర్జాగా తన కరెన్సీలో టోల్ వసూలు చేసుకుంటున్నది. చివరికి చర్చల ప్రారంభానికి ముందు కూడా ట్రంప్ తన హూంకరింపులను ఆపలేదు. ఇరాన్ ఒప్పందానికి రాకపోతే భారీ విధ్వంసం ఉంటుందనీ, నౌకల్లోకి ఆయుధాలను లోడ్ చేస్తున్నామనీ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. అదేదో తెలుగు సినిమాలో ‘రమణా లోడెత్తాలిరా, టోల్గేట్ పడుతుందీ’ అనే పాపులర్ డైలాగ్ ఉంటుంది.ఆరు వారాల్లో ట్రంప్ రకరకాల మాటలు విన్నవారికి అదే గుర్తొస్తుంది. నాలుగైదు రోజుల కింద ‘ఈ రాత్రితో ఒక నాగరికత అంతం కాబోతోందం’టూ ట్రంప్ చేసిన హెచ్చరికపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. నాగరికతలను అంతం చేసే విప రీత బుద్ధి ఏమిటని ప్రశ్నించారు. పర్షియా (ఇరాన్) చరిత్రలో ప్రసిద్ధుడెన సైరస్ ది గ్రేట్ చక్రవర్తి ఆదర్శాలు తనకు స్ఫూర్తి నిచ్చాయని అమెరికా స్వాతంత్య్ర ప్రకటనను రూపొందించిన థామస్ జెఫర్సన్ ప్రకటించారు. 2500 సంవత్సరాలకు పూర్వం సైరస్ ది గ్రేట్ బాబిలోన్‌ను జయించినప్పుడు అక్కడి బానిస లందరికీ, అలాగే ఖైదీలకూ విముక్తి ప్రసాదించారు. వీరిలో పెక్కుమంది యూదులు. తన సామ్రాజ్యంలో మత స్వేచ్ఛనూ, జాతి సమానత్వాన్నీ ఆ రోజుల్లోనే ప్రబోధించారు. అటువంటి నాగరికతను ట్రంప్ అంతం చేయడానికి సిద్ధమయ్యాడు.పాక్‌లో ప్రారంభమైన చర్చలు ఒకటి రెండు రోజుల్లో ముగిసే అవకాశం లేదు. అమెరికాకు మెసెంజర్‌గా ప్రారంభ మైన పాకిస్తాన్ పాత్ర చర్చల్లో మధ్యవర్తి స్థాయికి మారింది. ఇరాన్ ఇప్పటికీ పాక్‌ను పూర్తిగా నమ్మడం లేదు. యుద్ధంలో అమెరికాతో పాటు భాగస్వామిగా ఉన్న ఇజ్రాయెల్‌కు చర్చల్లో ఏ పాత్రా లేదు. పాకిస్తాన్ మిలిటరీ అధిపతి ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్‌పై ట్రంప్‌కు అవ్యాజమైన అనురాగం ఉన్నది. ట్రంప్ శాంతికాముకతకు నోబెల్ బహుమతి ఇవ్వాలని మునీర్ బహిరంగంగా డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అమెరికాకు ఏజెంట్‌గా పనిచేసే వ్యక్తిని ఇరాన్ మధ్య వర్తిగా అంగీకరించడానికి చైనా సలహానే కారణమనే అభిప్రాయం ఉన్నది.పేరుకు పాకిస్తాన్లో ఎన్నికైన ప్రభుత్వం ఉన్నా అన్ని వ్యవహారాలూ మునీర్ చేతుల మీదుగానే నడిచిపోతున్నాయి. మరో ఫీల్డ్ మార్షల్ అయూబ్ ఖాన్ మాదిరిగా పాక్ పాలనా పగ్గాలను అందిపుచ్చుకోవాలని మునీర్ ఉవ్విళ్లూరుతున్నారు. అమెరికా, చైనాల సహకారం ఉన్నది కనుక అతని కోరిక నెరవేరే అవకాశం ఉండవచ్చు. భారత్‌పై విపరీతమైన వ్యతిరేకత ఉన్న వ్యక్తి మునీర్. కశ్మీర్ కోసం వెయ్యేళ్లయినా యుద్ధం చేస్తామన్న భుట్టో మాటల్ని పదేపదే వల్లెవేస్తుంటాడు. ఆయన ఏర్పాట్లతో జరుగుతున్న చర్చల ఫలితంపై ఆయనకే ఆసక్తి లేదు. ప్రజల్లో తన ప్రతిష్ఠ పెరగడం, అమెరికా ఆజ్ఞలు పాటించడమే ఆయనకు కావాల్సింది! పరస్పర విరుద్ధమైన డిమాండ్లపై కాలయాపన కోసమే రెండు దేశాలూ చర్చలకు సిద్ధమయ్యాయన్న అభిప్రాయం ఉన్నది.ఇరాన్‌కు లోపాయకారీ సహాయం చేయడం తప్ప యుద్ధం విషయంలో చైనా బహిరంగంగా మాట్లాడడం లేదు. శత్రువు వ్యూహాత్మక తప్పిదాలు చేస్తున్నప్పుడు, అందులో తలదూర్చ వద్దనేది యుద్ధనీతి. తప్పిదం ఫలితాన్ని శత్రువు అనుభవిస్తాడు. ఇంకో నెలరోజుల్లో ట్రంప్ – షీ జిన్‌పింగ్‌ల మధ్య శిఖరాగ్ర సమావేశం జరగనున్నది. ఈ లోపల ఇరాన్ యుద్ధంలో చేతులు కాల్చుకొని బలహీనపడే ట్రంప్ తన ఎదురుగా కూర్చుంటే గట్టిగా బేరమాడే శక్తి షీకి లభిస్తుంది. చైనా వాళ్లకు వ్యాపార కిటుకులు బాగా తెలుసు. ట్రంప్ ఇరాన్ యుద్ధంలో నిజంగానే చేతులు కాల్చుకుంటే ఇరాన్ ఒక బలమైన ప్రాంతీయ శక్తిగా ఎదుగుతుంది. ఇప్పటికే రిమ్‌ల్యాండ్ తూర్పున ఉన్న చైనా ఒక బలమైన శక్తి. దృఢమైన నాయకత్వం ఉంటే భారత్ కూడా ప్రభావ శీల శక్తిగా ఎదిగేందుకు చాలా అవకాశాలున్నాయి. రానున్న రోజుల్లో ప్రాంతీయ శక్తుల ఆవిర్భావం జరిగి, బహుముఖీన ఒప్పందాలతో అంతర్జాతీయ సంబంధాలు కొనసాగవచ్చు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఇరాన్ విమానంలో రక్తంతో తడిసిన బ్యాగులు, బూట్లు..
ఇస్లామాబాద్: చర్చలకు పాకిస్తాన్ వచ్చిన ఇరాన్ విమానంలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. రక్తసిక్తమైన స్కూల్ బ్యాగులు, బూట్లు, మృతి చెందిన చిన్నారుల ఫొటోలను తమ వెంట తీసుకువచ్చారు. మినాబ్ స్కూల్ మృతుల కోసం ఒక్కో సీటు కేటాయించారు. అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికే దిశగా పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు ఇవాళ ప్రారంభం కాగా.. ఈ చర్చలకు హాజరైన ఇరాన్ ప్రతినిధి బృందం రక్తసిక్తమైన స్కూల్ బ్యాగులు, బూట్లు, మృతి చెందిన చిన్నారుల ఫొటోలను తమ వెంట తీసుకురావడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది.మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం వల్ల సంభవిస్తున్న మానవ ప్రాణ నష్టానికి ఇవి నిదర్శనంగా నిలిచాయి. సోషల్ మీడియాలో ఒక ఫోటోను పంచుకుంటూ, ఘలీబాఫ్ ఇలా రాశారు: "ఈ విమాన ప్రయాణంలో నా సహచరులు వీరే.. #Minab168" అంటూ ట్వీట్ చేశారు. యుద్ధానికి ముగింపు పలకాలని ఆశిస్తూ, అమెరికాతో చర్చల కోసం ఇస్లామాబాద్ వెళ్తున్న ఈ ప్రతినిధి బృందానికి 'మినాబ్ 168' అని పేరు పెట్టారు. యుద్ధం ప్రారంభమైన మొదటి రోజున అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన పాఠశాల విద్యార్థుల జ్ఞాపకార్థం ఈ పేరును నిర్ణయించారు. దక్షిణాఫ్రికాలోని ఇరాన్ రాయబార కార్యాలయం కూడా ఈ ఫోటోను రీ-షేర్ చేస్తూ.. "మినాబ్ చిన్నారులను మేము ఎప్పటికీ మర్చిపోము" అని రాసింది.همراهان من در این پرواز#Minab168 pic.twitter.com/xvXmDlSDiF— محمدباقر قالیباف | MB Ghalibaf (@mb_ghalibaf) April 10, 2026మినాబ్‌లో ఏం జరిగింది?ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 160 మందికి పైగా చిన్నారులు మరణించారు. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైన రోజున దక్షిణ ఇరాన్‌లోని మినాబ్ పట్టణంలో ఉన్న 'షజరే తయ్యిబే' అనే బాలికల ప్రాథమిక పాఠశాలపై ఈ దాడి జరిగింది. ఈ దాడి జరిగిన కొద్ది రోజుల తర్వాత, ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ ఒక వైమానిక చిత్రాన్ని షేర్ చేశారు. అందులో "అమాయక" బాలికల మృతదేహాలను పూడ్చిపెట్టడానికి సామూహిక సమాధులను తవ్వుతున్న దృశ్యాలు ఉన్నాయి. అదే పోస్ట్‌లో అరాగ్చీ, ట్రంప్‌పై విమర్శలు చేస్తూ దీనిని 'కోల్డ్ బ్లడెడ్ మర్డర్'(క్రూరమైన హత్య) గా అభివర్ణించారు. -
పాఠశాలలు, ఆసుపత్రులపై టార్గెట్.. ఇరాన్ లో యుద్ధ విధ్వంసం బట్టబయలు
-
అగ్రరాజ్యానికి ఇరాన్ గట్టి సవాల్ ఇరాన్ వ్యూహం ఏంటీ..?
-
ఇరాన్ మాజీ మంత్రి మృతి.. కమల్ ఖారాజీ మరణంతో ఉద్రిక్తతలు
-
అమెరికా-ఇరాన్ చర్చలపై ప్రతిష్టంభన
పశ్చిమాసియా యుద్ధం మరో మలుపు తిరిగేలా కనిపిస్తోంది. అమెరికా-ఇరాన్ మధ్య జరగాల్సిన శాంతి చర్చలపై ప్రతిష్టంభన నెలకొంది. లెబనాన్ అంశంపై తేల్చేంత వరకు తాము చర్చలకు వెళ్లబోమని ఇరాన్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రభుత్వ మీడియా ఫార్స్ న్యూస్ అధికారికంగా ధృవీకరించింది. రెండు వారాల యుద్ధ విరమణ ప్రకటించిన ఇరు దేశాలు.. ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలకు సిద్ధపడిన సంగతి తెలిసిందే. ఇందుకోసం పాకిస్తాన్ ఏర్పాట్లు కూడా చేసింది. ఉభయ పక్షాలను వేర్వేరు చోట్ల కూర్చోబెట్టి చర్చలు జరపాలని భావించింది. అయితే.. లెబనాన్‌కు కాల్పుల విరమణ వర్తించబోదని చెబుతూ ఇజ్రాయెల్ భీకర దాడులతో విరుచుకుపడుతోంది. ఈ దాడులను ఖండిస్తున్న ఇరాన్.. లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు ఆపితేనే తాము చర్చలకు ముందుకు వస్తామని మెలిక పెట్టింది. -
ఇంత అసహ్యంగా మాట్లాడతారా?.. పాక్ మంత్రికి స్ట్రాంగ్ కౌంటర్
ఇరాన్-అమెరికా శాంతి చర్చల వేళ.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లెబనాన్ అంశం తేల్చే వరకు చర్చలు సజావుగా సాగవంటూ ఓపక్క ఇరాన్ కొత్త పాట పాడుతోంది. మరోపక్క ఈ చర్చలకు మధ్యవర్తిగా ఉన్న పాకిస్తాన్‌పై ఇజ్రాయెల్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో బాహాటంగానే ఇరు దేశాలు తీవ్ర విమర్శలు గుప్పించుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇస్లామాబాద్‌లో శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో.. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చేసిన ఓ ట్వీట్ తీవ్ర దుమారం రేపింది. లెబనాన్ దాడుల విషయంలో ఇజ్రాయెల్‌పై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారాయన. ఇజ్రాయెల్ అనే దేశం క్యాన్సర్‌లాంటిదని, ప్రపంచానికి పట్టిన శాపమన్న రీతిలో వ్యాఖ్యానించారు. ‘‘ఇస్లామాబాద్‌లో శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ.. అటు లెబనాన్‌లో అమాయకుల్ని ఇజ్రాయెల్ చంపుతోంది. గాజా, ఇరాన్ తర్వాత.. లెబనాన్‌లో రక్తపాతం కొనసాగిస్తోంది. అలాంటి దేశాన్ని పుట్టించినవాళ్లు నరకంలో కాలిపోతూ చిత్రహింసలు అనుభవించాలని కోరుకుంటున్నా’’ అంటూ సోషల్ మీడియాలో ఆసిఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఆసిఫ్ వ్యాఖ్యలకు గట్టి కౌంటరే పడింది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం స్పందిస్తూ.. ఇజ్రాయెల్ నాశనం కోరుకుంటున్న పాకిస్తాన్ మంత్రి వ్యాఖ్యలు అసహ్యకరంగా ఉన్నాయని అన్నారు. ఏ దేశం ఇలాంటి వ్యాఖ్యలను స్వాగతించబోదని.. పైగా శాంతి చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న దేశం నుంచి ఇలాంటివి ఊహించలేం అంటూ పేర్కొంది. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియోన్ సర్ కూడా పాక్ నాయకత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇజ్రాయెల్‌ను క్యాన్సర్ జబ్బుతో పోల్చడం అంటే.. ఒక దేశ నాశనాన్ని కోరుకోవడమేనని, ఇలాంటి వ్యాఖ్యలు ఏమాత్రం మంచివి కావని అన్నారు. ఇజ్రాయెల్-పాకిస్తాన్ మధ్య ఏనాడూ అధికారిక సంబంధాలు లేవు. అయితే.. ఇరాన్-అమెరికా యుద్ధంలో చైనాతో పాటు పాక్ మధ్యవర్తిత్వం వహించడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. కానీ ఈ వ్యవహారంలో పాక్ పాత్ర ఏమీ ఉండకపోవచ్చని.. అసలు ఆ దేశాన్ని నమ్మడానికే వీల్లేదని ఇజ్రాయెల్ అంటోంది. గతంలో గాజా విషయంలో గల్ఫ్ దేశాల సాయం తీసుకున్న ట్రంప్.. ఇప్పుడు పాక్‌ను కూడా వాడుకుంటున్నట్లు కనిపిస్తోందని చెబుతోంది. ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు జరగాల్సిన టైంలో.. పాక్-ఇజ్రాయెల్ మధ్య దౌత్యపరంగా మాటల యుద్ధం ఎటు దారి తీస్తుందో చూడాలి. -
ఇరాన్‌కు అమెరికా మరోసారి వార్నింగ్
పశ్చిమాసియా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకోబోతోందా?. శాశ్వాత శాంతి స్థాపనే ధ్యేయంగా ఇరాన్-అమెరికాలు చర్చలకు ముందుకు వచ్చాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ పాటిస్తున్న ఇరు దేశాలు.. ఇస్లామాబాద్ వేదికగా చర్చలకు సిద్ధమయ్యాయి. అయితే ఈ చర్చలపై సందిగ్ధత నెలకొంది. -
తగ్గినట్లే తగ్గి.. ట్విస్ట్ ఇచ్చిన నెతన్యాహు
పశ్చిమాసియా యుద్ధంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. లెబనాన్‌పై దాడుల విషయంలో తగ్గినట్లే కనిపించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. ఆ వెంటనే ‘తూచ్’ అనేశారు. ఓవైపు శాంతి చర్చలకు సిద్ధమంటూనే.. మరోవైపు దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. లెబనాన్‌తో ప్రత్యక్ష చర్చలకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఎట్టకేలకు అంగీకరించారు. వీలైనంత త్వరగా చర్చలు ప్రారంభించాలని సంబంధిత కేబినెట్ అధికారులకు సూచించారాయన. అదే సమయంలో.. లెబనాన్ విషయంలో కాల్పుల విరమణ అనేది ఉండబోదని కుండబద్ధలు కొట్టారు. హెజ్బోల్లా సంస్థను నామ రూపాలు లేకుండా చేసేంత వరకు ఐడీఎఫ్(ఇజ్రాయెల్ సైన్యం) సైనిక చర్య కొనసాగుతుందని పేర్కొన్నారాయన. ‘‘అందరికీ ఒక్కటే చెప్పదల్చుకున్నా. లెబనాన్ విషయంలో కాల్పుల విరమణ అనేది ఉండబోదు. హెజ్బోల్లాపై మా శాయశక్తులు దాడులు కొనసాగిస్తాం. శాంతిని నెలకొల్పుతాం’’ అని ప్రకటించారు. లెబనాన్ నుంచి పదే పదే విజ్ఞప్తులు రావడంతోనే శాంతి చర్చలకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన నెతన్యాహు.. రెండు లక్ష్యాలను తమ ముందు పెట్టుకున్నామని చెప్పారు. ఒకటోది.. హెజ్బోల్లాకు ఆయుధాలు అందకుండా చేసి ఆ గ్రూప్‌ను అంతమొందించడం, రెండోది లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య శాశ్వతంగా శాంతి పరిస్థితులు నెలకొల్పడం అని ప్రకటించారు. రెండు వారాల యుద్ధ విరమణకు అమెరికా-ఇరాన్ ముందుకు వచ్చినప్పటికీ.. ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్‌పై భీకర దాడులకు దిగింది. ఈ దాడుల్లో సుమారు 300 మంది మరణించారు. ఈ పరిణామంపై ఇరాన్ భగ్గుమంది. ఇది ఇస్లామాబాద్(పాక్) వేదికగా జరగబోయే శాంతి చర్చలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని చెబుతూ.. హర్ముజ్‌ను మళ్లీ మూసేసింది. లెబనాన్‌పై దాడులు కొనసాగితే.. తాము తిరిగి యుద్ధం ప్రారంభిస్తామని బెదిరించింది కూడా. అయితే కాల్పుల విరమణ అనేది లెబనాన్‌కు వర్తించబోదని అటు అమెరికా, ఇటు ఇజ్రాయెల్‌లు చెబుతున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో అమెరికా వేదికగా.. లెబనాన్-ఇజ్రాయెల్ శాంతి చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
సందిగ్ధత నడుమ శాంతి
దుబాయ్/ఇస్లామాబాద్/బీరూట్/వాషింగ్టన్: పాకిస్తాన్ అస్తవ్యస్థ మధ్యవర్తిత్వంతో అమల్లోకి వచ్చిన ‘రెండు వారాల కాల్పుల విరమణ’పూర్తి సందిగ్ధవాతావరణంలో కొనసాగుతోంది. ఓవైపు లెబనాన్‌పై దాడులు ఆపేదిలేదని ఇజ్రాయెల్ తెగేసి చెప్పడం, మరోవైపు లెబనాన్‌పై దాడులుచేస్తే హార్మూజ్ పీకనొక్కేసి నౌకల రాకపోకలను శాశ్వతంగా మూసేస్తామన్న ఇరాన్ ప్రకటనతో అసలు కాల్పులవిరమణ అనేది ఏ స్థాయిలో అమలవుతోందనే ప్రశ్న యావత్ ప్రపంచప్రజలను వేధిస్తోంది. కాల్పుల విరమణ మొదలయ్యాక సైతం లెబనాన్‌పై బుధవారం ఇజ్రాయెల్ దాడులు చేయడంతో కన్నెర్రజేసిన ఇరాన్ కొన్ని నిమిషాల్లోనే మళ్లీ హార్మూజ్ జలసంధిని మూసేసింది. దీంతో పర్షియన్ గల్ఫ్ గుండా చమురు, పెట్రో ఉత్పత్తుల నౌకల రాకపై గంపెడాశలు పెట్టుకున్న ప్రపంచదేశాలు వెనువెంటనే నిట్టూర్చాయి. మరోవైపు తమ గగనతలంలోకి గత 24 గంటల్లో ఎలాంటి శత్రు క్షిపణులు, డ్రోన్లు చొరబడలేదని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్ గురువారం ప్రకటించాయి. పాకిస్తాన్లో జరగబోయే చర్చల్లో ఎలాంటి ఫలితం వస్తుందో? చర్చలు విఫలమైతే మళ్లీ భీకరదాడులు, ప్రతిదాడులు తప్పవేమోనన్న భయాందోళనల పీడకల ప్రపంచదేశాలను వదిలిపోవట్లేదు. మరోవైపు తమపై ఇజ్రాయెల్ బుధవారం జరిపిన భీకరదాడిలో పెద్దసంఖ్యలో జనం ప్రాణాలుకోల్పోవడంతో ఆ దేశంతో చర్చలకు సిద్ధమని లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్ ప్రకటించారు. దీంతో నేరుగా చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రకటించారు. ‘‘నేరుగా చర్చలు జరపాలని కేబినెట్ మంత్రులను ఆదేశించా. లెబనాన్‌లో హెజ్బొల్లా సాయుధులు తమ ఆయుధాలను త్యజించాల్సిందే. అప్పుడే ఇరుదేశాల మధ్య శాంతియుత సంబంధాలపై దృష్టిసారించగలం’’అని నెతన్యాహూ అన్నారు. లెబనాన్‌పై భీకరదాడులు కొనసాగుతాయన్న కొద్దిసేపటికే ఆయన ఇలా భిన్నమైన ప్రకటనచేయడం గమనార్హం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచనమేరకే నెతన్యాహూ లెబనాన్‌తో నేరుగా చర్చలకు అంగీకరించారని తెలుస్తోంది. వాషింగ్టన్లో వచ్చేవారం జరగబోయే ఈ చర్చల్లో అమెరికాలో ఇజ్రాయెల్ రాయబారి యేషెల్ లీటెర్, లెబనాన్‌లో అమెరికా రాయబారి మైఖేల్ పాల్గొంటారని తెలుస్తోంది. మా వేలు ట్రిగ్గర్మీదే ఉంది.. కాల్పుల విరమణ ప్రతిపాదనల్లో లెబనాన్ పేరు చేర్చినా ఇజ్రాయెల్ దాడులు ఆపకపోవడంపై ఇరాన్ మండిపడింది. లెబనాన్‌పై దాడులుచేస్తే మరింతగా రెచ్చిపోతామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఖలీబాఫ్ హెచ్చరించారు. శనివారం పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో జరగబోయే చర్చల్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో బఘేర్ భేటీకానున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లెబనాన్ విషయంలో వెనక్కి తగ్గకపోతే దారుణ ప్రతిదాడులు తప్పవని, గన్ ట్రిగ్గర్‌పై తమ వేలు అలాగే ఉందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ హెచ్చరించారు. మరోవైపు చమురుధరలు పెరుగుతూ పోతున్నాయి. గురువారం అంతర్జాతీయంగా నాణ్యమైన బ్రెంట్ రకం చమురు ధర బ్యారెల్‌కు 98 డాలర్లకు పెరిగింది. యుద్ధం మొదలైన ఫిబ్రవరి 28నాటి ధరతో పోలిస్తే ఇది ఏకంగా 35 శాతం అధికంకావడం గమనార్హం. చర్చల అంశాలపైనా సందిగ్ధత చర్చల్లో ఇరాన్ ఎలాంటి ప్రతిపాదనలు చేస్తుందో? వాటికి అమెరికా, ఇజ్రాయెల్ ఏ రీతిలో స్పందిస్తాయోననే సందిగ్ధత కొనసాగుతోంది. శనివారం పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో చర్చలు జరగనున్నాయి. ఇన్నాళ్లూ అంతర్జాతీయ సముద్రజలాలుగా ఉన్న హార్మూజ్ జలసంధి జలాలపై ఇకపై తమ గుత్తాధిపత్యం ఉండాలని ఇరాన్ డిమాండ్‌చేసే వీలుంది. ఇరాన్ నవతరం క్షిపణుల తయారీ ప్రాజెక్ట్, అణ్వాయుధ సామర్థ్యాన్ని సముపార్జించడంపై చర్చల్లో అమెరికా, ఇజ్రాయెల్ అడ్డుచెప్పే అవకాశముంది. ఆపత్కాలంలో కలిసిరావాల్సిన నాటో సభ్యదేశాలు మొండిచేయి చూపించాయన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపణల నడుమ జర్మనీ చాన్స్‌లర్ ఫ్రెడరిక్ మెర్జ్ అగ్రరాజ్యానికి మద్దతుపలికారు. ‘‘అమెరికాతో నాటో కలిసి నడుస్తుంది. ఈ మేరకు బుధవారం ట్రంప్‌తో సంభాషించా. అయితే ఏమేరకు అమెరికాకు సాయపడాలనే అంశంపై జూలైలో తుర్కియేలోని అంకారాలో జరిగే నాటో శిఖరాగ్ర సదస్సులో తేలుస్తాం. అమెరికా, యూరప్‌లను కలుపుతూ నాటో పరిరక్షణకు మేం కట్టుబడి ఉన్నాం’’అని మెర్జ్ అన్నారు. మరోవైపు చర్చలకు పాకిస్తాన్ సన్నాహకాలు చేస్తోంది. ఏర్పాట్లపై పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్, ప్రధాని షెహబాజ్‌తో సమీక్ష జరిపారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్, ట్రంప్ దూత స్టీవ్ విట్కాఫ్లతో కూడిన అమెరికా ప్రతినిధి బృందం శుక్రవారం ఉదయంకల్లా ఇస్లామాబాద్‌కు చేరుకోనుంది. శిథిలాల దిబ్బ... బుధవారం మధ్యాహ్నం 10 నిమిషాల్లో 100కుపైగా ప్రాంతాలపై ఒకేసారి దాడిచేసి లెబనాన్‌లో ఇజ్రాయెల్ వినాశనం సృష్టించిన ఘటనలో మరణాల సంఖ్య గురువారానికి 303కు పెరిగింది. 1,150 మందికిపైగా గాయాలపాలయ్యారు. చాలా మంది ఇంకా ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. దాడుల్లో హెచ్‌బొల్లా నేత నయీం ఖాసిమ్ సన్నిహితుడు అలీ యూసుఫ్ హర్షీ హతమయ్యాడని ఇజ్రాయెల్ ప్రకటించింది. శిథిలాల గుట్టలుగా మారిన దాడి ప్రాంతాల్లో ఇంకా బాధితుల కోసం అన్వేషణ కొనసాగుతోంది.సముద్ర మందుపాతరలతో జాగ్రత్త సరకు రవాణా నౌకలకు ఇరాన్ సూచన సీమైన్స్ అమర్చిన ప్రాంతం ‘చార్ట్’విడుదలదాడులు, ప్రతిదాడులు, బెదిరింపులు, కవి్వంపులు, హెచ్చరికల దశ దాటి కాల్పులవిరమణ పర్వంలోకి అడుగుపెట్టిన పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్ కాస్తంత మెత్తబడి అంతర్జాతీయ సరుకు రవాణా నౌకలు హార్మూజ్ గుండా వెళ్లేందుకు తాత్కాలికంగా అనుమతి ఇచ్చింది. అయితే యుద్ధంవేళ అనుమతిలేకుండా హార్మూజ్ గుండా వెళ్లే నౌకలను నాశనంచేసేందుకు పర్షియన్ గల్ఫ్ జలాల్లో అమర్చిన సముద్రమందుపాతరల జాడను వెల్లడిస్తూ ఇరాన్ తాజాగా ఒక చిత్రపటాన్ని విడుదలచేసింది. నలుపు, తెలుపురంగుల్లో ఉన్న ఈ చిత్రపటంలో పేర్కొన్న వృత్తాకార ప్రాంతం(డేంజర్ జోన్) నుంచి కాకుండా కాస్తంత దూరంగా జరిగి నౌకలు రాకపోకలు సాగించాలని ఇరాన్ ప్రకటించింది. చార్జ్ ప్రకారం చూస్తే సీమైన్స్‌ను ఇరాన్ తీరంవైపు కాకుండా ఆవలివైపునకు అత్యధికంగా అమర్చినట్లు స్పష్టమవుతోంది. ఇరాన్ తీరం వెంబడి దాడుల నుంచి తప్పించుకునేందుకు తీరానికి దూరంగా నౌకలు వెళ్తాయని ముందే ఊహించి, వాటి రాకపోకలను అడ్డుకునేందుకే ఇరాన్ ఇలాంటి ఎత్తుగడ వేసిందని స్పష్టమవుతోంది. సీమైన్స్ బారిపడకుండా ఈ నౌకలు ఇకపై ఇరాన్‌కు దగ్గరగా లరాక్ ద్వీపానికి సమీపంగా వెళ్లాల్సిన అగత్యం ఏర్పడింది. మేం ఇరాన్ చుట్టూతే ఉంటాం: ట్రంప్కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినంత మాత్రాన పశ్చిమాసియాను అమెరికా బలగాలు వీడిపోవని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ స్పష్టంచేశారు. ఈ మేరకు సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఆయన గురువారం ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘యుద్ధం శాశ్వత ముగింపునకు సంబంధించిన సమగ్ర ఒప్పందం కుదిరే వరకు, అది అమల్లోకి వచ్చే వరకు అమెరికా బలగాల ఎక్కడికీ పోవు. పశ్చిమాసియాలో ఇరాన్ చుట్టూతా మొహరించే ఉంటాయి. ఒకవేళ ఏదైనా కారణంతో ఒప్పందం కుదరకపోతే మళ్లీ బాంబుల దాడి, కాల్పుల మోత మరింతగా మోగుతుంది’’ అని ట్రంప్ అన్నారు. -
‘కాల్పుల విరమణ’కు తూట్లు!
ప్రపంచమంతా ఎంతో ఆశగా, ఆత్రంగా ఎదురుచూసిన కాల్పుల విరమణ ఒప్పందం ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాకుండానే ముగిసిపోయే ప్రమాదం కనబడుతోంది. తీవ్ర వైషమ్యాలతో కాలుదువ్వుకునే వైరిపక్షాలు యుద్ధ క్షేత్రాన్ని విడిచిపెట్టడం అంత సులభమేమీ కాదు. అందుకే ఒప్పందం కుదిరాక కూడా అక్కడక్కడ పరస్పర దాడులు తప్పవు. కానీ పశ్చిమాసియా పరిస్థితి కాస్త భిన్నమైనది. కాల్పుల విరమణపై తొలుత అమెరికా, ఆ తర్వాత ఇరాన్ ధ్రువీకరించాక, మధ్యవర్తి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సైతం ప్రకటన చేశారు. ఎప్పుడూ లేనిది ఇజ్రాయెల్ కూడా ఒప్పందాన్ని అంగీక రిస్తున్నట్టు తెలిపింది. కానీ 24 గంటలు గడవకుండానే అందరిదీ తలోమాట అయింది. మధ్యవర్తి పాత్ర పోషించే దేశం దృఢమైన స్వరం వినిపించగలగాలి. అవసరమైతేశాసించగలగాలి. కానీ అమెరికా అప్పులపై ఆధారపడే పాక్ ఆ పని చేయగలదా? ఘర్షణలు నివారించిన ఖ్యాతిని కూడా ‘త్యాగం’ చేసి, తెరవెనకుండి పాకిస్తాన్ ద్వారా కథ నడిపిస్తున్న చైనా ప్రత్యక్షంగా రంగంలోకి దిగితే అమెరికా, ఇజ్రాయెల్ ఈ మాదిరి డ్రామాలకు సాహసించేవి కాదు. అసలు పశ్చిమాసియాకు సంబంధించి ఏ ఒప్పందం కుదరాలన్నా అమెరికాను సంతృప్తిపరిస్తే సరిపోదు. ఆ దేశం ఒకటి కాదు... రెండు! అవిభాజ్య కవలల మాదిరిగా వ్యవహరిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ రెండూ ఒప్పుకుంటే తప్ప ఏదీ సాధ్యపడదు. ఒక్కోసారి ఆ రెండూ కావాలని భిన్న స్వరాలు వినిపిస్తాయి. దీన్ని వ్యూహం అనాలో, చవకబారు ఎత్తుగడగా భావించాలో ఎవరికీ తెలియదు. అమెరికా అవునంటుంది... కాసేపటికి ఇజ్రాయెల్ కాదంటుంది. పర్యవసానంగా అనుకున్నది అమలుకాక అవతలి పక్షం అయోమయంలో పడుతుంది. అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ పట్టాభిషేకమయ్యాక ఆయన అల్లుడు జేర్డ్ కుష్నెర్ ద్వారా ఇజ్రాయెల్‌కు చుట్టరికం కలవడంతో పట్టపగ్గా ల్లేకుండా పోయాయి. అందుకే వైట్‌హౌస్‌లో, ట్రంప్‌కు బాగా దగ్గరగావుండే వ్యక్తుల్లో కలకలం మొదలైంది. ఇప్పుడు తోకే కుక్కను ఆడిస్తోందన్న రీతిలో వ్యవహారం ముదిరింది. కనుకనే ఒప్పందంపై తొలుత ప్రకటించిన ట్రంప్ లెబనాన్‌పై దాడులు సాగుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయారు. అటు తర్వాత ఒప్పందంలో లెబనాన్ ప్రస్తావన లేదని బుకాయించటం మొదలుపెట్టారు. ఇరాన్ 10 అంశాల ముసాయిదా కొత్తదేమీ కాదు. దురాక్రమణకు ముందే ఇరాన్ దాన్ని ప్రతిపాదించింది. అప్పట్లో అది ట్రంప్‌కు నచ్చలేదు. ఇక ఇరాన్ ఎంతకూ లొంగకపోవటం, చమురు ధరలు ఆకాశాన్నంటడంతో కొంపమునుగుతుందని అర్థమై అది ఆచరణయోగ్యమేనని అంగీకరించక తప్పలేదు. తన కూటమిలోని ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి చేయరాదంటున్న ట్రంప్... ఆ దేశానికి మద్దతుగా నిలబడిన లెబనాన్‌లో మాత్రం ఇజ్రాయెల్ ఊచకోత కొనసాగించటం సబబేనంటున్నారు. ఇది మర్కట తర్కం కాదా? కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం ఉత్సవం చేసుకుంటున్న జనంపై పది నిమిషాలపాటు ఏకధాటిగా సాగించిన కాల్పుల్లో 250 మందికిపైగా మరణించారు. మరో 1,000 మంది గాయపడ్డారు. కాల్పుల విరమణ ప్రకటించాక అంతవరకూ 119 డాలర్లుగావున్న బ్యారెల్ ముడి చమురు ధర 94 డాలర్లకు చేరింది. కానీ ఇజ్రాయెల్ హంతక దాడులతో అదికాస్తా మళ్లీ 97కు పెరిగింది. అమెరికా, ఇజ్రాయెల్ కపట నాటకాలు కట్టిపెడితే తప్ప ప్రపంచం ప్రశాంతంగా మనుగడ సాగించలేదు. అది జరగాలంటే ఆ రెండు దేశాల్లోని ప్రజలతో పాటు ప్రపంచ దేశాలన్నీ ఒత్తిడి తీసుకురావాలి. ప్రపంచం సంక్షోభం అంచుల్లో ఉంది. ఇరాన్ ఇప్పటికే యుద్ధంవల్ల సమస్తం కోల్పోయింది. 3,000 మంది పౌరులు మరణించగా, లక్షలాది జనావాసాలు శిథిలాలుగా మారాయి. మౌలిక సదుపాయాలన్నీ ధ్వంస మయ్యాయి. ఇరాన్ శక్తిమేరకు ప్రతీకార దాడులు చేస్తూ దురాక్రమణకు దిగిన ఆ రెండు దేశాలతోపాటు, వాటికి సహకరిస్తున్న ఇరుగు పొరుగు దేశాలను సైతం దెబ్బతీయగలిగింది. పశ్చిమాసియాలో ఇంతకుమించి మరేం జరగకూడదకునే దేశాలు ఇక తటస్థ అవతారాలు చాలించి నిక్కచ్చిగా వ్యవహరించాలి. ఎన్ని లోటుపాట్లున్నా ఈ ఒప్పందం కొనసాగేలా చూడాలి. శుక్రవారం జరిగే చర్చలు ఫలవంతం కావాలి. లేనట్టయితే చరిత్ర క్షమించదు. -
ఇజ్రాయెల్ దాడుల్లో హజ్బొల్లా కీలక నేత హతం
బీరూట్: లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. హజ్బొల్లా చీఫ్ పర్సనల్ సెక్రటరీ అలీ యూసఫ్ హర్షీను హతమార్చినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ గురువారం ప్రకటించింది. రాత్రి బీరుట్‌పై జరిపిన దాడ్లుల్లో అలీ యూసఫ్ చనిపోయారని.. హెజ్బొల్లా ఆయుధ రవాణా మార్గాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. సౌత్ లెబనాన్‌లో 10 ఆయుధ డిపోలు నాశనం నాశనమైనట్లు పేర్కొంది. హర్షీ.. ఖాసిమ్‌కు అత్యంత నమ్మకస్థుడైన సలహాదారు మాత్రమే కాకుండా.. అతని కార్యాలయ నిర్వహణ, భద్రతా వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించేవారని తెలిపింది.అంతకుముందు, అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని దానికి ప్రతిచర్యగా ఇజ్రాయెల్‌పై రాకెట్లతో దాడి చేసినట్లు ఇరాన్ మద్దతు ఉన్న హజ్బొల్లా ప్రకటించిన సంగతి తెలిసిందే. లెబనాన్ అంతటా ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులకు సమాధానం ఇచ్చే హక్కు తమకు ఉందని హజ్బొల్లా పేర్కొంది. శత్రువు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు ప్రతిగా.. సరిహద్దు సమీపంలోని మనారా అనే ఇజ్రాయెల్ కిబ్బట్జ్‌పై గురువారం తెల్లవారుజామున రాకెట్లతో దాడి చేశాం" అని హిజ్బుల్లా ఒక ప్రకటనలో తెలిపింది.లెబనాన్‌పై కేవలం ఒక్క రోజులోనే ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 254 మంది మరణించగా.. 1,165 మందికి పైగా గాయపడ్డారు. దీంతో లెబనాన్ ప్రభుత్వం సంతాప దినం ప్రకటించింది. అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణలో లెబనాన్ భాగం కాదని ఇజ్రాయెల్ ప్రధాని బెన్జమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. మేము అటువంటి వాగ్దానం ఎప్పుడూ చేయలేదని పేర్కొన్నారు. -
ఆక్.. పాక్.. కరివేపాక్
ఇరాన్-అమెరికా&కో మధ్య యుద్ధం ఆగిపోవడానికి తామే కారణమని పాకిస్తాన్ తెగ ప్రచారం చేసుకుంటోంది. అయితే ఇరాన్ మాత్రం అందులో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదట కాస్త క్రెడిట్ ఇచ్చినప్పటికీ.. ఆ తర్వాత చైనా పాత్ర కీలకమని చెప్పి పాక్ గాలి తీసేశారు. ఈలోపు.. ఇటు ఇజ్రాయెల్ ఆ మధ్యవర్తిత్వంపై ఏకంగా అనుమానాలే వ్యక్తం చేస్తోంది. మిడిల్ ఈస్ట్ వార్‌లో పాక్ మధ్యవర్తిత్వంపై ఇజ్రాయెల్ సందేహాలు వ్యక్తం చేస్తోంది. ఆ దేశానికి అంత సీన్ లేదని.. అదసలు నమ్మదగిన విషయమే కాదని అంటోంది. భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. మధ్యవర్తిత్వం విషయంలో పాక్ పాత్ర ఏం మాత్రం ఉండకపోవచ్చు. అమెరికా కేవలం తమ వ్యూహాత్మక కారణాల వల్లే పాకిస్తాన్‌ను వాడుకుంటుందేమో అని వ్యాఖ్యానించారు.అమెరికా గతంలో ఖతర్, టర్కీ వంటి దేశాలను ముందుంచి గాజా విషయంలో హమాస్‌తో ఒప్పందాలు సాధించింది. అదే విధంగా ఇప్పుడు పాకిస్తాన్‌ను ఉపయోగించుకుని ఉండొచ్చు. కాబట్టి పాక్‌ను విశ్వసనీయ మధ్యవర్తిగా ఏ కోణంలోనూ చూడలేం అని అన్నారాయన. అదే సమయంలో.. అమెరికాతో సమన్వయం కొనసాగించడం ఇజ్రాయెల్‌కు ఎంతో ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు.విమర్శలు కూడా.. పశ్చిమాసియా యుద్ధంలో పాక్ మధ్యవర్తిత్వంపై ఇప్పుడు విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. లెబనాన్ విషయంలో స్పష్టత లేకపోవడంతోనే మరోసారి ఉద్రిక్తతలు తలెత్తడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. లెబనాన్‌కు కూడా కాల్పుల విరమణ వర్తిస్తుందని పాక్ తొలుత ప్రకటించగా.. ఆ మాట చెప్పడానికి పాక్‌కు ఏ అర్హత ఉందంటూ ఇజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే సమయంలో.. ఇటు అమెరికా కూడా లెబనాన్‌కు ఒప్పందం వర్తించబోదని తేల్చేసింది. దీంతో ఈ గందరగోళానికి పాక్ తీరే కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్, అమెరికా తమను నమ్ముతున్నాయని పాక్ అంటోంది. అయితే ఇరాన్ మాత్రం పాక్ ప్రయత్నాలను ప్రశంసిస్తూనే.. మధ్యవర్తిత్వాన్ని మాత్రం ఒప్పుకోవడం లేదు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇస్లామాబాద్‌లో శుక్రవారం జరగబోయే చర్చలకు అమెరికా–ఇరాన్ ప్రతినిధులను ఆహ్వానించారు. “ఇరాన్, అమెరికా- మిత్రదేశాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. శాంతి చర్చలు విజయవంతమవుతాయని ఆశిస్తున్నాం” అని ఆయన సోషల్ మీడియా వేదికలో ఓ పోస్ట్ చేశారు. సౌదీ, టర్కీ, ఈజిప్ట్ విదేశాంగ మంత్రులకు సైతం ఈ సమావేశానికి ఆహ్వానం వెళ్లినట్లు సమాచారం. అయితే చర్చలు శనివారం(11వ తేదీకి) జరుగుతాయని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌజ్ ఓ ప్రకటన రిలీజ్ చేసింది.ఇరాన్‌పై భీకర దాడుల హెచ్చరికలు చేసిన ట్రంప్.. చివరి నిమిషంలో యుద్ధానికి బ్రేక్ వేశారు. రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని.. శాశ్వత శాంతి స్థాపనకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇటు ఇరాన్ కూడా ఆ ప్రకటనను ధృవీకరించింది. కానీ, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులతో ఘర్షణలు మళ్లీ ఉధృతమయ్యాయి. ఈ పరిణామంపై ఇరాన్ భగ్గుమంటోంది. కీలకమైన హర్ముజ్‌ను తెరిచినట్లే తెరిచి.. మళ్లీ మూసేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ లెబనాన్ ఈ కాల్పుల విరమణలో ఏమాత్రం భాగం కాదని, హెజ్బొల్లా ఉనికి కారణంగా ఇది ‘వేరే ఘర్షణ’ అని ప్రకటించారు. అయితే పలు దేశాలు మాత్రం లెబనాన్‌కు సీజ్ఫైర్ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నాయి. -
ఇజ్రాయెల్ భీకర దాడులు.. ఇరాన్ కీలక ప్రకటన
పశ్చిమాసియాలో పట్టుమని ఒక్క గంట కూడా శాంతి పరిస్థితులు నెలకొనలేదు. ఇరాన్, అమెరికాలు యుద్ధ విరమణ, శాంతి చర్చలకు ఒక అంగీకారానికి వచ్చినప్పటికీ.. హెజ్బొల్లా పేరు చెప్పి లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతోంది. కేవలం 10 నిమిషాల్లో 100 బాంబులు ప్రయోగించి భారీ ప్రాణ, ఆస్తి నష్టాలు కలగజేసింది. లెబనాన్‌పై దాడులను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సమర్థించుకున్నారు. రెండు వారాల కాల్పుల విరమణ లెబనాన్‌కు వర్తించదని.. అది జలసంధిలో భాగం కాదని.. హెజ్బోల్లాపై దాడులు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో శాంతి చర్చలు అసంబద్ధం అని పేర్కొంది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్, శాంతి చర్చల ప్రతినిధి మొహమ్మద్ బాగర్ ఖలీబాఫ్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందన్నారు. ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నంతవరకు అమెరికాతో శాంతి చర్చలు జరపడం అసాధ్యమని, ఈ చర్చలే అసంబద్ధమని వ్యాఖ్యానించారు. ఇస్లామాబాద్(పాకిస్తాన్) వేదికగా శాంతి చర్చలు జరగనున్నాయి. అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం ఈ చర్చలను ముందుకు నడిపించనుంది.ఇజ్రాయెల్ లెబనాన్‌పై ఇప్పటివరకు జరిగిన అత్యంత భారీ వైమానిక దాడులు జరపగా.. 254 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఒక్క బీరుట్‌లోనే 91 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి మీడియా కథనాలు ఇస్తోంది. ప్రతికారంగా.. హెజ్బోల్లా కూడా ఇజ్రాయెల్‌పై రాకెట్లు ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఈ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ఇజ్రాయెల్–లెబనాన్ ఘర్షణలు మధ్యప్రాచ్యంలో(Middle East) శాంతి ప్రయత్నాలను మరింత క్లిష్టం చేస్తున్నాయని పలువురు ప్రపంచ అధినేతలు అభిప్రాయపడుతున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ లెబనాన్‌పై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. యూరప్, జపాన్, కెనడా నాయకులు సంయుక్త ప్రకటనలో శాంతి కోసం పిలుపునిచ్చారు. -
ఎట్టకేలకు శాంతి!
టెహ్రాన్/దుబాయ్/వాషింగ్టన్/ఇస్లామాబాద్: పశ్చిమాసియా కల్లోలానికి ఎట్టకేలకు తాత్కాలికంగా తెర పడింది. రెండు వారాల పాటు కాల్పుల విరమణకు అమెరికా–ఇజ్రాయెల్, ఇరాన్ అంగీకరించాయి. కనీవిని ఎరగని దాడులతో ఇరాన్‌ను సర్వనాశనం చేసేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన డెడ్‌లైన్ ముగిసేందుకు కేవలం 90 నిమిషాల ముందు ఈ మేరకు కీలక పరిణామం చోటుచేసుకుంది. దాంతో తాత్కాలికంగానైనా పెను ముప్పు తప్పిపోయి ప్రపంచమంతా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది. ఇరాన్ విజ్ఞప్తి మేరకు కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్టు మంగళవారం రాత్రి (అమెరికా కాలమానం ప్రకారం) ట్రంప్ తన ట్రూత్‌సోషల్ మాధ్యంలో పోస్టు చేశారు. కాల్పుల విరమణను ఇరాన్ కూడా ధ్రువీకరించింది. ఇందుకు మద్దతు తెలుపుతూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ రెండు వారాల్లోగా యుద్ధానికి పూర్తిగా తెర దించేందుకు కృషి చేయాలని అమెరికా, ఇరాన్ నిర్ణయానికి వచ్చాయి. అందులో భాగంగా అమెరికా, ఇరాన్ ప్రతినిధులు శుక్ర, లేదా శనివారాల్లో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో సమావేశం కానున్నారు. అమెరికా బృందానికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్‌కు విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ సారథ్యం వహిస్తారని సమాచారం. ఇరు బృందాలూ గురువారమే ఇస్లామాబాద్ చేరుకోనున్నట్టు చెబుతున్నారు. ఇరాన్ బృందం రాకను అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ధ్రువీకరించినట్టు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. అయితే ఇరు వర్గాల పరస్పర విరుద్ధ ప్రకటనలతో కాల్పుల విరమణకు సంబంధించి తీవ్ర అయోమయం నెలకొంది. కాల్పుల విరమణ లెబనాన్‌కు కూడా వర్తిస్తుందని ఒప్పందంలో మధ్యవర్తిగా వ్యవహరించిన పాక్ ప్రధాని ప్రకటించగా, నెతన్యాహు మాత్రం దాన్ని ఖండించారు. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆగబోవని కుండబద్దలు కొట్టారు. అనంతరం ట్రంప్ కూడా దీన్ని ధ్రువీకరించారు. హెజ్బొల్లా కారణంగా కాల్పుల విరమణ లెబనాన్‌కు వర్తించబోదని ఆయన చెప్పుకొచ్చారు. అలాగైతే విరమణ ఒప్పందం నుంచి బయటికి రావడమే గాక చర్చల నుంచే తప్పుకుంటామని ఇరాన్ హెచ్చరించింది! మరోవైపు, అసలు విరమణ ఒప్పందమే చాలా ‘బలహీనంగా’ఉందంటూ వాన్స్ పెదవి విరిచారు! ఇంకోవైపు కాల్పుల విరమణ ప్రకటన తర్వాత కూడా ఇరాన్, లెబనాన్‌లపై ఇజ్రాయెల్ నిరి్నరోధంగా దాడులను కొనసాగించింది. దాంతో ఇరాన్ కూడా గల్ఫ్ దేశాలపై భారీగా దాడులకు దిగింది! ఈ నేపథ్యంలో రెండు వారాల కాల్పుల విరమణ ఏ మేరకు అమలవుతుందన్నది సందేహాస్పదంగా మారింది. దీనికి తోడు, ఇరాన్‌తో ద్వైపాక్షిక చర్చలకు సంబంధించి సంబంధించి ఇప్పటిదాకా తుది ప్రణాళిక అంటూ ఏమీ ఖరారు కాలేదని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కోరోలినా లెవిట్ మీడియాకు స్పష్టం చేశారు! ఇరాన్ షరతులపై ట్రంప్ అసంతృప్తి హార్మూజ్ జలసంధిని తక్షణం పూర్తిస్థాయిలో తెరవాలన్న షరతుపైనే కాల్పుల విరమణకు తాను అంగీకరించినట్టు ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ 10 షరతులను తమ ముందుంచిందన్నారు. వాటిలో కొన్ని ఆచరణయోగ్యంగానే ఉన్నాయని అభిప్రాయపడ్డ ఆయన, ఆ తర్వాత మాట మార్చారు. ఇరాన్ షరతులు మోసపూరితంగా ఉన్నాయని ఆక్షేపించారు. అంతేగాక ఇరాన్ ఇకముందెప్పుడూ యురేనియం శుద్ధికి దిగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. ‘‘ఆ దేశం ఇప్పటికే శుద్ధి చేసిన యురేనియం నిల్వలను అమెరికా స్వాధీనం చేసుకుంటుంది. గతేడాది మా దాడుల్లో భూ స్థాపితమైన ఆ యురేనియం నిల్వలను ఇరాన్ సహకారంతోనే వెలికి తీసి తరలిస్తాం’’అని చెప్పుకొచ్చారు. యురేనియం నిల్వలను తమకు అప్పగించని పక్షంలో ఇరాన్‌పై మళ్లీ దాడులు తప్పవని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ హెచ్చరించారు! కానీ ఇందుకు ఆ దేశం ఏ మేరకు అంగీకరిస్తుందన్నది సందేహాస్పదంగా మారింది. యురేనియం నిల్వల అప్పగింతపై ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలపై ఇరాన్ స్పందించలేదు. ఇరాన్‌ను చర్చలకు ఒప్పంచడంలో తెర వెనక చైనా కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. ట్రంప్ కూడా దీన్ని ధ్రువీకరించారు. ఈ మేరకు తమకు కూడా సమాచారం ఉందని వెల్లడించారు.విజయం మాదంటే మాదేఅమెరికా, ఇరాన్ ప్రకటనలు ఇరానే దేబిరించింది: హెగ్సెత్ షరతులకు ఒప్పకున్నారు: ఇరాన్ కాల్పుల విరమణ నేపథ్యంలో, నెలన్నర రోజుల యుద్ధంలో గెలిచింది తామంటే తామేనని అమెరికా, ఇరాన్ పోటాపోటీగా ప్రకటనలు జారీ చేశాయి. కాల్పుల విరమణ కోసం ఇరానే దేబిరించిందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మీడియా సాక్షిగా ప్రకటించారు! ఆ దేశంపై తాము తలపెట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’కనీవిని ఎరగని రీతిలో విజయం సాధించిందని చెప్పుకున్నారు. తమ దాడుల ధాటికి ఇరాన్ సైన్యం కనీసం మరికొన్నేళ్లదాకా కోలుకోలేనంతగా దెబ్బ తిన్నట్టు చెప్పారు. అమెరికాయే కాళ్లబేరానికి దిగొచ్చి తాము విధించిన 10 షరతులకు అంగీకరించిందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన పలు పోస్టులు చేశారు.ప్రపంచ శాంతికి కీలకమైన రోజు! ఇరాన్ తమపై దాడులను ఆపాలని కోరింది. కాల్పుల విరమణకు విజ్ఞప్తి చేసింది. ఈ విషయాన్ని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ నాకు చేరవేశారు. ఈ రాత్రికి ఇరాన్‌పై తలపెట్టిన అతి పెద్ద దాడిని నిలిపేయాలని విన్నవించారు. హార్మూజ్ జలసంధిని తక్షణం తెరిచే షరతుపై ఇరాన్‌పై దాడులను 2 వారాల పాటు నిలిపేసేందుకు నేను అంగీకరించా. ఆ దేశంపై దాడుల ద్వారా మేం ఆశించిన లక్ష్యాలన్నింటిని ఇప్పటికే సాధించేశాం. ఇరాన్ మాకు 10 పాయింట్లతో ప్రతిపాదన పంపింది. దానిపై ఈ రెండు వారాల్లో చర్చలు జరిపి ఒప్పందానికి వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతాయి. హార్మూజ్ గుండా నౌకల రాకపోకలు యథావిధిగా సాగేందుకు అమెరికా సాయపడుతుంది. ఇరాన్ తన దేశ పునరి్నర్మాణ ప్రక్రియను మొదలు పెట్టుకోవచ్చు. అమెరికాలో మాదిరిగానే పశ్చిమాసియాలో కూడా త్వరలో స్వర్ణయుగాన్ని ఆస్వాదించాలి. ఇది ప్రపంచ శాంతికే అతి కీలకమైన రోజు! – ట్రూత్ సోషల్ పోస్టులో ట్రంప్ ఇరాన్‌కు ఆయుధాలిస్తే 50 % టారిఫ్ విధిస్తా ఇరాన్ మిత్రదేశాలకు ట్రంప్ హెచ్చరిక వాషింగ్టన్: కాల్పుల విరమణ నేపథ్యంలో ఇరాన్‌తో కయ్యానికి కాలు దువ్వబోనని శాంతివచనాలు పలికిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ మిత్రదేశాలపై టారిఫ్‌ల యుద్ధం ప్రకటించారు. ఇరాన్‌కు ఆయుధాలను సరఫరాచేస్తే ఊరుకునేది లేదని స్పష్టంచేశారు. ‘‘ఇరాన్‌కు మిలటరీ ఆయుధాలు అందించే ప్రతి దేశంపై 50 శాతం టారిఫ్‌లు విధిస్తా. అటు ఇరాన్‌కు ఆయుధాలు పంపుతూ ఇటు అమెరికాకు వస్తూత్పత్తులను ఎగుమతి చేసే దేశాలపై 50 శాతం టారిఫ్‌లను మోపుతా. టారిఫ్‌ల విధింపు విషయంలో ఎలాంటి మినహాయింపులు, సడలింపులు ఉండబోవు. ఇకపై ఆయుధాలు పంపిన తక్షణం అదనపు టారిఫ్‌లు అమల్లోకి వస్తాయి’’అని ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో బుధవారం ఒక పోస్ట్‌పెట్టారు. ట్రంప్ హెచ్చరికతో అంతర్జాతీయ వాణిజ్యంలో కొత్త అవరోధాలు తలెత్తే ముప్పు ఉంది. ఇరాన్ మిత్ర దేశాలైన రష్యా, చైనా, ఉత్తరకొరియా దేశాలపై అమెరికా అదనపు టారిఫ్‌ల భారం మోపే ఆస్కారముంది. రష్యా, చైనా, ఉ.కొరియాలు ఆయుధాలతోపాటు సైనిక సాంకేతికతనూ ఇరాన్‌కు చేరవేసినట్లు గతంలోనే అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. త్వరగా దేశం వీడండిఇరాన్లోని భారతీయ పౌరులకు కేంద్రం సూచన దుబాయ్: అనూహ్యంగా కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇరాన్ నుంచి బయటపడాలని అక్కడి భారతీయ పౌరులకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని భారతరాయబార కార్యాలయం బుధవారం ఒక అడ్వైజరీ జారీచేసింది. ‘‘ఇరాన్‌ను వీడాలనుకునే భారతీయులు తొలుత అక్కడి భారతీయ రాయబార కార్యాలయాన్ని సంప్రతించండి. వాళ్ల సూచన మేరకు నడుచుకోండి. ముందస్తు అనుమతి, సమన్వయం లేకుండా, సమాచారం ఇవ్వకుండా ఏ అంతర్జాతీయ సరిహద్దుకు చేరుకోకండి. రాయబార కార్యాలయం సూచించిన మార్గాల్లోనే దేశం వీడండి. అవసరమైతే అత్యవసర పరిస్థితుల్లో +989128109115, +989128109102, +989128109109, +989932179359 నంబర్లకు ఫోన్‌చేసి సంప్రతించి తగు సూచనలు, సలహాలు తీసుకోండి. cons. tehran@mea.gov.in ఈమెయిల్‌కు మెయిల్‌చేసి సలహాలు పొందొచ్చు. -
‘తాత్కాలిక సంధి’ దశ!
నలభై రోజులుగా ఇరాన్ పౌరుల్ని భీతావహుల్ని చేస్తూ, ప్రపంచాన్ని సైతం అల్లకల్లోల పరుస్తున్న యుద్ధం తాత్కాలికంగా నిలిచింది. రెండు వారాలపాటు కాల్పుల విరమణ పాటించటానికి అమెరికా, ఇరాన్‌లు అంగీకరించటంతోపాటు దాన్ని పూర్తిస్థాయి విరమణగా మార్చటానికి వీలుగా పరస్పరం చర్చించుకోవాలని నిర్ణయించాయి. పాకిస్తాన్ దౌత్యం వల్లే అంతా సాధ్యపడినట్టు కనిపిస్తున్నా ఇరాన్‌ను బలంగా ప్రభావితం చేయగల చైనా జోక్యమే ఫలించిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాటలు చూస్తే అర్థమవుతుంది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఇరుపక్షాల మధ్యా శుక్రవారం జరగబోయే చర్చల ఫలితం ఎలా ఉండబోతుందో అంచనా వేయటం అంత సులభం కాదు. ఎందుకంటే, చర్చలకు ప్రాతిపదికగా అమెరికా విడుదల చేసిన 15 అంశాలకూ, ఇరాన్ ప్రతిపాదిస్తున్న 10 అంశాలకూ మధ్య చాలా విషయాల్లో పొసగటం లేదు. భూమిలో పాతిపెట్టిన 60 శాతం శుద్ధిచేసిన 440.9 గ్రాముల యురేనియంను ఇరాన్ తవ్వి తీయాల్సిందేనని అమెరికా కోరుతుండగా, ఆ విషయంలో రాజీపడబోమంటున్నది ఇరాన్. తమపై ఇన్నేళ్లుగా విధిస్తూవచ్చిన మౌలిక ఆంక్షలనూ, సెకండరీ ఆంక్షలనూ ఎత్తి వేయాలనీ, పశ్చిమాసియా నుంచి అమెరికా సేనలు వైదొలగాలనీ, స్తంభింపజేసిన తమ ఆస్తుల్ని వెనక్కివ్వాలనీ, శాంతి ఒప్పందానికి భద్రతామండలి గ్యారెంటీ ఉండాలనీ ఇరాన్ కోరుతోంది. కాల్పుల విరమణలో లెబనాన్‌పై దాడుల్ని నిలిపేయటం భాగమని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చెబుతుండగా, అమెరికా తాజా వైఖరిని అంగీక రిస్తూనే ఇజ్రాయెల్ ఆ దాడులు ఆగబోవంటున్నది. రెండుపక్షాల మధ్య అభిప్రాయ భేదాలు రావటం, అవి ఘర్షణలకు దారితీయటం అసాధారణమేమీ కాదు. ఆ ఘర్షణలు తెచ్చే తీవ్ర ఉద్రిక్తతల వల్ల సంధి కుదరటం ఓ పట్టాన సాధ్యపడదు. కాల్పుల విరమణ ప్రకటన వెలువడి ఏడెనిమిది గంటలు గడిచినా పశ్చిమాసియాలో క్షిపణి దాడులు, బాంబుల మోతలు ఆగకపోవటం ఇందుకు తార్కాణం. కొన్ని దేశాలు మధ్యవర్తి పాత్ర పోషిస్తేనే, ఘర్షణల్లోని నిరర్థకతను వైరి దేశాలకు గుర్తుచేసి ఒప్పిస్తేనే ఆ దిశగా అడుగులు పడతాయి. కానీ ఈసారి అందుకు భిన్నంగా జరిగింది. పెను మారణహోమాన్ని సృష్టిస్తాననీ, ఇరాన్ నాగరికత మొత్తాన్ని తుడిచిపెట్టేస్తాననీ ట్రంప్ చేసిన హెచ్చరిక చర్చలకు దారులు పరిచింది. యుద్ధనేరాల్లో అగ్రభాగాన ఉండే ‘మారణహోమం’ బెదిరింపు చర్చల సాధనంగా మారటం అత్యంత ప్రమాదకర పరిణామం. ఇవాళ ఇరాన్‌కి ఎదురైన పరిస్థితే రేపన్నరోజు వేరే దేశాలకూ ఎదురుకావొచ్చు. తాను వేరే దేశాధ్యక్షుణ్ణి అపహరించవచ్చు... కానీ ఇరాన్ మాత్రం ఆత్మరక్షణకు ఎలాంటి చర్యలూ తీసుకోకూడదన్నది ట్రంప్ నీతి. అమెరికాతో దాదాపు సమవుజ్జీలుగా ఉండి కూడా చైనా, రష్యాలు అమెరికా వైఖరిని నిర్ద్వంద్వంగా ఖండించలేకపోయాయి. భద్రతా మండలిలో ఒత్తిడి చేయలేకపోయాయి. ఉక్రెయిన్ చేస్తున్న దాడులకు అమెరికా సాయం చేస్తున్నది గనుక తాము ఇరాన్‌కు సహకరిస్తున్నామని మాత్రం రష్యా చెప్పింది. బాధిత దేశంగా తనను తాను చిత్రించుకుంటూ రెండేళ్ల పాటు గాజాను ఇజ్రాయెల్ వల్లకాడు చేస్తున్నా నోరు మెదపని దేశాలు... ఇరాన్ విషయంలోనూ మౌన ప్రేక్షకులుగా మిగిలిపోయాయి. అన్ని మర్యాదలూ మంటగలిపి, మతి చలించినట్టు ప్రవర్తిస్తున్న ట్రంప్ ఇరాన్‌పై అణ్వస్త్ర దాడికి తెగబడతారన్న భయంతోనే చివరి నిమిషంలో చైనా కదిలింది. అది నచ్చజెప్పనట్టయితే ఇరాన్ అంగుళమైనా వెనక్కి తగ్గేది కాదు. కాల్పుల విరమణ కోసం ఇరాన్ తమను ప్రాథేయపడిందని అమెరికా యుద్ధశాఖ మంత్రి పీట్ హెగ్సెత్ స్వోత్కర్షకు పోతున్నారు. ట్రంప్ ఇరాన్ విషయంలో చాలా అసహనంగా ఉన్నారని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అంటున్నారు. కానీ ట్రిగ్గర్పైన వేళ్లతోనే ఈ ఒడంబడికకు సిద్ధపడ్డామనీ, శత్రువు వైపు చిన్న పొరపాటు జరిగినా సర్వశక్తులూ ఒడ్డి ప్రతిఘటిస్తామనీ ఇరాన్ ప్రకటించింది. కనుక ఈ స్వల్పకాల శాంతిపై ఎవరూ భరోసా పెట్టుకోనవసరం లేదు. ఏ క్షణంలోనైనా అది నీటి బుడగలా మటుమాయం కావొచ్చు. ఇంటా బయటా పెద్ద వినాశకారిగా పరిణమించిన ట్రంప్‌ను అభిశంసన ద్వారా అమెరికా సాగనంపే వరకూ శాంతి, సంధి వంటివి క్షణభంగురాలు! -
ఇరాన్ బలహీనపడింది.. మా వేలు ట్రిగ్గర్‌పై ఉంది: నెతన్యాహు
ఇరాన్‌కి విధించిన డెడ్‌లైన్ పొడిగించిన ట్రంప్.. మరో రెండు వారాల పాటు సీజ్ ఫైర్ కొనసాగుతుందని చెప్పారు. కానీ లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేయడం అందరికీ షాకిచ్చింది. దీంతో ఇరాన్.. మళ్లీ హర్మూజ్ జలసంధిని మూసేసింది. ఈ క్రమంలోనే కాల్పుల విరమణ తర్వాత, లెబనాన్‌పై దాడులు అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో కీలక వ్యాఖ్యలు చేశారు.'గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరాన్ బలహీనపడింది. ఇరాన్‌తో యుద్ధంలో పెద్దఎత్తున లక్ష్యాలు సాధించాం. అమెరికా అధ్యక్షుడి సహకారం చాలా గొప్పది. ట్రంప్‌తో సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి. మా వేలు ట్రిగ్గర్‌పై సిద్ధంగా ఉంది. కాల్పుల విరమణ లెబనాన్‌కి వర్తించదు. లెబనాన్.. సంధిలో భాగం కాదు. హెజ్బొల్లాపై దాడులు కొనసాగిస్తాం' అని నెతన్యాహు అన్నారు.లెబనాన్‌పై ఇజ్రాయెల్ కేవలం 10 నిమిషాల్లో 100 వైమానిక దాడులు చేసింది. ఇందులో ఇప్పటివరకు 254 మంది మృతి చెందగా వేలాది మంది గాయపడ్డారు. 1982 తర్వాత లెబనాన్‌పై ఇదే అతిపెద్ద దాడిగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు లెబనాన్‌పై ఇలానే దాడులు చేస్తే సీజ్ఫైర్ నుంచి ఇరాన్ తప్పుకొనే అవకాశముంది. -
ఇరాన్ సంచలన నిర్ణయం.. హర్మూజ్ మళ్లీ మూసివేత
ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసేసింది. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగించడంతోనే ఈ నిర్ణయం తీసుకుంది. మంగళవారానికల్లా ఇరాన్ నాగరికత తుడిచిపెట్టుకునిపోతుందని హెచ్చరించిన ట్రంప్.. చివరి నిమిషంలో యూటర్న్ తీసుకున్నారు. ఇరాన్‌కి పెట్టిన డెడ్‌లైన్‌కి సరిగ్గా గంటన్నర ముందు షాకింగ్ కామెంట్స్ చేశారు. రెండు వారాల పాటు యుద్ధం వాయిదా వేస్తున్నామని, ఈ లోపు శాంతి చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి ఇజ్రాయెల్ మద్దతు ఇచ్చినప్పటికీ లెబనాన్‌ని ఒప్పందంలో చేర్చలేదని తెలిపింది.ఈ క్రమంలోనే లెబనాన్‌పై ఇజ్రాయెల్ దారుణంగా విరుచుకుపడింది. 10 నిమిషాల్లోనే 100కి పైగా వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో వందల సంఖ్యలో ప్రజలు చనిపోగా, వేలమంది గాయపడ్డారు. 1982 తర్వాత లెబనాన్‌పై ఇదే అతిపెద్ద దాడిగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.మరోవైపు ఇజ్రాయెల్‌ని ఇరాన్ కొద్దిసేపటి క్రితమే హెచ్చరించింది. లెబనాన్‌పై దాడులు ఆపకపోతే టెల్ అవీవ్‌పై దాడి చేస్తామని హెచ్చరించింది. ప్రస్తుతం సీజ్ఫైర్ ఒప్పందం కేవలం ఇరాన్‌పై దాడికి సంబంధించింది మాత్రమేనని లెబనాన్‌పై దాడులు చేస్తామని ఇజ్రాయెల్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఇరాన్.. మళ్లీ హర్మూజ్‌ని మూసేవేసింది. -
ఇజ్రాయెల్ భీకర దాడి.. వందల సంఖ్యలో మృతులు
లెబనాన్‌పై ఇజ్రాయెల్, విరుచుకపడుతుంది. కేవలం 10 నిమిషాల్లో 100కు పైగా వైమానిక దాడులు చేసింది. ఈా దాడులలో వందల సంఖ్యలో ప్రజలు మృతిచెందగా, పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. అదే విధంగా పెద్ద మెుత్తంలో ప్రజలు గాయపడ్డారు. 1982 తర్వాత లెబనాన్‌పై ఇదే అతిపెద్ద దాడిగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ దాడిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.అయితే కొద్ది సేపటి క్రితమే ఇజ్రాయెల్‌ను ఇరాన్ హెచ్చరించింది. లెబనాన్‌పై దాడులు ఆపకపోతే టెల్ అవీవ్ పై దాడి చేస్తామని హెచ్చరించింది. కాగా ప్రస్తుతం సీజ్ఫైర్ ఒప్పందం కేవలం ఇరాన్‌పై దాడికి సంబంధించింది మాత్రమేనని లెబనాన్‌పై దాడులు చేస్తామని ఇజ్రాయెల్ తెలిపింది. ఈ నేపథ్యంలో మరోసారి వార్ టెన్షన్ నెలకొంది. -
కాల్పుల విరమణలో అదిరిపోయే ట్విస్ట్
అమెరికా–ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ కుదిరిన నేపథ్యంలో.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అనూహ్య ప్రకటన చేశారు. ఈ ఒప్పందం లెబనాన్‌కు వర్తించబోదని.. దాడులు కొనసాగుతాయన్న రీతిలోనే ఆయన మాట్లాడారు. అయితే.. పశ్చిమాసియా సంక్షోభానికి తాత్కాలిక తెర పడడంలో క్రెడిట్ పూర్తిగా తమదేనని భావిస్తున్న పాకిస్తాన్‌కు ఇది ఏమాత్రం మింగుడు పడని విషయంగా మారింది. ఇరాన్‌పై భీకర దాడులు ఉంటాయన్న ట్రంప్.. డెడ్‌లైన్‌కు సరిగ్గా గంటన్నర ముందు శాంతి పావురం ఎగరేశారు. రెండు వారాలపాటు యుద్ధం వాయిదా వేస్తున్నామని, ఈలోపు శాంతి చర్చలు జరుగుతాయని ప్రకటించారు. ఆ వెంటనే కాల్పుల విరమణ అనేది అన్ని ప్రాంతాలకు వర్తిస్తుందని పాకిస్తాన్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ ప్రకటించారు. అయితే.. కాసేపటికే షరీఫ్ చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరో ప్రకటన చేశారు. బుధవారం వేకువ జామున నెతన్యాహు కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి ఇజ్రాయెల్ మద్దతు ఇస్తున్నప్పటికీ లెబనాన్‌ను ఒప్పందంలో చేర్చలేదని పేర్కొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్, అలాగే ప్రాంతీయ మిత్రదేశాలు ఇరాన్ అణు, క్షిపణి, ఉగ్రవాద ముప్పును తొలగించేందుకు కట్టుబడి ఉన్నాయని అన్నారు. అమెరికా–ఇరాన్ యుద్ధ విరమణ ఒప్పందం పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో కుదిరిందన్నది ట్రంప్ ప్రకటనతో స్పష్టమైంది. ఇరాన్, యుద్ధం ముగించడానికి 10-పాయింట్ల ప్రణాళికను అమెరికాకు అందజేసింది. అయితే.. లెబనాన్‌కు కాల్పుల విరమణ వర్తిస్తుందా? లేదా? అనే విషయంలో ఇజ్రాయెల్–పాకిస్తాన్ మధ్య విభేదాలు స్పష్టమయ్యాయి. ఇస్లామాబాద్‌లో ఏప్రిల్ 10న శాంతి చర్చలు జరగనున్నాయి. ఆలోపు ఈ అంశం ఓ కొలిక్కి వస్తుందా? లేదంటే వ్యవహారం మరింత ముదురుతుందా? అనేది చూడాలి.ఇదిలా ఉంటే.. మరోపక్క లెబనాన్ పరిస్థితి తీవ్రంగా ఉంది. మార్చి 2న హెజ్బుల్లా సంస్థ ఇజ్రాయెల్ నగరాలపై రాకెట్లు ప్రయోగించగా.. ప్రతిగా ఇజ్రాయెల్ భారీ స్థాయి దాడులు జరిపింది. ఈ దాడుల్లో 1,500 మందికి పైగా మరణించగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.చైనా చెబితేనే.. పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్‌తో సంప్రదింపుల నేపథ్యంలోనే కాల్పుల విరమణ జరిగిందని ట్రంప్ స్వయంగా ప్రకటించారు. అయితే.. కాసేపటికే సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టులో చైనా కీలక పాత్ర పోషించిందని అన్నారు. మరోవైపు.. ఇరాన్ వాదన కూడా అలాగే ఉంది. ఈ విషయంలో పాక్ ప్రమేయమేదీ లేదనట్లే ఇరాన్ ప్రకటించింది. కేవలం చైనా చెబితేనే తాము ఈ ఒప్పందానికి ముందుకు వచ్చామని అంటోంది.ఇదీ చదవండి: అమెరికాకు ఇరాన్ 10 కండిషన్లు! ఇవిగో.. -
షాకిచ్చిన ఇరాన్.. హర్మూజ్ మళ్లీ క్లోజ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన డెడ్‌లైన్ మరికాసేపట్లో ముగియనుంది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా అందోళన నెలకొంది. ఇరాన్-అమెరికా మధ్య చర్చలు సఫలీకృతం కాకపోవడంతో దాడుల తీవ్రత మరింత పెరుగుతుందన్న భయాలు నెలకొన్నాయి. ఇరాన్‌లోని విద్యుత్ ప్లాంట్లు, బ్రిడ్జ్లపై దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. దాడుల తీవ్రతను పెంచేందుకు అమెరికా-ఇజ్రాయెల్ సిద్ధం?విద్యుత్ ప్లాంట్లు, బ్రిడ్జ్‌లు పేల్చేస్తామని ఇప్పటికే ట్రంప్ వార్నింగ్ ఇరాన్‌ను పూర్తిగా అధీనంలోకి తీసుకుంటామన్న ట్రంప్కాల్పుల విరమణ ప్రతిపాదనలకు ఒప్పుకోని ఇరాన్అమెరికా దాడులను ఎదుర్కొనేందుకు ఇరాన్ సిద్ధం! -
ఇరాన్‌పై దాడులు మొదలుపెట్టిన అమెరికా
హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన గడువు ముగియడానికి ముందే ఇరాన్‌పై దాడులు మొదలైనట్లు కనిపిస్తోంది. ఇరాన్‌లోని అల్యూమినియం ఎక్కువగా ఉత్పత్తి చేసే అరక్ అల్యూమినియం కంపెనీపై ఇజ్రాయెల్-అమెరికా క్షిపణలు.. బుధవారం వేకువజామున దాడి చేశాయి. ఈ విషయాన్ని ఇరాన్ మీడియా ధ్రువీకరించింది. దీంతో సదరు కంపెనీ ఉన్న మాషార్ పరిసర ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 5:30 గంటల (అమెరికాలో మంగళవారం రాత్రి 8 గంటలు) వరకు ఇరాన్‌కి అమెరికా గడువు విధించింది. అప్పటిలోగా హర్మూజ్‌ని తెరవకపోతే ఇరాన్‌లోని వంతెనలు, విద్యుత్ కేంద్రాలని నేలమట్టం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. తాజాగా ఇరాన్ నాగరికత మొత్తం అంతమైపోతుందని వ్యాఖ్యానించారు. దీనికి ప్రతిస్పందనగా.. అమెరికా, దాని మిత్రదేశాలు తమ దెబ్బ రుచిచూస్తాయని ఇరాన్ పేర్కొంది. ఈ క్రమంలోనే ఈజిప్టు, పాకిస్తాన్, తుర్కియే మధ్యవర్తిత్వంతో ఇరుదేశాల మద్య జరుగుతున్న చర్చలకు ముగింపు పలికింది. శాంతి చర్చల్లో భాగంగా 45 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదన తీసుకురాగా దాన్ని ఇప్పటికే ఇరాన్ తిరస్కరించింది. -
యుద్ధ ప్రభావం.. కువైట్‌లో ప్రభుత్వ హెచ్చరికలు
ఇరాన్‌కి అమెరికా అధ్యక్షుడు ఇచ్చిన గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. దీంతో పశ్చిమాసియా అంతటా ఉత్కంఠ, ఆందోళన నెలకొంది. ఇరాన్‌ని ఒక్క రాత్రిలో తుడిచిపెట్టేస్తామని ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. మరోవైపు ఇరాన్ కూడా ఏ మాత్రం లెక్కచేయట్లేదు. వెనక్కి తగ్గేదే లేదని వార్నింగ్స్ ఇస్తున్నారు. ఈ పరిణామాల వల్ల ఏం జరుగుతుందోనని పశ్చిమాసియాలోని ఇతర దేశాలు కూడా భయపడుతున్నాయి. ఈ క్రమంలోనే కువైట్ ప్రభుత్వం తమ దేశ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది.పౌరులంతా బుధవారం ఉదయం 6 గంటల వరకు ఇళ్లలోనే ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని కువైట్ హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ క్షిపణి దాడులు జరిపే ప్రమాదం ఉండడంతోనే కువైట్.. తన పౌరులను హెచ్చరించింది. -
ఇజ్రాయెల్ కాన్సులేట్ వద్ద కాల్పులు.. దుండగులు హతం
టర్కీలోని ఇజ్రాయెల్ కాన్సులేట్ వద్ద కాల్పుల కలకలం రేగింది. ఇస్తాంబుల్‌లోని కార్యాలయం వద్ద ముగ్గురు దుండగులు కాల్పుల యత్నం చేశారు. దీంతో భద్రతా బలగాలు వెంటనే స్పందించి వారిని మట్టుబెట్టాయి. మరోకరిని అదుపులోకి తీసుకున్నాయి.ఇజ్రాయెల్ కాన్సులేట్ కార్యాలయం ఎదుట లాంగ్ బారెల్ గన్స్‌తో ముగ్గురు వ్యక్తులు కాల్పులకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే స్పందించిన భద్రతా బలగాలు వారిపై ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించగా మరోకరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అయితే కాల్పుల ఘటనతో కాన్సులేట్ ఎదుట భారీగా భద్రత మోహరించినట్లు టర్కీ అధికారులు పేర్కొన్నారు.టర్కీ అధికారులు ఈ దాడిని అధికారికంగా గుర్తించారు. అయితే దాడి చేసిన వారి వివరాలు, ఎందుకు చేశారు అనే కారణాలు వెల్లడించలేదు. -
బెదిరింపులతో మా దాడులు ఆగవు.. ట్రంప్‌కు ఇరాన్ కౌంటర్
టెహ్రాన్: ఇరాన్, అమెరికా మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. హార్మూజ్ జలసంధి విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన డెడ్‌లైన్ సమీపిస్తున్న తరుణంలో ఇరాన్ ప్రతిగా కౌంటరిస్తోంది. ట్రంప్ బెదిరింపులకు అసలు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెబుతోంది. దీంతో, యుద్ధం ఎక్కడి వరకు వెళ్తుందోనన్న భయాందోళనలు నెలకొన్నాయి.అయితే, హార్మూజ్ అంశంలో వెంటనే ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్ మొత్తం ఒక్క రాత్రిలోనే తుడిచిపెట్టుకుపోతుందని అమెరికా అధ్యక్షుడు చేసిన హెచ్చరికలను టెహ్రాన్ తోసిపుచ్చింది. ఈ సందర్భంగా ఇరాన్ సైనిక కమాండ్ ప్రతినిధి ఘాటుగా హెచ్చరించారు. తాజాగా ఇరాన్ సైనిక కమాండ్ మాట్లాడుతూ..‘ట్రంప్ చేసిన అవివేకపు బెదిరింపులకు ఇరాన్‌పై ఎలాంటి ప్రభావం చూపవు. ట్రంప్ బెదిరింపులు వారి సైనిక వైఫల్యాల ఫలితం. అవి మా దాడులను ఆపలేవు. పశ్చిమాసియాలో అమెరికా ఎదుర్కొన్న అవమానాన్ని కూడా చెరపలేవు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) నౌకాదళం ఇజ్రాయెల్‌కు చెందిన కంటైనర్ నౌకపై క్షిపణి దాడి చేసింది. దీంతో అది ధ్వంసమై భారీ అగ్నిప్రమాదం సంభవించింది.అలాగే టెల్ అవీవ్, హైఫా, బీర్ షెవా వంటి ప్రాంతాల్లో కీలక లక్ష్యాలను బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. అమెరికా కూడా చెందిన నౌక ఎల్హెచ్ఏ-7 కూడా దాడులకు గురై, మహాసముద్రంలోనే వెనుదిగాల్సి వచ్చింది. కువైట్‌లోని అమెరికా స్థావరాలు, బాగ్దాద్‌లోని కమాండ్ కేంద్రాలపై కూడా దాడులు జరిపాయి’ అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో అమెరికా-ఇజ్రాయెల్ లక్ష్యాలపై తమ దాడులు కొనసాగుతాయని సైనిక కమాండ్ ప్రతినిధి హెచ్చరించారు. అంతకుముందు కూడా ఇరాన్.. కాల్పుల విరమణకు అంగీకరించలేదు. మద్యవర్తుల ప్రతిపాదనను తిరస్కరించింది. యుద్ధం ఆపాలంటూ అమెరికాకు పది షరతులు విధించింది.మరోవైపు.. డెడ్‌లైన్ తర్వాత ఇరాన్‌కు గడువు పొడిగింపు అసంభవమని ట్రంప్ తేల్చి చెప్పారు. ఇరాన్ మౌలిక సౌకర్యాలపై దాడులు చేస్తామని హెచ్చరించారు. ట్రంప్..‘మంగళవారం ఇరాన్‌ను పూర్తిగా అధీనంలోకి తీసుకుంటాం. ఇరాన్ మొత్తం తుడిచిపెట్టకుపోవచ్చు. ఇరాన్‌ను ఒక్క రాత్రిలోనే మట్టుబెట్టగలం. ఇరాన్లో మా వెపన్ సెక్షన్ ఆఫీసర్‌ను కాపాడుకున్నాం, పైలట్‌ను రక్షించాం, ఎఫ్-15 యుద్ధ విమానం నుంచి పైలట్‌ను రక్షించాం. శత్రు ప్రాంతాల్లోకి ఎఫ్-15 యుద్ధ విమానం చొచ్చుకెళ్లింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పైలట్‌ను కాపాడగలిగాం’ అని అన్నారు. -
ట్రంప్ బెదిరింపులకు దీటుగా బదులిచ్చిన ఇరాన్
ఇరాన్-అమెరికా మధ్య చర్చలు సఫలీకృతం కాకపోవడంతో దాడుల తీవ్రత మరింత పెరుగుతుందన్న భయాలు నెలకొన్నాయి. ఇరాన్‌లోని విద్యుత్ ప్లాంట్లు, బ్రిడ్జ్లపై దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. -
ప్రమాదపుటంచుల్లో దేశాలు
ఇజ్రాయెల్‌తో కలిసి ఏకపక్షంగా ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించింది మొదలు అది ఇవాళో, రేపో పూర్తికాబోతున్నదని చెప్పడం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు అలవాటైపోయింది. తాజాగా ప్రకటించిన సోమవారం డెడ్‌లైన్ కూడా ఆ ప్రస్తావనే లేకుండా ముగిసిపోయింది. కావలసినట్టుగా కథనాలను వండివార్చిపెట్టే ఒక వార్తాసంస్థ ద్వారా మాత్రం అమెరికా, ఇరాన్‌లు పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ‘ఇస్లామాబాద్ ఒడంబడిక’ కుదుర్చుకున్నాయనీ, రెండంచెల ఈ పథకంలో తక్షణ కాల్పుల విరమణ, అనంతరం కుదరబోయే సమగ్ర ఒప్పందం భాగమనీ సోమవారం లీక్ వదిలారు. కాల్పుల విరమణ 45 రోజులపాటు అమల్లో ఉంటుందని కూడా ఆ కథనం చెబుతోంది. కానీ 38వ రోజుకూడా యథావిధిగా దాడులు జరిగి, ఇరాన్‌కు చెందిన ఒక సహజవాయు క్షేత్రం ధ్వంసమైంది. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలపై ఇరాన్ దాడులు చేసింది. ఇక ఇరాన్‌లోని సమస్త మౌలిక సదుపాయాలనూ మంగళవారం ధ్వంసం చేయబోతున్నానని ట్రంప్ ప్రకటించినా అటునుంచి రాజీ స్వరం వినబడలేదు. పైపెచ్చు ఆయన వ్యాఖ్యలు తూగుతప్పిన మాటలని ఇరాన్ ప్రతిస్పందించింది. ‘మీ ప్రతిపాదనను పరిశీలించటానికి తగిన సమయం తీసుకుంటాం. ఈలోగా ఏ ఒత్తిడికీ లొంగేది లేదు. హార్మూజ్‌ను తెరిచేదిలేద’ ని కటువుగా సమాధానమిచ్చింది.నిఘా సంస్థలూ, రక్షణ దళాల ముఖ్యులూ హెచ్చరిస్తున్నా యుద్ధానికి కాలుదువ్విన ట్రంప్ దాన్నుంచి బయటపడే మార్గం కోసం తెగ తాపత్రయపడుతున్నారు. ఏ విధంగా చూసినా బలాబలాల విషయంలో తమతో సరిపోలని ఇరాన్ వంటి ఒక చిన్న దేశాన్ని పోరాడక తప్పని స్థితిలోకి నెట్టడం ద్వారా ప్రచార యుద్ధంలో దానిదే పైచేయి అయ్యేలా చూసిన ఘనత ట్రంప్‌కే దక్కుతుంది. సమవుజ్జీలు కాని ఇద్దరి మధ్య పోరు జరుగు తున్నప్పుడు సహజంగా బలహీనుడికే సహానుభూతి దక్కుతుందన్న ఇంగిత జ్ఞానం ఆయన మరిచారు. విద్యుదుత్పాదన ప్లాంట్లు, రోడ్లు, వంతెనలు, నిర్లవణీకరణ ప్లాంట్లు మంగళవారం ధ్వంసం చేస్తామనటం అంటే యుద్ధనేరాలకు పాల్పడతానని చెప్పడమే! అమెరికా అధ్యక్షుడొకరు ఇలా బాహాటంగా ప్రకటించటం మునుపెన్నడూ లేదు. యుద్ధంవల్ల పౌరజీవితాలకు నష్టం వాటిల్లకూడదని, వారి ప్రాణాలకు ముప్పు రాకూడదని జెనీవా ఒప్పందాలూ, హేగ్ ఒడంబడికలూ, న్యూరెంబర్గ్ నియమాలూ, ఐక్యరాజ్యసమితి అధికారిక పత్రమూ ఘోషిస్తున్నాయి. ట్రంప్ వర్తమాన స్థితి నియంత్రణ లేని ట్రెడ్మిల్ ఎక్కిన మనిషిని పోలి ఉంది. అది నిరంతరాయంగా తిరుగుతూనే ఉంటుంది, దిగటానికి ప్రయత్నిస్తే బొక్కబోర్లాపడే ప్రమాదం ఉంటుంది. యూదు జాతీయుడైన ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నెర్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ కుమ్మక్కై ఇరాన్ రెండ్రోజులకే పాదాక్రాంతమవుతుందని ట్రంప్‌ను నమ్మించిన పర్యవసానమే ఈ యుద్ధమని ‘మాగా’ శిబిరంలో అందరికీ తెలుసు. అమె రికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మొదలుకొని ‘మాగా’ సిద్ధాంతవేత్త స్టీవ్ బేనన్ వరకూ అందరిలోనూ వైట్‌హౌస్‌ను ‘ఇజ్రాయెల్ లాబీ’ శాసిస్తోందన్న ఆగ్రహావేశాలున్నాయి. ట్రంప్ బలమైన మద్దతుదారు చార్లీ కిర్క్ హత్య ఇలాంటి గొడవల పర్యవసానమేనని వదంతులున్నాయి. దానిపై దర్యాప్తు సాగుతున్న తరుణంలోనే మరో ‘మాగా’ మద్దతు దారు, జాతీయ ఉగ్రవాద వ్యతిరేక కేంద్రం డైరెక్టర్ జో కెంట్ నిష్క్రమించాల్సి వచ్చింది. దిక్కుతోచని స్థితిలో పడినందువల్లే యుద్ధంలో పాలుపంచుకోవాలంటూ యూరప్ దేశాలపై ట్రంప్ ఒత్తిళ్లు తెచ్చారు. అవి ఫలించకపోవటంతో శాపనార్థాలు పెట్టారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక్క 70వ దశకంలో తప్ప ప్రపంచానికెప్పుడూ ఈ స్థాయిలో ‘ఆయిల్ షాక్’ తగల్లేదు. అసలే ఆర్థిక వ్యవస్థలు కష్టాల్లో ఉన్నాయి. అప్పుడప్పుడు మాత్రమే లోటు బడ్జెట్లుండే కాలం గతించి, అవి రివాజుగా మారిన ఈ వర్తమానంలో ‘పులి మీద పుట్ర’లా ట్రంప్ తీసుకొచ్చిన ఈ యుద్ధంతో... ఇజ్రాయెల్, అమెరికాలను గుడ్డిగా సమర్థించే దేశాలు సైతం కష్టాల్లో కూరుకుపోయాయి. సగటు లోటు జీడీపీలో 2 శాతం మించని దేశాల్లో ఇప్పుడది 20 శాతానికి ఎగబాకే ముప్పు ముంచుకొస్తోంది. ఈ దశలో కూడా ట్రంప్ కళ్లు తెరవకపోతే ప్రపంచం మరింత సంక్షోభంలో పడుతుంది. -
ఇజ్రాయెల్‌పై భీకర దాడులతో విరుచుకుపడ్డ ఇరాన్
జెరూసలేం: పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు రోజురోజుకీ మరింత క్షీణిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రత్యర్థులు శత్రు స్థావరాలపై దాడులు జరపడం పరిపాటిగా ఉండేది. కానీ ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి జనావాసాలపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా, ఇరాన్ ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులతో విరుచుకుపడింది.సోమవారం ఇరాన్ భారీ క్షిపణులతో ఇజ్రాయెల్ నగరం టెల్ అవీవ్‌తో పాటు మొత్తం 15 ప్రాంతాల్లో దాడులు చేసింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల వల్ల అనేక ప్రదేశాలు దెబ్బతిన్నాయని ఇజ్రాయెల్ ఫైర్ అండ్ రెస్క్యూ నివేదించింది. ఈ దాడిలో గాయపడిన ఇద్దరికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్లు ఇజ్రాయెల్ రెస్క్యూ సర్వీస్ తెలిపింది. రోజంతా పదేపదే సైరన్లు మోగుతుండగా, రాబోయే మరిన్ని దాడుల గురించి అధికారులు హెచ్చరిస్తూ, నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని కోరారు. -
ఇరాన్‌కు మరో షాక్.. మజీద్ ఖదేమీ మృతి
టెహ్రాన్: పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్‌కు బిగ్‌షాక్ తగిలింది. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త క్షిపణి దాడుల్లో ఇరాన్ ఐఆర్జీసీ ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ మజీద్ ఖదేమీ మృతి చెందారు. అమెరికా-ఇజ్రాయెల్ క్షిపణి దాడుల్లో ఖదేమీ మృతి చెందినట్లు ప్రముఖ మీడియా సంస్థ అల్ జజీరా తెలిపింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అధికారికంగా మజీద్ మరణాన్ని ధృవీకరించింది. ఐఆర్జీసీ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ప్రెస్ టీవీ పలు కథనాలు ప్రసారం చేసింది. అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన క్షిపణి దాడుల్లో తమ ఇంటెలిజెన్స్ చీఫ్ మజీద్ మరణించారని ఐఆర్జీసీ ప్రకటించింది. మజీద్ గత ఐదేళ్లుగా ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ విభాగానికి చీఫ్‌గా పనిచేశారు. ఈ కాలంలో విదేశీ శక్తుల చొరబాటును అరికట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు ఐఆర్జీసీ అధికార ప్రతినిధులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రెస్ టీవీ కథనాలు కూడా ప్రస్తావించాయి. -
ఎయిరిండియా కీలక ప్రకటన.. ఆ దేశానికి విమానాలు రద్దు
ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ వెళ్లే విమాన సర్వీసులని తాత్కాలికంగా రద్దు చేసినట్లు పేర్కొంది.పశ్చిమాసియా యుద్ధం మెుదలై దాదాపు నెలరోజులు గడుస్తోన్నా ఇంకా పరిస్థితులు సద్దుమణగడం లేదు కదా పరిస్థితులు మరింతగా ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనేపథ్యంలోనే ఎయిర్ఇండియా కీలక ప్రకటన చేసింది. మే 31 వరకూ టెల్ అవీవ్ వెళ్లే అన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.ఎయిర్ఇండియాతో పాటు మరికొన్ని విమానాయాన సంస్థలు సైతం ఇజ్రాయెల్‌కు తమ సర్వీసులను నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌లో దాదాపు 40 వేల వరకూ భారతీయులు నివసిస్తున్నారు. స్వదేశానికి రావాలనుకునేవారు జోర్దాన్, ఈజిప్టు మీదుగా భారత్ చేరుకోవచ్చు. -
ట్రంప్ అల్టిమేటం.. ఆయుధాలు సిద్దం చేస్తున్న ఇజ్రాయెల్?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు భారీ వార్నింగ్ ఇచ్చారు. 48 గంటల్లో హర్మూజ్‌ను తెరవకపోతే కనీవినీ ఎరుగని విధ్వంసం చూస్తారని ఇరాన్‌ని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు ఆ దేశ ఉన్నతాధికారి తెలిపారు. పశ్చిమాసియా యుద్ధం తీవ్రస్థాయికి చేరుకోనుందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ట్రంప్ 48 గంటల అల్టిమేటం తర్వాత ఇరాన్‌కు చెందిన ఇంధన మరియు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల మీద భారీ దాడులు చేయడానికి ఇజ్రాయెల్ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం అందుతుంది. ఈ దాడుల కోసం అమెరికా నుండి 'గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉందని ఇజ్రాయెల్ రక్షణ శాఖ ఉన్నతాధికారి పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయమై అమెరికా అధ్యక్షుడు ఇరాన్‌కు ఇదివరకే అల్టిమేటం జారీ చేశారు. "ఇరాన్‌కు ఒక ఒప్పందానికి రావడానికి లేదా హర్మూజ్ జలసంధిని తెరవడానికి నేను 10 రోజుల సమయం ఇచ్చాను. ఆ సమయం ముగిసిపోతోంది. మరో 48 గంటల్లో ఇరాన్ మీద 'నరకం' కురుస్తుంది " అని ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా హెచ్చరించారు.ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఆయుధాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నిన్న అమెరికాకు చెందిన ఫైటర్ జెట్లను ఇరాన్ కూల్చివేసింది. అలాగే రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లపై కూడా దాడులు జరిగాయి. ఇటు ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ సైనిక ప్రధాన కార్యాలయం సమీపంలో ఇరాన్ క్షిపణులు పడ్డాయి. ఇటు ఇరాన్ సైతం అమెరికా షరతులు అంగీకారంగా లేవు అని చర్చలను దాటవేసింది. -
ఇరాన్‌లోని బుషెహర్ అణు స్థావరంపై క్షిపణి దాడి
టెహ్రాన్: ఇరాన్లో శనివారం (ఏప్రిల్ 4న) ఉదయం బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం పరిధి సమీపంలో ఒక క్షిపణి పడింది. దీంతో అక్కడి ఒక భద్రతా సిబ్బంది మరణించినట్లు ఇరానియన్ వార్త సంస్థ తస్నీమ్ తెలిపింది. ఈ ఘటనలో అణు విద్యుత్ కేంద్రం ప్రధాన భాగాలు దెబ్బతినలేదు. కానీ, సహాయక భవనం దెబ్బతింది. అణు విద్యుత్ కేంద్రం ఉత్పత్తిపై ప్రభావం పడలేదు.బుషెహర్ దక్షిణ ఇరాన్లో పర్షియన్ గల్ఫ్ తీరంలో ఉంది. ఇది ఆ దేశపు మొదటి వాణిజ్య అణు విద్యుత్ కేంద్రం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ఇరాన్ మౌలిక వసతులు, వంతెనలు, విద్యుత్ కేంద్రాలపై దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ‘‘అమెరికా సైన్యం ఇరాన్లో మిగిలినదాన్ని నాశనం చేయడం ఇంకా ప్రారంభించలేదు" అని అన్నారు. ఇంతలోనే ఇవాళ ఈ దాడి జరగడం గమనార్హం."మా సైన్యం ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైనది, ఇరాన్లో మిగిలినదాన్ని నాశనం చేయడం ఇంకా ప్రారంభించలేదు. తర్వాత వంతెనలు, ఆపై విద్యుత్ కేంద్రాలు నాశనం చేస్తాం. ఇరాన్‌లోని కొత్త పాలకులకు చేయాల్సిన పనుల గురించి తెలుసు, వెంటనే చేయాలి’ అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అవసరమైతే ఇరాన్‌ను రాతి యుగానికి తీసుకెళ్లేలా బాంబులు వేస్తామని ట్రంప్ హెచ్చరించారు.ఇవాళ ఉదయం ఇరాన్ సాయుధ దళాల కేంద్ర ప్రధాన కార్యాలయం.. అమెరికా, పశ్చిమాసియాలోని దేశాలకు తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. ఖాతమ్ అల్-అన్బియా కేంద్ర కార్యాలయం ప్రతినిధి ఇబ్రాహీం జోల్ఫఘారి ఓ ప్రకటన విడుదల చేసి.. అమెరికా, ఇజ్రాయెల్ ఆస్తులపై వినాశకర దాడులు చేస్తామని హెచ్చరించారు. పశ్చిమాసియాలోని దేశాలపై యుద్ధం చేస్తూనే సొంత దేశంలో తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని కూడా కఠినంగా శిక్షిస్తోంది ఇరాన్. ఇరాన్ నిషేధిత ప్రతిపక్ష గగ్రూప్ పీపుల్స్ మొజాహెదిన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇరాన్ (పీఎంఓఐ/ఎంఈకే) సభ్యులుగా తేలిన ఇద్దరు పురుషులను ఉరి తీసింది. ఈ వివయాలను ఇరాన్ న్యాయవ్యవస్థ వెబ్సైట్ మిజాన్ ఆన్లైన్లో తెలిపింది. -
బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన టెహ్రాన్
-
ఇరాన్ స్కూల్స్ ను టార్గెట్ చేసిన అమెరికా-ఇజ్రాయెల్
-
లెబనాన్‌పై విరుచుకుపడిన ఇజ్రాయెల్.. 1000 మంది మృతి!
జెరూసలేం: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దళాల దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత నెలలో లెబనాన్‌పై జరిపిన దాడుల్లో దాదాపు 1000 మంది ఉగ్రవాదులు హతమైనట్టు ఐడీఎఫ్ ఓ ప్రకటనలో పేర్కొంది. లెబనాన్‌లో దాదాపు 3,500కు పైగా లక్ష్యాలపై దాడులు జరిగినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది.ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) తాజాగా స్పందిస్తూ..‘లెబనాన్‌లో హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థకు సంబంధించిన అన్ని ప్రధాన కేంద్రాలపై దాడులు జరిగాయి. వైమానికి, సముద్ర, భూ మార్గాల ద్వారా దాడులు చేశాం. దక్షిణ లెబనాన్‌లో ఐడీఎఫ్ దృఢ నిశ్చయంతో పనిచేస్తోంది. 91వ, 146వ, 36వ, మరియు 162వ డివిజన్లు దక్షిణ లెబనాన్‌లో లక్షిత కార్యకలాపాలు, ఉగ్రవాద మౌలిక సదుపాయాలను కూల్చివేయడం జరిగింది. అలాగే, ఉగ్రవాదులను నిర్మూలించడంతో పాటు, ఆ సంస్థకు సంబంధించిన సామర్థ్యాలను మరింత దెబ్బతీసి, దానిని ఆ ప్రాంతం నుండి తరిమివేసేందుకు ఒక కేంద్రీకృత భూతల ప్రయత్నానికి నాయకత్వం వహిస్తున్నాయి.ఇప్పటివరకు, అనేక మంది సీనియర్ కమాండర్లు, వందలాది మంది రద్వాన్ ఫోర్స్ కార్యకర్తలతో సహా సుమారు 1,000 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. లెబనాన్ వ్యాప్తంగా 3,500కు పైగా ఉగ్రవాద లక్ష్యాలపై ఐడీఎఫ్ దాడులు చేసింది. ఈ దాడులు ఉగ్రవాద మౌలిక సదుపాయాలు, ఆయుధ నిల్వ సౌకర్యాలు, ప్రయోగ స్థానాలు, కమాండ్ అండ్ కంట్రోల్ ప్రధాన కార్యాలయాలపై కేంద్రీకరించబడ్డాయి.IDF Clearing Homes in Lebanon pic.twitter.com/pTcG4KWWGq— War Archive Clips (@WarArchiveClips) April 2, 2026దీనికి అదనంగా, లెబనాన్‌లో సమాంతర బ్యాంకింగ్ వ్యవస్థగా పనిచేస్తూ, పౌర నిధులను దుర్వినియోగం చేస్తూ, హెబ్జొల్లా ఉగ్రవాద సంస్థకు నిధులు ఇరాన్ నుంచి సమకూరుతున్నాయి. ఇందులో భాగంగా డబ్బు అందుకునే ఆర్థిక సంస్థ అయిన “అల్-ఖార్ద్ అల్-హసన్” అసోసియేషన్ కీలక ఆస్తులు, ఆర్థిక నిల్వ కేంద్రాలపై కూడా దాడులు జరిగాయి. అలాగే ఉత్తర లెబనాన్ నుండి దక్షిణ లెబనాన్‌కు ఆయుధాలు, శత్రు బలగాలను తరలించడానికి ఉపయోగించే ఐదు ప్రధాన వంతెనలను కూల్చివేశాం. ఈ దాడులు ఉగ్రవాద సంస్థ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన నష్టాన్ని కలిగించాయి’ అని తెలిపారు. -
అఖండ ఇజ్రాయెల్ భావన ప్రమాదకరం
ప్రస్తుత యుద్ధరంగంలో లెబనాన్, పాలస్తీనా, ఇరాన్ ప్రతిఘటనల్ని అణచివేసి ‘అఖండ ఇజ్రాయెల్’ స్థాపనకు ఇజ్రాయెల్ విశ్వ ప్రయత్నం చేస్తోంది. దేవుడు అబ్రహాంకు చేసిన వాగ్దానంలో అతని సంతానానికి నైలునది–యూప్రటీసుల మధ్యగల భూభాగం చెందు తుందని పురాణం చెబుతున్నట్లంటుంది. దీని ప్రకారం ఇరాన్, జోర్డాన్, లెబనాన్, సౌదీ అరేబియా, సిరియా దేశాలన్నింటినీ లేదా వాటిల్లో కొంత భూభాగాన్ని ఇజ్రాయెల్ ‘అఖండ ఇజ్రాయెల్’ కింద పరిగణిస్తోంది.ఆటోమన్ సామ్రాజ్యంపై విజయం సాధించిన బ్రిటిష్ సామ్రాజ్యం... అరబ్బులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేసి దానిపై పరిపాలనాధికారాన్ని 1948 వరకు తన దగ్గరే ఉంచుకొంది. 1917లో యుద్ధ సమయంలో యూదు నాయకుడు తియోడర్ హెర్షల్కు, బ్రిటిష్ వాళ్లకు మధ్య జరిగిన బల్ఫోర్స్ రహస్య ఒప్పందం ఫలితంగా... పాలస్తీనా భూభాగంలో యూదులకు తలదాచుకోవటానికి వాగ్దానం చేశారు.1948లో వారి అనుకూల ఐక్యరాజ్య సమితిలో 118వ తీర్మానంతో ఇజ్రాయెల్, పాలస్తీనాలుగా భూభాగాన్ని విభజించారు. కానీ 1948 యుద్ధంలో ఇజ్రాయెల్... గాజా, వెస్ట్‌బ్యాంక్‌లు మినహా బ్రిటిష్ మాండేటరీ పాలస్తీనా మొత్తాన్నీ తన ఆధీనంలోకి తీసుకొంది. 1967లో ఆరు రోజుల యుద్ధంలో వెస్ట్‌బ్యాంక్, గాజాలతో పాటుగా ఈజిప్టులోని సినాయ్ ద్వీపకల్పంతోపాటు సిరియాలోని గోలెన్ హైట్స్‌ను ఆక్రమించి, 1982లో సినాయ్ను ఈజిప్టుకు తిరిగి ఇచ్చింది. ఇప్పటికీ ఈ ప్రాంతంపై ఇజ్రాయెల్ అదుపుకలిగి ఉండటం గమనార్హం.ఇరాన్ యుద్ధాన్ని అదునుగా చేసుకొని దక్షిణ లెబనాన్‌లో, రాజధాని బీరూట్, మధ్య జిల్లాలతోపాటు బెకాలోయపై ఇజ్రాయెల్ బాంబుల దాడులు చేస్తున్నది. నివాస ప్రాంతాలు, మౌలిక సదుపాయాలు నేలమట్టమయ్యాయి. 15 లక్షల మందికి పైగా, దేశంలో దాదాపు 20 శాతం ప్రజలు తమ ఇళ్లను వదిలి వలసలకు వెళ్లిపో వాల్సి వచ్చింది. ఇది అంతర్జాతీయ చట్ట ఉల్లంఘన అని ఐరాస ప్రకటించింది. హెజ్బొల్లాను నిరాయుధులుగా చేసేవరకు లెబనాన్ భూమిని ఆక్రమిస్తూనే ఉంటామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ప్రజలను భయభ్రాంతుల్ని చేయటం ద్వారా హెజ్బొల్లాకు వ్యతిరేకంగా వారిని మార్చాలనే వ్యూహంలో ఇజ్రాయెల్ ఉంది.ప్రస్తుతం అమెరికా మద్దతుగా ఉన్న సిరియా అధ్యక్షుడు అహ్మద్ అలాషర్తో ఇజ్రాయెల్ మరింత బలపడుతోంది. సిరియా ద్వారా లెబనాన్ సరిహద్దులను, కదలికలను గమనిస్తూ లెబనాన్‌కు సహాయం అందకుండా చేస్తోంది. లెబనాన్ తూర్పు సరిహద్దును మూసివేయించింది. దేశంలో ఇప్పటికే అనేక వంతెనలను కూల్చింది. లెబనాన్ ఆక్రమణ దిశగా సాగుతోంది.చదవండి: అమెరికా.. తన ఆటలో తనే పాయిందా?కానీ డెమోరా అణుకేంద్రంపై ఇరాన్ చేసిన దాడి ఇజ్రాయెల్‌కు వణుకుపుట్టించింది. ఈ ఘటనతో షాక్‌కు గురైన అమెరికా అధ్య క్షుడు ట్రంప్ ఏకంగా కొన్ని రోజులపాటు ఇరాన్ ఇంధన కేంద్రాలపై దాడిచేయబోమని ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ‘అఖండ ఇజ్రాయెల్’ సాకారమవ్వడం అసాధ్యం. ఒక వేళ ఈ యుద్ధంలో ఇజ్రా యెల్– అమెరికా నెగ్గితే మొత్తం పశ్చిమాసియాను ఆక్రమించి దీనికి ‘నూతన పురాణ అఖండ ఇజ్రాయెల్’గా మరొక పురాణగాథ చెప్ప టానికి అవి సిద్ధంగా ఉన్నాయి. కానీ ఇరాన్ దగ్గర వాటి ఆటలు సాగడం లేదు. ‘రెండు దేశాల’ సిద్ధాంతానికి ఇజ్రాయెల్ కట్టుబడిన నాడే పశ్చిమాసియాలో శాంతి సాధ్యమవుతుంది. అంతవరకూ పశ్చిమాసియా కాష్ఠం రగులుతూనే ఉంటుంది.– బుడ్డిగ జమిందార్ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యవర్గ సభ్యులు -
చమురు, గ్యాస్ కాదు.. ఈసారి కండోమ్ వంతు!
-
ఇజ్రాయెల్ పై ఇరాన్ చేసిన అతి పెద్ద దాడి ఇదే..
-
దాడులు ఉధృతం
దుబాయ్/వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఇజ్రాయెల్–అమెరికా, ఇరాన్ నడుమ యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతూనే ఉంది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ బుధవారం దాడులకు దిగింది. అక్కడి ఇంధన నిల్వ ట్యాంకులనే లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు ప్రయోగించింది. ఒక ట్యాంక్ పేలిపోయి విమానాశ్రయంలో భారీగా మంటలు చెలరేగినట్టు కువైట్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఖతర్ తీర సమీపంలో ఆ దేశానికి చెందిన ఓ చమురు నౌకపై కూడా ఇరాన్ క్రూయిజ్ క్షిపణితో దాడి చేసింది. దాంతో అందులోని 21 మంది సిబ్బందిని హుటాహుటిన ఖాళీ చేయించారు. యూఏఈలోని ఫుజైరాలో డ్రోన్ శకలాలు తాకి ఒక వ్యక్తి మరణించాడు. బహ్రెయిన్‌పై కూడా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగింది. పలు క్షిపణులు, డ్రోన్లను నేలకూల్చినట్టు జోర్డాన్, సౌదీ అరేబియా ప్రకటించాయి.యూఏఈలోని ఉమ్ అల్ థౌబ్ పారిశ్రామిక ప్రాంతంపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో ఒక భారతీయుడు గాయపడ్డాడు. బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తి మరణించాడు. తన ప్రధాన శత్రువైన ఇజ్రాయెల్‌పై కూడా ఇరాన్ భారీ స్థాయిలో విరుచుకుపడింది. దేశవ్యాప్తంగా పలు నగరాలపై క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపించింది. దాంతో ఎక్కడ చూసినా సైరన్ల మోత విన్పించింది. ఐదుగురికి పైగా గాయపడ్డట్టు సమాచారం. హూతీ రెబెల్స్ కూడా ఇజ్రాయెల్‌పైకి క్షిపణులు ప్రయోగించారు! ఉత్తర ఇరాక్‌లోని ఇబ్రిల్లో బ్రిటన్ ఇంధన సంస్థ బీపీకి చెందిన నిల్వ కేంద్రంపై డ్రోన్ దాడులు జరిగాయి. దాంతో అక్కడ మంటలు చెలరేగినట్టు సమాచారం. ఇరాన్‌కు దన్నుగా యుద్ధ రంగంలోకి దిగేందుకు సిద్ధమని రష్యా అనుకూల చెచెన్ ఫైటర్లు ప్రకటించారు! పోరును మరింత ఉధృతం చేసేందుకు ఇజ్రాయెల్ వ్యతిరేక శక్తుల మద్దతు కూడా కూడగడతామని ఇరాన్ సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు చైనా, పాకిస్తాన్ ఐదు సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించాయి. దద్దరిల్లిన టెహ్రాన్ అమెరికా, ఇజ్రాయెల్ కూడా ఇరాన్‌పై తీవ్ర స్థాయిలో దాడులకు దిగాయి. రాజధాని టెహ్రాన్ పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. ఒకప్పటి అమెరికా రాయబార కార్యాలయ భవన ప్రాంగణం భారీగా దెబ్బ తింది. టెహ్రాన్‌లో ఫెంటానిల్ ఉత్పత్తి చేస్తున్న టోఫిక్ దారు కర్మాగారాన్ని బాంబులతో నేలమట్టం చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. దాన్ని రసాయినిక ఆయుధాల తయారీకి ఇరాన్ వాడుతోందని ఆరోపించింది. లెబనాన్‌పై కూడా ఇజ్రాయెల్ దాడుల తీవ్రత కొనసాగింది. రాజధాని బీరూట్‌పై జరిగిన దాడులకు ఐదుగురు బలైనట్టు ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాల నుంచి తమ సైన్యం వెనక్కు తగ్గుతున్నట్టు తెలిపింది. లెబనాన్‌లో హెజ్బొల్లా కార్యాలయాలను లక్ష్యం చేసుకుంటామని ఇజ్రాయెల్ పేర్కొంది.ప్రభుత్వంపై ఐఆర్జీసీ పట్టు!ఇరాన్ పూర్తిగా సాయుధ రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ) విభాగం చెప్పుచేతల్లోకి వెళ్లిన ట్టు వార్తలొస్తున్నాయి. అధ్యక్షుడి నిర్ణయాలు, నియామకాలను పక్కన పెట్టి ప్రభుత్వంపై ఐఆర్‌జీసీయే పూర్తిస్థాయిలో పెత్తనం చేస్తోందని ఇరాన్ ఇంటర్నేషనల్ వార్తా సంస్థ పేర్కొంది. -
ఒంటరి మానవుడు ట్రంప్!
ఇరాన్‌తో యుద్ధం ముగిసే సమయానికి అమెరికా సర్వభ్రష్టమయ్యే సూచనలు కనబడు తున్నాయి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ సలహాను శిరసావహించి యుద్ధంలోకి దిగిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఆయనతో చెడినట్టు కథనాలొస్తున్నాయి. గత ఏలుబడిలోనూ, రెండోసారి వచ్చాక అవకాశం దొరికినప్పుడల్లా నాటోను కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్న ట్రంప్ తాజాగా ఆ సంస్థ నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్టు బుధవారం ప్రకటించారు. ఇన్నేళ్లుగా తమను బహిరంగంగా దూషిస్తున్నా మౌనంగా ఉండిపోయిన దేశాలు, ఆయన మాట విని ఇరాన్‌తో అనవసర కయ్యానికి దిగదల్చు కోలేదని గత నెల రోజులుగా వాటి ప్రవర్తన చెబుతోంది. హార్మూజ్ జలసంధి దిగ్బంధాన్ని బద్దలు కొడదాం రమ్మని పిలుపునిస్తే ఎవరూ కదలకపోగా... దీంతో మాకేమిటి సంబంధమని స్పెయిన్ నిలదీసింది. మొదట్లో సిద్ధపడినట్టే కనిపించిన జర్మనీ, ఫ్రాన్స్ చివరకు మౌనం పాటించాయి. డీగోగార్షియా సైనిక స్థావరాన్ని ఇవ్వబోమని యుద్ధం తొలినాళ్లలో తిరస్కరించిన బ్రిటన్ అటుతర్వాత అంగీకరించినా, ఇప్పుడు అది సైతం యుద్ధ నౌకలను పంపేదిలేదని చెబుతోంది. సైనిక విమానాలు ఇంధనం నింపు కోవటానికి అనుమతించబోమని ఇటలీ చెప్పగా, ఇజ్రాయెల్‌కు ఆయుధాలతో వెళ్లే విమా నాలను తమ గగనతలంలోకి రానీయబోమని ఫ్రాన్స్ ప్రకటించింది. ఇలా ఎవరికి వారు మొహం చాటేస్తుండగా నాటో నుంచి తప్పుకోవటం తప్ప దిక్కులేదని ట్రంప్ భావించ టంలో ఆశ్చర్యం లేదు.నాటో ఆవిర్భవించి 77 యేళ్లు కావస్తోంది. స్థాపిత ఉద్దేశాలు మరిచి ప్రపంచ వ్యాప్తంగా అనేకచోట్ల అమెరికా ప్రయోజనాలు నెరవేర్చటానికి ముందుకురికిన ఆ సంస్థ వల్ల గతమంతా నెత్తుటితో తడిసింది. ఇన్ని దశాబ్దాల్లోనూ చోటుచేసుకున్న యుద్ధాల చిట్టా తీస్తే చాలావరకూ నాటోయే దోషిగా తేలుతుంది. పూర్వపు సోవియెట్ యూనియన్ నుంచి ముప్పు ముంచుకురాబోతున్నదని బెదిరి స్థాపించిన ఈ కూటమికి ఇన్నేళ్లలో ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఆ వైపునుంచి బెడద ఏర్పడింది లేదు. 1989లో ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక అప్పటి సోవియెట్ అధ్యక్షుడు గోర్బచెవ్ వార్సా కూటమిని రద్దుచేశాం గనుక, నాటోను కూడా రద్దు చేయమని కోరగా అందుకు అమెరికా, పాశ్చాత్య దేశాలు అంగీకరించలేదు. కనీసం దాన్లో తమను కూడా చేర్చుకోవాలని ప్రతిపాదించినా అవి తిరస్కరించాయి. పైపెచ్చు నాటోను ‘ఒక్క అంగుళం’ కూడా విస్తరించబోమని, రష్యా సరిహద్దు దేశాలను చేర్చుకునేది లేదని ఇచ్చిన వాగ్దానాన్ని ఉల్లంఘించాయి.ప్రపంచంలో పనికిమాలిన సంస్థ ఏమైనా ఉన్నదంటే అది నాటోయే. ప్రచ్ఛన్న యుద్ధం ముగిశాక దాన్ని శాంతిస్థాపక సంస్థగా మారిస్తే ప్రపంచంలో సహజ వనరుల వినియోగం గరిష్ఠంగా పెరిగి సైనిక వ్యయానికయ్యే ఖర్చంతా ఆదా అయి అవిద్య, నిరు ద్యోగం, అధిక ధరలు, ప్రాణాంతక వ్యాధులు సమసిపోయేవి. ఐక్యరాజ్యసమితికయ్యే వార్షిక వ్యయంతో పోలిస్తే నాటో ఖర్చు 400 రెట్లు ఎక్కువ! ఇందులో అత్యధిక శాతం సొమ్ము మారణాయుధాలకూ, సైనిక స్థావరాల నిర్వహణకూ ఖర్చవుతుంది. నాటో పేరు చెప్పి వివిధ యూరప్ దేశాల్లో తిష్టవేసిన సైన్యంలో అమెరికా సైనికుల సంఖ్యే దాదాపు 20 లక్షలు! మిగిలిన దేశాలకు చెందినవారి సంఖ్య అందులో సగం కూడా ఉండదు. నాటో నుంచి వైదొలగుతామని ట్రంప్ చెబుతున్న కబుర్లు ఉత్త బడాయి మాటలు. అదే అమలైతే ఇంటిదారిపట్టిన లక్షలాదిమంది సైనికుల్ని పోషించలేక అమెరికా ఆర్థిక వ్యవస్థ చతికిల బడుతుంది. అది సజావుగా సాగాలంటే, డాలర్ పచ్చగా కళకళలాడాలంటే ప్రపంచంలో ఏదో మూల మారణాయుధం పేలాల్సిందే!‘ఒక దశ దాటాక యుద్ధంలో నీకు ఆసక్తి లేకపోయినా, యుద్ధానికి నీపై ఆసక్తి తగ్గదు’ అని రష్యా విప్లవ సారథుల్లో ఒకరైన మార్క్సిస్టు సిద్ధాంతకర్త ట్రాట్సీ్క అంటాడు. కొరివితో తలగోక్కున్న చందంగా ఇరాన్‌పై అనవసర యుద్ధానికి దిగిన ట్రంప్‌కు దాన్నుంచి బయటపడటం ఎలాగో తెలియటం లేదు. అయినా రోజురోజుకూ పడిపోతున్న స్టాక్ మార్కెట్లను మాయజేయటం కోసం యుద్ధ విరమణ తథ్యమంటూ ప్రకటించటానికి ఆయన అలవాటుపడ్డారు. ఆ మాటెలా ఉన్నా ట్రంప్ బెదిరింపు నిజమై నాటో కనుమరుగైతే ప్రపంచం కాస్త ప్రశాంతంగా ఉంటుంది. -
చర్చలు కాదు.. యుద్ధానికి రెడీ.. UAE సంచలన ప్రకటన
-
‘నాటో’కు ట్రంప్ బిగ్‌షాక్!
వాషింగ్టన్: నాటో భాగస్వామ్య దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చారు. నాటో దేశాల కూటమి నుంచి బయటకు వచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇరాన్‌పై అమెరికా చేపట్టిన యుద్ధ చర్యలకు నాటో దేశాలు సహకరించడం లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నానని బ్రిటన్ మీడియా సంస్థ డైలీ టెలిగ్రాఫ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన నాటోను ‘కాగితపు పులి’గా అభివర్ణించారు. ‘అమెరికా నాటో కూటమిలో ఉండాలా వద్దా అన్నది మళ్లీ ఆలోచించే స్థితి దాటి పోయింది. నాటో విశ్వసనీయతపై నాకు ఎప్పటినుంచో సందేహాలున్నాయి. నాటో నన్ను ఎప్పుడూ ప్రభావితం చేయలేదు. వారు కాగితపు పులి అని నాకు ఎప్పటినుంచో తెలుసు. ఆ విషయం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కి కూడా తెలుసు’ అని వ్యాఖ్యానించారు.అమెరికా నాటో నుంచి బయటకు వస్తే, అది నాటోకు భారీ దెబ్బ అవుతుంది. ప్రస్తుతం అమెరికా నాటో మొత్తం రక్షణ ఖర్చులో సుమారు 70 శాతం వంతు భారం మోస్తోంది. అలాగే అత్యధిక సైనిక శక్తి, అణు ఆయుధాలు, సాంకేతికతను అందిస్తోంది. అమెరికా లేకుండా నాటో బలహీనమై, యూరప్ భద్రతా వ్యవస్థలో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
అమెరికాకు మద్దతుగా యుద్ధంలోకి UAE
-
యుద్ధం ముగింపుపై ట్రంప్ క్లారిటీ
-
ట్రంప్ కు దెబ్బ మీద దెబ్బ చెప్పినా వినలేదు...
-
యుద్ధం వేళ ఇజ్రాయెల్ కొత్త చట్టం.. వారికి మరణశిక్ష
జెరూసలేం: గాజాలో ఒకవైపు మారణహోమం సృష్టిస్తున్న ఇజ్రాయెల్ సర్కార్ మరోవైపు పాలస్తీనా పౌరులపై అణచివేత చర్యలను మరింత తీవ్రతరం చేసే దిశగా కఠిన చట్టాన్ని తీసుకొచ్చింది. పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ ప్రజలను హత్యచేస్తే మరణ దండన విధిస్తామని తేల్చిచెప్పింది. హత్య కేసులో దోషిగా తేలితే చావుకు సిద్ధపడాల్సిందేనని వెల్లడించింది.ఈ మేరకు ఇజ్రాయెల్ పార్లమెంట్లో బిల్లుకు సోమవారం ఆమోద ముద్ర వేశారు. బిల్లుకు అనుకూలంగా 62, వ్యతిరేకంగా 48 ఓట్లు వచ్చాయి. అంతకముందు బిల్లుపై దాదాపు 12 గంటలపాటు చర్చించారు. బిల్లు ఆమోదం పొందిన వెంటనే పార్లమెంట్లో సభ్యులు హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. ఇజ్రాయెల్ కొత్త చట్టాన్ని అంతర్జాతీయ సమాజం, మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ చట్టం వివక్షపూరితమైనదని, అమానుషమైనదని స్పష్టంచేశాయి. ఇజ్రాయెలీయులకు వ్యతిరేకంగా నేరాలకు పాల్పడే పాలస్తీనియన్లకు శిక్షలు పెంచాలని అతివాదాలు చాలాఏళ్లుగా డిమాండ్ చేశారు. కొందరు ఉద్యమబాట పట్టారు. వారి ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గినట్లు స్పష్టమవుతోంది. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు పార్లమెంట్లో బిల్లుపై ఓటింగ్‌లో స్వయంగా పాల్గొన్నారు. ఇజ్రాయెల్ జాతీయులకు మినహాయింపు కొత్త చట్టం ప్రకారం.. ఇజ్రాయెల్ పౌరుల హత్య కేసులో దోషులుగా తేలిన వెస్ట్ బ్యాంక్ పాలస్తీనియన్లకు ఉరిశిక్ష అమలు చేస్తారు. అంతేకాకుండా, ఇలాంటి కేసుల్లో దోషులుగా నిర్ధారణ అయిన ఇజ్రాయెల్ పౌరులకు కూడా మరణశిక్ష విధించే అధికారం ఇజ్రాయెల్ కోర్టులకు ఉంటుంది. అయితే, మరణశిక్షను ఇజ్రాయెల్‌లోని పాలస్తీనా జాతీయులకే పరిమితం చేసి, యూదు జాతీయులకు మినహాయింపు ఇచ్చేలా ఈ చట్టం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి కేవలం పాలస్తీనియన్లే శిక్షకు గురవుతారని స్పష్టమవుతోంది. -
ఇస్ఫహాన్ అణు కేంద్రంపై బాంబుల వర్షం!
దుబాయ్: పశ్చిమాసియాలో పరిస్థితి మరింత విషమిస్తోంది. చర్చలకు ససేమిరా అంటున్న ఇరాన్‌పై అమెరికా కన్నెర్రజేసింది. స్వీయ కాల్పుల విరమణను తుంగలో తొక్కుతూ మంగళవారం ఆ దేశంపై భారీ స్థాయి దాడులతో విరుచుకుపడింది. ఇస్ఫహాన్ నగరంలోని కీలక అణు కేంద్రాలపై బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేసింది. దాంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. ఇందుకు సంబంధించిన వీడియోను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో షేర్ చేయడం విశేషం. శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఆ కేంద్రంలోనే ఇరాన్ దాచి ఉంచినట్టు చెబుతున్నారు! ఈ నేపథ్యంలో తాజా దాడిలో అక్కడి అణుకేంద్రానికి నష్టం జరిగిందా అన్నది తెలియరాలేదు.త్వరగా ఒప్పందానికి రాకపోతే ఇరాన్‌లోని మౌలిక వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేస్తామని ట్రంప్ సోమవారమే హెచ్చరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజాము వేళ ఇజ్రాయెల్‌తో కలిసి టెహ్రాన్‌పైనా అమెరికా బాంబుల వర్షం కురిపించింది. పేలుళ్లతో ఇరాన్ రాజధాని దద్దరిల్లిపోయింది. నగరంలో పలుచోట్ల మంటలు చెలరేగాయి. లెబనాన్‌పైనా ఇజ్రాయెల్ భారీగా దాడులను కొనసాగించింది. వాటిలో ఐరాస శాంతి పరిరక్షక దళానికి చెందిన ముగ్గురు సిబ్బంది మరణించినట్టు సమాచారం. మొత్తమ్మీద మంగళవారం ఒక్క రోజే 21 మంది మృతి చెందినట్టు లెబనాన్ పేర్కొంది.మొత్తం మృతుల సంఖ్య 1,268 దాటినట్టు వెల్లడించింది. ఉత్తర గాజాలో కూడా ఇజ్రాయెల్ దాడుల్లో ఒక వ్యక్తి, అతని ఐదేళ్ల కుమారుడు దుర్మరణం పాలయ్యారు. అమెరికా, ఇజ్రాయెల్ నిస్సిగ్గుగా తమ మౌలిక వ్యవస్థలను లక్ష్యం చేసుకుంటున్నాయంటూ ఇరాన్ మండిపడింది. దీనికి తమ సమాధానం భయానకంగా ఉంటుందని విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ హెచ్చరించారు. గల్ఫ్ దేశాల్లోని అమెరికాకు చెందిన టెక్ దిగ్గజ కంపెనీలపై కూడా బుధవారం నుంచి భారీగా దాడులు చేస్తామని రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ) ప్రకటించింది. యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇంటెల్, ఐబీఎం, టెస్లా, బోయింగ్‌తో పాటు 18 సంస్థల పేర్లను వెల్లడించింది! తక్షణం కార్యాలయాలను వీడి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆ కంపెనీల సిబ్బందికి సూచించింది. మండుతున్న చమురు ధరలుయుద్ధం దెబ్బకు అంతర్జాతీయంగా చమురు ధరలు నానాటికీ ఎగబాకుతున్నాయి. మంగళవారం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారల్ చమురు ధర 107 డాలర్లకు చేరింది. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్–అమెరికా యుద్ధానికి తెర తీసినప్పటితో పోలిస్తే ఇది ఏకంగా 45 శాతం ఎక్కువ కావడం విశేషం! మరోవైపు అమెరికాలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగాయి! మంగళవారం గ్యాలన్ (దాదాపు 3.8 లీటర్ల) పెట్రోల్ ధర 4.02 డాలర్లకు చేరింది. 2022 తర్వాత అమెరికాలో పెట్రోల్ ధర 4 డాలర్లను దాటడం ఇదే తొలిసారి కావడం విశేషం! ఫిబ్రవరి 28న ఇరాన్ యుద్ధం మొదలయ్యే నాటికి అమెరికాలో గ్యాలర్ పెట్రోల్ ధర 2.98 డాలర్లుగా ఉంది. డీజిల్ ధర కూడా గ్యాలన్‌కు 3.75 డాలర్ల నుంచి 5.45 డాలర్లకు పెరిగింది. ఇజ్రాయెల్‌లో సైరన్ మోతలు ఇరాన్ కూడా ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై పెద్ద ఎత్తున దాడులు కొనసాగించింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో దుబాయ్ సమీపంలో కువైట్‌కు చెందిన ఓ చమురు నౌకపై డ్రోన్లతో దాడి చేసింది. దాంతో నౌకలో మంటలు చెలరేగాయి. సిబ్బంది చాలాసేపు శ్రమించి వాటిని ఆర్పేశారు. ఐదు క్షిపణులు, ఏడు డ్రోన్లను కూల్చేసినట్టు కువైట్ పేర్కొంది. దుబాయ్‌లోని అల్ బదాలో ఓ ఆవాస ప్రాంతంపై జరిగిన డ్రోన్ దాడిలో శకలాలు పడి ఇద్దరు భారతీయులతో పాటు నలుగురు గాయపడ్డారు. సౌదీ అరేబియా, బహ్రెయిన్ తదితర గల్ఫ్ దేశాలు కూడా దాడుల బారిన పడ్డాయి. ఆ దేశాలతో పాటు ఇజ్రాయెల్ నగరాల్లో కూడా రోజంతా సైరన్ మోతలు విన్పించాయి. ఇరాక్‌లోని సులేమానియా యూనివర్సిటీపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసింది.హార్మూజ్ సుంకం ఖరారుహార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల నుంచి వసూలు చేయాల్సిన సుంకాన్ని ఇరాన్ లాంఛనంగా ఖరారు చేసింది. ఒక్కో నౌక నుంచి గరిష్టంగా రూ.19 కోట్ల దాకా వసూలు చేయనున్నట్టు తెలుస్తోంది. ఆ దేశ పార్లమెంటు భద్రతా మండలి ఇందుకు ఆమోదముద్ర వేసింది. హార్మూజ్‌పై ఇరాన్ సార్వ¿ౌమాధికారానికి నిదర్శనంగా ఈ చర్య తీసుకున్నట్టు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్ఐబీ తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్‌తో పాటు ఇరాన్‌పై ఏకపక్షంగా ఆంక్షలు విధించిన దేశాల నౌకలకు హార్మూజ్ గుండా వెళ్లనివ్వబోమని పేర్కొంది.ఇటలీ సైతం... గగనతలం మూతస్పెయిన్ బాటలోనే ఇటలీ కూడా అమెరికాకు షాకిచ్చింది. ఇరాన్‌పై పోరులో అమెరికా వినియోగిస్తున్న యుద్ధ విమానాలకు తన గగనతలాన్ని మూసేస్తున్నట్టు ప్రకటించింది. సిసిలీలోని తమ వైమానిక స్థావరాన్ని అమెరికా వాడుకునేందుకు కూడా అనుమతి నిరాకరించినట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. సోమవారం స్పెయిన్ కూడా ఈ మేరకు ప్రకటన చేయడం తెలిసిందే. -
ఇజ్రాయెల్‌లో కీలక బిల్లు ఆమోదం.. అలా చేస్తే ఉరిశిక్షే?
ఇజ్రాయెల్ పార్లమెంటు (నాసాట్) పాలస్తీనా నేరస్థులను శిక్షించే కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ చట్టం కింద ఇజ్రాయెల్ పౌరుల హత్యలో లేదా ఉగ్రవాద కార్యకలాపాలలో పాలస్తీనియన్లు పాల్గొంటే వారికి నేరుగా ఉరిశిక్ష విధించబడుతుంది.ఇజ్రాయెల్‌లోని కొన్ని గ్రూపులు చాలా కాలంగా ఈ బిల్లు కోసం డిమాండ్ చేస్తున్నాయి. ఎట్టకేలకు పార్లమెంటులో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. దీనిప్రకారం పాలస్తీనాకు చెందిన వ్యక్తులు తీవ్రమైన నేరాలకు న్యాయమూర్తులు ఏకాభిప్రాయం లేకుండా కూడా మరణశిక్షను ప్రకటించగలరు. అప్పీల్ చేసే హక్కు ఉండదు. శిక్ష విధించిన 90 రోజుల్లో ఉరితీయబడతాడు. ఈ చట్టం జాతీయవాద లేదా తీవ్రవాద కారణాలకు వర్తిస్తుంది. అయితే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల మరణ శిక్షను జీవిత ఖైదు విధించే హక్కు కూడా కోర్టులకు ఉంటుంది.కాగా మానవ హక్కుల సంఘాలు ఈ బిల్లును జాతిపరంగా వివక్షతగా పేర్కొన్నాయి. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఇజ్రాయెల్ మానవ హక్కుల, పౌర సమాజ సంస్థలు ఈ చట్టం పాలస్తీనియన్లపై జాతి హింసను ప్రోత్సహిస్తున్నాయని నిరసన తెలుపుతూ ఈ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. కాగా ఇన్ని సంవత్సరాల ఇజ్రాయెల్ చరిత్రలో కేవలం రెండుసార్లు మాత్రమే ఆ ధేశంలోమరణశిక్ష విధించబడింది. -
తన ఆటలో తానే పావయిందా?
ఇరాన్ యుద్ధం ప్రారంభమై దాదాపు నెల రోజులు కావొస్తున్నది. ముగింపు సూచనలు లేవు సరికదా మరింత తీవ్రతరమవటమే కాకుండా, కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నది. ఇరాన్ తరఫున యెమెన్‌లోని హవుతీలు కూడా రంగంలో దిగటంతో పర్షియన్ గల్ఫ్‌తో బాటుగా ఎర్ర సముద్రంపై కూడా యుద్ధ మేఘాలు కమ్ముకొంటున్నాయి. ఎర్ర సముద్రం, బాబెల్ మెండెబ్ జలసంధి గుండా సుమారు 12 శాతం ప్రపంచ చమురు, గ్యాస్ రవాణా జరుగు తున్నది. అంటే, ఇరాన్ ఈ యుద్ధాన్ని మరొక అంచెకు తీసుకొని వెళ్లటానికి నిశ్చయించినట్లు లెక్క.అమెరికా ప్రేరేపిత యుద్ధాలు ప్రపంచానికి కొత్తేమీ కాదు. రెండవ ప్రపంచ యుద్ధం (1945) తర్వాత ప్రపంచంలో ఏ మూలలో ఏ యుద్ధం, సంక్షోభం తలెత్తినా, అందులో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ యూఎస్ఏ పాత్ర ప్రస్ఫుటం. ప్రచ్ఛన్న యుద్ధ (1945–1991) కాలంలో యూఎస్ విదేశాంగ విధానం సోవియట్ రష్యాను, కమ్యూనిజాన్ని అడ్డుకోవటం లక్ష్యంగా రూపొందించబడి నది. సోవియట్ విచ్ఛిన్నం (1991) తరువాత యూఎస్ఏ నాయక త్వంలో ఏకధ్రువ ప్రపంచం ఏర్పడింది. అమెరికన్ ప్రయోజనాలకు విఘాతం నెపంతో ముందస్తు సైనిక చర్యలు, ప్రభుత్వ మార్పిడు లను నిస్సంకోచంగా తన విదేశాంగ నీతిగా ఉంచుకొన్నది.యుద్ధంతో శాంతా?ట్రంప్ రెండవసారి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టగానే ప్రపంచ వ్యాప్తంగా యూఎస్ఏ ఇక యుద్ధాలు చేయటం లేదా ప్రోత్సహించడం ఉండదని ప్రకటించాడు. బైడెన్ ప్రభుత్వం అనవసరంగా యూఎస్ఏను యుద్ధాల ఊబిలోనికి లాగి ప్రజలపై పెనుభారాన్ని మోపిందని విమర్శించాడు. అదే సమయంలో సుంకాల యుద్ధానికి (టారిఫ్ వార్) తెరతీశాడు. క్రమంగా ట్రంప్ ప్రభుత్వం ‘యుద్ధాలకు ముగింపు’ విధానం నుండి మళ్లీ సైనిక జోక్యం వైపు తిరిగి వచ్చింది. మొట్టమొదటిగా పనామాను బెదిరించి లొంగదీసు కోవటం మొదలుపెట్టి, ఉక్రెయిన్‌కు సాయుధ సహకారాన్ని మరింత విస్తరించి రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని కొనసాగించేట్లు చేస్తున్నది. ఇరాన్ మీద 12 రోజుల యుద్ధం, వెనిజులాలో సైనిక చర్యతో యూఎస్ తన పంథా మార్చుకోలేదని అర్థమయింది. గ్రీన్‌ల్యాండ్‌ను యూఎస్ఏకు ఇవ్వాలని ట్రంప్ డిమాండ్ చేశాడు. ఇరాన్‌తో యుద్ధం ప్రారంభిస్తూనే క్యూబాతో కలహానికి శ్రీకారం చుట్టాడు.ఇటీవల 2025లో యూఎస్ ప్రభుత్వం విడుదల చేసిన జాతీయ భద్రతా వ్యూహం (నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ 2025) యూఎస్ ప్రవర్తనకు అద్దం పడుతుంది. ఈ వ్యూహం ప్రకారం బలం, సామర్థ్యం ద్వారా శాంతిని స్థాపించాలని యూఎస్ ప్రతిపా దిస్తుంది. అంటే యుద్ధాల ద్వారా ప్రపంచ శాంతి (వార్ ఫర్ పీస్) అనే విపరీత సూత్రాన్ని ప్రతిపాదిస్తున్నది. ఈ వ్యూహంలో భాగంగానే ట్రంప్ వివిధ దేశాలను సైనిక, ఆర్థిక, సాంకేతిక శక్తి ద్వారా లోబర్చుకొనే విధానాన్ని అమలుపరుస్తున్నాడు. బెదిరింపులకు లొంగిపోయిన దేశాలను మరింతగా బెదిరించాడు. ఎదురు నిలబడ్డ దేశాల విషయంలో వెనకడుగు వేశాడు. ఉదాహరణకు రష్యా, చైనా, కెనడా, ఈయూ, భారత్‌లతో ట్రంప్ వెనకడుగు వేశాడు.డీప్ స్టేట్ మద్దతు లేదా?యూఎస్ఏ ప్రభుత్వ విధానాలు, ముఖ్యంగా విదేశాంగ విధానాన్ని ఆ దేశంలోని డీప్ స్టేట్ రూపొందిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం రిపబ్లికన్ల చేతిలో ఉన్నా, డెమోక్రాట్ల చేతిలో ఉన్నా డీప్ స్టేట్ చెప్పుచేతల్లో ఉండాల్సిందే. సీఐఏ, పెంటగన్, ఎన్ఐఏ, మీడియా లాబీ, ఆయుధ కంపెనీల లాబీలు, టెక్ కంపెనీ లాబీలు, బడా మదుపరుల లాబీలు, యూదుల లాబీలతో కూడిన ఈ డీప్ స్టేట్ ప్రభుత్వ విధానాలు తన లక్ష్యాలకు అనుగుణంగా ఉండేట్లుగా చూస్తుంది.డీప్ స్టేట్ కనుసన్నల్లో ఉండే యూఎస్ విధానం ఎల్లప్పుడూ జియో పొలిటికల్ లక్ష్యాలతో పాటుగా అమెరికన్ లాబీల ఆర్థిక, వ్యాపార ప్రయోజనాలను కాపాడుతూ ఉంటుంది. ఈ లక్ష్యానికి అనేక సందర్భాలలో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల వంటి ఉదారవాద ముసుగులను కప్పి ప్రపంచాన్ని తప్పుదోవ పట్టిస్తుం టారు. తాత్కాలికంగా యూఎస్ ఆధిపత్యానికి నష్టం కలిగినా సరే, యూఎస్ డీప్ స్టేట్ లాబీల వ్యాపార, ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం ఎల్లప్పుడూ కాపాడుతుంది.యూఎస్ అధ్యక్షులెవరయినా యూఎస్ డీప్ స్టేట్ ప్రయోజనా లకు విరుద్ధంగా వెళ్లలేరు. గత ఎన్నికలలో బైడెన్‌పై ట్రంప్ ఓటమికి డీప్ స్టేట్ సహకరించిందని అనుమానం. అందుకే ట్రంప్ డీప్ స్టేట్‌ని పక్కకి నెట్టి హెగ్సెత్, కుష్నర్, లిండ్సే, విట్కాఫ్ వంటి వ్యక్తులపై ఆధారపడుతున్నారు. డీప్ స్టేట్ భాగస్వామ్యం లేకపోవ టంతో ఇరాన్ వ్యూహంలో డొల్లతనం కన్పడుతున్నది.ఎంతవరకు పోరాడగలవు?ఇరాన్‌పై యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ అంతిమ లక్ష్యాలలో వైరుధ్యం కన్పడుతున్నది. ఇరాన్‌ను పూర్తిగా ధ్వంసం చేయటం, ఇరాన్‌ను ముక్కలుగా చేయటం, సుదూర భవిష్యత్తులో ఇరాన్ మళ్లీ సవాలు చేసే స్థితిలో లేకుండా చూడటం ఇజ్రాయెల్ లక్ష్యం. యూదులు, క్రైస్తవులు, ముస్లింలకు పవిత్రమయిన జెరూసలెం వంటి ప్రదేశాలతో కూడిన ఇజ్రాయెల్‌కు ఉనికి, అస్తిత్వాల సమస్య ఉన్నది. సామ్యూల్ హంటింగ్టన్ సూచించినట్లు, ఇది నాగరికతల మధ్య యుద్ధం. ఆర్థిక, వాణిజ్య ఆంక్షల నడుమ చితికిపోయిన ఇరాన్ మనుగడకు ఈ యుద్ధం ఒక సవాల్. అందుకే ఈ రెండు దేశాలది ‘నిండా మునిగిన వాడికి చలేమిటి?’ పరిస్థితి. దీర్ఘ పోరాటానికి ఈ రెండు దేశాలూ వెనుకాడవు.ఇరాన్ నుండి తమను రక్షించుకోవటానికి అమెరికా ఛత్ర ఛాయలోకి దూరిన సౌదీ, యూఏఈ, ఖతర్, బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాలు, ఈ యుద్ధం నుండి తప్పించుకోలేని పరిస్థితి. తమను తాము రక్షించుకోలేని ఈ దేశాలు ఇరాన్ నాశనాన్నే కోరుకుంటాయి. భవిష్యత్తులో మరెప్పుడూ తమపై దాడి చేయనంతగా ఇరాన్‌ను ధ్వంసం చేయాలని ఈ దేశాలు కోరుకోవడం సహజం. అందువలన ఇవి యుద్ధం ఆగాలని కోరుకోకపోవచ్చును. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో కూడా రష్యాది అస్తిత్వ సమస్య. అందుకే ఎంత నష్ట పోయినా, నాలుగేళ్లయినా యుద్ధాన్ని కొనసాగిస్తున్నది.కానీ యూఎస్ఏ పరిస్థితి దీనికి భిన్నం. ఈ యుద్ధం అస్తిత్వానికి సంబంధించినది కాదు, మనుగడకు సంబంధించినది కాదు. యుద్ధ లక్ష్యాలలో గందరగోళం స్పష్టంగా ఉన్నది. ట్రంప్ దీర్ఘకాలిక యుద్ధానికి సుముఖంగా లేడు. కానీ అర్ధంతరంగా కాడి పడవేస్తే అది యూఎస్ ప్రతిష్ఠకు మాయని మచ్చ. ఇప్పటికే యూఎస్ మదుపరులు, వ్యాపార లాబీలు ట్రంప్‌పై ఒత్తిడి పెంచారు. యూఎస్ఏ జీడీపీ సుమారుగా 31.89 ట్రిలియన్ డాలర్లు. కానీ అప్పుల భారం 38.5 ట్రిలియన్ డాలర్లు. బాండ్ మార్కెట్ ద్వారా యూఎస్ చైనా, జపాన్, ఈయూ దేశాల నుండి పెద్ద మొత్తాలలో పెట్టుబడులను సేకరిస్తున్నది. ఈ పెట్టుబడులను వినియోగించే ఖరీదైన యుద్ధాలను నిర్వహిస్తున్నది. యూఎస్ బాండ్లపై ప్రపంచ దేశాల విశ్వాసం సన్నగిల్లితే యూఎస్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి పోతుంది. ప్రస్తుత యుద్ధం ప్రపంచ ఆయిల్ గ్యాస్ మార్కెట్లను సంక్షోభంలోనికి నెట్టివేస్తే, దీర్ఘకాలంలో యూఎస్ బాండ్ మార్కెట్ తద్వారా యూఎస్ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. అందుకే యూఎస్ డీప్ స్టేట్ లాబీలు ట్రంప్‌ను ఏదో రకంగా యుద్ధం నుండి బయటకు వచ్చేయాలని ఒత్తిడి తెస్తున్నాయి.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
‘మీకోసమే ఎదురు చూస్తున్నాం’
టెహ్రాన్: ఇరాన్‌పై యుద్ధంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్లో భూతల దాడులకు అమెరికా, ఇజ్రాయెల్ తమ సైన్యాన్ని మోహరిస్తున్నాయి. ఈ క్రమంలో శత్రు దేశాల సైన్యం భూతల దాడులకు దిగితే తాము ధీటుగా ఎదుర్కొంటామని హెచ్చరిస్తూ ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్జీసీ) సైన్యం ఓ వీడియోని విడుదల చేసింది.ఇరాన్ ప్రెస్ టీవీ ప్రసారం చేసిన వీడియోలో ఇస్లామిక్ రిపబ్లిక్ సైన్యం తమ కమాండోల క్లిప్‌లను చూపిస్తూ అమెరికన్ సైనికులను ఎదుర్కొని ఓడించడానికి తాము సిద్ధంగా ఉన్నామని’ ప్రకటించింది. 59 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో ఇరాన్ ప్రత్యేక దళాల కదలికలను వేగంగా చూపిస్తూ ‘దగ్గరకు రండి, మేము మీ కోసం ఎదురు చూస్తున్నాం’అనే సందేశం ఇస్తున్నట్లుగా ఉండటాన్ని గమనించొచ్చు. దీంతో పాటు సైనిక సామగ్రితో ఉన్న సైనికులు యుద్ధ విన్యాసాలు చేయడం, కఠినమైన భూభాగం గుండా దళాలు ముందుకు సాగడం చూడొచ్చు. మరో క్లిప్‌లో ఇరాన్ సైన్యానికి చెందిన ఒక భారీ క్షిపణి ప్రయోగ వాహనం తన ఆయుధాన్ని పేల్చడం, ఆ తర్వాత పేలుళ్లు సంభవించడం కనిపిస్తుంది. అమెరికా వైపు చర్యలుఅమెరికా వైట్ హౌస్ ప్రకారం..అదనపు సైన్యాన్ని పశ్చిమ ఆసియాకు పంపడం ద్వారా అమెరికా తాను అనుకున్న లక్ష్యాలను సాధించగలదని తెలిపింది. వైట్ హౌస్ ప్రెస్ కార్యదర్శి కరోలైన్ లీవిట్ మాట్లాడుతూ..‘ఎపిక్ ఫ్యూరీ ఆపరేషన్ లక్ష్యాలను సాధించడానికి పెంటగాన్ సైనిక వ్యూహాలను సిద్ధం చేస్తోంది’అని తెలిపారు. పెంటగాన్ ఇరాన్లో కొన్ని వారాలపాటు భూసైనిక చర్యలు చేపట్టే అవకాశాన్ని పరిశీలిస్తోంది. అయితే, ఇది పూర్తి స్థాయి ఆక్రమణ కాకుండా, లక్ష్యిత దాడుల రూపంలో ఉండవచ్చని సమాచారం. Iran’s Army released footage of its elite commandos, declaring it is ready to confront and defeat American soldiers.Follow: https://t.co/mLGcUTS2ei pic.twitter.com/gIdaV4W8lI— Press TV 🔻 (@PressTV) March 31, 2026 -
ఆకాశాన్ని కమ్మేసిన కాకుల వనం..!
ఇజ్రాయెల్ రాజధాని నగరం టెల్ అవీవ్.. సాధారణంగా రద్దీగా ఉండే ఈ నగరం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. జనం తమ పనులను ఆపేసి ఆకాశం వైపు భయంతో చూస్తున్నారు. పగలు కాస్తా రాత్రిలా మారిపోయింది. దానికి కారణం సూర్యుడిని కమ్మేసిన మేఘాలు కావు.. వేల సంఖ్యలో ఆకాశంలో తిరుగుతున్న నల్లని కాకులు! ఈ దృశ్యం చూస్తుంటే ఏదో హర్రర్ సినిమా క్లైమాక్స్ లా అనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవ్వడమే ఆలస్యం, ప్రపంచవ్యాప్తంగా ఒకటే చర్చ మొదలైంది. అసలు ఇజ్రాయెల్ ఆకాశంలో ఇన్ని కాకులు ఒకేసారి ఎందుకు వచ్చాయి? ఇది రాబోయే ముప్పుకు సంకేతమా? మనం చిన్నప్పటి నుండి వినే ఉంటాం.. కాకులు గుంపులుగా కనిపిస్తే ఏదో అశుభం జరుగుతుందని. ఇంగ్లీష్ లో కూడా కాకుల గుంపును ‘A Murder of Crows’ అని పిలుస్తారు. అంటే వాటి పేరులోనే ఒక రకమైన మరణం లేదా వినాశనం అనే అర్థం దాగి ఉంది. టెల్ అవీవ్ ఆకాశంలో ఈ కాకులు చేస్తున్న వింత ఆకారాలు చూస్తుంటే, స్థానికులు ఇది ఒక ‘చెడు శకునం’ (Bad Omen) అని నమ్ముతున్నారు. గతంలో కూడా ఇలాంటి వింతైన పక్షుల ప్రవర్తన జరిగినప్పుడు పెద్ద ఎత్తున యుద్ధాలు లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయని చరిత్ర చెబుతోంది. ఈ ఘటన కేవలం ఒక పక్షుల వలసగా నెటిజన్లు చూడటం లేదు. దీనికి మతపరమైన కోణాన్ని జోడిస్తున్నారు. బైబిల్లో చెప్పబడిన ‘అంత్యకాలం’ (End Times) సంకేతాల్లో పక్షుల వింత ప్రవర్తన కూడా ఒకటి అని కొందరు వాదిస్తున్నారు. ముఖ్యంగా ఇజ్రాయెల్ వంటి పవిత్ర భూమిపై ఇలాంటి దృశ్యాలు కనిపించడం వెనుక దైవికమైన హెచ్చరిక ఉందని కొందరు భక్తులు నమ్ముతున్నారు. వినాశనం సమీపించినప్పుడు పక్షులు మరియు జంతువులు ముందుగానే పసిగట్టి ఇలా వింతగా ప్రవర్తిస్తాయని పాత నిబంధనలోని కొన్ని వాక్యాలను ఉటంకిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.ప్రస్తుతం ఇజ్రాయెల్ , ఇరాన్ మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ కాకుల రాక ప్రాధాన్యత సంతరించుకుంది. యుద్ధం తీవ్రరూపం దాల్చబోతోందా? లేక ఏదైనా పెద్ద ఉపద్రవం రాబోతోందా? అనే ఆందోళన టెల్ అవీవ్ ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా పక్షులు ప్రకృతిలో వచ్చే మార్పులను మానవుల కంటే వేగంగా పసిగడతాయి. గాలిలోని పీడనం లేదా భూమి లోపల జరిగే మార్పులను అవి గుర్తించగలవు. మరి ఈ కాకులు దేనిని చూసి భయపడి ఇలా గుంపులుగా ఎగురుతున్నాయి? అయితే, ప్రతి మిస్టరీ వెనుక ఒక సైన్స్ ఉంటుంది. పక్షి శాస్త్రవేత్తల ప్రకారం, దీనిని 'ముర్మురేషన్' (Murmuration) అని పిలుస్తారు. ఆహారం కోసం వెతుకుతూ లేదా సురక్షితమైన స్థావరం కోసం పక్షులు ఇలా వేల సంఖ్యలో గుంపులుగా ప్రయాణిస్తాయి. ముఖ్యంగా శీతాకాలం ముగిసి వసంతకాలం వచ్చే సమయంలో వలస పక్షులు ఇలాంటి విన్యాసాలు చేస్తుంటాయి. టెల్ అవీవ్ నగరం పక్షుల వలస మార్గంలో ఉండటం వల్ల ఇది ఒక సహజ ప్రక్రియ అని శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు. కాకులు తెలివైన పక్షులు, అవి వేటాడే పక్షుల నుండి రక్షణ పొందడానికి కూడా ఇలా గుంపులుగా ఏర్పడతాయి.ఒకవైపు మూఢనమ్మకాలు, మరోవైపు శాస్త్రీయ కారణాలు.. ఈ రెండింటి మధ్య ప్రజలు అయోమయంలో ఉన్నారు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రజల్లో పెరిగిన 'అన్సర్టైనిటీ' (అనిశ్చితి). ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వింత పరిణామాలు మనిషిని ప్రతి చిన్న విషయాన్ని అనుమానించేలా చేస్తున్నాయి. గూగుల్‌లో ‘Something bad is going to happen’ అని వెతకడం, ఆకాశంలో కాకులు కనిపిస్తే అది ప్రళయం అని నమ్మడం.. ఇవన్నీ మనిషి లోపల ఉన్న అభద్రతా భావాన్ని సూచిస్తున్నాయి.టెల్ అవీవ్ ఆకాశంలో కనిపించిన ఆ నల్లని నీడలు నిజంగానే ఏదైనా విపత్తుకు సంకేతమా? లేక ప్రకృతిలో జరిగే ఒక సామాన్య ప్రక్రియనా? అనేది కాలమే నిర్ణయించాలి. కానీ ఒకటి మాత్రం నిజం.. మనం ప్రకృతిని గమనించడం మానేసి చాలా కాలమైంది, అందుకే ఇలాంటి చిన్న మార్పులు కూడా మనల్ని వణికించేస్తున్నాయి. ఏది ఏమైనా, అప్రమత్తంగా ఉండటం మంచిదే కానీ, అనవసరమైన భయాందోళనలకు గురికావద్దు. -
బంకర్ బస్టర్లతో దాడి.. సంచలన వీడియో షేర్ చేసిన ట్రంప్
ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు కొనసాగుతోంది. తాజాగా.. ఇరాన్లో అణుకేంద్రాలు ఉన్న ఇస్ఫహాన్‌పై అమెరికా విరుచుకుపడింది. ఓ ప్రధాన ఆయుధ నిల్వల డిపోపై బంకర్ బస్టర్లతో దాడి చేసింది. భారీ పేలుళ్లకు సంబధించి ఓ వీడియోను ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. మీడియా నివేదికల ప్రకారం.. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున ఇస్ఫహాన్ నగరంలో చోటుచేసుకుంది.ఈ వీడియోలో వరుస పేలుళ్లు సంభవించడం.. ఆ తర్వాత ఆకాశమంతా నారింజ రంగు మంటలతో నిండిపోవడం కనిపిస్తోంది. అయితే, ట్రంప్ ఈ వీడియోకు ఎటువంటి వివరణ ఇవ్వలేదు. అయితే, ఇస్ఫహాన్‌లోని ఆయుధ నిల్వలు ఉన్న డిపోపై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల దృశ్యాలేనని మీడియా నివేదికలు చెబుతున్నాయి. సుమారు 23 లక్షల జనాభా కలిగిన ఇస్ఫహాన్ నగరంలో 'బదర్' సైనిక విమానశ్రయం కూడా ఉంది.మరోవైపు, ఇరాన్‌కు ట్రంప్ తీవ్రస్థాయి హెచ్చరికలతో అల్టిమేటం ఇచ్చిన సంగతి తెలిసిందే. అత్యంత శుద్ధ యురేనియం నిల్వలను అప్పగిస్తూ, యుద్ధం నుంచి తప్పుకుంటూ శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని లేదంటే ఇరాన్‌ను సర్వనాశనం చేస్తానని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో పలు పోస్ట్‌లు పెట్టారు. -
యుద్ధంపై రణభేరి!
రాత్రింబగళ్లు నిప్పులు కురుస్తున్నా భూగోళంపైనున్న జనారణ్యాలన్నీ నిశ్చలన చిత్రాలై నిర్లిప్తంగా ఉండిపోతున్నాయన్న నిరాశ సర్వత్రా ఆవరించిన తరుణంలో అమెరికా వ్యాప్తంగా శనివారం ఒక మానవ మహాసముద్రం పోటెత్తింది. దశాబ్దాలనాటి వియత్నాం యుద్ధ వ్యతిరేక ర్యాలీలను తలపిస్తూ, అంతకన్నా మరిన్ని రెట్లు ఎక్కువగా నగరాలు, పట్టణాలు, మారుమూల పల్లెలన్న వ్యత్యాసం లేకుండా– అమెరికాలోని అన్ని వర్గాలూ ఏకమై 3,300 నిరసన ప్రదర్శనలు నిర్వహించి ముక్తకంఠంతో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధాన్ని ఖండించిన తీరు చరిత్రలో నిలిచిపోతుంది. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇంటా, బయటా తన అరాచకంతో ప్రజాస్వామ్యానికీ, మానవతకూ మహాపచారం చేస్తున్నారని ప్రదర్శకులు మండిపడ్డారంటే ఏడాది పాలనలో వారెంత విసిగిపోయారో అర్థమవుతుంది. ఖర్గ్ ద్వీపాన్ని బుగ్గి చేస్తానని, ఇరాన్ ఇంధన క్షేత్రాలకూ, విద్యుదుత్పాదన ప్లాంట్లకూ నిప్పెడతాననీ ట్రంప్ బెదిరిస్తున్న తరుణంలో ‘నో కింగ్స్’ పేరిట ఇంత పెద్దయెత్తున నిరసనలు ఎగిసిపడటం అసాధారణం. ఉత్తర ధ్రువప్రాంత అలస్కాలో కేవలం 3,000 మంది జనాభా నివసించే కోట్జెబు మొదలుకొని కరేబియన్ ద్వీపంలోని ప్యూర్టోరికో... న్యూయార్క్, వాషింగ్టన్, శాన్ఫ్రాన్సిస్కో, షికాగో తదితర మహా నగరాల వరకూ ప్రదర్శకులు భారీయెత్తున పాల్గొనగా, యూరప్, లాటిన్ అమెరికా, ఆస్ట్రేలియాల్లో సైతం ‘నో కింగ్స్’ ర్యాలీలు జరిగాయి. ‘నో కింగ్స్’ ఒక్క ట్రంప్ పైన మాత్రమే కాదు... ఆయనకు అపరిమితమైన అధికా రాలు కట్టబెట్టిన, చట్టపరమైన రక్షణలిచ్చిన వ్యవస్థలన్నిటిపైనా మోగించిన రణభేరి. అధికారం అహంకరించినప్పుడూ, న్యాయం సైతం దానితో కుమ్మక్కయినప్పుడూ నడి వీధులే న్యాయస్థానాలవుతాయి. శనివారంనాటి నిరసనల సారాంశం అదే. రాచరిక, భూస్వామ్య వ్యవస్థలపై శతాబ్దాల క్రితం పోరాడి నిర్మించుకున్న ప్రజాస్వామ్యంలో వ్యవస్థలన్నీ కలిసి మరో ‘రాజు’ను ప్రతిష్ఠించటానికి పూనుకోవడంపై ‘నో కింగ్స్’ ఒక తిరుగుబాటు. స్వదేశంలో నియంతగా మారిన పాలకుడు ప్రపంచానికి సైతం శాపంగా పరిణమించే ప్రమాదం ఉన్నదని ట్రంప్ పోకడలు చాటుతున్నాయి. నియంతృత్వం రాజ్యమేలేచోట అరాచకాలు పెరిగినప్పుడు మౌనప్రేక్షకులుగా మిగిలే సాధారణ జనంలో సైతం ఆలోచనలు రేకెత్తించడానికీ, కార్యోన్ముఖుల్ని చేయటానికీ ఈ నిరసనలు పుట్టు కొస్తాయి. రిపబ్లికన్ల ఆధిక్యతగల రాష్ట్రాలూ, ‘మాగా’ ఉద్యమ ప్రాబల్యంగల ప్రాంతాలూ సైతం ఈసారి నిరసనలతో హోరెత్తటం గమనించదగ్గది. జనహననం కోసం పశ్చిమాసియాకు ట్రంప్ తరలించిన మెరైన్ల తల్లులు కూడా ఇందులో పాల్గొన్నారు. నెలక్రితంతో పోలిస్తే... వారం రోజులుగా ఇరాన్ ప్రతిదాడుల సంఖ్య తగ్గిందనీ, రోజుకు 30 మించటం లేదనీ అంటున్నారు. కానీ అవి నేరుగా లక్ష్యాన్ని గురి చూస్తున్నాయి. వ్యూహాత్మక ప్రాంతాల్లో ఇరాన్ ప్రయోగించిన క్షిపణిని ప్రత్యర్థి పక్షాలు నిలువరిస్తున్నా అది కిందపడుతూ పదుల బాంబులై పేలటం, జననష్టంతోపాటు ఆస్తి నష్టం తీసుకురావటం కనబడుతూనే ఉంది. ఎదురుదాడుల క్రమంలోనే అంచనాలు పదు నెక్కించుకుని, నిఘా కార్యకలాపాలను సమన్వయపరుచుకుని ఇరాన్ దళాలు వ్యవహ రిస్తున్నాయని ఇది తేటతెల్లం చేస్తోంది. గల్ఫ్ దేశాల్లో, ఇజ్రాయెల్‌లో లక్షలాదిమంది పౌరులు ఇప్పటికీ బాంబు షెల్టర్లలో తలదాచుకొనక తప్పని స్థితి ఉంది. ప్రత్యర్థి పక్షాల ప్రాంతాల్లో ఒకసారంటూ అస్థిర పరిస్థితుల్నీ, అభద్రతా భావాన్నీ తీసుకొచ్చాక దాడుల సంఖ్య గణించదగ్గది కాదు. గత జూన్‌లో 12 రోజుల అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ విశ్రమించలేదని తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రజల జీవితాలనూ అస్తవ్యస్తం చేస్తోంది. వారి జీవికను దెబ్బతీస్తోంది. ఇరాన్‌పై యుద్ధం ఆపకుండా, హార్మూజ్ జలసంధి మాత్రం ప్రశాంతంగా ఉండాలనీ, ఇంధన రవాణా నిరాటంకంగా జరగాలనీ ట్రంప్ కోరుకోవటం దురాశ. ఇంధన ధరలు మిన్నంటితే తన కొలువుకు ఎసరొస్తుందన్న ఏకైక భయంతోనే పశ్చిమాసియాలో ప్రస్తుతం ఆయన వేలాదిమంది మెరైన్లను మోహరించారు. అమెరికా ప్రజల అభీష్టమేమిటో తెలిసింది గనుక ఇకనైనా ట్రంప్ తన దుష్ట పోకడలకు స్వస్తి చెప్పాలి. -
భూతల దాడులు తప్పనట్లేనా?
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ, అమెరికాలోని యూదు లాబీల ఒత్తిడి నుంచి అధ్యక్షుడు ట్రంప్ బయట పడలేకపోయి నట్లయితే, ఇరాన్‌తో పదాతి సేనల యుద్ధం తప్పక పోయేటట్లే కనిపిస్తున్నది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఫిబ్రవరి 28తో ఆరంభించి దాదాపు అయిదు వారాలుగా సాగిస్తున్న వైమానిక, నౌకా, క్షిపణి యుద్ధం ఇరాన్‌ను తీవ్రంగానే నష్టపర చినా, సమీప భవిష్యత్తులో ఓడించగల సూచనలు లేకపోవటంతో, కనీసం పదాతి యుద్ధంతోనైనా ఆ పని చేయగలమా అనే మీమాంసలో ట్రంప్ ఉన్నట్లు కనిపిస్తున్నది. ఇరాన్ ప్రతిఘటనతో తమకు, ఇజ్రాయెల్‌కు, గల్ఫ్ రాజ్యాలకు, ప్రపంచ ఇంధన వ్యవస్థకు కలుగుతున్న నష్టాలు, అమెరికన్ ప్రజ లతో పాటు తన ‘మాగా’ మద్దతుదారులలో ఎదురవుతున్న వ్యతిరేక తలు కూడా ఆయనపై ఒత్తిడిని పెంచుతున్నట్లు తోస్తున్నది.స్వభావమే సమస్యఅయినప్పటికీ ఏమీ చెప్పలేని స్థితి. అందుకు కారణం నెతన్యాహూ ఒత్తిడి అన్నది సరేసరి కాగా, స్వయంగా ట్రంప్ స్వభావం ఒక పెద్ద సమస్య అవుతున్నది. ఇరాన్‌ను తుదముట్టించాలన్నది తన ‘40 సంవత్సరాల కల’ అని, అందుకు తగిన అవ కాశం ఇప్పుడు వచ్చిందని నెతన్యాహూ అంటూ, అది నెరవేర్చగల నాయకుడు అమెరికన్ చరిత్రలో మొదటిసారిగా ఆవిర్భవించాడని చెప్తున్నారు. ఇరాన్‌పై ఈ తరహా యుద్ధం సాగించాలన్న ఒత్తిడులు ఒబామా, బైడెన్ కాలాలలోనూ వచ్చినా, వారు ఆంక్షలతో సరిపెట్టి యుద్ధానికి నిరాకరించారు. అణుశక్తి విషయమై చర్చల ద్వారా ఒప్పందం జరిగింది (2015) కూడా అప్పుడే. ఆ ఒప్పందాన్ని ఎటువంటి కారణం లేకుండా రద్దు చేసిన ట్రంప్, రెండవసారి అధ్యక్షుడైనప్పటినుంచి ఏ విధంగా వ్యవహరిస్తున్నారో కనిపిస్తు న్నదే. ఆయనను నెతన్యాహూ అంతగా పొగడటం అందువల్లనే. ఒక్క ఇరాన్ విషయంలోనే కాదు, అనేక ఇతర అంశాలలోనూ ట్రంప్ మొదటినుంచి గత 14 మాసాలుగా ప్రవర్తిస్తున్న తీరు ఇదే విధంగా ఉంది. ఆయన ‘స్వభావం’ అనే మాట ఉపయోగించవలసి రావటం అందువల్లనే.ప్రస్తుతం గడువులు, షరతులు, చర్చలు అనే ప్రహసనం మరొకసారి సాగుతున్నది. ఇరాన్ లొంగుబాటుకు 48 గంటల గడు వన్నారు. ఆ సమయం పూర్తి కావస్తుండగా అయిదు రోజులన్నారు. అది ముగియకముందే పది రోజులకు పెంచారు. అది ఏప్రిల్ 6న గడవనున్నది. ఈలోగానే 15 షరతులతో ఒక రాజీ ప్రతిపాదన అమె రికా నుంచి వచ్చింది. అందుకు మారుగ ఇరాన్ 5 షరతులన్నది. ఆ రెండింటిలో ఏదీ రాజీకి వీలయ్యేది కాదని ఎవరైనా వెంటనే చెప్ప గలరు. అసలు అణుశుద్ధి కార్యక్రమాన్నే పూర్తిగా ఆపివేయాలనీ, క్షిపణుల సామర్థ్యం, సంఖ్య తాము చెప్పినట్లే ఉండాలనీ, (ఇరాన్) అనుబంధ మిలిటెంట్ సంస్థలకు మద్దతు పూర్తిగా నిలిపి వేయాలనీ, హార్ముజ్‌పై సార్వభౌమాధికారం వదలుకోవాలనీ షరతులు విధిస్తే అందుకు ఇరాన్ అంగీకరించగలదా? అదే విధంగా గల్ఫ్‌లోని సైనిక స్థావరాలన్నీ ఖాళీ చేసి పోవాలన్న ఇరాన్ షరతు అమెరికాకు సమ్మతం కాగలదా? కనుక అది కాలక్షేపపు వ్యవహారం మాత్రమే. ఆ మాట తెలిసి కూడా అమెరికా అధ్యక్షుడు, చాలా షరతులను ఇరాన్ అంగీకరించి వేసిందని ఈ 30వ తేదీన మరొకమారు ప్రకటించారు.గెలిచే యుద్ధమేనా?ఎంతో వెనుకకు పోనక్కర లేదు. అమెరికా, ఇరాన్ మూడవ విడత చర్చలు ఒమన్ మధ్యవర్తిత్వంతో ఫిబ్రవరి 26న జరిగాయి. పరస్పర అంగీకారం దాదాపు ఒక కొలిక్కి వచ్చినట్లు ఒమన్‌తో పాటు అమెరికన్ ప్రతినిధులు ప్రకటించారు. తర్వాతి విడత చర్చలు మార్చి 2న జరగవలసి ఉంది. కానీ అకస్మాత్తుగా ఆ మధ్యలోనే ఇజ్రాయెల్, దాని వెనువెంట అమెరికా కలిసి ఇరాన్‌పై దాడులు ప్రారంభించాయి. ఏ ఇరాన్ నాయకుని అనుమతితో చర్చలు జరుగుతుండెనో అదే నాయకుడిని కుటుంబంతో సహా ప్రాణాలు తీశాయి. చర్చలు ఒక పక్క జరుపుతూనే మధ్యలో దాడులు చేయటం ట్రంప్‌కు అది రెండవసారి.అందుకే చర్చల నాటకాన్ని ఇరాన్ మాత్రమే కాదు, ఎవరూ నమ్మటం లేదు. అమెరికన్లు కూడా. నాలుగు వారాల వైమానిక యుద్ధం ట్రంప్ లక్ష్యాలను సాధించలేక పోయినప్పుడు పదాతి యుద్ధంతో అది జరిగేది కాదని అమెరికన్ రిటైర్డ్ జనరల్స్, యుద్ధ విషయాల చరిత్రకారులు స్పష్టంగా హెచ్చరిస్తున్నారు. అందుకు వారు గట్టి కారణాలు కూడా చెప్తున్నారు. లిబియా, ఇరాక్, అఫ్గాని స్తాన్లకు, ఇరాన్‌కు చాలా తేడాలున్నాయి. వాటికి భిన్నంగా ఇక్కడ విశాలమైన దేశం, పెద్ద జనాభా, బలమైన ప్రభుత్వం, భారీ సైన్యం, సైనిక సంపత్తి ఉన్నాయి. ఇరాన్ అనుసరిస్తున్న యుద్ధ వ్యూహం భిన్నమైనది. ఇరాన్లో అధిక భాగం పర్వతాలమయం. వారి ఆయుధ నిల్వలు కొండల అడుగున చాలా లోతైన బంకర్లలో ఉన్నందునే అమెరికన్ బంకర్ బస్టర్లు సైతం వాటిని ఛేదించలేక పోతున్నాయి. వీటన్నింటికీ అదనంగా, ఇరానియన్ ప్రభుత్వం, ప్రజలు కూడా తమ అస్తిత్వాన్ని ఏ విధంగానైనా కాపాడుకుని తీరాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు. అక్కడి ప్రజలు ప్రజాస్వా మికంగా ఎన్నుకున్న మొసాదెగ్ ప్రభుత్వాన్ని అమెరికా, బ్రిటన్ కలిసి 1953లో కూలదోసినప్పటి నుంచి గల 72 సంవత్సరాల చేదు అనుభవాల దృష్ట్యా పాశ్చాత్య దేశాలను, ఇజ్రాయెల్‌ను ఎంత మాత్రం నమ్మరన్నది ఆ నిపుణులు చెప్తున్నమాట.కపట నీతిఅందువల్ల, అమెరికా అధ్యక్షుడు గత 12 రోజులలో మూడు సార్లు మార్చిన గడువులుగానీ, చర్చల కోసమంటున్న షరతులు గానీ, ఇస్లామాబాద్‌లో జరుగుతాయనే మధ్యవర్తిత్వాలు గానీ ప్రహసనం తప్ప మరొకటి కాదు. అయినా, ఇరాన్‌పై యుద్ధాన్నిఇంకా తీవ్రం చేయండంటూ ట్రంప్‌కు మూడు రోజుల క్రితం చెప్పిన సౌదీ అరేబియా, అంతలోనే ఈజిప్టు, టర్కీలతో కలిసి పాకిస్తాన్‌కు మధ్యవర్తి ప్రతినిధులను పంపటం కపట నీతికి పరాకాష్ఠ వంటిది. ఇటువంటి రాజీలేవీ కుదిరేవి కాదని ఒమన్ దౌత్య వైఫల్యంతో గ్రహించలేనిదేమీ కాదు పాకిస్తాన్. అయినప్పటికీ చొరవ తీసుకోవటంలో తమ ఆలోచనలేవో తమకుండవచ్చుగానీ, అది జరిగే కార్యం కాదని అందరికీ తెలుసు. అంతకన్న ముఖ్యంగా, దానిని జరగనివ్వరాదని ఇజ్రాయెలీ ప్రధానికి తెలుసు. వీటన్నింటికి ఇరాన్‌పై అరబ్ షేఖ్‌లకు చిరకాలంగా గల వ్యతిరేకత పనిచేస్తున్నది.అందువల్ల, వెనిజులాతో చర్చలు చర్చలంటూ సైన్యాలను మోహరించి అకస్మాత్తుగా దాడి చేసినట్లు, ఇరాన్‌తో చర్చలు చర్చలంటూ సైన్యాలను సమీకరించి ఉన్నట్లుండి యుద్ధం మొదలు పెట్టినట్లు, ఇప్పుడు మళ్లీ ఒకవైపు రాజీ ప్రతిపాదనలు ప్రకటించి ఇస్లామాబాద్‌లో చర్చలంటూనే పదాతి సేనలను పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. అకస్మాత్తుగా ట్రంప్ 30వ తేదీన తన బ్రాండ్ మాట ఒకటి ప్రకటించారు. తనకు ఇరాన్ చమురు కావాలట. అందుకు ఖర్గ్ దీవిని ఆక్రమించుకుని హార్మూజ్‌ను తెరిపిస్తారట. కార్యసాధన తర్వాతగానీ ఇరాన్ నుంచి వెనుకకు మళ్లరట. ఒకవేళ రాగల రోజు లలో వైమానిక దాడులు, భూతల యుద్ధం జమిలిగా సాగితే ఏమి జరగవచ్చునన్నది అంచనా వేయలేము.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
అంతా ఫిబ్రవరి 26 తర్వాతే ఇప్పుడు దుబాయ్ ఎలా ఉందంటే?
-
రాజకీయ నాయకులను లేపేస్తాం.. ఇరాన్ వార్నింగ్
-
ఇజ్రాయెల్ ధీమా.. తగ్గేదేలే అంటున్న ఇరాన్
-
సొర చేపలకు ఆహారంగా అమెరికా సైనికులు?!
టెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి.తగ్గే సూచనలు మాత్రం కనిపించడం లేదు. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ప్రారంభించిన యుద్ధానికి నెల రోజుల గడువు పూర్తయింది. ఈ నేపథ్యంలో మరో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అమెరికాకు ఇరాన్ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.ఇరాన్ సైన్యం ఆదివారం విడుదల చేసిన వీడియో ప్రకటనలో ప్రధాన కమాండ్ ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఇబ్రాహీం జోల్ఫఘారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా సైన్యాన్ని పర్షియన్ గల్ఫ్‌లోకి పంపితే వారు ‘సొరచేపలకు ఆహారంగా’ మారతారని హెచ్చరించారు. ఇరాన్ సైనికులు ఈ అవకాశాన్ని చాలాకాలంగా ఎదురు చూస్తున్నారని అన్నారు. ట్రంప్‌ను ‘ఇజ్రాయెల్ నాయకత్వానికి బానిస’గా అభివర్ణించారు.అదే సందర్భంలో ట్రంప్‌ను ‘ప్రపంచ దేశాల మధ్య అత్యంత అసత్యవాది అధ్యక్షుడు’గా పిలుస్తూ, ఆయన నిర్ణయాలు స్థిరంగా లేవని విమర్శించారు. ఒక క్షణం చర్చల గురించి మాట్లాడతారని, వెంటనే యుద్ధం చేయాలని నిర్ణయిస్తారని ధ్వజమెత్తారు. ట్రంప్‌పై ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మోసాద్ ఒత్తిడి పెంచుతోందన్నారు. ట్రంప్ గత సంబంధాలు, ప్రత్యేకంగా జెఫ్రీ ఎప్స్టిన్ కేసుతో అనుబంధం కారణంగా ఈ ఒత్తిడి మరింత పెరిగిందని ఆరోపించారు.అమెరికా ఇరాన్లో భూతల దాడులకు సిద్ధమవుతోందంటూ పలు నివేదికలు వెలువడ్డాయి. ఖార్గ్ దీవి, హోర్ముజ్ జలసంధి సమీప ప్రాంతాల్లో దాడులు జరపాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగా అమెరికా తన సైన్యాన్ని వ్యూహాత్మక ప్రదేశాలకు భారీ ఎత్తున తరలిస్తున్నట్లు తెలుస్తోంది.మరోవైపు, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగేర్ ఘలీబాఫ్ కూడా ఇరాన్ సైన్యం ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. మిసైళ్ళు, వీధి నిరసనలు, హోర్ముజ్ జలసంధి ద్వారా అమెరికాపై ఒత్తిడి పెరుగుతోందని అన్నారు. ఈ పరిణామాలు ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న సంకేతాలను ఇస్తున్నాయి. ఇరాన్ స్పష్టంగా తెలిపినట్లుగా, భూ తల దాడి జరిగితే అది అమెరికాకు ఘోర పరాజయాన్ని తెస్తుందని, పర్షియన్ గల్ఫ్‌లోని సొరచేపలు అమెరికా సైనికుల కోసం ఎదురుచూస్తున్నాయని పునరుద్ఘాటిస్తోంది. -
ఇరాన్‌పై యుద్ధం.. అమెరికాకు భారీ ఎదురుదెబ్బ
రియాద్: ఇరాన్‌పై యుద్ధంలో అమెరికాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. యుద్ధంలో శత్రువుల రాకను ముందుగానే పసిగట్టి అమెరికా సైన్యానికి సమాచారం అందించే ఈ-3 సెంట్రీ ఎయిర్‌బోర్న్ విమానాన్ని ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో ధ్వంసం చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ విమానాన్ని మార్చి 27న రియాద్‌కు దక్షిణంగా 100 కిలోమీటర్ల దూరంలో ఇరాన్ క్షిపణి లక్ష్యంగా చేసిందని ది జెరూసలేం పోస్ట్ నివేదించింది. ఈ దాడిలో 10–12 మంది సైనికులు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.దాడిలో ధ్వంసమైన విమానం చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నష్టం తీవ్రంగా ఉండటంతో, దాన్ని మరమ్మతు చేసి తిరిగి ఉపయోగించడం సాధ్యం కాకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, అమెరికా రక్షణ శాఖకు చెందిన సెంట్రల్ కమాండ్ ఈ ఘటనను అధికారికంగా ధృవీకరించలేదు.ఈ-3సెంట్రీ ఎయిర్‌బోర్న్ కేవలం విమానం మాత్రమే కాదు. యుద్ధరంగంలో అమెరికాకు వెన్నెముకలాంటిది. తరచుగా ‘ఎగిరే కమాండ్ సెంటర్’గా వర్ణించబడే ఈ విమానం వందల మైళ్ల మేర గగనతలాన్ని పర్యవేక్షిస్తూ, దూసుకొస్తున్న క్షిపణులు, డ్రోన్లు, విమానాలను గుర్తించి మిత్ర దళాలకు ముందస్తు సమాచారం అందిస్తుంది. నిఘా నుండి అడ్డుకోవడం వరకు మొత్తం యుద్ధ క్షేత్రాన్ని ఏకీకృతం చేసే సామర్థ్యం దీనికి ఉంది. ఈ స్థావరంపై ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’, ‘రోరింగ్ లయన్’ వంటి సైనిక ఆపరేషన్లు ప్రారంభమైనప్పటి నుంచి అనేక సార్లు దాడులు జరిగాయి. ఈ వారం ఆరంభంలో జరిగిన మరో క్షిపణి దాడిలో 14 మంది గాయపడ్డారు. ఈ-3 సెంట్రీ ఎయిర్‌బోర్న్ ధ్వంసం కావడం చాలా పెద్ద విషయం అని మాజీ అమెరికా వైమానిక దళ కల్నల్ జాన్ జేవీ వెనబుల్ వ్యాఖ్యానించారు. ‘గల్ఫ్ ప్రాంతంలో ఏం జరుగుతుందో గమనించే సామర్థ్యానికి, అలాగే అక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన కలిగి ఉండే వీలుకు ఇది విఘాతం కలిగిస్తుంది’అని ఆయన పేర్కొన్నారు. 🚨 JUST IN: 🇮🇷🇺🇸Reports suggest a U.S. Air Force aircraft may have been damaged or destroyed following Iranian strikes at Prince Sultan Air Base in Saudi Arabia. pic.twitter.com/8Gigwrq7tx— IranDefenceForce (@IranDefenceForc) March 29, 2026అమెరికా ఖరీదైన విమానాలపై ఇరాన్ దాడులుఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా సైన్యానికి భారీ నష్టం వాటిల్లింది. 21 రోజుల యుద్ధంలో కనీసం 17 అమెరికా యుద్ధ విమానాలు ధ్వంసం అయ్యాయి లేదా తీవ్రంగా దెబ్బతిన్నాయి.కూలిన విమానాల వివరాలుఈ దాడుల్లో ఎఫ్‑35 స్టెల్త్ ఫైటర్, ఎఫ్‑18 జెట్, అలాగే అత్యంత కీలకమైన ఈ‑3 సెంట్రీ అవాక్స్ వంటి విమానాలు ఉన్నాయి. ఇవి అమెరికా వైమానిక దళానికి అత్యంత ఖరీదైన, వ్యూహాత్మక ఆస్తులుగా గుర్తింపు పొందాయి. ధర అంచనాలుఎఫ్‑35 స్టెల్త్ ఫైటర్: ఒక్కో విమానం ధర సుమారు 80–100 మిలియన్ డాలర్లు (రూ.6,600– రూ.8,300 కోట్లు). ఎఫ్‑18 జెట్: ధర సుమారు 60 మిలియన్ డాలర్లు (రూ.5,000 కోట్లు).ఈ‑3 సెంట్రీ అవాక్స్ : అప్గ్రేడ్లతో కలిపి 400 మిలియన్ డాలర్లు (రూ.3,000 కోట్లు)ఆర్థిక ప్రభావంఈ నష్టాల వల్ల అమెరికాకు బిలియన్ల డాలర్ల ఆర్థిక దెబ్బ తగిలింది. ఒక్కో విమానం ధర వందల మిలియన్ల డాలర్లలో ఉండటంతో, మొత్తం నష్టం విలువ విపరీతంగా పెరిగింది. -
ఇజ్రాయెల్ ఆకాశంలో వేల సంఖ్యలో కాకులు.. ఇది వినాశనానికి సంకేతమా?
-
యూనివర్సిటీలపై దాడులు.. యూఎస్,ఇజ్రాయెల్ కు ఇరాన్ వార్నింగ్
-
యుద్ధంలోకి హౌతీలు.. ఇజ్రాయెల్ పై మిసైల్ దాడులు
-
యుద్ధానికి నెల రోజులు.. ఊహించని మలుపు అగ్నిగుండంగా మిడిల్ ఈస్ట్!
-
రంగంలోకి హూతీలు!
దుబాయ్: పశ్చిమాసియాలో కల్లోలం నానాటికీ విస్తరిస్తోంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులకు తెర తీసి నెల రోజులైనా ఉద్రిక్తతలు చల్లారకపోగా నానాటికీ పెరిగిపోతూ వస్తున్నాయి. ఇరాన్‌కు దన్నుగా యెమన్‌కు చెందిన హూతీలు కూడా యుద్ధరంగంలోకి అడుగు పెట్టారు. దక్షిణ ఇజ్రాయెల్‌లోని కీలక సైనిక స్థావరాలపై శనివారం పెద్ద ఎత్తున క్షిపణి దాడులకు దిగినట్టు ప్రకటించారు. వారికి మద్దతుగా హెజ్బొల్లా ఉగ్ర సంస్థ కూడా ఇజ్రాయెల్‌పై ఎడాపెడా క్షిపణులు ప్రయోగించింది. దాంతో పరిస్థితి మరింతగా విషమించేలా కన్పిస్తోంది. ఎర్రసముద్రంలో ఏటా కనీసం లక్ష కోట్ల డాలర్ల మేరకు వాణిజ్యం జరిగే కీలకమైన బాబ్ ఎల్మందెబ్ జలసంధిని కూడా హూతీలు మూసేసే సూచనలు కన్పిస్తున్నాయి.అదే జరిగితే అంతర్జాతీయ వాణిజ్యం, ముఖ్యంగా ఇంధన సరఫరా మరింతగా కుదేలవడం ఖాయమన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ కూడా ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై దాడులను తీవ్రస్థాయిలో కొనసాగించింది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపైకి ఏకంగా 6 బాలిస్టిక్ క్షిపణులు, 29 డ్రోన్లు ప్రయోగించింది. దాంతో కనీసం 15 మందికి పైగా అమెరికా సైనికులు గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గత రెండు వారాల్లో గాయపడ్డ అమెరికా సైనికుల సంఖ్య 25 దాటింది. మొత్తమ్మీద ఈ యుద్ధంలో క్షతగాత్రులైన వారి సంఖ్య 300 దాటింది. మూడు రీ ఫ్యూయలింగ్ విమానాలతో పాటు అమెరికాకు చెందిన పలు యుద్ద విమానాలు కూడా దాడుల్లో దెబ్బతిన్నట్టు స్థానిక అధికార వర్గాలు తెలిపాయి.దుబాయ్‌లో ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేసుకున్న యాంటీ డ్రోన్ సిస్టమ్స్ నిల్వ కేంద్రంపైనా దాడి చేసి వాటిని ధ్వంసం చేసినట్టు ఇరాన్ ప్రకటించింది. ఆ సమయంలో అందులో 20 మంది దాకా ఉక్రేనియన్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఒమన్ సమీపంలో ఒక అమెరికా నౌకపై కూడా దాడి చేసినట్టు ఇరాన్ వెల్లడించింది. అమెరికా సైనికులు తలదాచుకున్నారన్న సమాచారంతో దుబాయ్‌లో ఒక హోటల్‌పై కామికాజ్ క్షిపణితో దాడి చేసినట్టు రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించారు. కువైట్‌పై దాడుల్లో పలు వాణిజ్య భవనాలు దెబ్బతిన్నాయి.దక్షిణ లెబనాన్‌లో యుద్ధాన్ని కవర్ చేస్తున్న ముగ్గురు జర్నలిస్టులు ఇజ్రాయెల్ దాడులకు బలయ్యారు! యూఏఈలోని ఖలీఫా ఎకనామిక్ జోన్‌పై ఇరాన్ క్షిపణి దాడిలో ఐదుగురు భారతీయులు గాయపడ్డారు. ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్ కూడా అల్లాడిపోయింది. జెరూసలేం, టెల్ అవీవ్, బీర్ షెబాతో పాటు పలు నగరాల్లో నిర్విరామంగా సైరన్లు మోగాయి. సెంట్రల్ ఇజ్రాయెల్‌లోని ఎషో్టల్లో కనీసం 11 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో 3,500 మంది అమెరికా సైనికులు గల్ఫ్‌కు చేరుకున్నట్టు సమాచారం! దద్దరిల్లిన టెహ్రాన్ ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు శనివారం కూడా కొనసాగాయి. రాజధాని టెహ్రాన్ పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. పలు ప్రాంతాల్లో మంటలు, పొగ కనిపించాయి. మీనాబ్ నగరంలో ఒక క్లినిక్‌పై అమెరికా సైన్యం పెద్ద ఎత్తున దాడి చేసింది. అయితే ప్రాణనష్టమేమీ సంభవించలేదని స మాచారం. తమ దేశంలో మృతుల సంఖ్య 1,900 దాటినట్టు ఇరాన్ పేర్కొంది. లెబనాన్‌లో 1,100కు పైగా, ఇజ్రాయెల్‌లో 19 మంది, గల్ఫ్ దేశాల్లో 20 మంది మరణించారు. లెబనాన్‌లోనూ ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు కొనసాగించింది. దక్షిణ లెబనాన్‌లో హెజ్బొల్లా క్షిపణి దాడుల్లో కనీసం 9 మంది సైనికులు గాయపడ్డట్టు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. గల్ఫ్ దేశాలకు ఇరాన్ వారి్నంగ్ యుద్ధం ఆగి శాంతి నెలకొనాలంటే గల్ఫ్ దేశాలు తాము చెప్పినట్టు వినాల్సిందేనని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కుండబద్దలు కొట్టారు. ఇరాన్‌పై దాడులకు వారి గగనతలాలను వాడుకునేందుకు అమెరికాను అనుమతించరాదన్నారు. శత్రువుకు సహకరించేవారిని వదలబోమని పునరుద్ఘాటించారు. భూతల దాడులకు అమెరికా 10 వేల సైన్యాన్ని పంపుతోందన్న వార్తలపై ఇరాన్ మీడియా వ్యంగ్యంగా స్పందించింది. ‘నరకానికి స్వాగతం’ అనే శీర్షికలతో దీనిపై వార్తలు ప్రచురించింది. ఇరాన్ గడ్డపై అడుగు పెట్టే ప్రతి అమెరికా సైనికుడూ శవపేటికలోకి చేరడం ఖాయమని హెచ్చరించింది. మరోవైపు ఇంధన సంక్షోభం ఇరాన్‌కు వరంగా మారుతోంది. చమురు ఎగుమతుల ద్వారా ఆ దేశం రోజుకు ఏకంగా రూ.1,319 కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నట్టు సమాచారం. అమెరికా, ఇరాన్ చర్చల్లో ప్రతిష్టంభనఇరాన్తో చర్చలు ఫలప్రదంగా సాగుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినా పరిస్థితిలో మాత్రం పెద్దగా పురోగతి కన్పించడం లేదు. చర్చల విషయంలో అమెరికా చిత్తశుద్ధిపై తమకు నమ్మకం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ శనివారం కుండబద్దలు కొట్టారు! ఈ నేపథ్యంలో యుద్ధానికి తెర దించే మార్గాలను అన్వేషించేందుకు పలు గల్ఫ్ దేశాల నడుమ ఆదివారం కీలక సమావేశం జరగనుంది.ఇందుకు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదిక కానుంది. మరోవైపు ఐరాస విజ్ఞప్తి మేరకు హార్మూజ్ గుండా మానవీయ సాయం, వ్యవసాయోత్పత్తులతో కూడిన నౌకలను అనుమతించేందుకు ఇరాన్ అంగీకరించింది. హార్మూజ్‌ను తెరిచేందుకు ఆ దేశానికి విధించిన డెడ్‌లైన్‌ను ఏప్రిల్ 6 దాకా ట్రంప్ పొడిగించడం తెలిసిందే. ఇరాన్‌పై దాడి ద్వారా తాము ఆశించిన లక్ష్యాలను భూతల దాడులతో నిమిత్తం లేకుండానే సాధిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ధీమా వెలిబుచ్చారు. -
ఇజ్రాయిల్ దాడుల్లో జర్నలిస్టులు మృతి
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. దక్షిణ లెబనాన్‌లో శనివారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ముగ్గురు జర్నలిస్టులు మృతిచెందినట్లు ఆదేశ సైన్యం ప్రకటించింది.ఇజ్రాయెల్ లెబనాన్‌పై విరుచుకపడుతుంది. ఆ దేశంపైకి కంబాట్ ఆపరేషన్ చేపడుతూ పెద్దఎత్తున హిజ్బుల్లా ఫైటర్స్‌ను హతమారుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకూ దాదాపు 400కు పైగా హిజ్బుల్లా ఫైటర్స్ అంతం చేసినట్లు ప్రకటించింది. తాజాగా శనివారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ముగ్గురు జర్నలిస్టులు మృతి చెందినట్లు ఆ దేశం ప్రకటించింది. హిజ్బుల్లాకు చెందిన ఛానెల్ షుయబ్-అల్- మనార్ ఛానెల్‌కు చెందిన జర్నలిస్టుతో పాటు మరో మహిళా జర్నలిస్టు, కెమెరామెన్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. హిజ్బుల్లాకు చెందిన జర్నలిస్టు దశాబ్దకాలంగా యుద్ధవార్తలు కథనాలు ప్రచురిస్తున్నట్లు సమాచారం.అయితే ఈ దాడులను లెబనాన్ అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని తెలిపారు. కాగా 2023 నుంచి ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అనేక మంది పాత్రికేయులు మృతి చెందినట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. -
సూపర్ ‘పవర్‌గేమ్’లో భారత్ డైలమా!
డామిట్, కథ అడ్డం తిరిగింది. ట్రంపూ, నెతన్యాహూ కలిసి రాసుకున్న స్క్రిప్టులో లేని సన్నివేశం ఎదురైంది. ఈ యాంటీ క్లైమాక్స్ వాళ్లు ఊహించింది కాకపోవచ్చు. వ్యూహం ప్రకారమే దాడులు జరిగిన తొలిరోజున ఇరాన్ ఆధ్యాత్మిక అధినేత అలీ ఖమేనీని హతం చేశారు. ఈ దెబ్బకు ఇరాన్ జావకారిపోయి ఉండాలి. మత పాలనను వ్యతిరేకించే ఇరాన్ ప్రజలు లక్షల సంఖ్యలో వీధుల్లోకి వచ్చి ట్రంపు మహాశయునికి జైకొట్టి ఉండాలి. మహా అయితే నాలుగు రోజుల్లో ఇరాన్ సర్కార్‌ను పీక పట్టుకొని మోకాళ్ల మీద కూర్చోబెట్టి అవమానకరమైన షరతుల మీద సంతకం పెట్టించి ఉండాలి. ఇదీ వ్యూహం. నాలుగు రోజులు కాదు. నాలుగు వారాలు గడిచిపోయాయి. ఏమైంది?హార్మూజ్ అనే ఒక సముద్రపు ఇరుకు సందులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పీకను దొరకబుచ్చుకొని దాని కణత మీద తుపాకీ గురిపెట్టి కూర్చున్న ఇరాన్ దృశ్యం ఇప్పుడు స్పష్టంగా కనిపి స్తున్నది. నాలుగున్నర దశాబ్దాలుగా ఇరాన్ మీద ఆర్థిక ఆంక్ష లను అమెరికా అమలు చేస్తున్నది. దాని చమురు అమ్మకాలను నిషేధించింది. తాజా పరిణామాలతో, చమురు నౌకల రవా ణాకు ఆటంకాలను తొలగించాలని విజ్ఞప్తి చేయడంతోపాటు ఇరాన్ కూడా అమ్ముకోవచ్చంటూ తాత్కాలిక ‘అనుమతి’ని ప్రసాదించింది. ఇదేమీ ట్రంప్ ‘కరుణ’ కాదు, కాళ్ల బేరమని అర్థమవుతూనే ఉన్నది. ఇరాన్‌పై యుద్ధం కారణంగా తలెత్తిన ఇంధన సంక్షోభంపై ప్రపంచ దేశాలు తనను వేలెత్తి చూపకుండా ఓ నెలరోజుల సడలింపును ఆయన ప్రకటించారు. గతంలో చాటుమాటుగా చైనాకు చమురు సరఫరా చేసి, దాన్నుంచి వస్తు–సేవలను పొందుతున్న ఇరాన్ ఇప్పుడు రైట్ రాయల్‌గా రోజుకు 140 మిలియన్ డాలర్ల విలువైన చమురు అమ్మకాలను ప్రారంభించింది. దాడుల్లో ఇరాన్‌కు జరిగిన ఆస్తి నష్టంపై స్పష్టమైన అంచనాలు ఇంకా రాలేదు గానీ, చమురు విక్రయం ద్వారా బహిరంగంగా రోజుకు సుమారు 1400 కోట్ల రూపాయలను (ఇండియన్ కరెన్సీలో) ఇరాన్ ఆర్జిస్తున్నది. అమె రికా మాత్రం చేతి చమురును బాగానే వదిలించుకుంటున్నదని ఆ దేశంలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు రోజుకు సగటున ఒకటిన్నర బిలియన్ డాలర్ల చొప్పున యుద్ధ జ్వాలలకు అమెరికా ఆహుతిస్తున్నదని లెక్కలు తేలుతున్నాయి. మొదటి మూడు వారాల్లో 30 బిలియన్ డాలర్లను అర్పించు కోవలసి వచ్చింది. ఇరాన్ దాడుల్లో గల్ఫ్ ప్రాంతంలోని అమె రికా సైనిక స్థావరాలు భారీగా ధ్వంసమయ్యాయి. వాటి పున రుద్ధరణ పేరుతో ఇంకో 200 బిలియన్ డాలర్లను కేటాయించాలని అమెరికా కాంగ్రెస్‌ను పెంటగన్ (రక్షణ శాఖ కేంద్రం) కోరుతున్నది.పెంటగన్ అభ్యర్థనపై ప్రతిపక్ష డెమోక్రాట్లే కాదు, కొందరు పాలక రిపబ్లికన్లు కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. అమెరికా ప్రజల జీవన ప్రమాణాలను ఫణంగా పెట్టి ఏం సాధించాలని ఇరాన్ యుద్ధంలో ఇంత పెద్దమొత్తంలో తగలేస్తున్నారని వారు ట్రంప్ సర్కార్‌ను నిగ్గదీస్తున్నారు. ఇప్పటికే 39 ట్రిలియన్ డాలర్ల అప్పులతో సతమతమవుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఈ నిరర్థక యుద్ధ ఖర్చు మోయలేని భారాన్ని మోపుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్‌పై హఠాత్తుగా ఇజ్రాయె ల్తో కలిసి దాడులకు తెగబడటానికి స్పష్టమైన కారణాన్ని కూడా ట్రంప్ ప్రభుత్వం చెప్పలేకపోయింది. అణ్వస్త్ర బూచీ అనే అరిగిపోయిన రికార్డునే అది ఇప్పటికీ ప్లే చేస్తున్నది.ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమం ఆరోపణలపై ఇప్పటికే అంత ర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ (ఏఐఈఏ) అక్కడ తనిఖీలు చేసింది. అణ్వాయుధాలను తయారుచేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తున్న దనేందుకు ఎటువంటి ఆధారాలు లభించలేదని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ రఫేల్ గ్రాసీ స్పష్టంగా ప్రకటించారు. అయినప్పటికీ అమెరికాకు, ఇజ్రాయెల్‌కు మాత్రం ఇరాన్ అణుబూచీ కనిపి స్తూనే ఉన్నది. ఇరాన్‌ను నిర్వీర్యం చేస్తే పశ్చిమాసియాలో పెత్తనం చేసే అవకాశం ఇజ్రాయెల్‌కు లభిస్తుంది. ఇరాన్ దన్నుతో ఆ ప్రాంతంలో ప్రమాదకరంగా తయారైన టెర్రరిస్టు గ్రూపులు హెజ్బుల్లా (లెబనాన్), హూతీ (యెమెన్), హమాస్ (పాలస్తీనా)లు కూడా తోక ముడుస్తాయి. ఇదీ ఇజ్రాయెల్ ఆలోచన. మరి అమెరికాకు ఒనగూడే ప్రయోజనం ఏమిటి?1979లో జరిగిన ఇస్లామిక్ రివల్యూషన్లో పదవీ చ్యుతుడైన రాజు రెజా పహ్లవీ. ఆయన అమెరికా కీలుబొమ్మ. ఆ కాలంలో ఇరాన్ నుంచి కారుచౌకగా అమెరికా చమురు కొనుగోలు చేసేది. ఇప్పుడింకో కీలుబొమ్మను కూర్చోబెడితే మళ్లీ ఆ అవకాశం ఉండొచ్చు. కానీ, యుద్ధానికి అదేమంత పెద్ద కారణం కాదు. అమెరికా ఇంధన భద్రతకు అంత ప్రమాదమేమీ లేదు. పైగా ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలున్న వెను జువేలా దేశం అమెరికాకు కూతవేటు దూరంలోనే ఉన్నది. దాని అధ్యక్షుడు మదురో, ఆయన సతీమణిని కిడ్నాప్ చేసి ఆ దేశాన్ని అమెరికా తన చెప్పుచేతుల్లోకి తీసుకున్నది. వెనుజువేలా కూడా ఇరాన్లాగే చైనాకు మిత్రదేశం కావడం ఇక్కడ గమనార్హం.భారత్ లాగే చైనా కూడా ఇంధన భద్రత గల దేశం కాదు. పైగా దాని ఇంధనావసరాలు చాలా ఎక్కువ. వెనుజువేలా, ఇరాన్ దేశాలు అమెరికా ఆంక్షల నేపథ్యంలో మలేసియా, రష్యా వంటి దేశాల ద్వారా క్రూడ్ ఆయిల్‌ను శుద్ధి చేసి చైనాకు పంపి స్తాయి. చైనాకు ప్రధాన చమురు సరఫరాదారైన రష్యా కూడా అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటున్నదే కావడం విశేషం. ప్రపంచ చమురు రవాణాలో ఇరవై శాతానికి పైగా సాగే హార్మూజ్ జలసంధిని యుద్ధ నేపథ్యంలో ఇరాన్ తన పూర్తి నియంత్రణలోకి తీసుకున్నది. అక్కడి నుంచి చమురు రవాణా చేసే నౌకలపై టోల్ ఫీజు వసూలు చేయాలని ఆలోచిస్తున్నట్టు ఒక లీక్‌ను ఇరాన్ వదిలింది. అంతేకాదు, ఆ ఫీజు అమెరికా డాలర్లలో కాకుండా చైనా యువాన్లలో వసూలు చేయాలని ఆలోచిస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఈ వార్తలు వచ్చిన మరుసటి రోజే ట్రంప్ ఐదు రోజుల దాడుల విరామాన్ని ప్రకటించాడు. దాన్ని తర్వాత ఏప్రిల్ 6 దాకా పొడిగించాడు. ఇజ్రాయెల్ దాడులు మాత్రం ఆగలేదు.డాలర్‌కు సవాల్ ఎదురైతే అమెరికా తట్టుకోలేదు. అందు లోనూ డాలర్ ఆధిపత్యానికి ఊపిరిపోసిన చమురు రంగంలో పోటీ ఎదురైతే చేటుకాలం దాపురించినట్టే. యాభయ్యేళ్ల కింద చమురు ఎగుమతి చేసే గల్ఫ్ దేశాల రక్షణ బాధ్యతను అమెరికా తీసుకున్నది. ప్రతిగా చమురు కొనుగోలు చేసే దేశాలు అందుకు చెల్లించాల్సిన సొమ్మును అమెరికా డాలర్లలో చెల్లించాలి. ఇంధన అవసరాలు అన్ని దేశాలకూ ఉంటాయి కనుక డాలర్ డిమాండ్ పెరిగింది. ఇప్పుడు ఇరాన్ యుద్ధం నుంచి వెనక్కు తగ్గి అమె రికా తోక ముడిస్తే, ఇరాన్ దాడుల్లో తీవ్రంగా నష్టపోతున్న అరబ్ దేశాల రక్షణ బాధ్యత నుంచి అమెరికా వైదొలగి నట్టవుతుంది. అప్పుడు చమురు అమ్మకాన్ని డాలర్లలోనే కొనసాగించవలసిన అవసరం ఈ దేశాలకు ఉండదు. యువాన్, రూబుల్, యెన్ దేన్నయినా వాళ్లు అంగీకరించే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిణామం సంభవిస్తే అమెరికా శిరస్సు మీద నుంచి అగ్రరాజ్యం అనే కిరీటం ఊడి కిందపడ్డట్టే!విరామం తాత్కాలికమే. ఇరాన్ పూర్తిగా లొంగిపోయి, తమ అనుకూల ప్రభుత్వాన్ని అక్కడ ప్రతిష్ఠించే దాకా దాడులు చేయాలని అమెరికా తొలుత భావించింది. అలా జరగాలంటే ఇరాన్ గడ్డమీద తన సేనలను దించాల్సి ఉంటుంది. ఇరాన్ భౌగోళిక స్వరూపం దృష్ట్యా దాంతో భూతల యుద్ధం సాధ్యం కాదని రక్షణ నిపుణులు చెబుతారు. ఉత్తర దక్షిణ సరిహద్దుల్లో సహజమైన కోట గోడగా ఉన్న పర్వత శ్రేణులే ఇందుకు కారణం. మధ్యేమార్గంగా ఇరాన్ చమురు నిల్వచేసే ఖార్గ్ దీవినో, పర్షియన్ గల్ఫ్‌లో ఉన్న దీవుల్లో మరోదాన్నో ఆక్రమించాలని అమెరికా భావిస్తున్నది. ఆ దీవి ద్వారా హార్మూజ్ నుంచి చమురు కంటెయినర్లు సజావుగా వెళ్లేలా పర్యవేక్షించి యుద్ధంలో విజయం సాధించినట్లు ప్రకటించుకోవాలని భావిస్తున్నది.పర్షియన్ గల్ఫ్ దీవుల ఆక్రమణ కూడా అమెరికా – ఇజ్రాయెల్ ఊహిస్తున్నంత సులభం కాదు. ఇరాన్ నుంచి తీవ్రమైన ప్రతిఘటననే ఎదుర్కోవలసి ఉంటుంది. నాలుగు వేల కిలోమీటర్ల దూరంలోని డిగో గార్షియా దీవులపైకే క్షిపణులను ప్రయోగించిన ఇరాన్ పట్టుమని పది కిలోమీటర్ల దూరం లేని దీవుల్లో అమెరికా సైన్యం దిగితే మిన్నకుంటుందా? పర్షియల్ గల్ఫ్‌లో పెనుమంటలు చెలరేగవచ్చు. దుబాయ్, అబుధాబీ, దోహా, రియాద్ నగరాల వైభవోజ్వల కాంతులు మసక బారవచ్చు. అన్నిటినీ మించి ప్రపంచ ఆర్థిక గమనం తీవ్రమైన ఒడిదుడుకులకు లోనుకావచ్చు. మన దేశం సంగతి సరేసరి. ఇరాన్ మన దేశం పట్ల కొంత ఉదారంగా ఉన్నప్పటికీ నాలుగు వారాల ఘర్షణే దేశంలో తీవ్రమైన ప్రభావాన్ని చూపెడుతున్నది. ఈ ఘర్షణ వారాల్లోంచి నెలల్లోకి మారితే తీవ్ర సంక్షో భాన్ని చవిచూడవలసి రావచ్చు. మన రాజకీయ నాయకత్వ దీక్షా దక్షతలకు, ప్రజా సమూహాల సమైక్యతకు ఇది పరీక్షా కాలం.ప్రపంచాన్ని ఆందోళనకరమైన పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్న ఈ అంతర్జాతీయ పరిణామాల్లో ఒక ప్రముఖ దేశంగా, అత్యధిక జనాభా గల దేశంగా ఉన్న భారత్ పోషించవలసిన పాత్ర ఏమిటన్నది కూడా చర్చించుకోవలసిన సందర్భం. తన సూపర్ పవర్ హోదాను, తన ఆధిపత్యంలోని ఏకధ్రువ ప్రపంచ గమనాన్ని నిలబెట్టుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నది. ఆర్థికంగా – సాంకేతిక పరంగా అనూహ్యమైన ప్రగతిని సాధించిన చైనా ఈ తరహా ప్రపంచ గమనపు దిశను మార్చాలని సహజంగానే భావిస్తుంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తొలిరోజు నుంచీ నేటి దాకా దాదాపు ఎనభయ్యేళ్ల శత్రుత్వం అమెరికా – రష్యాలది. నలభయ్యేళ్లుగా ఇరాన్ పట్ల అమెరికా అసహనంగా ఉన్నది. ఇజ్రాయెల్ అమెరికాకు అనుబంధ సంస్థ. పశ్చిమాసియాలో దాని బ్రాంచి ఆఫీసు. సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్ తదితర చమురు ఎగుమతి దేశాలన్నీ అమెరికాకు మిత్రులుగానే మనుగడ సాగిస్తున్నాయి.ప్రస్తుత సంక్షోభంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ దేశాలన్నీ పాత్రధారులు. ఇరాన్‌తో సరిహద్దును పంచుకునే మరో ఇస్లామిక్ దేశం పాకిస్తాన్. అమెరికా తరఫున బ్రోకరేజి చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుంది. ఈ దేశానికి సౌదీ అరేబియాతో ఈమధ్యనే ఒక రక్షణ ఒడంబడిక కుదిరింది. దాని ప్రకారం రెండు దేశాల్లో ఏ దేశంపై దాడి జరిగినా తన మీద దాడి జరిగినట్టే రెండో దేశం భావించి స్పందించాలి. గల్ఫ్ దేశాల మీద ఇరాన్ ఎక్కుపెట్టిన దాడులు సౌదీ అరేబియాను కూడా వదల్లేదు. ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్, ఆరామ్కో చమురు శుద్ధి కేంద్రాన్ని టార్గెట్ చేసి డ్రోన్ దాడులు చేసింది. అయినా పాకిస్తాన్ కిమ్మనలేదు. దీంతో పాక్ ప్రతాపమేమిటో తేలి పోయింది.రెండు శిబిరాలుగానో, మూడు శిబిరాలుగానో ప్రపంచ దేశాలు చీలిపోయి ఆ శిబిరాల తరఫున వకాల్తా పుచ్చుకునే రోజులు ఎప్పుడో గతించాయి. ఇప్పుడు అంతర్జాతీయ సంబంధాల్లో జాతీయ ప్రయోజనాలే గీటురాయి. మన ప్రయో జనాలను కాపాడుకోవడానికి ఏకకాలంలో రెండు శత్రు దేశా లతో రెండు రకాల ఒడంబడికల్లో భాగస్వామిగా ఉండటం ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏమీ కాదు. గల్ఫ్ సంక్షోభంలో భాగస్తులుగా ఉన్న అమెరికా, ఇజ్రా యెల్, యూఏఈ దేశాలతోపాటు ఇండియా కూడా ఐ2యూ2 ఒప్పందంలో భాగస్వామి. ఇండియా మినహా మిగిలిన మూడు దేశాల మీద దాడులు చేస్తున్న ఇరాన్‌తో మనకు వేల సంవ త్సరాల సాంస్కృతిక బంధం ఉన్నది. భారత ప్రజల పట్ల స్నేహ పూర్వకంగా, భారత సంస్కృతిపై అభిమానపూర్వకంగా పర్షియన్లు ఉంటారనేది కూడా వాస్తవమే. ఇరాన్‌కు మిత్ర దేశంగా ఉండే రష్యాతో మనది కాలపరీక్షలో నిలబడి నిగ్గుదేలిన స్నేహం.ఈ పరిస్థితిలో మనం ఎవరి పక్షం వహించాలి? అమెరికా, గల్ఫ్ దేశాలు భారత్‌తో అతిపెద్ద వాణిజ్య భాగస్వాములు. కోటిమంది భారతీయులు గల్ఫ్‌లో, 50 లక్షలమంది అమెరికాలో జీవిస్తున్నారు. ఎన్నారైలు సాలీనా మాతృభూమికి పంపిస్తున్న పన్నెండు లక్షల కోట్ల రూపాయల్లో గల్ఫ్, అమెరికాలదే సింహ భాగం. ఉగ్రవాద ముప్పును ఎదుర్కొంటున్న భారత్‌కు ఈ విషయంలో నమ్మకమైన మిత్రదేశం ఇజ్రాయెల్. రక్షణ, సాంకే తిక, వ్యవసాయ రంగాల్లో మనకు సహకరిస్తున్నది. కనుక భారత్ ఎవర్నీ దూరం చేసుకోలేదు. ఆచితూచి వ్యవహరించడంతోపాటు ఉద్రిక్తతల ఉపశమనానికి శక్తి మేరకు ప్రయత్నించడమే భారత్ ముందున్న మార్గం. మోదీ ప్రభుత్వం ఇదే దిశలో పయనిస్తున్నది. కనుకనే ఇప్పటిదాకా చమురు సంక్షోభాన్ని తట్టుకొని నిలబడగలిగింది.కాకపోతే తన స్థాయికి తగ్గట్టుగా కొన్ని విషయల్లోనైనా గొంతు విప్పాల్సిందనే అభిప్రాయం కూడా బలపడుతున్నది. అప్పుడే ప్రపంచ వేదికపై మనం నాయకత్వ స్థానానికి ఎదిగే అవకాశం ఉంటుంది. ఎటువంటి కవ్వింపు లేకుండా అమెరికా – ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ మీద దాడి చేసినప్పుడు సూత్ర ప్రాయంగానైనా భారత్ ఖండించి ఉండవలసింది. దాడుల్లో చనిపోయిన ఖమేనీకి సంతాపం ప్రకటించడంలో మీనమేషాలు లెక్కించకుండా ఉండవలసింది. ఇరాన్ పాఠశాల మీద దాడి చేసి 165 మంది విద్యార్థుల చావుకు కారణమైన అమెరికా చర్యను ఖండించి ఉండవలసింది. భారత్ ఆహ్వానం మేరకు వైజాగ్‌కు వచ్చి నౌకా విన్యాసాల్లో పాల్గొని వెళ్తున్న ఇరాన్ నౌకపై దాడి చేసి 150 మందిని హతం చేసిన అమెరికా చర్యను ఖండించి ఉండ వలసింది. అంతర్జాతీయ సంబంధాల్లో జాతి ప్రయోజనాలకు పెద్దపీట వేయవలసిందే. దాంతోపాటు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే విధంగా కూడా వ్యవహరించాలి. అప్పుడే విశ్వగురు హోదాకు అర్హత పొందగలం.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
తరుగుతున్న రక్షణ నిల్వలు ప్రమాదంలో ఇజ్రాయెల్
-
ఇరాన్ మిస్సైల్ పై థాంక్యూ ఇండియా
-
ఇరాన్ అణుక్షేత్రాలపై దాడి
దుబాయ్: పశ్చిమాసియా సంక్షోభానికి తెర దించే చర్చల విషయంలో సందిగ్ధత, ప్రతిష్టంభన యథాతథంగా కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కాల్పుల విరమణ గడువు శుక్రవారంతో ముగిసింది. దాన్ని మరో 10 రోజుల పాటు పొడిగిస్తున్నట్టు ఆయన తాజాగా ప్రకటించారు. ఇరాన్ కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పడం విశేషం! ‘‘ఏప్రిల్ 6 నాటికి హార్మూజ్ జలసంధిని ఇరాన్ పూర్తిస్థాయిలో తెరవాల్సిందే. లేదంటే ఆ దేశ ఇంధన క్షేత్రాలన్నింటినీ సర్వనాశనం చేస్తా’’ అంటూ హెచ్చరించారు. మరోవైపు ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర దాడులు నిర్నిరోధంగా కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం కూడా ఇరుపక్షాలు ముమ్మరంగా దాడులు చేసుకున్నాయి.ఇరాన్‌లోని యజ్ద్ ప్రావిన్స్‌లో అర్డకాన్ యురేనియం ప్రాసెసింగ్ కేంద్రంపై ఇజ్రాయెల్ క్షిపణి దాడులకు దిగింది! సెంట్రల్ ఇరాన్‌లోని ఒక భార జల కేంద్రంపై కూడా దాడులు చేసింది. దాడులను మరింతగా విస్తరిస్తామని కూడా ప్రకటించింది. మరోవైపు 2,500 మంది మరైన్లు, 1,000 మంది పారా ట్రూపర్లతో కూడిన అమెరికా యుద్ధ నౌకలు గల్ఫ్‌కు చేరువవుతున్నాయి. ఇంకో 10 వేల మంది సైనికులను గల్ఫ్‌కు తరలించాలని ట్రంప్ నిర్ణయించినట్టు వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల నడుమ చర్చల ప్రక్రియను ఎలాగైనా ముందుకు తీసుకెళ్లేందుకు టర్కీ, పాకిస్తాన్‌తో చర్చించినట్టు ఈజిప్టు పేర్కొంది. గల్ఫ్‌లో దాడుల మోత ఇరాన్‌లోని ఆయుధోత్పత్తి, నిల్వ కేంద్రాలే లక్ష్యాలుగా శుక్రవారం ఇజ్రాయెల్ భారీ దాడులకు దిగింది. రాజధాని టెహ్రాన్‌లోని పలు ప్రాంతాలు బాంబులతో దద్దరిల్లిపోయాయి. పశ్చిమ ఇరాన్‌లోని క్షిపణి ఉత్పత్తి కేంద్రాలతో పాటు మరిన్ని ప్రాంతాలకు దాడులను విస్తారిస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ హెచ్చరించారు. లెబనాన్‌పై కూడా ఇజ్రాయెల్ పెద్ద పెట్టున దాడులు చేసింది. శుక్రవారం వేలాది మంది సైనికులను ఆ దేశంలోకి తరలించింది. లితానీ నదికి దక్షిణాన ఉన్న భూభాగం మొత్తాన్నీ తమ అధీనంలోకి తీసుకుంటాని ప్రకటించింది! బీరూట్‌లో పలు ప్రాంతాల్లో భీకర దాడులు జరిగాయి. ఎటు చూసినా అగ్నికీలలు, పొగ కన్పించాయి. దాడులకు ఇద్దరు పౌరులు బలైనట్టు ఆరోగ్య శాఖ పేర్కొంది.ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ నగరాలు సైరన్ మోతలతో ప్రతిధ్వనించాయి. జనం భారీ సంఖ్యలో బంకర్లకేసి పరుగులు తీస్తూ కన్పించారు. గల్ఫ్‌లోని ఇజ్రాయెల్, అమెరికా సైనిక స్థావరాలు, లక్ష్యాలపైనా ఇరాన్ భారీ ఎత్తున దాడులు చేసింది. అష్దోద్లోని చమురు నిల్వ కేంద్రాలు, మొదీన్లోని సైనిక స్థావరాలతో పాటు అమెరికాకు చెందిన అల్ దాఫ్రా, అల్ ఉదెయ్రీ, అలీ అల్ సలేం ఎయిర్ బేస్, షేక్ ఇసా స్థావరాలపై క్షిపణుల వర్షం కురిపించింది. కువైట్ సిటీలోని షువైక్ రేవు, ఉత్తరాన ముబారక్ అల్ కబీర్ రేవుపై దాడి జరిగినట్టు కువైట్ తెలిపింది. అల్ కబీర్ చైనా సహకారంతో నిర్మిస్తున్న రేవు కావడం విశేషం. మరోవైపు ఇరాన్‌కు మిత్ర దేశం రష్యా 313 టన్నుల మేరకు ఔషధ నిల్వలను పంపింది.హార్మూజ్ వద్ద ‘అధికారిక’ంగా టోల్!త్వరలో చట్టం చేసే యోచనలో ఇరాన్హార్మూజ్ గుండా వెళ్లే నౌకల నుంచి సుంకం వసూలును ఇరాన్ అధికారికంగా మార్చే పనుల్లో పడింది. ఈ మేరకు త్వరలో పార్లమెంటులో చట్టం తేనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై ఐరాసకు కూడా ఇప్పటికే వర్తమానం ఇచ్చినట్టు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే రెండు నౌకలు ఇరాన్‌కు చైనా కరెన్సీలో సుంకం చెల్లించి హార్మూజ్‌ను దాటినట్టు లాయిడ్స్ లిస్ట్ ఇంటలిజెన్స్ సంస్థ పేర్కొంది. ఇది ఆర్థిక ఉగ్రవాదమే తప్ప మరోటి కాదంటూ పలు దేశాలు మండిపడుతున్నాయి. క్షిపణులపై ‘థాంక్యూ ఇండియా’ఇజ్రాయెల్‌పై ప్రయోగించిన ఇరాన్ ఇరాన్ తన క్షిపణులపై ‘థాంక్యూ పీపుల్ ఆఫ్ ఇండియా’అంటూ రాసి మరీ ఇజ్రాయెల్‌పైకి ప్రయోగిస్తోంది! ఇందుకు సంబంధించిన విజువల్స్‌ను ఇరాన్ మీడియాతో పాటు ముంబైలోని ఆ దేశ కాన్సులేట్ జనరల్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. స్పెయిన్, జర్మనీ, పాకిస్తాన్లకు కూడా ఇలాగే ఇరాన్ ధన్యవాదాలు తెలపడం విశేషం! తమ అతి కొద్ది మిత్ర దేశాల్లో భారత్ ఒకటని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ పేర్కొనడం తెలిసిందే. ఇరాన్‌కు దన్నుగా జమ్మూ కశ్మీర్ వాసులు నగదు మొదలుకుని నగల దాకా పలురకాలైన మానవతా సాయాన్ని విరాళాల రూపంలో సేకరించి పంపడం తెలిసిందే.ఎఫ్‌బీఐ చీఫ్ ఈ మెయిల్ హ్యాకింగ్తమ పనేనన్న ఇరాన్ అనుకూల గ్రూపు వాషింగ్టన్: ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ వ్యక్తిగత ఈ మెయిల్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. ఇది తమ పనేనని హందాలా అనే ఇరాన్ అనుకూల హ్యాకింగ్ గ్రూప్ పేర్కొంది. అందులోని రెజ్యుమేతో పాటు పలు వ్యక్తిగత డాక్యుమెంట్లతో పాటు కాష్ పటేల్ ఫొటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే అవన్నీ కనీసం పదేళ్ల నాటివిగా కనిపిస్తున్నాయి. హ్యాకింగ్‌ను ఎఫ్‌బీఐ ఉన్నతాధికారి ఒకరు ధ్రువీకరించారు. -
400 మంది హిజ్బుల్లా ఫైటర్స్ మృతి
ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులలో ఇప్పటివరకు 400 మందికి పైగా హిజ్బుల్లా ఫైటర్లు మృతి చెందినట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. దానితో పాటు లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులైనట్లు తెలిపింది.ఇజ్రాయెల్ ఏకకాలంలో ఇరాన్‌పై దాడులు చేస్తూనే ఇటు లెబనాన్‌పై విరుచుకపడుతుంది. ఆ దేశంలోని నేరుగా సాయుధబలగాల్ని రంగంలోకి దింపింది. ఈ నేఫథ్యంలోనే ఆ ప్రాంతంలో భారీగా దాడులు చేస్తోంది. ఈ అటాక్స్ వల్ల ఇప్పటికే లక్షలో సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. కాగా 400కు పైగా హిజ్బుల్లా తీవ్రవాదులు మృతిచెందినట్లు నివేదికలు రాయిటర్స్ కథనం పేర్కొంది. ఈ వివరాల్ని హిజ్బుల్లా సమూహానికి చెందిన వ్యక్తులు అందజేసినట్లు తెలిపింది.అయితే హిజ్బూల్లా మాత్రం ఇప్పటివరకూ ఎటువంటి అధికారిక వివరాలను ప్రచురించలేదు. కొంతమంది ప్రముఖమైన వ్యక్తులు మరణించిన సందర్భంలో వారి వివరాలను వెల్లడించింది. కాగా ఇజ్రాయెల్ మాత్రం ఈ దాడులలో కనీసం 700 మంది హిజ్బుల్లా ఫైటర్లను మరణించినట్లు పేర్కొంది. ఇందులో వందలాది మంది ఆ సమూహానికి చెందిన ఎలైట్ 'రాద్వాన్ ఫోర్స్' సభ్యులు ఉన్నారని తెలిపింది.లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం ఇజ్రాయెల్ దాడులు మరియు భూతల కార్యకలాపాల వల్ల లెబనాన్‌లో ఇప్పటివరకూ 1,142 మంది మరణించారని, వీరిలో 122 మంది పిల్లలు, 83 మంది మహిళలు మరియు 42 మంది వైద్య సిబ్బంది ఉన్నారని పేర్కొంది. కాగా 2023-2024లో ఇజ్రాయెల్‌తో జరిగిన యుద్ధంలో దాదాపు 5 వేల వరకూ హిజ్బుల్లా ఫైటర్స్ మృతిచెందినట్లు లెబనాన్ ప్రకటించింది. -
పట్టు బిగించిన ఇరాన్.. ఇక భీకర యుద్ధమే
-
ఇరాన్ కు ట్రంప్ ఆఫర్
-
ఇరాన్ సుప్రీం లీడర్‌గా డొనాల్డ్ ట్రంప్?!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ నాయకత్వం తనను ఇస్లామిక్ రిపబ్లిక్కి సుప్రీం లీడర్‌గా ప్రతిపాదించిందని, కానీ తాను తిరస్కరించానని ఆయన వెల్లడించారు. తాజాగా ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల్లో కొత్త చర్చలకు దారితీశాయి.వాషింగ్టన్లో జరిగిన రిపబ్లికన్ ఫండ్రైజర్ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఇరాన్ నాయకత్వం నన్ను సుప్రీం లీడర్‌గా చూడాలని అనుకుంది. కానీ నేను వద్దన్నాను. ఆ పదవి ఎవరూ కోరుకోరు’ అని అన్నారు. ఈ సందర్భంగా ఇరాన్‌పై అమెరికా చర్యలను ‘మిలిటరీ డెసిమేషన్’గా వర్ణించారు. అంటే సింహ భాగం ఇరాన్ సైన్యాన్ని నాశనం చేశాం. తద్వారా మేం ము సాధించిన విజయాన్ని ఎవరూ చూడలేదు. ఇరాన్ చర్చలకు సిద్ధంగా ఉంది, కానీ తమ ప్రజల భయంతో, అలాగే అమెరికా ప్రతీకార దాడుల భయంతో బహిరంగంగా చెప్పలేకపోతున్నారు’ అని ఎద్దేవా చేశారు. ఖండించిన ఇరాన్ ట్రంప్ వ్యాఖ్యల్ని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. యుద్ధం ఆపే ప్రయత్నాలు ఇరు దేశాల మధ్య జరగడం లేదని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో ట్రంప్ వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఇలాంటి విరుద్ధ ప్రకటనలు అంతర్జాతీయ వర్గాల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అమెరికా-ఇరాన్ సంబంధాలపై కొత్త ప్రశ్నలు లేవనెత్తాయి. ఒకవైపు ఆయన ‘ఇరాన్ చర్చలకు సిద్ధంగా ఉంది’ అని చెబుతుండగా, మరోవైపు ఇరాన్ ‘ఎలాంటి చర్చలు లేవు’ అని ఖండిస్తోంది. ఈ విరుద్ధ పరిస్థితులు యుద్ధం ముగిసే అవకాశాలను మరింత క్లిష్టం చేస్తున్నాయి.అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త క్షిపణి దాడులతో ఇరాన్ తీవ్రమైన నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గత నెలలో జరిగిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో ఆయన కుమారుడు మోజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారు.అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రకారం.. శకలాలు మోజ్తబా కాలును ఛిద్రం చేయడంతో వైద్యులు శస్త్రచికిత్స ద్వారా కాలును తొలగించి చికిత్స కొనసాగిస్తున్నారని నివేదికలు వెల్లడించాయి. ఖమేనీ మరణంతో మోజ్తబా ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అయినప్పటికీ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆయన ప్రజల్లో కనిపించకపోవడం ఇరాన్లో నాయకత్వ సంక్షోభాన్ని మరింతగా పెంచుతోంది. -
యుద్ధం మరో మలుపు.. రష్యాకు వెళ్తున్న నౌకను పేల్చేసిన ఇజ్రాయెల్..
-
ఇరాన్ యుద్ధంలో ఇండియా వైఖరి
యూఎస్, ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధంలో భారత వైఖరిపై దేశంలో అంత ర్గతంగా చర్చ జరుగుతున్నది. భారత్ వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నట్లగా కన్పడుతున్నది. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన పూర్తవగానే యుద్ధ భేరీలు మోగటం, భారత్‌కు సమీపంలోని హిందూ మహాసముద్రపు అంతర్జాతీయ జలాలలో భారత్ ఆతిథ్యం తరువాత తిరిగి వెళ్తున్న ఇరాన్ యుద్ధ నౌకపై అమె రికా జలాంతర్గామి దాడి, యుద్ధం మొదటి రోజే అలీ ఖమేని హత్య భారత్‌ను ఇరకాటంలో పెట్టాయి. ఇరాన్ అధినేత మృతికి సంతాపం తెలియజేయటంలో ఆలస్యాన్ని కూడా విమర్శకులు వేలెత్తి చూపుతున్నారు. ఒక రకంగా ఇజ్రాయెల్–యూఎస్ శిబిరంలో భారత్ చేరినట్లేనని కూడా కొంతమంది వాదిస్తున్నారు.బహుళ అలీన విధానంప్రస్తుత ఇరాన్ యుద్ధంలో భారత్ ప్రతిస్పందనను భారత స్థూల విదేశాంగ నీతిలో భాగంగా చూడాల్సి ఉంటుంది. మన ప్రతి స్పందన ప్రధానంగా అయిదు అంశాలపై ఆధారపడి ఉన్నది: 1. దేశ ప్రయోజనాలు 2. ట్రంప్ ఫ్యాక్టర్ 3. ఇరాన్, యూఎస్ఏ, ఇజ్రా యెల్, రష్యా, చైనా, జీసీసీ, ఈయూ దేశాలతో భారత్ సంబంధాలు 4. ప్రాంతీయ, ప్రపంచ జియో పాలిటిక్స్‌లో భారత్ స్థానం 5. భారత్ బలాలు – బలహీనతలు.21వ శతాబ్దంలో ప్రపంచ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. సోవియట్ విచ్ఛిన్నం తరువాత యూఎస్ఏ నాయ కత్వంలో ఏక ధ్రువ ప్రపంచం ఏర్పడింది. యూఎస్ఏ, యూరోపి యన్ దేశాలతో కూడిన నాటో కూటమి తూర్పు ఐరోపా, బాల్టిక్ ప్రాంతంలోనికి విస్తరించింది. సోవియట్ నుండి వేరుపడి స్వాతంత్య్రం పొందిన దేశాల లోనికి నాటో విస్తరించింది. పుతిన్ నాయకత్వంలో బలోపేతమైన రష్యా క్రమంగా నాటో విస్తరణను అడ్డు కోవటం మొదలుపెట్టింది. నాలుగేళ్లుగా జరుగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ఇదే మూల కారణం. రష్యాతో పాటుగా చైనా, బ్రెజిల్, భారత్, దక్షిణాఫ్రికా వంటి దేశాలు బ్రిక్స్ వంటి సంస్థలను ఏర్పాటు చేసి యూఎస్ఏ (డాలర్, సాయుధ) గుత్తాధిపత్యాన్ని సవాలు చేయటం ప్రారంభమయింది. ఈ నేపథ్యంలో విలువలు, సిద్ధాంతాలు, అలీన విధానం ఆధారంగా రూపుదిద్దుకున్న మన విదే శాంగ విధానానికి కాయకల్ప చికిత్స అనివార్యమయింది. దేశ ప్రయోజనాలు మాత్రమే కేంద్రకంగా వ్యూహాత్మక స్వాతంత్య్రాన్ని కాపాడుకుంటూ, బహుళ అలీన విధానం దిశగా మన విదేశాంగ విధానం పయనిస్తున్నది. ఎందుకు దగ్గర? ఎందుకు దూరం?ఇరాన్ యుద్ధంలో భారత్ వైఖరిని గతిశీలక అంతర్జాతీయ, ప్రాంతీయ రాజకీయ సమీకరణాల కోణం నుండి పరిశీలించాల్సి ఉంటుంది. ఇరాన్‌తో భారతదేశానికి చారిత్రకంగా సత్సంబంధా లున్నప్పటికీ, ఇరాన్ మత ఛాందస వ్యవస్థల చెప్పుచేతల్లో ఉన్నదన్న విషయాన్నీ, కశ్మీర్ విషయాల్లో ఎల్లప్పుడూ భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించిందన్న విషయాన్నీ పరిగణించాల్సి ఉంటుంది. పాల స్తీనాను స్వతంత్ర దేశంగా ఏర్పరచాలనే ప్రతిపాదనకు మద్దతిస్తున్న ప్పటికీ, హమాస్, హెజ్బొల్లా, హౌతీ వంటి సంస్థలకు భారత్ వత్తాసు పలకలేదు. వీటిద్వారా పరోక్షంగా తీవ్రవాదాన్ని ప్రోత్సహి స్తున్న ఇరాన్ విధానాన్ని సమర్థించటం ఆత్మహత్యాసదృశం.భారతదేశ అభివృద్ధికి, సమగ్రతకు, ఉన్నతికి రెండు ప్రధాన అవరోధాలున్నాయి. అవి: 1. తీవ్రవాద సమస్య 2. ఇంధన వనరుల కొరత. మన దౌత్య నీతి ఎల్లప్పుడూ ఈ రెండు అంశాలను దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. తీవ్రవాదం విషయంలో రాజీకి ‘ఆపరేషన్ సిందూర్’ స్వస్తి పలికింది. ‘ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన మిత్రుడు’. ప్రస్తుత అనిశ్చిత జియో పొలిటికల్ వాతావరణంలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు లేరు. ‘శత్రువుకి శత్రువు మిత్రుడు, మిత్రుడి శత్రువు శత్రువు’ అనే సిద్ధాంతానికి కాలం చెల్లింది.తీవ్రవాదాన్ని ఎదుర్కోవటంలో భారత్‌కు ఇజ్రాయెల్ మొదటి నుండీ వెన్నంటి ఉంటున్నది. తీవ్రవాద సంస్థల కదలికలు, ఆర్థిక కార్యకలాపాల నిఘా సమాచారాన్ని పంచుకోవడంలోనూ, సాంకే తిక పరిజ్ఞానాన్ని అందజేయటంలోనూ ఇజ్రాయెల్ భారత్‌కు పూర్తి సహాయ సహకారాలను అందజేస్తున్నది. రష్యా కూడా భారత్‌కు మొదటినుండీ అంతర్జాతీయ వేదికలపైన మద్దతు ద్వారానూ, ఆయుధాలు, ఆయుధ సాంకేతిక పరిజ్ఞానం అందించటం ద్వారానూ మద్దతు నిచ్చింది. అందుకే రష్యా, ఇజ్రాయెల్‌కు సంబంధించినంత వరకు భారత్ ఆచితూచి వ్యవహరిస్తున్నది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాను ఖండించలేదు. ఇరాన్ యుద్ధంలో ఇజ్రా యెల్‌ను ఖండించలేదు. ఈ రెండు యుద్ధాలతో భారత్‌కు సంబంధం లేదు. ఈ రెండు యుద్ధాలు ప్రపంచ జియో పొలిటికల్ చదరంగంలో భాగం. నాటో విస్తరణను అడ్డుకోవటాన్ని ప్రతిఘటిస్తూ రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసింది. మధ్యప్రాచ్యంలో ప్రాంతీయ శక్తిగా మత ఛాందస ఇరాన్ ఎదగకూడదని అమెరికా–ఇజ్రాయెల్ దాడి చేశాయి. ఈ వ్యూహాత్మక యుద్ధాలలో భారత్ తలదూర్చి తన జియో పొలిటికల్ లక్ష్యాలను ప్రమాదంలో పడేయకూడదు.కిం కర్తవ్యం?జియో పొలిటికల్ కోణంలో పరిశీలిస్తే భారత్ ముందు లక్ష్యాలు: 1. దక్షిణాసియాలో బలమైన ప్రాంతీయ శక్తిగా సుస్థిరతను సాధించటం. 2. పాకిస్తాన్–చైనా సవాళ్లను ఎదుర్కోవటం 3. ప్రపంచ రాజకీయ ఆర్థిక వ్యవస్థలపై యూఎస్ఏ–ఐరోపాల గుత్తాధిపత్యాన్ని తగ్గించి ఆసియా–ఆఫ్రికా–ద.అమెరికాలు పట్టు సాధించటం. 4. శక్తి భద్రతను సాధించటం.ఇరాన్ యుద్ధంలో ఏ మాత్రం తొందరపడినా సౌదీ, యూఏఈ వంటి దేశాలతో మనకున్న సంబంధాలపై ప్రభావం పడుతుంది. రష్యా, చైనా వంటి దేశాలు కూడా ప్రత్యేకంగా జోక్యం చేసుకోవటం లేదు. భారత్ ముందున్న తక్షణ సమస్య హార్మూజ్ జలసంధి నుండి మన చమురు–సహజ వాయువు, ఎల్పీజీ ట్యాంకర్ల రవాణా సాఫీగా జరిగేట్లుగా చూడటం. ఇరాన్‌తో మనకున్న సత్సంబంధా లను వినియోగించుకొని కొన్ని ట్యాంకర్లను క్షేమంగా రప్పించుకో వటం చిన్న విషయం కాదు.‘అమెరికాకు మిత్రుడుగా ఉండటం ప్రమాదకరం. కానీ అమె రికాకు శత్రువుగా మారటం మరణాన్ని కోరుకోవటమే’– అమెరి కాతో వ్యవహారంలో ప్రస్తుత పరిస్థితి. అమెరికా ప్రవర్తనతో పాటుగా ట్రంప్ వ్యక్తిగత వ్యవహార శైలిని కూడా మనం పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. తప్పనిసరి పరిస్థితులలో తప్ప ప్రాంతీయ యుద్ధాలలో భారత్ వేలు పెట్టాల్సిన అవసరం లేదు. విలువలు, సిద్ధాంతాల భేషజాల సంకెళ్లకు బందీ కాకూడదు. పాకిస్తాన్, టర్కీ, ఈజిప్టు వంటి ఇస్లామిక్ దేశాలు కూడా మత ప్రాతిపదికన ఇరాన్‌కు మద్దతు తెలపలేదు. వ్యూహాత్మకంగా మసలుతున్నాయి.రష్యా, చైనా వంటి అంతర్జాతీయ శక్తులు అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధ వ్యూహాలను, సాయుధ సంపత్తి సామర్థ్యాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇండో పసిఫిక్‌లో చైనా–తైవాన్ విషయంలో యూఎస్ఏ, పాశ్చాత్య దేశాల శక్తి ఏ మేరకు ఉండవచ్చనే విషయంపై అంచనాలు వేస్తున్నారు. భారతదేశం కూడా భవిష్యత్తులో పాకిస్తాన్–చైనా సమష్టిగా దాడి చేసినట్లయితే ఏ విధంగా ఎదుర్కో వాలో ఇరాన్ నుండి పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది.యుద్ధానంతరం అనేక పరిణామాలు చోటు చేసుకోవచ్చును. అమెరికా అంతర్జాతీయ స్థాయిలో బలహీనపడవచ్చు. నాటో కూటమి మనుగడ ప్రశ్నార్థకమవవచ్చు. రష్యా మరింత బలపడే అవకాశాలున్నాయి. సౌదీ అరేబియా, యూఏఈ వంటి గల్ఫ్ దేశాలు అమెరికాతో తమ సంబంధాలను పునఃసమీక్షించుకునే అవకాశా లున్నాయి. ‘కాగల కార్యం గంధర్వులు తీర్చారన్నట్లు’, నెతన్యాహు – ట్రంప్ దుందుడుకు నిర్ణయం వలన బహుళ ధ్రువ ప్రపంచం మరింత త్వరలోనే అవతరించవచ్చును.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల బోధకులు -
అమెరికా ఫైటర్ జెట్‌ను కూల్చేసాం.. ఇరాన్ కీలక ప్రకటన
ప్రస్తుతం ఇరాన్- అమెరికా మధ్య చర్చల ప్రస్థావన నడుస్తోన్న వేళ ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. అమెరికాకు చెందిన F-18 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు తెలిపింది. దానికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.పశ్చిమాసియా యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గి చర్చల జపం ఎత్తినా ఇరాన్ మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇది వరకే ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి తమ దేశంపై చేసిన దురాక్రమణకు ప్రశ్చాతాప పడే వరకూ దాడులు ఉంటాయని ప్రకటించారు. హర్మూజ్ జలసంధిపై తాము తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయ చట్టాలకు లోబడే ఉందని స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలోనే ఇరాన్ మరోసారి అమెరికాకు చెందిన F-18 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు ప్రకటించింది. ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్స్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. "యుఎస్‌కు చెందిన ఫైటర్ జెట్‌ను కూల్చేసాం. విజయవంతంగా టార్గెట్‌ని పూర్తి చేసాం". అని దానికి సంబంధించిన వీడియోని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అయితే దాడి ఎక్కడ చేశారు. ఆ ఫైలట్ పరిస్థితి ఏంటి అనే వివరాలు వెల్లడించలేదు. కాగా దీనిపై అమెరికా ఇంకా స్పందించలేదు.అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్చల రాగం పాడుతున్నా ఇరాన్ శాంతించడం లేదు. గల్ఫ్ దేశాలపై దాడులు కొనసాగిస్తోంది. యుద్ధంలో నష్టానికి పరిహారం చెల్లించి తమ షరతులు అంగీకరిస్తేనే కాల్పుల విరమణ ఉంటుందని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.Iran's Islamic Revolution Guards Corps (IRGC) announces that it has successfully targeted an American F-18 fighter jet.Follow Press TV on Telegram: https://t.co/LWoNSpkc2J pic.twitter.com/E9nRJgnla3— Press TV 🔻 (@PressTV) March 25, 2026 -
ఇరాన్‌పై అమెరికా యుద్ధం.. బంగారం కొనుగోలు చేయొచ్చా?
వాష్టింగన్: ఇరాన్‌పై యుద్ధం రోజుకో మలుపు తిరుగుతోంది. అయితే, ఈ ఒడిదుడుకుల్లో బంగారం కొనుగోలు చేయాలా? వద్దా? అనే ప్రశ్నల పరంపరం కొనసాగుతోంది. ఈ క్రమంలో బంగారం కొనుగోళ్లు అమ్మకాలపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వరుస ప్రకటనలతో బంగారం పెట్టుబడి దారుల్లో అనిశ్చితి నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై దాడుల్ని ముగించేలా ట్రంప్ సంకేతాలు పంపించారు. దీంతో బంగారం ధర ఒక్కసారిగా 4శాతం పెరిగింది. కానీ దీని వెనుక ఉన్న అస్థిరత పెట్టుబడిదారులను గందరగోళంలోకి నెడుతోంది. అమెరికా అధ్యక్షుడు హర్మూజ్ జలసంధి అంశంలో ఇరాన్ తమకు ఓ బహుమతి ఇచ్చిందని చెప్పారు. ఈ ప్రకటనతో ఇరాన్‌పై యుద్ధం అంశంలో శాంతి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని మార్కెట్లో ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఫలితంగా బంగారం ధర ఔన్స్‌కి 4,550 డాలర్లను దాటిందిదీంతో తొమ్మిది రోజుల వరుస నష్టాల తర్వాత ఒక్కసారిగా బంగారం ధరలు పెరగడం పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఏడాది జనవరిలో గరిష్ట స్థాయి ఔన్స్ బంగారం 5,626 డాలర్ల ధర దాదాపు 20శాతానికి పడిపోయింది. ఈ క్షీణత కారణంగా బంగారంలో పెట్టుబడులు సురక్షితమేనా అన్న ప్రశ్నను ఎదుర్కొంటున్నారుబెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న మార్కెట్ నిపుణులు నవీన్ పీఎంటీ బంగారం పెరుగుదలని ‘హెడ్లైన్ రిస్క్ వోలాటిలిటీ’గా అభివర్ణించారు. ‘మార్కెట్ యుద్ధ భయాల నుంచి శాంతి వైపు అడుగులు పడేలా చేస్తోంది. ఇది నిజమైన నమ్మకం కాదు ఒక రీలీఫ్ ర్యాలీ మాత్రమే’ అని వ్యాఖ్యానించారు. ఆగ్మాంట్ రీసెర్చ్ హెడ్ డాక్టర్ రెనిషా భిన్న అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. భౌగోళిక ఉద్రిక్తతలు సాధారణంగా బంగారాన్ని పెంచుతాయి. కానీ ఈసారి లిక్విడిటీ ఒత్తిడి కారణంగా పెట్టుబడిదారులు బంగారం అమ్మి నగదు సమకూర్చుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం ప్రభావంచమరు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతోంది. దీని కారణంగా వడ్డీ రేట్లు ఎక్కువ కాలం ఉన్న స్థాయిలోనే కొనసాగుతాయని అంచనా. ఇది బంగారంపై ఒత్తిడి పెంచుతోంది.కేంద్ర బ్యాంకుల ధోరణిగత రెండు సంవత్సరాల్లో కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేశాయి. ఇప్పుడు ధరలు ఎక్కువగా ఉండటంతో కొంత విరామం తీసుకుంటున్నాయి. అయినప్పటికీ, దీర్ఘకాలంలో డాలర్‌పై ఆధార పడటాన్ని తగ్గించి బంగారం కొనుగోళ్లు కొనసాగిస్తాయని నిపుణులు చెబుతున్నారు.ప్రస్తుత అస్థిరత బంగారం స్వభావాన్ని మార్చడం లేదు. తాత్కాలికంగా లిక్విడిటీ ఒత్తిడి కారణంగా బంగారం రిస్క్ ఆస్తిలా ప్రవర్తించినా, పరిస్థితులు స్థిరపడిన తర్వాత ఇది మళ్లీ ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ తగ్గుదల, వ్యవస్థాపక ప్రమాదాలకు వ్యతిరేకంగా రక్షణగా నిలుస్తుంది. ట్రంప్ వ్యాఖ్యలతో బంగారం ధరలు తాత్కాలికంగా పెరిగినా, దీర్ఘకాలంలో ఇది పెట్టుబడిదారులకు రక్షణా ఆస్తిగానే కొనసాగుతుంది. కానీ తక్షణ లిక్విడిటీ ఒత్తిడి, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు ధరలలో మార్పులు కొనసాగుతాయి. -
పాకిస్థాన్‌కు ఇరాన్ బిగ్ షాక్!
టెహ్రాన్: పాకిస్థాన్‌కు ఇరాన్ షాకిచ్చింది. హర్మూజ్ జలసంధిలో పాక్ నౌక్‌ను ఇరాన్ అడ్డుకుంది. అమెరికా-ఇరాన్ మధ్య తామే మధ్యవర్తిత్వం వహిస్తున్నామంటూ పాక్ గొప్పలు చెబుతోంది. ఇరాన్ తాము చెప్పినట్లే వింటోంది అంటూ బీరాలు పలికింది. ఈ క్రమంలో హర్మూజ్ జలసంధిలో పాక్ నౌకలకు అనుమతి లేదంటూ ఇరాన్ వాటిని అడ్డుకుంది. ఇరాన్‌లోని హోర్ముజ్ జలసంధి వద్ద అనుమతి లేకుండా ప్రయాణించడానికి ప్రయత్నించిన కంటైనర్ నౌక సీలెన్ ను ఇరాన్ నావికాదళం వెనక్కి తిప్పింది. ఈ నౌక పాకిస్తాన్‌లోని కరాచీకి వెళ్తుండగా, అవసరమైన అనుమతులు లేకపోవడంతో ఇరాన్ అధికారుల చర్యలు అంతర్జాతీయ వాణిజ్యంపై దృష్టిని ఆకర్షించాయి.ఇరాన్‌లోని కాబూల్ రాయబార కార్యాలయం ప్రకటన ప్రకారం.. సీలెన్ అనే కంటైనర్ నౌకను ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నేవీ వెనక్కి తిప్పింది. నౌక చట్టపరమైన ప్రోటోకాళ్లను పాటించకపోవడం, హర్మూజ్ జలసంధి గుండా వెళ్లేందుకు అవసరమైన అనుమతి లేకపోవడమే ఇందుకు కారణమని స్పష్టం చేసింది. ‘ఈ జలసంధి గుండా ఏ నౌక అయినా ప్రయాణించాలంటే ఇరాన్ సముద్రాధికారులతో పూర్తి సమన్వయం అవసరం’ఉందని పునరుద్ఘాటించింది. ఈ సంఘటనతో పాకిస్తాన్‌కు వెళ్తున్న వాణిజ్య నౌకలపై ప్రభావం పడే అవకాశం ఉంది. హర్మూజ్ జలసంధి మూసివేత లేదా నియంత్రణ కఠినతరం అయితే, చమురు ధరలు, వాణిజ్య సరఫరా గొలుసుపై గణనీయమైన ప్రభావం చూపవచ్చు. ఇరాన్ తీసుకున్న ఈ చర్య, ప్రాంతీయ భద్రతా పరిస్థితులు ఎంత సున్నితంగా ఉన్నాయో మరోసారి గుర్తు చేసింది.ఇరాన్ తాజా నిర్ణయం ద్వారా రెండు ముఖ్యమైన సందేశాలు ఇచ్చింది. సముద్ర మార్గాలపై తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటుందనే సంకేతం ఇచ్చింది. దీంతో పాటు ప్రాంతీయ ఘర్షణల మధ్య తన నియంత్రణను మరింత బలపరుస్తుందనే ఉద్దేశాన్ని వ్యక్తం చేసింది. తద్వారా పాకిస్తాన్, ఇతర వాణిజ్య భాగస్వాములు ఈ సంఘటనను గమనించి, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఇరాన్‌తో సమన్వయం పెంచుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ఇరాన్ పతనమే లక్ష్యంగా ? సౌదీ బిగ్ ప్లాన్
-
సిద్ధంగా ఉండాల్సింది ప్రజలా? ప్రభుత్వమా?
సాక్షి, చెన్నై: పశ్చిమ ఆసియాలో (ఇరాన్–ఇజ్రాయిల్ –అమెరికా మధ్య) నెలకొన్న ఉద్రిక్తతలు, యుద్ధ ప్రభావాలను ఎదుర్కోవడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై సీఎం ఎం.కె. స్టాలిన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘ప్రజలను సిద్ధంగా ఉండమని చెప్పేముందు.. వారిని రక్షించడానికి ముందుగా తమరు సిద్ధంగా ఉన్నారా? ’అని పీఎంను ప్రశ్నించారు. సిద్ధమవ్వడం అంటే బాధ్యతను విస్మరించడమేనా? తన ఎక్స్పేజీ వేదికగా కేంద్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు: “సన్నద్ధతను ప్రజలకు వదిలివేయలేమని, మనం దేనికి సిద్ధపడాలి? నాయకత్వం వహించడానికా లేక నాయకత్వం లేని లోటును భరించడానికా? అని ప్రశ్నించారు. గతంలో కరోనా సమయంలో కూడా ప్రజలనే సిద్ధంగా ఉండమన్నారని, ఇప్పుడు యుద్ధ ప్రభావాల విషయంలో కూడా అదే మాట అనడం బాధ్యతారాహిత్యమని ఆయన విమర్శించారు. కేంద్రం నిర్ణయాల కోసం వేచి చూడకుండా, తమిళనాడు ప్రభుత్వం మార్చి 14నే పలు కీలక నిర్ణయాలు తీసుకుందని స్టాలిన్ గుర్తు చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లు గ్యాస్ సిలిండర్లకు బదులుగా ఎలక్ట్రిక్ స్టవ్‌లను వాడితే, అదనపు విద్యుత్ వినియోగానికి సబ్సిడీ ప్రకటించామని గుర్తు చేశారు. చిన్న తరహా పరిశ్రమలు ఎలక్ట్రిక్ హీటర్లు, స్టవ్‌లు కొనుగోలు చేయడానికి వడ్డీతో కూడిన సబ్సిడీ రుణాలు అందిస్తున్నామన్నారు. ప్రత్యామ్నాయ ఇంధనాలను వాడే ఫ్యాక్టరీలకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుండి కొత్తగా అనుమతులు అవసరం లేదని మినహాయింపు ఇచ్చామన్నారు. కూరగాయలు, పండ్లు పండించే రైతుల జీవనోపాధి దెబ్బతినకుండా చర్యలు తీసుకున్నామన్నారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన సుమారు 19 లక్షల మంది తమిళులను సురక్షితంగా వెనక్కి తీసుకురావాలని, గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని, విద్యుత్ ప్లాంట్లకు ఇంధన సరఫరాపై ఉన్న ఆంక్షలను తొలగించాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని డిమాండ్ చేశారు. -
యుద్ధం తెచ్చిన కష్టాలు.. హైదరాబాద్ లో నో పెట్రోల్ ?
-
ఫలించని ట్రంప్ పిలుపు.. ఆగని ఇజ్రాయెల్,ఇరాన్ యుద్ధం
-
సమర్థంగా ఎదుర్కొందాం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా తీవ్రస్థాయిలో ఇంధన సంక్షోభం ఏర్పడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. యుద్ధ ప్రభావం మనపైనా ఉందన్నారు. అందుబాటులో ఉన్న అన్ని వనరుల నుంచి గ్యాస్, ముడి చమురు సేకరించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లోనూ ప్రయత్నాలు కొనసాగుతాయని వెల్లడించారు. దేశంలో ఎరువుల సరఫరాకు ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సమగ్ర వ్యూహాన్ని రూపొందిస్తున్నామని స్పష్టంచేశారు.ఈ మేరకు ప్రధాని మోదీ మంగళవారం రాజ్యసభలో ప్రకటన చేశారు. ఇంధన సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకొని లబ్ధి పొందడానికి కొన్ని శక్తులు కాచుకొని ఉంటాయని చెప్పారు. అందుకే నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. ఇంధనం, వంట గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. ఎగుమతి, దిగుమతి కార్యకలాపాల్లో ఎదురయ్యే ఇబ్బందులను అంచనా వేయడానికి, అవసరమైన పరిష్కార మార్గాలు రూపొందించడానికి ఇప్పటికే మంత్రులతో ఒకబృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ బృందం క్రమం తప్పకుండా సమావేశమవుతోందని అన్నారు. ఎలాంటి సవాలుకైనా సిద్ధంగా ఉండాలి కోవిడ్–19 మహమ్మారి సమయంలో వేర్వేరు రంగాల్లో సవాళ్లను ఎదుర్కోవడానికి నిపుణులు, అధికారులతో కూడిన సాధికార బృందాలను ఏర్పాటు చేసిన తరహాలోనే.. సోమవారం కొత్తగా ఏడు బృందాలను ఏర్పాటు చేశామని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. సప్లై చైన్స్, పెట్రోలియం, డీజిల్, ఎరువులు, సహజ వాయువు, ద్రవ్యోల్బణం వంటి కీలక అంశాలపై తక్షణ, దీర్ఘకాలిక వ్యూహాల ఆధారంగా చర్యలు తీసుకునే బాధ్యతను ఈ బృందాలకు అప్పగించినట్లు చెప్పారు. సమిష్టి కృషి ద్వారా ప్రస్తుత సంక్షోభాన్ని అధిగమించగలమన్న విశ్వాసం పూర్తిగా ఉందని వ్యాఖ్యానించారు.దక్షిణాసియా యుద్ధం వల్ల మన దేశంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడడానికి, యుద్ధ ప్రభావాన్ని తగ్గించడానికి అవసరమైన వ్యూహాలపై సాధికార బృందాలు కసరత్తు చేస్తాయన్నారు. పశ్చిమాసియా సంక్షోభం ఒక ప్రత్యేకమైన స్వభావం కలదని, దానికి తగినట్టుగానే విభిన్నమైన రీతిలో పరిష్కారాలను రూపొందిస్తున్నామని వివరించారు. ప్రతి సవాలును మనం ఓర్పు, సంయమనం, ప్రశాంతమైన మనసుతో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. పరిస్థితులు నిరంతరం మారుతున్నాయని, అందుకే ఎలాంటి సవాలుకైనా సిద్ధంగా ఉండాలని ప్రజలను కోరారు. పశ్చిమాసియా ప్రతికూల పరిణామాల ప్రభావం ఎక్కువ కాలం కొనసాగే పరిస్థితి కనిపిస్తోందని అన్నారు.శాంతి యత్నాలకు భారత్ మద్దతు ఎరువుల సరఫరా విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రధానమంత్రి భరోసా ఇచ్చారు. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు. రాబోయే పంటల సీజన్లో సరిపడా ఎరువులు అందజేయడానికి చర్యలు చేపట్టామని అన్నారు. సంక్షోభంతో సంబంధం లేకుండా అధిక ఆర్థిక వృద్ధిని సాధించడం మన బాధ్యత అని వివరించారు. పశ్చిమాసియాలో శాంతి, సుస్థిరతను కోరుకుంటున్నట్లు మోదీ పునరుద్ఘాటించారు. సమస్య పరిష్కారానికి చర్చలు, దౌత్య మార్గాలే శరణ్యమని తేల్చిచెప్పారు. దక్షిణాసియా లో శాంతి యత్నాలకు భారత్ మద్దతు కచి్చతంగా ఉంటుందన్నారు. అక్కడ ఉద్రిక్తతలు తగ్గిపోయి, హర్మూజ్ జలసంధి తేరుకోవాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. ఒకవేళ సంక్షోభం సుదీర్ఘ కాలం కొనసాగితే మరిన్ని తీవ్ర పరిణామాలు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు. -
ఐనా.. ఆగని దాడులు!
దుబాయ్: పశ్చిమాసియాలో యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐదు రోజుల విరామం ప్రకటించినా మిత్ర దేశం ఇజ్రాయెల్ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. మంగళవారం కూడా ఇరాన్‌పై పెద్ద ఎత్తున దాడులతో విరుచుకుపడింది. ఇరాన్ కూడా దీటుగా ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ప్రతి దాడులకు దిగింది. అంతేగాక ‘పూర్తి విజయం’సాధించేదాకా పోరాడుతూనే ఉంటామంటూ ఇరాన్ సైన్యం కుండబద్దలు కొట్టింది! దీనికితోడు అమెరికా కూడా వేలాదిమంది మెరైన్ సైనికులను గల్ఫ్‌కు పంపిస్తోంది. దాంతో పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఇప్పట్లో సమసిపోయే పరిస్థితులు కన్పించడం లేదు.దీనికి తోడు ట్రంప్ పేర్కొన్న చర్చలు మంగళవారం ఏ మేరకు పురోగతి సాధించాలన్న దానిపై కూడా పెద్దగా స్పష్టత లేకుండా పోయింది. అయితే ఈ విషయమై ప్రస్తుతానికి అమెరికా, ఇరాన్ నడుమ విశ్వాస కల్పన చర్యలు కొనసాగుతున్నట్టు ఈజిప్టు వెల్లడించింది. యుద్ధానికి తెర దించే దిశగా ఇరాన్‌తో రెండు రోజులకు పైగా కీలక చర్చలు జరుగుతున్నట్టు ట్రంప్ సోమవారం ప్రకటించడం తెలిసిందే. ‘‘చర్చలు ఫలప్రదంగా సాగుతున్నాయి. ఇరాన్‌కు చెందిన ఒక ముఖ్య నేతతో పాటు పశ్చిమాసియా ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్, నా అల్లుడు జెరేద్ కుష్నర్ వాటిలో పాల్గొంటున్నారు. చర్చలు ఈ వారమంతా కొనసాగుతాయి’’అని ఆయన చెప్పారు. ఇరాన్ మాత్రం ట్రంప్ చర్చల వ్యాఖ్యలను ఖండించింది. చమురు క్షేత్రాలకు నష్టం ఇరాన్‌లోని ఉత్పత్తి కేంద్రాలే లక్ష్యంగా మంగళవారం భారీ స్థాయిలో దాడులు కొనసాగించినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. రాజధాని టెహ్రాన్ ఉత్తర ప్రాంతంలో భారీ పేలుడు శబ్దాలు విన్పించాయి. దాడుల్లో రెండు ఇంధన క్షేత్రాలు భారీగా దెబ్బ తిన్నట్టు ఇరాన్ వార్తా సంస్థ ఫార్స్ న్యూస్ పేర్కొంది. ‘‘ఇస్ఫహాన్‌లోని సహజవాయు కేంద్రంపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. ఖొర్రంషార్లో కీలక విద్యుత్కేంద్రానికి గ్యాస్ సరఫరా చేసే పైప్లైన్లు కూడా తీవ్రంగా దెబ్బ తిన్నాయి’’అని పేర్కొంది. లెబనాన్‌పై కూడా ఇజ్రాయెల్ దాడులు చేసింది.బీరూట్ దక్షిణ శివార్లలో హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థ స్థావరాలే లక్ష్యంగా క్షిపణుల వర్షం కురిపించింది. ఒక అపార్ట్‌మెంట్‌పై జరిగిన దాడిలో కనీసం ముగ్గురు మృత్యువాత పడ్డట్టు లెబనాన్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. దాడుల నేపథ్యంలో లెబనాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ రాయబారిని దేశం వీడాల్సిందిగా ఆదేశించింది. ఇరాన్ విమానాలకు తమ గగనతలాన్ని మూసేస్తున్నట్టు కూడా ప్రకటించింది. టెల్ అవీవ్‌లో విధ్వంసం ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పైకి పలు దఫాలుగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. దాంతో టెల్ అవీవ్ నగరంలో భారీ విధ్వంసం జరిగినట్టు తెలుస్తోంది. 100 కిలోలకు పైగా బరువున్న వార్ హెడ్ సిటీ సెంటర్ సమీపంలోని వీధిపై పడింది. ఒక అపార్ట్‌మెంట్‌తో పాటు పలు భవనాలు దెబ్బ తిన్నాయి. నలుగురికి స్వల్ప గాయలయ్యాయి. ఇరాన్ డ్రోన్ దాడులతో కువైట్‌లో విద్యుత్ సరఫరా లైన్లు దెబ్బ తిన్నాయి. దాంతో పలు ప్రాంతాలు గంటల తరబడి చీకట్లో మగ్గాల్సి వచి్చంది. సౌదీ అరేబియా తూర్పు ప్రాంతంలోని చమురు క్షేత్రాలపై కూడా ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది.పలు డ్రోన్లను తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు నేలకూలి్చనట్టు యూఏఈ ప్రకటించింది. ఇరాన్ దాడుల్లో తమ సైనికుడు మరణించినట్టు బహ్రెయిన్ వెల్లడించింది. పలువురు సైనికులకు గాయాలైనట్టు తెలిపింది. యూఏఈలో జరిగిన దాడుల్లో మొరాకోకు చెందిన ఒక కాంట్రాక్టర్ మరణించినట్టు సమాచారం. బహ్రెయిన్‌లోని తమ డేటా సెంటర్లో కార్యకలాపాలకు డ్రోన్ దాడులతో అంతరాయం కలిగినట్టు అమెజాన్ సంస్థ వెల్లడించింది. దాడులతో అక్కడ సంస్థ కార్యకలాపాలు ప్రభావితం కావడం ఇది రెండోసారి. ఇజ్రాయెల్‌లో 16కు పెరిగిన మృతుల సంఖ్యఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతంలో హెజ్బొల్లా దాడుల్లో ఒక రైతు మరణించాడు. దాంతో ఆ దేశంలో మృతుల సంఖ్య 16కు పెరిగింది. యుద్ధం మొదలైనప్పటి నుంచీ 4,5654 మంది గాయపడ్డట్టు ఆ దేశ అత్యవసర వైద్య సేవల విభాగం పేర్కొంది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులకు బలైనవారి సంఖ్య 1,000 దాటింది. ఇక ఇరాన్లో ఇప్పటిదాకా 1,500 మందికి పైగా మరణించారు. యుద్ధ నెపం హెగ్సెత్‌పై!దాడి చేద్దామన్నది ఆయనే: ట్రంప్ వాషింగ్టన్: ఇరాన్‌పై ఏకపక్షంగా యుద్ధానికి దిగి ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆ నెపాన్ని ఇతరులపైకి నెట్టే ప్రయత్నాల్లో పడ్డారు. ఇరాన్‌పై దాడులు చేద్దామని తొలుత సూచించింది తమ రక్షణ మంత్రి పీట్ హెగ్సెతే అని ఆయన తాజాగా చెప్పుకొచ్చారు! టెనెసీలో జరిగిన ఓ కార్యక్రమం ఇందుకు వేదికైంది. ట్రంప్ ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు హెగ్సెత్ ఆయన పక్కనే ఉండటం విశేషం.‘‘ఇరాన్ సమస్యపై ఆ మధ్య నా సన్నిహితులందరినీ పిలిచి లోతుగా చర్చించా. పరిస్థితిని వారికి వివరించా. అణు బాంబు తయారీకి ఇరాన్ చాలా దగ్గరికి వచ్చేసింది, ఏం చేద్దామని అడిగా. అందరికంటే ముందు హెగ్సెత్ స్పందించారు. ఇరాన్‌పై దాడి చేద్దామని చెప్పుకొచ్చారు’’అన్నారు. అంతేగాక పక్కనే ఉన్న హెగ్సెత్కేసి తిరిగి, ‘‘అంతేకదా! ఇరాన్‌పై దాడి చేద్దామని ముందుగా చెప్పింది నువ్వే కదా! ఇరాన్ అణుబాంబు తయారు చేసేందుకు అవకాశమివ్వొద్దని కూడా అన్నావు’’అంటూ అడిగారు. -
ఇరాన్, అమెరికా చర్చల్లో భారత్ కీలక పాత్ర?
-
ట్రంప్ బ్రేక్ అన్న ఆగని యుద్ధం మిడిల్ ఈస్ట్ లో యుద్ధ సెగలు
-
యుద్ధ బీభత్సం 50 లక్షల కోట్ల నష్టం..
-
BIG BREAKING: 48 గంటల డెడ్ లైన్ పై ట్రంప్ వెనక్కి..
-
ఇరాన్‌పై దాడులకు 5 రోజుల విరామం. చర్చలు జరుపుతున్నామన్న ట్రంప్. అదేం లేదన్న ఇరాన్
-
ట్రంప్‌కు జ్ఞానోదయం!
‘నీ గురించి నీకు తెలిసి, శత్రువు గురించి కూడా తెలిస్తే వంద యుద్ధాల్లోనైనా ఓటమి ఉండదు. నీ గురించి నీకు తెలిసినా, శత్రువు గురించి తెలియకపోతే మాత్రం ప్రతి విజయం తర్వాతా ఒక ఓటమి తప్పదు’ అంటాడు పురాతన చైనా యుద్ధరంగ నిపుణుడు సన్–జూ. శత్రువు గురించి తెలియటం సంగతలా ఉంచి తన గురించి తనకే తెలియని అయోమయంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు గెలుపు రమ్మంటే ఎలా వస్తుంది? ఒమన్ మధ్యవర్తిత్వంలో అమెరికా, ఇరాన్‌ల మధ్య సాగుతున్న చర్చలు ఫలప్రదమయ్యే దశకు చేరాయని ఒమన్‌తో పాటు సాక్షాత్తూ అమెరికా ప్రతినిధి బృందం ప్రకటించిన కొన్ని గంటల్లోనే గత నెల 28న ఉన్నట్టుండి ఇరాన్‌పై యుద్ధ ప్రకటన చేసిన దుస్సాహసి ట్రంప్. తీరా ఇరాన్‌తో రెండురోజులుగా చర్చలు సాగుతున్నాయని, అందు వల్ల యుద్ధానికి అయిదు రోజుల విరామం ఇవ్వదల్చుకున్నామని సోమవారం ఆయన ప్రకటించారు. హార్మూజ్ దిగ్బంధాన్ని 48 గంటల్లో ముగించకపోతే ఇరాన్ మౌలిక సదుపాయ వ్యవస్థలన్నిటినీ నాశనం చేస్తామని శనివారం ప్రకటించిన ట్రంప్ ఇలా యూటర్న్ తీసుకోవటం ఆశ్చర్యకర పరిణామం.ఇరాన్ మతాచార్యుడు అలీ ఖమేనీని హతమార్చటంతో మొదలుపెట్టి అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు గత 23 రోజులుగా నరమేధానికి పాల్పడ్డాయి. అన్నిటికన్నా అత్యంత ఘోరమైన ఉదంతం– పసిపిల్లలు చదువుకుంటున్న బడిపై క్షిపణి దాడి చేసి 170 మంది ప్రాణాలు తీయడం. ఇక్కడితో ఆగలేదు. ఆ రెండు దేశాలూ క్షిపణులతో పెనువిధ్వంసాన్ని సృష్టించాయి. కొన్ని లక్షల జనావాసాలు ధ్వంసం చేశాయి. ఇరాన్ త్వరలోనే దాసోహం అంటుందని యుద్ధభేరి మోగించే ముందు అవి అంచనా వేసుకున్నాయి. అసలు ఇరాన్ అమ్ములపొదిలో ఆయుధాలేమిటన్న విషయంలోనే వాటికి స్పష్టత లేదు. అది అణ్వాయుధాల తయారీ దిశగా ముందుకెళ్తున్నదని చెప్పిన కారణం బూటకం. అదే నిజమైతే, అసలు దాని జోలికెళ్లడానికే వణికేవారు. ఉత్తర కొరియాను ఏం చేయగలుగుతున్నారు? అసలు ఇరాన్ దగ్గర 4,000 మైళ్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులున్నాయన్న సంగతి అది గురిచూసి కొట్టేదాకా తెలియదు. పశ్చిమాసియా కొరివితో తలగోక్కోవటం ట్రంప్‌తోనే మొదలు కాలేదు. ఇరాన్లో 1953లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మహమ్మద్ మొసాదిఘా ప్రభుత్వాన్ని బ్రిటన్‌తో కుట్రపన్ని పడగొట్టిన ఘనుడు నాటి అమెరికా అధ్యక్షుడు ఐసెన్‌హోవర్. ఆ దురంతం తర్వాత ఇరాన్ ప్రజలతో అమెరికాకు సత్సంబంధాలు లేవు. మొసదిఘా స్థానంలో వచ్చిన మహమ్మద్ రెజా షా పహ్లావి 25 ఏళ్ల పాటు ఇరాన్ సంపద దోచిపెట్టగా 1979లో ఆ నియంతను జనం తరిమికొట్టారు. నాటి అమెరికా అధినేత జిమ్మి కార్టర్ తమవారిని చెర నుంచి విడిపించటానికి చేసిన యత్నం బెడిసికొట్టింది. ఇక ఇరాక్‌లో 2003లో జార్జి బుష్... 2011లో లిబియా, సిరియాల్లో ఒబామా తలలు బొప్పికట్టించుకున్నారు. పశ్చిమాసియాలో ఏకైక పెత్తందారుగా ఆవిర్భవించాలన్న ఇజ్రాయెల్ కల చాలా పాతది. గత అధ్యక్షులంతా దీన్ని తోసిపుచ్చగా తొలిసారి ట్రంప్ తన సలహాదారుల మాటనూ, నిఘా వర్గాల హెచ్చరికలనూ బేఖాతరుచేసి ఈ దుస్సాహసానికి దిగారు. పర్యవసానంగా అమెరికా కల్పిస్తామంటున్న భద్రత ఉత్త డొల్ల అని గల్ఫ్ దేశాలు గ్రహించాయి. చరిత్రలో ట్రంప్‌కు సాటిరాగల ఒకే ఒకడు నెపోలియన్ బోనపార్టే. యూరొప్ను జయించి, రష్యాను సైతం దురాక్రమించాలని 1812లో వెళ్లిన నెపోలియన్ అక్కడి భౌగోళిక స్థితిగతులపై అంచనా లేక ఏకంగా 6 లక్షలమంది సైన్యాన్ని కోల్పోయాడు. అతడి పతనానికి అదే నాంది. ఇంతకూ తాజా ప్రకటనకైనా ట్రంప్ కట్టుబడతారా లేదా అన్నది చెప్పలేం. ఇరాన్ మాత్రం ససేమిరా అంటున్నది. అక్కడ నాయకత్వాన్ని అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు తుడిచి పెట్టడంవల్ల ఈ దుఃస్థితి ఏర్పడింది. అయినా ప్రపంచ శాంతిని దృష్టిలో పెట్టుకుని ఒక మెట్టు దిగడానికి ఇరాన్ సిద్ధపడాలి. ఆ దిశగా మధ్యవర్తులు ప్రయత్నించాలి. అటు ట్రంప్ భేషజాలు కట్టిపెట్టాలి. ఇరాన్ దాడుల్లో నష్టపోయిన గల్ఫ్ దేశాలకు నష్టపరిహారం చెల్లించటంతో పాటు, ఇరాన్‌కు కలిగిన నష్టాన్ని కూడా భర్తీ చేస్తేనే ఆ దేశాన్ని ఒప్పించటం సాధ్యమని గ్రహించాలి. ఇప్పటికైనా ఆయన తెలివి తెచ్చుకోవాలి. -
ఇజ్రాయెల్ కు పీడకల.. పనిచేయని ఐరన్ డూమ్
-
LPG సిలిండర్‌పై వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్?!
సాక్షి,న్యూఢిల్లీ: ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్‌తో పాటు ఇతర సహజ వనరులపై ప్రతికూల ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో వంటగ్యాస్ కొరతను అధిగమించేలా భారత ప్రభుత్వ చమురు కంపెనీలు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. గృహ అవసరాల కోసం 10 కిలోల గ్యాస్ సిలిండర్లను అందుబాటులోకి తేవాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ఏర్పడిన అనిశ్చితి కారణంగా దేశంలో ఎల్పీజీ సరఫరా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు 10 కిలోల గ్యాస్ చిన్న సిలిండర్లను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నాయని సమాచారం. హార్ముజ్ జలసంధి ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల ఎల్పీజీ దిగుమతులకు అంతరాయం కలుగుతోంది. భారత్ వినియోగించే ఎల్పీజీ ఎక్కువ శాతం ఈ ప్రాంతం ద్వారా వస్తుంది. సరఫరా తగ్గిపోవడంతో గృహ వినియోగదారులకు గ్యాస్ అందుబాటులో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కొత్త వ్యూహాలను పరిశీలిస్తున్నాయి. ముఖ్యంగా చిన్న 10 కిలోల గ్యాస్ సిలిండర్లను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం గృహ వినియోగానికి 14.2 కిలోల సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. చిన్న సిలిండర్లు ప్రవేశపెట్టడం వల్ల సరఫరా ఒత్తిడి తగ్గి, వినియోగదారులకు తాత్కాలిక ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. సరఫరా సమస్యలు తలెత్తితే గృహ వినియోగదారులు గ్యాస్ అందుబాటులో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. చిన్న సిలిండర్లు ప్రవేశపెట్టడం వల్ల తక్కువ ధరలో, తక్కువ పరిమాణంలో గ్యాస్ అందుబాటులోకి వస్తుంది. ఇది ముఖ్యంగా తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు ఉపశమనం కలిగించవచ్చు.ప్రభుత్వం ఇప్పటికే ఈ పరిస్థితిని సమీక్షిస్తోంది. ఆహారం, ఇంధనం, విద్యుత్ వంటి కీలక అవసరాలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఎల్పీజీ సరఫరాలో సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ వనరులను కూడా పరిశీలిస్తోంది. భవిష్యత్ చర్యలలో చిన్న సిలిండర్లను మార్కెట్లో ప్రవేశపెట్టడం, ప్రత్యామ్నాయ దిగుమతి మార్గాలను అన్వేషించడం, నిల్వలను పెంచడం, వినియోగదారులకు తాత్కాలిక ఉపశమనం కలిగించే విధానాలు అమలు చేయడం వంటి అంశాలు ఉన్నాయి. కేంద్రం ఈ దిశగా అడుగులు వేయనుంది. -
ఇరాన్ యుద్ధంపై ప్రధాని మోదీ కీలక ప్రకటన?
సాక్షి,న్యూఢిల్లీ: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంపై ప్రధాన మోదీ కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇవాళ (సోమవారం) మధ్యాహ్నం పార్లమెంట్లో ఇరాన్‌పై యుద్ధంపై మాట్లాడనున్నట్లు సమాచారం. దీంతో ప్రధాని మోదీ ఏం మాట్లాడతారనేది ఉత్కంఠగా మారింది. పశ్చిమ ఆసియా సంక్షోభంపై లోక్‌సభలో ప్రధాని మోదీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రసంగించనున్నారు. నిన్న పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులపై కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (సీసీఎస్) సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో ఆహారం, ఇంధనం, ఇంధన భద్రతతో పాటు సామాన్య ప్రజల కీలక అవసరాల లభ్యతపై అంచనా వేసింది.ఈ రోజు పార్లమెంట్లో సీసీఎస్ సమీక్షలో చర్చించిన అంశాలను ప్రధాని మోదీ ప్రస్తావించనున్నారు. ప్రధానంగా ఇరాన్‌పై కొనసాగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తక్షణ, మధ్యకాల, దీర్ఘకాల ప్రభావాలు చూపుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ప్రభావం దేశంపై ఎలా పడుతుందో, దానిని ఎదుర్కొనే చర్యలు ఏమిటో పార్లమెంట్ వేదికగా ప్రధాని వివరించనున్నారు.ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సీసీఎస్ సమావేశంలో ప్రధానమంత్రి కార్యాలయం, కేబినెట్ సెక్రటరీ సమగ్ర సమీక్ష నిర్వహించింది. వ్యవసాయం, ఎరువులు, ఆహార భద్రత, పెట్రోలియం, విద్యుత్, ఎంఎస్ఎంఈలు, ఎగుమతులు, షిప్పింగ్, వాణిజ్యం, ఆర్థిక రంగం, సరఫరా గొలుసులు వంటి విభాగాలపై సమీక్ష జరిగింది. -
డర్టీ బాంబు వేయనున్న ఇరాన్.. అదే జరిగితే ఇక గల్ఫ్ దేశాలు..
-
ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా నిలిపేస్తున్నాం: ట్రంప్
-
ఏమిటీ లిటిల్ ఇండియా?
ఇజ్రాయెల్‌పై ఆదివారం ఇరాన్ క్షిపణి దాడులతో అక్కడి డిమోనా నగరం ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. అక్కడ భారత సంతతి ప్రజలు ఎక్కువగా స్థిరపడ్డారు. వారి సంఖ్య 30 శాతం దాకా ఉంటుంది. అందుకే డిమోనాకు లిటిల్ ఇండియా అని పేరొచ్చింది. క్రీస్తుపూర్వం 175లో సెల్యూసిడ్ సామ్రాజ్యాన్ని ఏలిన ఆంటియోకస్–4 ఎపిఫానిస్ అరాచకాలకు తాళలేక కొందరు యూదులు భారత్‌లోని కొంకణ్ ప్రాంతానికి వలస వచ్చారని చరిత్ర చెబుతోంది. వారి సంతతి ముంబై, నవ్‌గావ్, పుణె, అహ్మదాబాద్‌ల్లో స్థిరపడింది. వీళ్లను బెనే ఇజ్రాయెల్(ఇజ్రాయల్ బిడ్డలు) అనేవారు. వారు గానుగ పట్టి నూనే తీసే వృత్తిలో, కిరాణా వ్యాపారాల్లో స్థిరపడ్డారు. 1948లో వీళ్ల జనాభా 20,000కు చేరింది. ఇజ్రాయెల్ స్వాతంత్య్రం ప్రకటించుకోవడంతో వారు స్వదేశం చేరి కొత్తగా నిర్మించిన డిమోనా సిటీలో స్థిరపడ్డారు. నగరంలోని 39,000 జనాభాలో భారత సంతతి వ్యక్తులు 7,500 దాకా ఉంటారని గణాంకాలు చెబుతున్నాయి. భారత సంప్రదాయ వంటకాలు, సంస్కృతిని వాళ్లు డిమోనాకు పరిచయం చేశారు. సోన్పాప్డీ, గులాబ్జాం, పాప్డీ చాట్, భేల్‌పురీ వంటివి డిమోనాలో చాలా ఫేమస్. అక్కడ క్రికెట్ అభిమానులూ చాలా ఎక్కువ. అవిభాజ్య భారత్‌లో ముంబై సినీ పరిశ్రమలో యూదులు నటులుగా, నిర్మాతలుగా రాణించారు. ఇజ్రామిర్, సాల్మన్ మోసెస్, ఇనాక్ ఇసాక్ సతామ్కర్ తదితరులు బాలీవుడ్ అభివృద్ధికి పాటుపడ్డారు. అందుకే ఇజ్రాయెల్‌లో రెండో ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్’ను డిమోనాలోనే నిర్వహించారు. గత నవంబర్‌లో జరిగిన ఈ వేడుక సూపర్ హిట్టయింది! – సాక్షి, నేషనల్ డెస్క్ -
డర్టీ బాంబు వేసేనా?
పశ్చిమాసియా యుద్ధాన్ని ఇరాన్ మరో స్థాయికి తీసుకెళ్లనుందా? తన అమ్ములపొదిలోని వినాశకర డర్టీ బాంబును ప్రయోగించనుందా? ఈ ఆలోచనే పశ్చిమాసియా దేశాలను ఇప్పుడు వణికిస్తోంది! అంతేగాక, ఇరాన్ ఇప్పటికే ఓసారి ఈ బాంబును ప్రయోగించిందన్న వార్తలు వాటికి గుబులు పుట్టిస్తున్నాయి. డర్టీ బాంబు ప్రయోగిస్తే జరిగే దారుణాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తీవ్ర రేడియేషన్ ముప్పు సాంప్రదాయిక బాంబులతో భవనాలు తదితరాలు నేలమట్టమవుతాయి. ప్రాణ నష్టం జరుగుతుంది. కొందరు గాయాలతో బయటపడతారు. దూరంగా ఉన్న వాళ్లకు మాత్రం ఏ నష్టమూ జరగదు. కానీ డర్టీ బాంబు విషయం అలా కాదు. డ్రోన్లు, క్షిపణుల సాయంతో దాన్ని ప్రయోగిస్తే రేడియోధార్మిక అణువులు గాల్లో చెల్లాచెదురుగా వ్యాపిస్తాయి. ఆ గాలి పీల్చిన వారు తీవ్ర రోగాల బారిన పడతారు. ఆరోగ్యం మళ్లీ బాగుపడటం కల్ల. రేడియోధార్మిక పదార్థాలను దట్టించిన పేలుడు పదార్థాలనే డర్టీ బాంబుగా పిలుస్తారు. దాని దుష్పరిణామాలు కొన్ని మైళ్ల దాకా వ్యాపిస్తాయి. రేడియోధార్మిక పొడి, పెల్లెట్లున్న డర్టీ బాంబు (రేడియోలాజికల్ డిస్పర్సల్ డివైజ్–ఆర్డీడీ) పేలితే అక్కడి నీరు, గాలి, భూమి రేడియోధార్మిక పదార్థంతో కలుíÙతమవుతాయి. సాగు భూములు ఎందుకూ పనికి రాకుండా పోతాయి. ఆ గాలి పీల్చే, ఆ నీరు తాగే, ఆ భూమిని వాడేవారికి చర్మం, ఎముక మజ్జ, ఊపిరితిత్తుల సంబంధిత క్యాన్సర్లు సోకే ప్రమాదముంది. నేత్ర, హృదయ సంబంధ సమస్యలతో పాటు రేడియోషన్ సిండ్రోమ్ వంటి జబ్బుల బారిన పడతారు. పైగా ఈ బాంబు సృష్టించే సమస్యల పరిష్కారం తలకుమించిన భారమే అవుతుంది. లాస్ ఏంజెలిస్ వంటి నగరంపై ఒక్క డర్టీ బాంబు వేస్తే అక్కడ గాలి, జల వనరుల శుద్ధికి ఏకంగా లక్షన్నర కోట్ల రూపాయలు అవుతుందని 13 ఏళ్ల క్రితమే సదరన్ కాలిఫోరి్నయా యూనివర్సిటీ అంచనా వేసింది. ఈ లెక్కన గల్ఫ్ దేశాలపై ఇరాన్ డర్టీ బాంబులు వేస్తే జరిగే వినాశనం ఊహాతీతమే! తయారీ సులభమా? అవుననే చెప్పాలి. ప్రస్తుతం విస్తృతంగా వినియోగంలో ఉన్న వైద్య, వాణిజ్య ఉపకరణాల తయారీలో వాడే రేడియోధార్మిక మూలకాలతో డర్టీ బాంబును తయారు చేయొచ్చు. ఇందుకు రేడియోథెరపీలో వాడే సీసియం–137, స్మోక్ డిటెక్టర్‌లో వాడే అమేరిసియం–241, సర్జరీ ఉపకరణాలను శుద్ధి చేసే కోబాల్ట్–60 తదితరాల మిశ్రమాన్ని వాడతారు. ఇవిగాక ఇరాన్ వద్ద 60 శాతం శుద్ధి చేసిన 440 కిలోల యురేనియం నిల్వలున్నాయి. ‘‘దీనితో అణు బాంబు తయారు చేయలేకపోయినా డర్టీ బాంబును తేలిగ్గా రూపొందించవచ్చు. ఇరాన్ చిత్తుగా ఓడే పరిస్థితే వస్తే కచ్చితంగా డర్టీ బాంబులు ప్రయోగించవచ్చు’’ అని అమెరికా జాతీయ భద్రతా విశ్లేషకుడు ఒకరన్నారు. ఆ భయంతోనే ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తున్నట్టు భావిస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇజ్రాయెల్ అణు కేంద్రమే లక్ష్యంగా... క్షిపణుల వర్షం
దుబాయ్/టెహ్రాన్/జెరూసలేం: పశ్చిమాసియా యుద్ధ జ్వాలలు నానాటికీ విస్తరిస్తున్నాయి. దాడులు, ప్రతిదాడులతో ఇరాన్, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు దద్దరిల్లిపోతున్నాయి. యుద్ధం ఆదివారం 23వ రోజుకు చేరుకుంది. నతాంజ్ అణు కేంద్రంపై దాడులకు ప్రతీకారంగా ఇరాన్ సైన్యం హెజ్బోల్లా మిలిటెంట్లతో కలిసి ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. నెగెవ్ ఎడారిలోని ఇజ్రాయెల్ ప్రధాన అణు పరిశోధన కేంద్రమే లక్ష్యంగా దాడులకు దిగింది. దాని సమీపంలోని అరాద్, డిమోనా పట్టణాలపై బాంబుల వర్షం కురిపించింది. వందల కిలోల వార్హెడ్లతో కూడిన బాలిస్టిక్ క్షిపణులను కూడా ప్రయోగించింది. ఈ ఘటనలో కనీసం 180 మందికిపైగా గాయపడినట్లు సమాచారం. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ దాడిలో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ఇరాన్ క్షిపణులను అడ్డుకోవడంలో అత్యాధునిక ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ ఘోరంగా విఫలం కావడం గమనార్హం. ఇరాన్ దాడిలో ఎవరూ మరణించకపోవడం నిజంగా అద్భుతమేనని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. అరాద్‌లో ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ యుద్ధంలో అనుకున్న లక్ష్యం కచ్చితంగా సాధిస్తామని తేల్చిచెప్పారు. అంతర్జాతీయ సమాజం తమకు సహకరించాలని కోరారు. తద్వారా యుద్ధం మరింత తీవ్రతరం కావడం తథ్యమని సంకేతాలిచ్చారు. ఇరాన్ బాలిస్టిక్ మిస్సైళ్లు తమ డిఫెన్స్ వ్యవస్థలను ఛేదించుకుని ఎలా రాగలిగాయన్న దానిపై ఇజ్రాయెల్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఆదివారం ఉత్తర ఇజ్రాయెల్‌లో వైమానిక దాడిలో ఒకరు మృతిచెందారు. ఈ దాడికి పాల్పడింది తామేనని లెబనాన్ హెజ్బొల్లా మిలిటెంట్లు ప్రకటించారు. ఆదివారం ఉదయం ఇజ్రాయెల్‌లో సైరన్ల మోతలు వినిపించాయి. టెల్ అవీవ్‌పై క్షిపణి దాడులు సౌదీ అరేబియా, యూఏఈ సహా ఇతర గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. ఇరాన్ ఆయుధాలను మధ్యలోనే కూల్చివేశామని ఆయా దేశాలు వెల్లడించాయి. ఇరాన్‌లోని అండిమెష్క్ సిటీ ఆసుపత్రిపై భారీ దాడి జరిగింది. రోగులు, వైద్యులను మరో నగరానికి తరలించారు. ఈ దాడికి ఇజ్రాయెల్ కారణమని భావిస్తున్నారు. హెజ్బోల్లా మిలిటెంట్లు తమ ఆయుధాలను ఇజ్రాయెల్ సరిహద్దుకు తరలిస్తున్నారు. లెబనాన్‌లోని ఖస్మియే వంతెనను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. ఉత్తర సరిహద్దుకు సమీపంలోని లెబనాన్ నివాసాలను ధ్వసం చేయాలని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ తమ సైన్యాన్ని ఆదేశించారు. ఇజ్రాయెల్ దాడుల్లో లెబనాన్‌కు ఇప్పటికే వెయ్యి మందికిపైగా మృతిచెందారు. 10 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. హెజ్బోల్లా గ్రూప్ వందలాది రాకెట్లను ఇజ్రాయెల్‌పై ప్రయోగించింది. ఇజ్రాయెల్‌లో కీలక నగరం టెల్ అవీవ్‌పై ఇరాన్ ఆదివారం బాలిస్టిక్ క్షిపణితో దాడికి దిగింది. ఈ దాడిలో పలువురు గాయపడినట్లు తెలిసింది. హార్మూజ్ నుంచి రాకపోకలు సాగించేందుకు కొన్ని దేశాల నౌకలకు తాజాగా అనుమతి లభించింది. ఇందులో భారత్, జపాన్, చైనా, పాకిస్తాన్, తుర్కియే చమురు నౌకలు ఉన్నాయి. ప్రపంచానికి పెనుముప్పు ఇరాన్: నెతన్యాహు ఇరాన్ వద్ద అత్యంత ప్రమాదకరమైన మారణాయుధాలు ఉన్నాయని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆదివారం ఆరోపించారు. డీగో గార్సియా దీవిపై జరిగిన దాడిని ప్రస్తావించారు. సుదూరంలో ఉన్న యూరప్ దేశాలపైనా దాడి చేసే సామర్థ్యం ఇరాన్‌కు ఉన్నట్లు దీన్నిబట్టి తెలుస్తోందని అన్నారు. ప్రపంచానికి ఇరాన్ పెనుముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజలందరి బాగు కోసమే అమెరికాతో కలిసి తాము పోరాడుతున్నామని తేల్చిచెప్పారు. శనివారం రాత్రి రెండు పట్టణాలపై దాడులకు దిగడం అత్యంత దారుణమని మండిపడ్డారు. సాధారణ జనావాసాలను ఇరాన్ టార్గెట్ చేసిందన్నారు. ప్రజలను హత్య చేయాలన్నదే ఇరాన్ అసలు ఉద్దేశమని విమర్శించారు. అదృష్టవశాత్తూ ఈ దాడుల్లో ఎవరూ చనిపోలేదని వ్యాఖ్యానించారు.హార్మూజ్‌ను తెరవకుంటే వినాశనమే: ట్రంప్ హార్మూజ్ నుంచి నౌకల రాకపోలకు అడ్డంకులు సృష్టిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరించారు. జలసంధిని 48 గంటల్లోగా పూర్తిగా తెరవాలని తేల్చిచెప్పారు. తమ మాట వినకపోతే ఇరాన్‌కు తగిన బుద్ధి చెప్తామని అన్నారు. ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలను, ఇతర సదుపాయాలను సర్వనాశనం చేస్తామని తేల్చిచెప్పారు. ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గలిబాఫ్ తీవ్రంగా స్పందించారు. తమ జోలికి రావొద్దని సూచించారు. తమ విద్యుత్ ప్లాంట్లు, మౌలిక సదుపాయాలపై దాడి చేస్తే హార్మూజ్‌ను పూర్తిగా మూసివేస్తామని తేల్చి చెప్పారు. అంతేగాక గల్ఫ్‌లోని అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలతో పాటు అక్కడి మౌలిక సదుపాయాలను, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) సెంటర్లను, నీటి శుద్ధి కేంద్రాలను కూడా నేలమట్టం చేస్తామని హెచ్చరించారు. శత్రు దేశాలకు తప్ప ఇతర దేశాలకు హార్మూజ్ తెరిచే ఉంటుందని ఇరాన్ సీనియర్ అధికారి అలీ మౌసావీ స్పష్టం చేశారు. నౌకాయానానికి, నావికులకు తగిన భద్రత కలి్పంచే విషయంలో ఐక్యరాజ్యసమితికి సహకరిస్తామన్నారు. ప్రస్తుత సంక్షోభానికి అమెరికా, ఇజ్రాయెల్ కారణమని నిందించారు. గల్ఫ్ వ్యవస్థలను నేలమట్టం చేస్తాం: ఇరాన్ హార్మూజ్ నుంచి నౌకల రాకపోలకు అడ్డంకులు సృష్టిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరించారు. జలసంధిని 48 గంటల్లోగా పూర్తిగా తెరవాలని తేల్చిచెప్పారు. తమ మాట వినకపోతే ఇరాన్‌కు తగిన బుద్ధి చెప్తామని అన్నారు. ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలను, ఇతర సదుపాయాలను సర్వనాశనం చేస్తామని తేల్చిచెప్పారు. ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గలిబాఫ్ తీవ్రంగా స్పందించారు. తమ జోలికి రావొద్దని సూచించారు. తమ విద్యుత్ ప్లాంట్లు, మౌలిక సదుపాయాలపై దాడి చేస్తే హార్మూజ్‌ను పూర్తిగా మూసివేస్తామని తేల్చి చెప్పారు. అంతేగాక గల్ఫ్‌లోని అమెరికా, ఇజ్రాయెల్ స్థావరాలతో పాటు అక్కడి మౌలిక సదుపాయాలను, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) సెంటర్లను, నీటి శుద్ధి కేంద్రాలను కూడా నేలమట్టం చేస్తామని హెచ్చరించారు. శత్రు దేశాలకు తప్ప ఇతర దేశాలకు హార్మూజ్ తెరిచే ఉంటుందని ఇరాన్ సీనియర్ అధికారి అలీ మౌసావీ స్పష్టం చేశారు. నౌకాయానానికి, నావికులకు తగిన భద్రత కలి్పంచే విషయంలో ఐక్యరాజ్యసమితికి సహకరిస్తామన్నారు. ప్రస్తుత సంక్షోభానికి అమెరికా, ఇజ్రాయెల్ కారణమని నిందించారు. అమెరికా ఎఫ్–15నూ కూల్చేశాం: ఇరాన్ ముంబై: తమ గగనతలంలోకి అనుమతి లేకుండా ప్రవేశించిన అమెరికా యుద్ధ విమానం ఎఫ్–15ను హార్మూజ్ ద్వీపం సమీపంలో నేలకూల్చామని ఇరాన్ ఆదివారం ప్రకటించింది. ఈ మేరకు ముంబైలోని ఇరాన్ కాన్సురేట్ జనరల్ తమ సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది. ‘‘శత్రువుల ఎఫ్–15 ఫైటర్‌జెట్ మా గగనతలంలోకి ప్రవేశించి మా గగనతల రక్షణ వ్యవస్థకు సవాల్ విసిరింది. దీంతో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లోని భూతలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే క్షిపణులు ఆ విమానం పనిపట్టాయి. చివరకు అది నేలకూలింది’’ అని ఇరాన్ ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే విమానం పూర్తిగా ధ్వంసమైందా? పైలట్ చనిపోయాడా? వంటి వివరాలను వెల్లడించలేదు. ఇటీవల ఎఫ్–35 యుద్ధ విమానం మీద సైతం ఇరాన్ దాడి చేసింది. దీంతో అది వెనువెంటనే పశ్చిమాసి యాలోని స్థావరంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఇరాన్ గగనతలంపై ఎప్పుడంటే అప్పుడు మేం విమానాలను చక్కర్లు కొట్టించగలం అంటూ ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటలకే ఆరోజు ఎఫ్–35ను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. -
దాడులు కొనసాగించండి.. అమెరికాను కోరిన ఇరాన్ మాజీ క్రౌన్ ప్రిన్స్
ఇరాన్ మాజీ క్రౌన్ ప్రిన్స్ రెజా పహ్లవి ఎక్స్‌లో చేసిన ఓ పోస్ట్ ఆసక్తికరంగా ఉంది. రెజా ఆ పోస్ట్‌లో ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్‌పై దాడులు కొనసాగించాలని అమెరికా, ఇజ్రాయెల్‌ను కోరారు. రెజా తన పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ కాదు. ఇరాన్ పౌర మౌలిక సదుపాయాలు ఇరాన్ ప్రజలకు మరియు స్వేచ్ఛాయుత ఇరాన్ భవిష్యత్తుకు చెందినవి. ఇస్లామిక్ రిపబ్లిక్ మౌలిక సదుపాయాలు అణచివేత, ఉగ్రవాద యంత్రాంగం మాత్రమే. ఇరాన్ కాపాడబడాలి. ఆ ప్రభుత్వాన్ని కూల్చివేయాలి.దేశాన్ని పునర్నిర్మించుకోవడానికి ఇరానీయులకు అవసరమయ్యే పౌర మౌలిక సదుపాయాలను కాపాడుతూ, ఆ ప్రభుత్వాన్ని మరియు దాని అణచివేత యంత్రాంగాన్ని లక్ష్యంగా చేసుకోవడం కొనసాగించాలని ట్రంప్ మరియు నెతన్యాహును కోరుతున్నాను.అమెరికా మరియు ఇజ్రాయెల్ మద్దతుతో, అన్నింటికంటే ముఖ్యంగా ఇరాన్ దేశభక్తుల త్యాగంతో ఇరాన్ స్వేచ్ఛా గడియ ఆసన్నమైంది. ఇరాన్ వర్ధిల్లాలి అని రెజా ఎక్స్‌లో రాసుకొచ్చాడు.కాగా, ఇరాన్ చివరి షా మహ్మద్ రెజా పహ్లవి పెద్ద కుమారుడైన ఈ రెజా పహ్లవి.. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ప్రవాసంలోకి వెళ్లి, ప్రస్తుతం అమెరికాలో తలదాచుకుంటున్నారు. రెజా ప్రస్తుత ఇరాన్ పాలనపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆయన తరచూ అమెరికా దాడులకు మద్దతు ప్రకటిస్తూ, పాలన మార్పు జరిగితే తిరిగి ఇరాన్‌కు వెళ్లవచ్చని అనుకుంటున్నారు. -
యుద్ధంలో ఎక్కడెక్కడ ఎన్నెన్ని మరణాలు సంభవించాయంటే?
అమెరికా, ఇజ్రాయెల్ ఫిబ్రవరి 28న ఇరాన్‌పై దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు వేల మరణాలు సంభవించాయి. యుద్ధం పశ్చిమాసియా అంతటా వ్యపించింది. ఆయా దేశాల్లో ప్రభుత్వాలు, సైన్యాలు, ఆరోగ్య విభాగాలు, రక్షణ సంస్థలు విడుదల చేసిన వివరాల ఆధారంగా మరణాల సంఖ్య ఎలా ఉందో చూద్దాం..ఇరాన్అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ (హెచ్ఆర్ఏఎన్ఏ) మార్చి 20న తెలిపిన ప్రకారం ఇరాన్లో దాదాపు 3,220 మంది మరణించారు. ఇందులో 1,398 మంది పౌరులు ఉన్నారు. వీరిలో 210 మంది పిల్లలు, 1,165 సైనిక సిబ్బంది ఉన్నారు.లెబనాన్ మరణాల సంఖ్య 1,024కి పెరిగిందని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది, ఇందులో 827 మంది పురుషులు, 79 మంది మహిళలు, 118 మంది పిల్లలు ఉన్నారు.ఇజ్రాయెల్ ఇరాన్ క్షిపణి దాడుల్లో యుద్ధం ప్రారంభం నుంచి 15 మంది పౌరులు మరణించారని ఇజ్రాయెల్ అత్యవసర సేవలు, అధికారులు తెలిపారు. ఇందులో 13 మంది ఇజ్రాయెల్ పౌరులు ఉన్నారు. సుమారు 260 మంది గాయపడ్డారు.వెస్ట్ బ్యాంక్ రామల్లా లోని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన ప్రకారం ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో ఇరాన్ క్షిపణి దాడుల్లో నలుగురు మహిళలు మరణించారు.గల్ఫ్ గల్ఫ్ దేశాల అధికారులు, అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపిన ప్రకారం ఇరాన్ దాడులు ప్రారంభమైనప్పటి నుంచి 28 మంది మరణించారు. కువైట్‌లో ఆరుగురు మరణించారు.యూఏఈలో ఎనిమిది మంది మృతి చెందారు.సౌదీ అరేబియాలో ఇద్దరు పౌరుల మృతి చెందారు.బహ్రెయిన్‌లో ఇద్దరు పౌరులు మరణించారు. ఇరాక్ యుద్ధం ప్రారంభం నుంచి ఇరాక్‌లో 68 మంది మరణించారని అధికారులు తెలిపారు.జోర్డాన్జోర్డాన్లో ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల శకలాలు పడటంతో దేశంలోని పలు ప్రాంతాల్లో 29 మంది గాయపడ్డారని భద్రతా అధికారులు తెలిపారు. గల్ఫ్‌లో ఏడుగురు అమెరికా సిబ్బంది మరణించినట్లు సెంట్రల్ కమాండ్ తెలిపింది. యుద్ధం ప్రారంభం నుంచి పశ్చిమాసియా అంతటా ఏడు దేశాల్లో సుమారు 200 మంది అమెరికా సైనికులు గాయపడ్డారని అమెరికా తెలిపింది. -
ఒక్కసారిగా బాంబుల వర్షం.. ఇజ్రాయెల్ లో భయానక పరిస్థితి
-
డీగో గార్సియా పైఇరాన్ దాడులు!
దుబాయ్/వాషింగ్టన్/మాస్కో: పశ్చిమాసియాలో యుద్ధ తీవ్రత ఏ మాత్రమూ తగ్గడం లేదు. ఇజ్రాయెల్–అమెరికా, ఇరాన్ యుద్ధం శనివారంతో నాలుగో వారంలోకి ప్రవేశించింది. రోజంతా ఇరు వర్గాలూ తీవ్రస్థాయిలో పరస్పర దాడులకు పాల్పడ్డాయి. హిందూ మహాసముద్రంలో మారుమూలన ఉన్న డీగో గార్సియా దీవిలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ అనూహ్యంగా దాడులకు దిగింది. వాటిపైకి రెండు క్షిపణులను ప్రయోగించి అగ్ర రాజ్యానికి ఒక్కసారిగా షాకిచి్చంది! ఒక క్షిపణి మార్గమధ్యంలోనే కుప్పకూలగా మరోదాన్ని ఎస్ఎం–3 ఇంటర్‌సెప్టర్‌తో అడ్డుకున్నట్టు అమెరికా పేర్కొంది. తమ క్షిపణుల గరిష్ట సామర్థ్యం 2,000 కి.మీ. మాత్రమేనని ఇరాన్ ఇప్పటిదాకా చెబుతూ రావడం తెలిసిందే. అలాంటిది తన భూభాగానికి ఏకంగా 4,000 కి.మీ. దూరంలో ఉన్న డీగో దీవిపైకి క్షిపణులు ప్రయోగించగలగడం తీవ్ర కలకలం రేపింది! డీగో గార్సియా అమెరికా, బ్రిటన్ సంయుక్త సైనిక స్థావరం. యూఎస్ బాంబర్ యుద్ధ విమానాలు ఆ దీవిని వాడుకునేందుకు బ్రిటన్ అంగీకరించిన మర్నాడే దానిపై ఇరాన్ దాడికి ప్రయతి్నంచడం విశేషం. మరోవైపు ఇరాన్‌లోని ప్రధాన అణు శుద్ధి కేంద్రమైన నతాంజ్‌పై ఇజ్రాయెల్ మరోసారి భారీగా క్షిపణి, బాంబుల వర్షం కురిపించింది. అక్కడి నిర్మాణాలను భారీగా నష్టపరిచినట్టు ప్రకటించింది. వచ్చేవారం ఇరాన్‌పై దాడుల తీవ్రత మరింత పెరగడం ఖాయమని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ ప్రకటించారు. అమెరికాతో కలిసి ఇరాన్‌పై మరింతగా విరుచుకుపడతామని హెచ్చరించారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం అందుకు విరుద్ధంగా స్పందించారు. ‘‘ఇరాన్‌పై దాడుల ద్వారా ఆశించిన లక్ష్యాలన్నింటినీ దాదాపుగా చేరుకున్నాం. ఆ దేశ వైమానిక, నావిక, క్షిపణి వ్యవస్థలన్నింటినీ నేలమట్టం చేసేశాం. కనుక దానిపై సైనిక చర్య తీవ్రతను క్రమంగా తగ్గించే యోచన ఉంది’’అని చెప్పుకొచ్చారు. కాకపోతే కాల్పుల విరమణకు మాత్రం అమెరికా సిద్ధంగా లేదంటూ మెలిక పెట్టారు! ఈ మేరకు ట్రూత్ సోషల్‌లో ట్రంప్ తాజాగా పోస్టులు పెట్టారు. అయితే యుద్ధానికి పూర్తిస్థాయిలో, శాశ్వతంగా ఫుల్స్టాప్ పెట్టడం మినహా మరే చర్యలూ ఆమోదయోగ్యం కాబోవంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కుండబద్దలు కొట్టారు. టెహ్రాన్ ఉక్కిరిబిక్కిరి శనివారం ఇజ్రాయెల్ శర పరంపరగా చేసిన దాడులతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ అల్లాడిపోయింది. నగరంలో పలు ప్రాంతాల్లో భారీగా మంటలు, పొగ కని్పంచాయి. దేశవ్యాప్తంగా పలు ఇతర నగరాలపైనా భారీ స్థాయిలో దాడులు కొనసాగాయి. నతాంజ్ అణు కేంద్రంపై తాజా దాడుల తర్వాత రేడియేషన్ లీకేజీ నమోదు కాలేదని ఇరాన్‌కు చెందిన మిజాన్ వార్తా సంస్థ పేర్కొంది. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైనప్పటి నుంచీ నతాంజ్‌పై ఇజ్రాయెల్, అమెరికా ఇప్పటికే పలుమార్లు దాడులు జరిపాయి. మరోవైపు లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై కూడా ఇజ్రాయెల్ దాడులు తీవ్రస్థాయిలో కొనసాగాయి. రాజధాని బీరూట్‌లో పలు ప్రాంతాలు పేలుళ్లతో దద్దరిల్లాయి. ఇరాన్లో దాడుల మధ్యే ప్రజలు ఈదుల్ ఫితర్ జరుపుకున్నారు. ఇరాన్ ముమ్మర దాడులు ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ఇరాన్ ముమ్మరంగా ప్రతి దాడులకు దిగింది. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని మౌలిక సదుపాయాలు, చమురు వ్యవస్థలే లక్ష్యంగా ఇరాన్ వందలాదిగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. దాంతో ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్, జెరూసలేంతో పాటు పలు నగరాల్లో భారీగా జనం బంకర్లకేసి పరుగులు తీశారు. క్షిపణి శకలాలు పడి టెల్ అవీవ్‌లో ఒక కిండర్‌గార్టెన్ స్కూలు ధ్వంసమైంది. అయితే ఎవరూ గాయపడలేదు. తమ తూర్పు ప్రాంతంలోని చమురు క్షేత్రాలపైకి దూసుకొచ్చిన 20కి పైగా డ్రోన్లను అడ్డుకున్నట్టు సౌదీ అరేబియా ప్రకటించింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో నిఘా విభాగం ప్రధాన కార్యాలయం డ్రోన్ దాడిలో దెబ్బతింది. ఈ ఘటనలో ఒక అధికారి కూడా మరణించినట్టు ఇరాక్ ధ్రువీకరించింది. డీగో దీవిపై ఇరాన్ దాడి యత్నాన్ని బ్రిటన్ తీవ్రంగా ఖండించింది. అది అత్యంత నిర్లక్ష్యపూరిత చర్య అంటూ నిరసించింది. వాణిజ్య నౌకలపై, గల్ఫ్‌లోని చమురు వ్యవస్థలపై ఇరాన్ దాడులను యూఏఈ, బహ్రెయిన్, బ్రిటన్, జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా, ఆ్రస్టేలియాతో సహా 22 దేశాలు తీవ్రంగా ఖండించాయి. వీటికి తక్షణం తెర దించడమే గాక హార్మూజ్ జలసంధిని వెంటనే తెరవాలని సంయుక్త ప్రకటనలో కోరాయి. నతాంజ్ అణు కేంద్రంపై దాడులను రష్యా తీవ్రంగా ఖండించింది. ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమంటూ మండిపడింది. ఖర్గ్లో నౌకపై ఇజ్రాయెల్ దాడి అమెరికా తర్వాత ఇజ్రాయెల్ కూడా ఇరాన్‌కు ఆయువుపట్టు వంటి ఖర్గ్ దీవిపై గురి పెట్టింది. శనివారం ఇజ్రాయెల్ సైన్యం ప్రయోగించిన క్షిపణి ఖర్గ్ దీవిలో ఒక నౌకను తాకింది. అయితే దాడి సమయంలో సదరు నౌక ఖాళీగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు దక్షిణ ఇరాన్‌లోని బుషెహర్ విమానాశ్రయంలో ప్రయాణికుల టరి్మనల్ భవనం కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో భారీగా దెబ్బతింది. ఖర్గ్పై దాడులకు ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించక తప్పదని ఇరాన్ హెచ్చరించింది.ఇజ్రాయెల్‌పైకి అది ప్రయోగించిన ఒక క్షిపణి జెరూసలేంలోని చారిత్రక అల్ అక్సా మసీదుకు అతి సమీపంలో పడింది.డీగోపై దాడికి స్పేస్ టెక్నాలజీ దన్ను! తమ క్షిపణుల గరిష్ట రేంజ్ 2,000 కి.మీ. మాత్రమేనని ఇప్పటిదాకా చెబుతూ వచ్చిన ఇరాన్, తాజాగా అందుకు రెట్టింపు దూరంలో ఉన్న డీగో దీవిపై దాడి చేయడం తీవ్ర కలకలానికే దారితీసింది. ఇందుకు వీలుగా తమ క్షిపణుల రేంజ్‌ను పెంచుకునేందుకు సీమోర్గ్ స్పేస్ రాకెట్ టెక్నాలజీని ఇరాన్ వాడుకున్నట్టు అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ కథనం పేర్కొంది. కాకపోతే ఆశించిన స్థాయిలో కచ్చితత్వాన్ని సాధించడంలో మాత్రం ఇరాన్ విఫలమైందని అభిప్రాయపడింది. -
ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడులు.. 24 గంటల్లో ఐదు సార్లు..!
ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడులు ముమ్మరం చేసింది. తమ ప్రధాన అణు శుద్ధి కేంద్రం నతాంజ్‌పై దాడికి ప్రతీకారంగా డిమోనా నగరంపై వరుస క్షిపణి దాడులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలోని ఈ నగరంపై ఇరాన్ 24 గంటల్లో ఐదు సార్లు దాడులు జరిపింది. ఈ దాడుల్లో కనీసం 39 మంది గాయపడినట్లు తెలుస్తుంది. ఓ మూడు అంతస్తుల భవనం పూర్తిగా కూలిపోయినట్లు సమాచారం. వరుస దాడులతో డిమోనా నగరం ఉలిక్కిపడింది. ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. డిమోనా నగరం ఇజ్రాయెల్‌కు అత్యంత భద్రత కలిగిన ప్రాంతం. అయినా ఇరాన్ ఈ ప్రాంతంపై దాడులు చేయడం ఆందోళన కలిగిస్తుంది. డిమోనాకు ఇజ్రాయెల్ అణు సౌకర్యం ఉన్న ప్రదేశంగా గుర్తింపు ఉంది. దీంతో అమెరికా సైతం ఈ దాడుల తర్వాత హడలెత్తిపోతుంది.కొద్ది గంటల ముందే ఇరాన్ హిందూ మహా సముద్రంలోని యూఎస్-యూకే సైనిక స్థావరం డిగో గార్సియాను టార్గెట్ చేసింది. రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ ప్రయోగించిన ఈ క్షిపణులు 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను రీచ్ కావడంతో శత్రువులు బెంబేలెత్తిపోతున్నారు. -
గాజాలో శాంతి స్థాపనే లక్ష్యంగా ట్రంప్ ముందడుగు
-
ఇరాన్ యుద్ధం ముగింపు.. నెతన్యాహు సంచలన ప్రకటన
-
ఇరాన్‌పై యుద్ధం.. వ్యూహం మారుస్తున్న అమెరికా!
ఇరాన్‌పై పరిమిత భూతల దాడుల దిశగా అమెరికా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వారం రోజులుగా ఈ దిశగా పలు సంకేతాలిస్తూ వస్తున్నారు. జపాన్ సమీపంలోని సముద్ర జలాల్లో ఉన్న విమానవాహక యుద్ధ నౌక యూఎస్ఎస్ ట్రిపోలీని అమెరికా యుద్ధ ప్రాతిపదికన గల్ఫ్‌కు తరలిస్తోంది. 31వ మరైన్ ఎక్స్‌పెడిషనరీ యూనిట్‌కు చెందిన 2,500 మంది సిబ్బంది అందులో ఉన్నారు.దీంతో ఇరాన్‌పై ఇజ్రాయెల్–అమెరికా పోరు నిర్ణాయక దశకు చేరుతున్నట్టు కనిస్తోంది. ముఖ్యంగా ఇంధనపరంగా ఇరాన్‌కు గుండెకాయ వంటి ఖర్గ్ దీవిని స్వాధీనం చేసుకోవడం, హార్మూజ్ జలసంధిపై నియంత్రణ సాధించి నౌకల రవాణాను వీలైనంత త్వరగా పునరుద్ధరించడం భూతల దాడుల ముఖ్య లక్ష్యాలు కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం వాటా ఉన్న హార్మూజ్‌ను ఇరాన్ మూసేయడంతో అంతర్జాతీయగా కల్లోలం రేగుతున్న విషయం తెలిసిందే. అమెరికా దాడుల్లో ఇరాన్ నావికా దళం చాలావరకు బలహీనపడిపోయింది. కనుక తక్కువ రిసు్కతోనే హార్మూజ్‌ను అదీనంలోకి తీసుకోవచ్చన్నది ట్రంప్ ఆలోచనగా తెలుస్తోంది. దీంతోపాటు ఖర్గ్ దీవిని కూడా స్వాధీనం చేసుకుంటే ఇరాన్‌కు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ఇరాన్ చమురు ఎగుమతుల్లో ఏకంగా 90 శాతం ఖర్గ్ నుంచే జరుగుతాయి.ఖర్గ్‌ను అధీనంలోకి తెచ్చుకుంటే హార్మూజ్ గుండా నౌకల రాకపోకలకు అంగీకరించేలా ఇరాన్‌ను ఒప్పించొచ్చన్నది పెంటగాన్ వ్యూహకర్తల భావన. అంతేగాక ఇరాన్‌కు ప్రధాన ఆదాయ వనరైన చమురు ఎగుమతులకు చెక్ పెడితే దానికి యుద్ధాన్ని కొనసాగించలేని పరిస్థితి తలెత్తుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.భూతల దాడులకు దిగే పక్షంలో పనిలో పనిగా ఇరాన్ చేతుల్లో ఉన్న 450 కిలోల పై చిలుకు శుద్ధి చేసిన యురేనియం నిల్వలను కూడా ఎలాగైనా స్వా«దీనం చేసుకోవాలని అమెరికా తలపోస్తోంది. తద్వారా ఇరాన్ అణ్వస్త్ర కార్యకలాపాలకు శాశ్వతంగా తెర దించొచ్చని భావిస్తోంది. కానీ అదంత తేలిక కాదన్నది నిపుణుల అభిప్రాయం. ‘‘ఖర్గ్ దీవి ఇరాన్ ప్రధాన భూభాగానికి 25 కి.మీ. దూరంలో ఉన్నందున దానిపై దాడి, స్వాదీనం అంత కష్టం కాకపోవచ్చు. కానీ యురేనియం నిల్వల విషయం అలా కాదు. అవి ఇరాన్ ప్రధాన భూభాగంలోనే ఉండి ఉంటాయి’’ అని వారంటున్నారు. -
యుద్దానికి ముగింపు..? హంటింగ్ ఆఫ్ హార్మూజ్
-
నన్ను చంపడానికి ఇజ్రాయెల్ ప్రయత్నించింది: రష్యన్ జర్నలిస్ట్
బీరుట్: ఇజ్రాయెల్ తనను చంపడానికి ప్రయత్నించిందని రష్యన్ జర్నలిస్ట్ స్టీవ్ స్వీనీ ఆరోపించారు. ఆ దేశం చేస్తున్న యుద్ధ నేరాలు బయటికి రావొద్దని ఉద్దేశపూర్వకంగానే తనపై దాడి చేసిందన్నారు. గురువారం లెబనాన్‌లోని అల్–ఖస్మియా వంతెన సమీపంలో చిత్రీకరణ చేస్తుండగా ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో స్వీనీ, అతని కెమెరామెన్ అలీ రిదా గాయపడ్డారు. అనంతరం ఇద్దరూ స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందారు. వైద్యులు స్వీనీ చేతి నుంచి శకలాలను తొలగిస్తున్న వీడియోను రిదా పంచుకున్నారు. అనంతరం, స్వీనీ శుక్రవారం ఇజ్రాయెల్‌పై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘వంతెనలను లక్ష్యంగా చేసుకోవడం, 10 లక్షల మందిని బలవంతంగా ఖాళీ చేయించడం, నక్బా కంటే పెద్ద ఎత్తున జరుగుతున్న జాతి ప్రక్షాళన చర్యపై దక్షిణ లెబనాన్‌లో నేను రిపోరి్టంగ్ చేస్తుండగా ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసి నన్ను చంపడానికి ప్రయతి్నంచింది’అని రష్యన్ టెలివిజన్ నెట్వర్క్ ఆర్టీలో కరస్పాండెంట్‌గా పనిచేస్తున్న ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. చిత్రీకరణకు లెబనీస్ సైన్యానికి ఎలాంటి సమాచారం లేకుండా, ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండా దాడి చేసిందని మండిపడ్డారు. ఇది ఇజ్రాయెల్ యుద్ధ నేరాలను నమోదు చేస్తున్న జర్నలిస్టుల గొంతు నొక్కే ప్రయత్నమని స్వీనీ ఆరోపించారు. రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా ఈ దాడిని ఖండించారు. గాజాలో 200 మంది జర్నలిస్టుల హత్య తరహాలోనే ఇది జరిగిందని, ప్రెస్ జాకెట్లు ధరించిన జర్నలిస్టులపై దాడిని ప్రమాదవశాత్తుగా జరిగిందని చెప్పలేమని అన్నారు. రాకెట్ ముఖ్యమైన వ్యూహాత్మక సైనిక స్థావరంపై కాకుండా, రిపోర్ట్ చిత్రీకరిస్తున్న ప్రదేశంపై పడిందని, అంతర్జాతీయ సంస్థల నుంచి స్పందన కోసం రష్యా ఎదురుచూస్తోందని ఆమె తెలిపారు. అయితే, దాడి జరిగిన ప్రాంతం నుంచి పౌరులు వెళ్లిపోవాలని తాము పదేపదే హెచ్చరికలు జారీ చేశామని, తగినంత సమయం ఇచి్చన తర్వాతే క్షిపణిని ప్రయోగించామని ఇజ్రాయెల్ తెలిపింది. -
ఎక్కడున్నా వదలం!
దుబాయ్: పశి్చమాసియా యుద్ధం చినికి చినికి గాలివానగా మారుతోంది. ఇజ్రాయెల్–అమెరికా రాజేసిన యుద్ధ జ్వాలలను ప్రపంచమంతటికీ విస్తరించేందుకు ఇరాన్ ప్రయతి్నస్తోంది. శుక్రవారం ఆ దిశగా స్పష్టమైన సంకేతాలిచి్చంది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలు, ప్రఖ్యాత విడిది కేంద్రాలన్నింటినీ ఇకపై దాడులకు లక్ష్యంగా చేసుకుంటామంటూ తీవ్ర హెచ్చరికలు జారీచేసింది. ‘‘పార్కులు, విడిది, పర్యాటక కేంద్రాల వంటివేవీ మా శత్రువులకు ఇకపై సురక్షితం కాదు. ప్రపంచవ్యాప్తంగా వాటన్నింటినీ లక్ష్యాలుగా చేసుకుంటాం’’ అని ఇరాన్ సైనిక ఉన్నతాధికారి అబుల్ ఫజల్ షెకార్చీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో దుబాయ్ తదితర గల్ఫ్ ప్రాంతాల్లోని ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రాలపై దాడులు తప్పవన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు రంజాన్ పర్వదినం సందర్భంగా కూడా ఇరాన్ నెమ్మదించలేదు. గల్ఫ్ దేశాల్లోని చమురు క్షేత్రాలపై దాడుల తీవ్రతను మరింతగా పెంచింది. కువైట్‌లో రెండు రిఫైనరీలపై డ్రోన్ దాడులకు దిగింది. దాంతో రోజుకు ఏకంగా 7.3 లక్షల బ్యారెళ్ల చమురు శుద్ధి చేసే మినా అల్ అహ్మదీ రిఫైనరీలో పలు యూనిట్లు మంటల్లో చిక్కాయి. వాటిని ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. కువైట్‌లోని మైనా అబ్దుల్లా చమురు క్షేత్రం కూడా దాడులకు గురైంది. ఈ రెండు క్షేత్రాలపై గురువారం కూడా ఇరాన్ దాడులు చేయడం తెలిసిందే. సౌదీ అరేబియా, బహ్రెయిన్, దుబాయ్‌ల్లో కూడా భారీ బాంబుల మోతలతో దద్దరిల్లిపోయాయి. ఈ నేపథ్యంలో తన గడ్డపై ఉన్న ఇరాన్ సంస్థలన్నింటినీ మూసేయాలని దుబాయ్ నిర్ణయించుకుంది. ఇజ్రాయెల్‌లో హైఫాలో ఉన్న అతి పెద్ద చమురు శుద్ధి కేంద్రంపై కూడా ఇరాన్ భారీగా దాడులు చేసింది. దాంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. జెరూసలేం, టెల్ అవీవ్‌తో పాటు దేశవ్యాప్తంగా దాడులు కొనసాగాయి.బాలిస్టిక్ క్షిపణి తయారీ సామర్థ్యాన్ని కోల్పోయానన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటనను ఇరాన్ ఖండించింది. ఇప్పటికీ భారీ సంఖ్యలో క్షిపణులను తయారు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. గురువారం తన గగనతలంలో అమెరికాకు చెందిన ఎఫ్–35 యుద్ధ విమానంపై చేసిన దాడికి సంబంధించి వీడియో క్లిప్పింగ్‌ను కూడా విడుదల చేసింది. ఈ అత్యాధునిక స్టెల్త్ ఫైటర్ జెట్లు దాడికి గురికావడం వాటి చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం! ఇరాన్‌పై బాంబుల వర్షం పర్షియా నూతన సంవత్సరం ‘నౌరోజ్’ నాడు ఇరాన్‌పై ఇజ్రాయెల్ ముమ్మర దాడులు కొనసాగాయి. రాజధాని టెహ్రాన్‌తో పాటు పలు దేశవ్యాప్తంగా నగరాలు పేలుళ్లతో దద్దరిల్లిపోయాయి. టెహ్రాన్‌లోని బసీజ్ గ్రూప్ ప్రధాన కార్యాలయంపైనా బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్‌లోని సౌత్ పార్స్ సహజవాయు క్షేత్రంపై ఇక దాడులు చేయబోమని నెతన్యాహు ప్రకటించారు. గల్ఫ్‌కు మరో మూడు యుద్ధ నౌకలను తరలించాలని అమెరికా నిర్ణయించింది. సిరియాపైనా దాడులు ఇజ్రాయెల్ తన దాడులను లెబనాన్‌తో పాటు సిరియాకూ విస్తరించింది. స్వెయ్డాతో పాటు దేశవ్యాప్తంగా పేలుళ్లు జరిగినట్టు సిరియా ప్రభుత్వ వార్తా సంస్థ వెల్లడించింది. అక్కడి డ్రౌజ్ మైనారిటీలను కాపాడేందుకే ఈ చర్యకు దిగినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది.వారి భ్రమలు వీడాయి: మొజ్తబా ఇరాన్ నాయకత్వాన్ని, అగ్ర నేతలను చంపినంత మాత్రాన ప్రభుత్వం తలకిందులైపోతుందని ఇజ్రాయెల్, అమెరికా భ్రమించాయని సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ ఎద్దేవా చేశారు. వాటిప్పుడు భ్రమలు వీడాయన్నారు. శత్రువుల రక్షణ కవచాలను ఛేదించాలని ఇరాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. యుద్ధం మొదలై మూడు వారాలైనా వాళ్లు గొప్ప ధైర్యస్థైర్యాలు చూపుతున్నారంటూ కొనియాడారు. పర్షియన్ నూతన సంవత్సరం ‘నౌరోజ్’ సందర్భంగా మొజ్తబాను ఉటంకిస్తూ ఇరాన్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆయన బతికే ఉన్నారంటూ ఒక వీడియోను కూడా విడుదల చేసింది. అందులో ఆయన పలువురికి మత బోధలు చేస్తూ కని్పస్తున్నారు. అది ఎప్పటి వీడియో అన్నదానిపై మాత్రం స్పష్టత లేదు. యుద్ధం మొదలైనప్పటి నుంచీ మొజ్తబా ఇప్పటిదాకా బహిరంగంగా కని్పంచకపోవడం తెలిసిందే. తండ్రి అయతొల్లా ఖమేనీ తదితరులను పొట్టన పెట్టుకున్న ఇజ్రాయెల్ దాడిలో ఆయన కూడా తీవ్రంగా గాయపడ్డట్టు వార్తలొస్తూనే ఉన్నాయి.నాటో దేశాలు పిరికిపందలు: ట్రంప్ వాషింగ్టన్: నాటో దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వాటిని పిరికిపందలుగా అభివరి్ణంచారు. అమెరికా లేకుంటే నాటో కూటమి కేవలం కాగితం పులిగా మిగిలిపోతుందని ఎద్దేవా చేశారు. ‘‘చమురు ధరలు పెరుగుతున్నాయంటూ నాటో దేశాలు ఫిర్యాదు చేస్తున్నాయి. హార్మూజ్ జలసంధిని తెరిపిస్తే పరిష్కారమయ్యే చిన్న సమస్య అది. పైగా వాటికి పెద్దగా రిస్కు కూడా లేని వ్యవహారం. కానీ అందుకు ముందుకు రమ్మంటే మాత్రం ముఖం చాటేస్తున్నాయి. నాటో దేశాల ఈ పిరికిపంద చర్యను గుర్తు పెట్టుకుంటాం’’ అంటూ హెచ్చరించారు.ఐఆర్జీసీ అధికార ప్రతినిధి మృతి ఇరాన్ సైన్యం అధికార ప్రతినిధి అలీ మొహమ్మద్ నైనీ శుక్రవారం ఇజ్రాయెల్ దాడుల్లో మరణించారు. ఇజ్రాయెల్‌కు సర్ప్రైజ్ ఇస్తామంటూ ప్రకటనలు చేసిన గంటల వ్యవధిలోనే దాడులకు బలయ్యారు. అంతకు కొద్దిసేపటి ముందే ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటనను కూడా నైనీ ఎద్దేవా చేశారు. ఇరాన్ యురేనియం శుద్ధి, బాలిస్టిక్ క్షిపణి ఉత్పత్తి కార్యకలాపాలను ఇకపై ఎంతమాత్రమూ కొనసాగించజాలదన్న నెతన్యాహు వ్యాఖ్యలను దుయ్యబట్టారు.హార్మూజ్ వద్ద ఇరాన్ నౌకలపై బాంబులు హార్మూజ్‌ను తెరిపించే ప్రయత్నాలకు అమెరికా ఎట్టకేలకు శ్రీకారం చుట్టింది. దాని సమీపంలోని పలు ఇరాన్ నావికా దళ లక్ష్యాలను శుక్రవారం ధ్వంసం చేసినట్టు అమెరికా సైన్యం ప్రకటించింది. దాడులకు సంబంధించిన వీడియో క్లిప్పింగులను విడుదల చేసింది. ఇరాన్ నావికా, సైనికోత్పత్తి సదుపాయాలతో పాటు మిసైల్ లాంచర్ వ్యవస్థలను కూడా పూర్తిగా ధ్వంసం చేయడంపైనే దృష్టి పెట్టినట్టు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వెల్లడించారు. హార్మూజ్ సుంకం! రూ.18 కోట్లు చెల్లించిన ఓ నౌక ముందుగా ప్రకటించినట్టుగానే హార్మూజ్ జలసంధిని దాటేందుకు నౌకల నుంచి ఇరాన్ సుంకం వసూళ్లు ప్రారంభించింది. ఇందుకోసం ఒక చమురు నౌక రూ.18 కోట్ల పై చిలుకు మొత్తం చెల్లించినట్టు లాయిడ్స్ లిస్ట్ శుక్రవారం వెల్లడించింది. అంతేగాక హార్మూజ్ గుండా తాను అనుమతించిన నౌకల రవాణాకు పకడ్బందీగా నమోదు వ్యవస్థను కూడా రివల్యూషనరీ గార్డ్ ప్రకటించింది.


