ఈ నెల 27న ఘనంగా మండల పూజ,హరివరాసనం..ఆలయం మూసివేత | Sabarimala Temple Closed On December 27th After Mandala Pooja, Check Important Details About Timings And Rituals | Sakshi
Sakshi News home page

ఈ నెల 27న ఘనంగా మండల పూజ,హరివరాసనం..ఆలయం మూసివేత

Dec 23 2025 11:08 AM | Updated on Dec 23 2025 11:51 AM

Sabarimala temple closed On December 27th after Mandala Pooja

శబరిమల (Shabarimala) అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ నెల 27న మండల పూజ అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన పూజారి కందరారు మోహనారు ప్రకటించారు. తిరిగి మకరవిళక్కు ఉత్సవం కోసం 30న సాయంత్రం 5 గంటలకు గుడిని తెరుస్తాం’ అని ఆలయ ప్రధాన పూజారి కందరారు మోహనారు తెలిపారు.

మండల పూజ సమయాలు, జరిగే ఆచారాలు..
మండల పూజ 27న ఉదయం 10:10AM నుండి 11:30AM వరకు జరిగే అవకాశముంది. 

26న రాత్రి 6:30PM సమయంలో, పవిత్ర బంగారు వస్త్రాలు శబరిమలకి చేరుకుంటాయి. ఈ వస్త్రాలు స్వామి అలంకరణకు ఉపయోగిస్తారు

ఈ వస్త్రాలతో దీపారాధన నిర్వహిస్తారు. దీపారాధన తర్వాత స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఘనంగా హరివరాసనం, ఆలయ మూసివేత
పూజ అనంతరం, 27న రాత్రి 11:00PMకి హరివరాసనం పూర్తి అవుతుంది. హరివరాసనం శబరిమలలో(Shabarimala) జరిగే మహత్తరమైన ఉత్సవాలలో ఒకటిగా పేర్కొంటారు. దీని అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు.

ఆలయ కార్యక్రమాల సమగ్ర వివరాలు:
పవిత్ర బంగారు వస్త్రాలు శబరిమలకు చేరవేత: 26న రాత్రి 6:30PM.
దీపారాధన: 26న పూజ అనంతరం.
మండల పూజ: 27న ఉదయం 10:10AM నుంచి 11:30AM.
హరివరాసనం: 27న రాత్రి 11:00PM.
ఆలయ మూసివేత: హరివరాసనం తర్వాత, 27న రాత్రి.
మకరవిళక్కు ఉత్సవం: 30న సాయంత్రం 5 గంటలకు ఆలయం తెరుస్తారు

(చదవండి: ఇవాళే ధంక అంగి ఊరేగింపు..! ఏడాదికి ఒక్కసారే..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement