ఒక్కోసారి మనం ఎదుర్కొనే పరాజయాలు మనల్ని ఎంతలా కుంగదీస్తాయంటే..ప్రతి చిన్నదానికి భయపడిపోయేలా చేస్తాయ్. ఇంతకు ముందున్నుట్లుగా ఆత్మవిశ్వాసంగా ఉండనివ్వవు. అంతేగాదు ప్రతి పనిలో ఆటంకం కూడా..భయం, ఆందోళనకు దారితీస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే మన మానసిక పరిస్థితి అత్యంత బలహీనంగా అయిపోతుంది. ఆ స్థితి నుంచి ఓ పట్టాన బయపడలేం. సరిగ్గా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోందో ఓ 32 ఏళ్ల మహిళ. ఆ దారుణమైన మానసిక పరిస్థితి నుంచి బయటపడేందుకు ఆమె ఏం చేసిందంటే..
గౌహతికి చెందిన 32 ఏళ్ల పూజా దాస్ మహిళ గత కొంతకాలంగా బ్యాంకు పరీక్షల కోసం సన్నద్ధమై ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయింది. దాంతో తీవ్రమైన ఆందోళన, డిప్రెషన్‌కి గురవ్వడమే కాదు, అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టాయి. దాంతో ఆమె ఇదివరకటిలా ధైర్యంగా ఎక్కడకి వెళ్లలేకపోతోంది. కనీసం ఏ పనిచేసినా..జరగకపోతే తీవ్రంగా ఆందోళన చెందడం, నా బతికింతే అన్నట్లుగా ఆత్మనూన్యత భావానికి గురయ్యేది. అలా ఒక్కోసారి చచ్చిపోవాలనేకునేంత స్టేజ్‌కి కూడా వెళ్లిపోయేది కూడా. బ్యాంకు ఉద్యోగాన్ని సంపాదించలేకపోయానన్న బాధ ఆమెను అంతలా కుంగదీసింది.
ఆ తర్వాత ఆమె ఆ ప్రయత్నాన్ని విరమించుకుని కంటెంట్ క్రియేటర్‌గా మారి ఆన్‌లైన్‌లో వీడియోలు పోస్ట్ చేస్తూ సంపాదించడం మొదలు పెట్టినా..ఎందుకో ఆ భయం, బెరుకు ఆమెను వదలి వెళ్లడం లేదు. ముఖ్యంగా అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్ (OCD) కారణంగా తీవ్రమైన ఆందోళనతో ఇబ్బంది పడుతుండేది. ఈ సమస్య నుంచి బయటపడాలని తనకు తాను ధైర్యం తెచ్చుకుని ఓ అడుగు ముందుకేసింది. అందుకోసం తాను సోలోగా ఫ్లైట్ జర్నీ చేయాలని నిర్ణయించుకుంది.
ఎందుకంటే ముందుగా ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లడం నుంచి అక్కడ జరిగే తనిఖీల వరకు ప్రతీదీ తానే స్వయంగా నిర్వహించుకోవాలని డిసైడ్ అయ్యింది. ఆ క్రమంలో ఎదురయ్యే టెన్షన్, ఒత్తిడి అన్నింటిని అధిగమించాలనే ఇలా చేసింది. అదేంటో ఆమె ఒక్కత్తే వెళ్లి తిరిగి వచ్చేసింది. పైగా తన భర్తకు నేరుగా ఎయిర్‌పోర్ట్‌కి వచ్చేదాక కాల్ చేయలేదు. అది చూసి ఆమె భర్త సైతం ఆశ్చర్యపోయారు. ఎందుకంటే..ఎప్పుడైనా.. ఎక్కడికైనా.. ఒంటిరిగా వెళ్లితే..ఓ వందసార్లుకు పైగా కాల్ చేస్తుంది.
అలాంటిది ఈసారి సోలోగా ఫ్లైట్ జర్నీ చేసినా..అంతలా భయపడలేదు, పైగా ఎక్కవ సార్లు భర్తకు కాల్ కూడా చేయలేదు. ప్రతీదీ తానే ధైర్యంగా చేయడమే కాదు ఇదివరకటిలా ఆత్మవిశ్వాసంగా ఉంది. అందుకు సంబంధించిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ..నావిలువను బ్యాంకు పోటీ పరీక్షలతో పోల్చుకున్నాని తెలుసుకున్నా. అయినా ప్రతీదీ అనుకున్నట్లుగా జరిపోదు అనేదాన్ని పూర్తిగా నమ్మాలి. నిజానికి ఆ దారిలో గెలవలేకపోతున్నాం అంటే..మరో దారి ఏదో మనకోసం వెయిట్ చేస్తుందని సానుకూలంగా తీసుకుని ముందుకుపోవాలని అర్థమైంది. అలాగే జీవితంలో ఎదురయ్యే కష్టాలు, ఆరోగ్య సమస్యల వల్ల కలిగే భయం మనకు ఎన్నో నేర్పించి. స్ట్రాంగ్‌గా మారుస్తుందని రాసుకొచ్చింది పోస్ట్‌లో.
చివరగా జీవితం అంటే బతకడం కోసం గడిపేది కాదు జీవించడం అని ఆత్మవిశ్వాసంగా చెప్పిందామె. అంతేగాదు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ప్రతి సవాలుని ఎదుర్కొంటేనే జీవితంలో కిక్కు ఉంటుందని తెలిసందీ.. అని అంటోంది. ఒంటిరిగా చేసిన ఆ జర్నీ తనలో ఎంతో మార్పు తీసుకువచ్చి, ఆత్మవిశ్వాసంగా ఉండేలా చేసిందని సంతోషంగా చెబుతోందామె. కాగా, దాస్ స్వస్థలం అస్సాంలోని మోరిగావ్. ఆమె అత్తమామలతో కలిసి అస్సాంలోని టిన్సుకియాలో ఉండేవారు. ప్రస్తుతం భర్తతో కలిసి హైదరాబాద్‌లో నివశిస్తోంది.


