రిటైర్మెంట్‌ గురించి క్లారిటీ ఇచ్చిన విక్రాంత్ మాస్సే | Vikrant Massey comment on his movie retirement | Sakshi
Sakshi News home page

రిటైర్మెంట్‌ గురించి క్లారిటీ ఇచ్చిన విక్రాంత్ మాస్సే

Feb 7 2026 10:07 AM | Updated on Feb 7 2026 10:12 AM

Vikrant Massey comment on his movie retirement

బాలీవుడ్‌ నటుడు విక్రాంత్ మాస్సే సినిమాలకు గుడ్‌బై చెబుతున్నట్లు కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. అయితే,  తాజాగా ఇదే అంశం గురించి ఆయన మరోసారి క్లారిటీ ఇచ్చారు.  తన రిటైర్మెంట్‌ను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని మరోసారి వెల్లడించారు.  ‘12th ఫెయిల్‌’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన ఆ తర్వాత కూడా వరసుగా పలు ప్రాజెక్ట్స్‌లలో పనిచేశారు.

ఎక్కువ పని ఒత్తిడి కారణంగా తాను సినిమాలకు గుడ్‌బై చెబుతున్నట్లు పేర్కొన్నానని ఆయన అన్నారు. కానీ, తాను చెప్పాలనుకుంటున్న విషయాన్ని తక్కువ పదాలలో చెప్పేసరికి చాలామంది మరోలా అర్థం చేసుకున్నారని క్లారిటీ ఇచ్చారు. కొంత కాలం  విరామం తీసుకుందామనుకున్నానని విక్రాంత్‌ మాస్సే చెప్పారు. శాశ్వతంగా నటనకు దూరమవుతానని తాను చెప్పలేదని గుర్తుచేశారు. రోజులో  సుమారు 16 గంటలు పని చేయడం చాలా కష్టంగా అనిపించడం వల్ల జీవితంలో చాలా అలసిపోయానన్నారు. దీంతో కాస్త బ్రేక్‌ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కానీ, తాను సినిమా పరిశ్రమ నుంచి రిటైర్మెంట్‌ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయని అందులో నిజం లేదని విక్రాంత్‌  పేర్కొన్నారు.

బాలికా వధు (చిన్నారి పెళ్లికూతురు) సీరియల్స్‌తో కెరీర్‌ ప్రారంభించిన విక్రాంత్‌..  2017లో 'ఎ డెత్‌ ఇన్‌ ది గంజ్‌' వెండితెరపై హీరోగా కనిపించారు. సుమారు 20కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. అయితే, 12th ఫెయిల్‌ సినిమాతో ఆయన దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఫిలిం ఫేర్‌ అవార్డ్‌తో పాటు  'ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌'గా కూడా గుర్తింపు పొందారు. విక్రాంత్‌, షీతల్‌ ఏళ్ల తరబడి ప్రేమించుకున్న వారిద్దరూ.. 2022 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. వారికి కుమారుడు జన్మించగా అతడికి వర్దన్‌ అని నామకరణం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement