'కేడీ: ద డెవిల్' సినిమా నుంచి రిలీజైన ఐటం సాంగ్ సర్కే చునర్ వివాదాస్పదమైంది. సంజయ్ దత్, నోరా ఫతేహి డ్యాన్స్ చేసిన ఈ సాంగ్‌లోని లిరిక్స్ డబుల్ మీనింగ్ డైలాగులతో నిండి ఉంది. దీంతో వెంటనే ఆ పాటను తొలగించాలని కేంద్రం ఆదేశించింది. దాంతో హిందీ వర్షన్‌ను యూట్యూబ్ నుంచి తొలగించారు. ఈ పరిణామాలపై కేడీ సినిమా డైరెక్టర్ ప్రేమ్ భార్య, నటి రక్షిత సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది.
పీలింగ్స్ అప్పుడు ఓకే
నేనంతా చూస్తూనే ఉన్నాను. మీరందరూ రకరకాల పోస్టులకు నన్ను ట్యాగ్ చేస్తూనే ఉన్నారు. ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. పీలింగ్స్.., డ్రీమమ్ వేకపమ్.., చోలీకే పీచే క్యా హై.. ఇలాంటి వందలాది పాటలు బయటకు వచ్చినప్పుడు అందరికీ బాగానే అనిపించాయి. శృంగారమే ప్రధానంగా సినిమాలు వచ్చినప్పుడు కూడా అందరూ బానే ఉన్నారు. ఎవరికీ ఏ ఇబ్బంది కలగలేదు.
చెత్త రచయిత అయిపోడు
కానీ ఇప్పుడు ఒక్క పాట విషయంలో మాత్రం పెద్ద రాద్ధాంతమే జరుగుతోంది. అదెందుకో నాకర్థం కావడం లేదు. అలా అని నేను ఈ పాటను సమర్థించడం లేదు. కాకపోతే ఈ వివక్షను అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ఒక్క పాట సరిగా లేనంత మాత్రాన ఆయనను చెత్త రచయిత అయిపోడు. తను ఇదంతా కావాలని చేస్తున్నారని అనడం కూడా తప్పే! కొన్ని సినిమాలు ఆడనంత మాత్రాన ఆయన్ని మంచి దర్శకుడు కాదని అనలేం. మీకు ఆయన్ని ప్రశ్నించే హక్కుంది, కానీ దూషించే హక్కు ఎవరికీ లేదు.
ప్రశ్నించే హక్కుంది
ఈరోజుల్లో మంచి, చెడు అన్నిరకాల పాటలు నిత్యం వస్తూనే ఉన్నాయి. రక్తపాతం, లైంగికతకు సంబంధించిన సినిమాలను జనాలు ఓపెన్‌గా చూస్తున్నారు. ప్రేమ్ కన్నడిగుడు. అతడిపై మీకు పూర్తి హక్కులున్నాయి. ఏది తప్పు? ఏది ఒప్పు? అని ప్రశ్నించే హక్కుంది. కానీ అతడి పనితీరును తప్పుపడుతున్నారు. ఒక కన్నడ డైరెక్టర్‌కు సినిమాను ఓటీటీలో అమ్మడమనేది ఎంత పెద్ద ఛాలెంజో మీకు తెలుసా? అలాగే జనాల్ని థియేటర్‌కు రప్పించడం కూడా సవాలుగానే మారింది.
కొంచెం సమయం ఇవ్వండి
ఇది కేవలం మా ఒక్క కథే కాదు, కన్నడ చిత్రపరిశ్రమలోని ప్రతి సినిమా కథ ఇంతే! రాబోయే రోజుల్లో అంతా సర్దుకుంటుందన్న నమ్మకం ఉంది. కొంచెం సమయం ఇవ్వండి. కేడీ మాకు బిడ్డలాంటిది. దానికి ఏది సరైనదో చివరకు అదే చేస్తాం. మమ్మల్ని నమ్మండి అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వరుస పోస్టులు పెట్టింది. ప్రేమ్ దర్శకత్వంలో ధ్రువ సర్జా హీరోగా నటించిన కేడీ మూవీ ఏప్రిల్ 30న విడుదల కానుంది.
చదవండి: చికిరి చికిరి నేనే రాశా.. ఈ పాటకు మాత్రం అవమానం: గేయరచయిత


