ఓటీటీలోకి ‘వరప్రసాద్‌గారు’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే? | Chiranjeevi Mana Shankara Vara Prasad Garu Movie OTT Release Date Fix, Check Out Streaming Platform Details | Sakshi
Sakshi News home page

అఫిషియల్‌.. ఓటీటీలోకి ‘వరప్రసాద్‌గారు’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Feb 7 2026 1:29 PM | Updated on Feb 7 2026 1:36 PM

Mana Shankara Vara Prasad Garu OTT Release Date Fix

ఈ సంక్రాంతికి టాలీవుడ్‌లో దాదాపు ఐదు సినిమాలు రిలీజ్‌ అయితే..వాటిలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టిన సినిమా ‘మన శంకర వరప్రసాద్‌గారు’. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి, నయనతార జంటగా నటించిన ఈ చిత్రం జనవరి 12న థియేటర్స్‌లో రిలీజ్‌ అయింది. తొలి రోజే హిట్‌ టాక్‌ రావడంతో భారీ కలెక్షన్స్‌ని రాబట్టింది. రిలీజ్‌ అయిన మొదటి వారంలోనే దాదాపు రూ. 300 కోట్ల వరకు కలెక్షన్స్‌ని రాబట్టింది. మొత్తంగా రూ. 375 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది.

అయితే ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌ కోసం కూడా చాలా మంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. థియేటర్స్‌లో రికార్డు బద్దలు కొట్టిన ఈ చిత్రం..త్వరలోనే డిజిటల్‌ స్క్రీన్‌పై సందడి చేయనుంది. రిలీజ్‌కి ముందే ఓటీటీ హక్కులను కైవసం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5.. తాజాగా స్ట్రీమింగ్‌ డేట్‌ని ప్రకటించింది.  ఫిబ్రవరి 11 నుంచి ఈ మూవీ జీ5లో స్ట్రీమింగ్‌ కానుంది.

కేవలం తెలుగులో మాత్రమే రిలీజైన ఈ చిత్రాన్ని, ఇతర భాషల్లోకి డబ్బింగ్ చేసి ప్రసారం చేయనున్నారు.  తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలతో పాటుగా మరాఠీ, బెంగాలీ ఆడియోలతో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు  జీ5 అధికారికంగా వెల్లడించింది. మరి డిజిటల్‌ స్క్రీన్‌పై ఈ చిత్రం ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement