సైలెంట్‌గా వస్తారు.. స్పెషల్‌గా ఉండిపోతారు: రవికృష్ణ | Ravi Krishna Birthday post to Navya Swamy: Some people Walk into our Lives Quietly | Sakshi
Sakshi News home page

Ravi Krishna: ఓయ్‌ స్వామి.. హ్యాపీ బర్త్‌డే.. నువ్వు కూడా అలాంటిదానివే!

Mar 18 2026 11:07 AM | Updated on Mar 18 2026 11:18 AM

Ravi Krishna Birthday post to Navya Swamy: Some people Walk into our Lives Quietly

చెన్నైలో ఓ సీరియల్‌కి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేసిన రవికృష్ణ తర్వాత నటుడిగా మారాడు. మొగలి రేకులు సీరియల్‌తో నటుడిగా సెన్సేషన్‌ అయ్యాడు. అనంతరం బిగ్‌బాస్‌ షోతో గుర్తింపు పొందాడు. ఈ షో తర్వాత సినిమా ఛాన్సులు ట్రై చేశాడు. పలు చిత్రాల్లో నటించాడు. విరూపాక్ష సినిమాతో అతడి కెరీర్‌ మలుపు తిరిగింది. లవ్‌ మీ: ఇఫ్‌ యు డేర్‌, దండోరా.. ఇలా పలు సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.

ప్రేమలో..
విజయవాడకు చెందిన ఇతడు ఆమె కథ అనే సీరియల్‌ చేస్తున్న సమయంలో నటి నవ్య స్వామితో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఏ షోకి వెళ్లినా జంటగా కలిసే వెళ్లేవారు. అయితే ప్రేమలో ఉన్నామని మాత్రం ఎన్నడూ అధికారికంగా వెల్లడించలేదు. కానీ నవ్య బర్త్‌డే రోజు మాత్రం తనతో దిగిన ఫోటోలు షేర్‌ చేస్తూ అందమైన క్యాప్షన్‌ ఇస్తుంటాడు. మంగళవారం (మార్చి 17న) నవ్య బర్త్‌డే. 

మనకు తెలియకుండానే స్పెషల్‌
ఈ సందర్భంగా ఆమెతో కలిసి దిగిన రెండు పిక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఓయ్‌ స్వామి.. హ్యాపీ బర్త్‌డే. ఇలాగే క్రేజీగా, అందంగా జ్ఞాపకాలను కూడబెట్టుకుంటూ ఉండాలి. కొందరు మన జీవితాల్లోకి అనుకోకుండా వస్తారు. కానీ, మనకు తెలియకుండానే ఎంతో ప్రత్యేకంగా మారిపోతారు. అలాంటి అరుదైనవారి జాబితాలో నువ్వు కూడా ఒకదానివి! అని రాసుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు.. మీరు పెళ్లెప్పుడు చేసుకుంటారని అడుగుతున్నారు. విజయ్‌-రష్మిక జోడీలాగే మీ జంట కూడా అద్భుతంగా ఉంటుందని, త్వరగా వివాహం చేసుకోమని కోరుతున్నారు.

 

 

చదవండి: పీలింగ్స్‌ చూశారు.. దీనికేమైందని అంత రాద్ధాంతం?: నటి

Advertisement
 
Advertisement
Advertisement