అప్పట్లో భారతీయ టెలివిజన్ రంగంలో తన అందం, గొంతుతో సంచలనం సృష్టించిన రూబీ భాటియా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. అయితే, ఈసారి ఆమె వార్తల్లో నిలవడానికి కారణం ఆమె గ్లామర్ కాదు.. రూ. 1,000 కే అందిస్తున్న లైఫ్ కోచింగ్ సర్వీసెస్. ఈ ప్రకటనలు చూసిన నెటిజన్లు, ముఖ్యంగా 90ల కాలం నాటి అభిమానులు ఒక్కసారిగా మూగబోయారు. ఒకప్పుడు లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకున్న ఒక లెజెండరీ యాంకర్..
90వ దశకంలో భారతీయ టెలివిజన్ రంగంలో ఛానల్‌వి హవా నడిచిన కాలం. ఆ తరం యువతకు ఫ్యాషన్ ఐకాన్ రూబీ భాటియా. తన విలక్షణమైన ఇంగ్లీష్ యాక్సెంట్, చిరునవ్వు, మెరిసే కళ్ళతో ఆమె బుల్లితెరను శాసించేది. మాజీ మిస్ ఇండియా కెనడా అయిన రూబీ భారత్ మొట్టమొదటి వీడియో జాకీగానూ గుర్తింపు పొందారు.
మూడు దశాబ్దాల తర్వాత ఇప్పుడు ఆమె ఒక స్మార్ట్‌ఫోన్ కెమెరా ముందు కనిపిస్తూ నెటిజన్లను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతున్నారు. పర్సనాలిటీ డెవలప్‌మెంట్, బరువు తగ్గడం, ఆందోళన, డిప్రెషన్ వంటి విషయాలపై లైఫ్ కోచింగ్ ఇస్తానంటూ ఆమె ఇటీవల వీడియోలు విడుదల చేశారు. వీటిని చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు.
ఆమెను ఇలా చూడటం మనుసుకి భారంగా ఉందంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తే, మరికొందరు మాత్రం ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. సెలబ్రిటీ అయినప్పటికీ కూడా ఏ పనీ చిన్నది కాదని భావించి, స్వయంగా తన సేవలను ప్రమోట్ చేసుకోవడం ఆమె ఆత్మవిశ్వాసానికి నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు.
For 90s kids, Ruby Bhatia was everywhere, a familiar, confident face on TV, VJing, anchoring, interviewing.
Seeing her reels today, offering life coaching, makeup tips, and even asking people to WhatsApp her for work for ₹1000, just feels heavy.
Not mocking her at all. It’s… pic.twitter.com/JAP2YPkZXp— Sapna Madan (@sapnamadan) January 29, 2026
(చదవండి: ఆ హోటల్ కోసం..ఆ బామ్మ తపన చూస్తే కళ్లు చెమ్మగిల్లుతాయ్!)


