మహిళలు ఒకవైపే అలా ఎందుకు కూర్చుంటారు? | The untold story: Why women sit sideways on motorbikes? | Sakshi
Sakshi News home page

మహిళలు ఒకవైపే అలా ఎందుకు కూర్చుంటారు?

May 2 2026 10:41 AM | Updated on May 4 2026 9:18 AM

The untold story: Why women sit sideways on motorbikes?

చాలా మంది మహిళలు సాధారణంగా బైక్‌ వెనుక కూర్చున్నప్పుడు రెండు కాళ్లు ఒకే వైపునకు పెట్టి కూర్చుంటారు. దీని వెనుక ఏదైనా సైంటిఫిక్‌ రీజన్‌ ఉందనో, లేదంటే కేవలం చీరలు కట్టుకోవడం వల్ల ఇలా కూర్చుంటారని మనం భావిస్తుంటాం. కానీ, దీని వెనుక శతాబ్దాల నాటి యూరోపియన్‌ చరిత్ర, వలస రాజ్యాల ప్రభావం ఉందని చెబుతున్నారు ప్రముఖ బైకర్, ఇన్‌స్టాగ్రామ్‌ క్రియేటర్‌ జెనిత్‌ ఇర్ఫాన్‌. 

ఆమె ఇటీవల షేర్‌ చేసిన ఒక వీడియో ద్వారా ఈ ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వీడియోలో ఉన్న అంశాల ప్రకారం.. మహిళలు ఇలా ఒక పక్కకు తిరిగి కూర్చోవడం అనే సంస్కృతి.. మధ్యయుగ ఐరోపాలోని ఉన్నత వర్గాల నుంచి వచ్చిన అలవాటు. 14వ శతాబ్దంలో ప్రిన్సెస్‌ అన్నే ఆఫ్‌ బోహేమియా దాదాపు 1,600 కిలోమీటర్ల ప్రయాణాన్ని గుర్రంపై ఒక పక్కకు కూర్చునే పూర్తి చేశారు. ఆ కాలంలో మహిళలు పురుషుల వలె గుర్రంపై రెండు కాళ్లు ఇరువైపులా వేసి కూర్చోవడం అమర్యాదగా భావించేవారు. స్త్రీల మర్యాదను కాపాడటానికి ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు. బ్రిటిష్‌  పాలన సమయంలో ఈ సంస్కృతి భారతదేశానికి దిగుమతి అయ్యింది. అప్పట్లో బ్రిటిష్‌ మహిళలు గుర్రపు స్వారీ చేసేటప్పుడు ఇదే పద్ధతిని  పాటించేవారు. కాలక్రమేణా ఇది మన దేశంలోని సామాజిక నిబంధనల్లో కలిసిపోయింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement