విశ్వంభరకు బై బై | Chiranjeevi Vishwambhara Shoot Ends | Sakshi
Sakshi News home page

విశ్వంభరకు బై బై

Jul 26 2025 12:22 AM | Updated on Jul 26 2025 12:22 AM

Chiranjeevi Vishwambhara Shoot Ends

‘విశ్వంభర’ సినిమా షూటింగ్‌కు చిరంజీవి బై బై చెప్పారు. చిరంజీవి హీరోగా నటించిన సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్‌ మూవీ ‘విశ్వంభర’. ఈ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహించారు. త్రిషా కృష్ణన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో హీరోయిన్‌ ఆషికా రంగనాథ్, కునాల్‌ కపూర్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్‌ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

తాజాగా హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో వేసిన సెట్‌లో చిరంజీవి, బాలీవుడ్‌ నటి మౌనీ రాయ్‌ పాల్గొనగా చిత్రీకరించిన ఓ స్పెషల్‌ సాంగ్‌తో ‘విశ్వంభర’ సినిమా చిత్రీకరణ ముగిసింది. చిరంజీవి, మౌనీ రాయ్‌లతో పాటు వంద మంది డ్యాన్సర్స్‌ ఈ పాటలో పాల్గొన్నారు. గణేష్‌ ఆచార్య ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. కాసర్ల శ్యామ్‌ లిరిక్స్‌ అందించిన ఈ సాంగ్‌కు భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించారు. ఇక ఈ ‘విశ్వంభర’ సినిమాకు ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్‌ వర్క్‌ జరుగుతోంది. ఈ పని పూర్తి కాగానే ‘విశ్వంభర’ రిలీజ్‌ డేట్‌పై ఓ స్పష్టత వస్తుంది. ఈ సినిమా సెప్టెంబరులో విడుదలయ్యే అవకాశం ఉందని తెలిసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement