ఒక వ్యక్తి నెట్టింట షేర్ చేసిన వీడియో నెటిజన్లను తెగ ఆకర్షించింది. అలాంటి క్షణం అత ఈజీగా మర్చిపోలేం కదూ..ఒక్కసారిగా స్టార్‌డమ్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది కదూ అని కామెంట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు.
అసలేం జరిగిందింటే..శుభం గౌతమ్ అనే వ్యక్తి ఒక వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశారు. "నా అమ్మ రష్యాలో సెలబ్రిటీ" అనే క్యాప్షన్‌తో షేర్ చేయడంతో మరింత వైరల్‌గా మారింది. ఆ వీడియోలో అతడు తన తల్లితో రష్యా వీధుల్లోకి రాగానే.. సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఆ తల్లిని చూసి రష్యన్ ప్రజలు ఆశ్చర్యపోవడమే కాదు..ఒక్క సెల్ఫీ అంటూ ఎగబెట్టారు.
ఏదో సెలబ్రిటీ మాదిరిగా అంతా దగ్గరకు వచ్చి ఫోటోలు దిగుతుంటే..మా అమ్మకు ఒక్కసారిగా ఎంత క్రేజ్ పెరిగిపోయిందో అంటూ మురిసిపోయాడు ఆమె కుమారుడు. విదేశాల్లో మన సంప్రదాయ దుస్తులో గనుక మనం కనిపిస్తే కచ్చితంగా ప్రత్యేకంగా నిలబడటమే గాక, అందరి దృష్టిని ఆకర్షిస్తాం..అందుకు ఈ తల్లే నిదర్శనం. అంతేగాదు ఆమె కొడుకు నా తల్లి రష్యాకు ఇష్టమైన సెలబ్రిటీ అని వీడియోలో చెబుతుండటం స్పష్టంగా వినిపిస్తుంది.
ఆమె కూడా అక్కడి వాళ్ల రియాక్షన్‌కు సంభ్రమాశ్చర్యాలకు లోనవ్వుతూ వారితో సెల్ఫీలు దిగడం స్పష్టంగా కనిపిస్తుంది వీడియోలో. భారతదేశం వెలుపల మన దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా దుస్తులు దరిస్తే..అవి మనల్ని ప్రత్యేకంగా నిలబడేల చేయడమే గాక, రియల్ సెలబ్రిటీకి అర్థం చెప్పేలా మనల్ని నిలబెడతాయి కూడా. ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్ రావడమే కాదు..ఆ తల్లి నిజంగా భారతదేశ బ్రాండ్ అంబాసిడర్ అని ప్రేమగా పిలుస్తూ పోస్టులు పెట్టారు నెటిజన్లు.
(చదవండి: సాత్విక ఆహారంతో బరువు తగ్గగలమా..? నటి, గాయని షెహ్నాజ్ సైతం..)


