వేల సంఖ్యలో ఉత్తర కొరియా సైనికులు మృతి | Thousands of North Korean soldiers died in the war with Russia | Sakshi
Sakshi News home page

వేల సంఖ్యలో ఉత్తర కొరియా సైనికులు మృతి

May 8 2026 10:24 AM | Updated on May 8 2026 4:14 PM

Thousands of North Korean soldiers died in the war with Russia

మాస్కో: రష్యా- ఉ‍క్రెయిన్ యుద్ధంపై బీబీసీ సంచలన నివేదిక విడుదల చేసింది. ఈ మారణహోమంలో ఇప్పటి వరకూ దాదాపు 2,300 మంది ఉత్తర కొరియా సైనికులు మృతిచెందినట్లు కథనాలు ప్రచురించింది. 

రష్యా- ఉ‍క్రెయిన్ యుద్ధం ప్రారంభమై నాలుగేళ్లు పూర్తయింది. అయినప్పటికీ యుద్ధ విరమణ విషయమై ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయమై ఎన్నో ప్రయత్నాలు చేసిన‍ప్పటికీ ఎటువంటి ఫలితాలు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఇరాన్- అమెరికా యుద్దం నేపథ్యంలో ఆ అవకాశాలు లేకుండా పోయాయి.

కాగా గత సంవత్సరం ఉక్రెయిన్ ఆకస్మిక దాడిలో నియంత్రణ కోల్పోయిన కుర్స్క్ ప్రాంతంలోని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి రష్యా తమ సహాయం కోరిందని అందుకు సైనిక్ దళాలను పంపించామని ఆదేశ అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ తెలిపారు. తాజాగా ఆ సేనలో 2,300 మంది మృత్యువాత పడ్డట్లు తెలుస్తోంది. ఈ యుద్ధంలో సహాయం కోసం రష్యాకు దాదాపు 11 వేల మంది సైనికులను పంపినట్లు సమాచారం. 

కాగా ప్రస్తుతం రెండు రోజుల పాటు  మే 8-9 (విక్టరీ డే) సందర్భంగా రష్యా ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించగా, ఉక్రెయిన్ మే 5-6 తేదీల్లో తన వంతుగా విరమణ ప్రకటించింది. అయితే, ఒకరి ప్రకటనలను మరొకరు గౌరవించడం లేదని, దాడులు కొనసాగుతున్నాయని ఇరు దేశాలు ఆరోపించుకుంటున్నాయి. అయితే ఈ యుద్ధంలో ఇప్పటి వరకూ రష్యా- ఉక్రెయిన్‌ రెండు పక్షాలు కలిపి దాదాపు లక్షల సంఖ్యలో సైనికులు మృతి చెందారని కథనాలు పేర్కొన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement