ఉద్యమం.. ఉద్రిక్తం | Police resorted to lathi charge to control protesting students at Jharkhand | Sakshi
Sakshi News home page

ఉద్యమం.. ఉద్రిక్తం

Aug 11 2026 5:09 AM | Updated on Aug 11 2026 5:09 AM

Police resorted to lathi charge to control protesting students at Jharkhand

అడ్డుకున్న పోలీసులు 

బారీకేడ్లను దాటుకుని కదం తొక్కిన వైనం

బాష్పవాయుగోళాలు, జలఫిరంగులను ప్రయోగించిన పోలీసులు 

లాఠీచార్జ్‌లో గాయపడిన పరీక్షార్థులు 

నలుగురు పోలీసులకూ గాయాలు

రాంచీ: దేశ రాజధానిలో నీట్‌ లీకేజీ ఉదంతంపై విద్యార్థుల సారథ్యంలో కొనసాగిన ఉద్యమం చివరకు పోలీసుల లాఠీచార్జ్‌తో ఉద్రిక్తంగా ముగియగా అదే బాష్పవాయుగోళాల ప్రయోగాలు, రక్తసిక్తమైన విద్యార్థులు, ప్రభుత్వ వ్యతిరేక నినాదాల దృశ్యాలు సోమవారం జార్ఖండ్‌ రాజధానిలో పునరావృతమయ్యాయి. జార్ఖండ్‌ పబ్లిక్‌ సరీ్వస్‌ కమిషన్‌(జేపీఎస్‌సీ), జార్ఖండ్‌ స్టాఫ్‌ సెలక్షన్‌ కమిటీ(జేఎస్‌ఎస్‌సీ)ల్లో సంస్కరణలు కోరుతూ, అక్రమాలమయమైన గత పోటీపరీక్షలను రద్దుచేయాలన్న డిమాండ్లతో ఉద్యమిస్తున్న ఆందోళనకారుల నిరసన ఉద్రిక్తంగా మారింది. 

సోమవారం పాత అసెంబ్లీ ప్రాంగణం నుంచి కొత్త అసెంబ్లీ భవనం దాకా ‘విధాన్‌ సభ మార్చ్‌’గా బయల్దేరిన వేలాది మంది విద్యార్థులు, పరీక్షార్థులు త్రివర్ణపతాకాలు, ప్రభుత్వ వ్యతిరేక నినాదాల ప్లకార్డులు చేతబూని న్యాయంకోరుతూ అసెంబ్లీకి సమీపప్రాంతానికి చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. జగన్నాథ్‌ ఆలయ రోడ్డులో చివరి అంచె బ్యారీకేడ్లను పరీక్షార్థులు బద్దలుకొట్టేందుకు యతి్నంచగా పోలీసులు జలఫిరంగులను ఎక్కుపెట్టారు. మెరుపులా దూసుకొస్తున్న నీటి ఉదృతికి తడుస్తున్నా విద్యార్థులు అలాగే ముందుకు కదలడంతో పోలీసులు బాష్పవాయుగోళాలను ప్రయోగించారు. 

అయినాసరే పరీక్షార్థుల నుంచి ప్రతిఘటన పెరగడంతో పోలీసులు లాఠీలకు పనిజెప్పారు. లాఠీచార్జ్‌లో  చాలా మంది పరీక్షార్థులు గాయపడ్డారు. చిన్నా పెద్దా, అమ్మాయిలు అనే తేడా లేకుండా తలలు పగలగొడుతూ పోలీసులు ఇష్టమొచి్చనట్లు చితకబాదారని రక్తసిక్తమైన ఉద్యమకారుడు పీయూశ్‌ కుమార్‌ సోనీ చెప్పారు. బారీకేడ్లను విజయవంతంగా దాటిన కొందరు ఉద్యమకారులు అసెంబ్లీ గేటు నంబర్‌ 1 వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు. 

‘‘శాంతియుతంగా నిరసన చేపడుతున్న మాపై లాఠీల వర్షం కురిపించారు. రక్తమోడుతున్నా ఉద్యమపంథాను వీడేదేలేదు. హేమంత్‌ సోరెన్‌ సారథ్యంలోని ప్రభుత్వం పరీక్షార్థుల డిమాండ్లను అస్సలు పట్టించుకోవట్లేదు. ఇన్నిసార్లు చర్చలు జరిపినా సానుకూలంగా స్పందించలేదు. అందుకే అసెంబ్లీ మార్చ్‌కు సిద్ధపడ్డాం’’అని ఉద్యమనేతలు స్పష్టంచేశారు. ‘‘ఈరోజే సీఎం హేమంత్‌ పుట్టినరోజు. బర్త్‌డే రోజు బహుమానాలు ఇస్తారనుకుంటే లాఠీదెబ్బలే గిఫ్ట్‌గా ఇచ్చారు. మా డిమాండ్లు నెరవర్చేదాకా ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. లాఠీచార్జ్‌తో పోలీసులు శారీరక దెబ్బకొట్టగలరేమోగానీ మా ఆలోచనలను దెబ్బతీయలేరు’’అని 
ఉద్యమనేతలు ప్రకటించారు. 

బల ప్రయోగం.. బాష్పవాయుగోళాలు.. 
నిరాహారదీక్షలు, ఉద్యమం ఆరంభమై 16 రోజులు గడిచినా చర్చల్లో ఎలాంటి పురోగతి కని్పంచకపోవడం, డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పకోకపోవడంతో సోమవారం ఉదయం 10.30 గంటలకు ధుర్వాలోని ఓల్డ్‌ అసెంబ్లీ కాంప్లెక్స్‌ నుంచి వేలాదిగా ఉద్యమకారులు ర్యాలీగా బయల్దేరారు. 9 రోజులుగా నిరాహారదీక్ష చేస్తూ పది కేజీల బరువు తగ్గిన ఉద్యమనేత దేవేంద్రనాథ్‌ మహతో సైతం అంబులెన్స్‌లో అసెంబ్లీ వైపుగా కదిలారు. జేఎస్‌ఎస్‌సీ పరీక్షల్ని రద్దుచేయాలి. సీబీఐ విచారణ జరపాలి. జేఎస్‌ఎస్సీపై దాడులకు సీఐడీ ఎందుకు జంకుతోంది? అన్న ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఉద్యమకారులు ముందుకు కదిలారు. 

 నాలుగు కిలోమీటర్ల ఈ మార్గంలో ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్, ఇండియన్‌ రిజర్వ్‌ బెటాలియన్, జిల్లా పోలీసులు, క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్‌ బృందాలు మొహరించాయి. ఒక్కో బారీకేడ్‌ను దాటుకుంటూ పరీక్షార్థులు మందుకొచ్చేకొద్దీ వాళ్లను పోలీసులు నిలువరించే ప్రయత్నంచేశారు. ఈ క్రమంలో తొలుత వాగ్వాదం జరిగింది. శానససభలో మా డిమాండ్లు విని్పంచకపోతే న్యాయం ఎలా జరుగుతుంది? అని పోలీసులతో ఉద్యమకారులు వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో తోపులాట జరగడంతో పోలీసులు జలఫిరంగులను ప్రయోగించారు. 

అయినాసరే ఉద్యమకారులు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు తొలత టియర్‌గ్యాస్‌ షెల్స్‌ను, తర్వాత లాఠీలను ప్రయోగించిచారు. తమపై విద్యార్థులు రాళ్లదాడి చేయడంతోనే లాఠీచార్జ్‌ చేయాల్సి వచి్చందని రాంచీ సిటీ ఎస్పీ పరాశ్‌ రాణా చెప్పారు. నిరననకారుల దాడిలో నలుగురు పోలీసులు తీవ్రంగా గాయపడినట్లు ప్రకటించారు. చర్చల పర్వం కొనసాగుతుండగా ర్యాలీ చేపట్టడమేంటని ప్రభుత్వం అసహనం వ్యక్తంచేసింది. 98 శాతం డిమాండ్లకు ఒప్పుకున్నాసరే ఉద్యమపంథాను ఎందుకు వీడట్లేరని ప్రభుత్వం నిలదీసింది. అయితే 13 పరీక్షల్ని రద్దుచేయాలంటే కనీసం మూడు పరీక్షలకే ఒప్పుకున్నారని, జేపీఎస్‌సీ, జేఎస్‌ఎస్‌లో సంస్కరణల ఊసే ఎత్తేట్లేరని, సీబీఐ విచారణకు ప్రభుత్వం సాహసించట్లేదని ఉద్యమకారులు ఆరోపించారు.

జేపీఎస్సీ మాజీ చైర్‌పర్సన్‌ అరెస్ట్‌ 
జార్ఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై జేపీఎస్సీ మాజీ ఛైర్‌పర్సన్, 1988 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి ఎల్‌.ఖియాంగ్టేను సోమవారం జార్ఖండ్‌ సీఐడీ అధికారులు అరెస్ట్‌చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామాచేశాక గత ఏడాది ఈయనను ప్రభుత్వం జేపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా నియమించింది. గత నెలలో ఈయనను సీఐడీ నాలుగుసార్లు ప్రశ్నించింది. ముగ్గురు జేపీఎస్సీ సభ్యులు రాజీనామాచేశాక ఒత్తిడి పెరగడంతో జూలై 22న ఖియాంగ్టే తన పదవికి రాజీనామా చేయడం తెల్సిందే. ఖియాంగ్టే అరెస్ట్‌తో ఈ ఉదంతంలో అరెస్టుల సంఖ్య ఇరవైకి పెరిగింది.

రంగంలోకి ఈడీ.. 
ఇన్ని రోజులు ఈ ఉదంతంలో సీఐడీ కేసు నమోదుచేసిన దర్యాప్తుచేస్తుండగా సోమ వారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) రంగంలోకి దిగింది. సీఐడీ నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్‌ను ఆధారంగాచేసుకుని మనీ లాండరింగ్‌ కోణంలో మరో కేసును ఈడీ నమోదుచేసి దర్యాప్తు ఆరంభించింది. ఈ కేసుతో సంబంధం ఉన్నవారందరికీ సమన్లు జారీచేసి పిలిపించి ప్రశ్నించనుంది. అవసరమైతే అరెస్ట్‌లుచేసే ఆస్కారముంది. జార్ఖండ్‌ జనరల్‌ గ్రాడ్యుయేట్‌ కంబైన్డ్‌ కాంపిటేటివ్‌ ఎగ్జామినేషన్‌ అక్రమాల్లో నిగ్గుదేల్చేందుకు విద్యార్థులు సీబీఐ దర్యాప్తుకోరుతుంటే ఈడీ రంగంలోకి దిగడం గమనార్హం.  

ఐసీయూలో మహతో 
సోమవారం అసెంబ్లీ మార్చ్‌లో పాల్గొన్న మహతోను తీవ్ర అనారోగ్యం కారణంగా తోటి ఉద్యమకారులు ఆస్పత్రిలో చేర్పించారు. మహతో గత 9 రోజులుగా నిరాహారదీక్ష చేస్తూ 10 కేజీలకుపైగా బరువుతగ్గడం తెల్సిందే. రక్తంలో చక్కర స్థాయిలో బాగా పడిపోయాయని, ఆయన ఆరోగ్యపరిస్థితి ‘క్లిష్టమైన’స్థాయికి పడిపోయిందని రాంచీలోని ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. రాంచీ సదర్‌ ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స చేస్తున్నామని మెడికల్‌ ఆఫీసర్‌ నాన్సీ ప్రియా తెలిపారు. అయితే లాఠీచార్జ్‌ వేళ మహతోనూ పోలీసులు కొట్టారని అతని సహాయకుడు పంకజ్‌కుమార్‌ వెల్లడించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement