breaking news
women
-
జేఈఈ ప్రిపరేషన్ నుంచి రాష్ట్రపతి మెడల్ వరకు..!
ఎన్డీఏ ప్రతిష్టాత్మకమైన పోర్టల్స్ 149వ కోర్సు నుంచి సుమారు 329 మంది క్యాడెట్లు ఉత్తీర్ణులయ్యారు. వారంతా ట్రై సర్వీసెస్ అకాడమీలోని రెండో బ్యాచ్ మహిళలు. మొత్తం 15 మంది మహిళా క్యాడెట్లకు ఈసారి చోటు కల్పించింది డిఫెన్స్ అకాడమీ. వారిలో మొత్తం మెరిట్ ఆర్డర్ పరంగా రాష్ట్రపతి మెడల్ని గెలుపొందిన తొలి మహిళా క్యాడెట్‌గా ఘనత సాధించిందామె. ఇంతకీ ఎవరామె..? ఆమె ఈ ఘనతను ఎలా సాధించగలిగిందంటే..ఇప్పటి వరకు ఇద్దరు మహిళా క్యాడెట్లు విద్యారంగంలో అగ్రస్థానంలో నిలిచారు. ఒకరు 148వ కోర్సులో కాగా, మరొకరు 149వ కోర్సులో. ఈ ఏడాది డిపెన్స్ అకాడమీ 149వ కోర్సులో మెరిట్ క్రమంలో గెలుపొందిన తొలి మహిళ సిద్ధి జైన్. దీన్ని మొత్తం మెరిట్ జాబితా, విద్యారంగం, బహిరంగ శిక్షణ, సామూహిక శిక్షణ, అధికారిలాంటి లక్షణాలు, ప్రత్యేక సేవా అంశాలతో కూడిన పనితీరు తదితరాల ఆధారంగా రూపొందించారు. ఈ ఏడాది రాష్ట్రపతి బంగారు పతకాన్ని ఆల్ఫా స్క్వాడ్రన్‌కు చెందిన అకాడమీ క్యాడెట్ అడ్జుటెంట్ దీపక్ కంద్‌పాల్కి, రాష్ట్రపతి వెండి పతకాన్ని ఆస్కార్ స్క్వాడ్రన్‌కు చెందిన అకాడమీ క్యాడెట్ కెప్టెన్ సిద్ధార్థ్ సింగ్, రాష్ట్రపతి కాంస్య పతకాన్ని కిలో స్క్వాడ్రన్‌కు చెందిన డివిజనల్ క్యాడెట్ కెప్టెన్ సిద్ధి జైన్లు అందుకున్నారు. ఈ మేరకు పాసింగ్ అవుట్ క్యాడెట్లను ఉద్దేశించి అడ్మిరల్ త్రిపాఠి మాట్లాడుతూ..ఈరోజు పట్టభద్రులవుతున్న రెండవ బ్యాచ్ మహిళా క్యాడెట్లను చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది. వారిలో సుమారు 15 మంది తమ పురుష సహచరులతో సమానంగా భుజం భుజం కలిపి నిలబడ్డారు. సేవ ఒకే ప్రమాణాన్ని గౌరవిస్తుందనేది ఈ ఘటన పునరుద్ఘాస్తోందని అన్నారు. ఇక వైమానిక దళంలో చేరనున్న సిద్ధి మాట్లాడుతూ.."మేము ఈ శిక్షణలో అనేక ఒడిదడుకులను చవిచూశాం. ప్రతి దశలోనూ మాకు మార్గదర్శకత్వం వహించిన ఉపాధ్యాయుల నుంచి, కుటుబం నుంచి పుష్కలంగా మద్దతు, ప్రేమ లభించింది. అందువల్లే అకాడమీలో సవాలుతో కూడిన శిక్షణ సాధ్యమైందని పేర్కొంది."అలాగే ఎన్డీఏ మహిళా క్యాడెట్లను చేర్చుకోవడాని కంటే ముందు తాను ఇంజనీరింగ్ కోర్సులో చేరి ఆపై సాయుధ దళాలలో చేరాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. ఆ లక్ష్యంతో నేఐఐటీ జేఈఈ కోసం సన్నద్ధమైనట్లు వెల్లడించింది. అయితే ఇంతలో ఎన్డీలో మహిళా క్యాడెట్ల చేరేలా మార్గం సుగమం కావడం..అందులో తాను చేరడం చకచక జరిగిపోయిందని, పైగా అందుకు తన కుటుంబం పూర్తి స్థాయిలో సహకరించిందని చెప్పుకొచ్చింది. కాగా, యూపీఎస్సీ నిర్వహించే ఎన్డీఏ, ఇండియన్ నావల్ అకాడమీ పరీక్షలకు అర్హత ఉన్న మహిళలు హాజరు కావడానికి ఆదేశాలు కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించగా, ఆగస్టు 2021లో సుప్రీంకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వు తర్వాత NDAలోకి మహిళల ప్రవేశం సాధ్యమైంది. ఆ నేపథ్యంలోనే 148వ కోర్సులో భాగంగా 2022 జూలై-ఆగస్టులో మహిళా క్యాడెట్ల మొదటి బ్యాచ్ NDAలో చేరింది.(చదవండి: ఆనంద్ మహీంద్రా మెచ్చిన గ్రామం..! ఐక్యతతో ఏదైనా సాధ్యం..!) -
పరువు పేరుతో ప్రేమకు సమాధి; తప్పెవరిది?
నాగరిక ప్రపంచంలో ప్రేమకు చోటు లేకుండా పోతోంది. కుల దురహంకారం మట్టికాళ్ల మహారాక్షసిలావిజృంభిస్తోంది. మనసుకు నచ్చినవాడిని ప్రేమించడమే తరతరాలుగా ‘ఆమె’ పాలిట శాపమైపోతోంది.మనసిచ్చినవాడిని మను వాడాలనుకున్న అమ్మాయి కలల్ని సొంత కుటుంబ సభ్యులే కాల రాస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలో చోటు చేసుకున్న హృదయ విదారక ఘటన పలువురి కంట తడి పెట్టిస్తోంది. ఒక అబ్బాయి ప్రేమించిన అమ్మాయిని ధైర్యంగా ఇంటికి తీసుకొచ్చినపుడు, అబ్బాయి తల్లిదండ్రులు స్వీకరించిన సులువుగా అమ్మాయి తల్లిదండ్రులు ఒక జంట ప్రేమను ఎందుకు అంగీకరించకలేక పోతున్నారు. అమ్మాయి ప్రేమిస్తే.. అది ధిక్కారమే అన్నట్టు ఆగ్రహావేశాలతో ఎందుకు రగిలిపోతున్నారు.. ఎందుకంటే అనాదికాలంగా పాతుకుపోయిన ఆమె మన సొత్తు..మనం చెప్పినట్టే వినాలి అనే భావన. అమ్మాయి మన స్వాధీనంలోనే ఉండాలనే ఆధిపత్య ధోరణి. కులం తక్కువ వాడిని పెళ్లి చేసుకొని, వాడితో పిల్లల్ని కంటుందా? అనే అత్యంత అమానవీయమైన భావజాలం వారిలో తీరని అసంతృప్తిని రగిలిస్తోంది.అమ్మాయి ప్రేమే సమస్యతమ కుటుంబంలోని అమ్మాయి ప్రేమిస్తే ఎందుకంత అగ్గిమీద గుగ్గిలం అవుతారు. కూర్చుని మాట్లాడుకుని, పరిష్కరించుకోవాల్సిన సమస్యని హత్యల దాకా ఎందుకు తీసుకెళతారు. ఎందుకంటే అనాదిగా వస్తున్న ఆధిపత్య, అహంకార పూరిత ధోరణి. ఆడవారి స్వేచ్ఛను, ప్రేమను అంగీకరించలేని అసహనం. వివక్ష. బాల్యంలో తండ్రి ఇంట, యవ్వనంలో భర్త ఇంట, ముసలి తనంలో కొడుకు ఇంట ఆడది బతకాలి. మారు మాట్లాడినా, ఎదురు తిరిగినా అంతే సంగతులు, పరువు ప్రతిష్ట పేరుతో ఇంట్లోని మగవాళ్ల ఆగ్రహానికి బలికావాల్సిందే. ఇదే తరతరాలుగా సాగుతున్న తంతు. మహిళల్ని, లేదా యువతులను పితృస్వామ్య అణచివేత, లైంగిక,శారీరక, మానసిక వేధింపులతోనే కాదు వారికి నచ్చినవారిని హతమార్చి, ఇలా కూడా అతి దారుణంగా చంపేయొచ్చు. వారిని మానసికంగా దెబ్బతీయచ్చు. తండ్రి , సోదరులు ఇలా ఎవరైనా సరే పరువు హత్యల ద్వారా పరోక్షంగా గానీ, ప్రత్యక్షంగా గానీ ‘ఆమెను’ హత్య చేయవచ్చు. అపుడే వారి అహం చల్లారుతుంది. ఈ అహంభావమే, దౌర్జన్యమే ఇప్పటికీ రాజ్య మేలుతోంది. ఆయా కుంటుంబాలలోని మహిళలు ఇలాంటి హత్యలను సమర్థించడం సాయపడుతూ ఉండటం దురదృష్టకరంఇటీవల జరిగిన సంచలన హత్యలు2016 మార్చి 13న లో తమిళనాడులోని తిరుప్పూర్‌లో జరిగిన శంకర్ పరువు హత్య సంచలనం రేపింది. తమ కుమార్తె కౌసల్యం శంకర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుందన అక్కసుతో, కౌసల్య తండ్రి చిన్నస్వామితన బంధువులతో కలిసి పట్టపగలే నడిరోడ్డుపై దారుణంగా హత్య చేయించారు.ఈ కేసులో ఏమైంది... నేరస్తులకు దక్కిన పరువు ఉంటి? నలుగురిలోనూ హంతకులనే పేర్లు, జైలు జీవితం అంతేగా. ప్రణయ్ హత్యతో పరువు నిలబడిందా? ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2018, సెప్టెంబర్ 14న పెరుమాళ్ల ప్రణయ్‌ది మరో దారుణ హత్య. కూతురు అమృతను ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కారణంగా, పగపెంచుకుని, కిరాయిహంతకుల సాయంతో స్వయంగా అమృత తండ్రి మారుతీ రావు చంపించాడు.ఒకవైపు అల్లారుముద్దుగా పెంచుకున్న కన్న కూతురు దూరం, మరోవైపు అల్లుడి హత్యతో ఆమె జీవితంలో నిప్పులు పోసానన్న పశ్చాత్తాపం ఊపిరి సలప నీయలేదు. దీనికి తోడు పోలీసు కేసులు విచారణ, చివరికి బలవన్మరణానికి పాల్పడ్డాడు మారుతీరావు. నానమ్మ కోసం హత్య 2025 జనవరిలో సూర్యాపేటలో భార్గవి, కృష్ణల ప్రేమను పరువు హత్య చేశారు. తమ కుమార్తెను భార్గవిని తన స్నేహితుడు కృష్ణ కులాంతర వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక పోయాడు దీంతో స్నేహితుడు అన్న కనికరం కూడా లేకుండా మరి కొంత మందితో కలిసి కృష్ణను నమ్మించి హత్య చేశారు. ఈ కేసులో నానమ్మ పాత్ర పెద్ద చర్చు దారితీసింది. మొదటినుంచి భార్గవి ప్రేమను వ్యతిరేకించి నాన్నమ్మ బుచ్చమ్మ మనవళ్లను రెచ్చగొట్టి మరీ ఈ హత్యకు వుసి గొల్పిందని పోలీసులు నిర్ధారించారు.ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో సూర్యాపేటలో 2000లో కు లాంతర వివాహం చేసుకుందని ఓ వ్యాపారి యువకుడిని హత్య చేయించాడు. 2012లో తన కుమార్తెను ప్రేమిస్తున్నాడని భావించి ప్రేమికుడిని హత్య చేశారు. అదేవిధంగా యాదాద్రి జిల్లాలో లింగరాజుపల్లికి చెందిన తుమ్మల స్వాతి, నరేష్ ప్రేమించు కున్నారు. కేవలం కుల అహంకారంతోనే స్వాతి తల్లిదండ్రులు నరేష్‌ను హత్య చేశారు. అది తట్టుకోలేక స్వాతి కూడా మనస్తాపంతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా మహారాష్ట్రలోని నాందేడుకు చెందిన యువకుడి హత్య. ఆంచల్ మామిద్వార్‌కు స్వయంగా తల్లిదండ్రులే పుట్టెడుదుఃఖాన్ని మిగిల్చారు. అంచల్ ప్రేమికుడు సాక్షమ్ టేట్ (25)ని దారుణంగా కాల్చి చంపారు. ఇవి మచ్చుకు కొన్నిమాత్రమే. వెలుగులోకి రాని కౄరహత్యలు ఎన్నో...మరెన్నో..! పగ కాదు, ప్రేమను పంచుదాంకన్నబిడ్డల కంటే వారి సంక్షేమం కంటే తల్లిదండ్రులకు ఏముంటుంది. జీవితాంతా కష్టపడి ప్రాణానికి ప్రాణంగా పెంచుతారు. కానీ పెళ్లి దగ్గరికి వచ్చేసరికి మూర్ఖంగా మారిపోతున్నారు. అమ్మాయి ప్రేమను అస్సలు ప్రేమను జీర్ణించుకోలేక పగతో రగిలి పోతున్నారు. కుటుంబ పరువు గంగలో కలిసిపోయిందంటూ గగ్గోలు పెడతారు. ఫలితంగా దారుణ హత్యలకు తెగబడుతున్నారు. చివరికి కన్నబిడ్డ గొంతుకు ఉరి బిగించేందుకు కూడా వెనుకాడటం లేదు.ఏమిటీ పరిష్కారంఇద్దరు వ్యక్తులు కలిసి జీవించాలంటే ఉండాల్సింది ప్రేమ, అభిమానం, పరస్పరం నమ్మకం. ప్రేమకు, ప్రేమ వివాహాలకు కులాలు, మతాలు అడ్డుగోడలు కాకూడదు. ఆర్థిక స్థోమత అస్సలు సమస్యే కాదు. కానీ తక్కువ, ఎక్కువ అనే లేని పోని విద్వేషాలతో ప్రేమ వివాహాలను పెద్దలు అడ్డుకుంటున్నారు. కుటుంబ పరువు, సమాజంలో నలుగురూ ఏమనుకుంటారో అనే లేని పోని ఆందోళన వారిని భయపెడుతోంది. ఇదే ప్రేమికులనూ భయపెడుతోంది. అందుకే తమ ప్రేమ బతకని చోట తామూ బతకలేమని ప్రేమికులు ఒకవైపు ఆత్మహత్యలకు పాల్పడుతోంటూ, మరోవైపు ప్రేమకోసం ప్రేమగా, ధైర్యంగా కలిసి బతుకుదామను కున్న వారిని స్వయంగా కుటుంబ సభ్యులే హత్య చేస్తుండటం బాధాకరం.రాజ్యాంగం ప్రకారం మేజర్ అయిన ప్రతీ యువతీ యవకుడికీ తమకు నచ్చిన వారిని భాగస్వాములుగా ఎంచుకునే హక్కు ఉంది. ఈ హక్కును కాలరాయడం చట్టరీత్యా నేరం. ఇలాంటి నేరాలకు పాల్పడిని వారికి కఠిన శిక్షలు పడేలా చట్టం, చట్టాన్ని రక్షించే అధికారులు చిత్తశుద్ధితో చర్యలు చేపట్టాలి. చట్టాలు, ప్రేమ వివాహాలు, పరువుహత్యలు, పర్యవసానాలపై పౌరుల్లో అవగాహన కల్పించాలి. "మతములన్నియు మాసిపోవును.. జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును." అని మహాకవి గురజాడ అప్పారావు చెప్పినట్టు కుల, మత బేధం లేని సమాజం ఇపుడు మనకు కావాలి. ఇకనైనా పరువు పేరుతో జరుగుతున్న మారణకాండ ఆగాలని కోరుకుందాం. పరువు, ప్రతీకారంకోసం నిండు నూరేళ్ల ప్రేమను కోల్పోయిన బాధితురాళ్ల వేదన సాక్షిగా నిజమైన ప్రేమలను గెలిపించుకుందాం. -
నిర్భయ!భయం ఆమె ‘మెదడు’లోనే లేదు
పొట్టలో ఏదో సీతాకోక చిలుకలు ఎగురుతున్న ఫీలింగ్ మనందరికీ తరచూ కలిగేదే. కదా! భయం తాలూకు అనేకానేక సంకేతాల్లో అదొకటి. అలాంటి భయమంటే అసలేమిటో, అదెలా ఉంటుందో ఏమాత్రమూ తెలియని మహిళ ఒకరున్నారు. అందుకు కారణం ఫక్తు వైద్యపరమైనది కావడం విశేషం...!చాలాకాలం కింది సంగతి. నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై ఆమె అలా నడిచి వెళ్తోంది. ఉన్నట్టుండి ఓ సాయుధుడు అటకాయించి ఏకంగా గొంతుపైనే కత్తి పెట్టాడు. కానీ ఆమె కళ్లలో భయం ఛాయలైనా కన్పించలేదు. ‘ఊ, కానీ. ఆలస్యమెందుకు?’అంటూ గొంతు కోయమని ఆహ్వానించింది! దాంతో దొంగ కాస్తా బిత్తరపోయి ఉన్నపళాన కాలికి బుద్ధి చెప్పాల్సి వచి్చంది. మనమైతే దీన్ని సాహసం అంటాం కదా! కానీ సైంటిస్టులు మాత్రం మరేదో అంటున్నారు. ఆ మహిళ తాలూకు ప్రత్యేకతే అందుకు కారణం. ఏమంటే, ఆమె మెదడులో భయాన్ని ప్రాసెస్ చేసి మనసుకు అర్థమయ్యేలా చేసే అమిగ్డాలా అనే వ్యవస్థే పూర్తిగా లోపించింది. ప్రపంచంలో ఇలాంటి కేసులు ఇప్పటిదాకా కేవలం కొన్ని వందలు మాత్రమే వెలుగు చూశాయి. ప్రస్తతమైతే ఇలాంటి లక్షణాలున్న ఏకైక వ్యక్తి భూ మండలం అంతటా ఆమె మాత్రమే కావడం విశేషం. వారిలోనూ ఇలా అమిగ్డాలా లోపించిన కేసు ఇది రెండోది మాత్రమే. అందుకే ఆమె వ్యక్తిగత వివరాలను సైంటిస్టులు అతి గోప్యంగా ఉంచారు. మనిషి భయం, ఆందోళన, అసంకల్పిత ఆత్మరక్షణ ప్రతిచర్య వంటివాటిని ఎలా అనుభూతి చెందుతాడో తెలుసుకునేందుకు ఆమెపై పలు పరిశోధనలు జరుపుతున్నారు. తనను కేవలం ఎస్ఎంగా వ్యవహరిస్తున్నారు. అరుదైన వ్యాధి ఎస్‌ఎంకు అర్బాక్ వీత్ అనే అత్యంత అరుదైన వ్యాధి ఉంది. ఇది తన మెదడులోని అమిగ్డాలాను క్రమంగా మటుమాయం చేస్తూ వచ్చింది. ఇదంతా ఓ పాతికేళ్ల కింది సంగతి. దాంతో ‘ఫియర్లెస్ షీ’గా అప్పట్లో ఆమె ప్రపంచమంతటా ఫేమస్ అయిపోయింది. తనకు నిజంగానే వీసమెత్తు కూడా భయం వేయదా అన్నది తేల్చుకునేందుకు ఎందరో ఎన్నెన్నో రకాల పరీక్షలు పెట్టి చూశారు. అన్నింట్లోనూ విజయం ఆమెదే. పరాజయం... భయానిదీ, పరీక్షకులదీ! ఆమెను దెయ్యల కొంపల్లో ఉంచి తాళం వేశారు. హఠాత్తుగా పాములను మెళ్లో వేశారు. భయంకరమైన హారర్ సినిమాలు ఒంటరిగా కూచోబెట్టి మరీ చూపించారు. ఆమె గత జీవితంలోనే అత్యంత భయానకమని చెప్పదగ్గ ఉదంతాలను పదేపదే పనిగట్టుకుని గుర్తు చేశారు. ఎన్ని చేసినా ఆమెకు భయమన్నదే కలగలేదు. సరికదా, అన్ని సందర్భాల్లోనూ ఎస్ఎం అత్యంత ఆసక్తిగా, ఉత్సాహంగా కన్పించి పరీక్షకులకే పరీక్ష పెట్టింది! పుట్టి బుద్ధెరిగిన నాటినుంచీ అసలు భయమంటే ఎలా ఉంటుందో కూడా ఎరగదట తను. 2009–11 మధ్య ఆమెపై పలుమార్లు ప్రాణాంతక దాడులు జరిగాయి. దోపిడీ యత్నాలకూ గురైంది. బెదిరింపులకైతే లెక్కే లేదు! కానీ ఒక్కటంటే ఒక్క ఉదంతంలో కూడా ఆమెలో భయం అణుమాత్రమైనా కన్పించలేదట. ఆమె భయపడ్డ క్షణం... ఇక ఇలా కాదని సైంటిస్టులు ఎస్‌ఎంను ఓ చిత్రమైన పరీక్షకు గురిచేసి చూశారు. తనతో పాటు తన మాదిరిగానే అమిగ్డాలా కాస్తో కూస్తో పాడైన మరో ఇద్దరిని ప్రయోగశాలలో కూచోబెట్టారు. 35 శాతం కార్బన్ డయాక్సైడ్ (సీఓటూ) పీల్చేలా చేశారు. నియంత్రిత పద్ధతిలో చేయగలిగితే దీనివల్ల అవతలి వ్యక్తి ఊపిరాడని పరిస్థితికి లోనవుతాడు. అలా సీఓటూ పీల్చగానే జరిగింది చూసి సైంటిస్టులే అవాక్కయ్యారు. జీవితంలోనే తొలిసారిగా ఎస్ఎం ‘పానిక్’అయింది. అంటే, భయపడిందన్నమాట! సీఓటూ మాస్క్‌ను ముఖంపై నుంచి ఒక్కసారిగా పీకిపారేసింది. శ్వాస కోసం పెనుగులాడింది. ఇప్పటికి గుర్తు చేసినా సరే, ‘అదో భయానక అనుభూతి’అంటూ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మిగతా ఇద్దరు రోగులు కూడా ఎస్ఎం మాదిరిగానే బెదిరిపోయారు.కీలక స్పష్టత ఎస్ఎం బృందంపై చేసిన పరీక్ష ఫలితాన్ని బట్టి సైంటిస్టులు ఒక కీలక స్పష్టతకు వచ్చారు. బయటి ప్రమాదాలను గుర్తించి శరీరానికి, మనసుకు అర్థమయేలా చేసేందుకు అమిగ్డాలా అవసరం. కానీ శరీరం లోపలి నుంచే పుట్టుకొచ్చే భయం మాత్రం దానితో నిమిత్తం లేకుండానే వణుకు పుట్టించేస్తుంది! అంతేకాదు, ‘‘భయానికి మెదడులో మూలం అమిగ్డాలా ఒక్కటే కాదు. అందుకు పలు దారులున్నాయి. అసలు భయం బలహీనత కానే కాదు. మనుగడకు అవసరమైన అత్యంత కీలకమైన సాధనం. ఎందుకంటే భయం ఏ కోశానా లేకపోబట్టే అర్ధరాత్రి, అపరాత్రి అనే లేకుండా ఎస్ఎం ఎటు పడితే అటు తిరిగి ప్రమాదాలను కొనితెచ్చుకుంది. భయముంటే ఇలాంటి పనులు ఎన్నటికీ చేయరు. అంతేకాదు, భయం లేకపోతే ఒంట్లో రిస్క్ మేనేజ్మెంట్ వ్యవస్థే కుప్పకూలిపోతుంది. కొసమెరుపుఅయితే, అమిగ్డాలాతో నిమిత్తం లేకుండా ఒంటికి, మనసుకు భయాన్ని అనుభూతం చేసే అంతర్గత సర్క్యూట్లు ఏమిటి, అవెలా పని చేస్తాయి అన్నది మాత్రం సైంటిస్టులకు ఇంకా అంతు చిక్కాల్సే ఉంది! -
‘రక్త’ సిందూరం!
కులం సాకుతో కూతురి ప్రేమను కాదన్నారు. ఖాతరు చేయలేదన్న కసితో కన్నతండ్రి, తోబుట్టువులే ఆమె ప్రేమికుడి పాలిట కాలయముళ్లయ్యారు. నడిరోడ్డుపై దారుణంగా హత్య చేశారు. మనసారా ప్రేమించినవాడు నడిరోడ్డుపై రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంటే.. ఆమె గుండె పగిలింది. నిప్పుల కొలిమి అయ్యింది. చట్టాన్ని ధిక్కరించిన పగలకు, కులాన్ని అడ్డుపెట్టిన క్రూరత్వానికి బదులివ్వడానికి ఆమె అప్పటికప్పుడే ఎంచుకున్న మార్గం... చరిత్రలో విలక్షణ అధ్యాయమై నిలిచింది. మట్టిలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్న ప్రియుడి దేహాన్నే వివాహం చేసుకుంది. అమరం.. అఖిలం మా ప్రేమ.. అంటూ యావత్ ప్రపంచానికి చాటిచెప్పింది. ఆమె ధిక్కార ప్రకటన.. మహారాష్ట్రలోని నాందేడ్‌లో కన్నీటి కెరటమై ఎగసిపడింది.మూడేళ్ల ప్రేమకు నూరేళ్లు ఆంచల్ మమిద్వార్ (21), సక్షం టేట్ (20)లది మూడేళ్ల గాఢమైన ప్రేమ బంధం. వాస్తవానికి ఆంచల్ సోదరుల ద్వారానే ఆమె కుటుంబానికి సక్షం పరిచయమయ్యాడు. తరచూ వారింటికి సక్షం రావడంతో.. వీరిద్దరి ప్రేమ బంధం బలపడింది. అయితే, వారిద్దరి కులాలు వేరు కావడంతో.. ఆంచల్ కుటుంబం ఈ ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించింది. ఎన్ని బెదిరింపులు వచ్చినా ఆంచల్, సక్షం తమ ప్రేమ బంధాన్ని వదులుకోలేదు. సక్షం, ఆంచల్ పెళ్లి చేసుకోబోతున్నారనే విషయం ఆంచల్ తండ్రి గజానన్ మమిద్వార్ (45)కు, సోదరులు హేమేశ్, సాహిల్ (25)లకు తెలిసిపోయింది. అంతే.. పరువు హత్యకు పథకం సిద్ధమైపోయింది.తుపాకీతో కాల్చి.. రాయితో కొట్టి.. గురువారం సాయంత్రం, నాందేడ్‌లోని పాతగంజ్ ప్రాంతంలో సక్షం తన స్నేహితులతో నిలబడి ఉండగా.. ఆంచల్ సోదరుడు హేమేశ్ మామిద్వార్ అక్కడికి చేరాడు. అతనికి.. సక్షం మధ్య గొడవ మొదలైంది. కోపంతో ఊగిపోయిన హేమేశ్, సక్షంపైకి తుపాకితో కాల్పులు జరిపాడు. ఆ గుండు సక్షం పక్కటెముకల్లోకి దూసుకుపోయింది. అంతటితో ఆగకుండా, హేమేశ్ ఒక రాతి పెంకుతో సక్షం తలపై బలంగా కొట్టాడు. దీంతో సక్షం అక్కడికక్కడే మరణించాడు. మా ప్రేమకు చావు లేదు.. సక్షం హత్య తర్వాత రోజు, శుక్రవారం సాయంత్రం.. అతని అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అప్పుడే అక్కడికి ఆంచల్ చేరుకుంది. సక్షం నిర్జీవ దేహం పక్కన మోకరిల్లింది. కళ్ల నుండి దుఃఖం ధారాపాతమై ప్రవహిస్తుండగా.. ఆమె సక్షం శరీరానికి పసుపు పూసింది. తన నుదుట సిందూరం ధరించింది. ప్రియుడి భౌతిక కాయంతోనే పెళ్లి చేసుకుంది. తమ ప్రేమకు అమరత్వం కలి్పంచడానికి ఈ పని చేస్తున్నానని ఆంచల్ చెబుతుంటే.. అక్కడున్నవారంతా కంటతడి పెట్టారు. ఈ హృదయవిదారక దృశ్యం వీడియోల రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.వారిని ఉరి తీయండి.. ప్రియుడి శవంతో వివాహం అనంతరం ఆంచల్ విలేకరులతో మాట్లాడుతూ.. కన్నతండ్రి, సోదరులు చేసిన ఈ ఘాతుకానికి వారికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేసింది. ‘కులం సాకుతో నా తండ్రి మా ప్రేమను వ్యతిరేకించాడు. నా కుటుంబం చాలాసార్లు సక్షంను చంపుతామని బెదిరించింది. ఇప్పుడదే చేసింది. నాకు న్యాయం కావాలి. ఈ ముగ్గురిని ఉరి తీయాలి’.. అని కోరింది. అంతేకాకుండా, ఆమె ఆ క్షణం నుంచే సక్షం ఇంట్లోనే కోడలిగా మిగిలిన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంది. ‘సక్షం మరణంలోనూ మా ప్రేమ గెలిచింది, నా తండ్రి, సోదరులు ఓడిపోయారు’.. అని ఆమె ప్రకటించింది. ఈ హత్యలో ఆంచల్ తండ్రి గజానన్, సోదరులు హేమేశ్, సాహిల్ పాత్ర ఉన్నట్లు పోలీసులు నిర్ధారించి, వెంటనే వారిని అరెస్టు చేశారు. మొత్తం ఆరుగురిపై భారతీయ న్యాయ సంహిత, ఎస్సీ/ఎస్టీ (అత్యాచార నిరోధక) చట్టం, ఆయుధ చట్టం కింద కేసులు నమోదు చేశారు. నిందితులకు మూడు రోజుల పోలీస్ కస్టడీ విధించారు. ఆంచల్ ధైర్యం, ఆవేదనతో కూడిన ప్రేమకథ.. కులాల మధ్య ప్రేమ మనుగడ సాగించాలంటే ఎంతటి తీవ్ర పోరాటం చేయాలో, ఎన్ని ప్రాణాలు బలివ్వాలో మరోసారి రుజువు చేసింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
TDP నేతల నుంచి నాకు ప్రాణహాని! అంగన్వాడీ హెల్పర్ సెల్ఫీ వీడియో
-
మహిళ అని కూడా చూడకుండా చీర పట్టుకొని లాక్కెళ్లి.. కాళ్లతో తన్నుతూ..!!
-
క్లీన్ ఎనర్జీ స్టార్స్..!
వ్యాపారం ద్వారా లాభం పొందాలి...అలాగే పర్యావరణానికి, సమాజానికి మేలు చేకూర్చాలి. ఈ రెండు విధానాలను వ్యాపారంలో చేర్చడం పెద్ద సవాల్. పర్యావరణహిత వ్యాపారాలు చేస్తూ ఎకో ఎంట్రప్రెన్యూర్లుగా రాణిస్తున్నారు నేటి మహిళలు. క్లీన్ ఎనర్జీ స్టార్టప్స్‌తో దేశంలోనే ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు: ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. రియా మజుందార్ సింఘాల్భారతదేశంలోని మొట్టమొదటి, అతిపెద్ద స్థిరమైన ప్యాకేజింగ్ కంపెనీ అయిన ‘ఎకోవేర్ సొల్యూషన్స్’ వ్యవస్థాపకురాలు రియా మంజుదార్ సింఘాల్. ముంబయ్వాసి అయిన రియా బయోడిగ్రేడబుల్ వస్తువులను తయారుచేస్తుంది. భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అత్యున్నత నారీ శక్తి పురస్కారం అందుకుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో యంగ్ గ్లోబల్ లీడర్, ఉమెన్ ఎంపవర్మెంట్– క్లీన్ ఎయిర్ జాతీయ కమిటీ సభ్యురాలు. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలలో చదువుకున్న రియా భారతదేశంలో ప్లాస్టిక్ ముప్పును పరిహరించే ఏకైక లక్ష్యంతో ‘ఎకోవేర్ సొల్యూషన్స్’ను స్థాపించింది. ప్లాస్టిక్‌ను పూర్తిగా కంపోస్ట్ చేయగల ప్రత్యామ్నాయాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఫుడ్ ప్యాకేజింగ్ పరిశ్రమను బ్రేక్ చేసింది. వ్యవసాయ పంటల వ్యర్థాల నుండి ఎకోవేర్ తయారవుతుంది. వాయు కాలుష్యాన్ని నివారిస్తుంది. భారతదేశంలో అతిపెద్ద ఫుడ్ సర్వీస్ ఆపరేటర్ అయిన ఇండియన్ రైల్వేలను ఎకోవేర్ బయోడిగ్రేడబుల్స్ ట్రేలకు మారేలా ఒప్పించడం రియా సాధించిన గొప్ప విజయాలలో ఒకటి. అజైతా షాగ్రామీణ భారతావనిలోని ఇళ్లకు అధిక నాణ్యత, స్వచ్ఛమైన శక్తితో నడిచే సౌర దీపాలు, కుకింగ్ స్టౌలు.. వంటి ఉపకరణాలను అందించడానికి ‘ఫ్రాంటియర్ మార్కెట్స్(క్లీన్ ఎనర్జీ)’ను స్థాపించింది. మహిళా వ్యవస్థాపకుల నెట్వర్క్ ద్వారా అమ్మకాలు, సేవలను కొనసాగిస్తుంది. అజైతా క్లీన్ ఎనర్జీ యాక్సెస్ ప్రపంచానికి కొత్తేమీ కాదు, ఫ్రంటియర్ మార్కెట్స్‌కు ముందు భారతదేశం అంతటా 10,000కు పైగా గ్రామాల్లో 13 లక్షలకు పైగా మహిళలకు సేవలందిస్తూ, ఏడేళ్లుగా మైక్రోఫైనాన్స్ రంగంలో పనిచేశారు.గ్రామాల్లో సరైన విద్యుత్తు అందుబాటులో లేదన్న వాస్తవాన్ని అర్థం చేసుకొని ఫ్రాంటియర్ మార్కెట్లను ప్రారంభించింది. గ్రామీణ కుటుంబాలకు నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తుంది. ఈ క్లీన్ ఎనర్జీ వినియోగదారులలో 70 శాతం మహిళలే ఉన్నారు. నీలిమా మిశ్రాఒడిశాలోని భువనేశ్వర్‌లో వ్యర్థాల నిర్వహణ రంగంలో ఒక విప్లవాత్మక స్టార్టప్ ద్వారా సంచలనం సృష్టిస్తోంది. పర్యావరణ స్పృహ కలిగిన నీలిమా రబీ నారాయణ్ మిశ్రా స్థాపించిన ‘సీబా గ్రీన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ సస్టెయినబిలిటీలో ఒక ఉద్యమం. పర్యావరణ పరిరక్షణకు అంకితమైన ఈ స్టార్టప్ ఐక్యరాజ్య సమితి స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలలో ఒకటిగా చేర్చింది. 2019లో నెలకొల్పిన ఈ స్టార్టప్ తన అనుభవాలనుండి పుట్టుకువచ్చిందని చెబుతుంది నీలిమా మిశ్రా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి పట్టాలు పొందిన నీలిమ‘సీబా గ్రీన్’ ద్వారా వ్యర్థాల నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. వ్యర్థాలను సేకరించడం, సేంద్రీయ వ్యర్థాలను విలువైన కం΄ోస్ట్గా మార్చడం, రీ సైక్లింగ్‌ను సులభతరం చేస్తూ పరిశుభ్రమైన నగరాలకు ఊపిరి ఊదుతుంది.ఆర్తి రాణా తరు ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి జిల్లాకు చెందిన ఆర్తి రాణా తరు 350 స్వయం సహాయక సంఘాలలోని పదివేల మంది మహిళల ద్వారా చేత చేనేత ఉత్పత్తులను తయారు చేయిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచింది. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ వంటి సంస్థల మద్దతుతో ఆరేడేళ్లలో వేల మందికి చేరువయ్యింది ఆర్తి. మొదట ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, హర్యానాలో సాధారణంగా కనిపించే పొడవైన, దృఢమైన గడ్డితో బుట్టలు, పెన్ స్టాండ్లను తయారు చేశారు. ఇవి వారి చేనేత వస్త్రాలతో పాటు ట్రైబల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిబిషన్లో ప్రజాదరణ పొందాయి. సస్టెయినబిలిటీ సాధించడం, మహిళల్లో స్వావలంబనను ప్రోత్సహించడంలో ఆర్తి రాణా 2020లో నారీ శక్తి పురస్కార్‌తో పాటు మరెన్నో సత్కారాలూ అందుకుంది.(చదవండి: కొత్త వస్తువులు చూస్తే కొనకుండా ఉండలేకపోతున్నాను!) -
మానసిక రుగ్మతలతో బేజార్
మానసిక సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య ఏయేటికాయేడు పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్య ఉన్నప్పటికీ, అది భారత్‌లో ఒకింత ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లోనే మానసిక రుగ్మతల బారిన పడుతున్న వారి సంఖ్య అధికంగా ఉంది. అలాగే, పురుషుల్లో కంటే మహిళల్లో ఈ రుగ్మతలు రెట్టింపు ఉన్నట్లు తేలింది. నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే–2015–16, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్)– 2019, లాన్సెట్ అధ్యయనం–2020 , మెంటల్ హెల్త్ అట్లాస్–2024, డబ్ల్యూహెచ్ఓ–2025 అధ్యయనాల ప్రకారం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న మానసిక రుగ్మతల తీరుతెన్నులు ఆందోళన కలిగిస్తున్నాయి.దేశంలో ప్రతి 100 మందిలో 11 మందికి.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడుగురిలో ఒకరు మానసిక రుగ్మతతో జీవిస్తుండగా.. భారత్‌లో ప్రతీ 100 మందిలో 11 మందికి ఈ సమస్యలు ఉన్నట్లు నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే స్పష్టం చేసింది. అలాగే ప్రతీ 100 మందిలో 14 మంది తమ జీవితకాలంలో ఎప్పుడో ఒకసారి మానసిక సమస్యను ఎదుర్కొన్నట్లు తేలి్చంది. గ్రామాల్లో 6.9% మంది బాధితులు ఉండగా, పట్టణాల్లో ఈ సంఖ్య 13.5 శాతంగా ఉంది. అలాగే, మానసిక రుగ్మతలు పురుషుల (10%) కంటే మహిళల్లో (20%) అధికంగా ఉన్నట్లు స్పష్టమైంది. మహిళల్లో నిరాశ, ఆందోళన వంటి సమస్యల కారణంగా మానసిక రుగ్మతలు పెరుగుతున్నట్లు తేలింది. ప్రత్యేకంగా 15–29 ఏళ్ల మధ్య ఉన్న వారిలో నిరాశ, ఆందోళన లాంటి మానసిక సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ నివేదిక తెలిపింది. మానసిక సమస్యల్లో నిరాశ 6.2%, ఆందోళన 4.7% ప్రధానమైనవిగా మెంటల్ హెల్త్ అట్లాస్ పేర్కొంది. ఆర్థిక భారంఅవగాహనలోపం, సామాజిక వివక్ష, నిపుణుల కొరత వల్ల 70% నుంచి 92% మంది సరైన మానసిక చికిత్స అందుకోవడం లేదని ఓ అధ్యయనంలో తేలింది. ప్రతీ లక్ష మంది జనాభాకు ముగ్గురు మానసిక వైద్యులు ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేయగా, భారత్‌లో మాత్రం 0.75 మంది మానసిక వైద్యులే ఉన్నారు. మానసిక సమస్యలు మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని, ఆయుర్దాయం తగ్గడానికి కారణమవుతాయని తేలింది. మానసిక రుగ్మతల వల్ల ఉత్పాదకత తగ్గడం, వైద్యం వంటి పరోక్ష ఖర్చులు పెరగడం వల్ల ఆర్థికంగా నష్టం జరుగుతుందని డబ్ల్యూహెచ్ఓ నివేదిక పేర్కొంది. 2030 నాటికి మానసిక రుగ్మతల కారణంగా వైద్య ఖర్చులు, పరోక్ష ఖర్చులతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థపై భారం 16 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని జర్నల్ ఆఫ్ మెంటల్ హెల్త్ స్పష్టం చేసింది. అవీ ఇవీ..⇒ మానసిక రుగ్మతల్లో మూడింట ఒక వంతు 14 ఏళ్ల వయస్సుకే మొదలవుతుండగా, సగం రుగ్మతలు 18వ ఏటి కల్లా, మూడింట రెండొంతులు 25 ఏళ్ల వయస్సు కల్లా మొదలవుతున్నాయి.⇒ ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్యంపై కోవిడ్–19 మహమ్మారి ప్రభావం అధికంగా పడింది. ఆ సమయంలో బాధితుల సంఖ్య 25% పెరిగింది. ఉద్యోగాల కోతలు, ఆర్థిక అభద్రత వల్ల ఒత్తిడి స్థాయిలు, మానసిక సమస్యలు పెరిగాయి.⇒ కేంద్ర ప్రభుత్వ మెంటల్ ఆస్పత్రులు బెంగళూరు (ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్)లో, తేజ్‌పూర్ (ఎల్‌జీబీఆర్‌ఐఎంహెచ్)లో, రాంచీ (సీఐపీ)లో ఉన్నాయి. అన్ని ఎయిమ్స్‌లలో మానసిక ఆరోగ్య సేవలు అందుబాటులో ఉన్నాయి. మానసిక వైద్య సేవల కోసం టోల్ ఫ్రీ నంబర్లు: 14416, 1800–891–4416⇒ 2023లో భారత్‌లో మానసిక రుగ్మతలతో ఆత్మహత్యలు చేసుకున్నవారు 1,71,418 ⇒ వీరిలో 72.8% పురుషులు, 27.2% మహిళలు ⇒ ఈ సమస్యతో ఏటా ప్రపంచంలో జరిగే ఆత్మహత్యలు: 7,27,000 ⇒ సాధారణ ప్రజలతో పోలిస్తే మానసిక రుగ్మతలున్న వారు ఆత్మహత్యలు చేసుకునే ముప్పు: 16 రెట్లు ఎక్కువ ⇒ నిరాశ వల్ల గుండె జబ్బుల వంటి సమస్యల ముప్పు: 72 శాతం అధికం -
పదిలో 'ఒకరే'..
అన్నింటా మేము అన్నట్టు వ్యాపారాల్లోనూ మహిళామణులు రాణిస్తున్నారు. పెట్టుబడి స్థాయి ఎంతదైనా తాము ప్రారంభించిన వ్యాపారాన్ని నిలబెట్టడమే కాదు.. ఆవిష్కరణల్లోనూ తీసిపోమని నిరూపిస్తున్నారు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. చిన్న దుకాణమైనా, స్టార్టప్ అయినా.. కుటుంబ బాధ్యతలు, పెట్టుబడి కొరత రూపంలో నిరంతర అడ్డంకులను మహిళా వ్యాపారులు ఎదుర్కొంటున్నారు. ఏ ఒక్క దేశానికో ఈ సవాళ్లు పరిమితం కాలేదు. దాదాపు ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్51 దేశాల్లో సర్వేబాబ్సన్ కాలేజ్, లండన్ బిజినెస్ స్కూల్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపార కార్యకలాపాల తీరుతెన్నులను అంచనా వేసేందుకు నిర్వహిస్తున్న పరిశోధన ప్రాజెక్టు అయిన ‘గ్లోబల్ ఆంట్రప్రెన్యూర్షిప్ మానిటర్ (జీఈఎం)’తాజాగా 2024/2025 ఉమెన్స్ ఆంట్రప్రెన్యూర్షిప్ రిపోర్ట్‌ను విడుదల చేసింది. సర్వేలో భారత్, చైనా, యూఎస్, యూకే, జర్మనీ సహా 51 దేశాలకు చెందిన లక్షలాది మంది పాలుపంచుకున్నారు. మహిళలు వ్యాపారం ప్రారంభించడంలో, కొనసాగించడంలో సవాళ్లను ఎదుర్కొంటున్న తీరును ఇందులో సమగ్రంగా వివరించింది. ప్రపంచ దేశాల జాతీయ ఆర్థిక విధానాలను ప్రభావితం చేయడానికి జీఈఎం డేటా ఉపయోగకరమైన సాధనంగా స్థానం సంపాదించింది. ఐక్యరాజ్యసమితి, వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్, ప్రపంచ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థలు విశ్వసించే వనరుగా నిలిచింది. ఉద్యోగ ప్రత్యామ్నాయంగా.. అనేక మంది మహిళా వ్యవస్థాపకులకు వ్యాపారం ఒక ఉద్యోగ ప్రత్యామ్నాయం. ఒకే వ్యక్తి నిర్వహించేలా వారు చిన్న వ్యాపారాలను ఏర్పాటు చేస్తున్నారు. మహిళలను వ్యాపారం వైపు నడిపించడానికి గల కారణాల్లో.. ఉద్యోగ కొరత 71.1%, సంపదను పెంచుకోవడం 57.3%, ప్రత్యేకత చూపించుకోవడానికి 49.8%, వారసత్వ వ్యాపారం 31.5% కారణాలుగా చెప్పారు. వృద్ధి అవకాశాలు అధికంగా ఉన్న వ్యాపారాలను నడుపుతున్న చాలా మంది మహిళలు అధిక ఆదాయ దేశా లకు చెందినవారని నివేదిక తెలిపింది. వారు డిగ్రీలను కలిగి ఉండటంతోపాటు అధిక ఆదాయ కుటుంబాల నుంచి వచ్చారు. డిజిటల్ మాధ్యమాలను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. స్థిరత్వ లక్ష్యాలను చేరుకుంటారని నివేదిక వివరించింది. కుటుంబానికే ప్రాధాన్యత..2024లో ప్రపంచవ్యాప్తంగా 3.4% మంది మహిళలు వ్యాపారాన్ని మూసివేశారు. పురుషుల విషయంలో ఈ సంఖ్య 3.8% ఉంది. కుటుంబ, వ్యక్తిగత కారణాల వల్ల వ్యాపారాన్ని మూసివేసినట్టు 21% మహిళలు, 14.3% మంది పురుషులు వెల్లడించారు. అంటే కుటుంబ, వ్యక్తిగత కారణాల వల్ల వ్యాపారానికి దూరం అవుతున్న మహిళల సంఖ్య పురుషుల కంటే 47% ఎక్కువ. వ్యాపారాన్ని కాపాడుకోవడం ఒకవైపు, గృహ బాధ్యతలు మరోవైపు.. ఈ రెండింటినీ సమతుల్యం చేయడంలో చాలా మంది మహిళలు సమస్యలను ఎదుర్కొంటున్నారని నివేదిక వెల్లడించింది. వ్యాపార రంగంలో మహిళల పురోగతి మందగించడానికి ప్రధాన అడ్డంకి ఏమిటంటే.. చాలా మంది మహిళలు స్టార్టప్‌లను ప్రారంభించి అభివృద్ధి చేస్తున్నప్పుడు ఇంటి పనులు కూడా వారి భుజాలపై పడటమే. 23వ స్థానంలో మనం.. ఒక ఆర్థిక వ్యవస్థలో 18–64 సంవత్సరాల వయసు గల జనాభాలో.. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించే ప్రయత్నాల్లో ఉన్నవారు లేదా కొత్తగా బిజినెస్ మొదలుపెట్టిన వారి (42 నెలలలోపు) సంఖ్య ఆధారంగా టోటల్ ఎర్లీ స్టేజ్ ఆంట్రప్రెన్యూరియల్ యాక్టివిటీ (టీఈఏ) రేట్‌ను ఇస్తారు. 10% టీఈఏ రేటుతో భారత్ 23వ స్థానంలో ఉంది. మన దేశంలో టీఈఏ రేట్ మహిళల్లో 10.3%, పురుషుల్లో 14% ఉంది. ఇక 32% రేటుతో తొలి స్థానంలో ఈక్వెడార్ నిలిచింది.» పురుషులతో పోలిస్తే మహిళా పెట్టుబడిదారులు 2.5 రెట్లు ఎక్కువగా స్త్రీలు నిర్వహిస్తున్న వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. » అనధికారిక పెట్టుబడులలో మూడింట రెండు వంతులు పురుష వ్యాపారులకే వెళ్లాయి. » పెట్టుబడిదారులు, పెట్టుబడి గ్రహీతలు.. ఈ రెండు విభాగాల్లోనూ మహిళల సంఖ్య తక్కువ. » 2024లో ఎనిమిది మంది పురుషులలో ఒకరు, పది మంది స్త్రీలలో ఒకరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించారు. » నూతన ఆవిష్కరణలను తెచ్చే స్టార్టప్స్‌లో 18 దేశాలలో మహిళా వ్యాపారులు పురుష వ్యాపారులతో సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నారు.» 19 దేశాలలో మహిళల స్టార్టప్ రేట్లు పెరిగాయి. జోర్డాన్, మొరాకోలో రేట్లు రెట్టింపు అయ్యాయి. -
వల్లభనేని వంశీకి సపోర్ట్ చేస్తావా? మహిళా అడ్వాకెట్ పై కక్షసాధింపు..
-
ఆస్తి వివాదాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: హిందూ వారసత్వ చట్టానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కుటుంబాల్లో వారసత్వ హక్కులపై తలెత్తే వివాదాలను నివారించేందుకు హిందూ మహిళలు తమ ఆస్తిపై వీలునామా రాసుకోవాలని సూచించింది. వయస్సుతో సంబంధం లేకుండా, మహిళలు ముందుగానే తమ ఆస్తులపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోర్టు అభిప్రాయపడింది.ఓ హిందూ కుటుంబంలో ఆస్తి పంపకాలపై తలెత్తిన వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా తల్లిదండ్రుల ఆస్తిపై హక్కు, భర్త ఇంటి ఆస్తిపై హక్కు వంటి అంశాల్లో మహిళలు న్యాయపరంగా చిక్కుల్లో పడే అవకాశాలు ఉన్నాయని, అలాంటి పరిస్థితుల్లో విలునామా ఉంటే స్పష్టత ఉంటుందని కోర్టు పేర్కొంది.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ సందర్భంగా మాట్లాడుతూ.. తల్లిదండ్రులు, అత్తమామల మధ్య తలెత్తే ఆస్తి వివాదాల్లో మహిళలు న్యాయపరంగా ఇరుక్కుపోవడం మంచిది కాదు. అలాంటి వివాదాల్లో మహిళలు న్యాయపరంగా జోక్యం చేసుకోవడం వల్ల కుటుంబ సంబంధాలు దెబ్బతింటాయి’అని పేర్కొంది.కోర్టు అభిప్రాయం ప్రకారం, హిందూ వారసత్వ చట్టం ప్రకారం మహిళలకు తల్లిదండ్రుల ఆస్తిలో హక్కు ఉన్నప్పటికీ, వాస్తవికంగా ఆ హక్కును వినియోగించడంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వివాహిత మహిళలు తమ తల్లిదండ్రుల ఆస్తిపై హక్కు కోరినప్పుడు, అత్తింటి కుటుంబంతో సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో మహిళలు తమ ఆస్తులపై ముందుగానే వీలునామా రాసుకోవడం ద్వారా భవిష్యత్తులో తలెత్తే వివాదాలను నివారించవచ్చని కోర్టు సూచించింది. ఇది కుటుంబ శాంతి, సౌహార్దతకు దోహదపడుతుందని అభిప్రాయపడింది. ఈ తీర్పు, హిందూ వారసత్వ చట్టం పరిధిలో మహిళల హక్కుల పరిరక్షణకు దోహదపడేలా ఉండగా..ఆస్తి పంపకాల విషయంలో ముందస్తు ప్రణాళిక అవసరమని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. ఈ తీర్పు ఆధారంగా, హిందూ మహిళలు తమ ఆస్తులపై స్పష్టమైన వీలునామా ఉండడం వల్ల భవిష్యత్తులో తలెత్తే కుటుంబ వివాదాలను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. -
అచ్చం షోలే మూవీని తలపించేలా..బామ్మల బైక్ రైడ్..!
వయసు శరీరానికే గానీ మనసుకు కాదని చాలామంది ప్రూవ్ చేస్తున్నారు. అయితే ఈ బామ్మలు వారందరికంటే ఇంకాస్త ముందడుగు వేసి..ఏకంగా చలాకీగా బైక్ రైడ్ చేస్తూ..సాహస యాత్రలు చేస్తున్నారు. ఈ ఇద్దరు వృద్ధ మహిళలు చూస్తే..ఓల్డ్ ఏజ్ అని అనిపించదు..బంగారంలా బతకడం అంటే ఏంటో తెలుస్తుంది.!.ఆ బామ్మలే అహ్మదాబాద్‌కు చెందిన ఇద్దరు వృద్ధ అక్కాచెల్లెళ్లు. 87 ఏళ్ల మందాకిని షా తన చెల్లెలు ఉషతో కలిస స్కూటర్‌పై సాహసయాత్రలు చేస్తోంది. అంతేగాదు తన చెల్లెలుతో ఉన్న సాన్నిహిత్యం, సాహసయాత్రల పట్ల ఉన్న అభిరుచి కలగలసి ఇలా తనతో కలిసి చుట్టిరావడానికి పురిగొల్పిందని అంటోంది. ఇంత ఏజ్‌లోనూ ఆ బామ్మ మందాకిని చాలా చలాకీగా స్కూటర్ నడిపేస్తుంటుంది. అయితే ఈ బామ్మ 62 ఏళ్ల వయసులో ఉన్నప్పుడూ స్కూటర్ నడపడం నేర్చుకుందట. ఆరుగురు తోబుట్టువులో పెద్దది కావడంతో చిన్న వయసులోనే బాధ్యతలను నిర్వహించడం అలవాటైపోయిందట ఆమెకు. స్వాతంత్ర సమరయోధుడైన ఆమె తండ్రి వ్యాపారం చేయాలని అనుకుంటూ ఉండేవాడట. కానీ చేతిలో చిల్లిగవ్వ లేక వ్యాపారం చేసే సాహసం చేయలేకపోయాడట. తన కుటుంబంలో తరుచు డబ్బు కొరత బాగా ఉండేదని, అందుకోసం తన తల్లి ప్రతి రోజు ఎంతలా కష్టపడేదో దగ్గరగా చూశానని అంటోంది. బహుశా అదే తనలో ఆత్మవిశ్వాసం పెంచి తన కాళ్లపై తాను నిలబడేందుకు దారితీసిందని చెబుతోంది. 16 ఏళ్ల వయసులో తనకు ఇంగ్లీష్ సరిగా రాకపోయినా..బాల్ మందిర్‌లో మాంటిస్సోరి స్కూల్లో టీచర్ పనిచేయడం ప్రారంభించినట్లు తెలిపింది. తర్వాత సామాజికి సంక్షేమ ప్రాజెక్టుల్లో పాల్గొనడం ప్రారంభించానని, దాంతో ఆమెకు మహిళా సంఘాలు, పంచాయతీ సమావేశాలు తదితర వాటిల్లో పాల్గొనే అవకాశం లభించిందని చెప్పుకొచ్చింది. ఆనేపథ్యంలోనే తానుమోపెడ్, జీపు నడపడం వంటివి నేర్చుకున్నట్లు వివరించింది. అలా 62 ఏళ్ల వయసులో సెకండ్‌హ్యాండ్ స్కూటర్ నడపడం నేర్చుకున్నట్లు వెల్లడించింది. ఇప్పటికీ తాను, తన సోదరి ఇద్దరం కలిసి నగరం చుట్టేసి వచ్చేస్తుంటామని నవ్వుతూ చెబుతోంది. అయితే స్థానికులు ఆ బామ్మను ఎందుకు వివాహం చేసుకోలేదని తరుచుగా అడుగుతుంటారట. అయితే బామ్మ ఒకప్పుడూ పెళ్లి చేసుకోవాలని అనుకుందట. అయితే జీవితం మరో మార్గాన్ని చూపించడంతో ఆ దిశగా కొనసాగుతున్నట్లు చెప్పుకొచ్చింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక బామ్మ మందాకిని చివరగా.. పూర్తిగా జీవితాన్ని ఆస్వాదించాలనుకునే వ్యక్తిని ఏది ఆపలేదని ఆత్మవిశ్వాసంగా చెప్పింది. ఈ బామ్మ ఈ తరానికి ఎంతో స్ఫూర్తి కదూ..! View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) (చదవండి: ఉద్యోగం ఐటీ..నాట్యంలో మేటి) -
స్త్రీగా ఉండటం అంటే అదే..!: మానికా విశ్వకర్మ
థాయిలాండ్‌లో జరుగుతున్న మిస్ యూనివర్స్ పోటీలో మానికా విశ్వకర్మ భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. ఆదివారం జరిగిన చైన్రియాక్షన్ ప్రశ్న సెషన్లో ఇతర పోటీదారుల తోపాటు మానికా విశ్వకర్మ కూడా పాల్గొన్నారు. ఆ రౌండ్లో ఒక ఇంటర్వ్యూర్ మానికాను మాజీ మిస్ యూనివర్స్ (1994) సుష్మితా సేన్ అడిగిన ప్రశ్ననే అడగడం విశేషం. అందుకు చాలాచక్కగా సమాధానం ఇచ్చి..తాను వేషధారణతోటే కాదు, తెలివితేటలతో కూడా మెప్పించగలనని చెప్పకనే చెప్పింది.అప్పుడు మిస్‌యూనివర్స్ ఫైనల్ సుష్మితా సేన్‌ని 'మీకు స్త్రీగా ఉండటంలో సారాంశం ఏమిటి?' అనే ప్రశ్న ఎదురైంది. అదే ప్రశ్న మళ్లా ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న 22 ఏళ్ల మానికాకు యాధృచ్ఛికంగా ఎదురైంది. అయితే మానికా ఏం సమాధానం ఇచ్చిందంటే..నాడు సుష్మితా చాలా సింపుల్‌గా ఆ ప్రశ్నకు సమాధానమిచ్చారు. స్త్రీగా ఉండటం అంటే జీవితాన్ని పోషించగల సామర్థ్యం, మీ చుట్టూ ఉన్న ప్రతిదాన్ని పోషించగల సామర్థ్యం అని చెప్పగా, మానికా ఇలా చెప్పింది. "మహిళలను సమాజం తరుచుగా పలు పాత్రల్లో చూస్తుంటుంది. అయితే మహిళలు మాత్రం తాము ఒక వ్యక్తిగా మానవుడిగా చూడాలని కోరుకుంటారు. మాకు పెంచే సామర్థ్యం, జీవితాన్ని సృష్టించే సామర్థ్యం ఉంది. అంతేగాదు మా చుట్టూ ఉన్న ప్రతి వస్తువుని అందంగా తీర్చిద్దిగల సామర్థ్యం కూడా మాకు ఉంది. సింపుల్‌గా చెప్పాలంటే స్త్రీగా ఉండటం అంటే అదే. కేవలం ప్రతి వస్తువు అందాన్ని మరింత అందంగా తీర్చిదిద్దడమే కాకుండా, దానిని స్వీకరించి.. విస్తరించగల సామర్థ్యం కూడా ఆమెకు ఉంది. అంటే స్త్రీగా ఉండటం అంటే..అనంతంగా ఉండటమే దాని సారాంశం." అని మానికా అత్యద్భుతంగా సమాధానమిచ్చింది. కాగా ఢిల్లీలో నివశిస్తున్న మానికా విశ్వకర్మ ప్రస్తుతం పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ ఫైనల్ ఇయర్ చదువుతోందామె. ఈ ఏడాది ఆగస్టులో మిస్ యూనివర్స్ ఇండియా 2025 కిరీటాన్ని గెలుచుకుంది. ఇక ఈ 74వ మిస్ యూనివర్స్ పోటీ నవంబర్ 21న థాయిలాండ్‌లోని నోంతబురిలోని పాక్ క్రెట్లోని ఇంపాక్ట్ ఛాలెంజర్ హాల్లో ప్రతిష్టాత్మకంగా జరుగనుంది. View this post on Instagram A post shared by SUMMER SMITH (@crownsisters) (చదవండి: 91 ఏళ్ల వ్యక్తి 12 గంటలు షిఫ్ట్! హీరో మాధవన్ సైతం..) -
విశాఖలో బస్టాండ్ లో రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి షాక్
-
పిల్లల్ని కనాలంటే ఆ మందులు వాడకూడదా?
దాంపత్య జీవితంలో ప్రతీ జంటకు తల్లిదండ్రులవ్వడం అనేది ఓ వరం. అయితే రకరకాల సమస్యలతో ఆ ప్రయత్నంలో ఇబ్బందులు పడే వాళ్లున్నారు. మరీ ముఖ్యంగా డయాబెటిస్ పెషేంట్లలో ఇది అధికంగా ఉంటోందనే ప్రచారం ఒకటి ఉంది. డయాబెటిక్ మహిళా పేషెంట్లు అసలు గర్భమే ధరించలేరని తరచూ కొందరు చెబుతుండడమూ చూస్తుంటాం. మరి అందులో నిజమెంత?.. ఇలాంటి ప్రచారాలపై వైద్య నిపుణులు ఏమంటున్నారు?.. ఓసారి పరిశీలిద్దాం.. ప్రచారం 1: డయాబెటీస్ ఉన్న మహిళలు సహజంగా గర్భం ధరించలేరు!!వాస్తవం: డయాబెటిస్ సహజంగా గర్భం ధరించడాన్ని ఆపదు. షుగర్‌ను కంట్రోల్లో ఉంచుకుంటూ.. ఆరోగ్యవంతమైన జీవనశైలి పాటిస్తూ చాలా మంది మహిళలు గర్భం దాల్చడమే కాదు.. ఆరోగ్యవంతమైన పిల్లల్నీ కనగలరు. షుగర్ నియంత్రణలో లేనప్పుడు మాత్రం అండం ఉత్పత్తిపై ప్రభావం పడే అవకాశం ఉంది. అప్పుడు గర్భం దాల్చడం కష్టతరమవుతుంది. ప్రచారం2: డయాబెటీస్ మహిళల ఫెర్టిలిటీని మాత్రమే ప్రభావితం చేస్తుందివాస్తవం: మహిళలకు మాత్రమే కాదు.. పురుషులకూ ఇది వర్తిస్తుంది. బ్లడ్ షుగర్ నియంత్రణలో లేకపోతే పురుషుల్లో శృంగార సామర్థ్యం తగ్గే అవకాశం ఉంది. పురుష హార్మోన్ (టెస్టోస్టిరాన్) లెవెల్స్ తగ్గుతుంది. స్పెర్మ్ నాణ్యతతో పాటు కౌంట్ కూడా తగ్గే ప్రమాదం ఉంది. ప్రచారం 3: ఆ టైంలో మందులు వాడకూడదు!వాస్తవం: గర్భధారణ ప్లాన్ చేస్తున్నప్పుడు షుగర్ పేషెంట్లు మందులు మావేస్తుంటారు. అలాంటి సమయంలో భాగస్వాములు ఆరోగ్యకరమైన గ్లూకోస్ లెవెల్స్ కలిగి ఉండడం అత్యంత అవసరం. అందుకే మధుమేహ మందులను అకస్మాత్తుగా ఆపడం సరైంది కాదు. రక్తంలో గ్లూకోజ్ సరైన మోతాదులో ఉంచుకునేందుకు.. కొన్ని మందులను సర్దుబాటు చేయాల్సి వస్తుంది. అయితే అది కేవలం వైద్యుల సూచనలతోనే జరగాలి. సొంత వైద్యం అస్సలు మంచిది కాదు. ప్రచారం 4: రక్తంలో అధిక గ్లూకోజ్ లెవల్స్‌తో ఏం కాదు వాస్తవం: ఇది చాలా తప్పు. గర్భంతో ఉన్న టైంలో షుగర్ పేషెంట్ల షుగర్ స్థాయిలు ఎక్కువగా ఉంటే.. అది బీపీ పెరగడం, ప్రీఎక్లాంప్షియా సమస్యలకు దారితీయొచ్చు ఇది తల్లీబిడ్డల ఆరోగ్యానికి ప్రమాదకరంగానూ మారొచ్చు. అందుకే ప్రెగ్నెన్సీ ప్లాన్ నుంచే షుగర్ లెవల్‌ను కంట్రోల్లో ఉంచుకోవాలి. ప్రచారం 5: డయాబెటిస్ ఉంటే ఫెర్టిలిటీ చికిత్సలు పనిచేయవువాస్తవం: డయాబెటిస్ పేషెంట్లు ఐవీఎఫ్, ఐసీఎస్ఐ లాంటి ఫెర్టిలిటీ చికిత్సల ద్వారా గర్భం దాల్చొచ్చు కూడా. డయాబెటిస్ ఉన్నదని ఈ చికిత్సలు పనిచేయవని భావించడం అపోహ మాత్రమే. అయితే ఈ చికిత్సలు విజయవంతంగా జరిగేందుకు బ్లడ్ షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉండడం చాలా ముఖ్యం. -డా. ప్రశాంత కుమార్ నాయక్, ఎంబీబీఎస్, ఎండీ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్. ఒయాసిస్ ఫెర్టిలిటీ -
యాత్రలో మిస్సింగ్.. తీరా చూస్తే పాకిస్థానీతో వివాహం?
గురునానక్ జయంతి సందర్భంగా ఇటీవలే పాకిస్థాన్ వెళ్లి మిస్సైన యాత్రికురాలు సర్బిజిత్ విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సర్బిజిత్ ఇస్లాం మతం స్వీకరించిదని పాకిస్థాన్ కు చెందిన వ్యక్తిని వివాహం చేసుకుందని నికానామా పేరుతో డాక్యుమెంట్స్ ప్రచురితమవుతున్నాయి. అయితే దీనిని ఇంకా అధికారికంగా ధృవీకరించలేదుఇటీవల సిక్కుల మత గురువు గురునానక్ జయంతి సందర్భంగా ప్రకాశ్ పుర్బ్ వేడుకల్లో పాల్గొనేందుకు పాకిస్థాన్ వెళ్లి కనిపించకుండా పోయిన యాత్రికురాలు సర్పిజిత్ విషయంలో సంచలన విషయం వెలుగులోకి వచ్చాయి. సర్బిజిత్ పాకిస్థాన్ లాహోర్ సమీపంలోని షేక్ పూరకు చెందిన నాసిర్ హుస్సేన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుందని, అంతేకాకుండా పెళ్లికి ముందే ఇస్లాం మతంలోకి చేరి తన పేరు నూర్ గా మార్చుకుందని నికానామా( మస్లింల వివాహా ఒప్పంద పత్రం) బయిటపడింది. అయితే ఈవిషయాన్ని ఇంకా అధికారులు అధికారికంగా ధృవీకరించలేదు. సర్పిజిత్ కౌర్ తన భర్తతో విడాకులు తీసుకున్నారు. తనకు ఇద్దరు పిల్లలున్నారు.అసలేం జరిగిందిపంజాబ్, కపుర్తా జిల్లాలోని అమానిపూర్ గ్రామానికి చెందిన సర్బిజిత్ కౌర్, గురునానక్ దేవ్ 556 జయంతి సందర్భంగా నిర్వహించే ప్రకాశ్ పుర్బ్ వేడుకల్లో పాల్గొనేందుకు నవంబర్ 4న పాకిస్థాన్ వెళ్లారు. 10 రోజుల పాటు యాత్ర జరిగిన అనంతరం తిరుగు ప్రయాణంలో ఆమె భారత్ రాలేదు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా ప్రస్తుతం ఆమె ఇస్లాంలోకి మారి వివాహం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే దీనిని అధికారులు ధృవీకరించలేదు. -
మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన యువతి
-
HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్ అంటే..? ఎందువల్ల వస్తుందంటే..
సాధారణ రొమ్ము కేన్సర్ గురించి అందరికీ తెలిసింది. కానీ HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్ గురించి చాలామంది మహిళలకి తెలియదు. ఇది సాధారణ రొమ్ము కేన్సర్ కంటే ప్రమాదకరమైనది కూడా. ఎందుకంటే ఈ HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్ చాలా దూకుడుగా ఉంటుంది, పైగా శరీరంలోని ఇతర భాగాలకు చాలా సులభంగా వ్యాప్తి చెందుతుంది. ఇటీవల కాలంలో ఈ కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై అవగాహన తోపాటు ఎలాంటి చర్యలతో ఈ వ్యాధిని అదుపులో పెట్టుకోవచ్చు వంటి వాటి గురించి హైదరాబాద్‌కి చెందిన ఒమేగా హాస్పిటల్స్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ వింధ్య వాసిని మాటల్లోనే సవివరంగా తెలుసుకుందాం.1 ప్రశ్న: హైదరాబాద్‌లో HER2-పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయా? ఎందుకు?డాక్టర్: దశాబ్దం క్రితం కంటే ఇప్పుడు మనం HER2-పాజిటివ్ నిర్ధారణలను ఎక్కువగా ఉన్నాయనే చెప్పారు. బహుశా దీనిపై అవగాహన పెరగడం, ఎక్కువమంది మహిళలు ముదుగానే స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం వంటివి అయ్యిండొచ్చని అన్నారు. అలాగే జీవనశైలి మార్పులు కూడా ఈ కేసులు అధికమవ్వడానికి కారణం కావొచ్చని ఆమె అన్నారు. 2 ప్రశ్న. HER2-పాజిటివ్ రొమ్ము క్యాన్సర్ ఇతర వాటికంటే ఎలా భిన్నంగా ఉంటుంది?డాక్టర్: HER2-పాజిటివ్ రొమ్ము కేన్స ర్అనేది కణాల ఉపరితలంపై కణ పెరుగుదల, విభజనను ప్రోత్సహించే గ్రాహకమైన HER2 (హ్యూమన్ ఎపిడెర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టర్ 2 కి సంక్షిప్తంగా) ప్రోటీన్ అధికంగా ఉత్పత్తి అవ్వడం వల్ల వస్తుందని అన్నారు. అందువల్ల ఈ కేన్సర్ ఇతర రకాల కేన్సర్ల కంటే మరింత దూకుడు స్వభావం కలది. అయితే దీన్ని HER2ను లక్ష్యంగా చేసుకుని మందులతో రోగులకు చికిత్స అందించవచ్చు. గత రెండు దశాబ్దాలుగా ఈ చికిత్సలు HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్ దృక్పథాన్నే మార్చేశాయి. ఒకప్పడు ఈ కేన్సర్ అధిక ప్రమాదకరమైనదిగా పరిగణించేవారని, ఇప్పుడూ మందులతో నిర్వహించేలా చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.3 ప్రశ్న. HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్‌పై హైదరాబాద్‌లో ఏవైనా శాస్త్రీయ ఆవిష్కరణలు జరుగుతున్నాయా?డాక్టర్: అవును. హైదరాబాద్‌లోని అనేక ఆసుపత్రులు ఇప్పుడు కొత్త చికిత్సా పద్ధతులను అందిస్తున్నాయి.ఉదాహరణకు సబ్కటానియస్ ఫార్ములేషన్స్ ఆఫ్ టార్గెటెడ్ థెరపీలు. ఇవి మందులతో వేగవంతంగా తగ్గించడమే కాకుండా రోగికి సౌకర్యవంతంగా కూడా ఉంటున్నాయి.4 ప్రశ్న: HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్‌కు ఏయే చికిత్సలు అందుబాటులో ఉన్నాయి?డాక్టర్: HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్‌కు అనేక చికిత్సా ఎంపికలు ఉన్నాయి - కేన్సర్ర్ ఎంత అభివృద్ధి చెందింది, అది వ్యాపించిందా, ఎంత వేగంగా పెరుగుతోంది వంటి వాటికి సంబంధించిన మొత్తం రోగి ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. అదృష్టం ఏంటంటే..HER2 ప్రమేయం ఉందని మనకు తెలుసు కాబట్టి, సాధారణమైన వాటికి అదనంగా ప్రభావవంతమైన "టార్గెటెడ్" చికిత్సలు ఉన్నాయి. అవేంటంటే..a. టార్గెటెడ్ థెరపీలు: ఈ మందులు ప్రత్యేకంగా కేన్సర్ కణాల పెరుగుదలను ఆపడానికి HER2 ప్రోటీన్‌ను నిరోధిస్తాయి.b. కీమోథెరపీ: ప్రభావాన్ని పెంచడానికి తరచుగా టార్గెటెడ్ థెరపీలతో కలిపి ఉపయోగిస్తారు.c. శస్త్రచికిత్స: కేసును బట్టి కణితి లేదా రొమ్ము కణజాలాన్ని తొలగించడం.d. రేడియేషన్ థెరపీ: పునరావృత ప్రమాదాన్ని తగ్గించడానికి అనేక సందర్భాల్లో శస్త్రచికిత్స తర్వాత ఉపయోగిస్తారు.e. హార్మోన్ల చికిత్స: కణితి కూడా హార్మోన్ రిసెప్టర్-పాజిటివ్ అయితే సిఫార్సు చేయవచ్చు.ఇప్పుడు లక్ష్యంగా చేసుకున్న చికిత్సలు చర్మం కింద ఇంజెక్ట్ చేసేలా సబ్కటానియస్ ఫార్ములేషన్లుగా అందుబాటులో ఉన్నాయి. అలాగే దీర్ఘ IV ఇన్ఫ్యూషన్లతో (సుమారు 4-6 గంటలు) పోలిస్తే వేగంగా (సుమారు 8 నిమిషాలు) చికిత్సను పూర్తి చేయొచ్చు. రోగి సౌకర్యంగా ఉండేలా చికిత్సా కేంద్రాల్లో గడిపే సమయం కూడా తగ్గేలా పలు చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయన్నారు. 5 ప్రశ్న: HER2-పాజిటివ్ రొమ్ము కేన్సర్ జర్నీలో రోగులు, సంరక్షకులు తప్పక తెలుసుకోవాల్సినవి ఏవి?డాక్టర్: a. HER2 స్థితిని నిర్ణయించడానికి తగిన చికిత్సను ప్లాన్ చేయడానికి ముందుగా సరైన సమయంలో రోగ నిర్ధారణ చేయడం అనేది ముఖ్యంb. చికిత్సకు కట్టుబడి ఉండటం కీలకం. మోతాదులను కోల్పోవడం లేదా చికిత్సను మధ్యలో ఆపడం వల్ల ప్రభావం తగ్గుతుంది.c. రోగులు,వారి సంరక్షకులకు భావోద్వేగ మద్దతు చాలా ముఖ్యమైనది. ఇది ఒకరకంగా మానసిక ఆరోగ్యాన్ని నిర్వహించడం, స్థితిస్థాపకతను పెంపొందించడంలో సహాయపడుతుంది.d. సంరక్షణ బృందంతో సకాలంలో కమ్యూనికేషన్ ద్వారా దుష్ప్రభావాలను నిర్వహించడం జీవిత నాణ్యతను మెరుగుపరుస్తుంది.e. భారతదేశంలో ప్రస్తుతం రోగి సౌకర్యార్థం మెరుగైనా సబ్కటానియస్ థెరపీలు అనే కొత్త చికిత్సా విధానం అందుబాటులో ఉంది. ఇవి రోగి చికిత్సా సమయాన్ని తగ్గించడమే కాకుండా ఆస్పత్రి సందర్శన కూడా తగ్గుతుంది. చివరగా రోగి సంరక్షకులు ఇలాంటి చికిత్సా విధానాలు, మంచి ప్రత్యామ్నాయాల గురించి వైద్యులతో సంభాషించి, సవివరంగా తెలుసుకోవాలి, సత్వరమే కోలుకునే చికిత్సా విధానాల గురించి క్షణ్ణంగా అవగాహన పెంపొందించుకోవాలని చెప్పారామె.ఒమేగా హాస్పిటల్స్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ వింధ్య వాసిని -
కొలువుల్లో వాటా పెరిగింది
భారత్‌లో కృత్రిమ మేధతో (ఏఐ) నడిచే రంగాలు తమ నియామకాల సరళిలోని ప్రాధాన్యాలను మార్చుకోవడంతో ఐదేళ్లలో తొలిసారిగా మహిళల ఉపాధి సామర్థ్యం పురుషులను మించిపోయిందని ఇండియా స్కిల్స్–2026 నివేదిక వెల్లడించింది. ప్రధానంగా కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఇంజనీరింగ్ రంగాలు ఉపాధి సామర్థ్యాల కొలమానాల్లో అగ్రస్థానంలో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. కంప్యూటర్ సైన్స్ పట్టభద్రులు 80 శాతం, ఐటీ ఇంజనీర్లు 78 శాతం ఉపాధి సామర్థ్యం కలిగి ఉన్నట్లు తెలిపింది. వారిలో పురుషుల కంటే మహిళా గ్రాడ్యుయేట్స్‌కే నియామకాల్లో ఎక్కువ ప్రాధాన్యం లభిస్తున్నట్లు పేర్కొంది. ఏఐ, డేటా అనలిటిక్స్, ఆటోమేషన్‌కు సంబంధించిన విభాగాలు మహిళలకు విరివిగా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు వివరించింది. – సాక్షి, స్పెషల్ డెస్క్శిక్షణ ఇప్పించి మరీ..నిపుణుల కొరతను నిరంతరంగా ఎదుర్కొంటున్న కృత్రిమ మేధస్సు, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా, సైబర్ సెక్యూరిటీ రంగాలలోని సంస్థలు.. సూక్ష్మ–క్రెడెన్షియల్స్ (నిర్ధిష్ట నైపుణ్యాలు), పరిమిత స్థాయి యోగ్యతలు కలిగి ఉన్నప్పటికీ మహిళలను నియమించుకుంటున్నాయి. ఏఐ ద్వారా గ్రామీణ ప్రాంతాలలోని మహిళా అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలలోకి తీసుకోవటం, మహిళల నైపుణ్యాలకు ఎక్కువ అవకాశాలకు లభించటం కూడా ఒక కారణమని నివేదిక తెలిపింది. ఐదేళ్లలో ముందడుగు..ప్రస్తుతం మహిళల ఉద్యోగ సామర్థ్యం రేటు 54 శాతం వద్ద ఉంది. ఐదేళ్లలో మొదటిసారిగా పురుషులను దాటి మెరుగైన ప్రతిభను కనబరిచారు. పురుషుల విషయంలో ఈ సామర్థ్యం రేటు 51.5 శాతం ఉంది. బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్), విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాలలో మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్యం నగరాలు, పట్టణ ప్రాంతాలలో గణనీయంగా పెరిగాయి. న్యాయ, ఆరోగ్య సేవల రంగాలలోని ఉద్యోగ అవకాశాలపై మహిళలు వరుసగా 96.4 శాతం, 85.95 శాతం మంది ఆసక్తి చూపుతుండగా; పురుషుల్లో 83.11 శాతం మంది గ్రాఫిక్ డిౖజైన్, 64.67 శాతం మంది ఇంజినీరింగ్ డిజైన్ ఉద్యోగావకాశాల వైపు మొగ్గు చూపుతున్నారు. ‘ఫాస్ట్ మూవింగ్..’ లోనూ..! ఫార్మాస్యూటికల్స్, హెల్త్‌కేర్ వంటి రంగాలు 1–5 సంవత్సరాల అనుభవం ఉన్న మహిళల్ని ఎక్కువగా నియమించుకుంటున్నాయి. ఆ తర్వాతి స్థానాలలో ఎఫ్ఎంసీజీ, బీఎఫ్ఎస్ఐ మహిళా నియామకాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఐటీలో ఇటీవల గ్రాడ్యుయేట్ల నియామకాలు 35 శాతానికి చేరుకోవడం విశేషం. వీరిలో మహిళలకే కాస్త ఎక్కువగా ప్రాధాన్యం లభిస్తోందని నివేదిక పేర్కొంది. కామర్స్ గ్రాడ్యుయేట్ల ఉద్యోగ అవకాశాలు గత సంవత్సరం ఉన్న 55 శాతం నుంచి ఈ ఏడాదికి 62.81 శాతానికి పెరిగాయి. సైన్స్, ఆర్ట్స్‌కి సంబంధించిన రంగాలు కూడా ఉద్యోగ అవకాశాల పెరుగుదలను నమోదు చేశాయి. ఈ మూడింటిలోనూ మహిళల భాగస్వామ్యం అధికంగా ఉందని నివేదిక తెలిపింది. -
Axis My India Exit Poll: బిహార్‌లో గెలుపు ఎవరిందంటే?
ఢిల్లీ: యాక్సిస్ మై ఇండియా సర్వేలోనూ ఎన్డీఏకే బిహార్ ఓటర్లు పట్టం కట్టబోతున్నట్లు వెల్లడైంది. బిహార్ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెలువరించిన ఆ సంస్థ.. ఎన్డీఏ కూటమికి 121 నుంచి 140 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. రెండు విడతల్లో జరిగిన బిహార్ ఎన్నికల పోలింగ్ రికార్డుస్థాయిలో ఓటింగ్ నమోదైంది.యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. ఎక్కువ మంది మహిళలు ఏన్డీఏకి ఓటు వేయగా.. మొదటిసారి ఓటు వేస్తున్న యువత మహాఘాట్‌బంధన్‌ను ఓటు వేసినట్లు వెల్లడైంది. బిహార్ అధికార పీఠం మరోసారి జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే)కే దక్కబోతున్నట్లు మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ తేల్చిచెప్పాయి.ఎన్డీఏ కూటమి- 121 నుంచి 140 స్థానాలుఇండియా కూటమి-98 నుంచి 118 స్థానాలుజన్ స్వరాజ్ పార్టీ- 0 నుంచి 2ఇతరులు- ఒకటి నుంచి ఏడు స్థానాలుపార్టీల వారీగా..బీజేపీ 50 నుంచి 56 జెడియు 56 నుంచి 62 ఎల్ జె పి 11 నుంచి 16 ఇతరులు నాలుగు నుంచి ఏడుమహాఘాట్ బంధన్ఆర్జేడీ 67 నుంచి 76 కాంగ్రెస్ 17 నుంచి 21 విఐపీ 3 నుంచి 5ఇతరులు 10 నుంచి 1 -
నిర్మలా సీతారామన్ సంతకం ఫోర్జరీ చేసి.. 99లక్షలు కాజేశారు
పూణే: హలో మేడం.. మేం ‘డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీ’ నుంచి మాట్లాడుతున్నాం. మీరు ఆధార్‌కు లింక్ చేసిన ఫోన్ నంబర్ ద్వారా నిబంధనలకు విరుద్ధంగా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం" అంటూ అరెస్టు వారెంట్ పంపించారు. లెటర్‌పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంతకం ఉండటంతో బాధితురాలు నమ్మింది.ఆ తర్వాత ఫోన్ చేసిన వ్యక్తి రూ.99 లక్షలు అడిగాడు. భయంతో బాధితురాలు ఆ మొత్తాన్ని చెప్పిన బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేసింది. అనంతరం అదే నంబర్‌కు కాల్ చేయగా..ఫోన్లు స్విచ్ ఆఫ్ అయినట్లు గుర్తించింది. తాను మోసపోయినట్లు గ్రహించిన ఆమె వెంటనే పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.సైబర్ నేరస్తులు ఇప్పుడు కొత్త పంథాను ఎంచుకున్నారు. ఓటీపీలు షేర్ చేయొద్దంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారంతో ప్రజల్లో అవగాహన పెరగడంతో, సైబర్ మోసగాళ్లు నకిలీ అరెస్ట్ వారెంట్లు, అధికార ముద్రలు, ప్రముఖుల సంతకాలను ఉపయోగిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు.తాజా ఘటన అక్టోబర్ చివరి వారంలో పూణేలోని కొథ్రుడ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. బాధితురాలు ఎల్ఐసీ సంస్థలో ఉన్నతోద్యోగినిగా పనిచేసి ఇటీవల పదవీ విరమణ చేశారు.ఇంట్లో ఉంటున్న సమయంలో ఆమెకు ఫోన్ కాల్ వచ్చింది. ‘డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీ’ నుంచి సీనియర్ అధికారినంటూ నిందితుడు పరిచయం చేసుకున్నాడు. ఆమె ఆధార్‌కు లింక్ చేసిన ఫోన్ నెంబర్‌తో అక్రమ లావాదేవీలకు ఉపయోగించినట్లు బెదిరించాడు.తర్వాత ఆమెను జార్జ్ మాథ్యూ అనే మరో వ్యక్తికి కనెక్ట్ చేసి, మనీలాండరింగ్ కేసులో ఆమె పేరు ఉందని చెప్పాడు.నిర్మలా సీతారామన్ నకిలీ సంతకంతో, అధికారిక ముద్ర, సీల్‌తో కూడిన అరెస్ట్ వారెంట్ పంపించారు. ఆమె వయస్సు కారణంగా మినహాయింపు ఇస్తున్నామని, విచారణ కోసం కెమెరా ముందు రావాలని సూచించారు. ధృవీకరణ కోసం కొంత నగదు బదిలీ చేయాలని చెప్పడంతో, ఆమె రూ.99 లక్షలు పంపించారు. చివరికి తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాల్ని పోలీసుల్ని ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. -
స్త్రీలకు వారి ఆస్తి వారికి ఇవ్వాల్సిందే!
మా నాన్నగారికి నలుగురు అక్క చెల్లెళ్లు. అందరికీ 1990లలోనే పెళ్ళిళ్లు కూడా అయిపోయాయి. మా నాన్నగారి తల్లిగారి పేరిట ఉన్న ఆస్తిని, తను చనిపోయాక మా నాన్నగారు తన పేరుతో పట్టా పాస్ పుస్తకం తీసుకున్నారు. కొంత భూమిని అమ్మే క్రమంలో కొనేవారు మా అత్తయ్యల అంగీకారం కూడా కావాలి అని అడిగారు. అయితే అందుకు అత్తయ్యలు అంగీకరించలేదు. మా నాన్నగారు వాళ్లకి కట్నకానుకలు ఇచ్చి పెళ్లిళ్లు చేశారు.. ఇప్పుడు మా నలుగురు అత్తయ్యలకు కూడా ఆస్తిలో వాటా ఇవ్వాలా? ఇవ్వకుండా ఉండే మార్గం ఏమైనా ఉంటే చెప్పండి.– ఫణీంద్ర, చిత్తూరు జిల్లాఇంట్లో ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపించాను కాబట్టి ఇక వారికి ఆస్తిలో ఎటువంటి భాగమూ ఉండదు అని చాలామంది భ్రమ పడుతూ ఉంటారు. పూర్వికులు ఆస్తి మగవారి హక్కు అని ఆడవారు కూడా నమ్మేస్తూ ఉంటారు. మీ అత్తయ్య గార్లకి పెళ్ళిళ్లు చేయకముందు – చేసిన తర్వాత కూడా ఆస్తిని మీ నాన్నగారు – మీరే కదా అనుభవిస్తున్నారు? మీరు అనుభవించిన దానితో పోలిస్తే వాళ్లకి చేసిన పెళ్ళిళ్లు సరితూగుతాయా? చట్టంలో ఎన్నో మార్పులు వచ్చాయి కానీ సమాజంలో ఇంకా రాలేదు. ఆడపిల్లలకు/స్త్రీలకు సమానమైన ఆస్తి హక్కులను చట్టం కల్పించినప్పటికీ తమ హక్కు కోసం ఎంతోమంది మహిళలు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఏది ఏమైనా, హిందూ వారసత్వ (సవరించబడిన) చట్టం, 2005 లోని సెక్షన్ 6 ప్రకారం స్త్రీలకు పురుషులతో సమానమైన హక్కులు ఉన్నాయి. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టు కూడా వినితా శర్మ వర్సెస్ రాకేష్ శర్మ కేసులో మరోసారి తేల్చి చెప్పింది. మీరు వివరించిన దాని ప్రకారం మీకు సెక్షన్ 15 వర్తిస్తుంది. వీలునామా రాయకుండా మరణించిన మహిళ ఆస్తి సెక్షన్ 15 ప్రకారం తన వారసులకు అనగా: 1. ప్రథమంగా కొడుకులకు (లేని పక్షంలో అతని వారసులకు), కూతుళ్ళకు (లేని పక్షంలో ఆమె వారసులకు) – భర్తకు సమానంగా సంక్రమిస్తుంది.2. ద్వితీయంగా భర్త వారసులకు3. తృతీయంగా తల్లి – తండ్రులకు4. లేదా నాలుగవ పక్షంలో తండ్రి గారి వారసులకు5. ఆఖరున తల్లిగారి వారసులకు;ఇలా క్రమపద్ధతిలో మొదటివారు, లేదా రెండవ వారు, ఎవరూ లేకుంటే ఆఖరున సూచించినవారికి ఆస్తి సంక్రమిస్తుంది. సెప్టెంబర్ 9, 2005 కంటే ముందు ఆస్తి పంపకాలు (పార్టిషన్) జరిగి ఉంటే తప్ప, స్త్రీలకు వారి ఆస్తి వారికి ఇవ్వాల్సిందే! పెళ్ళి చేశాము, కట్నం ఇచ్చాము, పురుడు పోశాము, సంక్రాంతికి కొత్త బట్టలు కొన్నాము అంటే కుదరదు. వారి హక్కును వారికి ఇవ్వండి. వారి ఆస్తిని వారికి ఇవ్వండి. మీ అత్తయ్యలకి తెలియకుండా ఆస్తిని అమ్మేస్తే అది మోసం చేసినట్టే. అలాంటి అమ్మకం చెల్లదు.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. (చదవండి: మ్యాడ్ హనీ గురించి విన్నారా..? కానీ ఒక్క చుక్క తాగినా అంతే సంగతులు..) -
ఏఐలో మహిళలకు బ్రైట్ ఫ్యూచర్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)కి సంబంధించిన శ్రామికశక్తిలో ఇప్పుడు అయిదుగురిలో ఒకరు మాత్రమే మహిళ ఉన్నారని, 2027 నాటికి మహిళల సంఖ్య గణనీయంగానే కాదు, ఘననీయంగానూ పెరగనుందని చెబుతోంది వెంచర్ క్యాపిటర్ సంస్థ కలరి క్యాపిటల్ తాజా నివేదిక. ఏఐ, ఎంఎల్ (మెషిన్ లెర్నింగ్)కు సంబంధించి మన దేశంలో 84,000 మహిళలు పనిచేస్తున్నారని, 2027 నాటికి వారి సంఖ్య 3.4 లక్షలకు చేరవచ్చు అని అంచనా వేస్తోంది కలరి రిపోర్ట్. ఏఐ ఎడ్యుకేషన్ మరింత ఎక్కువ మందికి అందుబాటులోకి రావడం, ఎక్కువగా అవకాశాలు అందుబాటులోకి రావడం... మొదలైన కారణాల వల్ల ఏఐ రంగంలో మహిళల సంఖ్య పెరుగుతుందని అంచనా వేసింది ఆ రిపోర్ట్. ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పురుష ఉద్యోగుల కోసం మాత్రమే అన్నట్లుగా ఉండకూడదు. ఈ రంగంలో స్త్రీ, పురుషులకు సమాన అవకాశాలు ఉన్నప్పుడే వైవిధ్యం కనిపిస్తుంది. ఏఐ నిర్మాణంలో అందరి భాగస్వామ్యం ఉంటే పక్షపాతం కనిపించదు. వైవిధ్యమైన, ప్రభావంతమైన ఏఐ భవిష్యత్ కోసం స్రీ, పురుషుల సమానభాగస్వామ్యం ఉండాలి’ అంటుంది ఒపెన్ఏఐ కంపెనీ పాలసీ అండ్ పాట్నర్‌షిప్స్ హెడ్ ప్రగ్యా మిశ్రా. ప్రపంచవ్యాప్తంగా స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం)కి సంబంధించి మన దేశంలో మహిళలు ముందంజలో ఉన్నారని నివేదిక పేర్కొంది. అయితే కంప్యూటర్ సైన్స్, ఏఐలాంటి క్లిష్టమైన విభాగాలలో పరిస్థితి వేరే విధంగా ఉంది. ఐఐటీ విద్యార్థులలో మహిళలు 15 శాతం మంది మాత్రమే ఉన్నారు. స్టార్టప్ ప్రపంచంలో కూడా లింగ అంతరం స్పష్టంగా కనిపిస్తుంది. మన దేశంలోని ఏఐ స్టార్టప్‌లలో ఉమెన్ ఫౌండర్స్ పది శాతం మాత్రమే ఉన్నారు. దేశంలో అత్యధికంగా నిధులు సమకూర్చుకున్న 24 ఏఐ స్టారప్‌లలో ఏ ఒక్కదానిలో ఉమెన్ ఫౌండర్ లేరు.అయితే, ఆశారేఖలాంటి విషయం ఏమిటంటే జనరేటివ్ ఏఐ కోర్సులలో మహిళల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. టెక్ రంగంలో యువతులకు ఏఐ, ఎంఎల్ టాప్ కెరీర్ ఆప్షన్‌గా మారింది. ‘మన దేశంలోని మహిళలు యూజర్ల స్థాయి నుండి ఏఐ రూపకర్తల స్థాయికి చేరుకోవడానికి ఎన్నో ద్వారాలు తెరవాలి. బాలికలకు పాఠశాల స్థాయి నుంచే ఏఐకి సంబంధించిన ప్రాథమిక జ్ఞానాన్ని అందించాలి. మహిళల నేతృత్వంలోని ఏఐ పరిశోధన సంస్థలు, స్టార్టప్‌లకు తగిన నిధులు సమకూర్చాలి’ అంటుంది మైక్రోసాఫ్ట్ సీనియర్ ప్రిన్సిపల్ రిసెర్చర్ కలిక బాలి. (చదవండి: అందాల బొమ్మలం కాదు..! వివాదంలో మిస్ యూనివర్స్ పోటీ..) -
స్టార్ క్రికెటర్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ లగ్జరీ వాచ్ : ధర ఎంతో తెలుసా?
భారత మహిళా క్రికెట్ జట్టు సారధిగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) తొలిసారి ఐసీసీ మహిళల ప్రపంచకప్ ట్రోఫీ అందుకొని చరిత్ర సృష్టించారు. అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్, కెప్టెన్‌గా ప్రతిభ కనబర్చి ప్రపంచ అత్యుత్తమ మహిళ క్రికెటర్లలో నిలవడమే కాదు, ప్రపంచకప్‌ను సాధించిన కెప్టెన్‌గా చరిత్రలో నిలిచిపోయిన పేరు. ఈ విజయాన్ని ఆస్వాదిస్తూ మ్యాచ్ తరువాత తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ సందర్బంగా ఆమె ధరించిన రోలెక్స్ వాచ్ అందరి దృష్టినీ ఆకర్షించింది.ఇటీవలి లెక్కల ప్రకారం భారత రిచెస్ట్ మహిళా క్రికెటర్‌గా ఉన్న హర్మన్ ప్రీత్ కౌర్ నికర విలువ రూ. 25 కోట్లు. ఆమె ధరించి లిమిటెడ్ ఎడిషన్ వాచ్‌లను కూడా ఇష్టపడుతుంది. ది ఇండియన్ హోరాలజీ అందించిన వివరాల ప్రకారం తాజా వీడియోలో ఆమె ధరించిన వాచ్ ఐకానిక్ రోలెక్స్ డేట్జస్ట్గా గుర్తించారు. చదవండి: జుకర్‌బర్గ్‌కే షాక్ : 22 ఏళ్లకే బిలియనీర్ క్లబ్లోకిహర్మన్ ప్రీత్‌కు క్లాసీ టచ్ ఇచ్చిన ఈ రోలెక్స్ డేట్‌జస్ట్ విలువ భారతదేశంలో సుమారు రూ. 8.7 లక్షలు. 36 mm ఓస్టర్స్టీల్ కేసు, స్క్రూ-డౌన్ స్టీల్ క్రౌన్, రోమన్ సంఖ్యలతో కూడిన తెల్లటి డయల్ స్పెషల్ లుక్‌లో కనిపిస్తోంది. అంతేకాదు విజయానికి చిహ్నంగా, ఐకానిక్‌గా రాయల్ లుక్‌లో ప్రీమియం అనుభవాన్నిస్తుంది.చదవండి: బెంగళూరు డాక్టర్ కేసులో ట్విస్ట్ : ప్రియురాలికి షాకింగ్ మెసేజ్అలాగే ప్రపంచ కప్ ట్రోఫీతో ఆమె పంచుకున్న ఫోటోకూడా వైరల్‌గా మారింది. క్రికెట్ అనేది జెంటిల్ మేన్ గేమ్‌కాదు ప్రతీ ఒక్కరిదీ అని అర్థం వచ్చేలా ఉన్న టీ షర్ట్ ట్రెండింగ్‌లో ఉంది. క్రికెట్ అందరి ఆట అనేది సందేశాన్ని హర్మన్‌ప్రీత్ గట్టిగానే ఇచ్చినట్టైంది. View this post on Instagram A post shared by THEINDIANHOROLOGY (@theindianhorology)కాగా పంజాబ్‌కు చెందిన హర్మన్ ప్రీత్ కౌర్ క్రికెట్ ప్రయాణం పంజాబ్ నుంచే ప్రారంభమైంది.2009లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగ్రేటం చేసింది మొదలు క్రికెట్ లో అద్భుతమైన క్రీడాకారిణిగా రాణిస్తూ ఎన్నో అవార్డులు, రివార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. మహిళల క్రికెట్లో అత్యంత ప్రభావ వంతమైన క్రికెటర్లలో ఒకరిగా నిలిచారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్ వరకు ప్రతీ ఫార్మాట్లోనూ ఆమెది ప్రత్యేకమైన ముద్ర. తాజాగా మహిళల ప్రపంచకప్ 2025 (Women's World Cup 2025) ట్రోఫిని దక్కించుకుని సూపర్ స్టార్‌గా నిలిచింది హర్మన్ ప్రీత్ కౌర్. కోట్లాది మంది క్రికెట్ అభిమానుల అభిమానాన్ని సంపాదించుకుంది. -
పెద్దపండక్కి రూ. 30 వేలు: తేజస్వి యాదవ్
పట్నా: బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఎన్నికల తేదీలు సమీపిస్తుండటంతో నేతలంతా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే నేపధ్యంలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ బీహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే తమ పార్టీ ‘మై-బహిన్ మాన్ యోజన’ను ప్రారంభిస్తుందని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ప్రచారం చివరి రోజున ఓటర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, 2026 జనవరి 14న మకర సంక్రాంతి రోజున ఈ పథకాన్ని అమలు చేస్తామని, దీని కింద మహిళలకు ఒక్కొక్కరికి రూ. 30 వేలు అందిస్తామన్నారు.తాము అధికారంలోకి వస్తే తమ పార్టీ అమలు చేయబోయే కీలక సంక్షేమ పథకాలను తేజస్వి యాదవ్ వివరించారు. రాష్ట్ర ఉద్యోగుల పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరిస్తామని, పోలీసు సిబ్బందితో సహా అన్నిశాఖల ప్రభుత్వ సిబ్బందిని వారి సొంత జిల్లాల నుంచి 70 కిలోమీటర్ల పరిధిలో నియమించేలా చూస్తామన్నారు. వరికి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కంటే క్వింటాలుకు అదనంగా రూ. 300, గోధుమలకు క్వింటాలుకు రూ. 400 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చారు. బీహార్‌లో మార్పును ముందుకు నడిపించడంలో మహిళల మద్దతు కీలకమని పేర్కొన్నారు.ఇటీవల ‘మహాఘట్ బంధన్’ విడుదల చేసిన మ్యానిఫెస్టోలోని వివరాల ప్రకారం వారి ప్రభుత్వం అధికారంలోకి వస్తే డిసెంబర్ ఒకటి నుండి మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం అందించనున్నారు. ఐదేళ్ల పాటు మహిళలకు రూ.30 వేల వార్షిక చెల్లింపును కూడా మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు. మకర సంక్రాంతి నాడు ఈ మొత్తాన్ని మహిళల ఖాతాల్లోకి బదిలీ చేస్తామని తేజస్వి పేర్కొన్నారు. బీహార్‌లోని ప్రతి ఇంటికి కనీసం ఒక ప్రభుత్వ ఉద్యోగం అందిస్తామని తేజస్వి యాదవ్ గతంలో హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం ఏర్పడ్దాక 20 నెలల్లోపు బీహార్‌లో ప్రభుత్వ ఉద్యోగం లేని కుటుంబం అంటూ ఉండదని తేజస్వి గతంలో పేర్కొన్నారు. తాను పదవీ బాధ్యతలు స్వీకరించాక ముందుగా క్యాబినెట్ సమావేశంలోనే ఈ ప్రతిపాదనపై సంతకం చేస్తానని అన్నారు.ఇది కూడా చదవండి: ‘ఇస్కాన్’పై ఉగ్ర ముద్ర.. ‘బంగ్లా’లో ఆందోళనలు -
వాంతులు నటిస్తూ.. వింత మహిళా దొంగలు
లక్నో: అరవై నాలుగు కళల్లో దొంగతనం ఒక కళ అంటారు. అయితే ఈ దొంగతనంలో 64 విధానాలు ఉన్నాయని నిరూపిస్తున్నారు కొందరు చోరులు. దొంగతనం జరిగిందని గుర్తించేలోగా చోరులు మాయమైపోతుంటారు. యూపీలోని లక్నోలో కొందరు మహిళా చోరులు వింతైన పద్ధతులు నటిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు.నగరంలోని బస్సులు, ఆటోలలో ప్రయాణికుల దృష్టి మరల్చడానికి సదరు మహిళా చోరులు తమకు వికారంగా ఉందని, వాంతులు వచ్చేలా ఉన్నాయంటూ నాటకాలు ఆడుతుంటారు. తరువాత తమ చాతుర్యాన్ని ఉపయోగించి, మహిళల బంగారు ఆభరణాలను తస్కరిస్తుంటారు. తాజాగా ఈ తరహాలో చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల మహిళా ముఠాను లక్నో పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ మహిళా దొంగలు బస్సు, లేదా ఆటో ఎక్కాక వాంతులు వేసుకున్నట్లు నటిస్తూ, తోటి ప్రయాణికులను ఇబ్బందికి గురిచేస్తారు. తరువాత వారి పరధ్యానాన్ని గుర్తించి, వారి బంగారు ఆభరణాలను దొంగిలించి, పారిపోతుంటారని పోలీసులు తెలిపారు. తూర్పు డీసీపీ శశాంక్ సింగ్ మాట్లాడుతూ, ముఠాలోని ఒక సభ్యురాలు.. ప్రయాణ సమయంలో తొలుత పక్కన్నున్నవారిని మాటల్లోకి దింపుతారు. మరొకరు వాంతి వస్తున్నట్లు నటిస్తూ, తమ దగ్గరున్న పాలిథిన్ బ్యాగ్‌లో వాంతి చేసుకుంటారు. ఈ చర్యతో తోటి ప్రయాణికులు వారిని అసహ్యించుకొని, వారికి కొంచెం దూరం జరుగుతారు. ఇదే తగిన సమయంగా భావించి దొంగల ముఠా సభ్యులు ఆభరణాలను చోరీ చేస్తారు. తరువాత వారంతా మెల్లగా జారుకుంటారని శశాంక్ సింగ్ తెలిపారు. ఈ తరహాలో చోరీలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను అరెస్టు చేశామన్నారు. తమకు అందిన రహస్య సమాచారం ఆధారంగా వారిని పట్టుకున్నామన్నారు. వీరి నుంచి మూడు బంగారు గొలుసులు, ఒక బంగారు లాకెట్, ఒక ముత్యాల హారం, రూ. 13 నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నదన్నారు.ఇది కూడా చదవండి: ‘కూటమిలో పప్పు, తప్పు, అప్పు’: సీఎం యోగి -
లాంగ్ కోవిడ్‌తో బాధపడ్డ మహిళల్లో..!
అప్పట్లో కోవిడ్ బారినపడటంతో పాటు దాని లక్షణాలు చాలాకాలంపాటు కొనసాగిన లాంగ్ కోవిడ్‌తోనూ బాధపడ్డ మహిళల్లో రుతుస్రావకాలం మరింత సుదీర్ఘంగా ఉంటోందంటూ ఓ అధ్యయనంలో తేలింది. ఈ పరిశోధన అంశాలను సైన్స్ / మెడికల్ జర్నల్ అయిన ‘నేచర్’లో ప్రచురితమయ్యాయి. కోవిడ్ అంటే ఏమిటో అందరికీ తెలిసిందే. ఇక లాంగ్ కోవిడ్ కూడా చాలామందికి గుర్తుండే ఉంటుంది. దాని గురించి పెద్దగా తెలియనివాళ్ల కోసం ‘లాంగ్ కోవిడ్’ అంటే ఏమిటో చూద్దాం.లాంగ్ కోవిడ్ అంటే...అప్పట్లో కోవిడ్ పాజిటివ్ సమయంలో బాధితుల్లో కొన్ని లక్షణాలు కనిపించేవి. ఉదాహరణకు జ్వరం వచ్చి తగ్గాక విపరీతమైన నీరసం, నిస్సత్తువలతో పాటు రుచి, వాసనలు తెలియకపోవడం వంటి లక్షణాలు కనిపించేవి. ఇక కొంతకాలం తర్వాత కరోనా వైరస్ తాలూకు చురుకుదనం దేహంలో బాగా తగ్గి΄ోయాక కోవిడ్–19 పరీక్షలు చేయిస్తే... వాటిల్లో నెగెటివ్ వచ్చిన తర్వాత కూడా కొందరిలో కోవిడ్ తాలూకు లక్షణాలు కొనసాగుతూ ఉండేవి. అలా కొనసాగుతున్న లక్షణాలను డాక్టర్లు ‘లాంగ్ కోవిడ్’గా చెప్పేవారు. కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోయిన తర్వాత కొందరిలో చాలా కాలం వరకు కొన్ని రకాల సమస్యలు బాధితులను వేధిస్తూ ఉండేవి. ఒక ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గాక ఆ తర్వాత కూడా కొన్ని సమస్యలు కనిపిస్తూనే ఉంటాయనీ, అవన్నీ చాలా సాధారణమంటూ మొదట్లో వైద్యులు కొట్టి΄ారేసినా, తర్వాత్తర్వాత మాత్రం ఇవి ఒక కొత్త రకమైన జబ్బుని సూచిస్తున్నట్లు కనిపించాయంటూ డాక్టర్లలో చాలామంది పేర్కొన్నారు. అలా నెగెటివ్ ఫలితాలు వచ్చాక కూడా అనేక జబ్బుల తాలూకు లక్షణాలు కనిపించడాన్ని ‘లాంగ్ కోవిడ్’గా వ్యవహరించారు.లాంగ్కోవిడ్కు ఉన్న మరికొన్ని పేర్లు...అమెరికన్ హెల్త్ సంస్థ అయిన ఎన్ఐహెచ్ వారు దీనికి ‘పీఏఎస్సీ’ అని పేరు పెట్టారు. అంటే ‘పీఏఎస్సీ’ అనే సంక్షిప్త నామానికి విస్తరణే పోస్ట్ అక్యూట్ సీక్వెల్ ఆఫ్ కోవిడ్ 19’. ఈ లక్షణాలతో బాధపడే వారిని ‘లాంగ్ హాలర్స్’ అని కూడా కొందరు పిలిచారు. మరి కొంతమంది దీన్ని ‘ఆన్ గోయింగ్ సింప్టమాటిక్ కోవిడ్ 19’ అనీ లేదా ‘క్రానిక్ కోవిడ్–19 సిండ్రోమ్’ అని కూడా పేర్కొన్నారు.పేషెంట్లే కనిపెట్టిన జబ్బు... సాధారణంగా ప్రపంచంలో అత్యధికమైన జబ్బులను డాక్టర్లు కనిపెడతారు. అయితే ఈ లాంగ్ కోవిడ్ మాత్రం పేషెంట్లు కనిపెట్టి వాళ్లు డాక్టర్లను అప్రమత్తం చేశారు. మొదట్లో చాలా మంది డాక్టర్లు ఈ విషయం చెప్పిన పేషెంట్ల వాదనను కొట్టిపడేశారు. వాస్తవానికి లాంగ్ కోవిడ్ అనే పేరుని ‘ఎలీసా పెరెగో’ అనే ఇటలీకి చెందిన బాధిత పేషెంట్ మొట్టమొదటిసారిగా వాడారు. లాంగ్ కోవిడ్ అనేది ఒక ప్రత్యేకమైన జబ్బు అనీ, దాన్ని అర్థం చేసుకోవడానికీ, చికిత్స చేయటానికి ప్రత్యేకమైన శ్రద్ధ అవసరమవుతోందని ప్రపంచవ్యాప్తంగా చాలామంది డాక్టర్లు గుర్తించారు. డాక్టర్ మాధురి మొవ్వ, సీనియర్ ఆబ్స్టిట్రీషియన్, గైనకాలజిస్ట్ – లాపరోస్కోపిక్ సర్జన్ (చదవండి: గుండె రంధ్రాలా..? గుబులొద్దు!) -
తగ్గుతున్న వేతన అంతరం
సాక్షి, హైదరాబాద్: భారత్‌లో కొన్ని రంగాల్లో పురుషులు– మహిళల మధ్య వేతన అంతరం క్రమంగా తగ్గుతోంది. ముఖ్యంగా మార్కెటింగ్, సేల్స్ రంగాల్లో జెండర్ పే గ్యాప్ తగ్గుదల నమోదైనట్టు సర్వేల్లో తేలింది. ఆయా రంగాల్లో అమెరికా, ఫ్రాన్స్, కెనడాలలో ఈ అంతరం అత్యధికంగా ఉండగా, మనదేశంలో మాత్రం ప్రపంచంలోనే అతి తక్కువగా లింగ వేతన అంతరాలు ఉన్నట్టు ‘డీల్’సంస్థ ‘స్టేట్ ఆఫ్ గ్లోబల్ కంపెన్సేషన్ రిపోర్ట్–2025’లో తెలిపింది.భారత్‌లో పురుషులు, మహిళల సగటు జీతాలు ప్రస్తుతం దాదాపు ఒకేలా ఉన్నాయని, ఏడాదికి 13– 23 వేల అమెరికన్ డాలర్ల మధ్య ఉన్నట్టుగా వెల్లడించింది. ఇది పెరుగుతున్న వేతన సమానత్వం, డేటా ఆధారిత పరిహార నమూనాల వినియోగానికి సంకేతమని పేర్కొంది. అయితే, టెక్, ప్రొడక్ట్ ఇతర రంగాల్లో మాత్రం వేతన అంతరం ఇంకా ఎక్కువగానే ఉందని తెలిపింది. సర్వేలోని కీలక అంశాలు.. ⇒ ఈ అధ్యయనంలో 150 దేశాలలో పది లక్షలకు పైగా కాంట్రాక్టు కార్మీకులు, 35 వేల కంటే ఎక్కువ మంది కస్టమర్లు పాల్గొన్నారు. ⇒ భారత్‌లో ఇంజనీరింగ్, డేటా నిపుణుల సగటు వేతనం ఏడాదికి 40 శాతం తగ్గిందని, 2024లో 36 వేల అమెరికన్ డాలర్ల నుంచి 2025లో 22 వేల అమెరికన్ డాలర్లకు తగ్గిందని కూడా నివేదికలో తెలిపారు. ⇒ ఇండియాలో 60 నుంచి 70 శాతం పూర్తికాల ఉద్యోగులు, 30 నుంచి 40 శాతం కాంట్రాక్ట్ కార్మీకులతో హైబ్రిడ్ వర్క్‌ఫోర్స్ నిర్మాణంపై ఎక్కువగా ఆధారపడటం కొనసాగుతోందని పేర్కొంది. ⇒ టెక్నాలజీ, స్పెషలిస్ట్ సేవలకు అత్యధిక సగటు పరిహారాన్ని యూఎస్, యూకే, కెనడా అందిస్తున్నాయని నివేదిక తెలిపింది. నైపుణ్యాల కొరత, పరిమిత బెంచ్‌మార్క్ డేటా కారణంగా ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మార్కెటింగ్ కమాండ్ ఉద్యోగాలు 20 నుంచి 25 శాతం వరకు ప్రీమియంలను చెల్లిస్తున్నట్టు తేల్చింది. ⇒ 2021 నుంచి భారత్, బ్రెజిల్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో టెక్నాలజీ నిపుణులకు మధ్యస్థ ఈక్విటీ గ్రాంట్లు కూడా క్రమంగా పెరిగినట్టు తెలిపింది. ఈక్విటీ ప్యాకేజీ పరిమాణంలో యూఎస్ ముందంజలో ఉండగా.. కెనడా, ఫ్రాన్స్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సాంకేతికత, ఉత్పత్తి రంగాల్లో లింగ వేతన అసమానతలు ఎక్కువగా కనిపిస్తున్నాయని పేర్కొంది. ⇒ ‘లింగ వేతన అంతరం గణనీయంగా తగ్గిన కొన్ని దేశాలలో భారత్ ఒకటిగా ఉండటం ప్రోత్సాహకరంగా ఉంది. ఈ పురోగతి పక్షపాతం కంటే యోగ్యతకు ప్రతిఫలమిచ్చే న్యాయబద్ధత, పారదర్శకత, డేటా ఆధారిత పరిహార నమూనాల వైపు విస్తృత మార్పును ప్రతిబింబిస్తుంది’అని డీల్ ఏపీఏసీ జనరల్ మేనేజర్ మార్క్ సామ్లాల్ పేర్కొన్నారు. -
తొక్కిసలాట: మంత్రి అచ్చెన్నాయుడిని నిలదీసిన భక్తులు
సాక్షి, శ్రీకాకుళం: మంత్రి అచ్చెన్నాయుడిని మహిళా భక్తులు నిలదీశారు. పోలీసుల నిర్లక్ష్యంతోనే తొక్కిసలాట జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకాదశి కావడంతో కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులు భారీగా రావడంతో తోపులాట జరిగింది. రెయింలింగ్ ఉండిపోవడంతో భక్తులు కింద పడ్డారు. 10 మంది మృతి చెందగా.. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.కాశీబుగ్గ తొక్కిసలాటలో అమాయకులైన భక్తులు ప్రాణాలు కోల్పోయారని.. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. దైవ దర్శనానికి ఇంత పెద్ద సంఖ్యలో వస్తున్నారని తెలియదా?. ప్రతి ఏటా ఈరోజున ఎక్కువ సంఖ్యలో వస్తారు కదా?. ముందస్తు సమాచారం ఉన్నా పోలీసులు ఎందుకు భద్రత ఇవ్వలేదు?. ఇది పూర్తిగా పాలనా వైఫల్యమే. ఈ దుర్ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. గత అనుభవాలనుంచి ప్రభుత్వం పాఠాలు నేర్చుకోలేదు’’ ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జిమ్ లేకున్నా హోమ్ చాలు
ఈ రోజుల్లో మహిళల బాధ్యతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇంట్లో గృహిణిగా, ఆఫీసుల్లో ఉద్యోగినిగా మల్టీ టాస్కింగ్‌గా పనులను చక్కబెట్టాల్సి వస్తోంది. ఇలాంటప్పుడు మైండ్ అండ్ బాడీ బ్యాలెన్స్డ్గా ఉండాలి. అందుకు రోజువారీ వ్యాయామాలు చేయాలి. జిమ్‌కు వెళ్లలేం అనుకునేవారు ఇంట్లోనే పాటించదగిన ఫిట్నెస్ కేర్ గురించి తెలుసుకుని ఆచరిస్తే ఎంతో మేలు జరుగుతుంది. బాలీవుడ్ సెలబ్రిటీ జిమ్ ట్రైనర్ యాస్మిన్ చెబుతున్న జిమ్ ఫిట్నెస్΄పాఠాలు ఇవి... దీపికా పదుకొనే, అలియాభట్ ఫిట్నెస్ ట్రైనర్ యాస్మిన్ మహిళల దినచర్యలకు తగిన విధంగా ఇంట్లోనే చేసుకోదగిన ఫిట్‌నెస్‌కు మార్గనిర్దేశం చేస్తుంది. పోషకాహారంపైనా దృష్టి పెడుతుంది. మహిళల ఫిట్నెస్ కోసం కోర్ స్ట్రెంత్, ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌తో కూడిన బ్యాలెన్స్‌ను గట్టిగా చెబుతుంది. అంతేకాదు, మెనోపాజ్ వంటి దశలలో మహిళలు ఆరోగ్యంగా ఉండటానికి సరైన సూచనలనూ అందిస్తుంది.స్థిరత్వం ముఖ్యంచాలా మందిలో ఫిట్నెస్ విషయంలో తీవ్రమైన నిర్ణయాలు ఉంటాయి. ఎక్కువ సమయం, వేగంగా వ్యాయామాలు చేయడం కంటే సరైన సమయంలో సరైన వ్యాయామాలు చేస్తూ ఫిట్నెస్ సాధించడం ముఖ్యం. సమతుల ఆహారం : ప్రాసెస్ చేసి, చక్కెర ఉన్న ఆహారాలను నివారించి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ఫిట్నెస్ లక్ష్యాలలో చాలా ముఖ్యమైనది.అనుకూలమైన వ్యాయామాలు: ఇంట్లో, జిమ్‌లో ఎక్కడైనా చేయడానికి ఎన్నో రకాల వ్యాయామాలు ఉన్నాయి. నిత్యం బిజీగా ఉండే వ్యక్తులు కూడా అనుకూలమైనవి ఎంచుకొని చేయవచ్చు.ఇంట్లోనే చేయదగిన కొన్ని వ్యాయామాలుట్రైసెప్ డిప్స్: మీ ట్రైసెప్స్ కోసం డిప్స్ చేయడానికి బలమైన కుర్చీని ఉపయోగించవచ్చు. అప్పర్కట్, పంచ్: చేతులను బలోపేతం చేసేలా బాక్సింగ్ విధానంలో కదలికలు ఉండాలి.∙డబుల్ లెగ్ స్ట్రెచ్: నేలపైన పడుకొని, మోకాళ్ళను ఛాతీ వద్దకు తీసుకురావడం, తిరిగి చేతులు, కాళ్లను యధాస్థానానికి తీసుకువెళ్లడం.. ఇలా పదే పదే చేయడం ద్వారా ఉదర కండరాలలో మార్పులు తీసుకురావచ్చు.స్ట్రెయిట్ లెగ్ లిఫ్ట్‌లు : నేలమీద వీపుపై పడుకుని, కాళ్లను సమాంతరంగా చాపుతూ పైకి ఎత్తాలి. తర్వాత తిరిగి కిందకు చేర్చాలి. మడమ స్పర్శ: నేలమీద పడుకొని, మోకాళ్ల దగ్గర కాళ్లను వంచి, చేతులతో మడమలను తాకడానికి ప్రయత్నం చేయాలి. వ్యాయామం చేసేటప్పుడు శ్వాస లయను కూడా ఒక రిథమ్‌గా నిర్వహించడం ముఖ్యం. ఎటువంటి గాయం కాకుండా మరొకరి పర్యవేక్షణలో సాధన చేయడం ఉత్తమం.నిటారుగా నిల్చొని, ఒక చేతిని తలకిందుగా పట్టుకుని, నెమ్మదిగా వంగిపాదాన్ని మరొక చేతితో తాకండి. అలాగే రెండో చేతితో చేయాలి. తక్కువ పరికరాలతో వ్యాయామాలుహాలో డంబెల్: పాదాలను, భుజాలను వెడల్పుగా ఉంచి భుజాలు, ట్రైసెప్స్, వీపును లక్ష్యంగా చేసుకోవడానికి రెండు చేతులతో డంబెల్‌ను పట్టుకొని, దానిని తల చుట్టూ తిప్పాలి. బ్యాండ్ ట్విస్ట్: మార్కెట్లో జిమ్ బ్యాండ్స్ లభిస్తాయి. కాళ్లు, చేతులతో ఈ బ్యాండ్ పట్టుకుంటూ ఎగువ, దిగువ వీపు కండరాలపై నిమగ్నం చేయాలి.కెటిల్‌బెల్ : ఇది సైడ్ బెండ్ చేయడానికి బాగా ఉపయోగపడే మరొక పరికరం. ఈ కెటిల్‌బెల్ తో మోచేయి నుండి మోకాలికి ఒక డైనమిక్ కదలిక ఉంటుంది. దీనివల్ల నడుము టోన్ అవ్వడమే కాకుండా, కోర్ కో ఆర్డినేషన్ కూడా మెరుగుపడుతుంది. చేతితో కెటిల్‌బెల్ తీసుకొని, బరువు ఉన్న వైపు పక్కకు వంగి, రెండో మోకాలిని మోచేయి కలిసే విధంగా పైకి ఎత్తాలి. ఇలా పది నుంచి పన్నెండు సార్లు చేయాలి.మెడిసిన్ బాల్ ట్విస్ట్ దీనితో వ్యాయామం చేస్తే పక్కలు బలోపేతం అవుతాయి. ఇందులో ఛాతీ స్థాయిలో మెడిసిన్ బాల్ పట్టుకుని, తల కింద నుంచి ఒక వైపు నుండి మరొక వైపుకు కదలించాల్సి ఉంటుంది.రోజులో ఖాళీ కడుపుతో కొంత సమయం ఈ వ్యాయామాలు చేస్తే మైండ్‌కు–బాడీకీ మధ్య సమతుల్యత ఏర్పడుతుంది. పనులకు తగినట్టు శక్తిని పుంజుకోవడానికి, శారీరక చురుకుదనం పెంపొందించుకోవడానికి, పోషకాహారంపై దృష్టి పెట్టడానికి ఈ పై వ్యాయమాలు పనిచేస్తాయి. చదవండి: Karthika masam 2025 దర్శించుకోవాల్సిన పవిత్ర శివాలయాలు -
భర్తే కాదు.. బావతోనూ సంసారం చేయాలని చిన్న కోడలిపై దారుణం
సాక్షి,ఏలూరు: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. భర్తతో పాటు బావతోనూ సంసారం చేయాలంటూ అత్తా,మామలు చిన్న కోడలిని చిత్ర హింసలకు గురి చేయడం కలకలం రేపింది. అందుకు తన తల్లిదండ్రులకు బాధితురాలి భర్త రంజింత్ కుమార్ వంతపాడటం గమనార్హం. జంగారెడ్డిగూడెంలో దారుణం జరిగింది. భర్తతో పాటు బావతోనూ సంసారం చేయాలంటూ చిన్న కోడలిపై అత్తమామలు ఒత్తిడి తెచ్చారు. బావకి పిల్లలు లేనందున అతనితో సంసారం చేసి పిల్లలు కనాలని కోరికను వ్యక్తం చేశారు. అందుకు బాధితురాలు నిరాకరించడంతో ఆమెను గదిలో బంధించి చిత్రహింసలకు గురి చేశారు. తల్లిదండ్రులు డిమాండ్‌కు భర్త మౌనంగా ఉండిపోవడంతో బాధితురాలికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఏడాది క్రితం బాధితురాలు బాబుకు జన్మనిచ్చినప్పటికీ, తాము చెప్పినట్లు చేయలేదన్న కారణంతో గత పది రోజులుగా ఆమెను, ఆమె కుమారుణ్ని గదిలో బంధించారు. గదికి కరెంటు, మంచినీళ్లు వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా లేకుండా చేశారు. ఈ అమానుష చర్యలు ఆమె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి.ఈ విషయంపై మానవ హక్కుల సంఘం నేతలకు సమాచారం అందడంతో, వారు పోలీసుల సహాయంతో శుక్రవారం బాధితురాలు నివసిస్తున్న ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డారు. బాధితురాలిని బంధించిన గదికి తాళాలు పగలగొట్టి ఆమెను బయటకు తీసుకువచ్చారు. అనంతరం అత్యవసర చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. -
మా ఆయన ప్రతీ అమ్మాయిని అదోలా చూస్తాడు? ఎందుకలా..?
నాకు పెళ్లి అయి 12 సంవత్సరాలు అవుతోంది. ఇద్దరు పిల్లలున్నారు. నా భర్త మంచివాడే, ఎలాంటి దురలవాట్లు లేవు. కానీ తనలో ఉన్న ఒక చిత్రమైన అలవాటు నన్ను చాలా ఇబ్బంది పెడుతోంది. అదేమంటే అతను రోడ్డు మీద వెళ్లే ప్రతి అమ్మాయిని అదోలా చూస్తుంటాడు. వారికి ఏదో ఒక పేరు పెడతాడు. తర్వాత నాతో వారి శరీర సౌష్టవం గురించి కామెంట్స్ చేస్తాడు. మా ఏకాంత సమయంలో ఆ పేర్లు కలవరిస్తూ ఉంటాడు. మొదట్లో అంతగా అనిపించలేదు కానీ పోను పోనూ ఆయన ప్రవర్తన నాకు కంపరంగా తయారైంది. దాంతో అతని మీద ఒకవిధమైన విముఖత ఏర్పడింది. ఒక్కోసారి అతన్ని వదిలేసి వెళ్ళి పోవాలనిపిస్తుంది కూడా! గట్టిగా అడిగితే అలా ఊహించుకోకుండా ఉండలేక పోతున్నానంటారు. ఇదేమైనా మానసిక సమస్య అంటారా! ‘మా సమస్యకేదైనా పరిష్కారముందా? – ఒక సోదరి, నంద్యాలమీ ఉత్తరం చదివి మీరు పడే క్షోభను అర్థం చేసుకోగలను. ఊహ అనేది మనిషికి మాత్రమే ఉన్న ఒక అద్భుత శక్తి. ఒక విజయం సాధిస్తానని ఊహించడం మనలో ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. అలాగే భార్యా భర్తల బంధం కొంచెం రొటీన్‌గా మారినప్పుడు ఇలా ‘ఫాంటసైజ్’ చేయడం కొందరికి కొత్త ఉత్సాహన్ని ఇస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు ఇలా ఊహించుకోవడం మామూలే! ఇది పురుషుల్లో అధికంగా చూసినప్పటికీ, స్త్రీలు కూడా ఇలా ‘ఫాంటసైజ్’ చేసుకుంటారని పరిశోధనల్లో తేలిన విషయం. అమెరికాలో 90వ దశకంలో జరిపిన ఒక పరిశోధన ప్రకారం కొందరు స్త్రీ, పురుషులు తమ భాగస్వామితో ఉన్నప్పుడు, వేరే వారిని ఊహించుకుంటారని తెలిసింది. మనదేశంలో జరిపిన పరిశోధన లో కూడా కనీసం 35 శాతం మంది ఇలా వేరే వారిని ఊహించుకుంటారని తెలిసింది. పురుషులు ఎక్కువగా తెలియని వారిని, సెలబ్రిటీలను ఊహించుకుంటే, స్త్రీలు తమకు తెలిసిన వారినే ఎక్కువ ఊహించుకుంటారని తెలిసింది. దీనికి ప్రధానమైన కారణం మెదడులో, ‘డోపమిన్’ అనే రసాయనం చాలా తొందరగా తగ్గిపోడం, అలాంటప్పుడు ఇతర స్త్రీల మీద పురుషులు మోహం పెంచుకుంటారు. లేదా వాళ్ళని ఫాంటసైజ్ చేసుకుంటూ ఉంటారు. దీన్ని ‘సెవెన్ ఇయర్ ఇచ్’ అని కూడా అంటారు. మామూలుగా చాలామంది మగవారు వారి భాగస్వామికి తెలియకుండా ఇలా చేస్తారు. కొంతకాలానికి అదే సర్దుకుంటుంది. అయితే మీవారి విషయంలో ఈ ప్రవర్తన హద్దులు మీరిందంటే అది ఒక మానసిక సమస్యను సూచిస్తుంది. కాబట్టి తనకి పారాఫిలియా’ లేదా ‘కంపల్సివ్ సెక్యువల్ బిహేవియరల్ డిజార్డర్ వంటి మానసిక సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది చూడాల్సి ఉంటుంది. అలాగే మీరు బాధపడతారని కొంచెం కూడా తను ఎంపతీ చూపలేకపోతున్నాడు. కాబట్టి, పర్సనాలిటీ సమస్యలు కూడా ఉండి ఉండచ్చు. ఏమైనా మీరు సహనాన్ని కోల్పోకండి. అలాగని ఇంకా ఆలస్యం చేయకండి. ఇద్దరూ కలిసి ఒక మంచి సైకియాట్రిస్టుని లేదా అనుభవం కలిగిన క్లినికల్ సైకాలజిస్టుని సంప్రదించండి. వారు మీ ఇద్దరితోనూ వివరంగా మాట్లాడి, కూలంకషంగా ఆయన్ని పరీక్షించి ఆయనకు ఉన్న సమస్య ఏమిటనేదానిపై ఒక నిర్థారణకు వస్తారు. అప్పుడు అవసరాన్ని బట్టి కౌన్సెలింగ్, మందులు, ఇతరత్రా సలహాలు ఇస్తారు. తప్పకుండా ఆయనలో మంచి మార్పు వస్తుంది. విష్ యు ఆల్ ది బెస్ట్.డా. ఇండ్ల విశాల్ రెడ్డి,సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు,సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
బ్యాంకు ఖాతాలు.. ఇంతింతై!
ప్రపంచవ్యాప్తంగా 100 మంది మహిళల్లో 77 మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. మన దేశం మాత్రం ఈ విషయంలో ప్రపంచ సగటు కంటే చాలా మెరుగ్గా ఉంది. ప్రపంచ బ్యాంకు ఫైండెక్స్ రిపోర్ట్–2025, సీఎంఎస్–టెలికం రిపోర్ట్–2025 ప్రకారం భారత్‌లో ఏకంగా 89% మంది మహిళలు బ్యాంకు ఖాతాలు నిర్వహిస్తుండడం విశేషం. ఆర్థిక కార్యకలాపాల్లోనూ అత్యధిక మహిళలు నిమగ్నమయ్యారనడానికి ఇది నిదర్శనం. ఆర్థిక విషయాలపట్ల పెరుగుతున్న అవగాహన, జన్ ధన్ ఖాతాలు, ప్రభుత్వ పథకాల తాలూకా ఆర్థిక ప్రయోజనాలు నేరుగా ఖాతాల్లోకి చేరడం.. వెరసి బ్యాంకు సేవలు అందుకుంటున్న స్త్రీల సంఖ్య పెరుగుతోంది.దేశవ్యాప్తంగా 2025 ఆగస్టు నాటికి 56 కోట్లకుపైగా ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ఖాతాలు తెరిచారు. వీటిలో 55.7 శాతం ఖాతాలు మహిళలకు చెందినవి కావడం విశేషం. ప్రపంచ బ్యాంక్ గ్లోబల్ ఫైండెక్స్ డేటాబేస్ 2025 ప్రకారం 54% భారతీయ మహిళలు తమ మొదటి బ్యాంకు ఖాతాను ప్రధానంగా ప్రభుత్వ ప్రయోజనాలు లేదా వేతనాలను పొందడానికి తెరిచారు. అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా, ప్రపంచ సగటు కంటే చాలా ఎక్కువగా 89% మంది భారతీయ మహిళలు బ్యాంకు ఖాతాను కలిగి ఉండడం గమనార్హం.తగినంత నగదు లేక..ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) పథకాల ద్వారా అందుకున్న నగదుపై మహిళల నియంత్రణ పెరిగిందని నివేదిక తెలిపింది. స్త్రీ పేరుతో ఉన్న ఆదాయం.. గృహ నిర్ణయాలలో ఆమె వాటాను పెంచుతుందని.. కుటంబ అభివృద్ధికి దోహదపడుతుందని పరిశోధనలో తేలింది. బ్యాంకు ఖాతాల విషయంలో ప్రపంచ సగటుతో పోలిస్తే మెరుగ్గా ఉన్నప్పటికీ.. ఖాతాల్లో తగినంత నగదు లేకపోవడం, తక్కువ అవసరం, అధికారిక బ్యాంకింగ్‌లో పాల్గొనడంలో అసౌకర్యం కారణంగా 17.5 శాతం బ్యాంకు ఖాతాలు క్రియాశీలకంగా లేవు.మరొకరిపై ఆధారం..డేటా ఖర్చులు, గోప్యత లేకపోవడం, సైబర్ మోసం భయం, సామాజిక నిబంధనల వంటివి మహిళలు మొబైల్ ఫోన్లు కొనకుండా అడ్డుకుంటున్నాయని నివేదిక తెలిపింది. సొంతంగా మొబైల్ లేకపోవడం స్వతంత్ర డిజిటల్ బ్యాంకింగ్‌ను పరిమితం చేస్తోంది. భారతీయ మహిళల్లో 66 శాతానికిపైగా ఇప్పటికీ ఆర్థిక లావాదేవీలు చేయడానికి పురుష బంధువులపై ఆధారపడుతున్నారట. ప్రభుత్వ పథకాలు ఆర్థిక సాధికారతకు నిజమైన సాధనంగా మారాలంటే.. మహిళల బ్యాంకు ఖాతాలలో డబ్బును జమ చేయడమేకాదు, లబ్ధిదారులకు దీర్ఘకాలిక మద్దతు అవసరమని నివేదిక వివరించింది. సబ్సిడీ స్మార్ట్ఫోన్లు, సరసమైన డేటా ప్లాన్లు.. మహిళలు తమ ఖాతాలను, డిజిటల్ చెల్లింపు సాధనాలను స్వతంత్రంగా ఉపయోగించడానికి వీలు కల్పిస్తాయి.బ్యాంకు ఖాతాలను ఉపయోగించి ఆర్థిక కార్యకలాపాల్లో మహిళల భాగస్వామ్యం (శాతాల్లో)⇒ బ్యాంకు ఖాతాలు ఉన్నవారు - 89⇒ డెబిట్ కార్డుదారులు - 30⇒ నగదు పంపడం, విత్‌డ్రా - 25⇒ ఖాతాలో పొదుపు - 21.2⇒ డిజిటల్ చెల్లింపులకు కార్డు/మొబైల్ వాడకం - 18.9⇒ క్రియాశీలకంగా లేని ఖాతాలు - 17.5⇒ రుణం తీసుకున్నవారు - 11.9⇒ వ్యాపారానికి రుణం - 9⇒ యుటిలిటీ బిల్లులు చెల్లించినవారు - 8.4⇒ డిజిటల్ పేమెంట్స్ చేసినవారు - 7.8మహిళలకు అందుబాటులో మొబైల్.. ఆర్థిక లావాదేవీలలో దాని వినియోగం (శాతాల్లో)⇒ ఖాతా నిల్వ పరిశీలనకు మొబైల్, ఇంటర్నెట్ వాడినవారు - 27⇒ పురుషుల సాయం లేకుండా లావాదేవీ నిర్వహించినవారు - 28⇒ కుటుంబ సభ్యులకు తన ఫోన్ ఇచ్చేవారు - 31⇒ తన పేరుతో సిమ్ ఉన్నవారు - 32⇒ ఇతరుల ఫోన్ వాడడం వల్ల సొంతంగా మొబైల్ లేనివారు - 24⇒ భద్రతా కారణాలతో సొంతంగా ఫోన్ లేనివారు - 18⇒ చదవడం, టైపింగ్ రాకపోవడం వల్ల ఫోన్ లేనివారు - 27⇒ డబ్బులు లేక మొబైల్ కొనుక్కోలేనివారు - 32⇒ టెలికం సేవలు ఖరీదు కావడం వల్ల ఫోన్ కొనలేనివారు - 38 -
స్టార్ హార్టిస్ట్
international Animation day 2025 యానిమేషన్ కంపెనీలు అక్కడొకటి, ఇక్కడొకటి అన్నట్లుగా ఉండే కాలంలో యానిమేషన్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది ప్రమిత ముఖర్జీ. మన దేశంలో యానిమేషన్ రంగం విస్తరణను దగ్గరి నుంచి చూసిన ముఖర్జీ మూడు ఖండాల్లో ప్రసిద్ధ కంపెనీలలో పనిచేసింది. ప్రపంచవ్యాప్తంగా 90 మంది యువతులను యానిమేషన్ రంగంలో తీర్చిదిద్దింది.యానిమేషన్ ఆర్టిస్ట్ కావాలనుకునే ఎంతోమంది యువతులకు నిరంతర స్ఫూర్తినిస్తోంది. కోల్‌కతాలో పుట్టి పెరిగిన ప్రమిత ముఖర్జీకి చిన్నప్పటి నుంచి కార్టూన్లు, బొమ్మలు అంటే ఇష్టం. తనకు తోచినట్లు బొమ్మలు, కార్టూన్లు వేసేది. బొమ్మలపై ఇష్టమే ప్రమితను యానిమేషన్ ప్రపంచంలోకి తీసుకువచ్చింది. హైస్కూల్ చదువు పూర్తయిన తరువాత 3డీ యానిమేషన్ సర్టిఫికేషన్ కోర్సు చేసింది. ఆ రోజుల్లో...ఆ రోజుల్లో మన దేశంలో కొన్ని యానిమేషన్ స్టూడియోలు మాత్రమే ఉండేవి. అవి హాలీవుడ్ కోసం పనిచేస్తుండేవి. వాటిలో ముంబైలోని ‘క్రెస్ట్ యానిమేషన్’ ఒకటి. ఆ స్టూడియో నుంచే క్యారెక్టర్ రిగ్గింగ్ ఇంటర్న్‌గా కెరీర్ ప్రారంభించింది. ‘యానిమేషన్ ఫీల్డ్‌కు భవిష్యత్ ఉంటుందా? ఇది నీటిబుడగ కాదు కదా!’ ‘యానిమేషన్ ఫీల్డ్‌లో కెరీర్ వెదుక్కోవడం ఎంతవరకు క్షేమం?’ ‘యానిమేషన్ అనేది పురుషాధిపత్య రంగం. మహిళలకు సమాన అవకాశాలు ఉంటాయా?’...ఇలాంటి సందేహాలు ఎన్నో ఆరోజుల్లో ఉండేవి.సందేహాలను వదిలి సత్తా చాటుతూ...కోల్‌కత్తాలోని ‘డ్రీమ్‌వర్క్స్ యానిమేషన్’తో పాటు లండన్, లాస్ ఏంజెలెస్‌లోని ప్రసిద్ధ స్టూడియోలలో పని చేసింది ప్రమిత. ‘ఫీచర్, షార్ట్, ఎపిసోడిక్... ఏదైనా యానిమేటెడ్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నప్పుడు, సృజనాత్మక కోణంలో నేను చేసే మొదటి పని దర్శకుడి మనసును చదవడం. బొమ్మలకు ప్రాణం పోయడం. ప్రతి డైరెక్టర్‌కు తనదైన భిన్నమైన ఆలోచనా విధానం ఉంటుంది. ఒక ఆర్టిస్ట్‌గా వారి ఆలోచనను లోతుగా అర్థం చేసుకోవడంతో పాటు క్రియేటివ్ అవుట్‌పుట్ ఇవ్వడం ముఖ్యం’ అంటుంది ప్రమిత.బాధ నుంచి బయట పడేలా...అమెరికాలో ఒక యానిమేషన్ కంపెనీ లో ఉద్యోగంలో చేరిన రోజుల్లో కొత్త దేశంలో, కొత్త ఉద్యోగ జీవితానికి అలవాటుపడడం ప్రమితకు కష్టంగా ఉండేది. ఆ సమయంలో తండ్రి క్యాన్సర్‌తో చని పోవడంతో మానసికంగా బాగా కృంగి పోయింది. ఆ బాధ నుంచి బయట పడడానికి తనకు ఉమెన్ ఇన్ యానిమేషన్ (డబ్ల్యూఐఏ) ఎంతో ఉపయోగపడింది. లాస్ ఏంజెలెస్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ స్వచ్ఛంద సంస్థ యానిమేషన్ రంగంలో లింగ సమానత్వం, మహిళలకు సమాన అవకాశాలకు కృషి చేస్తోంది. ఇదీ చదవండి: Yoga: ప్రశాంతమైన నిద్ర కావాలంటే.. చక్కటి ఆసనాలు‘2020లో డబ్ల్యూఐఏ మెంటర్షిప్ ప్రోగ్రామ్‌లో చేరాను. మెరుగైన సాఫ్ట్‌స్కిల్స్, నాయకత్వ సామర్థ్యాలు, మెరుగైన మాటతీరు... మొదలైన వాటిలో ఈ ప్రోగ్రామ్ ఎంతో ఉపకరించింది. సమాజానికి నా వంతుగా తిరిగి ఇవ్వాలి అనే ఆలోచన ఇచ్చింది’ అంటుంది ప్రమిత.మూడు ఖండాలలో...రెండు దశాబ్దాల తన కెరీర్లో మూడు ఖండాలలో, ఎన్నో ప్రసిద్ధ కంపెనీలలో, ఎన్నో స్థాయులలో, ఎన్నో ప్రాజెక్ట్‌లలో పనిచేసింది ప్రమిత. గత పది సంవత్సరాల కాలంలో విఎఫ్ఎక్స్, యానిమేషన్ రంగంలో సాంకేతికంగా ఎంతో మార్పు వచ్చింది. ఆ మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకొని, కాలంతో పాటు నడుస్తూ, తమను తాము నిరూపించుకుంటున్నారు ప్రమితలాంటి యానిమేషన్ ఆర్టిస్ట్‌లు. మహిళల సంఖ్య పెరుగుతోంది...లింగ అసమానతను తగ్గించడానికి చేసిన అనేక ప్రయత్నాల వల్ల యానిమేషన్ రంగంలో మహిళా ఆర్టిస్ట్‌ల సంఖ్య గతంతో పోల్చితే బాగా పెరిగింది. 2007లో నా బ్యాచ్‌లో వందమంది ఉంటే అందులో ఇద్దరు మాత్రమే మహిళలు. యానిమేషన్ ఆర్టిస్ట్‌గా రాణించడానికి జెండర్, బ్యాక్‌గ్రౌండ్‌తో పనిలేదు. మనం చేసే పనిపై మాత్రమే దృష్టి పెట్టాలి. ప్రతికూలంగా మాట్లాడే వారికి దూరంగా ఉండాలి. యానిమేషన్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా 90 మంది యువతులకు మార్గదర్శిగా నిలవడం సంతోషంగా, గర్వంగా ఉంది.యానిమేషన్లో ఆమె బహుముఖ ప్రజ్ఞయానిమేషన్ రంగంలో మహిళా ఆర్టిస్ట్‌లు, సాంకేతిక నిపుణులకు ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఎందుకు పెరుగుతోంది... అనే విషయానికి వస్తే విశ్లేషకులు ఇలా అంటున్నారు – ‘‘యానిమేషన్‌కు సంబంధించి సృజనాత్మక ప్రక్రియలో మహిళలు తమ జీవితానుభవాలను జోడిస్తున్నారు. యానిమేషన్ పరిశ్రమలో మహిళల ప్రాతినిధ్యం పెరగడం వల్ల పనిలో వైవిధ్యం, సృజనాత్మకత పెరుగుతుంది. యానిమేషన్ రంగంలో మహిళలు యానిమేటర్ ఆర్టిస్ట్‌లుగా మాత్రమే కాదు డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్టూడియో ఎగ్జిక్యూటివ్‌గా కూడా తమను తాము నిరూపించుకుంటున్నారు. వారు సృష్టించే కథలు అన్ని వర్గాల వారికి చేరువ అవుతున్నాయి.’’– ప్రమిత ముఖర్జీ -
సంకల్ప బలముంటే.. ప్రతీది సాధ్యమే..!
యువరానర్.. అనాలనేది చాలా మంది కల. కానీ యువరానర్ అనిపించుకునే స్థాయిలో ఉండేవారు కొందరే. ఆ కొందరిలోనూ మహిళలు తక్కువగా కనిపిస్తుంటారు. కానీ తెలంగాణ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటీవల మహిళా జడ్జీలు.. లాయర్ల సంఖ్య పెరుగుతుంది. రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు ప్రధాన న్యాయమూర్తులు మహిళలే. ఆత్మస్థైర్యంతో విజయం సాధిస్తే.. మనోధైర్యంతో వృత్తిలో రాణిస్తున్నామంటున్నారు మహిళా జడ్జిలు. వీరిపై ప్రత్యేక కథనం.ఆత్మస్థైర్యంతో ముందుకు.. సునీత కుంచాల, పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తిలక్ష్య సాధనలో ఆటుపోట్లు ఎదురైనా మనోధైర్యంతో ముందుకెళ్లి విజ యం సాధించారు పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల. సునీత తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు. తండ్రి గురువులు ఉపాధ్యాయుడిగా, తల్లి జయకుమారి ప్రభుత్వాస్పత్రిలో నర్సు. ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చిన్న వయసులోనే సునీతకు వివాహమైంది. భర్త, తల్లిదండ్రుల సహకారంతో డిగ్రీ, పీజీ ప్రైవేట్‌గానే పరీక్షలు రాసి ఉత్తీర్ణురాలయ్యారు. ఎల్ఎల్బీ ఉత్తీర్ణురాలు అ య్యారు. సునీత ఆడపడుచు జడ్జీ కావడంతో తాను కూడా జడ్జీ కావాలనే లక్ష్యం పెట్టుకొని.. శ్రమించా రు. 2003లో జడ్జీ పోస్టుకు పరీక్ష రాసి.. ఇంటర్వ్యూ దాకా వెళ్లి త్రుటిలో ఉద్యోగావకాశాన్ని చేజార్చుకున్నారు. ఓటమితో నిరాశచెందకుండా మళ్లీ ప్రయత్నించారు. 2013లో జూనియర్ సివిల్‌జడ్జిగా ఎంపికయ్యారు. జిల్లా జడ్జీ కావాలనే కాంక్ష వెంటాడడంతో అదే ఏడాది పడ్డ నోటిఫికేషన్లో ఒకే పోస్టు ఉండడంతో కష్టపడి చదివి విజయం సాధించారు. పోక్సో నేరాలకు కఠిన శిక్షలుజిల్లా జడ్జిగా హైదరాబాద్‌లోని స్పెషల్ కోర్టులో రెండేళ్లపాటు పనిచేసిన కాలంలో 84 పోక్సో కేసుల్లో తీర్పునిచ్చారు. 10 కేసుల్లో జీవితఖైదు విధించారు. పెద్దపల్లి జిల్లా జడ్జిగా భాధ్యతలు చేపట్టిన తర్వాత మూడు కేసుల్లోనూ తీర్పులిచ్చారు. నిజామాబాద్ జిల్లాలో పనిచేసే సమయంలో ఇద్దరు ట్రాన్స్జెండర్లకు ఆఫీసు సబార్డినేటర్లుగా ఉద్యోగావకాశాన్ని కల్పించడం సంతోషాన్ని ఇచ్చిందంటారు సునీత కుంచాల. నిజామాబాద్‌లో పనిచేసిన కాలంలో 14 వేల మందికి కరాటేలో శిక్షణ ఇప్పించారు. నిజామాబాద్‌లోని బాలసదనంలోని విద్యార్థుల ఇబ్బందిని గుర్తించి ప్రైవేట్ స్కూల్లో ఉచిత విద్య అందించేలా ట్రస్టు ఏర్పాటు చేయించడం సంతృప్తినిచ్చిందంటారు.కష్టాలు ఎదురైనా కుంగిపోలేదు: తడిగొప్పుల ప్రవిళిక, జూనియర్ సివిల్ జడ్జి, పిడుగురాళ్లతన ప్రయాణంలో కష్టాలు, కన్నీళ్లు అనేకం ఉన్నాయని పిడుగురాళ్ల జూనియర్ సివిల్ జడీ్జగా విధులు నిర్వర్తిస్తున్న తడిగొప్పుల ప్రవళిక తెలిపారు. వేములవాడ ప్రాంతంలోని కొదురుపాకకు చెందిన ప్రవళిక జడ్జీగా ఎంపికయ్యే క్రమంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ఇంటర్ వరకు కరీంనగర్లో చదువుకున్నారు. 2020లో పీజీ లాసెట్‌లో రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించిన ప్రవళిక క్లాట్ ద్వారా నల్సార్ విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్ఎం చదివారు. అనంతరం మొదటి ప్రయత్నంలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. వ్యవసాయ కుటుంబం. వివాహమైన తర్వాత తల్లిదండ్రులు, అత్తారింటి వారి సహకారంతో చదువు పూర్తి చేయడంతోపాటు జడ్జిగా ఎంపికయ్యారు. జడ్జిగా ఎంపికవ్వాలంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వూ్యలను విజయవంతంగా పూర్తి చేయాల్సిందే. వీటన్నింటిని విజయవంతంగా పూర్తి చేయాలంటే హైకోర్టు, సుప్రీంకోర్టులు ఇచ్చిన తీర్పులపై పూర్తి అవగాహన ఉండాలి. లాయర్‌గా వృత్తిలో రాణించాలంటనే నిత్య విద్యార్థి మాదిరిగా కొత్త అంశాలను నేర్చుకుంటూ ఉండాల్సిందేనని ప్రవళిక తెలిపారు.ఆత్మవిశ్వాసంతోనే విజయం: గడ్డం వందన, జూనియర్ సివిల్ జడ్జి,వేములవాడ అమ్మాయిలు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా.. కష్టపడితే ఏదైనా సాధిస్తారని వేములవాడకు చెందిన జూనియర్ సివిల్ జడ్జి గడ్డం వందన నిరూపించారు. జడ్జీ అంటే కేవలం ఉద్యోగమే కాదని.. జీవన విలువలు.. సమాజాన్ని అర్థం చేసుకోవడమని ఆమె అంటున్నారు. వేములవాడకు చెందిన వందన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నందిగామ జూనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. సవాళ్లను స్వాగతించాలివందన తల్లిదండ్రులు గడ్డం శైలజ, సత్యనారాయణరెడ్డి. వేములవాడలో 10వ తరగతి వరకు చదువుకున్న వందన ఇంటర్ హైదరాబాద్‌లో, లా కోర్సు మహాత్మాగాంధీ న్యాయ కళాశాలలో పూర్తి చేశాను. న్యాయవిద్యలో పీజీని ఉస్మానియా యూనివర్సిటీలో చదివారు. ఎల్ఎల్ఎం పూర్తయ్యాక జ్యుడీషి యల్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అయ్యారు. మొదటి ప్రయత్నంలోనే 2022లో ఆంధ్రప్రదేశ్ కర్నూల్ జడ్జిగా ఎంపికయ్యారు. చదువుతోపాటు క్రమశిక్షణ ఉంటేనే విజయం సాధిస్తామని వందన అంటున్నారు.(చదవండి: ఫ్యాషన్ సెన్స్.. కారాదు నాన్సెన్స్..) -
70 కిలోలు తగ్గిన ఇద్దరు పిల్లల తల్లి.. ఆమె పాటించిన ఐదు సూత్రాలు ఇవే
-
కనిపెట్టింది మహిళలు.. క్రెడిట్ కొట్టేసింది పురుషులు..!
చరిత్ర పొరపాట్లు చేయదు. కానీ, మానవ స్వార్థం చరిత్రలో పొరపాట్లు నమోదు అయ్యేలా చేస్తుంది. అటువంటి చారిత్రకమైన స్వార్థపూరిత పొరపాట్లే ఇక్కడ ఉన్న ఈ ఆవిష్కరణలన్నీ. వీటిని కనిపెట్టింది, లేదా సృష్టించింది మహిళలే అయినప్పటికీ, ఆ గొప్పదనం పురుషులకు దక్కింది! నిజానికి ఇది ‘దక్కటం’ కాదు. ‘కొట్టేయటం’! స్త్రీల నుంచి పురుషులు.. చోరీ చేసి, ప్రపంచాన్ని మభ్యపెట్టి, గురువు స్థానంలో ఉండీ, పేటెంట్‌ను మూలన పడేసి, సహోద్యోగిని టాలెంట్‌ను తొక్కిపెట్టి, పైకి మాట్లాడనీయకుండా చేసి, పక్కకు తోసేసి...క్రెడిట్ తీసుకున్న ఇన్నోవేషన్లు.. డిస్కవరీలలో ఇవి కొన్ని మాత్రమే!మోనోపలీ గేమ్ఈ బోర్డ్ గేమ్‌ని కనిపెట్టింది కాలిఫోర్నియాకు చెందిన చార్ల్స్ డారో అనే ఆయన అని; కనిపెట్టి ‘పార్కర్ బ్రదర్స్’ అనే గేమ్ పబ్లిషర్స్‌కి 1935లో విక్రయించారని; అలా ఈ ‘మోనోపలీ’ బోర్డ్ గేమ్ ప్రఖ్యాతి చెందిందని ప్రపంచానికి ఒక పొరపాటు భావన ఉంది.నిజానికి మోనోపలీ బోర్డ్ గేమ్‌ను కనిపెట్టింది అమెరికన్ గేమ్ డిజైనర్, రచయిత్రి ఎలిజబెత్ మ్యాగీ (1866–1948). చార్ల్స్ డారో కంటే 3 దశాబ్దాల ముందే.. ‘ది ల్యాండ్‌లార్డ్స్ గేమ్: యాంటీ–మోనోపలిస్ట్, మోనోపలిస్ట్’ అనే పేరుతో రెండు సెట్ల మోనోపలీ గేమ్‌ని ఎలిజబెత్ మ్యాగీ సృష్టించారు. మోనోపలీ బోర్డ్ గేమ్‌లో ఆటగాళ్లు తమ ప్రత్యర్థులను వ్యాపారంలో దివాలా తీయించటానికి, వ్యాపార ప్రపంచ జగదేక వీరుడిగా నిలవటానికి ఆస్తులను కొనుగోలు చేస్తూ, అమ్ముతూ, లాభాల కోసం ఎత్తులకు పైఎత్తులు వేస్తుంటారు. ఈ గేమ్‌ను కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆడుతుంటారు. ఆటకు కనీసం ఇద్దరు ఉండాలి. 6 లేదా 8 మంది ప్లేయర్ల వరకు ఆడవచ్చు.పేపర్ బ్యాగులు అడుగు భాగం బల్లపరుపుగా ఉండి, పక్కకు వాలిపోకుండా స్థిరంగా నిలబడి ఉండేలా పేపర్ బ్యాగులను తయారు చేసే యంత్రానికి సృష్టికర్త నిజానికి మార్గరెట్ ఎలోయిస్ నైట్ (1838–1914) అనే అమెరికన్ మహిళ. అయితే, చార్ల్స్ అన్నన్ అనే అతడు ఆమె కనిపెట్టిన పేపర్ బ్యాగ్ డిజైన్‌ను తస్కరించి తన పేరుతో పేటెంట్స్ సంపాదించాడు. మార్గరెట్ ఎలోయిస్ నైట్.. పేపర్ బ్యాగ్ యంత్రానికి మొదట చెక్కతో నమూనాను తయారు చేసి, దానికి ఒరిజినల్ వెర్షన్ కోసం (ఇనుప యంత్రం నమూనా) ఒక షాపుకు వెళ్లినప్పుడు అక్కడే ఉన్న అన్నన్ ఆమె దగ్గరున్న పేపర్ బ్యాగ్ డిజైన్‌ను దొంగిలించాడు. అన్నన్పై న్యాయ పోరాటం చేసి మరీ మార్గరెట్ తన పేటెంట్‌ను దక్కించుకోవలసి వచ్చింది. ఆమె తన 12వ యేటే ‘ఆటో–స్టాపర్’ మెషిన్‌ను కూడా కనిపెట్టారు. నేటి ఎలక్ట్రానిక్ గృహోపకరణాలలో; పారిశ్రామిక, వాణిజ్య పరికరాలలో ఆ ఆటో స్టాపర్ (దానంతటే ఆగిపోయే ఏర్పాటు) కీలకమైన పాత్రను నిర్వహిస్తోంది.సెక్స్ క్రోమోజోమ్లుఅమెరికన్ మహిళా జన్యుశాస్త్రవేత్త నెట్టీ స్టీవెన్స్ (1861–1912) 1905లో సెక్స్ క్రోమోజోములను కనిపెట్టారు. అయితే ఆ ఘనతను మొదట ఆమె గురువు ఇ.బి.విల్సన్ దక్కించుకున్నారు. పురుషుల్లోని లింగ నిర్ధారణ క్రోమోజోమ్‌ల ప్రభావాన్ని అర్థం చేసుకోవటానికి నెట్టీ స్టీవెన్స్ పేడ పురుగులపై పరిశోధనలు చేస్తున్నప్పుడు... పుట్టే బిడ్డ ఆడా, మగా అనేది నిర్ణయించేది పురుషుల క్రోమోజోమ్లేనని ఆమె కనుగొన్నారు. తల్లి అండంలో కేవలం ఎక్స్ క్రోమోజోమ్‌లు మాత్రమే ఉంటాయి. తండ్రి శుక్రకణాల్లో ‘వై’, ‘ఎక్స్’ క్రోమోజోములు రెండూ ఉంటాయి. తండ్రిలో ‘వై’ క్రోమోజోమ్ తల్లిలోని ‘ఎక్స్’తో కలిస్తే మగబిడ్డ; లేదా తండ్రిలోని ‘ఎక్స్’– తల్లిలో ఉండే ‘ఎక్స్’తో కలిస్తే ఆడబిడ్డ పుడతారని నెట్టీ స్టీవెన్స్ కనిపెట్టారు. నెట్టీ పరిశోధనను, మరికాస్త ముందు తీసుకువెళ్లటం వరకు మాత్రమే ఇ.బి.విల్సన్ పాత్ర పరిమితమై ఉన్నప్పటికీ అసలైన సృష్టికర్తగా ఆయనకే పేరు వచ్చింది.విండ్‌షీల్డ్ వైపర్లు1902లో, మేరీ ఆండర్సన్ (1866–1953) అలబామా నుండి న్యూయార్క్ నగరానికి కారులో ప్రయాణిస్తున్నారు. బాగా మంచు కురుస్తోంది. విండ్షీల్డుపై పడుతున్న ఆ మంచును మెత్తటి వస్త్రంతో తుడిచేందుకు డ్రైవర్ మాటిమాటికీ కారును రోడ్డు పక్కన ఆపవలసి వస్తోంది. అది చూసిన మేరీ ఆండర్సన్‌కు ఈ విండ్‌షీల్డ్ వైపర్ల ఆలోచన వచ్చింది. వెంటనే ఆ ఆలోచనకు పేటెంట్‌ను దాఖలు చేశారు.దురదృష్టవశాత్తూ ఆమె ఆవిష్కరణకు పెద్దగా ప్రాముఖ్యం లభించలేదు. ఇదీ ఒక ఇన్వెషనేనా అన్నారు. కొంతకాలం ఆమె పేటెంట్ గడువు ముగిసింది. తరువాత కొన్ని నెలల్లోనే అమెరికాలో ఎక్కడ చూసినా విండ్‌షీల్డ్ వైపర్లే! అంతేకాదు, విండ్‌షీల్డ్ వైపర్స్‌ను కనిపెట్టిన క్రెడిట్ రాబర్ట్ కియర్న్స్ అనే వ్యక్తికి దక్కింది! మేరీ ఎలిజబెత్ ఆండర్సన్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆమెకు విస్తారంగా పాడి పంటల క్షేత్రాలు ఉన్నాయి. ద్రాక్ష తోటల్ని పెంచేవారు. నిరంతరం కారు ప్రయాణాలు చేస్తుంటారు. ఏమైనా.. విండ్‌షీల్డ్ వైపర్ సృష్టికర్త రాబర్ట్ కియర్న్స్ కాదని, మేరీ ఎలిజబెత్ అని త్వరలోనే ప్రపంచానికి నిజం తెలిసిపోయింది.కేంద్రక విచ్ఛిత్తి ‘కేంద్రక విచ్ఛిత్తి’ని కనుగొన్నందుకు ఒట్టో హాన్ అనే జర్మనీ శాస్త్రవేత్తకు 1944లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. నిజానికి ఆ బహుమతి దక్కవలసింది ఆయన సహోద్యోగి లిజ్ మీట్నర్కు! కేంద్రక విచ్ఛిత్తికి (న్యూక్లియర్ ఫిషన్) సైద్ధాంతిక వివరణను అందించింది అసలు లిజ్ మీట్నరే. యురేనియంలో మహా శక్తి ఉన్నట్లు కూడా ఆమే కనిపెట్టారు.ఒక పరమాణు కేంద్రకం రెండు లేదా అంతకన్నా ఎక్కువ పరమాణు కేంద్రాలుగా విడిపోయే ప్రక్రియే కేంద్రక విచ్ఛిత్తి. రేడియో ధార్మిక వికిరణం కంటే ఎక్కువగా అత్యధిక స్థాయిలో కేంద్రక విచ్ఛిత్తిలో శక్తి విడుదల అవుతుందని లిజ్ మీట్నర్ కనుగొన్నారు. ఆమె అందించిన సహకారం వల్లనే ఒట్టో హాన్ నోబెల్ సాధించగలిగారు.లిజ్ మీట్నర్ (1878–1968) ఆస్ట్రియన్–స్వీడిష్ అణు భౌతిక శాస్త్రవేత్త. వియన్నా విశ్వవిద్యాలయం నుండి భౌతిక శాస్త్రంలో డాక్టరేట్ పొందిన రెండవ మహిళగా ఆమె గుర్తింపు పొందారు. 1924–1948 మధ్య రసాయన శాస్త్రంలో 19 సార్లు, 1937–1967 మధ్య భౌతిక శాస్త్రంలో 30 సార్లు నోబెల్‌కు ఆమె నామినేట్ అయ్యారు.గ్రీన్హౌస్ ప్రభావంగ్రీన్హౌస్ ప్రభావం గురించి మాట్లాడేటప్పుడు, ఈ అద్భుతమైన విషయాన్ని కనుగొన్న వ్యక్తిగా బ్రిటిష్ శాస్త్రవేత్త జాన్ టిండాల్ పేరు తరచుగా ప్రస్తావనకు వస్తుంటుంది. అయితే, గ్రీన్హౌస్ ప్రభావాన్ని మొదట సిద్ధాంతీకరించి, దానిని రుజువు చేసింది నిజానికి అమెరికన్ మహిళా శాస్త్రవేత్త యునిస్ ఫూటే (1819–1888). విచారకరం ఏంటంటే – ఆమె కనిపెట్టిన ‘గ్రీన్హౌస్ ఎఫెక్ట్’ గురించి వివరించటానికి ఆమెకు అనుమతి లభించలేదు. దాంతో ఆమె తన పరిశోధనల గురించి మాట్లాడాలని ఒక పురుష సహోద్యోగిని అడగాల్సి వచ్చింది. 1856లోనే యూనిస్ ఫూటే గ్రీన్హౌస్ ఎఫెక్ట్‌ను కనిపెట్టారు. కానీ 1861లో దానిని కనిపెట్టిన జాన్ టిండాల్కు ప్రాధాన్యం లభించింది. భూవాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ వంటి వాయువులు సూర్యుని వేడిని సంగ్రహించి భూమికి హితంగా ఉండేంత మోతాదులో మాత్రమే ఉష్ణోగ్రతను స్వీకరించి, మిగతా కిరణాలను వెనక్కు పంపే సహజ ప్రక్రియే గ్రీన్హౌస్ ఎఫెక్ట్. (చదవండి: తిరిగొచ్చిన ఉంగరం! ఆరు దశాబ్దాలు జ్ఞాపకం..) -
మహిళా న్యాయవాదిపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం.. విచారణ సమయంలో ఏం చేశారంటే?
ఢిల్లీ: మహిళా న్యాయవాదిపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భవిష్యత్‌లో వీడియో కాన్ఫరెన్స్‌లో విచారణకు హాజరయ్యేందుకు అనర్హులుగా ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అసలేం జరిగిందంటే?ఇవాళ ఢిల్లీ హైకోర్టులో కేసు వేసిన సంస్థ, ప్రతివాది సంస్థ తరుఫు విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించింది. కేసు వాదనలు జరిగే సమయంలో ఓ మహిళ న్యాయవాది.. న్యాయమూర్తి వాదనలు వినకుండా వీడియోను ఆఫ్ చేసి, సంభాషణలను మ్యూట్‌లో పెట్టారు. ఇది గమనించిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తేజస్ కారియా మహిళా న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.2025 జూలై 4న ఢిల్లీ హైకోర్టు విడుదల చేసిన ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ వీడియో కాన్ఫరెన్సుగా నిబంధనలను మహిళ న్యాయవాది ఉల్లంఘించారని గుర్తు చేశారు. విచారణ జరుగుతున్న సమయంలో న్యాయవాది వీడియో ఆఫ్ చేసి, మ్యూట్‌లోకి వెళ్లడం వీసీ నిబంధనలకు విరుద్ధం’ అని కోర్టు పేర్కొంది. అందుకు సదరు మహిళా న్యాయవాది తాను మరో కేసు విచారణలో పాల్గొనాల్సి ఉంది. అందుకే వీడియో ఆఫ్ చేసినట్లు తెలిపారు. అనంతరం, జస్టిస్ తేజస్ కారియా..సదరు మహిళ న్యాయవాది విచారణ మధ్యలో వీడియో ఆఫ్ చేసి, విచారణను మ్యూట్‌లో పెట్టినందుకు ఆమె ఇకపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరుకావడాన్ని నిషేధించింది.ఢిల్లీ హైకోర్టులో శ్రీరామ్ ఫార్మ్స్ పై మహీంద్ర హెచ్జెడ్పీసీ కేసు వేసింది.‘ఎస్ఆర్ఎఫ్-C51’ అనే బంగాళాదుంప రకాన్ని తన మహీంద్ర సంస్థకు చెందిన ‘Colomba’ వేరియంటుతో పోల్చి అమ్మకాలు జరుపుతున్నారని ఆరోపణలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టి ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తాత్కాలికంగా ‘SRF-C51’ వేరియంటు ఉత్పత్తి, అమ్మకాలు, ప్రచారం చేయడాన్ని నిషేధించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 19కి వాయిదా వేసింది. -
మహిళలకు ఎర వేస్తున్న జైషే ఉగ్రవాద సంస్థ!
ఉగ్రవాద సంస్థ జైష్-ఏ-మహ్మద్ సంస్థ తన పంథాను మార్చుకుని మహిళలను కూడా ఉగ్రవాద కార్యకలాపాల్లోకి దించేందుకు సిద్ధమైంది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్ (Jaish-e-Mohammed) కేవలం మహిళలతో జీహాదీ గ్రూప్‌ను తయారు చేస్తున్నది. దీంతో పాటు వసూళ్లను కూడా ముమ్మరం చేస్తోంది. మసూద్ అజార్ (Masood Azhar) సోదరి సాదియా అజార్ (Sadiya Azhar) నేతృత్వంలో ‘జమాతుల్-ముమినాత్’ పేరుతో మహిళా దళాన్ని తయారు చేస్తోంది. ఇందులో భాగంగానే మహిళలకు తుఫత్ అల్-ముమినాత్ అనే ఆన్లైన్ శిక్షణా కోర్సును ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కొన్ని ఆధారాలను ఎన్డీటీవీ నివేదించింది.జైష్ అధినేత మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ నేతృత్వంలోని 'జమాత్ ఉల్ మోమినాత్' అనే మహిళా బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కోర్సులో భాగంగా, జైష్ నాయకుల కుటుంబ సభ్యులు, వ్యవస్థాపకుడు మసూద్ అజార్, అతని కమాండర్ల బంధువులు, జిహాద్, ఇస్లాంకు సంబంధించి వారి 'విధుల' గురించి బోధిస్తారు. ఆన్లైన్లో నిర్వహించే నియామక డ్రైవ్ వచ్చే నెల నవంబర్ 8 నుండి ప్రారంభం కానుంది. ఈ 'ఉపన్యాసాలు' రోజుకు 40 నిమిషాలు ఉంటాయి. అజార్ ఇద్దరు సోదరీమణులు, సాదియా అజార్, సమైరా అజార్ నాయకత్వం వహిస్తారు. ఇందులో జమాత్ ఉల్-ముమినాత్‌లో చేరేలా మహిళల్ని పోత్సహిస్తాయి. గత నెలలో బహవల్పూర్లోని మర్కజ్ ఉస్మాన్ ఓ అలీలో తన చివరి బహిరంగ ప్రసంగం తర్వాత, ఈ వార్త వెలుగులోకి వచ్చింది. ఈ 'కోర్సు'లో చేరే ప్రతి మహిళ నుండి రూ. 156 వసూలు చేసి, వారిని ఆన్లైన్ సమాచార ఫారం నింపమని బలవంతం చేస్తోందట. దీంతోపాటు అజార్ తన 'విరాళాల' కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తున్నట్టు తెలుస్తోంది.చదవండి: ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న దీపికా తనయ ‘దువా’ ఫోటోలు : అలియా రియాక్షన్కాగా ఐక్యరాజ్యసమితి ఉగ్రవాద సంస్థగా ఐక్యరాజ్యసమితి ఎపుడో గుర్తించిన జైష్-ఎ-మొహమ్మద్, జమాత్ ఉల్-ముమినాత్ అనే మహిళా విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఇటీవల ప్రకటించింది. అజార్ అక్టోబర్ 8న జమాత్ మహిళా విభాగాన్ని ప్రకటించాడు. అలాగే అక్టోబర్ 19న, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో, మహిళలను సమూహంలోకి తీసుకొచ్చేలా 'దుఖ్తరన్-ఎ-ఇస్లాం' అనే కార్యక్రమం కూడా జరిగింది.ఇదీ చదవండి: ఇండోర్ మహారాణి : నీతా అంబానీ లాంగ్ నెక్లెస్ ఆ డైమండ్స్ ఎలా మోసారండీ! -
ఉమెన్ ఎంపవర్మెంట్ రచన దర్శకత్వం విజయం
అలా చేయడమే మా పనివ్యాపారవేత్త కావాలని చాలామంది మహిళలు కలలు కంటారు. అయితే చాలామందికి ఆ కలను ఎలా సాకారం చేసుకోవాలో తెలియదు. మహిళల కోసం ఎన్నో అవకాశాలు ఉన్నాయి. పేపర్‌పై ఉన్న ఆ అవకాశాల గురించి చాలామందికి తెలియదు. వారికి తెలిసేలా చేయడమే మా పని. ఇప్పటికే ఉన్న ప్లాట్‌ఫామ్‌లకు పోటీదారుగా కాకుండా అవసరంలో ఉన్నవారికి సహాయకురాలి పాత్ర పోషిస్తోంది మా ఫౌండేషన్. మహిళ వ్యాపారవేత్తలు, వివిధ ప్లాట్‌ఫామ్‌లకు మధ్య అంతరం లేకుండా చేస్తున్నాం. – రచన రంగనాథ్‘మైక్రోఫైనాన్స్ రంగానికి మహిళలే వెన్నెముక’ అంటున్న రచన రంగరాజన్ వ్యాపారంలో ఓనమాలు తెలియని మహిళల నుంచి వ్యాపారంలో రెండడుగులు వేసిన మహిళల వరకు తన ఫౌండేషన్ ‘46 డబుల్ ఎక్స్’ ద్వారా దేశవ్యాప్తంగా ఎంతోమంది మహిళలకు స్ఫూర్తినిచ్చి ముందుకు నడిపిస్తోంది.ఆ సమావేశానికి పట్టణం, పల్లె అనే తేడా లేకుండా ఎక్కడెక్కడి నుంచో మహిళలు వచ్చారు. వారిలో ఎంటర్‌ప్రెన్యూర్‌గా తమ కలను నిజం చేసుకోవాలనుకుంటున్న మహిళలు, ఎంటర్‌ప్రెన్యూర్‌గా తొలి అడుగు వేసి విజయబావుటా ఎగరేయాలని కలలు కంటున్న మహిళలూ ఉన్నారు. వీరికి మాజీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ రచన రంగరాజన్ మార్గనిర్దేశం చేసింది. 2020లో రచన ‘46 డబుల్ ఎక్స్’ ఫౌండేషన్ స్థాపించి ఎంటర్ప్రెన్యూర్ కావాలనుకునే ఎంతోమంది మహిళల కలలను నిజం చేసింది. 46 ఫౌండేషన్ మహిళల కోసం ఉచిత ఆన్లైన్ బిజినెస్ క్లాస్‌లు నిర్వహిస్తోంది. అంతేకాకుండా వారి వ్యాపార కల పట్టాలెక్కడానికి అవసరమైన సహకారాన్ని అందిస్తోంది.‘మన దేశంలోనే అతి పెద్ద డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయాలనే నా కలను 46 ఫౌండేషన్ ద్వారా సాకారం చేసుకున్నాను. మా లక్ష్యం ఒక్కటే... ఔత్సాహిక వ్యాపారవేత్తలు, ఎంటర్ ప్రెన్యూర్ కావాలనుకునే మహిళలకు తగిన సమాచారాన్ని అందించి అవసరమైన సహకారం అందించడం’ అంటుంది రచన. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్‌లో కెరీర్ మొదలుపెట్టిన రచన చిన్నా,పెద్దా తేడా లేకుండా ఎంతోమంది ఎంటర్ప్రెన్యూర్లతో కలిసి పనిచేసింది.‘మనం తీసుకునే నిర్ణయాల మీదే ఒక వ్యాపారం విజయవంతం కావడమా, కాకపోవడమా అనేది ఉంటుంది. సరిౖయెన మార్గనిర్దేశకత్వంలో ఎన్నో వ్యాపారాలు విజయవంతం కావడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఆ స్ఫూర్తిని ఇతరులతో పంచుకోవాలనుకున్నాను’ అంటుంది రచన. అత్యంత విజయవంతమైన నమూనాలలో ఒకటిగా మైక్రోఫైనాన్స్ రంగం గురించి చెబుతారు. ఈ రంగాన్ని దగ్గరగా పరిశీలించిన రచన మైక్రోఫైనాన్స్ రంగం విజయవంతం కావడానికి కారణం మహిళలే అంటుంది.‘బాధ్యతతో డబ్బులు తీసుకుంటారు. అదే బాధ్యతతో తిరిగి చెల్లిస్తారు. తమ కుటుంబాలను ఆర్థికంగా నిలబెట్టడానికి చిన్న చిన్న వ్యాపారాలు చేసి విజయం సాధించారు’ అంటుంది రచన. పంజాబ్ నుంచి అరుణాచల్‌ప్రదేశ్ వరకు మన దేశంలో ఎంతోమంది మహిళలకు స్ఫూర్తినిచ్చి దారి చూపించింది . 46ఫౌండేషన్.రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా 4000 వేలమంది మహిళా ఎంటర్ప్రెన్యూర్లకు చేరువ కావాలని ఫౌండేషన్ లక్ష్యంగా నిర్ణయించుకుంది. -
కుంగుబాటు.. మహిళల్లోనే అధికం
సాక్షి, హైదరాబాద్: కుంగుబాటు, మానసిక ఒత్తిడి సమస్యలు పురుషుల కంటే మహిళల్లో రెండురెట్లు అధికంగా ఉన్నాయని ఓ అంతర్జాతీయ అధ్యయనం తేల్చింది. స్త్రీలలో ఉండే వేలాది ప్రత్యేకమైన జన్యు వైవిధ్యాలే ఇందుకు కారణమని గుర్తించారు. ఈ ప్రత్యేక జన్యు నిర్మాణం మహిళలను సామాజిక, పర్యావరణ ఒత్తిళ్లకు అధికంగా ప్రభావితం చేస్తోంది. ఇటీవల నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురితమైన ‘సెక్స్–్రస్టాటిఫైడ్ జీనోమ్–వైడ్ అసోసియేషన్ మెటా–అనాలిసిస్ ఆఫ్ మేజర్ డిప్రెసివ్ డిజార్డర్’అనే పరిశోధన పత్రంలో ఈ అంశం వెల్లడైంది. మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ (ఎండీడీ)తో ముడిపడి ఉన్న ఏడు వేల కంటే ఎక్కువ జన్యు వైవిధ్యాలు పురుషుల్లో ఉంటే.. అందుకు అదనంగా మహిళలు ఆరు వేల జన్యు వైవిధ్యాలను కలిగి ఉన్నారని తేలింది. ఈ అధ్యయనంలో భాగంగా కుంగుబాటు (డిప్రె షన్)తో బాధపడుతున్న 1.3 లక్షల మంది మహిళలు, 65 వేల మంది పురుషుల జన్యు డేటాను పరిశోధకులు విశ్లేషించారు. అలాగే డిప్రెషన్లో లేని 2.9 లక్షల మందికి చెందిన జన్యు డేటాను కూడా విశ్లేషించారు. ఈ సర్వేలో ఆ్రస్టేలియా, నెదర్లాండ్స్, యూకే, యూఎస్‌లకు చెందినవారు అధికంగా పాల్గొన్నారు. ఏమిటీ జన్యు వైవిధ్యాలు? » జన్యు వైవిధ్యం అంటే కేవలం డీఎన్ఏ క్రమంలో మార్పు. వీటిలో కొన్ని వైవిధ్యాలు అంత ప్రమాదకరం కాదు. మరికొన్ని కుంగుబాటు, నిరాశతో సహా అనారోగ్యాల ప్రమాదాన్ని పెంచుతాయి. ఈ వైవిధ్యాలు తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా రావొచ్చు లేదా ఆకస్మికంగా సంభవించవచ్చు. మహిళల్లో ఈ వైవిధ్యాలు మెదడు అభివృద్ధి, హార్మోన్లు, జీవక్రియ వంటి ప్రక్రియలతో సంకర్షణ చెందుతాయి. దీనివల్ల వారు కుంగుబాటుతోపాటు ఇతర రుగ్మతలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.కుంగుబాటుతో బరువు పెరుగుదల, నిద్రలేమి.. » కుంగుబాటు, ఒత్తిడితో బాధపడుతున్న మహిళలు బరువు పెరగటం, నిద్రలేమి, అలసట వంటి సమస్యలు ఎదుర్కొంటారని సర్వేలో పేర్కొన్నారు.» మహిళల నిరాశ లక్షణానికి జన్యు మార్పులు కారణమని పరిశోధకులు కనుగొన్నారు. » దీనికి విరుద్ధంగా నిరాశతో బాధపడుతున్న పురుషులు తరచుగా కోపం, దూకుడు ప్రదర్శిస్తారు » డిప్రెషన్–లింక్డ్ డీఎన్ఏ తేడాలు వారసత్వంగా రావచ్చు లేదా ఆకస్మికంగా సంభవించవచ్చు.» ఇవి పుట్టుకతో వచ్చే డీఎన్ఏ తేడాలు అని పరిశోధకులు చెప్పారు. » ఈ పరిశోధన ఫలితాలు కుంగుబాటు నిర్ధారణ, చికిత్సకు లింగ నిర్దిష్ట విధానాల అవసరాన్ని నొక్కిచెబుతున్నాయి. » ఉదాహరణకు మహిళలకు జీవక్రియ మార్గాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా మంచి చికిత్స అందించవచ్చు » పురుషులకు వారి ప్రవర్తన లేదా న్యూరోకాగ్నిటివ్ నమూనాలపై దృష్టి పెట్టడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు. -
బెంగుళూరులో దారుణం.. సీసీ కెమెరాల్లో షాకింగ్ దృశ్యాలు
బెంగుళూరు: ప్రమాదం ఏ రూపంలో ఎదురవుతుందో చెప్పలేం.. బెంగుళూరులో జరిగిన ఓ దారుణ ఘటన కలకలం రేపింది. గత నెల సెప్టెంబర్ 13న గణేష్ ఉత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఆర్కెస్ట్రాకు హాజరై తిరిగి వస్తుండగా.. ఇద్దరు మహిళలపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసి.. నగలు దోచుకున్నారు. నిందితులను ప్రవీణ్, యోగనందగా పోలీసులు గుర్తించారు. బైక్‌పై ఆ మహిళల వద్దకు వచ్చి వారి బంగారు గొలుసులను లాక్కోవడానికి ప్రయత్నించారు.భయపడిన ఉష తన గొలుసును వారికి ఇచ్చేసింది. కానీ మరొక మహిళ వరలక్ష్మి, ప్రతిఘటించింది. దీంతో యోగానంద ఆమెపై కత్తితో క్రూరంగా దాడి చేసి.. రెండు వేళ్లను నరికాడు. ఆ తర్వాత నిందితులు 55 గ్రాముల బంగారు ఆభరణాలతో అక్కడి నుంచి పారిపోయారు. సెప్టెంబర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది.ఈ ఘటనపై పోలీసులు వారాల తరబడి దర్యాప్తు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం నిందితులను అరెస్టు చేసింది. వారు దొంగిలించిన బంగారాన్ని, దాడికి ఉపయోగించిన కత్తిని పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటన జరిగిన తర్వాత యోగనంద పుదుచ్చేరి, ముంబై, గోవా వంటి నగరాలకు పారిపోయి.. ఆ తర్వాత కర్ణాటకలోని తన సొంత గ్రామానికి తిరిగి వచ్చాడని పోలీసులు వెల్లడించారు. అతనికి గతంలో నేర చరిత్ర ఉందని, ఒక హత్య కేసులో కూడా ప్రమేయం ఉందని పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలు వరలక్ష్మి ప్రస్తుతం వైద్య చికిత్స పొందుతున్నారు.On camera: Two men on a bike wielding machetes rob women in Bengaluru, chop off two fingers and snatch their gold chain. Arrested after a month, police have now recovered 74g of gold and the weapons.https://t.co/ymRnB0fF5t pic.twitter.com/ElKFdlFKH2— Deepak Bopanna (@dpkBopanna) October 18, 2025 -
Viral Video: వామ్మో..భారీ అనకొండతో ఎవరీ డేర్ డెవిల్!
-
Viral Video: విచారణ లైవ్ లో మహిళతో జడ్జీ ముద్దులాట
-
ఊపిరి ఉగ్గబట్టి 20 మీటర్లు.. 2 నిమిషాలు... సీఫుడ్ హీరోలు జుజు మహిళలు
శ్వాస పరికరాలు లేకుండా సాగర గర్భంలోకి డైవ్ చేస్తూ షెల్ ఫిష్, సీవీడ్స్ వంటి సముద్ర ఆహారాన్ని సేకరించి కుటుంబాలను పోషించుకునే మహిళా రైతుల తెగువ ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయంలో చెమటను చిందించే రైతమ్మలందరికీ స్ఫూర్తినిస్తుంది. దక్షిణ కొరియాలోని జెజు ద్వీపానికి చెందిన హెన్యో అనే మహిళా డైవర్లను ‘సీ ఉమన్’ అంటారు. వెయ్యేళ్ల నాటి వారసత్వ సంస్కృతి, డైవింగ్ నైపుణ్యం, సుస్థిరతలకు ప్రసిద్ధి చెందిన ఒక ప్రత్యేకమైన పాక్షిక మాతృస్వామిక సంప్రదాయం వారిది. ఇప్పటికీ 103 గ్రామాలకు చెందిన మహిళలు ఈ విధంగా ఎటువంటి యంత్రాల సహాయం లేకుండా సముద్ర గర్భంలోకి దూసుకెళ్తూ ఆహార సేకరణ చేస్తున్నారు. ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) ‘ఫుడ్ హీరోలు’గా కీర్తిస్తోంది. అంతేకాదు, అత్యంత అరుదైన ప్రపంచ వ్యవసాయ వారసత్వ సంపదగా కూడా హెన్యో సామ్రాజ్యాన్ని ఎఫ్ఏవో, యునెస్కో విశిష్ట గుర్తింపునిచ్చాయి. జెజు ద్వీపంలో పుట్టిన ఈ తరం యువతులు సైతం ఈ సంప్రదాయ వారసత్వ వ్యవసాయాన్ని కొనసాగిస్తూ ఆధునిక సాగర కన్యలుగా జీవనం సాగిస్తుండటం విశేషం. స్వేచ్ఛా డైవింగ్ ద్వారా వారు ‘సముద్ర పొలాలను’ పండిస్తున్న అరుదైన మహిళా ఫుడ్ హీరోలపై అక్టోబర్ 16న అంతర్జాతీయ ఆహార దినోత్సవం (World Food Day )సందర్భంగా ప్రత్యేక కథనం...‘సముద్రం నా రెండో తల్లి’!ర్యుజిన్ కో తన తల్లి లేదా అమ్మమ్మ అడుగుజాడల్లో నడవాలని ఎప్పుడూ అనుకోలేదు. జెజు ద్వీపం తూర్పు తీరంలో డైవ్ చేయడానికి తన తల్లి లేదా అమ్మమ్మ ఇంటి నుంచి పొద్దున్నే బయలుదేరి వెళ్లే సంగతి ఆమెకు బాల్యంలోనే తెలుసు. సీజన్ సరిగ్గా ఉన్నప్పుడు, వారు తమ కుటుంబాలను పోషించుకోవడానికి సముద్రపు అర్చిలు, అబలోన్, సముద్రపు నాచును సముద్రం లోపలి జలాలను గాలించి సేకరించేవారు. ర్యుజిన్ తన తరంలోని చాలా మంది అమ్మాయిల్లాగే కష్టపడి చదువుకుని నగరపు జీవితాన్ని గడపాలని కలలు కంది. అథ్లెటిక్స్‌లో డిగ్రీ పొందినతర్వాత ఆమె నగరానికి వెళ్లిపోయింది. కానీ, అక్కడి జీవితంలో నిలవలేకపోయింది. ఎదురైన నిరాశ, ఆవహించిన నిస్సత్తువ ఆమెను తిరిగి ఇంటి బాట పట్టించాయి. ఇల్లు ఆమెను సముద్రం వైపు నడిపించింది. ఆ విధంగా యువ ర్యుజిన్ తన తల్లి, అమ్మమ్మలాగే ఆమె ‘సముద్ర మహిళ’ కావాలని నిర్ణయించుకుంది.ప్రకృతి చిత్రమైనది. ఒక వనరు లేకపోతే మరో వనరును చూపిస్తుంది మనుషులు బతకడానికి! రిపబ్లిక్ ఆఫ్ కొరియాలోని జెజు ద్వీపం ఇందుకు ఒక ఉదాహరణ. ఒక అసాధారణ, విలక్షణ ‘సముద్ర వ్యవసాయ’ వారసత్వానికి కేంద్ర బిందువైంది. జెజు ద్వీపంలో ఎక్కువ భూమి నిస్సారవంతమైనది కావటంతో వ్యవసాయానికి అంతగా పనికొచ్చే స్థితిలో లేదు. ఈ భౌగోళిక బలహీనత కారణం వల్ల జెజు ప్రజలు సాంప్రదాయకంగా వరికి బదులుగా తమ మెట్ట పొలాల్లో బాగా పెరిగే చిరుధాన్యాలు, బార్లీ వంటి ధాన్యపు పంటలను పండించేవారు. ఎందుకంటే ఈ పంటలు తక్కువ వనరులతోనే ఎక్కువ మందికి ఆహార భద్రతనిచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఆ కారణంగా అక్కడి మహిళా రైతులు సముద్రంపై ఆధారపడి తమ కుటుంబాలకు ఆహారాన్ని సమకూర్చుకోవటంపై దృష్టి సారించారు. సముద్రం అడుగున ఉండే జీవులు, ఆకులు అలములను వెదికి తెచ్చుకోవటమే వారు వృత్తిగా పెట్టుకున్నారు. సుమారు వెయ్యి ఏళ్ల క్రితం నుంచి జుజు ద్వీపంలోని మహిళలు సముద్రపు నీటి లోతుల్లోకి దూకి తినదగిన ఆహారాన్ని సేకరించటం ప్రారంభించారు. ఆ క్రమంలో వారు అసాధారణమైన డైవింగ్ నైపుణ్యాలను తరతరాలుగా సంతరించుకున్నారు. ఎటువంటి శ్వాస పరికరాలు పెట్టుకోకుండా సాగర గర్భంలోకి డైవ్ చేస్తూ అట్టడుగున ఉండే షెల్ ఫిష్, సీవీడ్స్ వంటి సముద్ర ఆహారాన్ని సేకరించి కుటుంబాలను పోషించుకుంటున్నారు. జెజు హెన్యో ఫిషింగ్ ప్రాక్టీస్ అనేది ప్రధానంగా మహిళలు నిర్వహించే సాంప్రదాయ జీవనాధార ఫిషింగ్ వ్యవస్థ. హెన్యో అంటే కొరియన్ భాషలో ‘సముద్ర మహిళ’ అని అర్థం. జెజు హెన్యోలు సాధారణ పద్ధతుల్లో చేపలు పట్టరు. అలాగని మట్టిలో పంటలు పండించరు. ఈ రెండిటికి మధ్యలో పర్యావరణ హితమైన సముద్రాహార సేకరణ ద్వారా తమ సమాజానికి ఆహార, జీవనోపాధి భద్రతను సాధించగలిగారు. ఈ మహిళా డైవర్లు సగం వ్యవసాయం – సగం మత్స్యకార జీవనశైలితో కూడిన జీవనోపాధి పనిలో నిమగ్నమవుతున్నారు. వట్టిపోతున్న సముద్రంకనుమరుగవుతున్న వాణిజ్య అవకాశాలతో పాటు సముద్రం నుంచి జుజు మహిళా డైవర్లు పొందే ప్రతిఫలం కూడా తగ్గుతోంది. వాతావరణ మార్పుల కారణంగా జెజు సముద్ర జలాలు వేడెక్కుతున్నాయి. ఫలితంగా, ఈ ప్రాంత సముద్ర జలాల్లోకి చొచ్చుకొస్తున్న ఉపఉష్ణమండల చేపలు స్థానిక జాతులను మింగేస్తున్నాయి. అముర్ స్టార్ ఫిష్, బ్లూ–రింగ్డ్ ఆక్టోపస్ వంటి మాంసాహార జాతులు ఈ జలాలను దురాక్రమణ చేస్తున్నాయి. సముద్ర మహిళలు ఇప్పుడు అలల కింద కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నారు.ర్యుజిన్ సముద్రంలోకి దిగిన ప్రారంభ సంవత్సరాల్లో సమృద్ధిగా చేపలు పట్టుకోగలిగేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారి΄ోయింది. ఒకప్పుడు దొరికిన దానిలో ΄ావు వంతు కంటే తక్కువ మత్స్య సంపదే ఇప్పుడు దొరుకుతోంది. ‘నా నైపుణ్యాలు మెరుగుపడినప్పటికీ, సముద్రం నుంచి తక్కువగానే పట్టుకోగలుగుతున్నాను. మూడు సంవత్సరాల క్రితం నేను ఏటా 30 బస్తాల అగర్ సీవీడ్‌ను సేకరించి ఎండబెట్టగలిగాను. ఈ సంవత్సరం కేవలం ఏడు బస్తాలతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది..’ అన్నారు ర్యుజిన్. ర్యుజిన్, ఆమెతో పాటు ఉండే మహిళా డైవర్లు మత్స్య సంపద అంతరించి΄ోకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. స్వీయ–నియంత్రణ ΄ాటిస్తూ సముద్ర పర్యావరణ వ్యవస్థను సంరక్షించే చర్యలు చేపడుతున్నారు. హానికరమైన మత్స్య జాతుల నుంచి ఒబుంజాక్ (ఒక రకమైన అబలోన్) వంటి స్థానిక జాతులను కాపాడుతున్నారు. మహిళా డైవర్లు తాము ఆహారం కోసం వేటాడే వారిలా మాత్రమే కాకుండా సముద్ర జీవుల సంరక్షకులుగా తమను తాము భావిస్తారు. స్థానిక సముద్ర జలాలను దురాక్రమణ చేసే స్టార్ ఫిష్‌లను స్థానిక ప్రభుత్వ మద్దతుతో చంపే పని కూడా చేస్తున్నారు.కొత్త యుగంసవాళ్లు ఎదురవుతున్నప్పటికీ జెజు హెన్యో సంస్కృతిపై ప్రజలకు ఆసక్తి పెరుగుతోంది. 2016లో యునెస్కో జెజు హెన్యో సంస్కృతిని యావత్ మానవాళి అవ్యక్త సాంస్కృతిక వారసత్వ సంపదగా గుర్తించింది. ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) జెజు హెన్యో మత్స్యకార వ్యవస్థను ‘ప్రపంచవ్యాప్తంగా అతిముఖ్యమైన వ్యవసాయ వారసత్వ వ్యవస్థ’గా 2023లో ప్రకటించింది. సముద్ర జీవవైవిధ్యం, హానికరం కాని రీతిలో వేట పద్ధతులు అనుసరించటం, అసాధారణమైన సామాజిక నీతి సంరక్షకులుగా హెన్యో మహిళా డైవర్లకు గల ప్రాముఖ్యతను ఎఫ్ఏఓ గుర్తించి ప్రోత్సహిస్తోంది. జెజు ప్రత్యేక స్వయం పాలిత రాష్ట్రంలో ఏర్పాటైన హెన్యో సాంస్కృతిక వారసత్వ విభాగం డైరెక్టర్ క్యుంగ్–హో కో మాట్లాడుతూ ఈ గుర్తింపు ప్రాముఖ్యతను ఇలా వివరించారు.. ‘ఇది జెజు హెన్యో వ్యవస్థను ఉన్నతీకరిస్తుంది. ఈ విలువైన వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించడానికి సహాయపడుతుంది. స్థానిక సమాజం అభివృద్ధికి దోహదపడుతుంద’ని ఆయన అన్నారు. ‘కఠినమైన పని పరిస్థితులు, పర్యావరణ మార్పులు, తగ్గుతున్న సముద్ర వనరులు, వృద్ధాప్యం, కొత్తగా ఈ పనిలోకి వచ్చే వారి సంఖ్య తక్కువగా ఉండటం వంటి సవాళ్లు ఉన్నప్పటికీ, తమ జీవనోపాధిని కొనసాగించే మహిళల బలమైన ఆకాంక్షను ఎఫ్ఏవో గుర్తింపు బలోపేతం చేస్తోంది’ అన్నారాయన. హెన్యో జీవన విధానాన్ని కాపాడుకోవడానికి జెజు ప్రభుత్వం కృషి చేస్తోంది. సముద్ర మహిళల సంక్షేమం కోసం, వారి ఆదాయాన్ని పెంపొందించడానికి, వారి పని వాతావరణాన్ని మెరుగుపరచటం ద్వారా హెన్యో సంస్కృతిని సంరక్షించడానికి ఈ సంవత్సరం 2 కోట్ల అమెరికన్ డాలర్ల మేరకు ప్రభుత్వం పెట్టుబడి పెట్టిందని డైరెక్టర్ క్యుంగ్–హో కో వివరించారు. డైవింగ్ సంబంధిత గాయాలకు వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తోంది. అరవై, డెబ్బయి ఏళ్లు దాటిన హెన్యోలకు ఆర్థిక భత్యాలు ఇస్తున్నారు. 75 ఏళ్లు పైబడిన వారికి పదవీ విరమణ ప్రయోజనాలను అందిస్తున్నారు. హెన్యో పండుగలు, ఆచారాల ప్రోత్సహించటం, కొత్త తరం మహిళలకు హెన్యో నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వడానికి పాఠశాలలను కూడా నిర్మించటం విశేషం.ఉద్యోగం కంటే ఎక్కువ..ఒక జీవన వారసత్వం! వేగవంతమైన ప్రపంచంలో జెజులోని హెన్యో సమాజం పర్యావరణ స్పృహతో కొనసాగుతోంది. ప్రకృతిని మనుషులు ఉపయోగించుకునే క్రమంలో పర్యావరణ పరిమితులను గౌరవిస్తుంది. పరస్పరం ఆధారపడటాన్ని విలువైనదిగా భావించే జీవన విధానాన్ని కొత్త తరాలకు చాటిచెప్పే ఉదాహరణగా నిలుస్తుంది. ‘ప్రజలు ఈ పనిని ‘3డి ఉద్యోగం’ అని పిలుస్తారు. మూడు డీలు అంటే.. డర్టీ, డేంజర్, డిమాండింగ్తో కూడిన పని అని చెబుతుంటారు. కానీ నా మటుకు నాకు, ఇది అత్యున్నతమైన సంతృప్తినిచ్చే పని అనిపిస్తుంటుంది’ అన్నారు 42 ఏళ్ల ర్యుజిన్. ‘నేను నీటి అడుగున ఉన్నప్పుడు, నేను జీవించడం గురించి మాత్రమే ఆలోచిస్తాను. అంతకుమించి అతిగా ఆలోచించడం మానేశాను’ అంటారు ర్యుజిన్. ‘సముద్రం నా రెండో తల్లి. నేను సముద్రపు తల్లి ఒడిలో ఈదులాడుతూ చాలా స్వస్థత పొందాను. ఈ తల్లి నాకు చాలా ఇచ్చింది..’ అంటారామె ఉద్వేగంగా! ‘నాకు నలుగురు పిల్లలు. ప్రతి ఉదయమూ జీవన పోరాటమే. కానీ సముద్రం వైపు వెళుతున్నప్పుడు మాత్రం నాకు ఉత్సాహంగా ఉంటుంది. ఈ రోజు సముద్రం నాకు ఏమి ఇస్తుందో అన్న ఉత్సుకత కలుగుతుంది. స్వస్థత చేకూర్చే నిరంతర ప్రవాహంలా జీవితం గడచిపోతోంది’ అన్నారామె. ‘జెజులో మహిళలది ఎల్లప్పుడూ కీలక పాత్రే. నాకు, హెన్యో అంటే మహిళలు, మహిళలు అంటే హెæన్యో. ఇది గొప్ప గర్వకారణం...’ అన్నారు.కనుమరుగవుతున్న వారసత్వంహెన్యో వ్యవసాయ వారసత్వ సంప్రదాయానికి వెయ్యి సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. క్రీస్తు శకం 1,105వ సంవత్సరం నుంచి ఈ వ్యాపారాన్ని ప్రస్తావించిన రికార్డులున్నాయి. జెజు మహిళలు ఎల్లప్పుడూ ఆ ద్వీపం జీవితానికి వెన్నెముకగా ఉన్నారు. మత్స్యకారులుగా, రైతులుగా, తల్లులుగా, ఎక్కువగా వీళ్లదే ఇళ్లలో ముఖ్యమైన సంపాదనగా ఉంటుంది.1970లలో 14,000 మంది హెన్యోలు ఉన్నారు. కానీ, 1980 తర్వాత కాలంలో చాలా మంది మహిళలు ఈ పనిని విడిచిపెట్టి పర్యాటక, టాన్జేరిన్ పరిశ్రమల్లో ఉద్యోగాల కోసం వెళ్లారు. ప్రస్తుతం 2,700 హెన్యోలు ఉన్నారు. అయితే, వారిలో చాలా మంది డెబ్బై, ఎనభై– ఏళ్ల వయస్కులే! 42 సంవత్సరాల వయస్కురాలైన ర్యుజిన్ సముద్రంలోకి వెళ్లే అతి పిన్న వయస్కుల్లో ఒకరు. ర్యుజిన్ గ్రామంలో 83 మంది చురుకైన హెన్యోలు ఉన్నారు. ఈ సంవత్సరం పది మంది పదవీ విరమణ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ర్యుజిన్ తరంలో డైవర్లు పని నేర్చుకున్న వారి సంఖ్య చాలా తక్కువ. ‘భవిష్యత్తులో నేను ఒంటరిగా డైవింగ్ చేయవలసి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నాను. అందుకే నేర్చుకోవాలనుకునే వారెవరినైనా స్వాగతిస్తున్నాను. నాకు తెలిసిన ప్రతి నైపుణ్యాన్నీ వారికి నేర్పుతాను’ అని ర్యుజిన్ చెప్పారు. 20 మీటర్లు.. 2 నిమిషాలు...స్వేచ్ఛా డైవింగ్ చేసే జెజు మత్స్యకార మహిళలు తమ శ్వాసను ఉగ్గబట్టుకునే సామర్థ్యం, సముద్ర జలాల్లోకి దూసుకెళ్లే నైపుణ్యం, సముద్రపు నీటి అడుగున ఏయే తావుల్లో తమకు అవసరమైన ఆహారం ఎక్కడెక్కడ ఉంటుందో గ్రహించే సంప్రదాయ విజ్ఞానం, జ్ఞాపక శక్తిని మాత్రమే ఆయుధాలుగా ఉపయోగించి సముద్రపు లోతుల్లోకి సాహసంతో దూకేస్తారు. ఆక్సిజన్ ట్యాంకులు లేకుండా వారు డైవ్ చేయగలరు. ఒకటి–రెండు నిమిషాలు తమ శ్వాసను స్తంభింపజేసుకోగలరు. ఆ కొద్ది సమయంలోనే ఐదు నుండి 20 మీటర్ల లోతుకు డైవ్ చేయగలరు. రోజుకు ఏడు గంటల పాటు సముద్రంలో గడపటం వారికి వెన్నతో పెట్టిన విద్య. ప్రతి అక్టోబర్ 16 నాడు ప్రపంచ ఆహార దినోత్సవం జరుపుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ర్యుజిన్ వంటి ‘ఫుడ్ హీరో’ల గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. ఇటువంటి సంప్రదాయ విజ్ఞానంతో కూడిన గొప్ప జీవన నైపుణ్య సాంప్రదాయ వారసత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరాన్ని ఈ తరం గుర్తించేలా చెయ్యటం మన కర్తవ్యం.– నిర్వహణ: పంతంగి రాంబాబు సాక్షి సాగుబడి డెస్క్ -
కలెక్టర్, ఎమ్మెల్యేతో యువతి వాగ్వాదం
తమిళనాడు: 30 సంవత్సరాలుగా తమ ఆదీనంలోని భూమిని 60 సంవత్సరాల క్రితం మృతి చెందిన వ్యక్తి పేరిట పట్టా ఇవ్వడాన్ని తప్పుబడుతూ యువతి చంటి పాపతో వచ్చి కలెక్టర్ ప్రతాప్, ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్‌తో వాగ్వాదానికి దిగిన సంఘటన కలెక్టర్ కార్యాలయంలో కలకలం రేపింది. తిరువళ్లూరు జిల్లా విడయూర్ గ్రామానికి చెందిన గోవిందరాజ్‌కు అదే ప్రాంతంలో 30 సెంట్లు వ్యవసాయ భూమి ఉంది. సంబంధిత పొలంలో గోవిందరాజ్ సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గోవిందరాజ్ పొలానికి సమీపంలోనే కుళ్లప్పరెడ్డి కుమారుడు ఏలుమలై, గోవిందరాజ్ సోదరుడు నాగరత్నంకు చెందిన వ్యవసాయ పొలం ఉంది. కుళ్లప్పరెడ్డి సుమారు 60 సంవత్సరాల క్రితం మృతి చెందాడు. ఈ క్రమంలో గత మూడు సంవత్సరాల క్రితం గోవిందరాజ్ అ«దీనంలోని వ్యవసాయ పొలాన్ని కుళ్లప్పరెడ్డి పేరిట పట్టాను నాగరత్నం మార్చినట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న గోవిందరాజ్ కుమార్తె అనిత పట్టా మారి్పడిపై గత రెండు సంవత్సరాలుగా వినతిపత్రాలు ఇస్తోంది. అయితే ఇంత వరకు ఫలితం లేదు. దీంతో సోమవారం ఉదయం గ్రీవెన్స్‌డేలో వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్ ప్రతాప్, తిరువళ్లూరు ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్‌ను కలిసి వినతి పత్రం సమరి్పంచారు. ఈ వినతి పత్రంపై తక్షణం విచారణ చేయాలని కలెక్టర్‡ ఆర్డీఓ రవిచంద్రన్‌ను ఆదేశించారు. అయితే కలెక్టర్ ఆదేశాలపై యువతి వాగ్వాదానికి దిగింది. ఇప్పటి వరకు 9 సార్లు వినతి పత్రం ఇచ్చామని, వినతి పత్రం ఇచ్చిన ప్రతి సారీ విచారణ అంటూనే కాలం వెల్లదీస్తున్నారని ఆరోపించింది. న్యాయం జరిగేది ఎప్పుడూ అంటూ గట్టిగా కేకలు వేయడంతో గ్రీవెన్స్ హాలు నిశ్శబ్దంగా మారిపోయింది. తనకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని తేల్చి చెప్పడంతో కలెక్టర్ యువతిని సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో పోలీసులను పిలిపించి యువతిని బయటకు పంపారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. -
అఫ్గాన్ మంత్రి ప్రెస్ మీట్ వివాదం.. కేంద్రం వివరణ
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో అఫ్గాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తఖీ ఏర్పాటుచేసి మీడియా సమావేశానికి మహిళా జర్నలిస్టులను అనుమతించకపోవడంపై వివాదం తలెత్తింది. దీనిపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) స్పందిస్తూ, అఫ్గాన్ మంత్రి మీడియా సమావేశంతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ సమావేశానికి మహిళా జర్నలిస్టులను ముత్తఖీ ఆహ్వానించలేదంటూ పలు విమర్శలు వచ్చాయి. ఈ నేపధ్యంలో విపక్షాలు మహిళా జర్నలిస్టులకు మద్దతుగా నిలిచాయి. ఈ క్రమంలోనే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీనిపై స్పందిస్తూ వివరణ ఇచ్చింది.శుక్రవారం విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో అఫ్గాన్ మంత్రి ముత్తఖీ ద్వైపాక్షిక చర్చలు జరిపిన తర్వాత ఆయన అఫ్గాన్ రాయబార కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. అయితే దీనిలో పాల్గొనేందుకు వచ్చిన మహిళా జర్నలిస్టులను లోపలికి అనుమతించలేదు. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ సమావేశానికి ఎంపిక చేసిన కొందరు పురుష జర్నలిస్టులు, అఫ్గాన్ రాయబార కార్యాలయ అధికారులు మాత్రమే హాజరయ్యారు. సమావేశంలో ముత్తఖీ భారతదేశం- అఫ్గాన్ సంబంధాలు, పరస్పర మానవతా సహాయం, వాణిజ్య విధానాలు, భద్రతా సహకారం తదితర ప్రాంతీయ అంశాలపై మాట్లాడారు. Prime Minister @narendramodi ji, please clarify your position on the removal of female journalists from the press conference of the representative of the Taliban on his visit to India. If your recognition of women’s rights isn’t just convenient posturing from one election to…— Priyanka Gandhi Vadra (@priyankagandhi) October 11, 2025మహిళా జర్నలిస్టులను అఫ్గాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తఖీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి అహ్వానించకపోవడంపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఈ ఉదంతంపై తీవ్రంగా స్పందించారు. దీనిని భారతీయ మహిళా జర్నలిస్టులకు జరిగిన అవమానంగా పేర్కొన్నారు. దీనిపై ప్రధాని మోదీ తమ వైఖరిని స్పష్టం చేయాలని ప్రియాంక గాంధీ వాద్రా డిమాండ్ చేశారు. ఇదేవిధంగా మాజీ కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ఈ సంఘటనపై స్పందిస్తూ.. తోటి మహిళా జర్నలిస్టులకు మద్దతుగా పురుష జర్నలిస్టులు ప్రెస్ మీట్‌ను బహిష్కరించి ఉంటే బాగుండేదని అన్నారు. I am shocked that women journalists were excluded from the press conference addressed by Mr Amir Khan Muttaqi of AfghanistanIn my personal view, the men journalists should have walked out when they found that their women colleagues were excluded (or not invited)— P. Chidambaram (@PChidambaram_IN) October 11, 2025ఈ ఘటన హాస్యాస్పదంగా ఉన్నదని చిదంబరం పేర్కొన్నారు. తాలిబన్ల వివక్షపూరిత విధానాలకు భారత ప్రభుత్వం అనుమతించిట్లు ఉన్నదన్నారు. ఇందుకు సహకరించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ తీరుపై ఆయన విరుచుకుపడ్డారు. కాగా అఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం మహిళలపై పలు ఆంక్షలు విధించింది. ఇటీవల అఫ్ఘనిస్తాన్ విశ్వవిద్యాలయానికి చెందిన మహిళలు రాసిన పుస్తకాలను కూడా నిషేధించింది. మహిళా సామాజిక శాస్త్రం, మానవ హక్కులు, అఫ్ఘన్ రాజ్యాంగ చట్టం-ప్రపంచీకరణ- అభివృద్ధి తదితర 18 కోర్సులను కూడా రద్దు చేసింది. -
పేదవాడి ప్రాణాలతో చెలగాటం.. కల్తీ మద్యంపై కదం తొక్కిన మహిళలు (చిత్రాలు)
-
నకిలీ మద్యంపై కదం తొక్కిన మహిళలు
కడప కార్పొరేషన్/ఏలూరు టౌన్: నకిలీ మద్యంతో ప్రాణాలు తీస్తున్న కూటమి ప్రభుత్వంపై మహిళలు కదం తొక్కారు. ఎన్–బ్రాండ్ లిక్కర్‌ను అరికట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ, నగర అధ్యక్షురాలు బండి దీప్తి ఆధ్వర్యంలో కడపలోని ప్రకాష్ నగర్ మెయిన్ రోడ్డులో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం ఎదుట మద్యం పారబోసి నిరసన తెలిపారు. అనంతరం అసిస్టెంట్ సూపరింటెండెంట్ వినోద్ కుమార్ నాయక్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ మాట్లాడుతూ ప్రజలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బెల్టుషాపులు విచ్చలవిడిగా ఉన్నాయని, నకిలీ మద్యం ఎక్కడపడితే అక్కడే దొరుకుతోందన్నారు. ఇప్పటికే నకిలీ మద్యానికి నలుగురు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ మద్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, బాధ్యులైపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏలూరులో..రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, వీధివీధిలో బెల్టు షాపులు పెట్టి ప్రజలను మద్యానికి బానిసలుగా మారుస్తూ ప్రజల ప్రాణాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు కేసరి సరితారెడ్డి మండిపడ్డారు. ఏలూరు న్యూ అశోక్‌నగర్‌లోని ఎక్సైజ్ శాఖ డీసీ కార్యాలయం వద్ద శుక్రవారం వైఎస్సార్సీపీ మహిళా నేతలతో భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం చంద్రబాబు ఫ్లెక్సీకి మద్యంతో అభిõÙకం చేసి నినాదాలు చేశారు. -
మోసగాళ్లున్నారు..లివ్ఇన్పై జాగ్రత్త..లేదంటే : గవర్నర్ ఆనందీబెన్ హెచ్చరిక
ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఈ తరం అమ్మాయిలకు కీలకమైన సందేశాన్నిచ్చారు. మహిళలపై పెరుగుతున్న హింస కేసులపై ఆందోళన వ్యక్తం చేస్తూ, సామాజిక , వ్యక్తిగత జీవితాల్లో విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అమ్మాయిలు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలనీ,ముఖ్యంగా లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లు ( (సహజీవనం) , మహిళల అణచివేతకే దారితీస్తాయని, అందుకే అలాంటి పరిస్థితులకు దూరంగా ఉండాలని ఆనందీబెన్ హితవు పలికారు.వారణాసిలోని మహాత్మా గాంధీ కాశీ విద్యాపీఠం 47వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ అయిన గవర్నర్ పటేల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడి విద్యార్థులకు డిగ్రీ పట్టాలు, బంగారు పతకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.చదవండి : జస్ట్ 10 లక్షల లోన్‌తో రూ. 60 లక్షల ఇల్లుకొన్న పనిమనిషి, షాకవ్వకండి!లివ్-ఇన్ (సహజీవనం) సంబంధాలపై తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలని, మోసగాళ్లను కనిపెట్టి, జాగ్రత్తగా మసలుకోవాలని ఆమె వారికి పిలుపునిచ్చారు. లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లు ఈ రోజుల్లో ఒక ట్రెండ్‌గా మారాయి వాటికి దూరంగా ఉండాలన్న గవర్నర్ , లివ్-ఇన్ రిలేషన్షిప్ల పరిణామాల గురించి తెలుసుకోవానలుకుంటే 15-20 ఏళ్ల బాలికలు ఏడాది వయసున్న పిల్లలతో నిలబడి ఉన్న అనాథాశ్రమాలను చూడాలని తెలిపారు. సహజీవనంలో ఉన్న మహిళలుదారుణంగా ముక్కలు ముక్కలుగా హత్యలకు గురౌతున్న వైనాన్ని ప్రస్తావించారు. వనితలు ఎడ్యుకేషన్‌పై దృష్టి కేంద్రీకరించాలన్నారు. What is this live-in relationship? Visit an orphanage and see what is live-in relationship: UP Governor Anandiben Patel "I have only one advice for daughters. Someone will approach you for friendship. There is this trend of live-in relationships. What is this live-in… pic.twitter.com/c1SUZ03ejT— Piyush Rai (@Benarasiyaa) October 8, 2025 "విద్య అనేది కేవలం డిగ్రీ కోసం కాదు, జీవితంలో మార్పు కోసం" అన్నారు డిగ్రీలతో పాటు సామాజికజాతీయ బాధ్యతను పెంపొందించు కోవాల్సిన అవసరాన్ని హైలైట్ చేశారు. యువతలో పెరుగుతున్నమాదకద్రవ్యాల దుర్వినియోగంపై ఆనందీబెన్ పటేల్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు పర్యావరణ సమస్యలపై, విద్యార్థులు సేంద్రీయ వ్యవసాయాన్ని అవలంబించాలని, పరిశుభ్రతను మెరుగుపరచాలని మరియు ప్రకృతి వైపరీత్యాల నుండి నష్టాలను తగ్గించడానికి పరిశోధనలు నిర్వహించాలని గవర్నర్ కోరారు.MGKVP వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ ఆనంద్ త్యాగి యూనివర్శిటీ సాధించిన విజయాలను వివరించారు ఈ వేడుకలలో, 25,363 మంది పురుషులు, 45,877 మంది మహిళలు, ట్రాన్స్జెండర్లు సహా 71,243 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. 101 మంది విద్యార్థులకు మొత్తం 103 బంగారు పతకాలను ప్రదానం చేశారు. చందౌలి జిల్లా నుండి ఐదుగురు అంగన్వాడీ కార్యకర్తలను కూడా సత్కరించారు . ఈ సందర్భంగా జరిగిన వివిధ పోటీలలో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. -
ముందస్తు పరీక్షలే బెస్ట్!
ఆధునిక జీవన శైలి వల్ల 50 ఏళ్లు దాటిన తరువాత వచ్చే రొమ్ము క్యాన్సర్లు నేడు 25 ఏళ్లకే కనిపించడం ఆందోళనకు దారి తీస్తోంది. విద్యావంతులు, చదువులేనివారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాధిపై అవగాహన లేకుండా నిర్లక్ష్యంగా ఉండటం వల్లే రొమ్ము క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది అక్టోబరు నెల రొమ్ము క్యాన్సర్ అవగాహన మాసంగా నిర్వహిస్తున్నారు. గుంటూరు మెడికల్: పేదల పెద్దాసుపత్రిగా పేరుగడించిన గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో రొమ్ము క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించే వైద్య పరికరం మెమోగ్రఫీ వైద్య పరికరం అందుబాటులో ఉంది. నాట్కో ట్రస్ట్ వారు రూ. కోటి విలువైన త్రీడీ డిజిటల్ మెమోగ్రఫీ వైద్య పరికరాన్ని నాట్కో క్యాన్సర్ సెంటర్లో అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా రొమ్ము క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు. మెమోగ్రామ్ పరీక్ష చేసినందుకు ప్రైవేటు ఆస్పత్రుల్లో సుమారు రూ. 2వేలు వరకు ఫీజు తీసుకుంటున్నారు.జీజీహెచ్‌లో వ్యాధి నిర్ధారణతోపాటు, రొమ్ము క్యాన్సర్ బాధితులకు అవసరమైన ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నారు. ఆపరేషన్ల అనంతరం అవసరమయ్యే రేడియేషన్ థెరఫీ, కిమోథెరఫీ వైద్య సేవలు సైతం జీజీహెచ్ నాట్కో క్యాన్సర్‌సెంటర్‌లో పూర్తి ఉచితంగా అందిస్తున్నారు. ‘మెమోగ్రామ్’ పరీక్షలు చేయించుకున్నవారి వివరాలు.. జీజీహెచ్‌లో రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష మెమోగ్రామ్ 2023లో 368 మంది, 2024లో 381మంది, 2025 సెపె్టంబరు వరకు 381 మంది పరీక్షలు చేయించుకున్నారు. రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతూ 2022లో 34 మంది, 2023లో 73 మంది, 2024లో 69 మంది, 2025 సెప్టెంబరు వరకు 55 మంది రొమ్ము క్యాన్సర్ ఆపరేషన్ చేయించుకున్నారు. స్క్రీనింగ్ పరీక్షలతో చెక్ మహిళలంతా మెమోగ్రామ్, బయాప్సీ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. క్యాన్సర్‌ను ప్రథమ దశలోనే గుర్తించి చికిత్స అందించడం ద్వారా పూర్తిగా నివారించవచ్చు. కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే ఇతర కుటుంబ సభ్యు లకు వచ్చే అవకాశాలు ఉన్న దృష్ట్యా ముందస్తుగా జనటిక్ పరీక్ష చేయించాలి. సంతానం లేనివారికి, ఆలస్యంగా పిల్లలు పుట్టిన వారికి సైతం రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ముందస్తుగా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. –డాక్టర్ బైరపనేని స్రవంతి, క్యాన్సర్ వైద్య నిపుణులు, గుంటూరు ఉచితంగా రొమ్ము క్యాన్సర్ ఆపరేషన్లు... నాట్కో క్యాన్సర్ సెంటర్లో కార్పొరేట్ ఆస్పత్రుల కంటే దీటుగా రొమ్ము క్యాన్సర్ బాధితులకు చికిత్స అందించేలా ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేశాం. గత ఏడాది 69 మందికి, ఈఏడాది ఇప్పటివరకు 55 మందికి ఉచితంగా క్యాన్సర్ ఆపరేషన్లు చేశారు. నన్నపనేని లోకాధిత్యుడు, సీతారావమ్మ స్మారక నాట్కో సెంటర్లో 24 గంటలు కార్పోరేట్ ఆస్పత్రుల కంటే ధీటుగా ఉచితంగా క్యాన్సర్ వైద్యసేవలను అందిస్తున్నారు. – నన్నపనేని సదాశివరావు, నాట్కో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్తొలిదశలోనే గుర్తించవచ్చు తొలి దశలోనే రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించేందుకు మెమోగ్రామ్ పరీక్ష చేస్తారు. మెమోగ్రామ్తో రెండు మి.మీ కన్నా తక్కువ సైజులో రొమ్ములో గడ్డలు ఉన్నా గుర్తించి వెంటనే వైద్యం చేయవచ్చు తొలి దశలోనే వ్యాధిని గుర్తిస్తే వ్యాధి నుంచి త్వరితగతిన కోలుకోవటంతోపాటుగా మరణాన్ని తప్పించవచ్చు. మహిళలే స్వయంగా రొమ్ము పరీక్ష చేసుకుని రొమ్ములో ఏమైనా గడ్డలు ఉన్నట్లు అనిపిస్తే తక్షణమే వైద్యులను సంప్రదించాలి. – డాక్టర్ చక్కా సుజాత, సీనియర్ రేడియాలజిస్ట్, గుంటూరు -
అట్ల తద్దె : ముందుగా ఈ నోము ఎవరు నోచారు, ఎందుకోసం?
ఆశ్వయుజ మాసం వచ్చిందంటే తద్దెనోము నోచని పల్లెపడచులు తెలుగు నాట ఉండరంటే అతిశయోక్తి కాదు. పల్లెటూళ్లలో అయితే యువతీ యువకులందరూ అట్లతద్దె ఎప్పుడు వస్తుందా అని కాచుకుని కూచుంటారు. ఇంతకీ ఈ అట్ల తద్దెనోము ముందుగా ఎవరు నోచారో, వారికి కలిగిన ఫలమేమిటో తెలుసుకుంటూ, ఆ నోము నోచే విధానం కూడా చెప్పుకుందాం. ‘అట్లతద్దోయ్ ఆరట్లోయ్, ముద్దపప్పోయ్ మూడట్లోయ్’ అంటూ ఆడపడుచులకు, బంధువులకు, ఇరుగు పొరుగువారికి అట్లు వాయనంగా ఇవ్వటం ఆచారం. సాయంత్రం వాయనాలు, నైవేద్యాలు పూర్తిచేసుకుని గోమాతను పూజిస్తారు. అక్కడ నుంచి దీపాలను వదలడానికి చెరువులు, కాలువల దగ్గరకు వెడతారు. అన్నీ పూర్తయిన తరవాత చెట్టుకు ఉయ్యాలలు కట్టి ఊగుతారు.ఈ నోము ఇందుకోసంఆశ్వయుజ బహుళ తదియనాడు చేసుకునే ఈ పూజ ప్రధానంగా చంద్రుని ఆరాధనకు సంబంధించినది. చంద్రకళల్లో కొలువై ఉన్న శక్తి అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని, కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని శాస్త్రం చెబుతోంది. ఈ నోములో అమ్మవారికి అట్లు నైవేద్యంగా పెట్టడంలో ఒక అంతరార్థం ఉంది. నవగ్రహాలలో ఒకడైన కుజునికి అట్లంటే ప్రీతి. వీటిని ఆయనకు నైవేద్యంగా పెడితే కుజుని వలన కలిగే దోషాలు పరిహారమై, సంసారసుఖంలో ఎటువంటి అడ్డంకులు రావనేది ఒక విశ్వాసం. అంతేకాక కుజుడు రజోదయానికి కూడా కారకుడు కనుక ఋతుచక్రం సరిగా ఉంచి ఋతుసమస్యలు రానివ్వకుండా కాపాడతాడు. అందువల్ల గర్భధారణలో ఎటువంటి సమస్యలుండవు. మినుముల పిండి, బియ్యప్పిండి కలిపి అట్లను తయారుచేస్తారు. మినుములు రాహువుకి, బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు. గర్భదోషాలు పోవడం కోసం, గర్భస్రావం కాకుండా సుఖప్రసవం అయ్యేందుకు ముత్తయిదువులకు అట్లను వాయనంగా ఇస్తారు. అట్లతద్దిలో ఇంతటి వైద్యవిజ్ఞానం ఉంది. ఈ పండుగను ఉత్తరభారతదేశంలో కరవాచౌత్ అనే పేరుతో జరుపుకుంటారు.వ్రతవిధానం: ఈ రోజు తెల్లవారుఝామునే స్త్రీలు మేల్కొని స్నానం చేయాలి. పగలంతా ఉపవాసం ఉండాలి. ఇంట్లో తూర్పుదిక్కున గౌరీదేవికి మంటపం ఏర్పాటు చేయాలి. ధూప, దీప, నైవేద్యాలు పెట్టి ముందుగా గణపతిపూజ చేయాలి. పిదప శాస్త్రోక్తంగా గౌరీదేవికి పూజచేసి, ఆ తరవాత గౌరీ స్తోత్రం, శ్లోకాలు చదవడంతో పాటు, పాటలు పాడాలి. సాయంత్రం చంద్రదర్శనం అయిన తరవాత శుచిగా స్నానం చేసి మళ్లీ గౌరీపూజ చేయాలి. 11 అట్లు నైవేద్యంగా పెట్టాలి. ముత్తయిదువులకు అలంకారం చేసి 11 అట్లు, 11 ఫలాలు వాయనంగా ఇచ్చి అట్లతద్ది నోము కథ చెప్పుకుని అక్షతలు వేసుకోవాలి. పేరంటానికి వచ్చిన ముత్తయిదువులకు నల్లపూసలు, లక్కకోళ్లు, రవికలగుడ్డలు, దక్షిణ తాంబూలాలు ఇచ్చి భోజనాలు పెట్టి, తామూ భోజనం చేయాలి. 11 రకాల ఫలాలను తినడం, తాంబూలం వేసుకోవడం, 11 సార్లు ఊయల ఊగడం, గోరింటాకు పెట్టుకోవడం, ఇందులో విశేషం. (ఈ సంఖ్య ఇంటిని బట్టి, ప్రాంతాలను బట్టి మారచ్చు). ఇవన్నీ చేయడం వలన గౌరీదేవి అనుగ్రహం లభిస్తుందని, కన్యలకు గుణవంతుడైన భర్త లభిస్తాడని, పెళ్లయిన వారికి పిల్లలు కలుగుతారని, ఐదవతనంతో పాటు పుణ్యం లభిస్తుందని నమ్మకం.అట్లతద్దెలో ఆరోగ్యంఇది కన్నెపిల్లలంతా ఎంతో సంతోషంగా చేసుకునే పండుగ. తెల్లవారు ఝామునే లేవటం, పిల్లలతో కలిసి ఆడుకోవటం, పేరంటం చేస్తూ అందరితో సరదాగా ఉండటం పిల్లలకు అలవాటవుతాయి.చలికాలం దగ్గర పడే సమయం కావడంతో పొద్దున్నే లేవలేకపోతారు. ఈ పండగ కారణంగా ఉత్సాహం కొద్దీ ఉదయమే లేవడం అలవాటు చేసుకుంటారు. అలాగే చలి నుంచి శరీరానికి వేడి పుట్టే ఆహారం కూడా ఆ రోజున తీసుకోవడం వల్ల ఆరోగ్యపుష్టికి దోహదపడుతుంది. నువ్వుల పొడి, గోంగూర పచ్చడి, పెరుగు వంటివి శరీరానికి వేడి చేస్తే ఉల్లిపాయపులుసు చలవ చేస్తుంది. అంతేకాక అన్నీ చద్దివి తినడం వల్ల అరగదనే భయం కూడా లేకుండా తాంబూల సేవనం కూడా జరుగుతుంది. ఈ పండుగ ఆనంద, ఆరోగ్యాలను కలుగచేస్తుంది. ఆట΄ాటల వల్ల పిల్లలకి మంచి వ్యాయామం కూడా అవుతుంది.గౌరీదేవి శివుని పతిగా పొందాలనే కృత నిశ్చయంతో ఉందని త్రిలోక సంచారి అయిన నారదుడు తెలుసుకున్నాడు. ఆమె కోరిక ఫలించాలంటే అట్లతద్ది వ్రతం చేయమని నారదుడు సూచించాడు. ఆయన ప్రోద్బలంతో పార్వతీదేవి చేసిన వ్రతమే అట్లతద్ది. ఇది స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం కన్నెపిల్లలు పడచువాణ్ణి పతిగా పొందాలనుకుంటే తప్పక ఆచరించవలసిన వ్రతమిది. (నేడు అట్ల తద్ది) చదవండి:చిట్టిచేప.. చీరమీను... ఒక్కసారి తిన్నారంటే!ఇదీ చదవండి: నో అన్న గూగుల్లోనే కీలక పదవి.. ఎవరీ రాగిణీ? -
నకిలీ మద్యంపై మహిళల కన్నెర్ర
సాక్షి, అమరావతి: నకిలీ మద్యాన్ని ఏరుల్లా పారిస్తున్న కూటమి ప్రభుత్వ తీరుపై మహిళలు కన్నెర్రజేశారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో బుధవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పెద్దఎత్తున తరలివచ్చిన మహిళలు 7 జిల్లాల్లో ఎక్సైజ్ కార్యాలయాల్ని ముట్టడించారు. కార్యాలయాల ఎదుట మద్యం బాటిళ్లు సైతం పగులగొట్టారు. ఈ సందర్భంగా మహిళా నేతలు మాట్లాడుతూ.. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మద్యం మాఫియా తయారైందని ధ్వజమెత్తారు. మద్యం షాపులు, పర్మిట్ రూమ్‌లు, బెల్టు షాపుల పేరిట ఎక్కడబడితే అక్కడ ఆ మాఫియా గ్యాంగ్ ఎమ్మార్పికి మించి ఇష్టానుసారం మద్యం అమ్ముతోందని ఆరోపించారు. ఇదంతా టీడీపీ కనుసన్నల్లోనే జరుగుతోందన్నారు. మద్యం విక్రయాల్లో దోపిడీతో ఆగని టీడీపీ నాయకులు ఏకంగా నకిలీ మద్యం తయారీకి తెగబడ్డారని, రాష్ట్రంలో ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసి మరీ అన్ని ప్రాంతాలకు నకిలీ మద్యం సరఫరా చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇందుకోసం గోదాములు కూడా ఏర్పాటు చేసుకున్నారన్నారు. ఆ నకిలీ మద్యానికి ఆ దుకాణాల వద్దే 8 మంది మరణించారని, ఇళ్లవద్ద ఎన్ని మరణాలు సంభవించాయో లెక్కేలేదని చెప్పారు. అయినా అధికార పక్షం నిస్సిగ్గుగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీపై బురద జల్లుతోందని ఆక్షేపించారు. కల్తీ మద్యాన్ని అరికట్టాల్సిందే విశాఖపట్నంలో ఎక్సైజ్ కార్యాలయం వద్ద పెద్దఎత్తున తరలివచ్చిన వైఎస్సార్సీపీ మహిళా విభాగం నాయకులు, ప్రతినిధులు నిరసన చేపట్టారు. విజయవాడలో జిల్లా ఎక్సైజ్ కార్యాలయం ఎదుట మహిళా నేతలు మద్యం బాటిళ్లు పగులగొట్టి నిరసన తెలిపారు. గుంటూరులోనూ పెద్దఎత్తున నిరసన కార్యక్రమం జరిగింది. మద్యం బాటిళ్లు పగులగొట్టి ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. నెల్లూరులో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. నకిలీ మద్యాన్ని పూర్తిగా అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఎౖక్సైజ్ డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. తిరుపతిలో ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం కొనసాగింది. వైఎస్సార్సీపీ నాయకులు, ఆ పార్టీ మహిళా విభాగం ప్రతిని«ధులు పెద్దసంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతపురంలో ఎక్సైజ్ కార్యాలయం ఎదుట వైఎస్సార్సీపీ మహిళా, యువజన విభాగాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కర్నూలులో మహిళలు, పార్టీ కార్యకర్తలు మద్యం బాటిళ్లు పగులగొట్టారు. -
ఛీ.. తు.. సిగ్గు, శరం లేని సీఎం..! ఇంకెంత మంది తాళి తెంచుతావ్..!
-
చనిపోయిన మహిళ లేచి వచ్చింది.. దెబ్బకి షాకైన జనం
-
CI నన్ను వేధిస్తున్నాడు దయచేసి యాక్షన్ తీసుకోండి
-
నంద్యాలలో సిఐ లీలలు..!!
-
దుర్గమ్మ దర్శనానికి వచ్చిన మహిళ స్నానం చేస్తుండగా నగ్న వీడియో రికార్డ్ చేసి..
-
ఉగ్ర తాండవం..అనిర్వచనీయం..
‘దసరా అంటేనే మహిళల అపూర్వ శక్తికి పట్టం కట్టే అద్భుతమైన పండుగ. అందుకే ప్రతీ మహిళా ఈ పండుగతో మనసారా మమేకమవుతుంది’ అంటున్నారు ప్రముఖ సినీనటి అర్చన. దసరా పండుగ నేపథ్యంలో ‘సాక్షి’తో తన మనోభావాలను పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. నాకు అమ్మవారి పట్ల ఉన్న ఎనలేని భక్తి ఇప్పటిది కాదు. ముఖ్యంగా దుర్గామాత, సరస్వతీ దేవి రూపాలు అంటే చాలా ఇష్టం. సినిమాల్లో దేవీ పాత్రలు చేసిన అనుభవం ఉన్నప్పటికీ.. ఈ దసరా నాకెందుకు ప్రత్యేకం అంటే ప్రస్తుతం నేను చేస్తున్న కర్మస్థలం అనే సినిమా. ఈ సినిమా కోసం నేను గతంలో ఎన్నడూ చేయని విధంగా అమ్మవారి ఉగ్రరూపం ధరించి తాండవం చేశాను. మహిషాసుర మరి్ధని మూర్తి ఎదురుగా చేసిన ఆ నాట్యం మరిచిపోలేని అనుభూతి అందించింది. మాతా తుల్జాభవాని తాకిన చీరను నాకు ఆ సన్నివేశంలో ధరింపజేశామని ఆ సినిమా యూనిట్ ఆ తర్వాత నాకు చెప్పారు. (చదవండి: శక్తిరూపం అభినయ'దీపం'..! అమ్మవారిలా మెప్పించడం..) -
Gaza: ఆహారానికి బదులుగా లైంగిక దోపిడీ.. భయానక స్థితిలో మహిళలు
గాజా: యుద్ధంతో అట్టుడికిపోతున్న గాజాలో దుర్భర పరిస్థితులు తాండవిస్తున్నాయి. అక్కడి ప్రజలు సహాయం కోసం నిరంతరం ఎదురు చూస్తున్నారు. ఆహార కొరత, ఉద్యోగాలు కనుమరుగు కావడం లాంటివి ఇక్కడి జనాభాను తీవ్రంగా కుంగదీశాయి. దీనిని అనువుగా మలచుకున్న కొందరు పురుషులు సహాయం మాటున లైంగిక దోపిడీకి పాల్పడుతున్నారని స్థానిక మహిళలు చెబుతున్నారు.ఆరుగురు పిల్లల కోసం..దక్షిణ గాజా స్ట్రిప్‌లోని ఖాన్ యునిస్‌లోని ఛారిటీ కిచెన్ నుండి ఆహారాన్ని అందుకునేందుకు ఎదురుచూస్తున్న మహిళలు తమ దుర్భర స్థితిని ‘అసోసియేటెడ్ ప్రెస్’ ముందు వెళ్లగక్కారు. తన ఆరుగురు పిల్లలకు ఆహారం అందించేందుకు వారాల తరబడి ఎదురు చూశానని 38 ఏళ్ల ఒక తల్లి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరించింది. ఒక వ్యక్తి తనకు సేవా సంస్థలో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చాడని, తరువాత అతను ఒక ఖాళీ అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లాడని తెలిపింది. దీంతో తాను అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని అనుకున్నానని, అయితే తాను ఆహారం కోసం అతను చెప్పినట్లు చేయల్సి వచ్చిందని తెలిపారు. తరువాత అతను కొంత నగదు, ఆహారం ఇచ్చాడని, దీంతో పిల్లల ఆకలి తీర్చానని ఆమె వివరించింది. అయితే అతను చెప్పినట్లు ఉద్యోగం ఇవ్వలేదని పేర్కొంది. ఆహారానికి బదులుగా కొందరు పురుషులు లైంగిక దోపిడీకి ఎలా పాల్పడుతున్నారనే దానికి ఈ ఘటన ఉదాహరణగా నిలిచింది.సర్వసాధారణంగా లైంగిక దోపిడీ గాజాలో సహాయం అందిస్తున్న సంఘాలు మానవ హక్కుల న్యాయవాదులు ఇటువంటి ఘటనలు ఇక్కడ సర్వసాధారణంగా మారిపోయాయన్నారు. దక్షిణ సూడాన్ నుండి హైతీ వరకు యుద్ధ భూముల్లో ఇలాంటివి నిత్యం కనిపిస్తున్నాయన్నారు. మానవతా సంక్షోభాలు ప్రజలను అనేక విధాలుగా దుర్బలంగా మారుస్తాయనేది భయంకరమైన వాస్తవమని హ్యూమన్ రైట్స్ వాచ్‌లోని మహిళా హక్కుల విభాగం అసోసియేట్ డైరెక్టర్ హీథర్ బార్ పేర్కొన్నారు. గాజాలో మహిళలు, బాలికలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారన్నారు. సహాయం అందుకునే నేపధ్యంలో లైంగిక దోపిడీకి గురైన కొందరు మహిళలకు చికిత్స చేసినట్లు పాలస్తీనియన్ మనస్తత్వవేత్తలు తెలిపారు. లైంగిక దోపిడీకి గురైన మహిళల్లో కొందరు గర్భవతులయ్యారన్నారు.పెళ్లి చేసుకోవాలంటూ వేధింపులు35 ఏళ్ల ఒక వితంతువువు ఒకరు మీడియాతో మాట్లాడుతూ సహాయక స్థలంలో యూనిఫాంలో ఉన్న ఒక వ్యక్తి తనకు ఒక నంబర్ ఇచ్చి, అర్థరాత్రి ఫోన్ చేశాడని తెలిపారు. దీనిపై తాను ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా, వారు కాల్ రికార్డింగ్స్ అవసరమని చెప్పారని, తాను వాటిని అందించలేకపోయానని ఆమె తెలిపింది. కాగా గత ఏడాది గాజాలో 18 లైంగిక వేధింపుల ఆరోపణలను నమోదు చేసినట్లు పీఎస్ఈఏ నెట్వర్క్ తెలిపింది. మరో ఉదంతంలో 29 ఏళ్ల ఒక తల్లి తన నలుగురు పిల్లలకు ఆహారం అందించేందుకు బదులుగా ఒక సహాయ కార్యకర్త తనను వివాహం చేసుకోవాలని వేధించాడని ఆరోపించింది. తాను అందుకు నిరాకరించానని పేర్కొంది. -
హత్యలు తగ్గాయి.. కిడ్నాప్‌లు పెరిగాయి..
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా 2023లో నేరాల్లో 7.2 శాతం పెరుగుదల నమోదైంది. అన్ని రకాల నేరాలు కలిపి దేశవ్యాప్తంగా 2022లో 58,24,946 కేసులు నమోదు కాగా..2023లో 62,41,569 కేసులు నమోదైనట్టు ఎన్సీఆర్బీ (నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో) 2023 నివేదిక వెల్లడించింది. ఆ ఏడాది నమోదైన వాటిల్లో 27,53,235 కేసుల్లో చార్జ్ïÙట్ పూర్తయింది. ప్రతి లక్ష మంది జనాభాకు 2022లో 422.2గా ఉన్న నేర నమోదు శాతం..2023లో 448.3కి పెరి గినట్టు గణాంకాలు వెల్లడించాయి.తెలంగాణలో 2022లో 1,65,830 కేసులు నమోదు కాగా, 2023 నాటికి అది 1,83,644కి చేరినట్టు నివేదిక పేర్కొంది. ఈ మేరకు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో 2023 వార్షిక నివేదికను సోమవారం విడుదల చేసింది. అందులో పేర్కొన్న ప్రకారం దేశవ్యాప్తంగా పలు రకాల నేరాలకు సంబంధించిన గణాంకాలు ఇలా.. హత్యలు తగ్గాయి 2023లో మొత్తం 27,721 హత్య కేసులు నమోదదయ్యాయి. 2022తో పోలిస్తే 2023లో 2.8 శాతం తగ్గుదల కనిపించింది. హత్య కేసుల్లో అత్యధికంగా వివాదాలు (9,209 కేసులు) ప్రధాన కారణంగా ఉన్నాయి, ఆ తర్వాత ‘వ్యక్తిగత శత్రుత్వం లేదా ద్వేషం’(3,458 కేసులు), ‘వ్యక్తిగత లబ్ధి లేదా లాభం (1,890 కేసులు) కారణంతో జరిగాయి. 5.6 శాతం పెరిగిన కిడ్నాప్ కేసులు 2022, 1,07,588 కిడ్నాప్ కేసులు నమోదు కాగా 2023లో 1,13,564 కేసులు నమోదయ్యాయి. 2022తో పోలిస్తే 2023లో 5.6% పెరుగుదల నమోదైనట్టు ఎన్సీఆర్బీ నివేదిక వెల్లడించింది. 2023లో కిడ్నాపైన వారిలో 1,40,813 మంది జాడను పోలీసులు గుర్తించగా, వీరిలో 1,39,164 మంది బతికి ఉన్నారు. మరో 1,649 మంది చనిపోయినట్టు గుర్తించారు. మహిళలపై నేరాల్లో స్వల్ప పెరుగుదల మహిళలపై నేరాల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది. 2022లో 4,45,256 కేసులు నమోదు కాగా..2023లో 4,48,211 కేసులు మహిళలపై నేరాలకు సంబంధించి నమోదయ్యాయి. ఇందులో భర్త లేదా అత్తింటివారి దాడులకు సంబంధించి 1,33,676 కేసులు, మహిళల కిడ్నాప్‌నకు సంబంధించి 88,605 కేసులు, లైంగిక వేధింపులకు సంబంధించినవి 83,891 కేసులు, పోక్సో యాక్టు కింద 66,232 కేసులు నమోదయ్యాయి. చిన్నారులపై నేరాల నమోదులో 9.2 శాతం పెరుగుదలచిన్నారులపై నేరాల నమోదులో 2022తో పోలిస్తే 2023లో 9.2 శాతం పెరిగింది. 2023లో పిల్లలపై మొత్తం 1,77,335 నేరాలు నమోదయ్యాయి. వీటిలో పిల్లల కిడ్నాప్‌నకు సంబంధించినవి 79,884 కేసులు, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోక్సో చట్టం) కింద 67,694 కేసులు నమోదయ్యాయి. సైబర్ నేరాల్లో 31.2 శాతం పెరుగుదల నమోదు సైబర్ నేరాల్లో భారీగా పెరుగుదల నమోదవుతోంది. 2022తో పోలిస్తే 2023లో సైబర్ నేరాల్లో 31.2 శాతం పెరుగుదల నమోదైంది. 2023లో దేశవ్యాప్తంగా మొత్తం 86,420 సైబర్ క్రైం కేసులు నమోదయ్యాయి. 2023లో నమోదైన వాటిలో 68.9 శాతం మోసం, లైంగిక దోపిడీ 4.9 శాతం కేసులు, దోపిడీ 3.8శాతం కేసులు ఉన్నాయి. ఆరు శాతం పెరిగిన ఆర్థిక నేరాలు ఆర్థిక నేరాల్లోనూ గత ఏడాదితో పోలిస్తే..ఆరు శాతం పెరుగుదల నమోదైనట్టు ఎన్సీఆర్బీ 2023 నివేదిక వెల్లడించింది. 2023 మొత్తం 2,04,973 కేసులు నమోదయ్యాయి. వీటిలో నమ్మక ద్రోహం, ఫోర్జరీ, మోసం కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఈసారి ఎంతో ఆలస్యంగా నివేదిక..: ఎన్సీఆర్బీ నివేదిక ‘క్రైం ఇన్ ఇండియా’సాధారణంగా ఏడాది మధ్యలో విడుదల చేస్తారు. కానీ, 2023 నివేదికల ప్రచురణ చాలా ఆలస్యమైంది. డేటా సేకరణలో ఆలస్యం కారణంగానే 2023 నివేదిక ఆలస్యం అవుతోందని ఇటీవల కేంద్ర హోంశాఖ సైతం పార్లమెంట్లో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. కాగా, 2022 సంవత్సరానికి సంబంధించిన నివేదిక సైతం డిసెంబర్ 2023లో విడుదలైంది. -
అక్షరాన్ని అందిస్తూ...
దేశంలో సంపన్నులకే పరిమితమైన విద్యను సామాన్యుల దరికి చేర్చిన ఘనత అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాలకే దక్కింది. దేశంలో తొలి సార్వత్రిక విశ్వవిద్యాలయంగా 1982లో ఏర్పాటైనప్పటి నుంచి విద్యకు దూరమైన వారిని అక్కున చేర్చుకుంది. మొత్తం విద్యార్థుల్లో సగటున 85 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందినవారు ఉన్నారు. స్త్రీలు విద్యావంతులు కావడంలోనూ ఎంతో కృషి చేస్తోంది. మొత్తం మీద యూనివర్సిటీ విద్యార్థుల్లో సగటున ఏటా 48 శాతం మంది మహిళలుఉంటున్నారు.Dr B.R. Ambedkar Open University (BRAOU) యూనివర్సిటీ ఈ ఏడాది (2025–26) నుంచి వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ‘చదువుతూ సంపాదించు’ విధానంపై దృష్టి సారించారు. విద్యార్థులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి పొందేందుకు అవసరమైన శిక్షణ ఇచ్చేలా ‘శ్రీ రామానందతీర్థ రూరల్ ఇనిస్టిట్యూట్’తో ఒప్పందం కుదుర్చుకుంది. యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు ఉచిత భోజన, వసతితో వివిధ అంశాల్లో రెండు నుంచి మూడు నెలలు ఈసంస్థలో శిక్షణ ఇస్తారు. కంప్యూటర్, ఆటోమొబైల్, సోలార్ విద్యుత్తు నుంచి అనేక రంగాలకు సంబంధించి వివిధ పరిశ్రమల్లో పనిచేయడానికి లేదా స్వయం ఉపాధి పొందడానికి అవసరమైన మెలకువలు, నైపుణ్యం సాధించేలా శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. అదే తరహాలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (నాక్)తోనూ యూనివర్సిటీ సంప్రతింపులు జరిపింది. నిర్మాణరంగానికి సంబంధించిన వివిధ విభాగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చే కార్యక్ర మానికి శ్రీకారం చుట్టనుందిచదవండి: Gorati Venkanna: పాటతల్లికి పెద్దకొడుకుయూనివర్సిటీ మహిళా విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడానికి వీలుగా ‘వీ హబ్’తో ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలోని అంగన్వాడీల్లో పనిచేసే సిబ్బంది నైపుణ్యాల్ని పెంపొందించేందుకు సర్టిఫికెట్, డిప్లమో ప్రోగ్రామ్స్ రూపొందించింది. మహిళా, శిశు సంక్షేమశాఖతో ఒప్పందం కుదుర్చుకుని ఆ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనున్నారు. ఈ విద్యా సంవత్సరం (2025– 26) నుంచి గిరిజన విద్యార్థులకు, వికలాంగులు, ట్రాన్స్ జెండర్స్‌కు ఉచిత విద్య అందించనున్నది. సైనికులకూ, ఖైదీలకూ ఇప్పటికే విద్యను అందుబాటులోకి తెచ్చింది. యూనివర్సిటీ మంగళవారం తన 26వ స్నాతకోత్సవం జరుపుకొంటోంది. రెండు విద్యాసంవత్సరాలకు (2023–24, 2024–25) సంబంధించిన 60,288 మందికి డిగ్రీలు అందిస్తోంది. 55 మందికి డాక్టరేట్ పట్టాలుఅందించనున్నారు. ఇద్దరు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేయ నున్నారు. అందులో ఒకరు వాగ్గేయకారుడు గోరటి వెంకన్న కాగా మరొకరు ప్రఖ్యాత శాంతి విద్యా ప్రచారకులు ప్రేమ్ రావత్!– డా.ఎల్వీకే అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ రిజిస్ట్రార్, హైదరాబాద్(నేడు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 26వ స్నాతకోత్సవం) -
రక్షణ ఛత్రం..! 'షీ అస్త్రం'..
సోషల్ మీడియా యాప్స్ అంటే ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్.. వ్యక్తిగత అనుభూతి, అభిరుచులు ఉత్సాహంగా పంచుకోవడం.. కానీ ప్రస్తుతం హేట్ స్పీచ్, విద్వేషాలు, నెగెటివ్ కామెంట్స్, బాడీ షేమింగ్ వంటి అంశాలకు ఆన్లైన్ వేదికలుగా మారాయి. ముఖ్యంగా అమ్మాయిలకు, మహిళలకు ఫేస్బుక్, ఇన్‌స్టా వంటి వేదికలు మరింత అసభ్యకరంగా మారాయి. జెన్ జీ బ్యాచ్ అయితే మరీ హద్దు అదుపు లేకుండా ట్రోలింగ్, లీచింగ్‌కు పాల్పడుతున్నారు. ఇలాంటి తరుణంలో మహిళలు, యూత్ గర్ల్స్‌కు ప్రత్యామ్నాయ ఆన్లైన్ వేదికల అవసరముందని ఆలోచించారు నగరానికి చెందిన మహిళా అడ్వొకేట్ వెన్నెల. ఇందులో భాగంగానే కేవలం మహిళల కోసమే అనే సోషల్ యాప్ రూపొందించారు. ఇన్నోవేషన్ల వేదికగా.. ఈ ‘షీ అస్త్ర’ యాప్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా రూమ్స్ ఉంటాయి. టాలెంట్ రూమ్‌లో యువత ఆర్ట్స్, స్కిల్స్ ప్రోత్సహించేలా రూపొందించారు. ముఖ్యంగా జెన్ జీ అట్రాక్షన్, గుర్తింపునకు వారిలోని నైపుణ్యాన్ని, కళలను షేర్ చేసుకోవచ్చు. అమ్మాయిలు స్వేచ్ఛగా మాట్లాడుకోడానికి, చర్చించుకోడానికి గాసిప్ రూమ్, ఈ తరం ఇన్నోవేషన్స్, స్టార్టప్స్, బ్రాండ్స్ ప్రమోట్ చేసుకోడానికి రికమండేషన్ రూమ్ వంటివి ఉన్నాయి. డిప్రెషన్, ట్రోమా వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రైవసీతో సిస్టర్ ఎస్ఓఎస్ వేదిక ఉంది. మహిళలకు ప్రోత్సాహం, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ‘షీ అస్త్ర స్కూల్’ తయారు చేశారు. ఇది మహిళలకు పెద్దబాలశిక్ష మాదిరి అని వెన్నెల తెలిపారు. మిగతా సోషల్ యాప్స్‌లో ట్రోలింగ్ రిపోర్ట్ చేయడానికి ట్రోల్ పోలీస్, సెకండరీ విక్టిమైజేషన్, హాష్‌ట్యాగ్ వంటి ఎన్నో ఫీచర్లు ఇందులో ఉండటం విశేషం. అడ్వొకేట్ ప్రాక్టీస్‌లో భాగంగా మహిళలకు సైబర్, ఆన్లైన్ వేధింపులకు సంబంధించిన పలు సున్నితమైన, సూక్ష్మమైన అంశాలను.. అవి ప్రభావితం చేసే పరిస్థితులను ప్రత్యక్షంగా చూశానని యాప్ రూపొందించిన వెన్నెల తెలిపారు. సోషల్ మీడియా ట్రోలింగ్‌తో ఎందరో అమ్మాయిలు, ఇన్ఫ్లుయెన్సర్స్ నిరాశ, నిరాస నిస్ప్రుహలోకి చేరుకోవడం సర్వసాధారణం. ఇలాంటి పరిస్థితులకు పరిష్కారంగా మిగతా సోషల్ యాప్స్‌లాగే కేవలం ఉమెన్ కోసం ‘షీ అస్త్ర’ యాప్ రూపుదిద్దుకుంది. దీనికి మహిళగా తప్పనిసరి ఆధార్ అప్రూవల్ అవసరం. దేశంలో మొదటి ఆధార్ అనుసంధానిత యాప్ కావడం దీని ప్రత్యేకత. ఈ యాప్‌ను నగరంలోని టీహబ్ వేదికగా దేశవ్యాప్తంగా అందుబాటులో ఉండేలా ప్రముఖ సినీ దర్శకులు శేఖర్ కమ్ముల, ఐఏఎస్ ఆఫీసర్ భవానీ శ్రీ, ఐఆర్ఎస్ అధికారి బలరాం, ఐఏఎమ్‌సీ డిప్యూటీ రిజి్రస్టార్ నిక్షిత నిరంజన్ ఆవిష్కరించారు. నా వంతు సహకారంగా..సోషల్ మీడియాలో ఒక ఫొటో పెడితే ఎన్నో నెగెటివ్ కామెంట్స్, ట్రోలింగ్.. మహిళలు స్వేచ్ఛగా తమ ఆలోచలనలు పంచుకోలేకపోతున్నారు. దీనిని మార్చడానికి నేనేం చేయగలను అనే ఆలోచన నుంచి నా సాంకేతిక బృందం అశ్విన్, నవ్య, దీక్ష, నవీన్ సహకారంతో దీనిని సృష్టించాం. ప్రస్తుతం దేశంలో మరికొద్ది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. నెలకు చిన్నమొత్తం రుసుముతో దీనిని వినియోగించుకోవచ్చు. షీ అస్త్ర మహిళ కోసం మొదటి సారి భారత్ నుంచి ఆవిష్కృతమైందని గర్వంగా చెప్పుకుంటాను. – వెన్నెల, యాప్ క్రియేటర్, అడ్వొకేట్కామెంట్లకు గ్రూప్రిపోర్ట్.. ప్రస్తుత తరుణంలో అమ్మాయిలకు సురక్షితమైన వర్చువల్ స్పేస్ లేదనే చెప్పాలి. 10వ తరగతి చదువుతున్న చిన్న పిల్లలు సైతం అన్లైన్లో ట్రోల్ చేయడం, అభ్యంతరకరమైన, అశ్లీల కామెంట్లు పెట్టడం సాధారణమైపోయింది. ఈ తరుణంలో షీ అస్త్ర యాప్ మంచి ఆవిష్కరణ. అశ్లీల, అసభ్య కామెంట్లకు గ్రూప్ రిపోర్ట్ ఆప్షన్ ప్రతిఒక్కరూ వినియోగించాలి. చట్టాలు, సైబర్ క్రైమ్ ప్రభావవంతంగా ఉంటే మహిళలు తమ ఆలోచనలను మరింత ఉన్నతంగా పంచుకోగలుగుతారు. – శేఖర్ కమ్ముల, సినీ దర్శకుడుట్రోలింగ్ నుంచి రక్షణగా.. మహిళలకు సోషల్ మీడియా ట్రోలింగ్ అనేది యూనివర్స్ ప్రాబ్లం.. ఈ మధ్య ఒక అమ్మాయి విడాకులు తీసుకుని వేడుక చేసుకుంటే.. సోషల్ మీడియాలో వచి్చన నెగెటీవ్ కామెంట్స్ ఆశ్చర్యాన్ని కలిగించింది.. నాగాలాండ్‌లో ఐఏఎస్‌గా విధులు నిర్వర్తిస్తున్నప్పుడు ఓ మహిళా ఉద్యోగి తన భర్త నుంచి మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురవుతుందని తెలుసుకోడానికి చాలా సమయం పట్టింది. అనంతరం కేసులు, కౌన్సిలింగ్‌తో పరిష్కారం చూపించగలిగా. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు రిపోర్ట్ చేయడం అలవర్చుకోవాలి. – భవానీ శ్రీ, ఐఏఎస్, జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి నెగెటివిటీకి దూరంగా.. గత ఇరవై సంవత్సరాలుగా సోషల్ మీడియా వాడకం ఎక్కువగా పెరగడం.. దీంతో పాటు మహిళలపై ట్రోలింగ్ పెరిగింది. ముఖ్యంగా మార్ఫింగ్, ఫేక్ అకౌంట్స్ వంటివి సమస్యగా మారాయి. సాంకేతిక పరంగా మహిళలకు సురక్షితమైన షీ అస్త్ర వంటి ఆన్లైన్ వేదికలు పెరగాలి. ఇది అనువైన డిజైనింగ్ క్రియేటింగ్ స్పేస్ కావలి.. ట్రోలింగ్, నెగెటివిటీకి దూరంగా.. షీ అస్త్రలోని ప్రైవసీ పాలసీ, మలి్టపుల్ ఫీచర్స్, రిపోర్టింగ్ ఆప్షన్స్ అమ్మాయిలకు మేలు చేస్తాయి. – నిక్షిత నిరంజన్, ఐఏఎమ్‌సీ డిప్యూటీ రిజి్రస్టార్. రెండు అంశాల సమ్మిళితం.. సామాజికంగానే కాదు ఆన్లైన్ వేదికగా కూడా అమ్మాయిలకు అనువైన పరిస్థితులు కనపడట్లేదు. ఈ తరంలో వచి్చన మార్పు ఇది.. దీనికి అనుగుణంగా సాంకేతికంగా, న్యాయ శాఖ పరంగా మార్పులు రావాల్సిన అవసరముంది. ఈ రెండు అంశాల సమ్మిళితమే షీ అస్త్ర యాప్. అడ్వొకేట్ సేవలందింస్తూనే ఇలాంటి సాంకేతిక పరిష్కారం అందించిన వెన్నెల టీం ప్రయత్నం అభినందనీయం. – బలరాం, ఎస్సీసీఎల్ చైర్పర్సన్–ఎండీ -
కంపెనీల నాయకత్వంలో అతివలకు అందలం
భారతీయ కంపెనీల్లో నాయకత్వ హోదాల్లో మహిళలకు ప్రాధాన్యం పెరుగుతోంది. తాజాగా మొత్తం కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లలో వారి ప్రాతినిధ్యం 20 శాతానికి చేరింది. భారత్‌లో మహిళలు ఉద్యోగం చేసేందుకు అత్యుత్తమ కంపెనీలపై వర్క్‌ప్లేస్ కల్చర్ కన్సల్టింగ్ సంస్థ అవతార్, టాలెంట్ సర్వీసెస్ సంస్థ సెరామౌంట్ నిర్వహించిన 10వ విడత అధ్యయనంలో ఇది వెల్లడైంది.ఈ అధ్యయనం ప్రకారం అత్యుత్తమ కంపెనీల్లో మహిళల ఉద్యోగుల వాటా 35.7 శాతం స్థాయిలో స్థిరంగా ఉంది. మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడంలో ప్రొఫెషనల్ సర్వీసుల రంగం (44.6 శాతం) ముందంజలో ఉంది. ఐటీఈఎస్ (41.7 శాతం), ఫార్మా (25 శాతం), ఎఫ్ఎంసీజీ (23 శాతం), తయారీ (12 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మహిళల అట్రిషన్ రేటు (ఉద్యోగం నుంచి తప్పుకోవడం) పురుషులతో దాదాపు సమానంగా 20 శాతం స్థాయిలో ఉంది. మెరుగైన ఉద్యోగావకాశాలు దక్కించుకోవడమే మహిళలు, పురుషుల అట్రిషన్కి ప్రధాన కారణంగా ఉంటోంది.అయితే, మహిళల విషయానికొస్తే పిల్లల సంరక్షణకంటే ఎక్కువగా ఆరోగ్యపరమైన సమస్యలే ఉద్యోగం నుంచి తప్పుకోవడానికి మరో కీలక కారణంగా నిలుస్తోంది. 2016లో కంపెనీల్లో మహిళల ప్రాతినిధ్యం సగటున 25 శాతంగా ఉండగా ప్రస్తుతం 35.7 శాతానికి పెరగడం, నాయకత్వ హోదాల్లో మహిళల వాటా 13 శాతం నుంచి 20 శాతానికి చేరడం మంచి పరిణామమని అవతార్ వ్యవస్థాపకురాలు సౌందర్య రాజేశ్ తెలిపారు. ఈ అధ్యయనానికి దేశవ్యాప్తంగా 365 కంపెనీల నుంచి దరఖాస్తులు రాగా 125 కంపెనీలకు జాబితాలో చోటు దక్కింది. ఆటోమోటివ్, కెమికల్స్, బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్), మీడియా, ఫార్మా తదితర రంగ సంస్థల నుంచి దరఖాస్తులు వచ్చాయి. మహిళలకు టాప్ 10 బెస్ట్ కంపెనీలు..మహిళలకు టాప్ 10 కంపెనీల జాబితాలో యాక్సెంచర్ సొల్యూషన్స్, ఏఎక్స్ఏ ఎక్స్ఎల్ ఇండియా బిజినెస్ సరీ్వసెస్, కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ వేదాంత, ఈవై, కేపీఎంజీ ఇండియా, మాస్టర్‌కార్డ్, ఆప్టమ్ గ్లోబల్ సొల్యూషన్స్ ఇండియా, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఇండియా, టెక్ మహీంద్రా, విప్రో సంస్థలు (అక్షర క్రమంలో) ఉన్నాయి. -
అమ్మాయిల ఆశలపై 'నీళ్లు'
కొత్త హెచ్–1బీ వీసా దరఖాస్తులపై ఒకేసారి లక్ష డాలర్ల రుసుము విధిస్తున్న అమెరికా ప్రభుత్వ తాజా నిర్ణయం భారతీయ యువ మహిళా ఔత్సాహికుల ను దెబ్బతీసే అవకాశం ఉంది. నిజానికి హెచ్–1బీ వీసా అందుకుంటున్న భారతీయుల్లో అత్యధికులు పురుషులే. 2023–24లో తమ ఉద్యోగాలను కొనసాగించడానికి (రెన్యువల్) ఆమోదం పొందిన నిపుణుల్లో 74% మంది పురుషులు, 26% మంది మహిళలు ఉన్నారు. హెచ్–1బీ కొత్త దరఖాస్తులకు (ప్రారంభ ఉపాధికి) ఆమోదం లభించిన నిపుణుల్లో మహిళల వాటా 37%. కొత్త ‘వన్ టైమ్ రుసుము’ ప్రభావంతో నూతన దరఖాస్తుదారులు.. ముఖ్యంగా, పురుషులతో పోలిస్తే తక్కువ వేతనాలు ఉండే మహిళల అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఉద్యోగుల లేదా కార్మికుల వార్షిక జీతంలో అధిక భాగం లేదా అంతకు మించి కొత్త హెచ్–1 బీ వీసా ఫీజు ఉంది. అందువల్ల, ప్రారంభ ఉపాధి లబ్ధిదారులను స్పాన్సర్ చేయడం కంపెనీలకు ఆర్థికంగా లాభదాయకం కాకపోవచ్చు.ఈ అంశం హెచ్–1బీ వీసాలు ఆశిస్తున్న ఔత్సాహికుల భవిష్యత్తు గురించి ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఉదాహరణకు ఒక కంపెనీ కొత్త లబ్ధిదారునికి నూతన వీసా ఫీజు ప్రకారం స్పాన్సర్ చేస్తే.. మొదటి సంవత్సరంలో మొత్తం ఖర్చు.. రెన్యువల్ కోరుకునే అనుభవజ్ఞుడైన ఉద్యోగికి అయ్యే వ్యయం కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రభావం ముఖ్యంగా మహిళా లబ్ధిదారులపై ఉంటుందన్నది నిపుణుల మాట. ఎందుకంటే వారు సాధారణంగా హెచ్–1బీ హోల్డర్లలో పురుషుల కంటే తక్కువ సంపాదిస్తున్నారు. – సాక్షి, స్పెషల్ డెస్క్విద్యార్హతలు ఉన్నప్పటికీ..అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ సేవల విభాగం గణాంకాల ప్రకారం.. 2023–24లో హెచ్–1బీ ద్వారా కొత్త ఉద్యోగాలకు ఆమోదం పొందిన మహిళల్లో 35 సంవత్సరాల కంటే తక్కువ వయసు గలవారు 75% మంది ఉన్నారు. పురుషుల విషయంలో ఇది 65%గా ఉంది. దీని అర్థం.. కెరీర్‌ను ప్రారంభించే వయసులో ఉన్న మహిళల్లో ఎక్కువ మందిని హెచ్–1బీ వీసా కొత్త ఫీజు ప్రభావితం చేయనుందని పరిశీలకులు అంటున్నారు. 2023–24లో కొత్త ఉద్యోగాలకు ఆమోదం పొందిన మహిళల్లో 44% మంది మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. పురుషుల విషయంలో ఇది కేవలం 39% మాత్రమే. డాక్టరేట్, ప్రొఫెషనల్ డిగ్రీ స్థాయిల్లో సైతం మహిళలదే ఆధిపత్యం. కొత్త రుసుము నూతన దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుంది కాబట్టి పురుషులతో పోలిస్తే ఉన్నత విద్యార్హతలు ఉన్నప్పటికీ ఇది మహిళలపై ప్రభావం చూపనుందని నిపుణులు చెబుతున్నారు.2023-24లో హెచ్-1బీ దరఖాస్తుల ఆమోదంప్రారంభ ఉపాధి దరఖాస్తుపురుషులు 63%మహిళలు 37%రెన్యువల్ దరఖాస్తుపురుషులు 74%మహిళలు 26% -
వనితలది.. ఇంకా వెనుకబాటే!
ప్రపంచవ్యాప్తంగా 37.6 కోట్లకుపైగా మహిళలు తీవ్ర దారిద్య్రంలో మగ్గుతున్నారని, ఇది పురుషుల సంఖ్య కంటే ఎక్కువని ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల అమలులో పురోగతిపై విడుదల చేసిన ‘ద జెండర్ స్నాప్‌షాట్ 2025’లో వెల్లడించింది. ప్రతి ముగ్గురిలో ఒక మహిళ తమ జీవితకాలంలో శారీరక లేదా లైంగిక హింసకు గురవుతున్నారు. జెనరేటివ్ ఏఐ వల్ల పురుషులతో పోలిస్తే మహిళల ఉద్యోగ, ఉపాధి అవకాశాలే ఎక్కువగా దెబ్బతింటాయి. 2024లో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వాడుతున్న పురుషులు 70 శాతం కాగా, మహిళల్లో ఇది 65 శాతమే. ఈ నివేదిక ఇంకా ఏమేం చెప్పిందంటే..ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన ‘ద జెండర్ స్నాప్‌షాట్ 2025’.. ప్రపంచవ్యాప్తంగా మహిళల స్థితిగతులపై కీలక అంశాలను వెల్లడించింది. మహిళల్లో పేదరికం అనారోగ్యం, వారిపై వివక్ష ఇవన్నీ తగ్గాలంటే.. ప్రభుత్వాలు విద్య, వైద్యం వంటి రంగాల్లో పెట్టుబడులు పెంచాలని, మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించాలని ఈ నివేదిక పేర్కొంది. ఇలా పెట్టే పెట్టుబడులు వృథా కావని, వీటివల్ల దేశాల ఆర్థిక వ్యవస్థలు మెరుగుపడతాయని తెలిపింది.పేదరికంమహిళా పేదరికం 2020 నుంచి భారీగా పెరుగుతోంది. ఇది ఇలాగే కొనసాగితే 2030 నాటికి 35 కోట్లకుపైగా బాలికలు, స్త్రీలు పేదరికంలో మగ్గుతూనే ఉంటారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు (ఎస్డీజీలు) అమలును ఇప్పటినుంచి వేగవంతం చేస్తే 2025లో 9.2 శాతంగా ఉన్న ఈ పేదరికాన్ని 2050 నాటికి 2.7 శాతానికి పరిమితం చేయొచ్చు.లింగ సమానత్వంగత 5 ఏళ్లలో ప్రపంచ వ్యాప్తంగా.. మహిళల పట్ల వివక్ష చూపే అనేక చట్టాలను తొలగించారు. లింగ సమానత్వాన్ని ప్రోత్సహించే చట్టాలు వచ్చాయి. మానభంగానికి (రేప్) సంబంధించి 63 దేశాలు చట్టాలు చేశాయి. కానీ ఇప్పటికీ కేవలం 38 దేశాల్లోనే అమ్మాయిలకు వివాహానికి కనీస వయసు 18 ఏళ్లుగా ఉంది. ⇒ 15–49 ఏళ్ల మహిళల్లో.. గత ఏడాది కాలంలో.. ప్రతి 8 మందిలో ఒకరు (12.5 శాతం) తమ ప్రస్తుత లేదా మాజీ భాగస్వామి వల్ల శారీరక లేదా లైంగిక హింసకు గురయ్యారు. ⇒ 2025 జనవరి 1 నాటికి జాతీయ పార్లమెంటుల్లో మహిళా సభ్యుల శాతం 27.2 శాతం. 102 దేశాల్లో దేశాధిపతి లేదా ప్రభుత్వాధిపతిగా ఇప్పటివరకూ మహిళలు ఎంపిక/ఎన్నిక కాలేదు. ⇒ 2025 ఆగస్టు 1 నాటికి కేవలం 29 దేశాల్లోనే.. దేశాధిపతి లేదా ప్రభుత్వాధిపతిగా మహిళ ఉన్నారు. 5 ఏళ్ల కిందట ఇలాంటి దేశాల సంఖ్య 22.⇒ ప్రపంచ వ్యాప్తంగా మొత్తం మేనేజర్ స్థాయిలో మహిళలు 30 శాతం ఉన్నారు.ఆరోగ్య భద్రతపురుషులతో పోలిస్తే దాదాపు 6.4 కోట్ల మంది మహిళలకు ఆరోగ్య భద్రత లేదు. పోషకాహార లోపాల వల్ల బాలికలు, స్త్రీల ఆరోగ్యం దారుణంగా తయారవుతోంది. 15–49 ఏళ్ల మధ్య ఉండే యువతులూ, స్త్రీలలో రక్తహీనత 2025లో 31.1 శాతంగా ఉంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2030 నాటికి ఇది 33 శాతానికి పెరుగుతుంది2000–2023 మధ్య మహిళల ప్రసూతి మరణాల రేటు 39.3 శాతం తగ్గింది. మగవాళ్లు తమ జీవితంలో అనేక రకాల తీవ్రమైన వ్యాధులూ, అనారోగ్య పరిస్థితులతో గడిపే మొత్తం సమయం.. 2021లో 8 ఏళ్లు కాగా, మహిళల్లో ఇది 10.9 సంవత్సరాలు.విద్యపాఠశాలల్లో ప్రాథమిక స్థాయిలో చేరికలు, చదువు పూర్తి విషయంలో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే ముందున్నారు. కానీ, సబ్‌సహారన్ ఆఫ్రికా, మధ్య, దక్షిణాసియాల్లో మాత్రం సెకండరీ విద్య పూర్తి చేయడంలో మాత్రం వెనకబడ్డారు.స్వచ్ఛ ఇంధనంప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 89.6 కోట్ల మంది మహిళలకు స్వచ్ఛ ఇంధనం లేదా ఆ సాంకేతికత అందుబాటులో లేదు. 2030 నాటికి ఇది సాధించాలంటే ఇప్పటి నుంచి ఏటా 8 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాలి. ఈ పెట్టుబడికి 24 రెట్ల ఆదాయం తిరిగి వస్తుంది.ఏఐజెనరేటివ్ ఏఐ మహిళల ఉద్యోగ, ఉపాధి అవకాశాలనూ దెబ్బతీయనుంది. 21.1 శాతం పురుష ఉద్యోగాలపై ఈ ప్రభావం ఉంటే.. మహిళలపై ఇది 27,6 శాతం.ఇంటర్నెట్2024లో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వాడుతున్న పురుషులు 70 శాతం కాగా, మహిళల్లో ఇది 65 శాతమే. అధిక ఆదాయ దేశాల్లో 93 శాతం మహిళలు, 94 శాతం పురుషులు ‘ఆన్లైన్’లో ఉంటున్నారు.దివ్యాంగులుమామూలు మహిళలతో పోలిస్తే దివ్యాంగులు చాలాచోట్ల వివక్షను ఎదుర్కొంటున్నారు. మామూలు మహిళల్లో 65 శాతం ఇంటర్నెట్ వాడుతుంటే దివ్యాంగుల్లో 26 శాతమే వినియోగిస్తున్నారు.శాంతి2024లో తీవ్రమైన అశాంతి, ఘర్షణ వాతావరణం ఉన్న ప్రాంతానికి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉంటున్న బాలికలు, స్త్రీలు 67.6 కోట్లు. 1990ల తరువాత ఇదే అత్యధిక . అశాంతి, ఘర్షణలు, యుద్ధవాతావరణం ఉన్న దేశాల్లోని పార్లమెంటుల్లో మహిళల ప్రాతినిధ్యం కేవలం 20 శాతమే. -
నో జిమ్.. హోమ్ వర్కౌట్లతో 8 నెలల్లో 20 కిలోలు తగ్గింది!
బరువు తగ్గాలంటే చాలా కష్టం అని భావిస్తున్నారా? అంత భయపడాల్సిన అవసరం లేదు అంటూ చాలా మంది ఇన్ఫ్లూయెన్సర్లు చాలా పకడ్బందీగా బరువుతగ్గి చూపిస్తున్నారు. ఖరీదైన జిమ్ సభ్యత్వం ఫ్యాన్సీడైటింగ్లేకుండా ప్రణాళికా బద్దంగా ప్రయత్నిస్తూ.. కాస్త ఓపిక పడితే వెయిట్ లాస్ అవ్వడం ఈజీనే అంటున్నారు. అలాంటి వారిలో ఒకరు మన తెలుసుకోబోతున్న కంటెంట్ క్రియేటర్. కఠినమైన ఆహార పద్ధతులు, తీవ్రమైన కసరత్తులు కాకుండా చక్కటి జీవనశైలి, మంచి ఆహార అలవాట్లతో బరువు తగ్గిన వైనాన్ని సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది.కంటెంట్ క్రియేటర్ యామిని అగర్వాల్ 8 నెలల్లో 20 కిలోలు తగ్గినట్టు తెలిపింది. యామిని తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో తన వెయిట్ లాస్ జర్నీ, వ్యాయామాలను కూడా వివరించింది: ఎక్కువ ఉపవాసాలు కఠినమైన వ్యాయామాలత ఫలితంగా స్వల్పకాలికంగా ఉండవచ్చు. కానీ నిజంగా పట్టుదలగా కొన్ని ఆహార అలవాట్లు, వెయిట్ ట్రెయినంగ్ స్థిరంగా బరువు తగ్గవచ్చని యామిని చెబుతోంది.ఆ క్రమంలో యామిని హోమ్ వర్కౌట్లనే ఎక్కువగా పాటించింది. అదీ క్రమం తప్పకుండా అనుసరించింది. 4 రోజుల బరువు శిక్షణ, 2 రోజుల కార్డియో ఒక రోజు రెస్ట్ అనేపద్ధతిని పాటించింది. అంతేకాదు ఈ రోజుల్లోఆర్మ్స్ డే, లెగ్స్ డే, అంటూ స్మార్ట్ స్ప్లిట్‌ను పాటించింది. సోమవారం కాళ్లకు,మంగళవారం యాబ్స్, బుధవారం చేతులకు వ్యాయామాలను కేటాయించింది. గురువారం వీపు , భుజాల కండరాలను బలోపేతం చేసేలా తన వ్యాయామాన్ని ప్లాన్ చేసింది. అలా స్థిరమైన ప్రణాళిక, సాధారణ వ్యాయామాలుచేస్తూ తన వెయిట్ లాస్‌ను ట్రాక్ చేసుకుంది. View this post on Instagram A post shared by Nihira Aggarwal (@nihiraaggarwal)యామిని చిట్కాయామిని పంచుకున్న ఒక ముఖ్యమైన చిట్కాను కూడా షేర్ చేసింది. వ్యాయామం చేస్తున్నప్పుడు తన వీడియోలను రికార్డ్ చేయడం ద్వారా తాను చేస్తున్న తప్పులను గమనించింది.ఎక్కడ తప్పు జరుగుతోందో గమనించి దాన్ని సరిదిద్దు కుంటూ ముందుకు సాగాననీ, ఇది తన వెయిట్ లాస్ జర్నీలో మరిన్ని కొలోల బరువు తగ్గేందుకు ఉపయోగపడిందని చెప్పుకొచ్చింది. -
అప్పు తీర్చమన్నందుకు మహిళను చితక్కొట్టిన టీడీపీ నేతలు
-
కంప్రెషన్ బ్యాండ్‌తో.. కత్తిలాంటి ఫేస్‌కట్!?
సాక్షి, స్పెషల్ డెస్క్: ముఖ సౌందర్యాన్ని పెంచడానికి ఫ్యాషన్ స్పెషలిస్టుల దగ్గర ‘ఫేషియల్ యోగా’ మొద లు ‘గ్వాషా’ మసాజ్, ఫేషియల్ కప్పింగ్ వరకు ఎన్నో విద్యలు ఉంటాయి. అలాంటి వాటిలో ఇప్పుడు ‘ఫేషియల్ కంప్రెషన్ బ్యాండ్స్’ (ముఖాన్ని పట్టి ఉంచే పట్టీలు) ట్రెండింగులోకి వచ్చాయి. నిపుణుల సహాయం లేకుండా ఎవరికి వారుగా వీటిని ధరించే సౌలభ్యం ఉండటంతో వీటిపై మహిళలు ఆసక్తి కనబరుస్తున్నారు. ‘చెవులు, దవడల మీదుగా నిలువుగా ముఖం చుట్టూ కంప్రెషన్ బ్యాండ్‌ను అమర్చుకుని కొన్ని గంటల తర్వాత తొలగిస్తే చాలు. ముఖం బక్కచిక్కి చక్కనమ్మల్ని చేస్తుంది. నాజూకు నగుమోము మీ సొంతమవుతుంది’ అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకటనలు కనిపిస్తున్నాయి. కంప్రెషన్ బ్యాండ్స్నే ఫేస్ స్లిమ్మింగ్ బ్యాండ్స్, వి–లైన్ లిఫ్టింగ్ బ్యాండ్స్ / మాస్క్ అని కూడా అంటున్నారు. అయితే, ముఖంలో షేప్ తీసుకురావటానికి ధరించే ఈ ఎలాస్టిక్ పట్టీలు నిజంగానే ముఖాన్ని నాజూకుగా మార్చేస్తాయా అంటే.. పూర్తిగా కాదు అంటున్నారు కాస్మెటాలజిస్టులు. బ్యాండ్స్ ఏం చేస్తాయి? ముఖాన్ని కంప్రెషన్ బ్యాండ్ పట్టి ఉంచుతుంది. అంటే ముఖాన్ని బిగించేస్తుంది. ఈ ఒత్తిడి కారణంగా ముఖం ఉబ్బడం తగ్గుతుంది. చర్మంలో ఉబ్బుకు కారణమయ్యే కణజాల ద్రవాన్ని తిరిగి ప్రసరణలోకి పంపే లింఫటిక్ డ్రైనేజ్ వ్యవస్థ క్రియాశీలం అవుతుంది. దాంతో ముఖ చర్మం బిగుతుగా మారి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఫేస్ మసాజ్‌లో జరిగేది కూడా ఇదే. వరంలా మారుతోంది! సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండింగ్‌లోకి వస్తుందో తెలీదు. ఈ ఫేస్ బ్యాండ్ కూడా ఇప్పుడు అలాగే ట్రెండ్ అవుతోంది. దవడల్ని పదునెక్కించి, ముఖ చర్మంలోని వదులును తగ్గించుకునేందుకు మహిళలు ఈ కంప్రెషన్ బ్యాండ్ల పట్ల ఆసక్తి చూపుతున్నారు. కాస్మెటిక్స్ వాడటం ఇష్టం లేనివారికి ఇదొక వరంలా కనిపిస్తోంది. పైగా వీటిని ఇంట్లోనే అమర్చుకోవచ్చు. ఎవరికీ కనిపించకూడదు అనుకుంటే.. రాత్రుళ్లు పెట్టుకుని పడుకోవచ్చు. తీసిన కొన్ని గంటల వరకు ముఖ్యం పలుచగా, తేటగా కనిపిస్తుంది. మైనస్లూ ఉన్నాయి నిపుణులు చెబుతున్న దాన్ని బట్టి కంప్రెషన్ బ్యాండ్లు పైకి హాని చేయనివిగా కనిపించవచ్చు కానీ, వాటిని సరిగ్గా ఉపయోగించకపోతే మాత్రం సురక్షితం కావు. ‘బ్యాండ్ పట్టి ఉంచే ఒత్తిడికి ముఖంలో అసౌకర్యంగా ఉంటుంది. తలనొప్పి రావచ్చు. రక్త ప్రసరణ పరిమితం కావచ్చు. బ్యాండ్ లోపలి వైపు చర్మానికి చెమట పట్టి దద్దుర్లు తేలొచ్చు. పైగా ఎక్కువసేపు ధరించటం వల్ల ముఖంపై నొక్కులు పడతాయి. తిమ్మిరి కూడా ఉండొచ్చు’ అంటున్నారు చర్మవైద్య నిపుణులు. నాణ్యమైనవి కాకుంటే? ‘కంప్రెషన్ బ్యాండ్లు నాణ్యమైనవి కాకపోతే అది మరో సమస్య. అందువల్ల ముఖానికి వదులుగా గానీ, బిగుతుగా గానీ అనిపించవచ్చు. సమానంగా కాకుండా ఎగుడు దిగుడుగా సాగొచ్చు. దవడ, చెవులపై అధిక ఒత్తిడిని కలిగించవచ్చు. ఇందువల్ల కొన్నిసార్లు తల తిరిగినట్లు కూడా అవుతుంది’ అని చెప్తున్నారు కాస్మెటాలజిస్టులు. సర్జరీల తరవాత! ఫేస్ లిఫ్టింగ్ స్ట్రాప్స్ లేదా చిన్ స్ట్రాప్ అని కూడా వాడుకలో ఉన్న ఫేషియల్ కంప్రెషన్ బ్యాండ్లు సాధారణంగా శస్త్ర చికిత్స తర్వాత కోలుకోవటానికి కొంతవరకు ఉపయోగపడతాయి. అవి మెడపై స్థిరమైన ఒత్తిడి ఉండేలా చూస్తాయి. మఖానికి, నోటికి శస్త్ర చికిత్స జరిగినప్పుడు ఆ వాపును, గాయాలను తగ్గించటానికి రక్త ప్రసరణ మెరుగయ్యేలా ఈ బ్యాండ్లు సహాయపడతాయి. కొంతమంది డబుల్ చిన్ (దవడ కింద చర్మం జారిపోవడం) వంటివి తగ్గించుకోవడానికి వాడుతుంటారు. ముఖ వ్యాయామాలు ఉత్తమం ఫేషియల్ బ్యాండ్ల కంటే ముఖ వ్యాయామాలు ఉత్తమమని ఫిట్నెస్ నిపుణులు సూచిస్తున్నారు. ‘చెంప, దవడల వ్యాయామాల వంటివి ముఖ కండరాలను బలోపేతం చేస్తాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. చర్మాన్ని బిగుతుగా ఉంచడంలో సాయపడతాయి. వైద్యులు సూచించే కొన్ని ఔషధాలతోనూ ముఖ చర్మాన్ని సంరక్షించుకోవచ్చు’ అని వారు సలహా ఇస్తున్నారు. థెరపీలూ, చికిత్సలూ! రేడియోఫ్రీక్వెన్సీ, అ్రల్టాసౌండ్ థెరపీ, లేజర్ లైటింగ్ వంటి చికిత్సలతో ముఖ చర్మాన్ని దీర్ఘకాలం చక్కటి ఆకృతిలో ఉంచుకోవటం సాధ్యమేనని చర్మవ్యాధి నిపుణులు చెబుతున్నారు. చర్మంపై ముడతలను పోగొట్టే డెర్మల్ ఫిల్లర్లు, బొటాక్స్ ఇంజెక్షన్లు కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయని సూచిస్తున్నారు. జీవనశైలి.. చక్కటి పరిష్కారం ముఖ సౌందర్యానికి డైటీíÙయన్లు చెబుతున్న కొన్ని ప్రధాన సూచనలు – రోజూ సరిపడా నీళ్లు తాగటం – కంటి నిండా నిద్రపోవడం – ముఖాన్ని రోజుకు కనీసం రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవడం – ఒత్తిడి, ఆందోళన దరిచేరకుండా ఆనందంగా ఉండటం – అన్ని రకాల పోషకాలూ ఉండే ఆహారం తీసుకోవడం – ఉదయపు ఎండలో తగినంత వ్యాయామం చేయడం – ఆహారంలో ఉప్పు తగ్గించటం – బరువు పెరగకుండా జాగ్రత్త పడటం -
చర్లపల్లి: సంచిలో మృతదేహం కేసు.. ఆ మహిళ ఎవరంటే?
సాక్షి, హైదరాబాద్: చర్లపల్లి సంచిలో మృతదేహం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. చనిపోయిన మహిళ బెంగాల్‌కు చెందిన ప్రమీలగా గుర్తించారు. పది సంవత్సరాల నుంచి భర్తతో దూరంగా ఉంటున్న ప్రమీల.. మరొక వ్యక్తితో కలిసి సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవల బెంగాలీ యువకుడితో ప్రమీలకు పరిచయం కాగా, కొండాపూర్ ప్రాంతంలో అతనితో కలిసి ఉంటుంది.ప్రమీలను హత్యను చేసిన ఆ యువకుడు గోనె సంచిలో వేసుకొని చర్లపల్లి స్టేషన్‌కు వచ్చాడు. ఆటోలో మృతదేహాన్ని 37 కిలోమీటర్లు తీసుకొచ్చిన ఆ వ్యక్తి.. చర్లపల్లి రైల్వే స్టేషన్ గోడ పక్కన పెట్టి వెళ్లిపోయాడు. రైల్వే స్టేషన్ వెయిటింగ్ హాల్లోకి వెళ్లి స్నానం చేసి బట్టలు మార్చుకొని అస్సాం వెళ్లే ట్రైన్ ఎక్కి వెళ్లిపోయాడు. హత్యకు సంబంధించి సీసీ ఫుటేజ్ లభ్యమైంది.కాగా, చర్లపల్లి రైల్వేస్టేషన్ గోడ వద్ద సంచిలో మహిళ మృతదేహం కలకలం రేపిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 15న ఉదయం 11 గంటల సమయంలో మృతదేహాన్ని ఓ వ్యక్తి ఆటోలో తీసుకొచ్చి పడేసినట్టు స్థానిక ఆటో డ్రైవర్లు పోలీసులకు సమాచారం అందింది. కేసు నమోదు చేసిన పోలీసులు పరిసరాల్లోని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. -
Anxiety ఎక్కువగా మహిళల్లోనే..! ఎందుకో తెలుసా?
తీవ్రమైన కుంగుబాటు (డిప్రెషన్), ఉద్విగ్నతకు (యాంగ్జైటీ) లోను కావడం వంటివి పురుషులతో పోలిస్తే మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటాయని డబ్ల్యూహెచ్ఓ గణాంకాలు పేర్కొంటున్నాయి. ఉదాహరణకు 2021 నాటి డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం మానసిక సమస్యలతో బాధపడేవారిలో పురుషుల సంఖ్య 13 శాతం కాగా... మహిళల్లో ఆ సంఖ్య 14.8 శాతం. అదే నివేదికలోని వివరాల ప్రకారం... యాంగై్జటీ సమస్యలు వయసుపరంగా చూస్తే బాలికల్లో చాలా త్వరగా బయటపడతాయనేది డబ్ల్యూహెచ్ఓ రిపోర్టులు చెబుతున్న మాట. ఉదాహరణకు యాంగ్జైటీ సమస్యలతో బాధపడేవారిలో 10 నుంచి 19 ఏళ్ల వయసున్న బాలికలు 5.8 శాతం మంది ఉండగా... 20 నుంచి 24 ఏళ్ల వయసున్న యువతులు 7.1 శాతం మంది ఉంటారు. ఇక యాంగై్జటీ బాధితుల్లోనే యుక్తవయసుకు వచ్చిన ఆడపిల్లలు 5.7 శాతం మంది ఉంటారు. అలాగే 50 నుంచి 69 ఏళ్ల మహిళల విషయానికి వస్తే ఇందులో డిప్రెషన్‌తో బాధపడేవారు 6 నుంచి 7 శాతం వరకు ఉంటారని డబ్ల్యూహెచ్ఓ నివేదికలు వెల్లడిస్తున్నాయి. చదవండి: నో ఫుడ్.. నోవాటర్.. రోజుకి 8 లీటర్ల ఇంజిన్ ఆయిల్ చాలు, వైరల్ వీడియో -
Infosys: కెరీర్ గ్యాప్ మహిళలకు శుభవార్త..
కెరీర్లో గ్యాప్ మహిళలకు దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ చక్కని అవకాశం కల్పిస్తోంది. వృత్తి జీవితానికి విరామం ఇచ్చి మళ్లీ ఉద్యోగ ప్రపంచంలో అడుగు పెట్టాలనుకుంటున్న మహిళల కోసం రీస్టార్ట్ విత్ ఇన్ఫోసిస్ అనే కొత్త రిఫరల్ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. విజయవంతమైన రిఫరల్స్‌కు రూ .50,000 వరకు రివార్డులను కూడా అందించనున్నట్లు కంపెనీ ఉద్యోగులకు అంతర్గత ఈమెయిల్ పంపింది.అర్హతలు ఇవే..ఈ ప్రోగ్రామ్ కు అర్హత పొందడానికి, అభ్యర్థులు కనీసం రెండు సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి. కనీసం ఆరు నెలల పాటు నిరంతర కెరీర్ గ్యాప్ ఉండాలి. అర్హులైనవారిని వివిధ టెక్నాలజీల్లో డెవలపర్లు, టెక్ లీడ్లు, మేనేజర్లుగా నియమించుకునేందుకు ప్రయత్నిస్తోందని, దీని గురించి తెలిసిన వర్గాలను ఉటంకిస్తూ ఒక నివేదిక పేర్కొంది.రెఫర్ చేసినవారికి రివార్డులుఈఎస్జీ విజన్ 2030లో భాగంగా 2030 నాటికి 45 శాతం మహిళా ప్రాతినిధ్యాన్ని సాధించాలని ఇన్ఫోసిస్ లక్ష్యంగా పెట్టుకుంది. తాజా ఈఎస్జీ నివేదిక ప్రకారం.. కంపెనీలో ప్రస్తుతం సుమారు 3,23,000 మంది ఉద్యోగులలో మహిళలు 39% ఉన్నారు. దీంతో మహిళా ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవడంలో భాగంగా కంపెనీ ఈ రిఫరల్ ప్రోత్సాహకాలను అందిస్తోంది. జాబ్ లెవల్ 3 (JL3) లో విజయవంతమైన నియామకాలకు రూ .10,000, జాబ్ లెవల్ 4కు రూ .25,000, జాబ్ లెవల్ 5కు రూ .35,000, జాబ్ లెవల్ 6 రెఫరల్స్‌కు రూ .50,000 రివార్డులను ఇన్ఫోసిస్ అందించనుంది.ఇదీ చదవండి: ‘టీసీఎస్‌లో బలవంతంగా రాజీనామా చేయమన్నారు’ -
ఆంజినాని అర్థం చేసుకుంటే..అతివల గుండె పదిలం..!
గుండె వ్యాధులు ఎక్కువగా పురుషులనే ప్రభావితం చేస్తాయని, అందులోనూ కరోనరి ఆర్టరీ డిసీజ్ వంటి గుండె సమస్యలు పురుషులకే అత్యంత ప్రమాదమని అనుకుంటారు అంతా. కానీ మహిళలకూ అంతే స్థాయిలో ప్రమాదం ఉంటుందట. వాళ్లు కూడా తరుచుగా ఆంజినా(ఛాతీనొప్పి) వంటి లక్షణాలను ఎదుర్కొంటారట. అయితే ఈ ఛాతీనొప్పిని మహిళలు తేలిగ్గా కొట్టిపారేయడం, సకాలంలో చికిత్స తీసుకోకపోవడంతో ప్రాణాలపై కొనితెచ్చుకుంటున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఛాతీనొప్పిపై అవగాహన లేమి దీనంతటికి కారణమని అంటున్నారు. మరీ ఏంటి ఛాతీనొప్పి, దాని లక్షణాలు, ముందుస్తుగా ఎలా గుర్తించాలి తదితరాల గురించి వైద్యుల మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!.భారతదేశంలో చాలావరకు సంభవిస్తున్న మరణాల్లో కరోనరీ ఆర్టరీ డిసీజ్ (CAD)కి సంబంధించిన కేసులు కూడా ఉన్నాయని అన్నారు. అంతేగాదు డబ్ల్యూహెచ్ఓ ప్రకారం..2022లో భారతదేశంలో దాదాపు 4 మిలియన్లకు పైగా మరణాలు క్యాడ్ వల్లే సంభవించాయి. పైగా ఈ గణాంకాలు మహిళలకు ఈ వ్యాధిపై తక్షణ అవగాహన, సంరక్షణ చర్యలు తీసుకోవాల్సి అవసరం గురించి నొక్కి చెప్పాయి. అందువల్ల ఈ ఆంజినా పెక్టోరిస్ని(ఛాతీనొప్పి)ని ముందస్తుగా గుర్తించడం, సమర్థవంతంగా నిర్వహించడంపై మహిళలకి అవగాహన పెంచడం అనేది అత్యంత ప్రధానమని నిపుణులు సూచిస్తున్నారు.ఆంజినా (ఛాతీనొప్పి) ఎలా ఉంటుందంటే..ఆంజినా అనేది క్యాడ్(CAD)కి సంబంధించిన అత్యంత సాధారణ లక్షణం. మహిళలే ఎక్కువగా ఈ వ్యాధి లక్షణాలను ఎదుర్కొంటారట. ఇది రోగి జీవన నాణ్యతను గణనీయంగా దెబ్బతీస్తుంది. గుండె కండరాలకు తగినంత ఆక్సిజన్ ఉన్న రక్తం అందనప్పుడు వచ్చే ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం. దీని వలన ధమనులు సంకోచించి, గుండెకు రక్త ప్రసరణ తగ్గుతుంది. ఆంజినా లక్షణాలు ఛాతీలో ఒత్తిడి లేదా బిగుతుగా అనిపించడం, చేతులు, భుజాలు, మెడ లేదా దవడలోకి వ్యాపించడం, శ్వాస ఆడకపోవడం, అలసట, వికారం, చెమటలు పట్టడం వంటివి ఉండవచ్చు. ఇది హార్ట్ ఎటాక్ కానప్పటికీ, గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని సూచిస్తుంది. పైన పేర్కొన్న ఆ సమస్యల ఉత్పన్నమవ్వగానే సకాలంలో వైద్య సహాయం తీసుకోకపోవడంతోనే ఈ ఆంజినా సవాలుగా మారుతుందని చెబుతున్నారు వైద్యులు. మహిళల్లో ఈ సమస్య నిర్థారణలో చేస్తున్న జాప్యమే సమస్య తీవ్రతను పెంచి, అకాల మరణాలకు దారితీస్తుందని చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు ఈ నిర్లక్ష్యమే ఒక్కోసారి నిపుణులు సైతం అంతర్లీనంగా ఉన్నీ ఆంజినా సమస్యను పరిష్కరించకుండా ఇతరత్ర ఉపశమన పరిష్కారాలు అందించేలా చేసి, మరింత ప్రమాదంలోకి నెట్టేస్తుందని హెచ్చరిస్తున్నారు. చికిత్స విధానం..OPTA(ఆప్టిమల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఆంజినా) క్లినికల్ చెక్‌లిస్ట్, OPTA ప్రశ్నాపత్రం, OPTA విధానంతో సహా మూడు ప్రత్యేకమైన సాధనాలు వరుసగా ఆంజినా(ఛాతీనొప్పి) నిర్థారణకు కీలకమైనవి. ఇవి రోగ నిర్థారణకు, వైద్య నిర్వహణకు మద్దతిస్తాయి. పైగా వైద్యలకు సకాలంలో ఈ ఛాతీనొప్పిని నిర్థారించడంలో హెల్ప్ అవుతుంది. ఇది ఒకరకంగా ఆంజినా నిర్వహణపై తొలి అడుగుగా అభివర్ణించారు నిపుణులు.మహిళ్లలోనే ఈ వ్యాధిని గుర్తించలేకపోవడానికి రీజన్..మహిళల్లో గుండె జబ్బులను గుర్తించడంలో ఒక ప్రధాన సవాలు ఏంటంటే..సహజంగా తాము తక్కువ ప్రమాదంలో ఉన్న అపోహనే ప్రధాన కారణమని చెబుతున్నారు అపోలా ఆస్పత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ సరితా రావు. అదీగాక గుండెజబ్బులు వంటి సమస్యలు తరుచుగా పురుషులే బారిన పడతారనేది నిజమే అయినప్పటికీ, పూర్తిగా మహిళలకు ఈ వ్యాధుల రావు అని అర్థం కాదని అంటున్నారు. అందువల్లే ఈ గుండె జబ్బుల ప్రమాదాలపై మహిళలకు అవగాహన కలిగించడం అత్యంత ప్రధానమని నొక్కి చెబుతున్నారు. 75 ఏళ్లు పైబడిన హృదయ సంబంధ రోగుల్లో మహిళలే అధికమని చెప్పారు. ముఖ్యంగా ఆంజినా(ఛాతీనొప్పి)తో ముడిపడి ఉన్న గుండెజబ్బులు పురుషుల కంటే మహిళలనే ఎక్కువగా ప్రభావితం చేస్తాయని అన్నారు. అందువల్ల మహిళలు ఈ వ్యాధిని తిప్పికొట్టేలా రోగ నిర్థారణ, సకాలంలో చికిత్స, నిర్వహణపై ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించి మెరుగైన ఫలితాలు అందుకునేలా చర్యలు తీసుకోవడం అనేది అత్యంత కీలకమని అన్నారు.(చదవండి: Pain Relief Therapy: నొప్పిని పోగొట్టే ‘అయాన్’) -
ఏసీ కోచ్‌లో యువతి స్మోకింగ్.. ‘నా డబ్బుతో కొనుక్కున్న సిగరెట్.. మీకెందుకంత బాధ?’
సాక్షి,విశాఖపట్నం: విశాఖపట్నం-గాంధీధామ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (20803)లో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో.. ఏసీ కోచ్‌లో ఓ యువతి సిగరెట్ తాగుతూ ఇతర ప్రయాణికులతో వాగ్వాదానికి దిగింది. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట్లో చక్కెర్లు కొడుతున్నాయి. ఇక ఆ వీడియోను పరిశీలిస్తే.. యువతి సిగరెట్ తాగుతుండగా.. ఓ యువకుడు ఆమెను ప్రశ్నిస్తూ వీడియో తీస్తుంటారు. ‘ఏం చేస్తున్నారు మీరిక్కడ? ట్రైన్ లోపల ఎందుకు సిగరెట్ తాగుతున్నారు? ఇది ఏసీ కోచ్ మీకు కనిపించడం లేదా? అని ప్రశ్నిస్తాడు. దీంతో వీడియో తీస్తున్నారని గమనించిన ఆ ప్రయాణికురాలు.. యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు నన్నెందుకు వీడియో తీస్తున్నారు. వెంటనే డిలీట్ చేయండి అంటూ బెదిరింపులకు దిగింది. అందుకు ఆ యువకుడు ఒప్పుకోకపోవడంతో.. నీకెందుకు బ్రదర్.. ఇది నీ ట్రైన్ కాదు కదా ప్రశ్నించింది. ఓ చేతిలో సిగరెట్ పట్టుకుని.. ఈ సిగరెట్‌ను నా సొంత డబ్బుతో కొనుక్కొని తాగుతున్నా మీకెందుకు అని మరింత గట్టిగా కేకలు వేసింది. కేకలు విన్న తోటి ప్రయాణికులు ..యువతిని ట్రైన్లో సిగరెట్ తాగడం ఆపాలని కోరారు. అయితే ఆమె వారి మాటలను పట్టించుకోకుండా.. ఇది మీ ట్రైన్ కాదు కదా, మీకు ఎందుకు బాధ? అని కసురుకుంది. నేను లోపలికి వెళ్లను. నా వీడియో ఎందుకు డిలీట్ చేయడం లేదు? అని ప్రశ్నించింది. అందుకు తోటి ప్రయాణికులకు చిర్రెత్తడంతో యువతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసేది లేక చివరికి ఆమె తన బెర్త్‌కి వెళ్లి ఇప్పుడు పోలీసులను పిలవండి అంటూ సవాల్ విసిరింది. ఈ వీడియో ఎప్పుడు రికార్డ్ చేశారో తెలియాల్సి ఉండగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై రైల్వే శాఖ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. सिगरेट पीने की तलब, बेईज्जत करवा देती हैं. वायरल वीडियो में चलती ट्रेन में इस तरह धूम्रपान करेगी तो सामने वाला आपकी करतूतों को दिखाएगा?@RailMinIndia pic.twitter.com/mXHxy0715s— Tushar Rai (@tusharcrai) September 15, 2025 -
‘అయ్యో పాపం.. ప్రాణం పోగొట్టుకునేందుకేనా 600కిలోమీటర్లు ప్రయాణించింది’
జైపూర్: ప్రియుడిని పెళ్లికి ఒప్పించేందుకు 600 కిలోమీటర్లు ప్రయాణించిన ఓ మహిళ… చివరికి శవమై కనిపించింది. ఈ విషాద కథపై నెటిజన్లు ‘అయ్యో పాపం..ప్రేమ కోసం అంత దూరం ప్రయాణించి చివరికి ప్రాణం పోగొట్టుకుందా?’ అంటూ నిట్టూరుస్తున్నారు.పోలీసుల కథనం ప్రకారం..రాజస్థాన్‌లోని ఝుంఝునుకు చెందిన ముఖేష్ కుమారి అంగన్వాడీ సూపర్వైజర్గా విధులు నిర్వహించేది. పదేళ్ల క్రితం తన భర్తతో మనస్పర్ధలు రావడంతో కుమారి ఆమె భర్త నుంచి విడిపోయింది. ఈ క్రమంలో గతేడాది నవంబర్‌లో అదే రాష్ట్రంలోని బర్మార్‌లో టీచర్‌గా విధులు నిర్వహించే మనారామ్‌తో మెటాలో పరిచయం పెంచుకుంది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. సోషల్ మీడియాలో చాటింగ్, వాట్సాప్‌లో వీడియో కాలింగ్లతో ఏడాదిపాటు మునిగిపోయారు. చివరికి ఆ ప్రేమను పెళ్లిగా మారుద్దామని అనుకున్నారు.ఈ నేపథ్యంలో పెళ్లికి ఒప్పించేందుకు ఝుంఝును నుంచి 600కిలోమీటర్ల దూరంలో ఉన్న మనారామ్‌ను కలిసేందుకు కుమారి కారులో బయలుదేరింది. మనారామ్ ఇంటికి చేరుకుని, అతని కుటుంబ సభ్యులకు వారి సంబంధం గురించి వివరించింది. దీంతో కుమారిపై మనారామ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమ సమస్యను పరిష్కరించమని కోరుతూ స్థానిక పోలీసుల సాయం తీసుకున్నాడు. ఆ తర్వాత సాయంత్ర రోజు అలా మాట్లాడుకుందాం పదా అంటూ కుమారిని బయటకు తీసుకుకెళ్లాడు మనారామ్. ఇద్దరు ఏకాంతంగా ఉండగా.. మనరామ్ ఓ రాడ్డుతో కుమారి తలపై మోదీ ప్రాణాలు తీశాడు. ఆనవాళ్లన్నీ ధ్వంసం చేశాడు. హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. కుమారిని కారు డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టి ప్రమాదం జరిగిందని నమ్మేలా కారును సైడ్ కాలువలోకి పోనిచ్చాడు. ఇంటికి వచ్చి హాయిగా నిద్రపోయాడు(ఈ విషయం పోలీసుల దర్యాప్తులో తెలిపాడు). మరుసటి రోజు ఉదయం కుమారి రోడ్డు ప్రమాదానికి గురైందని పోలీసులకు సమాచారం ఇవ్వాలని తన తరుఫు లాయర్‌ను పురమాయించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. తొలుత బాధితురాలు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకుందని పోలీసులు భావించారు.అన్నీ కోణాల్లో కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులకు కుమారి ప్రాణం తీసింది మనారామ్ అని నిర్ధారించుకున్నారు. కుమారి హత్య జరిగే సమయంలో నిందితుడు మనరామ్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండటం అనుమానం పోలీసులకు అతనిపై అనుమానం మొదలైంది. ఆ అనుమానంతో మనారామ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా.. అసలు విషయం భయట పడింది. కుమారిని హత్య చేసింది మనారామ్‌నేనని తేల్చారు. కుమారి మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులకు అప్పగించారు. -
బతుకమ్మ చీరెలొస్తున్నాయ్..
జగిత్యాల: స్వయం సహాయక సంఘాల మహిళలకు దసరా కానుకగా చీరలను పంపిణీ చేసేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారిగా ఎన్ని సంఘాలున్నాయి..? ఎంతమంది మహిళ సభ్యులు ఉన్నారు..? అనేది లెక్కలు తీశారు. జిల్లాకు మొత్తం 2,39,950 చీరలు రానున్నాయి. గతంలో ప్రభుత్వం ప్రతి దసరాకు బతుకమ్మ చీరల పేరిట పంపిణీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొదటిసారిగా బతుకమ్మ పండగకు చీరలు ఇవ్వాలని నిర్ణయించింది. బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమయ్యేనాటికి మహిళాసంఘాల సభ్యులకు అందించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే జిల్లాలో గోదాములను గుర్తించి నియోజకవర్గాలుగా పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రేవంతన్న కానుకగా ప్రతి సంఘం సభ్యులకు చీరెలు అందించనున్నారు. మరో రెండుమూడు రోజుల్లో చీరలు జిల్లాకు రానున్నట్లు డీఆర్డీఏ శాఖ అధికారులు తెలిపారు. మెప్మా సిబ్బందికి పంపిణీ బాధ్యతలు అప్పగించారు. జిల్లాలోని మూడు నియోజకవరాల్లో గోదాం పాయింట్లను ఏర్పాటు చేశారు.మహిళలకు అందిస్తాంప్రతి సంఘం సభ్యురాలికి బతుకమ్మ పండగ సందర్భంగా చీరలు అందించనున్నాం. జిల్లాకు 2,39,950 చీరలు రానున్నాయి. నిల్వ చేసేందుకు గోదాం పాయింట్లు గుర్తించాం. త్వరలోనే మహిళలకు అందించేలా చర్యలు తీసుకుంటాం. – రఘువరణ్, డీఆర్డీఏ పీడీ -
తిరుపతిలో ఇద్దరు మహిళలని కిడ్నాప్ చేసిన కూటమి నేత
-
Kukatpally: కాళ్లు, చేతులు కట్టేసి... అక్కడే స్నానం చేసి..
హైదరాబాద్: ఓ మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. స్థానిక సాన్వీ లేక్ అపార్ట్మెంట్లో 1311 ప్లాట్‌లో రాకేష్ అగర్వాల్, రేణు (50) దంపతులు నివాసం ఉంటున్నారు. రాకేష్ సనత్‌నగర్ లో స్టీల్ షాప్ నిర్వహిస్తున్నాడు. వారి ఇంట్లో పని చేసేందుకు పది రోజుల క్రితం హర్ష అనే వ్యక్తిని వంట మనిషిని నియమించుకున్నారు. బుధవారం భర్త, కుమారుడు షాప్‌కు వెళ్లగా రేణు ఒక్కతే ఇంట్లో ఉంటుంది. సాయంత్రం ఆమె భర్త ఇంటికి వచ్చి చూడగా ఇళ్లు తాళం వేసి ఉండటంతో ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి ప్లంబర్ సహాయంలో తలుపులు తెరిచి చూడగా రేణు రక్తం మడుగులో పడి ఉంది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కాళ్లు, చేతులు కట్టేసి... అక్కడే స్నానం చేసి.. రేణు కాళ్లు, చేతులు కట్టేసి కుక్కర్‌తో తలపై మోది గొంతు కోసి హత్య చేశారు. రక్తం అంటుకున్న దుస్తులను అక్కడే విడిచి బాత్రూంలో స్నానం చేసి దుస్తులు మార్చుకుని బ్యాగ్‌తో సహా యజమాని స్కూటీపై పరారైనట్లు సీసీ కెమెరాలో రికార్డయ్యింది. 5 టీమ్‌లతో నిందితుల కోసం గాలిస్తున్నట్లు బాలానగర్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. -
నది పాడే ఏకాంత గీతం
నది పాడే గీతాన్ని ఎప్పుడైనా విన్నారా?నది మౌనాన్ని ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా? సముద్రంలో కలిసే నది చెప్పే జీవిత సత్యం ఏమిటి?..నది అనేది తత్వశాల. ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. ప్రవాహంలోనే జవాబులు ఉంటాయి. ఆరుగురు మహిళా ఆర్టిస్ట్‌లు... అలము కుమరెసన్, అపరాజిత జైన్ మహాజన్, డా. సవిత, హన్సిక శర్మ, లక్ష్మీ మాధవన్, మీనాక్షి నిహలాని ‘వేర్ ది రివర్ మీట్స్ ది సీ’ పేరుతో ముంబైలోని ఆర్ట్ గ్యాలరీ ‘అనూప్ మెహతా కాన్టెంపరరీ ఆర్ట్’లో ఆర్ట్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు.ఫైబర్, క్లాత్, ఎంబ్రాయిడరీలకు ఆధునిక కళారీతులను జోడించి కన్నుల పండగ చేశారు. ‘జీవన ప్రయాణానికి నది ప్రతీకలాంటిది’ అంటారు ఆ ఆరుగురు ఆర్టిస్ట్‌లు. ఈ చిత్రాలలో మన వారసత్వ సంపద, సంస్కృతి కనిపిస్తాయి. స్త్రీవాద గొంతుక వినిపిస్తుంది.టెక్స్్టటైల్ ఆర్ట్‌కు కాలం చెల్లుతుందా? అనుకునే రోజుల్లో అది ప్రపంచవ్యాప్తంగా పునరుజ్జీవించింది. సమకాలీన అంశాలతో మమేకం అవుతూ కొత్త కాంతులు విరజిమ్ముతోంది. ఈ ఆరుగురు ఆర్టిస్ట్‌ల ‘వేర్ ది రివర్ మీట్స్ ది సీ’ వస్త్రకళను మరింత కొత్తగా చూపే ప్రయత్నం. -
తిరుమల శ్రీవారి సేవలో భారత మహిళా క్రికెటర్ శ్రీ చరణి (ఫొటోలు)
-
బతికుండగానే చంపేశారు
-
6 నెలలు.. రూ.13.82 లక్షల ఆదాయం
నారాయణపేట రూరల్: రాష్ట్రంలో కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘ఇందిరా మహిళాశక్తి’ని పటిష్టంగా అమలు చేస్తోంది. నారాయణపేట జిల్లా మహిళా సమాఖ్యలో 8,196 మహిళా సంఘాలు ఉన్నాయి. వీటిలో 91,369 మంది సభ్యులున్నారు. ఇందిరా మహిళాశక్తిలో భాగంగా జిల్లా కేంద్రానికి సమీపంలోని సింగారం క్రాస్ రోడ్డులో రూ.1.30 కోట్ల వ్యయంతో జిల్లా మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి 21న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. 20 ఏళ్లకు నెలకు రూ.10 వేల అద్దె ప్రాతిపదికన మహిళా సమాఖ్య ద్వారా ఈ పెట్రోల్ బంక్ నిర్వహణకు బీపీసీఎల్‌తో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఒప్పందం చేసుకుంది. మహిళలకు ముందస్తు శిక్షణ..బంక్ నిర్వహణకు సంబంధించిన 11 మంది మహిళలను ఎంపిక చేసి ప్రభుత్వం వారికి ముందస్తుగా జడ్చర్ల, షాద్‌నగర్‌లోని పెట్రోల్ బంక్‌లలో మేనేజర్, సేల్స్ ఉమెన్లుగా శిక్షణ ఇప్పించింది. మొత్తం వ్యయంలో మౌలిక వసతులు కల్పనకు రూ.15 లక్షలు ఖర్చు చేశారు. సీఎం ఆదేశాలు మేరకు ప్రతి 15 రోజులకోసారి పెట్రోల్ బంక్ నిర్వహణపై కలెక్టర్ సమీక్షిస్తున్నారు.∙మహిళా సమాఖ్య పెట్రోల్ బంక్‌లో రోజుకు 4 వేల లీటర్ల పెట్రోల్, 6 వేల లీటర్ల డీజిల్‌ను విక్రయిస్తున్నారు. అందులో విధులు నిర్వర్తించే 10 మంది సేల్స్ ఉమెన్లకు ఒక్కొక్కరికి నెలకు రూ.13,200 చొప్పున, మహిళా మేనేజర్‌కు నెలకు రూ.18 వేలు వేతనంగా జిల్లా సమాఖ్య నుంచి తీసుకుంటున్నారు. మహిళా పెట్రోల్ బంక్ ద్వారా వేతనాలు, ఇతర నిర్వహణ ఖర్చులు పోను ఆరు నెలల్లో రూ.13.82 లక్షల ఆదాయాన్ని ఆర్జించారు.ఆర్థికంగా ఎదుగుదలకు..మహిళలు వంటింటికే పరి మితం కాదని నారాయణపేట మహిళా సమాఖ్య నిరూపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సా హం బాగుంది. 11 మంది మహిళలం కష్టపడి పనిచేసి రూ.13.82 లక్షల ఆదాయాన్ని గడించాం. – చంద్రకళ, పెట్రోల్ బంక్ మేనేజర్మహిళా స్వావలంబనకు తోడ్పాటు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో మహిళల ఆర్థిక స్వావలంబనకు ఇదొక ముందడుగు. తెలంగాణలోనే కాదు దేశం మొత్తంలో జిల్లా మహిళా సమాఖ్యచే నడిచే మొదటి పెట్రోల్ బంక్‌గా గుర్తింపు పొందింది. – సిక్తా పట్నాయక్, కలెక్టర్, నారాయణపేట -
ఆమెకు అభద్రత!
దేశంలోని ప్రతి 10 మంది మహిళల్లో నలుగురు.. తాము ఏమంత సురక్షితంగా లేరని భావిస్తున్నారట. యువతుల్లో భయాందోళనలు గత ఏడాది కంటే పెరిగాయి. ఫిర్యాదు ఇస్తే న్యాయం జరుగుతుందన్న ఆశ బాధిత మహిళల్లో చాలా తక్కువగా ఉందట. పని చేసే చోట భద్రత గురించి మాత్రం.. సురక్షితమైన వాతావరణం ఉందని అత్యధికులు చెప్పారు. దేశంలోని మహిళల భద్రతా స్థితిగతులపై జాతీయ మహిళా కమిషన్.. ‘నారీ 2025 వార్షిక నివేదిక, భద్రతా సూచిక’ పేరిట విడుదుల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. -సాక్షి, స్పెషల్ డెస్క్వీధి లైట్లు.. ప్రజా రవాణా!⇒ ‘ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్’ గురించి విన్నవారిలో చాలా మంది, ఆఫీసులలో అలాంటి యంత్రాంగం ఒకటి ఉంటుందన్న అవగాహన మహిళలకు భద్రత కల్పిస్తుందని అభిప్రాయపడ్డారు. ⇒ మహిళల భద్రత అంటే కేవలం వారికి భౌతిక రక్షణను మాత్రమే ఇవ్వటం కాదని; వారి మానసిక, ఆర్థిక, డిజిటల్ భద్రతలను కూడా కల్పించాలని నివేదిక సూచించింది. ⇒ స్థలాన్ని, సమయాన్ని బట్టి కూడా భద్రత అర్థం మారుతుందనీ, పగటిపూట సురక్షితమైన వాతావరణాన్ని నైట్ షిఫ్టులలో ఆశించలేమని మహిళలు అన్నారు.⇒ వీధి లైట్లు లేకపోవటం, సరిగా లేని ప్రజా రవాణా వ్యవస్థ కూడా రాత్రివేళ మహిళలకు భద్రత లేకపోవటానికి కారణమని వారు తెలిపారు.దేశంలోని 31 నగరాల్లో 12,770 మంది మహిళల అభిప్రాయాలు సేకరించి జాతీయ మహిళా కమిషన్ ‘నారీ 2025 వార్షిక నివేదిక, భద్రతా సూచిక’ రూపొందించింది. సర్వేలో దాదాపు 60 శాతం మంది మహిళలు తమ నగరాల్లో తాము సురక్షితంగా ఉన్నట్లు చెప్పగా, 40 శాతం మంది అంత సురక్షితంగా లేమని లేదా సురక్షితంగా అస్సలు లేమని భావిస్తున్నట్లు తెలిపారు.యువతులలోని భయాందోళనలు గత ఏడాది కంటే పెరగటాన్ని కూడా నివేదిక గుర్తించింది. 2024లో సర్వేలో పాల్గొన్న మహిళల్లో 7 శాతం మంది బహిరంగ వేధింపులను గురయ్యామని చెప్పగా, 24 ఏళ్లలోపు యువతుల్లో ఇలా చెప్పిన వారి సంఖ్య గరిష్ఠంగా 14 శాతంగా ఉంది. ముఖ్యంగా చదువుకునే అమ్మాయిలు, ఉద్యోగినులైన యువ నిపుణులు, సామాజిక వేడుకల్లో పాలుపంచుకున్న మహిళలు వేధింపులకు గురైనట్లు సర్వే పేర్కొంది.ముగ్గురిలో ఒక్కరే ఫిర్యాదు!ఫిర్యాదు ఇస్తే న్యాయం జరుగుతుందన్న ఆశ బాధిత మహిళల్లో చాలా తక్కువగా ఉందని నివేదిక తెలిపింది. సర్వే ప్రకారం, వేధింపులకు గురైన ముగ్గురిలో ఒకరు మా త్రమే ఫిర్యాదు చేశారు. 75 శాతం మహిళలు.. తమ ఫిర్యాదులను అధికారులు పరిష్కరిస్తారని నమ్మటం లేదు. వేధింపులు, ఇతర ఘటనల్లో 22 శాతం వరకే కేసులు నమోదు కాగా, వాటిల్లో పరిష్కారం అయినవి కేవలం 16 శాతం మాత్రమే. వ్యవస్థపై అపనమ్మకం, బాధితుల మౌనం ఏ స్థాయిలో ఉన్నాయో ఈ లెక్కలు చెబుతున్నాయి. వేధింపు ఘటనల్లో 32 శాతం.. తెలిసిన ప్రాంతాలలో జరుగుతుండగా, 29 శాతం ప్రయాణ సమయాలలో సంభవిస్తున్నాయని నివేదిక తెలిపింది.కోహిమాలో సురక్షితంనగరాల వారీ భద్రతా అసమానతలను కూడా నివేదిక పొందుపరిచింది. కోహిమా, విశాఖపట్నం, భువనేశ్వర్.. భద్రతా సూచికలో అగ్రస్థానంలో ఉన్నాయి, తరువాత ఐజ్వాల్, గ్యాంగ్‌టక్, ఇటానగర్ ముంబై ఉన్నాయి. ఇందుకు భిన్నంగా పట్నా, జైపుర్, ఫరీదాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, శ్రీనగర్, రాంచీ మరీ దిగువ స్థానాల్లో ఉన్నాయి. రాంచీ అంత సురక్షితమైనది కాదని 44 శాతం మంది మహిళలు భావిస్తుండగా, ఢిల్లీ ఫరీదాబాద్‌లలో ఈ శాతం దాదాపు 42గా ఉంది. దేశంలోని మహిళల భద్రతను పట్టణ పరిస్థితులు, అక్కడి పాలనా యంత్రాంగం పనితీరు ప్రభావితం చేస్తున్నట్లు ‘నారీ 2025’ తేల్చి చెప్పింది. పనిచేసే చోట భద్రమేపని చేసే చోట భద్రత గురించి 91 శాతం మంది మహిళలు.. కార్యాలయంలోని వాతావరణం సురక్షితంగా ఉందని తెలిపారు. అయితే వారిలో దాదాపు సగం మంది, తమ సంస్థ తప్పనిసరి ‘లైంగిక వేధింపుల నివారణ’ (పి.ఓ.ఎస్.హెచ్. – ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్) యంత్రాంగాన్ని అమలు చేస్తోందో లేదో తమకు తెలియదని చెప్పారు.వేధింపులు⇒ బహిరంగ వేధింపులకు గురయ్యామని చెప్పిన మహిళలు 7 శాతం. 24 ఏళ్లలోపు యువతుల్లో ఇది 14 శాతం.⇒ వేధింపు ఘటనల్లో 32 శాతం తెలిసిన ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి. ⇒ ముఖ్యంగా 38% ఇరుగు పొరుగు వారి వల్లే జరుగుతున్నాయి.⇒ 29 శాతం ప్రయాణాల సమయాలలో సంభవిస్తున్నాయి.⇒ వేధింపుల్లో మాటలతో అత్యధికంగా 58 శాతం చోటు చేసుకుంటున్నాయి.⇒ వేధింపులకు గురైనవారిలో ప్రతి ముగ్గురిలో కేవలం ఒక్కరే ఫిర్యాదు చేస్తున్నారు. -
రక్తపరీక్షతో ప్రీఎక్లాంప్సియా గుర్తింపు!
చాలామంది గర్భిణులు ప్రీఎక్లాంప్సియా సమస్యకు లోనవుతుంటారు. ఇప్పటి వరకు ఈ సమస్య వచ్చాక గుర్తించి, చికిత్స చేసే పద్ధతులే ఉన్నాయి తప్ప ముందుగా గుర్తించే పద్ధతులేవీ అందుబాటులో లేవు. అయితే, ఇటీవల స్పానిష్ వైద్య నిపుణులు ప్రీఎక్లాంప్సియాను నెలల ముందుగానే గుర్తించగల రక్తపరీక్ష విధానాన్ని కనుగొన్నారు. ప్రీఎక్లాంప్సియా సాధారణంగా గర్భిణుల్లో మొదటి ఇరవై వారాల తర్వాత తలెత్తుతుంది. దీనివల్ల రక్తపోటు పెరగడం; మూత్రంలో ప్రొటీన్ పోవడం; శరీరంలో నీరు నిలిచిపోవడం వల్ల బరువు పెరగడం; ముఖంలోను, చేతుల్లోను వాపులు రావడం; వాంతులు, వికారం పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ‘ప్లాస్మా సెల్ ఫ్రీ ఆర్న్ఏ’ (సీఎఫ్ఆర్ఎన్ఏ) రక్తపరీక్ష ద్వారా ప్రీఎక్లాంప్సియా వచ్చే అవకాశాలను నెలల ముందుగానే గుర్తించవచ్చు. ఈ పరీక్షను స్పానిష్ వైద్య పరిశోధన సంస్థ ‘ఐప్రీమామ్’కు చెందిన టమారా గారిడో గోమెజ్ నేతృత్వంలోని వైద్య నిపుణులు రూపొందించారు. వీరు 2021–2024 మధ్య 9,586 మంది మహిళలకు ఈ రక్తపరీక్షలు నిర్వహించి, విజయవంతమైన ఫలితాలను సాధించారు. డాక్టర్ ప్రమత శిరీష, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: ఏడాది తర్వాత రక్తస్రావం అవుతుంది..ఇది పెద్ద సమస్యనా?) -
చాకిరీనే ఆమె నౌకరీ
భారతీయ మహిళకు ఇంటా, బయటా మోయలేనంతగా రెండింతల పని భారం ఉంటోందని తాజాగా విడుదలైన ‘టైమ్ యూజ్’ సర్వే వెల్లడించింది. ఎక్కువ చదువుకున్న, సంపన్నులైన మహిళలు సైతం ఈ విషయంలో మెరుగ్గా ఏమీ లేరని కూడా వ్యాఖ్యానించింది. పురుషులు జీతం వచ్చే పనికి బయట ఎంత సమయం వెచ్చిస్తున్నారో, అంతకుమించిన సమయాన్ని మహిళలు జీతం రాని పనికి ఇంట్లో వెచ్చిస్తున్నారని సర్వే పేర్కొంది.భారత ‘స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్’ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఎన్.ఎస్.ఒ.) 2024లో దేశవ్యాప్తంగా నిర్వహించిన ‘టైమ్ యూజ్’ సర్వేలో – రోజువారీ పనులకు స్త్రీలు, పురుషులకంటే రెండింతలు ఎక్కువగా సమయాన్ని వెచ్చిస్తున్నట్లు వెల్లడైంది. ఈ సర్వే కోసం ఎన్.ఎస్.ఒ. 1,67,000 మందిని కలిసి వివరాలు సేకరించింది. శ్రమలో అసమానతలుఉద్యోగం, నిద్ర, ఆహారం, విశ్రాంతి మొదలు.. చదవటం, షాపింగ్, వంట పని వంటి 165 రోజువారీ పనులకు స్త్రీ పురుషులు వెచ్చించిన సమయాన్ని సర్వే నమోదు చేసింది. పురుషులు, మహిళలు నిద్రించడానికి దాదాపు సమాన సమయాన్ని వెచ్చిస్తుండగా, సగటు స్త్రీ, సగటు పురుషుడు బయట నలుగురితో కలిసి గడిపే దాని కంటే కూడా ఎక్కువ సమయాన్ని ఇంటి పనులకే కేటాయిస్తోంది. నిద్రను మినహాయిస్తే, పురుషులు ఉద్యోగం లేదా స్వయం ఉపాధి పనులలో రోజుకు సగటున గ్రామాలలో 4.6 గంటలు, పట్టణ ప్రాంతాలలో 5.3 గంటలు వెచ్చిస్తున్నారు. ఆ తరువాతనైనా వారికి విశ్రాంతి లభిస్తోంది. లేదా బయటి కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. కాని మహిళల్లో ఇంటి పనులు సుదీర్ఘంగా ఉంటున్నాయి. ఈ ధోరణి శ్రమ చేయటంలో స్త్రీ పురుష అసమానతల్ని స్పష్టంగా చూపిస్తోంది. 2024–25లో దేశంలో 15ఏళ్లు, అంతకు పైబడిన వయసు గల మహిళల కార్మిక భాగస్వామ్య రేటు 41.7 శాతం ఉండగా, పురుషులలో ఈ శాతం 78.8 వరకు ఉంది. తక్కువ జీతం, తక్కువ అవకాశాలు స్త్రీలు ఉద్యోగం చేయటానికి ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయి.రెండింతల రెట్టింపు పని మహిళలు విద్యలో ఎంతగా పురోగతి సాధిస్తున్నా, ఉద్యోగాలలో పెద్దగా ప్రయోజనం పొందటం లేదు. జీతం ఉన్న పని, జీతం లేని పని రెండింటినీ కలిపి, విద్యాస్థాయి లేదా సామాజిక–ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా మహిళలు పురుషుల కంటే ఎక్కువగా శ్రమిస్తున్నారు. నిరక్షరాస్యులైన మహిళలు సగటున రోజుకు 103 నిమిషాలకు పైగా జీతం ఉన్న ఉపాధి పనులకు, 281 నిమిషాలకు పైగా జీతం లేని పనికి వెచ్చిస్తున్నారు. డిగ్రీ ఉన్న మహిళలు సైతం ఉపాధి కోసం 106 నిమిషాలు, జీతం లేని పనికి చాలా ఎక్కువగా 323 నిమిషాలు కేటాయిస్తున్నారు. ఇది పురుషులు చేస్తున్న శ్రమ కంటే చాలా ఎక్కువ. నేటికీ నెమ్మదిగానే పురోగతిఅనేక విద్యా స్థాయులలో బాలురు, పురుషుల కంటే బాలికలు, మహిళలు మెరుగ్గా ఉన్నప్పటికీ, ఉద్యోగావకాశాలలో మహిళలింకా పురుషుల కంటే వెనుకబడే ఉన్నట్లు సర్వే పేర్కొంది. ఇంటి బాధ్యతలు తరచుగా వారిని ఉద్యోగావకాశాలకు దూరంగా ఉంచుతున్నాయని ఆర్థికవేత్తలు, విధాన నిర్ణేతలు ఎప్పటి నుండో చెబుతూ ఉన్న విషయమే. కాగా 2023 నోబెల్ గ్రహీత క్లాడియా గోల్డిన్, 200 సంవత్సరాల అమెరికా ఉద్యోగ రంగ డేటాను అధ్యయనం చేసి... వేతనం లేని పని భారం, ముఖ్యంగా మాతృత్వం... ఉపాధి అవకాశాలలో లింగ భేదాలకు దారి తీసిందని తెలిపారు. గర్భనిరోధక మాత్రల లభ్యత, సేవా రంగ ఉద్యోగాల ఆవిర్భావం కారణంగా పరిస్థితి కొంత మెరుగవటం కూడా క్లాడియా గమనించారు. అయితే, భారతదేశంలో ఈ పురోగతి ఇప్పటికీ నెమ్మదిగానే ఉంది. ∙∙ కాస్త బ్రేక్ తీస్కో తల్లీ! సినిమా మధ్యలో ‘విశ్రాంతి’ పడుతుంది, ప్రేక్షకుల రెస్ట్ కోసం. యుద్ధం మధ్యలో ‘కాల్పుల విరమణ’ ఉంటుంది, సైనికుల రెస్ట్ కోసం. ఆఫీస్‌లలో చిన్న చిన్న బ్రేక్‌లు ఉంటాయి, ఉద్యోగుల రెస్ట్ కోసం. ‘‘ఎటూ కదలకండి’’ అని డాక్టర్లు సలహా ఇస్తారు. పేషెంట్ల రెస్ట్ కోసం. డాక్టర్లే కాదు, ఒక పనిలో అదే పనిగా ఉండిపోతే, మన శరీరం కూడా మనకు రెస్ట్ సిగ్నల్ కొడుతుంది. ‘‘కాస్త ఆగు తల్లీ’’ అంటుంది. కానీ మనం ఆ సిగ్నల్స్‌ను పట్టించుకోం. పని పూర్తి చేసేస్తే ఒక పనైపోతుంది అనుకుంటాం. మన ఆలోచన ఏమిటంటే, పనిని మధ్యలోనే వదిలేయటం ఎందుకని? ఆలోచన మంచిదే కాని, ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు సలహా ఇస్తున్నారు. పని మధ్యలో రెస్ట్ అవసరం అయినప్పుడు పనిని మధ్యలోనే కదా వదిలేయాలి అని సున్నితంగా హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా... మహిళలకు చెబుతున్నారు. రెస్ట్ తీసుకోవటం అంటే?అలసట నుండి తేరుకోవటానికి రెస్ట్ అవసరం కనుక, అలసట తీరేవరకు పనిని పక్కన పెట్టటమే రెస్ట్ తీసుకోవటం. చేస్తున్న పనిని బట్టి, అప్పటి మీ శారీరక స్థితిని బట్టి కొన్ని నిముషాల రెస్ట్, లేదా కొన్ని గంటల రెస్ట్, లేదంటే కొన్ని రోజుల రెస్ట్ అవసరం అవుతుంది. అయితే రెస్ట్ తీసుకున్నంత మాత్రాన బాడీ, మైండ్ రెండూ రీచార్జ్ అవుతాయని చెప్పలేం. రెస్ట్ ఉంటుంది. ఉత్సాహం ఉండదు. ఉత్సాహం లేని రెస్టు కూడా మళ్లీ పనితో సమానమే. అందుకే, ముల్లును ముల్లుతోనే తీసినట్లుగా పని వల్ల వచ్చిన అలసటను పనితోనే పోగొట్టుకోవటం అవసరం. అందుకోసం ఏ రకం రెస్టు మనల్ని ఏ రకం అలసట నుంచి కోలుకునేలా చేస్తుందో తెలుసుకోవాలి. ముందు, రెస్టులోని రకాలు ఏమిటో తెలుసుకుంటే, వాటిల్లో ఏ రెస్ట్ మన స్థితికి సరిపోతుందో తెలిసిపోతుంది.రెస్టులో 7 రకాలుఫిజికల్ రెస్ట్, ఎమోషనల్ రెస్ట్, స్పిరిచ్యువల్ రెస్ట్, సోషల్ రెస్ట్, సెన్సరీ రెస్ట్, క్రియేటివ్ రెస్ట్, మెంటల్ రెస్ట్ అని ఏడు రకాలైన రెస్ట్లు ఉన్నాయి.ఫిజికల్ రెస్ట్: ఇది శారీరక విశ్రాంతి. చక్కగా నిద్రపోతే సరిగ్గా రెస్ట్ దొరుకుతుంది. ఇందుకు భిన్నంగా యోగా, బాడీనీ స్ట్రెచ్ (సాగతీయటం) వంటివి మంచి ఫలితాన్ని ఇస్తాయి. శరీరం తేలిపోతున్నట్లుగా ఉంటుంది. పని కోసం మళ్లీ మనసు పరుగులు పెడుతుంది. ఫిజికల్ రెస్ట్ వల్ల క్రియాశీలం అయ్యే రక్త ప్రసరణ మహిమ ఇది. ఇవి కాక.. మసాజ్, చిన్న చిన్న విరామాలు, వాకింగ్.ఎమోషనల్ రెస్ట్: ఇది భావోద్వేగ విశ్రాంతి. అంటే మీ కోపాన్ని, అసహనాన్ని, విసుగును, అసంతృప్తిని, ఆందోళనను.. ఆరోగ్యంగా వ్యక్తపరచడం. మీ మనసు లోపలి ఉద్దేశాల గురించి నిజాయితీగా బయటికి చెప్పుకోవటం. అవసరం అయితే సహాయం తీసుకోవటం. ఉద్వేగం మితిమీరకుండా నిగ్రహించుకోవటం. ఇందువల్ల మీకు మానసికమైన విశ్రాంతి లభిస్తుంది. ఇవి కాక.. ఒంటరిగా సమయం గడపడం, మీ గురించి మీరు శ్రద్ధ వహించటం. డైరీ రాయటం, ప్రకృతిలో గడపటం.స్పిరిచ్యువల్ రెస్ట్ : ఇది ఆధ్యాత్మిక విశ్రాంతి. దినచర్యలకు మించి జీవితానికి అర్థం, పరమార్థం కనుగొనే ప్రయత్నం చేయటం. అందుకోసం ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనటం. హృదయంతో ఆలోచించటం. ఇవన్నీ మనసును తేటపరుస్తాయి. భౌతికమైన ఒత్తిళ్ల నుంచి విశ్రాంతిని చేకూరుస్తాయి. ఇవి కాక.. మీకు నచ్చిన ఆధ్యాత్మిక సాధనలో పాల్గొనడం, ఒక సత్కార్యం కోసం స్వచ్ఛందంగా పనిచేయడం.సోషల్ రెస్ట్: ఇది సామాజిక విశ్రాంతి. సానుకూలంగా ఉండేవాళ్లు, మనకు మద్దతుగా ఉండేవాళ్లతో సమయాన్ని గడపటం. అదే సమయంలో అలసట కలిగించే, ఒత్తిడితో కూడిన సంబంధాలకు దూరంగా ఉండటం. మనం సామాజిక జీవులం. అయినప్పటికీ అంతర్ముఖులకు ఈ సోషల్ రెస్ట్ అలసట కలిగించేది కావచ్చు. అలాంటి వారికి సోషల్ రెస్ట్ వల్ల నష్టం తప్ప ప్రయోజనం ఉండదని గమనించాలి. ఇవి కాక.. ఒంటరిగా లేదా సన్నిహితులు, కుటుంబ సభ్యులతో సమయం గడపడం. సోలో పిక్నిక్, టూర్ లేదా ఉన్న చోటే బయటికి వెళ్లి భోజనం చేయడం, మీ ఒంటిపై మీరు ధ్యాస పెట్టటం.సెన్సరీ రెస్ట్: ఇది ఇంద్రియ విశ్రాంతి. దేదీప్యమానంగా వెలిగే లైట్లు, రణగొణధ్వనులు; టీవీ, స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ల వంటి వాటికి దూరంగా, డిమ్ లైట్లు, నిశ్శబ్దాల మధ్య పొందే విశ్రాంతి. ఇవి కాక.. కాసేపు కళ్లు మూసుకోవడం, నిశ్శబ్దంగా ఉండే గదిలో సమయం గడపడం, ఎక్కువసేపు స్నానం చేయడం.క్రియేటివ్ రెస్ట్: సృజనాత్మక విశ్రాంతి. ఇది మీలోని క్రియేటివిటీని తట్టి లేపుతుంది. అలసటకు ఇది దివ్యౌషధం. మెదడుకు మేత వల్ల మీ మనసు పునరుత్తేజితం అవుతుంది. ఇవి కాక.. పని నుండి విరామం తీసుకోవడం, సృజనాత్మకమైన పనులు చేయటం (డ్రాయింగ్, పెయింటింగ్, అల్లికలు మొదలైనవి)మెంటల్ రెస్ట్: ఇది మానసిక విశ్రాంతి. ఇది మీ మెదడుకు బ్రేక్ ఇస్తుంది. నిర్ణయాలు తీసుకోవడం, సమస్య పరిష్కారం వెతకటం వంటి ఒత్తిళ్ల నుంచి తాత్కాలికంగా విరామం ఇస్తుంది. ధ్యానం వంటి అభ్యాసాలు లేదా తీవ్రమైన ఏకాగ్రత అవసరం లేని తేలిక పాటి సాధనల్లో పాల్గొనడం వల్ల మానసిక విశ్రాంతి లభిస్తుంది. ఇవి కాక.. మీ ఫోన్‌ను ఆఫ్ చేయడం, సోషల్ మీడియాకు కొన్నాళ్లు దూరంగా ఉండటం. (చదవండి: జాతీయ పోషకాహార వారోత్సవాలు: అరవైల్లోనూ యవ్వనంగా!) -
‘మొగుడు’ కదా.. మనిషి అనుకుంటే ఎలా?
మొగుడు అయిన వెంటనే మనిషి అనే హోదాను కోల్పోతారా? భర్త అనే కిరీటం దక్కిన వెంటనే మానవత్వం అనే లక్షణం నశించి పోతుందా? భార్య అనే ప్రాణి మన జీవితంలోకి ప్రవేశిస్తే చాలు, కట్టు బానిసలాగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉండవచ్చునా? అనే రకరకాల సందేహాలు రేకెత్తే సందర్భం ఇది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్) వారు సేకరించిన డేటా ప్రకారం విస్తుగొలిపే గణాంకాలు బయటకు వస్తున్నాయి. ‘భార్యను భర్త కొట్టడం’ అనేది నేరంగా ఎంచడానికి అవకాశం లేదు- అని ఈ దేశంలోని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. వీరిలో పురుషులు, స్త్రీలు కూడా తగు మాత్రం ఉండడం ఇంకా బాధాకరమైన వాస్తవం. వయస్సు, లింగ భేదం ప్రకారం చూసినప్పుడు 40 నుంచి 49 ఏళ్ల వయస్సు మధ్యలో ఉన్న వారిలో- భార్యను భర్త కొట్టడం అనేదానిని సాధారణమైన విషయంగా ఎక్కువ మంది ఆమోదిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.ఈ వయో తరగతిలో ఇంచుమించుగా 49 శాతం మంది మహిళలు 47 శాతం మంది పురుషులు భార్యను భౌతికంగా కొట్టి హింసించడాన్ని ఆమోదిస్తున్నారు. అనుమతి అడగకుండా భార్య బయటకు వెళ్లడం, పిల్లలను నిర్లక్ష్యం చేయడం లేదా శృంగారానికి నిరాకరించడం వంటి కారణాల మీద భార్యను కొడితే తప్పు లేదంటున్నారు. ఈ పోకడమీద ప్రజల్లో, ప్రధానంగా మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి స్వచ్ఛందసంస్థలు ఒకవైపు పనిచేస్తున్నాయి. అదే సమయంలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కూడా ‘గౌరవం అనేది ఇంట్లోనే ప్రారంభం కావాలి’ అనే నినాదంతో మహిళలను భర్తే కొట్టడం అనే దుర్మార్గానికి వ్యతిరేకంగా చైతన్యం, అవగాహన తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నది. ఇవన్నీ పక్కన పెడదాం. అసలు భార్యను భర్త కొట్టడం అనే వరకు పరిస్థితులు ఎందుకు వస్తాయి? మనతో కలిసి బతుకుతున్న ఒక ప్రాణిని, మనకంటె తక్కువగా చూడడం, మనకు కోపం వస్తే చేయిచేసుకోవచ్చు అనుకోవడమే చాలా దుర్మార్గమైన సంగతి. కుటుంబ బంధాలు ఆధునిక సమాజంలో ఎంతగా పతనం అయిపోతున్నాయో గమనించినప్పుడు.ఇంకా దుఃఖం కలుగుతుంది. భార్యల్ని అత్యంత దారుణంగా హత్యచేసి ముక్కలను వేర్వేరు చోట్ల పారవేస్తున్న భర్తలు, భర్తల్ని దారుణంగా చంపేసి.. తప్పించుకోగలం అనుకునే భార్యలు ప్రతిరోజూ మనకు వార్తల్లోనే కనిపిస్తూ ఉన్నారు. కానీ ఒక రకంగా గమనించినప్పుడు.. ఇలా ఒకరినొకరు చంపుకునే భార్యాభర్తల వ్యవహారాల కంటె.. వార్తల్లో కనిపించకుండా.. ఇలాంటి నివేదికల్లో మాత్రమే బయటపడే వ్యవహారాలు చాలా ప్రమాదకరమైనవి. ఎవరి మీదనైనా సరే మనకు కోపం రావడం అేది మన చేతగానితనం వల్ల జరుగుతుంది. ఫరెగ్జాంపుల్ వంట చేసుకోవడం చేతకాని వారికి.. సమయానికి భార్య వండిపెట్టలేదని కోపం వస్తుంది. ఆ కోపం భార్యమీద చేయి చేసుకోవడం వరకు ఎలా వెళ్లగలుగుతుందంటే.. ఆమె తిరిగి తనను కొట్టదనే భరోసా వల్ల! ఈ భరోసా ఎలా వస్తుంది? భార్యల్ని మనం పరాధీనలుగా ఉంచడం వల్ల, ఆర్థిక స్వావలంబన, ఆర్థిక స్వాతంత్ర్యం లేని స్థితిలో ఉంచడం వల్ల, ‘నీకు నేనున్నాను’ అనే ఆమెను స్వంతంగా పనులు చేసుకోనివ్వని దుర్బల స్థితిలో పంజరంలో ఉంచేయడం వల్ల! భార్య కూడా ఉద్యోగం చేస్తున్న కుటుంబాల్లో గమనించండి చికాకులు తగాదాలు సాధారణంగా కనిపించొచ్చు గానీ.. కొట్టడం వరకు వ్యవహారం వెళ్లడం అరుదే. ఎందుకంటే ఆమెకున్న ఆర్థిక స్వేచ్ఛ తీవ్ర నిర్ణయాలకు దారితీస్తుందనే భయం ఆ భర్తను నిలువరిస్తుంది. మారుతున్న సమాజంలో కొట్టడం కొంత తగ్గవచ్చు. దాని గురించి చర్చ కూడా తగ్గించుకోవచ్చు. ఎందుకంటే.. 41-49 ఏళ్ల వయసు మధ్య గ్రూపులోనే ఈ కొట్టడం పట్ల ఆమోదం ఎక్కువగా ఉన్నది. కానీ.. ఇక్కడ ప్రమాదకరమైన మరో అంశాన్ని ఈ నివేదికలో గమనించాలి. ఈ వయోతరగతి కాకుండా, అంతకంటె చిన్న వయసు ఉన్న వారిలో ఈ స్థాయిలో ఆమోదం లేకపోవడం గురించి కొంత సంతోషించాలి. కానీ, ఈ వయసు వారిలో ఏకంగా 49 శాతం మంది మహిళలు (పురుషుల శాతం కంటె ఎక్కువగా) భార్యను కొట్టడాన్ని ఆమోదిస్తుండడాన్ని గర్హించాలి. బాధాకరం ఏంటంటే.. ఈ వయసులోని మహిళలు, రేపటి తరం ఇల్లాళ్లను తయారుచేసే వయో తరగతిలో ఉన్నారు. కాబట్టి వీరి ఆలోచనలు మారాలి. మార్చడానికి బయటినుంచి వచ్చిన వారు కాదు.. ఆ పోకడను గుర్తించిన బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరుగు వారు కూడా ప్రయత్నించాలి. భార్యాభర్తలు ఒకరికోసం ఒకరు జీవించే జోడీ అనే స్పృహ ఇద్దరికీ ఉండాలి. అంతే తప్ప.. ఒకరి వలన ఒకరు, ఒకరి ఆధీనంలో మరొకరు, ఒకరి దయతో మరొకరు జీవింతే జోడీ కాదు అని కూడా గ్రహిపంచాలి. అప్పుడు మొగుడు అయినా సరే.. మనిషే అనే తత్వం వారిలో నాటుకుంటుంది. మానవత్వపు జాడ మిగిలే ఉంటుంది. కుటుంబ వాతావరణంలో ఆశాజనకమైన మంచి వాతావరణం ఏర్పడుతుంది.-ఎం. రాజేశ్వరి -
మహిళ ప్రాణాల మీదకు తెచ్చిన కరక్కాయ
హైదరాబాద్: దగ్గు వస్తోందని రాత్రి నిద్రపోయేటప్పుడు కరక్కాయ బుగ్గన పెట్టుకోవడం ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. హైదరాబాద్ నగరానికి చెందిన 57 ఏళ్ల విజేత అనే మహిళకు దగ్గు బాగా ఎక్కువగా వస్తుందని రాత్రి నిద్రకు దగ్గుతో ఇబ్బంది అవుతుందని, ఆమె కరక్కాయ బుగ్గన పెట్టుకుని పడుకున్నారు. నిద్రలో తెలియకుండానే దాన్ని మింగేశారు. అది కాస్తా శ్వాసనాళాల్లోకి వెళ్లిపోవడంతో ఆమెకు తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఇందుకు సంబంధించిన వివరాలను ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ ఈ రవీందర్ రెడ్డి, డాక్టర్ భరత్ జానపాటి తెలియచేసారు.విజేత అనే ఈ మహిళకు కొంతకాలంగా వాతావరణంలో మార్పుల కారణంగా దగ్గు వస్తోంది. కూర్చున్నప్పటి కంటే పడుకుని ఉండే స్థితిలో దగ్గు ఎక్కువ అవుతుంది. రాత్రి నిద్రకు ఆటంకం కలుగుతుందని, దగ్గు తగ్గడానికి ఆమె ఒక కరక్కాయ బుగ్గన పెట్టుకున్నారు. నిద్రలో పొరపాటున దాన్ని మింగేశారు. దాంతో ఆమెకు విపరీతమైన దగ్గు, ఆయాసం, ఊపిరి అందకపోవడంతో బాధపడుతూ కామినేని ఆస్పత్రి ఎమర్జెన్సీకు వచ్చారు. అక్కడ సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాII రవీందర్ రెడ్డి చూసి, శ్వాస ఆడటంలో ఎక్కువగా ఇబ్బంది ఉంటడంతో ఆమెను వెంటిలేటర్ మీద ఉంచి, ఐసీయూలో అడ్మిట్ చేశారు. ఆమెకు చెస్ట్ ఎక్స్-రే, హెచ్ఆర్ సీటీ స్కాన్ పరీక్షలు చేయగా ఎడమ శ్వాసనాళాలలో ఎదో అడ్డు పడినట్టు, దాని కారణంగా ఎడమ ఊపిరితిత్తులు పూర్తిగా మూసుకుపోయినట్టు గుర్తించారు. వెంటిలేటర్ పైన ఆమె ఆరోగ్యం కాస్త మెరుగుపడ్డాక కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాII భరత్ జానపాటి బ్రాంకోస్కోపీ ద్వారా శ్వాసనాళాలను పరీక్షించారు. ఎడమ శ్వాసనాళం ఒక పదార్థంతో మూసుకుపోయినట్టు గుర్తించారు. దాంతో ఆమెకు ఫ్లెక్సిబుల్ బ్రాంకోస్కొపీ చికిత్స చేయాలని నిర్ణయించారు. ఇదివరకే ఆమెకు అధిక రక్తపోటు, థైరాయిడ్, గుండె సమస్య ఉన్నాయి. గతంలో ఒకసారి యాంజియోప్లాస్టీ కూడా చేశారు. అందువల్ల ఈ ప్రక్రియ ప్రాధాన్యత సంతరించుకుంది. అనస్తీషియా టీం సహకారంతో ఆపరేషన్ థియేటర్లో ఈ ప్రక్రియ మొదలుపెట్టారు. బ్రాంకోస్కోపీ ద్వారా రాట్ టూత్ (Rat Tooth ) ఫోర్సెప్స్ అనే ప్రత్యేకమైన పరికరం సహాయంతో ఎడమ శ్వాసనాళంలో రెండు ముక్కలుగా బలంగా ఇరుక్కుపోయిన కరక్కాయను పేషెంట్‌కు ఎటువంటి హాని కలగకుండా విజయవంతంగా తీశారు.బ్రాంకోస్కోపీ చేసిన తర్వాత తీసిన ఎక్స్-రేలో ఎడమ ఊపిరితిత్తులు పూర్తిగా తెరుచుకున్నాయి. రోగి పరిస్థితి కూడా చాలా మెరుగుపడింది. ఎడమ ఊపిరితిత్తులు బాగా పనిచేస్తోందని నిర్ధారించుకున్న మరుసటి రోజు ఆమెను డిశ్చార్జ్ చేసారు.ఈ సందర్బంగా డాII భరత్ జానపాటి మాట్లాడుతూ "ఈ రకంగా శ్వాసనాళాలోకి, ఉపిరితిత్తులలోకి బయట పదార్థాలు వెళ్లడం ముఖ్యంగా చిన్నపిల్లల్లో, లేదా న్యూరోలాజికల్ సమస్యలు ఉన్న వారిలో తరచూగా చూస్తూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో ఆరోగ్యంగా ఉన్నవారిలో కూడా పడుకునే సమయాల్లో కరక్కాయలు, లేదా వక్క పలుకులు లాంటివి బుగ్గన పెట్టుకొని పడుకునే అలవాటు ఉన్నవారికి ఇలాంటి ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు బ్రాంకోస్కోపీ ప్రక్రియ ద్వారా వాటిని తొలగించటం సాధ్యం" అని ఆయన తెలియచేసారు. -
‘నరేగ’ పనుల్లో నారీ శక్తి
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్–నరేగ)లో మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో 70 శాతం మంది కూలీలు మహిళలే పనిచేస్తున్నట్లు అధికారుల నివేదికలు చెబుతున్నాయి. దేశ వ్యాప్తంగా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలలో అత్యధికంగా మహిళా కూలీలే పాల్గొంటున్నట్లు.. ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నివేదికలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ వెల్లడించింది. భూమి అభివృద్ధి, చెరువుల తవ్వకం వంటి పనుల్లో పురుషులతో సమానంగా కష్టపడుతున్నారు. కుటుంబ పోషణకు కావలసిన ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఇంటిని చక్కదిద్దడంలో భాగస్వామ్యం వహిస్తున్నారు. పురుషులతో సమానంగా వ్యవసాయం, భూమి అభివృద్ధి, చెరువు కాలువల తవ్వకం, ఫిష్‌పాండ్ తవ్వకాలు వంటి మట్టి పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. – సాక్షి ప్రతినిధి, వరంగల్ దేశ వ్యాప్తంగా ‘ఉపాధి’లెక్క ఇదీ. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గణాంకాల ప్రకారం.. దేశంలో 741 జిల్లాలు.. 2,69,228 గ్రామ పంచాయతీల్లో ఉపాధి పథకం అమలవుతోంది. ఇందుకోసం 27.64 కోట్ల మంది ఉపాధి పనుల్లో పాల్గొనేందుకు జాబ్‌కార్డులు పొందారు. ఇందులో 12,16,19,422 మంది కూలీలు మాత్రమే పనుల్లో చురుగ్గా పాలొంటున్నారు. వీరి కోసం 2025–26 సంవత్సరానికి 9.29 కోట్ల పనులను గుర్తించి 122.91 కోట్ల పని దినాలను కూలీలకు కల్పించారు. ఇందువల్ల ప్రత్యక్షంగా సుమారు 4.12 కోట్ల కుటుంబాలకు ‘ఉపాధి’కలిగినట్లు కేంద్రప్రభుత్వ నివేదిక వెల్లడించింది. ఉపాధి కూలీలు నమోదు చేసుకున్న 27,64,35,398 మందిలో మహిళా కూలీల సంఖ్య 13,85,16,125 (50.10 శాతం కాగా, చురుగ్గా పాల్గొన్న 12,16,19,422 మందిలో 6,50,33,150 (53.47 శాతం) మంది మహిళలు కావడం గమనార్హం. అత్యధికంగా ఆరు రాష్ట్రాలలో... అదే వరుసలో తెలంగాణ 34 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో ఉపాధి కూలీలు మహిళల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ.. తెలంగాణతో పాటు మరో ఆరు రాష్ట్రాల్లో 56 నుంచి 80 శాతానికి పైగా ఉన్నారు. తమిళనాడులో ఉపాధి పనుల్లో చురుగ్గా పాల్గొంటున్న కూలీల సంఖ్య 88.71 లక్షలుగా ఉండగా.. అందులో మహిళా కూలీలు 71.84 లక్షలు (80.98 శాతం)గా ఉన్నారు.కేరళలో 22.85 లక్షలకు మహిళలు 18.12 లక్షలు (79.89 శాతం)గా, రాజస్తాన్‌లో 116.29 లక్షలకు 70.20 (62.89 శాతం), పంజాబ్‌లో 15.99 లక్షలకు 9.26 లక్షలు (57.91 శాతం), తెలంగాణలో 55.90 లక్షల మంది కూలీలకు మహిళలు 31.33 లక్షలు (56.40 శాతం)గా ఉన్నారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో 96.51 లక్షలకు 52.47 లక్షలు (54.37 శాతం)గా, కర్ణాటకలో 75.52 లక్షలకు 38.67 లక్షలు (51.20 శాతం)గా.. ఇలా దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో మహిళా కూలీలదే ఉపాధి పనుల్లో ఆధిక్యంగా ఉంది. కాగా తెలంగాణలో మొత్తం కూలీలు 1.04 కోట్లు ఉండగా.. చురుగ్గా పనుల్లో పాల్గొనే 55,89,867 మంది కూలీలలో 31,32,674 మంది మహిళలు ఉన్నారు. దాదాపు అన్ని జిల్లాల్లో మహిళలే అధికంగా పాల్గొంటుండగా, నల్లగొండ, ఖమ్మం, మహబూబాబాద్, మెదక్ తదితర జిల్లాల్లో అత్యధికంగా ఉన్నారు. ‘ఉపాధి’ని వీడని సవాళ్లు.. ఉపాధి హామీ పథకం కింద రూ.307ల దినసరి వేతనంగా ఇస్తున్నా.. అనేక ప్రాంతాల్లో కూలీలకు వేతనాలు ఆలస్యంగా అందుతున్నాయి. ఇది ఉపాధి కూలీల ఆర్థిక ఇబ్బందులకు దారి తీస్తోంది. వేసవిలో పని ప్రదేశాల్లో తగిన సౌకర్యాలు కల్పించకపోవడం, వేతనాలు తక్కువగా ఉండటం వంటి సమస్యలు ఉన్నాయి. కొన్నిచోట్ల క్షేత్రస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్లు పనులు చేయకుండానే డబ్బులు డ్రా చేయడం, మస్టర్ల మాయాజాలం చేయడం వంటి అవినీతిపై.. కూలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలను స్వయం ఉపాధి వైపు మళ్లించేలా, ఆవులు, మేకల పెంపకం వంటి వ్యక్తిగత ప్రయోజనాలు పొందేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. పని ప్రదేశాలలో సకల సౌకర్యాలను కల్పించాలని, వేడి వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని పనులను ఉదయం, సాయంత్రం వేళల్లోనే కల్పించాలని గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసినా.. వేతనాలు ఆలస్యం అవ్వడం, పనులకు వెళ్లేటప్పుడు సౌకర్యాలు లేకపోవడం, సిబ్బంది అవినీతి వంటి సమస్యలు వారిని వేధిస్తున్నాయని చెబుతున్నారు. ఉపాధితో ఎంతో మేలు అయితంది ఉపాధి హామీ పనులు గ్రామాల్లో నిర్వహించడం వల్ల మాలాంటి నిరుపేద కూలీలకు ఎంతగానో మేలు జరుగుతోంది. వ్యవసాయ పనులు లేని సమయంలో.. ఉపాధి హామీ కూలి పనులకు క్రమం తప్పకుండా వెళ్తాం. ఫీల్డ్ అసిస్టెంట్ ఇచ్చిన కొలతల ప్రకారం పనిచేస్తే పెంచిన కూలి రేటు రూ.307 వస్తుంది. బయట కూలి పనికి వెళ్లినా కూలి రూ.300లే ఇస్తున్నారు. దీంతో ఉపాధి హామీ పనికి వెళ్లడమే మేలనిపిస్తోంది. పని జరుగుతున్న ప్రదేశంలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తే ఇంకా బాగుంటుంది. – కుంట రజిత, మల్లికుదుర్ల గ్రామం, హనుమకొండ జిల్లా దేశవ్యాప్తంగా ‘ఉపాధి’జిల్లాలు: 741గ్రామ పంచాయతీల సంఖ్య: 2,69,228 ‘ఉపాధి ’కోసం నమోదు చేసుకున్న కూలీలు: 27,64,35,398వీరిలో మహిళల సంఖ్య: 13,85,16,125 (50.10 శాతం) ఉపాధి పనుల్లో చురుగ్గా పాల్గొంటున్న కూలీలు: 12,16,19,422 ఉపాధి పనుల్లో పొల్గొనే మహిళా కూలీలు: 6,50,33,150 ఉపాధి పనుల్లో పాల్గొనే మహిళా కూలీల శాతం 53.47శాతం‘ఉపాధి’లో లబ్ధి పొందుతున్న కుటుంబాలు: 4.13 కోట్లు 2025–26 కోసం గుర్తించిన పనులు మొత్తం: 9.29 కోట్లు కల్పించిన పని దినాలు (02.09.2025 వరకు): 122,91,09,626 -
మహిళల్లో కేసులెక్కువ.. పురుషుల్లో మరణాలెక్కువ
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కేన్సర్ వ్యాధి కేసులు, మరణాల్లో భిన్న వైఖరి కనిపిస్తోంది. మహిళల్లో కేన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతుండగా పురు షుల్లో మాత్రం కేన్సర్ మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి. ప్రజల జీవనశైలిలో వచ్చిన మార్పులు, మారిన ఆహార అలవాట్లు కేన్సర్ వ్యాధికి ఎక్కువగా కారణమవుతున్నాయి. 2015–2019 మధ్య 43 కేన్సర్ రిజిస్ట్రీల్లో నమోదైన గణాంకాలను విశ్లేషించిన ఓ జాతీయ బృందం ఈ ఆందోళనకర వివరాలను బయటపెట్టింది. దీనిప్రకారం 2015–2019 మధ్య 7.08 లక్షల కేన్సర్ కేసులు నమోదవగా 2.06 లక్షల మరణాలు సంభవించాయి. ఈ లెక్కన 2024లో దేశవ్యాప్తంగా 15.6 లక్షల కేసులు నమోదై 8.74 లక్షల మరణాలు నమోదై ఉండొచ్చని అంచనా వేసింది.మహిళల్లో ఎక్కువ కేసులు2012–2022 మధ్య జాతీయ కేన్సర్ రిజిస్ట్రీలు పలు ఆసక్తికర అంశాలను తెరపైకి తెచ్చాయి. మహిళల్లో కేన్సర్ కేసులు పురుషుల కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ కేన్సర్ బాధితులు మహిళల్లో ఎక్కువగా ఉన్నారు. కానీ ఆశ్చర్యకరంగా మహిళల్లో ఈ కేన్సర్ల కారణంగా మరణాల రేటు తక్కువగా ఉంది. మొత్తం కేసుల్లో మహిళల వాటా 51.1 శాతం. కానీ మరణాల రేటు మాత్రం 45 శాతమే. దీనికి ప్రధాన కారణం మహిళల్లో ఎక్కువగా వచ్చే బ్రెస్ట్, సర్వైకల్ కేన్సర్లు. ఇవి స్క్రీనింగ్ ద్వారా ముందే గుర్తించే వీలుండటంతోపాటు ముందస్తుచికిత్సలతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. మరోవైపు పురుషుల్లో వచ్చే ఓరల్, లంగ్, లివర్, ఉదర, అన్నవాహిక కేన్సర్లు ఆల స్యంగా నిర్ధారణ కావడంతో మరణాలు అధికంగా నమోదవుతు న్నాయని ఐసీఎంఆర్–ఎన్‌సీడీఐఆర్ డైరెక్టర్ ప్రశాంత్ మాథూర్ తెలిపారు.పొగాకును నియంత్రించకుంటే మరణాలు తగ్గవు..ళీ కేన్సర్‌పై పోరులో పురుషుల ప్రవర్తననే పెద్ద శత్రువుగా చూడాలి. పొగాకు నియంత్రణలో కఠిన చట్టాలు అమలు చేయకపోతే మరణాలు తగ్గవు. గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే ప్రకారం 2009–10లో 34.6% ఉన్న పొగాకు వినియోగం 2016–17 నాటికి 28.6%కి తగ్గింది. అయినా కేసులు పెరగడానికి పొగాకు దుష్ప్రభావాలకు 20 ఏళ్ల తర్వాత బయటపడే గుణం ఉండటమే కారణం. అధిక మద్యపానం కూడా నోటి కేన్సర్ భారాన్ని పెంచుతోంది. మద్యం, పొగాకు రెండూ విడిగా కేన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఇక కలిపి వాడితే మరింత ప్రమాదం పెరుగుతుంది. – డాక్టర్ ప్రశాంత్ మాథూర్మరణాలకు కారణం అలవాట్లే..» పురుషుల్లో ఊపిరితిత్తుల కేన్సర్ కంటే నోటి కేన్సర్ కేసులు ఎక్కువగా నమో దు అవుతున్నాయి. అందుకు ప్రధాన కారణం గుట్కా, జర్దా, బీడీ, సిగరెట్, పొగాకు విని యోగం అలవాట్లేనని అధ్యయనం పేర్కొంది. అలాగే కేన్సర్ లక్షణాలను పురుషులు ఎక్కువగా నిర్లక్ష్యం చేస్తుండటం వల్ల చికిత్స మొదలుపెట్టే సరికే వ్యాధి మూడు లేదా నాలుగో దశకు చేరుకుంటోందని తెలిపింది. దీంతో చికిత్సలు ఫలితం ఇవ్వడంలేదని అధ్య యనం వివరించింది.పర్యావరణం, జీవనశైలి ప్రభావం» అయితే దేశమంతా కేన్సర్ కేసుల తీరు భిన్నంగా ఉంటోంది. ఈశాన్య రాష్ట్రం మిజోరాం (ఐజ్వాల్)లోని పురుషుల్లో ప్రతి లక్ష మంది పురుషుల్లో 269.4 కేన్సర్ కేసులు, అరుణా చల్‌ప్రదేశ్ (పపుంపారే) లోని ప్రతి లక్ష మంది మహిళల్లో 227.5 కేన్సర్ కేసులు నమోదవుతుండగా మహారాష్ట్రలోని బర్షీలో మాత్రం అతితక్కువ కేన్సర్ కేసులు నమోదైనట్లు అధ్యయనం గుర్తించింది. వాయు కాలు ష్యం, ఆహార అలవాట్లు, జన్యు కారణాలు మొదలైన అంశాల వల్ల ప్రాంతాలవారీ వ్యత్యాసం కనిపిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు.ప్రాంతాలవారీగా కేన్సర్ కేసుల తీరు: (ప్రతి లక్ష జనాభాకు)హైదరాబాద్: బ్రెస్ట్ కేన్సర్ అత్యధికం (54)ఐజ్వాల్: సర్వైకల్ కేన్సర్ అత్యధికం (27.1)శ్రీనగర్: పురుషుల్లో లంగ్ కేన్సర్ అత్యధికం (39.5)ఐజ్వాల్ మహిళలు: లంగ్ కేన్సర్ అత్యధికం (33.7)అహ్మదాబాద్: పురుషుల్లో ఓరల్ కేన్సర్ అత్యధికం (33.6)శ్రీనగర్: ప్రోస్టేట్ కేన్సర్ అత్యధికం (12.7)ఈస్ట్ ఖాసీ హిల్స్: మహిళల్లో ఓరల్ కేన్సర్ అత్యధికం (13.6) -
దేశంలోనే తొలి మహిళా మావటి..!
సాధారణంగా గజరాజులను మచ్చిక చేసుకునేది మగవారే. ఆ వృత్తిలో కొనసాగేది కూడా పురుషులే. కానీ అలాంటి వృతిలో ఓ మహిళ కొనసాగడమే గాక, ఎన్నో ఏగులను సంరక్షించి ఎన్నో అవార్డులే కాదు, రాష్ట్రపతిచే సత్కారం కూడా పొందారామె. అంతేగాదు ఆమెను హస్తి కన్య లేదా ఏనుగుల కుమార్తె అని కూడా పిలుస్తారు. ఇంతకీ ఎవరా మహిళ అంటే..ఆమె దేశంలోనే తొలి మహిళా మావటి. ఏనుగులను మచ్చిక చేసుకోవడంలో ఆమెకు సాటిలేరెవ్వరూ. ఆమెనే అస్సాంకు చెందని పర్బతి బారువా. ఐదు దశాబ్దాలకు పైగా తన జీవితాన్ని ఏనుగులను మచ్చిక చేసుకోవడానికి, సంరక్షించడానికి అంకితం చేసింది. చారిత్రాత్మకంగా పురుషులే కొనసాగుతున్న వృత్తిలోకి వచ్చి సత్తా చాటడమే గాక ఏళ్లనాటి మూసధోరణిని చేధించారామె. మహిళ మావాటిగా ఆమె ప్రస్థానం కేవలం అసామాన్య ధైర్యసాహాసాలకు సంబంధించినదే కాదు, ఏనుగుల పట్ల భారతదేశానికి ఉన్న లోతైన సాంస్కృతిక సంబంధాన్ని ఆధ్యాత్మిక గౌరవానికి, జ్ఞానానికి చిహ్నం కూడా.ఆమె ఈ రంగంలోకి ఎలా వచ్చిందంటే..మార్చి 14, 1953న అస్సాంలోని గౌరీపూర్ రాజకుటుంబంలో జన్మించిన పర్బతి. గౌరీపూర్ చివరి పాలకుడు దివంగత ప్రకృతిష్ చంద్ర బారువా కుమార్తె. ఆమె తండ్రి వేటగాడు, ఏనుగులను మచ్చిక చేసుకోవడంలో మంచి నిపుణుడు కూడా. అలా ఆమెకు ఏనుగులను మచ్చిక చేసుకోవడం వంశపారంపర్యంగా అబ్బిన విద్యగా పేర్కొనవచ్చు. ఆమె గౌహతి విశ్వవిద్యాలయం నుంచి పాలిటిక్స్‌లో గ్రాడ్యుయేట్ కూడా. అయినా ఆమె అటు విద్యారంగం, ఇటు ప్రజాసేవను కాకుండా వంశపారంపర్య అభిరుచి వైపుకే మగ్గడం విశేషం.14 ఏళ్లకే ఆ నైపుణ్యం..ఇక పర్బతి 14 ఏళ్ల ప్రాయంలోనే అస్సాంలోని కొచుగావ్ అడవి ఏనుగును మంచిక చేసుకుని దాని బాగోగులు చూసుకునేది. అలా 1975 నుంచి 1978 వరకు సంప్రదాయ అస్సామీ టెక్నిక్ షికార్ని ఉపయోగించి ఏకంగా 14 అడవి ఏనుగులను విజయవంతంగా మచ్చిక చేసుకుందామె. ఇక్కడ ఏనుగులను ట్రాంక్విలైజర్లతో అపస్మారక స్థితికి తీసుకువచ్చి మచ్చిక చేసుకోరు. లాస్సో పద్ధతిలో ఒక విధమైన తాడుతో బంధించి మచ్చిక చేసుకుంటారు.మచ్చిక చేయడం, కేర్‌టేకర్‌గా..అలా ఆమె అస్సాం, పశ్చిమ ెబెంగాల్, కేరళ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ అటవీ శాఖలతో పనిచేసింది. అక్కడ మవాటిగా ఏనుగులకు శిక్షణ ఇవ్వడం ామానవులు-ఏనుగుల సంఘర్షణకు అడ్డుకట్ట వేయడం, గాయపడిన ఏనుగులు లేదా అనారోగ్యంతో ఉన్న ఏనుగులకు ఔషధ మూలికలతో చికిత్స అందించడంలో ఆమెకు మంచి నైపుణ్యం ఉంది. అయితే ఓ ఇంటర్వ్యూలో ఏనుగులు మానవులకంటే మంచివా అని ప్రశ్నించగా..నూటికి నూరు శాతం ఏనుగులే మంచివని నిర్మొహమాటంగా చెప్పేశారామె. అవి కూడా మానవుల మాదిరిగానే ప్రత్యేక మనస్తత్వంతో ఉంటాయట. కొన్ని అత్యంత సహనంగా, మరికొన్ని తెలివిగా, లీడర్లుగా ఉంటాయట. వాటి సహనం హద్దు దాటిపోతేనే విజృంభిస్తాయట. అవి తమ పిల్లలను అమితంగా ప్రేమిస్తాయని, ఎట్టిపరిస్థితుల్లోనూ హాని చేయదని అన్నారామె.అంతర్జాతీయంగా ఆమె సేవలు..ఆమె నైపుణ్యాలు, సేవలు అంతర్జాతీయంగా కూడా ప్రదర్శించాల్సి వచ్చింది. ఆమె 2001లో బ్యాంకాక్ నుంచి తమిళనాడు, జల్దపారా, ఉత్తర బెంగాల్‌లోని వర్క్‌షాప్‌ల వరకు ఏనుగులపై ప్రపంచ సమావేశాలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అలాగే ఆసియాటిక్ ఏనుగుల స్థితిపై పరిశోధనకుగానూ సహాయసహకారాలు అందించింది. ఆమె ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) ఆసియన్ ఎలిఫెంట్ స్పెషలిస్ట్ గ్రూప్‌లో సభ్యురాలిగా కూడా పనిచేశారు.సత్కారాలు, అవార్డులు..ఆమె అవిశ్రాంత కృషికి, పర్బతి బారువాను అనేక అవార్డులతో సత్కరించింది భారత ప్రభుత్వం. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) నుంచి గ్లోబల్ 500 రోల్ ఆఫ్ ఆనర్ (1989).అస్సాం ప్రభుత్వం ప్రదానం చేసే గౌరవ చీఫ్ ఎలిఫెంట్ వార్డెన్ ఆఫ్ అస్సాం (2003).అస్సాం అత్యున్నత పౌర గౌరవం అసోం గౌరవ్ అవార్డు (2023) నేచర్స్ వారియర్ జ్యూరీ అవార్డు (2023)తో సహా వన్యప్రాణులు, పరిరక్షణ సమూహాలకు సంబంధించిన జీవితకాల సాధన గుర్తింపులు.2024లో పర్బతి ఏనుగుల సంక్షేమానికి ఆమె చేసిన కృషికి గాను భారత అత్యున్నత పురస్కారం పద్మశ్రీతో సత్కరించారు.(చదవండి: Weight loss story: మైండ్‌ఫుల్‌నెస్‌గా తినడం, ఒక యోగా భంగిమ అద్భుతం చేశాయ్..!) -
డయాబెటిస్ స్త్రీ పురుషుల మధ్యన తేడా ఇది!
యాభై ఏళ్లలోపు పురుషుల్లో టైప్–2 డయాబెటిస్ అనేది టైప్–1 కంటే తీవ్రమైన దుష్ప్రభావాలు చూపుతుంది. అదే మహిళల విషయానికి వస్తే వాళ్లలో టైప్–1 డయాబెటిస్ అనేదే ఎక్కువ దుష్ప్రభావాలు చూపుతుందని తేలింది. దాదాపు నాలుగు లక్షలమందికి పైగా పేషెంట్లపై స్వీడన్‌కు చెందిన పరిశోధకులు నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వివరాల్లోకి వెళ్తే... కాస్తంత చిన్నవయసు పురుషుల్లో అంటే 50 ఏళ్లలోపు పురుషుల్లో టైప్–1 డయాబెటిస్ కంటే టైప్–2 డయాబెటిస్ తీవ్రమైన దుష్ప్రభావాలను కలగజేస్తుంది. ఉదాహరణకు టైప్–2 డయాబెటిస్తో బాధపడుతున్న పురుషుల్లో 51 శాతానికి పైగా వ్యక్తుల్లో గుండెజబ్బుల (కార్డియోవాస్క్యులార్ డిసీజెస్) ముప్పు ఉంటుంది. దాంతోపాటుగా హార్ట్ ఫెయిల్యూర్ లేదా గుండె΄ోటు రిస్క్ కూడా వాళ్లలో రెట్టింపు ఉంటుంది. దీనికి కారణాలు ఆ వయసులో పురుషుల్లో ఊబకాయం, హైబీపీ జబ్బులతోపాటు వారి జీవనశైలి కాస్త అస్తవ్యవస్తంగా ఉండటంతో అది టైప్–2 డయాబెటిస్ తాలూకు దుష్ప్రభావాలను మరింతగా ప్రేరేపిస్తుంది. అయితే పురుషుల వయసు పెరుగుతున్నకొద్దీ ఈ ముప్పు క్రమంగా కాస్త తగ్గుతూ పోతుంది. అంటే వాళ్ల వయసు 60కి చేరేనాటికి వాళ్లలో టైప్–1 డయాబెటిస్తో వచ్చే ముప్పు కంటే టైప్–2 డయాబెటిస్తో వచ్చే ముప్పులు కాస్త తగ్గుతాయని చెప్పవచ్చు. ఇక వాళ్ల వయసు 70కి చేరేనాటికి టైప్–1 డయాబెటిస్తో ఉన్నవారిలో వచ్చే గుండెపోట్ల కంటే టైప్–2 డయాబెటిస్తో ఉన్నవారిలో గుండెపోటు వచ్చే ముప్పు 26 శాతం తక్కువ. ఇక మహిళల విషయానికి వస్తే వాళ్లలో టైప్–1 డయాబెటిస్తో ముప్పు ఎక్కువ. అందునా అది ఏ వయసువారిలోనైనా ఎక్కువే. ఇలా టైప్–1 డయాబెటిస్తో బాధపడే యువతులూ, మహిళల్లో గుండెజబ్బులూ, గుండె΄ోట్లు వచ్చే ముప్పు టైప్–2 డయాబెటిస్తో బాధపడే మహిళల కంటే ఎక్కువే. అదే మహిళల వయసు 50 దాటాక... టైప్–1 డయాబెటిస్ బాధపడేవాళ్లతో పోలిస్తే టైప్ – 2 డయాబెటిస్తో బాధపడేవారిలో గుండెజబ్బులూ, గుండె΄ోట్లు వచ్చే ముప్పు 25 నుంచి 47 శాతం తక్కువ. ఇక అన్ని రకాల గుండెజబ్బుల ముప్పులనూ పరిగణనలోకి తీసుకుంటే టైప్ –2 డయాబెటిస్తో బాధపడే మహిళల్లో గుండెజబ్బులతో మృతిచెందడానికి ఉన్న అవకాశాలు టైప్ – 1 మహిళల కంటే 19 శాతం తక్కువ. దీన్ని బట్టి తేలిసేదేమిటంటే... టైప్ –1 అలాగే టైప్ –2 డయాబెటిస్ల ముప్పులు ఇటు మహిళలూ, అటు పురుషుల్లో వేర్వేరు దుష్ప్రభావాలను చూపుతుంటాయని ఈ స్వీడిష్ అధ్యయనంలో వెల్లడైంది. (చదవండి: ఈ జబ్బులకు లింగ వివక్ష?) -
ఈ జబ్బులకు లింగ వివక్ష?
అదేమిటో గానీ... కొన్ని జబ్బులు కక్ష పట్టినట్టుగా మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి. వాళ్లపైనే తమ దుష్ప్రభావాలు ఎక్కువగా చూపిస్తాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్‌కు చెందిన రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, జువెనైల్ ఇడియోపథిక్ ఆర్థరైటిస్, సిస్టమిక్ లూపస్ అరిథమెటోసిస్ (ఎస్‌ఎల్‌ఈ), మయోసైటిస్ వంటివి. అవి వాళ్లలోనే ఎందుకలా వస్తాయన్న విషయాన్ని అనన్య అనే ఓ అమ్మాయి వృత్తాంతంతో డాక్టర్లు వివరిస్తున్నారు. అనన్య కథేమిటో చూద్దామా!ఓ అనన్య కథ అనన్య 24 ఏళ్ల ఓ అమ్మాయి. పెదవుల మీద చెరగని చిర్నవ్వు... ఎల్లప్పుడూ చకచకా కదులుతూ ఉండే చురుకుదనం... కళ్లనిండా భవిష్యత్తు మీద ఆశ! మొన్ననే కాలేజీ చదువులు పూర్తి చేసిన ఆ అమ్మాయి ఇటీవలే ఓ ఐటీ కంపెనీలో చేరింది. అలా చదువై΄ోయిందో లేదో ఇలా ఉద్యోగం వచ్చిందన్న సంతోషం ఈమధ్య అంతగా ఉండటం లేదు. కారణం... ఆమె ఉదయాలు కష్టంగా మారాయి. వేళ్ల కణుపుల వద్ద వాపు బ్రష్ చేయనివ్వడం లేదు. ఆఫీసులో కీబోర్డు మీద టైప్ కూడా చేయనివ్వడం లేదు. మెట్లెక్కే సమయంలో మోకాళ్లలో నొప్పి. ఆమె మొదట్లో ఈ బాధను కాస్త తేలిగ్గా తీసుకుంది. సిస్టమ్ ముందు ఎక్కువ సేపు కూర్చోవడం వల్లనో లేదా పని ఒత్తిడి కారణంగాలో ఇలా జరుగుతోందని అనుకుంది. పోనుపోనూ ఈ నొప్పి... తొలుత అసౌకర్యంగా... తర్వాత ఇబ్బందికరంగా... ఇప్పుడు బాధాకరంగా మారింది. తన రోజువారీ పనుల మీద తీవ్ర ప్రభావం చూపడం మొదలైంది. మొదట్లో కుటుంబ సభ్యులు ఆమెను తమ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. తనను పరీక్షించిన డాక్టర్ ఆమెను రుమటాలజిస్ట్ దగ్గరికి పంపారు. జాయింట్ల పరిశీలనా, రక్తపరీక్షలూ అయ్యాక ఆమెకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని నిర్ధారణ అయ్యింది. ఆర్థరైటిస్‌లో అదోరకం. అనన్య జీవితంలో అదో అతిపెద్ద షాక్!! ‘‘ఆర్థరైటిసా? ఈ వయసులోనా? సాధారణంగా అది వృద్దాప్యంలో వచ్చే వ్యాధి కదా’’ అనుకుంది. ఆమె మనసులో ఎన్నో ప్రశ్నలు. ‘‘నేనిక పని చేయగలనా? పెళ్లి మాటేమిటి? నేనెప్పటికీ ఈ నొప్పులతోనే బతకాలా? ఈ మందులు సురక్షితమేనా? వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా? ఆ దుష్ప్రభావాలతో ఇక సహజీవనం తప్పదా??? ఆమె మనసులో మెదిలే అనేక ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం. డాక్టర్ చెప్పినట్టుగా పురుషులతో ΄ోలిస్తే ఈ తరహా ఆర్థరైటిస్‌ల వ్యాప్తి, దుష్ప్రభావాలు మహిళల్లోనే ఎందుకు ఎక్కువ, వాటిని అ«ధిగమించడమెలాగో, ఆ వివరాలేమిటో తెలుసుకుందాం. ∙∙ అసలు ఆటోఇమ్యూన్ రుమాటిక్ వ్యాధులు అంటే ఏమిటి? మన శరీర రక్షణ వ్యవస్థ (ఇమ్యూన్ సిస్టమ్) ఎల్లప్పుడూ మనల్ని వైరస్‌లూ, బ్యాక్టీరియా బారి నుంచి కాపాడుతూ ఉంటుంది. బయటి వ్యాధి కారకాలు ఏవైనా మనలోకి ప్రవేశించిన వెంటనే మన వ్యాధి నిరోధక వ్యవస్థ అప్రమత్తమై, వాటితో పోరాడటానికి తన రక్షణ కణాలను పంపుతుంది. అయితే ఈ క్రమంలో మన వ్యాధి నిరోధక కణాలు... ఒక్కోసారి తమ ఒంట్లోని సొంత కణాలనే శత్రు కణాలుగా పొరబడతాయి. వాటితో తలబడతాయి. అలా మన సొంత వ్యాధి నిరోధక వ్యవస్థ తన సొంత కణాలపైనే దాడి చేయడం వల్ల వచ్చే వ్యాధులనే ‘ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్’గా చెబుతారు. ఇలా దాడి చేసే క్రమంలో అవి మన కీళ్లు (జాయింట్లు), కండరాలు (మజిల్స్), చర్మం, కొన్ని సందర్భాల్లో ఒంట్లోని కీలక అవయవాలపై తీవ్రంగా దాడి చేసి, బాధిస్తాయి. ఈ తరహా వ్యాధులు యువతులు / మహిళల్లో తమ 20 నుంచి 40 ఏళ్ల వయసులో ఎక్కువగా వస్తుంటాయి. దాంతో వాళ్ల చదువులూ, కెరియర్, కుటుంబ జీవితంపై ప్రభావం చూపడటంతో భావోద్వేగాల పరంగా కూడా వీళ్లు ఎక్కువగా ప్రభావితమవుతుంటారు.కొన్ని ప్రధానమైన జబ్బులివి... రుమటాయిడ్ ఆర్థరైటిస్ (ఆర్ఏ) : ఇది రెండు చేతులూ, మోకాళ్లలోని కీళ్లను (జాయింట్స్)ను ప్రభావితం చేస్తుంది. యాంకలైజింగ్ స్పాండిలైటిస్ : మెడ, వెన్నెముకలను ప్రభావితం చేస్తుంది. సోరియాటిక్ ఆర్థరైటిస్ : సోరియాసిస్‌లో లాగా జుట్టు నుంచి వెండిరంగులో ఉండే చర్మం సొలుసులు రాలడంతోపాటు కీళ్లవాపు, తీవ్రమైన కీళ్ల నొప్పులు కనిపిస్తాయి. జువెనైల్ ఇడియోపథిక్ ఆర్థరైటిస్ : చిన్నపిల్లలూ, టీనేజీలో ఉండే కౌమార వయసులో ఉండే పిల్లల్లో కనిపించే ఎముకల, కీళ్ల వ్యాధి ఇది.ఎక్కువగా మహిళల్లోనే... ఎందుకిలా? అనేక గణాంకాల నుంచి లభ్యమైన వివరాల ప్రకారం ఆటోఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారిలో దాదాపు 75 శాతం మంది మహిళలే. ఇవి వాళ్లలోనే ఎక్కువగా కనిపించడానికి కారణాలు... హార్మోన్ల ప్రభావం: ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ ప్రధానంగా మహిళల్లోనే ఎక్కువగా స్రవిస్తుంది. ఈ హార్మోన్ ఇమ్యూన్ వ్యవస్థపై చూపే ప్రభావం ఇందుకు ఒక కారణం. జన్యుపరమైన అంశాలు: మహిళల్లో ఉండే కొన్ని రకాల జన్యువులు (జీన్స్) ఈ తరహా వ్యాధులను ప్రేరేపించడం. ఇమ్యూన్ వ్యవస్థలో తేడాలు: స్వాభావికంగా పురుషులతో పోలిస్తే మహిళల వ్యాధి నిరోధక (ఇమ్యూన్) వ్యవస్థ చాలా బలంగా, శక్తిమంతంగా ఉంటుంది. అదే కారణం చేత... ఒకవేళ ఆ ఇమ్యూన్ వ్యవస్థ తన సొంత కణాలపై పనిచేసేటప్పుడు కూడా ఆ ప్రతిచర్యలూ (రియాక్షన్స్) అంతే బలంగా ఉండటం.ఈ జబ్బుల తాలూకు మందుల పట్ల ఉండే భయాలివి... ఈ జబ్బుల్లో సాధారణంగా కొన్నింటికి మందుల వల్ల కొన్ని రకాల భయాలూ, ఆందోళనలూ ఉంటాయి. కారణం కొన్ని సందర్భాల్లో సైడ్ఎఫెక్ట్స్ ఎక్కువగా కనిపిస్తుండటమే. అయితే గుర్తుంచుకోవాల్సిందేమిటంటే... ఈ సైడ్ఎఫెక్ట్స్ తాత్కాలికమే. ఈ మందులన్నీ చాలావరకు సురక్షితమే. ఇటీవల బయాలజిక్స్ అనే కొత్తరకం మందులు అందుబాటులోకి వచ్చాయి. సాధారణ మందులతో అంతగా ప్రభావం కనిపించనివాళ్లలో డాక్టర్లు ఈ కొత్తరకం మందులైన బయాలజిక్స్నూ వాడుతుంటారు. చికిత్స తీసుకోకపోతే... చాలా కేసుల్లో ఈ లక్షణాలు చాలామందిలో ఏదో ఒక సమయంలో కనిపించే చాలా సాధారణ లక్షణాలనే కలిగి ఉండటంతో చాలామంది మొదట్లో నిర్లక్ష్యం చేస్తారు. అయితే ఈ తరహా వ్యాధుల్లో ఎంత నిర్లక్ష్యం చేస్తే అంత ప్రమాదం జరుగుతుంది. కొందరిలో శాశ్వత వైకల్యమూ కలగవచ్చు. అందుకే వీటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ వ్యాధితో సాధారణ ప్రజల్లాగే జీవించడానికి... పొగతాగడం, మద్యం అలవాట్లకు దూరంగా ఉండాలి. పూర్తిగా మానేయడం మంచిది. యోగా, ఈత, నడక వంటి తేలికపాటి వ్యాయామాలను నిత్యం చేస్తుండటం. కీళ్ల జబ్బులు కనిపించగానే డాక్టర్లు సూచించిన సహాయక పరికరాలను వాడుతుండటం. ద్యానం, మంచి హాబీలతో, రిలాక్సేషన్ టెక్నిక్స్‌తో ఒత్తిడిని అదుపులో పెట్టుకోవడం. ఎముకల ఆరోగ్యం కోసం డాక్టర్లు సూచించిన విధంగా క్యాల్షియమ్, విటమిన్–డి సప్లిమెంట్లు తీసుకోవడం. ∙∙ చివరగా... ‘‘నేను మళ్లీ మామూలుగా జీవించడం సాధ్యమవుతుందా?’’ అడిగింది అనన్య. ‘‘పూర్తిగా సాధ్యమే. ఇది కలలకు ముగింపు కాదు. కొద్దిపాటి జాగ్రత్తలతో పూర్తిస్థాయిలో మామూలు జీవితం గడపవచ్చు. కెరియర్, పిల్లలూ, ప్రయాణాలూ... ఇవన్నీ మామూలుగానే జరుగుతాయి. కాకపోతే డాక్టర్లు సూచించిన మందులూ, జాగ్రత్తలూ పాటించాలి. ఇక ముందుగానే గుర్తించడం, అవగాహన కలిగి ఉండటం, నిరంతర పర్యవేక్షణ... ఇవీ మనకు అవసరమైన తారక మంత్రాలు’’ అంటున్న డాక్టర్ల మాటలు ఈ తరహా ఆర్థరైటిస్ వ్యాధులతో బాధపడే మహిళల జీవితాలకు ఒక మంచి భరోసా. ఈ జబ్బుల తాలూకు లక్షణాలు కనిపించిన వెంటనే నిపుణులైన రుమటాలజిస్టులను సంప్రదించాలి. ఎందుకంటే ఈ లక్షణాలు మామూలుగా చాలామందిలో చాలా సాధారణంగా కనిపించేవి కావడంతో సాధారణ డాక్టర్లు వెంటనే వాటిని గుర్తించలేకపోవచ్చు. దాంతో చికిత్స ఆలస్యమయ్యే కొద్దీ దుష్ప్రభావాలూ, కీళ్లు దెబ్బతినడం కూడా పెరగడం జరగవచ్చు. రుమటాలజిస్టలను కలిస్తే వారు కొన్ని పరీక్షలు చేయిస్తారు. అవి... ఈఎస్ఆర్, సీఆర్పీ, రుమటాయిడ్ ఫ్యాక్టర్, ఏఎన్ఏ, యాంటీ సీసీపీ, కీళ్ల (జాయింట్ల) ఎక్స్–రే, అల్ట్రా సౌండ్ పరీక్షల వంటివి. వ్యాధి నిర్ధారణ జరిగిన వెంటనే రుమటాలజిస్టులు డీఎమ్‌ఏఆర్‌డీ (డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్) అని పిలిచే మెథోట్రెక్సేట్, హైడ్రాక్సీక్లోరోక్విన్, సల్ఫాసలాజీన్ వంటి మందులను సూచిస్తారు. వీటిని ఎంత త్వరగా మొదలుపెడితే... జరగబోయే నష్టాలు అంతగా నివారితమవుతాయి. చికిత్సలు మొదలయ్యాక క్రమం తప్పకుండా ఫాలో అప్‌లకు వెళ్తుండాలి. అప్పుడు డాక్టర్లు మందుల ప్రభావాన్ని తరచూ పరీక్షిస్తూ మోతాదులను సవరిస్తుంటారు. డాక్టర్ విజయ ప్రసన్న పరిమిసీనియర్ రుమటాలజిస్ట్ (చదవండి: మేలైన ఆరోగ్యానికి మల్బరీ..!) -
చీపురుపల్లి-రాజాం రోడ్డులో ఆటో డ్రైవర్ల ఆందోళన
-
మీ మోసాలతో అక్క చెల్లెమ్మలకూ వెన్నుపోటు: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : గత ఎన్నికల్లో మహిళలకు ఫ్రీ బస్సు హామీ ఇచ్చి.. ఆ చిన్న హామీని కూడా మీరు చెప్పినట్టుగా అమలు చేయడం లేదంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు సూపర్–6, సూపర్–7 అంటూ మహిళలందరినీ నమ్మించి.. గత ఏడాది జూన్ నుంచే వాటిని అమలు చేస్తామని ఇంటింటా బాండ్లు పంచి.. 14 నెలలపాటు ఆ ఊసే ఎత్తకుండా వెన్నుపోటు పొడిచారంటూ మండిపడ్డారు. సవాలక్ష ఆంక్షలు పెట్టి.. హామీలకు కోతలు పెడుతున్నారు.. ఇది మోసం కాదా? దగా కాదా? అంటూ నిలదీశారు. అందుకే బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ అంటూ వ్యంగోక్తులు విసిరారు. ఈ మేరకు గురువారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే..⇒ చంద్రబాబు గారూ.. మీ మోసాలతో అక్క చెల్లెమ్మలకూ వెన్నుపోటు పొడిచారు. మహిళలకు ఫ్రీ బస్సు పేరిట హామీ ఇచ్చి, ఆ చిన్న హామీని కూడా మీరు చెప్పినట్టుగా అమలు చేయడం లేదు. ఎన్నికలకు ముందు సూపర్–6, సూపర్ –7 అంటూ అద్భుత సన్నివేశాలతో సినిమాలు, సీరియళ్లను మించి వీడియో ప్రకటనలతో మహిళలందర్నీ నమ్మించారు. అధికారంలోకి వస్తే.. జూన్ నుంచే హామీలు అమలు చేస్తామని ఇంటింటా బాండ్లు పంచారు. 14 నెలలపాటు ఆ ఊసే ఎత్తలేదు. తీరా ఇప్పుడు అతిచిన్న హామీ అయిన ఉచిత బస్సు ప్రయాణంకూడా, అన్ని బస్సుల్లో కాదు, కొన్ని బస్సుల్లోనే ఉచితం అంటున్నారు. ఆ కొన్ని బస్సుల్లో కూడా సవాలక్ష ఆంక్షలు పెట్టారు. రాష్ట్రం అంతా కాదు, కొన్ని చోట్లకే అంటున్నారు. ⇒ ఆర్టీసీలో 16 కేటగిరీ బస్సులు ఉంటే అందులో కేవలం 5 రకాల బస్సుల్లోనే, మొత్తంగా 11,256 బస్సులు ఉంటే అందులో కేవలం 6,700 బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణాన్ని పరిమితం చేశారు. ఈ బస్సుల్లో కూడా ఆంక్షలు పెట్టారు. 1,560 ఎక్స్‌ప్రెస్ బస్సులు ఉంటే, అందులో 950 నాన్ స్టాప్ బస్సులకు ఈ పథకం వర్తించదంటూ ఏకంగా బోర్డులు పెడుతున్నారు. ఇది అక్కచెల్లెమ్మలకు చేసిన మోసం కాదా? దగా కాదా?⇒ చంద్రబాబు గారూ.. మీరు ఇంత మోసం చేసి కూడా మీరు చేస్తున్న ప్రచారాలు చాలా విడ్డూరంగా ఉన్నాయి. బస్సు ఎక్కితే చాలు మహిళలంతా లక్షాధికారులు అయిపోయినట్టుగా మీరు అంటున్న మాటలు విని మహిళలంతా నివ్వెరపోతున్నారు. 2014–19 మధ్య డ్వాక్రా రుణాల మాఫీ పేరిట మాయచేసి, చివరకు వడ్డీ సైతం ఎగరగొట్టి, తర్వాత మీరు వెన్నుపోటు పొడిచిన ఆ రోజులను కూడా మహిళలంతా మరోసారి చర్చించుకుంటున్నారు. మా ఐదేళ్ల కాలంలో మేం చేసిన మంచినీ గుర్తు చేసుకుంటున్నారు. ⇒ మా ప్రభుత్వ హయాంలో దేశంలో తొలిసారిగా మేం ప్రవేశ పెట్టిన అమ్మఒడి పథకాన్ని మీరు తొలి ఏడాది ఎగ్గొట్టారు. ఒక్కో ఏడాది ఒక్కో పిల్లాడికి రెండేళ్లకు గాను రూ.30 వేలు ఇవ్వాల్సి ఉండగా రూ.13 వేలే ఇచ్చారు. చాలా మంది పిల్లలకు అది కూడా అందలేదు. మొత్తం 87 లక్షల మంది పిల్లలకు ఇవ్వాల్సి ఉంటే, 30 లక్షల మంది పిల్లలకు కోత పెట్టారు.⇒ చంద్రబాబు గారూ.. కొనసాగుతున్న ఈ పథకాలన్నింటినీ మీరు నిర్దాక్షిణ్యంగా రద్దు చేసి, మహిళలను మళ్లీ పేదరికంలోకి నెట్టి, లక్షలాది కుటుంబాలను దెబ్బ తీశారు. చేయకూడని ద్రోహం చేస్తూ, పైగా ఇచ్చిన అరకొర బస్సుల్లో ప్రయాణిస్తే లక్షాధికారులు అయిపోతారంటూ మోసపుచ్చే మాటలు మాట్లాడుతున్నారు. మీరు చేస్తున్నది మోసం కాదా? దగా కాదా?⇒ మహిళల స్వయం సాధికారత కోసం, వారి కాళ్ల మీద వారు నిలబడేలా మేం హామీ ఇచ్చిన విధంగా ఆసరా కింద రూ.25,571 కోట్లు వారి చేతికే అందించాం. సున్నా వడ్డీ కింద మరో రూ.5 వేల కోట్లు అదనంగా ఇచ్చాం. చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. మహిళల స్వయం ఉపాధి కోసం చేయూత కింద ప్రతి ఏటా ఆ అక్కచెల్లెమ్మలకు రూ.18,750 చొప్పున 33,14,901 మందికి రూ.19,189.59 కోట్లు నేరుగా వారి చేతికే ఇచ్చాం. అమూల్, పీ అండ్ జీ, హిందుస్థాన్ లీవర్, మహీంద్రా, ఐటీసీ లాంటి ప్రఖ్యాత సంస్థలను బ్యాంకులతో అనుసంధానం చేస్తూ, వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేలా ప్రోత్సహిస్తూ, బ్రహ్మాండంగా అమలు చేశాం.ఎప్పుడూలేని విధంగా కాపు నేస్తం కింద 4,62,878 మంది కాపు అక్క చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున రూ.2,029 కోట్లు, మేనిఫెస్టోలో మేం పెట్టకపోయినా, అగ్రకులాల్లోని పేదలైన అక్క చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున ఈబీసీ నేస్తం కింద మరో 4,95,269 మందికి రూ.1,876 కోట్లు ఇచ్చాం. 1.05 కోట్ల మంది మహిళలకు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేసి, డ్వాక్రా రుణాలపై వారు కట్టాల్సిన వడ్డీని మా ప్రభుత్వమే భరిస్తూ రూ.4,969 కోట్లు చెల్లించాం. 31 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు అక్కచెల్లెమ్మలకే ఇస్తూ వారి పేరు మీదే రిజిస్ట్రేషన్ చేశాం. ఇందులో ఏకంగా 22 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. మహిళా సాధికారతలో మా పరిపాలనా కాలం ఒక స్వర్ణయుగం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం. మా చిత్త శుద్ధికి నిదర్శనం.⇒ మీరు ఏడాదికి ఇస్తానన్న 3 ఉచిత సిలిండర్ల పథకం కూడా ఈ మాదిరిగానే అఘోరించింది. గత ఏడాది మూడు సిలిండర్లకుగాను మీరు ఇచ్చింది ఒక్కటే. రాష్ట్రంలో 1.59 కోట్ల కనెక్షన్లు ఉంటే, ఏడాదికి మూడు సిలిండర్లకుగాను రూ.4,100 కోట్లు అవసరం. మొదటి ఏడాది ఇచ్చింది ఒక్క సిలిండర్. అదికూడా అందరికీ ఇవ్వలేదు. ఖర్చు చేసింది కూడా కేవలం రూ.764 కోట్లు. మిగిలిన 2 సిలిండర్లు ఎగ్గొట్టారు. ఇప్పుడు రెండో ఏడాది కూడా అంతే. మూడు సిలిండర్ల కోసం రూ.4,100 కోట్లకుగాను ఇప్పటికి ఇచ్చింది కేవలం రూ.747 కోట్లే. ఇది మోసం కాదా? దగా కాదా? అందుకే బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ! -
మగాళ్లకు ఒక రూల్... మహిళలకు మరో రూల్
-
Noida Dowry Case: నోయిడా వరకట్నం కేసులో బిగ్ ట్విస్ట్..
ముంబై: నోయిడా అదనపు కట్నం కేసులో ట్విస్ట్ చేసుకుంది. అదనపు కట్నం కోసం కట్టుకున్న భర్త విపిన్ భాటి, అత్తమామలు నిక్కీభాటిని సజీవ దహనం చేశారు. ఇప్పుడే అదే నిక్కీభాటి కుటుంబ సభ్యులు వరకట్నం కావాలని తననూ వేదించినట్లు నిక్కీభాటి వదిన మీనాక్షి సంచలన ఆరోపణలు చేశారు. దీంతో నిక్కీభాటి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.నోయిడా వరకట్న హత్య కేసులో బాధితురాలు నిక్కీ భాటి కుటుంబంపై వదిన మీనాక్షి ఆరోపణలు చేశారు. నిక్కీభాటి సోదరుడు రోహిత్ పయ్లాతో మీనాక్షి వివాహం జరిగింది. వరకట్నం కావాలని తన మాజీ భర్త రోహిత్‌తో పాటు అతని తల్లిదండ్రులు తనని వేధించారని అన్నారు. దీంతో తన కుమార్తె ప్రాణం తీసిన విపిన్ భాటి కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాంటూ నిక్కీభాటి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్న తరుణంలో వారిపై ఆరోపణలు రావడంతో కేసును చేధించడం పోలీసులకు మరింత క్లిష్టంగా మారినట్లు తెలుస్తోంది.రోహిత్,మీనాక్షీలకు 2016లో వివాహం జరిగింది. వివాహ సమయంలో కట్నం కింద మీనాక్షి కుటుంబ సభ్యులు కట్నం కింద మారుతి సియాజ్‌ను ఇచ్చారు. ఆ తర్వాత అశుభం పేరుతో దాన్ని అమ్మేశారు. బుదులు స్కార్పియో ఎస్యూవీ కొత్తమోడల్ కట్నం కింద డిమాండ్ చేశారు.అందుకు తాను, తన కుటుంబసభ్యులు ఒప్పుకోకపోవడంతో ఇంటి నుంచి పంపించారు. ఇదే విషయాన్ని పెద్దల సమక్షంలో తేల్చుకోనేందుకు గ్రామ పంచాయితీకి తీసుకెళ్లారు. అక్కడ మినాక్షి కుటుంబానికి రూ.35 లక్షలు (వారి వివాహానికి ఖర్చు చేసిన మొత్తం) తిరిగి ఇవ్వాలని, తద్వారా ఆమె తిరిగి వివాహం చేసుకోవచ్చని లేదా భర్త కుటుంబం ఆమెను తిరిగి తమ కోడలుగా అంగీకరించాలని పంచాయితీ పెద్దలు ఆదేశాలు జారీ చేశారు. ఆమెను తిరిగి కోడలుగా స్వీకరించేందుకు నిక్కీ భాటియా తండ్రి భిఖారి సింగ్ పైలా, ఇతర కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. సమస్య పరిష్కారం నోచుకోలేదని మీనాక్షి వాపోయారు. మీనాక్షి ఆరోపణలపై ఆమె మాజీ భర్త నిక్కీ భాటి సోదరుడు మాట్లాడేందుకు నిరాకరించాడు. నేను ఈ విషయంపై మాట్లాడదలుచుకోలేదు.ఆమె కేవలం ఆరోపణలే చేసిందన్నారు. ఇదే విషయంపై నిక్కీ భాటి మరో కుటుంబసభ్యుడు మాట్లాడుతూ.. ఈ విషయంపై రెండు కుటుంబాల మధ్య కాల్పులకు దారి తీసింది. ప్రతీ ఇంట్లో గొడవలు జరగడం సాధారణం. కానీ మేం ఆ అమ్మాయిని తగలబెట్టలేదు’ అని రోహిత్ కుటుంబ సభ్యులకు మద్దతు పలికారు. -
ఆర్టీసీ బస్సులో ఆటో డ్రైవర్ల భిక్షాటన
పోలవరం రూరల్: మహిళలకు ఉచిత బస్సు పథకం ఆటో కార్మికుల పాలిట శాపంగా మారిందంటూ ఆటో డ్రైవర్లు ఆర్టీసీ బస్సుల్లో భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఏలూరు జిల్లా పోలవరంలో మంగళవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. పోలవరం ఏటిగట్టు సెంటర్లో నిరసన తెలుపుతూ ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని డిప్యూటీ తహసీల్దార్ కె.శ్రీనివాస్‌కు వినతిపత్రం సమర్పించారు.ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలో పోలవరం ప్రాజెక్టు పేరుతో ముంపు గ్రామాలను ఇతర మండలాలకు తరలించారని, ఆ ప్రాంతానికి ఆటోల రాకపోకలు నిలిచిపోయాయని చెప్పారు. మిగిలిన ప్రాంతాల్లో ఉచిత బస్సులు తిరుగుతుండటంతో ఆటోలు ఎక్కేవారు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు.మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు తమ పరిస్థితి ఉందన్నారు. ఈఎంఐలు, ఆటో అద్దెలు, కుటుంబ పోషణ తదితర సమస్యలతో అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం ఆటో డ్రైవర్లు, ఓనర్లకు న్యాయం చేయకపోతే రోడ్డున పడే పరిస్థితి ఉందన్నారు. -
మొరాయించిన ఆర్టీసీ బస్సు.. తోసుకెళ్లిన మహిళా ప్రయాణికులు
పెనుమంట్ర: రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం పేరుతో ఆర్టీసీ బస్సుల్లో స్త్రీలకు కల్పించిన ఉచిత ప్రయాణంలో మహిళలకు చేదు అనుభవం ఎదురైంది. మహిళలు తాము ఎక్కిన బస్సును తామే తోసుకువెళ్లిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం బట్టల మగుటూరు బస్టాండ్ సెంటర్లో మంగళవారం చోటుచేసుకుంది. తాడేపల్లిగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో ఆచంట వెళ్తుండగా బట్టల మగుటూరు బస్టాండ్‌కి వచ్చే సమయానికి ఉన్నట్లుండి రోడ్డుపై ఆగిపోయింది. దాన్ని తిరిగి స్టార్ట్ చేయడానికి డ్రైవర్ ఎంత ప్రయత్నం చేసినా మొరాయించింది.దీంతో మహిళలే బస్సును తోసి ముందుకు నడిపించారు. భీమవరం, తాడేపల్లిగూడెం బస్ డిపోలలో కాలం చెల్లిన బస్సులను పెనుమంట్ర రూట్లో తాడేపల్లిగూడెం– ఆచంట– నరసాపురం, రాజమండ్రి– భీమవరం వెళ్తున్న ఉచిత సర్విసులుగా నడపడంతో ఆ బస్సులు మార్గం మధ్యలో నిలిచిపోతున్నాయి. సోమవారం భీమవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బ్రాహ్మణ చెరువు వద్ద యాక్సిల్ రాడ్ విరిగి పోయింది.ఆ సమయంలో బస్సు నెమ్మదిగా వెళుతుండటంతో ప్రయాణికులకు పెద్ద ప్రమాదం తప్పింది. ఈ రూట్లో బస్సులు కిక్కిరిసిపోయి మహిళలు హ్యాండిల్ రాడ్లు పట్టుకుని వేలాడుతూ ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఇప్పటికైనా తాడేపల్లిగూడెం–ఆచంట, భీమవరం–రాజమండ్రి రూట్లలో కండిషన్లో ఉన్న బస్సులు నడపాలని మహిళ ప్రయాణికులు కోరుతున్నారు. -
గ్రేటర్ నోయిడాలో కట్నం కోసం మహిళ సజీవ దహనం
-
ఆధార్‌లో 'తెలంగాణ' ఉంటేనే... ఉచిత ప్రయాణమట!
సాక్షి, హైదరాబాద్: ఆధార్ సవరణ కేంద్రాలకు ఉన్నట్టుండి మహిళలు క్యూ కడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న ఆధార్ కార్డుల్లో ఇంటి చిరునామాలో ఆంధ్రప్రదేశ్ స్థానంలో తెలంగాణ అని మార్చుకుంటున్నారు. కొందరు ఫొటోలను అప్డేట్ చేసుకుంటున్నారు. మీసేవ కేంద్రాలు, పోస్టాఫీస్ ఆధార్ సెంటర్లు, ఆధార్ సవరణ కేంద్రాలు.. ఇలా ఎక్కడ వీలుంటే అక్కడ ఆధార్ కార్డులను సవరించుకునేందుకు మహిళలు పోటెత్తుతున్నారు. ఆధార్ కార్డులోని ఇంటి చిరునామాపై తెలంగాణ బదులు ఏపీ అని ఉంటే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు ఉండదని, కచ్చితంగా టికెట్ కొనాల్సిందేనంటూ కొందరు కండక్టర్లు అత్యుత్సాహంతో చేసిన ప్రచారం ఫలితమిది. – మహేశ్వరం సమీపంలోని ఓ కాలనీకి చెందిన మహిళ తుక్కుగూడ నుంచి చాంద్రాయణగుట్ట వెళ్లేందుకు మహేశ్వరం డిపో బస్సు ఎక్కారు. ఆధార్ కార్డులో తెలంగాణ బదులు ఏపీ అని ఉండటంతో జీరో టికెట్ ఇచ్చేందుకు కండక్టర్ నిరాకరించారు. చేసేది లేక రూ.25 టికెట్ కొని ప్రయాణించాల్సి వచ్చింది. ‘దీనిపై మహేశ్వరం డిపో అధికారులకు ఫిర్యాదు చేస్తే, చిరునామాలో తెలంగాణ బదులు ఏపీ అని ఉంటే ఉచిత ప్రయాణానికి అనుమతించబోమని తేల్చి చెప్పారు’అని ఆమె కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. – నాలుగు రోజుల క్రితం బూర్గంపహాడ్ ఇంటి చిరునామా ఉన్న ఆధార్‌కార్డుతో ఓ మహిళ నగరంలోని మెహిదీపట్నంలో బస్కెక్కగా, కండక్టర్ ఉచిత ప్రయాణానికి అనుమతించలేదు. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న ఆధార్‌కార్డు కావటంతో దానిపై తెలంగాణ బదులు ఆంధ్రప్రదేశ్ అని ఉండటమే కారణం. దీంతో ఆ మహిళ ఆ బస్సు దిగి మరో బస్సు ఎక్కాల్సి వచ్చింది. ఇలా నిత్యం కొన్ని ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు జీరో టికెట్లను నిరాకరిస్తుండటంతో ఇప్పుడు అలజడి రేగింది. కొన్ని బస్సుల్లో కండక్టర్లు నోటీసులు అతికించి మరి ఆధార్ కార్డులను అప్డేట్ చేయించుకోవాలని, లేని పక్షంలో మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతి ఉండదని రాసి ఉన్న సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. అలాంటి ఆదేశాలు లేకున్నా... ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న ఆధార్ కార్డులను చాలామంది ఇప్పటికీ అలాగే వాడుతున్నారు. ఇళ్లు మారినవారు, ఫోన్‌నంబర్లు మారినవారు ఆధార్ కార్డుల్లో ఆ మేరకు మార్పుల వివరాలను సవరించుకుంటుండగా, ఎలాంటి మార్పులు జరగనివారు పాత ఆధార్‌కార్డులనే వాడుతున్నారు. ఏపీ పేరున్న ఆధార్ కార్డులు అన్నిచోట్లా చెల్లుబాటు అవుతుండగా, ఒక్క ఆర్టీసీ బస్సుల్లోనే అభ్యంతరాలు వ్యక్తం అవుతుండటం విశేషం. దీనిపై ఆర్టీసీ ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే, తాము డిపో మేనేజర్లకు అలాంటి ఆదేశాలు ఏమీ ఇవ్వలేదని, ఉమ్మడి రాష్ట్రంలో పొందిన ఆధార్ కార్డుల్లో తెలంగాణ బదులు ఆంధ్రప్రదేశ్ అని ఉన్నా, వాటిని అనుమతించాల్సి ఉంటుందని పేర్కొనటం విశేషం. ఉచిత ప్రయాణ పథకం అమలులోకి వచ్చిన కొత్తలో మాత్రం రెండుమూడు పర్యాయాలు, ఆధార్ కార్డులను అప్డేట్ చేసుకోవాలన్న ప్రకటన వెలువడిందని, ఇప్పుడు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. కానీ, ఒకరిని చూసి మరొకరుగా ఆధార్ కార్డుల్లో ఆంధ్రప్రదేశ్ అని ఉంటే అనుమతించడం లేదు. కొందరు టికెట్ చెకింగ్ సిబ్బంది కూడా తెలంగాణ అని లేకపోతే తప్పుపడుతున్న సందర్భాలూ ఉన్నాయి. చిన్ననాటి ఫొటో ఉంటే మార్చుకోవాల్సిందే.. ఆధార్ కార్డులు అమలులోకి వచ్చిన 15 ఏళ్ల క్రితం, అప్పటి చిన్నారుల కార్డులు ఇప్పటికీ కొందరు వాడుతున్నారు. వాటిపై చిన్ననాటి ఫొటోలే ఉన్నాయి. ఇప్పుడు వారి వయసు పెరిగిన నేపథ్యంలో, ఆ కార్డు వారిదా కాదా అని ధ్రువీకరించుకోవటం కండక్టర్లకు పెద్ద సమస్యగా మారింది. ఇలాంటి కార్డుల్లో ఫొటోలను అప్డేట్ చేయించుకోవాల్సి ఉంది. కానీ, ఆంధ్రప్రదేశ్ అని ఉంటే అనుమతించకపోవటం ఇప్పుడు పెద్ద వివాదంగా మారుతోంది. -
ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నారా? మహిళలూ ఈ చిక్కులు రావొచ్చు!
బరువు తగ్గేందుకు చాలామంది చేస్తున్న రకరకాల ప్రయత్నాలలో ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన మాట ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ (Intermittent fasting (IF). అయితే స్త్రీలకు మాత్రం ఈ పద్ధతి అంత మంచిది కాదంటున్నారు వైద్యనిపుణులు. ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది తినే సమయానికి, ఉపవాసానికీ మధ్య నిర్దేశించు కున్న వ్యవధులను పాటించే పద్ధతి. ఉదాహరణకు ఆహారం తీసుకోవడం ఉదయం పది నుంచి సాయంత్రం ఆరుగంటల లోగా ముగించేయాలి. ఆ తర్వాత ఏమీ తినకూడదు. దీనివల్ల బరువు తగ్గడం, మెరుగైన జీవక్రియలు, మంచి జీవన నాణ్యత వంటి ప్రయోజనాలున్నాయి. ఈ ఐఎఫ్ అనేది మీరు ఎప్పుడు తింటారు అనే దానిపై దృష్టి పెట్టాలని చెబుతుంది. ఇదీ చదవండి: KBC-17లో రూ. 25 లక్షల ప్రశ్నఈ క్రికెటర్ గురించే.. ఇంట్రస్టింగ్!స్త్రీలకు జాగ్రత్త ఎందుకు ?అధిక ఉపవాసం మహిళల హార్మోన్లలో అసమతుల్యతకు దారితీస్తుంది - ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ – ఋతు చక్రాలు, అండోత్సర్గం, థైరాయిడ్ స్థాయులు, పీసీఓస్, సంతానోత్పత్తిని కూడా ప్రభావితం చేస్తుంది. ఇది పునరుత్పత్తి పనితీరును నియంత్రిస్తుంది. అంతేకాదు.. ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్‌ను ప్రేరేపించడం వల్ల ఆందోళన, చిరాకు నిద్రపోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం ఈ తరహా ఉపవాసానికి దూరంగా ఉండటం ఉత్తమం. నెమ్మదిగా ప్రారంభించండి, నెమ్మదిగా వెళ్లండి16 గంటలు ఉపవాసం ఉండి మిగిలిన 8 గంటల వ్యవధిలోపు తినడం మంచిది. అంటే 12/12 మోడ్‌లో, ఉపవాసం రాత్రి 8 నుండి ఉదయం 8 గంటల వరకు, తినే సమయం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఉండాలంటున్నారు. రాత్రి ఆలస్యంగా భోజనం చేసే అలవాటున్న వారికిది ప్రయోజనకరం. చదవండి: పెట్రోల్ పంపు, 210 ఎకరాలు, 3 కిలోల వెండి.. రూ.15 కోట్ల కట్నం : వైరల్ వీడియోసమృద్ధిగా తినండి... హైడ్రేటెడ్ గా ఉండండిఈ పద్ధతి పాటించేవారు కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు – ఫైబర్ వంటి అన్ని సూక్ష్మ పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు, బయోఫ్లేవనాయిడ్స్ వంటి ఇతర పోషకాలను తగినంత పరిమాణంలో అందేలా చూసుకోవాలి. ఇందుకోసం కూరగాయలు, పండ్లు, గింజలు, విత్తనాలు, తృణధాన్యాలు, లీన్ మాంసాలు, చేపలు, గుడ్లు, చిక్కుళ్ళు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాలకు ప్రాధాన్యత ఇస్తూనే, పెరుగు, పెరుగు వంటి ప్రోబయోటిక్స్, ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలు, పండ్లు వంటి ప్రీ బయోటిక్ వనరులను చేర్చడం కూడా ముఖ్యం. ఉపవాస సమయాల్లో హైడ్రేటెడ్ గా ఉండటం కూడా ముఖ్యం. ఇంటి పని, వంట పని, ఆఫీసు పని తదితర పనుల ఒత్తిడిలో ఉండే స్త్రీలకు ఇన్ని జాగ్రత్తలను పాటించడం కష్టం కాబట్టి దీనికి దూరంగా ఉండటమే ఉత్తమం అంటున్నారు డైటీషియన్లు. చదవండి: అందమైన హారాన్ని షేర్ చేసిన సుధామూర్తి , విశేషం ఏంటంటే! -
రాసలీలతో రెచ్చిపోతున్న చినబాబు గ్యాంగ్
-
ఆడబిడ్డల జోలికొస్తే తాట తీస్తానన్న బాబూ.. మరి నీ నేతల సంగతేంటి..?
-
ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం.. ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది
సాక్షి,తూర్పుగోదావరి జిల్లా: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. ఓ ప్రయాణికురాలి కాలును ఆర్టీసీ బస్సు నుజ్జునుజ్జు చేసింది. తూర్పుగోదావరి జిల్లా జగ్జంపేటలో రేవాడ రాజేశ్వరి అనే మహిళ తన సోదరి కుమార్తె ఆశ్వనీను బస్సు ఎక్కించేందుకు జగ్గం పేటకు వచ్చారు. జగ్గంపేట బస్టాండ్‌లో అశ్వినినీ బస్సు ఎక్కించి ఆమెకు బ్యాగ్ ఇస్తుండగా.. ఉచిత బస్సు ప్రయాణంతో రద్దీ విపరీతంగా పెరిగడంతో డ్రైవర్ బస్సును ముందుకు కదిలించాడు. దీంతో రాజేశ్వరి కాలుజారి కిందపడింది. బస్సు టైరు ఎక్కడంతో ఆమె కాలు నుజ్జునుజ్జయ్యింది. ప్రమాదంతో తోటి ప్రయాణికులు అంబులెన్స్‌కు సమాచారం అందించారు. కానీ సకాలంలో అంబులెన్స్ రాకపోవడంతో బాధితురాల్ని ఓ స్ట్రెచ్చర్ మీద రోడ్డు మీదకు తోసుకుంటూ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
AP: ఆ మాత్రం దానికి ఫ్రీ బస్..
-
దక్షిణ ‘మహిళా’ రైల్వే
సాక్షి, హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వే ఓ అరుదైన ఘనతను సాధించింది. జోన్ పరిధిలో 11 ప్రధాన విభాగాలుండగా, వాటిల్లో ఐదు విభాగాలకు మహిళలే అధిపతులయ్యారు. ఇటీవలి వరకు మూడు విభాగాలకు వారు నేతృత్వం వహిస్తూ రాగా, తాజాగా జరిగిన బదిలీల్లో మరో రెండు విభాగాలను కూడా వారికే అప్పగించారు. కీలక ఐదు విభాగాలను మహిళలే పర్యవేక్షిస్తుండటం పట్ల దక్షిణ మధ్య రైల్వే జనరల్మేనేజర్ సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ ఆనందం వ్యక్తం చేశారు. ఎలాంటి కీలక లక్ష్యాలనైనా సాధించే సత్తా మహిళలకుందని, జోన్ పరిధిలో కీలక విభాగాలను సమర్థంగా పర్యవేక్షిస్తున్నారన్నారు. ఆపరేషన్స్: కె. పద్మజ రైళ్ల రాకపోకలు, వాటి సమయపాలన, ట్రాఫిక్ నిర్వహణ, ఇతర విభాగాలతో సమన్వయం, రోలింగ్ స్టాక్ నిర్వహణ వంటి కీలక అంశాలు రైల్వేలో ఆపరేషన్స్ విభాగ పరి«ధిలోకే వస్తాయి. ఈ విభాగ నిర్వహణ కత్తిమీద సామే. ఈ సంవత్సరం జూలై వరకు సరుకు రవాణా ద్వారా దక్షిణ మధ్య రైల్వే రూ.4,601 కోట్ల ఆదాయం సాధించింది. 49 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసి కొత్త రికార్డు సృష్టించింది. పండుగలు లాంటి ప్రత్యేక సందర్భాల్లో 1,117 ప్రత్యేక రైళ్లు నడిపింది. దీనికి ప్రస్తుతం 1991 బ్యాచ్ ఐఆర్టీఎస్ అధికారి కే.పద్మజ అధిపతిగా వ్యవహరిస్తున్నారు. 2025 జనవరిలో ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్‌గా ఆమె బాధ్యతలు స్వీకరించారు. వాణిజ్య విభాగం: ఇటీ పాండే ఆపరేషన్స్ తర్వాతఅంత ప్రాధాన్యం ఉన్న విభాగమిది.టికెట్ అమ్మకాలు, రిజర్వేషన్,స్టేషన్ నిర్వహణ, సరుకు రవాణా,మార్కెటింగ్, ఆదాయ వనరుల పెంపువంటివి దీని పరిధిలో ఉంటాయి. ఈ విభాగానికి ఈ నెల రెండో తేదీన 1998 బ్యాచ్ ఐఆర్టీఎస్ అధికారి ఇటీ పాండే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆమె ‘రైల్ మంత్రి రాజభాష రజత్ పథక్ (2025), మంత్రిత్వ శాఖ పురస్కారం (2007), జీఎం అవార్డులు (రెండుసార్లు), విమెన్ ఎచీవర్స్ (2016) లాంటి అనేక పురస్కారాలు పొందారు. ‘రైడింగ్ ది ఫ్రైట్ ట్రైన్’అనే పుస్తకం రాశారు. అంతర్జాతీయస్థాయిలో కామ్ రోడ్స్ మారథాన్ (88 కి.మీ.)ను పూర్తి చేసిన ఏకైక మహిళా సివిల్ సర్వెంట్గానూ గుర్తింపు పొందారు. భద్రతా విభాగం: అరోమా సింగ్ ఠాకూర్ రైల్వే ఆస్తులు, ప్రయాణికుల భద్రత చాలా కీలకం. అసాంఘిక శక్తులు, ఆకతాయిలు మొదలు ఉగ్రవాదుల వరకు రైల్వేపై దాడులు చేయటం సహజం. ట్రాక్‌పై అడ్డుగా ఇనుప చువ్వలను ఉంచి రైళ్లు పట్టాలు తప్పేలా చేసే కుట్రలు తరచూ జరుగుతున్నాయి. ఇలాంటి వాటినినిర్వీర్యం చేయటం సహా స్టేషన్లు, రైళ్లలో ప్రయాణికులు క్షేమంగా ఉండేలా, భద్రంగా గమ్యంచేరేలా ఆర్పీఎఫ్ సిబ్బంది పహారాలో ఉంటారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షించే కీలక బాధ్యతనుప్రస్తుతం 1993 బ్యాచ్ ఐఆర్పీఎఫ్ఎస్ అధికారి అరోమాసింగ్ ఠాకూర్ పర్యవేక్షిస్తున్నారు. 2023 జూలైలో ఆమె ఐజీ కమ్ చీఫ్ ప్రిన్సిపల్ సెక్యూరిటీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆమె నేతృత్వంలో ‘ఆపరేషన్ యాత్రి సురక్ష‘, ‘ఆపరేషన్ అమానత్‘, ‘ఆపరేషన్ నన్హే ఫరిస్తే్త‘, ‘ఆపరేషన్ సతర్క్‘వంటి ప్రత్యేక కార్యక్రమాలు విజయవంతంగా అమలయ్యాయి. మహిళల భద్రతకు ‘ఉమన్ శక్తి టీమ్‌లు‘, ‘మెరి సాహిలీ‘, ‘యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు‘ప్రారంభించారు. వైద్య విభాగం: డా. నిర్మలానరసింహన్రైల్వేలో ప్రత్యేక ఆస్పత్రులు ఉంటాయి. సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు ఇవి వైద్య సేవలందిస్తాయి. ఇవి కాకుండా ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే ప్రత్యేక మొబైల్ ఆస్పత్రులు ఆయా ప్రాంతాలకు చేరుకుని వైద్యం అందిస్తాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 8 ప్రధాన ఆస్పత్రులు, 40 హెల్త్ యూనిట్లు ఉన్నాయి. లాలాగూడలోని 380 పడకల కేంద్ర రైల్వే ఆస్పత్రి ఉంది. ఈ విభాగానికి 1989 బ్యాచ్ ఐఆర్‌హెచ్‌ఎస్ అధికారి డా.నిర్మలానరసింహన్ డిసెంబర్లో ప్రిన్సిపల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆర్థిక విభాగం: హేమ సునీత అతి పెద్ద నెట్వర్క్ అయిన రైల్వేలో ఆర్థిక అంశాల పర్యవేక్షణ కూడా చాలా కీలకం. ఆర్థికపరమైన పొరపాట్లు, అక్రమాలకు తావు లేకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ఈ విభాగానికి 1993 ఐఆర్ఏఎస్ అధికారి హేమసునీత గత ఏప్రిల్ నుంచి ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా వ్యవహరిస్తున్నారు. లండన్, పారిస్, మలేíÙయా, సింగపూర్లలో ఆర్థిక అంశాలçపై అంతర్జాతీయ స్థాయిలో కోర్సులు చేసి, శిక్షణ పొందారు. ఆమె పీపీపీ, ఇంటర్నేషనల్ టాక్స్, అక్రూవల్ అకౌంటింగ్‌లలో ప్రావీణ్యం పొందారు. -
మహిళల కోసం టాటా ఏఐఏ కొత్త పాలసీ
జీవిత బీమా సంస్థ టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్.. ప్రత్యేకంగా మహిళల కోసం శుభ్ శక్తి పేరిట టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ప్రెగ్నెన్సీ సమయంలో ప్రీమియం హాలిడే, పురుషుల పాలసీలతో పోలిస్తే ప్లాన్ వ్యవధి ఆసాంతం ప్రీమియంపై 15% సుమారు డిస్కౌంటు, సింగిల్ మదర్స్‌కి దీనికి అదనంగా 1% మేర జీవితకాల డిస్కౌంటులాంటి ఫీచర్లు ఈ పాలసీలో ఉంటాయి.అలాగే సర్వికల్ క్యాన్సర్, హెచ్‌పీవీ మొదలైన వాటికి టీకాలపరమైన మద్దతు, ఐవీఎఫ్ కౌన్సెలింగ్, స్పెషలిస్ట్ కన్సల్టేషన్లు, వార్షిక హెల్త్ చెకప్‌ల వంటి ప్రయోజనాలు ఉంటాయని సంస్థ చీఫ్ కాంప్లయెన్స్ ఆఫీసర్ గాయత్రి నాథన్ తెలిపారు.పాలసీ ముఖ్య లక్షణాలుప్రీమియం హాలిడే: బిడ్డ పుట్టిన తర్వాత 12 నెలల పాటు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది పాలసీ వ్యవధిలో రెండుసార్లు వర్తిస్తుంది.తక్కువ ప్రీమియం: పురుషుల పాలసీలతో పోలిస్తే మహిళలకు 15% తక్కువ ప్రీమియం ఉంటుంది. ఇది పాలసీ కాలం మొత్తం వర్తిస్తుంది.ఒంటరి తల్లులకు ప్రత్యేక రాయితీ: జీవితకాల ప్రీమియంపై అదనంగా 1% తగ్గింపు.ఆరోగ్య ప్రయోజనాలు: సర్వికల్ క్యాన్సర్, హెచ్‌పీవీ వంటి వ్యాధులకు టీకాల మద్దతుఐవీఎఫ్ కౌన్సెలింగ్, స్పెషలిస్ట్ కన్సల్టేషన్లు, వార్షిక హెల్త్ చెకప్లుప్రీమియం వెయివర్: జీవిత భాగస్వామి ప్రమాదవశాత్తూ మరణిస్తే, తదుపరి ప్రీమియాలు చెల్లించాల్సిన అవసరం లేదు.అదనపు ప్రయోజనం: అదనపు ప్రీమియంతో పిల్లల విద్య కోసం నెలవారీ ఆదాయం పొందే అవకాశం (21 లేదా 25 ఏళ్ల వరకు) -
Eluru: ఈ మాత్రం దానికి ఫ్రీ బస్ అని పేరు ఎందుకు.. బాబుపై మహిళల ఆగ్రహం
-
గుండు పిన్నుపై జాతీయ జెండా
-
దొంగ ఓట్ల బాగోతాన్ని బయటపెట్టిన పులివెందుల మహిళలు
-
మా ఓటు వేరేవాళ్లు వేసేశారు..మహిళలు ఆగ్రహం
-
మహిళా సాధికారతలో టెక్నాలజీ సవాలు
దేశం ఆర్థికంగా శరవేగంగా దూసుకుపోవడంలో సాంకేతికతది కీలక పాత్ర. అయితే భారత ఆర్థికాభివృద్ధిలో ఎంతగా సాంకేతికత పెరుగుతున్నదో అదే స్థాయిలో మహిళల భాగస్వామ్యం తిరోగమిస్తున్నది. ప్రస్తుతం 35.9 శాతం మించని మహిళా శక్తి భాగస్వామ్యం... 2030 నాటికి 1.9 కోట్ల మంది మహిళలు ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయి మరింత దిగజారుతుందనేది ఓ అంచనా. వ్యవసాయ రంగంలోని అన్ని దశల్లో సాంకేతికతను విరివిగా వినియోగిస్తున్నారు. ఎరువులు, పురుగు మందులు చల్లడానికి డ్రోన్లు వచ్చేశాయి. కలుపు తీయడానికి, పంట కోతకు ఆధునిక యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. అనుబంధ రంగాలతో కలిసి భారత వ్యవసాయ దిగుబడుల విలువ సుమారు రూ. 58.74 లక్షల కోట్లకు చేరింది. సాంకేతికత దేశంలో వ్యవసాయ దిగుబడులను పెంచుతూ... వ్యవసాయ మహిళల జీవనోపాధిని కబళిస్తోంది. ఫలితంగా ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. విజృంభిస్తోన్న సాంకేతికతనూ వ్యతిరేకించలేం; కోట్లాది శ్రామిక మహిళాశక్తినీ విస్మరించలేం. ఇదో సంక్లిష్ట వ్యవహారం. ఈ రెండింటి మధ్య హేతుబద్ధత, సమతౌల్యత సాధించడం విహిత కర్తవ్యం.చదవండి: బాల అమితాబ్ గుర్తున్నాడా? ఇపుడు రూ. 200 కోట్ల కంపెనీకి అధిపతివర్తమాన 4వ పారిశ్రామిక విప్లవ కాలంలో, రోబోటిక్స్, ఆటోమేషన్, బ్రెయిన్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిగ్ డేటా, నానో– బయోటెక్నాలజీలు, బయోకెమిస్ట్రీ, జెనెటిక్స్ వంటి అత్యాధునిక సాంకేతికతలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఇవి ప్రధానంగా ఉత్పత్తి, సేవలపై దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. ఈ పరిణామం వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో నిమగ్నమైన కోట్లాది పేద, మధ్యతరగతి మహిళల ఉపాధిని హరిస్తోంది.వ్యవసాయ రంగంతో పోల్చితే, భారత పారిశ్రామిక రంగంలో సాంకేతికత వినియోగం ఎక్కువగా ఉంటోంది. అదే సమయంలో మహిళల భాగస్వామ్యం వేగంగా తగ్గుతోంది. అయితే భారత సేవా రంగంలో మహిళల పాత్ర గణనీయంగానే ఉంది. విద్య, ఆరోగ్యం, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, రిటైల్, హాస్పిటాలిటీ వంటి రంగాలలో మహిళల సంఖ్య గణనీయం. ఇవ్వాళ సేవారంగం... లింగ వివక్షకు, అసమానతలకు దూరంగా ఉంటూ, ప్రతిభకు పట్టం కడుతోంది. ఈ రంగం ఆధునిక సాంకేతిక విద్యావంతులైన కోట్లాది మహిళలకు ఉద్యోగాలను కల్పించింది. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ కేవలం సాంకేతికతను మాత్రమే కాదు, మహిళల శ్రమశక్తిని, మేధాసంపత్తిని సమానంగా ఇముడ్చుకుంటూ ముందుకు సాగితే లింగ వివక్ష, అసమానత సమసిపోతుందని విధాన నిర్ణేతలు గ్రహించాలి. మహిళలకు సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడం, చిన్న, అతి చిన్న పరిశ్రమలలో మహిళల సంఖ్యను గణనీయంగా పెంచడం, మహిళలు తయారు చేసిన వస్తు ఉత్పత్తులకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వడం; వనరులు, ముడి సరుకుల లభ్యతను సులభతరం చేయడం, బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణ సౌకర్యం కల్పించడం వంటి చర్యల వల్ల మహిళల ఆర్థిక స్వావలంబన సులభతరం అవుతుంది. ప్రభుత్వాలు ఈ దిశలో అడుగులు వేయాలి. మహిళా సాధికారతలో టెక్నాలజీ సవాలువిజృంభిస్తోన్న సాంకేతికతనూ వ్యతిరేకించలేం; కోట్లాది శ్రామిక మహిళాశక్తినీ విస్మరించలేం. ఈ రెండింటి మధ్య హేతుబద్ధత, సమతౌల్యత సాధించడం విహిత కర్తవ్యం.-బోగా దీపిక వ్యాసకర్త పరిశోధకురాలు -
‘స్త్రీ శక్తి’.. బాబు కుయుక్తి!
‘టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలు ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రం అంతటా ఉచితంగా ప్రయాణించవచ్చు.. శ్రీకాకుళం నుంచి తిరుమలకు ఉచితంగా వెళ్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవచ్చు.. టికెట్ లేకుండా అనంతపురం నుంచి అన్నవరం వెళ్లి సత్యన్నారాయణస్వామిని దర్శనం చేసుకోవచ్చు.. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రాజధాని అమరావతికి ఉచితంగా రావచ్చు అని హామీ ఇస్తున్నా...!’ ఇదీ ఎన్నికల ముందు చంద్రబాబు నమ్మబలికిన హామీ!ఈ మాట నమ్మి బస్సు ఎక్కితే ఆడపడుచులు బొక్కబోర్లా పడిపోయినట్లే.. ఎందుకంటే శ్రీకాకుళం నుంచి తిరుమలకు కాదు కదా వారుంటున్న గ్రామం నుంచి అదే జిల్లాలోని పలాసకు కూడా డైరెక్టుగా పోలేరు. బాబుగారి ఉచిత బస్సులో పక్క జిల్లాకే కాదు పక్క నియోజకవర్గానికి కూడా పోలేరు. పల్లె నుంచి పక్క పల్లెకు మాత్రమే పోగలుగుతారు. అది కూడా ఆ పల్లెల్లో బస్సు తిరిగితేనే.. ఎందుకంటే మన పల్లెల్లో ఇప్పటికే చాలా బస్సులు ఎత్తేశారు.. చాలా పల్లెలకు అసలు బస్సులే లేవు మరి... సాక్షి, అమరావతి: ‘బాబు ష్యూరిటీ అంటే మోసం గ్యారంటీ..’ అని మరోసారి నిరూపితమైంది! అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు తన ట్రేడ్ మార్కు వెన్నుపోటు రాజకీయం చూపించారు! ‘స్త్రీ శక్తి’ పథకం పేరిట మరోసారి తన కుయుక్తి ప్రదర్శించారు. ఏడాదికిపైగా కాలయాపన తరువాత ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామంటున్న ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని ఆదిలోనే నీరుగార్చారు. పథకం అమలుపై లెక్కలేనన్ని పరిమితులు విధించారు. మొత్తం 16 కేటగిరీ ఆర్టీసీ బస్సు సర్విసులు ఉంటే కేవలం ఐదు కేటగిరీ బస్సులకే ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. తద్వారా రాష్ట్రం అంతటా కాదు కదా కనీసం జిల్లా అంతా ఉచితంగా ప్రయాణించే అవకాశం కూడా లేకుండా చేశారు. స్త్రీలకు టికెట్ ప్రయాణమే..! ఆర్టీసీ మొత్తం 16 కేటగిరీల్లో బస్ సర్విసులను నిర్వహిస్తోంది. మరి చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని కేటగిరీ సర్విసుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేస్తామని చెప్పిందో తెలుసా..? కేవలం ఐదంటే ఐదు మాత్రమే! ఏసీ కేటగిరీలో వెన్నెల, డాల్ఫిన్ క్రూయిజర్, అమరావతి, నైట్ రైడర్, ఇంద్ర, మెటోలగ్జరీ, 9ఎం ఇ.బస్ సర్విసులను ఆర్టీసీ నిర్వహిస్తోంది. ఇక నాన్ ఏసీ కేటగిరీల్లో స్టార్ లైనర్, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్‌ప్రెస్, ఎస్ఏపీ ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ సర్విసులు నడుపుతోంది. మొత్తం 11,256 బస్ సర్విసులు నిర్వహిస్తోంది. ఎన్నికల ముందు టీడీపీ కూటమి ఇచ్చిన హామీ ప్రకారం అన్ని సర్విసుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేయాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కేవలం ఐదు కేటగిరీలు.. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ సర్విసుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. ఏసీ కేటగిరీలో ఉన్న ఏడు సర్విసుల్లో ఉచిత ప్రయాణం పథకం అమలు కాదని తేల్చి చెప్పింది. పోనీ నాన్ ఏసీ కేటగిరీలో ఉన్న 9 కేటగిరీల్లో అయినా పూర్తిగా ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేస్తుందా? అంటే అదీ లేదు. వాటిలో కూడా ముఖ్యమైన స్టార్ లైనర్, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎస్ఏపీ ఎక్స్‌ప్రెస్ సర్విసుల్లో ఉచిత ప్రయాణం వర్తించదని, టికెట్ తీసుకోవాల్సిందేనని ప్రకటించింది. మరోసారి మహిళలకు మోసం.. చంద్రబాబు ప్రభుత్వం పక్కా కుయుక్తితో మహిళలను వంచించింది. ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకోవాలి కానీ మహిళలకు అందకూడదనే రీతిలో దుర్భుద్ధితో వ్యవహరించింది. అందుకే అన్ని ఏసీ సర్వీసులు, నాన్ ఏసీ సర్వీసుల్లో కూడా నాలుగు కేటగిరీల్లో అమలు చేయబోమని ప్రకటించింది. ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో కేవలం ఒక్క కేటగిరీలోనే అంటే సాధారణ ఎక్స్‌ప్రెస్ సర్విసుల్లోనే ఉచిత ప్రయాణం అందిస్తామని చెప్పింది. పోనీ సాధారణ ఎక్స్‌ప్రెస్ సర్విసుల్లో అయినా పూర్తిగా ఈ పథకాన్ని అమలు చేస్తారా అంటే అదీ లేదు. నాన్ స్టాప్ సర్విసుల్లో ఈ పథకం అమలు చేయబోమని ప్రకటించి దొంగ దెబ్బ తీసింది. ఆర్టీసీ చాలా ఏళ్లుగా రెండు పట్టణాల మధ్య సాధారణ ఎక్స్‌ప్రెస్ సర్విసులను నిలిపివేసింది.వాటిని నాన్ స్టాప్ సర్విసులుగా మార్చివేసింది. ఉదాహరణకు.. శ్రీకాకుళం– విజయనగరం, శ్రీకాకుళం – విశాఖపట్నం, విశాఖపట్నం – అనకాపల్లి, విశాఖపట్నం – రాజమహేంద్రవరం, రాజమహేంద్రవరం– కాకినాడ, విజయవాడ – ఏలూరు, విజయవాడ – బందరు, విజయవాడ– గుంటూరు, ఒంగోలు – మార్కాపురం, నెల్లూరు– తిరుపతి, తిరుపతి– శ్రీకాళహస్తి, తిరుపతి – చిత్తూరు, తిరుపతి– మదనపల్లి, కడప – కర్నూలు... ఇలా రాష్ట్రంలోని ఏ రెండు ప్రధాన పట్టణాల మధ్య ఉన్న ఎక్స్‌ప్రెస్ సర్విసులను నాన్ స్టాప్ సర్వీసులుగా మార్చేసింది.ఎక్స్‌ప్రెస్ సర్విసులు పేరుకు 1,560 ఉన్నాయి. కానీ వాటిలో దాదాపు 950 సర్విసులు నాన్ స్టాప్ సర్విసులే. అంటే వాటిలో ఉచిత ప్రయాణం పథకం వర్తించదు. కేవలం జిల్లాలో కొన్ని పల్లెలు, పట్టణాల మధ్య తిరిగే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, నగరాల్లో సిటీ ఆర్డినరీ సర్విసుల్లోనే ఉచిత ప్రయాణం పథకం అమలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే మహిళలు టికెట్ లేకుండా రాష్ట్రం అంతా కాదు కదా కనీసం తమ జిల్లా అంతా కూడా ప్రయాణించే అవకాశం లేదని తేల్చి చెప్పింది. దాహరణకు శ్రీకాకుళం నుంచి పలాస, ఇచ్చాపురం వెళ్లాలంటే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సు సర్విసులు లేవు. అల్ట్రా డీలక్స్ బస్సులే శరణ్యం. ఆ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం అమలు చేయరు. అదే పరిస్థితి అన్ని జిల్లాల్లోనూ ఉంది. తిరుమలకు వెళ్లే సప్తగిరి సర్వీసుల్లో ఉచిత ప్రయాణం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం పేరిట చంద్రబాబు మరోసారి మహిళలను మోసం చేశారన్నది తేటతెల్లమైంది. -
ఉచిత బస్సు ప్రయాణం పేరిట చంద్రబాబు మరో మోసం
సాక్షి,అమరావతి: మహిళలను చంద్రబాబు ప్రభుత్వం చీట్ చేసింది. ఐదు రకాల బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం చేసేలా స్త్రీ శక్తి పథకం అమలుకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రమంతటా ఫ్రీ అని కొర్రీలు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం.. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో స్కీం ఎగట్టొంది.నాన్‌స్టాప్,సప్తగిరి ఎక్స్‌ప్రెస్,డీలక్స్.. అల్ట్రా డీలక్స్,సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్,ఇంద్ర, వెన్నెల, అమరావతి బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎగనామం పెట్టారు. ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం లేదని ఉత్తర్వుల్లో పేర్కొంది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో, సిటీ ఆర్డినరి, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మాత్రమే స్త్రీ శక్తి పథకం అమలుకు జారీ చేసిన ఉత్తర్వుల్లో హైలెట్ చేసింది. -
రంగారెడ్డి జిల్లా : అంగరంగ వైభవంగా తీజ్ సంబురాలు (ఫొటోలు)
-
‘యాక్ట్’ ఉంటేనే యాక్షన్!
భాగ్యనగర వీధుల్లో ఇటీవల జరిగిన వివిధ ఊరేగింపులు, వేడుకల్లో మహిళలు, యువతులను అసభ్యంగా తాకుతూ, అనుచితంగా ప్రవర్తిస్తూ 644 మంది ఆకతాయిలు షీ–టీమ్స్‌కు చిక్కారు. కానీ వారిలో కేవలం ఐదుగురిపైనే పోలీసులు కేసులు నమోదు చేయగలిగారు. మిగిలిన వారిని మందలింపులు, కౌన్సెలింగ్‌లతోనే సరిపెట్టి పంపించేశారు. అందుకు కారణం.. పోకిరీలకు చెక్ చెప్పడానికి అవసరమైన ప్రత్యేక చట్టం లేకపోవడమే.సాక్షి, హైదరాబాద్: చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడే వారికి జీవితఖైదు లాంటి తీవ్ర శిక్షలు విధించేందుకు వీలు కల్పించే అత్యంత కఠినమైన పోక్సో చట్టం అమల్లో ఉండగా.. మహిళలు, యువతులను వేధించే ఆకతాయిలు, పోకిరీలపై కఠిన చర్యలు తీసుకోవడానికి మాత్రం ప్రస్తుత చట్టాల్లోని సెక్షన్లు ఉపయుక్తంగా లేవు. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా షీ–టీమ్స్ తయారు చేసిన ప్రతిపాదనే తెలంగాణ ప్రొహిబిషన్ ఆఫ్ ఈవ్ టీజింగ్ యాక్ట్. పోకిరీల పీచమణిచేందుకు ప్రత్యేక చట్టం కావాలని షీ–టీమ్స్ పదేళ్ల క్రితమే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ఇప్పటికీ స్పందన రాలేదు. ఈ ఫైల్ న్యాయ విభాగం వద్దే పెండింగ్‌లో ఉండిపోయింది.తమిళనాడులో 1998 నుంచే...పోకిరీలు మొదలు ఆన్లైన్లో, సోషల్ మీడియా ద్వారా అదును చూసి కాటువేస్తున్న నయవంచకుల వరకు.. ఎందరో మృగాళ్ల బారి నుంచి అతివల్ని రక్షిస్తున్న హైదరాబాద్ షీ–టీమ్స్ ఏర్పడి 11 ఏళ్లు కావస్తోంది. ఇప్ప టికే గణనీ యమైన ఫలి తాలు సాధిస్తున్న ఈ బృందాల పనితీరును మరింత మెరుగుపరచడంతోపాటు మహిళలు/యువతులకు పూర్తిస్థాయి భరోసా ఇవ్వడానికి ప్రత్యేక చట్టం అవసరం ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. దీనికోసం తమిళనాడులో 1998 నుంచి అమల్లో ఉన్న ‘తమిళనాడు ప్రొహిబిషన్ ఆఫ్ ఈవ్ టీజింగ్ యాక్ట్’ తరహాలో రూపొందించిన ముసాయిదాను 2015లోనే రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు.చిక్కుతున్నా చిన్న కేసులే...బహిరంగ ప్రదేశాల్లో యువతులు/మహిళల్ని వేధిస్తున్న పోకిరీలను నిత్యం షీ–టీమ్స్ పట్టుకుంటున్నా తీవ్రత, ఆధారాలు ఉంటే తప్ప నిందితులపై బీఎన్‌ఎస్‌తోపాటు నిర్భయ, యాంటీ ర్యాగింగ్ యాక్ట్‌ల ప్రకారం కేసులు నమోదు చేయడం సాధ్యం కావట్లేదు. ఫలితంగా రాష్ట్రంలో ఏటా షీ–టీమ్స్‌కు చిక్కుతున్న పోకిరీల్లో 90 శాతం మంది పెట్టీ కేసులు, నామమాత్రపు జరిమానాతో బయటప డిపోతున్నారు.ఈవ్ టీజింగ్‌కు పాల్పడుతూ రెండోసారి చిక్కిన వ్యక్తులతోపాటు తీవ్ర స్థాయిలో రెచ్చిపోయిన వారిపైనే కేసులు నమోదు చేయగలుగుతున్నారు. అయితే ప్రతి సందర్భంలోనూ రిపీటెడ్ అఫెండర్స్‌ను గుర్తించడం సాధ్యం కావట్లేదు. పోకిరీల వేధింపులు చిన్న విషయంగా కనిపించినా బాధితులపై వాటి ప్రభావం తీవ్రంగా ఉండటంతోపాటు సమాజం, పోలీసులపై ఏహ్యభావం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో న్యాయశాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న ముసాయిదా చట్టం కార్యరూపం దాలిస్తే తెలంగాణలోనూ సత్ఫలితాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.ప్రత్యేక చట్ట ముసాయిదాలోని ముఖ్యాంశాలు⇒ బహిరంగ ప్రదేశాలతోపాటు పనిచేసే ప్రాంతాలు, మాల్స్... ఇలా ఎక్కడైనా ఈవ్ టీజింగ్‌కు పాల్పడుతూ చిక్కిన పోకిరీలపై నేరం రుజువైతే ఏడాది జైలు లేదా రూ. 10 వేల జరిమానా లేదా రెండూ పడతాయి.⇒ ఈవ్ టీజింగ్ చేయడానికి పోకిరీలు వాహనాలను వినియోగిస్తే వాటిని పోలీసులు స్వాధీనం చేసుకొనే అవకాశం ఏర్పడుతుంది. ⇒ దేవాలయాలతోపాటు మాల్స్, సినిమా హాల్స్, విద్యాసంస్థలు తదితర చోట్ల జరిగే ఈవ్ టీజింగ్‌లను నిరోధించాల్సిన బాధ్యత వాటి నిర్వాహకులపై ఉంటుంది. అలాంటి సమాచారాన్ని తక్షణం సంబంధిత పోలీసులకు చేరవేయాల్సిందే. దీనికి భిన్నంగా వ్యవహరిస్తే ఆ నేరానికి యాజమాన్యాలనూ బాధ్యుల్ని చేయవచ్చు. వారికి కూడా న్యాయస్థానం జరిమానా విధించే అవకాశం ఉంటుంది.రాష్ట్ర షీ–టీమ్స్ 2024 గణాంకాల ప్రకారం పోకిరీలపై కేసుల సంఖ్య⇒ చిక్కిన పోకిరీలు 26,526⇒ కౌన్సెలింగ్‌తో బయటపడిన వాళ్లు 15,664⇒ వారిలో ఫిర్యాదులతో చిక్కింది 10,862⇒ పెట్టీ కేసులుగా నమోదైనవి: 3,329⇒ ఐపీసీ/బీఎన్‌ఎస్‌ల కింద నమోదైన ఎఫ్ఐఆర్లు 830 -
‘కోవిడ్–19’తో మహిళల్లో ఆ సమస్య..!
‘కోవిడ్–19’ మహమ్మారి తర్వాత చాలామంది చాలారకాల ఆరోగ్య సమస్యలకు లోనవుతున్న వార్తలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. ‘కోవిడ్–19’ ఇన్ఫెక్షన్ ప్రభావం వల్ల, ఆ తర్వాత తీసుకున్న కోవిడ్ వ్యాక్సిన్ వల్ల పలువురు మహిళలు రుతుక్రమంలో అస్తవ్యస్తతలు, దానికి తోడు అసాధారణ రక్తస్రావంతో బాధపడుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. ‘కోవిడ్–19’ ఇన్ఫెక్షన్, కోవిడ్ వ్యాక్సిన్ల కారణంగా పలువురు మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి, అధిక రక్తస్రావం సమస్య తలెత్తుతోందని లండన్‌లోని వైద్య నిపుణులు ఇటీవల గుర్తించారు. ఈ సమస్యపై వారు క్షుణ్ణంగా అధ్యయనం చేసి, తమ అధ్యయన వివరాలను ‘క్లినికల్ సైన్స్’ జర్నల్‌లో ప్రచురించారు. ‘కోవిడ్–19’ ఇన్ఫెక్షన్కు గురైన వారిలో దాదాపు 33.8 శాతం మహిళలకు రుతుక్రమంలో అస్తవ్యస్తతలు ఏర్పడ్డాయి. 26 శాతం మహిళల్లో అస్తవ్యస్తమైన రుతుక్రమంతో పాటు అధిక రక్తస్రావం సమస్య ఏర్పడింది. 19.7 శాతం మహిళల్లో రుతుక్రమంలో అస్తవ్యస్తతలు లేకున్నా, అధిక రక్తస్రావం సమస్య తలెత్తింది. డాక్టర్ ప్రమత శిరీష, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: ‘కోవిడ్–19’తో మహిళల్లో ఆ సమస్య..!) -
ఆమె ఆర్థిక నిర్ణయాలలో...!
ఎనభై శాతం మంది మహిళల ఆర్థిక నిర్ణయాలలో ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తాజా అధ్యయనం తెలియజేసింది. మార్కెటింగ్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ ఒపినియన్ పోలింగ్ కంపెనీ ‘ఐపీఎస్వోఎస్’ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్‌కత్తాలోని 25–45 ఏళ్ల మధ్య ఉన్న మహిళలపై ఈ అధ్యయనాన్ని నిర్వహించింది.బడ్జెట్ ప్లానింగ్, మ్యూచువల్ ఫండ్స్... మొదలైన వాటి గురించి అవగాహన ఏర్పర్చుకోవడానికి మహిళలు ఎక్కువగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ఆధారపడుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్ గురించి నిమిషాల వ్యవధిలో సులభంగా వివరించే ఇన్‌స్టాగ్రామ్‌లోని షార్ట్ రీల్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ డక్ట్స్కు సంబంధించి వాట్సాప్ గ్రూప్‌లు షేర్ చేసే టిప్స్ మహిళలకు ఉపయోగపడుతున్నాయి. స్వతంత్రంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి సంబంధించి మహిళలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి, ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టడంలో మహిళలకు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్ ఉపయోగపడుతున్నాయి. స్వతంత్రంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి సంబంధించి 57 శాతం మంది యూజర్లు ఇన్‌స్టాగ్రామ్‌పైనా, 53 శాతం మంది యూజర్లు ఫేస్‌బుక్‌పై ఆధారపడుతున్నారు. ‘అథెంటిసిటీ’కి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. 75 శాతం మంది ఫైనాల్సియల్ పాడ్‌కాస్ట్‌లకు, 67 శాతం మంది ఇన్ఫ్లూయెన్సర్లు, ఆర్థిక విషయ నిపుణుల సలహాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక కొత్త స్కీమ్ గురించి తెలుసుకోవడం నుంచి దాని మంచిచెడ్డల గురించి విశ్లేషించుకోవడం వరకు ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు సంబంధించి వాట్సాప్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు స్టడీ రిపోర్ట్ తెలియజేసింది.(చదవండి: ఉమెన్ సెక్యూరిటీ ‘క్యూఆర్ కోడ్స్’) -
ఉమెన్ సెక్యూరిటీ ‘క్యూఆర్ కోడ్స్’
మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని సరికొత్త విధానాన్ని అనుసరించారు మహారాష్ట్రలోని నాగ్‌పుర్ పోలీసులు. నగరంలో నేరాలకు ఆలవాలంగా ఉన్న 330 ప్రదేశాలను గుర్తించి క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ కాంటాక్ట్‌లు, సేఫ్టీ రిసోర్స్‌కు సంబంధించి త్వరగా యాక్సెస్ కావడానికి ఆపదలో ఉన్న మహిళలకు ఈ క్యూ ఆర్ కోడ్లు ఉపయోగపడతాయి. నేరాలను బట్టి మరిన్ని ప్రాంతాలకు ఈ క్యూఆర్ కోడ్లను విస్తరిస్తారు. ‘మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని సాంకేతికతను ఉపయోగించుకుంటున్నాం’ అంటున్నారు సీపీ రవీందర్ సింఘాల్. మహిళల భద్రతకు సంబంధించిన ‘దామిని స్క్వాడ్స్’ కోసం అయిదు ప్రత్యేకమైన ఆల్–ఉమెన్ వాహనాలను ఏర్పాటు చేశారు. ఈ స్క్వాడ్‌లో 19 మంది మహిళా అధికారులు ఉన్నారు. ‘మా బృందాలలోని సభ్యులు ప్రతి స్కూల్‌కు వెళ్లి బాలికల భద్రతకు సంబంధించి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. బాలికలకు వారి హక్కుల గురించి తెలియజేయడం తోపాటు అవసరమైన సమయాలలో సహాయం ఎలా తీసుకోవాలి... వంటి విషయాల గురించి వివరిస్తున్నారు’ అంటున్నారు ‘భరోసా సెల్’ హెడ్ సీమా సుర్వే. (చదవండి: Parenting Tip: తండ్రి ఇచ్చిన సలహా ఆమె జీవితాన్నే మార్చేసింది..! ఇవాళ సీఈవోగా..) -
రోజులో సంతోషమే ఎక్కువ
సంతోషం, బాధ, ఆందోళన, ఆశ్చర్యం, కోపం.. ఇలాంటి భావోద్వేగాల సమాహారమే మన జీవితం. ఆ క్షణానికే చిన్న పిల్లల్లా మారిపోతాం.. మరుక్షణమే రాక్షసుల్లా ప్రవర్తిస్తాం.. ఇంకో క్షణంలో తీవ్ర ఒత్తిడికి గురవుతాం.. ఏ ఎమోషన్ కూడా మనలో ఎక్కువ సేపు ఉండదు. చాలామంది దీన్ని అంగీకరించరు కానీ ఇదే వాస్తవం. సరే, ఇన్ని భావోద్వేగాల్లో మనతో ఎక్కువ సేపు ఉండేది ఏది? చాలామంది అనుకుంటున్నట్టు బాధ / ఆవేదన / ఆందోళన ఇవేనా మన రోజువారీ జీవితంలో రాజ్యమేలుతున్నాయి? అంటే కాదు.. అంటున్నారు మానసిక నిపుణులు.సాక్షి, స్పెషల్ డెస్క్: ఏ మనిషీ రోజూ ఏడుస్తూ కూర్చోడు.. ఆవేదన, ఆందోళనలతో ఉక్కిరిబిక్కిరైపోడు. అలాగని రోజంతా సంతోషం, ఆనందం కూడా ఉండవు. కానీ, ఒక రోజులో ఒక మనిషిలో ఎక్కువ సేపు ఉండే ఎమోషన్ ఏదో తెలుసా.. సంతోషం. నెదర్లాండ్స్, స్పెయిన్, అమెరికాకు చెందిన వేర్వేరు విభాగాలకు చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. చాలామంది కోపిష్టులు మన చుట్టూ ఉంటారు. వాళ్లు కూడా రోజంతా ఎవరు దొరుకుతారా తిడదామా, కొడదామా అని రోజంతా ఉండరు. రోజు మొత్తం భావోద్వేగాల్లో ఇది 10 శాతం కూడా ఉండదు. కానీ, స్త్రీలలో మాత్రం పురుషుల కంటే ఎక్కువ సమయం కోపం ఉంటోందట. భయం కూడా రోజులో చాలా తక్కువ సేపే.. కేవలం 5 శాతమే ఉంటోంది.రోజుకు ఒకలా.. ఇకపోతే అన్ని రోజులూ అన్ని ఎమోషన్లూ ఒకేలా ఉండవు. సాధారణంగా వారం ప్రారంభంలో విచారం, ఆందోళన, కోపం వంటి ప్రతి కూల భావోద్వేగాల శాతం ఎక్కువగా ఉంటోంది. వారాంతంలో అనుకూల భావోద్వేగాలైన ఆనందం, ప్రేమ, సంతృప్తి ఎక్కువ శాతంలో ఉంటున్నాయి.పురుషుల్లో ఒకలా.. మహిళల్లో మరోలా..⇒ రోజువారీ జీవితంలో 45 శాతం సమయంలో పూర్తిగా పాజిటివ్ ఎమోషన్స్ ఉంటున్నాయని మగాళ్లు చెప్పారు. అలాగే 14 శాతం నెగెటివ్, 31 శాతం మిశ్రమ భావోద్వేగాలు ఉంటున్నాయని చెప్పారు. ⇒ ఈ విషయంలో మహిళలు.. 39 శాతం పాజిటివ్, 17 శాతం నెగెటివ్, 34 శాతం మిశ్రమ భావోద్వేగాలు ఉంటున్నాయని చెప్పారట. ⇒ స్త్రీలతో పోలిస్తే పురుషులు సానుకూల భావోద్వేగాలను ఎక్కువ సార్లు అనుభవిస్తున్నారట. ఇందులో కూడా ప్రత్యేకించి.. ఆనందం, సంతృప్తి, అప్రమత్తత, ఉల్లాసం, గర్వం వంటివి స్త్రీలలో కంటే పురుషుల్లో ఎక్కువసార్లు కలుగుతున్నాయట.ప్రామాణిక పరిశోధననెదర్లాండ్స్, స్పెయిన్, అమెరికాకు చెందిన వేర్వేరు విభాగాలకు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. మొత్తంగా 11,572 మంది పాల్గొన్నారు. సగటు వయసు 33 సంవత్సరాలు. ఇందులో ఫ్రెంచి, స్విస్, బెల్జియం దేశాల వారు ఉన్నారు. మొత్తం అభ్యర్థుల్లో సగానికిపైగా మహిళలే. ఈ అధ్యయనం కోసం ‘58 సెకెన్లు’ అనే మొబైల్ యాప్‌ని తయారుచేశారు.రోజులో ఏ సమయంలో ఏ భావోద్వేగం ఉంటుందో చెప్పాలని వీరికి ఒక ప్రశ్నపత్రం ఇచ్చారు. 2013 ఫిబ్రవరి నుంచి 2014 ఏప్రిల్ వరకు డేటా సేకరణ చేశారు. ఈ యాప్ ఇప్పటికీ కూడా పనిచేస్తోంది. ఇది ప్రపంచ ప్రసిద్ధ ప్లస్ వన్ సైన్స్ జర్నల్ సహా అనేక జర్నళ్లలో ప్రచురితమైంది. దీన్ని ఇప్పటికీ భావోద్వేగాలకు సంబంధించి ప్రామాణిక పరిశోధనల్లో ఒకటిగా పరిగణిస్తారు.ఒక రోజులో ఏ ఎమోషన్ మనలో ఎక్కువ శాతం ఉంటుందంటే.. టాప్ 10 ఎమోషన్లు⇒ ఆనందం ⇒ ప్రేమ⇒ ఆందోళన⇒ సంతృప్తి ⇒ అప్రమత్తత⇒ ఆశ ⇒ విచారం⇒ ఉల్లాసం ⇒ గర్వం⇒ అసహ్యం / చిరాకు⇒ రోజులో రాత్రి 8 నుంచి 9 గంటల సమయంలో ఆనందం, ఉల్లాసం, ప్రేమ వంటి భావోద్వేగాలు ఎక్కువగా కనిపించాయి.⇒ రోజులో ఎక్కువ సార్లు కలిగే అనుభూతి ఆనందం. ఆ తరవాతి స్థానాల్లో ప్రేమ, ఆందోళన ఉన్నాయి. ప్రతికూల భావోద్వేగాల కంటే అనుకూలమైనవి 2.5 రెట్లు ఎక్కువ సార్లు రోజులో కలుగుతున్నాయట. రోజులో 90 శాతం సమయంలో ప్రతి కూల లేదా అనుకూల లేదా మిశ్రమ.. ఇలా ఏదో ఒక భావోద్వేగం కలుగుతోందట. -
మహిళల జీవితాలు నాశనం చేసేలా చంద్రబాబు కేబినెట్ నిర్ణయం
-
సై అంటూ సత్తా చాటుతూ..!
డబ్బులు పొదుపు చేయడం, రుణాలు పొందడానికి మాత్రమే పరిమితం కావాలనుకోవడం లేదు గ్రామీణ మహిళా సంఘాలు. పెట్రోల్ బంక్‌ల నిర్వాహణ నుంచి ఆర్టీసీ బస్సులను అద్దె తీసుకొని నడపడం వరకు తమ సత్తా చాటుతున్నారు. సోలార్ ప్లాంట్ల నిర్వహణకు సిద్ధం అవుతున్నారు.’పెట్రోల్ బంక్’ అనగానే ‘పురుషులు మాత్రమే’ అన్నట్లుగా ఒక చిత్రం మదిలో ముద్రితమై ఉంటుంది. ఇప్పుడు ఆ చిత్రాన్ని మార్చేస్తున్నారు గ్రామీణ మహిళలు. ‘మేము సైతం’ అంటూ పెట్రోల్‌బంక్‌ల నిర్వాహణలో సత్తా చాటుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన ‘శ్రీ షిర్డీ సాయిబాబా’ గ్రామైక్య సంఘం మహిళలు పెట్రోల్ బంక్ నిర్వహణకు ముందుకు వచ్చారు.రాష్ట్రంలోనే మూడోది...మహిళా సంఘాల ద్వారా నడిపే పెట్రోల బంక్ ఇటీవల నారాయణపేట జిల్లాలో మొదటిసారి ్ర΄ారంభమైంది. తర్వాత సంగారెడ్డి జిల్లాలో ఒక పెట్రోల్ బంక్ ఏర్పాటైంది. రాష్ట్రంలో మూడో పెట్రోల్ బంక్ లింగన్నపేటలో మహిళా సంఘం ఆధ్వర్యంలో ్ర΄ారంభమైంది. పెట్రోల్ బంక్ ఏర్పాటుతో గ్రామైక్య సంఘానికి నెలవారీ స్థిర ఆదాయం లభించనుంది.ధాన్యం కొనుగోలు కేంద్రాలుసిరిసిల్ల జిల్లాలో పెద్ద సంఖ్యలో ఉన్న మహిళా సంఘాలు పొదుపు చేయడం, రుణాలు పొందడానికే పరిమితం కాకూడదని జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా భావించారు. ‘ఇందిరా క్రాంతి’ పథం ద్వారా మహిళా సంఘాలకు ఆరు నెలల క్రితం ధాన్యం కొనుగోలు కేంద్రాలను అప్పగించారు. 192 ఐకేపీ కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకు అప్పగించగా 20లక్షల 25వేల 252 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి శభాష్ అనిపించుకున్నారు. రూ.6.80 కోట్ల ధాన్యం కమీష¯Œ ను సాధించారు.రైతుల ముంగిట్లోకి ఎరువులువానకాలం సాగులో రైతుల ముంగింట్లోకే ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా మహిళలకు ఎరువుల దుకాణాలను అప్పగించారు. ఇలా 23 కేంద్రాలను ఇప్పటికే జిల్లాలో ప్రారంభించారు. ప్రతి మండలానికి రెండేసి చొప్పున ఎరువుల దుకాణాలను మహిళా సంఘాలకు అప్పగించారు.అద్దెకు ఆర్టీసీ బస్సులుమహిళల భాగస్వామ్యంతో ఆర్టీసీకి సిరిసిల్ల జిల్లా నుంచి తొమ్మిది బస్సులను అందించారు. 9 మండలాల సమాఖ్యల ద్వారా రూ.6 లక్షల వాటా ధనంతో రూ.30 లక్షలతో ఒక్కో ఆర్టీసీ బస్సును మహిళలు అద్దెకు తీసుకున్నారు. మూడు నెలల క్రితం మొదలైన అద్దె బస్సులతో ప్రతి నెల రూ. 50వేల అద్దెను తొమ్మిది సమాఖ్యలు పొందుతున్నాయి.ఇక సోలార్ పవర్పెట్రోల్ బంక్‌లే కాదు సోలార్ విద్యుత్ ఉత్పత్తి బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించనున్నారు. ముష్టిపల్లి, ధర్మారంలో భూసేకరణ పూర్తిచేయగా, జిల్లా సమాఖ్య ద్వారా రూ.3కోట్ల పెట్టుబడితో సోలార్ ΄్లాంట్లను ఏర్పాటు చేసే పనులు సాగుతున్నాయి. – అవధూత బాలశేఖర్, సాక్షి, ముస్తాబాద్, గంభీరావుపేట, సిరిసిల్లఉపాధి పొందుతున్నాంమేము నాలుగు నెలల క్రితం వరకు ధాన్యం కొనుగోళ్లు చేశాం. మా వీవోకు రూ.4.29లక్షల కమిషన్ వచ్చింది. పదిమందికి పని లభించింది. ‘కుట్టు’తో స్వశక్తి మహిళలు ఉపాధి పొందుతున్నారు. గత ఏడాదిగా స్వశక్తి మహిళలు జిల్లాలో స్కూల్ యూనిఫామ్స్ కుడుతున్నారు. మా ఊళ్లో కూడా యూనిఫామ్స్ కుడుతున్నాం. ఇప్పుడు ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నాం.– పందిర్ల సునీత, ఆవునూర్ఎంతో గర్వంగా ఉందిపెట్రోల్ బ్యాంక్‌ల నిర్వహణ అనేది మా సంఘానికి సంబంధించి పెద్ద మలుపు. మాకు ఎంతో గర్వంగా ఉంది. ఇప్పటివరకు మేము గృహిణులుగా ఇంటికే పరిమితమయ్యాం. పెట్రోల్ బంక్ నిర్వహణను సవాల్‌గా తీసుకొని విజయవంతంగా కొనసాగిస్తామనే ధీమాతో ఉన్నాం. – సుభద్ర, అధ్యక్షురాలు, శ్రీ షిర్డీ సాయిబాబా గ్రామైక్య సంఘం, లింగన్నపేటమహిళా శక్తిని చాటారుఇందిరా మహిళా శక్తి ద్వారా జిల్లాలో అనేక కార్యక్రమాలను చేపట్టాం. క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, ఎరువుల దుకాణాలు, ఆర్టీసీ బస్సులు ్ర΄ారంభించాం. త్వరలో రైస్‌మిల్లులు, సోలార్ ΄్లాంట్లను మహిళలకు అందజేస్తాం. – సందీప్‌కుమార్ ఝా, జిల్లా కలెక్టర్ -
అమ్మకూ అమృతమే!
చాలా మంది మహిళల్లో పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ వల్ల హార్మోన్ల స్థాయిలలో హెచ్చు తగ్గులు ఏర్పడుతుంటాయి. ప్రసవం అయ్యాక బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం ద్వారా అమ్మకు హార్మోన్లలో సమతుల్యత ఏర్పడుతుందంటున్నారు నిపుణులు. అంతేకాదు, పీసీఓఎస్ సమస్య ఉన్నవాళ్లు ఎలాంటి ఆందోళన పడకుండా తల్లి పాలు ఇవ్వడం ఆమె ఆరోగ్యానికీ మేలు చేస్తుంది అంటున్నారు.పీసీఓఎస్ అనేది సంతానోత్పత్తికి, ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే సాధారణమైన హార్మోన్ల రుగ్మత. ఈ సమస్య ఉన్నa స్త్రీలలో ప్రోజెస్టెరాన్ తక్కువ స్థాయిలో ఉంటుంది. ఈ హార్మోన్ రొమ్ము కణజాల అభివృద్ధికి అవసరం. ఈ కణజాలం తగినంతగా లేకపోవడం అలాగే ఈస్ట్రోజెన్ లేదా టెస్టోస్టెరాన్ స్థాయులు ఎక్కువగా ఉండటం వల్ల పాల ఉత్పత్తి తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇన్సులిన్ నిరోధకత, థైరాయిడ్ సమస్యలు వంటి కారణాల వల్ల తక్కువ పాల ఉత్పత్తి ఉండవచ్చు. ఇలాంటప్పుడు తల్లి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. తల్లికి మంచి గైడెన్స్, కుటుంబ మద్దతు, ఆరోగ్యకరమైన అలవాట్లతోపాటు బిడ్డకు చనుబాలు ఇవ్వడం వల్ల అమ్మలో పాలు ఊరటం పెరుగుతుంది. దీనివల్ల తిరిగి హార్మోన్లలో సమతుల్యత ఏర్పడుతుంది. ప్రసవం నుంచి త్వరగా కోలుకోవడమూ జరుగుతుంది.హార్మోన్ల స్థాయులను ఎలా ప్రభావితం చేస్తాయంటే... బిడ్డకు పాలిచ్చేటప్పుడు తల్లిలో ఆక్సిటోసిన్, ్రపోలాక్టిన్ ఉత్పత్తి పెరుగుతాయి. ఈ హార్మోన్లు పాల ఉత్పత్తితో పాటు తల్లీ–బిడ్డ బంధం, మానసిక ఆరోగ్య శ్రేయస్సుకు సహాయపడతాయి. పీసీఓఎస్ ఉన్న మహిళ తల్లి అయ్యి, పాలు బిడ్డకు ఇస్తుంటే ఆ తల్లిల్లో టెస్టోస్టెరాన్ స్థాయులు తగ్గవచ్చు. ఆక్సిటోసిన్ గర్భాశయం సంకోచించడానికి, ప్రసవం తర్వాత దాని సాధారణ పరిమాణానికి తిరిగి రావడానికి తోడ్పడుతుంది.తల్లీ–బిడ్డ బంధాన్ని మెరుగుపరిచి, ఒత్తిడిని తగ్గిస్తుంది. రక్తంలో షుగర్ లెవల్స్ సమస్థాయిలో ఉండి, పెరిగిన బరువును ప్రసవం తర్వాత తగ్గడానికి సహాయపడుతుంది. పీసీఓఎస్ ఉండి, తల్లిపాలు ఇవ్వడంలో రకరకాల సవాళ్లు ఉంటాయి. కానీ చాలా మంది మహిళలు బిడ్డకు పాలు ఇవ్వగలుగుతారు. ఆరోగ్యకరమైన జీవనశైలితో మంచి ప్రయోజనాలను పొందవచ్చు.ఆందోళన పడవద్దుతల్లిపాలు ఇవ్వడం ద్వారా పీసీఓఎస్ లక్షణాలు తిరిగి రావడంలో జాప్యం జరుగుతుంది. అయితే, తల్లిపాలు ఇవ్వడం ఆగిపోయిన తర్వాత, హార్మోన్ స్థాయులు మారినప్పుడు పీసీఓఎస్ లక్షణాలు తిరిగి వచ్చే అవకాశాలూ ఉన్నాయి. పీసీఓఎస్ ఉన్నవాళ్లలో తక్కువ పాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ, తల్లి ఆందోళన పడకుండా వైద్యులను సంప్రదిస్తే పాలు రావడానికి రొమ్ముకు మందులు సూచిస్తారు. తల్లిపాలు తగ్గడానికి పీసీఓస్ మాత్రమే కారణం అని చెప్పలేం. మానసిక ఒత్తిడి, ఆందోళన వల్ల కూడా పాలు తక్కువ వస్తాయి. ఓపిక పట్టాలి.అలాగని, కొన్ని రోజుల తర్వాత పాలు సరిపడా వస్తాయిలే అని జాప్యం చేయకూడదు. పోషకాహారం, వాడుతున్న మందుల విషయంలో ఉన్న సవాళ్లు, మానసిక సమస్యలను కూడా పరిష్కరించుకోవాలి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి తల్లులకు జ్వరాలు, ఇన్ఫెక్షన్ సమస్యలు కూడా ఉంటాయి. ఇలాంటప్పుడు నిర్లక్ష్యం చేయకుండా లాక్టేషన్ నిపుణులు లేదా వైద్యుల సలహా పాటించాలి. – డాక్టర్ మనోరమ, గైనకాలజిస్ట్, ఖమ్మం -
కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న మహిళా సైనికురాలు.. కారణం ఏంటంటే?
చెన్నై: ఓ మహిళా సైనికురాలు కన్నీరుమున్నీరలయ్యేలా విలపిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘తాను దేశ రక్షణ కోసం విధులు నిర్వహిస్తుండగా.. తన ఇంట్లో దొంగతనం జరిగిందని వాపోయారు. అగంతకులు తన పెళ్లికోసం కొనుగోలు చేసిన బంగారంతో పాటు ఇతర ఖరీదైన వస్తువులు దోచుకెళ్లారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. తమిళనాడులోని నారాయణపురం గ్రామానికి చెందిన కళావతి జమ్మూ కశ్మీర్లో సీఆర్పీఎఫ్ జవానుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె జమ్మూకశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తుండగా.. జూన్ 24న నారాయణపురం తన గ్రామంలోని ఇంట్లో దొంగతనం జరిగింది.ఇదే విషయాన్ని కన్నీటి పర్యంతం అవుతూ ఓ వీడియో తీశారు. ఆ వీడియోలో వ్యవసాయం నిమిత్తం నాతల్లిదండ్రులు పొలానికి వెళ్లారు. ఆ సమయంలో అగంతకులు నా ఇంటి తాళం పగలగొట్టి, నా పెళ్లి కోసం దాచుకున్న ఆభరణాలన్నీ దొంగిలించారు. దొంగతనం జరిగిన రోజైన జూన్ 24న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ జూన్ 25న ముఖ్యమంత్రి భద్రతా విధుల్లో ఉన్నారని ఎవరూ దర్యాప్తుకు రాలేదు. తర్వాత వేలిముద్రలు సేకరించి జూన్ 28న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు’అని కళావతి వీడియోలో పేర్కొన్నారు.ఆ వీడియో వైరల్‌గా మారింది. సైనికురాలి వీడియోను తమిళనాడు బీజేపీ నేత అన్నామలై షేర్ చేస్తూ డీఎంకే ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. దేశాన్ని కాపాడే సైనికురాలి పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. అయితే,ఆ వీడియోపై వెల్లూరు జిల్లా పోలీసులు స్పందించారు.జూన్ 24న కళావతి తండ్రి కుమారసామి తన ఇంట్లో జరిగిన దొంగతనం గురించి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు ప్రకారం, కళావతి పెళ్లి కోసం పక్కన ఉంచిన 15 తులాల బంగారు ఆభరణాలు, రూ.50,000 నగదు, ఒక పట్టు చీర దొంగతనం జరిగింది. జూన్ 25న భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, వేలిముద్రల నమూనాలు సీసీటీవీ ఫుటేజ్‌లను సేకరించామని పోలీసులు తెలిపారు.అనుమానితుల సెల్‌ఫోన్ కాల్ డేటా రికార్డులను (CDRలు) తిరిగి పొందడానికి వారు టవర్ డంప్ టెక్నాలజీని కూడా ఉపయోగించారు. జూన్ 29న, ఫిర్యాదుదారుడు తన ప్రకటనను సవరించి దొంగిలించబడిన ఆభరణాల బరువు 22.5 తులాలని చెప్పినట్లు తెలిసింది. ఈ వివాదంలో నిజమెవరిదో తేలాలంటే, విచారణ పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే. A CRPF jawan from Tamil Nadu, serving with honour at our nation’s borders in J&K, is forced to take to social media on police inaction on the case of jewellery theft from her residence near Katpadi in June this year. What kind of governance forces a woman in uniform to beg for… pic.twitter.com/BnU6WtT99l— K.Annamalai (@annamalai_k) August 4, 2025 -
పనికిమాలినదానా... నీకు గంగజాతరే..
సాక్షి, అమరావతి: అధికారం మత్తులో టీడీపీ నాయకులు సభ్యత, సంస్కారం, విచక్షణ కోల్పోయి మహిళలను బూతులు తిడుతూ బెదిరిస్తున్నారు. తాజాగా చిత్తూరు నగరానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు షణ్ముగం అదే నగరానికి చెందిన వైఎస్సార్సీపీ మహిళా నాయకురాలికి ఫోన్‌చేసి తీవ్రంగా దుర్భాషలాడాడు. పనికిమాలినదానా.. నీకు గంగజాతరే.. అంటూ హెచ్చరించారు. ఆయన మాట్లాడిన మాటలు సోమవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బంగారుపాళెం పర్యటనలో పాల్గొన్న వారిలో కొందరిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే.జైలులో ఉన్న వారిని శనివారం వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి తదితరులు వెళ్లి పరామర్శించారు. దీనిపై టీడీపీ నాయకుడు షణ్ముగం విలేకరుల సమావేశం పెట్టి వైఎస్సార్సీపీ శ్రేణులపై ఆరోపణలు చేశారు. అతని ఆరోపణలను వైఎస్సార్సీపీ వారు సోషల్ మీడియా వేదికగా ఖండించారు. అందులో వైఎస్సార్సీపీ మహిళా విభాగం నాయకురాలు కూడా ఉన్నారు. ఆమె ఖండించడాన్ని జీరి్ణంచుకోలేని టీడీపీ నేత షణ్ముగం ఫోన్‌చేసి పత్రికలో రాయలేని పదజాలంతో దూషించాడు. టీడీపీ నేత బూతుపురాణం ఇలా... షణ్ముగం: హలో.. ఏంటీ విషయం.. మహిళా నాయకురాలు: మీరు చెప్పాలి.. మమ్మల్ని అడుగుతున్నారు.. ఏంటీ విషయమని.. షణ్ముగం: ఏమీ ఎక్కువ పెడుతున్నావ్.. ఏం కథా.. మహిళ: మీరు ఎక్కువ పెట్టలేదా? భయపడాలా ఎట్లా.. ప్రశి్నంచాం. ధైర్యముంటే సమాధానం చెప్పాలి. మీరెవ్వరూ మా నాయకులు (మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, చిత్తూరు సమన్వయకర్త విజయానందరెడ్డి) గురించి మాట్లాడడానికి? షణ్ముగం: పత్రికలో రాయలేని భాషలో బూతుపురాణం అందుకున్నాడు. నీవు ఎలాంటి పనికిమాలినదానివో. ఎందుకు కౌంటర్ ఇచ్చావ్.. లం.. ముండవు నువ్వు. నీది బ్రోకర్ బతుకే. లం..దానివి. నీ బతుకంతా టూటౌన్ సీఐ చెబుతున్నాడు. లం.. నీ.. ఫోన్ పెట్టవే. నిన్నేమైనా మీ నాయకుడు.. అంటూ రాయలేని భాషలో బూతుపురాణం అందుకున్నాడు. మహిళ: నువ్వు ఎన్ని మాట్లాడినా వెంట్రుక కూడా పీకలేవ్. నీవెంతా...నీ బతుకెంతా. రెండో వాయిస్ రికార్డు షణ్ముగం: హలో..(మర్యాదగా) మహిళ: ఇంతసేపు ఎలా అలా మాట్లాడావ్.. నేను మిమ్మల్ని మీరు అని మాట్లాడాను. నన్ను ఎలా ఆ పదంతో మాట్లాడావ్. షణ్ముగం: వాట్సాప్‌లో గ్రూప్ ఎందుకు కౌంటర్ మెసేజ్‌లు ఎందుకు పెడుతావ్. మహిళ: టీడీపీలో నీకు సభ్యత్వం ఉందా. పార్టీలో నువ్వు ఉన్నావా. నువ్వు ఎందుకు మా నాయకుల పేరు ఎత్తుతావ్. మా నాయకుల దగ్గర డబ్బులు తీసుకోలేదా..? నీకేదైనా అయితే టీడీపీ వచ్చిందా? సంస్కారం అనేది మనిషిలో ఉండాలి. కూతురును పోగొట్టుకున్నావ్. ఇంకో ఆడబిడ్డ గురించి అలా ఎలా మాట్లాడుతావ్? నువ్వు నన్ను అంటే.. నేను నిన్ను అంటా. నువ్వు బూతులు మాట్లాడితే..నేను బూతులు మాట్లాడుతా. షణ్ముగం: టీడీపీకి నేను లైఫ్ టైం మెంబర్‌ను. వాళ్ల గురించి వీళ్ల గురించి ఎలా మాట్లాడుతావ్. మహిళ: అన్నీ కల్పించుకొని మాట్లాడొద్దు. మర్యాదగా సార్ అని వాట్సాప్‌లో సమాధానం ఇచ్చా. నీవు ఎలా ముండా.. ముండా.. అని రిప్లై ఇస్తావ్. వయస్సుకి మర్యాద ఇచ్చా. నిన్ను ప్రశ్నిస్తే ముండలా? షణ్ముగం: నీకు చిత్తూరు గంగజాతరే... మహిళ: చిత్తూరు గంగజాతరా కాదు. తిరునాళ్లు చేసుకో.. అంటుండగా షణ్ముగం ఫోన్ కట్ చేశాడు. -
ప్రజ్వల్‌కు సరైన శిక్ష
డబ్బూ పలుకుబడీ జతగూడితే ఎన్ని నేరాలకు కారణమవుతుందో, ఎన్ని వికారాలకు ఆస్కార మిస్తుందో దాదాపు ఇరవయ్యేళ్లక్రితం అమెరికాలో ప్రముఖ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎపిస్టిన్ ఉదంతం రుజువు చేసింది. ఈ రెండింటికీ రాజకీయాధికారం తోడైతే ఏమవుతుందో కర్ణాటక జేడీఎస్ మాజీ ఎంపీ, మాజీ ప్రధాని దేవెగౌడ మనుమడు ప్రజ్వల్ రేవణ్ణ నిరూపించారు. ఒక మహిళపై అత్యా చారం చేసిన కేసులో ప్రజ్వల్‌కు యావజ్జీవ శిక్ష విధిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రజ్వల్ ఒక రాజకీయ నాయకుడే కాక మాజీ ప్రధాని దేవె గౌడకు మనుమడు కావటం, తండ్రి మాజీ మంత్రి, ఎమ్మెల్యే అవడం, అతని బాబాయ్ కుమార స్వామి లోగడ ముఖ్యమంత్రిగా పనిచేయటంతోపాటు ప్రస్తుతం కేంద్రమంత్రిగా వుండటం, తమ్ముడు ఎమ్మెల్సీ కావటం వంటివి ఈ సంచలనానికి కారణమైతే కావొచ్చు గానీ... అంతకన్నా ఎక్కువగా ప్రజ్వల్ దురంతాలు ప్రజల్ని దిగ్భ్రాంతిపరచటం అసలు కారణం. ఒకరు కాదు... ఇద్దరు కాదు, పదులకొద్దీ మంది ప్రజ్వల్ అఘాయిత్యాలకు బలైపోయారు. అతని ఘోరాలకు సంబంధించి 3,000 వీడియోలు ప్రచారంలోకొచ్చాయంటే అతని దుర్మార్గం ఎంతటిదో ఊహించవచ్చు. తమనేమీ చేయొద్దని, కనికరించి వదిలేయాలని బాధిత మహిళలు వేడు కోవటం వంటి హృదయవిదారక దృశ్యాలు ఈ వీడియోల్లో ఉన్నాయంటున్నారు. తన ఘన కార్యాన్ని తానే వీడియో తీసి బాధితుల్ని బ్లాక్మెయిల్ చేయటం ప్రజ్వల్‌కు అలవాటు. ఆ వీడియోలు, ఫొటోలు చూసి 70 మంది బాధిత మహిళలను గుర్తించగలిగినా వారిలో కేవలం అయిదుగురు మాత్రమే ఫిర్యాదులీయటానికి ముందుకొచ్చారు. అందులో ఒక కేసులో ప్రస్తుతం ప్రజ్వల్‌కు శిక్షపడింది. ఈ నేరాలు గుట్టుచప్పుడు కాకుండా జరగలేదు. కుటుంబంలో వీటికి సంబంధించి తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధాలవుతున్నాయని మీడియాలో కథనాలొచ్చాయి. కానీ ప్రజ్వల్‌ను చట్టానికి అప్పగించాలని కుటుంబంలో ఏ ఒక్కరూ భావించకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. అంతే కాదు... ప్రజ్వల్ తల్లిదండ్రులు బాధితుల్ని బెదిరించిన వైనం వెల్లడైంది. శిక్ష తప్పదనుకున్న ప్రజ్వల్ కొన్నాళ్లు విదేశాలకు పరారయ్యాడు. చిత్రమేమంటే ఇతర పార్టీలకు సైతం ఉప్పందినా అవి సైతం మౌనంగానే ఉన్నాయి. చివరకు ఒక మహిళా సంఘం ఫిర్యాదు చేయాల్సివచ్చింది. మరి పార్టీలున్నది దేనికి? ఆ ఫిర్యాదుపై రాష్ట్ర మహిళా కమిషన్ వేగంగా స్పందించి, డీజీపీకి ఆదేశాల్విటంతో అంతా బయటికొచ్చింది. రాజకీయంగా శక్తిమంతమైన కుటుంబంతో ఢీకొట్టి నట్టవుతుందని భయపడి బాధితుల్లో అత్యధికులు ఫిర్యాదు చేయటానికి ముందుకు రాలేదు సరి కదా... వారిలో చాలామంది ఏకంగా హసన్ నగరం నుంచి మకాం మార్చేశారు. ప్రఖ్యాత అమెరికన్ క్రిమినాలజిస్టు ఫ్రెదా అడ్లర్ ఒక సందర్భంలో బాధితులే దోషులుగా మారే ఏకైక నేరం అత్యాచారమేనన్నారు. బాధితులు ఎందుకంత భయపడ్డారో ఈ వ్యాఖ్యే చెబుతుంది. విచారణ పేరిట నిండు న్యాయస్థానంలో అవమానాలు పొంది, న్యాయమూర్తి నుంచే దుర్వా్యఖ్యానాలు ఎదురైన మహిళలు తక్కువేమీ కాదు. ఇందుకు మన దేశం కూడా మినహాయింపు కాదు.ఈ కేసులో నిష్పక్షపాతంగా వ్యవహరించి డీఎన్ఏ ఆధారాలతో సహా పకడ్బందీ సాక్ష్యాధా రాలు సేకరించినందుకు, త్వరితగతిన విచారణ పూర్తికావటానికి దోహదపడినందుకు కర్ణాటక పోలీసు విభాగాన్ని అభినందించాలి. ప్రజ్వల్ ఉదంతంలో వీడియోలను ప్రచారంలో పెట్టి బాధితుల్ని మరింతగా వేధించిన ఇతరులను సైతం బోనెక్కించాలి. డబ్బూ, పలుకుబడి గల నిందితు లకు శిక్ష పడేలా చేస్తే, సమాజంలో ఇతరులూ భయపడతారు. కర్ణాటకలో గతంలో కూడా కొందరు నాయకుల ఉదంతాలు వెల్లడైనా అవి పోలీసుల వరకూ రాలేదు. ఆ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాల్లో అభ్యంతరకర వీడియోలు వీక్షిస్తూ ఎమ్మెల్యేలు లైవ్ కెమెరాలకు చిక్కిన సందర్భాలు న్నాయి. బలహీనులపై అధికారం చలాయించటం, వారిని కనీసం మనుషులుగా గుర్తించక పోవటం స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా మన దేశంలో యథేచ్ఛగా సాగిపోతోంది. ఆ బలహీనులు మహిళలైతే ఇక చెప్పేదేముంది? వందలమంది బాలికలపైనా, మహిళలపైనా లైంగిక నేరాలకు పాల్పడిన ఎపిస్టిన్ 2019లో న్యాయ విచారణ మొదలుకావడానికి ముందే నిర్బంధంలో ఉండగా ఆత్మహత్య చేసుకున్నాడు. అతగాడికి ఒకప్పుడు సన్నిహితులైన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, బ్రిటిష్ రాజవంశీకుడు ప్రిన్స్ ఆండ్రూ తదితరుల్ని ఆ పాపం ఇప్పటికీ వెన్నాడుతోంది. ట్రంప్ అయితే తరచూ సంజాయిషీ ఇచ్చుకోక తప్పడం లేదు. మన దేశంలో కూడా మహిళలపై నేరాలు చేసే బడాబాబులు కటకటాల వెనక్కిపోయినప్పుడే నిజమైన న్యాయం, ప్రజాస్వామ్యం వర్ధిల్లుతున్నట్టు లెక్క! -
ఎంఎస్ఎంఈల్లో.. మహిళా శక్తి
భారతీయ మహిళా వ్యాపారులు పారిశ్రామిక రంగంలోనూ గణనీయమైన పురోగతి సాధిస్తున్నారు. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ఏర్పాటు, నిర్వహణలో వారు కీలకపాత్ర పోషిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎంఎస్ఎంఈల్లో సుమారు 40 శాతం కంపెనీలకు యజమానులు మహిళలే కావడం విశేషం. అత్యధికంగా 30 లక్షలపైచిలుకు మహిళా పారిశ్రామికవేత్తలతో దేశంలో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉంది. టాప్ – 10 రాష్ట్రాల జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలూ ఉన్నాయి.భారత్‌లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగం ముఖ్య భూమిక పోషిస్తోంది. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో 45%, మొత్తం ఎగుమతుల్లో 45% వాటా ఎంఎస్ఎంఈలదే అంటే ఇవి ఏ స్థాయిలో పురోగతి సాధించాయో అర్థం చేసుకోవచ్చు. జీడీపీలో ఎంఎస్ఎంఈల వాటా 37.54%కి చేరింది. దేశవ్యాప్తంగా 2025 జూలై 24 నాటికి 6,57,97,647 ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. వీటిలో 39.59 శాతం కంపెనీలకు యజమానులు మహిళలే. దేశంలోని మొత్తం ఎంఎస్ఎంఈల్లో సూక్ష్మ, చిన్న తరహావే 99.99%. సూక్ష్మ కంపెనీల్లో 39.79 శాతం, చిన్న తరహా కంపెనీల్లో 11.63 శాతం మహిళలు నెలకొల్పినవి ఉన్నాయి.ప్రభుత్వ ప్రోత్సాహంతో..ప్రధాన మంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (పీఎంఈజీపీ) సూక్ష్మ సంస్థల ఏర్పాటుకు మద్దతు ఇవ్వడం ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తోంది. 2008లో ప్రారంభమైన నాటి నుండి ఇది 9.87 లక్షలకు పైగా యూనిట్లకు సహాయం అందింది. 2023 సెప్టెంబర్‌లో రూ.13,000 కోట్ల వ్యయంతో ప్రారంభించిన పీఎం విశ్వకర్మ పథకం సంప్రదాయ చేతివృత్తుల వారి నైపుణ్యాలను, మార్కెట్‌తో అనుసంధానించడంలో కీలకపాత్ర పోషిస్తోంది. 2025 జూన్ 26 నాటికి ఈ పథకం లబ్ధిదారుల సంఖ్య 30 లక్షలు దాటింది.2020లో ప్రవేశపెట్టిన ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఎంఎస్ఎంఈలకు ఉచిత, పేపర్ రహిత రిజిస్ట్రేష¯Œ కు వీలు కల్పిస్తోంది. అనధికారిక వ్యాపారాలకు అధికారిక ప్రయోజనాలను విస్తరించడానికి ఉద్యమ్ అసిస్ట్ ప్లాట్‌ఫామ్ 2023లో అందుబాటులోకి వచ్చింది. ఎంఎస్ఎంఈ రంగంలో మహిళలను ప్రోత్సహించేందుకు, వారికి మార్గదర్శనం చేసేందుకు ‘యశస్విని’ అనే కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించింది.మార్కెట్ అనుసంధానాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు వినియోగించే వస్తు, సేవల్లో 25 శాతం సూక్ష్మ, చిన్న సంస్థల నుండి సేకరించాలని ప్రభుత్వ సేకరణ విధానం నిర్దేశించింది. దీనికింద ఇందులో 3 శాతం మహిళల యాజమాన్యంలోని వ్యాపారాల నుండి కొనుగోలు చేయాలి. ఇలాంటి అనేక కార్యక్రమాలతో మహిళలు ఈ రంగంలో దూసుకుపోతున్నారు.ఉద్యోగాల్లో 18.73%ఉపాధి: ఎంఎస్ఎంఈలకు సంబంధించిన ఉద్యమ్ పోర్టల్‌లో నమోదిత మహిళా వ్యాపారులు ఏర్పాటు చేసిన యూనిట్ల ద్వారా సృష్టించిన ఉద్యోగాలు.. మొత్తం ఉద్యోగాల్లో సుమారు 18.73%పెట్టుబడి: మొత్తం పెట్టుబడిలో మహిళల యాజమాన్యంలోని ఎంఎస్ఎంఈల వాటా 11.15%టర్నోవర్: మొత్తం టర్నోవర్‌లో వాటా 10.22%కేంద్రం విడుదల చేసిన ‘ఎమ్ఎస్ఎమ్ఈ వార్షిక నివేదిక 2024–25’ ప్రకారం..⇒ ఎమ్ఎస్ఎమ్ఈలు.. వ్యవసాయం తరవాత అతిపెద్ద ఉద్యోగ కల్పనా రంగం.⇒ మొత్తం సృష్టించిన ఉద్యోగాలు 24.4 కోట్లు⇒ మొత్తం ఎమ్ఎస్ఎమ్ఈల్లో సూక్ష్మ పరిశ్రమలు 98.6 శాతం.⇒ 2024 డిసెంబరు 31 నాటికి.. మొత్తం ఎమ్ఎస్ఎమ్ఈల్లో మహిళలు యజమానులుగా ఉన్న వాటి శాతం 28.8. -
టీడీపీ ఎమ్మెల్యే నసీర్ రాసలీలలు
సాక్షి టాస్క్‌ఫోర్స్: గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అహ్మద్ (టీడీపీ) ఓ మహిళతో మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. గతంలో టీడీపీ కార్పొరేటర్ పదవికి పోటీ చేసిన ఒక మహిళతో వీడియోలో చెప్పలేని రీతిలో సైగలు చేస్తూ వ్యవహరించిన తీరు తేటతెల్లమైంది. సదరు మహిళ రైలులో ప్రయాణిస్తుండగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తన కార్యాలయంలో ఉండి వీడియో కాల్చేసి మాట్లాడినట్టు స్పష్టమవుతోంది.ఎమ్మెల్యే నసీర్, ఆ మహిళ వ్యవహరించిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజాప్రతినిధి అయి ఉండి ఈ రకంగా రాసలీలలు చేస్తున్న ఎమ్మెల్యే నసీర్ తీరుపై మహిళా లోకం దుమ్మెత్తి పోస్తోంది. ఆ వీడియోలో ఆడియో వినపడకపోయినా ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు స్పష్టంగా తెలుస్తోంది. -
'ఏం ప్రేమ రా నీది'..! ఏకంగా 43 సార్లు..
ఎన్నో ప్రేమకథలు గురించి విని ఉండి ఉంటారు. ఇలాంటి వెరైటీ లవ్‌స్టోరీ మాత్రం విని ఉండరు. ఎవ్వరైన నచ్చిన అమ్మాయి/అబ్బాయికి ఓకే చెప్పేందుకు ట్రై చేయడం, నిరీక్షించడం కామన్. కానీ మరి ఇన్నిసార్లు మాత్రం ప్రపోజ్ చెయ్యరు. ఒక్కసారి రిజెక్ట్ చేస్తేనే.. గుండెపగిలిపోయినంతగా బాధపడతారు ప్రేమికులు. ఆ తర్వాత రాను.. రాను.. లైట్ అనుకుంటారు. కానీ ఈ వ్యక్తి అలాంటి ఇలాంటి ప్రేమికుడు కాదు. తన ప్రియురాలు చేత ఓకే చెప్పించేంత వరకు ఎన్ని సార్లు ప్రపోజ్ చేశాడో వింటే నోరెళ్లబెడతారు. ఇంతలానా బాస్ అంటారు.ఏడేళ్ల ప్రణయ ప్రేమకథ ఇది. ఏదో కాంపిటీటివ్ ఎగ్జామ్ ఫెయిలైతే ట్రై చేసినట్లుగా లవ్ ఎగ్జామ్ రాశాడు మనోడు. యూఎస్‌కు చెందిన 36 ఏళ్ల ల్యూక్ వింట్రిప్ తన స్నేహితురాలు సారాను 2018లోనే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అయితే ఆమె అస్సలు అతడి లవ్‌ని అంగీకరించలేదట. అలా అని అక్కడితో వదిలేయలేదు ల్యూక్. ఆమె ఓకే అనేంత వరకు తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఏదో రెండు, మూడు, ఐదు సార్లు కాదు ఏకంగా 42 సార్లు ల్యూక్ ప్రపోజల్‌ని స్నేహితురాలు రిజెక్ట్ చేస్తూనే వచ్చింది. అయినా సరే పట్టువదలని విక్రమార్కుడిలో ఈసారి కాకపోయినా..మరోసారి అయినా తన దేవత అంగీకరించపోతుందా అని ఆశగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు ల్యూక్. ఏమైతేనేం..43సారి తన స్నేహితురాలు సారా చేత 'యస్' అనిపించుకున్నాడు. ఈ ఏడాది(2025)కి తన అమర ప్రేమను పెళ్లిపీటల వరకు తీసుకొచ్చాడు. చెప్పాలంటే అతడిలా ఏ లవర్ అన్నిసార్లు ప్రపోజ్ చేసి ఉండడు. నిజంగా అతడు గిన్నిస్ వరల్డ్ రికార్డులకి ఎక్కాల్సిందే ఈ విషయంలో. అతడి భాగస్వామి సారా కూడా అలానే అంటూ అతడిని ఆటపట్టిస్తోందామె. అయితే సారా కూడా ల్యూక్ని తొలిచూపులోనే ప్రేమించింది కానీ ఆమెకు అప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉండటంతో వెంటనే అంగీకరించలేకపోయింది. అదీగాక విడాకులు తీసుకుని ఉండటంతో మరొసారి వైవాహిక బంధం అనగానే ఆమెకు ఒక విధమైన భయం, ఆందోళన వెంటాడంతో ల్యూక్ ప్రేమను అంగీకరించలేకపోయిందట. ఏదిఏమైతేనేం తన ప్రియురాలి మనసు కరిగేలా చేసి తన ప్రేమను గెలుపించుకున్నాడు ల్యూక్. ఇక్కడ సారా తన పిల్లలు, బంధువులు అంగీకరించాక..ఎలాంటి సమస్యలు ఉండవని నిర్థారించుకున్నాక..అతడికి ఓకే చెప్పిందట. అంతేకాదండోయ్ ల్యూక్ తన ప్రేమను గెలిపించుకునే ప్రయత్నంలో ఆమెకు రకరకాలుగా ప్రపోజ్ చేసేవాడట. దాని కోసం అతడు పడిన పాట్లు అన్ని ఇన్నీ కావట కూడా. ఇక 43వ సారి టైం కీపింగ్ నావిగేషన్ గ్రీన్విచ్కు తీసుకెళ్లి మరీ ప్రపోజ్ చేశాడట ప్రియురాలు సారాకు. "ఈ ప్రదేశం టైంకి సంబంధించిన ప్రపంచ కేంద్రం అయితే ..నువ్వు నా ప్రపంచానికి కేంద్రానివి, అందుకే మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా" అంటూ భావోద్వేగంగా ప్రియురాలికి ప్రపోజ్ చేశాడట. అతడి మాటలకు ఉప్పొంగిన కన్నీళ్లతో అంగీకరించా అంటూ తన ప్రేమకథను గుర్తుచేసుకుంది సారా. అతడి ఓపికకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే, నిజంగా అతడు గొప్ప ప్రేమికుడు అంటూ ప్రియుడు ల్యూక్‌పై ప్రశంసల వర్షం కురిపించేసింది సారా.(చదవండి: డాగ్ థెరపీ.. ! 'ఒత్తిడికి బైబై'..) -
ఆగని టీడీపీ నేత అకృత్యాలు
చిలమత్తూరు: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు అధికారం అండతో రెచ్చిపోతున్నారు. వారి ఆగడాలు, అకృత్యాలపై ఫిర్యాదు చేసిన బాధితులను మరింతగా వేధిస్తున్నారు. టీడీపీ హిందూపురం నాయకుడు యుగంధర్ అలియాస్ చింటు స్థానిక ప్రభుత్వాస్పత్రిలో పారిశుద్ధ్య కారి్మకురాలిని వేధించిన ఆడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో టీడీపీ నేతల తీరుపై వైఎస్సార్సీపీ మహిళా విభాగం తీవ్రంగా స్పందించి బాధిత మహిళకు అండగా నిలిచింది. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.ఈ నేపథ్యంలో టీడీపీ మొక్కుబడి చర్యగా ఆడియోలో మాట్లాడిన కగ్గల్లప్ప, అతడి సోదరుడు నగేష్ కు పార్టినుంచి సస్పెండ్ చేసి, ప్రధాన నిందితుడైన చింటును మాత్రం వదిలేసింది. ఇప్పుడు చింటు బాధిత మహిళపై ప్రతీకార చర్యకు దిగారు. ఆమెను ఊరి నుంచి ఖాళీ చేసేయాలని ఒత్తిడి తీసుకురావడంతో పాటు చంపేస్తానని బెదిరించారు. దీంతో ఆమె పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించింది. అక్కడా సీఐ స్పందించకపోవడంతో ఓ వీడియో ద్వారా తన ఆవేదనను బయటపెట్టింది. తనను చింటు వేధిస్తున్నాడని, ఇల్లు ఖాళీ చేయాలని బెదిరిస్తున్నాడని, పోలీసులు పట్టించుకోవడంలేదని వాపోయింది. చింటు తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని తెలిపింది. బాలకృష్ణ సపోర్ట్ చేస్తున్నారా? మహిళలను వేధించే నాయకులకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సపోర్ట్ చేస్తున్నారా అని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త టి.ఎన్.దీపిక ప్రశ్నించారు. ఆమె సోమవారం మీడియాతో మాట్లాడుతూ అధికార మదంతో మహిళను ఉద్యోగం నుంచి తొలగించి, లైంగిక వేధింపులకు పాల్పడిన టీడీపీ నేతలను జైలుకు పంపించాల్సింది పోయి.. నిందితుడైన వ్యక్తిని వెనకేసుకురావడం ఏమిటని నిలదీశారు. ఈ ఘటన జరిగిన తర్వాతే ఎమ్మెల్యే సతీమణి వసుంధరాదేవి హిందూపురంలో పర్యటించారని, నిందితుడి నుంచి బొకే తీసుకున్నారని గుర్తుచేశారు. అతడు మహిళను వేధించాడని తెలిసి కూడా చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. టీడీపీ కార్యకర్తలు మహిళల జోలికి వస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. బాధిత మహిళకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని ఆమె తెలిపారు.బాధితురాలి ఆత్మగౌరవం దెబ్బతీసేలా సీఐ ప్రవర్తనటీడీపీ నేత నుంచి లైంగిక వేధింపులకు గురైన మహిళ పేరు, ఆమె భర్త పేరు, నివాస ప్రాంతాన్ని ప్రస్తావిస్తూ హిందూపురం వన్‌టౌన్ సీఐ రాజగోపాల్‌నాయుడు వీడియో చేసి వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ కాపీలను కూడా జతచేసి పోస్ట్ చేయడం ద్వారా బాధితురాలి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా సీఐ వ్యవహరించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఐ రాజగోపాల్‌నాయుడు ఆది నుంచి టీడీపీకి అనుకూలంగా ఉంటూ ఆ పార్టీ లీడర్లా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాధితురాలి భద్రత, ఆత్మగౌరవాన్ని పట్టించుకోకుండా.. ఆమె గోప్యతకు భంగం కలిగిస్తూ టీడీపీ నేతల స్క్రిప్ట్ ప్రకారం నడుచుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
అతివలను.. నిలువనివ్వని కొలువు
దేశంలోని కార్మిక, నైపుణ్య (బ్లూ, గ్రే కాలర్) ఉద్యోగాలు చేస్తున్న మహిళల్లో సగం మందికి పైగా.. ఉద్యోగంలో చేరిన ఏడాది లోపే తమ ఉద్యోగాన్ని విడిచిపెట్టే ఆలోచనలో ఉంటున్నారని స్త్రీ సాధికార సంస్థ ‘ఉదయతి ఫౌండేషన్’, ఐటీ కంపెనీలకు ఉద్యోగులను సమకూర్చే ‘క్వెస్ కార్ప్’ కలిసి రూపొందించిన తాజా నివేదికలో వెల్లడైంది. రౌండేళ్లకు పైగా తమ ఉద్యోగాల్లో నిలదొక్కుకోగలిగిన మహిళల్లో ఉద్యోగం మానేయాలన్న తలంపు 3 శాతం మాత్రమే ఉండగా, ఒక ఏడాది కంటే తక్కువ కాలం ఉద్యోగం చేస్తున్న వారిలో ఇది 52 శాతంగా ఉందని నివేదిక తెలిపింది. ఉద్యోగంలో చేరిన కొత్తల్లో ఇంటా బయటా మహిళలు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిని ఈ ధోరణి తెలియజేస్తోందని నివేదిక పేర్కొంది.జీతం పెంచితే మళ్లీ వస్తాం..: 54 శాతం మంది మహిళలు తమ ఆదాయం ఏమంత సంతృప్తికరంగా లేదని చెప్పగా, వారిలో 80 శాతం మంది నెలకు రూ. 2,000 కంటే తక్కువ ఆదా చేయగలుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మెరుగైన జీతం ఉంటే మహిళలు ఉద్యోగం మానేయాలన్న భావనలో ఉండేవారు కాదని సర్వే చెబుతోంది. రూ. 20,000 కంటే ఎక్కువ సంపాదించే మహిళలు ఉద్యోగం మానేసే అవకాశం 21 శాతం తక్కువగా ఉండగా, పని మానేసి వెళ్లిన వారిలో 42 శాతం మంది తమకు మెుగైన వేతనాలు ఇస్తామంటే తిరిగి ఉద్యోగంలో చేరుతామని చెప్పినట్లు నివేదిక తెలిపింది.రిటైల్, వస్తు ఉత్పత్తి, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా వంటి రంగాలలో ప్రస్తుతం పని చేస్తున్న 10,000 మంది, గతంలో పనిచేసిన 1,500 మంది మహిళా కార్మిక ఉద్యోగులపై ఉదయతి, క్వెస్ కార్ప్ సర్వే నిర్వహించి ‘స్టేట్ ఆఫ్ ఉమెన్ ఇన్ ది బ్లూ–గ్రే కాలర్ వర్క్‌ఫోర్స్ 2025’ అనే పేరుతో ఈ నివేదికను రూపొందించాయి. తక్కువ జీతం, సదుపాయంగా లేని రోజువారీ ప్రయాణం, భద్రతా సమస్యలు, ఉద్యోగంలో ఎదుగుదలకు పరిమిత అవకాశాలు, అన్ని కలిసి మహిళా కార్మిక ఉద్యోగులు తమకు తాముగా ఉద్యోగం మానేసే పరిస్థితులను కల్పిస్తున్నాయని సర్వే స్పష్టం చేసింది. సురక్షితం కాని రాకపోకలు..: ప్రస్తుత మహిళా ఉద్యోగుల్లో 57 శాతం మంది నివాస స్థలానికి, పని ప్రదేశానికి మధ్య సజావైన రవాణా సదుపాయం లేక ఇబ్బంది పడుతున్నామని చెప్పారట. 11 శాతం మంది తమ ప్రయాణ మార్గంలో, ముఖ్యంగా రాత్రి షిఫ్ట్‌లలో సురక్షితంగా లేమని భావిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. చాలామంది హాస్టళ్లపై ఆధారపడతారు కానీ, ప్రయాణాల్లో మళ్లీ అదే భయం, అదే అభద్రత. ఉద్యోగం వదిలిపెట్టిన ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు, ఇంటికి దగ్గరగా ఉద్యోగావకాశం వస్తే తిరిగి ఉద్యోగానికి వెళ్తామని చెప్పారు.పని ప్రదేశంలో మహిళల భద్రత కూడా ఆందోళనకరంగానే ఉంది. 22 శాతం మంది మహిళలు పనిలో తాము సురక్షితంగా లేమని భావిస్తున్నారట. 28 శాతం మహిళలు.. ఎక్కువ గంటలు, కష్టతరమైన పరిస్థితుల వల్లే తాము ఉద్యోగం మానేశామని చెప్పారు. వారిలో మూడింట ఒక వంతు మంది తమకు ఒత్తిడిని తట్టుకునే శక్తి లేకపోవటమే కారణమన్నారు.67 శాతం మానేశారు⇒ బ్లూ–గ్రే ఉద్యోగాలలో ఉన్న ఎంట్రీ–లెవల్ మహిళల్లో సగం మంది ఒక సంవత్సరం లోపే ఉద్యోగ విరమణ చేయాలన్న ఆలోచనకు వచ్చేస్తున్నారు.⇒ 2020–21లో 16 శాతంగా ఉన్న బ్లూ–గ్రే కాలర్ ఉద్యోగాలలో మహిళల వాటా 2023–24లో 19 శాతానికి పెరిగినప్పటికీ, ‘పీరియాడిక్ లేబర్ ఫోర్స్’ సర్వే ప్రకారం, గత ఆరు నెలల్లో అనేక ప్రతిబంధకాల కారణంగా 67 శాతం మంది మహిళలు ఉద్యోగాలు మానేసి వెళ్లిపోయారు.ఆ 5 కీలకం⇒ మహిళల్ని ఉద్యోగం మానేయకుండా ఆపగలవని నివేదిక గుర్తించిన 5 అంశాలు...⇒ మెరుగైన వేతనం సురక్షితమైన ప్రయాణ సదుపాయం⇒ అనువుగా మార్చిన కార్యాలయ మౌలిక సదుపాయాలు⇒ స్పష్టమైన వృద్ధి అవకాశాలు⇒ అందరినీ కలుపుకొనిపోయే కార్యాలయ సంస్కృతిమహిళలు సామర్థ్యం లేకపోవడం వల్ల ఉద్యోగం మాని వెళ్లిపోవడం లేదు. వారికి తగినట్లుగా మనమింకా మౌలిక సదుపాయాలను కల్పించడం లేదు. వారి నుంచి అత్యుత్తమ ఫలితాలను సాధించటానికి అనువుగా పని ప్రదేశాలను మలుచుకోవడం లేదు. అందుకే వాళ్లు మధ్యలోనే ఉద్యోగం మానేస్తున్నారు– పూజా గోయల్, ఉదయతి ఫౌండేషన్ వ్యవస్థాపక సీఈఓఎదిగే అవకాశాలు అస్పష్టం..: కెరీర్లో ఎదుగుదలకు సంబంధించి స్పష్టమైన దారేదీ కనిపించక ఉద్యోగాన్ని వదిలేశామని 21 శాతం మంది మహిళలు తెలిపారు. ముఖ్యంగా బీ.ఎఫ్.ఎస్.ఐ. (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా) టెలికం రంగాల్లో ఎదుగుదల అవకాశాలు అస్పష్టంగా ఉన్నప్పుడు ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఆ ఉద్యోగంలో పనిచేసిన పోస్ట్ గ్రాడ్యుయేట్లలో ఉద్యోగ విరమణ చేసే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా ఉందని డేటా తెలిపింది. అయినప్పటికీ 11 శాతం మంది మహిళలు అదనపు నైపుణ్యాలలో శిక్షణ పొంది ఉద్యోగాలలో కొనసాగుతున్నారు. -
మహిళల శబరిమల గురించి తెలుసా? పురుషులకు నో ఎంట్రీ
Sabarimala of Women" మహిళల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. వారి కోసం ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతారని తెలుసు. కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో మహిళల కోసం ఏకంగా ఒక ఆలయమే ఉంది. పురాతన కథలు, మత సంప్రదాయాలకు ప్రసిద్ధిగాంచిన అట్టుకల్ భగవతి ఆలయం అది. భద్రకాళి దేవికి అంకిత మిచ్చిన ఈ ఆలయంలోని దేవేరిని అట్టుక్కల్ అమ్మగా పిలుస్తారు. ఆమె ఎంతటి రక్షకురాలో అంతటి విధ్వంసకురాలిగా భక్తులు భావిస్తారు. అత్యంత మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో స్త్రీలకు మాత్రమే ప్రవేశం. అందుకే ఈ ఆలయాన్ని ‘మహిళల శబరిమల’గా పిలుస్తారు. ఏటా పది రోజులపాటు నిర్వహించే అట్టుకల్ పొంగళ (Attukal Pongala) ఉత్సవంలో ఆడవాళ్లు మాత్రమే పూజాదికాలు నిర్వహిస్తారు. ఆ రోజుల్లో పురుషులను ఆలయ దరిదాపులకు కూడా రానివ్వరు.ఆలయ చరిత్రఒకానొక సాయంత్రం ఓ వ్యక్తి కిల్లియర్ నదిలో స్నానం చేస్తుండగా, ఒక బాలిక వచ్చి నది దాటడానికి సహాయం చేయాలని అడిగినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆమె ప్రవర్తనకు ముగ్ధుడైన ఆ వ్యక్తి బాలికను ఇంటికి ఆహ్వానించాడు. కుటుంబసభ్యులంతా చూస్తుండగానే ఆమె అదృశ్యమైంది. అదే రాత్రి ఆ వ్యక్తికి కలలో ఆమె దేవత రూపంలో కనిపించింది. సమీపంలోని అడవిలో మూడు గీతలు గీసిన చోట తన కోసం గుడి కట్టించాలని ఆదేశించింది. మర్నాడు ఆ వ్యక్తి ఆ ప్రదేశానికి వెళ్లి మూడు గీతలను చూశాడు. వెంటనే ఆ స్థలంలో ఒక ఆలయాన్ని నిర్మించడం ప్రారంభించాడు. అది పూర్తయ్యాక నాలుగు చేతులున్న దేవత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అలా అట్టుక్కల్ భగవతి ఆలయం వెలుగు చూసింది.ఆలయ నిర్మాణంకేరళ, తమిళనాడు రాష్ట్రాల శిల్పులు గుడి గోపురాన్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆలయ గోడలు, ప్రధాన ద్వారంపై∙మహిషాసురమర్దిని, కాళి, రాజరాజేశ్వరి, శివపార్వతుల దేవతా రూపాలను చక్కగా చెక్కారు. ఇంకా విష్ణుమూర్తి దశావతారాల కథలు కూడా తోరణంపై కనిపిస్తాయి. దక్షిణ గోపురంపై దక్షయజ్ఞం కథను చిత్రీకరించారు. ఆలయ ప్రాంగణంలో వినాయకుడు, శివుడు, నాగ దేవతల విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఆలయం లోపల రెండు దేవతా విగ్రహాలు ఉంటాయి. ఒకటి ఆభరణాలతో అలంకరించిన అసలు విగ్రహం, దాని వెనుక మరో విగ్రహం ఉంటాయి. ఆలయంలోకి ప్రవేశించగానే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. కణ్ణగిని అమ్మవారి అవతారంగా భావించి మహిళలు అత్యంత భక్తితో పూజిస్తారు.అట్టుక్కల్ పొంగళఏటా మార్చి నెలలో పది రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇది ఆలయంలో జరిగే అతి పెద్ద పండుగ. దీన్ని అట్టుకల్ పొంగళ అని పిలుస్తారు. దేశవ్యాప్తంగా దీనికి గుర్తింపు ఉంది. వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది మహిళలు ఇక్కడికొస్తారు. స్త్రీ దైవత్వాన్ని గౌరవించడానికి మగువలకు మాత్రమే ఆలయ ప్రవేశం కల్పిస్తారు. అంతేతప్ప పురుషుల పట్ల ఎలాంటి వివక్ష ఉండదు. ఆచార వ్యవహారాల్లో కేవలం మహిళల భాగస్వామ్యం కోసం మాత్రమేనని చెబుతారు. పేద, ధనిక, వివాహితులు, వితంతువులు అనే తేడా లేకుండా మహిళలందరూ బియ్యం, బెల్లం, కొబ్బరి ఉపయోగించి తీపి పొంగలిని కట్టెలపొయ్యిపై కుండల్లో వండి భగవతిదేవికి నైవేద్యం సమర్పిస్తారు. మహిళా శక్తిని ప్రదర్శించడానికి వనితలు దీన్ని వేదికగా మలచుకుంటారు. ఒక మహిళ తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడం కోసం చేసిన పోరాటానికి ప్రతీక ఈ వేడుక అని పురాణ గా«థ ఒకటుంది. 2009లో గిన్నిస్ రికార్డుల్లోకి సయితం ఎక్కింది. ఒకే రోజు 25 లక్షల మందికి పైగా మహిళలు పాల్గొన్న మతపరమైన సమావేశంగా గిన్నిస్ బుక్ గుర్తించడం విశేషం. ఈ వేడుకకు కేరళ రాష్ట్ర ఆర్టీసీ, భారతీయ రైల్వే ప్రత్యేక రవాణా సదుపాయాలు కల్పిస్తాయి.ఇదీ చదవండి: Ananya Reddy తొలిప్రయత్నంలోనే సివిల్స్ ర్యాంక్, మార్క్ షీట్ వైరల్ఎలా చేరుకోవాలి?తిరువనంతపురం విమానాశ్రయం నుంచి ఆలయం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. రైలు మార్గంలో వస్తే తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్లో దిగాలి. అక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో గుడి ఉంటుంది. ఇంకా ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో గుడికి చేరుకోవచ్చు. స్థానికంగా ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి. ఉదయం 4–30 నుంచి మధ్యాహ్నం 12–30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 నుంచి 8–30 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. -చెన్నాప్రగడ శర్మ -
కష్టాలున్నాయని కుమిలిపోలే..జీవిత పట్టా కుట్టుకుంది!
ఆమె తన కుల వృత్తి అయిన చెప్పులు కుడుతూనే... పుస్తకాలు పట్టుకుని జీవితంలోని చిరుగులను కుట్టుకుంది. అమ్మకు ఆసరాగా బీడీలు చుడుతూనే... తెలంగాణ యూనివర్సిటీ లో ఇంటిగ్రేటెడ్ కోర్సులతో డిగ్రీ, పీజీ చదివింది. విదార్థి నాయకురాలిగానూ అనేక ఉద్యమాల్లో పాల్గొంది. బీఈడీ అయ్యాక బీడీ కార్మికుల బతుకులపై పీహెచ్డీ చేసి ఇటీవల తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా పట్టా అందుకుని ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ఆమే కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన సిద్ధలక్ష్మి.కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన మోచి వెంకటయ్య, నాగమణి దంపతులకు ఇద్దరు పిల్లలు. పిల్లలిద్దరు చిన్న వయసులో ఉన్నపుడే తండ్రి మరణించాడు. తల్లి నాగమణి ఓ వైపు బీడీలు చుడుతూ మరోవైపు చెప్పులు కుడుతూ పిల్లల్ని చదివించింది. కూతురు సిద్ధలక్ష్మి ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు, అక్కడే ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసింది. చదువుకునే సమయంలో సిద్దలక్ష్మి బీడీలు చుట్టడంతో పాటు కులవృత్తి కూడా చేసేది. పొద్దున, సాయంత్రం చెప్పుల దుకాణంలో తల్లితో పాటు కూర్చునేది. చెప్పులు కుట్టడం, అమ్మడంలో సాయపడేది. ఇంటర్ పూర్తయిన తరువాత తెలంగాణ యూనివర్సిటీలో ఐదేళ్ల డిగ్రీ, పీజీ (ఇంటిగ్రేటెడ్) కోర్సుకు సంబంధించిన ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణురాలై సీటు సాధించింది. దీంతో యూనివర్సిటీలో అడుగుపెట్టిన సిద్ధలక్ష్మి చదువుకుంటూనే విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొంది. పీడీఎస్‌యూ లో క్రియాశీలకంగా పనిచేసింది. తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలోనూ చురుకుగా పాల్గొంది.ఉద్యమాల్లోపాల్గొంటూనే సిద్ధలక్ష్మి డిగ్రీ, పీజీ పూర్తి చేసింది. బీఈడీ చదువు కోసం మహబూబ్‌నగర్ వెళ్లింది. తరువాత ఉద్యమ సహచరుడు కన్నయ్యను వివాహమాడింది. ఆమెకు ముగ్గురు కుమారులు.బీడీ కార్మికుల బతుకులపై పరిశోధన...తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో వ్యవసాయం తరువాత ఎక్కువ మంది ఆధారపడే బీడీ రంగంలో కార్మికుల ఆదాయం.. ఖర్చులు అన్న అంశంపై సిద్ధలక్ష్మి పరిశోధన పత్రం సమర్పించింది. ఇటీవల తెలంగాణ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా అందుకుంది. కాగా ఫెలోషిప్ ద్వారా తనకు నెలనెలా అందిన డబ్బులను పొదుపు చేసి ఎల్లారెడ్డిలో ఇల్లు నిర్మించుకుంది. బాన్సువాడలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీగా పని చేసింది. కష్టపడి పరిశోధన చేసి పీహెచ్డీ పట్టా అందుకుంది. అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఇదీ చదవండి: కుటుంబం తొలుత ఒప్పుకోకపోయినా..నిలిచి గెలిచిన ప్రేమికులు! కష్టాలను దిగమింగానుమాది పేద కుటుంబం. అమ్మ ఎంతో కష్టపడి చదివించింది. మా మేనత్త చదువుకోమని ప్రోత్సహించింది. అమ్మకు ఆసరాగా చెప్పులు కుట్టడం, బీడీలు చుట్టడం చేస్తూనే చదువుకు కూడా సమయం కేటాయించేదాన్ని. యూనివర్సిటీలో చాలామంది ప్రోత్సహించారు. చిన్నప్పుడు బీడీ కార్మికుల కష్టాలను స్వయంగా చూశాను కాబట్టి బీడీ కార్మికులనే సబ్జెక్టుగా తీసుకుని పీహెచ్డీ చేశాను. డాక్టర్ పాత నాగరాజు సార్ నా పీహెచ్‌డీకి గైడ్‌గా ఎంతో ప్రోత్సహించి నా పరిశోధనకు సహకరించారు. కష్టాలున్నాయని కుమిలిపోతే ఇక్కడిదాకా రాకపోయేదాన్ని. కష్టాలను ఎదుర్కొనడంలోనే సక్సెస్ ఉంటుందని స్వయంగా తెలుసు కున్నాను. – డాక్టర్ సిద్ధలక్ష్మి, ఎల్లారెడ్డిఇదీ చదవండి: చదివింది పదో తరగతే... కట్ చేస్తే కోట్లలో సంపాదన– ఎస్.వేణుగోపాలాచారి, సాక్షి ప్రతినిధి, కామారెడ్డి -
World IVF Day 2025: ఐవీఎఫ్ అంటే..? ఎలాంటప్పుడు ఈ చికిత్స..
వివాహమైన ప్రతీ స్త్రీ తల్లి కావాలని కోరుకుంటుంది. అయితే ఆ యోగ్యత కొందరికి మాత్రం లభించడం లేదు. ఇందుకు ఆమెలో కొన్ని అనారోగ్య కారణాలు, లేదా భర్తలో ఏదైనా లోపమైనా ఉండొచ్చు. వైద్యులను సంప్రదించి వారి సూచనలు పాటిస్తూ మహిళలు గర్భం దాలుస్తున్నారు. అమ్మ కల నెరవేర్చుకుంటున్నారు. ఐవీఎఫ్ విధానం ద్వారా చికిత్స తీసుకుంటున్నారు. నేడు వరల్డ్ ఐవీఎఫ్ డే సందర్భంగా ప్రత్యేక కథనం.పెరుగుతున్న సంతానలేమి సమస్య ఇటీవల ఉమ్మడి జిల్లాలో సంతానలేమి సమస్యతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. ఒకప్పుడు వందలో ఒకరిద్దరు మాత్రమే సంతానలేమితో బాధపడేవారు. ఇప్పుడు ఆసంఖ్య 20శాతం వరకు ఉంటోంది. ఇలాంటి వారు వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకుని గర్భం దాలుస్తున్నారు. కొందరు మాత్రం మూఢ నమ్మకాలతో కాలం వెళ్లదీస్తున్నారు. కాలానుగుణంగా ఇప్పుడు వైద్యంపై అవగాహన పెరిగింది. గతంలో హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లి సంతాన సాఫల్య కేంద్రాల్లో వైద్యులను సంప్రదించేవారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లో కూడా అలాంటి కేంద్రాలు ఏర్పాటయ్యాయి. అత్యాధునిక వసతులు, సౌకర్యాలతో మహానగరాల్లో అందించే వైద్యసేవలు ఇక్కడ అందిస్తున్నారు. కరీంనగర్లో పదికి పైగా ఫెర్టిలిటీ కేంద్రాలు (సంతాన సాఫల్య కేంద్రాలు) ఉన్నాయి. ఆయా కేంద్రాలకు ప్రస్తుతం రోజూ 30 నుంచి 40 మందిదాకా చికిత్స కోసం వస్తుంటారు. సంతానలేమికి కారణాలివే.. ఇటీవల యువతీ యువకులు జీవితంలో స్థిరపడ్డాక వివాహం చేసుకుంటున్నారు. అమ్మాయిల సంఖ్య తగ్గిపోవడం వంటి కారణాలతో ఆలస్యంగా వివాహం చేసుకుంటున్నారు. దీంతో సంతానలేమి సమస్యలు పెరుగుతున్నాయి. మారిన జీవనశైలి, వ్యాయామం లేకపోవడం, స్థూలకాయం, మహిళల్లో పీసీఓడీ (అండాశయంలో తిత్తులు), రాత్రివేళల్లో ఆలస్యంగా నిద్రపోవడం, జంక్‌ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం తదితర కారణాలతో సంతానలేమి సమస్య కలుగుతుంది. ఐవీఎఫ్ అంటే..చాలామంది సంతానం లేనివారు సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్తున్నారు. కానీ అక్కడ ఐవీఎఫ్ పద్ధతి గురించి వారికి అవగాహన ఉండదు. ఈ పద్ధతిలో బిడ్డను జన్మనివ్వాలి అనుకునే దంపతులు ముందుగా దాని గురించి అవగాహన ఉండాలి. అప్పుడే భవిష్యత్‌లో వారి మధ్య అపోహలు తలెత్తకుండా ఉంటాయి. సాధారణంగా స్త్రీ గర్భధారణ కలగాలంటే మగవారి వీర్యకణాలు ఆడవారి అండంతో కలవాలి. అది పిండంగా రూపాంతరం చెందుతుంది. ఈ విషయంలో ఇబ్బంది ఉన్నప్పుడు ఐవీఎఫ్ విధానంలో ల్యాబ్‌లో అండకణాలను సంగ్రహించడం చేసి స్పెర్మ్ నమూనాను మెరుగుపరుస్తారు. ఐవీఎఫ్ ఎప్పడు అవసరమంటే..సాధారణంగా సంతానం లేనివారికి ఐవీఎఫ్ అవసరం లేదు. ముందుగా వైద్యులను సంప్రదించి సమస్యను వివరించాలి. దీన్ని బట్టి ముందుగా సహజసిద్ధంగా గర్భం దాల్చేలా తగిన చికిత్స, ఔషధాలు అందిస్తారు. సహజ సిద్ధంగా గర్భధారణ కలిగేందుకు అవకాశం లేకుండా ఉన్నవారికి మాత్రమే ఐవీఎఫ్ చికిత్స ప్రారంభిస్తారు. ముఖ్యంగా ఆడవారిలో ఫెలోపియన్ నాళాలు మూసుకుపోయినప్పుడు, అండకణాలు తక్కువగా ఉన్నప్పుడు, అండాశయ ట్యూబ్స్ బ్లాక్ అయినప్పుడు, ఎక్కువసార్లు అబార్షన్లు అయినవారికి, క్యాన్సర్ రోగులు, మగవారిలో స్పెర్మ్ నాణ్యత తక్కువగా, పూర్తిగా లేనప్పుడు ఐవీఎఫ్ చికిత్స అవసరం ఉంటుంది.అపోహలు వద్దు1978 జులై 25న ఇంగ్లండ్‌లో ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) అనే కృత్రిమ గర్భధారణ పద్ధతిలో జన్మించిన మొదటి బిడ్డ లూయీస్ బ్రౌన్ అయ్యారు. ఈ విజయానికి గుర్తుగా ఏటా జులై 25న ప్రపంచ ఎంబ్రియాలజిస్ట్ డేగా జరుపుతారు. ఇప్పటికీ చాలామందికి ఐవీఎఫ్ అంటే తెలియని భయం. సంతానం కలిగేందుకు అన్ని ప్రయత్నాలు చేసి విఫలమైనప్పుడు మాత్రమే ఐవీఎఫ్ మార్గాన్ని సూచిస్తాం.– డాక్టర్ రేఖారాణి, రేఖాసాగర్ ఐవీఎఫ్ సెంటర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు 30 ఏళ్లు దాటిన మహిళలకు సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ విధానం ద్వారా ఇప్పటివరకు 8 మిలియన్ల మందికి పైగా జన్మించారు. అయితే ఐవీఎఫ్‌పై చాలామందికి అపోహలున్నాయి. ఐవీఎఫ్లోనూ ఐసీఎస్ఐ, ఐవీఎం, ఎగ్‌ఫ్రీజింగ్, స్పెర్మ్ ఫ్రీజింగ్, ఫెర్టిలిటీ ప్రిజర్వేషన్, ప్రీ ఇంప్లాంటేషన్, జనటిన్ టెస్ట్ అనే అడ్వాన్స్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాయి. ఐవీఎఫ్‌లో ఇచ్చే మందులతోనూ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. – డాక్టర్ రజని ప్రియదర్శిని, రజని ఫెర్టిలిటీ సెంటర్(చదవండి: తొమ్మిది కాదు.. ఐదో నెలలోనే పుట్టేశాడు.. వండర్ బేబీ!) -
ఆపదలో అమ్మ: సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలివే!
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముంచుకొస్తోంది. అవగాహన లోపంతో మహిళలను ముప్పుతిప్పలు పెడుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. ఈ వ్యాధి ఎక్కువగా పేద, మధ్య తరగతికి చెందిన అబలలనే బలితీసుకుంటోంది. ఉచిత టీకాల విషయంపై ఎవరూ నోరెత్తకపోవడం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో పెరుగుతున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్, Cervical cancer)చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలోని ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఇటీవల సిబ్బంది ఎన్సీడీ సర్వే చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 5,92,514 కుటుంబాలు ఉండగా 5,03,311 కుటుంబాలను సర్వే చేశారు. ఈ సర్వేలో కొంత మేర సరై్వకల్ క్యాన్సర్ కేసులు బయటపడ్డాయి. 18 ఏళ్లు దాటిన వారు 15,67,268 మంది ఉంటే 11,24,511 మందికి స్క్రీనింగ్ పరీక్షలు చేశారు. ఇందులో 273 మందికి ఓరల్ క్యాన్సర్, 218 మందికి రొమ్ము క్యాన్సర్, 203 మందికి సరై్వకల్ క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించారు. ఇక అవగాహన రాహిత్యంతో సర్వైకల్ క్యాన్సర్‌ను గుర్తించలేకపోతున్నారు. ఇలాంటి వారు వివిధ కారణాలతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించడంతో కేసులు బయటపడుతున్నాయి. సర్వైకల్ క్యాన్సర్ వ్యాప్తి ఇలా...సరై్వకల్ క్యాన్సర్ సోకడానికి ప్రధాన కారణం ‘హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ)’. ఎక్కు వ మంది భాగస్వాములతో శృగారంలో పాల్గొనడం వల్ల ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది కొన్నేళ్ల తర్వాత వృద్ధి చెంది క్యాన్సర్‌కు కారణమవుతుంది. హెచ్ఐవీ/ఎయిడ్స్ రోగుల్లో, కొన్ని రకాల మందులు తరచూ వాడడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. తద్వారా కూడా సరై్వకల్ క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుంది. చిన్న వయసులో శృంగారంలో పాల్గొనడం వల్ల హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్ సోకే ముప్పు ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. అందుకే బాల్య వివాహాలు చేసుకునే వారిలో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు స్పష్టం చేస్తున్నారు. గర్భనిరోధక మాత్రలు ఏళ్ల తరబడి వాడినా సరై్వకల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. నెలసరి సమయంలో సరైన వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం కూడా ఈ క్యాన్సర్ ముప్పును పెంచుతుంది. వీటితో పాటు ధూమపానం, అనారోగ్యకరమైన జీవనశైలి, వంశపారంపర్యంగా కూడా కొంతమందిలో సరై్వకల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి ఈ కేసులు అత్యధికంగా పేద కుటుంబాల్లోని మహిళల్లోనే వెలుగుచూస్తున్నాయి.వ్యాధి లక్షణాలురుతుక్రమంలో సమస్యలుయోని నుంచి రక్తస్రావం లైంగిక సంపర్కం తర్వాత రక్తస్రావంపీరియడ్స్ ఆగిపోయిన తర్వాత రక్తస్రావం యోని నుంచి దుర్వాసన, రక్తంతో కూడిన గడ్డలు రావడం మూత్రం, మల విసర్జనలో ఆటంకాలు పొత్తికడుపులో నొప్పి, బరువు తగ్గడం, నీరసం, విరేచనాలు, కాళ్లవాపు వంటి సమస్యలువ్యాక్సినేషన్ మాటేమిటో?ఈ వ్యాధి బారిన పడకుండా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో ఒకటి వ్యాక్సినేషన్. ప్రస్తుతం 9–26 ఏళ్ల వారికి ఈ టీకా అందుబాటులో ఉంది. అటు కేంద్రం కూడా దీనిపై దృష్టి సారించింది. 19–14 ఏళ్ల లోపు బాలికలు సరై్వకల్ క్యాన్సర్‌బారిన పడకుండా వ్యాక్సినేషన్‌ను పోత్సహిస్తామని ప్రకటించింది. దీని ధర మార్కెట్లో రూ.2వేల వరకు ఉన్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు. విడతల వారీగా ఈ వ్యాక్సినేషన్‌ను వేయించుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ వేయించుకునే స్థోమత పేద, మధ్యతరగతి కుటుంబాల్లో లేదు. ఈ కారణంగా ప్రభుత్వమే వ్యాక్సిన్‌ను మహిళలకు ఉచితంగా అందించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. దీనికితోడు క్షేత్ర స్థాయిలో సరై్వకల్ క్యాన్సర్‌పై సరైనా అవగాహన కల్పించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్లు ఈ క్యాన్సర్‌పై మహిళలకు అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తే క్యాన్సర్ నివారణ తొలి దశలోనే గుర్తించొచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వ్యాక్సిన్ ఉందిగంటకు దేశంలో 9 మంది సర్వైకల్ క్యాన్సర్‌తో చనిపోతున్నారు. ఇప్పటి వరకు 80వేల మంది మరణించారు. కొత్త కేసులు 1.70 లక్షలు ఉన్నాయి. ఇలానే వదిలేస్తే ఇంకా కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అన్ని క్యాన్సర్లకంటే..ఈ సరై్వకల్ క్యాన్సర్ నివారణకు మాత్రమే వ్యాక్సిన్ ఉంది. ఈ క్యాన్సర్ నివారణకు ఏళ్ల లోపు పిల్లలకు 90శాతం వ్యాక్సినేషన్ పూర్తయి ఉండాలి. 35–45 సంవత్సరాల లోపు మహిళలకు 70 శాతం స్క్రీనింగ్ పరీక్షలు అయి ఉండాలి. బాధితులు కచ్చితంగా మెరుగైన వైద్యం చేయించుకోవాలి. హెచ్‌పీవీ వ్యాక్సిన్ వల్ల 80శాతం కేసులను నివారించవచ్చు. – ఆశ్రీత, వైద్య నిపుణులుగ్రామాల్లోనే అధికంగ్రామాల్లోనే గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ క్యాన్సర్‌ను పాప్ స్మియర్ టెస్టు ద్వారా ముందే గుర్తించే అవకాశం ఉంది. తద్వారా మరణాలను కూడా గణనీయంగా తగ్గించవచ్చు. ఈ ముప్పును తప్పించుకోవాలంటే మన శరీరంపై అవగాహన ఉండాలి. ఏ మాత్రం మార్పు కనిపించినా దాన్ని గుర్తించాలి. శరీరంలో నొప్పి లేని గడ్డలు ఏమి కనిపించినా నిర్లక్ష్యం చేయొద్దు. తక్షణం వైద్యులను సంప్రదించాలి. – ఉషశ్రీ, సూపరింటెండెంట్, జిల్లా ప్రభుత్వాస్పత్రి, చిత్తూరుముందే గుర్తిస్తే మేలుసరై్వకల్ క్యాన్సర్ దాచిపెడితే ప్రాణానికే ప్రమాదం. ఇందులో దాపరికాలు వద్దు. లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. పరీక్షలు చేయించాలి. నిర్థారణ అయితే సరైనా చికిత్స తీసుకోవాలి. బయపడాల్సి పనిలేదు. దీనికి తోడు కౌమార దశలో బాలికలు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఈ వ్యాధిపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం. మరింత అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటాం. - సుధారాణి, డీఎంఅండ్ హెచ్ఓ, చిత్తూరు -
Kuppam: ప్రియుడు ఇంటి ఎదుట మంటల్లో కాలిన యువతి
సాక్షి, చిత్తూరు జిల్లా: కుప్పం మండలం మార్వాడలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడు ఇంటి ఎదుట ఓ యువతి మంటల్లో కాలింది. బాధితురాలిది ప్రొద్దుటూరుకు చెందిన ప్రశాంతిగా పోలీసులు గుర్తించారు.ఆర్టీసీలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ప్రశాంతి మార్వాడకు చెందిన వాసుతో ప్రేమ వ్యవహారం నడుపుతోంది. అయితే, ప్రశాంతితో ప్రేమకు ముందే వాసుకు వివాహం జరిగింది. ఈ క్రమంలో గురువారం ప్రశాంతి.. మార్వాడలో ఉన్న వాసును కలిసేందుకు అతని ఇంటికి వచ్చింది.ఈ క్రమంలో ప్రశాంతి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను పోసుకొని నిప్పటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో అప్రమత్తమైన గ్రామస్తులు యువతికి అంటుకుంటున్న మంటల్ని ఆర్పేశారు. అనంతరం, అత్యవసర చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అత్యవసర చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా,బాధితురాలు ప్రొద్దుటూరులో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నట్లు సమాచారం.వాసు ఇంటి ఎదుట మంటల్లో కాలిన యువతి ,ప్రశాంతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దారుణంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రశాంతిది ఆత్మహత్యా? లేక నిప్పు పెట్టారా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. -
పథకాలు అమలు చేయలేనప్పుడు హామీలు ఎందుకు ఇచ్చారని మహిళల నిలదీత
-
చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌పై మహిళల ఆగ్రహం
-
అయ్యా చంద్రబాబు, బాధిత మహిళకు రక్షణ కల్పిస్తారా ?
-
200 కోట్ల జీరో టికెట్ల మైలురాయి అభినందనీయం
సాక్షి, హైదరాబాద్: మహిళల ఉచిత ప్రయాణ పథకం 18 నెలల కాలంలో 200 కోట్ల జీరో టికెట్ల మైలురాయి ని చేరుకోవటం సంతోషంగా ఉందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ పథకంలో భాగంగా జారీ చేసిన జీరో టికెట్ల సంఖ్య బుధవారంతో 200 కోట్లకు చేరు కుంటున్న నేపథ్యంలో అన్ని డిపోల ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్లలో ప్రజాప్రతినిధులు, మహిళా సమాఖ్య ప్రతినిధుల సమక్షంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.మహిళా ప్రయాణికుల అనుభవాలను వెల్లడించటంతోపాటు పలు రంగాల మహిళా ప్రయాణికులకు బహుమతులు అందించి సత్కరించనున్నారు. ఈమేరకు సీఎం ‘ఎక్స్’వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేశారు. మహిళలకు రూ.6,700 కోట్లు ఆదా: ఉచిత ప్రయాణ పథకంలో 200 కోట్ల జీరో టికెట్లు జారీ అయ్యాయని, వాటి ద్వారా మహిళలు రూ.6,700 కోట్లు ఆదా చేసుకున్నారని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వీటికి సంబంధించిన మొత్తాన్ని ఆర్టీసీకి ప్రభుత్వం ఎప్పటికప్పుడు రీయింబర్స్ చేస్తోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
ఆడబిడ్డ నిధిని ఇవ్వాలంటే.. ఆంధ్రాను అమ్మాలి
ఎన్నికలకు ముందు చంద్రబాబు టీడీపీ అధికారంలోకి వచ్చాక మహా శక్తి కింద ఐదు కార్యక్రమాలు అమలు చేస్తాం. 19 నుంచి 59 ఏళ్ల మధ్య మహిళలందరికీ.. ఒక్కొక్కరికీ నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు.. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అందరికీ అందజేస్తాం. – 2024 మార్చి 13న టీడీపీ ‘కలలకు రెక్కలు’ నినాదంతో వెబ్ పోర్టల్‌లో పేర్లు నమోదు కార్యక్రమం ప్రారంభం సందర్భంగా చంద్రబాబుఏరుదాటాక.. అచ్చెన్న ఆడవాళ్లకు నెలకు రూ.1,500 హామీని అమలు చేయాలంటే, ఆంధ్రానే అమ్మాలి. అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చేయాలి? పథకం ఎలా అమలు చేయాలి? అని ఆలోచన చేస్తూ చంద్రబాబు ముందుకెళ్తున్నారు. – విజయనగరం జిల్లా సభలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు‘ఇచ్చిన ప్రతి హామీకి క్యాలిక్యులేషన్ చేసి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకున్నాం. ఎలా అమలు చేయాలో తెలుసుకున్నాకే హామీ ఇచ్చాం. సూపర్ సిక్స్ వెరీ క్లియర్. ఇది మా ఎష్యూరెన్స్. పూర్తి చేస్తామని చెబుతున్నా. కెమేరాలు ఉన్నాయి. రికార్డు చేసుకోండి. ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తాం. చేయకపోతే ప్రజలకు కాలర్ పట్టుకుని నిలదీసే హక్కు కూడా ఉంటుంది. –2023 డిసెంబరులో ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో నారా లోకేశ్‘వైఎస్సార్సీపీ నాయకులు అడుగుతున్నారు హామీలు ఎలా నిలబెట్టుకుంటారని...? అలాంటి వారందరికీ మీ లోకేశ్ ఒకటే సమాధానం ఇస్తున్నాడు. జగన్ అప్పుల అప్పారావు అయితే, మా చంద్రన్న సంపద సృష్టికర్త. మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలు తెలిసి మా చంద్రన్న మహాశక్తి ప్రకటించారు. దాంట్లో ప్రధానంగా నాలుగు ప్రకటనలు ఉన్నాయి. మొదటిది ఆడబిడ్డ నిధి. 18 ఏళ్లు నిండిన మహిళలకు ప్రతి నెలా రూ.1,500 వాళ్ల ఖాతాలో వేస్తున్నాం. సంవత్సరానికి రూ.18 వేలు. ఐదేళ్లు రూ.90 వేలను తెలుగింటి ఆడపచుల అకౌంట్లలో మన చంద్రన్న వేయబోతున్నాడు’ –2023లో ఓ బహిరంగ సభలో నారా లోకేశ్‘రాష్ట్ర ప్రజల నేటి అవసరాలను తీరుస్తూ... రేపటి ఆకాంక్షలను సాకారం చేసేలా రూపొందించిన మేనిఫెస్టోను పక్కాగా అమలు చేస్తాం’–ప్రజాగళం పేరుతో 2024 ఏప్రిల్ 30న చంద్రబాబుతో కలిసి ఎన్నికల ఉమ్మడి మేనిఫెస్టో విడుదల సందర్భంగా అందులో పేర్కొన్న హామీల అమలుపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు.‘చంద్రబాబు–పవన్‌కళ్యాణ్ ఉమ్మడిగా ప్రకటించిన మేనిఫెస్టోలో ‘ప్రతి మహిళకు నెలకు రూ.1500’ (19 నుంచి 59 సంవత్సరాల వరకు) అని పేర్కొన్నారు. కానీ, ఎన్నికలకు ఏడాది, ఏడాదిన్నర ముందు నుంచే... మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా ‘19–59 సంవత్సరాల వరకు’ అన్నది కూడా లేకుండా, భవిష్యత్‌కు గ్యారెంటీ–బాబు ష్యూరిటీ నినాదంతో ‘ఆడబిడ్డ నిధి’ నుంచి ‘18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500’ అంటూ ప్రత్యేక కరపత్రాలను రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులు ఇంటింటికీ పంచుతూ ప్రచారం చేశారు’.సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలందరికీ ప్రతి నెలా రూ.1,500 చొప్పున ఏటా రూ.18 వేలు ‘ఆడబిడ్డ నిధి’ ఇస్తామని ఇంటింటా బాండ్లు పంపిణీ చేసి.. తీరా గద్దెనెక్కాక చంద్రబాబు, కూటమి నేతలు మాట తప్పారు. సూపర్ సిక్స్ కింద మేనిఫెస్టోలో కూడా చేర్చి ఆ హామీ అమలు చేయకుండా మోసం చేశారు. తొలి ఏడాది రూ.32,400 కోట్లు ఎగ్గొట్టి అక్కచెల్లెమ్మలకు వెన్నుపోటు పొడిచారు. ఈ ఏడాదైనా ఇస్తారని ఆశగా ఎదురు చూస్తుంటే ‘ఆంధ్రాను అమ్మితే తప్ప ఇవ్వలేం’ అని చేతులెత్తేశారు. ప్రభుత్వ మోసం కారణంగా ఒక్క ఆడబిడ్డ నిధి పథకం కింద రాష్ట్రంలో మహిళలు గడిచిన 13 నెలల్లో ఏకంగా రూ.35,100 కోట్లు కోల్పోయారు. అధికారమే పరమావధిగా హామీల వర్షం కురిపించి.. ప్రజలను నమ్మించి.. గద్దెనెక్కాక వారిని నిలువునా మోసం చేయడంలో తనను మించిన వారు లేరని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోమారు చాటుకున్నారు. ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచే చంద్రబాబు, లోకేశ్ సహా టీడీపీకి చెందిన చిన్న, పెద్ద నాయకుల వరకు ప్రజల ఇళ్లకు వెళ్లి తమ ప్రభుత్వం వస్తే ఆడబిడ్డ నిధి కింద చంద్రబాబు ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఇచ్చేలా పథకం అమలు చేస్తారని ఊదరగొట్టారు. ‘గ్యారంటీ’ కార్డులను కూడా పంపిణీ చేశారు. తీరా 13 నెలల పాటు పథకం కింద డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టి.. ఇప్పుడేమో ఈ పథకాన్ని అమలు చేస్తే రాష్ట్రాన్నే అమ్మాల్సి ఉంటుందంటూ ప్రభుత్వంలోని కీలక మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించడం కూటమి మోసాలకు పరాకాష్టగా నిలిచింది. ఎగవేతపై 2 నెలల కిందటే బాబు సంకేతాలు⇒ ఆడ బిడ్డ నిధి హామీ అమలుపై సీఎం చంద్రబాబు పూర్తిగా చేతులేత్తేసినట్టే కనిపిస్తోంది. వాస్తవానికి రెండు నెలల కిందటే కర్నూలు బహిరంగ సభలో ఆయన ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. ఆయన మాట్లాడిన తీరే ఇందుకు నిదర్శనమని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వం–ప్రైవేట్ భాగస్వామ్యంతో పి–4 కార్యక్రమం ద్వారా 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా చేస్తానని, అప్పటికీ పేదలు మిగిలితే అడ్డబిడ్డ నిధి కింద ఇచ్చే డబ్బులు పి–4కు అనుసంధానం చేసి మహిళల ఆదాయాన్ని పెంచే మార్గం ఆలోచిస్తానంటూ కర్నూలులో చంద్రబాబు వ్యాఖ్యానించారు.⇒ అంటే 2029 వరకు ఈ పథకం అమలు ఉండదని చెప్పకనే చెప్పారు. ఇప్పుడు మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలతో దీనికి మరింత బలం చేకూరుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వాస్తవానికి... ఎన్నికల్లో ఎలాగైనా గెలవడం అనే ఉద్దేశం తప్ప... ఇచ్చిన హామీలపై కూటమి ప్రభుత్వ పెద్దలకు చిత్తశుద్ధి లేదని వివరిస్తున్నారు. ఇందులోభాగంగానే హామీల అమలు నుంచి తప్పించుకునేందుకు సాకులు మీద సాకులు వెదుక్కుంటున్నారని చెబుతున్నారు.మహిళలు నష్టపోయిన మొత్తం రూ.35,100 కోట్లు⇒ ఎన్నికల నాటికి రాష్ట్రంలో 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అంటే వీరంతా 18 ఏళ్లు దాటినవారే. ఈ నేపథ్యంలో... టీడీపీ కూటమి ఎన్నికలకు ముందు చెప్పిన హామీ ప్రకారం మొత్తం 2.10 కోట్ల మందికి ప్రభుత్వం ప్రతి నెల రూ.1500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్లు దాటిన దాదాపు 30 లక్షల మంది పెన్షనర్లను తీసేసినా రాష్ట్రంలో సుమారు 1.80 కోట్ల మంది ఆడబిడ్డ నిధి పథకానికి అర్హులయ్యే అవకాశం ఉంది. వారికి ఏడాదికి రూ.18 వేలు చొప్పున 13 నెలల కాలంలో మొత్తం రూ.35,100 కోట్లు ఇప్పటికే కూటమి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.⇒ ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 చొప్పున అందజేస్తామంటూ చంద్రబాబు ఇచ్చిన హామీ ఎప్పటినుంచి అమలవుతుందా? అని రాష్ట్రవ్యాప్తంగా మహిళలు 13 నెలలుగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే.. ఒక్కొక్క నెల ఆలస్యం అయ్యేకొద్దీ వారు కోల్పోతున్న మొత్తం పెరుగుతోంది. ఇలా గత 13 నెలల్లో రాష్ట్రంలోని పేద మహిళలందరూ నెలకు ఏకంగా రూ.2,700 కోట్ల చొప్పున ఇప్పటికి రూ.35,100 కోట్ల లబ్ధిని కోల్పోయారు.ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చిన వైఎస్ జగన్కోవిడ్ వంటి మహమ్మారులు ఎదురైనా వెనక్కుతగ్గని వైనంమేనిఫెస్టో అంటే భగవద్గీత, ఖురాన్, బైబిల్ అంత పవిత్రంగా భావించిన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారంటే.. కచ్చితంగా అమలు చేస్తామని నిరూపించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కోవిడ్ వంటి మహమ్మారులు, అనుకోని విపత్తులు వచ్చినా అప్పటి సీఎం వైఎస్ జగన్ ఏమాత్రం వెనక్కుతగ్గలేదు.2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలును అపలేదు. కాగా, వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన నవరత్న పథకాలను చూపిస్తూ.. ‘రాష్ట్రం మరో శ్రీలంకలా తయారవుతుందోంటూ నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ దుష్ప్రచారం చేసింది. తీరా సరిగ్గా ఎన్నికల సమయానికి ప్రజలను ప్రలోభపెట్టేందుకు చంద్రబాబు కూటమి హామీల వరద పారించింది. అధికారం దక్కాక మాత్రం వాటిని ఒక్కోటిగా పక్కనపెడుతోంది.కుర్చీలో కూర్చున్నాకే తెలిసిందా..! కూటమి ప్రభుత్వంలో అక్క చెల్లెమ్మలను నట్టేట ముంచారు. ఆడబిడ్డ నిధి, బీసీ మహిళలకు 50 ఏళ్ల మహిళలకే పెన్షన్ ఇస్తామని మాయమాటలు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాలేదని, రాష్ట్రాన్ని అమ్మేయాలంటూ మంత్రులతో చెప్పిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటో కుర్చీలో కూర్చున్నాకే తెలిసిందా? – బూడి ముత్యాలనాయుడు, మాజీ డిప్యూటీ సీఎం ఇది మంచి ప్రభుత్వమా? ఎన్నికల ముందేమో సంపద సృష్టిస్తాం–సంక్షేమ పథకాలు అమలు చేస్తాం అని ఓట్లు వేయించుకుని.. గద్దెనెక్కిన తర్వాత అమలు చేయలేమని వ్యాఖ్యలు చేయడం మీకు తగునా అచ్చెన్నాయుడు? ఇది మంచి ప్రభుత్వమా చంద్రబాబూ? – పాముల పుష్ప శ్రీవాణి, మాజీ డిప్యూటీ సీఎం ముందుగా తెలియదా? కూటమి పార్టీలు అబద్ధపు హామీలు ఇచ్చాయని మరోమారు తేటతెల్లమైంది. 14 ఏళ్లు సీఎంగా పనిచేసి 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తికి హామీలు అమలు చేయగలమా లేదా అనేది ముందుగా తెలియదా? చేయలేమని తెలిసీ ఎందుకు హామీలు ఇచ్చారు? – ధర్మాన కృష్ణదాస్, మాజీ డిప్యూటీ సీఎంమహిళలను నిలువునా మోసం చేశారు.. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే ఆంధ్రాను అమ్మేయాలనడం మహిళలను ఈ ప్రభుత్వం ఏ రకంగా మోసం చేసేందుకు కుట్రలు పన్నుతుందో తెలుస్తోంది. మొదటి ఏడాది ఎగ్గొట్టినా రెండో ఏడాది నుంచి అయినా ఇస్తారని చూస్తున్న మహిళల నోట్లో కూటమి మన్ను కొట్టింది. అధికార దాహంతో హామీలు గుప్పించారు. అమలు చేయలేక చేతకాని మాటలు మాట్లాడటం మహిళలను నిట్టనిలువునా మోసం చేయడమే. – కారుమూరి వెంకట నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్అబద్ధపు హామీలిచ్చారా? చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఎన్నికల ముందు కళ్లు మూసుకుపోయిన అబద్ధపు హామీలు ఇచ్చారా? మీ మాటలు నమ్మి ఆడబిడ్డలు ఓట్లు వేశారు. వారిని మోసం చేసేందుకు చంద్రబాబే అచ్చెన్నాయుడు చేత ఇలాంటి వ్యాఖ్యలు చేయిస్తున్నారు. రాష్ట్రాన్ని అమ్మేస్తే కాని తీర్చలేని హామీలు మీకు ఎవరు ఇమ్మన్నారు? – తమ్మినేని సీతారాం, మాజీ స్పీకర్సంపద సృష్టిస్తానని చేతులెత్తేశారు! ఒక్క హామీని అమలు చేయకుండా సుపరిపాలనకు చీతొలి అడుగుచీ అంటూ టీడీపీ మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. చంద్రబాబు ఏమో సంపద సృష్టిస్తా.. పథకాలు అమలు చేస్తా అన్నారు. ఇప్పుడేమో మంత్రి అచ్చెన్నాయడు చీఆడబిడ్డ నిధిచీ అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్మాలంటున్నారు. పథకాలు అమలు చేయలేనప్పుడు హామీలు ఎందుకు ఇచ్చారు? – విడదల రజిని, మాజీ మంత్రి అడ్డమైన హామీలు ఇచ్చి మోసం చేస్తారా? సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్మాలా? అలా మాట్లాడడానికి సిగ్గులేదా అచ్చెన్నాయుడు? ఎన్నికల ముందు హామీలు ఇచ్చేటప్పుడు తెలియదా? అప్పుడేమో ఓట్లు కోసం అడ్డమైన హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఇలా మాట్లాడమని మీ నాయకుడు చంద్రబాబు చెప్పారా? – ఆర్కే రోజా, మాజీ మంత్రి చంద్రబాబు వైఖరేంటో తేటతెల్లమైంది ఆడబిడ్డ నిధిని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సిందే అని అచ్చెన్నాయుడు అనడం దారుణం. ఈ విషయం ఎన్నికలప్పుడు చంద్రబాబుకు తెలియదా? అమలు చేయలేని హామీలివ్వడం అంటే ప్రజలను మోసం చేయటమే కాదా? హామీలు అమలు చేయటంలో చేతులెత్తేసి మంత్రులతో ఇలా నిస్సిగ్గుగా మాట్లాడించడంతో చంద్రబాబు వైఖరేంటో తేటతెల్లమైంది. – మేరుగు నాగార్జున, మాజీ మంత్రి ప్రజల పక్షాన పోరాటం చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ మోసానికి నిఘంటువులో కొత్త పదం వెతకాలి. ఆడబిడ్డ నిధి అమలుకు రాష్ట్రాన్ని అమ్మాల్సిందేనని మంత్రి మాట్లాడటం మహిళలను అవమానపరచడమే. వాగ్దానాలు ఇచ్చినప్పుడు తెలియదా? ముఖ్యమంత్రి సంతకానికి ఉన్న విలువ ఇదేనా? కూటమి ప్రభుత్వ హామీలను అమలు చేసే వరకు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాం. – డాక్టర్ ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు ప్రజలకు మోసపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజల ఆశలపై వెన్నుపోటు పొడిచారు. అచ్చెన్నాయుడు నోట మాట వచ్చిందంటే అది చంద్రబాబు మాటే. సంపద సృష్టించి ప్రజలకు పంచి పెడతామంటూ వివిధ నూతన విధానాల పేరుతో ప్రజల నడ్డివిరుస్తున్నారు. కూటమి దగాకోరు మాటలను ప్రజలందరూ గమనిస్తున్నారు. – డాక్టర్ సాకే శైలజానాథ్, మాజీ మంత్రిఅచ్చెన్నాయుడూ.. సిగ్గుండాలి రాష్ట్రాన్ని ఇప్పటికే అమ్మేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కొత్తగా ఏదో ఆడబిడ్డ నిధి కోసం రాష్ట్రాన్ని అమ్మాలని వ్యాఖ్యలు చేయడానికి అచ్చెన్నాయుడుకి సిగ్గుండాలి. ఏరు దాటాక తెడ్డు తగలేసే వైఖరి కూటమిది. ఆడబిడ్డలకు ఇస్తానన్న పథకాలను అమలు చేయకపోగా సిగ్గూఎగ్గూ లేకుండా రాష్ట్రాన్ని అమ్మాలని అనటం సబబు కాదు. మహిళలను వంచిస్తున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. – అంబటి రాంబాబు, మాజీ మంత్రి హామీలు ఎందుకిచ్చారు? ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలనడం దుర్మార్గం. కూటమి ప్రభుత్వం మహిళలను దారుణంగా మోసం చేస్తోంది. ఆడబిడ్డలకు ఈ ప్రభుత్వ అబద్ధపు హామీలు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయి. అమలు చేయలేని హామీలు ఎందుకు ఇచ్చారో కూటమి నేతలు చెప్పాలి. – డాక్టర్ సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి నమ్మించి.. నయ వంచన.. ‘ఆడబిడ్డల కష్టాలు కళ్లారా చూశాను. ఆ కష్టాల నుంచి బయట పడేయడానికి ఆడబిడ్డ నిధి పథకం తీసుకువచ్చాం’ అని ఎన్నికల ముందు ప్రతి సభలో చంద్రబాబు ప్రచారం చేశారు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ప్రతి నెలా రూ.1,500లు చొప్పున ఏడాదికి రూ.18000 ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక నయవంచన చేశారు. – వరుదు కళ్యాణి, ఎమ్మెల్సీ ప్రజలను దగా చేసింది.. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలతో టీడీపీ వైఖరి మరోసారి తేటతెల్లమైంది. ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలనడం సిగ్గు చేటు. అలవికాని హామీలిచ్చి టీడీపీ ప్రజలను నిలువుగా దగా చేసింది. ఓటు వేసినందుకు ప్రజలు టీడీపీని అసహ్యించుకుంటున్నారు. త్వరలోనే కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు. – పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పథకాలకు ఎగనామం పెట్టేందుకే .. ఆడబిడ్డ నిధి సంక్షేమ పథకం అమలు చేయాలంటే ఏపీనే తాకట్టు పెట్టాలని టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు అనడం ఆశ్చర్యకరంగా ఉంది. సంక్షేమ పథకాల హామీలకు ఎగనామం పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతుంది. సూపర్ సిక్స్‌తో పాటు 143 హామీలు ఇచ్చి ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారు. – కేకే రాజు, వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడుప్రభుత్వ మెడలు వంచుతాం అలవిగాని హామీలతో చంద్రబాబు గద్దెనెక్కారు. ఏడాదిలోనే రూ.1,87,000 కోట్ల అప్పులు చేశారు. ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్ముకోవాలంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలతో కూటమి ప్రభుత్వ నిజస్వరూపం బయటపడింది. చంద్రబాబు జీవితమంతా మోసపూరితం, కుట్రలే. ప్రభుత్వం మెడలు వంచైనా పథకాలు అమలు చేయించేలా పోరాటం చేస్తాం. – అనంత వెంకటరామిరెడ్డి, వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు ప్రజలు ప్రభుత్వ భరతం పడతారుఆడబిడ్డ నిధిపై మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. హామీల అమలుకు ఎంత ఖర్చవుతుందనే కనీస పరిజ్ఞానం కూడా కూటమి ప్రభుత్వానికి లేదు. రాష్ట్రాన్నే కాదు, దేశాన్ని అమ్మినా చంద్రబాబు ఇచ్చిన హమీలు అమలు చేయలేరు. బాబు ష్యూరీటీ, మోసం గ్యారెంటీ అని తేలిపోయింది. ప్రజలంతా ఈ ప్రభుత్వ భరతం పట్టడం ఖాయం. – ఎస్వీ మోహన్ రెడ్డి, వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాటపై నిలబడే ప్రభుత్వం కాదిది కూటమిది మాటపై నిలబడే ప్రభుత్వం కాదని తెలిసిపోయింది. మేనిఫెస్టోను అమలు చేయలేమని వారికి కూడా తెలుసు. అయినా ఎన్నికల్లో నీకు రూ.18వేలు, నీకు రూ.18వేలు అని మహిళందరికీ చెప్పి ఇప్పుడు మోసం చేస్తున్నారు. ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎత్తేసే కార్యక్రమంలో భాగంగానే అచ్చెన్నాయుడితో మాట్లాడించారు. – పి.రవీంద్రనాథ్‌రెడ్డి, వైఎస్సార్సీపీ వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షుడు మహిళలను మోసగించే ఎత్తుగడ మహిళలకు రూ.1,500 ఇవ్వడానికి రాష్ట్రాన్ని అమ్మేయాలా? మంత్రి అచ్చెన్నాయుడి మాటలు మహిళలను మోసగించే ఎత్తుగడ అని స్పష్టమవుతుంది. చంద్రబాబు జీవితమంతా ప్రజలను మోసగించడమే. అమలుకాని హామీలు ఇవ్వడం ఆ తరువాత వెన్నుపోటు పొడవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. – ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు రాష్ట్రాన్ని అమ్మేయాలనడం సిగ్గుచేటుఆడబిడ్డ నిధిపై మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు దమననీతికి నిదర్శనం. పథకం అమలుకు రాష్ట్రాన్ని అమ్మేయాలనడం సిగ్గుచేటు. ఆడబిడ్డనిధిని అమలు చేయలేమని చేతులెత్తేయడం కూటమి పాలన దగా కోరుకు నిదర్శనం. – శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
జాబు కావాలంటే ‘కమిట్మెంట్’ ఇవ్వాల్సిందే
చిలమత్తూరు: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో శానిటేషన్ వర్కర్‌గా పనిచేసిన ఓ మహిళను ఆసుపత్రిలో శానిటేషన్ పనులు చేయించే టీడీపీ పట్టణ నాయకుడు యుగంధర్(చింటు) ఉద్యోగం నుంచి తొలగించాడు. ఆమె ఉద్యోగం కోసం అనేక మార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇంతలో ఓ టీడీపీ కార్యకర్త నుంచి సదరు మహిళ సెల్‌కు కాల్ వచ్చింది. తాను సహాయం చేస్తానని, నీకు తిరిగి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. అయితే తనతో పాటు చింటుకు కమిట్మెంట్ ఇవ్వాలని నిస్సిగ్గుగా అడిగాడు.ఆ ఆడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను అలాంటి దానిని కాదని, డబ్బులు కావాలంటే ఇస్తానని బాధితురాలు చెప్పగా.. ‘డబ్బు వద్దు’ అని చెబుతూ గట్టిగా మాట్లాడుతూ ‘ఒప్పుకుంటే ఇప్పిస్తా.. లేదంటే లేదు’ అని తేల్చి చెప్పాడు. అది లేకుండా ఉద్యోగం కుదరదా? అని సదరు మహిళ ప్రశ్నిస్తూ..‘ఎవరు అడిగారు’ అని అడగ్గా.. తానే అడిగానంటూ అంటూ సదరు వ్యక్తి చెప్పడం గమనార్హం.కాగా, ఈ ఘటన వారం క్రితం జరిగినట్లుగా తెలుస్తోంది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. హిందూపురం పట్టణానికి చెందిన టీడీపీ నేత చింటు ఈ వ్యవహారం అంతా తనకు చుట్టుకుంటుందని తెలిసి నిందితుడి తరఫున మాట్లాడి తప్పించే ప్రయత్నం చేశాడు. ఇది కాస్తా ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏల దగ్గరకు వెళ్లగా.. విషయం బయటకు పొక్కకుండా చేసినట్టుగా తెలుస్తోంది. -
Kesineni Chinni: కరెంటు బిల్లుపై నిలదీసిన మహిళ.. దెబ్బకు పారిపోయిన ఎంపీ
-
ఏరియల్ యోగా అంటే..? కేవలం మహిళల కోసమేనా..
ఇటీవల ఆరోగ్య స్పృహ ఎక్కువై అంతా జిమ్, వాకింగ్, యోగా, వ్యాయమాలు బాట పట్టారు. మరికొందరు ఇంకాస్త ముందడుగు వేసి విభిన్న రకాల వర్కౌట్లను అనుసరిస్తున్నారు. వినూత్న శైలిలో ఆరోగ్యంగా ఉండటం ఎలా అంటూ సరికొత్త యోగాలను పరిచయం చేస్తున్నారు. అలానే నెట్టింట ఇండోనేషియా బండా అషేలోని మహిళా జిమ్‌లోని సరికొత్త యోగా ఫోజ్‌లు పెద్ద దుమారం రేపి చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే అక్కడ మహిళలంతా వ్యాయామాలు చేస్తున్నారా..? ఊయల్లో సేదతీరుతున్నారా అని అర్థంకానీ ఫోజ్లలో కనిపించారు. మరి ఆ సరికొత్త యోగా భంగిమ ఏంటి..? ఎలా చేస్తారు..? ఎవరికి మంచిది తదితరాల గురించి సవివరంగా చూద్దామా..!.2004 సునామీ తర్వాత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నగరమే ఈ బందా అసే. అక్కడ కాస్త మహిళలకు సంబంధించి కట్టుదట్టమైన చట్టాలు అమలులో ఉన్నా దేశం ఇది. అయితే అక్కడ మహిళా ఫిట్నెస్ ట్రైనర్ పర్యవేక్షణలో యోగా క్లాసులు, పలు వెల్నెస్ సెంటర్లు నడుస్తుండటం విశేషం. అక్కడ ఓ మహిళల జిమ్‌లో ఈ వింతైన దృశ్యం కనువిందు చేసింది. ఆ మహిళలంతా ఊయల ఆసనం మాదిరి యోగా భంగిమలో వేలాడుతూ కనిపించారు. దాన్ని ఏరియల్ యోగా అని పిలుస్తారట. అదెలా చేస్తారంటే.. View this post on Instagram A post shared by Chaideer Mahyuddin (@mirroreye) ఏరియల్ యోగా అంటే: ఊయలలాంటివి లేదా పైకప్పు నుంచి వేలాడే మృదువైన వస్త్రాల సాయంతో చేసే యోగా పద్ధతి. ఇది సాధారణ యోగాతో పాటు జిమ్నాస్టిక్స్, పైలేట్స్ వంటి వర్కౌట్లను కలగలపిన ఒక ప్రత్యేకమైన యోగాసనం.ప్రయోజనాలు..ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది: శరీర భాగాలు గాలిలో సాగదీయబడి, కండరాలు మెరుగవుతాయివెన్నునొప్పి తగ్గుతుంది: వెన్నెముకపై ఒత్తిడి లేకుండా స్ట్రెచ్ అవుతుందిఒత్తిడి తగ్గుతుంది: గాలిలో వేలాడుతూ ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందిబరువు తగ్గేందుకు సహాయపడుతుంది: 50 నిమిషాల సెషన్లో సుమారు 320 కేలరీలు ఖర్చవుతాయిజీర్ణక్రియ మెరుగవుతుంది: పొత్తికడుపు సమస్యలు, గ్యాస్ సమస్యలు తగ్గుతాయిశ్వాసకోశ ఆరోగ్యం మెరుగవుతుంది: ఊపిరితిత్తులకు వ్యాయామం అవుతుందిఎవరికి మంచిది కాదంటే..గుండె జబ్బులు, బీనీ, గ్లకోమా, ఆర్థరైటిస్ ఉన్నవారుగర్భిణులు, పెద్ద ఆపరేషన్ చేసినవారుఒకవేళ ఈ ఏరియల్ యోగా చేయాలనుకున్న నిపుణుల పర్యవేక్షణలో చేయడమే ఉత్తమం. ఇది కేవలం మహిళలే కాదు ఆరోగ్యవంతమైన పురుషుల కూడా చేయవచ్చు. పైన చెప్పిన అనారోగ్య సమస్యలు లేనివాళ్లు ఎవరైనా నిపుణుల పర్యవేక్షలో నిస్సందేహంగా ఈ ఏరియల్ యోగాని నేర్చుకోవచ్చని చెబుతున్నారు. -
వజ్రాలు వదిలేసింది!
ఆరేళ్లయింది అవుంగ్షీ ఢిల్లీని వదిలేసి. ఇప్పుడు ఆమె మణిపూర్‌లోని తన స్వగ్రామంలో తల్లిదండ్రులకు తోడుగా ఉంటోంది. అసలు వాళ్ల కోసమే ఆమె వజ్రంలాంటి తన ఉద్యోగాన్ని వదిలేసి వచ్చింది. వస్తూ వస్తూ సిమ్లా నుంచి ఆపిల్ మొక్కల్ని తెచ్చుకుంది. అవి రెండో ఏడాదే కిలోల కొద్దీ తియ్యటి ఆపిల్ పండ్లను ఇచ్చాయి. తొలి కాపును అమ్మానాన్నకు నైవేద్యంగా పెట్టింది. స్నేహితులు, బంధువులకు ప్రసాదంలా పంచింది. మిగతా పండ్లను అమ్మింది. మరికొన్ని చెట్టుకు సిద్ధంగా ఉన్నాయి. ‘‘ఆరేళ్ల క్రితం ల్యాబ్‌లో మేము వజ్రాలను తయారు చేసేవాళ్లం. ఆనాటి ఉద్యోగ సంతృప్తిని మించిన సంతృప్తి ఏటా చేతికొస్తున్న ఈ ఆపిల్ పంటను చూస్తే కలుగుతోంది’’ అంటోంది అవుంగ్షీ.తొలి పంట వచ్చినప్పుడు చూడాలి అవుంగ్షీ కళ్లలోని వజ్రాల మెరుపుల్ని! ‘పండంటి బిడ్డ’ అంటుంటాం కదా.. ఆమెకు అవి బిడ్డంటి పండ్లు. విరగ గాసిన ఆపిల్ పండ్లు! ఆమెను చూసి ఉఖ్రూల్లోని పాయ్ గ్రామం ఆపిల్‌ని పండించడానికి ఉత్సాహపడింది. అక్కడి భూమిలకది ఏ మాత్రం పరిచయం లేని పంట. అయితే ఎర్రగా, జ్యూసీగా, తియ్యగా ఉన్న ఆ ఆపిల్ పండ్లను చూసి స్థానికులు తాము కూడా ఆపిల్స్‌ను పండించడానికి ఆసక్తి కనబరిచారు. దాంతో పోయ్ ప్రాంతానికి ఆవుంగ్షీ ఆపిల్ పండ్ల సాగుకు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. 2019 ఏప్రిల్‌లో ఆమె హిమాచల్‌ప్రదేశ్ నుంచి 55 ఆపిల్ మొక్కల్ని తెచ్చి నాటితే వాటిలో 52 బతికాయి. మొదటి ఏడంతా కాపు లేదు. రెండో ఏడాది జూన్ రెండో వారానికల్లా ఆకులు కనిపించనంతగా పండ్లొచ్చేశాయి! పోయ్ గ్రామం ఇండో–బంగ్లాదేశ్ సరిహద్దులో ఉంటుంది. మరీ చల్లగా ఉండని అక్కడి పొడి వాతావరణానికి అనువైన భూమిలో పెరిగే ఆపిల్ మొక్కల్ని ఆవుంగ్షీ ఎంపిక చేసుకోవడం దగ్గర్నుంచి.. హిమాచల్ ప్రదేశ్ పాలంపూర్లోని శిక్షణ కేంద్రంలో ఆపిల్ సాగులో మెలకువలు నేర్పించడం వరకు అన్నిటా ఆమె స్నేహితురాలు సోసో షైజానే ఆమెకు సహాయంగా ఉంది. షైజా.. నేషనల్ విమెన్ కమిషన్‌లో సభ్యురాలు. ‘‘ఊరెళ్లి ఏం చేస్తావు?!’’‘‘ఊరెళ్లిపోతున్నాను. అమ్మానాన్నకు ఇంటి దగ్గర తోడుగా ఉండాలి’’ అని అవుంగ్షీ చెప్పినప్పుడు.. షైజా మొదట ఆమెను అడిగిన మాట.. ‘‘ఉద్యోగం మానేసి, ఊరెళ్లి ఏం చేస్తావు?’’ అని. ‘‘ఏమీ అనుకోలేదు’’ అంది అవుంగ్షీ. ఏమీ అనుకోకుండా ఉద్యోగం మానేయడం అంటే అంతకన్నా పొరపాటు లేదు. పైగా అవుంగ్షీ ఆ సమయంలో ఢిల్లీలోని గోర్డెన్–మ్యాక్స్ అనే సింగపూర్ వజ్రాల కంపెనీలో డైమండ్ ల్యాబ్ మేనేజర్‌గా ఉంది! అయితే తల్లిదండ్రుల కోసం ఆ వజ్రంలాంటి ఉద్యోగాన్ని వదలేయాలని నిర్ణయించుకుంది. ‘‘సరే వదిలేయ్, అయితే మీ మణిపూర్‌లో ఆపిల్స్ పండించడం ఎలా ఉంటుందో ఆలోంచించు’’ అని షైజా సలహా ఇచ్చింది. అలా ఢిల్లీ–హిమాచల్‌ప్రదేశ్–మణిపూర్‌ల మీదుగా అవుంగ్షీ ఆపిల్ పంట ఆలోచన సాగింది. ఆనాటి ఆ ఆలోచన ఈనాటి వరకూ ఏటా విరగ్గాస్తూనే ఉంది.పంట రాగానే పంపకం!పెరుగుతున్న దిగుబడితో ఏటికేడాదీ మరిన్ని ఆపిల్ మొక్కల్ని తెచ్చి భారీ ఎత్తున ఆపిల్ తోటను పెంచుతోంది అవుంగ్షీ. ఆమె తండ్రి వరి రైతు. మొదట – కూతురు ఆపిల్స్ పండిస్తాను అనగానే ఆయనేమీ మాట్లాడలేదు. తల్లి మాత్రం కూతురి వైపు నిలబడింది. ఆమె మద్దతు ఇవ్వడానికి తగిన కారణమే ఉంది. అవుంగ్షీ పెంచుతున్న ఆపిల్ రకం ఆరు నుంచి పన్నెండు నెలల మధ్యలోనే కాపుకు వచ్చేస్తుంది. ఉఖ్రూల్ శీతోష్ణ స్థితుల్లో చక్కగా ఎదుగుతుంది. పైగా పూర్తి ఆర్గానిక్. మార్కెట్లో మంచి ధర ఉంది. కిలో ఆపిల్స్ రూ.250 వరకు ధర పలుకుతాయి. ఏటా పంట రాగానే స్నేహితులకు, పరిచయస్తులకు, బంధువులకు ఇచ్చినన్ని ఇచ్చి మిగతా వాటిని అమ్మేస్తుంది అవుంగ్షీ. ఇంకా కొన్ని అమ్మకానికి ఉంటాయి. వాటిని ఉచితంగా గ్రామస్థులకు పంచిపెడుతుంది. చెట్లపై ఇంకా డెబ్భై నుంచి ఎనభై కిలోల ఆపిల్స్ కోతకు వస్తూనే ఉంటాయి. ఈ లెక్కలన్నీ క్రమేణా అవుంగ్షీ తండ్రిలో నమ్మకం కలిగించి ఆయన ప్రోత్సాహం కూడా ఆమెకు లభించింది. ఇప్పుడు తన ఆపిల్ పండ్ల తోటను చూడ్డానికి వస్తున్న పోయ్, చుట్టు పక్కల గ్రామాల అమ్మాయిలు, గృహిణులు ఆపిల్ సాగుపై ఆసక్తి చూపడంతో వారిని కూడా అవుంగ్షీ ప్రోత్సహిస్తోంది. తను ఏ విధంగానైతే హిమాచల్ ప్రదేశ్ వెళ్లి శిక్షణ తీసుకుని వస్తూ వస్తూ కొన్ని ఆపిల్ మొక్కల్ని కొని తెచ్చుకుందో వాళ్లకూ అదే దారిని చూపిస్తోంది. ఈ ఆరేళ్లతో తనకు ఎదురైన కష్టనష్టాల గురించి కూడా ఆమె వారికి చెబుతోంది. ‘‘కష్టనష్టాలంటే ఏం లేదు. మొక్కల్ని పశువులు తినకుండా కాపాడుకోవాలి. పండ్లు వచ్చాక దొంగలు పడకుండా కాపు కాయాలి’’ అని తియ్యగా నవ్వుతుంది అవుంగ్షీ. ఏమైనా వజ్రాల ఉద్యోగాన్ని మించినదవుతుందా ఆపిల్ పండ్ల పెంపకం?! ‘‘కాకపోవచ్చు. అక్కడికి మించిన ఉద్యోగ సంతృప్తి.. ఈ పంట సాగులో ఉంది’’ అంటుంది ఈ యువ కృషీవలురాలు. ∙సాక్షి, స్పెషల్ డెస్క్ -
సరదా మాత్రమే కాదు.. స్త్రీ సాధికారత కూడా..!
కాస్త సరదా కోసం’ అన్నట్లుగా కనిపించే ఇమోజీలు ఇప్పుడు సామాజిక విషయాలపై కూడా దృష్టి పెడుతున్నాయి.స్త్రీ సాధికారత, శక్తికి పెద్ద పీట వేస్తున్నాయి...‘వంద మాటలేల... ఒక ఇమోజీ చాలదా!’ అనుకోవడం వల్ల ఇమోజీలకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. వరల్డ్ ఆన్లైన్ పాపులేషన్లో 90 శాతం మంది ఇమోజీలను ఉపయోగిస్తున్నారు. సరదా సమయాలలో, భావోద్వేగ ప్రతీకలుగా ఉపయోగించే ఇమోజీలను స్త్రీ సాధికారత, శక్తిని ప్రతిబింబించే ప్రతీకలుగా తీర్చిదిద్దే ధోరణి పెరిగింది.‘వైవిధ్యమైన కెరీర్లో మహిళలు’ అనే అంశాన్ని ప్రతిబింబించేలా ఇమోజీలు వచ్చాయి. స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్, బోట్ రైడింగ్... ఇలా వివిధ ఆటల్లో మహిళల శక్తిసామర్థ్యాలను ప్రతిఫలించే ఇమోజీలు వచ్చాయి. ‘స్టెమ్’ కెరీర్లలో రాణించడానికి అమ్మాయిలకు కావాల్సింది ఏమిటి? అని చెప్పే ఇమోజీలు, సాంకేతికరంగంలో మహిళలు సత్తా చాటుతున్నారు అని చెప్పే ఇమోజీలు వచ్చాయి.మహిళల సమస్యలను ప్రతిబింబించే ఇమోజీలు...కరోనా కల్లోల సమయంలో స్త్రీలపై ఒత్తిడి, గృహహింస బాగా పెరిగింది. సంస్థలు, ఇతరుల నుంచి సహాయం తీసుకోవడం కూడా కష్టంగా ఉన్న సమయం అది. ఆ కల్లోల పరిస్థితికి అద్దం పట్టేలా ‘వయొలెన్స్ ఆన్ ఉమెన్ అండ్ గర్ల్స్’ ఇమోజీ వచ్చింది. కోవిడ్ సమయంలో హెల్త్, సోషల్ కేర్ వర్కర్లుగా మహిళలు ముందు వరుసలో ఉండి పనిచేశారు. ప్రాణాలను లెక్క చేయకుండా వృత్తి నిబద్ధత చాటుకున్నారు. వారి వృత్తి నిబద్ధత మాట ఎలా ఉన్నా వేతనాలు, నాయకత్వ స్థానాలకు సంబంధించి మహిళలపై వివక్ష కనిపించింది. ఈ సమస్యను గురించి చెప్పే ఇమోజీ... జెండర్ పే గ్యాప్.కోవిడ్ కాలంలో విద్యాసంస్థలు మూతపడడం వల్ల చాలామంది ఆన్లైన్ ఎడ్యుకేషన్ వైపు వెళ్లారు. అయితే సరైన సదు΄ాయాలు లేక΄ోవడం, పేదరికం వల్ల అబ్బాయిలతో ΄ోల్చితే అమ్మాయిలు ఆన్లైన్ ఎడ్యుకేషన్‌లో వెనకబడి΄ోయారు. దీని గురించి చెప్పే ఇమోజీ... డిజిటల్ జెండర్ డివైడ్. కోవిడ్ కల్లోలం మహిళల ఆదాయం, జీవనోపాధిని బాగా దెబ్బతీసింది. ఎకనామిక్ యాక్టివిటీ లేకుండా పోయింది. దీని గురించి చెప్పే ఇమోజీ... ఇన్ఫార్మల్ వర్క్ అండ్ ఇన్స్టేబిలిటీ.పీరియడ్స్‌కు సంబంధించి మహిళలు ఎదుర్కొనే సమస్యలపై ‘పీరియడ్ పావర్టీ అండ్ స్టిగ్మా’ ఇమోజీ వచ్చింది. కోవిడ్ సమయంలో పురుషులతో పోల్చితే ఫిమేల్ హెల్త్‌కేర్ వర్కర్లు ఇన్ఫెక్షన్, అనారోగ్యం బారిన పడ్డప్పటికీ ప్రాణభయంతో వెనకడుగు వేయలేదు. అయినప్పటికీ విధాన నిర్ణయాలలో వారికి తగిన ప్రాతినిధ్యం లభించలేదు. ఈ విషయాన్ని చెప్పే ఇమోజీ... అండర్ రిప్రెజెంటేషన్ యాజ్ లీడర్స్ ఇన్ హెల్త్.బ్రెస్ట్ ఫీడింగ్ ఇమోజీటెక్నికల్ ఆర్గనైజేషన్ యూనికోడ్ కన్షార్టియం తొలిసారిగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇమోజీని తీసుకువచ్చింది. ఇది ఇమోజీ లైబ్రరీలో భాగం అయింది. ట్విట్టర్(ఎక్స్)లాంటి సామాజిక మాధ్యమాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవంలాంటి సందర్భాలలో ప్రత్యేక ఇమోజీలు తీసుకువచ్చాయి.కొన్ని సంవత్సరాల క్రితం...‘పెళ్లికూతురు ఇమోజీలు తప్ప వివిధ వృత్తులకు సంబంధించిన మహిళల ఇమోజీలు కనిపించవు. ఇమోజీ ప్రపంచంలో లింగ వివక్ష కనిపిస్తుంది’ అనే విమర్శలు ఉండేవి. ఇలాంటి విమర్శల నేపథ్యంలో పురుషులతో సమానంగా మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడానికి, స్త్రీ సాధికారతకు అద్దం పట్టే ఇమోజీలకు పట్టం కట్టే ప్రయత్నం జరుగుతోంది. మార్పు మంచిదే కదా! (చదవండి: నీట్, యూపీఎస్సీలలో ఓటమి..ఇవాళ రోల్స్ రాయిస్‌లో రూ. 72 లక్షలు..) -
విద్యుత్ కోతలపై మహిళల కన్నెర్ర
ప్రత్తిపాడు: అక్రకటిత విద్యుత్ కోతలపై మహిళలు మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ నిప్పులు చెరిగారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఒకటో వార్డులోని పూల బజారులో కొద్ది నెలలుగా తీవ్ర విద్యుత్ సమస్య నెలకొంది. లో వోల్టేజీ సమస్యతో పాటు ఎడాపెడా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. తాజాగా శనివారం రాత్రి పదకొండు గంటల నుంచి ఆదివారం రాత్రి వరకు కోత విధించడంతో స్థానిక మహిళలు, ప్రజలు విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందిని ప్రశి్నంచారు. వారు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతుండటంతో పాటు ఏమి చేసుకుంటారో చేసుకోండని చులకన చేసి మాట్లాడుతున్నారు.దీంతో మహిళలు, స్థానికులు ఆదివారం రాత్రి గుంటూరు పర్చూరు పాతమద్రాసు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఉచితంగా కరెంటు ఇస్తున్నారా? అందరిలానే తాము నెల నెలా వేలకు వేలు విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదా? అంటూ మండిపడ్డారు. ఎప్పుడు కరెంటు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదని వాపోయారు. ఇంట్లో వృద్ధులు, పసి పిల్లల బాధలు వర్ణణాతీతంగా ఉంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతమద్రాసు రోడ్డుపై పెద్దఎత్తున ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ నాగేంద్ర రోడ్డు మీద ఆందోళన విరమించాలని కోరారు. ఏఈ వచ్చి సమాధానం చెప్పే వరకు కదిలేది లేదని మహిళలు పట్టుబట్టారు. విద్యుత్‌శాఖ అధికారులతో మాట్లాడతామని పోలీసులు చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. -
మహిళలపై దాడి మీ శాడిజానికి పరాకాష్ట
సాక్షి, అమరావతి: ‘చంద్రబాబూ.. మహిళల మీద మీ దాడి మీ శాడిజంకు పరాకాష్ట’ అంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం నేరం చేశారని బీసీ సామాజిక వర్గానికి చెందిన గుడ్లవల్లేరు జెడ్పీటీసీ సభ్యురాలు, కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారికపై గుడివాడలో మీ వాళ్లను పంపి దాడులు చేయించారని సీఎం చంద్రబాబును నిలదీశారు. ఈ మేరకు శనివారం రాత్రి ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ‘మహిళల మీద ఈ రోజు మీ దాడి, మీ శాడిజంకు పరాకాష్ట. వైఎస్సార్సీపీ నాయకుల మీద వరుసగా దాడులు చేయించడమే కాదు.. చివరకు బీసీ మహిళా నాయకుల మీద కూడా నిస్సిగ్గుగా దాడులు చేయిస్తున్నారు.ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నానని.. చేతిలో అధికారం ఉంది కదా అని, పోలీసులు ఎలా చెబితే అలా వింటున్నారు కదా అని, మీ పచ్చ సైకోలతో మీరు దాడులు చేయించడం గొప్ప పనా? ఏం నేరం చేశారని ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన కృష్ణాజిల్లా చైర్పర్సన్ ఉప్పాల హారికపై గుడివాడలో మీవాళ్లను పంపి దాడులు చేయించారు? పైగా పోలీసుల సమక్షంలోనే వారు దుర్భాషలాడుతూ దాడి చేశారు.చంద్రబాబూ.. దీన్ని పరిపాలన అనరు. శాడిజం అంటారు.. పైశాచికత్వం అంటారు. ఒక రాజకీయ పార్టీగా మా కార్యక్రమాలు మేం చేసుకోకూడదా? ఆ కార్యక్రమాలకు మా నాయకులు, మా మహిళా నాయకులు హాజరు కాకూడదా? ఇదేమైనా తప్పా? మా వాళ్లను ఎందుకు హౌస్ అరెస్టు చేయాల్సి వచ్చింది? కార్యక్రమానికి వెళ్తున్న వారిపై ఎందుకు దాడులు చేయాల్సి వచ్చింది? అందులోనూ మహిళ అని కూడా చూడకుండా, దుర్భాషలాడుతూ సిగ్గు, ఎగ్గు వదిలేసి దాడి చేశారు. ఇది పైశాచికత్వం కాదా? అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయంలో మీరు ఇలాగే చేస్తున్నారు. తన సొంత ఇంటికి, తన నియోజకవర్గ కేంద్రానికి, హైకోర్టు ఆదేశాలున్నా మీరు వెళ్లనీయడం లేదు. పైగా పోలీసులు సినిమా స్టైల్లో తుపాకులు చూపించి, బరితెగించి ఆయన్ను బయటకు తీసుకెళ్లారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై కూడా నెల్లూరులో ఒక పథకం ప్రకారం మీ పచ్చసైకోలతోనే, పోలీసుల సమక్షంలోనే దాడులు చేయించారు. పైగా దాడికి గురైన ప్రసన్న మీదే ఎదురు కేసు పెట్టారు. దాడి చేయించిన, ఇల్లు ధ్వంసం చేసిన ఎమ్మెల్యే కానీ, వారి మనుషుల మీద కానీ ఎలాంటి చర్యలు లేవు.. అరెస్టులు లేవు. ఇలా చేయడం మీకు గొప్పగా కనిపిస్తోందా? ఇది శాడిజం కాదా? పైశాచికత్వం కాదా? రాజకీయ కక్షలతో దుష్ట సంప్రదాయాన్ని తీసుకొస్తారా? చంద్రబాబూ.. మీరు రాజకీయ కక్షలతో ఈ రాష్ట్రంలో ఒక దుష్ట సంప్రదాయాన్ని తీసుకువచ్చి, దాన్ని కొనసాగిస్తున్నారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వల్లభనేని వంశీ, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, నందిగం సురేష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పోసాని కృష్ణమురళి సహా ఎంతో మంది మీద తప్పుడు కేసులు, దొంగ కేసులు పెట్టారు. వీళ్లే కాకుండా సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు సహా ఎంతో మంది అమాయకులను కేసుల్లో ఇరికించారు.. దాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు.వైఎస్సార్సీపీకి చెందిన వందల మంది గ్రామ స్థాయి, మండల స్థాయి నాయకులపైన, వందల మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపైన తప్పుడు కేసులు, దొంగ కేసులు పెట్టి వారిని హింసించారు.. తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారు. ఇదే సంప్రదాయం రేపు మా ప్రభుత్వం వచి్చన తర్వాత, ప్రతిచర్యగా కొనసాగితే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగబద్ధ పాలనను, చట్టాన్ని పూర్తిగా గాలికి వదిలేసి, మీ ఇష్టానుసారం మీరు ప్రవర్తిస్తే పరిస్థితులు ఎల్లకాలం ఇలాగే ఉండిపోవు. అవి మారినప్పుడు, మీరంతా ఇప్పుడు చేస్తున్న దుర్మార్గాలకు, దారుణాలకు, అన్యాయాలకు మీరు బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రజల తరఫున హెచ్చరిస్తున్నాం. ఇకనైనా శాడిజం వదిలి, ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను అమలు చేయడం మీద దృష్టి పెట్టండి. లేకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతారు.సిగ్గుతో తల వంచుకోవాల్సిన ఘటన కూటమి అధికారంలోకి వచ్చాక మహిళలకు రక్షణ కరువైంది. టీడీపీ, జనసేన గూండాలు కలిసి జిల్లా ప్రథమ మహిళకే ఈ పరిస్థితి తెస్తే, సామాన్య మహిళలకు రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది. ఎవరు ఇస్తారు? పోలీసుల సమక్షంలోనే టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. సిగ్గుతో తలవంచుకోవాల్సిన ఘటన ఇది. – తమ్మినేని సీతారాం, మాజీ స్పీకర్ రెడ్‌బుక్ పాలనకు పరాకాష్ట కూటమి అధికారం చేపట్టాక వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నారు. మహిళలు అని కూడా చూడకుండా దాడులు చేస్తున్నారు. కూటమి రెడ్‌బుక్ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోంది. ఇలాంటి చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి. – ధర్మాన కృష్ణదాస్, మాజీ డిప్యూటీ సీఎంహారికపై టీడీపీ గూండాల దాడి హేయం ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ గూండాలు గుడివాడలో దాడికి పాల్పడటం హేయమైన చర్య. మహిళలపై దాడి చేసే హీన సంస్కృతిని చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారా? ఇటువంటి అమానుష దాడులను సహించేది లేదు. – జోగి రమేష్, మాజీ మంత్రిరాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవు రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవైంది. మహిళా ప్రజాప్రతినిధులను సైతం మానసికంగా వేధించడమే కాకుండా భౌతికంగా దాడులకు కూడా బరితెగించడం అన్యాయం. కూటమి ప్రభుత్వానికి ప్రజలు అధికారం ఇచ్చింది ఇందుకేనా? గతంలో ఏ ప్రభుత్వం హయాంలోనూ ఈ రకమైన దౌర్జన్యాలు, దాడులు ఈ రాష్ట్ర ప్రజలు చూడలేదు. – వంగా గీత, మాజీ ఎంపీ, కాకినాడ ఆటవిక పాలన సాగుతోంది రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోంది. చంద్రబాబు పాలన మహిళల పాలిట నరకాసుర పాలనలా మారింది. జెడ్పీ చైర్పర్సన్, బీసీ మహిళా నాయకురాలు ఉప్పాల హారికపై దాడి హేయం. ఆడపిల్ల మీద చెయ్యి వేస్తే.. అదే చివరి రోజవుతుందన్న చంద్రబాబు టీడీపీ గూండాలు రెచి్చపోతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు. – ఆర్కే రోజా, మాజీ మంత్రి పోలీసులు చోద్యం చూస్తున్నారు మహిళా ప్రజాప్రతినిధి, జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ గూండాలు దాడి చేయడం దారుణం. ఒక మహిళ హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై దాడులు జరగడం అంటే.. ఆ హోం మంత్రి పదవిలో ఉండటం అనవసరం. పోలీసులు సైతం చోద్యం చూస్తున్నారు. – సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి రాష్ట్రంలో సైకోపాలన ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సైకో పాలన నడుస్తోంది. గుడివాడలో పార్టీ కార్యక్రమానికి హాజరు కాకుండా మమ్మల్ని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పోలీసుల మాటున పచ్చ సైకోలు బీసీ కులానికి చెందిన, ఉన్నత చదువులు చదువుకుని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవిలో ఉన్న ఉప్పాల హారికపై దాడికి తెగబడటం దారుణం. ఒక మహిళ అని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో దూషించారు. – పేర్ని నాని, వైఎస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడుదారుణమైన పాలన చంద్రబాబు ప్రజలకిచి్చన వాగ్దానాల అమలులో విఫలమై డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్సీపీని టార్గెట్ చేశారు. ఇంత దారుణమైన పాలన ఎన్నడూ చూడలేదు. కక్ష సాధింపులు, వేధింపులు, దాడులు, దౌర్జన్యాలతో ఏడాది కాలం గడిపారు. వ్యక్తిగత కక్షలు, దాడులు, అరెస్ట్‌లు దారుణం. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. – విడదల రజిని, మాజీ మంత్రి పోలీసుల సాక్షిగా ఉన్మాద దాడి కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి ఉన్మాద చర్యలను పోలీసులు చోద్యం చూసినట్లు చూస్తున్నారంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఇంకెక్కడ ఉన్నట్లు? ఈ దాడికి చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ ఇప్పుడేం సమాధానం చెబుతారు? మహిళా హోం మంత్రి అనిత ఎందుకు నోరు మెదపడం లేదు? – ఉషాశ్రీచరణ్, మాజీ మంత్రి రాష్ట్రంలో రాక్షస పాలన సీఎం చంద్రబాబు రాక్షస పాలనలో వైఎస్సార్సీపీ నాయకులే లక్ష్యంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక కారుపై టీడీపీ, జనసేన గూండాలు కర్రలు, రాళ్లతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. – పాముల పుష్పశ్రీవాణి, మాజీ మంత్రి సామాన్య మహిళల పరిస్థితి ఏంటి? జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై జరిగిన దాడి రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని స్పష్టం చేస్తోంది. బీసీ మహిళపై చేసిన దాడిని కచి్చతంగా గుర్తు పెట్టుకుంటాం. గంటన్నరసేపు మీటింగ్‌కు రానివ్వకుండా రోడ్డుమీద ఆపేసి, కారు అద్దాలు పగులగొట్టడం అమానుష చర్య. జిల్లా ప్రథమ పౌరురాలిపై ఇంత దారుణంగా ప్రవర్తిస్తే సామాన్య మహిళల పరిస్థితి ఏంటి..? – ఆరె శ్యామల, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధిమహిళ దుస్థితికి ఈ ఘటన అద్దం పట్టింది కూటమి పాలనలో మహిళల దుస్థితికి ఈ ఘటన అద్దం పడుతోంది. రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ మహిళలపై దారుణాలకు కూటమి నేతలు తెగబడుతున్నారు. ఈ దాడికి కూటమి కార్యకర్తలను ఎగదోసిన చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేష్‌లను బీసీ వర్గాలు క్షమించవు. రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారు. – రాయన భాగ్యలక్ష్మి, విజయవాడ మేయర్ -
అత్యంత ప్రభావవంతమైన డిజిటల్ వాయిస్‌గా ఆమె..! వన్ అండ్ ఓన్లీ..
యూట్యూబ్ నుంచి నటిగా మారిన ప్రజక్తా కోలి మోస్ట్లీ సేన్ అనే యూట్యూబ్ ఛానెల్‌తో దేశంలోనే తొలి మహిళా కామెడీ కంటెంట్ క్రియేటర్‌గా పేరుతెచ్చుకుంది. రోజువారీ జీవితంలోని పరిస్థితుల గురించి మంచి టైమింగ్ కామెడీ వీడియోలతో యువతను ఆకర్షించింది. అంతేగాదు నెట్‌ఫ్లిక్స్ సిరీస్ మిస్మాచ్డ్ లో ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది. దాంతోపాటు జగ్ జగ్ జీయో" చిత్రంలో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా ఆమె టైమ్స్ 100 అత్యంత ప్రభావవంతమైన డిజిటల్ వాయిస్‌లో చోటు దక్కించుకుంది. ఇలా ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ కంటెంట్ క్రియేటర్ కూడా ఆమెనే కావడం విశేషం. ఈ ప్రతిష్టాత్మకమైన జాబితాలో జిమ్మీ డోనాల్డ్సన్ (మిస్టర్ బీస్ట్), ఖబానే లేమ్, కై సెనాట్, మెల్ రాబిన్స్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. ఈ మేరకు ఈ ప్రజక్తా కోలి తన ఆనందాన్ని ఇన్‌స్టాలో షేర్ చేసుకున్నారు. ఈ అత్యున్నత గౌరవం లభించినందుకు ముందుగా ప్రేక్షకులకు, నా కుటుంబ సభ్యులకు ధన్యావాదాలు. ఎలాంటి సపోర్టు లేకుండా కేవలం కథల పట్ల ఉన్న అవగాహనతో సంపాదించుకున్న స్టార్ డమ్ ఇది. మీ అందరి సహకారం వల్ల ఇదంతా సాధించానని పోస్ట్‌లో రాసుకొచ్చింది.కెరీర్ మొదలైంది ఇలా..పుట్టిపెరిగింది ముంబైలో. మనోజ్ కోలి, అర్చన కోలి .. ఆమె తల్లిదండ్రులు. ముంబై యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. డిగ్రీ పూర్తవగానే రేడియో జాకీగా కెరీర్ మొదలుపెట్టింది. ఆర్జేగా ఆమె చేసిన హృతిక్ రోషన్ ఇంటర్వ్యూ చాలా పాపులర్ అయింది. అదివిన్న ‘వన్ డిజిటల్’ యూట్యూబర్ సుదీప్ ఆమెను యూట్యూబ్ చానెల్ పెట్టమని ప్రోత్సహించాడు. అలా 2015లో ‘మోస్ట్లీ సేన్’ను లాంచ్ చేసింది. ‘10 హిలేరియస్ వర్డ్స్ దట్ డిల్లీ పీపుల్ యూజ్’ అనే వీడియోతో ఆ చానెల్ క్లిక్ అయింది. యూట్యూబ్ చానెల్స్ తొలినాళ్లలోనే వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్తో ప్రజక్త.. దేశంలోనే ఫస్ట్ ఫిమేల్ కామెడీ క్రియేటర్ అనే పేరు సంపాదించుకుంది. సాధించింది. సమకాలీన పరిస్థితులు, ఒరవడుల మీద ఆమె చేసే కామెడీ వీడియోలు దేశీ ప్రేక్షకులనే కాదు విదేశీ వీక్షకులనూ కడుపుబ్బ నవ్విస్తాయి. ఆ ప్రతిభ యునైటెడ్ నేషన్స్ వరకు చేరింది. ఆ హాస్యచతురతను ప్రత్యక్షంగా చూసేందుకు ప్రజక్త వీడియోలను యూఎన్ స్క్రీన్ చేసింది. ప్రజక్తా కేవలం ఈ వీడియోలే కాదు. ఆమె స్త్రీల పక్షపాతి. అమ్మాయిలు బాగా చదవాలని దాదాపుగా అన్ని వీడియోల్లో చూపుతూ చెబుతూ ఉంటుంది. హేట్ టాక్, బాడీ షేమింగ్, సైబర్ బుల్లీయింగ్ తదితర దుర్లక్షణాల మీద కటువైన వ్యంగ్యంతో చేసిన వీడియోలు ఆమెకు గౌరవం తెచ్చి పెట్టాయి. ‘ఐ ప్లెడ్జెడ్ టు బి మీ’ అనే పేరుతో ఆమె చేసిన కాంపెయిన్ చాలామంది అమ్మాయిలకు ఆత్మవిశ్వాసం ఇచ్చింది. ఇవన్నీ ఆమెకు అవార్డులు, పెద్ద పెద్ద సంస్థల సోషల్ కాంపెయిన్లో భాగస్వామ్యాలు తెచ్చి పెట్టాయి. అంతేగాదు న్యూఢిల్లీలో ఆమె మిషేల్ ఒబామాతో కాఫీ తాగి కబుర్లు చెప్పే స్థాయికి ఎదిగింది. అలాగే యూట్యూబ్ సిఇఓ సుజేన్ వూను ఇంటర్వ్యూ చేయగలిగే ఏకైక భారతీయ యూట్యూబర్‌గా ఎదిగింది. ఇవన్నీ ఆమె కేవలం తన ఆకర్షణీయమైన మాటతోనే సాధించింది.ఇటీవలే యూట్యూబ్ ‘గ్లోబల్ ఇనిషీయేటివ్ క్రియేటర్స్ ఫర్ చేంజ్’కి ఇండియన్ అంబాసిడర్‌గా ఎన్నికైంది కూడా. ఆమె హావభావాలు, చక్కటి టైమింగ్‌కు ఎంటర్టైన్మెంట్ మార్కెట్లో ఉన్న డిమాండ్ ప్రజక్తకు చలనచిత్ర, వెబ్పరిశ్రమలో అవకాశాలను కల్పించాయి. ముందుగా తన నటనా నైపుణ్యాన్ని ‘ఖయాలీ పులావ్’ అనే షార్ట్ ఫిల్మ్‌తో పరీక్షించుకుంది. సూపర్ హిట్ అయిందిఈ ఏడాద ప్రారంభంలో, ఆమె తన తొలి నవల టూ గుడ్ టు బి ట్రూ విడుదలతో కథకురాలిగా ఆమె బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించింది. ఇక ప్రజక్తా కోలి ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30లోనూ, జీక్యూ ఇండియా అత్యంత ప్రభావవంతమైన యువ భారతీయుల జాబితా 2025 వంటి వాటిల్లో కూడా చోటు దక్కించుకున్నారు. (చదవండి: డెలివరీ ప్రాసెస్ ఇలా ఉంటుందా..? బిజేపీ నాయకుడి కుమార్తె...) -
అలనాటి మహిళా రాజ్యం..!
పురాతన టర్కిష్ నగరాన్ని 9000 సంవత్సరాల క్రితం మాతృస్వామ్య సమాజంలో నివసించే స్త్రీలు పాలించారని ఒక కొత్త అధ్యయనం ధ్రువీకరించింది. కాటల్హో యుక్లోలో 35 వేర్వేరు ఇళ్ల నుంచి 130కి పైగా అస్థిపంజరాల డీఎన్ఏను పరిశోధకులు విశ్లేషించారు.జన్యు శాస్త్రవేత్తలు, పురావస్తు శాస్త్రవేత్తలు, బయోలాజికల్ ఆంత్రోపాలజిస్ట్‌లు ఈ అధ్యయనంలో పాలుపంచుకున్నారు. అస్థిపంజరాల డీఎన్ఏ విశ్లేషణకు అత్యాధునిక సాంకేతిక జ్ఞానాన్ని ఉపయోగించారు. ఆ కాలంలో ప్రతి కుటుంబంలో, వ్యవసాయంలో మహిళలు కీలక పాత్ర పోషించేవారు. వివాహం తరువాత భర్తలు భార్య ఇంటికి వచ్చేవారు.మరణం తరువాత అంత్యక్రియలకు సంబంధించి పాటించే ఆచారాలలో స్త్రీ, పురుషుల మధ్య తేడా ఉండేదని అధ్యయనం తెలియజేసింది. పురుషులతో పోల్చితే స్త్రీల సమాధిలో ఉంచవలసిన వస్తువులు అయిదు రెట్లు ఎక్కువగా ఉండేవి. మాతృస్వామ్య సమాజానికి సంబం«ధించిన చిహ్నాలు, మహిళా ప్రతిమలను భారీ స్థాయిలో కలిగిన ఉన్న కారణంగా కాటల్హో ప్రసిద్ధి పొందింది. కాలానుగుణంగా సంస్కృతిలో వచ్చిన మార్పులకు సాక్ష్యంగా నిలుస్తోంది.(చదవండి: Fake weddings: పెళ్లి ఘనంగా జరిగింది... కానీ వధూవరులు లేరు!)


