మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను ఇవాళ(ఫిబ్రవరి 4, బుధవారం) వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. అధైర్య పడొద్దని.. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. టీడీపీ రౌడీమూకల దాడిలో ధ్వంసమైన ఇంటిని, ఆఫీస్‌ను కూడా ఆయన పరిశీలించారు.


