మీ స్కూల్ గ్రౌండ్‌లో ముక్కులున్నాయా? వాటి పేర్లేంటి? ఇంకా అక్కడ ఎలాంటి మొక్కలుంటే బాగుంటుంది? అక్కడ ఏయే మొక్కల ద్వారా ఏయే ప్రయోజనాలున్నాయి? వాటిని రక్షించుకోవడం ఎలా? ఇలాంటివి తెలుసుకునేందుకు కేరళలోని కార్యవట్టం ప్రభుత్వ కళాశాల బీఎస్సీ భౌగోళిక శాస్త్ర విద్యార్థుల బృందం ఓ వెబ్ అప్లికేషన్‌ను తయారు చేసింది.
ఇది విద్యార్థులకు ఎంతో అనుకూలమైనది. సెకండరీ పాఠశాల విద్యార్థులు తమ పాఠశాల క్యాంపస్‌లలో మొక్కల వైవిధ్యాన్ని మ్యాప్ చేసేందుకు ఈ యాప్ వీలు కల్పిస్తుంది. యాండ్రాయిడ్ ఫోన్ లేదా వెబ్ బ్రౌజర్ ఉంటే చాలు ఈ అప్లికేషన్ పనిచేస్తుంది. దీనికి ఇన్‌స్టాలేషన్ కూడా అవసరం లేదు.
ఇదీ చదవండి: డ్యాన్సర్ నోట్లో బలవంతంగా నాణేలు : పరిస్థితి విషమం
ఈ యాప్ అందరూ వాడొచ్చు. సాధారణ ఫీల్డ్ సర్వేలను నిర్వహించడానికి ప్రాథమిక కార్టోగ్రాఫిక్ అంశాలతో జీవవైవిధ్య మ్యాప్‌లను తక్షణమే రూపొందించడానికి ఈ యాప్ పనికొస్తుందని దీన్ని తయారు చేసిన విద్యార్థులు అంటున్నారు. భౌగోళిక శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రతీప్ కుమార్ మార్గదర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ రూపొందించారు. తరగతి గదుల్లో డిజిటల్ బోధనను ప్రోత్సహించే కేరళ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్ (ఓఐఖీఉ) లక్ష్యాలకు అనుగుణంగా ఈ యాప్ తయారు చేశారు. టెక్నాలజీపై కనీస అవగాహన ఉన్న పాఠశాల విద్యార్థులంతా దీన్ని సులభంగా ఉపయోగించవచ్చు.పాఠశాల విద్యార్థులలో డిజిటల్ విద్య, పర్యావరణ అభ్యాసం, జియోస్పేషియల్ నైపుణ్య అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి ఇది ఉపయోగ పడుతుంది. ఇలాంటి యాప్స్ తయారీపై విద్యార్థులు దృష్టి పెట్టాలి.
ఇదీ చదవండి: టొమాటో..టొమాటో నీది ఏ దేశం? మీకు తెలుసా?


