ప్రపంచకప్‌ మ్యాచ్‌లకు భారత జట్టు ప్రకటన | India A Squad for T20 World Cup 2026 Warm Up Matches announced, Tilak Varma back | Sakshi
Sakshi News home page

ప్రపంచకప్‌ మ్యాచ్‌లకు భారత జట్టు ప్రకటన

Feb 2 2026 1:53 PM | Updated on Feb 2 2026 2:03 PM

India A Squad for T20 World Cup 2026 Warm Up Matches announced, Tilak Varma back

టీ20 ప్రపంచకప్‌ వార్మప్‌ మ్యాచ్‌ల కోసం భారత-ఏ జట్టును ఇవాళ (ఫిబ్రవరి 2) ప్రకటించారు. ఈ జట్టు ఫిబ్రవరి 2న యూఎస్‌ఏతో (నవీ ముంబై), 6న నమీబియాతో (బెంగళూరు) మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మ్యాచ్‌ల కోసం 15 మంది సభ్యుల జట్టును ప్రకటించారు. 

ఈ జట్టులో టీమిండియా స్టార్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ ప్రత్యేక ఆకర్శనగా ఉన్నాడు. తిలక్‌ కడుపులో సమస్యతో న్యూజిలాండ్‌ సిరీస్‌కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. తిలక్‌ రీఎంట్రీ ఎలా ఉంబోతుందోనని ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వార్మప్‌ మ్యాచ్‌లతో తిలక్‌ ఫామ్‌లోకి రావాలని వారు కోరుకుంటున్నారు.

ఈ జట్టుకు కెప్టెన్‌గా ఢిల్లీ ఆటగాడు ఆయుశ్‌ బదోని ఎంపిక కాగా.. ప్రియాంశ్‌ ఆర్య, అషుతోష్‌ శర్మ లాంటి ఐపీఎల్‌ స్టార్లు చోటు దక్కించుకున్నారు. టీమిండియా ఆటగాళ్లు రవి బిష్ణోయి, రియాన్ పరాగ్ కూడా ఈ జట్టుకు ఎంపికయ్యారు. మయాంక్ యాదవ్, నమన్ ధీర్, ఎన్ జగదీశన్, ఉర్విల్ పటేల్ వంటి దేశీయ స్టార్లు ఈ జట్టులో ఉన్నారు.  

వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ల కోసం భారత-ఏ జట్టు.. 
అయుష్ బదోని (c), తిలక్ వర్మ, నమన్ ధీర్, అశుతోష్ శర్మ, ప్రియాంశ్ ఆర్యా, ఎన్ జగదీశన్ (wk), రియాన్ పరాగ్, మనవ్ సుతార్, అశోక్ శర్మ, ఉర్విల్ పటేల్ (wk), గుర్జప్నీత్ సింగ్, విప్రాజ్ నిగమ్, రవి బిష్ణోయి, ఖలీల్ అహ్మద్, మయాంక్ యాదవ్.  

ఇదిలా ఉంటే, వార్మప్‌ మ్యాచ్‌ల్లో భాగంగా టీమిండియా కూడా ఓ మ్యాచ్‌ ఆడనుంది. ఫిబ్రవరి 4న భారత జట్టు సౌతాఫ్రికాతో తలపడుతుంది. ఫిబ్రవరి 7 నుంచి ప్రపంచకప్‌ రెగ్యులర్‌ మ్యాచ్‌లు మొదలవుతాయి. టోర్నీ ఓపెనర్‌లో పాక్‌, నెదర్లాండ్స్‌ కొలొంబో వేదికగా తలపడనున్నాయి. అదే రోజు భారత్‌ కూడా తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. ముంబైలోని వాంఖడేలో టీమిండియా యూఎస్‌ఏతో తలపడుతుంది. 

Advertisement
 
Advertisement
Advertisement