అసెంబ్లీ ఎదుట వైఎస్ జగన్ సహా వైఎస్సార్‌సీపీ నేతల నిరసన..
ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్.
ప్రజల తరపున ప్రశ్నిస్తామనే భయంతోనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదన్న వైఎస్సార్‌సీపీ నేతలు.
కూటమి ప్రభుత్వ అరాచక పాలనను ప్రశ్నిస్తూ నిరసన
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్‌తో కూడా అబద్ధాలు చెప్పించడం బాధాకరం
కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే గవర్నర్‌తో తప్పుడు ప్రసంగం చేయిస్తోందని ఆరోపణ
తిరుమల లడ్డూపై కూటమి నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారం ఆపాలని డిమాండ్.
సభ్యుల హక్కులను కాపాడి, సభా గౌరవం నిలపాలి.
రాష్ట్రంలో అశాంతి, అశ్లీల నృత్యాల పాలన సాగుతోంది.
కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ది కొరవడింది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వెంటనే రద్దు చేయాలి.
రెడ్‌బుక్ రాజ్యాంగంతో ప్రతిపక్ష నేతల అక్రమ అరెస్ట్, దాడులను వెంటనే ఆపాలి.
ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు సృష్టించినా ప్రజల తరపున పోరాటం చేస్తాం.


