యువతపై దౌర్జన్యం సరికాదు: ప్రకాశ్ రాజ్ | Prakash Raj condemns use of tear gas in Jharkhand student protest crackdown | Sakshi
Sakshi News home page

యువతపై దౌర్జన్యం సరికాదు: ప్రకాశ్ రాజ్

Aug 11 2026 8:16 AM | Updated on Aug 11 2026 8:17 AM

Prakash Raj condemns use of tear gas in Jharkhand student protest crackdown

రాంచీ: జార్ఖండ్‌లో ఉద్యోగ నియామక పరీక్షల అవకతవకలపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు బలప్రయోగం చేయడంపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోటీ పరీక్షలను రద్దు చేయాలని, సీబీఐ విచారణ జరిపించాలంటూ జార్ఖండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీని ముట్టడించడానికి యత్నించిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేసి, టియర్ గ్యాస్, వాటర్ క్యానాన్లను ప్రయోగించారు. ఈ అణచివేత తీరుపై సోషల్ మీడియా వేదికగా ప్రకాశ్ రాజ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
 

ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోను రీపోస్ట్ చేస్తూ ఆయన తీవ్రంగా స్పందించారు. ‘ఎందుకు.. ఎందుకు.. ఎందుకు.. ఈ క్రూరత్వం ఇకపై సాగదు. ఇది కేవలం అహంకారంతో కూడిన ప్రభుత్వాన్ని కిందకు దించుతుంది’ అంటూ ప్రకాశ్ రాజ్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో రాసుకొచ్చారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువతపై ఈ రకమైన దౌర్జన్యం సరికాదని, వారి భవిష్యత్తు కోసం గళం ఎత్తుతున్న విద్యార్థులపై పోలీసుల ఉక్కుపాదం మోపడాన్ని ఆయన తీవ్ర పదజాలంతో ఖండించారు.

జార్ఖండ్‌లో జరుగుతున్న ఈ ఆందోళనలు, విద్యార్థులపై పోలీసుల చర్యలు జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు ఈ అంశంపై పార్లమెంట్‌లోనూ అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం నడుస్తోంది. విద్యార్థుల సమస్యలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమని ప్రకటించినప్పటికీ, ఈ ఘటన దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. 

ఇది కూడా చదవండి: ఆరుగురు కొత్త సైనిక కమాండర్లను నియమించిన మొజ్తబా ఖమేనీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement