
ఓ 24ఏళ్ల యువకుడు. బ్రతికుండగానే తన సమాధిని తానే తవ్వుకుంటున్నాడు. కుటుంబ సభ్యులు సైతం ఆ యువకుడిని సజీవంగా పాతిపెట్టిన సజీవ అస్థి పంజరంతో పోలుస్తున్నారు. అలా అని ఆ యువకుడికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్య ఏదైనా ఉందా? అంటే అదేం లేదు. ఆరోగ్యంగానే ఉన్నాడు. అయినప్పటికీ తాను మరణం అంచునా ఉన్నానని, బతికే అవకాశం లేక తన సమాధిని తానే తవ్వుకున్నానంటూ చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇంతకీ ఎవరా యువకుడు?. ఎందుకు తన సమాధిని తానే తవ్వుకుంటున్నాడు
ఇజ్రాయెల్- గాజా యుద్ధం నేపథ్యంలో హమాస్ విడుదల చేసిన తాజా వీడియోలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. హమాస్ విడుదల చేసిన వీడియోల్లో 24 ఏళ్ల ఎవ్యాతార్ డేవిడ్ అనే ఇజ్రాయెల్ యువకుడి పరిస్థితి మరింత ధీనంగా ఉంది. మాట్లాడే ఒపిక లేక,చిక్కి శల్యమై కనిపిస్తున్న దృశ్యాలు మరింత కలవరానికి గురి చేస్తున్నాయి.
ఇక హమాస్ విడుదల చేసిన వీడియోలో డేవిడ్ మాట్లాడేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ఓ చిన్న పారతో తన సమాధిని తవ్వుతూ ఇజ్రాయెల్ అధికారిక భాష హీబ్రూలో తన కష్టాలను తెలిపే ప్రయత్నం చేస్తున్నాడు.‘రోజు రోజుకి నేను మరింత చిక్కి శల్యమైతున్నాను. నా గమ్యం ఇక సమాధివైపే. అందుకే నేను నా సమాధిని నేను తవ్వుకుంటున్నాను. అదిగో అక్కడే నా సమాధి ఉంది. నేను అక్కడే సమాధినవుతాను. ఈ బంధనాల నుంచి విడుదలై నా కుటుంబంతో నిద్రపోయే సమయం చాలా తక్కువే ఉంది’ అంటూ చెబుతున్న అతని మాటలు చూపురులను కంటతడి పెట్టిస్తున్నాయి.
ఎవ్యాతార్ డేవిడ్ ఎవరు?
ఎవ్యాతార్ డేవిడ్ 24 ఏళ్ల ఇస్రాయెల్ పౌరుడు. 2023 అక్టోబర్ 7న హమాస్ దాడిలో నోవా మ్యూజిక్ ఫెస్టివల్ నుండి హామాస్ టెర్రరిస్టులు అతడిని బంధించారు. నాటి నుంచి అతను గాజాలో బంధీగా (ఆగస్ట్ 3తో 666రోజులు) ఉన్నాడు. తాజాగా హామాస్ విడుదల చేసిన వీడియోతో డేవిడ్ కుటుంబసభ్యులు సజీవ అస్థి పంజరం,బతికుండగానే సమాధిలో ఉన్నాడని’ వర్ణిస్తున్నారు.
వీడియోలో ఏముంది?
డేవిడ్ గాజా టన్నెల్లో ఒక గోతిని తవ్వుతూ కనిపించాడు. ఇది నా సమాధి. నా శరీరం రోజుకో రోజు బలహీనమవుతోంది. నా కుటుంబంతో పడుకునే అవకాశం త్వరలో ముగిసిపోతుందని చెప్పుకొచ్చాడు. అతని శరీరం చాలా బలహీనంగా, ఆకలితో క్షీణించినట్లు కనిపించగా.. డేవిడ్‌తో పాటు ఇతర బంధీలు రోమ్ బ్రాస్లావ్స్కీ అనే మరో బంధీ వీడియో కూడా హమాస్ విడుదల చేసింది. అతను 21 ఏళ్ల యువకుడు. నోవా ఫెస్టివల్‌లో సెక్యూరిటీగా పనిచేస్తుండగా.. హామాస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు.
గాల్లో కలిసిపోతున్న అమాయకుల ప్రాణాలు
ఇక నిర్విరామంగా కొనసాగుతున్న గాజా,హమాస్ యుద్ధం వేలాది మంది అమాయకుల ప్రాణాల్ని తీసింది. ఇంకా తీస్తూనే ఉంది. 1,219 మంది ఇస్రాయెల్ పౌరులు హమాస్ దాడిలో మరణించారు. 60,000 మంది పాలస్తీనియన్లు గాజాలో మరణించారు. వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారు. ఆహార, ఔషధాల కొరత కారణంగా 169 మంది పిల్లలు ఆకలితో మరణించినట్లు తెలుస్తోంది. కాగా, హమాస్ విడుదల చేసిన వీడియోలతో బంధీలను వెంటనే విడిపించాలని డిమాండ్ చేస్తూ ఇజ్రాయెల్ ప్రజలు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు.
సూపర్ నోవా ఫెస్టివల్ అంటే ఏమిటి..?
సూపర్ నోవాను యూనివర్సల్ పారలెల్లో ఫెస్టివల్ అని కూడా అంటారు. గాజా సరిహద్దుకు సమీపంలో ఉన్న గ్రామీణ ప్రాంతం రీమ్‌లో జరిగింది. సూపర్ నోవా పండుగను యూదులు వారంపాటు జరుపుకుంటారు. సెప్టెంబర్ 29, 2023 నుంచి అక్టోబర్ 6, 2023 వరకు జరిగే వేడుక. పంట సేకరణను ఉద్దేశించి జరుపుకునే వేడుక ఇది. పిల్లలపై దేవుడి దయకు నిదర్శనంగా సంబరాలు చేసుకుంటారు. ఈ పండుగ ఐక్యమత్యం, ప్రేమలకు గుర్తుగా మనసుకు హత్తుకునే అంశాలతో కూడుకుని ఉంటుంది.
పండుగ సందర్భంగా వేలాది మంది యువకులు వేడుకలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే రాత్రిపూట గాజా సరిహద్దును దాటుకుని వందిలాది రాకెట్ దాడులు జరిగాయి. ఉగ్రవాదులు మారణాయుధాలతో కాల్పులకు తెగబడ్డారు. గన్‌లతో దాదాపు 3500 మంది ఇజ్రాయెల్ యువతపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. వేడుకలో చాలా మంది అప్పటికే మద్యం సేవించి మత్తులో ఉండగా.. బైక్‌లపై వచ్చిన దుండగులు ఏకే-47 వంటి ఆయుధాలతో కాల్పులకు తెగబడ్డారు. భయంతో పరుగులు తీస్తున్న జనం, క్షతగాత్రుల అరుపులతో ఆ ప్రాంతమంతా అల్లకల్లోలంగా మారింది.
How psychopathic is Hamas?
It forced starving hostage Evyatar David to DIG HIS OWN GRAVE for the cameras. pic.twitter.com/iMa404St4s— Eylon Levy (@EylonALevy) August 2, 2025