breaking news
Russia
-
రష్యా ఆంక్షల బిల్లు.. చూశారా ట్రంప్ డబుల్ గేమ్!
రష్యాపై మరిన్ని ఆంక్షలకు అమెరికా సిద్ధమైంది. రష్యా నుంచి చమురు, సహజవాయువు కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీ టారిఫ్‌లు విధించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అధికారం ఇచ్చే బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. దీంతో రష్యా చమురు కొనుగోలులో కీలకంగా ఉన్న భారత్, చైనాలకు 100 శాతం వరకు టారిఫ్ ముప్పు పొంచి ఉంది. అయితే.. ఇదే బిల్లులో అమెరికాకు అనుకూలంగా ఉన్న మరో కీలక నిబంధన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ట్రంప్ సర్కార్ ‘లిండ్సే ఓ. గ్రాహమ్ శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్–2026’ పేరుతో ఈ బిల్లును తీసుకొచ్చింది. ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తున్న రష్యాకు చమురు, గ్యాస్ ఎగుమతులే ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటి. ఆ ఆదాయాన్ని తగ్గించడంతో పాటు.. రష్యాతో ఇంధన వ్యాపారం కొనసాగిస్తున్న దేశాలపై ఒత్తిడి పెంచడమే బిల్లు ప్రధాన ఉద్దేశం. రష్యా అధికారులు(అధ్యక్షుడు పుతిన్ సహా..), ఆర్థిక సంస్థలు, ఇంధన రంగం, ఆంక్షలను తప్పించుకునేందుకు ఉపయోగిస్తున్న ‘షాడో ఫ్లీట్’పై కూడా కఠిన చర్యలకు ఇందులో అవకాశం కల్పించారు. అమెరికా ప్రతినిధుల సభలో బిల్లు 262–159 ఓట్లతో ఆమోదం పొందింది. ఇందులో 203 మంది రిపబ్లికన్లు, 58 మంది డెమొక్రాట్లు, ఒక ఇండిపెండెంట్ సభ్యుడు అనుకూలంగా ఓటేశారు. అంతకుముందే సెనేట్ కూడా ఈ బిల్లును 86–11 ఓట్లతో ఆమోదించింది. దీంతో ఇప్పుడు బిల్లు ట్రంప్ డెస్క్‌కు చేరగా.. ఆయన సంతకంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.అసలు ట్విస్ట్ ఇదే..రష్యా నుంచి చమురు కొనే దేశాలపై భారీ టారిఫ్‌లకు సిద్ధమైన అమెరికా.. అందులో తనకు అనుకూలంగా ఓ సెక్షన్‌ను జత చేర్చుకుంది. అవసరమైన రష్యా యురేనియం విషయంలో మాత్రం కొంత వెసులుబాటు ఉంచుకుంది. అయితే బిల్లులోని సెక్షన్ 111 రష్యా నుంచి యురేనియం దిగుమతులపై ఇప్పటికే ఉన్న అమెరికా ఆంక్షలను అమలు చేయాలని చెబుతోంది. రష్యా ప్రభుత్వ అణు సంస్థ రోసాటమ్, దాని అనుబంధ/వారస సంస్థల నుంచి వచ్చే యురేనియం కూడా ఇందులో ప్రస్తావనకు వచ్చింది.కానీ అదే బిల్లులోని సెక్షన్ 114 మాత్రం కొన్ని ముఖ్యమైన మినహాయింపులను ఇచ్చింది. అమెరికా–రష్యా మధ్య కుదిరిన పౌర అణు సహకార ఒప్పందాల కింద జరిగే కొన్ని కార్యకలాపాలకు ఈ ఆంక్షలు వర్తించవు. అలాగే అణు రియాక్టర్లలో ఉపయోగించే కొన్ని రకాల లో-ఎన్రిచ్డ్ యురేనియం (LEU) దిగుమతులకు కూడా మినహాయింపు ఉంది. నిబంధనల ప్రకారం కొన్ని వైద్య ఐసోటోపుల దిగుమతులకు కూడా వెసులుబాటు కల్పించారు. అంటే రష్యాతో అణు రంగంలో ప్రతి లావాదేవీని పూర్తిగా నిలిపివేసేలా ఈ బిల్లు లేనేలేదన్నమాట.అమెరికాకు ఎందుకంత అవసరం?రష్యాపై ఆర్థిక ఆధారపడటాన్ని తగ్గించాలని అమెరికా ప్రయత్నిస్తున్నప్పటికీ.. అణు ఇంధన రంగంలో మాత్రం మాస్కో పాత్ర ఇప్పటికీ పెద్దదే. 2025లో అమెరికా పౌర అణు విద్యుత్ సంస్థలు మొత్తం 12.71 మిలియన్ సెపరేటివ్ వర్క్స్ యూనిట్స్ (SWU) మేర ఎన్రిచ్మెంట్ సేవలను కొనుగోలు చేశాయి. అందులో రష్యా నుంచి వచ్చినవి 3.284 మిలియన్ ఎస్‌డబ్ల్యూయూ.. అంటే సుమారు 26 శాతం. అమెరికా దేశీయ ఎన్రిచ్మెంట్ సేవల వాటా సుమారు 23 శాతంగా ఉంది. ఫ్రాన్స్, బ్రిటన్, నెదర్లాండ్స్ కూడా అమెరికాకు ఎన్రిచ్మెంట్ సేవలు అందిస్తున్నాయి. యురేనియం కొంటే సరిపోదు..అణు ఇంధనం తయారీ ప్రక్రియ ముడి చమురు లాంటిది కాదు. గనుల నుంచి తీసిన యురేనియంను నేరుగా చాలా వాణిజ్య అణు రియాక్టర్లలో ఉపయోగించలేరు. ముందుగా కన్వర్షన్, ఎన్రిచ్మెంట్ వంటి పలు దశలు దాటాలి. ఈ ఎన్రిచ్మెంట్ సామర్థ్యంలో రష్యా చాలా కాలంగా ప్రపంచంలో కీలక స్థానంలో ఉంది. అందుకే రష్యాతో విస్తృత ఆర్థిక సంబంధాలను తగ్గించేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నా.. అణు విద్యుత్ రంగానికి అవసరమైన ఇంధన సరఫరాను ఒక్కసారిగా దెబ్బతీసే నిర్ణయాలు తీసుకోవడం అంత సులభం కాదు.2024లోనే రష్యా యురేనియంపై నిషేధంఈ ఆధారపడటాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా.. అమెరికా 2024 మేలో రష్యా యురేనియం ఉత్పత్తుల దిగుమతులపై నిషేధం విధించింది. అయితే దేశీయ సరఫరా వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే వరకు కంపెనీలు మినహాయింపులు కోరుకునే అవకాశం కల్పించింది. ఈ మినహాయింపు వ్యవస్థ 2028 జనవరి 1 వరకు కొనసాగేందుకు అవకాశం ఉంది.అదే సమయంలో అమెరికా దేశీయ అణు ఇంధన సరఫరా గొలుసును బలోపేతం చేసేందుకు 2.72 బిలియన్ డాలర్ల నిధులను కేటాయించింది. దీని లక్ష్యం కూడా రష్యాపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించడమే. అయితే రష్యా చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై భారీ టారిఫ్‌లకు మార్గం వేస్తూనే.. తన అణు విద్యుత్ రంగానికి అవసరమైన కొన్ని రష్యా యురేనియం సరఫరాలకు మాత్రం మినహాయింపులు ఉంచింది. ఇలా.. ఒకే బిల్లులో అమెరికా రెండు రకాల విధానాలను అవలంబిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. భారత్, చైనా.. టారిఫ్‌లపై సస్పెన్స్రష్యా నుంచి ముడి చమురు, సహజవాయువు కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అధికారం ఈ బిల్లుతో ట్రంప్‌కు దక్కింది. రష్యా ఇంధనాన్ని పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలే ఈ విషయంలో ప్రభావితం కానున్నాయి. అయితే భారత్ మాత్రం రష్యా ఆయిల్ విషయంలో తగ్గేదే లేదని చెబుతోంది. జాతి ప్రయోజనాల కోసం తాము ఆలోచిస్తామని.. అదే సమయంలో ఈ టారిఫ్ ముప్పు గురించి అమెరికాతో చర్చిస్తున్నట్లు తెలిపింది. దీంతో ట్రంప్ నిర్ణయం ఏంటన్నది ఉత్కంఠగా మారింది. ఇదీ చదవండి: డయానా ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్ -
డేంజర్కే డేంజర్ ఈ బామ్మ!.. ఏం చేసిందో చూడండి
యుద్ధం అంటే కేవలం సైనికులు, ఆయుధాలే కాదు.. సామాన్య ప్రజలు కూడా అనుకోని పరిస్థితుల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉక్రెయిన్‌లో ఓ వృద్ధ మహిళకు ఎదురైన అలాంటి ఘటనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోడ్డుపై పడి ఉన్న రష్యా డ్రోన్ వద్దకు వెళ్లిన ఆమె.. దాన్ని పీకిపారేసి ఎందుకు పనికి రాకుండా చేసి పడేసింది. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఎరుపు రంగు దుస్తులు ధరించిన ఆ మహిళ.. నేలపై ఉన్న డ్రోన్ దగ్గరకు వెళ్లింది. దాని పైభాగంలోని ఫైబర్-ఆప్టిక్ కేబుల్ స్పూల్ను బయటకు తీసి అవతల పడేసింది. అనంతరం డ్రోన్‌ను కూడా చేతుల్లోకి తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగింది అనేదానిపై స్పష్టత లేదు. కానీ, ఈ వీడియో సెప్టెంబర్ 15న సోషల్ మీడియా నుంచి వైరల్ అయింది. ఈ ఘటన ఉక్రెయిన్‌లోని జపోరిజ్జియా ప్రాంతంలో జరిగి ఉండొచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఏంటీ డ్రోన్ స్పెషాలిటీ!సాధారణ డ్రోన్లు రేడియో సిగ్నళ్ల ద్వారా ఆపరేటర్ నియంత్రణలో ఉంటాయి. అయితే ఫైబర్-ఆప్టిక్ ఎఫ్‌పీవీ డ్రోన్లకు మాత్రం పలుచటి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ అనుసంధానమై ఉంటుంది. డ్రోన్ ఎగురుతున్న కొద్దీ ఈ కేబుల్ స్పూల్ నుంచి బయటకు వస్తుంది. దీని ద్వారా ఆపరేటర్‌కు ప్రత్యక్ష వీడియో, నియంత్రణ సమాచారం అందుతుంది. రేడియో సిగ్నళ్లపై ఆధారపడకపోవడంతో ఎలక్ట్రానిక్ జామింగ్ ద్వారా వీటిని అడ్డుకోవడం సాధారణ డ్రోన్లతో పోలిస్తే కష్టంగా ఉంటుంది. అందుకే వీడియోలో కనిపించిన మహిళ స్పూల్ను తొలగించడంతో డ్రోన్‌కు ఆపరేటర్‌తో ఉన్న నియంత్రణ లింక్ తెగిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి డ్రోన్‌ను చేతితో తాకడం అత్యంత ప్రమాదకరమని నిపుణులు, పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. డ్రోన్‌లో పేలుడు పదార్థాలు ఉండే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. సో.. ఈ బామ్మ లక్కీ అన్నమాట.Ukrainian badass granny disables russian FPV drone 😮 pic.twitter.com/uyZiPIwtvS— Apple Tree (@LonelyAppleTree) September 16, 2026ఇదేం కొత్త కాదు!ఉక్రెయిన్‌లో డ్రోన్లతో సామాన్యులు తలపడిన ఘటనలు గతంలోనూ వెలుగులోకి వచ్చాయి. 2022లో కీవ్‌కు చెందిన ఓ వృద్ధురాలు.. బాల్కనీలో నుంచి జార్‌ను విసిరి రష్యా డ్రోన్‌ను కూల్చేయడం చర్చనీయాంశమైంది. అలాగే మొన్నీమధ్యే ఓ పండ్ల వ్యాపారిని వెంటాడగా.. అతను బతిమాలిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. అయితే అది పేలి.. అతనికి గాయాలయ్యాయి. తాజా వీడియోపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందనలు వస్తున్నాయి. మహిళ ధైర్యాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.ఇదీ చదవండి: ఇది వెయ్యేళ్లకొకసారి వచ్చే వర్షమట! -
ట్రంప్ 100% టారిఫ్ బిల్లు: భారత్ రియాక్షన్ ఇదే..
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీ సుంకాలు విధించేలా అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన బిల్లుపై భారత్ స్పందించింది. తమ వాణిజ్య, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇదే సమయంలో దేశ ఇంధన అవసరాలు, జాతీయ ప్రయోజనాలే తమ చమురు కొనుగోళ్లకు ప్రాతిపదిక అని మరోసారి తేల్చిచెప్పింది.అమెరికా ప్రతినిధుల సభ బుధవారం ‘లిండ్సే ఓ. గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026’కు 262–159 ఓట్లతో ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ద్వారా రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు, సహజవాయువు కొనుగోలు చేసే దేశాలపై గరిష్టంగా 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కల్పించారు. భారత్, చైనా వంటి దేశాలు దీని పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో ఆయన నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.భారత్ స్పందన.. బిల్లు ఆమోదం నేపథ్యంలో.. భారత విదేశాంగ శాఖ గురువారం స్పందించింది. తన వాణిజ్య, ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించుకునే విషయంలో స్పష్టమైన వైఖరితో ఉన్నట్లు తెలిపింది. రష్యా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేయడంపై భారత్ ఇప్పటికే తన విధానాన్ని పలుమార్లు వివరించిందని గుర్తు చేస్తోంది. దేశంలోని 140 కోట్లకుపైగా ప్రజల ఇంధన అవసరాలను తీర్చేందుకు వివిధ దేశాల నుంచి చమురు దిగుమతులు చేసుకుంటున్నామని పేర్కొంది. రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో అమెరికా ఒత్తిడి కొనసాగుతున్న నేపథ్యంలో.. భారత్ తన ఇంధన భద్రత, జాతీయ ప్రయోజనాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు స్పష్టం చేస్తోంది. అదే సమయంలో.. అమెరికా ప్రతినిధులతో గత కొన్ని నెలలుగా ఉన్నతస్థాయిలో ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయని విదేశాంగ శాఖ అంటోంది. ఈ బిల్లు వల్ల భారత్–అమెరికా ద్వైపాక్షిక సంబంధాలతో పాటు అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌పై పడే ప్రభావాలను కూడా భారత ప్రభుత్వం ఇప్పటికే అమెరికా వర్గాలకు స్పష్టంగా వివరించిందని పేర్కొంది. అమెరికా చర్య వల్ల ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనేందుకు వాణిజ్య, పారిశ్రామిక సంస్థలతో కలిసి పనిచేస్తామని తెలిపింది.ట్రంప్ డెస్క్ మీద.. అమెరికా ప్రతినిధుల సభలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదం పొందింది. అయితే అంత మాత్రాన భారత్‌పై వెంటనే 100 శాతం టారిఫ్ అమల్లోకి వచ్చినట్లు కాదు. ఈ బిల్లు ఇప్పుడు అధ్యక్షుడు ట్రంప్ ఆమోదానికి వెళ్లనుంది. సంబంధిత చట్టానికి సంబంధించిన ఫైల్.. ట్రంప్ డెస్క్ వద్దకు వెళ్లినట్లు వైట్‌హౌజ్ వర్గాలు ధృవీకరించాయి. అయితే ఏ దేశంపై, ఎంత టారిఫ్ విధించాలి అనే అధికారం ఇప్పుడు అధ్యక్షుడి నిర్ణయంపై ఆధారపడి ఉంది. రష్యా ఆంక్షల బిల్లులో.. రష్యా చమురు, గ్యాస్ కొనుగోళ్లపై ఆంక్షలతో పాటు రష్యా ‘షాడో ఫ్లీట్’, ఆ దేశ నాయకత్వం(పుతిన్ సహా అక్కడి పలువురు అగ్రనేతలు), ఆర్థిక సంస్థలు, ఇంధన రంగంపైనా బిల్లు కఠిన చర్యలను ప్రతిపాదిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధానికి రష్యాకు లభిస్తున్న ఇంధన ఆదాయాన్ని పరిమితం చేయడమే అమెరికా చర్యల ప్రధాన ఉద్దేశంగా పేర్కొంటోంది. ఇక భారత్‌పై ఈ చట్టం ఎలా అమలవుతుంది? టారిఫ్ విధిస్తే ఎంత మేరకు ఉంటుంది? రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై దాని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది? అనే అంశాలు ట్రంప్ తదుపరి నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతానికైతే భారత్ మాత్రం తన ఇంధన భద్రత, వాణిజ్య ప్రయోజనాల పరిరక్షణకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.అమెరికా రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం.. 2026 జూలైలో ఉక్రెయిన్ పర్యటన ముగించుకుని అమెరికాకు తిరిగొచ్చిన మరుసటి రోజే మరణించారు. రష్యాపై కఠిన ఆంక్షలకు ఉద్దేశించిన ఈ బిల్లును ఆయనే ముందుకు తీసుకెళ్లడంతో.. ఆయన గౌరవార్థం ఈ బిల్లుకు ట్రంప్ ‘లిండ్సే ఓ. గ్రాహం’ పేరు పెట్టారు.ఇదీ చదవండి: ట్రంప్ రష్యా బిల్లు.. భారత్, చైనాపైనే ఎందుకు? -
అయిపాయె.. ఇక భారత్, చైనాకు బిగ్ టెన్షన్!
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మాస్కోపై ఆర్థిక ఒత్తిడి పెంచేందుకు అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాపై కఠిన ఆంక్షలు విధించే బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులో రష్యా చమురు, గ్యాస్‌ను కొనుగోలు చేసే దేశాలపై భారీ టారిఫ్‌లు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కల్పించారు. ఇందులో భాగంగా 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అవకాశం ఉండటం భారత్, చైనాలకు ఆందోళన కలిగించే అంశంగా మారింది.ప్రతినిధుల సభలో రష్యా ఆంక్షల బిల్లుకు అనుకూలంగా 262 ఓట్లు, వ్యతిరేకంగా 159 ఓట్లు వచ్చాయి. ఇప్పటికే గత నెలలో సెనెట్ 86–11 ఓట్లతో ఈ బిల్లును ఆమోదించింది. దీంతో ఇప్పుడు బిల్లు ట్రంప్ వద్దకు వెళ్లనుంది. తాను బిల్లుపై సంతకం చేస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు.రష్యాపై మరింత ఒత్తిడి‘లిండ్సే ఓ. గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్–2026’గా పిలుస్తున్న ఈ చట్టం రష్యా ఇంధన, రక్షణ రంగాలపై కఠిన ఆంక్షలకు మార్గం సుగమం చేయనుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇతర కీలక అధికారులపైనా ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది. పాశ్చాత్య దేశాల ఆంక్షలను తప్పించుకునేందుకు రష్యా ఉపయోగిస్తోందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘షాడో ఫ్లీట్’ ట్యాంకర్లపైనా చర్యలు తీసుకునే వీలు కల్పిస్తోంది. ఇరాన్‌కు సంబంధించిన అదనపు ఆంక్షలకు కూడా బిల్లులో అవకాశం ఉంది.అంతేకాకుండా రష్యాతో వ్యాపారం కొనసాగించే ఇతర దేశాలపై కూడా చర్యలకు ఈ చట్టం వీలు కల్పిస్తుంది. ముఖ్యంగా రష్యా చమురు, గ్యాస్‌ను కొనుగోలు చేసే దేశాల నుంచి అమెరికాకు వచ్చే దిగుమతులపై 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అధికారాన్ని ట్రంప్‌కు ఇస్తోంది.భారత్, చైనాలే ఎందుకు?ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలైన తర్వాత ప్రపంచ ఇంధన మార్కెట్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. పాశ్చాత్య దేశాల ఆంక్షల కారణంగా రష్యా చమురు తక్కువ ధరలకు విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడగా.. భారత్, చైనా సహా పలు దేశాలు రష్యా నుంచి భారీగా ముడిచమురు కొనుగోలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేసే ప్రధాన దేశాలపై ద్వితీయ టారిఫ్‌లు విధించే అధికారాన్ని అమెరికా ఉపయోగించవచ్చని బిల్లులో పేర్కొన్నారు. అమెరికా ప్రతినిధుల సభలో జరిగిన చర్చలో భారత్, చైనాలను ప్రధాన కొనుగోలుదారులుగా ప్రత్యేకంగా ప్రస్తావించారు.అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏమిటంటే.. బిల్లు ఆమోదమైనంత మాత్రాన భారత్‌పై 100 శాతం టారిఫ్ తక్షణమే అమల్లోకి రాదు. ఏ క్షణమైనా అలాంటి టారిఫ్ విధించే అధికారం మాత్రమే అధ్యక్షుడికి లభిస్తుంది. కాబట్టి దాన్ని ఎప్పుడు, ఏ దేశంపై, ఎంత మేరకు అమలు చేయాలన్నది ట్రంప్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.అమెరికా మార్కెట్‌పై ప్రభావం?భారత్ రష్యా నుంచి భారీగా ముడిచమురు దిగుమతి చేసుకుని, దాన్ని శుద్ధి చేసి దేశీయ అవసరాలకు వినియోగించడంతోపాటు కొన్ని ఉత్పత్తులను ఎగుమతి కూడా చేస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా ఇంధన కొనుగోళ్లను కొనసాగిస్తే భారత ఉత్పత్తులపై అమెరికా అదనపు టారిఫ్‌లు విధించే అవకాశం ఉండటం వాణిజ్య రంగంలో కొత్త అనిశ్చితికి దారితీస్తోంది. అయితే ఇప్పటివరకు భారత్‌పై కొత్త 100 శాతం టారిఫ్ విధించినట్లు అమెరికా ప్రకటించలేదు.ట్రంప్‌కు అధికారం ఇవ్వడంపై అభ్యంతరాలుబిల్లుకు కాంగ్రెస్‌లో విస్తృత మద్దతు లభించినప్పటికీ.. ట్రంప్‌కు ఇంత విస్తృతమైన టారిఫ్ అధికారాలు ఇవ్వడంపై డెమొక్రాట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీలో డెమొక్రాట్ల తరఫున సీనియర్ సభ్యుడైన గ్రెగరీ మీక్స్ ఈ బిల్లును తీవ్రంగా విమర్శించారు. రష్యాపై ఆంక్షలకు తాము మద్దతు ఇస్తున్నప్పటికీ.. రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై టారిఫ్‌లు విధించే అధికారాన్ని ట్రంప్‌కు విస్తృతంగా ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు డెమొక్రాట్లు తెలిపారు. ఇక సెకండరీ టారిఫ్‌లకు సంబంధించిన నిబంధనలను తొలగించే ప్రయత్నం చేసినా అది విఫలమైంది.ట్రంప్ నిర్ణయంపైనే ఉత్కంఠరష్యాపై ఒత్తిడి పెంచి ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేలా పుతిన్‌ను చర్చల వైపు తీసుకురావడమే ఈ చర్యల లక్ష్యమని బిల్లు మద్దతుదారులు చెబుతున్నారు. మరోవైపు ట్రంప్ స్వయంగా టారిఫ్‌లు, ఆంక్షలను తన విదేశాంగ విధానంలో కీలక సాధనాలుగా ఉపయోగిస్తున్నారు.ఇప్పుడు ప్రతినిధుల సభ, సెనెట్ ఆమోదం పొందిన బిల్లు ట్రంప్ సంతకానికి వెళ్లనుంది. బిల్లు చట్టంగా మారిన తర్వాత భారత్, చైనా వంటి రష్యా ఇంధన కొనుగోలుదారులపై ట్రంప్ ఈ అధికారాన్ని ఎలా ఉపయోగిస్తారన్నదే అసలు ప్రశ్న. దీంతో రష్యా నుంచి చమురు కొనుగోళ్లు, భారత్–అమెరికా వాణిజ్య సంబంధాలపై తదుపరి పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.ఇదీ చదవండి: అక్కడ రూల్స్ పాటించకుంటే ఫైన్లు వేసేస్తారు! -
బస్సుపై డ్రోన్ దాడి.. ఐదుగురి మృతి
ఉక్రెయిన్ దక్షిణ ప్రాంతంలో ప్రయాణికుల బస్సుపై రష్యా డ్రోన్ దాడి చేయడంతో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నికోపోల్ నగరం వద్ద బుధవారం తెల్లవారుజామున ఈ దాడి జరిగినట్లు వెల్లడించారు. మరో ఏడుగురు గాయపడ్డారని ద్నిప్రొపెట్రోవ్స్క్ ప్రాంత గవర్నర్ ఒలెక్సాండర్ హాంజా తెలిపారు.దాడికి గురైన బస్సు కిటికీలు ధ్వంసమైన దృశ్యాలను ప్రాంతీయ గవర్నర్ టెలిగ్రామ్‌లో పోస్ట్ చేశారు. బస్సు వెలుపల రక్తం కారుతున్నట్లు కనిపించిన ఫొటోను కూడా ఆయన పంచుకున్నారు. అయితే ఆ చిత్రాన్ని అంతర్జాతీయ మీడియా ఇంకా ధ్రువీకరించలేదు. ఈ దాడిపై రష్యా నుంచి ఎలాంటి స్పందన రాలేదు. యుద్ధంలో పౌరులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుంటున్నారన్న ఆరోపణలను రష్యా, ఉక్రెయిన్ రెండూ ఖండిస్తున్నాయి.రైళ్లపైనా దాడులుఇదే సమయంలో ఉక్రెయిన్‌లోని మైకోలైవ్ ప్రాంతంలో ప్రయాణికుల రైలుపైనా రష్యా డ్రోన్ దాడి జరిగినట్లు తాత్కాలిక ప్రాంతీయ గవర్నర్ హెఓర్హీ రెషెటిలోవ్ తెలిపారు. రైలులో ఉన్న మొత్తం 168 మంది ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా బయటకు తరలించినట్లు, ఎవరూ గాయపడలేదని ఆయన చెప్పారు. తొలి దాడి తర్వాత రైలుపై మరో రెండు సార్లు దాడి జరిగినట్లు తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ ప్రకారం, పోలాండ్ సరిహద్దుకు సమీపంలోని కోవెల్లో ఓ రైలు ఇంజిన్‌పైనా దాడి జరిగింది.ఉక్రెయిన్ గగనతలం 2022లో రష్యా పూర్తిస్థాయి దాడి ప్రారంభించినప్పటి నుంచి మూసివేయడంతో, దేశంలో సాధారణ ప్రజలు, వ్యాపారాలకు బస్సులు, రైళ్లు కీలక రవాణా మార్గాలుగా మారాయి. ఇటీవలి నెలల్లో రష్యా, ఉక్రెయిన్ పరస్పరం రవాణా వ్యవస్థలు, మౌలిక వసతులపై దాడులను పెంచాయి. ఉక్రెయిన్ రైల్వే సంస్థ ప్రకారం, ఈ ఏడాది ఇప్పటివరకు 120 ప్రయాణికుల బోగీలు, 304 రైలు ఇంజిన్లు, 43 రైల్వే స్టేషన్లు దెబ్బతిన్నాయి. మొత్తం 1,700 రైల్వే సదుపాయాలపై దాడులు జరిగినట్లు సంస్థ తెలిపింది.ఈ దాడుల నేపథ్యంలో రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలు విధించాలని జెలెన్స్కీ అమెరికా, ఐరోపా దేశాలను కోరారు. రాబోయే రోజుల్లో రవాణా వ్యవస్థలపై దాడులు, పౌరుల భద్రత, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో పాశ్చాత్య దేశాల తదుపరి చర్యలు కీలకంగా మారనున్నాయి. -
భారత్‌కు బిగ్ షాక్.. వంద శాతం టారిఫ్‌లకు అమెరికా గ్రీన్‌సిగ్నల్!
వాషింగ్టన్: రష్యా నుంచి చమురు, సహజవాయువు కొనుగోలు చేసే దేశాలపై భారీగా సుంకాలు విధించేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అధికారం కల్పించే కీలక బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభలో ముందడుగు పడింది. ‘లిండ్సేఓ గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026’పై ఓటింగ్‌లో భాగంగా 214–211 ఓట్ల తేడాతో కీలక ప్రొసీజరల్ ఆమోదం పొందింది. ఈ బిల్లులో భారత్, చైనా వంటి రష్యా చమురు కొనుగోలు చేసే దాదాపు 10 దేశాలపై గరిష్ఠంగా 100 శాతం టారిఫ్ విధించే అధికారం అధ్యక్షుడికి ఇవ్వాలని ప్రతిపాదించారు. అయితే, హౌస్‌లో ఈ దశలో జరిగిన ఓటింగ్ తుది ఆమోదం కాదు. బిల్లుపై తుది ఓటింగ్ బుధవారం జరగాల్సి ఉంది. అది ఆమోదం పొందిన తర్వాతే అధ్యక్షుడి సంతకం కోసం వైట్‌హౌస్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది.భారత్‌కు ఎందుకు కీలకం?రష్యా నుంచి భారీ స్థాయిలో ముడి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ ఒకటి. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించినప్పటికీ.. భారత్ తన ఇంధన అవసరాల కోసం రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగించింది. ఇప్పుడు ప్రతిపాదిత అమెరికా చట్టం అమల్లోకి వస్తే.. రష్యా నుంచి ఇంధన దిగుమతులు కొనసాగించే దేశాలపై అదనపు టారిఫ్‌లకు మార్గం ఏర్పడుతుంది. బిల్లులో 100 శాతం వరకు టారిఫ్ విధించే అధికారం అధ్యక్షుడికి ఇవ్వాలని ప్రతిపాదించారు. అంటే చట్టం ఆమోదం పొందినంత మాత్రాన భారత్‌పై వెంటనే 100 శాతం టారిఫ్ అమల్లోకి వచ్చినట్లు కాదు. టారిఫ్ విధించాలా? ఎంత విధించాలి? అనే నిర్ణయం అధ్యక్షుడి వద్దే ఉంటుంది.రష్యాపైనే ప్రధాన గురిఈ బిల్లు కేవలం రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై టారిఫ్‌లకు మాత్రమే పరిమితం కాదు. రష్యా నాయకత్వం, ఆర్థిక సంస్థలు, ఇంధన రంగంతో పాటు ఆంక్షలను తప్పించుకోవడానికి ఉపయోగిస్తున్నట్లు అమెరికా భావిస్తున్న ‘షాడో ఫ్లీట్’పై కూడా ఆంక్షలను కఠినతరం చేయాలని ప్రతిపాదించింది. రష్యా చమురు ఆదాయం ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న యుద్ధానికి నిధులుగా ఉపయోగపడుతోందన్నది అమెరికా చట్టసభ సభ్యుల వాదన. అలాగే ఇరాన్‌పై ఇప్పటికే ఉన్న ఆంక్షలను పొడిగించే నిబంధనలు కూడా ఈ ప్యాకేజీలో ఉన్నాయి.సెనేట్‌లో భారీ మెజార్టీతో ఆమోదంఈ బిల్లుకు అమెరికా సెనేట్‌లో ఇప్పటికే భారీ మద్దతు లభించింది. ఆగస్టు 7న సెనేట్ 86–11 ఓట్లతో బిల్లును ఆమోదించింది. అనంతరం ఇది ప్రతినిధుల సభకు చేరింది. సెనేట్‌లో ఆమోదమైన రూపంలో రష్యా ఇంధనాన్ని భారీగా దిగుమతి చేసుకునే దేశాలపై 100 శాతం వరకు టారిఫ్‌లకు అవకాశం కల్పించారు. భారత్, చైనా వంటి దేశాలు ఈ నిబంధన పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని రాయిటర్స్ సహా పలు నివేదికలు పేర్కొన్నాయి.ఇక, బిల్లుకు మద్దతు ఉన్నప్పటికీ.. అమెరికా ప్రతినిధుల సభలో దీనిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా అధ్యక్షుడికి టారిఫ్‌ల విషయంలో అత్యధిక అధికారాలు ఇవ్వడంపై కొందరు డెమోక్రటిక్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.Breaking || US House to vote on Russia sanctions bill, which could give Trump authority to impose tariffs of up to 100% on countries buying Russian energy.➤ India may face possible 100% tariff➤ India among 10 nations named for tariffs➤ Russia oil buyers: U.S. tariff… pic.twitter.com/4gyjSS8Gi6— TIMES NOW (@TimesNow) September 16, 2026ఇక ఏం జరుగుతుంది?హౌస్‌లో తుది ఓటింగ్ కీలకం. బిల్లు ప్రతినిధుల సభలోనూ ఆమోదం పొందితే అధ్యక్షుడి సంతకం కోసం వెళ్తుంది. ఆ తర్వాతే చట్టంలోని నిబంధనలు అమల్లోకి వచ్చే ప్రక్రియ ప్రారంభమవుతుంది. అందువల్ల ప్రస్తుతం భారత్‌పై 100 శాతం టారిఫ్ విధించినట్లు కాదు.. అయితే అలాంటి చర్య తీసుకునే చట్టపరమైన అధికారాన్ని ట్రంప్‌కు కల్పించే దిశగా అమెరికా కాంగ్రెస్‌లో ప్రక్రియ ముందుకు సాగుతోంది. ఈ పరిణామం భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలతో పాటు, భారత్ కొనసాగిస్తున్న రష్యా చమురు కొనుగోళ్లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో తాజా పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఇదీ చదవండి: సౌదీకి భారీ షాక్.. గోడ మీద పిల్లిలా హ్యాండిచ్చిన పాక్! -
మైనస్ 50 డిగ్రీల చలిలో లక్షలాది మంది ఖైదీల కన్నీటి కథ
మైనస్ 50 డిగ్రీల కన్నా తక్కువగా ఉండే అతి చల్లని వాతావరణంం చుట్టూ అంతులేని మంచు పర్వతాలు.. జనసంచారం చాలా తక్కువ. రష్యాలోని ఈశాన్య భాగంలో ఉన్న కోలిమా ప్రపంచంలోని అత్యంత కఠినమైన, ఏకాంత ప్రదేశాల్లో ఒకటి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ ప్రాంతాన్ని ప్రపంచం గుర్తించేలా చేసింది అక్కడి చలి మాత్రమే కాదు.. దాని వెనుక ఉన్న విషాద చరిత్ర. సోవియట్ పాలకుడు జోసెఫ్ స్టాలిన్ పాలనలో కోలిమా ప్రాంతం ఒక పెద్ద లేబర్ క్యాంప్‌గా మారింది. గులాగ్ అనే వ్యవస్థలో భాగంగా వేలాది కిలోమీటర్ల దూరం నుంచి ఖైదీలను ఇక్కడికి తరలించేవారు. బంగారం, ఇతర ఖనిజాల తవ్వకాలు, రహదారుల నిర్మాణం వంటి అత్యంత కఠినమైన పనుల్లో వారిని ఉపయోగించేవారు.తీవ్రమైన చలి, తగిన ఆహారం లేకపోవడం, వ్యాధులు, కఠినమైన వర్కింగ్ కండిషన్స్, ఇవన్నీ అక్కడి ఖైదీల జీవితాన్ని దారుణంగా మార్చేశాయి. అసలు కొలిమాకు ఎంతమందిని తరలించారు, అక్కడ ఎంత మంది మరణించారు అనే విషయంపై చరిత్రకారుల్లోనే స్పష్టత లేదు. అయితే బాధితుల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది అని అంచనా వేస్తున్నారు. నేడు కోలిమాలో చిన్న చిన్న పట్టణాలు, గనులు, విస్తారమైన అడవులు కనిపిస్తాయి. అయితే శీతాకాలంలో తీవ్రమైన చలి, పరిమితమైన రవాణా సదుపాయం, కఠినమైన ప్రకృతి ఈ ప్రాంతాన్ని ఛాలెంజింగ్ లొకేషన్‌గా మార్చాయి. కోలిమా అనేది ఒక ట్రావెల్ డెస్టినేషన్ మాత్రమే కాదు ఒకప్పుడు వేలాది మంది ఖైదీలు అనుభవించిన బాధను గుర్తు చేసే ప్రదేశంగా చరిత్రలో నిలిచిపోతోంది. పూర్తిగా మంచుతో నిండి ఉన్న ఈ నేల సోవియట్ చరిత్రలోని ఒక చీకటి అధ్యాయానికి నేటికీ నిశ్శబ్ద సాక్షిగా నిలిచిపోయింది. ఇదీ చదవండి: ఎట్టకేలకు 105 ఏళ్ల తల్లిని కలిసిన 85 ఏళ్ల కుమార్తె -
రష్యా డీజిల్ వనరులపై దాడులు ఆపండి
కీవ్: రష్యాలోని డీజిల్ వనరులపై డ్రోన్ దాడులను వెంటనే ఆపాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కోరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం వెల్లడించారు. ఉక్రెయిన్ దీర్ఘ శ్రేణి డ్రోన్ దాడుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా డీజిల్ కొరత తీవ్రరూపం దాల్చిందని చెప్పారు. రష్యాలోని డీజిల్ ఇంధన మౌలిక వనరులను వదిలేసి, ఇతర లక్ష్యాలపై దాడులు చేసుకోవచ్చని చెప్పానన్నారు. ఈ ఒక్క పని చేయాలని జెలెన్స్కీని కోరినట్లు వెల్లడించారు. ప్రపంచంలోనే చమురు, గ్యాస్ అతిపెద్ద ఎగుమతిదారైన రష్యా, ఇప్పుడు ఉక్రెయిన్ డ్రోన్ దాడుల కారణంగా తీవ్ర ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో ఇంధన రేషనింగ్‌ను అమలు చేస్తోంది. భారత్ నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటోంది. పశి్చమాసియాలో పరిణామాలతో ఇప్పటికే ఇంధన వనరుల సరఫరాకు తీవ్ర విఘాతం కలగడం, ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ట్రంప్ ఆదివారం ఈ విషయం వెల్లడించడం గమనార్హం. -
సముద్ర గర్భంలో రష్యా భారీ విధ్వంసకర ప్లాన్.. నాటో తిప్పికొట్టి..
ఆర్కిటిక్ సముద్ర జలాల్లో కీలకమైన సముద్రగర్భ కేబుళ్లను ధ్వంసం చేసేందుకు రష్యా చేపట్టిన రహస్య ప్రయత్నాన్ని నాటో దేశాలు అడ్డుకున్నాయి. కొన్ని నెలల క్రితం స్వాల్బార్డ్ దీవుల సమీపంలో రష్యా జలాంతర్గాములు ఓ రహస్య ఆయుధాన్ని ప్రయోగించేందుకు శిక్షణ తీసుకుంటుండగా బ్రిటన్, నార్వే, అమెరికా సంయుక్తంగా వాటిని గుర్తించి అడ్డుకున్నట్లు రాయిటర్స్ తెలిపింది.ఈ రహస్య ఆపరేషన్‌ను రష్యా ప్రధాన సముద్రగర్భ పరిశోధనా విభాగం జీయూజీఐ నిర్వహించినట్లు ఇద్దరు అధికారులు తెలిపారు. లోతైన సముద్రంలో ప్రయాణించగల చిన్న జలాంతర్గాములను ఉపయోగించి అత్యంత అధునాతన సాంకేతికతతో రూపొందించిన ఆయుధాన్ని ఎలా ప్రయోగించాలో రష్యా సిబ్బంది పరీక్షించినట్లు చెప్పారు.బ్రిటన్, నార్వే, అమెరికా కలిసి రష్యా నౌకలను సముద్రంలో గుర్తించి ఎదుర్కొన్నాయి. దీంతో రష్యా తన శిక్షణను పూర్తి చేయలేకపోయింది. అనంతరం ఆ నౌకలు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టాయి. ఈ ఘటనలో ఎలాంటి సముద్రగర్భ కేబుల్ దెబ్బతినలేదు. నాటోతో ఘర్షణ ఏర్పడితే ఆ సాంకేతికతను ఎలా ఉపయోగించవచ్చో పరీక్షించడమే ఈ శిక్షణ ఉద్దేశమని అధికారులు తెలిపారు.స్వాల్బార్డ్ దీవులను నార్వే ప్రధాన భూభాగంతో కలిపే 2 సముద్రగర్భ ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లు సుమారు 1,400 కిలోమీటర్ల పొడవు ఉన్నాయి. ఇవి సముద్ర మట్టానికి 2,700 మీటర్ల లోతు వరకు ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఉపగ్రహ భూ కేంద్రంగా ఉన్న స్వాల్సాట్ నుంచి భారీ మొత్తంలో ఉపగ్రహ సమాచారాన్ని ఈ కేబుళ్లు ప్రసారం చేస్తాయి.విధ్వంసక చర్యలను పెంచుతున్న రష్యా ఈ ఘటనతో రష్యా యూరప్‌లో విధ్వంసక చర్యలను పెంచుతోందన్న పాశ్చాత్య దేశాల ఆందోళనలు మరింత పెరిగాయి. కొంతమంది అమెరికా నిఘా అధికారులు రష్యా నాటో పరస్పర రక్షణ ఒప్పందంలోని ఆర్టికల్ 5ను పరీక్షించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నాటోలోని ఓ సభ్యదేశంపై తీవ్రమైన దాడి జరిగితే ఇతర సభ్యదేశాలు దాన్ని మొత్తం కూటమిపై దాడిగా పరిగణించే నిబంధనే ఆర్టికల్ 5.రష్యా తన చర్యలతో కేబుళ్లకు ఎలాంటి నష్టం కలిగించలేదని అధికారులు తెలిపారు. బ్రిటన్, నార్వే అధికారులు తమ వద్ద కొత్త సాంకేతికతపై సమాచారం ఉందని మాస్కోకు తెలియజేసినట్లు చెప్పారు. రష్యా దాన్ని ఉపయోగించకుండా వెనక్కి తగ్గుతుందనే ఉద్దేశంతో ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలిపారు.‘‘మా సంయుక్త చర్య ద్వారా రష్యాకు స్పష్టమైన సందేశం పంపాం. వారు రహస్యంగా కార్యకలాపాలు నిర్వహించలేరు’’ అని నార్వే రక్షణ మంత్రి టోరె శాండ్విక్ తెలిపారు. కీలక మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకునే ఏ ప్రయత్నాన్నైనా గుర్తించి తగిన పరిణామాలు ఎదుర్కొనేలా చేస్తామని రష్యా అధికారులకు స్పష్టం చేసినట్లు ఆయన చెప్పారు.బ్రిటన్, నార్వే ఏప్రిల్‌లోనే ఆందోళన రష్యా సముద్రగర్భ కార్యకలాపాలపై బ్రిటన్, నార్వే ఏప్రిల్‌లోనే ఆందోళన వ్యక్తం చేశాయి. రష్యా ప్రధాన సముద్రగర్భ పరిశోధనా విభాగం జీయూజీఐ నార్వే, బ్రిటన్ జలాల్లో రహస్య కార్యకలాపాలకు ప్రయత్నించినట్లు అప్పట్లో వెల్లడించాయి. ఈ విభాగంపై అమెరికా, బ్రిటన్ ఆంక్షలు విధించాయి. 2022లో జర్మనీకి రష్యా నుంచి సహజ వాయువును సరఫరా చేసే నార్డ్ స్ట్రీమ్ సముద్రగర్భ పైప్లైన్లలో 4లో 3 ధ్వంసమైన తర్వాత నాటో దేశాలు సముద్రగర్భ మౌలిక వసతుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఈ ఘటనలో ఉక్రెయిన్ ప్రమేయాన్ని ఆ దేశం ఖండించింది. 2023 నుంచి సముద్రగర్భ పైప్లైన్లు, విద్యుత్ కేబుళ్లు, సమాచార కేబుళ్లకు సమీపంలో కొన్ని నౌకలు నెమ్మదిగా ప్రయాణిస్తూ వాటి స్థానాలను గుర్తిస్తున్నట్లు భద్రతా నిపుణులు గుర్తించారు. దీనిని ‘డ్రిఫ్టింగ్’గా పిలుస్తారు.గత ఏడాది ఉత్తర సముద్రంలో ఇలాంటి నౌకల సంఖ్య 52 శాతం పెరిగి 13,079కు చేరింది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో ఈ కార్యకలాపాలు 88 శాతం పెరిగి 18,401 నౌకలకు చేరినట్లు సముద్ర భద్రతా విశ్లేషణ సంస్థ విండ్‌వార్డ్ తెలిపింది. సముద్రగర్భ మౌలిక వసతులపై విస్తృతంగా సమాచారాన్ని సేకరించడం చట్టవిరుద్ధం కాకపోయినా, ఇంత భారీ స్థాయిలో ప్రాంతాలను గుర్తించడం భవిష్యత్తులో విధ్వంసక చర్యలకు సిద్ధమవుతున్న సంకేతంగా భద్రతా నిపుణులు భావిస్తున్నారు.ఈ కార్యకలాపాలు, కొన్ని కేబుళ్లపై అనుమానాస్పద జోక్యాల నేపథ్యంలో నాటో గత ఏడాది జనవరిలో బాల్టిక్ సెంట్రీ పర్యవేక్షణ వ్యవస్థను ప్రారంభించింది. బ్రిటన్ నేతృత్వంలో నార్డిక్ వార్డెన్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. కీలక మౌలిక వసతులపై నిఘా, గస్తీని పెంచడం ఈ కార్యక్రమాల ఉద్దేశం.విద్యుత్, సమాచార ప్రసార కేబుళ్లపై ప్రపంచవ్యాప్తంగా ఆధారపడటం పెరుగుతున్నందున సముద్రగర్భ మౌలిక వసతుల ప్రాధాన్యం కూడా పెరుగుతోంది. కృత్రిమ మేధ కారణంగా సమాచారంతో పాటు విద్యుత్ అవసరం పెరుగుతుండటంతో ఈ కేబుళ్ల సంఖ్య కూడా ప్రతి ఏడాది పెరుగుతోంది. అయితే యూరప్ ఇప్పటికీ ఈ మౌలిక వసతులపై ముప్పును ఎదుర్కొనే స్థితిలోనే ఉందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు.బ్రూకింగ్స్ సంస్థకు చెందిన సీనియర్ పరిశోధకుడు బ్రూస్ జోన్స్ మాట్లాడుతూ.. గత 25 ఏళ్లలో యూరప్ సముద్రగర్భ మౌలిక వసతులపై ఆధారపడటాన్ని భారీగా పెంచుకున్నా, వాటిని రక్షించే సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గించుకుందని అన్నారు. పెరుగుతున్న రష్యా ముప్పు నేపథ్యంలో ఇప్పుడు ఆ రక్షణ సామర్థ్యాన్ని తిరిగి నిర్మించేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. -
భారత్‌లో పుతిన్-జిన్‌పింగ్ ‘పవర్’ షో!
ప్రపంచ దేశాల అధినేతలు సదస్సులు, సమావేశాలకు వెళ్లినప్పుడు ప్రసంగాలకే కాదు.. వాళ్ల ప్రయాణాలు, భద్రత-ఆహార ఏర్పాట్లు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. వెంట తీసుకొచ్చే వస్తువులు, అందుకునే కానుకల వరకు ప్రతీ అంశంపైనా ఆసక్తికర చర్చ నడుస్తుంటుంది. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న 2026 బ్రిక్స్ సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ విషయంలో అంతకు మించిందేదో కనిపిస్తోంది.. ఇద్దరు నేతలు భారత్‌కు చేరుకున్న తీరు ఇప్పుడు ప్రత్యేక చర్చకు దారితీసింది. ఒకవైపు పుతిన్ అత్యంత భద్రతా ప్రమాణాలతో రూపొందించిన ఐఎల్-96-300పీయూలో ఢిల్లీకి వచ్చారు. దీనినే ‘డూమ్స్‌డే ప్లేన్’, ‘ఫ్లయింగ్ క్రెమ్లిన్’ వంటి పేర్లతో పిలుస్తారు. మరోవైపు ఎయిర్ చైనా ప్రత్యేక విమానంలో జిన్‌పింగ్ వచ్చారు. గగన ప్రయాణమే కాదు.. ఇటు వీళ్ల కోసం తెచ్చిన ప్రెసిడెన్షియల్ కార్లు కూడా అంతే ఆసక్తికరంగా ఉన్నాయి. పుతిన్ కోసం ఔరస్ సెనాట్.. జిన్‌పింగ్ కోసం సమ్‌థింగ్ స్పెషల్ హోంగ్‌చీ ఎన్701 హైలైట్‌గా నిలిచాయి. ఒకరిది ‘ఫోర్ట్రెస్ ఆన్ వీల్స్’గా పేరొందితే.. మరొకరి రాజకీయ చరిత్రతో ముడిపడిన ‘రెడ్ ఫ్లాగ్’ బ్రాండ్‌గా పేరొందాయి.‘ఫ్లయింగ్ క్రెమ్లిన్’..పుతిన్ ప్రయాణించే విమానం ఐఎల్-96-300పీయూ.. ఎంతో ప్రత్యేకం. అత్యవసర పరిస్థితుల్లోనూ రష్యా అధ్యక్షుడు దేశ సైనిక, ప్రభుత్వ వ్యవస్థలతో సురక్షితంగా కమ్యూనికేట్ చేయగలిగేలా దీన్ని మొబైల్ కమాండ్ సెంటర్‌గా రూపొందించారు. శాటిలైట్ లింకులు, ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్, రాడార్ జామింగ్ సహా పలు రక్షణ వ్యవస్థలు ఇందులో ఉంటాయి. అంతేకాదు.. పుతిన్ భారత్‌కు వచ్చినప్పుడు ఒకే తరహాకు చెందిన రెండు విమానాలు ఒకేసారి ప్రయాణించాయి. అసలు అధ్యక్షుడు ఏ విమానంలో ఉన్నారో గుర్తించడం కష్టమయ్యేలా చేసే ఈ వ్యూహం.. భద్రతలో భాగమే. అందుకే ఐఎల్-96-300పీయూకి ‘ఫ్లయింగ్ క్రెమ్లిన్’, ‘డూమ్స్‌డే ప్లేన్’ వంటి పేర్లు వచ్చాయి.ఫోర్ట్రెస్ ఆన్ వీల్స్..ఆకాశంలో ఇంతటి భద్రత ఉంటే.. పుతిన్ నేలపై ప్రయాణించే కారు కూడా అంతే కట్టుదిట్టంగా ఉంటుంది. ఢిల్లీలో పుతిన్ ఉపయోగించిన ఔరస్ సెనాట్‌ను అందుకే ‘ఫోర్ట్రెస్ ఆన్ వీల్స్’గా అభివర్ణిస్తారు. బుల్లెట్లు, పేలుళ్ల నుంచి రక్షణ కల్పించేలా రూపొందించిన ఈ ఆర్మర్డ్ లిమోసిన్‌ను రష్యా దేశీయంగా అభివృద్ధి చేసింది. పాశ్చాత్య లగ్జరీ కార్లపై ఆధారపడకుండా.. దేశాధ్యక్షుడి స్థాయికి తగ్గ భద్రతా వాహనాన్ని సొంతంగా తయారు చేసుకోగలిగింది. బ్రిక్స్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పుతిన్ ఇదే కారులో ప్రయాణించడం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.జిన్‌పింగ్ ‘ఎయిర్ చైనా’..ఇక పుతిన్ విమానంతో పోలిస్తే జిన్‌పింగ్ ప్రయాణించిన విమానం మరో రకమైన ప్రత్యేకతను చూపిస్తుంది. చైనా అధ్యక్షుడు ఎయిర్ చైనా ప్రత్యేక విమానంలో భారత్‌కు చేరుకున్నారు. ఇది పుతిన్ ఐఎల్-96-300పీయూ తరహాలో మొబైల్ కమాండ్ సెంటర్‌గా రూపొందించిన ప్రత్యేక అధ్యక్ష విమానం కాదు. అయితే దేశాధ్యక్షుడి విదేశీ పర్యటన కావడంతో భద్రత, ప్రోటోకాల్‌కు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. అంటే.. ఒకరి విమానం అత్యంత రహస్య భద్రతా వ్యవస్థలకు ప్రతీక అయితే.. మరొకరి ప్రయాణం చైనా అధికారిక విమానయాన వ్యవస్థను ప్రతిబింబిస్తోంది.‘రెడ్ ఫ్లాగ్’ ఎన్701..విమానం నుంచి రోడ్డుపైకి వస్తే.. జిన్‌పింగ్ కోసం ఉపయోగించే హోంగ్‌చీ ఎన్701 మరో ప్రత్యేక ఆకర్షణ. హోంగ్‌చీ అంటే చైనీస్‌లో ‘రెడ్ ఫ్లాగ్’.. అంటే ‘ఎర్ర జెండా’ అని అర్థం. చైనా రాజకీయ, అధికార వ్యవస్థతో దశాబ్దాలుగా ముడిపడిన ఈ బ్రాండ్.. దేశ అత్యున్నత నాయకత్వానికి ప్రతీకగా మారింది. జిన్‌పింగ్ కోసం ఉపయోగించే ఎన్701 సాధారణ హోంగ్‌చీ కారు కాదు. సుమారు 5.5 మీటర్ల పొడవుండే ఈ ప్రత్యేక లిమోసిన్‌లో బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్, భారీ ఆర్మర్, బుల్లెట్ ప్రూఫ్ టైర్లు వంటి భద్రతా ఏర్పాట్లు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే దీని పూర్తి సాంకేతిక వివరాలను చైనా అధికారికంగా వెల్లడించలేదు. అందుకే ఎన్701 చుట్టూ ఉన్న ఆసక్తి.. దాని డిజైన్ కంటే, దానిలో దాగి ఉన్న భద్రతా సాంకేతికతపైనే ఎక్కువ.కేవలం ప్రయాణం కాదు.. పవర్ స్టేట్మెంట్!ఈ విమానాలు, కార్లు కేవలం ప్రపంచ నేతలను ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్లే సాధనాలు మాత్రమే కాదు. ఆ విమానాలు, కార్లు ఆయా దేశాల భద్రతా ఏర్పాట్లు, టెక్నాలజీ, సొంత తయారీ సామర్థ్యాన్ని చూపిస్తాయి. బ్రిక్స్ వంటి ప్రపంచ వేదికపై నేతల రాకతో పాటు వారి వెంట వచ్చిన ఈ ‘పవర్ మెషీన్లు’ కూడా తమదైన రీతిలో ఒక సందేశాన్ని ఇస్తున్నాయి. ఆకాశంలో భద్రతా కోటలు.. నేలపై కదిలే కోటలు.. మొత్తంగా చూస్తే ఇది కేవలం నేతల ప్రయాణం కాదు.. రష్యా, చైనాల పవర్ స్టేట్మెంట్!.ఇదీ చదవండి: ఏడేళ్ల తర్వాత భారత్‌లో అడుగుపెట్టాడు! -
2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు..
న్యూఢిల్లీ: ఉక్రెయిన్–రష్యా సంఘర్షణను ముగించడానికి చేపట్టే ఏ శాంతి ప్రయత్నానికైనా మద్దతు ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. నల్ల సముద్రంలోని భారతీయ నావికుల తగిన భద్రతకు కల్పింంచాలని రష్యా అధినేత పుతిన్‌కు విజ్ఞప్తి చేశారు. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ అస్థిరత నేపథ్యంలో ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు పుతిన్ శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరం భారత్ మండపంలో ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. 45 నిమిషాలకు పైగా ఈ భేటీ జరిగింది. భారత్, రష్యా సంబంధాలతోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై విస్తృతంగా చర్చించారు. కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని తీర్మానించారు. రెండు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను సైతం సమీక్షించారు. ప్రస్తుతం 65 బిలియన్ డాలర్లుగా ఉన్న వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేర్చాలని ఈ సందర్భంగా భారత్, రష్యాలు లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. ఈ ద్వైపాక్షిక సమావేశం అనంతరం భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. భారత్–రష్యా ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే ప్రయత్నాల్లో వేగం పెంచాలని ఇద్దరు నేతలు నిర్ణయానికి వచ్చారని వెల్లడించింది. రెండు దేశాల మధ్య వార్షిక శిఖరాగ్ర చర్చల కోసం రష్యాలో పర్యటించాలన్న పుతిన్ ఆహ్వానాన్ని మోదీ అంగీకరించారని తెలియజేసింది. చర్చలు, దౌత్యమే సరైన మార్గం రక్షణ, ఇంధనం, కీలక ఖనిజాలు, పౌర అణు శక్తి, ఎరువుల సరఫరా, ప్రజల మధ్య పరస్పర సంబంధాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని మోదీ, పుతిన్ నిర్ణయించారు. పశ్చిమాసియా, నల్ల సముద్ర ప్రాంతంలో సముద్ర వాణిజ్యం, భారతీయ నావికుల భద్రత సహా ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధన, అంతరిక్ష, నైపుణ్య బదిలీ సహా ప్రజల మధ్య సంబంధాలు, ద్వైపాక్షిక సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించారు. ఉక్రెయిన్, రష్యా మధ్య ఘర్షణ త్వరగా ముగిసిపోవాలని మోదీ ఆకాంక్షించినట్లు సమాచారం. సంఘర్షణల పరిష్కారానికి చర్చలు, దౌత్యమే సరైన మార్గమని పుతిన్ దృష్టికి మరోసారి తీసుకెళ్లినట్లు తెలిసింది. శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లవేళలా సహకరిస్తుందని మోదీ అన్నారు. రష్యా మార్కెట్లో అవకాశాలు ఇప్పటికే బలంగా ఉన్న తమ రక్షణ సహకారాన్ని మరింత విస్తరించడంపైనా ఇరుపక్షాలు లోతుగా చర్చించాయి. ఇంధన రంగంలో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించాయి. పౌర అణు ఇంధన రంగంలో సహకారాన్ని మరింత పెంచుకోవడానికి అంగీకరించాయి. అంతేకాకుండా పారిశ్రామిక సహకారాన్ని విస్తరించడం, రైలు, సొరంగ మార్గాల నిర్మాణాల్లో కలిసి పనిచేయడం, ఉక్కు సప్లై చైన్లను అభివృద్ధి చేయడం, భారతీయ ఎగుమతిదారులకు రష్యా మార్కెట్లో అవకాశాలను పెంచడం వంటి అంశాలు కూడా ఈ చర్చల్లో చోటుచేసుకున్నాయి. మోదీ, పుతిన్ కలుసుకోవడం 2 వారాల వ్యవధిలో ఇది రెండోసారి. ఇటీవల కిర్గిజిస్తాన్లోని బిష్కెక్లో ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఇరువురు నేతలు సమావేశమయ్యారు. ఇదిలా ఉండగా, శుక్రవారం ద్వైపాక్షిక సమావేశం అనంతరం భారత్ మండపంలో బిజినెస్ ఫోరమ్ వేదిక వద్దకు చేరుకోవడానికి మోదీ, పుతిన్ ఒకే కారులో ప్రయాణించారు. అంతకుముందు వారిద్దరూ భారత్ మండపంలో ‘ఇన్నోప్రోమ్ ఇండియా’ప్రదర్శనను సందర్శించారు. అందులో పాల్గొన్న వారితో సంభాషించారు. పరస్పర సహకారంపై చర్చించా: మోదీ మౌలిక సదుపాయాలు, ఇంధనం, సాంకేతికత, రక్షణ, సంస్కృతి వంటి రంగాల్లో పరస్పర సహకారంపై పుతిన్‌తో చర్చించానని మోదీ సోషల్ మీడియాలో పోస్టుచేశారు. ‘ఆర్థిక సహకార కార్యక్రమం–2030’అమలు సహా వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై తాము చర్చించినట్లు పేర్కొన్నారు. పుతిన్‌కు ‘తిరుక్కురళ్’బహూకరణ ప్రఖ్యాత తమిళ కవి, తత్వవేత్త తిరువళ్లువర్ రచించిన ప్రాచీన తమిళ కావ్య సంకలనం ‘తిరుక్కురళ్’రష్యన్ అనువాద గ్రంథాన్ని ప్రధాని మోదీ రష్యా అధినేత పుతిన్‌కు బహూకరించారు. అనేక అంశాలపై జ్ఞానోపదేశాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. భాషలు, సరిహద్దులకు అతీతంగా శాశ్వత జ్ఞానాన్ని అందించే తిరుక్కురళ్ రష్యన్ అనువాదాన్ని పుతిన్‌కు అందజేశానంటూ మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. పుతిన్‌తో ఆప్యాయంగా కరచాలనం చేసిన దృశ్యాలతో కూడిన ఒక చిన్న వీడియో క్లిప్‌ను కూడా షేర్చేశారు. -
‘ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపండి’.. పుతిన్‌తో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ సంక్షోభానికి దౌత్యపరమైన చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యమని భారత ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరిపిన ద్వైపాక్షిక సమావేశంలో ప్రధాని మోదీ యుద్ధాన్ని తక్షణమే ఆపి, శాంతి మార్గాన్ని ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇరు దేశాల మధ్య శాంతిని పునరుద్ధరించేందుకు భారత్ తన వంతు సహాయసహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. భారత్ అధ్యక్షతన న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌కు విచ్చేశారు. ఈ పర్యటనలో భాగంగా ఢిల్లీలోని ‘భారత్ మండపం’ వేదికగా ఇరు నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రష్యన్ భాషలోకి అనువదించిన ప్రముఖ తమిళ ప్రాచీన కావ్యమైన ‘తిరుక్కురళ్’ ప్రతిని పుతిన్‌కు ప్రత్యేక బహుమతిగా అందజేశారు. దాదాపు రెండు వేల ఏళ్ల నాటి ఈ గ్రంథంలోని మానవతా విలువలను మోదీ ఈ సందర్భంగా పుతిన్‌కు వివరించారు.రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధన, అంతరిక్ష రంగాల బలోపేతంపై ఇరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు.రష్యాలో జరగబోయే 24వ ఇండో-రష్యా వార్షిక శిఖరాగ్ర సమ్మిట్‌కు హాజరు కావాల్సిందిగా ప్రధాని మోదీని అధ్యక్షుడు పుతిన్ అధికారికంగా ఆహ్వానించగా.. ఆయన ఆ ఆహ్వానాన్ని స్వీకరించారు. దీనికి సంబంధించిన తుది తేదీలను దౌత్య అధికారులు త్వరలోనే ఖరారు చేయనున్నారు.👉ఇదీ చదవండి: ప్రధాని మోదీతో పుతిన్ భేటీ -
రష్యా మంత్రికి మన సినిమాల్లో హీరో ఛాన్స్!.. గోయల్ సరదా ఆఫర్
‘‘మీరు ఒప్పుకుంటే.. త్వరలో మా సినిమాల్లో చూస్తామేమో’’ అంటూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. రష్యా మంత్రి ఆంటోన్ అలిఖానోవ్ను ఉద్దేశించి గోయల్ ఆ వ్యాఖ్య చేశారు. వృత్తి రీత్యా రాజకీయ నాయకుడు అయినప్పటికీ ఆయన లుక్, కటౌట్లు సినిమా హీరోలకు ఏమాత్రం తీసిపోదన్నట్లుగా ఉంటుంది. ఇదే విషయాన్ని మన మంత్రి ప్రస్తావించారు..ఇన్నోప్రామ్ ఇండియా 2026 కార్యక్రమంలో భారత్, రష్యా మధ్య పారిశ్రామిక, వాణిజ్య సంబంధాలపై చర్చ సందర్భంగా ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చోటుచేసుకున్నాయి. అలిఖానోవ్ చూడటానికి చాలా డ్యాషింగ్‌గా ఉన్నారని పేర్కొన్న గోయల్.. ఆయన బహుశా పొరపాటున రాజకీయాల్లోకి వచ్చారేమో అని వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య ఆడియోవిజువల్ సహకారాన్ని కూడా మరింత పెంచుకోవాలని, త్వరలోనే ఆయనను బాలీవుడ్ సినిమాలో చూడొచ్చేమోనని సరదాగా వ్యాఖ్యానించారు.2030 నాటికి 100 బిలియన్ డాలర్ల టార్గెట్అలిఖానోవ్కు గోయల్ ఇచ్చిన బాలీవుడ్ ఆఫర్ సరదా వ్యాఖ్యే అయినప్పటికీ.. ఆయనతో జరిగిన చర్చలు మాత్రం పూర్తిగా వ్యాపారపరమైనవే. భారత్–రష్యా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అలాగే రెండు దేశాల మధ్య పెట్టుబడులను 50 బిలియన్ డాలర్లకు పెంచే దిశగా చర్చలు జరుగుతున్నాయి.ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాణిజ్యం దాదాపు 60 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇది రికార్డు స్థాయిలో 68.7 బిలియన్ డాలర్లకు చేరింది. అయితే ఈ వాణిజ్యంలో భారత్ నుంచి రష్యాకు జరిగే ఎగుమతులు తక్కువగా ఉండగా.. రష్యా నుంచి భారత్‌కు దిగుమతులు భారీగా ఉన్నాయి.Bollywood calling? Piyush Goyal sees a movie star in Russia’s trade minister“Possibly we’ll see him starring in a movie in Bollywood very soon,” Goyal joked about Anton Alikhanov at the India–Russia Business Dialogue 2026. pic.twitter.com/yvRpLn26en— Sputnik India (@Sputnik_India) September 10, 2026పుతిన్ మెచ్చుకుని మరీ..ఆంటోన్ ఆండ్రేయెవిచ్ అలిఖానోవ్ 1986 సెప్టెంబర్ 17న సుఖుమిలో జన్మించారు. ప్రస్తుతం 40 ఏళ్ల వయసున్న ఆయన.. ఆర్థికశాస్త్రం, న్యాయశాస్త్రం చదివారు. రష్యా ప్రభుత్వంలో వివిధ బాధ్యతలు చేపట్టి రాజకీయాల్లో వేగంగా ఎదిగారు. 2016లో కేవలం 30 ఏళ్ల వయసులో కలినిన్‌గ్రాడ్ ప్రాంతానికి తాత్కాలిక గవర్నర్‌గా నియమితులై.. అప్పట్లో రష్యాలోనే అత్యంత పిన్న వయస్కుడైన రీజియనల్ లీడర్‌గా పేరు దక్కించుకున్నారు. 2017లో పూర్తిస్థాయి గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సమయంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంతో ఆయనకు సన్నిహిత అధికారిక సమన్వయం కొనసాగింది. 2024లో పుతిన్ ప్రభుత్వం ఆయనకు కీలకమైన పరిశ్రమలు, వాణిజ్య శాఖ బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుంచి రష్యా పారిశ్రామిక విధానాలు, విదేశీ వాణిజ్యంపై కీలక నిర్ణయాల్లో ఆయన భాగస్వామిగా ఉన్నారు.భారీగా వాణిజ్య లోటురష్యా నుంచి భారత్ ప్రధానంగా ముడిచమురు, ఇంధనం వంటి ఉత్పత్తులను పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటోంది. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్యంలో భారీ అసమతుల్యత(trade imbalance) ఉంది. దీన్ని తగ్గించేందుకు భారత్ నుంచి రష్యాకు వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు, టెక్స్టైల్స్ తదితరాల ఎగుమతులను పెంచాలని గోయల్ లక్ష్యంగా పెట్టుకున్నారు.ఇదే సమయంలో భారత్–యూరేషియన్ ఎకనామిక్ యూనియన్ (EAEU) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) చర్చలను వేగవంతం చేయాలని ఇరు పక్షాలు నిర్ణయించాయి. రష్యాతో పెట్టుబడులు, వాణిజ్య సంబంధాలను మరింత విస్తరించేందుకు ఈ ఒప్పందం కీలకంగా మారనుంది. పీయూష్ గోయల్ సెప్టెంబర్ 10న అలిఖానోవ్తో పాటు ఈఏఈయూ వాణిజ్య మంత్రి ఆండ్రే స్లెప్నెవ్తోనూ చర్చలు జరిపారు.రేర్ ఎర్త్స్, మైక్రోఎలక్ట్రానిక్స్పై దృష్టిఇరు దేశాల మధ్య సహకారాన్ని సంప్రదాయ వాణిజ్యానికి మాత్రమే పరిమితం చేయకుండా కొత్త రంగాలకు విస్తరించాలన్న దానిపైనా చర్చ జరిగింది. ముఖ్యంగా రేర్ ఎర్త్ మినరల్స్, మైక్రోఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ రంగాల్లో కలిసి పనిచేసే అవకాశాలను అలిఖానోవ్ ప్రస్తావించారు. రష్యాలో ఏపీఐ తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు భారత ఫార్మా కంపెనీలను ఆయన ఆహ్వానించారు.ఇలా ఇరు దేశాల మధ్య కీలకమైన వాణిజ్య, పారిశ్రామిక చర్చలు జరుగుతున్న వేళ.. అలిఖానోవ్ లుక్‌ను ప్రస్తావిస్తూ గోయల్ చేసిన ఒక్క సరదా వ్యాఖ్య మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది. వ్యాపార చర్చల మధ్య ‘‘బాలీవుడ్‌లోకి వస్తారా?’’ అంటూ గోయల్ చేసిన చమత్కారం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ ఆసక్తికరంగా మారింది.ఇదీ చదవండి: ఏఐతో ఎంతో ఈజీగా వినాశనం! -
రోబోట్ ను తోసేశాడు... రివర్స్ లో తన్ని తరిమింది! అంతా షాక్!
-
ఉక్రెయిన్ ఖజానా ఖాళీ... యుద్ధంతో దివాలా దిశగా..!
-
సైన్యంలో చేరమని ఒత్తిడి చేస్తున్నారని భార్య ఆవేదన
మాస్కో: రష్యా నుంచి ఓ భారతీయ మహిళ చేసిన విజ్ఞప్తికి భారత ప్రభుత్వం వెంటనే స్పందించింది. తన భర్తను అక్కడి పోలీసులు అక్రమంగా నిర్భందించారని అక్కడి సైన్యంలో చేరమని ఒత్తిడి చేస్తున్నారని సదరు మహిళ భారత్ ప్రభుత్వానికి ఎమెర్జెన్సీ కాల్ ద్వారా విజ్ఞప్తి చేసింది. దీనికి స్పందించిన భారత ప్రభుత్వం అతని విడుదల కొరకు రష్యాలోని భారత ఎంబసీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది.బాధితురైలైన మహిళ ఇన్‌స్టా వేదికగా భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వీడియో చేసింది. అందులో "తన భర్త ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన ఇంజనీర్ చందన్ గుప్తా, నోయిడాలోని కంపెనీ ద్వారా జారీ చేయబడిన 'అత్యంత అర్హత కలిగిన నిపుణుడి' వీసాపై మా కుటుంబం మాస్కోలో ఉంది. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో రష్యా పోలీసులు నా భర్తను అరెస్టు చేశారు. ఎలాంటి తప్పు చేయనప్పటికీ అతడిని జైలులో ఉంచారు. ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా పోరాడటానికి రష్యన్ సైన్యంలో చేరమని పోలీసులు తన భర్తపై ఒత్తిడి తెచ్చారు." అని సదరు మహిళ వీడియోలో ఆరోపించింది.రష్యన్ సైన్యంలో సిబ్బంది కొరత ఉందనే నెపంతో, భారతీయులతో సహా విదేశీయులను దేశ సాయుధ దళాలలోకి బలవంతంగా చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె పేర్కొంది. తన భావోద్వేగ విజ్ఞప్తిలో, ఆ దంపతులకు పదేళ్ల కుమారుడు ఉన్నాడని, ఈ పరిస్థితితో తమ కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైందని ఆమె తెలిపింది. తన భర్తను సురక్షితంగా విడుదల చేయించడానికి ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆమె భారత ప్రభుత్వానికి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ విషయమై రష్యాలోని భారత ఎంబసీతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.కాగా ఉక్రెయిన్- రష్యా మధ్య యుద్ధం మెుదలై దాదాపుగా నాలుగేళ్లు గడుస్తోంది. అయినప్పటికీ యుద్ధం ఇంకా ముగియలేదు. అయితే యుద్ధంలో పెద్దఎత్తున సైనికులు మృతిచెందడంతో రష్యాకు సైనికుల కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే రష్యా ఉద్యోగాల పేరుతో ఆశ చూపి భారతీయులను రష్యాకు రప్పించి, ఆ తర్వాత రష్యా సైన్యంలోకి చేర్చుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.భారత్ సైతం దీనిపై కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకూ మెుత్తంగా 227 మంది భారతీయులు రష్యా సాయుధ దళాలలోకి చేరారని, వారిలో 139 మందిని విడుదల చేయగా, 51 మంది మరణించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మిగిలిన భారతీయులను సైతం త్వరగా విడుదల చేసి, తిరిగి రప్పించేందుకు భారత్ రష్యా పక్షంతో సంప్రదింపులు కొనసాగిస్తోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. -
పుతిన్‌కు బిగ్ షాక్.. ఒడెసాలో సంచలన నిర్ణయం!
యుద్ధం తుపాకులతోనే కాదు.. ఇప్పుడు భాషతోనూ మొదలైంది! రష్యా దాడులతో అట్టుడుకుతున్న ఉక్రెయిన్‌లో రష్యన్ భాషపై ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశంలోని మూడో అతిపెద్ద నగరమైన ఒడెసాలో కళలు, సంగీతం, సాహిత్యంలో రష్యన్ భాషను బహిరంగంగా ఉపయోగించడాన్ని పూర్తిగా నిలిపివేయాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. రష్యన్ మాట్లాడేవారు అధికంగా ఉన్న ఈ నగరంలో ఈ నిర్ణయం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. దీంతో, పుతిన్‌కు బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది. వీధులు, పార్కులు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఆధ్వర్యంలోని కళా, వినోద ప్రదేశాల్లో రష్యన్ పాటలు, సాహిత్యాన్ని ప్రదర్శించకుండా చేయాలని ప్రతిపాదించారు. పబ్లిక్ లైబ్రరీల్లో రష్యన్ పుస్తకాలను ప్రముఖంగా ప్రదర్శించడంపైనా ఆంక్షలు రానున్నాయి. అయితే ఇళ్లలో లేదా ప్రైవేట్ ప్రదేశాల్లో వ్యక్తిగతంగా రష్యన్ మాట్లాడటంపై నిషేధం ఉండదు. రష్యన్ భాష ద్వారా మాస్కో తన సాంస్కృతిక ప్రభావాన్ని కొనసాగిస్తోందని ఉక్రెయిన్ భాషా ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా యువతపై రష్యన్ సంగీతం, సాహిత్యం ప్రభావాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.అయితే ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నవారు కూడా గట్టిగానే ఉన్నారు. రష్యన్ భాష కేవలం పుతిన్ భాష కాదని.. దొస్తొయెవ్స్కీ, బుల్గాకోవ్ వంటి ప్రముఖ రచయితల భాష కూడా అదే అని ఒడెసా హాస్య నటుడు బోరిస్ బార్స్కీ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ను ప్రేమించే రష్యన్ మాట్లాడేవారిని దూరం చేయడం వల్ల చివరకు లాభపడేది పుతిన్ మాత్రమేనని అన్నారు. ఉక్రెయిన్‌లో ఇప్పటికే విద్య, ప్రభుత్వ సేవలు, కస్టమర్ సర్వీసులు వంటి అనేక రంగాల్లో ఉక్రేనియన్ భాష వినియోగం తప్పనిసరిగా ఉంది.కాగా, 2022లో రష్యా పూర్తిస్థాయి దాడి ప్రారంభించిన తర్వాత చాలామంది రష్యన్ మాట్లాడే ప్రజలు ఉక్రేనియన్ భాష వైపు మారారు. ఇప్పుడు ఒడెసాలో రష్యన్ భాషపై కొత్త ప్రతిపాదనకు కౌన్సిల్ ఆమోదం లభిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. రష్యా ప్రభావాన్ని తుడిచేయడమా.. లేక భాషా స్వేచ్ఛను కాపాడడమా? అనే ప్రశ్నతో ఒడెసాలో రాజకీయ, సాంస్కృతిక పోరు మరింత ముదురుతోంది.ఇదీ చదవండి: కోర్టు సంచలన తీర్పు.. టీవీ యాంకర్‌కు ఉరిశిక్ష -
రష్యాలో అమెరికా ప్రతినిధులు.. యుద్ధంపై పుతిన్ కీలక నిర్ణయం
మాస్కో: ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ లభించింది. మూడురోజుల పాటు ఉక్రెయిన్‌పై ఎటువంటి దాడులు చేయవద్దని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశించినట్లు మాస్కో ప్రకటించింది. ఉక్రెయిన్ యుద్ధంపై చర్చల నేపథ్యంలో అమెరికా ప్రతినిధులు రష్యా వచ్చిన నేపథ్యంలో పుతిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీంతో గత కొంతకాలంగా ఇరు దేశాల మధ్య మారణహోమం జరిగిన నేపథ్యంలో ఎట్టకేలకు కొంతమేర ఊపశమనం లభించింది.ఉక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధంపై చర్చలకు అమెరికా ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ శనివారం మాస్కో చేరుకున్నారు. వారిద్దరితో యుద్ధం అంశమై పుతిన్ చర్యలు జరపనున్నట్లు క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ శనివారం (ఈ రోజు) అర్ధరాత్రి నుంచి మూడు రోజుల పాటు కీవ్‌పై ఎలాంటి దాడులు జరపకూడదని పుతిన్ ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అయితే చర్చలు ముగిసిన అనంతరం ఆ వివరాలను మీడియాకు వెల్లడిస్తామని పేర్కొన్నారు.మాస్కో చేరుకున్న అమెరికా ప్రతినిధులుకాగా గత కొంతకాలంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధ అంశాన్ని అమెరికా పట్టించుకోవడం లేదు. ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో ఈ అంశంపై ట్రంప్ ఆసక్తి కనబరచలేదు. దీంతో చర్చలను మరోసారి ముందుకు తీసుకెళ్లేందుకు అమెరికా యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ శనివారం మాస్కో చేరుకున్నారు. వీరికి రష్యా అధ్యక్షుడి ప్రత్యేక ప్రతినిధి కిరిల్ దిమిత్రియెవ్.. మాస్కో విమానాశ్రయంలో స్వాగతం పలికారు.యుద్దంపై ట్రంప్ ప్రకటన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ అంశమై మాట్లాడుతూ యుద్ధానికి ముగింపు పలికేందుకు వాషింగ్టన్ వద్ద తాజాగా ఒక స్పష్టమైన ప్రతిపాదన ఉందని తెలిపారు.కాగా ఈ పర్యటన అనంతరం అమెరికా ప్రతినిధులు రేపు ఆదివారం అమెరికా ప్రతినిధులు మాస్కో పర్యటన ముగించుకుని ఆదివారం ఉక్రెయిన్‌కు వెళ్లనున్నట్లు సమాచారం -
Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?
-
పాకిస్తాన్‌కు వెళ్తున్న రష్యా నౌకపై డ్రోన్ దాడి.. అందులో23 మంది భారతీయులు
రష్యా నుంచి పాకిస్తాన్‌లోని కరాచీకి వెళ్తున్న ఓ నౌకపై (ఎంవీ బేరియన్) డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో నౌకలోని సిబ్బంది నివాస ప్రాంతం దెబ్బతినడంతో మంటలు చెలరేగాయి. దాడి సమయంలో నౌకలో 23 మంది భారతీయ నావికులు ఉన్నారు. వారంతా సురక్షితంగా బయటపడ్డారని తెలుస్తోంది. నౌక సమీపంలో మరో డ్రోన్ కూడా కనిపించినట్లు సమాచారం.హోర్ముజ్ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతఅమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతంలో వాణిజ్య నౌకల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లో నౌకాయానానికి ముప్పు పెరిగింది.డ్రోన్ దాడులు, నౌకలపై దాడుల ముప్పు, సముద్ర మార్గాల్లో అంతరాయాల కారణంగా అంతర్జాతీయ షిప్పింగ్ సంస్థలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. హర్మూజ్ వద్ద పరిస్థితి మరింత దిగజారితే ప్రపంచవ్యాప్తంగా చమురు, సహజ వాయువు సరఫరాలపై భారీ ప్రభావం పడే అవకాశం ఉంది.స్పష్టత లేదుఎంవీ బేరియన్పై జరిగిన డ్రోన్ దాడి హర్మూజ్ జలసంధిలో జరిగిందా, లేక దాని సమీపంలో జరిగిందా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.నౌకపై దాడి జరిగిన ఖచ్చితమైన ప్రదేశాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు.చదవండి: అమెరికాలో డీజిల్ ధరలు ఆల్‌టైమ్ హై -
చమురు కొనడం ఆపితే యుద్ధం ఆగదు
కీవ్ :రష్యా నుంచి చమురు కొనకపోవడం వల్ల ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం ఆగే పరిస్థితులు లేవని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. దీర్ఘకాలికంగా జరుగుతున్న ఈ ఘర్షణను ఆపాలంటే ఇరు దేశాలు దౌత్యం, చర్యల సంప్రదింపుల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో పరోక్షంగా అమెరికా, ఉక్రెయిన్లకు చురకలింటించారు.ఉక్రెయిన్ పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడిన నేపథ్యంలో 140 కోట్ల మందికి ఇంధనాన్ని అందించడంలో ఉన్న సవాళ్లను అర్థం చేసుకోవాలన్నారు. చమురు కొనుగోళ్ల విషయంలో ఉక్రెయిన్‌కు స్పష్టంగా దృక్కోణం ఉంటుందని దానిని భారత్ గౌరవిస్తుందని అదే విధంగా భారత్ దృక్కోణాన్ని సైతం ఇతరులు గౌరవించాలని ఆశిస్తున్నట్లు జైశంకర్ పేర్కొన్నారు.ఆయన మాట్లాడుతూ "యుద్దం ఐదవ సంవత్సరంలోకి అడుగుపెడుతుంది. ఎవరో చమురు, అల్యూమినియం, ఖనిజాలు, లోహాలు లేదా ఎరువులు కొనడం లేదా కొనకపోవడం వల్ల పరిష్కారం కాదు. ఈ వివాదం చర్చలు, దౌత్యం, సంప్రదింపుల ద్వారానే పరిష్కారమవుతుంది," అని అన్నారు. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహాతో భేటీ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.కాగా గత నెలలో అధిక పన్నుల చట్టాన్ని చట్ట సభల్లో ప్రవేశపెట్టారు. రష్యా నుండి చమురు, గ్యాస్‌ను దిగుమతి చేసే దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించే బిల్లును అమెరికా సెనేట్ లో ప్రవేశ పెట్టారు. అనంతరం దీనికి సెనేట్ ఆమోదం తెలిపింది. ఈ వాణిజ్యం మాస్కో ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇస్తుందని, సైనిక కార్యకలాపాలకు నిధులు సమకూర్చడంలో సహాయపడుతుందని అధిక పన్నులు విధిస్తున్నట్లు అమెరికా తెలిపింది. చమురు దిగుమతులుకాగా యుద్ధం ప్రారంభానికి ముందు (2021) వరకు, భారతదేశ ముడి చమురు దిగుమతులలో రష్యా చమురు వాటా కేవలం 0.2 శాతంగా మాత్రమే ఉండేది. అయితే, 2022 ఫిబ్రవరిలో రష్యా దాడి చేసిన తరువాత, పాశ్చాత్య దేశాలు మాస్కోను బహిష్కరించడంతో తక్కువ ధరకు లభించే రష్యా ముడి చమురుకు న్యూఢిల్లీ అతిపెద్ద కొనుగోలుదారుగా మారింది.భారతదేశం తన ముడి చమురులో సుమారు 88 శాతాన్ని విదేశాల నుండి కొనుగోలు చేస్తుంది, దీనిని పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలుగా మారుస్తారు. అందులో మూడింట ఒక వంతు రష్యా నుండే వస్తుంది. భారతదేశ ముడి చమురు దిగుమతులలో 40 శాతానికి పైగా ఉంటుంది. క్లెప్లర్ డేటా ప్రకారం, ఆగస్టులో భారతదేశం రష్యా నుండి రోజుకు సుమారు 2.1 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకుంది. -
లీప్జిగ్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి..
వార్సా: లీప్జిగ్ విమానాశ్రయంపై ఆగస్ట్ 4వ తేదీన రష్యా డ్రోన్ దాడికి యతి్నంచిందన్న జర్మనీ ఆరోపణ తీవ్ర దుమారం రేపింది. ఈ ఆరోపణను తీవ్రంగా ఖండించిన రష్యా..మరో అడుగుముందుకేసి, తమ దేశంలోని జర్మన్ సాంస్కృతి కేంద్రాలను మూసివేయాలని ఆదేశించింది. మాస్కోతోపాటు సెయింట్ పీటర్స్బర్గ్, ఎక్తెరినాబర్గ్ నగరాల్లోని గోతె ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నడిచే కల్చరల్ సెంటర్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ బుధవారం చెప్పారు. బదులుగా, బాన్‌లోని రష్యా కాన్సులేట్, బెర్లిన్‌లోని రష్యన్ హౌస్ కల్చరల్సెంటర్ను కూడా తాము మూసివేస్తున్నట్లు జర్మనీ ప్రకటించింది. గురువారం మ్యూనిక్‌లో రక్షణ రంగ సంస్థల సముదాయం పక్కన నిర్మాణంలో ఉన్న భవనంపై గుర్తు తెలియని వస్తువులను విసిరేయగా, అవి మండిపోయాయని జర్మనీ తెలిపింది. ఇది రష్యా పనేనని ఆరోపించింది. తమపై నిత్యం రష్యా ఇలాంటి వాటికి పాల్పడుతోందని పేర్కొంది. కాగా, లీప్జిగ్ విమానాశ్రయంపై దాడికి నిరసనగా లండన్‌లోని రష్యా రాయబారికి యూకే ప్రభుత్వం గురువారం నోటీసు పంపింది. పోలెండ్, డెన్మార్క్, ఫిన్లాండ్, చెక్ రిపబ్లిక్, లిథువేనియా కూడా తమ దేశాల్లోని రష్యా బారులకు నోటీసులు పంపాయి. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన రష్యాతో ఇప్పటికే దాదాపుగా యూరప్ దేశాలన్నీ తెగదెంపులు చేసుకున్న వేళ చోటుచేసుకున్న ఈ పరిణామం, మరిన్ని చర్యలకు దారి తీయనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రష్యా తీరుపై ఇప్పటికే భయపడుతున్న యూరప్ దేశాలు ముందస్తు భద్రతా చర్యలను మొదలుపెట్టాయి. గురువారం ఫిన్లాండ్ రాజధాని హెల్సింకిలో 2 వేల మంది పౌర రక్షణ విన్యాసాల్లో పాలుపంచుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో చేపట్టిన అతి పెద్ద విన్యాసంగా దీనిని భావిస్తున్నారు. రష్యా తమ ఆయుధ కంపెనీలు, వివిధ సంస్థలను లక్ష్యంగా చేసుకుంటోందని డెన్మార్క్ సైతం ఆరోపిస్తోంది. 7 -
సముద్ర రవాణా ఇక ఆర్కిటిక్ వైపు?
ప్రపంచ సగటుతో పోలిస్తే వేగంగా పెరుగుతున్న ఆర్కిటిక్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, గ్రీన్ లాండ్‌ను వశం చేసుకుంటామనే ట్రంప్ బెదిరింపులు, అసాధారణ స్థాయిలో కరిగిపోతున్న మంచు; రష్యా, ఇరాన్లపైన అమెరికా ఆర్థిక యుద్ధం క్రమంగా ప్రపంచ దేశాలను ఆర్కిటిక్ సముద్ర జలాల వైపు నడిపిస్తున్నాయి. అమెరికా నాయకత్వంలోని పాశ్చాత్య దేశాల అదుపాజ్ఞలలో ఉన్న హార్మూజ్, బాబెల్ మాండెబ్, సూయెజ్, మలక్కా జలసంధుల నుండి దూరంగా సురక్షిత ఆర్కి టిక్ సముద్ర మార్గం గుండా సరకుల రవాణాకు రష్యా, చైనా పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నాయి. ఆసియా, ఐరోపాలను కలిపే కేప్ ఆఫ్ గుడ్‌హోప్, సూయెజ్ కాలువ మార్గాలలో అశాంతి, అనిశ్చిత స్థితి వలన అందరి చూపు ఆర్కిటిక్ వైపు మళ్లింది. ప్రపంచ సగటుతో పోల్చితే ఆర్కిటిక్ సముద్రంలో ఉష్ణోగ్రతలు మూడు నుండి నాలుగు రెట్లు వేగంగా పెరుగుతున్నాయి. దీనినే పర్యావరణ శాస్త్రజ్ఞులు ‘ఆర్కిటిక్ ఆంప్లిఫికేషన్ ’గా అభివర్ణిస్తున్నారు. పారిశ్రామిక విప్లవానికి ముందు ఉష్ణోగ్రతల కంటే ఐరోపాలో 2.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరిగితే ఆర్కిటిక్ సముద్రంలో 3.3. డిగ్రీల సెల్సియస్ పెరిగింది. గత సంవత్సరంలో అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఆర్కిటిక్‌లో 5.8 శాతం మంచుపొర క్షీణించింది. వేగంగా క్షీణిస్తున్న మంచుపొర ఆర్కిటిక్ జలాలను నౌకాయానానికి మరింత అనుకూలంగా చేస్తున్నది. రష్యాకు సానుకూలంఆర్కిటిక్ జలాలలో మూడు ప్రధాన నౌకా మార్గాలున్నాయి. అవి. 1. నైరుతి మార్గం 2. వాయవ్య మార్గం 3. ధ్రువ ప్రాంతం మీదుగా వెళ్లే (ట్రాన్స్ పోలార్) మార్గం. కెనడా తీరంలోని వాయవ్య మార్గంలో అనువైన రేవు పట్టణాలు లేవు. అందువలదన ఈ ప్రాంతంలో కేవలం విహార యాత్రికుల క్రూయిజ్ షిప్పులు, పరిశోధనా నౌకలు మాత్రమే సంచరిస్తున్నాయి. ఉత్తర ధ్రువాన్ని ఆనుకుని ఉన్న ట్రాన్స్పోలార్ మార్గం పూర్తిగా మంచుతో కప్పబడి నౌకాయానానికి ఏ మాత్రం వీలుగా లేదు. ప్రస్తుత ప్రపంచ దృష్టి అంతా రష్యా తీరంలోని నైరుతి ఆర్కిటిక్ సముద్ర మార్గంపైననే ఉన్నది. రష్యా తీరంలో ముర్మన్స్క్నుండి వ్లాదివోస్తోక్ మధ్యలో 70కి పైగా రేవు పట్టణాలు ఉన్నాయి. ముర్మన్స్క్ రేవు పట్టణం సంవత్సరం పొడవునా అందుబాటులో ఉంటుంది. రష్యన్ న్యూక్లియర్ ఐస్ బ్రేకర్ నౌకాదళ ప్రధాన కార్యాలయం ఇక్కడనే ఉన్నది. 2025లో ఈ ఆర్కిటిక్ సముద్ర మార్గం గుండా 37 మిలియన్ టన్నులుగా ఉన్న రవాణా 2026లో ఇప్పటికే 40 మిలియన్ టన్నులకు చేరింది. ఈ రవాణా ప్రధానంగా రష్యన్ చమురు, గ్యాస్ ఎగుమతుల రూపంలో ఉన్నది. యామాల్ ద్వీపకల్పంలోని నోవాటెక్ చమురు క్షేత్రాలలో ఉత్పత్తి అవుతున్న చమురు, సహజవాయువులను ఈ మార్గం గుండా చైనాకు ఎగుమతి చేస్తున్నారు. రష్యా–చైనా మధ్య గత సంవత్సరం 103 నౌకలు ఈ మార్గంలో ప్రయాణించాయి. ఈ మార్గంలో చమురు ట్యాంకర్లే కాకుండా క్రమంగా సరకుల రవాణా చేసే భారీ కంటెయినర్ కార్గో షిప్పుల ప్రయాణం కూడా ప్రారంభమైంది. 2023లో 7 కంటెయినర్ షిప్పులు ప్రయాణిస్తే ఈ సంవత్సరం ఇప్పటికే 30 కంటెయినర్ షిప్పులు ప్రయాణించాయి.చైనా వడి వడి అడుగులుచైనా వ్యూహాత్మకంగా ఆర్కిటిక్ సముద్ర మార్గంపై అమితా సక్తిని చూపిస్తున్నది. చైనాకు ఆర్కిటిక్ తీరం లేదు. 2013లో ఆర్కిటిక్ కౌన్సిల్లో అబ్జర్వర్‌గా చేరింది. 2017లో చైనా తన ప్రతిష్ఠాత్మక బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బీఆర్ఐ) పథకాన్ని ఆర్కిటిక్‌కు విస్తరిస్తూ ‘పోలార్ సిల్క్ రోడ్’ను ప్రతిపాదించింది. 2018లో ఆర్కిటిక్ విధాన శ్వేతపత్రంలో చైనా తనను తాను ‘నియర్ ఆర్కిటిక్ స్టేట్’గా అభివర్ణించుకున్నది. ఆర్కిటిక్ సముద్ర జల మార్గంలో 2024లో 15 చైనా నౌకలు ప్రయాణించగా, వాటి సంఖ్య 2026 నాటికి 30కి పైగా చేరింది. చైనాలో నింగ్బో నుండి కంటె యినర్ షిప్పులు సూయెజ్ కాలువ గుండా ప్రయాణిస్తే యూకేలోని అతిపెద్ద కంటెయినర్ టర్మినల్ ఫీలిక్స్స్టోవే చేరటానికి 40 రోజులు పడుతుంది. ఆర్కిటిక్ సముద్ర మార్గంలో నింగ్బో నుండి ఫీలిక్స్ స్టోవేకు 20 రోజుల్లో చేరుతున్నారు. చైనాకు చెందిన సీవోఎస్సీవో (కాస్కో) ఈ మార్గంలో కంటెయినర్ రవాణాను చేపట్టింది. నౌకల రవాణాను సుగమం చేయటానికి చైనా ఆర్కిటెక్ జలాలలోకి గ్జ్యూ లాంగ్, గ్జ్యూ లాంగ్–2 ఐస్‌బ్రేకర్ షిప్పులను ప్రవేశపెట్టింది. 2025లో రష్యా, చైనా ఆర్కిటిక్ సముద్ర రవాణాలో పరస్పరం సహకరించుకోవటానికి ఒప్పందం కుదుర్చుకొన్నాయి.అంతర్జాతీయంగా రష్యన్ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేయటానికి రష్యాపై అమెరికా తీవ్ర ఆంక్షలను విధించింది. అంతర్జాతీయ నెఫ్ట్ చెల్లింపుల వ్యవస్థ నుండి రష్యాను బహిష్కరించింది. అయి నప్పటికీ చైనా, భారత్, ఇరాన్ వంటి దేశాలతో లావాదేవీల ద్వారా రష్యా తన వాణిజ్యాన్ని కొనసాగిస్తున్నది. ఆర్కిటిక్ జలాలలో రష్యా–చైనా వ్యూహాలను అమెరికా, ఐరోపాలు నిశితంగా గమనిస్తున్నాయి. ప్రస్తుతం రష్యన్ ఆర్కిటిక్ ఎకానమీ, రష్యన్ జీడీపీలో పది శాతం కంటే తక్కువగానే ఉన్నది. కానీ రానున్న 20 సంవత్సరాలలో ఇది 60 శాతానికి చేరినా ఆశ్చర్యపడనవసరం లేదు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ గ్రీన్ లాండ్ వివాదాన్ని భుజాలకెత్తుకున్నాడు. ఆర్కిటిక్ జలాలలో రష్యా–చైనా లపై నిఘా వేయటానికి గ్రీన్ లాండ్ కీలకం. అందుకే గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో అంతర్భాగం చేయాలని పట్టు బడుతున్నాడు. 2026 ఫిబ్రవరిలో నాటో ‘ఆపరేషన్ ఆర్కిటిక్ సెంట్రీ’ని ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఆర్కిటిక్ జలా లపై నాటో బలగాలు గట్టి నిఘాను పెడుతున్నాయి. అయితే ఆర్కిటిక్ రష్యాను ఎదుర్కొనే నౌకాశక్తిగానీ, ఐస్ బ్రేకింగ్ షిప్పుల సామ ర్థ్యాలుగానీ, యూఎస్, నాటోలకు లేవు. అదే రకంగా రష్యాకూ పరిమితులున్నాయి. రష్యా మీద ఆంక్షల వలన పాశ్చాత్య షిప్పింగ్ కంపెనీలు, బీమా కంపెనీలు ముందుకు రాకపోవడంతో ఆర్కిటిక్ ప్రపంచ రవాణా మార్గంగా అభివృద్ధి చెందటం కష్టం.భారత్ కార్యకలాపాలు1920 స్వాల్బార్డ్ ఒప్పందంపై సంతకం చేయటం ద్వారా భారత్ ఆర్కిటిక్ వైపు అడుగులు వేసింది. 2007లో తన మొదటి పరిశోధనా/ అన్వేషణ నౌకను ఆర్కిటిక్‌కు పంపించింది. 2013లో ఆర్కిటిక్ కౌన్సిల్లో అబ్జర్వర్‌గా చేరింది. 2022లో ఆర్కిటిక్ పాలసీని ప్రకటించింది. శాస్త్ర–వైజ్ఞానిక అంశాల లక్ష్యంగా ఉన్న ఆర్కిటిక్ సముద్ర జలాలను భారత్ 2022 తర్వాత వనరులు, ఆర్థిక లక్ష్యాలు, వ్యూహాత్మక కోణంలో నుండి పరిశీలించటం ప్రారంభించింది. 2024లో చెన్నై–వ్లాదివోస్తోక్ మార్గాన్ని ‘ఈస్టర్న్ మారిటైమ్ కారిడార్’గా అభివృద్ధి చేయటానికి రష్యాతో ఒప్పందం కుదుర్చు కున్నది. రష్యన్ ఆర్కిటిక్ తీరంలో ప్రాజెక్టుల అభివృద్ధికి ఒక బిలియన్ డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్‌ను ఏర్పాటు చేసింది. వచ్చే సంవ త్సరం (2027)లో మొట్టమొదటి భారతీయ రవాణా నౌక ఆర్కిటిక్ జలాలలో ప్రయాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గురజాల శ్రీనివాసరావు వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
ఉక్రెయిన్‌పై కొనసాగిన దాడుల పర్వం
కీవ్: ఉక్రెయిన్ లక్ష్యంగా రష్యాసేనల దాడు లు బుధవారమూ కొనసాగాయి. దీంతో డినిప్రో నగరంలోని పలు అపార్ట్మెంట్ భవంతులు దాడులతో దద్దరిల్లాయి. బుధ వారం రష్యా జరిపిన 174 డ్రోన్ దాడులు, రెండు క్షిపణి దాడుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు తీవ్రంగా గాయ పడ్డారు. యుద్ధం మొదలై నాలుగేళ్లు పూర్త యినా ఇరు దేశాల మధ్య దాడుల తీవ్రత ఏమాత్రం తగ్గట్లేదు. తూర్పు, దక్షిణ ఉక్రెయి న్ ప్రాంతాల్లో యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. సయోధ్యకు అమెరికా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సానుకూల ఫలితాలు కనుచూపు మేరలో కన్పించట్లేవు. మరోవైపు మంగళవారం అర్ధరాత్రి తదుపరి దాడులు భీకరంగా ఉంటాయని అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్ పరస్పరం హెచ్చరికలు చేసుకోవడం గమనార్హం. ‘‘రష్యా గగనత లంలో ప్రయాణించే విదేశీ ఎయిర్‌లైన్స్ సంస్థల విమానాలకు దాడులు ముప్పు పెరగొచ్చు. ఎందుకంటే ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి డ్రోన్ దాడులతో పరిస్థితి మారుతోంది. శాంతి చర్చలకు ముందుకొచ్చేలా రష్యాపై ఒత్తిడి పెంచడమే మా లక్ష్యం’’ అని జెలెన్స్కీ అన్నారు. దీనిపై పుతిన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ఇది ప్రభుత్వ ప్రయోజిత ఉగ్రవాదంలా ఉంది. ఇలాంటి ఉగ్రవాదులతో మేం చర్చలు జరపబోం’’ అని అన్నారు. పుతిన్ వ్యాఖ్యలను ఉక్రెయిన్‌లోని తప్పుడువార్తలను ఖండించే ప్రభుత్వ విభాగం తప్పుబట్టింది. ‘‘రష్యానే ఏకపక్షంగా ఈ యుద్ధం మొదలెట్టింది. రోజూ ఉక్రెయిన్ అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతోంది. తీరా ఇప్పుడేమో మమ్మల్ని ఉగ్రవాదులు అంటోంది. తమను బాధిత దేశంగా చిత్రీకరించుకునే కుట్ర ఇది’’ అని ఆ విభాగం తూర్పారబట్టింది. ‘‘ఉక్రెయిన్ బెదిరింపులకు బెదరబోం. మా గగనతల రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తాం. విమానాల రాకపోకలకు యతాతథంగా సాగుతాయి’’ అని రష్యా రవాణా మంత్రి ఆండ్రీ నికితిన్ తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్ దాడులతో బెల్గార్డ్ సరిహద్దు ప్రాంతంలో ఇద్దరు చనిపోయారని రష్యా రక్షణ శాఖ బుధవారం తెలిపింది. 130 డ్రోన్లను కూల్చేశామని వెల్లడించింది. -
పుతిన్ ధీమా.. ఉక్రెయిన్‌పై బిగ్ స్టేట్మెంట్
ఉక్రెయిన్‌పై యుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి చర్చలకు మాస్కో ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని అన్నారాయన. అయితే వ్లాదిమిర్ జెలెన్స్కీ నేతృత్వంలోని ఉక్రెయిన్ నాయకత్వాన్ని ‘ఉగ్రవాదులు’గా అభివర్ణిస్తూ.. వారితో చర్చలు జరపడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు ముగిసిన తర్వాత మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా దూసుకెళ్తోందని పుతిన్ ప్రకటించారు. రష్యా సేనల పురోగతి వేగం పెరిగిందని, ఉక్రెయిన్ బలగాలు త్వరలో కుప్పకూలుతాయని ధీమా వ్యక్తం చేశారు. జెలెన్స్కీ ఉన్నంతకాలం శాంతి చర్చలు జరగడం అనుమానమే అని వ్యాఖ్యానించారాయన. చర్చలనేవి జరిగితే.. ఉక్రెయిన్ నాయకత్వం మారిన తర్వాతే అనే సంకేతాలు ఇచ్చారు.ముందుకు దూసుకెళ్తున్నాం..ఆగస్టులో డొనెట్స్క్ ప్రాంతంలో 270 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నామని పుతిన్ ఈ సందర్భంగా ప్రకటించారు. రష్యా సైన్యం చాకచక్యంగా 4,500–4,800 మంది, మరో 2,000 మంది ఉక్రెయిన్ సైనికులతో కూడిన రెండు బృందాలను చుట్టుముట్టిందని పేర్కొన్నారు. స్లోవియాన్స్క్, క్రామటోర్స్క్ నగరాల వైపు రష్యా బలగాలు ముందుకు సాగుతున్నాయని చెప్పారు. ఈ వాదనలను స్వతంత్రంగా నిర్ధారించలేదని రాయిటర్స్ తెలిపింది.‘డ్రోన్లతో ఉగ్రవాదం’రష్యాలోకి ఉక్రెయిన్ జరుపుతున్న డ్రోన్ దాడులను పుతిన్ తీవ్రంగా తప్పుబట్టారు. ఉగ్రవాదం మరో స్థాయికి చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపించారు. రష్యా చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులతో నష్టం జరిగినట్లు తొలిసారిగా అంగీకరించిన ఆయన.. తమ రిఫైనరీల్లో కేవలం 10 శాతం మాత్రమే మరమ్మతులు అవసరమని చెప్పారు.చర్చలకు ఓకే.. కానీ!యుద్ధాన్ని పూర్తిగా ముగించే ఉద్దేశంతో జరిగే చర్చలకు రష్యా సిద్ధంగా ఉందని పుతిన్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతినిధులతో చర్చలకు కూడా తాము వ్యతిరేకం కాదన్నారు. అయితే చర్చల ప్రక్రియను సాగదీస్తూ కాలయాపన చేయడం మాత్రం అంగీకరించబోమని స్పష్టం చేశారు.కొత్త సైనిక సమీకరణ ఉండదురష్యాలో మరోసారి సైనిక సమీకరణ చేపట్టాల్సి వస్తుందన్న ప్రచారాన్ని పుతిన్ కొట్టిపారేశారు. అదంతా ‘పచ్చి అర్ధంలేని మాటలు’ అని వ్యాఖ్యానించారు. రష్యా సైనిక పరిస్థితి బలంగానే ఉందన్న సందేశాన్ని పుతిన్ తాజా వ్యాఖ్యల ద్వారా ఇచ్చారు. -
విమానాశ్రయంపై దాడి.. రష్యాపై జర్మనీ ఆరోపణ
లైప్జిగ్ విమానాశ్రయంపై గత నెల జరిగిన డ్రోన్ దాడి వెనుక రష్యా ఉందని జర్మనీ ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు 4న పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్‌ను విమానాశ్రయంలో గుర్తించారు. అది పేలకపోవడానికి డిటోనేటర్‌లో లోపమే కారణమని దర్యాప్తులో తేలింది.మరో డ్రోన్ సమీపంలోని ఉక్రెయిన్ కార్గో విమానాన్ని ఢీకొన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. 10 రోజుల తర్వాత విమానాశ్రయం సమీపంలో మూడో డ్రోన్‌ను కూడా గుర్తించారు.ఈ దాడి యూరప్‌లో రష్యా చేపడుతున్న హైబ్రిడ్ ఆపరేషన్లకు నమూనాలా ఉందని జర్మనీ అంతర్గత వ్యవహారాల మంత్రి అలెగ్జాండర్ డోబ్రిండ్ట్ తెలిపారు. పరికరాల పరిశీలన, నిఘా సమాచారంతో రష్యా ప్రమేయానికి ఆధారాలు లభించాయని ఆయన చెప్పారు.అయితే రష్యా ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. బెర్లిన్‌లోని రష్యా రాయబార కార్యాలయం ఆరోపణలను అసంబద్ధమైనవిగా పేర్కొంది.రష్యాపై జర్మనీ కీలక చర్యలువిమానాశ్రయంపై దాడిలో రష్యా ప్రమేయం నేపథ్యంలో బాన్‌లోని రష్యా కాన్సులేట్‌ను మూసివేయాలని జర్మనీ విదేశాంగ మంత్రి జోహాన్ వేడ్‌ఫుల్ ప్రకటించారు. బెర్లిన్‌లోని రష్యన్ హౌస్ ఒప్పందాన్ని కూడా రద్దు చేయనున్నట్లు తెలిపారు. చదవండి: అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులు -
విస్తరణ చాలదు... బలపడాలి!
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దూకుడుతో అన్ని దేశాలూ కొత్త కొత్త దారులు వెదుక్కుంటున్నాయి. ఉన్న కూటములు విస్తరిస్తున్నాయి. సైనిక సహకార ఒప్పందాలు పుట్టుకొస్తున్నాయి. మంగళవారం ముగిసిన రెండు రోజుల షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశాలు దీన్నే నిరూపించాయి. 2001లో అయిదు సభ్యదేశాలతో మొదలైన ఆ సంస్థ 2017లో మనదేశంతోపాటు పాకిస్తాన్‌ను కూడా చేర్చుకోగా... 2023లో ఇరాన్, ఆ మరుసటి ఏడాది బెలారస్ కూడా సంస్థలోకి ప్రవేశించాయి. ఈసారి తుర్కియే, అజర్బైజాన్, ఆర్మేనియా, మంగోలియా, లావోస్, టోగో, నేపాల్, మాల్దీవులు, బహ్రెయిన్, శ్రీలంక తదితర 14 దేశాలు ‘సంభాషణ భాగస్వాములు’గా ఇందులో పాలుపంచుకున్నాయి. ఎస్సీఓ పాతికేళ్ల ప్రస్థానాన్ని జాగ్రత్తగా గమనిస్తే అది క్రమేపీ రష్యా పరిధినుంచి చైనా పరిధిలోకి జారుకుంటున్నదన్న అభిప్రాయం కలుగుతుంది. ఇప్పటికైతే మధ్య ఆసియాలోని పూర్వపు సోవియెట్ ప్రాంతాలైన కజఖ్‌స్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, తుర్కుమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్లు భద్రత, సంస్కృతి, సంస్థాగత, వ్యూహాత్మక అంశాల్లో ఇంకా రష్యాకు సాన్నిహిత్యంగానే ఉన్నాయి. అది కొనసాగుతుంది కూడా. కానీ మరోపక్క ఈ దేశాల్లో చైనా ఆర్థిక ప్రాబల్యం పెరుగుతోంది. అది ఈసారి సమావేశాల్లో బాహాటంగానే కనబడింది. చైనాను పశ్చిమాసియా, యూరప్, పశ్చిమాసియాలతో అనుసంధానించే బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్(బీఆర్ఐ) బృహత్తర ప్రాజెక్టు ద్వారా వచ్చే రోడ్లు, రైల్వేలు, పైప్లైన్లు, పోర్టులు వగైరాలు తమ ప్రాంత ఆర్థిక చిత్రాన్ని సమూలంగా మార్చేస్తాయని ఆ దేశాలు భావిస్తున్నాయి. చైనా వీటికి ఆయుధ సామగ్రి విక్రయాన్ని కూడా మొదలెట్టింది. అసలే ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉండే రష్యా ఉక్రెయిన్‌తో యుద్ధానికి దిగి మరింత నష్టపోయింది. ఈ దశలో చైనాతో భాగస్వామ్యం కలిసొస్తుందని పూర్వపు సోవియెట్ దేశాలు భావించటంలో వింతేమీ లేదు. ఇప్పుడున్న అంతర్జాతీయ పరిస్థితుల్లో ఈ విషయంలో చైనాతో విభేదించే ఓపిక, తీరిక రష్యాకు లేవు. అందుకే ఈ పరిణామాలను మౌనంగా వీక్షిస్తోంది. ఈ నేపథ్యంలో మన దేశం కూడా ఆచితూచి అడుగేయటం అవసరం. ప్రధాని నరేంద్ర మోదీ సెక్యూరిటీ (భద్రత), కనెక్టివిటీ (అనుసంధానం), ఆపర్చ్యునిటీ (అవకాశం) అనే మూడుస్తంభాలుగా ఎస్సీఓ దేశాలమధ్య సహకారం పటిష్టపడాలనీ... అది కొలవగలిగే ఫలితాల సాధన దిశగా ఉండాలనీ సదస్సులో పిలుపునివ్వటం గమనించదగింది. చైనా మాదిరే ఆ సంస్థ ఛత్రఛాయలో మనం కూడా ఎదగటానికి, ఆర్థికంగా విస్తరించటానికి మరింతగా ప్రయత్నించాల్సి వుంది. ఇందుకు అవరోధాలు తక్కువేం లేవు. సంస్థలోని రెండు సభ్య దేశాలు రష్యా, ఇరాన్ యుద్ధాల్లో కూరుకుపోయాయి. వాటితో ఒప్పందాలు కుదుర్చుకునే దేశాలపై అమెరికా ఆంక్షల కత్తి వేలాడుతోంది. భారత్, పాకిస్తాన్ మధ్య వైరం అలాగే ఉంది. అమెరికా ఒత్తిళ్ల కారణంగా ఇరాన్ నుంచి మన దేశం చమురు కొనుగోళ్లను గణనీయంగా తగ్గించుకుంది. ఏడేళ్ల తర్వాత ఇటీవలే ముడి చమురు దిగుమతి చేసుకుంది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో రాగల కాలంలో ఆ దేశంతో మరిన్ని రంగాలకు వాణిజ్యాన్ని విస్తరించదల్చుకున్నట్టు మోదీ చెప్పారు. ఇరాన్‌పై మహా ఆర్థిక దిగ్బంధనాన్ని అమలు చేస్తామని అమెరికా ప్రకటించిన నేపథ్యంలో ఇది కీలక వాగ్దానం. భిన్న ప్రయోజనాలున్న, వివిధ రాజకీయ వ్యవస్థలున్న దేశాలమధ్య అర్థవంతమైన సహకారం విస్తరించటం అంత సులభమేమీ కాదు. ఈ పాతికేళ్లలో గణనీయంగా పెరిగిన ఎస్సీఓ... ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదాలను సమర్థవంతంగా ఎదుర్కొనాలన్న చైనా ప్రతిపాదనకు ఇప్పటికీ కట్టుబడే ఉన్నా, ఆచరణలో అదేమీ అమలుకావటం లేదు. మన దేశంలో ఉగ్రవాద దాడుల వెనక తన హస్తం లేదని దబాయించటంతోపాటు తమ దగ్గర జరిగే అలాంటి దాడుల్లో భారత్ ప్రమేయం ఉందని పాకిస్తాన్ ఎదురు ఆరోపిస్తోంది. ఇలాంటి డ్రామాలు కట్టిపెట్టి సభ్యదేశాలు చిత్తశుద్ధితో వ్యవహరించినప్పుడే ఏ సంస్థలైనా లక్ష్యసాధనలో విజయం సాధిస్తాయి. ఎస్సీఓ విస్తరణ మంచిదే... దాని మాటెలావున్నా ఆ సంస్థ బలపడాలంటే పెడ ధోరణులను అరికట్టడం తప్పనిసరి. -
ఉక్రెయిన్‌పై దాడులు తీవ్రతరం చేసిన రష్యా
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు తీవ్రతరం చేసింది. ఆ దేశ రైల్వే నెట్వర్క్ లక్ష్యంగా భారీ దాడులకు పాల్పడింది. మంగళవారం జరిగిన తాజా దాడిలో లోకోమోటివ్ డిపోపై బాలిస్టిక్ క్షిపణి పడటంతో ఆరుగురు రైల్వే సిబ్బంది మృతి చెందారు.రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్ రైల్వే వ్యవస్థకు భారీ నష్టం వాటిల్లింది. ఈ ఏడాది ఇప్పటివరకు రైల్వే నెట్‌వర్క్‌పై 1500కు పైగా దాడులు జరిగినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 58 మంది రైల్వే సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, 318 మందికి పైగా గాయపడ్డారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడి, కొన్ని సర్వీసులు 12 నుంచి 15 గంటల వరకు ఆలస్యమవుతున్నాయి.మరోవైపు కీవ్ ప్రాంతంలో జరిగిన భారీ దాడుల్లో మొత్తం 12 మంది మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.చదవండి: రష్యా చమురుక్షేత్రంపై దాడి -
స్కూళ్లకు వెళ్తే గన్ పట్టాల్సిందే.. పిల్లలకు యుద్ధ పాఠాలు
రష్యా తన పాఠశాల విద్యలో సైనిక శిక్షణను పెంచుతూ, చిన్న వయసు నుంచే పిల్లలను భవిష్యత్ యుద్ధాలకు సిద్ధం చేస్తోంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో, రష్యా ప్రభుత్వం తరువాతి తరం యువతను సైనిక దృక్పథంతో తీర్చిదిద్దేందుకు విద్యా వ్యవస్థను ఇలా మార్చుతోంది.రష్యాలో పాఠశాలలకు తిరిగి వచ్చే విద్యార్థులకు “మాతృభూమి భద్రత, రక్షణ ప్రాథమిక అంశాలు” అనే కోర్సులో సైనిక శిక్షణకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. 13 ఏళ్ల వయసు నుంచే విద్యార్థులకు మెషిన్ గన్స్, యాంటీ-ట్యాంక్ ఆయుధాలు, హ్యాండ్ గ్రెనేడ్లు వంటి ప్రధాన ఆయుధాల గురించి శిక్షణ ఇస్తారు. అత్యవసర పరిస్థితుల్లో ఫీల్డ్ మెడిసిన్, ప్రాథమిక చికిత్స, సైనిక క్రమశిక్షణ వంటి అంశాలను కూడా నేర్పించనున్నారు.కొత్త పాఠ్య ప్రణాళికలో ఈ కోర్సులోని తరగతుల్లో సగం సైనిక శిక్షణకే కేటాయించాలని రష్యా విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశించింది. గతంలో కూడా కొన్ని పాఠశాలల్లో పరిమిత స్థాయిలో ఇలాంటి శిక్షణ ఉండేది. అయితే ఇప్పుడు దాన్ని చిన్న వయసు పిల్లల వరకు విస్తరించడం కీలక మార్పు. దీని వెనుక ఉద్దేశం రష్యా యువతలో దేశభక్తి, సైనిక క్రమశిక్షణ, యుద్ధానికి సిద్ధంగా ఉండే మానసిక సామర్థ్యాన్ని పెంచడమే.మొత్తంగా, రష్యా పాఠశాలల్లో జరుగుతున్న ఈ మార్పును కథనం విద్యా వ్యవస్థలో పెరుగుతున్న సైనికీకరణగా వివరిస్తోంది. రష్యా పిల్లలకు పుస్తకాలతో పాటు ఆయుధాలు, యుద్ధ నైపుణ్యాలు నేర్పిస్తూ భవిష్యత్ సైనిక తరాన్ని తయారు చేస్తోంది.నేటి నుంచే విద్యా సంవత్సరం ప్రారంభంరష్యాలోని అన్ని పాఠశాలల్లో కొత్త విద్యా సంవత్సరం మంగళవారం (సెప్టెంబర్ 1న) ప్రారంభమైంది. ఈ రోజును ‘నాలెడ్జ్ డే’గా పిలుస్తారు. ఇటీవలి సంవత్సరాల్లో పుతిన్ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పిల్లలతో ‘ముఖ్యమైన విషయాలపై సంభాషణలు’ పేరుతో ఒక పాఠాన్ని నిర్వహిస్తున్నారు.క్రెమ్లిన్ అభిప్రాయాలైన దేశభక్తి, రష్యా చరిత్రను పిల్లల్లో పెంపొందించేందుకు ఈ తప్పనిసరి తరగతిని సెప్టెంబర్ 2022లో ప్రవేశపెట్టారు. ఇందులో ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి దండయాత్ర గురించి కూడా బోధిస్తారు. ఈ ఏడాది ప్రీ-స్కూల్ పిల్లల కోసం ఆటల ఆధారంగా రూపొందించిన రూపాన్ని కిండర్గార్టెన్లలో ప్రవేశపెడుతున్నారు.రష్యా ఆక్రమణలో ఉన్న తూర్పు, దక్షిణ ఉక్రెయిన్ ప్రాంతాల్లో పాఠశాల విద్యను పూర్తిగా మార్చేస్తున్నారు. ఇది సాంస్కృతిక చెరిపివేతకు దారితీస్తోంది. ఈ ఏడాది ప్రవేశపెట్టిన కొత్త ప్రభుత్వ ఆమోదిత చరిత్ర పాఠ్యపుస్తకాల్లో మాస్కో నియంత్రణలో ఉన్న డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజ్జియా, ఖెర్సాన్ ప్రాంతాల భూమి ఎప్పటినుంచో రష్యాదేనని పిల్లలకు బోధించనున్నారు. -
పుతిన్‌తో మోదీ భేటీ... యుద్ధంపై కీలక వ్యాఖ్యలు
బిష్కెక్: ప్రస్తుత కాలంలో యుద్ధం వల్ల ముందుకు వెళ్లలేమని భారత ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. అంతులేని యుద్ధం నుండి బయిటపడి యుద్ధానికి ముగింపు పలికే దిశగా మందుకు సాగాలని కోరారు. భారత్ ఎల్లప్పుడూ శాంతికి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఈ రోజు(సోమవారం) కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్లో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మోదీ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై దాదాపు నాలుగేళ్లు పూర్తయింది. అయినప్పటికీ యుద్ధం ఇంకా ఉద్రిక్తంగానే సాగుతుంది. ఈ నేపథ్యంలో మోదీ,పుతిన్ మధ్య కీలక భేటీ జరిగింది. పుతిన్‌తో సమావేశంలో మోదీ మాట్లాడుతూ, “మనం అంతులేని యుద్ధం నుంచి బయటపడి, యుద్ధానికి ముగింపు పలికే దిశగా ముందుకు సాగాలి. ఇది మానవాళి సంక్షేమానికి ఎంతో అవసరం. అన్ని సమస్యలకు వీలైనంత త్వరగా శాంతియుత పరిష్కారం లభించాలి. ఇదే మానవాళి ఆకాంక్ష, ఇదే భారతదేశ సందేశం” అని అన్నారు.భారత్ శాంతి సంప్రదాయాన్ని కూడా మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. “గాంధీ పుట్టిన నేల, బుద్ధుని నేల — ఈ రెండు నేలలు ఒకే సందేశాన్ని పంచుకుంటాయి. ఆ సందేశం శాంతి మార్గం” అని ఆయన అన్నారు. అంటే మహాత్మా గాంధీ, గౌతమ బుద్ధుల బోధనలు రెండూ కూడా హింసకు బదులుగా శాంతి, సామరస్యం, సమస్యలకు శాంతియుత పరిష్కారం వైపు నడిపిస్తాయని పుతిన్‌కు పరోక్షంగా సూచించారు. భారత్ శాంతి కోసం జరుగుతున్న అన్ని ప్రయత్నాలకు మద్దతుగా నిలుస్తుందని కూడా మోదీ స్పష్టం చేశారు.యుద్ధమనేది మానవాళిని ప్రతిరోజూ వెనక్కి నెడుతుంది. అదే సమయంలో శాంతి వైపు వేసే ప్రతి అడుగు మానవాళిలో కొత్త ఆశను, కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది” అని ఆయన పేర్కొన్నారు. కాగా గతేడాది పుతిన్ భారత పర్యటన తర్వాత మోదీ, పుతిన్‌లు ప్రత్యక్షంగా కలుసుకున్న సందర్భం ఇదే. ఈ సందర్భంగా సమావేశానికి ముందు ఇరువురు నేతలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.తాజా సమావేశంలో మోదీ పుతిన్‌ను భారత్‌లో జరగనున్న BRICS సదస్సుకు కూడా ఆహ్వానించారు. భారత్ కొన్ని రోజుల్లో BRICS సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనుందని, పుతిన్‌తో పాటు ఆయన ప్రతినిధి బృందానికి స్వాగతం పలకడానికి భారతీయులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని మోదీ చెప్పారు. -
రష్యా డ్రోన్ల విధ్వంసకర దాడులు
-
మైనస్ 50 డిగ్రీల చలి.. లక్షల మంది జీవించే నగరం ఇదే!
యాకుట్సిక్, సఖా రిపబ్లిక్ క్షణాల్లో వేడి నీళ్లను మంచులా మార్చేసే చలి. ప్రతీ క్షణం జీవితాన్ని ఒక అడ్వెంచర్‌గా మార్చే వాతావరణం. ఈ నగరంలో చలికాలంలో టెంపరేచర్ మైనస్ 50 డిగ్రీల కంటే తక్కువకు పడిపోతుంది. ఈ ప్రదేశమే రష్యాలోని సఖా రిపబ్లిక్ రాజధాని యాకుట్సిక్.సైబీరియాలోని ఈశాన్య ప్రాంతంలో లెనా నది తీరంలో ఉన్న యాకుట్సిక్ను ప్రపంచంలోనే అత్యంత కోల్డోస్ట్ సిటీల్లో ఒకటిగా చెబుతారు. శీతాకాలంలో ఇక్కడ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయి. దాదాపు ఏడు నెలల పాటు ఉండే చలికాలంలో లైఫ్ ప్రతీ రోజు ఒక ఛాలెంజ్‌లా ఉంటుంది.సిమెంట్ పిల్లర్స్‌పై నిలబడే ఇల్లు యాకుట్సిక్ ఉన్న సఖాలో ప్రాంతంలో అధిక భాగం పర్మాఫ్రాస్ట్ నేల ఉంటుంది. అంటే భూమి లోపలి పొరలు వందల మీటర్ల లోతు వరకు శాశ్వతంగా గడ్డకట్టిన స్థితిలో ఉంటాయి. ఇక్కడ ఇల్లు కట్టుకోవడం అంటే మంచు గడ్డపై నిలబడే ప్రయత్నం చేయడం లాంటిదే. అందుకే ఇంటి నిర్మాణం కోసం డిఫరెంట్ టెక్నాలజీని వినియోగిస్తారు. ఇంటిని బలమైన పైల్స్‌పై అంటే పొడుగాటి పిల్లర్స్‌పై నిర్మిస్తారు. ఇంటి నుంచి బయటికి వచ్చే వేడి వల్ల అక్కడి గడ్డకట్టిన నేల కరగకుండా గ్యాప్‌తో నిర్మిస్తారు.నీటి పైపులు కూడా బయటే మన ఇంటి పైపులు సాధారణంగా అయితే భూమిలోపల ఉంటాయి కదా.. కానీ ఇక్కడ మాత్రం భూమిపైనే ఈ పైపులను అంటే నీరు, హీటింగ్, గ్యాస్‌లాంటి ఇంధన సరఫరా వ్యవస్థలకు సంబంధించిన పైపులను భూమిపైనే ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఈ పైపులు భూమిలోపల ఉంటే వాటి మెయింటెనెన్స్ చాలా కష్టం. బయటి ఉష్ణోగ్రతలను తట్టుకునేందుకు వీటికి స్పెషల్ ఇన్సులేషన్ ఏర్పాటు చేస్తారు.ఇంతటి అత్యంత చల్లని వాతావరణంలోనూ యాకుట్సిక్లో లక్షలాది మంది ప్రజలు సాధారణంగా జీవిస్తారు. స్కూల్స్, ఆఫీసులు, షాపులు, ట్రాన్స్‌పోర్టేషన్ అన్నీ కూడా ఇక్కడి వాతావరణాన్ని బట్టి నడుస్తాయి. కోల్డెస్ట్ ప్రదేశంగా పాపులర్ అయిన యాకుట్సిక్లో డైమండ్స్ లాంటి ఖనిజాలు కూడా లభిస్తాయి. మంచుతో కవర్ అయిన ఈ నేలలో దాగి ఉన్న ఖనిజ సంపదే ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది.ఇదీ చదవండి: 12 ఏళ్లు ఆర్మీకి సేవలు : గుడ్‌బై చెప్పిన ‘నేషనల్ క్రష్’హైదరాబాద్ నుంచి యాకుట్సిక్ ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి యాకుట్సిక్కు వెళ్లేందుకు డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. హైదరాబాద్ నుంచి ముందు మాస్కో వెళ్లి, అక్కడి నుంచి యాకుట్సిక్కు వెళ్లవచ్చు. మొత్తం ప్రయాణానికి సుమారు 15 నుంచి 20 గంటల టైమ్ పట్టే అవకాశం ఉంది.ఇదీ చదవండి: అపుడు భర్త, ఇపుడు భార్య రాజీనామా? యూపీ రాజకీయాల్లోకి ఎంట్రీ? -
రష్యా చమురుక్షేత్రంపై దాడి
మాస్కో/న్యూఢిల్లీ: నెలల తరబడి తమపై దాడులతో తెగబడుతున్న రష్యాపై ఉక్రెయిన్ మరోసారి బదులుతీర్చుకుంది. రష్యాలోని లెనిన్గ్రాడ్ ఓబ్లాస్ట్ పరిధిలోని కిరిషి నగరంలోని అత్యంత కీలకమైన చమురుశుద్ధి కర్మాగారంపై ఉక్రెయిన్ డ్రోన్లు దాడిచేశాయి. దీంతో ఆయిల్ రిఫైనరీ కేంద్రం నుంచి మంటలు చెలరేగాయి. గతంలో రెండుసార్లు దాడులతో నెలల తరబడి ఉత్పత్తిని ఆపేసి మరమ్మత్తుల తర్వాత ఇటీవలే ఉత్పత్తిని మొదలుపెట్టగా వెంటనే ఉక్రెయిన్ దాడులు చేయడం గమనార్హం. ఈ దాడిలో ప్రాణనష్టం వివరాలను రష్యా బయటపెట్టలేదు. రిఫైనరీపై దాడికి యతి్నంచిన 62 డ్రోన్లలో నేలమట్టంచేశామని రష్యా ప్రకటించింది. శనివారం రాత్రి నుంచి గత 24 గంటల్లో 500 డ్రోన్లను కూల్చేశామని రష్యా రక్షణశాఖ తెలిపింది. దాడులకు ప్రతీకారం తప్పదని రష్యా అధ్యక్షకార్యాలయం అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోస్ హెచ్చరించారు. భారత్ నుంచి రష్యాకు భారీగా పెట్రోల్చమురు శుద్ది కర్మాగారాలపై ఉక్రెయిన్ దాడులు తీవ్రతరంచేయడంతో రష్యా స్థానిక అవసరాలకు సరిపడా చమురును ఉత్పత్తిచేయలేక దిగుమతులపై ఆధారపడుతోంది. దీంతో తాజాగా సముద్రమార్గం ద్వారా భారీస్థాయిలో పెట్రోల్‌ను సరఫరాచేస్తూ మిత్రదేశాన్ని భారత్ ఆదుకుంటోందని గణాంకాలు వెల్లడించాయి. గత రెండు నెలల్లో భారత్ నుంచి ఏకంగా 10 లక్షల బ్యారెళ్ల పెట్రోల్ రష్యాకు ఎగుమతి అయినట్లు వాణిజ్యరంగంలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గుజరాత్‌లోని వడినార్ చమురుశుద్ది కర్మాగారం నుంచి ఎగుమతులు ఎక్కువగా జరిగాయి. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో భారత్ తన ఇంధనఅవసరాల కోసం రష్యా నుంచి ముడిచమురున భారీస్థాయిలో కొనుగోలుచేయడం తెల్సిందే. ఇందుకు ప్రతిగా ముడిచమురును శుద్ధిచేశాక వచ్చే పెట్రోల్‌ను తిరిగి రష్యాకు సరఫరాచేస్తున్నట్లు తెలుస్తోంది. -
కీవ్ లో రష్యా డ్రోన్ల బీభత్సం.. 37 మంది మృతి
-
వెనక్కి తగ్గని రష్యా.. ఉక్రెయిన్ నాశనం కావాల్సిందే!
-
రష్యా దాడుల్లో 27 మంది మృతి, 42 మందికి గాయాలు
ఉక్రెయిన్‌లోని కీవ్ ప్రాంతంపై గత రాత్రిపూట రష్యా జరిపిన వైమానిక దాడుల్లో 27 మంది మృతి చెందినట్లు గవర్నర్ తైమూర్ తకాచెంకో శనివారం తెలిపారు. టెలిగ్రామ్ యాప్‌లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. మరో 42 మంది గాయపడినట్లు, బుచా జిల్లాలో దాడి జరిగిన ప్రాంతం నుంచి 380 మందికి పైగా ప్రజలను తరలిస్తున్నట్లు తెలిపారు.రష్యా దాడిలో దాదాపు 50 నివాస భవనాలు దెబ్బతిన్నట్లు తకాచెంకో తెలిపారు. ఈ దాడి కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించి, ఇళ్లు, ఒక రెస్టారెంట్‌కు మంటలు వ్యాపించాయని చెప్పారు. దాడిలో ఏ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నారనే వివరాలను కీవ్ గవర్నర్ వెల్లడించలేదు.గిడ్డంగిపై జరిగిన దాడి కారణంగా పేలుడు సంభవించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ తెలిపారు. సమీపంలోని మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. ఇందులో నివాస భవనాలు, వృద్ధుల సంరక్షణ కేంద్రం కూడా ఉన్నాయని తెలిపారు.“ఇది జరగడానికి అనుమతించిన వారిని వారి నిర్ణయాలకు బాధ్యులను చేయాలి” అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యం ఆరోపణలపై ఇప్పటికే క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. బాధ్యులకు శిక్ష తప్పదని ఆయన హామీ ఇచ్చారు.“నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఇళ్లకు లేదా ఇతర నివాస ప్రాంతాలకు సమీపంలో మందుగుండు సామగ్రిని నిల్వ చేయకూడదు. దీనిపై తగిన నిర్ణయాలు తప్పకుండా తీసుకుంటాం” అని జెలెన్స్కీ తెలిపారు.గత మూడు రోజులుగా కీవ్‌పై దాదాపు నిరంతర వైమానిక దాడులు జరుగుతున్నాయి. రష్యా వైమానిక దాడులతో ఉక్రెయిన్ రాజధానిలో ఆర్థిక కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ దాడుల కారణంగా సాధారణ ప్రజల జీవనం కూడా తీవ్రంగా అంతరాయం ఎదుర్కొంటోంది. -
హాలీవుడ్ స్టైల్లో రష్యా, అమెరికా సీక్రెట్ చర్చలు
ఉప్పు నిప్పుగా ఉండే అమెరికా రష్యాల మధ్య తాజా పరిణామాలు హాలీవుడ్ సినిమాను తలపిస్తున్నాయి. వేర్వేరు వార్తా సంస్థలు, అధికార వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి అమెరికా గూఢచార సంస్థ సీఐఏ చీఫ్ తాజాగా మాస్కో వెళ్లి రష్యన్ ఇంటెలిజెన్స్ విభాగం క్రెమ్లిన్ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా ఇటీవలి కాలంలో అమెరికా – రష్యా దౌత్య సంబంధాలు కనిష్ట స్థాయికి చేరిన నేపథ్యంలో ఈ పర్యటన చోటు చేసుకోవడం.. అది కూడా అత్యంత రహస్యంగా జరగడం ఆసక్తి రేకెత్తిస్తోంది. సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్ క్లిఫ్ రష్యా వచ్చారని, అధ్యక్షుడు పుతిన్‌ను కలవకపోయినప్పటికీ చర్చల సారాంశాన్ని ఆయనకు వివరించామని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ ప్రకటించారు. ఏ ఏ అంశాలపై చర్చించారన్నది మాత్రం చెప్పలేదు. మరోవైపు ఈ చర్చలపై కానీ, డైరెక్టర్ రష్యా పర్యటనపై కానీ సీఐఏ కూడా నోరు మెదపడం లేదు. వైట్‌హౌస్ నుంచి కూడా ఎలాంటి సమాచారం లేకుండా పోయింది. అమెరికా మిలిటరీ విమానం మాస్కోలోని వ్నూకోవో విమానాశ్రయంలో మంగళవారం ల్యాండ్ అయిందని, అదే రోజు తిరిగి వెళ్లిపోయిందని రష్యా అధికార వార్తా సంస్థలు తెలిపాయి. ఇవన్నీ ఇలా ఉంటే.. ‘‘ప్రతినిధి బృందం ఒకటి రష్య రాజధానికి వెళుతోంది. ఆ బృందం రష్యా నుంచి వెళ్లిపోయేదాకా దాడులకు విరామం ఇవ్వాలి’’అంటూ వాషింగ్టన్ నుంచి ఉక్రెయిన్‌కు ఆదేశాలు వెళ్లినట్లు ఉక్రెయిన్ అధికారి ఒకరు అసోసియేటెడ్ ప్రెస్‌కు తెలిపారని సమాచారం. రష్యా మొత్తమ్మీద దాడులు ఆపాల్సిందిగా చెప్పలేదని, మాస్కో, సెయింట్ పీటర్స్బెర్గ్, రష్యా ఉత్తర ప్రాంతాల్లో మాత్రం జరక్కూడదని అమెరికా స్పష్టంగా చెప్పిందని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఆ అధికారి తెలిపారు. సీఐఏ డైరెక్టర్ రష్యా పర్యటన వివరాలను మొట్టమొదట సీబీఎస్ ఛానెల్ బయటపెట్టింది. సంక్షోభంలోనే దౌత్య సంబంధాలు... నిఘా వర్గాల స్థాయిలో ఇరు దేశాల మధ్య కొన్ని సంబంధాలు ఉన్నప్పటికీ రష్యా, అమెరికా మధ్య దౌత్య సంబంధాల్లో మాత్రం సంక్షోభం కొనసాగుతోందని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి పెస్కోవ్ చెబుతున్నారు. సీఐఏ డైరెక్టర్ పర్యటన ప్రభావం ఇరుదేశాల సంబంధాలపై ఎలా ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేమని స్పష్టం చేశారు. అయితే సీఐఏ డైరెక్టర్ రష్యా రావడం చాలా అరుదైన విషయమని రష్యా భద్రతాదళాల విషయంలో నిపుణుడైన అండ్రే సోల్డటోవ్ చెబుతున్నారు. సాధారణంగా ఈ స్థాయి సమావేశాలు అమెరికా జాతీయ ప్రయోజనాలకు ఏదైనా దెబ్బ తగులుతోందన్న సందర్భంలోనే జరుగుతాయని చెప్పారు. -
రష్యా గ్యాస్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి
మాస్కో: రష్యాలోని తూర్పు ప్రాంతమైన అమూర్‌లోని ఒక గ్యాస్ కెమికల్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు చైనా పౌరులతో సహా మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, మరో తొమ్మిది మంది ఆచూకీ గల్లంతైంది. మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చినట్లు ప్లాంట్ యాజమాన్యం బుధవారం టెలిగ్రామ్ వేదికగా వెల్లడించింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా, 152 మంది గాయపడ్డారు. వీరిలో పరిస్థితి విషమంగా ఉన్న 36 మందిని మెరుగైన చికిత్స అందిస్తున్నారు.పరిశ్రమల భద్రతా నిబంధనల ఉల్లంఘన కోణంలో రష్యా దర్యాప్తు కమిటీ ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఈ గ్యాస్ ప్లాంట్ నిర్మాణ పనుల్లో పలువురు విదేశీ కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో అధిక శాతం చైనా పౌరులు ఉన్నారు. రష్యా సాధారణంగా భారీ పారిశ్రామిక, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం విదేశీ శ్రామికులపై ఆధారపడుతుంటుంది. ఈ అమూర్ గ్యాస్ కెమికల్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్‌ను రష్యాకు చెందిన ‘సిబూర్’, చైనాకు చెందిన ‘సినోపెక్’ సంస్థల భాగస్వామ్యంతో నిర్మిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పాలిథిలిన్, పాలిప్రొపైలిన్ ఉత్పత్తి కేంద్రాలలో ఒకటిగా నిలవనుంది. ఈ ప్లాంట్ ద్వారా ఏటా సుమారు 23 లక్షల మెట్రిక్ టన్నుల పాలిథిలిన్, 4 లక్షల టన్నుల పాలిప్రొపైలిన్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఇది కూడా చదవండి: నేపాల్‌లో వరద బీభత్సం: 28 మంది పోలీసులు గల్లంతు! -
సి-17లో వచ్చిందెవరో తెలుసా?.. ఆయనే!
మాస్కోలో అర్ధరాత్రి అమెరికా సైనిక విమానం ల్యాండ్ అయింది. ఆ వెంటనే రష్యాపై ఉక్రెయిన్ దాడులు ఆగిపోయాయి! అసలు ఆ విమానంలో ఉన్నదెవరు? ఎందుకు ఇంత రహస్యంగా మాస్కోకు వచ్చారు? అనే ప్రశ్నలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపాయి. ఇప్పుడు ఆ మిస్టరీ దాదాపు వీడినట్లే కనిపిస్తోంది. అమెరికా సీఐఏ డైరెక్టర్ జాన్ ర్యాట్‌క్లిఫ్ రష్యా అధికారులతో రహస్య చర్చల కోసం మాస్కో వచ్చినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి.అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) డైరెక్టర్ జాన్ ర్యాట్‌క్లిఫ్ రహస్యంగా రష్యా వెళ్లడం తీవ్ర చర్చకు దారితీసింది. ఆయన ఎవరిని కలిశారు? ఎలాంటి అంశాలపై చర్చలు జరిపారు? అనే వివరాలు బయటకు రావాల్సి ఉంది. అయితే మంగళవారం ఆయన రష్యా అధికారులతో సమావేశమైనట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. ఇదే సమయంలో అమెరికా సీఐఏ ఈ విషయంపై స్పందించేందుకు నిరాకరించగా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ కూడా మీడియా ముందు ఈ పర్యటనను ధ్రువీకరించలేదు. మాస్కోకు సి-17 గ్లోబ్మాస్టర్మంగళవారం అమెరికా సైన్యానికి చెందిన భారీ రవాణా విమానం సి-17 గ్లోబ్‌మాస్టర్-3 మాస్కోలోని వ్నూకోవో విమానాశ్రయంలో దిగింది. విమానాల ట్రాకింగ్ వివరాల ప్రకారం.. ఈ విమానం తొలుత లాత్వియా రాజధాని రిగాకు చేరుకుని, అక్కడి నుంచి మాస్కోకు వెళ్లింది. అమెరికా సైన్యానికి చెందిన ఈ విమానం సైనికులు, వాహనాలు, భారీ కార్గో రవాణాకు ఉపయోగిస్తారు.అయితే విమానంలో ఎవరు ప్రయాణించారనే విషయాన్ని అమెరికా అధికారికంగా వెల్లడించలేదు. లాత్వియా రక్షణ శాఖ మాత్రం ఈ విమానానికి తమ గగనతలంలో ప్రయాణించేందుకు అనుమతి ఉందని, అవసరమైన సమన్వయం పూర్తయినట్లు తెలిపింది. ఆ వెంటనే విమానంలో సీఐఏ డైరెక్టర్ ర్యాట్‌క్లిఫ్ ఉన్నట్లు అమెరికా మీడియా కథనాలు పేర్కొన్నాయి. U.S. Air Force Boeing C-17A Globemaster III strategic airlifter descending to land at the Vnukovo International Airport in Moscow on Tuesday morning.The cameraman, likely sarcastically, comments: "we are under attack!" https://t.co/7EfvANBScW pic.twitter.com/dVItO5nAjn— Status-6 (War & Military News) (@Archer83Able) August 25, 2026ఉక్రెయిన్‌కు అమెరికా కీలక సూచనర్యాట్క్లిఫ్ పర్యటనకు ముందు అమెరికా.. ఉక్రెయిన్‌కు కీలక సూచన చేసినట్లు సమాచారం. మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్తో పాటు రష్యాలోని ఉత్తర ప్రాంతాలపై సోమవారం నుంచి బుధవారం వరకు డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేయవద్దని కోరినట్లు తెలుస్తోంది. రష్యా రాజధానికి ఓ సీనియర్ అమెరికా అధికారి ప్రయాణిస్తున్నారని కూడా కీవ్‌కు సమాచారం ఇచ్చినట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ కథనాలు వెలువడ్డాయి. ఈ పరిణామం అమెరికా–ఉక్రెయిన్ సంబంధాలపైనా ఆసక్తిని రేకెత్తిస్తోంది. రష్యాతో యుద్ధం కొనసాగిస్తున్న ఉక్రెయిన్ను అమెరికా బహిరంగంగా సమర్థిస్తున్న సమయంలోనే.. సీనియర్ అమెరికా గూఢచార అధికారి మాస్కోకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.నాలుగేళ్ల తర్వాత మళ్లీ సీఐఏ చీఫ్ రాకర్యాట్క్లిఫ్ పర్యటన నిజమైతే.. 2021 తర్వాత రష్యా రాజధానికి అమెరికా గూఢచార సంస్థ అధిపతి వెళ్లడం ఇదే తొలిసారి. అప్పటి సీఐఏ డైరెక్టర్ విలియం బర్న్స్ 2021 నవంబర్‌లో మాస్కో వెళ్లి అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలు జరిపారు. ఆ భేటీ జరిగిన మూడు నెలలకే రష్యా ఉక్రెయిన్‌పై దాడికి దిగింది. ప్రస్తుతం కూడా రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుండటం, మరోవైపు అమెరికా–రష్యా మధ్య సంబంధాలు సున్నితంగా ఉండటంతో ర్యాట్‌క్లిఫ్ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.రష్యా–ఇరాన్ బంధం కూడా కీలకమే..ర్యాట్‌క్లిఫ్ మాస్కో పర్యటన సమయంలో మరో అంశం కూడా చర్చకు వస్తోంది. ఇరాన్‌తో రష్యాకు ఉన్న సన్నిహిత సంబంధాలు అమెరికాకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడి పెంచేందుకు అమెరికా ఇటీవల కొత్త ఆంక్షలు ప్రకటించింది. ఇరాన్‌తో వ్యాపార సంబంధాలు కొనసాగించే దేశాలు, సంస్థలపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది.రష్యా మాత్రం ఇరాన్‌తో సైనిక, ఆర్థిక, దౌత్య సంబంధాలను కొనసాగిస్తోంది. ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు ఇరాన్ డ్రోన్లు అందించినట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి. మరోవైపు రష్యా.. ఇరాన్‌కు అమెరికా లక్ష్యాలపై దాడులకు ఉపయోగపడే ఉపగ్రహ చిత్రాలను అందించిందని ఉక్రెయిన్ ఆరోపించింది. మాస్కో ఈ ఆరోపణలను ఖండించింది.ఖైదీల మార్పిడిలోనూ కీలక పాత్రఅమెరికా–రష్యా మధ్య ఖైదీల మార్పిడి వ్యవహారాల్లోనూ సీఐఏ కీలక పాత్ర పోషిస్తోంది. ర్యాట్‌క్లిఫ్ స్వయంగా 2025 ఏప్రిల్‌లో అమెరికా–రష్యా ద్వంద్వ పౌరురాలు క్సేనియా కరేలినా విడుదలకు సంబంధించిన చర్చల్లో పాల్గొన్నట్లు సమాచారం. 2024లో వాల్‌స్ట్రీట్ జర్నల్ విలేకరి ఇవాన్ గెర్ష్కోవిచ్, మాజీ అమెరికా మెరైన్ పాల్ వీలన్ విడుదలకు దారితీసిన ఖైదీల మార్పిడిలోనూ సీఐఏ ప్రమేయం ఉంది.పుతిన్‌తో భేటీ ఉంటుందేమో!ర్యాట్‌క్లిఫ్ మాస్కో పర్యటన వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఉక్రెయిన్ యుద్ధం, రష్యాతో సంబంధాలు, ఇరాన్ అంశం, ఖైదీల మార్పిడి వంటి పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. అధికారికంగా ఎలాంటి వివరాలు బయటకు రాలేదు.ఇదీ చదవండి: ఇరాన్‌పై కోపం.. భారత కంపెనీలకూ షాక్! -
మాస్కోలో అమెరికా సైనిక విమానం!
మాస్కో: అమెరికా, రష్యా మధ్య ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులున్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఉక్రెయిన్‌పై దాడితో పాటు ప్రస్తుతం ఇరాన్‌కు సైతం అమెరికా సహకరిస్తోందని ఆరోపణలున్నాయి. దీంతో ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు ఏమాత్రం మెరుగ్గా లేవు. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అమెరికా వైమానిక దళానికి చెందిన ఓ రవాణా విమానం మాస్కోలోని వ్నుకోవో విమానాశ్రయంలో ల్యాండ్ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే, ఈ విమానం రాక గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని క్రెమ్లిన్ తెలపడం గమనార్హం.అమెరికాకు చెందిన విమాన ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్రాడార్ 24 వివరాల ప్రకారం, ఈ విమానం మంగళవారం సుమారు 0700 GMT సమయంలో లాట్వియా రాజధాని రిగా నుంచి మాస్కోకు చేరుకుంది. అయితే ఈ పరిణామంపై క్రెమ్లిన్ ప్రెస్ సెక్రటరీ డిమిత్రి పెస్కోవ్‌ను మీడియా ప్రశ్నించగా, ఈ వారం అమెరికా ప్రభుత్వ ప్రతినిధులతో ఎలాంటి సమావేశాలు జరగాల్సిన ప్రణాళిక లేదని ఆయన చెప్పారు. విమానం రాకకు సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు.ఫ్లైట్రాడార్24 డేటా ప్రకారం, ఈ విమానం ఆదివారం సాయంత్రం అమెరికా తూర్పు కాలమానం ప్రకారం సుమారు 5 గంటలకు ముందు ఈ విమానం మేరీల్యాండ్‌లోని అమెరికా వైమానిక దళానికి చెందిన జాయింట్ బేస్ ఆండ్రూస్ నుంచి బయలుదేరింది. వాషింగ్టన్ డీసీ సమీపంలోని క్యాంప్ స్ప్రింగ్స్ ఎయిర్‌బేస్ నుంచి రిగాకు చేరుకుంది. అనంతరం రిగా నుంచి మాస్కోకు వెళ్లింది. అమెరికా అధ్యక్షుడు, ఉన్నతస్థాయి అధికారులు అధికారిక విమాన ప్రయాణాల కోసం ఉపయోగించే ప్రధాన సైనిక స్థావరాల్లో జాయింట్ బేస్ ఆండ్రూస్ ఒకటి.యూరప్ నుంచి రష్యాకు నేరుగా వచ్చిన అమెరికా ఉన్న విమానం ఇదే మొదటిది కాదు. చివరిసారిగా జనవరిలో ఇలాంటి విమానం రష్యాకు వచ్చింది. అప్పట్లో ఉక్రెయిన్‌పై శాంతి చర్చల కోసం అమెరికా ప్రత్యేక ప్రతినిధులు స్టీవెన్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ మాస్కోకు వెళ్లి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమయ్యారు.విమానం రాకపై ఊహాగానాలుఈ విమానం సీ-17 గ్లోబ్‌మాస్టర్. భారీ మొత్తంలో సైనిక సామగ్రి, సిబ్బందిని సుదూర ప్రాంతాలకు తరలించేందుకు ఈ విమానాలను ఉపయోగిస్తారు. ఇలాంటి విమానం అకస్మాత్తుగా మాస్కోలో ల్యాండ్ కావడంతో దాని రాక వెనుక కారణంపై పలు ఊహాగానాలు మొదలయ్యాయి. ఇది దౌత్యపరమైన వ్యవహారానికి సంబంధించినదై ఉండొచ్చని, లేదా ఖైదీల మార్పిడి కోసం విమానం వచ్చి ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది.కాగా ఇటీవలే మాజీ అమెరికా మెరైన్ రాబర్ట్ గిల్మన్ను ఆగస్టు 2026లో రష్యా విడుదల చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, ఈ ఏడాది ప్రారంభంలోనూ అమెరికా, రష్యా మధ్య ఖైదీల మార్పిడి జరిగింది.అయితే, మాస్కోలో అమెరికా సైనిక రవాణా విమానం ల్యాండ్ కావడానికి అసలు కారణం ఏమిటన్నది మాత్రం ఇప్పటివరకు అధికారికంగా వెల్లడి కాలేదు. -
బ్రిటన్‌పై రష్యా ఫైర్.. స్థావరాలను పేల్చిపడేస్తాం
మాస్కో: బ్రిటన్‌పై రష్యా తీవ్ర స్థాయిలో మండిపడింది. ఉక్రెయిన్‌లో శాంతి స్థాపన జరగకుండా బ్రిటన్ అడ్డుకుంటుందని తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ మేరకై ఈ రోజు సోమవారం ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్‌లోనే SCALP సుదూర క్షిపణులను తయారు చేసేందుకు అవసరమైన సమాచారాన్ని బ్రిటన్ కీవ్‌కు అందిస్తున్నందుకు రష్యా తీవ్రంగా స్పందించింది. ఈ క్షిపణులను తయారు చేసే ప్లాంట్లను గుర్తించి ధ్వంసం చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. ఉక్రెయిన్‌కు సైనికంగా కొనసాగుతున్న బ్రిటన్ మద్దతును మరింత బలపరుస్తామని బ్రిటన్ ప్రధాని ఆండీ బర్న్‌హామ్ కీవ్ పర్యటన సందర్భంగా హామీ ఇచ్చిన నేపథ్యంలో రష్యా ఈ హెచ్చరికలు చేసింది.SCALP క్షిపణులకు సంబంధించిన బ్లూప్రింట్లు, సాంకేతిక సమాచారంపై క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్‌ని ప్రశ్నించగా తీవ్ర ఆగ్రహంతో స్పందించారు. “ బ్రిటన్ క్రమపద్ధతిలో, నిరంతరం మంటలకు నూనె పోస్తోంది. శాంతి ప్రక్రియలో కనీస స్థాయిలోనైనా పురోగతి సాధించకుండా అడ్డుకునేందుకు బ్రిటన్ పదేపదే పథకాలు రచిస్తోంది. ఇలాంటి క్షిపణులు, ఇతర సైనిక పరికరాల తయారీ కేంద్రాలను గుర్తించేందుకు మా సాయుధ దళాలు అవసరమైన గూఢచారి సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఆ సదుపాయాలను ధ్వంసం చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాయి” అని విలేకరులతో అన్నారు.SCALP క్షిపణిSCALP ఒక సుదూర క్రూయిజ్ క్షిపణి. ఇది సుమారు 250 కిలోమీటర్ల (దాదాపు 150 మైళ్ల) దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం కలిగి ఉంది. 2022లో రష్యా ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి సైనిక దాడిని ప్రారంభించినప్పటి నుంచి ఫ్రాన్స్, బ్రిటన్లు ఈ క్షిపణులను ఉక్రెయిన్‌కు అందిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఉక్రెయిన్‌లోనే వీటిని దేశీయంగా తయారు చేయలేదు.ఉక్రెయిన్‌లో SCALP క్షిపణుల ఉత్పత్తి ప్రారంభించేందుకు అవసరమైన సహకారం అందించే దిశగా బ్రిటన్ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఫ్రాంకో-బ్రిటిష్ క్షిపణిలో ఉపయోగించే బ్రిటన్‌కు చెందిన భాగాలకు సంబంధించిన సమాచారాన్ని రక్షణ రంగ సంస్థ MBDA ఉక్రెయిన్‌కు విడుదల చేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం అనుమతించనుంది.బ్రిటన్ ప్రధాని ఉక్రెయిన్ పర్యటనకాగాా బ్రిటన్ ప్రధాని ఆండీ బర్న్‌హామ్ సోమవారం కీవ్‌ను సందర్శించారు. ఉక్రెయిన్ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ, రష్యా నుంచి వస్తున్న దారుణమైన బెదిరింపులు ఉన్నప్పటికీ ఉక్రెయిన్ రక్షణకు బ్రిటన్ తన సైనిక మద్దతును కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.నా దేశానికి రష్యా దారుణమైన బెదిరింపులు చేస్తున్నప్పటికీ , ఉక్రెయిన్ రక్షణకు మా మద్దతును కొనసాగిస్తాం అని కీవ్‌లో జరిగిన ప్రసంగంలో బర్న్‌హామ్ అన్నారు. కాగా ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ మధ్య దాడులు తీవ్రస్థాయికి చేరాయి. ఇరుదేశాలు పరస్పరం క్షిపణి దాడులతో విరుచుక పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. -
అసలు ఆ రాత్రికి ఏ జరిగింది? ఇప్పటికీ మిస్టరీగానే ఆ ఘటన!
1959 ఫిబ్రవరి ఒకటో తేదీ... రష్యాలోని యూరల్ పర్వత ప్రాంతం– సంధ్యకాంతుల్లో ఆ మంచు పర్వతం శోభాయమానంగా కనిపిస్తోంది. అప్పుడే అక్కడకు ఓ పర్వతారోహకుల బృందం వచ్చింది. ‘‘ఈ రాత్రికి ఇక్కడ బస చేద్దాం’’ అని 23 ఏళ్ల ఇగోర్ డియాట్లోవ్ తన సహచరులను ఉద్దేశించి అనడంతో అందరూ టెంట్ వేయడానికి ఉపక్రమించారు.గంటలు గడిచాయి. అందరూ గాఢనిద్రలోకి జారుకున్నారు. చుట్టూ తెల్లటి మంచుకొండలు తప్ప ఎలాంటి అలికిడీ లేదు. బయట ఉష్ణోగ్రత మైనస్ 30 డిగ్రీలకు పడిపోయి భయంకరమైన నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. అంతలోనే ఏమైందో తెలియదు– టెంటులో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. లోపలున్నవారు విపరీతమైన భయంతో టెంట్‌ను కత్తితో చీల్చుకుని బయటకు వచ్చారు. పెద్దగా అరుస్తూ ప్రాణభయంతో తలోదిక్కుకు పరుగులు తీశారు. ఆ రాత్రి వారి జీవితంలో కాళరాత్రిగా మిగిలిపోయింది.ఆ భయానక రాత్రికి ఎనిమిది రోజుల ముందు– అంటే, 1959 జనవరి 23న రష్యాలోని యూరల్ పాలిటెక్నిక్ ఇన్ స్టిట్యూట్‌కు చెందిన ఎనిమిది మంది యువకులు, ఇద్దరు యువతులు ‘ఓటోర్టెన్’ అనే ప్రమాదకరమైన మంచు పర్వతాన్ని అధిరోహించడానికి బయలుదేరారు. అనారోగ్యం కారణంగా ‘యూరీ యుడిన్’ అనే యువకుడు వెనక్కి తిరిగి వెళ్లిపోయాడు.మిగిలిన తొమ్మిదిమంది ఫిబ్రవరి 1న ‘ఖోలాట్ స్యాఖ్ల్’ అనే కొండపైకి చేరుకుని అక్కడ టెంట్ వేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 12 నాటికి తిరిగి రావాలి. కానీ ఫిబ్రవరి 20 వచ్చినా వారి నుంచి ఎలాంటి సమాచారం లేదు. దీంతో కుటుంబసభ్యుల విన్నపం మేరకు రష్యా ప్రభుత్వం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఫిబ్రవరి 26న సహాయక బృందాలు ఆ కొండ వద్దకు చేరుకుని అక్కడి దృశ్యాలు చూసి షాక్ తిన్నాయి.టెంట్‌ను లోపల నుంచి కోసిన ఆనవాళ్లు కనిపించాయి. కానీ చుట్టుపక్కల ఎవరూ లేరు. టెంట్‌కు దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఓ చెట్టు కింద ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. వారి ఒంటిపై లోదుస్తులు మాత్రమే ఉన్నాయి. మరికొంత దూరంలో డియాట్లోవ్ సహా మరో ముగ్గురి శవాలు మంచులో గడ్డకట్టి కనిపించాయి. మిగిలిన నలుగురి మృతదేహాలు మే నెలలో కరిగిన మంచు ప్రవాహంలో దొరికాయి. వీరిలో కొందరి పక్కటెముకలు విరిగిపోగా, ఒకరి పుర్రె పగిలిపోయింది. ల్యూడ్మిలా దుబినినా అనే యువతి నాలుక, కళ్లు కనిపించలేదు. మరొకరి కనుగుడ్లు లేవు. వారి ఒంటిపై అంతటి గాయాలు ఉన్నప్పటికీ, బయటి నుంచి దెబ్బలు తగిలిన గుర్తులు లేవు. కొందరి దుస్తులపై రేడియోయాక్టివ్ ఆనవాళ్లు కూడా కనిపించాయి.ఈ మరణాలపై దశాబ్దాల పాటు రకరకాల ప్రచారాలు సాగాయి. ఆ రాత్రి ఆకాశంలో వింత కాంతులు కనిపించాయని స్థానికులు చెప్పడంతో ఏలియన్స్ లేదా యూఎఫ్ఓల దాడే కారణమని కొందరు నమ్మారు. రష్యా మిలిటరీ అక్కడ రేడియేషన్ ఆయుధాలను పరీక్షించిందని, అది వికటించి వీరు చనిపోయారని ప్రచారం జరిగింది. ఆ ప్రాంతంలో ఉండే ‘మాన్సీ’ అనే గిరిజన తెగకు చెందిన వ్యక్తులు తమ పవిత్ర స్థలంలోకి వచ్చినందుకు వీరిని హత్య చేశారని అనుకున్నారు.భారీ ఆకారం కలిగిన యతి అనే మంచు మనిషి దాడి చేయడం వల్లే వారికి ఎముకలు విరిగిపోయాయని మరో ఊహాగానం సాగింది. కానీ వీటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లభించలేదు. చివరకు ప్రభుత్వం– ‘నిరోధించలేని ఒక అపరిమితమైన ప్రకృతి శక్తి’ వల్ల వీరు చనిపోయారని 1959లోనే ఆ కేసును మూసివేసింది. అనంతరం ఆ ప్రాంతం ఆ గ్రూప్ లీడర్ పేరుతో ‘డియాట్లోవ్ పాస్’గా ప్రసిద్ధికెక్కింది.మిస్టరీగా మిగిలిపోయిన ఆ మరణాలపై 2021లో స్విట్జర్లాండ్‌కు చెందిన శాస్త్రవేత్తలు జోహన్ గౌమే, అలెగ్జాండర్ పుజ్రిన్ కలిసి కంప్యూటర్ మోడళ్లు, స్నో ఫిజిక్స్ ఆధారంగా అధ్యయనం చేసి, శాస్త్రీయ వివరణ ఇచ్చారు. ఆ రాత్రి వీచిన బలమైన గాలుల వల్ల ఒక భారీ మంచుపలక టెంట్‌పై పడిందని, దీంతో అందులో ఉన్నవారి పక్కటెముకలు విరిగిపోయాయని అంచనా వేశారు.మంచు పలకలు పడతాయనే భయంతో వారు టెంట్‌ను లోపలి నుంచి కోసుకుని బయటకు పరిగెత్తారని, మైనస్ 30 డిగ్రీల చలిలో ‘హైపోథెర్మియా’ (శరీర ఉష్ణోగ్రత పడిపోవడం)తో చనిపోయారని వివరించారు. మృతదేహాలు చాలారోజులు మంచులో ఉండటంతో పక్షులు, అడవి జంతువులు కళ్లు, నాలుకలను తినేసి ఉంటాయని పేర్కొన్నారు. అందులో కొందరు గతంలో రేడియేషన్ కు గురయ్యే వాతావరణంలో ఉన్నందున వారి దుస్తులపై రేడియేషన్ ఆనవాళ్లు కనిపించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే, ఈ వివరణపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.ఇంతకీ అసలా రాత్రి ఏం జరిగింది? వారంతా ఎలా చనిపోయారు... అనే ప్రశ్నలకు సమాధానాలు మాత్రం నేటికీ ఆ యూరల్ పర్వతాల మంచు పొరల కిందే నిక్షిప్తమై ఉండిపోయాయి.- సత్యకిశోర్ కొండ్రెడ్డి -
రష్యా సీక్రెట్ ఆపరేషన్ ఒక్క టీ... టాప్ స్పై హతం స్టోరీ వింటే గూస్ బంప్స్ గ్యారంటీ
-
కీవ్ పై రష్యా భీకర దాడి..16 మంది మృతి
-
ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి, డ్రోన్ల దాడులు
కీవ్: ఉక్రెయిన్‌లోని కీవ్‌పై గురువారం రాత్రి రష్యా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. 12 ప్రాంతాలపై జరిగిన ఈ దాడిలో 16 మంది మరణించారు. 40 మంది గాయపడ్డారు. ఈ దాడులతో కీవ్‌లోని పలు చోట్ల మౌలిక వసతులు దెబ్బతిన్నాయి. దీంతో సుమారు 90,000 ఇళ్లకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. రాజధాని అంతటా రాత్రంతా పేలుళ్ల శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు. దాడుల కారణంగా గిడ్డంగులు, పాఠశాల, చిన్నారుల వైద్యశాల దారుణంగా దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న భవనాల నుంచి సహాయక సిబ్బంది ప్రజలను తప్పిస్తున్న దృశ్యాలను ఉక్రెయిన్ అత్యవసర సేవా విభాగం విడుదల చేసింది. డ్రోన్ విడిభాగాలను ఉత్పత్తి చేసే కేంద్రాలు, ఒక సైనిక స్థావరం, ఒక లాజిస్టిక్స్ హబ్‌ను లక్ష్యంగా చేసుకుని కీవ్ సహా చుట్టుపక్కల ప్రాంతంపై రష్యా క్షిపణులు, డ్రోన్లతో వైమానిక దాడులు జరిపిందని ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది. -
బిడ్డ కోసం కన్నతల్లి చేసిన పోరాటం, చివరికి ఏమైంది?
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా లక్షలాదిమంది చిన్నారుల జీవితాలు అతలాకుతలమయ్యాయి. ఎన్నో జీవితాలను చిన్నా భిన్నం చేసింది. మరెన్నో కుటుంబాలను విఛ్చిన్నం చేసింది. అలాంటి తల్లీ బిడ్డ స్టోరీ వింటే కళ్లు చెమర్చక మానవు. ఉక్రెయిన్ యుద్ధంలో బందీగా మారిన లిలియా ప్రుటియన్ (55) ,ఆమె చిన్న కొడుకు దిమా జాహ్రేబయేవ్ను కాపాడుకోవడం చేసిన సాహసం, జీవన్మరణ పోరాటం యుద్ధ పరిస్థితులకు అద్దం పడుతుంది.లిలియా ఉక్రెయిన్ సైన్యంలో మిలిటరీలో వైద్యురాలిగా పనిచేస్తున్న సమయంలో ఆమె తలకి బలమైన దెబ్బ తగలడంతో ఆమె వినికిడి శక్తి పాక్షికంగా దెబ్బతింది. మరోవైపు 2022 ఫిబ్రవరిలో రష్యా దండయాత్ర ప్రారంభమైంది. ఐదార్ బెటాలియన్‌లో సేవలు అందిస్తున్న సమయంలో, రష్యన్ దళాలు ఆమెను బందీగా పట్టుకున్నాయి. అక్కడ రష్యన్ యుద్ధ ఖైదీలు ఎదుర్కొన్న దారుణమైన పరిస్థితులను అనుభవించింది. తనను పట్టుకున్న సమయంలో, ఒక రష్యన్ సైనికుడు తనపై అత్యాచారం చేశాడని ఆమెచెప్పింది. ఉగ్రవాద ఆరోపణలతో లీలియా రెండున్నర సంవత్సరాల పాటు రష్యన్ బందీగా గడిపారు.ఆమె రష్యన్ నిర్బంధ కేంద్రంలో ఉన్న సమయంలోనే ఆమె చిన్న కుమారుడు 17 ఏళ్ల డిమా తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యన్ ఆక్రమిత ప్రాంతంలో చిక్కుకుపోయాడు.తల్లికి దూరమైన డిమా, ఆక్రమిత ప్రాంతంలో తీవ్ర అనారోగ్యం, ఒంటరితనంతో జీవితాన్ని సాగించాడు. తండ్రి ఇప్పటికే మరణించగా, పెద్ద కొడుకు ఉక్రెయిన్ సైన్యంలో, మధ్య కొడుకు రష్యా సైన్యంలో చేరిపోయారు. దీంతో డిమా తనను తాను పోషించుకునేందుకు ఒంటరి పోరాటమే చేశాడు.చివరికి 2024 సెప్టెంబర్‌లో జరిగిన ఒక ప్రధాన ఖైదీల మార్పిడి కార్యక్రమంలో భాగంగా లిలియా విముక్తి లభించింది. ఉక్రెయిన్‌కు తిరిగి వచ్చిన తరువాత తన సుదీర్ఘ జైలు జీవితం వల్ల కలిగిన శారీరక, మానసిక గాయాల నుండి కోలుకోవడానికి ఆమె కైవ్ వెలుపల ఉన్న ఒక పునరావాస కేంద్రంలో చేరారు. అయితే, తన బిడ్డ తన పక్కన లేడనే బాధం వేధించేది. తన కుమారుడు లేని ఆ స్వేచ్ఛ ఆమెకు పూర్తి సంతోషాన్ని ఇవ్వలేదు.పైగా డిమాకు 20 ఏళ్లు నిండడంతో, అతన్ని బలవంతంగా రష్యన్ సైన్యంలోకి చేర్చుకునే ప్రమాదం ఉందే అందోళన తీవ్రమైంది. అందుకే తన ఆరోగ్యం క్షీణించినా లెక్క చేయకుండా మూడేళ్లపాటు దూరమైన తన కొడుకు డిమాను ఆక్రమిత ప్రాంతం నుండి కాపాడుకోవడానికి, యుద్ధ సరిహద్దులను దాటుతూ లిలియా అత్యంత ప్రమాదకర రక్షణ మిషన్‌ను రూపొందించింది.ప్రమాదకరమైన రక్షణ ప్రణాళికడిమాను తప్పించడానికి లిలియా కీవ్ సమీపంలోని పునరావాస కేంద్రం నుంచే పనిచేయడం ప్రారంభించింది. అతన్ని రష్యన్ సైన్యంలోకి బలవంతంగా చేర్చుకుంటారనే భయంతో, ఆమె ఒక టాక్సీ డ్రైవర్‌కు డబ్బు చెల్లించి అతనికి తాత్కాలిక ఉక్రేనియన్ పాస్‌పోర్ట్‌ను రహస్యంగా అందేలా చేసింది. అలా 2025 ఫిబ్రవరిలో దిమా తన గ్రామం నుంచి బయలుదేరి, రష్యా, బెలారస్, పోలండ్ మీదుగా దాదాపు 1,740 మైళ్ల ప్రయాణం చేసి ఉక్రెయిన్‌లోని కీవ్ చేరుకున్నాడు. దాదాపు మూడేళ్ల తర్వాత రైల్వే స్టేషన్లో శాశ్వత వేదనకు ముగింపు పలుకుతూ తల్లీకొడుకులు కలుసుకోవడం విశేషం. అయితే ఆమెకు మళ్లీ బందీగా ఉన్నట్లు ఆమెకు ఇప్పటికీ కలలు వస్తుంటాయట.ఇదీ చదవండి: త్విషా శర్మ : నన్ను ప్రశాంతంగా చావనివ్వండి : ఆ 90నిమిషాల్లో ఏం జరిగింది?లిలియా ప్రూటియన్, ఆమె 20 ఏళ్ల కుమారుడు డిమా జహ్రెబాయెవ్లగురించి న్యూయార్క్ టైమ్స్ హృదయవిదారక కథనం ప్రచురించింది. ప్రస్తుతం రష్యా నియంత్రణలో ఉన్న ఉక్రెయిన్ భూభాగంలోని 20 శాతం ప్రాంతంలో నెలకొన్న బాధాకరమైన కుటుంబ విభేదాలను వారి కథ ప్రతిబింబిస్తుంది. రష్యా నియంత్రణలో ఉన్న ఉక్రెయిన్‌లోని 20 శాతం భూభాగంలో అనేక కుటుంబాల కథే వారి ఈ ఎడబాటు. లక్షలాది మంది ఆ ఆక్రమిత భూభాగాల నుండి పారిపోయారు, ఇంకా లక్షలాది మంది వెళ్ళడానికి ఇష్టపడక లేదా వెళ్ళలేక అక్కడే ఉండిపోయారు.ఇదీ చదవండి: ప్రియుడితో కలిసి ఘాతుకం : దిండుతో అదిమి భర్త, కొడుకు హత్య -
ఉక్రెయిన్, రష్యా వార్‌లోకి బ్రిటిష్ డ్రోన్ల ఎంట్రీ..! నాటో గగనతలంలోకి రష్యన్ డ్రోన్ ?
-
రష్యా పంజా.. మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు డ్యామేజ్
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మరో కీలక మలుపు తీసుకుంది. తాజా డ్రోన్ల దాడితో ఇరు దేశాల మధ్య మళ్లీ యుద్ధం భీకరంగా మారింది. ఈ క్రమంలో.. క్రివీ రిహ్ స్టీల్ ప్రాంతంలో భారత సంతతికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీ మిట్టల్‌కు చెందిన ఆర్సెలర్ మిట్టల్ ప్లాంట్‌పై రష్యా క్షిపణితో దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందగా.. 14 మంది కార్మికులు గాయపడ్డారు. ఇది ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ స్వస్థలం కూడా!. రష్యా క్షిపణి దాడి కారణంగా.. మిట్టల్ ప్లాంట్‌లోని కీలక ఉత్పత్తి విభాగాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా విద్యుత్ వ్యవస్థలు, బ్లాస్ట్ ఫర్నేస్ కార్యకలాపాలకు సంబంధించిన సదుపాయాలు ప్రభావితమయ్యాయి. దీంతో ఉత్పత్తి ప్రక్రియలను పాక్షికంగా నిలిపివేయాల్సి వచ్చింది. నష్టం తీవ్రతను అంచనా వేసేందుకు అధికారులు, నిపుణులు పరిశీలనలు ప్రారంభించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడిన వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇటు దాడి వల్ల జరిగిన ఆర్థిక నష్టంపై అధికారిక అంచనా ఇంకా వెలువడలేదు. అయితే భారీ పరిశ్రమ అయిన ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిచిపోవడం వల్ల మరమ్మతుల ఖర్చుతో పాటు ఉక్కు ఉత్పత్తి, ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉంది. నష్టం స్థాయిని పరిశీలించిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. 90 ఏళ్ల చరిత్ర.. వెన్నెముకలక్ష్మీ మిట్టల్‌కు చెందిన ఆర్సెలర్ మిట్టల్ క్రివీ రిహ్ స్టీల్ ప్లాంట్ సాధారణ పరిశ్రమ కాదు. దాదాపు 90 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ భారీ ఉక్కు కర్మాగారం నిర్మాణం 1931లో అప్పటి సోవియట్ యూనియన్ హయాంలో ప్రారంభమైంది. 1934 ఆగస్టులో ఇక్కడ తొలి ఉక్కు ఉత్పత్తి జరిగింది. అప్పట్లో క్రివొరిజ్స్టల్ (Kryvorizhstal) పేరుతో కొనసాగిన ఈ ప్లాంట్.. ఉక్రెయిన్ పారిశ్రామిక రంగంలో కీలకమైన సంస్థగా ఎదిగింది.2005లో లక్ష్మీ మిట్టల్ నేతృత్వంలోని మిట్టల్ స్టీల్ సంస్థ ప్రైవేటీకరణ వేలంలో ఈ ప్లాంట్‌ను సుమారు 4.8 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఆర్సెలర్‌తో విలీనం కావడంతో ఇది ఆర్సెలర్ మిట్టల్ క్రివీ రిహ్గా మారింది. స్వాధీనం అనంతరం ఆధునీకరణ, ఉత్పత్తి సామర్థ్యం పెంపు, పర్యావరణ ప్రమాణాల మెరుగుదల కోసం భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇనుప ఖనిజం నుంచి ఉక్కు తయారీ వరకు మొత్తం ప్రక్రియ ఒకేచోట జరిగే ఈ ప్లాంట్.. ఉక్రెయిన్ ఉక్కు పరిశ్రమకు వెన్నెముకలాంటి సంస్థల్లో ఒకటిగా నిలిచింది.ఇలాంటి వ్యూహాత్మక పరిశ్రమపై రష్యా క్షిపణి దాడి జరగడం.. కేవలం ఓ కంపెనీకి జరిగిన నష్టంగానే కాకుండా, యుద్ధ సమయంలో ఉక్రెయిన్ పారిశ్రామిక మౌలిక సదుపాయాలపై పడుతున్న ఒత్తిడికి మరో ఉదాహరణగా మారింది.డ్రోన్ దాడులకు ప్రతీకారమే..ఉక్రెయిన్ రష్యాలోని పలు ప్రాంతాలపై భారీ డ్రోన్ దాడులు చేసిన తర్వాతే ఈ క్షిపణి దాడి జరిగినట్లు స్పష్టమవుతోంది. ఉక్రెయిన్ దాడుల్లో రష్యాలో మరణాలు సంభవించగా.. దీనికి ప్రతీకార చర్యల్లో భాగంగానే మాస్కో ఈ దాడులు చేపట్టింది. అయితే.. తాము ఉక్రెయిన్‌లో సైనిక, పారిశ్రామిక లక్ష్యాలనే టార్గెట్ చేస్తున్నామని రష్యా ఖుల్లాగా ప్రకటించుకుంటోంది. క్రివీ రిహ్‌లోని మెటలర్జికల్ ప్లాంట్ కూడా తమ లక్ష్యాల్లో భాగమని పేర్కొంది. అయితే జెలెన్స్కీ స్వస్థలాన్ని టార్గెట్ చేసి మరీ దాడులు చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. యుద్ధంలో కొత్త దశరష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న కొద్దీ ఇరు దేశాలు సరిహద్దులు దాటి దూర ప్రాంతాలపై దాడులను పెంచుతున్నాయి. సైనిక స్థావరాలతో పాటు విద్యుత్ కేంద్రాలు, ఇంధన వనరులు, పారిశ్రామిక సంస్థలు కూడా లక్ష్యాలుగా మారుతున్నాయి. జెలెన్స్కీ స్వస్థలమైన క్రివీ రిహ్‌పై గతంలోనూ రష్యా దాడులు చేసింది. తాజాగా మిట్టల్ స్టీల్ ప్లాంట్‌పై జరిగిన దాడి.. ఉక్రెయిన్ ఆర్థిక, పారిశ్రామిక వ్యవస్థపై యుద్ధ ప్రభావాన్ని మరోసారి స్పష్టం చేసింది. -
800కు పైగా డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్
కీవ్: ఉక్రెయిన్ సైన్యం సమారా నగరంలోని రష్యా రాకెట్, అంతరిక్ష కేంద్రంపై ఫ్లామింగో క్షిపణులతో దాడి చేసిందని అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ తెలిపారు. ఫ్లామింగో క్షిపణి సుమారు టన్ను పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదని, తక్కువ ఎత్తులో 3,000 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని నివేదికలు తెలిపాయి. రష్యా యుద్ధ విమానాలకు స్థావరంగా ఉన్న సవాస్లేయ్కా సైనిక వైమానిక స్థావరంపై కూడా సైన్యం దాడి చేసిందని జెలెన్స్కీ తెలిపారు. సుదూర దాడుల్లో మంచి ఫలితాలు సాధించినట్లు ఆయన ప్రకటించారు.“మంచి విజయం. మా సరిహద్దు నుంచి దూరం సుమారు 900 కిలోమీటర్లు” అని సమారా దాడి గురించి ఆయన అన్నారు. “ఈ యుద్ధం విషయంలో రష్యాపై మా సుదూర ఆంక్షల ప్రణాళిక అమలవుతోంది. రష్యా యుద్ధ సామర్థ్యం తగ్గించడం ముఖ్యం. శాంతి అవసరం. నిర్దిష్ట స్థావరాలకు స్పష్టమైన నష్టం కలిగించడం ద్వారా ఇది రష్యాలో కనిపించాలి” అని ఆయన అన్నారు.రష్యా నౌకాశ్రయాలపై ఉక్రెయిన్ దాడులు చేస్తున్న సమయంలో డ్రోన్ ఒకటి లాత్వియా గగనతలంలోకి ప్రవేశించడంతో శుక్రవారం నాటో యుద్ధ విమానాలను అత్యవసరంగా రంగంలోకి దింపినట్లు అధికారులు తెలిపారు.దీనికి స్పందనగా లిథువేనియా నుంచి 2 ఇటాలియన్ యూరోఫైటర్ యుద్ధ విమానాలు బయలుదేరాయి. ఎస్టోనియాలోని ఒక స్థావరం నుంచి 2 టర్కీ ఎఫ్-16 యుద్ధ విమానాలను కూడా రంగంలోకి దించినట్లు నాటో ప్రతినిధి అల్లిసన్ హార్ట్ తెలిపారు.బ్రిటిష్ డ్రోన్లను ఉపయోగిస్తున్న ఉక్రెయిన్గత 6 నెలలుగా రష్యా భూభాగంలో సుదూర దాడులు చేసేందుకు ఉక్రెయిన్ బ్రిటిష్ డ్రోన్లను ఉపయోగిస్తున్నట్లు సమాచారం. చాలా దాడులు ఉక్రెయిన్ డ్రోన్లతోనే జరిగినప్పటికీ, బ్రిటిష్ డ్రోన్లు కూడా విజయవంతమైన దాడులు చేశాయని ఉక్రెయిన్ సైనిక వర్గాన్ని ఉటంకిస్తూ ది టైమ్స్ నిన్న నివేదించింది.బ్రిటిష్ డ్రోన్లు మాస్కో సమీపంలోనే కాకుండా యారోస్లావ్, వోల్గోగ్రాడ్ ప్రాంతాల్లోని చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులు చేశాయి. బ్రిటిష్ రాయల్ నేవీ పరీక్షించిన న్యాన్ జెట్ ఇంజిన్ డ్రోన్‌ను రష్యా సరిహద్దుకు సమీపంలోని ఉక్రెయిన్ సరిహద్దు నగరం బెల్గొరోడ్ను లక్ష్యంగా చేసుకునేందుకు కూడా ఉపయోగించినట్లు ఆ పత్రిక తెలిపింది. -
రష్యాకు మైండ్‌బ్లాక్.. మెగా అటాక్‌తో ఉక్కిరిబిక్కిరి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో నల్ల సముద్రం మరోసారి అగ్నిగుండంగా మారింది. రష్యాకు అత్యంత కీలకమైన నోవొరోసిస్క్ నౌకాశ్రయంపై ఉక్రెయిన్ భారీ డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. రష్యా నల్ల సముద్ర నౌకాదళానికి ప్రధాన స్థావరంగా ఉన్న ఈ పోర్టుపై జరిగిన దాడిలో నాలుగు రష్యా యుద్ధనౌకలు దెబ్బతిన్నాయని ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. వాటిలో రెండు ఫ్రిగేట్లు ఉన్నాయని తెలిపింది. అయితే ఈ నష్టంపై రష్యా నుంచి ఇప్పటివరకు పూర్తి స్థాయి అధికారిక ధృవీకరణ రాలేదు.ఈ దాడి సైనిక లక్ష్యాలకే పరిమితం కాలేదు. నోవొరోసిస్క్లోని రెండు ప్రధాన ధాన్యం ఎగుమతి టెర్మినల్స్ కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. దీంతో రష్యా ధాన్యం ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. నల్ల సముద్రం ద్వారా ప్రపంచ మార్కెట్లకు రష్యా భారీగా గోధుమలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. ఇప్పటికే దాడి కారణంగా సరకు రవాణాను బాల్టిక్, కాస్పియన్ సముద్ర నౌకాశ్రయాలతో పాటు భూ మార్గాలకు మళ్లించే అవకాశాలను రష్యా పరిశీలిస్తున్నట్లు వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది.నోవొరోసిస్క్ రష్యాకు సాధారణ వాణిజ్య నౌకాశ్రయం కాదు. క్రిమియాలోని సెవాస్టోపోల్‌పై ఉక్రెయిన్ దాడుల ముప్పు పెరగడంతో రష్యా తన నల్ల సముద్ర నౌకాదళంలోని పెద్ద భాగాన్ని నోవొరోసిస్క్కు తరలించింది. అందువల్ల అక్కడి నౌకాదళ స్థావరంపై దాడి చేయగలిగామని ఉక్రెయిన్ ప్రకటించడం రష్యాకు వ్యూహాత్మకంగా పెద్ద సవాలుగా మారింది. సెవాస్టోపోల్‌ను వదిలి సురక్షిత ప్రాంతంగా భావించిన నోవొరోసిస్క్ కూడా పూర్తిగా సురక్షితం కాదన్న సందేశాన్ని ఈ దాడి ఇచ్చినట్లయింది.‘ప్రత్యేకమైన ఆపరేషన్’..ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ ఈ దాడిని ‘ప్రత్యేకమైన ఆపరేషన్’గా అభివర్ణించారు. రాకెట్లు, వైమానిక డ్రోన్లు, నౌకాదళ డ్రోన్లను కలిపి ఉపయోగించి రష్యా నౌకాదళ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. రష్యా దూకుడు కొనసాగుతున్నంతకాలం ఆ దేశ నౌకాదళం, దానికి మద్దతు ఇచ్చే మౌలిక వసతులు సురక్షితంగా ఉండబోవని హెచ్చరించారు. రాత్రంతా నోవొరోసిస్క్‌లో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు స్థానిక నివేదికలు తెలిపాయి. రష్యా వైమానిక రక్షణ వ్యవస్థలు పలు లక్ష్యాలను కూల్చివేసినట్లు అధికారులు ప్రకటించారు. అయినప్పటికీ డ్రోన్ల దాడి పోర్టు చుట్టుపక్కల ప్రాంతాలను తాకింది. పైప్లైన్లు దెబ్బతినడంతో నగరంలో నీటి సరఫరా నిలిచిపోయింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా నోవొరోసిస్క్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.ఈ దాడి రష్యాకు సైనికంగానే కాకుండా ఆర్థికంగానూ ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంది. రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద గోధుమ ఎగుమతిదారు. నల్ల సముద్రంలోని నౌకాశ్రయాలు ఆ ఎగుమతులకు అత్యంత కీలకం. రెండు ప్రధాన ధాన్యం టెర్మినల్స్ కార్యకలాపాలు నిలిచిపోవడం వల్ల ఎగుమతులపై తక్షణ లాజిస్టికల్ ఒత్తిడి ఏర్పడింది. రష్యా తన సరకు రవాణాను ఇతర సముద్ర మార్గాలకు మళ్లించాల్సి వస్తే రవాణా సమయం, ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. దీని ప్రభావం రష్యా వరకే పరిమితం కాకపోవచ్చు. రష్యా, ఉక్రెయిన్ రెండూ ప్రపంచ ధాన్యం వాణిజ్యంలో కీలక దేశాలు. ముఖ్యంగా ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, ఆసియాలోని అనేక దేశాలు నల్ల సముద్రం నుంచి వచ్చే ధాన్యంపై ఆధారపడుతున్నాయి. యుద్ధం కారణంగా సరఫరా మార్గాల్లో అంతరాయం పెరిగితే ప్రపంచ ఆహార ధరలపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది. -
12 వేల కోట్ల ‘పుతిన్ ప్యాలెస్’ రక్షణ వలయంపై ఉక్రెయిన్ డ్రోన్ల బీభత్సం!
మాస్కో: నల్లసముద్ర తీరంలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు చెందిన అత్యంత విలాసవంతమైన రహస్య ప్యాలెస్‌కు రక్షణగా నిలిచిన అత్యాధునిక ‘ఎస్-400’ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థను ఉక్రెయిన్ డ్రోన్లు విజయవంతంగా ధ్వంసం చేశాయి.దక్షిణ రష్యాలోని గెలెంజిక్ సమీపంలో ఉన్న పుతిన్ భారీ ప్యాలెస్‌కు దాదాపు 12 మైళ్ల దూరంలో ఈ ఎస్-400 ‘ట్రయంఫ్’ లాంచర్‌ను రష్యా మోహరించింది. విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్ల దాడుల నుంచి రక్షణ కల్పించే సామర్థ్యం ఉన్న ఈ వ్యవస్థపై ఉక్రెయిన్ డ్రోన్లు విరుచుకుపడ్డాయి. ఈ దాడి అనంతరం లాంచర్ దాదాపు మూడు గంటల పాటు మంటల్లో కాలిపోయిందని ఉక్రెయిన్ అన్మ్యాన్డ్ సిస్టమ్స్ దళాల కమాండర్ మేజర్ రాబర్ట్ బ్రోవ్డీ వెల్లడించినట్లు ‘ది టెలిగ్రాఫ్’ పత్రిక పేర్కొంది.వాస్తవానికి ఈ ఎస్-400 వ్యవస్థ 27 చదరపు మైళ్ల విమానాల రాకపోకలు నిషేధించిన ప్రాంతం పుతిన్ నివాస భద్రతా వలయంలో భాగంగా ఉంది. అయితే, ఉక్రెయిన్ నగరాలపై విరుచుకుపడేందుకు రష్యా ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను దాడి చేసేందుకు అనువుగా మార్చిందని, ఆగస్టు 8న దీని నుంచే ఆరు క్షిపణులను ప్రయోగించిందని బ్రోవ్డీ ఆరోపించారు. రష్యా వద్ద వ్యూహాత్మక క్షిపణుల కొరత ఏర్పడటంతో ఇలాంటి రక్షణ వ్యవస్థలను కూడా దాడుల కోసం వాడుతోందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.రూ. 12 వేల కోట్ల 'పుతిన్ ప్యాలెస్'దాడి జరిగిన ప్రదేశం ‘పుతిన్ ప్యాలెస్’గా పిలిచే భారీ ఇటాలియన్ శైలి భవన సముదాయానికి సమీపంలో ఉంది. ఈ ఎస్టేట్ విలువ దాదాపు రూ. 12,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. 2021లో దివంగత రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నవల్నీ నేతృత్వంలోని యాంటీ-కరప్షన్ ఫౌండేషన్ ఈ ప్యాలెస్‌కు సంబంధించిన విలాసాలను బయటపెట్టింది. ఈ ఎస్టేట్‌లో క్యాసినో, వైన్యార్డ్, స్పా, ఐస్ రింక్, థియేటర్, పోల్-డ్యాన్సింగ్ రూమ్, హుక్కా లాంజ్, అక్వాటిక్ డిస్కోతో పాటు చిన్న రైళ్ల కోసం ప్రత్యేక గది కూడా ఉన్నట్లు నివేదికలు తెలిపాయి. ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి డ్రోన్ దాడుల ముప్పు పెరగడంతో పుతిన్ ప్రస్తుతం ఈ నల్లసముద్ర నివాసానికి చాలా అరుదుగా వస్తున్నారని, మాస్కోకు తూర్పున ఉన్న వాల్డాయ్ సరస్సు వద్ద గల కట్టుదిట్టమైన డాచా (విశ్రాంతి భవనం)లోనే ఎక్కువగా గడుపుతున్నారని సమాచారం.రష్యా లోపలికి చొచ్చుకెళ్తున్న ఉక్రెయిన్ డ్రోన్లుఇటీవలి కాలంలో రష్యా సైనిక, ఇంధన మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ భారీ స్థాయిలో డ్రోన్ దాడులను విస్తరించింది. ఆక్రమిత క్రిమియాలో రెండు ఎస్-400 లాంచర్లను, ఓరియన్ డ్రోన్ల కంట్రోల్ యాంటెన్నాను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ తెలిపింది. మరోవైపు రష్యాలోని టాటర్‌స్తాన్‌లో ఉన్న చమురు శుద్ధి కర్మాగారంపై 450కి పైగా ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేయడంతో 13 మంది మరణించారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా భూభాగంలో జరిగిన అత్యంత తీవ్రమైన దాడుల్లో ఇది ఒకటిగా నిలిచింది. సైబీరియాలోని త్యుమెన్ వరకు డ్రోన్ శకలాలు పడినట్లు సమాచారం. -
రష్యా తరఫున రంగంలోకి మాజీ సీజేఐ చంద్రచూడ్!
మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ మరో కీలక అంతర్జాతీయ బాధ్యతను చేపట్టారు. రష్యా–ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న న్యాయ వివాదంలో రష్యా తరఫున ఆర్బిట్రేటర్‌గా ఆయన నియమితులైనట్లు సమాచారం. ప్రభుత్వ బ్యాంకు ఓష్చాడ్‌బ్యాంక్ (Oschadbank) దాఖలు చేసిన పెట్టుబడి వివాదానికి సంబంధించిన కేసులో ఈ నియామకం జరిగింది.ఈ వివాదం 1998 రష్యా–ఉక్రెయిన్ ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం (BIT) కింద విచారణకు వస్తోంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా బ్యాంకు ఆస్తులు, వ్యాపార కార్యకలాపాలకు జరిగిన నష్టమే ఈ కేసుకు కేంద్రంగా ఉంది. ఈ మేరకు గ్లోబల్ ఆర్బిట్రేషన్ రివ్యూ (Global Arbitration Review) నివేదికను ఉటంకిస్తూ బార్ అండ్ బెంచ్ ఓ కథనం ఇచ్చింది.భారీ నష్టం అంటూ బ్యాంకు క్లెయిమ్ఉక్రెయిన్ ప్రభుత్వ ఆధీనంలోని ఓష్చాడ్‌బ్యాంక్.. డొనెట్స్క్, లుహాన్స్క్, ఖెర్సాన్, జపోరిజ్జియా ప్రాంతాల్లోని తన ఆస్తులు, వ్యాపార కార్యకలాపాలను రష్యా సైనిక చర్యల కారణంగా కోల్పోయినట్లు పేర్కొంటోంది. 2022లో రష్యా పూర్తి స్థాయి సైనిక దాడి ప్రారంభించిన తర్వాత ఈ నష్టం జరిగిందని బ్యాంకు వాదిస్తోంది. ఈ నేపథ్యంలో పరిహారం కోరుతూ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించింది. బ్యాంకు చేసిన క్లెయిమ్ విలువ వందల మిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నట్లు సమాచారం.2025 జూలైలో ఓష్చాడ్‌బ్యాంక్ రష్యాకు వివాదానికి సంబంధించిన నోటీసు పంపినప్పటికీ.. రష్యా స్పందించకపోవడంతో ఆర్బిట్రేషన్ ప్రక్రియ మొదలైనట్లు నివేదికలు చెబుతున్నాయి.ముగ్గురు సభ్యులతో ట్రిబ్యునల్ఈ కేసును ముగ్గురు సభ్యులతో కూడిన ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ విచారించనుంది. కోస్టారికా మాజీ వాణిజ్య మంత్రి, ఆర్బిట్రేటర్ డయాలా జిమెనెజ్ను రష్యా, ఓష్చాడ్‌బ్యాంక్ సంయుక్తంగా ట్రిబ్యునల్ అధ్యక్షురాలిగా ఎంపిక చేశాయి. మరో సభ్యుడిగా ఓష్చాడ్‌బ్యాంక్ తరఫున గ్రీస్‌కు చెందిన ఆర్బిట్రేటర్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రొఫెసర్ స్టావ్రోస్ బ్రెకౌలాకిస్‌ను ఎంపిక చేశారు. రష్యా తరఫున మూడో సభ్యుడిగా మాజీ సీజేఐ చంద్రచూడ్‌ను నియమించింది.అప్పట్లో తిరస్కరణచంద్రచూడ్కు రష్యా తరఫున అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ వ్యవహారాల్లో ఇది తొలి పరిచయం కాదని నివేదికలు చెబుతున్నాయి. గతంలో వింటర్‌షాల్ డియా అనే చమురు, గ్యాస్ సంస్థకు సంబంధించిన వివాదం, అలాగే ఉక్రెయిన్ ప్రభుత్వ విద్యుత్ ప్రసార సంస్థ ఉక్రెనెర్గోకు సంబంధించిన ఒప్పంద వివాదాల్లో రష్యా తరఫున ఆర్బిట్రేటర్‌గా వ్యవహరించాలంటూ ఆయనను సంప్రదించినట్లు సమాచారం. అయితే ఆ ప్రతిపాదనలను చంద్రచూడ్ గతంలో తిరస్కరించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.ఇక ఆ సమయంలో పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (PCA) ఆయనను వింటర్‌షాల్ కేసులో నియామక అధికారిగా ఎంపిక చేసిన రోజే రష్యా నుంచి ఈ సంప్రదింపులు వచ్చినట్లు సమాచారం. ఆ విషయాన్ని వెల్లడించిన అనంతరం చంద్రచూడ్ ఆ బాధ్యత నుంచి తప్పుకున్నట్లు నివేదికలు తెలిపాయి.యుద్ధం.. లీగల్వార్.. ఇప్పుడు చంద్రచూడ్రష్యా–ఉక్రెయిన్ యుద్ధం సైనిక రంగానికే పరిమితం కాకుండా అంతర్జాతీయ న్యాయస్థానాలు, పెట్టుబడి వివాదాల వరకు విస్తరించింది. యుద్ధం కారణంగా ఆస్తులు, వ్యాపారాలు, పెట్టుబడులకు జరిగిన నష్టాలపై ఇరు దేశాలకు చెందిన సంస్థలు అంతర్జాతీయ వేదికలను ఆశ్రయిస్తున్నాయి. అలాంటి కీలక వివాదంలో మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ రష్యా తరఫున ఆర్బిట్రేటర్‌గా నియమితులు కావడం ఇప్పుడు అంతర్జాతీయ న్యాయవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. -
రష్యాపై ఉక్రెయిన్ భీకర డ్రోన్ దాడి
కీవ్: ఉక్రెయిన్ తన లాంగ్రేంజ్ డ్రోన్ల సత్తాను మరోసారి రష్యాకు రుచి చూపింది. ఆదివారం రాత్రి రష్యాలోని టాటార్‌స్తాన్ ప్రాంతంలోని నిజ్నెకామ్స్క్ నగరంపై పాల్పడిన డ్రోన్‌లో 13 మంది ప్రాణాలు కోల్పోగా, 48 మంది గాయాలపాలయ్యారు. సోమవారం ఉదయం చోటుచేసుకున్న ఈ దాడి ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. అయితే, రష్యా చమురు ప్లాంట్లను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించుకుంది. ఉక్రెయిన్ సరిహద్దుకు 1,200 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిజ్నెకామ్స్క్ నగర జనాభా 2.40 లక్షలు.నగరంలో రెండు అత్యాధునిక, అతిపెద్ద ఆయిల్ రిఫైనరీలతోపాటు ఒక పెట్రో కెమికల్ ప్లాంటు ఉన్నాయి. ఉక్రెయిన్ తరచుగా రష్యా ఇంధన మౌలిక వనరులే లక్ష్యంగా దాదాపు ప్రతి రోజూ దాడులకు పాల్పడుతుండటం తెల్సిందే. రష్యాలో చమురు శుద్ధి కర్మాగారాలు దెబ్బతినడంతో ఇంధన కొరత తలెత్తింది. ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నాలుగేళ్ల యుద్ధానికి ముగింపు పలుకుతూ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను చర్చలకు దిగేలా చేయడమే తమ దాడుల లక్ష్యమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంటున్నారు. ‘రష్యా పాల్పడిన ప్రతి దాడికీ ధీటుగా మేం బదులిస్తాం. యుద్ధం ప్రభావం రష్యన్లకు కూడా తెలిసేలా చేస్తాం’అని ఆయన వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ దేశీయంగా అభివృద్ధి చేసుకున్న లాంగ్ రేంజ్ డ్రోన్లతో రష్యాలోని సుదూర ప్రాంతాలపైనా దాడులకు పాల్పడుతోంది. సరిహద్దు నుంచి సుమారు 2 వేల కిలోమీటర్ల దూరంలో గల సైబీరియా ప్రాంతంపైనా ఇటీవల దాడి చేసింది. కాగా, ఉక్రెయిన్‌కు గగనతల రక్షణ వ్యవస్థల కొరత తీవ్రంగా ఉందని తెలిసిన రష్యా నిత్యం శక్తివంతమైన గ్లైడ్ బాంబులు, రకరకాల క్షిపణులు, డ్రోన్లతో పౌర ఆవాసాలపై దాడులు చేస్తోంది. ఉక్రెయిన్‌లోని నీప్రో ప్రాంతంలో ఉన్న తమ రెండు గోదాములపై రష్యా 24 గంటల వ్యవధిలో రెండుసార్లు దాడులకు పాల్పడిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సోమవారం వెల్లడించింది. ఈ దాడుల్లో యుద్ధ క్షేత్రంలోని వారికి ఉద్దేశించిన 5 లక్షల డాలర్ల విలువైన అత్యవసర సాగ్రి ధ్వంసమైందని తెలిపింది. ప్రాణనష్టం మాత్రం సంభవించలేదంది. కాగా, ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు వివిధ ప్రాంతాలపైకి ఉక్రెయిన్ ప్రయోగించిన 450కిపైగా డ్రోన్లను మధ్యలోనే కూల్చినట్లు రష్యా తెలిపింది. ఇలా ఉండగా, రష్యాలోని సరిహద్దు బెల్గొరోడ్ ప్రాంతంపై ఉక్రెయిన్ గత 24 గంటల్లో జరిపిన దాడుల్లో మరో నలుగురు చనిపోయారని అధికారులు తెలిపారు. -
పుతిన్ యుద్ధాన్ని తీవ్రతరం చేస్తున్నారు.. జెలెన్స్కీ
కీవ్:ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన ప్రకటన చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. దీనికొరకే త్వరలో భారీ స్థాయిలో సైనికుల సమీకరణ చేపట్టబోతున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్‌లో జరిగే రష్యా దిగువ సభ ఎన్నికల తర్వాత ఈ ఆపరేషన్ చేపట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు.ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ మధ్య తీవ్ర ఉద్రిక్తకర పరిస్థితులు నడుస్తున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా ఇటీవల వరుసగా డ్రోన్ దాడులు చేస్తోంది. ఈ దాడులలో పెద్దఎత్తున పౌరులు ప్రాణాలు వదులుతున్నారు. తాజాగా ఈ రోజు (సోమవారం) రష్యాలోని తతార్‌స్తాన్ ప్రాంతంపై ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడిలో కనీసం 13 మంది మరణించారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్ జరిపిన అత్యంత ప్రాణాంతక దాడుల్లో ఇది ఒకటిగా చెబుతున్నారు. అదే సమయంలో ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ ప్రాంతంలో రష్యా జరిపిన ఆర్టిలరీ దాడిలో ఐదుగురు మరణించారు. ఈ ఉద్రిక్తతల నడుమ జెలెన్స్కీ సంచలన ప్రకటన చేశారు. రష్యా అధ్యక్షుడు యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉందన్నారు. జెలెన్స్కీ మాట్లాడుతూ.. "రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది. ఇందుకోసం 5 లక్షల మంది కొత్త సైనికులను సమీకరించేందుకు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ 21న జరిగే రష్యా డ్యూమా ఎన్నికల తర్వాత ఈ సమీకరణ చేపట్టాలని పుతిన్ భావిస్తున్నారు. రష్యా ప్రజల్లో వ్యతిరేకత భయంతో పుతిన్ ఈ ప్రక్రియను బహిరంగంగా చేపట్టకపోవచ్చు" అని జెలెన్స్కీ పేర్కొన్నారు.కాగా ఇటీవల టర్కీ విదేశాంగశాఖ మంత్రి హకాన్ ఫిదాన్ సంచలన ప్రకటన చేశారు." ఉక్రెయిన్ రష్యా భూభాగంలోకి సుదూర డ్రోన్ దాడులను పెంచుతున్న నేపథ్యంలో పుతిన్ అణ్వాయుధాలను ప్రయోగించే పరిస్థితి రావచ్చని హెచ్చరించారు. యుద్ధం ముందు వరుస నుంచి రష్యా భూభాగంలోకి కూడా తీవ్రంగా విస్తరిస్తే, రష్యా తన ఉనికినే కాపాడుకునే చివరి మార్గంగా అణ్వాయుధాలను ఉపయోగించే ప్రమాదం ఉంది" అని ఆయన అన్నారు. -
రష్యా నుంచి భారత్‌కు రైలు.. కొత్త కారిడార్ ప్లాన్?
మాస్కో: సముద్ర మార్గాల్లో ఎదురవుతున్న రవాణా ముప్పును అధిగమించేందుకు హిందూ మహాసముద్రానికి ఒక ప్రత్యక్ష రైల్వే కనెక్షన్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని రష్యా పరిశీలిస్తున్నట్లు ఆ దేశ ఉప ప్రధాని మరాత్ ఖుస్నుల్లిన్ తెలిపారు. తుర్క్మెనిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ల మీదుగా వెళ్లే భూమార్గ కారిడార్ల సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నట్లు ఆయన తెలిపారు. బోస్ఫరస్, హోర్ముజ్ జలసంధి వంటి కీలకమైన వ్యూహాత్మక సముద్ర మార్గాల్లో తలెత్తుతున్న రవాణా ప్రమాదాల నేపథ్యంలో ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది.వార్తా సంస్థ ‘టాస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖుస్నుల్లిన్ ఈ విషయాలను వెల్లడించినట్లు ‘ఏఎన్ఐ’ వార్తా సంస్థ తెలిపింది. జలమార్గాల్లో ఎదురవుతున్న అంతరాయాల నుండి రష్యా రవాణా రక్షణను మెరుగుపరిచేందుకు ఈ ప్రత్యామ్నాయ మార్గాల అభివృద్ధి దోహదపడుతుందని మరాత్ ఖుస్నుల్లిన్ అన్నారు. భారత్‌తో కనెక్టివిటీని పెంపొందించే ఏ మార్గమైనా ఆచరణాత్మకమైనదిగా పరిగణిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ నెట్వర్క్ కనుక భవిష్యత్తులో రూపుదిద్దుకుంటే, రష్యా- భారత్ మధ్య నేరుగా వస్తువుల రవాణాకు ఒక ప్రత్యామ్నాయ భూమార్గ రైల్వే మార్గం అందుబాటులోకి రానుంది.ఈ ప్రతిపాదన సంప్రదాయ సముద్ర మార్గాలకు అతీతంగా కనెక్టివిటీని నిర్మించడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. నల్ల సముద్రాన్ని మధ్యధరా సముద్రంతో కలిపే బోస్ఫరస్ జలసంధి, ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన మార్గమైన హోర్ముజ్ జలసంధి వ్యూహాత్మకంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. హిందూ మహాసముద్రం మీదుగా భారత్‌కు సరుకులను తరలించడంలో మరింత వెసులుబాటును కల్పించే మార్గాలపై రష్యా పరిశీలిస్తున్నదని ఖుస్నుల్లిన్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.అయితే, తుర్క్మెనిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ , పాకిస్తాన్ ల గుండా వెళ్లే ఈ కారిడార్ బహుళ దేశాల గుండా సాగాల్సి ఉంటుంది. దీనికి గణనీయమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, దేశాల మధ్య సమన్వయం అవసరమవుతాయి. ఒకవేళ ఈ ప్రతిపాదిత రైల్వే నెట్వర్క్ సాకారమైతే, ప్రమాదకరమైన సముద్ర రవాణా మార్గాలపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ రష్యాకు భారత్‌తో ప్రత్యామ్నాయ భూమార్గ రవాణా మార్గం ఏర్పాటవుతుంది. ఇది కూడా చదవండి: ‘నో మ్యాన్స్ ల్యాండ్’.. ఈ భూమిపై ఎవరికీ హక్కు లేదా? -
రష్యా, ఉక్రెయిన్ల దాడుల్లో ఏడుగురు మృతి
కీవ్: రష్యా, ఉకెయ్రిన్ల పరస్పర దాడుల్లో కనీసం ఏడుగురు చనిపోగా, పదులసంఖ్యలో క్షతగాత్రులయ్యారు. రష్యా సరిహద్దుల్లోని బెల్గొరోడ్‌పై ఉక్రెయిన్ చేపట్టిన డ్రోన్ దాడుల్లో నాలుగేళ్ల చిన్నారి సహా ఐదుగురు చనిపోగా, మరో 25 మంది వరకు గాయపడ్డారు. రష్యా క్షిపణి దాడుల్లో ఉక్రెయిన్‌లో ఖర్కీవ్‌లో ఇద్దరు చనిపోగా, 13 మంది గాయపడ్డారు. తీర నగరం ఒడెసాపై జరిగిన మరో దాడిలో 8 మంది గాయపడ్డారు. ఒడెసా చుట్టుపక్కల ప్రాంతాలపై రష్యా డజన్లకొద్దీ క్షిపణలను ప్రయోగించిందని స్థానిక యంత్రాంగం పేర్కొంది. ఇలా ఉండగా, ఉక్రెయిన్ డ్రోన్ సరిహద్దుల్లోని తమ గ్రామంపై పడిందని మాల్దోవా తెలిపింది. ఘటనలో ఎవరికీ అపాయం వాటిల్లలేదని పేర్కొంది. -
తణుకు అబ్బాయి.. రష్యా అమ్మాయి
పశ్చిమగోదావరి: తణుకు అబ్బాయి.. రష్యా దేశ అమ్మాయి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తణుకు పట్టణానికి చెందిన సిర్రా బ్రహ్మయ్య కుమారుడు జానకి రామ్ పాల్, రష్యా దేశానికి చెందిన అనస్తాసియా డానిలోవా వివాహం శనివారం స్థానిక వీకే ఫంక్షన్ హాలులో క్రైస్తవ సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. నాలుగేళ్ల క్రితం జానకి రామ్ పాల్ బైబిల్ కోర్సులో శిక్షణ పొందేందుకు రష్యా దేశానికి వెళ్లారు.అక్కడ అనస్తాసియా డానిలోవాతో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా స్నేహంగా, అనంతరం ప్రేమగా మారడంతో ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ ప్రేమ విషయాన్ని ఇరువురి కుటుంబ సభ్యులకు తెలియజేయగా, వారు కూడా సానుకూలంగా అంగీకరించారు. దీంతో రష్యా నుంచి వచ్చిన అనస్తాసియా కుటుంబ సభ్యులు, తణుకుకు చెందిన రామ్ పాల్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. -
పుతిన్ నెక్స్ట్ టార్గెట్ అదేనా?.. అమెరికా నిఘా వర్గాల సంచలన అంచనా
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై అమెరికా నిఘా వర్గాల సంచలన ఆరోపణలు చేశాయి. పుతిన్.. నాటో కూటమి ఐక్యతను, దాని సమిష్టి రక్షణ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఆ కూటమిలోని ఓ సభ్యదేశంపై పరిమిత స్థాయి దాడికి పాల్పడే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాల పేర్కొంటున్నాయి. సైబర్ దాడులు, రహస్య కార్యకలాపాలు, హైబ్రిడ్ ఆపరేషన్లు లేదా చిన్న స్థాయి సైనిక చొరబాటు రూపంలో ఈ చర్య ఉండొచ్చని అమెరికా అధికారులు భావిస్తున్నట్లు ది వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం నివేదించింది.ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా నిమగ్నమై ఉన్నంతకాలం నాటోతో నేరుగా తలపడేందుకు పుతిన్ ప్రయత్నించరని గతంలో అమెరికా అధికారులు భావించారు. అయితే, తాజాగా ఆ అంచనాలో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ డ్రోన్ దాడులు రష్యా సైనిక స్థావరాలు, చమురు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం, యుద్ధంలో రష్యా భారీ నష్టాలను ఎదుర్కోవడం వంటి పరిణామాలను అమెరికా నిఘా వర్గాలు పరిగణనలోకి తీసుకుంటున్నాయి.రష్యా చర్యకు దిగితే భూభాగాన్ని ఆక్రమించుకోవడం కంటే నాటోలోని దేశాల మధ్య విభేదాలు సృష్టించడం, కూటమి స్పందనను పరీక్షించడమే లక్ష్యం కావచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇలాంటి చర్యలు 2026 నవంబర్ నుంచి 2029 మధ్య ఎప్పుడైనా చోటుచేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే నేరుగా భూదాడి చేసే అవకాశం తక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. నాటో ఆర్టికల్ 5 ప్రకారం ఒక సభ్యదేశంపై సాయుధ దాడిని మొత్తం కూటమిపై దాడిగా పరిగణించే అవకాశం ఉండటమే దీనికి కారణం. అలా జరిగితే రష్యా-నాటో మధ్య ప్రత్యక్ష యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది.అలాంటి పరిస్థితుల్లో నాటో ఎలాంటి చర్య తీసుకుంటుందన్నదే కీలకంగా మారనుంది. కాగా, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నాటో ఇప్పటికే స్పష్టం చేసింది. వివిధ రకాల పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, అవసరమైనప్పుడు నిరోధించేందుకు, రక్షించేందుకు సిద్ధంగా ఉన్నామని నాటో ప్రతినిధి కల్నల్ మార్టిన్ ఓ డొన్నెల్ తెలిపారు.ఇదిలా ఉండగా అమెరికా కీలక ఆయుధాల నిల్వలపైనా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉక్రెయిన్‌కు సంవత్సరాలుగా అందించిన సైనిక సహాయం, ఇటీవల ఇరాన్‌కు సంబంధించిన సైనిక చర్యల కారణంగా కొన్ని కీలక ఆయుధాల నిల్వలు తగ్గినట్లు అధికారులు, రక్షణ నిపుణులు చెబుతున్నారు. ప్రెసిషన్ స్ట్రైక్ మిసైల్స్, ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టమ్స్ (ATACMS), స్టింగర్ క్షిపణులతో పాటు పేట్రియాట్, SM-3, THAAD వంటి వాయు రక్షణ ఇంటర్సెప్టర్ల నిల్వలపైనా ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. రష్యా-నాటో మధ్య ప్రత్యక్ష ఘర్షణ ఏర్పడితే దాని ప్రభావం యూరప్‌కే పరిమితం కాకుండా ప్రపంచ భద్రతా వ్యవస్థపై పడే అవకాశం ఉంది. -
బిల్లు పాస్.. భారత్‌పై ట్రంప్ 100% టారిఫ్ అస్త్రం!
ఉక్రెయిన్ యుద్ధానికి రష్యాకు అందుతున్న ఆర్థిక వనరులను దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీ సుంకాలు విధించే అధికారాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇచ్చే బిల్లును అమెరికా సెనేట్ ఆమోదించింది. ఈ పరిణామం ఇప్పుడు ప్రపంచ ఇంధన మార్కెట్లలోనే కాకుండా భారత్-అమెరికా వాణిజ్య సంబంధాల్లోనూ చర్చకు దారితీసింది.రష్యా ఇంధన ఆదాయాన్ని తగ్గించడం ద్వారా మాస్కోపై ఒత్తిడి పెంచాలన్నది అమెరికా వ్యూహం. అయితే ఈ బిల్లు చట్టంగా మారి అమల్లోకి వస్తే.. రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనా వంటి దేశాలు కొత్త ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశం ఉంది.ఏమిటీ రష్యా శాంక్షన్స్ బిల్లు?అమెరికా సెనేట్ ఆమోదించిన ఈ బిల్లు పేరు “లిండ్సే ఓ. గ్రాహమ్ శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026”. రష్యా చమురు, గ్యాస్ ద్వారా వస్తున్న ఆదాయాన్ని తగ్గించడం, ఉక్రెయిన్‌పై యుద్ధానికి ఉపయోగపడుతున్న ఆర్థిక వనరుల ప్రవాహాన్ని అడ్డుకోవడం ఈ బిల్లు ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.ఈ బిల్లు సెనేట్‌లో 86-11 ఓట్లతో భారీ మెజారిటీతో ఆమోదం పొందింది. ఇక ఇది అమెరికా ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) ఆమోదం పొందాల్సి ఉంది. అక్కడ కూడా ఆమోదం లభిస్తే అధ్యక్షుడు ట్రంప్ సంతకం తర్వాత ఇది చట్టంగా మారనుంది.అయితే.. ఈ బిల్లు పేరులో ఇరాన్ ఉన్నప్పటికీ ప్రస్తుత పరిణామాల్లో ప్రధాన దృష్టి రష్యా చమురు ఆదాయాన్ని అడ్డుకోవడంపైనే ఉంది. రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేసే దేశాలపై టారిఫ్‌లు విధించే అధికారం ట్రంప్‌కు ఇవ్వడమే ఈ బిల్లులో అత్యంత కీలక అంశంగా మారింది.రష్యా ఇంధనం కొనే దేశాలపై టారిఫ్ పిడుగురష్యా చమురు, సహజ వాయువు కొనుగోలు చేస్తున్న దేశాలపై ఒత్తిడి పెంచడం ద్వారా మాస్కో ఆదాయానికి గండికొట్టాలని అమెరికా భావిస్తోంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే.. రష్యా ఇంధనాన్ని అత్యధికంగా కొనుగోలు చేసే టాప్ ఐదు దేశాలపై అమెరికా అధ్యక్షుడికి 100 శాతం వరకు టారిఫ్‌లు విధించే అధికారం లభిస్తుంది.అంటే రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగించే దేశాల నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై భారీ సుంకాలు విధించే అవకాశం ఉంటుంది. దీంతో ఇంధన కొనుగోళ్ల అంశం కేవలం ఆర్థిక వ్యవహారంగా కాకుండా అంతర్జాతీయ దౌత్య అంశంగా మారనుంది.భారత్, చైనాలపైనే ఎందుకు గురి?ప్రస్తుతం రష్యా చమురు, గ్యాస్‌కు అతిపెద్ద కొనుగోలుదారుల జాబితాలో చైనా, భారత్, అజర్బైజాన్, హంగేరీ, స్లోవేకియా ఉన్నాయి. ఈ దేశాల ఇంధన కొనుగోళ్లే రష్యా ఆర్థిక వ్యవస్థకు కీలక మద్దతుగా మారాయని అమెరికా వాదిస్తోంది.2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత పాశ్చాత్య దేశాలు మాస్కోపై అనేక ఆంక్షలు విధించాయి. అయితే రష్యా చమురు తక్కువ ధరకు లభించడంతో భారత్, చైనా వంటి దేశాలు కొనుగోళ్లను కొనసాగించాయి. దీంతో రష్యా ఇంధన ఆదాయాన్ని పూర్తిగా నిలువరించాలన్న అమెరికా ప్రయత్నాల్లో ఈ దేశాలు ప్రధానంగా మారాయి.భారత్‌కు అసలు పరీక్ష ఎక్కడ?రష్యా చమురు భారత్‌కు గత కొన్నేళ్లుగా కీలక ఇంధన వనరుగా మారింది. తక్కువ ధరకు ముడి చమురు లభించడం వల్ల దేశ ఇంధన అవసరాలను తీర్చుకోవడంలో ఇది ఉపయోగపడుతోంది. 2026 జూన్‌లో భారత్ రష్యా ముడి చమురు కొనుగోళ్లు భారీగా పెరిగాయి. మే నెలతో పోలిస్తే 34 శాతం పెరిగి 4.5 బిలియన్ యూరోలకు చేరినట్లు నివేదికలు పేర్కొన్నాయి.అయితే ఇప్పుడు భారత్ ముందు రెండు కీలక అంశాలు నిలిచాయి. ఒకవైపు తక్కువ ధరకు లభించే రష్యా చమురు ద్వారా ఇంధన భద్రతను కొనసాగించాల్సి ఉంది. మరోవైపు అమెరికాతో ఉన్న వ్యూహాత్మక, వాణిజ్య సంబంధాలను కూడా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.చైనాపైనా భారీ ప్రభావంఈ బిల్లు ప్రభావం ఎక్కువగా చైనాపై ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రష్యా శిలాజ ఇంధనాల అతిపెద్ద కొనుగోలుదారుగా చైనా కొనసాగుతోంది. 2026 జూన్ గణాంకాల ప్రకారం రష్యా ఇంధన ఎగుమతుల నుంచి వచ్చే ఆదాయంలో చైనా వాటా గణనీయంగా ఉంది. ఐదు అతిపెద్ద కొనుగోలుదారుల ఆదాయంలో 41 శాతం చైనా నుంచే వచ్చినట్లు విశ్లేషణలు చెబుతున్నాయి.రష్యా చమురు ఎగుమతుల్లో చైనా దాదాపు సగం కొనుగోలు చేస్తుండగా.. భారత్ కూడా 36 శాతం వాటాతో కీలక కొనుగోలుదారుగా ఉంది. దీంతో ఈ బిల్లు రష్యాపైనే కాకుండా అమెరికా-చైనా వాణిజ్య సంబంధాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.లిండ్సే గ్రాహమ్ పేరుతో ఎందుకు?ఈ బిల్లుకు రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహమ్ కీలక రూపకర్తల్లో ఒకరు. ఉక్రెయిన్ పర్యటన అనంతరం జూలై 11న ఆయన ఆకస్మికంగా మరణించారు. అయినప్పటికీ ఆయన రూపొందించిన ఆంక్షల ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లాలని రెండు పార్టీల నేతలు నిర్ణయించారు. ఆయనకు గౌరవంగా ఈ బిల్లుకు ఆయన పేరు పెట్టారు.పుతిన్, రష్యా సంస్థలపైనా చర్యలుఈ బిల్లు కేవలం రష్యా చమురు కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకోవడం మాత్రమే కాదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉన్నతాధికారులు, సంపన్న వర్గాలు, ఆర్థిక సంస్థలపై కూడా ఆంక్షలు విధించే నిబంధనలు ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా అంతర్జాతీయ ఆంక్షలను తప్పించుకునేందుకు రష్యా ఉపయోగిస్తున్న “షాడో ఫ్లీట్” చమురు నౌకల నెట్‌వర్క్‌పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.500 శాతం నుంచి 100 శాతానికి తగ్గిన టారిఫ్ ప్రతిపాదనఈ బిల్లు మొదటి రూపంలో మరింత కఠినంగా ఉంది. రష్యా ఇంధనం కొనుగోలు చేసే దేశాలపై ఏకంగా 500 శాతం వరకు టారిఫ్‌లు విధించే ప్రతిపాదన ఉండేది. అయితే అమెరికా ప్రభుత్వం, చట్టసభ సభ్యుల మధ్య జరిగిన చర్చల తర్వాత దీనిని సవరించారు. చివరకు రష్యా ఇంధన కొనుగోలుదారులపై గరిష్ఠ టారిఫ్‌ను 100 శాతానికి పరిమితం చేశారు.ట్రంప్‌కు అధికారం ఇవ్వడంపై విమర్శలుఈ బిల్లుకు అమెరికాలోనే భిన్న స్పందనలు వస్తున్నాయి. కొందరు డెమొక్రాట్లు ట్రంప్‌కు విస్తృత టారిఫ్ అధికారాలు ఇవ్వడం ప్రమాదకరమని అభిప్రాయపడుతున్నారు. టారిఫ్‌ల భారం చివరకు అమెరికా వ్యాపారాలు, వినియోగదారులపైనే పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ఈ చర్య అవసరమని బిల్లు మద్దతుదారులు వాదిస్తున్నారు.ఇక ముందు ఏం జరగనుంది?ప్రస్తుతం ఈ బిల్లు అమెరికా ప్రతినిధుల సభ ముందుకు వెళ్లనుంది. అక్కడ కూడా ఆమోదం పొందితే ట్రంప్ సంతకం తర్వాత ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే అసలు ప్రశ్న.. ట్రంప్ ఈ అధికారాన్ని వెంటనే ఉపయోగిస్తారా? లేదంటే భారత్, చైనా వంటి దేశాలతో చర్చలు, మినహాయింపులు, దౌత్య మార్గాలను ఎంచుకుంటారా? అన్నదే. అయితే..టారిఫ్‌లు అమల్లోకి రాకముందే వాటి ప్రభావం మొదలయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే అమెరికా చర్యల భయంతో చమురు కంపెనీలు, బ్యాంకులు, షిప్పింగ్ సంస్థలు తమ భవిష్యత్ వ్యూహాలను మార్చుకునే అవకాశం ఉంది.రష్యా చమురు ఆదాయాన్ని అడ్డుకోవాలన్న అమెరికా వ్యూహం ఇప్పుడు భారత్, చైనా వంటి దేశాలకు కొత్త ఆర్థిక పరీక్షగా మారింది. ట్రంప్ తీసుకునే తదుపరి నిర్ణయాలపైనే ప్రపంచ ఇంధన మార్కెట్లు, అంతర్జాతీయ వాణిజ్య సంబంధాల భవిష్యత్ ఆధారపడనుంది. -
అమెరికాకు కొత్త పవర్.. చైనా, రష్యాకు వార్నింగ్ బెల్స్?
ప్రపంచ భద్రతా సమీకరణాలను మార్చే నిర్ణయం దిశగా అమెరికా అడుగులు వేస్తోందా? చైనా లేదా రష్యాతో యుద్ధం జరిగితే ఇప్పటివరకు ఉన్న అణు వ్యూహాన్ని పూర్తిగా మార్చాలని పెంటగాన్ ఆలోచిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీర్ఘ శ్రేణి అణు క్షిపణులకే పరిమితం కాకుండా, యుద్ధభూమిలో వినియోగించే టాక్టికల్ అణు ఆయుధాలకు ప్రాధాన్యం పెంచే ప్రతిపాదనపై సమీక్ష జరుగుతున్నట్లు సమాచారం. ఈ మార్పు అమల్లోకి వస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సంక్షోభ సమయంలో మరిన్ని సైనిక ఎంపికలు లభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ప్రతిపాదనపై మద్దతుతో పాటు తీవ్ర విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.ప్రస్తుతం అమెరికా ప్రధానంగా దీర్ఘ శ్రేణి వ్యూహాత్మక (Strategic) అణు క్షిపణులపై ఆధారపడుతోంది. అయితే కొత్త ప్రతిపాదనలో తక్కువ శ్రేణి టాక్టికల్ అణు ఆయుధాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ సమీక్షకు పెంటగాన్ విధానాల విభాగం అధిపతి ఎల్బ్రిడ్జ్ కోల్బీ నాయకత్వం వహిస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.మరిన్ని సైనిక ఎంపికలే లక్ష్యమా?ఈ ప్రతిపాదన వెనుక ప్రధాన ఉద్దేశం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సంక్షోభ సమయంలో మరిన్ని ప్రతిస్పందన ఎంపికలు అందుబాటులో ఉంచడమేనని అధికారులు చెబుతున్నారు. రష్యా లేదా చైనా.. అమెరికా మిత్రదేశాలపై దాడి చేసిన సందర్భంలో, భారీ స్థాయి అణు దాడికి మాత్రమే పరిమితం కాకుండా పరిస్థితికి అనుగుణంగా స్పందించే అవకాశాలు ఉండాలని ఈ సమీక్ష సూచిస్తోంది. ఒక సీనియర్ రక్షణ శాఖ అధికారి ప్రకారం..‘అమెరికాకు విశ్వసనీయమైన అణు ప్రతిస్పందన ఎంపికలు అవసరం. అధ్యక్షుడికి ఎక్కువ ప్రత్యామ్నాయాలు ఉంటేనే శత్రుదేశాలను సమర్థంగా నిరోధించవచ్చు’ అని అభిప్రాయపడ్డారు.టాక్టికల్ అణు ఆయుధాలు అంటే?టాక్టికల్ అణు ఆయుధాలు వ్యూహాత్మక అణు బాంబులతో పోలిస్తే తక్కువ శక్తి కలిగి ఉంటాయి. ఇవి యుద్ధభూమిలోని సైనిక స్థావరాలు, దళాలు లేదా ఇతర సైనిక లక్ష్యాలను లక్ష్యంగా చేసుకుని ఉపయోగించేందుకు రూపొందించబడతాయి. అయినప్పటికీ, ఇవి కూడా భారీ ప్రాణనష్టం, విధ్వంసం సృష్టించే సామర్థ్యం కలిగిన అణు ఆయుధాలేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అయితే, ఈ ప్రతిపాదనపై ఇప్పటికే చర్చ మొదలైంది. అనుకూల వర్గాలు ఇది అమెరికా అణు నిరోధక శక్తిని (Deterrence) మరింత బలపరుస్తుందని చెబుతుండగా, విమర్శకులు మాత్రం టాక్టికల్ అణు ఆయుధాలకు ప్రాధాన్యం పెరగడం వల్ల వాటి వినియోగానికి ఉన్న మానసిక అడ్డంకి తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి అణు ఆయుధం ఉపయోగిస్తే అది మరింత పెద్ద స్థాయి ఘర్షణకు దారితీయవచ్చని వారు హెచ్చరిస్తున్నారు.కాగా, ఈ ప్రతిపాదన ఇప్పటికీ విధాన సమీక్ష (Policy Review) దశలోనే ఉంది. అమెరికా ప్రభుత్వం అధికారికంగా కొత్త అణు విధానాన్ని ప్రకటించలేదు. కాబట్టి ప్రస్తుతం దీనిని పరిశీలనలో ఉన్న ప్రతిపాదనగా మాత్రమే పరిగణించాలి. అయితే, 1945లో హిరోషిమా, నాగసాకిపై అణుబాంబులు పడిన తర్వాత ప్రపంచంలో యుద్ధ రంగంలో అణు ఆయుధాలు మళ్లీ ఉపయోగించబడలేదు. అందుకే అమెరికా అణు వ్యూహంలో ఎలాంటి మార్పు ప్రతిపాదన వచ్చినా, అది ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి, ఆందోళనలకు కారణమవుతోంది. -
డ్రోన్ వెంటాడింది.. చేతులు జోడించినా కనికరించలేదు!
ఉక్రెయిన్‌లో భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. కూరగాయలు విక్రయిస్తున్న ఓ సాధారణ పౌరుడిని డ్రోన్ వెంటాడి దాడి చేసిన వీడియోను ఉక్రెయిన్ విడుదల చేసింది. చేతులు జోడించి ప్రాణాలు కాపాడాలని వేడుకున్నా.. డ్రోన్ అతడిని వెంబడించింది. చివరకు అతని మీద పడిపోయి పేలినట్లు వీడియోలో కనిపిస్తోంది.వీడియోలో ఓ వ్యక్తి వీధిలో పరుగులు తీస్తూ డ్రోన్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. డ్రోన్ అతడిని చుట్టుముట్టి వెంటాడగా.. అతడు ఓ వాహనం చుట్టూ తిరుగుతూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. చివరకు డ్రోన్ అతడి సమీపంలో పేలినట్లు కనిపించింది. ఈ దాడిలో ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడని తెలుస్తోంది. అయితే అతడికి గాయాలయ్యాని.. ఆ షాక్ నుంచి ఇంకా కోలుకోలేకపోతున్నాడని వైద్యులు వెల్లడించినట్లు సమాచారం.Today, many were shocked by yet another video of the drone “safari” Russians are carrying out against civilians in Kherson. A Russian drone deliberately hunted down a man selling vegetables and detonated right next to him. The Russians even admitted to the crime, showing zero… pic.twitter.com/uGjC7esFwR— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) August 4, 2026ఈ ఘటనను ఉక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. పౌరులను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లను ఉపయోగించడం యుద్ధ నేరమని పేర్కొంది.ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఇది రష్యా డ్రోన్ దాడికి నిదర్శనమని ఆరోపించారు. దక్షిణ ఉక్రెయిన్‌లోని ఖెర్సన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. అయితే ఇది సరిగ్గా ఎప్పుడు జరిగిందనేది మాత్రం ఆయన వెల్లడించలేదు. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రి సిబిహా దీనిని “కిరాతక చర్య”గా అభివర్ణిస్తూ.. పౌరులను భయభ్రాంతులకు గురిచేసే ఉద్దేశంతోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై రష్యా ఇంకా స్పందించలేదు. యుద్ధ ప్రాంతాల్లో డ్రోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో.. సాంకేతిక ఆయుధాలు సాధారణ పౌరుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయనే ఆందోళనలు మరోసారి తెరపైకి వచ్చాయి. తాజాగా ఉక్రెయిన్ రష్యా భూభాగంలో జరిపిన దాడుల్లో.. చిన్నారులు సహా పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. ఓ వైపు యుద్ధం కొనసాగుతుండగా.. మరోవైపు పౌరులపై దాడుల ఆరోపణలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. -
రష్యా, ఉక్రెయిన్ పరస్పర దాడులు.. 10 మంది మృతి
మాస్కో: రష్యా, ఉక్రెయిన్ పరస్పరం జరుపుకున్న దాడుల్లో కనీసం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యా రాజధాని మాస్కోపై ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడుల్లో ఐదుగురు చనిపోగా 10 మంది గాయపడ్డారు. అదేవిధంగా, సెయింట్ పీటర్స్ బర్గ్‌లోని మరో వైల్డ్‌బెర్రీస్ గోదాముపై దాడి చేయగా మంటలు చెలరేగాయి. ఉక్రెయిన్ ప్రయోగించిన 320 డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది.ఉక్రెయిన్‌లోని మైకోలైవ్, పివ్‌డెన్యి, ఒడెసా పోర్టులపై దాడి చేసి చమురు, ఆయుధాలు, సైనిక సామగ్రితో వెళ్తున్న నాలుగు నౌకలను ధ్వంసం చేశామంది. రష్యా దాడుల్లో మైకోలైవ్ ఒకరు, సుమీలో ఇద్దరు బాలికలు, ఒక వృద్ధురాలు, ఖర్కీవ్‌లో మరొకరు చనిపోయారు. అదేవిధంగా, క్రమటోర్స్క్లో రష్యా జరిపిన గ్లైడ్ బాంబుల దాడిలో మరో 22 మంది గాయపడ్డారు. -
డోస్ పెంచిన ఉక్రెయిన్.. రష్యా విలవిల
రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ దూకుడు పెంచిందా? నల్ల సముద్ర తీరంలోని రష్యా పర్యాటక ప్రాంతం, ఆక్రమిత క్రిమియాపై వరుస డ్రోన్ దాడులతో కీవ్ తన దాడి సామర్థ్యాన్ని మరోసారి చాటుకుందా? తాజాగా జరిగిన ఈ దాడుల్లో 11 మంది మృతి చెందినట్లు రష్యా అధికారులు ప్రకటించారు. తమ భూభాగంలోకి చొచ్చుకొచ్చి జరిగిన ఈ దాడుల వెనుక ఉక్రెయిన్ హస్తం ఉందని మాస్కో ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలపై కీవ్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు.రష్యాలోని క్రాస్నొడార్ ప్రాంతంలోని ఆర్కిపో-ఒసిపోవ్కా సముద్ర తీర రిసార్ట్‌పై సోమవారం జరిగిన డ్రోన్ దాడిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పర్యాటకులతో కిక్కిరిసిన బీచ్‌పైకి డ్రోన్ దూసుకురావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో.. సముద్రంలో ఉన్న పర్యాటకులు, తీరంలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు కనిపించాయి. డ్రోన్ శకలాలు పడటంతోనే ప్రాణనష్టం జరిగినట్లు రష్యా అధికారులు పేర్కొన్నారు.🇷🇺🇺🇦 A drone has crashed onto a tourist beach in Gelendzhik, Russia, killing at least 3 and injuring 13.Gelendzhik is a prominent resort town located on the northeastern coast of the Black Sea, in Russia’s Krasnodar Territory.The incident occurred during an overnight raid,…— Mario Nawfal (@MarioNawfal) August 3, 2026ఈ డ్రోన్‌ను రష్యా గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకుందా? లేదంటే అది నేరుగా బీచ్‌ను తాకిందా? అనే అంశంపై స్పష్టత లేదు. సమీపంలో ఉన్న రష్యా నౌకాదళ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని వచ్చిన డ్రోన్ దారి తప్పిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.క్రిమియాలో మరో నలుగురు మృతిమరోవైపు రష్యా ఆధీనంలోని క్రిమియా ప్రాంతంలో జరిగిన మరో డ్రోన్ దాడిలో నలుగురు మృతి చెందినట్లు అక్కడి రష్యా నియమిత గవర్నర్ సెర్గీ అక్స్యోనోవ్ తెలిపారు. నల్ల సముద్ర తీర ప్రాంతాలు వేసవి కాలంలో రష్యా పర్యాటకులకు అత్యంత ఆకర్షణీయమైన ప్రాంతాలు. ఇలాంటి ప్రాంతాల్లో దాడులు జరగడం తీవ్ర కలకలం రేపింది.కమాండర్ లక్ష్యంగా.. రెస్టారెంట్లో?ఇదిలా ఉండగా రష్యా రాజధాని మాస్కోలోని ఓ ప్రముఖ ఇటాలియన్ రెస్టారెంట్ వద్ద జరిగిన పేలుడు ఘటనపై కూడా ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ పేలుడులో ఐదుగురు మృతి చెందగా.. 19 మంది గాయపడ్డారు. కుద్రిన్స్కయా స్క్వేర్‌లోని బాల్సీ రోస్సీ రెస్టారెంట్ వద్ద పేలుడు జరిగినట్లు రష్యా అధికారులు తెలిపారు. ఓ మహిళ పేలుడు పదార్థాలతో రెస్టారెంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారని.. ఆ సమయంలో బాంబు పేలినట్లు వెల్లడించారు.తొలుత ఇది ఉగ్రదాడి అని ప్రకటించిన రష్యా.. ఆ తర్వాత ఈ దాడి వెనుక ఉక్రెయిన్ హస్తం ఉందని ఆరోపించింది. అయితే కీవ్ మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ పేలుడు రష్యా ఎయిరోస్పేస్ ఫోర్సెస్ కమాండర్ జనరల్ అలెగ్జాండర్ చైకోను లక్ష్యంగా చేసుకుని జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన తన 55వ పుట్టినరోజు వేడుకల కోసం అదే రెస్టారెంట్లో ఉన్నట్లు కొన్ని రష్యా మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ ఘటన నుంచి జనరల్ చైకో సురక్షితంగా బయటపడ్డారు.ఉక్రెయిన్లోనూ రష్యా దాడులుమరోవైపు ఉక్రెయిన్‌లోని జపోరిజ్జియా నగరంపై రష్యా వైమానిక దాడులు జరిపినట్లు స్థానిక అధికారులు తెలిపారు. దాదాపు 90 నిమిషాల పాటు జరిగిన బాంబు దాడుల్లో ఒకరు మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు వెల్లడించారు.ఐదో ఏడాదిలోనూ కొనసాగుతున్న యుద్ధంరష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఐదో ఏడాదిలోకి ప్రవేశించినా.. ముగింపు సంకేతాలు కనిపించడం లేదు. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు డ్రోన్లు, క్షిపణులతో దాడులు కొనసాగిస్తున్నాయి. పౌరులను లక్ష్యంగా చేసుకోవడం లేదని రష్యా, ఉక్రెయిన్ రెండూ చెబుతున్నప్పటికీ.. తాజా ఘటనల్లో సామాన్యులు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజా దాడులు యుద్ధాన్ని మరింత తీవ్ర దశకు తీసుకెళ్తాయా?.. అమెరికా అధ్యక్షుడు మరోసారి జోక్యం చేసుకుంటారా? అనేది ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. -
కీవ్‌పై మిసైళ్ల దాడి.. భారీగా మృతులు
కీవ్ : ఉక్రెయిన్‌పై రష్యా బాలిస్టిక్ మిసైళ్లతో విరుచుకపడింది. గగనతలం మిసైళ్ల మోతతో దద్దరిల్లింది. ఈ రోజు శనివారం ఉదయం రష్యా.. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై బాలిస్టిక్ క్షిపణులతో జరిపిన దాడిలో కనీసం తొమ్మిదిమంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కాగా ఈ వారంలో కీవ్‌పై రష్యా దాడి చేయడం ఇది రెండోసారి.ఇటీవల రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. రష్యా వరుసగా కీవ్‌పై మిసైళ్లతో విరుచుకపడడంతో పెద్దఎత్తున ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి ప్రతిగా ఉక్రెయిన్ సైతం విరుచుకపడుతుంది.రష్యాలోని చమురు రిఫైనరీలు, ఇంధన డిపోలను లక్ష్యంగా చేసుకుని దాడులను కొనసాగిస్తోంది. నల్లసముద్ర ప్రాంతంలో వాణిజ్య నౌకలు, సరుకు రవాణా నౌకలను లక్ష్యంగా చేసుకుని కూడా దాడులు జరుగుతున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ నేపథ్యంలో ఈరోజు మరోసారి కీవ్‌పై రష్యా బాలిస్టిక్ మిసైళ్లతో విరుచుకపడింది. ఈ దాడుల్లో కనీసం తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, నలుగురు పిల్లలతో సహా 28 మంది గాయపడ్డారు. ఈ వివరాలను కీవ్ మేయర్ విటాలీ క్లిట్ష్కో స్వయంగా వెల్లడించారు.ఈ దాడులతో కీవ్‌లోని వివిధ ప్రాంతాల్లో భారీగా మంటలు చెలరేగడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని పేర్కొన్నారు.కాగా కీవ్‌పై ఈ వారంలో ఇలాంటి పెద్ద దాడి జరగడం ఇది రెండోసారి. గత గురువారం జరిగిన దాడిలో క్రివాయ్ రిగ్ సమీపంలోని ఒక గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సహా తొమ్మిది మంది మరణించారు.ఈ ఘటన నుంచి తేరుకోకముందే తాజాగా మరోసారి దాడి చేసింది. రష్యా దాడులు ఉదృతమవుతున్న నేపథ్యంలో తమ దేశానికి మరిన్ని రక్షణ వ్యవస్థలు కావాలని జెలెన్స్కీ పశ్చిమ దేశాలను కోరుతున్నారు. మిత్రులను కోరుతున్నారు. స్వయంగా పాట్రియాట్ క్షిపణులను తయారు చేసుకునేందుకు అమెరికా నుంచి లైసెన్స్ పొందడానికి ఆయన చర్చలు జరుపుతున్నారు.కాగా ఈ విషయమై ట్రంప్ మాట్లాడినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. "ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. వాషింగ్టన్ ఇంకా దీనికి అంగీకరించలేదుఎవరికైనా అలాంటి సాంకేతికతను ఇవ్వడం చాలా ప్రమాదకరమైన విషయం. ఎందుకంటే మనం ఎవరికైతే ఆ టెక్నాలజీ ఇస్తామో, వారు భవిష్యత్తులో మనపైనే తిరగబడవచ్చు" అని ట్రంప్ పేర్కొన్నట్లు కథనాలు వెలువడ్డాయి. -
క్లాస్‌రూంలో ధైర్యం మేరీ క్యూరీ!
అది పోలాండ్ దేశంలోని వార్సా నగరం. అప్పట్లో అక్కడ రష్యా ఆధిపత్యం నడుస్తోంది. పోలిష్ భాష మాట్లాడటం, అక్కడి సంస్కృతిని నేర్చుకోవడంపై రష్యా ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు విధించింది. ఆ కాలంలో ‘మరియా సలోమియా’ (మేరీ క్యూరీ చిన్నప్పటి పేరు) అనే పదేళ్ల చిన్నారి ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేది. మరియా క్లాసులో అందరికంటే చాలా తెలివైంది, చురుకైనది. రష్యన్ అధికారులు ఎప్పుడు స్కూల్‌ను తనిఖీ చేయడానికి వచ్చినా క్లాస్ టీచర్ భయపడుతూ మరియానే పిలిచి ప్రశ్నలకు సమాధానాలు చెప్పమనేవారు. ఎందుకంటే మరియా రష్యన్ అధికారుల కళ్లల్లోకి కళ్లు పెట్టి, వాళ్ల భాషలోనే తప్పుల్లేకుండా పక్కాగా జవాబులు చెప్పేది. అధికారులు వెళ్ళిపోయాక తన దేశ సంస్కృతిని దూరం చేస్తున్నందుకు క్లాస్ రూమ్‌లోనే వెక్కి వెక్కి ఏడ్చేది. ఆ కన్నీళ్లు మరియాను బలహీనపరచలేదు, మరింత మొండి పట్టుదలను పెంచాయి. ఆ రోజుల్లో పోలాండ్‌లో మహిళలకు యూనివర్సిటీలో ప్రవేశం లేకపోవడంతో రహస్యంగా నడిచే ‘ఫ్లయింగ్ యూనివర్సిటీ’(రాత్రి వేళల్లో వేర్వేరు ఇళ్లల్లో దొంగతనంగా నడిచే క్లాసులు)లో చేరి మరియా ప్రాణాలకు తెగించి చదువుకుంది. ట్యూషన్లు చెప్పుకుంటూ డబ్బు దాచుకుని పారిస్ వెళ్లి ఫిజిక్స్, మ్యాథ్స్ చదివింది. ఆ పట్టుదలే ఆమెను ప్రపంచం గర్వించే ‘మేరీ క్యూరీ’గా మార్చింది! -
ఉక్రెయిన్‌పైకి క్షిపణులు, డ్రోన్ల దండు
కీవ్: బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో రష్యా మరోసారి ఉక్రెయిన్‌పైకి దండెత్తింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు రాజధాని కీవ్ నుంచి సుదూరంగా ఉన్న లీవ్ దాకా 10 ప్రాంతాలపై దాడులు జరిపింది. రష్యా దాడులతో రాజధాని కీవ్ పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ దాడుల్లో నీప్రోపెట్రోవిస్క్ లో ఆరుగురు, కీవ్, పోల్టావాల్లో ఒక్కరు చొప్పున మొత్తం 8 మంది చనిపోయారని అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. జెలెన్స్కీ సొంతూరు క్రీవ్యీ రిహ్‌లోని నీప్రోపెట్రోవిస్క్ లో ఓ ఇంటిపై ఇస్కందర్ బాలిస్టిక్ క్షిపణి నేరుగాపడటంతో అందులో నలుగురు చిన్నారులు, వారి తల్లిదండ్రులు మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరు చిన్నారులు సహా 10 మంది గాయాలతో బయటపడ్డారు. లీవ్ నగరంపై జరిగిన క్షిపణి దాడుల్లో రెండు అపార్టుమెంట్లు ధ్వంసం కాగా 34 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఖెర్సన్ నగరంలోని పారిశ్రామిక ప్రాంతంపై రష్యా శక్తివంతమైన మూడు గ్లైడ్ బాంబులను ప్రయోగించిందని, ఒకరు చనిపోయారన్నారు. రష్యా 70కి పైగా వివిధ రకాల క్షిపణులు, 280 డ్రోన్లను ప్రయోగించిందని అధికారులు చెప్పారు. వీటిలో 260 డ్రోన్లను మధ్యలోనే అడ్డుకున్నామన్నారు. కాగా, ఉక్రెయిన్ సైనిక మౌలిక వసతులే లక్ష్యంగా దాడులు జరిపినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. నల్లసముద్ర తీరంలోని ఒడెసాలో ఆయుధాలు, మిలటరీ సామగ్రితో ఉన్న మూడు సరుకు నౌకలపై దాడులు జరిపినట్లు వెల్లడించింది. కాగా, రష్యా ప్రయోగించిన కేహెచ్–101 బాలిస్టిక్ క్షిపణి ఒకటి దారి తప్పి లీవ్‌కు సమీపంలో పోలెండ్ భూభాగంలో పడినట్లు ఉక్రెయిన్ తెలిపింది. ఓ వ్యవసాయ క్షేత్రంలో పడటంతో భారీ గొయ్యి ఏర్పడిందని తెలిపింది. దీనివల్ల ఎలాంటి నష్టం జరగలేదని, దర్యాప్తు జరుపుతున్నామని పోలెండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ చెప్పారు. వైల్డ్‌బెర్రీస్‌పై ఆగని దాడులు.. రష్యా ఆరీ్మకి సరుకులు రవాణా చేస్తున్నాయని ఆరోపిస్తూ ఆన్లైన్ రిటెయిలర్ వైల్డ్‌బెర్రీస్ ఔట్లెట్లపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు కొనసాగిస్తోంది. తాజాగా, రష్యాలోని పెంజా, సరపుల్, పెర్మ్ల్లోని మూడు వైల్డ్‌బెర్రీస్ గోదాములపై దాడులు చేపట్టింది. దీంతో, అవి మంటల్లో చిక్కుకున్నాయని, పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. వివిధ ప్రాంతాలపైకి బుధవారం రాత్రి ఉక్రెయిన్ ప్రయోగించిన 258 డ్రోన్లను కూల్చినట్లు రష్యా ఆర్మీ తెలిపింది. అదేవిధంగా, రష్యా షాడో ఫ్లీట్‌కు చెందిన మరో నాలుగు చమురు నౌకలపై డ్రోన్ దాడులు జరిపామని, దీంతో జూలై 6వ తేదీ నుంచి తాము ఇప్పటి వరకు దాడి చేసిన నౌకల సంఖ్య 205కు చేరుకుందని ఉక్రెయిన్ డ్రోన్ దళం తెలిపింది. -
అమెరికా రాజనీతికి యుద్ధం కేంద్రకం
ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధాలను, వీటిలో యూఎస్ఏ పాత్రను విస్తృత అంతర్జాతీయ జియో పొలిటికల్ క్రీడలో భాగంగా చూడాలి. 2035లో ప్రపంచ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారబోతున్నది. ఈ పరిణామంలో భాగమే ఈ యుద్ధాలు. గత 250 సంవత్సరాల అమెరికా చరిత్ర పూర్తిగా యుద్ధాలతోనే ముడిపడి ఉన్నది. గత శతాబ్దంలో ప్రతి 20 సంవత్సరాలకు కనీసం ఒక పెద్ద యుద్ధానికి తెరతీసింది. పద్దెనిమిది,పందొమ్మిది శతాబ్దాలలో దేశ విస్తరణకు బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, మెక్సికోలతో యుద్ధం చేసింది. ఇరవయ్యవ శతాబ్దంలో ఫిలిప్ఫైన్, రెండు ప్రపంచ యుద్ధాలు, కొరియా, వియత్నాం, బోస్నియా, గల్ఫ్ యుద్ధాలలో నిమగ్నమైంది. ఇరవయ్యొకటవ శతాబ్దంలో అఫ్గాని స్తాన్, ఇరాక్, లిబియా, యెమెన్, సిరియా, సోమాలియాలలో యుద్ధాలను లేవనెత్తింది. గత 250 ఏళ్లలో యూఎస్ఏ కేవలం 1865–1898 (33 సం‘‘లు), 1918–1945 (27 సం‘‘లు) మధ్య మాత్రమే యుద్ధానికి దూరంగా ఉన్నది. శాంతి కోసం యుద్ధం, సుభిక్షానికి యుద్ధం, సుస్థిరతకు యుద్ధం అనేది అమెరికా పాలనా విధానం. శక్తిని చాటి చెప్పటానికి యుద్ధాన్ని ఒక పరికరంగా పరిగణిస్తుంది. ఈ యుద్ధ తంత్రానికి ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, ఉదారవాద విధానాల ముసుగు కప్పుతుంది. కథ అడ్డం తిరిగింది!సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నం తరువాత ప్రపంచంపై తన ఏకచ్ఛత్రాధిపత్యాన్ని నిలబెట్టుకోవటానికి అమెరికా సర్వశక్తులు ఒడ్డింది. ప్రత్యర్థి రష్యాను పూర్తిగా అణచివేయాలని నాటోను విస్త రించింది. 2010కల్లా రష్యా ఆర్థికంగా పుంజుకొని అమెరికాకు సవా లుగా తయారైంది. ఇదే సమయంలో అనూహ్యంగా చైనా బలమైన ప్రత్యర్థిగా ఎదిగింది. 2020కల్లా భారత్, బ్రెజిల్, దక్షిణ ఆఫ్రికాలు కూడా బలమైన శక్తులుగా రూపుదిద్దుకున్నాయి. బ్రిక్స్ రూపంలో కూటమిగా చేరి, అమెరికన్ ఆర్థిక వ్యవస్థకు ప్రత్యామ్నాయాలను సంకల్పించటంతో కథ అడ్డం తిరిగింది.బహుళ ధ్రువ ప్రపంచం ఏర్పడటం ఖాయమనే విశ్లేషకుల జోస్యాన్ని తప్పుగా నిరూపించాలని కృతనిశ్చయంతో ఉన్నది. అమెరికా ముందు మూడు ప్రత్యామ్నాయాలున్నాయి. 1. ప్రత్యర్థు లను నిర్వీర్యం చేసి ఏకైక ప్రపంచ శక్తిగా కొనసాగటం. 2. ప్రత్య ర్థులతో రాజీపడి పరిమిత ధ్రువ (లిమిటెడ్ పోలార్) ప్రపంచంలో ప్రధాన శక్తిగా కొనసాగటం. 3. ప్రత్యర్థులతో రాజీపడి బహుళ ధ్రువ (మల్టీ పోలార్) ప్రపంచంలో ప్రధాన శక్తిగా కొనసాగటం.మూడింట్లో మొదటి దారిప్రస్తుతం అమెరికా ఏకైక ప్రపంచ శక్తిగా కొనసాగాలనే పట్టు దలతోనే ఉన్నట్లుగా కన్పిస్తున్నది. ఇందులో భాగంగానే ఇంధన వనరులు, ఇంధన రవాణా మార్గాలపై పెత్తనానికి సర్వశక్తులు ఒడ్డు తున్నది. రష్యాపై తీవ్రస్థాయిలో ఆంక్షలు విధించి ఉక్రెయిన్ యుద్ధపు పద్మవ్యూహంలోనికి రష్యాను లాగింది. రష్యానుండి చమురు, గ్యాస్ ఎవరూ కొనగూడదని ఐరోపా, భారత్‌లను కట్టడి చేసింది. దీర్ఘకాలిక యుద్ధంలో ఉక్రెయిన్ వెనుక నిలబడి రష్యా అలసిపోయి నిర్వీర్యమవటానికి దీర్ఘకాలిక ప్రణాళికను అమలు పరుస్తున్నది. అందుకే నెల లోపున ముగుస్తుందనుకున్న ఉక్రెయిన్ యుద్ధం నాలుగన్నర సంవత్సరాలకు కూడా కొనసాగుతున్నది. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం చైనా చేతిలో పడకుండా చూడటం ద్వారా చైనాను కట్టడి చేయాలనేది అమెరికా వ్యూహం. ‘చిప్ 4’ అలయన్స్‌లో భాగంగా అమెరికా, తైవాన్, ద.కొరియా, జపాన్‌లు చైనాకు అత్యాధునిక సెమీకండక్టర్ చిప్‌లు అందుబాటు లోనికి రాకుండా ప్రయత్నిస్తున్నాయి. ఆకస్ కూటమిలో భాగంగా ఆస్ట్రేలియా, యూకే, యూఎస్ఏలు ఏఐ, క్వాంటమ్ మెకానిక్స్ హైపర్సోనిక్ టెక్నాలజీని చైనాకు అందకుండా చేయటానికి ప్రయ త్నిస్తున్నాయి. జీ7, యూరోపియన్ యూనియన్ల ద్వారా అత్యాధు నిక చిప్స్ తయారు చేసే యంత్రాలను ఏఎస్ఎంఎల్ (నెదర్లాండ్స్), టోక్యో ఎలక్ట్రానిక్ (జపాన్) కంపెనీలు చైనాకు ఎగుమతి చేయకుండా ఆంక్షలు పెట్టాయి. తైవాన్ను సమర్థించటం ద్వారా కూడా చైనాకు చెక్ పెట్టటానికి అమెరికా ప్రయత్నిస్తున్నది.విశేషంగా ఇంధన వనరులున్న ఇరాన్, ఇరాక్, సౌదీ, యూఏఈ, కువైట్ మొదలైన గల్ఫ్ దేశాలపై నియంత్రణకు అమెరికా దీర్ఘకాలికంగా వ్యూహాలను అమలుపరుస్తున్నది. సైనిక స్థావరాల ద్వారా గల్ఫ్ దేశాలలో అమెరికా ఇప్పటికే పాగా వేసింది. ఈ ఇంధన వనరుల నియంత్రణలో అమెరికాకు కొరకరాని కొయ్యగా మారింది ఇరాన్. అందుకే హార్మూజ్, బాబెల్ మాండెబ్ జలసంధులపై పెత్తనానికి అమెరికా ప్రయత్నిస్తున్నది.ఆసియాలో భారత్ ఆధిపత్యం?అమెరికా తన ఆధిపత్యాన్ని కొనసాగించే వ్యూహంలో భాగాలే ఉక్రెయిన్, ఇరాన్ యుద్ధాలు. అందువలన ఈ రెండు ఇప్పట్లో ముగిసే అవకాశాలు లేవు. ఇరాన్ యుద్ధం వలన తీవ్రంగా నష్ట పోయేది భారత్, చైనాలని గుర్తించాలి. చైనా, రష్యా, భారత్‌లను ఈ రెండు యుద్ధాల ద్వారా కట్టడి చేయటం సాధ్యం కాని పక్షంలో అమె రికా పరిమిత ధ్రువ ప్రపంచానికి రాజీ పడాల్సి వస్తుంది. రష్యా, చైనా/భారత్‌లను ప్రపంచ శక్తులుగా అంగీకరించాల్సి వస్తుంది. క్రమంగా నాటోను రద్దుపరచి ఐరోపాపై రష్యా ఆధిపత్యానికి అంగీ కరించి ఉత్తర, మధ్య, దక్షిణ అమెరికాలకు యూఎస్ఏ తన ఆధిప త్యాన్ని పరిమితం చేసుకోవాల్సి ఉంటుంది. దక్షిణ, తూర్పు ఆసి యాలలో చైనా ఆధిపత్యాన్ని అంగీకరించి గల్ఫ్ ప్రాంతంలో ఇజ్రా యెల్–యూఏఈ– సౌదీల ద్వారా నియంత్రణకు ప్రయత్నిస్తుంది. అయితే దక్షిణ, తూర్పు ఆసియాలలో ఆధిపత్యంతో చైనా సరిపెట్టుకోక పోవచ్చును. చైనా ప్రపంచాధిపత్యానికి ప్రయత్నించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాక్రమంగా రష్యాతో ఒప్పందం ద్వారా చైనాకు వ్యతిరేకంగా భార త్ను ఆసియాలో ఆధిపత్యానికి ప్రోత్సహించవచ్చును.2040 కల్లా చైనా ప్రపంచ శక్తిగా అమెరికా, రష్యాలనే సవాలు చేయవచ్చని విశ్లేషకుల అంచనా. ఈనాడు ప్రత్యర్థులుగా ఉన్న రష్యా, అమెరికాలు కలిసి చైనాను నిలువరించాల్సి రావచ్చును. రాజకీయాలలో శాశ్వత మిత్రత్వం కానీ శాశ్వత శతృత్వం కానీ ఉండదు. అమెరికా, రష్యాలు, ఆసియాలో భారత్ వైపే మొగ్గు చూప టానికి అవకాశం ఉన్నది. తైవాన్ను చైనా ఆక్రమించటానికి ప్రయ త్నించినప్పుడు చైనాను ఇంకొకవైపు నుండి నిలువరించటానికి భారత్ సిద్ధమవవచ్చును. ఒకవైపు హిమాలయాలలో చైనాపై దాడి చేస్తూనే భారత్ మలక్కా జలసంధిని దిగ్బంధనం చేయవచ్చు. ఆ సందర్భంలో చైనా సముద్రంలో అమెరికా, జపాన్‌లను చైనా ఎదు ర్కోవటం కష్టమవుతుంది. భారత్‌కు అమెరికా సైనిక, వ్యూహాత్మక మద్దతును అందించవచ్చును.కాకపోతే, ఈ అమెరికన్ అంతర్జాతీయ రాజకీయ వ్యూహంలో పావుగా మారటానికి భారత్ ఒప్పుకోకపోవచ్చును. ప్రాంతీయంగా ఆసియాలో చైనాను నియంత్రించటానికి భారత్ ఒప్పుకుంటుంది. కానీ అంతర్జాతీయంగా చైనాను నిరోధించే వ్యూహంలో భారత్ భాగ స్వామిగా మారాల్సిన అవసరం భారత్‌కు లేదు. ఏది ఏమయినా ఉక్రెయిన్, ఇరాన్ యుద్ధాలు అంతర్జాతీయ రాజకీయ యవనికను నియంత్రించే కీలక ఘట్టాలనటంలో సందేహం లేదు. భారత్ ఆచి తూచి అడుగులు వేయాల్సి ఉంటుంది.-వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్); సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు- గురజాల శ్రీనివాసరావు -
టెలిగ్రామ్ వ్యవస్థాపకుడిని ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారు?
మాస్కో: టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్‌కు రష్యా అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరించారని రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్ఎస్బీ) అభియోగాలు మోపింది. దేశంలో విధ్వంసకర, తీవ్రవాద, సైబర్ మోసాల కార్యకలాపాలను సమన్వయం చేయడానికి ఉపయోగించినట్లు ఆరోపణలున్న కంటెంట్‌ను తొలగించడంలో మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ విఫలమైందని ఆరోపించింది.రష్యాలో దాడులు, విధ్వంసాలకు పాల్పడేందుకు ఉక్రెయిన్ నిఘా వర్గాలు, ఉగ్రవాద సంస్థలు టెలిగ్రామ్‌ను వాడుకుంటున్నాయని ఎఫ్ఎస్బీ ఆరోపించింది. రష్యా క్రిమినల్ కోడ్ కింద దురోవ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. దీనిపై పావెల్ దురోవ్ (Pavel Durov) గానీ, టెలిగ్రామ్ గానీ వెంటనే స్పందించలేదు.డిజిటల్ వేదికలపై నియంత్రణను కఠినతరం చేయడానికి రష్యా చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఈ చర్యలు తీసుకుంది. దేశంలో టెలిగ్రామ్ వాడకాన్ని నియంత్రించేందుకు ఇప్పటికే పలు ఆంక్షలు విధించడంతో పాటు, స్వదేశీ మెసెంజర్ ‘ఎమ్ఏఎక్స్’ (మ్యాక్స్)ను ప్రోత్సహిస్తోంది. రష్యాలోనే జన్మించి, ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తున్న దురోవ్‌కు యూఏఈ, ఫ్రాన్స్ పౌరసత్వం ఉంది.చదవండి: వెలుగులోకి ఘోరాలు, రష్యాపై షాకింగ్ ఆరోపణలుఫ్రాన్స్లోనూ టెలిగ్రామ్ ప్రస్తుతం పరిశీలనను ఎదుర్కొంటోంది. నేర కార్యకలాపాలను అరికట్టడంలో టెలిగ్రామ్ విఫలమైందని, చట్ట అమలు సంస్థల అభ్యర్థనలకు తగినంతగా సహకరించలేదని వచ్చిన ఆరోపణలపై ఫ్రెంచ్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
వెలుగులోకి ఘోరాలు.. రష్యాపై షాకింగ్ ఆరోపణలు
రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో మరో భయానక అంశం వెలుగులోకి వచ్చింది. యుద్ధ ఖైదీలు, సాధారణ పౌరులపై రష్యా బలగాలు లైంగిక హింసను ఒక ఆయుధంగా ఉపయోగిస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఖైదీలను అవమానించడం, మానసికంగా దెబ్బతీయడం, ప్రతిఘటనను పూర్తిగా విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయని పలువురు బాధితులు చెబుతున్నారు.మాజీ ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు, ఐక్యరాజ్యసమితి పరిశోధకులు, ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ల వాంగ్మూలాల ఆధారంగా.. అంతర్జాతీయ మీడియా సంస్థ వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలనాత్మక కథనం ప్రచురించింది. 2022లో రష్యా పూర్తిస్థాయి దాడులు ప్రారంభించిన తర్వాత ఈ తరహా ఘటనలు ఎక్కువగా నమోదయ్యాయని పేర్కొంది.మానసికంగా కుంగదీసే వ్యూహం?ఉక్రెయిన్‌కు చెందిన మాజీ ఖైదీ సెర్హీ బోయ్చుక్ తన అనుభవాలను వివరిస్తూ.. రష్యా నిర్బంధంలో ఉన్న సమయంలో చిత్రహింసలు ఎదుర్కొన్నట్లు తెలిపాడు. తనను శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా కూలదోసేందుకు లైంగిక హింసను ఉపయోగించారని ఆరోపించాడు. ఇలాంటి ఘటనలు ఒక్కరి అనుభవమే కాదని.. పలువురు మాజీ యుద్ధ ఖైదీలు కూడా ఇలాంటి ఆరోపణలే చేసినట్లు చెప్పాడు. లైంగిక హింసను శత్రువులను అవమానించే, భయపెట్టే, మానసికంగా బలహీనపరిచే వ్యూహంగా ఉపయోగిస్తున్నారని బాధితులు చెబుతున్నారు.ఎక్కువ బాధితులు ఎవరంటే.. సాధారణంగా యుద్ధాల్లో లైంగిక హింసకు మహిళలు, చిన్నారులే ఎక్కువగా గురవుతుంటారు. అయితే ఉక్రెయిన్ యుద్ధంలో పురుష యుద్ధ ఖైదీలపై ఇలాంటి దాడులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఐక్యరాజ్యసమితి పరిశీలనలో ఉన్న లైంగిక హింసకు సంబంధించిన కేసుల్లో ఎక్కువ శాతం బాధితులు పురుషులేనని వెల్లడైంది. రేప్, సామూహిక లైంగిక దాడులు, జననాంగాలపై హింస, విద్యుత్ షాక్‌లు, శారీరక చిత్రహింసలకు గురిచేసినట్లు పలువురు బాధితులు వెల్లడించారు. కొంతమంది ఖైదీలను నగ్నంగా నిలబెట్టడం, అవమానకర పరిస్థితుల్లో ఉంచడం వంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి.రష్యా స్పందన ఏంటి?అయితే ఈ ఆరోపణలపై రష్యా అధికారికంగా స్పందించలేదు. గతంలో కూడా ఇలాంటి ఆరోపణలను మాస్కో ఖండిస్తూ.. అవి రాజకీయ ఉద్దేశాలతో చేస్తున్న నిరాధార ఆరోపణలని పేర్కొంది. అంతేకాకుండా ఆక్రమిత ప్రాంతాల్లో ఐరాస దర్యాప్తు సంస్థలకు పూర్తి స్థాయిలో అనుమతులు ఇవ్వలేదని విమర్శలు ఉన్నాయి.అసలు తీవ్రత ఎంత?లైంగిక హింసకు సంబంధించిన వాస్తవ ఘటనల సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని ఉక్రెయిన్ అధికారులు భావిస్తున్నారు. సామాజిక అవమానం, ప్రతీకార భయం కారణంగా చాలా మంది బాధితులు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదని చెబుతున్నారు. ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ కార్యాలయం ప్రకారం.. రష్యా సైనికులపై వందల సంఖ్యలో లైంగిక హింస కేసులపై విచారణ జరుగుతోంది. ఇందులో పురుష బాధితుల సంఖ్య కూడా గణనీయంగా ఉందని అధికారులు చెబుతున్నారు.యుద్ధాల్లో ఆయుధాలు, బాంబులు మాత్రమే కాదు.. మనుషుల మనోధైర్యాన్ని దెబ్బతీసే పద్ధతులు కూడా వినియోగించబడుతున్నాయన్న దానికి ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు మరో ఉదాహరణగా నిలుస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై తుది నిర్ధారణకు అంతర్జాతీయ దర్యాప్తులు కీలకంగా మారనున్నాయి. -
రష్యా రిఫైనరీలపై ఉక్రెయిన్ దాడులు
కీవ్: రష్యాపై ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి క్షిపణుల దాడిని కొనసాగిస్తోంది. అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహమ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అమెరికా వచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మంగళవారం రాత్రి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అయిన కొన్నిగంటలకే రష్యాపై ఉక్రెయిన్ దాడులను ఉధృతంచేయడం గమనార్హం. రష్యాలోని పెర్మ్ రీజియన్‌లోని లూక్‌ఆయిల్ రిఫైనరీ, రియాజన్లోని మరో చమురు శుద్ధి కర్మాగారంపై ఉక్రెయిన్ దాడులు చేసింది. ఈ రెండు రిఫైనరీల ఉమ్మడి వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఏకంగా 3 కోట్ల టన్నులుకావడం గమనార్హం. ఇంతటి భారీ రిఫైనరీలపై దాడి చేసి ఇన్నాళ్లూ యుద్ధంలో రష్యా సాయుధరంగ ఇంధన అవసరాలు, దేశ ఖజానాకు నష్టం చేకూర్చామని ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీసెస్, జనరల్ స్టాఫ్ విభాగం ప్రకటించింది. అయితే తమ రిఫైనరీలకు ఎలాంటి నష్టం జరగలేదని, పారిశ్రామిక వాడల్లో డ్రోన్ల దాడుల్లో గాయపడిన ఆరుగురికి ఆస్పత్రుల్లో చేరి్పంచామని రష్యాలోని రియాజన్ గవర్నర్ పావెల్ మాల్కోవ్ తెలిపారు. -
‘‘రష్యాలో 4 నెలలుగా ఉన్నా.. నీట్ నిరసన కేసులో నా పేరు పెట్టారు’’
పట్నా: దేశవ్యాప్తంగా ఇటీవల జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనలకు సంబంధించిన కేసులో తన పేరు చేర్చారని తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యానని బిహార్‌కు చెందిన ఓ యువకుడు చెప్పాడు. బిహార్‌లోని కిషన్‌గంజ్‌కు చెందిన మహ్మద్ సదాఖత్ తాను గత 4 నెలలుగా రష్యాలో ఉన్నానని పేర్కొన్నాడు.“జూలై 24న నీట్ లీక్‌కు వ్యతిరేకంగా ఎల్‌ఆర్‌పీ చౌక్ వద్ద నిరసన జరిగింది. ఆ కేసులో బహదూర్‌గంజ్ అడ్మినిస్ట్రేషన్ నా పేరు చేర్చింది. నేను గత 4 నెలలుగా రష్యాలో ఉన్నాను” అని సదాఖత్ చెబుతూ ఓ వీడియో పోస్ట్ చేశాడు.“నేను రష్యాలో ఉండడంతో నా పేరును అక్కడి నుంచి తొలగించాలని అడ్మినిస్ట్రేషన్‌ను కోరుతున్నాను. అలా చేస్తే వారికి రుణపడి ఉంటాను” అని అతడు కోరాడు. అతడి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నప్పటికీ దాని ప్రామాణికతను స్వతంత్రంగా ఇప్పటివరకు ఏ మీడియా కూడా నిర్ధారించలేకపోయింది.పోలీసులు ఏమన్నారు?కిషన్‌గంజ్ పోలీసు సూపరింటెండెంట్ హరి మోహన్ శుక్లా స్పందిస్తూ... వైరల్ వీడియోలోని వ్యక్తిపై కేసు నమోదైందా? లేదా? అన్న విషయాన్ని ధ్రువీకరించలేదు, ఖండించలేదు. సదాఖత్ వీడియోపై అడిగిన ప్రశ్నకు హరి మోహన్ స్పందిస్తూ.. “నిరసనలకు సంబంధించిన ఏవైనా ఫిర్యాదులు ఉన్నవారు పోలీసులను సంప్రదించవచ్చు. పరిష్కారం పొందవచ్చు” అని చెప్పారు.బిహార్ పోలీసుల అధికారిక ఎక్స్ ఖాతా గతంలో ఈ వైరల్ వీడియోపై స్పందిస్తూ, విషయాన్ని పరిశీలిస్తామని తెలిపింది. అయితే ఆ పోస్టు ఇప్పుడు కనిపించడం లేదు. తొలగించినట్టు తెలుస్తోంది.విద్యార్థులపై కేసులు ఉపసంహరించనున్న ప్రభుత్వంముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరి నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వం... నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన అన్ని కేసులను ఉపసంహరించనున్నట్టు ప్రకటించింది. ఢిల్లీలో ప్రారంభమైన సీజేపీ ఆందోళనలు చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీశాయి.రాష్ట్ర హోం శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. జూలై 26 ఉదయం 6 గంటల కంటే ముందు జరిగిన ఘటనలకు సంబంధించి నమోదైన “అన్ని ఎఫ్ఐఆర్లు, ఫిర్యాదులు, షోకాజ్ నోటీసులు” ఉపసంహరించాలనే నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ కేసుల్లో అరెస్టైన వారందరినీ వెంటనే విడుదల చేయాలని కూడా నోటిఫికేషన్లో పేర్కొన్నారు.मोहम्मद सदाकत 4 महीने से रूस में हैं। बिहार पुलिस ने स्टूडेंट प्रोटेस्ट में उनके खिलाफ भी FIR दर्ज कर दी है !! pic.twitter.com/jEDqWs27ck— Sachin Gupta (@Sachingupta) July 29, 2026 -
పుతిన్‌కు ఉచ్చు బిగిస్తున్న అమెరికా.. రష్యాకు డబుల్ స్ట్రైక్
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగిస్తున్న రష్యాపై మరింత ఆర్థిక ఒత్తిడి తీసుకురావాలనే లక్ష్యంతో రూపొందించిన కీలక ఆంక్షల బిల్లుకు అమెరికా సెనేట్ తొలి ఆమోదం తెలిపింది. బిల్లును తదుపరి దశకు తీసుకెళ్లేందుకు నిర్వహించిన విధానపరమైన (ప్రొసీజరల్) ఓటింగ్‌లో 86-12 ఓట్లతో తీర్మానం ఆమోదం పొందింది. దీంతో ఈ బిల్లుపై సెనేట్‌లో పూర్తి స్థాయి చర్చకు మార్గం సుగమమైంది.ఈ కీలక ఓటింగ్ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ అమెరికా క్యాపిటల్ భవనానికి హాజరయ్యారు. ఇటీవల మరణించిన రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహమ్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అమెరికా వెళ్లిన జెలెన్స్కీ, ఓటింగ్‌కు ముందు పలువురు రిపబ్లికన్, డెమోక్రాటిక్ సెనేటర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం సెనేట్ గ్యాలరీలో కూర్చొని ఓటింగ్ ప్రక్రియను ప్రత్యక్షంగా వీక్షించారు.సెనేటర్లతో సమావేశంలో జెలెన్స్కీ మాట్లాడుతూ.. రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ ప్రస్తుతం కీలక పురోగతి సాధిస్తోందని, అయితే విజయం సాధించాలంటే అమెరికా నుంచి మరింత సైనిక, ఆర్థిక, రాజకీయ మద్దతు అవసరమని తెలిపారు. ఈ ఆంక్షల బిల్లు ఉక్రెయిన్ ప్రజలకు నైతిక బలాన్ని ఇవ్వడమే కాకుండా, రష్యాపై అంతర్జాతీయ ఒత్తిడిని మరింత పెంచుతుందని ఆయన పేర్కొన్నట్లు సమావేశానికి హాజరైన సెనేటర్లు వెల్లడించారు. కాగా, ఈ బిల్లును రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహమ్, డెమోక్రాటిక్ సెనేటర్ రిచర్డ్ బ్లూమెంథల్ సంయుక్తంగా రూపొందించారు. జూలై 10న వైట్ హౌస్‌తో ఈ బిల్లుపై ఒప్పందానికి వచ్చిన మరుసటి రోజే గ్రాహమ్ ఆకస్మికంగా మరణించారు. ఆయన మరణానికి ముందు ఉక్రెయిన్ వెళ్లి జెలెన్స్కీతో కూడా సమావేశమయ్యారు. ఈ బిల్లు గ్రాహమ్ రాజకీయ జీవితంలో అత్యంత కీలకమైన వారసత్వంగా నిలుస్తుందని బ్లూమెంథల్ పేర్కొన్నారు.బిల్లులోని ముఖ్యాంశాలు:రష్యా నుంచి చమురు, సహజ వాయువు, ఇతర ఎగుమతులను కొనుగోలు చేస్తున్న దేశాలపై భారీ సుంకాలు విధించే అవకాశం.పుతిన్‌తో పాటు రష్యా ఉన్నత రాజకీయ, సైనిక నాయకులు, ఆర్థిక సంస్థలు, ఇంధన రంగంపై కొత్త ఆంక్షలు.ఇప్పటికే ఉన్న ఆంక్షలను తప్పించుకునేందుకు రష్యా ఉపయోగిస్తున్న పాత చమురు ట్యాంకర్లపై కూడా చర్యలు.జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అవసరమైతే కొన్ని ఆంక్షలను తాత్కాలికంగా మినహాయించే అధికారం అమెరికా అధ్యక్షుడికి కల్పించే నిబంధన.అయితే అధ్యక్షుడికి అదనపు టారిఫ్ అధికారాలు ఇవ్వడంపై కొందరు డెమోక్రాటిక్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధనలను సవరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సవరణలపై చర్చ అనంతరం బిల్లుపై అమెరికా సెనేట్‌లో తుది ఓటింగ్ జరగనుంది. ఈ బిల్లు చట్టంగా మారితే రష్యా యుద్ధ ఆర్థిక వనరులపై గట్టి దెబ్బ పడటంతో పాటు, ఉక్రెయిన్‌కు అమెరికా మద్దతు మరింత బలపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
కీవ్‌పై భీకర దాడి..10 మంది మృతి
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై శుక్రవారం రష్యా భీకర క్షిపణి దాడికి పాల్పడింది. ఘటనలో కనీసం 10 మంది చనిపోగా, మరో 100 మంది వరకు గాయపడ్డారు. సెంట్రల్ కీవ్‌కు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ప్రైవేట్ రక్షణ ఉత్పత్తిదారుల ప్రతినిధుల సమావేశంపై ఈ దాడి జరిగిందని అధికారులు తెలిపారు. దాడి తీవ్రతకు చుట్టుపక్కలున్న 27 ఇళ్లు, 44 వాహనాలు కూడా ధ్వంసమయ్యాయన్నారు. ఇతర వివరాలను తెలిపేందుకు నిరాకరించారు. ప్రభుత్వం కూడా దాడి మీడియా కవరేజీపై ఆంక్షలు విధించింది. కాగా, రష్యా దాడుల భయమున్న విషయం తెలిసీ ఆ ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేయడంపై ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ రుస్లాన్ క్రవ్చెంకో ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై వేరుగా క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు. ఇలా ఉండగా, సరిహద్దులకు 1,350 కిలోమీటర్ల దూరంలోని రష్యాలో ని కిరోవ్లో ఉన్న ఆయిల్ డిపోతోపాటు, మిలటరీ ప్లాంట్‌పైనా తాము డ్రోన్ దాడులు చేపట్టినట్లు జెలెన్స్కీ చెప్పారు. దాడిలో ఆరుగురు చనిపోగా, 26 మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. కాగా, రష్యాలోనే అతిపెద్ద ఆన్లైన్ రిటైలర్ వైల్డ్‌బెర్రీస్‌కు చెందిన సెయింట్పీటర్స్బర్గ్లోని గోదాముపై ఉక్రెయిన్ డ్రోన్ దాడికి పాల్పడింది. గోదాము నుంచి దట్టమైన పొగలు వెలువడుతున్న ఫొటోలు బయటకు వచ్చాయి. రేథియాన్‌తో జెలెన్స్కీ భేటీ రష్యా క్షిపణి దాడులను తట్టుకునే గగనతల రక్షణ వ్యవస్థలను సమకూర్చుకునేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చర్యలను వేగవంతం చేశారు. గురువారం కీవ్‌లో జెలెన్స్కీని రేథియాన్ కంపెనీ ప్రతినిధి బృందం కలిసింది. ఉక్రెయిన్‌తో కలిసి పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థలను ఉత్పత్తి చేసేందుకు గల అవకాశాలపై వీరు చర్చించారు. రాడార్లు, కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థలు, ఇంటర్సెప్టార్ క్షిపణులు ఈ వ్యవస్థల్లో ఉంటాయి. ప్రభుత్వ రంగంలో లేదా ప్రైవేట్ రంగంలో పేట్రియాట్ వ్య వస్థలను సమకూర్చుకునేందుకు తా ము సిద్ధంగా ఉన్నామంటూ అనంతరం జెలెన్స్కీ సోషల్ మీడియాలో ప్రకటించారు. అయితే, ఈ వ్యవహారం అంతసులువుగా కార్యాచరణలోకి వచ్చే అవకాశాలు లేవని నిపుణులు అంటున్నారు. ఉత్పత్తి దశకు చేరుకునేందుకు కొన్ని సంవత్సరాలు పడుతుందని చెబుతున్నారు. -
అలా చేస్తే మీ పని అంతే.. చైనా,రష్యాలకు ట్రంప్ వార్నింగ్
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ రష్యా,చైనాలపై ఫైరయ్యారు. ఈ రెండు దేశాలు ఇరాన్‌కు ఎట్టిపరిస్తితుల్లో ఆయుధాలు విక్రయించవద్దని తీవ్రంగా హెచ్చరించారు. ఒకవేళ ఆ పని చేస్తే అది ఆ దేశాలకే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని అది వారి దేశ ప్రయోజనాలకు ఏమాత్రం మంచిది కాదని స్పష్టం చేశారు.ట్రంప్ తన అధికారిక ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేస్తూ "చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈ ఏడాది మే నెలలో బీజింగ్‌లో జరిగిన సమావేశంలో తమ దేశం నుంచి ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇరాన్‌కు ఆయుధాలు విక్రయించబోమని హామీ ఇచ్చారు. మా మధ్య ఉన్న సంబంధాల దృష్ట్యా ఆయన మాటను నమ్ముతున్నాను" అని అన్నారు.అదే విధంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ సైతం ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్నప్పటికీ, ఇరాన్‌కు ఆయుధాలు అమ్మబోమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా తనకు హామీ ఇచ్చారని ట్రంప్ చెప్పారు.అదే సమయంలో ఉక్రెయిన్‌కు అమెరికా ఆయుధాలు అమ్మడంపై మాట్లాడుతూ "నేను ఉక్రెయిన్‌కు నేరుగా ఆయుధాలు అమ్మడం లేదని, కేవలం నాటో (NATO) దేశాలకే విక్రయిస్తున్నానని పుతిన్‌కు తెలుసు. నాటో దేశాలు పూర్తి ధర చెల్లించి కొనుగోలు చేస్తాయి, ఆ తర్వాత ఆ ఆయుధాలు ఎలా పంపిణీ అవుతాయో నాకు తెలియదు" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.ఇటీవలి కాలంలో అమెరికా సైనిక స్థావరాలపై జరిగిన వరుస దాడులకు సంబంధించి, ఇరాన్‌కు రష్యా మరియు చైనాలు లక్ష్యాల సమాచారాన్ని అందిస్తున్నాయా లేదా అనే అంశంపై వాషింగ్టన్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో దర్యాప్తు జరుపుతోంది. ఇంతలోనే ట్రంప్ ఇరుదేశాలకు వార్నింగ్ ఇచ్చారు. -
కార్గో షిప్ పై రష్యా దాడి..నలుగురు భారతీయుల మృతి
-
కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి
ఉక్రెయిన్‌లోని ఒడెసా పోర్టు దగ్గర కార్గో నౌకపై దాడి జరిగింది. నలుగురు భారతీయులు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఉక్రెయిన్‌లోని ఒడెసా పోర్టు నుంచి కార్గో నౌకలో ధాన్యం తీసుకెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిపై భారత్ తీవ్రంగా ఖండించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గినియా-బిస్సావు జెండాతో ప్రయాణిస్తున్న ఎంవీ గోల్డెన్ లియో నౌక జులై 19 సాయంత్రం ఒడెసా నుంచి బయలుదేరిన వెంటనే దాడికి గురైంది. ఆ నౌకలో మొత్తం 17 మంది సిబ్బంది ఉండగా, వారిలో ఐదుగురు భారతీయులు ఉన్నారు."ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం.. నలుగురు భారతీయులు దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. మరో భారతీయుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉంది" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడి అధికారులతో నిరంతరం సంప్రదింపులు సాగిస్తూ, బాధితులకు సాధ్యమైనంత సహాయం అందించే ప్రయత్నం చేస్తోందని భారత్ తెలిపింది. "మృతి చెందిన భారతీయుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. గాయపడిన భారతీయుడు త్వరగా పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాం" అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. నల్ల సముద్రం ప్రాంతంలో తాజాగా పెరిగిన యుద్ధ ఉద్రిక్తతల తర్వాత భారతీయ నావికులు ఎదుర్కొన్న అత్యంత ప్రాణాంతక ఘటనల్లో ఇది ఒకటి.వాణిజ్య నౌకలపై దాడులు సరికాదు: భారత్ ఈ ఘటనపై స్పందించిన భారత్.. పౌర నౌకలపై దాడులను ఖండించింది. యుద్ధ పరిస్థితుల్లోనూ సముద్ర రాకపోకల స్వేచ్ఛకు రక్షణ ఉండాలని భారత్ మరోసారి స్పష్టం చేసింది. "వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, అమాయక పౌర సిబ్బంది ప్రాణాలకు ముప్పు తేవడం, సముద్ర రాకపోకలు, వాణిజ్యానికి ఆటంకం కలిగించడం ఖండించదగ్గ విషయం. అలాంటి చర్యలు నివారించాలి" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.ఆ ప్రకటనలో రష్యా పేరు నేరుగా ప్రస్తావించలేదు. అయితే ఈ దాడికి రష్యాదే బాధ్యతని ఉక్రెయిన్ అధికారులు ఆరోపించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి చర్చలు, దౌత్య మార్గం ద్వారానే పరిష్కారం లభించాలని భారత్ పలుమార్లు పిలుపునిచ్చింది. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని, పౌరుల ప్రాణాలకు ముప్పు తెచ్చే దాడులు చేయవద్దని అన్ని పక్షాలను కోరింది. -
అత్యంత భారీ బాలిస్టిక్ క్షిపణుల దాడులు చేసిన రష్యా
రష్యా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై వరుసగా బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసింది. ఈ దాడుల్లో ఒకరు మరణించగా, 14 మంది గాయపడినట్టు అధికారులు తెలిపారు. గత రాత్రి వేళ ప్రాంతంలోని పలు చోట్ల దాడులు జరిగాయి. పూర్తి స్థాయి యుద్ధం మొదలైనప్పటి నుంచి కీవ్‌పై జరిగిన అత్యంత భారీ బాలిస్టిక్ దాడుల్లో ఇది ఒకటని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ చెప్పారు.ఉక్రెయిన్ సైన్యం తెలిపిన వివరాల ప్రకారం, 41 క్షిపణుల్లో 18 క్షిపణులను గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయి. మరో 108 డ్రోన్లను కూడా అడ్డుకున్నాయి. అటు ఉక్రెయిన్ కూడా రష్యాలోని లక్ష్యాలపై దాడులు కొనసాగిస్తోంది. స్టావ్రోపోల్ గవర్నర్ మాట్లాడుతూ.. డ్రోన్ దాడి వల్ల ఒక పారిశ్రామిక పార్కులో అగ్నిప్రమాదం సంభవించింది. కీవ్‌పై తాజా దాడుల్లో ఇస్కాండర్, హైపర్సోనిక్ జిర్కాన్ క్షిపణులతో పాటు 125 డ్రోన్లను కూడా రష్యా వినియోగించిందని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది.ఆదివారం కీవ్ మేయర్ విటాలీ క్లిచ్కో మాట్లాడుతూ.. ఈ దాడుల్లో నివాస భవనాలు, ఇతర భవనాలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఒక సూపర్ మార్కెట్, ఒక వసతి గృహం కూడా నష్టం చవిచూశాయని అన్నారు. రెండు గిడ్డంగుల్లో చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చే పనిలో ఉన్నారు.గత వారం ఉక్రెయిన్‌పై రష్యా సుమారు 1,450 దాడి డ్రోన్లు, 1,640కు పైగా బాంబులు, 99 రకాల క్షిపణులను ప్రయోగించిందని టెలిగ్రామ్‌లో జెలెన్స్కీ పేర్కొన్నారు. రాత్రి జరిగిన ఈ దాడులకు ముందు, రష్యాలోని అతిపెద్ద ఆన్లైన్ రిటైలర్ వైల్డ్‌బెర్రీస్‌కు చెందిన రెండు గిడ్డంగులను ఉక్రెయిన్ డ్రోన్లతో ధ్వంసం చేసింది. ఈ ఘటనలో 8 మంది మరణించగా, భారీ అగ్నిప్రమాదాలు సంభవించాయి.మాస్కోకు ఆగ్నేయంగా సుమారు 475 కిలోమీటర్ల దూరంలో ఉన్న టాంబోవ్ నగరంలోని ఒక కేంద్రంలో ఏడుగురు మరణించగా, 25 మంది గాయపడ్డారు. రాజధాని సమీపంలోని ఎలెక్ట్రోస్టాల్‌లో ఉన్న మరో వైల్డ్‌బెర్రీస్ గిడ్డంగిలో ఒకరు మరణించగా, 37 మంది గాయపడ్డారు. శనివారం జెలెన్స్కీ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ చర్యలు రష్యా పౌర మౌలిక సదుపాయాలు, నగరాలు, సమాజాలపై చేసిన దాడులకు ప్రతిస్పందన అని చెప్పారు.వైల్డ్బెర్రీస్ను తరచూ రష్యాకు చెందిన అమెజాన్‌గా అభివర్ణిస్తారు. వైల్డ్‌బెర్రీస్, ప్రకటనల సంస్థ రస్ కలిసిన ఆర్డబ్ల్యుబీ గ్రూప్ విలువను 2026లో ఫోర్బ్స్ రష్యా సుమారు $12.6 బిలియన్ (£9.3 బిలియన్)గా అంచనా వేసింది.ఇటీవలి కాలంలో రష్యా కీలక ఇంధన మౌలిక సదుపాయాలపై దీర్ఘ శ్రేణి డ్రోన్ దాడులను ఉక్రెయిన్ మరింత తీవ్రం చేసింది. దీని వల్ల విస్తృత స్థాయిలో ఇంధన కొరత ఏర్పడింది. ఈ నెల ప్రారంభంలో రష్యా చమురు శుద్ధి సామర్థ్యంలో దాదాపు 43% పనిచేయకుండా చేశామని కీవ్ ప్రకటించింది. -
రష్యాకు డబుల్ ట్రబుల్.. పుతిన్‌కు కొత్త సవాల్!
