బెంగళూరులో తొలి స్టోర్‌ : ఆటోలో స్టైలిష్‌గా ‘నథింగ్‌’ సీఈవో | Nothing CEO Carl Pei In Autorickshaw For Bengaluru Flagship Store Opening, Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

బెంగళూరులో తొలి స్టోర్‌ : ఆటోలో స్టైలిష్‌గా ‘నథింగ్‌’ సీఈవో

Feb 14 2026 4:34 PM | Updated on Feb 14 2026 6:21 PM

Nothing CEO Carl Pei in autorickshaw for Bengaluru flagship store opening viral video

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నథింగ్ భారతదేశంలో తన మొట్టమొదటి ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను అధికారికంగా ప్రారంభించింది. బెంగళూరులో తన తొలి స్టోర్‌ను  లాంచ్‌ చేసింది. ఈ  ప్రారంభోత్సవం సందర్బంగా ఒక వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. అదేంటో తెలియాలంటే ఈ స్టోరీ మొత్తం చదవాల్సిందే.


నథింగ్ సిగ్నేచర్ బ్రాండింగ్‌తో  సరిపోలేలా అద్భుతమైన తెల్లటి ఆటోలో సీఈవో CEO కార్ల్ పీ  స్టోర్‌కు రావడం అభిమానులకు ఆకట్టుకుంది. ఆటోలో ఆయన్ని చూడగానే అక్కడ గుమిగూడిన అభిమానుల హర్ష ధ్వానాలు చేశారు. వారి కరతాళ ధ్వనుల మధ్య స్టోర్‌లోకి  బెంగళూరు స్టైల్‌లో కాలు పెట్టారు పీ. ఫ్లాగ్‌షిప్ అవుట్‌లెట్ వెలుపల భారీ జనసమూహం క్యూలైన్లలో వేచి ఉన్నారు.ఆయన రాకతో,అప్పటివరకూ క్యూలో వేచి ఉ‍న్న వేలాదిమంది  అభిమానుల ఉత్సాహానికి అంతులేకుండాపోయింది.

ఇదీ చదవండి: కాలిఫోర్నియాలో భారతీయ విద్యార్థి అదృశ్యం, 5 రోజులుగా గాలింపు

"> ఇండియాలో ప్రత్యేకంగా బెంగళూరునే తమ తొలి అవుట్‌లెట్ కోసం ఎందుకు ఎంచుకున్నారో వివరిస్తూ, ప్రపంచవ్యాప్తంగా నథింగ్ అతిపెద్ద మార్కెట్లలో దేశం ఒకటి అని, తమ వినియోగదారులు చాలా మంది భారతదేశంలో మరీ ముఖ్యంగా బెంగళూరులో ఎక్కువమంది ఉన్నారని తెలిపారు. ఇక్కడ బలమైన టెక్ కమ్యూనిటీ కూడా ఉంది, కాబట్టి ఇక్కడ ప్రారంభించడం సహజంగా అనిపించిందన్నారు.  

ఈ సందర్బంగా ఈవెంట్‌ను గ్రాండ్‌ సక్సెస్‌ చేసిన బెంగళూరు వాసులకు పీ ప్రత్యక ధన్యవాదాలు తెలిపారు. దీంతో నెటిజన్లు కూడా సంతోషం వ్యక్తం చేశారు. నథింగ్‌ బ్రాండ్‌కు కొంతమంది శుభాకాంక్షలు తెలపగా, మరికొంతమంది లాంచ్ స్థాయిని చూసి ఆశ్చర్య పోయామన్నారు. భారతదేశ టెక్ రాజధాని బెంగళూరులో నథింగ్‌ బ్రాండ్‌కు  పెరుగుతున్న ప్రజాదరణకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఎప్‌స్టీన్‌ను గొంతు నులిపి చంపేశారు : ఫోరెన్సిక్ నిపుణుడు సంచలన వ్యాఖ్యలు

Advertisement
 
Advertisement
Advertisement