International
-
ఔను.. చెత్త పనులు చేశాం.. తప్పు ఒప్పుకున్న పాక్
అమెరికా, బ్రిటన్ కోసమే చెత్త పనులు చేశామని.. ఉగ్రవాదాన్ని పోత్సహించడం పొరబాటని అర్థమైందంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు. అమెరికా కోసమే ఉగ్రవాదులను పెంచిపోషించామంటూ ఆయన తప్పును ఒప్పుకున్నారు. ఉగ్రవాదం వల్ల చాలా ఇబ్బందులు పడ్డామన్నారు. ఉగ్ర సంస్థలకు నిధులు, ఉగ్రవాదులకు శిక్షణ నిజమేనంటూ స్వయంగా ఆ దేశ రక్షణమంత్రే అంగీకరించారు. ఓ అంతర్జాతీయ మీడియాతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.పహల్గాం దాడి అనంతరం భారత్‌తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ‘స్కై న్యూస్’ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉగ్ర సంస్థలకు నిధుల సమీకరణ, ఉగ్రవాదులకు శిక్షణ, మద్దతు ఇవ్వడంలో పాకిస్థాన్‌కు సుదీర్ఘ చరిత్ర ఉందని.. దీని మీరు అంగీకరిస్తారా? అంటూ జర్నలిస్టు ప్రశ్నించగా.. ‘‘అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమదేశాల కోసమే మూడు దశాబ్దాల పాటు తాము ఈ చెత్త పనులన్నీ చేస్తున్నామంటూ ఖవాజా బదులిచ్చారు.సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో మేం చేరకపోయి ఉంటే.. పాక్‌కు తిరుగులేని ట్రాక్ రికార్డ్ ఉండేదన్నారు. లష్కరే తోయిబాకు గతంలో పాకిస్థాన్‌తో కొన్ని సంబంధాలు ఉన్నాయని కూడా ఖవాజా ఆసిఫ్ అంగీకరించారు. అయితే, ఇప్పుడు ఈ ఉగ్రవాద సంస్థ అంతమైందన్నారు. -
పిల్లపామును పెంచి పోషిస్తున్న హఫీజ్ సయ్యద్!
పహల్గాంలోని బైసరన్ లోయలో ఉగ్రవాదులు నరమేధం జరిపి 26 మందిని పర్యాటకుల్ని పొట్టనబెట్టుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. కశ్మీర్లో జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇదే కావడం గమనార్హం. అయితే లష్కర్-ఇ-తోయిబా(LeT) తరఫున కరడుగట్టిన టీఆర్ఎఫ్ గ్రూప్ ఈ ఘాతుకానికి పాల్పడగా.. ఆ సంస్థ కదలికలపై భద్రతా ఏజెన్సీలు ఓ అంచనాకి వచ్చాయి.లష్కరే తోయిబా విష సర్పానికి పుట్టిన పిల్ల పామే.. ద రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్). 2019లోనే ఇది పుట్టింది. ఈ విభాగానికి తొలినాళ్లలో షేక్ సాజిద్ గుల్ సుప్రీం కమాండర్‌గా, చీఫ్ ఆపరేషనల్ కమాండర్‌గా బాసిత్ అహ్మద్ దార్ వ్యవహరించారు. ఆ తర్వాత నుంచి లష్కరే చీఫ్ హఫీజ్ సయ్యద్(hafiz saeed) కనుసన్నల్లోనే నడుస్తోంది. డిప్యూటీ హెడ్‌గా సైఫుల్లా(హిజ్బుల్ ముహజిదిన్) వ్యవహరిస్తున్నారు. ఈ ఇద్దరూ పాక్ నుంచే ఎల్ఈటీ కార్యకలాపాలను నడిపిస్తున్నారనే అభియోగాలు ఉండనే ఉన్నాయి. పాక్ సైన్యం, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ISI) టీఆర్ఎఫ్ గ్రూపులకు సైద్ధాంతికపరమైన మద్దతు మాత్రమే కాదు.. అన్నిరకాలుగా మద్దతు ఇస్తున్నాయని భారత గూఢచార సంస్థలు భావిస్తున్నాయి.తొలినాళ్లలో జిహాదీ పేరిట ఆన్లైన్లో The Resistance Front సంస్థ పోస్టులు చేసేది. కశ్మీరీలు భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదంలో చేరేలా గప్‌చుప్ ప్రచారాలు చేసేది. ఉగ్ర కార్యకలాపాల కోసం ఆన్లైన్ ద్వారా యువతను నియమించుకునేది. ఆయుధ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి చర్యలకు పాల్పడింది. ఆ సమయంలో ఈ గ్రూప్ కార్యకలాపాలను కట్టడి చేసేందుకు జమ్ము పోలీసులు చేసిన ప్రయత్నాలేవీ పెద్దగా ఫలించలేదు. ఆ తర్వాత హిజ్బుల్ ముహజిదిన్, లష్కరే తొయిబా సభ్యులతోనే చాన్నాళ్లు నడిచింది. కానీ, ఆ తర్వాతే ఈ గ్రూపులో విదేశీ ఉగ్రవాదుల చేరిక క్రమంగా పెరుగుతూ వచ్చింది. వీళ్లకు కశ్మీర్ నుంచి స్థానిక ఉగ్రవాదుల మద్దతు లభిస్తూ వస్తోంది. అలా.. ఈ సంస్థ కశ్మీర్ లోయలో చాలా కాలంగా యాక్టివ్‌గా ఉంది. 2023లో కేంద్రం హోం శాఖ ఈ గ్రూప్‌పై విషేధం విధించింది.ఇంతకుముందు.. సోనామార్గ్, బూటా పాత్రి, గందర్బల్ దాడులకు ఈ సంస్థే కారణమని భద్రతా సంస్థలు బలంగా నమ్ముతున్నాయి. కిందటి ఏడాది అక్టోబర్‌లో బూటా పాత్రి ఇద్దరు సైనికులు సహా నలుగురిని ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. అదే నెలలో సోనామార్గ్ టన్నెల్ పనులు జరుగుతున్న ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో ఆరుగురు కార్మికులు, ఓ డాక్టర్ చనిపోయారు. పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాది హషీమ్ మూసా.. సోనామార్గ్ దాడిలోనూ పాల్గొన్నట్లు స్పష్టంగా తేలింది. అయితే సోనామార్గ్ ఘటన తర్వాత.. ఎల్ఈటీ ఏఫ్లస్ కేటగిరీ ఉగ్రవాది జునైద్ అహ్మద్ భట్‌ను డిసెంబర్లో దాచిగామ్ వద్ద భద్రతా దళాలు మట్టుపెట్టాయి. ఇదే ఎన్కౌంటర్లో గ్రూప్ సభ్యులు సమీపంలోని అడవుల్లోకి పారిపోయారు.సాధారణంగా దాడులకు పాల్పడ్డాక టీఆర్ఎఫ్ గ్రూప్ సభ్యులు అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోతారు. దట్టమైన అడవుల్లో తలదాచుకుంటూ.. పాక్ నుంచి గ్రూప్ నేతలు ఆదేశాలు కోసం ఎదురు చూస్తుంటారు. టీఆర్ఎఫ్ను తన కనుసన్నల్లోనే నడిపిస్తున్న హఫీజ్ సయ్యదే.. పహల్గాం దాడికి మాస్టర్ మైండ్ హఫీజ్ సయ్యదే అయి ఉండొచ్చని నిఘా సంస్థలు భావిస్తున్నారు. ఏప్రిల్ 24వ తేదీన.. గురువారం జమ్ము కశ్మీర్ పోలీసులు ఉగ్రవాదులకు సంబంధించిన స్కెచ్‌లు రిలీజ్ చేశారు. అందులో హషిమ్ మూసా అలియాస్ సులేమాన్, అలీ బాయి అలియస్ తల్హా పాకిస్థానీలుగా జమ్ము పోలీసులు ప్రకటించారు. మిగతా ఇద్దరు అబ్దుల్ హుస్సేన్ తోకర్, అసిఫ్‌లు స్థానికులేనని ప్రకటిచారు. ఈ ఇద్దరూ 2018లో కశ్మీర్‌కు వెళ్లి.. ఎల్ఈటీలో శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత టీఆర్ఎఫ్లో సహాయకులుగా చేరి.. పహల్గాం మారణ హోమంలో భాగం అయ్యారు.ప్లాన్ ప్రకారమే..సైనికుల దుస్తుల్లో వచ్చిన టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు.. బైసరన్ లోయలోని పిక్నిక్ స్పాట్లో మూడు వేర్వేరు ప్రాంతాలను ఎంచుకుని దాడికి పాల్పడ్డారు. తొలుత పర్యాటకులతో చాలాసేపు వాళ్లు మాట్లాడారు. ఆ తర్వాత పర్యాటకుల్లో ఐదుగురిని ఒక చోట చేర్చి చంపారు. మైదానంలో మరో ఇద్దరిని కాల్చి చంపారు. పారిపోతున్న క్రమంలో.. ఫెన్సింగ్ వద్ద ఇంకొందరిని కాల్చి చంపారు. ఫెన్సింగ్ దూకిన వాళ్లు ప్రాణాలతో బయటపడగలిగారు. -
తాష్కెంట్ ఒప్పందానికీ చెల్లుచీటీ!
భారత్, పాకిస్థాన్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదుల దుశ్చర్యను నిరసిస్తూ సింధు నదీ జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేయడం, అందుకు బదులుగా 1972 నాటి సిమ్లా అగ్రిమెంటు అమలును పాక్ సస్పెండ్ చేయడం తెలిసిందే. తాష్కెంట్ ఒప్పందం నుంచి కూడా వైదొలగాలని పాక్ తాజాగా యోచిస్తోంది. 1965లో ఇండియాతో తలెత్తిన యుద్ధానికి ముగింపు పలికేందుకు పాక్ 1966లో తాష్కెంట్ (ఉజ్బెకిస్థాన్) శాంతి ఒప్పందానికి తలూపింది. నాటి సోవియట్ యూనియన్ మధ్యవర్తిత్వంతో 1966 జనవరి 10న తాష్కెంట్ వేదికగా భారత్, పాక్ మధ్య ఈ చారిత్రక శాంతి ఒప్పందం కుదిరింది. నాటి భారత ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి, పాక్ అధ్యక్షుడు మహమ్మద్ ఆయూబ్ ఖాన్ ఈ డిక్లరేషన్ మీద సంతకాలు చేశారు. నాటి సోవియట్ రాజకీయవేత్త అలెక్సీ కోసిజిన్ ఈ కార్యక్రమానికి సోవియట్ ప్రతినిధిగా హాజరయ్యారు. భారత్, పాక్ ఇరు దేశాలూ తమ సైనిక బలగాలను ఉపసంహరించుకుని వాటిని యుద్ధానికి ముందు నాటి స్థానాలకు మళ్లించడం, ఒక దేశ అంతర్గత వ్యవహారాల్లో రెండో దేశం జోక్యం చేసుకోకుండా నివారించడంతోపాటు దౌత్య, ఆర్ధిక సంబంధాలను పునరుద్ధరించడం వంటివి ఈ డిక్లరేషన్ ప్రధానాంశాలు. అయితే కశ్మీర్ వివాద పరిష్కారంలో తాష్కెంట్ ఒప్పందం విఫలమైంది. 1971లో భారత్, పాక్ నడుమ మరో యుద్ధం సంభవించడం, బంగ్లాదేశ్ అవతరణ పరిణామాలతో 1972లో సిమ్లా ఒప్పందం కుదిరింది. అలా కశ్మీర్లో నియంత్రణ రేఖ ఏర్పాటైంది. అప్పట్నుంచి భారత్, పాక్ ద్వైపాక్షిక సంబంధాల్లో సిమ్లా అగ్రిమెంటుకు ప్రాధాన్యం పెరగడంతో తాష్కెంట్ ఒప్పందం కొన్ని దశాబ్దాలుగా మరుగునపడింది. సిమ్లా అగ్రిమెంటుకే విలువ ఇవ్వకుండా పక్కకు తప్పుకున్న పాక్ తాజాగా ఆరు దశాబ్దాల నాటి తాష్కెంట్ ఒప్పందం నుంచి వైదొలగాలని యోచించడం పెద్ద విశేషమేమీ కాదు. కాకపొతే పాక్ వైఖరిని గమనించడానికి ఇదొక ఉదాహరణ. చారిత్రకంగా ప్రాధాన్యమున్న శాంతిపరమైన బాధ్యతలను నెరవేర్చకుండా తప్పుకోవడం, కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయంగా రచ్చ చేయాలని చూడటం వంటివి పాక్ వ్యూహాలుగా కనిపిస్తున్నాయి. ఇకపై కశ్మీర్ వివాదం ద్వైపాక్షికం కాదని వాదిస్తూనే, ఆ సమస్య పరిష్కారం కోసం తృతీయ పక్షం లేదా అంతర్జాతీయ జోక్యానికి పిలుపు ఇవ్వాలని పాక్ భావిస్తోంది. ఇందులో భాగమే తాష్కెంట్ ఒప్పందానికి పాక్ చెల్లుచీటీ! - జమ్ముల శ్రీకాంత్. -
పాన్ వరల్డ్ హైవే.. 14 దేశాలను కలుపుతూ.. ఎన్నో వింతలు, విశేషాలతో..
ప్రస్తుతం అంతా పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్థాయి అంటూ తెగ చర్చ జరుగుతోంది. అయితే, దానికి కాస్తా భిన్నంగా పాన్ హైవే(PAN Highway.. గురించి ఎప్పుడైనా విన్నారా.. ఎప్పుడైనా చూశారా?. తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి.. ఈ హైవే అగ్రరాజ్యం అమెరికాలో ఉంది. ఈ రోడ్డు మార్గం పొడవు ఏకంగా 30,600 కిలోమీటర్లు (దాదాపు 19,000 మైళ్ళు). ఇది 14 దేశాలను కలుపుతూ వెళ్తోంది. అందుకే దీన్ని పాన్ అమెరికా హైవే అని పిలుస్తున్నారు. ఈ గురించి మరిన్ని వివరాలు ఇలా..రోడ్లు, హైవేలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు, ప్రదేశాలు, సంస్కృతులను కలుపుతాయి. ఒక దేశంలో రోడ్డు రవాణా వ్యవస్థ బాగుంటేనే ఆర్థికంగా ఎదిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ క్రమంలోనే అమెరికాలో ప్రపంచంలోనే అతి పొడవైన రోడ్డు మార్గం నిర్మించారు. దీంతో, ఈ పాన్ అమెరికా హైవే.. రికార్డుల్లోకి ఎక్కింది.30,600 కిలోమీటర్ల పొడవు.. పాన్-అమెరికన్ హైవే.. అలాస్కాలోని ప్రుధో బేలో ప్రారంభమై అర్జెంటీనాలోని ఉషుయాలో ముగుస్తుంది. ఉత్తర అమెరికా.. దక్షిణ అమెరికాను కలుపుతుంది. ఈ రోడ్డు మార్గం దాదాపు 30,600 కిలోమీటర్లు (దాదాపు 19,000 మైళ్ళు) విస్తరించి ఉంది. ప్రపంచంలోనే అతి పొడవైన డ్రైవింగ్ చేయగల రహదారిగా రికార్డు సృష్టించింది.పాన్-అమెరికన్ హైవే ఉత్తర, మధ్య, దక్షిణ అమెరికా అంతటా ఒకదానికొకటి అనుసంధానించబడిన రహదారుల ద్వారా విస్తరించి ఉంది. మరీ ముఖ్యంగా ప్రపంచంలోని అత్యంత సరళ రేఖలలో ఒకటిగా ఈ హైవే పరిగణించబడుతోంది. ఇది ఎలాంటి మలుపులు లేకుండా.. సరళ రేఖగా ఉంటుంది. ఈ రోడ్డు ఒక చివర నుంచి మరో చివరకు చేరుకోవాలంటే దాదాపు 60 రోజుల సమయం పడుతుంది. విరామం లేకుంగా రోజుకు 500 కిలోమీటర్లు ప్రయాణిస్తే.. గమ్యస్థానం చేరుకునే అవకాశం ఉంది.Did you know about the Pan-American Highway? It stretches from Alaska to Argentina, covering over 19,000 miles and passing through multiple terrains, climates, and countries! Civil engineers across the Americas made it all possible.#CivilEngineering #Infrastructure #DidYouKnow pic.twitter.com/zDqErPyZ6R— CKL Engineers (@CKLEngineersLLC) April 10, 202514 దేశాలను కలుపుతూ..పాన్ అమెరికా రహదారి 14 దేశాలను కలుపుతూ వెళ్తోంది. కెనడా, యునైటెడ్ స్టేట్స్, మెక్సికో, గ్వాటెమాల, ఎల్ సాల్వడార్, హోండురాస్, నికరాగ్వా, కోస్టా రికా, పనామా, కొలంబియా, ఈక్వెడార్, పెరూ, చిలీ, అర్జెంటీనాను కలుపుతుంది. ఇది కేవలం ఒక మార్గం మాత్రమే కాదు. ఈ రోడ్డుపై ప్రయాణ సమయంలో ఎన్నో వింతలు, ప్రకృతి దృశ్యాలు, సంస్కృతులు, చరిత్రలను తెలుసుకోవచ్చు. ఈ హైవే ఎడారులు, పర్వతాలు, వర్షారణ్యాలు, తీర ప్రాంతాలతో సహా వివిధ వాతావరణాలు కలిగిన ప్రాంతాల గుండా వెళ్తోంది. ఈ రోడ్డు నిర్మాణంపై 1920లో మొదటి సారి చర్చలు జరగ్గా.. 1937లో 14 దేశాలు పాన్-అమెరికన్ హైవే కన్వెన్షన్‌పై సంతకం చేశాయి. 1960లో రోడ్డు నిర్మాణం పూర్తి అయ్యి వాహనదారులకు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ రహదారిపై ట్రాఫిక్ లేకుండా వాహనాలు ప్రయాణం సాగిస్తున్నాయి. లాంగ్ రైడ్ వెళ్లాలనుకునే వారు ఈ మార్గంలో వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. -
పహల్గాం ఉగ్రదాడిపై పాక్ ఉప ప్రధాని సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: జమ్మూకశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడి వేళ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి, ఉప ప్రధాని ఇషాక్ దార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్ పహల్గంలో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల్నిస్వాంతంత్ర్య సమరయోధులని అభివర్ణించారు. పహల్గాంలో ఉగ్రమూఖల దుశ్చర్యను ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. పాకిస్తాన్ తీరుపై పరోక్షంగా దుమ్మెత్తి పోస్తున్నాయి. ఉగ్రదాడిని ఖండిస్తూ భారత్‌కు సంఘీభావం తెలుపుతున్నాయి. అదే సమయంలో పాకిస్తాన్ సైతం పహల్గాంలో జరిగిన దాడిని ఖండించినప్పటికీ, తామే ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం ఇస్తున్నారనే ఆరోపణలను కొట్టిపారేసింది. Pakistan Deputy Prime Minister and Foreign Minister Ishaq Dar calls Pahalgam Islamic terrorists asFreedom fighters'And our liberals have Aman ki Asha with this Terrorist country 😡😡😡 pic.twitter.com/rrWUxWtArJ— Sheetal Chopra 🇮🇳 (@SheetalPronamo) April 24, 2025అయితే, ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ ఏప్రిల్ 22న పహల్గాంలో దాడి చేసిన వారు స్వాంతత్య్ర సమరయోధులని వ్యాఖ్యానించారు. ఇస్లామాబాద్‌లో నిర్వహించిన అధికారిక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం జిల్లాలో దాడులు చేసిన ఉగ్రవాదులు స్వాతంత్య్ర సమరయోధులై ఉండవచ్చు’ అని అన్నారు. "Pakistan Army is ready for any challenge", stated Foreign Minister and Deputy Prime Minister Ishaq Dar in response to India’s actions after the Pahalgam incident. #IshaqDar #Pakistan #India #Pahalgam #TOKReports pic.twitter.com/QYfjFq6vQx— Times of Karachi (@TOKCityOfLights) April 24, 2025భారత్‌కు గట్టి బదులిస్తాంప్రధాని మోదీ పహల్గాం ఉగ్రవాదులకు బహిరంగంగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఎక్కడ దాక్కున్నా ప్రపంచపు అంచుల దాకా వెంటాడి మరీ వాళ్లను మట్టిలో కలిపేస్తాం. వారిని ప్రోత్సహిస్తున్న దుష్టశక్తినీ కఠినంగా శిక్షిస్తాం. కలలోనైనా ఉహించలేని స్థాయిలో ప్రతీకారం తీర్చుకుని తీరుతాం’ అని పునరుద్ఘాటించారు. ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు ఇషాక్ దార్ పరోక్షంగా స్పందించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకున్న చర్యలకు ప్రతిస్పందనగా పాక్ సైన్యం ఎలాంటి సవాళ్లకైనా సిద్ధంగా ఉందన్నారు. భారత పౌరులు సురక్షితంగా ఉండరుభారతదేశం ఏదైనా దుస్సాహసానికి ప్రయత్నిస్తే గతంలో కంటే దారుణమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పాకిస్తాన్ పౌరులను లక్ష్యంగా చేసుకుంటే భారత పౌరులు సురక్షితంగా ఉండరని రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు.మీ వ్యాఖ్యలు దేశానికే అవమానంపహల్గాం ఉగ్రదాడిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ఆదేశ ప్రభుత్వ పెద్దల తీరును వరుస ట్వీట్లతో ఎండగడుతున్నారు. తాజాగా పహల్గాం దాడికి పాల్పడ్డవారు స్వాంతత్య్ర సమరయోధులంటూ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి,ఉప ప్రధాని ఇషాక్ దార్ చేసిన సంచలన వ్యాఖ్యలపై కనేరియా ఎక్స్ వేదికగా స్పందించారు. పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి ఉగ్రవాదులను స్వాతంత్ర్య సమరయోధులు’ అని పిలవడం దేశానికి అవమానకరమే కాదు. తాము ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నామని బహిరంగంగా అంగీకరించడమే అవుతుందని’ అన్నారు. When the Deputy Prime Minister of Pakistan calls terrorists “freedom fighters,” it’s not just a disgrace — it’s an open admission of state-sponsored terrorism. pic.twitter.com/QlS1UDzq20— Danish Kaneria (@DanishKaneria61) April 24, 2025 అలా అయితే ఉగ్రవాదాన్ని పెంచిపోషించేది ప్రభుత్వమే అంతకు ముందు పహల్గాం ముష్కరుల దాడిలో తమదేశ ప్రమేయం లేదంటే పాక్ ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ప్రకటనలపై ప్రశ్నల వర్షం కురిపించారు. పహల్గాం దాడిలో పాత్ర లేకపోతే.. ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎందుకు ఖండించలేదు. దాడి తర్వాత పాక్ దళాలు అకస్మాత్తుగా ఎందుకు అప్రమత్తమయ్యాయి’ అని నిలదీశాడు. ప్రభుత్వం ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తుందని ఆరోపించారు. ఉగ్రవాదం విషయంలో ప్రభుత్వ చర్యలకు సిగ్గుపడాల్సిన విషయమని ట్విటర్ వేదికగా అసహనం వ్యక్తం చేశారు. If Pakistan truly has no role in the Pahalgam terror attack, why hasn’t Prime Minister @CMShehbaz condemned it yet? Why are your forces suddenly on high alert? Because deep down, you know the truth — you’re sheltering and nurturing terrorists. Shame on you.— Danish Kaneria (@DanishKaneria61) April 23, 2025 -
భారత్, పాక్ మధ్య యుద్ధం తప్పదా?.. సంచలన నివేదిక
భారత్, పాక్.. రెండు దేశాలూ ఒకదాని గురించి మరొకటి అంచనాలు వేయడంలో పొరపాట్లు జరిగినా లేదా రెండిట్లో ఏదో ఒక దేశం అకారణంగా అతిగా స్పందించినా... సాధారణ శతృత్వం కాస్తా అణుయుద్ధానికి దారి తీయవచ్చు! 1980, 1990ల నాటి అమెరికన్ ఇంటెలిజెన్స్ నివేదికలు ఈ ఉపద్రవాన్నే సూచిస్తున్నాయి. కశ్మీర్‌లోని పహల్గాంలో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు బలిగొన్న నేపథ్యంలో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు మిన్నంటుతున్నాయి. ఇదే తరుణంలో విడుదలైన అమెరికన్ ఇంటెలిజెన్స్ రహస్య నివేదికలు మరిత ఆందోళన రేకెత్తిస్తున్నాయి. డీక్లాసిఫై అయిన ఇంటెలిజెన్స్ నివేదికల పత్రాలను అమెరికాలోని నేషనల్ సెక్యూరిటీ ఆర్కైవ్ మంగళవారం (ఈ నెల 22న) బహిర్గతం చేసింది.నివేదికల ప్రకారం భారత్, పాక్ నడుమ యుద్ధం సంభవించే అవకాశాలు స్వల్పమే అయినప్పటికీ పరస్పరం అంచనాలు వేయడంలో ఆయా దేశాలు పొరబడినా లేదా ఉభయ దేశాల్లో ఏదో ఒకటి అహేతుకంగా ప్రతిస్పందించడమో, అసమంజస నిర్ణయాలు తీసుకోవడమో జరిగినా సంప్రదాయ వైరం కాస్తా అణుయుద్ధంగా పరిణమించవచ్చు. ప్రస్తుతం భారత్ వద్ద సుమారు 160 న్యూక్లియర్ వార్ హెడ్లు, పాక్ అమ్ములపొదిలో 165 అణు వార్ హెడ్లు ఉండవచ్చని ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ అంచనా. ఆధునిక క్షిపణి వ్యవస్థలు అణుయుద్ధ ముప్పును ‘వేగవంతం’ చేస్తున్నాయి. పాక్ క్షిపణి ‘షహీన్’ ఏడు నిమిషాల్లో న్యూఢిల్లీని చేరగలదు. అలాగే భారత్ క్షిపణి ‘ప్రళయ్’ ఆరు నిమిషాల లోపే ఇస్లామాబాద్ మీద దాడి చేయగలదు. మరో ముఖ్యాంశం... ‘నో ఫస్ట్ యూజ్’ పాలసీకి తాము కట్టుబడినట్టు భారత్ గతంలో ప్రకటించింది. ఈ ‘నో ఫస్ట్ యూజ్ న్యూక్లియర్ డాక్ట్రిన్’ ప్రకారం... భారత భూభాగంపైనో, భారత సైనిక దళాలపైనో అణుదాడి జరిగితేనే మన దేశం ప్రతీకార అణుదాడులకు ఉపక్రమిస్తుంది. అంతేతప్ప భారత్ తనంతట తానుగా, ముందుగా అణ్వాయుధాలను ఏ దేశంపైనా ప్రయోగించదు. ‘ఇండియాస్ రియాక్షన్ టు న్యూక్లియర్ డెవలప్మెంట్స్ ఇన్ పాకిస్థాన్’ శీర్షికతో ఉన్న 1981 నాటి అమెరికన్ స్పెషల్ నేషనల్ ఇంటెలిజెన్స్ ఎస్టిమేట్ (ఎస్ఎన్ఐఈ) ప్రకారం... తమ భద్రతకు తీవ్రంగా ముప్పు వాటిల్లుతుందని భావిస్తేనే భారత్ ముందస్తుగా పాక్ అణు కేంద్రాలపై దాడులు చేస్తుంది. ఇక ‘నో ఫస్ట్ యూజ్ అణు విధానం లాంటి స్వీయ నియంత్రణ, కట్టుబాట్లు మన పొరుగు దేశానికి లేవు. 2019లో భారత యుద్ధ విమానాలు పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి బాలాకోట్ వద్ద బాంబులు వేసి ఉగ్రవాద శిబిరాలను నాశనం చేశాయి. అలాంటి సాధారణ, సంప్రదాయ దాడి సందర్భాల్లో పరిస్థితులను అర్థం చేసుకోకుండా పాకిస్థాన్ ఒకవేళ అసంబద్ధంగా ప్రవర్తిస్తే జరిగేది... అణుయుద్ధమే!.ఇండియాతో మరో యుద్ధం తలెత్తితే తమ దేశం మొత్తం కాకపోయినా తమ మిలిటరీ నాశనమవుతుందని పాక్ సైనిక నాయకత్వం భయపడినట్టు 1993 నాటి సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) రహస్య నివేదిక ఒకటి వెల్లడించింది. ‘ఇండియా-పాకిస్థాన్: ప్రాస్పెక్ట్స్ ఫర్ వార్ ఇన్ ద నైంటీస్’ శీర్షికతో ఉన్న ఈ నివేదిక... భారత్-పాక్ మధ్య యుద్ధం జరిగే అవకాశాలు 20% (ఐదింట ఒక వంతు) ఉన్నట్టు అప్పట్లో అంచనా వేసింది.- జమ్ముల శ్రీకాంత్.Conflict with India could destroy Pak military, if not the entire state : declassified CIA docs.Recently declassified paper predicted a spectacular terror attack could increase chances of conflict, Pak would fear destruction of the state.https://t.co/PfOwuRym9A pic.twitter.com/StP3TDJPZi— Manu Pubby (@manupubby) April 24, 2025పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం దౌత్యపరమైన ఆంక్షలతో పాక్‌ను ఉక్కిరి బిక్కిరి చేసింది. అందులో సింధు జలాల ఒప్పందం నిలిపివేతతో ప్రధాన చర్చనీయాంశమైంది. భారత్ చర్యలకు ప్రతిగా.. పాక్ కూడా భారత్‌పై పలు ఆంక్షలను విధిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. -
శాంతిస్థాపనే లక్ష్యంగా సిమ్లా ఒప్పందం
పహల్గాంలో హేయమైన ఉగ్రదాడి తర్వాత సింధూ నదీజలాల ఒప్పందం అమలును నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించాక అందుకు ప్రతీకార నిర్ణయంగా పాకిస్తాన్ రెచ్చగొట్టే నిర్ణయం తీసుకుంది. ఇరు దేశాల మధ్య సమస్యల పరిష్కారంలో మూడో దేశం జోక్యం చేసుకోవద్దనే ప్రధాన అజెండాగా రూపుదిద్దుకున్న సిమ్లా ఒప్పందం నుంచి పక్కకు జరుగుతున్నట్లు పాక్ ప్రకటించింది. దీంతో దశాబ్దాలుగా రావణకాష్టంగా రగలిపోతున్న కశీ్మర్ అంశంలో ఇకపై అమెరికా వంటి సంపన్న దేశాలు పెద్దమనిషిలా దూరిపోయి అంశాన్ని మరింత జఠిలం చేసే ప్రమాదముందనే సంకేతాలు వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు సిమ్లా ఒప్పందంలో ఏమేం అంశాలు ఉన్నాయి?. వాటి ప్రాధాన్యత ఏమిటి? అనే చర్చ ఇప్పుడు మొదలైంది. 1972లో సాకారం.. తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్‌గా విమోచన పొందడంలో భారత ప్రమేయాన్ని తీవ్రంగా తప్పుబడుతూ భారత్‌పైకి పాకిస్తాన్ దాడికి తెగించడం తదనంతర పరిణామాలతో 1971 యుద్ధం జరిగింది. 1971లో భారత్, పాక్‌ల మధ్య యుద్ధం ముగిశాక శాంతిస్థాపనే లక్ష్యంగా ఒక ఒప్పందానికి ఇరుదేశాలు మొగ్గుచూపాయి. ఉద్రిక్త పరిస్థితులను తగ్గించుకుని, సాధారణ పరిస్థితులు నెలకొనడమే లక్ష్యంగా ఒక ఒప్పందానికి ఇరుదేశాలు పచ్చజెండా ఊపాయి. పొరుగుదేశ సరిహద్దు ప్రాంతాన్ని ఆక్రమిస్తూ నియంత్రణ రేఖను ఇష్టమొచి్చనట్లు ఏకపక్షంగా మార్చకూడదనే కట్టుబాటుతో ఈ ఒప్పందం చేసుకున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా పట్టణంలో 1972 జూలై రెండో తేదీన నాటి భారత ప్రధాని ఇందిరా గాం«దీ, పాకిస్తాన్ అధ్యక్షుడు జులి్ఫ కర్ అలీ భుట్టో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. యుద్ధం ముగిసిన వెంటనే శాంతిస్థాపనకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ఇరుదేశాలు తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయంగా ఈ ఒప్పందం పేరొందింది. ఇకపై పొరుగుదేశాలుగా పరస్పర సహకారం, సామరస్యంతో మెలుగుతామని ఆనాడు ఇరుదేశాలు ప్రతినబూనాయి. ఒప్పందంలో ఏమేం ఉన్నాయి? భవిష్యత్తులో సరిహద్దుసహా మరే అంశంలోనైనా మనస్పర్థలు తలెత్తినా, వివాదాలు చెలరేగినా మూడో దేశానికి లేదా అంతర్జాతీయ సంఘంలో ఫిర్యాదుచేయకుండా రెండు దేశాలు మాత్రమే కూర్చుని మాట్లాడుకోవాలని సిమ్లా ఒప్పందంలో పేర్కొన్నారు. మూడో దేశం జోక్యాన్ని ఈ ఒప్పందం నివారిస్తోంది. 1971లో యుద్ధం సమయంలో సరిహద్దు దాటి ముందుకు చొచ్చుకురావడం, మరి కొన్ని చోట్ల భూభాగాన్ని కోల్పోవడం వంటి ఘటనలు జరిగాయి. ప్రస్తుతం తమ అ«దీనంలోని భూభాగాలను తమవిగా పేర్కొంటూ, యథాతథ స్థితిని కొనసాగించాలంటూ దానినే నియంత్రణ రేఖగా ఇరుదేశాలు అంగీకరించాయి. ఈ ని యంత్రణ రేఖను ఏకపక్షంగా మార్చడానికి వీలులేదు. యుద్ధం వేళ చాలా మంది పాకిస్తానీ సైనికులను భారత బలగాలు బంధించాయి. ఈ ఒప్పందంలో భాగంగా వారందరినీ విడిచిపెట్టారు. పాకిస్తాన్ సైతం బంగ్లాదేశ్ సాధించిన సార్వభౌమత్వాన్ని అధికారికంగా గుర్తించింది. బంగ్లాదేశ్‌తోనూ పర స్పర గౌరవం పాదుకొల్పడమే లక్ష్యంగా ఈ అంశాన్నీ సిమ్లా ఒప్పందంలో చేర్చారు. ఒప్పందం ప్రభావం ఎంత ? ఈ ఒప్పందం కారణంగా తదనంతరకాలంలో ఇరు దేశాల మధ్య పొరపొచ్చాలు వచి్చన ప్రతిసారీ ఈ రెండు దేశాలే సమస్యలను పరిష్కరించుకున్నాయిగానీ మరే ఇతర దేశాన్ని మధ్యవర్తిగా ఆహ్వానించలేదు. చర్చలు రెండు దేశాల మధ్యే పరిమితం కావడంతో వేగంగా సంప్రతింపులు సాధ్యమయ్యాయి. మెరుగైన పరిష్కారం సాధ్యమైంది. కశ్మీర్లో నియంత్రణ రేఖనే వాస్తవా«దీన రేఖగా అప్పటి నుంచి కొనసాగింది. దీంతో ఆనాటి నుంచి ఎలాంటి సరిహద్దు ఆక్రమణ ఘటనలు జరగలేదు. ఇలా ఈ ఒప్పందం భూభాగాల వివాదాలను సమర్థవంతంగా పరిష్కరించింది. దౌత్యపరంగా సంబంధాల కొనసాగింపునకు ఈ ఒప్పందం సుసాధ్యం చేసింది. ఇరుదేశాల మధ్య విశ్వాసం పెంచే ప్రయత్నాలు ఈ ఒప్పందం కారణంగానే జరిగాయి. అయితే ఇరువైపులా కాల్పుల విరమణ ఒప్పందం వంటివి తరచూ ఉల్లంఘనకు గురవడం ఒక్కటే ఈ ఒప్పందం మనుగడకు సవాల్‌గా నిలిచింది. తాజాగా పాకిస్తాన్ ఈ ఒప్పందం నుంచి తప్పుకుంటే కశీ్మర్ అంశంపై పాక్ అనుకూల దేశాలు మధ్యవర్తులుగా బయల్దేరే ప్రమాదముంది. అప్పుడు కశీ్మర్ మా ఇద్దరికి మాత్రమే సంబంధించిన అంశం అనే భారత వాదన అంతర్జాతీయ వేదికలపై కాస్తంత బలహీనపడే అవకాశముందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
దాడిని తీవ్రంగా ఖండించిన అరబ్ దేశాలు
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రమూకలు 26 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ఉదంతాన్ని ఇరాక్, జోర్డాన్, ఖతార్ తదితర అరబ్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. భారత్‌కు సంఘీభావం ప్రకటించిన ఈ దేశాలు, మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించాయి. యూరప్ దేశాల సమాఖ్య ఈయూ కూడా దారుణాన్ని ఖండించింది. భారత్‌కు సంఘీభావం తెలిపింది. లక్ష్యమేదైనా, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అందరూ ఖండించాల్సిందేనని స్పష్టం చేసింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. దేశ భద్రత, స్థిరత్వానికి భంగం కలిగించే ఇటువంటి శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. అదేవిధంగా, పహల్గాం దాడి నేపథ్యంలో ప్రధాని మోదీకి గురువారం ఇటలీ ప్రధానమంత్రి మెలోనీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఫోన్ చేసి మాట్లాడారు. మృతుల కుటుంబాలకు వారు సానుభూతి తెలిపారు. అమాయకులను దారుణంగా పొట్టనబెట్టుకున్న ఉగ్రమూకల పైశాచికాన్ని వారు తీవ్రంగా ఖండించారు. మెలోనీ, మాక్రాన్‌లకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారని, దాడికి కారకులైన వారిని చట్టం ముందు నిలబెడతామని చెప్పారని విదేశాంగ శాఖ తెలిపింది. -
క్షిపణి పరీక్షలకు సిద్ధమైన పాక్
ఇస్లామాబాద్: సరిహద్దు వెంట తరచూ కాల్పుల విరమణ ఉల్లంఘనలతో కవ్వింపు చర్యలకు పాల్పడే పాకిస్తాన్ పహల్గాం ఉదంతం తర్వాత సైతం తన బుద్ధిని మార్చుకోలేదు. తాజాగా కరాచీ తీరం వెంట క్షిపణి పరీక్షను చేపట్టబోతున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ మేరకు తూర్పున ఉన్న కరాచీ తీరంలో భూతలం నుంచి భూతలం మీదకు ప్రయోగించి క్షిపణిని పరీక్షించనున్నట్లు ఒక నోటీస్‌ను జారీచేసింది. అరేబియా సముద్రంలో తమ పరిధిలోని సముద్రజలాల మీదుగా ఎలాంటి వైమానిక రాకపోకలు లేకుండా నిషేధం అమల్లోకి తెచ్చింది. ఆ ప్రాంతాన్ని నో–ఫ్లై జోన్‌గా ప్రకటించింది. ఆ పరిధిలో నావికులు సంచరించకూడదని హెచ్చరించింది. దాదాపు 480 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల మిస్సైల్‌ను పరీక్షంచనుంది. పాక్ తన ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ జోన్(ఈఈజెడ్)ప్రాంతంలో ఏప్రిల్ 25వ తేదీన ఈ క్షిపణి పరీక్ష చేపట్టే అవకాశం ఉందని భారత రక్షణ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పహల్గాం ఉదంతంపై ఆగ్రహంతో భారత్ తమపై ప్రతీకార దాడులకు దిగితే తాము కూడా అందుకు సన్నద్ధంగా ఉన్నామని తెలియజేప్పేందుకే పాకిస్తాన్ ఇలా క్షిపణి పరీక్షలకు దిగిందని యుద్ధరంగ నిపుణులు చెబుతున్నారు. -
నీటి మళ్లింపు.. పాక్‌పై యుద్ధ ప్రకటనే
ఇస్లామాబాద్: సింధూ నది జలాల ఒప్పందాన్ని లెక్కచేయకుండా నీటి మళ్లింపు కోసం ఎలాంటి చర్యలు చేపట్టినా అది తమపై యుద్ధ ప్రకటనగానే పరిగణిస్తామని పాకిస్తాన్ స్పష్టం చేసింది. పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్ విధించిన ఆంక్షలకు ప్రతీకారంగా పాకిస్తాన్ సైతం భారత్‌పై ఆంక్షలు ప్రకటించింది. భారతదేశ విమానాలు తమ గగనతలం గుండా ప్రయాణించడానికి వీల్లేదని పేర్కొంది. ఇండియాతో అన్ని రకాల వాణిజ్య కార్యకలాపాలు, ద్వైపాక్షిక ఒప్పందాలతోపాటు కీలకమైన సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వాఘా సరిహద్దును మూసివేస్తున్నట్లు వెల్లడించింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలో గురువారం నేషనల్ సెక్యూరిటీ కమిటీ(ఎన్ఎస్సీ) సమావేశం జరిగింది. పలువురు మంత్రులతోపాటు త్రివిధ దళాల అధిపతులు హాజరయ్యారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత ప్రభుత్వం విధించిన ఆంక్షలపై చర్చించారు. భారత్‌పైనా అదే తరహా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఎన్ఎస్సీ భేటీ అనంతరం పాక్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. భారత్‌తో అమల్లో ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలను నిలిపివేసే హక్కు తమకు ఉందని పేర్కొంది. కేవలం సిమ్లా ఒప్పందమే కాకుండా మిగతా ఒప్పందాలనూ నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. పాక్ ప్రభుత్వ నిర్ణయాలు → ఇండియాతో ద్వైపాక్షిక ఒప్పందాలతోపాటు సిమ్లా ఒప్పందం సైతం నిలిపివేత. → వాఘా బోర్డర్ పోస్టు తక్షణమే మూసివేత. రాకపోకలు పూర్తిగా రద్దు. → ఈ సరిహద్దు గుండా బయటకు వెళ్లినవారు 30లోగా తిరిగిరావాలి. → సార్క్ వీసా మినహాయింపు పథకం(ఎస్‌వీఈఎస్) కింద భారతీయులకు ఇచ్చిన అన్ని రకాల వీసాలు వెంటనే రద్దు. సిక్కు యాత్రికులకు మాత్రం మినహాయింపు. → ఎస్‌వీఈఎస్ పథకం కింద పాకిస్తాన్లో ఉన్న భారతీయులు 48 గంటల్లోకి బయటకు వెళ్లిపోవాలి. → పాక్‌లో ఉన్న భారతీయ త్రివిధ దళాల సభ్యులు ఏప్రిల్ 30 లోగా వెనక్కి వెళ్లిపోవాలి. భారత హైకమిషన్‌లోని ఈ పోస్టులు రద్దు. → భారత హైకమిషన్‌లో పనిచేస్తున్న భారత సహాయక సిబ్బంది సైతం స్వదేశానికి వెళ్లిపోవాలి. → ఇండియన్ హైకమిషన్‌లో దౌత్యవేత్తలు, సిబ్బంది సంఖ్య 30కి పరిమితం. ఇది ఈ నెల 30వ తేదీ నుంచి అమల్లోకి. → పాక్ గగనతలంపై ప్రయాణించేందుకు భారత విమానాలు అనుమతి లేదు. ఈ నిర్ణయం ఇది తక్షణమే అమలు. → సింధూ నది జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ భారత్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం దారుణం. 24 కోట్ల మంది పాక్ పౌరులకు ఈ జలాలు జీవనాధారం. → ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉగ్రవాదం ఏ రూపంలో, ఎక్కడున్నా అంతం చేయాల్సిందే. శాంతి, స్థిరత్వానికి కట్టుబడి ఉన్నాం. ఒకవేళ పాక్ సార్వ¿ౌమత్వానికి, భద్రతకు ముప్పు వాటిల్లితే తగిన రీతిలో బదులిస్తాం. → రాజకీయ ఎజెండా కోసం పాక్‌పై నిందలు వేయడం భారత్ మానుకోవాలి. ఇలాంటి నిందలు శాంతి, స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయి తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆగ్నికి ఆజ్యం పోసేలా వ్యవహరించకూడదు. -
యుద్ధమేఘాలు!
సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాక్ నడుమ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుతున్నాయి. తనకు జీవనాడి వంటి సింధు జలాల ఒప్పందం సస్పెన్షన్‌పై పాక్ గంగవెర్రులెత్తిపోయింది. ఇది తమపై నేరుగా యుద్ధ ప్రకటనేనంటూ గగ్గోలు పెట్టింది. ప్రతీకారంగా నామమాత్రపు సిమ్లా ఒప్పందాన్ని సస్పెండ్ చేసి అక్కసు తీర్చుకుంది. భారత్‌కు తన గగనతలాన్ని మూసేయడమే గాక వాణిజ్య సంబంధాలను పూర్తిగా తెంచుకుంటున్నట్టు ప్రకటించింది. ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధమంటూ బీరాలు పలికింది. ఎడాపెడా క్షిపణి పరీక్షలకు రంగం సిద్ధం చేసుకుంటోంది. సరిహద్దుల వెంబడి సైనిక మోహరింపులను కూడా యుద్ధ ప్రాతిపదికన భారీగా పెంచేస్తోంది. మరోవైపు దాయాది ఎన్నటికీ మర్చిపోలేని రీతిలో ‘నిర్ణాయక చర్య’లకు కేంద్రం సిద్ధమవుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. గురువారం చోటుచేసుకున్న పలు కీలక పరిణా మా లు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జై శంకర్ మధ్యాహ్నం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో భేటీ అయ్యారు. గురువారం శ్రీనగర్‌లోని మార్కెట్ ప్రాంతంలో భద్రతా దళాల గస్తీ తాజా పరిస్థితిని వివరించడంతో పాటు పలు ‘ఇతర’ అంశాలపైనా చర్చించినట్టు చెబుతున్నారు. ప్రధాని మోదీ కూడా పహల్గాం ముష్కరులకు బహిరంగంగా తీవ్ర హెచ్చరికలు చేశారు. ‘‘ఎక్కడ దాక్కున్నా ప్రపంచపు అంచుల దాకా వెంటాడి మరీ వాళ్లను మట్టిలో కలిపేస్తాం. వారికి దన్నుగా నిలిచిన దుష్టశక్తినీ కటినంగా శిక్షిస్తాం. కలలోనైనా ఊహించలేని స్థాయిలో ప్రతీకారం తీర్చుకు ని తీరతాం’’ అంటూ ప్రతినబూనారు. తర్వాత కా సేపటికే ‘ఆక్రమణ్’ పేరిట సైన్యం భారీ వైమానిక విన్యాసాలు నిర్వహించింది. అత్యాధునిక రఫేల్‌తో పాటు సుఖోయ్ తదితర యుద్ధ విమానాలు ఇందులో పాల్గొన్నాయి. మరోవైపు పాక్‌లో ఉన్న భారతీయులు తక్షణం తిరిగి రావాలంటూ కేంద్రం అడ్వై జరీ జారీ చేసింది. పొరుగు దేశాన్ని అంతర్జాతీయ వేదికలపై ఏకాకిని చేయడమే గాక దానిపై తీసుకోబోయే ‘కఠిన’ చర్యలకు జీ20 తదితర దేశాల మద్దతు కూడగడుతోంది. పహల్గాం ఆటవిక దాడి, అందులో పాక్ ముష్కరులు పాల్గొన్న వైనం తదితరాలను జీ20 సభ్య దేశాల రాయబారులకు విదేశాంగ శాఖ పూసగుచ్చినట్టు వివరించింది. భేటీకి హాజరైన అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, ఆ్రస్టేలియా, యూఏఈ తదితర దేశాల రాయబారులు దాడిని తీవ్రంగా ఖండించాయి. పాక్‌కు కరుడుగట్టిన మద్దతుదారైన చైనా కూడా భేటీలో పాల్గొనడమే గాక భారత్‌కు మద్దతు పలకడం విశేషం. మరోవైపు పహల్గాం దాడి, తదనంతర పరిస్థితులను కాంగ్రెస్ తదితర పార్టీలన్నింటితో కేంద్రం పంచుకుంది. ఉగ్ర తండాలను శాశ్వతంగా నిర్మూలించి తీరాల్సిందేనని పార్టీలన్నీ ముక్త కంఠంతో అభిప్రాయపడ్డాయి. అందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకున్నా అండగా నిలుస్తామని అఖిలపక్ష భేటీలో ప్రకటించాయి. అత్యాధునిక యుద్ధ విమానాలు, క్షిపణులతో విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్, దానికి తోడుగా యుద్ధనౌక ఐఎన్ఎస్ సూరత్ పాక్ దిశగా కదులుతున్నట్టు సమాచారం. -
పాక్ సైన్యం చేతిలో బందీగా బీఎస్ఎఫ్ జవాన్
న్యూఢిల్లీ: పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ తో భారత్ తెగతెంపులు చేసుకోవడానికి సిద్ధమైన తరుణంలో బీఎస్ఎఫ్ జవాన్ ఒకరు పాక్ సైన్యం చేతిలో బందీ అయ్యారు. అనుకోకుండా పంజాబ్‌లోని ఫెరోజ్‌పూర్ బోర్డర్ దాటిన క్రమంలో పీకే సింగ్ అనే జవాన్ ను పాక్ సైన్యం అదుపులోకి తీసుకుంది. దీనిపై పాకిస్తాన్ సైన్యంతో భారత్ సైన్యం చర్చలు జరుపుతుంది.పాక్ చేతిలో బందీగా మారిన భారత్ జవాన్ ను సురక్షితంగా విడిచిపెట్టాలని బీఎస్ఎఫ్ అధికారులు.. పాక్ బోర్డర్ సెక్యూరిటీ అధికారిని కోరారు. అది యాధృచ్ఛికంగా జరిగిన ఘటనేనని, సదరు జవాన్ కావాలని పాక్ బోర్డర్ లో అడుగుపెట్టలేదనే విషయాన్ని తెలిపినట్లు భారత్ కు చెందిన బీఎస్ఎఫ్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
సింధు జలాలను ఆపడమంటే యుద్ధం ప్రకటించడమే: పాక్
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా భారత్ విధిస్తున్న దౌత్యపరమైన ఆంక్షలకు పాకిస్తాన్ అల్లలాడిపోతోంది. ఈ క్రమంలో ప్రతీకార చర్యలకు దిగింది. పాక్ గగనతలం నుంచి వెళ్లే భారత విమానాలకు అనుమతిని రద్దు చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. గురువారం పాక్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ అధ్యక్షతన జాతీయ భద్రతా కమిటీ సమావేశం జరిగింది. పహల్గాం దాడి తర్వాత పాక్ విషయంలో భారత్ అనుసరిస్తున్న తీరుపై సమీక్ష ఈ భేటీలో సమీక్ష జరిపారు. పాక్ పౌరుల వీసా రద్దు చేయడం, దేశం విడిచి వెళ్లిపోవాలనే ఆదేశాలను పాక్ తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలోనే.. కౌంటర్ చర్యలను ప్రకటించింది. భారత్‌లో జరిపే అన్ని వర్తకవ్యాపారాలను(మధ్యవర్తి దేశం ద్వారా జరిపే వ్యాపారలావాదేవీలను సైతం) నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వాఘా సరిహద్దును మూసేస్తున్నట్లు తెలిపింది. ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ సిబ్బందిని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. భారతీయ పౌరులకు జారీ చేసే వీసాలను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. సింధు జలాలను ఆపడమంటే యుద్ధం ప్రకటించడం కిందకే వస్తుందని పేర్కొంది. మరోవైపు సైన్యం సెలవులను రద్దు చేసిన పాక్ ప్రభుత్వం.. భారత్ గనుక యుద్ధానికి దిగితే ప్రతిఘటనకు సిద్ధంగా ఉండాలని పిలుపు ఇచ్చింది. బుధవారం సాయంత్రం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భద్రతా కమిటీ భేటీలో కీలక నిర్ణయాలను ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే పహల్గాం దాడిని ఖండించిన పాక్.. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించింది. ‘‘భారత్‌లో జమ్ము కశ్మీర్, ఛత్తీస్‌గఢ్, మణిపూర్ సహా దక్షిణ భారతంలోని పలు రాష్ట్రాల్లో తిరుగుబాట్లు నడుస్తున్నాయని.. బహుశా ఈ క్రమంలోనే పహల్గాం దాడి జరిగి ఉంటుందని, ఇందులో విదేశీ శక్తుల దాడి అయ్యి ఉండకపోవచ్చని’’ పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ వ్యాఖ్యానించారు. ప్రాథమిక హక్కులను కోల్పోయిన వ్యక్తులపై సైన్యం లేదంటే పోలీసులు దారుణాలకు పాల్పడుతుంటే.. పాకిస్తాన్‌ను నిందించడం అలవాటుగా మారిపోయింది. పహల్గాం దాడిలో.. మమ్మల్ని నిందించకండి’’ అంటూ ఓ లోకల్ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. -
మోస్ట్ పవర్ ఫుల్ ఆర్మీ కల్గిన దేశాలు ఇవే..
అత్యంత శక్తివంతమైన ఆర్మీ కలిగిన దేశాల జాబితాను గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్(GFP Index) విడుదల చేసింది. ఇందులో భారత్ టాప్ 5లో చోటు దక్కించుకుంది. భారత్ నాల్గో స్థానంలో నిలిచింది. అమెరికా, రష్యా, చైనాల తర్వాత స్థానాన్ని భారత్ ఆక్రమించింది. ప్రపంచ వ్యాప్తంగా 145 దేశాల సైనిక శక్తిని అంచనా వేసేంది గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్‌సైనిక బలంతో పాటు నేటి ప్రపంచ రక్షణ వాతావరణాన్ని ప్రభావితం చేసే వ్యూహాత్మకత, సాంకేతిక, భౌగోళిక రాజకీయ అంశాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే యూకే, దక్షిణకొరియా, ఫ్రాన్స్ తదితర దేశాలను వెనక్కి నెట్టిన భారత్.. నాల్గో స్థానాన్ని నిలబెట్టుకుంది. యూఎస్ఏ (పవర్ ఇండెక్స్ 0.0744)2,127,500 మంది సైనిక శక్తితో యూఎస్ఏ అగ్రస్థానంలో నిలిచింది. 13, 043 విమానాలు, 4, 640 యుద్ధ ట్యాంకుర్లతో కూడిన బలీయమైన సైనిక శక్తితో అమెరికా ఉంది. దాంతోపాటు అతిపెద్ద రక్షణ బడ్జెట్ కూడా అమెరికా సొంతం. అత్యాధునిక సాంకేతికత, వైమానిక ఆధిపత్యం కూడా అమెరికాను అగ్రస్థానంలో నిలబెట్టాయి.రష్యా (పవర్ ఇండెక్స్0.0788)అసాధారణ సైనిక శక్తి కల్గిన దేశాల్లో రష్యాది రెండో స్థానం. 3,570,000 మంది మిలటరీ సిబ్బంది, 5, 750 యుద్ధ ట్యాంకర్లు రష్యా సొంతం. విస్తృతమైన యుద్ధ ట్యాంకర్ల దళం, అణ్వాయుధాలు కల్గి ఉంది రష్యా. అణు సామాగ్రిని వివిధ దేశాలకు సరఫరా చేసే దేశాల్లో రష్యా కీలక పాత్ర పోషిస్తుంది. గత కొంతకాలంగా ఉక్రియెన్ తో యుద్ధం చేస్తున్న రష్యా.. చైనాతో వ్యూహాత్మక పొత్తులను కొనసాగిస్తూ తన ఆధిపత్యాన్ని కాపాడుకుంటూ వస్తుంది.చైనా (పవర్ ఇండెక్స్ 0.0788)పవర్ ఇండెక్స్ పాయింట్లలో రష్యాతో కలిసి పంచుకుంటున్న చైనా.. అత్యంత శక్తివంతమైన సైనిక సామర్థ్యం కల్గిన దేశాల జాబితాలో మూడో స్థానంలో ఉంది. చైనా సైనిక విస్తరణ, సాంకేతిక పురోగతి, ఆర్థిక శక్తి తదితర అంశాలు ప్రపంచ వేదికపై ఆ దేశ సైనిక పురోగతని చూపెడు\తోంది. 6,800 యుద్ధ ట్యాంకర్లతో అతిపెద్ద ట్యాంక్ ఫ్లీట్ కల్గిన దేశంగా చైనా ఉంది. చైనా 3,170,000 సైనిక సిబ్బందితో పాటు 3,309 యుద్ధ విమానాలను కల్గి ఉంది.భారత్ (పవర్ ఇండెక్స్ పాయింట్లు 0.1184)ప్రపంచంలోని అతిపెద్ద సాయుధ దళాలలో ఒకటిగా ఉన్న భారత్,.. నాల్గో స్థానంలో ఉంది. 5,137,550 మంది సైన్యం, 2,229 యుద్ధ విమానాలు, 4, 201 యుద్ధ ట్యాంకర్లతో భారత్ నాల్గో స్థానాన్ని తిరిగి నిలబెట్టుకుంది. రక్షణ ఉత్పత్తి సామర్థ్యాలను, అణ్వాయుధాలను కల్గిన భారత్.. ఆసియా అంతటా వ్యూహాత్మకంగా తన ఉనికిని విస్తరిస్తూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. దక్షిణకొరియా (పవర్ ఇండెక్స్ 0.1656)పవర్ ఇండెక్స్ జాబితాలో దక్షిణాకొరియా ఐదో స్థానంలో కొనసాగుతోంది. 3,820,000 సైనిక సిబ్బంది, 1, 592 యుద్ధ విమానాలు, 2, 236 యుద్ధ ట్యాంకర్లు దక్షిణకొరియా సొంతం. అత్యంత అధునాతన టెక్నాలజీ కల్గిన రక్షణ రంగంలో దక్షిణకొరియాది ప్రత్యేక స్థానం. దాంతోపాటు అమెరికాతో సాన్నిహిత్య సంబంధాలు కూడా దక్షిణకొరియా సైనిక బలానికి మరింత దోహదం చేస్తోంది,. ప్రధానంగా సరిహద్దుల్లో ఉత్తరకొరియాతో ఉన్న వైరంలో భాగంగా ఉద్రిక్త పరిస్థితులను దక్షిణకొరియా ఎప్పటికప్పుడు చాకచక్యంగా తిప్పికొడుతోంది.యూకే (పవర్ ఇండెక్స్ 0.1785)పవర్ ఇండెక్స్ స్కోరులో యునైటెడ్ కింగ్ డమ్(యూకే) ఆరోస్థానంలో ఉంది. 1,108,860 మంది సైనిక సిబ్బందితో పాటు 631 ఎయిర్ క్రాఫ్ట్ లు, 227 యుద్ధ ట్యాంకర్లు యూకే కల్గి ఉంది. పవర్ ఫుల్ నేవీ, శక్తివంతమైన న్యూక్లియర్ సామర్థ్యం యూకే సొంతం. నాటో సభ్యత్వం కల్గిన దేశాల్లో యూకే కీలక పాత్ర పోషిస్తోంది.ఫ్రాన్స్ (పవర్ ఇండెక్స్ 0.1878)అత్యంత శక్తివంతమైన సైనిక సామర్థ్యం కల్గిన దేశాల జాబితాలో ఫ్రాన్స్ ది ఏడో స్థానం. 376,000 మంది సైనికి శక్తి, 976 ఎయిర్ క్రాఫ్ట్ లు, 215 యుద్ధ ట్యాంకర్లను ఫ్రాన్స్ కల్గి ఉంది. నాటోతో పాటు, యూరోపియేన్ భద్రత విభాగంలో ఫ్రాన్స్ ముఖ్య భూమిక పోషిస్తోంది. అధునాతన ఆయుధ శక్తిని ఫ్రాన్స్ కల్గి ఉంది. అధునాతమైన అణ్వాయుధాలను కల్గిన దేశంగా ఫ్రాన్స్ ఉంది.జపాన్ (పవర్ ఇండెక్స్ 0.1839)సైనిక శక్తిలో జపాన్ ఎనిమిదో స్థానంలో ఉంది. 328,150 సైనిక శక్తి, 1, 443 ఎయిర్ క్రాఫ్ట్ లు, 521 యుద్ధ ట్యాంకర్లను జపాన్ కల్గి ఉంది. మిలటరీ విభాగంలో సాంకేతికపరంగా అడ్వాన్స్ డ్ గా ఉన్న దేశం జపాన్. త్యున్నత సైనిక శిక్షణ కల్గిన దేశంగా జపాన్ కొనసాగుతోంది. ప్రధానంగా నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో జపాన్ సైనిక శక్తి అత్యంత బలంగా ఉంది.టర్కీ (పవర్ ఇండెక్స్ 0.1902)టర్కీది తొమ్మిదో స్థానం. 883,900 సైనిక సిబ్బంది, 1,083 ఎయిర్ క్రాఫ్ట్స్, 2,238 యుద్ధ ట్యాంకర్లు ఫ్రాన్స్ కల్గి ఉంది. మిడిల్ ఈస్ట్, యూరోపియన్ వ్యవహారాల్లో టర్కీ అత్యంత చురుకైన పాత్ర పోషిస్తోంది. ఎయిర్ ఫోర్స్, మిలటరీ విభాగాల్లో టర్కీ అత్యంత బలంగా ఉంది.ఇటలీ (పవర్ ఇండెక్స్ 0.2164)అత్యంత బలమైన సైనిక శక్తి కల్గిన దేశాల టాప్ 10 జాబితాలో ఇటలీది పదో స్థానం. 280,000 సైనిక శక్తిని ఇటలీ కల్గి ఉంది. 729 ఎయిర్ క్రాఫ్ట్ లు, 200 యుద్ధ ట్యాంక్లరు ఇటలీ కల్గి ఉంది. నాటోలో ఇటలీ ముఖ్య భూమికను పోషిస్తూ ఉంది.పవర్ ఇండెక్స్ లెక్క ఇలా..పవర్ ఇండెక్స్ స్కోరును లెక్కించేటప్పుడు అన్ని అంశాలకు సమాన ప్రాధాన్యం ఇస్తారు. ఒక దేశానికి అత్యంత శక్తివంతమైన ఎయిర్‌ఫోర్స్ ఉండి, అదే దేశానికి నేవీ బలం తక్కువగా ఉంటే, ఆ దేశం మొత్తం స్కోరులో వెనకంజలో ఉంటుంది. ఇక్కడ సైనిక బలాన్ని అన్ని కోణాల్లో సమగ్రంగా లెక్కించి ఒక అంచనా వేస్తారు. పవర్ ఇండెక్స్ స్కోరు ఎంత తక్కువగా ఉంటే, ఆ దేశం అంత బలంగా ఉన్నట్లు అర్ధం. . -
ప్రతిచర్యకు సిద్ధమైన పాక్.. సిమ్లా ట్రీటీకి టాటా?
న్యూఢిల్లీ: కశ్మీర్‌లోని పహల్గాంలో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు ఊచకోత కోసిన దరిమిలా సింధు జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిచర్యగా చారిత్రక సిమ్లా ఒప్పందం(Shimla Agreement) నుంచి వైదొలిగే అంశం ప్రస్తుతం పాకిస్థాన్ పరిశీలనలో ఉంది. 1971లో భారత్-పాక్ యుద్ధం అనంతరం 1972 జులై 2న ఇరు దేశాల మధ్య సిమ్లా ఒప్పందం (సిమ్లా అగ్రిమెంట్/సిమ్లా ట్రీటీ) కుదిరింది. నియంత్రణ రేఖను ఏకపక్షంగా మార్చకుండా... సమస్యాత్మక అంశాల్ని ఉభయ దేశాలు శాంతియుతంగా పరిష్కరించుకోవాలనేది ఆ సంధి సారాంశం. నాటి భారత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ(Indira Gandhi), పాక్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. సమస్యల పరిష్కారంలో రెండు దేశాల మధ్య మూడో దేశం లేదంటే అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవడానికి వీలు లేకుండా సిమ్లా ఒప్పందం ఇండియాకు ఇన్నాళ్లూ ఓ కవచంలా ఉపయోగపడింది. ఇప్పుడు ఈ ఒప్పందానికి కట్టుబడకుండా పాక్ తప్పుకుంటే.. కశ్మీర్ సహా ఇతర వివాదాంశాల పరిష్కారంలో తృతీయ పక్షం జోక్యానికి తలుపులు తెరచినట్టవుతుంది. 1999 అనంతరం ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరగకుండా నిరోధించిన ద్వైపాక్షిక యంత్రాంగం కుప్పకూలినట్టవుతుంది. వ్యవసాయం, ఇంధన అవసరాల కోసం సీమాంతర నదులపై ఆధారపడిన రెండు దేశాలు ప్రాంతీయ నీటి లభ్యత విషయంలో అనిశ్చితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ సిమ్లా ఒప్పందం నుంచి ‘స్వీయ ఉపసంహరణ’ మార్గాన్ని పాక్ ఎంచుకునే పక్షంలో ఆ చర్య ఆ దేశానికే నష్టం కలిగిస్తుందని నిపుణుల అభిప్రాయం. ఎందుకంటే అప్పుడిక ద్వైపాక్షిక ఒప్పందం అమల్లో ఉండదు కనుక ఏదైనా చర్చల ప్రతిపాదన వచ్చినా భారత్ తోసిపుచ్చవచ్చు.:::జమ్ముల శ్రీకాంత్ఇదీ చదవండి: ఏమిటీ సింధూ నదీ జలాల ఒప్పందం? -
పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. బిన్ లాడెన్ ఒక్కటే.. అమెరికా అధికారి సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇక, ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న ముష్కరులకు అండగా ఉన్న పాకిస్థాన్‌ను భారత్ గట్టిగా హెచ్చరించింది. ఆ దేశంతో దౌత్య సంబంధాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ తరుణంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్‌పై పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన నేపథ్యంలో పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ తాజాగా స్పందించారు. ఈ క్రమంలో మైఖేల్ రూబిన్.. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్, ఆల్‌ఖైదా మాజీ చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌కు పెద్ద తేడా లేదని వ్యాఖ్యానించారు. బిన్ లాడెన్ అప్పుడు కలుగులో దాక్కుంటే ఇప్పుడు మునీర్ ప్యాలెస్‌లో జీవిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. పహల్గాం ఘటన నేపథ్యంలో అమెరికా పాక్‌ను ఉగ్రవాద ప్రేరేపిత దేశంగా, మునీర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించాలని సూచించారు.ఇదే సమయంలో.. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారతదేశానికి వెళ్ళినప్పుడు ఉగ్ర దాడి జరిగినట్లే, ఇప్పుడు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత పర్యటన సందర్భంగా పాకిస్తాన్ దాడి చేసినట్టు కనిపిస్తోంది అన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.ఇదిలా ఉండగా.. ఇప్పటి పహల్గాం ఉగ్ర దాడికి.. 2000 సంవత్సరంలో జరిగిన ఛత్తీసింగ్‌పొర నరమేధానికి పోలికలు కనిపిస్తున్నాయి. దేశంలో విదేశీ అగ్ర నేతల పర్యటనలు సాగుతున్న వేళే ఇవి చోటుచేసుకున్నాయి. దీనికి తోడు పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ రెచ్చగొట్టే ప్రసంగం తర్వాతే దాడి జరగడం గమనార్హం. అసీం మునీర్‌కు.. భారత్‌పై తీవ్రమైన ద్వేషంతో ఉంటాడన్న పేరుంది. ఆయన ప్రకటనలూ ఉగ్ర దాడికి పురిగొల్పేలానే ఉంటాయి. దీనికి తోడు జమ్ము కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయడానికి విదేశీ అతిథుల పర్యటనను ఉగ్రవాదులు వాడుకుంటున్నారనే అనుమానాలు బలంగా ఉన్నాయి. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉండటం.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్‌లో పర్యటిస్తున్న సమయంలో పహల్గాం దాడి చోటుచేసుకోవడం గమనార్హం.పుల్వామా దాడి వేళ మునీరే..2019లో పుల్వామాలో సీఆర్పీఎఫ్ వాహనంపై దాడి జరిగినప్పుడు మునీర్ పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ అధిపతిగా ఉన్నారు. ఆ దాడి ఆయన కనుసన్నల్లోనే జరిగిందని చెబుతారు. ఇప్పుడు ఆయనే ఆర్మీ చీఫ్ కావడంతో భారత్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రమూకను ఉసిగొల్పుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇక, ప్రస్తుత పహల్గాం ఘటనకు సంబంధించిన కూడా ఆయనకు సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల అసీం మునీర్ చేసిన రెచ్చగొట్టే ప్రసంగమే ఈ దాడికి పురిగొల్పిందనే వాదనలను బలపరిచే ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఆయన మాట్లాడుతూ.. ‘మన ఉద్దేశం స్పష్టం. కశ్మీర్ గతంలోనూ మన జీవనాడిలా ఉండేది. భవిష్యత్తులోనూ ఉంటుంది. దానిని మనం ఎప్పటికీ మరిచిపోలేం. మన కశ్మీరీ సోదరుల పోరాటంలో.. వారిని ఒంటరిగా వదిలేయం. మీరు మీ పిల్లలకు పాకిస్థాన్ కథ చెప్పండి. మన జీవితంలోని ప్రతి అంశంలోనూ హిందువుల కంటే భిన్నమని భావించిన మన పూర్వీకుల ఆలోచనలను అప్పుడే వారు గుర్తుంచుకుంటారు. మన మతాలు, సంప్రదాయాలు, ఆలోచనలు, ఆకాంక్షలు భిన్నమైనవి. అదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది. మనవి రెండు దేశాలు’ అని మునీర్ వ్యాఖ్యానించారు. -
పొగచూరి ఎండతగలక.. చల్లబడిన న్యూయార్క్!
న్యూయార్క్: సూరీడుని అదృశ్య శక్తి మింగేయడం, దాంతో భూమి మీద సూర్యరశ్మి కరువై ఒక్కసారిగా వాతావరణం చల్లబడం వంటి అభూత కల్పనల్లో వింటుంటాం. అలాంటి అరుదైన, వింత ఘటనకు అగ్రరాజ్యం వేదికైంది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో 2023 జూన్‌లో భానుడు భగభగమండుతున్నా సిటీలో మాత్రం వాతావరణం చల్లబడింది. ఆ నగరంలో భూమిపై సూర్యరశ్శి ప్రసరణ తగ్గిపోవడమే కారణం. ఆనాడు సమీప కెనడా (Canada) దేశంలోని అటవీ కార్చిచ్చు కారణంగా దట్టంగా కమ్ముకున్న దుమ్ము, ధూళి మేఘాల కారణంగా న్యూయార్క్‌లో ఆకాశం మొత్తం మసకబారి సూర్య కిరణాలకు కాస్తంతయినా జాగా లేకుండా పోయిందని, అందుకే ఉష్ణోగ్రత మూడు డిగ్రీ సెల్సియస్ తగ్గిందని ఒక అధ్యయనం తాజాగా వెల్లడించింది. సంబంధిత అధ్యయన వివరాలు నేచర్ కమ్యూనికేషన్స్ ఎర్త్ అండ్ ఎన్విరోన్మెంట్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. భూఉపరితాన్ని సూర్యరశ్మి తాకలేకపోవడంతో కాస్తంత వెలుతురు, వేడి తగ్గడాన్ని ‘గ్లోబల్ డిమ్మింగ్’ అంటారు. వాతావరణ మార్పుల దుష్పరిణామాలకు ఇది సంకేతమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గాలిని మరింత గరళం చేసే వాయువులు భూ వాతావరణంలో చిక్కుబడిపోవడంతో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయని రట్గర్స్ హెల్త్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు చెప్పారు. ఏకంగా 1,000 కిలోమీటర్లు ప్రయాణించి.. ఫిలిప్ డెమొక్రిటో, జార్జియస్ కెలీసిడీస్ల సారథ్యంలోని పరిశోధనా బృందం కెనడా దావానలం తాలూకు పొగ, ధూళి ఏకంగా 1,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి న్యూయార్క్, న్యూజెర్సీ నగరాలను కమ్మేసిన వైనాన్ని ఈ బృందం పరిశోధించింది. ‘‘ఈ దుమ్ము, ధూళి మేఘాల్లోని గోధమ రంగ కర్భన ఆర్గానిక్ అణువుల కారణంగానే సూర్యరశ్మి భూమిని తాకలేకపోయింది. ఉష్ణోగ్రత తగ్గడానికి ఇదే కారణం. ఈ భారీ ‘దుమ్ము గొడుగు’ కారణంగా స్వేచ్ఛగా ప్రయాణించాల్సిన సహజ గాలికి సైతం ఆటంకాలు ఏర్పడ్డాయి.గాలి అటు ఇ టూ వేగంగా వెళ్లే పరిస్థితిలేకపోవడంతో ఎక్కడి వాయు కాలుష్యం (Air Pollution) అక్కడే గాఢంగా పరుచుకుపోయింది. ఈ కాలుష్య గాలిలోని సూక్ష్మధూ ళి కణాలు అలాగే భూమి సమీప వాతావరణంలోనే తిష్టవేశాయి. ఈ సమయంలో న్యూయార్క్ నగరంలో సూక్ష్మ ధూళి కణాలు (2.5 పీఎం) అత్యంత ఎక్కువ స్థాయిలో పోగుబడ్డాయి. పర్యావరణ పరిరక్షణా సంస్థ నిర్దేశించిన స్థాయి కంటే ఏకంగా మూడు రెట్లు ఎక్కువ సూక్ష్మధూళి కణాలు వాతావరణంలో ఉండిపోయాయి. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుచేసిన స్థాయి కంటే ఎనిమిది రెట్లు ఎక్కువగా సూక్ష్మ ధూళి కణాలు నగర గాలిలో ఉన్నాయి’’ అని పరిశోధకులు చెప్పారు. వ్యాధి నిరోధక శక్తి సగానికి.. ఊహించనంతగా పెరిగిన వాయుకాలుష్యం కారణంగా స్థానికులను శ్వాస సంబంధ సమస్యలు చుట్టుముట్టాయని అధ్యయనకారులు తెలిపారు. రట్గర్స్ బృందం చేసిన మరో పరిశోధన ఎన్విరోన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ జర్నల్‌లో ప్రచురితమైంది. ఈ పెను వాతావరణ పోకడ కారణంగా నగరంలోని ప్రతి ఒక్క ఒక్కరి ఊపిరితిత్తుల్లోకి అదనంగా సగటున 9.3 మిల్లీగ్రాముల బరువైన పొగ అణువులు చొరబడ్డాయని దీంతో ఇన్ఫెక్షన్లతో పోరాడే వాళ్ల వ్యాధినిరోధక శక్తి సామర్థ్యం ఏకంగా 50 శాతం క్షీణించిందని ఆ పరిశోధన పేర్కొంది.కెనడాలో కార్చిచ్చు ఘటనలు కొనసాగినన్ని రోజులూ న్యూయార్క్‌లో ఆస్తమా సంబంధ కేసులు 44 శాతం నుంచి ఏకంగా 82 శాతానికి పెరిగాయని ప్రభుత్వ గణాంకాలే స్పష్టంచేస్తున్నాయని పరిశోధన ఉదహరించింది. ‘‘ఈ ప్రాంతంలో ఇలాంటి దృగ్విషయం జరగడం ఇదే తొలిసారి. అయితే ఇదే చివరిసారి అని మాత్రం చెప్పలేం. వాతావరణ మార్పుల కారణంగా ఇలాంటి మళ్లీ సంభవించే ప్రమాదం ఉంది’’ అని పరిశోధకుడు ఫిలిప్ డెమొక్రిటో ఆందోళన వ్యక్తంచేశారు. ఈ ప్రాంతంలో వాతావరణ మార్పుల కారణంగా ఇకపై తరచూ, అత్యధికంగా కార్చిచ్చు ఘటనలు సంభవించి ఈశాన్య అమెరికాకు కాలుష్య కష్టాలు పెరిగే అవకాశముందని ఫిలిప్ విశ్లేషించారు. కార్చిచ్చులకు, పట్టణ ప్రాంతంలో వాతావరణంలో మార్పులకు, ప్రజారోగ్యానికి మధ్య సంబంధాలను ఈ పరిశోధన విశదీకరించింది. -
చివరి నిమిషంలో సమావేశం రద్దు..
కీవ్: రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం కోసం బుధవారం లండన్‌లో జరగాల్సిన సమావేశం చివరి నిమిషంలో రద్దయ్యింది. మూడేళ్లకు పైగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు పలు దేశాలు చేస్తున్న ప్రయత్నాల్లో పురోగతి కనిపించకపోవడం, షెడ్యూల్ సమస్య కారణంగా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆకస్మిక రద్దుతో చర్చల దిశపై సందేహాలు వ్యక్తమయ్యాయి. శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని అధ్యక్షుడు పుతిన్ ప్రకటించినా.. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తూనే ఉంది. 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని రష్యా ఉల్లంఘించడంతో ఉక్రెయిన్ ప్రతి దాడులకు దిగింది. వెయ్యి కిలోమీటర్ల ఫ్రంట్ లైన్ వెంబడి ఇరు పక్షాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. శాంతి ఒప్పందంపై సమావేశం జరుగుతుందని భావించిన బుధవారం ఉదయం కూడా రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసింది. తూర్పు ఉక్రెయిన్‌లో కార్మికులతో వెళ్తున్న బస్సుపై రష్యా చేసిన దాడిలో ఏడుగురు మహిళలు, ఇద్దరు పురుషులు మరణించారు. 40 మందికి గాయపడ్డారు. -
జెలెన్స్కీ యుద్ధాన్ని పొడిగిస్తున్నారు: ట్రంప్
కీవ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. శాంతి ఒప్పందంలో భాగంగా క్రిమియాను రష్యాకు అప్పగించే విషయంలో వెనక్కి తగ్గకుండా రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని జెలెన్స్కీ పొడిగిస్తున్నారని బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యాకు అప్పగించే ఆలోచనను తోసిపుచ్చిన జెలెన్స్కీ ‘మాట్లాడటానికి ఏమీ లేదు. ఇది మా భూమి, ఉక్రేనియన్ ప్రజల భూమి’ అని మంగళవారం ఉద్ఘాటించారు. ఆ వ్యాఖ్యలపై స్పందించిన ట్రంప్.. ఈ ప్రకటన రష్యాతో శాంతి చర్చలకు చాలా హానికరమన్నారు. ఇది చర్చనీయాంశం కూడా కాదని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో రాశారు. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఉక్రెయిన్ క్రిమియాను కోల్పోయిందని, క్రిమియా కావాలనుకుంటే పదకొండేళ్ల కిందట రష్యాకు అప్పగించినప్పుడు వారు దాని కోసం ఎందుకు పోరాడలేదని ఆయన ప్రశ్నించారు. -
తాజ్ మహల్‌ను సందర్శించిన జేడీ వాన్స్
ఆగ్రా/జైపూర్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబం తాజ్ మహల్‌ను సందర్శించింది. తన భార్య ఉషా వాన్స్, ముగ్గురు పిల్లలతో కలిసి బుధవారం ఉదయం తాజ్ మహల్‌కు చేరుకున్న జేడీ వాన్స్.. తాజ్ మహల్ అంతటా కలియదిరిగారు. ఓ గంటపాటు ఆ అద్భుత నిర్మాణాన్ని వీక్షించారు. సందర్శన అనంతరం ‘తాజ్ మహల్ ఓ అద్భుతం. నిజమైన ప్రేమకు, మానవ నైపుణ్యానికి నిదర్శనం’అని వాన్స్ సందర్శకుల డైరీలో రాశారు. అంతకుముందు జైపూర్ నుంచి ఆగ్రా విమానాశ్రయానికి చేరుకున్న వాన్స్ కుటుంబానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘనంగా స్వాగతం పలికారు. వారు ఆగ్రా విమానాశ్రయం నుంచి తాజ్ మహల్ వరకు కారులో ప్రయాణించారు. వారి కాన్వాయ్ మార్గం వెంబడి ఉన్న మార్గాలను ప్రత్యేకంగా అలంకరించారు. వందలాది మంది పాఠశాల పిల్లలు వీధుల్లో నిలబడి, అమెరికా–భారత్‌ల జాతీయ పతాకాలను ఎగురవేశారు. తాజ్ మహల్ దారి పొడవునా రంగురంగుల ముగ్గులు, ఇసుకతో బొమ్మలు సహా వివిధ అలంకరణలతో పండుగ వాతావరణాన్ని సృష్టించారు. వాన్స్ కుటుంబానికి స్వాగతం పలుకుతూ పలు చోట్ల భారీ హోర్డింగులు కూడా ఏర్పాటు చేశారు. హైప్రొఫైల్ పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పర్యటన అనంతరం వాన్స్ కుటుంబం జైపూర్‌కు తిరిగి వచ్చింది. ముందే షెడ్యూల్ అయిన జైపూర్ సిటీ ప్యాలెస్ పర్యటనను వారు రద్దు చేసుకుని, నేరుగా రామ్ బాగ్ ప్యాలెస్‌కు వెళ్లారు. నాలుగు రోజుల భారత పర్యటనలో ఉన్న వాన్స్ కుటుంబం గురువారం ఉదయం అమెరికాకు తిరిగి వెళ్లనుంది. -
టర్కీలో భారీ భూకంపం.. ఇళ్ల నుంచి ప్రజల పరుగులు
ఇస్తాంబుల్: టర్కీలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.2గా నమోదైంది. మధ్యాహ్నం 12 గంటల 49 నిమిషాల సమయంలో భూకంపం వచ్చిందని.. తీవ్రత ఎక్కువగా ఉందని ఆ దేశ విపత్తు సంస్థ పేర్కొంది.భూకంప కేంద్రం.. ఇస్తాంబుల్ సిటీకి ఉత్తరం వైపు 80 కిలోమీటర్ల దూరంలోని సిలివ్రి ప్రాంతంలో ఉందని.. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని ఆ దేశ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ప్రకటించింది. ఇస్తాంబుల్ నగరంపైనే భూకంప తీవ్రత ఎక్కువగా ఉందని టర్కీ ప్రభుత్వం తెలిపింది. తీవ్రత ఎక్కువగా ఉండటంతో భారీ భవనాల్లోని ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. ప్రస్తుతానికి ఆస్తి, ప్రాణనష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు.కాగా, 2023 ఫిబ్రవరి 6న ఆ దేశంలో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. తీవ్రస్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. సుమారుగా 53 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. రెండు సంవత్సరాల క్రితం వచ్చిన భూకంపాన్ని మరువక ముందే తాజాగా మళ్లీ భూ ప్రకంపనలతో టర్కీ ప్రజలు వణికిపోతున్నారు. -
మస్క్‌తో వైట్‌హౌస్‌లో బ్రేక్‌ఫాస్ట్ : ఫోటో వైరల్, ఎవరీ సజ్వానీ ?
దుబాయ్‌కు చెందిన డెవలపర్ DAMAC ప్రాపర్టీస్ చైర్మన్ బిలియనీర్ హుస్సేన్ సజ్వానీ Hussain Sajwani) మరోసారి నెట్టింట హల్ చల్ చేస్తున్నాడు. దుబాయ్ బిలియనీర్, వైట్ హౌస్‌లో ఎలాన్ మస్క్ (Elon Musk), ఆయన భార్యతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. కొన్ని నిమిషాల్లోనే 10.2 లక్షలకు పైగా వ్యూస్, వేలాది లైక్స్ దక్కించుకుంది. ఇంతకీ ఎవరీ హుస్సేన్ సజ్వానీ?హుస్సేన్ సజ్వానీ ఎవరు?దుబాయ్ బిలియనీర్ హుస్సేన్ సజ్వానీ (71) డమాక్ ప్రాపర్టీస్ చైర్మన్ హుస్సేన్ సజ్వానీ. ఫోర్బ్స్ ప్రకారం. నియక విలువ విలువ 10.2 బిలియన్డాలర్లు. ఇటీవల దుబాయ్ బిలియనీర్ హుస్సేన్ సజ్వానీతో కలిసి, టెస్లా , స్పేస్ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్ వైట్ హౌస్‌లో అల్పాహార విందు ఆరగించాడు. ‘‘ఒక చిరస్మరణీయ ఉదయం" అంటూ దీనికి సంబంధించిన ఫోటోలను సజ్వానీ ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలు మస్క్‌తోపాటు, మస్క్ భార్య న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్, శివోన్ జిలిస్‌ను కూడా చూడవచ్చు.చదవండి: 5 నెలల్లో 18 కిలోలు తగ్గిన హీరో : ఇదేం కొత్త కాదంటున్న ఫ్యాన్స్‌డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు మొదటి దఫా అధ్యక్షుడిగా పనిచేసినపుడు వార్తల్లో నిలిచారు సజ్వానీ. 2016 నూతన సంవత్సర వేడుకలో ఆయన సంస్థ డమాక్ దుబాయ్‌లో ట్రంప్-బ్రాండెడ్ గోల్ఫ్ కోర్సును నిర్మించాడ. ఇక రెండోసారి ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టిన అమెరికా డేటా సెంటర్లలో 20 బిలియన్ల పెట్టుబడిని సజ్వానీ ప్రకటించాడు. ఎనిమిది రాష్ట్రాలలో 2025లో నిర్మాణం ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్, అమెరికా సాంకేతిక మౌలిక సదుపాయాలను పెంచడం , డేటా సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఉండటం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పెట్టుబడుల తరువాత ట్రంప్ సజ్వానీని "దార్శనిక వ్యాపారవేత్త"గా ప్రశంసించిన సంగతి తెలిసిందే.Had a great breakfast at the White House with Elon Musk and family — a memorable morning. pic.twitter.com/ckTs9PBRVM— Hussain Sajwani (@HussainSajwani) April 21, 2025 1953లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జన్మించిన హుస్సేన్ సజ్వానీ, అనేక లగ్జరీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లతో మల్టీ బిలియనీర్ వ్యాపారవేత్తగా ఎదిగాడు. వ్యాపార కుటుంబానికి చెందిన సజ్వానీ చిన్నతనంలోనే తన తండ్రి దుకాణంలో పనిచేయడం ప్రారంభించాడు. వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రం,పారిశ్రామిక ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు. తరువాత సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించి బిజినెస్ టైకూన్ ఎదిగాడు. ముఖ్యంగా గల్ఫ్ వార్ టైంలో సజ్వానీ అమెరికన్ సైనిక కార్యకలాపాలకు సేవలందిచాడు. 2002లో DAMAC ప్రాపర్టీస్‌ను స్థాపించి వెనుదిరిగి చూసింది లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపార దిగ్గజం ఎదిగాడు. DAMAC హోటళ్ళు, అపార్ట్మెంట్లు మరియు విల్లాలు వంటి వేలాది లగ్జరీ గృహాలను నిర్మించింది. చదవండి: పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణం -
మమ్మల్ని నిందించకండి.. పహల్గాం దాడిపై స్పందించిన పాక్
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్ పహల్గాం ఉగ్రదాడిపై పొరుగు దేశం పాకిస్థాన్ స్పందించింది. ఉగ్రదాడిలో పర్యాటకుల ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొంటూ మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసింది. అయితే దాడుల వెనుక తమ ప్రమేయం ఉందన్న వాదనను ఖండిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.అనంతనాగ్ జిల్లాలో జరిగిన దాడిలో పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఈ ఘటనపై మేం ఆందోళన చెందుతున్నాం. మృతుల కుటుంబాలకు మా సంతాపం తెలియజేస్తున్నాము. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము అని పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే అంతకు ముందు.. పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ పహల్గాం దాడిపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని.. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తామూ వ్యతిరేకిస్తామని ప్రకటించారు.ఇదీ చదవండి: పహల్గాం దాడి సూత్రధారి సైఫుల్లా సాజిద్.. పాక్ ఆర్మీ హస్తం?భారత్‌లో జమ్ము కశ్మీర్, ఛత్తీస్‌గఢ్, మణిపూర్ సహా దక్షిణ భారతంలోని పలు రాష్ట్రాల్లో తిరుగుబాట్లు నడుస్తున్నాయని.. బహుశా ఈ క్రమంలోనే పహల్గాం దాడి జరిగి ఉంటుందని, ఇందులో విదేశీ శక్తుల దాడి అయ్యి ఉండకపోవచ్చని ఓ స్థానిక న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు. ప్రాథమిక హక్కులను కోల్పోయిన వ్యక్తులపై సైన్యం లేదంటే పోలీసులు దారుణాలకు పాల్పడుతుంటే.. పాకిస్తాన్‌ను నిందించడం అలవాటుగా మారిపోయింది. పహల్గాం దాడిలో.. మమ్మల్ని నిందించకండి’’ అంటూ ఖ్వాజా అసిఫ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై భారత్ స్పందించాల్సి ఉంది. We have absolutely nothing to do with it. We reject terrorism in all its forms and everywhere, says Pakistan's Defence Minister Khawaja Asif on the #Pahalgam attack.#pahalgamattack pic.twitter.com/qGiTz6uVOn— Ghulam Abbas Shah (@ghulamabbasshah) April 23, 2025 పహల్గాంలోని బైసరన్‌లో ఉగ్రదాడి చేసి పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)’ .. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ఏర్పడిందే. తొలుత టీఆర్ఎఫ్ ఆన్లైన్లో కార్యకలాపాలు నడిపించింది. ఆపై లష్కరే తోయిబా(LeT) వంటి పలు ఉగ్ర సంస్థ సభ్యులను తీసుకుని ఫిజికల్ గ్రూపుగా ఏర్పాటైంది. 2019లో ఏర్పాటైనప్పటి నుంచి టీఆర్ఎఫ్ దాడులకు దిగుతూ.. కశ్మీర్ ప్రాంతంలో ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తోంది. దీంతో 2023లో టీఆర్ఎఫ్ను ఉగ్రసంస్థల జాబితాలో భారత్ చేర్చింది. పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐనే టీఆర్ఎఫ్ను సృష్టించిందని భారత నిఘా వర్గాల సమాచారం. లష్కరే తోయిబా నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించడానికి ఈ టీఆర్ఎఫ్ను ఏర్పాటు చేయించినట్లు చెబుతుంటారు. -
విశ్వసనీయ మిత్రదేశం
జెడ్డా: ‘‘భారత్–సౌదీ అరేబియా స్నేహ సంబంధాలు మరింత బలోపేతం కావాలి. అందుకు నా పర్యటన దోహదపడుతుంది’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు. సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆహా్వనం మేరకు ఆయన మంగళవారం సౌదీలో పర్యటించారు. మోదీ విమానం సౌదీ గగనతలంలోకి ప్రవేశించగానే రాయల్ సౌదీ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఆరు ఎఫ్–15 ఫైటర్ జెట్లు ఎస్కార్ట్‌గా నిలవడం విశేషం. సంబంధిత వీడియోను భారత విదేశాంగ శాఖ విడుదల చేసింది.మోదీకి లభించిన అపూర్వ ఆహ్వనం భారత్–సౌదీ అరేబియా మధ్య బలపడుతున్న రక్షణ సహకారానికి ప్రతీక అని పేర్కొంది. ఎయిర్‌పోర్టు నుంచి బస చేసే హోటల్‌కు చేరుకున్న మోదీకి సంప్రదాయ స్వాగతం లభించింది. సౌదీ గాయకుడు హషీం అబ్బాస్ ‘ఆయే వతన్ మేరే ఆబాద్ రాహే తూ’ హిందీ పాటను చక్కగా ఆలపించారు. మోదీ చప్పట్లతో ఆ గాయకుడిని అభినందించారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రవాస భారతీయులతో ఆప్యాయంగా మాట్లాడారు.సౌదీ యువరాజు నా సహోదరుడు భారత్‌కు సౌదీ అత్యంత విలువైన, విశ్వసనీయమైన మిత్రదేశమని మోదీ ఉద్ఘాటించారు. ఆయన మంగళవారం ‘అరబ్ న్యూస్’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆసియాలో శాంతి, స్థిరత్వాన్ని రెండు దేశాలు ప్రగాఢంగా కోరుకుంటున్నాయని మోదీ తెలిపారు. -
శనివారం పోప్ అంత్యక్రియలు
వాటికన్ సిటీ: వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బాసిలికా చర్చిలో మూడు రోజులపాటు ప్రజల సందర్శనలు, నివాళుల తర్వాత శనివారం పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలను నిర్వహించనున్నారు. కోట్లాది మంది క్యాథలిక్‌ల అత్యున్నత మతాధికారి అయినప్పటికీ అత్యంత సాధారణ వ్యక్తిలా ఖనన క్రతువును పూర్తిచేయాలని పోప్ కోరుకున్నారని, అదేరీతిలో అంత్యక్రియలను పూర్తిచేస్తామని వాటికన్ వర్గాలు ప్రకటించాయి.పోప్ మరణంతో ప్రపంచవ్యాప్తంగా సంతాపాలు వెల్లువెత్తుతున్న వేళ పోప్ అంత్యక్రియల షెడ్యూల్ వివరాలను వాటికన్ అధికార వర్గాలు మంగళవారం వెల్లడించాయి. సెయింట్ పీటర్స్ స్క్వేర్ వద్ద శనివారం ఉదయం 10 గంటలకు అంత్యక్రియల కార్యక్రమాన్ని మొదల పెట్టనున్నారు. కార్డినళ్ల కాలేజీ డీన్ అయిన 91 ఏళ్ల కార్డినల్ జియోవన్నీ బటిస్టా రే నేతృత్వంలో ఈ కార్య క్రమాన్ని నిర్వహించను న్నా రు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు, అర్జెంటీనా అధ్యక్షుడు జేవి యర్ మిలేయీ తదిత రులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. 88 ఏళ్ల పోప్ ఫ్రాన్సిస్ సోమవారం బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా కోమాలోకి వెళ్లి, తర్వాత గుండె వైఫల్యం కారణంగా కన్ను మూసిన విషయం విదితమే.తొలిసారిగా పార్థివదేహం ఫొటో విడుదలఅధికారిక నివాసంలోకాకుండా పోప్ పార్థివదేహాన్ని పోప్‌గా బాధ్యతలు చేపట్టిననాటి నుంచి ఆయన నివసిస్తున్న డోమస్ శాంటా మార్టా గెస్ట్‌హౌస్ హోటల్ చాపెల్లోనే ఉంచారు. వాటికన్ విదేశాంగ మంత్రి కార్డినల్ పెట్రో పరోలిన్ పోప్‌కు నివాళులర్పిస్తున్న ఫొటోలను అధికారికంగా మంగళవారం విడుదలచేశారు. ఎర్రని వస్త్రంతో కప్పిన కలపతో చేసిన శవపేటికలో పోప్ పార్థివదేహాన్ని ఉంచారు. పోప్ నచ్చిన శ్వేత వర్ణ ‘మిటర్’ టోపీని ఆయనకు పెట్టారు. సెయింట్ మేరీ మేజర్ బాసిలికాలో ఖననంఆయన ఎక్కువగా సందర్శించి, ప్రార్థించే సెయింట్ మేరీ మేజర్ బాసిలికా చర్చి ప్రాంగణంలోనే పోప్‌ను ఖననం చేయనున్నారు. అక్కడే తనను ఖననం చేయాలని పోప్ గతంలోనే సూచించారు. ఆ మేరకే ఖనన క్రతువును పూర్తిచేయనున్నారు. -
వాణిజ్య ఒప్పందంపై రోడ్‌మ్యాప్ సిద్ధం
జైపూర్: భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా నానాటికీ పెరుగుతోందని, ఆయనను చూస్తే అసూయగా ఉందని అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ చెప్పారు. మోదీ ప్రభుత్వాన్ని కొందరు విమర్శిస్తున్నప్పటికీ ఆయన పేరు ప్రతిష్టలు మరింత ఇనుమడిస్తున్నాయే తప్ప ఎక్కడా తగ్గడం లేదన్నారు. అంతర్జాతీయంగా మోదీకి లభిస్తున్న అప్రూవల్ రేటింగ్స్ తనకు అసూయ కలిగిస్తున్నాయని, ఈ విషయం సోమవారం నేరుగా మోదీకే చెప్పానని వెల్లడించారు.‘మోదీ స్పెషల్ పర్సన్’ అని ప్రశంసించారు. మంగళవారం రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో రాజస్తాన్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఓ సదస్సులో వాన్స్ ప్రసంగించారు. ప్రధానంగా ఇండియా–అమెరికా సంబంధాలపై మాట్లాడారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం విషయంలో తుది ఒప్పందంపై రోడ్‌మ్యాప్ సిద్ధమైందని ప్రకటించారు. రోడ్‌మ్యాప్‌పై విధివిధానాలను ఇరు దేశాలు అధికారికంగా ఖరారు చేశాయని వెల్లడించారు. భారతదేశ ఉత్పత్తులపై విధించిన 26 శాతం ప్రతీకార సుంకాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 90 రోజులపాటు నిలిపివేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల మధ్య విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. వాణిజ్య ఒప్పందంపై రోడ్‌మ్యాప్ సిద్ధం కావడం డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీల విజన్ వాస్తవరూపం దాల్చే విషయంలో ఒక కీలకమైన ముందడుగు అని వాన్స్ అభివర్ణించారు. భారత్–అమెరికా సంయుక్తంగా ప్రగతి సాధించాలని ట్రంప్ కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రధాని మోదీ ‘కొరుకుడుపడని కఠినమైన సంధానకర్త’ అని అభివర్ణించారు. ఆయనతో బేరం తేల్చడం అంత సులభం కాదన్నారు. అందుకే ఆమెరికా ఆయనను గౌరవిస్తోందని వ్యాఖ్యానించారు. మిత్రుడిగా వచ్చా.. తాను ఇండియాకు నీతిబోధలు చేయడానికి రాలేదని, ఒక భాగస్వామిగా, మిత్రుడిగానే వచ్చానని జె.డి.వాన్స్ అన్నారు. ఏ పని ఎలా చేయాలో ఇండియాకు నేర్పే ఉద్దేశం తనకు లేదన్నారు. గతంలో అమెరికా ప్రభుత్వాలు భారత్‌కు నీతి పాఠాలు బోధించేందుకు ప్రయత్నించేవని, భారత్‌ను చౌకగా కార్మిక శక్తి లభించే దేశంగానే చూసేవారని చెప్పారు . ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయిందని పేర్కొన్నారు. అమెరికా ఉత్పత్తులను మరింత అధికంగా కొనుగోలు చేయాలని భారత్‌కు విజ్ఞప్తిచేశారు.అమెరికా ఇంధన, రక్షణ ఉత్పత్తులు, పరికరాలను ఎక్కువగా కొనుగోలు చేయాలన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడాలని ఆకాంక్షించారు. టెక్నాలజీ, రక్షణ, వాణిజ్యం, ఇంధనం వంటి వేర్వేరు కీలక రంగాల్లో భారత్, అమెరికా కలిసికట్టుగా పనిచేస్తే అద్భుత విజయాలు సాధించవచ్చని పిలుపునిచ్చారు. ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా ‘ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం’పై ఇరుదేశాలు చర్చలు కొనసాగిస్తున్నాయని తెలిపారు.ఇవాన్ ఇండియాలోనే ఉంటానన్నాడు ప్రధాని మోదీ తమకు చక్కటి ఆతిథ్యం ఇచ్చారని జె.డి.వాన్స్ ఆనందం వ్యక్తంచేశారు. మోదీ ప్రేమానురాగాలు తమ కుటుంబాన్ని ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు. ముఖ్యంగా తమ ముగ్గురు పిల్లలకు మోదీ ఎంతో ఆత్మీయులయ్యారని తెలిపారు. మోదీ ఇచ్చిన విందు తన కుమారుడు ఇవాన్‌కు ఎంతోగానో నచ్చిందని, ఇండియాలోనే ఉండిపోవాలని కోరుకుంటున్నట్లు ఇవాన్ తనతో చెప్పాడని అన్నారు. తన పిల్లలకు డొనాల్డ్ ట్రంప్‌తో ఏర్పడిన అనుబంధం ఇప్పుడు మోదీతోనూ ఏర్పడిందని వ్యాఖ్యానించారు. ఇండియాలో తన కంటే తన భార్య ఉషా చిలుకూరికే గొప్ప ఆదరణ లభిస్తోందని వాన్స్ చమత్కరించారు.అంబర్ కోట సందర్శనవాన్స్ తన భార్య ఉషా చిలుకూరి, ముగ్గురు పిల్లలతో కలిసి మంగళవారం ఉదయం రాజస్తాన్‌లోని చరిత్రాత్మక అంబర్ కోటను సందర్శించారు. వాన్స్ కుటుంబానికి రాజస్తాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ, ఉప ముఖ్యమంత్రి దియా కుమారీతోపాటు అధికారులు సంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు. చక్కగా అలంకరించిన ఏనుగులు, తీర్చిదిద్దిన రంగవల్లులు, జానపద నృత్యాలతో అమెరికా ఉపాధ్యక్షుడికి ఆత్నియ స్వాగతం లభించింది. చందా, మాలా అనే రెండు ఏనుగులు తొండాలు ఎత్తి వాన్స్ కుటుంబానికి స్వాగతం పలికాయి. రాజస్తానీ సంప్రదాయ జానపద నృత్యాలు అలరించాయి. -
పోప్ ఫ్రాన్సిస్ చివరి కోరిక
చారిత్రకంగా చూస్తే... పోప్స్ మృతదేహాలను వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బాసిలికా నేలమాళిగల్లో ఖననం చేయడం రివాజు. ఈ సంప్రదాయాన్ని కాదని 1903లో పోప్ లియో-13 మృతదేహాన్ని ఆయన కోరిక మేరకు సెయింట్ జాన్ లేటరన్ బాసిలికాలో పూడ్చిపెట్టారు. ప్రస్తుత పోప్ ఫ్రాన్సిస్(Pope Francis) ఆఖరి కోరిక ఏంటో తెలుసా? తన భౌతిక కాయాన్ని వాటికన్ వెలుపల సెయింట్ మేరీ మేజర్ బాసిలికా చర్చి(రోమ్)లో ఖననం చేయాలనేది ఆయన మనోవాంఛ. 2023 డిసెంబరు 12న మెక్సికన్ వార్తా సంస్థ ‘ఎన్+’కు కు ఇంటర్వ్యూ ఇస్తూ ఫ్రాన్సిస్ తన అంత్యక్రియలకు సంబంధించి మనసులోని మాట బయటపెట్టారు. అంత్యక్రియల ఏర్పాట్ల గురించి ఆర్చ్ బిషప్ డీగో జియోవని రవేలీతో అంతకుముందే చర్చించినట్టు తెలిపారు. సెయింట్ మేరీ మేజర్ బాసిలికా చర్చి విషయానికొస్తే... ఆరుగురు పోప్స్ మృతదేహాలను అక్కడ ఖననం చేశారు. చివరిసారిగా 1669లో పోప్ క్లెమెంట్-9 అంత్యక్రియలు అక్కడ నిర్వహించారు. శిశువైన జీసస్ ను కన్య మేరీ ఎత్తుకున్న ‘సేలస్ పోపులి రోమని’ (రోమ్ ప్రజలకు రక్షణ) పెయింటింగ్ ఆ చర్చిలో ఉంది. ఆ చిత్రంతో పోప్ ఫ్రాన్సిస్ ది ప్రత్యేక అనుబంధం. పోప్ హోదాలో పర్యటనలు చేసి తిరిగొచ్చాక ఆయన దాని ఎదుట ప్రార్థనలు చేసేవారు.:::జమ్ముల శ్రీకాంత్(Source: AmoMama.com. Photo Credit: The Catholic Weekly). -
ట్రంప్ యాక్షన్.. హార్వర్డ్ యూనివర్సిటీ రియాక్షన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలకు.. హార్వర్డ్ యూనివర్సిటీ(Harvard University) తగ్గేదే లే అంటోంది. విశ్వవిద్యాలయానికి అందించే ఫెడరల్ నిధులకు ట్రంప్ సర్కార్ కత్తెర వేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో కత్తెరకు సిద్ధపడుతున్న తరుణంలో విశ్వవిద్యాలయం అనూహ్యంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.ఫెడరల్ నిధులను నిలిపివేయడం ద్వారా.. విద్యాపరమైన నిర్ణయాలపై నియంత్రణ సాధించడానికి ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ మసాచుసెట్స్ (massachusetts) కోర్టులో దావా వేసింది. అంతేకాదు పలు యూనివర్సిటీలను కూడా ట్రంప్ లక్ష్యంగా చేసుకున్నారంటూ దావాలో ప్రస్తావించింది. ట్రంప్ చర్యలు ఏకపక్షంగా ఉన్నాయని.. ఫెడరల్ చట్టాలను, నిబంధలను ఉల్లంఘించేలా ఉన్నాయని పేర్కొంది. నిధులను స్తంభింపజేయడం, ఫెడరల్ సమాఖ్య గ్రాంట్లపై విధించిన షరతులను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని, హార్వర్డ్ ఖర్చులను చెల్లించేలా ట్రంప్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని దావాలో హార్వర్డ్ యూనివర్సిటీ కోరింది.హార్వర్డ్ యూనివర్సిటీకి వైట్‌హౌస్(White House) పలు నిబంధనలు జారీ చేసిన విషయం తెలిసిందే. విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో యూదు వ్యతిరేక నిరసనల కట్టడికి సంబంధించినవి అవి. అయితే, వాటిని వ్యతిరేకిస్తున్నట్లు విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్ అలాన్ గార్బర్ పేర్కొన్నారు. ఇక్కడి నుంచి అసలు వ్యవహారం మొదలైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్వర్డ్ యూనివర్సిటీకి అందించే 2.2 బిలియన్ డాలర్ల ఫెడరల్ నిధులకు కత్తెర వేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో 1 బిలియన్ డాలర్ల కోతకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వైద్య పరిశోధనల కోసం యూనివర్సిటీకి ఇచ్చే ఫెడరల్ గ్రాంట్లు, కాంట్రాక్టుల నుంచి 1 బిలియన్ డాలర్లను తగ్గించాలని ట్రంప్ యంత్రాంగం ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వాల్‌స్ట్రీట్ జర్నల్ తాజాగా ఓ కథనం ప్రచురించింది.అయితే.. వైట్‌హౌజ్ జారీ చేసిన డిమాండ్లకు ఏ మాత్రం తలొగ్గేది లేదని హార్వర్డ్ అధ్యక్షుడు అలాన్ గార్బర్(Alan Garber) స్పష్టం చేస్తున్నారు. వాటిని బహిరంగంగా తిరస్కరిస్తున్నారు కూడా. ఈ నేపథ్యంలోనే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కొత్త బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. గార్బర్ చర్యలపై ట్రంప్ యంత్రాంగం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. విదేశీ విద్యార్థుల అక్రమ, హింసాత్మక కార్యకలాపాల రికార్డులను సమర్పిస్తేనే కొత్తగా విదేశీయులను చేర్చుకునేందుకు అనుమతిస్తామని హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ ప్రభుత్వం స్పష్టంచేసింది. రికార్డులను సమర్పించకపోతే వర్సిటీకున్న ప్రవేశాల అర్హతను రద్దు చేస్తామని హెచ్చరించింది. విద్యార్థుల రికార్డులను అందించాలని ఆదేశిస్తూ హోంలాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నోయెమ్ వర్సిటీకి ఇప్పటికే ఓ లేఖ రాశారు. ఈ నెల 30వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని అందులో కోరారు. ఒకవేళ వర్సిటీ స్పందించకపోతే.. విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్ కార్యక్రమం (ఎస్ఈవీపీ) ధ్రువీకరణ రద్దవుతుందని పేర్కొన్నారు. కానీ, ఈ పరిణామాలను హార్వర్డ్ తేలికగా తీసుకుంటోంది. ‘ఆ లేఖ మా దృష్టికీ వచ్చింది. గతంలో మేం చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నాం. మా స్వాతంత్య్రం, రాజ్యాంగ హక్కుల విషయంలో మేం రాజీ పడలేం. మేం చట్ట ప్రకారమే నడుచుకుంటాం. ప్రభుత్వ యంత్రాంగం కూడా వాటికి అనుగుణంగానే వ్యవహరించాలని ఆశిస్తున్నాం’ అని వర్సిటీ ప్రతినిధి స్పష్టంచేశారు.తమ డిమాండ్లను రహస్యంగా ఉంచాలని ప్రభుత్వం కోరినప్పటికీ.. హార్వర్డ్ యూనివర్సిటీ వ్యవహరించిన తీరుతోనే వైట్‌హౌస్ ఈ విషయంలో మరింత దూకుడుగా వెళ్లడానికి ఒక కారణమని వాల్‌స్ట్రీట్ జర్నల్ తన నివేదికలో పేర్కొంది.ట్రంప్ యంత్రాంగంతో ఘర్షణ వైఖరి కారణంగా హార్వర్డ్ యూనివర్సిటీ.. ఫెడరల్ నిధుల నుంచి దాదాపుగా 9 బిలియన్ డాలర్లను కోల్పేయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు కోర్టుకు చేరడంతో ఏం జరగబోతోందా? అనే ఆసక్తి నెలకొంది. -
నష్టం కలిగిస్తే ప్రతీకారం తప్పదు
బీజింగ్: టారిఫ్‌ల నుంచి తప్పించుకునే క్రమంలో అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునే దేశాలకు చైనా హెచ్చరికలు చేసింది. ఆ ఒప్పందాలతో తమకు నష్టం వాటిల్లే పక్షంలో ప్రతీకార చర్యలు తప్పవని ఆయా దేశాలకు తేల్చి చెప్పింది. ఇటువంటి ఒప్పందాలకు తాము పూర్తిగా వ్యతిరేకమని చైనా వాణిజ్య శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు. అత్యధిక సుంకాల నుంచి మినహాయించినందుకు ప్రతిఫలంగా చైనాతో వాణిజ్య సంబంధాలను పరిమితం చేయాలంటూ ఇతర దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా సిద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో వాణిజ్య శాఖ ప్రతినిధి ఈ ప్రకటన చేశారని అధికార జిన్హువా వార్తా సంస్థ పేర్కొంది. ‘ఒక వేళ అటువంటి పరిస్థితే ఏర్పడితే చైనా ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోదు. తీవ్ర ప్రతీకార చర్యలు తీసుకుంటుంది. తాత్కాలిక లాభం కోసం ఇతరుల ప్రయోజనాలను ఫణంగా పెట్టాలని చూడటం పులి చర్మం కోసం దానితో బేరమాడటం వంటిదే. ఎదురుదెబ్బ తప్పదు’అని ఆ ప్రతినిధి వ్యాఖ్యానించారు. తమతో లాభదాయకమైన వ్యాపార సంబంధాలు కలిగిన పలు దేశాలు సుంకాల మినహాయింపులు పొందడానికి అమెరికాతో ప్రత్యేక వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోకుండా నిరోధించడానికే చైనా ప్రభుత్వం ఈ ప్రకటన చేసినట్లుగా భావిస్తున్నారు. జపాన్, ఈయూ, ఆసియాన్‌లోని పలు దేశాలు అమెరికాతోపాటు చైనాతోనూ విస్తృత వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్నాయి. భారత్ కూడా అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయతి్నస్తోంది. చైనా వస్తువులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 245 శాతం టారిఫ్‌లు ప్రకటించగా, చైనా సైతం అమెరికా వస్తువులపై 125 శాతం టారిఫ్‌లు విధించింది. ఎక్కువగా ఎగుమతులపైనే ఆధారపడిన చైనా ఆర్థిక వ్యవస్థపై అమెరికాతో ఆసియాన్ లాంటి భాగస్వాములు కుదుర్చుకునే ఒప్పందాలతో ప్రతికూల ప్రభావం చూపుతుంది. -
పోప్ వారసుని ఎన్నిక ఇలా...
వాటికన్ సిటీ: పోప్ ఫ్రాన్సిస్ వారసున్ని శతాబ్దాలుగా అనుసరిస్తూ వస్తున్న సంప్రదాయం ప్రకారం ఎన్నుకుంటారు. అందుకు పెద్ద ప్రక్రియే ఉంటుంది. అది వాటికన్లోని సిస్టిన్ చాపెల్‌లో ఆద్యంతం అత్యంత గోప్యత నడుమ జరుగుతుంది. తుది ఫలితాన్నే తప్ప ప్రక్రియను ఎప్పటికీ బయటికి వెల్లడించరు. ఎంపిక ప్రక్రియ సందర్భంగా ఏం జరిగిందో బయటి ప్రపంచానికి చెప్పడం పూర్తిగా నిషిద్ధం. దీన్ని ఉల్లంఘించిన కార్డినల్స్‌ను తక్షణం వెలి వేసేలా నిబంధనలను పోప్ బెనెడిక్ట్–16 కఠినతరం చేశారు. 1996లో పోప్ జాన్‌పాల్–2 తిరగరాసిన పోప్ ఎన్నిక తాలూకు నియమ నిబంధనలను బెనెడిక్ట్ రెండుసార్లు సవరించారు. → పోప్ ఫ్రాన్సిస్ వారసున్ని ఎన్నుకునేదాకా రోజువారీ వ్యవహారాలను వాటికన్ కార్డినల్ కెవిన్ ఫారెల్ చాంబర్లెయిన్ హోదాలో లాంఛనంగా నిర్వర్తిస్తారు. ఈ దశలో కీలక నిర్ణయాలేవీ తీసుకోరు. → పోప్ మృతిని చాంబర్లెయిన్ అధికారికంగా ధ్రువీకరించాక పోప్ నివాసానికి సీల్ వేస్తారు. → పోప్ అస్తమయంతో ఒకరిద్దరు మినహా దాదాపుగా వాటికన్ అధికారులంతా మాజీలవుతారు. → ‘ఫిషర్‌మన్స్ రింగ్’గా పిలిచే పోప్ అధికారిక ముద్రను చాంబర్లెయిన్ ప్రత్యేక సుత్తెతో విరగ్గొడతారు. తద్వారా ప్రస్తుత పోప్ పాలనకు తెరపడిందని లాంఛనంగా ప్రకటిస్తారు. → త్వారత కార్డినల్స్ కాలేజీ సమావేశమై పోప్ అంత్యక్రియల ఏర్పాట్లను ఖరారు చేస్తుంది. → ఫ్రాన్సిస్ కోరిక మేరకు అంత్యక్రియలు ఆయనకెంతో ఇష్టమైన సెయింట్ మేరీ మేజర్ బాసిలికాలో సాదాసీదాగా జరుగుతాయి. సాధారణంగా పోప్ అంత్యక్రియలకు సైప్రస్, జింక్, ఇల్మ్తో కూడిన మూడు శవపేటికలను ఉపయోగిస్తారు. ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు మాత్రం ఆయన కోరిక మేరకు జింక్‌తో కూడిన ఒకే పేటికను వాడనున్నారు. → తర్వాత వాటికన్లో 9 రోజుల పాటు సంతాప దినాలు పాటిస్తారు. ఈ సమయంలో కార్డినల్స్ అంతా రోమ్కు విచ్చేస్తారు. ప్రక్రియ ఇదీ.. → పోప్ మరణించిన 15 నుంచి 20 రోజులకు ఆయన వారసుని ఎన్నిక ప్రక్రియ లాంఛనంగా మొదలవుతుంది. → కార్డినల్స్ అంతా సిస్టిన్ చాపెల్‌లో సమావేశమై పోప్‌ను ఎన్నుకుంటారు. 80 ఏళ్లలోపు వయసువారు మాత్రమే అందుకు అర్హులు. ప్రస్తుతం ఆలోపు వయసున్న కార్డినల్స్ 135 మంది ఉన్నారు. నిబంధనల ప్రకారం ఎలక్టర్ల సంఖ్య 120కు మించరాదు. → పోప్ ఎన్నిక దీర్ఘచతురస్రాకృతిలో ఉండే కాగితపు బ్యాలెట్ ద్వారా జరుగుతుంది. దానిపై భాగంలో ‘సుప్రీం పాంటిఫ్గా నేను ఎన్నుకుంటున్నది’ అని రాసుంటుంది. పేరు రాసేందుకు వీలుగా పక్కన ఖాళీ వదులుతారు. → ఒక్కో కార్డినల్ దానిపై తనకిష్టమైన వారి పేరు రాసి సగానికి మడిచి ట్రేలో వేస్తారు. దాన్ని సరిగ్గా నింపిందీ లేనిదీ స్రు్కటినీర్స్గా పిలిచే ముగ్గురు కార్డినల్స్ సరిచూస్తారు. → తర్వాత ఒక్కో బ్యాలెట్ తెరిచి అందులో రాసిన పేరు బయటికి చదువుతూ లెక్కిస్తారు. ప్రతి రౌండ్ అనంతరం ఫలితాలను ప్రకటిస్తూ పోతారు. → కనీసం మూడింట రెండొంతుల ఓట్లు వచ్చిన వారే తదుపరి పోప్ అవుతారు. అందుకోసం ఇనిíÙయల్ మాస్‌గా పిలిచే లాంఛన కార్యక్రమం అనంతరం ఫస్ట్ బ్యాలెట్ నిర్వహిస్తారు. పోప్‌ను ఎన్నుకోలేకపోతే బ్యాలెట్లను సూది ద్వారా దారానికి గుచ్చి ట్రేలో వేస్తారు. తర్వాత వాటిని స్తూపాకారపు స్టౌలో కాల్చేస్తారు. దాని తాలూకు పొగ నల్ల రంగులో సిస్టిన్ చాపెల్ చిమ్నీ గుండా అందరికీ కన్పించేలా బయటికొస్తుంది. ఇంకా పోప్‌ను ఎన్నుకోలేదని దాని అర్థం. అలా పోప్‌ను ఎన్నుకునే దాకా ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. అది పూర్తవగానే తెల్ల పొగ వెలువడుతుంది. చర్చి గంటలు మోగుతాయి. → అనంతరం కార్డినల్స్ ‘మనం పోప్‌ను ఎన్నుకున్నాం’ అని ప్రకటిస్తారు. నూతన పోప్ ఎంచుకున్న పేరును చదివి విన్పిస్తారు. → చివరికి కొత్త పోప్ సెయింట్ పీటర్స్ స్క్వేర్ నుంచి అందరికీ దర్శనమిచ్చి తన తొలి ఆశీర్వాదమిస్తారు. → పోప్ ఎన్నిక ప్రక్రియ పొడవునా కార్డినల్స్‌తో పాటు అందులో పాలుపంచుకునే వారికి బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధాలూ ఉండవు. వారు మొబైల్స్‌తో సహా ఎలాంటి ఆడియో, వీడియో పరికరాలూ వెంట ఉంచుకునేందుకు వీల్లేదు. రేసులో వీరే బాప్టిజం తీసుకున్న క్యాథిలిక్ పురుషుడెవరైనా పోప్ కావచ్చు. అయితే 1378 నుంచి కేవలం కార్డినల్స్ మాత్రమే పోప్‌గా ఎన్నికవుతూ వస్తున్నారు. పోప్ ఫ్రాన్సిస్ వారసునిగా విన్పిస్తున్న కొన్ని పేర్లు... → ఇటలీకి చెందిన కార్డినల్ పియెట్రో పారోలిన్ (70). వాటికన్లో సీనియర్ దౌత్యాధికారి. ప్రస్తుత విదేశాంగ మంత్రి. → కెనడాకు చెందిన కార్డినల్ మార్క్ ఔలెట్ (80). 2010 నుంచి 2023 దాకా వాటికన్ బిషప్స్ హెడ్‌గా ఉన్నారు. → ఆ్రస్టియాకు చెందిన కార్డినల్ క్రిస్టోఫ్ షోన్బర్న్ (80). పోప్ బెనెడిక్ట్–16 దగ్గర శిష్యరికం చేశారు. సంప్రదాయవాదిగా పేరు. → ఫిలిప్పీన్స్‌కు చెందిన కార్డినల్ లూయిస్ టగ్లే (67. వాటికన్ మిషనరీ ఆఫీస్ సారథిగా ఫ్రాన్సిసే ఎంపిక చేశారు. → ఇటలీకి చెందిన కార్డినల్ మట్టెయో జుప్పీ (69). ఫ్రాన్సిస్‌కు బాగా ఇషు్టడు. కార్డినల్స్లో నలుగురు భారతీయులు పోప్‌ను ఎన్నుకునే 35 మందితో కూడిన కార్డినల్స్ కాలేజీలో నలుగురు భారతీయులున్నారు. వారు ఫిలిప్ నెరీ ఫెరారో, బాసెలియొస్ క్లీమిస్, ఆంథోనీ పూల, జార్జ్ జాకోబ్ కూవకాడ్. -
చైనాలో 10జీ నెట్వర్క్..!
బీజింగ్: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సముపార్జనలో డ్రాగన్ దేశం చైనా మరో అడుగు ముందుకు వేసింది. ప్రపంచంలోనే మొట్ట మొదటిసారిగా 10 గిగాబైట్స్ ఫర్ సెకన్స్() వేగంతో పనిచేసే 10జీ బ్రాడ్ బ్యాండ్ నెట్‌వర్క్‌ను ప్రారంభించింది. రాజధాని బీజింగ్ సమీపంలోని హుబే ప్రావిన్స్‌లో చేపట్టిన ప్రయోగ పరీక్షలో గరిష్టంగా 10 జీబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ పని చేసినట్లు మీడియా వెల్లడించింది. ఈ వేగంతో అత్యంత స్పష్టతతో కూడిన రెండు పూర్తి సినిమాలను కేవలం సెకన్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్లౌడ్ కంప్యూటింగ్, టెలీ మెడిసిన్ తదితర రంగాల్లో దీనితో ఎన్నో మార్పులు సంభవించనున్నాయి. -
ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి మరీ..
న్యూఢిల్లీ: నాలుగు రోజుల పర్యటనలోభాగంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సోమవారం ఉదయం 9.50 గంటలకు ఢిల్లీలోని పాలెం వైమానిక స్థావరంలో దిగారు. తెలుగమ్మాయి, భార్య ఉషా చిలుకూరి, తమ ముగ్గురు సంతానం ఇవాన్, వివేక్, మీరాబెల్తో కలిసి వాన్స్ ‘ఎయిర్‌ఫోర్స్ టు’ విమానం నుంచి దిగారు. ఈ సందర్భంగా వాన్స్ దంపతులకు ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి మరీ కేంద్ర కేబినెట్ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సాదర స్వాగతం పలికారు. వాన్స్‌తోపాటు అమెరికా జాతీయ భద్రతా మండలి సీనియర్ డైరెక్టర్ రికీ గిల్, ఇతర ఉన్నతాధికారులు వచ్చారు. ఎయిర్‌బేస్‌లోనే కళాకారులతో ఏర్పాటుచేసిన నృత్యకార్యక్రమం వాన్స్ కుటుంబసభ్యులను అలరించింది. తర్వాత వాన్స్ భారత త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. వాన్స్ పర్యటన నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక వాన్స్ భారత్‌కు రావడం ఇదే తొలిసారి. భారతీయ దుస్తుల్లో పిల్లలు విమానం దిగేటప్పుడు వాన్స్ ముగ్గురు పిల్లలు భారతీయ దుస్తుల్లో కనిపించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎనిమిదేళ్ల పెద్దకుమారుడు ఇవాన్ బూడిద రంగు కుర్తా, తెలుపు పైజామా ధరించాడు. ఐదేళ్ల కుమారుడు వివేక్ పసుపు రంగు కుర్తా, తెలుపు పైజామా ధరించాడు. మూడేళ్ల కుమార్తె ఆకుపచ్చ రంగు అనార్కలీ సూట్, జాకెట్ ధరించారు. అమెరికా సెకండ్ లేడీ, వాన్స్ భార్య ఉషా ఆధునిక దుస్తుల్లో కనిపించారు. స్వాగత కార్యక్రమం పూర్తయ్యాక వాన్స్ కుటుంబం ఢిల్లీకి తరలివెళ్లింది. అక్షరధామ్ ఆలయ సందర్శన ఢిల్లీలో తొలుత అక్షరధామ్ ఆలయాన్ని వాన్స్ కుటుంబం సందర్శించింది. యమునా తీరంలో అత్యద్భుతంగా నిర్మించిన స్వామినారాయణ్ అక్షరధామ్ ఆలయాన్ని చూసి వాన్స్ కుటుంబం పులకించిపోయింది. లోపలికి వెళ్లి దర్శనం చేసుకున్నాక ఆలయం మొత్తం కలియతిరిగారు. గజేంద్రపీఠంను చూసి అచ్చెరువొందారు. ‘‘ ఇంతటి సుందర ప్రదేశంలో సాదర స్వాగతం పలికి ఆతిథ్యమిచ్చినందుకు కృతజ్ఞతలు. ఎంతో నేర్పుతో శ్రద్ధతో ఇంత అందమైన ఆలయాన్ని నిర్మించిన భారత్‌ను ప్రశంసించాల్సిందే. మా పిల్లలకు ఈ ఆలయం ఎంతో నచ్చింది’’ అని అక్కడి సందర్శకుల పుస్తకంలో వాన్స్ రాశారు. వాన్స్ దంపతులకు ఢిల్లీ అక్షరధామ్ ఆలయ నమూనాను, చెక్క ఏనుగును చిన్నారులకు చిన్నపిల్లల పుస్తకాన్ని ఆలయ నిర్వాహకులు కానుకగా ఇచ్చారు. ఆలయం ఎంతో ప్రశాంతంగా ఉందని వాన్స్ కుటుంబం తనతో చెప్పిందని వాళ్లకు ఆలయంలో సహాయపడిన మీరా సోందాగర్ చెప్పారు. తర్వాత వాన్స్ దంపతులు జన్‌పథ్‌లోని సెంట్రల్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఎంపోరియంను సందర్శించారు. అక్కడ కొన్ని భారతీయ హస్తకళలను కొనుగోలుచేశారు. ఢిల్లీలో ఉన్నంతసేపు వాన్స్ కుటుంబం ఐటీసీ మౌర్య షెరటాన్ హోటల్లో బసచేయనుంది. ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునేందుకే..గతంలో అమెరికా ఉపాధ్యక్షులు విచ్చేసినప్పుడు కేంద్ర సహాయ మంత్రి, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వంటి వారు మాత్రమే స్వాగతం పలికారు. ఈసారి ప్రోటోకాల్‌ను పక్కనబెట్టి ఏకంగా కేంద్ర కేబినెట్ మంత్రి అమెరికా ఉపాధ్యక్షుడికి సాదర స్వాగతం పలికారు. కేబినెట్ ర్యాంక్ స్థాయి నేత ఇలా స్వయంగా ఆహ్వానం పలకడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. 2023 సెపె్టంబర్లో నాటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సదస్సు కోసం వచ్చినప్పుడు పౌరవిమానయాన శాఖ సహాయమంత్రి వీకే సింగ్ స్వాగతం పలికారు. బైడెన్ 2013లో ఉపాధ్యక్ష హోదాలో వచ్చినప్పుడు నాటి విదేశాంగ శాఖ కార్యదర్శి రంజన్ మథాయ్ స్వాగతం పలికారు. ట్రంప్ అధ్యక్షునిగా 2020లో వచ్చినపుడు కేబినెట్ మంత్రి కాకుండా కేవలం సహాయ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ట్రంప్‌కు స్వాగతం పలికారు. సుంకాల భారం మోపుతూ భారత్ పట్ల ఆగ్రహం ఉన్న ట్రంప్ సర్కార్‌ను వాన్స్ ద్వారా ప్రసన్నం చేసుకునేందుకు మోదీ సర్కార్ ఇలా కేబినెట్ మంత్రిని పంపించి సాదరంగా ఆహ్వానించింది. నేడు జైపూర్‌లో సందర్శనమంగళవారం ఉదయం నుంచి జైపూర్‌లోని పలు చారిత్రక ప్రదేశాలను వాన్స్ కుటుంబం సందర్శించనుంది. తొలుత జైపూర్‌లోని రామ్‌భాగ్ ప్యాలెస్‌లో బస చేస్తారు. మంగళవారం యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడమైన అంబర్ కోటకు వెళ్తారు. సాయంత్రం జైపూర్‌లోని రాజస్తాన్ ఇంటర్నేషనల్ సెంటర్లో వాన్స్ ప్రసంగిస్తారు. బుధవారం ఉదయం వాన్స్ దంపతులు ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చరిత్రాత్మక కట్టడం తాజ్‌మహల్‌ను సందర్శిస్తారు. తర్వాత భారతీయ శిల్పకళల ప్రదర్శనశాల అయిన శిల్పాగ్రామ్కు వెళ్తారు. సాయంత్రం మళ్లీ జైపూర్‌కు వస్తారు. జైపూర్ నుంచి గురువారం ఉదయం అమెరికాకు బయల్దేరతారు. -
వాణిజ్య బంధం బలోపేతంపైనే దృష్టి
న్యూఢిల్లీ: అగ్రరాజ్యాధినేత ట్రంప్ ఆదేశాలతో అమెరికా ప్రభుత్వం భారత్‌పై సుంకాల సుత్తితో మోదుతున్న వేళ ట్రంప్‌కు కుడిభుజం, ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా హస్తనకు విచ్చేసిన వాన్స్ సోమవారం సాయంత్రం ప్రధాని మోదీని ఆయన నివాసంలో కలిశారు. సతీమణి ఉషా చిలుకూరి, పిల్లలు ఇవాన్, వివేక్, మీరాబెల్‌లతో కలిసి 7, లోక్‌కళ్యాణ్ మార్గ్‌లోని మోదీ అధికారిక నివాసానికి వాన్స్ విచ్చేశారు. అక్కడ వీళ్ల కుటుంబానికి మోదీ సాదర స్వాగతం పలికారు. స్వయంగా కారు దాకా వచ్చిన మోదీ.. వాన్స్ కారు దిగి దగ్గరకు రాగానే ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. వాన్స్ వెంట వచ్చిన కుమారులిద్దరినీ సరదాగా పలకరించారు. వారిని పరిచయం చేసుకున్నారు. కుమార్తె మీరాబెల్ను ఎత్తుకుని వచ్చిన ఉషా చిలుకూరితో మోదీ కరచాలనం చేసి కుశల ప్రశ్నలు వేశారు. తర్వాత చిన్నారులను చేయిపట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లారు. తొలుత వాన్స్ కుటుంసభ్యులందరికీ ఇంటి గార్డెన్‌ను మోదీ స్వయంగా చూపించారు. నెమళ్లు స్వేచ్ఛగా విహరిస్తున్న పచ్చికబయళ్లలో కుటుంబంతో కలిసి మోదీ కలియతిరిగారు. తర్వాత ఇంట్లోకి తీసుకెళ్లి గ్రూప్ ఫొటో దిగారు. తర్వాత నెమలి ఈకలను ముగ్గురు చిన్నారులకు ఇచ్చి వారితో ముచ్చటించారు. మీద కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పారు. వాన్స్ చిన్నకుమారుడు వివేక్ మోదీ తరహా డ్రెస్, పెద్దబ్బాయి ఇవాన్ సూట్ ధరించారు. ఒప్పందం పురోగతిపై సంతృప్తితర్వాత మోదీ, వాన్స్‌లు విడిగా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇరుదేశాలకు ప్రయోజనకారి అయిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై విస్తృతస్థాయిలో చర్చలు జరిపారు. ఒప్పందం పురోగతిపై మోదీ, వాన్స్‌లు సంతృప్తి వ్యక్తంచేశారు. వీలైనంత త్వరగా ఒప్పందం ఓ కొలిక్కి వచ్చేలా చూడటంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దీంతోపాటు రక్షణ, ఇంధనం, వ్యూహాత్మక సాంకేతికత రంగాల్లో మరింత సహకారంపైనా చర్చలు జరిపారు. త్వరలో భారత్‌లో పర్యటించాలని భావిస్తున్నందుకు ట్రంప్‌కు తన తరఫున కృతజ్ఞతలు తెలపాలని వాన్స్‌తో మోదీ చెప్పారు. ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన పలు అంశాల్లో పురోగతి సాధించంపై ఇరు దేశాల నేతలు సమగ్ర స్థాయిలో చర్చలు జరిపారని భేటీ ముగిశాక సోమవారం రాత్రి భారత్ ఒక ప్రకటన విడుదలచేసింది. ‘‘ ఫిబ్రవరిలో ట్రంప్‌తో భేటీ, ఫలవంతమైన చర్చల వివరాలను వాన్స్ వద్ద మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. నాటి చర్చలు ఇరు దేశాల మధ్య సహకారానికి బాటలు వేశాయి. అటు మేక్ అమెరికా గ్రేట్ ఎగేన్‌కు, ఇటు వికసిత్ భారత్ 2047 సుసాధ్యానికి మార్గం సుగమం చేశాయి. ఇరు దేశాల ప్రజల సంక్షేమానికి దోహదపడే దైపాక్షిక వాణిజ్యం ఒప్పందం(బీటీఏ) పురోగతిపై నేతలిద్దరూ సంతృప్తి వ్యక్తంచేశారు. టారిఫ్‌లు, ఇరుదేశాల మార్కెట్లలోకి సులభంగా ప్రవేశించడం తదితర కీలకాంశాలు బీటీఏలు ఉండనున్నాయి. పరస్పర ప్రయోజనకర అంశాలతోపాటు అంతర్జాతీయ సమకాలీన అంశాలూ మోదీ, వాన్స్‌ల భేటీలో ప్రస్తావనకు వచ్చాయి. సమస్యాత్మక అంతర్జాతీయ అంశాల్లో దౌత్యం, సంప్రతింపులే పరిష్కార మార్గాలని నేతలు భావించారు. భారత్‌లో ఉన్నన్ని రోజులు వాన్స్, ఉషా, వాళ్ల చిన్నారులు ఎంతో ఆహ్లాదంతో గడపాలని మోదీ ఆకాంక్షించారు’’ అని ఆ ప్రకటన పేర్కొంది. చర్చల్లో భారత్ తరఫున విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ప్రధాని ముఖ్య కార్యదర్శి శక్తికాంతదాస్ పాల్గొన్నారు. 12 ఏళ్ల తర్వాత అమెరికా ఉపాధ్యక్షుడు ఒకరు భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. 2013లో నాటి ఉపాధ్యక్ష హోదాలో జోబైడెన్ ఢిల్లీకి వచ్చారు. -
పోప్ అస్తమయం
వాటికన్ సిటీ: ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మందికి పైగా రోమన్ క్యాథలిక్‌ల అత్యున్నత మత గురువైన పోప్ ఫ్రాన్సిస్ ఇక లేరు. 88 ఏళ్ల ఫ్రాన్సిస్ అనారోగ్య సమస్యలతో సోమవారం కన్నుమూశారు. ‘‘పోప్ బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై కోమాలోకి వెళ్లిపోయారు. అది గుండె వైఫల్యానికి దారి తీసింది’’ అని వాటికన్ వర్గాలు పేర్కొన్నాయి. ‘‘తన జీవితమంతటినీ చర్చి, ప్రభువు సేవకే అంకితం చేసిన రోమ్ బిషప్ ఫ్రాన్సిస్ ఈ ఉదయం 7.35కు తండ్రి సన్నిధి చేరారు’ అంటూ వాటికన్ కార్డినల్ కెవిన్ ఫారెల్ అధికారిక ప్రకటన చదివి వినిపించారు. ఆ వెంటనే రోమ్ అంతటా చర్చి టవర్లలో సంతాప సూచకంగా గంటలు మోగాయి. పోప్ పార్థివ దేహాన్ని తొలుత వాటికన్ మత పెద్దలు, అధికారుల సందర్శన నిమిత్తం శాంతా మార్తా చాపెల్‌లో ఉంచుతారు. అనంతరం సాధారణ ప్రజల సందర్శనార్థం సెయింట్ పీటర్స్ చర్చికి తరలిస్తారు. విశ్వాసులు, దేశ విదేశీ ప్రముఖులు ఆయనకు నాలుగు నుంచి ఆరు రోజుల పాటు తుది నివాళులు అరి్పస్తారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహిస్తారు. అందుకు త్వరలో తేదీని ఖరారు చేస్తారు. ఆ తర్వాత 9 రోజుల పాటు వాటికన్లో సంతాప దినాలు పాటించాక పోప్ వారసుని ఎన్నిక జరుగుతుంది. దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న పోప్ ఇటీవలే 38 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. నిమోనియాతో 1950ల్లోనే ఆయన కుడి ఊపిరితిత్తిని తొలగించాల్సి వచ్చింది. పోప్ చివరిసారిగా ఈస్టర్ సందర్భంగా ఆదివారం బయటి ప్రపంచానికి కన్పించారు.భారతీయులపై పోప్ ప్రేమాభిమానాలు మరవలేనివి: మోదీ న్యూఢిల్లీ: పోప్ ఫ్రాన్సిస్ అస్తమయం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. ‘‘ప్రేమాభిమానాలకు, సహానుభూతికి మారుపేరుగా ఆయన ఎప్పటికీ గుర్తిండిపోతారు. యువప్రాయం నుంచే ఫ్రాన్సిస్ క్రీస్తు సేవకు అంకితమయ్యారు. పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడ్డారు. బాధల్లో ఉన్న కోట్లాదిమందిలో ఆశాదీపం వెలిగించారు. ఆజన్మాంతం ఫ్రాన్సిస్ ప్రదర్శించిన ఆధ్యాతి్మక స్థైర్యం అందరికీ ఆదర్శం. ముఖ్యంగా భారతీయుల పట్ల ఎనలేని ప్రేమాభిమానాలు చూపారు. ఆయనతో భేటీ అయిన క్షణాలను ఎన్నటికీ మర్చిపోలేను’’ అన్నారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్‌గాం«దీ, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేశవ్యాప్తంగా పలు చర్చిల ప్రతినిధులు తదితరులు పోప్ అస్తమయం పట్ల సంతాపం తెలిపారు. దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు సంతాపం పాటించనున్నట్టు కేంద్రం ప్రకటించింది.సంతాపాల వెల్లువ పోప్ అస్తమయం పట్ల ప్రపంచవ్యాప్తంగా సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. పలువురు దేశాధినేతలు దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. ఇది తమనెంతో ఆవేదనకు గురిచేసిందన్నారు. బ్రిటన్ రాజు చార్లెస్–3, ప్రధాని కియర్ స్టార్మర్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్సలా వాండెర్ లెయన్, స్పెయిన్ ప్రదాని పెడ్రో శాంచెజ్, పోలండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్, డెన్మార్క్ ప్రధాని డిక్ స్కూఫ్, ఈజిప్ట్ అధ్యక్షుడు ఎల్ సిసీ, ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్, దుబాయ్ పాలకుడు షేక్ మహ్మద్ బిల్ రషీల్ అల్ మక్తూమ్ తదితరులు సంతాప సందేశాలు విడుదల చేశారు. భావి తరాలకు ఫ్రాన్సిస్ గొప్ప ఆదర్శంగా నిలుస్తారంటూ కొనియాడారు. ఈస్టర్ సందర్భంగా ఆదివారమే పోప్‌తో భేటీ అవడాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గుర్తు చేసుకున్నారు.సంస్కరణవాదిగా చెరగని ముద్ర అది 2013. పోప్ బెనెడిక్ట్–16 తన పదవికి రాజీనామా చేసి రిటైరయ్యారు. అలాంటి అసాధారణ పరిస్థితి తలెత్తడం 600 సంవత్సరాల్లో అదే తొలిసారి. అలాంటి అనూహ్య పరిస్థితుల నడుమ 266వ పోప్‌గా ఫ్రాన్సిస్ బాధ్యతలు స్వీకరించారు. ఆ పదవి చేపట్టిన తొలి లాటిన్ అమెరికన్‌గా, తొలి జెస్యూట్‌గా చరిత్ర సృష్టించారు. ఆయన అసలు పేరు జార్గ్ మారియో బెర్గోగ్లియో. 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో రాజధాని బ్యూనస్ ఎయిర్స్లో జని్మంచారు. ఐదుగురు సంతానంలో అందరికంటే పెద్దవాడు. దైవసేవే తన మార్గమని 17 ఏళ్ల వయసులోనే నిర్ణయించుకున్నారు. 36 ఏళ్లకే అర్జెంటీనాలోని జెస్యూట్లకు సారథి అయ్యారు. 1992లో బ్యూనస్ ఎయిర్స్ సహాయ బిషప్, 1998లో ఆర్చి బిషప్ అయ్యారు. 2001లో కార్డినల్ అయ్యారు. అనంతరం పోప్‌గా 12 ఏళ్లకు పైగా తన పనితీరుతో చెరిగిపోని ముద్ర వేశారు. అతి నిరాడంబర జీవన శైలితో ఆకట్టుకున్నారు. మిగతా పోప్ల్లా రాజప్రాసాదంలో కాకుండా వాటికన్లోని ఓ హోటల్లో నివసించారు. 2023 దాకా బెనెడిక్ట్, ఫ్రాన్సిస్ రూపంలో వాటికన్లో ఏకకాలంలో ఇద్దరు పోప్లు ఉండటం ఓ అసాధారణ ఘటనగా నిలిచిపోయింది. అయితే బెనెడిక్ట్ అబార్షన్ వ్యతిరేక అజెండాను ఫ్రాన్సిస్ పూర్తిగా సమర్థించలేదు. అధికార బలమున్న వాళ్లు నిస్సహాయులను పీల్చుకు తినడం ఎంతమాత్రమూ సరికాదంటూ తరచూ సామ్యవాద తరహా భావనలు వెలిబుచ్చేవారు. ఎన్నో సంచలనాలు శరణార్థులు, అణగారిన వర్గాలతో పాటు స్వలింగ సంపర్కల పట్ల ఫ్రాన్సిస్ ఎంతో సహానుభూతి చూపారు. వారితో పాటు పేదలు, ఖైదీలు, అంటరాని వర్గాలకు చర్చి వ్యవస్థ పెద్ద దిక్కుగా నిలవాలని స్పష్టం చేశారు. స్వలింగ సంపర్కం నేరం కాదని బాహాటంగా ప్రకటించారు. అంతేగాక, ‘ఈ అంశంపై తీర్పు చెప్పేందుకు నేనెవరిని?’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్య చిరస్థాయిగా నిలిచిపోయింది. స్వలింగ వివాహాలు చేసుకున్న జంటలను చర్చి ఆశీర్వదించడానికి అనుమతించారు. స్వలింగ సంపర్కులు ప్రీస్ట్ బాధ్యతలు స్వీకరించడాన్ని సమర్థించారు. దీన్ని ఆఫ్రికా, ఆసియా, ఇతర ప్రాంతాల బిషప్‌లు తీవ్రంగా వ్యతిరేకించినా పట్టించుకోలేదు. సంప్రదాయవాదుల తీరుతెన్నులను సందర్భం దొరికనప్పుడల్లా గట్టిగా ఆక్షేపించారు. ఇరాక్ పర్యటన ఇరాక్‌లో పర్యటించిన తొలి పోప్‌గా ఫ్రాన్సిస్ నిలిచారు. అరబ్ దేశాల్లోనూ పర్యటించి ముస్లిం ప్రపంచంతో చర్చి సంబంధాల్లో కొత్త అధ్యాయానికి తెర తీశారు. వాటికన్ బ్యూరోక్రసీతో పాటు మొత్తంగా చర్చి వ్యవస్థనే సంస్కరించేందుకు ప్రయతి్నంచి సంచలనం సృష్టించారు. మరణశిక్షను పూర్తిగా వ్యతిరేకించేలా, అణ్వాయుధాలు కలిగి ఉండటాన్ని అనైతికంగా పేర్కొనేలా చర్చి వైఖరిలో మార్పులు తెచ్చారు. పోప్‌ను ఎంపిక చేసే కీలక కార్డినల్ పదవుల్లో పాస్టర్లకు అధిక ప్రాధాన్యమిచ్చారు. కార్డినల్స్పై క్రిమినల్ కేసుల విచారణకు ఉన్న అడ్డంకులను కూడా తొలగించారు. వాటికన్ కార్యాలయాలపై పోలీసు దాడు లకూ అనుమతులిచ్చారు! వాటికన్ అధికారుల అపరిమిత ఆర్థికాధికారాలకు కత్తెర వేశారు. వారందుకునే కానుకలపైనా పరిమితి విధించారు. పర్యావరణ పరిరక్షణ విషయంలో అమెరికా వైఖరిని తీవ్రంగా విమర్శించారు. ఫ్రాన్సిస్ పనితీరుపై కొన్ని వివాదాలూ తలెత్తకపోలేదు. మైనర్లపై లైంగిక వేధింపుల అభియోగాలున్న కార్డినల్ థియోడర్ మెక్కారిక్కు చాలాకాలం పాటు దన్నుగా నిలిచారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భూమాత భద్రంగా..
ఈరోజు వరల్డ్ ఎర్త్ డే. మదర్ ఎర్త్‌ను పరిరక్షించాలని అందరికీ ఉంటుంది. అయితే వ్యక్తులుగా మనం ఏం చేయాలనే సందేహానికి సమాధానం ఉండదు. ఆ సందేహానికి సమాధానాలు వీళ్లంతా. లీలాలక్ష్మారెడ్డి రీ ఫారెస్టేషన్ ద్వారా గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఎదురైన గ్రీన్హౌస్ గ్యాసెస్ విడుదలను నియంత్రిస్తున్నారు. అంకారావు గ్లోబల్ క్లీనప్ కాన్సెప్ట్‌లో అడవులను కాపాడుతూ ప్లాస్టిక్ కారణంగా ఎదురయ్యే అనారోగ్యాల నుంచి వన్య్రపాణులను రక్షిస్తున్నారు. స్పందన ప్లాస్టిక్ వినియోగాన్ని నివారిస్తూ పవర్ వినియోగాన్ని తగ్గించడం, సస్టెయినబుల్ ఫ్యాషన్‌లో భాగంగా రీ యూజ్‌ని ప్రోత్సహిస్తూ కెరీర్‌ని పర్యావరణహితంగా మలుచుకున్నారు. చిన్నారి ఆరాధన సముద్రాల నుంచి ప్లాస్టిక్‌ని ఏరివేస్తూ సముద్రజీవుల సంరక్షణ కోసం పని చేస్తోంది. వీరంతా మన బతుకులు ఛిద్రం కాకుండా ఉండాలంటే భూమి భద్రంగా ఉండాలని చెబుతున్నారు భావి తరాలకు పరిశుభ్రమైన భూమిని అందించాలనే ప్రపంచ ఎర్త్‌డే లక్ష్యానికి మార్గదర్శనం చేస్తున్నారు.భూగోళాన్ని కాపాడుదాం!గ్లోబల్ ఎర్త్ డే 2025... ‘అవర్ పవర్, అవర్ ప్లానెట్’ థీమ్‌తో మన ముందుకు వచ్చింది. ‘మనకు రకరకాల శక్తి వనరులున్నాయి. భూమికి హాని కలిగించకుండా భవిష్యత్తును నడిపించే ఇంధనం పునరుత్పాదక శక్తి మాత్రమే’ అనే అంశాన్ని ప్రతిబింబించే పోస్టర్ తయారైంది. నిజానికి ఎర్త్ డే అంటే ఎర్త్ యాక్షన్ డే. భూమిని పరిరక్షించుకోవడానికి మనుషులుగా మనమంతా కార్యాచరణ చేపట్టాల్సిన రోజు. ఏటా ఏప్రిల్ 22వ తేదీన ఎర్త్‌డేని జరుపుకుంటున్నాం. 55 ఐదేళ్ల కిందట 1970లో యూఎస్‌లో మొదలైన ఈ ఎర్త్ డే నిర్వహణ క్రమంగా విస్తరించింది. ప్రస్తుతం 193 దేశాలు భూమిని పరిరక్షించే బాధ్యతలో పాలు పంచుకుంటున్నాయి. ప్రతి రోజూ ఎర్త్ డే!సీజీఆర్ (కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్) ను పదిహేనేళ్ల కిందట ఎర్త్ డే రోజునేప్రారంభించాం. అప్పటి నుంచి 13 లక్షల మంది ఎర్త్ లీడర్స్‌ను తయారు చేశాం. యంగ్ ఎర్త్ లీడర్స్ప్రోగ్రామ్ నిర్వహించడంలో మా ఉద్దేశం... కొత్త తరాలకు బాధ్యతాయుతమైన జీవనశైలిని అలవరచడమే. అలాగే ఈస్టర్న్ ఘాట్స్ కన్వర్జేషన్‌ను చేపట్టాం. ఎర్త్ డే అంటే ఏడాదికి ఒక రోజు మాట్లాడుకుని మరిచి పోవడం కాదు. ప్రతి రోజూ ఎర్త్ డేనే. పిల్లల పుట్టిన రోజు ఏడాదికి ఒక రోజు చేస్తాం. మిగిలిన రోజుల్లో కూడా వాళ్లకు పోషకాహారం, అనారోగ్యం వస్తే వైద్యం చేయించడంతోపాటు వారి బాగోగులన్నీ చూసినట్లే ఇది కూడా. పిల్లల భవిష్యత్తు కోసం జీవితాలను అంకితం చేసే పేరెంట్స్‌కి కూడా వారి కోసం మంచి ఎన్విరాన్మెంట్ని అందించాలనే ధ్యాస ఉండడం లేదు. భూమిని రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత, ఎవరికి వారు ఇది తమ ఒక్కరి బాధ్యత కాదన్నట్లు ఉంటున్నారు. మనకున్నది ఒక భూమి– ఒక కుటుంబం– ఒక భవిష్యత్. ఇవి బాగుండాలంటే వ్యక్తులుగా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. అప్పుడే భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన మదర్ ఎర్త్‌ని ఇవ్వగలుగుతాం.– కోరుపోల్ లీలా లక్ష్మారెడ్డి, ప్రెసిడెంట్, సీజీఆర్తొలకరి... మొక్కల పండగ!ప్రకృతికి మనం ఏమిస్తే అది మనకు తిరిగి దానినే ఇస్తుంది. మంచి చేస్తే మంచినందుకుంటాం. చెడు చేస్తే ఆ పర్యవసానాలను చవి చూస్తాం. వందల ఏళ్ల వెనక్కు వెళ్తే మన గ్రామాల్లో పండుగకో చెట్టు నాటే అలవాటుండేది. మొక్కను ప్రేమించడం, పూజించడం మన సంస్కృతి. ఆ కల్చర్‌ని విసిరిపారేశాం, తిరిగి అదే డైలీ రొటీన్‌ని అక్కున చేర్చుకోవాల్సిన అవసరం వచ్చింది. అందుకే కోటి విత్తన బంతుల ఉద్యమం చేపట్టి విజయవంతంగా పూర్తి చేశాను. తొలకరి చినుకులు పడగానే మొక్క నాటడాన్ని అలవాటు చేసుకోవాలి. తొలకరిని మొక్కల వసంతంగా వేడుక చేసుకోవాలి.– అంకారావు (జాజి) కొమ్మెర, ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియాఎకో వారియర్సేవ్ ఓషన్ ఇనిషియేటివ్‌లో భాగంగా పదేళ్ల తారాగై ఆరాధన 11.30 గంటలు నీటి లోపల ఉండి 1200 కిలోల ప్లాస్టిక్‌ని ఒడ్డుకు చేర్చింది. చెన్నైకి చెందిన ఆరాధన ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆఫ్ డైవింగ్ ఇన్స్ట్రక్టర్స్’ సర్టిఫికేట్ పొందిన స్కూబా డైవర్. ఐదేళ్ల వయసులో డైవింగ్ మొదలు పెట్టిన ఆరాధన ఇప్పటి వరకు 30 వేల కిలోల ప్లాస్టిక్‌ని వెలికి తీసి సముద్రానికి ఊపిరిపోసింది. భూమండలంలోని అన్ని సముద్రాల్లో కలిపి యాభై ట్రిలియన్ల ప్లాస్టిక్ ముక్కలు ఉంటాయని అంచనా. ఇది ఇలాగే కొనసాగితే తీరం కోతకు గురవడంతోపాటు సముద్రాలు విస్తరించే ప్రమాదం పొంచి ఉంది. అంతేకాదు, 700 రకాల సముద్రజీవుల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది కూడా. ‘ప్లాస్టిక్ బ్యాగ్ ఇస్తున్న ప్రతి చోటా క్లాత్ బ్యాగ్ కావాలని అడగండి. మొదట మీ ఇంటిని ప్లాస్టిక్ ఫ్రీగా మార్చుకోండి. ఆ తర్వాత మీరు నివసిస్తున్న వీథిని మార్చండి. ఆ తర్వాత సముద్రాన్ని ప్రక్షాళన చేయండి’ అని ఆరాధన ప్రతి ఒక్కరినీ వేడుకుంటోంది.జెన్ జెడ్ ఎంటర్ప్రెన్యూర్మేము మోడరన్ ఎనర్జీ మినిమమ్ థీమ్‌లో భాగమయ్యాం. పవర్ వినియోగాన్ని తగ్గించడానికి స్టోర్ కోసం గాలి వెలుతురు ధారాళంగా ప్రసరించే భవనాన్ని ఎంచుకున్నాం. పగలు లైట్, ఫ్యాన్ వేయాల్సిన అవసరమే ఉండదు. ప్లాస్టిక్ రహితంగా కూడా డిజైన్ చేశాం. క్యారీ బ్యాగ్‌ల విషయానికి వస్తే పేపర్ బ్యాగ్‌లు రీ యూజ్‌కి ఉపయోగపడడం లేదు. దాంతో నాన్ఓవన్ బ్యాగ్‌లు వాడుతున్నాం. సొసైటీలో ఎంత అవేర్నెస్ వచ్చిందంటే... మా కస్టమర్లు మా స్టోర్ వైపు నుంచే వెళ్లేటప్పుడు ఆ బ్యాగ్‌లను రీ యూజ్ కోసం తెచ్చిస్తున్నారు. ప్రైస్ ట్యాగ్‌కి దారం, నూలు, పేపర్లనే వాడుతాం. మంచినీటికి మాత్రం కొందరు కస్టమర్లు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బాటిళ్లనే అడుగుతున్నారు. ఇక మా దగ్గరకు వచ్చే క్లాత్ వేస్ట్‌ని రీ యూజ్ చేయడానికి రకరకాలుగా ఆలోచిస్తున్నాం, ఇంకా స్పష్టమైన రూపం రాలేదు. మా పార్టనర్స్ అనూష, అమృతలు కూడా ఎకో ఫ్రెండ్లీ లైఫ్ స్టయిల్ని గౌరవిస్తారు. కాబట్టి మా స్టోర్‌ని ఇలా యూనిక్‌గా తీసుకురాగలిగాం. ఒక మోడల్ని ఎవరో ఒకరు మొదలుపెడితే మిగిలిన వాళ్లు అందుకుంటారు. ఆ మొదటి అడుగు వేశాం.– వి. స్పందన, కో ఫౌండర్, లావెండర్ లేన్ – హౌస్ ఆఫ్ ఫ్యాషన్నేడు ఎర్త్ డే ఉమెన్స్ సమ్మిట్‘ఎర్త్ డే ఉమెన్స్ సమ్మిట్–2025’ ఈరోజు అమెరికాలోని డల్లాస్‌లో జరుగుతుంది. వాతావరణ మార్పులను పరిష్కరించడానికి మహిళల ఆలోచనలు, సృజనాత్మక పరిష్కారాలకు ఈ సమ్మిట్ వేదిక కానుంది. ‘నాయకత్వ స్థాయిలో మహిళలు ఉండడం వల్ల సమాజం, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణంలో మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి’ అంటున్నారు గ్లోబల్ గ్రీన్ సిఇవో విలియం బ్రిడ్జ్. వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించడానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వ, వ్యాపార, పౌర సమాజ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు.– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
జనావాసాల్లోకి సింహం.. ఫ్రెండ్ కళ్లముందే యువతి ప్రాణం తీసింది!
నైరోబీ: కెన్యా రాజధాని నైరోబీలో ఒక సింహం జనావాసాల్లోకి వచ్చి దాడి చేసిన ఘటనలో యువతి ప్రాణం కోల్పోయింది. నేషనల్ జూ పార్క్ నుంచి తప్పించుకు వచ్చిన ఆ సింహం.. జనావాసాల్లోకి వచ్చింది. అయితే దీన్ని గమనించని ఇద్దరు యువతులు వస్తున్న సమయంలో సింహం అమాంతం దాడి చేసింది. ఇందులో ఒక యువతిపై పంజా విసిరి అక్కడ నుంచి దూరంగా తీసుకెళ్లిపోయింది. దీనిపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు.. చివరకు యువతి మృతదేహాన్ని మాత్రమే కనుగొన్నారు. ఆమె వెనుక భాగంలో తీవ్ర గాయాల పాలైన ఆ యువతి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. జనావాసాలు ఉండే ప్రాంతానికి నైరోబీ నేషనల్ పార్క్ కేవలం 10 కి.మీ దూరంలోనే ఉంది. అక్కడ నుంచి తప్పించుకుని ఉంటుందని భావిస్తున్న సింహం.. ఇలా దాడి చేయడంతో స్థానికులు భయభ్రాంతులకు గురౌవుతున్నారు. ఆ నేషనల్ పార్క్ అనేది క్రూర మృగాలకు ఆవాసం. సింహాలు, పులులు, చిరుత పులులు తదితర జంతువులు ఉంటాయి. -
Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం
ఢిల్లీ: క్రైస్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్(88)కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మృతి చెందినట్లు వాటికన్ సిటీ అధికారులు ప్రకటించారు.వాటికన్ సిటీ అధికారుల ప్రకటనతో దేశాదినేతలు పోప్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పోప్ మృతిపై విచారం వ్యక్తం చేశారు.‘పోప్ ఫ్రాన్సిస్ మరణం నాకు తీవ్ర బాధను కలిగిస్తోంది. ఈ విషాద సమయంలో ప్రపంచ కాథలిక్ సమాజానికి నా హృదయపూర్వక సంతాపం. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కరుణ, వినయం ఆధ్యాత్మిక ధైర్యానికి ప్రతీకగా పోప్ ఫ్రాన్సిస్ ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు. చిన్నప్పటి నుంచీ, ఆయన క్రీస్తు ఆదర్శాలను సాకారం చేసేందుకు కృషి చేశారు. పేదలు,అణగారిన వర్గాలకు సేవ చేశారు’అని ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్లో కొనియాడారు. Deeply pained by the passing of His Holiness Pope Francis. In this hour of grief and remembrance, my heartfelt condolences to the global Catholic community. Pope Francis will always be remembered as a beacon of compassion, humility and spiritual courage by millions across the… pic.twitter.com/QKod5yTXrB— Narendra Modi (@narendramodi) April 21, 2025 పోప్ ఆత్మకు శాంతి చేకూర్చుగాక : జేడీ వాన్స్భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఎక్స్ వేదికగా పోప్ ఫ్రాన్సిస్ మరణంపై విచారం వ్యక్తం చేశారు. పోప్ ఫ్రాన్సిస్ మరణ వార్త నాకు ఇప్పుడే తెలిసింది. కోవిడ్ తొలినాళ్లలో ఆయన ఇచ్చిన ప్రసంగం మరిచిపోలేనిది. నేను ఆయనను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటాను. దేవుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చుగాక అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. I just learned of the passing of Pope Francis. My heart goes out to the millions of Christians all over the world who loved him. I was happy to see him yesterday, though he was obviously very ill. But I’ll always remember him for the below homily he gave in the very early days…— JD Vance (@JDVance) April 21, 2025 వైట్ హౌస్ ట్వీట్ పోప్ ఫ్రాన్సిస్ మరణ వార్తపై అమెరికా శ్వేతసౌథం వర్గాలు అధికారికంగా స్పందించాయి. ‘రెస్ట్ ఇన్ పీస్’ అంటూ ఎక్స్ వేదికగా పేర్కొన్నాయి. Rest in Peace, Pope Francis. ✝️ pic.twitter.com/8CGwKaNnTh— The White House (@WhiteHouse) April 21, 2025 -
Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత
వాటికన్ సిటీ: క్రైస్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్(88) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి చెందినట్లు వాటికన్ సిటీ వర్గాలు ప్రకటించాయి. ఈస్టర్ సందర్భంగా నిన్న ఆయన పేరిట సందేశం వెలువడగా.. కొన్ని గంటలకే ఆయన మృతి చెందారని వీడియో సందేశం విడుదల చేయడం గమనార్హం.పోప్ ఫ్రాన్సిస్(Pope Francis) అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్లో 1936 డిసెంబర్ 17న ఈయన జన్మించారు. 2013లో నాటి పోప్ బెనెడిక్ట్-16 రాజీనామా చేయడంతో ఫ్రాన్సిస్ కేథలిక్ చర్చి అధిపతి అయ్యారు. ఆ ఏడాది మార్చి 13న 266వ పోప్‌గా ఎన్నికయ్యారు. అమెరికా ఖండం నుంచి ఎన్నికైక తొలి పోప్‌గా ఈయనకంటూ ఓ గుర్తింపు ఉంది. Pope Francis died on Easter Monday, April 21, 2025, at the age of 88 at his residence in the Vatican's Casa Santa Marta. pic.twitter.com/jUIkbplVi2— Vatican News (@VaticanNews) April 21, 2025పోప్ ఫ్రాన్సిస్ తరచూ సమకాలీన సామాజిక అంశాలపై వ్యాఖ్యలు చేస్తుండేవారు. వలసదారులు, శరణార్థుల పట్ల మానవత్వంతో మెలగాలని ప్రపంచ దేశాలకు పిలుపు ఇచ్చిన ఈయన.. అదాయ అసమానతలు, వాతావరణ మార్పులు, మరణ శిక్షలకు వ్యతిరేకంగా పోరాడారు కూడా. 2016లో రోమ్ బయట ఇతర మతానికి చెందిన శరణార్థుల పాదాలు కడగడం తీవ్ర చర్చనీయాంశమైంది. మొన్నటి అమెరికా అధ్యక్ష ఎన్నికల టైంలోనూ.. అటు ట్రంప్, ఇటు కమలా హారిస్ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు కూడా. తాజాగా ఈస్టర్ సందర్భంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(JD Vance) పోప్‌ను కలుసుకున్నారు కూడా. గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలు, డబుల్ న్యూమోనియా, కిడ్నీ సమస్యలతో తీవ్రంగా బాధపడ్డ పోప్ ఫ్రాన్సిస్.. కొన్నాళ్లపాటు ఆస్పత్రిలో చికిత్స కూడా పొందారు. వాటికన్ సిటీలోని కాసా శాంటా మార్టా (Casa Santa Marta) నివాసంలో సోమవారం కన్నుమూసినట్లు తెలుస్తోంది. పోప్ మృతి పట్ల పలు దేశాల అధినేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. -
Talking Tree: చెట్టుకే మాటలొస్తే.. వినాలని ఉందా?
దాదాపు వందేళ్లక్రితం జగదీశ్ చంద్రబోస్ అనే వృక్షశాస్త్రవేత్త మొక్కలకు ప్రాణం ఉంటుందని నిరూపించారు. అవి ఎండనుంచి శక్తిని. వాతావరణం నుంచి కార్బన్ డయాక్సయిడ్ ను తీసుకుని ఆకులతో శ్వాసించి మనకు ప్రాణాలు నిలిపే ఆమ్లజనిని విడుదల చేస్తాయని నిరూపించారు. అంతేకాకుండా మొక్కలు తమకు హానికారక రసాయనాలను చూసి ఎలర్జీ ఫీలవుతాయని.. వాటిలోనూ మనుషులకు ఉన్నట్లే నాడీ వ్యవస్థ ఉంటుందని చెప్పారు. ఆ తరువాత కొంతమంది శాస్త్రవేత్తలు మొక్కలు తమలోతాము సంభాషించుకుంటాయని.. భావాలు కూడా షేర్ చేసుకుంటాయని పరిశోధించి వివరించారు.. అంటే కొంపదీసి మొక్కలు కూడా మనలా మాట్లాడతాయా ఏందీ అంటూ కొంతమంది అత్యుత్సాహకులు ఆనాడే కామెంట్లు చేసారు.. అయితే అవును మొక్కాలు మాట్లాడతాయి.. ఇదిగో కావాలంటే వినండి అంటూ డబ్లిన్(Dublin)లోని శాస్త్రవేత్తలు మనకు వినిపిస్తున్నారు.మాట్లాడే చెట్టు (టాకింగ్ ట్రీ ) అంటూ ట్రినిటీ కాలేజీలో రూపొందించిన ఈ సరికొత్త ప్రయోగం ఎంతోమందిని ఆకట్టుకుంటోంది. అసలు చెట్లు.. వృక్షాలు మొక్కలు తీగలు మనతో మాట్లాడితే బావుణ్ణు.. అసలివి మనతో ఏం మాట్లాడతాయి అంటారు.. ఏమో.. అసలు మనతో మాట్లాడితే కదా... ఇలాంటి ఉత్సుకత మనలో చాలామందిలో ఉంటుంది. మన ఉత్సాహాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు.. ఆ కాలేజీ ప్రాంగణంలోని ఓ చెట్టుతో సంభాషించే అవకాశాన్ని.. కలిగించారు.. దీనికి అధునాతన సాంకేతికతను జోడించారు.కాలేజీలోని ఇరవయ్యేళ్ళ వయసున్న లండన్ ప్లేన్ చెట్టుతో ముఖాముఖి సంభాషించే అవకాశం కలిగించారు. డ్రోగా5 టెక్నాలజీ సంస్థ మరియు బ్రిటన్‌లోని ఏజెన్సీ ఫర్ నేచర్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును రూపొందించాయి. శాస్త్రవేత్తలు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ... కృత్రిమ మేధస్సు ఇంకా సెన్సర్లను చెట్టుకు అనుసంధానించి చెట్టుకు గొంతును ఇచ్చారు. ఈ సెన్సార్లు చెట్టు అడుగున ఉన్న మట్టి .. దానిలోని తేమ, వాతావరణ ఉష్ణోగ్రత, సూర్యరశ్మి లోని తీవ్రత.. గాలి స్వచ్ఛత వంటివి అంచనావేసి ఆర్టిఫీషియల్ భాషా నమూనాకు అనుసంధానిస్తారు. అవి చెట్టుకు లింక్ చేస్తారు.. అప్పుడు చెట్టు ఎలా ఫీలవుతుందన్నది అట్నుంచి మళ్ళీ మాటల రూపంలో మనకు వినిపిస్తారు. అంటే చెట్టుకు నీళ్లు లేకపోతె.. వేళ్ళు దాహంతో అల్లాడే పరిస్థితి ఉంటే బహుశా.. దాహం.. దాహం.. కాసిన్ని నీళ్లు పోయండర్రా అంటుందేమో చెట్టు! ఆకలేస్తోంది.. ఎవరైనా ఓ గంపెడు ఎరువు తెచ్చి వేసి పుణ్యం కట్టుకోండర్రా అని చెట్టు మ్రాన్పడిపోతుందేమో!.అంతేకాకుండా చెట్లకు కాలజ్ఞానం ఉంటుందని విశ్వసిస్తున్న శాస్త్రవేత్తలు.. అడవుల్లో ప్రజ్వరిల్లే కార్చిచ్చు వంటివాటిని ముందుగానే మనకు తెలుస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చెట్టుతో సంభాషన అనంతరం కొందమంది విద్యార్థులు మాట్లాడుతూ.. మనం సహచరులతో మాట్లాడడం సహజం.. కానీ ఇలా ప్రకృతితో సంభాషణ అనేది వింతగా ఉంది.. చెట్టు చెబుతున్న భావాలు వింటుంటే అద్భుతంగా ఉందని అబ్బురపడుతున్నారు. :::సిమ్మాదిరప్పన్న -
ట్రంప్ ఎఫెక్ట్.. ఆ దేశాలకు చైనా సీరియస్ వార్నింగ్
బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల కారణంగా చైనా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. చైనా తాజాగా.. తన మిత్ర దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. చైనా ప్రయోజనాలకు నష్టం కలిగించేలా నిర్ణయాలు తీసుకుంటే ఆయా దేశాలపై ప్రతీకార చర్యలు కఠినంగా ఉంటాయని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్బంగా..‘బుజ్జగింపులతో శాంతి స్థాపన జరగదు. రాజీ పడితే గౌరవం లభించదు. దీని వల్ల ఎవరికీ ఎలాంటి ప్రయోజనం చేకూరదు. స్వల్పకాలిక లాభాల కోసం వెళితే.. అది ఎప్పటికైనా మనకే హాని చేస్తుందన్న విషయాన్ని దేశాలు గుర్తుంచుకోవాలి. చైనా ప్రజల ప్రయోజనాలకు నష్టం కలిగించేలా ఏ దేశమైనా అమెరికాతో వాణిజ్యపరంగా, ఆర్థికంగా ఒప్పందం కుదుర్చుకుంటే దాన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైతే దాన్ని ఎన్నటికీ అంగీకరించబోం. మా నుంచి ప్రతిస్పందన కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఇతరుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి తాత్కాలికంగా, స్వార్థపూరితంగా లాభం పొందాలనుకోవడం.. పులి చర్మం కోసం దాంతోనే డీల్ చేసుకోవడం లాంటిది’ అని ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వార్నింగ్ ఇచ్చింది.ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే చైనా సహా పలు దేశాలపై టారిఫ్‌లు విధించిన విషయం తెలిసిందే. వాణిజ్య చర్చల కోసం వాటిని 90 రోజుల పాటు నిలిపివేశారు. అయితే, చైనాకు మాత్రం ఎలాంటి మినహాయింపు లేదని ప్రకటించారు. చైనా ఉత్పత్తులపై టారిఫ్‌లను ఏకంగా 245 శాతానికి పెంచుతున్నట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. బోయింగ్ విమానాల డెలివరీపై నిషేధం విధించినందుకు చైనాపై అమెరికా ప్రభుత్వం వెంటనే ప్రతీకార చర్యలకు దిగారు. ఈ మేరకు ఫ్యాక్టషీట్ విడుదల చేసింది. BREAKING: China warns it will hit back at any country that sides with the US in ways that hurt its interests."Deals at China's expense won't be accepted. Expect countermeasures" says Min of Commerce.During Trump’s #Tariffwar - China didn’t stay silent then, won’t now either. https://t.co/3U3Vv4KTAP pic.twitter.com/jz1WrTDOGh— Amit Bhawani 🇮🇳 (@amitbhawani) April 21, 2025 -
‘యెమెన్ లీక్ ఎపిసోడ్’లో బిగ్ ట్విస్ట్
యెమెన్‌పై భీకర దాడులకు సంబంధించి అమెరికా ప్రణాళికలు ముందుగానే బయటపడడం చర్చనీయాంశమైన వేళ.. విస్మయం కలిగించే విషయం ఒకటి వెలుగు చూసింది. హౌతీ రెబల్స్‌పై దాడుల సమాచారాన్ని అమెరికా రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్ తన భార్య, కుటుంబ సభ్యులు, వ్యక్తిగత లాయర్‌తోనూ పంచుకున్నట్లు బయటపడింది. సమాచారం లీక్ విషయంలో ఈయన ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.న్యూయార్క్: సమాచారం లీక్ అవ్వడానికి కారణమైన ‘సిగ్నల్’ గ్రూప్‌ను తానే క్రియేట్ చేశానని, దీనికి పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు అమెరికా జాతీయ భద్రత సలహాదారు మైక్ వాల్జ్ (Mike Waltz) ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ గ్రూప్‌లో సమాచారం ఎలా లీక్ అయ్యిందో అర్థం కావడం లేదని, దీనిపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరుగుతోందని అన్నారాయన. ఈలోపు.. అమెరికా రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్(Pete Hegseth) తన కుటుంబ సభ్యులతోనూ ఆ కీలక సమాచారం పంచుకున్నారనే విషయం వెలుగు చూసింది.యెమెన్‌లోని హౌతీ రెబల్స్‌ను టార్గెట్ చేస్తూ జరిగిన F/A-18 హార్నెట్ దాడుల షెడ్యూల్ల వివరాలను ఆయన మరో ఛాట్‌లో భార్య, తన సోదరుడు, స్నేహితులతోనూ పంచుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ ఆదివారం ఒక కథనం ప్రచురించింది. అంతేకాదు హెగ్సెత్ భార్య, ఫాక్స్ న్యూస్ ప్రొడ్యూసర్ అయిన జెన్నిఫర్.. సైన్యానికి సంబంధించిన కీలక సమావేశాలకూ హాజరయ్యారని వాల్ స్ట్రీట్ జనరల్ విడిగా మరో కథనం ఇచ్చింది.ఈ కథనాలపై ఇటు అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్.. అటు వైట్‌హౌజ్ వర్గాలు స్పందించాల్సి ఉంది. మరోవైపు.. అత్యంత సున్నితమైన భద్రతా వివరాలను పంచుకోవడానికి ట్రంప్ పేషీ ‘‘సిగ్నల్’’ లాంటి యాప్‌ను వాడడంపై అమెరికాలో తీవ్ర చర్చ నడుస్తోంది.అమెరికా బలగాలు కిందటి నెలలో యెమెన్(Yemen Attacks Plan Leak)పై భీకర దాడులు చేయడానికి సంబంధించిన ప్రణాళికలు ముందుగానే ఓ పాత్రికేయుడికి తెలియడం అమెరికాలో కలకలం రేపింది. సిగ్నల్‌లో గ్రూప్‌చాట్ కోసం తనను రెండు రోజుల ముందే యాడ్ చేశారని ‘అట్లాంటిక్ మ్యాగజైన్’ ఎడిటర్-ఇన్-చీఫ్ జెఫ్రీ గోల్డ్బర్గ్ ప్రకటించారు. లక్ష్యాలు, అమెరికా ఆయుధాల మోహరింపు, దాడులు చేసే దిశ వంటి అంశాలపై గ్రూపులో చర్చించారని, ఆ ప్రకారమే దాడులు జరిగాయని ఆయన వెల్లడించారు. అయితే తన వద్ద ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ.. తాను ఎలాంటి కథనాలు ఇవ్వలేదంటూ చెప్పారాయన.అమెరికా రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇతర ముఖ్య అధికారులు యెమెన్‌పై చర్చించిన సిగ్నల్ యాప్ గ్రూప్చాట్లో ఈ జర్నలిస్టును యాడ్ చేశారు. దాడుల విషయాలు ఆ పాత్రికేయునికి తెలుసని శ్వేతసౌధం ధ్రువీకరించింది.మరోవైపు.. ఈ ప్రణాళిక లీకైన అంశంపై తనకెలాంటి సమాచారం లేదని అధ్యక్షుడు ట్రంప్ అంటున్నారు. ఈ భద్రతా ఉల్లంఘనను ట్రంప్ సాధారణ విషయంగా తీసుకున్నప్పటికీ.. డెమోక్రట్లు తీవ్రంగా ఖండించారు. నూతన పాలకవర్గం అజాగ్రత్త వల్లే ఇది జరిగిందని వ్యాఖ్యానించారు.ఇక.. ఈ ఉదంతంపై ఉన్నతస్థాయి నిఘా అధికారులను అమెరికా సెనెట్ విచారిస్తోంది. ఇప్పటికే ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్, సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్, జాతీయ నిఘా డైరెక్టర్ తులసీ గబ్బార్డ్‌లు సెనెట్ నిఘా కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చారు. అయితే గ్రూప్‌ను తానే క్రియేట్ చేసినప్పటికీ సదరు జర్నలిస్టు ఫోన్ నెంబర్ తన వద్ద లేదని అన్నారు. ఫోన్లో లేని నెంబర్ ఎలా గ్రూప్‌లోకి వచ్చిందో తెలుసుకోవడానికి సాంకేతిక నిపుణులు కృషి చేస్తున్నారని .. విషయంలో తాము ఇలాన్ మస్క్ సహాయం కూడా తీసుకుంటున్నట్లు అమెరికా జాతీయ భద్రత సలహాదారు మైక్ వాల్జ్ వెల్లడించారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మార్చి 15న యెమెన్‌పై దాడులను ప్రకటించారు. ఇజ్రాయెల్ నౌకలపై దాడుల్ని పునరుద్ధరిస్తామని ప్రకటించిన యెమెన్ తిరుగుబాటు దళం హూతీలపై అమెరికా ఇటీవల పెద్దఎత్తున దాడులు చేసింది. ఉగ్రవాద స్థావరాలు, ఉగ్ర నేతలపై తమ దళాలు భీకర దాడులు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ దాడుల్లో 50 మందికి పైగా మృతిచెందగా.. అనేకమంది గాయపడ్డారు. -
పుట్టి.. మళ్లీ కడుపులోకి వెళ్లి.. మళ్లీ పుట్టి
బ్రిటన్‌లో రాఫర్టీ ఇసాక్ అనే పిల్లాడు రెండు సార్లు పుట్టాడు. ఒకసారి జన్మించిన పిల్లాడు పెరిగి పెద్దవాడయ్యాక ముదిమి వయసులో చనిపోతే తర్వాత జన్మలో కదా పుట్టేది అని చాలా మంది అనుకోవచ్చు. కానీ ఈ పిల్లాడు ‘సాంకేతికంగా’రెండుసార్లు జన్మించాడు. తల్లికి క్యాన్సర్ కణుతులు పెరిగి క్యాన్సర్ రెండో స్టేజీకి చేరుకున్నాక తప్పనిసరి పరిస్థితుల్లో అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది. అప్పటికి పిల్లాడు ఇంకా 20 వారాల వయసులో గర్భస్త పిండంగా గర్భాశయంలోనే ఉన్నాడు. ఆలస్యం చేస్తే పిల్లాడు బతుకుతాడేమోగాని క్యాన్సర్ ముదిరి తల్లి ప్రాణాలు వదలడం ఖాయం. ఈ పరిస్థితుల్లో అత్యంత నిష్ణాతుడైన డాక్టర్ సాల్మనీ మజిద్ తన 15 మంది వైద్య బృందంతో కలసి చాలా సంక్లిష్టమైన ఆపరేషన్ చేసి అటు తల్లిని, ఇటు గర్భస్థ శిశువును సంరక్షించాడు. అరుదైన ఆపరేషన్ బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్ట్ ప్రాంతానికి చెందిన లూసీ ఇసాక్ వృత్తిరీత్యా టీచర్. 32 ఏళ్ల లూసీ గత ఏడాది గర్భందాల్చింది. గర్భిణి కావడంతో సాధారణ అ్రల్టాసౌండ్ పరీక్ష చేయించడంతో అనూహ్యంగా ఓవరీ క్యాన్సర్ బారిన పడ్డట్లు తేలింది. గర్భంతో ఉన్న కారణంగా కీహోల్ తరహాలో శస్త్రచికత్స చేయడం కుదరలేదు. అలాగని గర్భాన్ని తొలగించలేని పరిస్థితి. దాంతో పిండాన్ని ప్రసవం తరహాలో అలాగే బయటకు తీసుకొచ్చి బయట క్షేమంగా పక్కనే పెట్టి తల్లిని శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా జాన్ రాడ్‌క్లిఫ్ ఆస్పత్రిలో వైద్యుల బృందం రంగంలోకి దిగి గర్భస్త పిండాన్ని బయటకు తీశారు. తల్లి శరీరంతో అనుసంధానమైన రక్తనాళాలు, కణజాలం జోలికి వెళ్లలేదు. వెచ్చగా పొత్తికడుపులో ఉండాల్సిన పిండం బయటి వాతావరణంలో మనగలగడం అసాధ్యం. అందుకే వెచ్చని ‘సలీన్’బ్యాగ్‌లో పెట్టారు. దాదాపు ఐదు గంటలపాటు కష్టపడి తల్లి ఓవరీ క్యాన్సర్ కణాలను వైద్యులు తొలగించారు. బ్యాగులో పిండం ఆరోగ్యపరిస్థితిని ఇద్దరు వైద్యుల బృందం అనుక్షణం గమనించింది. ప్రతి 20 నిమిషాలకొకసారి బ్యాగును మార్చారు. ఈలోపు ఆపరేషన్‌ను పూర్తిచేసి గర్భాశయాన్ని మళ్లీ తల్లి పొత్తికడుపులో పెట్టి కుట్లేశారు. ఇలా ఆపరేషన్‌ను విజయవంతం చేశారు. ఈ ఏడాది జనవరిలో నిండు గర్భిణిగా మళ్లీ ఆస్పత్రికి వచ్చిన లూసీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. పిల్లాడు పుట్టినప్పుడు 2.86 కేజీల బరువున్నాడు. ఇలా రెండు సార్లు పుట్టిన పిల్లాడిగా రాఫర్టీ అరుదైన ఘనత సాధించాడు. ఆపరేషన్ చేసిన వైద్యుడు సాల్మనీ మజిద్‌ను పిల్లాడి తల్లిదండ్రులు ప్రత్యేకంగా కలిసి కృతజ్ఞతలు చెప్పారు. ‘‘మూడేళ్ల క్రితం నాకు మూత్రపిండ మారి్పడి శస్త్రచికిత్స జరిగింది. అలా నాకు అది పునర్జన్మ. క్యాన్సర్ బారిన పడి కూడా కోలుకుని నా భార్య లూసీ పునర్జన్మ ఎత్తింది. ప్రసవానికి ముందే పుట్టి మళ్లీ తల్లికడుపులోకి వెళ్లి మరోసారి పుట్టి నా కుమారుడు కూడా పునర్జన్మ ఎత్తాడు’’అని పిల్లాడి తండ్రి ఆడమ్ ఆనందంగా చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Rakhaldas Banerjee: ఆయనకింకా ఆ క్రెడిట్ దక్కలేదు!
భారతదేశంలో 5,300 సంవత్సరాలకు పూర్వమే గొప్ప నాగరికత వషిల్లింది. అదే సింధూలోయ నాగరికత లేదా హరప్పా నాగరికత. ప్రణాళికాబద్ధమైన వీధులు, ఇళ్లు, మురుగు నీటి వ్యవస్థతో ఈ నాగరికత ఇప్పటి ఆధునిక నగరాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండేది. 1990వ దశకం తర్వాత బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో సింధూలోయ నాగరికత ఆనవాళ్లు బయటపడ్డాయి. భూమి పొరల కింద శతాబ్దాలుగా కప్పబడి ఉన్న శిథిలాలను వెలుగులోకి తీసుకొచ్చారు. అవిశ్రాంతమైన తవ్వకాలతో ఈ గొప్ప నాగరికతను నేటి తరానికి పరిచయం చేశారు. ఈ మహాయజ్ఞం వెనుక ఉన్నది ఎవరో తెలుసా? భారతీయుడైన రఖల్దాస్ బెనర్జీ. కానీ, మొత్తం క్రెడిట్ కొట్టేసింది మాత్రం అప్పటి భారత పురావస్తు సర్వే విభాగం(ఏఎస్ఐ) చీఫ్, బ్రిటిష్ జాతీయుడైన జాన్ మార్షల్. సింధూలోయ నాగరికతను బయటపెట్టింది జాన్ మార్షల్ అని బ్రిటిష్ ప్రభుత్వం లోకాన్ని నమ్మించింది. పాఠ్య పుస్తకాల్లోనూ అదే చేర్చారు. ఇప్పటికీ పిల్లలు అదే చదువుకుంటున్నారు. కానీ, వాస్తవం అది కాదని చరిత్రకారులు, పరిశోధకులు తేల్చిచెబుతున్నారు. అసలైన కథానాయకుడు రఖల్దాస్ బెనర్జీ అనామకంగా ఉండిపోవడానికి కారణం ఏమిటి? అసలు ఆయనెవరు? ఆ మహా మనిషిని మనం ఎందుకు మర్చిపోయాం? చిన్నప్పుడే చరిత్రపై ఆసక్తి పురావస్తు పరిశోధకుడైన రఖల్దాస్ బెనర్జీ 1885లో పశ్చిమ బెంగాల్లో ఓ సంపన్న కుటుంబంలో జని్మంచారు. బహరాంపూర్ పట్టణంలో పెరిగారు. ఆ మధ్య యుగాల నాటి కట్టడాలు అధికంగా ఉండేవి. ఆయన వాటిని చూస్తూ ప్రాచీన నాగరికతలు, చరిత్రపై ఆసక్తి పెంచుకున్నారు. కాలేజీలో చేరి చరిత్రను అధ్యయనం చేశారు. మధ్యయుగ భారతదేశ చరిత్రపై వ్యాసం రాసే బాధ్యత అప్పగించగా, అందుకోసం స్వయంగా పరిశోధన ప్రారంభించారు. పొరుగు రాష్ట్రం వెళ్లి అక్కడి శిల్పాలు, రాతపత్రులను పరిశీలించారు. దాంతో చరిత్ర, నాగరికతలపై ఆసక్తి మరింత పెరిగింది. 1910లో ఏఎస్ఐలో ఎక్సవేషన్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. చురుకైన వ్యక్తి కావడంతో తక్కువకాలంలోనే సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్టు స్థాయికి ఎదిగారు. 1917లో విధుల్లో భాగంగా పశ్చి మ భారతదేశానికి చేరుకున్నారు. 1919లో సింధూ ప్రాంతంలోని మొహెంజోదారోలో అడుగుపెట్టారు. ప్రస్తుతం ఈ ప్రాంతం పాకిస్తాన్‌తో లర్కానాలో జిల్లాలో ఉంది. ఇప్పటికైనా గుర్తింపు దక్కేనా? సింధూలోయలో ప్రాచీన నగరాన్ని తవ్వకాల్లో బయటకు తెచ్చిన ఘనత నిశ్చయంగా రఖల్దాస్ బెనర్జీదే. అందుకోసం ఆయన ఎంతగానో కష్టపడ్డారు. వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకున్నారు. కానీ, ఒక భారతీయుడికి ఆ పేరు ప్రఖ్యాతలు దక్కడం బ్రిటిష్ ప్రభుత్వానికి ఇష్టం లేకపోయింది. ఆయనపై ఎన్నో అభియోగాలు మోపింది. అంతేకాకుండా రఖల్దాస్ది ధిక్కరించే తత్వం. తనపై ఎవరైనా పెత్తనం చెలాయించాలని చూస్తే సహించేవారు కాదు. ఈ లక్షణమే ఆయనను బ్రిటిష్ అధికారులకు విరోధిగా మార్చింది. నిధులు దురి్వనియోగం చేశారని, అవినీతికి పాల్పడ్డారని రఖల్దాస్పై నిందలు మోపారు. అరుదైన శిల్పాలు, పెయింటింగ్‌లు దొంగిలించారని ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో చోరీకి గురైన ఒక బుద్ధిస్టు దేవత విగ్రహం కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చారు. అవమానాలు భరించలేక ఆయన 1927లో ఏఎస్ఐలో ఉద్యోగానికి రాజీనామా చేశారు. కానీ, ఆయనపై వచ్చిన అభియోగాలను తర్వాత కోర్టులు కొట్టివేశాయి. ఉపాధి కోసం రఖల్దాస్ 1928లో బనారస్ హిందూ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. 1930లో మరణించారు. అప్పుడు ఆయన వయసు కేవలం 45 ఏళ్లు. గొప్ప చరిత్రను వెలికితీసిన రఖల్దాస్కు చివరకు చరిత్రలో స్థానం లేకుండాపోవడం ఒక వైచిత్రి. ఇప్పటి తరానికి ఆయనెవరో తెలియదు. సింధూలోయలో ప్రాచీన నగరా>న్ని సందర్శించేవారికి కూడా ఆయన గొప్పతనం ఏమిటో తెలిసే అవకాశం లేదు. ఇప్పటికైనా భారత ప్రభుత్వం స్పందించాలని, రఖల్దాస్ బెనర్జీకి తగిన గుర్తింపు ఇవ్వాలని చరిత్రకారులు కోరుతున్నారు. 5,300 ఏళ్ల నాటి నగరం మొహెంజోదారో అంటే సింధీ భాషలో మృతిచెందిన మనిషి దిబ్బ అని అర్థం. ఇదే చోట రఖల్దాస్ బెనర్జీ తవ్వకాలు ప్రారంభించారు. తొలుత బౌద్ధ స్తూపాలు, నాణేలు, ముద్రలు, కుండలు, ఇతర కళాకృతులు లభించాయి. మరిన్ని ఆధారాల కోసం 1922, 1923లో తవ్వకాలు ఊపందుకున్నాయి. ప్రాచీన సింధూలోయ నాగరికత బయటపడింది. కాల్చిన ఇటుకలతో నిర్మించిన అప్పటి భవనాలు, నీటి తొట్టెలు, స్నానపు గదులు, రహదారులు వెలుగులోకి వచ్చాయి. ఇది 5,300 ఏళ్ల క్రితం నాటిదని తేల్చారు. సింధూనది లోయ 3.86 లక్షల చదరపు మైళ్ల మేర విస్తరించి ఉండేది. ఈశాన్య అఫ్గానిస్తాన్ నుంచి వాయువ్య భారత్ దాకా గొప్ప రాజ్యం వర్థిల్లింది. తర్వాత ప్రతికూల వాతావరణ పరిస్థితులు, వరదల కారణంగా చాలావరకు తుడిచిపెట్టుకుపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
డొనాల్డ్ ట్రంప్‌పై ప్రజాగ్రహం
వాషింగ్టన్: అమెరికాను మరోసారి గొప్ప దేశంగా మారుస్తానంటూ రెండోసారి అధికారంలోకి వచ్చిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసనలు ఊపందుకుంటున్నాయి. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాలు అమెరికన్లకు ఎంతమాత్రం నచ్చడం లేదు. ట్రంప్ తీరును మెజార్టీ జనం తప్పుపడుతున్నారు. అమెరికాను నాశనం చేయొద్దని కోరుతున్నారు. అమెరికాలో రాచరికం లేదు, ట్రంప్ రాజు కాదు అంటూ జనం గొంతెత్తి నినదిస్తుండడం గమనార్హం. ట్రంప్‌కు వ్యతిరేకంగా శనివారం దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. జనం వీధుల్లోకి వచ్చి అధ్యక్షుడికి వ్యతిరేకంగా గొంతు విప్పారు. ప్లకార్డులు ప్రదర్శించారు. వైట్‌హౌస్ ఎదుట, టెస్లా కార్యాలయాల వద్ద, నగరాల్లోని ప్రధాన సెంటర్లలో జనం పెద్ద ఎత్తున గుమికూడారు. ట్రంప్ వ్యవహార శైలిపై ఆగ్రహం వెళ్లగక్కారు. చాలాచోట్ల ర్యాలీలు జరిగా యి. ఈ నిరసన ఉద్యమం ‘50501’గా పేరు పొందింది. ‘50 నిరసనలు, 50 రాష్ట్రాలు, ఒక ఉద్యమం’ అనేదే దీని అర్థం. సరిగ్గా 250 ఏళ్ల క్రితం అమె రికాలో ఇదే రోజు విప్లవ యుద్ధం ఆరంభమైంది. బ్రెగో గార్సియాను వెనక్కి రప్పించాలి ప్రభుత్వ ఉద్యోగాల్లో కోతలు విధించడానికి, ప్రభుత్వ ఖర్చులు తగ్గించడానికి డిపార్ట్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(డోజ్) పేరిట ట్రంప్ ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థ పట్ల అమెరికన్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. శనివారం నాటి ప్రజాందోళనల్లో ఇది స్పష్టంగా కనిపించింది. ఎల్‌సాల్వెడార్ దేశానికి చెందిన బ్రెగో గార్సియా అనే వ్యక్తిని ప్రభుత్వం ఇటీవల బలవంతంగా స్వదేశానికి పంపించింది. ఈ ఉదంతాన్ని అమెరికన్లు తప్పుపట్టారు. గార్సియాను తిరిగి అమెరికాకు రప్పించాలని డిమాండ్ చేశారు. ట్రంప్‌ను ఎల్‌సాల్వెడార్‌కు తరిమేయాలంటూ కొందరు తేల్చిచెప్పారు. ప్రజల నిరసనలు చాలావరకు శాంతియుతంగానే జరిగాయి. ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరిగినట్లు తెలియరాలేదు. ‘నో కింగ్స్’ అని రాసి ఉన్న ప్లకార్డులు జనం ప్రదర్శించారు. ట్రంప్ రాచరిక పోకడలు ప్రదర్శిస్తున్నారంటూ పరోక్షంగా మండిపడ్డారు. ట్రంప్ పనితీరుకు 45 శాతం సానుకూలత మొదటి త్రైమాసికంలో ట్రంప్ పనితీరు పట్ల ఇటీవల నిర్వహించిన గ్యాలప్ సర్వేలో 45 శాతం మంది సానుకూలత వ్యక్తం చేశారు. తొలిసారిగా ఆయన అధ్యక్షుడైనప్పుడు తొలి త్రైమాసికంలో ఆయన పనితీరుకు 41 శాతం మంది అనుకూలంగా ఓటేశారు. అంటే ఈసారి ప్రజాదరణ కొంత పెరిగినట్లు స్పష్టమవుతోంది. కానీ, 1952 నుంచి 2020 దాకా అధ్యక్షులుగా పనిచేసిన నేతల తొలి త్రైమాసికం పనితీరుకు సగటున 60 శాతం జనామోదం లభించింది. అంటే వారితో పోలిస్తే ట్రంప్ వెనుకబడే ఉన్నారు. ఆయన జనవరిలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పుడు అప్రూవల్ రేటింగ్ 47 శాతంగా ఉన్నట్లు ఒక సర్వేలో తేలింది. అది ఇప్పుడు 43 శాతానికి పడిపోయింది. -
హైడ్రోజన్ బాంబ్‌ను పరీక్షించిన చైనా
బీజింగ్: రెండో ప్రపంచయుద్ధంలో రెండు అణుబాంబులను ప్రయోగించి యుద్ధంలో గెలవడంతోపాటు ఆనాటి నుంచి అగ్రరాజ్యం హోదాను కైవసం చేసుకున్న అమెరికా గురించి తెల్సిందే. అయితే ఇప్పుడు అలా అణుబాంబులను ప్రయోగిస్తే రేడియోధార్మికత ముప్పుతోపాటు అంతర్జాతీయ ఆంక్షలను ఎదుర్కొనే ఆస్కారముంది. ఒక దెబ్బకు రెండు పిట్టలు తరహాలో రేడియోధార్మికత వెలువర్చని, అత్యంత వినాశనం సృష్టించే అధునాతన బాంబును చైనా విజయవంతంగా పరీక్షించింది. నాన్–న్యూక్లియర్ హైడ్రోజన్ బాంబ్‌ను చైనా పరీక్షించిందని ‘సౌత్‌చైనా మార్నింగ్ పోస్ట్’ ఒక సంచలన కథనాన్ని ప్రచురించింది. సుంకాల సమరంలో అమెరికాతో వాణిజ్యయుద్ధానికి దిగిన వేళ చైనా తన సైనికసత్తాను చాటడం గమనార్హం. ఈ వివరాలు ‘ప్రోజెక్టైల్స్, రాకెట్స్, మిస్సైల్స్, గైడెన్స్’ జర్నల్‌లోనూ ప్రచురితమయ్యాయి. శుద్ధ ఇంధన సాంకేతికతతో.. చైనా ప్రభుత్వ షిప్‌బిల్డింగ్ కార్పొరేషన్‌లోని ‘705 రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ ఈ రెండు కేజీల బరువైన హైడ్రోజన్ బాంబును తయారుచేసింది. అణుబాంబు మాదిరికాకుండా తక్కువ స్థలంలో ఎక్కువగా ఘన హైడ్రోజన్‌ను తనలో ఇముడ్చుకునే మెగ్నీషియం హైడ్రైడ్‌ను ఈ బాంబులో వాడారు. రేడియోధార్మికతను వెదజల్లకుండా వినాశనం సృష్టించే లక్ష్యంతో శుద్ధ సాంకేతికతతో ఈ హైడ్రోజన్ బాంబును సృష్టించారు. ఈ బాంబు పేలితే మెగ్నిషియం హైడ్రైడ్ పొడి చుట్టూతా పరిసరాల్లో పరుచుకుంటుంది. దాన్నుంచి హైడ్రోజన్ వాయువు ఉద్భవించి రెప్పపాటులో పేలుళ్లు సంభవిస్తాయి. ఇవి భయంకర ట్రైనైట్రోటోలిన్(టీఎన్టీ) బాంబు పేలినదానికంటే 15 రెట్లు అధిక వినాశనం కల్గిస్తాయి. ఈ పరిసరాల ఉష్ణోగ్రత కేవలం రెండు సెకన్లలోనే 1,000 డిగ్రీ సెల్సియస్‌కు చేరుకుంటుంది. అంటే బాంబును ప్రయోగించిన చోట శత్రు దేశ ఆయుధాగారాలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, వంతెనలు ఉంటే సెకన్లలోనే ధ్వంసమవడం, కాలి బూడిద కుప్పలుగా మారడం ఖాయం. బాంబు పేలినప్పుడు కేవలం రెండు మీటర్ల దూరంలో ఏకంగా 428.43 కిలోపాస్కల్ల పీడనం ఏర్పడిందని దీంతో ఊహించనంత వినాశనం జరుగుతుందని సౌత్‌చైనా మార్నింగ్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. నిశ్శబ్దంగా తయారీ ఈ ఏడాది తొలినాళ్ల నుంచే మెగీ్నషియం హైడ్రైడ్ తయారీని చైనా మొదలెట్టింది. షాన్జీ ప్రావిన్సులో 150 టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో కర్మాగారాన్ని ప్రారంభించింది. వాస్తవానికి రోజుకు కేవలం కొన్ని గ్రాముల మెగ్నిషియం హైడ్రైడ్‌ను మాత్రమే తయారుచేయగలం. అదికూడా అత్యంత జాగ్రత్తగా ల్యాబ్‌లలోనే తయారుచేయొచ్చు. కానీ చైనా భారీ స్థాయిలో ఉత్పత్తికి సిద్ధపడటం గమనార్హం. -
యెమెన్ పోర్టుపై మళ్లీ అమెరికా దాడులు
సనా: యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదార్ల మౌలిక వనరులే లక్ష్యంగా అమెరికా మరోసారి భీకర దాడులకు పాల్పడింది. హొడైడా నౌకాశ్రయం, విమానా శ్రయాలపై ఆదివారం 13 సార్లు అమెరికా వైమానిక దాడులు జరిపిందని హౌతీల అధీనంలో అల్ మసీరాహ్ టీవీ చానెల్ పేర్కొంది. హొడైడా ప్రావిన్స్‌లోనే ఉన్న రాస్ ఇసా పోర్టుపై అమెరికా రెండు రోజుల క్రితం చేపట్టిన దాడుల్లో 80 మంది మృతి చెందారు. 150 మందికి గాయాలయ్యాయి. అమెరికా బలగాలు శనివారం రాజధాని సనాలోని రెండు ప్రాంతాలపై జరిపిన దాడుల్లో ముగ్గురు చనిపోగా నలుగురు గాయపడినట్లు అల్ మసీరాహ్ తెలిపింది. అమెరికా ఎన్ని దాడులు చేసినా తాము వెనక్కి తగ్గేది లేదని హౌతీలు ప్రకటించారు. గాజాలోని పాలస్తీనియన్లకు తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ వాణిజ్యానికి ఎంతో కీలకమైన ఎర్ర సముద్రంలో ప్రయాణించే పశ్చిమదేశాల నౌకలపై హౌతీలు ఇప్పటివరకు 100కు పైగా దాడులు జరిపారు. దీంతో, హౌతీల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తామని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజా దాడులకు శ్రీకారం చుట్టారు. ఈ దాడులపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ఆందోళన వ్యక్తం చేశారు. రాస్ ఇసా పోర్టుపై దాడి ఫలితంగా దెబ్బతిన్న ట్యాంక్‌ల నుంచి లీకైన చమురు ఎర్ర సముద్ర జలాలను కలుషితంగా మార్చే ప్రమాదముందన్నారు. ఈ దాడిలో ఐదుగురు ఐరాస సహాయక సిబ్బంది సైతం గాయపడ్డారన్నారు. యెమెన్ దిగుమతుల్లో 70 శాతం, మానవతాసాయంలో 80 శాతం రాస్ ఇసా, హొడైడా, అస్ సలీఫ్ పోర్టుల ద్వారానే జరుగుతుంటాయి. రాస్ ఇసాలో యెమెన్ ప్రధాన ఆయిల్ పైప్ లైన్‌కు టెర్మినస్‌తోపాటు, అత్యంత కీలక మౌలిక వనరులున్నాయని ఐరాస పేర్కొంది. -
నేడే సతీసమేతంగా జె.డి.వాన్స్ రాక
న్యూఢిల్లీ: అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ సతీసమేతంగా భారత పర్యటనకు రాబోతున్నారు. భార్య ఉషా చిలుకూరి, ముగ్గురు పిల్లలు ఇవాన్, వివేక్, మిరాబెల్‌తో కలిసి ఆయన సోమవారం ఇటలీ నుంచి ఢిల్లీకి చేరుకుంటారు. దేశంలో మొత్తం నాలుగు రోజులపాటు పర్యటిస్తారు. అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వాన్స్ దంపతులు ఇండియాకు వస్తుండడం ఇదే మొదటిసారి. ఉషా చిలుకూరి తెలుగు మూలాలున్న అమెరికా మహిళ అనే సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ ఉత్పత్తులపై 26 శాతం ప్రతీకార సుంకాలు విధించడం, తర్వాత 90 రోజులపాటు వాయిదా వంటి పరిణామాల నేపథ్యంలో జె.డి.వాన్స్ ఇండియా పర్యటన ఎనలేని ప్రాధాన్యం సంతరించుకుంది. భారత ప్రధాని మోదీతో ఆయన భేటీ కాబోతున్నారు. ద్వైపాక్షిక, వాణిజ్య అంశాలపై ఇరువురు నేతలు చర్చించబోతున్నారు. వ్యాపారం, వాణిజ్యం, టారిఫ్‌లు, ప్రాంతీయ భద్రత వాన్స్ దంపతులకు ప్రధాని మోదీ ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సోమవారం సాయంత్రం విందు ఇవ్వనున్నారు. అంతకంటే ముందు ఇరువురు నేతలు సమావేశమవుతారు. అమెరికా–భారత్ మధ్య వ్యూహాత్మక ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా చర్చలు జరుగుతాయని సమాచారం. ఇరు దేశాల నడుమ సంబంధాల పురోగతిని వారు సమీక్షిస్తారు. సంబంధాలను మరింత మెరుగుపర్చుకోవడానికి అందుబాటులో ఉన్న అవకాశాలపై సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారం, వాణిజ్యం, టారిఫ్‌లు, ప్రాంతీయ భద్రత వంటి కీలక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. అత్యంత కీలకమైన ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై మోదీ–వాన్స్ భేటీలో ముందడుగు పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చర్చల్లో భారత్ తరఫున ప్రధాని మోదీతోపాటు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ, అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా పాల్గొంటారని తెలిసింది. అమెరికా తరఫున వాన్స్‌తోపాటు ఐదుగురు సీనియర్ అధికారులు హాజరవుతారని సమాచారం. జైపూర్, ఆగ్రా సందర్శన ఢిల్లీకి చేరుకున్న తర్వాత వాన్స్, ఉషా దంపతులు ప్రఖ్యాత స్వామినారాయణ్ అక్షర్ధామ్ ఆలయాన్ని దర్శించుకోనున్నారు. భారతీయ సంప్రదాయ హస్తకళాకృతులు విక్రయించే మార్కెట్‌ను సందర్శిస్తారు. ఐటీసీ మౌర్య షెరటాన్ హోటల్లో బస చేయబోతున్నారు. సోమవారం రాత్రి వారు రాజస్తాన్ రాజధాని జైపూర్‌కు చేరుకుంటారు. రామ్‌భాగ్ ప్యాలెస్‌లో బస చేస్తారు. మంగళవారం అమేర్(అంబర్) కోటతోపాటు రాజస్తాన్‌లోని ప్రఖ్యాత కట్టడాలను సందర్శిస్తారు. సాయంత్రం జైపూర్‌లోని రాజస్తాన్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఓ కార్యక్రమంలో వాన్స్ ప్రసంగిస్తారు. ట్రంప్ పాలనలో భారత్–అమెరికా సంబంధాలపై ఆయన అభిప్రాయాలు వెల్లడిస్తారని సమాచారం. బుధవారం వాన్స్ దంపతులు ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చరిత్రాత్మక కట్టడం తాజ్‌మహల్‌ను సందర్శించబోతున్నారు. సాయంత్రం మళ్లీ జైపూర్‌కు తిరిగివెళ్తారు. వాన్స్ కుటుంబం జైపూర్ నుంచి గురువారం అమెరికాకు పయనమవుతుంది -
మీ రైస్‌లో ఆర్సెనిక్ ఉందా!?
వరి. విశ్వవ్యాప్తంగా వందల కోట్ల మంది ప్రజలకు నిత్యం కడుపునింపే అమృతం. ఇక తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఎన్ని చిరుతిళ్లు, ఇతర చల్లనిపానీయాలు తాగినా కాస్తంత వరి అన్నంతో భోజనం చేస్తేనే కడుపు నిండిన సంతృప్తికర భావన కల్గుతుంది. జీవకోటి ప్రాణాలు నిలుపుతున్న వరిలో ఇప్పుడు అత్యంత విషపూరిత ఆర్సెనిక్ మూలకం స్థాయిలు ఎక్కువ అవుతున్నట్లు తాజా అధ్యయనం ఒకటి చేదు నిజాన్ని బయటపెట్టింది. యథేచ్ఛగా జరుగుతున్న మానవ కార్యకలాపాలు, అడవుల దహనం, శిలాజ ఇంధనాల వాడకంతో వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. ఇప్పుడీ వాతావరణ మార్పుల విపరిణామాలు వరి పంటలపై పడుతున్నాయని స్పష్టమైంది. వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగి, కార్భన్‌డయాక్సైడ్, కర్భన ఉద్గారాల స్థాయిలు పెరగడంతో వాటి కారణంగా పొల్లాల్లో మట్టి, నీటి నుంచి ఆర్సెనిక్ మూలకం అత్యధికంగా వరిధాన్యంలోకి చేరుతోంది. విషాల రారాజుగా పేరొందిన ఆర్సెనిక్ పాళ్లు వరిలో పెరిగితే ఆరోగ్యంపై దాని దు్రష్పభావాలు దారుణంగా ఉంటాయి. ఆర్సెనిక్ స్థాయి పెరిగిన వరి అన్నాన్ని ఆహారంగా తీసుకుంటే చర్మ, ఊపిరితిత్తుల సంబంధ క్యాన్సర్లతో పాటు ఎన్నోరకాల తీవ్ర ఆరోగ్య సమస్యలు మనిషిని చుట్టుముట్టడం ఖాయం. రక్తసరఫరా, రోగ నిరోధక వ్యవస్థలు, కాలేయం, మూత్రపిండాలు, మూత్రాశయం, చర్మం, ప్రోస్టేట్ గ్రంథి వంటి శరీర భాగాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. హృద్రోగ సమస్యతోపాటు మధుమేహ వ్యాధి ప్రబలే ప్రమాదముంది. గర్భిణుల్లో పిండం సరిగా ఎదగపోవడం, అకాల మరణాలు సంభవించే ముప్పు ఉంది. వాతావరణ మార్పుల కారణంగా వాతావరణంలోని వెలువడుతున్న అధిక కర్భన ఉద్గారాలు, ఉష్ణోగ్రతల పెరుగుదలతో అమృతాహారం కాస్తా విషాహారంగా మారుతున్న వైనాన్ని శాస్త్రవేత్తలు వివరించారు. కొలంబియా విశ్వవిద్యాలయంలోని పరిశోధకుల బృందం చేసిన ఈ అధ్యయన ఫలితాలు ‘లాన్సెట్ ప్లానిటరీ హెల్త్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. అకర్బన ఆర్సెనిక్తో మరింత ప్రమాదం ఆర్సెనిక్ కర్భన, అకర్బన రూపాల్లో సహజంగానే నేల పొరల్లో ఉంటుంది. మానవునికి అకర్బన ఆర్సెనిక్తో పోలిస్తే అకర్బన ఆర్సెనిక్తో ముప్పు చాలా ఎక్కువ. వరిపంట మడుల్లో నీటితో నింపినప్పుడు మట్టిలోని ఆర్సెనిక్ వరినాట్ల ద్వారా వరిధాన్యంలోకి చేరుతుంది. అధ్యయనంలో భాగంగా పదేళ్లపాటు చైనాలో వేర్వేరు వాతావరణ పరిస్థితుల్లో సాగుచేస్తున్న 28 రకాల వరి వంగడాలపై శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, వాతావరణంలో కార్భన్‌డయాక్సైడ్ స్థాయిలు పెరిగినప్పుడు ఆర్సెనిక్ శోషణ స్థాయిలూ పెరుగుతున్నాయి. దీంతో వరి ధాన్యంలో ఆర్సెనిక్ స్థాయిలు ఎక్కువవుతున్నాయి. ఇలాగే కొనసాగితే ఒక్క చైనాలోనే వరి అన్నం తినడం వల్ల 1.93 కోట్ల క్యాన్సర్ కేసులు పెరుగుతాయని న్యూయార్క్‌లోని కొలంబియా వర్సిటీలోని వాతావరణ ఆరోగ్య శాస్త్ర సహాయ అధ్యాపకులు, ఈ పరిశోధనలో సహ రచయిత లెవీస్ జిస్కా చెప్పారు. ఉష్ణోగ్రత మరో 2 డిగ్రీల సెల్సియస్ పెరిగితే మరో పాతికేళ్లలో వాతావరణంలో కార్బన్డయాక్సైడ్ ప్రతి 10 లక్షలకు 200 పాళ్లు ఎక్కువవుతుందని ఆయన పేర్కొన్నారు. మతలబు అంతా వరిమళ్లలోనే వేల సంవత్సరాల క్రితం వరిసాగు లేదు. అక్కడక్కడా పెరిగిన వరికంకుల నుంచే వరిధాన్యాన్ని సేకరించి వండుకుని తిన్నారు. ఆ వరిమొక్కల మొదళ్ల వద్ద ఎలాంటి నీరు నిల్వ ఉండేదికాదు. ఇప్పుడు నాగరిక సమాజంలో మడులు కట్టి నీటిని నిల్వచేసి వరిసాగు చేస్తున్నారు. వరి మొక్కల మొదళ్ల వద్ద పూర్తిగా నీరు ఉంటుంది. దీంతో మట్టిలో సహజ ఆక్సిజన్ ఉండదు. దీంతో మొక్క వేర్ల వద్ద అన్ఎరోబిక్ బ్యాక్టీరియా శక్తి సంగ్రహణ కోసం ప్రత్యామ్నాయంగా ఆర్సెనిక్ అణువులను లాగేస్తుంది. అలా గతంలో పోలిస్తే ఆర్సెనిక్ వరిధాన్యంలోని వచ్చి చేరుతోంది. కాలుష్యం, తదితర మానవ ప్రేరేపిత వాతావరణ మార్పుల కారణంగా నేలలో కర్భన ఉద్గారాలు పెరిగి, ఉష్ణోగ్రత ఎక్కువై ఈ ఆర్సెనిక్ సంగ్రహణ రేటు పెరుగుతోంది. అరికట్టే మార్గాలున్నాయి వరిధాన్యంలోని ఆర్సెనిక్ వంట ద్వారా ఒంటిలోకి చేరకుండా అడ్డుకునే చిట్కాలున్నాయి. బ్రౌన్ రైస్‌తో పోలిస్తే తెల్ల బియ్యంలో పోషకాలు తక్కువ. అలాగే ఆర్సెన్ పాళ్లు కూడా తక్కువే. అందుకే బ్రౌన్‌రైస్ బదులు తెల్ల అన్నం తింటే కాస్త దీని ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. ఇతర రకాలతో పోలిస్తే బాస్మతి రకం బియ్యంలోనూ ఆర్సెనిక్ తక్కువగా ఉంటుంది. ఆగ్నేయాసియా, అమెరికా, యూరప్ దేశాల్లోని రకాలతో పోలిస్తే తూర్పు ఆఫ్రికాలో దొరికే వరిలో ఆర్సెనిక్ తక్కువగా ఉంటోంది. ‘‘ అప్పటికే మరుగుతున్న నీటిలో బియ్యాన్ని పోసి ఉడకబెట్టండి. ఒక ఐదు నిమిషాల తర్వాత ఆ నీటినంతా పారబోయండి. తర్వాత మళ్లీ కొత్తగా నీళ్లు జతచేసి అన్నం వండండి. గంజి వార్చకండి’’ అని బ్రిటన్‌లోని షెఫీల్డ్ యూనివర్సిటీ పరిశోధకులు చెప్పారు. ‘‘ వండటానికి ముందు బియ్యాన్ని బాగా కడగండి. తర్వాత ఒక పాలు బియ్యానికి, ఆరు పాళ్ల నీటిని జతచేసి వండండి’’ అని బ్రిటన్ ఆహార ప్రమాణాల ప్రాధికార సంస్థ సూచించింది.బ్రౌన్ రైస్ కంటే తెల్ల అన్నమే మంచిది ! ‘‘బ్రౌన్ రైస్‌లో అకర్బన ఆర్సెనిక్ ఎక్కువగా ఉంటుంది. తెల్ల అన్నంలో ఇది తక్కువగా ఉంటుంది. విషపూరిత ఆర్సెనిక్ కోణంలో చూస్తే ఆహారంగా బ్రౌన్ రైస్ కంటే పాలిష్ చేసిన తెల్ల అన్నమే మంచిది’’ అని శాస్త్రవేత్తలు చెప్పారు. తెల్ల అన్నంతో పోలిస్తే ముడి అన్నం, బ్రౌన్ రైస్ మంచివి అంటూ జనం కొత్తపోకడలో వెళుతున్న ఈ తరుణంలో శాస్త్రవేత్తలు తెల్ల అన్నమే ఉత్తమమని చెప్పడం గమనార్హం. ‘‘ వరిధాన్యంలో ఆర్సెనిక్ స్థాయిని తేల్చేందుకు ప్రపంచంలో విస్తృతస్థాయిలో జరిగిన తొలి అధ్యయనం ఇది’’ అని బెల్ఫాస్ట్లోని క్వీన్స్ యూనివర్సిటీ బయోలాజికల్ సైన్సెస్ విభాగ ప్రొఫెసర్ ఆండ్రూ మెహార్గ్ చెప్పారు. రంగు, రుచి, వాసన ఉండదు ఆర్సెనిక్ విషపూరితమైనదని ప్రాచీన మానవులకు కూడా తెలుసు. ఇది ఎలాంటి రంగు, రుచి, వాసన ఉండదు. ప్రాచీనకాలంలో రోమ్, యూరప్ దేశాల్లో శత్రువులను చంపేసేందుకు ఆర్సెనిక్‌ను ఇచ్చేవారని కథలు కథలుగా చెప్పేవారు. అయితే అత్యల్ప స్థాయిలో దీనిని తీసుకుంటే వెంటనే ఎలాంటి ప్రభావం చూపించదుగానీ స్లో పాయిజన్‌లా పనిచేసి దీర్ఘకాలంలో శరీరంపై తీవ్ర దు్రష్పభావాలను చూపిస్తుంది. అకర్బన ఆర్సెనిక్ అణువులు మానవశరీరంలోని జీవఅణువులతో అత్యంత సులభంగా బంధం ఏర్పర్చుకుంటాయి. కర్బన ఆర్సెనిక్ సహజంగా శిలలు, నేలల్లో ఉంటుంది. అకర్బన ఆర్సెనిక్ ఎక్కువగా గనుల తవ్వకం, బొగ్గును కాల్చడం ఇతర పారిశ్రామిక కార్యకలాపాల వల్ల వాతావరణంలోకి చేరుతుంది. ఇది నీటిలో కరుగుతుంది. పారిశ్రామిక వ్యర్థాలు నదీజలాల్లోకి పారి ఆ నీటితో పండించే పంటల ద్వారా మానవ శరీరాల్లోకి చేరుతోంది. దక్షిణ అమెరికా, దక్షిణ, మధ్యాసియా దేశాల్లోని భూగర్భ జలాల్లోనూ అకర్బన ఆర్సెనిక్ ఉంటోంది. అమెరికాలో దాదాపు 21 లక్షల మంది ప్రజలు ఇలా అకర్బన∙ఆర్సెనిక్ ఉన్న నీటినే తాగుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన పరిమితులను దాటిన ఆర్సెనిక్ ఉన్న జలాలనే ప్రపంచవ్యాప్తంగా 14 కోట్ల మంది జనం తాగుతున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
చైనాపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. భారత్‌కు గోల్డెన్ ఛాన్స్!
చైనా వస్తువులపై అమెరికా అధిక సుంకాలను విధించడంతో.. బొమ్మల ఎగుమతి క్షీణించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భారతీయ బొమ్మల ఎగుమతిదారులు చూస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ మంది అమెరికన్ కొనుగోలుదారులు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి ప్రత్యామ్నాయ సరఫరాదారుల కోసం వెతుకుతున్నారు.అమెరికాకు ఎక్కువగా బొమ్మలను ఎగుమతి చేసే దేశాల్లో చైనా అగ్రగామిగా ఉండేది. అయితే ఇప్పుడు అధిక సుంకాల కారణంగా చైనా ఎగుమతులు ప్రశ్నార్థకంగా మారాయి. ఈ అవకాశాన్ని భారతదేశం సద్వినియోగం చేసుకోవచ్చని టాయ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు 'అజయ్ అగర్వాల్' ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.ప్రస్తుతం, దాదాపు 20 సంస్థలు అమెరికన్ మార్కెట్‌కు పెద్ద ఎత్తున బొమ్మల ఎగుమతుల్లో నిమగ్నమై ఉన్నాయని అగర్వాల్ అన్నారు. గత నెలలో యుఎస్ బేస్డ్ బొమ్మల కొనుగోలుదారుల నుంచి మాకు మరిన్ని విచారణలు వస్తున్నాయి. యూఎస్ నియమాలు, నిబంధనల ప్రకారం బొమ్మ ఉత్పత్తులను తయారు చేయగల తయారీదారుల జాబితాను కోరుతూ కొన్ని భారతీయ ఎగుమతి సంస్థలు కూడా మమ్మల్ని సంప్రదించాయి ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.ఇదీ చదవండి: విడాకులు తీసుకుంటే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది!.. ఎలా అంటే?2024లో యూఎస్ బొమ్మల మార్కెట్ 42.8 బిలియన్ డాలర్లకు చేరుకుందని జీఎమ్ఐ రీసర్చ్ వెల్లడించింది. 2032 నాటికి ఈ వృద్ధి 56.9 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా. బొమ్మల రంగంలో భారతదేశం నుంచి ఇప్పటికే దాదాపు 20 కంపెనీలు పెద్దమొత్తంలో అమెరికాకు ఎగుమతి చేస్తున్నాయి.ఇతర దేశాల కంటే తక్కువ రేట్లు ఉండటం వల్ల మనకు సుంకాల ప్రయోజనం లభిస్తే.. అమెరికా మార్కెట్లో భారతీయ బొమ్మల ఉనికిని తప్పకుండా పెంచుకోవచ్చని.. టాయ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అన్నారు. అంతే కాకుండా త్వరలోనే తయారీదారులతో ఒక సెమినార్ నిర్వహించాలని అసోసియేషన్ యోచిస్తోందని ఆయన అన్నారు. -
పుతిన్‌పై వ్యూహాత్మక దాడి.. ప్లాన్ బీ అమలులో ట్రంప్, జెలెన్స్కీ!
కీవ్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఉక్రెయిన్ జెలెన్స్కీ సంచలన ఆరోపణలు చేశారు. పుతిన్ చెప్పుదొకటి.. చేసేదొకటి అని మండిపడ్డారు. ఈస్టర్ సందర్భంగా కాల్పులు విరమణ పాటిస్తున్నామంటూనే.. రష్యా సైన్యం కాల్పులు జరిపిందని చెప్పుకొచ్చారు. మరోవైపు.. కాల్పులు విరమణ విషయంలో రష్యాపై ఆగ్రహం వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. దీంతో, క్రెమ్లిన్ కీలక ప్రకటన చేసింది.ఈస్టర్ కాల్పులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తాజాగా స్పందిస్తూ..‘కాల్పులు విరమణ పాటిస్తామన్న రష్యా తమ మాట నిలబెట్టుకోలేదు. ఈస్టర్ సందర్భంగా కూడా దాడులు చేసింది. రష్యా సరిహద్దు ప్రాంతాలైన కుర్స్క్, బెల్గోరోడ్లలో రష్యా సైన్యం కాల్పులు జరిపింది. శనివారం సాయంత్రం నుండి 30 గంటల ఈస్టర్ కాల్పుల విరమణను ప్రకటించిన తర్వాత రష్యా దాడులు చేయడమేంటి?. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన కొన్ని గంటల్లోనే కీవ్, ఇతర ప్రాంతాలలో వైమానిక దాడి సైరన్లు వినిపించాయి. ఇది రష్యా చర్యలకు అద్దం పడుతుంది. నిశ్శబ్దానికి ప్రతిస్పందనగా నిశ్శబ్దం, దాడులకు ప్రతిస్పందనగా రక్షణాత్మక దాడులు ఉంటాయి’ అని హెచ్చరించారు.ఇదిలా ఉండగా.. 30 రోజుల పూర్తి కాల్పుల విరమణ కోసం అమెరికా మద్దతుతో కూడిన ప్రతిపాదనకు ఉక్రెయిన్ ముందుగా అంగీకరించింది, దానిని రష్యా తిరస్కరించిన విషయం తెలిసిందే. కాగా, యుద్ధం విషయంలో చర్చలు ఓ కొలిక్కి రాకపోవడం పట్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధ విరమణ చేయించాలన్న తన ప్రయత్నాలకు ఆ రెండు దేశాలు సహకరించడంలేదని తెలిపారు.A report by the Commander-in-Chief. We are documenting the actual situation on all directions. The Kursk and Belgorod regions — Easter statements by Putin did not extend to this territory. Hostilities continue, and Russian strikes persist. Russian artillery can still be heard…— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) April 19, 2025ఇదే సమయంలో.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో పురోగతి ఏమీ కనిపించకుంటే.. ఆ రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చే ప్రయత్నాల నుంచి తాము విరమించుకుంటామని అమెరికా ప్రకటన వెలువరించిన విషయం తెలిసిందే. దీనిపై రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ స్పందించింది. ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు చర్యలు తీసుకుంటామని.. ఈ దిశగా త్వరలో ముందుకు సాగే అవకాశం ఉందని పేర్కొంది. తమ స్వంత ప్రయోజనాలను కాపాడుకోవడానికి.. కీవ్, అమెరికాతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ పేర్కొన్నారు. ఈ చర్చలు చాలా క్లిష్టమని అంగీకరించినప్పటికీ.. వాటిని కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ అధినేత పుతిన్‌కు మధ్య ప్రస్తుతం ముందస్తు సమావేశాలు లేవని.. కానీ అవసరం అయితే వెంటనే సమావేశమవుతామని తెలిపారు. అలాగే, ఈ ఘర్షణ విషయంలో ఐరోపా దేశాలు ఉక్రెయిన్‌పై ఎలాంటి ఒత్తిడి తీసుకురావట్లేవని విమర్శించారు. -
ట్రంప్‌కు బిగ్ షాక్.. అమెరికా సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు
వాషింగ్టన్: అమెరికాలో 1798 నాటి ఎలియన్ ఎనిమీస్ చట్టం కింద నిర్బంధానికి గురైన వెనిజులా పౌరులకు భారీ ఊరట లభించింది. వారిని బలవంతంగా వెనక్కి పంపించకుండా అమెరికా సుప్రీంకోర్టు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తేల్చిచెప్పింది.కాగా, ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత ఉత్తర టెక్సాస్‌లో 261 మంది వెనిజులా పౌరులను ఎలియన్ ఎనిమీస్ చట్టం–1798 కింద నిఘా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో అరెస్టు చేశారు. ఈ 261 మందిని ట్రంప్ ప్రభుత్వం ఎల్‌సాల్వెడార్ దేశంలో భూలోక నరకంగా పరిగణించే ఓ జైలుకు తరలించింది. తర్వాత వారందరినీ వెనిజులాకు పంపించాలని నిర్ణయించింది. దీంతో బాధితులకు మద్దతుగా అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ కార్యకర్తలు న్యాయ పోరాటం ప్రారంభించారు. కోర్టులను ఆశ్రయించారు. 261 మందిని వారి స్వదేశానికి తరలించకుండా తాత్కాలికంగా నిలిపివేస్తూ కింది కోర్టు మార్చి 15న ఆదేశాలిచ్చింది.అయితే, వారిని వెనక్కి పంపించడానికి 1798 నాటి వార్‌టైమ్ చట్టాన్ని ట్రంప్ ఉపయోగించుకోవచ్చని స్పష్టంచేస్తూ సుప్రీంకోర్టు ఈ నెల 8న తీర్పు వెలువరించింది. కానీ, డిపోర్టేషన్‌ను సవాలు చేసే అవకాశం వారికి ఇవ్వాలని స్పష్టంచేసింది. దాంతో సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలయ్యింది. ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం డిపోర్టేషన్‌ను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొంది. వెనిజులా పౌరులకు ఇది అతిపెద్ద విజయమని అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ కార్యకర్తలు పేర్కొంటున్నారు.వెనిజులా వాసులు ప్రస్తుతానికి ఎల్ సాల్వెడార్ జైలులోనే ఉండనున్నారు. 216 మందిలో 137 మందిపై ఎలియన్ ఎనిమీస్ చట్టం–1798ను తొలగించినట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు. పెద్ద సంఖ్యలో విదేశీయులను అక్రమ వలసదార్లను గుర్తించి, అరెస్ట్ చేసి డొనాల్ట్ ట్రంప్ ప్రభుత్వం అమెరికా నుంచి బయటకు పంపిస్తున్న సంగతి తెలిసిందే. The US Supreme Court just blocked President Trump from Deporting illegals under the Alien Enemies Act.Thomas & Alito dissented.They did this while we weren't looking and they did this before the 5th or the 4th circuit could dismiss the appeals.Barack Obama deported 3… pic.twitter.com/aTJvfUhsSJ— Matthew Zimmerman 🇺🇸 (@MattZimmerman26) April 19, 2025 -
జూలైలో మెగా సునామీ?
సునామీ. మూడక్షరాలే అయినా, అది సృష్టించే విధ్వంసం ఎంతటిదో తెలియని వారంటూ ఎవరూ ఉండరు. 2004లో విరుచుకుపడ్డ సునామీ బీభత్సాన్ని ప్రపంచం ఎన్నిటికీ మర్చిపోలేదు. అనంతరం 2011లో భారీ సునామీ జపాన్ మొదలుకుని పలు దేశాలను అతలాకుతలం చేసేసింది. అలాంటి ఉత్పాతం మరోసారి వచ్చి పడితే? అది కూడా 2011, 2004ల్లో కంటే ప్రళయభీకర స్థాయిలో వస్తే? అదే జరగవచ్చట. అది కూడా ఎప్పుడో కాదు, వచ్చే జూలైలోనే! దాని తీవ్రత జపాన్ చరిత్రలోనే కనీ వినీ ఎరగని విధంగా ఉంటుందట. ఈ మేరకు జపాన్‌కు చెందిన ప్రఖ్యాత మాంగా ఆర్టిస్టు ర్యో తత్సుకీ చెప్పిన జోస్యం ఇప్పుడు చాలామందిని తీవ్రంగా కలవరపెడుతోంది. 2011 సునామీతో పాటు ఆమె గతంలో చెప్పినవెన్నో అక్షరాలా జరగడమే ఇందుకు కారణం. ఆ జాబితాలో 2020 నుంచి రెండేళ్లకు పైగా ప్రపంచానికి నిద్ర కూడా లేకుండా చేసిన కరోనా కూడా ఉంది! ఏమిటీ మాంగా? మాంగా అంటే జపాన్‌కే ప్రత్యేకమైన నవలలు, కార్టూన్లు. 70 ఏళ్ల తత్సుకీ ఈ కళలో ఆరితేరారు. పైగా ఇలస్ట్రేటర్‌గా కూడా ఆమెకు చాలా పేరుంది. అంతకుమించి భవిష్యద్రష్టగా కూడా తత్సుకీకి ఉన్న పేరు అంతా ఇంతా కాదు. 1980ల నుంచీ ఆమె భవిష్యత్తు చెబుతున్నారు. ప్రిన్సెస్ డయానా మరణాన్ని కూడా ముందే చెప్పారు. ఇవన్నీ ఒక ఎత్తయితే, ‘నేను చూసిన భవిష్యత్తు (ద ఫ్యూచర్ దట్ ఐ సా)’పేరిట 1999లో ఆమె రాసిన మాంగా రేపిన దుమారం అంతా ఇంతా కాదు.సమీప భవిష్యత్తులో వచి్చపడనున్న ఎన్నెన్నో ప్రాకృతిక విపత్తులను గురించి అందులో తత్సుకీ ముందే పేర్కొన్నారు. ముఖ్యంగా 2011 మార్చి 11న ఏకంగా 9.1 తీవ్రతతో జపాన్ను కుదిపేసిన భయానక భూకంపం, దాని ఫలితంగా వచి్చపడ్డ భీకర సునామీ ధాటికి ఏకంగా 20 వేల మందికి పైగా మరణించారు. ఈ ఉత్పాతం గురించైతే తత్సుకీ అత్యంత స్పష్టంగా పేర్కొన్నారు. ‘2011లో భారీ ఉత్పాతం వచ్చి పడనుంది’అంటూ ఓ అధ్యాయమే రాశారు. అంతేకాదు, ‘2020లో అంతుపట్టని కొత్త రకం వైరస్ వ్యాప్తి పరాకాష్టకు చేరుతుంది’అంటూ మరోచోట కరోనా గురించి కూడా స్పష్టంగా పేర్కొన్నారు. రాకాసి బుడగలువచ్చే జూలైలో మెగా సునామీ రాబోతోందన్న తత్సుకీ, అది జపాన్ చరిత్రలోనే కనీవినీ ఎరగనంత తీవ్రమైనదని కూడా రాశారు. దాని ధాటికి జపాన్, తైవాన్, ఇండొనేసియా, ఉత్తర మరియానా దీవులు అతలాకుతలమైపోతాయని హెచ్చరించారు. ఆ దేశాలను అనుసంధానించే వజ్రాకృతితో కూడిన జోన్ నిండా ‘రాక్షస బుడగలు (రాకాసి అలలు) పడగలెత్తుతాయి’, ‘దక్షిణ జపాన్ సముద్రం మరిగిపోతుంది’అంటూ రాబోయే సునామీ తీవ్రతను వర్ణి0చారు. అంతేకాదు, దాని తీవ్రత 2011 నాటి సునామీ కంటే కనీసం మూడు రెట్లకు పై చిలుకేనని స్పష్టంగా పేర్కొన్నారు. దీనిపై కొద్ది రోజులుగా ఇంటర్నెట్ హోరెత్తిపోతోంది. ఈ జోస్యం ఏ మేరకు నిజమవుతుందన్న దానిపై ఎవరి అంచనాల్లో వారున్నారు. గత 20 ఏళ్లలో తత్సుకీ చెప్పినవన్నీ జరిగినప్పుడు ఇది మాత్రం ఎందుకు జరగదని వాదించే వారు కొందరు. సునామీ వంటి ప్రాకృతిక విపత్తుల విషయంలో శాస్త్రీయ అంచనాలను నమ్ముకోవాలే తప్ప ఇలాంటి జోస్యాలను కాదని మరికొందరు కొట్టిపారేస్తున్నారు. చూడబోతే మాంగా పేరిట తత్సుకీ ఏకంగా ప్రపంచం పాలిట మరణశాసనమే రాసినట్టు కని్పస్తోందంటూ ఇంకొందరు వాపోతున్నారు. తన రాతలపై ఇంత దుమారం రేగుతున్నా 70 ఏళ్ల తత్సుకీ మాత్రం వాటిపై మౌనం వీడటం లేదు. గత శతాబ్దికి చెందిన బల్గేరియా మిస్టిక్, హీలర్ బాబా వంగా పేరిట ఆమెను ఇప్పుడంతా ‘జపనీస్ బాబా వంగా’అంటూ కీర్తిస్తున్నారు. అంధురాలైన బాబా వంగా కూడా ఇలాగే జరగబోయే విషయాలను ముందుగానే చెప్పి ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. కొసమెరుపు కరోనాకు సంబంధించి మనందరినీ మరింత వణికించేలా మరో జోస్యం కూడా చెప్పారు తత్సుకీ! అదేమిటో తెలుసా? మరో అయిదేళ్లలో అంటే 2030లో అది మరింత తీవ్రతతో వచ్చి పడుతుందట.– సాక్షి, నేషనల్ డెస్క్ -
సియాచిన్, గల్వాన్‌లకు సైతం మొబైల్ కనెక్టివిటీ
శ్రీనగర్: ప్రపంచంలోనే అత్యంత అననుకూల వాతావరణ పరిస్థితులున్న సియాచిన్, గల్వాన్‌లలో విధులు నిర్వర్తిస్తున్న భారత జవాన్లు ఇప్పుడిక తమ ఆత్మీయులతో మాట్లాడుకోవచ్చు. లద్దాఖ్ ప్రాంత మంతటా హై స్పీడ్ మొబైల్ కనెక్టివిటీని ఆర్మీ అందుబాటులోకి తేవడమే ఇందుకు కారణం. ఈ పరిణామం డిజిటల్ అంతరాన్ని తగ్గించడం, మారుమూల ప్రాంతాల వారికి సాధికారత కలి్పంచడం దిశగా పరివర్తనాత్మక ముందడుగుగా ఆర్మీ పేర్కొంది. సరిహద్దులకు అత్యంత సమీపంలోని పోస్టులున్న తూర్పు లద్దాఖ్, పశ్చిమ లద్దాఖ్‌లతోపాటు సియాచిన్ హిమానీనదం వరకు 4జీ, 5జీ మొబైల్ కనెక్టివిటీ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్దక్షేత్రం సియాచిన్‌లో 5జీ మొబైల్ టవర్‌ను విజయవంతంగా ఏర్పాటు చేశామని ప్రకటించింది. ‘అత్యంత కఠినమైన శీతల పరిస్థితుల్లో 18వేల అడుగుల ఎత్తులోని సరిహద్దు పోస్టుల్లో పనిచేస్తున్న సైనికులకు ఈ సౌకర్యంతో మనోధైర్యం పెరుగుతుంది. తమ కుటుంబాలు, ప్రియమైన వారితో కనెక్ట్ అవ్వడానికి వీలు కలుగుతుంది’అని అధికారులు తెలిపారు. ఇందుకోసం కేవలం లద్దాఖ్, కార్గిల్ జిల్లాల్లోనే నాలుగు ముఖ్యమైన టవర్లు ఏర్పాటు చేశామని, ఇందులో ఆరీ్మకి చెందిన ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ తోడ్పాటు ఎంతో ఉందన్నారు. బలగాలతోపాటు సరిహద్దు పోస్టులకు సమీప గ్రామాల వారు మొబైల్ సౌకర్యం అందుబాటులోకి రావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఇది వారికెంతో ఉపయోగపడుతుందన్నారు. -
త్వరలో 30 ఎంబసీలు, 17 కాన్సులేట్ల మూసివేత
వాషింగ్టన్: అమెరికాలో ఇప్పటికే వేలాది మంది ఫెడరల్ ఉద్యోగులు తొలగించిన ట్రంప్ సర్కార్ త్వరలో విదేశాల్లోని తమ రాయబార కార్యాలయాల సిబ్బందిపైనా తొలగింపు వేటు వేయనుందని తెలుస్తోంది. అమెరికా ప్రభుత్వంలోని అంతర్గత మంత్రిత్వశాఖకు సంబంధించిన డాక్యుమెంట్లలో ఆయా వివరాలు ఉన్నట్లు అమెరికా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రధానంగా యూరప్, ఆఫ్రికా ఖండాల్లో ఎక్కువ రాయబారకార్యాలయాలు, కాన్సులేట్లను శాశ్వతంగా మూసేయాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. మొత్తంగా 30 ఎంబసీలు, 17 కాన్సులేట్ కార్యాలయాలకు తాళాలు పడే అవకాశముంది. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ వ్యయ నియంత్రణ ప్రతిపాదనల్లో భాగంగా ప్రభు త్వం ఈ చర్యలకు ఉపక్రమిస్తోందని తెలుస్తోంది. సోమాలియా, ఇరాన్ దేశాల్లోనూ అమెరికా తన ప్రాధాన్యాన్ని తగ్గించుకోనుంది. -
ఉల్కాపాతపు వెలుగులు
అంతరిక్ష వీక్షకులకు మరో రెండు రోజుల్లో పండుగే. లైరైడ్ ఉల్కాపాతం వారికి కావాల్సినంతగా కనువిందు చేయనుంది. ఉత్తరార్ధ గోళంలోని వారు ఏప్రిల్ 22న తెల్లవారుజాము నుంచి కనీసం రెండు రోజుల పాటు ఈ ఖగోళ అద్భుతాన్ని తనివితీరా ఆస్వాదించవచ్చు. మబ్బుల వంటివేమీ లేకుండా వాతావరణం పొడిగా, వీలైనంత చీకటిగా ఉంటే చాలు. గంటకు కనీసం 10 నుంచి 20 దాకా ఉల్కలు భూ వాతావరణంలోకి ప్రవేశించి ప్రకాశవంతంగా మండిపోతూ కని్పస్తాయి. ఒక్కోసారి వాటి సంఖ్య గంటకు 100 దాకా కూడా ఉంటుంది. ఈ వార్షిక ఖగోళ వింత సాధారణంగా ఏప్రిల్ 20 తర్వాత ఏర్పడుతూ ఉంటుంది. ఏమిటి ఇవి: ఏటా భూమిని పలకరించే ఈ ఉల్కలను లైరైడ్స్గా పిలుస్తారు. వీటి మూలాలు లైరా నక్షత్రరాశిలో ఉండటమే అందుకు కారణం. అక్కడినుంచి పుట్టుకొచ్చిన థాచర్ అనే తోకచుక్క ఈ ఉల్కలకు మాతృస్థానం. థాచర్‌ను 1861లో తొలిసారిగా గుర్తించారు. ఇది సూర్యుని చుట్టూ 415 ఏళ్లకు ఓసారి చొప్పున తిరుగుతుంటుంది. ఆ క్రమంలో ఏటా ఏప్రిల్ చివర్లో భూమికి అతి సమీపంగా వస్తుంది. అప్పుడు దాని తోక తాలూకు శిథిలాలు భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుంటాయి. కొన్ని అనామకంగా అదృశ్యమైపోతాయి. మరికొన్ని మాత్రం ప్రకాశవంతంగా మండిపోతూ అందమైన వెలుతురు వలయాలను సృష్టిస్తాయి. అందుకే వీటిని తారా సమూహంగా కూడా పిలుస్తుంటారు. ఎప్పుడు చూడొచ్చు: ఏప్రిల్ 22 తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య సమయంలో లైరైడ్స్ను వీక్షించేందుకు అత్యంత అనువైనది. ఆ సమయంలో వాటి సంఖ్య, వెలుతురు రెండూ గరిష్టంగా ఉంటాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బుల్లెట్‌కు బలైన భారతీయ విద్యార్థిని
న్యూయార్క్/తరన్ తారన్(పంజాబ్): ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లి అక్కడ అనూహ్య ఘటనల్లో భారతీయులు ప్రాణాలు కోల్పోతున్న విషాద పర్వానికి ముగింపు కనిపించట్లేదు. తాజాగా కెనడాలో రెండు వాహనాల్లోని వ్యక్తుల మధ్య జరిగిన కాల్పుల ఘటనల్లో అభం శుభం తెలియని ఒక భారతీయ విద్యార్థిని బుల్లెట్ గాయాలకు బలైంది. పంజాబ్‌లోని తరన్ తారన్ జిల్లా ధుండా గ్రామానికి చెందిన 21 ఏళ్ల హర్సిమ్రత్ కౌర్ రంధావా కెనడాలో కాల్పుల ఘటనలో మృతిచెందారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి ఒంటారియో ప్రావిన్సులోని హామిల్టన్ నగరంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మృతి వార్త తెల్సి పంజాబ్‌లోని సొంతూరులో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె మృతదేహాన్ని వెంటనే భారత్‌కు తరలించాలని, నిందితులను కఠినంగా శిక్షించేలా కెనడా సర్కార్‌పై భారత ప్రభుత్వం ఒత్తిడితేవాలని సిమ్రత్ కుటుంబసభ్యులు డిమాండ్‌చేశారు. అసలేం జరిగింది? ఉన్నత విద్య కోసం సిమ్రత్ రెండేళ్ల క్రితం కెనడాకు వెళ్లారు. అక్కడ మొహాక్ కాలేజీలో చదువుకుంటున్నారు. రోజులాగే బుధవారం రాత్రి తాత్కాలిక ఉద్యోగం చేసే చోటుకు వెళ్లేందుకు హ్యామిల్టన్‌లోని అప్పర్ జేమ్స్, సౌత్ బెండ్ రోడ్ వీధిలోకి వచ్చారు. అక్కడే ఉన్న బస్టాప్‌లో నిల్చుని బస్సు కోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో అక్కడే ఉన్న రెండు వాహనాల్లోని వ్యక్తులు పరస్పరం గన్లతో కాల్పులు జరుపుకున్నారు. ఈ సందర్భంలో వేరే దిశలో దూసుకొచ్చిన ఒక బుల్లెట్ సిమ్రత్ ఛాతీలోకి దూసుకెళ్లింది. దీంతో విపరీతంగా రక్తమోడుతూ అక్కడే కుప్పకూలారు. విషయం తెల్సి అక్కడికొచ్చిన పోలీసులు ఈమెను వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. తుపాకీ బుల్లెట్లు సమీపంలోని ఇంట్లోకి సైతం దూసుకెళ్లాయి. వీడియోలు ఉంటే ఇవ్వండి ఘటనపై హ్యామిల్టన్ పోలీసులు వెంటనే దర్యాప్తు మొదలెట్టారు. నిందితుని కోసం వేట మొదలెట్టారు. కాల్పుల తర్వాత ఆ రెండు వాహనాలు వెంటనే ఘటనాస్థలి నుంచి వెళ్లిపోయాయని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. వాస్తవంగా ఏం జరిగిందని తెల్సుకునేందుకు సీసీటీవీ వంటి వీడియో ఫుటేజీలను సంపాదించేందుకు పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారు. బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో అదే రోడ్లో వెళ్తున్న వాహనాల్లోని డ్యాష్‌క్యామ్ కెమెరా రికార్డులను ఇవ్వాలని స్థానికులను పోలీసులు కోరారు. భారతీయ విద్యార్థి మృతి పట్ల విదేశాంగ శాఖ తీవ్ర విచారం వ్యక్తంచేసింది. ఈ మేరకు టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ ‘ఎక్స్’లో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘కాల్పుల్లో అమాయక భారతీయురాలు ప్రాణాలు కోల్పోవడం చాలా విచారకరం. సిమ్రత్ కుటుంబసభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నాం. మృతదేహం తరలింపుసహా అన్నిరకాల సహాయసహకారాలు ప్రభుత్వం నుంచి అందుతాయి’’అని పేర్కొంది. -
మూడో దశ చర్చలు 26న
రోమ్: అణు కార్యక్రమాలను ఇరాన్ మరింతగా వేగవంతం చేసిన నేపథ్యంలో ఆ దేశంతో అమెరికా మొదలెట్టిన రెండో దఫా చర్చలు శనివారం రోమ్‌లో ముగిశాయి. తొలి దఫా చర్చలు ఒమన్‌లో ముగియగా రెండో రౌండ్ చర్చలు ఇటలీ వేదికగా శనివారం జరిగాయి. ఇటలీ రాజధాని రోమ్ నగరానికి సమీపంలోని క్యామిలూసియా ప్రాంతంలోని ఒమన్ రాయబార కార్యాలయంలో ఈ పరోక్ష చర్చలు జరిగాయి. అమెరికా తరఫున అధ్యక్షుడు ట్రంప్ పశ్చిమాసియా రాయబారి స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగీ్చలు చర్చల్లో పాల్గొన్నారు. ఈ చర్చలకు ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ అల్ బుసైదీ మధ్యవర్తిగా వ్యవహరించారు. అయితే రెండోదఫా చర్చల్లో ఎలాంటి పురోగతి ఉందనే వివరాలను ఇరుదేశాలు వెల్లడించలేదు. అయితే ఏప్రిల్ 26వ తేదీన ఒమన్‌లో స్టీవ్ విట్కాఫ్తో మూడో దఫా చర్చలు జరగనున్నాయని ఇరాన్ మంత్రి అబ్బాస్ చెప్పారు. ‘‘ఇరాన్ గొప్పగా, సుసంపన్నంగా ఉంటే సరిపోతుంది. అణ్వాస్త్ర సామర్థ్యంతో పనిలేదు. ఆ సామర్థ్యాన్ని సాధించకుండా అడ్డుకోవడమే మా లక్ష్యం’’అని ట్రంప్ శుక్రవారం వ్యాఖ్యానించారు. ‘‘మేం ఎల్లప్పడూ బాధ్యతాయుతంగానే మెలిగాం. సమస్యలకు దౌత్యమార్గం ద్వారా పరిష్కరించుకునేందుకు కట్టుబడి ఉన్నాం. సంపత్రింపులు కొనసాగుతాయి’’అని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ శనివారం తన ‘ఎక్స్’ఖాతాలో ఒక పోస్ట్‌పెట్టారు. చర్చలు ముందు ఇరాన్ మంత్రి అరాగ్చీ ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీతో భేటీ అయ్యారు. తదుపరి చర్చల్లో రష్యా సైతం భాగస్వామి కానుందని వార్తలొచ్చాయి. -
మనిషి.. మరమనిషి సై
మనిషికి దీటుగా కృత్రిమ మేధ ఆన్లైన్లో అసాధారణ ప్రతిభ చూపిస్తుంటే ఆఫ్‌లైన్‌లో అంటే ప్రత్యక్షంగా హ్యూమనాయిడ్ రోబోలు మనిషికి సవాల్ విసురుతున్నాయి. అనుకున్నదే తడవుగా పరుగుపందెంలో పోటీకి దిగి తమ సామర్థ్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశాయి. కృత్రిమ మేధ సాంకేతికతలో అధునాతన ఆవిష్కరణలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే 21 హ్యూమనాయిడ్ రోబోలు 21 కిలోమీటర్ల పరుగుపందెంలో మనుషులతో పోటీగా పరిగెత్తి శెభాష్ అనిపించుకున్నాయి. మానవులతో సమానంగా పరుగుకు ప్రయత్నించడంతో ప్రపంచంలోనే తొలి హ్యూమనాయిడ్ రోబో హాఫ్ మారథాన్‌గా ఈ కార్యక్రమం చరిత్రకెక్కింది. చైనాలోని బీజింగ్ నగరంలో శనివారం ఈ రోబోలు చేసిన హడావుడి అంతాఇంతా కాదు. మనిషి సృష్టించిన మరమనిషి.. మనిషితోనే పోటీకి సై అనడం చూసేందుకు జనం తండోపతండాలుగా విచ్చేశారు. వాటితో కలిపి సెలీ్ఫలు, వీడియోలు తీసుకున్నారు. ట్రాక్‌పై పరుగెడుతున్న రోబోలను ఉత్సాహపరుస్తూ జనం విజిల్స్ వేస్తూ చప్పట్లు కొట్టారు. అమెరికా రోబోటిక్స్ కంపెనీలతో పోటీపడుతూ హ్యూమనాయిడ్ రోబోల రంగంలో ఆధిపత్యం కోసం చైనా ప్రయత్నిస్తున్న తరుణంలో దేశ రాజధాని బీజింగ్‌లో ఇజువాంగ్ హాఫ్ మారథాన్‌ను నిర్వహించడం గమనార్హం. ఫార్ములా 1 తరహాలో.. ఫార్ములా 1 కార్ల రేసులో మార్గమధ్యంలో కార్ల టైర్లు పాడైతే వెంటనే ట్రాక్ పక్కనే హఠాత్తుగా ఆపేస్తారు. అక్కడున్న సిబ్బంది సెకన్ల వ్యవధిలో టైర్లు మార్చేసి వెంటనే రేస్‌ను కొనసాగించడానికి సాయపడతారు. శనివారం రోబోట్ల హాఫ్ మారథాన్లోనూ ఇదే నియమం పాటించారు. వేగంగా పరుగెత్తే రోబోల బ్యాటరీలు పాడైనా, చార్జింగ్ అయిపోయినా నిట్టనిలువుగా అక్కడే ఆగిపోకుండా పక్కనే స్టాప్పాయింట్లను సిద్ధంచేశారు. అక్కడ వెంటనే బ్యాటరీలను మార్చుకుని రోబోలు పరుగు కొనసాగించాయి. ఒకదానితో మరోటి ఢీకొనకుండా ఉండేందుకు మొదట్లోనే వీటిని సమాంతరంగా 1–2 మీటర్ల దూరంలో నిలబెట్టి పోటీని ప్రారంభించారు. ఎన్నెన్నో సైజులు, ఆకారాలు బీజింగ్ ఎకనామిక్–టెక్నలాజికల్ డెవలప్మెంట్ ఏరియాలో జరిగిన ఈ రేసులో ఒకే డిజైన్‌తో కాకుండా భిన్న పరిమాణాల్లో వేర్వేరు ఆకారాల్లో ఉన్న హ్యూమనాయిడ్ రోబోలు పాల్గొన్నాయి. మారథాన్ పూర్తయ్యాక ఆయా రోబోట్ల తయారీ కంపెనీలు, విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించేందుకు నిర్వాహకులు పలు విభాగాల కింద అవార్డులు అందజేశారు. ‘అత్యంత పోటీతత్వం’, ‘గొప్ప డిజైన్’, ‘అత్యంత వినూత్న తరహా రోబో’ఇలా పలు అవార్డ్లు ప్రదానం చేశారు. 2 గంటల 40 నిమిషాల్లో ఫినిషింగ్ లైన్‌కు.. ఈ పోటీలో చైనాలోని పలు ప్రముఖ హ్యూమనాయిడ్ రోబో కంపెనీలు, విశ్వవిద్యాలయాలు పోటీపడ్డాయి. తమ అధునాతన రోబోలను రంగంలోకి దింపాయి. ప్రతి రోబోకి ఒక రిమోట్ ఆపరేటర్, ఒక సహాయకుడు వెంటే పరుగెత్తారు. బీజింగ్ కేంద్రంగా పనిచేస్తున్న రోబోట్ ఇన్నోవేషన్ సెంటర్ వారి ‘తియాన్‌గాంగ్ అల్ట్రా’రోబో వేగంగా దూసుకొచ్చి విజేతగా నిలిచింది. 21 కిలోమీటర్ల పరుగుపందాన్ని కేవలం 2 గంటల 40 నిమిషాల్లో పూర్తిచేసి ఔరా అనిపించింది. ‘‘మనిషిలాగా ఈ రోబోకు పొడవైన కాళ్లను అమర్చాం. మనిషిలా ఒక పద్ధతిగా పరుగెత్తేలా ప్రత్యేక అల్గారిథమ్‌ను ఇందులో సెట్‌చేశాం. అందుకే గెలుపు సాధ్యమైంది’’అని దీని తయారీసంస్థ రోబోటిక్స్ ఇన్నోవేషన్ సెంటర్ చీఫ్ టెక్నాలజీ అధికారి టాంగ్ జియాన్ చెప్పారు. హాఫ్ మారథాన్‌లో పురుషుల విభాగంలో 12,000 మంది పాల్గొనగా ఇథియోపియాకు చెందిన ఎలియాస్ దెస్తా అందరికంటే వేగంగా ఒక గంట రెండు నిమిషాల్లో మారథాన్‌ను పూర్తిచేసి విజేతగా నిలిచాడు. ఫిబ్రవరినెలలో హాఫ్ మారథాన్‌లో ప్రపంచ పరుగువీరుడు, ఉగాండా అథ్లెట్ జాకబ్ కిప్లిమో ఇదే 21 కి.మీ.ల హాఫ్ మారథాన్‌ను కేవలం 56 నిమిషాల్లో పూర్తిచేయడం తెల్సిందే. ఇక్కడ పరుగు ముఖ్యం కాదు..! ‘‘ఇక్కడ కేవలం సరళరేఖ మార్గంలో పరుగు పందెం ముఖ్యం కాదు. అంతకుమించినవి ఎన్నో ఉన్నాయి. రోబోలు వేగంగా పరుగెత్తేటప్పుడు కూడా స్థిరంగా ఉండగల్గడం, ట్రాక్‌పై మలుపుల వద్ద తూలిపడిపోకుండా చూసుకోవడం, ట్రాక్‌పై జారిపోయే స్వభావం ఉన్న చోట జాగ్రత్తగా పరుగెత్తడం, ఎత్తుపల్లాలున్న చోట్ల వేగాన్ని అందుకు తగ్గట్లు మార్చుకోవడం వంటివన్నీ కీలకం. ఎంత వేగంతో వెళ్తే ఎంత బ్యాటరీ అయిపోతుంది?. గజిబిజి పరుగులో రోబో భాగాలు వదులుకాకుండా చూసుకోవడం వంటివన్నీ ముఖ్యమే’’అని బీజింగ్ హ్యూమనాయిడ్ రోబోట్ ఇన్నోవేషన్ సెంటర్ సీఈఓ జియాంగ్ యూజువాన్ చెప్పారు. చైనాలో హ్యూమనాయిడ్ రోబోల మార్కెట్ మరో ఐదేళ్లలో ఏకంగా 119 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుంటుందని ఓ అంచనా. ‘‘రోబోల మారథాన్ ఇక్కడితో ముగిసినా హ్యూమన్ టెక్నలాజికల్ అభివృద్ధి శకం ఇక్కడితోనే మొదలుకానుందనే చెప్పాలి. నేటి స్ఫూర్తితో మరిన్ని సంస్థలు ఈ రంగంలో ముందుకొస్తాయి. భవిష్యత్ హ్యూమనాయిడ్ శకానికి ఇది నాంది’’అని ఇజువాంగ్ స్థానిక యంత్రాంగం కమిటీ డిప్యూటీ డైరెక్టర్ లియాంగ్ లెయాంగ్ వ్యాఖ్యానించారు. – బీజింగ్ -
భద్రతా కోణంలోనే.. రక్షణాత్మకం కాదు
న్యూఢిల్లీ: స్టీల్, అల్యూమినియం దిగుమతులపై తాము విధించిన సుంకాలు దేశ భద్రతా కోణంలోనే తప్పించి రక్షణాత్మక చర్యల కింద చూడరాదని అమెరికా కోరింది. అమెరికా జాతీయ భద్రతకు స్టీల్, అల్యూమినియం దిగుమతులు ముప్పుగా పరిణమించడంతో, దీన్ని సర్దుబాటు చేయడానికి సెక్షన్ 232 కింద అధ్యక్షుడు టారిఫ్‌లను ప్రకటించినట్టు వివరించింది. ఈ మేరకు ప్రపంచ వాణిజ్య సంస్థకు బదులిచ్చింది. డబ్ల్యూటీవో సేఫ్‌గార్డ్ అగ్రిమెంట్‌లోని ఆర్టికల్ 12.3 కింద అమెరికాతో సంప్రదింపులకు ఏప్రిల్ 11న భారత్ ప్రతిపాదన చేయడంతో ఈ సమాధానం వచ్చింది. ‘‘ఇవి ఎంత మాత్రం రక్షణాత్మక చర్యలు కావు. కనుక రక్షణాత్మక చర్యల కింద సంప్రదింపులకు ఎలాంటి ప్రాతిపదిక లేదు. అయినప్పటికీ ఈ అంశమే కాదు, ఏ అంశంపై అయినా భారత్‌తో చర్చలకు సుముఖంగా ఉన్నాం. కాకపోతే, చర్చలు ఏవైనా కానీ రక్షణాత్మక చర్యల ఒప్పందం కింద ఉండకూడదు’’అని అమెరికా స్పష్టం చేసింది. అయితే, అమెరికా వాదనను భారత్ అంగీకరించలేదు. భద్రతా కోణంలోనే అని అమెరికా చెప్పినప్పటికీ.. అవి రక్షణాత్మక చర్యలేనని వాదించింది. ఈ ఒప్పందం కింద చర్యలను డబ్ల్యూటీవో కమిటీకి తెలియజేయడంలో అమెరికా విఫలమైనట్టు పేర్కొంది. -
కాల్పులకు ‘ఈస్టర్’ సెలవు
మాస్కో: ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉక్రెయిన్‌తో జరిగే యుద్ధంలో తాత్కాలికంగా కాల్పుల విరమణను పాటించనున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. మాస్కో కాలమానం ప్రకారం శనివారం రాత్రి 6 గంటల నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు దాదాపు 30 గంటలపాటు ఇది అమల్లో ఉంటుందన్నారు. ఇదే విధమైన కాల్పుల విరమణకు ఉక్రెయిన్ ముందుకు రావాలని కోరారు. ఆ దేశం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఆర్మీ చీఫ్ వలెరీ గెరాసిమోవ్‌తో సమావేశం అనంతరం పుతిన్ ఈ మేరకు ప్రకటన చేశారు. అదే సమయంలో, రష్యా బలగాలు కాల్పుల విరమణ ఉల్లంఘనలకు, శత్రువు దుందుడుకు, రెచ్చగొట్టే చర్యలకు దీటుగా స్పందించేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాల్పుల విరమణపై ఉక్రెయిన్ ప్రతిస్పందనను బట్టి, ఈ సంక్షోభాన్ని ముగించే విషయంలో ఆ దేశానికి నిజంగా చిత్తశుద్ధి ఉన్నదీ లేనిదీ తెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇంధన వనరులే లక్ష్యంగా 30 రోజుల పాటు పరస్పరం దాడులకు పాల్పడరాదనే నిబంధనను ఇప్పటికే పలుమార్లు ఉక్రెయిన్ ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఒప్పందం కుదిరి, యుద్ధం ఆగని పరిస్థితుల్లో తాము మరోదారిని ఎంచుకుంటామంటూ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో శుక్రవారం హెచ్చరికలు చేయడం తెల్సిందే. ప్రాణాలతో పుతిన్ చెలగాటం: జెలెన్స్కీ పుతిన్ కాల్పుల విరమణ ప్రకటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందించారు. తమ బలగాలు కాల్పుల విరమణకు అంగీకరించవని ఆయన స్పష్టం చేశారు. పుతిన్ మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ మండిపడ్డారు. ‘మా గగనతలంలో రష్యా షహీద్ డ్రోన్ల సంచారం, మా సైరెన్ల మోతలు ఆగడం లేదు’అని రష్యాను నిందించారు. విరమణ సమయాన్ని మరిన్ని బలగాలను సమీకరించుకునేందుకు, తమపై దాడులను ముమ్మరం చేసేందుకే పుతిన్ వాడుకుంటారని ఆరోపించారు. -
ఇండియాకు ఎలాన్ మస్క్!.. ఎప్పుడో తెలుసా?
ప్రపంచకుబేరుడు 'ఎలాన్ మస్క్' ఈ ఏడాది చివర్లో భారతదేశాన్ని సందర్శిస్తానని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడటం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. శుక్రవారం మోదీతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన తర్వాత మస్క్ ఈ ప్రకటన చేశారు.సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణల్లో అమెరికాతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌తో ఈ ఏడాది ప్రారంభంలో వాషింగ్టన్ డీసీలో జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించినట్లు మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు.ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా పర్యటన సందర్భంగా మోదీ మస్క్‌ను కలిశారు. ఆ సమయంలో వీరిరువురు అంతరిక్ష అన్వేషణ, కృత్రిమ మేధస్సు.. స్థిరమైన అభివృద్ధిలో భారతీయ & అమెరికా సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం గురించి చర్చించారు. అయితే ఎలాన్ మస్క్ ఇప్పటికే.. పలుమార్లు ఇండియాలో పర్యటించనున్నట్లు ప్రకటించారు. కానీ అవన్నీ వాయిదా పడ్డాయి. బహుశా ఈసారి పర్యటించే అవకాశం ఉందని, భారత్‌తో తమ బంధాన్ని బలపరచుకుంటారని తెలుస్తోంది.ఇండియాకు టెస్లాటెస్లా కంపెనీ ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు సన్నద్ధమవుతోంది. భారత ప్రభుత్వం విధించిన నిబంధనలకు లోబడి సంస్థ ఇక్కడ కార్యకలాపాలు సాగించేందుకు సిద్ధమవుతున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. టెస్లా షోరూమ్‌ల కోసం ఇప్పటికే ముంబై, ఢిల్లీ నగరాలను ఎంపిక చేసినట్లు, ఉద్యోగుల నియామకాలను కూడా చేపడుతున్నట్లు వార్తలు వినిపించాయి.ఇదీ చదవండి: అల్లుడితో కలిసి ఏడెకరాలు కొన్న నటుడు.. భూమి విలువ ఎన్ని కోట్లంటే?ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలోనే టెస్లా ఎలక్ట్రిక్ కారు.. ముంబై - పూణే నేషనల్ హైవే మీద టెస్టింగ్ దశలో కనిపించింది. ఈ కారును మోడల్ వై కారు అని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికి గ్లోబల్ మార్కెట్లో అమ్ముడవుతున్న మోడల్ వై కార్ల కంటే కూడా.. టెస్టింగ్ సమయంలో కనిపించిన కారులో ఎక్కువ ఫీచర్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.It was an honor to speak with PM Modi. I am looking forward to visiting India later this year! https://t.co/TYUp6w5Gys— Elon Musk (@elonmusk) April 19, 2025 -
సుప్రీం కోర్టే చెప్పింది, ఇక ములాఖత్‌లో ఏకాంతంగా..
‘‘ఖైదీలతో జైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. వాళ్ల మానసిక ఆరోగ్యం ఏమాత్రం బాగుండడం లేదు. కుటుంబాలతో వాళ్ల బంధాలు బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే భాగస్వాములతో శారీరకంగా కలిసేందుకు అనుమతి ఇవ్వండి. పైగా అది వాళ్లకు ఉన్న హక్కు కూడా’’ అంటూ ఇటలీ సుప్రీం కోర్టు(Italy Constitution Court) తాజాగా ఇచ్చి తీర్పు ఇది. ఈ తీర్పునకు అనుగుణంగానే.. ఇటలీ జైళ్లలో శుక్రవారం నుంచి శృంగార గదులు(S*X Rooms) అందుబాటులోకి వచ్చాయి. ఉంబ్రియా రీజియన్‌లోని జైలులో ఓ ఖైదీని తన భార్యతో కలిసేందుకు అధికారులు అనుమతించారు. ఇందుకోసం అక్కడే లవ్ రూమ్(Love Rooms) పేరిట ఓ గదిని ఏర్పాటు చేయించారు. సాధారణంగా ములాఖత్‌ల టైంలో పక్కనే గార్డులు పర్యవేక్షిస్తుంటారు. కానీ, ఈ ఏకాంత ములాఖత్‌లో ఎవరూ పక్కన ఉండడానికి వీల్లేదు. న్యాయ శాఖ ఈ తరహా ఏర్పాట్లకు సంబంధించి మార్గదర్శకాలను కూడా రూపొందించడం గమనార్హం.ఉత్తర ఇటలీలోని అస్టి కారాగారంలో ఉన్న ఓ ఖైదీ తాను మానసికంగా ఎంతో కుంగిపోయి ఉన్నానని, తనను తన భార్యతో శారీరకంగా కలిసేందుకు అనుమతించాలని ట్యూరిన్ కోర్టులో పిటిషన్ వేశాడు. అయితే అది తిరస్కరణకు గురైంది. దీంతో అతను ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అక్కడ అతనికి అనుకూలంగా తీర్పు వచ్చింది. తాజా గణాంకాల ప్రకారం.. ఇటలీ వ్యాప్తంగా జైళ్లలో 62 వేలమంది ఖైదీలు ఉన్నారు. ఇది జైళ్ల సామర్థ్యం కంటే 21 శాతం ఎక్కువ. అంతేకాదు తరచూ ఖైదీలు బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇందుకు మానసిక ఒత్తిడే కారణంగా తెలుస్తోంది. అయితే.. ఖైదీలకు కూడా హక్కులు ఉంటాయని, వాటిని అడ్డుకోవాలని చూడొద్దని జైళ్ల శాఖను కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే శృంగారానికి అనుమతించాలని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ప్రిజనర్స్ రైట్స్ గ్రూప్ సంబురాలు చేసుకుంటోంది.అయితే ఈ తరహా ఏర్పాట్లు ఇటలీ(Italy)లోనే మొదటిసారి కాదు. ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్‌లాంటి యూరప్ దేశాల్లో ఈ తరహా ఏర్పాట్లు ఎప్పటి ుంచో ఉన్నాయి. -
తూటాకు బలైన భారతీయ విద్యార్థిని
కెనడాలో ఓ భారతీయ విద్యార్థి(Indian Student)ని అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయింది. బస్సు కోసం ఎదురు చూస్తున్న టైంలో ఎక్కడి నుంచో ఆమెపైకి ఓ తూటా దూసుకొచ్చి ఛాతిలో దిగింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన భారతీయ కాన్సులేట్ జనరల్.. ఎక్స్ ద్వారా వివరాలు తెలియజేసింది.హోమిల్టన్లోని మోహాక్ కాలేజీలో చదువుతున్న హర్సిమ్రత్ రంధవా(21).. బుధవారం సాయంత్రం 7.30గం. ప్రాంతంలో బస్టాప్‌లో వేచి ఉంది. ఆ సమయంలో అక్కడికి కాస్త దూరంలో రెండు కార్లు ఆగి ఉన్నాయి. ఉన్నట్లుండి వాటిల్లో ఉన్న వ్యక్తులు తుపాకులతో పరస్పరం కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఓ తుటా హర్సిమ్రత్ రంధవా(Harsimrat Randhawa) శరీరంలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే.. We are deeply saddened by the tragic death of Indian student Harsimrat Randhawa in Hamilton, Ontario. As per local police, she was an innocent victim, fatally struck by a stray bullet during a shooting incident involving two vehicles. A homicide investigation is currently…— IndiainToronto (@IndiainToronto) April 18, 2025ఛాతీలో బుల్లెట్ దిగడంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం జరిగిందని, ఆస్పత్రికి తరలించేలోపే ఆమె కన్నుమూసిందని వైద్యులు వెల్లడించారు. కాల్పుల సమయంలో పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి బుల్లెట్లు దూసుకెళ్లాయని, అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఏం జరగలేదని హామిల్టన్ పోలీసులు వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా వివరాలు సేకరించిన అధికారులు.. దర్యాప్తునకు సహకరించాలంటూ స్థానికులకు విజ్ఞప్తి చేస్తున్నారు. -
వంట కోసం బోటులో పొయ్యి వెలిగించిన మహిళ
మధ్య ఆఫ్రికా దేశం కాంగో(Democratic Republic of the Congo)లో ఘోరం జరిగింది. ప్రయాణికులతో నదిలో వెళ్తున్న ఓ భారీ బోటు అగ్నిప్రమాదానికి గురి కాగా.. 150 మందికి పైగా మృతి చెందారు. మరో వంద మందికి పైగా ఆచూకీ తెలియాల్సి ఉంది. ప్రమాద సమయంలో బోటులో 500 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కాంగో నార్త్‌వెస్ట్ రీజియన్‌లోని మటాన్‌కుము పోర్టు నుంచి బోలోంబా వైపు.. మంగళవారం వందల మందితో కూడిన భారీ చెక్కబోటు ‘హెచ్‌బీ కాంగోలో’ బయల్దేరింది. అయితే కాంగో నది మధ్యలోకి వెళ్లగానే హఠాత్తుగా బోటులో పేలుడు సంభవించి మంటలు అంటుకున్నాయి. ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రయాణికుల్లో చాలామంది నీళ్లలోకి దూకేశారు. ఈత కొందరు కొందరు నీట మునిగి చనిపోగా.. మరికొందరు అగ్నికి ఆహుతి అయ్యారు. చెల్లాచెదురైన మరో వంద మందికి పైగా జాడ తెలియాల్సి ఉంది. తీవ్రంగా గాయపడిన వాళ్లకు ప్రస్తుతం చికిత్స అందుతోంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులకు విస్మయం కలిగించే విషయం ఒకటి తెలిసిందే. ప్రయాణికుల్లో ఓ మహిళ వంట చేసేందుకు ప్రయత్నించగా.. మంటలు చెలరేగినట్లు నిర్ధారణ అయ్యింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. సదరు మహిళ గ్యాస్ స్టౌవ్ అంటించగానే.. పేలుడు సంభవించినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆమె అగ్నికి ఆహుతై అక్కడికక్కడే మరణించింది. ఇక.. కాంగోలో బోటు ప్రమాదాలు షరా మాములుగా మారిపోయాయి. At Least 148 Dead After Overcrowded Boat Capsizes In Congo@nitingokhale @SuryaGangadha13 @amitabhprevi @s_jkr #Congo #Africa https://t.co/em5A5kUqQZ— StratNewsGlobal (@StratNewsGlobal) April 19, 2025పాతవి, పాడైపోయిన పడవలను ప్రయాణాలకు వినియోగించడం, సామర్థ్యానికి మించిన ప్రయాణికులతో కూడిన పడవ ప్రయాణాలే అందుకు కారణాలు. దీనికి తోడు ప్రయాణికుల భద్రత గురించి ఏమాత్రం పట్టింపు లేకుండా బోటు నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. కిందటి ఏడాదిలో కాంగో వ్యాప్తంగా జరిగిన వేర్వేరు బోటు ప్రమాదాల్లో 400 మందికి పైనే మరణించారు. -
డౌట్ అక్కర్లేదు.. ఇవి సింహాలే..
ఎండాకాలం ఎఫెక్ట్ మరి.. దక్షిణాఫ్రికాలోని యుకుటులా రిజర్వ్ పార్క్‌లో జెడ్ నెల్సన్ అనే ఫొటోగ్రాఫర్ ఈ చిత్రాన్ని తీశారు. 2025 సోనీ వరల్డ్ ఫొటోగ్రఫీ పురస్కారాల్లో ఈ చిత్రం వైల్డ్ లైఫ్ అండ్ నేచర్ విభాగంలో మొదటి బహుమతిని గెలుచుకుంది. ఈ లయన్ రిజర్వులో శిక్షణ పొందిన గైడ్ల సాయంతో మనం సింహాలకు చాలా దగ్గరగా వెళ్లొచ్చు. వాటి జీవనశైలిని గమనించవచ్చు.రోమ్‌లో వాన్స్, మెలోనీ టారిఫ్ చర్చలురోమ్: టారిఫ్‌లపై అమెరికా–ఇటలీల మధ్య జరుగుతున్న చర్చల వేదిక రోమ్కు మారింది. శుక్రవారం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇటలీ ప్రధానమంత్రి జార్జియో మెలోనీతో సమావేశమయ్యారు, ప్రధాని కార్యాలయం ఛిగి ప్యాలెస్‌లో వీరు చర్చలు జరిపారు. అనంతరం, వైట్ హౌస్, మెలోనీ కార్యాలయం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. అతిత్వరలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటలీని సందర్శించనున్నారని ఆ ప్రకటన తెలిపింది.ఆ సమయంలోనే అమెరికా– యూరప్ మధ్య చర్చలు జరపాలనే విషయం పరిశీలనలో ఉందని కూడా పేర్కొంది. గురువారం వైట్ హౌస్‌లో చర్చల సందర్భంగా మెలోనీ పక్కనే కూర్చున్న ట్రంప్.. వాణిజ్యం ఒప్పందాలు కుదుర్చుకునేందుకు తాము తొందరపడటం లేదని తెలిపారు. యూరప్‌తోపాటు మధ్యధరా ప్రాంతంలో అమెరికాకు అత్యంత ముఖ్యమైన భాగస్వామిగా ఇటలీ ఉంటుందని భావిస్తున్నామని మెలోనీ పేర్కొన్నారు. వాన్స్‌తో జరుగుతున్న చర్చల్లో సుదీర్ఘకాలం మైత్రి మరింత బలోపేతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇమ్రాన్ సోదరీమణుల అరెస్టు రావల్పిండీ: జైల్లో ఉన్న పాక్ మాజీ ప్రధాని 72 ఏళ్ల ఇమ్రాన్‌ఖాన్‌ను కలిసేందుకు వెళ్లిన ఆయన సోదరీమణులను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన 2023 నుంచి రావల్పిండిలోని అడియాలా జైల్లో ఉన్నారు. ప్రతి మంగళ, గురువారాల్లో కుటుంబీకులు, లాయర్ల బృందం ఆయన్ను కలుస్తారు. గురువారం వెళ్లిన ఇమ్రాన్ సోదరీమణులు అలీమా, ఉజ్మా, నొరీన్తో పాటు పీటీఐ పార్టీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వెనక్కు వెళ్లాలని కోరారు. వారు నిరాకరించడంతో ఘర్షణ నెలకొంది. వారిని అరెస్టు చేసి జైలుకు దూరంగా విడిచిపెట్టినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.అడియాలా జైలు బయట పీటీఐ నేతలను అరెస్టు చేయడం ఈ వారంలో ఇది రెండోసారి. వీటిని పార్టీ ఖండించింది. బలమైన ప్రజా ప్రతిస్పందన తప్పదని హెచ్చరించింది. ఇంగ్లండ్‌లో ఉంటున్న తన పిల్లలతో మాట్లాడేందుకు, వైద్య పరీక్షలకు ఇమ్రాన్ పెట్టుకున్న పిటిషన్లను పాక్ కోర్టు ఇటీవలే అనుమతించింది. -
యూరప్ ‘మండుతోంది’
ఇప్పటికే నానా సమస్యలతో సతమతమవుతున్న యూరప్ ఖండం పరిస్థితి సమీప భవిష్యత్తులో పెనం నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారనుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు! అది పర్యావరణ మార్పుల ప్రభావానికి అత్యంత ఎక్కువగా లోనవుతుండటమే కారణం. దాంతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వేడెక్కుతున్న ఖండంగా యూరప్ నిలిచింది. అంతేగాక వరదల దెబ్బకు ఆ ఖండంలో ఏకంగా 30 శాతం నదుల నెట్వర్క్ బాగా దెబ్బతింది. అక్కడ వాతావరణం ఎప్పుడెలా మారుతుందో ఎవరూ చెప్పలేనంత అస్థిరంగా మారిపోయింది. ఫలితంగా యూరప్‌కు సమీప భవిష్యత్తులో నానారకాలైన ప్రాకృతిక విపత్తులు పొంచి ఉన్నట్టు సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ‘‘వాటిని నివారించాలంటే యూరప్ దేశాలన్నీ ఒక్కతాటిపైకి తక్షణం ఒక్కతాటిపైకి రావాలి. ఇప్పటినుంచే సమగ్ర పర్యావరణ పరిరక్షణ విధానాలు రూపొందించాలి. అంతకంటే ముఖ్యంగా వాటిని తూచా తప్పకుండా అమలు చేయాలి. లేదంటే పెను ముప్పు తప్పదు’’అని వారు కుండబద్దలు కొట్టారు. నిత్యం ఉత్పాతాలే: యూరప్‌లో పలు దేశాల్లో ఆకస్మిక వరదలు, కనీవినీ ఎరగని ఎండలు, వడగాడ్పులు కొన్నేళ్లుగా పరిపాటిగా మారిపోయాయి. గతేడాది యూరప్‌వ్యాప్తంగా చాలా దేశాలను వరదలు తీవ్రంగా వణికించడం తెలిసిందే. పశ్చిమ యూరప్‌ను గత పదేళ్లుగా 1950ల నుంచీ ఎన్నడూ చూడనన్ని వరదలు అతలాకుతలం చేశాయి. దక్షిణ యూరప్‌లో వరుసగా 13 రోజుల పాటు కనీవినీ ఎరగనంతటి వడగాడ్పులు వణించింయా. స్కాండినేవియాలో గ్లేసియర్లు కొన్నేళ్లుగా శరవేగంగా కరిగిపోతున్నాయి. తూర్పు యూరప్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. యూరప్‌లోని నదుల్లో 30 శాతానికి పైగా గరిష్ట వరద స్థాయిని దాటిపోయాయి. ఒక్క 2024లోనే 12 శాతం నదులు తీవ్ర వరద స్థాయిలను దాటి నగరాల్లోకి పొంగిపొర్లాయి. ఫలితంగా గత అక్టోబర్‌లో ఒక్క వాలెన్సియా నగరంలోనే 232 మంది వరదలకు బలయ్యారు. గత సెప్టెంబర్‌లో బోరిస్ తుఫాను మధ్య యూరప్ దేశాల్లో అతి భారీ వానలకు కారణమైంది. ఇవన్నీ యాదృచ్చికమేమీ కాదని సైంటిస్టులు చెబుతున్నారు. ఇదంతా రెండు దశాబ్దాలకు పైగా పర్యావరణంతో యథేచ్ఛగా చెలగాటమాడుతూ వచ్చిన ఫలితమని వారంటున్నారు. యూరోపియన్ యూనియన్‌కు చెందిన కోపరి్నకస్ క్లైమేట్ చేంజ్ సరీ్వస్, ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ)సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో సైంటిస్టులు ఈ మేరకు పేర్కొన్నారు. గతేడాది వరదలకు యూరప్‌లో చాలాదేశాల్లో తీవ్ర విధ్వంసానికి, వినాశనానికి దారితీశాయి. వాటి దెబ్బకు 4 లక్షల మందికి పైగా నిర్వాసితులయ్యారు. 335 మంది మరణించారు. యూరప్ చరిత్రలోనే కనీవినీ ఎరగని పరిణామమిది. వరదల నష్టం రూ.1.62 లక్షల కోట్ల పై చిలుకేనని అంచనా. ‘‘ఉష్ణోగ్రతలపరంగా యూరప్ ఇప్పటికే నిప్పుల కుంపటిపై కూచుని ఉన్నట్టు లెక్క. ఇకనుంచి పెరిగి ప్రతి డిగ్రీ ఉష్ణోగ్రతా ఆ ఖండం మొత్తాన్నీ వినాశనం వైపు నెడుతుంది’’అని డబ్ల్యూఎంఓ ప్రధాన కార్యదర్శి సెలెస్టీ సావ్లో హెచ్చరించారు. ఈ నేపథ్యంలో యూరప్ దిద్దుబాట పట్టింది. 2024లో ఖండంలో ఉత్పత్తయిన మొత్తం ఇంధనంలో సంప్రదాయేతర వనరుల వాటా 45 శాతానికి పెరిగింది. చాలా నగరాలు పర్యావరణ మార్పులకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
యెమెన్ నౌకాశ్రయంపై అమెరికా భీకరదాడులు
దుబాయ్: యెమెన్‌లోని హౌతీ రెబల్స్ ఆదీనంలో ఉన్న చమురు నౌకాశ్రయంపై అమెరికా భీకర వైమానిక దాడులు జరిపింది. ఘటనలో 74 మంది చనిపోగా, 171 మంది గాయపడినట్లు హౌతీలు ప్రకటించారు. కాగా, హౌతీల లక్ష్యాలపై ట్రంప్ ప్రభుత్వం మార్చి 15 నుంచి కొనసాగిస్తున్న దాడుల్లో శక్తివంతమైంది ఇదేనని చెబుతున్నారు. గురువారం రాత్రి జరిగిన దాడితో రస్ ఇసా ఆయిల్ పోర్టులో భీకర శబ్ధాలతోపాటు భారీగా మంటలు వ్యాపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దాడికి సంబంధించిన గ్రాఫిక్ ఫుటేజీని హౌతీలు విడుదల చేశారు. ఇరాన్ దన్నుతో చెలరేగుతున్న హౌతీల ప్రధాన ఆదాయ వనరును ధ్వంసం చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటనలో పేర్కొంది. గత పదేళ్లుగా ఈ ప్రాంతంలో భయోత్పాతం సృష్టించే హౌతీలకు అక్రమ ఆదాయం అందకుండా చేయడానికే ఈ దాడుల లక్ష్యమని తెలిపింది. శాంతియుతంగా జీవించాలని కోరుకునే యెమెన్ ప్రజలకు హాని తలపెట్టడం తమ ఉద్దేశం కాదని పేర్కొంది. అమెరికా దాడిని హౌతీలు తీవ్రంగా ఖండించారు. ఇది యెమెన్ సార్వభౌమత్వంపై చేసిన దాడిగా పేర్కొన్నారు. -
ఉగ్రవాది హ్యాపీ పాసియా అరెస్టు
న్యూయార్క్/చండీగఢ్: గ్యాంగ్‌స్టర్ నుంచి ఉగ్రవాదిగా మారిన హర్‌ప్రీత్ సింగ్ అలియాస్ హ్యాపీ పాసియా అలియాస్ జోరా అమెరికాలో అరెస్టయ్యాడు. పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ, ఖలిస్తానీ సంస్థ బీకేఐతో సంబంధాలున్న హ్యాపీ పాసియా పంజాబ్‌లో పలు ఉగ్రవాద దాడుల ఘటనల్లో నిందితుడిగా రికార్డుకెక్కాడు. వాంటెట్ జాబితాలో ఉన్న జోరా కోసం భారత దర్యాప్తు అధికారులు వెతుకుతున్నారు. అమెరికాలోని శాక్రమెంటో నగరంలో ఎఫ్‌బీఐ అతడిని అదుపులోకి తీసుకున్నట్లు అమెరికా అధికారులు శుక్రవారం వెల్లడించారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించినందుకు అక్కడి అధికారులు అరెస్టు చేసినట్లు తెలిపారు. పంజాబ్‌లో 16 ఉగ్రవాద దాడుల్లో జోరా ప్రమేయం ఉన్నట్లు భారత అధికారులు గుర్తించారు. ఈ ఏడాది జనవరిలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అతడిపై రూ.5 లక్షల నగదు రివార్డు ప్రకటించింది. పంజాబ్ రాష్ట్రం అమృత్సర్ జిల్లాలోని పాషియా గ్రామంలో జని్మంచిన జోరా తొలుత గ్యాంగ్‌స్టర్‌గా వ్యవహరించాడు. తర్వాత పాకిస్తాన్, ఖలిస్తాన్ సంస్థలతో సంబంధాలు ఏర్పరచుకొని ఉగ్రవాదిగా మారాడు. 2018 ఏప్రిల్‌లో దుబాయ్‌కి చేరుకున్నాడు. 2019లో ఫిబ్రవరిలో ఇండియాకు తిరిగివచ్చాడు. 2020 అక్టోబర్‌లో లండన్‌కు, అక్కడి నుంచి అమెరికాకు వెళ్లిపోయాడు. -
భారత్‌కు షింకన్సెన్ రైళ్లు
టోక్యో: భారత్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన హైస్పీడ్ రైలు ప్రాజెక్టు ఊపందుకుంటోంది. ట్రయల్ రన్, తనిఖీ తదితర అవసరాల నిమిత్తం రెండు ఐకానిక్ షింకన్సెన్ రైళ్లను భారత్‌కు జపాన్ కానుకగా ఇవ్వనుంది. నిర్మాణంలో ఉన్న ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్‌లో ట్రయల్ రన్ కోసం వాటిని వినియోగించనున్నారు. వీటిలో ఒకటి ఇ5 సిరీస్‌కు, మరోటి ఇ3 సిరీస్‌కు చెందినవి. ఈ రైళ్లను 2026 మొదట్లో భారత్‌కు డెలివరీ చేయనున్నట్లు టోక్యోకు చెందిన ది జపాన్ టైమ్స్ దినపత్రిక తెలిపింది. ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణం పూర్తయితే దేశంలో తొలి హైస్పీడ్ రైలు మార్గం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 320 కిలోమీటర్లు. బుల్లెట్ ట్రైన్‌గా పిలిచే ఈ రైలు వ్యవస్థను భారత రైల్వే అనుబంధ సంస్థ నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ (ఎన్హెచ్ఎస్ఆర్సీ) అభివృద్ధి చేస్తోంది. ముంబై–అహ్మదాబాద్ మార్గంలో పనులు పూర్తయ్యాక అధిక ఉష్ణోగ్రతలు, ధూళి ప్రభావాలతో సహా డ్రైవింగ్ పరిస్థితులపై డేటాను సేకరించడానికి షింకన్సెన్ రైళ్లను ఉపయోగిస్తారు. అంతకు అవసరమైన తనిఖీ పరికరాలను బిగించిన మీదట జపాన్ వాటిని భారత్‌కు అప్పగించనుంది. హైస్పీడ్ టెక్నాలజీ షింకన్సెన్ జపాన్ హైస్పీడ్ రైల్వే టెక్నాలజీ. ఈ10 అందులో నెక్ట్స్ జనరేషన్ మోడల్. 2030 నాటికి ముంబై–అహ్మదాబాద్ కారిడార్‌లో ఈ అత్యాధునిక ఈ10 మోడల్ షింకన్సెస్ రైళ్లను ప్రవేశపెట్టాలని భారత్ యోచిస్తోంది. ‘మేకిన్ ఇండియా’కింద ఈ రైళ్లను భారత్‌లోనే తయారు చేసేందుకు 2016లో నాటి జపాన్ ప్రధాని షింజో అబేతో ప్రధాని నరేంద్ర మోదీ ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ప్రకారం సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాన్ని జపాన్ త్వరలో భారత్‌కు బదిలీ చేస్తుంది. ప్రస్తుత రైల్వే నెట్‌వర్క్‌లో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఆర్ఆర్టిఎస్, వందేభారత్ వంటి దేశీయంగా తయారైన సెమీ హైస్పీడ్ రైళ్లను భారత్ ఉపయోగిస్తోంది. ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ కారిడార్‌లో ఈ5 సిరీస్ షింకన్సెన్ రైళ్లను నడపాలని తొలుత భావించింది. కానీ అధిక ఖర్చులు, జాప్యం కారణంగా ఆ ప్రతిపాదనలో ప్రతిష్టంభన ఏర్పడింది. దాన్ని తొలగించడమే గాక భారత్‌కు ఏకంగా అత్యాధునిక ఇ10 సిరీస్ రైళ్లను అందించేందుకు జపాన్ ముందుకొచ్చింది. అదే సమయంలో ఇ5, ఇ3 సిరీస్‌లకు చెందిన ఒక్కో రైలును ట్రయల్స్ తదితర అవసరాల నిమిత్తం పూర్తి ఉచితంగా అందించనున్నట్టు పేర్కొంది. మోదీ త్వరలో జరపనున్న జపాన్ పర్యటనలో ఇందుకు సంబంధించి ఒప్పందం కుదురుతుందని సమాచారం. -
అమెరికా పౌరుడినని చెప్పినా వదలని ఐసీఈ
మయామి: దేశంలో అక్రమంగా ఉంటున్నాడంటూ అమెరికా పౌరుడొకరిని యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సంబంధిత పత్రాలన్నిటినీ అతడి తల్లి చూపినా వదల్లేదు. చివరికి కోర్టు జోక్యంతో అతడికి విముక్తి లభించింది. బుధవారం కారులో వెళ్తున్న జువాన్ కార్లోస్ లోపెజ్ గోమెజ్ (20) అనే వ్యక్తిని ఫ్లోరిడా హైవే పెట్రోల్ అధికారులు జార్జియా రాష్ట్ర సరిహద్దుల్లో అడ్డుకున్నారు. దేశంలో అక్రమంగా ఉండే వారికి జార్జియాలోకి ప్రవేశం నిషిద్ధం. ఆ నిబంధనను సాకుగా చూపు తూ గోమెజ్తోపాటు ఆ కారులో ఉన్న వారందరినీ అధికారులు అరెస్ట్ చేశారు. అతడి తల్లి వచ్చి పౌరసత్వ కార్డు సహా ఆధారాలన్నీ చూపినా ససేమిరా అంటూ లియోన్ కౌంటీ జైలుకు వారిని తరలించారు. కేసు విచారణ సమయంలో గోమెజ్ తల్లి స్టేట్ ఐడెంటిటీ కార్డు, బర్త్ సర్టిఫికెట్, సోషల్ సె క్యూరిటీ కార్డు చూపారు. దీంతో, ఇమిగ్రేషన్ అధి కారుల చర్యకు ఎటువంటి ఆధారాలు లేవంటూ గోమెజ్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. ఈ పరిమాణంపై ఇమిగ్రేషన్ విభాగం స్పందించలేదు. దేశ పౌరులను అదుపులోకి తీసుకునే అధికారం యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు లేకపోవడం గమనార్హం. -
ఎలాన్ మస్క్ కు ప్రధాని మోదీ ఫోన్
న్యూఢిల్లీ: టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థల అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఫోన్లో మాట్లాడారు. ఇండియన్ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి త్వరలో టెస్లా అడుగుపెట్టబోతున్న నేపథ్యంతో వారిద్దరూ మాట్లాడుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మస్క్, మోదీ పలు కీలక అంశాలపై చర్చించుకున్నట్లు సమాచారం. టెక్నాలజీ, ఇన్నోవేషన్ వంటి రంగాల్లో భారత్, అమెరికా మధ్య పరస్పర సహకార మరింత బలోపేతం కావాలని వారు ఆకాంక్షించారు. సాంకేతికత, నవీన ఆవిష్కరణల విషయంలో ఉమ్మడి ప్రయోజనాలు కాపాడుకొనేలా పటిష్ట వ్యూహంతో ముందుకెళ్లాలని ఉద్ఘాటించారు. మస్క్ తో సంభాషణ అనంతరం మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. మస్క్ తో చక్కటి సంభాషణ జరిగిందన్నారు. వేర్వేరు అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నామని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో తాము కలిసినప్పుడు చర్చించుకున్న అంశాలు మరోసారి ప్రస్తావనకు వచ్చాయన్నారు. ప్రధానంగా టెక్నాలజీ, ఇన్నోవేషన్ పైనే తమ మాట్లాడుకున్నామని వివరించారు. ఈ రెండు అంశాల్లో అమెరికాతో భాగస్వామ్యాన్ని మరింత దృఢతరం చేసుకొనేందుకు కట్టుబడి ఉన్నామని మోదీ స్పష్టంచేశారు. మరోవైపు ఇండియన్ మార్కెట్లో ప్రవేశించానికి టెస్లా ఏర్పాట్లు చేసుకుంటోంది. తొలుత ముంబై, ఢిల్లీ, బెంగళూరులో టెస్లా కార్లు విక్రయించబోతున్నారు. వేలాది టెస్లా కార్లు ఇండియాను ముంచెత్తబోతున్నాయి. -
విశ్వమూ భ్రమిస్తోంది
భ్రమణం జీవలక్షణం. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది గనుకే రాత్రింబవళ్లు ఏర్పడతాయి. జీవకోటి యాత్ర సజావుగా సాగుతుంది. ఆ మాటకొస్తే చంద్రుని వంటి ఉపగ్రహాలు మొదలుకుని గ్రహాలన్నీ తమ చుట్టూ తాము నిత్యం తిరుగుతూనే ఉంటాయన్నది తెలిసిందే. చివరికి సూర్యుడు కూడా ఇందుకు అతీతుడు కాదు. ఆ మాటకొస్తే పాలపుంత కూడా తనచుట్టూ తాను తిరుగుతూ ంటుంది. మరి విశ్వం? విశ్వానికి భ్రమణమనేది లేదన్నది ఇప్పటిదాకా నమ్ముతూ వచ్చిన సిద్ధాంతం. అది నిత్యమూ అన్ని దిశలకూ సమానంగా విస్తరిస్తూ ఉంటుందన్నది సైంటిస్టుల భావన. కనుక విశ్వం తనచుట్టూ తాను తిరగదని సూత్రీకరించారు. కానీ అది నిజం కాదంటోంది తాజా పరిశోధన ఒకటి. విశ్వం కూడా తనచుట్టూ తాను తిరుగుతుందని పేర్కొంది. అయితే అది అత్యంత నెమ్మదిగా జరుగుతోందట. ఎంత మెల్లిగా అంటే, విశ్వం ఒక భ్రమణం పూర్తి చేయడానికి ఏకంగా 50 వేల కోట్ల ఏళ్లుపడుతుందని ఆ పరిశోధన తేల్చింది! దాని అధ్యయన వివరాలను రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ జర్నల్‌లో ప్రచురించారు.‘హబుల్’ముడి వీడినట్టే! తాజా పరిశోధనకు హవాయి యూనివర్సిటీలోని ఆస్ట్రానమీ ఇన్స్టిట్యూట్కు చెందిన ప్రొఫెసర్ ఇస్ట్వాన్ జపుదీ సారథ్యం వహించారు. అంతరిక్ష శా్రస్తానికి సంబంధించి ఇప్పటిదాకా అతి పెద్ద ప్రహేళికల్లో ఒకటిగా మిగిలిపోయిన ‘హబుల్ టెన్షన్’ను పరిష్కరించేందుకు కూడా ఇది దోహదపడుతుందని సైంటిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే విశ్వం తనచుట్టూ తాను తిరగడం లేదంటూ ఇప్పటిదాకా విశ్వసిస్తూ రావడం తెలిసిందే. విశ్వ విస్తరణ వేగానికి సంబంధించిన రెండు పరస్పర విరుద్ధ సమీకరణాలను వివరించడంలో ఈ సిద్ధాంతం విఫలమవుతోంది. వాటిలో ఒకటి సుదూరాల్లోని సూపర్నోవాలు, నక్షత్ర మండలాల దూరాల ఆధారంగా రూపొందించినది. మరొకటి దాదాపు 1,300 ఏళ్ల కింద విశ్వం ఆవిర్భవించిన నాటి కాస్మిక్ రేడియేషన్ నేపథ్యం ఆధారంగా సూత్రీకరించినది. రెండింట్లో ప్రతిపాదించిన విశ్వ విస్తరణ రేటులో తేడా ఉంది. దీన్ని అంతరిక్ష శాస్త్ర పరిభాషలో ‘హబుల్ టెన్షన్’గా పిలుస్తారు. జపుదీ బృందం అభివృద్ధి చేసిన గణిత సిద్ధాంతం ఈ సమస్యకు పరిష్కారం చూపడం విశేషం! అందులో భాగంగా విశ్వ విస్తరణ సిద్ధాంతానికి కొద్దిపాటి భ్రమణ సూత్రాన్ని జోడించారు. తద్వారా రెండు సమీకరణాలూ సరైనవేనని తేలినట్టు సైంటిస్టులు వివరించారు. ‘‘ప్రతిదీ విధిగా తనచుట్టూ తాను తిరుగుతుందన్న గ్రీకు తత్వవేత్త హెరాక్లిటస్ సూత్రాన్ని నమ్మి రంగంలోకి దిగాం. ఇంతవరకూ వచ్చాం. విశ్వం ఒక భ్రమణానికి 500 బిలియన్ ఏళ్లు తీసుకుంటుందన్న మా సూత్రీకరణ చాలా హేతుబద్ధంగా ఉంది. పైగా ప్రస్తుత భౌతికశాస్త్ర సూత్రాలు వేటినీ ఉల్లంఘించడం లేదు. కనుక రెట్టించిన ఉత్సాహంతో తర్వాతి దశకు పరిశోధనకు సిద్ధమవుతున్నాం. విశ్వభ్రమణ సిద్ధాంతాన్ని మరింతగా పరిశోధించేందుకు సమగ్ర కంప్యూటర్ సిమ్యులేషన్ ప్రయోగాలు చేపట్టనున్నాం’’అని జపుదీ వివరించారు. ఈ సిద్ధాంతం పూర్తిస్థాయిలో నిరూపణ అయితే విశ్వం తాలూకు మన అవగాహన మరింత విస్తరిస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
విద్యార్థుల వీసాలపై పిడుగు
విదేశీ విద్యార్థులపై అమెరికా కక్షగట్టినట్లుగా వ్యవహరిస్తోంది. గత నెల రోజుల వ్యవధిలోనే ఏకంగా 1,024 మంది విదేశీ విద్యార్థుల వీసాలనో, వారి లీగల్ రెసిడెన్సీ స్టేటస్నో రద్దు చేసింది. వారంతా అమెరికాలోని 160 కాలేజీలు, యూనివర్సిటీల్లో చదువుకుంటున్నవారే. వారంతా ఆందోళనకు లోనవుతున్నారు. ఇలా ఉన్నపళంగా వెళ్లగొట్టడం ఏమిటంటూ మండిపడుతున్నారు. ‘‘చట్టప్రకారం అన్ని అనుమతులూ ఇచ్చిన ప్రభుత్వమే ఆ చట్టాలను ఉల్లంఘిస్తోంది. ఈ చర్యలను ఎలా సమర్థించుకుంటుంది?’’ అని ప్రశి్నస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వ చర్యపై పలువురు కోర్టుకెక్కారు. కొందరు అరెస్టు భయంతో చదువులు మధ్యలోనే వదిలేసి స్వదేశాలకు వెళ్లిపోయారు. పునరాలోచించాలి లీగల్ స్టేటస్ రద్దుతో వందలాది మంది విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు అమెరికా వీడాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదంటే ప్రభుత్వమే నిర్బంధించి బలవంతంగా వెళ్లగొట్టే పరిస్థితి నెలకొంది. హార్వర్డ్, స్టాన్‌ఫర్డ్, యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్, ఒహాయో స్టేట్ వర్సిటీల్లోని పలువురు విద్యార్థుల లీగల్ స్టేటస్లు రద్దయ్యాయి. పలు కాలేజీల్లోని విద్యార్థులు వీసాలు కూడా రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీపై కోర్టుల్లో కేసులు దాఖలవుతున్నాయి. విదేశీ విద్యార్థులు ఇలా వెళ్లిపోతే అమెరికా వర్సిటీలు, కాలేజీల మనుగడ కష్టమవుతుందని అక్కడి నిపుణులు చెబుతున్నారు. దీనిపై పునరాలోచించాలని ట్రంప్ సర్కారుకు సూచిస్తున్నారు. కాలేజీలు, వర్సిటీల నుంచి కూడా ఈ మేరకు విజ్ఞాపనలు వెళ్తున్నాయి. రద్దయితే ఇంటికేనా? ఎఫ్–1 విద్యార్థి వీసాలను అమెరికా విదేశాంగ శాఖ పర్యవేక్షిస్తుంది. అమెరికాలోకి అడుగుపెట్టాక వారి లీగల్ రెసిడెన్సీ స్టేటస్‌ను పర్యవేక్షించే బాధ్యత డీఓహెచ్దే. విద్యార్థుల డేటాబేస్ దానివద్ద ఉంటుంది. విద్యాభ్యాసం పూర్తయ్యి వారు స్వదేశాలకు వెళ్లాక వర్సిటీ సూచనతో లీగల్ స్టేటస్‌ను తొలగించేవారు. ఇప్పుడు వర్సిటీలతో సంబంధమే లేకుండా విదేశీ విద్యార్థుల లీగల్ రెసిడెన్సీ స్టేటస్ ఉన్నపళంగా రద్దయిపోతోంది. పైగా ఆ మేరకు సమాచారం కూడా ఇవ్వడం లేదు. డేటాబేస్‌ను వర్సిటీ వర్గాలు తనిఖీ చేసినప్పుడు మాత్రమే ఆ విషయం తెలుస్తోంది. కొన్ని సందర్భాల్లో వీసా రద్దయినా లీగల్ రెసిడెన్సీ స్టేటస్ అలాగే ఉంటుంది. అలాంటప్పుడు విద్యాభ్యాసం కొనసాగించవచ్చు. స్వదేశాలకు వెళ్లి మళ్లీ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. స్టేటస్ రద్దయితే మాత్రం అమెరికాలో ఉండడానికి అనుమతించరు. స్వదేశాలకు వెళ్లిపోవాలని సూచిస్తారు. లేదంటే బలవంతంగా పంపిస్తారు.ఎందుకీ వీసాల రద్దు? → విద్యార్థుల వీసాల రద్దుకు నిబంధనల ఉల్లంఘన ముఖ్య కారణమని వర్సిటీలు చెబుతున్నాయి. → ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా వీసా రద్దవుతోంది. గత ఉల్లంఘనలకు కూడా ఇప్పుడు వీసా రద్దు చేస్తున్నారు. → చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడినా వీసా రద్దు తప్పదు. → పాలస్తీనా సానుభూతిపరుడంటూ కొలంబియా వర్సిటీ విద్యార్థి మహమ్మద్ ఖలీల్ వీసా రద్దు చేశారు. కానీ వీసాలు, లీగల్ స్టేటస్లు రద్దవుతున్న పలువురు విద్యార్థులకు ఉద్యమాలతో, తీవ్రవాద/ఉగ్రవాద సంస్థలతో ఏ సంబంధమూ లేదని ఆయా వర్సిటీలే చెబుతున్నాయి. కారణాలేమిటో ప్రభుత్వాన్నే అడగాలంటున్నాయి. → ‘‘విదేశీ విద్యార్థులను బయటకు వెళ్లగొట్టడమే డీఓహెచ్కు పనిగా మారింది. ఈ మేరకు అనధికారింగా జాతీయ పాలసీ తెచ్చినట్టు కనిపిస్తోంది’’ అని వేన్ స్టేట్ వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ ప్రతినిధులు విద్యార్థుల తరఫున కోర్టుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. బలవంతపు డిపోర్టేషన్లు ఆపాలని కోరారు. → డార్ట్మౌత్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న చైనాకు చెందిన షియాంటియాన్ లియూ తన లీగల్ స్టేటస్ రద్దుపై కోర్టును ఆశ్రయించాడు. ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేస్తూ విద్యారి్థకి అనుకూలంగా న్యూ హ్యాంప్‌షైర్ ఫెడరల్ జడ్జి తీర్పు ఇచ్చారు. → ‘‘అమెరికాలోకి వచ్చిపడుతున్న విదేశీయుల పట్ల ట్రంప్ గుర్రుగా ఉన్నారు. వారందరినీ వెనక్కు పంపేయాలని పట్టుదలగా ఉన్నారు. అందుకే విదేశీ విద్యార్థులను లక్ష్యం చేసుకుంటున్నారు’’ అని మైగ్రేషన్ పాలసీ ఇన్స్టిట్యూట్లో పబ్లిక్ అఫైర్స్ డైరెక్టర్ మిషెల్ మిటెల్స్టాడ్ అన్నారు.తీవ్ర పరిణామాలేఅమెరికాలో చట్టాల అమలు కఠినంగా ఉంటుంది. వాటిని పాటించకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ‘‘విద్యార్థులు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. చట్టాలను ధిక్కరిస్తామంటే ప్రభుత్వం సహించదు. ఇష్టానుసారం వ్యవహరిస్తే వీసాలు రద్దు చేసి వెనక్కు పంపుతారు. నిజాయితీగా ఉండేవారికి అమెరికాలో అద్భుత అవకాశాలున్నాయి’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మార్గరెట్ మెక్లియోడ్ అన్నారు. ఈ విషయంలో కేంద్రం ఇకనైనా మొద్దునిద్ర వీడి అమెరికాలోని మన విద్యార్థుల భవితవ్యాన్ని కాపాడాలని కాంగ్రెస్ పార్టీ సూచించింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌కు భారత వ్యోమగామి.. ముహూర్తం ఫిక్స్
న్యూఢిల్లీ: భారత్ తన అంతరిక్ష యాత్రలో అరుదైన మైలురాయిని చేరుకోవడానికి మూహూర్తం ఖరారైంది. భారత్ కు చెందిన వ్యోమగామి శుభాన్ష్ శుక్లా అంతర్జాతీయ స్పేస్ స్టేషన్((ఐఎస్ఎస్) లోకి వెళ్లనున్నారు. వచ్చే నెలలో శుభాన్ష్ శుక్లా స్పేస్ స్టేషన్ లో అడుగుపెట్టే విషయాన్ని తాజాగా వెల్లడించారు శాస్త్ర సాంకేతికత మంత్రి డా. జితేందర్ సింగ్. ‘అంతర్జాతీయ స్పేష్ మిషన్ భారత వ్యోమగామిని తీసుకువెళ్లడానికి మూహూర్తం ఖరారు చేయబడింది . వచ్చే నెలలో ‘గగన్ యాత్రి’ గ్రూప్ కు కెప్టెన్ గా ఉన్న శుభాన్ష్ శుక్లా అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ లో అడుగుపెట్టనున్నారు. ఇది భారత అంతరిక్ష యాత్రలో సువర్ణాధ్యాయంగా లిఖించబడుతుంది. ఇస్రో సరికొత్త హద్దులను ఛేదించడానికి ఒక భారతీయ వ్యోమగామి అంతరిక్ష యాత్రకు సిద్ధంగా ఉన్నాడు.మన అంతరిక్ష కలలు మరింత ఎత్తును తాకడానికి ఈ సన్నాహక యాత్ర కచ్చితంగా మైలురాయి కాబోతుంది’ అని జితేందర్ సింగ్ పేర్కొన్నారు. యాక్సియోమ్ 4 మిషన్ లో భాగంగా స్పేస్ ఎక్స్ అభివృద్ధి చేసిన స్పేస్ క్రాఫ్ కు నాసా మాజీ ఆస్ట్రోనాట్ పెగ్గీ విటన్స్ సారథ్యం వహిస్తున్నారు. దీనికి పైలట్ గా శుభాన్ష్ శుక్లా వ్యవహరించనున్నారు. వీరిద్దరితో పాటు ఉజ్ నాన్ స్కీ(పోలెండ్), టిబోర్ కపూ( హంగేరీ)లు అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కు చేరుకుని అక్కడ రెండు వారాల పాటు పరిశోధనలు చేసిన అనంతరం భూమికి తిరిగి వస్తారు. ఈ ప్రయోగంలోభారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో భాగస్వామిగా ఉంది. ఇస్రో వ్యోమగామి శుభాన్ష్ శుక్లా ఐఏఎన్ఎస్ లోకి అడుగుపెడితే అక్కడకు వెళ్లిన తొలి భారతీయుడిగా, రోదసిలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా రికార్డు సృష్టిస్తారు. ఇస్రో మావనసహిత అంతరిక్ష మిషన్‌లో భాగంగా గగన్‌యాన్‌కు ఎంపికైన నలుగురు వ్యోమగాముల్లో శుభాన్ష్ ఒకరుగా ఉన్నారు. -
ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చలపై ఆసక్తి పోయిందా?
రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందంపై అమెరికా కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌లో యుద్ధం ఆపడం సాధ్యం కాకపోతే తమ ప్రయత్నాలు విరమించుకుంటామని వెల్లడించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో(Marco Rubio) కీలక వ్యాఖ్యలు చేశారు.ఉక్రెయిన్ (Ukraine) యుద్ధం ముగించడం సాధ్యంకాని పక్షంలో.. చర్చల ప్రయత్నాలు ఆపేసి అమెరికా తన దారి తాను చూసుకుంటుందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో తేల్చి చెప్పారు. ఈ యుద్ధాన్ని మేం ప్రారంభించలేదు. ఇన్నాళ్లూ కేవలం ఉక్రెయిన్‌కు సాయం చేస్తున్నాం. ఇది మా యుద్ధం కాదు కాబట్టి ముగించాలనుకుంటున్నాం అని మార్కో రూబియో అన్నారు.ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ యుద్ధాన్ని ఓ ముగింపునకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగని నెలలు, సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉండబోరు. ఆయనకు ప్రపంచంలో ఇతర ప్రాధాన్యాలు కూడా ఉన్నాయి. చర్చల్లో గనుక పురోగతి కనిపించకపోతే ఆయన దీనిని వదిలేస్తానన్నారు అని రుబియో వెల్లడించారు.తాజాగా ఐరోపా నేతలతో భేటీ సందర్భంగా ఉక్రెయిన్ శాంతి ఒప్పందంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అతి తొందరలోనే ఇది సాకారం కావచ్చని పేర్కొన్నారు. అమెరికా ఓ శాంతిఒప్పందం ముసాయిదా తయారుచేసి ఐరోపా నేతలకు వెల్లడించింది. వారినుంచి సానుకూల స్పందనలు వచ్చినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇక దీనినే మార్కో రూబియో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌కు వెల్లడించారు. -
విమానం హైజాక్‌కు యత్నం.. నిందితుడ్ని కాల్చి చంపిన తోటి ప్రయాణికుడు
బెల్మోపాన్: అమెరికా ఈశాన్య తీర దేశమైన బెలిజ్‌లో విమానం హైజాక్ (Hijack Plane) కలకలం రేపింది. గురువారం (స్థానిక సమయం) బెలిజ్‌లో ఓ అమెరికన్ పౌరుడు గాల్లో ఉండగా ఓ చిన్న ట్రాఫిక్ ఎయిర్ విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో నిందితుడు తోటి ప్రయాణికులపై కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. ఆ తర్వాత నిందితుణ్ని కాల్చి చంపినట్లు తెలుస్తోంది. బెలిజ్ పోలీస్ కమిషనర్ చెస్టర్ విలియమ్స్ ప్రకారం..49ఏళ్ల అమెరికా పౌరుడు అకిన్యేలా సావా టేలర్ (Akinyela Sawa Taylor) గాలిలో ఉండగా శాన్ పెడ్రోకు వెళ్తున్న విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించాడు. తోటి ప్రయాణికులపై కత్తితో దాడి చేశాడు. ప్రతిఘటించిన తోటి ప్రయాణికుడు గన్నుతో నిందితుణ్ని కాల్చి చంపారు. ఈ సందర్భంగా టేలర్‌ను కాల్చి చంపిన ప్రయాణీకుడిని హీరో అంటూ కమిషనర్ విలియమ్స్ ప్రశంసించారు.కాగా,టేలర్ విమానంలోకి కత్తిని ఎలా తీసుకురాగలిగాడో అస్పష్టంగా ఉందని అధికారులు తెలిపారు.ఈ సంఘటనపై జరుగుతున్న దర్యాప్తులో సహాయం కోసం బెలిజియన్ అధికారులు అమెరికా రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. -
మెలోనీతో భేటీ.. సుంకాలపై మెత్తబడ్డ ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విషయంలో కాస్త మెత్తబడ్డారు. సుంకాలపై పలు దేశాలు అగ్రరాజ్యంతో చర్చలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ అమెరికా అధినేతతో సమావేశమయ్యారు. ఈ భేటీ సందర్భంగా ఆయన సానుకూల వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈయూ దేశాలపై అమెరికా 20 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. అయితే దాని అమలును 90 రోజులపాటు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పరిణామాల నడుమ.. ట్రంప్‌ను కలిసిన తొలి యూరప్ దేశపు నేత మెలోనీనే కావడం గమనార్హం. ఐరోపా సమాఖ్య(European Union)తో పాటు ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందం అంశంపై వీరు చర్చలు జరిపారు. అయితే ఈయూతో సుంకాలపై ఒప్పందం నూటికి నూరు శాతం కుదురుతుందని ట్రంప్ భరోసా ఇచ్చారు. ఈ డీల్ విషయంలో మాత్రం తాను తొందర పడటం లేదని వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రతీ ఒక్కరూ అమెరికాతో డీల్ కుదుర్చుకోవాలని తాపత్రయపడుతున్నారు. ఒకవేళ అలా వాళ్లు అనుకోకుంటే గనుక మేమే వాళ్లతో ఒప్పందానికి దిగి వస్తాం అంటూ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఇక.. మరోవైపు ఈ భేటీలో మెలోనీని ట్రంప్ ఆకాశానికెత్తారు. ఆమె ఓ అద్భుతమైన నేత అంటూ పొగడ్తలు గుప్పించారు. మరోవైపు.. పశ్చిమాన్ని గొప్పగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, కలిసికట్టుగా ఆ పని చేయగలమని అనుకుంటున్నా’ అని ఓవల్ ఆఫీసులో రిపోర్టర్లతో మెలోనీ మాట్లాడారు. ట్రంప్‌ను రోమ్ను ఆహ్వానించిన మెలోనీ.. అక్కడ ఈయూ దేశాల ప్రతినిధులతో సుంకాల అంశంపై చర్చిస్తామని వెల్లడించారు. Rendiamo l’Occidente di nuovo grande - Make the West Great Again pic.twitter.com/Z499ZRGx85— Giorgia Meloni (@GiorgiaMeloni) April 17, 2025 -
FSU: అమెరికా యూనివర్సిటీలో కాల్పులు.. ఇద్దరి మృతి
సాక్రమెంటో: అగ్రరాజ్యం మరోసారి కాల్పుల ఘటనతో ఉలిక్కి పడింది. ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ(Florida state University)లో ఓ సాయుధుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. పోలీసులు దుండగుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాల్పులకు గల కారణాలు తెలియరావాల్సి ఉంది.తొలుత.. తల్లహస్సి క్యాంపస్‌లోని స్టూడెంట్ యూనియన్‌లో యాక్టివ్ షూటర్ ఉన్నట్లు తొలుత సమాచారం రావడంతో యూనివర్సిటీ వెంటనే అలర్ట్ జారీ చేసింది. విద్యార్థులు, ఫ్యాకల్టీ, సిబ్బంది వెంటనే యూనివర్సిటీని వీడాలని, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని హెచ్చరించింది. అనంతరం పోలీసులు, ఇతర ఏజెన్సీలు కాల్పులు చోటుచేసుకున్న ప్రాంతానికి వచ్చి సహాయ చర్యలు చేపట్టాయి. ఈ ఘటనతో క్యాంపస్ లాక్డౌన్(Lock Down)లోకి వెళ్లింది. ఈ రోజు జరగాల్సిన క్లాస్‌లు, స్పోర్ట్స్ ఈవెంట్స్, ఇతర కార్యక్రమాలను రద్దు చేశారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తల్లహస్సి మెమోరియల్ హెల్త్‌కేర్ ప్రతినిధి తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్‌నకు ఈ విషయాన్ని అధికారులు చేరవేశారు. ఈ ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇదొక భయంకర సంఘటన అని ట్రంప్ పేర్కొన్నారు. ఓ యువకుడు తుపాకీతో కాల్పులు జరుపుతున్నట్లుగా ఫుటేజీ ఒకటి వెలుగులోకి వచ్చింది. నిందితుడు యూనివర్సిటీ విద్యార్థిగానే తెలియగా.. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. మరోవైపు.. ఐదుగురు మృతి చెందినట్లు కథనాలు వెలువడుతున్నప్పటికీ అధికారికంగా ధృవీకరణ కావాల్సి ఉంది. #Shooting at American universityMedia report that over 30 shots were fired on the campus of #Florida State #University.At least 5 people were killed and 4 others injured in the incident. pic.twitter.com/49nBiC6SLv— Tamadon News - English (@TamadonTV_EN) April 18, 2025 -
విక్టరీ డే వేడుకలకు రండి
మాస్కో: తమ రాజధాని మాస్కోలో మే 9వ తేదీన జరిగే 80వ ప్రతిష్టాత్మక విక్టరీ డే వేడుకల్లో పాల్గొనాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించినట్లు గురువారం రష్యా తెలిపింది. అయితే, ఆహ్వానంపై భారత ప్రభుత్వం స్పందించాల్సి ఉందని అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్రతినిధి వివరించారు. 1945లో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా రష్యా ఏటా మే 9వ తేదీన వేడుకలను భారీ ఎత్తున నిర్వహిస్తుంటుంది. ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాల నేతలను ఆహ్వానించడం ఆనవాయితీ. ఈసారి మోదీతోపాటు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌ను రష్యా ఆహ్వానించింది. ఆయన కూడా హాజరవుతారని భావిస్తున్నారు. కాగా, అధ్యక్షుడు పుతిన్ సైతం త్వరలో భారత్‌ను సందర్శించనున్నారని క్రెమ్లిన్ ప్రతినిధి యూరి ఉషకోవ్ మీడియాకు తెలిపారు. ఇందుకు సంబంధించి రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు. పుతిన్ మొట్టమొదటిసారిగా అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా 2000 అక్టోబర్‌లో భారత్‌లో పర్యటించారు. అప్పట్లో రెండు దేశాలు ‘వ్యూహాత్మక భాగస్వామ్య డిక్లరేష న్’పై సంతకాలు చేశాయి. ఈ భాగస్వామ్యమే ఇప్పుడు రెండు దేశాల మధ్య ‘ప్రత్యేక, విశేష భాగస్వామ్యం’స్థాయికి పరిణతి చెందింది. -
‘అమ్మా! ఇకపై నేను నిన్నెలా హత్తుకోనూ?
హేగ్: గాజాలో ఇజ్రాయెల్ దాడిలో రెండు చేతులు పూర్తిగా కోల్పోయిన పాలస్తీనా బాలుడి ఫొటోకి ఈ ఏడాది ప్రతిష్టాత్మక వరల్డ్ ప్రెస్ ఫొటో అవార్డు దక్కింది. న్యూయార్క్ టైమ్స్‌కు చెందిన సమర్ అబూ ఎలౌఫ్ అనే పాలస్తీనా మహిళా ఫొటోగ్రాఫర్ మహ్మద్ అజ్జౌర్ అనే ఈ 9 ఏళ్ల బాలుడి ఫొటో తీశారు. తనకు రెండు చేతులూ లేవన్న విషయం తెలుసుకున్న వెంటనే ఆ బాలుడు మొట్టమొదటగా ‘అమ్మా, నేను నిన్నెలా కౌగిలించుకోను?’అని తనను ప్రశ్నించాడని అతడి తల్లి చెప్పడంతో తాను ఎంతో ఆవేదన చెందినట్లు సమర్ అబూ తెలిపారని వరల్డ్ ప్రెస్ ఫొటో ఆర్గనైజేషన్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 2024 మార్చిలో ఇజ్రాయెల్ దాడి నుంచి తప్పించుకునే క్రమంలో అజ్జౌర్ భుజాల దిగువ నుంచి రెండు చేతులనూ కోల్పోయాడని వివరించింది. 68వ ఎడిషన్ పోటీ కోసం మొత్తం 141 దేశాల నుంచి 3,778 మంది ఫొటోగ్రాఫర్లు పంపిన 59,320 ఎంట్రీల నుంచి ఈ ఫొటోను ఎంపిక చేశామంది. ఈ ఫొటో ఎన్నో విషయాలను చెబుతుంది. ఒక బాలుడి గురించే కాదు, తరాలపాటు ప్రభావం చూపే ఒక యుద్ధం గురించి కూడా ఈ చిత్రం చెబుతుందని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జెయిన్ ఖౌరీ తెలిపారు. ఫొటో జర్నలిజం చేసిన అద్భుతం ఈ చిత్రమని జ్యూరీ చైర్ లూసీ కొంటిసెల్లో పేర్కొన్నారు. -
హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ ఆంక్షలు
న్యూయార్క్/వాషింగ్టన్: తన మాట వినని వాళ్లను ఎలాగైనా దారికి తెచ్చుకునేందుకు తెగించే ట్రంప్ ఇప్పుడు దేశంలోని విశ్వవిద్యాలయాలనూ తన బెదిరింపులతో భయపెడుతున్నారు. అమెరికన్ యువతలో పాలస్తీనా అనుకూల భావజాలం విశ్వవిద్యాలయాల కారణంగానే వ్యాప్తిచెందుతోందని ఆరోపిస్తూ తాజాగా హార్వర్డ్ యూనివర్సిటీపై ఆంక్షల కత్తిని వేలాడదీశారు. ఇప్పటికే వర్సిటీకి రావాల్సిన 220 కోట్ల డాలర్ల నిధులను నిలిపేసిన ట్రంప్ ప్రభుత్వం తాజాగా ఈనెల చివరికల్లా వర్సిటీలోని విదేశీ విద్యార్థుల ‘క్రమశిక్షణా’ చర్యల రికార్డులను తమకు అందించాలని హూంకరించారు. ఈ మేరకు వర్సిటీనుద్దేశిస్తూ అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం బుధవారం ఒక ప్రకటన విడుదలచేసింది. ‘‘ఈనెల 30వ తేదీలోపు హార్వర్డ్ వర్సిటీలోని విదేశీ విద్యార్థుల చట్టవ్యతిరేక, హింసాత్మక కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి అందజేయాలి. అలా అందజేయలేదంటే మీ ‘స్టూడెంట్ అండ్ ఎక్సే్ఛంజ్ విజిటర్ ప్రోగ్రామ్ (ఎస్ఈవీపీ)’ అర్హతను మీకు మీరుగా వదులు కున్నట్లు భావిస్తాం’’ అని హోమ్ ల్యాండ్ సె క్యూరిటీ శాఖ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ పేరిట ఆ శాఖ ఒక ప్రకటన విడుదలచేసింది. విదేశీ విద్యా ర్థులు స్టూడెంట్ వీసా పొందేందుకు కావాల్సిన అర్హతా పత్రాల జారీకి వీలు కల్పించే సర్టిఫికేషన్ విధానాన్నే ఎస్ఈవీపీగా పేర్కొంటారు. ‘‘ప్రైవేట్ వర్సిటీగా మీకు ఏకంగా 53.2 బిలియన్ డాలర్ల నిధులు వస్తున్నాయి. అందుకే ప్రభుత్వం నిధులు రాకున్నా మీకొచ్చే నష్టమేం లేదు. సొంతంగా నిర్వహణ ఖర్చులను సర్దుకోగలరు. అందుకే ప్రభ్వుత గ్రాంట్లకు కోత పెడుతున్నాం. ప్రభుత్వంతో చక్కటి ఆర్థిక సంబంధాలు కొనసాగించాలంటే మేం అడిగిన వివరాలు సమగ్రస్థాయిలో ఇవ్వండి. అక్రమ, హింస ఘటనల్లో పాల్గొని క్రమశిక్షణా చర్యలు ఎదుర్కొంటున్న విదేశీ విద్యార్థుల వివరాలను అందజేయండి’’ అని ప్రభుత్వం ఆ ప్రకటనలో హెచ్చరించింది. 2024–25 విద్యాసంవత్సంలో హార్వర్డ్ వర్సిటీలో 6,793 మంది విదేశీ విద్యార్థులు చేరారు. మొత్తం విద్యార్థుల్లో వీరు 27.2% మంది ఉన్నారు. వర్సిటీకి పన్ను మినహాయింపు హోదా రద్దు !వర్సిటీకి ఆర్థిక కష్టాల కడలిలోకి తోసేయాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇందులోభాగంగా వర్సిటీకి ఉన్న ‘పన్ను మినహాయింపు హోదా’ను రద్దుచేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా సంబంధింత వివరాలను తమకు అందజేయాలని ఇంటర్నల్ రెవిన్యూ సర్వీస్(ఐఆర్ఎస్) విభాగాన్ని ప్రభుత్వం కోరింది. నియమాలకు అనుగుణంగా వర్సిటీ నిర్వహణ లేదని తప్పుడు కారణాలు చూపి వర్సిటీకున్న పన్ను మినహాయింపు హోదాను రద్దుచేయాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే వర్సిటీ కోర్టును ఆశ్రయించే వీలుంది. -
ఇంటర్వ్యూ స్లాట్లు అదృశ్యం
న్యూఢిల్లీ: అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలని కలలుగంటున్న భారతీ య విద్యార్థులకు మరిన్ని షాక్‌లు తగులుతున్నాయి. అమెరికా వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ స్లాట్లు ఆన్లైన్ నుంచి హఠాత్తుగా అదృశ్యమైపోతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. గత 20–25 రోజుల నుంచి వీసా అపాయింట్మెంట్ స్లాట్లు దొరకడం గగనంగా మారిందని అంటున్నారు. ఇండియా నుంచి అమెరికా వెళ్లడానికి వేలాది మంది విద్యార్థులు ఏర్పాటు చేసుకుంటున్నారు. మరోవైపు అమెరికా విద్యా సంస్థల్లో అడ్మిషన్ల సీజన్ డెడ్‌లైన్‌కు గడువు ముంచుకొస్తోంది. నిర్దేశిత గడువులోగా వీసాలు దొరక్కపోతే అడ్మిషన్‌పై ప్రభావం పడనుంది. అమెరికా వీసా కావాలంటే ఇండియాలోని యూఎస్ ఎంబసీలు లేదా కాన్సులేట్లలో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ ఇంటర్వ్యూల కోసం ముందుగానే ఆన్లైన్లో నగదు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఏప్రిల్ నెలకు సంబంధించిన స్లాట్లన్నీ ఇప్పటికే బుక్ అయిపోయాయి. మే, జూన్‌కు సంబంధించిన స్లాట్లు అందుబాటులో లేవని విద్యార్థులు పేర్కొంటున్నారు. ఆన్లైన్లో కనిపించడం లేదని చెబుతున్నారు. కారణం ఏమిటో తెలియక అయోమయానికి గురవుతున్నారు. వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ స్లాట్ల కోసం నిత్యం వందలాది మంది ప్రయత్నిస్తున్నారు. కానీ, నిరాశే ఎదురవుతోంది. అమెరికా ఎంబసీ వీసా స్లాట్ల వ్యవస్థను అప్‌గ్రేడ్ చేస్తోందని, అందుకే ఈ సమస్య తలెత్తి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. వీసా స్లాట్ల వ్యవస్థను ఎవరూ దుర్వినియోగం చేయకుండా, అనధికారిక వ్యక్తులు ఇందులోకి ప్రవేశించకుండా పటిష్టమైన చర్యలు చేపడుతోందని తెలిపారు. త్వరలో సమస్య పరిష్కారం అవుతుందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. కానీ, దీనిపై అమెరికా ప్రభుత్వం ఇంకా స్పందించకపోవడం పట్ల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికిప్పుడు వీసాలు దొరకడం కష్టం కావడంతో అమెరికా వర్సిటీల్లో అడ్మిషన్లు వాయిదా వేసుకోవాలని కొందరు విద్యార్థులు భావిస్తున్నట్లు తెలిసింది.భారతీయ విద్యార్థులకు సహకరిస్తాం: రణధీర్ జైశ్వాల్ అమెరికాలో భారతీయుల వీసాలు హఠాత్తుగా రద్దు చేస్తుండడం, భారతీయ పర్యాటకులను అడ్డుకోవడం, హెచ్–1బీ వీసా ఉన్నవారికి ప్రవేశం నిరాకరిస్తుండడం వంటి సమస్యలపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ గురువారం స్పందించారు. ఎఫ్–1 వీసాలను రద్దు చేస్తున్నామంటూ భారతీయ విద్యార్థులకు అమెరికా ప్రభుత్వం నుంచి సమాచారం వస్తున్నట్లు తమకు తెలిసిందని అన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అసవరం లేదని, తగిన సహకారం అందిస్తామని చెప్పారు. అమెరికాలోని భారతీయ ఎంబీసీలు, కాన్సులేట్లు మన విద్యార్థులకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. -
సౌర వ్యవస్థకు ఆవల జీవం!
అనంతమైన విశ్వంలో మన భూగోళంపైనే కాకుండా ఇంకెక్కడైనా జీవజాలం ఉందా? జీవులు మనుగడ సాగించే వాతావరణ పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానం కనిపెట్టడానికి శతాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇతర గ్రహాలపై జీవుల ఉనికి ఉండొచ్చని అంచనా వేస్తున్నప్పటికీ అందుకు కచ్చితమైన ఆధారాలైతే లభించలేదు. గ్రహాంతర జీవులు కాల్పనిక సాహిత్యానికే పరిమితమయ్యాయి. కానీ, మన సౌర వ్యవస్థ వెలుపల ఉన్న ‘కే2–18బీ’ అనే గ్రహంపై జీవం ఉందని చెప్పడానికి బలమైన సాక్ష్యాధారాలు లభించాయని యునైటెడ్ కింగ్డమ్(యూకే)లోని ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ పరిశోధకులు వెల్లడించారు. ఈ గ్రహం మన భూమి నుంచి 124 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. భూమితో పోలిస్తే 8.5 రెట్లు పెద్దది. కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ‘నాసా’కు చెందిన జేమ్స్‌వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా ఈ గ్రహంపై డైమిౖథెల్ సల్ఫైడ్(డీఎంఎస్), డైమిౖథెల్ డైసల్ఫైడ్(డీఎండీఎస్) అనే రకాల వాయువుల కెమిల్ ఫింగర్‌ఫ్రింట్స్‌ను గుర్తించారు. ఈ రెండు రకాల వాయువులు భూమిపైనా ఉన్నాయి. ఇవి కేవలం జీవ సంబంధమైన ప్రక్రియల ద్వారానే ఉత్పత్తి అవుతాయి. సముద్రంలోని ఆల్గే(మెరైన్ ఫైటోప్లాంక్టన్)తోపాటు ఇతర జీవుల నుంచి ఈ వాయువుల ఉత్పత్తి అధికంగా జరుగుతుంది. దీన్నిబట్టి కే2–18బీ గ్రహంపై జీవం ఉందని తేల్చారు. అచ్చంగా భూమిపై ఉన్నట్లుగా అక్కడ జీవించి ఉన్న ప్రాణులు లేనప్పటికీ జీవసంబంధిత ప్రక్రియలు జరుగుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. అయితే, దీనిపై మరింత పరిశోధన జరగాల్సి ఉందని పేర్కొంటున్నారు. మనం ఒంటరివాళ్లం కాదు: మధుసూదన్ జీవుల మనుగడ సాధ్యమయ్యే మరో గ్రహం దొరికిందని చెప్పడానికి ఇది తొలి సంకేతమని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్‌లో అస్ట్రోఫిజిక్స్, ఎక్సోప్లానెటరీ సైన్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న నిక్కు మధుసూదన్ వెల్లడించారు. సౌర వ్యవస్థకు బయట జీవం ఉనికిని పరిశోధించే విషయంలో ఇదొక కీలకమైన మలుపు అని తెలిపారు. ఇతర గ్రహాలపై మన సహచర జీవులు ఉన్నాయని కచ్చితంగా చెప్పే రోజు మరికొన్ని సంవత్సరాల్లో వస్తుందని మధుసూదన్ స్పష్టంచేశారు. మనం ఒంటరివాళ్లం కాదన్నారు. హైసియన్ ప్రపంచాలు కే2–18బీ గ్రహం సబ్–నెప్ట్యూన్ తరగతికి చెందినది. అంటే ఇలాంటి గ్రహాల వ్యాసం భూమి వ్యాసం కంటే ఎక్కువ, నెప్ట్యూన్ వ్యాసం కంటే తక్కువ. కే2–18బీ గ్రహం ఎలా ఏర్పడిందన్నది ప్రస్తుతానికి మిస్టరీగానే ఉంది. దీనిపై మిథేన్, కార్బన్డయాక్సైడ్, డైమిౖథెల్ సల్ఫైడ్, డైమిౖథెల్ డైసల్ఫైడ్ వాయువులు సమృద్ధిగా ఉన్నట్లు 2023లో కనిపెట్టారు. 1990 నుంచి ఇప్పటివరకు సౌర వ్యవస్థ బయట 5,800 గ్రహాలను గుర్తించారు. వీటిని ఎక్సోప్లానెట్స్ అని పిలుస్తున్నారు. హైసియన్ ప్రపంచాలు అని కూడా అంటున్నారు. వీటిలో చాలావరకు ద్రవరూపంలోని నీటి సముద్రాలతో కప్పి ఉన్నాయని, ఎక్సోప్లానెట్స్‌పై హైడ్రోజన్‌తో కూడిన వాతావరణం ఉందని చెబుతున్నారు. ఆయా గ్రహాలపై జీవులు ఉండేందుకు వంద శాతం ఆస్కారం ఉందని, వాటిని గుర్తించడమే మిగిలి ఉందని పేర్కొంటున్నారు. పరిశోధనల దిగ్గజం నిక్కు మధుసూదన్ ఇండియన్–బ్రిటిష్ ప్రొఫెసర్ నిక్కు మధుసూదన్ ఎక్సోప్లానెట్స్‌ను గుర్తించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన సమర్పించిన ఎన్నో పరిశోధన పత్రాలు అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పలు అధ్యయనాలకు ఆయన నేతృత్వం వహిస్తున్నారు. మధుసూదన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–వారణాసిలో బీటెక్ పూర్తిచేశారు. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)లో ఎంఎస్, పీహెచ్డీ అభ్యసించారు. 2020లో వాస్ప్–19బీ అనే గ్రహంపై టైటానియం ఆౖక్సైడ్‌ను గుర్తించిన బృందంలో ఆయన కూడా ఉన్నారు. కే2–18బీ గ్రహంపై పరిశోధనలు సాగిస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
నరుడా.. ఓ నరుడా.. డోనరుడా..!
ఎలాన్ మస్క్.. ఈ పేరు ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. ఆయన టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి కంపెనీలకు అధిపతి. ఒక వ్యాపారవేత్తగానే కాకుండా ఆవిష్కరణ వేత్తగా కూడా పేరు సంపాదించారు. ప్రపంచ కుబేరుల్లో ఒకరు మస్క్. అయితే తన వారసత్వం తనతో ఆగిపోకూడదనే తపన కూడా ఆయనలో ఎక్కువగానే ఉంది. ప్రపంచానికి తనలాంటి మేధావులు మళ్లీ మళ్లీ పరిచయం కావాలంటే ఏం చేయాలనే ఆలోచన కూడా ఆయనకు ఎప్పుడో వచ్చిందట. దీనిలో భాగంగా తన తర్వాత తరాన్ని తయారు చేసే పనిలో పడ్డారట ఎలాన్ మస్క్. ప్రపంచ జనాభా పెంచే పనిలో మస్క్అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) క్యాబినెట్ లో కీలక పదవిలో ఉన్న ఎలాన్ మస్క్.. తన వీర్యాన్ని దానం చేసే పనిలో ఉన్నారని తాజా కథనాల సారాంశం. ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ తన కాస్ట్ కటింగ్ లతో ప్రపంచానికి నిద్రపట్టనివ్వకుండా చేస్తుంటే.. మస్క్ మాత్రం తన వీర్యాన్ని పంచి ప్రపంచ జనాభాను పెంచే పనిలో ఉన్నారట. దీనికి సంబంధించి అమెరికన్ వార్త పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించింది. మస్క్ కు బాగా తెలిసిన వాళ్లకు ఈ ఆఫర్ చేస్తూ ఉంటాడని, ఒకవేళ తెలియక పోయినా వారితో పరిచయం పెంచుకుని మరీ వారికి దగ్గరవుతూ ఉంటాడట. మేధావి వర్గం అనేది తర్వాత తరాలకు కూడా అందుబాటులో ఉండాలనే పదునైన సంకల్పంతో ఉన్న మస్క్ దీనికి పూనుకున్నట్లు పేర్కొంది. ’ఎక్స్’లో మహిళలకు దగ్గరవుతూ వారిని పిల్లల్ని కనమని ఆఫర్లు ఇస్తున్నాడని స్పష్టం చేసింది. ఇలా మస్క్ పిల్లల సంఖ్య పెరుగుతూ పోతూ ఉందని తెలిపింది. జనాభా సమతుల్యతను కాపాడే పనిలో..ఇప్పటికే 14 మంది పిల్లలకు తండ్రిగా ఉన్న ఎలాన్ మస్క్.. తన వారసత్వ సంపదగా ఒక దండునే తయారు చేయాలనే సంకల్పంతో ఉన్నాడని డబ్యూఎస్జే తెలిపింది. తగ్గిపోతున్న జనన రేట్ల మానవ నాగరికతను అస్తిత్వంలో పడేస్తాయని మస్క్ బలంగా నమ్ముతున్నాడని, ఇది కూడా తన వీర్యాన్ని దానం చేస్తూ జనాభా సమతుల్యతను కాపాడుకునే క్రమంలో సాధ్యమైనంత మేర తన వంతు ప్రయత్నం చేస్తున్నాడనేది ఆ కథనం సారాంశం. ఇప్పటికే ఎంతోమంది మహిళలకు తన వీర్యాన్ని డోనర్ రూపంలో దానం చేసినట్లు తెలిపింది. దీనికి సంబంధించి వ్యవహారాలపై సీక్రెట్ ఒప్పందాలు మస్క్ చేసుకున్నట్లు ప్రచురించింది. జపనీస్ మహిళను ఇలా కలిసి..?క్రిప్టో కరెన్సీ ఇన్ఫ్లూయెన్సర్ అయిన జపాన్ మహిళ టిఫనీ ఫాంగ్ కు కూడా మస్క్ నేరుగా మెస్సేజ్ చేసి తన బిడ్డ (వీర్యం దానం చేయడం ద్వారా) కావాలా అని అడిగినట్టు డబ్యూఎస్ జే పేర్కొంది. ఇది జరిగి ఏడాది అవుతుందని, మస్క్ ఆమెను ఎక్స్ లో ఫాలో అవ్వడం మొదలైన తర్వాత ఈ ఆఫర్ ఇచ్చాడట. ఆమెను మస్క్ ఫాలో అవ్వడంతో టిఫనీ ఫాంగ్ కు ఫాలోవర్స్ సంఖ్య కూడా గణనీయంగా పెరిగి రెండు వారాల్లోనే 21 వేల డాలర్లను సంపాదించినట్లు ఆ కథనంలోని మరొక విషయం. అయితే మస్క్ ఆఫర్ ను టిఫనీ ఫాంగ్ తిరస్కరించిందని, ఆమెకు అప్పటికే ఉన్న పిల్లల ఫోటోలను కూడా చూపించిందట.ఆష్లీ సెయింట్ క్లెయిర్ సంచలన ఆరోపణలుఇటీవల రచయిత్రి, ఇన్ఫ్లూయెన్సర్ ఆష్లీ సెయింట్ క్లెయిర్.. మస్క్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తన బిడ్డకు మస్క్ తండ్రి అంటూ సోషల్ మీడియాలో వేదికగా పోస్టు పెట్టారు. ఆమె పోస్టుపై మస్క్ సమాధానం ఇస్తూ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.ఆ చిన్నారికి తండ్రి మస్క్ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. తన బిడ్డ మస్క్‌కు 13వ సంతానమని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో.. తమ బిడ్డ భద్రతను, గోప్యతను దృష్టిలో ఉంచుకుని ఇన్ని రోజులు ఈ విషయం బయటపెట్టలేదని, మా ప్రైవసీకి ఎవరూ భంగం కలిగించవద్దంటూ కామెంట్స్ చేశారు.గతేడాది న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. తనకు పుట్టిన పిల్లలను, మాజీ భాగస్వామ్యులు ఉండేందుందుకు 14 వేల 400 స్క్వేర్ ఫీట్ కాంపౌడ్ లో ఒక పెద్ద భవనాన్ని నిర్మించి వారు బాగోగులు చూస్తున్నట్లు కూడా పేర్కొంది. ఆ ఇంటిని నిర్మించడం కోసం సుమారు 300 కోట్ల రూపాయిలు అయినట్లు తెలిపింది. ఏం లేదు.. అంతా గాసిప్: మస్క్‌జపాన్ మహిళకు వీర్యం ఆఫర్ చేసినట్టు వచ్చిన కథనాల్ని మస్క్ కొట్టిపారేస్తున్నారు. ఇందులో ఎటువంటి వాస్తవం లేదని అంటున్నారు. డబ్యూఎస్జే వెబ్సైట్ అనేది ఒక గాసిప్ వెబ్ సైట్ అని, అందులో గాసిప్ తప్పితే ఏమీ ఉండదని అంటున్నారు. అయితే స్పెర్మ్ డోనర్ అనే అంశం చాలా సీక్రెట్‌గానే ఉంచుతారు. మరి అటవంటప్పుడు మస్క్ ఎవరికైనా వీర్యాన్ని దానం చేసినా దానిని బహిరంగంగా చెప్పుకునే అవకాశం ఉండదు. ఇటీవల కాలంలో తన బిడ్డకు తండ్రి మస్క్ అంటూ బహిరంగంగా పలువురు వ్యాఖ్యానించిన క్రమంలోనే ఈ వార్తను డబ్యూఎస్జే పరిశోధానాత్మక కోణంలో ప్రచురించినట్లు తెలుస్తోంది. -
కశ్మీర్‌ను మరిచిపోయే ప్రసక్తే లేదు: పాక్ ఆర్మీ చీఫ్
కశ్మీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్(General Asim Munir) భారత్ వ్యతిరేక వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. భారత్, పాకిస్థాన్‌లు సిద్ధాంతాల పరంగా వేర్వేరు దేశాలేనన్న ఆయన.. కశ్మీర్‌ను ఇస్లామాబాద్‌కు గళ సిరగా అభివర్ణించారు. ఈ క్రమంలో పాక్ ఎట్టి పరిస్థితుల్లోనూ కశ్మీర్‌ను మరిచిపోదని, ఏ శక్తీ దానిని పాక్ నుంచి వేరు చేయలేదని వ్యాఖ్యానించారు. అలాగే దేశ విభజనకు కారణమైన రెండు దేశాల విభజనను సమర్థిస్తూ తీవ్ర వ్యాఖ్యలూ చేశారు. పాక్ మీడియా హౌజ్ డాన్(dawn) కథనం ప్రకారం.. తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన జనరల్ మునీర్ మాట్లాడారు. ఉగ్రకార్యకలాపాలతో పాక్ నిధులు రావనే భయాలు నెలకొన్నాయని.. కానీ, ఆ భయాలను తొలగించే ప్రయత్నాల్లో పాక్ సైన్యం ఉందని అన్నారు. ఉదాహరణగా.. బెలూచిస్తాన్, కశ్మీర్ అంశాలను(Kashmir Issue) ప్రస్తావించారు. పాక్‌కు బెలూచిస్తాన్ ఎంతో గర్వకారణమైంది. అలాంటి ప్రాంతంలో వేర్పాటువాద ఉద్యమాలను పాక్ సైన్యం సమర్థవంతంగా అణచివేసింది. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాల కారణంగా పెట్టుబడులు రాకపోవచ్చనే భయాలు ఉన్నాయి. కానీ, ఉగ్రవాదులు దేశ భవిష్యత్తును మార్చగలరా?. త్వరలో పూర్తి విజయం సాధిస్తాం. ఇంకో పది జన్మలెత్తినా ఆ ప్రాంతాన్ని మనకు ఎవరూ దూరం చేయలేరు. ఇక.. కశ్మీర్‌పై తమ ఆశ చావదన్న పాక్ ఆర్మీ చీఫ్(Pak Army Chief).. అది మాకు గళ సిర(జగ్యులర్ సిర) అని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మరిచిపోలేమని, కశ్మీరీ సోదరుల వీరోచిత పోరాటాలను అంత సులువుగా వదిలిపెట్టబోమని, ఏ శక్తీ దానిని పాక్ నుంచి వేరు చేయలేదని వ్యాఖ్యానించారు. పాక్ గురించి తర్వాతి తరాలకు ఎంతో చెప్పాల్సిన అవసరం ఉందన్న జనరల్ మునీర్.. మతం, సంప్రదాయాలు, ఆలోచనలు, లక్ష్యాలు.. ఇలా ప్రతీ విషయంలోనూ హిందువులతో మనం(ముస్లిం) వేరనే విషయం తెలియజేయాల్సిన బాధ్యత ఉందంటూ పాక్ పౌరులకు సూచించారు. ఇదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది వేసింది అని అన్నారాయన. ఏరకంగా ఈ రెండు దేశాలు ఒక్కటి కాదని.. అందుకే తమ పూర్వీకులు పాక్ కోసం పోరాడారని వ్యాఖ్యానించారు. ఇలాంటి దేశాన్ని ఎలా రక్షించుకోవాలనే దానిపైనే దృష్టిసారించాలని అన్నారు. ఈ వ్యాఖ్యలకు భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి!.Ugh! I thought General Musharraf was the worst, but this COAS takes the cake. The whole bakery. General Asim Munir. pic.twitter.com/t8eVYukQqG— Smita Prakash (@smitaprakash) April 16, 2025 -
ఉత్తరకొరియా మరో సంచలనం.. కిమ్ ప్లాన్‌తో ప్రపంచానికే హెచ్చరిక!
పాంగ్య్యాంగ్: ఉత్తరకొరియా తన శత్రు దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నిత్యం క్షిపణి పరీక్షలతో కవ్వించే కిమ్.. ఇప్పుడు అత్యాధునిక యుద్ధనౌకను తయారుచేసే పనిలో స్పీడ్ పెంచారు. మాక్సర్ టెక్నాలజీస్, ప్లానెట్ ఉపగ్రహాలు తీసిన చిత్రాల ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఉత్తర కొరియా నౌకాదళంలో ఉన్న వార్‌షిప్‌ల కంటే ఇది దాదాపు రెండింతలు పెద్దదిగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వివరాల ప్రకారం.. కిమ్ అధికారం చేపట్టాక సైనిక దళాలను అత్యంత వేగంగా ఆధునికీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తర కొరియా నౌకాదళం ఓ అతిపెద్ద నౌకను తయారుచేసే పనిలో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆ యుద్ధ నౌకపై ఆయుధ, అంతర్గత వ్యవస్థలను నిర్మిస్తున్నారు. దీని పనులు ఆ దేశ ఉత్తర తీరంలో జరుగుతున్నాయి. ఈ విషయాన్ని మాక్సర్ టెక్నాలజీస్, ప్లానెట్ ఉపగ్రహాలు పసిగట్టాయి. ప్రస్తుతం ఆ దేశ నౌకాదళంలో ఉన్న వార్‌షిప్‌ల కంటే ఇది దాదాపు రెండింతలు పెద్దదిగా ఉందని సమాచారం. దీని పొడవు సుమారు 140 మీటర్లుగా అంచనా వేశారు. దీని నిర్మాణానికి అవసరమైన టెక్నాలజీ మాస్కో నుంచి అంది ఉంటుందని దక్షిణ కొరియా నిపుణులు చెబుతున్నారు.***UPDATE***New warship revealed by #NorthKorea hints at VLS and phased array radars. #OSINT pic.twitter.com/2pzm01QcLr— H I Sutton (@CovertShores) December 29, 2024ఇదిలా ఉండగా.. అమెరికాకు చేరే స్థాయి ఖండాంతర క్షిపణులను ఇప్పటికే ఉత్తర కొరియా సమకూర్చుకొంది. ఈ ఆయుధాల తయారీకి అవసరమైన టెక్నాలజీ, పరికరాలను ఎవరూ ఉత్తరకొరియాకు విక్రయించకుండా ఐరాస ఆంక్షలు విధించింది. రష్యాతో మంచి సంబంధాలు ఉండటంతో ఆంక్షల ప్రభావం లేకుండా చూసుకొంది. మొత్తానికి ఈ భారీ నౌక నిర్మాణం ఉత్తర కొరియా సైనిక శక్తిని మెరుగుపరిచే మరో ముఖ్యమైన అడుగుగా చెప్పవచ్చు. దీంతో, అమెరికా.. ఈ విషయంపై ఫోకస్ పెంచే అవకాశం ఉంది.🇰🇵🛳️ North Korea is building the largest warship in its arsenal, measuring 140 meters long, — CNN.❗️The missile frigate is said to have vertical launchers for missiles at air and ground targets. DPRK receiving military technology from Russia, as it is under strict sanctions. pic.twitter.com/ivEEVwmQAY— MAKS 24 🇺🇦👀 (@Maks_NAFO_FELLA) April 14, 2025 -
టైమ్స్ జాబితాలో భారతీయులకు దక్కని చోటు!
ప్రపంచమంతా ప్రతిష్టాత్మకంగా భావించే టైమ్ మ్యాగజైన్(Time Magazine List 2025) జాబితా 2025 విడుదలైంది. వంద మంది పేర్లతో కూడిన జాబితాను విడుదల చేసింది. అయితే అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో ఈ ఏడాది భారతీయులెవరికీ చోటు దక్కకపోవడం గమనార్హం.2025కి గానూ మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ జాబితాను టైమ్ మ్యాగజైన్ విడుదల చేసింది. ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూకే ప్రధాని కీర్ స్టార్మర్, నోబెల్ బహుమతి గ్రహీత.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, టెస్లా సీఈవో ఇలాన్ మస్క్ తదితరులకు చోటు దక్కింది. జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్, పాపులర్ సింగర్ ఈద్ షరీన్, ఏఐ దిగ్గజం డెమిస్ హస్సాబిస్(Demis Hassabis) తదితరుల పేర్లు ఉన్నాయి.ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. భారత్ నుంచి ఈ ఏడాది జాబితాలో ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. గతంలో.. షారూఖ్ ఖాన్, అలియా భట్, సాక్షి మాలిక్(రెజ్లర్) పేర్లు ఈ జాబితాకు ఎక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య సంవత్సరాల్లో ఇలా భారతీయుల పేర్లు లేకపోవడం ఇదే తొలిసారి. ఈసారి విశేషం ఏంటంటే.. నేరుగా భారతీయులకు చోటు దక్కకపోయినా భారత సంతతికి చెందిన వర్టెక్స్ ఫార్మాసూటికల్స్ సీఈవో రేష్మా కేవలరమణి(Reshma Kewalramani) పేరు ఈ జాబితాలోకి ఎక్కింది. రేష్మ ముంబైలో పుట్టారు. ఆమెకు 11 ఏళ్ల వయసున్నప్పుడు ఆ కుటుంబం అమెరికాకు వలస వెళ్లి స్థిరపడింది. రేష్మా కేవలరమణి(52)టైమ్ జాబితాకు ప్రాధాన్యత ఎందుకు?టైమ్ మ్యాగజైన్ అనేది న్యూయార్క్ కేంద్రంగా నడిచే వార్త ప్రచురణ సంస్థ. 1923 మార్చి 3వ తేదీన ఇది ప్రారంభమైంది. సమకాలీన వార్తలకు పాఠకులకు అందించే ఉద్దేశంతో హెన్రీ లూస్, బ్రిటన్ హాడెన్ దీనిని స్థాపించారు. కాలక్రమేణా దీనికి ప్రపంచస్థాయి ఆదరణ లభించింది. అనేక రంగాలను మలుపు తిప్పిన వ్యక్తుల పేర్లతో ప్రతీ ఏటా జాబితా విడుదల చేస్తూ వస్తోంది టైమ్స్ మ్యాగజైన్. అలా..అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాను 1999లో తొలిసారి రిలీజ్ చేసింది టైమ్ మ్యాగజైన్. మేధావులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు ఈ జాబితా గురించి విస్తృతంగా చర్చించుకోవడం మొదలుపెట్టారు. అయితే 2004 నుంచి క్రమం తప్పుకుండా ప్రతీ ఏడాది జాబితాను విడుదల చేస్తూ వస్తోంది టైమ్ మ్యాగజైన్. -
భారత సంతతి వైద్యురాలు ముంతాజ్ పటేల్‌కి అరుదైన గౌరవం
లండన్: ప్రతిష్టాత్మక రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్(ఆర్సీపీ) 124వ ప్రెసిడెంట్‌గా భారత సంతతికి చెందిన డాక్టర్ ముంతాజ్ పటేల్ ఎన్నికయ్యారు. యూకే వైద్య నిపుణుల సంఘంలో ప్రపంచవ్యాప్తంగా నిపుణులుగా పేరున్న 40 వేల మంది వైద్యులు సభ్యులుగా ఉన్నారు.ఇక, ఇంగ్లండ్‌లోని లంకాషైర్‌లో డాక్టర్ పటేల్ జన్మించారు. ఈమె తల్లిదండ్రులు భారత్‌కు చెందిన వారు. మాంచెస్టర్‌లో కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్‌గా డాక్టర్ ముంతాజ్ పనిచేస్తున్నారు. ఆర్సీపీకు మొట్టమొదటి ఇండో–ఆసియన్ ముస్లిం ప్రెసిడెంట్‌గా ఆమె చరిత్ర సృష్టించారు. 16వ శతాబ్దంలో ఆర్సీపీ ఏర్పాటయ్యాక ఐదో మహిళా అధ్యక్షురాలుగా ముంతాజ్ పటేల్ నిలిచారు. సోమవారం ముగిసిన ఎన్నికలో డాక్టర్ ముంతాజ్ గెలుపొందారు. నాలుగేళ్ల పదవీకాలం ప్రారంభం ఖరారు కావాల్సి ఉంది. ఆర్సీపీ వైస్ ప్రెసిడెంట్(ఎడ్యుకేషన్–ట్రెయినింగ్)గా, తాత్కాలిక ప్రెసిడెంట్‌గా 2024 జూన్ నుంచి కొనసాగుతున్నారు. ఆర్సీపీ ప్రెసిడెంట్‌గా కౌన్సిల్ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యురాలుగా ఉంటారు. -
భూకంపం నుంచి బిడ్డను రక్షించుకునేందుకు.. వలయాన్ని సృష్టించిన ఏనుగులు
ప్రాణి ఏదైనా పిల్లల పట్ల చూపించే ప్రేమ, తీసుకునే జాగ్రత్తలు ఒకేతీరుగా ఉంటాయి. అందుకు తాజా ఉదాహరణ ఈ ఘటన. సోమవారం దక్షిణ కాలిఫోర్నియాలో 5.2 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఒక్కసారిగా కదలికలను గమనించిన శాన్‌డియాగో జంతు ప్రదర్శనశాలలోని ఏనుగులు అప్రమత్తమయ్యాయి. జూ సఫారీ పార్కులో ఉన్న ఆఫ్రికన్ ఏనుగుల గుంపు ఒకేచోట చేరింది. తమ పిల్లలను రక్షించుకోవడానికి వలయం ఏర్పాటు చేసింది. మధ్యలో పిల్లలను ఉంచిన ఏనుగులు ఏ పక్క నుంచి ఏ ముప్పు ఉందోనని చుట్టుపక్కల పరిశీలించడం మొదలుపెట్టాయి. చెవులు చాచి, కళ్లు పరిసరాలను పరిశీలిస్తూ, ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధమన్నట్టుగా నిలబడి ఉన్నాయి. గుంపులో ఉన్న మగ ఏనుగు పిల్ల కూడా రక్షణ వలయంలోకి వచ్చి నిలబడింది. దానికి తల్లి ఏనుగు తొండంసాయంతో నేనున్నా అనే భరోసాను సైతం ఇచ్చింది. భూమి కంపించడం ప్రారంభించిన క్షణాల్లోనే ఏనుగులు చర్యకు దిగాయి. ఎన్‌క్లోజర్‌లోని నిఘా కెమెరాలు ఈ దృశ్యాలను బంధించాయి. ‘అలర్ట్ సర్కిల్’అనిపిలిచే ఈ సహజ రక్షణ వలయం. బలహీనమైన సభ్యులు భయపడకుండా ఉండేందుకు ఏనుగులు ఈ విలక్షణమైన పవర్తనను కలిగి ఉంటాయి. ఇది వాటి తెలివితేటలకు, సామాజిక బంధానికి నిదర్శనమని జంతుప్రదర్శనశాల క్షీరదాల క్యూరేటర్ మిండీ ఆల్బ్రైట్ తెలిపారు. ఏనుగులు తమ పాదాల ద్వారా భూకంప కార్యకలాపాలను గ్రహించగలవని, ఆయా జంతువులకు ముందుగానే తెలిసిపోతుందని వెల్లడించారు. సుమారు గంట తర్వాత భూప్రకంపనలు రావడంతో ఆ గుంపు మరోసారి రక్షణ వలయాన్ని ఏర్పరిచింది. ముప్పేమీ లేదని నిర్ణయించుకున్నాకే విశ్రాంతి తీసుకుంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
జర్మనీలో కిల్లర్ డాక్టర్
బెర్లిన్: తన వద్ద చికిత్స పొందుతున్న రోగులను కంటికి రెప్పలా సంరక్షించాల్సిన ఓ వైద్యుడు వారిని కిరాతకంగా హత్య చేశాడు. వైద్య వృత్తికే మచ్చ తెచ్చాడు. ఏకంగా 15 మంది రోగుల ప్రాణాలు బలి తీసుకున్నాడు. ఈ ఘటన జర్మనీలో చోటుచేసుకుంది. హంతక డాక్టర్‌పై దర్యాప్తు కొనసాగుతోంది. 40 ఏళ్ల ఆ డాక్టర్ 2021 సెపె్టంబర్ నుంచి 2024 జూలై వరకు 15 హత్యలు చేశాడు. బాధితుల్లో 12 మంది మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. వారి వయసు 25 నుంచి 94 ఏళ్ల దాకా ఉంది. చాలామంది వారి సొంత ఇళ్లల్లోనే హత్యకు గురయ్యారు. చికిత్స పేరిట రోగుల ఇళ్లకు చేరుకొని ప్రమాదకరమైన డ్రగ్స్‌ను ఇంజెక్షన్ రూపంలో ఇచ్చినట్లు గుర్తించారు. దీంతో శ్వాస ఆగిపోయి నిమిషాల వ్యవధిలోనే రోగులు ప్రాణాలు విడిచారు. బాధితుల ఇళ్లకు నిప్పు పెట్టడం ద్వారా సాక్ష్యాధారాలను మాయం చేసేందుకు కిల్లర్ డాక్టర్ ప్రయత్నించినట్లు తేలింది. తొలుత నలుగురి మృతిపై అనుమానం రాగా అధికారులు దర్యాప్తు చేపట్టారు. కానీ, డాక్టర్ చేతిలో 15 మంది హత్యకు గురైనట్లు వెల్లడయ్యింది. అయితే, అతడు ఈ హత్యలు ఎందుకు చేశాడన్నది తెలియరాలేదు. హంతకుడు తన నేరం ఒప్పుకోవడం లేదని సమాచారం. నిబంధనల ప్రకారం గోప్యత దృష్ట్యా అతడి పేరును ఇంకా బయటపెట్టలేదు. గత ఏడాది ఆగస్టు 6వ తేదీ నుంచి కస్టడీలో ఉన్నాడని, విచారణ కొనసాగుతోందని అధికారులు బుధవారం వెల్లడించారు. జర్మనీలో హత్య కేసుల్లో సాధారణంగా యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు. -
కెనడా వర్సిటీల వైపు అమెరికా విద్యార్థుల చూపు
అమెరికాలో విద్యార్థులు ఇప్పుడు కెనడా వైపు దృష్టి సారించారు. ట్రంప్ విధానాల నేపథ్యంలో కెనడియన్ విశ్వవిద్యాలయా లు అమెరికా విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేయ డం, యూనివర్సిటీ నిధులను తగ్గించడంవంటి చర్యల ఫలితంగా.. యూనివ ర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొ లంబియా (యూబీసీ), యూనివర్సిటీ ఆఫ్ టొరంటో, యూనివర్శిటీ ఆఫ్ వాటర్లూ వంటి కెనడియన్ విశ్వవిద్యాలయాలకు అమెరికా విద్యార్థుల దరఖాస్తులు పెరిగాయి. వాంకోవర్‌లో ఉన్న యూబీసీ క్యాంపస్‌లో 2024తో పోలిస్తే మార్చి1 నాటికి యూఎస్ పౌరుల నుంచి గ్రాడ్యుయేషన్ దరఖాస్తుల్లో 27% పెరుగుదల నమోదైంది. ఈ సంస్థ కొన్ని ప్రోగ్రామ్స్ కోసం అడ్మిషన్లను ఈవారం కూ డా తిరిగి తెరిచింది. ఈ నేపథ్యంలో సెపె్టంబర్ 2025 నాటికి యూఎస్ విద్యార్థుల నుంచి దరఖాస్తుల సంఖ్య పెరగవచ్చని భావిస్తున్నారు. టొరంటో విశ్వవిద్యాలయానికి కూడా సాధారణం కంటే ఎక్కువ సంఖ్యలో యూఎస్ నుంచి దరఖాస్తులు వచ్చాయి. వాటర్లూ విశ్వవిద్యాలయంలో, సెపె్టంబర్ 2024 నుంచి యూఎస్ వెబ్ ట్రాఫిక్ 15% పెరిగింది. ఎక్కువ మంది అమెరికన్ విద్యార్థులు క్యాంపస్‌ను వ్యక్తిగతంగా సందర్శిస్తున్నారని కూడా నివేదికలు చెబుతున్నాయి. ఈ ఆకర్షణకు కారణాలు.. ట్రంప్ ప్రభుత్వం హఠాత్తుగా వీసాలను రద్దు చేయడం, విదేశీ విద్యార్థుల సోష ల్ మీడియా కార్యకలాపాలను పర్యవేక్షించడం, కాలేజీలకు ఫెడరల్ ఫండింగ్ తగ్గించడం ఇందుకు కారణమని అధికారులు భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ పలువురు విద్యార్థులు, కుటుంబాల్లో భవిష్యత్తుపై భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. స్టూడెంట్ వీసాలు, యూనివర్సిటీ ఫండింగ్పై అమెరికాలో నిరసనలు, దావాలు ఎదుర్కొంటున్న సమయంలో కెనడా విద్యకు మరింత స్థిరమైన, స్నేహపూర్వక గమ్యస్థానంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడా కొన్ని పరిమితులున్నాయి. తమ దేశంలోకి ప్రవేశించే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యపై కెనడా ప్రభుత్వం కూడా పరిమితి విధించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ పెరిగిన క్యాంపస్ టూర్లు.. యూబీసీలో యూఎస నుంచి అండర్ గ్రాడ్యుయేయేషన్ అప్లికేషన్లు కేవలం 2% మాత్రమే పెరిగినా, అమెరి కన్–నిర్దేశిత క్యాంపస్ టూర్లు మాత్రం 20% పెరిగాయి. ఆసక్తి పెరుగుతోందని, ఎక్కువ మంది విద్యార్థులు కెనడియన్ విశ్వవిద్యాలయాలను వాస్తవ అవకాశంగా చూస్తున్నారని ఇది సూచిస్తుంది. తమ క్యాంపస్‌లకు అంతర్జాతీయ విద్యార్థులను పంపే మొదటి మూడు దేశాల్లో అమెరికా ఇప్పటికే ఒకటి అని యూబీసీ వార్షిక నివేదిక పేర్కొంది. ఇప్పటికే సుమారు 1,500 మంది యూఎస్ విద్యార్థులు యూబీసీలో గ్రాడ్యుయేషన్, అండర్‌గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు. -
వాన్స్ భారత పర్యటన ఖరారు
న్యూఢిల్లీ: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య, తెలుగమ్మాయి ఉషా వాన్స్ వచ్చే వారం భారత్‌లో పర్యటించనున్నారు. ఉన్నత స్థాయి అధికారుల బృందంతో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు భారత్‌లో పర్యటించనున్నారని ఆయన కార్యాలయం బుధవారం ప్రకటించింది. ఈ సందర్భంగా 21న ప్రధాని మోదీతో సమావేశమవుతారని పేర్కొంది. ఆర్థిక, భౌగోళిక రాజకీయ అంశాలను చర్చించనున్నారని ఢిల్లీలోని అమెరికా ఎంబసీ తెలిపింది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉందని తెలిపింది. ట్రంప్ యంత్రాంగం టారిఫ్‌ల మోతెక్కిస్తూ ప్రపంచ వాణిజ్య యుద్ధానికి తెరతీసిన నేపథ్యంలో జరుగుతున్న ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. వాన్స్, సెకండ్ లేడీ ఉష తమ పిల్లలు ఇవాన్, వివేక్, మిరాబెల్‌లతో కలిసి జైపూర్, ఆగ్రాలోని ప్రముఖ ప్రాంతాలను సందర్శించనున్నారని వెల్లడించింది. వాన్స్ పర్యటనలో అధికారిక కార్యక్రమాలున్నా వ్యక్తిగత అంశాలకే ఎక్కువ ప్రాధాన్యముంటుందని సమాచారం. ఉష వాన్స్ తెలుగమ్మాయి అన్నది తెలిసిందే. ఈమె తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు. అమె రికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబార్డ్ ఇటీవలే భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. -
వీసాల రద్దు అన్యాయం
న్యూయార్క్: అధికారులు తమ స్టూడెంట్ వీసాలను అన్యాయంగా రద్దు చేశారంటూ భారతీయ విద్యార్థి సహా నలుగురు అమెరికా కోర్టులో కేసువేశారు. అధికారులు తమను నిర్బంధించి, సొంత దేశాలకు బలవంతంగా పంపించే అవకాశముందని వారు ఆరోపించారు. వీసాలను పొడిగించి, చదువులు పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండనివ్వాలని భారత్‌కు చెందిన చిన్మయ్ డియోరా, నేపాల్ వాసి యోగేశ్ జోషి, చైనా విద్యార్థులు జియాంగ్యున్ బు, క్వియువి యంగ్ కోరారు. వీరిలో చిన్మయ్ డియోరా.. వేన్ స్టేట్ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. హోంల్యాండ్ డిపార్టుమెంట్(డీహెచ్ఎస్), ఇమిగ్రేషన్ అధికారులు తమకు ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే ఆన్లైన్లో స్టూడెంట్ అండ్ ఎక్సే్ఛంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(ఎస్ఈవీఐఎస్)లో స్టూడెంట్ ఇమిగ్రేషన్ స్టేటస్‌ను రద్దు చేశారని ఆరోపించారు. ఎలాంటి కారణం చూపకుండా, నోటీసు ఇవ్వకుండా ప్రభుత్వం వీసా రద్దు చేయడంపై వీరి తరఫున తాము మిషిగన్ కోర్టులో కేసు వేశామని అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్(ఏసీఎల్యూ) తెలిపింది. వీరిపై ఎలాంటి కేసులు లేవని, వలస చట్టాలను వీరు ఉల్లంఘించలేదని పేర్కొంది. ఎఫ్–1 వీసాల రద్దు కారణాలపై సంబంధిత వర్సిటీలకు ఎలాంటి వివరణ కూడా అధికారులు ఇవ్వలేదని తెలిపింది. ట్రాఫిక్ చలాన్లు, రాంగ్ పార్కింగ్, గతంలో అధికారులతో గొడవ పడిన ఘటనలను సాకుగా చూపుతూ విద్యార్థులను బలవంతంగా పంపేయడం తగదని పేర్కొన్నారు. ఇదే అంశంపై న్యూహాంప్‌షైర్, ఇండియానా, కాలిఫోర్నియా రాష్ట్రాల్లోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. -
స్టైòపెండ్తో పాటు విమాన టికెట్
వాషింగ్టన్: అమెరికాలోని అక్రమ వలసదారుల పట్ల కఠిన వైఖరి ఆవలంబిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్తంత మెత్తబడ్డారు. ‘సెల్ఫ్–డిపోర్ట్’ఆప్షన్ ఎంచుకునే వలసదారులకు విమాన టికెట్లు కొనివ్వడంతోపాటు స్టైఫండ్‌గా కొంత డబ్బు కూడా అందజేయాలనే యోచన ఉన్నట్లు ట్రంప్ తెలిపారు. ఇది అన్ని దేశాల వలసదారులకూ వర్తిస్తుందన్నారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ విషయం వెల్లడించారు. ప్రస్తుతం హంతకులను మాత్రమే దేశం నుంచి పంపించివేస్తున్నామంటూనే ఆయన.. అక్రమంగా ఉంటున్న ఇతరులకు సాయప డేందుకు ‘సెల్ఫ్–డిపోర్టేషన్ ప్రోగ్రామ్’ను అమలు చేయనున్నామన్నారు. సొంత దేశాలకు వెళ్లాక వీరిలో సత్ప్రవర్తన కలిగి ఉన్న వారిని తిరిగి అమెరికాకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. అయితే, ఈ పథకాన్ని ఎప్పటి నుంచి వర్తింపజేస్తారు, ఇతర వివరాలను ఆయన వెల్లడించలేదు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు ట్రంప్ జనవరిలో అధ్యక్ష బాధ్యతలను చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులను నిర్బంధించి, వారిని బలవంతంగా సొంత దేశాలకు పంపిస్తున్న విషయం తెల్సిందే. ఇంటర్వ్యూ సందర్భంగా ఫాక్స్ న్యూస్ యాంకర్ రాచెల్ కంపోస్–డఫీ మెక్సికో వాసి వీడియో క్లిప్‌ను ప్రదర్శించారు. ‘నేను ట్రంప్‌కు ఓటేయలేదు. అయినప్పటికీ నా మద్దతు ట్రంప్‌కే. నేరాలకు పాల్పడిన వారిని, నాతో సహా ఎవరినైనా సరే సొంత దేశాలకు పంపించడంలో తప్పులేదు’అని ఆ వ్యక్తి తెలిపాడు. ఇరవయ్యేళ్ల క్రితం వచ్చిన ఈ వ్యక్తి ఇప్పుడు అమెరికా పౌరుడు..భార్య, పిల్లలు కూడా ఉన్నారని యాంకర్ డఫీ వివరించారు. ఇది చూసిన ట్రంప్..తమకు కావల్సింది ఇలాంటి వాళ్లేనన్నారు. అతడికి డిపోర్టేషన్ ముప్పు ఉన్నట్లు భావించడం లేదన్నారు. అవసరమైన సిబ్బందిని నియమించుకునే అవకాశం ఇవ్వడం ద్వారా హోటళ్లు, వ్యవసాయ క్షేత్రాల యజమానులకు సాయం చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వాళ్లు సొంత దేశాలకు వెళ్లిపోయి, తిరిగి చట్టబద్ధంగా అమెరికా రావాలన్నదే తన ఉద్దేశమన్నారు. అయితే, ఇందుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదీ ఆయన వెల్లడించలేదు. -
చైనాపై సుంకాలు 245%
వాషింగ్టన్/బీజింగ్: ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం నానాటికీ భీకరంగా మారుతోంది. బోయింగ్ విమానాల డెలివరీపై నిషేధం విధించినందుకు చైనాపై అమెరికా ప్రభుత్వం వెంటనే ప్రతీకార చర్యలకు దిగారు. చైనా ఉత్పత్తులపై టారిఫ్‌లను ఏకంగా 245 శాతానికి పెంచుతున్నట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ఫ్యాక్టషీట్ విడుదల చేసింది. అరుదైన ఖనిజాలు, వాటి ఉత్పత్తుల కోసం విదేశాలపై విపరీతంగా ఆధారపడడం వల్లే తలెత్తే భద్రతాపరమైన ప్రమాదాలపై విచారణకు ఆదేశిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారని వెల్లడించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థను మరోసారి అత్యున్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ‘అమెరికా ఫస్ట్ ట్రేడ్ పాలసీ’ని మొదటి రోజే ప్రారంభించారని గుర్తుచేసింది. నూతన వాణిజ్య ఒప్పందాలు, సుంకాలపై 75కు పైగా దేశాలు అమెరికాతో చర్చలకు ముందుకొచ్చాయని పేర్కొంది. అందుకే ఆయా దేశాలపై సుంకాలను వాయిదా వేసినట్లు వెల్లడించింది. చైనాపై మాత్రం ప్రతీకార సుంకాలు కొనసాగుతాయని తేల్చిచెప్పింది. చైనా ఉత్పత్తులను ఇకపై అమెరికాలో విక్రయించాలంటే 245 శాతం సుంకాలు చెల్లించాల్సి ఉంటుందని ఫ్యాక్ట్‌షీట్‌లో స్పష్టంచేసింది. చైనా–అమెరికా మధ్య కొంతకాలంగా టారిఫ్‌ల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చైనా ఉత్ప త్తులపై అమెరికా ఇప్పటికే 145 శాతం టారిఫ్‌లు విధించింది. అమెరికా నుంచి బోయింగ్ విమానాల కొనుగోలుపై నిషేధం విధించిన మరుసటి రోజే టారిఫ్‌లను అదనంగా 100 శాతం పెంచడం గమనార్హం. బోయింగ్ విమానాలు కొనుగోలు చేయవద్దని చైనా నిర్ణయించడం పట్ల డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒప్పందం నుంచి మధ్యలో విరమించుకోవడం సరైంది కాదంటూ మంగళవారం సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రత్యర్థులతో జరుగుతున్న వాణిజ్య యుద్ధంలో అమెరికా ప్రయోజనాలు కచ్చితంగా కాపాడుకుంటామని ఉద్ఘాటించారు. టారిఫ్ వార్‌ను ముగించే విషయంలో చైనాతో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. ఆ అవసరం చైనాకు మాత్రమే ఉందన్నారు. ప్రస్తుతం బంతి చైనా కోర్టులోనే ఉందని వెల్లడించారు.చర్చల సంధానకర్తగా లీ చెంగాంగ్ నియామకం టారిఫ్ యుద్ధాన్ని విరమించే విషయంలో బంతి చైనా కోర్టులో ఉందని డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేసిన నేపథ్యంలో చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాతో చర్చలకు మొగ్గుచూపింది. చర్చల కోసం సంధానకర్తగా లీ చెంగాంగ్‌ను నియమించింది. వాంగ్ షౌవెన్ స్థానంలో లీ చెంగాంగ్‌ను నియమిస్తున్నట్ల చైనా వాణిజ్య శాఖ బుధవారం ప్రకటించింది. 2020లో అమెరికా, చైనా మధ్య జరిగిన వాణిజ్య చర్చల్లో చెంగాంగ్ పాల్గొన్నారు. ఆయన గతంలో ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ)లో చైనా రాయబారిగా సేవలందించారు. -
అమెరికా వీసాలు.. కొందరి అదృష్టం
వాషింగ్టన్: అమెరికా వీసా విధానంపై కఠిన వైఖరిని విదేశాంగ మంత్రి మార్కో రూబియో సమర్థించుకున్నారు. ‘‘అమెరికా వీసాలు (US Visas) హక్కు కాదు. కొందరికి మాత్రమే లభించే అదృష్టం. మా చట్టాలు, విలువలను గౌరవించే వారికే అమెరికాలో ప్రవేశం ఉంటుంది’’ అని స్పష్టం చేశారు. వలస నిబంధనలను మరింత కఠినతరం చేస్తామన్నారు. అమెరికా వర్సిటీల్లోని పాలస్తీనా (Palestine) అనుకూల విద్యార్థులపై చర్యల నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు.వీసాదారులంతా తమ అర్హత ప్రమాణాలను నిరంతరం అందుకుంటూ ఉండాల్సిందేనన్నారు. లేదంటే వాటిని రద్దు చేయాల్సి రావచ్చని హెచ్చరించారు. ‘‘అమెరికాకు ఎవరు రావచ్చో, ఎవరు రాకూడదో చట్టాలు స్పష్టంగా ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారమే ప్రతి వీసా దరఖాస్తునూ పరిశీలిస్తారు. ఉగ్రవాద కార్యకలాపాలను సమర్థించేవారు, అందుకు ఇతరులను ఒప్పించే వ్యక్తులు సైతం యూఎస్ వీసాలకు అనర్హులు’’ అన్నారు.గతేడాది అమెరికా (America) వర్సిటీల క్యాంపస్‌లలో జరిగిన ఘటనలను మార్కో రూబియో (Marco Rubio) ప్రస్తావించారు. అమెరికాలో 11 లక్షలకు పైగా విదేశీ విద్యార్థులున్నారు. ‘‘నిరసనల సందర్భంగా వారిలో పలువురు క్యాంపస్‌లను మూసేశారు. యూదు విద్యార్థులను వేధించారు. రహదారులను దిగ్బంధించారు. భవనాలనూ ముట్టడించారు’’ అని రూబియో చెప్పుకొచ్చారు. ‘‘ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. వీసా ఉల్లంఘనల విషయంలో విదేశీయులకు రాజ్యాంగ రక్షణ వర్తించదు’’ అన్నారు. చదవండి: అమెరికాలో కొత్త టెన్షన్.. వారి వీసా రద్దు -
గుడ్ న్యూస్ చెప్పిన చైనా, ఏకంగా 85వేల వీసాలు
ఆంక్షలు, టారిఫ్‌లు అంటూ ప్రపంచ దేశాలను ముఖ్యంగా చైనాకు అమెరికా చుక్కలు చూపిస్తోంది. దీంతో చైనా ఇండియాతో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రజల మధ్య సంబంధాలను పునరుద్ధరించే లక్ష్యంతో తాజాగా చైనా (China) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు, భారతీయులకు 85 వేల వీసాల(China Visas)ను జారీ చేసినట్లు చెప్పింది. చైనా రాయబారి జు ఫీహాంగ్ ఎక్స్‌లో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. భారతీయ సందర్శకులకు ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, చైనా అనేక వీసా సడలింపులను ప్రవేశపెట్టింది.ఇండియా-చైనా దేశాల మధ్య ఏర్పడుతున్న దృఢమైన బంధానికి ఇది నిదర్ణమని స్పష్టం చేసింది. చైనాకు వస్తున్నన్న 85 వేల ఇండియన్లకు వీసాలు ఇచ్చినట్లు జూ ఫీహంగ్ తెలిపారు. తమన దేశంలో పర్యటించాల్సిందిగా ఎక్కువ మంది భారతీయ మిత్రులను కోరుతున్నట్లు వెల్లడించారు. భారత్, చైనా మద్య ట్రావెల్‌ను ఈజీ చేసేందుకు అనేక సదుపాయాలు కల్పించినట్లు చైనీస్ ప్రభుత్వం చెప్పింది.చదవండి: అపుడు స్టార్ యాక్టర్.. వరుస ఓటములు, అయినా తండ్రి మాటకోసం!అంతేకాదు వీసాకోసం దరఖాస్తుదారులు ఇకపై ఆన్లైన్ అపాయింట్మెంట్లను బుక్ చేసుకోవలసిన అవసరం లేదనీ, ఇప్పుడు పని దినాలలో వీసా కేంద్రాలలోకి నేరుగా తమ దరఖాస్తులను అందచేయ వచ్చని కూడా చైనా ప్రకటించింది. చాలా తక్కువ టైం కోసం చైనా వెళ్లే వారు బయోమెట్రిక్ డేటాను సమర్పించాల్సిన అవసరం లేదు. ఇది దరఖాస్తు ప్రక్రియను వేగవంతం చేస్తుంది అలాగే చాలా తక్కువ ధరకే చైనా వీసాను అందిస్తున్నట్లు చెప్పారు. కొనసాగుతున్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ సాంస్కృతిక, వ్యాపార విద్యా సంబంధాలను విస్తృతం చేయడానికి రెండు దేశాలు ప్రయత్నాల మధ్య ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.చదవండి: ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక దాడి, వెంటిలేటర్‌పై ఉండగానే అమానుషం! -
భారతీయ ఫేమస్ వంటకాన్ని మెచ్చిన జపాన్ రాయబారి..!
మన భారతీయ వంటకాలు విదేశీయలు మెచ్చుకోవడం కొత్తేం కాదు. కానీ ప్రముఖులు, అత్యున్నత హోదాలో ఉన్నవాళ్లు ఇతర దేశాల ప్రముఖ వంటకాలను రుచి చూస్తే మాత్రం..వెంటనే వాళ్లపై గౌరవం పెరుగుతుంది. అదీగాక ఆ వంటకం టేస్ట్‌ని మెచ్చుకుంటే..ఇక ఆ ఆనందం వేరెలెవెల్. అచ్చం అలాంటి సందర్భమే ఇక్కడ చోటుచేసుకుంది. భారతదేశం పర్యటనలో ఉన్న జపాన్ రాయబారి కైచి ఓనో బిహార్ పేమస్ వంటకమైన 'లిట్టి చోఖా'ని రుచి చూశారు. లిట్టి చోఖా ప్రపంచ వంటకాల్లోని తనదైనముద్ర వేసిన విలక్షణమైన వంటకం ఇది. భూటాన్, భారత్‌లలో సేవలందిస్తున్న జపాన్ రాయబారి కైచి ఓ రెస్టారెంట్లో బిహారి వంటకాలను రుచి చూశారు. టేబుల్‌పై అందంగా ఒక బౌల్లో ఆకర్షణీయంగా అమర్చిన రైస్, పెరుగు, చేపల ఫ్రై, వాటితోపాట ఈ లిట్టి చోఖా రెసిపీ కూడా ఉంది. అందుకు సంబంధించిన ఫోటోని సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ.."నమస్తే బిహార్..చివరికి బిహార్ ప్రముఖ వంటకం లిట్టు చోఖాను రుచి చూసే అవకాశం లభించింది." అని పోస్ట్‌పెట్టారు. అంతేగాదు ఆ పోస్ట్‌లో జపాన్ రాయబారి బిహారీ మాండలికాన్ని ప్రదర్శిస్తూ..“గజబ్ స్వాద్ బా” అని కితాబు కూడా ఇచ్చేశారు. ఇక్కడ గజబ్ స్వాద్ బా అంటే గొప్ప రుచి అని అర్థం. ఇది ఆహార ప్రియులను ఎంతగానో ఆకర్షించడమే గాక ఆశ్చర్యపరిచింది కూడా.ఏంటీ 'లిట్టి చోఖా ' :బిహారీ సంప్రదాయ వంటకం ఇది. దీన్ని స్టఫ్డ్ బేక్డ్ హోల్ వీట్ బాల్స్ అని కూడా అంటారు. ఇది చాలా రుచికరమైన, పోషక వంటకం. గోధుమ పిండి బంతిలో సుగంధద్రవ్యాలతో కూడిన మసాల ఉంచి సైడ్ డిష్‌గా కూరగాయలతో చేసిన కర్రీని అందిస్తారు. అలాగే ఇక్కడ జపాన్‌తో బీహార్ చాలా లోతైన ఆధ్యాత్మిక సాంస్కృతిక సంబంధాన్ని కలిగి ఉంది. అందులోనూ ఇది బుద్ధుని భూమి కావడంతో జపాన్ వాసులకు ఎంతో ఇష్టమైన ప్రదేశంగా పేరుగాంచింది.Namaste, Bihar!Finally had the chance to try the world-famous Litti Chokha—Gajab Swad Ba!👍 pic.twitter.com/DTzqStRsUn— ONO Keiichi, Ambassador of Japan (@JapanAmbIndia) April 14, 2025 (చదవండి: వేసవి తాపం నుంచి రక్షించే సహజ ఆరోగ్య పానీయాలివే..!) -
అమెరికాలో కొత్త టెన్షన్.. వారి వీసా రద్దు
వాషింగ్టన్: దేశ వ్యతిరేక భావజాలం నింపుకున్న వాళ్లకు అమెరికాలో నిలువనీడ లేదని ఇప్పటికే చాటిన ట్రంప్ సర్కార్ పలు విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థుల వీసాల రద్దు పర్వాన్ని కొనసాగిస్తోంది. శాస్త్రసాంకేతిక పరిశోధనా విద్యలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ది మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) విశ్వవిద్యాలయం పైనా ఈ వీసాల రద్దు ప్రభావం పడింది.ఇప్పటికే పలు వర్సిటీల్లో విద్యార్థులతోపాటు పరిశోధకులు, బోధనా, బోధనేతర సిబ్బందిపైనా వీసాల రద్దు వేటువేసిన రిపబ్లికన్ ప్రభుత్వం కనీసం ఎందుకు వీసా రద్దు చేస్తున్నారో చెప్పకపోవడం దారుణమని ఎంఐటీ వర్సిటీ పేర్కొంది. తమ వర్సిటీలో 9 మంది విదేశీ విద్యార్థుల వీసాలను కారణం చూపకుండానే రద్దుచేశామని వర్సిటీ తాజాగా వెల్లడించింది. అమెరికాలో సీబీఎస్ మీడియాసంస్థ సమాచారం మేరకు ఇప్పటిదాకా అక్కడి 88 కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో దాదాపు 530 మంది విద్యార్థులు, సిబ్బంది, పరిశోధకుల వీసాలను ట్రంప్ ప్రభుత్వం ఆకస్మికంగా రద్దుచేసింది. తమ వర్సిటీలో విదేశీ విద్యార్థుల వీసాల రద్దుపై ఎంఐటీ వర్సిటీ అధ్యక్షురాలు సలీ కార్న్‌బ్లూత్ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.వర్సిటీ వర్గాలకు ఈ మేరకు సోమవారం ఆమె ఒక లేఖ రాశారు. ‘‘ఏప్రిల్ 4వ తేదీ తర్వాత హఠాత్తుగా విద్యార్థుల చదువులను కాలరాస్తూ తీసుకున్న ఈ విధానాలు ఏమాత్రం ఆమోదనీయం కాదు. కనీసం ముందస్తు సమాచారం ఇవ్వలేదు. వీసాల రద్దుకు కారణం చెప్ప లేదు. అత్యంత ప్రతిభావంతులైన విదేశీ విద్యార్థులను ఆకర్షించగల వర్సిటీ సామర్థ్యాన్ని ఈ నిర్ణయాలు దెబ్బతీస్తాయి. వర్సిటీ కార్యకలాపాలూ కుంటుపడతాయి. అప్పుడు అంతర్జాతీయంగా వర్సిటీల్లో శాస్త్రసాంకేతిక పరిశోధనలకు సంబంధించి మా వర్సిటీలో ప్రపంచ అగ్రగామిగా కొనసాగడం కష్టసాధ్యమవుతుంది. నూతన పరిశోధనలు, ఆవిష్కరణలతో దేశాన్ని మరింత సుసంపన్నం చేసే క్రతువు కుంటువుడుతుంది’’ అని ఆమె అన్నారు.పరిశోధనా వ్యయాలకు పరిమితిపైనా వర్సిటీల ఆగ్రహం అధునాతన అధ్యయనాలకు సంబంధించిన పరోక్ష పరిశోధనా వ్యయాలను పరిమితం చేసుకోవాలని ప్రభుత్వ ఇంధన శాఖ ప్రకటించడంపై వర్సిటీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. పరోక్ష పరిశోధనా ఖర్చులు ఎంత పెరిగినాసరే ప్రభుత్వం మాత్రం 15 శాతం మాత్రమే రీయింబర్స్ చేస్తుందని పేర్కొనడాన్ని వర్సిటీలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. విద్యాసంస్థలకు నిధులు తగ్గిస్తే ఆయా విభాగాల సిబ్బందికి జీతభత్యాల చెల్లింపు దాదాపు ఆగిపోతుందని వర్సిటీలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ(డీఓఈ)పై బోస్టన్ ఫెడరల్ కోర్టులో ప్రిన్స్టన్, కాల్టెక్, ఇల్లినాయీ, ఎంఐటీ వర్సిటీలు కోర్టులో దావా వేశాయి. -
ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం.. భారత్‌లోనూ ప్రకంపనలు
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున హిందూకుష్ ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 6.9 తీవ్రతతో భూమి కంపించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. అయితే, దీని ప్రకంపనలు భారత్‌ను తాకాయి.వివరాల ప్రకారం.. ఆఫ్ఘనిస్థాన్‌లో హిందూకుష్ ప్రాంతం కేంద్రంగా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై 6.9 తీవ్రతతో భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇక, ఈ భూకంప తీవ్రత ప్రకంపనలు భారత్‌ను తాకాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. 55 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. భూకంపానికి సంబంధించి వీడియోలను నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.A 6.1 magnitude earthquake shook the Hindu Kush region of Afghanistan, and another 6.9 magnitude earthquake shook Tajikistan. pic.twitter.com/HcvpzSd0Cl— Niv Calderon (@nivcalderon) April 16, 2025 -
బోయింగ్‌పై నిషేధం!
బీజింగ్/బ్యాంకాక్: ప్రతీకార సుంకాల బాట పట్టిన ట్రంప్‌కు చైనా చుక్కలు చూపిస్తోంది. ఆయనకు దిమ్మతిరిగేలా రోజుకో నిర్ణయం తీసుకుంటోంది. ఆ క్రమంలో అమెరికా వైమానిక దిగ్గజం బోయింగ్‌ను చైనా అనధికారికంగా బ్లాక్ లిస్ట్‌లో పెట్టేసింది. ఆ సంస్థ నుంచి విమానాల డెలివరీలు తీసుకోవద్దని, కొత్తగా ఎలాంటి ఆర్డర్లూ ఇవ్వొద్దని దేశీయ విమానయాన సంస్థలకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. అంతేగాక అమెరికా కంపెనీల నుంచి ఎలాంటి వైమానిక పరికరాలు, విడిభాగాలనూ కొనుగోలు చేయొద్దని కూడా పేర్కొంది.ఈ నిర్ణయంతో బోయింగ్ విమానాల నిర్వహణ భారంగా మారకుండా దేశీయ ఆపరేటర్లను ఆదుకుంటామని హామీ ఇచ్చింది. బ్లూంబర్గ్ కథనం ఈ మేరకు వెల్లడించింది. ఇప్పటికే తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన బోయింగ్ పరిస్థితి చైనా నిర్ణయంతో పెనం నుంచి పొయ్యిలో పడింది. ఆ సంస్థకు అతి పెద్ద మార్కెట్ చైనాయే. అయితే అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కొన్నేళ్లుగా బోయింగ్‌కు చైనా కొత్త ఆర్డర్లేవీ ఇవ్వడం లేదు. బోయింగ్ నుంచి చివరిసారిగా 2018లో విమానాలు కొనుగోలు చేసింది. -
ట్రంప్‌కు కీలెరిగి వాత
అరుదైన ఖనిజాల ఎగుమతుల నిలిపివేత ద్వారా అమెరికాను చైనా నేరుగా కుంభస్థలంపైనే కొట్టిందని పరిశీలకులు అంటున్నారు. దీని ప్రభావం అమెరికా రక్షణ శాఖపై భారీగా ఉండనుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఫైటర్ జెట్లు తదితరాల తయారీని ఇది తీవ్రంగా ప్రభావితం చేయడం ఖాయంగా కన్పిస్తోంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న మొత్తం అరుదైన ఖనిజాల్లో ఏకంగా 70 శాతం వాటా చైనాదే! అమెరికా వాటా 11.4 శాతం.కానీ దేశీయ, ముఖ్యంగా రక్షణ అవసరాలను తీర్చేందుకు ఆ నిల్వలు ఏ మూలకూ చాలవు. మలేసియా, జపాన్ సహా పలు దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నా అవి 30 శాతం అవసరాలనే తీర్చగలుగుతున్నాయి. దాంతో మరో దారిలేక అగ్ర రాజ్యం ఇంతకాలంగా చైనా దిగుమతులపైనే ప్రధానంగా ఆధారపడుతూ వస్తోంది. తన అరుదైన ఖనిజ అవసరాల్లో 70 శాతం అక్కడినుంచే దిగుమతి చేసుకుంటోంది. చైనా ఇప్పుడు సరిగ్గా గురి చూసి ఆ కీలకమైన సరఫరా లింకును మొత్తానికే తెగ్గొట్టింది.17 రకాల అరుదైన ఖనిజాల్లో సమారియం, గాడోలినియం, టెర్బియం, డైస్పోరియం, లుటేటియం, స్కాండియం, ఇత్రియం రూపంలో ప్రస్తుతానికి ఏడింటికి ఎగుమతుల నిషేధాన్ని వర్తింపజేసింది. వీటితో పాటు పలు కీలక లోహాలు, అయస్కాంత వస్తువులను కూడా ఈ జాబితాలో చేర్చింది. ఇకపై చైనా కంపెనీలు వీటిని ఎగుమతి చేయాలంటే ప్రత్యేక లైసెన్సులు తీసుకోవాల్సిందే. చైనా నిర్ణయం పలు అమెరికానే గాక చాలా దేశాలనూ ప్రభావితం చేయనుంది. ముఖ్యంగా యూరప్ దేశాలకైతే పిడుగుపాటే. వాటి అరుదైన ఖనిజాల అవసరాల్లో సగటున 46 శాతం దాకా చైనా దిగుమతులపైనే ఆధారపడుతున్నాయి.అనుమానమే నిజమైందిఅత్యంత కీలకమైన ఖనిజ అవసరాల కోసం చైనాపై ఆధారపడటం ఎప్పటికైనా ప్రమాదమేనని అమెరికా రక్షణ శాఖ ముందునుంచీ మొత్తుకుంటూనే ఉంది. ఇది జాతీయ భద్రతకే ముప్పని 2024 మార్చి 11న అధ్యక్షునికి పంపిన ఓ నోట్లో స్పష్టంగా పేర్కొంది కూడా. ఈ విషయంలో అమెరికాతో పాటు ప్రపంచ దేశాల్లో చాలావరకు చైనామీదే ఆధారపడాల్సి రావడంపై తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. ఆ భయాలే ఇప్పుడు నిజమయ్యాయి. రక్షణ పాటవం పెంచుకోవడంలో అమెరికా, చైనా కొన్నేళ్లుగా నువ్వా, నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి.కీలక ఖనిజాలపై ఆంక్షలతో ఈ పోటీలో అగ్ర రాజ్యాన్ని దాటి చైనా దూసుకెళ్లేలా కన్పిస్తోంది. ఈ సమస్యను అధిగమించే మార్గాలపై అమెరికా రక్షణ శాఖ కొంతకాలంగా గట్టిగా దృష్టి సారించింది. దేశీయంగా అరుదైన ఖనిజాల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఇతోధికంగా పెంచుకునేలా ‘మైన్ టు మాగ్నెట్’ పేరిట ఐదేళ్ల ప్రణాళికను సిద్ధం చేసింది. కానీ ఆలోగా జరిగే అపార నష్టాన్ని భర్తీ చేసుకునే మార్గాంతరాలు కన్పించక ట్రంప్ సర్కారు తలపట్టుకుంటోంది.అన్నింట్లోనూ అవే కీలకంఫైటర్ జెట్లు మొదలుకుని కీలకమైన రక్షణ వ్యవస్థలన్నింట్లోనూ అరుదైన ఖనిజాలది కీలక పాత్ర. ఎఫ్–35 యుద్ధ విమానాలు, వర్జీనియా–కొలంబియా శ్రేణి జలాంతర్గాములు, తోమహాక్ క్షిపణులు, రాడార్ వ్యవస్థలు, ప్రిడేటర్ శ్రేణి మానవరహిత వైమానిక వాహనాలు, మ్యునిషన్ సిరీస్ స్మార్ట్ బాంబులు... ఇలా దేని తయారీకైనా అవి కావాల్సిందేనని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ వివరించింది.⇒ ఒక ఎఫ్–35 యుద్ధ విమానం తయారీకి 900 పౌండ్ల (400 కిలోల) మేరకు అరుదైన ఖనిజాలు కావాలి.⇒ అర్లే బ్రూక్ శ్రేణి డీడీజీ–51 డిస్ట్రాయర్ యుద్ధనౌక తయారీకి ఏకంగా 5,200 పౌండ్లు (2,300 కిలోలు) అవసరం.⇒ అదే వర్జీనియా శ్రేణి జలాంతర్గామి నిర్మాణానికి 9,200 పౌండ్ల (4,173 కిలోల) అరుదైన ఖనిజాలు అవసరం.ఆందోళనకరమే⇒ ఖనిజాలపై చైనాతో చర్చిస్తాం ⇒ ట్రంప్ ఆర్థిక సలహాదారువాషింగ్టన్: అరుదైన ఖనిజాలు, కీలక లోహాలు, అయస్కాంత పదార్థాల ఎగుమతులను నిలిపేస్తూ చైనా తీసుకున్న నిర్ణయం అమెరికాను తీవ్ర ఆందోళనకు గురిచేసే అంశమేనని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక సలహాదారు కెవిన్ హసెట్ అంగీకరించారు. సోమవారం ఆయన వైట్‌హౌస్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ‘‘ఆ అరుదైన ఖనిజాల అవసరం రక్షణ, టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ తదితర రంగాలకు చాలా ఉంటుంది.చైనా నిర్ణయాన్ని లోతుగా అధ్యయనం చేస్తున్నాం. ఈ విషయమై మాకు అందుబాటులో ఉన్న అన్ని ఇతర అవకాశాలనూ పరిశీలిస్తాం’’ అని చెప్పుకొచ్చారు. బహుశా డ్రాగన్ దేశంతో తాము చర్చలు జరిపే అవకాశాలు లేకపోలేదన్నారు. చైనా నిర్ణయంతో పలు యూరప్ దేశాల్లో కూడా ఆటోమొబైల్స్, సెమీ కండక్టర్లు తదితర కంపెనీలు తీవ్రంగా ప్రభావితమవుతాయని అభిప్రాయపడ్డారు. ట్రంప్ ప్రతీకార సుంకాల వల్ల అమెరికా ఆర్థిక మాంద్యం కోరల్లో చిక్కుతుందన్న వాదనను హసెట్ తోసిపుచ్చారు. అమెరికా, చైనా మధ్య తీవ్రస్థాయి టారిఫ్‌ల పోరు సాగుతున్న విషయం తెలిసిందే. -
'ఇది తప్పనిసరి' .. విడాకులపై స్పందించిన మెలిండా గేట్స్..!
ప్రపంచ అపరకుభేరుడు, మైక్రోసాఫ్ట్ విండోస్ సహా వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్, మెలిండా ఫ్రెంచ్ గేట్స్ దంపతులు అధికారికంగా విడిపోయిన సంగతి తెలిసిందే. 1994లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2021లో తమ 27 ఏళ్ల దాంపత్యానికి స్వస్థి చెబుతూ విడిపోయారు. అయితే దీన్ని అతిపెద్ద విచారంగా పేర్కొన్నారు బిల్‌గేట్స్. ఆ వ్యాఖ్యలపై ఎప్పుడు స్పందించలేదు మెలిండా ఫ్రెంచ్ గేట్స్. అయితే ఆమె తొలిసారిగా విడాకులు గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. మెలిండా తన మాజీ భర్త బిల్‌గేట్స్ మాటలకు నేరుగా స్పందించకపోయినప్పటికీ..పరోక్షంగా సమాధానమిచ్చారు. "అత్యంత సన్నిహిత బంధంలో విలువలతో జీవంచలేని పరిస్థితి ఎదురైతే విడాకులు తప్పనిసరి అవసరంగా అభివర్ణించారు. అయితే బిల్‌గేట్స్ వ్యాఖ్యలపై మాట్లాడనని నిర్మోహటంగా చెప్పేశారు. ఎందుకంటే అతనికి తనకంటూ సొంత జీవితం ఉంది. ఇప్పుడు నా జీవితం నాకు ఉంది. ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నాను. నిజానికి విడాకులు అనేది భావోద్వేగ భారం అన్నారు." ఎందుకంటే ఆ సమయంలో తానెంతో తీవ్ర భయాందోళనలకు గురైనట్లు తెలిపారు. వివాహం విడిచిపెడుతున్నప్పుడు..చాలా కష్టంగా ఉంటుందన్నారు. ఆ సమయంలో జరిగే చర్చలన్నీ కఠినంగా ఉంటాయన్నారు. 2014లో గేట్స్‌తో కలిసి భోజనం చేస్తున్నప్పుడు అచ్చం అలాంటి భాధ, తీవ్ర భయాందోళనలు కలిగాయని అన్నారు. అలాంటి సమయంలో వెంటనే ఇది సరైనది కాదా అని సానుకూలంగా ఆలోచించి..త్వరితగతిన బయటపడాలి లేదంటే ఉనికే ప్రశ్నార్థకంగా మారిపోతుందన్నారు. ఆ తర్వాత తాను నెమ్మదిగా దాని విలువ అర్థం చేసుకుని నిశబ్దంగా నిష్క్రమించానన్నారు. అలాగే ఇక్కడ భయాందోళనలకు గురవ్వడం అంటే తాను దెబ్బతిన్నట్లు కాదని కూడా చెప్పారు. ఇక్కడ తాను గుర్తించాల్సిన కొన్ని కష్టమైన విషయాలను ఎదుర్కొన్నానని అందువల్ల తనకు విడిపోవడం అనేది తప్పనిసరి అంటూ మెలిండా విడాకుల తీసుకోవడానికి గల కారణాలను వివరించారు. కాగా, ఈ జంటకు జెన్నిఫర్(28) రోరీ(25), ఫోబ్(22)లు ఉన్నారు. అంతేగాదు ఇద్దరు మనవరాళ్లు కూడా ఉన్నారు. ఇక బిల్‌గేట్స్ 2022 నుంచి మాజీ ఒరాకిల్ సీఈవో మార్క్ హర్డ్ భార్య పౌలా హర్డ్‌తో డేటింగ్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో లేటు వయసు విడాకులు ఎక్కువఅవుతున్నాయి. ఇన్నేళ్ల దాంపత్యం తర్వాత తాము ఏం కోల్పోయామో వెతుకుతూ విడిపోతున్నారు. మానసిక నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే..ఎంతోమంది సెలబ్రిటీలు, ప్రముఖులు పిల్లలు సెటిల్ అయిపోయాక విడిపోతున్నారు. మాకు స్పేస్ కావాలని కొందరూ..ఇనాళ్లు తన ఉనికే కోల్పోయానని కొందరూ అంటున్నారు. అన్నేళ్లు కలిసి ఉండటానికి.. బాధ్యతలు, పిల్లలు వంటి తదితర కారణాలే గానీ ఎప్పుడో వాళ్ల మధ్య బంధం విచ్ఛిన్నమైందని, అందువల్లే ఇలాంటి అనూహ్య నిర్ణయాలు తీసుకుంటారని చెబుతున్నారు మానసిక నిపుణులు. ఏదీఏమైనా..ఆ పరిస్థితి ఎదురవ్వక ముందే భాగస్వాముల్లో ఎవ్వరో ఒక్కరో దీన్ని గుర్తించి తమ బంధాన్ని కాపాడుకునే యత్నం చేయాలంటున్నారు. అలాగే మనతో సాగే సహచరులను నిర్లక్ష్యం చేస్తే..వాటి పర్వవసానం చివర్లో ఇలానే ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నారు. నిజానికి వయసులో కంటే వృద్ధాప్యంలోనే తోడు ఉండాలని ఆ సమయంలోనే.. అసలైన దాంపత్యం ఇరువురి నడుమ ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. (చదవండి: ఒర్రీ వెయిట్‌లాస్ సీక్రెట్: వాంతులు చేసుకుంటూ బరువు తగ్గడమా..?) -
‘అమెరికా విమానాల్ని కొనుగోలు చేయొద్దు’.. జిన్‌పింగ్ ఆదేశాలు
బీజింగ్: అమెరికా-చైనాల మధ్య టారిఫ్ వార్ (China–United States trade war) రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే చైనా పలు కీలక ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేయడాన్ని నిలిపివేసింది. ఆ దేశ ఉత్పత్తుల్ని కొనుగోలు చేయడం మానేసింది. తాజాగా అమెరికాలోని విమానాల తయారీ సంస్థ బోయింగ్‌కు (Boeing) చెందిన విమానాల్ని కొనుగోలు చేయొద్దని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ (Xi Jinping) ఆ దేశ విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. బ్లూమ్‌బర్గ్ సైతం ఇదే విషయాన్ని ధృవీకరించింది.అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికా మరియు చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రమవుతోంది. ఇప్పటికే అమెరికా, చైనా నుంచి దిగుమతులపై 145 శాతం వరకు టారిఫ్‌లు విధించింది. దీనికి ప్రతిగా చైనా కూడా అమెరికా దిగుమతులపై 125 శాతం కస్టమ్స్ టారిఫ్‌లు విధించింది. ఈ తరుణంలో చైనా, దేశీయ విమానయాన సంస్థలు బోయింగ్ విమానాలను కొనుగోలు చేయకుండా ఆదేశించినట్టు బ్లూమ్‌బర్గ్ నివేదించింది. అంతేకాకుండా, అమెరికా నుండి విమాన భాగాలు,ఉపకరణాల కొనుగోళ్లను కూడా నిలిపివేయాలని పేర్కొంది. అదే సమయంలో విమానాల లీజు తీసుకునే సంస్థలకు చైనా ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక ట్రంప్ విధించిన టారిఫ్‌లు ప్రపంచ మార్కెట్లను గందరగోళంలోకి నెట్టేశాయి. మిత్రదేశాలు, ప్రత్యర్థులతో కూడిన సంబంధాలపై ప్రభావం చూపించాయి. గత వారం ట్రంప్, కొత్త టారిఫ్‌లను తాత్కాలికంగా నిలిపివేశానని ప్రకటించినా, చైనాకు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. అమెరికా అధికారులు ఇటీవల స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు,సెమీకండక్టర్లు వంటి హైటెక్ ఉత్పత్తులపై టారిఫ్ మినహాయింపులు ప్రకటించారు.🚨🇺🇸🇨🇳China orders its airlines to halt any further deliveries of Boeing $BA jets as the Trade War with the U.S. heats up.$BA stock is down 3% in reaction to the news. pic.twitter.com/7xjCI0Heru— Jesse Cohen (@JesseCohenInv) April 15, 2025 -
అమెరికా ఫస్ట్ నినాదం.. ట్రంప్, మస్క్‌ను ఇలా ఎప్పుడైనా చూశారా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల పేరుతో ప్రపంచదేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. అమెరికా ఫస్ట్ నినాదంతో పలు దేశాలను టార్గెట్ చేసి ఇష్టానుసారం భారీగా సుంకాలు వడ్డీస్తున్నారు. దీంతో, ఇక ప్రపంచీకరణ ముగిసినట్లేనని పలువురు దేశాధినేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక, ట్రంప్ మాత్రం.. అమెరికన్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలను కాపాడేందుకు ఇతర దేశాల దిగుమతులపై భారీ సుంకాలను విధిస్తున్నట్టు చెబుతున్నారు.ఇదిలా ఉండగా.. 1991లో సోవియట్ యూనియన్ పతనం తర్వాత ప్రారంభమైన గ్లోబలైజేషన్ ఇక ముగిసినట్టే బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ పేర్కొన్నారు. అలాగే, ట్రంప్ టారిఫ్‌ల నేపథ్యంలో దేశీయంగా ఉత్పత్తిని పెంచడంపై దేశాలు ఫోకస్ పెడుతున్నాయి. అటు, అమెరికా సైతం స్థానిక వనరులనే వాడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా.. ఫన్నీ వీడియోలు షేర్ చేస్తున్నారు.తాజా ఓ నెటిజన్ ట్రంప్, ఎలాన్ మస్క్‌కు చెందిన వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ట్రంప్, మస్క్‌లు అమెరికా అభివృద్ధి కోసం ఇప్పుడే పనులు మొదలు పెడుతున్నట్టు ఉంది. ట్రంప్ పొలంలో నాట్లు వేస్తూ.. మస్క్ చీపురుతో ఊడుస్తున్నట్టుగా, జేడీ వాన్స్ షూ తయారు చేస్తున్నట్టుగా వీడియోలో ఉంది. ఇలా.. మెల్లగా పనులు చేస్తే ఎప్పటికి అమెరికా అభివృద్ధి చెందుతుంది అన్నట్టు ఫన్నీ కామెంట్స్ పెట్టారు.A couple new characters introduced in this one. pic.twitter.com/8lO3IaIiFA— MAGA Cult Slayer🦅🇺🇸 (@MAGACult2) April 13, 2025మరో నెటిజన్ ట్రంప్, జిన్‌పింగ్ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో చైనా టారిఫ్‌ల దెబ్బకు ట్రంప్ విలవిల్లాడిపోతున్నట్టుగా ఉంది.Trump opens a portal to the Upside Down and finds Xi waiting with a 125% tariff in this Stranger Things parody gone full trade war chaos 😱🌀📉💼🔥👔😂 #StrangerTariffs #UpsideDownEconomics #TrumpVsXi #TradeWarParody #StrangerThingsSpoof #MadeInChina #PoliticalParody… pic.twitter.com/zVmr8jchMB— Julius Dein (@JuliusDein) April 11, 2025 Who wore their tariff best? 💃📉🔥 Watch as world leaders strut their stuff in the most ridiculous outfits, proudly flexing their import taxes like it’s Paris Fashion Week for sanctions. 🇺🇸🇨🇳👠 #TariffFashionShow #GlobalDrip #Sanction #CustomsCouture #TradeWarLooks #china… pic.twitter.com/jpxmnmwl9w— Julius Dein (@JuliusDein) April 3, 2025 Trump’s MAGA hat says “Made in China 🇨🇳🧢 and Xi’s somewhere in Beijing cackling like he just won the trade war 😂🤡 #MakeAmericaManufactureAgain #TradeWar #MAGAhat #PoliticalSatire #XiLaughsLast #ManufacturingIrony #MadeInChina #USA🇺🇸 #GlobalLOL pic.twitter.com/3zOSPDR5ax— Julius Dein (@JuliusDein) April 11, 2025Trump and Elon Musk mocked in new AI video showing them as factory workers. pic.twitter.com/wAEXcmlYOK— Daily Mail Online (@MailOnline) April 10, 2025In 2025, AI surpasses all expectations, enabling thousands to become more creative, something that Trump certainly did not anticipate.😂 pic.twitter.com/NTbnGzp8LB— Johannes Maria (@luo_yuehan) April 12, 2025 -
అమెరికాకు ఊహించని ఎదురుదెబ్బ.. జిన్‌పింగ్ ప్లాన్‌తో టెన్షన్లో ట్రంప్!
వాషింగ్టన్: సుంకాల పోరులో అస్సలు తగ్గేది లేదంటూ చైనా, అమెరికా మధ్య ట్రేడ్ వార్ నడుస్తోంది. ఈ క్రమంలోనే అమెరికాకు చైనా గట్టి షాకిచ్చింది. పలు అరుదైన కీలక ఖనిజాలు, మాగ్నెట్ల ఎగుమతిని మొత్తంగా నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గాలిడోనియం, సమారియం, స్కాండియం, టెర్బియం, ఇత్రియం, డైస్పోరియం, లుటేటియం వంటివి నిలిపివేత జాబితాలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా నిర్ణయంపై వైట్‌హౌస్ స్పందించారు.తాజాగా ట్రంప్ ముఖ్య ఆర్థిక సలహాదారుల్లో ఒకరైన కెవిన్ హసెట్ మాట్లాడుతూ..‘చైనా అరుదైన ఖనిజాల నిలిపివేత ఆందోళనకరం. టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ తయారీ రంగంలో వాటి అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం. ఖనిజాలు లేకపోవడం అమెరికాకు నష్టం కలిగిస్తుంది. అందుకే ఈ అంశంపై పలు మార్గాలను అన్వేషిస్తున్నామని’ అన్నారు. ఇదే సమయంలో ట్రంప్ తన టారిఫ్ ప్రణాళికలతో ప్రపంచ వాణిజ్యానికి ఆర్థిక మాంద్యం తెచ్చే పరిస్థితులు వందకు వంద శాతం లేవని క్లారిటీ ఇచ్చారు.The chart shows how much the US relies on imports for rare earth metals, what they are used for, and how much of the imports come from China. A good one from JPM-AM. pic.twitter.com/xQalD5ZyH7— Ayesha Tariq, CFA (@AyeshaTariq) April 14, 2025మరోవైపు.. ఇదే అంశంపై యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా, చైనా.. పరస్పర సుంకాలపై రెండు దేశాలు బెదిరింపులకు దిగుతున్నప్పటికీ దీనిపై ఒక ఒప్పందానికి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు విడిపోవడానికి ఏ కారణం కనిపించడం లేదన్నారు. అలాగే, చైనాతో పెద్ద ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా ఇతర దేశాలతో పోలిస్తే చైనాతో ఒప్పందం కాస్త కష్టమేనని వ్యాఖ్యానించారు. ఎందుకంటే తమ దేశానికి చైనా అతిపెద్ద ఆర్థిక పోటీదారని, సైనిక ప్రత్యర్థి అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. అమెరికా ఈ ఖనిజాలను 90 శాతానికి పైగా చైనా నుంచే దిగుమతి చేసుకుంటోంది. దాంతో అమెరికా రక్షణ, ఏరోస్పేస్, కంప్యూటర్, సాఫ్ట్వేర్ తదితర పరిశ్రమలన్నీ తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. ఏప్రిల్ రెండు నుంచి చైనా వాటిని నియంత్రణ జాబితాలో చేర్చింది. అమెరికాకు ఒక అరుదైన లోహాలు ఉత్పత్తి చేసే గని కూడా ఉంది. అయినా ఆ దేశ వినియోగంలో ఎక్కువ భాగం చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. ఈ ఖనిజాలపైనే కాకుండా అయస్కాంతాల ఎగుమతిని డ్రాగన్ నిలిపివేసింది. దీంతో, ట్రంప్ సర్కార్‌కు ఊహించని షాక్ తగిలింది.BREAKING: Trump Administration’s Kevin Hassett says he’s “100 percent not expecting a recession.”He claims that job numbers are through the roof as the reason why.Does he not realize that Job numbers are from the month of March and Tariffs started in the beginning of April?… pic.twitter.com/DjXuC1vfT9— Ed Krassenstein (@EdKrassen) April 14, 2025ఇక.. చైనా వస్తువులపై అమెరికా 145 శాతం సుంకం విధించగా.. చైనా కూడా అంతే వేగంగా దూకుడు ప్రదర్శించింది. అమెరికా వస్తువులపై 125 శాతం సుంకాలు విధించింది. దీంతో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య జరుగుతోన్న ట్రేడ్ వార్ ఎక్కడివరకు వెళ్తుందోనన్న ఆందోళన నెలకొంది. ఇక, ఈ టారిఫ్‌ల నుంచి ఏ దేశానికీ మినహాయింపు లేదని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. ముఖ్యంగా చైనాకు ఎలాంటి రాయితీ లభించదని తేల్చి చెప్పేశారు. ఆ దేశం తమతో దారుణంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. -
అంతరిక్షంలోకి మహిళల టీమ్.. సింగర్ కేటీ పెర్రీ ఏం చేసిందంటే..
అంతరిక్ష పర్యాటకానికి ఊపు తెచ్చే దిశగా ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ మరో ముందడుగు వేసింది. మహిళా సెలబ్రిటీలతో 11 నిమిషాల బుల్లి రోదసి యాత్రను సోమవారం విజయవంతంగా నిర్వహించింది. బెజోస్ కాబోయే భార్య లారెన్ శాంచెజ్‌తో పాటు ప్రఖ్యాత అమెరికా గాయని కేటీ పెర్రీ, జర్నలిస్టు గేల్ కింగ్, సినీ నిర్మాత కెరియన్ ఫ్లిన్, సైంటిస్టు అమందా గుయెన్, నాసా మాజీ ఇంజనీర్ ఆయేషా బోవ్ ఇందులో భాగస్వాములయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.బ్లూ ఆరిజన్ సంస్థకు చెందిన న్యూ ఫెపర్డ్ వ్యోమనౌక NS-31 ద్వారా ఈ యాత్ర సాగింది. ఏప్రిల్ 14న సోమవారం పశ్చిమ టెక్సాస్ నుంచి ఇది ఆరంభమైంది. ఈ వ్యోమనౌక నింగిలో 107 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అంతరిక్ష సరిహద్దు అయిన కర్మాన్ రేఖను కూడా దాటగా, మహిళా ప్రముఖులు అంతా అక్కడ భార రహితస్థితిని ఆస్వాదించారు. మొత్తంగా 11 నిమిషాలు పాటు సాగిన ఈ యాత్ర సాగింది. అనంతరం ఈ వ్యోమనౌక భూమికి తిరిగొచ్చింది. బ్లూ ఆరిజిన్‌కు ఇది 11వ మానవసహిత అంతరిక్ష యాత్ర. ✨ Weightless and limitless. pic.twitter.com/GQgHd0aw7i— Blue Origin (@blueorigin) April 14, 2025అయితే, ఈ అంతరిక్ష యాత్ర సందర్బంగా వ్యోమనౌకలో ఉన్న మహిళలు ఎంజాయ్ చేశారు. వారంతా భార రహిత స్థితిలోకి వెళ్లిన తర్వాత ఆనందం వ్యక్తం చేశారు. ఇక, రోదసి నుంచి కిందకు దిగిన తర్వాత అమెరికా గాయని కేటీ పెర్రీ ఆనందంతో భూమిని ముద్దాడారు. వీరికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.A smooth landing in West Texas. Book your flight on New Shepard: https://t.co/RP3Lixyr4Y pic.twitter.com/xPiu9LMtlH— Blue Origin (@blueorigin) April 14, 2025 ఇదిలా ఉండగా.. బ్లూ ఆరిజిన్ సంస్థ 2000 సంవత్సరంలో ఏర్పాటైంది. ఈ సంస్థకు ఇది 11వ అంతరిక్ష యాత్ర. అమెరికాకు సంబంధించి పూర్తిగా మహిళలతో రోదసి యాత్రను నిర్వహించడం ఇదే తొలిసారి. 2021వ సంవత్సరం నుంచి బ్లూ ఆరిజిన్ సంస్థ రోదసి యాత్ర నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు మొత్తంగా 10 మిషన్లు చేపట్టగా, 52 మందిని అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. REPLAY: A New Shepard tradition pic.twitter.com/dSexRmoZl7— Blue Origin (@blueorigin) April 14, 2025 ‘YOUR KISS IS COSMIC 🎶’US pop star Katy Perry kissed the ground after returning to Earth following a flight aboard Blue Origin’s New Shepard NS-31. The rocket soared past the Kármán line—the internationally recognized boundary of space—before landing safely in Van Horn, West… pic.twitter.com/1PjjDWD2v4— Philstar.com (@PhilstarNews) April 15, 2025 -
ట్రంప్‌తో వివాదం.. హార్వార్డ్ యూనివర్సిటీకి షాకిచ్చిన సర్కార్
వాషింగ్టన్ డీసీ: ట్రంప్ సర్కారు హార్వాడ్ విశ్వవిద్యాలయం(Harwad University)పై వేటు వేసింది. యూదు వ్యతిరేకతను అరికట్టేందుకు ట్రంప్ సర్కారు జారీచేసిన విస్తృత డిమాండ్ల జాబితాను తిరస్కరించిన నేపధ్యంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి $2.2 బిలియన్ల నిధులను(సుమారు రూ. 18,300 కోట్లు) స్తంభింపజేసింది. గతంలో వైట్ హౌస్ పరిపాలన అధికారులు హార్వార్డ్ యూనివర్శిటీలో జరిగే నియామక పద్ధతులు, ప్రవేశ విధానాలలో మార్పులు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.దీనికి స్పందించిన హార్వర్డ్ వర్శిటీ హెడ్ అలాన్ గార్బర్ తమ విద్యాసంస్థ స్వాతంత్య్రాన్ని, రాజ్యాంగ హక్కులను వదులుకోదని స్పష్టంగా ప్రభుత్వానికి తెలిపారు. అయితే పన్ను చెల్లింపుదారులకు సహకారం కొనసాగాలంటే ఉన్నత విశ్వవిద్యాలయాలు మార్పులకు కట్టుబడి ఉండాలని టాస్క్ ఫోర్స్ గతంలో పేర్కొంది. గత ఏడాది హార్వార్డ్ పరిధిలోని కళాశాల ప్రాంగణాలలో విద్యార్థులు ఇజ్రాయెల్ యుద్ధాని(Israel's war)కి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. తదనంతరం అమెరికాలోని విద్యా శాఖ 60 కళాశాలలు, విశ్వవిద్యాలయాలపై వచ్చిన యూదు వ్యతిరేక వేధింపులు, వివక్ష ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించింది.హార్వర్డ్ విశ్వవిద్యాలయం ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీ(Immigration Policy)లతో పాటు ఇతర నిబంధనలను అమలు చేయడానికి నిరాకరించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది ప్రభుత్వ నిధులు అందేందుకు విధించిన షరతుల ఉల్లంఘనగా ట్రంప్ సర్కారు పేర్కొంది. ఈ నిధులను రక్షణ, వైద్య పరిశోధన వంటి ప్రాజెక్టులకు కేటాయిస్తుంటారు. ఈ ఫండింగ్ నిలిపివేత కారణంగా విద్యార్థులు, పరిశోధకులు పలు ఇబ్బందులను ఎదుర్కోనున్నారు. కాగా ట్రంప్ సర్కారు చర్యపై హార్వర్డ్ వర్శిటీ ఇంకా అధికారికంగా ప్రతిస్పందించలేదు.ఇది కూడా చదవండి: మూడు దశాబ్ధాల్లో 10 భారీ అగ్నిప్రమాదాలు -
రోదసిలోకి మహిళా సెలబ్రిటీలు
రోదసి పర్యాటకానికి ఊపు తెచ్చే దిశగా ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ సంస్థ మరో ముందడుగు వేసింది. మహిళా సెలబ్రిటీలతో 10 నిమిషాల బుల్లి రోదసి యాత్రను సోమవారం విజయవంతంగా నిర్వహించింది. బెజోస్ కాబోయే భార్య లారెన్ శాంచెజ్‌తో పాటు ప్రఖ్యాత అమెరికా గాయని కేటీ పెర్రీ, జర్నలిస్టు గేల్ కింగ్, సినీ నిర్మాత కెరియన్ ఫ్లిన్, సైంటిస్టు అమందా గుయెన్, నాసా మాజీ ఇంజనీర్ ఆయేషా బోవ్ ఇందులో భాగస్వాములయ్యారు. న్యూ షెపర్డ్ వ్యోమనౌకలో భూ ఉపరితలానికి 107 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి కాసేపు భారరహిత స్థితిని ఆస్వాదించారు. అనంతరం పారాచూట్ల సాయంతో వ్యోమనౌక భూమికి తిరిగొచి్చంది. బ్లూ ఆరిజిన్‌కు ఇది 11వ మానవసహిత అంతరిక్ష యాత్ర. -
థెరపిస్టు చాట్‌జీపీటీ
లవ్ బ్రేకప్.. ఒంటరితనం.. ఆఫీసులో కోపిష్టి బాస్ వేధింపులు.. సహోద్యోగులతో ఇబ్బందులు.. జీవితంలో ఏ సమస్య వచ్చినా చెప్పుకోవడానికి, ఓపిగ్గా వినేవారొకరు ఉండాలి. తీరా చెప్పాక జడ్జ్ చేయకుండా ఉంటారా? నిష్పాక్షికంగా పరిష్కార మార్గం సూచిస్తారా? అనుమానమే. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా మానసిక వైద్యులను సంప్రదిస్తారు. కానీ ఇప్పుడు ట్రెండు మారుతోంది. ఈ విషయంలో చాట్‌జీపీటీకే జనం ఓటేస్తున్నారు. సమస్యలను వినే మంచి ఫ్రెండ్‌గానే గాక వాటికి పరిష్కారం చూపే కౌన్సిలర్‌గా కూడా భావిస్తున్నారు. లైఫ్ కౌన్సిలర్ 27 ఏళ్ల మనీశ్ ఇంజనీర్. ప్రియురాలితో గొడవైంది. అపార్థాలతో బంధానికి బ్రేక్ పడింది. మానసికంగా అలసిపోయి ఓ సాయం వేళ చాట్‌జీపీటీని ఆశ్రయించాడు. సమస్యంతా చెప్పాడు. ఏం చేయాలో పాలుపోవడం లేదన్నాడు. చాట్‌జీపీటీ సమాధానం మనోన్ని ఆశ్చర్యపరిచింది. ‘‘మీరు చెప్పింది ఆమె వినకపోవడం మిమ్మల్ని బాధిస్తోంది. అదే విషయం ఆమెకు నేరుగా చెప్పారా?’’అని అడిగింది. అంతటితో ఆగకుండా ప్రేయసికి సందేశం పంపడంలో మనీశ్‌కు సాయపడింది. ఆమెను నిందించకుండా కేవలం అతని ఫీలింగ్స్ మాత్రమే వ్యక్తపరిచే ప్రశాంతమైన, నిజాయితీతో కూడిన నోట్ అది. అందుకున్న ఆ అమ్మాయి మనీశ్ తో మాట్లాడింది. ఇంకేముంది వారి మధ్య దూరం తగ్గిపోయింది. వృత్తి సమస్యల్లో సాయం 26 ఏళ్ల అక్షయ్ శ్రీవాస్తవ కంటెంట్ రైటర్, మీడియా ప్రొఫెషనల్. ఆఫీసుకు వెళ్లిరావడానికే నాలుగ్గంటలు పోతోంది. నిద్ర లేదు. కుటుంబంతో గడపడానికి లేదు. ఫిర్యాదులా కాకుండా ఈ విషయాన్ని బాస్‌తో ఎలా చెప్పాలో తేలక చాట్‌జీపీటీని ఆశ్రయించాడు. వాడాల్సిన పదాలతో సహా చక్కని నిర్మాణాత్మక సలహాలిచ్చింది. అప్పటినుంచి అక్షయ్ క్రమం తప్పకుండా చాట్‌బాట్‌ను ఆశ్రయిస్తున్నాడు. ఆయేషాది మరో సమస్య. ఇన్నాళ్లు సహోద్యోగిగా ఉన్న స్నేహితులకే బాస్ అయింది. సాన్నిహిత్యం కోల్పోకుండా వాళ్లతో ఎలా డీల్ చేయాలని చాట్‌జీపీటీనే అడిగింది. అదిచ్చిన సమాధానం ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌లో క్రాష్ కోర్సులా సాయపడింది. బెటర్ కౌన్సిలర్? ఒక్కోసారి కౌన్సిలర్ కంటే మెరుగ్గా చాట్‌జీపీటీ ఇచ్చే సమాధానాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. జీవితంలో చాలా కోల్పోయానని అపిస్తుందనే ప్రశ్నకు.. ‘మార్పు జరిగినప్పుడు అది మామూలే. అభిరుచులను పెంచుకోండి’అని కౌన్సిలర్ చెప్పారు. చాట్‌జీపీటీ మాత్రం, ‘సంతోషపరిచే పనులు చేయండి. చిన్న లక్ష్యాలు పెట్టుకుని చేరుకునే ప్రయత్నం చేయండి’అని సూచించింది. స్నేహితులు అర్థం చేసుకోవడం లేదంటే వారితో ఓపెన్‌గా మాట్లాడమని థెరపిస్టు చెబితే, ‘స్నేహితుల్లో అపార్థాలు మామూలే. వారితో నిజాయితీగా మాట్లాడండి’అని చాట్‌జీపీటీ సూచించింది. పని నచ్చడం లేదంటే ఒత్తిళ్లను గుర్తించి పరిష్కారానికి కొత్తగా ప్రయతి్నంచమని కౌన్సిలర్ చెప్పాడు. చాట్‌జీపీటీ మాత్రం, ‘పనిలో పరిమితులను పెట్టుకోండి. హెచ్ఆర్ లేదా మెంటార్‌తో మాట్లాడండి. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి’అని సలహా ఇచ్చింది. భాగస్వామితో విభేదాలపై ఓపెన్‌గా మాట్లాడుకుని, సమస్యకు కారణాలేంటో కనిపెట్టి పరిష్కారానికి కలిసి ప్రయతి్నంచండన్న చాట్‌జీపీటీ సూచనే మెరుగ్గా ఉందని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.ప్రత్యామ్నాయం కాబోదు: మానసిక వైద్యులు మానసిక వైద్యం మనదేశంలో కాస్త ఖరీదైన విషయం. జనంలో అవగాహన లేమి కూడా ఉంది. ఆ సమస్యలకు చాలామంది క్రమంగా ఏఐపై ఆధారపడుతున్నారు. అది జడ్జ్ చేయదు. చెబుతుంటే మధ్యలో అడ్డుకోదు. ఏం చెప్పినా, ఎంతసేపు చెప్పినా, ఎప్పుడు చెప్పినా శ్రద్ధగా వింటుంది. అంతే ఓపిగ్గా సమాధానమూ ఇస్తుంది. దాంతో వ్యక్తిగతం నుంచి వృత్తిపరమైన సలహాల దాకా యూత్ చాట్‌జీపీటీపై ఆధారపడుతోంది. కానీ ఈ చాట్‌బాట్ మానసిక ఇబ్బందులకు మొత్తంగా పరిష్కారం చూపలేదంటున్నారు వైద్యులు. ‘‘అది తాత్కాలిక ఉపశమనమిచ్చే ఔట్‌లెట్‌లా పనిచేస్తుందంతే. పూర్తిస్థాయి మానసిక చికిత్స ప్రక్రియకు ప్రత్యామ్నాయం కాబోదు. సహానుభూతి, అంతర్దష్టి, అవగాహన వాటికుండవు’’అంటున్నారు. అంతేగాక ఏఐ థెరపీ బాట్లతో ముప్పు కూడా ఉంటుందని అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ హెచ్చరించింది. ప్రత్యేకించి వాటిని పిల్లలు వాడటంపై ఆందోళన వ్యక్తం చేసింది. మనుషులను అవి మరింత ఒంటరులను చేస్తాయనీ హెచ్చరించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మనోళ్లపై మరో పిడుగు
ట్రంప్ సర్కారు భారతీయులను నానాటికీ మరింతగా లక్ష్యం చేసుకుంటోంది. వారిని వేధించేలా రోజుకో తరహా నిబంధనలు తీసుకొస్తోంది. హెచ్–1బీ వీసాలు, గ్రీన్‌కార్డులు ఆశావహుల కలలపై నీళ్లు చల్లేలా తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఎంప్లాయ్మెంట్ బేస్డ్ పిఫ్త్ ప్రిఫరెన్స్ (ఈబీ–5) అన్ రిజర్వ్డ్ కేటగిరీ కింద వాటికోసం దరఖాస్తు చేసుకునేందుకు కటాఫ్‌ను ఆర్నెల్ల పాటు తగ్గించింది. దాన్ని 2019 నవంబర్ 1 నుంచి 2019 మే 1కి మార్చింది. ఈబీ–5 కేటగిరీలో భారతీయుల నుంచి డిమాండ్ అధికంగా ఉందన్న సాకుతో ఈ నిర్ణయం తీసుకుంది. మే నెలకు సంబంధించి విడుదల చేసిన వీసా బులెటిన్‌లో అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ఈ మేరకు పేర్కొంది. దాంతో చాలామంది భారతీయులు ఈబీ–5 కేటగిరీ కింద దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులుగా మారారు! నెలవారీ బులెటిన్‌లో విదేశాంగ శాఖ పేర్కొనే ‘తుది కార్యాచరణ తేదీ’లు చాలా కీలకం. వీసా/గ్రీన్‌కార్డు దరఖాస్తును ప్రాసెసింగ్ నిమిత్తం యూఎస్ సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్ సరీ్వసెస్ (యూఎస్సీఐఎస్) పరిగణనలోకి తీసుకోవాలంటే అవి బులెటిన్‌లో పేర్కొన్న తేదీ కంటే ముందువి అయ్యుండాలి. చైనాకు మాత్రం ఈబీ–5 కటాఫ్‌ను మార్చకపోవడం విశేషం. ఏమిటీ ఈబీ–5 కేటగిరీ? అర్హులైన వలస ఇన్వెస్టర్లకు అమెరికాలోని గ్రామీణ, హెచ్చు నిరుద్యోగ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం కల్పించేందుకు ఈబీ–5 కేటగిరీని అమెరికా తెరపైకి తెచ్చింది. ముఖ్యంగా అన్ రిజర్వుడ్ విభాగం కింద దరఖాస్తు చేస్తున్న భారతీయుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. దాంతో అందుబాటులో ఉండే వీసాల తగ్గిపోతోంది. భారతీయులకు ఈబీ–5 కటాఫ్ తగ్గింపు వల్ల అర్హుల జాబితా నుంచి చాలామంది గల్లంతవుతారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికా–ఇరాన్ తదుపరి చర్చా వేదిక రోమ్
రోమ్: ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా–ఇరాన్ మధ్య తదుపరి చర్చలు శనివారం రోమ్‌లో జరగనున్నాయి. ఇరాన్, ఇటలీ అధికారులు ఈ విషయాన్ని సోమవారం ధ్రువీకరించాయి. చర్చలకు మధ్యవర్తిగా ఉన్న ఒమన్ నుంచి అందిన వినతి మేరకు అంగీకరించినట్లు ఇటలీ ప్రధాని ఆంటోనియో టజనీ తెలిపారు. ఒమన్ రాజధాని మస్కట్‌లో శనివారం రెండు దేశాల మధ్య మొదటి రౌండ్ చర్చలు జరగడం తెల్సిందే. కాగా, అంతర్జాతీయ అణు శక్తి సంస్థ(ఐఏఈఏ) చీఫ్ రఫేల్ మరియానో గ్రాస్సీ సోమవారం ఈ విషయమై ఒక ప్రకటన చేశారు. ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చించేందుకు బుధవారం టెహ్రాన్ వెళ్తున్నట్లు ప్రకటించారు. తమ పరిశీలకుల బృందాన్ని అణు మౌలిక వసతులను సందర్శించేందుకు వీలు కల్పించాలని ఇరాన్ ప్రభుత్వాన్ని కోరే అవకాశముందని సమాచారం. -
చైనా స్మార్ట్ఫోన్లపై సుంకాలు
వాషింగ్టన్: ప్రతీకార సుంకాలు విధించినా, నేరుగా బెదిరించినా చైనా దారికి రాకపోవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడుతున్నారు. ఆ దేశంపై మరింతగా కత్తులు నూరుతున్నారు. చైనా స్మార్ట్ ఫోన్లతో పాటు ఆ దేశ ఎలక్ట్రానిక్ వస్తువులపై సుంకాలు విధించనున్నట్టు ఆయన తాజాగా ప్రకటించారు. అవి ఎంత శాతమన్నది సోమవారం వెల్లడిస్తానని తెలిపారు. ‘‘ఎలక్ట్రానిక్ వస్తువులకు నేను ప్రకటించిన సుంకాల మినహాయింపు చైనాకు వర్తించబోదు. వాటిపై కేవలం సుంకాల శాతం మార్పుచేర్పులు చేయబోతున్నామంతే’’ అని ఆదివారం ట్రంప్ వెల్లడించారు. ‘‘చైనా ఎలక్ట్రానిక్ వస్తువులకు సెమీ కండక్టర్ టారిఫ్‌లు వర్తించవచ్చని వాణిజ్య మంత్రి హొవార్డ్ లెట్నిక్ చెప్పుకొచ్చారు. అమెరికాకు అవసరమైన ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, ఔషధాలు.. ఇలా అన్ని వస్తువులూ దేశీయంగానే తయారు కావాలన్నది అధ్యక్షుని ఆలోచన అన్నారు. స్మార్ట్ఫోన్లతో పాటు చైనా నుంచి దిగుమతయ్యే అన్నిరకాల ఎలక్ట్రానిక్స్ వస్తువులనూ ఆ దేశంపై విధించిన 145 శాతం టారిఫ్ నుంచి మినహాయిస్తున్నట్టు అమెరికా కస్టమ్స్ విభాగం శనివారం నోటీసులో వెల్లడించడం తెలిసిందే. ఈ అంశంపై రెండు రోజుల్లోనే ట్రంప్ పిల్లమొగ్గ వేశారు. ఆ నోటీసు వాస్తవం కాదంటూ సొంత సోషల్ మీడియా హాండిల్ ట్రూత్‌సోషల్‌లో పోస్టు పెట్టారు. అమెరికాకు ఎలక్ట్రానిక్స్ వస్తువుల సరఫరాపై త్వరలో నేషనల్ సెక్యూరిటీ టారిఫ్స్ ఇన్వెస్టిగేషన్స్ భేటీలో కూలంకషంగా చర్చిస్తామని చెప్పుకొచ్చారు. -
వేలానికి గోల్కొండ బ్లూ వజ్రం
న్యూఢిల్లీ: ఇండోర్, బరోడా మహారాజులు గతంలో ఎంతో మక్కువతో సొంతం చేసుకున్న అత్యంత అరుదైన గోల్కొండ బ్లూ వజ్రం వేలానికి రాబోతోంది. క్రిస్టీస్ వేలం సంస్థ స్విట్జర్లాండ్‌లోని జెనీవా నగరంలో మే 14వ తేదీన ఈ నీలిరంగు వజ్రాన్ని వేలం వేయనుంది. ఈ వజ్రం బరువు 23.24 క్యారెట్లు. వేలంలో 35 మిలియన్ డాలర్ల నుంచి 50 మిలియన్ డాలర్లు (రూ.300 కోట్ల నుంచి రూ.430 కోట్లు పలకవచ్చని అంచనా వేస్తున్నారు. అరుదైన గోల్కొండ వజ్రాన్ని తాము వేలం వేస్తుండడం క్రిస్టీస్ సంస్థ గొప్ప గౌరవంగా భావిస్తోంది. ఇలాంటి అవకాశం జీవితకాలంలో ఒక్కసారే లభిస్తుంది ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారు. రంగు, పరిమాణంలో గోల్కొండ నీలి వజ్రాన్ని మించింది మరొకటి లేదని క్రిస్టీస్ ఇంటర్నేషనల్ హెడ్ ఆఫ్ జువెల్లరీ రాహుల్ కడాకియా వెల్లడించారు. ఈ వజ్రం మూలాలు హైదరాబాద్ శివార్లలోని గోల్కొండ ప్రాంతంలో ఉన్నట్లు చెబుతున్నారు. -
రూ.1,800 కోట్ల డ్రగ్స్ పట్టివేత
అహ్మదాబాద్: గుజరాత్ తీరంలో మాదకద్రవ్యాలను అక్రమంగా తీసుకువచ్చే పాకిస్తాన్ స్మగ్లర్ల ఆటకట్టింది. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ బృందం(ఏటీఎస్), తీర రక్షక దళం(ఐసీజీ) సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో రూ.1,800 కోట్ల విలువైన 300 కిలోల మెథాంఫెటమైన్ అనే సింథటిక్ డ్రగ్ పట్టుబడింది. ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి దాటాక అరేబియా సముద్రంలో ఘటన చోటుచేసుకుంది. ఫిదా అనే పేరున్న మాఫియా ముఠా చేపల పడవలో భారత జలాల్లోకి ప్రవేశించనుందంటూ ఏటీఎస్ అందించిన నిఘా సమాచారం మేరకు ఐసీజీ గస్తీని ముమ్మరం చేసింది. అంతర్జాతీయ సముద్ర జలాలకు అత్యంత సమీపంలో అర్ధరాత్రి సమయంలో ఐసీజీ గస్తీ ఓడను దూరం నుంచే గమనించిన స్మగ్లర్లు తమ బోటులో ఉన్న డ్రగ్స్ డ్రమ్ములను సముద్రంలో విసిరేశారు. వేగంగా అంతర్జాతీయ సముద్ర జలాల సరిహద్దుల వైపు వెళ్లిపోయారు. ఇదంతా వెంటవెంటనే జరిగిపోయింది. వారిని పట్టుకునేందుకు ఐసీజీ చేసిన ప్రయత్నం ఫలించలేదు. కటిక చీకటిలోనే వారు విసిరేసిన డ్రగ్ పార్శిళ్లను ఐసీజీ, ఏటీఎస్ సిబ్బంది గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న 311 ప్యాకెట్లలో 311 కిలోల మెథాంఫెటమైన్‌ను పోర్బందర్ తీరానికి తరలించి, దర్యాప్తు చేపట్టామని ఐసీజీ తెలిపింది. ఈ ప్యాకెట్లను ప్లాస్టిక్ డ్రమ్ముల్లో సీల్ వేసి ఉంచారని, సముద్ర జలాల్లో వేసినా అందులోని సరుకు పాడవదని ఏటీఎస్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ సునీల్ జోషి చెప్పారు. ఈ డ్రగ్స్ గమ్యస్థానం తమిళనాడని ఆయన వివరించారు. పాక్‌లోని పస్ని పోర్టు నుంచి బయలుదేరిన మాఫియా సభ్యులు సముద్ర జలాల్లోనే డ్రగ్స్‌ను మరో బోటులోకి మార్చి, ఆపైన తమిళనాడుకు చేరవేయాల్సి ఉందని ఆయన వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఇటువంటి 13 ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేసి, అక్రమార్కుల ఆటకట్టించామని వివరించారు. కాగా, ఐస్, క్రిస్టల్ మెథ్ అని కూడా పిలిచే మెథాంఫెటమైన్ చాలా శక్తివంతమైన డ్రగ్. పొట్టలో రూ.7.85 కోట్ల కొకైన్ ముంబై: ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఉగాండా దేశస్తుడి పొట్టలో రూ.7.85 కోట్ల విలువుండే 785 గ్రాముల కొకైన్‌ను గుర్తించారు. ఈ నెల 9వ తేదీన రాత్రి ఓ విమానంలో వచ్చిన అతడిని అధికారులు అడ్డుకున్నారు. విచారణ సమయంలో అతడు ఆందోళనతో కనిపించడంతో కనిపించాడు. దీంతో, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు చేయించగా పొట్టలో టాబ్లెట్లు ఉన్నట్లు తేలింది. -
డీఐఈ చీఫ్ నీలా రాజేంద్రకు నాసా ఉద్వాసన
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా డీఈఐ విభాగం చీఫ్ నీలా రాజేంద్ర ఉద్వాసనకు గురయ్యారు. డీఈఐ వంటి ఫెడరల్ ఏజెన్సీలను రద్దు చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇందుకు కారణమైంది. భారత మూలాలున్న నీలా రాజేంద్రకు అత్యంత ప్రతిభావంతురాలిగా పేరుంది. ఆమెను ఎలాగైనా అట్టిపెట్టుకునేందుకు నాసా చివరిదాకా విఫలయత్నం చేసింది. అందులో భాగంగా నీలను జెట్ ప్రొపల్షన్ లేబోరేటరీ విభాగం డీఈఐ పదవి నుంచి తప్పించడమే గాక ఆమె హోదాను ‘టీమ్ ఎక్సలెన్స్ అండ్ ఎంప్లాయీ సక్సెస్ (టీఈఈఎస్)’విభాగం చీఫ్‌గా మార్చేసింది. నీల కెరీర్ ప్రొఫైల్ నుంచి డీఈఐ బాధ్యతల నిర్వహణ తాలూకు రికార్డులను పూర్తిగా తొలగించింది. అయినా లాభం లేకపోయింది. ‘‘నీల ఇకపై మనతో పాటు పనిచేయబోరు. ఎంతో ఆవేదన నడుమ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది’’అని జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ విభాగం డైరెక్టర్ లారీ లేసిన్ వెల్లడించారు. ‘‘నాసాకు నీల ఎనలేని సేవలందించారు. తన పనితీరుతో చెరగని ముద్ర వేశారు. అందుకు సంస్థ ఆమెకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది. తనకు అంతా మంచే జరగాలని ఆశిస్తున్నాం’’అని సంస్థ సిబ్బందికి రాసిన ఈ మెయిల్లో పేర్కొన్నారు. టీఈఈఎస్ను మానవ వనరుల విభాగంలో విలీనం చేస్తున్నట్టు తెలిపారు. త్వరలో మరికొందరు ఉద్యోగులకు ఉద్వాసన తప్పదనేందుకు ఇది సంకేతమని భావిస్తున్నారు. ఏమిటీ డీఈఐ డీఈఐ అంటే డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్. అమెరికాలోని జాతి, భాషాపరమైన మైనారిటీలు తదితరులకు ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించడం దీని ఉద్దేశం. ఈ పథకం అమెరికన్లలో జాతి ఆధారంగా విభజనకు, వివక్షకు కారణమవుతోందని ట్రంప్ చాలాకాలంగా ఆరోపిస్తూ వచ్చారు. రెండోసారి అధ్యక్షుడు కాగానే ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలన్నింట్లోనూ డీఈఐ విభాగాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు 2024లోనే బడ్జెట్ పరిమితులు, డీఈఐ నిబంధనల కారణంగా పలు విభాగాలకు చెందిన 900 మంది ఉద్యోగులను నాసా తొలగించాల్సి వచ్చింది. ఆ నిర్ణయంపై తీవ్ర దుమారం రేగింది కూడా. అయినా నీలను మాత్రం అప్పట్లో సంస్థ అట్టిపెట్టుకుంది. ట్రంప్ సర్కారు తాజా ఉత్తర్వులతో ఇప్పుడామెను తొలగించక తప్పలేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఖనిజాలు బంద్
బీజింగ్/బ్యాంకాక్: సుంకాల పోరులో అస్సలు తగ్గేది లేదన్న చైనా, అనుకున్నట్టుగానే అమెరికాకు గట్టి షాకిచ్చింది. పలు అరుదైన కీలక ఖనిజాలు, మాగ్నెట్ల ఎగుమతిని మొత్తంగా నిలిపేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. న్యూయార్క్ టైమ్స్ తాజా కథనంలో ఈ మేరకు పేర్కొంది. గాలిడోనియం, సమారియం, స్కాండియం, టెర్బియం, ఇత్రియం, డైస్పోరియం, లుటేటియం వంటివి నిలిపివేత జాబితాలో ఉన్నాయి. అమెరికా ఈ ఖనిజాలను 72 శాతానికి పైగా చైనా నుంచే దిగుమతి చేసుకుంటోంది. దాంతో అమెరికా రక్షణ, ఏరోస్పేస్, కంప్యూటర్, సాఫ్ట్వేర్ తదితర పరిశ్రమలన్నీ తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. రక్షణ రంగ దిగ్గజం లాక్‌హీడ్ మార్టిన్‌తో పాటు కార్ల తయారీ కంపెనీ టెస్లా, టెక్ దిగ్గజం యాపిల్ వంటి ఎన్నో సంస్థలు చాలా రకాలైన కీలక ముడి పదార్థాల కోసం ప్రధానంగా చైనా ఎగుమతులపైనే ఆధారపడుతున్నాయి. ఆయా ఖనిజ నిల్వలు అమెరికాలోనూ ఉన్నా అక్కడి పరిశ్రమల అవసరాలను అవి ఏమాత్రమూ తీర్చలేవు. దాంతో వాటి లోటును భర్తీ చేసుకోవడం అగ్ర రాజ్యానికి చాలా కష్టతరం కానుంది. ప్రపంచవ్యాప్తంగా అరుదైన ఖనిజాల ఎగుమతుల్లో ఏకంగా 90 శాతం వాటా చైనాదే. చైనా నిర్ణయంతో అమెరికాతో పాటు చాలా దేశాలు ప్రభావితం కానున్నాయి.ఢీ అంటే ఢీ అమెరికా, చైనా మధ్య సుంకాల పోరు కొద్ది రోజులుగా తారస్థాయికి చేరుకోవడం తెలిసిందే. చైనాపై సుంకాలను ఏకంగా 145 శాతానికి పెంచుతున్నట్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రతీకారంగా అమెరికాపై చైనా 125 శాతం సుంకాలు విధించింది. అంతేగాక ఖనిజ ఎగుమతులపై ఆంక్షలు విధిస్తామని కూడా ఏప్రిల్ 2వ తేదీనే ప్రకటించింది. చైనా తమతో చర్చలకు వచ్చి సుంకాలను తగ్గిస్తుందని ఆశిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించగా, ఆ ప్రసక్తే లేదని చైనా కుండబద్దలు కొట్టడం తెలిసిందే. అంతేగాక ఆయనవి మతిలేని చర్యలంటూ గట్టిగా నలుగు పెట్టింది. ‘‘ఈ ప్రతీకార సుంకాలతో ఎవరికీ మేలు జరగదు. వాణిజ్య యుద్ధంలో విజేతలంటూ ఉండరు. అమెరికా బెదిరింపులకు లొంగే సమస్యే లేదు’’ అని స్పష్టం చేసింది. అమెరికా ముందుకొస్తేనే చర్చలకు సిద్ధపడతామని కూడా తేల్చేసింది.చైనాయే దిక్కు అమెరికా కొన్నేళ్లుగా చైనా దిగుమతులపై విపరీతంగా ఆధారపడుతున్న కీలక విభాగాల సంఖ్య గత పాతికేళ్లలో అనూహ్యంగా పెరిగిపోయింది. ప్రస్తుతం 532 రకాల కీలక ఉత్పత్తి విభాగాల విషయంలో అగ్ర రాజ్యానికి చైనా దిగుమతులే దిక్కు. ఇదే సమయంలో చైనా ప్రధానంగా అమెరికా ఉత్పత్తులపై ఆధారపడ్డ విభాగాల సంఖ్య మాత్రం సగానికి సగం తగ్గిపోయింది. అంతేగాక అమెరికా నుంచి పలు కీలక వ్యవసాయోత్పత్తుల దిగుమతులపై చైనా ఆంక్షలు విధించనుంది. అగ్ర రాజ్యానికి ఇది కూడా కోలుకోలేని దెబ్బే. అమెరికా సోయాబీన్ ఎగుమతులు తదితరాల్లో 10 శాతానికి పైగా వాటా చైనాదే. -
New York Plane Crash : భారతీయ సంతతి వైద్యురాలి కుటుంబం దుర్మరణం
న్యూయార్క్ (New York)లో శనివారం కుప్పకూలిన విమాన ప్రమాద ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. వారాంతపు సెలవుల్లో, పుట్టిన రోజు వేడుకలను ఆనందంగా జరుపుకునేందుకు వెళుతున్న న్యూయార్క్‌లోని ఒక ప్రైవేట్ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.కొలంబియా కౌంటీ అండర్షెరీఫ్ జాక్వెలిన్ సాల్వటోర్ ఈ విషయాన్ని ధృవీకరించారు.కొలంబియాలోని కౌంటీ విమానాశ్రయానికి వెళ్తున్న ట్విన్ ఇంజిన్ (MU-2B)విమానం ఒక పొలంలో కుప్పకూలింది. కొలంబియా కౌంటీ అండర్షెరీఫ్ జాక్వెలిన్ సాల్వటోర్ ఈ విషయాన్ని వెల్లడించారు. మిత్సిబిషి ఎమ్‌యూ-2బీ విమానం కొలంబియాలోని కౌంటీ విమానాశ్రయానికి బయలుదేరింది. వాతారవణ అననుకూల పరిస్థితుల కారణంగా కోపాకేకు 30 మైళ్ల దూరంలో ఉండగానే ఒక పొలంలో కుప్పకూలింది. ప్రమాదానికి కొద్దిసేపటి ముందు, పైలట్ కొలంబియా కౌంటీ విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను రేడియో ద్వారా తాను ప్రమాదంలో ఉన్నట్టు, కొత్త విధానాన్ని అభ్యర్థించారని కూడా జాతీయ రవాణా భద్రతా బోర్డు అధికారులు ఆదివారం జరిగిన బ్రీఫింగ్లో తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు పరిశీలిస్తున్నారు. బాధితులు వివరాలుభారతదేశానికి చెందిన యూరోజినెకాలజిస్ట్ డాక్టర్ జాయ్ సైని, ఆమె భర్త, కొడుకు, కోడలు, కుమార్తె అల్లుడు ఉన్నారు. సైనీ భర్త న్యూరో సైంటిస్ట్, డాక్టర్ మైఖేల్ గ్రాఫ్, కుమార్తె, 2022లో NCAA ఉమెన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైన మాజీ MIT సాకర్ క్రీడాకారిణి కరెన్నా గ్రాఫ్ ఆమె భర్త, ఇంకా సైనీ కుమారుడు జారెడ్ గ్రాఫ్, పారాలీగల్గా పనిచేసిన ,జారెడ్ గ్రాఫ్ భాగస్వామి అలెక్సియా కౌయుటాస్ డువార్టే ఉన్నారు.డా. జాయ్ సైని ఎవరంటే..!మిడ్ హడ్సన్ న్యూస్ ప్రకారం డాక్టర్ జాయ్ సైని భారతదేశంలోని పంజాబ్‌లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు కుల్జిత్ , గుర్దేవ్ సింగ్‌లతో అమెరికాకు వలస వెళ్లారు. డా. సైనీ నిష్ణాతులైన పెల్విక్ సర్జన్‌గా పేరొందారు. అలాగే బోస్టన్ పెల్విక్ హెల్త్ అండ్ వెల్నెస్ వ్యవస్థాపకురాలు కూడా.పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో మెడిసిన్ చదువుతుండగా, మైఖేల్ గ్రాఫ్‌ను ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. మైఖేల్ ప్రముఖ న్యూరో సర్జన్, అనుభవజ్ఞుడైన పైలట్ కూడా. ఈ దుర్వార్తతో సైనీ మరో కుమార్తె అనికా గ్రాఫ్, మైఖేల్ తల్లిదండ్రులు స్టీఫెన్, గెబెనా గ్రాఫ్; జాయ్ తల్లి కుల్జిత్;,తోబుట్టువులు రిన్నే గ్రాఫ్, య్రామ్ గ్రాఫ్, , ప్రశాంత్ సైని తీరని విషాదంలో మునిగిపోయారు. -
Bangladesh: చరిత్రను చెరిపేస్తున్నారు: షేక్ హసీనా ఆగ్రహం
న్యూఢిల్లీ/ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా(Sheikh Hasina) ఆ దేశ తాత్కాలిక ప్రధాని మహ్మద్ యూనస్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ ఘన చరిత్రను చెరిపేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అవామీ లీగ్ కార్యకర్తలతో సామాజిక మాధ్యమాల సాయంతో మాట్లాడిన ఆమె మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం బంగ్లాదేశ్‌ను మతోన్మాద దేశంగా మార్చిందని, దేశ స్వాతంత్ర్య సమరంలో పోరాడిన తన తండ్రి బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ జ్ఞాపకాలను తుడిచిపెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్(Muhammad Yunus)ను దేశ ప్రజలను ఎన్నడూ ప్రేమించని వ్యక్తిగా హసీనా అభివర్ణించారు. యూనస్‌ను వడ్డీ వ్యాపారిగా పేర్కొంటూ, అతను అధిక వడ్డీ రేట్లకు అప్పులిచ్చి, ఆ డబ్బుతో విదేశాల్లో విలాసవంతమైన జీవితం గడిపాడని ఆరోపించారు. యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం అవామీ లీగ్ కార్యకర్తలపై దాడులు చేస్తోందని, హత్యలకు పాల్పడుతోందని, మీడియా స్వేచ్ఛను అణచివేస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. షేక్ హసనా చేసిన విమర్శలు యూనస్ ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచాయి.2024, ఆగస్టులో జరిగిన విద్యార్థుల ఉద్యమం అనంతరం షేక్ హసీనా అధికారం నుంచి దిగిపోయారు. ఆ తరువాత ఆమె భారతదేశంలో ఆశ్రయం పొందారు. అప్పటి నుంచి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి యూనస్ నాయకత్వం వహిస్తున్నారు. నాటి నుంచి హసీనా..మహ్మద్ యూనస్‌పై పలు ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా ఆమె తమ పార్టీ అవామీ లీగ్(Awami League)ను నిషేధించే ప్రయత్నాలను ప్రశ్నిస్తూ, ఇందుకు యూనస్ ప్రభుత్వానికి రాజ్యాంగ ఆధారం లేదని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ ప్రజలు ప్రస్తుత పరిస్థితులను గుర్తించి, యూనస్‌ను అధికారం నుంచి తొలగిస్తారని, తాను తిరిగి అధికారంలోకి వస్తానని హసీనా ఆశాభావం వ్యక్తం చేశారు.ఇది కూడా చదవండి: అంబేద్కర్ మదిలో ‘హైదరాబాద్’.. కలకత్తా, ముంబైలను కాదంటూ.. -
వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ అరెస్టు
బ్రస్సెల్స్: ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీని బెల్జియం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఒక నివేదికలో వెల్లడించారు. భారత సీబీఐ అధికారులు కోరిక మేరకు మెహుల్ ఛోక్సీ బెల్జియం పోలీసులు శనివారం అరెస్ట్ చేసినట్టు తెలిపారు. రూ.13,500 కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం కేసులో మెహుల్‌పై అభియోగాలు ఉన్న నేపథ్యంలో అతడిని అప్పగించాలని భారత్ కోరింది. ఈ నేపథ్యంలోనే అతడిని అరెస్ట్ చేసినట్టు తెలిసింది. దీంతో, ఛోక్సీని తర్వలోనే భారత్‌కు అప్పగించే అవకాశం ఉంది. ఇక, పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ (Mehul Choksi) విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. దీంతో, అతడిని భారత్‌కు రప్పించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే, అతడు బెల్జియంలో ఉన్నట్లు ఇటీవల అక్కడి ప్రభుత్వం ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలో సీబీఐ అభ్యర్థన మేరకు అతడిని బెల్జియం అధికారులు అరెస్ట్ చేశారు. ఇక, ఛోక్సీని అరెస్టు చేస్తున్నప్పుడు ముంబై కోర్టు జారీ చేసిన రెండు ఓపెన్-ఎండ్ అరెస్ట్ వారెంట్లను పోలీసులు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అంతకుముందు.. పీఎన్బీ కుంభకోణంలో కీలక సూత్రధారి అయిన చోక్సీ.. బెల్జియం పౌరురాలైన తన భార్య ప్రీతీతో కలిసి ఆంట్వెర్ఫ్లో ఉంటున్నాడని, అక్కడ ఎఫ్ రెసిడెన్సీ కార్డు పొందాడని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించింది. వైద్య చికిత్స కోసం ఆంటిగ్వా అండ్ బార్బుడా నుంచి బెల్జియానికి మకాం మార్చిన చోక్సీకి ఆ దేశ పౌరసత్వం కూడా ఉంది.కాగా, 2018 జనవరిలో దేశంలో రెండవ అతిపెద్ద బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం బయటపడటానికి కొద్ది వారాల ముందే మెహుల్ చోక్సీ, అతడి మేనల్లుడు నీరవ్ మోదీలు దేశం దాటిపోయారు. కుంభకోణం బయటపడటానికి రెండు నెలల ముందే అతడు అంటిగ్వా పౌరసత్వం పొందినట్టు తెలిసింది. ఈ కేసులో మరో నిందితుడు, చోక్సీ మేనల్లుడు నీరవ్ మోదీని లండన్ నుంచి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. Fugitive diamond trader Mehul Choksi, who is wanted in connection with the Rs 13,500-crore Punjab National Bank (PNB) loan fraud case, has been arrested by the police in Belgium, according to a report. The 65-year-old was taken into custody on Saturday (April 12) at the request… pic.twitter.com/xQlq2T3E0C— News9 (@News9Tweets) April 14, 2025 -
చిందేసిన ట్రంప్..!
మియామి: వలసదారుల బహిష్కరణలు, సుంకాలతో హడలెత్తిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం కాస్త రిలాక్సయ్యారు. తన బృందంలో కీలక సభ్యులైన ఎలాన్ మస్క్, తులసీ గబార్డ్ తదితరులతో కలిసి ఫ్లోరిడాలోని మియామిలో అలి్టమేట్ ఫైటింగ్ చాంపియన్ షిప్ కార్యక్రమాన్ని తిలకించారు. అభిమానులతో కలిసి కాసేపు డ్యాన్స్ చేసి, పిడికిలి బిగించి ఉత్సాహపరిచారు. పూర్తిగా ఫిట్ 78 ఏళ్ల ట్రంప్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు ధ్రువీకరించారు. అమెరికా సర్వసైన్యాధ్యక్షుడిగా పనిచేసే సామర్ధ్యం ఆయనకుందని పేర్కొన్నారు. శుక్రవారం ట్రంప్‌కు జరిపిన సాధారణ వైద్య పరీక్షల ఫలితాలను వైట్‌హౌస్ విడుదల చేసింది. ‘2020లో అధ్యక్షుడిగా ఉండగా చివరిసారిగా జరిపిన పరీక్షల్లో ట్రంప్ 110.677 కిలోలుండగా ఇప్పుడు 9 కిలోలు తగ్గారు. రక్తంలో కొలెస్టరాల్ స్థాయిలు తగ్గాయి. అధ్యక్షుడిగా రోజూ సమావేశాలు, సభల్లో భేటీల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇటీవల ఓ గోల్ఫ్ పోటీలో విజేతగా నిలిచారు కూడా. ఆరోగ్యవంతుల్లో కొలెస్టరాల్ స్థాయి 200కు మించరాదు. బీపీ మాత్రం కాస్త ఎక్కువ (128/74)గా ఉంది. హృదయ స్పందన రేటు గతంలో మాదిరిగా 62గానే ఉంది. గుండెపోటు రిస్‌్కను నివారించేందుకు ట్రంప్ నిత్యం ఆస్పిరిన్ టాబ్లెట్ తీసుకుంటున్నారు’’ అని పేర్కొంది. Trump Dance at UFC 314 🇺🇸 pic.twitter.com/Ud01BkHp8M— Margo Martin (@MargoMartin47) April 13, 2025 -
హసీనాకు మరో అరెస్ట్ వారెంట్
ఢాకా: అధికారాన్ని దుర్వినియోగం చేసి అక్రమంగా భూమిని స్వాధీనం చేసుకున్నారన్న ఆరోపణలపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బంగ్లాదేశ్ కోర్టు ఆదివారం అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఆమె సోదరి షేక్ రెహానా, బ్రిటిష్ ఎంపీ తులిప్ రిజ్వానా సిద్ధిఖ్ సహా మరో 50 మంది పేర్లు పొందుపరిచింది. అధికార దుర్వినియోగంతో పుర్బాచల్ న్యూటౌన్ ప్రాజెక్టులో 10 అంతస్తుల స్థలాన్ని కొనుగోలు చేశారంటూ జనవరి 13న రెహానాపై ఏసీసీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో హసీనా, రెహానా కుమార్తె బ్రిటిష్ ఎంపీ తులిప్ రిజ్వానా సిద్ధిఖ్ సహా 15 మందిని నిందితులుగా చేర్చారు. మరో 17 మందిపై చార్జిషీట్ దాఖలు చేసిన ఏసీసీ మార్చి 10న సమర్పించిన తుది చార్జిషీట్లోలో మరో 18 మంది పేర్లు చేర్చింది. మూడు వేర్వేరు ఛార్జిషీట్లను పరిశీలించిన అనంతరం ఢాకా మెట్రోపాలిటన్ సీనియర్ స్పెషల్ జడ్జి జాకీర్ హుస్సేన్ ఈ ఆదేశాలు జారీ చేశారు. అరెస్టు ఉత్తర్వుల అమలుపై నివేదికలను సమీక్షించడానికి విచారణను ఏప్రిల్ 27కు వాయిదా వేశారు. రజుక్ ప్లాట్ల కేటాయింపులకు సంబంధించిన మరో అవినీతి కేసులో హసీనా, ఆమె కుమార్తె సైమా వజీద్ పుతుల్, మరో 17 మందిపై ఏప్రిల్ 10న ఇదే కోర్టు అరెస్టు వారెంట్లు జారీ చేసింది. పుతుల్ 2023 నవంబర్ 1 నుంచి న్యూఢిల్లీ కేంద్రంగా ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. హసీనాపై సామూహిక హత్యలు, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు, బలవంతపు అదృశ్యాలు వంటి అనేక అభియోగాలు కూడా ఉన్నాయి. గతేడాది ఆగస్టు 5న తిరుగుబాటు అనంతరం తన ప్రభుత్వం కూలిపోవడంతో, 77 ఏళ్ల హసీనా అప్పటి నుంచి భారత్‌లోనే ఉంటున్నారు. -
ప్రొఫెసర్ చింపాంజీలు!
చింపాంజీలను మన పూర్వీకులుగా చెబుతారు. అదెంత నిజమో గానీ మనిషిలాగే వాటికి కూడా భౌతిక శాస్త్ర సూత్రాలు బాగానే వంటబట్టాయని తాజా అధ్యయనంలో తేలింది. కడుపు నింపుకునేందుకు చెద పురుగులను తినడం చింపాంజీలకు అలవాటు. ఎర్రమట్టిలో, మెత్తటి నేలలు, మట్టి దిబ్బల్లో చెదపురుగులను చేత్తో ఏరకుండా, బొరియల్లో చెదలను ఒంపులు తిరిగిన కర్ర పుల్లలతో ఒడుపుగా పట్టుకోవడం వాటికి వెన్నతో పెట్టిన విద్య. అందుకోసం కనిపించిన కర్రపుల్లనల్లా వాడేయకుండా తమకు చక్కగా పనికొచ్చే పుల్లను మాత్రమే వేటకు వినియోగిస్తాయట. దాంతో, ఏ పుల్ల బాగా అక్కరకొస్తుందన్నది చింపాంజీలు ఎలా కనిపెడతాయో తెల్సుకోవాలనే జిజ్ఞాస పరిశోధకుల్లో ఎక్కువైంది. భౌతికశాస్త్రంపై వాటికి పట్టు ఎలా చిక్కిందనే అంశంపై పరిశోధన మొదలెట్టారు. వాటిలోనూ అభిజ్ఞాన వికాసం ఎక్కువేనని అందులో తేలింది. ఈ వివరాలు ఐసైన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. గట్టిగా ఉండే పుల్లలకు బదులు స్ప్రింగ్‌లాగా ఒంగిపోయే లక్షణమున్న కాస్తంత గట్టి పుల్లలతో వేట సులభమవుతుందని చింపాంజీలు గ్రహించాయని, ఇవి వాటిలోని సహజ సంగ్రహణ సామర్థ్యం వల్లే సాధ్యమైందని పరిశోధకులు చెబుతున్నారు. మట్టిదిబ్బల్లో మహా ఒడుపుగా మట్టిదిబ్బల్లో ఇబ్బడిముబ్బడిగా చెదపురుగులు ఉంటాయి. చైనా వాళ్లు నూడుల్స్‌ను ఎలాగైతే తెల్లని సన్నని చిన్న కర్రపుల్లతో తింటారో అచ్చం అలాగే చింపాంజీలు చెదపురుగులను పుల్లలకు అంటుకునేలా చేసి ఆబగా ఆరగిస్తాయి. అలాగే అలా తినాలంటే వాటికి సహజసిద్ధ పుల్లలు కావాలి. మట్టిదిబ్బ బురద బొరియలో ఒకసారి లోపలికి దూర్చాక బయటకు తీస్తే మట్టి బరువుకు పుల్ల విరిగిపోవచ్చు. మెత్తడి పుల్ల తీసుకుంటే మట్టి తడికి మెత్తబడిపోతుంది. అలాగని గట్టి పుల్ల తీసుకుంటే గట్టిగా లాగితే విరిగిపోతుంది. దీంతో మెత్తబడని, సులువుగా ఒంగిపోయే బలమైన పుల్ల అవసరం చింపాంజీలకు ఏర్పడింది. బిరుసుగా ఉండే కర్రపుల్లకు బదులు బురద బొరియల్లో అలవోకగా ఒంగుతూ దూరిపోయే ఫ్లెక్సిబుల్ పుల్లతోనే పని సులువు అవుతుందని చింపాంజీలు కనిపెట్టాయని పరిశోధనల్లో ముఖ్య రచయిత అలెజాండ్రా పాస్కల్ గరిడో చెప్పారు. ‘‘ దగ్గర్లోని ప్రతి పుల్లను అవి మొదట సరిచూస్తాయి. మెత్తగా ఉందా, గట్టిగా ఉందా, వంచేస్తే విరుగుతుందా, ఎంత కోణం వరకు విరగకుండా వంగగలదు? ఇలాంటి టెస్ట్‌లన్నింటినీ పుల్లలపై చేస్తాయి. అన్ని టెస్టుల్లో పాసైన పుల్లనే చెదపురుగుల వేటకు వినియోగిస్తాయి. టాంజానియా దేశంలోని గాంబే నేషనల్ పార్క్‌లోని చింపాంజీల వేట విధానాలపై ఈ పరిశోధన చేశారు. అడవిలో భిన్న రకాల చెట్ల నుంచి ఒకతరహా పుల్లలు వస్తున్నప్పటికీ కొత్త జాతుల చెట్ల పుల్లలనే చింపాంజీలు వినియోగిస్తుండటం విశేషం. చింపాంజీలు నివసించే ప్రదేశాల్లో వేర్వేరు రకాల పుల్లలు ఉన్నప్పటికీ ఏకంగా 175 శాతం ఎక్కువగా ఒంగిపోయే సామర్థ్యమున్న పుల్లలనే చింపాంజీలు ఎంపికచేసి వాడుతున్నాయి. ఒకే జాతి చెట్ల పుల్లల్లో ఒంగిపోయే గుణమున్నా, ఎక్కువ ఒంగే లక్షణమున్న ఉపజాతి చెట్ల పుల్లలనే అవి కనిపెట్టి వాడుతుండటం చూస్తుంటే వీటిని నిజంగా ఫిజిక్స్ మీద మంచి పట్టు ఉన్నట్లు చెప్పొచ్చు’’ అని పాస్కల్ వ్యాఖ్యానించారు. ‘‘ ఒంగే పుల్లల్లోనూ ఏది ప్రస్తుతం వాడేందుకు అనువుగా ఉంది అనే అంశాన్ని తీరా వేట మొదలెట్టేటప్పుడూ పరీక్షించి చూస్తున్నాయి. తోటి చింపాంజీ ఏ రకం పుల్లను వాడుతోంది? అది పుల్లను ఎలా వినియోగిస్తోంది? వేట ఫలితం బాగుందా? అనే వాటినీ పక్కక ఉన్న మరో చింపాంజీ గమనిస్తుంది. మానవుల పూర్వీకులు సైతం ఇలాగే సమష్టిగా వేటాడుతూ వనోత్పత్తులను తమ వేటకు ఉపకరణాలుగా వాడుకునేవారు. ఇలాగే చెక్క సంబంధ వస్తువుల వినియోగంలో విప్లవాత్మక మార్పులు సాధ్యమయ్యాయి’’ అని పాస్కల్ వ్యాఖ్యానించారు. ‘‘ చింపాంజీలపై చేసిన ఈ పరిశోధన వాటికి ఏ పుల్ల అనువుగా ఉంది, అందుబాటులో ఉంది అనేది మాత్రమే కాదు వాటి అభిజ్ఞానవికాస స్థాయినీ తెలియజేస్తోంది. మన ఇంజనీరింగ్ సామర్థ్యాలు వేల సంవత్సరాల క్రితమే పరిణామ క్రమంలో మనలో ఇమిడిపోయాయనడానికి ఇదొక తార్కాణం. ఆదిమ మానవుల కాలం నుంచే అనాదిగా మనిషిలో ఇలా మేధాశక్తి పరంపరగా వస్తోంది’’ అని ఆయన అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రష్యా క్షిపణి దాడుల్లో 34 మంది మృతి
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భీకర క్షిపణి దాడులకు పాల్పడింది. సుమీ నగరం నడిబొడ్డున ఆదివారం జరిపిన వరుస దాడుల్లో కనీసం 34 మంది మృత్యువాత పడగా 117 మంది క్షతగాత్రులయ్యారు. ఉదయం 10.15 గంటల సమయంలో జనావాసాలున్న ప్రాంతంలో పామ్ సండే వేడుకల్లో పాల్గొన్న వారిపై పడ్డాయి. వీటి పేలుడు తీవ్రతకు ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగకమ్ముకుని భీతావహంగా మారింది. ఇద్దరు చిన్నారులు సహా 34 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది చిన్నారులు సహా 117 మంది గాయపడ్డారు. భవనాలు శిథిలాల దిబ్బగా మారింది. నుజ్జయిన వాహనాల నుంచి మంటలు చెలరేగాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. ఈ దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మండిపడ్డారు. రష్యాను ఉగ్రవాదిగా పరిగణిస్తూ చర్యలు తీసుకోవాలని పశ్చిమ దేశాలకు విజ్ఞప్తి చేశారు. కాల్పుల విరమణకు తూట్లు పొడుస్తున్నారంటూ రష్యా, ఉక్రెయిన్ పరస్పరం ఆరోపణలు చేసుకున్న మరునాడే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. -
మనువుతో మతిమరుపే!
ఒంటరితనంతో బాధపడేవారు కొన్ని విషయాలనే పదేపదే ఆలోచిస్తూ మిగతా వాటిని మర్చిపోతారనే వాదన ఉంది. కానీ అందులో అస్సలు నిజం లేదని తాజా అధ్యయనం ఒకటి బల్లగుద్ది చెబుతోంది. సోలో బతుకే సో బెటరు అంటోంది. పెళ్లికాని ప్రసాదుల్లో మతిమరుపు లక్షణాలు తక్కువని చెబుతోంది. వైవాహిక బంధానికి బీటలు పడి మళ్లీ ఒంటరయ్యే వాళ్లలో కూడా మతిమరుపు బారిన పడే అవకాశాలు బాగా తగ్గుతున్నట్టు కూడా ఈ పరిశోధనలో వెల్లడైంది.వేల మందిపై అధ్యయనం తర్వాత.. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర విశ్వవిద్యాలయం ఈ పరిశోధన జరిపింది. ఇందుకోసం అమెరికాలో 24,000 మందిని ఎంపికచేశారు. వాళ్లందరినీ 18 ఏళ్లపాటు అధ్యయనం చేశారు. పెళ్లయిన వాళ్లు, విడాకులైన వాళ్లు, బ్రహ్మచారులు, జీవితభాగస్వామి అనారోగ్యంతో కన్నుమూసిన వారిని పరిశోధనకు ఎంచుకున్నారు. మతిమరుపు లక్షణాలు లేని వాళ్లను మాత్రమే అధ్యయనం కోసం ఎంపికచేశారు. పెళ్లికాని వాళ్లను మూడు గ్రూప్‌లుగా విభజించి ఆరోగ్య పరిస్థితిని అంచనావేశారు. పెళ్లయిన వాళ్లతో పోలిస్తే వారికి మతిమరుపు ముప్పు తక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది. పొగ తాగడం, కుంగుబాటు వంటివి ఫలితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని పరిశోధకులు చెప్పారు. పెళ్లయిన వాళ్లతో పోలి స్తే పెళ్లయి విడాకులు తీసుకున్న వాళ్లు, అస్సలు పెళ్లిచేసుకోని వాళ్లలో మతిభ్రంశం ముప్పు తక్కువగా ఉందని బయటపడింది. పెళ్లికాని వ్యక్తుల్లో అల్జీమర్స్ తరహా డిమెన్షియా ముప్పు తక్కువగా ఉంది. అయితే డిమెన్షియాలో అరుదైన రకమైన వాసు్కలర్ చిత్తవైకల్యం ముప్పు వివరాలు వెల్లడికాలేదు.విడాకులు తీసుకున్న వాళ్లలో విడాకులు తీసుకున్న వాళ్లు, అస్సలు పెళ్లిచేసుకోని వాళ్లలో అభిజ్ఞానవికాసం క్షీణించి డిమెన్షియా బారినపడే అవకాశాలు తక్కువగా ఉంటాయని వెల్లడైంది. అధ్యయనకాలంలో జీవితభాగస్వామి చనిపోవడంతో ఒంటరిగా మారిన వ్యక్తుల్లోనూ మనోభ్రంశం ముప్పు తక్కువగా ఉండటం విశేషం. మెదడు ఆరోగ్యం ముఖ్యం మెదడు పనితీరు ఎంత కీలకమైందో ఈ పరిశోధనలో మరోసారి స్పష్టమైంది. వైవాహిక జీవితంలో ఎదురయ్యే అనూహ్య పరిణా మాలు, కష్టాలు, రాజీపడటం, కీలకమైన నిర్ణయాలు అనేవి మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. పెళ్లిచేసుకుంటే హాయిగా ఉంటాం అనేది నిజం కాదని, పెళ్లాయ్యాక కూడా హాయిగా ఉండగల్గితేనే మెదడు ఆరోగ్యం బాగుంటుందని పరిశోధన పునరుద్ఘాటించింది. జీవితభాగస్వామిని కోల్పోయిన వాళ్లు, విడాకులు తీసుకున్న వాళ్లు ఎంతో వేదనకు గురవుతారన్న అభిప్రాయాన్ని సవాల్ చేసేలా ఈ పరిశోధనా ఫలితాలు రావడం గమనార్హం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆస్పత్రిపై బాంబుల వర్షం
డెయిర్ అల్–బలాహ్: గాజాపై క్షేత్రస్థాయి దాడులను తీవ్రతరం చేసిన ఇజ్రాయెల్.. ఆదివారం మరో దారుణానికి ఒడిగట్టింది. గాజాలో పూర్తిస్థాయిలో పనిచేస్తున్న అతి పెద్ద, చిట్టచివరి ఆస్పత్రి అల్–అహ్లిపై ఇజ్రాయెల్ ఆదివారం ఉదయం క్షిపణులతో దాడి చేసింది. రెండు క్షిపణి దాడుల్లో ఆక్సిజన్‌పై ఉన్న ముగ్గురు రోగులు మరణించారు. ఆసుపత్రిలోని రెండంతస్తుల ప్రయోగశాల కూలిపోయింది. ఫార్మసీ, అత్యవసర విభాగ భవనాలు దెబ్బతిన్నాయి. సెయింట్ ఫిలిప్స్ చర్చి భవనం సహా చుట్టుపక్కల భవనాలకు కూడా నష్టం వాటిల్లింది. ఆస్పత్రిపై దాడి చేస్తామని ఇజ్రాయెల్ భద్రతా దళాల నుంచి కాల్ రావడంతో రోగులను ఖాళీ చేయిస్తుండగానే ఘటన జరిగింది. భయాందోళనకు గురైన రోగులు వీధుల్లోకి పరుగెత్తారు. క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన వారమైన పామ్ సండే నాడు ఇజ్రాయెల్ చేసిన దాడిని ఆస్పత్రిని నిర్వహిస్తున్న జెరూసలేం డయోసిస్ ఖండించింది. దాడి సమయంలో వందలాది మంది రోగులున్నారని తెలిపింది. రోగులకు ఆక్సిజన్ కూడా లేకుండా పోయిందని, వారు చనిపోతారనే ఆందోళనగా ఉందని తెలిపింది. మరో దాడిలో ఏడుగురు సోదరులు మృతి కొన్ని గంటల తరువాత, సెంట్రల్ గాజాలోని డెయిర్ అల్–బలాహ్‌లో కారుపై జరిపిన ప్రత్యేక దాడిలో ఆరుగురు సోదరులు, వారి స్నేహితుడు మరణించారు. వారిలో 10 ఏళ్ల బాలుడు ఉన్నాడు. గాజాలోని పాలస్తీనియన్లకు ఆహారాన్ని పంపిణీ చేసే స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్న తన కొడుకులను చంపారని వారి తండ్రి ఇబ్రహీం అబూ మహదీ వాపోయారు. ఏం పాపం చేశారని తనపిల్లలను చంపారంటూ రక్తసిక్తమైన కారులో ఉన్న మృతదేహాలపై పడి కన్నీరుమున్నీరుగా విలపించారు. గత 24 గంటల్లో 11 మంది చనిపోయారని, 100 మందికి పైగా గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది.హమాస్ కేంద్రంగా ఉపయోగిస్తున్నందుకే.. ఉగ్రవాద సంస్థ హమాస్ కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలుగా ఉపయోగిస్తున్నందునే ఆయా ప్రాంతాలపై దాడి చేశామని ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాంతంలో ముందస్తు హెచ్చరికలు అందించడం సహా పౌరులకు, ఆసుపత్రికి హాని కలిగించే అవకాశాలను తగ్గించడానికి చర్యలు తీసుకున్నట్లు ఎక్స్‌లో పేర్కొంది. హమాస్‌ను తుదముట్టించాలంటే ఆస్పత్రులతో సహా పౌర మౌలిక సదుపాయాలపై దాడులు అవసరమని ఇజ్రాయెల్ గతంలో పేర్కొంది. అయితే, తన వాదనలకు మద్దతు ఇచ్చే ఆధారాలను మాత్రం చూపలేదు. -
రష్యా గ్యాస్ పైప్‌లైన్ మాకిచ్చేయండి
వాషింగ్టన్: ‘మినరల్స్ ఫర్ వెపన్స్’ ఒప్పందంలో భాగంగా ఉక్రెయిన్‌పై మరింత నియంత్రణకు అమెరికా ప్రయత్నిస్తోంది. ఉక్రెయిన్ భూభాగం నుంచి వెళ్లే రష్యా పైప్‌లైన్‌ను తమకు అప్పగించాలనే కొత్త డిమాండ్ ముందుకు తెచ్చింది. అరుదైన ఖనిజాలు, ఆయిల్, గ్యాస్ సహా ఉక్రెయిన్ విస్తారమైన వనరులను అమెరికా కంపెనీలకు అప్పగించాలని.. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒత్తిడి నేపథ్యంలో తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. అమెరికా వైఖరిని ఉక్రెయిన్‌కు చెందిన సెంటర్ ఫర్ ఎకనామిక్ స్ట్రాటజీకి చెందిన సీనియర్ ఎకనమిస్ట్ వోలోదిమిర్ లాండా తప్పుబట్టారు. ఈ డిమాండ్లు వలసవాద తరహా ఒత్తిడిని తలపిస్తున్నాయని, వాటిని అంగీకరించే అవకాశం లేదని ఆయన చెప్పారు. సోవియట్ కాలం నాటి సహజ వాయువు పైప్‌లైన్ ఉక్రెయిన్ భూభాగం గుండా వెళ్తోంది. పశ్చిమ రష్యాలోని సుడ్జా నుంచి స్లొవేకియా సరిహద్దుకు సమీపంలోని ఉక్రెయిన్ నగరం ఉజ్హోరోడ్ వరకు ఈ పైప్‌లైన్ ఉంది. ఇది యూరప్‌కు రష్యన్ గ్యాసు సరఫరా చేయడంలో కీలకంగా పనిచేస్తుంది. దీన్ని నియంత్రణలోకి తీసు కోవాలని యూఎస్ ప్రభుత్వ సంస్థ అయిన ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చూస్తోంది. రష్యా ప్రభుత్వ ఇంధన సంస్థ గాజ్‌ప్రోమ్‌తో ఉక్రెయిన్ ఐదేళ్ల ఒప్పందం గడువు ఈ ఏడాది జనవరితో ముగిసింది.బెర్లిన్ తరహాలో విభజిద్దాం... ఉక్రెయిన్ను బెర్లిన్లాగా విభజించవచ్చని అమెరికా ప్రత్యేక రాయబారి కీత్ కెల్లాగ్ సూచించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బెర్లిన్‌లో రష్యన్ జోన్, ఫ్రెంచ్ జోన్, బ్రిటీష్ జోన్, యూఎస్ జోన్ తరహాలో.. ఉక్రెయిన్‌లో యూకే, ఫ్రాన్స్ దళాలు పశ్చిమ ప్రాంతంలో భరోసాగా ఉంటాయన్నారు. ఆక్రమిత తూర్పు ప్రాంతంలో రష్యా సైన్యం ఉండవచ్చని, రెండింటి మధ్య ఉక్రెయిన్ దళాలతో సైనిక రహిత ప్రాంతం ఉంటుందని వెల్లడించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో తన మాటలను వక్రీకరించారన్నారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని కాపాడటమే తన లక్ష్యమన్నారు. -
అంతరిక్షం నుంచి అందాల భారతం
వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి రాత్రివేళ భారత్ ఎలా కనిపిస్తుందో తెలుసా? ఇదుగో, సరిగ్గా ఇలా! నక్షత్రాల వలయం కిందుగా నగరాల తాలూకు విద్యుద్దీప కాంతుల్లో ధగధగా మెరిసిపోతోంది కదూ. ఐఎస్ఎస్ నుంచి తీసిన ఈ ఫొటోను నాసా ఆదివారం విడుదల చేసింది. మేఘావృతమైన అమెరికా, అందమైన ఆగ్నేయాసియా తీర ప్రాంతం, ఆకుపచ్చని అరోరా కాంతులతో కూడిన కెనడా తాలూకు ఫొటోలను కూడా ఎక్స్‌లో పంచుకుంది. ‘‘పైన నక్షత్రాలు, కింద మహానగరాల తాలూకు కాంతులు. దిగంతాల వెంబడి పరుచుకున్న వాతావరణపు మసక వెలుతురులు. అచ్చెరువొందించే అందాలకు ఆలవాలం మన భూగోళం’’ అంటూ చక్కని క్యాప్షన్ జోడించింది. అంతరిక్షం నుంచి భారత్ భలేగా కనిపిస్తోందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ‘అయితే భారతీయులమంతా సాలెగూడులా అందంగా విస్తరించామన్నమాట’ అంటూ ఒక యూజర్ మురిసిపోయాడు. -
అణు విద్యుచ్ఛక్తిలో... చైనా అద్భుతం!
ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ అవసరాలు నానాటికీ ఊహాతీతంగా పెరిగిపోతున్నాయి. కృత్రిమ మేధ, రోబోటిక్స్, సెమీ కండక్టర్లు, బయో టెక్నాలజీ వంటి రంగాల్లో ముందంజలో ఉండాలంటే అత్యధిక విద్యుత్, అది కూడా కారుచౌకగా అందుబాటులో ఉండటం అత్యంత ముఖ్యం. ఎందుకంటే ఒక అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌ను నిర్వహించాలంటే కనీసం 40 లక్షల విద్యుత్ వాహనాలను చార్జ్ చేయడానికి సమానమైన విద్యుత్ కావాలని అంచనా. ఆన్లైన్ డేటాను రెప్పపాటులో ప్రాసెస్ చేసే కృత్రిమ మేధ డేటా సెంటర్లకు ప్రాణమైన గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ (జీపీయూ)లకు కూడా నిరంతరం నిరాటంకమైన విద్యుత్ సరఫరా తప్పనిసరి. ప్రపంచమే డేటామయంగా మారిన నేపథ్యంలో డేటాను కాపాడుకోవాలన్నా, ఆన్లైన్లో నిరంతరం అందుబాటులో ఉంచాలన్నా అపారమైన విద్యుచ్ఛక్తి కావాల్సిందే. అణు విద్యుత్ రంగంలో ఇప్పటికే నంబర్‌వన్‌గా ఉన్న చైనా దీన్ని ముందే పసిగట్టింది. ప్రపంచంలోనే తొలిసారిగా ‘కేంద్రక సంలీన, విచ్చిత్తి’ సూత్రాల కలబోతగా ఓ వినూత్న అణు రియాక్టర్ తయారీకి నడుం బిగించింది. ఈ ప్రయత్నం గనుక ఫలిస్తే అపారమైన విద్యుత్ నిరంతరంగా అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. అన్నింట్లోనూ అగ్రస్థానం కేసి... ప్రపంచంలో ఎక్కడ ఏ కొత్త రకం వస్తువు తయారైనా వెంటనే దానికి నకలు తయారు చేస్తుందని చైనాకు పేరుంది. ఇమిటేషన్ టెక్నాలజీకి పేరెన్నికగన్న చైనా ఇప్పుడు వినూత్న ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక శక్తిగా ఎదగాలని ఆశపడుతోంది. పరిశోధన, అభివృద్ధిపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా వాటికి అత్యధిక నిధులు కేటాయించిన దేశాల్లో చైనాది రెండో స్థానం విశేషం. హువాయీ, టెన్సెంట్, అలీబాబా, గ్జియోమీ, డీజేఐ కంపెనీలు, ఇన్నోవేషన్‌కు సంబంధించి బీవైడీ తదితరాలు చైనాను టెక్నాలజీలో అగ్రస్థానంలో నిలిపాయి. 5జీ టెక్నాలజీలో హువాయీ, డ్రోన్ టెక్నాలజీలో బీవైడీ టాప్ కంపెనీలుగా వెలుగొందుతున్నాయి. ఐదు నిమిషాలు ఛార్జ్ చేస్తే 400 కిలోమీటర్ల వెళ్లగల బ్యాటరీ, చార్జింగ్ వ్యవస్థలను బీవైడీ అభివృద్ధి చేసింది. విద్యుత్ వాహనాల అమ్మకాలు, ఆదాయంలో అది ‘టెస్లా’ను దాటేసిందని బీబీసీ ఇటీవలే పేర్కొంది. విద్యుత్ ఆధారిత రంగాల్లో అగ్రగామిగా కొనసాగాలంటే నిరంతర విద్యుత్ అవసరం. ఆ అవసరాలు తీరేలా చైనా ఇలా కేంద్రక సంలీన, విచ్ఛిత్తి రియాక్టర్ పనిలో పడింది.ఇలా పని చేస్తుంది జియాన్‌గ్జీ ప్రావిన్సులోని యహోహూ సైన్స్ ద్వీపంలో ఝింగ్‌హువో పేరిట ఈ వినూత్న అణు విద్యుత్కేంద్రాన్ని కేంద్రాన్ని చైనా నిర్మిస్తోంది. చైనా భాషలో ఝింగ్‌హువో అంటే మెరుపు. కేంద్రక విచ్చిత్తిలో యురేనియం వంటి బరువైన అణువులోని కేంద్రకం రెండు చిన్న కేంద్రకాలుగా విడిపోతుంది. ఆ క్రమంలో అత్యధిక స్థాయిలో ఉష్ణశక్తి వెలువడుతుంది. అణుబాంబు తయారీలో ఉండేది ఈ సూత్రమే. అణు రియాక్టర్లలో నూ దీన్నే వాడతారు. అదే కేంద్రక సంలీన ప్రక్రియలో రెండు కేంద్రకాలు కలిసిపోయి ఒక్కటిగా మారతాయి. విచ్చిత్తితో పోలిస్తే సంలీన చర్యతోనే అత్యధిక విద్యుదుత్పత్తి సాధ్యం. ఝింగ్‌హువో రియాక్టర్లో తొలుత సంలీన చర్యలు జరిపి వాటి ద్వారా వచ్చే భారయుత కేంద్రకాల సాయంతో విచ్ఛిత్తి జరుపుతారు. తద్వారా మరింత ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందని చైనా శాస్తవేత్తలు చెబుతున్నారు. ఐదేళ్లలో లక్ష్యాన్ని సాధించాలని భావిస్తున్నారు.అత్యధిక ‘క్యూ వాల్యూ’ అత్యధిక అణు విద్యుదుత్పత్తి జరగాలంటే కేంద్రక సంలీన చర్యలో అత్యధిక శక్తి ఉద్గారం జరగాలి. సంలీన ప్రక్రియలో విడుదలయ్యే అత్యధిక ఉష్ణశక్తిని రియాక్టర్ విద్యుత్ రూపంలోకి మారుస్తుంది. సంలీన ప్రక్రియకు వెచ్చించాల్సిన శక్తి కంటే దాన్నుంచి ఉత్పన్నమయ్యే శక్తి ఎక్కువగా ఉండటాన్ని ‘నికర శక్తి లాభం’గా పిలుస్తారు. దాన్నే ‘క్యూ వాల్యూ’గా చెప్తారు. సంలీన ప్రక్రియలో అత్యధికంగా ఏకంగా 30 క్యూ వాల్యూను సాధించాలని చైనా లక్ష్యంగా పెట్టుకున్నట్టు సౌత్ చైనా మారి్నంగ్ పోస్ట్ కథనం పేర్కొంది. మూడేళ్ల క్రితం అమెరికాలో కాలిఫోరి్నయాలోని నేషనల్ ఇగ్నిషన్ ఫెసిలిటీ కేంద్రం 1.5 క్యూ వాల్యూను సాధించింది. ఫ్రాన్స్‌లోని ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పరమెంటల్ రియాక్టర్ (ఐటీఈఆర్) 10 క్యూ వాల్యూను సాధించే ప్రయత్నంలో ఉంది. అమెరికా, ఫ్రాన్స్ ఇప్పటికే కేంద్రక సంలీనం ద్వారా అణువిద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు శ్రమిస్తున్నాయి. చైనా తాజా యత్నాలు ఫలిస్తే అది ఏకంగా 20 ఏళ్లు ముందుకు దూసుకెళ్లగలదని ఆంట్రప్రెన్యూర్ ఇన్ఫ్లుయెన్సర్ ఆర్నాడ్ బేర్‌ట్రెండ్ అభిప్రాయపడ్డారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎలాన్ మస్క్ టాప్ సీక్రెట్: నెట్టింట్లో వైరల్
అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' ఇటీవల నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో.. ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' తీసుకున్న నోట్‌ప్యాడ్ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోను గమనిస్తే.. టెస్లా సీఈఓ కాన్ఫరెన్స్ టేబుల్ వద్ద కూర్చుని 'ఎలాన్ మస్క్' అని రాసి ఉన్న నేమ్ కార్డ్ కనిపిస్తుంది. అక్కడే ఒక పేపర్ మీద 'టాప్ సీక్రెట్' రాసి ఉండటాన్ని గమనించవచ్చు. ఈ ఫోటోలో ఒక పెన్ను, ఖాళీ గాజు మాత్రమే కాకుండా యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడి ముద్ర ఉన్న కోస్టర్ కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరక్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.సోషల్ మీడియా వినియోగదారులు మస్క్ నోట్‌ప్యాడ్‌ను జూమ్ చేయడంతో “టాప్ సీక్రెట్” అనే పదాలు కనుగొన్నారు. మీడియాను గందరగోళంలోకి నెట్టడానికి మస్క్ ఈ విధంగా చేసి ఉంటాడని.. ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. దీనికి ఎలాన్ నవ్వుతున్న ఒక ఎమోజీతో రిప్లై ఇచ్చారు.ఇదీ చదవండి: గోల్డ్ రేటు ఇంకా పెరుగుతుందా?: నిపుణులు ఏం చెబుతున్నారంటే..ఒక ట్రిలియన్ నుంచి రెండు ట్రిలియన్ డాలర్ల వరకు.. అమెరికా వ్యయాలను తగ్గిస్తామని ఒకప్పటి నుంచి చెబుతున్న ఎలాన్ మస్క్ ఇప్పుడు మాట మార్చేశారు. ఇటీవల జరిగిన సమావేశంలో.. 150 బిలియన్ డాలర్ల వ్యయాలను తగ్గించగలమని క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా ట్రంప్ నేతృత్వంలోని డోజ్ టీమ్ పర్ఫామెన్స్ అద్భుతంగా ఉందని మస్క్ మెచ్చుకున్నారు.😂 https://t.co/0NsNM4yAdR— Elon Musk (@elonmusk) April 12, 2025 -
Jesus Nut: టెక్ సీఈవో ఫ్యామిలీ ప్రాణం తీసిన ‘జీసెస్ నట్’ కథ!
వాషింగ్టన్: జర్మనీకి చెందిన దిగ్గజ టెక్నాలజీ కంపెనీ సీమెన్స్ స్పెయిన్ విభాగం సీఈవో అగస్టిన్ ఎస్కోబార్ (agustin escobar) కుటుంబం మరణానికి ‘జీసెస్ నట్’ (jesus nut) కారణమైందని నిపుణులు భావిస్తున్నారు.గత గురువారం ఆగస్టిన్ ఎస్కోబార్, అతని భార్య, మెర్సి కాంప్రూబి మాంటాల్, వారి ముగ్గురు పిల్లలు (వయస్సు 4, 5, 11), పైలట్‌తో సహా సైట్ సీయింగ్ కోసం బయల్దేరారు. ఇందుకోసం బెల్ 206 అనే సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్‌ను వినియోగించారు.అయితే, సీఈవో కుటుంబం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ వాల్ స్ట్రీట్ హెలిపోర్ట్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు టేకాఫ్ అవుతుండగా.. మన్‌హట్టన్ వినువీధిలో .. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దిశగా వెళ్లింది. ఆ సమయంలో గిరిగిరా తిరుగుతూ న్యూయార్క్ నగరంలోని ‘మిరాకిల్ ఆన్ ది హడ్సన్’ (miracle on the hudson) నదిలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంపై అందిన ప్రాథమిక సమాచారం మేరకు.. పక్షి ఢీకొట్టడం వల్లే హెలికాఫ్టర్ ప్రమాదం జరిగి ఉంటుందేమోనని అందరూ భావించారు. హెలికాప్టర్‌కు ప్రమాదం జరిగే సమయంలో స్థానికులు వీడియోలు తీశారు. ఆ వీడియోల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఘోరం జరిగే సమయంలో పక్షుల జాడ ఎక్కడా కనిపించలేదు. దీంతో హెలికాప్టర్ ప్రమాదానికి కారణం ఏమై ఉంటుందా? అన్న కోణంలో దర్యాప్తు కొనసాగింది. పలు ఆధారాలు, ఏవియేషన్ రంగ నిపుణులు, ప్రమాదానికి ముందు జరిగిన నిర్లక్ష్యం ఆధారంగా బెల్ 206 హెలికాప్టర్ ప్రమాదానికి కారణం ‘జీసెస్ నట్’ కారణమనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.ఏంటి ‘జీసెస్ నట్’ జీసెస్ నట్ అనేది హెలికాప్టర్ మెయిన్ రోటర్ మాస్ట్‌పై(mast) అమర్చబడి ఉంటుంది. అంటే ఇది హెలికాప్టర్ రెక్కలు..హెలికాప్టర్ ఇంజిన్‌కు జాయింట్ చేసి ఉంటుంది. ఈ భాగం వద్ద జీసెస్ నట్ ఉంటుంది. అది ఏ మాత్రం సరిగ్గా లేకపోయినా, ఊడినా హెలికాప్టర్ మొత్తం అదుపు తప్పుతుంది. ఆ నట్టు ఊడి పోతే హెలికాప్టర్ ప్రమాదం నుంచి బయటపడేయడం పైలెట్ వల్ల కూడా సాధ్యం కాదు. ఆగస్టిన్ ఎస్కోబార్ కుటుంబం ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లోని ఈ జీసెస్ నట్ ఊడిపోవడం వల్లే విషాదం చోటు చేసుకున్న న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. ప్రస్తుతం ఈ ఘటనపై ఎఫ్ఏఏ (fedaral viation Administration) విచారణను వేగవంతం చేసింది.‘జీసెస్ నట్’ అంటే ఏమిటి?.. చరిత్ర ఏం చెబుతోందిజీసెస్ నట్ అనే పదం వియత్నాం యుద్ధంలో అమెరికన్ సైనికుల నోట తొలిసారి ఈ పదం వెలుగులోకి వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. 1930, 1940లలో యుద్ధ సమయంలో అమెరికా నేవి ప్రత్యర్థుల్ని మట్టికరింపించేందుకు చిన్న ఎయిర్ క్ట్రాప్ట్లను భారీ సంఖ్యలో డిజైన్ చేయించింది. కాన్సాలిడేటెడ్ మోడల్ 28లో పీబీవై కాటలినా అనే ఎయిర్ క్ట్రాప్ట్లో తొలిసారి ఈ నట్టును వినియోగంలోకి తెచ్చారు. పైన చెప్పుకున్నట్లుగా ఈ నట్టు ఎయిర్ క్ట్రాప్ట్ రెక్కలకు, ఇంజిన్‌కు అనుసంధానం చేసి ఉంటుంది. అయితే వియత్నంతో జరిగే యుద్ధంలో ఈ ఎయిర్ క్ట్రాఫ్ట్లో సైనికులు ప్రయాణిస్తుండగా ఎదైనా ప్రమాదం జరిగితే ఆ నట్టు బిగించిన రూటర్ మాస్ట్ ఊడిపోతే .. జీసెస్‌ను ప్రార్థించడం తప్ప ఏం చేయలేం అని అమెరికా సైనికులు అనేవారంటూ వీకీపీడియా సమాచారం చెబుతోంది.ప్రయాణానికి ముందే అంతేకాదు, ఈ తరహా జీసెస్ నట్ ఉన్న ఎయిర్క్రాప్ట్లలో ప్రయాణించే ముందు నట్టు సరిగ్గా ఉందా? లేదా? అని పరిశీలించాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే ప్రయాల్సి ఉంది. లేదంటే ప్రాణాలు గాల్లోనే కలిసి పోవడం ఖాయం. తాజాగా ‘మిరాకిల్ ఆన్ ది హడ్సన్’ నదిలో చోటు చేసుకున్న సీమెన్స్ స్పెయిన్ విభాగం సీఈవో అగస్టిన్ ఎస్కోబార్ కుటుంబం హెలికాప్టర్ ప్రమాదం ఈ జీసెస్ నట్ పనితీరుపై దృష్టిసారించకపోవడం వల్లే ప్రాణ నష్టం జరిగినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. -
ట్రంప్ ప్రభుత్వం ‘30 డేస్’ వార్నింగ్.. మర్యాదగా వెళ్లిపోండి
వాషింగ్టన్: ఇప్పటికే ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం.. మరొక కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు వెళ్లి అక్కడ స్థిరపడాలని చూసే వారిని మరోసారి హెచ్చరించింది. అక్కడ సాధ్యమైనన్ని ఎక్కువ రోజులు ఉండాలని చూస్తే అందుకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అక్రమంగా తమ దేశంలో స్థిరపడాలని చూసే వారిని అప్రమత్తం చేస్తూ ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. ‘ ఇక్కడ ఉన్న విదేశీ పౌరులు ఎవరైనా సరే 30 రోజులు దాటితే అమెరికా ప్రభుత్వం నమోదు తప్పనిసరి. ఒకవేళ అలా జరగకపోతే భారీ జరిమానాలే కాదు.. జైలు శిక్షను కూడా చూడాల్సి వస్తుంది’అని ట్రంప్ ఆధ్వర్యంలోని హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ స్పష్టం చేసింది. ఈ మేరకు ‘ఎక్స్’లో ఒక ట్వీట్ చేసింది. ‘ దయచేసి ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్లిపోండి. మీకు మీరుగా స్వచ్ఛందంగా అమెరికా నుంచి వైదొలగండి.’ అంటూ స్పష్టం చేసింది.Foreign nationals present in the U.S. longer than 30 days must register with the federal government. Failure to comply is a crime punishable by fines and imprisonment. @POTUS Trump and @Sec_Noem have a clear message to Illegal aliens: LEAVE NOW and self-deport. pic.twitter.com/FrsAQtUA7H— Homeland Security (@DHSgov) April 12, 2025వారికి ఈ నిబంధన వర్తించదు..స్టూడెంట్ పర్మిట్లు , వీసాలు ఉండి యూఎస్ లో ఉన్నవారిని ఇది ప్రత్యక్షంగా ప్రభావితం చేసే అవకాశం లేదు. కానీ విదేశీ పౌరులై సరైన అనుమతి లేకుండా యూఎస్ లో ఉండేవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. అక్రమ వలసల్ని నిరోధించేందుకు కఠిన చర్యల్లో భాగంగా ట్రంప్ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. హెచ్ 1 బీ వీసాపై ఉన్న వ్యక్తి ఉద్యోగం కోల్పోయిన సమయంలో కూడా తాజా నిబంధన వర్తించదు. దానికి నిర్దేశించిన గడువు అనే నిబంధన ఇక్కడ వర్తిస్తుంది. విద్యార్థులు, హెచ్ 1 బీ వీసాదారులు యూఎస్ లో ఉండటానికి తప్పనిసరి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. -
సూడాన్‌లో మారణహోమం.. వందలాది మంది మృతి
కర్టోమ్: ఆఫ్రికా దేశం సూడాన్ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. పౌరుల శిబిరాలపై ఆర్ఎస్ఎఫ్ బలగాలు దాడులకు తెగబడ్డాయి. ఈ దాడుల్లో దాదాపు 114 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో, సూడాన్‌లో మారణహోమం జరిగింది.వివరాల ప్రకారం.. పశ్చిమ సూడాన్‌లోని నార్త్ డార్ఫర్‌లో గత రెండు రోజులుగా పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (RSF) బలగాలు దాడులు జరుపుతున్నాయి. విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో వందలాది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. జామ్జామ్‌లోని పౌరుల శిబిరాలపై శుక్రవారం ఆర్ఎస్ఎఫ్ బలగాలు దాడులు చేశాయి. ఈ దాడుల్లో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. మరణించిన వారిలో తొమ్మిది మంది రిలీఫ్ ఇంటర్నేషనల్ ఉద్యోగులు కూడా ఉన్నారు. #Sudan 🇸🇩: a desperate situation is unfolding in #Darfur as the #RSF has overrun the Zamzam IDP camp near #ElFasher, leaving hundreds killed and forcing thousands to flee towards the besieged city.The city of El-Fasher is on the brink after a year of brutal siege. pic.twitter.com/NReidyJklJ— Thomas van Linge (@ThomasVLinge) April 12, 2025 ఇక, శనివారం అబూషాక్ శిబిరంపై దాడులు జరిపారు. ఇందులో 14 మంది మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డారు. ఈ శిబిరంపై జరిగిన దాడిలో 40 మందికి పైగా మృతి చెందారని ఒక స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. ఈ దాడులకు సంబంధించి బలగాలు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. దాడుల సందర్భంగా భయంతో పౌరులు పరుగులు తీశారు. బతుకు జీవుడా అంటూ ప్రాణలు అరచేతిలో పట్టుకున్నారు. మరోవైపు.. దాడుల్లో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులు.. కన్నీటిపర్యంతమవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి. అయితే, 2023 ఏప్రిల్‌లో సూడాన్ ఆర్మీ చీఫ్ అబ్దుల్ ఫత్తా అల్-బుర్హాన్ మాజీ డిప్యూటీ, ఆర్ఎస్ఎఫ్ కమాండర్ మొహమ్మద్ హమ్దాన్ డాగ్లోల మధ్య ఘర్షణ నెలకొనడంతో ఇరువర్గాల మధ్య దాడులు ప్రారంభమయ్యాయి. సూడానీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ (SAF), ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మధ్య జరిగిన దాడుల వల్ల 2023 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 29,600 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. Scenes of Mourning: Funeral Held for Victims of Zamzam Camp MassacreHeartbreaking scenes unfolded in Darfur as residents gathered to bury the martyrs of Zamzam displacement camp, following the brutal attack carried out by the UAE-backed Rapid Support Militia.The funeral… pic.twitter.com/gvd6sNQUEV— Sudanese Echo (@SudaneseEcho) April 12, 2025 -
మాతో స్నేహం అంటూనే దాడి చేస్తారా?.. రష్యాపై భారత్ సీరియస్
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను టార్గెట్ చేసిన రష్యా దళాలు.. భీకర దాడులు చేశాయి. ఈ క్రమంలో భారతీయ ఔషధ కంపెనీ గోదాముపై రష్యా దాడి చేసింది. దీంతో, పేలుడు సంభవించి దట్టమైన మంటలు చెలరేగాయి. మరోవైపు.. రష్యా దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్‌తో స్నేహం ఉందని చెప్పే రష్యా కావాలనే ఇలా దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించారు.వివరాల ప్రకారం.. కీవ్‌లోని భారతీయ ఔషధ కంపెనీ కుసుమ్ అనే కంపెనీకి చెందిన గోదాముపై శనివారం రష్యా దాడి చేసింది. రష్యాకు చెందిన డ్రోన్ల దాడిలో గోదాం పూర్తిగా ధ్వంసమైంది. ఈ మేరకు గోదాంపై దాడి జరిగిందని ఢిల్లీలోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం వెల్లడించింది. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. రష్యా కావాలనే భారతీయ కంపెనీలను లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించింది. పిల్లలు, వృద్ధుల కోసం ఔషధాలు నిల్వ చేసిన గోదాములపై ఇలా దాడులు చేస్తోందని విమర్శించింది. భారత్‌తో స్నేహం ఉందని చెప్పే రష్యా కావాలనే ఇలా దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించింది.Breaking⚡️ : #Ukraine allege Indian pharmaceutical company godown hit by Russia leading to loss of medicines meant for children and distress people. Still to receive any statement from India or Moscow. #RussiaUkraineWar pic.twitter.com/VfpYND8PNq— Neeraj Rajput (@neeraj_rajput) April 12, 2025ఇక, అంతకుముందు ఉక్రెయిన్‌లోని బ్రిటన్ రాయబారి మార్టిన్ హారిస్ దాడిని ధ్రువీకరించారు. రష్యా డ్రోన్ల దాడిలో ఔషధాల గోదాము పూర్తిగా ధ్వంసమైందని తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్తోపాటు 29 దేశాల్లో తమ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని కుసుమ్ హెల్త్‌కేర్ వెబ్సైట్లో ఉంది. భారతీయ వ్యాపారవేత్త రాజీవ్ గుప్తా యాజమాన్యంలోని కుసుమ్, ఉక్రెయిన్‌లోని అతిపెద్ద ఫార్మా సంస్థలలో ఒకటి. -
పుతిన్‌తో ట్రంప్ ప్రతినిధి విట్కాఫ్ భేటీ
మాస్కో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్ శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమా వేశమయ్యారు. ఉక్రెయిన్‌తో కాల్పుల విర మణ ఒప్పందం కుదుర్చుకునేందుకు ముందుకు రావాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్‌పై ఒక అంగీకారానికి వచ్చే విష యమై సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో అధ్యక్షుడు పుతిన్‌తో విట్కాఫ్ నాలుగు గంటలకుపైగా చర్చలు జరిపారని, ఇవి ఫలవంతమయ్యా యని ప్రత్యేక ప్రతినిధి కిరిల్ దిమిత్రియేవ్ చెప్పారు. అమెరికా, రష్యాల మధ్య సంబంధాలను సాధారణ స్థాయికి తెచ్చే ప్రక్రియ సాగుతున్నందున చర్చల్లో కీలక పురోగతి సాధించొచ్చన్న ఊహాగానాలు చేయవద్దని అంతకుముందు దిమిత్రియేవ్ వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా, ఈ ఏడాదిలో పుతి న్, విట్కాఫ్ల మధ్య జరిగిన మూడో భేటీ ఇది. రష్యా అధ్యక్షుడు పుతిన్ వైఖరిని శుక్ర వారం ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ‘ఇది మతిలేని యుద్ధం, వేలాదిగా జనం చ నిపోతున్నారు. కాల్పుల విరమణకు రష్యా ముందుకు రావాలి’అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రెండో ప్రపంచ యుద్ధానంతరం జర్మనీని విడదీసినట్లుగానే ఉక్రెయిన్ ను రెండుగా చీల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వస్తున్న వార్తలను ఉక్రెయిన్ దూత కీత్ కెల్లాగ్ ఖండించిన నేపథ్యంలో ట్రంప్ ఈ మేరకు స్పందించడం గమనార్హం. పశ్చిమ ఉక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాల నియంత్రణను బ్రిటన్, ఫ్రాన్సు బలగాలకు అప్పగించే ప్రతిపాదన ఉన్నట్లు కెల్లాగ్ తెలిపారని టైమ్స్‌లో ఓ కథనం వెలువడింది. అనంతరం దీనిని కెల్లాగ్ ఖండించారు. తన వ్యాఖ్యలను వక్రీ కరించారని చెప్పారు. కాల్పుల విరమణ అనంతరం ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని పరిరక్షించేందుకు వీలుగా సైనిక మద్దతి వ్వాలని చెప్పానే తప్ప, విభజన గురించి మాట్లాడలేదన్నారు. -
అమెరికా కాలేజీల్లోనూఅక్రమ వలసదారుల వేట!
తలాహస్సీ(యూఎస్): అమెరికా గ్రామాలు, పట్టణాల్లో అనుమానిత ప్రదేశాలు, జనావాస స్థలాల్లో మాత్రమే ఇన్నాళ్లూ అక్రమ వలసదా రుల కోసం ఇమిగ్రేషన్ అధికారుల వేట కొన సాగింది. ఇకపై ‘సున్నిత ప్రదేశాల’ కేటగిరీలో ఉన్న విశ్వవిద్యాలయాల్లోనూ అక్రమ వలస దారుల జాడ కనిపెట్టేందుకు ఇమిగ్రేషన్ ఎన్ ఫోర్స్మెంట్ అధికారులు రంగప్రవేశం చేయ నున్నారు. ప్రస్తుతానికి ఫ్లోరిడా రాష్ట్రంలోని మూడు ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లోకి ‘ఇమి గ్రేషన్’ తనిఖీలను అనుమతించే అవకాశ ముంది. బోకా రాటన్ నగరంలోని ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ, గెయిన్స్‌విల్లేలోని ఫ్లోరిడా వర్సిటీ క్యాంపస్, తంపా సిటీలోని సౌత్ ఫ్లోరిడా యూనివర్సిటీలు ఈ మేరకు ట్రంప్ ప్రభుత్వంతో ఒప్పందానికి ముందుకొ చ్చాయి. తమ విశ్వవిద్యాలయాల అనుబంధ కళాశాలల్లోని స్థానిక పోలీసులను ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ సేవల కోసం వినియోగించుకునేందుకు ఈ మూడు ప్రభుత్వ విశ్వవి ద్యాలయాలు అనుమతి ఇవ్వనున్నాయి. ఫ్లోరిడా రాష్ట్ర గవర్నర్ రోన్ డీశాంటిస్ సైతం తమ రాష్ట్రంలో అక్రమ వలసదారులపై ఉక్కుపా దం మోపేందుకు ట్రంప్ సర్కార్‌కు పూర్తి మద్దతు పలుకుతున్న నేపథ్యంలో ఫ్లోరిడాలో తాజాగా ఈ పరిణామం జరగడం ప్రాధాన్య త సంతరించుకుంది. స్థానిక, రాష్ట్ర పాలనా యంత్రాంగాలు కలిసికట్టుగా ఇమిగ్రేషన్ విభాగానికి పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు ఫిబ్రవరి 19వ తేదీనే సంబంధిత ఒప్పందాలపై సంతకాలు చేశారు. పోలీసులకు తగు శిక్షణఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీలోని పోలీ స్ శాఖ(ఎఫ్ఏయూపీడీ) సిబ్బందికి ఇమిగ్రే షన్ ఎన్ఫోర్స్మెంట్ విభాగ విధులను అప్ప గించనున్నారు. ఇమిగేషన్ సంబంధిత పత్రాల తనిఖీ, ఒకవేళ అక్రమ వలసదారు చిక్కితే నిర్బంధం, అరెస్ట్, అనుసరించాల్సిన విధానాలను ఈ సాధారణ పోలీసులుకు విడమర్చి చెప్పనున్నారు. ఇందుకోసం ఎఫ్ఏ యూపీడీ సిబ్బందికి ‘287(జీ) ప్రోగ్రామ్’ పేరిట తగు శిక్షణ ఇస్తారని ఫ్లోరిడా అట్లాంటిక్ వర్సిటీ అధికార ప్రతినిధి జాషువా గ్లేంజర్ చెప్పారు. ఈ శిక్షణ బాధ్యతలను యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తీసుకోనుంది. వర్సిటీ పోలీసులకు ఇలా ఇమిగ్రేషన్ అధికారాలు దఖలుపడే అవకాశం రావడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి. శిక్షణ పూర్తయ్యాక వర్సిటీ పోలీసు లు ఆయా విశ్వవిద్యాలయాల ప్రాంగణాలు, క్యాంపస్, కళాశాలల్లో అనుమానితులు, విద్యార్థులు, విదేశీయులను విచారిస్తారు. తనిఖీలు చేస్తారు. అవసరమైతే ఎలాంటి వారెంట్ లేకుండానే అరెస్ట్ చేస్తారు. అయితే వర్సిటీ పాలకమండళ్ల ఈ నిర్ణయాలను విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నాయి. విద్యాలయాలను అక్రమచొరబాట్ల తనిఖీ కేంద్రాలుగా మార్చొద్దని, నిర్ణయాలను వెంటనే వెనక్కితీసుకోవాలని డిమాండ్‌చేశాయి. ‘‘వర్సిటీల్లో ఉన్న వాళ్లు విద్యార్థు లా కాదా అంటూ పోలీసులు అణువణువునా గాలింపులు మొదలెడితే వర్సిటీల్లో ప్రశాంత వాతావరణం దెబ్బతింటుంది’’ అని జెనికా ఛార్లెస్ అన్నారు. ఛార్లెస్ హౌతీ నుంచి వలసవచ్చి ఫ్లోరిడా అట్లాంటిక్ వర్సిటీలో రాజనీతిశాస్త్రం చదువుతున్నారు. సురక్షిత, సమ్మిళిత విద్యకు పట్టుగొమ్మల్లాంటి వర్సిటీ ల్లో ఇమిగ్రేషన్ తనిఖీలు, సోదాలను నిరోధించాలని ‘ప్రెసిడెంట్స్ అలయన్స్ ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ ఇమిగ్రేషన్’ సంస్థ సీఈఓ మిరియం ఫెడ్బ్లమ్ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ సంస్థ విదేశీ విద్యార్థుల సమస్యలపై పోరాడుతోంది. -
అణు కార్యక్రమంపై ముగిసిన ఇరాన్–అమెరికా ప్రతినిధుల భేటీ
మస్కట్: ఇరాన్, అమెరికా ప్రతినిధుల ముఖాముఖి మొదటి విడత చర్చలు శనివారం ఒమన్ రాజధాని మస్కట్‌లో ముగిశాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు జరిపేందుకు వీరు వచ్చే వారం మరోసారి సమావేశం కానున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి ఎన్నికయ్యాక మొదటి విడత చర్చలు పూర్తయినట్లు ఇరాన్ ప్రభుత్వ టీవీ తెలిపింది. అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి కొద్దిసేపు మాట్లాడుకున్నట్లు ఇరాన్ వార్తా సంస్థ పేర్కొంది. కాగా, ఈ నెల 19వ తేదీన తదుపరి విడత పరోక్ష చర్చలు జరుపుతామని అరగ్చి తెలిపారు. ‘ఫలితం లేని ఈ చర్చలతో సమయం వృథా. వీటిపై ఎవరికీ ఆసక్తి లేదు’అని పేర్కొన్నారు. మస్కట్ శివారులోని ఓ భవనంలో సమావేశమైన రెండు దేశాల ప్రతినిధులు రెండు గంటలపాటు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో చర్చలు ముఖాముఖి జరిగినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రతినిధి విట్కాఫ్ తెలపడం గమనార్హం. అణు కార్యక్రమాన్ని ధ్వంసం చేయడమన్నదే తమ లక్ష్యమని ఇరాన్‌కు తెలిపినట్లు విట్కాఫ్ అంటున్నారు. -
కొత్త సుంకాల నుంచి ఎల్రక్టానిక్స్‌కు మినహాయింపు
వాషింగ్టన్: ప్రతీకార సుంకాల విషయంలో ట్రంప్ సర్కారు మరో యూ టర్న్ తీసుకుంది. 20 రకాల కీలక ఎలక్ట్రానిక్ వస్తువులను కొత్త సుంకాల జాబితా నుంచి మినహాయిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. అన్ని దేశాల ఉత్పత్తులపైనా అమెరికా విధించిన 10 శాతం బేస్‌లైన్ టారిఫ్ నుంచి కూడా వీటిని మినహాయించినట్టు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం పేర్కొంది. చైనా దిగుమతులపై విధించిన 145 శాతం సుంకాలు కూడా వీటికి వర్తించబోవు. టారిఫ్‌ల దెబ్బకు అమెరికా కంపెనీలు నష్టపోకుండా చూడటమే దీని వెనక ప్రధానోద్దేశంగా కన్పిస్తోంది. స్మార్ట్ఫోన్లు మొదలుకుని ల్యాప్‌లాప్‌లు, సెమీ కండక్టర్ చిప్‌ల దాకా ఈ జాబితాలో ఉన్నాయి. వీటిలో చాలా వస్తువులు అమెరికా బయట తయారయ్యేవే. హెచ్చు టారిఫ్‌ల దెబ్బకు వీటి ధరలు చుక్కలనంటుతాయంటూ అమెరికా టెక్ దిగ్గజాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడటం విశేషం. దీనితో యాపిల్, సామ్సంగ్ వంటి మొబైల్ దిగ్గజాలతో పాటు ఎన్విడియా వంటి చిప్ తయారీ కంపెనీలకు లబ్ధి చేకూరనుంది. అయితే ఇది తాత్కాలిక నిర్ణయమేనని అమెరికా ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. వాటిపై త్వరలో ఎంతోకొంత టారిఫ్ ప్రకటించవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యాపిల్ ఉత్పత్తుల్లో ఏకంగా 80 శాతానికి పైగా చైనాలో, మిగతా మొత్తం భారత్‌లో తయారవుతాయని అంచనా. మినహాయింపు జాబితాలో... స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డ్రైవ్‌లు, టెలికాం పరికరాలు, చిప్–సెమీ కండక్టర్ తయారీ యంత్రాలు, రికార్డింగ్ పరికరాలు, డేటా ప్రాసెసింగ్ యంత్రాలు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు విడిభాగాలు, ఫ్లాట్ ప్యానల్ మానిటర్లు -
భారతీయులే లక్ష్యంగా ట్రంప్ మరో బాంబు
అమెరికాలోని మనోళ్లపై తెంపరి ట్రంప్ మరో బాంబు పేల్చారు. గ్రీన్‌కార్డు, హెచ్1బీ వీసాలపై అక్కడ చట్టబద్ధంగా నివసిస్తున్న భారతీయులే లక్ష్యంగా మరో వేధింపుల పర్వానికి తెరతీశారు. వాళ్లు నిరంతరం తమ ఐడీ కార్డును విధిగా వెంట ఉంచుకోవాల్సిందేనని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు కఠిన నిబంధనను శుక్రవారం (ఏప్రిల్ 11) నుంచే అమల్లోకి తెచ్చింది. లేదంటే జరిమానాలతో పాటు కఠినచర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఇంకా ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోని అక్రమ వలసదారులను గుర్తించడంలో ప్రభుత్వానికి దోహదపడుతుందంటూ అక్కడి న్యాయస్థానం కూడా ఈ కఠిన నిబంధనకు పచ్చజెండా ఊపింది. అమెరికా పౌరసత్వంలేని 18 ఏళ్లు నిండిన వారంతా తమ చట్టబద్ధ నివాసానికి సంబంధించిన ఐడీ కార్డును 24 గంటలూ వెంట ఉంచుకోవాల్సిందేనని కొత్త నిబంధన సూచిస్తోంది. విదేశీయుల నమోదు చట్టం (1940)లోని ఈ విదేశీయుల నమోదు ఆవశ్యకత (ఏఆర్ఆర్) నిబంధనలు గతంలో ఉన్నవే. కానీ వాటిని ఏనాడూ అమలుచేయలేదు. కోర్టు అనుమతితో కోట్ల మంది అక్రమవలసదారులే లక్ష్యంగా ఈ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని ట్రంప్ సర్కారు నిర్ణయించింది. హోంల్యాండ్ సెక్యూరిటీ మంత్రి క్రిస్టీ నోయెమ్ శుక్రవారం ఒక ప్రకటనలో ఈ మేరకు వెల్లడించారు. అమెరికాలో ప్రస్తుతం దాదాపు 54 లక్షల మంది భారతీయులున్నారు. 2022 గణాంకాల ప్రకారం 2.,2 లక్షల మంది భారతీయులు అక్కడ అక్రమంగా నివసిస్తున్నారు. అయితే మొత్తం అక్రమ వలసదారుల్లో వీరు కేవలం 2 శాతమేనని సమాచారం. ఏమిటీ నిబంధనలు ? అక్రమంగా వలస వచ్చిన విదేశీయులు, చాన్నాళ్లుగా అమెరికాలో అక్రమంగా ఉంటూ ఇప్పటిదాకా వివరాలు నమోదు చేసుకోని వలసదారులను గుర్తించి దేశం నుంచి బహిష్కరించడమే లక్ష్యంగా ఈ కఠిన నిబంధనలను తెచ్చారు. వాటి ప్రకారం అమెరికాకు వచ్చి 30 రోజులకు మించి ఉండాలనుకునే వాళ్లు తమ వీసా, ఐడీ కార్డులను కచి్చతంగా అనుక్షణం వెంట ఉంచుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో అధికారులు సోదాలు, తనిఖీల వేళ ప్రశ్నిస్తే వెంటనే వాటిని చూపించాలి. లేదంటే జరిమానాలు, ఇతర కఠిన చర్యలను ఎదుర్కోక తప్పదు. దీని ప్రకారం అమెరికా పౌరసత్వం లేని 18 ఏళ్లు నిండిన వాళ్లంతా ఐడీ కార్డును వెంటే ఉంచుకోవాలి. అమెరికా పౌరులు కాని 14 ఏళ్లు నిండిన టీనేజర్ వివరాలను విధిగా నమోదు చేయించుకోవాలి. 14వ పుట్టినరోజుకు ముందు నమోదు చేసినా మళ్లీ కొత్తగా నమోదు చేసుకుని మరోసారి వేలిముద్రల వంటివి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు టీనేజర్ 325ఆర్ దరఖాస్తు సమరి్పంచాలి. వారి తల్లిదండ్రులు సైతం 30 రోజుల్లోపు కచి్చతంగా నమోదు చేయించుకోవాలి. ..అయినా ఉండనివ్వరు మరోసారి నమోదు చేసుకున్నా వారిని అమెరికాలో ఉండనిచ్చే ప్రసక్తే లేదని ట్రంప్ సర్కారు స్పష్టం చేసింది. అక్రమవలసదారుల వాస్తవిక సంఖ్యను తేల్చడం, వారిని కనిపెట్టి వెళ్లగొట్టడమే రీ రిజి్రస్టేషన్ లక్ష్యమని హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు చెప్పారు. తాజాగా నమోదు సమయంలో కొత్త అడ్రస్, వ్యక్తిగత, కుటుంబ వివరాలు తెలపాల్సి ఉంటుంది. వాటిని కావాలని మార్చి రాస్తే స్వదేశానికి బదులు జైలుకు పంపవచ్చని కూడా తెలుస్తోంది. కఠిన నిబంధనలు అమల్లోకి వచ్చాక కూడా పేర్లను నమోదు చేయనివారు సోదాలు, తనిఖీల్లో దొరికితే భారీ జరిమానా, ఆర్నెల్ల దాకా జైలుశిక్ష వేస్తారు. అడ్రస్ అప్డేట్ చేయకుంటే 5 వేల డాలర్ల జరిమానా గ్రీన్‌కార్డు, వీసాదారులు మరో చోటుకు మారితే కొత్త చిరునామాను ప్రభుత్వానికి కచ్చితంగా తెలియజేయాలి. 10 రోజుల్లోపు తెలపని పక్షంలో 5,000 డాలర్ల జరిమానా విధిస్తారు. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాక గ్రీన్‌కార్డు, హెచ్–1బీ వీసాదారులు తమ సమాచారాన్ని మరోసారి నమోదు చేయించుకోవాల్సిన పనిలేదు. కాకపోతే గ్రీన్‌కార్డ్, హెచ్1బీ ఐడీ కార్డును మాత్రం ఎప్పుడూ విధిగా వెంట ఉంచుకోవాల్సిందే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సుంకాలపై ట్రంప్ కీలక నిర్ణయం.. వీటికి మినహాయింపు
వాషింగ్టన్: సుంకాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టారిఫ్‌ల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు, చిప్‌లకు మినహాయింపు ఇచ్చారు. దీంతో వినియోగదారులతో పాటు యాపిల్, శాంసంగ్ వంటి దిగ్గజ సంస్థలకు లబ్ధి చేకూరనుంది. ఈ మేరకు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ గైడ్లెన్స్ జారీ చేసింది.మరోవైపు.. అమెరికా, చైనా టారిఫ్ పోరు మరింత ముదిరిన సంగతి తెలిసిందే. చైనాపై మొత్తం సుంకాలు 145 శాతానికి చేరినట్టు అమెరికా ప్రకటించింది. ఆ మర్నాడే ఆ దేశంపై సుంకాలను 84 నుంచి 125 శాతానికి పెంచుతూ చైనా నిర్ణయం తీసుకుంది. చైనా కస్టమ్స్ టారిఫ్ కమిషన్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయం నేటి(శనివారం) నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది. అమెరికా దుందుడుకు చర్యలను దీటుగా ఎదుర్కొంటామే తప్ప వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించింది.భారత్ సహా ఇతర దేశాలపై ప్రకటించిన ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు ట్రంప్ తాత్కాలికంగా పక్కన పెట్టడం తెలిసిందే. చైనాపై మాత్రం సుంకాలను ఏకంగా 125 శాతానికి పెంచుతూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. 20 శాతం ఫెంటానిల్ సుంకంతో కలిపి అది 145 శాతానికి చేరినట్టు వైట్‌హౌస్ స్పష్టతనిచ్చింది. -
ఐవీఎఫ్ సెంటర్ నిర్వాకం: మరొకరి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి
‘‘మానవ తప్పిదాలు సహజమే’’, ‘‘అసలు తప్పే చేయనోడు మనిషే కాదు’’ ఇలాంటి మాటలు చెప్పుకోవడానికి బానే ఉంటాయి కానీ, తేడా వస్తే.. రిజల్ట్స్ భయంకరంగా ఉన్నాయి. దిమ్మదిరిగి బొమ్మ కనుపడుద్ది..తూచ్..నేనొప్పుకోను అంటే కుదరదు.. అస్సలేమీ అర్థం కాలేదు కదా... ఆ మాటల వెనుక మర్మం తెలియాలంటే ఈ కథనం గురించి తెలుసుకోవాలి.మారుతున్న జీవన పరిస్థితులు, జన్యుపరమైన కారణాల రీత్యా అనేక మంది సంతాన సమస్యలతో బాధపడుతున్నారు. సహజంగా గర్భం ధరించడం కష్టమైన వారు కృత్రిమ పద్దతుల ద్వారా బిడ్డల్ని కనేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సమస్య. దీంతో వీధికో ఐవీఎఫ్ సెంటర్ (IVF) పుట్టుకోస్తోంది. ఇవి కొందరికి వరాలిచ్చే కేంద్రాలుగా మారుతుండగా, మరికొందరికి మాత్రం పీడకలగా మారుతున్నాయి.ఆస్ట్రేలియాలోని ప్రముఖ సంతానోత్పత్తి కేంద్రాల్లో ఒకటైన మోనాష్ ఐవీఎఫ్ సెంటర్లో ఈ వివాదం నెలకొంది. ఐవీఎఫ్ ద్వారా గర్భధారణకు ప్రయత్నించిందో ఆస్ట్రేలియన్ మహిళ. మరో వైపు ఇదే ఆశతో బ్రిస్బేన కేంద్రానికి వచ్చిందో జంట. అయితే ఆ జంటకు చెందిన పిండాన్న ఆయా మహిళల గర్భంలోకి ప్రవేశ పెట్టారు. అనుకున్నట్టు ఆస్ట్రేలియన్ మహిళ గర్భం నిలిచింది. అంతులేని ఆనందంతో, నవమాసాలు మోసి కోటి ఆశలతో బిడ్డకు జన్మనిచ్చింది. తీరా అది తన బిడ్డకాదని తెలిసి ఒక్కసారిగా షాక్ అయింది. ఐవీఎఫ్ కేంద్రం చేసిన పొరబాటు కారణంగా మహిళ తానొక అపరిచితుడి బిడ్డకు జన్మనిచ్చినట్టు తెలుసుకుంది. ఇది చట్టపరమైన, నైతిక ఆందోళన లేవనెత్తింది.చదవండి: సింగపూర్ ‘ట్రీ టాప్‌వాక్’ తరహాలో వాక్‌వే, క్యూ కడుతున్న పర్యాటకులు తప్పయిదంటూ వివరణ, నష్ట పరిహారంఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ ప్రకారం, ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో జరిగిన ఈ తప్పును. ఈ ఏడాది ఫిబ్రవరిలో గుర్తించారు. అయితే జరిగిన తప్పును అంగీకరించి ఐవీఎఫ్ సెంటర్ మోనాష్ బాధితులు అందరికీ క్షమాపణ చెప్పింది. అలాగే వారికి పెద్ద మొత్తంలో నష్ట పరిహారం చెల్లించింది. దాదాసే భారత కరెన్సీ ప్రకారం రూ.480 కోట్లు నష్ట పరిహారం చెల్లించింది.ఇపుడా బిడ్డ ఎవరికి చెందుతుంది?నిజమైన జన్యు తల్లిదండ్రులు ముందు కొచ్చిదీని గురించి చర్చించాలనుకుంటున్నారా, లేదా అనేది ప్రశ్న అంటోంది మోనాష్ సంస్థ. ఇది అన్ని చోట్ల భయంకరమైన, విచారకరమైన పరిస్థితి అని మోనాష్ ఐవీఎఫ్ నిపుణుడు పేర్కొన్నారు. ఇది పాల్గొన్న జంటల జీవితాన్నిమార్చివేసేది అయినప్పటికీ, తదుపరిసారి ఎక్కువగా బాధపడేది ఈ తప్పుకు కారణమైన శాస్త్రవేత్త" అన్నారు. ఆస్ట్రేలియాలోని చట్టం ఎలా నిర్ణయిస్తుందో తెలియదు, మానవులు తప్పులు చేస్తారని అంగీకరించడం తప్ప ఇంతకు మించి చేసేదేమీ లేదు అంటూ చెప్పుకొచ్చారు. చదవండి: సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ టైటిల్ ఎగరేసుకుపోయాడు : ప్రైజ్‌మనీ ఎంతో?అయితే తల్లైన జంట, బయోలాజికల్ తల్లిదండ్రులు ఎవరు, బిడ్డను ప్రస్తుతం ఎవరికి అప్పగించారు? ఈ శిశువు ఎవరికి చెందుతుందనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుత ఆస్ట్రేలియన్ చట్టం ప్రకారం, జన్మనిచ్చిన తల్లి , ఆమె భాగస్వామి చట్టపరమైన తల్లిదండ్రులుగా గుర్తించ బడతారని, జీవసంబంధమైన తల్లిదండ్రులను కస్టడీ హక్కులు లేకుండా చేసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. ఈ కేసు IVF పరిశ్రమపై భద్రత, పర్యవేక్షణకు పిలుపునిచ్చింది. దీంతోపాటు సహాయక పునరుత్పత్తి సాంకేతికతలలో మెరుగైన రక్షణల అవసరాన్ని హైలైట్ చేసింది. -
చైనాలో ఇసుక తుపాను బీభత్సం.. వందలాది విమాన, రైళ్ల సర్వీసులు రద్దు
బీజింగ్: చైనాను భీకర గాలులు అతలాకుతలం చేస్తున్నాయి. ఇసుక తుపాను, భారీ గాలులతో రాజధాని బీజింగ్‌లో చెట్లు నేలకొరిగాయి. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం అప్రమత్తమైంది. వందలాది విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. బీజింగ్, డాక్సింగ్‌లో 693 విమాన సర్వీసులు రద్దు చేయడంతో పాటు, రైళ్లను కూడా నిలిపివేశారు. దుమ్ము తుపానులు చెలరేగడంతో.. అధికారులు పర్యాటక ప్రదేశాలను మూసేశారు.చైనాకు తీవ్ర తుఫాన్ హెచ్చరికలు జారీ అయ్యాయి. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 150 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని.. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని అలర్ట్ చేసింది. దేశంలోని ఉత్తర, తీర ప్రాంతాలలో తీవ్రమైన ప్రభావం ఉంటుందని అధికారులు హెచ్చరించారు.విమానాశ్రయ ఎక్స్‌ప్రెస్ సబ్వే, హై-స్పీడ్ రైలు మార్గాలతో సహా కొన్ని రైలు సేవలను కూడా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. బీజింగ్, డాక్సింగ్‌లో విమానాశ్రయాల్లో వందలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే నిద్రిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.గత ఏడాది చైనాలోని వివిధ ప్రాంతాల్లో సంభవించిన తుపానులు, వరదల్లో అనేక మంది మరణించారు. వేలాది మంది తమ ఇళ్లను వదిలి వెళ్ళవలసి వచ్చింది. మే నెలలో దక్షిణ చైనాలో కురిసిన వర్షాలతో ఒక రహదారి కూలిపోయి 48 మంది మరణించిన సంగతి తెలిసిందే.April 12, China was hit by a nationwide gale and dust storm that was rare in history, with the maximum gust reaching 46.8m/s! The sandstorm blew from Mongolia all the way to the Yangtze River and may even affect Hong Kong! pic.twitter.com/8mO795JEep— Jim (@yangyubin1998) April 12, 2025 -
‘ట్రంప్ సూపర్ విలన్.. మస్క్ సైడ్ విలన్’
ఒట్టావా: అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) రెండోసారి అధికార పీఠాన్ని అధిష్టించాక, అతను తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలకు మింగుడుపడటం లేదు. ఇదే సందర్భంలో ట్రంప్ కెనడాను అమెరికాలోని 51వ రాష్ట్రంగా పిలవడంతో కెనెడియన్లు మండిపడుతున్నారు. వారు తమలోని ఆగ్రహాన్ని పలు రూపాల్లో వ్యక్తం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో కెనడియన్ సూపర్‌హీరో ‘కెప్టెన్ కెనక్’(కామిక్ బుక్ క్యారెక్టర్) సరికొత్త కామిక్ బుక్ ద్వారా రీ-ఎంట్రీ ఇచ్చాడు.ఈ కామిక్‌లో ట్రంప్‌ను సూపర్ విలన్(Super villain)గా, ఎలాన్ మస్క్‌ను అతని పరమ విధేయునిగా చిత్రీకరించారు. కెప్టెన్ కెనక్ ఈ ఇద్దరి నుంచి కెనడా సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు ఎదుర్కొనే సన్నివేశాలను కామిక్‌లో ఆకర్షణీయంగా చూపించారు. ఈ కామిక్ కెనడాలో అందరినీ అలరిస్తోంది. ఈ కామిక్లతో కెనాడాలోని బుక్ స్టోర్లు, లైబ్రరీలలోని అరలు నిండిపోతున్నాయి. కెప్టెన్ కెనక్ను 1975లో రిచర్డ్ కోమెలీ సృష్టించాడు. ఈ సూపర్ హీరో కెనడా సార్వభౌమత్వాన్ని, సంస్కృతిని కాపాడే ఒక ప్రభుత్వ ఏజెంట్‌గా వ్యవహరిస్తుంటాడు. అతను ఒక రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ ఆఫీసర్, గ్రహాంతరవాసులతో జరిగిన ఒక సంఘటన కారణంగా అతీంద్రియ శక్తులను పొందుతాడు. కెప్టెన్ కెనక్ ఎరుపు, తెలుపు రంగుల దుస్తులు ధరించి, ఒక మాపుల్ లీఫ్ చిహ్నంతో కనిపిస్తాడు. ఇది కెనడా జాతీయ గుర్తింపును సూచిస్తుంది. 2025లో, కెప్టెన్ కెనక్ 50వ వార్షికోత్సవ సంచికలో.. కెనడాను ట్రంప్, మస్క్ బెదిరింపుల నుంచి కాపాడే సూపర్‌హీరోగా కనిపించాడు. ఈ కామిక్ కెనడియన్ జాతీయవాద భావనను అక్కడి ప్రజలలో మరింత బలపరిచింది. ఈ కామిక్‌లో ట్రంప్‌ను కెనడాపై ఆధిపత్యం చెలాయించాలనే కుట్రలతో రగిలిపోతున్న ఒక సూపర్విలన్గా చిత్రీకరించారు. ఎలాన్ మస్క్‌ను ట్రంప్‌కు విధేయునిగా చూపించారు. ఈ కామిక్‌లోని ఒక సన్నివేశంలో, కెప్టెన్ కెనక్.. ట్రంప్ మస్క్‌లను కాలర్ పట్టుకొని బయటకు లాగుతూ కనిపిస్తాడు. ఇది కెనడియన్ పాఠకులకు అమితమైన ఆనందాన్ని కలిగించిందట.ఈ కామిక్ విజయం తర్వాత కెప్టెన్ కెనక్ కొత్త కామిక్ సిరీస్(Captain Canuck's new comic series)లు, యానిమేటెడ్ సిరీల అమ్మకాలు పెరిగాయి. కెప్టెన్ కెనక్ సృష్టికర్త అయిన రిచర్డ్ కోమెలీ (74) ఈ కామిక్ పునరాగమనం గురించి మాట్లాడుతూ 1970లలో కెనడియన్లు తమకొక ప్రత్యేక గుర్తింపు కావాలని కోరుకున్నారని, ఆ సమయంలోనే కెప్టెన్ కెనక్ను సృష్టించానన్నారు. ఇప్పుడు ట్రంప్ విసురుతున్న సవాళ్ల నేపథ్యంలో కెనడియన్లు మళ్లీ ఈ హీరోను స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న వ్యక్తిగాచూస్తున్నారని అన్నారు.ఇది కూడా చదవండి: 26/11 దాడుల్లో ‘దుబాయ్ వ్యక్తి’? : ఎన్ఐఏ ఆరా -
పేరుకు ‘కృత్రిమ మేథ’.. పనిచేసేది మనుషులే.. అమెరికాలో మరో మోసం
న్యూయార్క్: ఇటీవలి కాలంలో విస్తృతంగా వినియోగమవుతున్న కృతిమమేథ(Artificial intelligence) మనిషి ఆలోచనలకు సవాల్ విసురుతోంది. ఇటువంటి తరుణంలో అమెరికాలో ఒక వింత మోసం చోటుచేసుకుని, సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఫిన్‌టెక్ స్టార్టప్ నిర్వాహకుడు ఆల్బర్ట్ సానిగర్ తన ‘నేట్’ (Nate)షాపింగ్ యాప్ కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారంగా నడుస్తున్నదని ప్రచారం చేసి, 50 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 420 కోట్లు) పైగా నిధులు సేకరించాడు. అయితే ఈ యాప్ ఫిలిప్పీన్స్‌లోని ఒక కాల్ సెంటర్లోని సిబ్బంది ద్వారా నడుస్తున్నదని విచారణలో తేలింది. ఈ మోసం బయటపడటంతో, సానిగర్పై అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్.. సెక్యూరిటీస్ ఫ్రాడ్, వైర్ ఫ్రాడ్ ఆరోపణలు నమోదు చేసింది. ఈ ఆరోపణలు నిజమైతే ఆల్బర్ట్ సానిగర్కు గరిష్టంగా 20 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి.నేట్ యాప్‌ను ఆల్బర్ట్ సానిగర్(Albert Saniger) 2018లో రూపొందించాడు. ఈ యాప్ ఒక యూనివర్సల్ షాపింగ్ కార్డ్‌గా ప్రచారం చేశాడు. దీని ద్వారా యూజర్లు ఎలాంటి ఇ-కామర్స్ సైట్ నుంచైనా ఒకే క్లిక్‌తో దేనినైనా కొనుగోలు చేయవచ్చని తెలిపాడు. ఈ యాప్ ఏఐ టెక్నాలజీ ద్వారా షాపింగ్ ప్రక్రియను సులభతరం చేస్తుందని, బిల్లింగ్, షిప్పింగ్ వివరాలను దానికదే నిర్వహిస్తుందని సానిగర్ పేర్కొన్నాడు. ఈ యాప్ కోసం ఆయన కోట్యూ, ఫోర్రన్నర్ వెంచర్స్, రెనెగేడ్ పార్టనర్స్ తదితర వంటి పెట్టుబడిదారుల నుంచి 50 మిలియన్ డాలర్లకుపైగా నిధులు సేకరించాడు.అయితే ఈ యాప్‌లో ఏఐ ఆటోమేషన్(Automation) దాదాపు శూన్యం అని అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ తేల్చింది. యాప్ ద్వారా జరిగే కొనుగోళ్లను ఫిలిప్పీన్స్‌లోని కాల్ సెంటర్‌లోగల వందలాది ‘పర్చేజింగ్ అసిస్టెంట్స్’ నెరవేరుస్తున్నారని తేలింది. ఈ నేపధ్యంలో ఆల్బర్ట్ సానిగర్ ఏఐ టెక్నాలజీ పేరును ఉపయోగించి, తప్పుడు కథనాన్ని సృష్టించాడని డిపార్ట్మెంట్ పేర్కొంది. 2021 హాలిడే షాపింగ్ సీజన్లో యాప్ డిమాండ్‌ను తట్టుకునేందుకు సానిగర్ తన ఇంజనీరింగ్ టీమ్‌ను కొన్ని లావాదేవీలను ఆటోమేట్ చేయడానికి ‘బాట్లు’ అభివృద్ధి చేయాలని ఆదేశించాడు. అయితే ఈ బాట్లు ఏఐ ఆధారితం కాకుండా, మానవ సిబ్బంది ఆధారంగా పనిచేశాయి. ఆల్బర్ట్ సానిగర్ చేసిన మోసం బయటపడటంతో అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) అతనిపై సివిల్ కేసు నమోదు చేసింది. అతనిని ఇకపై ఇలాంటి కంపెనీలలో అధికారిగా పనిచేయకుండా నిషేధించాలని కోరింది. అలాగే పెట్టుబడిదారుల నుంచి సేకరించిన నిధులను సానిగర్ తిరిగి వారికి ఇవ్వాలని ఆదేశించింది. ఇదేవిధంగా గతంలో ప్రెస్టో ఆటోమేషన్ అనే కంపెనీ ఏఐ ఆధారిత డ్రైవ్ త్రూ సేవలను అందిస్తామని చెప్పి, ఫిలిప్పీన్స్‌లోని సిబ్బందితో కార్యకలాపాలు సాగించి మోసానికి పాల్పడింది. ఇది కూడా చదవండి: గంట ప్రయాణం నిమిషంలో.. ప్రపంచంలోనే ఎత్తైన వంతెన -
జుకర్‌బర్గ్‌పై సంచలన ఆరోపణలు
మెటా అధినేత మార్క జుకర్‌బర్గ్‌పై ఆ సంస్థ మాజీ ఎగ్జిక్యూటివ్ విజిల్‌బ్లోయర్(వేగు) సారా విన్ విలియమ్స్ సంచలన ఆరోపణలకు దిగారు. జుకర్‌బర్గ్‌కు అమెరికా ప్రయోజనాల కన్నా డబ్బే ముఖ్యమని, ఈ క్రమంలోనే చైనాతో చేతులు కలిపి తన సొంత దేశం జాతీయ భద్రతా విషయంలో రాజీ పడ్డారని వెల్లడించారామె. సెనేటర్ జోష్ హవ్యూలే నేతృత్వంలోని కౌంటర్‌టెర్రరిజం సబ్ కమిటీ ఎదుట హాజరైన ఆమె.. తన వాంగ్మూలంలో ఆసక్తికరమైన వివరాలను వెల్లడించారు. సీబీఎస్ కథనం ప్రకారం సారా విన్ వాంగ్మూలంలో.. చైనాలో వ్యాపార ఉనికిని పెంచుకోవడానికే మెటా కంపెనీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని అన్నారు. చైనాతో మార్క్ జుకర్‌బర్గ్ చేతులు కలిపారు. అందుకే.. పదే పదే అమెరికా జాతీయ భద్రతా విషయంలో మెటా రాజీ పడుతోంది. ఈ క్రమంలోనే అమెరికన్లతో సహా మెటా వినియోగదారుల డేటా చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ చేతుల్లోకి వెళ్తోందని ఆరోపించారామె. మెటా కంపెనీ చైనా ప్రభుత్వం కోసం కస్టమ్ సెన్సార్షిప్ను టూల్స్‌ను రూపొందించింది. తద్వారా కంటెంట్ విషయంలో నియంత్రణ వాళ్ల చేతుల్లోకి వెళ్తోంది. తాను స్వేచ్ఛావాదినని, దేశ భక్తుడినని అమెరికా జెండా కప్పేసుకుని ప్రకటించుకునే జుకర్‌బర్గ్.. గత దశాబ్దకాలంగా 18 బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యం అక్కడ ఎలా స్థాపించుకోగలిగారు?. ఇది అమెరికన్లను మోసం చేయడమే అని ఆమె అన్నారు. సారా విన్ విలియమ్స్ గతంలో ఫేస్బుక్లో గ్లోబల్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్‌గా పని చేశారు. ఏడేళ్లపాటు సంస్థలో పని చేసిన ఆమె.. ఈ ఏడాది మార్చిలో కేర్లెస్ పీపుల్ పేరిట ఒక నివేదికను పుస్తకాన్ని విడుదల చేసి తీవ్ర చర్చనీయాంశంగా మారారు. అయితే ఈ పుస్తంపై మెటా కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం ఆ పుస్తకాన్ని తాత్కాలికంగా నిషేధించింది. అయితే బుధవారంనాటి విచారణ సందర్భంగా.. ‘‘ఫేస్బుక్ ఆ పుస్త విషయంలో ఆమెను ఎందుకు నిలువరించాలని అనుకుంటోంది?.. అమెరికన్లకు వాస్తవం తెలియాల్సి ఉంది’’ అని సెనేటర్ జోష్ హవ్యూలే అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తమ ఎదట హాజరై వివరణ ఇవ్వాలంటూ గురువారం జుకర్‌బర్గ్‌కు ఆయన ఓ లేఖ రాశారు. వాస్తవాలు బయటపెడితే తనను కోర్టుకు ఈడుస్తామంటూ మెటా బెదిరిస్తోందని సారా విన్ విలియమ్స్ చెబుతుండగా.. ఆమె ఆరోపణలన్నీ అవాస్తవమేనని, చైనాలో తమ కార్యకలాపాలు నడవడం లేదని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. -
గంట ప్రయాణం నిమిషంలో.. ప్రపంచంలోనే ఎత్తైన వంతెన
ఇప్పటికే అద్భుతాలకు నెలవైన చైనా త్వరలో ప్రపంచానికి మరో అద్భుతాన్ని చూపించబోతోంది. అదేమిటో తెలిసినవారంతా ఇప్పుటికే చైనా ప్రతిభకు కితాబిస్తున్నారు. చైనానోలోని గుయిజౌ ప్రావిన్స్‌లో నిర్మించిన హువాజియాంగ్ గ్రాండ్ కాన్యన్ బ్రిడ్జి(Huajiang Grand Canyon Bridge) జూన్ 25న ఆవిష్కృతం కానుంది. ఇదే ప్రపంచాన్ని అబ్బురపరిచే మరో వండర్. ఈ వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనగా సరికొత్త రికార్డు సృష్టించనుంది.చైనా ఈ నూతన వంతెనను.. రెండు మైళ్ల దూరం మేరకు విస్తరించి ఉన్న ఒక భారీ లోయను దాటడానికి నిర్మించింది. ఈ నిర్మాణానికి చైనా సుమారు 216 మిలియన్ పౌండ్లు (₹2200 కోట్లు) వెచ్చించింది. ఇప్పటివరకూ ఈ లోయను వాహనాల్లో దాటేందుకు ఒక గంట సమయం పడుతుండగా, ఈ వంతెన నిర్మాణంతో కేవలం ఒక్క నిముషం(One minute)లో ఈ వెంతెనను దాటేయవచ్చని చైనా చెబుతోంది. ఈ వంతెన ఎత్తు పారిస్‌లోని ఈఫిల్ టవర్‌కు రెట్టింపు ఎత్తును కలిగి ఉంటుంది. China's Huajiang Grand Canyon Bridge is set to open this year, becoming the world's tallest bridge at 2050 feet high. Recent footage of the bridge has been released, showing crews putting on the finishing touches. One of the most insane facts about the bridge is that… pic.twitter.com/DLWuEV2sXQ— Collin Rugg (@CollinRugg) April 8, 2025ఈ వంతెన మీద ఒక గాజు నడక మార్గం ఏర్పాటవుతోంది. ఫలితంగా సందర్శకులు లోయలోని అద్భుత దృశ్యాలను చూడగలుగుతారు. ఈ వంతెన నుంచి అత్యంత ఎత్తైన బంజీ జంప్‌ను ఏర్పాటు చేయాలని చైనా యోచిస్తోంది. ఇది సాహస ప్రియులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వంతెన సమీపంలో నివాస ప్రాంతాలను కూడా చైనా అభివృద్ధి చేయనుంది. ఇది పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేస్తుంది.ఈ వంతెన చైనాకున్న ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని(Engineering ability) ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప నిర్మాణంగా నిలుస్తుంది. అగాథంలాంటి లోయ మీద, ఇంత పొడవైన వంతెనను నిర్మించడం అనేది సాంకేతికంగా సవాలుతో కూడుకున్న పని. ఈ వంతెన స్థానికుల జీవన విధానాన్ని మరింత మెరుగుపరుస్తుంది. వాణిజ్య కార్యకలాపాలను సులభతరం చేస్తుంది. ఈ వంతెన ప్రపంచంలోని అత్యంత పొడవైన స్పాన్ వంతెనగా కూడా రికార్డు సృష్టించనుంది. చైనా గతంలోనూ పలు అద్భుత వంతెనలను నిర్మించింది. అయితే ఈ కొత్త వంతెన ఈ జాబితాలో మరో మైలురాయిగా నిలిచిపోనుంది.ఇది కూడా చదవండి: హనుమజ్జయంతి ఏటా రెండుసార్లు.. ఎందుకంటే..