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మరో కీలక దశలోకి అడుగుపెడుతోంది. యుద్ధభూమిలో పేలుళ్లు కొనసాగుతుండగా.. ఆ ప్రభావం ఇప్పుడు రష్యా ఆర్థిక వ్యవస్థపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు పెరుగుతున్న యుద్ధ ఖర్చులు, మరోవైపు ఉక్రెయిన్ దాడులు.. ఈ రెండు పరిణామాలు రష్యాకు కొత్త సవాళ్లను విసురుతున్నాయి. యుద్ధం సుదీర్ఘంగా కొనసాగుతున్న నేపథ్యంలో, భవిష్యత్తుపై ఆందోళనతో కొంతమంది రష్యన్లు తమ పొదుపులను బ్యాంకుల్లో ఉంచడం కంటే చేతిలో నగదుగా ఉంచుకోవడానికి మొగ్గు చూపుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆర్థిక పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో అన్న అనిశ్చితి ప్రజల్లో పెరుగుతోందని తెలుస్తోంది.భవిష్యత్తుపై భయం.. నగదు వైపు రష్యన్లు..బ్యాంకింగ్ వ్యవస్థపై పూర్తిస్థాయి నమ్మకం తగ్గిందని చెప్పలేకపోయినా.. సంక్షోభ సమయాల్లో అందుబాటులో నగదు ఉండటం మంచిదనే ఆలోచన కొంతమందిలో పెరుగుతోంది. గతంలో ఆర్థిక సంక్షోభాలు ఎదురైన సందర్భాల్లోనూ ఇలాంటి ధోరణులు కనిపించాయి. ఇప్పటికే రష్యా ఆర్థిక వ్యవస్థ పలు ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. పాశ్చాత్య దేశాల ఆంక్షలు, భారీగా పెరిగిన రక్షణ వ్యయం, ద్రవ్యోల్బణ ప్రభావం, కార్మికుల కొరత వంటి అంశాలు దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి సవాళ్లుగా మారుతున్నాయి. యుద్ధ అవసరాల కోసం ప్రభుత్వ వ్యయం భారీగా రక్షణ రంగం వైపు మళ్లడంతో ఇతర రంగాలపై ఒత్తిడి పెరుగుతోందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే రష్యా ప్రభుత్వం మాత్రం తమ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగానే ఉందని, ఆంక్షలను ఎదుర్కొనే సామర్థ్యం దేశానికి ఉందని చెబుతోంది.రష్యా వాణిజ్య నాడిపై దాడులుఇదే సమయంలో ఉక్రెయిన్ దాడుల పరిధి కూడా విస్తరిస్తోంది. రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో ఆన్లైన్ రిటైల్ సంస్థలకు చెందిన భారీ గోదాములు దాడులకు గురైనట్లు సమాచారం. ఈ గోదాములు కేవలం నిల్వ కేంద్రాలు మాత్రమే కాదు.. వేలాది ఆన్లైన్ ఆర్డర్లకు కేంద్రాలుగా పనిచేసే కీలక వాణిజ్య వ్యవస్థలు. దుస్తులు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు వంటి అనేక రకాల ఉత్పత్తులు ఇక్కడ నిల్వ ఉంటాయి. ఇలాంటి మౌలిక సదుపాయాలు దెబ్బతింటే సరఫరా వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. దాడుల్లో ప్రాణనష్టం, గాయాలపై స్థానిక వర్గాలు సమాచారం ఇచ్చినప్పటికీ.. పూర్తి వివరాలపై రష్యా, ఉక్రెయిన్ వర్గాల ప్రకటనల్లో వ్యత్యాసాలు ఉన్నాయి.మారుతున్న యుద్ధ వ్యూహం?యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరుదేశాలు ప్రధానంగా సైనిక స్థావరాలు, ఆయుధ నిల్వ కేంద్రాలు, ఇంధన వనరులను లక్ష్యంగా చేసుకున్నాయి. కానీ ఇప్పుడు వాణిజ్య రంగంపై కూడా దాడుల ప్రభావం కనిపించడం కొత్త ఆందోళనలకు కారణమవుతోంది. ఉక్రెయిన్ లక్ష్యం రష్యా యుద్ధ సామర్థ్యాన్ని బలహీనపరచడమేనని చెబుతుండగా.. రష్యా మాత్రం ఇలాంటి దాడులను ఖండిస్తూ ప్రతీకార చర్యలు కొనసాగిస్తోంది.Russian fuel stations are being put up for sale en masse due to huge financial losses.The Moscow Stock Exchange has fallen 18 straight weeks, the most since the 1990s.A half trillion rubles were withdrawn from banks in 2 weeks by panicked Russians.Worse is yet to come.🍿🍿 pic.twitter.com/DQqX1jxM2R— Maria Drutska 🇺🇦 (@maria_drutska) July 18, 2026యుద్ధం.. ప్రజల జీవితాలపై ప్రభావంఒకవైపు సరిహద్దుల్లో యుద్ధ శబ్దాలు.. మరోవైపు ఆర్థిక ఒత్తిళ్లు.. ఈ రెండు పరిణామాలు సాధారణ ప్రజల జీవితాలపై ప్రభావం చూపుతున్నాయి. భవిష్యత్తుపై అనిశ్చితి పెరిగినప్పుడు ప్రజలు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు దేశ ఆర్థిక పరిస్థితికి సంకేతాలుగా మారుతాయి. ప్రస్తుతం రష్యా ముందు ఉన్న సవాలు కేవలం యుద్ధంలో ఆధిపత్యం సాధించడం మాత్రమే కాదు.. దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధ భారాన్ని ఆర్థికంగా, సామాజికంగా ఎలా ఎదుర్కోవాలన్నదీ కీలక ప్రశ్నగా మారింది. ఒకవైపు ఆకాశంలో యుద్ధ విమానాల గర్జన.. మరోవైపు బ్యాంకుల నుంచి బయటకు వస్తున్న నగదు.. రష్యా ఇప్పుడు యుద్ధభూమితో పాటు ఆర్థిక రంగంలోనూ అతిపెద్ద పరీక్షను ఎదుర్కొంటోంది. యుద్ధంలో గెలుపు కోసం సైనిక బలం ఎంత ముఖ్యమో.. ఆర్థిక స్థిరత్వం కూడా అంతే కీలకం. రష్యా ఈ రెండు రంగాల్లోనూ ఒత్తిడిని ఎదుర్కొంటున్న వేళ.. ఈ పోరు భవిష్యత్తులో ఏ మలుపు తిరుగుతుందన్నది ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.Wildberries is a key source of supplies for the Russian front, as many "Z-channels" note."A vast quantity of military goods and dual-use items is sold on WB. Consequently, attacks on the warehouses would deal a severe blow to front-line supplies."Tens of thousands of Russians… https://t.co/pYZXP8ivLT pic.twitter.com/vg2ucDfSy9— Jürgen Nauditt 🇩🇪🇺🇦 (@jurgen_nauditt) July 18, 2026 -
రష్యాపై ఉక్రెయిన్ భీకర దాడులు
మాస్కో: ఉక్రెయిన్ తన లాంగ్ రేంజ్ డ్రోన్ల సత్తాను రష్యాకు రుచి చూపింది. శుక్రవారం రాత్రి రాజధాని మాస్కో తదితర ప్రాంతాలపై ఉక్రెయిన్ జరిపిన దాడుల్లో 9 మంది చనిపోగా, 60 మందికి పైగా గాయపడ్డారు. ఇంధన, సైనిక లక్ష్యాలపై జరిగిన ఈ దాడుల్లో పలు చోట్ల అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. టాంబోవ్ ప్రాంతంలోని కొటొవ్స్క్ , మాస్కోకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలక్ట్రోస్టాల్ నగరంలోని గోదాములు మంటల్లో చిక్కుకున్నాయి. ఈ రెండూ ప్రముఖ ఆన్లైన్ రిటైలర్ వైల్డ్‌బెర్రీస్‌కు చెందినవని అధికారులు తెలిపారు. కొటొవ్స్క్ ఘటనలో ఏడుగురు చనిపోగా, 25 మంది గాయపడ్డారు. మాస్కో ప్రాంతంలో జరిగిన దాడుల్లో ఒకరు చనిపోగా, 37 మంది గాయపడినట్లు గవర్నర్ తెలిపారు. ఎలక్ట్రోస్టాల్లోని గోదాములో దాడితో ఒకరు చనిపోయారు. ఇక్కడ ప్రమాద తీవ్రత కారణంగా పొరుగునే ఉన్న ఒక నివాస భవనాన్ని, ఆస్పత్రిని అధికారులు ఖాళీ చేయించారు. ఈ రెండు గోదాముల్లోనూ డ్రోన్ల తయారీకి సంబంధించిన నిషేధిత సామగ్రి ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. -
రష్యాపై ఉక్రెయిన్ దాడులు.. ఏడుగురి మృతి, 51 మందికి గాయాలు
రష్యాలో శనివారం తెల్లవారుజామున ఉక్రెయిన్ చేపట్టిన డ్రోన్ దాడుల్లో ఏడుగురు మృతిచెందారు. మరో 51 మంది గాయపడ్డారు. గోదాములు, చమురు నిల్వ కేంద్రం, ఓ నివాస భవనంపై ఈ దాడులు జరిగాయి. పలు ప్రాంతాల్లో వందల సంఖ్యలో డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థ అడ్డుకుందని రష్యా అధికారులు తెలిపారు.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడుతూ.. మాస్కో, టాంబోవ్ ప్రాంతాల్లోని రెండు కీలక లాజిస్టిక్ కేంద్రాలపై దాడులు చేపట్టినట్టు తెలిపారు. "డ్రోన్లు, నావిగేషన్ పరికరాల తయారీకి ఆంక్షలు ఎదుర్కొంటున్న విడిభాగాలను సరఫరా చేసేందుకు ఈ కేంద్రాలను ఉపయోగిస్తున్నారు. ఓ చమురు కేంద్రంపై కూడా దాడి చేశాం" అని టెలిగ్రామ్‌లో పేర్కొన్నారు. అజోవ్ సముద్రం, రష్యా ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో కూడా ప్రత్యేక ఆపరేషన్ దళాలు లక్ష్యాలపై దాడులు చేశాయని చెప్పారు.రష్యా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రష్యాలో అతిపెద్ద ఆన్లైన్ రిటైల్ సంస్థ వైల్డ్బెరీస్కు చెందిన రెండు భారీ గోదాములపై గత రాత్రి దాడులు జరిగాయి. వైల్డ్బెరీస్ అంటే రష్యాలో ప్రముఖ ఆన్లైన్ వస్తువుల విక్రయ సంస్థ. ఒకటి ఉక్రెయిన్ సరిహద్దు నుంచి దాదాపు 360 కిలోమీటర్ల దూరంలో ఉన్న టాంబోవ్ ప్రాంతంలోని కోటోవ్స్క్లో ఉంది. ఇంకొకటి మాస్కోకు తూర్పున దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలెక్ట్రోస్టాల్‌లో ఉంది.మృతులంతా విధుల్లో ఉన్న కార్మికులే.. టాంబోవ్ ప్రాంత గవర్నర్ యెవ్గెనీ పెర్విషోవ్ మాట్లాడుతూ.. కోటోవ్స్క్ గోదాంలో రాత్రి విధుల్లో ఉన్న ఏడుగురు కార్మికులు మరణించారని, మరో 25 మంది గాయపడ్డారని తెలిపారు. మాస్కో ప్రాంత గవర్నర్ ఆండ్రే వొరోబ్యోవ్ మాట్లాడుతూ.. ఎలెక్ట్రోస్టాల్‌లో 24 మంది గాయపడ్డారని చెప్పారు. ఎలెక్ట్రోస్టాల్కు ఉత్తరాన ఉన్న నొగిన్స్క్లో ఉక్రెయిన్ డ్రోన్ దాడి తర్వాత చమురు నిల్వ కేంద్రానికి మంటలు అంటుకున్నాయని, అక్కడ మరో ఇద్దరు గాయపడ్డారని తెలిపారు. ముందు జాగ్రత్తగా సమీపంలోని ప్రసూతి ఆసుపత్రి, ఓ నివాస భవనాన్ని ఖాళీ చేయించారు.మాస్కోకు తూర్పున దాదాపు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్లాదిమిర్‌లో ఉక్రెయిన్ డ్రోన్ ఓ నివాస భవనాన్ని ఢీకొనడంతో స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుందని గవర్నర్ అలెగ్జాండర్ అవ్దేయేవ్ తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదని చెప్పారు.రష్యా రక్షణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. 19 రష్యా ప్రాంతాలు, క్రిమియా, అజోవ్ సముద్రం, నల్ల సముద్రం ప్రాంతాలపై వచ్చిన 379 ఉక్రెయిన్ డ్రోన్లను రాత్రి సమయంలో వైమానిక రక్షణ వ్యవస్థ అడ్డుకుంది.రాత్రి జరిగిన ఈ దాడుల్లో టాంబోవ్, మాస్కో ప్రాంతాల్లో ప్రాణనష్టం చోటుచేసుకుంది. గోదాములు, చమురు నిల్వ కేంద్రం వంటి కీలక ప్రాంతాలు దెబ్బతిన్నాయి. వ్లాదిమిర్‌లోని ఓ నివాస భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. రష్యా సైనిక సరఫరాలకు అనుబంధంగా ఉన్న కేంద్రాలనే లక్ష్యంగా చేసుకున్నామని ఉక్రెయిన్ తెలిపింది. ఉక్రెయిన్ పెద్ద ఎత్తున దాడులు చేయడంతో నెక్ట్స్ రష్యా ఏం చేస్తుందోనన్న ఆందోళన నెలకొంది. -
జెలెన్స్కీ సంచలన నిర్ణయం
కీవ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యాతో యుద్ధంలో ఎంతో కీలకంగా వ్యవహరించిన రక్షణశాఖ మంత్రి ఫెదోరోవ్ ను ఆపదవి నుంచి తప్పించారు. రక్షణమంత్రితో విభేదాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జెలెన్ స్కీ నిర్ణయంతో ఒక్కసారిగా అంతా షాకయ్యారు. కాగా ఫెదోరవ్ రష్యాపై దాడుల సమయంసలో ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించారు.ఉక్రెయిన్ టాప్ మిలిటరీ కమాండర్-ఇన్-చీఫ్ జనరల్ ఒలెక్సాండర్ సిర్స్కీ, ఫెదోరోవ్ మధ్య వ్యూహాత్మక విభేదాలు వచ్చాయి. తాను ప్రతిపాదించిన సైనిక సంస్కరణలను సిర్స్కీ కావాలనే అడ్డుకున్నారని తనతో చర్చించడానికి సైతం నిరాకరించారని ఫెదోరోవ్ స్వయంగా ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆయన తొలగింపు జరిగింది.కాగా ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. కీవ్, ఖార్కివ్ సహా పలు నగరాల్లో ప్రజలు భారీ ఎత్తున నిరసనలకు దిగారు. యుద్ధంలో డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి విజయాలు సాధించిన ఫెడోరోవ్‌ను తొలగించడం సరికాదని, ఆయనపై రాజకీయ కక్షలతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు.ఫెదోరవ్ ఈ ఆరునెలల కాలంలో సాధించిన విజయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. రష్యా సైన్యానికి స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలు అందకుండా పూర్తిగా నిలిపివేయడం, డ్రోన్ల సహాయంతో రష్యా ఆక్రమిత క్రిమియా ద్వీపకల్పంలోని రవాణా వ్యవస్థను దెబ్బతీయడం, రష్యా ఇంధన క్షేత్రాలపై డ్రోన్ దాడులు చేయడం విజయాలుగా అభివర్ణించారు.నాటో ప్రమాణాలకు అనుగుణంగా రక్షణ శాఖను పూర్తిగా మార్చలేకపోవడం, సైనిక కొనుగోళ్లలో అవినీతి పాత పద్ధతులను పూర్తిగా నిర్మూలించలేకపోవడం వైఫల్యాలుగా చెప్పుకున్నారు. -
పాత దోస్తీకి కొత్త పరీక్ష.. భారత్ సాయం కోరిన రష్యా
ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుల్లో ఒకటైన రష్యా.. ఇప్పుడు శుద్ధి చేసిన ఇంధనం కోసం భారత్ వైపు చూస్తోంది. ఉక్రెయిన్ దాడులతో రష్యాలోని కీలక చమురు శుద్ధి కేంద్రాలు దెబ్బతినడంతో దేశీయ పెట్రోల్ సరఫరాపై ఒత్తిడి పెరిగింది. దీంతో అదనపు పెట్రోల్ సరఫరా కోసం భారతీయ రిఫైనరీలను రష్యా సంప్రదించినట్లు సమాచారం.ఇది అంతర్జాతీయ ఇంధన రంగంలో ఆసక్తికరమైన పరిణామంగా మారింది. ఎందుకంటే ఇప్పటివరకు రష్యా ప్రపంచ దేశాలకు ముడి చమురు సరఫరా చేసే శక్తివంతమైన దేశంగా ఉంది. ముఖ్యంగా భారత్‌కు భారీగా క్రూడ్ ఆయిల్ ఎగుమతి చేసిన రష్యా.. ఇప్పుడు అదే భారత్ నుంచి శుద్ధి చేసిన పెట్రోల్ కొనుగోలు చేసే పరిస్థితిని ఎదుర్కొంటోంది.ఈ పరిణామానికి ప్రధాన కారణం ఉక్రెయిన్ చేపడుతున్న డ్రోన్ దాడులు. రష్యాలోని చమురు రిఫైనరీలు, ఇంధన నిల్వ కేంద్రాలు లక్ష్యంగా దాడులు జరగడంతో కొన్ని ప్రాంతాల్లో ఇంధన ఉత్పత్తి తగ్గినట్లు సమాచారం. రిఫైనరీల్లో మరమ్మతులు, ఉత్పత్తి అంతరాయాల కారణంగా దేశీయ మార్కెట్లో పెట్రోల్ సరఫరాను స్థిరంగా ఉంచడం రష్యాకు సవాల్‌గా మారింది. రష్యా ప్రభుత్వం దేశీయ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ ఇంధన సరఫరాను నియంత్రించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ లభ్యతపై ఒత్తిడి పెరగడంతో దిగుమతుల ద్వారా లోటును భర్తీ చేసే మార్గాలను మాస్కో పరిశీలిస్తోంది.ఈ క్రమంలో రష్యా సంస్థలు భారతీయ రిఫైనరీ కంపెనీలను సంప్రదించినట్లు సమాచారం. భారత్‌కు ప్రపంచ స్థాయి భారీ చమురు శుద్ధి సామర్థ్యం ఉంది. ముఖ్యంగా భారత రిఫైనరీలు దిగుమతి చేసుకున్న ముడి చమురును శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్ వంటి ఉత్పత్తులుగా మార్చి అంతర్జాతీయ మార్కెట్లకు కూడా ఎగుమతి చేస్తుంటాయి. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గత కొన్నేళ్లుగా భారత్ రష్యా నుంచి రికార్డు స్థాయిలో ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పాశ్చాత్య ఆంక్షల కారణంగా రష్యా చమురుకు ప్రత్యామ్నాయ మార్కెట్లు అవసరమయ్యాయి. ఆ సమయంలో భారత్ పెద్ద కొనుగోలుదారుగా మారింది. ఇప్పుడు అదే ఇంధన సంబంధాలు మరో రూపంలో కనిపిస్తున్నాయి.భారత్‌కు ఒక అవకాశం.. అయితే ఈ పెట్రోల్ సరఫరా వ్యవహారం కేవలం వ్యాపార అంశం మాత్రమే కాదు. దీనికి అంతర్జాతీయ రాజకీయ ప్రాధాన్యత కూడా ఉంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు పెరగడం ప్రపంచ ఇంధన భద్రతపై ప్రభావం చూపుతోంది. భారత్‌కు ఇది ఒక అవకాశంగా కూడా మారవచ్చు. ప్రపంచ స్థాయి రిఫైనింగ్ సామర్థ్యం కారణంగా భారత ఇంధన కంపెనీలకు కొత్త మార్కెట్లు లభించే అవకాశం ఉంది. అయితే దేశీయ అవసరాలు, ఎగుమతి విధానాలు, అంతర్జాతీయ ఒత్తిళ్లు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.మొత్తంగా చూస్తే.. ఒకప్పుడు ప్రపంచానికి చమురు సరఫరా చేసిన రష్యానే ఇప్పుడు పెట్రోల్ కోసం ఇతర దేశాల వైపు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం కేవలం యుద్ధభూమికే పరిమితం కాకుండా ప్రపంచ ఇంధన సమీకరణాలను ఎలా మార్చుతోందో ఈ పరిణామం మరోసారి స్పష్టం చేస్తోంది. -
భారత్‌పై 100% సుంకాలు
వాషింగ్టన్: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు గాను భారత్ సహా ఐదు దేశాలపై 100 శాతం సుంకాలు విధించాలని సూచిస్తూ అమెరికా సెనేటర్లు ఒక బిల్లును ప్రతిపాదించారు. దివంగత రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం మధ్యవర్తిత్వంతో రూపొందించిన ఈ బిల్లు రష్యా గ్యాస్‌ను కొనుగోలు చేసే 15 యూరోపియన్ దేశాలకు సుంకాల నుంచి మినహాయింపు ఇస్తుంది. ఈ కొనుగోళ్లు వారి మొత్తం అవసరంలో ఒక చిన్న భాగం మాత్రమేనని బిల్లులో పేర్కొన్నారు. సదరు దేశాలు రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి చర్యలు తీసుకుంటున్నాయని వెల్లడించారు. 100 శాతం సుంకాల ప్రభావానికి గురయ్యే దేశాల్లో భారత్, చైనా, స్లొవేకియా, హంగేరీ, అజర్బైజాన్ ఉన్నాయి. ఒకవేళ ఈ బిల్లు అమెరికా కాంగ్రెస్‌లో ఆమోదం పొందితే మరొక దేశ యుద్ధ ప్రయత్నాలకు ఆర్థిక సహకారం అందించే దేశాలను శిక్షించే లక్ష్యంతో సుంకాలను ఒక భౌగోళిక రాజకీయ ఆయుధంగా ఉపయోగించడానికి చట్టసభ స్పష్టంగా అనుమతినివ్వడం ఇదే మొదటిసారి అవుతుంది. -
ఉక్రెయిన్ దెబ్బకు రష్యా విలవిల.. పెట్రోల్ కోసం భారత్ వైపు చూపు?
మొన్నటివరకు రష్యా నుంచి రికార్డు స్థాయిలో ముడిచమురును దిగుమతి చేసుకున్న భారత్.. ఇప్పుడు అదే రష్యాకు పెట్రోల్ ఎగుమతి చేసే పరిస్థితి తలెత్తింది. ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో తీవ్ర ఇంధన సంక్షోభంలో మునిగిపోయిన రష్యా.. తమకు అదనపు పెట్రోల్ సరఫరా చేయాల్సిందిగా భారత రిఫైనరీలను సంప్రదించినట్లు 'రాయిటర్స్' తమ కథనంలో పేర్కొంది. ఇటీవల కాలంలో రష్యా ఇంధన మౌలిక వసతులే లక్ష్యంగా ఉక్రెయిన్ వరుస డ్రోన్, క్షిపణి దాడులకు పాల్పడింది. ఈ దాడుల ప్రభావం రష్యా చమురు శుద్ధి రంగంపై తీవ్రంగా పడింది. రష్యాకు చెందిన దాదాపు 40 శాతం చమురు శుద్ధి సామర్థ్యం ఉక్రెయిన్ దాడుల వల్ల దెబ్బతిన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే భారత్ సాయాన్ని రష్యా కోరుతోంది. రోస్నెఫ్ట్ (Rosneft), గాజ్ప్రోమ్ నెఫ్ట్ (Gazprom Neft), లుకోయిల్ (Lukoil) వంటి రష్యా టాప్ ఎనర్జీ కంపెనీలు భారత రిఫైనరీలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ ఆంక్షల నేపథ్యంలో ఈ ఒప్పందాలు కుదిరితే, ఇరు దేశాల మధ్య నేరుగా కాకుండా థర్డ్-పార్టీ ఇంటర్నేషనల్ ట్రేడర్ల ద్వారా ఈ ఇంధన సరఫరా జరుగుతుంది. కాగా ఇప్పటికే ఒక పెట్రోల్ కార్గో భారత్ నుంచి రష్యాకు బయలు దేరినట్లు వార్తలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇరు దేశాల మధ్య సరఫరా ఒప్పందాలు కుదిరితే మరిన్ని షిప్మెంట్లు రష్యాకు వెళ్లే అవకాశం ఉంది. -
మాస్కోతో దోస్తీ.. భారత్‌పైనా ట్రంప్ గురి!
రష్యా నుంచి ముడిచమురు దిగుమతుల విషయంలో భారత్‌కు అమెరికా మరోసారి గట్టి హెచ్చరికలు పంపుతోంది. ఇప్పటివరకు కొన్ని వెసులుబాట్లతో కొనసాగిన పరిస్థితులకు తెరదించేలా.. రష్యా ఇంధన రంగంతో వ్యాపారాలు కొనసాగించే దేశాలపై భారీ సుంకాలు విధించే ప్రతిపాదన సిద్ధం చేసింది. అయితే మిత్రదేశం భారత్‌కు షాక్ ఇస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దానికి పూర్తి మద్దతు తెలిపినట్లు వైట్‌హౌస్ వెల్లడించింది.రష్యాపై ఆంక్షలను మరింత కఠినతరం చేసే ఓ బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ప్రకటించినట్లు వైట్‌హౌస్ వెల్లడించింది. ఈ విషయాన్ని ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీ అధికారికంగా ధృవీకరించింది. ‘సాంక్షనింగ్ రష్యా యాక్ట్’ పేరుతో తీసుకొచ్చిన ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే.. రష్యా ఇంధన రంగంతో సంబంధాలు కొనసాగించే దేశాలపై అమెరికా అధ్యక్షుడికి భారీ సుంకాలు విధించే అధికారం లభిస్తుంది. ఈ బిల్లులో భాగంగా దిగుమతులపై గరిష్ఠంగా 500 శాతం వరకు టారిఫ్‌లు విధించే అవకాశం ఉంది. అంటే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాల ఎగుమతులు తీవ్రంగా ప్రభావితమయ్యే పరిస్థితి ఏర్పడొచ్చు.టార్గెట్‌లో భారత్, చైనాఈ బిల్లును ముందుకు తీసుకెళ్లిన రిపబ్లికన్ నేత లిండ్సే గ్రాహమ్ గతంలోనే భారత్, చైనాలను ప్రధానంగా ప్రస్తావించారు. రష్యా చమురు, గ్యాస్ ఆదాయాలకు ఈ రెండు దేశాలే కీలక ఆధారాలని ఆయన వాదించారు. భారత్, చైనా కలిసి రష్యా ఇంధన ఎగుమతుల్లో భారీ వాటాను కలిగి ఉన్నాయని పేర్కొంటూ.. ఈ డిమాండ్‌ను తగ్గించడం ద్వారా మాస్కోపై ఆర్థిక ఒత్తిడి పెంచవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ బిల్లుకు బలమైన మద్దతుదారుగా ఉన్న గ్రాహమ్.. ఇటీవల ఉక్రెయిన్ పర్యటన ముగించుకుని అమెరికాకు తిరిగొచ్చిన అనంతరం ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన మరణం తర్వాత కూడా ఈ బిల్లును ముందుకు తీసుకెళ్లాలని పలువురు సెనేటర్లు భావిస్తున్నారు.భారత్‌కు ఎందుకు ఆందోళన?ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యా నుంచి తక్కువ ధరకు లభిస్తున్న ముడిచమురు భారత్‌కు కీలకంగా మారింది. దేశ ఇంధన అవసరాలను దృష్టిలో పెట్టుకునే రష్యా నుంచి చమురు దిగుమతులు చేస్తున్నామని భారత్ స్పష్టం చేస్తోంది. అయితే అమెరికా కొత్త ఆంక్షలు అమల్లోకి వస్తే.. భారత్ ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఫార్మా, టెక్స్టైల్స్, ఐటీ సేవలు రంగాలు ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశముందని అంచనా. 500 శాతం టారిఫ్‌లు అమలైతే భారత ఆర్థిక వృద్ధి దాదాపు 0.5 శాతం వరకు తగ్గే ప్రమాదం ఉందని కొన్ని అంచనాలు చెబుతున్నాయి.ఒకవైపు ముప్పు.. మరోవైపు వాణిజ్య అవకాశంరష్యా చమురు విషయంలో అమెరికా ఒత్తిడి పెంచుతున్న సమయంలోనే.. భారత్ మరో కీలక వాణిజ్య ఒప్పందంతో ముందుకు వెళ్తోంది. భారత్-బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (CETA) జూలై 15 నుంచి అమల్లోకి రానుంది. దీనితో భారత ఎగుమతిదారులకు బ్రిటన్ మార్కెట్లో మరిన్ని అవకాశాలు లభించే అవకాశం ఉంది. అంటే ఒకవైపు రష్యా చమురు విషయంలో అమెరికా ఒత్తిడి.. మరోవైపు కొత్త వాణిజ్య భాగస్వామ్యాలతో అవకాశాలు.. ప్రస్తుతం భారత్ దౌత్య, ఆర్థిక సమతుల్యతను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొంటోంది.చమురు కోసం స్నేహమా? ఆర్థిక భద్రతా?భారత్ మాత్రం తన వైఖరిలో మార్పు లేదని మొదటి నుంచి చెబుతోంది. ఇంధన దిగుమతులు దేశ ఆర్థిక అవసరాల ఆధారంగా జరుగుతున్నాయని, ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని వివరిస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ బిల్లుకు అమెరికా కాంగ్రెస్‌లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొందరు సెనేటర్లు రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ఇది అవసరమని చెబుతుండగా.. మరికొందరు భారత్, చైనా వంటి దేశాలపై భారీ సుంకాలు విధించడం ప్రపంచ వాణిజ్యానికి నష్టం కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు.ఇక ముందు ఏం జరుగుతుంది?ట్రంప్ మద్దతుతో ఈ బిల్లుకు మరింత ఊపు వచ్చినప్పటికీ.. ఇది చట్టంగా మారాలంటే కాంగ్రెస్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఒకవేళ ఇది అమల్లోకి వస్తే.. రష్యాతో భారత్ ఇంధన సంబంధాలు మాత్రమే కాదు.. భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. రష్యా చమురు కొనుగోళ్లు.. ఇప్పుడు భారత్‌కు ఆర్థిక లాభమా? లేక అమెరికా టారిఫ్‌ల రూపంలో కొత్త సవాలా? అన్నది అంతర్జాతీయ వాణిజ్యంలో కీలక చర్చగా మారింది. -
ట్రెంపరితనం తెచ్చిన తంటా!
అగ్రరాజ్యం అమెరికా ఏకాకి అవుతోందా? మిత్రులు ముఖం చాటేస్తున్నారా? అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు ఆర్థికంగా గుదిబండలవుతున్నాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం అవును అంటున్నారు జాన్ ఫైనర్. న్యూయార్క్‌టైమ్స్ పత్రికలో ఈయన రాసిన కథనం ప్రకారం అధ్యక్షుడి తెంపరితనం కాస్తా పౌరులకు వందల కోట్ల డాలర్ల నష్టం తీసుకొచ్చింది. మిత్రదేశాలనూ వదలకుండా చేస్తున్న హెచ్చరికలు అంతర్జాతీయంగా అమెరికా ఒంటరయ్యేందుకు కారణమవుతోందని విశ్లేషిస్తున్నారు.అధ్యక్షుడిగానే కాదు.. అంతకుముందు కూడా డొనాల్డ్ జే ట్రంప్ వైఖరి వివాదాస్పదమే. ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారం కావచ్చు. వివాహం, అక్రమసంబంధాలు, పన్నులు ఎగ్గొట్టడం.. ఇలా బోలెడన్నిసార్లు అంతర్జాతీయంగా చర్చల్లో నిలిచారు. అయితే రెండోసారి గద్దెనెక్కిన తరువాత ఈ వివాదాల జోరు మరింత పెరిగిందేమో అన్న అంచనాలు ఏర్పడ్డాయి. మేక్ అమెరికా గ్రేట్ ఎగేన్(మాగా) నినాదంతో ఎన్నికల్లో విజయం సాధించాక అక్రమ వలసదారులు, టారిఫ్‌లు, వీసాల వంటి విషయాల్లో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు పలుమార్లు విమర్శలకు గురయ్యాయి.ఈ నేపథ్యంలోనే న్యూయార్క్ టైమ్స్ కాలమిస్ట్ జాన్ ఫైనర్ ఈ తెంపరి నిర్ణయాల తాలూకూ ఆర్థిక భారంపై వివరణాత్మక విశ్లేషణ ఒకటి చేశారు. దాని ప్రకారం ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం కారణంగా అమెరికాలో ఇప్పటికే పెట్రోలు, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పెట్రోలు, డీజిల్ ధరలు సుమారు 15 శాతం వరకూ పెరగ్గా, యూరియా ధర ఏకంగా యాభై శాతం ఎక్కువైంది. డీఏపీ కోసం 27 శాతం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఈ పెంపు కాస్తా అమెరికన్లపై ఇప్పటికే సుమారు 13,200 కోట్ల డాలర్ల ఆర్థిక భారం మోపిందని అంచనా. తగ్గిన పర్యాటకులు, విద్యార్థులు... కఠిన వీసా నిబంధనలు అమలు చేయడం, యుద్ధభయం వంటి కారణాలతో అమెరికాకు వస్తున్న పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2024తో పోలిస్తే 2025లో అమెరికాకు వచ్చిన పర్యాటకుల సంఖ్య సుమారు 40 లక్షలు తక్కువ. ఫలితంగా ఆర్థిక వ్యవస్థకు 800 కోట్ల డాలర్ల నష్టం జరిగిందని లెక్కలేస్తున్నారు. వీసాల విషయంలో తీసుకొస్తున్న మార్పుల కారణంగా భారత్‌తోపాటు అనేక ఇతర దేశాల విద్యార్థులు అమెరికాకు కాకుండా ఇతర యూరోపియన్ దేశాలకు మళ్లుతూండటం గమనార్హం. ఫలితంగా అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో చేరే విద్యార్థులు 2024తో పోలిస్తే 2025లో 17 శాతం తక్కువైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2026కు సంబంధించిన పూర్తి వివరాలు లభ్యం కాలేదు కానీ ఈ ఏడాది తగ్గుదల సుమారు 10 శాతం వరకూ ఉండవచ్చునని అంచనా. ఫలితంగా ఏటా కనీసం వంద కోట్ల డాలర్ల నష్టం ఉండొచ్చని తెలుస్తోంది. యూరప్‌తో మిలటరీ సంబంధాలు రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలోనే అమెరికా, నాటోల మధ్య విపరీతమైన అభిప్రాయభేదాలు బహిర్గతమయ్యాయి. ట్రంప్ ఒంటెత్తు పోకడను పలు దేశాలు బహిరంగంగానే విమర్శించాయి. దీని ఫలితం సుస్పష్టం. 2025లో యూరోపియన్ దేశాలు మిలటరీపై పెట్టిన ఖర్చులు 14 శాతం వరకూ అంటే సుమారు 86,400 కోట్ల డాలర్లకు చేరినా అమెరికా కంపెనీల నుంచి చేసిన కొనుగోళ్లు సగానికి తగ్గడం గమనార్హం. ఇదే సమయంలో అమెరికా పొరుగున ఉన్న కెనడా 15,000 కోట్ల డాలర్లతో యూరోపియన్ డిఫెన్స్ ఫండ్‌లోకి చేరిపోయింది.చైనాతో తన సంబంధాలను సుదృఢం చేసుకునే దిశగా అడుగులేస్తోంది. ఆసియా దేశాల్లో జపాన్ తన మిలటరీ సామర్థ్యాన్ని పదును పెట్టుకుంటోంది. ఇందులో అమెరికా కంపెనీల స్థానంలో దక్షిణ కొరియా కంపెనీలు ముందంజలో ఉన్నాయి. భారత్ కూడా ఏఐ వంటి కీలక టెక్నాలజీల విషయంలో దేశీ కంపెనీలు లేదంటే చైనీస్ కంపెనీల్లో మెరుగైన వాటిని వెతుక్కుంటున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు అమెరికాకు దూరంగా జరుగుతున్నట్లు, ఇందుకు ట్రంప్ తీరు, అమెరికా ప్రభుత్వంలో పెరిగిన అవినీతి, వాణిజ్య వైరాలు, కృత్రిమ మేధ విషయంలో అస్పష్ట వైఖరి, విధానాలు కారణమని కాలమిస్ట్ ఫైనర్ విశ్లేషించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పుతిన్‌ని, మోదీ ఆపకుంటే.. పోలండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ: పోలండ్ మంత్రి భారత ప్రధానిని ప్రశంసిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్రరూపం దాల్చిన సమయంలో ప్రపంచాన్ని ఒక పెద్ద ముప్పు నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీ కాపాడన్నారు. 2022 చివర్లో రష్యా వ్యూహాత్మక అణు ఆయుధాలను ఉపయోగించకుండా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఒప్పించడంలో పీఎం మోదీ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఢిల్లీలో ఈ రోజు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న పోలాండ్ విదేశాంగ మంత్రి వ్లాడిస్లావ్ థియోఫిల్ బార్టోస్జెవ్స్కీ ANIతో మాట్లాడుతూ, "ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచంలో సుప్రసిద్ధ, అత్యంత గౌరవనీయుడైన రాజనీతిజ్ఞుడు. అలీన దేశంగా భారతదేశానికి రష్యన్ ఫెడరేషన్తో, అంతకుముందు సోవియట్ యూనియన్‌తో చాలాకాలంగా సంబంధాలు ఉన్నాయి. అధ్యక్షుడు పుతిన్ ప్రధానమంత్రి మోదీ చెప్పే విషయాలను శ్రద్ధగా వింటారు. 2022 చివరిలో ఉక్రెయిన్‌లో వ్యూహాత్మక అణ్వాయుధాలను ఉపయోగించకుండా పుతిన్‌ను ఆపడంలో ప్రధానమంత్రి మోదీ పోషించిన పాత్ర గురించి నేను ప్రస్తావించాను. కానీ ఇది నిజం, అధ్యక్షుడు పుతిన్‌పై కొంత ఒత్తిడిని, ప్రభావాన్ని చూపగల కొద్దిమంది వ్యక్తులలో ప్రధానమంత్రి మోదీ ఒకరు." అని అన్నారు.రష్యా తనను శత్రువుగా భావించని దేశాల నుండి వచ్చే శాంతి విజ్ఞప్తులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని పోలండ్ మంత్రి తెలిపారు. యుద్ధం మరింత పెరగకుండా చూడటంలో భారత్‌తో పాటు చైనా (షీ జిన్‌పింగ్) పాత్ర కూడా ముఖ్యమైనదని, అయితే ఈ సంక్షోభాన్ని ముగించడంలో భారత్ పాత్ర అత్యంత కీలకంగా మారిందని ఆయన అన్నారు. రష్యా ఆయిల్ కొనుగోళ్లపై మారిన పోలండ్ వైఖరిభారత్ రష్యా నుండి రాయితీపై ముడి చమురు కొనుగోలు చేయడంపై గతంలో పోలండ్ చేసిన విమర్శలపైనా మంత్రి క్లారిటీ ఇచ్చారు.రష్యా నుండి చౌకగా లభించే చమురును కొనుగోలు చేయడం ద్వారా భారత్ రష్యా యుద్ధ ఆర్థిక వ్యవస్థకు పరోక్షంగా మద్దతు ఇస్తోందని తాము గతంలో భావించామని, అయితే మార్కెట్ ధర కంటే 40% తక్కువకు చమురు లభిస్తున్నందున ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా భారత్ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు తాము అర్థం చేసుకున్నామని చెప్పారు. ప్రస్తుతానికి ఈ అంశం రెండు దేశాల మధ్య ఎలాంటి విభేదాలకు కారణం కాదని ఆయన స్పష్టం చేశారు.#WATCH | Delhi: On the Russia-Ukraine conflict, Secretary of State of the Polish Minister of Foreign Affairs, Władysław Teofil Bartoszewski, says, "Prime Minister Narendra Modi is a very well-known world statesman, who is very respected, and India has a long-standing relationship… pic.twitter.com/R38wQurE9u— ANI (@ANI) July 14, 2026 -
రష్యాను షేక్ చేస్తున్న ‘బోరిస్ నదెజ్దిన్’ ఎవరు?
మాస్కో: రష్యాలో పార్లమెంటరీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అక్కడి ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శిస్తున్న ప్రముఖ యుద్ధ వ్యతిరేక రాజకీయ నేత బోరిస్ నదెజ్దిన్ను రష్యా పోలీసులు అరెస్ట్ చేశారు. 2023లో ఆయన విడుదల చేసిన ఒక వీడియోలో ‘తీవ్రవాద చిహ్నాలను’ ప్రదర్శించారనే ఆరోపణలపై అధికారులు ఈ చర్యలు చేపట్టారు. ఆ వీడియోలో దివంగత ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవల్నీ ఫోటో ఉండటమే ఇందుకు కారణం.రాబోయే ఎన్నికల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు వ్యతిరేకంగా పోటీ చేసేందుకు మద్దతు కూడగడుతున్న తరుణంలో నదెజ్దిన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని, పుతిన్ పరిపాలనను బహిరంగంగా విమర్శించడంతో 2024లో నదెజ్దిన్ దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చారు. సోమవారం ఆయన తన టెలిగ్రామ్ ఖాతాలో ‘పోలీసులు వచ్చారు’ అని పోస్ట్ చేశారు. ఆ తర్వాత, 2023 వీడియో ఆధారంగా తనపై తీవ్రవాద చిహ్నాల ప్రదర్శన కేసు నమోదు చేసినట్లు ధృవీకరించే పత్రాన్ని ఆయన షేర్ చేశారు. ప్రస్తుతం ఆయనను జైలుకు పంపుతారా లేదా దేశం నుండి బహిష్కరిస్తారా అనేది ఇంకా స్పష్టత లేదు. కాగా ఈ అరెస్ట్‌కు మూడు రోజుల ముందు రష్యా అధికారులు ఆయనను విదేశీ ఏజెంట్‌గా ప్రకటించారు.ఎవరీ బోరిస్ నదెజ్దిన్?నదెజ్దిన్ దాదాపు 30 ఏళ్ల పాటు మాస్కో ప్రాంతంలో స్థానిక మున్సిపల్ కౌన్సిలర్‌గా పనిచేశారు. 1999 నుండి 2003 వరకు ‘యూనియన్ ఆఫ్ రైట్ ఫోర్సెస్’ (ఎస్పీఎస్)పార్టీ తరఫున రష్యా పార్లమెంట్ (స్టేట్ డుమా) సభ్యుడిగా సేవలందించారు. వరుస ఎన్నికల ఓటముల తర్వాత ఈ పార్టీ 2008లో రద్దయింది. 1990ల చివరలో ఆయన దివంగత ప్రతిపక్ష నాయకుడు బోరిస్ నెమ్త్సోవ్కు సలహాదారుగా, సెర్గీ కిరియెంకోకు సహాయకుడిగా పనిచేశారు. వ్యవస్థలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన రష్యా ప్రభుత్వ టెలివిజన్ టాక్ షోలలో తరచూ కనిపించారు. క్రెమ్లిన్ తనపై వచ్చే స్వల్ప ఉదారవాద విమర్శలను నియంత్రిత పద్ధతిలో వినిపించడానికి ఆయనను ఒక నిపుణుడిగా ఉపయోగించుకునేదని నివేదికలు చెబుతున్నాయి.పూర్తిగా మారిన వైఖరిఅయితే, 2023లో నదెజ్దిన్ వైఖరి పూర్తిగా మారింది. ఆయన అనూహ్యంగా పుతిన్‌కు వ్యతిరేకంగా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఉక్రెయిన్‌పై పుతిన్ చేపట్టిన ప్రత్యేక సైనిక చర్య ఒక ఘోరమైన పొరపాటు అని పేర్కొంటూ యుద్ధ వ్యతిరేక నినాదంతో ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయన ప్రచారానికి సాధారణ రష్యన్ల నుండి ఊహించని మద్దతు లభించింది. ఆయనకు మద్దతుగా సంతకాలు చేయడానికి వేలాది మంది ప్రజలు భారీ క్యూలలో నిలుచున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి అవసరమైన దానికంటే రెట్టింపు సంతకాలను ఆయన సేకరించారు. అయితే ఒక నెల తర్వాత రష్యా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆయన సమర్పించిన సంతకాలలో 15 శాతానికి పైగా సాంకేతిక లోపాలు ఉన్నాయని పేర్కొంటూ ఆయన పోటీ చేయకుండా నిషేధించింది. తాజాగా జూలై 2026లో ఆయనను విదేశీ ఏజెంట్‌గా ముద్ర వేశారు.యూట్యూబ్‌లో విడుదల చేసిన ఒక వీడియోలో ఆయన మాట్లాడుతూ... ‘రష్యాలో పోటీ చేయడానికి సంతకాలు సేకరిస్తున్న ఏకైక స్వతంత్ర ప్రతిపక్ష అభ్యర్థిని నేనే. యుద్ధం వల్ల వస్తున్న పరిణామాలు అందరికీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత 25 ఏళ్లుగా పుతిన్ దేశాన్ని నడిపిస్తున్న తీరు మిలిటరైజేషన్ వైపు సాగుతోంది. ఈ మార్గం దేశాన్ని తీవ్ర గందరగోళంలోకి నెట్టేస్తుంది. ఇది 1917 రష్యా విప్లవం లాంటి పరిస్థితులకు దారితీస్తుంది’ అని వ్యాఖ్యానించారు. రష్యాలో పార్లమెంటు ఎన్నికలు ఈ ఏడాది సెప్టెంబర్ 20న జరగనున్నాయి.ఇది కూడా చదవండి: 11 ఫ్లాప్‌లతో కెరీర్ క్లోజ్ అనుకున్న వేళ.. -
ఇరాన్ చేరుకున్న రష్యా ప్రళయ విమానం
టెహ్రాన్: ప్రస్తుతం పశ్చిమాసియా ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా, ఇరాన్ దేశాలు పరస్పరం దాడులకు తెగబడుతున్నాయి. గడిచిన ఆదివారం నాడు ఇరాన్‌లోని తమ మిలటరీ స్థావరాలపై అమెరికా దాడులు జరిపినట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశానికి చెందిన అత్యున్నత స్థాయి Tu-214PU 'డూమ్స్‌డే' (ప్రళయ) విమానాన్ని టెహ్రాన్‌కు పంపింది. ఈ చర్య ద్వారా ఇరాన్‌కు మాస్కో బహిరంగంగానే తమ అండను ప్రకటించినట్లయింది.పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమై దాదాపు ఐదు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి ముగింపుకు రాలేదు. ఇరు దేశాలు చర్చల ద్వారా యుద్ధానికి ముగింపు పలుకుతాయని భావించే లోపే, పరిస్థితులు తిరిగి మొదటికి వచ్చాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు జరుపుకుంటున్న ఈ తరుణంలో, రష్యా ఇరాన్‌కు ఒక అత్యాధునిక విమానాన్ని పంపడం అంతర్జాతీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఏ విధంగా ఉపయోగంఇరాన్కు అమెరికా నుంచి దాడులు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఈ విమానం ఇరాన్ గగనతలంలో నిరంతరం నిఘా ఉంచుతోంది. అమెరికా యుద్ధ విమానాలు లేదా క్షిపణులు దూసుకొస్తే ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను ముందే అప్రమత్తం చేస్తోంది.ఇన్ని రకాల ప్రత్యేకతలు ఉన్న ఈ విమానం ఇప్పుడు ఇరాన్‌కు చేరుకోవడం హాట్‌టాఫిక్‌గా మారింది. దీని రాకతో ఇరాన్‌కు రక్షణ పరంగా మరింత బలం చేకూరిందనేది వాస్తవం.Tu-214PU ప్రత్యేకతలుఇది సాధారణ విమానం కాదు. ఇందులో అత్యంత సురక్షితమైన ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ వ్యవస్థలు, కమాండ్, కంట్రోల్ నెట్‌వర్క్‌లు, ప్రత్యేక డేటా లింక్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ సదుపాయాల వల్ల సంక్షోభ సమయాల్లో విమానంలో ప్రయాణిస్తూనే యుద్ధ కార్యకలాపాలను పూర్తిగా పర్యవేక్షించవచ్చు. ఈ కారణంగానే దీనిని రష్యా "ప్రళయ విమానం" అని పిలుస్తుంది.భూమిపై అణు దాడులు సంభవించినప్పుడు దేశ అధ్యక్షుడు, రక్షణ మంత్రి, సైన్యాధిపతులు ఈ విమానంలోకి ఎక్కి ఆకాశం నుంచే యుద్ధ వ్యూహాలను రచించవచ్చు. కాక్‌పిట్ మినహా ఈ విమానానికి ఎలాంటి కిటికీలు ఉండవు. ఇది అణు విస్ఫోటనం వల్ల వచ్చే రేడియేషన్, విద్యుదయస్కాంత తరంగాల నుండి లోపల ఉన్నవారిని రక్షిస్తుంది. అలాగే ఆకాశంలోనే దీనికి ఇంధనం నింపే సదుపాయం ఉండడం వల్ల, వరుసగా కొన్ని రోజుల పాటు ల్యాండ్ అవ్వకుండా గాల్లోనే ప్రయాణించగలదు.అయితే, ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్న సమయంలోనూ ఈ విమానం రష్యాలో చాలాసార్లు ఆకాశంలో ఎగురుతూ కనిపించింది. ప్రస్తుతం రష్యా వద్ద ఇటువంటి విమానాలు ఎన్ని ఉన్నాయి అనే విషయంపై మాత్రం ఎవరికీ స్పష్టమైన సమాచారం లేదు. -
అమెరికాకు భారత్ భారీ షాక్
అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ చెలరేగిన యుద్ధం వల్ల ప్రపంచ ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరుకున్నాయి. హార్మూజ్ జలసంధి మూసివేత కారణంగా ప్రపంచ దేశాలన్నింటి ముందూ చమురు, సహజ వాయువు సంక్షోభం నెలకొనే అవకాశం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. మరోవైపు భారత్ విషయానికి వస్తే, పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతల నడుమ చమురు దిగుమతులను వేర్వే దేశాల నుంచి చేసుకోవాలనే లక్ష్యంతో "ప్లాన్-బీ" కింద తీసుకున్న నిర్ణయం ఇప్పుడు భారీ ప్రయోజనాన్ని ఇస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా కూడా భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం, జూన్ నెలలో రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకున్న ముడి చమురు రికార్డు స్థాయికి చేరింది. ఇది మే నెలతో పోలిస్తే 34% పెరిగింది. దీంతో అమెరికాకు షాక్ తగిలినట్లయింది. సీఆర్ఈఏ నివేదికలో కీలక వివరాలుసెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సీఆర్ఈఏ) నివేదికలో వెల్లడైన వివరాల ప్రకారం.. రష్యా మొత్తం చమురు ఎగుమతుల ఆదాయం తగ్గినా కూడా, భారత్ రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు జూన్‌లో రికార్డు స్థాయికి చేరాయి. ఇది మే నెలతో పోలిస్తే 34% ఎక్కువ.గణాంకాల ప్రకారం, జూన్‌లో భారత్ 4.5 బిలియన్ యూరోల విలువైన రష్యా ముడి చమురును కొనుగోలు చేసింది. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న మొత్తం 5.5 బిలియన్ యూరోల శిలాజ ఇంధన దిగుమతుల్లో ఇది 83% వాటా.ఈ గణాంకాలతో రష్యా శిలాజ ఇంధనాన్ని అత్యధికంగా కొనుగోలు చేస్తున్న దేశాల్లో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో నిలిచింది. జూన్‌లో చైనా 7.3 బిలియన్ యూరోల విలువైన కొనుగోళ్లతో తొలి స్థానంలో నిలిచింది.రిఫైనరీలకు పెరిగిన సరఫరాభారత్ మొత్తం ముడి చమురు దిగుమతులు నెలవారీగా 5.4% పెరిగాయి. ప్రధాన రిఫైనరీలకు రష్యా సరఫరా పెరగడమే దీనికి ప్రధాన కారణం. రిలయన్స్ ఇండస్ట్రీస్ జామ్‌నగర్ రిఫైనరీకి జూన్‌లో రష్యా నుంచి సరఫరా మేతో పోలిస్తే 150% పెరిగింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) పారాదీప్ రిఫైనరీకి దిగుమతులు 126% పెరిగాయి. సీఆర్ఈఏ తెలిపిన వివరాల ప్రకారం, బీపీసీఎల్ కొచ్చి రిఫైనరీకి సరఫరా 82% పెరిగింది. నయారా ఎనర్జీ వడినార్ రిఫైనరీకి సరఫరా 45% పెరిగింది.ఆ తర్వాత ఎగుమతులు..రష్యా ముడి చమురుతో తయారైన ఇంధన ఉత్పత్తుల ప్రపంచ వాణిజ్యంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకున్న భారత్, టర్కీ, బ్రూనై, జార్జియా దేశాల రిఫైనరీలు జూన్‌లో రష్యాపై ఆంక్షలు విధించిన దేశాలకే పెద్ద ఎత్తున చమురు ఉత్పత్తులను ఎగుమతి చేశాయి.యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా, అమెరికాకు 814 మిలియన్ యూరోల విలువైన చమురు ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. అమెరికాకు జరిగిన ఎగుమతుల్లో భారత్ జామ్‌నగర్ రిఫైనరీ, టర్కీలోని సోకార్ యాజమాన్యంలోని స్టార్ రిఫైనరీ, టుప్రాస్ ఇజ్మిట్ రిఫైనరీ ముందంజలో ఉన్నాయి.సీఆర్ఈఏ గణాంకాల ప్రకారం, గత 3 నెలల్లో టుప్రాస్ ఇజ్మిట్ రిఫైనరీ వాడిన ముడి చమురులో 60% రష్యా నుంచే వచ్చింది. జామ్‌నగర్ రిఫైనరీ వాడిన ముడి చమురులో 27% రష్యా నుంచే వచ్చింది. ఈ ముడి చమురుతో తయారైన ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేశారు. -
పుతిన్ తగ్గేదేలే.. మళ్లీ మంటలు రేపే యుద్ధమా?
ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న శాంతి ప్రయత్నాలకు.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదని తెలుస్తోంది. పైగా యుద్ధాన్ని ముగించే దిశగా చర్చల కంటే.. మరింత తీవ్రతరం చేసే వ్యూహాలపైనే మాస్కో దృష్టి పెట్టినట్లు సమాచారం. క్రెమ్లిన్‌కు సన్నిహితంగా ఉన్న ముగ్గురు వ్యక్తులు రాయిటర్స్‌కు వెల్లడించిన వివరాల ప్రకారం.. రానున్న నెలల్లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరింత ఉధృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. ట్రంప్ ఇటీవల పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీలతో వేర్వేరుగా ఫోన్ సంభాషణలు జరిపారు. యుద్ధానికి పరిష్కారం అనుకున్నదానికంటే దగ్గరలోనే ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే పుతిన్ మాత్రం ప్రస్తుత యుద్ధ లక్ష్యాలను సాధించే వరకు వెనక్కి తగ్గే పరిస్థితిలో లేరని క్రెమ్లిన్ వర్గాలు చెబుతున్నాయి.డాన్‌బాస్‌పై పట్టు కోసం..రష్యా అధ్యక్షుడి ప్రధాన లక్ష్యం ఉక్రెయిన్‌లోని తూర్పు డాన్బాస్ ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవడమేనని సమాచారం. ఈ ప్రాంతంపై నియంత్రణ సాధిస్తేనే యుద్ధంలో విజయాన్ని సాధించినట్లు భావిస్తున్నారని పుతిన్‌కు సన్నిహితంగా ఉన్న ఓ వ్యక్తి వెల్లడించారు. కాల్పుల విరమణతో ప్రస్తుత యుద్ధ రేఖలను కొనసాగించే ప్రతిపాదనలను పుతిన్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే డాన్‌బాస్‌లో మిగిలిన ప్రాంతాలను కూడా త్వరలోనే తమ బలగాలు స్వాధీనం చేసుకుంటాయని రష్యా అధ్యక్షుడు నమ్ముతున్నారని సమాచారం.చమురు కేంద్రాలపై దాడులతో ఒత్తిళ్లుఇటీవల ఉక్రెయిన్ డ్రోన్లతో రష్యాలోని చమురు శుద్ధి కేంద్రాలు, పోర్టులు, నిల్వ కేంద్రాలపై దాడులు చేసింది. ఈ దాడుల కారణంగా రష్యాలోని పలు ప్రాంతాల్లో ఇంధన కొరత సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ దాడులు పుతిన్‌ను మరింత ఆగ్రహానికి గురిచేశాయని, ప్రతిగా ఉక్రెయిన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలనే నిర్ణయానికి ఆయన వచ్చినట్లు సమాచారం. ఇటీవల రష్యా కీవ్‌తో పాటు పలు ఉక్రెయిన్ నగరాలపై డ్రోన్లు, క్షిపణులతో భారీ దాడులు చేసింది. ఇందులో పలువురు పౌరులు మృతి చెందారు.డాన్బాస్ దాటి కొత్త భూభాగాలపై కన్ను?ఉక్రెయిన్ దాడులకు ప్రతిస్పందనగా సరిహద్దు ప్రాంతాల్లో మరిన్ని భూభాగాలను స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉందని పుతిన్ ఇటీవల రష్యా సైనిక అధికారులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. వీటిని భద్రతా ప్రాంతాలుగా మార్చాలన్నది రష్యా ఉద్దేశమని ఆయన సంకేతాలిచ్చారు. ఉక్రెయిన్ మాత్రం తమ నిఘా నివేదికల ప్రకారం పుతిన్ శాంతి కోసం కాకుండా యుద్ధాన్ని కొనసాగించేందుకు కొత్త ఆపరేషన్లకు సిద్ధమవుతున్నారని ఆరోపిస్తోంది. అవసరమైతే ఉక్రెయిన్ వెలుపల ఉన్న యూరప్ దేశాలపై కూడా రష్యా దృష్టి పెట్టే అవకాశం ఉందని కీవ్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.నాటోతో ప్రత్యక్ష ఘర్షణకు అవకాశంరష్యా సైనిక వర్గాల్లో ఇటీవల యుద్ధాన్ని మరింత విస్తరించే అంశంపై చర్చలు పెరిగాయి. ముఖ్యంగా బాల్టిక్ దేశాల్లోని నాటో స్థావరాలపై దాడుల అవకాశాలను కూడా కొందరు ప్రస్తావిస్తున్నారు. అలాంటి చర్యలు జరిగితే అమెరికా నేతృత్వంలోని నాటో కూటమితో రష్యాకు ప్రత్యక్ష ఘర్షణ ఏర్పడే ప్రమాదం ఉంది. అయితే రష్యా నేరుగా నాటోతో యుద్ధం కోరుకోకపోయినా.. కూటమిలో విభేదాలు సృష్టించే లక్ష్యంతో చిన్నచిన్న దాడులకు పాల్పడే అవకాశం ఉందని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు.యుద్ధానికి పెరుగుతున్న మూల్యం2022లో పూర్తిస్థాయి యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు లక్షలాది మంది సైనికులు మృతి చెందడం, గాయపడటం లేదా కనిపించకుండా పోవడం జరిగిందని అంచనాలు చెబుతున్నాయి. అయినప్పటికీ రష్యా దళాలు డాన్బాస్ ప్రాంతంలో నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. ఉక్రెయిన్ డ్రోన్ల వినియోగం రష్యా సంఖ్యాబలానికి సవాల్‌గా మారింది. దాదాపు 1,200 కిలోమీటర్ల పొడవైన యుద్ధ రేఖపై పురోగతి సాధించేందుకు రష్యా భారీగా శ్రమిస్తోంది.పుతిన్‌కు విజయం అవసరంక్రెమ్లిన్కు సన్నిహితంగా ఉన్న వర్గాల ప్రకారం.. పుతిన్ ఈ యుద్ధంలో ఏదో ఒక స్పష్టమైన విజయాన్ని చూపించాలని భావిస్తున్నారు. ముఖ్యంగా డాన్‌బాస్‌పై పూర్తి ఆధిపత్యం సాధించడం ఆయన రాజకీయంగా కీలక విజయంగా చూస్తున్నట్లు సమాచారం. అందుకే అమెరికా శాంతి ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ.. రష్యా ఇప్పట్లో యుద్ధం నుంచి వెనక్కి తగ్గే సంకేతాలు కనిపించడం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
రష్యాకు రూట్ క్లియర్
జెనీవా: అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు రష్యాకు మార్గం సుగమమైంది. గత కొన్నేళ్లుగా రష్యా ఒలింపిక్ కమిటీపై ఉన్న సస్పెన్షన్‌ను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) బుధవారం ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో రష్యా ఎలాంటి ఆంక్షలు లేకుండా... తమ జాతీయ జెండా, జాతీయ గీతంతో బరిలోకి దిగనుంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ప్రధాన పోటీల్లో రష్యా ప్లేయర్లు పాల్గొనడంపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిషేధం విధించింది. దీంతో 2022 నుంచి రష్యా ప్లేయర్లు తటస్థ ఆటగాళ్లుగా తమ దేశ జెండా లేకుండానే పోటీల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు ఆటగాళ్లను బాధ్యులను చేయడం తగదని... అథ్లెట్లపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఐఓసీ అధ్యక్షురాలు క్రిస్టీ కోవెంట్రీ వెల్లడించింది. ఐఓసీ నిర్ణయాన్ని రష్యా స్వాగతించింది. ఇది తమ అథ్లెట్ల హక్కుల పునరుద్ధరణ దిశగా పడిన కీలక అడుగు అని పేర్కొంది. మరోవైపు ఐఓసీ నిర్ణయంపై ఉక్రెయిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రష్యా దాడుల్లో తమ పౌరులు చనిపోతుంటే... ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటని ప్రశ్నించింది. నిషేధం ఎత్తివేస్తున్నట్లు ఐఓసీ ప్రకటించినప్పటికీ... అథ్లెటిక్స్ (ట్రాక్ అండ్ ఫీల్డ్), ఫిఫా వంటి పలు అంతర్జాతీయ క్రీడా సంస్థలు మాత్రం రష్యాపై నిషేధాన్ని ఇంకా కొనసాగిస్తున్నాయి. గతంలో రష్యాపై ఉన్న డోపింగ్ ఆరోపణల నేపథ్యంలో తిరిగి పోటీలకు వచ్చే రష్యా అథ్లెట్లకు కఠినమైన డోపింగ్ పరీక్షలు నిర్వహించాలని ఆ్రస్టేలియా ఒలింపిక్ కమిటీ కోరింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో రష్యా 20 స్వర్ణాలు సహా మొత్తం 71 పతకాలు సాధించింది. పారిస్ ఒలింపిక్స్ సమయంలో రష్యాపై నిషేధం ఉండటంతో ఆ దేశ ప్లేయర్లు తటస్థ అథ్లెట్లుగా... ఒలింపిక్ జెండాతో బరిలోకి దిగారు. -
ఉక్రెయిన్ పై రష్యా దాడి వెనుక ప్లాన్ ?
-
కీవ్‌పై మిసైళ్ల వర్షం..11 మంది మృతి
కీవ్:ఉక్రెయిన్ రష్యా యుద్ధం మెుదలై దాదాపు నాలుగేళ్లు గడుస్తోన్నా ఇంకా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఏమాత్రం చల్లారడం లేదు. తాజాగా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా (సోమవారం) మిసైళ్లతో విరుచుకపడింది. ఈ దాడులలో 11మంది ఉక్రెయిన్ పౌరులు దుర్మరణం చెందగా మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు.కీవ్ టార్గెట్‌గా 68 మిసైళ్లు, 361 పైగా డ్రోన్లతో రష్యా దాడులు చేసినట్లు రాయిటర్స్ కథనాలు పేర్కొన్నాయి. ఈ దాడులలో కీవ్‌లో దాదాపుగా 10 మందికి పైగా నగరంలో మృతి చెందగా మరో 45 మంది గాయపడినట్లు కథనాలు పేర్కొన్నాయి. కాగా ఈ ఏడాది టర్కీలో నాటో శిఖరాగ్ర సదస్సు జరగనున్న నేపథ్యంలో ఈ దాడి జరగడం ఉద్రిక్తతలకు దారి తీసింది. కాగా ఇటీవలే కీవ్‌పై రష్యా దాడులతో విరుచుకపడుతోంది. గత గురువారం తెల్లవారుజామున ప్రారంభమైన దాడులు ఏకధాటిగా 11 గంటల పాటు జరిగాయి. ఈ అటాక్స్‌లో 20 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా 90 మందికి పైగా గాయపడ్డారు. ఉక్రెయిన్ ఇటీవల తమ చమురుశుద్ధి కేంద్రాలపై జరిపిన దాడులకు ఈ దాడులు ప్రతీకారమని రష్యా స్పష్టం చేసింది. అధికారుల ముందస్తు హెచ్చరికతో స్థానికులు చాలావరకూ సబ్వే స్టేషన్లలో తలదాచుకోవడంతో ప్రాణనష్టం తగ్గింది.దాడులు ఎందుకు తీవ్రతరమయ్యాయిఉక్రెయిన్ ‘నలభై రోజుల నుంచి మెరుపుదాడి’ప్రణాళికలో భాగంగా రష్యా మౌలిక సదుపాయాలు, చమురు శుద్ధి కర్మాగారాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తోంది. ఫలితంగా రష్యాలో ఇంధన సంక్షోభం తలెత్తింది. ఇందుకు ప్రతీకారంగా తాము దాడి చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. తాజా దాడి కోసం అత్యంత ఖచ్చితమైన దీర్ఘశ్రేణి ఆయుధాలు, డ్రోన్లు వినియోగించినట్లు వివరించింది. దీనికి ప్రతికారంగా రష్యా, కీవ్‌పై దాడులు చేస్తోంది. -
ఉక్రెయిన్ చేతిలో ఓడిపోతున్న రష్యా..!!
నాలుగేళ్ల క్రితం.. 2022 ఫిబ్రవరి 24న మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. ఇప్పుడు ఎవరూ ఊహించని ఒక సంచలన మలుపు తిరిగింది. ఒకప్పుడు ఉక్రెయిన్ను కేవలం మూడు రోజుల్లో లొంగదీసుకుంటామని భావించిన రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌కు, ఇప్పుడు 2026లో కోలుకోలేని షాక్ తగిలిందా? ఐదో ఏట అడుగుపెట్టిన ఈ యుద్ధంలో ఉక్రెయిన్ పైచేయి సాధిస్తోందా? రష్యా సైనిక వ్యవస్థతో పాటు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకూలే స్థితికి చేరుకుందా?రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆర్డర్ వేసినట్లు 2026 చివరి నాటికి డాన్బాస్ ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించడం రష్యాకు అసాధ్యంగా కనిపిస్తోంది. ఇప్పుడు పుతిన్ ముందు రెండే దారులు ఉన్నాయి. ఆ దారులు ఏంటి? ఉక్రెయిన్ భారీ గ్రౌండ్ అటాక్స్కు బదులుగా ఏ కొత్త యుద్ధ వ్యూహాన్ని అమలు చేస్తోంది? ఉక్రెయిన్ డ్రోన్ దాడుల వల్ల రష్యా ఆర్థిక వ్యవస్థలో ఏ ప్రధాన రంగం ఎక్కువగా దెబ్బతింది? మొదటగా రష్యా సాధించిన పురోగతిని ఒక్కసారి గమనిస్తే.. 2014లో మొదటి విడతగా రష్యా కేవలం 7 శాతం ఉక్రెయిన్ భూభాగాన్ని ఆక్రమించింది. ఆ తర్వాత 2022లో పూర్తిస్థాయి దండయాత్ర మొదలుపెట్టినప్పుడు.. గరిష్టంగా 27 శాతం భూభాగాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకుంది. కానీ, ఉక్రెయిన్ ఎదురుదాడితో అది 18 శాతానికి పడిపోయింది. అయితే, గత మూడున్నరేళ్లుగా రష్యా సాధించింది ఏంటో తెలుసా? కేవలం ఒకటిన్నర శాతం (1.5%) అదనపు భూభాగం మాత్రమే! వినడానికి ఇది చాలా చిన్నదిగా అనిపించవచ్చు, కానీ ఈ చిన్న ముక్క కోసం రష్యా చెల్లించిన మూల్యం ఎంతో తెలిస్తే మీ గుండె గుభేల్ మంటుంది. గత మూడున్నరేళ్లలో ఈ 1.5 శాతం భూమిని గెలవడానికి దాదాపు 5 లక్షల మంది మరణించినట్లు.. మరో 7 లక్షల మంది తీవ్రంగా లేదా పాక్షికంగా గాయాలపాలైనట్లు అంతర్జాతీయ నిఘా వర్గాల విశ్లేషణలు చెబుతున్నాయి. ఈ సంఖ్య 10 లక్షలకు పైనే ఉంటుందనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ కౌంటీ కంటే చిన్నదైన ఈ భూభాగం కోసం రష్యా ఇంతటి రక్తపాతాన్ని చవిచూడాల్సి వచ్చింది. అంటే రష్యాలోని మొత్తం పోరాడే వయసున్న యువకుల్లో 3 శాతం మంది ఈ యుద్ధంలో తుడిచిపెట్టుకుపోయారు. 21వ శతాబ్దంలో ఇంతటి ఘోరమైన గణాంకాలు బహుశా ఏ దేశానికీ లేవు.అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే.. రష్యా సైనికుల మరణాల రేటు 2026లో విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం రష్యా నెలకు సగటున 35 వేల మంది సైనికులను నష్టపోతోంది. రష్యా ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల యువకులకు సాధారణ జీతం కంటే 7 నుంచి 8 రెట్లు ఎక్కువ డబ్బులు, ఉచిత భూములు, రుణాల మాఫీ ఆశ చూపి సైన్యంలో చేర్చుకున్నప్పటికీ.. ఇప్పుడు చనిపోతున్న వారి సంఖ్యతో పోలిస్తే కొత్తగా చేరేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. అంటే, రష్యాకు ఇప్పుడు 'మ్యాన్‌పవర్' కొరత స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ కూడా దాదాపు 6 లక్షల మంది సైనికులను కోల్పోయింది. జనాభా పరంగా చూస్తే ఉక్రెయిన్‌కు ఇది 7 శాతం నష్టం. అందుకే ఉక్రెయిన్ తన పాత వ్యూహాన్ని మార్చింది. రష్యా ఆక్రమించిన భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సైనికులను పంపే భారీ గ్రౌండ్ అటాక్స్ పద్ధతిని పక్కన పెట్టి.. 'అసిమెట్రిక్ వార్ఫేర్' అంటే డ్రోన్ల ద్వారా రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీసే సరికొత్త వ్యూహాన్ని ఎంచుకుంది.అవును, ఉక్రెయిన్ ఇప్పుడు సరిహద్దుల పొడవునా వందల కిలోమీటర్ల మేర ఒక 'డ్రోన్ గోడ' నిర్మించింది. దాదాపు 150కి పైగా స్థానిక కంపెనీలతో మిలియన్ల కొద్దీ FPV డ్రోన్లను తయారు చేయిస్తోంది. ఈ డ్రోన్ల నిఘా వల్ల రష్యా సైన్యం కదలడమే కష్టంగా మారింది. గాయపడిన సైనికులను కాపాడటానికి హెలికాప్టర్లు కూడా రాలేకపోతున్నాయి. ఫలితంగా ఒకప్పుడు రష్యా వైపు గాయపడిన 10 మందిలో ఒకరు చనిపోతే, ఇప్పుడు ప్రతీ నలుగురిలో ఒకరు చనిపోతున్నారు. అంతేకాదు, ఉక్రెయిన్ ఏకంగా 1,750 కిలోమీటర్ల దూరం ప్రయాణించే లాంగ్-రేంజ్ డ్రోన్లతో రష్యా లోపలికి చొచ్చుకుపోతోంది. రష్యాకు ప్రధాన ఆదాయ వనరైన ఆయిల్, గ్యాస్ రిఫైనరీలపై ఉక్రెయిన్ 'కైనెటిక్ శాంక్షన్స్' పేరిట విరుచుకుపడుతోంది. మొన్న ఏప్రిల్, మే నెలల్లోనే దాదాపు 20 రష్యన్ ఆయిల్ రిఫైనరీలను ఉక్రెయిన్ ధ్వంసం చేసింది. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం రష్యా ఆయిల్ ఎగుమతులు రోజుకు 3 లక్షల బారెళ్లకు పడిపోయాయి. 2009 తర్వాత రష్యాలో ఇంత తక్కువ ఆయిల్ ఉత్పత్తి జరగడం ఇదే మొదటిసారి.రష్యాకు తగులుతున్న షాక్‌లు ఇక్కడితో అయిపోలేదు. అంతరిక్షంలో ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా వాడుతున్న స్టార్‌లింక్ ఇంటర్నెట్ టెర్మినల్స్‌ను స్పేస్ ఎక్స్ సంస్థ బ్లాక్ చేసింది. దీనివల్ల రష్యా సైనిక కమ్యూనికేషన్ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. అలాగే రష్యా ప్రభుత్వం దేశంలో టెలిగ్రామ్ యాప్‌ను బ్యాన్ చేయడం వల్ల వారి సొంత కమ్యూనికేషన్స్ కూడా దెబ్బతిన్నాయి. ఆర్థికంగా చూస్తే రష్యా పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. రష్యా తన ద్రవ్యోల్బణం కేవలం 5 శాతమే అని చెబుతున్నా, స్వీడన్ నిఘా వర్గాల ప్రకారం అది నిజానికి 15 శాతానికి పైనే ఉంది. రష్యా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను ఏకంగా 21 శాతానికి పెంచడమే దీనికి నిదర్శనం. యుద్ధం సుదీర్ఘంగా సాగుతుండటంతో రష్యా ప్రజల్లో పుతిన్ పట్ల తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఒకప్పుడు 77 శాతం ఉన్న పుతిన్ అప్రూవల్ రేటింగ్ ఇప్పుడు 65 శాతానికి పడిపోయింది. బడ్జెట్ లోటును భర్తీ చేయడానికి రష్యా తలప్రాణం తోకకు వస్తోంది. కానీ ఉక్రెయిన్ కథ వేరు. ఐరోపా సమాఖ్య నుంచి ఉక్రెయిన్‌కు 90 బిలియన్ యూరోల వడ్డీ లేని భారీ రుణం మంజూరైంది. విశేషం ఏంటంటే.. ఈ అప్పును రష్యా చెల్లించాల్సిన యుద్ధ నష్టపరిహారం నుంచే వసూలు చేయాలని ఐరోపా సమాఖ్య భావిస్తోంది. జర్మనీ, బ్రిటన్, డెన్మార్క్ వంటి దేశాలు నేరుగా ఉక్రెయిన్‌తో కలిసి డ్రోన్లు, రాకెట్ ఇంధనాన్ని తయారు చేస్తున్నాయి.ఇవన్నీ గమనిస్తుంటే.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆర్డర్ వేసినట్లు 2026 చివరి నాటికి డాన్బాస్ ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించడం రష్యాకు అసాధ్యంగా కనిపిస్తోంది. ఇప్పుడు పుతిన్ ముందు రెండే దారులు ఉన్నాయి. ఒకటి.. అవమానాన్ని భరిస్తూనే యుద్ధాన్ని ఆపేసి సీజ్ఫైర్ (Ceasefire) ప్రకటించడం. రెండు.. మరో 2 లక్షల మందిని బలవంతంగా సైన్యంలోకి చేర్చుకుంటూ రెండో విడత జనరల్ మొబిలైజేషన్ ప్రకటించడం. కానీ రెండో దారి ఎంచుకుంటే రష్యా ప్రజల నుండి తీవ్ర తిరుగుబాటు వచ్చే ప్రమాదం ఉంది. ఏది ఏమైనా, 2026 సంవత్సరం ఉక్రెయిన్ వైపు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. మరి రష్యా ఈ సంక్షోభం నుంచి ఎలా బయటపడుతుంది? పుతిన్ ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు? అనేదానికి కాలమే సమాధానం చెప్పాలి. :: హెచ్.కమలాపతిరావు, సీనియర్ జర్నలిస్టు -
పాకిస్తాన్‌కు ఊహించని శత్రువు.. పెంచిన పామే కాటేసిందా?
ఆసియా ఖండంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా?. ఇటీవల అఫ్గానిస్తాన్.. పాకిస్తాన్ భూభాగంలోని పలు లక్ష్యాలపై డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. అంతకు కొన్ని రోజుల ముందే పాకిస్తాన్ సైన్యం అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో వైమానిక దాడులు చేసింది. దానికి ప్రతీకారంగానే అఫ్గానిస్తాన్ ఈ డ్రోన్ దాడులు జరిపింది. మార్చి నెలలో ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఈ దాడులతో పూర్తిగా అస్తవ్యస్తమైపోయింది. దశాబ్దాలుగా మిత్రదేశాలుగా ఉన్న పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య అసలు ఈ శత్రుత్వం ఎందుకు మొదలైంది? ఇప్పుడు కొత్తగా ఈ ప్రాంతీయ రాజకీయాల్లోకి రష్యా ఎందుకు ఎంట్రీ ఇస్తోంది? ఉక్రెయిన్ యుద్ధంతో బిజీగా ఉన్న రష్యా, హఠాత్తుగా తాలిబాన్లతో చేతులు కలపడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి?అప్పట్లో భాయీ భాయీ..!పాక్-అఫ్గాన్ పాలిటిక్స్‌లోకి వెళ్లే ముందు ఫ్లాష్‌బ్యాక్ తిరగేస్తే.. ఇప్పుడు ఒకరినొకరు చంపుకుంటున్న ఈ పాకిస్తాన్, తాలిబాన్లు.. ఒకప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. 1980ల కాలంలో అఫ్గానిస్తాన్‌లోకి సోవియట్ రష్యా సైన్యం ప్రవేశించినప్పుడు, వారికి వ్యతిరేకంగా పోరాడిన ముజాహిదీన్లకు, తాలిబాన్లకు పాకిస్తాన్ వెన్నుదన్నుగా నిలిచింది. అమెరికా నుంచి వచ్చిన నిధులను, ఆయుధాలను పాకిస్తానే వీరికి సరఫరా చేసింది. అంతెందుకు.. తాలిబాన్లను తయారు చేసే హక్కానీ యూనివర్సిటీ కూడా పాక్ గడ్డపైనే ఉంది. 1996లో తాలిబాన్లు మొదటిసారి కాబూల్‌ను ఆక్రమించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు, వారిని అధికారిక దేశంగా గుర్తించిన కేవలం మూడు దేశాలలో పాకిస్తాన్ ఒకటి. ఆ తర్వాత 2001లో అఫ్గానిస్తాన్‌పై అమెరికా దాడి చేసి.. తాలిబాన్లను గద్దె దించినప్పుడు కూడా, పాకిస్తాన్ దొంగచాటుగా తాలిబాన్లకే మద్దతు ఇచ్చింది. అమెరికా ఎంత ఒత్తిడి తెచ్చినా పాకిస్తాన్ వినలేదు. ఎందుకంటే, భవిష్యత్తులో ఎప్పుడైనా అమెరికా వెళ్లిపోతే మళ్లీ తాలిబాన్లే అధికారంలోకి వస్తారని పాకిస్తాన్‌కు తెలుసు. వారిని మచ్చిక చేసుకుంటే, పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా పనిచేసే ఉగ్రవాద సంస్థలను.. ముఖ్యంగా ‘తెహ్రీక్ ఎ తాలిబాన్ పాకిస్తాన్’ని వారు అణచివేస్తారని పాకిస్తాన్ ఆశపడింది.మాట వినని తాలిబాన్లు..!2021లో అమెరికా సైన్యం అఫ్గానిస్తాన్‌ను వదిలి వెళ్ళిపోయాక, తాలిబాన్లు మళ్లీ కాబూల్‌ను హస్తగతం చేసుకున్నారు. పాకిస్తాన్ పండగ చేసుకుంది. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. అధికారంలోకి వచ్చిన తాలిబాన్లు, పాకిస్తాన్ మాట వినడం మానేశారు. పాకిస్తాన్లో ఘోరమైన దాడులకు పాల్పడే ఖీఖ్కీ ఉగ్రవాదులను, అలాగే బలూచిస్తాన్ విముక్తి పోరాట సమూహాలను అఫ్గానిస్తాన్ గడ్డపై నుంచి ఆపడానికి తాలిబాన్లు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీని ఫలితంగా పాకిస్తాన్లో ఉగ్రదాడులు భారీగా పెరిగిపోయాయి. ‘సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్’ నివేదికల ప్రకారం.. గత పదేళ్లలోనే లేని విధంగా 2024, 2025 సంవత్సరాల్లో పాకిస్తాన్ భద్రతా బలగాలు భారీగా నష్టపోయాయి.దాదాపు 1,200 మందికి పైగా పాక్ సైనికులు, పోలీసులు ఈ ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. దాంతో సహనం కోల్పోయిన పాకిస్తాన్, ఇప్పుడు అఫ్గానిస్తాన్ లోపల ఉన్న ఖీఖ్కీ స్థావరాలపై వైమానిక దాడులు చేయడం ప్రారంభించింది. ముఖ్యంగా కాబూల్, కాందహార్ నగరాలను లక్ష్యంగా చేసుకుంటోంది. ‘మీరు ఉగ్రవాదులను ఆపకపోతే నేరుగా మీపైనే దాడి చేస్తాం’ అని తాలిబాన్లకు హెచ్చరికలు పంపింది. దీంతో.. ఖతార్ జోక్యం చేసుకుని కాల్పుల విరమణ కుదిర్చినప్పటికీ.. అది ఎంతో కాలం నిలవలేదు. మొన్నటికి మొన్న పాకిస్తాన్లో జరిగిన ఒక ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా పాక్ ఆర్మీ అఫ్గానిస్తాన్‌పై బాంబుల వర్షం కురిపించింది. దానికి కౌంటర్‌గా తాలిబాన్లు సరిహద్దుల్లో భారీ సైనిక దాడికి దిగారు. ఇప్పుడు తాజాగా అఫ్గానిస్తాన్ డ్రోన్లు పాకిస్తాన్ సరిహద్దు దాటి వచ్చి దాడులు చేశాయి. ఇరు దేశాలూ ఇప్పుడు ఒక అంతం లేని యుద్ధ వలయంలో చిక్కుకున్నాయి.పాక్‌పై రగిలిపోతున్న తాలిబాన్లు?సరే, తాలిబాన్లు ఈ ఉగ్రవాదులను ఎందుకు ఆపలేకపోతున్నారు? ఇక్కడ రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మొదటిది, వారి దగ్గర సరైన వ్యవస్థలు, సైనిక సామర్థ్యం లేదు. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం అఫ్గానిస్తాన్‌లో ప్రస్తుతం 20కి పైగా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయి. వాటన్నింటినీ అణిచివేయడం తాలిబాన్ల వల్ల కావడం లేదు. రెండోది, తాలిబాన్లలోనే అంతర్గతంగా గ్రూపులు ఉన్నాయి. ఒక గ్రూప్ ఒప్పుకొన్నా, మరో గ్రూప్ ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తోంది. అయితే, ఈ నిరంతర యుద్ధ వాతావరణంలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన మార్పు చోటుచేసుకుంది. అదే.. రష్యా ఎంట్రీ!గత ఏడాది తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన మొదటి దేశంగా రష్యా నిలిచింది. ఆ తర్వాత ఈ ఏడాది మే నెలలో రష్యా, అఫ్గానిస్తాన్‌తో ఒక కీలకమైన సైనిక సహకార ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, అఫ్గానిస్తాన్ దగ్గరున్న పాత సోవియట్ కాలపు ఆయుధాలను, యుద్ధ విమానాలను రష్యా రిపేర్ చేసి, ఆధునీకరిస్తుంది. ఈ ఒప్పందం తర్వాత తాలిబాన్ల రక్షణ మంత్రి ఒక సంచలన ప్రకటన చేశారు. ‘ఇకపై పాకిస్తాన్ మాపై దాడులు చేయడానికి ధైర్యం చేయలేదు’ అనేది దాని సారాంశం. అంటే రష్యా అండ చూసుకునే తాలిబాన్లు ఇప్పుడు పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతున్నారని అర్థం చేసుకోవచ్చు.రష్యాకు వచ్చే లాభమేంటంటే..?తాలిబాన్లకు సహాయం చేయడం వల్ల రష్యాకు వచ్చే లాభం ఏంటి? మొదటి లాభం ఏంటంటే.. రష్యాకు కూడా ఉగ్రవాద భయం ఉంది. 2024లో మాస్కో కాన్సెర్ట్ హాల్‌పై దాడి చేసిన ‘ఇస్లామిక్ స్టేట్ ఖొరాసాన్’ ఉగ్రవాదులు అఫ్గానిస్తాన్ నుంచే ఆపరేట్ చేస్తున్నారు. తాలిబాన్లతో దోస్తీ చేస్తే, ఆ ఉగ్రవాదులను అణచివేయవచ్చన్నది రష్యా ప్లాన్. ఇక రెండోది, ఉక్రెయిన్ యుద్ధం వల్ల సెంట్రల్ ఆసియాలో రష్యా కోల్పోయిన పట్టును మళ్లీ సాధించడం. ఇందుకోసం రష్యా తన నేతృత్వంలోని ఇ ఖీౖ కూటమిని వాడుకుంటోంది. తజకిస్తాన్ సరిహద్దుల్లో రష్యా తన సైనిక ఉనికిని భారీగా పెంచుతోంది. చివరగా చెప్పాలంటే.. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య శాంతి కుదరాలంటే అఫ్గాన్ గడ్డపై ఉగ్రవాదం అంతం కావాలి. అందుకు తాలిబాన్లకు సైనిక, ఆర్థిక సహాయం అవసరం. ఇప్పుడు రష్యా ఆ పాత్రను పోషించడానికి సిద్ధమైంది. మరి రష్యా రాకతో ఈ ప్రాంతంలో శాంతి నెలకొంటుందా? లేదా పాకిస్తాన్, రష్యాల మధ్య కొత్త విభేదాలకు దారితీస్తుందా? అనేది కాలమే నిర్ణయించాలి. -హెచ్.కమలాపతిరావు, సీనియర్ జర్నలిస్టు -
రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర దాడులు
నాలుగేళ్లుగా సాగుతోన్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరోసారి తీవ్రరూపం దాల్చింది. ఒకరోజు క్రితం కీప్పై రష్యా భారీ క్షిపణి, డ్రోన్ దాడులు జరపగా.. శుక్రవారం కూడా ఇరు దేశాలు పరస్పరం దాడులు కొనసాగించాయి. తాజా దాడుల్లో ఇరు దేశాల్లో కలిపి కనీసం 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపిన వివరాల ప్రకారం.. రష్యా రాత్రికి రాత్రే 2 క్షిపణులు, 105 డ్రోన్లతో దాడులు చేసింది. మరోవైపు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ.. ఉక్రెయిన్ ప్రయోగించిన 155 డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు రష్యా భూభాగంతో పాటు ఆక్రమిత క్రిమియా ద్వీపకల్పం మీద కూల్చివేసినట్లు ప్రకటించింది. ఉక్రెయిన్‌లోని రష్యా ఆక్రమిత జపోరిజ్జియా ప్రాంతంలో జరిగిన ఉక్రెయిన్ దాడిలో స్థానిక మార్కెట్ లక్ష్యంగా మారింది. ఈ ఘటనలో ఐదుగురు పౌరులు మృతి చెందగా మరో మూడు వేర్వేరు దాడుల్లో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు ఆ ప్రాంతానికి రష్యా నియమించిన గవర్నర్ యెన్గెనీ బాలిట్స్కీ తెలిపారు. షాపింగ్ చేస్తున్న సాధారణ ప్రజలనే ఉక్రెయిన్ లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు.రష్యాలోని బెల్గారోడ్ ప్రాంతంలో ఒకరు, పొరుగున ఉన్న బ్రయాన్క్ ప్రాంతంలో మరో వ్యక్తి ఉక్రెయిన్ దాడుల్లో మృతి చెందినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఉక్రెయిన్ ఈశాన్యంలోని సుమీ ప్రాంతంలో రష్యా దాడి ఓ నివాస ప్రాంతాన్ని తాకింది. ఇల్లు మంటల్లో చిక్కుకోవడంతో రెండేళ్లలోపు చిన్నారి సహా నలుగురు మృతి చెందారు. మృతుల్లో చిన్నారి తల్లి, మరో మహిళ, వృద్ధుడు ఉన్నట్లు గవర్నర్ ఒలెహ్ హ్రిహొరోవ్ తెలిపారు. మరో ముగ్గురు గాయపడ్డారు. అలాగే డ్నిప్రోపెట్రోవ్స్ ప్రాంతంలో జరిగిన మరో రష్యా దాడిలో ఒకరు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడుతూ.. “యుద్ధాన్ని ఆపకుండా కొనసాగించేందుకు రష్యా దగ్గర మిగిలింది ఉగ్రవాదమే. కావాలనే పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటోంది.” అని ఆరోపించారు. అయితే రష్యా -రక్షణ మంత్రిత్వ శాఖ మాత్రం ఉక్రెయిన్ సైనిక పరిశ్రమలు, ఇంధన మౌలిక సదుపాయాలనే లక్ష్యంగా చేసుకున్నామని.. -ఇది ఉక్రెయిన్ దాడులకు ప్రతీకార చర్య అని పేర్కొంది. -
చైనాకే చుక్కలు చూపిస్తున్న కిమ్.. డ్రాగన్‌కు డబుల్ డోస్..
అంతర్జాతీయ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు.. అలాగని శాశ్వత మిత్రులూ ఉండరు. కేవలం స్వార్థ ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. దీనికి చక్కటి ఉదాహరణగా.. ఇప్పుడు తూర్పు ఆసియాలో నడుస్తున్న హైడ్రామాను చెప్పుకోవచ్చు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. ఇటీవల హఠాత్తుగా ఉత్తర కొరియాలో ల్యాండ్ అయ్యారు. ప్రపంచ మీడియా అంతా ఇప్పుడు ప్యాంగ్యాంగ్ వైపే చూస్తోంది. ఎందుకంటే, నిన్న మొన్నటి వరకు ఉత్తర కొరియా అంటే చైనాకు ఒక చిన్న ‘తోక దేశం’ లాంటిది. బీజింగ్ గీసిన గీతను కిమ్ సామ్రాజ్యం దాటదు అనేది ఒక అంచనా. కానీ.. సీన్ కట్ చేస్తే ఇప్పుడు కథ పూర్తిగా రివర్స్ అయింది!చైనా చేతిలో రిమోట్ పనిచేయట్లేదా?ఒకప్పుడు చైనా చేతిలో రిమోట్ కంట్రోల్లా ఉన్న ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్.. ఇప్పుడు ఏకంగా చైనాకే ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అటు రష్యాతో గుట్టుగా నడిపిన ఆయుధాల బేరం.. ఇటు అమెరికాను ముప్పుతిప్పలు పెడుతున్న వైనం.. వీటన్నిటి మధ్య చైనా అసహనం..! అసలు కిమ్ జోంగ్ ఉన్ ఆడుతున్న ఈ గ్లోబల్ మైండ్ గేమ్ ఏంటి? చైనా-రష్యాల మధ్య ఉత్తర కొరియా ఎలా నలిగిపోతోంది? లేక ఇద్దరినీ వాడుకుంటోందా? అనే ప్రశ్నలు అంతర్జాతీయంగా చర్చకు దారితీస్తున్నాయి.జుచే నుంచి హత్యల వరకు..ఈ గ్లోబల్ ఈక్వేషన్ అర్థం కావాలంటే.. మనం కొంచెం చరిత్ర పేజీల్లో వెనక్కి వెళ్లాలి. ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు, కిమ్ జోంగ్ ఉన్ తాత అయిన కిమ్ ఇల్ సంగ్.. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌తో పోరాడిన గట్టి మిలిటరీ లీడర్. ఆయన దేశాన్ని ఏర్పాటు చేశాక 'జుచే' (Juche) అనే ఒక వింత సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. జుచే అంటే.. ‘స్వయం సమృద్ధి’ అని అర్థం. అంటే.. ఎవరితోనూ సంబంధం లేకుండా ఒంటరిగా బతకడం, అభివృద్ధి చెందడం. దాంతో.. ప్రపంచమంతా ఇండస్ట్రియల్ ఏజ్‌లో దూసుకుపోతుంటే.. ఉత్తర కొరియా మాత్రం ఒక చీకటి సామ్రాజ్యంగా మిగిలిపోయింది. ఎంతలా అంటే, రాజధాని ప్యాంగ్యాంగ్ మినహా దేశంలో దశాబ్దాల పాటు కరెంట్ కూడా లేని పరిస్థితి.కట్ చేస్తే.. 1990ల్లో సోవియట్ యూనియన్ కుప్పకూలిపోయింది. అప్పటివరకు రష్యా నుంచి కొరియాకు వస్తున్న సాయం ఆగిపోయింది. ఈ పరిణామాలతో కిమ్ ఇల్ సంగ్ ఒక ప్రాక్టికల్ నిర్ణయం తీసుకున్నారు. 'జుచే' వర్కవుట్ కాదని గ్రహించి, దక్షిణ కొరియాతో విలీనం కోసం చర్చలకు సిద్ధపడ్డారు. కానీ, అంతర్జాతీయ ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ విలీనం జరిగితే తమ పదవులు ఊడిపోతాయని భయపడిన అక్కడి మిలిటరీ జనరల్స్.. కిమ్ ఇల్ సంగ్‌ను రహస్యంగా అంతమొందించారు. ఆ తర్వాత వచ్చిన కిమ్ జోంగ్ ఇల్.. కరడుగట్టిన కమ్యూనిస్ట్ భావజాలంతో బతికారు. ఆయన తెచ్చిన అనాలోచిత అగ్రికల్చర్ సంస్కరణల వల్ల దేశంలో ఏకంగా 20 లక్షల మంది ఆకలితో అలమటించి చనిపోయారు. కిమ్ హత్యాకాండ..!దేశాన్ని నాశనం చేస్తున్న కిమ్ జోంగ్ ఇల్‌ను చూసి మిలిటరీ జనరల్స్ అలర్ట్ అయ్యారు. తర్వాతి తరం అయినా ప్రపంచాన్ని చూసి నేర్చుకోవాలని.. అప్పట్లో చిన్న పిల్లోడైన కిమ్ జోంగ్ ఉన్ను స్విట్జర్లాండ్‌కు పంపించి చదివించారు. కానీ, అనుకోకుండా కిమ్ జోంగ్ ఇల్ చనిపోవడంతో.. కేవలం 20 ఏళ్ల చిరు ప్రాయంలోనే కిమ్ జోంగ్ ఉన్ దేశాధినేత అయ్యాడు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. మిలిటరీ జనరల్స్ తన తాతను, తండ్రిని ఎలా వాడుకున్నారో కిమ్‌కు బాగా తెలుసు. అందుకే పవర్లోకి రాగానే.. తన తండ్రి కాలం నాటి పాత తరం జనరల్స్‌ను ఒక్కొక్కరినీ లేపేయడం మొదలుపెట్టాడు. సింగపూర్‌లో ఒకరిని చంపించాడు. రైల్వే మినిస్టర్‌ను ఏకంగా రైలు కిందే వేయించాడు. డిఫెన్స్ అటాచీని యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్‌తో షూట్ చేయించాడు. ఇలా భయోత్పాతం సృష్టించి.. టోటల్ పవర్‌ను తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు కిమ్.ఉత్తర కొరియాపై చైనా పెత్తనం కిమ్ అంతర్గతంగా పవర్ స్ట్రాంగ్ చేసుకున్నా.. ఎక్స్టర్నల్గా చైనా ఆధిపత్యం ఎక్కువైంది. 2017 సమయంలో.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. కిమ్‌ను బీజింగ్ పిలిపించుకుని తాతలా క్లాసులు పీకేవారు. చైనా మీడియా కూడా కిమ్‌ను ఒక చిన్న ప్రావిన్స్ లీడర్లా తక్కువ చేసి చూపించేది. ఇది ఈ యంగ్ డిక్టేటర్‌కు అస్సలు నచ్చలేదు. చైనా అహాన్ని దెబ్బకొట్టడానికి.. కిమ్ నేరుగా అప్పటి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌తో చేతులు కలిపాడు. సింగపూర్, వియత్నాంలలో సమ్మిట్స్ జరిగాయి. అయితే, ట్రంప్ స్టేట్ డిపార్ట్మెంట్ బ్రీఫింగ్స్ సరిగ్గా చదవకపోవడం వల్ల.. ఆ చర్చలు ఫలించలేదు. అమెరికా చాప్టర్ క్లోజ్ అయింది.కలిసొచ్చిన ఉక్రెయిన్ యుద్ధంచైనా ఒత్తిడి పెరుగుతోంది. మరి కిమ్ ఏం చేయాలి? సరిగ్గా అప్పుడే వచ్చింది ఉక్రెయిన్ యుద్ధం! 2022లో ఉక్రెయిన్‌పై యుద్ధం వల్ల రష్యా ఒంటరైంది. ఆయుధాల కొరత వచ్చింది. ఇదే అదనుగా కిమ్ రంగంలోకి దిగాడు. దశాబ్దాలుగా దాచి ఉంచిన కోట్ల కొద్దీ ఆర్టిలరీ షాట్స్‌ను రష్యాకు ట్రైన్ల ద్వారా పంపాడు. ఎంతలా అంటే, యుద్ధంలో రష్యా వాడిన ఆయుధాల్లో మూడింట ఒక వంతు ఉత్తర కొరియా అందజేసినవే..! అంతేకాదు.. ఏకంగా 10,000 మంది కొరియన్ సైనికులను రష్యా బోర్డర్లో రష్యా తరఫున యుద్ధం చేయడానికి పంపాడు. దీనికి ప్రతిఫలంగా రష్యా నుంచి కిమ్ ఏం తీసుకున్నాడో తెలుసా? అత్యాధునిక స్పేస్ టెక్నాలజీ..! ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ సాంకేతికత! దీనివల్ల ఇప్పుడు ఉత్తర కొరియా అమెరికాలోని ఏ మూలనైనా న్యూక్లియర్ మిసైల్‌తో కొట్టగల సామర్థ్యం సంపాదించింది. అంటే, కిమ్‌కు కావాల్సిన డబ్బు, ఎనర్జీ, టెక్నాలజీ అన్నీ ఇప్పుడు రష్యా ఇస్తోంది. దీంతో చైనా మీద ఆధారపడాల్సిన అవసరం కిమ్‌కు పూర్తిగా తప్పిపోయింది!నో విలీనం..ఇదీ అసలు మ్యాటర్. ఇప్పుడు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్యాంగ్యాంగ్ ఎందుకు వెళ్లారంటే.. తమ చేతుల్లోంచి జారిపోయి రష్యా గూటికి చేరిన కిమ్‌ను మళ్లీ లొంగదీసుకోవడానికి. కానీ కిమ్ మాత్రం ‘తగ్గేదే లే’ అంటున్నాడు. ఎలాంటి షరతులు లేకుండా సాయం చేస్తేనే ఓకే అని.. లేదంటే పొమ్మని నిర్మొహమాటంగా చెబుతున్నాడు. ఎందుకంటే కిమ్ ఈ ఏడాది ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తమ రాజ్యాంగాన్ని మార్చేసి, "ఇకపై దక్షిణ కొరియాతో విలీనం అనే ముచ్చటే లేదు.. మాది విడిగా ఉండే ఒక స్వతంత్ర అణు దేశం" అని డిక్లేర్ చేసేశాడు. చైనా లాంటి ఒక గ్లోబల్ సూపర్ పవర్‌కే చుక్కలు చూపిస్తున్న కిమ్ జోంగ్ ఉన్.. రాబోయే రోజుల్లో ఆసియా పసిఫిక్ రీజియన్‌లో, ముఖ్యంగా గ్లోబల్ ఎకానమీలో ఎలాంటి అలజడి సృష్టిస్తాడో అని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.-హెచ్.కమలాపతిరావు, సీనియర్ జర్నలిస్టు -
కీవ్‌పై రష్యా డ్రోన్లు, క్షిపణుల దాడి
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా గురువారం తెల్లవారుజామున జరిపిన డ్రోన్లు, క్షిపణి దాడుల్లో 20 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 90 మందికి పైగా గాయపడ్డారు. ఉక్రెయిన్ తమ చమురుశుద్ధి కేంద్రాలపై జరిపిన దాడులకు ఇది ప్రతీకారమని రష్యా స్పష్టం చేసింది. 24 బాలిస్టిక్ రకంసహా మొత్తంగా 74 క్షిపణులు, 496 డ్రోన్లను రష్యా ప్రయోగించిందని ఉక్రెయిన్ వాయుసేన పేర్కొంది.ఏకధాటిగా 11 గంటలపాటు రష్యా డ్రోన్లు, క్షిపణి దాడుల కారణంగా కీవ్ నగరంలో పేలుళ్ల మోత మోగింది. అధికారుల ముందస్తు హెచ్చరికతో స్థానికులు చాలావరకూ సబ్వే స్టేషన్లలో తలదాచుకోవడంతో ప్రాణనష్టం తగ్గినట్టు కీవ్ నగర మేయర్ విటాలి క్లిషెకో వెల్లడించారు. నగరంలో సుమారు 30 చోట్ల భారీ నష్టం జరిగింది. 20 నివాస భవనాలు దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాలు కూలాయి.16 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దాడుల అనంతరం సహాయక బృందాలు, భవనాల శిథిలాల్లో బాధితుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఉక్రెయిన్ ‘నలభై రోజుల నుంచి మెరుపుదాడి’ప్రణాళికలో భాగంగా రష్యా మౌలిక సదుపాయాలు, చమురు శుద్ధి కర్మాగారాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తోంది. ఫలితంగా రష్యాలో ఇంధన సంక్షోభం తలెత్తింది. ఇందుకు ప్రతీకారంగా తాము దాడి చేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. తాజా దాడి కోసం అత్యంత ఖచ్చితమైన దీర్ఘశ్రేణి ఆయుధాలు, డ్రోన్లు వినియోగించినట్లు వివరించింది. -
సీన్ రివర్స్.. ఇంధన దిగ్గజానికి భారత్ దన్ను!
ప్రపంచానికి చమురు, ఇంధనం ఎగుమతి చేసే దిగ్గజం.. ఇప్పుడు దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇంధన మౌలిక సదుపాయాలు, ఆయిల్ రిఫైనరీలు యుద్ధంలో తీవ్రంగా దెబ్బతినడంతో దేశవ్యాప్తంగా పెట్రోల్ కొరత ఏర్పడింది. జనాలు ఇంధనం కోసం కిలోమీటర్ల మేర క్యూలు కడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు.. స్వదేశీ అవసరాలు తీర్చుకునేందుకు భారత్‌ను ఆశ్రయించే పరిస్థితికి చేరింది!. ఇది ప్రపంచ ఇంధన సమీకరణాల్లో అసాధారణ మార్పుగా కనిపిస్తోంది!.ఉక్రెయిన్ గత కొద్ది నెలలుగా రష్యాలోని కీలక ఆయిల్ రిఫైనరీలు, ఇంధన నిల్వ కేంద్రాలు, రవాణా మౌలిక సదుపాయాలపై డ్రోన్ దాడులు కొనసాగిస్తోంది. ఈ దాడుల కారణంగా అనేక రిఫైనరీల్లో ఉత్పత్తి తగ్గిపోయింది. ఫలితంగా రష్యా వ్యాప్తంగా పెట్రోల్ కొరత, రేషన్ విధానం, పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు, ధరల పెరుగుదల వంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రష్యా ప్రభుత్వం ఇప్పుడు ఇంధన సరఫరా కోసం భారత్ వైపు మళ్లింది.రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ఇప్పటికే భారత్ నుంచి కనీసం 60 వేల మెట్రిక్ టన్నుల పెట్రోల్ రష్యాకు సముద్ర మార్గంలో చేరింది. మరో రెండు ట్యాంకర్లు కూడా ఒక్కొక్కటి 30–40 వేల మెట్రిక్ టన్నుల ఇంధనంతో రష్యా వైపు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సరఫరా ఏ భారతీయ రిఫైనరీ నుంచి వెళ్తోందన్నది మాత్రం అధికారికంగా వెల్లడించలేదు.వేసవి కాలంలో రష్యాలో ఇంధన డిమాండ్ భారీగా ఉంటుంది. రోజుకు సుమారు 1.10 లక్షల మెట్రిక్ టన్నుల పెట్రోల్ అవసరం ఉంటుందని అంచనా. ఈ పరిస్థితుల్లో నెలకు దాదాపు 4 లక్షల మెట్రిక్ టన్నుల పెట్రోల్‌ను వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని మాస్కో యోచిస్తోంది. ఇప్పటికే బెలారస్ కూడా రష్యాకు సహాయక సరఫరాలు పెంచింది. జూన్ మొదటి భాగంలోనే బెలారస్ నుంచి రైలుమార్గంలో 70 వేల మెట్రిక్ టన్నులకుపైగా పెట్రోల్ రష్యాకు చేరినట్లు నివేదికలు చెబుతున్నాయి.మరోవైపు భారత్–రష్యా ఇంధన వాణిజ్యం మాత్రం గత కొన్నినెలల్లోనే మరింత బలపడింది. ఉక్రెయిన్ యుద్ధం.. పశ్చిమ దేశాల ఆంక్షలు, అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన ధరల ఒత్తిడుల నేపథ్యంలో భారత్ రష్యా నుంచి తక్కువ ధరలకు ముడిచమురు భారీగా కొనుగోలు చేస్తోంది. అమెరికా సహా పలు పశ్చిమ దేశాలు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, భారత్ తన ఇంధన భద్రతా అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొనుగోళ్లు కొనసాగించింది. భారత రిఫైనరీలు ఈ చమురును శుద్ధి చేసి దేశీయ అవసరాలకే కాకుండా ఇతర మార్కెట్లకు కూడా సరఫరా చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇరు దేశాల బంధం మరింత బలపడింది.ఇక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దేశంలో ఇంధన కొరతను అంగీకరించారు. ఉక్రెయిన్ దాడుల కారణంగానే కొన్ని ప్రాంతాల్లో సరఫరా సమస్యలు ఏర్పడ్డాయని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ దాడులు రష్యా సైనిక కార్యకలాపాలపై ప్రభావం చూపలేదని స్పష్టం చేస్తూ, ఇంధన మౌలిక సదుపాయాల రక్షణ కోసం వైమానిక రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.మరోవైపు భారత్–రష్యా మధ్య ఇంధన వాణిజ్యం గత కొద్ది నెలల్లో మరింత బలపడింది. హర్ముజ్ జలసంధి చుట్టూ ఏర్పడిన అంతరాయాల నేపథ్యంలో భారత్ రష్యా నుంచి రికార్డు స్థాయిలో ముడిచమురు దిగుమతి చేసింది. తక్కువ ధరలకు లభిస్తున్న రష్యా చమురును భారత రిఫైనరీలు పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తుండగా, ఇప్పుడు ఆ సరఫరా చైన్ కొత్త దశకు చేరినట్లు కనిపిస్తోంది.ఇలా ఒకప్పుడు ఇంధన ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న రష్యానే ఇప్పుడు భారత్‌పై ఆధారపడే పరిస్థితికి చేరడం అంతర్జాతీయ రాజకీయాలు, యుద్ధ ప్రభావాలు, ఇంధన మార్కెట్ మార్పులపై తీవ్ర చర్చకు దారితీస్తోంది. విశ్లేషకుల ప్రకారం, ఇది యుద్ధం తెచ్చిన ఆర్థిక సమీకరణాల “సీన్ రివర్స్” ఉదాహరణగా నిలుస్తోంది. అదే సమయంలో సంక్షోభ సమయంలో భాగస్వామ్య దేశానికి అండగా నిలుస్తూ భారత్ తన మిత్రధర్మాన్ని కూడా కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
ఉక్రెయిన్‌పై రష్యా వైమానిక దాడి.. ‘కీవ్’ అతలాకుతలం
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా అర్థరాత్రి అకస్మాత్తుగా డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో భారీ దాడులకు తెగబడింది. నగరమంతటా శక్తివంతమైన పేలుళ్లు సంభవించాయి. పలు నివాస భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రాజధానిపై రష్యా పెద్ద ఎత్తున దాడికి సిద్ధమవుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ఈ దాడి జరిగింది. ఎయిర్-రైడ్ సైరన్లు మోగడంతో భయాందోళనకు గురైన వేలాది మంది స్థానికులు భూగర్భ మెట్రో స్టేషన్లలో ఆశ్రయం పొందారు. Kyiv city has been hell for a few hours now. - 13 cruise missiles have struck the city- Several Geran-3/4/5 - Several ballistic missiles- The lack of air defense is real sadlyAttack is not over pic.twitter.com/oGpsCWDl71— kim høvik (@kimhvik2) July 2, 2026ఈ దాడిలో ఒక తొమ్మిది అంతస్తుల నివాస భవనం పాక్షికంగా కూలిపోగా, శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఒక హోటల్‌తో పాటు పలు నివాస ప్రాంతాలలో భారీగా మంటలు చెలరేగడంతో సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. కీవ్ మేయర్ విటాలీ క్లిట్చ్కో తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో ఐదుగురు వైద్య సిబ్బంది గాయపడ్డారు. ప్రాణనష్టం, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.ఇటీవలి కాలంలో రష్యా ఇంధన మౌలిక సదుపాయాలు, మాస్కోను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ లాంగ్-రేంజ్ డ్రోన్ దాడులను పెంచిన నేపథ్యంలో రష్యా ఈ ప్రతీకార చర్యకు దిగింది. యుద్ధాన్ని ఆపడానికి పుతిన్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచాలని ఐర్లాండ్ పర్యటనలోవున్న జెలెన్స్కీ పిలుపునిచ్చారు. మరోవైపు ఉక్రెయిన్‌కు అమెరికా అందిస్తున్న సైనిక సహాయం ప్రాంతీయ, ప్రపంచ స్థిరత్వానికి ఊహించని పరిణామాలకు దారితీస్తుందని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా ఇప్పటికే హెచ్చరించారు. -
ఉక్రెయిన్ దాడులు.. రష్యాలో ఇంధన సంక్షోభం
రష్యా రిఫైనరీలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు కొనసాగుతున్న వేళ దేశంలో ఇంధన సంక్షోభం ఏర్పడిందని అధికార యంత్రాంగం తెలిపింది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వ జోక్యం అవసరమని పేర్కొన్నది. మరోవైపు వేసవి ప్రయాణాలు, పంట కోతల తరుణంలో గ్యాసోలైన్, డీజిల్‌కు డిమాండ్ పెరుగుతున్నది. దీంతో ఇంధనం గురించి ఆందోళన అక్కర్లేదన్న ప్రకటన నుంచి ఇంధన సరఫరాలో సంక్షో భం ఉందని దేశాధ్యక్షుడు పుతిన్ ప్రకటించే స్థాయికి పరిస్థితి దిగజారింది. రాజధాని మాస్కోలోనూ ఇంధన కొరత నెలకొంది. ఈ నేపథ్యంలో గతవారం ప్రభుత్వ, చమురు కంపెనీల ఉన్నతాధికారులతో పుతిన్ సమావేశమై పరిష్కారం గురించి చర్చించారు. -
ఉక్రెయిన్‌పై మరోసారి విరుచుకుపడ్డ రష్యా
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సోమవారం రష్యా జరిపిన క్షిపణి, డ్రోన్ దాడుల్లో కనీసం ఎనిమిది మంది మరణించగా, మరో 34 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. రష్యా దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెనెస్కీ ఖండించారు. యుద్ధరంగం నుంచి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉక్రెయిన్ పారిశ్రామిక కేంద్రమైన ద్నీప్రో నగరంపై రష్యా దళాలు తరచూ దాడులు చేస్తున్నాయని అధికారులు తెలిపారు. అయితే చనిపోయిన బాధితుల్లో ఒకరు 13 ఏళ్ల బాలిక అని ప్రాంతీయ గవర్నర్ ఒలెక్సాండర్ హంజా టెలిగ్రామ్ సందేశంలో తెలిపారు. పగిలిన కిటికీలతో ఉన్న ఒక భవనం చిత్రాలను, మెట్ల దగ్గర పడి ఉన్న మృతదేహం అస్పష్టమైన ఫోటోను ఆయన పంచుకున్నారు.ఇక జపోరిజ్జియాపై జరిగిన డ్రోన్ దాడిలో కనీసం ముగ్గురు మరణించగా, ఒక చిన్నారితో సహా మరో ఆరుగురు గాయపడ్డారని జెలెనెస్కీ తెలిపారు. సుమీ, ఒడెసా, చెర్నిహివ్, ఖేర్సన్, ఖార్కివ్ ప్రాంతాలలో కూడా రష్యా దాడులు నిర్వహించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వెల్లడించారు. 2024లో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, మాస్కో తమవని చెప్పుకుంటున్న నాలుగు ప్రాంతాల నుంచి కీవ్ బలగాలు వైదొలగాలని, అలాగే నాటోలో చేరాలన్న తమ ప్రణాళికలను బహిరంగంగా విరమించుకోవాలని చెప్పినప్పటి నుంచి శాంతి ఒప్పందంపై రష్యా వైఖరి మారలేదని క్రెమ్లిన్ సోమవారం తెలిపింది. పోరాటాన్ని తగ్గించాలన్న ఉక్రెయిన్ కొత్త ప్రతిపాదనను తిరస్కరిస్తూ, ఆ ప్రాంతాలపై పూర్తి నియంత్రణ సాధించాలన్న లక్ష్యంతో రష్యా ముందుకు సాగుతుందని వారాంతంలో ఒక టెలివిజన్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్ పేర్కొన్నారు. సుదూర దాడులను పరస్పరం నిలిపివేయాలని, పోరాటాన్ని డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, పోరిజ్జియా అనే నాలుగు ప్రాంతాలకే పరిమితం చేయాలని కీవ్ ప్రతిపాదించిందని పుతిన్ చెప్పారు. -
పుతిన్‌కు భారీ షాక్.. రష్యాకు కొత్త టెన్షన్!
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొత్త దశకు చేరుకుంది. యుద్ధభూమిలో పోరాటంతో పాటు ఒకరి ఆర్థిక, ఇంధన మౌలిక సదుపాయాలను మరొకరు లక్ష్యంగా చేసుకుంటున్న తరుణంలో ఉక్రెయిన్ డ్రోన్ దాడులు రష్యా చమురు పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గత కొన్ని నెలలుగా ఉక్రెయిన్ వరుసగా నిర్వహిస్తున్న దీర్ఘశ్రేణి డ్రోన్ దాడులతో రష్యాలోని పలు కీలక చమురు రిఫైనరీలు, ఇంధన నిల్వ కేంద్రాలు, ఆయిల్ డిపోలు దెబ్బతిన్నాయి. దీంతో దేశీయ ఇంధన సరఫరాపై ఒత్తిడి పెరిగినట్లు సమాచారం.ఈ పరిస్థితుల మధ్య రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దేశంలో ఇంధన కొరత, సరఫరా సమస్యలు ఉన్నాయని అంగీకరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. దేశీయ అవసరాలకు అనుగుణంగా ఇంధన సరఫరాను నిర్ధారించాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశించినట్లు తెలుస్తోంది.రిఫైనరీలపై వరుస దాడులుఉక్రెయిన్ తన స్వదేశంలో అభివృద్ధి చేసిన దీర్ఘశ్రేణి డ్రోన్లతో రష్యా భూభాగంలో వందల కిలోమీటర్ల లోతులో ఉన్న చమురు రిఫైనరీలను లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ దాడుల్లో కొన్ని రిఫైనరీలలో మంటలు చెలరేగగా, మరికొన్ని చోట్ల ఉత్పత్తి తాత్కాలికంగా నిలిచిపోయినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. దెబ్బతిన్న యంత్రాంగాన్ని పునరుద్ధరించేందుకు సమయం పడుతుండటంతో ఇంధన ఉత్పత్తి సామర్థ్యం తగ్గినట్లు సమాచారం.Our warriors began Ukraine’s Constitution Day with great accuracy. Last night, our long-range sanctions reached two oil refineries in Russia. The Slavyansk oil refinery in the Krasnodar region was hit – about 300 kilometers from the frontline. We also reached a refinery in the… pic.twitter.com/MiKOSjszFF— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) June 28, 2026ఎందుకు రిఫైనరీలే లక్ష్యం?రష్యా యుద్ధ యంత్రాంగానికి ఇంధనం అత్యంత కీలకం. సైనిక వాహనాలు, యుద్ధ ట్యాంకులు, విమానాలు, నౌకలు, లాజిస్టిక్స్ వ్యవస్థ మొత్తం పెట్రోలియం ఉత్పత్తులపై ఆధారపడి ఉంటుంది. ఈ కారణంగానే ఉక్రెయిన్ నేరుగా యుద్ధరంగంపై కాకుండా, రష్యా చమురు శుద్ధి కేంద్రాలు, ఇంధన నిల్వలు, సరఫరా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. దీని ద్వారా రష్యా సైనిక కార్యకలాపాల సామర్థ్యాన్ని తగ్గించడంతో పాటు ఆర్థిక ఒత్తిడిని కూడా పెంచాలనేది ఉక్రెయిన్ వ్యూహంగా ఉంది. దీంతో యుద్ధం కేవలం సరిహద్దు ప్రాంతాలకే పరిమితం కాకుండా రెండు దేశాల అంతర్భాగాలకూ విస్తరించింది.ఇంధన సరఫరాపై ప్రభావంరిఫైనరీల ఉత్పత్తి తగ్గడంతో దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ సరఫరాపై ప్రభావం పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఇంధన కొరత తలెత్తే అవకాశం ఉండటంతో ప్రభుత్వం సరఫరాను సమతుల్యం చేసేందుకు చర్యలు చేపడుతోంది. అవసరమైతే ఎగుమతులపై పరిమితులు విధించడం, దేశీయ మార్కెట్‌కు ప్రాధాన్యం ఇవ్వడం వంటి చర్యలను కూడా రష్యా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రపంచంలో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారులు, ఎగుమతిదారుల్లో రష్యా ఒకటి. చమురు, సహజ వాయువు విక్రయాల ద్వారానే రష్యా ప్రభుత్వానికి భారీ ఆదాయం లభిస్తుంది. రిఫైనరీలు దెబ్బతినడం వల్ల శుద్ధి చేసిన ఇంధన ఉత్పత్తుల ఎగుమతులు తగ్గే అవకాశం ఉంది. ఇది ప్రభుత్వ ఆదాయంపై ప్రభావం చూపడమే కాకుండా యుద్ధ వ్యయాలను భరించే సామర్థ్యంపైనా ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.అంతర్జాతీయ ఆందోళనరష్యా ఇంధన రంగంపై కొనసాగుతున్న దాడులు ప్రపంచ ఇంధన మార్కెట్‌పైనా ప్రభావం చూపే అవకాశముందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. చమురు ఉత్పత్తి, సరఫరాలో అంతరాయం ఏర్పడితే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. యుద్ధం మరింత తీవ్రతరం అయితే ప్రపంచ ఇంధన భద్రత, సరఫరా గొలుసులపై కూడా దీని ప్రభావం కనిపించే అవకాశముంది. -
రష్యా మాజీ రక్షణ మంత్రి ఇవనోవ్ కన్నుమూత
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు వారసుడిగా గుర్తింపు పొందిన మాజీ రక్షణ మంత్రి సెర్గీ ఇవనోవ్(73) శుక్రవారం కన్నుమూశారు. అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ఈ విషయం ప్రకటించింది. ఆయన మరణానికి కారణాలు, ఇతర వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఒకప్పటి నిఘా సంస్థ కేజీబీలో తనతోపాటు పనిచేసిన సెర్గీ ఇవనోవ్‌ను అధ్యక్షుడు పుతిన్ 2001లో రక్షణ మంత్రిగా నియమించారు. రాజ్యాంగ నిబంధనల కారణంగా 2008లో వైదొలగాల్సిన సమయంలో పుతిన్ తన బాధ్యతలను ఇవనోవ్కే బాధ్యతలను అప్పగిస్తారని అంతా భావించారు. అయితే, అత్యాశాపరుడైన ఇవనోవ్ అధ్యక్ష పదవిని అట్టిపెట్టుకుని ఉంటారని పుతిన్ అనుమానించారని, అందుకే అప్పట్లో దిమిత్రీ మెద్వదెవ్కే బాధ్యతలిచ్చారు. -
యుద్ధ ఖైదీలైన కిమ్ సైనికులకు కొత్త జీవితం?
వాళ్లంతా నార్త్ కొరియా నియాంతాధ్యక్షుడు కిమ్‌కు చెందిన సైనికులు. రష్యా కోసం తుపాకీ పట్టారు.. ఉక్రెయిన్‌కు యుద్ధ ఖైదీలుగా చిక్కారు. ఇప్పుడు వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఒకవైపు యుద్ధ చెర, మరోవైపు స్వదేశానికి తిరిగి వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయోనన్న ఆందోళన. ఇలాంటి సమయంలో వారికి అనూహ్యంగా దాయాది దేశమైన దక్షిణ కొరియా చేయూతనివ్వడానికి ముందుకొచ్చింది. స్వచ్ఛందంగా రావాలనుకుంటే ఆశ్రయం కల్పిస్తామని సియోల్(దక్షిణ కొరియా రాజధాని) ప్రకటించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. యుద్ధ ఖైదీలను వారి ఇష్టానికి విరుద్ధంగా తిరిగి ఉత్తర కొరియా లేదంటే రష్యాకు పంపడం సరైంది కాదని పేర్కొంది. అంతర్జాతీయ మానవ హక్కుల ప్రమాణాలు, యుద్ధ ఖైదీల హక్కులను గౌరవించాల్సిన అవసరం ఉందని కూడా వివరించింది. విదేశాంగ శాఖ జూన్ 23న విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ అంశం ప్రస్తుతం సియోల్, కీవ్‌ల మధ్య దౌత్య చర్చల్లో కీలకంగా మారింది. వచ్చే వారం ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సైబిహా(Andrii Sybiha) సియోల్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన, దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చో హ్యున్(Cho Hyun)తో సమావేశం కానున్నారు. ఉక్రెయిన్ సైన్యానికి చిక్కిన ఉత్తర కొరియా సైనికుల భవిష్యత్తు, దక్షిణ కొరియాకు రావాలనుకునే వారి పరిస్థితిపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.కొన్నేళ్లుగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో.. ఉత్తర కొరియా ప్రమేయం గత కొంతకాలంగా అంతర్జాతీయ చర్చకు దారితీస్తోంది. అమెరికా, దక్షిణ కొరియా, పశ్చిమ దేశాల అంచనాల ప్రకారం.. ఉత్తర కొరియా రష్యాకు ఆయుధాలతో పాటు వేలాది మంది సైనికులను కూడా పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా రష్యాలోని కుర్సుక్ ఒబ్లాస్ట్ (Kursk Oblast) ప్రాంతంలో ఉక్రెయిన్ దాడులను ఎదుర్కొనేందుకు ఉత్తర కొరియా దళాలను వినియోగించినట్లు నివేదికలు చెబుతున్నాయి.దక్షిణ కొరియా గూఢచారి సంస్థల అంచనాల ప్రకారం.. ఉత్తర కొరియా సుమారు 10 వేల నుంచి 15 వేల మంది వరకు సైనికులను రష్యాకు పంపినట్లు గతంలో వెల్లడైంది. వీరిలో కొందరు యుద్ధంలో మరణించగా, మరికొందరు గాయపడ్డారని, కొందరు ఉక్రెయిన్ సైన్యానికి ఖైదీలుగా చిక్కినట్లు సమాచారం. ఈ ఖైదీల్లో కొందరు ఉత్తర కొరియాకు తిరిగి వెళ్లాలనే ఆసక్తి చూపడం లేదని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా చేసిన తాజా ప్రకటనకు రాజకీయ, దౌత్యపరంగా ప్రాధాన్యం ఏర్పడింది. ఉత్తర కొరియా నుంచి పారిపోయే వారికి గతంలో కూడా దక్షిణ కొరియా ఆశ్రయం కల్పించింది. ఇప్పుడు యుద్ధ ఖైదీల విషయంలో కూడా అదే విధానాన్ని అనుసరించేందుకు సిద్ధమని సంకేతాలు ఇచ్చింది.ఒకవేళ ఉక్రెయిన్ చెరలో ఉన్న ఉత్తర కొరియా సైనికులు దక్షిణ కొరియాలో స్థిరపడాలని నిర్ణయించుకుంటే, అది కేవలం మానవతా అంశంగానే కాకుండా ఉత్తర కొరియా-రష్యా సంబంధాలు, కొరియా ద్వీపకల్ప రాజకీయాలపై కూడా ప్రభావం చూపే పరిణామంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
రష్యా నుంచి భారత్‌కు చమురు.. నావికుడు అరెస్టు
రష్యా నుంచి భారతదేశానికి వస్తూ ఇంగ్లీష్ ఛానెల్‌ను దాటుతున్న షాడో- ప్లీట్ అనే ఆయిల్ ట్యాంకర్‌ను బ్రిటన్ అధికారులు అడ్డుకున్నారు. ఆ నౌక కెప్టెన్‌నైనా అజయ్ పంత్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. దీంతో ఆ కెప్టెన్ కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎలాగైనా ఆయనను విడిపియ్యాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు."రష్యా (ఆంక్షలు) నిబంధనలు 2019" లోని 'రెగ్యులేషన్ 46Z9B' ని ఉల్లంఘిస్తూ.. రష్యా చమురును ఇతర దేశానికి ఓడ ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సరఫరా చేసినట్లు ఆయనపై కేసు నమోదు చేశారు.అయితే ఆయన తరపున కేసు వాదించిన "ఈ నౌక ఎక్కడికి వెళ్లాలి, ఎలాంటి సరుకును తీసుకెళ్లాలి అనేది ఆయన నిర్ణయం కాదు. ఆయన కేవలం కార్పొరేషన్ (కంపెనీ) ఆదేశాలను మాత్రమే పాటించారు. ఆయన తన ఉద్యోగాన్ని చేసుకుంటున్న ఒక ఉద్యోగి మాత్రమే, ఇప్పుడు బ్రిటీష్ కోర్టు ముందు నిలబడాల్సి వచ్చింది" అని పేర్కొన్నారు.ఇరు వాదనలు విన్న అక్కడి కోర్టు ఈ కేసు తదుపరి విచారణను జూలై 16కు వాయిదా వేసింది.భార్య ఆవేదనఅజయ్ పంత్ భార్య.. రీతు మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో బ్రిటీష్ మీడియా నివేదికల ద్వారానే తన భర్త అరెస్ట్ విషయం తెలిసింది. UK లేదా భారత అధికారుల నుండి తమకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని చెప్పారు. ఆయన కేవలం కంపెనీ ఆదేశాల మేరకే నౌకను నడిపారని, ఇందులో ఆయన తప్పేమీ లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం స్పందనదీనిపై ఉత్తరాఖండ్ హోం సెక్రటరీ శైలేష్ బగౌలీ స్పందిస్తూ.. పంత్ విడుదల మరియు పునరాగమనం కోసం సహాయం చేయాలని కోరుతూ రెండు రోజుల క్రితమే భారత విదేశాంగ శాఖ కు లేఖ రాశామని తెలిపారు. ఢిల్లీలోని తమ ప్రాంతీయ కమిషనర్ కేంద్ర అధికారులతో సమన్వయం చేసుకుంటున్నారని చెప్పారు. కాగా UKలోని భారత హైకమిషన్‌కు పంత్‌ను కలుసుకునేందుకు అనుమతి లభించింది..కాగా బ్రిటన్ చరిత్రలో ఇలాంటి ఆపరేషన్ జరగడం ఇదే మొదటిసారి. రాయల్ మెరైన్ కమాండోలు రాత్రి వేళల్లో 'చినూక్' హెలికాప్టర్ ద్వారా నౌకపైకి దిగారు. నేషనల్ క్రైమ్ ఏజెన్సీ అధికారులు నౌకలోని పత్రాలను తనిఖీ చేశారు. బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ ఈ ఆపరేషన్‌ను తాను వ్యక్తిగతంగా పర్యవేక్షించానని చెబుతూ, ఇది "రష్యాకు తగిలిన మరో దెబ్బ" అని అభివర్ణించారు. -
2030 కంటే ముందే స్వదేశీ బ్రహ్మోస్
సాక్షి, హైదరాబాద్: బ్రహ్మోస్.. ఆపరేషన్ సిందూర్‌లో లక్ష్యాన్ని ఛేదించి శత్రువుకు నిద్రలేని రాత్రులు చూపించిన.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూజ్ మిస్సైల్. భారత్–రష్యా సంయుక్తంగా దీనిని అభివృద్ధి చేశాయి. దీనిని భూమి, సముద్రం, జలాంతర్గామి, యుద్ధ విమానాల నుంచి ప్రయోగించవచ్చు. ఒక్కసారి లక్ష్యాన్ని నిర్దేశించి ప్రయోగిస్తే.. ఇది స్వయంచాలకంగా టార్గెట్‌ను ధ్వంసం చేస్తుంది. శత్రువుల రాడార్లకు చిక్కకుండా చాలా తక్కువ ఎత్తులో దూసుకుపోవడం దీని ప్రత్యేకత. ఇలాంటి క్షిపణుల తయారీలో హైదరాబాద్ సైతం కీలకంగా వ్యవహరిస్తోందని బ్రహ్మోస్ డైరెక్టర్ జనరల్, బ్రహ్మోస్ ఏరోస్పేస్ సీఈవో, ఎండీ జైతీర్థ్ ఆర్. జోషి తెలిపారు. ఎన్‌డీఈ–2026 సదస్సు వివరాలు వెల్లడించేందుకు ఏర్పాటైన సమావేశంలో ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... నూరు శాతం దేశీయంగా.. బ్రహ్మోస్ క్షిపణుల తయారీకి అవసరమైన 85 శాతం విడిభాగాలను దేశీయంగా సమకూర్చుకుంటున్నాం. కొన్ని ఎలక్ట్రానిక్ విడిభాగాల విషయంలో వెనుకబడ్డాం. సెమీకండక్టర్ పరికరాలు దిగుమతి చేసుకుంటున్నాం. నూరు శాతం తయారీ దేశీయంగా సాధ్యమే. 2030 కంటే ముందే ఈ కల సాకారం అవుతుంది. కాన్సెప్ట్ రెడీ అయితే మూడేళ్లలోనే సరికొత్త బ్రహ్మోస్ క్షిపణిని అభివృద్ధి చేయగల సత్తా మనకు ఉంది. ఈ మేరకు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) పూర్తిస్థాయి సామర్థ్యం సొంతం చేసుకుంది. ప్రస్తుతం సంస్థ వద్ద 6 బిలియన్ డాలర్ల (సుమారు రూ.56 వేల కోట్లు) విలువైన ఆర్డర్ బుక్ ఉంది. ఇప్పటికే బ్రహ్మోస్ క్షిపణులను ఫిలిప్పీన్స్‌కు సరఫరా చేస్తున్నాం. వియత్నాంకు అతి త్వరలోనే అందించనున్నాం. ఈ క్షిపణుల కోసం పశ్చిమ, తూర్పు ప్రాంతంలోని చాలా దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. రష్యా సైతం అడుగుతోంది. 10 రోజుల్లో ఒక క్షిపణిని తయారు చేయగలం. 20 శాతం హైదరాబాద్ నుంచే.. బ్రహ్మోస్ ఇండస్ట్రి కన్సార్షియంలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని 200కుపైగా చిన్న, మధ్యతరహా కంపెనీలున్నాయి. బ్రహ్మోస్ క్షిపణుల తయారీలో వాడే విడిభాగాలను ఈ కన్సార్షియంలో ఉన్న కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. మిసైళ్ల అసెంబ్లింగ్లోనూ ఇవి పాలుపంచుకుంటున్నాయి. కన్సార్షియంలోని 20 శాతం కంపెనీలు హైదరాబాద్ నుంచే ఉంటాయి. భాగస్వామ్య కంపెనీలకు సాంకేతిక బదిలీ, నిపుణులకు శిక్షణ ఇస్తున్నాం. హైదరాబాద్, నాగ్‌పూర్, పిలానీ, లక్నో వద్ద సంస్థకు తయారీ కేంద్రాలున్నాయి. 4 యూనిట్లలో మూడవ షిఫ్ట్ మొదలుపెట్టబోతున్నాం. బ్రహ్మోస్ ప్రాజెక్టులో డిజైన్, డెవలప్మెంట్, తయారీలో హైదరాబాద్ అత్యంత కీలకపాత్ర పోషిస్తోంది. తెలంగాణలో సర్వే పూర్తి.. కొత్త ప్లాంటుకు 400–500 ఎకరాలు అవసరం. ఏపీ ప్రభుత్వం చూపించిన స్థలం అనువైనది కాదు. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర వద్ద సర్వే పూర్తి చేశాం. ప్లాంటు ఎక్కడ ఏర్పాటు చేస్తారనే నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదే. ప్లాంటు ఏర్పాటు ముఖ్యం కాదు. అందుకు అవసరమైన ఎకో సిస్టమ్ ప్రధానం. వాస్తవానికి ఈ రంగంలో దేశవ్యాప్తంగా మానవ వనరుల కొరత చాలా ఉంది. ఇండియన్ సొసైటీ ఫర్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ (ఐఎస్‌ఎన్‌టీ) వచ్చే నవంబర్‌లో నాన్ డిస్ట్రక్టివ్ ఇవాల్యుయేషన్ (ఎన్‌డీఈ)–2026, ఏరోఎన్డీటీ–2026 సదస్సులను నిర్వహిస్తోంది. 15–17 తేదీల్లో జరిగే ఈ కార్యక్రమాలకు హైటెక్స్ వేదిక. దేశ, విదేశాల నుంచి రక్షణ, వైమానిక, ఇంధన, తయారీ రంగాలకు చెందిన 2వేల మంది నిపుణులు పాలుపంచుకోనున్నారు. -
'సవాళ్ల నడుమ' సమర్థ దౌత్యం?
వేగంగా మారుతున్న అంతర్జాతీయ రాజకీయ సమీకరణాలు, ట్రంప్ దూకుడు, పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్‌లలో ప్రతికూల వాతావరణం; చైనా, యూఎస్‌లతో బలపడుతున్న పాక్ మైత్రీబంధం... భారత దౌత్యనీతికి పెద్ద సవాలుగా పరిణమించాయి. ఈ నేపథ్యంలో జాతీయ, ఆర్థిక, భద్రతా ప్రయోజనాలను రక్షించుకుంటూ అంతర్జాతీయ శక్తిగా ఎదగటం భారత్‌కు అగ్నిపరీక్షే. గత దశాబ్ద కాలాన్ని పరిశీలిస్తే, భారత దౌత్యనీతిలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. అమెరికా, రష్యా ప్రాపకం కోసం అర్రులు చాచే దశ నుండి బయటకు వచ్చింది. జాతి ప్రయోజనాల దృష్ట్యా ‘వ్యూహాత్మక స్వతంత్రత’ వైపు అడుగులు వేసింది. అలీన విధానం, పంచశీల సూత్రాలు, మానవ హక్కులు వంటి విలువల బంధనాలను తెంచుకొని లావాదేవీలకు సంబంధించిన దౌత్యనీతిని అమలుపరుస్తున్నది. ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’లో భాగంగా భారత్... ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా దేశాలతో ఆర్థిక, వాణిజ్య, సైనిక సంబంధాలను బలోపేతం చేసుకోవటంపై దృష్టిని కేంద్రీకరించింది. యు.ఎస్., ఐరోపా దేశాల ద్వంద్వ వైఖరిని బాహాటంగా ఎత్తి చూపింది. కుండబద్దలు కొడుతూ...ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుండి భారత్ చౌకగా చమురును కొనుగోలు చేయటాన్ని ఐరోపా దేశాలు విమర్శించి నప్పుడు, భారత్ విదేశాంగ మంత్రి ‘‘ఐరోపా దేశాలు తమ సమ స్యల్ని ప్రపంచ సమస్యలు అనుకుంటాయి. కానీ అభివృద్ధి చెందుతున్న ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల సమస్యలను ఐరోపా ఏనాడైనా పట్టించుకుందా?’’ అని నిలదీయటం భారత్ వైఖరిని సూచిస్తున్నది. రష్యా నుండి చమురు దిగుమతుల విష యంలో యూఎస్ ఆంక్షల గురించి భారత విదేశాంగ మంత్రి, ‘‘మనమెవరమూ ఈ పెద్దవాళ్ల ఆటను అర్థం చేసుకోలేనంత పిల్లలం కాము’’ అని యూఎస్ నిజస్వరూపాన్ని విమర్శించటం భారత దౌత్య ధృడత్వానికి సంకేతం. ఇటీవల అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటనలో ఉన్నప్పుడూ ఆయన సమ క్షంలోనే ‘‘అమెరికాకు అమెరికన్ ప్రయోజనాల మాదిరిగా భారత్‌కు భారత ప్రయోజనాలు ముఖ్య’’మని కుండబద్ధలు కొట్టారు.భద్రతాపరంగా అత్యంత ప్రమాదకరమైన పాకిస్తాన్, చైనా లతో సంబంధాల విషయంలో సైతం భారత్ కఠినమైన వైఖరిని అవలంబిస్తున్నది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యలకు మిన్నకుండే బుజ్జగింపు విధానం నుండి పూర్తిగా వైదొలగి ‘కన్నుకు కన్ను, కాలుకు కాలు’ సిద్ధాంతాన్ని అమలు పరుస్తున్నది. గల్వాన్ ఘర్షణల అనంతరం భారత్ పెద్ద మొత్తంలో లద్దాఖ్‌లో సైన్యాన్ని మోహరించి చైనాతో ప్రత్యక్ష యుద్ధానికి సన్నద్ధంగా ఉన్నట్లు సవాలు విసిరింది. సరిహద్దుల్లో కాలుదువ్వుతూ వాణిజ్యపరంగా స్నేహ సంబంధాలు కుదరదని చైనా పెట్టుబడులపై తీవ్ర ఆంక్షలు విధించింది. మాల్దీ వుల ప్రభుత్వపు భారత వ్యతిరేక ధోరణి నేపథ్యంలో భారత పర్యా టకులను లక్ష దీవులవైపు మళ్లిస్తూ కఠిన నిర్ణయాన్ని తీసుకుంది.విమర్శలకు వెరవని దృఢత్వంఅయితే భారత విదేశాంగ విధానం కొన్ని ప్రత్యేక సందర్భా లలో లొంగుబాటు ధోరణిని కనబరచిందన్న విమర్శ ఉంది. ముఖ్యంగా ట్రంప్ తెంపరితనం విషయంలో భారత్ మెతక వైఖరి అనుసరించిందని విశ్లేషకుల అభిప్రాయం. ట్రంప్ భారత్ ఆర్థిక వ్యవస్థను ఒక మృత ఆర్థిక వ్యవస్థగా అభివర్ణించినా భారత్ స్పందించలేదనీ, ట్రంప్ ఆదేశాల మేరకు ఒక దశలో రష్యా నుండి చమురు కొనుగోళ్లు కూడా ఆపేసిందనీ మరొక విమర్శ. ఇజ్రాయెల్ ‘గాజా’పై బాంబుల వర్షం కురిపించి నేలమట్టం చేస్తున్నా భారత్ ఇజ్రాయె ల్ను సమర్థించి పాలస్తీనాకు వ్యతిరేకంగా వ్యవహరించిందనీ, ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ విధానం పూర్తిగా రష్యాను సమర్థిస్తు న్నట్లుగా ఉందనీ కూడా రాజకీయ పరిశీలకుల వ్యాఖ్యానం. ఇదే దృష్టికోణంతో, భారత్ పొరుగుదేశాలు భారత్‌కు ప్రతికూలంగా మారిపోయాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకల విష యంలో మన దౌత్య నీతి విఫలమైందా అనే సందేహాలు తలెత్తాయి!ట్రంప్ రెండవసారి అధ్యక్ష పదవిని చేపట్టడంతో భారత్– అమెరికా సంబంధాలు మరింత పటిష్టమవుతాయని అందరూ ఆశించారు. కానీ ఆపరేషన్ సిందూర్ తరువాత ట్రంప్ వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. అయినప్పటికీ అమెరికా వాణిజ్య సుంకాల యుద్ధంలో భారత్ దృఢంగా నిలబడింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం విషయంలో కూడా అమెరికా ఒత్తిడులను తట్టుకొని నిల బడింది. అదే సమయంలో భారత్–పాకిస్తాన్ల విషయంలో యూఎస్ మధ్యవర్తిత్వాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించింది కూడా! హమాస్, హెజ్బొల్లా, హౌతీ వంటి ఉగ్రవాద సంస్థల ఉగ్ర చర్యలను భారత్ ఏ రకంగానూ సమర్థించలేదు. ఇరాన్ యుద్ధంలో ఇంకొక ముఖ్యమైన అంశం గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు. గల్ఫ్ దేశాలలో కోటి మందికి పైగా భారతీయులు ఉపాధి పొందు తున్నారు. యూఏఈ వంటి గల్ఫ్ దేశాలతో భారత్‌కు పటిష్టమైన వాణిజ్య సంబంధాలున్నాయి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచు కొని భారత్ కేవలం హార్మూజ్ జలసంధి నుండి భారత్‌కు చమురు, గ్యాస్ రవాణాకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చింది. అదే సమయంలో ఇరాన్‌కు వ్యతిరేకంగా ఏ చర్యనూ తీసుకోలేదు. ఈ సందర్భంగా ఇరాన్ భారత్‌కు పూర్తిగా సహకరించటాన్ని గమనించాలి. ఉక్రెయిన్ యుద్ధంలో మనం కేవలం మన పౌరులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావటానికే ప్రాధాన్యతనిచ్చాం. ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా రష్యా నుండి చౌక ఇంధనాన్ని కొనుగోలు చేశాం. దౌత్యనీతికి నిదర్శనందక్షిణాసియాలో పొరుగు దేశాలతో భారత్ సంబంధాలు కాస్త యినా క్షీణించాయన్నది వాస్తవం. సంబంధాలు బలహీనపడి నప్పుడు ఆయా దేశాలను నియంత్రించటానికి దౌత్యనీతిలో భాగంగా కీలకమైన వ్యవస్థలను ఏర్పాటు చేశామా లేదా అన్నదే ప్రశ్న. బంగ్లాదేశ్ విషయానికి వస్తే అక్కడ రాడికల్ ఇస్లామిక్ శక్తులు బలపడకుండా ఆపలేం. కానీ మత ఛాందస శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్న షేక్ హసీనా ప్రభుత్వాన్ని బలపరిచాం. ఛాందస శక్తు లది పైచేయి అయినప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని నియంత్రించ టానికి మన దగ్గర తురుపు ముక్కలున్నాయా? ఈ కోణంలో చూస్తే ఆర్థిక వ్యవస్థకు కీలకమైన విద్యుచ్ఛక్తి విషయంలో భారత్‌పై బంగ్లా దేశ్ ఆధారపడాల్సిందే. భారత్‌కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ స్వతంత్రించి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోలేదు. ఈ విద్యుచ్ఛక్తి సంబం ధాన్ని గత దశాబ్దంలో ఏర్పరచటం మన దౌత్యనీతి విజయం.అమెరికా సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో యూరోపియన్ యూనియన్, కెనడా, ఆస్ట్రేలియా, యూఏఈ వంటి దేశాలతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఫ్రాన్స్, ఇజ్రా యెల్, రష్యా, దక్షిణ కొరియాలతో సైనిక, వ్యూహాత్మక ఒప్పందా లను చేసుకుంది. ఆర్థికంగా, సైనికపరంగా ప్రత్యామ్నాయాలున్నా యని యూఎస్‌కు భారత్ స్పష్టం చేస్తున్నది. దౌత్యనీతి అంటే ఇదే. ఓపిక, వివేకం, సహనాలతో మాత్రమే దౌత్యం నడుస్తుంది. గురజాల శ్రీనివాసరావు వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
రష్యాపై ఉక్రెయిన్ భారీ ప్రతీకార దాడి
ఉక్రెయిన్ సైన్యం గురువారం మాస్కోపై భారీ ప్రతీకార దాడికి పాల్పడింది. రష్యాతో యుద్ధం ప్రారంభమైన తర్వాత జరిగిన అతి భారీ డ్రోన్ దాడి ఇదే. ఈ దాడిలో మాస్కోలోని కీలకమైన Kapotnya Oil Refinery తగలబడిపోయింది. ఈ రిఫైనరీ మాస్కోకు ఆయువుపట్టు లాంటిది.ఈ దాడిలో రిఫైనరీకి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ రిఫైనరీ మాస్కో పెట్రోల్ అవసరాల్లో దాదాపు 40 శాతం, డీజిల్ అవసరాల్లో 50 శాతం వాటా కలిగి ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో రిఫైనరీ వద్ద భారీగా పొగలు ఎగసిపడుతున్న దృశ్యాలు కనిపించాయి.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ దాడిని సమర్థిస్తూ, ఇటీవల రష్యా కీవ్‌లోని చారిత్రక మఠ సముదాయంపై జరిపిన క్షిపణి దాడికి ప్రతీకార చర్యగా ప్రకటించారు. "ఉక్రెయిన్ కాలిపోతే మాస్కో కూడా కాలుతుంది. యుద్ధం ముగిసే సమయం వచ్చింది" అని ఆయన వ్యాఖ్యానించారు.ఈ దాడిపై రష్యా విదేశాంగ మంతి సెర్గీ లవ్రోవ్ స్పందిస్తూ, ఇకపై ఉక్రెయిన్‌పై క్రమం తప్పకుండా భారీ సమూహ దాడులు నిర్వహిస్తామని హెచ్చరించారు.మరోవైపు రష్యా రాత్రికిరాత్రే దేశవ్యాప్తంగా 555 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేశామని ప్రకటించింది. అయితే కనీసం కొన్ని డ్రోన్లు రక్షణ వ్యవస్థలను దాటుకుని లక్ష్యాలను తాకినట్లు తెలుస్తోంది. దీంతో దేశంలోని పలు విమానాశ్రయాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు సమాచారం.ఇదే సమయంలో రష్యా కూడా ఉక్రెయిన్‌పై 200కు పైగా డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో ఎదురుదాడులు కొనసాగించింది. దీంతో రెండు దేశాల మధ్య వైమానిక యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చే సూచనలు కనిపిస్తున్నాయి. -
మంటల్లో మాస్కో రష్యాపై అతిపెద్ద డ్రోన్ల దాడి..
-
మీరు నమ్మలేరు!! రష్యాలో ఉన్న ఆ రంధ్రం నరకానికి ద్వారం, ఇది నిజం!
-
పుతిన్ విమర్శకుడి దారుణ హత్య
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు తీవ్ర విమర్శకుడిగా పేరుగాంచిన రష్యన్ కళాకారుడు, కార్టూనిస్ట్ రాబర్ట్ కుజోవ్‌కోవ్ పోలాండ్‌లో దారుణ హత్యకు గురయ్యాడు. తూర్పు పోలాండ్లోని బియాలా పోలాస్కా పట్టణంలో గుర్తుతెలియని వ్యక్తులు అతడిని తుపాకులతో కాల్చిచంపారు. ఈ ఘటన సోమవారం ఉదయం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు ఇద్దరు బెలారస్ పౌరులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.2021లో రాజకీయ వేధింపుల భయంతో రష్యా విడిచి వచ్చిన కుజోవ్కోవ్కు పోలాండ్ ఆశ్రయం కల్పించింది. "సెమ్యోన్ స్క్రెపెట్స్కీ" పేరుతో ఆయన రూపొందించిన వ్యంగ్య చిత్రాలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రాచుర్యం పొందాయి. పుతిన్‌తో పాటు చెచెన్యా నాయకుడు రంజాన్ క్యాడీరోవ్, అలెంగ్జాండర్ లుకాషెంకో వంటి నేతలను లక్ష్యంగా చేసుకుని ఘాటు కార్టూన్లు గీసేవాడు.ఇటీవల బెర్లిన్‌లో జరిగిన "రష్యా డే" నిరసన కార్యక్రమంలో కూడా పాల్గొన్న ఆయన.. పుతిన్, జోసఫ్ స్టాలిన్లను వ్యంగ్యంగా చిత్రీకరించిన పెయింటింగ్‌తో నిరసన తెలిపాడు. మరణానికి ముందు రోజు కూడా ఆయన సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నట్లు సమాచారం. కుజోవ్‌కోవ్ సన్నిహితులు ఈ హత్య వెనుక రాజకీయ కోణం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. -
ఒకే రోజు.. అమెరికా, రష్యాలకు భారీ షాక్!
అవేం సాధారణ యుద్ధ విమానాలు కావు.. అవసరమైతే అణ్వాయుధాలను మోసుకెళ్లి వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై విరుచుకుపడగల గగన కోటలు. ఒకటి అమెరికా బీ-52 స్ట్రాటోఫోర్ట్రెస్, మరొకటి రష్యా టీయూ-22ఎం3.. కోల్డ్‌వార్ కాలంలో ప్రపంచాన్ని గడగడలాడించిన రెండు మహాశక్తుల అణు బలానికి ప్రతీకలవి. అలాంటి రెండు దేశాల వ్యూహాత్మక శక్తికి ప్రతీకలైన బాంబర్లు.. కొన్ని గంటల వ్యవధిలో నేలకూలడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది.. అమెరికా, రష్యాలకు ఒకే రోజు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అణ్వాయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం ఉన్న రెండు దేశాల వ్యూహాత్మక బాంబర్లు ప్రమాదానికి గురయ్యాయి. అమెరికాకు చెందిన బీ-52 స్ట్రాటోఫోర్ట్రెస్ బాంబర్ కూలి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా.. రష్యాకు చెందిన టీయూ-22ఎం3 బాంబర్ కూడా కుప్పకూలింది. అయితే రష్యా విమానంలోని సిబ్బంది సురక్షితంగా బయటపడటంతో పెను విషాదం తప్పింది.SHOCKING COINCIDENCE: On June 15, 2026, TWO strategic bombers crashed on the SAME DAY — first Russia's Tu-22M3 in Siberia (4 pilots survived), then US B-52 in California (8 crew died) ❄️🇺🇸Both Cold War-era aircraft. Both gone in one day. pic.twitter.com/rxZ01MztPX— RB. (@KailashVashi) June 16, 2026అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అమెరికా వైమానిక దళానికి చెందిన బీ-52 స్ట్రాటోఫోర్ట్రెస్ బాంబర్ కూలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే విమానం మంటల్లో చిక్కుకోవడంతో అందులో ఉన్న ఎనిమిది మంది సిబ్బంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ బాంబర్ టెస్టింగ్‌లో భాగంగా.. ప్రమాదానికి గురైనట్లు అమెరికా వైమానిక దళం తెలిపింది. ప్రమాదంలో సిబ్బంది సజీవ దహనం కాగా.. స్పాట్ నుంచి భారీగా నల్లటి పొగలు ఎగసిపడిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించిన అధికారులు.. ఎడ్వర్డ్స్ ఎయిర్ బేస్‌లోని కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు.All 8 crew DEAD in B-52 bomber crash in routine test flight — CNN 'Indications are crash was not survivable' — officialshttps://t.co/Llhou3fYku pic.twitter.com/DwEmKbAhTb— RT (@RT_com) June 16, 2026మరోవైపు రష్యాలోని సైబీరియా ప్రాంతంలోని ఇర్కుట్స్క్లో టీయూ-22ఎం3 వ్యూహాత్మక బాంబర్ కూలిపోయింది. శిక్షణా విమానయానంలో పాల్గొంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ప్రమాదం సంభవించే ముందే సిబ్బంది ఎజెక్ట్ కావడంతో ప్రాణనష్టం జరగలేదని తెలిపింది. విమానం ఎలాంటి యుద్ధ సామగ్రి లేకుండానే ప్రయాణిస్తోందని, భూమిపై కూడా ఎలాంటి నష్టం జరగలేదని పేర్కొంది.అసలు ఈ రెండు వ్యూహాత్మక బాంబర్ల ప్రత్యేకతే వాటిని ప్రపంచ సైనిక చరిత్రలో అత్యంత కీలక వేదికలుగా నిలిపింది. బీ-52 స్ట్రాటోఫోర్ట్రెస్ 1952లో తొలి ప్రయోగాన్ని పూర్తి చేసుకోగా, 1955లో అమెరికా వైమానిక దళంలో అధికారికంగా ప్రవేశించింది. దాదాపు ఏడు దశాబ్దాలుగా ఇది అమెరికా వ్యూహాత్మక వైమానిక శక్తికి వెన్నెముకగా కొనసాగుతోంది. వియత్నాం యుద్ధం, గల్ఫ్ యుద్ధం, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ ఆపరేషన్లలో ఈ బాంబర్లు కీలక పాత్ర పోషించాయి. అణు బాంబుల నుంచి అత్యాధునిక క్రూయిజ్ క్షిపణుల వరకు మోసుకెళ్లగల సామర్థ్యం దీనికి ఉంది.దీని ప్రారంభ ఉత్పత్తి కాలంలో ఒక్క బీ-52 విమానం ఖర్చు సుమారు 14 మిలియన్ డాలర్లకు చేరువగా ఉండేది. కానీ ఆధునికీకరణలు, అప్గ్రేడ్లు కలిపితే ప్రస్తుత విలువ మరియు నిర్వహణ వ్యయం వందల మిలియన్ డాలర్ల స్థాయికి చేరినట్లు రక్షణ విశ్లేషణలు పేర్కొంటాయి. ఇప్పటికీ కొత్త ఇంజిన్లు, అవియానిక్స్, ఆయుధ వ్యవస్థలతో దీన్ని నిరంతరం అప్‌గ్రేడ్ చేస్తూ వస్తున్నారు.మరోవైపు రష్యా టీయూ-22 బాంబర్ కుటుంబానికి చెందిన టీయూ-22ఎం3 వెర్షన్ 1980లలో సేవల్లోకి వచ్చింది. నాటో దేశాలు దీనిని "బ్యాక్‌ఫైర్"గా పిలుస్తాయి. సోవియట్ యుగం నుంచి రష్యా వ్యూహాత్మక వైమానిక శక్తిలో ఇది కీలక భాగంగా కొనసాగుతోంది. సిరియా, ఉక్రెయిన్ యుద్ధాల్లో కూడా ఈ బాంబర్లను వినియోగించారు. ఖెచ్-22 క్రూయిజ్ క్షిపణులు, అలాగే ఆధునిక హైపర్సోనిక్ ఆయుధాలు మోసుకెళ్లగల సామర్థ్యం దీని ప్రధాన బలం.టీయూ-22ఎం3 ఖర్చు విషయానికి వస్తే, సోవియట్ కాల అంచనాలు మరియు ఆధునిక పునర్మూల్యాంకనాల ప్రకారం ఒక్క విమానం ఉత్పత్తి వ్యయం సుమారు 40–50 మిలియన్ డాలర్ల మధ్యగా భావించబడుతుంది. అయితే ఆయుధ సమీకరణ, నిర్వహణ, ఆధునికీకరణతో కలిపితే దీని మొత్తం జీవన వ్యయం గణనీయంగా పెరుగుతుంది.బలం విషయానికి వస్తే.. బీ-52 విమానం దాదాపు 31 టన్నుల వరకు ఆయుధాలను మోసుకెళ్లగలదు. గాల్లో ఇంధనం నింపుకుంటే వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేరుకుని దీర్ఘదూర దాడులు చేయగల సామర్థ్యం దీనికి ఉంది. మరోవైపు టీయూ-22ఎం3 సూపర్సోనిక్ వేగంతో ప్రయాణించగలదు. సముద్రంలోని యుద్ధ నౌకలు, భూభాగంలోని వ్యూహాత్మక స్థావరాలపై వేగవంతమైన దాడుల కోసం దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు.ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. కోల్డ్‌వార్ ముగిసి మూడు దశాబ్దాలకు పైగా గడిచినా అమెరికా, రష్యా ఇప్పటికీ ఈ పాత తరం బాంబర్లపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం కొత్త వ్యూహాత్మక బాంబర్ల అభివృద్ధికి అయ్యే భారీ వ్యయం!. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు, అణు జలాంతర్గాములు, హైపర్సోనిక్ ఆయుధాల అభివృద్ధితో బాంబర్ల ప్రాధాన్యం కొంత తగ్గినప్పటికీ.. అణు నిరోధక వ్యూహంలో వీటి పాత్ర మాత్రం ఇప్పటికీ కీలకంగానే ఉంది.అమెరికా ప్రస్తుతం అత్యాధునిక బీ-21 రైడర్ స్టెల్త్ బాంబర్‌ను అభివృద్ధి చేస్తుండగా.. రష్యా పాక్-డీఏ ప్రాజెక్టుపై పనిచేస్తోంది. అయితే సాంకేతిక సవాళ్లు, భారీ వ్యయభారం, పరీక్షల్లో జాప్యం కారణంగా ఈ ప్రాజెక్టులు ఇంకా పూర్తిస్థాయిలో సేవల్లోకి రాలేదు. ఫలితంగా 1950ల, 1980ల కాలానికి చెందిన ఈ గగన దిగ్గజాలే ఆధునికీకరణలతో ఇప్పటికీ సేవలు అందిస్తున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా అణు శక్తికి ప్రతీకగా నిలిచిన బీ-52, రష్యా వ్యూహాత్మక బలానికి చిహ్నంగా భావించే టీయూ-22ఎం3 బాంబర్లు ఒకే రోజు ప్రమాదాలకు గురికావడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కోల్డ్ వార్ ప్రత్యర్థులైన రెండు దేశాలకు ఒకేసారి ఎదురైన ఈ అరుదైన ఎదురుదెబ్బ.. ప్రపంచ సైనిక వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది. -
ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు
ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి భారీ క్షిపణి, డ్రోన్ దాడులకు పాల్పడింది. రాజధాని కీవ్‌తో పాటు పలు నగరాలపై ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు జరిగిన దాడుల్లో కనీసం 11 మంది మృతి చెందగా, 53 మంది గాయపడ్డారు.ఈ దాడుల్లో చారిత్రక డార్మిషన్ కేథడ్రల్ భారీగా దెబ్బతింది. డ్రోన్ నేరుగా పడటంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 11వ శతాబ్దానికి చెందిన ఈ కేథడ్రల్ ఉక్రెయిన్ ఆర్థడాక్స్ క్రైస్తవ సంప్రదాయానికి అత్యంత పవిత్రమైన కేంద్రంగా భావిస్తారు.ఈ దాడులపై స్పందించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.. యుద్ధాన్ని కొనసాగించాలన్న రష్యా ఉద్దేశాన్ని ఈ దాడులు స్పష్టం చేస్తున్నాయని అన్నారు. రష్యాపై మరింత ఒత్తిడి తీసుకురావాలని, ఉక్రెయిన్‌కు అధునాతన వైమానిక రక్షణ వ్యవస్థలను అందించాలని జీ-7 దేశాలను కోరారు.ఈ దాడుల అనంతరం జెలెన్స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వేర్వేరుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడారు. శాంతి చర్చలు, యుద్ధ విరమణ అవకాశాలపై చర్చించినట్లు ఉక్రెయిన్, రష్యా వర్గాలు వెల్లడించాయి. -
ప్రపంచ యుద్ధాన్ని దాటేసి..1,569 రోజులుగా ఆగని మారణహోమం
న్యూఢిల్లీ: రష్యా, ఉక్రెయిన్ మధ్య సాగుతున్న సుదీర్ఘ యుద్ధం సరికొత్త రికార్డులకు దారితీసింది. 2022 ఫిబ్రవరిలో రష్యా దళాలు ఉక్రెయిన్‌పైకి దూసుకెళ్లినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ ఘర్షణ 1,569 రోజులకు చేరుకుంది. ఇది 1914 నుండి 1918 వరకు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన మొదటి ప్రపంచ యుద్ధం (ది గ్రేట్ వార్) కాల వ్యవధిని కూడా దాటేసింది. కొద్ది రోజుల్లోనే ఉక్రెయిన్ను లొంగదీసుకోవచ్చన్న క్రెమ్లిన్ ఆశలు అడియాసలయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా ఖండంలో అత్యంత సుదీర్ఘమైన, అత్యంత ఘోరమైన రక్తపాతంగా ఈ యుద్ధం చరిత్రకెక్కింది.ఆధునిక సాంకేతికత.. సరికొత్త వ్యూహాలుమొదటి ప్రపంచ యుద్ధంలో అనేక ప్రపంచ అగ్రరాజ్యాలు నేరుగా పాల్గొనగా, ప్రస్తుత యుద్ధం ప్రధానంగా రెండు దేశాల మధ్యే సాగుతోంది. అయినప్పటికీ డ్రోన్లు, లక్ష్యాలను ఛేదించే క్షిపణులు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థల వంటి అత్యాధునిక సైనిక సాంకేతికత వాడకం ఈ యుద్ధాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లింది. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అలాస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు రెడ్ కార్పెట్ పరిచి, దశాబ్ద కాలంలో మొదటిసారి అమెరికా గడ్డపై ద్వైపాక్షిక చర్చలు జరిపినప్పటికీ, శాంతి ప్రయత్నాలు ఒకపట్టాన ఫలించలేదు. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పాశ్చాత్య దేశాల నుంచి నిధులు, ఆయుధాల కోసం నిరంతరం పర్యటనలు చేస్తూనే ఉన్నారు.మొదటి ప్రపంచ యుద్ధ ఛాయలుప్రస్తుత ఉక్రెయిన్ యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధాన్ని తలపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. నాటి ట్రెంచ్ వార్ఫేర్ (బంకర్ల యుద్ధం), భారీ ప్రాణనష్టం, భూభాగాల కోసం సాగుతున్న హోరాహోరీ పోరు ఇందుకు నిదర్శనం. నాడు మెషిన్ గన్లు, ట్యాంకులు రణరంగాన్ని శాసిస్తే.. నేడు డిజిటల్ నిఘా, డ్రోన్ దాడులు వ్యూహాలను మారుస్తున్నాయి. ఉక్రెయిన్ ప్రజల దృష్టిలో ఈ యుద్ధం 2014లో రష్యా క్రిమియాను ఆక్రమించినప్పటి నుంచే మొదలై, ఒక దశాబ్ద కాలంగా సాగుతోంది. నాటోలో సభ్యత్వం లేకపోయినా, అణ్వాయుధాలు లేకపోయినా ఉక్రెయిన్ ఇంతకాలం రష్యాను ప్రతిఘటించడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది.వర్సాలీస్ పాఠాలు.. అస్పష్టంగానే శాంతి ప్రక్రియప్రస్తుతం ఉక్రెయిన్ డ్రోన్లు రష్యా భూభాగంలోకి చొచ్చుకుపోతూ తమ బలాన్ని నిరూపించుకుంటున్నాయి. అయినప్పటికీ పుతిన్ చర్చలకు సిద్ధంగా లేరని ‘ది ఎకనామిస్ట్’ పేర్కొంది. మొదటి ప్రపంచ యుద్ధాన్ని ముగించిన 1919 నాటి ‘వర్సాలీస్ సంధి’ సృష్టించిన అసంతృప్తులే రెండో ప్రపంచ యుద్ధానికి దారితీశాయి. ఇప్పుడు కూడా కేవలం తాత్కాలికంగా యుద్ధాన్ని నిలిపివేయడం కాకుండా, భవిష్యత్తులో శాంతి భద్రతలకు గ్యారెంటీ ఇచ్చేలా ఒప్పందాలు జరగాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దశాబ్దాల సైనిక అంచనాలను తలకిందులు చేస్తూ, యుద్ధాలు ఎప్పుడూ వాటి గడువుల ప్రకారం ముగియవని ఈ సుదీర్ఘ పోరు నిరూపిస్తోంది.ఇది కూడా చదవండి: ‘ఇండియాలో నరకం’.. అమెరికా రిటర్న్ టెక్కీ రచ్చ! -
ఇరాన్లో తగ్గి క్యూబాలో నెగ్గేనా?
మెరుపు దాడిలో వెనిజులా అధ్యక్షుడిని బంధించిన తరువాత యూఎస్ అధ్యక్షుడి తరువాతి లక్ష్యం క్యూబా అని అందరూ భావించారు. అనుకోని పరిస్థితులలో ఇరాన్ యుద్ధం క్యూబాను వెనక్కు నెట్టే సింది. ఇరాన్ ఎదురు దెబ్బల నేపథ్యంలో యూఎస్ పక్కా ప్రణాళికతో క్యూబా పథకాన్ని రచిస్తున్నట్లుగా విశదమవుతు న్నది. మే నెల చివరలో యూఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నిమిట్జ్‌ను కరేబియన్ సముద్రంలోకి పంపించటంతో యుద్ధమేఘాలు కమ్ముకోవటం ప్రారంభమైంది. క్యూబా మాజీ అధ్యక్షుడు రావుల్ కాస్ట్రోపై యూఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ హత్యానేర అభియోగాలను మోపటం క్యూబాపై దాడికి యూఎస్ పావులు కదుపుతున్నట్లుగా అర్థమవుతున్నది. క్షేత్ర స్థాయిలో క్యూబా కూడా దాడికి సన్నద్ధమవుతున్న వార్త లొస్తున్నాయి. ‘ప్రజలందరి యుద్ధం’ డాక్ట్రిన్‌ను క్యూబా పాటించ బోతున్నది. ఈ సిద్ధాంతం ప్రకారం అమెరికా దాడిని క్యూబా సైన్యమే కాకుండా, క్యూబా పౌరులందరూ ప్రతిఘటిస్తారు. కమ్యూ నిస్టు పార్టీ వ్యవస్థ, విప్లవ చరిత్ర కలిగిన క్యూబాను దారికి తేవడం యూఎస్‌కు తేలిక కాదు. కానీ ఇరాన్ వైఫల్యాల నుండి ప్రజలదృష్టిని మరలించటానికి ట్రంప్‌కు క్యూబాపై విజయం కీలకం.గుప్పిట్లో ఉంచుకునే ప్రయత్నంకరేబియన్ సముద్రంలో అమెరికాకు కేవలం 90 మైళ్ల దూరంలో ఉన్న క్యూబా దీవి వ్యూహాత్మకంగా భౌగోళిక ఉనికిని కలిగి ఉన్నది. క్యూబాలో విదేశీ శక్తులు తిష్టవేస్తే ఫ్లోరిడా జలసంధిని దిగ్బంధించి యూఎస్‌ను కట్టడి చేయవచ్చు. అందుకే 200 ఏళ్ళ క్రితమే మన్రో డాక్ట్రిన్‌లో భాగంగా ఉత్తర, దక్షిణ అమెరికా ఖండా లను యూఎస్ తన వ్యూహాత్మక ప్రాంతాలుగా ప్రకటించింది. 1898లో స్పెయిన్‌ను యూఎస్ ఓడించటంతో క్యూబాకు వలస పాలన నుండి విముక్తి లభించింది. కానీ 1901 ప్లాట్ సవరణ చట్టం ద్వారా క్యూబాను యూఎస్ తన నియంత్రణలో ఉంచుకొన్నది. 1934లో ఈ చట్టాన్ని రద్దు పరచినప్పటికీ క్యూబా ఆర్థిక వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకున్నది. యూఎస్ పెత్తనాన్ని ఎదిరించి ఫిడెల్ కాస్ట్రో 1959లో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పరచి క్యూబాలోని యూఎస్ వ్యాపారాలను, ఆస్తులను జాతీయీకరణం చేశాడు. 1960లో క్యూబాపై అమెరికా ఆంక్షలు విధించింది. 1961లో యూఎస్‌లోని క్యూబా ప్రవాసుల ద్వారా ఫిడెల్ కాస్ట్రో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి సీఐఏ ప్రయత్నించి విఫలమైంది. దీనిని ‘బే ఆఫ్ పిగ్స్ తిరుగుబాటు’గా పిలుస్తారు. యూఎస్‌ను ఎదు ర్కోవటానికి కాస్ట్రో సోవియట్ రష్యా పంచన చేరాడు. 1962లో సోవియట్ యూనియన్ క్యూబాలో అణుక్షిపణులను మోహరించ టంతో అగ్ర రాజ్యాలు అణుయుద్ధపు అంచులకు చేరాయి. 1991లో సోవియట్ రష్యా విచ్ఛిన్నమవటంతో క్యూబాకు దిక్కుతోచలేదు. కాస్ట్రో ఒకవైపు ఉక్కు పిడికిలితో క్యూబాను పాలిస్తూనే కమ్యూనిజంను లాటిన్ అమెరికా అంతటా వ్యాప్తి చేయటానికి ప్రయత్నించాడు. అంగోలా, ఇథియోపియాలలో కూడా క్యూబన్ గెరిల్లా సైనికులు సేవలందించారు.సంబంధాలు కొంత మెరుగైనా...రావుల్ కాస్ట్రో 2008లో క్యూబా పగ్గాలు చేపట్టాక యూఎస్‌తో కొంత సుహృద్భావ వైఖరిని ప్రదర్శించాడు. ఒబామా హయాంలో యూఎస్–క్యూబా సంబంధాలు కొంత గాడిన పడ్డాయి. 2015లో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల పునరుద్ధరణ జరిగింది. 2016లో క్యూబా పర్యటనలో భాగంగా క్యూబాను టెర్రరిజంను ప్రోత్సహించే దేశాల లిస్టు నుండి తొలగించారు. ఇది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ట్రంప్ 2017లో అధికారంలోకి రావటంతోనే మళ్లీ ఘర్షణ వాతావరణం పునఃస్థాపితమైంది. బైడెన్ కూడా క్యూబాపై ఆంక్షలను చాలావరకు కొనసాగించాడు. వెనిజులాపై దాడి తరువాత తన తదుపరి లక్ష్యం క్యూబా అని ట్రంప్ బహిరంగంగానే ప్రకటించాడు. ఆరు దశాబ్దాలుగా కొనసాగు తున్న ఆర్థిక–వాణిజ్య ఆంక్షలు చాలవన్నట్లు ఈ ఏడాది జనవరిలో ట్రంప్ చమురు దిగ్బంధనాన్ని (ఆయిల్ ఎంబార్గో) ప్రకటించాడు. క్యూబాకు చమురు సరఫరా కాకుండా యూఎస్ నౌకాబలం అడ్డు కుంటున్నది. ముఖ్యంగా వెనిజులా నుండి చమురు దిగుమతులు పూర్తిగా ఆగిపోయాయి. క్యూబా తన శక్తి అవసరాలకు 60 శాతం దిగుమతులపై ఆధారపడుతున్నది. దీనితో క్యూబాలో శక్తి సంక్షోభం ఏర్పడింది. ప్రతిరోజు 20–22 గంటల కరెంటు కోతలు సాధారణ మైనాయి. రవాణా స్తంభించింది. నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెత్త రవాణాకు కూడా వాహనాలకు ఇంధనం లేక పోవటంతో హవానాతో సహా పలు పట్టణాలలో వీధులలో చెత్త పేరుకుపోయింది. ఆసుపత్రులలో కరెంటు కొరతతో పలు వైద్య సేవలు స్తంభించాయి. పాఠశాలలు, యూనివర్సిటీలు మూత పడ్డాయి. కోవిడ్ తరువాత కోలుకుంటున్న పర్యాటక రంగం కుదేల యింది. అమెరికా పథకం ప్రకారమే క్యూబా సమాజాన్ని ఒత్తిడి లోనికి నెట్టి వేసింది. క్యూబాతో వాణిజ్యం చేసే దేశాలు, సంస్థలపై ద్వితీయ శ్రేణి ఆంక్షలకూ సిద్ధమైంది. ఈ సంక్షోభం నుండి క్యూబా సమాజంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంతర్యుద్ధం, తిరుగుబాటు కోసం యూఎస్ వేచి చూస్తుండవచ్చు.మూడు శక్తులు ‘ఒక్కటైతే’?నాణ్యమైన విద్య, వైద్యాన్ని చౌకగా అందించటంలో విజయం సాధించిన క్యూబా ఈ ఆర్థిక యుద్ధాన్ని ఎదుర్కోవటం కష్టమే. రష్యా, చైనా ఆర్థికంగా, సైనికపరంగా ప్రత్యక్షంగా క్యూబాకు దన్నుగా ఉండటం సందేహాస్పదమే. చైనా సౌర విద్యుత్ పలకల సరఫరా ద్వారా క్యూబా విద్యుత్ గ్రిడ్‌ను స్థిరీకరించటానికి ప్రయత్ని స్తున్నది. దీర్ఘకాలంలో మాత్రమే క్యూబా ఈ రంగంలో విజయం సాధించగలుగుతుంది. కానీ క్యూబాకు అంత సమయం లేదు. మెక్సికో లాంటి పొరుగు దేశాలు ఆహారం, మందులు, మానవతా సహాయం చేస్తున్నా, అవి యూఎస్‌ను ఎదిరించి క్యూబాకు సహాయ పడే సాహసం చేయలేవు. రష్యా ప్రస్తుత దృష్టి ఉక్రెయిన్‌పై, నాటోపై ఉన్నది. చైనా దృష్టి తైవాన్‌పై ఉన్నది. తైవాన్, ఉక్రెయిన్ విషయంలో అమెరికా మెతక వైఖరికి సిద్ధపడితే, ప్రతిగా రష్యా, చైనా మధ్య ప్రాచ్యం, కరేబియన్ ప్రాంతాల నుండి తమ దృష్టిని పూర్తిగా మరల్చ టానికి సిద్ధపడవచ్చును. దీనినే ‘గ్రేట్ పవర్స్ బార్గెయిన్’ అని పిలుస్తారు.బహుశా రష్యా, చైనాలతో లోపాయికారీ అంగీకారంతో క్యూబాపై ట్రంప్ పూర్తి స్థాయిలో దాడి చేయవచ్చు. కానీ క్యూబా గెరిల్లా పోరాట సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయకూడదు. పెద్ద మొత్తంలో రక్తపాతం సంభవిస్తుంది. క్యూబా నుండి పెద్ద మొత్తంలో యూఎస్‌కు వలసలు జరగవచ్చు. యూఎస్ ఈ రెండు పరిణా మాలను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి. యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో క్యూబన్ సంతతికి చెందినవాడు. ఈ పరిణామాలపై పూర్తి అవగాహన ఉండి ఉంటుంది. క్యూబాలో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి రావుల్ కాస్ట్రో అంగీకరిస్తే సమస్యకు శాంతియుత పరిష్కారం లభించినట్లవుతుంది.-వ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు-గురజాల శ్రీనివాసరావు -
రష్యా చమురు కేంద్రాలపై ఉక్రెయిన్ దాడులు
రష్యా చమురు టార్గెట్‌గా ఉక్రెయిన్ దాడులు చేసింది. క్రాస్నోడార్ క్రాయ్, క్రిమియాలోని చమురు క్షేత్రాలపై దాడులు చేసినట్లు ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్ తెలిపారు. ఈ కాంప్లెక్స్ దక్షిణ రష్యాలో చమురు, పెట్రోలియం ఉత్పత్తుల రవాణాకు సంబంధించిన అతిపెద్ద కేంద్రాలలో ఒకటి. మరో వైపు రష్యాతో పాటు, రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ ప్రాంతాలపైనా డ్రోన్లతో దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోగా.. 18 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు మాస్కో ప్రాంతం, పశ్చిమ, నైరుతి రష్యా, రష్యా ఆక్రమిత క్రిమియా, నల్లసముద్రం, అజోవ్ సముద్రాలపై వచ్చిన 310 ఉక్రెయిన్ డ్రోన్లను తమ దళాలు కూల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదే సమయంలో రష్యా 155 డ్రోన్లతో ఉక్రెయిన్ను లక్ష్యంగా చేసుకోగా.. వాటిలో 124 డ్రోన్లను ఉక్రెయిన్ వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చివేసాయని ఆ దేశ వైమానిక దళం పేర్కొంది. -
భారత్‌పై ఆంక్షలు విధిస్తే బూమరాంగే!
సెయింట్‌పీటర్స్‌బర్గ్: నరేంద్ర మోదీ నాయకత్వం వహిస్తున్న భారతదేశంపై ఆంక్షలు విధించాలన్న ఆలోచన ఎవరికైనా ఉంటే వెంటనే మానుకోవాలని రష్యా అధినేత పుతిన్ హితవు పలికారు. ఆంక్షల బెదిరింపుల ద్వారా భారత సార్వభౌమతాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తే తక్షణమే పెద్ద ఎదురుదెబ్బ(బూమరాంగ్) తగులుతుందని తేల్చిచెప్పారు. శుక్రవారం సెంటర్ పీటర్స్బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో పుతిన్ ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ ఎల్లప్పుడూ ఒక సార్వభౌమ దేశంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఆంక్షల బెదిరింపులతో భారత్‌ను లొంగదీసుకోలేరని పరోక్షంగా తేల్చిచెప్పారు. ప్రధాని మోదీతో తాను చాలాకాలంగా సన్నిహితంగా చర్చలు జరుపుతున్నానని తెలిపారు. అమెరికాలోకి ప్రవేశించకుండా మోదీపై గతంలో నిషేధం విధించారని గుర్తుచేశారు. ఆ విషయాన్ని మోదీ ఎప్పటికీ మర్చిపోలేరన్న సంగతి తనకు తెలుసని అన్నారు. మోదీ ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యారు కాబట్టి ఆయనపై అన్ని ఆంక్షలను తొలగించారని పేర్కొన్నారు. తనకు తెలిసినంతవరకు అమెరికా, భారత్‌ల మధ్య సంబంధాలు విజయవంతంగా అభివృద్ధి చెందుతున్నాయని వెల్లడించారు. పుతిన్ ఇంకా ఏం చెప్పారంటే.. ఆ స్వేచ్ఛ భారత్‌కు ఉంది ‘‘భారత్ ఒక సార్వభౌమ దేశం. అత్యంత ఆధునికమైనవి, అనువైనవి, ఉత్తమ ధరకు లభించే ఆయుధాలను విదేశాల నుంచి కొనుగోలు చేసే స్వేచ్ఛ భారత్‌కు ఉంది. అందించేవిగా భావించే ఉత్పత్తులను ఎంచుకోవడానికి దానికి స్వేచ్ఛ ఉంది. ఎవరు ఏమనుకున్నప్పటికీ సొంత ప్రయోజనాల పరిరక్షణ విషయంలో భారత్ రాజీపడడం లేదు. ఎల్లప్పుడూ జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తోంది. నచ్చిన దేశం నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడం భారత్ హక్కు. భారత్–రష్యా బంధం ఇతర భాగస్వాముల బంధం లాంటిది కాదు. భారత్‌తో రష్యా సహకారం కూడా రాజకీయ వాతావరణానికి లోబడి ఉండదు. మమ్మల్ని ఎవరూ శాసించలేరు. మాకు ఎవరూ ఆదేశాలు ఇవ్వలేరు. అలా చేయడానికి ఎవరూ ప్రయత్నించరు కూడా. మేము ఎల్లప్పుడూ సరైనదని భావించిన దానినే చేస్తాం. భారత్ వంటి విలువైన భాగస్వాములకు ఇచ్చిన హామీలకు ఎల్లప్పుడూ మేము కట్టుబడి ఉంటాం. భారత్, రష్యా స్నేహానికి పరస్పర విశ్వాసమే పునాది. భారతీయ మిత్రులతో మా సంబంధాలు ప్రత్యేకమైనవి. మేము కేవలం వాణిజ్యంపైనే దృష్టి పెట్టడం లేదు. కొనుగోలు, అమ్మకాలపైనే కాకుండా, ఉమ్మడి పరిశోధనలు, అభివృద్ధిపైనా దృష్టి పెట్టాం. బ్రహ్మోస్ మధ్యశ్రేణి క్షిపణి రూపకల్పనపై ఇరు దేశాల నిపుణులు కలిసి పని చేస్తున్నారు’’అని పుతిన్ స్పష్టంచేశారు. -
రేపే ఎన్నికలు.. రష్యా, అమెరికాకు టెన్షన్
దక్షిణ కాకసస్ ప్రాంతంలోని అర్మేనియా దేశ రాజకీయాలు ఇప్పుడు భారత్ సహా అనేక పెద్ద దేశాలను టెన్షన్‌లోకి నెట్టాయి. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనే చర్చ తీవ్రంగా కొనసాగుతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా రాజకీయ వర్గాలు ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అంతర్జాతీయ విశ్లేషణలు చెబుతున్నాయి. ఈ ఎన్నికలు కేవలం ప్రభుత్వం మార్పు కోసం మాత్రమే కాకుండా, అర్మేనియా భవిష్యత్తులో రష్యా ప్రభావ వలయంలోనే కొనసాగుతుందా లేదా యూరప్–అమెరికా వైపు మరింత దగ్గరవుతుందా అనే కీలక నిర్ణయానికి సంకేతంగా మారాయి.పషిన్యాన్కు రాజకీయ అగ్నిపరీక్షప్రస్తుతం అర్మేనియాలో ప్రధాని నికోల్ పషిన్యాన్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆయన నాయకత్వంలోని సివిల్ కాంట్రాక్ట్ పార్టీ మరోసారి అధికారం నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. 2018 ప్రజా ఉద్యమం ద్వారా అధికారంలోకి వచ్చిన పషిన్యాన్, గత కొన్నేళ్లుగా రష్యాపై ఆధారాన్ని తగ్గించి యూరోపియన్ యూనియన్, అమెరికాతో సంబంధాలను బలోపేతం చేస్తున్నారు. అయితే అభిప్రాయ సేకరణల ప్రకారం ఆయన పార్టీ అతిపెద్ద శక్తిగా నిలిచే అవకాశం ఉన్నప్పటికీ, రాజ్యాంగ సవరణలకు అవసరమైన స్పష్టమైన మెజారిటీ సాధించడం కష్టమని విశ్లేషకుల అభిప్రాయం.2023 సంఘటనతో మారిన రాజకీయ సమీకరణంఅర్మేనియా రాజకీయాల్లో పెద్ద మలుపు 2023లో చోటుచేసుకుంది. నాగోర్నో-కరాబాఖ్ ప్రాంతంపై అజర్బైజాన్ పూర్తి నియంత్రణ సాధించడంతో లక్ష మందికి పైగా అర్మేనియన్లు అక్కడి నుంచి తరలిపోవాల్సి వచ్చింది. ఈ సమయంలో సంప్రదాయ మిత్రదేశమైన రష్యా తగిన స్థాయిలో మద్దతు ఇవ్వలేదని అర్మేనియాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. దీంతో “రష్యాపై పూర్తిగా ఆధారపడటం ప్రమాదకరం” అనే భావన బలపడింది. ఇదే పషిన్యాన్ పశ్చిమ దేశాల వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణంగా మారింది.ప్రధాన ప్రత్యర్థి ఎవరు?పషిన్యాన్కు ప్రధాన సవాలు సామ్వేల్ కరపేట్యాన్ నేతృత్వంలోని స్ట్రాంగ్ అర్మేనియా కూటమి నుంచి వస్తోంది. ఈ కూటమి రష్యాతో సంప్రదాయ సంబంధాలు కొనసాగించాలని, పశ్చిమ దేశాల వైపు వేగంగా వెళ్లడం ప్రమాదకరమని వాదిస్తోంది. గత అనుభవాలను ప్రస్తావిస్తూ ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తోంది.రష్యా ఆందోళన ఎందుకు పెరుగుతోంది?రష్యా దృష్టిలో అర్మేనియా అత్యంత కీలక వ్యూహాత్మక మిత్రదేశం. దేశంలో రష్యా సైనిక స్థావరం ఉంది. అలాగే ఇంధనం, వాణిజ్యం, భద్రత రంగాల్లో అర్మేనియా ఇప్పటికీ రష్యాపై అధికంగా ఆధారపడుతోంది. ఈ పరిస్థితుల్లో అర్మేనియా పశ్చిమ దేశాల వైపు వెళితే:దక్షిణ కాకసస్లో రష్యా ప్రభావం తగ్గుతుందిEurasian Economic Union బలహీనపడుతుందిపశ్చిమ ప్రభావం రష్యా సరిహద్దులకు మరింత చేరుతుందిఈ నేపథ్యంలో రష్యా ఎన్నికల ముందు అర్మేనియాపై ఆర్థిక ఒత్తిళ్లు పెంచినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.అర్మేనియాపై రష్యా ఆర్థిక ఒత్తిళ్లు..అర్మేనియన్ పండ్లు, చేపలు, పూలు, మినరల్ వాటర్, మద్యం ఉత్పత్తులపై పరిమితులుగ్యాస్, చమురు సరఫరాలపై హెచ్చరికలుయూరోపియన్ యూనియన్ వైపు వెళితే ఆర్థిక కూటమి నుంచి తొలగించే సంకేతాలుఇవి మాస్కో వ్యూహాత్మక ఒత్తిడి చర్యలుగా విశ్లేషకులు చూస్తున్నారు.పశ్చిమ దేశాల మద్దతు..ఇక యూరోపియన్ యూనియన్ మరియు అమెరికా కూడా అర్మేనియాకు బహిరంగ మద్దతు ఇస్తున్నాయి.EU ద్వారా సుమారు 50 మిలియన్ యూరోల ఆర్థిక సహాయం ప్రణాళికఅమెరికాతో అణుశక్తి మరియు మౌలిక సదుపాయాల భాగస్వామ్యంబ్రస్సెల్స్ నుంచి యూరోపియన్ సమీకరణకు రాజకీయ సంకేతాలుఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపనున్నాయి. పషిన్యాన్ గెలిస్తే:యూరోపియన్ యూనియన్ దిశగా వేగవంతమైన అడుగులుఅజర్బైజాన్తో శాంతి చర్చలు ముందుకురష్యాతో సంబంధాల్లో ఉద్రిక్తత పెరుగుతుందిప్రతిపక్షం బలపడితే:రష్యాతో సంబంధాల పునరుద్ధరణ ప్రయత్నాలుయూరోపియన్ సమీకరణ మందగింపువిదేశాంగ విధానంలో మాస్కో ప్రభావం పెరుగుతుందిప్రాంతీయ సమీకరణం..అర్మేనియా చుట్టూ ఉన్న దేశాల పాత్ర కూడా కీలకం:టర్కీ: అజర్‌బైజాన్‌కు బలమైన మిత్రుడుఅజర్బైజాన్: భూభాగ నియంత్రణ తర్వాత మరింత శక్తివంతంఇరాన్: ప్రాంతీయ సమతుల్యం కోరుకుంటుందిభారత్పై ప్రభావంగత కొన్నేళ్లలో అర్మేనియా రష్యాపై ఆధారాన్ని తగ్గిస్తూ భారత్ నుంచి రక్షణ పరికరాలను కొనుగోలు చేస్తోంది. దీని ఫలితంగా భారత్.. దక్షిణ కాకసస్లో కొత్త రక్షణ భాగస్వామిగా ఎదుగుతోంది. పశ్చిమ వైపు అర్మేనియా మరింత మొగ్గు చూపితే భారత్ పాత్ర మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా, మొత్తంగా చూస్తే ఈ ఎన్నికలు కేవలం అర్మేనియా రాజకీయ పోటీ మాత్రమే కాదు. ఇది వాస్తవానికి రష్యా ప్రభావంలో కొనసాగాలా లేదా పశ్చిమ ప్రపంచానికి దగ్గరవ్వాలా? అనే నిర్ణయాత్మక పోరుగా మారింది. అందుకే ప్రపంచ శక్తులు ఈ ఎన్నికలను అత్యంత ఆసక్తిగా గమనిస్తున్నాయి. -
రష్యా ఫుల్ సపోర్ట్.. ఇక భారత్ నుండి శత్రు దేశాలకు చుక్కలే..
-
మోదీ లొంగిపోయే రకం కాదు: పుతిన్ సంచలన వ్యాఖ్యలు
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి భారత్‌పై ప్రశంసలు కురిపించారు. ఇదే సమయంలో రష్యాతో సంబంధాలు తగ్గించాలని భారత ప్రధాని మోదీపై పాశ్చాత్య దేశాలు ఒత్తిడి తీసుకురావడం సరైన పద్దతి కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒత్తిడి తెస్తే మోదీ లొంగిపోయే రకం కాదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే, భారత్‌ను రష్యా విశ్వసనీయ భాగస్వామిగా అభివర్ణించారు. దీంతో, పుతిన్ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.రష్యా అధ్యక్షుడు పుతిన్ సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ప్రపంచ వార్తా సంస్థల ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ.. రష్యాకు భారత్ ఎప్పుడూ మిత్రదేశమే. భారత్ తన విదేశాంగ విధానాన్ని స్వతంత్రంగా నిర్ణయించే దేశం. ఏ దేశం ఒత్తిడి చేసినా భారత్ తన జాతీయ ప్రయోజనాల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటుంది. అందువల్ల రష్యాతో సంబంధాలు తెంచుకోవాలని లేదా తగ్గించాలని భారత నాయకత్వంపై ఒత్తిడి చేయడంలో ప్రయోజనం ఉండదు. భారత్ ఒక గొప్ప దేశం. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తి. అలాంటి దేశం తన ప్రయోజనాలను బాగా అర్థం చేసుకుంటుంది. రష్యాకు భారత్ విశ్వసనీయ భాగస్వామి. రష్యాతో సంబంధాలు తగ్గించాలని భారత ప్రధాని మోదీపై పాశ్చాత్య దేశాలు ఒత్తిడి తీసుకురావడం ఫలితం ఇవ్వదు’ అని స్పష్టం చేశారు.రష్యా భారత్‌ను ఇప్పటికీ అత్యంత కీలక వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తోంది. పాశ్చాత్య ఒత్తిళ్ల మధ్య కూడా భారత్ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కొనసాగిస్తోందని రష్యా భావిస్తోంది. అమెరికాతో భారత సంబంధాలు పెరిగినా, రష్యా-భారత్ సంబంధాలపై మాస్కోకు పెద్దగా ఆందోళన లేదని పుతిన్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఈ భాగస్వామ్యం మరింత విస్తరిస్తుందని చెప్పారు. అయితే, పరోక్షంగా అమెరికాను టార్గెట్ చేసే పుతిన్ ఇలా వ్యాఖ్యలు చేశారనే చర్చ నడుస్తోంది.అమెరికా-భారత్ సంబంధాలపై వ్యాఖ్యపుతిన్ వ్యాఖ్యల్లో అత్యంత ప్రాధాన్యం పొందిన అంశం అమెరికా-భారత్ సంబంధాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు. భారత్ అమెరికాతో వ్యూహాత్మక, ఆర్థిక, రక్షణ రంగాల్లో సంబంధాలను బలోపేతం చేసుకుంటున్నప్పటికీ, అది రష్యా-భారత్ సంబంధాలకు ఎలాంటి ఆటంకం కాదని ఆయన అన్నారు. అంటే, భారత్ ఒకేసారి అమెరికా మరియు రష్యాతో మంచి సంబంధాలు కొనసాగించగలదని, ఇది భారత విదేశాంగ విధానంలోని ప్రత్యేకత అని పుతిన్ అభిప్రాయపడ్డారు.ఎందుకు ఈ వ్యాఖ్యలు?రష్యా, ఉక్రెయిన్ మధ్య 2022లో యుద్దం ప్రారంభమైన తర్వాత అమెరికా, యూరోపియన్ దేశాలు రష్యాపై పలు ఆర్థిక ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో అనేక దేశాలు రష్యాతో వాణిజ్యాన్ని తగ్గించగా, భారత్ మాత్రం తన ఇంధన అవసరాల కోసం రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగించింది. తక్కువ ధరకు లభిస్తున్న రష్యన్ క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయడం ద్వారా భారత్ తన ఇంధన భద్రతను కాపాడుకుంది. దీనిపై పాశ్చాత్య దేశాలు విమర్శలు చేసినప్పటికీ, భారత్ తన నిర్ణయం జాతీయ ప్రయోజనాల కోసమేనని స్పష్టం చేసింది.భారత్-రష్యా మధ్య ప్రధాన రంగాలు:రక్షణ సహకారంఅణు విద్యుత్అంతరిక్ష పరిశోధనఇంధన భద్రతవాణిజ్యంసాంకేతికత -
రష్యాపైకి ఉక్రెయిన్ డ్రోన్ల దండు
కీవ్: దురాక్రమణ జెండా ఎగరేసి తమ భూభాగాలను ఆక్రమిస్తున్న రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దండును పంపి దాడికి తెగబడింది. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని కీలక చమురు టర్మినల్‌పై డ్రోన్లు దాడిచేశాయి. దీంతో నౌకాశ్రయం సమీప టర్మినల్ నుంచి అగ్నికీలలు ఎగసిపడి దట్టంగా నల్లటి పొగ వెలువడుతున్న వీడియోలను అంతర్జాతీయ మీడియా ప్రసారంచేసింది. ఉక్రెయిన్‌పై భీకరంగా రష్యా దాడి చేసి 22 మంది పౌరులను చంపేసి, 138 మందిని గాయపరిచిన ఘటన జరిగిన 24 గంటలకే రష్యాపై ఉక్రెయిన్ ప్రతిదాడులుచేయడం గమనార్హం. రష్యా అధ్యక్షుడు పుతిన్ తాను పుట్టిపెరిగిన సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో స్వంతంగా శుక్రవారం అంతర్జాతీయ ఆర్థిక సదస్సు నిర్వహణకు సంసిద్ధమవుతున్న వేళ ఈ దాడిజరిగింది. వేయి కిలోమీటర్ల ప్రయాణించి మరీ తమ డ్రోన్లు రష్యాలో విధ్వంసం సృష్టించాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ బుధవారం తన సోషల్‌మీడియా ఖాతాలో ఒక పోస్ట్‌పెట్టారు. దాడి దెబ్బకు నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసేశారు. మొబైల్ ఇంటర్నెట్ సేవలను సైతం నిలిపేశారు. దాడి జరిగిన నష్టవివరాలను రష్యా ప్రభుత్వం బయటపెట్టలేదు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రష్యా సొంతంగా అంతర్జాతీయ ఆర్థిక సదస్సును నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. ఏటా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతుండగా పుతిన్ సారథ్యంలో జరిగేదానిని రష్యా దావోస్‌గా పిలుస్తుంటారు. మరోవైపు ఇరాన్ యుద్ధంతో సొంతంగా పాట్రియోట్ గగనతల రక్షణ వ్యవస్థను అమెరికా విచ్చలవిడిగా వాడేస్తుండటంతో మిత్రదేశమైన ఉక్రెయిన్‌కు వాటిని గతంలోమాదిరి సరఫరా చేసే పరిస్థితిలేదు. దీంతో ఉక్రెయిన్‌లో ఇప్పుడు వీటి కొరత ఎక్కువైంది. రష్యా బాలిస్టిక్ క్షిపణి దాడులను ఎదుర్కొనే సత్తా తగ్గిపోయిందని, యూరప్ దేశాలు ఇతోధికంగా సాయం చేయల్సిన అవసరం ఏర్పడిందని ఉక్రెయిన్ పేర్కొంది. బుధవారమే కీవ్‌లో పర్యటించిన నాటో చీఫ్ మార్క్ ఉక్రెయిన్ ఉన్నతాధికారులతో సమావేశంకానున్నారు. నౌకాస్థావరంపైనా.. కోల్టీన్ ద్వీపం సమీపంలోని రష్యా క్రోన్‌స్టార్డ్ నౌకాస్థావరం పైనా ఉక్రెయిన్ డ్రోన్లు దాడిచేశాయి. రష్యా బాల్టీక్ విభాగ నౌకాస్థావరం, ఆయుధాగారం సైతం ఇక్కడే ఉన్నాయి. దాడికి తెగించిన 354 డ్రోన్లను కూల్చేశామని రష్యా తెలిపింది. మరోవైపు రష్యా ఆక్రమించిన డోనెట్సషేక్‌లోని బస్సుపై ఉక్రెయిన్ జరిపిన దాడిలో ఏడుగురు చనిపోయారు. 11 మంది గాయపడ్డారని క్రిమ్లిన్ నియమించిన డోనెట్సషేక్ ప్రాంత చీఫ్ డెనిస్ పుషిలిన్ వెల్లడించారు. -
తాలిబాన్ సర్కార్‌కు రష్యా బంపరాఫర్.. పాక్‌కు కొత్త టెన్షన్!
రష్యా, తాలిబాన్ల సర్కార్ పాలిత ఆఫ్ఘనిస్థాన్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఇరుపక్షాల మధ్య తొలి సైనిక-సాంకేతిక సహకార(Military-Technical Cooperation Agreement) ఒప్పందానికి గ్రీన్‌సిగ్నల్ పడింది. అయితే, ఈ ఒప్పందంలోని పూర్తి వివరాలు బహిరంగంగా వెల్లడించలేదు. కానీ, ఆయుధాల సరఫరా, సైనిక సాంకేతిక పరిజ్ఞానం బదిలీ అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో, ఈ ఒప్పందం ప్రాంతీయ రాజకీయాల్లో పెద్ద మార్పుగా విశ్లేషకులు చూస్తున్నారు. కీలక ఒప్పందం కారణంగా దాయాది దేశం పాకిస్తాన్‌కు టెన్షన్ మొదలైంది. ఇదే సమయంలో భారత్‌కు ఇది సానుకూల అంశం కానున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.2026 మే 27న మాస్కోలో జరిగిన అంతర్జాతీయ భద్రతా సమావేశం సందర్భంగా అఫ్గానిస్థాన్ రక్షణ మంత్రి మహ్మద్ యాకూబ్, రష్యా భద్రతా మండలి కార్యదర్శి సెర్గీయి షోయిగూ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంలోని పూర్తి వివరాలు బహిరంగంగా వెల్లడించలేదు. అయితే సాధారణంగా ఇటువంటి మిలిటరీ-టెక్నికల్ ఒప్పందాల్లో ఆయుధాల సరఫరా, సైనిక సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, శిక్షణ, నిర్వహణ, లైసెన్సింగ్,ఉమ్మడి అభివృద్ధి ప్రాజెక్టులు ఉంటాయి.ఎందుకు ముఖ్యమైనది?ఆప్ఘనిస్తాన్‌లో 2021లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచంలోని చాలా దేశాలు అధికారిక గుర్తింపు ఇవ్వలేదు. కానీ రష్యా 2025లో తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన తొలి దేశంగా నిలిచింది. అప్పటి నుంచి భద్రత, వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, ఇప్పుడు రక్షణ రంగాల్లో కూడా సంబంధాలను వేగంగా పెంచుతోంది.రష్యా ఎందుకు తాలిబాన్‌కు దగ్గరవుతోంది?1. ISIS-K ముప్పురష్యా ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న Islamic State–Khorasan Provinceను పెద్ద భద్రతా ముప్పుగా చూస్తోంది.2024లో మాస్కోలో జరిగిన Crocus City Hall ఉగ్రదాడి తర్వాత రష్యా ఆఫ్ఘనిస్థాన్‌లోని ఉగ్రవాద నెట్‌వర్క్‌లపై మరింత అప్రమత్తమైంది. తాలిబాన్‌తో సహకారం ద్వారా ISIS-Kను నియంత్రించవచ్చని మాస్కో భావిస్తోంది.2. మధ్య ఆసియాలో ప్రభావంఆఫ్ఘనిస్థాన్కు ఆనుకుని ఉన్న మధ్య ఆసియా దేశాలు రష్యా భద్రతా వ్యూహంలో కీలకమైనవి. ఆఫ్ఘనిస్థాన్‌లో స్థిరత్వం లేకపోతే ఆ ప్రభావం నేరుగా మధ్య ఆసియాపై పడుతుంది. 2021లో ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా ఉపసంహరణ తర్వాత ఏర్పడిన వ్యూహాత్మక ఖాళీని రష్యా, చైనా, ఇరాన్ వంటి దేశాలు భర్తీ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. రష్యా ఈ ఒప్పందాన్ని ఆ దిశలో మరో అడుగుగా చూస్తోంది.పాకిస్తాన్‌కు టెన్షన్?ఇదే ఈ పరిణామంలో అత్యంత కీలక అంశం. రష్యా నేరుగా తాలిబాన్‌తో సంబంధాలు బలోపేతం చేస్తోంది. గత రెండు దశాబ్దాలుగా ఆఫ్ఘనిస్థాన్‌లో పాకిస్థాన్ ప్రభావశీల దేశంగా ఉండేది. కానీ ఇప్పుడు తాలిబాన్–పాకిస్థాన్ మధ్య సంబంధాలు క్రమంగా క్షీణించాయి. ఇటీవలి కాలంలో ఇరు పక్షాల మధ్య యుద్ధం కూడా జరిగింది. పాక్ ఆరోపణ ప్రకారం టీటీపీ Tehrik-i-Taliban Pakistan (TTP) యోధులు ఆఫ్ఘనిస్థాన్‌లో ఆశ్రయం పొందుతున్నారు. తాలిబాన్ ఈ ఆరోపణలను తిరస్కరిస్తోంది. దీంతో రెండు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగాయి. ఇప్పుడు రష్యాతో కుదిరిన ఒప్పందం కారణంగా తాలిబాన్లకు ఆయుధాల సరఫరా, సైనిక సాంకేతిక పరిజ్ఞానం బదిలీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో, తాలిబాన్లు.. పాకిస్తాన్‌కు పక్కలో బల్లెంలా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకే పాక్ ఆందోళనకు గురవుతోంది. భారత్ సంగతేంటి? భారత్ అధికారికంగా తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించకపోయినా ఆఫ్ఘనిస్థాన్‌తో పరిమిత దౌత్య సంబంధాలు కొనసాగిస్తోంది. ఇటు రష్యాతోనూ మంచి స్నేహం ఉంది. దీంతో, భారత్‌పై పాక్ అనుసరించే చర్చకు చెక్ పడే అవకాశం ఉంది. అయితే, ఈ ఒప్పందం తాలిబాన్ అంతర్జాతీయ గుర్తింపు పొందే ప్రయత్నంలో పెద్ద ముందడుగుగా అనేక దేశాలు భావిస్తున్నాయి. రష్యా మధ్య ఆసియాలో తన ప్రభావాన్ని విస్తరించే వ్యూహంగా విశ్లేషించుకుంటున్నాయి.చైనా పాత్ర.. డ్రాగన్ కంట్రీ చైనా కూడా తాలిబాన్‌తో సంబంధాలు పెంచుకుంటోంది. అక్కడి ఖనిజ సంపదపై చైనా కన్నేసిందని వార్తలు సైతం బయటకు వచ్చాయి. ఆఫ్ఘనిస్థాన్‌లోని లిథియం, రాగి వంటి ఖనిజాలపై చైనా, రష్యా రెండింటికీ ఆసక్తి ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో రష్యా–చైనా–తాలిబాన్ సమీకరణం బలపడితే కొత్త వ్యూహాత్మక సవాళ్లు ఎదురుకావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి ఒకప్పుడు ఆఫ్ఘనిస్థాన్‌లో యుద్ధం చేసిన రష్యా, ఇప్పుడు తాలిబాన్ ప్రభుత్వంతో భద్రతా భాగస్వామిగా మారుతోంది. రష్యా–తాలిబాన్ ఒప్పందం ఇప్పటికైతే సాంకేతిక-సైనిక సహకారానికి పరిమితమైనా, దీని అసలు ప్రాధాన్యం ఆఫ్ఘనిస్థాన్‌ను అంతర్జాతీయ రాజకీయాల్లో తిరిగి స్థాపించడం, రష్యా ప్రభావాన్ని పెంచడం, దక్షిణాసియా శక్తి సమీకరణాలను మార్చడమేనని తెలుస్తోంది. -
రష్యాకు అమెరికా బంపరాఫర్.. భారత్ ఆందోళన?
వాషింగ్టన్: అంతర్జాతీయంగా చమురు సరఫరా వ్యవస్థ మెరుగు కోసం తాత్కాలికంగా రష్యా చమురుపై ఆంక్షలను ఎత్తేయనున్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ మేరకు సెనేట్ విదేశీ విధానాల కమిటీ ఎదుట అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మంగళవారం హాజరై ఈ విషయం వెల్లడించారు. అయితే, అమెరికా ప్రకటన భారత్‌కు ఆందోళన కలిగిస్తున్నట్టు తెలుస్తోంది. ‘‘రష్యా నుంచి చమురును కొంటే ఆంక్షలు తప్పవంటూ గతంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోబోతున్నాం. ఇది తాత్కాలికం మాత్రమే. దీనిపై తుది నిర్ణయం అమెరికా ఆర్థికశాఖ తీసుకుంటుంది. రష్యా చమురు ప్రపంచదేశాలు అందుబాటులోకి వస్తే పశ్చిమాసియా చమురు సంక్షోభానికి కొంతైనా పరిష్కారం చూపినవారం అవుతాం’’ అని రూబియో తెలిపారు.అయితే, 2022లో ఉక్రెయిన్, రష్యా యుద్ధం తర్వాత అమెరికా, యూరోపియన్ దేశాలు రష్యాపై భారీ ఆర్థిక ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా తన చమురును తగ్గింపు ధరలకు అమ్మడం ప్రారంభించింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని భారత్ భారీ స్థాయిలో రష్యా చమురును దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టింది. యుద్ధానికి ముందు భారత చమురు దిగుమతుల్లో రష్యా వాటా చాలా తక్కువగా ఉండేది. కానీ గత నాలుగేళ్లలో రష్యా భారతదేశానికి అతిపెద్ద చమురు సరఫరాదారులలో ఒకటిగా మారింది. భారత రిఫైనరీలు తక్కువ ధరకు చమురు కొనుగోలు చేసి, పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం వంటి ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి.అమెరికా ఆందోళన?అమెరికా అభిప్రాయం ప్రకారం, రష్యా చమురు అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం రష్యా ప్రభుత్వానికి మరియు యుద్ధ ఖర్చులకు ఉపయోగపడుతోంది. అందువల్ల రష్యా ఆదాయాన్ని తగ్గించేందుకు ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయాలని అమెరికా కోరుతోంది. అమెరికా విదేశాంగ మంత్రి రుబియో చేసిన వ్యాఖ్యల ప్రకారం, ప్రస్తుతం అమలులో ఉన్న కొన్ని తాత్కాలిక మినహాయింపులు శాశ్వతం కావు. వీటిని త్వరలో ముగించాలని అమెరికా యోచిస్తోంది.ఈ మినహాయింపులు ఎందుకు?2026లో ఇరాన్ యుద్ధం మరియు హోర్ముజ్ జలసంధి సమస్యల కారణంగా ప్రపంచ చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. చమురు ధరలు మరింత పెరగకుండా ఉండేందుకు అమెరికా తాత్కాలికంగా కొన్ని దేశాలకు రష్యా చమురు కొనుగోలు చేసే అవకాశం ఇచ్చింది. ఈ మినహాయింపులను ఇప్పటికే రెండు సార్లు పొడిగించారు. ప్రస్తుత పొడిగింపు జూన్ 17 వరకు అమల్లో ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి.భారత్‌పై ప్రభావం ఏమిటి?రష్యా చమురు దిగుమతులపై ఒత్తిడి పెరగవచ్చు.రవాణా, బీమా, చెల్లింపుల వ్యవస్థలు క్లిష్టం కావచ్చు.భారత్ ఇతర దేశాల నుంచి ఎక్కువ చమురు కొనాల్సి రావచ్చు.దేశీయ ఇంధన ధరలపై పరోక్ష ప్రభావం ఉండే అవకాశం ఉంది.భారత్ వైఖరిభారత్ పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారులు ఇటీవల స్పష్టం చేసిన విషయం ఏమిటంటే, అమెరికా మినహాయింపులు ఉన్నా లేకపోయినా భారత్ రష్యా చమురును కొనుగోలు చేస్తూనే ఉందని, భవిష్యత్తులో కూడా నిర్ణయం వాణిజ్య ప్రయోజనాలు మరియు ఇంధన భద్రత ఆధారంగానే ఉంటుందని చెప్పారు.మొత్తం మీద ఈ పరిణామం భారత్‌కు ముఖ్యమైనది. ఎందుకంటే రష్యా చమురు ప్రస్తుతం భారత ఇంధన వ్యూహంలో కీలక భాగంగా ఉంది. అయితే అమెరికా మినహాయింపులు ముగిసినా, భారత్ వెంటనే రష్యా చమురు కొనుగోళ్లను ఆపేస్తుందని చెప్పలేం. తుది ప్రభావం అమెరికా అమలు చేసే ఆంక్షల తీవ్రతపై భారత్ ప్రత్యామ్నాయ సరఫరాలను ఎంత వేగంగా సమకూర్చుకోగలదనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. -
ఉక్రెయిన్‌పై మరోసారి భీకర దాడులు
కీవ్: రాజధాని కీవ్ సహా ఉక్రెయిన్‌లోని పలు నగరాలపై రష్యా మరోసారి డజన్ల కొద్దీ క్షిపణులు, వందలాది డ్రోన్లతో చెలరేగిపో యింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కొనసాగిన ఈ దాడులతో నివాస భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఇద్దరు చిన్నారులు సహా కనీసం 18 మంది ప్రాణాలు కోల్పోగా, వందమందికి పైగా గాయాలపాలయ్యారు. కీవ్ లో డజనుకు పైగా భారీ పేలుళ్లు సంభవించాయి. భారీగా మంటలు చెలరేగాయి. దాడు ల్లో ఐదు ఆస్పత్రులు, పలు నివాస భవనా లు, వాణిజ్య సముదాయాలు దెబ్బతిన్నా యి. శిథిలాల్లో కూరుకుపోయిన ప్రజలను కాపాడేందుకు అగ్ని మాపక, సహాయక సిబ్బంది నిర్విరామంగా పనిచేస్తున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. కీవ్‌లో రాత్రంతా సైరన్లు మోగుతూనే ఉన్నా యి.అండర్‌గ్రౌండ్ రైల్వే స్టేషన్లలో 41 వేల మందికి పైగా తలదాచుకున్నారు. ఇటీవలి సంవత్సరాల్లో ఇంతమంది మెట్రో రైల్వే స్టేషన్లలో ఆశ్రయం పొందడం ఇదే మొదటి సారని అధికారులు తెలిపారు. తీవ్రస్థాయిలో గగనతల దాడులకు పాల్పడతాం, కీవ్‌ను విడిచి వెళ్లిపొమ్మంటూ కొన్ని రోజుల క్రితం రష్యా చేసిన హెచ్చరికలను విదేశీ దౌత్యాధికారులు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. భవన శిథిలాల్లో చిక్కుకుని కీవ్‌లో ఆరుగురు చనిపోగా, 67 మంది వరకు గాయపడినట్లు ఎమర్జెన్సీ సిబ్బంది తెలిపారు. నీప్రోలో ఇద్దరు చిన్నారులు సహా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యా ప్రయోగించిన 73 మిస్సైళ్లు, 656 డ్రోన్లకుగాను 40 క్షిపణులు, 602 డ్రోన్లను మధ్యలోనే అడ్డుకున్నట్లు ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది.ప్రధానంగా కీవ్, నీప్రోలతోపాటు పొల్టావా, ఖర్కీవ్, జపొరిఝియాలపైనే రష్యా దాడులు జరిగాయంది. కాగా, సైనిక పరిశ్రమ కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేపట్టినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. కనీసం 30 బాలిస్టిక్ మిస్సైళ్లు, 3 క్రూయిజ్ మిస్సైళ్లు, 33 డ్రోన్లు 38 ప్రాంతాల్లో లక్ష్యాలను ఛేదించాయంది. రష్యా ఆక్రమిత లుహాన్స్క్లోని కాలేజీ హాస్టల్‌పై మే 22వ తేదీన జరిగిన డ్రోన్ దాడిలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు.ఇందుకుగాను ఉక్రెయిన్‌పై తప్పక ప్రతీకారం తీర్చుకుంటామని, ఇలాంటి దాడులు కొనసాగుతూనే ఉంటాయని మంగళవారం అధ్యక్షుడు పుతిన్ ప్రకటించడం గమనార్హం. యుద్ధక్షేత్రంలో రష్యా సరఫరా వ్యవస్థలను ఉక్రెయిన్ డ్రోన్లు చిందరవందర చేయడం, కీలక ఆదాయ వనరుగా ఉన్న చమురు వసతులను ఉక్రెయిన్ లాంగ్ రేంజ్ డ్రోన్లు తీవ్రంగా దెబ్బతీయడంతో నిస్పృహతోనే అధ్యక్షుడు పుతిన్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు పరిశీలకులు అంటున్నారు. మే మొదటివారంలో రష్యా ఇదే రీతిన చేపట్టిన దాడుల్లో కనీసం 21 మంది చనిపోగా, పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. -
బూమ్.. రష్యా కొత్త వెపన్ అదుర్స్
-
సైలెంట్‌గా వస్తాయి.. స్థావరాన్ని లేపేస్తాయి.. రష్యాకు వణుకే
కీవ్: రష్యాను కదనరంగంలో దెబ్బగొట్టడానికి ఉక్రెయిన్ సరికొత్త ప్రణాళికను అనుసరిస్తోంది. సాంకేతికను వాడి భారీగా రోబోలు, డ్రోన్లు వంటి ఆధునాతన పరికరాలను వాడి శత్రువును తీరని దెబ్బకొడుతోంది. ఏమాత్రం శబ్ధం చేయకుండా రోబోటిక్ వాహనాలు శత్రుస్థావరాలకు చేరుకొని వారు తేరుకునేలోపే కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి.ఉక్రెయిన్ యుద్ధంలో సాంకేతికను పెద్దఎత్తున వాడుకుంటుంది. ఒకప్పుడు స్వయంగా యుద్ధరంగంలోకి దూకి శత్రువులతో పోరాడి తమ ప్రాణాలు అర్పించిన ఉక్రెయిన్ కమాండర్లు ఇప్పుడు ఫ్రంట్‌లైన్‌కు దూరంగా సురక్షిత ప్రాంతాల్లో కూర్చొని స్క్రీన్లు, లైవ్‌స్ట్రీమ్‌లు, డ్రోన్ల సహాయంతో దాడులను పర్యవేక్షిస్తున్నారు. ఉక్రెయిన్ సైనికులు ఎవరూ నేరుగా రంగంలోకి దిగకుండానే, కేవలం పేలుడు పదార్థాలతో కూడిన రోబోల సహాయంతో రష్యా స్థావరాలను విజయవంతంగా ముట్టడిస్తున్నారు. రోబోటిక్ వాహనాలతో రష్యన్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు.ఈ రోబోటిక్ బాంబు వాహనాలకు రష్యా సైనికులు "సైలెంట్ డెత్" (నిశ్శబ్ద మరణం) అని పేరు పెట్టుకున్నట్లు పట్టుబడిన రష్యా ఖైదీలు వెల్లడించారు. ఇవి ఎంత నిశ్శబ్దంగా ప్రయాణిస్తాయంటే, కేవలం 10 మీటర్ల దూరంలోకి వచ్చేంత వరకు రష్యా సైనికులు వీటిని గుర్తించలేకపోతున్నారు. అప్పటికే అవి పేలుడు పరిధిలోకి రావడంతో జరగాల్సిన నష్టం జరుగుతుంది.నాలుగేళ్లకు పైగా సాగుతున్న ఈ యుద్ధంలో ఉక్రెయిన్ ఇప్పటికే భారీగా సైనికులను కోల్పోయింది. జనాభా పరంగా రష్యా కంటే చిన్న దేశం కావడంతో సైనికుల కొరతను అధిగమించడానికి ఉక్రెయిన్ ఈ రోబోటిక్ వ్యవస్థను ఎంచుకుంది. అదేవిధంగా అమెరికా ఇతర పాశ్చాత్య దేశాల నుండి అందుతున్న సైనిక సహాయంపై స్పష్టత లేకపోవడంతో, ఉక్రెయిన్ సొంతంగా డ్రోన్ల ఉత్పత్తిని, రోబోల సామర్థ్యాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టింది.ఈ యుద్ధంలో సాంకేతికతను పెంచడం ద్వారా నెలకు సుమారు 35,000 మంది రష్యా సైనికులను హతమార్చడం లేదా గాయపరచడం ఉక్రెయిన్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉక్రెయిన్ ప్రకటించింది.కాగా, బ్రిటన్ నిఘా సంస్థ 'GCHQ' అంచనా ప్రకారం, ఈ యుద్ధంలో ఇప్పటివరకు దాదాపు 5 లక్షల మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు నివేదిక తెలిపింది. అదే విధంగా రోబోల వాడకంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇదివరకే స్పష్టతనిచ్చారు. చరిత్రలోనే మొదటిసారిగా కేవలం డ్రోన్లు, రోబోల సహాయంతో ఒక రష్యా స్థావరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నామని ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఈ రోబోలను కేవలం దాడులకే కాకుండా, గాయపడిన సైనికులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఫ్రంట్‌లైన్ సైనికులకు ఆహారం, మందులు, ఆయుధాలను సరఫరా చేయడానికి కూడా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. -
‘ఒరెష్నిక్ హైపర్సోనిక్’తో రష్యా భీకరదాడులు
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా పెద్ద ఎత్తున దాడులు చేసింది. కొన్ని వందల డ్రోన్లు, డజన్లకొద్దీ క్షిపణులను ప్రయోగించింది. కీవ్ నగరంతో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో నలుగురు మృతిచెందగా, మరో 50 మందికిపైగా గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున ఆ ప్రాంతమంతా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇళ్లకు, పాఠశాలలకు నష్టం వాటిల్లినట్లు సమాచారం.బిలా సెర్క్వా నగరంపై జరిగిన దాడిలో ఒరెష్నిక్ హైపర్సోనిక్ క్షిపణి వాడినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. ఆ నగరం కీవ్ ప్రాంతంలో ఉంది. ఒరెష్నిక్ హైపర్సోనిక్ క్షిపణి శబ్ద వేగం కన్నా 10 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది.ఉక్రెయిన్ శుక్రవారం స్టారోబిల్స్క్ పట్టణంలోని విద్యార్థుల వసతి గృహంపై దాడి చేసిందని ఆరోపించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించారు. చెప్పినట్లే ఆదివారం దాడులు చేశారు. రష్యా దాడులు చేయడానికి ముందే జెలెన్ స్కీ మాట్లాడుతూ.. తమ దేశంపై దాడి చేసే సూచనలు కనిపిస్తున్నాయని అన్నారు. రష్యా ఒరెష్నిక్ క్షిపణి వాడే అవకాశం ఉందని ఉక్రెయిన్ నిఘా సంస్థలకు సమాచారం వచ్చినట్టు కూడా ఆయన చెప్పారు. ఆ క్షిపణిని అడ్డుకోవడం అసాధ్యమని చెబుతున్నారు. ఉక్రెయిన్ జాతీయ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కీవ్ ప్రాంతంలో 50కు పైగా చోట్ల దాడి జరిగింది. ఇళ్లు, షాపింగ్ కేంద్రాలు, అత్యవసర సేవల భవనాలు, పోలీస్ భవనాలు దెబ్బతిన్నట్టు సమాచారం.నీటి సరఫరా కేంద్రంపై కూడా దాడి జరిగినట్టు జెలెన్స్కీ చెప్పారు. “రాజధానిపై భారీ బాలిస్టిక్ దాడి జరిగింది. ఇంకా దాడులు జరిగే అవకాశం ఉంది” అని కీవ్ సైనిక పరిపాలన అధిపతి టిమూర్ ట్కాచెంకో టెలిగ్రామ్‌లో గత అర్ధరాత్రి తర్వాత పోస్ట్ చేశారు.కీవ్ మేయర్ విటలి తెలిపిన వివరాల ప్రకారం నగరంలో ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చిన్నారులు సహా 30 మంది ఆసుపత్రిలో చేరారు. మధ్య షెవ్చెంకో జిల్లాలో 9 అంతస్తుల భవనంపై దాడి జరిగింది. పై అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. ఒకరు చనిపోయారు.అదే జిల్లాలో పాఠశాల వద్ద ఉన్న ఎయిర్ రైడ్ షెల్టర్ సమీపంలో దాడి జరిగింది. శిథిలాలు పడటంతో ప్రవేశ ద్వారం మూసుకుపోయింది. పలువురు లోపల చిక్కుకున్నారు. ఎమర్జెన్సీ సిబ్బంది నగరంలోని పలు ప్రాంతాలకు చేరుకుని మంటలు ఆర్పారు. శిథిలాలను తొలగించారు. గాయపడిన వారికి చికిత్స అందించారు.రాజధాని చుట్టూ ఉన్న కీవ్ ప్రాంతంలో మరో ఇద్దరు చనిపోయినట్టు ప్రాంతీయ అధిపతి మైకోలా కలాష్నిక్ తెలిపారు. కీవ్ బయట చెర్కాసీ, ఖార్కివ్, క్రోపీవ్నిట్స్కీ, ఒడెసా, పోల్టావా, సుమీ, జైటోమిర్ ప్రాంతాలపైనా దాడులు జరిగాయని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబియా తెలిపారు. -
రష్యా ఆర్మీలో 217 మంది భారతీయులు.. ఏం జరుగుతోంది?
న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో చిక్కుకొని, రష్యా ఆర్మీలో చేరిన భారతీయుల పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పలు వివరాలు సమర్పించింది. సుమారు 217 మంది భారతీయులు రష్యా సైన్యంలో చేరగా, అందులో 49 మంది యుద్ధభూమిలో ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మరో ఆరుగురు ఆచూకీ తెలియకుండా పోగా, మొత్తం 139 మందిని తిరిగి స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత రాయబార కార్యాలయం కృషి చేస్తోందని కేంద్రం తెలిపింది.రష్యా వల: ఆశచూపి.. బలిపశువులుగారష్యా తమ సైన్యంలో చేర్చుకునేందుకు విదేశీయులను ఆకర్షణీయమైన ప్యాకేజీలతో ప్రలోభపెట్టింది. నెలకు సుమారు 2,500 డాలర్ల జీతం, 5,000 డాలర్ల సైనింగ్ బోనస్, రష్యా పౌరసత్వం, మరణిస్తే 1,68,000 డాలర్ల పరిహారం ఇస్తామని నమ్మబలికింది. ఈ ఆశతోనే చాలా మంది భారతీయులు రష్యా సైన్యంతో స్వచ్ఛందంగా ఒప్పందాలు చేసుకున్నారని ప్రభుత్వం పేర్కొంది. ఇందులో జైలు శిక్ష అనుభవిస్తున్న కొందరు తమ శిక్ష నుంచి విముక్తి పొందాలనే ఆశతోనే రష్యా ఆర్మీలో చేరడం గమనార్హం.ప్రభుత్వ ప్రయత్నాలు- సవాళ్లుప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధభూమిలో చిక్కుకున్న భారతీయులను రక్షించడానికి భారత ప్రభుత్వం రష్యాతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పటివరకు 48 మందికి విమాన టిక్కెట్లను ప్రభుత్వం అందించింది. అయితే, యుద్ధ పరిస్థితుల దృష్ట్యా మృతదేహాలను గుర్తించడం, స్వదేశానికి తరలించడం అత్యంత క్లిష్టంగా మారిందని రష్యా అధికారులు తెలిపారు. కుటుంబ సభ్యుల డిఎన్ఏ నివేదికలను ఇప్పటికే సేకరించి, రష్యన్ అధికారులకు అందజేశామని, మరణించిన వారి కుటుంబాలకు పరిహారం ఇప్పించే ప్రక్రియను వేగవంతం చేశామని ప్రభుత్వం తెలిపింది.కోర్టు ముందు వాస్తవాలుసుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కేంద్రం కీలక విషయాలను బయటపెట్టింది. పిటిషన్లో పేర్కొన్న 26 మందిలో ఇప్పటికే 14 మంది మరణించగా, 11 మంది ఆచూకీ తెలియలేదు. ఒక వ్యక్తి వేధింపుల కేసులో రష్యాలో ఎనిమిదేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని సంచలనం చేయవద్దని కోరిన కేంద్రం, మరణించిన వారి కుటుంబాలకు పరిహారం అందించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలిపింది. -
పుతిన్‌తో ట్రంప్ గేమ్.. ఎక్కడికి దారి తీస్తుందో..
డొనాల్డ్ ట్రంప్.. ఈ పేరు ఎప్పుడూ సంచలనమే. ఆయన తీసుకునే నిర్ణయాలు, చర్యలు.. ఎప్పుడు ఏం చేస్తారో.. ఏం చెబుతారో అనేది ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. తీసుకున్న నిర్ణయాలు అనేక దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. యూరోప్‌లో తమ బలగాలను తగ్గిస్తామని ఇన్నాళ్లూ చెప్పిన ట్రంప్ ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. పోలాండ్‌కు అదనంగా 5000 మంది బలగాలను పంపనున్నట్లు వెల్లడించారు. దీంతో ఆయన చేస్తున్న ప్రకటన నాటో దేశాలను షాక్‌కు గురిచేసింది.అంతకుముందు ట్రంప్.. జర్మనీ నుంచి తమ సైనికుల సంఖ్యను తగ్గించనున్నట్లు చెప్పారు. జర్మనీ నుంచి సుమారు 5 వేల మందిని ఉపసంహరించనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. అయితే, ఇరాన్ యుద్ధంలో అమెరికా పరాజయాన్ని చవిచూసినట్లు జర్మనీ ఛాన్సలర్ మెర్జ్ ఆరోపించారు. యుద్ధ వ్యూహాంలో అమెరికా విఫలమైనట్లు ఆయన విమర్శించారు. ఈ క్రమంలో జర్మనీ నుంచి తమ బలగాలను ట్రంప్ ఉపసంహరించుకున్నట్టు సమాచారం.కానీ, పోలాండ్‌కు మాత్రం అదనంగా బలగాలను పంపనున్నట్లు ట్రంప్ చెప్పడం నాటో దేశాల్లో గందరగోళం నెలకొన్నది. పోలాండ్ అధ్యక్షుడిగా కరోల్ నవరోకీ విజయవంతంగా ఎన్నికయ్యారని, ఆయనకు తన మద్దతు ఉంటుందని, అమెరికా ఆయనకు మద్దతుగా 5 వేల మంది బలగాలను పోలాండ్‌కు పంపుతోందని ట్రంప్ తన ట్రుత్ సోషల్‌లో తెలిపారు. అయితే, జర్మనీ నుంచి ఉపసంహరించుకునే సైనికులను పోలాండ్‌కు బదిలీ చేస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. కాగా, ఇది యూరప్‌లో అమెరికా సైనిక వ్యూహంలో మార్పులకు సంకేతంగా భావించబడుతోంది. మరోవైపు.. పోలాండ్ నాయకత్వం ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. ఎందుకంటే ఇది రష్యా ముప్పు నుంచి రక్షణను బలోపేతం చేస్తుందని భావిస్తోంది. ఈ నిర్ణయం సైనిక వ్యూహం కంటే రాజకీయ సంబంధాలపై ఆధారపడి ఉందని విశ్లేషకులు అంటున్నారు.పోలాండ్-రష్యా ఘర్షణ.. ప్రస్తుతం పోలాండ్-రష్యా సంబంధాలు తీవ్ర ఉద్రిక్తతలో ఉన్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో పోలాండ్ తన భద్రతను నాటో మరియు అమెరికా సైనిక ఉనికిపై ఆధారపడి బలోపేతం చేస్తోంది. అలాగే రష్యా చర్యలను ప్రత్యక్ష ముప్పుగా చూస్తోంది. ప్రస్తుతం పోలాండ్-రష్యా మధ్య ఘర్షణలు ప్రత్యక్ష యుద్ధం రూపంలో కాకుండా “హైబ్రిడ్ వార్” రూపంలో జరుగుతున్నాయి. రష్యా పోలాండ్‌పై సైబర్ దాడులు, గూఢచారి చర్యలు, సమాచార యుద్ధం, మరియు సరిహద్దు అస్థిరతను ఆయుధంగా ఉపయోగిస్తోంది. పోలాండ్ మాత్రం NATO తూర్పు రక్షణలో ముందు వరుసలో నిలిచి రష్యా ముప్పును ఎదుర్కొంటోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగియకపోతే పోలాండ్-రష్యా సంబంధాలు మరింత కఠినమవుతాయి. మరోవైపు.. ఇటీవల పోలాండ్ విదేశాంగ మంత్రి పార్లమెంట్లో చేసిన ప్రసంగంలో.. రష్యా నుంచి వచ్చే ముప్పు నిజమైన ప్రమాదమని పేర్కొన్నారు. 2025 నవంబరులో రష్యా క్షిపణి దాడిలో పోలాండ్ పౌరులు మరణించడం ఈ ఉద్రిక్తతను మరింత పెంచింది.పోలాండ్.. నాటో తూర్పు రక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పోలాండ్ తన సైనిక శక్తిని విస్తరించి, NATO తూర్పు ఫ్లాంక్లో ప్రధాన స్థావరంగా మారింది. అమెరికా బలగాల ఉనికి, పోలాండ్ సైనిక విస్తరణ, మరియు NATO Forward Land Forces బెటాలియన్ పోలాండ్‌ను తూర్పు యూరప్ రక్షణలో కేంద్రంగా నిలబెట్టాయి.ప్రధాన ఘర్షణ రూపాలు1. హైబ్రిడ్ దాడులు సైబర్ దాడులు: పోలాండ్ ప్రభుత్వ, మౌలిక వసతులపై రష్యా తరచుగా సైబర్ దాడులు చేస్తోంది. గూఢచారి చర్యలు: రష్యా గూఢచారులు పోలాండ్లోని కీలక సైనిక, ఆర్థిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. సమాచార యుద్ధం: సోషల్ మీడియా, మీడియా ప్రచారాల ద్వారా పోలాండ్ సమాజాన్ని విభజించే ప్రయత్నం.2. సరిహద్దు సమస్యలు బెలారస్ ద్వారా వలసదారుల ప్రవేశం: రష్యా-బెలారస్ కలిసి అక్రమ వలసదారులను పోలాండ్ సరిహద్దులోకి పంపి అస్థిరత సృష్టిస్తున్నారు. సైనిక ఒత్తిడి: పోలాండ్ NATOతో కలిసి తూర్పు సరిహద్దులో బలగాలను పెంచుతోంది.3. ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం పోలాండ్ ఉక్రెయిన్‌కు ప్రధాన లాజిస్టికల్ హబ్‌గా మారింది. రష్యా దీన్ని ప్రత్యక్ష ముప్పుగా భావించి పోలాండ్‌పై దాడులను పెంచింది.పోలాండ్ పాత్రలో ప్రధాన అంశాలు1. Forward Land Forces (FLF) NATO తూర్పు ఫ్లాంక్లోని ఎనిమిది మల్టీనేషనల్ బెటాలియన్లలో ఒకటి పోలాండ్‌లో ఉంది. ఈ బెటాలియన్ రష్యా దాడులను అడ్డుకోవడానికి మరియు తక్షణ ప్రతిస్పందన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది.2. Mass-Army Strategy పోలాండ్ 2039 నాటికి 500,000 సైనికులు (300,000 యాక్టివ్, 200,000 రిజర్వ్) కలిగిన భారీ సైన్యాన్ని నిర్మిస్తోంది. ఇది దీర్ఘకాలిక, అధిక తీవ్రత గల యుద్ధంను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుతుంది. AI, డ్రోన్లు, లాంగ్-రేంజ్ స్ట్రైక్ సిస్టమ్స్ వంటి ఆధునిక సాంకేతికతలను సమీకరిస్తోంది.3. Air & Missile Defence పోలాండ్ NATO Integrated Air and Missile Defence (IAMD)లో కీలక భాగస్వామి. పర్మనెంట్ NATO Air Policing ద్వారా పోలాండ్ ఆకాశాన్ని 24/7 పర్యవేక్షిస్తున్నారు.4. సైబర్ మరియు స్పేస్ రక్షణ పోలాండ్ NATO Eastern Sentry ప్రోగ్రామ్‌లో భాగమై, సైబర్ దాడులు, ఉపగ్రహ ముప్పులు.రష్యా ప్లాన్..నాటోలో విభేదాలు: రష్యా హైబ్రిడ్ దాడులు NATO ఏకత్వాన్ని బలహీనపరుస్తున్నాయి.యూరప్‌లో అస్థిరత: సైబర్ దాడులు, ఇంధన సమస్యలు, వలసదారుల ఒత్తిడి యూరప్ భద్రతను దెబ్బతీస్తున్నాయి.ఉక్రెయిన్ మద్దతు తగ్గించడం: రష్యా లక్ష్యం యూరప్ దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతు తగ్గించేలా ఒత్తిడి చేయడం.నాటో ప్రస్తుతం రష్యా, చైనా వంటి దేశాల హైబ్రిడ్ వార్ వ్యూహాలకు ప్రతిస్పందించడానికి ప్రత్యేకమైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. 2026లో NATO “Counter-Hybrid Support Teams”, Article 5 invocation readiness, మరియు EUతో సమన్వయం వంటి చర్యల ద్వారా సభ్యదేశాలను రక్షిస్తోంది. ఇలాంటి తరుణంలో ట్రంప్ పోలాండ్‌కు అదనపు బలగాలను పంపుతానని ప్రకటించడం నాటోకు కొన్ని ఇబ్బందులను కలిగిస్తోంది. మొత్తం మీద రష్యా హైబ్రిడ్ వార్‌లోకి అమెరికా ఎంట్రీ ఇచ్చిందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.1. సమన్వయం లోపం ట్రంప్ నిర్ణయం NATO మిత్రదేశాలతో ముందుగా చర్చించకుండా తీసుకున్నారు. NATOలో ఏకత్వం, నమ్మకం దెబ్బతింటుంది.2. జర్మనీ నుండి బలగాల తగ్గింపు పోలాండ్‌కు బలగాలను పంపడం కోసం అమెరికా జర్మనీలోని సైనికులను తగ్గిస్తోంది. జర్మనీ, ఫ్రాన్స్ వంటి పశ్చిమ యూరప్ దేశాలు దీన్ని తమ భద్రతా ప్రాధాన్యత తగ్గింపుగా భావిస్తున్నాయి. నాటోలోని ఇతర దేశాలు దీన్ని సంయుక్త వ్యూహం కాకుండా వ్యక్తిగత రాజకీయ నిర్ణయంగా చూస్తున్నాయి.4. తూర్పు-పశ్చిమ విభేదాలు తూర్పు యూరప్ దేశాలు (పోలాండ్, బాల్టిక్ దేశాలు) అమెరికా బలగాలను స్వాగతిస్తున్నాయి. పశ్చిమ యూరప్ దేశాలు (జర్మనీ, ఫ్రాన్స్) దీన్ని NATOలో విభేదాలు పెంచే చర్యగా భావిస్తున్నాయి. -
అగ్రజుల గుసగుసలు
రెండు సాధారణ దేశాల అధినేతలు కలిశారంటే వాణిజ్యం, వ్యాపారం, పరస్పర సహకారం, ఇచ్చిపుచ్చుకోవడాలు చర్చకొస్తాయి. ఒప్పందాలు కుదురుతాయి. కానీ రెండు అగ్రదేశాలు కలిశాయంటే పైకి కనబడే వాణిజ్య, వ్యాపారాదులతోపాటు గుట్టుచప్పుడు కాకుండా కుదిరే లాలూచీలుంటాయి. వారం రోజుల వ్యవధిలో మూడు అగ్ర రాజ్యాల మధ్య మంతనాలు సాగాయి. గతవారం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకొస్తే, ఈ బుధవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వంతు. స్వల్ప వ్యవధిలో ఇలా ఇద్దరు అగ్రరాజ్యాధినేతలు రావటంవల్ల సహజంగానే చైనా స్థాయి అమాంతం పెరిగిపోయింది. పుతిన్ వచ్చిన సందర్భం సాధారణమైనది కాదు. ఆయనే చెప్పినట్టు 54 సంవత్సరాల క్రితం ఇదేరోజున అప్పటి చైనా అధినేత మావో జెడాంగ్ ‘ప్రపంచ దేశాలన్నీ ఏకమై అమెరికా సామ్రాజ్యవాదంపై పోరాడాల’ని పిలుపునిచ్చారు. అప్పటికీ ఇప్పటికీ ప్రపంచం మారింది. పెట్టుబడి ఎగుమతిలో, దేశాలపై ఆర్థికంగా పట్టుబిగించటంలో, ఇరుగుపొరుగును చీకాకుపెట్టడంలో, కనిపించేదంతా తనదేనని ప్రకటించుకోవటంలో చైనా సైతం సామ్రాజ్యవాద పోకడలకు పోతోంది. మధ్యన ‘సోషల్ సామ్రాజ్యవాదం’ ముద్ర వేయించుకున్న సోవియెట్ యూనియన్ చీలికలూ, పేలికలై కుప్పకూలింది. అందులోని ప్రధాన భాగం రష్యా కూడదీసుకునే ప్రయత్నం చేస్తూ, గత వారసత్వాన్ని కొనసాగించటానికి ఆపసోపాలు పడుతోంది. ఇక అమెరికా పోకడలు దశాబ్దాలుగా అదే బాణీలో కొనసాగుతున్నాయి.గతవారం ట్రంప్‌కు లభించిన స్వాగత సత్కారాలన్నీ పుతిన్‌కు కూడా దక్కాయి. రెడ్‌కార్పెట్ పరచడం, సైనిక వందనం, కేరింతలతో పిల్లలు అభివాదం చేయడం వంటివన్నీ కనబడ్డాయి. అయితే స్వీయ ప్రయోజనాల రక్షణలో తమకెవరూ సాటిరారని అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ నిరూపించారు. ఏవేవో ఒప్పందాలు కుదిరాయని ట్రంప్ చెప్పటమే తప్ప చైనా వైపునుంచి గతవారం ఎలాంటి ప్రకటనలూ రాలేదు. ఇప్పుడు పుతిన్‌కు కూడా దాదాపు అదే అనుభవం ఎదురైంది. ఇంధన సర ఫరా కోసం ‘పవర్ ఆఫ్ సైబీరియా 2’ పేరిట రెండో పైప్‌లైన్ నిర్మాణానికి రష్యా సిద్ధపడినా, చైనా అందుకు సంబంధించి మరింత లోతుగా చర్చించాల్సి ఉందంటూ వాయిదా వేసింది. కాకపోతే తైవాన్ విషయంలో ట్రంప్‌కు ‘రెడ్‌లైన్’ హెచ్చరిక జారీ అయిన పద్ధతిలో పుతిన్కుఎలాంటి భంగపాటు కలగలేదు. ఎవరికి వారు అవతలివారిని వేలెత్తి చూపడమే తప్ప, తమ తప్పులెరగరని ట్రంప్, పుతిన్‌ల పర్యటనలు నిరూపించాయి. హార్మూజ్ జలసంధి ప్రతిష్టంభన, ఇరాన్ యుద్ధం విషయంలో గతవారం అమెరికా, చైనాలు ‘ఏకాభిప్రాయం’ ప్రకటిస్తే... ఇప్పుడు చైనా, రష్యాలు సైతం అలాంటి స్వరమే వినిపిస్తున్నాయి. ‘ఏకపక్ష వ్యవహారశైలి, ఆధిపత్యవాద ధోరణులు’ ఉండరాదని కోరాయి. ప్రపంచం ఆటవిక న్యాయంలోకి దిగజారే ప్రమాదం కనబడుతోందని ఆందోళన వ్యక్తంచేశాయి. తరచిచూస్తే ఈ మూడు దేశాలూ జంకూ గొంకూ లేకుండా ఆధిపత్య ధోరణులు ప్రదర్శిస్తున్నాయి. అయినా గంభీరస్వరాలతో హితవు పలికే సాహసం చేస్తున్నాయి. అమెరికా సైన్యం వెనెజులా అధ్యక్షుణ్ణి భార్యా సమేతంగా చీకటిచాటున అపహరించుకు పోయింది. ఇరాన్ అగ్రనేతను ఇజ్రాయెల్‌తో కలిసి హత్య చేసింది. క్యూబాను కబళించటానికి కత్తులు నూరుతోంది. రష్యా నాలు గేళ్లుగా ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంది. దురాక్రమణకు దిగకపోయినా ఆసియా ఖండ దేశాల్లో చైనా కండబల ప్రదర్శన తక్కువేం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పుతిన్‌కు చైనా అవసరమే ఎక్కువుంది. ఉక్రెయిన్ను తక్కువ అంచనా వేసి యుద్ధంలోకి దిగి, అది తీవ్రంగా దెబ్బతింది. పుతిన్ స్వీయభద్రతే ప్రమాదంలో పడింది. రష్యా కాల్పుల విరమణ ప్రతిపాదనకు అంగీకరించిన ఉక్రెయిన్... ‘రష్యా తలపెట్టిన మే 9 విక్టరీ పెరేడ్ సజావుగా సాగటానికే’ దీనికి అంగీకరించామంటూ ఎద్దేవా చేసింది. దానికితోడు 2008 తర్వాత తొలిసారి ట్యాంకులు, క్షిపణులు లేకుండా ఆ పెరేడ్ హడావుడిగా ముగిసింది. మొత్తానికి ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ఆ రెండు దేశాల మాదిరిగా తనపై ఇంకా దురాక్రమణదారు ముద్రపడనందువల్లే ఈమాత్రం ప్రతిష్ఠయినా దక్కుతున్నదని చైనా గ్రహించి సవ్యంగా వ్యవహరిస్తే అదే పదివేలు! -
క్షిపణులను బూడిద చేసే మరో S-400 వస్తుంది.. ఎలా తీసుకొస్తారంటే?
భారత వైమానిక రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే అత్యంత శక్తిమంతమైన ఆయుధం రష్యా తయారీ S-400 Triumf నాలుగో స్క్వాడ్రన్ ఈ వారం భారత్‌కు చేరుకోనుంది. శత్రుదేశాల క్షిపణులు, డ్రోన్లు, యుద్ధ విమానాలను ఆకాశంలోనే కూల్చివేయగల ఈ అత్యాధునిక వ్యవస్థ రవాణా ప్రక్రియ ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఒక చిన్న టీవీ లేదా ఫ్రిజ్ సురక్షితంగా ఇంటికి ఎలా చేరుతుందో అనుకునే మనకు, ఇంత భారీ రక్షణ వ్యవస్థను రష్యా నుంచి భారత్‌కు ఎలా తరలిస్తారు? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది.చరిత్రాత్మక ఒప్పందం భారత్–రష్యా మధ్య 2018లో దాదాపు 5.43 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం మొత్తం ఐదు S-400 స్క్వాడ్రన్లను భారత్ కొనుగోలు చేయాల్సి ఉంది. ఇప్పటికే మూడు యూనిట్లు భారత వైమానిక దళంలో సేవలందిస్తుండగా, ఇప్పుడు నాలుగో స్క్వాడ్రన్ రాజస్థాన్ సరిహద్దుల్లో మోహరించేందుకు సిద్ధమవుతోంది. పాకిస్థాన్ వైపు నుంచి వచ్చే దీర్ఘశ్రేణి క్షిపణులు, డ్రోన్ దాడులను ఎదుర్కొనేందుకు ఇది కీలకంగా మారనుంది. భారత వాయుసేన ఈ వ్యవస్థను “సుదర్శన్ చక్ర”గా అభివర్ణిస్తోంది.ఇంత భారీ రక్షణ వ్యవస్థను రష్యా నుంచి భారత్‌కు తీసుకురావడం సాధారణ విషయం కాదు. ఇది అత్యంత సమన్వయంతో జరిగే భారీ లాజిస్టిక్ ఆపరేషన్. సముద్ర, వాయు, రోడ్డు మార్గాలను కలిపి ప్రత్యేక వ్యూహంతో ఈ తరలింపు చేపడతారు. భారీ క్షిపణి లాంచర్లు, ట్రాన్స్పోర్టర్ వాహనాలు వంటి పరికరాలను భారీ కార్గో నౌకల ద్వారా భారత తీర ప్రాంత పోర్టులకు తరలిస్తారు. మరోవైపు కమాండ్ అండ్ కంట్రోల్ మాడ్యూల్స్, అత్యాధునిక రాడార్లు, ఇంటర్‌సెప్టర్ క్షిపణులు వంటి సున్నితమైన పరికరాలను రష్యా నుంచి భారీ మిలిటరీ విమానాల ద్వారా నేరుగా భారత వైమానిక దళ స్థావరాలకు చేర్చుతారు.రవాణాకు ముందు భారత వైమానిక దళ అధికారులు రష్యాలోనే ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తారు. అన్ని పరికరాలు సక్రమంగా ఉన్నాయని నిర్ధారించిన తర్వాత వాటిని ప్రత్యేక భద్రతా కంటైనర్లలో ప్యాక్ చేస్తారు. ప్రస్తుతం భారత్‌కు వస్తున్న నాలుగో యూనిట్‌కు సంబంధించిన ఈ తనిఖీలు ఇప్పటికే పూర్తయ్యాయని సమాచారం.సాధారణంగా చాలామంది S-400 అంటే కేవలం క్షిపణులు అమర్చిన ఒక పెద్ద ట్రక్కు మాత్రమే అనుకుంటారు. కానీ వాస్తవానికి అది పూర్తి స్థాయి మొబైల్ యుద్ధ వ్యవస్థ. ఒక స్క్వాడ్రన్‌లో 16 ప్రత్యేక వాహనాలు ఉంటాయి. ఇందులో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, 600 కిలోమీటర్ల దూరంలో శత్రువులను గుర్తించగల రాడార్లు, లక్ష్యాలను ట్రాక్ చేసి క్షిపణులకు మార్గనిర్దేశం చేసే ఎంగేజ్మెంట్ రాడార్లు, ఎనిమిది మొబైల్ లాంచర్ యూనిట్లు, క్షిపణి రీలోడర్లు, జనరేటర్లు, మెయింటెనెన్స్ వాహనాలు ఉంటాయి. ఈ మొత్తం వ్యవస్థ కలిపి శక్తివంతమైన వైమానిక రక్షణ కవచాన్ని సృష్టిస్తుంది.భారత్‌కు చేరుకున్న తర్వాత అసలు ఆపరేషన్ ప్రారంభమవుతుంది. పోర్టుల వద్ద కస్టమ్స్, భద్రతా క్లియరెన్స్ పూర్తయిన తరువాత ఈ భారీ కంటైనర్లను ప్రత్యేక మిలిటరీ ట్రక్కుల ద్వారా గమ్యస్థానాలకు తరలిస్తారు. ఈ రవాణా సమయంలో భారీ భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. గగనతలంలోనూ, రోడ్లపైనూ హై అలర్ట్ ప్రకటిస్తారు. అనంతరం భారత వైమానిక దళ సాంకేతిక నిపుణులు అన్ని భాగాలను ఒక భారీ లెగో సెట్స్‌లా అమర్చి పరీక్షలు నిర్వహిస్తారు. అన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయని నిర్ధారించిన తర్వాతే ఆ వ్యవస్థను యుద్ధ సిద్ధంగా ప్రకటిస్తారు.ఐదో యూనిట్‌ను చైనా సరిహద్దులో ఇప్పుడున్న నాలుగో స్క్వాడ్రన్ రాజస్థాన్ సరిహద్దులో మోహరించనున్నప్పటికీ, ఈ ఏడాది నవంబర్ నాటికి ఐదో యూనిట్ కూడా భారత్‌కు చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. దానిని చైనా సరిహద్దు ప్రాంతంలో మోహరించనున్నట్టు సమాచారం. అంతేకాదు, అదనంగా మరో ఐదు S-400 యూనిట్ల కొనుగోలుకు కూడా భారత రక్షణ కొనుగోలు మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా బహుస్థాయి “ఇండియన్ ఐరన్ డోమ్” రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడమే భారత లక్ష్యంగా కనిపిస్తోంది.ఒకసారి ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే, శత్రుదేశాల క్షిపణులు, డ్రోన్లు, ఫైటర్ జెట్లు భారత గగనతలంలోకి చొరబడటం దాదాపు అసాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. సముద్రం, గగనం, రోడ్డు మార్గాల ద్వారా అత్యంత రహస్యంగా జరిగే ఈ భారీ రవాణా వెనుక భారత సైన్యం, ప్రభుత్వం చేస్తున్న కృషి ఇప్పుడు దేశ రక్షణలో మరో కీలక అధ్యాయంగా నిలుస్తోంది. -
పుతిన్ పర్యటనతో చమురు సంక్షోభం తీరుతుందా..?
మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ ఏడాది భారత్‌లో పర్యటించనున్నారు. బ్రిక్స్ సదస్సుకు హాజరుకావడానికి ఆయన భారత్ వస్తున్నప్పటికీ ఈ పర్యటనలో పలు కీలకమైన ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా చమురు సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో పుతిన్ భారత్ పర్యటన ఎంతో కీలకం కానుంది.ప్రస్తుతం మిడిల్ఈస్ట్లో యుద్ధపరిస్థితుల నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 నుంచి 110 డాలర్ల పైమాటకు చేరి తీవ్రంగా హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. దీనికి తోడు హర్ముజ్‌ను మూసివేయడంతో చమరు రవాణా దెబ్బతిని తీవ్ర సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో భారత్‌లో సైతం పెట్రో డీజిల్ ధరలు పెద్ద ఎత్తున పెరగవచ్చనే ఆందోళన ప్రజలలో నెలకొంది.ఈ నేపథ్యంలో పుతిన్ భారత్ పర్యటన ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో చమురు సంక్షోభం తీరేలా ఇరు దేశాల మధ్య ఏదైనా ఒప్పందం జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. దానికి బలం చేకూర్చేలా ఇటీవలే ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మాట్లాడుతూ "భారతదేశానికి ఇంధన సరఫరా ఒప్పందాల విషయంలో ఎలాంటి అడ్డంకులు రాకుండా రష్యా అన్ని బాధ్యతలను నెరవేరుస్తుంది. బాహ్య శక్తుల నుండి వచ్చే ఎలాంటి అనైతిక పోటీల వల్ల భారత్ ప్రయోజనాలకు నష్టం వాటిల్లనివ్వం." అని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ మాటలతో భారత్‌కు ఎంతో ఊరట లభించింది.ఇతర ఇంధన రంగాలు కేవలం ముడి చమురు మాత్రమే కాకుండా, భారత్‌కు అవసరమైన ఎల్.ఎన్.జి బొగ్గు సరఫరాలను పెంచడం, తమిళనాడులోని కుడంకుళం అణు విద్యుత్ కేంద్రం లాంటి ఉమ్మడి ప్రాజెక్టుల విస్తరణపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది.రూపాయి-రూబుల్ చెల్లింపులుఅంతే కాకుంగా చమురు కొనుగోళ్లకు సంబంధించి డాలర్ల కొరత లేదా అంతర్జాతీయ ఆంక్షల ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, స్వదేశీ కరెన్సీలలో (రూపాయి - రూబుల్) సురక్షితమైన బ్యాంకింగ్ మరియు ఆర్థిక ఛానళ్లను ఏర్పాటు చేయడంపై ఈ పర్యటనలో మోదీ, పుతిన్ తుది నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇందులో ఓ సమస్య ఉంది. రష్యా నుంచి చమరుదిగుమతులతో భారత్ తన స్వంత కరెన్సీలో చెల్లింపులు చేస్తే ఆ డబ్బులు వారి వద్ద అధికంగా నిల్వ ఉంటున్నాయి. ఎందుకంటే రష్యా భారత్‌కు ఎగుమతులు చేస్తున్నంతగా ఆ దేశానికి భారత ఎగుమతులు లేవు అందుకే వారి వద్ద కరెన్సీ నిల్వలు అధికంగా ఉంటున్నాయి. దీంతో రష్యా ఆ డబ్బను తిరిగి భారత ప్రభుత్వ బాండ్లు, షేర్లు ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెడుతుంది.భారత్‌కు రష్యా పూర్తి స్థాయిలో చమురు సరఫరా చేయగలదా?రష్యా రోజుకు సుమారు 10.3 మిలియన్ బ్యారెళ్ల (1 కోటి 3 లక్షల బ్యారెళ్లు) ముడి చమురును ఉత్పత్తి చేస్తుంది. ఇందులో దాదాపు 4.5 నుండి 4.9 మిలియన్ బ్యారెళ్లను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంది. భారత్‌కు సగటున రోజుకు సుమారు 5.3 మిలియన్ బ్యారెళ్ల వరకూ చమురు అవసరం కనుక రష్యా భారత్ అవసరాలను దాదాపు తీర్చగలదు.ప్రధాన సమస్యలులాజిస్టిక్స్, రవాణా సవాళ్లు గల్ఫ్ దేశాలు (సౌదీ, ఇరాక్, యూఏఈ) భారత్‌కు భౌగోళికంగా చాలా దగ్గరగా ఉన్నాయి. అక్కడి నుండి చమురు నౌకలు కేవలం 4 నుండి 7 రోజుల్లో భారత్ చేరుకుంటాయి. కానీ రష్యా నుండి చమురు రావాలంటే చాలా దూరం ప్రయాణించాలి. రష్యా పశ్చిమ నౌకాశ్రయాల నుండి వచ్చే నౌకలు భారత్ చేరడానికి 30 నుండి 35 రోజులు పడుతుంది.పశ్చిమ దేశాల ఆంక్షల వల్ల రష్యా చమురును రవాణా చేయడానికి అంతర్జాతీయ నౌకలు, భీమా సంస్థలు ముందుకు రావడం లేదు. రష్యా తన స్వంత 'షాడో ఫ్లీట్' (పాత నౌకలు) ద్వారానే సరఫరా చేస్తోంది. భారత్‌కు కావాల్సినంతగా ఇందులో చమురు రవాణా చేయడం కొద్దిగా కష్టమైన పని.రిఫైనరీల సాంకేతికత భారతదేశంలోని చమురు శుద్ధి కర్మాగారాలు (Refineries) దశాబ్దాలుగా మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి వచ్చే 'సౌర్ క్రూడ్' (సల్ఫర్ ఎక్కువగా ఉండే చమురు) ను శుద్ధి చేసేలా డిజైన్ చేయబడ్డాయి. రష్యా నుంచి వచ్చే 'ఉరల్స్ క్రూడ్' రకం కొద్దిగా భిన్నంగా ఉంటుంది.భారతీయ రిఫైనరీలు రష్యా చమురును 100% వాడలేవు; సాంకేతిక బ్యాలెన్స్ కోసం మిడిల్ ఈస్ట్ చమురును కూడా కలిపి వాడాల్సి ఉంటుంది.భారత్‌కు ఇష్టం లేదు వ్యూహాత్మకంగా భారతదేశం తన ఇంధన అవసరాల కోసం ఏ ఒక్క దేశం పైనా పూర్తి స్థాయిలో ఆధారపడదు. రేపు రష్యాతో ఏదైనా సమస్య వస్తే భారత్ ఇరుక్కుపోతుంది. అందుకే భారత్ తన రిస్క్‌ను తగ్గించుకోవడానికి రష్యాతో పాటు సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈ, అమెరికా దేశాల నుండి చమురును విడివిడిగా కొనుగోలు చేస్తుంది. అయితే ఈ పర్యటనతో భారత చమురు సమస్య పూర్తిగా తీరుతుంది అని చెప్పడం అతిశయోక్తే అయినప్పటికీ ప్రస్తుత చమురు సంక్షోభ పరిస్థితులను అరికట్టడానికి ఎంతో కొంత సహకరిస్తుందనేది మాత్రం చెప్పవచ్చు. -
రష్యాలో కలకలం.. భారీగా డ్రోన్ దాడులు.. నలుగురి మృతి
మాస్కో సహా రష్యాలోని పలు ప్రాంతాలపై ఉక్రెయిన్ భారీ స్థాయిలో డ్రోన్ దాడులు చేసింది. దీంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడాది వ్యవధిలో రష్యాపై జరిగిన అతిపెద్ద డ్రోన్ దాడి ఇదేనని అధికారులు వివరించారు. ఆదివారం రష్యా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మాస్కోలో ముగ్గురు మృతిచెందగా, ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలోని బెల్గొరోడ్లో మరో వ్యక్తి చనిపోయాడు.మాస్కో గవర్నర్ ఆండ్రే వోరోబ్యోవ్ తెలిపిన వివరాల ప్రకారం.. నగర ఉత్తర భాగంలోని ఖిమ్కిలో ఓ ఇంటిపై డ్రోన్ దాడి జరగగా ఓ మహిళ మృతి చెందింది. శిథిలాల కింద మరో బాధితుడు ఉన్నాడని తెలుస్తోంది. మైటిష్చి జిల్లాలోని పొగొరెల్కి గ్రామంలో మరో ఇద్దరు చనిపోయినట్లు ఆయన తెలిపారు. దాడుల్లో అపార్ట్మెంట్ భవనాలు, మౌలిక సదుపాయ కేంద్రాలు దెబ్బతిన్నాయని వోరోబ్యోవ్ తెలిపారు.మాస్కో మేయర్ సెర్గెయ్ సోబ్యానిన్ను ఉటంకిస్తూ రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ టాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మాస్కోను లక్ష్యంగా చేసుకున్న 81 డ్రోన్లను రాత్రికిరాత్రే గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయి. మాస్కో చమురు శుద్ధి కేంద్రం సమీపంలో కొందరు గాయపడ్డారు. శుద్ధి కేంద్రం పనులు ఆగలేదని, 3 ఇళ్లు దెబ్బతిన్నాయి.రష్యా రక్షణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ 556 డ్రోన్లను అడ్డుకున్నారు. మాస్కోలోని అతిపెద్ద షెరెమెత్యేవో విమానాశ్రయం పరిధిలో డ్రోన్ శకలాలు పడినప్పటికీ ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధం ముగింపు దశకు చేరవచ్చని సూచించిన తర్వాత ఈ దాడులు జరిగాయి. గత వారం ట్రంప్ మాట్లాడుతూ యుద్ధం ఆపేందుకు రష్యా, ఉక్రెయిన్ త్వరలో ఒప్పందానికి వస్తాయని తాను నమ్ముతున్నట్లు చెప్పారు.ఇదే సమయంలో ఉక్రెయిన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలపై రష్యా దాడులు కొనసాగాయి. ఖార్కివ్ ప్రాంతంలో గత 24 గంటల్లో 15 ప్రాంతాలను రష్యా బలగాలు లక్ష్యంగా చేసుకున్నాయని, ఏడుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.దక్షిణ ఖెర్సోన్ ప్రాంతంలో శనివారం ఉదయం ఇన్హులెట్స్ గ్రామంపై రష్యా డ్రోన్ పేలుడు పదార్థాలు వదలగా 36 ఏళ్ల వ్యక్తి మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. -
ఫోన్ పక్కకి పెడతారా.. లేక గన్ తీయమంటారా
ఢిల్లీ: భారత్ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ విదేశాంగ శాఖ మంత్రుల సదస్సు ముగిసింది. అయితే ఇందులో పాల్గొనడానికి వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్కు ఊహించని ఘటన ఎదురైంది. సదస్సులో పాల్గొన్న అనంతరం సెర్గీ లావ్రోవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతుండగా ఓ జర్నలిస్టు ఫోన్లో మాట్లాడుతూ తరచుగా అంతరాయం కలిగించారు. దీంతో ఆగ్రహం చెందిన సెర్గీ లావ్రోవ్ మీరు బయిటకి వెళతారా లేక గన్ తీయమంటారా అని హెచ్చరించారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం నిన్న (మే 15) ముగిసింది. పశ్చిమాసియా లో నెలకొన్న సంక్షోభం, ఇరాన్ వివాదం వంటి అంశాలపై సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఉమ్మడి ప్రకటన లేకుండానే సదస్సు ముగిసింది. ఈ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ని ఒక జర్నలిస్టు ఇబ్బందులకు గురిచేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.బ్రిక్స్ సదస్సు అనంతరం సెర్గీ లావ్రోవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సావధానంగా సమాధానాలిస్తున్నారు. అయితే ఇంతలోనే ఓ జర్నలిస్టు ఫోన్లో మాట్లాడడంతో లావ్రోవ్ మాటలకు అంతరాయం కలిగింది. దీంతో ఆయన "మీరు మమ్మల్ని ఒంటిరిగా వదిలేయండి. లేదా ఫోన్‌ని వదిలేయండి" అని ఆయనతో అన్నారు. దీని తర్వాత సైతం అతని తీరు మారక మరోసారి ఫోన్లో మాట్లాడుతూ ఆయనను ఇబ్బందులకు గురిచేశారు. దీంతో ఆగ్రహం చెందిన లావ్రోవ్ "మీరు మమ్మల్ని వదిలేస్తారా.. నేను జోక్ చేయడం లేదు. మీరు ఫోన్ వదిలేయకపోతే సెక్యూరిటీ సిబ్బంది తుపాకీ తీయాల్సి వస్తుంది" అని తీవ్రంగా హెచ్చరించారు.దీంతో మీడియా సమావేశంలో పరిస్థితులు గంభీరంగా మారాయి. కాగా బ్రిక్స్ సమావేశం కోసం వచ్చిన లావ్రోవ్ కేంద్రమంత్రులతో పలు కీలక సమావేశాలు జరిపారు. మోదీ యూఏఈ పర్యటనకు ముందు గురువారం ఆయనతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు, ఉక్రెయిన్, పశ్చిమ ఆసియాలోని పరిస్థితులతో సహా కొనసాగుతున్న అంతర్జాతీయ సంఘర్షణల గురించి చర్చించారు.#Watch | "If you don't surrender your phone, they will pull out a gun": Russian Foreign Minister Sergey Lavrov loses cool at a journalist during the BRICS Foreign Ministers Summits in New Delhi pic.twitter.com/Tpdk5uNzTX— NDTV WORLD (@NDTVWORLD) May 16, 2026 -
మోదీతో రష్యా మంత్రి లావ్రోవ్ భేటీ
న్యూఢిల్లీ: రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఉక్రెయిన్, పశ్చిమాసియా పరిణామాలతోపాటు పరస్పర ప్రయోజనాలతో ముడిపడి ఉన్న వివిధ ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. వివాదాలు, సంఘర్షణల పరిష్కారానికి సంప్రదింపులు, దౌత్య మార్గాలకే భారత్ స్థిరంగా కట్టుబడి ఉందని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. లావ్రోవ్ను నందంగా ఉందంటూ మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. భారత్, రష్యా మధ్య ప్రత్యేక, విశిష్ట వ్యూహాత్మక భాగస్వామ్యంలోని వివిధ అంశాల పురోగతిపై తాజా సమాచారం అందించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేశానని వెల్లడించారు. రష్యా అధినేత పుతిన్‌కు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయాలని లావ్రోవ్ను మోదీ కోరారు. మోదీని కలిసిన ‘బ్రిక్స్’విదేశాంగ మంత్రులు బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రులు ప్రధాని మోదీని కలిశారు. ఆయన వారికి ఆతిథ్యం ఇచ్చారు. రష్యా మంత్రి సెర్గీ లావ్రోవ్, ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, బ్రెజిల్ మంత్రి మౌరో, ఇండోనేíÙయా మంత్రి సుగియోనో, దక్షిణాఫ్రికా మంత్రి రోనాల్డ్ లామోలా ఉమ్మడిగా మోదీతో సమావేశమయ్యారు. మరోవైపు బ్రిక్స్దేశాల విదేశాంగ మంత్రుల రెండు రోజుల సదస్సు గురువారం ప్రారంభమైంది. -
భారత్‌కు చమురు సంక్షోభం తలెత్తనివ్వం.. రష్యా కీలక ప్రకటన
మాస్కో: రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ కీలక ప్రకటన చేశారు. భారత్‌కు రష్యా నుండి సరఫరా అవుతున్న చమురులో ఏటువంటి ఆటంకం రానివ్వమన్నారు. తమ మిత్రదేశమైన భారత ఇంధన ప్రయోజనాలకు మాస్కో అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. త్వరలో భారత పర్యటనకు రానున్నట్లు విదేశాంగ మంత్రి తెలిపారు.రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ త్వరలో భారత్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో పలు కీలక అంశాలు వెల్లడించారు. తాను ఇప్పటి వరకూ చూసిన అత్యంత శక్తివంతమైన నాయకులలో భారత ప్రధాని మోదీ ఒకరని కొనియాడారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చమురు విషయంలో సంక్షోభం నెలకొన్నప్పటికీ భారత్‌తో ఒప్పందం చేసుకున్న విధంగా రష్యా చమురు అందిస్తుందని తెలిపారు.ఇంధన సరఫరా విషయంలో భారత్‌తో పాటు వేరే ఏదేశానికి ఇచ్చిన హామీని రష్యా ఎన్నడూ తప్పలేదన్నారు.కుడంకుళంలో నిర్మిస్తున్న అణువిద్యుత్ కేంద్రం భారత్ విద్యుత్ అవసరాలను గణనీయంగా తీరుస్తుందన్నారు. భారత-రష్యా మధ్య సంబంధాలు ఎంతో స్నేహపూర్వకమైనవని ఈ మైత్రి తరతరాలదన్నారు. హిందీ-రుసీ భాయ్-భాయ్ (భారతీయులు- రష్యన్లు సోదరులు) అనే నినాదం సరదాది కాదని అది ఇరు దేశాల సంస్కృతిలో భాగమైందన్నారు. -
రష్యా అణ్వాయుధ క్షిపణి ప్రయోగం.. కెపాసిటీ తెలిస్తే షాక్..?
మాస్కో: రష్యా తన సత్తాని మరోసారి ప్రపంచానికి చాటింది. తన అణ్వాయుధ సంపత్తిని మరింత మెరుగుపరిచే విధంగా నిన్న (మంగళవారం) ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ ను విజయవంతంగా పరీక్షించింది. ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుందని ప్రకటించిన కొద్ది రోజులకే అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ శక్తివంతమైన క్షిపణిని ప్రదర్శించడం విశేషం.ఇది సుమారు 35,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఇది భూమి చుట్టూ ఉప-కక్ష్యలో ప్రయాణించి, శత్రువుల క్షిపణి రక్షణ వ్యవస్థలను ఛేదించగలదని రష్యా పేర్కొంది. ఇవి పాత సోవియట్ కాలం నాటి 'వొయెవోడా' క్షిపణుల స్థానంలో రానున్నట్లు తెలిపింది. దీనికి అమర్చిన వార్హెడ్లు పశ్చిమ దేశాలకు చెందిన క్షిపణుల కంటే నాలుగు రెట్లు ఎక్కువ అని పేర్కొంది. కాగా ఈ క్షిపణి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన క్షిపణి అని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. రష్యా అణ్వాయుధ క్షిపణులు అవంగార్డ్ ధ్వని కంటే 27 రెట్లు వేగంతో ప్రయాణించే హైపర్ సోనిక్ గ్లైడ్ వెహికల్.ఒరేష్నిక్ : ఇది మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి. ఇది ఐరోపాలోని ఏ ప్రాంతాన్నైనా తాకగలదు.పోసిడాన్ : ఇది అణ్వాయుధ సామర్థ్యం ఉన్న అండర్ వాటర్ డ్రోన్. ఇది సముద్రతీరంలో పేలి 'రేడియోధార్మిక సునామీ'ని సృష్టించగలదు.బ్యూరెవెస్ట్నిక్ : అణుశక్తితో పనిచేసే ఈ క్రూయిజ్ క్షిపణికి అపరిమితమైన పరిధి ఉంటుంది.కాగా అమెరికా, మధ్య ఉన్న చివరి అణ్వాయుధ ఒప్పందంఅమెరికా మరియు రష్యాల మధ్య ఉన్న చివరి అణ్వాయుధ నియంత్రణ ఒప్పందం 'న్యూ స్టార్ట్' కాలపరిమితి ఫిబ్రవరి 2026తో ముగిసింది. ఫిబ్రవరిలో ముగిసింది. దీనివల్ల ఇప్పుడు ప్రపంచంలోని రెండు అతిపెద్ద అణు దేశాల ఆయుధ సంపత్తిపై ఎటువంటి పరిమితులు లేవు. ఇది కొత్త అణ్వాయుధ పోటీకి దారితీస్తుందని నిపుణులు భయపడుతున్నారు.కాగా 2024లో పుతిన్ రష్యా యొక్క అణు సిద్ధాంతాన్ని సవరించారు. దీని ప్రకారం, అణ్వాయుధాలు లేని దేశం (ఉక్రెయిన్ వంటివి) అణ్వాయుధ దేశాల మద్దతుతో రష్యాపై దాడి చేస్తే, దానిని ఆ రెండు దేశాల ఉమ్మడి దాడిగా పరిగణించి రష్యా అణ్వాయుధాలతో స్పందించవచ్చు. -
అచ్చం భారతీయ స్త్రీలా రష్యన్ మహిళ..!
ఇంతవరకు చాలామంది భారత్ ఉండటం ఇష్టపడటాన్ని చూశాం. ఇక్కడ భోజనానికి, జీవనశైలికి అలవాటు పడితే ఒక మహిళ ఏకంగా అచ్చం భారతీయ మహిళలా రష్యన్ మహిళ తనను తాను మార్చుకుంది. కేవలం కట్టు బొట్టు మాత్రమే కాదు..మన భారత నారి ఎలా ప్రవర్తిస్తుందో, ఎలా కుటుంబంతో మసులుకుంటుందో అలా మొత్తం జీవనశైలినే మార్చుకుందామె. పైగా ఆ జీవనవిధానం తన వ్యక్తిత్వాన్ని చాలా గొప్పగా మార్చాయంటూ తన అనుభవాన్ని వివరిస్తూ వీడియో షేర్ చేసుకుంది. ముంబైలోని మొహాలీలో నివశిస్తున్న రష్యన్ మహిళ ఒక భారతీయ మహిళ నుంచి ఆ ఐదు అలవాట్లను నేర్చుకున్నా అంటూ వాటి గురించి వీడియోలో వివరించింది. ఉదయాన్నే త్వరగా లేవడం నుంచి ప్రతి నిర్ణయం తీసుకునే ముందుకు భర్తను సంప్రదించడం వరకు ప్రతి అలవాటు తన వ్యక్తిత్వాన్ని అద్భుతంగా మార్చాయని పేర్కొంది. భారతీయ మహిళల నుంచి అలవర్చుకున్న అలవాట్లు అంటూ క్యాప్షన్ జోడించి మరి వీడియోని పోస్ట్ చేసింది.నేర్చుకున్న ఐదు అలవాట్లు..1. తాను రష్యాలో ఉంటే ఉదయం 10 అయితే గానీ లేచేదాన్ని కాదు. కానీ ఇప్పుడు ఉదయాన్నే లేవడం అలవాటు చేసుకున్నా. ఉదయం 5 నుంచి 7 లోపు మేల్కొంటానని చెప్పింది. భారత్‌లో రోజు చాలా త్వరగా ప్రారంభమవుతుంది. ఉదయాన్నే చెత్త సేకరించడం, తాజా కూరగాయలు, పాలు తెచ్చుకోవడం, దుకాణాలు తెరుచుకోవడం వంటివన్నీ చాఆ తొందరగా జరిగిపోతాయి అని పోస్ట్‌లో రాసింది.2. భర్త లేచేసరికే వంట చేయడం తనకు ఇష్టమని, అందుకే ఉదయాన్నే లేస్తానని చెప్పింది. కాచిన పాలను తాగడం అనేది తాను తప్పించుకోలేని రోజువారి ఉదయపు అలవాటుగా పేర్కొంది.3. అలాగే ప్రతి నిర్ణయం తీసుకునే ముందు భర్తను సంప్రదించడం వంటివి కూడా చేస్తానని అంది. నిజానికి ఇది రష్యాలో అతి పెద్ద ప్రమాదకరమైన సమస్య, ముఖ్యంగా స్వేచ్ఛను హరించేదిగా తీవ్రంగా పరిగణిస్తారని, కానీ భారత్ ప్రకారం కుటుంబ ఐక్యతకు సంబంధించిందని అంటుంది. అంతేగాదు దాన్ని సింపుల్‌గా జట్టు కృష్టిగా అభివర్ణించిందామె. 4. ఇప్పుడు తన దగ్గర చీరలు, సూట్లు ఉన్నాయని, ప్రతి కార్యక్రమం "ప్రత్యేకంగా" అనిపిస్తుందని చెబుతోంది. ఎలాగైన భారతీయ వేషధారణ కాస్త ఇబ్బందిగా, అసౌకర్యంగా అనిపించినా..నలుగురిలో ప్రత్యేకంగా కనిపించేలా చేస్తుందని చెబుతోంది.5. అతిథులు రాగానే భారతీయ మహిళల్లా నీళ్లు, టీ లేదా కాఫీ సర్వ్ చేయడం నేర్చుకున్నానని అంటోంది. ఒక భారతీయ మహిళ వడ్డించినట్టుగా భోజనం కూడా సర్వ్ చేస్తానని చెబుతోంది.నెటిజన్లంతా ఆమెతో ఏకభవిస్తూ..మాకు అత్యంత సర్వసాధారణం, జీవితంలో భాగమైన మా అలవాట్ల గొప్పతనాన్ని అద్భుతంగా వివరించడమే గాక, అనుసరించడం అభినందనీయం. ధన్యవాదాలు అని మెచ్చుకుంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by 𝑫𝒆𝒔𝒊𝒍𝒊𝒇𝒆 |𝑩𝒆𝒂𝒖𝒕𝒚 |𝑰𝒏𝒅𝒊𝒂 (@sofia_desilife) (చదవండి: కేన్సర్‌పై ఎలా పోరాడాలంటే..! నటి రాజశ్రీ దేశ్‌పాండే హెల్త్ టిప్స్) -
రష్యాలో ఎంబీబీఎస్: 10 వేల సీట్లు.. ఫుల్ స్కాలర్షిప్స్!
కోయంబత్తూరు: డాక్టర్ కావాలనేది మీ లక్ష్యమా? అయితే మీకు ఒక అద్భుతమైన వార్త. విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థుల కోసం రష్యా రెడ్ కార్పెట్ పరిచింది. వేలాది సీట్లు, ఆకర్షణీయమైన స్కాలర్షిప్లు, అత్యంత తక్కువ ఫీజులతో 2026-27 విద్యా సంవత్సరానికి ఒక భారీ అవకాశాన్ని ముందుకు తెచ్చింది.కోయంబత్తూరులో రష్యన్ ఎడ్యుకేషన్ ఫెయిర్భారతీయ విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మక రష్యన్ ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఏకంగా 10,000 ఎంబీబీఎస్ సీట్లను కేటాయించారు. దీనికి సంబంధించి మే 15న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తమిళనాడులోని కోయంబత్తూరులో గల హోటల్ గ్రాండ్ రీజెంట్‌లో ‘ఆల్-ఇండియా రష్యన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2026’ జరగనుంది. చెన్నై రష్యన్ హౌస్ డైరెక్టర్, వైస్ కాన్సుల్ అలెగ్జాండర్ డోడోనోవ్ మాట్లాడుతూ.. 60 ఏళ్లుగా భారతీయ విద్యార్థులకు రష్యా అత్యుత్తమ వైద్య విద్యను అందిస్తోందని, విదేశీ మెడికల్ ఎడ్యుకేషన్‌కు రష్యానే ఎప్పటికీ మొదటి ఛాయిస్ అని అన్నారు.ఫీజుల మోత లేదు... విరివిగా స్కాలర్షిప్లురష్యాలో వైద్య విద్యకు ప్రభుత్వ భారీ సబ్సిడీలు అందిస్తుండటంతో ఫీజులు చాలా తక్కువగా ఉంటాయి. ఏడాదికి కేవలం రూ.3.5 లక్షలతో ప్రారంభమయ్యే అత్యంత తక్కువ ఫీజులతో ఇక్కడ చదువుకోవచ్చు. అంతేకాకుండా, ఈ ఏడాది 200 మంది భారతీయ విద్యార్థులకు రష్యా ప్రభుత్వం బ్యాచిలర్, మాస్టర్, పీజీ ప్రోగ్రామ్‌ల కోసం 100 శాతం స్కాలర్షిప్లను అందించనుంది. ప్రస్తుతం రష్యాలోని సుమారు 30 యూనివర్సిటీల్లో 25,000 మంది భారతీయులు చదువుతున్నారు. అక్కడ ప్రదానం చేసే ఎండీ (ఎండీ)డిగ్రీ, భారతదేశంలోని ఎంబీబీఎస్ (ఎంబీబీఎస్)తో పూర్తిగా సమానం.అర్హతలు.. స్పాట్ అడ్మిషన్లుఈ కోర్సులు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంఎస్)తాజా నిబంధనలకు అనుగుణంగా పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. కనీసం 50శాతం మార్కులతో ‘నీట్’ పాసైన వారు అర్హులు. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ విద్యార్థులకు 40శాతం మార్కులు సరిపోతాయి. ఐఈఎల్టీఎస్ వంటి ఇతర ఎలాంటి ఇంగ్లీష్ ఎంట్రన్స్ టెస్ట్‌లు అవసరం లేదు. వోల్గోగ్రాడ్, కజాన్, పీరోగోవ్ తదితర ఏడు ప్రముఖ వర్సిటీలు పాల్గొంటున్న ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్‌కు ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు. అర్హులైన విద్యార్థులకు అక్కడికక్కడే స్పాట్ అడ్మిషన్లు లభిస్తాయి. -
ట్రంప్ దాడికి.. ఇరాన్ మాస్టర్ ప్లాన్.. రష్యా సాయంతో..?
ప్రస్తుతం ఇరాన్- అమెరికా యుద్ధం సీజ్ఫైర్ ఒప్పందంతో నడుస్తోంది.అయితే ఈ యుద్ధంలో అమెరికా మెుదటి నుంచి రష్యా ఇరాన్‌కు సహకారం అందించిందనే అమెరికా వాదిస్తూ వచ్చింది. తాజాగా ఈ ఆరోపణల్ని బలపరుస్తూ 'ది ఎకనామిస్ట్' నివేదిక ప్రచురించింది. అమెరికా ఇరాన్ యుద్దంలో డొనాల్డ్ ట్రంప్ తొలుత నుంచి రష్యాపై గుర్రుగా ఉన్నారు. మాస్కో రహస్య సమాచారం ఆధారంగానే ఇరాన్ తమ స్థావరాలపై దాడులు చేస్తోందన్నారు. ఇరాన్ సాంకేతికతను పూర్తి స్థాయిలో ధ్వంసం చేసినా పక్కా ప్రణాళికతో అమెరికా స్థావరాలను ఎలా టార్గెట్ చేయగలుగుతుందని దీనిలో కచ్చితంగా మాస్కో హస్తం ఉందని ఆరోపించారు. ది ఎకనామిస్ట్ నివేదిక ఈ నివేదిక ప్రకారం, "వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వం ఇరాన్‌కు దాదాపు 5,000 షార్ట్-రేంజ్ ఫైబర్-ఆప్టిక్ డ్రోన్లను సరఫరా చేయడానికి రహస్య ప్రణాళిక రూపొందించింది. వీటితో పాటు శాటిలైట్ ద్వారా నడిచే లాంగ్-రేంజ్ డ్రోన్లను కూడా అందించాలని రష్యా భావించింది.ఫైబర్-ఆప్టిక్ డ్రోన్లురేడియో సిగ్నల్స్‌కు బదులుగా సన్నని వైర్ల ద్వారా నియంత్రించబడతాయి. దీనివల్ల శత్రువులు వీటిని 'జామ్' చేయడం (సిగ్నల్స్ కట్ చేయడం) సాధ్యం కాదు. ఇవి 40 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించగలవు". అని నివేదిక ప్రచురించింది.రష్యా తన లాంగ్-రేంజ్ డ్రోన్లలో ఎలాన్ మాస్క్‌కు చెందిన 'స్టార్‌లింక్' టెర్మినల్స్‌ను ఉపయోగించే.. ఉక్రెయిన్ రక్షణ వ్యవస్థలను దాటవేసింది. ఇప్పుడు అదే సాంకేతికతను మధ్యప్రాచ్యంలో ఇరాన్ దళాలకు మళ్లించాలని రష్యా చూస్తోంది.కేవలం ఆయుధాలు ఇవ్వడమే కాకుండా, వాటిని ఎలా వాడాలో శిక్షణ ఇచ్చే బాధ్యతను కూడా రష్యా తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు కథనం ప్రచురితమైంది. దీని కోసం రష్యాలోని విశ్వవిద్యాలయాలలో చదువుకుంటున్న సుమారు 10,000 మంది ఇరాన్ విద్యార్థుల నుండి ఆపరేటర్లను ఎంపిక చేయాలని రష్యా నిఘా సంస్థ భావించిందని తెలిపింది. అలాగే రష్యన్ భాష మాట్లాడగలిగే తజిక్ ప్రజలను మరియు సిరియాలోని అలవైట్ మైనారిటీలను కూడా ఈ పనుల కోసం వినియోగించుకోవాలని ప్రణాళికలో ఉంది.ట్రంప్ వ్యూహానికి కౌంటర్గాఇటీవల ట్రంప్ ఇరాన్‌లోని ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటారని ప్రచారం జరిగింది. అంతే కాకుండా అమెరికా సైన్యం నేరుగా ఇరాన్‌పై దాడి చేస్తుందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అమెరికాను ఎదుర్కొనేలా ఈ ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. ఈ డ్రోన్లు ప్రధానంగా ఇరాన్ తీర ప్రాంతంలోని ద్వీపాల వద్దే మోహరించేలా ప్రణాళికలు రచించారు. ఒకవేళ ఇరాన్‌పై అమెరికా పదాతి దళాలతో దాడికి ఆదేశిస్తే అమెరికాను ఎదుర్కొవడానికి ఈ డ్రోన్లు కీలకంగా మారతాయని నివేదిక పేర్కొంది. -
శత్రువు గుండెల్లో నిద్ర పోవడం అంటే ఇదేనేమో..!
-
ఇరాన్‌కు సపోర్టు.. ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
మాస్కో: ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం, అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణ్వాయుధాల తయారీ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం ముగింపు దశకు వస్తోందని శుభవార్త చెప్పారు. విక్టరీ డే పరేడ్ అనంతరం పుతిన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మాస్కో ఒక సంప్రదింపుల దశకు సిద్ధమవుతోందని అనడానికి ఇది ఆయన ఇచ్చిన అత్యంత బలమైన సంకేతం.రష్యా-ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లకు పైగా భయంకరమైన పోరాటం సాగింది. ఈ క్రమంలో అమెరికా మద్దతుతో రష్యా, ఉక్రెయిన్ మూడు రోజుల కాల్పుల విరమణను ప్రారంభించాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి జరిగిన అతిపెద్ద ఖైదీల మార్పిడిలో భాగంగా చెరొక దేశం 1,000 మంది ఖైదీలను మార్చుకోవడానికి అంగీకరించిన తరుణంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. పుతిన్ ప్రకటన వెలువడిన సమయం వెంటనే ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. క్రెమ్లిన్ సంవత్సరాలుగా సైనిక దృఢత్వాన్ని ప్రదర్శిస్తూ వస్తోంది, కానీ రష్యా నాయకుడి తాజా వ్యాఖ్యలు తెరవెనుక పెరుగుతున్న దౌత్యపరమైన కదలికలను సూచించాయి.మరోవైపు.. పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్-అమెరికా మధ్య వివాదం చాలా క్లిష్టంగా మారింది. అయితే, ఇరాన్ అణ్వాయుధాల తయారీ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు. రష్యాకు ఇరాన్‌తో పాటు పర్షియన్ గల్ఫ్ దేశాలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇది మాకు కూడా సవాలుగా మారింది. ఇరు పక్షాలతో సంప్రదింపులు కొనసాగిస్తున్నాం. ఈ ఘర్షణ త్వరగా ముగుస్తుందని ఆశిస్తున్నా. దీన్ని కొనసాగించాలనే ఆసక్తి ఎవరికీ లేదని నేను భావిస్తున్నా. అయితే సమస్య పరిష్కారానికి ఇంకా రాజీ అవకాశాలు ఉన్నాయి' అని అభిప్రాయపడ్డారు. -
వేల సంఖ్యలో ఉత్తర కొరియా సైనికులు మృతి
మాస్కో: రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై బీబీసీ సంచలన నివేదిక విడుదల చేసింది. ఈ మారణహోమంలో ఇప్పటి వరకూ దాదాపు 2,300 మంది ఉత్తర కొరియా సైనికులు మృతిచెందినట్లు కథనాలు ప్రచురించింది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై నాలుగేళ్లు పూర్తయింది. అయినప్పటికీ యుద్ధ విరమణ విషయమై ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయమై ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఎటువంటి ఫలితాలు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఇరాన్- అమెరికా యుద్దం నేపథ్యంలో ఆ అవకాశాలు లేకుండా పోయాయి.కాగా గత సంవత్సరం ఉక్రెయిన్ ఆకస్మిక దాడిలో నియంత్రణ కోల్పోయిన కుర్స్క్ ప్రాంతంలోని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి రష్యా తమ సహాయం కోరిందని అందుకు సైనిక్ దళాలను పంపించామని ఆదేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ తెలిపారు. తాజాగా ఆ సేనలో 2,300 మంది మృత్యువాత పడ్డట్లు తెలుస్తోంది. ఈ యుద్ధంలో సహాయం కోసం రష్యాకు దాదాపు 11 వేల మంది సైనికులను పంపినట్లు సమాచారం. కాగా ప్రస్తుతం రెండు రోజుల పాటు మే 8-9 (విక్టరీ డే) సందర్భంగా రష్యా ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించగా, ఉక్రెయిన్ మే 5-6 తేదీల్లో తన వంతుగా విరమణ ప్రకటించింది. అయితే, ఒకరి ప్రకటనలను మరొకరు గౌరవించడం లేదని, దాడులు కొనసాగుతున్నాయని ఇరు దేశాలు ఆరోపించుకుంటున్నాయి. అయితే ఈ యుద్ధంలో ఇప్పటి వరకూ రష్యా- ఉక్రెయిన్ రెండు పక్షాలు కలిపి దాదాపు లక్షల సంఖ్యలో సైనికులు మృతి చెందారని కథనాలు పేర్కొన్నాయి. -
చైనా, రష్యా, కొరియాతో తలపడాల్సి వస్తే.. అమెరికా పరిస్థితి
-
ప్రపంచానికే నష్టం.. ట్రంప్‌నకు పుతిన్ హెచ్చరిక
మాస్కో: ఇరాన్, అమెరికా మధ్య యుద్ధ పరిస్థితులు, ఉద్రిక్తతల వేళ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఫోన్ సంభాషణ ఉత్కంఠకు తెరలేపింది. వీరిద్దరూ దాదాపు 90 నిమిషాలు మాట్లాడుకున్నారని రష్యా ప్రతినిధి వెల్లడించారు. ఇరువురు నేతల మధ్య ముఖ్యంగా ఇరాన్, ఉక్రెయిన్ గురించి జరిగినట్టు తెలిపారు. ఇదే సమయంలో ఇరాన్‌పై మరోసారి సైనిక చర్చ వద్దని ట్రంప్‌ను పుతిన్ హెచ్చరించినట్టు సమాచారం.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం రాత్రి ఫోన్లో మాట్లాడుకున్నారు. ఈ సంభాషణలో ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్ ఘర్షణ, మరియు తాత్కాలిక కాల్పుల విరమణ అవకాశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా పుతిన్.. ఇరాన్‌పై ఒకవేళ అమెరికా లేదా ఇజ్రాయెల్ మళ్లీ సైనిక చర్యకు దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పారు. ఆ సైనిక చర్య ప్రభావం ఇరాన్ దాని పొరుగు దేశాలకే కాకుండా మొత్తం ప్రపంచానికి అత్యంత నష్టదాయకంగా మారుతుందని పుతిన్ హెచ్చరించారు. ఇదే క్రమంలో ఇరాన్‌తో కాల్పుల విరమణను పొడిగించాలని ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని పుతిన్ స్వాగతించారు.ఈ మేరకు వారిద్దరి సంభాషణ జరిగినట్టు క్రెమ్లిన్ ప్రతినిధి యూరి ఉషాకోవ్ వెల్లడించారు. ట్రంప్-పుతిన్ ఫోన్ సంభాషణలో ప్రధానంగా పశ్చిమాసియా యుద్ధం, ఉక్రెయిన్ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లోని ప్రస్తుత పరిస్థితులను, రష్యా సైన్యం సాధిస్తున్న పురోగతిని పుతిన్ వివరించారని చెప్పారు. ఐరోపా దేశాల మద్దతుతో జెలెన్స్కీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే యుద్ధాన్ని పొడిగిస్తోందని ఇద్దరు నేతలు ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు ఉషాకోవ్ తెలిపారు. ఈ ఫోన్ కాల్ రష్యా చొరవతోనే జరగ్గా, సంభాషణ ఫలప్రదంగా సాగిందని క్రెమ్లిన్ వర్గాలు పేర్కొన్నాయి.ఇదిలా ఉండగా.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఐదో సంవత్సరంలోకి ప్రవేశించింది. రష్యా సైన్యం డోన్బాస్ ప్రాంతంలో ఇరుక్కుపోయింది. ఉక్రెయిన్ డ్రోన్లు రష్యా ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దాడులు చేస్తున్నాయి. ఇరు దేశాల మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని పుతిన్‌కు ట్రంప్ సూచించినట్టు తెలిసింది. ఈ క్రమంలో మే 9వ తేదీన రష్యా విక్టరీ డే సందర్భంగా ఉక్రెయిన్‌పై తాత్కాలిక కాల్పులు విరమణపై పుతిన్ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. -
ట్రంప్ వల్లే యుద్ధం ఆగలేదు.. యూఎస్ రాయబారుల రాజీనామా!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మరో బిగ్ షాక్ తగిలింది. ఉక్రెయిన్‌లో అమెరికా రాయబారుల పదవీ విరమణలు, మార్పుల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ విధానాల వల్లే తాము రాజీనామాలు చేస్తున్నట్టు సదరు వ్యక్తులు ఆరోపించడం గమనార్హం. ఉక్రెయిన్ విషయంలో ట్రంప్.. పుతిన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపణలు చేయడం ఇక్కడ పెద్ద ట్విస్ట్. అందుకే ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ఆగడంలేదని పరోక్షంగా చెప్పుకొచ్చారు.ఉక్రెయిన్‌లో అమెరికా రాయబారుల పదవీ మార్పులు తరచూ జరగడం తీవ్ర చర్చకు దారి తీసింది. బ్రిడ్జెట్ బ్రింక్ (2022–2025) అధ్యక్షుడు ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా రాజీనామా చేశారు. ఆమె తరువాత బాధ్యతలు చేపట్టిన జూలీ డేవిస్ కూడా 2026 జూన్‌లో పదవీ విరమణ చేయనున్నారు. ఈ మార్పులు అమెరికా, ఉక్రెయిన్ సంబంధాల్లో అస్థిరతను ప్రతిబింబిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాయబారులు ఇద్దరూ ట్రంప్ విధానాలను వ్యతిరేకించడం సంచలనంగా మారింది.I resigned as U.S. Ambassador Ukraine when Trump kept siding with Putin over our democratic partner. Now, my successor is doing the same.I knew I had to speak out and run for office because siding with dictators is just not who we are. https://t.co/j1cGvub4Bf— Bridget Brink (@AmbBridgetBrink) April 29, 2026బ్రిడ్జెట్ బ్రింక్ 2022 నుండి 2025 వరకు కీవ్‌లో పనిచేశారు. తాజాగా ఆమె.. మిచిగాన్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ కంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు పదేపదే అనుకూలంగా వ్యవహరించడం వల్లే తాను తన పదవికి రాజీనామా చేసినట్టు తెలిపారు. నియంతల పక్షం వహించడం మన నైజం కాదంటూ ఘాటు విమర్శలు చేశారు. మన ప్రజాస్వామ్య భాగస్వామి కంటే పుతిన్‌కు ట్రంప్ పదేపదే వత్తాసు పలుకుతున్నప్పుడు నేను ఉక్రెయిన్ యూఎస్ రాయబారి పదవికి రాజీనామా చేశాను అన్నారు. ఈ పదవిలో ఏడాది లోపే పనిచేసిన తన వారసురాలు జూలీ డేవిస్ కూడా ఇలాంటి కారణాలతోనే వైదొలుగుతున్నారని ఆమె ఆరోపించారు. ఇదిలా ఉండగా, డేవిస్ ఈ ఏడాది చివర్లో పదవి నుంచి వైదొలిగి, మూడు దశాబ్దాల దౌత్య వృత్తికి ముగింపు పలుకుతూ పదవీ విరమణ చేస్తారని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ తెలిపింది.ట్రంప్ పరిపాలనలో ఉక్రెయిన్ విధానానికి వ్యతిరేకంగా మే 2025లో రాజీనామా చేసిన బ్రింక్ స్థానంలో, డేవిస్ గత ఏడాది మేలో తాత్కాలిక ప్రాతిపదికన బాధ్యతలు స్వీకరించారు. ఆమె కూడా.. పుతిన్‌కు ట్రంప్ మద్దతు ఇవ్వడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, ట్రంప్‌పై వీరిద్దరూ విమర్శలు చేయడాన్ని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగాట్ ఖండించారు. ఇదంతా నిజం కాదన్నారు. రష్యా, ఉక్రెయిన్ల మధ్య శాశ్వత శాంతిని నెలకొల్పడానికి ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు రాయబారి డేవిస్ గట్టి మద్దతుదారుగా ఉన్నారని కామెంట్స్ చేశారు. -
ప్రపంచవ్యాప్తంగా మరింత ముదరనున్న చమురు సంక్షోభం..?
ఇరాన్- అమెరికా యుద్ధంతో అసలే ప్రపంచమంతా చమురు సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే ఇప్పుడు ఆ పరిస్థితి మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్యా చమురు స్థావరాలే టార్గెట్‌గా ఉక్రెయిన్ వరుసగా డ్రోన్స్‌లతో దాడులకు తెగబడుతుంది. దీంతో 24కు పైగా ముడి చమురు నిల్వ కేంద్రాలు పూర్తిగా ధ్వంసమైనట్లు రష్యా ప్రకటించింది.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య క్రూడాయిల్.. హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో క్రూడాయిల్ సరఫరాకు ఆటంకం తలెత్తి తీవ్ర సంక్షోభం ఏర్పడింది. దీంతో ప్రత్యామ్నయ మార్గంగా రష్యాపై కొన్ని దేశాలు దృష్టిసారించాయి. అయితే ఇప్పుడు రష్యా చమురు స్థావరాలు సైతం దాడులకు గురి కావడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.వరుసగా చమురు స్థావరాలపై దాడులు నిన్న( బుధవారం) తుయాప్సే నగరంలోని రష్యా చమురు స్థావరాలపై దాడులు జరిపినట్లు తెలిపింది. ఈ దాడుల ప్రభావంతో యాసిడ్ వర్షం కురవడంతో పాటు గాలిలో బెంజీన్, గ్జైలీన్ వంటి విషవాయువులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయని తీర ప్రాంతంలో చేపలు, పక్షులు చనిపోయి పడి ఉన్నాయని పేర్కొంది. ఉక్రెయిన్ గడిచిన 15రోజుల్లో రష్యా చమురు స్థావరాలే లక్షంగా మూడుసార్లకు పైగా దాడులు చేసినట్లు రష్యా పేర్కొంది. తొలిసారిగా ఏప్రిల్16న దాడులు జరుపగా మరోసారి ఏప్రిల్ 20 తేదీన దాడులు జరిగినట్లు తెలిపింది. ఈ దాడుల్లో ఇప్పటికే 24 చమురు నిల్వ ట్యాంకులు ధ్వంసమయ్యాయని పేర్కొంది.రష్యాకు ఈ రిఫైనరీ ఎంతో కీలకంకీవ్ నగరానికి ఆగ్నేయంగా 900 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుయాప్సే రిఫైనరీ రష్యా చమురు ఎగుమతులకు అత్యంత ప్రధానమైనది. దీని వార్షిక ఉత్పత్తి సామర్థ్యం సుమారు 12 మిలియన్ మెట్రిక్ టన్నులు సరాసరిన రోజుకు 240,000 బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేస్తుంది. రష్యా మొత్తం ఇంధన ఎగుమతి సామర్థ్యంలో సుమారు 12 శాతం వాటాను కలిగి ఉంది. ఇది రష్యాలోని టాప్ 10 రిఫైనరీలలో ఒకటి .చమురు సంక్షోభం మరింత ముదిరే అవకాశంరష్యా బడ్జెట్లో చమురు ఎగుమతులది సింహభాగం. దీనికి తోడు హర్ముజ్ మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తింది. దీంతో ప్రపంచం చూపు రష్యా చమురు వైపు మళ్లుతోంది. దీనివల్ల రష్యాకు ఊహించని లాభాలు కూడా చేకూరాయి. అల్ జజీరా ప్రకారం, హర్ముజ్ జలసంధి మూసివేత, ఆకాశాన్నంటుతున్న ప్రపంచ చమురు ధరల కారణంగా, యుద్ధం మొదలైన మొదటి రెండు వారాల్లోనే రష్యా చమురు అమ్మకాల ద్వారా అదనంగా 672 మిలియన్ యూరోలు ($777 మిలియన్లు) సంపాదించిందని 'సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్' అంచనా వేసింది .ఎగుమతి కోసం ఉద్దేశించిన చమురు నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా రష్యాని ఆర్థికంగా దెబ్బతీయాలని ఉక్రెయిన్ భావిస్తోన్నట్లు విశ్లేషకుల అంచనా. అయితే ఈ దాడులతో దీనివల్ల ప్రపంచ చమురు కొరతను మరింత తీవ్రతరం చేస్తోందని రష్యా ఆరోపణలు చేస్తుంది. -
ఇరాన్‌కు రష్యా అండ.. యుద్ధంలో బిగ్ ట్విస్ట్?
మాస్కో: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న వేళ రష్యా-ఇరాన్ దేశాల మధ్య బలపడుతున్న మైత్రి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నరాలు తెగే ఉత్కంఠను రేపుతోంది. అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య కూటమికి సవాలు విసురుతూ, ఈ రెండు దేశాల మధ్య బలపడుతున్న బంధం మరింత ఉత్కంఠ రేపుతోంది. కేవలం దౌత్యపరమైన మద్దతుకే పరిమితం కాకుండా, ఒకరి రక్షణ అవసరాలను మరొకరు తీర్చుకుంటూ కొనసాగుతున్న ఈ దోస్తీ.. ఇరాన్ వెనుక ఒక అగ్రరాజ్యం అండగా నిలబడిందనే సంకేతాన్ని స్పష్టంగా పంపుతోంది.ఈ విపత్కర పరిస్థితుల్లో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ చేపట్టిన దౌత్య పర్యటనలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పాకిస్తాన్, ఒమన్ దేశాల్లో పర్యటన ముగించుకుని ఆయన నేరుగా మాస్కో చేరుకోవడం వెనుక భారీ యుద్ధ వ్యూహం దాగి ఉందన్నది బహిరంగ రహస్యం. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో జరగబోయే భేటీలో ప్రాంతీయ భద్రతతో పాటు కీలకమైన రక్షణ ఒప్పందాలపై చర్చలు జరగనున్నాయి. రష్యాతో కలిసి దౌత్యపరమైన వ్యూహాలను ఖరారు చేయడం ద్వారా, అటు పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ ముప్పును, ఇటు అంతర్జాతీయ స్థాయిలో పాశ్చాత్య దేశాల ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవాలని టెహ్రాన్ భావిస్తోంది.ఈ పరిణామాలన్నింటినీ మలుపు తిప్పుతూ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇరాన్‌కు ఇచ్చిన హామీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో అబ్బాస్ అరాఘ్చీతో జరిగిన అత్యంత కీలక భేటీలో పుతిన్ మాట్లాడుతూ.. ఇరాన్ ప్రయోజనాలను కాపాడేందుకు మాస్కో తన సర్వశక్తులూ ఒడ్డుతుందని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో శాంతిని పునరుద్ధరించేందుకు ఇరాన్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని, ఇరాన్ ప్రజలు ప్రస్తుత కష్టకాలాన్ని ధైర్యంగా అధిగమిస్తారని ఆయన భరోసా ఇచ్చారు. అంతర్జాతీయ పరిణామాలపై రెండు దేశాలు నిరంతరం సన్నిహితంగా చర్చలు జరుపుతాయని, ఈ వ్యూహాత్మక సహకారం భవిష్యత్తులోనూ అప్రతిహతంగా కొనసాగుతుందని పుతిన్ ప్రకటించడం ఈ దోస్తీ ఎంతటి బలమైనదో చాటిచెబుతోంది.


